Activities calendar

21 March 2017

21:33 - March 21, 2017

ఢిల్లీ : నల్లధనం నిరోధించేందుకు ఖాతాదారులకు మరో షాక్‌ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నగదు లావాదేవీలు 2 లక్షల పరిమితి దాటితే వంద శాతం జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంతకు ముందు 3 లక్షల రూపాయల పరిమితి ఉండేది. ఈ నిబంధన ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుంది. నగదు లావాదేవీలను ఆపేందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

21:32 - March 21, 2017

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడాన్ని నిలిపేయాలంటూ మమత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో సీబీఐ విచారణకు ఇక ఎలాంటి అడ్డు ఉండే అవకాశం దాదాపు లేకుండా పోయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సిబిఐకి ప్రాథమిక విచారణ పూర్తి చేయడానికి 72 గంటలకు బదులు నెలరోజుల గడువిచ్చింది. 2016 మార్చి నెలలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టింది. అందులో పలువురు టీఎంసీ ఎంపీలు, నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారం మొత్తం రికార్డయింది. 

21:30 - March 21, 2017

ఢిల్లీ: సబ్‌ కా సాథ్‌...సబ్‌ కా వికాస్ ధ్యేయంగా కుల మతాల కతీతంగా అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. సిఎం అయ్యాక తొలిసారిగా ఆయన లోక్‌సభలో ప్రసంగిస్తూ... గ్లోబల్‌ ఐకాన్‌గా మారిన ప్రధాని నరేంద్రమోదితోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మోది చొరవ వల్లే గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్ ఏర్పాటయిందని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌ను అవినీతి, నేర రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. రాహుల్‌ కన్నా ఏడాది చిన్నవాడినని, అఖిలేష్‌ కన్నా ఏడాది పెద్దవాడినని ఇద్దరి మధ్య తాను సిఎంగా వచ్చానని యోగి అనడంతో సభలో నవ్వులు విరిసాయి.

21:28 - March 21, 2017

హైదరాబాద్‌ : నగరంలోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ తరలించాలనే తెలంగాణా సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలు..ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. నిరసనకారుల గొంతు నొక్కే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ధర్నా చౌక్‌ తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు.

 

21:27 - March 21, 2017

ఢిల్లీ: టీ.టీడీపీ నేతలు ఎలక్షన్‌ కమిషనర్‌ ఓం ప్రకాష్‌రావత్‌ను కలిశారు. తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన 12 మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని ఆయన్ని కోరారు. తెలంగాణాలో నియోజకవర్గాల పునర్విభజన పాత పది జిల్లాల ప్రకారమే చేపట్టాలని కోరామని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన నిర్ణయానికి తలొద్దని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు. 

21:25 - March 21, 2017

హైదరాబాద్: తెలంగాణ శాసనసభా సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. మంగళవారం ఐదు కీలక అంశాలపై చర్చలు నడిచాయి. విపక్ష సభ్యులు పలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో ..

ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు సూటిగా ప్రశ్నలు సంధించాయి. తమ ప్రభుత్వాల హయాంలో దాదాపు పూర్తిచేసిన ప్రాజెక్టులద్వారా నీరందింస్తూ.. తామే అంతా చేసినట్టు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విమర్శించారు. తెలంగాణకు ఆయుపట్టు అయిన ప్రాణహిత ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేస్తే జాతీయ ప్రాజెక్టు గుర్తింపు వచ్చేదని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు.

దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్ రావు...

దీనిపై ఘాటుగా స్పందించిన నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్‌పార్టీ పై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల నిర్వాకం వల్లే.. తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. తమ్మిడిహట్టి వద్ద డ్యాం నిర్మాణం చేపట్టకుండానే.. రంగారెడ్డి, మెదక్‌జిల్లాల్లో అక్కడక్కడా మట్టిపనులు చేపట్టి వందల కోట్లు ఖర్చు చేశారని హరీశ్‌ అన్నారు. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు చనిపోయిన వ్యక్తుల పేరుతో కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేశారని హరీశ్‌ ఆరోపించారు.

మంత్రి వ్యాఖ్యలను తప్పు బట్టిన జానా...

మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను విపక్షనేత జానారెడ్డి తప్పుబట్టారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మించి లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌పార్టీదే అన్నారు జానారెడ్డి. అటు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వాగతించిన సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య.. భద్రాచలం నియోజకవర్గంలో పలు మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను మిషన్‌ కాకతీయ పథకంలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని...

ప్రాజెక్టుల నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ శాసన సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఇద్దరు కాంట్రాక్టర్లను బాగుచేయడానికే ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునిర్మాణంలో పలు సవరణలు చేసిందని ప్రభాకర్‌ విమర్శించారు. మరో వైపు రాష్ట్రంలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థలను నిస్తేజంగా మారుస్తున్నారని.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారులు, నిధులు లేకుండా చేశారని విపక్షాలు విమర్శించాయి. పంచాయతీ రాజ్‌ వ్యవస్థ పటిష్టత కోసం నిర్దేశించిన చట్టాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య.

ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష ...

ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. గ్రామీణప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయింపుల్లో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలకు కోటిరూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సభ వాయిదాపై కాంగ్రెస్ గుస్సా....

సాయంత్రం 6 గంటల వరకు చర్చ అనంతరం... డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి సభను బుధవారానికి వాయిదా వేశారు. అయితే డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గరం అయ్యారు. వన్‌సైడ్‌గా సభను నడిపిస్తున్నారని విమర్శించారు. విపక్షనేత జానారెడ్డి మాట్లాడ్డానికి రెడీ అవుతుండగా సభను అర్థాంతరంగా వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్‌ మధుసూదనాచారికి ఫిర్యాదు చేయడంతో పాటు.. సభ జరిగినన్ని రో జులు డిప్యూటీస్పీకర్‌ చైర్‌లోకి రాగానే వాకౌట్‌ చేయాలని కూడా నిర్ణయించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ కూడా మద్దతు తెలపడంతో బుధవారం నాటి సమావేశాలు మరింత హాట్‌హాట్‌గా సాగనున్నాయి. 

21:21 - March 21, 2017

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం రేపు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అలాగే భూదాన్‌యాక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ద్వంద్వ పదవులు నిర్వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఒకే వేతనం పొందేలా సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు, ప్లీనరీపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. ఇక ఏప్రిల్‌ 27న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. 

20:39 - March 21, 2017

కూరగాయలు కొనడానికి స్వైప్, పచారీ కొట్టులో పేటీఎం, సినిమా హాల్లో డెబిట్ కార్డు, మనీ ట్రాన్స్ ఫర్ కు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్, అంతా క్యాష్ లెష్.. ఓన్లీ ఆన్ లైన్. వినడానికి బాగానే ఉంది. కానీ ఇక్కడే అస్సలు సమస్య కాబోతోందా? వైరస్ లు, మాల్ వేర్లు కుప్పలు.. తెప్పలుగా పొంచి ఉన్నాయా? మీ స్మార్ట్ ఫోన్ ను కబలించే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా అకౌంట్ లో సొమ్ముతో పాటు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా వూడ్చేసే ప్రమాదం ఉందా? ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ప్రశ్నపత్రం లీకేజీ వదంతు మాత్రమే

హైదరాబాద్: పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వదంతు మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎలాంటి ప్రశ్నపత్రాల లీకేజీ జరగలేదన్నారు. వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నపత్రాలను మాల్‌ ప్రాక్టీస్‌ కింద గుర్తిస్తామని కలెక్టర్‌ చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. పరీక్షలు యథాతథంగా జరుగాతాయని లోకేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

20:08 - March 21, 2017

హైదరాబాద్: అవినీతల ఆంధ్రప్రదేశ్ ఫస్టు ప్లేస్...అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సీఎం, మీడియా మీద అఖిలపక్షం దాడి..చూడిండ్రి లేడీ ఎమ్మెల్యేల వాడి, ఉద్యమకారుడ్ని ఉరికిచ్చి తన్నాలే...క్యాడరుకు పిలుపునిచ్చిన తీగల కృష్ణ, పుచ్చకాయలతోనే పోలీసు ఫుడ్ బాల్...ఆదర్శ కాఖీలు అవుతున్న ఉప్పల్ ట్రాఫికోళ్లు, పన్ను కట్టలేదని ఇంట్లేసి తాళం వేసిండ్రు... జర తక్కువ పని చేసిన ఇల్లెందు ఆఫీసర్లు, కలిసి తిరిగినపుడు కనిపించని కులం...పెండ్లి అనంగనే చూపెడుతున్నడు బలం ఇలాంటి వేడి వేడి విషయాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:57 - March 21, 2017

ఢిల్లీ: మళ్లీ వరుసగా ఆయనే నెంబర్‌ వన్‌..ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో మళ్లీ అగ్రస్థానం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌దే. ఫోర్బ్స్ మేగజిన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో..బిల్‌గేట్స్ సంపద 86 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. కాగా బిల్‌గెట్స్‌ వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగగా..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం 200 స్థానాలు కిందకు జారిపోయారు. బిల్‌గేట్స్ తర్వాత బెర్క్‌షైర్ హాత్‌వే చీఫ్ వారెన్ బఫెట్ రెండోస్థానంలో కొనసాగగా..రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ..33వ స్థానంలో ఉన్నారు.

86 బిలియన్‌ డాలర్ల సంపదతో వరుసగా నాలుగోసారి అగ్రస్థానం ...

ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ పత్రిక తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మళ్లీ నంబర్‌వన్‌గా నిల్చారు. 86 బిలియన్‌ డాలర్ల సంపదతో వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఇక బెర్క్‌షైర్‌ హాథ్‌వే చీఫ్‌ వారెన్‌ బఫెట్‌ 75. 6 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా..అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ మూడో స్థానంలో నిల్చారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జకర్‌బర్గ్‌ 5వ స్థానం దక్కించుకొని టాప్‌లో ఉన్నారు. ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్‌ 7వ స్థానంలో ఉన్నారు.

గతేడాతో పోలిస్తే 13 శాతం పెరిగింది ...

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల జనాభా..క్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి 13 శాతం పెరిగి 2,043కి చేరింది. 31 సంవత్సరాల క్రితం సంపన్నుల జాబితాను రూపొందించడం మొదలుపెట్టినప్పట్నుంచీ ఇదే అత్యధిక పెరుగుదల అని ఫోర్బ్స్‌ పేర్కొంది. అత్యధికంగా 565 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా,.319 బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో, 114 మందితో జర్మనీ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం 220 స్థానాలు దిగజారి 544వ స్థానానికి పరిమితమయ్యారు.

33వ స్థానంలో ముఖేష్‌ అంబానీ...

ఇక భారత్‌ విషయానికొస్తే 23.2 బిలియన్‌ డాలర్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 33వ స్థానాన్ని దక్కించుకోగా..భారత్‌లో నెంబర్‌వన్‌ శ్రీమంతుడిగా నిలిచారు. పేటీఎం చీఫ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ 1.3 బిలియన్‌ డాలర్లతో 1,567వ స్థానంలో నిల్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..అరబిందో ల్యాబ్స్‌ సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి 2.6 బిలియన్‌ డాలర్లతో 782వ స్థానంలోనూ, దివీస్‌ ల్యాబరేటరీస్‌ వ్యవస్థాపకుడు మురళీ దివి 1. 6 బిలియన్‌ డాలర్లతో 1,290 స్థానంలో నిల్చారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన శ్రీమంతుల జాబితాకు సంబంధించి టాప్‌ టెన్‌లో సింహభాగం టెక్నాలజీ దిగ్గజాలే ఉండడం విశేషం. 

19:49 - March 21, 2017

ఢిల్లీ: రామ జన్మభూమి వివాదాన్ని.. కోర్టు బయటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకూ సంసిద్ధతను వ్యక్తం చేసింది. సుప్రీం సూచనను బిజెపి స్వాగతించగా.. విశ్వ హిందూపరిషత్‌ మాత్రం రామాలయ నిర్మాణం కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.

