Activities calendar

18 March 2017

22:18 - March 18, 2017

ఓ అమాయకుడు బందీ అయ్యాడు. ఏడేళ్ల శిక్షకు సిద్ధమయ్యాడు. కానీ అతడు మాత్రం ఏ తప్పూ చేయలేదు. అతనితోపాటు అతని భార్య.. ఆ నవ వధువు నట్టింట్లో శిక్ష అనుభవిస్తుంది. ఆమె కూడా ఏ తప్పు చేయలేదు. ఈ దంపతులు దూరమై, కనీసం మాట్లాడుకునేందుకు కూడా చేసింది నమ్మకం. ఆ నమ్మకమే వారి జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడా ఇళ్లాలు కడుపులో బిడ్డను మోస్తోంది. కన్నీళ్లు తాగుతూ బతుకుంతోంది. దీనంతటికీ కారణం నమ్మకమే. భర్త ఏ నాటికైనా తిరిగి వస్తాడన్న ఒకే ఒక నమ్మకం. ఆమెలో ధైర్యాన్ని తెస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:59 - March 18, 2017

రాంచీ : రాంచీ టెస్ట్‌ మూడో రోజు భారత్‌ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. పుజార ఫైటింగ్‌ సెంచరీ, విజయ్‌ హాఫ్‌ సెంచరీలతో ఆస్ట్రేలియాకు భారత్‌ ధీటుగా బదులిచ్చింది. 120 పరుగులకు ఒక వికెట్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌....కంగారూ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. విజయ్‌,పుజార సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌ను పోటీలో నిలిపారు. విరాట్‌ కొహ్లీ విఫలమైనా....క్రీజ్‌లో పాతుకుపోయిన పుజారా...రహానే,కరుణ్‌నాయర్‌తో కీలక భాగస్వామ్యాలు జోడించాడు. టెస్టుల్లో 11వ సెంచరీ పూర్తి చేసిన పుజారా....ఫైటింగ్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 6 వికెట్లకు 360 పరుగుల స్కోర్ నమోదు చేసింది. కంగారూ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ 4 వికెట్లు తీయగా హేజిల్‌వుడ్‌,ఒకీఫ్‌ చెరో వికెట్‌ తీశారు.  

 

21:57 - March 18, 2017

ఫ్రాన్స్ : పారిస్‌లోని ఓర్లీ ఎయిర్‌పోర్టులో ఉదయం ఎనిమిదిన్నరకు కాల్పులు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలోని అధికారి వద్ద నుంచి ఓ వ్యక్తి ఆయుధాన్ని లాక్కునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన భద్రతాదళాలు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అగంతకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తి పేలుడు పదార్థాలు కలిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భద్రాతా దళాలు పేలుడు పదార్థాల కోసం తనిఖీలు చేశారు. కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం 3 వేలమంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి అధికారులు ఖాళీ చేయించారు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియలేదు.

 

21:55 - March 18, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజనపాదయాత్ర ముగింపుసభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మార్చి 19న నిర్వహించబోయే ఈ సభకు పార్టీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సభకు ముందు రెండు భారీ ర్యాలీల ద్వారా కార్యకర్తలు, కళాకారులు సభాప్రాంగణం సరూర్‌నగర్‌ స్టేడియంకు రాబోతున్నారు. పలువురు ప్రముఖులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొనబోయే ఈ కార్యక్రమానికి పోలీసులు గట్టిభద్రత ఏర్పాటుచేశారు. 
2016 అక్టోబర్ 17న పాదయాత్ర ప్రారంభం
కనీవినీ ఎరుగనిరీతిలో ఐదునెలలపాటు 4వేల కిలోమీటర్లు సాగిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపుకొచ్చేసింది.. 2016 అక్టోబర్ 17న ఇబ్రహీంపట్నంలో సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది.. ఐదు నెలలపాటు.... నాలుగు వేల కిలో మీటర్లు సాగిన ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా సాగిన పాదయాత్ర మార్చి 19న రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించబోయే సభతో ముగియబోతోంది. సామాజిక న్యాయ సమర సమ్మేళనం పేరుతో నిర్వహించబోయే ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, వామపక్ష నేతలు, ప్రొఫెసర్‌ కోదండరామ్, చుక్కా రామయ్య, హరగోపాల్, కె. నాగేశ్వర్, కాకి మాధవరావు, జస్టిస్ చంద్ర కుమార్, గద్దర్, విమలక్క, మంద కృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, బెల్లయ్య నాయక్, పలు సామాజిక, ప్రజా సంఘాల నేతలు హాజరుకాబోతున్నారు.. 
సభ నిర్వహణకు పార్టీ 12 కమిటీలు ఏర్పాటు
సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణఏర్పాట్లను 12కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. సభకోసం రెండు వేదికలు సిద్ధం చేశారు.. వంద మంది కూర్చునేందుకు వీలుగా ప్రధాన వేదిక.... కళా రూపాల ప్రదర్శనకు మరో వేదికను రెడీచేశారు. సభా ప్రాంగణంలో మీడియా, వీఐపీలకోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసారు. సభ కనిపించేలా నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లను బిగించారు.
మ.12 గం.లకు ఎస్‌వీకే నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ 
సభ ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 12 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ కొనసాగనుంది. పాదయాత్ర బృందం ముందు, వెనుక రెండువైపులా రెడ్, బ్లూ షర్టులతో కళాకారులు, చీరలతో మహిళాకళాకారులు, కార్యకర్తలు కవాతు చేయనున్నారు.. అటు వనస్థలిపురంనుంచి మరో ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు..
భారీగా జన సమీకరణ 
ఈ సభకు సీపీఎం భారీగా జన సమీకరణ చేస్తోంది.. వివిధ సామాజిక తరగతులు, పలు రంగాల కార్మికులు, మహిళలు, యువత, ఈ సభలో పాల్గొనబోతున్నారు.. భారీస్థాయిలో ఏర్పాట్లుచేస్తున్న ఈ సభకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాటుచేస్తున్నారు.. స‌భా ప్రాంగ‌ణంలో డాగ్ స్క్వాడ్‌, బాంబ్ స్క్వాడ్‌ తనిఖీలు చేస్తున్నాయి. భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ సభ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది.

 

21:50 - March 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో గురుకులాలు, విద్యుత్‌, హైదరాబాద్‌లో నీటిసరఫరాపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌, మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వాదం నడిచింది.. ప్రశ్నలు కూడా అడగొద్దంటే ఎలా అంటూ అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హైదరాబాద్‌కు నీటి సమస్య లేకుండా చూస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. 
సోలార్‌ విద్యుత్‌పై చర్చ
తెలంగాణ అసెంబ్లీ శనివారం హాట్‌హాట్‌గానే సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సోలార్‌ విద్యుత్‌పై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానమిచ్చారు.. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు.. తెలంగాణలో ఇప్పటికే 1456 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని ప్రకటించారు.
119 బీసీ గురుకులాల ఏర్పాటు
తెలంగాణలో 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయబోతున్నామని... మంత్రి జోగురామన్న తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకులాన్ని మంజూరు చేస్తామని తెలిపారు.. బీసీ గురుకులాలపై ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 
అక్బరుద్దీన్‌, కేటీఆర్‌ మధ్య వాగ్వాదం
క్వశ్చన్‌ అవర్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌, మంత్రి కేటీఆర్‌ మధ్య వాగ్వాదం నడిచింది.. ఆర్‌టీసీ బస్సులకు సంబంధించి అక్బరుద్దీన్‌ పలు ప్రశ్నలు సంధించారు.. వీటిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌... ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా సమయంపడుతుందని గుర్తుచేశారు.... ఇలా చేస్తే మిగతా సభ్యులకు సమయం సరిపోదని సూచించారు. కేటీఆర్‌ సమాధానంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆక్బరుద్దీన్‌ కనీసం ప్రశ్నలుకూడా అడగొద్దంటే ఎలా అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేటీఆర్...హైదరాబాద్‌ తాగునీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సభలో ప్రకటించారు. 
సమయాన్ని వృధా చేయొద్దన్న సీఎం కేసీఆర్ 
నీటి సరఫరాకు సంబంధించి బీజేపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరో ప్రశ్న అడిగారు.. దీనిపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఒకే ప్రశ్న, దాని అనుబంధ ప్రశ్నల సమాధానాలకు సమయం ఎక్కువ సమయం పడుతోందని అభిప్రాయపడ్డారు.. ఇలా ఒకే టాపిక్‌పై ప్రశ్నలతో సమయాన్ని వృధా చేయొద్దని సూచించారు..
కేటీఆర్‌ సమాధానంపై రామచంద్రారెడ్డి ఆగ్రహం 
కేటీఆర్‌ సమాధానంపై రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారంలో ఉన్నాం కదా అని ఎప్పుడూ భావించొద్దని.. ఎప్పటికైనా మీరు ప్రతిపక్షానికి రావాల్సివాళ్లేఅంటూ పరోక్షంగా విమర్శించారు.
బడ్జెట్‌పై చర్చ
టీ బ్రేక్‌ తర్వాత బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది.. అయితే పద్దుపై ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే... కేవలం ముగ్గురుమంత్రులే సభలో ఉండటం బాధాకరమన్నారు కిషన్‌ రెడ్డి.. వెంటనే ఈ విషయం స్పందించిన మంత్రి తుమ్మల.... మిగతా మంత్రులు మండలిలో ఉన్నారని సమాధానమిచ్చారు..
సంక్షోభంలో వ్యవసాయం : చిన్నారెడ్డి 
తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆయన....2015-16లో 54.45 లక్షల టన్నులకు ఆహార ఉత్పత్తులు పడిపోయాయని వివరించారు. అనంతరం మిగతా సభ్యులు మాట్లాడాక డిప్యూటీ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

