Activities calendar

23 March 2017

21:31 - March 23, 2017

ఢిల్లీ: బ్రిటీష్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దాడికి సంబంధించిన వివరాలను ఉగ్ర సంస్థకు చెందిన అధికారిక ప్రెస్ సర్వీసు ద్వారా ఐసిస్ వెల్లడించింది. అంతకు ముందు బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఉగ్రదాడి గురించి ప్రధాని థెరిసా మే మాట్లాడారు. పార్లమెంటుపై దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో హతమైన దుండగుడు బ్రిటన్‌లో జన్మించిన వ్యక్తేనని తెలిపారు...అతడు అంతర్జాతీయ ఐసిస్‌ ఉగ్రవాదంతో ప్రేరేపితుడై ఒక్కడే దాడికి దిగినట్లు విశ్వసిస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈ విషయం ఇంటిలిజెన్స్‌ వర్గాలకు ముందే తెలుసన్నారు. బ్రిటన్‌ పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్ట్‌ చేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌పై బుధవారం జరిగిన ఉగ్ర దాడిలో దుండగుడితో సహా ఐదుగురు మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.

21:30 - March 23, 2017

ఢిల్లీ : బిజెపి నేతలు ఎదుర్కొంటున్న బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 6కు వాయిదా వేసింది. బిజెపి సీనియర్‌ నేతలు అద్వాని, కళ్యాణ్‌సింగ్‌, మురళీమనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కటియార్‌ సహా 13 మంది నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ, అద్వానితో సహా అన్ని పక్షాలు లిఖితపూర్వక నివేదికలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాంకేతిక కారణాలతో 13 మంది బిజెపి నేతలపై ఉన్న కేసులను తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

21:26 - March 23, 2017

ఢిల్లీ: విమానంలో సీటు కోసం శివసేన ఎంపీ రవీంద్ర గాయక్‌వాడ్‌ దాదాగిరి చేశాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా సిబ్బందితో గొడవపడుతూ వీరంగం సృష్టించాడు. ఆగ్రహంతో ఎయిర్‌ ఇండియా అధికారిని ఒకటి కాదు రెండు కాదు 25 సార్లు చెప్పుతో కొట్టాడు. పైగా తాను చేసిన పనిని ఎంపీ సమర్థించుకున్నాడు. తనపట్ల అతడు దురుసుగా వ్యవహరించడం వల్లే చెప్పుతో కొట్టానని రవీంద్రగాయక్‌వాడ్‌ తెలిపాడు. తాను బిజినెస్‌ టికెట్‌ తీసుకోగా...ఎకానమీ క్లాస్‌ సీటు ఇచ్చారని, ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించాడు. ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా విచారణకు ఆదేశించింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ నుంచి గైక్వాడ్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

21:23 - March 23, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్‌కె నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నాడిఎంకే పార్టీలోని రెండు వర్గాలకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించింది. శశికళ వర్గానికి టోపీ గుర్తు , పన్నీర్‌సెల్వం వర్గానికి రెండు విద్యుత్‌ స్తంభాల గుర్తును కేటాయించింది. రెండు వర్గాలకు వేర్వేరు పార్టీ పేర్లను కూడా ఈసీ ప్రకటించింది. శశికళ వర్గానికి 'అన్నాడిఎంకె అమ్మ' పార్టీ , పన్నీర్‌ సెల్వం వర్గానికి 'అన్నాడిఎంకే పురిట్చితలైవి అమ్మ' పార్టీగా పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల్లో అన్నాడిఎంకే పేరును ఎక్కడా వాడొద్దని ఇరువర్గాలకు ఈసీ సూచించింది. పార్టీ సింబల్‌ రెండాకుల గుర్తు కోసం ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. రెండాకుల గుర్తును ఎవరికి కేటాయించకుండా ఈసీ నిర్ణయం తీసుకుంది.

21:21 - March 23, 2017

హైదరాబాద్: మరోసారి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాల కేసు విచారణ జరిగింది. రీజైండర్లు దాఖలు చేసేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కోరాయి. మరోవైపు గడువును పొడిగించవద్దని.. సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్రం ట్రిబ్యునల్‌ను కోరింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏప్రిల్‌ 13 లోపు రెండు రాష్ట్రాలు స్టేట్‌మెంట్ల దాఖలుకు ట్రిబ్యునల్‌ సమయమిచ్చింది. మే 4, 5 తేదీల్లో విచారణ జరగనున్నట్లు ట్రిబ్యునల్‌ తెలిపింది.

21:20 - March 23, 2017

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల వైద్యులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈమేరకు మంత్రి లక్ష్మారెడ్డికి వైద్యసంఘం తరపున నోటీసులు ఇచ్చారు. 18రోజుల్లోపు డిమాండ్లను పరిష్కరించాలని గడువు పెట్టారు. లేదంటే ఏప్రిల్‌ 10 నుంచి వివిధ రూపల్లో నిరసనలు తెలిపి..జూన్ 2నుంచి పూర్తిస్థాయిలో వైద్యసేవలు నిలిపివేస్తామంటున్నారు. తమకు యూజీసీ స్కేలు అనుసరించి వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

21:18 - March 23, 2017

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల అనుమతులకు అవినీతిలేని వ్యవస్థను రూపొందించామన్నారు మంత్రి కేటీఆర్‌. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 15రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తున్నామని చెప్పారు. టీ-ప్రైడ్‌, టీ-ఐడియాతో పాటు టీ-ప్రైమ్‌ను కూడా త్వరలోనే ప్రవేశపెడుతామని చెప్పారు. మరోవైపు విద్య, వైద్య రంగాలపై కూడా అసెంబ్లీలో చర్చ కొనసాగింది.

టీఎస్‌ ఐపాస్‌ ప్రపంచంలోనే అద్భుతమైన పాలసీ..

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయన్న ఆయన టీఎస్‌ ఐపాస్‌ ప్రపంచంలోనే అద్భుతమైన పాలసీ అన్నారు. టీ-ప్రైడ్‌, టీ-ఐడియాతో పాటు టీ-ప్రైమ్‌ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు కృషి ...

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. స్కూళ్లలో 95 శాతం ఆధార్ లింక్డ్ ఎన్‌రోల్‌మెంట్ చేశామన్నారు. 10 వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. త్వరలో 7600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయి....

తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. తప్పుడు ప్రచారాలతో పేదలను భయపెట్టొద్దన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచామన్నారు. ఆస్పత్రుల్లో లంచాలు తీసుకునే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌ తరహాలో మరో రెండు ఆస్పత్రుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యూలరైజ్‌ చేయాలి...

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యూలరైజ్‌ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా.. ఇంతవరకూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు వేయలేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ. కే అరుణ. ఇటు రాష్ర్టంలో మాన్యూఫ్యాక్చరింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న నిమ్జ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని, టీఎస్‌ఐఐసీకి పెద్దగా కేటాయింపులేవని వివరించారు. బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. గురుకుల పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం సబ్జెట్‌ను పొందుపర్చాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు.

మొత్తంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సంబంధింత మంత్రులు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు.

20:34 - March 23, 2017

హైదరాబాద్ : భగత్ సింగ్... బ్రిటీష్ సామ్రాజ్యవాదం పై ఎగిసి పడ్డ ఒక విప్లవ కెరటం. మరి ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్న విప్లవం ఏమిటి? ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వారు ఎవరు? ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి పని చేస్తున్న వారు ఎవరు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ కథనం. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రూ. 28 లక్షల విలువైన బంగారం పట్టివేత...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 28 లక్షల విలువైన బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అరబ్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి అధికారులు 950 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారును వ్యక్తిని విచారణ చేపట్టారు.

సమ్మె నోటీసు ఇచ్చిన టీఎస్. సర్కార్ డాక్టర్లు...

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి 28 డిమాండ్లతో కూడిన నోటీసును అందజేశారు. 18 రోజుల్లో డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది. డిమాండ్ల సాధన క్రమంలో భాగంగా వారు చేపట్టబోయే చర్యలను వివరించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన.. మే 1 నుంచి 15 వరకు రోజుకు గంట పాటు నిరసన.. మే 16 నుంచి జూన్ 1 వరకు ఓపీ సేవలు బహిష్కరించడం.. జూన్ 2 నుంచి మొత్తంగా అన్ని వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటించింది.

