Activities calendar

19 March 2017

22:14 - March 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. మాట్లాడించే పాత్ర ఇష్టమని, చాలా ముఖ్యమైన విషయాలు వక్తలు పేర్కొన్నారని తెలిపారు. పాదయాత్ర విశేషాలు చెప్పాలంటే గంటన్నర టైం పడుతుందని, 154 రోజుల పాటు యాత్ర చేయడం జరిగిందన్నారు. ఈ పాదయాత్ర మరుపురాని అనుభూతినిచ్చిందన్నారు. రాజకీయాల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమౌతాయని, ఒక ఏజెండా కోసం రాజకీయ పార్టీలు కొట్లాడాలన్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్ కు...గత పాలకులు అర్థం కావడం లేదన్నారు. 1520 గ్రామాలు తిరగడం జరిగిందని, తెలంగాణ రాక ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించి ప్రాణాలు అర్పించిన యువత..అడ్డా..కూలీలపై పని చేస్తున్నారు. పాలించే విధానంలో తప్పు ఉందన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవితాల మార్పు అని, వైద్యం...విద్య..ఉద్యోగం..సరిపడా వేతనం ఉండాలని సూచించారు. ఇవి ఉంటే మార్పు వస్తుందని, ఇవన్నీ ఇస్తాయని కేసీఆర్ చెప్పి ఇవ్వలేదన్నారు. తమకు పాదయాత్రలో చూడడం జరిగిందని, మారుమూల ప్రాంతాల్లో పిట్టల్లా ప్రజలు రాలుతున్నారని తెలిపారు. ఉద్యమానికి సపోర్టు ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉందో చూడాలని, శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని నిధులు కేటాయించాలని చెబితే కేవలం కొన్నింటిని మాత్రమే కేటాయించారన్నారు. పరిశ్రమలు తెరిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమలు మూత పడుతున్నా కళ్లు అప్పగించి చూస్తున్నారని, కేసీఆర్ ఖబడ్దార్ అనే హెచ్చరిక చేయాల్సినవసరం వచ్చిందన్నారు. సామాజిక న్యాయమే తెలంగాణ అభివృద్ధికి మార్గం అని మరోమారు స్పష్టం చేశారు. కులాల ఘర్షణ కాదని, వీరి అభివృద్ధి చెందకుండా అభివృద్ధి అనేది అసాధ్యమన్నారు. మాటలతో..చేతలతో కాదని..20 శాతం ఉచితంగా విద్య చెబుతారా ? లేదా ? అని ప్రైవేటు స్కూళ్ల ఎదుట కూర్చొంటామన్నారు. పెద్ద ఎత్తున్న ఉద్యమం వస్తుందని, 22 లక్షల మందికి ఇళ్లు కటిస్తామని చెప్పారని, కానీ కట్టివ్వడం లేదన్నారు. ఇదే కొనసాగితే మీ బెడ్ రూంలో నిద్రపోనివ్వమన్నారు. ఖచ్చితంగా ఇళ్లు కేటాయించాల్సిందేనన్నారు.

పోడు భూముల కోసం..
పోడు భూముల కోసం పోలీసులను పంపిస్తే మళ్లీ మన్యం పోరాటం జరుగుతుందన్నారు. ప్రత్యక్షంగా పోలీసులు..గిరిజనులు తలపడే పరిస్థితి నెలకొంటుందన్నారు. చట్టాలను తుంగలో తొక్కుతున్నారని, కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, లాల్..నీల్ జెండాలు కలిసి పోరాటం చేస్తాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకున్నారని, దీనికోసం ఉద్యమం చేస్తే నిర్భందం ప్రయోగిస్తున్నారని తెలిపారు. ఇవి ఎంతోకాలం సాగవన్నారు. రాజ్యాధికారంలో వాటా రావాలని, సమన్యాయం జరిగి తీరాల్సిందేనన్నారు. మీ విధానం మార్చుకోకపోతే మీరే మారాలని పిలుపునిస్తామని, భవిష్యత్ కార్యాచరణ ఈ వేదిక చూపెడుతుందని తెలిపారు. రాజ్యాధికారం సాధించే దాక ఈ వేదిక కొనసాగాలని ఆకాక్షిస్తున్నట్లు, కలిసొచ్చే శక్తులను ఏకం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల విషయం పక్కన పెడితే మరో జన్మలో కూడా సీపీఎం, సీపీఐ కలిసి ఉంటాయన్నారు. వామపక్షాల ఐక్యతను మరింత పటిష్టం చేస్తామని, అందర్నీ ఐక్యం చేసేలా ప్రయత్నాలు చేస్తామని అందుకే సభకు అందర్నీ పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాజకీయ ముఖచిత్రం మారిపోతోందని, ఇప్పటికే దడ పుట్టిస్తోందన్నారు. పొద్దున నుండి రాత్రి వరకు అన్నీ అబద్ధాలే చెబతున్నారని దీనికి పేపర్ పెట్టాలని అంటున్నామని, బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గొర్రెలు కొంటామని ప్రకటించారని, ఎక్కడి నుండి కొంటారని ప్రశ్నించారు. ముస్లింలపై ప్రేమ ఉంటే ఒక చట్టం చేయాలని పేర్కొన్నారు. ముస్లింలకు మత ప్రాదికన రిజర్వేషన్ లు ఇవ్వడంపై వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ మౌనంగా ఉండిపోయారని తెలిపారు. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సరిపోతుందని, దమ్ముంటే పనిచేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరింది మొట్టమొదట డిమాండ్ చేసింది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిర్వీర్యం చేస్తున్నారని, మోడీ ప్లాన్ తీసినా సరే ఒక రాష్ట్రంలో ప్లాన్ తీయాల్సినవసరం లేదన్నారు. మహిళ సాధికారితపై మాట్లాడుతున్నారని..సిగ్గు లేదా అని నిలదీశారు. మంత్రివర్గంలో ఒక్క మంత్రి కూడా లేదని, వారి బిడ్డను మాత్రం దేశ, విదేశాల్లో తిరిగిపిస్తూ మహిళా సాధికారితపై మాట్లాడిస్తారని ఎద్దేవా చేశారు.

సమరం కొనసాగాలి..
ప్రజా ఉద్యమాలు రాక తప్పదని, లాల్..నీల్ జెండాలు కలిసి పనిచేస్తాయని అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మహాజన పాదయాత్ర ఆశ్వీరదించారో అదే రీతిగా సామాజిక సమరంలో సైనికుల్లా కదలాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా 13 కి.మీటర్ల మేర పాదయాత్ర జరగడం విశేషమని, ఇంత రాత్రి అయినా ఇక్కడ కూర్చొని ప్రసంగాలు వింటుండడం ఆనందం కలిగిస్తోందన్నారు. శరీరం..ఆరోగ్యం. కాదు..మనస్సులో ఒక పెద్ద రాజకీయ సంకల్పం ఉండాలని ఇవి లేకపోతే యాత్ర సాగదన్నారు. శరీరానికి ఆక్సిజన్ ఇచ్చింది ప్రజలేనని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఈ సమరం కొనసాగాలని పిలుపునిచ్చారు. 

మైనర్ బాలిక పై వారం రోజుల పాటు గ్యాంగ్ రేప్

 

రాజ్ కోట్: 14 ఏళ్ళ మైనర్ బాలిక పై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

దేశానికే స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది: ప్రొ.మురళీ మనోహర్

హైదరాబాద్: మహాజన పాదయాత్ర తెలంగాణాకే కాక దేశానికే స్పష్టమైన మెసేజ్ ఇచ్చిందని ప్రొ.మురళీ మనోహర్ అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న సామాజిక సమర సమ్మేళనం సభలో ఆయన మాట్లాడుతూ...సామాజిక వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించే విధంగా పాదయాత్ర స్పష్టమైన మెసేజ్ ఇచ్చిందన్నారు. 

రికార్డు బద్దలు కొట్టారు

 

రాంచీ టెస్టు: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్టులో పుజారా,సాహ 69 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టారు. 1948లో అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో హేమ అధికారి-విజయ్ హజరే ఏడో వికెట్ కు 132 పరుగులు జోడించారు.

