Activities calendar

15 March 2017

ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం..

ఢిల్లీ : ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది.

20:12 - March 15, 2017

నాలుగు నెలలు దాటింది.. ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయి. మరో పక్క సీన్ రివర్సయింది. రిజల్ట్ తిరగబెడుతోంది. మళ్ళీ ఏటీఎం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నగదు సమస్య మరింత తీవ్రమయింది. ఈ సమస్య పరిధి ఇంతేనా? లేక దేశంపై భారీ ఎత్తున ప్రభావం చూపబోతోందా? నగదు కొరత రైతన్న బతుకులను కూలుస్తోందా? చిన్న వ్యాపారాలను, పరిశ్రమల ఆయువు తీస్తోందా? ఏం జరుగుతోంది? ఈ అంశంపై ప్రత్యేక కథనం. నాలుగు పనిచేయని ఏటీఎంలు. నెలజీతం డ్రా చేయలేని ఉద్యోగులు.. ఏటీఎంల దగ్గర నిలబడిన కొందరు సామాన్య ప్రజలు.. ఇదేనా సమస్య.. ఇంతేనా నగదు రద్దు ప్రభావం..? ఎంత మాత్రమూ కాదని పరిశీలనలు చెప్తున్నాయి. డీమానిటైజేషన్ తో దేశంలో ఎన్ని రంగాలు అష్టకష్టాలు పడుతున్నాయో ఊహించగలరా? ఎందరు కోలుకోలేని దెబ్బ తిన్నారో తెలుసా?

అసంఘటిత రంగం..
రైతన్న బతుకంతా ఏదో ఒక గండమే.. ప్రకృతి విపత్తులు తరచుగా కాటేస్తుంటే.. ఈ ఏడాది ప్రభుత్వ నిర్ణయం నిండా ముంచుతోంది. అంతులేని కష్టాలను తెచ్చిపెడుతోంది. అడుగడుగునా కరెన్సీ సమస్య ఎదురవుతూ రైతన్నను ఎక్కడలేని సమస్యలో పడేసింది. కూటి కోసం కూలి కోసం.. పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం.. ఎప్పుడో శ్రీశ్రీ రాసిన మాటలివి. ఇప్పుడు దేశం పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. చేద్దామంటే పనిలేదు. చేతిలో చిల్లగవ్వలేదు.. తినటానికి తిండిలేదు.. కుటుంబాన్ని సాకటానికి సొమ్ములేదు. రోగమొస్తే దిక్కులేదు. ఎంత కష్టం.. ఎంత కష్టం.. ఎన్నాళ్లీ కరెన్సీ సమస్య.. భారత అర్ధిక వ్యవస్థపై ముఖ్యంగా అసంఘటిత రంగంపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది..

కోలుకోలేనంత దెబ్బ..
పాలపాకెట్ల నుండి... పచారీ సరుకుల వరకు..నిత్యం కరెన్సీ నోట్లు అవసరమమే.. తొంభై శాతం జనాభా కరెన్సీ నోట్లపై ఆధారపడి నిత్యజీవిత అవసరాలను తీర్చుకునే కరెన్సీ లేకుండా చేసి ప్రజల జీవితాలను సంక్షోభంలో పడేసేలా సర్కారు చర్య మారింది. అయిందేదో అయింది.. అంతా సర్దుకుంటోందని అనుకున్నారు. అంతలోనే సీన్ రివర్సయింది. నవంబర్ 8న ఎలాంటి పరిస్థితి ఉందో మళ్లీ అదే సీన్ కనిపిస్తోంది. పనిచేయని ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర పెరిగిన రద్దీ.. చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు.. వెరసి తెలుగు రాష్ట్రాలు నగదు లేక విలవిల్లాడుతున్నాయి. మరోపక్క గ్రామీణ భారతం కోలుకోలేనంత దెబ్బతింటోంది. వెరసి రాబోయే కాలంలో ఈ ఫలితాలు స్పష్టంగా కనపడబోతున్నాయని చెప్పాలి.
ఈ అంశంపై పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:06 - March 15, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 150వ రోజులుగా జరుగుతున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజల ఇబ్బందులను పాదయాత్ర బృందం అడిగి తెలుసుకొంటోంది. ఆయా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూ పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా 'మల్లన్న' పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శితో 'మల్లన్' ముచ్చటించాడు. పాదయాత్రలో ప్రజలు వెలిబుచ్చిన సమస్యలను..ఇతర విషయాలను వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:56 - March 15, 2017

అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 56 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 19 వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 12 వేల కోట్లు కేటాయించారు. 9 రంగాల ఆధారంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందన్నారు యనమల. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో చర్చ జరిగింది. ఈ చర్చలో వర్మ (టిడిపి), తులసీదాస్ (విశ్లేషకులు), విశ్వేశ్వర్ రెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

గురువారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. తమ వేతన పెంపుపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని పేర్కొంటూ వివిధ శాఖలకు చెందిన కేంద్ర ఉద్యోగులు గురువారం ఒకరోజు సమ్మె చేపట్టనున్నారు.

 

19:28 - March 15, 2017

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

రాజస్థాన్ లో కూలిన సుఖోయ్ 30

రాజస్థాన్ : బార్మర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం సుఖోయ్ 30 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

18:56 - March 15, 2017

ఆదిలాబాద్ : ఉన్నట్టుండి మంటలు లేస్తాయి..అగ్నిప్రమాద సెంటర్ కు సమాచారం వెళుతుంది. గంటల పర్యంతం అగ్నిమాపక సిబ్బంది హడావుడి చేస్తారు. ఆ తరువాత ఏమంది...ప్రమాదానికి గల కారణాలపై నివేదిక తయారు చేస్తారు. ఇంకేముంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకోవడం..ఈ తతంగం అంతా ఆదిలాబాద్ జిల్లాలో రోటిన్ గా మారింది. ఏడాది ఒకసారి ప్లాన్డ్ ప్రమాదాలతో కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లో వెళ్లడం.. విలువైన వ్యవసాయ ఉత్పత్తులు బుగ్గిపాలవుతున్నాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:47 - March 15, 2017
18:45 - March 15, 2017

విజయవాడ : ఏపీ బడ్జెట్‌ ప్రజలకు తీరని నిరాశ మిగిల్చిందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. ఇది పూర్తిగా దివాళాకోరు బడ్జెట్‌ అని విమర్శించారు. ముఖ్యమైన రంగాలకూ కేటాయింపులు అంతంతమాత్రంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి కేటాయింపులు చూస్తే ఒక్కొక్కరికి రూ. 120 వస్తుందని విమర్శించారు. కుటుంబ రావు కమిటీ పేరిట రూ. 24వేల కోట్ల రూపాయలకు రుణమాఫీ కుదింపు చేశారని తెలిపారు.

18:43 - March 15, 2017

విజయవాడ : ఓవరాల్‌గా బడ్జెట్‌ బాగుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో లోబేస్‌ ఉన్నా.. ఇబ్బందులున్నా.. గ్రోత్‌ రేట్‌ 11.61గా ఉందన్నారు. గ్రోత్‌రేట్‌ 15 శాతం అచీవ్‌మెంట్‌గా పెట్టుకుని ముందుకువెళ్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు.. ప్రతి కుటుంబం నెలకు 10 వేల ఆదాయం సంపాదించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా యనమల బడ్జెట్‌ను తీర్చి దిద్దారని చంద్రబాబు అభినందించారు.

18:42 - March 15, 2017

విజయవాడ : అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 56 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 19 వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 12 వేల కోట్లు కేటాయించారు. 9 రంగాల ఆధారంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందన్నారు యనమల. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అమరావతిలో నిర్మించిన శాసనసభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చారిత్రక నగరమైన అమరావతిలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు యనమల. 2016-17 కంటే ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాలు 15.70 శాతం పెరిగాయని.. లక్షా 56 వేల 999 కోట్ల ప్రతిపాదనలతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 25 వేల 912 కోట్లు కాగా.. కేపిటల్‌ వ్యయం 31 వేల 87 కోట్లు. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు 31 వేల 87 కోట్లుగా, ఆర్థిక లోటు 21 వేల 863 కోట్లుగా ఉందన్నారు యనమల.

గ్రామీణాభివృధ్ధి..
ఇక ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణాభివృద్ధికి తొలి ప్రాధాన్యత కల్పిస్తూ 19 వేల 565 కోట్లు కేటాయించారు యనమల. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల 197 కోట్లు, నీటి పారుదల రంగానికి 12 వేల 770 కోట్లు కేటాయించారు. ఇక వ్యవసాయ సంబంధిత రంగాలకు 9 వేల కోట్లు, రైతు రుణమాఫీకి 3,600 కోట్లు కేటాయించిన మంత్రి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు వెయ్యి 60 కోట్లు కేటాయించారు. అన్ని దేశాల నుంచి పెట్టుబడుల ఆహ్వానిస్తున్న ప్రభుత్వం... రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి 2 వేల 86 కోట్లను ప్రకటించారు.

వెనుకబడిన తరగతుల సంక్షేమం..
అలాగే... వెనకబడిన తరగతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన సర్కార్‌.. దానికోసం 10 వేల కోట్లు కేటాయించింది. ఇక షెడ్యూల్డ్‌ కులాలకు 9,847 కోట్లు, గిరిజన సంక్షేమానికి వెయ్యి 814 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి 695 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మైనారిటీల ఉపకార వేతనాల కోసం 240 కోట్లు కేటాయించిన యనమల.. మసీదుల్లో పని చేసే ఇమామ్‌ల, మౌజన్ల ప్రోత్సాహకా ల కోసం 24 కోట్లు ప్రకటించారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖకు 3 వేల 685 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 89 కోట్లు కేటాయించారు. స్త్రీ, శిశు, వికలాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ.1,773కోట్లు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి 7 వేల 21 కోట్లు కేటాయించారు. అలాగే విదేశాల్లో విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థుల కోసం ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేకంగా 5 కోట్లు కేటాయించారు.

