Activities calendar

17 March 2017

కేంద్ర తీరుపై పవన్ విమర్శలు,

విజయవాడ : మరోసారి ట్విట్టర్‌ వేదికగా కేంద్రంతీరుపై మరోసారి విమర్శలు చేశారు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్.. యూపీ లో రుణమాఫీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీపై స్పందించారు.. రుణమాఫీపై తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.. రైతు ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగాఉన్నాయని గుర్తుచేశారు.. యూపీలో మాత్రమే రుణమాఫీని కేంద్రం ఇస్తామనడం సరికాదని సూచించారు..అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని కోరారు.. ఒక్క ప్రాంతానికే పరిమితమైతే ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయని హెచ్చరించారు..

భువనగిరిలో 'పాదయాత్ర’కు బ్రహ్మరథం..

యాదాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 4వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్న పాదయాత్ర..ప్రస్తుతం 153వ రోజు యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది.

కోమటిరెడ్డి..హరీష్ వాగ్వాదం..

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో మారోసారి ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కోమటిరెడ్డి, మంత్రి హరీష్ రావులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్..

నెల్లూరు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. నెల్లూలో జిల్లాలో రికార్డు స్థాయిలో 99శాతం పోలింగ్‌ నమోదైంది. కర్నూలులో 48.62 శాతం పోలింగ్,  కడప జిల్లాలో 99 శాతం పోలింగ్ నమోదైంది.

మమతకు షాక్..

ముంబై : నారదా స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించి మమతా బెనర్జీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నారదా స్టింగ్‌ ఆపరేషన్‌పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.

గొల్ల, కుర్మ సోదరులకు గొర్రెలు - కేసీఆర్..

హైదరాబాద్ : గొల్ల, కుర్మ సోదరులకు 75శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ పథకానికి తెలంగాణ ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూరుస్తుందని... సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు..

20:42 - March 17, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర హుషారుగా సాగుతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా 9వ తేదీ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు మహాజన పాదయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. పాదయాత్రకు వివిధ పార్టీ పక్షాల నేతలు మద్దతు తెలియచేస్తున్నారు. పాదయాత్రలో 'మల్లన్న' పాల్గొని నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మిగతా విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

20:38 - March 17, 2017

నిజామాబాద్ : ప్రశాంతంగా ఉండే పల్లె.. పేళుల్లుతో దద్దరిల్లుతోంది. భారీ శబ్దాలతోనే గ్రామ ప్రజలకు తెల్లారుతోంది.. ఎప్పుడూ..ఏమవుతుందోననే భయాందోళన వెంటాడుతోంది. ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా రాతికొండను తవ్వేందుకు చేస్తున్న బ్లాస్టింగ్‌లు మంచెప్ప గ్రామ ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మిగతా విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

20:33 - March 17, 2017

హైదరాబాద్ : అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వడగళ్ల వానలతో కడగండ్లపాలు అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పొలాల్లోనే తడిసి సర్వనాశనం కావడంతో దిగాలుపడ్డారు. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరేమార్గంలేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో పెకలించుకుని నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వేలాది ఎకరాల్లో పంటలు సర్వనాశనమయ్యాయి.

మామిడితోటలకు భారీ నష్టం..
ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షానికి పూర్తిగా తడిచిపోయింది. మామిడి తోటలకు భారీ నష్టం వాటల్లింది. కాయలన్నీ రాలిపోవడంతో అన్నదాతలు దిగులుతో కుంగిపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన వర్షాలకు ఈసారి మావిడి భారీ దిగుబడి వస్తోందన్న ఆనందంతో ఉన్న రైతుల ఆశలు అకాల వర్షాలతో ఆవిరయ్యాయి. మార్కెట్‌ యార్డులకు తెచ్చిన కందులు, మక్కలు, జొన్నలు పూర్తిగా తడిచిపోవడంతో చేతికి అందిన పంట నోటికి అందలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్‌-కాగజ్‌నగర్‌లో విద్యుత్‌ తీగలు తెగిపడంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

మంచిర్యాల..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఉపరితల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్‌ జిల్లా ముథోల్‌, తానూరు, తాండూరు మండలాల్లో మామిడి, కంది, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కోతకు వస్తున్న దశలో కాయలు రాలిపోవడంతో జరిగిన నష్టాన్ని తలచుకుని రైతులు దిగులుపడుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాలను వడగళ్ల వాన ముంచెత్తింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ధర్మపురి, మేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో కూడా కొద్దిపాటి వర్షం కపడింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్పువాడ ప్రాంతంలో వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుతాఘాతానికి 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వరావుపేట ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షం పడటంతో మిర్చి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీవృక్షం కూలి ద్విచక్రవాహనంపై పడటంతో, అది పూర్తిగా ధ్వంసమైంది. పాల్వంచ, దమ్మపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

మహబూబ్ నగర్..
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో భారీ వర్షానికి పంటలు పూర్తిగా నాశమయ్యాయి. ఈ ప్రాంతంలో 10 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మిర్చిపంట సర్వనాశనమైంది. వేసవి తీవ్రత పెరగకముందే ఉములు, పిడగులు, వడగళ్లు, ఈదురుగాలలతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఉత్తర కర్నాటక, మహారాష్ట్రలోని మరాట్వాడ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. లక్షద్వీప్‌ నుంచి మహారాష్ట్రలోని విదర్భ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

20:27 - March 17, 2017
20:24 - March 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థులు... నేడు భవిష్యత్తుపై బెంగతో తల్లడిల్లుతున్నారు. ఉద్యమవేళ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం... చదువులనూ పక్కన పెట్టి పోరాడిన ఫలితంగా వారు ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం ఉదాసీనంగా ఉండిపోయింది. దీంతో, నాడు ఉద్యమించిన విద్యార్థులు, ఉద్యోగం పొందేందుకు ఈ కేసులే ప్రధాన అవరోధంగా మారనున్నాయి. 33 నెలలైనా కేసులు తొలగకపోవడంతో, గ్రూప్స్‌, ఎస్‌ఐ పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఎస్‌బీ రిపోర్టు గురించి కలవరపడుతున్నారు. అసలే నిరుద్యోగం.. ఆపై పోలీసు కేసులు.. భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో పోటీ పరీక్షల అభ్యర్థులు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, నేడు ప్రభుత్వోద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరిలోనూ కేసుల బెంగే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 33 నెలలు పూర్తి అయినా.. విద్యార్ధుల్లో కేసుల టెన్షన్ పోలేదు. ఎప్పుడు ఏ కోర్టు నుంచి నోటీసులు వస్తాయో తెలియక భయం భయంగా కాలం గడుపుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్ రాసిన వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఉద్యోగం వస్తే ఎస్.బి. రిపోర్టు ఏం వస్తుందోనని వీరంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యార్థులందరిపైనా కేసులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విద్యార్థులు వాపోతున్నారు.

