Activities calendar

26 March 2017

సోమవారం పార్లమెంట్ కు పలు బిల్లులు..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను-జీఎస్టీ అనుబంధ బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

భారత్ 248 పరుగులు..

ధర్మశాల వేదికగా సాగుతోన్న చివరి టెస్ట్‌లో భారత్‌ ఆచితూచీ ఆడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది.

21:33 - March 26, 2017

ధర్మశాల వేదికగా సాగుతోన్న చివరి టెస్ట్‌లో భారత్‌ ఆచితూచీ ఆడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో టెస్ట్‌లో భారత్‌ - ఆస్ట్రేలియా జట్లు పోరాడుతున్నాయి. ట్రోఫీ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 300 రన్స్‌కే కట్టడి చేసిన భారత్‌.. భారీ స్కోరు సాధించేందుకు శ్రమిస్తోంది. ప్రారంభంలోనే ఓపెనర్ మురళీ విజయ్‌ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ మాధ్యూవేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. 87 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌ ఔటయ్యాడు. రాహుల్ 60 పరుగులు చేశాడు.

248 పరుగులు..
పుజారాతో జతకలిసిన అజింక్యా రహానే ఆచితూచి ఆడుతూ స్కోరును 150 పరుగులు దాటించారు. ఈ సమయంలోనే 57 పరుగులతో జోరుమీదున్న పుజారా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ 5పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో 167 పరుగులకే భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌... రహానేతో కలిసి 49 పరుగులు జోడించారు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రహానే.. ఆలియాన్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత ఆల్‌రౌండర్ అశ్విన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. దీంతో 221 పరుగులకే భారత్‌ ఆరువికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా, జడేజా మరో విక్కెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. మొత్తంగా ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 248 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. భారత బ్యాటింగ్‌ జోరుకు.. ఆసీస్‌ స్పిన్నర్‌ లైయన్‌ అడ్డుకట్ట వేశాడు. కీలక సమయాల్లో నాలుగు వికెట్లు తీశాడు.

21:31 - March 26, 2017
21:30 - March 26, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను-జీఎస్టీ అనుబంధ బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్‌టీలో భాగమైన సీ, జీఎస్టీ, ఐ, జీఎస్టీ యూటీ, జీఎస్టీ, మొదలైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మార్చి 28న చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్‌టీ అమలైతే ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ చట్టంలో ఉన్న వివిధ సెస్సులను రద్దు చేస్తారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన బిల్లులన్నీ జీఎస్‌టీ కిందకు వస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయాన్ని, ఇతర విషయాలపై రేపు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మార్చి 29 లేదా 30లోపు జీఎస్‌టీ బిల్లుకు సభ ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

21:29 - March 26, 2017

ఢిల్లీ : శ్రీలంక నేవీ సిబ్బంది మరోసారి జులుం ప్రదర్శించారు.12 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీపుకున్నారు. మత్స్యకారుల నుంచి రెండు బోట్లు స్వాధీనం చేసుకున్నారు.పుదుకొట్టాయ్‌ వద్ద తమ జలాల్లో ప్రవేశించారంటూ తమిళజాలర్లను అదుపులోకి తీసుకున్నారు.అయితే నిన్న శ్రీలంక జాలర్లతో భారత మత్స్యకారులు గొడవపడ్డంతోనే లంక నేవీ అధికారులు మనవారిని నిర్బంధించారని స్థానిక తమిళ జాలర్లు అంటున్నారు.

21:26 - March 26, 2017

హైదరాబాద్ : పద్మశాలీ చైతన్య సదస్సు నగరంలో ఘనంగా జరిగింది. నాగోల్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌తో పాటు టి-టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ, బీసీ సంఘం చైర్మన్‌ జి.రాములు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పద్మశాలీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పద్మశాలీల అభివృద్ధి-వాటికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యనేతలు చర్చించారు.

