Activities calendar

14 March 2017

మంగళవారం ఏపీ బడ్జెట్...

విజయవాడ : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో వాయిదా పడిన ఏపీ బడ్జెట్ ను శాసనసభలో రేపు ప్రవేశ పెట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఆర్దికమంత్రి యనమల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

మంగళవారం జాతీయ అగ్రికల్చర్ సైన్స్ ఫెయిర్..

ఢిల్లీ: జాతీయ అగ్రికల్చర్ సైన్స్ ఫెయిర్ రేపు ఢిల్లీలో ప్రారంభం కానుంది. 15 నుంచి 17వ తేదీ వరకు ఫెయిర్ నిర్వహణ ఉండనుంది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) ప్రతి ఏడాది ఈ ఫెయిర్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

21:29 - March 14, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను నిలిపివేసే దాకా ఉద్యమం ఆగదని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. తుందుర్రుతో పాటు పలు గ్రామాల్లో పర్యటించిన నేతలు ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా చేస్తున్న గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి పోరాటానికి మద్దతు తెలపడమే కాకుండా... ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేసే దాకా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. గ్రామస్తుల ఆందోళనలకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నాయి. పోరాటానికి మద్దతివ్వడమే కాకుండా.. ప్రజల్లో ధైర్యం నింపేందుకు తుందుర్రుతో పాటు కంసాలి బేతపూడి, జొన్నలగురువు గ్రామాల్లో అఖిలపక్ష నేతలు పర్యటించారు.

ఆందోళన..ఉధృతం..
తమకు హాని తలపెట్టే ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. తుందుర్రులో పర్యటిస్తున్న అఖిలపక్ష నేతలకు గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆందోళన చేస్తున్న తమపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజలకు అండగా ఉంటామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఫ్యాక్టరీ నిర్మించాలని చూస్తే.. ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అఖిలపక్షం మద్దతు..
రెండున్నరేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత నరిహరిశెట్టి నరసింహారావు అన్నారు. తుందురు ఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. మొత్తానికి ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పోరాట సమితికి అండగా ఉంటామని అఖిలపక్ష నేతలు భరోసా ఇచ్చారు. ఇక అసెంబ్లీలో ఇదే అంశాన్ని చర్చకు తీసుకువస్తామని.. దీనిపై ప్రభుత్వం చెప్పే సమాధానంపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.

21:27 - March 14, 2017

యాదాద్రి : సీపీఎం మహాజన పాదయాత్ర 4వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పులిగిల్లలో ఈ చారిత్ర ఘట్టానికి వేదిక అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రసంగించారు. పాదయాత్ర తమ కోసం చేయడం లేదని, పార్టీ కోసం కాదని పేద ప్రజల బాగు పడటానికని మరోసారి స్పష్టం చేశారు. పులిగిల్లను తాము గుర్తు పెట్టుకుంటామన్నారు. 1500 గ్రామాల్లో పాదయాత్ర జరిగిందని, సమస్యలపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 80వేలకు పైగా దరఖాస్తులు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు ఎలాంటి బతుకులున్నాయో వచ్చిన తరువాత అలాంటి బతుకులున్నాయని విమర్శించారు.

21:22 - March 14, 2017

విజయవాడ : గుండెపోటుతో చనిపోయిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఏపీ అసెంబ్లీ ఘన నివాళులు అర్పించింది. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. అయితే భూమా నాగిరెడ్డికి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభకు హాజరుకాలేదు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఏపీ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ కూడా సభకు హాజరయ్యారు. తన తల్లి మరణం తర్వాత తండ్రి ఎంతో కుంగిపోయారని.. దుఃఖాన్ని దిగమింగుకున్నారని అఖిల ప్రియ ఈ సందర్భంగా చెప్పారు. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలకు తన తల్లిదండ్రులు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని అన్నారు. భూమా నాగిరెడ్డి జీవితం మొత్తం పోరాట బాటలోనే సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నాగిరెడ్డి మరణం రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటని అన్నారు. వారి కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రేపటికి వాయిదా..
అలాగే సభలో ఉప ముఖ్యమంత్రి కేసీ కృష్ణమూర్తి, మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాస్‌, బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు భూమాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. అనంతరం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు భూమా మృతికి సంతాపం ప్రకటించి సభను రేపటికి వాయిదా వేశారు. అయితే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని అధికార పార్టీ రాజకీయం చేసిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. సభకు హాజరై ఉంటే భూమా చేసిన మంచి పనులతో పాటు.. చివరి సమయంలో ఆయన చేసిన తప్పులను కూడా గుర్తు చేయాల్సి వచ్చేదని మీడియాలో చిట్‌చాట్‌లో అన్నారు. కాగా జగన్‌ గైర్హాజరుపై సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పక్షులు, పశువులు కూడా తమ సాటి జీవి చనిపోతే సానుభూతి చూపుతాయని... కానీ జగన్‌ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారని సీఎం విమర్శించారు.

21:15 - March 14, 2017

ముంబై : నితిన్ కపూర్‌ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. JSK కంబైన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు తీశారు. ఆశాజ్యోతి అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. జయసుధ, నితిన్ దంపతులకు 1985లో వివాహం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి నీహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో శ్రేయాన్ కొద్దిరోజుల క్రితం హీరోగా పరిచయమయ్యాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర, నితిన్ వరుసకు అన్నదమ్ములవుతారు.

మహాజన పాదయాత్ర 4000 కి.మీ.పూర్తి..

యాదాద్రి : సీపీఎం మహాజన పాదయాత్ర నాలుగు వేల కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. కాసేపటి క్రితం పులిగిల్లకు చేరుకున్న పాదయాత్రకు బోనాలు, బతుకమ్మలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైలాన్ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు.

20:43 - March 14, 2017

అడుగడుగునా జననీరాజనాలు.. పూలదండలు, బతుకమ్మలు, బోనాల స్వాగతం.. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, వృద్ధులు, వివిధ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు, పిల్లా పెద్దా అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర బృందానికి ఎదరురేగి స్వాగతం పలుకుతున్నారు. తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. బంగరు తెలంగాణ ఎంత బరువుగా మారుతోందో చెప్పుకుంటున్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఎన్నికల వాగ్దానాల తక్షణ అమలు నినాదంతో దిగ్విజయంగా కొనసాగుతోంది మహాజన పాదయాత్ర. 150 రోజులు.. నాలుగువేల కిలోమీటర్లు.. 9మంది నాయకుల బృందం.. అయిదు నెలల కాలం.. మొదటి రోజు నుంచి, నేటివరకు అదే ఉత్సాహంతో సాగుతున్న మహాజనపాత్రపై ప్రత్యేక కథనం..

150 రోజులు..
అడుగడుగు కలుపుతూ... పాదం పాదం కదుపుతూ... పల్లె పల్లెనూ ఏకం చేస్తూ, జనం గుండె ఘోషను ప్రపంచానికి వినిపిస్తూ.. సర్కారీ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ వేల కిలోమీటర్లు సాగుతున్న జన చైతన్య యాత్ర.. ఈ మహాపాదయాత్ర.. హామీలు వమ్ములై, బతుకు బరువై, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణ సమాజం.. అర్ధం లేని నిర్ణయాలతో, నియంతృత్వ పోకడలతో సాగుతున్న సర్కారు విధానాలతో నానా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజానీకం ఉంది.. అదే ఉత్సాహం, అదే ఆదరణ... నూటయాభై రోజులుగా కొనసాగుతోంది. జనం కోసం అడుగు.. జనంతో అడుగు..అంటూ సాగిన మహాజన పాదయాత్ర జనం కోసం..మూడున్నర కోట్ల జనాభా కోసం.. 90శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం.. పాలకుల మెడలు వంచి, హామీలను చేతల దిశగా నడిపించటం కోసం, ప్రజల మౌనానికి మాటలు నేర్పి, కష్టాలకు గొంతుకై , బంగారు బూటకపు తెలంగాణ కాదు.. బతికే తెలంగాణ కావాలంటూ సాగుతున్న మహాజన పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. ప్రజల కోసం.. ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్న ఉద్యమంలో మైలురాయి రాయి లాంటి సమయం. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:39 - March 14, 2017

ఎవ్వలన్న ఒక్కటో తరగతి సద్వినంకనే రెండు మూడు నాల్గు ఐదు.. ఇట్ల వర్సవెట్టి సద్వుకుంటవోతరుగదా..? ఫస్టు డిగ్రీ సద్వి.. తర్వాత ఇంటర్మీడియట్ సద్వి.. తర్వాత పదో తర్గతి సద్వి.. ఇట్ల ఒక్కటో తర్గతి సద్వి.. మీదికెళ్లి కిందికొస్తరా..? కిందికెళ్లి మీదికి వోతరా..? పోరుగదా..? కని మన తెలంగాణల ఒక లీడరు అట్లనే వొయ్యిండు.. ఆయన కథ ఏందో వీడియోలో సూడుండ్రి..

