Activities calendar

24 March 2017

21:30 - March 24, 2017

హైదరాబాద్: ఎయిర్‌ ఇండియా సీనియర్‌ ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకు శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ను ఎఫ్‌ఐఏ నిషేధించింది. దీంతో ఆయన ఏ ప్రయివేట్‌ విమానంలోనూ ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. ఇవాళ ఢిల్లీ నుంచి పుణెకు వెళ్లాల్సిన గైక్వాడ్‌ విమాన టికెట్‌ను ఇండిగో రద్దు చేసింది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన గైక్వాడ్‌-దమ్ముంటే పోలీసులు తనను అరెస్ట్ చేయాలని సవాల్‌ విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఈయ...

శివసేనకు చెందిన రవీంద్ర గైక్వాడ్‌ సాధారణ వ్యక్తి కాదు పార్లమెంట్‌ సభ్యుడు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఈయన- విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సీటు కోసం విచక్షణ కోల్పోయాడు. ఎయిర్‌ ఇండియా సెక్యూరిటీ అధికారిని 25 సార్లు చెప్పుతో కొట్టాడు. పక్కనే ఉన్న సిబ్బంది ఎంత వేడుకున్నా వెనక్కి తగ్గలేదు. పైగా ఆ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిందకు తోసేందుకు యత్నించాడు.

రోల్‌ మాడల్‌గా ఉండాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే ఎలా...

రోల్‌ మాడల్‌గా ఉండాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ మహిళా అధికారి ఎంపీని సముదాయించే ప్రయత్నం చేశారు. మీరు ప్రజా ప్రతినిధి.... ఇలా చేయడం సబబు కాదు సర్... అంటూ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినప్పటికీ గైక్వాడ్ వెనక్కి తగ్గక పోగా...తన స్థాయిని మరచి మిగతా సిబ్బందిపై చిందులేశాడు...

శివసేన ఎంపీ తీరుపై విమాన సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి

శివసేన ఎంపీ తీరుపై విమాన సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ రవీంద్ర గైక్వాడ్‌ పేరును బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దీంతో ఆయన ఏ ప్రయివేట్‌ విమానంలోనూ ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. ఎయిర్‌ ఇండియా బ్లాక్‌ లిస్టులో చేరిన తొలి వ్యక్తి రవీంద్ర గైక్వాడే కావడం గమనార్హం.

ఇంతజరిగినా...సదరు ఎంపీ పశ్చత్తాపం చెందలేదు...

ఇంతజరిగినా...సదరు ఎంపీ పశ్చత్తాపం చెందలేదు.... క్షమాపణ చెప్పడానికి నిరాకరించడమే కాదు... దమ్ముంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని రవీంద్ర గైక్వాడ్-సవాల్‌ విసిరారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో సదరు ఎంపీకి శివసేన సమన్లు జారీ చేసింది.

21:26 - March 24, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఆయుధాల లభ్యం కలకలం రేపుతోంది. హబీబ్ నగర్‌లో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐసిస్ సానుభూతిపరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో భారీ హింసకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హబీబ్ నగర్, రాజేంద్రనగర్‌లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

21:22 - March 24, 2017

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో లక్ష, గ్రామాల్లో లక్ష ఇళ్లు నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు.

ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని...

ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఆరోపించారు. అదే విధంగా, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎన్నికల హామీనీ ప్రస్తావించారు.

మూడెకరాల భూమి ఇస్తామని ఎవరూ చెప్పలేదు..

అన్ని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని ఎవరూ చెప్పలేదని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ, భూమి లేని దళితులకు మాత్రమే మూడెకరాలు ఇస్తామని చెప్పామని స్పష్టంచేశారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని పదివేల ఎకరాలను దళితులకు పంపిణీ చేస్తామన్నారు.

మతపరమైన రిజర్వేషన్లు వద్దంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన...

అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మతపరమైన రిజర్వేషన్లు వద్దంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయగా వారిపై శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌ రావు ఫైరయ్యారు. ఆందోళన విరమించాలని కోరినా వినిపించకోకపోవడంతో.. స్పీకర్‌ రెండు రోజుల పాటు వారిని సస్పెండ్‌ చేశారు.

సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి గొంతునొక్కేస్తున్నారని ...

సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి గొంతునొక్కేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభపక్షనేత జానారెడ్డి ధ్వజమెత్తారు. నిరసనలు, ఆందోళనలు చేసిన వారిని సస్పెండ్ చేయడం.. ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ఎస్సీ డెవలెప్‌మెంట్ బిల్లుపై సుదీర్ఘ చర్చ ....

ఎస్సీ డెవలెప్‌మెంట్ బిల్లుపై సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును మంత్రి జగదీష్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ బిల్లుకు ఆమోదం తెలిపారు.

21:20 - March 24, 2017

ఢిల్లీ : పసుపు ఎగుమతులు, ఉత్పత్తి పెంపు కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. ఇందుకు సంబంధించి లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును కవిత ప్రవేశపెట్టారు. త్వరలోనే ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగనుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయటం వల్ల చాలా మంది పసుపు రైతులకు మేలు జరుగుతుందన్నారు కవిత. విదేశాల నుంచి వెంటనే పసుపు దిగుమతులను ఆపాలని కోరారు. ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.

చేసిన ఆరోపణలను జగన్ నిరూపించాలి: లోకేష్

అమరావతి: నాపై చేసిన ఆరోపణలను జగన్ నిరూపించాలని చిన బాబు నారా లోకేష్ సవాలు విసిరారు. ఆయన జగన్ చేసిన ఆరోపణలపై ట్విట్టర్లో స్పందిచారు. ఎదుటివారిపై బురదజల్లి పారిపోవడం కాదని, జగన్ పై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ లా వ్యవహరించేందుకు నేను రాజకీయాల్లో రాలేదన్నారు. సభా సంఘాన్ని వృధా చేస్తున్న పనికిరాని ప్రతిపక్ష నేత జగనే అని లోకేష్ విమర్శించారు.

సబ్ ప్లాన్ చట్టానికి 109 సవరణలు చేయాలి: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ తెచ్చిన సబ్ ప్లాన్ చట్టం కంటే ప్రగతి నిధిలో ఎక్కువ మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సబ్ ప్లాన్ చట్టానికి 109 సవరణలు చేయాల్సి ఉందని, రూల్స్ రూపొందించేందుకు ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులతో భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. రూల్స్ రూపకల్పనలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉంటుందని, దళితుల అభివృధ్ధికి సమన్వయంతో పనిచేద్దామన్నారు.

తెలంగాణలో 30 నుంచి లారీల సమ్మె

హైదరాబాద్: డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లారీ యజమానులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో రవాణాకు వీలుగా ఒకే పర్మిట్‌ ఇవ్వాలని, బీమా ప్రీమియం పెంచొద్దని లారీ యజమానులు డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా డీజిల్‌ ధరలు తగ్గించాలని, లారీ యజమానులకు, డ్రైవర్లకు ఉచిత బీమా కల్పించాలన్న తదితర 6 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేశారు. సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర లారీలు స్తంభించనున్నాయి.

నీట్ విద్యార్థులకు శుభవార్త...

ఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విద్యార్థులకు శుభవార్త. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్స్‌లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న నీట్‌ను మరో 23 నగరాల్లో నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. నీట్-2017కు రికార్డు స్థాయిలో 11.35 లక్షల మంది నమోదు చేసుకున్నారని తెలిపింది. నీట్‌ను ఇప్పటి వరకు 80 నగరాల్లో నిర్వహించినట్లు, ఈ ఏడాది పరీక్షార్థుల సంఖ్య పెరిగినందువల్ల మరో 23 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనా చారి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లును సభ ఆమోదించింది.

20:07 - March 24, 2017

హైదరాబాద్: ఆగానికి వచ్చిన అన్నదాత బతుకు....ఎండిపోతున్న పంటలు, అందని నీళ్లు, తోటి ఉద్యోగినికి తొంటి మెసేజ్ లు.. తీర్చాలన్న సారువారి మోజులు, చిరిగిపోతున్న సిర్పూర్ కత్తుల వర...చూడలేకపోతున్నరట లీడర్లు ఆడ, అమ్మా, నాన్న చిన్నపుడే సచ్చిపోయిండ్రు...బతుకుండి జీవశ్చవం అయిన పోలగాని పిచ్చి గోస, న్యాయాన్ని అమ్మేస్తున్న పోలీసు అధికారి...కడుపుకు పెండ తింటున్నావురా వారి, తిరుమల కొండెక్కిన నర్శింహన్ సారూ...రెండు మాట్లు దర్శించుకున్న గవర్నర్ ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుచు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పాతబస్తీ లో భారీగా ఆయుధాలు స్వాధీనం...