రద్దయిన పాత నోట్లు మార్చుతూ నలుగురు అరెస్ట్

హైదరాబాద్: రద్దు అయిన పాతనోట్లను మార్పిడి చేసేందుకు యత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ అంబర్‌పేట పోస్టాఫీసు వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.48.66 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి చెప్పారు.

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

జనగామ: స్టేషన్‌ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతిచెందగా బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

20:07 - March 23, 2017

హైబీపీ పెంచుకుంటున్న హన్మంతన్న... అసెంబ్లీలో సెక్యూరిటోనితో పంచాయతీ, ఆంక్షలతో అద్భుతంగా నడుస్తోన్న అసెంబ్లీ... ప్రతిపక్షాల మీద కక్ష కడుతోన్న టీ.సర్కార్, కందుల కొనుగోలు కాడ గోల్ మాల్...ఆలేరు మార్కెట్ కాడ రైతుల ఆగంఆగం, ప్రకాశం జిల్లాలో పంచాయితీకొచ్చిన జనం...గల్లీ,గల్లీకి మోపైన దుకాణాలు, గాలి మోటర్లతో కయ్యం పెట్టుకున్న ఎంపీ సారూ...దింగంగనే చెప్పుతోని కొట్టి కసి తీర్చుకున్నడు. ఇత్యాది అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:48 - March 23, 2017

హైదరాబాద్: దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం, రూరల్ ఎకానమీ, క్రైసిస్ మీద అధ్యయనం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రొ. పాలగుమ్మి నాథ్ అన్నారు. ఆయన తో '10టివి' స్పెషల్ ఇంటర్వూ చేసింది. కౌలు రైతు చట్టబద్ధమైన గుర్తింపునకు నోచుకోవడం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు శాశ్వత యంత్రాంగం అవసరమన్నారు. ప్రతి ఏటా కార్పొరేట్ రుణాలు రద్దు చేస్తున్నారని.. ఇప్పటి వరకు 42 లక్షల కోట్ల రూపాయలు క్పొరేట్ రుణాలు రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ రైతు రుణాలు లక్ష కోట్లు కూడా రద్దు కాలేదన్నారు. అస్సలు వ్యవసాయ రుణాలు రద్దు తప్పేంటి? అని ప్రశ్నించారు. కేరళలోని కుటుంబ శ్రీ ప్రత్యామ్నాయ విధానాలను ప్రోత్సహిస్తోందన్నారు. పంట ధరల హెచ్చుతగ్గుల క్రమబద్దీకరణకు ధరల స్థిరీకరణ నిధి ఉండాలన్నారు. ప్రభుత్వాలు భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నాయని, రైతు ఆత్మహత్యల విషయంలో దొంగల ఎక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్ష సబ్సిడీలతో కార్పొరేట్ కంపెనీలకు కాసులు కురిస్తూ, యూపీఏ, ఎన్డీఏ రెండు ప్రభుత్వాలు రైతులను దగా చేశాయని ఆరోపించారు. రైతు కుటుంబంలో ఒకొక్కరి నెలసరి ఆదాయం నెలకి 13 వందల రూపాయలు మాత్రమేనని తెలిపారు. మరిన్న వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఈజిఫ్ట్ లో ఉగ్రదాడి: 10 మంది సైనికుల దుర్మరణం

హైదరాబాద్: ఈజిప్ట్‌లో ఆర్మీ వాహ‌నాలే ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. ఉగ్ర‌వాదులు జ‌రిపిన‌ రెండు దాడుల్లో 10 మంది సైనికులు మృతి చెందారు. వెంట‌నే తేరుకున్న ఇత‌ర‌ సైనికులు ఉగ్రవాదుల‌పై ఎదురు కాల్పులు జ‌రిపి వారిని హ‌త‌మార్చారు.

18:38 - March 23, 2017

కడప: మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కడప జిల్లా డ్వామా పీడీ రమేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో అఖిలపక్ష నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సిద్దవటంలో విధులు నిర్వహిస్తున్న శైలజ అనే మహిళ ఉద్యోగిని ఏ కారణం లేకుండా సస్పెండ్‌ చేశాడని.. మహిళలను బెదిరిస్తూ.. వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న రమేష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని మానవహక్కుల వేదిక కన్వీనర్‌ జయశ్రీ తెలిపారు.

18:37 - March 23, 2017

కృష్ణా : విజయవాడ నగరానికి మణిహారంగా భావిస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు వేగం పుంజుకున్నాయి. 447.80 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులను 2015 డిసెంబర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంతోపాటు 4 లైన్ల రహదారి విస్తరణ పనులను సోమా కంపెనీ దక్కించుకుంది. 2.55 కిలోమీటర్ల పొడవు, మొత్తం 51 పిల్లర్లతో ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు.

సోమా కంపెనీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం...

గతంలో ఫ్లై ఓవర్ పనులను ఆలస్యం చేయడంపై సోమా కంపెనీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు ప్లై ఓవర్ పనులను గుత్తేదారు వేగవంతం చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ పనులు మందకొడిగా సాగడంతో..ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. ఫ్లై ఓవర్ పనులను పూర్తిచేసే క్రమంలో పలు శాఖలు అప్రమత్తంగా వ్యవహారించాలని,. నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారికైనా వేటు తప్పదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాదిలోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేసి తీరాలని హెచ్చరించారు. అయితే ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల పర్యవేక్షణను ఎంపీ కేశినేని నానికి అప్పగించారు చంద్రబాబు. దీంతో నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎంపీ కేశినేని. అధికారులు, ఎమ్మెల్యేలతో కలసి స్వయంగా పనులను పరిశీలిస్తున్నారు.

ఫ్లై ఓవర్ పనులను వీలైనంత తొందరగా పూర్తి ...

ఈ తరుణంలో రేయింబవళ్లు శ్రమిస్తూ ఫ్లై ఓవర్ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి వాహనదారులు, ప్రజలకు ఉపశమనం కల్గించాలని చూస్తున్నారు. ప్లై ఓవర్ పనులు ఆలస్యం జరుగుతున్నా కొద్దీ హైదరాబాద్, భద్రాచలం వైపు వెళ్లే వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి భారీ వాహనాలను నూజివీడు వైపు మళ్లిస్తున్నారు. మరికొన్ని వాహనాలను గొల్లపూడి నుంచి బైపాస్ మీదుగా ఊర్మిళానగర్, కబేళా, మిల్క్ ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు రావాల్సిన బస్సులు, ఇతర వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి..ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

18:34 - March 23, 2017

హైదరాబాద్: యూరోప్ దేశాల్లో మాస్టర్‌ డిగ్రీ,ఎంటెక్, ఎంబీసీ, బ్యాచులర్ డిగ్రీ లను సంవత్సరానికి కేవలం లక్ష రూపాయల ఖర్చులో చదువుకునే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ స్కాలర్‌షిప్‌, హాస్టల్‌, అడ్మిషన్‌, వీసా అంశాలపై మరింత సమాచారం అందించడానికి గ్లోబల్‌ సిక్స్‌ సిగ్మా కన్సల్టెన్సీ డైరెక్టర్‌ ప్రణయ్‌ ప్రేమ్‌కుమార్‌ అనేక వివరాలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:49 - March 23, 2017

సంగారెడ్డి: నారాయణఖేడ్‌లో దారుణం చోటు చేసుకుంది. సేమ్యా తయారీ యంత్రంలో చున్ని చిక్కుకుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నాగల్‌ గిద్ద మండలం థౌర్యా నాయక్‌ తండాకు చెందిన మోతీబాయి, థౌర్యానాయక్‌ దంపతులు సేమ్యాలు తయారుచేసుకుందుకు నారాయణఖేడ్‌ పట్టణంలోని ఓ మిల్లుకు వెళ్లారు. అయితే మిల్లులో సేమ్యాలు పడుతున్న సమయంలో మోతీబాయి చున్నీ యంత్రంలో చిక్కుకుని... మెడకు ఉరితాడులా మారి.. తలా..మొండెం వేరై దుర్మరణం పాలైంది. మిల్లులో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వలే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

17:45 - March 23, 2017

హైదరాబాద్: ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం హైకోర్టు ప్రత్యేక అధికారులను నియమించింది. కొన్ని నెలలుగా హెచ్ సీఏ ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే ఉండడంతో.. ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఏఆర్‌ దవే, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి సీతాపతిని ప్రత్యేక అధికారులుగా హైకోర్టు నియమించింది.

ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు సమన్లు జారీచేయనున్న స్టాండింగ్ కమిటీ

 

 

ఢిల్లీ: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు సమన్లు జారీ చేయనుంది. ఏప్రిల్ 20 న కమిటీ ముందు హాజరుకావాలంటూ ఆర్ బీఐ గవర్నర్ కు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కమిటీ సభ్యులు బ్యాంకుల్లో డిపాజిటైన మొత్తం పాత నోట్ల వివరాలు, కొత్తగా విడుదల చేసిన నోట్ల వివరాలు కోరనున్నారు.

 

17:43 - March 23, 2017

హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి 39శాతం పోలైతే... మిగిలిన ఓట్లన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినవేనని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఓట్లు నిదర్శనమని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కృషి చేయాలని వారు సూచించారు.

17:41 - March 23, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వస్తే తనను సిబ్బంది అడ్డుకున్నారని.. ఇది ప్రజాస్వామ్యంలో మంచిపద్దతి కాదన్నారు. మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించినా.. చర్యలు తీసుకోలేదని ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందంటున్న రేవంత్‌రెడ్డి స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:38 - March 23, 2017

హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా.. ఇంతవరకూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు వేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ. కే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

మక్కా మసీదు పేలుళ్ల నింధితులకు బెయిల్ మంజూరు

 

 

హైదరాబాద్: నాంపపల్లి కోర్టు మక్కా మసీదు  పేలుళ్ల కేసు నింధితులకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆసిమానంద, భరత్ కు బెయిల్ ఇచ్చింది. వీరు గత నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్నారు. అజ్మీరా దర్గా పేలుళ్ల కేసులో వీరు నింధితులుగా ఉన్నారు.

 

16:40 - March 23, 2017

అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులుకు అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 11 వందల 82 కోట్ల రూపాయలు చెల్లిస్తామని.. అలాగే చనిపోయిన అగ్రిగోల్డ్‌ బాధితులకు 10 లక్షల పరిహారం చెల్లిస్తామని జగన్‌ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని.. ఈ పోరాటంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహకారం తీసుకుంటామని జగన్‌ చెప్పారు.

16:38 - March 23, 2017

అమరావతి: ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఒక్క అగ్రిగోల్డ్‌ నిందితులనే కాకుండా .. ఆర్థిక నేరాలకు పాల్పడే వారు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్తులో ప్రజలను మోసం చేయాలంటేనే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ సీఎం.

16:36 - March 23, 2017

విజయవాడ: స్పీకర్‌ తీరుతో తాము విసిగిపోయామన్నారు ప్రతిపక్షనేత జగన్‌. ప్రతిపక్షసభ్యులపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత జగన్‌ ఆరోపించారు. స్పీకర్‌ మీద తాము విశ్వాసం కోల్పోయినందున.. శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్‌పై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడతామని జగన్‌ స్పష్టం చేశారు.

16:35 - March 23, 2017

హైదరాబాద్: గురుకుల పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం సబ్జెట్‌ను పొందుపర్చాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కోరారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. భద్రచలంలో పాలిటెక్నిక్‌ కాలేజీని, గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని, చర్లలో జూనియర్‌ కాలేజీని, వెంకటాపురంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించి.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అగ్రిగోల్డ్ కేసును పక్కదారి పట్టిస్తున్నారు: జగన్

అగ్రిగోల్డ్ కేసును పక్కదారి పట్టిస్తున్నారు: జగన్

 

 

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్షను వైసీపీ అధ్యక్షుడు జగన్ విరమింపజేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును కోరినా స్పందించలేదని అన్నారు. అగ్రిగోల్డ్ కేసును పక్కదారి పట్టించడానికి మహిళా పార్లమెంట్ అంశం తెరపైకి తెచ్చారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే మృతిచెందిన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇస్తామని జగన్ ప్రకటించారు.

 

16:33 - March 23, 2017

హైదరాబాద్: మీడియా పాయింట్‌ దగ్గర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడేందుకు వచ్చిన వీహెచ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఉందంటూ వీహెచ్‌ను మాట్లాడనివ్వలేదు. దీంతో పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ వీహెచ్‌ పోలీసులపై మండిపడ్డారు.

16:31 - March 23, 2017

అమరావతి: విజయవాడ నగరంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలో జనసంఖ్య పెరగడంతో అద్దెల బాదుడు ఎక్కువైంది. యజమానులు ఇష్టానుసారంగా అద్దెలు పెంచేస్తున్నారు. గతంలో 2వేలు ఉన్న అద్దె ధర ఇప్పుడు ఏకంగా 5 వేలకు చేరిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.... హైదరాబాద్‌లో కూడా లేని అద్దె ధరలు విజయవాడలో ఉన్నాయి.

రాజధానిగా మారిన తర్వాత విజయవాడలో పెరిగిన జనం....

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ఏపీ రాజధానిగా మారిపోయింది. రాజధాని అనగానే ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం, మంత్రుల పేషీలతోపాటు వివిధ శాఖలకు చెందిన ఆఫీసులు ఉంటాయి. దీంతో సహజంగానే జనసంఖ్య పెరుగుతుంటుంది. విజయవాడలోనూ అదే జరిగింది. రాజధానిగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడకు మకాం మార్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు అధికమయ్యారు. వీరితోపాటు ఇతర చిరు వ్యాపారులు, విద్యార్ధులు, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్ధుల సంఖ్య పెరిగింది. దీంతో అద్దె రూములు దొరకడం గగనమైపోయింది. ఇదే అదనుగా భావిస్తోన్న యజమానులు అద్దెను అమాంతం పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడలో ఇంటి అద్దెలపై సీఎం చంద్రబాబు శాసనమండలిలో ప్రస్తావించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు.

విజయవాడలో 1.80 లక్షల గృహాలు....

విజయవాడలో ప్రస్తుతం 1.80 లక్షల గృహాలు ఉండగా... వీటిలో 10.5 లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. దీంతో అద్దె ఇళ్లు దొరకడం కష్టతరమైంది. ఒక వేళ దొరికినా అద్దె బాదుడు ఎక్కువైంది. ఇక ఫ్యామిలీస్‌కు అద్దె ఇవ్వడానికి ఇంటి యజమానులు ముందుకురావడం లేదు. బ్యాచ్‌లర్స్‌కే రూమ్స్‌ ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. వారి నుంచైతే ఎక్కువ బాడుగ వసూలు చేయవచ్చని యజమానులు భావిస్తున్నారు.

అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్‌రూమ్‌కు రూ. 7వేల అద్దె...

అపార్టుమెంట్లలో సింగిల్‌ బెడ్‌రూంకు 7 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌కు 13వేలు, త్రిపుల్‌ బెడ్‌రూమ్‌కు 16వేలకుపైగా యజమానులు వసూలు చేస్తున్నారు. వన్‌టౌన్‌, అయోధ్యనగర్‌, పటమట, గవర్నర్‌పేట, కృష్ణలంక, భవానీపురం, మొగల్రాజపురం ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మెయింటనెన్స్‌ కింద మరో 1000 నుంచి 1500 అదనంగా వసూలు చేస్తున్నారు. అరకొర సౌకర్యాలు ఉన్న రెండు గదుల ఇంటికి సైతం 4వేల నుంచి 5వేలు వసూలు చేస్తున్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు ప్రాంతాల్లో 3 గదులున్న ఇళ్లకు 8వేలు వసూలుచేస్తున్నారు. దీంతో ఇక్కడ దశాబ్దాలుగా ఉంటూ చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఇబ్బందిగా మారింది.

యజమానులను కట్టడి చేయాలంటున్న అద్దెదారులు...

ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇంటి అద్దెలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అద్దెదారులు కోరుతున్నారు. ఇంటి అద్దెలను ఎడాపెడా పెంచేస్తున్న యజమానులను కట్టడి చేయాలని విన్నవిస్తున్నారు. ఇంటి అద్దెలపై ఓ చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నారు.

భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: సున్నం రాజయ్య

 

హైదరాబాద్: ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించాలని,కేజీ టూ పీజీ విద్యను ప్రతి పాఠశాలలో అమలు చేయాలని దీని పై ప్రభుత్వం వెంటనే ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అసెంబ్లీలో  డిమాండ్ చేశారు. భద్రాచలం, చర్లలో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీని భద్రాచలంలో ఏర్పాటు చేయాలని, భద్రచలం ఆస్పత్రికి అనుసంధానంగా పీహెచ్ సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సున్నం రాజయ్య కోరారు.

స్పీకర్ కోర్టు ఆదేశాలను దిక్కరిస్తున్నారు: రేవంత్ రెడ్డి

 

 

 

హైదరాబాద్: స్పీకర్ ను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణామని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ విలీనం, పార్టీ ఫీరాయింపుల పై హైకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయడంలేదని రేవంత్ ఆరోపించారు. అనర్హత ఎమ్మెల్యేల పై 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిన స్పీకర్ కాలయపన చేస్తున్నారని ఆయన అక్షేపించారు. దీని పై కోర్టులో కోర్టు దిక్కర కేసు వెస్తామని ఆయన తెలిపారు.

అగ్రిగోల్డ్ కేసును పక్కదారి పట్టిస్తున్నారు

విజయవాడ: అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, బాధితులను గాలికొదిలేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. సభకు సంబంధంలేని అంశాన్ని చర్చకు తెచ్చారని, నెలన్నర క్రితం జరిగిన సబ్జెక్టును బయటకు తీశారని, ఇష్టలేని పత్రికలు, ఛానళ్లపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

15:32 - March 23, 2017

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసే విషయంలో రాజీలేదు-బాబు

అమరావతి : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 3 లక్షల పరిహారం ఇస్తామన్నారు. నిందితుల ఆచూకీ చెబితే 10 లక్షలు బహుమానం ప్రకటించారు. అగ్రిగోల్డ్ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును..అనపైసతో సహా రికవరీ చేస్తామన్నారు. వైట్‌ కాలర్‌ నేరాలు జరగకుండా ఉండేందుకు ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999కు సవరణ తీసుకొచ్చామన్నారు.

15:29 - March 23, 2017

హైదరాబాద్: స్పీకర్‌ మధుసూదనా చారిని కలిసేందుకు వెళ్లిన రేవంత్‌రెడ్డిని అసెంబ్లీ లాబీలోనే సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్‌ను కలిసేందుకు వెళ్తున్నానని రేవంత్‌ చెప్పినా సిబ్బంది వినకుండా అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ నేరస్థుడా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు చీఫ్‌ మార్షల్స్‌ ఆదేశాల మేరకే అడ్డుకున్నామని సిబ్బంది తెలిపారు.

 

15:27 - March 23, 2017

అమరావతి: సభలో ప్రతిపక్షం ఆరోపణలపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. మంత్రి పుల్లారావు భూముల కొనుగోళ్లపై ఏ విచారణకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. జ్యూడిషియల్ ఎంక్వెయిరీకి ఆదేశిస్తున్నామన్నారు. విచారణలో మంత్రి పుల్లారావుది తప్పని తేలితే బహిష్కరిద్దామన్నారు.. లేదా ఆరోపణలు తప్పని తేలితే జగన్‌ను బహిష్కరిద్దామన్నారు. సభలో పుల్లారావు లేదా జగన్‌ ఒకరే ఉండాలన్నారు.

అగ్రిగోల్డ్ పై జ్యుడీషియరీ విచారణ

 

విజయవాడ: అగ్రిగోల్డ్ వ్యవహరం పై జ్యుడీయరీ విచారణ జరుపుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధికుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రతి ఒక్క పైసా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కేసు త్వరగా పరిష్కారమయ్యేల కోర్టుకు సహకరిస్తామని తెలిపారు.

రేవంత్ రెడ్డి ని అడ్డుకున్న అసెంబ్లీ సిబ్బంది

 

 

హైదరాబాద్: స్పీకర్ ను కలవడం కోసం అసెంబ్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీని పై అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి భద్రతా సిబ్బందిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చీఫ్ మార్షల్స్ ఆదేశాల ప్రకారమే అడ్డుకున్నామని సిబ్బంది తెలిపారు.

14:45 - March 23, 2017

అమరావతి:సభలో అగ్రిగోల్డ్‌ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి.. టీడీపీ నాయకులు సాక్షి మీడియాపై అనవసర ఆరోపణలు చేశారని ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శించారు. ఉమెన్‌ పార్లమెంట్ ప్రెస్‌మీట్‌లో మహిళలపై స్పీకర్‌ కోడెల చేసిన వ్యాఖ్యలను నేషనల్‌ మీడియా కూడా ప్రచారం చేసిందని.. కానీ ఈరోజు కేవలం సాక్షి మీడియానే టార్గెట్‌ చేశారని ఇది ఎంత వరకు న్యాయమని ఆయన అన్నారు. సంబంధం లేని ఓ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక కారణమేంటని ఆయన ప్రశ్నించారు. కేవలం సాక్షి మీడియానే టార్గెట్ చేసి.. దానిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని జగన్‌ అన్నారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు..స్పీకర్

అమరావతి: ఏపీలో నిర్వ‌హించిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ‘మీట్ ది ప్రెస్’ లో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని ఆరోపించిన స్సీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ ఈ రోజు ఈ వీడియోను అసెంబ్లీలో చూపించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించ‌డం త‌న‌కు చాలా బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. అంతేగాక‌, త‌న‌ కుమారుడు, కోడ‌లి గురించి కూడా సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్టులు పెట్టారని ఆయ‌న అన్నారు. తాను అన‌ని మాట‌లు అన్న‌ట్లు చూపించం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇటువంటి చ‌ర్య‌లు అన్యాయం, అక్ర‌మం అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

జగన్ ఆరోపణలపై ఏపీ అసెంబ్లీలో దుమారం...

గుంటూరు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆరోపణలు రుజువు చేయాలని అధికార పక్షం సభ్యులు పట్టుబట్టారు. అగ్రిగోల్డుపై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అగ్రిగోల్డు భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య కొన్నారని ఆరోపించారు. జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించాలని, సిట్టింగ్ జడ్జిడితో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేశారు. దీంతో అధికారపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేని ఎడల సభ నుంచి జగన్ ను బహిష్కరించాలని స్పీకర్ ను కోరారు. సభలో ఉండే అర్హత జగన్ లేదన్నారు.

జగన్ ను బహిష్కరించాలన్న అచ్చెన్నాయుడు

గుంటూరు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ ను జగన్ స్వీకరించకపోతే జగన్ ను బహిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తానని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రత్తిపాటి సవాలును ప్రతిపక్షాలు స్వీకరించాలని తెలిపారు. 

14:05 - March 23, 2017

గుంటూరు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆరోపణలు రుజువు చేయాలని అధికార పక్షం సభ్యులు పట్టుబట్టారు. అగ్రిగోల్డుపై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అగ్రిగోల్డు భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య కొన్నారని ఆరోపించారు. జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించాలని, సిట్టింగ్ జడ్జిడితో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేశారు. దీంతో అధికారపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేని ఎడల సభ నుంచి జగన్ ను బహిష్కరించాలని స్పీకర్ ను కోరారు. సభలో ఉండే అర్హత జగన్ లేదన్నారు. ప్రత్తిపాటి విసిరిన సవాల్ ను జగన్ స్వీకరించిన తర్వాతే జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేస్తామని చెప్పారు. హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థికమంత్రి యమనల రామకృష్ణుడు అన్నారు. ప్రత్తిపాటి సవాలును ప్రతిపక్ష నాయకుడు స్వీకరించకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అవుతుందని తెలిపారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ ను జగన్ స్వీకరించకపోతే జగన్ ను బహిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తానని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రత్తిపాటి సవాలును ప్రతిపక్షాలు స్వీకరించాలని తెలిపారు. ప్రత్తిపాటిపై ఆరోపణలు చేసి నిరూపించకుండా జగన్ పారిపోతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రజలకు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జ్యుడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

 

 

 

13:41 - March 23, 2017

గుంటూరు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ ను జగన్ స్వీకరించకపోతే జగన్ ను బహిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తానని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రత్తిపాటి సవాలును ప్రతిపక్షాలు స్వీకరించాలని తెలిపారు. 