కేసులతో సతమతం..
తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఇప్పటికీ నాటి కేసులతో సతమతమవుతున్నారు. రద్దయిన కేసులు కూడా వీరిని వేధిస్తున్నాయి. ప్రైవేటు కేసులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి మరీ దారుణం. ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా అని కోర్టు వాయిదాలకు హాజరు కాని విద్యార్థులపై ఇప్పుడు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో కష్టపడి చదివి రాసిన పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశ ఆవిరవుతోంది. పోలీసు వెరిఫికేషన్‌లో తమ బతుకు బండలైపోతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం విద్యార్థులపై, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పోలీసులపై తిరుగుబాటు తదితర నేరాల కింద మొత్తం 3 వేల 152 కేసులు నమోదు చేసింది. తెలంగాణ రాక ముందే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ తీవ్రత ఉన్న కేసులను ఎత్తి వేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి కేసుకూ ఒక్కోజీవో జారీ చేసి 698కేసులను రద్దు చేసింది. అయితే రద్దయినవన్నీ ఓయూ పరిధిలోని కేసులే. ఆరోజుల్లో చిలకలగూడ, ముషీరాబాద్‌ లాంటి చోట్ల ఆస్తుల ధ్వంసం కేసులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. అదనపు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు అలాగే ఉన్నాయి. వీటిని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులున్నాయంటూ ప్రభుత్వం అంటోంది.

తస్మాత్ జాగ్రత్త..
ఉద్యమ సమయంలో ఇళ్లముట్టడి, కార్యాలయాలపై దాడి వంటి కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన కేసుల్లో, సదరు బస్సులు కాంట్రాక్టు మేరకు ఆర్టీసీకి అప్పగించిన ప్రైవేటు వ్యక్తులవి కావడంతో, ఇవి ప్రైవేటు కేసులుగా నమోదయ్యాయి. దీంతో ఈ అన్ని కేసుల్లో, ప్రైవేటు వ్యక్తులతో రాజీ కుదుర్చుకోవడం తప్ప మరో దారి లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసుల కారణంగా, వికారాబాద్‌కు చెందిన అధికారపార్టీ నేత ఒకరు, హనీమూన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తే వీసా రాలేదని భోగట్టా. అదే తరహాలో పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకూ ఈ కేసులు అవరోధం కావచ్చన్న భావనా వ్యక్తమవుతోంది. అందుకే, కేసు కొట్టేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని కోర్టుకు సమర్పించి, కేసులు కొట్టివేయించుకుంటేనే, మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. సో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులూ.. తస్మాత్‌ జాగ్రత్త.

20:17 - March 17, 2017

విజయవాడ : మరోసారి ట్విట్టర్‌ వేదికగా కేంద్రంతీరుపై మరోసారి విమర్శలు చేశారు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్.. యూపీ లో రుణమాఫీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీపై స్పందించారు.. రుణమాఫీపై తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.. రైతు ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగాఉన్నాయని గుర్తుచేశారు.. యూపీలో మాత్రమే రుణమాఫీని కేంద్రం ఇస్తామనడం సరికాదని సూచించారు..అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని కోరారు.. ఒక్క ప్రాంతానికే పరిమితమైతే ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయని హెచ్చరించారు.. రుణమాఫీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలను విస్మరించడం మంచిదికాదని పవన్‌ అభిప్రాయపడ్డారు.

20:12 - March 17, 2017
20:09 - March 17, 2017

విజయవాడ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం.. ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం పడడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. గాలుల దెబ్బకు పోలీసుల టెంట్లు ఎగిరిపోయాయి. అమరావతిలో వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రారంభోత్సవంలో ఉన్నంతా హడావిడి.. సదుపాయాలు కల్పించడంలో కన్పించడంలేదు. దీంతో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే కురిసిన వర్షానికి నేతలు, అధికారులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు.

అసెంబ్లీ..చిత్తడి..
భారీ వర్షం కురవడం అసెంబ్లీ చుట్టుపక్కల అంతా వ్యవసాయభూమి కావడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. పోలీసుల కోసం ఏర్పాటుచేసిన టెంట్లు గాలికి ఎగిరిపోవడంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం దెబ్బకు ప్రాంగణమంతా చిత్తడిగా మారడంతో వావానాలన్ని నేలలో కూరుకుపోయాయి. వాహనాలను చిత్తడి నేల నుంచి బయటకు తీసుకురావాడానికి అటు నేతలు, ఇటు అధికారులు నరకయాతన పడ్డారు. మొదటి నుంచి అందరు చెబుతున్నట్లు వర్షం పడితే అసెంబ్లీ, సచివాలయ పరిసరాలు ఎంత దుర్భరంగా ఉంటాయో రుజువైంది.

20:06 - March 17, 2017

హైదరాబాద్ : పార్టీ ప్రక్షాళనకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. ఫోటోలకు ఫోజులిస్తూ కాలం గడిపేసే వారిని వదిలించుకోడానికి రంగం సిద్ధమైంది. ప్రజా సమస్యలపై అలుపెరగకుండా పోరాడే నాయకత్వాన్ని సపోర్టు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికల నాటికి అధికార పార్టీకి ధీటుగా తమ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు వైసీపీ కార్యాచరణను రెడీ చేసింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేయడానికి వైసీపీ అధినాయకత్వం కార్యచరణకు పూనుకుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని జగన్‌ భావిస్తున్నారు. దీనికోసం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ పరిశీలకుడిగా నియమించి.. ప్రజాసమస్యలపై ఉద్యమాలకు సిద్ధం చేయిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైసీపీ చాలా బలంగా ఉండేదీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో బలమైన నాయకత్వం ఉండేది. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, సబ్బంహరి లాంటి బలమైన నేతలు ఒక్కక్కరుగా పార్టీని వీడారు. వీరితోపాటు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో .. పార్టీ టోటల్‌గా ఉత్తరాంధ్రలో డీలాపడింది.

ఉత్సాహం నింపుతున్న విజయసాయిరెడ్డి..
ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ చేరికతో వైసీపీలో కొంత ఉత్సాహం కనిపించింది. అయితే బొత్స చేరిక పట్ల గుర్రుగా ఉన్న విజయనగరం జిల్లాపార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామీ వైసీపీని వీడారు. పార్టీకి బలమైన క్యాడర్‌ ఉన్నా.. సరైన నాయత్వం లేక గతంలో విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన విజయమ్మ ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాలన్నీ గమనించిన వైసీపీ అధిష్టానం.. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసేందుకు .. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ప్రత్యేక పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించారు. నెలకోసారి జిల్లాల్లో పర్యటిస్తూ.. కిందిస్థాయి నాయకత్వంలో ఉత్సాహం నింపుతున్నారు విజయసాయిరెడ్డి.

ఫొటోలకు ఫోజులిస్తారా ?
విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమర్‌నాథ్‌రెడ్డి కొన్ని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా దిశానిర్దేశం లేక నిస్తేజంగా ఉండిపోయారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో పార్టీ కమిటీల ఏర్పాటులో జిల్లా నాయకత్వం అసలత్వం ప్రదర్శిస్తుందన్న అలోచనలో అధిష్టానం ఉంది. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సభ్యత్వ నమోదు ఇప్పటికీ కేవలం 40 శాతం మాత్రమే పూర్తవడంతో .. జిల్లాపార్టీ నేతలపై విజయసాయిరెడ్డి సీరియస్‌ అయ్యారు. కేవలం ఫోటోలకు ఫోజులిస్తూ.. మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితం అయ్యేవారిపై వేటువేస్తామని విజయసాయి హెచ్చరించారు.