 

21:41 - March 18, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 26 ఏళ్లకే ఎంపీ అయిన ఆదిత్యనాథ్‌ ఓ కరడుగట్టిన హిందుత్వవాది. ఇంతకీ యోగి ఆదిత్యానాథ్‌ సన్యాసి నుంచి సిఎం వరకు ఎలా ఎదిగారు? వాచ్‌ దిస్‌ స్టోరీ.
రేపు ప్రమాణస్వీకారం 
ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. యోగి అసలు పేరు అజయ్‌ సింగ్‌. జూన్‌ 5, 1972లో ఉత్తరాఖండ్‌లోని ఓ పల్లెటూర్లో జన్మించారు. గఢ్‌వాల్‌ యూనివర్సిటీ నుంచి బిఎస్‌సి పూర్తి చేశారు. అనంతరం ఆయన గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయ మహంత్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయనకు ముందు మహంత్‌ అవైద్యనాథ్‌ ఉత్తరాధికారిగా ఉన్నారు. ఆదిత్యనాథ్ హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా.
1998లో రాజకీయ సన్యాసం
1998లో మహంత్‌ అవైద్యనాథ్‌ రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆ తర్వాత ఉత్తరాధికారిగా ఆదిత్యనాథ్‌ పేరును ప్రకటించారు. అదే సంవత్సరం రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపీ అయ్యారు. గోరఖ్‌పూర్‌ నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
ఆదిత్యనాథ్‌ కరడుగట్టిన హిందుత్వవాది
ఆదిత్యనాథ్‌ కరడుగట్టిన హిందుత్వవాది. ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నిలుస్తారు. 2007 గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి ఆదిత్యనాథ్‌ను అరెస్ట్‌ చేశారు. యోగికి వ్యతిరేకంగా ఎన్నో కేసులున్నాయి. 2008లో ఆదిత్యనాథ్‌పై ఆజంగఢ్‌లో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

 

గాంధీ ఆస్పత్రిలో బొమ్మ సైకిల్ వినియోగం ఘటనపై చర్యలు

సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో బొమ్మ సైకిల్ వినియోగం ఘటనలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకటరత్నం, మహేంద్రభాయ్ ని సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించారు. 

 

21:02 - March 18, 2017

ఇంటర్ నేషనల్ స్కూళ్లు.. అడ్వటైజ్ మెంట్స్, టీవీఎఫ్ కాంట్రవర్సి, డెసిజన్ రివ్యూ సిస్టమ్ పై చిన్న గందరగోళం, రాజమౌళి పబ్లిసిటీ... వంటి అంశాలపై క్రేజీ నూస్ ను వీడియోలో చూద్దాం....

 

20:52 - March 18, 2017

సర్కార్ హాస్టల్ విద్యార్థులతో మల్లన్నముచ్చటించాడు. మోటకొండూరు మండల కేంద్రంలోని హాస్టల్ భవనంలో సగం హాస్టల్, సగం మండల కార్యాలయంగా ఉంది. మహిళలతో మాట్లాడాడు. సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

పురోహితుడిని చితకబాదిన పెళ్లిబృందం

పెద్దపల్లి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో పురోహితుడిని దండించారు. వివాహం ఆలస్యంగా జరిపించాడని పెళ్లి బృందం చితకబాదింది. 

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్ : ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. అమెరికాలో భారతీయులపై దాడులు జరగకుండా అమెరికా ప్రభుత్వంతో చర్చించాలని మోడీని కేసీఆర్ కోరారు. అమెరికాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

 

20:37 - March 18, 2017

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత చెరుపల్లి సీతారాములు, సీపీఐ నేత సుధాకర్, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ప్రొ.హరగోపాల్ పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు వెళ్తున్నారని చెప్పారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాప్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిని మిస్ యూజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను ఎన్నుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం కలిగిందని చెప్పారు. ఇతర పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:36 - March 18, 2017

ఖమ్మం : ఇంటికో బిడ్డ...ఊరుకో బండి అనే నినాదంతో ప్రజలు కదం తోక్కనున్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 'సర్వసమ్మేళన సభ'కు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలి రానున్నారు. 
పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన మహాజన పాదయాత్ర
పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది.. పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నెల రోజుల పాటు సాగిన యాత్ర
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు నెల రోజులు సాగిన సీపీఎం మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభించింది. స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలపటంతో పాటు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని తమ్మినేనికి వినతులు అందజేశారు. 
సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  
సీపీఎం మహాజన పాదయాత్ర విజయోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు జనం హాజరుకానున్నారు. ఖమ్మం జిల్లాలోని 22 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 22 మండలాలకు సంబంధించి రెండు జిల్లాలో 776 గ్రామ పంచాయతీల నుండి ప్రజలు పెద్ద ఎత్తున కదం తొక్కుతున్నారు. ఇప్పటికే కొంతమంది బస్సులు, లారీలు, డీసీఎంలు, రైలు మార్గాల ద్వారా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా నుండి 25 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం నుండి 10 వేల మంది కార్యకర్తలు కదలి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
పినరయ్ విజయ్‌కు రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో కవాతు 
ఎర్ర చీరలు, ఎర్ర చొక్కలు ధరించి ప్రతి ఒక్కరి చేతిలో ఎర్ర జెండా పట్టుకుని హైదరాబాద్ వెళ్లేందుకు అంతా సిద్ధమయ్యారు. సభకు వస్తున్న కేరళ సీఎం పినరయ్ విజయ్‌కు రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో కవాతు నిర్వహించనున్నారు. ప్రత్యేక క్యాడర్‌గా ఖమ్మం జిల్లా నుంచి ప్రతినిధులను ఇప్పటికే సభా స్థలానికి చేరుకున్నారు. ప్రజాసంఘాల బాధ్యులు కూడా కదం తొక్కనున్నారు. మొత్తంగా 19వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సర్వ సమ్మేళన సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు జనం హాజరుకానున్నారు.

20:12 - March 18, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. 154 రోజుల క్రితం ప్రారంభమైన సిపిఎం మహాజన పాదయాత్రకు ముగింపు సభే  తెలంగాణ రాష్ట్ర సంక్షేమ, సామాజిక న్యాయ సమర సమ్మేళనం.  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన 40 మంది ప్రముఖులు ఆదివారం సమర సమ్మేళనంలో ప్రసంగిస్తారు.
అక్టోబర్ 17న పాదయాత్ర ప్రారంభం 
అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ ఆరు నెలలకూ ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత వుంది. బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మహాశివరాత్రి, హోలీ, ఉగాది ఇలా ఇవన్నీ తెలుగువారు, తెలంగాణ బిడ్డలు అత్యంత వైభవంగా జరుపుకనే పండుగలే. ఇన్ని పర్వదినాల మధ్య తెలంగాణ గడ్డ మీద సాగింది సిపిఎం మహాజన పాదయాత్ర. బతుకమ్మ సంబురాల సందడిలో అక్టోబర్ 17న ప్రాంభమైన మహాజన పాదయాత్ర, ఉగాదికి సరిగ్గా ఓ  పది రోజుల ముందు ముగియడం విశేషం. 
154 రోజుల పాటు సాగిన పాదయాత్ర  
సాధారణంగా పండుగల సమయంలో ఎక్కడెక్కడో వున్న కుటుంబ సభ్యులంతా ఒకే గూటికి చేరతారు. ఉన్నంతలో నలుగురూ కలిసి సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. ఇన్ని పర్వదినాలలోనూ విరామం లేకుండా, పాదయాత్ర సాగడం మెచ్చదగ్గ విశేషం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పాదయాత్ర సాగించిన రమ, జాన్ వెస్లీ, రమణ, ఆశయ్య, రాజు, నగేష్, అబ్బాస్, శోభన్ నాయక్ వీళ్లంతా మొత్తం తెలంగాణ సమాజాన్ని తమ కుటుంబంగానే భావించి వుండబట్టే, ఇది సాధ్యమై వుంటుంది. తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల సమయంలో 154 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర  ప్రభుత్వ విధానాలనే ప్రభావితం చేస్తుండడం సంతోషకర పరిణామం. 
పాదయాత్రతో ప్రభుత్వ పెద్దల వైఖరి మార్పు
బతుకమ్మ పండుగకు ముందు ముఖ్యమంత్రి కేసిఆర్, ఆయన పార్టీ సహచరులు చేసిన కామెంట్స్, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు, విభిన్న వర్గాలకు ప్రకటిస్తున్న వరాలు ప్రభుత్వ పెద్దల వైఖరిలో వచ్చిన మార్పుకు సంకేతాలే. ఐపాస్, ఐటి హబ్ లంటూ విదేశాలచుట్టూ చక్కర్లు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు మేకలు, గొర్రెలు పెంచేవారి గురించి, చేపలు పట్టేవారి గురించి, తట్టలు బుట్టలు అల్లేవారి గురించి మాట్లాడుతుండడం సిపిఎం మహాజన పాదయాత్ర సాధించిన విజయానికి గుర్తుగా భావించవచ్చు. మిషన్ భగీరథ నీళ్లు తొలుత దళితవాడలకే ఇస్తామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం, ప్రముఖ రచయిత బిఎస్ రాములు నేతృత్వంలో బిసి కమిషన్ నియమించడం, వెయ్యి కోట్ల రూపాయల నిధితో ఎంబిసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనడం సిపిఎం పాదయాత్ర ప్రభావమేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 
సిపిఎం కేడర్ లో కొత్త ఉత్సాహం
154 రోజుల పాటు తెలంగాణలోని దాదాపు 1600 గ్రామాలలో, 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో, దాదాపు 4200 కిలోమీటర్లు  సాగిన మహాజన పాదయాత్ర సిపిఎం కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపి వుంటుందనడంలో సందేహం లేదు. ప్రారంభ సమయంలో పాదయాత్రను వ్యతిరేకించి,  పాదయాత్రలెందుకంటూ ఎకసెక్కాలడిన అధికార పార్టీ ఇప్పుడు సిపిఎం ప్రస్తావిస్తున్న అంశాలపై స్పందిస్తుండడం ఆ పార్టీ కేడర్ లో మరింత ఆత్మస్థయిర్యం పెంచుతోంది. తాము పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రికి దాదాపు 140 లేఖలు రాశారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే తెలంగాణ సమాజానికి గొప్ప మేలు జరుగుతుంది.  అయిదు నెలల పాటు మహాజన పాదయాత్ర నిర్వహించిన సిపిఎం కోరుకున్నది అదే. 

