Activities calendar

20 March 2017

21:25 - March 20, 2017

అమరావతి: ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు హవా కొనసాగిస్తున్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్శింహారెడ్డి గెలుపొందారు. వీరి గెలుపును కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది.

ఇంద్రేశం చెరువులో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం ఇంద్రేశం చెరువులో ఇద్దరు బీటెక్ విద్యార్థులు రాహుల్, శ్రీకాంత్ రెడ్డి గల్లంతయ్యారు.

ఈతకు వెళ్లి తండ్రీ, కొడుకు గల్లంతు

నెల్లూరు: పొదలకూరు మండలం డేగపూడి వద్ద కండలేరు వాగులో ఈతకు వెళ్లి తండ్రీ కొడుకు శ్రీనివాసులు, లోకేష్ గల్లంతయ్యారు. గల్లంతైన వారు సైదాపురం మండలం తూర్పుపాండ్ల వాసులుగా గుర్తించారు.

పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం

చిత్తూరు: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది.

పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్శింహారెడ్డి గెలుపు

అనంతపురం: రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్శింహారెడ్డి గెలుపొందారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

20:35 - March 20, 2017

సమరభేరి మోగింది. మాటలతో.. కల్లబొల్లి కబుర్లతో నడిపే ప్రభుత్వం పై సమర భేరి మోగింది. అధికారం అనుభవించడం.. అయినవాళ్లతో కలిసి పదవులు పంచుకోవడం తప్ప నిజమైన అభివృద్ధి అంటే సంకల్పం ఒక్కటే. సమర భేరి షురూ అయ్యింది. ప్రశ్నించే గొంతుకలను పిడికిలిలో భిగించి నియతృత్వ పోకడులపై నిలిచే పాలకులపై సమర భేరి మోగింది. బంగారు తెలంగాణ అంటూ బతుకే లేని తెలంగాణను మిగుల్చుతున్న సర్కారీ విధానాలపై సరూర్ నగర్ వేదిక సాక్షిగా సమరభేరి మోగింది. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

18:33 - March 20, 2017
18:19 - March 20, 2017

గాంధీ ఆస్పత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు...

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో తిరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. తనిఖీ తర్వాత ఆయన ఆస్పత్రి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

తెలంగాణ పోస్టల్ శాఖలో 645 ఉద్యోగాలు

హైదరాబాద్:  తెలంగాణ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ వ్యాప్తంగా 645 ఉద్యోగాలను భర్తీ చేయనుంది పోస్టల్ శాఖ. ఓపెన్ కేటగిరి 356, ఓబీసీ 151, ఎస్సీ 86, ఎస్టీ 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హాత పదో తరగతి. వయస్సు 18 నుంచి 40 ఏళ్లు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 19. ఇతర వివరాల కోసం https://indiapost.gov.in or https://appost.in/gdsonline వెబ్‌సైట్‌ను సందర్శించండి.

18:08 - March 20, 2017
17:54 - March 20, 2017

హైదరాబాద్: భారతీయులపై విద్వేషపూరిత దాడులు అమెరికాలోనే కాదు...ఆస్ట్రేలియాలోనూ వెలుగు చూసింది. మెల్‌బోర్న్‌లోని ఓ కాథలిక్‌ చర్చి ఫాదర్‌గా ఉన్న భారతీయుడిపై కత్తితో దాడి చేశారు. 48 ఏళ్ల టామీ కాలాథూర్‌ మాథ్యూ ప్రార్థనలు చేయడానికి అర్హుడు కాదని దాడి చేసిన వ్యక్తి నినాదాలు చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి క్రైస్తవుడు కాదని, ఓ హిందువో, ముస్లిమో అయ్యుంటాడని దాడి చేసిన వ్యక్తి ఆరోపించాడు. 72 ఏళ్ల ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్వల్పగాయాలతో చర్చి ఫాదర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

17:51 - March 20, 2017

హైదరాబాద్: 25 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ కాకతీయతో 46 వేల చెరువులు నింపి రాష్ట్రాన్ని సస్యశామలం చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మల్లుభట్టివిక్రమార్క. 9 గంటల విద్యుత్, లక్ష రుపాయల రుణమాఫీతో పాటు మిషన్‌ భగీరథ పనులు గొప్పగా జరిగితే.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగాలి కానీ తగ్గకూడదన్నారు. 2014-15లో 53 లక్షల హెక్టార్ల సాగుభూములను.. 2015-16 నాటికి 48 లక్షల హెక్టార్లకు కుదించారని ఆరోపించారు.

17:50 - March 20, 2017

హైదరాబాద్: రైతు తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే రోజులు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం అన్నారు. స్వామినాథన్‌ చెప్పినట్లుగా వ్యవసాయంలో మార్పులు రావాలన్న పోచారం.. జనాభాలో 70 శాతం ఉన్న రైతులు పండించే పంటకు ధర నిర్ణయించలేని పరిస్థితి నెలకొంది. పంటను కొనేవారు ధర నిర్ణయించడం రైతుల పాలిట శాపంగా అభివర్ణించారు.

17:48 - March 20, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో చోటా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుందని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కొన్ని కారణాల వల్ల రేషన్‌ బియ్యం అక్రమార్కుల చేతిలోకి వెళ్తుందన్న ఆయన.. నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వచ్చే ఆటో, ట్రాలీ డ్రైవర్లకు వాహనాల కొనుగోలులో ట్యాక్స్‌లు మినహాయింపు పరిశీలిస్తున్నట్లు ఈటెల వెల్లడించారు.

17:47 - March 20, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో హోంశాఖ పనితీరు బాగోలేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. జనాల వీపులు పగల గొట్టేలా పోలీసుల తీరుందని విమర్శించిన ఆయన.. హోంశాఖ ప్రజలకు రక్షణగా లేదన్నారు. అక్రమంగా కేసులు పెట్టి నిర్భందిస్తూ ప్రజలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అధికార యంత్రాంగం సరిగ్గా లేదని సున్నం రాజయ్య అన్నారు.

17:45 - March 20, 2017

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ వద్ద దొరికిన డ్రైవర్ నాగరాజు డెడ్‌బాడీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే నాగరాజును అంతం చేసిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు పుత్రరత్నం వెంకట్‌ సుకృత్‌ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు..సీసీ ఫుటేజీలు..ఇతర ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు సుకృత్‌ను అదుపులోకి తీసుకున్నారు...ఈ కేసులో కొడుకుకి సాయం చేసినందుకు వెంకటేశ్వర్‌రావును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు....

ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

17న ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు డ్యూటీ వెళ్లి ఇంటికి రాలేదు.. మధ్యలో భార్య ఫోన్ చేస్తే స్విచ్చాఫ్‌ రాగా..ఆ తర్వాత తానే ఫోన్ చేసి సారు వద్ద ఉన్నానని చెప్పాడు..ఆ తర్వాత తిరిగి రాలేదు...ఇదిలా ఉంటే అదే అర్ధరాత్రి నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లాడు...ఆ తర్వాత ఎవరూ చూడలేదు.. మర్నాడు ఉదయం అదే యువకుడు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి ఓ మూటను తరలించేయత్నం చేయగా వృద్దుడు ప్రశ్నించడంతో అక్కడే వదిలేసి వెళ్లాడు...తీరా అది విప్పిచూస్తే అందులో డెడ్‌బాడీ ఉంది....

హత్యకు గురయింది డ్రైవర్ నాగరాజు..

కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా పరిశోధిస్తే వివరాలు బయటపడ్డాయి...సీసీ ఫుటేజీ పరిశీలించగా అందులో ఉన్న యువకుడు ఐఏఎస్‌ వెంకటేశ్వర్‌రావు కొడుకు వెంకట్‌ సుకృత్‌గా గుర్తించారు..నాగరాజును దారుణంగా చంపి మూటగట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

ఐఏఎస్‌ కొడుకు మహిళను చిత్రహింసలు చేశాడా..?