విశాఖకు రైల్వే జోన్..
అటు విశాఖకు రైల్వేజోన్‌ అంశంపై జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి అత్మగౌరవ యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికోసం ఈ నెల 21వ తేదీ నుంచి విశాఖ జిల్లా భీమిలి నుంచి తగరపు వలస వరకూ పాదయాత్రకు కూడా ఆయన రెడీ అవుతున్నారు. దీనికోసం జిల్లానాయకులందరూ సమన్వయంగా ఉద్యమించాలని విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీ పనులంటే మొక్కుబడిగా భావించే వారిపై వేటు వేసి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పార్టికి పూర్వవైభవం తీసుకొస్తామంటోంది వైసీపీ అధినాయకత్వం.

20:01 - March 17, 2017
19:58 - March 17, 2017

హైదరాబాద్ : పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది... అన్ని వర్గాల ప్రజలను కదిలించింది..పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది. సీపీఎం చేపట్టిన మ‌హాజన పాదయాత్ర ఐదు నెలల క్రితం ఇబ్రహింపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగసభతో ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగింది. 19న హైదరబాద్‌లో జరిగే బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగియనుంది. ఈ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గోనున్నారు. కాగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ మహాబూబ్‌నగర్‌లో మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రంజెటేటివ్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మహాజన పాదయాత్ర సభ్యులు పర్యటించారు. ప్రతి గ్రామానికి వెళ్లి అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలియజేశారు. అలాగే ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసింది. గ్రామీణ స్థాయిలో ఉండే అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. వివిధ రంగాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి లేఖలు రాశారు.

పాలమూరులో..
అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వందల గ్రామాల్లో పాదయాత్ర సభ్యులు పర్యటించారు. అక్కడున్న సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదని.. రైతులు అనేక సమస్యలన ఎదుర్కొంటున్నారని, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వలేదని జిల్లా వాసులు పాదయాత్ర బృందం సభ్యులకు తెలియజేశారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని పాదయాత్ర సభ్యులు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్ట్‌లలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర విజయోత్సవ సభకు ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి దాదాపు పదివేల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. జిల్లాలో వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు ముగింపు సభలో పాల్గొంటున్నారు.

19:55 - March 17, 2017

యాదాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 4వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్న పాదయాత్ర..ప్రస్తుతం 153వ రోజు యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని యూసఫ్‌నగర్‌, హన్మాన్‌వాడ, భువనగిరి, స్పిన్నింగ్‌ మిల్‌, పగిడిపల్లి, గూడూరు స్టేజీ, బీబీనగర్‌, నిమ్స్‌ ఆసుపత్రి, కొండమడుగు స్టేజీలో పాదయాత్ర కొనసాగనుంది. కేపాల్‌ వద్ద మేడ్చల్‌ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. భువనగిరి దగ్గర ఏర్పాటు చేసిన సభకు టిడిపి, కాంగ్రెస్‌ నేతలు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే జరుగుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

19:47 - March 17, 2017
19:43 - March 17, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో లంచావతారం మరోసారి బయటపడింది.. ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి ఘటన మరువకముందే గాంధీ ఆస్పత్రిలో మరో దారుణం బయటకొచ్చింది. పెద్ద ఆస్పత్రి అంటూ సర్కారు దవాఖానాకువచ్చినందుకు ఓ రోగికి అక్కడి సిబ్బంది నరకం చూపారు. బేగంపేట్‌కుచెందిన రాజుకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి. అతన్ని ఆస్పత్రి గదిలోకి తీసుకువెళ్లేందుకు బంధువులు వీల్‌ చెయిర్‌ అడిగారు. అసలే శరీరం సహకరించక నరకయాతన పడుతున్న అతను వంద రూపాయలు ఎక్కడినుంచి తెచ్చేదంటూ సిబ్బందికి సమాధానమిచ్చాడు. చివరకు చిన్న పిల్లలు ఆడుకునే కారు బొమ్మపై రోగిని ఆస్పత్రిలోకి తీసుకువచ్చారు.

19:40 - March 17, 2017

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో మారోసారి ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నల్గొండ జిల్లాకు లక్ష ఎకరాలకు సాగునీరు, త్రాగునీరందించే ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు కోమటిరెడ్డిపై ప్రతివిమర్శలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూమిని ప్రభుత్వం సేకరిస్తుంటే..కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం భూ సేకరణకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు.

 

19:37 - March 17, 2017

నెల్లూరు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. జిల్లాలో రికార్డు స్థాయిలో 99శాతం పోలింగ్‌ నమోదైంది... 852మంది ఓటర్లకుగాను 851మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరులో వందశాతం పోలింగ్‌ నమోదైంది. కడప జిల్లాలో కూడా పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 99 శాతం పోలింగ్ నమోదైంది. కర్నూలులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రశాంతంగా జరిగిన పోలింగ్ లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 48.62 శాతం పోలింగ్ నమోదైంది.

19:32 - March 17, 2017

ఢిల్లీ : గోవాలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ చర్చకు పట్టుబట్టింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీకి కాకుండా బిజెపిని అనుమతించలేమని స్వయంగా గవర్నర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాన్ని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ గుర్తు చేశారు. అలాంటిది కేంద్ర మంత్రికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ ఎలా అనుమతిస్తారని ఆజాద్‌ ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ కోరగా... ముందు నోటీస్‌ ఇవ్వాలని అనంతరం నిర్ణయం తీసుకుంటామని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ అన్నారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు నిరసనకు దిగడంతో గందరగోళం మధ్య సభను కురియన్ 12 గంటలకు వాయిదా వేశారు.

19:30 - March 17, 2017

ముంబై : నారదా స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించి మమతా బెనర్జీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నారదా స్టింగ్‌ ఆపరేషన్‌పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. పోలీసులు ప్రభుత్వానికి కీలుబొమ్మలుగా మారారని విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తప్పనిసరని సూచించింది. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారదా న్యూస్‌ పోర్టల్‌ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో 11 మంది తృణమూల్‌ నేతలు డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. ఇందులో కాబినెట్‌ మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు.

19:27 - March 17, 2017
19:22 - March 17, 2017

హైదరాబాద్ : గొల్ల, కుర్మ సోదరులకు 75శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ పథకానికి తెలంగాణ ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూరుస్తుందని... సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.. ఈ స్కీంకు కేంద్రంనుంచి అణాపైసాకూడా తీసుకోవడంలేదని చెప్పారు.. అలాగే కరెంటు సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్‌ అయిందని... TRS ప్రభుత్వం సూపర్‌ సక్సెస్‌ అయిందని అసెంబ్లీలో తెలిపారు.. రాష్ట్రానికి సింగరేణి ప్రాజెక్టు రావడానికి తాను చాలా కృషి చేశానని సభలో వివరించారు..