కీలక సూచనలు చేసిన సుప్రీం....

అయోధ్యలో వివాదాస్పద రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు మంగళవారం, కీలక సూచనలు చేసింది. ఇది చాలా సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన అంశం కావటంతో కోర్టు వెలుపలే పరిష్కరించుకోవడం మేలని కోర్టు అభిప్రాయపడింది. అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ కోరుతూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ ఇరు వర్గాలు కలిసి కూర్చొని వివాదానికి పరిష్కార మార్గం కనుగొనాలని సూచించారు.

న్యాయ వ్యవస్థ జోక్యం అవసరమనన్నస్వామి ...

రామజన్మభూమి వివాదంలో.. గతంలో కూడా కోర్టు బయట చర్చలు జరిగాయని సుబ్రహ్మణ్య స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకే ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం అవసరమని స్వామి అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై ఇరు వర్గాలను సంప్రదించి వారి నిర్ణయాన్ని మార్చి 31లోగా వెల్లడించాలని సుబ్రహ్మణ్య స్వామిని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే, తామూ మధ్యవర్తిత్వం వహించటానికి సిద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గత 27 ఏళ్లుగా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా...

గత 27 ఏళ్లుగా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా ఎలాంటి పురోగతి లేదని బాబ్రీ మసీదు యాక్షన్‌ ప్లాన్ సభ్యులు జఫర్‌యాబ్‌ జిలానీ అన్నారు. చర్చల కాలం ముగిసిందని ఆలిండియా ముస్లిం బోర్డు పేర్కొంది. 2010లో రామజన్మభూమికి అనుకూలంగా అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు, సుప్రీంకోర్టు సూచనను భారతీయ జనతాపార్టీ స్వాగతించింది. కానీ, సంఘ్‌పరివార్‌ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. రామాలయ నిర్మాణం కోసం మరో ఉద్యమాన్ని చేపడతామని విశ్వహిందూ పరిషత్‌ స్పష్టం చేసింది. యూపీలోని 70వేల గ్రామాల్లో, మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16 వరకు రామ మహోత్సవం నిర్వహిస్తామనీ వెల్లడించింది. 

ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమానులతో మంత్రి శిద్ధా భేటీ

విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమానులతో మంత్రి శిద్ధా రాఘవరావు భేటీ అయ్యారు. 20 రోజుల్లో ప్రతి బస్ కు జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, దూర ప్రాంతాలకు ముగ్గు డ్రైవర్లను ఏర్పాటు చేయాలని, డ్రైవర్ డ్యూటీకి వచ్చే సమయంలో మద్యం సేవించారా లేదా చెకింగ్ చేసి పంపాలని యాజామాన్యాలకు మంత్రి సూచించారు. స్పీడ్ లిమిట్ 80 కిలో మీటర్ల కంటే మించరాదన్నారు. శిక్షణ తీసుకోకుండా బస్సులు నడిపితే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డ్రైవర్ నాగరాజు హత్య కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: డ్రైవర్ నాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు, కుమారుడు వెంకట్ ను అరెస్ట్ చేసింది. కాసేపట్లో నిందితులను మీడియాముందు ప్రవేశపెట్టనున్నారు.

19:33 - March 21, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైంది. రిజర్వేషన్ల పెంపు బిల్లుల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

19:32 - March 21, 2017

డిప్యూటీ స్పీకర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గరంగరం

హైదరాబాద్: డిప్యూటీ స్పీకర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గరంగరంగా ఉన్నారు. డిప్యూటీ ఛైర్మన్ సభను వన్ సైడ్ గా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి మాట్లాడేందుకు లేవగానే సభను వాయిదా వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ వ్యవహార శైలి సరిగా లేదని మంత్రి హరీష్ రావుతో జానారెడ్డి చెప్పగా స్పందించిన హరీష్ జరిగిన పరిణామాలపై క్షమించాలని జానాను కోరారు.

19:26 - March 21, 2017

బీటెక్ విద్యార్థి ప్రాణం తీసిన కబడ్డీ

రంగారెడ్డి : కబడ్డీ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలం కాచారం వర్థమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎండలో కబడ్డీ ఆడుతూ సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న సంపత్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అత్యుత్సాహంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మండుటెండలో యాజమాన్యం కబడ్డీ ఆడించడం వల్లే సంపత్ మృతి చెందాడని కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైంది. రిజర్వేషన్ల పెంపు బిల్లుల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

19:07 - March 21, 2017

ఢిల్లీ: నేరచరితులపై కొరడా ఝళిపించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది. ఇకపై దోషులని తేలితే జీవితకాలం నిషేధం విధించాలని ప్రతిపాదిస్తోంది. వారు ఏ పదవులు చేపట్టడానికైనా అనర్హులుగా భావిస్తోంది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మరోవైపు ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చే సేందుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది.

నేర రహితం చేసే దిశగా ఈసీ అడుగులు..

రాజ్యాంగం, చట్టం పరిధిలో రాజకీయాలను నేర రహితం చేసే దిశగా ఈసీ అడుగులు వేస్తోంది. నేరచరితులు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు...కఠినంగా వ్యవరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, రెండేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన దోషులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని ఆరేళ్లకే పరిమితం చేయకుండా, జీవితకాలం విధించాలని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదిస్తోంది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు...

శాసన, న్యాయ, పాలన వ్యవస్థల్లోని సభ్యులపై దాఖలైన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేసి, వాటిలో దోషులుగా తేలిన వారిని రాజకీయ ప్రక్రియ నుంచి జీవిత కాలం నిషేధించాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై విచారణ సందర్భంగా.. ఈసీ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. నేరచరితులపై జీవితకాల నిషేధానికి తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది.

కనీస విద్యార్హత, వయో పరిమితిపై స్పందించిన ఈసీ ...

ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత...చట్ట సభ సభ్యులకు వయో పరిమితి అంశాలపై ఈసీ స్పందించింది. ఆ రెండూ శాసన వ్యవస్థ పరిధిలోనివని, వాటిని అమలుకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తమ ప్రతిపాదనలు, సిఫార్సుల్లో అత్యధికం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నాయని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని అఫిడవిట్‌లో ఈసీ వివరించింది. రాజ్యాంగం, చట్టం పరిధిలో రాజకీయాలను నేర రహితం చేయాలని తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని తెలిపింది.

పబ్లిక్‌ సర్వెంట్లు, న్యాయాధికారులకూ వర్తింపజేయాలి-ఈసీ ...

రాజకీయ నాయకులతోపాటు దోషులుగా తేలిన పబ్లిక్‌ సర్వెంట్లు, న్యాయ వ్యవస్థ సభ్యులు కూడా మళ్లీ ఆయా వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని ఈసీ ప్రతిపాదించింది. న్యాయ, పాలనా వ్యవస్థలోని సభ్యులు కూడా పదవులు చేపట్టడానికి అనర్హులుగా ప్రకటించాలని సూచించింది. వారిపై దాఖలైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలని అఫిడవిట్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ శుక్రవారం మరోసారి విచారణకు రానుంది. 

18:52 - March 21, 2017

హైదరాబాద్‌: వెస్ట్‌ మారేడ్‌పల్లి టీఐటీ కాలనీలో నయీం అనే వ్యక్తి ఇంట్లో నిప్పు పెట్టి దుండగులు పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో చుట్టుపక్కల వారి ఇళ్లకు బయటి నుంచి గొల్లాలు వేసి నయీం అనే వ్యక్తి ఇంట్లో నిప్పు పెట్టారు దుండగులు. ఇది గమనించిన స్థానికులు 100 కు ఫోన్‌ చేశారు. ఇటు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుని.. నయీం ఇంట్లోని మంటలను ఆర్పివేశారు. ఇంట్లో విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. బాధితుడు నయీం భార్య డెలివరీ కోసం 20 రోజుల క్రితం ఊరికి వెళ్లడంతో... మారేడ్‌ పల్లిలోని తన తల్లివద్ద ఉంటున్నాడు నయీం. ఇది దొంగలు చేశారా.? లేక ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

18:48 - March 21, 2017

నల్గొండ: సీపీఎం తెలంగాణ రాష్ర్ట కమిటీ సభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్మికోద్యమ నేత తిరందాస్ గోపి అంత్యక్రియలు అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య ముగిశాయి. గోపిని కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. తిరుమలనగర్‌లోని గోపి నివాసం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వెనక ఉన్న శ్మశానవాటికి వరకు కార్యకర్తల నినాదాలు, ప్రజా కళాకారుల విప్లవ గీతాల నడుమ అంతిమయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు గోపి మృతదేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. నిన్న భువనగిరి నుంచి నల్లగొండ వస్తుండగా.. రామన్నపేట వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో గోపి దుర్మరణం చెందారు. గోపి మరణం సిపిఎం పార్టీకి.. కార్మికోద్యమానికి తీవ్రమైన లోటని.. ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిని తాము కోల్పోయామని.. తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి జిల్లాలో మహాజన పాదయాత్ర జయప్రదంగా సాగడానికి గోపి కృషి మరువలేనిదన్నారు.

18:48 - March 21, 2017
18:46 - March 21, 2017
18:43 - March 21, 2017

హైదరాబాద్: సమాజం కోసం.. సమాజ మార్పుకోసం..పత్రికలు నిరంతరం కృషి చేయాలని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన నవతెలంగాణ దినపత్రిక రెండో వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో మీడియా కార్పొరేట్‌ సంస్థలను తలపిస్తోందని..తద్వారా జర్నలిస్ట్‌లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సాయినాథ్‌ అన్నారు. అనంతరం పలువురికి ఉత్తమ జర్నలిస్ట్‌ల అవార్డులను సాయినాథ్‌ ప్రదానం చేశారు. 

18:41 - March 21, 2017

వికారాబాద్ : ఫీజు చెల్లించలేదనే కారణంతో 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చితకబాదాడు. వికారాబాద్‌ జిల్లా పరిగిలోని సిద్దార్థ పాఠశాలలో వినయ్‌ రెండో తరగతి చదువుకుంటున్నాడు. అయితే స్కూల్‌ ఫీజు చెల్లించని కారణంగా ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ రఫీ... వినయ్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా విద్యార్థి తల్లికి ఫోన్‌ చేసి నానా దుర్భాషలాడాడు. నీవు అమ్ముడుపోయైనా.. ఫీజు కట్టాలని బూతులు తిట్టాడని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్‌ తీరుపై వినయ్‌ తల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు తాను విద్యార్థిని కొట్టలేదని.. ఫీజులు కట్టలేదని మాత్రమే అడిగానని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రఫీ తెలిపాడు. 

18:38 - March 21, 2017

హైదరాబాద్: ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సొంతింటి కోసం సామాన్యులు జీవితకాలం పాటు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ కలను అతి తక్కువ కాలంలో, అత్యల్ప వ్యయంతోనే నిజమయ్యేలా చేస్తోంది వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ. తక్కువ బడ్జెట్‌తో ఇళ్లు నిర్మించి ఇస్తూ... సొంతింటి కలలను సాకారం చేస్తున్న వాల్యూ సంస్థ కృషిపై 10 టీవీ స్పెషల్‌ స్టోరీ.

ఇల్లు నిర్మాణం సామాన్యుడికి తలకు మించిన భారం...

ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్ నుంచి..ఇంటీరియర్ వరకు అవసరమైన అన్ని వస్తువులు సమకూర్చుకోవడం పెద్ద తలనొప్పే. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. దొరికినా అది నాణ్యమైనదో కాదో తెలియదు. అలాగే ఖర్చు కూడా అధికమే..సిమెంట్‌, ఇసుక, ఇటుక, ఇనుము ధరలకు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఇల్లు నిర్మించుకోవడం సామాన్యుడికి తలకుమించిన భారమవుతుంది. ఈ సమస్యలన్నిటికి వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఫుల్‌స్టాప్‌ పెడుతోంది. అతి తక్కువ సమయంలో..తక్కువ డబ్బుతో పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి... అందిస్తోంది.