21:20 - March 26, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ లేటెస్ట్‌ మూవీ కాటమరాయుడు చిత్రాన్ని... తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. అనంతరం హీరో పవన్‌ కల్యాణ్‌కు, డైరెక్టర్‌ డాలీతో పాటు చిత్రబృందానికి కేటీఆర్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని అన్నారు. ఈ సినిమా ద్వారా చేనేతకు ప్రచారకర్త దొరికాడని పవన్‌పై కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో ఆయన తీసుకున్న సెల్పీని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అటు మూవీని చూసి.. అభినందనలు తెలిపినందుకు... పవన్‌ కల్యాణ్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

21:18 - March 26, 2017

హైదరాబాద్ : ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ వామపక్షాలు మరోసారి ఆందోళన నిర్వహించాయి. ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కె రన్‌ నిర్వహించారు. అయితే పోలీసులు రన్‌లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొన్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజాక్ ఛైర్మన్ కోదండరామ్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రం దగ్గర ఆదివారం ఉదయం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ వామపక్షాలు ఆదివారం ఉదయం చేపట్టిన 2కె రన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌కు బయలుదేరిన వామపక్ష, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని 2రన్‌ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు రన్‌ను అడ్డుకున్నారు. దీంతో ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నిర్భంద చర్యలు..
2 కే రన్‌లో పాల్గొన్న టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ నేత సంధ్య, ఎంపీజే జాతీయ కార్యదర్శి ఎండీ గౌస్, ప్రొఫెసర్‌ విశ్వశ్వరావుతో పాటు పలువురు వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎస్వీకే దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే ప్రత్యేక వాహనాల్లో గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుందరయ్య పార్క్‌కు ఉదయం వాకింగ్‌ కోసమని వచ్చే వాళ్లు కూడా రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్భంధ చర్యలు చేపట్టారు. దీంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసరాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. మరోవైపు నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన వామపక్ష కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

ప్రజాగ్రహానికి గురికాక తప్పదు..
ప్రభుత్వం తమ ఏకపక్ష నిర్ణయాలతో వెళితే..ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తే నచ్చడంలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే..ఏప్రిల్‌లో అన్ని వర్గాల ప్రజలతో భారీప్రదర్శనతో ప్రభంజనం సృష్టిస్తామని కోదండరాం హెచ్చరించారు. మొత్తానికి ధర్నా చౌక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు వామపక్షాలు, ప్రజాసంఘాలు సమాయాత్తం అవుతున్నాయి.

21:14 - March 26, 2017

హైదరాబాద్ : విభజన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు నిర్ణయించాయి. ఉద్యోగుల బదలాయింపు, ఆస్తుల పంపకం, సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాల అప్పగింత, 42 కార్పొరేషన్ల విభజన వంటి అంశాలను పరస్పర చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏర్పాటైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు రాజ్‌భవన్‌లో సమావేశమయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ త్రిసభ్య కమిటీ సభ్యులు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ పాల్గొన్నారు. ఏపీ తిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు భేటీకి హాజరయ్యారు.

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు..
రెండు రాష్ట్రాల కమిటీ సభ్యులు విభజన సమస్యలపై అరమరికలు లేకుండా చర్చించారు. ముఖ్యంగా ఉద్యోగుల విభజన అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. విద్యుత్‌ సంస్థలతోపాటు, ఉపాధ్యాయులు, పోలీసుల బదలాయింపు అంశాలపై సమాలోచనలు జరిపారు. అలాగే శాసనసభ, శాసనమండలి, సచివాలయం భవనాల అప్పగింతపై కూడా చర్చించారు. ఖాళీగా ఉన్న ఈ భవనాలు అప్పగించాలని తెలంగాణ త్రిసభ్య కమిటీ సభ్యులు కోరగా, ఇది రాజకీయపరంగా తీసుకోవాల్సిన నిర్ణయమని ఏపీ కమిటీ సభ్యులు చెప్పారు. అలాగే ఏపీ పుర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చిన 42 కార్పొరేషన్ల ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజనపై కూడా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పంపకాలు చేసుకునే అంశంపై సమాలోచనలు జరిపారు. వచ్చే నెల 17 మరోసారి భేటీ కావాలని త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్ణయించాయి. ఆ రోజు జరిగే సమావేశంలో కొన్ని అంశాలపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

చిన్న కోడూరులో మంత్రి హరీష్ రావు పర్యటన..

సిద్ధిపేట : చిన్నకోడూరులో మంత్రి హరీష్ రావు పర్యటించారు. 429 మందికి సాదా బైనామా పట్టాలను, 32 మందికి కల్యాణలక్ష్మీ చెక్కును పంపిణీ చేశారు. రైతులకు 9 గంటల విద్యుత్ ను అందించేందుకు రూ. 5వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, త్వరలో చిన్న కోడూరుకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. 37వేల ఎకరాలకు సాగునీరందిస్తామని, రాష్ట్రంలో రూ. వేయ్యి కోట్లతో గోదాములు నిర్మిస్తామన్నారు. రూ. 280 కోట్ల కందులను ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.