19:18 - March 17, 2017

హైదరాబాద్ : గొర్రెల విషయంలో సీఎం కేసీఆర్ వరాలు కురిపించడం లంబాడా..కోయ పశు పోషణ చేస్తుంటారని, వీరికి కూడా న్యాయం చేయాలని కోరారు. కమ్యూనిస్టు సిద్ధాంతం పనికి రాదని చెప్పడం కరెక్టు కాదని, గొప్ప సిద్ధాంతం అని పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం గొప్పదని వ్యాఖ్యానించారు. లెనిన్..మావో చెప్పింది అమలు చేయడం లేకపోవడం కారణంగా కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

విశాఖ : నగరంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విశాఖ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ముమ్మన రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. 20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

రెవెన్యూ ఆదాయం తగ్గిన మాట వాస్తవం : మంత్రి ఈటెల

హైదరాబాద్ : 2015...16 సంవత్సరంలో రెవెన్యూ సర్ ప్లస్ స్టేట్ గా అవతరించిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. భూ విక్రయాల్లో 2015..16 లో రెవెన్యూ ఆదాయం తగ్గిన మాట వాస్తవమేనని నోట్ల రద్దు తర్వాత కూడా తొలి 3 నెలల్లో రెవెన్యూ తగ్గినా ఆ తర్వాత పుంజుకుందని పేర్కొన్నారు. 2015...16లో రూ.97,923 కోట్లు ఖర్చు చేశామని, 19.33 శాతం గ్రోత్ సాధించామని పేర్కొన్నారు.

14:01 - March 17, 2017
14:00 - March 17, 2017

హైదరాబాద్ : 2015...16 సంవత్సరంలో రెవెన్యూ సర్ ప్లస్ స్టేట్ గా అవతరించిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. భూ విక్రయాల్లో 2015..16 లో రెవెన్యూ ఆదాయం తగ్గిన మాట వాస్తవమేనని నోట్ల రద్దు తర్వాత కూడా తొలి 3 నెలల్లో రెవెన్యూ తగ్గినా ఆ తర్వాత పుంజుకుందని పేర్కొన్నారు. 2015...16లో రూ.97,923 కోట్లు ఖర్చు చేశామని, 19.33 శాతం గ్రోత్ సాధించామని పేర్కొన్నారు.

 

13:48 - March 17, 2017

యాదాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 4వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్న పాదయాత్ర..ప్రస్తుతం 153వ రోజు యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని యూసఫ్‌నగర్‌, హన్మాన్‌వాడ, భువనగిరి, స్పిన్నింగ్‌ మిల్‌, పగిడిపల్లి, గూడూరు స్టేజీ, బీబీనగర్‌, నిమ్స్‌ ఆసుపత్రి, కొండమడుగు స్టేజీలో పాదయాత్ర కొనసాగనుంది. కేపాల్‌ వద్ద మేడ్చల్‌ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. భువనగిరి దగ్గర ఏర్పాటు చేసిన సభకు టిడిపి, కాంగ్రెస్‌ నేతలు మద్దతు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

 

13:40 - March 17, 2017

విశాఖ : నగరంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విశాఖ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ముమ్మన రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. 20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 1990లో 1450 రూపాయల జీతంతో రాజేశ్వరరావు ఉద్యోగంలో చేరారు. 2012 నుంచి 2016 వరకు నాలుగేళ్ల కాలంలో అత్యధికంగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించామని ఏసీబీ అధకారులు చెబుతున్నారు.  

 

13:36 - March 17, 2017
13:34 - March 17, 2017

మహిళా వార్తల సమహారం మానవి న్యూస్. అక్రమ పద్ధతుల్లో త్రిబుల్ తలాక్, కుటుంబ నియంత్రణ... గర్భ నిరోధక ఇంజెక్షన్ లు... త్రీవ దుష్పరిణామాలు, ప్రముఖ రచయిత్రి వకుళాభరణం లలిత మృతి, ప్రధాని మోడీని అభినందించిన పాకిస్తాన్ 11 ఏళ్ల బాలిక, పోరాడి ఓడిన పివి.సింధు, సైనా నెహ్వాల్, పోరాడి ఓడిన సానియామీర్జా.. వంటి అంశాలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:24 - March 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నోట్ల రద్దు అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రసంగించారు. నోట్ల రద్దు వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర జీడీపీలో 2.5 ఆదాయం తగ్గిందని రిపోర్టులు చెబుతున్నాయని తెలిపారు. 

 

12:49 - March 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ  కేసులు పెరుగుతోండంపై అసెంబ్లీలో ఆందోళన వ్యక్తమైంది. స్వైన్ ఫ్లూతో  ఇంతవరకు రాష్ట్రంలో 16 మంది చపోయిన విషయాన్ని కాంగ్రెస్‌ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై సభలో చర్చ జరిగింది. జంటనగరాల్లో స్వైన్‌ ఫ్లూ మరణాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి ఆందోళన చెందారు. స్వైన్‌ ఫ్లూ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు భయపెడుతున్నాయని చిన్నారెడ్డి చెప్పారు. స్వైన్‌ ఫ్లూ రోగులు చివరిదశలో ఆస్పత్రులకు వస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి  పేర్కొన్నారు.

12:46 - March 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రెండు, మూడు నమూనాలు పరిశీలనలో ఉన్నాయని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ సభ దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత కొత్త పాసు పుస్తకాలు జారీ చేయడంతోపాటు, వీటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని సభ దృష్టికి తెచ్చారు. ఏపీ పేరు మీద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను తెలంగాణ పేరు మీద మార్పు చేస్తామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి అన్నారు. పటిష్టంగా ఉండేలా కొత్త పాసు పుస్తకాలు జారీ చేయాలని కోరారు. కొత్త పాసు పుస్తకాల జారీ నిలిపివేతతో భూముల అమ్మకాలు ఆగిపోయాయని తెలిపారు. 