10 నుంచి 15 రోజుల్లో ఇంటి నిర్మాణం...

కేవలం 10నుంచి 15 రోజుల కాల వ్యవధిలో 5 లక్షల 40 వేల రూపాయాలకే.. డబుల్‌ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తూ.. వాల్యూ కన్ స్ర్టక్షన్ సంస్థ పేదోడికి అండగా నిలుస్తోంది. గతంలో కరీంనగర్ జిల్లాలో వందల ఇళ్లు నిర్మించింది. ఇప్పుడు మహబూబ్‌ నగర్ జిల్లాలో కొత్తూర్ సమీపంలో దాదాపు మరో 300 ఇళ్లకు పైగా నిర్మించి పేదల కలను సాకారం చేస్తోంది.

పదేళ్ల పాటు అధ్యయనం చేసిన వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ....

పేదలకు తక్కువ బడ్జెట్‌తో.. నాణ్యమైన ఇళ్లను అందించే ప్రయత్నంలో వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ పదేళ్ల పాటు కష్టపడింది. వియత్నాం పరిశోధకులు మార్కెట్‌లోకి తెచ్చిన ఈ సరికొత్త గృహ నమూనాపై అధ్యయనం చేసింది. దేశ, విదేశాలు తిరిగి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లు నిర్మించే రీతిని గురించి తెలుసుకుంది. నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా... పరిశోధన కేంద్రాలను సంప్రదించింది. అనంతరం తమకంటూ నిర్దిష్టమైన విధానాన్ని, ప్రణాళికను రూపొందించుకుని, మొత్తానికి రోజుల వ్యవధిలోనే ఇళ్లను పూర్తి చేసి సామాన్యులకు అందిస్తోంది. ఈ విధానంలో కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌ గటర్లను వేర్వేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చితే చాలు 10 నుంచి 15 రోజుల్లో ఇల్లు పూర్తవుతుందని రూపకర్తలు చెబుతున్నారు.

ఎన్నేళ్లయినా ఇల్లు చెక్కుచెదరదని రూపకర్తల హామీ...

ఎన్ని ఏళ్లైనా ఇల్లు చెక్కుచెదరదని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం ఎదుర్కొని నిలబడుతుందని..అంటున్నారు. నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌, స్టీల్‌ పాడవుతాయనే భయమక్కరలేదని చెబుతున్నారు. ప్రస్తుతం వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ మార్కెట్‌లో మంచి స్థానంలో ఉంది. ఇళ్ల నిర్మాణంలో ఈ సంస్థ ప్రభుత్వ దృష్టిని కూడా ఆకర్షించింది. భవిష్యత్తులో వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ సేవలు మరింత విస్తృతం అయితే ఎలాంటి శ్రమ లేకుండానే అందమైన ఇంటిని నిర్మించుకోవడం ఏ మాత్రం కష్టం కాదనడంలో సందేహం లేదు. పేదలందరికీ సొంతిల్లు సాకారం అయ్యేందుకు వాల్యూ సంస్థ అనుసరిస్తోన్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. వాల్యూ సంస్థ ప్రయోగాత్మక విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే.. పేదలకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశయమూ నెరవేరే అవకాశం కనిపిస్తోంది. 

18:35 - March 21, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ చేసిన వ్యాఖ్యలపై ఓయూ వీసీ స్పందించారు. తన పరిధిలో ఉన్నంత మేరలో తాను ఉన్నత విద్యామండలికి మూడు పేర్ల లిస్ట్ పంపించానని అంటున్నారు ఓయూ వీసీ రామచంద్రం. ఈ ఘటనలో తనకెలాంటి సంబంధం లేదని, అంతా ఉన్నత విద్యామండలి పరిధిలో ఉంటుందని ఓయూ వీసీ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:33 - March 21, 2017

అమరావతి : వైఎస్ జగన్‌- యనమల మధ్య అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌పై అడిగిన ప్రశ్నలకు యనమల సమాధానమిస్తున్న సమయంలో జగన్ బయటకు వెళ్లారు. దీంతో జగన్ బాత్‌రూమ్‌కు వెళ్లారా అని యనమల అడగగా.. బాత్‌రూమ్‌కు కూడా చెప్పి వెళ్లాలా అని జగన్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాత్రం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే మనవడి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వెళ్లొచ్చున్నారు. దీనికి సమాధానంగా సీఎం స్పీకర్‌కు చెప్పే వెళ్లారని యనమల చెప్పారు. 

18:31 - March 21, 2017

అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని.. ఇందుకోసం చంద్రబాబు కృషిచేశారని యనమల రామకృష్ణుడు అన్నారు. 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. 

18:29 - March 21, 2017

అమరావతి: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 8వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయింది. 5 వేల 45 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ-బీజేపీ అభ్యర్థి పీవీఎస్‌ మాధవ్‌ ఉన్నారు. మాధవ్‌కు 42 వేల 863 ఓట్లు రాగా.. అజ శర్మకు 37 వేల 818 ఓట్లు పోలయ్యాయి. అటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ అభ్యర్థి కేకే రెడ్డిపై 12 వేల 682 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఉన్నారు. అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఏడుగురు అభ్యర్థులను ఎలిమినేట్‌ చేశారు. టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డికి 258 ద్వితీయ ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎప్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 224 ఓట్లు వచ్చాయి. దీంతో యండపల్లి ఆధిక్యం 3 వేలపైగా చేరుకుంది. 

18:24 - March 21, 2017

నగదు లావాదేవీల పరిమితి రూ.2లక్షలకు కుదింపు

ఢిల్లీ:నగదు లావాదేవీల పరిమితి రూ.2లక్షలకు కుదిస్తూ కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా నగదు లావాదేవీలను రూ.3లక్షలకు కుదిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.2లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగితే 100శాతం జరిమానా విధించనుంది.

లక్ష్యాలకు అనుగునంగా ప్రభుత్వం పని చేస్తోంది:యనమల

అమరావతి: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఏపీ అసెంబ్లీ లో మంత్రి యనమల పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళిక ప్రతిని అన్ని విభాగాలకు అందజేశాం, బడ్జెట్ లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. లక్ష్యాలకు అనుగునంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవడంపై సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు.

సీఈసీ కమిషనర్ ను కలిసిటి. టిడిపి నేతలు

ఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ ప్రకాష్ రావత్ ను టి.టిడిపి నేతలు రమణ, రేవంత్, గరికపాటి, సండ్ర, వేం నరేంద్ర కలిశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 12 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన పాత 10 జిల్లాల ప్రకారమే చేపట్టాలని కోరారు.

రోజా వ్యాఖ్యలను ఖండించిన మంత్రి మృణాళి

అమరావతి: డ్వ్రాకా మహిళలపై రోజా వ్యాఖ్యలను మంత్రి మృణాళిని ఖండించారు. రోజా వ్యాఖ్యలు డ్వాక్రా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిధులే ఇచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 82,91,321 మంది, డ్వాక్రా మహిళలకు 8,291 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ, 32, 000 కోట్లు బ్యాంకు లింకేజ్ కింద ఇచ్చామన్నారు. 2015-2017 మార్చి నిధులు 1,378 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుండి క్లియరెన్స్ రాగానే జమ చేస్తామన్నారు. ప్రతి మహిళ నెలకు రూ. 10 వేలు సంపాదించాలనేదే సీఎం లక్ష్యం మంత్రి తెలిపారు.

కావేరీ జలాలను పంపిణీ చేయండి : సుప్రీం

ఢిల్లీ: తమిళనాడుకు 2 వేల క్యూసెక్కుల కావేరీ జలాలను పంపిణీ చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది.

మోదీ వల్లే గోరఖ్ పూర్ కి ఎయిమ్స్ :యూపీసీఎం

ఢిల్లీ : లోక్ సభకు యూపీ ఎంపి యోగి ఆదిత్యనాథ్ హాజరయి ప్రసంగించారు. 1998 నుంచి నా నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించినా పట్టించుకోలేదన్నారు. మోదీ వల్లే గోరఖ్ పూర్ కి ఎయిమ్స్ వచ్చిందని తెలిపారు. మోది పై యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. మోదితోనే దేశాభివృద్ధి సాధ్యం అని యోగి తెలిపారు. మోదీని ప్రపంచం గమనిస్తోందని, అభివృద్ధికి మతంతో సంబంధం లేదన్నారు. యూపీని అవినీతి, నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు. యూపీలోని 34 జిల్లాల్లో పోషకాహార లోపతంతోనే చిన్నారులు మరణిస్తున్నారని తెలిపారు.

కేంద్ర బడ్జెట్ లో విప్లవాత్మక మార్పులు: ఎంపి కవిత

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ లో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని ఎంపి కవిత అన్నారు. బడ్జెట్ పై ఆమె లోక్ సభలో మాట్లాడుతూ.. 'ఈ సారి బడ్జెట్ లో విప్లవాత్మక మార్పులు చేశారు. బడ్జెట్ లో రాష్ట్రాలకు కేటాయించింపులు తగ్గించారు. బడ్జెట్ సంక్షేమ పథకాలకు నిధులు పెంచారు. విద్యకు కేటాయింపులు పెంచడం శుభపరిణామం. నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో తలెత్తే సమస్యపై జాగ్రత్తలు తీసుకోవడం అసవరం' అని అన్నారు.

మమతాబెనర్జీకి సుప్రీంలో చుక్కెదురు

ఢిల్లీ:సీఎం మమతాబెనర్జీకి సుప్రీంలో చుక్కెదురయ్యింది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌ విషయంలో తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల‌పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆదేశాల‌ను నిలిపేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు నేడు తెలిపింది. గత ఏడాది మార్చి నెలలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సీడీల్లో కొంత‌మంది టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

17:26 - March 21, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అజ్ఞాతం వీడారు. తాను వెనుకబడిన కులంలో పుట్టడం వల్లనే తనకు యూనివర్శిటీ తీవ్ర అన్యాయం చేస్తోందని రాథోడ్ ఆరోపిస్తున్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నా... పీఈ సెట్ కన్వీనర్‌గా నియమించలేదని.. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల, జేఎన్‌యూలో కృష్ణకు జరిగిన అన్యాయమే తనకు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం జరిగేంత వరకూ ఉద్యమస్తానంటున్న ప్రొఫెసర్ రాథోడ్‌ స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయడం...

17:16 - March 21, 2017

కటౌట్ లు పెట్టడం, బ్యానర్లు కట్టడం ఒకప్పటి మాట. ఇప్పుడంతా తీరిక, ఓపిక ఎవరికీ లేవు. అరచేతిలో నెట్ ఉంది ఈ నెట్ లోనే బలా బలాలు తేల్చుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ ఐన ట్రైలర్లు అందుకు సాక్షంగా మారుతున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్‌ రికార్డుల పరంగా 'నాన్‌-బాహుబలి' అంటూ సెకండ్‌ ప్లేస్‌ కోసమే పోటీ జరుగుతోంది. సాధారణ సినిమాలు అందుకోలేని అసాధారణ స్థాయి రికార్డులని సెట్‌ చేసిన 'బాహుబలి-2' ఇప్పుడు యూట్యూబ్‌లోను రికార్డులన్నిటినీ బ్రేక్‌ చేసి పారేసింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 7 కోట్ల వ్యూస్ దాటేసింది ఈ 'బాహుబలి టు' ట్రైలర్.

డీజే..
హరీష్ శంక‌ర్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ డీజే ..దువ్వాడ జగన్నాధం మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఈ సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకు పెరుగుతూనే వ‌చ్చాయి. అనుకున్న‌ట్లుగానే ఆ అంచ‌నాలెలా ఉన్నాయో టీజ‌ర్‌తో చూపించింది. టీజ‌ర్ రిలీజ్ అయింది. ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. లెటెస్ట్‌గా ఈ సినిమా టీజ‌ర్ కోటి వ్యూస్‌ను దాటేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్‌. ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'డిజె' 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'లో 'పూజా హెగ్డే' హీరోయిన్‌గా న‌టిస్తోంది.