హైదరాబాద్ : పాతబస్తీలో గల హబీబ్ నగర్ లో ఇద్దరు యువకుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో హబీబ్ నగర్, రాజేంద్రనగర్ లో అసాంఘీక కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు, భారీ ఎత్తున ఇద్దరు యువకుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అవి ఎయిర్ గన్స్ అని చెబుతున్న పోలీసులు..వారివద్ద నుంచి విదేశాల నుంచి కాల్ చేసినట్టు రూపించే రూటర్ లు, ల్యాప్ ట్యాప్ ఇతర సాంకేతిక పరికరాలు చూసి ఆశ్చర్యపోయారు. వారేం చేస్తున్నారు? వారి అసలు వ్యూహమేంటి? ఇంత ఖరీదైన ఇన్ని ఎయిర్ గన్ లు ఎందుకు ఉంచుకున్నారు? వంటి వివరాలు ఆరాతీయనున్నట్టు తెలుస్తోంది.

షారూఖ్ ఖాన్, జూహీ చావ్లాకు ఈడీ నోటీసులు

హైదరాబాద్: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, నటి జూహీ చావ్లాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వీరిద్దరితోపాటు ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం మొత్తానికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్: టీమిండియా మొత్తం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, ఛతేశ్వర పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ.

మధ్యదార సముద్రంలో బోటు మునిగి 11 మంది మృతి

హైదరాబాద్ : ఐరోపాలోని మధ్యదార సముద్రంలో బోటు మునిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా మరి కొందరు గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

లోక్ సభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపి కవిత

ఢిల్లీ: పసుపు ఎగుమతులు, ఉత్పత్తి పెంపు కోసం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. ఇందుకు సంబంధించి లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎంపీ కవిత ప్రవేశపెట్టారు.

19:45 - March 24, 2017
19:25 - March 24, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీ అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని విపక్షం, అధికార పక్షం మధ్య సవాళ్లు,గత రెండు రోజులుగా ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. అస్సలు సభలో వైసీపీ ప్రవర్తించిన తీరు, అధికార పక్షం ప్రవర్తిస్తున్న తీరుతో బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇదే అంశంపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో అగ్రి గోల్డ్ బాధితుల సంఘం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు,, టిడిపి నేత ప్రభాకర్ చౌదిరి, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:51 - March 24, 2017

హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకున్న క్రేజ్ తో, తన స్టార్ డమ్ కు ఉన్న పవర్ తో కాసుల వర్షం కురిపించే స్టార్ హీరో పవన్ కల్యాణ్. గత సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ కొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాలు అందించడానికి, అభిమానులను అలరించడానికి కాటమ రాయుడుగా పంచె కట్టి కత్తి పట్టి థియేటర్స్ లోకి వచ్చాడు. టీజర్ ట్ర్రైలర్స్ తో తన ప్రభంజనాన్ని చూపించిన పవర్ స్టార్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్స్ అందుకున్నాడో చూద్దాం..

కథ విషయానికి వస్తే నలుగురు అనాధలను చేరదీసి, తన తమ్ముళ్ళుగా చాలా ప్రేమగా చూసుకుంటాడు కాటమరాయుడు. కాని చిన్న తనంలో జరిగిన ఓ సంఘటన వలన లవ్ అన్నా, అమ్మాయి అన్నా అస్సలు పడదు కాటమరాయుడికి. అయితే అతని తమ్ముళ్లు మాత్రం లవ్ లో పడతారు. అన్నయ్యను ఎదురించి పెళ్లి చేసుకోకూడదు అని ముందుగా కాటమరాయుడిని లవ్ ట్రాక్ లోకి లాగడానికి ట్రై చేస్తారు అతని తమ్ముళ్లు. అందుకోసం అవంతికా అనే క్లాసికల్ డాన్సర్ ను ఎంచుకుంటారు. అన్యాయాన్నిచూసి సహించలేని కాటమరాయుడికి వైలెన్స్ అంటే ఆమడ దూరంలో ఉండు అవంతికాకు ప్రేమ పుట్టిందా.... ఆ ప్రేమ సక్సెస్ కావడానికి వీళ్శిద్దరిలో ఎవరు తమ స్వభావాన్ని మార్చుకున్నారు. వైలెన్స్ తో సాగిపోయిన గతం అతనికి, అతని ప్రేమకి ఎలాంటి ప్రోబ్లమ్స్ ను క్రియేట్ చేసింది. వాటిని కాటమ రాయుడు ఎలా ఎదుర్కుని హిరోగా ఎలా నిలబడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...

నటీ నటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన బుజాలపై వేసుకుని అభిమానులు కోరుకునే అంశాలతో పాటు ఆడియన్స్ ఎక్స్ పర్డ్ చేసే ఎలిమెంట్స్ మిక్స్ చేసి, అన్ని వేరియేషన్స్ ను నీట్ గా ప్రజంట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ పవన్ కల్యాణే... గబ్బర్ సింగ్ లో ఆడియన్స్ నుఅలరించిన శృతి హాసన్ ఈ సినిమాలో మాత్రం నటన పరంగా, ఎపీరియన్స్ పరంగా కూడా అంత ఇంప్రెసీవ్ గా అనిపించలేదు. గ్లామర్ పరంగా మాత్రం కొంచెం ఓవర్ డోస్ ఇచ్చింది. అలాగే ఎప్పుడూ ఫిట్ గా ఉండే శృతీ హాసన్ సినిమాలో బొద్దుగా షేప్ అవుట్ గా కనిపించింది. ఇక పవన్ తమ్ముళ్ళుగా నటించిన అజయ్, శివబాలాజి, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తమ క్యారక్టర్స్ పరిది మేరకు న్యాయం చేశారు. ఆలీ పంచెస్ వర్కౌట్ అయ్యాయి. పృధ్వీ క్యారక్టర్ రొటీన్ గా ఉన్నా ఓకే అనిపిస్తుంది. ఇక నాజర్, అతని కుటుంబం అంతా గ్రాండ్ ఇయర్ కోసం పెట్టిన సెటప్ లా కనిపిస్తుంది. రావు రమేష్ క్యారక్టర్, ఆ క్యారక్టర్ లో అతని నటన కొత్తాడా ఉంది. విలన్స్ ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా... తమ క్యారక్టర్లలో తేలిపోయారు...

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ మార్కులు వేయించుకుంది సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ. సినిమా కంటెంట్ ను డ్రైవ్ చేసుకుని పవన్ ప్రజెంటేషన్ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టాడు. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ నెస్ తీసుకు వచ్చింది. రామ్ లక్ష్మన్ ఫైట్స్ పవన్ ఫాన్స్ తో పాటు, మాస్ ఆడియన్స్ అందరిని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తాయి.... అనూప్ రుబెన్స్ సంగీతం అప్ టూ ద మార్క్ లేదు అనేది అందరూ ఒప్పుకుకే నిజం... పాటలు అంతత మాత్రంగానే ఉన్నాయి... ఆర్ ఆర్ పర్వాలేదు అనిపించినా కంటెంట్ ను పూర్తిగా ఎలివేట్ చేయలేకపోయింది. డాన్స్ లుఅన్నీ పవన్ కల్యాణ్ స్టెప్ లతో.. శృతీ హాసన్ గ్లమరస్ లుక్ తో అలా అలా సాగిపోయారు.. పవన్ తో ఇంతకు ముందు గోపాల గోపాల తీసిన డైరక్టర్ డాలి, ఈ సారి కూడాపవన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ అన్ని విషయాలలో పుల్ ప్లజ్డ్ గా నడిపించిన డాలి. సెకండ్ ఆఫ్ విషయంలో తడబడ్డాడు అని చెప్పాలి. యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎమోషన్స్ పై ఇంకొంచె కేర్ తీసుకుని ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యేది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ చాలా బావున్నాయి...

ఓవర్ ఆల్ గా సమ్మర్ సీజన్ ను స్టార్ట్ చేసి కాటమ రాయుడు, టాక్ పరంగా కొంచెం అటూ ఇటూ ఉన్నా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులపడం కాయం.. ఎందుకంటే ఫాన్స్ పండుగ చేసుకునే అంశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యేలా, అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా సెట్ అయ్యాయి...

ప్లస్ పాయింట్స్

పవన్ స్క్రీన్ ప్రజెంట్స్

కామెడీ

ఫైట్స్

ప్రొడక్షన్ వ్యాల్యూస్


 

మైనస్ పాయింట్స్

బలం లేని ఎమోషన్స్

సాంగ్స్

సెకండ్ ఆఫ్ స్క్రీన్ ఫ్లే

రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:13 - March 24, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్ పెద్ద స్కాం అని ఆస్కాంలో పెద్దల హస్తం ఉందని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ స్కాంపై మాట్లాడుతుంటే మైక్ ను కట్ చేశారన్నారు. 20 నిమిషాలు సమయం ఇవ్వండి ఆధారాలు బయటపెడతానన్నా సమయం ఇవ్వలేదు. నేనో లేక పుల్లారావో ఎవరో ఒకరే సభలో ఉండాలట, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తీర్మానాలు, సవాళ్లతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. హాయ్ లాండ్ ను ఎందుకు వేలం వేయడం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను గద్దల్లా తన్నుకుపోయారని, ఆ గద్దలపై ఎంక్వైరీ చేసి ఆస్తులను కూడా వేలం వేసి డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వాలన్నారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందన్నారు.