డ్రైవర్ నాగరాజును ఎందుకు హత్య చేశాడన్నది అనుమానం...పోలీసుల దర్యాప్తు చేస్తుంటే తెలిసిన విషయాలను బట్టి చూస్తే వెంకట్‌ సుకృత్‌ తీరే బాగోలేదని తెలుస్తోంది...కొద్ది రోజులు క్రితమే వెంకట్ ఓ మహిళను తీసుకొచ్చి ఆమెని చిత్ర హింసలకు గురి చేశాడు .. అయితే సమయం లో ఆమ్మాయిని వేదిస్తున్న దృశ్యాలు ను డ్రైవర్ నాగరాజు సెల్ ఫోన్ లో చిత్రికారించాడా ? ఆ భయం తోనే నాగరాజు ను హత్యకు కారణామా ? లేక నాగరాజు భార్యపై వెంకట్ కన్నేశాడా..? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతుండడంతో అసలు కథ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగం చేశారు... ఈ హత్య కేసులో ఐఏఎస్ కుమారుడు నిందితుడుగా ఉండడంతో తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆందోళన చేసింది...అయితే కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో శిక్ష పడేలా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు చెప్పారు...మూడు కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు...నాగరాజు , వెంకట్ సుకృత్‌ కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

17:42 - March 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం :. ఇల్లందు .. దాసరిగడ్డలోని నిరుపేద కుటుంబాలపై మున్సిపాలిటీ అధికారులు తమ జులుం ప్రదర్శించారు. ఇంటి పన్ను కట్టలేదంటూ.. నోటీసులిచ్చి.. ఇళ్లకు తాళం వేశారు. అంతేకాదు ఇళ్లలోని సామగ్రినంతా బయట పెట్టేశారు. పన్ను కట్టేందుకు సమయమివ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో పసిపిల్లలు..మహిళలతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

అధికారుల తీరుపై మండిపడ్డ బాధితులు....

అధికారుల జులుంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ బాధితులు.. వారి తీరుపై మండిపడ్డారు. ఇల్లందు మున్సిపల్‌ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. చంటి పిల్లలతో కలసి రాత్రి 11 గంటల వరకు ఆందోళన చేపట్టారు. వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి.. అక్కడే భోజనాలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామని.. కానీ ఎప్పుడు తమకు నోటీసులు రాలేదని బాధితులు వాపోయారు.. అకస్మాత్తుగా 17 వేలు పన్ను కట్టాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో బకాయిలున్న వ్యాపారులను అధికారులు ఏమి అనరని మా లాంటి వాళ్లను మాత్రం కష్టపెడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన పాలకవర్గం...

ఈ విషయం తెలుసుకున్న పాలక పక్షం నేతలు.. ఇతర రాజకీయ పక్షాల నాయకులు తక్షణమే రంగంలోకి దిగారు. బాధితులకు భరోసా ఇస్తూనే అధికారుల తీరును తప్పుబట్టారు. పేదల పట్ల అధికారులు ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. అనంతరం బాధితులను సముదాయించి.. అధికారులు తీసుకున్న తాళాలను ఇప్పించారు. ఇళ్లకు పంపించారు.

హైదరాబాద్‌ మలక్‌పేట గంజిలో మిర్చి రైతుల ఆందోళన

హైదరాబాద్‌ : మలక్‌పేట గంజిలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించారు. భారీ సంఖ్యలో రైతులు ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు

17:03 - March 20, 2017
16:57 - March 20, 2017

ఢిల్లీ: జిఎస్‌టికి చెందిన నాలుగు సహాయక బిల్లులకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో పరిహార చట్టం, కేంద్ర జిఎఎస్‌టి, ఏకీకృత జిఎస్‌టి, కేంద్ర పాలిత జిఎస్‌టిలు ఉన్నాయి. జిఎస్‌టికి చెందిన నాలుగు సహాయక బిల్లులే ఎజెండాగా ప్రధాని మోది అధ్యక్షతన కాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ బిల్లులను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో చర్చ అనంతరం ఈ బిల్లులను రాష్ట్రాల విధానసభలకు పంపుతారు. చట్టసభల ఆమోదం తర్వాత జిఎస్‌టి బిల్లును కేంద్రం జూలై ఒకటి నుంచి అమలు చేయనుంది.

 

16:55 - March 20, 2017

హైదరాబాద్: మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ విశ్వాసపరీక్షలో నెగ్గారు. 60 మంది శాసనసభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి 32 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపికి కేవలం 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 31. ఈ నెల 15న మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరేన్‌సింగ్‌, డిప్యూటి సిఎంగా ఎన్‌పిపికి చెందిన జయకుమార్‌ సింగ్‌ ప్రమాణం చేశారు. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేల మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా తోసిపుచ్చారు. మణిపూర్‌లో తొలిసారిగా బిజెపి అధికారంలోకి వచ్చింది.

16:53 - March 20, 2017

చిత్తూరు: ఏపీలో ఎమ్మెల్సీ కోటాలో 3 పట్టబధ్రుల స్థానాలు, 2 ఉపాధ్యాయ స్థానాల కౌంటింగ్ కొనసాగుతోంది. రేపు ఉదయానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. చిత్తూరు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ లో పీడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ తొలిరౌండ్‌లో 1766ఓట్ల ఆధిక్యంలో పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం ఉన్నారు. అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై.. పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు విశాఖలో పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమైంది.

16:50 - March 20, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురువేసింది. జరిగిన మూడు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్‌ కంచుకోట కడప జిల్లాలో వైసీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఓడించి.. అక్కడ టీడీపీ పాగా వేసింది. 40 ఏళ్ల వైఎస్‌ రాజకీయ కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేసి.. బీటెక్‌ రవి 33 ఓట్లతో విజయం సాధించారు. కడపలో విజయం కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడే మకాం వేసి వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు. ఇక బీటెక్‌ రవి విజయంతో తెలుగు తమ్ముళ్లు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలంతా స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

62 ఓట్ల మెజారిటీతో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం ....

ఇక కర్నూలులోనూ ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై.. టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి.. 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1084 ఓట్లకు గాను 1077 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 564 ఓట్లు రాగా.. వైసీపీకి 502 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లకుండాపోయాయి. చంద్రబాబు, లోకేశ్‌ ఆశీస్సులతో విజయం సాధించానని.. ప్రజాసమస్యలపై మండలిలో తన గళం విప్పుతానన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.

87 ఓట్ల మెజారిటీతో వాకాటి నారాయణరెడ్డి గెలుపు ...

నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డి.. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలో మొత్తం 851 ఓట్లకు గాను వాకాటి 465 ఓట్లు సాధించారు. ఆనం విజయ్‌కుమార్‌రెడ్డికి 378 ఓట్లు పోలయ్యాయి.

అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థులను గెలిపించారు...

ఇదిలావుంటే.. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థులను గెలిపించారన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. వైఎస్‌ కంచుకోట అయిన కడపలో టీడీపీ అడుగుపెట్టిందని.. భవిష్యత్‌లో పులివెందులలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ విజయాన్ని కొట్టి పారేసిన వైసీపీ ....

అయితే.. వైసీపీ మాత్రం టీడీపీ గెలుపును కొట్టిపారేస్తున్నారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి విజయం సాధించారన్నారు. టీడీపీకి ధైర్యం ఉంటే.. ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని సవాల్‌ విసురుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పాలక పక్షం నేతలు అంటున్నారు.

16:47 - March 20, 2017

అమరావతి: రాష్ట్ర పనితీరుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అవార్డులు ఇస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అవార్డులను కూడా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారని.. అవార్డులు ఇచ్చే వారి కంటే తామే తెలివైన వారిమని ప్రతిపక్ష సభ్యులు అనుకుంటున్నారని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

16:45 - March 20, 2017

అమరావతి: రాష్ట్రంలో తమ పరిపాలనకు అవార్డులు వచ్చాయని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని.. అసలు రాష్ట్రంలో ఏం సాధించారని అవార్డులు వస్తాయని జగన్ విమర్శించారు.

16:44 - March 20, 2017

అమరావతి : రెయిన్ గన్స్ ద్వారా రాయలసీమలో కరవును తరిమికొడుతున్నామని చంద్రబాబు చెప్తున్నారని అది అంతా పచ్చి మోసమని జగన్ ఆరోపించారు. రెయిన్ గన్స్ పేరుతో కమీషన్‌లు దండుకుంటున్నారని.. అందుకే అనంతపురంలోని 63 మండలాలు కరవు మండలాలుగానే ఉన్నాయన్నారు.