కాటమరాయుడు..
ప‌వ‌ర్‌స్టార్ 'ప‌వ‌న్‌క‌ళ్యాణ్' 'కాట‌మ‌రాయుడు' ఈ మార్చి 24న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్‌పార్థ‌సాని డైరెక్ట‌ర్‌. రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. పవన్ కళ్యాణ్ కి మాస్ లో ఉన్నా క్రేజ్ అంత ఇంత కాదు. ఎప్పుడు ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని ఫాన్స్ వెయిట్ చేసారు. అనుకున్నట్టుగానే రిలీజ్ ఐన ట్రైలర్ కి 28 లక్షల వ్యూస్ తెచ్చిపెట్టారు. కానీ డీజే ట్రైలర్ కి డిస్ లైక్స్ వచ్చినట్టే పవన్ కళ్యాణ్ ట్రైలర్ కి డిస్ లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి.

గురు..
విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాతో రాబోతున్నాడు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో న‌టిస్తోం. సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. టీజర్ తో పాటు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఒక పాటని అయితే వెంకటేష్ స్వయంగా పాడాడు కూడా. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి ఈ సినిమా ట్రైల‌ర్‌ను మార్చి 20న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. పాటలైనా, టీజర్ ఐన, ట్రైలర్ ఐన సినిమాకి సంబంధించింది ఏదైనా వ్యూస్ పబ్లిసిటీ మీదనే డిపెండ్అయి ఉంటుంది.

17:07 - March 21, 2017

సినిమాలు థియేటర్స్ నుండి ఇంటర్నెట్ కి పయనం కట్టాయి. డిజిటల్ రెవెల్యూషన్ పెరుగుతున్న ఈ ట్రెండ్ లో యూ ట్యూబ్ హావా నడుస్తోంది. రీసెంట్ గా సినిమా నటులు కూడా వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టారు. చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకట్లేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ద సినిమాల హావా నడుస్తోంది. 'బాహుబలి', 'ఖైదీ నెంబర్ 150' ఇలా చెప్పుకుంటూపోతే చిన్న సినిమాలని పక్కకు నెట్టడానికి ఎన్నో పెద్ద సినిమాలు ఉన్నాయ్. ఇలా పెద్ద సినిమాలే ఇండస్ట్రీనీ మొత్తం కబ్జా చేస్తే మరి చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి ?. అందుకే ఇపుడు చిన్న నిర్మాతలు, చిన్న నటులు వెబ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇంటర్నెట్ లో తమ సినిమాల రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ చాల చిన్న సినిమాలు థియేటర్ లు దొరక్క యూట్యూబ్ రిలీజ్ ని ఆశ్రయిస్తున్నాయి. వాటితో పాటు వెబ్ సిరీస్ గా కూడా రిలీజ్ అవుతున్నాయి.

సుమంత్ అశ్విన్...
'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా పరిచయమైన హీరో 'సుమంత్ అశ్విన్'. కెరీర్ స్టార్టింగ్ నుండి ఎంత కష్టపడ్డా సరైన హిట్ లేక విలవిలలాడుతున్నాడు ఈ యంగ్ హీరో. అడివి సాయికిరణ్ డైరెక్షన్ లో వచ్చిన 'కేరింత' మూవీ చిన్న సినిమానే కానీ 'దిల్' రాజు హ్యాండ్ పడటం వల్ల థియేటర్స్ దొరికి రిలీజ్ కి నోచుకుంది. కొంచెం ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అయింది. ఈ సినిమాలో నలుగురిలో ఒక హీరోగా మెప్పించాడు 'సుమంత్ అశ్విన్'. రీసెంట్ గా వచ్చిన 'రైట్ రైట్' సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు ఎందుకిలా అనే వెబ్సెరీస్ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు 'సుమంత్'.

ధన్య బాలకృష్ణ..
తమిళం లో కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు తెరకు పరిచయం అయింది 'ధన్య బాలకృష్ణ'. అందం అభినయం రెండు ఉన్నా సరైన పాత్రలు పడక తడబడుతుంది ఈ టాలెంటెడ్ యంగ్ బ్యూటీ ..సెకండ్ హ్యాండ్ సినిమా తో మంచి పెరఫార్మెర్ అనిపించుకున్న ధన్య 'రాజుగారి గది' సినిమా తో కమర్షియల్ గా కూడ హిట్ అందుకుంది. మరి ఇప్పుడే అమ్మడు "పిల్ ఏ " అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇది వెబ్ సిరీస్ అయినా.. సిల్వర్ స్క్రీన్ పై మెరిసే ఫీచర్ ఫిలింకి ఏ మాత్ర తగ్గకుండా తీశాడు దర్శకుడు పవన్ సాదినేని. ఫ్రేమింగ్.. విజువల్స్.. లొకేషన్స్.. డైలాగ్స్.. ఇలా ఏ విషయంలో దర్శకుడు రాజీ పడలేదు. ట్రెండీ కాన్సెప్ట్ తో డిజైన్ చేసాడు డైరెక్టర్ పవన్ సాధినేని. అంటే సినిమాలకి పోటీ ఇచ్చేనందుకు ఈ నెట్ బుల్లి సినిమాలు రెడీ గా ఉన్నాయ్ అన్నమాట.

16:57 - March 21, 2017

యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఏ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా దూసుకుపోతున్న హీరో 'నిఖిల్'. లాంగ్ బ్యాక్ కెరీర్ ని స్టార్ట్ చేసి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మొదటిలో పెద్దగా గుర్తింపు రాకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు నిఖిల్. 'శేఖర్ కమ్ముల' డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' సినిమాలో ఉన్న నలుగురి హీరోల్లో ఒకడిగా నటించాడు 'నిఖిల్'. స్టూడెంట్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తూ తీసిన 'హ్యాపీ డేస్' సినిమా 'నిఖిల్' కి మంచి గుర్తింపు ఇచ్చింది.

స్వామి రారా..
నిఖిల్ ని నటుడిగా కాకుండా హీరోగా ఒక రేంజీకి తీసుకెళ్లిన సినిమా 'స్వామి రా రా'. తెలుగు తెరపై రెగ్యులర్ స్టోరీలు వస్తున్న టైం లో కొత్త స్క్రీన్ ప్లే తో థ్రిల్లర్ లో కామెడీ మిక్స్ చూపించిన సినిమా 'స్వామి రా రా'. ఈ సినిమా కి డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాని సుధీర్ వర్మ మలిచిన తీరు చాల ఆసక్తికరంగా ఉంటుంది. కలర్స్ స్వాతి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా సుధీర్ వర్మకి మంచి హిట్ ఇచ్చిన సినిమా.

సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్ లో..
సుధీర్ వర్మ, నిఖిల్ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'కేశవ'. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ పోస్టర్ లో మెయిన్ గా 'నిఖిల్' లుక్ గురించే చెప్పుకోవాలి. ఇప్పటివరకూ 'నిఖిల్' ఏ సినిమాలోనూ కనిపించనంత రఫ్ లుక్ తో ఉన్నాడు. డిఫరెంట్ గా షేప్ చేసి బాగా పెరిగిన గడ్డం.. మాసిన తలకట్టు.. బైక్ పై రయ్యిమంటూ దూసుకువచ్చేస్తున్న 'నిఖిల్' ఈ పోస్టర్ లో కనిపిస్తాడు. మార్చి 23న 'కేశవ' టీజర్ రిలీజ్ చేయబోతున్నామని పోస్టర్ ద్వారా చెప్పారు. ఏది ఏమైనా ఈ సారి 'నిఖిల్' లుక్ మాస్ ని టార్గెట్ చేసింది అని చెప్పాలి.

ప్రాజెక్టులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ - హరీష్..

హైదరాబాద్ : కాంగ్రెస్ కేసుల పేరిట ప్రాజెక్టులను అడ్డుకొంటోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. టి.అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మిడ్ మానేరును పూర్తి చేసి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ. 902 కోట్లు ఖర్చు చేసినట్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు.

టీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు ప్రారంభించలేదు - జానా..

హైదరాబాద్ : తాము ప్రారంభించిన ప్రాజెక్టులే కొనసాగుతున్నాయని ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. టి.అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఏ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేయలేదన్నారు.

ప్రశ్నాపత్రం లీక్ పై కడియం ఆరా.

ఖమ్మం : టెన్త్ ఇంగ్లీషు ప్రశ్నాపత్రం లీకేజ్ అయ్యిందని వస్తున్న వార్తలపై మంత్రి కడియం స్పందించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్..విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంగ్లీషు పేపర్ లీక్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి ఏనుకూరు, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాలు, ఖమ్మం నగరంలో పేపర్ లీకైనట్లు అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జానారెడ్డికి మల్లు రవి..చురకలు..

హైదరాబాద్ : బాహుబలి కామెంట్స్ పై జానారెడ్డికి మల్లు రవి చురకలంటించారు. బాహుబలి అనే వారు సినిమాల్లోకి, కుస్తీ పోటీలకు పోతే మంచిదని, కాంగ్రెస్ పార్టీ కుస్తీల పార్టీ కాదన్నారు. నెహ్రూ..ఇందిరా, వైఎస్ లు బాహుబలులు కారని, బాహుబలుల వల్ల పార్టీ గెలవదన్నారు. ప్రజా మద్దతు ద్వారానే గెలుపు సాధ్యమౌతుందని పేర్కొన్నారు.

 

16:48 - March 21, 2017

అమరావతి: గొడవపెట్టుకునేందుకే వైసీపీ సభ్యులు అసెంబ్లీ వస్తున్నారని... చంద్రబాబు ఆరోపించారు.. మంత్రి యనమల ప్రసంగం తర్వాత అవినీతిపై చర్చకు తాము సిద్ధమని.... మీరు సిద్ధమా అంటూ వైసీపీకి సవాల్‌ విసిరారు.. మీడియా పాయింట్‌దగ్గరకూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని... అక్కడకూడా మార్షల్స్‌ను పెట్టాలని స్పీకర్‌ను కోరారు.. వైసీపీ నేత బుగ్గన మాట్లాడుతుండగా మైక్‌ కట్‌చేయడంపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పీకర్‌ పోడియం చుట్టముట్టి వి వాంట్ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు.. స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తిచేసినా వినిపించుకోలేదు...

కావేరి స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం..

నల్గొండ : చిట్యాల (మం) పెద్దకాపర్తి శివారులో కావేరి స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

16:46 - March 21, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన మేజర్‌ , మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణాల ను అవినీతికి తావులేకుండా పూర్తిచేయాలని భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని మోడికుంట, గుండ్లవాగు, తాలిపేరుప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న వద్దిపేట ప్రాజెక్టులను మిషన్‌ కాకతీయ పథకంలో చేర్చాలని ఎమ్మెల్యే సున్నం ప్రభుత్వాన్ని కోరారు. అటు పంచాయతీ రాజ్‌ సంస్థలు ససమస్యలతో సతమతం అవుతున్నాయని సున్నం రాజయ్య అన్నారు. ప్రజా ప్రతినిధులకు అధికారాలు నిధుల్లేక స్థానిక సంస్థలు నిస్తేజంగా మారాయన్నారు. 

