Activities calendar

22 March 2017

గురువారం ఢిల్లీకి బాబు..

హైదరాబాద్ : రేపు సాయంత్రం 5గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపుఏ సీఎన్ జీసీ టీవీ 18 బిజినెస్ లీడర్స్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

21:34 - March 22, 2017

ఢిల్లీ : బీసీసీఐ భారత క్రికెటర్లకు భారీగా పారితోషికాలు పెంచింది. క్రికెటర్లకు ఏటా చెల్లించే రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్-ఏ క్రికెటర్ల పారితోషికం రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు, గ్రేడ్-బీ క్రికెటర్లకు పారితోషికం రూ.50 లక్షల నుంచి కోటికి పెంపు,
గ్రేడ్-సీ క్రికెటర్ల పారితోషికం రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

 • గ్రేడ్-ఏ క్రికెటర్లు : విరాట్ కోహ్లీ, ధోని, అశ్విన్, రహానే, పుజారా, జడేజా, మురళీ విజయ్
 • గ్రేడ్-బీ క్రికెటర్లు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్‌యాదవ్, సాహా, బుమ్రా, యువరాజ్‌సింగ్
 • గ్రేడ్-సీ క్రికెటర్లు : శిఖర్ ధావన్, అంటిరాయుడు, అమిత్ మిశ్రా, మనీశ్‌పాండే, అక్షర్ పటేల్, కరుణ్‌నాయర్, పాండ్యా, నెహ్రా, కేదార్ జాదవ్, చాహల్, పార్దివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్‌దీప్ సింగ్, కుల్‌కుర్ణి, షార్దుల్ థాకూర్, రిషబ్ పంత్
21:31 - March 22, 2017
21:27 - March 22, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పాలక తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు ముగ్గురు, వైసీపీ సభ్యుడు ఒకరు విజయకేతనం ఎగురవేశారు. విశాఖ పట్టభద్రుల ఎన్నికలో మాత్రం.. టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు సత్తా చాటారు. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం వెలువడిన ఫలితాలు, పాలక పక్షాన్ని ఖంగు తినిపించాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో వామపక్షాలకు ఎదురు లేదని మరోమారు నిరూపితమైంది. చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను పీడీఎఫ్ అభ్యర్థులను విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి కైవసం చేసుకున్నారు. వరుసగా మూడోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలిచారు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనదని పీడీఎప్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కార్పొరేట్ శక్తులను తనపై పోటీకి దింపి మండలిలో తన గొంతు నొక్కేయాలని అధికార పార్టీ చూసిందని.. అయితే ఉపాధ్యాయులు విజ్ఞతతో ఓటు వేసి తనను గెలిపించారన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై యండపల్లి శ్రీనివాసరెడ్డి విజయదుందుభి మోగించారు. ఈ విజయం వామపక్షాల విజయమని యండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ తరపున గోపాల్‌రెడ్డి ఈ ఎన్నికలో గెలుపొందారు. ఈ విజయంతో విద్యావంతులందరూ తమతోనే ఉన్నారని తేలిందన్నారు.. గోపాలరెడ్డి. ఇక ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నిబీజేపీ సొంతం చేసుకుంది. పీడీఎప్ అభ్యర్థి అజశర్మపై బీజేపీ అభ్యర్థి మాధవ్ విజయం సాధించారు. ఫలితం అనంతరం విశాఖకు రైల్వే జోన్ కోసం కృషిచేస్తానని మాధవ్ తెలిపారు. మొత్తమ్మీద విద్యావంతులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే... ఏపీలో, పాలక తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా తగ్గిందని.. అదే సమయంలో, వామపక్షాల జోరుకు ఎదురేలేదని స్పష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

21:21 - March 22, 2017

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధిత మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. మదర్ కిట్ ప్రతిపాదనకు..మహా ప్రస్థానం ట్రాన్స్ పోర్టేషన్ వెహికల్స్ కు ..డిపాజిట్ల రక్షణ కోసం రివైజ్డ్ బిల్లుకు..ఆమోదం తెలిపింది. ఒంటిమిట్ట నిర్వాసితుల ఇళ్ల కోసం రూ. 101.85 లక్షలు..ఏపీ ఎస్ హెచ్సీఎల్ ఉద్యోగుల జీతాల పెంపునకు..లేబర్ రిఫార్మ్ ఏపీ యాక్టు 2015 సవరణలకు..ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్ 2017 డ్రాఫ్ట్ రూపకల్పన..పోలవరం పనుల మొబలైజేషన్ అడ్వాన్సుల రికవరినీ వాయిదా వేసేందుకు ఆమోదం తెలిపింది.

21:19 - March 22, 2017

హైదరాబాద్ : పాలక, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య ఇవాల్టి తెలంగాణ శాసనసభా సమావేశాలు వాడివేడిగా సాగాయి. కాంగ్రెస్‌సభ్యుల వాకౌట్‌, బీజేపీ సభ్యుల స్పీకర్‌పోడియం ముట్టడితో సభ హాట్‌హాట్‌గా నడిచింది. మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. సభ వాయిదా వేయడానికి ముందు ఎస్సీఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ భూదాన బిల్లుతోపాటు తెలంగాణ పేమెంట్‌ అండ్‌ శాలరీస్‌ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభలో ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. మిషన్‌భగీరథ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖల పనితీరుపై విపక్షసభ్యులు సూటిగా ప్రశ్నలు సంధించారు. మిషన్‌ భగీరథలో వేలకోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని కాంగ్రెస్‌ సభ్యులు జానారెడ్డి , జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి తదితరులు ఆరోపించారు. నిజాలు బయటికి రావాలంటే హౌస్‌కమిటీ వేయాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. హౌస్‌కమిటీ వేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో .. కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు తోసిపుచ్చారు. అభివృద్ధి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మంచి పేరు తెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు పంచాయతీరాజ్‌ శాఖ పనితీరుపై కూడా సభలో చర్చ జరిగింది. గ్రామపంచాయితీల్లో అవినీతికి అవకావశం లేని విధంగా అన్ని డాక్యుమెంట్స్‌ డిజిటలైజ్‌ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి సమాధానంపై సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ అనాలోచిత చర్యల వల్ల..ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు సుమారు 300 కోట్ల రూపాయలు మురిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

ఘాటుగా స్పందించిన జగదీశ్ రెడ్డి..
మున్సిపల్ కార్మికుల సమస్యలను సీపీఎం శాసనసభ్యుడు సున్నంరాజయ్య సభలో ప్రస్తావించారు. భద్రాచలం ఏజెన్సీలో మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. సభలో విద్యుత్‌శాఖ పనితీరుపై బీజేపీ సభ్యులు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్‌ పథకం నుంచి రాష్ట్రం లబ్దిపొందలేక పోతోందని ఆరోపించారు. దీనికి మంత్రి జగదీశ్వరరెడ్డి ఘాటుగా స్పందించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందనపై సీరియస్‌ అయిన బీజేపీ సభ్యులు స్పీకర్‌ పోడియంలోకి దూసుకొచ్చారు. ప్రధాని మోదీపై మంత్రి అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో కల్పించుకున్న మంత్రి హరీశ్‌రావు మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు. బీజేపీ సభ్యులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని సభ సజావుగా జరగడానికి సహకరించాలన్నారు. ఈ వాగ్వాదాల నడుమే.. ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఆతర్వాత గురువారం ఉదయం 10గంటలకు సభను వాయిదా పడింది.

21:16 - March 22, 2017

విజయవాడ : రైతులకు రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సకాలంలో చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వాస్తవాలు వక్రీకరిస్తుందని ప్రతిపక్షనేత జగన్‌ ఆరోపించారు. అయితే, రైతులకు పంటనష్టపరిహారాన్ని ఎగ్గొట్టిన చరిత్ర వైఎస్‌ రాజశేఖరరెడ్డిదంటూ పాలక పక్షం ఎదురు దాడికి దిగింది. రైతు ఆత్మహత్యలపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌ చర్చ జరిగింది. రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తుటాలు పేలాయి. ప్రపంచ జలదినోత్సవ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో జల సంరక్షణపై చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జలసంరక్షణపై చంద్రబాబు సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. రైతులకు రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సకాలంలో చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని జగన్‌ అన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వాస్తవాలు వక్రీకరిస్తుందని ఆరోపించారు.

జగన్ ఆరోపణలు..
రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తుందని వైసీపీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. 2014 నుంచి ఇప్పటి వరకు 20184 మంది చనిపోయారని తెలిపారు. జగన్, రామచంద్రారెడ్డి ఆరోపణలపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిచ్చారు. సభలో అసత్యాలను మాట్లాడటం జగన్‌కు ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2013-14 సంవత్సరానికి గానూ 2300 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్‌ ఆరోపించారు. ఇప్పటివరకు 8వేల కోట్లకు కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. అయితే, చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు ఈ ఆరోపణలపై తీవ్రఆక్షేపణ తెలిపారు. రైతులకు ప్రకటించిన 57 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర వైఎస్సార్ సర్కార్‌దని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సంవత్సరం 1762 కోట్ల రుపాయల ఇన్‌ఫుడ్‌ సబ్సిడీని రైతులకు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిరోజు ప్రతిపక్షం అనవసరంగా గందరగోళం సృష్టిస్తుందని..వైసీపీ సభ్యులు ఇదే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని యనమల హెచ్చరిస్తే.. సభలో హుందాగా వ్యవహరించేలా ప్రతిపక్ష సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను గురువారానికి వాయిదావేశారు.

ఆధిక్యంలో కాటేపల్లి జనార్ధన్ రెడ్డి..

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

21:05 - March 22, 2017

లండన్ : బ్రిటన్ పార్లమెంట్ ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేగింది. కాల్పుల సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 02 గంటల 04 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా అధికారులు కాల్పులు జరిపిన ఆగంతకుడి కోసం గాలింపులు చేపట్టారు. కాల్పులతో పాటు పెద్ద శబ్ధంతో పేలుడు జరిగిందని తెలుస్తోంది. ఎయిర్ అంబులెన్స్ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకుంది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఆగంతకుడు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. వెంటనే పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేశారు. అప్రమత్తమైన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సరిగ్గా సంవత్సన్నరం క్రితం జరిగిన దాడిలో 33 మంది మృతి చెందారు.