కాంగ్రెస్ వీడి మంత్రి అయ్యారు

 

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషికి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కింది. బహుగుణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ భార్య పై గెలిచారు.

19:42 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహాజన పాదయాత్ర నిర్వహించిన తమ్మినేని బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్ర విజయవంతం కావడం అనేది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదహారణ అని తెలిపారు. తెలంగాణ సమాగ్రాభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించాలన్నారు. చర్చించే సమయం లేకపోతే సీపీఎం సూచించిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సీపీఎం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిందని, వీటి ద్వారా సమస్యలకు పరిష్కరించే విధంగా చూడాలి. సమాజంలో మార్పులు రావాల్సి ఉందని, అట్టడుగున ఉన్న వారి సమస్యలు పరిష్కరించాలని ఇవన్నీ క్షేత్రస్థాయిలో వెళితే తెలుస్తుందన్నారు. అట్టడుగున్న వారి అభివృద్ధి కాకపోతే అది అభివృద్ధి అనరని తెలిపారు. సీపీఎం విడుదల చేసిన సమగ్ర ప్రణాళికపై చర్చించాలని, సామాజిక న్యాయమే తగిన పరిష్కారమన్నారు. కేసీఆర్, బీజేపీ, ఆరెస్సెస్ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మహాజన పాదయాత్ర విజయవంతం అవ్వడం కమ్యూనిస్ట్ మరియు సామాజిక శక్తుల ఘనత అని తెలిపారు. సబ్ ప్లాన్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు కావడం లేదని, సబ్ ప్లాన్ ల ద్వారానే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. విభజన జరిగిన అనంతరం విధానాలు మారలేదని, అంతకుముందున్న సమస్యలు..విధానాలు పునరావృతమయ్యాయన్నారు. మహాజన పాదయాత్ర భారత దేశ మెజారిటీ ప్రజల బతుకుల్లో మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం కొత్త మలుపు అవుతుందన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మరింత వినాశకర విధానాలు అవలింబిస్తోందని, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలు లేవని కేవలం కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పాటు పని కల్పించాలని ఉండేదని, దీనిని ప్రస్తుతం నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ హాయాంలో కాషాయ బీభత్సం జరుగుతోందని, ముఖ్యంగా మైనార్టీ వర్గాలపై జరుగుతోందన్నారు. ఎలా ఉండాలి..ఏమి తినాలి..ఇతరత్రా వాటిపై మాట్లాడుతున్నారని, పశువుల వ్యాపారాన్ని కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. అజ్మీర్ పేలుళ్లలో సంఘ్ పరివార్ ప్రమేయం ఉందని పేర్కొన్నారు.

సామాజిక పోరాటాలు జరుగుతున్నాయని, విద్యార్థుల పోరాటాలు నిలబడాలని పేర్కొన్నారు. బీజేపీ గొప్ప విషయాలు సాధించలేదని, గోవా, మణిపూర్ లలో అనైతికంగా పాలన చేపట్టారని, యూపీలో గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. కేరళలో ప్రభుత్వం దీర్ఘకాలిక పథకాలు తీసుకున్నామని, హరిత కేరళ అనీ పేరు పెట్టామన్నారు. వైద్యం అందరికీ అందే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు.

వరంగల్ లో నిట్ విద్యార్థి ఆత్మహత్య

 

వరంగల్: జిల్లాలోని నిట్ లో సివిల్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థి మహారాష్ట్ర చెందిన సాకేత్ కమార్ గా గుర్తింపు. విద్యార్థి హాస్టల్ భవన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు తెలిపారు. 

19:31 - March 19, 2017

మణిపూర్ లో ఆర్థిక దిగ్బంధనం ఎత్తివేత

 

ఇంఫాల్: గత నాలుగున్నర నెలల నుంచి మణిపూర్ ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలు ఈ రోజుతో తీరిపోనున్నాయి.ఆదివారం రాత్రి నుంచి యునైటెడ్ నాగా కౌన్సిల్(యుఎసీ)నిరసను విరమిస్తున్నట్టు ప్రకటించింది.

18:26 - March 19, 2017

హైదరాబాద్: నీల్- లాల్ జెండా రెండూ కలిస్తే ఎవరూ ఆపలేరని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న సమర సమ్మేళనం సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర లాంటి యాత్రను మావో సేటుంగ్ లాంగ్ మార్చ్ తప్ప .. వేరే పార్టీ ఇంత సుదూర పాదయాత్ర చేసినట్లు చరిత్ర ఎక్కడా లేదు. ప్రజల సమస్యల ను గుర్తించి పాదయాత్ర సందర్భంగా ప్రతి రోజూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారని.. వాటన్నింటిని సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏం సాధించారని సీతారం ప్రశ్నించారు. తెలంగాణ లో ప్రారంభం అయిన సామాజిక న్యాయం స్లోగన్ తో దేశవ్యాప్తం ఉద్యమం ప్రారంభం అయ్యిందన్నారు. హిందూ సమాజాన్ని ఏర్పాటు చేస్తామని యూపీ రాజకీయాలద్వారా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నిరూపిస్తోందన్నారు. మోడీ ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేయడం వల్ల సామాజిక, ఆర్థిక రంగాల్లో దౌర్జాన్యాలు పెరుగుతున్నాయి. సామాజిక న్యాయం పేరుతో లాల్- నీల్ జెండాను కలిపుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి.. దోపిడీ లేని సమాజాన్ని నిర్మిస్తామని తెలిపారు.  

సమర సమ్మేళన సభకు చేరుకున్న కేరళ సీఎం

హైదరాబాద్: సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న సమర సమ్మేళన సభకు కేరళ సీఎం, సీపీఎం జాతీయ నేత పినరయి విజయన్ చేరుకున్నారు. కేరళ సీఎం కు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

కేసీఆరే ముక్కు నేలకు రాయాలి : చాడ వెంకట్ రెడ్డి

హైదరాబాద్: కమ్యూనిస్టులను సీఎం కేసీఆర్ సన్నాసుల పార్టీ అన్నారని... కమ్యూనిస్టులు సన్నాసులు కాదని సకల జనుల ఆర్తనాధాలకు అద్దంపట్టేవారే కమ్యూనిస్టులు అని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో సమర సమ్మేళనం సభలో ఆయన మాట్లాడుతూ... సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర విజయవంతం అయ్యిందని, పాదయాత్రలో 9 మంది నవరత్నాలు పాల్గొన్నారని తెలిపారు.

సన్నాసుల రాజ్యంలో ఉన్నం: అద్దంకి దయాకర్

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో సన్నాసుల రాజ్యం నడుస్తోందని తెలంగాణను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సరూర్ నగర్ లో జరుగుతున్న సమర సమ్మేళనం సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణను దోచుకుంటున్న సీఎం కేసీఆర్ ను తన్ని తరమే రోజు వస్తోందని హెచ్చరించారు. కేంద్రంలో పెళ్లి కాని ఒక సన్నాసి, యూపిలో మరో సన్నాసి సీఎం అయ్యారని, కానీ ఇక్కడ ఉన్న సన్నాసికి పెళ్లయి పిల్లులున్న తెలంగాణ సీఎం సన్నాసికేమయిందని ఉద్వేగ భరిత ఉపన్యాసం చేశారు. సామాజిక యుద్ధం ఈ వేదిక నుండి ప్రారంభం అయ్యిందని స్పష్టం చేశారు. ఖబ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు.

17:57 - March 19, 2017

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో సన్నాసుల రాజ్యం నడుస్తోందని తెలంగాణను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సరూర్ నగర్ లో జరుగుతున్న సమర సమ్మేళనం సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణను దోచుకుంటున్న సీఎం కేసీఆర్ ను తన్ని తరమే రోజు వస్తోందని హెచ్చరించారు. కేంద్రంలో పెళ్లి కాని ఒక సన్నాసి, యూపిలో మరో సన్నాసి సీఎం అయ్యారని, కానీ ఇక్కడ ఉన్న సన్నాసికి పెళ్లయి పిల్లులున్న తెలంగాణ సీఎం సన్నాసికేమయిందని ఉద్వేగ భరిత ఉపన్యాసం చేశారు. సామాజిక యుద్ధం ఈ వేదిక నుండి ప్రారంభం అయ్యిందని స్పష్టం చేశారు. ఖబ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. దమ్మూ ధైర్యం, చేవలేని ప్రభుత్వం తెలంగాణ లో నడుస్తోందని అందూ ఆలోచించాలని సూచించారు.