 

16:42 - March 20, 2017

అమరావతి: రెయిన్ గన్స్ నిధుల ఖర్చుపై జగన్ చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తప్పుబట్టారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని లేదంటే జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాల్వ జగన్‌కు సవాల్ విసిరారు.

16:40 - March 20, 2017

అమరావతి : వైసీపీ ఎమ్మెల్యేలు అలగ జనం లాగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలుకెళ్లిన నాయకుడు వెనక ఉండడానికి ఎమ్మెల్యేలు సిగ్గుపడాలన్నారు. ప్రతిపక్ష సభ్యులకు పద్ధతి లేదని దుయ్యబట్టారు.

'వారం రోజుల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు లేఖ'

ఢిల్లీ: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, పీఎంవో కార్యదర్శులను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినినిధి రామచంద్రు తెజావత్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ లో ఎయిమ్స్ ఏర్పాటు పై చర్చించారు. వారం రోజుల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వస్తుందని రామచంద్రు తెజావత్ తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు 3 అనువైన ప్రదేశాల నివేదికను పంపించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరిందన్నారు.

రాంచీ టెస్ట్ డ్రా

రాంచీ : ఆ స్ట్రేలియా అసాధార‌ణంగా పోరాడి టీమిండియా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. చివ‌రిరోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌, షాన్ మార్ష్ తెగువ చూపించారు. 62 ఓవ‌ర్ల పాటు ఊపుమీదున్న భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఒక ద‌శ‌లో 63 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఓట‌మివైపు చూస్తున్న ఆసీస్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. 2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడి చివరికి మ్యాచ్ డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే.

ఐఏఎస్ వెంకటేశ్వర్లును విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ఐఏఎస్ వెంకటేశ్వర్లును పోలీసులు విచారిస్తున్నారు. నగారాజు హత్య తర్వాత మృతదేహం మాయం చేసేందుకు కొడుకు సుకృత్ కి సాయంచేసినట్లు వెంకటేశ్వర్లు పై ఆరోపణలు రావడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణకు పిలిచారు. అయితే ఆయన ఫోన్‌ను సైతం పోలీసులు తీసుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను విడిచి పెట్టాలని పోలీసులతో వెంకటేశ్వర్లు వాగ్వాదానికి దిగారు.

అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారు: జగన్

అమరావతి :అధికార పార్టీ తప్పుడు లెక్కలతో అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు.

జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే : చంద్రబాబు

అమరావతి : వైసీపీ జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని,పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే ప్ర‌జ‌లు బాగుప‌డ‌తార‌ని, ఇక వైసీపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌నే వారు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సీఎం చంద్రబాబు అన్నారు.

15:37 - March 20, 2017

అమరావతి : జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని,పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే ప్ర‌జ‌లు బాగుప‌డ‌తార‌ని, ఇక వైసీపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌నే వారు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో అధికార.. విపక్షం మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ప్రతిపక్షనేత మాటలపై మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. జగన్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, మైనార్టీలకు బడ్జెట్‌లో పెద్దమొత్తంలో కేటాయించినట్టు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి గుర్తుచేశారు. బలహీనవర్గాలను వైఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీందర్‌ అన్నారు. బీసీలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. బీసీలకు రూ.10వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టిన ఘనత టీడీపీదేనన్నారు. విప‌క్ష నేత‌ల తీరు బాగోలేద‌ని అన్నారు. తాము త్వ‌ర‌లోనే విప‌క్ష నేత‌ల బండారాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని చంద్రబాబు అన్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి నినాదాలతో ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ రేపట్టికి వాయిదా

అమరావతి: ఏపీ అసెంబ్లీ లో అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

15:21 - March 20, 2017

అమరావతి :అధికార పార్టీ తప్పుడు లెక్కలతో అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ గరవ్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ... రెయిన్ గన్స్ బాగా పనిచేస్తే అనంతపురంలో కరువు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్ట‌క‌పోయినా పెట్టేసిన‌ట్లు చూపిస్తోంద‌ని జ‌గ‌న్ అన్నారు. గ‌తంలోనూ చంద్ర‌బాబు ఎల్లంప‌ల్లి విష‌యంలో స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారని అన్నారు. ఇప్పుడు కూడా ఎన్నో అంశాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, సాంఘిక సంక్షేమ శాఖ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ ఏది తీసుకున్నా అన్ని విష‌యాల్లోనూ అస‌త్యాలే ప‌లికార‌ని జగన్ అన్నారు. కాపు కార్పోరేష‌న్‌కు కూడా వెయ్యికోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం అందులో  338 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని చెప్పారు. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో చేసిన‌ కేటాయింపుల‌కు, ఖ‌ర్చుల‌కు అస‌లు పొంత‌నే లేద‌ని అన్నారు దీని పై అధికార పక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. దీంతో సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా వైసీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

 

కలెక్టరేట్ లో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: జోగులాంబ జిల్లా కలెక్టరేట్ లో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయబోయారు. అగ్రకుల పెద్దలు తమ భూమిని ఆక్రమించుకున్నారని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అడ్డుకున్న అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధ దంపతులు వెనుదిరిగారు. బాధితులు సోంపురం గ్రామానికి చెందిన తమ్మప్ప - భూలక్షి.

విశ్వాసపరీక్షలో నెగ్గిన బీరేన్ సింగ్

హైదరాబాద్: మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ విశ్వాసపరీక్షలో నెగ్గారు. 60 మంది శాసనసభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి 32 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపికి కేవలం 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 31. ఈ నెల 15న మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరేన్‌సింగ్‌, డిప్యూటి సిఎంగా ఎన్‌పిపికి చెందిన జయకుమార్‌ సింగ్‌ ప్రమాణం చేశారు.

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు-చింతల

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టి.. వ్యవసాయ బడ్జెట్‌ను 20 శాతం తగ్గించడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. గ్రీన్‌ హౌస్‌లకు వ్యవసాయ బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. కరవు మండలాలకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీని కేంద్రం నుంచి రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. సకాలంలో రైతు రుణమాఫీ చేయకపోవడం వల్లనే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆరోపించారు.

వ్యవసాయ బడ్జెట్‌ తగ్గించడం సరైంది కాదు: ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ పెరుగుతుంటే.. వ్యవసాయ బడ్జెట్‌ తగ్గించడం సరైంది కాదన్నారు ఆర్‌ కృష్ణయ్య. రైతులు విపత్తులు ఎదుర్కొంటున్న సమయంలో.. వ్యవసాయ శాఖ నూతన పద్ధతులు ప్రవేశపెట్టి రైతులకు అన్ని విధాలా చేయూత అందించాలన్నారు. కల్తీకల్లును అరికడుతూనే స్వచ్ఛమైన కల్లు తయారీకి గీత పరిశ్రమను ప్రోత్సహించాలన్నారు. ఈతచెట్ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ అంతా అంకెల గారడి - మల్లు భట్టివిక్రమార్క

హైదరాబాద్: 25 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథతో 46 వేల చెరువులు నింపి రాష్ట్రాన్ని సస్యశామలం చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మల్లుభట్టివిక్రమార్క. 9 గంటల విద్యుత్, లక్ష రుపాయల రుణమాఫీతో పాటు మిషన్‌ భగీరథ పనులు గొప్పగా జరిగితే.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగాలి కానీ తగ్గకూడదన్నారు. 2014-15లో 53 లక్షల హెక్టార్ల సాగుభూములను.. 2015-16 నాటికి 48 లక్షల హెక్టార్లకు కుదించారని ఆరోపించారు.

14:33 - March 20, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో కొనసాగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులో బరిలో ఉండగా.. ప్రధానంగా టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్‌, పీడీఎఫ్‌ అభ్యర్థి అజాశర్మ మధ్యే నెలకొంది. కౌంటింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:31 - March 20, 2017

అమరావతి : అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల ... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక పాలిటెక్నిక్ కాలేజ్ లో ప్రారంభమైంది. కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని...ఎమ్మెల్సీఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కోనశశిధర్ తెలిపారు. చివరి రౌండ్‌ వరకు కౌంటింగ్ సజావుగా నిర్వహిస్తామంటున్న ఎన్నికల అధికారి కోనశశిధర్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:29 - March 20, 2017

అమరావతి: ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేయాలో అన్ని విధాలుగా టీడీపీ చేసిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ప్రజాప్రతినిధులను కిడ్నాప్‌ చేయడంతో పాటు.. పోలీసులు, రౌడీలతో భయాందోళనలకు గురి చేశారన్నారు చెవిరెడ్డి.