12:40 - March 17, 2017
12:33 - March 17, 2017

కరీంనగర్ : అప్పు దొరక్క...కూతురి పెళ్లి చేయలేక..మనోవేదనతో ఉరితాడుకు వేలాడిన ఓ గీతకార్మీకుడి కుటుంబానికి అండగా నిలిచారు పోలీసులు.. ఖాకీలంటే కాఠిన్యమే కాదు...కారుణ్యం కూడా చూపిస్తారని నిరూపించారు...ఆగిపోయిన పెళ్లికి పెద్దలయిన పోలీసులు అంగరంగ వైభవంగా అనూష పెళ్లి చేశారు... ప్రతీ ఒక్కరి మన్ననలు అందుకున్నారు. చనిపోయిన ఓ పెద్దాయన స్వప్నం నెరవేరింది.. తండ్రి హనుమాండ్లు ఆత్మ శాంతించింది... ఓ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టిన పోలీసులు.. ఆగిపోయిన పెళ్లికి పెద్దలయిన కాప్స్...అంగరంగ వైభవంగా అనూష పెళ్లి...
గీత కార్మీకుడి బిడ్డ పెళ్లి చేసిన పోలీసులు...             
కూతురి పెళ్లి చేయలేనేమోనని...చేతికి డబ్బు అందక మనస్తాపంతో ఉరితాడుకు వేలాడిన ఓ గీత కార్మీకుడి బిడ్డ పెళ్లి చేశారు పోలీసులు... ఆత్మహత్య చేసుకున్న హనుమాండ్లు కేసులో విచారణ జరిపిన పోలీసులకు తెలిసిన వాస్తవాలు వారిని కదిలించాయి.. ఈ నెల 13న జరగాల్సిన అనూష వివాహం ఆగిపోయిన సంగతి తెలిసి చలించిన పోలీసులే ఆ అమ్మాయికి అన్నలయ్యారు... యావత్ పోలీసులంతా కదిలివచ్చి అనూష పెళ్లి జరిపించి నిండు మనస్సుతో ఆశీర్వదించారు...
అత్తారింటికి సాగనంపి చూపించిన మానవత్వం..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిరుమల పూర్ గ్రామంలో ఈ నెల తొమ్మిదిన కల్లుగీత కార్మీకుడు హనుమాండ్లు ఆత్మహత్య చేసుకున్నాడు... సరిగ్గా మరికొన్ని రోజుల్లోనే చిన్న కూతురు అనూష పెళ్లి చేయాల్సి ఉంది..అన్ని ఏర్పాట్లు చేసుకున్న హనుమాండ్లకు డబ్బు చేతికి అందకపోవడంతో పాటు ఎన్నో కష్టాల్లో ఉండడంతో ఇక తన పరువు పోతుందని మనస్తాపంతో బలవన్మరణం చెందాడు..ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు వాస్తవాలు తెలుసుకుని ..ఆ కుటుంబం ఉన్న కష్టాలను గుర్తించారు.. మానవతాదృక్పదం చూపిస్తూ అనూష పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఈ నెల 13న జరగాల్సి ఉండగా నేడు ఘనంగా జరిపించారు...
అత్తారింటికి పంపేవరకు అన్నీ తామై...
రామడుగు ఎస్సై నరేష్ రెడ్డి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అనూష పెళ్లి చేయాలన్న ఆయన ఆలోచనలను అభినందించారు..ఆ వెంటనే అందరూ అధికారులు ముందుండి నడిపించారు..పెళ్లికి పెద్దలయ్యారు...పెళ్లికి కావాల్సిన షామియానాల నుండి అమ్మాయిని అత్తగారింటికి పంపే తంతు వరకు అంతా తామై నడిపించారు పోలీసులు. పెళ్లికి వచ్చే అతిదులను కూడా ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఇంటి పెళ్లిలా చేసి ప్రతీ ఒక్కరి అభినందనలు అందుకున్నారు...లక్షల యాబై వేల రూపాయలను అందిన సాయంతో అనూష పేరున పోలీసులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేయగా మరికొందరు దాతలు ఆమె పేరున నగదు అందించారు...అంతే కాదు అనుషను పెళ్లి చేసుకున్న యువకుడికి..ఇటు అనుషకు ఉద్యోగం కల్పించే భాద్యత కూడా పోలీసులే తీసుకున్నారు.. పోలీసులు ఏకం చేసిన ఈ జంట  దాంపత్య జీవితం కలకాలం వర్దిల్లాలని ప్రతీ ఒక్కరం కోరుకుందాం.

 

12:24 - March 17, 2017

ఖమ్మం : ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే.. ఆసుపత్రిలో రోగి పక్కన ఉండే వారే లేరు.. ఆ గ్రామంలో డెంగ్యూ మరోసారి పంజా విసిరింది. గ్రామంలో 750మంది జనాభా ఉంటే 450మందికి జ్వరం సోకింది. అధికారికంగా 35 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని పరిస్థితిపై 10టీవీ ప్రత్యేక కథనం. 
డెంగ్యూతో వణికిపోతోన్న బుచ్చిరెడ్డి పాలెం 
ఖమ్మం జిల్లాలోని మధిర మండలం బుచ్చిరెడ్డి పాలెం డెంగ్యూతో వణికిపోతోంది. గ్రామంలో మెత్తం 750 మంది జనాభా ఉండగా అందులో సగం పైగా జనాభా డెంగ్యూ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పైన ఖర్చు
ఖమ్మం, మధిర ప్రభుత్వాస్పత్రిలో సరైన వసతులు లేక విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్‌లో గ్రామస్తులు వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పైన ఖర్చుఅయ్యాయి. అయినా కానీ వైద్యం తగ్గడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.  
డెంగ్యూను రూపుమాపటానికి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు : గ్రామస్తులు 
వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శలు తప్పా డెంగ్యూను రూపుమాపటానికి ప్రత్యేక చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బోనకల్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ను 100పడకల ఆసుపత్రిగా ఆప్ గ్రేడ్ చేస్తానని చెప్పి 3నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదు.  
గ్రామస్తుల భయాందోళన    
పక్కనే ఉన్నా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో డెంగ్యూ బారిన పడి 28 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే బుచ్చిరెడ్డి పాలెంలో డెంగ్యూ విజృభిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక్కరు మృత్యువాత పడ్డారు. గ్రామంలోని వైద్యుల దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే అందరికీ ఒకే రకమైన మందులు ఇస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కనీసం తర్వాత తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా కూడా తీయడం లేదని వాపోతున్నారు. 
బుచ్చిరెడ్డి పాలెంలో తాగే నీటిలో ఫ్లోరైడ్
బుచ్చిరెడ్డి పాలెంలో తాగే నీటిలో ఫ్లోరైడ్ ఉందని సంవత్సరం క్రితమే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తేల్చారు. సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తి  స్థాయిలో విఫలమయ్యారు. డెంగ్యూ వ్యాధికి ఫ్లోరైడ్ వాటర్ సమస్యే కారణం అని వైద్యాధికారులు చెబుతున్నారు. 
బ్లీచింగ్ చల్లి చేతులు దులుపుకుంటున్న వై.ఆరోగ్యశాఖ అధికారులు  
వైద్యారాగ్యాశాఖాదికారులు మాత్రం గ్రామాన్ని సందర్శించి, బ్లీచింగ్ చల్లి చేతులు దులుపుకుంటున్నారే తప్ప మెడికల్ క్యాంపు మాత్రం ఏర్పాటు చేయడంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తమను మృత్యువు నుంచి కాపాడాలని విజ్ఞప్తిచేస్తున్నారు. 

 

12:16 - March 17, 2017

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో లక్ష ఎకరాలను సాగునీరు అందించే ఉదయసముద్రం ఎత్తిపోత పథకం నిర్మాణాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందన్న కాంగ్రెస్‌ సభ్యుల ఆరోపణలపై అసెంబ్లీతో తీవ్ర రగడ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేవనెత్తి ఈ అంశంపై అధికార, ప్రతిపక్షల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తే భూములు ఇప్పిస్తామని చెప్పారు. కోర్టు కేసులతో కాంగ్రెస్‌ ప్రాజెక్టులను అడ్డుకుంటుందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటే ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అవుతాయని చెప్పారు.