 

20:00 - March 18, 2017
19:59 - March 18, 2017
19:57 - March 18, 2017

కృష్ణా : జిల్లాలోని జి.కొండూరు మండలం వెల్లటూరు, శేగిరెడ్డిపాడు, వెలగలేరు, కుంటముక్కల గ్రామాలలోని ఇటుక బట్టీలపై సంబంధిత అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీలను పలు లోపాలతో నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.     

 

19:54 - March 18, 2017

విజయవాడ : వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నిర్మాణమవుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని... మంత్రి దేవినేని తెలిపారు. పోలవరం పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న ఉమ... స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

 

19:52 - March 18, 2017

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట మండలం, ములకలూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనార్టీలకు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని..మైనార్టీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, ప్రస్తుత బడ్జెట్‌లో పెద్దపీట వేశామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.  

 

19:42 - March 18, 2017

రంగారెడ్డి : షాద్‌నగర్‌ బస్టాండ్‌ పార్కింగ్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో భారీగా వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది...మంటలార్పుతున్నారు. 

 

19:38 - March 18, 2017

అనంతపురం : 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ జనసేన అధినేత ప్రకటనతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోనున్నాయా..? పవన్‌ కల్యాణ్‌ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారనున్నాయా..? జనసేనాని అనంత పోటీపై 10 టీవీ ప్రత్యేక కథనం..! 
అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ 
జనసేన అధినేత 2019 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంతపురం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు అనంతలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు రంగం కూడా సిద్ధం చేస్తోంది జనసేన. 
రాష్ట్ర రాజకీయాలల్లో ఉత్కంఠ          
తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాము.. యువతకు 60శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ మొదలైంది. జనసేన ఎన్నికల ప్రవేశంతో ఏపీ రాష్ట్రంలో త్రిముఖి పోటీ ఏర్పనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అనంత అర్బన్‌లో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడంతోనే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు సాగుతున్నాయి. పవన్ అనంత నుంచి పోటీచేస్తే ఆ ప్రభావం రాయలసీమ మొత్తం మీద ఉండే అవకాశాలున్నాయంటున్నారు ఆయన అభిమానులు. 
సమస్యలపై వాణి వినిపించనున్న పవన్
పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలపై గట్టిగా తన వాణి వినిపిస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నేతలకు పవన్ టెన్షన్ పట్టుకుంది. ఇక వివిధ పార్టీల సీనియర్ నేతలు జనసేనలో చేరతారన్నచర్చ కూడా మొదలైంది. పవన్ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారుతాయని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తమ్మీద పవన్ పోటీతో అనంత జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన సీపీఎం మహాజన పాదయాత్ర

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు 28 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. 

 

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నిక

లక్నో : యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ను ఎన్నుకున్నారు. ఈమేరకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందరీ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేశారు. కేశవ్‌మౌర్య, దినేష్‌ శర్మలకు డిప్యూటీ సీఎం పదువులు ఇచ్చే అవకాశం ఉంది.

 

19:13 - March 18, 2017

లక్నో : యూపీ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడింది. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ను ఎన్నుకున్నారు. ఈమేరకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందరీ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేశారు. కేశవ్‌మౌర్య, దినేష్‌ శర్మలకు డిప్యూటీ సీఎంలు పదువులు ఇచ్చే అవకాశం ఉంది.

 

19:09 - March 18, 2017

ప్రకాశం : జిల్లాలో వడగండ్ల వాన రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. అరగంట సేపు కురిసిన వడగండ్ల వానతో నిమ్మ, బత్తాయి, పుచ్చ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఓవైపు పంటలు లేక అవస్థలు పడుతుంటే.. మరోవైపు వడగండ్ల వాన తమకు అపార నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

 

19:06 - March 18, 2017

హైదరాబాద్ : రాజ్యాధికారంతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 153వ రోజు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కొనసాగుతోంది. మేడిపల్లి మండలంలో కొనసాగుతున్న పాదయాత్రకు అడుగడుగున ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీల నేతలు సైతం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. సామాజిక న్యాయం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి త్వరలో భారీ మహాసభను నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు. 

 

19:02 - March 18, 2017

హైదరాబాద్ : ఆయనో ప్రజాప్రతినిధి. ఒక్కటి కాదు.. రెండు కాదు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శాసనసభ్యుడు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే వస్తుంటారు. కానీ.. ఒకే ఒక్క సభ్యుడు బస్సులో వస్తున్నారని.. డీజిల్‌ ఖర్చు వృధా అనే నెపంతో.. ప్రభుత్వం బస్సును రద్దు చేసింది. బస్సును పునరుద్ధరించాలని అసెంబ్లీ సెక్రటరీ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ప్రజావాణిని వినిపించాలనే దృఢ సంకల్పం ఉన్న సున్నం రాజయ్య.. టూవీలర్‌పైనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చిన్న పదవులు పొందిన నేతలే భారీ హంగామా చేస్తుంటే.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సున్నం రాజయ్య.. సింపుల్‌గా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. సున్నం రాజయ్య లాంటి నేతలను చూసి నేటి ప్రజాప్రతినిధులను ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని విశ్లేషకులు అంటున్నారు.  

 

18:36 - March 18, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన సుదీర్ఘ మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న 'సర్వసమ్మేళన సభ'ను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. 
ముగింపు దశకు సీపీఎం మహాజన పాదయాత్ర  
తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న ముగింపు సభను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా జనవరి ఒకటివ తేదీన పాదయాత్ర వరంగల్ అర్బన్ జిల్లాకు చేరుకుంది. నెల రోజుల పాటు జనగాం, వరంగల్ రూరల్, మహబూబా బాద్, జయశంకర్ జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగింది. 
నెరవేరని ప్రభుత్వ హామీలు : ప్రజలు 
ప్రభుత్వం ఇచ్చిన చాలా హామీలు నేరవేరలేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా ప్రజలు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సీయం కేసీఆర్ కు లేఖలు రాశారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 
సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వం : రత్నమాల 
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశవర్కర్లు, డ్వాక్రా మహిళాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రత్నమాల తెలిపారు. ఈ సమస్యలను పాదయాత్ర ముగింపు సభలో మరోమారు లేవనెత్తుతామన్నారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున వారి సమస్యలను సీపీఎం నాయకులకు వినిపించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఈ రంగాల నుంచి 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 
వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాసుదేవారెడ్డి          
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటూనే వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి. మొత్తమ్మీద ఈ సమస్యలన్నింటిని పాదయాత్ర ముగింపు సభలో లేవనెత్తుతామంటున్నారు సీపీఎం నాయకులు. ఈ నెల 19న జరిగే మహాజన పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతున్నారు. 

 

18:09 - March 18, 2017

నెల్లూరు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయమహల్‌ గేటు సెంటర్‌ వద్ద రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. యువకుడు కొండాపురం మండలం తూర్పుయర్రబల్లికి చెందిన వినయ్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు చేసుకునే ముందు వీరిద్దరు రైల్వేట్రాక్‌ సమీపంలో కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

షాద్ నగర్ బస్టాండ్ లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ బస్టాండ్ లోని పార్కింగ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా వాహనాలు దగ్ధం అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 

దంతెవాడ అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్

ఛత్తీస్గఢ్ : దంతెవాడ అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

17:53 - March 18, 2017

గుంటూరు : రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నానని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరులో సంక్షేమ కార్యక్రమముల శంకుస్థాపన మహోత్సవము కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చొరవ, పట్టుదలతో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని తెచ్చానని చెప్పారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా, ఘర్షణ పడకుండా రాష్ట్రాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నానని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే అన్ని రాయితీలు.. సదుపాయాలు రాష్ట్రానికి వస్తాయని ... కానీ ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

 

17:48 - March 18, 2017

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కృష్ణకాంత్‌ పాల్- త్రివేంద్రసింగ్‌ రావత్‌తో ప్రమాణం చేయించారు. సిఎంతో పాటు  9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో మదన్‌ కౌషిక్‌, రేఖ ఆర్యా, సత్పాల్‌ మహరాజ్‌, ప్రకాష్‌ పంత్‌ ఉన్నారు. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌కు 9వ ముఖ్యమంత్రి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ సిఎం హరీష్‌ రావత్‌ కూడా హాజరయ్యారు. 56 ఏళ్ల త్రివేంద్ర సింగ్‌ 1983 నుంచి 2002 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పనిచేశారు. 2002లో డొయివాలా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన త్రివేంద్రసింగ్‌ అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన గతంలో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. 