16:44 - March 21, 2017

హైదరాబాద్: ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వేంకటరెడ్డి ఆరోపించారు. గ్రామీణప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయింపుల్లో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలకు కోటిరూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి నిధుల మంజూరిలో వివక్ష పాటించవద్దని ముఖ్యమంత్రి చెబుతున్నా.. మంత్రులు, అధికారులు మాత్రం మారడంలేదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

16:42 - March 21, 2017

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో పదో తరగతి ఇంగ్లీష్‌ పరీక్షా ప్రశ్నపత్రం లీకయ్యింది. వాట్స్‌ ఆప్‌ ద్వారా ప్రశ్నపత్రం లీక్‌ అయ్యినట్లు తెలుస్తోంది. ఉదయం 11:36కి వాట్స్‌ఆప్‌లో ప్రశ్నపత్రం వచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు రుజువులు చూపారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

16:34 - March 21, 2017

హైదరాబాద్: ధూల్‌పేట్‌లోని సారా వ్యాపారుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నేడు రాజీనామా చేసేందుకు సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ కేసీఆర్‌ను కలిసేందుకు అనుమతి లేదని సీఎంవో నిరాకరించింది. రాజాసింగ్‌ను లోనికి అనుమతించలేదు. దీంతో ఆయన కాసేపు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

 

16:32 - March 21, 2017

ఢిల్లీ: 8 ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే కొన్ని విమానాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ దేశాల నుంచి అమెరికాకు వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, ఐప్యాడ్‌, కెమెరా తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురాకుండా నిషేధం విధించింది. జోర్డాన్‌, కువైట్‌, కతార్‌, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి అమెరికాకు వచ్చే నాన్‌స్టాప్‌ విమానాలపైనే ఈ ఆంక్షలు విధించారు. నిషేధం ఎందుకు విధించారని చెప్పేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. భద్రతాపరమైన నిర్ణయాలపై తాము ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు చేయలేమని, అవసరమైనప్పుడు తామే వెల్లడిస్తామని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఇందులో మొబైల్‌, మెడికల్‌ పరికరాలకు మినహాయింపునిచ్చారు.

16:29 - March 21, 2017

ఢిల్లీ: పశుమాంసం విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో రాజస్థాన్‌లోని ఓ హోటల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో బీఫ్‌ అమ్ముతున్నారంటూ గో సంరక్షణ కార్యకర్తలు ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన అధికారులు హోటల్‌ను తనిఖీ చేసి-మాంసాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు -హోటల్‌ను మూసివేశారు. బీఫ్‌ విక్రయ ఆరోపణలతోపాటు.. హోటల్‌కు సరైన అనుమతులు లేకపోవడం వల్లే సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తాము బీఫ్‌ అమ్మడం లేదని హోటల్‌ యాజమాన్యం చెబుతోంది. 

16:28 - March 21, 2017

తిరుపతి : టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డి మళ్లీ అరెస్ట్‌ అయ్యారు. బెయిల్‌పై విడుదలైన వెంటనే ఈడీ శేఖర్‌ రెడ్డిని అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. గతంలో చెన్నైలోని శేఖర్‌ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో 70 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ, 100 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ధర్నా చౌక్ తరలింపుకు నిరసనగా సదస్సు..

హైదరాబాద్ : ఇందిరాపార్కు ధర్నా చౌక్ ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ కమిటీ ఏర్పాటైంది. ఎస్వీకే జరిగిన సదస్సులో వామపక్ష నేతుల..ప్రజా సంఘాల నేతలు..ఇతరులు పాల్గొన్నారు. 'ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ' పేరిట ఏర్పాటైన ఈ కమిటీలో వామపక్ష, సామాజిక శక్తుల నేతలున్నారు. మొత్తం 21 మంది కమిటీలో ఉన్నారు. కన్వీనర్ గా సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, కో కన్వీనర్ గా పీఎల్ విశ్వేశ్వరరావులున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా మొదట మార్చి 26వ తేదీ ఉదయం ఎస్వీకే నుండి 2కే రన్ నిర్వహించాలని, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

ప్రశ్నాపత్రం లీక్ లో విచారణ..

ఖమ్మం : జిల్లాలో పదో తరగతి ఇంగ్లీషు పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దుమారం రేపుతోంది. వాట్స్ ఆప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. 11.30గంటలకు పేపర్ లీకైనట్లు డీఈవో తెలుసుకున్నారు. రాతపూర్వకంగా ఏసీపీ గణేష్ కుమార్ కు డీఈవో ఫిర్యాదు చేశారు. ఉదయం 11.36 గంటలకు వాట్స్ ఆప్ లో ప్రశ్నాపత్రం వచ్చినట్లు పేరెంట్స్ రుజువులు చూపించారు. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.

నలుగురు చేరితే కమ్యూనిస్టు అయిపోతారా - మల్లు రవి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో నలుగురు సీపీఎం నేతలు చేరినంత మాత్రాన కేసీఆర్ కమ్యూనిస్టు కారని కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్కొన్నారు. కేసీఆర్ కమ్యూనిస్టు అంటే కమ్యూనిజానికే అవమానమని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంకుఏ పట్టడం లేదన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు ఎందుకు చేయడం లేదని, కేసీఆర్ సర్కార్ కు రైతుల ఉసురు తాకుతుందన్నారు.

మోడీతో యోగి ఆదిత్యనాథ్..

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు.

15:46 - March 21, 2017

ఒకసారి హిట్ కొట్టి బెస్ట్ కాంబినేషన్ అనిపించారు ఈ హీరో అండ్ కమెడియన్. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ ఐన ఫస్ట్ లుక్ కూడా కామెడీ టచ్ తో ఉంది. ఆ ఫస్ట్ లుక్ విశేషాలు ఏంటో తెలుసా ? మంచు విష్ణు...బ్రహ్మానందం వీరి కాంబినేషన్ లో వచ్చిన 'డి' సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తరువాత 'విష్ణు' అరడజను సినిమాలు చేసిన సరైన హిట్ లేక సతమతమైపోతున్నాడు ఈ మంచు హీరో. మల్టిస్టారర్ సినిమాలు చేసిన 'మంచు విష్ణు'కి సరైన గుర్తింపు రాలేకపోయింది. 'రాజ్ తరుణ్' తో కలిసి స్క్రీన్ పంచుకున్న 'విష్ణు' సినిమా 'వాడో రకం వీడో రకం'. 'సరైనోడు' తరువాత సరైన రోల్ పడలేదు ఈ కమెడియన్ కి. కమెడియన్ లో సీనియర్ 'బ్రహ్మానందం' ఈ మధ్య తెలుగు తెరమీద సరిగా కనిపించడం లేదు అనే చెప్పాలి. కొత్త కమెడియన్స్ తాకిడికి 'బ్రహ్మీ' వెనక్కు తగ్గాడా లేక బ్రహ్మీ కి సరిపోయే పత్రాలు రైటర్స్ రాయలేక పోతున్నారా అనేది ఆలోచించాలి. జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలో మళ్ళీ జోడి కట్టబోతున్నారు ఈ హిట్ కాంబినేషన్ నటులు. ఆల్రెడీ కామెడీ సినిమాలు తీసి తానేంటో నిరూపించుకున్న డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రెజెంట్ ఈ సినిమాతో మళ్ళీ ఓ కామెడీ ఎంటర్టైనర్ కి డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఇంటరెస్ట్ ని పెంచాడు ఈ డైరెక్టర్. బ్రహ్మీ, విష్ణు కాంబినేషన్ ఈ సారి అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.

హోదా ఇవ్వాల్సిందే - కేవీపీ..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

టి.టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికల కౌంటింగ్ పూర్తి..

హైదరాబాద్: తెలంగాణ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

 

ప్రశాంత్ కిశోర్ కు కాంగ్రెస్ మద్దతు..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ కు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ప్రశాంత్ కిశోర్ కు మద్దతుగా నిలిచారు.

విమానాశ్రయాల పేర్ల మార్పు తీర్మానానికి ఆమోదం

అమరావతి: ఏపీలోని గ‌న్నవరం, రేణిగుంట విమానాశ్రయాల పేర్ల‌ను మార్చాల‌ని భావిస్తోన్న‌ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు ప‌డింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఈ రోజు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు శాస‌న‌మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టారు. గన్నవరం విమానాశ్రయాన్ని ఎన్టీఆర్‌ విమానాశ్రయంగా, అలాగే రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేర్లు మార్చనున్నారు. ఈ తీర్మానానికి శాస‌న‌ మండలి ఆమోదం తెలిపింది.

14:48 - March 21, 2017

టాలీవుడ్ లో మొత్తం రెండు సినిమాలు మార్చి..ఏప్రిల్ నెలలో రానున్నాయి. ఒకటి 'బాహుబలి-2'..రెండు 'కాటమరాయుడు'. ఈ సినిమాల ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన 'బాహుబలి' ట్రైలర్ దెబ్బకి యూట్యూబ్ షేక్ అవుతోంది. ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ కి స్కోర్ చేసిన వ్యూస్ కి వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ నివ్వెర పోయింది. ఇప్పటికే ఐదుకోట్ల వ్యూస్ తో రికార్డు క్రేయేట్ చేసింది 'బాహుబలి' ట్రైలర్. ఇక ముందు ఏ సినిమా ట్రైలర్ అయిన ఈ మార్కుని టచ్ కూడా చెయ్యలేదేమో అన్న రేంజీ లో వ్యూస్ అండ్ షేర్స్ కొల్లకొట్టింది. 'అల్లుఅర్జున్' తాజాగా నటిస్తున్న చిత్రం ''దువ్వాడ జగన్నాధం''. 'హరీష్ శంకర్' దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. మొదట్లో కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఏప్రిల్ కాకుండా మే రెండో వారంలో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట. ఇంతకీ 'దువ్వాడ జగన్నాధం' వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా 'బాహుబలి 2'. ఏప్రిల్ 28న ఆ సినిమా రిలీజ్ అవుతుండటంతో దాని మేనియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకు రిస్క్ అంటూ వాయిదా వేస్తున్నారు.

శర్వానంద్..
మంచి హిట్ సినిమాలతో జోరుమీద ఉన్న హీరో 'శర్వానంద్'. కుటుంబకథా చిత్రం 'శతమానంభవతి'తో సైలెంట్ హిట్ ఇచ్చాడు. అదే ఫ్లో ని కంటిన్యూ చేస్తూ 'రాధ' అనే సినిమాని రెడీ చేసుకున్నాడు. 29న 'రాధ'ను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. కానీ మళ్ళీ తన రిలీజ్ డేట్ ని చేంజ్ చేశాడు కారణం 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' సినిమా. 'పవన్' కి ఉన్న క్రేజ్ కి 'రాధ' సినిమా ఆగలేదనుకున్నారేమో ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏది ఏమైనా ఇలా స్టార్ డం ఉన్న సినిమాలు కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: పాత పెద్ద నోట్ల డిపాజిట్‌లపై దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ఆర్ఐల‌కు మాత్ర‌మే ఎందుకు అవ‌కాశం ఇచ్చారు. మార్చి 31 వ‌ర‌కు అంద‌రికీ ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించింది. రెండు వారాల్లో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.

మంత్రి కేటీఆర్ ను కలిసిన వీవీఎస్ లక్ష్మణ్

హైదరాబాద్: మాజీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న వీవీఎస్ లక్ష్మణ్, ఈ ఉదయం తెలంగాణ మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ, లక్ష్మణ్ తో మాట్లాడుతున్న చిత్రాలను పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము చర్చించామని తెలిపారు. 

14:23 - March 21, 2017

గుంటూరు : టీడీపీ అంటే 'టెంపరరీ డెవలప్ మెంట్ పార్టీ' అని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. రాష్ట్రంలో అన్నీ టెంపరరీయేనని చెప్పారు. ప్రాజెక్టులూ టెంపరరీ అని అన్నారు. అసెంబ్లీ, సచివాలయమూ టెంపరరీయేనని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలపై మంత్రి మంత్రి దేవినేని ఫైర్ అయ్యారు. పట్టిసీమతో సీమకు నీళ్లిచ్చామని తెలిపారు. 

 

14:07 - March 21, 2017

గుంటూరు : వైసీపీ దివాళ కోరు, అవినీతి పార్టీని సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ అంటే వైసీపీ సభ్యులకు గౌరవం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ సభ్యుల పద్ధతి సిరిగ్గా లేదని చెప్పారు. వైసీపీ సభ్యులు గొడవలు పెట్టుకునేందుకే అసెంబ్లీకి వస్తున్నారని ఆరోపించారు. రన్నింగ్ కామెంటరీ చేస్తే కోపం రాదా అని ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద మార్షల్స్ ను పెట్టాలన్నారు. 