20:50 - March 22, 2017

అమ్మ సీటును చిన్నమ్మ వర్గం దక్కించుకుంటుందా...? పన్నీరు పార్టీతో ప్రజల మనస్సులు గెలవగలడా...? అమ్మలేని గ్యాప్ ని డీఎంకే వశం చేసుకుంటుందా..?
తమిళనాట కమలం పార్టీ కలలు నెరవేరుతాయా...? ఈ అంశంపై ప్రత్యేక కథనం.. ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక చుట్టూ జరుగుతున్న చర్య ఇది. నిజానికి ఇది ఒక అసెంబ్లీ నియోజక వర్గంకి జరిగే ఉప ఎన్నిక. దివంగత ముఖ్యమంత్రి తమిళ ప్రజలు అమ్మగా పిలుచుకునే జయలలిత అనారోగ్య కారణాల వల్ల మరణించడం వల్ల వచ్చిన ఉపఎన్నిక. కాని ఇది అమ్మలేని లోటు ఎవరు తీరుస్తారు అని తేల్చే ఎన్నిక, తమిళనాట రాజకీయ భవిష్యత్తును తేల్చే ఎన్నిక, అందుకే ఇక్కడ గెలుపు అందరికి అవసరం. కాదు కాదు అత్యవసరం. భవిష్యత్తులో తమిళ నాడు రాజకీయలపై చెరగని ముద్ర వేయాలంటే ఆర్కే నగర్ లో తప్పకుండా గెలిచి తీరాలి. ప్రస్తుతం తమిళ రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. ఈ అంశంపై మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

లండన్ లో కాల్పులు..

లండన్ : బ్రిటన్ పార్లమెంట్ ఆవరణలో ఓ దండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు..

విజయవాడ : ఏపీ కేబినెట్ కాసేపటి క్రితం ముగిసింది. డాట్ భూముల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకరావాలని..ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలని..అగ్రిగోల్డ్ బాధిత మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల చొప్పున పరిహారం చ చెల్లించాలని కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. మదర్ కిట్ ప్రతిపాదనకు..మహా ప్రస్థానం ట్రాన్స్ పోర్టేషన్ వెహికల్స్ కు ..డిపాజిట్ల రక్షణ కోసం రివైజ్డ్ బిల్లుకు..ఆమోదం తెలిపింది. ఒంటిమిట్ట నిర్వాసితుల ఇళ్ల కోసం రూ.

'అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరిగే అవకాశం'..

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం నిర్ణయం చేసే అవకాశం ఉందని, విభజన చట్టంలోనే సీట్ల పెంపు అంశం పేర్కొన్నారని తెలిపారు.

ముగిసిన ఏపీ కేబినెట్..

విజయవాడ : ఏపీ కేబినెట్ కాసేపటి క్రితం ముగిసింది. డాట్ భూముల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకరావాలని..ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలని..అగ్రిగోల్డ్ బాధిత మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల చొప్పున పరిహారం చ చెల్లించాలని కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

 

20:15 - March 22, 2017

నరం లేని నాల్కె ఎన్నిమాటలన్న మాట్లాడ్తదంటరు సూడు.. గది మన చంద్రాలుకు సూటైతుండొచ్చు ఈ ముచ్చట్ల.. జనగామా ఎమ్మెల్యే సారు.. చర్లపల్లి కాడ కష్టపడి సర్కారు భూమి కబ్జావెట్టుకున్నడట..లోక కళ్యాణం లెక్క.. తెలంగాణ కళ్యాణం గూడ జర్గి తీరవల్సిందే అని.. మన తెలంగాణ సీఎం కేసీఆర్ సారు.. మస్తు తన్లాడుతున్నడు..గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగు సారు యాదికున్నడా..? తెలంగాణ రాష్ట్రం మీద రాహుకేతులువు తిష్టేశి కూసున్నట్టే గొడ్తున్నది.. ఆదిలాబాద్ జిల్లాల జనం ఆగమైతున్నరు.. దుపదూపై అంగలారుస్తున్నరు.. దొంగోని పట్ల కనీస మర్యాదలు పాటించకుంట ఇంట్ల ఏం దాశిపెట్టకుంట ఊరికి వొయ్యిన ఆ ఇంటోళ్ల మీద కోపంరాదా.. ఇగో వచ్చింది..గత పాలకుల లెక్క గాదు మాది రైతు ప్రభుత్వం అని మోడీగారు ఎన్నిమాట్ల మొత్తుకున్నడు...గిసొంటి ముచ్చట్లు సూడాలంటే వీడియో చూడండి..

20:12 - March 22, 2017

గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగు సారు యాదికున్నడా..? మర్శిపోయే క్యారెక్టరేనా సారుదిగని.. సారుకు నిన్నియాళ్ల ఓట్లేశిన జనం మీద ఏమన్న ప్రేమ వుట్టుకొచ్చిందా..? ఎన్కగన్ మెన్లు లేకపోతె.. జనం కాళ్లు గడ్కి నెత్తిల సల్లుకోని ఆయన ఆఫీసు మీద గూడ సల్లుకునెతట్టుండి.. రెండున్నరేండ్ల సంది లేని ప్రేమ సడన్గ వుట్టుకొచ్చెవర్కళ్ల జనం గోషామహల్ జనం ఆనంద బాష్పాలు గారిస్తె పెద్ద మడుగే తయ్యారైందట.. ఆ కథేందో వీడియోలో సూడుండ్రి..

19:53 - March 22, 2017

అమెరికాలో తెలుగు సంఘం తానా విపరీతమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తానాలో వసూల్ రాజాలు పెరిగిపోయాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 40 ఏళ్ల తానా క్లీన్ ఇమేజ్ పై మరకలు పడుతున్నాయి. సెటిల్ మెంట్ల కోసం ఐఏఎస్, ఐపీఎస్ లను మచ్చిక చేసుకున్నారంటూ, బ్యూరోక్రాట్లను లాస్ వేగాన్, కోస్టారికాలలో రహస్యంగా ఎందుకు తిప్పుతున్నారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముగ్గురు దొంగల చేతిలో తానా బందీ అయిందంటూ అభియోగాలున్నాయి. తానా ఎన్నికల కోసం దొంగ ఓటర్లను చేర్పించారంటూ విమర్శలున్నాయి. తానా సభ్యులు అప్రమత్తం కావాలంటూ బహిరంగ లేఖలు రాస్తున్నారు. దీనితో తానా వ్యవహరాలు అప్రతిష్టపాలైపోతున్నాయి. మరి తానా సేవ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి..అనే దానిపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో నగేష్ (విశ్లేషకులు), బాబురావు (అమెరికా), కాకర్ల సుబ్బారావు (నిమ్స్ మాజీ డైరెక్టర్), డా.రాజా కరణం (అమెరికా) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి సూచనలు..సలహాలు అందించారో వీడియోలో చూడండి.

భారీగా పెరిగిన క్రికేటర్ల పారితోషకాలు..

ముంబై : భారత క్రికేటర్ల పారితోషకాలు భారీగా పెరిగాయి. గ్రేడ్ -ఏ క్రికేటర్ల పారితోషకం రూ. కోటి నుండి రూ. 2 కోట్లకు..గ్రేడ్ -సి క్రికేటర్లకు రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షలకు పెరిగింది.

 

సాతం రాయి వద్ద రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : శంషాబాద్ (మం) సాతం రాయి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు వెనుక నుండి ఢీకొట్టడంతో టాటా ఎస్ బోల్తా కొట్టింది. 9మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

అక్వాఫుడ్ పార్క్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..

కాకినాడ : కరప (మం) గురజనపల్లిలో ఆక్వాఫుడ్ పార్క్ లో అమ్మోనియం గ్యాస్ లీకేజ్ అయ్యింది. ముగ్గురు మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

 

మహారాష్ట్ర వైద్యుల సమ్మెపై సీరియస్..

మహారాష్ట్ర : వైద్యులు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాత్రి 8గంటల్లోగా డ్యూటీలో చేరకపోతే ఆరు నెలల జీతం కట్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక చేసింది. నాగపూర్ లో 370 మంది వైద్యులు సోలాపూర్ లో 114 మంది వైద్యులకు సస్పెన్షన్ నోటీసులు రెడీ చేసింది. దాడుల నుండి తమకు రక్షణ కల్పించాలంటూ నాలుగు రోజులుగా మెడికోలు సమ్మె చేస్తున్నారు. మహారాష్ట్ర వైద్యుల సమ్మెకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల మద్దతు పలికింది. సంఘీభావంగా హెల్మెట్లు పెట్టుకుని విధులకు హాజరయ్యారు.

అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్షయ గోల్డ్ లో ఉన్న ఏడుగురు డైరెక్టర్లలో ముగ్గురిని అరెస్టు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. మరో నలుగురు డైరెక్టర్ల పట్ల అభిప్రాయం ఏంటో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అప్పుల ఊబిలో నెట్టేలా బడ్జెట్ - రామచంద్రయ్య..

విజయవాడ : ఏపీ శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ ముగిసింది. విపక్ష నేత రామచంద్రయ్య మాట్లాడారు. ఏపీని అప్పుల ఊబిలో నెట్టేలా బడ్జెట్ ఉందని, సలహాదారుల పేరిట అనవసరపు నియామకాలు చేస్తున్నారని విమర్శించారు. అనుభవజ్ఞులైన నిపుణులను సలహాదారులుగా నియమించాలని, అప్పులు తెచ్చి ఉత్సవాలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రతిష్ట పెరగదన్నారు. మంచి పరిపాలనతో పెరుగుతుందని, విభజన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో రాష్ట్రంపై అదనపు భారం పడుతుందన్నారు. కేంద్రంలో జీఎస్టీ తరహాలోనే రాష్ట్రంలో ఎస్జీఎస్టీ తీసుకొచ్చే ఆలోచన ఉందన్నారు.

ఐఏఎస్..కొడుకు సుక్రులకు రిమాండ్..

హైదరాబాద్ : డ్రైవర్ నాగరాజు హత్య కేసులో నాంపల్లి కోర్టు ఐఏఎస్ వెంకటేశ్వర్లు, కొడుకు సుక్రుకి 14 రోజుల రిమాండ్ విధించింది.

 

చీఫ్ సెక్రటరీలకు సుప్రీం సమన్లు..

ఢిల్లీ : కరువు సహాయక చర్యలపై పది రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 26న హాజరు కావాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలకు సమన్లు జారీ అయ్యాయి.

18:55 - March 22, 2017

టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా ..రాంచీలో రికార్డ్‌ల మోత మోగించాడు. అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్‌తో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ట్రేడ్‌ మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా లేటెస్ట్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. రాంచీ టెస్ట్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సొంతం చేసుకున్న చటేశ్వర్‌ పుజారాపై స్పెషల్‌ ఫోకస్‌. మారథాన్‌ ఇన్నింగ్స్‌తో ఎన్నో మైలురాళ్లు అధిగమించాడు. అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి భారత్‌ను ఆదుకోవడం మాత్రమే కాదు ఫైటింగ్‌ డబుల్‌ సెంచరీతో తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా బౌలర్ల ఆధిపత్యానికి చెక్‌ పెట్టాడు.