 

అగ్రిగోల్డు భూములు కొనలేదన్న ప్రత్తిపాటి

గుంటూరు : తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేస్తానని.. లేకపోతే జగన్ రాజీనామా చేస్తారా అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాస్ విసిరారు. అగ్రిగోల్డుకు సంబంధించిన భూములు తాను కొనలేదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గతంలో తనపై చేసిన ఆరోపణలకు సవాలు విసిరితే జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. 

అగ్రిగోల్డు భూములు కొనుగోలు చేసిన మంత్రి ప్రత్తిపాటి భార్య : జగన్

గుంటూరు : చంద్రబాబు ప్రకటనతో అగ్రిగోల్డు బాధితులకు నిరాశ మిగిలిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రూ.1182 కోట్లు ప్రభుత్వం ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డు ఆస్తుల విలువ రూ.7300 కోట్లని తెలిపారు. బాధితుల లిస్టు ఆన్ లైన్ లో పెట్టాలన్నారు. అగ్రిగోల్డు భూములను మంత్రి ప్రత్తిపాటి భార్య కొన్నారని ఆరోపించారు. 

13:30 - March 23, 2017

గుంటూరు : తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేస్తానని.. లేకపోతే జగన్ రాజీనామా చేస్తారా అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాస్ విసిరారు. అగ్రిగోల్డుకు సంబంధించిన భూములు తాను కొనలేదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గతంలో తనపై చేసిన ఆరోపణలకు సవాలు విసిరితే జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఒక అవినీతి పత్రికలో ఏది పడితే రాస్తూ..అవాస్తవాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పినదాంట్లో తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..ఒకవేల జగన్ చెప్పిందాంట్లో తప్పుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారో లేదో చెప్పాలన్నారు. 

 

13:18 - March 23, 2017

గుంటూరు : చంద్రబాబు ప్రకటనతో అగ్రిగోల్డు బాధితులకు నిరాశ మిగిలిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రూ.1182 కోట్లు ప్రభుత్వం ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డు ఆస్తుల విలువ రూ.7300 కోట్లని తెలిపారు. బాధితుల లిస్టు ఆన్ లైన్ లో పెట్టాలన్నారు. అగ్రిగోల్డు భూములను మంత్రి ప్రత్తిపాటి భార్య కొన్నారని ఆరోపించారు. 

12:59 - March 23, 2017

గుంటూరు : అగ్రిగోల్డు బాధితులు అధైర్యపడొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. 'అగ్రిగోల్డు'పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించారని తెలిపారు. ఈ కేసులో 19 మంది నిందితులున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డుపై అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామన్నారు. బాధితులకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిందితుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కేసును సీబీఐకి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. అవసరమైతే ఆర్థిక నేరాల చట్టానికి సవరణలు చేస్తామన్నారు. చట్ట వ్యతిరేకంగా డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

'అగ్రిగోల్డు'పై సీఎం చంద్రబాబు ప్రకటన

గుంటూరు : 'అగ్రిగోల్డు'పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన  వెల్లడించారు. అగ్రిగోల్డు బాధితులు అధైర్యపడొద్దని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. 

12:37 - March 23, 2017
12:36 - March 23, 2017
12:34 - March 23, 2017

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 9 నెలల్లో పూర్తి : దేవినేని

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 9 నెలల్లో పూర్తి చేస్తానమి మంత్రి దేవినేని ఉమా తెలిపారు. 

 

12:32 - March 23, 2017

హైదరాబాద్ : స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి  జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. గ్రామాల్లో వందశాతం ట్యాక్సులను వసూలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీలను ఆర్థిక పరిపుష్టి చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలకు 96 కోట్లు, ఆకర్షణీయ పట్టణాలకు 94 కోట్లు కేటాయించామని తెలిపారు. 

 

12:24 - March 23, 2017

గుంటూరు : వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. సభలో వైసీపీ సభ్యుల తీరును అచ్చెన్నాయుడు, పెన్మత్స ఖండించారు. సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. చర్చించాలని పట్టు పట్టడం హాస్యాస్పదమన్నారు. 

 

సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు కేసు విచారణ

ఢిల్లీ : సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ జరిగింది. రెండు వారాల్లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ కోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.

12:09 - March 23, 2017

ఢిల్లీ : సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ జరిగింది. రెండు వారాల్లోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ కోర్టు ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు మాట్లాడుతున్నారు. 

 

11:57 - March 23, 2017

తిరుపతి : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనం విజయం సాధించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా తన విజయంలో వామపక్షాల కృషి ఎంతో ఉందని కొనియాడారు. శాసనమండలిలో నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన కోసం కృషి చేస్తానని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను నిరుద్యోగ పక్షపాతినని తెలిపారు. నిరుద్యోగ భృతి పూర్తి స్థాయిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

11:35 - March 23, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 9 నెలల్లో పూర్తి చేస్తానమి మంత్రి దేవినేని ఉమా తెలిపారు. 

11:31 - March 23, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని వైసీపీ నేతలు అన్నారు. ఈమేరకు ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదాపై చర్చించేందుకు స్పీకర్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ప్రత్యేకహోదా కోసం జరిగే పోరాటానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. హోదా కోసం అహర్నిశలు పని చేస్తామని చెప్పారు. అనంతరం టీడీపీ నేత మాట్లాడుతూ  ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమన్నారు. ఢిల్లీలో జగన్ ను నిరాహారదీక్ష, ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రత్యేకహోదా సాధించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

 

11:21 - March 23, 2017
11:19 - March 23, 2017
11:18 - March 23, 2017
11:13 - March 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తాను తప్పుగా మాట్లాడివుంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని విజ్ఞప్తి చేశానని తెలిపారు. తాను ఏ పదం వాడానో చెబితే ఆ పదాన్ని ఉపసంహరించుకుంటానని కోరినా... సదరు సభ్యులు చెప్పలేదన్నారు. రికార్డు చూసి అలాంటివేమైనా ఉంటే తొలగిస్తామని స్పీకర్ చెప్పారని గుర్తు చేశారు. రికార్డుల్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే, తన వైపు నుంచి తప్పువుంటే తొలగించాలని కోరుతున్నట్లు చెప్పారు. 
నేను పశ్చాత్తాపం చెందుతున్నా : కిషన్ రెడ్డి 
గత పదమూడు సంత్సరాలుగా తాను ఎప్పుడు వెల్ లోకి రాలేదని కానీ.. నిన్న తాను వెల్ లోకి రావడం ఫస్ట్ టైమ్.. అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు సభ్యులతో కలిసి ప్రభుత్వంపై ఏ రకంగా పోరాటం చేశానో టీర్ ఎస్ సభ్యులు, తెలుసన్నారు. నరేంద్రమోడీని అన్నారని తాను కొంచెం తొందరపాటు పడ్డానని తెలిపారు. నిన్న వెల్ లోకి వచ్చినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

 

ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా...

గుంటూరు : ఏపీ అసెంబ్లీ పది నిమిషాలపాటు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రత్యేకహోదా పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైసీపీ తీరును టీడీపీ సభ్యులు ఖండించారు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. 

09:43 - March 23, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీక్ పై కాంగ్రెస్, మతపరమైన రిజర్వేషన్లు వద్దని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:41 - March 23, 2017

గుంటూరు: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎనిమిది రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల సమయం గుడుస్తోంది. ప్రత్యేకహోదా పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైసీపీ తీరును టీడీపీ సభ్యులు ఖండించారు. 

కాసేపట్లో టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కాంగ్రెస్, మతపరమైన రిజర్వేషన్లు వద్దని బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. 
 

ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.