 

14:03 - March 21, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో మళ్లీ గందరగోళం నెలకొంది. అసెంబ్లీ అంటే వైసీపీ సభ్యులకు గౌరవం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ సభ్యుల పద్ధతి సిరిగ్గా లేదని చెప్పారు. వైసీపీ సభ్యులు గొడవలు పెట్టుకునేందుకే అసెంబ్లీకి వస్తున్నారని ఆరోపించారు. రన్నింగ్ కామెంటరీ చేస్తే కోపం రాదా అని ప్రశ్నించారు. 

13:54 - March 21, 2017

ఢిల్లీ : అయోధ్య రామమందిరం కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామమందిరం కేసును అత్యవసర విచాణకు కోర్టు అంగీకరించింది. కోర్టు బయట సమస్య పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సుప్రీం సూచించారు. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని సుప్రీం చీఫ్ జస్టిస్ చెప్పారు. విచారణను వచ్చే వారానికి వాయిదా పడింది. 

13:47 - March 21, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే అనిత మధ్య వాగ్వాదం నెలకొంది. మహిళా సమస్యలపై గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారులకు వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. అనంతరం ఈశ్వరీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. వైసీపీ సభ్యులు రౌడీల్లా ప్రవరిస్తస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఖమ్మంలో టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్ ?

ఖమ్మం : టెన్త్ ఇంగ్లీషు పేపర్ లీక్ అయ్యిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. కార్పొరేట్ విద్యాలయాల గ్రూపు విబేధాలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కార్పోరేట్ విద్యాలయాల గ్రూపు వివాదంపై పోలీసులు నిఘా పెట్టారు.

13:35 - March 21, 2017

గుంటూరు : వైఎస్ హయాంలోని అధికారులు జైలుకు ఎందుకెళ్లారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ పై సీబీఐ 11 కేసులు నమోదు చేసిందన్నారు. సోనియాగాంధీ కాళ్లు పట్టుకోకపోతే జగన్ కు బెయిల్ వచ్చేదా... అని ప్రశ్నించారు. జగన్ తీరు చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో కోట్ల అవినీతి జరిగిందన్నారు. 

 

13:32 - March 21, 2017

నేరస్తులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు నగేష్, టీడీపీ నేత విజయ్ కుమార్, సీపీఎం నేత కృష్ణ పాల్గొని, మాట్లాడారు. నేరస్తులకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:30 - March 21, 2017

వేసవి కాలం వచ్చేసింది..ఇక ఉక్కపోత..చెమట..వడదెబ్బ..ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల ప్రభావం వల్ల శారీరకంగా..మానసికంగా..కృంగి పోతుంటారు. మరి ఈ సమస్య నుండి బయటపడడం ఎలా ? కొన్ని చిట్కాలు..

  • వేసవిలో నీడలోనే గడిపితేనే మంచిది. ఉద్యోగులు..బయటకు వెళ్లే వారు సన్ స్ర్కీన్, టోపి, సన్ గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి.
  • వేసవికాలంలో తగినంత నిద్ర ఉండి తీరాల్సిందే. సమయానికి నిద్ర పోవడం వల్ల మానసిక ప్రశాంతత చేరుకుంటుందనడంలో సందేహం లేదు.
  • వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల నీరసం రాదు. అంతేగాకుండా శరీరంలోని నరాలు..ఎముకలు బలంగా ఉంటాయి.
  • రోజు ఉదయం..సాయంత్రం వ్యాయామం చేయండి. కనీసం 20 నిమిషాలైనా నడవాలి.
  • తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
13:29 - March 21, 2017

తాప్సీ..టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ సొట్టబుగ్గల సుందరి బాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది 'పింక్' సినిమాలో శక్తివంతమైన యువతి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను ఆకట్టుకొంది. దీనితో 'తాప్సీ'కి అలాంటి తరహా పాత్రలే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె 'నామ్ షబానా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో తాప్సీ వెల్లడించింది. తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, గ్లామర్ అస్సలు ఉండదని పేర్కొంది. చాలా డ్రైగా ఉంటుందని, తనకు తెలిసి ఇలాంటి పాత్రలో తనను చూపించాలని ఏ దర్శకుడు అనుకోరని వ్యాఖ్యానించింది. ఆయా పాత్రల్లో చేయాలంటే కొన్ని సార్లు చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందని, ఒక రకంగా ఇంది సైకో ట్రిప్పీ పాత్ర అని తెలిపింది. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. మరి ఈ చిత్రం 'తాప్సీ'కి పేరు తీసుకొస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

13:27 - March 21, 2017

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించే హీరో..హీరోయిన్లు పాత్రలను పండించేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ఆయా పాత్రలకనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటుంటారు. అంతేగాకుండా విన్యాసాలను నేర్చుకుంటుంటారు. తాజాగా విద్యాబాలన్ గన్ వాడడం కూడా నేర్చుకుంది. తన తాజా చిత్రం 'బేగంజాన్' లో నటిస్తోంది. మహిళా ప్రధాన చిత్రాలకు..శక్తివంతమైన కేరాఫ్ గా 'విద్యాబాలన్' నిలుస్తోందనే సంగతి తెలిసిందే. వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా పోషిస్తోంది. ఇందులో గన్ వాడాల్సి ఉంటుంది. అందుకని గన్ వాడడం కూడా నేర్చుకుంది. ఎంతో కఠోర శ్రమతో కేవలం పది రోజుల్లోనే తుపాకీని పేల్చడం నేర్చుకుందంట. కొందరు కార్పొరేటర్లు..జమీందార్లు వీరిపై అనేక రకాలుగా దాడులు చేస్తుండడం..వీరిని ఎదుర్కొనేందుకు వ్యభిచారంలో ఉన్న మహిళలంతా తుపాకీలను కాల్చడం నేర్చుకోవాల్సి ఉంటుంది. సన్నివేశాలు..సహజతత్వం రావడం కోసం పది రోజుల్లోనే తుపాకీని వాడడం నేర్చుకుందంట. ‘బేగంజాన్' చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంలో ఆమె ఎలా నటించారో చిత్రం చూసిన తరువాత తెలవనుంది.

సుప్రీంకోర్టులో అయోధ్య అంశంపై విచారణ..

ఢిల్లీ : అయోధ్య అంశంపై సత్వర విచారణ చేపట్టాలన్న సుబ్రమణ్యస్వామి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీం సూచించింది. చర్చలు విఫలమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని.. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం నియమిస్తామని కోర్టు పేర్కొంది. ఇరువర్గాల నిర్ణయంపై ఈనెల 31లోగా సమాచారం ఇవ్వాలని సుబ్రమణ్యస్వామికి ఆదేశాలు జారీ చేసింది.

అవినీతిపై చర్చకు తాము సిద్ధం - బాబు..

విజయవాడ : అవినీతిపై చర్చకు తాము సిద్ధమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతిపక్షానికి అసెంబ్లీ..స్పీకర్ అంటే గౌరవం లేదని, రన్నింగ్ కామెంటరీ చేస్తే కోపం రాదా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి పార్టీని చూడలేదన్నారు. వీళ్లు చేసే పనులకు ఒక్కోసారి కోపం..విసుగు వస్తుందన్నారు. సభకు హుందాతనం తీసుకరావాలని సూచించారు. తాము ఏంతో సంయమనం పాటిస్తున్నట్లు, తాను వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గొడవలు పెట్టుకొనేందుకే సభకు వస్తున్నారని తెలిపారు. అవినీతి..అభివృద్ధిలో ఏపీ ముందుందని పొరపాటున అన్నానని, ఈ మాటను సరిచేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

 

దేశమంతా ఏపీని మెచ్చుకొంటోంది - అచ్చెన్నాయుడు..

విజయవాడ : విద్యుత్ రంగంలో దేశమంతా ఏపీ రాష్ట్రాన్ని మెచ్చుకొంటోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సాధారణ బడ్జెట్ పై రాజేందర్ మాట్లాడారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. విద్యుత్ శాఖ గురించి దేశమంతా ఏపీని మెచ్చుకుంటుంటే...దీనిపై విమర్శలు చేస్తున్నారంటే ఏమి అనాలో అర్థం కావడం లేదన్నారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాను - జగన్..

విజయవాడ: వైసీపీ నేత జగన్ అసెంబ్లీ లో సంచలన వ్యాఖ్యలు చేశారు..క్విడ్ ప్రో పై మంత్రి అచ్చెన్నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. ‘నేనే అధ్యక్ష..బ్లాక్ మనీ తీసుకుని..సూట్ కేసుల్లో పెట్టుకుని..ఆడియో..వీడియో టేపుల్లో..దొరికేటట్టుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది నేనే అధ్యక్ష' అంటూ ఏపీ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేశారు.

12:04 - March 21, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీలోనే కాకుండా మీడియా పాయింట్ వద్ద కూడా వైసీపీ..టిడిపి సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాయిదా పడిన అనంతరం ప్రారంభమైన సభలో వైసీపీ నేత జగన్ అక్రమస్తులు..ఇతర విషయాలపై అధికారపక్షం తీవ్ర ఆరోపణలు గుప్పించింది. మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై మాట్లాడారు. జగన్ దగ్గర లక్ష కోట్ల డబ్బు ఉందని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ నుద్ధేశించి నువ్వు..నువ్వు..అనవద్దని..జగన్ దగ్గర లక్ష కోట్ల డబ్బు ఉందని చూశారా అంటూ మంత్రి అచ్చెన్నాయుడిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. రాష్ట్రం అంధకారంలో ఉన్నప్పుడు వెలుగులు నింపిన చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయడు స్పందించారు. డబ్బులున్నట్లు తాను చూడలేదని, ఈడీ కోట్ల రూపాయలను జప్తు చేసిందని గుర్తు చేశారు. నువ్వు అనడం పొరపాటేనని, ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

ఆస్తిలో భాగం ఇస్తా - జగన్..
జరుగుతున్నదానిపై ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకున్నారు. క్విడ్ ప్రో అంటున్నారు...రూ. 43వేల కోట్లు అంటున్నారు కదా...చూపిస్తారా ? తన ఆస్తిలో భాగం ఇస్తానని సవాల్ విసిరారు. కేసులు ఎప్పుడు పెట్టారు..వైఎస్ బతికి ఉన్నంత వరకు ఆయన మంచోడు..ఆయన చనిపోయిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వదిలి పెట్టినప్పుడు కేసులు పెట్టింది కాంగ్రెస్..టిడిపి వాళ్లు పెట్టారని పేర్కొన్నారు. ఆరోపణల కింద రూ. 1200 కోట్లు చూపించారని, సాక్షి సంస్థ దేశంలో నెంబర్ 8 స్థానంలో ఉందన్నారు. ఈనాడు అనే సంస్థ షేర్లు అమ్ముకుందని..సగం ధరకే ఇన్వెస్టర్లకు షేర్ చేసిందని ఎలాంటి స్కాం లేదన్నారు. దీనిపై అధికార..విపక్ష సభ్యుల మధ్య తీవ్ర విమర్శలు చేసుకున్నారు. కుక్క తోక వంకర అంటూ టిడిపి చేసిన విమర్శపై వైసీపీ సభ్యుడు కోడాలి నాని స్పందించి బురద..అంటూ వ్యాఖ్యలు గుప్పించారు. దీనిపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు కోడాలి నాని పేర్కొన్నారు.