17:44 - March 24, 2017

యాదాద్రి భువనగిర : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తిరందాసు గోపి అకాల మరణం పార్టీకి తీరని లోటని.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరందాసు గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపి మంచి కమ్యూనిస్టు అని... ఆయన మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటన్నారు.

17:41 - March 24, 2017

హైదరాబాద్ : దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని సీపీఎం ఎమ్మెల్మే సున్నం రాజయ్య అన్నారు. పోడు భూములను అక్రమంగా లాక్కుని గిరిజనులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. అలాగే ఉద్యోగాల నియామకాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు.

17:40 - March 24, 2017

కృష్ణా: అమెరికాలో విజయవాడ పోరంకి లక్ష్మీనగర్‌కు చెందిన శశికళ, ఆమె ఏడేళ్ళ కుమారుడు హనీష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తన కుమార్తె శశికళను, మనవడు హనీష్‌ను అల్లుడు హనుమంతరావు హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హనుమంతరావు మరో మహిళతో వివాహేర సంబంధం పెట్టుకుని... భార్య, కుమారుడిని హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. తమ కూతురును నిత్యం కొట్టి... వేధించేవాడని శశికళ తమకు ఫోన్ చేసి చెప్పేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

గోదావరి పంప్ హౌస్ ఎక్కిన 7గురు యువకులు

రాజమండ్రి : ఏడుగురు యువకులు గోదావరి పంప్ హౌస్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు కాలుష్యాన్ని అరికట్టాలని, స్థానికులకు ఉద్యోగాల హామీల నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మళ్లీ విధుల్లో చేరిన శశాంక్ మనోహరే

ముంబై : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మళ్లీ ఛైర్మన్‌గా విధుల్లో చేరారు. ఐసీసీ బోర్డు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మనోహర్‌ని కోరడంతోఆయన మళ్లీ బాధ్యతలు స్వీకరించారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్లు పెరిగి 29,421 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 9,108 వద్ద ముగిసింది.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా..

అమరావతి:ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రతిపక్ష నేత జగన్‌ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ శాసనసభ తీర్మానం అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. అంతకుముందు దీన్ని ఆర్థికమంత్రి యనమల సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.

'పథకం ప్రకారమే కుతురు, మనవడి హత్య'

విజయవాడ: అమెరికాలో శశికళ, కుమారుడి హత్య పథకం ప్రకారమే జరిగిందని శశికళ తల్లిదండ్రులు కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు ఆరోపించారు. అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకుని తమ కూతురిని, మనువడిని హతమార్చాడని తెలిపారు. హత్యలో శశికళ అత్తా, మామలకు పరోక్ష ప్రమేయం ఉందన్నారు.

16:38 - March 24, 2017

అమరావతి: 20నిముషాలు టైం ఇవ్వండి.. ఆధారాలు సభ ముందు ఉంచుతామని విపక్షనేత జగన్‌ స్పీకర్‌ను కోరారు. అయితే.. ముందు జుడిషియల్‌ ఎంక్వైరీకి ఒప్పుకుంటున్నారా.. లేదా.. అనేది తేల్చాలని.. లేదంటే జగన్‌ కు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని మంత్రి అచ్చెన్నాయడు అడ్డు తగిలారు. దీంతో ఆధారాలుంటే విచారణ సంఘం ముందు ఉంచొచ్చు.. ముందు మంత్రి పుల్లారావు సవాల్‌ను స్వీకరిస్తున్నారా లేదా.. తేల్చాని స్పీకర్‌ కూడా జగన్‌కు సూచించారు. దీంతో అయోమయంలో పడిన విపక్షనేత .. ముందు మాట్లాడే అవకాశం ఇవ్వండని పదే పదే అభ్యర్థించినా.. స్పీకర్‌ నిరాకరించారు.

ఎంక్వైరీకి డిమాండ్‌చేసి.. వెనక్కు తగ్గడం విపక్షనేతకు అలవాటైంది - మంత్రి యనమల

ఎంక్వైరీకి డిమాండ్‌చేసి.. వెనక్కు తగ్గడం విపక్షనేతకు అలవాటైందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నకిలీ పేపర్లు పట్టుకుని సభలో గందరగోళం చేయడం తప్ప.. నిజాలు అంటూ ఏవీ లేవని యనమల ఎద్దేవా చేశారు

జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి మాణిక్యాలరావు....

అటు బీజీపీ ఎమ్మెల్యే , మంత్రి మాణిక్యాలరావు కూడా జగన్‌ను టార్గెట్‌ చేశారు. మంత్రి పుల్లారావుపై చేసిన ఆరోపణలను నిరాధారమన్నారు. ఒక వ్యక్తి పరువుకు భంగకరంగా ఆరోపణలు చేయడం తగదన్నారు మంత్రి మాణిక్యాలరావు. మడమతిప్పని నాయకుని కొడుకునని చెప్పుకుంటూ.. ఇలా అనవరమైన ఆరోపణలు చేస్తూ.. సభాసమయాన్ని వృధా చేస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు.

నవ్వులు పూయించిన విష్ణుకుమార్ రాజు....

టీడీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు శాసనసభలో నవ్వులు పూయించారు. జగన్‌ వ్యవహరాశైలిపై మాట్లాడుతూ.. జగన్‌కు సీఎం కావాలనే ఆశ ఉన్నట్టే.. తనకు కూడా సన్నబడిపోవాలని ఆశ ఉందన్నారు. కాని నేను లావుతగ్గలేను..జగన్‌ సీఎంకాలేరు..అనగానే ఒక్కసారిగా సభలో నవ్వులు విరిసాయి. ఇదే సమయంలో సభలోనే ఉన్న సీఎం చంద్రబాబుకూడా ఒక్కసారిగా నవ్వేశారు.

 

16:36 - March 24, 2017

కృష్ణా : విజయవాడలో వీఆర్‌ఏలు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని రైల్వే స్టేషన్‌ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా ర్యాలీ చేసి...భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విధంగా తమకూ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

16:34 - March 24, 2017

కర్ణాటక : ఆసుపత్రి సిబ్బంది ఆగడాలు నానాటికి శృతి మించుతున్నాయి. నలుగురు గర్భిణి స్త్రీలను ఒకే స్ట్రెచర్‌పై కూచోపెట్టి తీసుకెళ్లిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. నలుగురు గర్భిణులు నెలలు నిండడంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించడంతో ఆస్పత్రి సిబ్బంది వీరిని థియేటర్‌కు తరలించారు. అయితే స్ట్రెచర్‌పై ఒక్కొక్కరినీ జాగ్రత్తగా తీసుకెళ్లాల్సింది పోయి నిర్లక్ష్యంతో నలుగురినీ ఒకే స్ట్రెచర్‌పై కూచోపెట్టి తీసుకెళ్లారు. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన కిమ్స్‌ అధ్యక్షుడు శివప్ప దర్యాప్తుకు ఆదేశించారు.

16:33 - March 24, 2017

ఢిల్లీ: ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకు శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ తగిన మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఆయన పేరును బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దీంతో ఆయన ఏ ప్రయివేట్‌ విమానంలోనూ ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. ఎయిర్‌ ఇండియా బ్లాక్‌ లిస్టులో చేరిన తొలి వ్యక్తి రవీంద్ర గైక్వాడే కావడం గమనార్హం. మరోవైపు క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన రవీంద్ర గైక్వాడ్- దమ్ముంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని సవాల్‌ విసిరారు. తన‌కు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వలేద‌న్న కార‌ణంతో రవీంద్ర...ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టడం వివాదాస్పద‌మైంది.

16:30 - March 24, 2017

భూపాలపల్లి : అడవి పందులను తింటే ప్రజలపై ఎలాంటి కేసులు ఉండవన్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మురళి. ఏఎన్‌ఎంలు, ఆశాలు అడవి పందులను తినాలని, ప్రచారం చేయాలి సూచించారు.