నిరుద్యోగ యువతకు..
నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో 500 కోట్లు ప్రకటించారు యనమల. ఉన్నత విద్యకు 3 వేల 513 కోట్లు కేటాయించారు. పట్టణాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన సర్కార్‌.. పట్టణాభివృద్ధి శాఖకు 5,207 కోట్లను ప్రకటించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల అభివృద్ధి కోసం 450 కోట్లు, మరో 13 స్మార్ట్‌సిటీల అభివృద్ధికి 150 కోట్లు కేటాయించారు. అలాగే 33 అమృత పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 300 కోట్లు ప్రకటించారు. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విజయవాడ మెట్రోకు వంద కోట్లు కేటాయించారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో గ్రామీణ, పట్టణ నిరుపేదలకు శాశ్వత గృహ నిర్మాణం కోసం వెయ్యి 456 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు యనమల.

ఉద్యోగాల ఖాళీల భర్తీ..
ఇక పోలీసు వ్యవస్థను ఆధునీకరించాలని భావించిన ప్రభుత్వం.. పోలీసు శాఖకు 5,221 కోట్లు కేటాయించారు. హోంగార్డులతో సహా పోలీసులందర్నీ ప్రమాద బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు యనమల. ఇక కొత్త పెన్షన్‌ విధానం కింద ఉద్యోగాల్లో చేరి, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ మంజూరు చేసే అంశాన్ని ఏపీ ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందన్నారు. ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు దీనిని వర్తింప చేస్తామన్నారు. రెండున్నరేళ్లలో 12,552 ఉద్యోగాల ఖాళీ భర్తీకి అనుమతి ఇచ్చినట్టు ఆర్థిక మంత్రి యనమల తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు.

18:19 - March 15, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను ప్రతిపక్ష నేత జగన్ తప్పుబట్టారు. అన్నీ తప్పులు..అబద్ధాలే చెప్పారంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అనంతరం సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని, రూ. 1600 కోట్లు ఇస్తామని పేర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ విషయానికి వస్తే రూ. 1300 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొందన్నారు. 2015-16 సంబంధించి 15లక్షల 13 వేల 883 మంది విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకున్నారని ఇందులో ప్రభుత్వం కోతలు విధించి 14 లక్షల 62 వేల 04 విద్యార్థులను ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో రూ. 2,578 కోట్లు ఖర్చు ఉంటే ప్రభుత్వం రిలీజ్ చేసింది కేవలం రూ. 1,578 కోట్ల రూపాయలుని పేర్కొన్నారు. అంటే ఇంకా రూ. 999 కోట్ల బకాయిలున్నాయన్నారు. ఇక 2016-17కు సంబంధించి 15 లక్షల 80 వేల 191 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం కోతలు విధించి 14 లక్షల 42వేల మందికి తగ్గించారని తెలిపారు. వాళ్లకు రూ. 2,481 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ. 527 కోట్లు అని తెలిపారు. ఇంకా ఇవ్వాల్సింది రూ. 1954 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

బాత్ రూంలు..వాస్తవాలు..
7లక్షల 50 వేల బాత్ రూంలు నిర్మించబోతున్నామని, దీనికి వంద కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఒక్కో బాత్ రూం నిర్మించడానికి రూ. 15వేలు లెక్కిస్తే రూ. 1050 కోట్లు అవసరం ఉంటుందని, కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోతుందని నిలదీశారు. తాను రంపచోడవరంలో ఇటీవలే పర్యటించడం జరిగిందని, అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చెంబులు పట్టుకుని కొండలు ఎక్కుతున్నామని హాస్టల్ విద్యార్థులు పేర్కొన్నారని దీనికి సమాధానం ఏంటీ అని ప్రశ్నించారు.

ఆశ్చర్యపోయే లెక్కలు..
బడ్జెట్ లో ఆశ్చర్యపోయే లెక్కలున్నాయని, చంద్రబాబువి పేపర్ లెక్కలని..14వ ఆర్థిక సంఘం చెప్పిందని ప్రత్యేక హోదా రావడం లేదని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రణాళిక సంఘానికి..హోదాకు సంబంధం లేదని చెప్పడానికి బాబు పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. క్రెసిల్ రేటింగ్ తగ్గి రెండు డిస్కంల్లో నష్టాలు వచ్చినా ఐదు అవార్డులు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లక్షా 40వేల కోట్లు ఉంటే ప్రస్తుతం ఏపీ బడ్జెట్ లక్షా 56వేల కోట్లు అని తెలిపారు. మూడేళ్లలోనే బడ్జెట్ ఇంతగా పెరగడం ఆశ్చర్యం వేస్తోందని, 17వేల కోట్లు అప్పులు తెచ్చి లెక్కలు చూపించడం లేదన్నారు. 2016 డిసెంబర్ నాటికి రూ. 30వేల కోట్లు అప్పులు తెచ్చిందన్నారు.

నిర్మాణ పనులు ఆపాలన్న ఎన్జీటీ..

ఢిల్లీ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా దట్టమైన అడవుల్లో నిర్మాణ పనులు ఆపాలని ఎన్టీటీ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ అసెంబ్లీ ఎదుట ప్రివిలేజ్ కమిటీ రిపోర్టు..

విజయవాడ : రేపు ఏపీ అసెంబ్లీ ఎదుట ప్రివిలేజ్ కమిటీ రిపోర్టు రానుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై స్పీకర్ కు కమిటీ నివేదిక సమర్పించనుంది.

బడ్జెట్ లో ఆశ్చర్యపోయే లెక్కలు - జగన్..

విజయవాడ : బడ్జెట్ లో ఆశ్చర్యపోయే లెక్కలున్నాయని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. చంద్రబాబువి పేపర్ లెక్కలని, 14వ ఆర్థిక సంఘం చెప్పిందని ప్రత్యేక హోదా రావడం లేదని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రణాళిక సంఘానికి..హోదాకు సంబంధం లేదని చెప్పడానికి బాబు పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. క్రెసిల్ రేటింగ్ తగ్గి రెండు డిస్కంల్లో నష్టాలు వచ్చినా ఐదు అవార్డులు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లక్షా 40వేల కోట్లు ఉంటే ప్రస్తుతం ఏపీ బడ్జెట్ లక్షా 56వేల కోట్లు అని తెలిపారు.

లుథియానాలో అమ్మోనియం గ్యాస్ లీక్..

లుథియానా: ఓ ఐస్ ఫ్యాక్టరీ నుండి అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. దీనితో స్థానికులు తలనొప్పి..కళ్ల మంటతో ఇబ్బందులు పడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలుస్తోంది.

వెస్ట్ బెంగాల్ లో 11.50 కిలోల గోల్డ్ స్వాధీనం..

పశ్చిమ బెంగాల్ : సిలిగురి ప్రాంతంలో 11.50 కిలొల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ. 3.42 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది.

17:32 - March 15, 2017
17:31 - March 15, 2017

యాదాద్రి : సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో మహిళా నాయకురాలు రమ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గత 150 రోజులుగా పాదయాత్ర జరుగుతోంది. గ్రామాల్లోని మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలపై పోరాటం చేసేలా వారిని సంఘటితం చేయాల్సినవసరం ఉందని రమ పేర్కొన్నారు. పాదయాత్ర విరామ సమయంలో ఆమె టెన్ టివితో మాట్లాడారు. మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రమతో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా పలు విశేషాలు..విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:25 - March 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని, మరో 27 నెలలు ఆగాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం సురక్షితంగా ఉంటుందని భావించి తమకు అధికారం కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వంలో అవినీతి చాలా వరకు తగ్గిందని చెప్పుకొచ్చారు. తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు ఓ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

17:19 - March 15, 2017

యాదాద్రి : సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి లక్ష్యంతో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కాటేపల్లి, సికిందర్ నగర్, మోటకొండూరు, దిలావర్ పూర్, మంతపురి, బహదూర్ పేట, ఆలేరులో పాదయాత్ర పర్యటించనుంది. అనంతరం ఆలేరులో బహిరంగసభ జరగనుంది.

17:16 - March 15, 2017

కోటి ఎకరాలకు నీళ్లిస్తాం - కేసీఆర్..

హైదరాబాద్ : ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్లిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే '21 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే నెం.1 స్థానంలో ఉన్నాం. ఐటీ రంగంలో రెండోస్థానంలో ఉన్నాం. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదు. 11 వందల వెటర్నరీ సెంటర్లు పెడుతున్నాం. వచ్చే ఏడాది 201 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేస్తాం. రెండున్నరేండ్లలో 119 బీసీ గురుకులాలను ప్రారంభించాం. ఒక్కో విద్యార్థిపై రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. దేశంలోనే తొలిసారి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు.

ఇబ్రహీంపట్నంలో నకిలీ నోట్ల ముఠా..

హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 6.20 లక్షల కొత్త నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సాకేత్వాల రమేష్, మహ్మద్ రియాజ్ లను అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. ఇటీవల నకిలీ నోట్ల కేసులో రమేష్ అరెస్టు అయి బెయిల్ పై విడుదల అయ్యాడు.

టి.శాసనమండలి వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. కాసేపటి క్రితం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.

ఏడేళ్ల విద్యార్థినిపై అత్యాచారయత్నం..

కర్నూలు : మంత్రాలయం మండలం మాధవరంలో ఏడేళ్ల విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. తప్పించుకొన్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ బడ్జెట్ నిరాశగా ఉందన్న సీపీఎం..

విజయవాడ : ఏపీ బడ్జెట్ నిరాశపరిచిందని సీపీఎం పేర్కొంది. దళిత, బలహీన వర్గాల ప్రజలకు మొండి చేయి చూపారని, పోలవరం, నిర్వాసితుల పరిహారాన్ని బడ్జెట్ లో ప్రస్తావించలేదన్నారు. మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేసేలా ఉందన్నారు.

బడ్జెట్ లు బాగున్నాయి - గవర్నర్..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల బడ్జెట్ లు బాగున్నాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కితాబిచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారం కోసం కమిటీ వేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ ఈ కమిటీ రెండుసార్లు సమావేశమైందని, ఈనెల 26న మరోసారి కమిటీ సమావేశం జరుగుతుందన్నారు.

17 నుండి 1 వరకు పదో తరగతి పరీక్షలు..

విజయవాడ : ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2931 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు, 628081 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 65 సమస్యత్మాక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 156 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తాయన్నారు. ఇన్విజిలేటర్స్ సెంటర్లకు ఫోన్ లు తీసుకెళ్ల కూడదని స్పష్టం చేశారు.