11 గంటల 8 నిమిషాల పాటు...
11 గంటల 8 నిమిషాల పాటు క్రీజ్‌లో పాతుకుపోయిన పుజారా కంగారూ బౌలర్ల సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూనే...పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో షాట్లతో ఆకట్టుకున్నాడు.214 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 521 బంతుల్లో డబుల్‌ సెంచరీ మార్క్‌ దాటాడు. ఈ ట్రేడ్‌మార్క్‌ ఇన్నింగ్స్‌తో పుజారా ఎన్నో అరుదైన రికార్డ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులెదుర్కొన్న భారత బ్యాట్స్‌మెన్‌గా పుజారా రికార్డ్‌ సృష్టించాడు. 495 బంతులతో ఇప్పటివరకూ టాప్‌ ప్లేస్‌లో ఉన్న రాహుల్‌ ద్రావిడ్‌ను పుజారా వెనక్కునెట్టాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో 500 పరుగులు..
ఒకే ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు పైగా బంతులెదుర్కొన్న తొలి భారత క్రికెటర్‌గా పుజారా హిస్టరీ క్రియేట్‌ చేశాడు.అంతే కాదు భారత గడ్డపై టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులెదునర్కొన్న బ్యాట్స్‌మెన్‌గా యూనిస్‌ ఖాన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఈ లిస్ట్‌లో ఇప్పటివరకూ యూనిస్‌ ఖాన్‌ 504 బంతులతో ముందువరుసలో ఉండగా....లేటెస్ట్‌గా 525 బంతులతో పుజారా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇప్పటివరకూ పుజారా 3 డబుల్‌ సెంచరీలు సాధించగా....ఆస్ట్రేలియా జట్టుపైనే రెండు సార్లు ఈ ఘనత సాధించడం విశేషం. ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో పుజారా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. పుజార ట్రేడ్‌మార్క్‌ ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్‌ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

18:51 - March 22, 2017

టీమిండియా స్టార్‌ ఆల్ రౌండర్‌ రవీందర్‌ జడేజా....టెస్టుల్లో అంచనాలకు మించి అదరగొడుతున్నాడు. ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో బంతితో మ్యాజిక్‌ చేస్తూనే బ్యాట్స్‌మెన్‌గానూ రాణిస్తూ అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంటున్నాడు. టెస్ట్‌ బౌలర్ల లిస్ట్‌లో సోలోగా టాప్‌ ర్యాంక్‌లో నిలిచి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో జడేజా జాదూ చేస్తూనే ఉన్నాడు. స్పిన్నర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూనే ఉన్నాడు. బ్యాట్స్‌మెన్‌గానూ మెరుపులు మెరిపించాడు. రాంచీ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి భారత్‌ను పోటీలో నిలిపాడు. ఒక్క రాంచీలోనే కాదు సిరీస్‌ ఆధ్యంతం జడేజా అశ్విన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీస్తూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు ముగిసే సరికి జడేజా ఓవరాల్‌గా 21 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టాప్ ప్లేస్ లో ..
గత వారం టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌తో కలిసి సంయుక్తంగా టాప్‌ ప్లేస్‌లో నిలిచిన జడేజా....రాంచీ టెస్ట్‌ ఫెర్ఫామెన్స్‌తో సోలోగా టాప్‌ ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ లోయర్‌ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న జడ్డూ....టెస్ట్‌ ఆల్‌రౌండర్ల లిస్ట్‌లోనూ మూడో స్థానంలో నిలిచాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి సారిగా మొదటి ర్యాంక్‌లో నిలిచి అరుదైన రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌గా ఎంట్రీ ఇచ్చిన జడేజా....బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌ చెయిర్‌ను సొంతం చేసుకుని తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. మరి టెస్టుల్లో జడేజా ఆల్‌రౌండర్‌గా ఇదే స్థాయిలో రాణిస్తే....మరిన్ని రికార్డ్‌లతో పాటు అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటాడు అనడంలో అనుమానమే లేదు.

18:43 - March 22, 2017

హైదరాబాద్ : ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సొంతింటి కోసం సామాన్యులు జీవితకాలం పాటు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ కలను అతి తక్కువ కాలంలో, అత్యల్ప వ్యయంతోనే నిజమయ్యేలా చేస్తోంది వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ. తక్కువ బడ్జెట్‌తో ఇళ్లు నిర్మించి ఇస్తూ... సొంతింటి కలలను సాకారం చేస్తున్న వాల్యూ సంస్థ కృషిపై 10 టీవీ స్పెషల్‌ స్టోరీ. ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్‌ నుంచి..ఇంటీరియర్ వరకు అవసరమైన అన్ని వస్తువులు సమకూర్చుకోవడం పెద్ద తలనొప్పే. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. దొరికినా అది నాణ్యమైనదో కాదో తెలియదు. అలాగే ఖర్చు కూడా అధికమే..సిమెంట్‌, ఇసుక, ఇటుక, ఇనుము ధరలకు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఇల్లు నిర్మించుకోవడం సామాన్యుడికి తలకుమించిన భారమవుతుంది. ఈ సమస్యలన్నిటికి వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఫుల్‌స్టాప్‌ పెడుతోంది. అతి తక్కువ సమయంలో..తక్కువ డబ్బుతో పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి... అందిస్తోంది.

10 నుంచి 15 రోజుల్లో ఇంటి నిర్మాణం..
కేవలం 10 నుంచి 15 రోజుల కాల వ్యవధిలో 5 లక్షల 40 వేల రూపాయాలకే.. డబుల్‌ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తూ.. వాల్యూ కన్ స్ర్టక్షన్ సంస్థ పేదోడికి అండగా నిలుస్తోంది. గతంలో కరీంనగర్ జిల్లాలో వందల ఇళ్లు నిర్మించింది. ఇప్పుడు మహబూబ్‌ నగర్ జిల్లాలో కొత్తూర్ సమీపంలో దాదాపు మరో 300 ఇళ్లకు పైగా నిర్మించి పేదల కలను సాకారం చేస్తోంది. ఈ కొత్త ఇళ్ల నిర్మాణంలో వాల్యూ కన్‌స్ట్రక్షన్ సంస్థకి నాట్కో ఫార్మా కంపెనీ బాసటగా నిలిచింది. నాట్కో కంపెనీ ప్రోత్సాహంతో వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ముందుకు వెళ్తుంది. నాట్కో కంపెనీ చైర్మన్‌ నన్నపనేని చౌదరి ఈ ఆధునిక ఇళ్ల నిర్మాణాల ఆలోచనను ప్రొత్సాహిస్తూ... ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంలో వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ... నాట్కోలో పని చేస్తున్న సిబ్బందికి 300 ఇళ్లను నిర్మించి అప్పగించింది.

ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకున్న సంస్థ
పేదలకు తక్కువ బడ్జెట్‌తో.. నాణ్యమైన ఇళ్లను అందించే ప్రయత్నంలో వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ పదేళ్ల పాటు కష్టపడింది. వియత్నాం పరిశోధకులు మార్కెట్‌లోకి తెచ్చిన ఈ సరికొత్త గృహ నమూనాపై అధ్యయనం చేసింది. దేశ, విదేశాలు తిరిగి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లు నిర్మించే రీతిని గురించి తెలుసుకుంది. నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా... పరిశోధన కేంద్రాలను సంప్రదించింది. అనంతరం తమకంటూ నిర్దిష్టమైన విధానాన్ని, ప్రణాళికను రూపొందించుకుని, మొత్తానికి రోజుల వ్యవధిలోనే ఇళ్లను పూర్తి చేసి సామాన్యులకు అందిస్తోంది. ఈ విధానంలో కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌ గటర్లను వేర్వేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చితే చాలు 10 నుంచి 15 రోజుల్లో ఇల్లు పూర్తవుతుందని రూపకర్తలు చెబుతున్నారు.

ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన సంస్థ
ఎన్ని ఏళ్లైనా ఇల్లు చెక్కుచెదరదని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం ఎదుర్కొని నిలబడుతుందని..అంటున్నారు. నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌, స్టీల్‌ పాడవుతాయనే భయమక్కరలేదని చెబుతున్నారు. ప్రస్తుతం వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ మార్కెట్‌లో మంచి స్థానంలో ఉంది. ఇళ్ల నిర్మాణంలో ఈ సంస్థ ప్రభుత్వ దృష్టిని కూడా ఆకర్షించింది. భవిష్యత్తులో వాల్యూ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ సేవలు మరింత విస్తృతం అయితే ఎలాంటి శ్రమ లేకుండానే అందమైన ఇంటిని నిర్మించుకోవడం ఏ మాత్రం కష్టం కాదనడంలో సందేహం లేదు. పేదలందరికీ సొంతిల్లు సాకారం అయ్యేందుకు వాల్యూ సంస్థ అనుసరిస్తోన్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. వాల్యూ సంస్థ ప్రయోగాత్మక విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే.. పేదలకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశయమూ నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

18:40 - March 22, 2017

విజయవాడ : వైసీపీ సభ్యులు పదే పదే సభను అడ్డుకోవడం పట్ల శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల తీవ్రంగా పరిగణించారు. రెడ్‌ టేప్‌ ఎవరూ దాటినా వేటు వేయాల్సిందే అన్నారు. దాంతో పాటు ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌ ఉండాలన్నారు. ప్రతిపక్షం ప్రవర్తన చూస్తే రూల్స్‌ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ప్రతిపాదనలను రూల్స్‌ కమిటీకి పంపించాలని స్పీకర్‌ను కోరారు.

18:38 - March 22, 2017

విజయవాడ : వైసీపీ సభ్యులు సభలో ఆందోళన చేయడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. సభను పదే పదే అడ్డుకోవడం సరికాదన్న బాబు.. ప్రతిపక్ష సభ్యులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. సభను అడ్డుకుని సక్సెస్‌ కావాలని చూస్తున్నారని విమర్శించారు.

18:35 - March 22, 2017

హైదరాబాద్ : మేనెజ్‌మెంట్ కోర్సుల్లో కేసు స్టడీస్‌కు ఉత్తమ ప్లేస్‌గా ఐసీఎఫ్ఏఐ నిలిచిందని ఐసీఎఫ్ఏఐ గ్రూపు డైరెక్టర్ బ్రాడింగ్ సుధాకర్ రావు తెలిపారు. తాట్‌ లీడర్ షిప్‌, గ్రేట్ ప్లేస్ టూ స్టడీ వంటి రెండు అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఐసీఎఫ్ఏఐ కు లభించాయని ఆయన తెలిపారు. ఈ అవార్డులను లండన్‌లో సుధాకర్ రావు అందుకున్నారు.

18:32 - March 22, 2017

విజయవాడ : రైతులకు రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సకాలంలో చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని జగన్‌ అన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. 87612 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి సంవత్సరానికి 3,500 కోట్లు చెల్లిస్తున్నారన్నారు. దీంతో రైతులపై వడ్డీభారం పెరిగిపోతుందన్నారు.

అన్ని అసత్యాలే - ప్రత్తిపాటి..
సభలో అసత్యాలను మాట్లాడటం జగన్‌కు ఆనవాయితీగా మారిందని మంత్రి ప్రతిపాటి అనడంపై వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. స్పీకర్‌ పోడియం దగ్గరకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడనివ్వకుండా మైక్ కట్‌ చేయడాన్ని తప్పుబట్టారు.