16:12 - March 24, 2017

అమరావతి: రాయలసీమలో తప్పు చేస్తే గౌరవంగా ఒప్పుకుంటామని... లేదంటే సై అంటూ ముందుకు వెళతామని జగన్ మాత్రం రణం లేదు.. శరణం లేకుండా పలాయనం చిత్తగించాడని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... డబ్బులు తీసుకుని పార్టీలు మారామని జగన్ ఆరోపించారని, మరో సారి అంటే కేసు వేస్తామని హెచ్చరించారు. జగన్ కు జ్యుడిషరీ ఎంక్వయిరీ అంటే భయమని పేర్కొన్నారు. తన మంత్రి వర్గంలో ని మంత్రి పై జ్యుడీషరీ ఎంక్వయిరీకి ఓప్పుకున్న సీఎం ఒక్క చంద్రబాబు మాత్రమే అన్నారు. జగన్ వ్యవహార శైలి నచ్చకే 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారని విమర్శించారు.

15:36 - March 24, 2017

అమరావతి: వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి జగన్ అని కళా వెంకట్రావు అన్నారు. ఏప అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉండడం అటు ప్రజలకు, ఇటు సభకు దురదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు. జ‌గ‌న్ అక్ర‌మాల గురించి ప్ర‌జ‌లు టీవీల్లో చూస్తూనే ఉన్నారని చెప్పారు. ఇటువంటి క్యారెక్ట‌ర్ ఉన్న‌వారు అసెంబ్లీలో ఉండ‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. కొడుకులు ఎటువంటి ప‌నులు చేసినా త‌ల్లికి త‌ప్ప‌దు కాబ‌ట్టి జ‌గ‌న్ త‌ల్లి భ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. తండ్రి అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ ఎన్నో అక్ర‌మాలకు పాల్పడ్డారని అన్నారు.

15:32 - March 24, 2017

అమరావతి : తండ్రి బుద్ధలతో పాటు తాత బుద్ధులు కూడా విపక్ష నేతకు వచ్చాయని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం పై ఆయన మాట్లాడుతూ... స్పీకర్ పై ఏ హక్కుతో అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెడతారని ప్రశ్నించారు.

సభలో జగన్ వైఖరికి నిరసనగా తీర్మానం

అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత వైఖరి వల్ల అత్యంత విలువైన రెండు రోజుల సభాసమయం వృథా అయిందని విమర్శించారు.

సవాల్ ను స్వీకరిస్తారా? లేదా? : స్పీకర్

అమరావతి: అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన సవాల్‌ను అంగీకరిస్తారో? లేదో? చెప్పాలని ప్రతిపక్ష నేత జగన్‌ను స్పీకర్‌ అడిగారు. ఉదయం నుంచీ ఈ అంశంపైనే రాద్ధాంతం జరుగుతున్నా పట్టించుకోకపోవడం తగదని సూచించారు.

14:32 - March 24, 2017

ఢిల్లీ : పసుపు రైతులను ఆదుకునేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నామని తెలంగాణ ఎంపీ కవిత అన్నారు. ఇందులో భాగంగా పసుపు టర్మిరీ బోర్డును పెట్టాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశ పెట్టబోతున్నట్టు కవిత చెప్పారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే ముందే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ సీఎంల మద్దతు కోరుతూ వారికి లేఖలు కూడా రాశామని కవిత చెప్పారు.

14:31 - March 24, 2017

అమరావతి: సవాళ్లు-ప్రతిసవాళ్లతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. గతంలో ప్రతిపక్ష నేత జగన్‌ విసిరిన సవాళ్లనూ అధికారపక్షం స్వీకరించాలని.... వైసీపీ నేత పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలోకి చేర్చుకున్న విషయంపైనా చర్చకు ఆయన డిమాండ్ చేశారు..

సవాల్‌ను స్వీకరించి ఉండేవాడినని...

ప్రతిపక్ష నేత జగన్‌ స్థానంలో తానుఉండిఉంటే తప్పకుండా సవాల్‌ను స్వీకరించి ఉండేవాడినని... బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు.. చాలెంజ్‌ను స్వీకరించే పరిస్థితిలో జగన్‌లేరని.. కనీసం తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని ఒప్పుకుంటే చాలని స్పష్టం చేశారు.. ఏడాది సస్పెన్షన్‌తర్వాతకూడా రోజాలో ఎలాంటిమార్పు రాలేదని... బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు విమర్శించారు.. సభ్యులు మాట్లాడుతుండగా వెనకనుంచి రన్నింగ్‌ కామెంట్రీ చేస్తున్నారని ఆరోపించారు.. తన వెనకసీటులో రోజా కూర్చుకున్నారని... ఆమె తన సీటులోకి వెళ్లి కూర్చుంటే బావుంటుందని సూచించారు..

మరణమో... శరణమో తేల్చుకోవాలి:పల్లె...

ప్రతిపక్ష నేత జగన్‌... మరణమో... శరణమో తేల్చుకోవాలన్నారు.. మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి.. జగన్‌లాంటి నోటిదురుసుఉన్నవారు చరిత్రలో బాగుపడిన దాఖలాలులేవని తీవ్రస్థాయిలో విమర్శించారు.. జగన్‌ తన మాటతీరు మార్చుకోవాలని సూచించారు..

శరణమో, రణమో తేల్చుకోవాలి: అచ్చెన్నాయుడు....

తమకు సమయం లేదని... శరణమో, రణమో తేల్చుకోవాలంటూ ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్‌ విసిరారు... అచ్చెన్నాయుడు.. చాలెంజ్‌కు స్వీకరిస్తున్నారో, లేదో త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు.. ఆ తర్వాత మరో సబ్జెక్టుపై చర్చకు వెళ్లాలని స్పీకర్‌ను కోరారు.. అగ్రిగోల్డ్‌ భూములపై జగన్‌ స్పందిస్తుండగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి అచ్చెన్నాయుడుకు అవకాశం ఇచ్చారు.. జగన్‌గానీ, ప్రత్తిపాటిగానీ చెప్పేదేమీలేదని... సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదో తేల్చాలని అచ్చెన్నాయుడుమరోసారి డిమాండ్ చేశారు..

సవాల్‌ను స్వీకరిస్తున్నారా? లేదా?- స్పీకర్‌...

మంత్రి ప్రత్తిపాటి సవాల్‌ను స్వీకరిస్తున్నారో, లేదో చెప్పాలని స్పీకర్‌ కోడెల కూడా జగన్‌కు సూచించారు.. అంగీకరిస్తున్నారో, లేదో ఏదో ఒకటి తేల్చాలన్నారు.. ఆ తర్వాత వేరే సబ్జెక్టులోకి వెళదామని చెప్పారు..

న్యాయవిచారణ అంటే ఎందుకు అంత భయం...

న్యాయ విచారణ అంటే వైసీపీ సభ్యులకు భయం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే నిరూపించడానికి ఎందుకు సంకోచిస్తున్నారని నిలదీశారు. జగన్‌ పదవికి ఎసరొస్తుందన్న పిరికితనం మంచిదికాదని.. పుల్లారావు సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

జగన్‌ నిజంగా రాయలసీమ బిడ్డ అయితే...

జగన్‌ నిజంగా రాయలసీమ బిడ్డ అయితే మంత్రి ప్రత్తిపాటి చాలెంజ్‌కు ఒప్పుకొనితీరాలని మంత్రి పీతల సుజాత సవాల్‌ విసిరారు.. సవాల్‌కు స్పందించమంటే పారిపోతున్నారని ఆరోపించారు.. సమయంలేదు ప్రతిపక్షమా, ఏదో ఒకటి తేల్చుకోవాలని సూచించారు.. సభ ప్రారంభంనుంచీ సభ్యుల నినాదాలు కొనసాగడంతో సభ మరోసారి వాయిదాపడింది..

ప్రత్తిపాటి.. రాజీనామాకు సిద్ధంగా ఉండు : చెవిరెడ్డి

గుంటూరు : అగ్రిగోల్డు భూముల్ని కొన్నట్లు పాస్ పుస్తకాలున్నాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. పాస్ పుస్తకాలను స్పీకర్ కు ఇస్తున్నామని తెలిపారు. ఇంతకన్నా ఇంకా ఏం ఆధారాలు కావాలి అని ప్రశ్నించారు. మంత్రి ప్రత్తిపాటి తన రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు.