20:36 - March 14, 2017

మొన్న గొల్లకుర్మోళ్లు.. చేనేతోళ్లు పాల పాకెట్లు చింపి పోశిండ్రుగదా.?. ఇప్పుడు మన నాయి బ్రాహ్మణుల అన్నల వంతొచ్చింది..ఇన్నొద్దులు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనుకుంటొచ్చిన పవన్ కళ్యాణ్ సారు.. ఇగ ప్రశ్నలు లేవు.. అన్ని ఆన్సర్లే అంటున్నడు.. ఈ పాలాభిషేకాలు ఎవ్వలు గనిపెట్టిండ్రోగని.. నాయనా.. ఏ సందుల జూశ్నా నల్గురు జమైతున్నరు..బడ్జెట్ లెక్కలు జూశి బాగ ముర్శిపోతున్న పబ్లీకు.. ఇగో మీకీ ముచ్చట మింగుడువడకపోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికి తెల్గుదేశం ప్రభుత్వమే పరిపాలించాలని చంద్రాలు అంటున్నడు.. వ్వలన్న ఒక్కటో తరగతి సద్వినంకనే రెండు మూడు నాల్గు ఐదు.. ఇట్ల వర్సవెట్టి సద్వుకుంటవోతరుగదా..?ఏడ ఏ ఏటీఎం కాడ జూశ్నా..? దిష్టిబొమ్మల లెక్క నో క్యాష్ బోర్డులే గనిపిస్తున్నయ్..ఫలానోళ్లు లంబాడోళ్లు అని గుర్తువట్టాల్నంటే ఏం జూశి గుర్తువడ్తుంటిమి..?జాంబాద్ జిల్లా బోదన్ మండలం హున్సా అనే ఊరికాడ యాబై ఏండ్ల సంది హోళీ పండుగ వెరైటీగ జేస్కుంటున్నరట. గిసొంటి ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

19:41 - March 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ లో సహజ నటిగా పేరొందిన 'జయసుధ' భర్త నితిన్ కపూర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టించింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నారా ? లేక హత్య చేశారా ? అనేది తెలియరావడం లేదు. 1985లో జయసుధను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు జితేంద్ర సోదరుడైన నితిన్ కపూర్ పలు సినిమాలకు..భోజ్ పురి, హిందీ భాషల్లో కొన్ని సీరియల్స్ ను నిర్మించారు. నితిన్ కపూర్..జయసుధ తనయుడు హీరోగా ఇటీవలే ఓ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మృతికి గల కారణాలు తెలియరావడం లేదు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న జయసుధ వెంటనే ముంబైకి బయలుదేరారు.

18:17 - March 14, 2017

మణిపూర్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని బీజేపీకి గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆహ్వానం పలికారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా బీరేన్ సింగ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈయన రేపు ఇంఫాల్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి ఇబోబిసింగ్ రాజీనామా చేశారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 28 స్థానాలు, బీజేపీ 21 స్థానాలు, ఇతర పార్టీలు 11 స్థానాల్లో విజయం సాధించాయి. పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు లోక్ జనశక్తి ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నారని, మ్యాజిక్ ఫిగర్ 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు ఇదివరకే బీజేపీ తెలియచేసింది. అతి పెద్ద పార్టీగా ఉన్న తమకు ప్రభుత్వ ఏర్పాటు చేసే విధంగా ఆహ్వానించాలని ఇబోబిసింగ్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

18:09 - March 14, 2017

యాదాద్రి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్ల మహా ఘట్టం వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో చేరుకుంది. చారిత్రాత్మకంగా ఎంతో పేరున్న తమ గ్రామంలో.. మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్లకు చేరుకోవడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహాజన పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు సీపీఎం కార్యకర్తలు చేసిన ఏర్పాట్లపై టెన్ టివితో అక్కడి నేతలు మాట్లాడారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ఈసీకి కేజ్రీ లేఖ..

ఢిల్లీ : త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని సీఎం కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్ ను కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఆయన లేఖ రాశారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరపాలని లేఖలో కోరారు.

గోవా సీఎంగా మనోహర్ పారికర్..

గోవా : రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

హైకోర్టును ఆశ్రయించిన రేవంత్..

హైదరాబాద్ : తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని కోరుతూ టిడిపి నేతలు రేవంత్..హైకోర్టును ఆశ్రయించారు. సస్పెండ్ చేయడం సభా నిబంధనలకు విరుద్ధమని, తనను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ మధుసూధనచారికి లేదని పేర్కొన్నారు.

17:10 - March 14, 2017

హైదరాబాద్ : జనసేన వెబ్ సైట్ ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. 2019 ఎన్నికలకు సిద్ధమౌతున్నట్లు వెల్లడించారు. చిరంజీవి పార్టీలోకి రారని, ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. పవన్ పేర్కొన్న అంశాలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. 'నాలుగు అంశాలను తేల్చిచెప్పారు. జూన్ నుండి పార్టీ నిర్మాణం..కార్యకలాపాలు, ఏ విధానంపై ప్రజల్లోకి వెళ్లాలి ఇందుకు 32 అంశాలను క్రోడీకరించడం..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ..యువతకు ఎక్కువ అవకాశాలు..పొత్తులపై పవన్ స్పష్టమైన అభిప్రాయాలు తెలియచేశారు. సెంట్రల్ కమిటీ, జిల్లాల వారీగా కమిటీ నియమిస్తారని తెలుస్తోంది. యువతకు ఎక్కువ ప్రాధాన్యమివ్వనున్నారని, సమాజంలో ఉన్న భిన్న వర్గాల వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది'. అని పేర్కొన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

16:27 - March 14, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికలకు జనసేన సన్నద్ధమౌతోందని, జూన్ నుండి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సోమవారం సాయంత్రం 4గంటలకు జనసేన వెబ్ సైట్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ఆలోచనతో పార్టీని స్థాపించడం జరిగిందని, పార్టీకి అండగా ఉన్న అభిమానులు, కార్యకర్తలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, తాను ఏపీలో పోటీ చేయడం జరుగుతుందని అనంతపూర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తానన్నారు. సర్వేల మీద ఆధారపడి పనిచేయమని, జనసేన లక్ష్యం ప్రజా సమస్యలపైనే కానీ అధికారం కోసం కాదన్నారు. అధికారంలోకి వచ్చినా..రాకపోయినా ప్రజల కోసం పార్టీ ఉంటుందన్నారు. 60 శాతం యువతకు సీట్లు ఇస్తామని, ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించామన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు చాలా బలమైన నిర్మాణం ఉందని, పొత్తుల విషయంలో ఆలోచించి మాట్లాడుతామని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను ఎంత బలంగా ముందుకు తీసుకెళుతామనే దానిపై దృష్టి పెడుతామన్నారు. కుటుంబ కలహాల వల్ల యూపీలో ఎస్పీ ఒటమికి కారణమన్నారు. చాలా తక్కువగా మాట్లాడుతానని, బలంగా మాట్లాడుతానని, పార్టీకి సీనియర్ నాయకత్వం కూడా అవసరమేనన్నారు. చిరంజీవి జనసేనలోకి రారని, తమ ఇద్దరి ఆలోచనలు వేరని వెల్లడించారు. పీఆర్పీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామన్నారు. ఇసోం షర్మిలకు వచ్చిన ఓట్లు చూసి చాలా బాధేసిందని తెలిపారు. మెగా ఆక్వా పార్కు పొల్యూషన్ లేదని అంటున్నారని, పొల్యూషన్ లేదని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ పోరాటం చేయాల్సి వస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని పవన్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు..