'మహాజన పాదయాత్ర వల్ల ఎంబీసీలకు వరాలు'

హైదరాబాద్: మహాజనపాదత్ర మొదలైన తరువాత ఎంబీసీలకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారని లంబాడీ హక్కుల నేత బెల్లం నాయక్ తెలిపారు.

డబ్బున్నోడికి చదువు.. ఎక్కడ మెరిట్: జస్టిస్ చంద్ర కుమార్

హైదరాబాద్: పేదలకు చదువును దూరం చేస్తున్నారని, డబ్బున్నోడికి చదువు అందుతోందని జస్టిస్ చంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ కు చదువు అందడం లేదని... నారాయణ కాలేజీల్లో వేలకు వేలు కడితేనే చదువుతు అందుతోందన్నారు. వైద్యం అందక దళితులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేదని చెప్పడం సీఎం కేసీఆర్ కు సిగ్గు ఉండాలన్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులు లేకుండా నాశనం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.

ఆర్టీసి కళ్యాణ మండపం వద్ద ఏబీవీపీ కార్యకర్తల బీభత్సం

హైదరాబాద్ : ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేరళ సీఎం పినరయి విజయన్ మళయాళీల ఆత్మీసభ లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు కేరళ సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ హైదరాబాద్ వస్తే తల నరికేస్తామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడైనా.. ఎవరైనా రావచ్చు.. తమ మనోభావాలు తెలియపరిచే అంశాలను కూడా ఆర్ ఎస్ ఎస్ నేతలు, బిజెపి, ఏబీవీపీ కార్యకర్తలు మర్చినట్లు ఈ ఘటన నిరూపితం చేస్తోందని ప్రజాతంత్ర వాదులు మండిపడుతున్నారు.

నాలుగవ రోజు ముగిసిన ఆట ఆస్ట్రేలియా 23/2

 

 

రాంచీ టెస్టు: నాలుగవ రోజు ఆటముగిసే సమయనికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో

2 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది. జడేజా 2వికెట్లు తీశాడు.

16:51 - March 19, 2017

హైదరాబాద్: మహాజన పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు అసమానతలు మా దృష్టికి వచ్చినట్లు సీపీఎం నేత జాన్ వెస్లీ పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర ముంగిపు సభ సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోమని పిలుపు ఇచ్చినా జయప్రదం చేసినందు ప్రజలకు విప్లవ జేజేలు చెప్పారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను నిర్వహించాం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సమగ్రంగా అమలు చేయాలని, సరైన నిధులు కేటాయించాలని యాత్రను నిర్వహించాం. పాదయాత్ర ద్వారా దళితులు, గిరిజనులు, వెనకబడి వర్గాలు, అగ్రకుల పేదల స్థితిగతులను అధ్యయనం చేవామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై పలు అసమాతలు మా దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వైద్యం అందక ప్రజలు పిట్టలు రాలినట్లు రాలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలతో కిక్కిరిసిన సభా ప్రాంగణం

 

హైదరాబాద్: సరూర్ నగర్ లో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ. లక్షలదిగా తరలివచ్చిన ప్రజలు. ప్రజలతో కిక్కిరిసిన సభా ప్రాంగణం.

మళయాళీలతో కేరళ సీఎం ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్: కేరళ సీఎం పినరై విజయన్ హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో మళయాళీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.

16:43 - March 19, 2017

హైదరాబాద్: కేరళ సీఎం పినరై విజయన్ హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో మళయాళీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

16:35 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సంక్షేమం కోసం చేపట్టిన సీపీఎం నేత తమ్మినేని ఆధ్వర్యం లో చేపట్టిన మహాజన పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్, ఎంపి కవిత ప్రకటించినా అద్వితీయంగా జరిగిందని తెలిపారు. అంతే కాకుండా టీఆర్ ఎస్ నాయకులు నీడనిచ్చి, అన్నం కూడా పెట్టారని తెలిపారు. పార్టీల తో నిమిత్తం లేకుండా మహాజన పాదయాత్రను విజయవంతం చేశామని తెలిపారు. సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సమరం సృష్టించేందుకు సామాజిక సమర సమ్మేళనం పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.

సామాజిక సమ్మేళనం సభ ప్రారంభం

హైదరాబాద్: సరూర్ నగర్ స్టేడియంలో సామాజిక సమ్మేళనం సభ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు వేధిక పైకి నాయకులకు ఆహ్వానం పలికారు. 

15:57 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 2016 అక్టోబర్ 17న ఇబ్రహీం పట్నంలో ప్రారంభం అయిన మహాజన పాదయాత్ర నేటితో ముగియనుంది. సరూర్ నగర్ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. ఈ సందర్భంగా లాల్ - నీల్ సలాం చెప్తు ఓ పాట... మీరూ వినాలకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు భారీగా తరలివస్తున్న ప్రజలు

 

హైదరాబాద్: సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు భారీగా తరలివస్తున్న అన్ని వర్గాల ప్రజలు. లాల్ నీల్ జెండాలతో రెపెపలాడుతోన్న హైదరాబాద్ నగరం. ఎరుపు, నీలం జెండాలతో కార్యకర్తల కవాత్తు నిర్వహిస్తున్నారు.

కోలాహలంగా సరూర్ నగర్ స్టేడియం

హైదరాబాద్: సరూర్ నగర్ స్టేడియం సీపీఎం కార్యకర్తలు, అభిమానులతో కలకలాడుతోంది.సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సామాజిక సమ్మేళనం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్ర ముగింపు సభ సరూర్ నగర్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

సరూర్ నగర్ స్టేడియానికి తమ్మినేని బృందం

హైదరాబాద్: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సామాజిక సమ్మేళనం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్ర బృందం సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీగా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

15:49 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సామాజిక సమ్మేళనం సభకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక పోరాటం నడుపుతున్నామని, మహాజన పాదయాత్రకు సంపూర్ణ మద్దతుతెలియజేస్తున్నాం అన్నారు. లాల్, నీల్ జెండాలు ఏకం కావాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన పాడిన పాట మీ కోసం.. ఈ వీడియోను క్లిక్ చేయండి.

15:33 - March 19, 2017

హైదరాబాద్: కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సిఐటియు నేత సుధాభాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సాగిన మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక నేత సుధాభాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు కోటి మంది దాకా ఉన్నారని వారి కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. జీఓ 14 అంగన్ వాడీ కార్మికుల మీద కత్తిలా వేలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, అన్ని రంగాల కార్మికులకు పీఎఫ్, ఇఎస్ ఐ లాంటి సదుపాయలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లు తీర్చిన కార్మికుల కోర్కెలు చెప్పాలని డిమాండ్ చేశారు.

15:30 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సామాజిక సమ్మేళనం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్ర విజయవంతం అయ్యింది. సీపీఎం నేత సాగర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేపట్టిన తరువాత ప్రభుత్వం ఎంబీసీ లకు సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బీసీ కమిషన్ ను నియమించిందన్నారు. సకల వృత్తులకు సంబంధించిన అంశాలకు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానంది. కానీ దానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. 93 శాతం ఉన్న అభివృద్ధి చెందకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి ధ్యేయంగా

హైదరాబాద్: సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 2016 అక్టోబర్ 17న ఇబ్రహీంపట్నంలో సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది.రాష్ట్రవ్యాప్తంగా 1550లకు పైగా పల్లెలను సందర్శించి వివిధ సమస్యలను అధ్యయనం చేసిన మహాజన పాదయాత్ర నేడు ముగింపు దశకు చేరుకుంది.

కాసేపట్లో మహాజపాదయాత్ర ముగింపు సభ

 

హైదరాబాద్: కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజనపాదయాత్ర ముగింపు సభ జరగనుంది. సభకు కేరళ సీఎం పినరయి, సీపీఎం జాతీయ కార్యదర్శి  సీతారాం ఏచూరి హాజరు కానున్నారు.

