Activities calendar

16 March 2017

22:35 - March 16, 2017

అన్నీ వట్టిమాటలేనా...?  చెప్పుకోవటానికి మాత్రమేనా..? నినాదాలన్నీ గాల్లో అరుపులేనా...? చేతల్లోకి వచ్చే సరికి అంతా ఒకటే అని రుజువు చేసుకుంటున్నారా...? మొక్కుబడి వ్యవహారంగా తేల్చేస్తున్నారా..అసలు మహిళలకు రాజకీయ పార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత.? ఎంతమందికి టిక్కెట్లు ఇస్తున్నాయి..? చట్టసభల్లో ఎందరికీ ఎంట్రీ దొరుకుతోంది.. ప్రపంచవేదికపై మనస్థానం ఎక్కడ..? ఐక్యరాజ్యసమితి లెక్కలు ఏం చెబుతున్నాయి..!
ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ...పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:26 - March 16, 2017

గుంటూరు : వైసీపీ, నగరి ఎమ్మెల్యే రోజాపై మరోసారి సస్పెన్షన్‌ వేటు వేయాలని అసెంబ్లీ సభాహక్కుల కమిటీ సిఫారసు చేసింది. ఈసారి కూడా ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ... సభాహక్కుల కమిటీ స్పీకర్‌కు నివేదిక సమర్పించింది. పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపిన కమిటీ.. రోజాపై సస్పెన్షన్‌ వేటుకే మొగ్గు చూపింది. 
రోజా మళ్లీ సస్పెన్షన్‌...?
నగరి ఎమ్మెల్యే రోజా మెడపై మళ్లీ సస్పెన్షన్‌ కత్తి వేలాడుతోంది. దళిత మహిళనైన తనను రోజా, సభ సాక్షిగా తీవ్రంగా అవమానించారంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని స్పీకర్‌ సభాహక్కుల సంఘానికి బదలాయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన శాసనసభ హక్కుల కమిటీ.. రోజాను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయాలని సిఫారసు చేస్తూ.. బుధవారం అసెంబ్లీకి నివేదిక సమర్పించింది. మొత్తం 62 పేజీలతో కూడిన ఈ నివేదికపై శాసనసభే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
సభాపతికి ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు 
గొల్లపల్లి సూర్యారావు ఛైర్మన్ గా ఉన్న శాసనసభ సభాహక్కుల కమిటీలో నందమూరి బాలకృష్ణ, శ్రవణ్ కుమార్, కె.రామకృష్ణ, బీసీ జనార్దన రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూలు సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సభలోనే సభాపతికి ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. అనిత ఫిర్యాదుపై విచారణ జరిపి సభకు నివేదిక ఇవ్వాలని సభాపతి కోడెల హక్కుల కమిటీని ఆదేశించారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిటీ, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా రోజాను మూడుసార్లు పిలిచారు. అయితే రోజా సభా హక్కుల కమిటీ ఎదుట హాజరు కాలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ ఆమెపై ఎలాంటి చర్య అయినా తీసుకునే అధికారం సభకు ఉందంటూ గతంలోనే నివేదిక సమర్పించింది. 
నా అనారోగ్యం వల్లే సభాహక్కుల కమిటీ ఎదుట హాజరు కాలేదు: రోజా 
పరిస్థితి ప్రతికూలంగా మారిన పరిస్థితుల్లో రోజా.. తన అనారోగ్యం వల్లే సభాహక్కుల కమిటీ ఎదుట హాజరు కాలేక పోయానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ పంపారు. దీంతో, రోజాకు మరో అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసనసభ హక్కుల కమిటీకి సూచించారు. అనంతరం, కమిటీ ఎదుట హాజరైన రోజా తన వాదనను వినిపించారు. అయితే ఆమె బేషరతు క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించలేదు. ఇవే విషయాలను, కమిటీ తన నివేదికలో పొందు పరిచింది. రోజా, రోజా వివిధ సందర్భాల్లో పొంతన లేని భిన్న వాదనలు వినిపించారని కమిటీ నివేదించింది. 
రోజా సమక్షంలోనే నివేదికపై చర్చ
శాసనసభ హక్కుల కమిటీ సమర్పించిన నివేదికపై, బుధవారమే చర్చ జరిపి, రోజాపై వేటు వేయాలని పాలక పక్షంలోని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. రోజా సభలో ఉండగానే, చర్చించి, చర్య తీసుకుంటే సమంజసంగా ఉంటుందన్న భావన వ్యక్తమైంది. అయితే, ఎమ్మెల్యే రోజా, బుధవారం సభకు హాజరుకాకపోవడంతో నివేదికపై చర్చ జరగలేదు. ఒకటి రెండు రోజుల్లో రోజా సమక్షంలోనే ఈ నివేదికపై చర్చించి, సస్పెన్షన్‌పై తుది నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. 

 

22:21 - March 16, 2017

హైదరాబాద్ : సర్కారు దవాఖానాల్లో రోగుల మృతిపై తెలంగాణ అసెంబ్లీలో సీరియస్‌ చర్చ సాగింది. నీలోఫర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో రోగుల మరణాలు, అరాచకాలు ఎప్పుడు ఆగుతాయని సభ్యులు ప్రశ్నించారు.. ఈ మరణాలపై విచారణ కొనసాగుతోందన్న ప్రభుత్వం.. రిపోర్ట్‌ వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.. బడ్జెట్‌పై చర్చ కొనసాగాక సభ రేపటికి వాయిదా పడింది.. 
ఆస్పత్రులో మృతుల ఘటనలపై వాడీ వేడి చర్చ
తెలంగాణ అసెంబ్లీ జీరోఅవర్‌లో, సర్కారు దవాఖానాలపై చర్చ సాగింది. నీలోఫర్‌లో ఐదుగురు మృతి, చెస్ట్‌ ఆస్పత్రిలో మరో వ్యక్తి మరణంపై ఎంఐఎం, బీజేపీ సభ్యులు సర్కారును నిలదీశారు.. లంచం ఇవ్వలేదంటూ ఆక్సీజన్‌ పెట్టకపోవడంవల్లే ఒక నిండు ప్రాణం బలైపోయిందని మండిపడ్డారు.. 
ఈ మరణాలపై విచారణ : ప్రభుత్వం 
ఈ మరణాలపై విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలియజేసింది. నివేదిక అందాక, బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో, సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు..  జీహెచ్‌ఎంసీ పరిధిలో త్వరలోనే అన్నపూర్ణ భోజన కేంద్రాలు ప్రారంభమవుతాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 5 రూపాయలకే భోజనం కేంద్రాల పేరును అన్నపూర్ణ కేంద్రాలుగా పేరు మారుస్తున్నామని స్పష్టం చేశారు..
బడ్జెట్‌పై చర్చ 
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై మంత్రి కడియం సమాధానమిచ్చారు.. ప్రభుత్వ పాఠశాల్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. టీ బ్రేక్‌ తర్వాత బడ్జెట్‌పై చర్చ నడిచింది.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అవాస్తవాలే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేత జానారెడ్డి విమర్శించారు. బడ్జెట్‌ చాలా గందరగోళంగా ఉందని విమర్శించారు. బడ్జెట్‌లో కేటాయింపులు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య విమర్శించారు.. నిధుల దారిమళ్లింపు సరికాదని అభిప్రాయపడ్డారు..
సభను రేపటికి వాయిదా 
సున్నం రాజయ్య ప్రసంగం తర్వాత సభను రేపటికి వాయిదావేస్తున్నట్లు అధ్యక్షస్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి ప్రకటించారు.

22:16 - March 16, 2017

సంగారెడ్డి : సుధీర్‌ కమిషన్‌ సూచన మేరకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీజాక్ కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా... జహీరాబాద్‌ పట్టణంలో టీజాక్ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో సుధీర్‌ కమిషన్‌-ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై సదస్సు జరిగింది. సుధీర్‌ కమిషన్‌ సూచించిన విధంగా ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని , వక్ఫ్‌ ఆస్తులను కాపాడాలని కోదండరామ్‌ అన్నారు.     