 

12:11 - March 17, 2017

కడప : కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కడప,జమ్మలమడుగు,రాజంపేటలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తమ శిబిరాల నుంచి ఇరు పార్టీల ఓటర్లు బస్సులలో పోలింగ్ కేంద్రాలకు నేరుగా చేరుకున్నారు. ఓటర్లను క్షుణ్ణంగా తనీఖీ చేసిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి పంపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల ఓటర్లు తమ నాయకుల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కడపలో కొనసాగుతున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

 

12:00 - March 17, 2017

కడప : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కడప,జమ్మలమడుగు,రాజంపేటలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తమ శిబిరాల నుంచి ఇరు పార్టీల ఓటర్లు బస్సులలో పోలింగ్ కేంద్రాలకు నేరుగా చేరుకున్నారు. ఓటర్లను క్షుణ్ణంగా తనీఖీ చేసిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి పంపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల ఓటర్లు తమ నాయకుల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కడపలో కొనసాగుతున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

 

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ మధ్యాహ్నం వాయిదా పడింది. గోవా, మణిపూర్ ప్రభుత్వాల ఏర్పాటుపై అంశంపై చర్చ జరిగింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోలం నెలకొంది. ఈనేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

11:49 - March 17, 2017

ఢిల్లీ : రాజ్యసభలో గందరగోళం నెలకొంది. గోవా, మణిపూర్ ప్రభుత్వాల ఏర్పాటుపై అంశంపై చర్చ జరిగింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

టీ.అసెంబ్లీ సమావేశాలకు 15 నిమిషాలు టీ బ్రేక్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ 15 నిమిషాలు టీ బ్రేక్ ప్రకటించారు. బ్రేక్ అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

11:37 - March 17, 2017
11:31 - March 17, 2017

కర్నూలు : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆర్టీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. 

 

11:20 - March 17, 2017

నెల్లూరు : జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఓట్లు వేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు బారులు తీరారు. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది.

 

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష జరుగనుంది.
 

ద్వారకాలోని హోటల్ లో అగ్నిప్రమాదం

గుజరాత్ : ద్వారకాలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ లో బస చేసిన ధోనీ సహా జార్ఖండ్ క్రీడాకారులంతా క్షేమంగా ఉన్నారు.

 

10:53 - March 17, 2017

ఢిల్లీ : టీమ్‌కు వైస్ కెప్టెన్ కాదు కెప్టెన్ కావాలంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ ఫ‌లితాల త‌ర్వాత హస్తం నేతలు స్వరం పెంచారు. ఇప్పుడు పార్టీలో కామ‌రాజ్ ప్లాన్ 2ను అమ‌లు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇంత‌కి ఏమిటీ కామ‌రాజ్ ప్లాన్ .. ?
2014 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ డీలా
కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌ల్గిన పార్టీ. దేశంలోనే అతి పెద్ద పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు అనేక ఒడిదుడుకుల‌కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత పూర్తిగా డీలాప‌డిపోయింది. 
రాహుల్ కష్టపడినా ఫలితాలు శూన్యం
పార్టీ ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఎంత‌ కష్టపడినా ఫ‌లితాలు నిరాశ క‌లిగిస్తున్నాయి. తాజాగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల‌తో మ‌రింత డీలాప‌డింది. దీంతో పార్టీ నేతల స్వరం మారుతుంది.
అధికారం చేజారడం జీర్ణించుకోలేకపోతున్న నేతలు 
పంజాబ్ ను హ‌స్తగ‌తం చేసుకున్నా.. గోవా, మ‌ణిపూర్ లో అధికారం చేజారడం హ‌స్తం నేత‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ సుధీర్ఘ యాత్ర చేసినా.. ఫ‌లితం ద‌క్కక‌పోవ‌డంతో .. ఇప్పుడు పార్టీ భ‌విష్యత్‌పై నేత‌ల్లో అంత‌ర్మథనం మొద‌లైంది. పరిస్థితి ఇలాగే కొన‌సాగితే.. 2019లో కూడా అధికారం ద‌క్కద‌న్న భావ‌న‌లో ఉన్న కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పడి నుంచే ప్రత్యామ్నాయాల‌పై దృష్టిపెట్టారు. 
ప్లాన్ అమలు చేస్తేపూర్టీకి పూర్వ వైభవం..
దీనిలో భాగంగా.. ఇప్పుడు పార్టీలో కామ‌రాజ్ ప్లాన్ 2ను తెర‌మీదికి తెస్తున్నారు హ‌స్తం నేత‌లు. ఈ ప్లాన్ ను అమ‌లు చేస్తేనే పార్టీకి పూర్వ వైభ‌వం అంటున్నారు. ఇంత‌కు కామరాజ్ ప్లాన్ 2 అంటే ఏంటీ అనుకుంటున్నారా.. 1963లో నెహ్రు ప్రధానిగా ఉన్న స‌మ‌యంలో పార్టీలో కామ‌రాజ్ ప్లాన్-2 ను అమ‌లు చేశారు. దీంతో అప్పుడు పార్టీకి మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. అలాగే ఇప్పుడు కూడా  రాహుల్ కు పూర్తి స్తాయిలో ఫ్రీహ్యాండ్ ఇవ్వాల‌న్న డిమాండ్ చేస్తున్నారు నేతలు. సీడబ్ల్యూసీ నుండి అంద‌రు త‌ప్పుకుని.. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు  పార్టీలో ప్రక్షాళ‌న జ‌ర‌గాల‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. 
రాహుల్ మార్క్ షురూ
మొత్తానికి రాహుల్‌గాంధీ ప‌ట్టాభీషేకానికి స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్న వేళ‌.. పార్టీలో కామ‌రాజ్ ప్లాన్ 2ను తెర‌పైకి రావ‌డం.. పార్టీలో మంచి ప‌రిణామ‌మ‌న్న చ‌ర్చ సాగుతుంది. దీంతో ఇక రేపో మాపో రాహుల్ ప‌గ్గాలు చేప‌ట్టగానే పార్టీలో రాహుల్ మార్క్ షూరు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

 

10:44 - March 17, 2017
10:41 - March 17, 2017

హైదరాబాద్ : అంబర్ పేటలోని పటేల్ నగర్ లో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యం లభ్యం అయింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బాలికలను గుర్తించారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు బాలికల ఆచూకీ కొనుగొన్నారు. బాలికల ఆచూకీ తెలియడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బర్త్‌డే పార్టీ చేసుకుంటామని శ్రీనిధి, నందిని, ప్రతిభ, ప్రీతి, సంగీత అనే విద్యార్థినులు ఇంటి నుంచి వెళ్లి విద్యార్థినులు కనిపించకుండా పోయారు. పిల్లల సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది.. అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు బాలికల ఆచూకీ కొనుగొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బాలికలను గుర్తించారు. శ్రీనిధి, నందిని, ప్రతీప, ప్రీతి, సంగీతలు పటేల్‌నగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌ స్కూల్‌ లో ఏడో తరగతి చదువుతున్నారు. 

 

ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల శాసనమండలి స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 

10:28 - March 17, 2017

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల శాసనమండలి స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటటకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. బీటెక్ రవి, వైఎస్ వివేకానందరెడ్డి మధ్య హోరాహోరి పోరు కొనసాగుతుంది. ఈనెల 20న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

 

10:21 - March 17, 2017

హైదరాబాద్ : విహారి సంస్థ 12 వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విహారి ఎండీ నితిన్‌కుమార్‌తో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహారి ద ట్రావెలర్‌ బుక్‌ను రిలీజ్‌ చేశారు. 