16:44 - March 15, 2017

టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా ఆస్ట్రేలియాతో రియల్‌ టెస్ట్‌కు రెడీ అయింది.పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకున్న కొహ్లీ అండ్‌ కో రాంచీ టెస్ట్‌తో సిరీస్‌పై పట్టుబిగించాలని పట్టుదలతో ఉంది. టెస్టుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌...టీమిండియా,ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా జరుగనున్న కీలక టెస్ట్‌ మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి.

తొలి టెస్టులో..
తొలి టెస్ట్‌లో తేలిపోయిన భారత్‌ రెండో టెస్ట్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకున్న కొహ్లీ అండ్‌ కో రాంచీ టెస్ట్‌లో అంచనాలకు మించి రాణించాలని పట్టుదలతో ఉంది. సిరీస్‌కే కీలకంగా మారిన రాంచీ టెస్ట్‌లో విరాట్‌ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి సమాన ఆధిక్యంలో నిలిచాయి. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా...ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియాదే పై చేయి..
ఇక ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం ఇండియాపై ఆస్ట్రేలియాదే పై చేయిగా ఉంది. టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియాపై ఆధిపత్యం ప్రదర్శించిన జట్లలో ఆస్ట్రేలియా ముందు వరుసలోనే ఉంది. టెస్టుల్లో ఇప్పటివరకూ ఇరు జట్లు 92 మ్యాచ్‌ల్లో పోటీపడగా ఆస్ట్రేలియా 41 టెస్టుల్లో నెగ్గింది. భారత్‌ 25 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఎంతో ఒత్తిడిలోనూ రెండో టెస్ట్‌లో విరాట్‌ ఆర్మీ రాణించి సంచలన విజయం సాధించిన తీరు భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి సారిగా అంతర్జాతీయ టెస్ట్‌కు ఆతిధ్యమిస్తోన్న రాంచీ స్టేడియంలో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టెస్టుల్లో టీమిండియాపై తిరుగులేని ట్రాక్ రికార్డ్‌ కలిగిన ఆస్ట్రేలియాను ఓడించాలంటే కొహ్లీ అండ్‌ కో మరో సారి అంచనాలకు మించి రాణించాల్సిందే.

16:41 - March 15, 2017

నెల్లూరు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రాజకీయాలకు దారితీస్తున్నాయి. పోటాపోటీగా స్థానిక ప్రజాప్రతినిధులను తమ పార్టీల్లో చేర్చుకుంటూ టీడీపీ, వైసీపీ క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు క్యాంపు రాజకీయాలకు దిగజారాయి. అధికార పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి బరిలో ఉంటే.. ప్రతిపక్ష వైసీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఎవరికి వారే తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 16 మంది స్వతంత్ర, వైసీపీ ఎంపీటీసీలను చేర్చుకుంది. ఇప్పటికే చెన్నై, బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు దాదాపు 350 మందికి పైగా ఓటర్లను క్యాంపులకు తరలించినట్లు తెలుస్తోంది.. ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్యాంపులకు తరలించారు.

వైసీపీ..
అధికార పార్టీకి ధీటుగా వైసీపీ సైతం క్యాంపు రాజకీయాలు నడుపుతోంది. జిల్లాలో తొలుతా క్యాంపులకు తెరలేపిన వైసీపీ కోవూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు ఓటర్లను క్యాంపులకు తరలించారు. వైసీపీ అభ్యర్ది ఆనం విజయ్ కుమార్ రెడ్డి వియ్యంకురాలు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రాతినిథ్యం వహిస్తున్న గద్వాల్‌ నియోజకవర్గంలో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. మరికొందరిని తరలించే క్రమంలో అధికార పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు.. దీంతో వైసీపీలోకి వెళ్లిన వారితో పాటు స్వతంత్రులు, కొత్తవారిని తమ ఖాతాలో వేసుకుంటూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తోంది టీడీపీ. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్ష నేతలు క్యాంపు రాజకీయాలతో బిజీబీజీగా ఉన్నారు.

16:37 - March 15, 2017

కరీంనగర్ : ఖాకీ దుస్తుల వెనుక కాఠిన్యమే కాదు.. కారుణ్యము కూడా ఉంటుందని కరీంనగర్ జిల్లా పోలీసులు చాటారు. ఆడబిడ్డ పెళ్లి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పెళ్లి పెద్దలుగా మారి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించడానికి ముందుకొచ్చారు. మా ఆడబిడ్డ పెళ్లికి రండి.. వధూవరులను ఆశీర్వదించండంటూ శుభలేఖలు పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి చేస్తూ ఖాకీ బాస్‌లు పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఆశలు అవిరైపోయిన ఆ ఆడబిడ్డకి అండగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ లో హన్మండ్లు గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. హన్మండ్లుకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. . ఎన్నో కష్టాలతో ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. కొడుకు దుబాయ్‌లో ఏజెంట్ మోసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో చనిపోయింది. దీంతో కుటుంబపోషణ అంతా హన్మండ్లు మీద పడింది. ఈ క్రమంలోనే తన బాధ్యతగా చిన్న కూతురు పెళ్లి చేయడానికి రెడీ అయ్యాడు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఎక్కడా డబ్బు ముట్టలేదు. దీంతో మరో వారం రోజుల్లో పెళ్లి ఉండడంతో ఎక్కడ కూతురు పెళ్లి ఆగిపోయితుందనే బాధతో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు జైల్లో ఉండడంతో కోడలే హన్మండ్లుకి అంత్యక్రియలను పూర్తిచేయడం అందరి మనసులను కలిచివేసింది.

పోలీసుల విచారణ..
హన్మండ్లు మృతిపై విచారణ చేపట్టిన రామడుగు ఎస్‌ఐ నరేష్‌రెడ్డి హన్మండ్లు మృతికి దారితీసిన కారణాలు తెలుసుకుని చలించిపోయారు. కుటుంబ పెద్ద మృతితో తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆడబిడ్డ పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు. చొప్పదండి సీఐ లక్ష్మిబాబుతో కలిసి ఆగిపోయిన పెళ్లిని జరిపించడానికి డిసైడ్ అయ్యారు. ఇందుకు కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి కూడా తోడ్పాటునిందించారు. తమవంతుగా పెళ్లి సహకరించడానికి ముందుకు రావడంతో ప్రస్తుతం పెళ్లి పనులు చకచక జరుగుతున్నాయి. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉండగా తండ్రి మరణంతో పుట్టెడు శోకంలో ఉన్న అనూషను ఒప్పించి ఈ నెల 16న ఉదయం 11 గంటల 17 నిమిషాలకు శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో పోలీస్ లు శుభముహుర్తం ఖరారు చేశారు. మా ఆడబిడ్డ పెళ్లికి రావాలంటూ అందరిని ఆహ్వానిస్తున్నారు.

పెళ్లి పెద్ద కమిషనర్..
పెళ్లి పెద్దగా కమిషనర్ కమలాసన్ రెడ్డి నిలుస్తుండగా... తాళిబొట్టు, మట్టెలను ఏసీపీ తిరుపతి తనవంతుగా అందించనున్నారు. వధూవరులకు కొత్త బట్టలను కొనుగోలు చేసి ఇరు కుటుంబీకులకు అందజేశారు. ఈ పెళ్లి చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎస్‌ఐ నరేష్‌రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన కర్తవ్యం అని చెప్పారు. పోలీసుల ఔదర్యాన్ని గ్రామపెద్దలు మెచ్చుకుంటున్నారు. తమ వంతుగా వారు కూడా పెళ్లికి సాయపడుతున్నారు. పోలీసుల అండతో తమ ఊరి ఆడబిడ్డ పెళ్లి చేయడం గర్వంగా ఉందంటున్నారు గ్రామస్తులు. తండ్రి మృతితో నిలిచిపోతుందనుకున్న పెళ్లిని పోలీస్ లు దగ్గరుండి జరిపిస్తుండం పట్ల వధువు అనూష కన్నీటి పర్యాంతం అవుతోంది. జీవితాంతం పోలీసులకు రుణపడి ఉంటానని చెబుతోంది. పోలీస్‌లు సమాజంలో పరివర్తన కోసం పాటు పడడమే కాదు ఆపదలో ఉన్న వారినీ ఆదుకుంటూ ఆదర్శవంతులుగా నిలవడం హర్షించదగిన విషయమని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటువంటి పోలీసులు సమాజంలో ఉంటే ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగదు.

16:33 - March 15, 2017

హైదరాబాద్ : అవకాశం ఉండి అప్పు చేయని ప్రభుత్వమే సన్నాసి ప్రభుత్వమని.. ప్రొగ్రెస్‌ లేని ప్రభుత్వమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసన మండలిలో మాట్లాడిన కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా అప్పు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ 60 ఏళ్లలో చేసిన అప్పును టీఆర్‌ఎస్‌ రెండేళ్లలో చేసిందన్న వ్యాఖ్యలను కేసీఆర్‌ ఖండించారు. కాంగ్రెస్‌ చేసిన 60 వేల కోట్ల అప్పు ఆరు లక్షల కోట్లకు సమానమన్నారు.

16:30 - March 15, 2017

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ కొరతను అధిగమించామని.. సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలోని విద్యుత్‌ డిమాండ్‌ కంటే 300 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా వచ్చిందని దాన్ని కూడా సప్లై చేయగలిగామన్నారు. ఇంకా 700 మెగావాట్ల అవసరాన్ని సైతం తీర్చగలమని అన్నారు. ఈ నెల రోజులు విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని.. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని కేసీఆర్‌ చెప్పారు.

జర్నలిస్టుల సంక్షేమానికి నిధులేవన్న ఏపీజేయూ..

విజయవాడ : బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడాన్ని ఏపీజేయూ ఖండించింది. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయిస్తే ఏపీ ప్రభుత్వం ఒక్కపైసా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా గృహ నిర్మాణం..రిటైర్డ్ జర్నలిస్టుల పెన్షన్ పథకం విస్మరించారని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా పథకం కూడా అమలు కాలేదన్నారు.