17:46 - March 18, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరన్నది కాసేపట్లో తేలనుంది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడనుంది. యూపీ సీఎం అభ్యర్ధి ఎంపికకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేరుగా రంగంలోకి దిగింది. సీఎం అభ్యర్ధిపై ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఓపీ మాథూర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించారు. ఇదే సమయంలో తాను సీఎం రేసులో లేనట్లు కేంద్రమంత్రి మనోజ్‌సిన్హా  ప్రకటించారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం చేయాలంటూ ఆయన మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు మర్య పేరు కూడా సీఎం రేసులో ప్రముఖంగా వినిస్తోంది.  ఇదే సమయంలో యూపీ పరిశీలకుడిగా వెళ్లిన వెంకయ్య నాయుడు... కాసేపట్లో జరిగే బీజేపీ శాసనసభాపక్షం భేటీలో సీఎం అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు.

 

17:42 - March 18, 2017

విజయవాడ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని... యూటీఎఫ్ తోపాటు... పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెండు రకాలుగా వేతనాలు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఏపీ పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60ఏళ్లకు పెంచుతామంటూ... సీఎం చంద్రబాబు ఎన్నికలకుముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హామీని నిలబెట్టుకోవాలంటూ నేతలు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. 

 

17:40 - March 18, 2017

హైదరాబాద్ : ప్రైవేటు స్కూల్స్‌ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఫీజు కట్టలేదని 20 మంది విద్యార్ధులను ఎగ్జామ్‌ రాయనివ్వకపోగా వారందర్ని క్లాస్‌ రూంలో బంధించి మానసిక వేదనకు గురి చేశారు. హయత్‌నగర్‌కు చెందిన సరితా విద్యానికేతన్‌ యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురి చేస్తుందనే సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను విడిపించారు. ఫీజు తర్వాత కడుతామన్న ఇప్పుడే కట్టాలంటూ వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

17:37 - March 18, 2017

హైదరాబాద్ : మార్చి 19న సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ జరుగనుంది. సరూర్ నగర్ స్టేడియంలో సామాజిక న్యాయ, సంక్షేమ సమర సమ్మేళనం పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి సీపీఎం పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మధ్యాహ్నం ముగింపు కాలినడక ప్రారంభమై సరూర్ నగర్ స్టేడియం వరకు కొనసాగుతుంది. మరో ప్రదర్శన వనస్థలిపురం నుంచి ప్రారంభమై సభా ప్రాంగణం వరకు సాగుతుంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారు. సభా ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:34 - March 18, 2017

నల్గొండ : సంక్షేమ, సామాజిక సమర సమ్మేళనం సభకు యావత్‌ తెలంగాణ కదులుతోంది. రేపు హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు తెలంగాణ పల్లెలు సిద్ధమయ్యాయి.  నల్లగొండ జిల్లా నుంచి భారీ సంఖ్యలో కదలడానికి పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. సీపీఎం శ్రేణులతోపాటు విద్యార్ధి, యువజన, మహిళా, రైతు సంఘాలు కూడా జనసమీకరణలో మునిగిపోయాయి. అటు సమాజిక శక్తులు, ప్రజాసంఘాల నేతలు సభకు తరలుతున్నారు. 
మహాజన పాదయాత్ర ముగింపు సభ
మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఊరూవాడ కదులుతోంది. ఆదివారం సరూర్‌నగర్‌   ఇండోర్‌స్టేడియం గ్రౌండ్స్‌లో జరిగే  బహిరంగ సభకు  పల్లెలన్నీ పయనమవుతున్నాయి.  నల్లగొండ జిల్లా నుంచి సమర సమ్మేళనం సభకు  తరలేందుకు ప్రజానీకం రెడీ అవుతోంది. సీపీఎం శ్రేణులతోపాటు ఇతర వామపక్ష నేతలు, వివిధ సామాజిక శక్తులు, ప్రజా సంఘాల నేతలు కూడా సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 
పాదయాత్రకు అపూర్వ స్వాగతం 
నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచింది. నల్లగొండ జిల్లాలో మొదటి నుంచీ కమ్యూనిస్టులకు పురిటిగడ్డగా నిలిచింది. అనేక ఉద్యమాలు నల్లగొండ జిల్లాలో జరిగాయి. కమ్యూనిస్టులకు పెట్టని కోటగా నల్లగొండ నిలిచింది. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగిన మహాజన పాదయాత్రకు జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. పదహారు మండలాలు చుడుతూ 320 కిలోమీటర్లు ఈ జిల్లాలో సాగిన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు.  కేతేపల్లి నుంచి చిట్యాల వరకు ప్రతిచోటా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 
సభ సక్సెస్‌పై పార్టీ నాయకత్వం దృష్టి  
పాదయాత్ర పొడవునా జిల్లాలో అపూర్వ స్వాగతం లభించడంతో పార్టీ నాయకత్వం 19న జరిగే సభ సక్సెస్‌పై దృష్టి పెట్టింది.  ఇప్పటికే సమర సమ్మేళనం సభపై ప్రతిగ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటికో మనిషి.. ఊరికో బండి నినాదంతో పల్లెల్లో క్యాంపెయిన్‌ నిర్వహించారు. 50వేల మందిని తరలించడమే లక్ష్యంగా సీపీఎం నేతలు ముందుకుసాగుతున్నారు. సీపీఎం శ్రేణులతోపాటు విద్యార్ధి, యువజన, రైతు, మహిళా సంఘాలు కూడా సమర సమ్మేళనం సభ విజయవంతంపై దృష్టి పెట్టాయి. గ్రామాల వారీగా పక్కాగా ప్లాన్‌ చేశాయి. సమర సమ్మేళనం లక్ష్యాన్ని వివరిస్తూ వారిని సభకు తరలించే ఏర్పాట్లలో మునిగిపోయాయి.  మొత్తానికి జెండాలన్నీ పక్కనపెట్టి... సామాజిక ఎజెండాపై కలిసి రావాలన్న సీపీఎం పిలుపు అన్ని వర్గాలను ఆలోచింపజేస్తోంది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి ముగింపు సభకు జనం భారీగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

17:28 - March 18, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు వందల క్వింటాళ్ల కందులు పట్టుబడ్డాయి. పౌరసరఫరాల శాఖ  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వ్యాపారి లలిత్‌కుమార్‌ అగర్వాల్‌ దాల్‌మిల్‌పై దాడి చేశారు.  అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు వందల క్వింటాళ్ల కందులను గుర్తించారు.  కందుల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి రికార్డులు, బిల్లులు  లభించకపోవడంతో కందులను సీజ్‌ చేశారు. ఈ మేరకు లలిత్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు అధికారులు చెప్పారు.  

 

17:22 - March 18, 2017

ఆసిఫాబాద్ : జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఒకరికి బదులు పదో తరగతి పరీక్ష రాస్తున్న మరో బాలుడు అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కాగజ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ కరీం అనే విద్యార్థికి బదులు అదే ప్రాంతానికి చెందిన జహీర్‌..ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ తెలుగు రెండో పేపర్‌ పరీక్ష రాస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు.  ఇన్విజిలేటర్‌ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జహీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న కరీం కోసం గాలిస్తున్నారు. 

 

17:04 - March 18, 2017


హైదరాబాద్ : నగరంలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్‌ అల్వాల్‌ గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్న మహిళ తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ సేవించి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. స్థానికులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. రావత్ తో గవర్నర్ కెకె.పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. 

ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. రావత్ తో గవర్నర్ కెకె.పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. 

13:25 - March 18, 2017

గుంటూరు : గొళ్లపాడులో సీఎం చంద్రబాబు ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కుటుంబంలో ప్రతి ఒక్కరూ నెలకు 100 చొప్పున చెల్లిస్తే.. వారికి 2 లక్షల ఆరోగ్యబీమా కవర్‌ అవుతుంది. ప్రజలు ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పేదవారికి వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.