 

22:12 - March 16, 2017

ఢిల్లీ : గాయం కారణంగా మూడో టెస్ట్‌కు టీంఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. 40వ ఓవర్‌లో బంతిని ఆపేందుకు డైవ్ చేసిన కోహ్లీ భుజానికి గాయమైంది. మిడాన్ నుంచి బాల్‌ను వెంబండించిన కోహ్లీ బౌండరీ దాటకుండా ఆపేందుకు డైవ్ చేశాడు. ఆ ప్రయత్నంలో కుడి భుజంపై అతని బరువంతా పడింది. కొద్దిసేపు పైకి లేవలేకపోవడంతో ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చి పరిశీలించాడు. విశ్రాంతి అవసరమని సూచించడంతో.. వైస్ కెప్టెన్ రహానె సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. స్టాండ్‌బై అభినవ్ ముకుంద్ ‌ఫీల్డింగ్‌కు వచ్చాడు. తర్వాత భుజానికి బెల్ట్‌తో పెవిలియన్‌లోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కోహ్లీ కనిపించాడు. ఓ పక్క మ్యాచ్ సాగుతున్నా కోహ్లీకి ఏమైందనే ఉత్కంఠ అభిమానుల్లో కొనసాగింది. గాయం కారణంగా మూడోటెస్ట్‌కు కోహ్లీ దూరం కావడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

 

22:10 - March 16, 2017

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బాహుబలి -2 ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.   హైదరాబాద్‌లోని సినిమ్యాక్స్‌లో బాహుబలి 2 తెలుగు వర్షన్‌ ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్‌, రానా, హీరోయిన్‌ తమన్న ,  దర్శకులు రాఘవేంద్రరావు హాజరయ్యారు. రెండు నిమిషాల 20 సెకన్ల నిడివిగల ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. అయితే ట్రైలర్‌లో  ఫస్ట్‌పార్ట్‌లోని కొన్ని సీన్స్‌ రిపీట్‌ అయ్యాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినట్టు అన్న కోణాన్ని బయటపెట్టకుండా రాజమౌళి సస్పెన్స్‌లో పెట్టేశాడు.  ఆధిపత్య పోరులో అన్నదమ్ముల మధ్యవార్‌ సన్నివేశాలు మేజర్‌ హైలెట్‌గా చూపించారు.  బాహుబలి-2 ది కన్లూజన్‌ చిత్రాన్ని వచ్చే నెల ఏప్రిల్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ట్ర్రైలర్ విడుదలైన 12గంటల్లోనే కోటి 60లక్షల వ్యూస్‌తో.. కొత్త రికార్డ్ సృష్టించింది. 

 

22:08 - March 16, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించాడు. ఆ వివరాలను వారి మాటల్లోనే...
చెరుపల్లి సీతారాములు 
'పాదయాత్రకు అపూర్వమైన స్పందన వస్తుంది. గ్రామాలకు గ్రామాల ప్రజలు కదులుతున్నారు. పాదయాత్రకు ఎదురెళ్లి స్వాగతం చెబుతన్నారు. అనేకమైన విన్నపాలు చేస్తున్నారు. సమస్యలను పాదయాత్ర బృందానికి ఏకరవుపెడుతున్నారు. 
స్థానికంగా సమస్యలపై అధికారులకు మెమోరండం ఇస్తున్నాం. సమస్యలను పాదయాత్ర సందర్భంగానే అధికారులకు దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తున్నాం.
తమ్మినేని వీరభద్రం..
ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లలో ధర్నాలు చేయొద్దని...సిటీకి దూరంగా చేయాలని సీఎం కేసీఆర్ అంటున్నాడు.
జనం లేనితాన ధర్నాలు చేసి సమస్యలను చెట్లకు, పట్టలకు చెప్పుకోవాలా..? ప్రతిపక్షాలను లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నాడు. పోలీసులను భారీగా పెంచడం, పోలీసు వాహనాలను ఇచ్చాడు. జీతాలు ఇస్తున్నడు. నా లేఖలకు స్పందన లేదు.. ప్రత్యుత్తరం లేదు.. కానీ సమీక్షలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు కోతా పెడుతున్నారు. నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. 9800 కోట్లు వివిధ పథకాలకు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం దారుణంగా ఉంది. మోడీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. నల్లధనం వెలికి తీయలేదు. నోట్ల రద్దు దేశానికి పెద్ద విఘాతం. బీజేపీ మత భావాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుంది. ప్రజలు బీజేపీకి విజయం ఇచ్చారు..కానీ అది నష్టదాయకం.
రమ...
పాదయాత్ర చాలా బాగుంది. మహిళలకు ప్రభుత్వం ఆచరణలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆశా వర్కర్ల విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదని' చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

21:58 - March 16, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఆరు ముస్లిం దేశాల వలసదారులపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలపై హవాయి కోర్టులో చుక్కెదురైంది. మరికొద్ది గంటల్లో అమలు కావలసిన ట్రావెల్ బ్యాన్‌పై హ‌వాయి కోర్టు స్టే విధించింది. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించినట్లయితే అది 'వైద్యం చేయలేని గాయం'గా మిగిలిపోతుందని హవాయి ఫెడరల్‌ న్యాయమూర్తి డెర్రిక్ వాట్సన్  పేర్కొన్నారు. ట్రావెల్‌ బ్యాన్‌ అమలు చేయడానికి అంగీకరించమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.  ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆరు ముస్లిం దేశాల వ‌ల‌స‌దారుల‌పై 90 రోజులు, శ‌ర‌ణార్థుల‌పై 120 రోజుల‌ నిషేధం ఉంది. 

 

21:56 - March 16, 2017

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దళిత శోషణ ముక్తి మంచ్‌ ఆందోళన చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేయకుండా దళిత సంక్షేమం అనడంలో అర్థం లేదని డీఎస్ ఎంఎం నేత శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వివక్షకు గురికాకుండా కేంద్రం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పారు. ఈమేరకు ఆయన టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలవను వీడియోలో చూద్దాం..

 

21:53 - March 16, 2017

హైదరాబాద్ : జర్నలిస్టులకు... ప్రభుత్వాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే  దేశానికి మంచిదని జస్టిస్‌ సీకే ప్రసాద్‌ అన్నారు. టీయూడబ్ల్యుజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, వెటరన్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌, మీడియా ఎడ్యుకేషన్‌ ఫాందటిన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో  సమకాలీన జర్నలిజం-విలువలు అనే అంశంపై  జాతీయ సదస్సు జరిగింది. జర్నలిస్ట్‌ వృత్తి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని జస్టీస్‌ సీకే ప్రసాద్‌ అన్నారు. జర్నలిస్ట్‌ల పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌లకు దిగుతున్నవారిని మీడియా నుంచి బయటకు పంపాలని.. వార్తల నియంత్రణ ఎడిటర్‌ల చేతిలో ఉండాలని ఆయన సూచించారు.

 

21:50 - March 16, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగియనున్న సందర్భంగా 19న నిర్వహించే బహిరంగసభను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్ర ద్వారా సీపీఎం నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లారని విద్యార్థి నాయకులు అన్నారు. సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరగబోయే  సభకు అధిక సంఖ్యలో విద్యార్థులు తరలిరావాలని ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్, ఏఐడీఎస్ వో, పీడీఎస్ వో, పీడీఎస్ వై, ఏఐఎఫ్ డిఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. 

 

21:48 - March 16, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర... ముగింపు సభకు ఏర్పాట్లు 
హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరూర్‌నగర్‌ స్టేడియంలో   మార్చి19 న జరిగే ఈ భారీ బహిరంగ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలు వామపక్ష, సామాజిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్‌నగర్ సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. 
4000 కిలోమీటర్లకుపైగా సాగిన పాదయాత్ర 
అక్టోబర్ 17, 2016న ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర ఐదు నెలల్లో.. నాలుగు వేల కిలో మీటర్లకు పైగా కొనసాగింది. తెలంగాణలోని పల్లెపల్లెన పాదయాత్ర బృందం అలుపెరుగక పర్యటించింది. ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసుకుంది. ప్రజా సమస్యలను లేఖల రూపంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. 
ఈ నెల 19న ముగియనున్న పాదయాత్ర
తెలంగాణలోని 31 జిల్లాల్లో, నాలుగువేల కిలోమీటర్లకుపైగా సాగిన మహాజన పాదయాత్ర ఈ నెల 19న ముగియనుంది. ముగింపు సభ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. సామాజిక న్యాయ సమర సమ్మేళనం పేరుతో జరిగే భారీ బహిరంగ సభకు సీపీఎం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు వామపక్ష నేతలు, పలు సామాజిక, ప్రజా సంఘాల నేతలు ఈ సభలో పాల్గొననున్నారు.
సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్న సీపీఎం 
సరూర్‌నగర్‌లో మార్చి 19న జరిగే బహిరంగసభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ నిర్వహణకు  12 కమిటీలు ఏర్పాటు చేసారు. రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. వంద మంది నేతలు కూర్చునేలా ప్రధాన వేదిక, కళా రూపాల ప్రదర్శనకు మరో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్‌నగర్‌ సభా ప్రాంగణం వరకు  ముగింపు కాలినడక జరుగనుంది. పాదయాత్ర బృందం ముందు, వెనుక, రెడ్, బ్లూ షర్ట్స్, శారీస్ కవాతు, వెనుక కళాకారుల ప్రదర్శన, వచ్చిన ప్రజలు ప్రదర్శనలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. మరో ప్రదర్శన వనస్థలిపురం నుంచి ప్రారంభమవుతుంది. సభా ప్రాంగణంలో మీడియా, వీఐపీకి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసారు. 
నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు 
సభ కనిపించేలా.. నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు సీపీఎం భారీ జన సమీకరణ చేస్తోంది. వివిధ సామాజిక తరగతులు, అసంఘటిత రంగ కార్మికులు, వివిధ రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, ఈ సభకు వచ్చేలా ఆ పార్టీ, ప్రజా సంఘాలు ,సామాజిక సంస్థలు కార్యాచరణ ప్రారంభించాయి. మొత్తానికి పాదయాత్ర ముగింపు సభకు భారీగా జన సమీకరణ చేసి సభను సక్సెస్‌ చేయాలని సీపీఎంతో పాటు కార్మిక, ప్రజాసంఘాలు యోచిస్తున్నాయి.

21:43 - March 16, 2017
21:41 - March 16, 2017

హైదారాబాద్ : ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తరలించవద్దని విపక్షాలు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశాయి. ఇవాళ విపక్షనేతలు, ప్రజాసంఘాలు... రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ధర్నా చౌక్‌ను మారుస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. 