14:28 - March 20, 2017

అమరావతి: టీడీపీ ప్రలోభాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిందని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

14:26 - March 20, 2017

అమరావతి: చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను గెలిపించారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. నదులను అనుసంధానం చేసి కడప జిల్లాకు కృష్ణా నీళ్లు తరలించిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఈ తీర్పును చూసైనా వైఎస్‌ జగన్‌, వైసీపీ నేతలు కళ్లు తెరవాలని కళా వెంకట్రావు అన్నారు.

చరిత్ర తిరగరాయబోతున్నాం - బాబు..

విజయవాడ : చరిత్ర తిరగరాయబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. భవిష్యత్ కోసం కసిగా పనిచేస్తామని, అమరావతికి వాస్తుబలం ఉందన్నారు. ప్రజలే నాకు హై కమాండ్ అని, దేశానికి ఐటీని తీసుకొచ్చింది తానేనన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై 8 శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

13:31 - March 20, 2017

విజయవాడ : జూన్ 2వ తేదీ వరకు అందరికీ గ్యాస్ అందిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభకు తెలిపారు. అంతేగాకుండా ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. రూ. 24వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టిడిపిదేనని స్పష్టం చేశారు. ఏ జిల్లాకు ఎంత ఇచ్చామనే దానిపై వెబ్ సైట్ లో పెట్టడం జరిగిందన్నారు. డ్వాక్రా సంఘాలు తానే పెట్టడం జరిగిందని, పసుపు..కుంకుమ పథకం కింద రూ. 10వేలు ఇవ్వడమే కాకుండా వడ్డీ మాఫీ చేయించడం జరిగిందన్నారు. మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా ముసలి వాళ్లకు తెలియచేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా రూ. 200 ఫించన్ ను రూ. 1000 చేసిన ఘనత తమదేనని, రూ. 14,682 కోట్ల రూపాయల ఫించన్ లు ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో 45,68,329 మందికి రూ. 5,170 కోట్ల రూపాయలు ఫించన్ లు ఇచ్చామన్నారు. పేదవాళ్లందరికీ ఆహార భద్రత ఉంటూ ఇబ్బందులు కలుగకుండా ఉండాలని యోచించానని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ వరకు అందరికీ గ్యాస్ అందిస్తానని సభకు తెలిపారు. నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించామని తెలిపారు.

13:29 - March 20, 2017

హైదరాబాద్ : మిర్చీ రైతులు మలక్ పేటలో ఆందోళన చేపట్టారు. మిర్చీకి మద్దతు ధర రాకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం మలక్ పేట గంజ్ లో రోడ్డుపై బైఠాయించారు. దీనితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు గంజ్ కు చేరుకుని రైతులతో మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బీఎస్పీ నేత షమీ కాల్చివేత..

అల‌హాబాద్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీఎస్పీ పార్టీ నేత‌ మొహ‌మ్మ‌ద్ ష‌మీని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. అల‌హాబాద్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ విజయం అనైతికం - జగన్..

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం చెందడం పట్ల పార్టీ నేత జగన్ స్పందించారు. తమ ఓట్లన్నీ కొనుగోలు చేసి సాధించిన విజయం అనైతికమని, ఓట్ల కొనుగోలులో చంద్రబాబు ఆరితేరారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే అధికార బలంతో పాటు ఓట్లను కొనుగోలు చేశారని తెలిపారు.

12:45 - March 20, 2017

పారిజాత...తెలుగింటి అమ్మాయి..ఈమె కెనాడలో స్థిరపడ్డారు. భారత సంగీత సౌరభాన్ని విదేశాల్లో వెదజల్లుతున్నారు. అమెరికాలో ప్రవాస స్త్రీ శక్తిగా ఈమె అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి మానవి పలకరించింది. ఈ సందర్భంగా తన జీవిత ప్రయాణం..మధ్యలో వినసొంపైన పాటలను పాడారు. మరి పారిజాత పాటల ప్రయాణం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:37 - March 20, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరందాస్ గోపి మృతి చెందారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలియచేశారు. నల్గొండ జిల్లా నుండి కారులో తిరందాస్ గోపి వస్తున్నారు. రామన్నపేట శివారు ప్రాంతానికి చేరుకున్న అనంతరం కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తీవ్రగాయాలైన గోపి కారులోనే ఉండిపోయారు. 40 నిమిషాల అనంతరం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా గోపి మృతి చెందారు. ఇటీవలే సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్రను జిల్లాలో సక్సెస్ చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. పాదయాత్ర జిల్లా నుండి వెళ్లిన అనంతరం గోపి నల్గొండకు వెళ్లారు. అక్కడి నుండి సోమవారం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్మిక నాయకుడిగా పనిచేశారు. వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు అని పలువురు నేతలు పేర్కొన్నారు.

12:15 - March 20, 2017

విజయవాడ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ విడిపోయి రెండేళ్లు కావస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు విభజన కష్టాలు..నష్టాలు పలుమార్లు ప్రస్తావించారు. తాజాగా మరోమారు విభజన కష్టాలు..నష్టాలు వివరించారు. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం బాబు ప్రసంగించారు. చరిత్ర తెలుసుకోవాలని..చరిత్ర చెప్పే అవసరం తనకు ఉందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ కు హై కమాండ్ ఢిల్లీ ఉండేదని..తనకు మాత్రం హై కమాండ్ ప్రజలేనని పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించిన అసెంబ్లీకి రైతులు భూములు ఇచ్చారని, భూములివ్వకుండా ఉండేందుకు చాలా మంది ప్రయత్నాలు జరిపారని వైసీపీనుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారో వీడియో క్లిక్ చేయండి.

తిరందాస్ గోపి మృతి..

యాదాద్రి భువనగిరి : రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు ఢీకొంది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరందాస్ గోపి మృతి చెందారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు.

ఏపీ అసెంబ్లీలో బాబు ప్రసంగం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగుతోంది. ఈ చర్చలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు.

ఏసీబీకి చిక్కిన మాధవరం వీఆర్వో...

కర్నూలు : డోన్ లో ఏసీబీకి మాధవరం వీఆర్వో చిక్కారు. రైతు నుండి రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో పుల్లయ్యను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకున్నారు.

11:57 - March 20, 2017
11:53 - March 20, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం వైసీపీకి శరాఘాతం కలిగింది. కంచుకోటగా ఉన్న కడప జిల్లాకు బీటలు పడ్డాయి. దీనితో వైసీపీ శ్రేణులు నిరుత్సాహంలో మునిగిపోయారు. కనివినీ ఎరుగని రీతిలో టిడిపి దెబ్బ కొట్టింది. వైఎస్ కుటుంబాన్ని జిల్లాలో ఓడించారు. జిల్లా వ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఏపీ రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. కడప స్థానిక బరిలో టిడిపి నుండి బీటెక్ రవి, వైసీపీ నుండి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు స్థానిక బరిలో టిడిపి నుండి చక్రపాణి, వైసిపి నుండి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.

కడపలో..
స్థానిక సంస్థలో టిడిపి, వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకా ముందంజలో కొనసాగారు. చివరిగా టిడిపి అభ్యర్థి బిటెక్ రవి క్రమంగా ఓట్లను పెంచుకొంటూ ముందుకు సాగారు. చివరకు బీటెక్ రవి 34 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

కర్నూలు..
ఈ జిల్లాలో కూడా టిడిపి పాగా వేసింది. వైసిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 64 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టిడిపి 565 ఓట్లు రాగా వైసిపికి 501 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. ఒక ఓటు నోటాగా వచ్చింది.