14:14 - March 24, 2017

కర్నూలు : జిల్లాలోని డోన్ మండలంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. మున్సిపాలిటీ వేలంపాటలో ఇరు పార్టీల నేతలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో నలుగురు వైసీపీ నాయకులక తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

14:02 - March 24, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ అధికార, ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. జగన్ శరణమా... రణమా తేల్చుకోవాలని అధికార పక్షం నేతలు సవాల్ విసిరారు. ప్రత్తిపాటి పుల్లారావు చేసిన ఆరోపణలను జగన్ రుజువు చేయాలి...లేదా తప్పైందని క్షమాపణ చెప్పి..ఆరోపణలను ఉపసంహరించుకోవాలి అన్నారు. జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూడిషియల్ ఎంక్వరీ వేయాలని ప్రతిపక్షమే అడిగిందన్నారు. సవాలు విసిరింది ప్రతి పక్షమే అని చెప్పారు. జగన్ శరణమా..? రణమా...? తేల్చుకోవాలని సవాల్ విసిరారు. జగన్ మంత్రి ప్రత్రిపాటి సవాల్ ను స్వీకరించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. కనీసం తన వ్యాఖ్యలు వెనక్కితీసుకుంటానని చెప్పమనండని తెలిపారు. జగన్ తన వ్యాఖ్యలు అవాస్తవమని ఒప్పుకుంటే చాలని అన్నారు. మరణమో, శరణమో జగన్ తేల్చుకోవాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సవాల్ విసిరిరారు. జగన్ కు నోటి దురుసు చాలా ఎక్కువని మండిపడ్డారు. నోటి దురుసు ఉన్నవారు చరిత్రలో ఎక్కడా బాగుపడలేదన్నారు. జగన్ తన మాట తీరు మార్చుకోవాలన్నారు. జగన్ పుల్లారావు సవాన్ ను స్వీకరించాలనిసీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే ఆరోపణలు నిరూపించాలన్నారు. జగన్ పదవికి ఎసరొస్తుందన్న పిరికితనం మంచిదికాదన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ పై జగన్ సమాధానం చెప్పాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సవాల్ ను స్వీకరిస్తున్నారా.. లేదా చెప్పాలని అడిగారు. ఏదో ఒక విషయం తేల్చండి అని చెప్పారు. సభలో సంప్రదాయాలు పాటించాలని పెద్దిరెడ్డి అన్నారు. 

13:50 - March 24, 2017
13:40 - March 24, 2017

గుంటూరు : జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూడిషియల్ ఎంక్వరీ వేయాలని ప్రతిపక్షమే అడిగిందన్నారు. సవాలు విసిరింది ప్రతి పక్షమే అని చెప్పారు. జగన్ శరణమా..? రణమా...? తేల్చుకోవాలని సవాల్ విసిరారు.
 

13:20 - March 24, 2017

గుంటూరు : అగ్రిగోల్డు భూముల్ని కొన్నట్లు పాస్ పుస్తకాలున్నాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. పాస్ పుస్తకాలను స్పీకర్ కు ఇస్తున్నామని తెలిపారు. ఇంతకన్నా ఇంకా ఏం ఆధారాలు కావాలి అని ప్రశ్నించారు. మంత్రి ప్రత్తిపాటి తన రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. 

 

13:07 - March 24, 2017
13:06 - March 24, 2017

గుంటూరు : అధికార, ప్రతిపక్షాలతో సవాళ్లపై సభ వేడెక్కింది. సవాళ్లను స్వీకరిస్తారా ? లేదా ? తేల్చి చెప్పాలని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు అన్నారు. పోడియం వద్దకు వైసీపీ సభ్యులు దూసుకొచ్చారు. అధికారపక్షం సీట్ల వద్దకు విపక్ష సభ్యులు చేరుకున్నారు. అర్థం లేకుండా గొడవ చేస్తున్నారని చెవిరెడ్డితో చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బయటకు రా రా చూసుకుందామని చెవిరెడ్డి అన్నారు. చింతమనేని, చెవిరెడ్డి పరస్పరం దూసుకెళ్లారు. చింతమనేనికి ప్రభాకర్ చౌదరి జతకట్టారు. శివప్రసాద్ రెడ్డి చెవిరెడ్డికి మద్దతిచ్చారు. సభ వాయిదా అనంతరం కూడా అధికార, విపక్ష సభ్యులు వాగ్వాదం చేసుకున్నారు. గందరగోళం మధ్య సభ వాయివా పడింది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద యుద్ధ వాతారణం నెలకొంది.  

 

12:45 - March 24, 2017
12:44 - March 24, 2017

గుంటూరు : అగ్రిగోల్డు ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. తమ ఛాలెంజె కు సిద్ధమా అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఛాలెంజ్ కు సిద్ధం కాకుంటే చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై తమ వైఖరేంటో చెప్పాలని జగన్ కు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డు భూముల్లో బినామీలు ఎవరో తేల్చాలని జగన్ అన్నారు. 
సభలో గందరగోళం కొనసాగింది. దీంతో సభ రెండో సారి వాయిదా పడింది.  

8900 టీచర్ పోస్టులు భర్తీ : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ప్రభుత్వ పాఠశాలలో 8900 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

12:31 - March 24, 2017

ఇది శాసన సభా..లేక కౌరవ సభా: చెవిరెడ్డి

గుంటూరు : ఇది శాసనసభా.. లేక కౌరవ సభా అర్ధం కావట్లేదని వైసీపీ ఎమ్మోల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాన్ని తిట్టేవారికే స్పీకర్ మైక్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. అధికార పక్షం సవాల్ కు జగన్ జవాబు చెబుతారని కానీ ఆయన సమాధానం చెప్పేందుకు మైక్ ఇవ్వట్లేదని చెవిరెడ్డి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన చూస్తే అసహ్యం వేస్తోందని ఆయన అన్నారు. పత్తిపాటి అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు జారీ చేశారని, వాటిని స్పీకర్ కు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

12:30 - March 24, 2017

గుంటూరు : వైసీసీ సభ్యుల తీరు సరికాదని టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఓటుకునోటు రాష్ట్రానికి సంబంధించింది కాదన్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. 

12:16 - March 24, 2017

గుంటూరు : రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఆందోళన చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రతిపక్ష సభ్యుల తీరు సరికాదన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని తెలిపారు.

 

12:12 - March 24, 2017

గుంటూరు : జగన్ ఆర్థిక ఉగ్రవాది అని టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యరావు ఘాటుగా విమర్శించారు. జగన్ కు మానవత్వం లేదన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్న నేరస్తుడని చెప్పారు. జగన్ కు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

12:04 - March 24, 2017

గుంటూరు : 16 నెలలు జైల్లో ఉన్న దొంగ ప్రతిపక్ష నాయుకుడు కావడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైసీపీ నేతలు కేసుల గురించి మాట్లాడడం ఆశ్యర్యంగా ఉందన్నారు. 

చెవిరెడ్డి, చింతమనేని బాహాబహీ...

గుంటూరు : ఏసీ అసెంబ్లీ వాయిదా అనంతరం కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సవాళ్ల, ప్రతి సవాళ్లతో సభ వేడెక్కింది. సవాళ్లు స్పీకరిస్తారా? లేదా? తేల్చి చెప్పాలని మంత్రులు పుల్లరావు, అచ్చెన్నాయుడు.. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ప్రశ్నించారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. అక్కడ నుండి అధికారపక్షం సీట్ల వద్దకు చేరారు. వెంటనే చింతమనేని.. చెవిరెడ్డిని అర్ధం లేని గొడవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో చెవిరెడ్డి బయటకు రారా! చూసుకుందామని చింతమనేనికి సవాళు విసిరారు. ఇద్దరు పరస్పరం కొట్టుకున్నంతా పని చేశారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు.

 

11:52 - March 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. బీజేపీ నేతలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సీ బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సమయంలో మత పరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్, మంత్రి ఎంత చెప్పినా వినుకుండా ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ బీజేపీ సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కిషణ్ రెడ్డి, లక్ష్మణ్, ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్ రెడ్డి, డి.రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డిలను సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. 

 

11:41 - March 24, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో తాను ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు నినాదాలు చేపట్టారు.  ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తమ సవాల్ ను స్వీకరిస్తున్నారా లేదా..? చెప్పాలన్నారు. జగన్ తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 
అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో సభలో గందరగోళం నెలకొంది. 

 

11:33 - March 24, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు సందడి మొదలైంది. ఇవాళ భారీ అంచనాలతో కాటమరాయుడు విడుదలవుతోంది. థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ కోళాహలం చేస్తున్నారు. పోస్టర్స్ కు అభిమానులు పాలాభిషేకం చేస్తున్నారు. అభిమానులు పంచ కట్టుతో థియేటర్లకు వచ్చారు. సినిమా వెయ్యి రోజులు పక్కాగా ఆడుతుందని చెప్పారు. ఉగాది పండుగ నాలుగు రోజుల ముందే వచ్చిందన్నారు. కాబోయే ఎమ్మెల్యే, మంత్రి, సీఎం పవన్ అని అన్నారు. 

 

11:29 - March 24, 2017

వాషింగ్టన్ : అమెరికాలో జాత్యాహంకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం జరిగింది. తెలుగు వారు హత్య గావించబడ్డారు. న్యూజెర్సీలో తల్లీకొడులను దుండుగులు హత్య చేశారు. ప్రకాజం జిల్లా తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హన్మంతరావు కుటుంబం యూఎస్ లో స్థిరపడ్డారు. ఆయనతోపాటు భార్య శశికళ, కమారుడు హనీష్ సాయి ఉంటున్నారు. ఈనేపథ్యంలో హన్మంతరావు ఆఫీసు నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో అతని 
భార్య శశికళ, కొడుకు హనీష్ దారుణంగా హత్య గావించబడ్డారు. ఈ హత్యపై ఎమ్మెల్యే సాంబశివరావు తానా ప్రతినిధులతో  సంప్రదింపులు జరుపుతున్నారు. 