21:39 - March 16, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై వాడి వేడి చర్చ నడిచింది. ప్యాకేజీకి చట్టబద్దత వచ్చిందంటూ టీడీపీ హర్షం వ్యక్తం చేయగా...... ప్రత్యేక హోదా హామీ ఏమైందంటూ వైసీపీ ప్రశ్నలవర్షం కురిపించింది. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత మధ్య వాగ్వాదం హాట్‌ హాట్‌గా సాగింది.
సభలో గందరగోళం 
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలనుంచే సభలో గందరగోళం మొదలైంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధుల కేటాయింపులపై అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే 16 వేల కోట్ల వ్యయంలో కేంద్రం ఏడు వేల కోట్లు ఇవ్వడానికే ఒప్పుకుందని ప్రతిపక్ష నేత జగన్‌ ఆరోపించారు.
జగన్‌ విమర్శలపై టీడీపీ అభ్యంతరం 
జగన్‌ విమర్శలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం అసెంబ్లీ వాయిదాకు దారితీసింది. సభ తిరిగి ప్రారంభమయ్యాక చేనేత కార్మికుల సమస్యలపై మళ్లీ రభస జరిగింది. నేత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు  తప్పుబట్టారు.. ఈ విషయంపై వైసీపీ నేత అనిల్‌ ప్రశ్నించగా... మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. మంత్రి సమాధానం తర్వాత జగన్‌ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. స్పీకర్‌ అనుమతి ఇవ్వలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభలో గందరగోళంతో సభ రెండోసారి వాయిదా పడింది. 
పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై వాడివేడి చర్చ 
రెండుసార్లు వాయిదా తర్వాత, సభలో పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై వాడివేడి చర్చ నడిచింది.. ప్యాకేజీ చట్టబద్దత కల్పించిన  కేంద్ర ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు.. కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూనే వైసీపీతీరుపై విమర్శలు గుప్పించారు. 
చంద్రబాబుపై జగన్ ఫైర్
చంద్రబాబు విమర్శలపై వైసీపీ అధినేత తీవ్రస్థాయిలో స్పందించారు.. తొమ్మిదేళ్లు గత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు... పోలవరానికి ఒక్క రూపాయీ విడుదల చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని అంగీకరించడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. 
జగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్‌ 
జగన్‌ వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలకోసమే ప్యాకేజీకి ఒప్పుకోవాల్సివచ్చిందని గుర్తుచేశారు.. అసత్యాలు మాట్లాడితే వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కాక తప్పదని హెచ్చరించారు. 
చంద్రబాబు ప్రసంగంపై వైసీపీ సభ్యుల అసంతృప్తి
చంద్రబాబు ప్రసంగంపై వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.. న్యాయం కావాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు.. సభలో గందరగోళం కొనసాగుతుండగానే సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం సభ ఆమోదం పొందిందని  స్పీకర్‌ ప్రకటించారు.. సభను ఈనెల 20కి వాయిదావేశారు.

 

ఫ్రాన్స్‌లోని హైస్కూళ్లో కాల్పులు

ప్యారిస్ : ఫ్రాన్స్‌లో దక్షిణ ఫ్రాన్స్‌ గ్రస్సే పట్టణంలోని ఓ హైస్కూళ్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డట్లు ఫ్రెంచ్‌ పోలీసులు తెలిపారు. 

21:17 - March 16, 2017

ప్యారిస్ : ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ ఫ్రాన్స్‌ గ్రస్సే పట్టణంలోని ఓ హైస్కూళ్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డట్లు ఫ్రెంచ్‌ పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు ఉగ్రవాదానికి సంబంధం లేదని స్థానిక అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పారిస్‌లోని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ కార్యాలయంలో లెటర్‌ బాంబ్‌ పేలింది. సిబ్బంది ఓ పార్శిల్‌ కవర్‌ విప్పుతుండగా అది పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన ఉద్యోగులు కార్యాలయ భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. లెటర్‌ బాంబు పేలుడుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

21:14 - March 16, 2017
21:12 - March 16, 2017

విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి అన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 
ఆ వివరాలను ఆయన మాటాల్లోనే...
'ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి పాఠశాలకు ఒక హెడ్  మాస్టర్ ఉండాలి. విద్య, వైద్యం ప్రభుత్వం నుంచి అందించాలి. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి. హెల్త్ కార్డులు ఇస్తున్నారు.. కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. పెన్షన్ ను సామాజిక భద్రతగా చూడాలి. జాతీయ పెన్షన్ విధానం నష్టదాయకం. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించుకోవాలి. విద్యాలయాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని' అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:06 - March 16, 2017

డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ

అమెరికా : డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఒక్కరోజే రెండు న్యాయస్థానాల్లో వ్యతిరేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. సవరించిన వలస బిల్లును మేరీలాండ్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. సవరించిన వలస విధానాన్ని హవాయి కోర్టు నిలిపివేసింది. 

 

20:58 - March 16, 2017
20:56 - March 16, 2017
20:54 - March 16, 2017

గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే రోజా భేషరతుగా క్షమాపణలు చెబితే.. తనతో పాటు సభ మరో ఏడాది వేటు వేయకుండా క్షమిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రోజా సభకు రాకుండా అడ్డుపడుతున్నది వైసీపీ అధినేత జగనేనని అనిత ఆరోపించారు. రోజా సభకు క్షమాపణలు కోరకుండా జగనే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

 

20:46 - March 16, 2017

కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఈదురుగాలులతో భారీ రాళ్ళ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో స్థానిక ఓల్డ్ కాలనిలో రెండు ఇళ్ళలో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షంతో రోడ్లన్ని జలమైమయ్యయి. అటు సిర్పూర్(టి) మండలంలో కూడా ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. 

 

20:43 - March 16, 2017
20:42 - March 16, 2017
20:28 - March 16, 2017
20:27 - March 16, 2017

సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీజాక్ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు గత పదిహేను రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్ధుల శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ ఇంజనీర్లకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు. 

 

20:21 - March 16, 2017

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ, ఎల్‌కె అద్వానీ, అమిత్‌షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేదానిపై ఈ సమావేశంలో చర్చించారు. యూపీలో బీజేపీ 325 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఇంతవరకు సీఎం ఎవరన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో బీజేపీ యూపీ సీఎం అభ్యర్ధిపై మల్లగుల్లాలు పడుతోంది.  సాయంత్రంలోగా యూపీ సీఎం అభ్యర్ధిపై ప్రకటన వెలువడే అకాశముంది.

20:14 - March 16, 2017

ఛండీగఢ్ : పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరింది. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు.   నవజోత్‌సింగ్‌ సిద్దూ, మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్‌తోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  సిద్దూకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించినా ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. అమరీందర్‌సింగ్‌ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. 

 

19:59 - March 16, 2017

పనాజీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో పారీకర్‌కు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో ఓటింగ్‌ జరుగుతుండగా...కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విశ్వజిత్‌ రాణే సభ నుంచి వాకౌట్‌ చేశారు. తనకు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ముఖ్యమంత్రి పారీకర్‌ ప్రకటించారు. పారికర్‌ రెండు రోజుల క్రితం గోవా ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13 సీట్లు రాగా, ఎంజీపీ, జీఎఫ్ పీ, ఎన్ సీపీలతోపాటు స్వతంత్రులను కలుపుకుని సంకీర్ణ  ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు మనోహర్‌ పారీకర్‌ ఇవాళ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌ 17 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

19:58 - March 16, 2017

ఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి నిధుల అందుకున్న త‌మిళ‌నాడుకు చెందిన ఆరుగురు వ్యక్తులపై  ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ నిధుల‌తో నిందితులు సుమారు 12 మందిని సిరియా, ఇరాక్ దేశాల‌కు పంపించిన‌ట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన హజ ఫక్రూద్దీన్, ఖాజా మొయినుద్దీన్,  షకూల్‌ హమీద్, అన్సార్‌ మీరన్‌,  మసూద్‌ అసరుద్దీన్, సాదిక్‌ భాషా, మహ్మద్‌ సయీద్‌ అబు, మహ్మద్‌ తాబ్రేజ్‌లతో పాటు తెలంగాణ‌కు చెందిన నౌమ‌న్ జలీల్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.  ఇస్లామిక్ స్టేట్ కార్యక‌లాపాల‌ను భార‌త్‌లో విస్తరింప‌చేసేందుకు వీళ్లు ప్రయ‌త్నించిన‌ట్లు ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. 

19:50 - March 16, 2017

రంగారెడ్డి : జిల్లాలో కన్నకొడుకుపై కసాయి తల్లి కర్కషత్వం వెలుగుచూసింది. భర్తపై కోపంతో... కన్నకొడుకైన 8 ఏళ్ల హర్షవర్థన్‌ శరీరంపై తల్లి అనూష.. వాతలు పెట్టింది. దీంతో బాలుడి తండ్రి మురళీ కృష్ణ.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనూషకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని.. అప్పటినుంచి పిల్లలపై క్రూరంగా వ్యవహిరిస్తోందని మురళీ కృష్ణ వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. 