నెల్లూరులో..
నెల్లూరులో టిడిపి అభ్యర్థి గెలుపొందారు. గంటకే ఫలితం బయటకు వచ్చింది. వైసిపి అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. 852 ఓట్లుండగా ఎన్నికల్లో 851 ఓట్లు పోలయ్యాయి. 465 ఓట్లు టిడిపికి, 378 ఓట్లు వైసిపికి వచ్చినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

సీఎం బహుమతి - ఆదినారాయణరెడ్డి..
ఈ ఎన్నికలు అవినీతి..అభివృద్ధికి మధ్య పోటీ జరిగిందని, ఇందులో తాము విజయం సాధించామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇది సీఎం చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వనున్నామని తెలిపారు.

11:38 - March 20, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయ ఎజెండాయే బాహుబలి అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఐదు మాసాలు..సుదీర్ఘ పాదయాత్ర అనంతరం ఆయన సోమవారం ఉదయం ఎంబీ భవన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాజన పాదయాత్ర అద్భుతంగా..జయప్రదంగా ముగిసిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి అవుతుందని, సామాజిక న్యాయం చెప్పడానికి..ప్రజలను చైతన్యవంతం చేయడానికి తాము పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం పట్ల ఆసక్తి ఉన్న వారిని ఒక తాటి మీదకు తేవడం జరిగిందని, ఇది ప్రారంభం మాత్రమేనని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే స్థూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, కేసీఆర్ పాలన గురించి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కొన్ని పథకాలు ప్రారంభం కాలేదని, కొన్ని పథకాలు అమలు కావడం లేదన్నారు. ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించిన వారిపై నిర్భందం ప్రయోగిస్తున్నారని, అవమానకరంగా ప్రొ.కోదండరాంను అరెస్టు చేశారని తెలిపారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, మార్చి 15వ తేదీన సింగరేణిలో సమ్మె కొనసాగుతోందని వీరిపై నిర్భందం ప్రయోగిస్తున్నారని తెలిపారు. ఇది ఖచ్చితంగా దొరలపాలేనని, ప్రత్యామ్నాయం ఏంటీ అనే చర్చ ముందుకొస్తుందన్నారు. ప్రజల విశ్వాసం పొందగలిగే శక్తులు ఎవరైతే ముందుకొస్తారో వారు ప్రత్యామ్నాయం చూపేట్టే అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయం ఏజెండా రూపంలో ముందుకు రావాలని, వ్యక్తి రూపంలో కాదన్నారు.

నిర్ణయాలు..
సామాజిక న్యాయం అజెండా ఎంతమందిని సమీకరిస్తుందనే దానిపై సీపీఎం స్పష్టమైన వైఖరి తెలియచేసిందని, పార్టీ అంటే తీవ్రంగా విబేధించిన వారు తమ అజెండాను బలపరుస్తున్నారని తెలిపారు. తొందరపాటు అంచనాలు మాత్రం వేయడం లేదని, ఏజెండా యొక్క లోతుపాతులపై చర్చించడం అందుకు వ్యూహాలు రచించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు లోతైన చర్చ జరగాల్సి ఉంటుందని, ఒకటి..రెండు మాసాల పాటు అందరితో విడిగా..సమిష్టిగా చర్చ జరుపుతామని వెల్లడించారు. అనంతరం ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తాము పేర్కొనటువంటి వాటిపై భిన్నాభిప్రాయాలు వెలువడే అవకాశాలున్నాయని, ఉమ్మడి ప్రణాళిక రచించడానికి ఉపయోగపడుతుందన్నారు. తమ అంతిమ లక్ష్యం ప్రజలు గెలవాలని, 93 శాతం ఉన్న వారందరూ గెలవాలని..మిగతా ఏడు శాతం ఉన్న వారికి వ్యతిరేకం మాత్రం కాదన్నారు. చివరి మనిషికి తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందించడమే తమ లక్ష్యమని తమ్మినేని వెల్లడించారు.

11:34 - March 20, 2017

హైదరాబాద్ : మహాజన పాదయాత్ర విజయవంతంగా జరిగిందని, అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని సీపీఎం నేత వెంకట్ పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో 70 నుండి 80 లక్షల కుటుంబాలను కలవడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని కుటుంబాలను కలవడానికి ప్రయత్నించడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం కోసం పరితపించే వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకరావాలని ప్రయత్నించడం జరిగిందని, ఈసభలో అందరూ పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాల్..నీల్ జెండాలు ఐక్యం కావాలని, వామపక్షాలు..ముఖ్యంగా సీపీఎంపై మరింత బాధ్యత పెరిగిందని, రాబోయే కాలంలో వామపక్షాలు..సామాజిక శక్తులు..అభ్యుదయశక్తులతో మాట్లాడి ఉద్యమాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాపోరాటంలో రాజీ పడకుండా పనిచేస్తామని ప్రజలకు హామీనిస్తున్నట్లు, ఎన్నికల కోసం మాత్రం కాదని మరోమారు స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం 37వేలు మాత్రమేనని..కానీ ఇంత మందిని కలుసుకోవడం అంటే ప్రజాభిమానం పొందినట్లేనని తెలిపారు. నిన్న సభకు రెండు లక్షల మందికిపైగా హాజరయ్యారని, ఈ సభకు సహకరించిన వారందరికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.

మలక్ పేటలో మిర్చి రైతుల ఆందోళన..

హైదరాబాద్ : మలక్ పేట గంజ్ లో మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

11:12 - March 20, 2017

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం పట్ల వైసీపీ స్పందించింది. మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఓట్లను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారని, డబ్బు బలంతో ఓట్లను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సీఎం ఎక్కడా లేడని విమర్శించారు. తమ పార్టీ తరపున గెలిచి టిడిపిలోకి వెళ్లిన వారిచేత రాజీనామా చేయించి ఎందుకు గెలుపొందలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజు వేసుకోవడం జరుగుతుందని, రాష్ట్రంలో వైసీపీ శక్తివంతంగా మారడానికి ప్రయత్నిస్తామని, వైఎస్ కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దని సూచించారు.

కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : కేంద్రకేబినెట్ సమావేశం ప్రారంభమైంది. జీఎస్టీ నమూనా చట్టాల బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.

10:55 - March 20, 2017

వైఎస్ వివేకా పరాజయం..

కడప : జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బిటెక్ రవి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 30 ఓట్లతో బిటెక్ రవి గెలుపొందారు.

10:23 - March 20, 2017

హైదరాబాద్ : సాదాబైనామాల సమస్యలు తీర్చాలని టి.కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సాదాబైనామాల అంశంపై డీకే అరుణ పలు ప్రశ్నలు సంధించారు. సాదాబైనామాలామ విషయంలో గ్రామాల్లో తగాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటిదాక 11 లక్షల 17 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారని, ఎన్ని రిజక్ట్ అయ్యాయో చెప్పాలని సూచించారు. గ్రామాల్లో భూమి అమ్మినటువంటి..కొన్నటువంటి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని, ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎంక్వయిరీ చేయాలని సూచించారు.

10:13 - March 20, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కర్నూలు, నెల్లూరు జిల్లాల ఫలితాలు వచ్చేశాయి. ఈ రెండింటిలోనూ టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. కడప జిల్లాకు వచ్చేసరికి టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. 42 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కొనసాగుతున్నారు.
కడప స్థానిక బరిలో టిడిపి నుండి బీటెక్ రవి, వైసీపీ నుండి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు స్థానిక బరిలో టిడిపి నుండి చక్రపాణి, వైసిపి నుండి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. కర్నూలులో టిడిపి అభ్యర్థి చక్రపాణి విజయం సాధించారు. చివరి నిమిషంలో శిల్పా చక్రపాణిరెడ్డి 56 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. 87 ఓట్ల మెజార్టీతో వాకాటి నారాయణరెడ్డి గెలుపొందారు. టిడిపికి 462, వైసీపీకి 377 ఓట్లు వచ్చాయి.