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో బీసీలతో జనహిత కార్యక్రమం జరిగింది. సీఎం కేసీఆర్ ను కలిసిన కులసంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు బహుమతులను సమర్పించారు. తెలంగాణాలో ఆదాయం ఎక్కువ అని, దేశంలోనే తెలంగాణ ఎక్కువగా వృద్ధి రేటు సాధించిందన్నారు.

15:30 - March 14, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రులో ఆక్వా ఫుడ్ పార్కును అడ్డుకుని తీరుతామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తేల్చిచెప్పారు. సోమవారం తుందుర్రు ప్రాంతంలో అఖిలపక్షం పర్యటించింది. ఈసందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అనంతరం టెన్ టివితో ఆయన మాట్లాడారు. పర్యావరణానికి..ప్రజలకు హాని కలిగించే ఆక్వా ఫుడ్ పార్కును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. టిడిపి, బిజెపి మినహా ఇతర పార్టీలన్నీ మద్దతిస్తున్నాయని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

15:21 - March 14, 2017

విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనలు ఉధృతం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనకారులపై పోలీసుల దాడులను నిరసిస్తూ ఈ దీక్షకు పూనుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు కర్నాటి లక్ష్మీనరసయ్య దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమండ్ చేశారు. ఓ వైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలున్నాయి.

రక్షణ మంత్రిగా జైట్లీ..

ఢిల్లీ : రక్షణ శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

రేపు ఉదయం ఏపీ బడ్జెట్..

విజయవాడ : ఈనెల 31 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ కోడెల అధ్యక్షతనలో బీఏసీ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి యనమల రేపు ఉదయం 10.25 గంటలకు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.

తేడాను గమినించాలన్న బాబు..

విజయవాడ : తనకు..జగన్ కు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని జగన్ చెప్పాడని ఆ తేడా ఏంటో ప్రజలు గమనించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. తన రాజకీయ జీవితంలో వైఎస్ అంత తీవ్రంగా తనను ఎవరూ విమర్శించలేదని, అయినా ఆయన మృతి అప్పుడు తాను వెళ్లి పరామర్శించడం జరిగిందని తెలిపారు.

అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ - రాహుల్..

ఢిల్లీ : బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గోవా..మణిపూర్ లలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచినా బీజేపీ అధికారం కోసం డబ్బును దుర్వినియోగం చేస్తోందన్నారు.

14:31 - March 14, 2017

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కేసీఆర్‌ చెబుతున్న అభివృద్ధి గ్రామాల్లో ఎక్కడ కనిపించడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో సామాజిక అంశాలు లెవనెత్తడంతో..తన సీఎం కుర్చికి ఎసరొస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. తమ అజెండా చాలా శక్తివంతమైందన్నారు. అట్టడుగు కులాలకు సంక్షేమంతో పాటు చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న తమ్మినేని టెన్ టివితో మాట్లాడారు. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

14:29 - March 14, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని...ఈ ప్రాంత ప్రజల పోరాటానికి మద్దుతుగా నిలుచుంటామని అన్ని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆక్వా ఫుడ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా... తుందుర్రు, కంసాలి బేతపూడి .. జొన్నలగరువు ప్రాంతాల్లో అఖిల పక్షం నాయకులు పర్యటించి.... అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ వల్ల పచ్చని పొలాలు నాశనమవుతాయని.. ఈ ప్రాంతాల ప్రజల బతుకులు బుగ్గిగా మారతాయని అఖిలపక్షం నాయకులు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనివ్వమని... ఇక్కడ ప్రజల పోరాటంలో తాము భాగమవుతామని కాంగ్రెస్‌, వైసీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, హక్కుల సంఘాల నాయకులు ప్రకటించారు.

 

14:26 - March 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి కాంగ్రెస్‌ నేతల కళ్లు బైర్లుకమ్ముకున్నాయని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ విమర్శల్లో పసలేదని కొట్టిపారేశారు. తమ బడ్జెట్‌పై సబ్బండ వర్ణాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే కేవలం కాంగ్రెస్‌ నేతలు మాత్రమే నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ భవిష్యత్‌ ఉండదనే కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించా

14:25 - March 14, 2017

హైదరాబాద్ : టీ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో టీ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ట్యాండ్‌బండ్‌ దగ్గరున్న అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో టీ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణలో కేసీఆర్‌ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టీ టీడీపీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలు ప్రశ్నించిన తమ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

14:22 - March 14, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ తిరుపతి మొక్కులపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కంచె ఐలయ్య, షెఫర్డ్‌, జి. రాములు పిటిషన్‌ వేశారు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని.. రూ.5 కోట్ల విలువైన స్వర్ణ సాలగ్రామ హారం, ఐదు పేటల స్వర్ణ కంఠాభరణాలను సమర్పించారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బంగారు ముక్కు పుడకను కానుకగా సమర్పించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు పూత గల కిరీటం, విజయవాడ కనకదుర్గమ్మకు బంగారపు ముక్కుపడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాల మొక్కులు తీర్చిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ మొక్కులపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తిరుపతి మొక్కులపై దాఖలైన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచె ఐలయ్య, షెఫర్డ్, జి.రాములు పిటిషన్ లు దాఖలు చేశారు.

13:28 - March 14, 2017

విజయవాడ: భూమా నాగిరెడ్డి మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని వైసీపీ గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. నాగిరెడ్డి గురించి ఈ రోజు పొగుడుతున్న చంద్రబాబుకు.... భూమా వైసీపీ లో ఉండగా ఎస్సీ,ఎస్టీ అకృత్యాల కేసు పెట్టి వేధించిన విషయం గుర్తు లేదా అని ప్రశిస్తున్నారు.

13:26 - March 14, 2017

అమరావతి: ఏపీ బడ్జెట్‌ను రేపు సభలో ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఆర్దికమంత్రి యనమల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టానున్నారు. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 31 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 30,31న పలు బిల్లులకు సభ ఆమోదం తెలుపనుంది.

12:55 - March 14, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటిస్తున్న..నటించబోయే చిత్రాలపై అభిమానులు ఆసక్తి పెంచుకుంటుంటారు. 'కాటమరాయుడు' చిత్రం అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరి కాంబినేషన్ లో 'జల్సా'..'అత్తారింటికి దారేది' సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడో ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో 'పవన్ కళ్యాణ్' సాఫ్ట్ వేర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్రత్యేక సెట్ ని రామోజ్ ఫిలిం సిటీలో రెడీ చేస్తున్నారని, సమ్మర్ కారణంగా సెట్ మొత్తం చల్లగా ఉండేలా దానిని తయారు చేయిస్తున్నట్టు టాక్. మార్చి 25 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుండగా ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు కథానాయికలుగా నటించనున్నారు. అంతేగాకుండా సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

12:52 - March 14, 2017

హైదరాబాద్: మగువల చేతిలో మట్టి ముద్ద కూడా కళారూపాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే వారు కళాత్మకతకు, సృజనాత్మకత మారు పేరు కాబట్టి. వారి చేతిలో అంతమైన వస్తువులు రూపుదిద్దుకుంటాయి. అలా మహిళలు చేసే సృజనాత్మక వస్తువులతో మీ ముందుకు వచ్చింది. ఈ నాటి సొగసు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:44 - March 14, 2017

హైదరాబాద్: పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ.. ఆరోగ్య సమస్యలు వెన్నంటినా మొక్కవోని దీక్షతో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కంకణం కట్టుకుని శ్రామిక మహిళల సమస్యలపై పోరాడుతూ.. కొన్ని నెలల క్రితం సుదీర్ఘ మహాజన పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఈ సంమయంలో తనకు ఎదురై సంఘటనలు, ఊహించని ఘటనలు చిన్నవేనని ఆమె భావించారు. ఈ వారం మానవి' స్ఫూర్'తి ఎస్. రమ ఇతివృత్తం. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:29 - March 14, 2017