19:44 - March 16, 2017
19:33 - March 16, 2017

గుంటూరు : ఏపీ శాసనసభలో జగన్‌ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని... ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటోందని స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రయోజనాలకోసమే ప్యాకేజీకి ఒప్పుకున్నామని గుర్తుచేశారు. ఇవేవీ పట్టించుకోని వైసీపీ అధినేత.. అసత్యాలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మరని... వచ్చే ఎన్నికల్లో మీపార్టీవారికి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని హెచ్చరించారు.

 

19:30 - March 16, 2017

గుంటూరు : ప్రత్యేక హోదా నినాదంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.. హోదా ఇస్తామంటూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో ఎందుకు చెప్పారని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం కాకముందే కేంద్ర కేబినెట్‌ హోదాపై తీర్మానంకూడా చేసిందని గుర్తుచేశారు.. ఆ తర్వాత మాట మార్చినా ఏపీ సీఎం ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదని మండిపడ్డారు.. ఇప్పుడుమాత్రం అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

 

19:18 - March 16, 2017

ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక సహకారానికి చట్టబద్ధత లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. కేవలం కేబినెట్ ఆమోదంతోనే... చట్టబద్ధత లభించిందని పాలకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టింస్తోందని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీలు ప్రవేశపెట్టి దానికి చట్టరూపం కల్పిస్తేనే... ప్రత్యేక సహకారానికి విలువ ఇచ్చినట్టు అవుతుందని రాఘవులు తెలిపారు. 

 

19:09 - March 16, 2017

గుంటూరు : సభలో రౌడీయిజం చేయడం మంచిది కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. ఆనాడు వైఎస్ ప్రభుత్వం రూ. 2535 కోట్లు ఖర్చు పెట్టిందని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.3451 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. 

 

13:34 - March 16, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో ఈ పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర మార్చి 19వ తేదీన ముగియనుంది. 'సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం' పేరిట సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఈ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు రెండున్నర లక్షల మంది హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరు కానున్నారు. వీరితో పాటు వంద మంది అతిథులు హాజరు కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో క్లిక్ చేయండి.

13:28 - March 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు పూర్వ వైభవం తెస్తామని మంత్రి కడియం శాసనసభలో ప్రకటించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై గురువారం శాసనసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఇందుకు మూడు లక్ష్యాలను నిర్ధేశించుకోవడం జరిగిందని, జూన్ 12వ తేదీ నాటికి ఆ లక్ష్యాలను చేరుకుంటామన్నారు. ప్రతి విద్యార్థికి బుక్ లు అందించేలా చూస్తున్నట్లు, మేలోగా పాఠశాలలకు యూనిఫాంలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. టాయిలెట్స్ ను కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

13:24 - March 16, 2017

హైదరాబాద్ : 'త్వరలో 'అన్నపూర్ణ' భోజన కేంద్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజనంపై గురువారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జీహెచ్ఎంసీ త్వరలో అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 109 కేంద్రాల్లో ఐదు రూపాయల భోజనం పెడుతున్నామన్నారు. ఈ సంఖ్యను 150 పెంచి అన్నపూర్ణ భోజన కేంద్రాలుగా నామకరణం చేస్తామన్నారు. నాణ్యమైన భోజనం అందించడమే ధ్యేయమన్నారు. ఒక వ్యక్తి భోజనం చేయడానికి రూ. 24.05 పైసలు ఖర్చు అవుతుందని అందులో వ్యక్తి 5 రూపాయలు ఖర్చు చేస్తే మిగతా 19.05 పైసలు జీహెచ్ఎంసీ భరిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

13:21 - March 16, 2017

హైదరాబాద్ : యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ శాసనసభలో వెల్లడించారు. గురువారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కాటేజీలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, టెంపుల్ సిటీకి 250 ఎకరాలు కేటాయించామన్నారు. టూరిజం అట్రాక్షన్ విధంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, భూ సేకరణ ఇంకా చేయాల్సి ఉందన్నారు.

13:12 - March 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ పై ఆయన శాసనసభలో చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు విమర్శలు గుప్పించారు. వాస్తవాలకు విరుద్ధంగా..అంకెల గారడీగా..ప్రజల్లో ఆశలపల్లకిలో ఊరేగించే విధంగా ఉందన్నారు. ఆయన మాటల్లోనే...'ప్రజలు ఆశించని విధంగా పాలన ఉండాలి. తమ సూచనలు బాగుంటే స్వీకరించవచ్చు. ప్రతిపక్షాల సూచనలు ప్రభుత్వం అమలుపరచాలి. బడ్జెట్ లెక్కలు వాస్తవమా ? కాదా ? ప్రజలే తేల్చుతారు. 2014-15 మధ్యకాలంలో ఆర్థిక లోటును తగ్గించాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక లోటును తగ్గించాం. ప్రభుత్వ చెబుతున్న లెక్కలు..వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉంది. ఇది జానా, బెత్తడు బడ్జెట్. టీఆర్ఎస్ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తోంది. బడ్జెట్ తో ప్రజలను ఆశలపల్లకి ఎక్కించారు. అప్పు తీసుకున్న పావలా వడ్డీ సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమౌతుంది' అని పేర్కొన్నారు. జానా ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

13:03 - March 16, 2017

పనాజీ : సీఎం పారికర్ బలపరీక్షలో నెగ్గారు. బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరినట్లైంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాషాయదళం గోవాలోనూ అధికారం చేపట్టింది. గవర్నర్ మృదులా సిన్హా ప్రభుత్ ఏర్పాటుకు ఆహ్వానించడంతో పారికర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే విధించాలన్న కాంగ్రెస్‌ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 13న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పారికర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 16న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. గురువారం బలపరీక్షలో పారికర్ కు బీజేపీ సభ్యులు 13 మందితో పాటు ఇతర పార్టీలకు చెందిన మరో 9 మంది సభ్యులు ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీనితో మొత్తం 22 ఓట్లు పడడంతో ఆయన గెలిచినట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. పారికర్ కు వ్యతిరేకంగా 16 ఓట్లు మాత్రమే పడ్డాయని తెలుస్తోంది.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు.

12:55 - March 16, 2017

రాజన్న సిరిసిల్ల : చేనేతల ఆత్మహత్యలు ఆగడం లేదు. నేతన్నలను ఆదుకుంటామని పాలకులు చెబుతున్న మాటలు ఎంతమేరకు అమలవుతున్నాయో ఈ ఘటనలు చూస్తే అర్థమౌతోంది. సిరిసిల్లలో 24గంటల్లో ఇద్దరు నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీనితో జిల్లాలో కలకలం రేగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీవయ్య నగర్ లో నివాసం ఉంటున్న ఆసామీ సత్యం ఉరి వేసుకుని మృతి చెందగా సత్యం అనే ఆసామీ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనితో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

నెగ్గిన పారికర్..

గోవా : సీఎం పారికర్ బలపరీక్షలో నెగ్గారు. బీజేపీ స‌భ్యులు13 మందితో పాటు ఇత‌ర పార్టీల‌కు చెందిన మ‌రో 9 మంది స‌భ్యులు మద్దతు తెలిపారు. మ‌నోహ‌ర్ పారిక‌ర్ కు అనుకూలంగా మొత్తం 22 ఓట్లు ప‌డ‌డంతో ఆయ‌న గెలిచిన‌ట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

12:35 - March 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గందరగోళంగా..ప్రజలను భ్రమించే విధంగా..ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా..అంకెల్లో ఉందని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి తనదైన శైలిలో పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్ పై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా జానారెడ్డి ప్రభుత్వంపై సున్నితమైన విమర్శలు గుప్పించారు. అప్పులు తీసుకరావాల్సిందేనని..కానీ ఆస్తులకంటే అప్పులు మించితే ద్రవ్యలోటు ఏర్పడి అభివృద్ధి కుంటుపడి సమస్య ఏర్పడుతుందన్నారు. అప్పులు ఆ దిశలో ఉన్నాయా ? లేదా ? ఆలోచించాలని సూచించారు. 1956-94 వరకు అప్పు 100 ఉంటే ఆస్తులు 101 ఉన్నాయని, 2004 వచ్చేసరికి రెవెన్యూ లోటు ఏర్పడిందని, ఎఫ్ఆర్బీఎం రావడం జరిగిందన్నారు. గత పదేళ్లలో అప్పులు తీర్చుకుంటూ..ఆస్తులు పెంచుకుంటూ వెళ్లడం జరిగిందని, 100 అప్పులు ఉంటే 110 ఆస్తులు పెరిగాయని గుర్తు చేశారు. వ్యవసాయ పరిస్థితులు తరిగిపోయినప్పుడు అనేక మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి ఈటెల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పెరుగుదల సప్తసముద్రాలు దాటిందని, దేశంలో ఇంత పెరుగుదల చూపెట్టిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. ఇది వాస్తవమా ? కాదా ? అనేది మంత్రి ఈటెల తమకు తెలియచేయాలని జానా సూచించారు.

12:30 - March 16, 2017

ఢిల్లీ : గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై కూడా దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు మల్లగుల్లాలు పడుతోంది. అందులో భాగంగా కేంద్రమంత్రివర్గం గురువారం సమావేశమైంది. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ప్రధాని మోడీ, ఎల్ కే అద్వానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల కీలక ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ లో అనుసరించాల్సిన వ్యూహం..ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.