18:29 - March 22, 2017

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. చుక్కల భూములపై మంత్రివర్గం స్పష్టతనివ్వనుంది. రెవెన్యూ రికార్డుల్లో క్లారీటీ లేకపోవడం..దీనిపై చాలా వివాదాలు నెలకొన్నాయి. రికార్డులన్నింటినీ క్రమబద్ధీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పలుసార్లు చర్చ జరిగినా ఒక ప్రణాళిక రూపొందించలేదు. ఈసారి జరిగే కేబినెట్ లో విధి విధానాలు..ఆమోదం పొందే అవకాశం ఉంది. కేంద్ర బిల్డింగ్ యాక్ట్ కు అనుగుణంగా చట్టసవరణ చేయనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీలో అనుసరిస్తున్న వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై కూడా చర్చించనుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం..గందరగోళం చేయడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. దీనిపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. స్పీకర్ పోడియం వద్ద ఒక రిబ్బన్ ఏర్పాటు చేయాలని, ఈ రిబ్బన్ దాటి వెళ్లే వారిపై ఆటోమెటిక్ గా సస్పెన్షన్..వేయడం..లాంటివి చేయాలని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీ అనంతరం ఎలాంటి విషయాలపై చర్చించారో తెలియనుంది.

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చుక్కల భూములపై మంత్రివర్గం స్పష్టతనివ్వనుంది. కేంద్ర బిల్డింగ్ యాక్ట్ కు అనుగుణంగా చట్టసవరణ చేయనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూపీలో శాఖల కేటాయింపు..

హైదరాబాద్ : యూపీలో మంత్రుల శాఖ కేటాయింపు జరిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ హోం శాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకొని, మౌర్య‌కు ప్ర‌జా ప‌నుల శాఖ ఇచ్చారు. డిప్యూటీ సీఎం దినేశ్ శర్మకు విద్యాశాఖ..మైనారిటీ వ్యవహారాల శాఖ‌ను మొహసిన్ రజాకు, వ్య‌వ‌సాయ శాఖ‌ను సూర్యప్రతాప్ సాహికి, ఆర్థిక శాఖ‌ను రాజేశ్ అగర్వాల్‌కు, ఆరోగ్య శాఖ‌ను సిద్ధార్థ్‌నాథ్‌కు, మ‌హిళా సంక్షేమ శాఖ‌ను స్వాతీ సింగ్‌కు, సెకండ‌రీ ఎడ్యేకేష‌న్ శాఖ‌ను రీటా బహుగుణా జోషికి కేటాయించారు.

17:52 - March 22, 2017

హైదరాబాద్ : ఎలక్ట్రిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 8 జాతీయ మహా సభలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో మహాసభలు జరగనున్నాయి. ఎలక్ట్రిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. విద్యుత్ రంగంలో ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడుతోందని మహాసభ కో-ఆర్డినేటర్ సుధా భాస్కర్ తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో 9 దేశాలు, 29 రాష్ట్రాలకు చెందిన విద్యుత్ రంగ నిపుణులు పాల్గొంటారని టీఎస్ యూఈఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కిరణ్ తెలిపారు. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాల్సిన చర్యలతో పాటు, అందరికీ విద్యుత్ అనే అంశాలపై మహాసభలో చర్చ జరుగుతుందన్నారు.

17:51 - March 22, 2017

హైదరాబాద్ : ప్రధాని మోదీ వేలకోట్లు పంపిస్తున్నట్టు..! అవి లెక్కపెట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతున్నట్టు ..! అసలేం ఒరిగింది ఉదయ్‌ పథకంలో చేరడం వల్ల..? ఉదయ్‌ పథకంలో చేరడంవల్ల ఇప్పటివరకు రాష్ట్రానికి ఒక్కపైసా గ్రాంట్‌కూడా రాలేదు..! అసలు ఉదయ్‌ పథకంలో ఏం ఉంది..? అని నిలదీశారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి. ఉదయ్‌పథకం ద్వారా కేంద్రం నుంచి నిధులు పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు.

17:50 - March 22, 2017

హైదరాబాద్ : గ్రామపంచాయితీల్లో అవినీతికి అవకావశం లేని విధంగా అన్ని డాక్యుమెంట్స్‌ డిజిటలైజ్‌ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు సభకు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ విద్యుత్‌ బల్బులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్న దృష్టితోనే ప్రతిపక్షాలు ఉన్నాయని .. జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతిపక్షాలు మంత్రి సూచించారు.

17:45 - March 22, 2017

హైదరాబాద్ : పంచాయతీరాజ్‌ శాఖ అనాలోచిత చర్యల వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉపయోగం లేకుండా పోతాయని సీఎల్‌పీ నాయకుడు జానారెడ్డి అన్నారు. nrgs act ప్రకారం ఏ సంవత్సరం కేటాయింపులు అదే సంవత్సరంలో పూర్తిగా ఖర్చుపెట్టాలి..లేదంటే ఆ సంవత్సరం కేటాయింపులన్నీ మురిగిపోతాయన్నారు. గ్రామపంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు నెలరోజుల క్రితం చేపట్టిన పనులు మార్చి 31నాటి ఎలా పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు. దీంతో ఏకంగా 300కోట్లు పనికిరానివిగా మారే ప్రమాదం ఉందని.. దీన్నిబట్టే పంచాయతీరాజ్‌శాఖ ఎంత సమర్థంగా పనిచేస్తుంతో స్పష్టం అవుతోందని జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

17:43 - March 22, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్‌కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని.. ప్రభుత్వం తక్షణమే పనుల్లో వేగం పెంచాలన్నారు. వేసవి వచ్చినందున పలు గ్రామాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయని సున్నం రాజయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అటు భద్రాచలం పట్టణంలో కూడా మంచినీటితోపాటు పలు సమస్యలు పరిష్కరించాల్సి ఉందని ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. హైదరాబాద్ లో వేతనాలు పెంచారని, 72 మున్సిపల్స్ లో కార్మికులు చాలీ చాలని జీతాలతో ఉన్నారని తెలిపారు. తగిన సమయంలో వేతనాలు పెంచుతామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ మంచి కార్యక్రమమని, 2018 నాటికి ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంక్ లు నిరుపయోగంగా ఉన్నాయని, వేసవికాలంలో మంచినీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తక్షణం పథకాలు వర్తింపచేసే విధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రానికి వచ్చే ఇబ్బందులు పడుతున్నారని, డెడ్ స్టోరేజీలో నీళ్లు ఉన్నాయని దీనిని మిషన్ భగీరథలో చేర్చాలని సూచించారు.

17:41 - March 22, 2017

హైదరాబాద్ : నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతసేపు ప్రచారంపైనే దృష్టిపెట్టిందని ఆయన విమర్శించారు. సభలో అర్థవంతమైన చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో తాగునీరు, ప్రజారోగ్యం, విద్య , వైద్యరంగాలు దెబ్బతిన్నాయని ఆయన మండిపడ్డారు. అర్థవంతమైన చర్చ జరగాలని, మంచిని స్వాగతిస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది ఆరోగ్యకరం కాదని, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదని ప్రకటనలు ఆకాశంలో ఉంటాయని..అందులో కూడా కోతలుంటాయన్నారు.

 

గోబెల్స్ ప్రచారమే - పొంగులేటి..

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ గోబెల్స్ ప్రచారం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి పేర్కొన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోవడం లేదని, తాగునీటిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పూర్తవుతుందో లేదోననే అనుమానంతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగమని కొత్తపల్లవి అందుకున్నారని విమర్శించారు.

మిషన్ భగీరథ పెద్ద స్కాం - జీవన్ రెడ్డి...

హైదరాబాద్ : మిషన్ భగీరథ పెద్ద స్కామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను ఆంధ్రా కాంట్రాక్టర్రుల దోచుకతింటున్నారని మిషన్ భగీరథలో రూ. 20 వేల కోట్లు స్కాం జరిగిందని ఆరోపించారు.

17:38 - March 22, 2017

హైదరాబాద్ : మిషన్‌ భగీరథలో ప్రభుత్వం, కాంట్రాక్టర్లు వేలకోట్లు దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఇష్టం వచ్చినట్టు అంచనాలు పెంచుకుని ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీనిపై నిజానిజాలు తేల్చేందుకే తాము హౌస్‌కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే మిషన్‌భగీరథ చేపట్టారని కోమటిరెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథలో అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని, రూ. 50 వేల కోట్ల పనుల్లో 25 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై హౌస్ కమిటీ వేయాలని, టీఆర్ఎస్ అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తానని, కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుందన్నారు. ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ నేతలు తిన్నది కక్కిస్తామన్నారు.

మిషన్ భగీరథ పెద్ద స్కాం..
మిషన్ భగీరథ పెద్ద స్కామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను ఆంధ్రా కాంట్రాక్టర్రుల దోచుకతింటున్నారని మిషన్ భగీరథలో రూ. 20 వేల కోట్లు స్కాం జరిగిందని ఆరోపించారు.

17:27 - March 22, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్‌పార్టీ భయపడతుతోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సాగు, తాగునీటి పథకాలతోపాటు పలు అభివృద్ధి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మంచి పేరు తెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్‌ నాయకలు జీర్ణించుకోలేక పోతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్త చోటు చేసుకుంది. కాపు, బీసీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాపులకే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని బీసీలు పేర్కొన్నారు. కాపు, బీసీ నేతల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. బీసీలకు మంజునాథ కమిషన్ అన్యాయం చేస్తుందంటూ ప్రజాభిప్రాయ సేకరణను బీసీ నేతలు బాయికాట్ చేశారు. మంజునాథ ముందు మాట్లాడేందుకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ప్రయత్నం చేశారు. దీనితో మంజునాథన్, సభ్యులు బయటకు వెళ్లిపోయారు.

ఈ ఏడాదిలోనే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం - బాబు..

విజయవాడ : ఉపాధి కల్పనలో భాగంగా దళిత యువతకు వాహనాల పంపిణీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏపీ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ. 30 కోట్లతో 222 క్యాబ్స్ పంపిణీ చేస్తున్నట్లు సీఎం బాబు పేర్కొన్నారు. రూ. 20 లక్షల విలువైన కార్లను రూ. 16 లక్షలకే ఇప్పిస్తున్నామని, ఈ మొత్తంలో రూ. 7 లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరించనుంది. ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో అనుసంధానిస్తామని, ఒక్కో వాహనం నుండి నెలకు రూ. 12 వేల నుండి రూ. 22 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ ఏడాదిలోనే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతోంది. కేంద్ర బిల్డింగ్ యాక్ట్ కు అనుగుణంగా చట్టసవరణ చేయనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీలో అనుసరిస్తున్న వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై కూడా చర్చించనుంది.