15:15 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర ఈ రోజు ముగియనుంది. కాసేపట్లో సర్వ సమ్మేళన సభ పేరుతో సరూర్ నగర్ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో దళితులకు సరైన రక్షణ కల్పించడం లేదు, దళితుపై అగ్రవర్ణాలు పెత్త సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక ఉద్యమం ఆధిపత్యం కోసం ముందుకెల్తామని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా ఎత్తేసేందుకు ప్రయత్నం చేస్తోందని మండి పడ్డారు.

మరికాసేపట్లో సరూర్ నగర్ స్టేడియాని పాదయాత్ర బృందం

హైదరాబాద్: మరికాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో సమరసమ్మేళన సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞానకేంద్రం నుండి బయలు దేరిన సీపీఎం నేత తమ్మినేని బృందం తిలక్ నగర్, అంబర్ పేట, దిల్ షుక్ నగర్, వనస్థలీపురం మీదుగా సరూర్ నగర్ చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరై విజయన్, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొననున్నారు.

పుజారా డబుల్ సెంచరీ

రాంచీ టెస్టు: మూడో టెస్టులో పుజారా డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. పుజారా 521 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. పుజారాకు టెస్టుల్లో ఇది మూడోవ డబుల్ సెంచరీ, ఆస్ట్రేలియా పై రెండవ సెంచరీ.

 

దిల్ షుక్ నగర్ కు చేరుకున్న తమ్మినేని బృందం

హైదరాబాద్: ఎస్వీవీకే నుంచి ప్రారంబమైన సీపీఎం మహాజన పాదయాత్ర దిల్ సుఖ్ నగర్ కు చేరుకుంది. మరి కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అక్టోబర్ 17న ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభం అయింది. పాదయాత్ర నేటితో ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 31జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1800 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. 

సాహ సెంచరీ

 

రాంచీ టెస్టు: మూడో టెస్టులో వృద్దిమాన్ సాహ సెంచరీ పూర్తి చేశాడు. సాహ 214 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సాహకు టెస్టుల్లో ఇది మూడోవ సెంచరీ.  

14:27 - March 19, 2017

యూపి : ఉత్తర్‌ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌(44)గా ప్రమాణస్వీకారం చేశారు. లఖ్‌నవూలోని కాన్షీరామ్‌ స్మృతి ఉపవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. యోగి తో గవర్నర్ రాంనాయక్ ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎం లుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో పాటు మంత్రులుగా 43 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ కేబినెట్ లో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కాసేపట్లో యెగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం

 

లక్నో:కాసేపట్లో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం. ఆదిత్యనాథ్ టీమ్ లో 47 మందికి మంత్రి పదవులు. ఆదిత్యనాథ్ కేబినెట్ లో ఆరుగురు మహిళలకు చోటు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న 43 మంది. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దానేశ్ శర్మ.

కాసేపట్లో...యూపీ సీఎం ప్రమాణ స్వీకారం..

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా కాసేపట్లో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎం చంద్రబాబు ఇతర బీజేపీ నేతలు హాజరు కానున్నారు.

 

అమలుకు నోచుకోని హామీలు : ఏచూరి

హైదరాబాద్ : ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో పాల్గొన్నారు. ప్రభుత్వ వాగ్ధానాలు ఏవీ ముందడుగు వేయలేదన్నారు. ప్రభుత్వం వాగ్ధానాలకు కట్టుబడి ఉంటారా లేదా.. అని తేల్చుకోవాల్సిన అవసరముందన్నారు. పాదయాత్ర ప్రభుత్వానికి చివరి హెచ్చరిక అని అన్నారు. 

ఎస్వీవీకే నుంచి ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర

హైదరాబాద్ : ఎస్వీవీకే నుంచి సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం అయింది. సరూర్ నగర్ స్టేడియంకు ర్యాలీగా వెళ్లనుంది. ర్యాలీని జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నగరమంతా ఎరుపుమయం అయింది. 

 

ఢిల్లీలో 12 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 12 మెట్రో రైల్వే స్టేషన్లు మూసివేశారు. జాతీయ రహదారులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. రేపు పార్లమెంట్ ముట్టడికి జాట్లు పిలుపునిచ్చారు. మరోసారి జాట్ల రిజర్వేషన్లు అంశం తెరపైకి వచ్చింది. జాట్ల ఆందోళన దృష్ట్యా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హర్యానాలో పారా మిలిటరీ బలగాలను మోహరించారు.
పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 

13:38 - March 19, 2017
13:35 - March 19, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 12 మెట్రో రైల్వే స్టేషన్లు మూసివేశారు. జాతీయ రహదారులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. రేపు పార్లమెంట్ ముట్టడికి జాట్లు పిలుపునిచ్చారు. మరోసారి జాట్ల రిజర్వేషన్లు అంశం తెరపైకి వచ్చింది. జాట్ల ఆందోళన దృష్ట్యా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హర్యానాలో పారా మిలిటరీ బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 

13:30 - March 19, 2017
13:29 - March 19, 2017
13:28 - March 19, 2017

హైదరాబాద్ : ఎస్వీవీకే నుంచి సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభం అయింది. సరూర్ నగర్ స్టేడియంకు ర్యాలీగా వెళ్లనుంది. ర్యాలీని జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నగరమంతా ఎరుపుమయం అయింది. అక్టోబర్ 17న ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభం అయింది. పాదయాత్ర నేటితో ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 31జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1800 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు పాదయాత్ర బృందానికి 90 వేల వినతులు ఇచ్చారు.  

 

13:23 - March 19, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో పాల్గొన్నారు. ప్రభుత్వ వాగ్ధానాలు ఏవీ ముందడుగు వేయలేదన్నారు. ప్రభుత్వం వాగ్ధానాలకు కట్టుబడి ఉంటారా లేదా.. అని తేల్చుకోవాల్సిన అవసరముందన్నారు. పాదయాత్ర ప్రభుత్వానికి చివరి హెచ్చరిక అని అన్నారు. 

 

13:12 - March 19, 2017

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగి పొందేవేళ..
అంటూ అద్భుత భావనా బలంతో కవిత్వం రాసిన అరుదైన కవి విన్నకోట రవిశంకర్. మనిషి తనలోని ఆత్మను అందంగా ఆవిష్కరించడమే కవిత్వమని భావించే రవిశంకర్ ఏ వస్తువునైనా అద్బుతమైన కవితా శిల్పంగా మార్చగలరు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంతో వస్తూ వస్తూనే తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశారు. అదే వరుసలో వచ్చిన వేసవివాన, రెండో పాత్ర లాంటి కవితా సంపుటాలు కవిత్వాభిమానులను మరితంగా ఆకట్టుకున్నాయి. 
"కవిత్వంలో నేను" వ్యాసం
కవిత్వం రాయడంతో పాటు ఇతర కవులు రాసిన కవిత్వాన్ని ఆకళింపజేసుకొని వారి కవితా సంపుటాలలోని వస్తుశిల్పాలను "కవిత్వంలో నేను" అనే వ్యాస సంకలనంలో అందంగా విశ్లేషించారు విన్నకోట రవిశంకర్. కవిత్వంలో నూతన అభివ్యక్తికి ఈ కవిరాసిన కుండీలో మర్రి చెట్టు కవిత్వం అద్దం పడుతుంది.
సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి
శ్రుతి చేసిన వీణలా ఆమె ధ్వనిస్తుంది
కనిపించని విషాదపు ఒత్తిడికి
చిగురుటాకులా  ఆమె  చలిస్తుంది
అంటూ సరికొత్త అభివ్యక్తితో కవిత్వాన్ని శిల్పీకరించారు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంలో 29 కవితలున్నాయి. హోళీ, ఉదయాలు, ప్లూ, నిద్రానుభవం, గాయం, కెరీరిజం, పాప మనసు, చలనచిత్రం, మెుదలైన కవితలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. 