12:16 - March 16, 2017

హైదరాబాద్ : సింగరేణి వారసత్వం ఉద్యోగాలపై టి.సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను న్యాయస్థానం గురువారం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారసత్వ ఉద్యోగాల విషయంలో ఇటీవలే ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగి మెడికల్‌ గ్రౌండ్స్‌ అన్‌ ఫిట్‌ అయితే తప్ప వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం సింగరేణి యాక్టు విరుద్ధంగా జీవో ఇచ్చారని, గతంలో కూడా తీర్పు చెప్పారని పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందని ఆ ఉత్తర్వులకు అనుగుణంగా మాత్రమే జీవో జారీ చేయాలని హైకోర్టు సూచించింది. దీనిపై టి.సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

11:59 - March 16, 2017
11:54 - March 16, 2017

గోవా శాసనసభలో బలపరీక్ష ప్రారంభం..

గోవా : రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష ప్రారంభమైంది. బలపరీక్ష తీర్మానాన్ని సీఎం పారికర్ సభలో ప్రవేశ పెట్టారు. 21 మంది సభ్యుల బలం ఉందని బీజేపీ పేర్కొంది.

వారసత్వ ఉద్యోగాల జీవోను కొట్టివేసిన హైకోర్టు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సింగరేణి వారసత్వాల ఉద్యోగాల నియామకం జీవోను హైకోర్టు రద్దు చేసింది. వారసత్వ ఉద్యోగాల తీరును కోర్టు తప్పుబట్టింది.

పల్లె సమాధానంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆగ్రహం..

విజయవాడ : కార్పోరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ నివేదిక ఎందుకు అందించలేదని పీడీఎఫ్ సభ్యులు సర్కార్ ను నిలదీశారు. ఏప్రిల్ 15 నాటికి నివేదిక వస్తుందని, విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రుల ఒత్తిడి..కుటుంబకలహాలే కారణమని మంత్రి పల్లె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు.

స్పీకర్ కోడెలకు రోజా లేఖ..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా తాను సభకు హాజరు కాలేదని పేర్కొన్నారు. ఆమెపై నియమించబడిన ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.

స్కూళ్లలో టాయిలెట్స్ సరిచేస్తామన్న కడియం..

హైదరాబాద్ : జూన్ 12 పాఠశాలల పున:ప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు సరిచేస్తామని మంత్రి కడియం శాసనసభలో ప్రకటించారు. ప్రతి విద్యార్థికి బుక్ లు అందించేలా చూస్తున్నట్లు, మేలోగా పాఠశాలలకు యూనిఫాంలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. టాయిలెట్స్ ను కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

11:41 - March 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని టి.అసెంబ్లీలో టి.కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఆయన మిర్చి రైతుల కష్టాలపై మాట్లాడారు. తన ప్రశ్న మార్కెటింగ్ శాఖకు సంబంధించిందని, దీనిపై ఇతర మంత్రులు సమాధానం చెప్పాలని కోరారు. మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రూ. 12వేలు క్వింటాలు ఉంటే ఎక్కువ ధర దొరకుతుందనే ఉద్ధేశ్యంతో రైతులు పంటను ఎక్కువగా పండించారని తెలిపారు. ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు పెద్ద ఎత్తున్న మిర్చి బస్తాలు వస్తున్నాయని తెలిపారు. పత్తి పండించాలని ప్రభుత్వమే చెప్పిందని, కందుల ధర ఎంతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడం కరెక్టు కాదని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అనంతరం గువ్వల బాల్ రాజు కూడా మాట్లాడారు.

11:40 - March 16, 2017

హైదరాబాద్: ధర్నా చౌక్ తరలింపునకు నిరసనగా బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఉదయం ఇందిరాపార్కు నుండి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీనిపై కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేయవద్దా ? ఉద్యమాలు చేస్తేనే కదా రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్ వినిపించుకోలేదు.

11:34 - March 16, 2017

విజయవాడ : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు ప్రతిపక్షం ఆందోళనలు చేయడంతో పలుమార్లు సభ వాయిదా పడుతూ వచ్చింది. ఉదయం ప్రశ్నోత్తరాల్లో పోలవరం అంశంపై అధికార..ప్రతిపక్షం మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగన్ కు అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. ఎక్సైజ్ మినిస్టర్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఐదు లక్షల కింద రుణాలు అందించడం జరుగుతోందని, ఆరు నేత బజార్లు ఏర్పాటు చేసినట్లు ఇది ఇతర జిల్లాల్లో విస్తరిస్తామన్నారు. 231 కోట్లు పెట్టినా పెన్షన్ 118 కోట్లు ఇవ్వడం జరుగుతోందని, రుణమాఫీ 110 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి స్పీకర్ అనుమతినివ్వలేదు. ప్రతి ప్రశ్నకు జోక్యం చేసుకుంటే ఎలా అని సింగిల్ సప్లిమెంటరీకి అనుమతినిచ్చారు. వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

11:28 - March 16, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశం మళ్లీ రాజుకుంది. ఎమ్మెల్యే అనితపై రోజా వ్యవహారశైలిపై విచారించబడిన ప్రివిలేజ్ కమిటీ గురువారం ఉదయం స్పీకర్ కు నివేదిక సమర్పించింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతనలో ప్రివిలేజ్ కమిటీ 62 పేజీల నివేదిక తయారు చేసింది. రోజా ఏ విధంగా అవమానపరిచారు ? వీడియో క్లిప్పింగ్స్..ఇతరత్రా వ్యాఖ్యలను నివేదికలో పొందుపరిచారు. రోజా సభకు క్షమాపణలు చెబితే ఈ అంశంపై పునరాలోచిస్తారని తెలుస్తోంది. దాదాపు సంవత్సర కాలంగా కమిటీ ఐదు సార్లు సమావేశమైంది. మూడుసార్లు గైర్హాజరయిన రోజా నాలుగోసారి హాజరయ్యారు. కమిటీ ఎదుట హాజరైన రోజా క్షమాపణలు చెప్పినా కమిటీ సంతృప్తి పడలేదని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే అధికార..ప్రతిపక్షాల మధ్య వాద..ప్రతివాదాలు జరుగుతున్నాయి. సోమవారం నాడు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ వాయిదా తీర్మానం తిరస్కరణ..

హైదరాబాద్ : ధర్నా చౌక్ తరలింపునకు నిరసనగా బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఉదయం ఇందిరాపార్కు నుండి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

11:19 - March 16, 2017

హైదరాబాద్ : జూన్ 12 పాఠశాలల పున:ప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు సరిచేస్తామని మంత్రి కడియం శాసనసభలో ప్రకటించారు. గురువారం శాసనసభలో పాఠశాలలో నెలకొన్న టాయిలెట్స్ పరిస్థితులపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. ఎన్ఆర్ ఐజీఎస్టీ కింద తీసుకుంటున్నారా ? మెయింటెనెన్స్ చాలా ప్రధానమైందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. చాలి చాలని జీతాలు ఇవ్వడంతో మరుగుదొడ్లు క్లీనింగ్ జరగడం లేదని, సరిపోయినంత సంఖ్య పరంగా టాయిలెట్స్ కట్టించాలని కోరారు. మరుగుదొడ్లు ఉపయోగించాలన్నా..మన్నికగా ఉండాలంటే వాటర్ ఉండాల్సిందేనన్నారు. గ్రామ పంచాయతీ..ప్రత్యేక నిధులు..ఆర్ డబ్ల్యూఎస్ నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య ప్రమాణాలు మెరుగుపడాలని సూచించారు. ఒక్కో స్కూల్ లో 500 మంది విద్యార్థులు చదుకుంటూ ఉంటున్నారని బాబిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించాలని సూచించారు. దీనిపై మంత్రి కడియం సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 25926 ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఉన్నాయని, ఒక టాయిలెట్ కనీసం ఉందని..నీళ్లు మెంటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా పాఠశాలలో మూత్ర శాలలు పనిచేయడం లేదన్నారు. దీనిపై శాఖ రివ్యూ చేయడం జరిగిందన్నారు.

ఏపీ అసెంబ్లీలో గందరగోళం..

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో మళ్లీ గందరగోళం నెలకొంది. సింగిల్ సప్లిమెంటరీకు స్పీకర్ కోడెల అనుమతినివ్వడంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. సభకు సహకరించే విధంగా చూడాలని వైసీపీని బీజేపీ సభ్యుడు కోరారు.

మహిళల సాధికారితకు కృషి - జూపల్లి..

హైదరాబాద్ : మహిళల సాధికారిత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మహిళా సంఘాలున్నాయని, రాష్ట్రంలో మహిళా సంఘాలకు నిధుల కొరత లేదన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

కొనసాగుతున్న టి.అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పాఠశాలలో నెలకొన్న టాయిలెట్స్ సమస్యపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు.

 

కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ పై చెప్పుతో దాడి...

చెన్నై : కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ పై దుండుగుడు చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. జెఎన్ యూ విద్యార్థి ముత్తుకృష్ణన్ కు నివాళి అర్పించేందుకు వెళ్లగా ఈ దాడి జరిగింది.

పంజాబ్ సీఎంగా..

పంజాబ్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజ్‌భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు.