15:54 - March 15, 2017

తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. ఈ చిత్రాన్ని తెరకెకిక్కించిన 'రాజమౌళి' ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. 'కట్టప్ప' బాహుబలిని ఎందుకు చంపాడా ? అని అందరీలోనూ మెదలుతున్న ప్రశ్న. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సినిమా ట్రైలర్ ను 16వ తేదీన విడుదల చేస్తామని స్వయంగా 'రాజమౌళి' చెప్పడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉదయం తెలుగు రాష్ట్రాలు..ఇతర ప్రాంతాల్లో ఎంపిక చేసిన థియేటర్ లలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నామని, సాయంత్రం 5 గంటలకు సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. ఇప్పటికే తొలి భాగంతో ఇండస్ట్రీ రికార్డ్లను 'బాహుబలి' తిరగారాసిన సంగతి తెలిసిందే. మరోసారి రికార్డులు సృష్టించాలని 'బాహుబలి 2' చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరి చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో ? ఎలాంటి రికార్డులు సృష్టించనుందో కొద్ది గంటల్లో తేలనుంది.

15:41 - March 15, 2017

అమీర్ ఖాన్..బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందారు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అలరిస్తున్న ఈ హీరో ఇటీవలే బర్త్ డే జరుపుకున్నారు. 52వ పుట్టిన రోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముంబైలో తన నివాసంలో కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో సరదాగా మాట్లాడారు. సోమవారం రాత్రి 12గంటలకే నిద్రపోవడం జరిగిందని, ఆ సమయంలో ఎన్నో ఫోన్స్ కాల్స్, సందేశాలు వచ్చాయన్నారు. కానీ ఒక్కరు కూడా తనకు పుట్టిన రోజు బహుమతులివ్వలేదని..కనీసం మీరైనా ఇస్తారని ఆశిస్తున్నట్లు మీడియానుద్దేవించి సరదాగా వ్యాఖ్యానించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీకి రావాలని రెండు రోజుల క్రితమే 'షారూఖ్ ఖాన్'ని ఫోన్ లో ఆహ్వానించినట్లు, తమ మధ్య వృత్తిపరమైన విషయాలను చర్చించుకోవడం జరగదన్నారు. గతేడాది 'దంగల్‌' సినిమాతో కలెక్షన్ల రికార్డులు సృష్టించిన ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ప్రస్తుతం 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌', 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

15:33 - March 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ఆనాటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత వైసీపీ లీడర్ బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలు వినిపించాయి. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై పలు విమర్శలు గుప్పించారు. అవినీతి విషయంలో ఆయన మాట్లాడారు. ఎక్కడా తాము అవినీతి చేయలేదని, గతంలో వోక్స్ వ్యాగన్ విషయాన్ని ప్రస్తావించారు. 'ఏంటీ సేత్తాం' అంటూ సెటైర్ వేశారు. ఆరోపణలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, ఆరోపణలు రుజువు చేయాల్సిందేనన్నారు. 29 రాష్ట్రాల ఫెర్మామెన్స్ కు సంబంధించిన లెక్కలు ప్రధాన మంత్రి వద్ద ఉంటాయని, ప్రభుత్వం అంటే తెలంగాణ గవర్నమెంట్ లా ఉండాలని మోడీ కితాబిచ్చారని పేర్కొన్నారు. 6వేల మెగావాట్ల విద్యుత్ ను ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వడం జరిగిందని, ప్రైవేటు వారు తనపై తీవ్రమైన వత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని అభినందించారని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో ఒక తప్పు ఉంటే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. ఒక్క ఆరోపణ రుజువు చేశారా ? అని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

15:24 - March 15, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2017-18 బడ్జెట్ పై వైసీపీ నేత రోజా పెదవివిరిచారు. బడ్జెట్ అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమైన పథకాలకు నిధులు కేటాయించలేదని, మహాలక్ష్మీ స్కీంకు నిధులు కేటాయించలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని అనుకుంటే లోకేష్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఊహించలేదన్నారు. మహిళలకు ఎక్కడా జాబు కేటాయించలేదన్నారు.

15:18 - March 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 21 శాతం గ్రోత్ సాధించి దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. శాసనసమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బడ్జెట్..ఇతరత్రా అంశాలపై ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు అనంతరం ప్రధాన మంత్రి మోడీని తాను కలవడం జరిగిందని, 31 జిల్లాలతో అద్భుతంగా ఉరుకుతున్న తెలంగాణలో సమస్యలు నెలకొన్నాయని ప్రధాని దృష్టికి తీసుకరావడం జరిగిందన్నారు. నోట్ల రద్దు జరిగినా స్టాంప్ రిజిస్ట్రేషన్, మోటార్ రిజిస్ట్రేషన్ లలో కొంత ఆదాయం తగ్గిందన్నారు. 21 శాతం గ్రోత్ సాధించడంపై ప్రధాని అభినందించడం జరిగిందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం, ఐటీలో అద్భుతమైన గ్రోత్..ఇతరత్రా రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు.

88 లక్షల గొర్రెలు..
ప్రస్తుతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలని, ఇందుకు కావాల్సిన వనరులపై దృష్టి సారించడం జరిగిందన్నారు. 30 లక్షల మంది యాదవులు, 40 లక్షల మంది మత్స్య కార్మికులున్నారని, వీరిని అభివృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. అందులో భాగంగా 88 లక్షల గొర్రెలను తెచ్చి యాదవులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం గొర్రెల సంఖ్య ఎంత ఉందని ఆరా తీస్తే కోటి 20 లక్షలున్నాయని అధికారులు పేర్కొన్నారని, ప్రభుత్వం ఇచ్చే గొర్రెలు ఆ సంఖ్యకు కలిపితే కోటి 33 లక్షలవుతాయని తెలిపారు. రెండు సంవత్సరాలలో ఈ సంఖ్య నాలుగున్నర కోట్లకు చేరుతుందన్నారు. వెటర్నరీ డాక్టర్ల సమస్య లేదని, మందుల కొరత కూడా లేదని కేసీఆర్ వెల్లడించారు.

15:13 - March 15, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలకు సిద్ధమౌతోంది. ఈనెల 24న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్..టీజర్..ట్రైలర్ లు ఇప్పటికే విడుదలయ్యాయి. చిత్ర సాంగ్స్ కూడా రెండు రోజులకు ఒకటి విడుదల చేస్తున్నారు. ఇవి యూ ట్యూబ్ లలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. తాజాగా 'పవన్' నెక్ట్స్ సినిమాల పై అప్పుడే వార్తలు వెలువడుతున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా..తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. అయితే ఈ రెండింటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదట పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను ఈనెల 25వ తేదీన ప్రారంభిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రానికి 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్ సరసన క్తీరి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటించనున్నారు. ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శాసనసమండలిలో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : శాసనసమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. బడ్జెట్..ఇతరత్రా అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. 21 శాతం గ్రోత్ సాధించి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ ఉందన్నారు.

 

గోవింద్ పురా పారిశ్రామిక వాడలో ఫైర్ ఆక్సిడెంట్..

మధ్యప్రదేశ్‌ : గోవింద్‌పురా పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మోడ్రన్ బ్రెడ్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 20 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.

బడ్జెట్ పై బాబు స్పందన..

విజయవాడ : ఏపీ శాసనసభలో మంత్రి యనమల ప్రవేశ పెట్టిన 2017-18 బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వినూత్నంగా..అన్ని రంగాలకు..వర్గాలకు న్యాయం చేసేలా ఉందని ప్రశసించారు. బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిచ్చినట్లు, బడ్జెట్ ను సమతూకంగా రూపొందించామన్నారు. యువతకు నిరుద్యోగ భృతి కోసం రూ. 500 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. బీసీల సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు, అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనానికి రూ. 97 కోట్లు, వ్యవసాయంలో తొలిసారిగా 14 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు.

14:11 - March 15, 2017

బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం..

ఇంఫాల్ : మణిపూర్ ముఖ్య‌మంత్రిగా బీరెన్‌సింగ్ ప్ర‌మాణ‌ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ న‌జ్మా హెప్తుల్లా ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు. జాయ్ కుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

వాటికోసమే అప్పులు : ఈటెల..

హైదరాబాద్ : సాగునీరు, విద్యుత్ కోసమే అప్పులు చేస్తున్నట్లు మంత్రి ఈటెల సమాధానం చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం అర్హత ప్రకారమే అప్పులు తీసుకుంటున్నామని, ప్రభుత్వ నిజాయితీపై ఎవరికీ అపోహలు అవసరం లేదన్నారు. యాదవ, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

బాకీల తెలంగాణ - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీల్లో బడ్జెట్ పై చర్చ కొనసాగుతోంది. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బాకీల తెలంగాణగా మారుస్తున్నారని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఏటా అప్పుల చెల్లింపుల కోసం రూ. 15700 కోట్లు అవుతోందన్నారు. గత ర ఎండేళ్ల బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 60 నుండి 70 శాతం మాత్రమే ఖర్చు చేశారని, బడ్జెట్ లో అంకెలు మాత్రమే మారయని కొత్తదనం లేదన్నారు. లేని ఉన్నట్లు చూపి ప్రజలను మభ్య పెడుతున్నారని, ప్రభుత్వం ప్రవేశ పెట్టింది బడాయి బడ్జెట్ అని కిషన్ రెడ్డి విమర్శించారు.

ఏపీ శాసనసభ వాయిదా..

విజయవాడ : ఏపీ శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. కాసేపటి క్రితం వ్యవసాయ బడ్జెట్ ను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశ పెట్టారు. అంతకంటే ముందు సాధారణ బడ్జెట్ ను మంత్రి యనమల ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

హెచ్చార్డీ మంత్రి సమాధానం చెప్పాలి - ఏచూరి..

ఢిల్లీ : సెంట్రల్ యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని, ఆత్మహత్యలపై హెచ్చార్డీ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభలో సీపీఐ నేత రాజా ఆగ్రహం..

ఢిల్లీ : రాజ్యసభలో యూనివర్సిటీ ఆత్మహత్యలపై సీపీఐ నేత రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్ష కొనసాగుతోందని, రోహిత్ వేముల మృతి నుండి యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఏ విద్యార్థి చనిపోయినా దేశానికి నష్టమేనన్నారు.

ఏపీ సచివాలయం ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం..