09:33 - March 20, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చొప్పదండి నియోజకవర్గంలో లెదర్ పార్క్ ఏర్పాటుపై గత కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, ఇందుకు భూ సేకరణ కూడా జరిపిందని పేర్కొంటోంది. దీనిపై అధికార పక్షం పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలిచ్చాయి. ఆబ్కారీ పద్దులు..రెవెన్యూ పద్దతులపై చర్చ జరగనుంది. ఇక ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే పది ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ పై అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తుపెంపుపై ప్రశ్న ఉంది. దీనితో అధికార..విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై రెండు ప్రశ్నలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై సభ్యులు పలు ప్రశ్నలు అడగనున్నారు. రూపాయికి కిలో బియ్యం విషయంలో కేంద్రం నుండి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ పేర్కొంటుండగా కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుంది..రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనే దానిపై చర్చ జరగనుంది.

టి.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయంపై బీజేపీ, చొప్పదండి నియోజకవర్గంలో లెదర్ పార్క్ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి.

09:21 - March 20, 2017

సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర చరిత్రాత్మక పాదయాత్ర అని, 150 రోజులకు పైబడి సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు ఆదివారం వచ్చారు. ఈసందర్భంగా టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ ఆయనతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర నినాదాలపై ఆసక్తిని కనబరిచి వారు మద్దతిచ్చారని తెలిపారు. కిలోమీటర్ల కొద్ది పాదయాత్రతో కలిసి సాగారని, ఏది ఏమైనా ఇది ఘనవిజమన్నారు. కేరళ రాష్ట్రంలో పేదలు లబ్దిపొందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు చాలా సమస్యల్లో ఉన్నారని, సామాజిక న్యాయం అన్నది తమ దృష్టిలో ప్రధానాంశమన్నారు. అభివృద్ధి సామాజిక న్యాయంపైనే ఆధారపడిందని, ఈ దిశగా తాము నాలుగు మిషన్లను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా తాము నవ కేరళలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పినరయి స్పష్టం చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి కింద ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు.

నెల్లూరు టిడిపి అభ్యర్థి వాకాటి గెలుపు...

నెల్లూరు :జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో నిలిచారు. 85 ఓట్ల తేడాతో వాకాటి నారాయణ గెలుపొందారు.

09:07 - March 20, 2017

నెల్లూరు :జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో నిలిచారు. కౌంటింగ్ జరిగిన గంట అనంతరం ఫలితం వచ్చేసింది. వైసీపీ అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి గెలుపొందారు. వాకాటి నారాయణ 85 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఐదు టేబుళ్లపై కౌంటింగ్ జరిపారు. ఇక్కడ జరిగిన ఎన్నికలో 851 ఓట్లు పోలయ్యాయి. టిడిపి అభ్యర్థి విజయం సాధించడంపై పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఎన్నికను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా మంత్రి నారాయణ రంగంలోకి దిగి అభ్యర్థిని గెలుపొందే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు.

08:24 - March 20, 2017

విజయవాడ : మూడురోజుల సెలవుల తర్వాత ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది.. షెడ్యూల్‌ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఇందులో వివిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశముంది.. ముఖ్యంగా రాష్ట్రానికి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు, రుఫమాఫీ, మధ్యాహ్న భోజనపథకంకోసం ఏజెన్సీలు, రేషన్‌కార్డులకోసం విజ్ఞప్తులు, ఎన్టీఆర్ వైద్యసేవలకింద నిధుల కేటాయింపు, మహిళాశిశుసంక్షేమం, ఆదర్శ పాఠశాలలపై చర్చ జరిగే అవకాశముంది.. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు ఉభయసభల్లోనూ మాట్లాడనున్నారు.. అటు వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారం సభలో నిర్ణయం తీసుకోవాల్సిఉంది.. సభాహక్కులకమిటీ సిఫార్సులమీద ఇవాళ సభలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.. ప్రతిపక్ష నేతల వైఖరినిబట్టి రోజా అంశాన్ని సభలో ప్రస్తావించాలని అధికారపార్టీ భావిస్తోంది.. మరోవైపు పీఏసీ, పీయూసీ కమిటీలతోపాటు అంచనాలకమిటీలకుచెందిన కాలపరిమితి ముగిసింది.. ఈ కమిటీలను కొత్తగా ఎన్నుకోవాల్సిఉంది... ఈ అంశంకూడా ఉభయసభలముందుకు రానుంది.

08:12 - March 20, 2017

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కడప స్థానిక బరిలో టిడిపి నుండి బీటెక్ రవి, వైసీపీ నుండి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు స్థానిక బరిలో టిడిపి నుండి చక్రపాణి, వైసిపి నుండి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.

నెల్లూరులో..
నెల్లూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. ఆరు టేబుల్స్..నాలుగు బాక్స్ లను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

కడపలో...
కడపలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు..బాణాసంచా కాల్చరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రెండు..మూడు గంటల్లో విజయం ఎవరిదో తేలనుంది.

కర్నూలులో..
కర్నూలులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ లో 1077 ఓట్లు పోలయ్యాయి. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టిడిపి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

08:02 - March 20, 2017

తాజా చిత్రం 'కాటమరాయుడు' చిత్రంలో పవర్ స్టార్ 'పవన కళ్యాణ్' పై విధంగా డైలాగ్స్ పలికారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. పవన్ మరింతగా గ్లామర్ గా కనిపిస్తుండడం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్ .. చాలా చాలా డేంజర్ రోయ్" అనే డైలాగ్..."కోపాన్ని .. ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో" అంటూ పవన్ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకొంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన సాంగ్స్ యూ ట్యూబ్ లో రెండు రోజుల కొకసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

07:55 - March 20, 2017

సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర నిన్నటితో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై వక్తలు విమర్శలు గుప్పించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్షాలు ఆయనపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో చెరుపల్లి సీతారాములు (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీధర్ (బీజేపీ), బెల్లం నాయక్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

విజయవాడ : చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

07:12 - March 20, 2017

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కౌలు రైతులకు నిరాశే మిగిలింది. 32 లక్షల మంది వున్న కౌలు రైతుల సమస్యలకు ఈ బడ్జెట్ పరిష్కారం చూపించలేకపోయింది. లక్షా 56వేల కోట్ల రూపాయలతో యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఏపి రాష్ట్ర బడ్జెట్ పై కౌలు రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సవరణలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత జమలయ్య మాట్లాడారు. ఆయన ఎలాంటి సూచనలు..సలహాలు చేశారో వీడియోలో చూడండి.

06:53 - March 20, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమరశంకం పూరిస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ..తాడోపేడో తేల్చుకునేందుకు దండయాత్రకు సిద్ధమవుతోంది. నిరుద్యోగ ర్యాలీ సందర్బంగా ప్రభుత్వం అనుసరించిన తీరుతో...గ్రామ స్థాయి నుంచి జనంలోకి వెళ్లేందుకు టీ-జాక్ ప్రణాళికలను రచిస్తోంది. తెలంగాణా ఉద్యమట్యాగ్ లైన్‌గా ఉన్న నీళ్లు-నిధులు-నియామాకల అంశాలనే అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై తెలంగాణ జేఏసీ మరింత దూకుడును పెంచింది. తెలంగాణా ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిన టీ-జాక్..తమ కార్యాచరణను మరింత విస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వం విఫలమవుతున్న అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచాలని జాక్ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్న టీజాక్‌కు..ప్రభుత్వం తరపున కూడా అదే స్థాయిలో అడ్డంకులు ఎదురౌతున్నాయి. ప్రభుత్వ తీరును తప్పుబడుతూనే ప్రజా సమస్యలపై దృష్టి పెడుతామని స్పష్టం చేస్తోంది. ఆదివారం జరిగిన టీజాక్ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను జాక్ తీసుకుంది.