13:23 - March 18, 2017

బెంగళూరు : కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందారు. ఎలే రాంపుర వద్ద 2 ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పగలడంతో లారీ అదుపుతప్పి ఆటోలను ఢీకొట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతిలో టిడీపీ, బిజెపి నాయకుల బాహాబాహీ

అమరావతి: టిడిపి, బిజెపి నేతలు బాహా బాహీకి దిగారు. భూ వివాదంలో ఇరు పార్టీ నాయకుల మధ్య విభేదాలు వచ్చాయి. సదావర్తి భూముల విషయంలో బిజెపి నాయకులే వివాదం సృష్టించారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్త చేశారు. నిన్న బిజెపి జిల్లా యూత్ నాయకుడు అశోక్ ఇంటి పై దాడి చేసి కారు అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ అమరావతిలో బిజెపి ఆందోళన చేపట్టింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పీఎస్ ముట్టడికి యత్నించారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

హైదరాబాద్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా ఎలేరాంపుర వద్ద రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఉన్న వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులు. బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పగలడంతో లారీ అదుపుతప్పి ఆటోలను ఢీకొట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

12:49 - March 18, 2017

మహబూబ్ నగర్ : విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్యా నిలయాలు. ఎంతోమందిని మేధావులుగా తయారు చేసే విద్యా కేంద్రాలు. అవే సంక్షేమ హాస్టల్స్‌. విద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిదిద్దే సంక్షేమ హాస్టల్స్‌ నేడు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీస వసతులులేక సమస్యలకు నిలయాలుగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌ దుస్థితిపై 10టీవీ ప్రత్యేక కథనం.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 201 సంక్షేమ హాస్టల్స్‌

ఇవీ పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల దుస్థితి. సంక్షేమ హాస్టల్స్‌ సమస్యలకు నిలయాలుగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 201 వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో 102ఎస్సీ, 34 ఎస్టీ, 65 బీసీ హాస్టల్స్‌ ఉన్నాయి. వీటిలో దాదాపు 30వేల మంది విద్యార్ధులు నివసిస్తూ విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలోని 201 హాస్టల్స్‌లో సగానికిపైగా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిలో చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్నింటికి పైకప్పు పెచ్చులూడిపోతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకెళ్లదీస్తున్నారు.

హాస్టల్స్‌లో మౌలిక వసతుల లేమి

హాస్టల్స్‌ గదుల్లో విద్యార్ధులకు మౌలిక వసతులు కూడా లేవు. చాలా హాస్టల్స్‌ను కరెంట్‌ సమస్య వెంటాడుతోంది. విద్యార్ధులకు సరిపడ ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు లేక అంధకారంలోనే మగ్గుతున్నారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్ధులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. వీరికి సరిపడ టాయ్‌లెట్స్‌, బాత్‌రూమ్స్‌ కూడా ఉండవు. కొన్ని చోట్ల ఉన్నా అవి విద్యార్ధులకు అందుబాటులోలేవు. విద్యార్ధినులు ఉండే హాస్టల్స్‌లో బాత్‌రూమ్‌లకు తలుపులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో వసతిగృహాల్లో టాయ్‌లెట్స్‌ లేక విద్యార్దులు ఆరుబయటకు వెళ్లి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

విద్యార్థులకు కలగా మిగిలిన పౌష్టికాహారం

భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్ధులకు సంక్షేమ హాస్టల్స్‌లో పౌష్టికాహారం అందడం లేదు. పురుగుల అన్నం, నీళ్ల సాంబారే వారికి పరమాన్నమైంది. హాస్టల్స్‌కు సన్నబియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా అది చాలాచోట్ల అమలుకావడం లేదు. ముక్కిన బియ్యం, కుళ్లిన కూరగాయలతో చేసిన ఆహారమే విద్యార్ధులకు దిక్కవుతోంది. చాలా చోట్ల సంక్షేమ హాస్టల్స్‌ అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. విద్యార్ధులు ఉంటున్న గదుల పక్కనే పాడైన ఆహారం వేయడంతో దోమలు విజృంభిస్తున్నాయి. అంతేకాదు మురుగునీరు చేరి దోమలు చేరడంతో తరచూ విద్యార్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా చోట్ల ప్రహరీ గోడలు లేకపోవడంతో పందులకు ఆవాసాలుగా హాస్టల్స్‌ మారుతున్నాయి.

సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన వార్డెన్లు ...

వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్ధులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన వార్డెన్లు వారికి అందుబాటులో ఉండడం లేదు. వారి ఇష్టానుసారం హాస్టల్స్‌కు వచ్చి వెళ్తున్నారు. ఒక్కో వార్డెన్‌ 3 నుంచి 4 హాస్టల్స్‌కు ఇంచార్జీగా వ్యవహరిస్తుండడంతో ఎక్కడా న్యాయం చేయలేకపోతున్నారు. విద్యార్ధులకు ఏదైనా అత్యవసరమైతే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కూడా దిక్కులేదు.

సంక్షేమ హాస్టల్స్‌ సమస్యలపై సైకిల్‌యాత్రే...

సంక్షేమ హాస్టల్స్‌ దుస్థితిపై విద్యార్ధి సంఘాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ఎస్‌ఎఫ్‌ఐ లాంటి విద్యార్ధి సంఘం ఏకంగా సంక్షేమ హాస్టల్స్‌ సమస్యలపై సైకిల్‌యాత్రే నిర్వహించింది. విద్యార్ధుల సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. హాస్టల్‌ విద్యార్ధుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని ఆ సంఘం నేతలు మండిపడుతున్నారు.

వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 299 పోస్టులు

జిల్లాలోని 201 వసతిగృహాల్లో 299 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వార్డెన్స్‌, వంట మనుషులు, హెల్త్‌ వర్కర్లు, కామాటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 19 గురుకుల పాఠశాలల్లో మర 275 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని భర్తీ చేయాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి విద్యార్ధుల చదువులు సాఫీగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్ధి నేతలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా విద్యార్దుల బతుకులు మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

12:34 - March 18, 2017
12:32 - March 18, 2017
12:30 - March 18, 2017

హైదరాబాద్‌ : నగరంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌కు ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేస్తామన్నారు.ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరువు వచ్చినా హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ తాగునీటి కోసం శివారుల్లో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు.

 

12:29 - March 18, 2017

హైదరాబాద్: తెలంగాణలో 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి జోగురామన్న తెలిపారు. ప్రతి నియోజకవర్గానికో గురుకులాలన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీసీ గురుకులాలపై ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. టీచింగ్‌స్టాప్‌ను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. అయితే నాన్‌టీచింగ్‌ స్టాప్‌ను మాత్రం ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.

12:27 - March 18, 2017
11:45 - March 18, 2017

హైదరాబాద్: సోలార్‌ విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1456 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఈ ఏడాది చివరినాటికి 2వేల మెగావాట్ల ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన... యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తేలేదన్నారు.

గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

గుంటూరు : జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు హాజరయ్యారు.

11:41 - March 18, 2017

తమిళనాడు : చెన్నైలో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఇంట‌ర్నేష‌న‌ల్ కారు రేసర్‌ అశ్విన్ సుంద‌ర్ మృతిచెందాడు. ఆ దుర్ఘటనలో ఆయ‌న భార్య కూడా చ‌నిపోయింది. రేస‌ర్ అశ్విన్ న‌డుపుతున్న బీఎండబ్ల్యూ కారు శాంతం హైరోడ్డులో చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో రేసర్‌ అశ్విన్‌ దంపతులు సజీవదహనమయ్యారు. చెట్టును అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చే లోపే కారు పూర్తిగా ద‌గ్ధమైంది. ఈ ప్రమాద ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. 2012, 2013 సంవ‌త్సరాల్లో ఎఫ్‌4 క్యాటిరీల్లో అశ్విన్ చాంపియ‌న్‌గా నిలిచాడు.

11:36 - March 18, 2017

హైదరాబాద్: హీరో సాయిరాం శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్‌, రేష్మీ మీన‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం “నేనోర‌కం''. సుద‌ర్శ‌న్ స‌లేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో దీపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సినిమా హిట్ టాక్ అందుకుంది. ఈ సంద‌ర్భంగా నేనో రకం సినిమా టీంతో చిట్ చాట్. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

11:15 - March 18, 2017

హైదరాబాద్: యూపీలోని ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జంట పేలుళ్లు కలకలం రేపాయి. ఆగ్ర రైల్వే స్టేషన్ సమీపంలో మొదటి పేలుడు సంభవించగా షాహ్గంజ్ ప్రాంతంలో ఓ ఇంటి వెనుకాల రెండో పేలుడు సంభవించింది. ఘటనా స్థలికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు. వీరి పరిశీలనలో బెదిరింపు లేఖ దొరికింది. తక్కువ పవర్ ఉన్న బాంబ్ పేల్చడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు సమాచారం. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

'భవిష్యత్ అవసరాలకోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్'

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ... భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాల్సి వచ్చిందని, కృష్ణా జలాల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఖచ్చితంగా తీసుకు వస్తామని తెలిపారు. కృష్ణా జిల్లాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని, కాంగ్రెస్ నేతలు అడ్డుపడటం వల్లే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యం జరుగుతోందని మంత్రి హరీష్ మండిపడ్డారు.

11:00 - March 18, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఓ దుండగుడు.. వైద్యుడి పేరుతో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుపోయాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మౌలాలికి చెందిన రమ అనారోగ్యంతో గాంధీ చేరింది. అయితే ఆమెకు ఇంజక్షన్‌ ఇస్తానంటూ ఓ ఓ దుండగుడు నమ్మించాడు. ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

సిబ్బంది అవినీతికి పాల్పడితే విధుల్లోంచి తొల‌గిస్తాం.. డీఎంఈ

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డ‌బ్బులిస్తేనే వీల్ చైర్ ఇస్తామ‌న‌టం అవాస్తవమ‌ని డీఎంఈ ర‌మ‌ణి తెలిపారు. ఇదంతా కావాల‌ని చేసిన‌ట్లుగా ఉంద‌ని దీనిపై విచార‌ణకు క‌మిటీ వేశామ‌ని చెప్పారు. ఓ రోగి చిన్న పిల్లలు ఆడుకునే బైక్ పై ఆసుప‌త్రికి వ‌చ్చాడంటే అనేక‌ అనుమానాలు క‌ల్గుతున్నాయ‌న్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే విధుల్లోంచి తొల‌గిస్తామ‌ని హెచ్చరించారు. ఆస్పత్రులలో డ‌బ్బులు అడిగితే వెంట‌నే ఫిర్యాదు చేయాలన్నారు.