అమరావతి :అమ్మా,నాన్న పేర్లు గుర్తుండే విధంగా ప్రజల సమస్యపై పని చేస్తానని భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ హామీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానంపై అకిల ప్రియ మాట్లాడుతూ.. ప్రజల కోసం అహర్నిశలు పాటుపడిన నా తండ్రి గురించి శాసనభలో గొప్పగా చెబుతుంటే సంతోషంగా అనిపిస్తోంది. నేను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో వరుసగా తల్లి, తండ్రిని కోల్పోవడం బాధ కలిగిస్తోంది. నా తండ్రి చివరి కోరిక తీరేవరకు, ఆయన ఆశయాలు నెరవేర్చే వరకు ఏడవకూడదని నిర్ణయించుకున్నా.నంద్యాలలో పేదలకు 10వేల ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాక.. ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా అయ్యాక.. అప్పుడే నా తండ్రిని తలుచుకుని ఏడుస్తా. అప్పటివరకు బాధను గుండెల్లో దిగమింగుకుని కంటనీరు రానివ్వను.’ అని అఖిల్‌ప్రియ అన్నారు. నాన్నకు గుండెపోటు వచ్చిన వెంటనే మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌కు ఫోన్‌ చేశా. నంద్యాలలో అత్యున్నత వైద్య సదుపాయాలు లేనందున వారు ఏదైనా సహాయం చేస్తారని అనుకున్నా. అందుకు తగినట్లుగానే సీఎం వెంటనే స్పందించి నా తండ్రిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఎయిర్‌ అంబులెన్స్‌ సిద్ధం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే ఆయన ప్రాణం వదిలారు. అమ్మంటే నాన్నకు చాలా ఇష్టం. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. అమ్మ చనిపోయినప్పుడే ఆయన ఏమై పోతారోనని భయపడ్డాం. అయితే ఈ మూడు సంవత్సరాలు మా కోసమే ఆయన బతికున్నారు. చిన్న పిల్లనైనా అమ్మనాన్నలు ఇచ్చిన ధైర్యంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా. మనసులో భరించలేని బాధ ఉన్నప్పటికీ.. దాన్ని కనిపించకుండా వారి ఆశయాల కోసం కృషి చేస్తా అన్నారు.

12:21 - March 14, 2017

ఎండకాలం వచ్చేసింది. చాలా మంది ఈ కాలంలో డీ హైడ్రేషన్ బాధ పడుతుంటారు. దీని నుండి తప్పించుకోవాలంటే 'కీర' తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది. కీరదోస రసంలో పోటాషియా, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. కీరను తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలని ధృడంగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఉంది. ఖనిజ లవణాలు ఉదర సంబంధిత వ్యాధులతో కీర పోరాడుతుంది. అజీర్తి లేకుండా చేయడం..శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం అల్పాహారంతో పాటు కొన్ని కీరదోస ముక్కల్ని తీసుకుంటే తక్కువ కెలొరీలు ఎక్కువ శక్తి అందుతాయి. 

12:19 - March 14, 2017

హైదరాబాద్: గోవా కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గోవా సీఎంగా మనోహర్‌ పారికర్‌ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. గోవా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలవాలని సుప్రీం సూచించింది. గవర్నర్‌ను కలిసి సంఖ్యాబలం నిరూపించాలని స్పష్టం చేసింది. దీంతో గోవా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలిసే యోచనలో ఉన్నారు. పారికర్‌ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని గోవా సీఎల్పీనేత చంద్రకాంత కవ్లేకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పారికర్‌ను సీఎంగా నియమిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు... సంఖ్యాబలంతో గవర్నర్‌ను కలవాలని సూచించింది.

 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

అమరావతి: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మృతికి అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. భూమా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

 

12:16 - March 14, 2017

టాలీవుడ్ కమెడియన్స్ లో తనదైన ముద్ర వేసుకుని నటుడు 'సప్తగిరి'. ఇతని పేరు మీద ఇటీవలే వచ్చిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. రోషిని ప్రకాస్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం 50రోజుల వేడుకను నిర్వహించారు. వేడుకకు మంత్రి తలసాని హాజరయ్యారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని, చిన్న చిత్రాలకు ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. మల్టీప్లెక్స్‌ల్లో ఐదో ఆటను వేయమని జి.వో ఇవ్వడం జరిగిందని, ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి విజయవంతమైన చిత్రం చేసిన దర్శకనిర్మాతలకు అభినందనలు' అని అన్నారు. 'పవన్‌ కళ్యాణ్‌' ఆడియో వేడుకకు వచ్చి ప్రోత్సహించడంతో సినిమాకు మరింత క్రేజ్‌ పెరిగిందని నటుడు 'సప్తగిరి' తెలిపారు. చిన్న సినిమాగా ప్రారంభించిన ఈ సినిమా చాలా పెద్దదిగా మారిపోయిందని, ఇలానే మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనుకున్నట్లు సప్తగిరి వెల్లడించారు. 

12:10 - March 14, 2017

మల్టిస్టారర్ చిత్రాలు ఎక్కువగా బాలీవుడ్ లో తెరకెక్కుతుంటాయి. టాలీవుడ్ లో అడపదడపా అలాంటి సినిమాలు వస్తుంటాయి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్..షారూఖ్ ఖాన్..అక్షయ్ కుమార్..తదితరులు పలు చిత్రాల్లో నటించారు. సల్మాన్ ఖాన్..అక్షయ్ కుమార్ లు ఓ చిత్రంలో నటిస్తున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రం తెరకెక్కడం లేదని తాజాగా ఓ వార్త పుకారు షికారవుతోంది. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించాడు. వారి మాటలను నమ్మవద్దని, అక్షయ్ తో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు సల్మాన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 1897లో బ్రిటీష్‌-భారత ఆర్మీకి, ఆఫ్గాన్‌ ఒరాక్‌ జాయ్ గిరిజనులకి మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో 'బ్యాటిల్‌ ఆఫ్‌ సారాగర్హి' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇందులో అక్షయ్ తోపాటు సల్మాన్‌ కూడా నటించనున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

12:06 - March 14, 2017

సూపర్ స్టార్ అంటే ఎవరు అంటే 'శ్రీదేవి' అని బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' పేర్కొంటున్నాడు. 'శ్రీదేవి' ప్రధాన పాత్ర పోషించిన 'మా' చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సల్లూ భాయ్ హాజరయ్యాడు. సల్మాన్ వేదిక మీదకు వచ్చే సమయంలో 'స్టార్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌' అని యాంకర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై 'సల్మాన్' స్పందించాడు. తాను..అమీర్, షారూఖ్, అక్షయ్ కుమార్ చాలా సినిమాలు చేయడం జరిగిందని షారూఖ్, తాను, అక్షయ్ లు కలిసి సుమారు 275 సినిమాలు చేసి ఉండవచ్చునని, అలాగే అమీర్ సంవత్సరానికి ఓ సినిమా చొప్పున 50 సినిమాల్లో నటించాడని తెలిపాడు. కానీ శ్రీదేవి బాల నటిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టి చిత్ర సీమలో 300కి పైగా సినిమాల్లో నటించారని గుర్తు చేశాడు. ఆమెలాంటి లెజెండ్‌తో తమ పనిని పోల్చుకోలేమని, నిజం చెప్పాలంటే ఆమెనే నిజమైన సూపర్‌ స్టార్‌ అని పేర్కొన్నారు. శ్రీదేవి నటిస్తున్న 'మా' చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

నోట్ల మార్పిడి ముఠా..

సికింద్రాబాద్ : బేగంపేట శ్యాంలాల్ ప్రాంతంలో నోట్ల మార్పిడి ముఠా చేస్తున్న పది మంది సభ్యులను పోలీసులు అర్టె చేశారు. రూ. 1.25కోట్ల విలువైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు నెల్లూరుకు చెందిన వారుగా భావిస్తున్నారు.