పాదయాత్ర..
కార్పొరేట్ విద్యావ్యవస్థకు మద్దతు తెలిపేలా ప్రభుత్వ విధానం ఉందని తెలంగాణ జేఏసీ అభిప్రాయ పడింది. ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయకపోవడంపై ఏప్రిల్ నుంచి జిల్లాల్లో సదస్సులు నిర్వహించడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మే నెలలో "నీళ్లు-నిధులు-నియామకాలు'' నిజాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అంటున్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ స్పూర్తి యాత్రను జూన్‌ 21 నుంచి మొదలు పెట్టాలని సమావేశం నిర్ణయించినట్లు కోదండరామ్‌ తెలిపారు. ఓ వైపు నిరసన కార్యక్రమాలను చేపడుతూనే..గ్రామ స్థాయి నుంచి కమిటీల నియామకాన్ని చేపట్టాలని టీ-జేఏసీ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టీ జేఏసీ సిద్ధమవుతోంది. అయితే టీ జేఏసీ తీరుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

06:50 - March 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని నాలుగున్నర లక్షల మంది మలయాళీల అభివృద్ధికి కృషి చేస్తానని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విజయన్‌.. అనంతరం మలయాళీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఎం నిర్వహించిన సమర సమ్మేళనం సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌.. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయనకు కేసీఆర్‌ విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయన్‌ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం అక్కడ ఓ భవనాన్ని నిర్మించే అంశాన్ని కూడా కేసీఆర్‌.. విజయన్‌ దృష్టికి తెచ్చారు. దీనికి అవసరమైన భూమిని సమకూర్చుతామని విజయన్‌ హామీ ఇచ్చారు.

ఆత్మీయ సమ్మేళనం..
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపంలో జరిగిన మలయాళీల ఆత్మీయసమ్మేళనం కార్యక్రమంలో కేరళ సీఎం విజయన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఉంటున్న నాలుగన్నర లక్షల మలయాళీల అభివృద్ధికి కృషి చేస్తానని విజయన్ తెలిపారు. కేరళ భవన్‌ను త్వరతగతిన పూర్తిచేయాలని.. హైదరాబాద్ నుంచి నేరుగా కేరళకు బస్సులు నడపాలని సీఎం కేసీఆర్‌ను కోరానని చెప్పారు. అలాగే కేరళ వాసులకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్టు తెలిపారు. మరోవైపు విజయన్ పర్యటన సమయంలో ఆర్టీసీ కళాభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేరళ సీఎం గోబ్యాక్ అంటూ ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

06:48 - March 20, 2017

హైదరాబాద్ : సబ్బండ వర్గాల సమరసైన్యం హైదరాబాద్‌లో సమరశంఖం పూరించింది. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసింది. ఎర్రదళం భాగ్యనగరి వీధుల్లో కవాతు తొక్కింది. ఎక్కడ చూసినా లాల్‌, నీల్‌ జెండాల రెపరెపలే దర్శనమిచ్చాయి. మెడలో కండువాలు, చేతిలో జెండాలు, లాల్‌,నీల్‌ దుస్తులు ధరించి సాగిన ర్యాలీ... హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారులన్నీ సరూర్‌నగర్‌కే అన్నట్టుగా ఎటుచూసినా జనసంద్రమే తలపించింది. పదం పాడుతూ... కదం కదుపుతూ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఎక్కడ చూసినా ఎర్రజెండాలు, నీల్‌ జెండాలే రెపరెపలాడాయి. దీంతో హైదరాబాద్‌ లాల్‌నీల్‌ వర్ణశోభితమైంది. కులవివక్షత, సామాజిక అసమానతలపై అవి దండోరా మోగించాయి. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి.

154 రోజులు..
తెలంగాణ వ్యాప్తంగా మహాజన పాదయాత్ర 154 రోజులు కొనసాగింది. 4200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆదివారం పాదయాత్ర ముగింపు సందర్భంగా సమర సమ్మేళనం సభ జరిగింది. ఈ సభకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తమ్మినేని నేతృత్వంలో పాదయాత్ర బృందం సభ్యులు, పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి పాదయాత్రగా చేరుకున్నారు. ఈ పాదయాత్రకు హైదరాబాద్‌ జనం అడుగడుగునా జేజేలు పలికారు. తమ అభిమానాన్నంతా పూలవర్షంలా కురిపించారు. పాదయాత్ర వస్తున్న ప్రధాన కూడళ్లలో కార్యకర్తలు బాణాసంచాలలు కాల్చి ఘన స్వాగతం పలికారు. జై భీం, లాల్‌సలాం నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాదయాత్ర సాగిన దారులన్నీ కోలాహలంగా జన జాతరను తలపించింది.

నగరంలో జోరు హోరు..
పాదయాత్ర పొడవునా తమ్మినేని బృందానికి జనం తండోపతండాలుగా తోడయ్యారు. ప్రతి కూడలి దగ్గర పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలుకుతూ..అక్కడి నుంచి వారితో కలిసి నడిచారు. టీవీ టవర్‌ చౌరస్తాకు రాగానే జనం వేలాదిగా జమఅయ్యారు. ఇక కొత్తపేట చేరుకోగానే జనం రెట్టింపయ్యారు. దీంతో దారులన్నీ సీపీఎం, సామాజిక సంఘాల కార్యకర్తలతో నిండిపోయాయి. మరోవైపు వనస్థలిపురంలోని స్పెన్సర్స్‌ నుంచి మరో ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్ధులు భారీగా సభకు తరలివచ్చారు. లాల్‌,నీల్‌ జెండాలు చేతబట్టి వాహనాల్లో చేరుకున్నారు. దూరప్రాంతాల వారు కొంతమంది శనివారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నానికే సభ ప్రాంగణం నిండిపోయింది. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా జనం సభలో కూర్చొన్నారు. సభికుల సౌకర్యార్ధం సభా ప్రాంగణంలో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో తొక్కిసలా జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా జనమూ సహకరించారు. సభా ప్రాంగణానికి దూరంగా వాహనాలను నిలిపివేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మొత్తం హైదరాబాద్‌ జన హోరు తలపించింది.

06:46 - March 20, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు సభికులను కట్టిపడేశాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పోడకలపై గాయకుల పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రజాగాయకులు గద్దర్‌, గోరటి వెంకన్న, విమలక్క పాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. గాయకుల పాటలకు సభికులు ఈలలువేస్తూ, నృత్యాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభకు వచ్చిన జనాన్ని అలరించాయి. ప్రజా గాయకుడు గద్దర్‌ సభలో పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అమర వీరులపై పాడిన పాట ఉర్రూతలూగించింది. ఇక పొడుస్తున్న పొద్దుమీద పాటకు సభికులు నృత్యాలు చేశారు. రచయిత, ప్రజా కవి గోరటి వెంకన్న స్టేజ్‌ను షేక్‌ చేశారు. పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ఇక విమలక్క ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న దాడిపై పాడిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆడుదాం డప్పుల్లా దరువేయరా అంటూ విమలక్క పాడితే సభికులు కదం కలుపుతూ స్టెప్పులేశారు. గాయకుడు ఏపూరి సోమన్న తన పాటలతో అందరిలో ఉత్తేజం నింపారు. కేసీఆర్‌ హామీలపై ఆయన పాడినపాటలు అందరినీ ఆలోచింపజేశాయి. రోజులు మారాలి, మా రోజులు రావాలంటూ సాగిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజానాట్య మండలి కళాకారులు నర్సింహ్మా పాడిన పాటలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. తమ్మినేని పాదయాత్రపై ఆయన పాడిన పాటకు సభకు వచ్చిన వారు ఈలలువేస్తూ... నృత్యాలు చేస్తూ మద్దతు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు, భద్రాచలానికి చెందిన గోండు నృత్యాలు సమర సమ్మేళనం సభకే హైలెట్‌గా నిలిచాయి.

06:43 - March 20, 2017

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రసంగిచిన వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు..టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోకడలు నియంతృత్వాన్ని తలపిస్తున్నాయని మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలకు వివిధ పక్షాలు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల్లోని లోపాలను వేలెత్తిచూపారు. దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, రెండు పడక గదుల ఇళ్లు, నిరుద్యోగం, గిరిజనులు, మైనారిటీల రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక స్థానంలో ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వంటి అవిషయాల్లో సర్కారు వైఖరిపై విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం విషయంలో ప్రభుత్వ పోకడలను నేతలు ఎండగట్టారు.