పీఎస్ లో మద్యం మత్తులో వ్యక్తి వీరంగం..

సిద్ధిపేట : వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మద్యం మత్తులో కిషన్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఇద్దరు కానిస్టేబుళ్లపై కిషన్ అనే వ్యక్తి చేయి చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆలయాల అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. యాదాద్రి, వేములవాడ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

20:07 - March 26, 2017

పవన్ కు కేటీఆర్ కంగ్రాట్స్..

హైదరాబాద్ : ట్విట్టర్ లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. పవన్ నటనకు అభినందనలు తెలియచేశారు. పవన్ నటించిన 'కాటమరాయుడు' చిత్రాన్ని తాను చూడడం జరిగిందని, చేనేత వస్త్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రం సాగిందన్నారు. చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం కల్పించిన పవన్..శరత్ మరార్ లు నిజమైన విజేతలన్నారు.

19:30 - March 26, 2017

తూర్పుగోదావరి : అక్కడ మహిష పాదమే మహాపవిత్రం. దున్నపోతు తొక్కిందంటే సర్వరోగాలు మటుమాయమట. ఆ పశువు పాదాల కింద నగలడానికి జనం బారులు తీరుతారు. గిట్టల పాదాలు మీదపడగానే అమ్మోరి పాదాలే తాకినట్టు పరవశించి పోతారు. ఇంతకీ ఎక్కడా వింత ఆచారం. ఏమిటా మహిష మర్ధనం కథ. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వీరు పడుకున్నది ఏ బాబా కోసమో కాదు. మరే స్వామి వారి కోసమో కాదు. మహిష పాదం కోసం. వినడానికి విచిత్రంగా ఉన్నా అదే వాస్తవం. దున్నపోతు తొక్కిందంటే సర్వరోగాలు మటుమాయమవుతాయని ఇక్కడి జనం నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో అమీనాబాద్‌ అనే గ్రామమొకటి ఉంది. ఇక్కడ ప్రతిఏటా పోలేరమ్మ పేరిట జాతర జరుగుతుంది. ఈ జాతర కోసం జనం ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మొక్కులు తీర్చుకుంటారు.

పోలేరమ్మ జాతర..
పోలేరమ్మ జాతరలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అంటే మహిష పాదమే. అదేనండి దున్నపోతుతో తొక్కించుకోవడం అన్నమాట. గ్రామం మధ్యలో ఉన్న పోలేరమ్మ ఆలయం దగ్గర అందరూ వరుసగా పడుకుంటారు. ఆడా,మగా, చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా అందరూ పడుకుని ఉంటారు. ఇక అప్పుడే డప్పుల శబ్దం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అమ్మవారి ప్రతిరూపంగా భావించే గణాచారులు.... వేపమండలు చేతబట్టి ఊగిపోతూ వేగంగా నడుచుకుంటూ వస్తారు. వారి వెంట వేపమండలు, పూలదండలతో అలంకరించిన దున్నపోతు కూడా ఉంటుంది. గణాచారులతోపాటు దున్నపోతు కూడా పడుకున్న జనంపైనుంచి నడుచుకుంటూ వెళ్తుంది. అందరినీ తొక్కుతూ వేగంగా వెళ్లిపోతుంది. దీంతో జనం జయ జయధ్వానాలు చేస్తారు. మహిషపాదం తమపై పడగానే పాపాలు అన్నీ తొలగిపోయినట్టు భావిస్తారు. అమ్మవారి పాదాలే తమను తాకినట్టు పరవశించిపోతారు. అనంతరం అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు.

వింత ఆచారం..
దున్నపోతుతో తొక్కించుకునే ఈ వింత ఆచారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ఆచారం అనాదిగా కూడా వస్తోంది. సుమారు అమీనాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాల ప్రజలు దున్న పాదస్పర్శకోసం ఎగబడతారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ ఉత్సవం కోసం జనం ఎదురు చూస్తుంటారు. జాతరలో దున్నపోతు కిందపడుకునే భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం తలస్నానం చేసి అమ్మ ప్రతిరూపంగా భావించే దున్నపోతు చేత తొక్కించుకుంటారు. మహిషం జాతరకు రెండు రోజుల ముందే గ్రామం శివారులో ఉంటుందని.. దానిని అమ్మవారి ప్రతిరూపంగా కొలిచి జాతర నిర్వహిస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. మూడు రోజులపాటు ఈ పోలేరమ్మ జాతర జరుగుతుంది.