విజయవాడ : ఏపీ సచివాలయం ఎదుట ఓ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళగిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి శ్రీకాకుళం జిల్లా కళ్యాణిగా గుర్తించారు.

కేజ్రీపై హర్ సిమ్రత్ కౌర్ ఫైర్...

అమృత్ సర్ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై హర్ సిమ్రత్ కౌర్ మండిపడ్డారు. కేజ్రీవాల్ మానసికస్థితి సరిగ్గా లేదని, మానసిక స్థైర్యం కోల్పోయారని పేర్కొన్నారు.

12:42 - March 15, 2017

విజయవాడ : వ్యవసాయానికి పునరుజ్జీవం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభలో 2017-18 వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వ్యవసాయ సమస్యలు అధిగమించడానికి వినూత్న పద్ధతులు అవలింబిస్తోందన్నారు. 28.5 శాతం తక్కువ వర్షపాతం ఉందన్నారు. పట్టిసీమ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, గడ్డు పరిస్థితుల్లోనూ వ్యవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని, వ్యవసాయం అనుబంధ రంగాలను ఒకే గొడుగకు కిందకు తీసుకొస్తామని వెల్లడించారు. పత్తి రైతులు గడ్డు పరిస్థితులను ధీటుగా ఎదుర్కొన్నారని సభకు తెలిపారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2.81 శాతం పెరుగుదల సాధించినట్లు, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను అధిగమిస్తున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్న, మినుము ఉత్పత్తిలో ప్రథమ స్థానం, వరి ఉత్పాదక స్థానంలో మూడో స్థానంలో ఉందన్నారు. రాయలసీలమ, ప్రకాశం జిల్లాల్లో కరువు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా రైతుల కళ్లల్లో ఆనందం చూడడం జరిగిందన్నారు. రుతుపవనాల వైఫల్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 6.27 లక్షల ఎకరాలకు రెయిన్ గన్ ల ద్వారా నీటి తడి అందించినట్లు పేర్కొన్నారు. 2016 లో ఖరీఫ్ దిగుబడులు అధికమయ్యాయని, పాల ఉత్పత్తిలో ఏపీ 5వ స్థానం సాధించిందన్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు అవలింబిస్తున్నట్లు, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఏపీ ఉందన్నారు.

 • వ్యవసాయ రంగానికి రూ. 9091 కోట్లు.
 • మత్స్య శాఖకు : రూ. 782 కోట్లు
 • పండ్లతోటల పెంపకానికి : రూ. 1015 కోట్లు
 • ఆయిల్ ఫామ్ తోటల విస్తరణకు రూ. 55 కోట్లు.
 • పొలం పిలుస్తోంది, చంద్రన్న క్షేత్రాలకు రూ. 17 కోట్లు.
 • సమగ్ర సాగునీటి వ్యవసాయ రూపాంతీకరణ ప్రాజెక్టు కు : రూ. 1600 కోట్లు.
 • 55 లక్షల మందికి రుణమాఫీ.
 • రూ. 1100 కోట్లతో కరవు నివారణ పథకం.
 • రుణమాఫీ కోసం : రూ. 3600 కోట్లు
 • వ్యవసాయంలో యాంత్రీకరణ కోసం : రూ. 147 కోట్లు.
 • బిందు తుంపర సేద్యానికి : రూ. 717 కోట్లు.
 • హార్టికల్చర్ యూనివర్సిటీకి : రూ. 51 కోట్లు.
 • పశుగణాభివృద్ధి : రూ. 1,112 కోట్లు.
 • రైతు బిందు పథకానికి రూ. 33 కోట్లు.
 • ఘంటసాల, రామగిరిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు.
 • ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి : రూ.308 కోట్లు
 • శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి : రూ. 153 కోట్లు
 • అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ కరవు నివారణ పథకం అమలు
 • కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు. దీని కోసం రూ. 25 కోట్లు.
 • విదేశాలకు ఉద్యానవన ఉత్పత్పుల ఎగుమతులు పెంచేందుకు జైకా, సిమ్‌ఫెడ్‌, ఐకోవా సంస్థలతో ఒప్పందం
 • అన్ని వ్యవసాయ కోర్సుల్లో 25 శాతం సీట్లు పెంపు
 • రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు (రూ. లక్షలోపు రుణాలకు)
 • పావలా వడ్డీ రుణాలకు రూ. 5 కోట్లు
 • విత్తన ఉత్పత్తి కోసం రూ. 220 కోట్లు
 • రైతు బంధు పథకానికి రూ. 18 కోట్లు
 • ప్రధాన మంత్రి పసల్‌ బీమా యోజన కింద పంటల బీమాకు రూ. 269 కోట్లు
 • మత్స్య శాఖకు రూ. 282 కోట్లు

'పట్టిసీమ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు'..

విజయవాడ : పట్టిసీమ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. గడ్డు పరిస్థితుల్లోనూ వ్యవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని, వ్యవసాయం అనుబంధ రంగాలను ఒకే గొడుగకు కిందకు తీసుకొస్తామని వెల్లడించారు. పత్తి రైతులు గడ్డు పరిస్థితులను ధీటుగా ఎదుర్కొన్నారని సభకు తెలిపారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2.81 శాతం పెరుగుదల సాధించినట్లు, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను అధిగమిస్తున్నట్లు వెల్లడించారు.

ఏపీలో నిరుద్యోగ భృతికి కేటాయింపులు..

విజయవాడ : అమరావతిలోని నూతన అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడుతున్నారు. తొలిసారిగా ఈ బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని చేర్చింది. అంతేగాకుండా పది వేల ఉద్యోగాలను భర్తీ చేయనన్నట్లు ప్రకటించింది. నిరుద్యోగ భృతి ఈ కార్యక్రమం కోసం బడ్జెట్ లో తొలిసారిగా రూ. 500 కోట్లను కేటాయించారు.

11:50 - March 15, 2017

విజయవాడ : రాజధాని అమరావతి వేదికగా తీసుకొచ్చిన తొలి బడ్జెట్ పద్దును బుధవారం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్ర బ‌డ్జెట్ రూ.1,56,999 కోట్ల‌ని తెలిపారు. రెవెన్యూ రూ.1,25,911 కోట్ల‌ని చెప్పారు. నిర్వ‌హ‌ణ వ్య‌యం కూ.31,087 కోట్ల‌ని, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు రూ.8,790 కోట్లని కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకుపోతామని చెప్పారు. బడ్జెట్ ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి..

 • శాస్త్ర సాంకేతిక శాఖకు : రూ. 29 కోట్లు.
 • పరిశ్రమల శాఖకు : రూ. 2,086 కోట్లు
 • మత్య్స శాఖకు : రూ. 282 కోట్లు.
 • పశుగణాభివృద్ధి శాఖకు : రూ. 1,112 కోట్లు.
 • రైతు రుణమాఫీకి : రూ. 3,600 కోట్లు. (రూ.11వేల కోట్లు చెల్లించాం)
 • హోం శాఖకు : రూ. 5,221 కోట్లు.
 • సాంస్కృతిక వ్యవహారాల శాఖకు : రూ. 78.27 కోట్లు.
 • క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు : రూ. 728 కోట్లు.
 • గృహ నిర్మాణ శాఖకు : రూ. 1,326 కోట్లు.
 • పట్టణాభివృద్ధి శాఖకు : రూ. 4,216 కోట్లు.
 • రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలపాలకు : రూ. 1,061 కోట్లు.
 • సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్, ఇతర రంగాలకు : రూ.1,051 కోట్లు
 • ఎస్టీల సంక్షేమానికి : రూ. 3,528 కోట్లు.
 • ఎస్సీల సంక్షేమానికి : రూ. 9,485 కోట్లు.
 • ఖనిజాభివృద్ధి శాఖకు : రూ. 1,665 కోట్లు.
 • కార్మిక, ఉపాధి కల్పనకు : రూ. 468 కోట్లు.
 • సామాజిక భద్రత, సంక్షేమానికి : రూ. 1,636 కోట్లు.
 • సంక్షేమ శాఖకు : రూ. 11,361 కోట్లు.
 • పర్యావరణం, అటవీ శాఖకు : రూ. 383 కోట్లు.
 • కార్మిక, ఉపాధి కల్పనకు : రూ. 468 కోట్లు.
 • బీసీల సంక్షేమానికి : రూ. 10,000 కోట్లు.
 • క్రైస్తవ కార్పొరేషన్ కు : రూ. 35 కోట్లు.
 • ఈబీసీల సంక్షేమానికి : రూ. 1695 కోట్లు.
 • వికలాంగుల సంక్షేమానికి : రూ. 89.51 కోట్లు.
 • మరుగుదొడ్ల నిర్మాణానికి : రూ. 100 కోట్లు.
 • ఎన్టీఆర్ సుజల స్రవంతికి : రూ. 100 కోట్లు.
 • అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనానికి : రూ. 1000 కోట్లు.
 • ఆరోగ్య శ్రీకి : రూ. 1000 కోట్లు.
 • సాధారణ ఆర్థిక సర్వీసులకు : రూ. 4272 కోట్లు.
 • సమాచార ప్రసార శాఖ కు : రూ. 152 కోట్లు.
 • పేదల విద్యుత్ సబ్సిడీకి : రూ. 3,300 కోట్లు.
 • విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి : రూ. 450 కోట్లు.
 • మహిళా సాధికారిత సంస్థకు : రూ. 400 కోట్లు.
 • దుల్హన్ పథకానికి : రూ. 60 కోట్లు.
 • ఎన్టీఆర్ జలసరి పథకానికి : రూ. 44 కోట్లు.
 • ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం : రూ. 695 కోట్లు.
 • విజయవాడలో మెట్రో రైలుకు : రూ. 100 కోట్లు.
 • దివ్యాంగుల వివాహ ప్రోత్సాహానికి :రూ. 40 వేల నుండి లక్షకు పెంపు.
 • మసీదుల్లో పనిచేసే ఇమామ్ లు, మౌసమ్ లకు : రూ. 24 కోట్లు.
 • వక్ఫ్ సర్వే కమిషన్ కు : రూ. 50 కోట్లు.
 • జెరూసలెం యాత్రికులకు సాయం : రూ. 20 వేల నుండి రూ. 40 వేలకు పెంపు.
 • కొత్త చర్చిల నిర్మాణానికి సాయం : రూ. లక్ష నుండి రూ. 3 లక్షలకు పెంపు.
 • వ్యవసాయ అనుబంధ రంగాలకు : రూ. 9091 కోట్లు.
 • మున్సిపల్ శాఖకు : రూ. 5207 కోట్లు
 • రోడ్లు భవనాలకు : రూ. 4041 కోట్లు.
 • జలవనరుల, వరద నివారణకు : రూ. 701 కోట్లు
 • విద్యారంగానికి : రూ. 20710 కోట్లు.
 • వైద్య రంగానికి : రూ. 6574 కోట్లు.
 • పౌరసరఫరాల శాఖకు : రూ. 2,800 కోట్లు.
 • పెన్షన్లకు : రూ. 4376 కోట్లు.
 • ఎన్టీఆర్ క్యాంటిన్ పథకానికి : రూ. 200 కోట్లు.
 • రవాణా రంగానికి : రూ. 1677 కోట్లు.
 • ఆరోగ్య శాఖకు : రూ. 7020 కోట్లు.
 • హౌసింగ్ శాఖకు : రూ. 1456 కోట్లు.
 • ఐటీ శాఖకు : రూ. 364 కోట్లు.
 • పట్టణాభివృద్ధి శాఖకు : రూ. 5207 కోట్లు.
 • నీటిపారుదల శాఖకు : రూ. 12,770 కోట్లు.
 • కాపు కార్పొరేషన్ కు : రూ. 1000 కోట్లు.
 • ఉన్నత విద్యకు : రూ. 3513 కోట్లు.
 • పాఠశాల విద్యకు : రూ. 17,197 కోట్లు.
 • గ్రామీణ రహదారులకు : రూ. 262 కోట్లు.
 • ప్రజాపంపిణీ పథకానికి : రూ. 2800 కోట్లు.
 • స్కిల్ డెవలప్ మెంట్ కు : రూ. 398 కోట్లు.
 • ఎల్ పీజీ కనెక్షన్ల కోసం : రూ. 380 కోట్లు.
 • పశుగణాభివృద్ధికి : రూ. 1112 కోట్లు.
 • పండ్ల తోటల పెంపకానికి : రూ. 1015 కోట్లు