కవిత్వం రాయడాన్ని చాలా సీరియస్ యాక్టివిటీగా భావిస్తారు రవి శంకర్ . అతని ప్రతి కవితా సంకలనంలో, ప్రతి కవితలోనూ ఈ స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. అతడు వెలువరించిన మరో కవితా సంపుటి వేసవివాన .అందులో
నేల కురిసే వాన
గుండ్రంగా తిరుగుతుంది
ఎప్పుడంటే అప్పడు
ఇంటి ముందు ఇంద్రధనుస్సులల్లుతుంది
 అంటూ వానను సరికొత్త భావనతో కవిత్వం చేసి అబ్బురపరుస్తారు. 
అగ్ని పర్వతం ఒకటి
హఠాత్తుగా మనసు మార్చుకుని
మంచుకొండగా మారిపోయినట్టుగా ఉంది
అంటూ ఒక వస్తును ఎవరూ ఊహించని ఇమేజరీతో తళుక్కుమనిపిస్తారు. ఇది  రవిశంకర్ ప్రత్యేక కవితా శిల్పకళ అని చెప్పాలి. 
విన్నకోట కవిత్వంలో ఏ వస్తువైనా అందంగా శిల్పీకరించబడుతుంది. కవిత్వ భాష , పదచిత్రాలు, ఇమేజరి, అభివ్యక్తి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అందమైన కవిత్వంగా ఆవిష్కరించబడుతుంది.. 

ఇక రెండో పాత్ర కవితా సంపుటిలో మెుత్తం 77 కవితలున్నాయి. అందులో గొడుగు, వానపాట, బాధ, సహచరిలాంటి కవితలు శిల్ప సోయగంతో కవితా ప్రియులను అలరిస్తాయి. 
జలజలమంటూ కురిసే వాన
కిటికీపై నీటిపరదాలు జార్చినట్టు
నీ పాట నా కంటిమీద
కన్నీటి తెరలు దించుతుంది..

వెలిసిన వాన వేరే ఊరు 
వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
ముగిసిన నీ పాట మాత్రం
కొన్నాళ్ల వరకు 
తలపుల్లో గూడుకట్టుకుని
కలలో కూడా వెంటాడుతుంది.. అంటాడు విన్నకోట రవిశంకర్..

కవిత్వం రాయడంతో ఆగి పోకుండా, ఇతరుల కవిత్వాన్ని చదువుతూ  కవిత్వాన్ని విశ్లేషించడం నిరంతరం కొనసాగిస్తున్నారు విన్నకోట రవిశంకర్.  కవిత్వంలో నేను సంకలనంలో నల్లగేటు నందివర్ధనం చెట్టు, నిరంతరయాత్ర, పడవనిద్ర, సాలె పురుగులాంటి వ్యాసాలు ఆయా కవుల సృజన పట్ల కొత్త ఆలోచలను రేకెత్తిస్తాయి. 

విన్నకోట రవిశంకర్ కు కవిత్వం వారసత్వంగా వచ్చింది. తండ్రి విన్నకోట వేంకటేశ్వరావు స్వయానా పండితుడు ..ఆయన తెలుగు తోట అన్న ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు. ఇందులో 85 మంది కవుల కవితలను ప్రచురించారు. 

ఇక రవిశంకర్ జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో  విన్నకోట వేంకటేశ్వరరావు, శ్యామల దంపతులకు జన్మించారు. పిఠాపురం, కాకినాడల్లో హైస్కూల్ వరకు చదువుకున్నారు. వరంగల్ లో యం.టెక్ ను పూర్తి చేశారు. తర్వాత ఎ.పి.ఎస్.ఇ.బి లోను తర్వాత  సి.యం.సిలో ఇంజనీర్ గా పనిచేశారు. 1998 లో అమెరికా వెళ్లి సౌత్ కెరొలినాలో ఉద్యోగం చేస్తున్నారు. 

ప్రముఖ కవి ఇస్మాయిల్ ప్రభావంతో  తనదైన మార్గంలో కవిత్వం రాస్తున్న అరుదైన కవి, సాహితీ సమీక్షకులు విన్న కోట రవిశంకర్. ఆయన కలం నుండి భవిష్యత్ లో మరెన్నో కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం....

12:26 - March 19, 2017

హైదరాబాద్ : నేడు సీపీఎం మహజన పాదయాత్ర ముగింపు సభ జరుగనుంది. ఎస్ వీకే నుంచి ర్యాలీకి పాదయాత్ర బృదం, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 4 గంటలకు సరూర్ నగర్ లో భారీ సమర సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. సమర సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. సీపీఎం పాదయాత్ర ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 31జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1800 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు పాదయాత్ర బృందానికి 90 వేల వినతులు ఇచ్చారు. 
వెట్టి చాకిరి చేస్తున్నాం : ఆశా వర్కర్లు....
'వేతనాల కోసం 106 రోజులు సమ్మె చేశాం. వేతనాలు పెంచలేదు. వెట్టి చాకిరి చేస్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచారు. కానీ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచలేదు. ఆశా వర్కర్ల గుర్తించి జీతాలు పెంచాలి. కనీస వేతనం రూ.18000 పెంచాలి. సచ్చిన తర్వాత కాదు బతికున్నప్పుడే వేతానలు ఇవ్వాలని' అంటున్నారు. 

 

12:14 - March 19, 2017
12:10 - March 19, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఎవ‌రి నోట విన్నా అదే మాట‌... బాహుబలి క్యారెక్టర్లు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోకివచ్చేశాయి.. జానారెడ్డి మొదలుపెట్టిన బాహుబ‌లి  కామెంట్స్.. పొలిటిక‌ల్ స్క్రీన్ ను హీటెక్కిస్తున్నాయి. 
తెలుగు పాలిటిక్స్‌నూ షేక్‌ చేస్తున్న బాహుబలి 
బాహుబలి సినీరంగాన్నేకాదు... తెలుగు పాలిటిక్స్‌నూ షేక్‌ చేస్తోంది... అసెంబ్లీలో.... బయటా ఎక్కడచూసినా బాహుబలిని పోలుస్తూ నేతలు సెటైర్లు విసురుతున్నారు.. ముఖ్యంగా బాహుబలి వస్తాడంటూ ప్రతిపక్ష నేత జానా వ్యాఖ్యల తర్వాత కామెంట్లు మరింత ఊపందుకున్నాయి. జానా మాటలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటీపడిమరీ చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ లో బాహుబలిపై ఆసక్తికరంగా చర్చ 
కాంగ్రెస్‌లో బాహుబ‌లి ఎవ‌రంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్‌ లీడర్లను ప్రశ్నిస్తుండగా... హస్తం పార్టీలో బాహుబలిపై మరింత ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.. కాంగ్రెస్‌లో చాలామంది బాహుబలులున్నా... జానారెడ్డి మా బాహుబలి అంటూ తేల్చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
ఎన్నిక‌ల నాటికి బాహుబ‌లి రావ‌డం ఖాయం : డికే
అటు బాహుబలి ఎపిసోడ్‌పై తన స్టైల్‌లో స్పందించారు డీకే అరుణ... ఎన్నిక‌ల నాటికి బాహుబ‌లి రావ‌డం ఖాయ‌మ‌న్న డికే.... సీఎం కేసీఆర్‌ను కట్టప్పతో పోల్చారు.... మరో ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌... తెలంగాణకు తానే బాహుబలినంటూ ప్రకటిస్తున్నారు.. 
కేసీఆర్‌ ను బల్లాలదేవుడితో పోలిక
బాహుబలి ఎవరో చెబుతూనే కాంగ్‌ నేతలు... మూవీలోని మిగతా పాత్రలనూ వాడేసుకుంటున్నారు.. కేసీఆర్‌ను బల్లాలదేవుడితో పోల్చిన భట్టి విక్రమార్క... బాహుబలి సెకండాఫ్‌లో కాంగ్రెస్‌దే విక్టరీ అని స్పష్టం చేస్తున్నారు.. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ బాహుబలి తడాఖాఏంటో చూపిస్తామంటూ సవాల్‌ విసురుతున్నారు జీవన్‌ రెడ్డి.. మొత్తానికి జానారెడ్డి పేల్చిన బాహుబ‌లి ఎపిసోడ్‌ లీడర్ల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది.