సర్కార్ పై ఆగ్రహం..
హరితహారం పేరుతో ఆదివాసీల పోడు వ్యవసాయంపై ఉక్కుపాదం మోపుతున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. తమ్మినేని పాదయాత్రను అడ్డుకునేందుకు పాలకులు పన్నిన కుట్రను ప్రజలు తిప్పికొట్టారని సీపీఐ తెలంగాణ కమిటీ కార్యదర్శి చాడ వెంటకరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో అణగారిన వర్గాల అణచివేతకు గురువుతున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మండిపడ్డారు.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫమైందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంగా సందర్భంగా ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల్లల్లో నెలకొన్న దుస్థితిని జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రస్తావించారు. వేలాది స్కూళ్లలో మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యంలేని విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోని గ్రామాల్లో ప్రజలు పడుతున్న అవస్థలు తమ్మినేని పాదయాత్రతో వెలుగులోకి వచ్చిన సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. బలహీనవర్గాల సంక్షేమాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సామాజికవేత్త కంచె ఐలయ్య మండిపడ్డారు. నీలి, ఎరుపురంగు కలిసి దేశంలో మొదటిసారి సమర సమ్మేళనం నిర్వహించడం మార్పుకు చిహ్నమన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఐక్యపోరాటాలు..
తెలంగాణలో సన్నాసులు పాలన నడుస్తున్నదని మాలమహానాడు నాయకుడు అద్దంకి దయాకర్‌ విమర్శించారు. కుల వృత్తులు చేసుకుంటున్నవారికి అదే వృత్తిలో సహాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాన్ని దయాకర్‌ తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ పాలనలో సామాజికన్యాయం కొరవడిందని పలువురు నేతలు విమర్శించారు. బలహీనవర్గాల సంక్షేమం కుంటుపడిందని దయ్యబట్టారు. సర్కారు మెడలు వంచి సామాజిక తెలంగాణ సాధించేందుకు ఐక్య పోరాటాలకు ప్రజలు కలిసిరావాలని నేతలు పిలుపు ఇచ్చారు.

06:40 - March 20, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం దిశగా చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. సామాజిక న్యాయం సాధించే వరకు లాల్‌నీల్‌ జెండాల ఐక్య ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సమర సమ్మేళనం సభలో మాట్లాడిన ఆయన..ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని..ఉద్యమాలపట్ల కేసీఆర్‌ తీరుమారకుంటే ఆయనను ప్రజలే మార్చేస్తారని హెచ్చరించారు. మహాజన పాదయాత్ర ముగింపుగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మహాజన పాదయాత్ర తనకు ఎన్నో మధుర స్మృతులను ఇచ్చిందన్నారు. ఈ పాదయాత్రను తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనన్నారు. పల్లెపల్లెనా తమకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలకు ఆయన సభా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక న్యాయమే నినాదం..
సామాజిక న్యాయం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తమ్మినేని వీరభద్రం ఉద్ఘాటించారు. తెలంగాణలోని ప్రజలంతా అట్టడుగు వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారని.. వారంతా అభివృద్ధి చెందకుండా తెలంగాణ ఎలా అభివృద్ధి అవుతుందని ప్రశ్నించారు. సామాజిక న్యాయం అంటే ఓట్లు దండుకోవడానికి వాడే పదజాలం కాదన్నారు. అట్టడుగు వర్గాలకు సమన్యాయం జరగాలన్నదే సామాజిక న్యాయ నినాదమని స్పష్టం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో అణగారిన వర్గాలు బాగుపడేలా ప్రభుత్వ చర్యలు లేవన్నది స్పష్టమైందన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయ సాధనకు చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వం గద్దె దిగక తప్పదని హెచ్చరించారు. సామాజిక న్యాయం సాధించే వరకు లాల్‌నీల్‌ జెండాలు కలిసి పోరాటం కొనసాగిస్తాయని, కచ్చితంగా అధికారంలోకి వస్తాయన్నారు తమ్మినేని.

అప్రజాస్వామిక చర్యలు...
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ విస్మరించారని తమ్మినేని మండిపడ్డారు. దళితులకు 3ఎకరాల భూమి, బీసీ, మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో 22 లక్షల మందికి ఇళ్లులేవని ప్రభుత్వ సర్వేలో తేలిందని వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి తీరాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. లేకుంటే కేసీఆర్‌ను ఆయన బెడ్‌రూంలో నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలపట్ల కేసీఆర్‌ కర్కోటకుడిలా వ్యవహరిస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే..గోడకు కొట్టిన బంతిలాగా మరింతగా ఎదుగుతామన్నారు. అప్రజాస్వామిక చర్యలను కేసీఆర్‌ మానుకోవాలని సూచించారు. కేసీఆర్‌ తీరుమార్చుకోకపోతే ప్రజలే కేసీఆర్‌ను మార్చుతారని హెచ్చరించారు.

పోడు భూములు..
సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి సాధనగా భవిష్యత్‌లో భారీ ఉద్యమాలు నిర్మిస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అన్ని సామాజిక శక్తులు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులతో కలిసి ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. స్పష్టమైన విధానంతో ప్రజలకు ముందుకు వస్తామని...తమను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ ప్రజల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని తమ్మినేని విమర్శించారు. గిరిజన భూముల జోలికి వెళితే మరో మన్యం పోరాటం తప్పదన్నారు. ఆదివాసీల పోడుభూముల జోలికి వెళ్లితే ఖబర్దాన్‌ అని హెచ్చరించారు. ప్రాజెక్టుల కోసం భూములు లాక్కొనే రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

06:37 - March 20, 2017

హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సామాజిక తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఏమి చేయాలన్న విషయంలో సీపీఎం సూచనలను పరిగణలోకి తీసుకోవాలని విజయన్‌ కోరారు. తమ్మినేని పాదయాత్ర ద్వారా వెలుగులోకి వచ్చిన సామాజిక సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు బంగారు తెలంగాణ సాధన ఏమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యమంత్రి కరేసీఆర్ కేసీఆర్ ను ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ సాధనం కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాయరయ్యారు. ఐదు నెలలపాటు అవిశ్రాంతంగా అలుపెరుగని పాదయాత్ర చేసిన తమ్మినేని వీరభద్రం బృందాన్ని నినరయి విజయన్‌ అభినందించారు. పాదయాత్రను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పిలుపు ఇవ్వడాన్ని పినరయి విజయన్‌ తప్పుపట్టారు. పాలకులు ఎన్ని కుటియత్నాలు చేసినా..మహాజన పాదయాత్ర విజయవంతం కావడం కమ్యూనిస్టులు, సామాజిక శక్తుల ఘనతని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల అభివృద్ధితోనే సామాజిక తెలంగాణ సాధ్యమన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని పినరయి విజయన్‌ సూచించారు.

హామీల అమలేది..
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ హామీ అమలుకు నోచుకోలేదని, ఇది కేవలం వాగ్దానంగానే మిగిలిపోయిందని కార్యక్రమానికి హాజరైన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పాలకులు విస్మరించిన సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం పునరంకింతమైందని, ఇందుకోసం భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు తప్పవని ఏచూరి చెబుతున్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం భవిష్యత్‌లో చేపట్టే ఉద్యమాలకు ప్రజలందరూ సహకరించాలని సీతారాం ఏచూరి విజ్ఞప్తి చేశారు.

సంతోష్ నగర్ లో పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు..

హైదరాబాద్ : సంతోష్ నగర్ లోని మిత్రా వైన్స్ వద్ద పాత నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి 35 లక్షల 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు.

పోలీసుల అదుపులో ఐఏఎస్ కుమారుడు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో ఓ ఐఏఎస్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 17న నాగరాజు అనే డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నాగరాజు హత్య కేసులో ఐఏఎస్ వెంకటేశ్వర్లు కుమారుడిని అనుమమానితుడని పోలీసులు భావిస్తున్నారు.

సీఐ కారు దగ్ధం..

కరీంనగర్ : ఇరుకుల్ల వంతెన వద్ద కారులో మంటలు చెలరేగాయి. పొగలు రావడంతో అప్రమత్తమై కారులో నుండి సీఐ భూమయ్య, మరో ఇద్దరు దిగిపోయారు. కారు ప్రమాదంలో సీఐ భూమయ్య పిస్తోల్ దగ్ధంమైంది. పెద్దపల్లి నుండి కరీంనగర్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ..

విజయవాడ : నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరగనుంది. అధికార..ప్రతిపక్ష మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలున్నాయి.

పోలవరంపై బాబు సమీక్ష..

విజయవాడ : నేడు పోలవరంపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం పోలవరంపై ఆయన సమీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

Don't Miss