11:33 - March 14, 2017

పశ్చిమగోదారి : ఆక్వా ఫుడ్ పార్క్ ను నిరసిస్తూ తుందుర్రులో తుందుర్రులో అఖిలపక్షం పర్యటిస్తోంది. సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ ఇతర పార్టీల నేతలున్నారు. ఈ నేపథ్యంలో కంసాల బేతలపూడి గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. ఫుడ్ పార్క్ వద్దని పెద్ద ఎత్తున పోరాడుతున్నారని, మహిళా దినోత్సవం రోజున జరిగిన ఆందోళనలో పోలీసులు వ్యవహరించిన తీరును పలువురు తప్పుబట్టారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

11:26 - March 14, 2017

చిత్తూరు : టెన్త్‌ పరీక్షల ప్రారంభం రోజే తిరుపతిలో విషాదం నెలకొంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధి సాయిచరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్‌ మండలం ఆలూరు సమీపంలోని నారాయణ మెడికల్‌ అకాడమీ స్కూల్‌ హాస్టల్‌లో సాయిచరణ్‌ టెన్త్‌ చదువుతున్నాడు. సోమవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ సాయిచరణ్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందపడి చనిపోయాడు. దీంతో విద్యార్ధి మృతదేహాన్ని స్విమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న సాయిచరణ్‌ తండ్రి మోహన్‌కృష్ణ కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు చనిపోయిన సమాచారం కూడా యాజమాన్యం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్‌కృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్‌గా పనిచేశారు.

11:23 - March 14, 2017

ఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్‌ పారికర్‌ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని కాంగ్రెస్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. పారికర్‌ను సీఎంగా నియమిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని గోవా సీఎల్పీనేత చంద్రకాంత కవ్లేకర్‌ పిటిషన్‌లో కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ అంగీకరించారు. దీంతో కాంగ్రెస్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

11:20 - March 14, 2017

విజయవాడ : అసెంబ్లీలో భూమా నాగిరెడ్డికి సంతాపం ప్రకటించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ రాకపోడాన్ని అధికార టిడిపి తప్పుపట్టింది. శాసనసభలో దుష్ట సంప్రదయానికి జగన్‌ తెర తీశారని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

వైసీపీ వాకౌట్ చేయడం దారుణమన్న బోండా..
ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపే అపార అనుభవమున్న రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి అని బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. భూమా నాగిరెడ్డితో కలిసి పనిచేయడం జీవితంలో మరుపురానిదన్నారు. భూమాకు సంతాపం తెలిపే సమయంలో వైసీపీ వాకౌట్‌ చేయడం వారి రాక్షస మనస్తత్వం బయటపడుతుందన్నారు.

మానవ ధర్మాన్ని మరిచిపోయారు - ధూళిపాళ్ల..
కర్నూలు జిల్లా రాజకీయాల్లో తన దైన ముద్ర కనబరిచిన నేత భూమా నాగిరెడ్డి అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తమ ప్రాంత అభివృద్ధికి రాజీలేని పోరాటం చేసి.. ప్రజాభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. తండ్రి ఆశయాల సాధన కోసం కూతురు అఖిలప్రియ పనిచేయాలన్నారు. వైసీపీ సభ్యులు కనీస మానవ ధర్మాన్ని కూడా మరిచిపోయారని ఆక్రోశించారు.

ఆక్షేపించిన బీజేపీ..
భూమా నాగిరెడ్డికి సంతాపం ప్రకటించేందుకు అసెంబ్లీకి హాజరకాని ప్రతిపక్ష నేత జగన్‌ తీరును బీజేపీ ఆక్షేపించింది. ఈ విషయంలో జగన్‌ కుసంస్కారం మరోసారి బయటపడిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.

గోవా సీఎం పారికర్ నియామకంపై సుప్రీంలో పిటిషన్..

ఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్ పారికర్ ను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది.

జగన్ చేసింది చాలా తప్పు : అచ్చెన్నాయుడు..

విజయవాడ : భూమాకు సంతాపం ప్రకటించేందుకు జగన్ అసెంబ్లీకి రాకపోవడం చాలా తప్పని, శాసనసభలో దుష్ట సంప్రదాయానికి తెర తీశారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయం భవిష్యత్ లో పునరావృతం కారాదని, కుసంస్కారంతో వ్యవహరించిన జగన్ సభలో ఉండడం అవసరమా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంతాపంలోనూ రాజకీయమా - విష్ణుకుమార్ రాజు..

విజయవాడ : భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానంలోనూ ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని, భూమా సంతాప తీర్మానానికి వైసీపీ రాకపోవడం దారుణమని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. వైసీపీ ఉన్మాదాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

జగన్ రాకపోవడం బాధాకరం - బుద్ధా వెంకన్న..

విజయవాడ : భూమా భౌతికాయాన్ని చూసేందుకు ప్రతిపక్ష నాయకుడు జగన్ రాకపోవడం బాధకరమని, జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. జగన్ పద్ధతులు నచ్చకే భూమా టిడిపిలో చేరారని, జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు భూమా అండగా నిలిచారని తెలిపారు. జగన్ శవాలతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

10:55 - March 14, 2017

అమీ జాక్సన్...అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకపోతోంది. టాలీవుడ్ లో వచ్చిన 'ఎవడు' సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ కే పరిమితమైపోయింది. 'రజనీకాంత్' 'రోబో 2.0' లో ఆడిపాడిన ఈ అమ్ముడు తాజాగా మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. వరుస విజయాలతో మంచి ట్రాక్ మీదున్న 'విజయ్ సేతుపతి' సరసన హీరోయిన్ గా ఎంపికైంది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో నూతన చిత్రానికి 'విజయ్' సైన్ చేశాడు. 2013లో వచ్చిన 'ఇదుర్కుదానే ఆశైపట్టారు బాలకుమరా' చిత్రానికి సీక్వెల్‌గా గోకుల్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'అమీజాక్సన్‌'ను ఎంపిక చేసినట్టు టాక్.

అసెంబ్లీకి హాజరైన అఖిల ప్రియ

అమరావతి : దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె ఆళ్లగడ్డ అఖిల ప్రియ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అఖిలప్రియను శాసనసభ్యులంతా పలకరించి, ఓదారుస్తుంటే ఆమె బాధతో తన స్థానంలో కూర్చుండిపోయారు. నిన్న ఆళ్లగడ్డలో భూమా అంత్యక్రియలు ముగిసిన తరువాత, నేడు ఆయనకు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నప్పుడు అఖిలప్రియ కళ్ల నుంచి నీరు కారింది.

10:41 - March 14, 2017

అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జీవితం మొత్తం పోరాట బాటలోనే సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇటీవల మృతిచెందిన భూమానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సంతాపం ప్రకటించింది. ఈరోజు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. నాగిరెడ్డి మరణం రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటని అన్నారు. మూడేళ్ల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారి కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాగిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలా చర్యలు తీసుకుంటామన్నారు. డైనమిక్ లీడర్ ను కోల్పోయామని ఆర్థిక శాఖ మంత్రి యనమల పేర్కొన్నారు.భూమా నాగిరెడ్డిది రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. ప్రజా సమస్యల పట్ల చాలా నిబద్ధతతో వ్యవహరించేవారు. తన నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలి అని తపించేవారు అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి అంటేనే హుందాతనానికి మారుపేరు. అందరితో సరదాగా ఉండే వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన భార్య చనిపోయినప్పటి నుంచీ చాలా సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టుకునేవారు. ఆయన లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకు కచ్చితంగా లోటే. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.

10:40 - March 14, 2017

క్రికెట్ మ్యాచ్ లు..ఇతర క్రీడల్లో అన్నదమ్ములు..సోదరీమణులు పాల్గొంటు ఉంటుంటారు. యాదృచ్చికంగా వీరు తలపడాల్సి వస్తుంది కూడా. ఇలాగే క్రికెట్ పోటీలో అన్నదమ్ముల్లు ఒకే టీమ్ కు ఆడడం చూశాం. కానీ తండ్రికొడుకులు కలిసి ఆడడం చూశారా. అంతేగాకుండా వీరిద్దరూ చెరో హాఫ్ సెంచరీలు కూడా చేయడం విశేషం. వెస్టిండీస్ దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్, అత‌ని కొడుకు తాగెనారాయ‌ణ్ చంద్ర‌పాల్ గయానా టీమ్ కు ఆడుతున్నారు. ఆదివారం సబీనా పార్కులో జమైకా టీమ్ తో మ్యాచ్ జరిగింది. జమైకా తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసింది. అనంతరం గయానా ఆటను ఆరంభించింది. తాగె నారాయణ్ ఓపెనర్ గా వచ్చాడు. శివనారాయణ్ చంద్రపాల్ మూడో వికెట్ పడిన అనంతరం క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ 12.2 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్‌కు 38 ప‌రుగులు జోడించారు. 2012లో గాంధీ యూత్ ఆర్గ‌నైజేష‌న్ త‌ర‌ఫున ఆడుతూ ఇద్దరూ క‌లిసి 256 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేయ‌డం విశేషం. త‌న తండ్రిలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మ‌న్ అయిన తాగెనారాయ‌ణ్‌.. అత‌నిలాగే క్రీజులోకి రాగానే బెయిల్‌తో గార్డ్ మార్క్ చేస్తాడు. టెస్టుల్లో లారా త‌ర్వాత వెస్టిండీస్ త‌ర‌ఫున అత్య‌ధిక టెస్టు ప‌రుగులు (11867) చేసిన బ్యాట్స్‌మ‌న్‌గా శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్ నిలిచాడు. 