10:59 - March 18, 2017

హైదరాబాద్: ఒడిశా కలహంది జిల్లాలో మావోయిస్టుల బీభత్సం సృష్టించారు. కర్లపాటులో కానిస్టేబుల్‌ బోనమల్లి నాయక్‌ను దారుణంగా హతమార్చారు. ఇద్దరు గ్రామస్తులను కిడ్నాప్‌ చేశారు. దీంతో కర్లపాటులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

10:57 - March 18, 2017

హైదరాబాద్: యూపీ సీఎం అభ్యర్ధి ఎంపికపై ఉత్కంఠ వీడడంలేదు. రేపు సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా అభ్యర్ధి ఎవరన్నది మాత్రం తేలలేదు. అయితే ఇవాళ యూపీ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమవుతోంది. ఈ సమావేశంలోనే సీఎం అభ్యర్ధి ఖరారు అయ్యే అవకాశం ఉంది. యూపీ సీఎం రేసులో రాజ్‌నాథ్‌సింగ్‌, మనోజ్‌సిన్హాతోపాటు మౌర్య ఉన్నారు. వీరిలో ఎవరు సీఎం అవుతారన్నది ఉత్కంఠగా మారింది.

ఆగ్రా రైల్వే స్టేషన్లో సమీపంలో జంట పేలుళ్లు

హైదరాబాద్: యూపీలోని ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జంట పేలుళ్లు సంభవించాయి. రైల్వే స్టేషన్ సమీపంలో మొదటి పేలుడు సంభవించగా షాహ్గంజ్ ప్రాంతంలో ఓ ఇంటి వెనుకాల రెండో పేలుడు సంభవించింది. ఘటనా స్థలికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు.

ఉత్తర, దక్షిణ భేదాభిప్రాయాలు తీసుకురావద్దు:వెంకయ్యనాయుడు

హైదరాబాద్: రైతు రుణమాఫీలో ఉత్తర, దక్షిణ భేదాభిప్రాయాలు తీసుకురావద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆర్థిక వనరులను బట్టి ఆయా రాష్ట్రాలు రుణ మాఫీ నిర్ణయం తీసుకుంటాయన్నారు. యూపీ సీఎం అభ్యర్థి పై వస్తున్న వర్తాలు అవాస్తవం అని, సాయంత్రం జరిగే సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని వెంకనాయుడు స్పష్టం చేశాడు.

10:35 - March 18, 2017
10:34 - March 18, 2017

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమించ్చారు. విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి వీలైనంత తక్కువ ఖర్చుతో పారదర్శిక బిడ్డింగ్‌ ద్వారా వెళ్తున్నామన్నారు. 2400 మెగావాట్ల జలవిద్యుత్తు అందుబాటులో ఉందన్నారు. అన్ని వనరులు ఉపయోగించి హైడల్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. సోలార్‌ విద్యుత్తు ఇప్పుడు అంత లాభదాయకంగా లేదన్నారు.

రోడ్డు ప్రమాదంలో రేసర్ అశ్విన్ సుందర్ మృతి

చెన్నై: రోడ్డు ప్రమాదంలో రేసర్ అశ్విన్ సుందర్ మృతి చెందారు. శాంతం హైరోడ్ లో అశ్విన్ కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అశ్విన్ తో పాటు ఆయన భార్య నివేదిత సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

రోగి నగలు కాజేసిన నకిలీ వైద్యుడు

హైదరాబాద్: మహిళా రోగి దృష్టిని మరల్చి ఓ నకిలీ వైద్యుడు ఆమె మంగళ సూత్రాన్ని అపహరించాడు. బాధితురాలు రమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటన గాంధీ ఆసుపత్రిలో జరిగింది.

09:51 - March 18, 2017
09:49 - March 18, 2017

హైదరాబాద్: ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటివాడిననని, విత్తనాన్ని కాపాడుకుంటే పంటను ఎప్పుడైనా పండించుకోవచ్చని.. కాంగ్రెస్‌ నాయకులకు హితబోధ చేశారు.. తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి. మాటకు మాట తన నైజం కాదని, తన ప్రతి మాటకూ పక్కా లెక్క ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ తీరుపై చురకలు వేస్తూనే.. తమ పార్టీలో త్వరలోనే బాహుబలి పుట్టుకొస్తారని అన్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వంపై జానా సెటైర్లు.....

బడ్జెట్‌ సమావేశాల్లో ఆచితూచి మాట్లాడుతూనే.. ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి. బడ్జెట్‌పై వరుసగా గురు, శుక్రవారాల్లో ప్రభుత్వాన్ని ఏకిపారేశారాయన. విద్యుత్తు, డబుల్‌ బెడ్‌రూం పథకం తదితర అంశాలపై ప్రభుత్వ సమాధానం తీవ్ర అసంతృప్తికరంగా ఉందన్నారు జానా. శుక్రవారం అసెంబ్లీ ముగిశాక, మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా జానారెడ్డి తన మనసుని ఆవిష్కరించారు.

తన మాటకు పక్కా లెక్క ఉంటుందన్న జానా.....

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు సమంజసంగా లేదన్న జానారెడ్డి, తన ప్రతి మాటకూ పక్కా లెక్క ఉందన్నారు. తన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సూటి సమాధానాలు ఇవ్వక పోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాను ఆదర్శ రాజకీయాలకు విత్తనం లాంటివాడని, విత్తనాన్ని కాపాడుకుంటే పంటను ఎప్పుడైనా పండించుకోవచ్చంటూ.. పార్టీలోను, రాజకీయాల్లోనూ తనకు దక్కాల్సిన గుర్తింపు గురించి నిక్కచ్చిగా చెప్పారు జానా.

ఎన్నికల నాటికి లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అసాధ్యమన్న జానా.....

వచ్చే ఎన్నికల నాటికి సీఎం చెబుతున్నట్లుగా లక్ష డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం అసాధ్యమన్న జానారెడ్డి, ఊరికి ఇరవై ఇళ్లు కట్టి ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పారు. ఎన్నికల నాటికి ప్రజలకు కేసీఆర్‌పై భ్రమలు తొలగిపోతాయని, అప్పటికి తమ పార్టీలో బాహుబలి పుట్టుకొస్తాడని, అతనే కేసీఆర్‌ పాలనకు శుభం కార్డు వేస్తాడన్నారు. ఇంతకీ కాంగ్రెస్‌లో ఆవిర్భవించే బాహుబలి ఎవరు అన్నదానికి మాత్రం జానా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అన్నదానిపై పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చ జరుగుతోంది.

09:43 - March 18, 2017

ప్రకాశం: జిల్లా చీరాల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తోన్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివపార్వతి అనే మహిళా కూలీ చనిపోగా... మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన 15మంది మహిళా కూలీలు పనికోసం ఒకే ఆటోలో పర్చూరు వెళ్తున్నారు. చీరాల మండలం కారంచేడు దగ్గర ఎడ్ల బండిని ఓవర్‌టేకే సమయంలో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది.

09:41 - March 18, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీలో ఇవాల్టి వాయిదా తీర్మానాలు . భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.

09:39 - March 18, 2017

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పేరును బిజెపి ఖరారు చేసింది. డెహ్రాడూన్‌లో జరిగిన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో త్రివేంద్రసింగ్‌ రావత్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తదితర దిగ్గజ నేతలు హాజరు కానున్నారు. 56 ఏళ్ల త్రివేంద్ర సింగ్‌ 1983 నుంచి 2002 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పనిచేశారు. 2002లో డొయివాలా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన త్రివేంద్రసింగ్‌ అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. త్రివేంద్రసింగ్‌ పిజితో పాటు జర్నలిజంలో డిప్లమా చేశారు. ఆయన భార్య సునీతా రావత్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. రావత్‌ దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు.

టీఎస్ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : నేడు తెలంగాణ అసెంబ్లీలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది.

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా: ఒకరి మృతి

ప్రకాశం: చీరాల సమీపంలో శనివారం ఉదయం కూలీలతో వెళుతున్న ఆటోబోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చీరాల ఆసుపత్రికి తరలించారు.

తిరుమల భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్రసింగ్‌ రావత్‌

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌ సీఎంగా త్రివేంద్రసింగ్‌ రావత్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి శాసనభాపక్షం శుక్రవారం ఆయనను ఏకగ్రీవంగా తమ నేతగా ఎంపిక చేసింది దీంతో ఆయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టటానికి మార్గం సుగమమైంది.