 

16:34 - March 22, 2017

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతోంది. మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆలస్యమైంది. ప్రస్తుతం రాజధానికి సంబంధించిన దానిపై లండన్ ప్రతినిధులు సీఎం బాబుతో భేటీ అయ్యారు. ఏపీ కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర బిల్డింగ్ యాక్ట్ కు అనుగుణంగా చట్టసవరణ చేయనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీలో అనుసరిస్తున్న వ్యూహం, ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై కూడా చర్చించనుంది.

16:19 - March 22, 2017
16:16 - March 22, 2017

హైదరాబాద్ : డ్రైవర్ నాగరాజు హత్య కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. పోలీసులపై ఐఏఎస్ అధికారి సంచలన ఆరోపణలు గుప్పించారు. యూసుఫ్‌గూడలోని సాయికళ్యాణ్ అపార్ట్‌మెంట్‌లో ఈనెల 17న జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు కుమారుడు సుకృత్ నిందితుడని, ఇందుకు ఐఏఎస్ అధికారి సహకరించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏ 2 నిందితుడిగా ఉన్న వెంకటేశ్వరరావు పోలీసులపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఇతను అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన కుమారున్ని పోలీసులకు అప్పగించడానికి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళితే తనని అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. సెటిల్‌మెంట్‌ చేసుకుంటే కేసు నుంచి తప్పిస్తామని చెప్పారని తాను ఒప్పుకోకపోవడంతో నింధితుడిగా కేసు నమోదు చేసారని అన్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన తనని మూడు రోజుల పాటు స్టేషన్లో ఉంచారని కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసు కమీషనర్ మహేందర్ రెడ్డి సైతం అవినీతికి పాల్పడుతున్నారని సంచలన వాఖ్యలు చేసారు.

16:10 - March 22, 2017

కాటేపల్లి జనార్ధన్ రెడ్డికి 5459 ఓట్లు..

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో 14,200 ఓట్లు లెక్కించారు. ఇందులో కాటేపల్లి జనార్ధన్ రెడ్డికి 5459 ఓట్లు, మాణిక్ రెడ్డికి 2171 ఓట్లు, ఏవీఎన్ రెడ్డికి 2238 ఓట్లు, హర్షవర్దన్ రెడ్డికి 1720 ఓట్లు పోలయ్యాయి.

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా కేంద్ర వ్యవహారం - ఏచూరి..

ఢిల్లీ : జీఎస్టీ లాంటి కీలక బిల్లులను మనీ బిల్లులుగా మార్చి రాజ్యసభకు రానివ్వకుండా లోక్ సభలో పెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. రాజ్యసభలో ఎదుర్కొనలేక బిల్లులను మనీ బిల్లులుగా మార్చి పార్లమెంట్ ముందుకు తీసుకవస్తున్నారని, 40 కొత్త చట్టాలను ఆర్థిక బిల్లులో తీసుకొచ్చారని తెలిపారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా కేంద్రం వ్యవహరం ఉందని పేర్కొన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు గెలుపొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

15:47 - March 22, 2017

హైదరాబాద్ : సాగునీటి రంగం కేటాయింపులపై ప్రభుత్వం నిజాలు దాస్తోందని టి.కాంగ్రెస్ పేర్కొంది. సాగునీటి రంగం పద్దుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై జానారెడ్డి మాట్లాడారు. కేటాయింపులపై ప్రతిపక్షాలకు అనుమానాలున్నాయని తెలిపారు. హౌస్ కమిటీ వేసి సభ్యుల అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. హౌస్ కమిటీ వేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీనితో సభ నుండి టి.కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

15:34 - March 22, 2017

చిత్తూరు : తిరుపతి మండలం పాతకాల్వలో విషాదం నెలకొంది. క్వారీ కుంటలో పడి తల్లి..ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై స్థానికులు కంటతడిపెట్టారు. ఆదిలక్ష్మీ అనే మహిళ తన బిడ్డలు సురేష్ (3), భార్గవి (5)లను తీసుకుని బట్టలు ఉతికేందుకు క్వారీ కుంట వద్దకు వెళ్లింది. వకుళామాత ఆలయ సమీపంలో ఈ కుంట ఉంది. సురేష్..భార్గవిలు ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు భార్గవి కుంటలో పడిపోయింది. ఇది చూసిన ఆదిలక్ష్మీ కుమార్తెను రక్షించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో కుంటలో పడిపోయిన ఆదిలక్ష్మీ, భార్గవిలు మృతి చెందారు. అమ్మా..అక్క..అంటూ ఏడుస్తూ ఏమి తెలియని సురేష్ (3) చెరువులోకి దిగిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు.

15:29 - March 22, 2017

హైదరాబాద్ : ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదని, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు లేవని మంత్రి కేటీఆర్ పేర్కొనడం పట్ల బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. తమ ప్రభుత్వం ఏరకమైన వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిన అనంతరం కేంద్రం నిధులు ఇస్తోందని స్వయంగా మంత్రులు పేర్కొన్నారని సభకు తెలిపారు. నారాయణపేట మున్సిపల్ లో డ్రింకింగ్ వాటర్ లేకున్నా ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. హైదరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారని, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో ఓ దళితుడికి 50 గజాల స్థలానికి ప్రభుత్వం ఉచితంగా పట్టా ఇచ్చిందన్నారు. 2012-13లో ప్రాపర్టీ ట్యాక్స్ 218 రూపాయలు ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం దీనిని 2838 రూపాయలకు పెంచిందంటూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ పేరిట ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.

15:25 - March 22, 2017

హైదరాబాద్ : బీజేపీ సభ్యుడు 'చింతల రామచంద్రారెడ్డి'కి చింతలు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ శాసనసభలో వెల్లడించారు. పురపాల శాఖకు సంబంధించిన పద్దుపై ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మున్సిపల్ సిబ్బందికి వేతనాలు పెంచింది తామేనని, పెంచుతామని...వారిపై తమకు ప్రేమ ఉందన్నారు. మున్సిపల్స్ పరిధిలో ఉన్న స్కూళ్ల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వంద లీటర్ల వరకు హెచ్ ఎండబ్ల్యూఎస్ సరఫరా చేస్తోందని, 40 లీటర్ల మేర పైసలు రావడం లేదని పేర్కొన్నారు. 20 లక్షల కుటుంబాలుంటే కేవలం 8 లక్షల మీటర్లున్నాయన్నారు. అపార్ట్ మెంట్స్ లకు బల్క్ సప్లయి ఉందని, ఆ మేరకు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో రివిజన్ చేయడం జరుగుతుందని, ప్రతిపక్షాలు చెప్పే సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. భద్రాచలం విషయంపై సీపీఎం సభ్యుడు సున్న రాజయ్య ప్రశ్నలు వేశారని..2011 జనాభా లెక్కల ప్రకారం 50వేల జనాభా ఉందని, 48.3 కిలో మీటర్ల పైపులైన్ వేస్తున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లతో కొత్త పైపు లైన్ వేయడం జరుగుతోందన్నారు. ఆందోళన పడాల్సినవసరం లేదన్నారు.

కాటేపల్లి జనార్ధన్ రెడ్డికి 4641 ఓట్లు..

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో 12,002 ఓట్లు లెక్కించారు. ఇందులో కాటేపల్లి జనార్ధన్ రెడ్డికి 4641 ఓట్లు, మాణిక్ రెడ్డికి 1883 ఓట్లు, ఏవీఎన్ రెడ్డికి 1975 ఓట్లు, హర్షవర్దన్ రెడ్డికి 1428 ఓట్లు పోలయ్యాయి.

టెన్త్ ఇంగ్లీష్ పేపర్ 2 లీక్..

సూర్యాపేట : హుజూర్ నగర్ లో వీవీఎం స్కూల్ లో పదో తరగతి ఇంగ్లీష్ పేపర్ 2 లీక్ అయ్యింది. పరీక్షా కేంద్రం నుండి వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని రూపావత్ బాబు అనే విద్యార్థి బయటకు పంపాడు. ప్రశ్నాపత్రంపై ఉన్న కోడ్ ఆధారంగా విద్యార్థినిని డీఈవో, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాన్ని తనూజ స్కూల్ కు పంపినట్లు విద్యార్థి వెల్లడించాడు. విద్యార్థి ఇచ్చిన సమాచారంతో తనూజ స్కూల్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రశ్నాపత్రానికి జవాబులు రాస్తున్న విద్యాధికారులు, తనూజ స్కూల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రేపు ఢిల్లీకి బాబు..

హైదరాబాద్ : రేపు సాయంత్రం 5గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపుఏ సీఎన్ జీసీ టీవీ 18 బిజినెస్ లీడర్స్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

టిటిడి విజిలెన్స్ సిబ్బంది దాడి..భక్తుడు మృతి..

చిత్తూరు : తిరుమల విజిలెన్స్ సిబ్బంది దాడిలో గాయపడిన భక్తుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం సర్వదర్శనం క్యూ లైన్ లో నిలబడిన పద్మనాభం అనే భక్తుడిపై దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మనాభం మంగళవారం మృతి చెందాడు. ఇద్దరు విజిలెన్స్ సిబ్బంది, ఎస్పీఎఫ్ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

14:37 - March 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మున్న వారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం సాగునీటి పద్దులపై చర్చ జరిగింది. మిషన్ భగీరథపై సభ సంఘం వేయనందుకు గాను కాంగ్రెస్ వాకౌట్ చేసింది. వాకౌట్ చేయడంపై మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. స్వచ్చమైన నీటిని అందిస్తామని, అందించకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా స్వచ్చమైన నీటిని అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని తెలుసుకోవడానికి అనేక రాష్ట్రాలు ఇక్కడకు రావడం జరుగుతోందని, ప్రశంసిస్తుంటే ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

14:35 - March 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం..అధికార పక్షం మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం మధ్యాహ్నం సాగునీటి పద్దులపై చర్చ జరిగింది. ఈసందర్భంగా టి.కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. దీనిపై మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి కాదు..ఐదు సార్లు మైక్ తీసుకుంటే ఎలా హరీష్ రావు ప్రశ్నించారు.
చెప్పిందే..చెప్పి ఐదారు సార్లు క్లారిఫికేషన్ అడగడం..స్పీకర్ ను డిక్టేట్ చేయడం సరికాదన్నారు. ఎల్ వోపీ స్పందించి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. అనంతరం దీనిపై టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మాట్లాడారు. ఎక్స్ పర్ట్ వారితో ఓ కమిటీ వేయించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు తరువాత కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి మాట్లాడారు. తాము వాకౌట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

14:29 - March 22, 2017

విశాఖపట్నం : ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. దీనితో సరదాగా గడుపుదామని పలువురు విద్యార్థులు విహార యాత్రలకు..ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇలాగే వెళ్లిన విద్యార్థులు అనంతలోకాకి వెళ్లిపోయారు. దీనితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జోడుగుళ్ల పాలెం తీర ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన ఇంటర్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. పీఎంపాలెం ప్రాంతానికి చెందిన అమృత, కల్యాణ్‌గా వారిని గుర్తించారు. అమృత మృతదేహం ఒడ్డుకు చేరుకోగా..కల్యాణ్‌ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