19:28 - March 26, 2017

విజయవాడ : ఏపీ ఆర్టీఏ కమిషనర్‌పై టీడీపీ నేతల దాడి వివాదం సద్దుమణిగింది. కమిషనర్‌పై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ కావడంతో కమిషనర్‌ను క్షమాపణలు కోరారు. మరోవైపు టీడీపీ నేతల దాడిని విపక్ష నేతలు తప్పుపట్టారు. అటు ఉద్యోగ సంఘాల నేతలూ టీడీపీ నేతల దాడిని ఖండించారు. విజయవాడలో ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంతో ఎంపీ కేశినేని, ఇతర టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేతల తీరును విపక్షనేతలతో పాటు ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. రవాణా శాఖ అధికారులపై టీడీపీ నేతలు రౌడీయిజం చేశారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం కాకపోతే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతల దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అండతోనే అధికారులపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు పార్థసారధి, శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..
రవాణాశాఖ కమిషనర్‌పై టీడీపీ ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడటంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు కమిషనర్‌కు బాసటగా నిలిచారు. కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దాడికి పాల్పడిన నాని, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. విపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. కేశినేని నాని, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరాను తన కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నారు. తక్షణమే ఆర్టీఏ కమిషనర్‌, సిబ్బందికి క్షమాపణ చెప్పాలని సూచించారు. సీఎం చంద్రబాబు క్లాస్‌ తీసుకోవడంతో టీడీపీ నేతలు నేరుగా రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు క్షమాపణలు చెప్పారు. మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. శనివారం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. సీఎం సూచన మేరకు కమిషనర్‌కు విచారం వ్యక్తం చేశామని, తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు. ఉద్యోగులపై దాడితో ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం అన్నారు. ప్రజలకు సేవ చేయాలని చెప్పే ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడటం మంచిదికాదన్నారు. టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పడంతో.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నామన్నారు. మొత్తానికి టీడీపీ నేతల క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావిస్తున్నారు.

19:11 - March 26, 2017

పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలను వారి వారి రంగాల్లో స్థిరపడిన వారి 'అంతరంగాన్ని' టెన్ టివి 'అంతరంగం' పరిచయం చేసింది. కానీ ఈసారి మాత్రం నీకోసం జీవిస్తే నీలో నీవే జీవిస్తావు..ప్రజల కోసం...జనాల కోసం జీవిస్తే జనహృదయాల్లో నిలిచిపోతావు అన్న అంబేద్కర్ మాటలను నిజం చేస్తూ జనం సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నారు. ఆయన ఎవరో కాదు.. ‘శరణం గచ్చామి'..సినిమాపై సెన్సార్ బోర్డు సృష్టించిన వివాదం అంతాఇంత కాదు. కానీ ప్రజల నుండి వచ్చిన ప్రశంసల ద్వారా..సమాజం ప్రశ్నించడం ద్వారా సెన్సార్ బోర్డు దిగివచ్చింది. సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. టెన్ టివి అంతంరగం కార్యక్రమంలో నిర్మాత..భూమా మురళితో ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

18:25 - March 26, 2017

విజయవాడ :  సోలార్ పై అవగాహన పెంచుకోవాలని సోల్ టెక్ సంస్థ మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం ఆటోనగర్ లో సోలార్ పవర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోల్ టెక్ సంస్థ నిర్వాహకులు, రాష్ట్రంలోని ప్రైవేటు ఎలక్ర్టికల్ సభ్యులకు సోలార్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోలార్ పై ప్రజల్లో కొంత అపోహ ఉందని, కరెంటుతో సంబంధం లేకుండా సోలార్ ను వినియోగించుకోవచ్చన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రతి ఇళ్లు..కంపెనీ..షాపుల్లో సోలార్ ఎంతో అవసరమని, ప్రజలు దీని ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించారు.

18:18 - March 26, 2017
18:12 - March 26, 2017

కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ : కోదండరాం

హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైనింగ్ కాంట్రాక్టర్ల కోసమే అని టీజేఏసీ చైర్మన్ ప్రొ . కోదండరాం ఆరోపించారు. ప్రశ్నించే వారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేస్తున్నా ప్రభుత్వం, ధర్నా చౌక్ ను ఎత్తేసినట్లే సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నూ ఎత్తేసి ప్రభుత్వన్ని ప్రశ్నించకుండా చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని , విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ శక్తులను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ స్కీంలో నైనా 30 నుంచి 40 శాతం నిధులే ఖర్చువుతున్నాయని ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయ విధానం ప్రకటించాలని ఆయన ప్రభుత్వన్ని కోరారు.