ఆత్మహత్య చేసుకున్న టెన్త్‌ క్లాస్‌ విద్యార్ధి సాయిచరణ్‌

తిరుపతి : టెన్త్‌ పరీక్షల ప్రారంభం రోజే తిరుపతిలో విషాదం నెలకొంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధి సాయిచరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్‌ మండలం ఆలూరు సమీపంలోని నారాయణ మెడికల్‌ అకాడమీ స్కూల్‌ హాస్టల్‌లో విద్యార్ధి సాయిచరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్‌ పైనుంచి కిందపడి చనిపోయాడు. దీంతో విద్యార్ధి మృతదేహాన్ని స్విమ్స్‌కు తరలించారు. చనిపోయిన విద్యార్ధి ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్‌గా పనిచేస్తోన్న మోహన్‌కృష్ణ నాయక్‌ కుమారుడిగా గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లా గోపవరం దగ్గర రోడ్డు ప్రమాదం

పశ్చిమ గోదావరి : జిల్లాలో గోపవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కారును బయటకు తీశారు. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో కాల్వలో గల్లంతై ఉంటారని అనుమానిస్తున్నారు. కొవ్వూరుకు చెందిన సత్తి వరలక్ష్మీ పేరిట కారు రిజిస్టర్‌ అయ్యినట్టు తెలుస్తోంది.

10:33 - March 14, 2017

హైదరాబాద్: ఢిల్లీ జేఎన్ యూలో ఎం. ఫిల్‌ విద్యార్థి ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. మునీర్కా విహార్‌లోని స్నేహితుని ఇంట్లో ముత్తుకృష్ణన్‌ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముత్తుకృష్ణన్‌ మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. ముత్తుకృష్ణన్‌ది తమిళనాడులోని సేలం ప్రాంతం. తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తారు. అయితే ముత్తు కృష్ణన్‌ ఆత్మహత్యపై తల్లిదంద్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే అంతటి పిరికివాడు కాదని అంటున్నారు. ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10:31 - March 14, 2017

యాదాద్రి : తెలంగాణ బడ్జెట్‌ సామాజిక న్యాయానికి ఆమడదూరంలో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సామాజిక న్యాయం దిశగా బడ్జెట్‌ లేదన్నారు. అగ్రవర్ణాలు, కమీషన్ల చుట్టూనే బడ్జెట్‌ తిరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర జనాభాలో 52శాతంగా ఉన్న బీసీలకు 5వేల కోట్లు కేటాయిస్తే వారి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3ఎకరాల భూమి హామీల ఊసే లేదన్నారు. తక్షణమే బడ్జెట్‌ ప్రతిపాదనలు సమూలంగా మార్చాలని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

10:28 - March 14, 2017

యాదాద్రి : పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందుబాటులో ఉండేలా కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దొరల బడ్జెట్‌గా ఉందని..ఇది పేదల అభివృద్ధికి ఏ మాత్రం దోహదం చేసేలా లేదని తమ్మినేని విమర్శించారు. అందరికీ సామాజిక న్యాయం అందాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా..ఏ ఒక్క వర్గం ప్రజల కష్టాలు తీరలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. అందరికి సామాజిక న్యాయం అందాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర లక్ష్యమని తమ్మినేని అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌ వాగ్ధానాల బడ్జెట్‌ ...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌ వాగ్ధానాల బడ్జెట్‌ అని తమ్మినేని ఆరోపించారు. ఆర్థిక మంత్రి ఈటల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఎంబీసీలకు ఈ బడ్జెట్‌ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని తమ్మినేని అన్నారు. అంకెల గారడితో మాటలు చెబుతున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ఆచరణలో చేస్తున్నది ఏం లేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తమ్మినేని విమర్శించారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను సమూలంగా మార్చాలని ఆయన సూచించారు.

149 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర..

ఎర్రజెండా నీడలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 149 రోజులు పూర్తి చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న తమ్మినేని బృందం ప్రతి చోటా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. ఇవాళ పాదయాత్ర బృందం భీమన్‌పల్లి, పోచంపల్లి, వంకమామిడి, సంగెం గ్రామాల్లో పర్యటించింది. మేదరి కులస్థుల సమస్యలు, పోచంపల్లిలో చేనేత కార్మికులకు చెందిన భూమి కబ్జాపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖలు రాశారు.

10:21 - March 14, 2017

అమరావతి : సమర్థవంతమైన నాయకుడ్ని కోల్పోయామని డిప్యూటీసీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. ఏపీ అసెంబ్లీలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పై సంతాప తీర్మానం పై మాట్లాడుతూ.. కుటుంబాన్ని దురదృష్టం నిత్యమూ వెన్నాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన ఇద్దరు సోదరులు కూడా ఇదే విధంగా గుండెపోటుతోనే మరణించారని గుర్తు చేసుకున్నారు. తొలుత అన్న భాస్కర రెడ్డి, ఆపై వీరశంకర రెడ్డి చనిపోయారని, ఆపై మూడేళ్ల క్రితం భార్య శోభా నాగిరెడ్డిని కోల్పోయినప్పటి నుంచి ఆయన మానసికంగా కృంగి పోయారని, తన కుమార్తె ఎమ్మెల్యే అయిన తరువాతనే ఆయనలో కాస్తంత మార్పు కనిపించిందని చెప్పుకొచ్చారు. భూమాతో తాను ఎంతో కాలం పాటు కలసి పనిచేశానని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.

10:15 - March 14, 2017

ఢిల్లీ : మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఢిల్లీ జేఎన్ యూ లో ఎంఫిల్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం లేదని దళిత విద్యార్థి ముత్తుకృష్ణన్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. సమానత్వం నిరాకరించినప్పుడు సమస్తం నిరాకరించబడినట్లేనని సూసైడ్‌ చేసుకునే ముందు ముత్తుకృష్ణన్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు.

చరిత్ర విభాగంలో ఎంఫిల్‌ చేస్తున్న ముత్తుకృష్ణన్‌ ......

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ఎంఫిల్‌ చేస్తున్న ముత్తుకృష్ణన్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని సేలమ్‌కు చెందిన ముత్తుకృష్ణన్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం లేదని చనిపోయే ముందు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. సమానత్వం నిరాకరించినప్పుడు సమస్తం నిరాకరించబడినట్లేనని ఆయన మెసేజ్‌లో పేర్కొన్నాడు. వైవా వాయిస్‌లో కూడా వివక్ష చూపుతున్నారని, ప్రతిభ గల వారికి మార్కులు వేయాలంటూ ప్రొఫెసర్‌ చెబుతున్నా వినిపించుకోకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

వర్శిటీలో అన్నిచోట్లా సమానత్వం నశించిందని ముత్తుకృష్ణన్‌ ఆందోళన

విశ్వవిద్యాలయంలో అన్నిచోట్లా సమానత్వం నశించిందని తన ఆఖరి మాటగా వాల్‌లో రాసుకొచ్చారు ముత్తు కృష్ణన్‌. ఆ తర్వాత హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య అనంతరం ఉద్యమంలో ముత్తు కృష్ణన్‌ కీలకపాత్ర పోషించాడు.

రోహిత్‌ వేముల, ముత్తుకృష్ణన్‌ స్నేహితులు

గత ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్న రోహిత వేములకు ముత్తుకృష్ణన్‌ మిత్రుడు. ఇతను కూడా దళిత విద్యార్థే. రోహిత్‌కు, అతని తల్లికి జరిగిన అన్యాయం గురించి అనేకమందిని జాగృత పరుస్తూ ముత్తుకృష్ణన్‌ అనేక ఆర్టికల్స్‌ రాశాడు. రోహిత్‌ వేముల, ముత్తుకృష్ణన్‌ ఇద్దరూ కలిసి అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముత్తుకృష్ణన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంఏ చదివారు. రోహిత వేముల ఆత్మహత్య అనంతరం జరిగిన విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

వర్శిటీల్లో ఆత్మహత్యలను తక్షణమే ఆపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ ...