07:21 - March 18, 2017

హైదరాబాద్: రైతు రుణ మాఫీపై కేంద్రానికి జాతీయ విధానం ఉండాల్సిన అవసరం లేదా? యూపీలో రుణమాఫీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రుణమాఫీపై తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? రైతు ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? యూపీలో మాత్రమే రుణమాఫీని కేంద్రం ఇస్తామనడం సరియేనా? అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా? ఇదే అంశంపై గుడ్ మార్నింగ్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిఆర్ ఎస్ నేత దినేష్, బిజెపి ప్రకాష్ రెడ్డి, జనసేన నేత కల్యాణ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:02 - March 18, 2017

కోల్ కత్తా : పశ్చిమబంగలోని మమతాబెనర్జీ సర్కారును కలకత్తా హైకోర్టు చిక్కుల్లో పడేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయస్థానం ఆదేశించింది. అదికూడా కేవలం 72 గంటల్లోనే విచారణ జరిపి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ నిషితా మహత్రే, జస్టిస్‌ టి.చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

సీఎం మమత హయాంలో మూడు అతిపెద్ద కుంబకోణాలు...

పశ్చిమబంగ రాష్ట్రంలో ఇప్పటికే మూడు అతిపెద్ద కుంబకోణాలు వెలుగు చూశాయి. పార్టీ ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ, టపాస్‌ పౌల్‌లు, రోజ్‌వ్యాలీ కుంబకోణంలో 15వేల కోట్ల రూపాయల వరకూ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరినీ సీబీఐ అధికారులు గతంలో అరెస్టు చేశారు. ఇదికాకుండా శారదా కుంబకోణంలోనూ తృణమూల్‌ ప్రజాప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

2016 ఎన్నికల వేళ టీఎంసీ నేతలకు భారీ ముడుపులు....

ఇదే క్రమంలో, 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నారదాన్యూస్‌ సంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఈ వ్యవహారాన్ని రట్టు చేసింది. టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ముగ్గురు మంత్రులు, కోల్‌కతా మేయరు డబ్బులు తీసుకున్నట్లు ఈ సంస్థ వెలువరించిన దృశ్యాల ద్వారా వెల్లడైంది.

దృశ్యాల ఆధారంగా విచారించిన కలకత్తా హైకోర్టు.....

నారదాన్యూస్‌ సంస్థ బయటపెట్టిన దృశ్యాల ఆధారంగా కేసును విచారించిన కలకత్తా హైకోర్టు, ఇందులో మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున, రాష్ట్ర పోలీసులు తోలుబొమ్మల్లా మారారని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన మమతాబెనర్జీ, దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు.

06:58 - March 18, 2017

అమరావతి : ఏపీలో రహదారులు రక్తమోడాయి. గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో ఆటో బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. సుమారు 20మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గురజాల ఆస్పత్రికి తరలించారు. అటు ప్రకాశం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ల వెళ్లే మార్గంలోని కంభం, పోరుమామిళ్ల గ్రామాల మధ్య మూలమలుపులో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు కూలీలు మృతిచెందారు. జంగంగుంట్లకు చెందిన 25మంది కూలీలు తురిమెళ్ల గ్రామం వద్ద పొగాకు ఆకులు కోసుకుని ట్రాక్టర్‌లో వస్తుండగా మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కిందపడ్డ కూలీలపై పొగాకు పడింది. దీంతో వూపిరి ఆడక ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

06:57 - March 18, 2017

ఢిల్లీ: దేశంలోని బాలికల విద్యపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేంద్రం ఏర్పాటుచేసిన సబ్ కమిటీ ఇవాళ ఢిల్లీలో తొలి సమావేశం కానుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది. కమిటీలో సభ్యులుగా అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీరా యాదవ్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్ ఉన్నారు.

 

దేశంలోని బాలికల విద్యపై సబ్ కమిటీ తొలి సమావేశం

ఢిల్లీ: దేశంలోని బాలికల విద్యపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేంద్రం ఏర్పాటుచేసిన సబ్ కమిటీ ఇవాళ ఢిల్లీలో తొలి సమావేశం కానుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది. కమిటీలో సభ్యులుగా అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీరా యాదవ్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్ ఉన్నారు.

06:54 - March 18, 2017

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినందకు మంత్రి అచ్చెంనాయుడు తనను వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణి అనే మహిళ ఆరోపిస్తోంది. ఆమదాలవలస మండలం కోర్లకోటకు చెందిన కళ్యాణి ఆర్.అండ్.బిలో క్లాస్ ఫోర్ ఎంప్లాయిగా పనిచేస్తోంది. పైఅధికారులు తనను వేధిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులపైనే కంప్లైంట్ చేస్తావా అంటూ మంత్రి అచ్చెన్న తనను బెదిరిస్తున్నారని మహిళ ఆరోపిస్తోంది.

ఏడాది నుంచి తనకు జీతం ఇవ్వకుండా...

ఏడాది నుంచి తనకు జీతం ఇవ్వకుండా స్ధానిక అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని కళ్యాణి మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాధు చేసింది. అయితే సదరు ఉన్నతాధికారి మంత్రికి దగ్గరి బంధువు కావడంతో నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చన్న తనను బూటుతో తన్నారని కళ్యాణి ఆరోపిస్తోంది. తనకు జరిగిన అన్యాయాన్ని అమరావతిలో సీఎం దృష్టికి తీసుకు వెళ్లాననే కోపంతో మంత్రి తనపై తప్పుడు కేసులు బనాయించారని అంటోంది.

15వ తేదీన కళ్యాణి అమరావతి సెక్రటేరియట్ వద్ద ఆత్మహత్యాయత్నం ...

ఈనెల 15వ తేదీన కళ్యాణి అమరావతి సెక్రటేరియట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. కళ్యాణిని అమరావతిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కళ్యాణిని రిమాండ్‌కు పంపించారు. దీంతో వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన కళ్యాణి మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళనకు దిగింది. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం సంపాదించావంటూ వేధిస్తున్నారని కళ్యాణి సోదరుడు ఆరోపిస్తున్నాడు. లీసులు మాత్రం కళ్యాణికి మతిస్థిమితం లేకపోవటంతో వింతగా ప్రవర్తిస్తుందని చెబుతున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా... స్థానికంగా కళ్యాణి ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీకాకుళం రిమ్స్ వద్ద కళ్యాణి అనే మహిళ ఆందోళన

శ్రీకాకుళం: రిమ్స్ ఆసుపత్రి వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది..జిల్లా మంత్రి అచ్చెంనాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళనకు దిగింది... ముఖ్యమంత్రికి ఫిర్యాధు చేసినందుకు మంత్రి తనపై కక్ష సాధింపులకు దిగుతున్నారని మహిళ ఆరోపిస్తోంది. ఇదే మహిళ ఈనెల 5న అమరావతి సెక్రటేరియట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది.

 

06:51 - March 18, 2017

హైదరాబాద్: ఐదు నెలలకు పైగా.. నాలుగు వేల కిలోమీటర్లు దాటి సాగుతోన్న సీపీఎం మహాజన పాదయాత్ర ఈనెల 19న ముగుస్తుంది. పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని బృందం.. అలుపెరుగకుండా, అవిశ్రాంతంగా.. తెలంగాణలోని ప్రతి పల్లెనూ పలుకరిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాగుతోంది. దేశ చరిత్రలోనే.. అత్యధిక దూరం సాగిన పాదయాత్రగా మహాజన పాదయాత్ర రికార్డు సృష్టించింది. ఈనెల 19న యాత్ర ముగింపు సభను హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ అవుట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముగింపు సభకు పూర్తయిన ఏర్పాట్లు....

ఈనెల 19న ఆదివారం నాడు జరిగే మహాజన పాదయాత్ర ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌ తదితర వామపక్ష, సామాజిక, ప్రజాసంఘాల నేతలు ఈ సభలో పాల్గొంటారు. అంతకుముందు.. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ముగింపు పాదయాత్ర సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమవుతుంది. మరో యాత్ర వనస్థలిపురం స్పెన్సర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఎం అనుబంధ సంఘాలు.. తమ విభాగాల శ్రేణులను, ప్రజలను కోరాయి.

చరిత్రలో నిలిచిపోయే విధంగా ముగింపు కార్యక్రమం...

పాదయాత్రల చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని... చరిత్రలో నిలిచిపోయే విధంగా, లక్షిత వర్గాల వారందరికీ పాదయాత్ర ఫలాలు చేరాలన్న లక్ష్యంతో రూపొందిస్తున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మహాసభ ప్రారంభమవుతుంది.

06:47 - March 18, 2017

అమరావతి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది.. రికార్డు స్థాయిలో మూడు జిల్లాల్లో 99శాతం పోలింగ్‌ నమోదైంది.. ఈ నెల 20న కౌంటింగ్ జరగనుంది..

నెల్లూరు జిల్లాలో 99.9 శాతం ఓటింగ్‌

నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 99.9 శాతం పోలింగ్‌ నమోదైంది.. ఐదు డివిజన్లలో 852 ఓట్లకు గాను 851మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేటలో నూటికి నూరుశాతం ఓట్లు పోలయ్యాయి.. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలవరకూ కొనసాగింది..

టీడీపీనుంచి వాకాటి నారాయణరెడ్డి.....

ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి వాకాటి నారాయణరెడ్డి, వైసీపీనుంచి ఆనం విజయ కుమార్‌ రెడ్డి పోటీపడ్డారు.. రెండు పార్టీలవారు తమ పార్టీ ఓటర్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు.. ఓటర్లను పదిరోజులకుపైగా ఇతర రాష్ట్రాల్లో ఉంచారు.. టీడీపీ తమ ఓటర్లను తమిళనాడుకు తీసుకువెళ్లగా... వైసీపీ తెలంగాణకు తరలించింది... వీరందరినీ బస్సుద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చారు.