నేటి ఏపీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిది రోజు కొనసాగునున్నాయి. ప్రత్యేక హోదాపై మరోసారి సభలో తీర్మానం చేయాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎనిమిది రోజు

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిది రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. అగ్రిగోల్డు బాధితులకు పరిహారంపై ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు, అలాగే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.3 లక్షలు చంద్రబాబు ప్రకటించనున్నారు. పలు పద్దులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

08:55 - March 23, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిది రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. అగ్రిగోల్డు బాధితులకు పరిహారంపై ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు, అలాగే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.3 లక్షలు చంద్రబాబు ప్రకటించనున్నారు. పలు పద్దులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రత్యేక హోదాపై మరోసారి సభలో తీర్మానం చేయాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 

 

08:46 - March 23, 2017

రైతుల రుణాల మాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఏపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ రామ్ శర్మ, టీడీపీ నేత దినకర్, సీపీఎం నేత భవన్ నారాయణ పాల్గొని, మాట్లాడారు. రైతులు తీసుకున్న రుణాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని చెప్పారు. వ్వవసాయ రంగానికి ప్రభుత్వ నిధులు కేటాయింపు తగ్గుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:41 - March 23, 2017

ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ తిరుమలరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి పోరుబాట పట్టారు. రెండు రోజుల క్రితం అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.  మార్చి 3 నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 32 లక్షల మంది వున్న బాధితులకు సత్వర న్యాయం చేయకపోతే, ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేయకతప్పదంటూ హెచ్చరిస్తున్నారు. బాధితులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున తక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:38 - March 23, 2017

చెన్నై : సగటున రోజుకు ఇద్దరి ఆత్మహత్య...! ఆరు నెలల కాలంలో 254 మంది బలవన్మరణాలు..!! ఈ గణాంకాలు, తమిళనాట, రైతుల దుస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. రుతుపవనాలు సహకరించక.. సేద్యానికి పెట్టిన పెట్టుబడులూ గిట్టక, అధికారం కోసం కుమ్ములాటలతో పాలకులకు క్షణం తీరిక లేక.. తమను పట్టించుకునే వారే కానరాక... రైతులు ఉరికొయ్యలే శరణమని భావిస్తున్నారు. 
మృత్యువు కరాళ నృత్యం..
తమిళనాడును వేధిస్తోన్న వర్షాభావ పరిస్థితులు.. దుర్భర కరవుతో తల్లడిల్లుతున్న అన్నదాతలు.. సగటున రోజుకు ఇద్దరు చొప్పున బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతులు.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో మృత్యువు కరాళ నృత్యం.. తమిళనాడులో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు, ఈశాన్య రుతుపవనాలూ రైతులను తీవ్రంగా దగా చేశాయి. సకాలంలో వానలు కురవని కారణంగా.. నీరు అందక.. పైర్లు ఎండిపోయాయి. కనీసం పెట్టుబడులు కూడా తిరిగి రాని దుర్భర పరిస్థితుల్లో తమిళ రైతులు.. నైరాశ్యంలో కూరుకుపోయారు. బతుకుపై భరోసా కొరవడి.. బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. 
254 మంది రైతులు బలవన్మరణాలు
ఒకరు కాదు ఇద్దరు కాదు.. గడచిన ఆరు నెలల కాలంలో 254 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు కోల్పోయారు. సిరులు కురిపించే డెల్టా ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన నాగపట్నం, తంజావూరు జిల్లాల్లోనే ఈ దుర్భర పరిస్థితులు తలెత్తడం యావత్‌ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రాంతంలో సగటున ప్రతి రైతుకూ రెండు నుంచి మూడు ఎకరాల పొలం ఉంది. మొత్తం 80వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంత రైతులు వరి పండిస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టపోవడంతో.. తమను ఆదుకోవాలంటూ రైతులు గడచిన డిసెంబర్‌, జనవరి నెలల్లో ఆందోళన నిర్వహించారు. తద్వారా తమ ఆవేదనను రాష్ట్రం మొత్తానికి తెలిసేలా చేశారు. 
అధికార యంత్రాంగం కాస్త ఉదాసీనత 
జయలలిత మృతి.. తదనంతర పరిస్థితుల్లో రైతుల వెతలు పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం తొలినాళ్లలో కాస్త ఉదాసీనత కనబరచింది. అయితే రైతుల ఆందోళన అధికం కావడంతో, యంత్రాంగం కదిలింది. రైతులను ఆదుకునేందుకంటూ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఐదు ఎకరాలలోపు పొలమున్న రైతులకు, ఎకరాకు 5వేల 465 రూపాయల వంతున చెల్లిస్తామని తెలిపింది. అయితే, ఆల్‌ తమిళనాడు ఫార్మర్స్ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం, 254 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే.. ప్రభుత్వం మాత్రం 58 మందేనంటూ లెక్క తేల్చింది. వీరిలో 25 శాతం రైతులకు కూడా ఇంకా పరిహారం చెల్లించలేదని వారి బ్యాంకు అకౌంట్ల ద్వారా తెలుస్తోంది. 
ఢిల్లీలో రైతులు ఆందోళన
పరిస్థితి తీవ్రత అధికం కావడం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. డెల్టా ప్రాంత రైతులు.. ఇటీవలే, దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగారు. పుర్రెలు ధరించి, తమ దుస్థితిని సింబాలిక్‌గా దేశం మొత్తానికి తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతుల దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష డిఎంకె, సీపీఎంలు విమర్శించాయి. కాలువల మరమ్మతులు చేయకపోవడం వల్ల నీరు అందడం లేదని, దీంతో భూములున్న రైతులు కూలీలుగా మారుతున్నారని విపక్షాలు అంటున్నాయి. ఇంటాబయటా ఒత్తిడి పెరగడంతో, ముఖ్యమంత్రి పళనిస్వామి, కరవు పీడిత రైతులకు 2,247 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. దీని ద్వారా 32 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఈ ఉపశమనం రైతులకు చేరేందుకు ఎంతకాలం పడుతుందో.. ఈలోపు మరెంత మంది ప్రాణాలు కోల్పోతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

08:33 - March 23, 2017

ఢిల్లీ : రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు సూచన.. కొత్త ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇరు పక్షాలూ కూర్చుని.. చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అయితే.. ఏ అంశంపై చర్చలు జరపాలి..? రామాలయ నిర్మాణం జరపాలా వద్దా అనా..? లేక అసలు ఆ వివాదాస్పద స్థలం ఎవరిది అన్న అంశాన్ని తేల్చడంపైనా..? చర్చించాల్సిన అంశం ఏదన్నదే చర్చనీయాంశమైందిప్పుడు.
రామజన్మభూమి వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలి..
రామజన్మభూమి వివాదాన్ని, కోర్టు వెలుపలే, ఇరుపక్షాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ సూచించారు. ఏకాభిప్రాయం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న సీజే, అవసరమైతే మధ్యవర్తిత్వం విషయంలో తామూ జోక్యం చేసుకుంటామని చెప్పారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, ఏ అంశంపై చర్చ సాగాలి..? కోర్టు తీర్పు వెలువరించాల్సిన అంశం.. చర్చించాల్సిన అంశమూ ఒకటేనా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 
వివాదంలో రెండు అంశాలు 
రాముడు జన్మించిన చోటే రామాలయం నిర్మించాలని సంఘ్‌ పరివార్‌ పట్టుబడుతుంటే.. ఆ స్థలంపై హక్కు తమదేనంటూ వక్ఫ్‌ బోర్డు వాదిస్తోంది. ఈ వివాదంలో రెండు అంశాలు ముడిపడి వున్నాయి. ఒకటి.. రామాలయ నిర్మాణం.. రెండు.. వివాదాస్పద స్థలంపై హక్కు ఎవరిది అన్న అంశం. సమస్య వివాదాస్పద భూమిపై హక్కు గురించినది అయినప్పుడు.. ఇరు పక్షాలూ కూర్చుని చర్చించుకోవడం వల్ల ప్రయోజనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. 
1992 డిసెంబర్‌ 6 బాబ్రీమసీద్‌ విధ్వంసం 
1992 డిసెంబర్‌ 6 అయోధ్య లోని బాబ్రీమసీద్‌ విధ్వంసానికి గురైంది. హిందూ సంస్థల కరసేవకులు ఈ కట్టడాన్ని కూల్చివేశారు. అప్పటి నుంచి ఈ స్థలం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందా....హిందూ మహాసభకు చెందుతుందా అనే వివాదం తలెత్తింది. వివాదస్పద 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు, నిర్మోహి అఖరాకు, రామ్‌లల్లాకు పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.
వివాదాస్పద స్థలపు యజమాని ఎవరో తేల్చాలి : ఏచూరీ
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో వివాదాస్పద స్థలపు యజమాని ఎవరో తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపైనే ఉందని సిపిఎం అభిప్రాయపడింది. రామ మందిరం భూమి రికార్డుల అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సుప్రీంకోర్టే దీన్ని తేల్చాల్సి ఉందన్నది సీపీఎం అభిప్రాయం. అటు, బాబ్రీ మస్జిద్‌ యాక్షన్‌ కమిటీ కూడా, అయోధ్య వివాదానికి కోర్టు వెలుపల పరిష్కారానికి లభించే అవకాశం ఏ మాత్రం లేదని అభిప్రాయపడింది. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వం వహించినా, మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేసినా లేదా కోర్టు విచారణ చేసినా తమకు ఆమోదయోగ్యమేనని పేర్కొంది. ఈ వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారం లభించడం అసాధ్యమని, దీనిని కోర్టే తేల్చాల్సి వుంటుందని బాబ్రీ మస్జిద్‌ యాక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది. 