14:24 - March 22, 2017

విజయవాడ : గుణదల ఏపీ ట్రాన్స్‌కో సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయం ఆవరణలో ఉన్న కేబుల్స్‌ కాలి.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన నివేదికలు ఇవ్వలేదని తెలుస్తోంది. పవర్ హౌస్ లో కేబుల్స్ డంప్ చేయడం జరుగుతోంది. కేబుల్స్ విషయంలో కుంభకోణం జరిగినట్లు, ఆ విషయం బయటకు రావద్దని యోచించే వాటిని తగులబెట్టే ప్రయత్నం చేశారని సమాచారం. నష్టం ఎంతుంటదనే విషయం తెలియడం లేదు. అగ్నిప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

14:22 - March 22, 2017

హైదరాబాద్ : హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌ కొనసాగుతోంది. జనార్ధన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పీఆర్‌టియు అభ్యర్థి కాటపల్లి జనార్ధన్‌రెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లో 35-45 శాతం జనార్ధన్ రెడ్డికి ఓట్లు వచ్చినట్లు సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో 14వేలు పూర్తయ్యాయి. ఇంకా 5వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. మొత్తంగా 19,600 పోలయ్యాయి. 9800 ఓట్లు వస్తేనే వారు విజేతలుగా ప్రకటిస్తారనే విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో ఎవరికీ మెజార్టీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు తెలియరావడం లేదు.

అమరావతిలో హైకోర్టు..

ఢిల్లీ : అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. నూతన భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైకోర్టు అంశాన్ని తోట నర్సింహం ప్రస్తావించారు. తోట నర్సింహం ప్రశ్నకు రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగతంగా ఇద్దరు సీఎంలతో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు.

అసెంబ్లీలో నన్నపనేని..యనమల సరదా సంభాషణ..

విజయవాడ : ఏపీ అసెంబ్లీకి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వచ్చారు. రెండు సభల్లోనూ కూర్చొనేందుకు చోటు లేకుండా పోయిందని, ఐదేళ్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చినా సభలో మాట్లాడితే ఆ తృప్తే వేరని నన్నపనేని వ్యాఖ్యానించారు. అప్పుడే అక్కడకు వచ్చిన యనమల నన్నపనేనితో మాట్లాడారు. మీకిక్కడేం పని అంటూ సరదాగా చమత్కరించారు. నోరున్న వాళ్లు సభలో ఉంటే బాగుండేదని నన్నపనేని చమత్కరించడంతో యనమల నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

 

ఏపీ ట్రాన్స్ సబ్ డివిజన్ ఆఫీసులో ఫైర్ ఆక్సిడెంట్..

విజయవాడ : గుణదల ఏపీ ట్రాన్స్ సబ్ డివిజన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్స్ కాలుతుండడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

 

ఏపీ ట్రాన్స్ సబ్ డివిజన్ ఆఫీసులో ఫైర్ ఆక్సిడెంట్..

విజయవాడ : గుణదల ఏపీ ట్రాన్స్ సబ్ డివిజన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్స్ కాలుతుండడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

కొనసాగుతున్న టి. ఎమ్మెల్సీ కౌంటింగ్..

హైదరాబాద్ :తెలంగాణ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ - మహబూబ్ నగర్ - రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. కాటపల్లి జనార్ధన్ రెడ్డి (పీఆర్ టియూ) స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 

14:00 - March 22, 2017

హైదరాబాద్ : గత ప్రభుత్వాలు ప్రాజెక్టులకు భూసేకరణ చేయలేదనడం సరికాదని కాంగ్రెస్ జానారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సాగునీటిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భూసేకరణ వల్లే ప్రాజెక్టు పనులు సాగుతున్నాయన్నాయని తెలిపారు.  

 

13:54 - March 22, 2017

సినిమాల్లో 'ఎల్బీ శ్రీరాం' తెలియని వారుండరు. ఎందుకంటే ఆయా సినిమాల్లో తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. మరి ఆయన 'పక్షి' తీర్థం పుచ్చుకోవడం ఏంటీ ? పక్షి అని ఏదైనా పార్టీ పెట్టారా ? లేక దానిపేరు మీదున్న పార్టీలో చేరారా ? అని అనుకోకండి. రచయితగా పరిశ్రమలోకి వచ్చి, తరువాత 'చాలాబాగుంది' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యి పాతికేళ్లకు పైగా సినిమా పరిసమలో కొనసాగుతున్నాడు ఎల్బీ శ్రీరాం. ఇటీవలే ఆయన ఎల్ బి క్రియేషన్స్ బ్యానర్ పై షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతా తెరిచారు. ‘పక్షి' తీర్థం అంటే ట్విట్టర్ ఖాతా తెరిచారని అర్థం. మార్చి 18న ట్విట్టర్ ఖాతా తెరిచిన ఎల్బీ శ్రీరామ్.. తనదైన రచనా శైలిలో ట్వీట్ చేశారు. ‘'ఇ-ప్పు-డే' కొత్త రెక్కలతో 'L'B-oard పెట్టుకుని ఈ 'పక్షి'తీర్థానికి ఒచ్చేను వసంతానికి ముందే ""కో"" అని కూస్తూ.....!!’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొంతమంది ట్విట్టర్ యూజర్లు స్వాగతం పలికారు. మరికొంతమంది ఫన్నీగా ట్వీట్ చేశారు.

13:47 - March 22, 2017

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు ఏదో ఒక పనిలో బిజీ బిజీగా గడుపుతూ ఉండేస్తుంటాం. ముఖ్యంగా మహిళలు ఇంటి పని..బయటపనితో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. పనుల విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పని తొందరగా అయిపోతుంది. వంటింట్లో సామాగ్రీ విషయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు..మీ కోసం...

 • వంటింట్లో నూనె ఒలికిపోయిందా ? వెంటనే ఆ ప్రాంతంలతో మైదా పిండి చల్లాలి.
 • క్యాబేజీ ఉడికించే సమయంలో వాసన వస్తోందా ? వాసన పోవాలంటే చిన్న అల్లం ముక్క వేసి చూడండి.
 • కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
 • ఇంగువ నిల్వ చేసే డబ్బాలో ఒక పచ్చిమిరపకాయ వేయడం వల్ల తాజాగా ఉంటుంది.
 • గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పువేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.
 • వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు వేసి చూడండి.
 • కిచెన్ ను ఎంత కడిగినా ఈగలు పోకపోతే పసుపు నీటితో శుభ్రం చేసి చూడండి.
 • పకోడీలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాకయి.
 • పట్టుచీరలు ఉతికేటప్పుడు బకెట్‌లో కొంచెం నిమ్మరసం వేయడంవల్ల రంగు పోవు.
13:45 - March 22, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర మైకుల కోసం అధికార, విపక్ష సభ్యులు పోటీపడ్డారు. చెవిరెడ్డి మాట్లాడుతుండగా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి..మైకు కావాలన్నారు. దీంతో చెవిరెడ్డి, పల్లె మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభ లోపల, బయట మాట్లాడకుండా టీడీపీ సభ్యులు ప్రతిపక్షాన్ని అడ్డుకుంటున్నారని చెవిరెడ్డి ఆక్రోశం వ్యక్తం చేశారు.  

 

13:40 - March 22, 2017

గుంటూరు : వ్యర్థ జలాలను శుద్ధి చేయకపోతే చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ జలదినోత్సవ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో జల సంరక్షణపై సీఎం మాట్లాడారు. సింగపూర్‌ లాంటి దేశాల్లో వ్యర్థజలాలను తాగునీరుగా మారుస్తున్నారని చెప్పారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. 

 

13:34 - March 22, 2017

‘నిఖిల్' జోరు మీదున్నాడు. వరుసగా సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటుండడంతో ఆచితూచి అడుగేస్తున్నాడు. 'శంకరాభరణం' అనంతరం విడుదలైన ''ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. 'స్వామిరారా' ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కేశవ' సినిమాలో 'నిఖిల్' వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ మూవీకి 'పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు' అనే ట్యాగ్ లైన్ ని తగిలించారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ అందర్నీ ఆకట్టుకొంటోంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న ‘నిఖిల్’ హత్యలు చేస్తూ టీజర్ కనిపిస్తుండడంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. 'భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.. వైప్లవ్య గీతాన్ని నేను.. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం.. అనల వేదిక ముందు అస్ర నైవేద్యం' అంటూ శ్రీశ్రీ చెప్పిన వాక్యాలతో ఈ టీజర్ ప్రారంభమైంది. గత చిత్రాలతో పోలిస్తే ‘నిఖిల్’ కు ఈ సినిమా విభిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. హీరో ఆవేశపడితే అతని ప్రాణాలకే ప్రమాదం...అలాంటి పరిస్థితుల్లో ఆయన శత్రువులపై ఎలా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. నిఖిల్ సరసన రీతూ వర్మ నటిస్తోంది.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈమేరకు స్పీకర్ అసెంబ్లీని గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు : వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతారణంలో చర్చ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. నినాదాల మధ్య ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

13:13 - March 22, 2017

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ 'రజనీకాంత్' తో నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకుంటుంటారు. అలాంటి ఛాన్స్ కొంతమందికి మాత్రమే వస్తుంది. తాజాగా 25 ఏళ్ల తరువాత అలనాటి హీరోయిన్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు 'ఖుష్బూ'....’కబాలి' లాంటి డిజాస్టర్ ఇచ్చిన పా.రంజిత్ తోనే 'రజనీ' మరో సినిమా చేయనున్నాడని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్ర పోషించనుందని సోషల్ మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. 1988లో 'ధర్మాతినై తలైవన్' సినిమాలో 'రజనీ'తో 'ఖుష్బూ' నటించారు. ముంబై బ్యాక్ డ్రాప్ అంటే మళ్లీ మాఫియా రిలేటెడ్ స్టోరీనే అయి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. గతంలో పలు హిట్ చిత్రాలలో నటించిన వీరిద్దరూ ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నారు. అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించలేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం 'రజనీకాంత్' శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో 2.0'లో నటిస్తున్నారు.

13:03 - March 22, 2017

‘రాజు గారి గది' చిత్రం గుర్తుండే ఉంటుంది కదా. చిన్న చిత్రమైనా ఘన విజయం సాధించింది. దర్శకుడు ఓంకార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. చిత్ర మూడో షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. సుమారు ఇరవై రోజుల పాటు చిత్ర షూటింగ్ జరగనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ‘నాగార్జున' ది వైవిధ్యమైన పాత్ర పోషించనున్నట్లు టాక్. ఇందులో 'సమంత' కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. సీఎం ప్రసంగానికి అడ్డుపడడం సరికాదని స్పీకర్ హితవుపలికారు. 