 

ఈ ఏడాది రాష్ట్ర బ‌డ్జెట్ రూ.1,56,999 కోట్లు...

అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు రాష్ట్ర‌ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బ‌డ్జెట్ రూ.1,56,999 కోట్ల‌ని తెలిపారు. రెవెన్యూ రూ.1,25,911 కోట్ల‌ని చెప్పారు. నిర్వ‌హ‌ణ వ్య‌యం కూ.31,087 కోట్ల‌ని, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు రూ.8,790 కోట్లని కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకుపోతామని చెప్పారు.

'2029లో నిర్ధేశించుకున్న లక్ష్యాలను నిర్దేశించే బడ్జెట్'

అమరావతి:విజ‌న్ 2029లో నిర్ధేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని మంత్రి యనమల అన్నారు. అభివృద్ధిని వేగ‌వంతం చేసేందుకు రాజధానిని అమ‌రావ‌తికి తరలించామని అన్నారు. అమరావతిలో తొలిసారి బ‌డ్జెట్‌ ప్రవేశపెడుతున్నామని గుర్తుచేశారు. పరిపాలన అమ‌రావ‌తికి రావ‌డం వ‌ల్ల ఆర్థికాభివృద్ధి జ‌రుగుతోందని అన్నారు. చంద్ర‌బాబు నాయుడి ఆధ్వ‌ర్యంలో ఎన్నో స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కున్నామని చెప్పారు. ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూనే రాజ‌ధానిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

'క్వాలిటీ వస్తువులతో కేసీఆర్ కిట్'

హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానల్లో డెలివరి అయిన కేసీఆర్ కిట్ అందజేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేసీఆర్ కిట్ ద్వారా అన్ని క్వాలిటీ వస్తువులను అందిస్తామన్నారు. కేసీఆర్ కిట్‌లో 11 రకాల వస్తువులుంటాయని తెలిపారు.

బడ్జెట్ ప్రవేశపెడుతున్న యనమల

అమరావతి: ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. సొంతగడ్డ పడ్డ పై తొలిపొద్దును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. 9వసారి యనమల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. దాదాపు రూ.1.55లక్షల కోట్ల స్మార్ట్‌ బడ్జెట్‌ పద్దును రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్‌ ఇదే కావడం విశేషం.

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

హైదరాబాద్: కొద్ది సేపటి క్రితం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

 

మరి కాసేపట్లో సభలో యనమల బడ్జెట్

అమరావతి: మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

దేవాదాయ భూములపై ఏపీ అసెంబ్లీలో చర్చ

అమరావతి: ఏపీ శాసనసభలో సదావత్ భూములు, సిద్దార్థ మెడికల్ కాలేజీ భూముల లీజు అంశం పై విపక్ష నేత జగన్ లేవనెత్తిన అంశాలపై మంత్రి మాణిక్యాలరావు సమాధాం చెప్పారు.

09:44 - March 15, 2017

అమరావతి: కొద్ది సేపటి క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ చేపట్టారు. దేవాదాయ భూములపై సభ్యులు లేవనెత్తి ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇచ్చారు.

ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం

శ్రీనగర్: భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో చోటుచేసుకుంది. కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాగిఉన్నట్లు సమాచారం. భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి అరెస్ట్

యూపీ: గ్యాంగ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి అరెస్ట్ అయ్యారు. తల్లీ, కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల కార్యక్రమం

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. అనంతరం మంత్రి యనమల బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

నెల్లూరులో దారుణం

నెల్లూరు: పదేళ్ల గిరిజన బాలికపై వృద్ధుడు మాధవయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో స్కైల్యాండ్ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడు ప్రముఖ ఫర్నిచర్ షాపు యజమాని కావడంతో కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

08:28 - March 15, 2017

అమరావతి: ఏపీ కేబినెట్‌ భేటీ అయ్యింది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశం బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా కేబినెట్‌ చర్చించనుంది. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబు సహచర మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ బడ్జెట్‌ను ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు ఆర్దికమంత్రి యనమల శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో పురపాలకశాఖ మంత్రి నారాయణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం 10 నిమిషాల విరామం తర్వాత సభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను అయ్యన్నపాత్రుడు ప్రవేశపెడతారు. ఇక ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 31వరకు కొనసాగనున్నాయి.

కుప్వారా లో ఎదురు కాల్పులు...

జమ్మూకాశ్మీర్ : కుప్వారా లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కలరూస్ ముగ్గురు ఉగ్రవాదులు దాగివున్నట్లు సమాచారం తో భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం.

ఆర్కే నగర్ నుండి బిజెపి అభ్యర్థిగా నటి గౌతిమి?

చెన్నై: జయ మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి నటిగౌతమిని బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా రేపటి (16వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కపార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

నగరంలో నేటి ఆర్థరాత్రి నుండి ఆటోల బంద్

హైదరాబాద్ : కిలోమీటరుకు ప్రస్తుతం అమలులో ఉన్న రూ.11ను తగ్గిస్తూ రూ.7.25, రూ.6గా నిర్ణయించిన ప్రైవేటు క్యాబ్‌ల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న అర్ధరాత్రి నుంచి ఆటోలబంద్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్ల ఐకాస వెల్లడించింది. ఈ నెల 16న చలో అసెంబ్లీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపింది.

07:35 - March 15, 2017

హైదరాబాద్: హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం సంతాప రాజకయీంగా మరిపోయింది. నాగిరెడ్డి గురించి మాట్లాడటం మానేసి పూర్తిగా రాజకీయ ప్రసంగంగా మారిపోయింది. మరో వైపు ప్రతిపక్షం వైపీసీ సభకు హాజరు కాలేదు. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టిడిపి నేత సూర్యప్రకాష్, సిఐటియు నేత ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:29 - March 15, 2017

హైదరాబాద్: ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్‌కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడిలో ఉన్న నితిన్‌కపూర్ ముంబైలోని ఆయన కార్యాయలం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నితిన్ కపూర్ మృతి విషయం తెలియగానే జయసుధ తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి ముంబైకి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.

 

ఏపీలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

తూ.గో: కుమార్తెకు వివాహం చేసే ఆర్థిక స్థోమత లేక ఓ నిరుపేద చేనేత కార్మికుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరికి చెందిన చేనేత కార్మికుడు సీరం బాబూరావు(65)కు భార్య సత్యవతితో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంటి వెనుకకు వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని కాకినాడకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నేటి నుండి ఎంసెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

హైదరాబాద్: ఎంసెట్-2017 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నదని జేఎన్టీయూహెచ్ వీసీ ఏ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు లేకుండా) కళాశాలల్లో ప్రవేశాల కోసమే ఇక నుంచి ఎంసెట్‌ను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఎంబీబీఏస్, బీడీఎస్, ఆయుష్ సీట్ల భర్తీ నీట్ పరిధిలోకి వెళ్లినట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు.

ర్యాంకుల ఆధారంగానే ఎమ్మెల భవిష్యత్..సీఎం బాబు హెచ్చరిక

అమరావతి: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగానే ర్యాంక్‌లు ఇస్తాన‌ని సీఎం చంద్రబాబు సృష్టం చేశారు. ర్యాంక్‌ల ఆధారంగానే భ‌విష్యత్ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవ‌హ‌రిస్తున్న తీరును గ‌మ‌నిస్తున్నాన‌ని... దాన్ని బ‌ట్టి ర్యాంక్‌ల‌తో పాటు బాగా ప‌నిచేస్తున్న వారికి అవార్డులు కూడా ఉంటాయ‌ని చెప్పారు. తాను చేసిన ప‌నుల‌ను చెప్పుకోవ‌డంలో మోదీ స‌క్సెస్ అయ్యార‌ని, మ‌నం మాత్రం ప్రచారంలో వెన‌క‌బ‌డి ఉన్నామ‌న్నారు చంద్రబాబు.