17:33 - March 26, 2017

భద్రాచలం : జిల్లాలోని ఐదో తేదీన జరిగే శ్రీరామనవమి వేడుకల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవమి వేడుకల ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. ఆదివారం ఏర్పాట్లను మంత్రి తుమ్మల పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ మొదటి తేదీ వరకే ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

17:29 - March 26, 2017
17:22 - March 26, 2017

మెదక్ : సంగారెడ్డిలోని వ్యవసాయ జూనియర్ కాలేజీలో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వ లేదని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రేపు అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, మూడు సంవత్సరాల నుండి వ్యవసాయ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు నిరసనలు..ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. మంత్రులను..కలిసినా స్పందించకపోవడం దారుణమన్నారు. అసెంబ్లీ ముట్టడి చేస్తామని, ఉద్యోగాలప్రకటనలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు.

17:18 - March 26, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు కోరితే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు అనుమతులు ఇవ్వకుండా టీఆర్ఎస్ నేతలకు అనుమతులిస్తున్నారని పేర్కొన్నారు. తనపై వివక్షత వీడకపోతే పోరాటం తప్పదని, ఈనెల చివరిలోగా అనుమతులివ్వకపోతే ఏప్రిల్ లో కార్యాచరణ ప్రకటిస్తానని వంశీచంద్ రెడ్డి ప్రకటించారు.

 

అటముగిసే సమయానికి భారత్ 248/6

ధర్మశాల టెస్టు : రెండో రోజు అటముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 248/6. క్రీజులో వృ ద్ధిమాన్ సాహా-10, రవీంద్ర జడేజా-16 ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 300 అలౌట్. భారత్ పై 52 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. భారత్ బ్యాటింగ్ రాహుల్-60, పుజారా-57, రహానె-46, అశ్విన్-30, మురళీ విజయ్-11, నాయర్-5పరుగులు చేశారు. బౌలింగ్ లియన్ కు 4 వికెట్లు, హాజిల్ వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ దక్కాయి.

16:50 - March 26, 2017

ఆర్ఎస్ఎస్ లో పని చేయడం గర్వంగా ఉంది: అద్వానీ

రాజస్థాన్ : మౌంట్అబులో బ్రహ్మకుమారీస్ 80వ వార్షికోత్స కార్యక్రమంలో ఎల్ కే అద్వానీ పాల్గొన్నారు. నేను కరాచీలో పుట్టినా క్రమశిక్షణ, విద్యా బుద్దులు నేర్పింది ఆర్ఎస్ఎస్ అని ఆయన తెలిపారు. చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేయటం గర్వంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు పనులను ప్రోత్సహించకూడదని ఆర్ఎస్ఎస్ లో నేర్చకున్నానని ఆయన అన్నారు.

వెంకయ్య నివాసంలో ఉగాది వేడుకలు

ఢిల్లీ : వెంకయ్య నివాసంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ చాలమేశ్వర్, జస్టిస్ రమణ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి , తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు, ప్రముఖులు హాజారయ్యారు. వేడుకల్లో మాడగల నాగఫణి శర్మ పంచాంగ శ్రవాణం చేశారు.

16:31 - March 26, 2017
16:29 - March 26, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో కంది రైతులు రోడ్డెక్కారు. గత నాలుగు రోజులుగా కొనుగోలు చేయడం జరగడం లేదని పేర్కొంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కిసాన్ చౌక్ లో ఆందోళన చేపట్టారు. అమ్మకానికి తీసుకొచ్చిన కందులను అధికారులు కొనుగోలు చేయడం లేదని పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని, తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరు చేసిన ఆందోళనలతో రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులతో చర్చించి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు.

16:23 - March 26, 2017

హైదరాబాద్ : విభజన సమస్యలపై ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో తెలంగాణ, ఏపీ మంత్రుల కమిటీ భేటీ జరిగింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఏప్రిల్ 15వ తేదీ తరువాత మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఏప్రిల్ తరువాత జరిగే సమావేశంలో 42 కార్పొరేషన్లకు సంబంధించిన ఆస్తులు..ఉద్యోగులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ మీడియాకు తెలిపారు. ఏప్రిల్ 17న భేటీ జరిగే అవకాశం ఉందన్నారు.