 

12:57 - March 22, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. సీఎం ప్రసంగానికి అడ్డుపడడం సరికాదని స్పీకర్ హితవుపలికారు. ప్రతి రోజూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సభ్యుల ప్రవర్తన ఇలాగే ఉంటే చర్యలు తీసుకోక తప్పదన్నారు. పోడియం వద్ద ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

12:46 - March 22, 2017

అయోధ్యలో రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని వక్తలు తెలిపారు. న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, బీజేపీ నాయకురాలు రవళి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. సుప్రీంకోర్టు వెలుపల తేల్చుకోవాలనడం సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఈ ఏడాది చిత్తూరు నగరానికి నీళ్లు ఇస్తాం : సీఎం చంద్రబాబు

గుంటూరు : రాయలసీమకు 140 టీఎంసీల నీళ్లిచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. చిత్తూరు నగరానికి ఈ ఏడాది నీళ్లు ఇస్తామని చెప్పారు. 

మైక్ కట్ చేయడం పట్ల వైసీపీ ఆందోళన

గుంటూరు : జగన్ కు మైక్ ఇవ్వకపోవడంపై వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. పదే పదే మైక్ కట్ చేయడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద సభ్యుల నినాదాలు చేశారు. సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.

12:39 - March 22, 2017
12:37 - March 22, 2017

గుంటూరు : రాయలసీమకు 140 టీఎంసీల నీళ్లిచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు 140 టీఎంసీల నీళ్లిచ్చామని తెలిపారు. చిత్తూరు నగరానికి ఈ ఏడాది నీళ్లు ఇస్తామని చెప్పారు. 

12:32 - March 22, 2017

గుంటూరు : జగన్ కు మైక్ ఇవ్వకపోవడంపై వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. పదే పదే మైక్ కట్ చేయడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద సభ్యుల నినాదాలు చేశారు. సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు. 

 

12:27 - March 22, 2017

గుంటూరు : సభలో అసత్యాలు మాట్లాడడం జగన్ కు ఆనవాయితీగా మారిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. వాస్తవాలను అంగీకరించాలని చెప్పారు. 

 

12:23 - March 22, 2017

గుంటూరు : రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వాస్తవాలు వక్రీకరిస్తోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీ అరకొరగా చెల్లిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ ఇవ్వనందుకే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 

 

12:18 - March 22, 2017

గుంటూరు : రైతులకు ఇచ్చే పరిహారంలోనూ ఎగనామం పెడుతున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఈ ఏడాది దేశంలో 12602 మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు. ఒక్క ఏపీలోనే 916 మంది రైతులు చనిపోయారని తెలిపారు.
 

12:06 - March 22, 2017

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ వి కాకి లెక్కలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. ఇన్ ఫుడ్ సబ్సిడీ పై జగన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. సభలో అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని...ఏదీ, ఎప్పుడు మాట్లాడాలో జగన్ కు తెలియదన్నారు. ఎవరు, ఏది చెబితే అడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని రైతు సంక్షేమ రాష్ట్రంగా చేస్తామని స్పష్టం చేశారు. 

 

12:00 - March 22, 2017

గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 సం.లు లోపే 1546 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పెద్ద మొత్తంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీ బకాయిలపై హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. రైతుల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

 

11:50 - March 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో సమయం కేటాయింపుపై చర్చ జరిగింది. సభలో తమకు తగిన సమయం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. 

ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన వైఎస్సార్ సర్కార్ : కాల్వ

గుంటూరు : ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన చరిత్ర వైఎస్సార్ సర్కార్ ది అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈ ఏడాది రూ.1762 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. 

రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ సరిగ్గా ఇవ్వడం లేదు : జగన్

హైదరాబాద్ : రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ సరిగ్గా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. అనంతరం మంత్రి పత్తపాటి పుల్లారావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపే 1546 కోట్ల ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇచ్చిందని అన్నారు. పెద్దమొత్తంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నామని తెలిపారు.

11:44 - March 22, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ఇన్ ఫుట్ సబ్సిడీ పై వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2013..14 సంవత్సరానికి 2300 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. ఇప్పటివరకు రూ. 8 వేల కోట్లకు కేవలం రూ.1500 కోట్లు ఇచ్చారని తెలిపారు. 
 

11:38 - March 22, 2017

గుంటూరు : ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన చరిత్ర వైఎస్సార్ సర్కార్ ది అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈ ఏడాది రూ.1762 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. 

 

11:24 - March 22, 2017

హైదరాబాద్ : రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ సరిగ్గా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. అనంతరం మంత్రి పత్తపాటి పుల్లారావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపే 1546 కోట్ల ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇచ్చిందని అన్నారు. పెద్దమొత్తంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నామని తెలిపారు. 

 

11:02 - March 22, 2017

ప్రజల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత, పాదయాత్ర బృందం సభ్యుడు శోభన్ నాయక్ అన్నారు. ఇవాళ్టి జనపథంలో శోభన్ తో పాటు ఆయన సతీమణి విజయకుమారి పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి పాదయాత్ర నిర్వహించామని చెప్పారు. 'ఇవాళ్టి 10టీవీ జనపథానికి ఒక విశిష్ట అతిథి హాజరయ్యారు. చిన్న వయస్సుల్లోనే పెద్ద రికార్డు సృష్టించిన పాదయాత్రికుడు శోభన్ నాయక్ ఇవాళ్టి జనపథంలో తన అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శోభన్  హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శోభన్ రెండేళ్ల పాటు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శోభన్ ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ కేంద్ర కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. గిరిజన సంఘం నిర్మాణంలోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న శోభన్ రెండు సార్లు జైలు జీవితం కూడా గడిపారు. తెలంగాణలో 154 రోజుల పాటు సాగిన మహాజన పాదయాత్ర బృందంలో ఒకరైన శోభన్ ఇవాళ్టి జనపథంలో తన అనుభవాలు పంచుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

10:49 - March 22, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. వైసీపీ సభ్యుల సభ నుంచి వాకౌట్ చేశారు. 

అగ్రిగోల్డు బాధితుల సమస్యను పరిష్కరించాలి : వైసీపీ నేతలు

హైదరాబాద్ : అగ్రిగోల్డు బాధితుల సమస్యను పరిష్కరించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన్నారు. 

కొనసాగుతున్న టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌

హైదరాబాద్ : రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌ కొనసాగుతోంది. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో 28 టేబుళ్లపై కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ కౌంటింగ్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్‌ పర్యవేక్షణలో కొనసాగుతోంది. 

 

10:35 - March 22, 2017
10:34 - March 22, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో 28 టేబుళ్లపై కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ కౌంటింగ్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్‌ పర్యవేక్షణలో కొనసాగుతోంది. 

 

10:29 - March 22, 2017

హైదరాబాద్ : అగ్రిగోల్డు బాధితుల సమస్యను పరిష్కరించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన్నారు. 

09:38 - March 22, 2017

కాసేపట్లో టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాలు సభలో పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ను కలిసే యోచనలో ఉన్నారు. 

09:35 - March 22, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విపక్షాలు సభలో పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ను కలిసే యోచనలో ఉన్నారు. 

09:27 - March 22, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు.  

ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజు ప్రారంభం అయ్యాయి. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. 

వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టు

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజు ప్రారంభం అయ్యాయి. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు.  

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజు ప్రారంభం అయ్యాయి. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు.  

 

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఇవాళ ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ రోజు వివిధ బడ్జెట్‌ పద్దులను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. ప్రశ్నోత్తరాల్లో వైద్యారోగ్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమంపై చర్చ
జరుగనుంది. మండలిలో కరవు, వైద్యారోగ్యశాఖపై లఘు చర్చ చేపట్టనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో అక్రమ మద్యం అమ్మకం, క్రీడల అభివృద్ధి, డ్వాక్రా రుణాలపై చర్చ నిర్వహించనున్నారు. మండలిలో బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుది. 

08:54 - March 22, 2017

గుంటూరు : ఇవాళ ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ రోజు వివిధ బడ్జెట్‌ పద్దులను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. ప్రశ్నోత్తరాల్లో వైద్యారోగ్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమంపై చర్చ
జరుగనుంది. మండలిలో కరవు, వైద్యారోగ్యశాఖపై లఘు చర్చ చేపట్టనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో అక్రమ మద్యం అమ్మకం, క్రీడల అభివృద్ధి, డ్వాక్రా రుణాలపై చర్చ నిర్వహించనున్నారు. మండలిలో బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుది. 

 

ఏపీలో వెలువడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసి ఉన్న  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై 3,500 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులరెడ్డి నెగ్గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవ్‌  గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మపై  9,215 ఓట్ల మెజార్టీతో మాధవ్‌ నెగ్గారు. మాధవ్‌కు 48,499 ఓట్లు వచ్చాయి.

08:50 - March 22, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసి ఉన్న  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై 3,500 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులరెడ్డి నెగ్గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవ్‌  గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మపై  9,215 ఓట్ల మెజార్టీతో మాధవ్‌ నెగ్గారు. మాధవ్‌కు 48,499 ఓట్లు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిసివున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి  మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైసిపి అభ్యర్థి గోపాల్‌రెడ్డి 14,146 ఓట్ల తేడాతో ప్రత్యర్థి కేజేరెడ్డిపై విజయం సాధించారు.  
---

08:41 - March 22, 2017

చిత్తూరు : తిరుమలలో నకిలీ బ్రేక్‌ దర్శనం టికెట్ల కుంభకోణం వెలుగుచూసింది. టీటీడీ సూపరింటెండెంట్‌ ధర్మయ్య సహకారంతో.. కొందరు దళారులు... నకిలీ వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు రూపొందించి విక్రయించారు. విషయాన్ని పసిగట్టిన పోలీసులు సిబ్బంది..  సూపరింటెండెంట్‌ ధర్మయ్యతో పాటు... 9 మంది దళారీలను అరెస్టు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

 

08:39 - March 22, 2017

కృష్ణా : విజయవాడ యనమలకుదురులో  దారుణం జరిగింది. అక్కతో కలసి కన్న కొడుకుని దారుణంగా హింసించింది కన్నతల్లి. 6 ఏళ్ల బాలుడు రాజ్ కుమార్ ను కడ్డీతో కాల్చి విచక్షణా రహితంగా వాతలు పెట్టింది. బాలుడు విపరీతంగా బాధ పడుతున్నా... మూడు రోజులుగా గదిలో నిర్బంధించింది. కాలిన తీవ్రగాయాలతో బాలుడు అంగన్ వాడి కేంద్రానికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నవజీవన్ బాలభవన్ ప్రతినిధుల సహకారంతో  అంగన్ వాడి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాలుడిని ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు. బాలుడిని హింసించిన తల్లి శైలజ, ఆమె అక్క భవానీపై కేసు నమోదు చేశారు. 