బయటకు రా తేల్చుకుందాం...

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ సభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, టీడీపీ సభ్యుడు చింతమనేని ప్రభాకర్ పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. బయటకు వెళ్లి తేల్చుకుందాం రా అంటూ ఇద్దరు నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. అక్కడే ఉన్న ఇరు పార్టీల నేతలు సముదాయించడంతో గోడవ సద్దుమనిగింది.

11:02 - March 24, 2017
10:52 - March 24, 2017

గుంటూరు : రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. గుంటూరు మిర్చియార్డులో రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలను బ్లాక్ లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మార్కు ఫెడ్ ద్వారా పంటను కొంటామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. రైతులకు అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. 

 

అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్

 

 

హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు వాకౌటు చేశారు.  

10:26 - March 24, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలో వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. నిరసనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
విష్ణుకుమార్ రాజు..
'క్వశ్చన్ హవర్ రావడం అదృష్టం. వైసీపీ క్వశ్చన్స్ ను హవర్ ను పాడుచేయడం సరికాదు. రోజు ఇలా చేస్తే ప్రతిపక్షం పరువు పోతుంది. అలాగే ప్రభుత్వం పరువు కూడా పోతోంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని' అని అన్నారు. 

 

అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఆందోళన

 

 

 

 

విజయవాడ: ఏపీ శాసన సభలో వైసీపీ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీం నోటీసుల పై సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో తీర్మానం పై చర్చకు   వైసీపీ సభ్యులు  పట్టుపట్టారు.  వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

 

ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు పాటు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలో వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. టీడీపీ సభ్యులు ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో సభను పది నిమిషాల పాటు  వాయిదా వేశారు. 

09:47 - March 24, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలంటూ సీపీఎం, మతపరమైన రిజర్వేషన్లు వద్దని బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 
ఎమ్మెల్యే సున్నం రాజయ్య...
'సీపీఎం పోరాటం ఫలితంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం వచ్చింది. ఇది ఎంతో ఉపయోగమైంది. ఎస్సీ, ఎస్సీ సబ్ ప్లాన్ కు ప్రత్యేక నిధి అని పేరు పెట్టడం సరికాదు. డైవర్ట్ అయిన సబ్ ప్లాన్ నిధులను వెనక్కి తీసుకురావాలి. జనాభా ఆధారంగా నిధులు ఖర్చు పెట్టాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, జనరల్ నిధులతో ముడిపెట్టవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని యథాతథంగా ఉంచాలి అని చెప్పారు. 

 

కాసేపట్లో టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలంటూ సీపీఎం, మతపరమైన రిజర్వేషన్లు వద్దని బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 

 

మాజీ ఎమ్మెల్యే ప్రసూన హౌస్ అరెస్టు

హైదరాబాద్ : బీజేపీ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

 

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు తొమ్మిదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలో వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. 

 

09:27 - March 24, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు తొమ్మిదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలో వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు 
మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 16 నెలల పాటు జైలులో ఉన్న దొంగ.. ప్రతిపక్ష నాయకుడు కావడం దురదృష్టకరమన్నారు. అగ్రిగోల్డు అంశంపై చంద్రబాబు సభలో ప్రకటన చేశాక...వైసీపీ సభ్యులు సభ నుంచి పారిపోయారని ఎద్దెవా చేశారు. జగన్ తోపాటు వైసీపీ సభ్యులు అలీ బాబా నలబై దొంగల్లా తయారయ్యారని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు తొమ్మిదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చర్చకు పట్టుబట్టింది. 

 

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు తొమ్మిదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. సవాళ్లు..ప్రతి సవాళ్ల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి. 

 

08:46 - March 24, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు తొమ్మిదో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, సుప్రీంకోర్టు నోటీసులపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. సవాళ్లు..ప్రతి సవాళ్ల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి. టీడీపీ పిఠాపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక నేరగాళ్లు కనిపిస్తే కరిచే విధంగా కుక్కలకు శిక్షణ ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:41 - March 24, 2017

గుంటూరు : మిర్చి యార్డును వైసీపీ అధినేత జగన్ సందర్శించారు. మిర్చి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలసుకున్నారు. రైతులు తమ సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. తమ గోడును ఆయనకు వెల్లబోసుకున్నారు. ఆత్మహత్యలు తప్ప తమకు వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:38 - March 24, 2017

ప్రజా సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఏపీలో అధికార పక్షం ప్రయత్నిస్తోందని వక్తలు అభిప్రాయపడ్డారు. సమస్యలను తప్పుదోవపట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కర్యాక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీడీపీ నేత చందూ సంబశివరావు, వైసీపీ నేత కొణజేటి రమేష్ పాల్గొని, మాట్లాడారు. స్పీకర్ స్వతంత్ర వ్యక్తిగా వ్యవహరించాలని సూచించారు. స్పీకర్ అధికారి పార్టీ వైపు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:33 - March 24, 2017

సామాజిక తెలంగాణ కావాలని ఎంబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పడితేనే పేదల బతుకులు బాగుపడుతాయని తెలిపారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆయన సతీమణి విజయ పాల్గొన్నారు. '154 రోజులు, 4200 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన సిపిఎం బృందంలోని సభ్యుడు ఆశయ్యగారు ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. వారి సతీమణి విజయగారు కూడా 10టీవీ స్టూడియోకి వచ్చారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం నీర్ నెమల గ్రామంలో, రజక వృత్తిదారుల కుటుంబంలో జన్మించారు ఆశయ్య. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న ఆశయ్య జూనియర్ కాలేజీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.  విద్యార్థి దశలోనే వామపక్షభావజాలం వైపు ఆకర్షితులైన ఆశయ్య ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేసి, యువజన సంఘాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. స్వగ్రామంలో 1996లో జరిగిన పెత్తందారి వ్యతిరేక పోరాటంలోనూ, విద్యుత్ ఉద్యమంలోనూ యాక్టివ్ గా పాల్గొని, జైలుకు సైతం వెళ్లారు. ఎంబిసి ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధత్యలు నిర్వహిస్తున్నారు. 154రోజుల పాదయాత్ర అనుభవాలన వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:27 - March 24, 2017
08:25 - March 24, 2017

కుమ్రం భీమ్‌ : కొత్తగా ఏర్పాటైన కుమ్రం భీమ్‌ జిల్లా  సిర్పూర్‌  అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార టీఆర్ ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వర్గాల మధ్య కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య మృగ్యం కావడంతో పార్టీ పరువు గోదావరిలో కలుస్తోంది.
కోనప్ప వర్సెస్ సమ్మయ్య 
కుమ్రం భీమ్‌ జిల్లా సిర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ శాసనసభ్యుడు కావేటి సమ్మయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయి. ఇద్దరు నేతల ఆధిపత్యపోరు మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. 
ఇద్దరి మధ్య ముదిరిన విభేదాలు 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ నుంచి బీఎస్‌పీ అభ్యర్థిగా  కోనేరు కోనప్ప, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కావేటి సమ్మయ్య పోటీ చేశారు. సమ్మయ్యపై నెగ్గిన కోనప్ప ఆతర్వాత బీఎస్‌పీని వీడి, టీఆర్‌ఎస్‌లో చేరారు.  దీంతో సమ్మయ్య అలిగారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో  విభేదాలు ఉన్నా, కోనప్ప టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న తర్వాత మరింత ముదిరాయి. టీఆర్‌ఎస్‌లో కోనప్ప  బలమైన నేతగా ఎదిగి, అన్నింటా చక్రం తిప్పుతోండంతో సమయ్య కనుమరుగయ్యే పరిస్థితితులు వచ్చాయి.  2004 వరకు ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. ఎమ్మెల్యేగా కోనప్ప, పార్టీ నేతగా సమ్మయ్య ఉన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య పోరు నడిచింది. ఆ తర్వాత సమ్మయ్య కాంగ్రెస్‌ను వీడి, టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసిన సమ్మయ్య... కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కోనప్పను ఓడించారు. అప్పడు పొడచూపిన వైరం ఇప్పుడు తీవ్రమైంది.
తమ నేత ఎదుగుదలను ఓర్వలేకపోతున్న సమ్మయ్య కోనప్ప వర్గం 
సమ్మయ్యది ఉద్యమ నేపథ్యం. కోనప్పది అభివృద్ధి నినాదం. తమ నేత ఎదుగుదలను చూసి ఓర్వేలేక సమ్మయ్య వర్గం ప్రతి అంశాన్ని వివాదం  చేస్తోందన్నది కోనప్ప వర్గం వాదన. ఉద్యమం నుంచి  కూడా పార్టీని వెన్నంటి ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కోనప్ప విలువ ఇవ్వడంలేదన్నది సమ్మయ్య వర్గం ప్రతివాదన. తన అనుచరగణానికి ప్రాధాన్యత ఇస్తూ... నిజమైన కార్యకర్తలను విస్మరించడం వలన సిర్పూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ బలపడంలేదని కావేటి సమ్మయ్య వర్గం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఓర్వేలేకే సమ్మయ్య వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నది కోనప్ప  వర్గం వాదన. ఇలా ఇద్దరు నేతల మధ్య వర్గ విభేదాలు ముదురుతున్నాయి. 
సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తమకు సమాచారం లేదు : సమ్మయ్య వర్గం 
కాగజ్‌నగర్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కోనప్ప, సమ్మయ్యల మధ్య వర్గపోరు మరోసాయి బయటపడింది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తమకు సమాచారం లేదని, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని సమ్మయ్య వర్గం తప్పుపడుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ సమక్షంలోనే ఈ పంచాయితీ జరిగింది. దీంతో ఈ వ్యవహారన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సతీశ్‌ నిర్ణయించారు.  ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

08:16 - March 24, 2017

కృష్ణా : విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్ధిలో భాగంగా రన్ వే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయస్థాయికి గన్నవరం విమానాశ్రయం రూపుదాల్చడంతో ఏపీలోనే ఈ ఎయిర్ పోర్ట్ కీలకంగా మారింది. రానున్న రోజుల్లో భారీగా విమానాల రాకపోకలకు కేంద్ర బిందువుగా మారనుండటంతో ఎయిర్ పోర్ట్ రూపురేఖలు మార్చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్ పోర్టును వేగవంతంగా అభివృద్ధి చేసి అగ్రదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
భారీ విమానాల కోసం రన్ వే
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి జెట్ స్పీడ్‌గా దూసుకుపోతోంది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు భారీ విమానాల కోసం రన్ వేను మరో కిలోమీటరు పొడవున విస్తరించే పనులు ముమ్మరం చేశారు. రైతుల నుంచి భూసమీకరణ ప్రక్రియ పూర్తికావడంతో న్యూఢిల్లీకి చెందిన కాంట్రాక్ట్ సంస్థ మట్టి మెరక పనులు చేయిస్తోంది. బ్రిటీష్ హయాం నాటి గన్నవరం ఈ ఎయిర్ పోర్ట్ ను దశాబ్దంన్నర కాలంలో ఆక్యుపెన్సీపరంగా, దేశ, విదేశీ ప్రయాణికుల రాకపోకలకు కేంద్రంగా మారింది. 2017 మార్చి 22న గన్నవరం ఎయిర్ పోర్ట్ కు 'ఎన్టీఆర్' ఎయిర్ పోర్టుగా ఏపీ సర్కార్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపింది.
రూ. 162 కోట్లతో ట్రాన్సిట్‌ టెర్మినల్‌ నిర్మాణం 
రాష్ట్ర విభజన, నవ్యాంధ్ర రాజధాని గుంటూరు, విజయవాడ ప్రాంతాల నడుమ విమానాశ్రయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కేంద్ర పౌర విమానయాన సంస్థ ఈ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. తొలిదశ విస్తరణలో భాగంగా రూ.162 కోట్లతో ట్రాన్సిట్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 100 కోట్ల అంచనా వ్యయంతో ప్స్తుత రన్ వే బలోపేతం, రన్ వే విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. 
3,360 మీటర్లు రన్‌ వే పొడవు పెంపు 
ప్రస్తుతం 2,286 మీటర్లు పొడవు ఉన్న రన్ వే సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కల్గిన ఎయిర్ బస్ కు చెందిన ఎ320, బోయింగ్ 787-800 వంటి మధ్య తరహా విమానాలు దిగేందుకు మాత్రమే అనువుగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోడ్ 'ఇ' ఎయిర్ క్రాప్ట్ వంటి భారీ విమానాలు రాకపోలు సాగించేందుకు వీలుగా రన్ వేను 3,360 మీటర్లకు విస్తరించేందుకు పనులు చేపట్టారు. రన్ వే నిర్మాణ పనులు దక్కించుకున్న ఢిల్లీకి చెందిన పీఆర్ఎల్ సంస్థ నెల రోజుల క్రితం పనులు చేపట్టింది. ఒప్పందంలో భాగంగా ప్రస్తుత రన్ వే పటిష్టం చేయడంతోపాటు 1,074 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో కొత్త రన్ వే, ఐసొలేషన్ బే, ట్యాక్సీవేతోపాటు లింక్ ట్యాక్సీ ట్రాక్, పెరీమీటర్ రోడ్డు, రన్ వే మరియు సేఫ్టీ పనులను 20 నెలల నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంది. దీనికోసం బుద్ధవరం గ్రామం వైపున ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుంచి ఏలూరు కాలువ వరకు రన్ వే పొడగింపు పనులు ప్రారంభించారు. బ్రహ్మయ్య లింగయ్య చెరువు నుంచి రోజుకు 400 భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. రన్ వే విస్తరణ పూర్తయితే సుమారు 420 నుంచి 550 మంది ప్రయాణికుల సామర్థ్యం కల్గిన బోయింగ్ 747-400 రకం, ఎయిర్ బస్ కు చెందిన ఎ340-500, ఎ340-600 వంటి అతిపెద్ద విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు దక్కించుకున్న గుత్తేదారు పీఆర్‌ఎస్‌ సంస్ధ ప్రయత్నిస్తోంది. 

 

08:02 - March 24, 2017

హైదరాబాద్‌ : నగరంలో గత రాత్రి రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. సికింద్రాబాద్‌ మంజు థియేటర్‌ వద్ద ఒక చెప్పుల దుకాణం గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అటు ఓల్డు బోయిన్‌పల్లి బాలాజీనగర్‌లోని ఒక పండ్ల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు లక్షల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లింది.  సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘగనా స్థనాలకు చేరుకుని మంటలు అదుపు చేశారు.  సికింద్రాబాద్‌ మంజు థియేటర్‌ దగ్గర ఓ నివాస భవనంలో చెప్పుల గోదాము ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. 

07:59 - March 24, 2017

హైదరాబాద్ : పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన కాటమరాయుడు చిత్రం ఇవాళ థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. అయితే హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంబిక-మల్లికార్జున థియేటర్ దగ్గర మాత్రం కాటమరాయుడు సినిమా బెన్ఫిట్ షో కి పర్మిషన్ లేకపోవడంతో పవన్‌ అభిమానులు ఆందోళన నిర్వహించారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులపై లాఠీచార్జ్‌ చేశారు. భ్రమరాంబిక -మల్లికార్జున థియేటర్‌లో బెన్ఫిట్ షో కి పర్మిషన్ లేదని  పోలీసులు తెలిపారు. అయినప్పటికీ లాభపేక్షతో టికెట్స్ అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు పవన్‌ అభిమానులు మాత్రం థియేటర్‌ యాజమాన్యంపై అలాగే..పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. బెనిఫిట్‌ షో ఉందంటేనే టిక్కెట్లు కొన్నామని..తీరా థియేటర్‌ దగ్గరకు వచ్చాకా పోలీసులు పర్మిషన్‌ లేదని వెనక్కి పంపించేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

07:57 - March 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో పలువురికి పదోన్నతులు కల్పించగా మరి కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీజీగా పూర్ణచందర్‌రావు..పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. 
15 మంది ఐపీఎస్‌ల బదిల
రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో పలువురికి పదోన్నతులు కల్పించగా మరొకొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్‌ల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. 
ఏసీబీ అదనపు డీజీగా జె. పూర్ణచంద్రరావు
సీఐడీ అదనపు డీజీగా గోవింద్ సింగ్ 
టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా జితేందర్
టీఎస్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా బి. నవీన్ కుమార్ 
పశ్చిమ మండలం ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
ఎక్సైజ్ డీజీగా అకున్ సబర్వాల్
నిజామాబాద్ డీఐజీగా శివశంకర్‌రెడ్డి
సైబరాబాద్ జాయింట్ సీపీగా షానవాజ్ ఖాసీం
ఖమ్మం కమిషనర్‌గా ఎక్బల్ 
కరీంనగర్ డీఐజీగా సి. రవివర్మ 
హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త కమిషనర్‌గా వి. రవీందర్
రాచకొండ సంయుక్త కమిషనర్‌గా తరుణ్ జోషి
ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా ఎ.సత్యనారాయణ
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా టీవీ శశిధర్ రెడ్డి 
పోలీస్ సంక్షేమం ఐజీగా సౌమ్యా మిశ్రాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. 

07:51 - March 24, 2017

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సుపరిపాలనుకు ఎన్నో అవార్డులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో సీఎన్ బీసీ మీడియా సంస్థ.. స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించింది. ఈ అవార్డును సీఎం చంద్రబాబు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని.. ఇవి తమ బాధ్యతను మరింత పెంచుతున్నాయని చంద్రబాబు అన్నారు. అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.  

 

07:48 - March 24, 2017

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అగ్రిగోల్డ్‌ బాధితులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షనేత జగన్‌ ఆరోపిస్తుంటే.. జగన్‌ చర్యల వల్లే బాధితులకు త్వరగా న్యాయం జరగడం లేదని అధికారపార్టీ నేతలు అంటున్నారు. స్పీకర్‌పై అవిశ్వాసానికి సిద్ధమని వైసీపీ ప్రకటిస్తే.. అది టైం వేస్టు పనని సీఎం చంద్రబాబు అంటున్నారు. 
బాధితుల పట్ల బాబుకు కనీస సానుభూతి లేదన్న జగన్ 
అగ్రిగోల్డ్ బాధితుల పట్ల సీఎం చంద్రబాబుకు కనీస సానుభూతి కూడా లేదని ప్రతిపక్ష నేత జగన్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌ అంశంపై సభలో చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్‌ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై అగ్రిగోల్డ్‌ బాధితులు వెయ్యికళ్లతో  ఆశగా ఎదురుచూశారని.. కానీ ఆయన ప్రకటన బాధితులను మరింత నిరాశకు గురిచేసిందని జగన్‌ అన్నారు. అగ్రిగోల్డ్ కేసులో రాష్ట్రంలోని మొత్తం 14 లక్షల మందికి న్యాయం జరుగాలంటే 1182 కోట్లు అవసరమన్నారు. డిపాజిటర్లతో పాటు, బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని వైసీపీ అధినేత డిమాండ్ చేశారు. అటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్‌చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షనేత మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌తో పాటు ఆయన సోదరుడిని అరెస్ట్‌ చేసి మిగతావారి జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రజలకు చెప్పాలన్నారు.  
బాధితులను మరింత ఆవేదనకు గురిచేస్తున్న బాబు : జగన్‌ 
అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానంటూ బాధితులను మరింత ఆవేదనకు గురిచేస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రన్న భీమా కింద 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం  అగ్రిగోల్డ్ బాధితులపై మాత్రం ఎందుకీ వివక్ష అని జనగ్‌ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే  అగ్రిగోల్డ్‌లో మోసపోయి చనిపోయిన వారి కుటుంబాలకు  10 లక్షల  రూపాయల పరిహారం  ఇస్తామంటున్నారు జగన్‌. అటు అసెంబ్లీలో స్పీకర్‌ తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు విపక్షనేత జగన్‌. 
జగన్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సీఎం చంద్రబాబు  
మరోవైపు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామన్న జగన్‌ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు. సభా సమయం వృధా తప్ప దీనివల్ల ఒరిగేదేమీలేదన్నారు. అసలు స్పీకర్‌ వ్యాఖ్యలను జాతీయ మీడియా వక్రీకరించడానికి కూడా వైసీపీనే కారణమన్నారు చంద్రబాబు. మొత్తానికి అగ్రిగోల్డ్‌ వ్యవహారం అటు అసెంబ్లీలోనూ ఇటు ఏపీ రాజకీయాలనూ ఓ ఊపు ఊపేస్తోంది. అధికార విపక్షాలు ఒకరి పైఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ.. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు.

07:43 - March 24, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితుల అంశం.. అసెంబ్లీని అట్టుడికించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను మంత్రి కొన్నారంటూ జగన్‌ చేసిన ఆరోపణలకు, విపక్ష నేత ఈ ఆరోపణను నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేని పక్షంలో జగన్‌ రాజీనామా చేస్తారా అంటూ ప్రత్తిపాటి సవాల్‌ విసిరారు. ఓ దశలో సీఎం కూడా.. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని, ప్రత్తిపాటి సవాల్‌ను జగన్‌ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు.  దీంతోపాటే ప్రత్యేక హోదా అంశంపైనా సభలో గందరగోళం నెలకొంది. 
అధికార... విపక్షం... సవాళ్లు, ప్రతిసవాళ్లు 
అగ్రిగోల్డ్‌ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అధికార విపక్ష సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ దద్దరిల్లింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొన్నారంటూ విపక్షనేత జగన్‌ ఆరోపించారు. దీనిపై జుడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. 
ప్రతిపక్షం ఆరోపణలపై స్పందించిన సీఎం చంద్రబాబు 
ప్రతిపక్షం ఆరోపణలపై సీఎం చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. మంత్రి పుల్లారావు భూముల కొనుగోళ్లపై న్యాయ విచారణ జరిపించేందుకూ సిద్ధమన్నారు. విచారణలో మంత్రి పుల్లారావుది తప్పని తేలితే ఆయన్ను బహిష్కరిద్దామని, ఒకవేళ ఆరోపణలు తప్పని తేలితే జగన్‌ను సభనుంచి బహిష్కరిద్దామని ప్రతిపాదించారు. 
జగన్‌కు సంబంధించిన మీడియా, పేపర్‌లో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు : అధికార పక్షం
ఇదే సందర్భంలో విపక్షనేత జగన్‌కు సంబంధించిన మీడియా, పేపర్‌లో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికారపక్ష సభ్యులు ఆరోపణలు చేశారు. మహిళా పార్లమెంట్‌ సదస్సు సందర్భంగా స్పీకర్‌ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించినట్టు వార్తలను వక్రీకరించి రాశారని అధికారపక్షం ఆరోపించింది. వాస్తవాలు సభ ముందు ఉంచడానికి ఆరోజు స్పీకర్‌ మాట్లాడిన ప్రెస్‌మీట్‌ క్లిప్‌ను సభలో ప్రదర్శించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న జగన్‌ మీడియాను నిషేదించాలని టీడీపీ సభ్యులు, మంత్రులు డిమాండ్‌ చేశారు. దీనిపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. అగ్రిగోల్డ్‌ అంశాన్ని పక్కదోప పట్టించేందుకే.. ఎపుడో ముగిసిపోయిన అంశాన్ని సభలోకి తీసుకొచ్చారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ 
అగ్రిగోల్డ్‌ అంశం కన్నా ముందే... సభ ప్రారంభంకాగానే  రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్‌పోడియం ను చుట్టుముట్టి పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 9 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఈ సందర్భంగా చెప్పారు. కీలకమైన అంశాలు చర్చించాల్సి అవసరం ఉందని.. సంయమనంతో వ్యవహరించాలన్న  సూచనను కూడా ప్రతిపక్ష సభ్యులు  పట్టించుకోకపోవడంతో  స్పీకర్‌  సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
అగ్రిగోల్డ్‌ అంశాన్ని లేవనెత్తిన వైసీపీ 
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత వైసీపీ సభ్యులు అగ్రిగోల్డ్‌ అంశాన్ని లేవనెత్తారు. ఈసమయంలో వైసీపీ సభ్యుల మైక్‌లను ఆఫ్‌చేయడంతో.. నిరసనగా జగన్‌తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభనుంచి వాకౌట్‌ చేశారు. తర్వాత సభలో అగ్రిగోల్డ్‌ అంశంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అగ్రిగోల్డ్‌ అంశంలోనే కాకుండా .. రాష్ట్రంలో వైట్‌కాలర్‌ నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సీఎం వివవరణ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. 

 

గుంటూరు మిర్చి యార్డులో రైతులతో జగన్ ముఖాముఖి

గుంటూరు : మిర్చి యార్డులో రైతులతో వైసీపీ అధినేత జగన్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. 

క్రేన్ వక్కపొడి అధినేత గ్రంధి సుబ్బారావు కన్నుమూత

గుంటూరు : క్రేన్ వక్కపొడి అధినేత గ్రంధి సుబ్బారావు (87) కన్నుమూశారు. రేపు గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.  

నేడు లోక్ సభలో టర్మరిక్ బోర్డు..2017 బిల్లును ప్రవేశపెట్టనున్న ఎంపీ కవిత

ఢిల్లీ : నేడు లోక్ సభలో టర్మరిక్ బోర్డు..2017 బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎంపీ కవిత ప్రవేశపెట్టనున్నారు. 

 

నేడు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు

హైదరాబాద్ : నేడు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చింది. మత పరమైన 12 శాతం రిజర్వేషన్ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తోంది. 

నేడు లోక్ సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఢిల్లీ : నేడు లోక్ సభలో కేంద్రప్రభుత్వం జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టనుంది. 

నేడు టీఆర్ ఎస్ ప్రజా ప్రజానిధులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ ప్రజా ప్రజానిధులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

Don't Miss