 

12:05 - March 19, 2017

జూనియర్ ఎన్టీఆర్...వరుస విజయాలతో ముందుకు వెళుతున్నాడు. ఆయన నటించిన 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌' మూడు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీనితో నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న చిత్రంలో 'ఎన్టీఆర్' నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనేక విషయాలు దాగున్నాయి. ఏకంగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ‘రాశీఖన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్ సరసన ఆడి..పాడనున్నారు. శక్తివంతమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌.. ఓ పాత్రలో అంధుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేగాకుండా ఓ పాత్ర చాలా ఆసక్తికరంగా మలుస్తున్నట్లు టాక్. సినిమా టైటిల్ విషయంలో క్లారిటీ రావడం లేదు. గతంలో అనుకున్నట్లుగానే 'జై లవకుశ' పేరు చిత్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

12:04 - March 19, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర రథసారథి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయనతో 10 టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పాదయాత్రతో సమాజిక ఎజెండాపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. అనేక ఉద్యమాలు జరిపితే తప్ప సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. పాదయాత్ర ఎజెండా చుట్టూ ప్రభుత్వాన్ని తిప్పగలింది. అయితే సీఎం మాట్లాడినంత మాత్రాన అమలు జరుగుతాయన్న నమ్మకం లేదని తెలిపారు. కేసీఆర్ మాట్లాడిన ఏ ఒక్క మాట నిజం కాలేదని ఎద్దేవా చేశారు. కలిసి వచ్చే సంఘాలతో భవిష్యత్ లో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజల ఒత్తడి, ఉద్యమాలే శరణ్యమన్నారు. పదవి ఉన్న లేకున్నా.. ప్రజల తరపున పోరాడేది ఎర్రజెండాయే అని స్పష్టం చేశారు. తమ పార్టీపై ప్రజలు భరోసా ఉంచారని తెలిపారు. తన ఆర్యోగంపై తనకు సంపూర్ణమైన ధీమా ఉందన్నారు. రాళ్లకు బదులు... పాదయాత్రపై పూల వర్షం కురిసిందని, ఆపూర్వ స్వాగతం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలపై సీఎం కేసీఆర్ కు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. 

 

11:35 - March 19, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళానికి సర్వం సిద్ధమైంది. సభ సక్రమంగా జరిగేందుకు నిర్వహణ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియంలో పూలే, అంబేద్కర్, సుందరయ్య ఫొటోలతో ఉన్న ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎల్ బి నగర్, సరూనర్ నగర్ ప్రాంతాలు ఆరుణమయమయ్యాయి. సరూర్ నగర్ స్టేడియంలో నీలి రంగు జెండాలు, ఎరుపు జెండాలు రెపరెపులాడుతున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకు సరూర్ నగర్ లో భారీ సమర సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. సమర సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. సీపీఎం పాదయాత్ర ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 31జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1800 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు పాదయాత్ర బృందానికి 90 వేల వినతులు ఇచ్చారు. 
సభకు అన్ని ఏర్పాట్లు చేశాం : సాయిబాబు 
'సరూర్ నగర్ స్టేడియంలో సభకు అన్ని ఏర్పాట్లు చేశాం. మొదట నిజాం కాలేజీలో సభ అనుకున్నాం.. కానీ ప్రభుత్వం 
అనుమతి ఇవ్వలేదు. 2 లక్షల మంది హాజరు అవుతారు. తమ్మినేనితో పాటు 9 మంది పాదయాత్ర బృందం పసుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా సరూర్ నగర్ స్టేడియానికి వస్తారు. పాదయాత్ర 31 జిల్లాలు, 1800 గ్రామాల్లో కొనసాగింది. పాదయాత్ర ఎజెండాను ప్రజలు గుండెలకు అత్తుకున్నారు. పాదయాత్ర అడుగడుగునా ప్రజలు నిరాజనాలు పలికారని' తెలిపారు. 

11:35 - March 19, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' 151వ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం 'చిరు' 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో 'చిరు' నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించారు. తదుపరి చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' ఉంటుందని తెలిసిందే. సురేందర్‌రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ప్రీలుక్‌గా ఓ సరికొత్త శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేశారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అంటున్నాయి. 'యుఎన్‌-ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' అనే ఇంగ్లీష్‌ టైటిల్‌తో, ఆంగ్లేయులతో కొంతమంది పోరాడుతున్న దృశ్యం..చిరంజీవి కంటిచూపు..రక్తం కారుతున్న గొడ్డలితో ఉన్న పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకొంది. ఏప్రిల్‌లో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ చిరు నెక్ట్స్ సినిమాలోనేదేనా ? కాదా ? అనేది కొద్ది రోజుల్తో తెలియనుంది.

10:45 - March 19, 2017

హైదరాబాద్ : నేటితో సీపీఎం పాదయాత్ర ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 29 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1500 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు పాదయాత్ర బృందానికి 90 వేల వినతులు ఇచ్చారు. నేడు సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ జరుగనుంది. సమర సమ్మేళానికి సర్వం సిద్ధమైంది. సభ సక్రమంగా జరిగేందుకు నిర్వహణ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ లో భారీ సమర సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. సమర సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. 
అంగన్ వాడీలు 
'సీఎం కేసీఆర్ ను గెలిచిపించాము. ఆయన గెలిచినప్పుడు గొర్రెలు, మేకలు కోసి పండుగు చేసుకున్నాం. కానీ ఇప్పుడు మంచి పరిపాలన చేయడం లేదు. మాకు అన్నపెడుతాడని అనుకున్నాం... మమ్మల్ని పోలీసుల పాలు చేస్తున్నాడని' చెప్పారు. 

10:22 - March 19, 2017


హైదరాబాద్ : నేడు సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ జరుగనుంది. సభ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సభ సక్రమంగా జరిగేందుకు నిర్వహణ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ లో భారీ సమర సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వనస్థలిపురం స్పెన్సర్ నుంచి సూరూర్ నగర్ స్టేడియం వరకు మరో ప్రదర్శన నిర్వహించనున్నారు. బహిరంగసభను జయప్రదం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. 
పోస్టర్స్, బ్యానర్స్, తోరణాలు, ఎర్రజెండాలతో నగరమంతా ఎరుపుమయం అయింది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:51 - March 19, 2017

కొనసాగుతోన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ రీపోలింగ్

హైదరాబాద్ : రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రాంభమైంది. సాయంత్రం 6 గంటల పోలింగ్ కొనసాగనుంది. 8 జిల్లాల్లో 126 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 

09:46 - March 19, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి... మహబూబ్ నగర్...హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రాంభమైంది. సాయంత్రం 6 గంటల పోలింగ్ కొనసాగనుంది. 8 జిల్లాల్లో 126 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ఫొటోలు మారడంతో రీ పోలింగ్ తప్పనిసరి అయింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారు. ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. 23, 789 మంది టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 22న ఓట్ల లెక్కింపు జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ప్రారంభమైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక రీ పోలింగ్

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రీ పోలింగ్ ప్రారంభం అయింది. రీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఎనిమిది గంట‌లకు రీపోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం ఆరు గంటల వ‌ర‌కూ పోలింగ్‌ జరగనుంది. గతంలో బ్యాలెట్‌ పేపర్‌పై ఫొటోలు మారడంతో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

 

నేడు కేరళ వాసులతో సీఎం పినరయి విజయన్ గెట్ టుగెదర్

హైదరాబాద్ : సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో కేరళ వాసులతో పినరయి విజయన్ గెట్ టుగెదర్ నిర్వహించనున్నారు. 

శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపల్ పై విద్యార్థుల దాడి

రంగారెడ్డి : బాచుపల్లిలో అర్ధరాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ప్రిన్సిపల్ తోపాటు సెక్యూరిటీ గార్డుపై  విద్యార్థులు దాడి చేసి చితకబాదారు. అంతటి ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న బస్సుపై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. వారిని అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

08:35 - March 19, 2017

రంగారెడ్డి : బాచుపల్లిలో అర్ధరాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ప్రిన్సిపల్ తోపాటు సెక్యూరిటీ గార్డుపై విద్యార్థులు దాడి చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న బస్సుపై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాలేజీ వద్ద ఉద్రికత్త నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

08:26 - March 19, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా మార్గంమధ్యలో యాదమర్రి మండలం లక్ష్మయ్యకండ్రిగలో లారీ, టెంపో ట్రావెలర్ ఢీ కొననున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. 