12:00 - March 21, 2017

విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సహాయకుల సంఘం నాయకులు బాలకాశి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ లో విఆర్ఏలు మరోసారి పోరుబాట పట్టారు. తెలంగాణ కంటే ఆంధప్రదేశ్ లో విఆర్ఏల వేతనాలు తక్కువగా వున్నాయి. తెలంగాణలో  విఆర్ఏలకు పది వేల ఏడు వందల రూపాయల వేతనం ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లో ఆరు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. టిడిపి ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసినట్టుగా తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలంటూ విఆర్ఏలో ఆందోళనలు చేపడుతున్నారు. మార్చి 24న చలో విజయవాడకు విఆర్ఏల సంఘం పిలుపునిచ్చింది. విఆర్ఏల సమస్యలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:49 - March 21, 2017

విజయవాడ: వైసీపీ నేత జగన్ అసెంబ్లీ లో సంచలన వ్యాఖ్యలు చేశారు..క్విడ్ ప్రోకో పై మంత్రి అచ్చెన్నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. ‘నేనే అధ్యక్ష..బ్లాక్ మనీ తీసుకుని..సూట్ కేసుల్లో పెట్టుకుని..ఆడియో..వీడియో టేపుల్లో..దొరికేటట్టుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది నేనే అధ్యక్ష' అంటూ ఏపీ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈసందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు..జగన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 4.46 కోట్ల మెగావాట్ చేశారని..గుజరాత్ లో 4.76 కోట్లకు చేశారని పేర్కొన్నారు. వేరే చోట 3.96 కోట్లకు మెగావాట్ ఆల్ రెడీ ప్రాజెక్టులు చేసిన చరిత్ర ఉందన్నారు.

11:47 - March 21, 2017

విజయవాడ : విద్యుత్ రంగంలో దేశమంతా ఏపీ రాష్ట్రాన్ని మెచ్చుకొంటోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సాధారణ బడ్జెట్ పై రాజేందర్ మాట్లాడారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. విద్యుత్ టెండర్లలో ఓపెన్ బిడ్స్ పిలుస్తున్నామని సభకు తెలిపారు. రాజేందర్ దగ్గర డబ్బు లేదనుకుంటా..కానీ జగన్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనా ఎద్దేవా చేశారు. తెలంగాణ రేట్ కు బిడ్ చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సభకు తెలిపారు. క్విడ్ ప్రో లేదని..ఈ అలవాటు ఎవరికి ఉందో తెలుసని వైసీపీనుద్దేశించి విమర్శలు గుప్పించారు. పది సంవత్సరాలు చేయనటువంటి పనులు తాము రెండున్నరేళ్లలో చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ శాఖను దేశమంతా ఏపీని మెచ్చుకుంటుంటే...దీనిపై విమర్శలు చేస్తున్నారంటే ఏమి అనాలో అర్థం కావడం లేదన్నారు.

11:28 - March 21, 2017

ఢిల్లీ : ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్‌ నాయక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధానికి గురైన ఆయన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, ఇతరులకు చెందిన 18.37కోట్లను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. మరోవైపు జకీర్ నాయక్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ రెండోసారి నోటీసు పంపింది. ఈనెల 30న ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  మార్చి 14న విచారణకు జకీర్ హాజరుకాకపోవడంతో మరోసారి ఎన్ఐఏ నోటీసు జారీ చేసింది. దేశంలో అల్లర్లు చోటుచేసుకునేలాగా జకీర్‌నాయక్‌ ప్రసంగాలు చేశారని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్టును తప్పించుకునేందుకు అప్పటి నుంచి ఆయన సౌదీ ఆరేబియాలో ఉంటున్నారు. 

11:25 - March 21, 2017

హైదరాబాద్ : గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపి ఎమ్మెల్యే టి రాజాసింగ్‌లోథ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు పంపకుండా సీఎం కేసీఆర్‌కు పంపించారు. గుడుంబా తయారీ నివారణలో భాగంగా ధూల్‌పేటలోలోని 3వేల కుటుంబాలకు పునరావాస పథకాన్ని సక్రమంగా అమలు చేయనందుకు మనస్థాపంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ధూల్‌పేట నివాసి భీంసింగ్‌ పోలీసుల కస్టడిలో మరణించిన సంగతి తెలిసింది. దీనిపై ఆదివారంనాడు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడి పోలీసులు లాఠీచార్జ్‌ చేసే వరకు పరిస్థితులు దారితీశాయి. ఈ నేపథ్యంలో ధూల్‌పేట పునరావాస ప్యాకేజీ అమలును ప్రశ్నిస్తూ రాజాసింగ్‌ రాజీనామా అస్ర్త్రాన్ని ప్రయోగించారు. ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజిరెడ్డి స్థానిక ప్రజల్ని తీవ్రంగా వేధిస్తున్నారని సీఎం కేసీఆర్‌కు రాసిన రాజీనామాల లేఖలో పేర్కొన్నారు. 

 

11:21 - March 21, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నాలుగో రౌండ్ కౌంటింగ్ పూర్తి అయింది. టీడీపీ...బీజేపీ అభ్యర్థి పీవీఎస్ మాధవ్ 4095 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మూడో కౌండ్ కౌంటింగ్ పూర్తి అయింది. వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి 5924 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ లో పీడీఎస్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాస్ రెడ్డి 4 వేల ఆధిక్యంలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి...

ఢిల్లీ : రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు జస్టిస్ చొరవ చూపారు. కోర్టు వెలుపలే సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని అన్ని పార్టీలకు సూచించారు.

తిరుమల రెండో ఘాట్ లో రోడ్డు ప్రమాదం..

చిత్తూరు : తిరుమల రెండో ఘాట్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీనితో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.

11:14 - March 21, 2017

తిరందాస్ కు తమ్మినేని నివాళి..

నల్గొండ : తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరందాస్ గోపి భౌతికకాయానికి తమ్మినేని పూలమాల వేసి నివాళి అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర నేతలు జూలకంటి, నంద్యాల, పోతినేని సుదర్శన్ ఇతరులున్నారు. నిన్న రోడ్డు ప్రమాదంలో తిరందాస్ గోపి మృతి చెందిన సంగతి తెలిసిందే.

11:07 - March 21, 2017

ప్రముఖ తమిళ నటుడు 'ధనుష్' కు పుట్టుమచ్చల లొల్లి వదలడం లేదు. ధనుష్ తమ కుమారుడేనంటూ మధురై జిల్లాకు చెందిన కదిరేశన్ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యంలో వైద్యులు తమ నివేదికను సోమవారం న్యాయస్థానానికి సమర్పించారు. ఇందులో సంచలన విషయాలు పేర్కొనట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. కోర్టు ఆదేశం మేరకు మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రి డీన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం కొద్దిరోజుల కిందట 'ధనుష్‌' శరీరంపైనున్న మచ్చలు, ఇతర గుర్తులను సేకరించిన విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు లేజర్ చికిత్స విధానంలో ధనుష్ తన శరీరంపై ఉన్న మచ్చలను తొలగించారని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ధనుష్ కు కష్టాలు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు తదుపరి విచారణనను 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ తేదీన ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

11:02 - March 21, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గందరగోళం నెలకొంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మీడియా పాయింట్ దద్దరిల్లింది. మీడియాతో మాట్లాడేందుకు వైసీపీ, టీడీపీ సభ్యులు పోటీ పడ్డారు. వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతుండగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దూసుకొచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే అనిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈశ్వరీ ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై, అనిత వైసీపీపై విమర్శలు చేసుకున్నారు. ఇరు పక్షాలు నేతలు పోటీ పడి విమర్శించారు. మహిళలకు రక్షణ లేదని వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఇరు పార్టీల శాసనసభ్యుల మధ్య తోపులాట జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:00 - March 21, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం చంద్రబాబుపై వైసీపీ సభ్యులు స్పీకర్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రూల్ 168 కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అలగాజనమంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. స్పీకర్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. పోడియం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ వైసీపీ సభ్యులు రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వైసీపీ సభ్యులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దుష్ట సాంప్రదాయాన్ని పాటిస్తున్న వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. సభను అడ్డుకోవడం వైసీపీ సభ్యులకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. 

10:57 - March 21, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం చంద్రబాబుపై వైసీపీ సభ్యులు స్పీకర్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రూల్ 168 కింద నోటీసులు ఇచ్చినట్లు నేతలు తెలిపారు. 

 

10:52 - March 21, 2017

విమానాల్లో ల్యాప్ టాప్..టాబ్లెట్..ఐ ప్యాడ్..ఇలా తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళుతున్నారా ? కానీ తీసుకెళ్లకూడదు. వాటిపై నిషేధం విధించారు. గిదేంటీ ? చివరకు విమాన ప్రయాణాల్లో కూడా నిషేధాలు విధిస్తున్నారా ? అని ప్రశ్నిస్తున్నారా...ఈ వార్త నిజమే కానీ మన దేశంలో మాత్రం కాదు. అగ్రరాజ్యం అంటూ పిలవపడుతున్న 'అమెరికా'లో...అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు వచ్చే విమానాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం విధించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్, జోర్డాన్ లోని అమన్, కువైట్, ఈజిప్టు రాజధాని కైరో, మొరాకాలోని కసబ్లాంకా, ఖతాలోని దోహ, సైదీలోని రియాద్, దుబాయి నుండి వచ్చే నాన్ స్టాప్ విమానాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం విధించారంట. కానీ నిషేధం ఎందుకు విధించారో తెలియరావడం లేదు. భద్రతాపరంగా ఈ నిర్ణయాలు తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ నిషేధం తాత్కాలికమా ? అనేది తెలియడం లేదు. మరి తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

10:43 - March 21, 2017

అంతటా 'పవన్' ఫీవర్ పట్టుకుంది. ఆయన నటించిన 'కాటమరాయుడు' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్..ట్రైలర్..పోస్టర్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. ఉగాది సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఉగాది పండుగకు చిత్రం రిలీజ్ అవుతుందా ? లేదా ? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉగాదికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానుల సందేహాలు పటాపంచలయ్యాయి. తాజగా ఈనెల 24వ తేదీన చిత్రం వస్తోందంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మాస్ ఆడియన్స్ ను.. యూత్ ను.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మళ్లీ శేఖర్ రెడ్డి అరెస్టు..

చెన్నై : టిటిడి బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి మళ్లీ అరెస్టయ్యారు. నోట్ల మార్పిడి కేసులో జైలు నుండి విడుదల కాసేపటికే అరెస్టు కావడం గమనార్హం. శేఖర్ రెడ్డితో పాటు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ లను పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. ఈనెల 28 వరకు కస్టడీ విధించారు.

ముందంజలో పీడీఎఫ్ అభ్యర్తి యండపల్లి..

చిత్తూరు : తూర్పు, రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5వ రౌండ్ ముగిసింది. 5వేల ఓట్ల ఆధిక్యంలో పీడీఎఫ్ యండపల్లి ముందంజలో కొనసాగుతున్నారు.

ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో రౌండ్ పూర్తయ్యింది. 5924 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4వ రౌండ్ పూర్తయ్యింది. 4095 ఓట్ల ఆధిక్యంలో టిడిపి - బీజేపీ అభ్యర్థి మాధవ్ ముందంజలో ఉన్నారు.

మీడియా పాయింట్ వద్ద కూడా..

విజయవాడ : మీడియా పాయింట్ వద్ద కూడా టిడిపి..వైసిపి సభ్యులు వాగ్వాదం చేసుకున్నారు. మహిళలపై మాట్లాడే హక్కు లేదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో మీడియాకు అర్థం కాలేదు.

టి.అసెంబ్లీ నేటి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్..ఉద్యోగుల క్రమబద్ధీకరణ..ప్రభుత్వ ఉద్యోగ భర్తీ చేయాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

ఏపీ అసెంబ్లీలో లొల్లి..లొల్లి..

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష..విపక్ష మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నాడు సమావేశాలు కొనసాగాయి. సోమవారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ వెల్ లోకి వెళ్లి నినాదాలు చేసింది. దీనితో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

 

'పులివెందులలో చీని..అరటి తోటలను కాపాడం'..