చర్చలు మాత్రమే జరిగాయి - అచ్చెన్నాయుడు..
విభజన సమస్యలపై ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ, ఏపీ మంత్రులు జరిపిన భేటీ ముగిసింది. భేటీ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. చర్చలు మాత్రమే జరిగాయని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఉద్యోగుల విభజన, ఇతర సమస్యలపై చర్చించడం జరిగిందని, టీచర్...విద్యుత్ ఉద్యోగులపై చర్చించినట్లు తెలిపారు. ఏప్రిల్ 17న తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

 

గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల పై ఉత్కంఠ

విజయవాడ: గ్రూప్-2 ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ల అంశం పై ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. 10 రోజుల పాటు గ్రూప్-2 ఫలితాలను ఆపాలని ఆదేశించింది. ఏల్లుండి పూర్తి వివరాలతో రావాలని ఏపీపీఎస్సీకి సూచింది.

16:15 - March 26, 2017

విజయవాడ : రవాణా శాఖ అధికారులతో విజయవాడ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ, ఇతర నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అయితే ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కమిషనర్ కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదంపై కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, క్షమాపణలు చెప్పడంతో ఇంతటితో వివాదాన్ని వదిలేస్తున్నట్లు తెలిపారు. ఏదో ఒక విషయాన్ని నమ్ముకోవడం..అవగాహనరాహిత్యం వల్లే ఇది చోటు చేసుకుందన్నారు. క్షమాపణలు చెప్పారు కనుక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలన్నారు. అది వేరే బస్సుకు సంబంధించిన విషయమని, సమాచారం పూర్తిగా తెలియకపోవడం వల్ల వారు ఇక్కడకు వచ్చారన్నారు. తన గన్ మెన్ పై చేయిం చేసుకోవడం సబబు కాదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. జరిగిన విషయంలో తమ సిబ్బంది మనస్సులు నొచ్చుకున్నాయని, పెన్ డౌన్ లాంటివి ఏవి ఉండవన్నారు.

16:12 - March 26, 2017

విజయవాడ : ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంకు ఏపీ టిడిపి నేతలు కేశినేని, బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు క్షమాపణలు చెప్పారు. శనివారం నాడు రవాణాశాఖ కమిషనర్ పై దౌర్జన్యం చేయడం తీవ్ర వివాదస్పదంగా మారింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం మరింత ముదురుతుండడంతో బాలసుబ్రమణ్యంకు నేతలు క్షమాపణలు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడితో వీరు భేటీ అయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారికి తెలియచేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. దాడి ఘటన దురృష్టకరమని వాఖ్యానించారు. సీఎం బాబు తమను మందలించారని, రవాణాశాఖ కమిషనర్ ను కలిసి విచారం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. మాకు ఎలాంటి బేషజాలు లేవని, ఎవరినీ దూషించలేదని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఉద్యోగుల మనస్సులు నొచ్చుకుని ఉంటే క్షమించాలని బుద్ధా వెంకన్నలు తెలిపారు.

ఐదో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల టెస్టు: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్  ఐదో వికెట్ కోల్పోయింది. 216పరుగుల వద్ద రహానె (46) ఔటయ్యాడు.

 

డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ తప్పనిసరి

ఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్ లకు ఆధార్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రా ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల టెస్టు: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్  నాలుగో వికెట్ కోల్పోయింది. 167 పరుగుల వద్ద నాయర్(5) ఔటయ్యాడు.

 

 

15:03 - March 26, 2017

అమెరికా : అగ్రరాజ్యం మరోసారి వణికింది. ఇటీవల అక్కడ తరచూ కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. సిన్సినాటిలోని కామియో నైట్ క్లబ్ లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. దీనితో ఓ వ్యక్తి మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపులు చేపట్టారు.

బాబును కలిసిన కేశినేని, బుద్ధా, బోండా..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడిని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా, ఎమ్మెల్యే బోండా ఉమలు కలిశారు. నిన్న రవాణాశాఖలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబుకు వివరణ ఇవ్వడం జరిగిందన్నారు.

గాంధీ ఆసుపత్రి ఘటనపై స్పందించిన ఇన్ ఛార్జీ సూపరింటెండెంట్..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటనతో వైద్యులు..సిబ్బందికి సంబంధం లేదని ఆసుపత్రి ఇన్ ఛార్జీ సూపరింటెండెంట్ శ్రవణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులపై కావాలనే బురద చల్లుతున్నారని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని, దోషులని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్లకు ఇచ్చిన డ్రగ్ ప్రభుత్వం సరఫరా చేసింది కాదని పేర్కొన్నారు.

ఆర్టీఏ కమిషనర్ తో ఉద్యోగ సంఘాల భేటీ..

విజయవాడ : ఆర్టీఏ కమిషనర్ తో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. నిన్నటి ఘటనపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టిడిపి నేతల దౌర్జన్యంపై ఉద్యోగులు భగ్గుమంటున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ప్రజాప్రతినిధుల తీరు సక్రమంగా లేదన్నారు. పోలీసులకు తాము ఫిర్యాదు చేస్తామని, సంబంధం లేని విషయంలో ఎంపీ కేశినేని నాని ఎందుకు తలదూర్చారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి జరిగిన ఘటనపై వివరిస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుండి పెన్ డౌన్ చేయనున్నట్లు వెల్లడించారు.

మూడో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల టెస్టు: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద పుజారా(57) ఔటయ్యాడు.

 

 

14:33 - March 26, 2017
14:32 - March 26, 2017
14:27 - March 26, 2017

కర్నూలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.గఫూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను బలి తీసుకోవడానికే మోటారు వాహనం చట్టానికి సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రవాణా రంగంలో సంస్కరణలు అనే అంశంపై కర్నూలులో సీఐటీయూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోటారు రవాణ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు, చట్టం రూపుదాల్చితే తీవ్ర సమస్యలు ఏర్పడుతాయన్నారు.

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికా : అగ్ర దేశం అమెరికాలో మళ్లి కల్పుల కలకలం చేలరేగింది. ఓహియోలోని సిన్ సినాటి నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 13 మందికి గాయాలయ్యయి.

 

14:11 - March 26, 2017

నల్గొండ : రాష్ట్ర హోం మంత్రి నాయినీ నర్సింహారెడ్డి సొంత గ్రామం నేరేడుగొమ్మలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై హాస్టల్ వార్డెన్ భర్త రాజు, ఉపాధ్యాయుడు ప్రిన్స్ పాల్ లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై ఎవరికి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు అర్థం కాలేదు. చివరకు విద్యార్థులు ఛైల్డ్ లైన్ హెల్ప్ లైన్ సంస్థకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.

నేరేడుగొమ్మలో దారుణం...

నల్గొండ : నేరేడుగొమ్మలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ భర్త రాజు, ఉపాధ్యాయుడు మురళీలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెల్డ్ లైన్ హెల్ప్ లైన్ కు విద్యార్థినిలు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

14:06 - March 26, 2017

కృష్ణా : విజయవాడ ఆర్టీఏ వద్ద జరిగిన ఘటనపై టీటీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటన దురదృష్టకరమన్నారు. మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని చెప్పారు.  సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.
మేం ఎవరనీ దూషించలేదు : బోండా ఉమా
'నిన్నటి ఘటన దురదృష్టకరం. విచారణ వ్యక్తం చేస్తున్నాం. మేం ఎవరినీ దూషించలేదు. ప్రతిపక్షం ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోంది. రాష్ట్రాన్ని సరైన రీతిలో అభివృద్ధి చేసేందుకు అందరినీ కలుపుకుని ముందుకు పోతామని' చెప్పారు. 
నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం : ఎంపీ కేశినేని నాని... 
'నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. తాము ఎవరీ దూషించలేదు. విచారం వ్యక్తం చేస్తున్నాం. తమకు ఎలాంటి స్వంత ఎజెండాలు లేవు. తెలిసో...తెలియకో ఏమైనా తప్పుగా మాట్లాడితే, మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. తమ దగ్గర అవినీతి అనే మాట లేదు. మా బ్లడ్ లో, డీఎన్ ఏలో లేదు అని తెలిపారు. 

గేట్ ఫలితాలు విడుదల

ఉత్తరాఖండ్ : రూర్కీ ఐఐటీ గేట్ ఫలితాలు విడదల చేసింది. గేట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూడవచ్చు. మే 5వరకు ఫలితాలు డౌన్ లోడ్ చేసునునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా జరిగిన గేట్ పరీక్షకు 8 లక్షలకు పైగా హాజరై య్యారు.

13:47 - March 26, 2017

హైదరాబాద్ : గవర్నర్ తో మంత్రుల భేటీలో చర్చలు మాత్రమే జరిగాయని.. ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోలేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధానంగా ఉద్యోగుల విభజన సమస్యలపైనే చర్చించామని తెలిపారు. టీచర్లు, విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై ఈసారి భేటీలో కచ్చితంగా నిర్ణయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏప్రిల్ 17న మరోసారి భేటీ కావాలని రెండు రాష్ట్రాల కమిటీలు నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. 