10:23 - March 16, 2017
10:22 - March 16, 2017
10:10 - March 16, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మళ్లీ ఏడాది పాటు సస్పెన్స్ వేటు పడే అవకాశం ఉంది. గతంలో జరిగిన సభలో ఎమ్మెల్యే అనిత..రోజా మధ్య జరిగిన వివాదం దుమారం రేగిన సంగతి తెలిసిందే. రోజా వ్యవహార శైలిపై ఎమ్మెల్యే అనిత స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో స్పీకర్ కోడెల ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. అనంతరం దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టారు. నాలుగు సార్లు సమావేశమైంది. ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా హాజరై సారీ చెప్పడం జరిగింది. ఏకపక్షంగా ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా గురువారం ఉదయం స్పీకర్ కు 62 పేజీల నివేదికను ప్రివిలేజ్ కమిటీ అందచేసింది. మరో ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేయాలని కమిటీ పేర్కొంది. నిర్ణయం తీసుకొనే అధికారం సభకు వదిలేసింది.
ఫిర్యాదు మేరకు విచారణ జరిగిందని, అనంతరం కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని అధికార పార్టీకి చెందిన నేత పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తీవ్ర అభ్యంతరమని, గొంతునొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ సభ్యుడు సురేష్ పేర్కొన్నారు. మరి సభ ఏ నిర్ణయం తీసుకుంటారు ? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదు - జగన్..

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై వైసీపీ నేత జగన్ మాట్లాడారు. టిడిపి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, విభజన చట్టంలోని హామీని కేంద్రం ఆమోదించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని గుర్తించాలని సూచించారు.

09:39 - March 16, 2017

యాదాద్రి : ఒకటే లక్ష్యం.. అదే గమ్యం.. 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసినా.. ఇంకా తగ్గని ఉత్సాహం. సామాజిక లక్ష్యం-సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఎగిసిపడుతున్న కెరటాల్లా దూసుకెళ్తోంది. వాగులు, వంకలు దాటుకుంటూ.. ఎన్నో పల్లెల్లో కొనసాగుతున్న పాదయాత్ర నేటితో 150 రోజులు పూర్తి చేసుకుంది. ఎంతో ఉత్సాహం కొనసాగుతున్న పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా.. మరోవైపు ఇతర రాజకీయ పార్టీలు సైతం సంఘీభావం తెలుపుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించాలనే ఎజెండాతో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర యాదాద్రి జిల్లాలో సాగుతోంది. మహాజన పాదయాత్రకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి.. తమ సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారు. మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ పార్టీల నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ పాదయాత్ర బృందాన్ని కలిసి అభినందించారు.

150వ రోజు...
రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నా.. పల్లెల్లో ఆ పరిస్థితి లేదన్నారు తమ్మినేని వీరభద్రం. ఇంటింటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌.. కనీసం ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దీంతో యువకులు కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పాదయాత్రను చూసి అన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌.. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా ఆ వర్గాల కోసమే ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదన్నారు తమ్మినేని. 150వ రోజు పాదయాత్ర.. పులిగిల్ల నుంచి ప్రారంభమై కాటేపల్లి, సికిందర్‌నగర్‌, మోటకొండూర్‌, దిలావార్‌పూర్‌ మీదుగా ఆలేరు వరకు కొనసాగింది. తమ్మినేని బృందం మోటాకొండూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మోటాకొండూరు కొత్త మండలంగా ఏర్పడడంతో హాస్టల్‌ విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పాదయాత్ర బృందం దృష్టికి వచ్చింది. మండల కేంద్రాన్ని హాస్టల్‌లోనే ఏర్పాటు చేయడంతో గదులు సరిపోవడం లేదని విద్యార్థులు వాపోయారు. దీనిపై స్పందించిన తమ్మినేని.. హాస్టల్‌ సమస్యతో పాటు.. మోటాకొండూరు మండల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇక ఎన్నో ఏళ్లుగా నిర్మాణం లేక వెలవెలబోతున్న బునాదిగాని కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ తమ్మినేని.. సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాశారు. బడ్జెట్‌లో కాల్వకు నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కోరారు.

09:34 - March 16, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. అధికార..విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు..వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. గురువారం నాడు ప్రారంభమైన శాసనసభలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై వైసీపీ నేత జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. నేషనల్ ప్రాజెక్టు అని డిక్లేర్డ్ చేసిన అనంతరం కేంద్రం చేయాల్సిన ధర్మమన్నారు. రాష్ట్రం విడిగొట్టిన అనంతరం మార్చి 2, 2014లో కేబినెట్ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేయడం జరిగిందని, రెండింటికి ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతికి పంపించారని తెలిపారు. ముంపు మండలాలు ఒక పాయింట్ అయితే, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలని ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేశారని దీనిపై మాట్లాడడం లేదన్నారు. దీనిపై మరింత మాట్లాడుతుండగానే స్పీకర్ కన్ క్లూడ్ చేయాలని సూచించారు. ఇది చాలా ఇంపార్ట్ంట్ అని జగన్ మాట్లాడారు. మధ్యలో అధికారపక్షం జోక్యం చేసుకోవడం..దీనికి స్పీకర్ అనుమతించడంతో రభస చెలరేగింది.
ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు, గృహనిర్మాణ, సీఆర్‌డీఏలో స్థలాల పంపిణీ, మెట్రోరైలు వ్యవస్థ వంటి అంశాలపై చర్చ ఉంటుంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇస్తుంది. సభముందుకు నాలుగు బిల్లులు రానున్నాయి. పర్యాటక, సంస్కృతిక, వారసత్వ చట్టం, వ్యాట్‌, ఎక్సైజ్‌ చట్టాల సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.

పోలవరంపై మాట్లాడుతున్న జగన్..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులుపై వైసీపీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతున్నారు.

09:24 - March 16, 2017

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బాహుబలి -2 ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. గురువారం ఉదయం నేరుగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని జక్కన్న టీం ప్లాన్‌ చేసింది. అయితే తెలుగుకంటే కోలీవుడ్‌లో అనుకున్న సమయంకంటే ముందుగానే ట్రైలర్‌ వచ్చేసింది. రెండు నిమిషాల 20 సెకన్ల నిడివిగల ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అయితే ట్రైలర్‌లో ఫస్ట్‌పార్ట్‌లోని కొన్ని సీన్స్‌ రిపీట్‌ అయ్యాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినట్టు అన్న కోణాన్ని బయటపెట్టకుండా రాజమౌళి సస్పెన్స్‌లో పెట్టేశాడు. యువరాజుగా ఉన్నప్పుడు ప్రభాస్‌, యువరాణిగా ఉన్నప్పుడు అనుష్కని చూపించారు. ఆధిపత్య పోరులో అన్నదమ్ముల మధ్యవార్‌ సన్నివేశాలు మేజర్‌ హైలెట్‌గా చూపించారు.

09:22 - March 16, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కు సంబంధించిన అంశంపై సర్కార్ ను కాంగ్రెస్ నిలదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి పలు ప్రశ్నలు సంధించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ నుండి జానారెడ్డి, టిడిపి, ఎఐఎం, సీపీఎం చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. అప్పటి వరకు సమయం సరిపోకపోతే రేపటికి కూడా చర్చను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు సభ్యులు పది ప్రశ్నలను లేవనెత్తానున్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని నిలబెట్టుకోలేకపోయిందని..ఎంత మందికి ఇచ్చారనే దానిపై..సీసీ రోడ్లు..అంగన్ వాడీ కేంద్రాలు..జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు..యాదాద్రి ప్రణాళిక అమలు..ఇతరత్రా వాటిపై ప్రశ్నలు సంధించనున్నారు. ఇందిరాపార్కు నుండి ధర్నా చౌక్ ను తరలించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందిరాపార్కు నుండి అసెంబ్లీ వరకు పాదయాత్రగా రానున్నారు. దీనిపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది.

ఆసీస్ బ్యాటింగ్..

రాంచీ : నేటి నుండి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకున్న కొహ్లీ అండ్‌ కో రాంచీ టెస్ట్‌తో సిరీస్‌పై పట్టుబిగించాలని పట్టుదలతో ఉంది.

దుమ్ము రేపుతున్న 'బాహుబలి2’ ట్రైలర్..