ఆక్వా పార్క్ ను అడ్డుకుంటాం: అఖిలపక్షం

.గో :తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌లో ఎలాంటి కాలుష్యం రాదని ప్రభుత్వం, యాజమాన్యం చెబుతోందని అయితే అందులో ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. యూపీలో అధికార పార్టీ తప్పిదాలు బీజేపీకి లాభించాయన్నారు. మణిపూర్‌లో ఇరోమ్‌ షర్మిల ఓడిపోవడం చాలా బాధాకరం అన్నారు.

తెలంగాణ, ఏపీలో పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన ఆయన.. ఈ ఏడాది జూన్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడతామన్నారు. 60 శాతం యువతకు సీట్లు ఇస్తామన్న పవన్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తామని చెప్పారు.

టీడీపీ శవ రాజకీయాలు చేస్తోంది: వైసీపీ

అమరావతి: భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని టీడీపీ రాజకీయం చేస్తుందన్నారు వైసీపీ అధినేత జగన్‌. సంతాప తీర్మాన సమయంలోనూ తమ పార్టీపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ రికార్డ్స్‌లో భూమాపై చెడు అంశాలు ఉండకూడదనే అభిప్రాయంతోనే సభకు హాజరు కాలేదన్నారు వైసీపీ అధినేత.

నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి యనమల

అమరావతి :ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. 31 వరకు సమావేశాలు సాగేలా అసెంబ్లీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పాటు.. పలు సంక్షేమశాఖలపై చర్చ జరగనుంది.

07:19 - March 15, 2017

అమరావతి: మంత్రి యనమల రామకృష్ణుడు నేడు ఉదయం 10 గంటల 25 నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అలాగే 16వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. 20, 21న మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించడం జరుగుతుంది. 22న రోడ్లు, బిల్డింగ్‌, పోర్ట్‌, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్యశాఖ, పౌర సరఫరాల శాఖలపై చర్చ జరుగుతుంది. 23న గృహ నిర్మాణ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, బలహీన వర్గాల సంక్షేమ శాఖల గురించి... మాతా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల గురించి చర్చించనున్నారు. 24న విద్య, క్రీడలు, యువజన సంక్షేమం, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, మున్సిపల్‌ అడ్మినిట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌పై చర్చించనున్నారు.

25న రెవెన్యూ రిజిస్ట్రేషన్స్‌, ఎక్సైజ్‌ అడ్మినిస్ట్రేషన్‌...

అలాగే 25న రెవెన్యూ రిజి‌స్ట్రేషన్స్‌, ఎక్సైజ్‌ అడ్మినిస్ట్రేషన్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌పై డిస్కస్‌ చేయనున్నారు. అలాగే 27న లేబర్ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌, పర్యాటక, పర్యావరణ, అటవీశాఖ, సాంకేతికత, పరిశ్రమలు, తదితర అంశాల గురించి విశ్లేషించనున్నారు. 28న ఏపీ అప్రోప్రియేషన్‌ బిల్‌ నెంబర్‌ 1, 2లపై చర్చ జరగనుంది. ఉగాది సందర్భంగా 29న సెలవు కాగా..30, 31 తేదీలలో పలు శాఖల గురించి డిస్కస్‌ చేయనున్నారు. ఈ శాఖలపై ఆయా రోజుల్లో సభలో చర్చించే విధంగా బీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు. బీఏసీ సమావేశంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణుడు పాల్గొన్నారు.

07:04 - March 15, 2017

అమరావతి: భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని టీడీపీ రాజకీయం చేస్తుందన్నారు వైసీపీ అధినేత జగన్‌. సంతాప తీర్మాన సమయంలోనూ తమ పార్టీపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ రికార్డ్స్‌లో భూమాపై చెడు అంశాలు ఉండకూడదనే అభిప్రాయంతోనే సభకు హాజరు కాలేదన్నారు వైసీపీ అధినేత.

మృతి చెందిన సభ్యునికి సంతాపం తెలపడం కనీస ధర్మం అన్న టీడీపీ

ఏపీ శాసనసభలో, భూమానాగిరెడ్డి సంతాప తీర్మాన కార్యక్రమంలో పాల్గొనకపోవడాన్ని.. వైసీపీ అధినేత జగన్‌ సమర్థించుకున్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మనసులోని మాటను వెల్లడించారు. అసెంబ్లీ రికార్డుల్లో భూమాపై చెడు అభిప్రాయం నమోదు కాకూడదనే తాము సభకు హాజరు కాలేదన్నారు. మంత్రిపదవి ఇస్తానన్న హామీతో భూమాను పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు... ఏడాది దాటినా హామీని నిలుపుకోలేదని, ఫలితంగా భూమా ఎంతటి మానసిక క్షోభకు గురైవుంటారో అర్థమవుతుందని జగన్‌ అన్నారు.

సంతాప సభను టీడీపీ రాజకీయం చేస్తుందన్న జగన్‌...

రాజకీయాల్లో చంద్రబాబుకు, తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు జగన్‌. తమపార్టీలోకి వస్తామనేవారితో ముందుగా పదవులకు రాజీనామా చేయించే హూందా రాజకీయం తమదన్నారు. తన రాజకీయం హీరోలా ఉంటుందని.. చంద్రబాబుది విలన్‌ రాజకీయం అని సెటైర్‌ వేశారు జగన్‌. నంద్యాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామన్నారు. అధికార పార్టీ, భూమా సంతాప సభను కూడా రాజకీయాలకు వాడుకుంటోందని జగన్‌ ఆరోపించారు. తండ్రి మృతితో బాధలో ఉన్న కుమార్తె అఖిలప్రియను.. 24 గంటల్లోనే అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే.. అఖిలప్రియకు తాను, విజయమ్మ ఫోన్‌ చేసి సంతాపం తెలిపినట్లు ఈ సందర్భంగా జగన్‌ తెలిపారు.

నా రాజకీయం హీరోలా ఉంటుంది.. చంద్రబాబుది విలన్‌ రాజకీయం -జగన్‌...

అటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ తీరుపై విరుచుకుపడ్డారు. శోభా నాగిరెడ్డి చనిపోయినప్పుడు కనీసం సంతాపం కూడా తెలపని టీడీపీ నేతలు ఇప్పుడు శవరాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. భూమాకు సంతాపం కంటే.. జగన్‌పై ఆరోపణలు చేయడానికే అధికార పార్టీ నేతలు ప్రాధాన్యతిచ్చినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. మరణించిన సహచర శాసనసభ్యునికి హుందాగా సంతాపం చెప్పాల్సిన అంశం కూడా, టీడీపీ, వైసీపీ వాగ్వాదానికి అస్త్రం కావడం.. పూర్తి వివాదాస్పదం కావడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది.

06:59 - March 15, 2017

హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి కులంలోని సభ్యుడు కాలర్‌ ఎగరేసుకుని బతికే రోజు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో కుల సంఘాలతో సమావేశమైన ఆయన.. అన్ని కుల సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో బతకాలన్నారు. మత్య్సకారులు, యాదవులు ఇతర రాష్ట్రాలకు చేపలను, గొర్రెలను ఎగుమతి చేసే రోజులు రావాలని అన్నారు.

06:57 - March 15, 2017

అమరావతి: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగానే ర్యాంక్‌లు ఇస్తాన‌ని సీఎం చంద్రబాబు సృష్టం చేశారు. ర్యాంక్‌ల ఆధారంగానే భ‌విష్యత్ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవ‌హ‌రిస్తున్న తీరును గ‌మ‌నిస్తున్నాన‌ని... దాన్ని బ‌ట్టి ర్యాంక్‌ల‌తో పాటు బాగా ప‌నిచేస్తున్న వారికి అవార్డులు కూడా ఉంటాయ‌ని చెప్పారు. తాను చేసిన ప‌నుల‌ను చెప్పుకోవ‌డంలో మోదీ స‌క్సెస్ అయ్యార‌ని, మ‌నం మాత్రం ప్రచారంలో వెన‌క‌బ‌డి ఉన్నామ‌న్నారు చంద్రబాబు.

శాసనసభా సమావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై...

శాసనసభా సమావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ క‌మిటీ హ‌ల్లో మూడు గంట‌ల పాటు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

అసెంబ్లీలో పనితీరుపైనే నేతల భవిష్యత్‌ : చంద్రబాబు

అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరుని గ‌మ‌నిస్తున్నాన‌ని , దీనిని అనుసరించే ప్రజాప్రతినిధులకు భ‌విష్యత్ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని సియం చంద్రబాబు అన్నారు. సభలో ఎమ్మెల్యేలు, మంత్రులకు యాక్టివ్‌ పార్టిసిపేషన్‌ పైనే ప్రతిఒక్కరికీ ర్యాంకులు కేటాయిస్తామన్నారు సీఎం. ప్రభుత్వ పథకాలపై ఎవరెంత అవగాహన కలిగి ఉన్నారనే అంశాన్ని అంచనా వేసి .. అవార్డులు కూడా ప్రకటిస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి.

పథకాలపై ప్రచారంతోనే 5 రాష్ట్రాల్లో బీజేపీ విజయం...

ఇటీవల వెలువడ్డ 5 రాష్ట్రల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కూడా టీడీఎల్పీ భేటిలో ప్రస్తావించారు చంద్రబాబు. అధికారంలోకి వ‌చ్చాక చేపట్టిన అభివృద్ది పనులపై ప్రజలకు చెప్పుకోవడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని.. అదేబాటలో మనం కూడా సాగాలని టీడీపీ ఎమ్మెల్యేలకు బాబు సూచించారు. ప్రభుత్వం చేసిన ప‌నులు చెప్పుకోవ‌డంలో టీడీపీ నేతలు వెన‌కబ‌డి ఉన్నారని, ఇక‌ నుండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప‌థకాల‌ను ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాలననారు చంద్రబాబు.

ఎండోమెంట్‌ అధికారులపై బాబుకి ఎమ్మెల్యేల ఫిర్యాదు...