విజయవాడ : పులివెందుల బ్రాంచి కెనాల్ నుండి నీళ్లిచ్చి 18వేల ఎకరాల చీని, అరటి తోట్లను కాపాడామని మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. కేసీ కెనాల్ కు 5,255 టీఎంనీల నీటిని అందించినట్లు పేర్కొన్నారు.

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఓయూ ప్రోఫెసర్..

హైదరాబాద్ : ఓయూ సీనియర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ సూసైడ్ నోట్ రాసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్, జేఎన్ యూ విద్యార్థి కృష్ణకు జరిగిన అన్యాయమే తనకు జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. రాథోడ్ అదృశ్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓయూ పీఎస్ లో ఓయూ విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

రుజువు చేస్తారా రాజీనామా చేస్తా - చింతమనేని..

విజయవాడ : వనజాక్షి విషయంలో తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గిడ్డి ఈశ్వరీ మళ్లీ వనజాక్షి విషయం లేవనెత్తారని, మహిళలకు అన్యాయం చేశారని తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేసిన ఎంక్వయిరీలో నిజనిజాలు బయటకు వస్తాయని, చెప్పిన దాని పదే పదే చెబుతూ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం అలవాటుగా మారిపోయిందన్నారు. వనజాక్షి మీద దాడి చేసినట్లు రుజువు చేయగలిగితే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. డ్వాక్రా సంఘాలు..వనజాక్షి మధ్య ఘర్షణ జరిగిందన్నారు.

టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు.

వారింట్లో మహిళా సాధికారిత లేదు - అనిత..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వారింట్లోనే మహిళా సాధికారిత లేదని ఎమ్మెల్యే అనిత వైసీపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళలపై స్పీకర్ కోడెల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు వక్రీకరించారని విమర్శించారు.

09:54 - March 21, 2017

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. కరువుపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. కరువుపై చర్చకు వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలు తర్వాత వాయిదా తీర్మానంపై చర్చిద్దామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 

09:51 - March 21, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. కరువుపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. కరువుపై చర్చకు వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలు తర్వాత వాయిదా తీర్మానంపై చర్చిద్దామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 

09:44 - March 21, 2017

గుంటూరు : ఇవాళ ఆరవరోజు ఏపీ ఉభయసభల సమావేశాలు కొనసాగనున్నాయి... ఏకగ్రీవ తీర్మానానికి 2 ప్రతిపాదనల్ని ఉభయసభల్లో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్‌టీఆర్‌ ఎయిర్‌పోర్టుగా పేరుమార్పు ప్రతిపాదన చేశారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా పేరుమార్పు ప్రతిపాదన చేశారు. ఏపీ అసెంబ్లీలో కరువుపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. ఉభయ సభల్లో బడ్జెట్‌పై ఇవాళ సాధారణ చర్చ కొనసాగనుంది. బడ్జెట్‌పై చర్చకు మంత్రి యనమల సమాధానం ఇవ్వనున్నారు.

 

09:38 - March 21, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మూడో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే సమయానికి.. 2,633 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ-బీజేపీ అభ్యర్థి పీవీఎస్‌ మాధవ్‌ ఉన్నారు.  అటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రెండో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయింది. 3,675 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఉన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ కంటిన్యూ అవుతోంది. నాలుగోరౌండ్‌లో 4 వేల ఆధిక్యంలో పీడీఎఫ్‌ అభ్యర్థి యండవల్లి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 

 

09:31 - March 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ ఇవాళ సాయంత్రం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బిల్లుల ఆమోదంపై కేబినెట్‌ చర్చించనుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో చేపట్టాల్సిన చట్ట సవరణ, మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. 
కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశముంది. ప్రధానంగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున.. ఈ సమావేశాల్లో చేయాల్సిన చట్టాలపై కేబినెట్‌ చర్చించనుంది. బడ్జెట్‌పై వివిధ తరగతుల నుంచి వస్తున్న స్పందనపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌లో చేపట్టాల్సిన సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.  సబ్‌ప్లాన్‌కు నేరుగా నిధులు కేటాయించి, ఖర్చు చేసేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు సబ్‌ప్లాన్‌కు పేరు కూడా మార్చి ప్రగతి పద్దు అని నామకరణం చేయనున్నారు. ఈ సబ్‌ప్లాన్‌ నిధులు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా ఓ రిటైర్డ్‌ సీనియర్‌ అధికారిని నియమించనున్నారు. ఇందుకు మాజీ సీఎస్‌ ప్రదీప్‌చంద్ర పేరును  ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇవాళ జరిగే కేబినెట్‌లో దీనిపై ప్రధానంగా చర్చించనున్నారు.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే బిల్లుపై చర్చ
ఈ సమావేశాల్లో ఆమోదించాల్సిన పలు బిల్లుపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు కూడా తెప్పించుకుంది. ప్రతిపక్షాల నుంచి కూడా ఈ డిమాండ్‌ వినిపిస్తుండడంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  గిరిజనులు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు  కూడా ఈ సమావేశాల్లోనే  ప్రభుత్వం ఆమోదించాలని భావిస్తోంది. దీంతో ఈ బిల్లుపైనా కేబినెట్‌ చర్చించనుంది. వీటితోపాటు అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహం, సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర  డిమాండ్స్‌పైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.

 

09:25 - March 21, 2017

హైదరాబాద్ : ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసు ఓటింగు వైసీపీ అభ్యర్థుల విజయాన్ని దెబ్బతీసింది. మూడు జిల్లాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధుల క్రాసు ఓటింగుతో ముగ్గురు అభ్యర్థులు ఓడిపోయారు. కడప నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి, నెల్లూరు  నుంచి ఆనం విజయకుమార్‌రెడ్డి, కర్నూలు నుంచి గౌరు వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు. ఇందుకు దారితీసిన పరిస్థితులపై వైసీపీ నేతలు సమీక్షించుకుంటున్నారు. 
క్రాసు ఓటింగ్ 
ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసు ఓటింగ్ వైసీపీకి శాపంగా పరిణమించింది. వైపీసీ ప్రజా ప్రతినిధులు క్రాసు ఓటింగుకు పాల్పడంలో పార్టీ అభ్యర్థులు  కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఓటమి చవిచూశారు. స్థానిక సంస్థల్లో వైపీసీ బలం ఉన్నా కడప నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి, కర్నూలు నుంచి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు నుంచి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ఓడిపోయారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైపీసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 
వాకాటి నారాయణరెడ్డికి 87 ఓట్ల ఆధిక్యత 
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి..తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డిపై విజయం సాధించారు. నారాయణరెడ్డికి 87 ఓట్లు ఆధిక్యత వచ్చింది. అయితే నారాయణరెడ్డికి ఇంకా ఎక్కువు మెజారిటీ రావాలన్నది తెలుగుదేశం నేతల వాదన. టీడీపీలో కొందరు క్రాసు ఓటింగుకు పాల్పడ్డారని  విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ శిబిరంలో 515 మంది ఓటర్లు ఉన్నారని టీడీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. కానీ వాకాటి నారాయణరెడ్డికి 465 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈయనకు పడిన ఓట్లలో ఏడు మురిగిపోయాయి. మొత్తం 45 ఓట్లు వైసీపీ ఆనం విజయకుమార్‌రెడ్డికి  అనుకూలంగా పడినట్టు తేల్చారు. క్రాసు ఓటింగుకు పాల్పడినవారు ఎవరన్న అంశంపై తెలుగుదేశం నేతలు ఆరా తీస్తున్నారు. పదిరోజుల పాటు నమ్మకంగా టీడీపీ శిబిరంలో ఉండి పోలింగు రోజు 45 మంది  వైసీపీ ఓటు వేయడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో ఎవరు క్రాసు ఓటింగు చేశారు, వీరికి వెనుక టీడీపీ నేతలు ప్రోద్బలం ఏమైనా ఉందా ? అన్న కోణంలో పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. పార్టీలో బలమైన నేతల ఆదేశాలు లేకుండా టీడీపీ శిబిరంలోని ప్రజా ప్రతినిధులు  క్రాసు ఓటింగుకు పాల్పడే అవకాశంలేదని భావిస్తున్నారు. వీరు ఎవరన్న విషయం తేల్చే పనిలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. 
నెగ్గిన శిల్పాచక్రపాణిరెడ్డి 
కర్నూలు జిల్లాలో కూడా క్రాసు ఓటింగు జరిగినట్టు టీడీపీ, వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉత్కంఠ భరింగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదట్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధుల క్రాసు ఓటింగుతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 38 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఆ తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి పుంజుకున్నారు. చివరకు 62 ఓట్ల ఆధిక్యతంలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపుపొందారు. కర్నూలు జిల్లాలో ఉన్న 1084 ఓట్లలో 1077 పోలయ్యాయి. వీటిలో 11 ఓట్లు చెల్లలేదు. శిల్పా చక్రపాణిరెడ్డికి  564 ఓట్లు రాగా, వైపీసీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీటీడీ ప్రజా ప్రతినిధుల క్రాసు ఓటింగుతో తన మెజారీటీ తగ్గిందంటున్న శిల్పా చక్రపాణిరెడ్డి... ఈ విషయాన్ని టీటీడీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి...
వైపీసీ ఓట్లకు భారీగా గండి
వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లాలో కూడా క్రాసు ఓటింగు జరిగింది. వైపీసీ గుర్తుపై నెగ్గిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బలం ఉందని గట్టినా నమ్మిన వైసీపీకి వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటమితో అనూహ్య పరిణామం ఎదురైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్దేల్‌ శాసనసభ్యుడు జయరాములు,   ఎమ్మెల్సీ చెంగల్‌రాయుడు టీడీపీలో చేరడంతో వైపీసీ ఓట్లకు భారీగా గండిపడింది. ఎమ్మెల్యేలతోపాటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,  కడప నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు పదుల సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో వివేకానందరెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

 

09:16 - March 21, 2017

హైదరాబాద్ : ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండుచోట్ల పీడీఎఫ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కత్తి నర్సింహారెడ్డి గెలుపొందారు. విజయ సాధించిన ఇద్దరు పీడీఎఫ్ ఎమ్మెలీలను పలువురు అభినందించారు. 
పీడీఎఫ్‌ అభ్యర్థులు విజయఢంకా 
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసివున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలుపొందారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కత్తి నర్సింహారెడ్డి విజయం సాధించారు. 
బాలసుబ్రహ్మణ్యం గెలుపు 
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి విఠపు బాలసుబ్రహ్మణ్యం వరుసగా మూడవసారి గెలుపొందారు. టీడీపీ బలపరిచిన వాసుదేవనాయుడుపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. బాలసుబ్రహ్మణ్యంకు 3,545 ఓట్లు ఆధిక్యతంలో గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17,652 ఓట్లు పోలయ్యాయి. 537 ఓట్లు చెల్లలేదు. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విఠపు బాలసుబ్రహ్మణ్యం చెబుతున్నారు. 
కత్తి నర్సింహారెడ్డి గెలుపు
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డిపై 3,759 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం 18,840 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 9,620 ఓట్లు నర్సింహారెడ్డికి వచ్చాయి. 513 ఓట్లు చెల్లలేదు. 26 నోటా ఓట్లు నమోదయ్యాయి.   టీడీపీ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య  3,812 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయానికి కృషి చేసిన నేతలకు కత్తి నర్సింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను నుంచి విజయం సాధించిన పీడీఎఫ్‌ అభ్యర్థులను పలువురు నేతలు, ఉపాధ్యాయులు అభినందించారు.

 

నేడు ఆరోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గుంటూరు : నేడు ఏపీ అసెంబ్లీ ఆరో రోజు సమావేశాలు జరుగనున్నాయి. శాసనసభ, మండలిలో బడ్జెట్ లో సాధారణ చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో నేడు విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.  

 

ఏపీలో కొనసాగుతోన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పీడీఎఫ్ అభ్యర్తుల హవా కొనసాగుతోంది. పీడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

 

Don't Miss