హైదరాబాద్ : బాహుబలి 2 ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. తొలుత తమిళంలో విడుదలైన ఈ ట్రైలర్ కాసేపటి క్రితం తెలుగులో విడుదలైంది. ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

08:28 - March 16, 2017

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం పలు కులసంఘాలు..ఇతరులు సీఎం కేసీఆర్ ను అభినందనలో ముంచెత్తుతున్నారు. దీనిపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ఒక డౌట్ తెరమీదకు తెచ్చారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వాళ్లు ఎలా రెడీ అయ్యారు..గొల్ల అయిన రెడీ ఉండి గొర్రె ఎలా ఇచ్చిండు.? ప్రశ్న లేవనెత్తారు. అసెంబ్లీకి రావాలంటే పాస్ రావాలి కదా. ఈ పాస్ ఎలా వచ్చింది..మంత్రి తలసాని పాస్ ఇచ్చిండు. టీఆర్ఎస్ మంత్రి కదా. ఆయన మనిషి వచ్చి పరిపాలన బాగా లేదంటాడా ? అని పేర్కొన్నారు. పాలు కూడా వీళ్లే తెప్పిస్తారు. బొమ్మ వీళ్లదే. ప్రేమతో పోసిన పాలు కాదు. ముందే చెబుతారని తమ్మినేని తెలిపారు. టైం పెట్టండి..ఏ ఊళ్లోకి రమ్మంటే ఆ ఊళ్లోకి వస్తా. కమ్మరి..బెస్త..వడ్రంగి..అందర్నీ పిలుద్దాం. కేసీఆర్ సర్కార్ మంచి చేస్తుందని చెబితే నేను ఒప్పుకుంటా అని తమ్మినేని తెలిపారు. మరి తమ్మినేని వ్యాఖ్యలపై సర్కార్ స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

08:21 - March 16, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం కొనసాగనున్నాయి. ఈ రోజు జరిగే సమావేశాల్లో పలు అంశాలు చర్చకు రానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం..పర్యాటక – సాంస్కృతిక, వారసత్వ చట్టం, ఎక్సైజ్ బిల్లు, వ్యాట్ బిల్లులు సభ ఎదుట రానున్నాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించనుంది. ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ టెన్ టివితో మాట్లాడారు. రోజా అసలు మహిళేనా అని ప్రశ్నించారు. ఆమెను చూసి మహిళలే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. కాళ్లు చూపించడం చూశామని..తోటి సభ్యులపై ఏ విధంగా ప్రవర్తించారో చూశారని పేర్కొన్నారు. ఇంట్లో ఏ విధంగానైనా ఉండవచ్చు..లోటస్ పాండ్ లో ఏ విధంగానైనా ఉండవచ్చు...కానీ ఇది ఏపీ అసెంబ్లీ అని పలు వ్యాఖ్యలు చేశారు. బోండా ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి.

08:17 - March 16, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం కొనసాగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీ హాట్ హాట్ జరగనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఓ మహిళ అనుచితంగా ప్రవర్తించారంటే అందుకు గల కారణాలు చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోజా మూడు సార్లు దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందని, తనపై ఎమ్మెల్యే అనిత ఎలా దురుసుగా మాట్లాడారో చూపెట్టాలని కోరడం జరిగిందన్నారు. శాసనసభ్యులకు కులం అంటూ ఏదీ ఉండదని ఇందుకు ఎమ్మెల్యే రోజా వివాహమే నిదర్శనమన్నారు. ఒక మహిళను ఎదుర్కొనే దీనస్థితిలో టిడిపి ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పనున్నారు. సభ ఎదుట నాలుగు బిల్లులు రానున్నాయి. పర్యాటక – సాంస్కృతిక, వారసత్వ చట్టం, ఎక్సైజ్ బిల్లు, వ్యాట్ బిల్లులు ఇందులో ఉన్నాయి. ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై చర్చ జరగనుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించనుంది.

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ..

విజయవాడ : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పనున్నారు. సభ ఎదుట నాలుగు బిల్లులు రానున్నాయి. పర్యాటక – సాంస్కృతిక, వారసత్వ చట్టం, ఎక్సైజ్ బిల్లు, వ్యాట్ బిల్లులు ఇందులో ఉన్నాయి. ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై చర్చ జరగనుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించనుంది.

08:04 - March 16, 2017

అధికారంలోకి రాగానే దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఇస్తామని ప్రస్తుత పాలకులు పేర్కొన్నారు. మరి మూడెకరాల భూ పంపిణీ జరిగిందా ? ఇతరత్ర సమస్యలు తీరాయా ? అనేది తెలుసుకోవడానికి సీపీఎం మహాజన పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ముగింపు చేరుకున్న సందర్భంగా పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో 'మల్లన్న' ముచ్చటించాడు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు కదా..మూడెకరాల భూమి తరువాత సార్..చచ్చినపోయినప్పుడు మూడు గజాల స్థలం లేదు..అని పలువురు తమతో చెప్పారని తెలిపారు. రూ. 5లక్షలు పెట్టి భూమి కొనడానికి సిద్ధంగా ఉంది..ఆ రేటుకు భూమి దొరకతలేదని అని ప్రభుత్వం చెబుతోంది..మూడెకరాల చొప్పున రూ. 15లక్షలు వారి ఖాతాల్లో వేయాలని సూచించారు. ఒకవేళ వారు డబ్బులు ఖర్చు పెడుతారని అనుకుంటే భూమి కొనుక్కొంటే డబ్బులిస్తామనే షరతు పెట్టాలన్నారు. దీని గురించి వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

07:52 - March 16, 2017

తెలంగాణ రాష్ట్ర మంత్రి..ఉద్యోగాలిచ్చే కేటీఆర్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మహాజన పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా తమ్మినేనితో 'మల్లన్న' ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు. కేటీఆర్ పరిశ్రమలు పెడుతానని చెప్పారు..టీ పాస్ లు..ఐపాస్ లు అంటున్నాడు...ఏమీ లేదు..దద్దమ్మ మంత్రిలా ఉన్నాడని విమర్శించారు. ఒక్కరికి ఒక్క ఉద్యోగం లేదన్నారు. ఉద్యోగాల మంత్రి ఈయనే కదా..కేసీఆర్ ఏమో ఉన్న ఉద్యోగాలిస్తారు..మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వందల స్కూళ్లు తిరగడం జరిగిందని తమ స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు పేర్కొంటున్నారని, ట్రైనింగ్ తీసుకుని ఖాళీగా ఎంతో మంది టీచర్లు ఉన్నారు. ఒక్క సంతకం పెడితే అయిపోతది కదా అని తమ్మినేని పేర్కొన్నారు. తమ్మినేని మాటల్లోనే వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

07:38 - March 16, 2017

అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 56 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 19 వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 12 వేల కోట్లు కేటాయించారు. 9 రంగాల ఆధారంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందన్నారు యనమల. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో గౌతమ్ రెడ్డి (వైసీపీ), పట్టాభిరామ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

భార్య..కోడలిపై గొడ్డలితో దాడి..

సిద్ధిపేట : సిద్ధిపేట రూరల్ (మం) ఎన్సాన్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య లక్ష్మీ, కోడలు అనితలపై పోచయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా పరిస్థితి విషమంగా ఉన్న కోడలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

డమాస్కస్ లో ఆత్మహుతి దాడి..

బీరూట్ : సిరియా రాజధాని డమాస్కస్ లో ఆత్మహతి దాడి జరిగింది. కోర్టు సముదాయ భవనంలో దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడడంతో 25 మంది మృతి చెందారు.

 

06:49 - March 16, 2017

ఎస్సీ ఉపకులాలు మరోసారి పోరుబాటపడుతున్నాయి. బేడ బుడగ జంగాలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. ఏప్రిల్‌ 13న చలో హైలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఎస్సీ ఉపకులాలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? బేడ బుడగ జంగాల జీవన స్థితిగతులు ఎలా వున్నాయి? ప్రభుత్వ పథకాలు వీరికి ఎలా అందుతున్నాయి? ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ బేడ బుడగ జంగాల హక్కుల దండ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం సమస్యలను తెలియచేశారు. మరి వారి సమస్యలు ఏంటీ ? ఎలాంటి డిమాండ్స్ వినిపిస్తున్నారు ? తదితర విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

06:44 - March 16, 2017

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి అరెస్టు అయ్యారు. కొద్ది రోజులుగా తప్పించుకుతిరుగుతున్న ప్రజాపతిని పోలీసులు లక్నోలో అరెస్టు చేశారు. ప్రజాపతి అఖిలేశ్‌ మంత్రివర్గంలో పని చేశారు. ప్రజాపతి తనయులను నిన్నే అరెస్టు అయ్యారు.

06:43 - March 16, 2017

ఢిల్లీ : మణిపూర్‌ నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన బీరేన్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా బీరేన్‌సింగ్‌తో ప్రమాణం చేయించారు. డిప్యూటి సిఎంగా ఎన్‌పిపికి చెందిన వై.జయ్‌ కుమార్‌ సింగ్‌తో పాటు ఏడుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్‌లో తొలిసారిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ 28 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 21 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 31. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేతో కలిపి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బిజెపి గవర్నర్‌కు జాబితాను అందజేసింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

06:39 - March 16, 2017

చెన్నై : అన్నాడీఎంకేలో రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. ఆర్‌కె నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి అన్నాడిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ పేరును శశికళ ఖరారు చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అన్నాడీఎంకే తరపున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదన్నారు. దినకరన్‌కు అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పన్నీర్‌ సెల్వం ఈసీని కోరారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తును తనకే కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12 ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ కూడా ఆర్కేనగర్‌ నుంచే రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

06:38 - March 16, 2017

హైదరాబాద్ : డిగ్రీ కోర్సుల్లానే...ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఆ దిశగా బోర్డుకు ఆదేశాలు కూడా అందజేసింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నిర్వహణకు అవసరమైన నిబంధనలపై నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం ప్రైవేటు కాలేజీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2వేల 464 జూనియర్ కాలేజీలున్నాయి. అందులో 405 కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 63 కాలేజీలు ఎయిడెడ్, 1651 కాలేజీలు ప్రైవేటు యాజమాన్యాల కింద నడుస్తున్నాయి. ఇవికాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్ ఆధ్వర్యంలో కూడా కొన్ని జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ కాలేజీల్లో సీట్లను ఆన్‌లైన్‌లోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే రెసిడెన్షియల్ కాలేజీలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.