 

08:37 - March 22, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి సమస్య రాలేదని, అయితే ఈ పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. లోక్ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ బ్రిటిష్‌ సంప్రదాయాలకు స్వస్తి పలికారని మోదీని కొనియాడారు. బడ్జెట్‌లో ఎన్నో సానుకూల అంశాలున్నాయని, సంక్షేమ పథకాలకు ఈ సారి నిధులు పెంచారని కవిత అన్నారు. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

 

08:35 - March 22, 2017

గుంటూరు : నలభై ఏళ్ల తన రాజకీయ చరిత్రలో వైసీపీ అంత దివాళాకోరుపార్టీని ఇంతవరకూ చూడలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు శాసనసభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల  మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 
వైసీపీ సభ్యులపై చంద్రబాబు, యనమల ఆగ్రహం 
బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులపై సీఎం  చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన రాజకీయ చరిత్రలో వైసీపీ అంత దివాళాకోరుపార్టీని ఇంతవరకూ చూడలేదంటూ సీఎం చంద్రబాబు శాసనసభలో ఫైర్ అయ్యారు.. విపక్ష సభ్యులకు అసెంబ్లీ అంటే గౌరవంలేదని... స్పీకర్‌ అంటే గౌరవంలేదని మండిపడ్డారు..గొడవపెట్టుకునేందుకే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారని... చంద్రబాబు ఆరోపించారు.. మంత్రి యనమల  ప్రసంగం తర్వాత అవినీతిపై చర్చకు తాము సిద్ధమని.... మీరు సిద్ధమా అంటూ వైసీపీకి చంద్రబాబు సవాల్‌ విసిరారు.            
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అధికారులు జైలుకు ఎందుకెళ్లారు : అచ్చెన్నాయుడు 
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అధికారులు జైలుకు ఎందుకు వెళ్లారో జగన్ చెప్పాలని మంత్రి  అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 15 నెలల జైలు జీవితం గడిపిన చరిత్ర జగన్‌ది అని.. సోనియా గాంధీ  కాళ్లు పట్టుకోకపోతే జగన్‌కు బెయిలు వచ్చేదా..? అని ప్రశ్నించారు. 
పాలక పక్షం ఆరోపణలపై దీటుగా జగన్‌ సమాధానం 
పాలక పక్షం ఆరోపణలపై.. విపక్ష నేత జగన్‌ దీటుగానే సమాధానమిచ్చారు. తాను 43వేల కోట్ల అవినీతి చేశానంటున్నారని.... ఇందులో పదిశాతం ఇస్తే తాను ఎక్కడ సంతకం  పెట్టమంటే అక్కడ పెడతానంటూ సవాల్‌ విసిరారు..
జగన్‌, యనమల మధ్య ఆసక్తికర చర్చ 
ఇదిలా ఉండగా బడ్జెట్‌పై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు యనమల సమాధానమిస్తున్న సమయంలో వైఎస్ జగన్‌- యనమల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. యనమల సమాధానమిస్తున్న సమయంలో  జగన్ బయటకు వెళ్లారు. దీనిపైనా యనమల సెటైర్లు వేశారు. జగన్‌ కూడా అంతేస్థాయి తీవ్రతతో బదులిచ్చారు. మొత్తమ్మీద ఏపీ అసెంబ్లీ,  అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హోరెత్తి పోయింది. బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు సమాధానం అనంతరం, స్పీకర్‌ శివప్రసాదరావు, సభను బుధవారానికి వాయిదా వేశారు. 

 

08:26 - March 22, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించనున్నట్టు తెలిపింది. అటు భూదాన్‌ బోర్డు చట్టంలో సవరణలకూ మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 9మంది సభ్యులతో కొత్త భూదాన్‌ బోర్డును ఏర్పాటు చేసింది. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, ఆవిర్భావ దినోత్సవంపైనా కేబినెట్‌లో చర్చించారు. 
కీలక అంశాలపై చర్చించిన కేబినెట్‌
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  గతంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం ఉండేది. దాని స్థానంలో ప్రభుత్వం అభివృద్ధి నిధి బిల్లును తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. దీనికి చట్టరూపం తీసుకువచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఈ సంవత్సరం మిగిలిపోయిన  సబ్‌ప్లాన్‌ నిధులను వచ్చే సంవత్సరం కూడా ఖర్చు చేయాలని సీఎం ఆదేశించారు.  ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లును అభ్యుదయ, ప్రగతిశీల అంశాలతో  రూపొందించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు.
భూదాన్‌ బోర్డు చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదముద్ర
భూదాన్‌ బోర్డు చట్ట సవరణకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.  ఎంతమందైనా కమిటీలో ఉండేలా భూదాన్‌ బోర్డు చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. 9మంది సభ్యులతో కొత్త భూదాన్‌ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.  భూముల రక్షణకు తహసీల్దార్లను  కమిటీలో చేర్చారు.  నిరుపయోగ భూములన్నీ భూదాన్‌ బోర్డుకే వర్తించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  సంస్థలు లాభాల్లో ఉంటే సభ్యులకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా  ఓ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది.  దీనికి కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, ఆవిర్భావ దినోత్సవంపై చర్చ
టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు, ప్లీనరీ నిర్వహణపైనా మంత్రిమండలిలో చర్చించారు. ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకన్నా ముందే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరుగనుంది.  పార్టీ అధ్యక్ష ఎన్నికతోపాటు వివిధ అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. పలు తీర్మానాలు ఆమోదించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై వరంగల్‌లో జరిగే బహిరంగసభ ద్వారా ప్రజలకు సంపూర్ణ సందేశం ఇవ్వాలని కేసీఆర్‌ మంత్రులకు సూచించారు. బహిరంగ సభ, ప్లీనరీ ఏర్పాట్లు చూడాలని పార్టీ శ్రేణులను కేసీఆర్‌ ఆదేశించారు.

 

హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌ ప్రారంభం

హైదరాబాద్ : రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌ ప్రారంభం అయింది. అధికారులు కౌటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌటింగ్ కోసం.. అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12మంది అభ్యర్ధులు పోటిప‌డుతున్న ఈ ఎన్నిక‌లో ఫోటోల మార్ఫింగ్‌తో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. 

08:20 - March 22, 2017
08:16 - March 22, 2017

హైదరాబాద్‌ : నగరంలోని హుమాయున్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మైరాజ్‌ అనే ఓ ప్రైవేటు డాక్టర్‌ను తన సొంత బావమరిది కత్తితో నరికి చంపారు. మైరాజ్‌ మెడికల్‌ అండ్‌ కాడియో క్లినిక్‌లో విధులు  నిర్వహిస్తున్న డాక్టర్‌ మైరాజ్‌పై సొంత బామ్మర్ధి అజీజ్‌తో పాటు మరికొంతమంది దుండగులు ఆసుపత్రిలోకి చొరబడి డాక్టర్‌పై కత్తులతో దాడిచేశారు. దీంతో కత్తిపోట్లకు తీవ్రగాయాలైన డాక్టర్‌ మైరాజ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే డాక్టర్‌పై దాడిచేసిన అనంతరం నేరుగా హుమాయున్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. అయితే సొంతబామరిది అజీజే ఈ ఘాతుకానికి పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మైరాజ్‌ మూడో వివాహం చేసుకున్నాడన్న  కోపంతో అతతినిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. 

 

కాసేపట్లో హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌

హైదరాబాద్ : కాసేపట్లో హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌ ప్రారంభం కానుంది. అధికారులు కౌటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌటింగ్ కోసం.. అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12మంది అభ్యర్ధులు పోటిప‌డుతున్న ఈ ఎన్నిక‌లో ఫోటోల మార్ఫింగ్‌తో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. 

08:09 - March 22, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 12మంది అభ్యర్ధులు పోటిప‌డుతున్న ఈ ఎన్నిక‌లో ఫోటోల మార్ఫింగ్‌తో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. బుధవారం జరిగే కౌటింగ్ కోసం.. అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
ఓటు హ‌క్కు వినియోగించుకున్న 19,624 మంది 
హైద‌రాబాద్ రంగారెడ్డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. మొత్తం 23,789 మంది ఓటర్లు ఉండ‌గా.. 19,624 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఓటర్లు... నోటాకు మొద‌టి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థుల‌కు ఇత‌ర ప్రాధాన్యత‌లు ఇస్తే అలాంటి ఓట్లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు. 
అంబ‌ర్ పేట్‌లోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్  
అంబ‌ర్ పేట్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉద‌యం 8గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకు అనుగుణంగా అధికారులు మాక్ కౌంటింగ్ నిర్వహించారు. కౌటింగ్ కోసం మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొద‌టి ప్రాధాన్యత క్రమంలో గెలుపు ఫైన‌ల్ కాకుంటే ఇబ్బందులు రాకుండా 3 షిఫ్ట్‌ల‌కు కౌంటింగ్ సిబ్బందిని రెడీ చేశారు. ఒక్కో షిఫ్ట్‌కు 30 మంది కౌంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌లు, 90 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌ల‌ను నియమించారు. ప్రతి టేబుల్ వ‌ద్ద న‌లుగురు అధికారులు ఉంటారు. 
ఒక్క పోస్టల్ బ్యాలెట్ రాలేదు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మొద‌ట లెక్కించాల్సి ఉన్నప్పటికి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాలేదు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి అభ్యర్థి నుంచి ఒక్కో టేబుల్ కు ఒక్కో ఏజెంట్ కు అవ‌కాశం క‌ల్పిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.  

 

08:02 - March 22, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసి ఉన్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై 3,500 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులరెడ్డి నెగ్గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవ్‌  గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మపై  9,215 ఓట్ల మెజార్టీతో మాధవ్‌ నెగ్గారు. మాధవ్‌కు 48,499 ఓట్లు వచ్చాయి.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిసివున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి  మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఫలితం వెలువడాల్సి ఉంది. అనంతపురంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి  12 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 

రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

అనంతపురం : రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో మూడో ప్రాధాన్యత ఓట్ల ఎక్కింపు ప్రారంభించారు. వైసీపీ అభ్యర్థి విజయానికి 1500 ఓట్ల దూరంలో ఉన్నారు. 

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ గెలుపు

విశాఖ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ...టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్ గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మపై 9215 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ప్రైవేట్ వైద్యుడు దారుణ హత్య

హైదరాబాద్ : హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలో ప్రైవేట్ వైద్యుతు మిరాజ్ దారుణ హ్యతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చొరబడిన దుండగులు మిరాజ్ ను నరికి చంపారు. 
 

ప్రైవేట్ వైద్యుడు దారుణ హత్య

హైదరాబాద్ : హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలో ప్రైవేట్ వైద్యుతు మిరాజ్ దారుణ హ్యతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చొరబడిన దుండగులు మిరాజ్ ను నరికి చంపారు. 
 

Don't Miss