అటు అనంత‌పురం ఘ‌ట‌న కూడా సమావేశంలో చ‌ర్చకు వ‌చ్చింది. ఎన్నిసార్లు చెప్పినా నేత‌లు మారడం లేద‌ని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారుల‌పై ఎమ్మెల్యేలు బాబుకి ఫిర్యాదు చేశారు. సింహచ‌లం భూముల వ్యవ‌హ‌రంలో ప్రభుత్వ ఆలోచ‌న‌ల‌కు వ్యతిరేకంగా అధికారులు ప‌నిచేస్తున్నార‌ని ఎమ్మెల్యేలు సియంకు ఫిర్యాదు చేశారు. త్వర‌లోనే పెండింగ్‌లో ఉన్న అన్ని దేవాల‌యాలకు కమిటీలు వేస్తాన‌ని సియం భ‌రోసా ఇచ్చారు. య‌న్ఆర్‌జియ‌స్ నిధులను వినియోగించుకోవాల‌ని బాబు సూచించారు. ఇళ్ళ నిర్మాణంపై టిడిఎల్పీ భేటీలో చ‌ర్చ జ‌రిగింది. ప్రభుత్వ ఇళ్ళ/ 400య‌స్‌య‌ఫ్‌టి కంటే ఎక్కువ ప్రదేశంలో నిర్మించ‌డం స‌బబు కాద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభంకాగానే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం ప్రక‌టించిన టీడీపీఎల్పీ నేతలు.. భూమా కుమార్తె అఖిలప్రియ అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై ప్రశంశలు కురిపించినట్టు సమాచారం.

06:49 - March 15, 2017

హైదరాబాద్: తెలంగాణ శాసనసభా బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసేందుకే సర్వేలు నిరంతరం నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా తమ పార్టీకే అధికారం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా... తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

సర్వే నివేదికలను నేరుగా ఎమ్మెల్యేలకే....

నియోజకవర్గాల్లో శాసనసభ్యుల పనితీరుపై ఇటీవల సర్వే చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... సర్వే నివేదికలను నేరుగా ఎమ్మెల్యేలకే అందించి అప్రమత్తం చేశారు. కొంతమంది మంత్రులు కూడా ఈ సర్వేలో వెనుకబడినట్లు నివేదికలో తెలిపారు. మంత్రి కేటీఆర్‌ కూడా సర్వే జాబితాలో వెనకే ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ పరంగా పటిష్టం కావడంతో పాటు ప్రజలు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని కేసీఆర్‌ పలు సూచనలు కూడా చేశారు. ఇప్పటికీ తమ పార్టీని ఎదుర్కొనే స్థాయిలో విపక్షాలు లేవన్న ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉన్నా... కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని అంగీకరించారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు.

ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

ఇటీవల వెలువడిన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్‌కు ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదురైనా అతను భవిష్యత్తు ఉన్న నాయకుడని అన్నారు. ఆయా రాష్ర్టాల్లో బీజేపీ ఘన విజయం సాధించినా... తెలంగాణలో ఆ పార్టీకి అంత సీన్‌ లేదని తేల్చి పారేశారు. బీజేపీ రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఆమోదించరని అన్నారు. మోదీ హవా ఇదే విధంగా ఉంటుందనికోవడానికి వీల్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు.

సర్వేలు నిర్వహించి... మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే...

మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్నది ఊహగానాలే అన్నారు కేటీఆర్‌. సర్వేలు నిర్వహించి... మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే అవసరం కేసీఆర్‌కు లేదని, మార్పులు చేయాలంటే... సర్వేలు అవసరం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు స్థానిక బీజేపీ నేతల అభ్యంతరాల వల్లే జాప్యం జరుగుతోందన్న అనుమానాలను కేటీఆర్‌ వ్యక్తం చేశారు.

06:47 - March 15, 2017

హైదరాబాద్: బ్యాంకుల తీరుతో కస్టమర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లోని ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌ కోఠి ఉమెన్స్‌ కాలేజీ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు రాలేదన్న అసహనంతో ఓ యువకుడు ఇండి క్యాష్‌ ఏటీఎం అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన అమీద్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

06:45 - March 15, 2017

హైదరాబాద్: ఆందోళన చేస్తే సస్పెండ్‌ చేస్తానని.. డిమాండ్‌ చేస్తే డీబార్ చేస్తానన్న వర్గాలన్నింటికీ .. సీఎం కేసీఆర్‌ వరాలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు సొంతపార్టీ ఎమ్మెల్యేలకు... మంత్రులకు కూడా సమయమివ్వని సీఎం ఇప్పుడు గంటలకొద్దీ సబ్బండవర్గాలతో గడుపుతున్నారు. ఎందుకిలా..? ఈ ప్రశ్నకు.. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఎఫెక్టే కారణమన్న సమాధానం వస్తోంది. మహాజన పాదయాత్ర కారణంగా.. ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగానే, కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారన్న భావన వ్యక్తమవుతోంది.

సొంతపార్టీ నాయకులతోటే సమావేశం కాని కేసీఆర్‌.....

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సొంతపార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కలసి కూర్చొని సమస్యలపై చర్చించిన సందర్భాలు చాలా తక్కువ. ఇక సామాన్య ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు సీఎంను కలిసే అవకాశమే లభించలేదు. ఒక సమయంలో సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం సచివాలయంలో విపక్షాలు ధర్నాకు కూడా దిగాయి. కానీ అనూహ్యంగా.. సీఎంలో ఇటీవల చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వివిధ వృత్తులు, కుల సంఘాల ప్రతినిధులతో గంటలకొద్దీ మాట్లాడుతున్నారు. వారితో సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్నారు. వారు అడిగిన దానికంటే కొంత ఎక్కువే ఇచ్చి మరీ పంపుతున్నారు. ఇంతటి మార్పుకు కారణం ఏంటి..? అన్న ప్రశ్నకు సీపీఎం మహాపాదయాత్ర ఎఫెక్ట్‌ అన్నదే అందరిలోనూ వస్తున్న ఏకైక సమాధానం.. విపక్షాలే కాదు.. పాలక పక్షంలోని చాలామందిదీ ఇదే అభిప్రాయం.

పాదయాత్రతో సీఎంలో కదలిక....

మహాజన పాదయాత్ర ప్రారంభమయ్యాకనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. చేనేత కార్మికులు, మత్యకారులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, అంగన్‌వాడీల వంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాస్తవానికి ఈ వర్గాల సమస్యలన్నిటిపై సీపీఎం నాయకులు పాదయాత్రలో తమ గళాన్ని వినిపించారు. ఒక్కో అంశంపై ఒక్కో రోజు పాదయాత్ర నాయకులు సీఎంకు లేఖలు రాస్తూనే ఉన్నారు. కొన్ని ప్రశ్నలతో ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. దీంతో ప్రజలు ప్రశ్నించే స్థాయికి చేరకముందే ఆయా వర్గాలను తమవైపు తిప్పుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది.

అనవసరంగా రొడ్డెక్కి అందోళన చేయవద్దంటూ...

మీ సమస్యలు పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నాము..మీరు అనవసరంగా రొడ్డెక్కి అందోళన చేయవద్దంటూ కేసీఆర్‌ పరోక్ష సందేశాలు ఇచ్చారు. ఈ మేరకు మహాజన పాదయాత్ర ప్రభుత్వంలో కదలికను కలిగిచింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న మహాజనపాదయాత్ర... ఈ విధంగా సఫలీకృతమైందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ముత్తుకృష్ణన్‌ మృతిపై సిబిఐతో విచారణ జరిపించాలి:వామపక్షాలు

ఢిల్లీ: జెఎన్‌యు విద్యార్థి ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముత్తుకృష్ణన్‌ మృతదేహానికి పోస్టుమార్టం జరపకుండా జెఎన్‌యు విద్యార్థులు అడ్డుకున్నారు. ముత్తుకృష్ణన్‌ మృతిపై సిబిఐతో విచారణ జరిపించాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.

06:41 - March 15, 2017

హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత విద్యార్థి ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముత్తుకృష్ణన్‌ చనిపోయినా చూడటానికి వీసీ రాలేదంటూ జెఎన్‌యు విద్యార్థులు ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ యాజమాన్యంపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు. వీసీ వచ్చే వరకు పోస్టుమార్టం జరుగనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధుల ఆందోళనతో ముత్తుకృష్ణన్‌ డెడ్‌బాడీకి పోస్టుమార్టం జరగలేదు.

తన కుమారుడిది ఆత్మహత్య కాదు....

తన కుమారుడిది ఆత్మహత్య కాదు హత్యేనని ముత్తుకృష్ణన్‌ తండ్రి జీవనంతం అన్నారు. కృష్ణన్‌ మృతిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై వామపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై అత్యున్నత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

తమిళనాడులోని సేలంకు చెందిన 27 ఏళ్ల ముత్తుకృష్ణన్‌ ...

తమిళనాడులోని సేలంకు చెందిన 27 ఏళ్ల ముత్తుకృష్ణన్‌ జేఎన్‌యూలో సెంటర్‌ ఫర్‌ హిస్టారికల్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీ మునిర్కా విహార్‌లోని స్నేహితుడి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే క్రిష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ముత్తుకృష్ణన్‌ గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని వద్ద ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని తెలిపారు. ఎంఫిల్, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం లేదని, యూనివర్సిటీలో నిరసనలు చేపట్టేందుకూ అవకాశం లేదని... మార్చి 10న ఫేస్‌బుక్‌లో చేసిన చివరి పోస్టులో ముత్తుకృష్ణన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సియూలో రోహిత్‌ వేముల ఆత్మహత్య నిరసనల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

06:38 - March 15, 2017

హైదరాబాద్: దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలతో తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఫస్ట్ లుక్ ఫీల్ గుడ్ భావన కలిగించినా, లోతుల్లోకి వెళ్లి విశ్లేషిస్తే చివరకు నిరాశే మిగులుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతున్న అప్పులు కలవరపెడుతున్నాయి. మూడేళ్లలోనే రాష్ట్ర అప్పులు రెండింతలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు వివిధ సామాజిక వర్గాలకు ఘనమైన కేటాయింపులు చేసినట్టు టిఆర్ఎస్ చెప్పుకుంటున్నా, జనాభా ప్రాతిపదికన చూసిన్నప్పుడు మళ్లీ అన్యాయమే జరిగిందన్న బాధ ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ బడ్జెట్ లో ఏముంది? ఈ బడ్జెట్ ను ఎలా అర్ధం చేసుకోవాలి? ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్ ఎంత వరకు ప్రాధాన్యతనిచ్చింది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కెవిపిఎస్ నేత స్కైలాబ్ బాబు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss