Activities calendar

25 March 2017

21:29 - March 25, 2017

అనంతపురం: రాష్ట్రంలో వేలాది గ్రామాలు తాగునీరులేక విలవిల్లాడుతోంటే.. అసెంబ్లీసాక్షిగా అధికార, ప్రతిపక్షపార్టీలు వాటాలకోసం పోట్లాడుకుంటున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. జన్మభూమి పేరుతో టీడీపీ నాయకులు నీటి ట్యాంకర్లుపెట్టి వ్యాపారం చేసుకుంటున్నారని రఘువీరా మండిపడ్డారు. చివరికి పశువులక మేతకోసం కేటాయించిన డబ్బులను కూడా టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. అనంతపురంలోని పార్టీ ఆఫీసులో కాంగ్రెస్‌నేతలు సత్యాగ్రహం నిర్వహించారు.

శ్రీలంక పర్యటనను రద్దు చేస్తున్న రజనీకాంత్

చెన్నై: తమిళనాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ శ్రీలంక పర్యటన రద్దు చేసుకున్నారు. రజనీ శ్రీలంక పర్యటనపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో జాఫ్నాలో రోబో-2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా నిర్మించిన 150 గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీ పాల్గొనాల్సి ఉంది. తమిళులను అణచివేసిన రాజపక్సే కుటుంబంతో లైకా సంస్థకు సంబంధాలు ఉన్నాయని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపించాయి.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: చినరాజప్ప

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. నిష్పాక్షపాతంగా విచారణ జరిపి నిందింతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్రిగోల్డ్ కేసు సహారా కేసు లాంటిదని డీజీపీ సాంబశివరావు అన్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తెలిపారు.

టీడీపీ ప్రభుత్వంపై రఘువీరారెడ్డి ఫైర్‌

అమరావతి: రాష్ట్రంలో వేలాది గ్రామాలు తాగునీరులేక విలవిల్లాడుతోంటే.. అసెంబ్లీసాక్షిగా అధికార, ప్రతిపక్షపార్టీలు వాటాలకోసం పోట్లాడుకుంటున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. జన్మభూమి పేరుతో టీడీపీ నాయకులు నీటి ట్యాంకర్లుపెట్టి వ్యాపారం చేసుకుంటున్నారని రఘువీరా మండిపడ్డారు. చివరికి పశువులక మేతకోసం కేటాయించిన డబ్బులను కూడా టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. అనంతపురంలోని పార్టీ ఆఫీసులో కాంగ్రెస్‌నేతలు సత్యాగ్రహం నిర్వహించారు.

20:41 - March 25, 2017

హైదరాబాద్: నవ్వు ఒక భోగం. నవ్విచడం ఒక యోగం. సాధారణంగా సినిమాల్లో కామెడీని చూస్తాం. కానీ వార్తల్లో కూడా కామెడీ కోణం ఉంటుందండోయ్. మనం ఆ కోణాన్ని పట్టుకోగలిగినప్పుడు ఆ వార్తల్ని మనం ఎంజాయ్ చేయగలం. వార్తల్లో కామెడీని వెతుక్కోవడమే 'క్రేజీ' న్యూస్ ప్రత్యేకత. ఇక ఈ రోజు మనం చూడబోయే అంశాలు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి లీగల్ నోటీసు పంపిన ఇళయరాజా, కపిల్ శర్మ.. సునీల్ రోహిత్ కొట్టేసుకున్నారు., వరల్డ్ హ్యాపీనెస్ ఇలాంటి అంశాలతో నేటి క్రేజీ న్యూస్ మన ముందుకు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:09 - March 25, 2017

హైదరాబాద్: మళ్లీ అలిగిన అంబర్ పేట హన్మంతన్న..అరెస్ట్ చేసి ఎత్తుకుపోయిన ఫ్రెండ్లీ పోలీస్, ఫ్లెక్సీ అభిమానుల మీద మంత్రిగారి మంట...మళ్లొకపారి కడితే చింపేయాలే లోకమంతా, మహిళ ఉద్యోగిని కడుపులో తన్నిన మంత్రి...శ్రీకాకుళం జిల్లాలో కామాంధుల కావరం, మాటలకే పరిమితం అవుతున్న ఆంధ్రా చంద్రాలు...కర్నూలు జిల్లాలో ఆగని కత్తులు, రక్తాలు, బోధన్ కాడ దున్నపోతు ఈదిందంట...దూడ కోసం దేవులాడుతున్న కేడర్, దుప్పి వేటగాళ్లకు పోలీసుల అండలు..మంత్రిగారి కొడుకే ఉన్నడన్న జనాలు ఇలాంటి అంశాలను తీసుకుని మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' అనే కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. మరి మీరు కూడా ఆ వివరాలను పూర్తిగా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:18 - March 25, 2017

హైదరాబాద్: జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పం అయ్యాయి. ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.కంచె ఐలయ్య, భానుమూర్తి తెలంగాణ బ్రాహ్మణ సంఘం నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:58 - March 25, 2017

పశ్చిమగోదావరి : చాగళ్లు మండలం..ఉనగట్టకు చెందిన తొర్లపాటి విమల ఆత్మహత్య కేసులో..సూసైడ్‌ లెటర్‌ బయటపడింది. నూతంగి జయంత్‌ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని లేఖలో ఉండడంతో...పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శవాన్ని వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

18:53 - March 25, 2017

అమరావతి: ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయని.... ప్రతిపక్ష నేత జగన్‌ మండిపడ్డారు.. ఆ నిధుల్ని ఉపాధి కోసం కాకుండా ఇతర పనులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అన్నదాతలకు పనిలేక బిక్షాటన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

కేరళలోఎక్కువ కూలి దొరుకుతుందనే...

కేరళలోఎక్కువ కూలి దొరుకుతుందనే ఎక్కువమంది ఆ రాష్ట్రానికి వలసపోతున్నారని... మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.. ఉపాధి కావాలని పేరు నమోదుచేసుకుంటే 24గంటల్లో తాము పని ఇప్పిస్తామని చెప్పారు.. మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

సభలో బీసీ సంక్షేమంపై చర్చకు వైసీపీ పట్టు...

సభలో బీసీ సంక్షేమంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది.. ఈ సమస్యపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు.. సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

సీఆర్‌డీఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు...

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అమరావతి నగర నమూనాలపై అసెంబ్లీ కమిటీ హల్లో సీఆర్‌డీఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు రావాలంటూ సభ్యులను ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు ఆహ్వానించారు.

ప్రభుత్వ ఆహ్వానాన్ని తప్పుపట్టిన వైసీపీ సభ్యులు ....

ప్రభుత్వ ఆహ్వానాన్ని వైసీపీ సభ్యులు తప్పుబట్టారు. చంద్రబాబు మరో డ్రామా ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో ఊసరవెళ్లిలా రోజుకోరంగు మారుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు..

రైతుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..

భోజన విరామ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రైతుల సమస్యలపై మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతుల భూములను బడాబాబులు అధికారికంగా కబ్జా చేస్తున్నారని.. కబ్జా చేసిన భూముల్ని ల్యాండ్ పూలింగ్‌లో ఇస్తున్నారని అలాంటి వారిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.సభలో వివిధ అంశాలపై చర్చ అనంతరం సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

18:50 - March 25, 2017

విజయవాడ: ఇష్టానుసారంగా ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారని.. ఆర్టీఏ అధికారులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఆర్టీఏ అధికారుల తీరుతో.. ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రైవేటు బస్సులకు యాక్సిడెంట్లు జరిగితే... టీడీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తోందని వాపోయారు. అధికారుల అవినీతే దీనికి కారణమని మండిపడ్డారు. కేశినేని ట్రావెల్స్ బస్సులో తప్పులుంటే తమ బస్సులన్ని తీసుకొచ్చి అధికారుల ముందు పెడతానని.. చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

18:48 - March 25, 2017

అమరావతి: అసెంబ్లీలలో తమ రాజకీయాల కోసం కాకుండా.. నిజంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఘర్షణ పడితే బాగుంటుందని అగ్రిగోల్డ్‌ బాధిత సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ వెంకటేశ్వరరావు అన్నారు. బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

18:46 - March 25, 2017

అనంతపురం : నగర శివార్లలలోని పవికేకే కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కళాశాలలోని వంద కంప్యూటర్లు, ఫర్నిచర్లు, 8 ఏసీలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేటప్పటికే మొత్తం కాలిపోయాయి. అయితే ఈ ప్రమాదంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

18:45 - March 25, 2017

తూగో : కాకినాడ టీడీపీలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా పరిణమించింది. నిన్నా మొన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్‌ కొండబాబు, నగర అధ్యక్షుడుగా పని చేస్తున్న దొరబాబు ఇప్పుడు ఉప్పు, నిప్పుగా మారి, చిటపటలాడుకుంటున్నారు. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ పరువు బజారుకెక్కుతోంది.

ఎమ్మెల్యే కొండబాబుకు రాజకీయ అండదండలు తక్కువ...

ఎమ్మెల్యే కొండబాబు సిటీలో బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత. నగర అధ్యక్షుడు దొరబాబుది కాపు సామాజికవర్గం. ఎమ్మెల్యే కొండబాబుకు సామాజికవర్గ నేతల మద్దతు మినహా పెద్దగా రాజకీయ అండదండలు లేవు. దొరబాబుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సహా పలువురు నేతల ఆశీస్సు ఉన్నాయి. దీంతో అన్నింటా తన పెత్తనమే నెగ్గాలన్న పంతంతో ముందుకు పోతున్నారు. ఇద్దరు నేతల మధ్య రాజకీయ విభేదాలు ముదరడానికి కారణాలు లేకపోలేదు. కాంట్రాక్టులు, ప్రభుత్వ పథకాలను చక్కబెట్టే వ్యవహారంలో అభిప్రాయభేదాలు ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచాయి.

రాజ్యాంగేతర శక్తిగా మారిన ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ ...

కొండబాబు, దొరబాబు మధ్య విభేదాలు ముదరడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ రాజ్యాంగేతర శక్తి మారాడన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి ప్రభుత్వ వ్యవహారాల వరకు అన్నింటీలో జోక్యం చేసుకోవడం నగర అధ్యక్షుడు దొరబాబుతో పాటు, పార్టీ నేతలకు నచ్చలేదు. అన్నది అధికారం, తమ్మునిది పెత్తనం అన్న చందంగా పరిస్థితి తయారైంది. ప్రభుత్వ వ్యవహారాలన్ని తన కనుసన్నల్లోనే జరగాలని ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేస్తుండటంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్నదమ్ముల తీరుతో అసంతృప్తితో ఉన్న తెలుగు తమ్ముళ్లను ఏకతాటిపైకి తెచ్చేందుకు దొరబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే దొరబాబు నాయకత్వం, శక్తి, సామర్థ్యాలపై నమ్మకంలేని నేతలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గళం ఇప్పేందుకు ముందుకు రావడంలేదు.

కాపు కోటాలో మరోసారి నగర అధ్యక్ష పదవి కోసం దొరబాబు యత్నం ....

కాకినాడ తెలుగుదేశం నేతల మధ్య చిచ్చు ముదురుతున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ సంస్థాగత ఎన్నికలు తెరమీదకు వచ్చాయి. కాపు కోటాలో మరోసారి నగర అధ్యక్ష పదవి కోసం నున్న దొరబాబు పావులు కదుపుతున్నారు. దొరబాబు ఆధిపత్యానికి గండికొట్టేందుకు ఎమ్మెల్యే కొండబాబు, ఈయన సోదరుడు సత్యనారాయణ చక్రం తిప్పేందుకు యత్నిస్తున్నారు. దీంతో నగర టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. విభేదాలను మరింత ముదరకుండా ఇద్దరికీ సర్దిచెప్పేందుకు సీనియర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో సిటీ తెలుగుదేశం రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కాకినాడ తెలుగు తమ్ముళ్ల మధ్య ముదురుతున్న విభేదాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.

18:33 - March 25, 2017
18:01 - March 25, 2017

అమరావతి: ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ రూపొందించిన అమరావతి నగర పరిపాలన భవన నమూనాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధికారులు వివరించారు. నిర్మించబోయే అమరావతి నగర విశేషాలను మా ప్రతినిధి విజయచంద్రన్‌ అందించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:45 - March 25, 2017

అమరావతి: ఏపీ రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని రైతుల భూములను బడాబాబులు అధికారికంగా కబ్జా చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. కబ్జా చేసిన భూముల్ని ల్యాండ్ పూలింగ్‌లో ఇస్తున్నారని అలాంటి వారిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

17:43 - March 25, 2017

ఢిల్లీ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ తమిళనాడు రైతులు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. 40 వేల కోట్ల కరవు సాయం విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ.. వారి పుర్రెలతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు గుర్తుకొస్తారని తర్వాత మర్చిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరకు అన్నదాత సమస్యలు పరిష్కరించక పోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘం నేతల స్పష్టం చేశారు.

17:42 - March 25, 2017

హైదరాబాద్: ఖాలాపడిన పరిశ్రమలను తెరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. మూతపడిన పరిశ్రమలు తెరిపించేందుకు నిధుల సమీకరణ తదితరాలపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్‌. మరోవైపు బడ్జెట్ పద్దులకు కూడా సభ ఆమోదం తెలిపింది.

నిజాంషుగర్స్‌, సిర్పూర్‌ -కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులు....

నిజాంషుగర్స్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులకు మళ్లీ ప్రాణం పోస్తామని తెలంగాణ ప్రభత్వం ప్రకటించింది. శాసన సభలో చర్చ ఖాయిలపడిన మిల్లులను తెరిపిస్తామని సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా నిజాం షుగర్స్‌పై మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. రైతులంతా సహకార సంఘంగా ఏర్పడితే.. ఫ్యాక్టరీకి సంబంధించిన అప్పులు తీర్చి పునరుద్దరణ చేస్తామన్నారు. అటు సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లును కూడా తెరిపిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెడుతున్న పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలన్నీ.. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పరిశ్రమకు వర్తింపజేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.

వాహనాల వేగపరిమితిపై సభలో చర్చ....

వాహనాల వేగ పరిమితిపై కూడా తెలంగాణ శాసన సభలో చర్చ జరిగింది. నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న వాహనాల వేగానికి బ్రేకులు పడాలని విపక్షసభ్యులు కోరారు. ముఖ్యంగా ఔటర్‌ రింగ్‌రోడ్డుతోపాటు జాతీయ,రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని సభ్యులు సభదృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రులు.. వాహనాల వేగపరిమితిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బడ్జెట్‌ పద్దులకు ఆమోదం అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

 

 

17:39 - March 25, 2017

మహదేవ్ పూర్ దుప్పుల వేట కేసులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. దుప్పల వేటలో పాల్గొన్న .. అస్రార్‌, కాలీమ్‌, సత్యనారాయణను అరెస్ట్‌చేసి.. వారి దగ్గర నుంచి 150 బుల్లెట్లను.. ఒక స్టింగ్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని.. అసలైన నిందితులను తప్పించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో బడా నేతల హస్తం ఉందని..వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

17:38 - March 25, 2017

హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏప్రిల్ 21 న హైదరాబాద్ కోంపల్లిలో ప్లీనరీ సమావేసాలు నిర్వహించాలని... ఏప్రిల్ 27న వరంగల్‌లో బహిరంగ సభ జరపాలని సమావేశంలో నిర్ణయించారు. సర్వేలో మార్కులు తక్కువ వచ్చిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందవద్దని కేసీఆర్ సూచించారు.

17:37 - March 25, 2017

మహబూబ్ నగర్ : ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలన్నింటిని ప్రైవేట్‌ కళాశాల, పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణా లెక్చరర్‌ ఫోరం మహబూబ్‌నగర్‌లో చైతన్య యాత్రను ప్రారంభించింది. నేటి నుంచి ఏప్రిల్‌ 1 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని రాష్ట్ర కార్యదర్శి కత్తి వెంకటస్వామి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:35 - March 25, 2017

హైదరాబాద్: రాజధాని నగరం సెల్‌ఫోన్‌ టవర్ల హబ్‌గా మారిపోతోంది. ఎక్కడబడితే అక్కడ సెల్‌ టవర్లు వెలుస్తున్నాయి. మొబైల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ విస్తృతమై.. సంబంధిత కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దీనికోసం భారీ స్థాయిలో సెల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇళ్ల మధ్య కూడా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రేటర్‌వాసులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. రకరకాల సమస్యలు వస్తున్నాయి.. పిల్లల పెరుగుదల కూడా సరిగా ఉండడం లేదని నగరవాసులు వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రులు.. పాఠశాలలు.. దేవాలయాలు..

వాస్తవానికి ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, జనవాసాల మధ్య సెల్‌ఫోన్‌ టవర్లు ఏర్పాటు చేయకూడదు. ఈ మేరకు 2016 నవంబర్‌లో జనవాసాల మధ్య సెల్‌టవర్లను తొలగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలో ఇవేమీ అమలు కావడం లేదు. అలాగే కొంతమంది ఇంటి యజమానులు డబ్బులకు ఆశపడి బిల్డింగ్‌లపై సెల్‌ టవర్ల ఏర్పాటుకు .. సెల్‌ కంపెనీ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

మార్కెట్‌లోకి వచ్చిన ఓ కంపెనీ ఒక్కో ప్రాంతంలో ...

తాజాగా ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోకి వచ్చిన ఓ కంపెనీ ఒక్కో ప్రాంతంలో 15కు పైగా సెల్‌ టవర్ల ఏర్పాటుచేసేందుకు అనుమతులు తీసుకున్నట్టు సమాచారం. దీంతో నగరవాసులకు రేడియేషన్‌ సమస్యలు మరింత తీవ్రం కానున్నాయి.

ఢిల్లీ సీఎం కు కోర్టు నోటిసులు

ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ కు పాటియాల కోర్టు నోటిసులు జారీ చెసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసులో కేజ్రీవాల్ కు కోర్టు ఈ నోటిసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కోర్టు నోటిసులు జారీ చేసింది. కోర్టు తదుపరి విచారణ ను మే 20కి వాయిదా వేసింది.

 

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముగిసిన సీఎం భేటీ

హైదరాబాద్: ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలు, పార్టీ ప్లీనరీ నిర్వహణ, వరంగల్ లో జరిగే బహిరంగ సభకు జన సమీకరణ పై కేసీఆర్ చర్చించారు. ఏప్రిల్ 5లోపు సభ్యత్వ ప్రక్రియా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 15లోపు జిల్లా, మండల పార్టీ కమిటీల ఏర్పాటు చేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. కొంపల్లిలో ఆర్డీ కన్వెన్షన్ సెంటర్ లో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని సీఎం తీర్మానించారు.

ఆస్ట్రేలియా అలౌట్

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా 300 పరుగులకు అలౌటైంది. బౌలింగ్ కుల్దీపు యాదవ్ 4 వికెట్లు, ఉమేష్ 2వికెట్లు, భువనేశ్వర్, అశ్విన్, జడేజాకు తలో వికెట్ దక్కాయి. బ్యాటింగ్ స్మిత్ 111, వార్నర్ 56, వెడ్ 57పరుగులు చేశారు. 

 

16:24 - March 25, 2017

అమరావతి: విజయవాడ నగరాన్ని మెట్రో పాలిటన్‌ సిటీ గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 104 నంబర్‌ జీవో విడుదల చేసింది. శివారు గ్రామాలను నగరంలో కలపాలన్న నగర పాలక సంస్థ తీర్మానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం తర్వాత బెజవాడ రాష్ట్రంలో రెండో మెట్రో సిటీగా గుర్తింపు పొందింది. దీనిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వెంటనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు..

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 59 డివిజన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బెజవాడ వివారల్లోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిదమానూరు, దొనెఆత్మకూరు, గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం గ్రామాలను మెట్రో పాలిటన్‌ ఏరియా పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరులను కూడా మెట్రో సిటీ పరిధిలో చేరాయి. గొల్లపూడి, జక్కంపూడి, నున్న, పాతపాడు, అంబాపురం గ్రామాలు కూడా మెట్రో ఏరియాలో చేర్చారు. మెట్రో ఏరియా ప్రకటనతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది.

బస్‌ స్టేషన్‌ నుంచి నిడమానూరు వరకు మొదటి కారిడార్‌ ....

ముందుగా రెండు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపడతారు. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా నిడమనూరు వరకు కారిడార్‌ వన్‌గా నిర్ణయించారు. మొత్తం 13.27 కి.మీ. పొడవున నిర్మించే ఈ మార్గంలో 13 స్టేషన్లు వస్తాయి. పండిట్‌ నెహ్రూ బస్ స్టేషన్‌ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు కారిడార్‌-2 పనులు చేపడతారు. 12.76 కి.మీ. పొడవు ఉంటే మార్గంలో 12 స్టేషన్లు ఉంటాయి. విజయవాడను మెట్రో పాలిటన్‌ ఏరియాగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మెట్రో మార్గాల నిర్మాణానికి మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు.

ముందుకు సాగుతుందని ఆశించడం పొరపాటేనని...

అయితే విజయవాడను మెట్రో పాలిటన్‌ ఏరియాగా ప్రకటించినంత మాత్రాన మెట్రో రైలు ముందుకు సాగుతుందని ఆశించడం పొరపాటేనని కొందరు భావిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అరకొర నిధులతో మెట్రో ప్రాజెక్ట్‌ చేపట్టే అవకాశం లేదని సీపీఐ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ నేతలు...

మరోవైపు కాంగ్రెస్‌ నేతల ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు నాలుగు బడ్జెట్లలో మెట్రో రైలుకు కేటాయించిన నిధులు అరకొరగానే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

2018 డిసెంబర్‌ నాటికి మొదటి దశ పూర్తి చేయాలని....

2018 డిసెంబర్‌ నాటికి మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నిధుల కొరత, ఇతరిత సమస్యలతో ప్రాజెక్టు అమల్లో సుదీర్ఘ జాప్యం జరిగింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టు చేపట్టినా నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

స్పీకర్ తో భూపాలపల్లి కలెక్టర్ భేటీ

హైదరాబాద్: స్పీకర్ మధుసూదనాచారితో భూపాలపల్లి కలెక్టర్ మురళి భేటీ అయ్యారు. జిల్లాలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. అటవీ ప్రాంతములో వేటపై కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదం రాజుకోవడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

16:20 - March 25, 2017

హైదరాబాద్: తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డ్ లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అడ్డుకోలేకపోతున్న అధికారులు ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెడుతున్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినా పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కనీసం స్పాట్ వాల్యుయేషన్ అయినా సక్రమంగా చేస్తారా అంటే అదీ లేదు. సీనియర్ ప్యాకల్టీతో జరిపించాల్సిన వాల్యుయేషన్.. ట్యూటర్స్ , ట్రైనింగ్ లెక్చరర్స్ తో కానిచ్చేస్తున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో 80వేల మంది లెక్చరర్ లు ఉండగా స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొనేందుకు ఇరవై వేల మంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.

ఇంటర్‌ బోర్డు ఆదేశాన్ని పట్టించుకోని ప్రైవేట్‌ కాలేజీలు...

స్పాట్ వాల్యుయేషన్ కోసం సీనియర్ అద్యాపకులను పంపాలని కార్పొరేట్ కళాశాలలను ఇంటర్ బోర్డ్ ఆదేశించింది. అయితే ఈ విషయాన్ని ప్రైవేటు కళాశాలలు లైట్ తీసుకున్నాయి. ఎంసెట్, ఐఐటి ,నీట్ కోచింగ్ నేపథ్యంలో సీనియర్ ప్యాకల్టీని పంపడానికి వారు నిరాకరించారు. కేవలం కళాశాలలో పనిచేసే ట్యూటర్స్, ట్రైనింగ్ ఫ్యాకల్టీని వాల్యుయేషన్ డ్యూటీకి పంపించారు.

ఫలితాలు త్వరగా ఇవ్వాలని తొందర పెడుతున్న ఇంటర్‌ బోర్డు....

మరోవైపు బోర్డ్ ఉన్నతాధికారులు మాత్రం ఫలితాలు త్వరగా ప్రకటించాలని టార్గెట్లు పెడుతున్నట్టు సమాచారం. ఇంటర్ ఫలితాలు త్వరగా ప్రకటించాలన్న అధికారుల అత్యుత్సాహం విద్యార్థుల జీవితాలతో చెలాగాటమాడుతోంది. రోజుకు 30 పేపర్లు వాల్యూ చేయాల్సి వుండగా.. నిబందనలకు విరుద్ధంగా 40 పైగా పేపర్లను దిద్దిస్తున్నారని అద్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్‌బోర్డు నిర్వాకంతో ఏటేటా పెరుగుతున్న రీవాల్యూయేషన్ డిమాండ్‌ ....

ఇంటర్‌ బోర్డ్‌ అనుసరిస్తున్న పరీక్షల వాల్యుయేషన్‌లో లోపాల కారణంగా ప్రతిఏటా రీ వాల్యూయేషన్ కోరే వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రైవేట్‌ కళాశాలల ఇష్టారాజ్యంగా మారిన ఇంటర్మిడియట్ పరీక్షల వాల్యుయేషన్ పై.. ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

16:07 - March 25, 2017

హైదరాబాద్: నగరవాసులకు భానుడు చుక్కలు చూపిస్తున్నాడు.. మార్చిలోనే నగరం నిప్పుల కుంపటిగా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.

హైదరాబాద్‌ వాసులను హడలెత్తిస్తున్న ఎండలు.....

గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వడగాడ్పులకు గురై వాంతులు..విరోచనాలతో సతమతమవుతున్నారు. ఎండతీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోవడం వల్ల, నగర రహదారులన్నీ కర్ఫ్యూని తలపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే పగటి ఉష్ణోగ్రత 37 డిగ్రీలు నమోదు కావడాన్ని బట్టి చూస్తే, భవిష్యత్తులో ఎండతీవ్రత మరెంతగా ఉంటుందోనని నగరవాసి కలవర పడుతున్నాడు.

ఎండ తీవ్రతకు దేశ వ్యాప్తంగా 1400 మంది మృతి.....

ఎండల తీవ్రతకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా 14 వందల మంది మృత్యువాత పడగా ... తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు అంచనా. మరో 2 వందల మంది చర్మ సంబంధిత ఎలర్జీస్‌తో పాటు, డీ హైడ్రేషన్‌ కారణంగా ఆస్పత్రుల పాలయ్యారు. ముదురుతున్న ఎండల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పసి పిల్లలు తొందరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని.. వారిని ఎండబారిన పడకుండా..జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్లే...

పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మార్చి మూడో వారంలోనే ఎండతీవ్రత ఇలా ఉంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందోనని నగరవాసులు భయపడుతున్నారు.

ఉద్యోగులకు మంత్రి హామీ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-3, 4ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణ ఆస్తుల విభజన కమిటీ సభ్యుడు అచ్చెన్నాయుడుని కలిశారు. ఉద్యోగులు తమను తెలంగాణకు కేటాయించాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. గవర్నర్ తో రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశంలో ఈ అంశం చర్చిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

15:52 - March 25, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై చర్చ ముగిసింది. వాహనాల వేగ పరిమితి, ఖాయిలా పడ్డ పరిశ్రమలపై ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. నిజాం షుగర్స్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులను పునరుద్దరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అనంతరం అనేక అంశాలపై చర్చ జరిగిన మీదట అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేశారు.

15:48 - March 25, 2017

హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ సభ్యత్వం, ప్లీనరీ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 269 పరుగుల వద్ద ఒకీఫ్(1)ఔటయ్యాడు.

 

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 254పరుగుల వద్ద కమ్మిన్స్(21)ఔటయ్యాడు.

 

15:19 - March 25, 2017

హైదరాబాద్: సొంత పార్టీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ గుర్రుగా వున్నారు. శనివారం నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ... పార్టీలో దళిత ఎమ్మెల్యేల పట్ల వివక్ష కొనసాగుతోదన్నారు. అసెంబ్లీలో దళితుల అభివృద్ధికి చర్చ జరుగుతుంటే పార్టీ నుంచి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా పార్టీ సభ్యుల నుంచి నాకు నైతిక మద్దతు లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శు క్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో.. వంశీచంద్‌కు మైక్‌ ఇవ్వాలని పదే పదే కోరిన జానారెడ్డి నాకు మైక్‌ ఇవ్వాలని అడకకపోవడం బాధాకరం. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపినందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. అందుకే ఎస్సీ, ఎస్టీ బిల్లుపై మాట్లాడేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. సబ్‌ కమిటీ సభ్యుడినైన నాకే అవకాశం రాకుండా చేశారు. మా నాయకులు కూడా నా వైపు నిలవలేదని ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ పార్టీతో మాట్లాడి అన్ని విషయాలను సరద్దు బాటు చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా అనేక అంశాలను చర్చించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

విజయవాడ రవాణా కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తనిఖీల పేరతో అధికారులు అవినీతికి పాల్పడుతూ ప్రైవేటు బస్సులకు అడ్డదిడ్డంగా షర్మిట్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో బైఠాయించారు. కార్యాలయంలోని అధికారులతో ఎంపీ వాగ్వాదం దిగారు. పరిస్థితి అదుపులోకి తెవడానికి పోలీసులను భారీగా మోహరించారు.

 

14:46 - March 25, 2017

సంగారెడ్డి : వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు.. తమకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. 23రోజులుగా దీక్ష చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.. వీరికి కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మద్దతు ప్రకటించారు.. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:44 - March 25, 2017

అమరావతి: రాజధాని నిర్మాణంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని... సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేలా రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు.. 9 సిటీల్లో 25 టౌన్‌షిప్‌లు వస్తాయని ప్రకటించారు.. అమరావతి పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడారు..

14:42 - March 25, 2017

మహదేవాపూర్ : అటవి ప్రాంతంలో వేటగాళ్ల కేసులో డొంక కదులుతుంది...వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో అధికారపార్టీకి చెందిన ప్రముఖ నేతల పుత్రరత్నాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...వేటాడిన జంతు మాంసంతో విందు చేసుకున్నట్లు తెలుస్తోంది...వేటగాళ్లు 5 జింకలను హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది...దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసినా వేటగాళ్లను పట్టుకోవడంలో మాత్రం వెనకడుగువేస్తున్నట్లు తెలుస్తోంది...

కారులో రెండు దుప్పిలు...

జరిగిన ఘటనలో ముఠా పారిపోగా అధికారులకు దొరికిన వాహనాల్లో రెండు దుప్పిలున్నాయి..మరో మూడు మాయమైనట్లు అనుమానిస్తున్నారు..అప్పటికే ఐదు జింకలను చంపిన వేటగాళ్లు ఇక సర్ధుకుని వెళ్తున్న సమయంలో దాడులు జరిగాయి.. అటవీ అధికారులపైనే తుపాకీ ఎక్కుపెట్టిన దుండగులు పారిపోగా..వెళ్తూ వెళ్తూ వారి మరో కారును వదిలేశారు...

14 మంది సభ్యులతో ముఠా...

ఈ నెల 19న మాహదేవాపూర్ అటవి ప్రాంతంలో వన్యమృగాలను వేటాడిన వేటగాళ్లు దాదాపు 14మంది సభ్యులు గల ముఠా...ఒక కారు జీప్పీ టాప్ లేస్ జీబ్ లో వేటకు వెళ్లిన బృందం తిరుగు ప్రయాణంలో అటవిశాఖ అధికారులకు తారసపడ్డారు. వీరిలో మాహదేవ్ పూర్, ఏటూర్ నాగారం, అడవుల నుండి తప్పించుకోని హైదరాబాద్ కు పారిపోయినట్లు తెలుస్తుంది. మరో ఐదుగురు వేటగాళ్లు ఏకంగా అటవి శాఖ అధికారులకు తుపాకి ఎక్కి పెట్టి వాహనాన్ని వదలి పలిమెల ఏటూర్ నాగారం మిదుగా పారిపోయారు... గోదావరిఖని, మాహదేవ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ ముఠా తో కలిసి వేట కొనసాగించినట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం వెల్లడైంది.

అడవిలో నిత్యం వేటగాళ్లు..

మాహదేవ్ పూర్ మారుముల అటవి ప్రాంతం కావడంతో జింకలు,దుప్పిలు,నెమళ్లు ఎక్కువగా ఈ ప్రాంతంలో సంచారిస్తుంటాయి. గతంలో మహదేవ్ పూర్లో అధికార పార్టికి చెందిన జడ్పిటిసి భర్త అటవి జంతువులను వేటాడి చంపిన కేసులో నిందితుడు...అతనికి ఉన్న రాజకీయ, సామాజిక వర్గం సహకరంతో యదేచ్చగా వన్య మృగాలను వేటాడుతున్నట్లు తెలుస్తుంది. వదిలి పెట్టి వెళ్లిన కారులో రెండు దుప్పిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫైజల్ ఆహ్మద్ కు చెందిన ఆధార్ కార్డు ఇండికా కారుతో పాటు ఓ కత్తి, చెక్కులను స్వాదీనం చేసుకుని ఐదుగురి పై కేసునమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల నుండి పోలీస్,అటవి శాఖ అధికారుల పై ఒత్తిళ్లు వస్తుండడం కారణంగానే అసలు నిందితులను తప్పించేందుకు ప్రయత్నలు జరుగుతున్నట్లు సమాచారం..

14:29 - March 25, 2017

హైదరాబాద్: దళితుల కోసం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ 66 ఎకరాల భూమిని అందిస్తున్నాడని..ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్నారు. అజయ్‌కుమార్‌ భూమిని ఉచితంగా ఏమి అందించడం లేదని...మరెందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనైతిక రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, బట్టీ విక్రమార్క అన్నారు.

 

14:25 - March 25, 2017

అమరావతి: అనంతపురం జిల్లాలో కరువు విలయతాండం వచేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 33 మండలాల్లో మొత్తం కరువు విలయతాండం చేస్తోందన్నారు. రెయిన్ గన్స్ వాడాలంటే కనీసం రెండున్న ఇంచుల నుండి మూడు ఇంచుల నీళ్లు ఉండాలని, అస్సలు రెయిన్ గన్స్ గురించి మరింత పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా మొత్తానికి 30 టీఎంసీల నీరు కూడా రాదని, రెయిన్స్ గన్స్ ద్వారా ఎన్ని ఎకరాల పంటలను కాపాడారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తం ఇప్పటికే 3 లక్షల మంది వలసపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో సీపీఐ వారు సర్వే చేసి రిపోర్టు తయారు చేసేటప్పుడు కళ్ల నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 208 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ (111) ఔటయ్యాడు.

 

 

నిలోఫర్ ఘటన పై విచారణ : లక్ష్మారెడ్డి

హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రి ఘటన పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి మండలిలో తెలిపారు. గతంతో పోల్చితే మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ సెంటివ్ కేర్ లు లేవు దీని పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆసుపత్రులు ఇలా తయారయ్యాయని ఆయన విమర్శించారు.

14:12 - March 25, 2017

గుంటూరు : అత్యాధునిక హంగులతో అమరావతి రాజధాని నిర్మాణం చేపడుత్నుట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు.. బయట మహిళలు కనీసం బాత్ రూంకు వెళ్లడానికి సౌకర్యం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని చెప్పారు. ఇష్టమొచ్చినట్లు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం లేదన్నారు. ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభా సమయాన్ని వృధా చేస్తారంట అని ఎద్దేవా చేశారు. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 లాగా రాజధాని నగర నిర్మాణ గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 

13:59 - March 25, 2017
13:58 - March 25, 2017

స్మిత్ సెంచరీ...

ధర్మశాల టెస్టు : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేశారు. 150 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశారు. స్మిత్ కు ఇది 19వ సెంచరీ. ఇండియా పై 10వ సెంచరీ పూర్తి చేశారు.

 

 

13:46 - March 25, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో బీసీ సంక్షేమంపై వైసీపీ పట్టు చర్చకు పట్టుబట్టింది. ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

 

13:34 - March 25, 2017

ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

 

 

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 178పరుగుల వద్ద మ్యాక్స్ వెల్(8) ఔటయ్యాడు.

 

 

 

నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

 

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 168పరుగుల వద్ద స్కోంబ్ (8) ఔటయ్యాడు.

 

 

కాంగ్రెస్ విప్ పదవికి సంపత్ రాజీనామా

హైదరాబాద్ : కాంగ్రెస్ విప్ పదవికి ఎమ్మెల్యే సంపత్ కుమారు రాజీనామా చేశారు. శుక్రవారం సభలో ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ పై మాట్లాడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. కనీసం తమ పార్టీ సభా నాయకుడు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని మనస్తాపంతో రాజీనామా చేశారని తెలుస్తోంది. 

12:48 - March 25, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అంతకముందు ఉపాధి హామీ సక్రమంగా అమలవుతుందని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎక్కువకూలీ కోసం కేరళకు వలసలు వెళ్తున్నారని ప్రకటించారు. మంత్రి అయ్యన్న సమాధానంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. 

రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల టెస్టు : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 144పరుగుల వద్ద వార్నర్(56) ఔటయ్యాడు.

12:47 - March 25, 2017
12:45 - March 25, 2017

గుంటూరు : ఉపాధి లేక అన్నదాతలు భిక్షాటన చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు. నిధుల్ని ఉపాధి కల్పించేందుకు వాడటం లేదని చెప్పారు. అంగన్ వాడీ భవనాలకూ ఇవే నిధులు వాడుతున్నారని పేర్కొన్నారు. చివరికి స్మశానాలకు కూడా ఇవే నిధుల ఉపయోగిస్తున్నారని తెలిపారు. 

 

12:40 - March 25, 2017
12:04 - March 25, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 2019 సంవత్సరం నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,916 కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను నాబార్డ్ నుండి తీసుకోస్తామన్నారు. 2018 సంవత్సరం నాటికి పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లిస్తామని ఆయన తెలిపారు.

 

పేపర్ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వ కృషి : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభలో సిర్పూర్ పేపర్ మిల్లుపై జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ సమాధానమిస్తూ పేపర్ మిల్లు తెరిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నామని ఆయన సభకు తెలిపారు. దీంతోపాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్వహించడానికి రైతులు ముందుకోస్తే అవసరమైన నిధులు అంధిస్తామని ఆయన ప్రకటించారు. 

 

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 2019 నాటికి పోలవరం పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు.కేంద్రం నుంచి రూ.2,916 కోట్లు తీసుకొచ్చామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను నాబార్డ్ నుండి తీసుకోస్తామని ఆయన అన్నారు. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లిస్తామని ఆయన తెలిపారు.

 

 

స్మిత్ అర్ధ సెంచరీ

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీ పూర్తి చేశారు.

 

 

 

హుస్నాబాద్ పీఎస్ లో తుపాకుల మాయం

సిద్దిపేట : జిల్లాలోని హుస్నాబాద్ పోలీసుస్టేషన్ లో తుపాకులు మాయమయ్యాయి. 2 నెలలుగా ఏకే 47తో పాటు కార్బన్ వెపన్ కనిపించకపోపవడంపై అధికారులు విచారణ చేపట్టారు .

టీఅసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు.

 

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 

 

10:54 - March 25, 2017

కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు వివాహితపై పైశాచిక దాడికి ఒడిగట్టారు. నిద్రిస్తున్న ఓ వివాహిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని ఆలహర్విలో రాత్రి ఇంటిముందు భర్త పక్కల నిద్రిస్తున్న మహిళను పక్కగదిలోకి తీసుకెళ్లి.. నోట్లో బట్టలు కుక్కి, కాళ్లుచేతులు కట్టేసి దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం అనంతరం మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె మర్మాంగాలపై ఆయుధాలతో గాయపరిచారు. తెల్లవారే సరికి కాలకృత్యాలకు లేచి భర్తకు పక్కన పడుకున్న భార్య కనిపించలేదు. చుట్టూ పక్కలా వెతికారు ఎక్కడా కనిపించలేదు. చివరకు ఇంట్లోని పక్క రూములోకి వెళ్లి చూడగా మహిళ అపస్మారక స్థితిలో పడింది. బంధువుల సహాయంతో మహిళను ఆదోని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనలో నలుగురు లేదా ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పు అడిగినందుకు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలో వివాహితపై లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు వివాహితపై పైశాచిక దాడికి ఒడిగట్టారు. నిద్రిస్తున్న ఓ వివాహిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

నల్ల కండువాతో అసెంబ్లీకి ఎమ్మెల్యే సంపత్ కుమార్

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నల్ల కండువాతో అసెంబ్లీకి వచ్చారు. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చ సందర్భంగా తనకు అవకాశం ఇవ్వలేదని నల్ల కండువాతో నిరసన తెలిపారు. వంశీచంద్ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జానారెడ్డి కోరారు. కానీ తన కోసం అడగకపోవడమేంటని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంపత్ ను కోమటిరెడ్డి, చిన్నారెడ్డి బుజ్జగించారు. తాను ఎస్సీ అయినందునే తమ నాయకులెవరూ మద్దతు నిలవడం లేదని సంపత్ కుమార్ తెలిపారు.

మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మలశాల టెస్టు : ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. 10 పరుగుల వద్ద ఓపెనర్ రెన్షా ఔటయ్యాడు.

10:26 - March 25, 2017
10:24 - March 25, 2017

ధర్మశాల : భారత్, ఆస్ట్రేలియాల మధ్య కాసేపట్లో నాల్గో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఈ టెస్టుకు కెప్టెన్ గా అజింక్యా రహానే వ్యవహరించనున్నారు. ఇషాంత్ కుమార్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఆడనున్నారు. కోహ్లీ స్థానంలో కుల్దీప్ కు అవకాశం లభించింది.

10:23 - March 25, 2017
09:30 - March 25, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. ఈనేపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. 

ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా..

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడింది. సమవేశాలు ప్రారంభం కాగానే వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. ఈనేపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. 

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ధర్మశాల : ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ టెస్టుకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. నాలుగో టెస్టుకు కెప్టెన్ గా అజింక్యా రహానే వ్యవహరించనున్నారు. 

08:44 - March 25, 2017
08:42 - March 25, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాణిజ్యపంటలకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధిపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు, గోదావరి డెల్టా ఆధునీకరణ, కళాకారుల పెన్షన్ వంటి అంశాలపై క్వశ్చన్ అవర్ లో చర్చ జరుగనుంది. అలాగే మేరిటైంబోర్డు బిల్లు, ఏపీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ సవరణ బిల్లులు, హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లులు ఇవాళ సభ ముందుకు రానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు జగన్ కు చిత్తశుద్ధి లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సభలో గందరగోళం చేయడం, పదే పదే సభను వాయిదా వేయడం జగన్ పరిపాటిగా మారిందని విమర్శించారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాణిజ్యపంటలకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధిపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది.

 

08:25 - March 25, 2017

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వక్తలు అన్నారు. న్యూస్ మర్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, బీజేపీ నేత వేణుగోపాల్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్ పాల్గొని, మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మార్పు చేస్తామనడంలో అర్ధం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాయిదా తీర్మానం

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో నేడు వాణిజ్యపంటలకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది.

08:15 - March 25, 2017

చిత్తూరు : తిరుమలకు వెళ్లే మార్గంలో విషాదం నెలకొంది. శిలాతోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతుండగా విద్యుత్ షాక్ తో శ్రీనివాస్ అనే ఉద్యోగి మృతి చెందారు. తిరుమలలోని ఆస్పత్రికి తరిలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు జీహెచ్ ఎంసీ సర్వసభ్య సమావేశం

హైదరాబాద్ : నేడు జీహెచ్ ఎంసీ సర్వసభ్య సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు బల్దియా సమావేశం ప్రారంభం కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ముసాయిదాపై చర్చ జరుగనుంది. 

 

08:04 - March 25, 2017

హిమాచల్‌ ప్రదేశ్‌ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా....ఆస్ట్రేలియాతో అసలు సిసలు సమరానికి సన్నద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని క్లైమాక్స్ టెస్ట్‌లో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగనున్న సమరంలో పక్కా గేమ్‌ ప్లాన్‌తో కంగారూలకు చెక్‌ పెట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
క్లైమాక్స్‌ టెస్ట్‌
టెస్టుల్లో తిరుగులేని టీమిండియా...ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌కు సన్నద్ధమైంది. సిరీస్‌కే నిర్ణయాత్మకంగా మారిన క్లైమాక్స్‌ టెస్ట్‌కు ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. 
అమీతుమీకి సిద్ధమైన భారత్‌ 
నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోన్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరాటలో కంగారూ టీమ్‌తో భారత్‌ అమీతుమీకి సిద్ధమైంది. పూణేలో ఎదురైన పరాభవానికి బెంగళూర్‌లో బదులు తీర్చుకున్న  భారత్‌....మూడో టెస్ట్‌లో విజయానికి చేరువగా వచ్చి డ్రాతోనే సరిపెట్టుకుంది. ఓపెనర్‌ రాహుల్‌, టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా నిలకడగా రాణిస్తుండటంతో పాటు మురళీ విజయ్‌ ఫామ్‌లోకి రావడంతో భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ ఆస్ట్రేలియాకు ధీటుగా ఉంది. 
దర్శశాల టెస్టులో కోహ్లీ డౌటే.. 
మూడు టెస్టుల్లోనూ విఫలమైన కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీతో పాటు అజింక్య రహానే సైతం గాడిలో పడితే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు. కానీ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోని కొహ్లీ...ధర్మశాల 
టెస్ట్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. స్పిన్‌ ట్విన్స్‌ అశ్విన్‌,జడేజా టెస్టుల్లో ఎంతలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అశ్విన్‌ విఫలమైతే జడేజా....జడ్డూ ఫెయిలైతే అశ్విన్‌, వికెట్లు తీయడంలో పోటీపడుతూనే ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోర్లు  చేయడంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడం మీదనే భారత  జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 
భారత్‌కు గట్టి పోటీనిస్తున్న ఆస్ట్రేలియా 
మరో వైపు అనామక జట్టుగా భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు....ప్రస్తుత సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీనిస్తూనే ఉంది. పీటర్‌ హ్యాండ్స్‌కూంబ్‌, షాన్‌ మార్ష్‌ల వీరోచిత పోరాటంతో రాంచీ టెస్ట్‌ను డ్రా చేసుకున్న కంగారూ టీమ్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం  విరాట్‌ ఆర్మీకి మరోసారి కష్టాలు తప్పవు. స్పిన్నర్లు స్టీవ్‌ ఒకీఫ్‌, నాథన్‌ లయోన్‌కు చెక్‌ పెట్టిన భారత బ్యాట్స్‌మెన్‌ హేజిల్‌వుడ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ను  ఎదుర్కోవడంలో మాత్రం తడబడుతూనే ఉన్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగితే ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. 
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఎవరిదో..?  
సిరీస్‌ నిర్ణయాత్మక ఆఖరి టెస్ట్‌లో.... ఆస్ట్రేలియాను ఓడించాలంటే టీమిండియా అంచనాలకు మించి రాణించాల్సిందే. మరి క్లైమాక్స్‌ టెస్ట్‌లో నెగ్గి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సొంతంచేసుకునే జట్టేదో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

07:52 - March 25, 2017

విశాఖ : క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ విశాఖలో సందడి చేశారు. దేవ్‌దర్‌ ట్రోఫీలో ఆడేందుకు విశాఖ వచ్చిన హర్బజన్‌ సింగ్‌ నగకంలోని ఒక ప్రముఖ స్పోర్ట్స్‌ స్టోర్‌ను సందర్శించారు. తనకు కావాల్సిన క్రీడా పరికరాలను కొనుగోలు చేశారు. 
 

07:50 - March 25, 2017

ప్రకాశం : అమెరికాలో మరో దారుణం వెలుగుచూసింది...నట్టింట్లో తల్లీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు... ఈ హత్యలు ఎవరు చేశారు..? ఎందుకు చేశారన్నది మాత్రంమిస్టరీగా మారింది...మరోవైపు భర్తనే చంపేసి ఉంటాడన్న అనుమానాలు పెరుగుతున్నాయి...జరిగిన ఘోరంపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుండగా ...హతుల స్వస్థలంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి...
అమెరికాలో మరో ఘోరం...
శశికళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు...బాబును స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చారు...రోజూలానే హన్మంతరావు ఆఫీస్‌ నుంచి ఇంటికి రాగా భార్యా,కుమారుడు రక్తపు మడుగులో కన్పించారు..అప్పటికే వారిద్దరూ చనిపోయారు...ఆయన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు... దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 
భర్తే చంపాడంటున్న పేరెంట్స్...
హన్మంతరావుకు మరో మహిళకు సంబంధం ఉందని ...దీంతోనే శశికళను అడ్డు తొలగించుకునేందుకు హత్యలు చేశాంటున్నారు హతురాలి కుటుంబీకులు...అల్లుడి వ్యవహారం సరిగా లేదని...కొన్నాళ్లుగా కొడుతున్నాడని తమ కూతురు చెప్పిందంటున్నారు...
డబుల్ మర్డర్‌పై ఎన్నో అనుమానాలు..
హన్మంతరావు, శశికళల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో భార్య,కొడుకులను చంపి దుండగుల దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నాడన్న ఆరోపణలు పెరిగాయి... అయితే జరిగిన విషయంలో మాత్రం అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

నేడు టీడీపీ నేతల సర్వసభ్య సమావేశం

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేడు టీడీపీ నేతల సర్వసభ్య సమావేశం జరుగనుంది. సంస్థాగత బలోపేతం, మినీ మహానాడుపై చర్చించనున్నారు. 

నేడు యూజీపీ వద్ద విద్యార్థుల ధర్నా

ఢిల్లీ : నేడు యూజీపీ వద్ద విద్యార్థుల ధర్నా చేపట్టనున్నారు. ఎంఫిల్, పీహెచ్ డీ కోర్సుల్లో సీట్ల కుదింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

07:39 - March 25, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ 2017....18 వార్షిక బడ్జెట్‌కు ఎట్టకేలకు కౌన్సిల్‌ ఆమోదముద్ర వేయనుంది. జనవరిలోనే బల్దియా కౌన్సిల్‌.. బడ్జెట్‌ను ఆమోదించి ప్రభుత్వానికి పంపాల్సి ఉండగా.... రెండు నెలలు ఆలస్యమైంది.  బల్దియా చరిత్రలోనే మొదటిసారి అధికారులు ప్రతిపాదించిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది స్టాండింగ్‌ కమిటీ. అయితే గతేడాది కంటే 43 కోట్లు పెంచి 5643 కోట్లతో బడ్జెట్‌ ఫైనల్‌ చేశారు.
బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ. 1000 కోట్లు కేటాయింపు
2017..18 సంవత్సరానికి గాను 5643 కోట్లతో జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.  గత ఏడాది 5600 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టగా... ఇప్పుడు మరో 43 కోట్లను పెంచింది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులు రూపొందించిన బడ్జెట్‌కే స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.  గ్రేవ్‌ యార్డుల అభివృద్ధి, వారసత్వ కట్టడాల రక్షణకు మాత్రం నిధులను పెంచాలని నిర్ణయించిన స్టాండింగ్‌ కమిటీ... ఏకగ్రీవంగా బడ్జెట్‌ను ఆమోదించి కౌన్సిల్‌ ముందుంచుతుంది. బల్దియా రెవెన్యూ రాబడి 2926 కోట్లు వస్తుందని భావించిన అధికారులు... 2616 కోట్లు ఖర్చు చెయ్యాలని ప్రతిపాదించారు. ఇందులో 301 కోట్లు మిగులు ఉంటుందని అంచనా వేశారు.  ఆస్తిపన్ను ద్వారా 1285 కోట్లు వస్తుందని అంచనా వేసిన అధికారులు.. ఫీజులు, ట్రేడ్‌ లైసెన్సులు, ప్రకటనల ఫీజు, రోడ్డు కట్టింగ్‌ ఫీజులు, భవన నిర్మాణ అనుమతుల వంటి యూజర్‌ చార్టీల ద్వారా 962.79 కోట్లు వస్తుందని భావిస్తున్నారు.  బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా 30 కోట్లు, భవనాలు, స్థలాల లీజు ద్వారా 17 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 583 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1000 కోట్లు ఇస్తున్నట్టు బడ్జెట్‌లో కేటాయించింది.
క్యాపిటల్‌ ఇన్‌కం రూ. 3026.73 కోట్లు
క్యాపిటల్‌ ఇన్‌కమ్‌ ద్వారా 3026.73 కోట్లుకాగా... దానిని పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా ప్లాన్‌ రూపొందించారు. క్యాపిటల్‌ రాబడిలో ప్రధానంగా అప్పులపైనే నమ్మకం పెట్టుకుంది బల్దియా.  2240 కోట్లను అప్పుల రూపంలో సమీకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు.  మూడేళ్లలో 3300 కోట్లు అప్పులు చేయాలని భావించిన అధికారులు.. ఈ ఏడాదే  2240 కోట్ల అప్పుకు సిద్దమయ్యారు. ఇక కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులతోపాటు.. స్లమ్‌ప్రీ సిటీ, జెన్‌ఎన్‌యూఆర్‌ఎం, రోడ్ల అభివృద్ధి లాంటి పనులకు 413 కోట్లు వస్తాయని ఆశిస్తోంది. బీపీఎస్‌ఎల్‌ఆర్‌ఎల్‌ ద్వారా 157 కోట్లు, యూసిడి, సిటీ డెవలప్‌మెంట్‌ కోసం కేంద్రం ద్వారా మరో 164 కోట్లు ఆశిస్తోంది.
రోడ్లపై జీహెచ్‌ఎంసీ ప్రధాన దృష్టి
గత బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వగా.... ఈసారి మాత్రం రోడ్లపై దృష్టిసారించారు.  బడ్జెట్‌లో 29శాతం నిధులను అంటే 1611 కోట్ల రూపాయలను రోడ్లకోసం కేటాయించారు. వీటిలో ఎస్‌ఆర్డిపి, వైట్‌ టాంపింగ్‌ రోడ్లతోపాటు జంక్షన్ల విస్తరణపై ఫోకస్‌ పెట్టారు.   ఇక డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం 400 కోట్లను కేటాయించారు. వాటర్‌సప్లై, సివరేజ్‌ సౌకర్యం కోసం 153 కోట్లు, వర్షపునీటి కాలువల అభివృద్ధి కోసం 249 కోట్లు, మోడల్‌ మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు 140 కోట్లు ఖర్చు చేయనున్నారు. సబ్‌వేల నిర్మాణం కోసం 60 కోట్లు, స్ట్రీట్‌ లైటింగ్‌ కోసం 41 కోట్లు కేటాయించిన బల్దియా కొత్త వాహనాల కొనుగోలుకు 16 కోట్లు ఖర్చు చేయనుంది.
రాబడి ఎంత...? 
గత ఏడాది 5600 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించగా... చివరకు దానిని రివైజ్‌ చేసిన అధికారులు 5061కోట్లుగా లెక్కలు తేల్చారు. కాని 3500 కోట్లు కూడా దాటలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి 5643 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదిస్తే.. వాస్తవంగా రాబడి ఎంత వస్తుందనేది బల్దియా తెచ్చే అప్పులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిపాదిత బడ్జెట్‌లో ప్రతిపక్ష సభ్యులతోపాటు అధికారపక్ష సభ్యుల ప్రతిపాదనలు ఎలా ఉంటాయన్నది సమావేశంలో తేలనుంది. 

 

07:32 - March 25, 2017

గుంటూరు : మాట్లాడే అవకాశం ఇవ్వండి.. ఆధారాలు సభముందు ఉంచుతా.. ఇదీ విపక్షనేత జగన్‌ సవాల్. కాదు.. ముందు మంత్రి పుల్లారావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తారా..లేదా.. తేల్చండి.. అన్నది పాలక పక్షం పంతం. మొత్తానికి అగ్రిగోల్డ్‌ వివాదంలో టీడీపీ, వైసీపీ పక్షాల మధ్య అసెంబ్లీలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇరు పక్షాల పోటాపోటీ వ్యూహాల కారణంగా.. ఏపీ శాసనసభ సమావేశాలు రవత్తరంగా మారాయి. 
పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం 
అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై శుక్రవారం కూడా అసెంబ్లీలో పాలక, ప్రతిపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష  సభ్యుల నినాదాలతో ఏపీ శాసనసభ దద్దరిల్లింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విపక్షనేత జగన్‌ చేసిన ఆరోపణలను నిగ్గుతేల్చాలని అధికార పక్షం పట్టుబట్టింది. తనకు ఇరవై నిమిషాల సమయం మాట్లాడేందుకు అవకాశమిస్తే.. ఆధారాలు చూపుతానంటూ జగన్‌ సమాధానమిచ్చారు. ఆధారాలు ఇవిగో అంటూ కొన్ని పేపర్లు చేతబట్టి.. పాలక పక్షం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించే ప్రయత్నం చేశారు. జగన్‌ ఆరోపణలపై ఆర్థిక, శాసనసభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. ఖాళీపేపర్లు పట్టుకుని విపక్షనేత హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై, విపక్షనేతను అనుమతించవద్దని స్పీకర్‌ను కోరారు. 
20నిముషాలు టైం ఇవ్వండి : జగన్ 
20నిముషాలు టైం ఇస్తే ఆధారాలు సభ ముందు ఉంచుతామన్న జగన్‌ డిమాండ్‌ను.. పాలక పక్షం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ అంశంపై న్యాయవిచారణకు ఆదేశిస్తామని సీఎం ప్రకటించినందున, జగన్‌ వద్దనున్న సాక్ష్యాలు కమిటీ ముందు ఉంచవచ్చని పేర్కొంది. అన్నింటికన్నా ముందు జగన్‌, ఈ అంశంలో న్యాయవిచారణకు అంగీకరిస్తున్నారో లేదో తేల్చాలని.. మంత్రి అచ్చెన్నాయడు డిమాండ్‌ చేశారు. మకు సమయం లేదని... శరణమో, రణమో తేల్చుకోవాలంటూ సినీఫక్కీలో ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్‌ విసిరారు. అయితే ముందు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ జగన్‌ పదే పదే స్పీకర్‌ను కోరారు. ఈ దశలో.. ముఖ్యమంత్రి సహా.. పలువురు మంత్రులు, పాలక పక్షం ఎమ్మెల్యేలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విసిరిన సవాల్‌ను జగన్‌ తీసుకుంటున్నారో లేదో తేల్చాలంటూ పట్టుబట్టారు. 
సభలో గందరగోళం 
ఈసందర్భంలో వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టూ చేరి పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను పదినిముషాలపాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత జగన్‌ మరోసారి స్పీకర్‌ను అభ్యర్థించారు. తనకు మాట్లాడే టైం ఇస్తే తాను చేసిన ఆరోపణలకు రుజువులు సభ ముందు ఉంచుతానన్నారు. దీంతో మరోసారి మంత్రులు ఎదురుదాడికి దిగారు. ముందు జుడిషియల్‌ ఎంక్వైరికైనా ఒప్పుకోవాలి.. లేదంటే మత్రి పుల్లారావుకు క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఏదో ఒకటి తేల్చి చెప్పండని స్పీకర్‌ కూడా విపక్షనేతకు సూచించారు. 
సభ నుంచి జగన్ వాకౌట్ 
అటు బీజేపీ ఎమ్మెల్యే , మంత్రి మాణిక్యాలరావు కూడా జగన్‌ను టార్గెట్‌ చేశారు. అనవరమైన ఆరోపణలు చేస్తూ.. సభాసమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే .. తనకు సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ అసంతృప్తి ప్రకటించిన విపక్షనేత సభ నుంచి వాకౌట్ చేశారు. 
విపక్షం వ్యవహారశైలిపై అధికార పక్షసభ్యులు నిరసన 
వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేశాక, విపక్షం వ్యవహారశైలిపై అధికారపక్షసభ్యులు నిరసనను తెలిపారు. ఈ సందర్భంలో  వివాఖ నార్త్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడిన తీరు సభలో హాస్యం పడించింది. జగన్‌కు సీఎం కావాలన్న కోరిక.. తనకు లావు తగ్గాలన్న కోరిక తీరేవి కాదని వ్యాఖ్యానించడంతో సీఎం చంద్రబాబుతోసహా సభఅంతా నవ్వులు విరిశాయి. 
వైసీపీ సభ్యుల వైఖరిని ఖండిస్తూ యనమల తీర్మానం 
అనంతరం సభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సభలో వైసీపీ సభ్యుల వైఖరిని ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభలో ఉన్న బీజేపీ, టీడీపీ సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. తర్వాత సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. 

 

07:23 - March 25, 2017

పెద్దపల్లి : 23 సంవత్సరాల కల ఫలించింది. ఆ గ్రామాల ప్రజల చిరకాల వాంఛ నిజమైంది. పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల ప్రజలకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ జిల్లాల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మోర్తాడ్‌ నుంచి నిజామాబాద్‌ వరకూ పొడిగింపు
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు మోర్తాడ్‌ వరకు నడుస్తున్న పెద్దపల్లి-నిజామాబాద్‌ రైలు ఇక నుంచి నిజామాబాద్‌ వరకు రానుంది. గత సంవత్సరం పెద్దపల్లి...నిజామాబాద్ రైల్వే సర్వీసు ప్రారంభమైంది. ఈ రైలును నిజామాబాద్ వరకు నడిపించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మోర్తాడ్‌ నుంచి నిజామాబాద్ వరకున్న 28 కిలోమీటర్లు రైల్వే లైన్‌ పూర్తి చేయించారు.  
1993 సంవత్సరంలో లైన్‌కు శంకుస్థాపన
వాస్తవానికి 1993 సంవత్సరంలో జూన్‌ 30 నాడు అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ఈ లైనుకు శంకుస్థాపన చేశారు. 178 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైనుకు 417 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అప్పుడు అంచనా వేశారు. అప్పటి నుంచి బడ్జెట్‌లో  ఈ  ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయిస్తూ వచ్చారు. ఈ మేరకు మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేశారు. మొత్తం 74.12 కోట్లతో  గత ఏడాది జగిత్యాల నుంచి కోరుట్ల మెట్‌పల్లి కమ్మర్ పల్లి మోర్తాడ్‌ వరకు రైల్వే లైన్ల పనులు పూర్తి చేశారు.  ఇప్పుడు నిజామాబాద్ వరకు రైల్వే లైన్ పనులు పూర్తి చేశారు. ఈ మేరకు రేపు పెద్దపల్లి-నిజామాబాద్ రైలును హైదరాబాద్‌ నుంచి కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు రిమోట్ కంట్రోల్‌ ద్వారా  ప్రారంభించనున్నారు. రైలు సౌకర్యంపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు... తమకు పలు గ్రామాల ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.
ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తి
పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో మూడు బ్రిడ్జ్‌లు మినహ పూర్తిస్థాయిలో ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే తాత్కాలికంగా రైల్వే గేట్లను ఏర్పాటు చేసి పెద్దపల్లి నిజామాబాద్ రైలును ప్రారంభిస్తున్నారు. 

 

07:17 - March 25, 2017

గుంటూరు : వచ్చే నెలాఖరు నాటికి అమరావతి పరపాలన నగర తుది ప్రణాళికలను ఖరారు చేయాని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన నగర భవన నిర్మాణ ఆకృతులు కూడా ఆలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థను ఆదేశించారు. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన రాజాధాని ప్రాంత ప్రాధికార సంస్థ.. సీఆర్ డీఏ కమిటీ సమావేశంలో పరిపాలనా నగర నిర్మాణంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 
సచివాయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం 
అమరావతి పరిపాలనా నగర నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఆర్‌డీఏ అధికారులతోపాటు, పరిపాలన నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నఫోస్టర్‌ అండ్‌ పర్టనర్స్‌ ప్రతినిధి క్రిస్‌ బబ్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు  సమావేశంలో పాల్గొన్నారు. 
బ్లూ అండ్‌ గ్రీన్‌ సిటీగా అమరావతి   
పరిపాలనా నగరాన్ని బ్లూ అండ్‌ గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నీటి లభ్యతపై చర్చించారు. పాలవాగు, పులిచింతల ప్రాజెక్టుకు దిగువ నిర్మించబోయే బ్యారేజీ నుంచి నీరు తీసుకునే విధంగా ఉండాలని జల వనరులు శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. రాజధాని భవిష్యత్‌ అవరసరాలకు నీటి వనరులు అందుబాటులో ఉండే విధంగా బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. అమరావతికి కృత్రిమ జల  మార్గాలు కంటే  సహజ సిద్ధంగా నీటి ప్రవాహం ఉండేలా చూడాలని, అప్పుడే రాజధానికి అద్భుత శోభ వస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలవనరులు మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని, ఏడాదికి సరిపడేలా నీటి వనరులన్నింటినీ అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. రాజధాని మీదుగా వెళ్లే జల మార్గాల్లో నీటి మట్టం ఎంత ఉండాలన్న అంశంపై నిపుణులతో చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
రాజధాని ప్రణాళికలకు సమగ్ర రూపం 
పరిపాలనా నగర ప్రణాళికలపై ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ అందించిన ప్రణాళికపై కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చర్చ నిర్వహించేందుకు నోడల్‌ అధికారికి బాధ్యతలు అప్పంచాలని చంద్రబాబు కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతోపాటు, జాతీయ స్థాయిలో ప్రముఖుకు పరిపాలనా నగర ప్రణాళికలపై ప్రజెంటేషన్‌ ఇవ్వాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను చంద్రబాబు ఆదేశించారు. అందరి సూచనలు, సలహాలతోనే ప్రణాళికకు  సమగ్ర రూపం వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోస్టర్స్‌ తాజా ప్రణాళికను సామాజిక మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉంచి, నెటిజన్ల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని సమీక్షలో నిర్ణయించారు.  ఆకాశం నుంచి చూస్తే అమరావతి అక్షరాలు కనిపించేలా రాజధానిలో ప్రత్యేకంగా భారీ ఉద్యాన వనం నిర్మించాలని  ప్రతిపాదించారు. 
వారసత్వ సందలకు ప్రతీకగా అమరావతి 
రాజధాని నగరాన్ని అత్యంత ఆధునికంగా  తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆదేశించారు. చరిత్ర, సాంస్కృతిక వారసత్వ సంపదలకు ప్రతీకగా ఉండాలని సూచించారు. ఇందుకు తగ్గట్టుగా తుది ప్రణాళికలు ఉండాలని ఫోస్టర్‌ అండ్‌ ప్రార్టనర్స్‌ సంస్థ దృష్టికి తెచ్చారు. దేశంలో ఐటీ పరిశ్రమ అనగానే హైదరాబాద్‌లోని హెటెక్‌ సిటీ ఎలా గుర్తుకు వస్తుంటే, భారత్‌లో ఒక రాష్ట్ర  రాజధాని నగరం అన్నగానే అమరావతి గుర్తుకు వచ్చే విధంగా నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు. రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటుకు శాఖమూరు గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 125 అడుతు ఎత్తున అంబేద్కర్‌ లోహ విగ్రహాన్ని నిర్మిస్తారు. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన విగ్రహాల సరసన శాఖమూరు  నిర్మించే అంబేద్కర్‌ విగ్రహం ఉండాలని సూచించారు. 2019 నాటికి దీనిని పూర్తి చేయాలని నిర్ణయించారు. 

శిలాతోరణం దారిలో సబ్ స్టేషన్ వద్ద మంటలు

తిరుమల : శిలాతోరణం దారిలోని సబ్ స్టేషన్ వద్ద అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పే క్రమంలో సబ్ స్టేషన్ సిబ్బంది శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు.  

 

నేటి నుంచి భారత్..ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్

ఢిల్లీ : నేటి నుంచి భారత్..ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు పెద్దపల్లి..నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభం

పెద్దపల్లి : నేడు పెద్దపల్లి..నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. 

 

నేడు కాంగ్రెస్ సమూహిక సత్యాగ్రహం

అమరావతి : నేడు కాంగ్రెస్ సమూహిక సత్యాగ్రహం చేయనుంది. కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
 

రాజధాని డిజైన్స్ పై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

అమరావతి : రాజధాని డిజైన్స్ పై ఎమ్మెల్యేలకు నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. 

 

Don't Miss