 

08:28 - March 23, 2017

హైదరాబాద్ : టర్కీ కరెన్సీని మార్పిడి చేస్తున్న ముఠాసభ్యులను సికింద్రాబాద్‌ నార్త్‌ జోన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు. టర్కీ దేశంలో నిషేధించిన నోట్లను కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్పిడి చేస్తుండగా... విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 5 కోట్ల విలువైన టర్కీ దేశానికి చెందిన నగదును స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో వాటి విలువ 85 నుంచి 90 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆరుగురు వ్యక్తులగల ముఠా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందినవారు. వీరిలో సునీల్‌ రెడ్డి, రవి అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. నలుగురు వ్యక్తులు చంద్రపాల్‌, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, అనూప్‌ కుమార్‌లను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. 

 

08:25 - March 23, 2017

హైదరాబాద్ : రెండు కోట్లు డిమాండ్ చేశారు... కుదరకపోవడంతో కేసులో ఇరికించారు...కేసులో సెటిల్ చేసుకోమన్నారు...వినకపోవడంతో అరెస్టు చేస్తామన్నారు...ఆ డబ్బు కింది స్థాయి నుంచి పోలీసు బాస్‌వరకు వెళ్తుంది...తీవ్ర సంచలన ఆరోపణలు చేసిందెవరో కాదు...హత్య కేసులో అరెస్టయిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు...ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వాట్సాప్ సందేశం కలకలం రేపింది...
పోలీసు డిపార్ట్‌మెంట్‌పై ఐఏఎస్‌ ఆరోపణలు..
డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ప్రమేయంపై అరెస్టు అయిన ఐఏఎస్‌ అధికారి డి.వెంకటేశ్వర్‌రావు పోలీసు డిపార్ట్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు....హత్య కేసులో తన ప్రమేయం లేకున్నా ఇరికించారని...అన్యాయం చేశారంటూ దుమ్మెత్తి పోశారు...పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారంటూనే పోలీసు బాస్‌పైనే తన బాణం ఎక్కుపెట్టారు...
సెటిల్ చేసుకోమంటూ ఫోన్లు..
డ్రైవర్ నాగరాజు హత్యానంతరం తనకు విషయం తెలియగానే పోలీసు స్టేషన్‌కు కొడుకు సుకృత్‌ను తీసుకువెళ్లి అప్పగించానని..అయితే సెటిల్ చేసుకోవాలంటూ ఫోన్లు వచ్చాయంటున్న వెంకటేశ్వర్‌రావు రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ ఆరోపించారు.
డబ్బులు ఇవ్వకపోవడంతో కేసు...
నాగరాజు హత్య తర్వాత తానే డెడ్‌బాడీ తీసుకురమ్మని కొడుకును పంపానంటున్నారు...18 ఏళ్ల కుర్రాడు డెడ్‌బాడీ మోసుకు రావడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు...తనపై మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తూ డబ్బులు ఇవ్వాలని..నిరాకరించడంతో కేసులో ఇరికించారంటూ ఆస్పత్రిలో ఉన్న ఐఏఎస్‌ వెంకటేశ్వర్‌రావు వాట్సాప్‌ ద్వారా తన సందేశాన్ని బయటకు పంపారు.
సెటిల్‌ చేసుకుందామని ఫోన్ చేసిందెవరు..?
ఈ నెల 17న డ్రైవర్ నాగరాజును వెంక‌టేశ్వర్‌రావు  పెద్ద కుమారుడు వెంకట్ సుక్రుత్ హత్య చేశాడు. ఈ కేసులో మృతదేహాన్ని సంఘటనాస్థలం నుంచి తరలించేందుకు ప్రయత్నించారని హత్యకు పాల్పడిన వెంకట్ తో పాటు తండ్రి ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు వెంకట్ ను పోలీసులు మీడియా ముందు చూపించగా... వెంకటేశ్వర్‌రావు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు...ఆయన్ని నేరుగా కోర్టులో హాజరుపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు... ఆస్పత్రిలో ఉన్న వెంకటేశ్వర్ రావు ఆరోపణలతో సందేశాన్ని పంపడంతో కలకలం రేపుతోంది.

 

08:11 - March 23, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో మంజునాథ కమిషన్‌ ప్రజాభిప్రాయసేకరణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అటు బీసీలు.. ఇటు కాపులు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో  ప్రజాభిప్రాయసేకరణ మధ్యలోనే నిలిచిపోయింది. 
కాకినాడలో మంజునాథ కమిషన్‌ పర్యటన
కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌న్న ప్రతిపాదనపై ఏర్పడిన మంజునాథ క‌మిష‌న్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించింది. తొలుత కమిషన్‌ సభ్యులు బీసీల‌లో కులాల వారీగా అభిప్రాయాల‌ను  అడిగి తెలుసుకున్నారు. బీసీల‌లో గ్రూపుల మార్పిడికి సంబంధించి వారి విన‌తుల‌ను స్వీక‌రించారు. ఈ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను  వేదిక మీద‌కు అనుమ‌తించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్యక్తమైంది.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సభలో ఆందోళన.. బాయ్‌కాట్‌ చేసిన బీసీలు
అనంతరం కాపు సామాజక వర్గీయుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అయితే కాపుల్లో ఎక్కువ మంది మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని.. కమిషన్‌ తమకు అన్యాయం చేస్తుందంటూ బీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కమిషన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. సమావేశ మందిరం ముందు బైఠాయించారు. గో బ్యాక్‌ మంజునాథన్‌ కమిషన్‌ అంటూ నినాదాలు చేశారు. 
నిలిచిపోయిన ప్రజాభిప్రాయసేకరణ
అలాగే కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజ మాట్లాడడంపై కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. కాపుల్లో రెండు వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగారు. ఈ పరిణామంతో మంజునాథన్‌ సహా కమిషన్‌ సభ్యులందరూ అక్కడ నంచి వెళ్లిపోయారు. మధ్యలోనే ప్రజాభిప్రాయసేకరణ నిలిచిపోయింది.
పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు 
మంజునాథ కమిషన్‌ ప్రజాభిప్రాయసేకరణ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. అదనపు బలగాలతో గస్తీ కాయడమే కాకుండా.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. పరిస్థితిని పర్యవేక్షించారు.

 

08:06 - March 23, 2017

గుంటూరు : ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక డిజైన్స్ లో మార్పులతో కూడిన బృహత్తర ప్రణాళికను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. గత నెలలో 4 రకాల డిజైన్స్ ను ముఖ్యమంత్రికి చూపించగా, వాటిలో రెండు డిజైన్స్ కు మార్పులు చేసి, తయారు చేయాలని సీఎం వారికి వివరించారు. దానిలో భాగంగా మార్పులతో కూడిన డిజైన్స్ ను ముఖ్యమంత్రికి చూపించారు. ఈ డిజైన్స్ లో ముఖ్యంగా సుస్థిర దార్శనిక నిర్మాణం' ట్యాగ్ లైన్‌తో 'అమరావతి-ప్రజారాజధాని' స్థూల ప్రణాళికను రూపొందించారు. నీలి, ఆకుపచ్చని సమ్మిళిత అమరావతిగా ఉండే విధంగా  బృహత్ ప్రణాళికను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు రూపొందించారు. బృహత్ ప్రణాళికలో 51 శాతం ఆకుపచ్చని ప్రదేశం, 10 శాతం జలభాగం, 14 శాతం రహదారులు, 25 శాతం భవంతుల కట్టడాలు ఉపయోగించే విధంగా రూపొందించడం విశేషం.

 

నేడు పద్మావతి యూనివర్సిటీ స్నాతకోత్సవం

తిరుపతి : నేడు పద్మావతి యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగనుంది. స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరుకానున్నారు. 

అగ్రిగోల్డు బాధిత కుటుంబాలకు పరిహారంపై నేడు సీఎం చంద్రబాబు ప్రకటన

అమరావతి : అగ్రిగోల్డు బాధిత కుటుంబాలకు పరిహారంపై నేడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. 

07:54 - March 23, 2017

హైదరాబాద్ : ఓయూ బీకాం థర్డ్‌ ఇయర్‌ ఆనర్స్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యింది. వారం క్రితం అరోరా కాలేజీలో జరిగిన ప్రి ఫైనల్‌ ప్రశ్నపత్రమే ఫైనల్‌ పేపర్‌గా ఓయూ అధికారులు ఇచ్చారు. ఒక్క ప్రశ్న కూడా తేడా లేకుండా సేమ్‌ టూ సేమ్‌ క్వశ్వన్స్‌ ఉన్నాయి. 

07:52 - March 23, 2017

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌..రంగారెడ్డి..హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో జనార్థన్‌రెడ్డికి 9734 ఓట్లు రాగా..తన ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 5095 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డిపై 4,639 ఓట్ల తేడాతో జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు. 

 

07:49 - March 23, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని AP మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. అగ్రిగోల్డు దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకుతిరుగున్న అగ్రిగోల్డ్‌ నిందితులను పట్టించినవారికి 25 లక్షల రూపాయల బహుమతి ప్రకటించాలని చంద్రబాబునాయుడు సీఐడీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డు దర్యాప్తు ఆలస్యం, బాధితులకు న్యాయంచేయడం, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం వంటి అంశాలపై చర్చించారు. 
అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై నేడు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన 
అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టిన సొమ్ము తిరిగిరాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల వివరాలను సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల వంతున పరిహారం చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేస్తారు. అగ్రిగోల్డ్‌ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. జాప్యానికి దారి తీస్తున్న కారణాలను కోర్టుకు నివేదించాలని కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పించుకు తిరుగున్న అగ్రిగోల్డ్‌ నిందితులను పట్టించినవారికి 25 లక్షల రూపాయల బహుమతి ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  ప్రైవేటు ఆర్థిక సంస్థల్లో పొదపు చేస్తున్న డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు 1999లో చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంస్థల మదుపర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని సవరించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. 
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సహించేదిలేదన్న చంద్రబాబు 
విశాఖ జిల్లా సింహాచలం భూములపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే 
భూములకు విలువలేదని అధికారులు ఫైలు పంపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. తిరుమలలో మిరాసీదారుల వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పై కూడా చంద్రబాబు మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం సమర్ధనీయంకాదని అధికారులను వారించారు. 
మరో కీలక నిర్ణయం 
ఏపీ మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో వంద గజాలలోపు ఇళ్లుకట్టుకున్నవారికి భూమిని క్రమబద్ధీకరించాలని  తీర్మానించింది. ఇలాంటి వారిని గుర్తించి వెంటనే హక్కులు కల్పిచేందుకు చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లోనే దీనిపై బిల్లు  ప్రవేశపెడతారు. ప్రభుత్వ ఆస్పత్రల్లో మరణించినవారి దేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏసీ అంబులెన్స్‌ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బసవతారకం మదర్‌ కిట్‌ పేరుతో బాలింతలకు కిట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనిలో నర్సింగ్‌ కవర్‌, ఫ్లాస్కు, ఆరు శానిటరీ ప్యాడ్లు, రెండు స్కార్ఫ్‌లు,  దుప్పటి ఉంటాయి. ఒక్కో కిట్‌కు 800 రూపాయలు ఖర్చు చేస్తారు. బసవతారకం మదర్‌ కిట్‌ పథకానికి ఏడాది 36 కోట్ల రూపాయలు  అవుతుందని అంచనావేశారు. 
లక్ష్మీ అమ్మాళ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టుకు 150 ఎకరాల భూమి 
ఇక పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నైకి చెందిన లక్ష్మీఅమ్మాళ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు విశాఖలో ఏర్పాటు చేసే యూనివర్సిటీకి 150 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పదేళ్లో 992 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. యూనివర్సిటీ పూర్తిగా అందుబాటులోకి వచ్చే నాటికి 16,731 మంది విద్యార్థులు ఉండేలా ప్రాంగణం ఏర్పాటు చేస్తుంది. ఆక్వా  యూనివర్సిటీ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యాభై ఎకరాల్లో 300 కోట్లుతో ప్రభుత్వ, ప్రైవేటు  భాగస్వామంలో  ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసేందుకు కమిటీ నియమించనున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, ఉత్తరాంధ్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన స్థిరాస్తి చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకు వస్తారు.

07:41 - March 23, 2017

బ్రిటన్ : లండన్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ సాయుధుడు బ్రిటన్‌ పార్లమెంట్‌ ముందే రెచ్చిపోయాడు. ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోగా.. మరో 12 మందిగాయపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే..ఊహంచని ఈ ఘటనతో లండన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్లమెంట్‌లో ఉన్న బ్రిటన్‌ ప్రధాని థెరిస్సాతోపాటు ఎంపీలను భారీ భద్రత నడుమ సురక్షితంగా బయటకు తరలించారు. 
రెచ్చిపోయిన దుండగుడు
లండన్‌ నగరం కాల్పుల కలకలంతో ఉలిక్కి పడింది. బ్రిటన్‌ పార్లమెంట్‌ భవనం హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌ దగ్గర ఓ ఆగంతకుడు గన్‌తో రెచ్చిపోయాడు. ఇష్టానుసారంగా కాల్పులు జరుపుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. ఆగంతకుడి కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు.  మరో 12 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
దుండగుడిని మట్టుబెట్టిన పోలీసులు 
కాల్పులకు తెగబడ్డ దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. దుండగుడిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే అతడు కత్తితో ఓ పోలీసును తీవ్రంగా గాయపర్చాడు. దీంతో అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. సాయుధుడు వెస్ట్‌ మినిస్టర్‌ బ్రిడ్జీపైకి కారులు అతివేగంగా దూసుకెళ్లాడని ప్రత్యక్షసాక్షి చెబుతున్నారు.కారు నుంచి దిగిన వెంటనే పాదచారులపై కాల్పులు జరిపాడని అన్నారు.
కాల్పుల ఘటనతో ఉలిక్కిపడ్డ ప్రజలు 
బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌ దగ్గర కాల్పుల ఘటన జరుగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పైగా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు కాల్పులు జరగడం ఆందోళన కలిగించింది. ఆ సమయంలో ప్రధాని ధెరిసా మే .. హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లోనే ఉన్నారని... ఆమె క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు ఘటన జరిగినప్పుడు పార్లమెంట్‌లో దాదాపు 200 మంది సభ్యులు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరందరినీ  భద్రతా దళాలు సురక్షితంగా తరలించాయి. ప్రధాని థెరిసామేను సిల్వర్‌  జాగ్వార్‌ కారులో తరలించారు. 
హై అలర్ట్‌ 
కాల్పుల ఘటనతో లండన్‌ అంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. తాత్కాలికంగా పార్లమెంట్‌నూ మూసివేశారు.  అయితే కాల్పులు జరిపిన దుండగుడు స్థానికుడా...లేక ఉగ్రవాదా అన్నది తేలాల్సి ఉంది.

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎన్ బీసీ టీవీ 18 బిజినెస్ లీడర్స్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 

 

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనార్ధన్ రెడ్డి విజయం

హైదరాబాద్ : మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. కాటేపల్లి జనార్ధన్ రెడ్డి 9,734 ఓట్లు సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 5,095 ఓట్లు సాధించారు. 

 

ఆల్ నూరు వెటర్నిటీ ఆస్పత్రిలో విషాదం

హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ఆల్ నూరు వెటర్నిటీ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. శ్యామల అనే నర్సు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

 

Don't Miss