 

మరికాసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రీ పోలింగ్

హైదరాబాద్ : మరీ కొద్దిసేపట్లో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రీ పోలింగ్ జరుగనుంది. రీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఎనిమిది గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంటల వ‌ర‌కూ పోలింగ్‌ జరగనుంది. గతంలో బ్యాలెట్‌ పేపర్‌పై ఫొటోలు మారడంతో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

08:05 - March 19, 2017
08:02 - March 19, 2017

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నిక రాజ్యాంగం విరుద్ధమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ నేత ఆచారి, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి పాల్గొని, మాట్లాడారు. గతంలో ఆదిత్యానాథ్ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనకు లౌకికత్వం లేదని చెప్పారు. అలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవడం సరికాదని హితవు పలికారు. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ ఎజెండాను అమలు చేస్తుందన్నారు. కేంద్రం మెడీత్వ, హిందూత్వ పోకడలకు పోతున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

07:54 - March 19, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైపై ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలనా తారు మారు చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌ను బిజెపి ఎంపిక చేసింది. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేష్‌ శర్మలను ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నిక  
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీని సొంతం చేసుకున్న బిజెపి సిఎం అభ్యర్థిని ప్రకటించడానికి మాత్రం బాగా కసరత్తే చేసింది. వారం రోజుల పాటు తర్జన భర్జన పడ్డ కమలనాథులు ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరదింపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగిన బిజెపి శాసనసభాపక్ష సమావేశం తమ నేతగా 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకుంది. సమావేశం జరుగుతున్న వేదిక వద్ద ఆదిత్యనాథ్‌ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు.యోగి యోగి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోజ్‌ సిన్హా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్యతో పాటు యోగి ఆదిత్యనాథ్‌  పేర్లు  ప్రముఖంగా విన్పించాయి. చివరి నిముషంలో తాను సిఎం రేసులో లేనని మనోజ్‌ సిన్హా  ప్రకటించారు. సిఎం పదవి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకే వరిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అనూహ్య మలుపుల మధ్య చివరకు యోగి ఆదిత్యనాథ్‌ను బిజెపి ఎంపికచేయడం గమనార్హం. 
సీఎం, మంత్రులు నేడు 2 గం.లకు ప్రమాణ స్వీకారం 
కొత్త సీఎం, మంత్రులు నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లఖ్‌నవూలోని కాన్సీరామ్‌ స్మృతి ఉప్‌వన్‌లో నిర్వహించే ఈ వేడుకకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

 

07:47 - March 19, 2017

హైదరాబాద్ : ఆయనో ప్రజా ప్రతినిధి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే. భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే వస్తుంటారు. అయితే.. ఈసారి ప్రభుత్వం బస్సును ఎత్తేసింది. కానీ.. ప్రజావాణిని వినిపించాలనే చిత్తశుద్ధి ఉన్న ఆయన టూవీలర్‌పై వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ఎమ్మెల్యే ఎవరు..? ఆయనపై ప్రభుత్వానికి ఎందుకు నిర్లక్ష్యం?
అసెంబ్లీకి టూవీలర్‌పై వెళ్తున్న రాజయ్య
ఈరోజుల్లో సాదాసీదా నేతలే భారీ వాహనాలతో హంగామా చేస్తుంటే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సున్నం రాజయ్య సింపుల్‌గా ఉండి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సున్నం రాజయ్య అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే వస్తుంటారు. గత అసెంబ్లీ సమావేశాల వరకు ఇలాగే జరిగింది. ఈసారి కూడా ఆయన అలాగే వెళ్దామనుకున్నారు. కానీ.. ప్రభుత్వం మరోలా ఆలోచించింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అందరూ ఎమ్మెల్యేలు కార్లలోనే వెళ్తుండడంతో... రాజయ్య ఒక్కడి కోసం బస్సు, డీజిల్‌ ఖర్చులు వృథా అని భావించిన సర్కార్‌.. ఆ బస్సును రద్దు చేసింది. దీంతో సున్నం రాజయ్య, బస్సును పునరుద్ధరించాలని అసెంబ్లీ సెక్రటరీ రాజాసదారామ్‌ను కోరారు. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. దీంతో సున్నం రాజయ్య అసెంబ్లీ సమావేశాలకు ఇలాగే టూవీలర్‌పై వచ్చి వెళ్తున్నారు. 
ప్రజా సమస్యలపై సున్నం రాజయ్య చిత్తశుద్ధి
ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించినా.. కల్పించకపోయినా ప్రజా సమస్యలపై ఉన్న చిత్తశుద్ధితో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. అసెంబ్లీ సమావేశాలకు ఇలా టూవీలర్‌పై వచ్చి వెళ్తున్నారు సున్నం రాజయ్య. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న తన దృక్పథం ముందు ఇవన్నీ చాలా చిన్నవని అంటున్నారు సున్నం రాజయ్య. గల్లీ స్థాయిలోనే ఓ చిన్న పదవి దక్కించుకుంటే.. నానా హంగామా చేసే నేటి ప్రజాప్రతినిధులు ఇలాంటి నేతలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటున్న విశ్లేషకులు. 

 

07:40 - March 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుంచి టీటీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సభ్యుల సస్పెన్షన్‌పై ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు. 
హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగించారంటూ తెలుగుదేశం శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను స్పీకర్‌ బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ రేవంత్  హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా తనను సస్పెండ్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి.. శాసనసభ స్పీకర్‌ను విచారించే పరిధి హైకోర్టుకు లేదని కోర్టుకు నివేదించారు. అవసరమైతే అసెంబ్లీ కార్యదర్శిని విచారించవచ్చని, సమయం ఇస్తే వివరణ తీసుకువస్తానని తెలిపారు.
విచారణ ఈ నెల 24కు వాయిదా 
రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో సభాపతిని ప్రతివాదిగా చేర్చారని, అది కోర్టు పరిధిలోకి రాదని ఏజీ వాదించారు. అయితే రేవంత్ తరఫు న్యాయవాది జంద్యాల రవిశంకర్ జోక్యం చేసుకుని పిటిషన్‌లో ఇద్దరు ప్రతివాదులుగా ఉన్నారని, ఏజి ఎవరి తరపున వాదనలు వినిపిస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు. ఏజి స్పష్టం చేసిన తర్వాతే వాదనలు వినాలని న్యాయమూర్తిని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి పిటిషన్‌పై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని, విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు విచారణ చేపట్టడంతో తమకు న్యాయం జరుగుతుందని రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

07:33 - March 19, 2017

ఢిల్లీ : అర్థంతరంగా బాలికలు చదువుకు ఎందుకు దూరమవుతన్నారని సెంట్రల్ అడ్వయింజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చర్చించింది. బాలికల విద్యపైకేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ సబ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ సభ్యులు సమావేశంలో చర్చించారు. 
సెంట్రల్ అడ్వయింజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం 
దేశస్థాయిలో బాలిలకను విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ అడ్వయింజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ కమిటీకి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వం వహిస్తున్నారు. 
బాలికల విద్య ప్రోత్సహనికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
బాలికల విద్యలోని వెనుకబాటుతనానికి కారణాలు తెలుసుకునేందుకు.. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనుకబాటుతనానికి బాలికల సామాజిక, ఆర్థిక అంశాలు, లింగ వివక్ష వంటి అంశాలు ఎంతవరు ప్రభావితం చూపుతున్నాయో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. 
బాలికల హాజరు నమోదు, డ్రాపౌట్ శాతం పరిశీలించాలని నిర్ణయం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో బాలికల హాజరు నమోదు, డ్రాపౌట్ శాతాలని పరిశీలించాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారికి హాజరు శాతాన్ని లెక్కించనున్నారు. అలాగే విద్యాలయాలు, పాఠశాలల్లో బాలికల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, టాయిలెట్స్ లేకపోవడం వంటి తదితర అంశాలు చర్చకు వచ్చాయి. 
ఈ నెల 31న తదుపరి సమావేశం 
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలువుతున్న ఉత్తమ విధానాలను స్టడీ చేసి ఓ నివేదికను రూపొందించనుంది. తదుపరి సమావేశం ఈ నెల 31వ తేదీన జరగనుంది.  