 

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు .

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు. 

10:13 - March 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:06 - March 17, 2017
08:52 - March 17, 2017

కేవలం ఉత్తరప్రదేశ్ లలోని రైతులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ అధికారి ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, బీజేపీ నేత పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేస్తారు కానీ రైతులకు రుణమాఫీ చేయరని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే దేశానికి మంచిది కాదన్నారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను కేంద్రం చేతిలోకి తీసుకుంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:44 - March 17, 2017

ఏపీ రాష్ట్ర బడ్జెట్ కరువు ప్రాంతాలకు ఉపశమనం కలిగించలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత పెద్దిరెడ్డి అన్నారు. బడ్జెట్ కరువు సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందని పేర్కొన్నారు. కౌలు రైతులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 'లక్షా 66 వేల 999 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కరువు సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందంటూ రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 8 జిల్లాల్లోని 301 మండలాల్లో కరవు తీవ్రంగా వున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. కరువు పై శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక చర్చ జరపాలంటూ మరోవైపు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాన్ని తమ భుజస్కందాలమీద మోస్తున్న 32 లక్షల మంది కౌలు రైతులకీ ఈ బడ్జెట్ అసంతృప్తినే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి కరువు ప్రాంత రైతులు, కౌలు రైతులు ఆశించినదేమిటి? చివరకు దక్కిందేమిటి? కరువు ప్రాంతాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిందేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:31 - March 17, 2017
08:28 - March 17, 2017

హైదరాబాద్ : సింగరేణి వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. 30వేల ఉద్యోగాలను, వారసులతో భర్తీ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో న్యాయపోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
సతీశ్‌కుమార్‌ పిటిషన్‌పై తీర్పునిచ్చిన హైకోర్టు
సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గోదావరిఖనికి చెందిన సతీశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. ఈమేరకు తీర్పునిచ్చింది. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారమే కొత్త నోటిఫికేషన్‌ జారీచేయాలని సింగరేణి సంస్థను ఆదేశించింది. 
వైద్యపరంగా అనర్హుల కుటుంబ సభ్యులకే వారసత్వ ఉద్యోగం
సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, వైద్యపరంగా అనర్హులై, కుటుంబానికి మరి ఏ ఇతర ఆధారమూ లేనప్పుడు మాత్రమే, ఆ కుటుంబ సభ్యుడికి వారసత్వ ఉద్యోగాన్ని కల్పించ వచ్చని, ఇలా గంపగుత్తగా వారసత్వ ఉద్యోగాలు కట్టబెట్టడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. తాజా నోటిఫికేషన్‌ కారణంగా, సింగరేణిలో భవిష్యత్తులో నోటిఫికేషన్‌లు వచ్చే వీలే ఉండదని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. 
వారి కుటుంబ సభ్యులతో ఖాళీలు భర్తీ చేసేందుకే నోటిఫికేషన్‌
పిటిషనర్‌ వాదనను, ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. 2017నాటికి 5875 మంది ఉద్యోగులు అనారోగ్యం వల్ల విఆర్ఎస్‌ తీసుకున్నారని, ఆ ఖాళీలను వారి కుటుంబ సభ్యులతో నింపేందుకే తాజా నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఇంప్లీడ్‌ అయిన సీనియర్‌ న్యాయవాది విద్యాసగర్‌, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టుకు దృష్టికి తెస్తూ ఆరువేల మందికి మాత్రమే వారసత్వ ఉద్యోగాలు లభించే వీలుందని తెలిపారు.
కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసుకోవచ్చని సూచన
రెండు పక్షాల వాదనలు విన్న, జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌, వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసుకోవచ్చని సూచించింది. అన్ని ఖాళీలు వారసత్వ ఉద్యోగులతో భర్తీకాకుండా సింగరేణి బోర్డ్ పర్యవేక్షించాలని, కొత్త రెక్రూట్‌మెంట్‌  నోటిఫికేషన్ లో కోల్ ఇండియా నిబంధనలు పాటించాలని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. 
సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఉత్కంఠ
హైకోర్టు నిర్ణయంతో, సింగరేణి కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఉత్కంఠను నింపుతోంది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా  కోర్టులో పిటిషన్‌లద్వారా అడ్డుకుంటున్నారంటూ, పెద్దపల్లి టీఆర్ఎస్‌ శ్రేణులు,   పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి, జేఏసీ నాయకుడు కోదండరాం  దిష్టిబొమ్మలను దహనం చేశాయి.
సర్కారు తీరును ఆక్షేపించిన కిషన్‌రెడ్డి
మరోవైపు, ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఓ చేత్తో ఇచ్చి, మరోచేత్తో లాక్కునే వ్యవహారశైలిని అనుసరిస్తోందని, బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాలకపక్షానికి చెందిన వారే,  కోర్టులో పిటిషన్‌ వేయించారని, కార్మికులకు లబ్ది చేకూరకుండా చేశారని విమర్శించారు. 
30వేల కుటుంబాల్లో కలవరం
మొత్తానికి హైకోర్టు ఆదేశం, ఆరు జిల్లాల్లోని 26 నియోజకవర్గాలకు చెందిన సుమారు 30వేల కుటుంబాల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో, కొత్త నోటిఫికేషన్‌ను ఎప్పుడు వెలువరిస్తుందో, అది ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

08:21 - March 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు గంట మోగింది. ఇవాళ నుంచి మొదలయ్యే రెగ్యులర్ టెన్త్ ఎగ్జామ్స్ ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం ఎస్ ఎస్ సీ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు మాత్రం 8 గంటల 45 నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం నింబంధనని ఈ సారి ఐదు నిమిషాలకు పొడిగించారు. 
నేటి నుంచి 30 వరకూ పరీక్షలు
తెలంగాణలో ఇవాళ నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ రెగ్యూలర్‌ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం తొమ్మిదన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల 9వేల 831 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ర్టంలో మొత్తం 2వేల 556 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి సివిల్‌ డ్రెస్‌లోనే రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ సెంటర్‌లోకి తీసుకెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. 
పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్‌ అమలు
టెన్త్ పరీక్షలు సజావుగా సాగేందుకు వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే బోర్డు అధికారులు చర్చించారు. ఆర్టీసీ బస్సులతో పాటు పరీక్ష సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూసేందుకు విద్యుత్ శాఖతో కూడా చర్చించారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక సెంటర్లలో భారీ బందోబస్తును పెంచారు. మిగతా అన్ని కేంద్రాల్లోనూ పరీక్ష సమయంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉ. 8: 45 నిమిషాలలోపు కేంద్రానికి చేరుకోవాలి
గతంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించక పోవడం వల్ల విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడటంతో ఒక్క నిమిషం నిబంధనను ఐదు నిమిషాలకు మార్చారు. అయినప్పటికీ విద్యార్ధులు 8గంటల 45నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జీరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 

కర్ణాటకలో ప్రమాదం....ఐదుగురు మృతి

కర్ణాటక : చిత్రదుర్గ జిల్లా మన్నెకోట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుది. రైలు అంబులెన్స్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఐదు నెలల చిన్నారికి గాయాలయ్యాయి. 

ఏపీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న మూడు శాసనమండలి స్థానాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల శాసనమండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

 

08:11 - March 17, 2017

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న మూడు శాసనమండలి స్థానాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల శాసనమండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నెల్లూరులో 5, కడప, కర్నూలు జిల్లాల్లో మూడేసి చొప్పున ఇవి ఏర్పాటయ్యాయి. ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీడీపీ, వైసీపీలు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. కడపలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉండటం, జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో 4వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. 

08:06 - March 17, 2017

గుంటూరు : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం.. ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం పడడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. గాలుల దెబ్బకు పోలీసుల టెంట్లు ఎగిరిపోయాయి. 
అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే వర్షం... 
అమరావతిలో వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రారంభోత్సవంలో ఉన్నంతా హడావిడి.. సదుపాయాలు కల్పించడంలో కన్పించడంలేదు. దీంతో అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే కురిసిన వర్షానికి నేతలు, అధికారులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు.
గాలులకి కొట్టుకుపోయిన టెంట్లు...
భారీ వర్షం కురవడం అసెంబ్లీ చుట్టుపక్కల అంతా వ్యవసాయభూమి కావడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. పోలీసుల కోసం ఏర్పాటుచేసిన టెంట్లు గాలికి ఎగిరిపోవడంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  చిత్తడి నేలలో కూరకుపోయిన వాహనాలు వర్షం దెబ్బకు ప్రాంగణమంతా చిత్తడిగా మారడంతో వావానాలన్ని నేలలో కూరుకుపోయాయి. వాహనాలను చిత్తడి నేల నుంచి బయటకు తీసుకురావాడానికి అటు నేతలు, ఇటు అధికారులు నరకయాతన పడ్డారు. మొదటి నుంచి అందరు చెబుతున్నట్లు వర్షం పడితే అసెంబ్లీ, సచివాలయ పరిసరాలు ఎంత దుర్భరంగా ఉంటాయో రుజువైంది.  

 

పటేల్ నగర్ లో ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం

హైదరాబాద్‌ : నగరంలోని అంబర్‌పేటలో ఐదుగురు ఏడోతరగతి విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. బర్త్‌డే పార్టీ చేసుకుంటామని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థినులు కనిపించకుండా పోయారు. పిల్లల సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

07:53 - March 17, 2017

హైదరాబాద్‌ : నగరంలోని అంబర్‌పేటలో ఐదుగురు ఏడోతరగతి విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. బర్త్‌డే పార్టీ చేసుకుంటామని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థినులు కనిపించకుండా పోయారు. పిల్లల సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. కనిపించకుండా పోయిన విద్యార్థినులు శ్రీనిధి, నందిని, ప్రతీప, ప్రీతి, సంగీతలుగా గుర్తించారు. వీరు పటేల్‌నగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌ స్కూల్‌ లో ఏడో తరగతి చదువుతున్నారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

 

07:44 - March 17, 2017

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న మూడు శాసనమండలి స్థానాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల శాసనమండలి స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీడీపీ, వైసీపీలు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసింది. నెల్లూరులో 5, కడప, కర్నూలు జిల్లాల్లో మూడేసి చొప్పున ఇవి ఏర్పాటయ్యాయి. కడపలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉండటం, జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో 4వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. 
పోలింగ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్షాలు 
నెల్లూరు, కడప, కర్నూలు స్థానాలకు జరిగే ఈ పోలింగ్‌ను అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నెల్లూరు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి బరిలో నిలివగా... వైసీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈయన ఆనం సోదరులకు స్వయాన తమ్ముడు. నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలవటానికి కావాల్సిన సంఖ్యా బలమే ఉన్నప్పటికీ గూడూరు, సూళ్లూరుపేట వంటి నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధులు వాకాటి నారాయణరెడ్డిపై వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పరిణామాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకోవటంతో జిల్లాలో పరిస్థితి అధికారపక్షానికి అనుకూలంగా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. 
కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయం 
అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. అధికార పార్టీ బీటెక్ రవిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానంలో వైసీపీ నుంచి జగన్‌ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని బరిలో నిలిపారు. జగన్‌కు కంచుకోటగా ఉన్న కడపలో పాగా వేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు ఏ క్యాంపులో ఉన్నా... ఓటింగ్ మాత్రం తమకు అనుకూలంగానే ఉంటుందనే భరోసా వైసీపీ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైఎస్ సానుభూతితో పాటు సొంత ఇలాక తమకు కలసి వచ్చే అంశమని వైసీపీ నేతలు చెబుతున్నారు. 
శిల్పా చక్రపాణిరెడ్డికి మరో అవకాశం 
ఇక రాయలసీమలోని మరో జిల్లా కర్నూలు విషయానికొస్తే.... టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డికి మరో అవకాశం లభించింది. అయితే... వైసీపీ అంచనాలు వేరే విధంగా ఉన్నాయి. ఈ జిల్లాలో తమ అభ్యర్థిగా గౌరు వెంకటరెడ్డిని ఎన్నికల బరిలో వైసీపీ దింపింది. భూమా మరణానికి పరోక్షంగా చంద్రబాబే కారణమనే ప్రచారం చేయడంతో పాటు... ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తమకు కలిసి వస్తాయనే ఆశాభావంతో వైసీపీ నేతలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇవాళ అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు.

 

కిషన్ గూడ వద్ద ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ మండలం కిషన్ గూడ వద్ద ఆర్టీఏ తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 6 బస్సులు సీజ్ చేశారు. 18 బస్సులపై కేసు నమోదు చేశారు. 

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు

హైదరాబాద్ : నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఏపీలో 6.28 లక్ష మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలో 5.09 లక్షల మంది విద్యార్థులు హాజురుకానున్నారు. 

 

ఏపీలో నేడు 3 స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

హైదరాబాద్ : ఏపీలో నేడు 3 స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు పోలింగ్  నిర్వహించనున్నారు. 

నేటి నుండి పదో తరగతి పరీక్షలు..

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం నిబంధన ఈ సారి ఐదు నిమిషాలకు పొడిగించారు.

నగరంలో ఐదుగురు విద్యార్థినిల అదృశ్యం..

హైదరాబాద్ : పటేల్ నగర్ లో ఐదుగురు విద్యార్థినిల అదృశ్యం కలకలం రేపుతోంది. బర్త్ డే పార్టీ చేసుకుంటామని ఇంటి నుండి వెళ్లినట్లు అంబర్ పేట పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పిల్లల సమాచారం తెలియకపోడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు..

విజయవాడ : ఏపీలో నేడు మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

నేడు ఉత్తరాఖండ్ లో బీజేఎల్పీ సమావేశం..

ఉత్తరాఖండ్ : రాష్ట్ర బీజేపీఎల్పీ నేడు భేటీ కాబోతోంది. బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

Don't Miss