కర్నూలు జిల్లాలో 99.35శాతం పోలింగ్‌.....

కర్నూలు జిల్లాలోనూ 99.35శాతం ఓటింగ్‌ నమోదైంది.. జిల్లాలో వెయ్యి 84ఓట్లుంటే... వెయ్యి 77 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డి బరిలోఉన్నారు. రెండు పార్టీలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు క్యాంప్‌ శిబిరాలనుంచి నేరుగా పోలింగ్‌కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు.. నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి వీల్‌చైర్‌లోవచ్చి కర్నూలు పోలింగ్‌ సెంటర్లో ఓటు వేశారు.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతోపాటు.. శ్రీశైలం, ఎమ్మిగనూరు, డోన్‌ ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. అయితే పోలింగ్‌ పూర్తికాగానే ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి..

కడపలో 99శాతం ఓటింగ్‌....

కడపలోకూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ఇక్కడకూడా 99శాతం ఓటింగ్‌ నమోదైంది.. జిల్లాలో 841ఓట్లుఉంటే... 839మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. రాజంపేట మండలం ఊటుకూరు ఎంపీటీసీ సుహ్రులత ఓటు చెల్లదంటూ హైకోర్టు తీర్పుతో ఆమె ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.. గతంలో వైసీపీనుంచి గెలిచి టీడీపీలోకి రావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.. మరో ఎంపీటీసీ లక్ష్మీదేవి అనారోగ్యం వల్ల ఓటు వేయలేకపోయింది.. ఇక్కడ వైసీపీనుంచి వైఎస్‌ వివేకానంద రెడ్డి, టీడీపీనుంచి బీటెక్‌ రవి పోటీలో ఉన్నారు.. మూడు జిల్లాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.. ఈ నెల 20న జరిగే కౌంటింగ్‌లో విజేతలెవ్వరో తేలనుంది..

06:44 - March 18, 2017

హైదరాబాద్: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో బడ్జెట్‌ చర్చ వాడివేడిగా సాగింది. మంత్రి కేటీఆర్‌, బీజేపీ సభ్యుడు ఎన్‌ రామచంద్రరావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రైతు రుణమాఫీపై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణకు వర్తింపచేయని రుణమాఫీ, యూపీలోనే ఎందుకు ప్రకటించారని, యూపీకి ఒకనీతి, తెలంగాణకు మరోనీతా..? అని కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. బంగారు తెలంగాణ చేస్తారనుకుంటే.. బకాయిల తెలంగాణగా మారుస్తున్నారని బీజేపీ సభ్యుడు ఎన్‌. రామచంద్రరావు ఎద్దేవా చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఈ విధంగా స్పందించారు. రైతుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నిందించడం కాకుండా నిధులివ్వాలన్నారు.

కొంతకాలంగా కేంద్రంతో సయోధ్యగా....

కొంతకాలంగా కేంద్రంతో సయోధ్యగా ఉంటోంది టీఆర్‌ఎస్‌. మోదీ తీసుకున్న డిమానిటైజేషన్‌ విధానానికి కూడా కేసీఆర్‌ మద్దతు తెలిపారు. ఇటీవల ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం మోదీని అభినందిస్తూ.. కేసీఆర్‌ లేఖ కూడా రాశారు. అయితే.. యూపీలో అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దీన్ని అస్ర్తంగా చేసుకుంటోంది టీఆర్‌ఎస్‌. అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్‌ రుణమాఫీ సహాయం కోరితే.. కేంద్రం పెద్దగా స్పందించలేదు. దీంతో రాష్ర్ట ప్రభుత్వమే విడతల వారీగా రుణమాఫీ చేస్తోంది. రైతు రుణమాఫీ హామీతో యూపీలో అధికారం చేపట్టబోతున్న బీజేపీపై టీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది.

ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని తెలంగాణకు ...

విభజన అనంతరం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని తెలంగాణకు మాత్రం ఎందుకు ప్రకటించడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతురుణ మాఫీకి సహకరించకపోవడంతో పాటు ఇప్పటి వరకు తెలంగాణాలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు లెవనెత్తడం లేదని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

బీజేపీపై టిఆర్ ఎస్ ముప్పెట దాడి

హైదరాబాద్: కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ... ఇప్పుడు బీజేపీపై ముప్పెట దాడికి దిగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో రైతు రుణమాఫీపై బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని అధికార పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. తెలంగాణకు మోదీ ప్రధాని కారా..? అని ప్రశ్నిస్తోంది. ఏపీకి ప్రకటించిన విధంగానే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తోంది.

 

06:39 - March 18, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులకు భూసేకరణ, విద్యుత్‌ సరఫరా, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలపై వాడివేడి చర్చ జరిగింది.. శుక్రవారం సభ ప్రారంభంకాగానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూలాంటి వ్యాధులు, ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సపై ప్రతిపక్ష సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.. వీటికి మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు.. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో నిర్మించాలని భావిస్తున్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు భూసేకరణపై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి, మంత్రి హరీశ్‌రావు మధ్య వాగ్వాదం జరిగింది.. భూసేకరణకు రైతుల్ని తాను ఒప్పిస్తానని... ప్రాజెక్టు త్వరగా పూర్తిచేయాలని కోమటిరెడ్డి కోరారు.. దీనిపై స్పందించిన హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ నేతలవల్లే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు.. 123 జీవోను వెనక్కి తీసుకుంటే పదినెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తానంటూ సవాల్‌ విసిరారు..

మంత్రి సమాధానం పై కోమటిరెడ్డి అసహనం...

మంత్రి సమాధానంపై కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రాజెక్టు పూర్తిచేయమంటే ఈరకంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు..

టీబ్రేక్ తరువాత....

టీ బ్రేక్‌ తర్వాత సభలో బడ్జెట్‌పై చర్చ జరిగింది.... బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సందేహాలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు.. అనంతరం సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌పై మాట్లాడారు.. ప్రతిపక్ష సభ్యులతీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

కేసీఆర్‌ విమర్శలపై స్పందించిన జానారెడ్డి ...

కేసీఆర్‌ విమర్శలు, విద్యుత్‌ అంశంపై జానారెడ్డి స్పందించారు.. డిస్కంలకు పదివేల కోట్ల రూపాయల లోటు ఏర్పడుతుందని దీన్ని ఎలా పూడుస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు..

సభలో కిషన్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌మధ్య కూడా ...

సభలో కిషన్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌మధ్య కూడా హాట్‌ హాట్‌ చర్చ నడిచింది.. సర్‌చార్జీ రద్దుకు సంబంధించి టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన హామీలేఖతోపాటు... ఇదే విషయంపై ఓ రైతు ఆవేదన లెటర్‌ను శాసనసభ సాక్షిగా సీఎంకు పంపానని గుర్తుచేశారు.. సర్‌ చార్జి తొలగించాల్సిందిపోయి అన్నదాత పొలానికి కరెంటు కనెక్షన్‌ తొలగించారని ఆరోపించారు.. పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టులకు భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సంగతేంటని ప్రశ్నించారు..

కిషన్‌ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్‌ సమాధానం...

కిషన్‌ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్‌ సమాధానమిచ్చారు.. పరిహారం ఇచ్చాకే తాము ప్రాజెక్టులకు భూమి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు... వచ్చే రెండేళ్లలో రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని స్పష్టం చేశారు..

సున్నం రాజయ్య సూచనపై స్పందించిన సీఎం...

గిరిజన ప్రాంతాల్లోకూడా లంబాడీలు, కోయలకు గొర్రెలు, మేకలు ఇవ్వాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు.. అలాగే కమ్యూనిజంపై సీఎం వ్యాఖ్యలు సరికావని సూచించారు..సున్నం రాజయ్య సూచనపై స్పందించిన సీఎం... ప్రపంచంలోనే కమ్యూనిజం సిద్ధాంతం చాలా గొప్పదని చెప్పారు.. కాలానికి అనుగుణంగా మారకపోవడంవల్లే పార్టీకి ఇబ్బందులని అభిప్రాయపడ్డారు.. సీఎం సమాధానం తర్వాత సభ రేపటికి వాయిదాపడింది..

06:35 - March 18, 2017
06:34 - March 18, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారి మైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వివిధ అంశాలపై చర్చించేందుకు వెలగపూడి సచివాలయంలో మలేసియా, ఆస్ట్రేలియాకు చెందిన విదేశీ ప్రతినిధులు సీఎంతో సమావేశం అయ్యారు.

మైనింగ్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారాలు

మైనింగ్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో మైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసేలా తమ దేశంలోని కర్టిన్ యూనివర్సిటీ తగిన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

గ్రీన్ బెల్ట్ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పట్టణాలు, నగరాలతో పాటు అమరావతిలోనూ వాన నీటి సంరక్షణతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు వీలుగా సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఆస్ట్రేలియా ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన మలేసియా

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటులో సహకరించేందుకు మలేసియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలుత అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటుచేయనున్నారు. ఏప్రిల్ నెలలో మలేసియా ప్రధానమంత్రి భారత్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల ప్రధానమంత్రుల సమక్షంలో దీనికి సంబంధించిన జీటూజీ, లేదా బీటూబీ ఒప్పందాలు జరగనున్నాయి.

Don't Miss