ఢిల్లీ జేఎన్ యూ లో ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్య ఘటన వర్శిటీల్లోని విద్యార్థులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన ఫేస్‌బుక్‌ 'రజనీక్రిస్‌' వాల్‌పై వేల సంఖ్యలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శిటీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్రం వెంటనే స్పందించాలని, వర్శిటీల్లో ఆత్మహత్యలను తక్షణమే ఆపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

10:10 - March 14, 2017

హైదరాబాద్: ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకానికి మూడు వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ యేతర నిధులతో పూర్తి చేస్తున్న ఈ పథకానికి ... బడ్జెట్‌ సపోర్ట్‌ కింద మూడు వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. పథకం అనుకున్న వేగంతో పూర్తవుతుందని.. డిసెంబర్‌ కల్లా అన్ని గ్రామాల ప్రజలకు నీరందేలా కార్యాచరణ అమలవుతుందని ఈటల తెలిపారు.

పూర్తైన 1,426 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు...

పేదలకు నీడ కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో మొదలు పెట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి బడ్జటేతర వనరుల నుంచి నిధుల సమీకరణ జరుగుతుందని ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇప్పటికే వేయి 426 గృహాలు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ఇంకా 16 వేల 60 ఇళ్ల నిర్మాణం పూర్తి కావల్సి ఉందని... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం వేగం పుంజుకునే అవకాశం ఉందని మంత్రి అన్నారు. వివిధ పథకాల నిర్మాణంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అయితే మిషన్ భగీరథకు 3వేల కోట్ల కేటాయింపులపై విపక్షాలు విమర్శలు గుప్పించారు. పథకానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

10:09 - March 14, 2017

హైదరాబాద్: ఎన్నిక‌ల్లో పోటీ చేయలేదు.. ఎక్కడా గెలవలేదు. కానీ, ప్రజా స‌మ‌స్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమ‌వుతున్నాడు జ‌న‌సేన అధినేత. ప్రజా సమస్యలను పరిష్కరించాలని పాలకులను గట్టిగా హెచ్చరిస్తున్నాడు. రాజ‌ధాని భూముల ద‌గ్గర నుంచి ప్రత్యేక హాదా వ‌ర‌కూ.. సీమ క‌రువు నుండి శ్రీకాకుళం కిడ్నీవ్యాధుల సమస్యల వ‌ర‌కూ.. పవన్‌ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి.. మూడేళ్లు పూర్తిచేసుకుని... 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం..!

2013 మార్చి 14 జనసేన ఆవిర్భావం.....

ప‌వ‌ర్ కోసం కాదు... ప్రశ్నించ‌డం కోసం అంటూ మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2013 మార్చి 14వ తేదీన పురుడుపోసుకుంది జనసేన పార్టీ. పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి ప‌వ‌న్‌కల్యాణ్‌లో నిజాయితీ, నిబ‌ద్దత, ఖ‌చ్చిత‌త్వాన్ని అమాంతం పెంచాయి. ముఖ్యంగా యువతకు జనసేన ఒక ఐకాన్‌గా మారింది.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీకి జనసేన మ‌ద్దతు.....

2014 సార్వత్రిక‌ ఎన్నిక‌ల్లో టిడిపి, బిజెపి కూట‌మికి మ‌ద్దతు ప్రక‌టించిన పవన్‌... ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో కొంతకాలం మౌనంగా ఉన్నారు. రాజ‌ధాని ప్రాంత రైతులు భూముల‌కు సంబంధించిన అంశం త‌ప్ప మిగిలి సంఘ‌ట‌న‌లపై పవన్‌ పెద్దగా స్పందించలేదు. కానీ, ఆయన అభిమాని కుటుంబాన్ని ఓదార్చడానికి తిరుప‌తి వెళ్లిన ప‌వన్ స‌డ‌న్‌గా ఏపీ రాజకీయాల్లో తుఫాను తీసుకొచ్చారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి దిగుతున్నట్లు బహిరంగ స‌భ‌లో ప్రకటించి... వ‌ర‌స‌గా మూడు బహిరంగ స‌భ‌లు నిర్వహించారు. ఈ మూడు సభల్లోనూ కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. అప్పటి నుంచి పవన్‌ ప్రత్యేక హోదా కోసం అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో పాటు ద‌క్షణాది ప్రాంతవాసుల అత్మగౌర‌వాలను ఉత్తరాది నాయ‌కులు చిన్నచూపు చూస్తున్నార‌నే అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు ప‌వ‌న్.

సింహ‌పురి విద్యార్థుల స‌మ‌స్యలపైనా పవన్‌ స్పందన....

గ‌డ‌చిన మూడేళ్లలో అనేక ప్రజా స‌మ‌స్యల‌పై ప‌వ‌న్ గ‌ళ‌మెత్తారు. రాజ‌ధాని భూముల అంశం మొదలుకుని నిన్నటి విక్రమ సింహ‌పురి విద్యార్ధుల స‌మ‌స్యల వ‌ర‌కూ త‌నదైన శైలిలో స్పందిచారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్‌ పార్కుకు నిర‌స‌న‌గా ప్రజ‌లు చేస్తున్నపోరాటానికి ప‌వ‌న్ మ‌ద్దతు ప్రక‌టించారు. ప్రజ‌ల జీవితాల‌ను నాశ‌నం చెసేలా అభివృద్ది జ‌ర‌గ‌కూడ‌దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్ని స‌మ‌స్యలపైనా ప‌వ‌న్ గ‌ళ‌మెత్తారు. పోల‌వ‌రం నిర్వాసితులు, కృష్ణా న‌ది క‌ర‌క‌ట్టపై ద‌ళితుల భూములు వంటి అనేక అంశాల‌పైనా ప‌వ‌న్ ప్రభుత్వ తీరును తప్పబ‌ట్టారు. దీనితో పాటు చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటున్నట్లు ప్రక‌టించారు. మంగ‌ళ‌గిరిలో చేనేత క‌ళాకారుల‌ స‌త్యాగ్రహ స‌భ‌ను నిర్వహించారు.

జనసేన నిర్మాణంపై సీరియస్‌గా ఫోకస్‌ చేసిన పవన్‌....

జనసేన స్థాపించి మూడేళ్లు పూర్తవ‌డంతో పార్టీ నిర్మాణంపై ప‌వ‌న్ ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇటీవ‌లే పార్టీ నిర్మాణానికి సంబంధించి స్పష్టత ఇచ్చారు. దానికి అనుగుణంగానే పార్టీ ఆవిర్భావం రోజునే పార్టీ విధి విధానాలు ప్రక‌టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు సోషల్‌ మీడియాలో పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు. త్వర‌లోనే పార్టీ అప్‌డేట్స్ కోసం మెబైల్ యాప్‌ను రూపొందించనున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల నాటికి పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే అంశాల‌పై నేరుగా ప్రజ‌ల నుంచే అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. ప్రతీ స‌మ‌స్య గురించి పాల‌కుల‌ను ప్రశ్నించ‌డం, వాటి ప‌రిష్కారం దిశ‌గా ప్రభుత్వాన్నిక‌దిలించ‌డం వంటివి జ‌నసేనకు ఈ మూడేళ్లు ప్రజాధార‌ణను అమాంతం పెంచాయి.

10:07 - March 14, 2017

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ 2017 నోటిఫికేషన్‌ విడుదలైంది.. ఎంసెట్‌కు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.... అపరాద రుసుములేకుండా ఏప్రిల్ 15వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎస్‌సీల, ఎస్‌టీలు 250 రూపాయలు... ఇతరులు 500 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సిఉంటుంది.. 500 ఫైన్‌తో ఏప్రిల్ 21వరకు.... వెయ్యి ఫైన్‌తో ఏప్రిల్ 27 వరకు.. 5వేల ఫైన్‌తో మే 3 వరకు... పదివేల అపరాధ రుసుముతో మే 8 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టవచ్చని అధికారులు తెలిపారు..