 

07:27 - March 19, 2017

హైదరాబాద్‌ : ఐదు నెలలు.. 4 వేల కిలోమీటర్లు. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 153 రోజులపాటు అవిశ్రాంతగా కొనసాగిన మహాజన పాదయాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. చరిత్రలోనే అత్యధిక దూరం కొనసాగిన పాదయాత్రగా చరిత్ర పుటలకు ఎక్కింది.
అక్టోబర్‌ 17న పాదయాత్ర ప్రారంభం
అక్టోబర్‌ 17న ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 1600 గ్రామాలు, 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. 153వ రోజు పాదయాత్ర మేడ్చల్‌ జిల్లా మీదుగా కొనసాగి హైదరాబాద్‌కు చేరుకుంది. నగర శివారు ప్రాంతాల్లో పాదయాత్ర బృందానికి సీపీఎం కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సామాజిక ఎజెండానే లక్ష్యంగా కొనసాగుతున్న పాదయాత్రకు ఇతర పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. నగరంలోకి ప్రవేశించిన మహాజన పాదయాత్రకు ప్రత్యేకంగా డప్పు బృందాలు ప్రత్యేకంగా స్వాగతం పలికాయి. 
సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణ అభివృద్ధి : తమ్మినేని 
ఎప్పుడూ స్కైవేలు, విశ్వనగరి, ఐటీహబ్‌ల గురించి మాట్లాడే కేసీఆర్‌ను... సామాజిక వర్గాలపై దృష్టిపెట్టేలా మహాజన పాదయాత్ర చేయగలిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తమ్మినేని ఉద్ఘాటించారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. సామాజిక ఎజెండాతో చేసిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన లభించిందని.. ఇందుకోసం కలిసివచ్చే అన్ని పార్టీలతో భవిష్యత్‌లో భారీ మహాసభను ఏర్పాటు చేస్తామన్నారు తమ్మినేని.
సభకు భారీ ఏర్పాట్లు
153 రోజులుగా పల్లెపల్లెన కొనసాగిన మహాజన పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ఈ సమర సమ్మేళనానికి సీపీఎం నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరై విజయన్‌తో పాటు 40 మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఆదివారం జరిగే సమర సమ్మేళానాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

 

07:23 - March 19, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో జరిగే సమర సమ్మేళన సభలో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి పదిన్నరకు వచ్చిన ఆయనకు... శంషాబాద్ విమానశ్రయంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింహరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. విమానశ్రయం నుంచి నేరుగా బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్‌కు చేరుకున్నారు. సాయంత్రం నాలుగన్నర గంటలకు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండంలో జరిగే మలయాళీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సరూర్‌నగర్‌లో జరిగే సీపీఎం సమ్మర సమ్మేళన సభకు చేరుకుంటారు. అనంతరం రాత్రి 9 గంటల 25 నిమిషాలకు కేరళ తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన విజయన్‌కు ఆదివారం అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో విందు ఏర్పాటుచేశారు. 

07:21 - March 19, 2017

గుంటూరు : కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా...రాష్ట్రాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్ట్‌లను..ప్యాకేజీని రప్పించానని అన్నారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపనలు చేశారు. మొదటగా గొళ్లపాడులో ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించారు. అలాగే నరసరావుపేట మండలం, ములకలూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు  శంకుస్థాపన చేశారు. అనంతరం గుంటూరులో సంక్షేమ కార్యక్రమముల శంకుస్థాపన మహోత్సవము పేరుతో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.  
ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని తెచ్చా : చంద్రబాబు 
తన చొరవ... పట్టుదలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని తెచ్చానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే అన్ని రాయితీలు.. సదుపాయాలు ప్రత్యేక ప్యాకేజీతోనూ రాష్ట్రానికి వస్తాయని... కానీ ప్రతిపక్షాలు దీనిపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముస్లిం మైనార్టీలకు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సభలో సీఎం చంద్రబాబునాయుడును మహిళా సమాఖ్యకు చెందిన మహిళలు సత్కరించారు. 

 

రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

చిత్తూరు : యాదమరి మండలం లక్ష్మయ్యకండ్రిగలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ..టెంపో ఢీ కొననున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 

07:11 - March 19, 2017

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఎనిమిది గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంటల వ‌ర‌కూ పోలింగ్‌ జరగనుంది. గతంలో బ్యాలెట్‌ పేపర్‌పై ఫొటోలు మారడంతో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. 
రీ పోలింగ్‌కు సర్వం 
టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల రీ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్‌ పేపర్లో ఫోటోలు తారుమారు కావడంతో, తొమ్మిదో తేదీన రద్దయిన ఎమ్మెల్సీ ఎన్నికను ఆదివారం ఉదయం నిర్వహిస్తున్నారు. గతంలో బాలెట్‌ పేపర్‌లో యూటీఎఫ్‌ బలపరిచిన మాణిక్‌రెడ్డి ఫొటోకు బదులుగా స్వతంత్ర అభ్యర్థి  లక్ష్మయ్య ఫొటోను.. ఆయన ఫొటో స్థానంలో మాణిక్‌రెడ్డి ఫొటో ముద్రించారు. దీంతో పోలింగ్‌లో గందరగోళం ఏర్పడింది.. రీ పోలింగ్‌ నిర్వహించాలని పలువురు టీచర్లు ఆందోళన చేశారు. ఈ పరిణామంతో అధికారులు 19న రీ పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 
ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డి, హైద‌రాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నియోజకవర్గంలో 23 వేల 789 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12 మంది అభ్యర్థులు ఈ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. మ‌హ‌బూబ్‌నగర్‌, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల, నాగ‌ర్‌కర్నూల్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్, హైద‌రాబాద్ జిల్లాల్లో మొత్తం 126 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు.  సంబంధిత మెటిరియ‌ల్‌ను పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రెండు వెబ్ కెమెరాలు  ఏర్పాటు చేస్తున్నారు. 
ఎడ‌మ చేతి మధ్య వేలుకు సిరా గుర్తు 
మొన్నటి ఎన్నికల సందర్భంగా, ఓటర్ల చూపుడు వేలుకు సిరా వేసిన కారణంగా, ఈసారి ఎడ‌మ చేతి మధ్య వేలుకు సిరా గుర్తు వేయాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికల సంద‌ర్భంగా ఆదివారం సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ మ‌ద్యం దుకాణాల‌ను బంద్ చేయాల‌ని ఆదేశించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరించారు. 
ఈనెల 22న ఓట్ల లెక్కింపు 
ఓట్ల లెక్కింపును ఈనెల 22వ తేదీ ఉద‌యం 8గంట‌ల నుంచి నిర్వహిస్తారు.  అంబ‌ర్ పేట్ ప్లేగ్రౌండ్‌లో  దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 

 

నేడు సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ

హైదరాబాద్ : నేడు సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ లో భారీ సమర సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. 
మధ్యాహ్నం 2 గంటల నుంచి వనస్థలిపురం స్పెన్సర్ నుంచి సూరూర్ నగర్ స్టేడియం వరకు మరో ప్రదర్శన నిర్వహించనున్నారు.  

నేడు తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్

హైదరాబాద్ : నేడు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23,789 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి కానుంది. ఈనెల 22న ఓట్ల లెక్కింపు కానుంది. 

నేడు యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం

డెహ్రడూన్ : నేడు ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా కేపీ మౌర్య, దినేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆమిత్ షా, బీజేపీ పెద్దలు హాజరు కానున్నారు. 
 

నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి భేటీ

హైదరాబాద్ : నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు కేరళ సీఎం పినరయి విజయన్ తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లో కేరళ సీఎం పినరయి విజయన్ తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. 

Don't Miss