అకాడమీ ముసుగులో..
రాష్ట్రంలో ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల పేరుతో కొందరు అకాడమీల ముసుగులో కాలేజీలు నడుపుతున్నారు. కొన్ని కాలేజీ యాజమాన్యాలు అనుమతులు లేకుండా విద్యార్థులను జాయిన్‌ చేసుకుని.. పరీక్షా సమయాల్లో ఆందోళనకు గురిచేస్తున్నారు. అలాగే విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటివి అరికట్టడానికి టీ సర్కార్ ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇది అమలు జరిగితే ప్రైవేటు కాలేజీల ఖజానాకు గండిపడుతుందని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్‌ కళాశాలలు రెండు లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు పూర్తిచేశాయి. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా ముందస్తుగా యాజమాన్యం ఎంపిక చేసిన విద్యార్థులకు అడ్మిషన్లు వస్తాయా? రావా ?అనే ఆందోళన మొదలైంది. ఆన్‌లైన్‌ విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాల్సి వుంటుంది కాబట్టి కొన్ని ప్రైవేటు కార్పోరేట్ కాలేజీలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

06:35 - March 16, 2017

హైదరాబాద్ : మన మధ్య లేని వారిని స్మరించుకుంటూ.. ఉన్న వారిని గౌరవిస్తుండడమే సంస్కారానికి గీటురాయి అని రాజ్యసభ సభ్యులు, సీనినటులు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాల కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పురస్కార స్వీకర్త దాసరి నారాయణరావు ఆస్పత్రిలో ఉండడంతో ఆయన తరపున అల్లు అరవింద్‌, సారిపల్లి కొండలరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థను చిరంజీవి ప్రారంభించారు.

06:33 - March 16, 2017

అనంతపురం : 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ జనసేన అధినేత ప్రకటనతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోనున్నాయా..? పవన్‌ కల్యాణ్‌ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారనున్నాయా..? జనసేనాని అనంత పోటీపై 10 టీవీ ప్రత్యేక కథనం..! జనసేన అధినేత 2019 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంతపురం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు అనంతలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు రంగం కూడా సిద్ధం చేస్తోంది జనసేన.

యువతకు 60 శాతం సీట్లు..
తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాము.. యువతకు 60శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ మొదలైంది. జనసేన ఎన్నికల ప్రవేశంతో ఏపీ రాష్ట్రంలో త్రిముఖి పోటీ ఏర్పనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అనంత అర్బన్‌లో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడంతోనే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు సాగుతున్నాయి. పవన్ అనంత నుంచి పోటీచేస్తే ఆ ప్రభావం రాయలసీమ మొత్తం మీద ఉండే అవకాశాలున్నాయంటున్నారు ఆయన అభిమానులు. పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలపై గట్టిగా తన వాణి వినిపిస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నేతలకు పవన్ టెన్షన్ పట్టుకుంది. ఇక వివిధ పార్టీల సీనియర్ నేతలు జనసేనలో చేరతారన్నచర్చ కూడా మొదలైంది. పవన్ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారుతాయని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తమ్మీద పవన్ పోటీతో అనంత జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

06:30 - March 16, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అవసరానికి మించి అప్పులు చేస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీటుగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని.. భవిష్యత్‌లోనూ మరింత రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందన్న ఊహాగానాలకు కేసీఆర్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అప్పు పొందే అవకాశం ఉండి.. అప్పు తేలేకపోతే ప్రభుత్వ అసమర్ధతే అవుతుందన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎక్కువగా చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంపై.. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనమండలిలో సీఎం మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు తీసుకోవడంలో తప్పు లేదని స్పష్టం చేశారు కేసీఆర్‌.

27 నెలలు ఆగాల్సిందే..
అసెంబ్లీ ఎన్నికలకు మరో 27 నెలలు ఆగాల్సిందేనన్నారు కేసీఆర్‌. రాష్ట్రం ఏర్పడగానే సురక్షితంగా ఉంటుందనే ప్రజలు తమకు అధికారం అప్పగించారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి చాలావరకు తగ్గిందన్న కేసీఆర్‌.. తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు త్వరలోనే చట్టం తేబోతున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించామన్నారు కేసీఆర్‌. సమైక్య రాష్ట్రంలోని విద్యుత్‌ డిమాండ్‌ కంటే 300 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా వచ్చిందని.. దాన్ని కూడా సప్లై చేయగలిగామన్నారు. ఈ నెల రోజులు విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని.. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

కిషన్ రెడ్డి వర్సెస్ ఈటెల..
ఇక తెలంగాణ అప్పులపై అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య చర్చ జరిగింది. రాష్ట్రం బంగారు తెలంగాణ కాకుండా.. బాకీల తెలంగాణగా మారిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి ఈటల.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అప్పులు చేయాల్సిన అవసరముందన్నారు. అప్పులు చెల్లించే స్థాయిని బట్టే రాష్ట్రానికి బ్యాంకులు రుణం ఇస్తాయన్నారు ఈటల. మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసేందుకు వెనకాడేది లేదని పాలకులు స్పష్టం చేస్తున్నారు.

06:26 - March 16, 2017

విజయవాడ : రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 18వేల 214 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌లో మూడో విడత రుణమాఫీ కింద 3వేల 600కోట్లు ప్రతిపాదించారు. మొక్కజొన్న, మినుముల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయ్యాక... వ్యవసాయ బడ్జెట్‌ వివరాల్ని సభలో చదివి వినిపించారు ప్రత్తిపాటి . 18,214 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళికా వ్యయం 11వందల 70కోట్లు... ప్రణాళికేతర వ్యయం 4వేల 355కోట్లని మంత్రి తెలిపారు.. 2016-17లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 14శాతంగా ఉందని స్పష్టం చేశారు.

పొలం పిలుస్తోంది... చంద్రన్న రైతు క్షేత్రాలకు...
వ్యవసాయ బడ్జెట్‌లో పొలం పిలుస్తోంది... చంద్రన్న రైతు క్షేత్రాలకు 17కోట్లు... మత్స్యశాఖకు 2వందల 82కోట్లు... రైతులకు వడ్డీలేని రుణాలకోసం 172కోట్లు కేటాయించారు.. వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో మూల విత్తన ఉత్పత్తికి 220కోట్లు... ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 308కోట్లు... శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీకి 153కోట్లు కేటాయించారు.. సమగ్ర సాగునీటి, వ్యవసాయ రూపాంతరీకరణ ప్రాజెక్టుకు 1600కోట్లు కేటాయించామని మంత్రి ప్రకటించారు. మొక్కజొన్న, మినుములు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందన్నారు ప్రత్తిపాటి. వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

06:24 - March 16, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకోనుంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల టీడీపీ, బీజేపీ నేతలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరానికి వంద శాతం నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాలన్నీ విదేశీ రుణాల ప్రాజెక్టులకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం నేతల హర్షం..
ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా గతేడాది సెప్టెంబర్‌ 8న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. ప్యాకేజీకి చట్టబద్దతపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి అన్ని విధాలుగా సాయం చేసేందుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని... ఇకపై ప్రత్యేక హోదా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు కేంద్రమంత్రి సుజనాచౌదరి. ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలన్నింటిని ప్రత్యేక ప్యాకేజీ కింద ఇవ్వడానికి కేబినెట్ ఆమోదించిందని చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడు కేంద్రంతో రాజీ పడలేదన్నారు. కేంద్రంతో ఘర్షణ పడకుండా రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలన్నారు. మొత్తమ్మీద ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్యాకేజీకి చట్టబద్ధత – సుజనా..

ఢిల్లీ : ఏపీకి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి బుధవారం రాత్రి ఢిల్లీలో మీడియాకు తెలిపారు. స్పెషల్ స్టేటస్ లో వచ్చే అని ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఏపీకి వస్తాయని పేర్కొన్నారు.

అమరీంద్ సింగ్ నేడు ప్రమాణం..

పంజాబ్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ నేడు రాజ్‌భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు బీజేపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీల పాదయాత్ర..

హైదరాబాద్ : ధర్నా చౌక్ తరలింపునకు నిరసనగా నేడు ఇందిరాపార్కు నుండి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర చేయనున్నారు.

మరదిలిపై బావ దాడి..ఆపై ఆత్మహత్య..

జయశంకర్ భూపాలపల్లి : కారల్ మార్క్స్ కాలనీలో సింధు అనే యువతిపై బావ గణేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం భవనంపై నుండి కింద దూకి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నేటి నుండి భారత్ - ఆసీస్ మూడో టెస్టు..

జార్ఖండ్ : నేటి నుండి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకున్న కొహ్లీ అండ్‌ కో రాంచీ టెస్ట్‌తో సిరీస్‌పై పట్టుబిగించాలని పట్టుదలతో ఉంది.

 

ఏపీ అసెంబ్లీ ఎదుట ప్రివిలేజ్ కమిటీ రిపోర్టు..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ ఎదుట ప్రివిలేజ్ కమిటీ రిపోర్టు గురువారం రానుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై స్పీకర్ కు కమిటీ నివేదిక సమర్పించనుంది.

గురువారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. తమ వేతన పెంపుపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని పేర్కొంటూ వివిధ శాఖలకు చెందిన కేంద్ర ఉద్యోగులు గురువారం ఒకరోజు సమ్మె చేపట్టనున్నారు.

 

Don't Miss