మే 1 నుంచి మే 9 వరకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్

ఫీజులు చెల్లించిన విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.. మే 12 ఎంసెట్‌ జరగనుంది.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్.... మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అగ్రికల్చరల్ అండ్ మెడిసిన్ పరీక్ష నిర్వహించనున్నారు... పరీక్షకోసం తెలంగాణలో 22 రీజినల్ కేంద్రాలు, ఏపీలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు... పరీక్ష ప్రిలిమినరీ కీని మే 13న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను మే 18వరకూ స్వీకరించనున్నారు.. ఫలితాలను మే 22న ప్రకటించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎంసెట్‌కు గత ఏడాదిలాగానే నిమిషం నిబంధన కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.. విద్యార్థులు అరగంటముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని సూచించారు..

10:06 - March 14, 2017

హైదరాబాద్: గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్‌, బిజెపిల మధ్య వార్‌ మొదలైంది. గోవాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం కాగా...మణిపూర్‌లో కూడా తమకే అవకాశం ఇవ్వాలని దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. గోవాలో పారికర్ ప్రమాణ స్వీకారం నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. మరోవైపు మణిపూర్‌లో గవర్నర్‌ సూచన మేరకు సిఎం పదవికి ఇబోబి సింగ్‌ రాజీనామా చేయనున్నారు. బిజెపి శాసనసభాపక్ష నేతగా బీరేన్‌సింగ్‌ ఎంపికయ్యారు.

కమలనాథులకు అధికార దాహం...

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో భారీ విజయం దక్కడంతో కమలనాథులకు అధికార దాహం పట్టుకుంది. గోవా, మణిపూర్‌లో తమకు మెజారిటీ దక్కకున్నా అధికారమే లక్ష్యంగా చిన్న చితక పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బిజెపి తహతహలాడుతోంది. ఇప్పటికే గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

గోవాలో మొత్తం 40 స్థానాలుండగా...

గోవాలో మొత్తం 40 స్థానాలుండగా...17 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్‌ ఫిగర్‌కు 4 స్థానాలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 13 సీట్లనే గెలుచుకున్న బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గవర్నర్‌ మృదులా సిన్హా కాంగ్రెస్‌కు ఆహ్వానించకుండా పారీకర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్‌ పారికర్‌ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 15 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి పదవికి మనోహర్‌ పారికర్‌ రాజీనామా చేశారు.

మణిపూర్‌లో కూడా ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు..

మణిపూర్‌లో కూడా ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్‌ 28 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 21 స్థానాల్లో గెలిచింది. 11 స్థానాలను చిన్నా చితకా పార్టీలు గెలుచుకున్నాయి.తమకు మెజారిటీ లేకపోయినా 31 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ గవర్నర్‌ను కోరారు. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేతో కలిపి మేజిక్‌ ఫిగర్‌ 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బిజెపి గవర్నర్‌కు జాబితాను అందజేసింది.

అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు...

మరోవైపు అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ నజ్మాహెప్తుల్లాకు ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తున్నారని తెలిపారు. మణిపూర్‌లో గవర్నర్‌ ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమిస్తారన్నది వేచి చూడాలి. గోవా, మణిపూర్‌లో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

10:05 - March 14, 2017

హైదరాబాద్: లక్షా 49వేల 646 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ వచ్చింది. గత బడ్జెట్ తో పోల్చుకుంటే కొన్ని రంగాలకు నిధులు తగ్గించి, మరికొన్ని రంగాలకు నిధుల కేటాయింపు పెంచారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. బిసి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ఈసారి పెద్దపీట వేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే, గతంలో కేటాయించిన నిధులను వినియోగించకుండా, దారిమళ్లించి, ఇప్పుడు అంకెలగారడీ చేశారన్నది ఆయా వర్గాల విమర్శ. స్థూలంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎలా వుంది? తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందా? విద్యారంగం సమస్యలను పరిష్కారం చూపుతోందా? ఈ బడ్జెట్ ను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇదే అంశంపై ఇవాళ్టి 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాజీ హిందూ రెసిడెన్స్ ఎడిటర్ నగేష్, కొమటి నాగేంద్ర గౌడ్, ఎఐకేఎస్ నేత సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:07 - March 14, 2017

హైదరాబాద్: అట్టడుగు వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని.. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో మార్పులు చేపట్టామని తెలిపారు. ఎస్సీల అభివృద్ధికి 14,375 కోట్లు, ఎస్టీల అభివృద్ధి 8,165.88 కోట్లు కేటాయించామన్నారు. ఒకవేళ ఈ నిధులు ఖర్చుకాకుంటే, మిగిలిన నిధులను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి గిరిజన తండాలను, గూడాలను గ్రామ పంచాయితీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు. చెల్లప్ప కమీషన్‌ నివేదిక వచ్చిన తరువాత వాల్మీకి బోయ, ఖైతి లంబాడ కులాలను ఎస్టీ కేటగిరిలో చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈటల స్పష్టం చేశారు.

బీసీల సంక్షేమానికి రూ.5,070 కోట్లు......

అదేవిధంగా బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి 5,070 కోట్లు ప్రకటించారు ఈటల. ప్రతి నియోజకవర్గంలోనూ, ఐదు నుంచి ఇంటర్‌వరకూ చదువుకునే వీలుండేలా బీసీ గురుకులాలను ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే రజక, నాయి బ్రాహ్మణుల కోసం మరో 500 కోట్లు, చేనేత రంగాన్ని ఆదుకునేందుకు 1200 కోట్లు కేటాయించామన్నారు ఈటల. కులవృత్తుల వారికి ఆధునిక సాంకేతికత అందిస్తామన్నారు మేకలు, గొర్రెలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకందారులకు సాయం చేస్తామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

మైనారిటీల సంక్షేమానికి రూ.1,249.66 కోట్లు......

ఇక బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి 1249 కోట్ల 66 లక్షల రూపాయలు కేటాయించారు. ఇమామ్‌లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి 1500 వందలకు పెంచినట్లు ఈటల తెలిపారు. అదేవిధంగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వాల పట్టించుకోని ఎంబీసీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఈటెల. ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రకటించామని.. వారి అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించారు ఈటల.

రూ.406 కోట్లతో భూమి సేకరణ......

దళితులకు మూడెకరాల భూ కేటాయింపులో భాగంగా 406 కోట్లతో భూమిని సేకరించి... 3,671 దళిత కుటుంబాలకు 9,664 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఈటల తెలిపారు. మొత్తానికి ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని మంత్రి ఈటల ప్రకటించారు.

మిషన్ కాకతీయ పై మంత్రి హరీష్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్: తెలంగాణలో మిషన్‌ కాకతీయ మూడో దశ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే అధికారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం... పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పనులపై మంత్రి హరీశ్‌ రావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలానికి ముందే చెరువుల పూడికతీత పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కాంగ్రెస్‌, బిజెపిల మధ్య వార్‌

హైదరాబాద్: గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్‌, బిజెపిల మధ్య వార్‌ మొదలైంది. గోవాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం కాగా...మణిపూర్‌లో కూడా తమకే అవకాశం ఇవ్వాలని దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. గోవాలో పారికర్ ప్రమాణ స్వీకారం నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. మరోవైపు మణిపూర్‌లో గవర్నర్‌ సూచన మేరకు సిఎం పదవికి ఇబోబి సింగ్‌ రాజీనామా చేయనున్నారు. బిజెపి శాసనసభాపక్ష నేతగా బీరేన్‌సింగ్‌ ఎంపికయ్యారు.

06:19 - March 14, 2017

హైదరాబాద్: ‘కాటమరాయుడు’ సినిమా సెట్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, అలీ సరదాగా సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించి వారు సరదాగా గడిపిన క్షణాలను చిత్ర యూనిట్ షూట్ చేసింది. 50సెకన్ల నిడివి గల ఈ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. పవన్, అలీ సరదాగా ఎంజాయ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రతి సన్నివేశంలో పవన్‌ నవ్వుతూనే ఉండటం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. దాదాపు పవన్‌ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉంటారు.. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. డాలీ దర్శకత్వం వహిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Don't Miss