 

13:44 - March 26, 2017

హైదరాబాద్ : విభజన సమస్యలపై గవర్నర్‌తో ఏపీ తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున..  ఏప్రిల్‌ 15తర్వాత మరోసారి భేటీకావాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ తర్వాతి సమావేశంలో మరో 42 కార్పొరేషన్‌లకు సంబంధించిన ఆస్తులు, ఉద్యోగులు  తదితరాలపై  చర్చించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌ చెప్పారు. బహుశా ఏప్రిల్‌ 17న మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందన్నారు.

 

13:42 - March 26, 2017

కృష్ణా : విజయవాడ రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతల దాడిని ఆర్టీఏ ఉద్యోగుల సంఘం ఖండించింది. నేతలపై వెంటనే క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొద్దిరోజులక్రితం బస్సు ప్రమాదం నివేదికను మార్చి ఇవ్వాలంటూ నేతలు ఒత్తిడిచేశారని. దానికి తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. పట్టాభి అనే వ్యక్తి తమ కార్యాలయానికివచ్చి ఎంపీగారు పంపారని... రిపోర్ట్ ఇవ్వాలన్నారని మండిపడ్డారు. ముందు చక్రం కింద పడి చనిపోతే వెనక చక్రం కింద పడినట్లు రిపోర్ట్‌ మార్చాలంటూ డిమాండ్ చేశారని ఆరోపించారు. 

 

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

నల్లగొండ : జిల్లాలోని నేరేడుకొమ్మ గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్ వార్డెన్ భర్త రాజు, ఉపాధ్యాయుడు మురళి కలిసి విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయంపై విద్యార్థినిలు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. హెల్ప్ లైన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

13:34 - March 26, 2017

తెలంగాణాలో ఎందరో గేయ రచయితలు ఉన్నారు. ప్రజాసమస్యలను అక్షరీకరిస్తూ ఎన్నో పాటలు రాస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అలాంటి వారిలో దేవణ్ణ ఒకరు. సమాజంలోని అనేక సమస్యలపై ఎప్పటికప్పడు స్పందిస్తూ వందలాది పాటలు రాసిన గేయరచయిత దేవణ్ణ జనం పాటలు చూద్దాం....

13:30 - March 26, 2017

ఆమె కలంలో అధునాతన భావాల జలపాతాలు జాలువారుతుంటాయి
ఆమె గళంలో ప్రగతిశీల భావనల సముద్రాలు ఉప్పొంగుతుంటాయి
ఆమె స్త్రీజాతి స్వేచ్ఛను కోరి రచనలు చేసిన కవయిత్రి...
ప్రేమకు పెళ్ళికి మధ్య నలిగిపోయిన అంతరాల అంత:సంఘర్షణను అక్షరాల్లో చూపించిన నవలా రచయిత్రి...
ప్రవాసాంధ్ర జీవన దృశ్యాలను కథలుగా..... నవలలుగా శిల్పీకరించిన కథనశిల్పి...
ఆమె కల్పన రెంటాల..
తెల్లటి పూల గుత్తులు రోడ్డంతా
మంచు ప్రేమ మైకంలో మునిగిపోయే మాడిసన్
చివరి చూపు, చివరి మాటల్లాగా
ఎండిపోయిన చెట్లు
ఆఖరిక్షణాల్లో ఆత్మీయపు పలకరింతల్లాగా
మళ్లీ తొలిప్రేమంతా తాజాగా
ఓ తెల్లటి కౌగిలింతలో ఒదిగి పోయిన రెండు రాబిన్ పక్షులు
అంటూ అద్భుత భావుకతతో కవిత్వం రాసిన కల్పన రెంటాల కలానికి రెండు పక్కలా పదునే అని చెప్పాలి. 

కవిత్వం రాసినా.. కథరాసినా.. నవల రాసినా రెంటాల కల్పన అక్షరాలలో జీవితం ఉంటుంది.. జీవం ఉంటుంది.. అనుభూతి ఉంటుంది.. ఆర్ధ్రత ఉంటుంది.. సున్నితమైన మనోభావాలుంటాయి.. బలమైన తాత్వికతా నీడలుంటాయి.. స్త్రీ పురుషుల అంత:సంఘర్షణల తాలుకూ చేదు నిజాలుంటాయి. అణచివేతల ఆనవాళ్లుంటాయి.. మానవీయ కోణాలుంటాయి.. అనుభవాలుంటాయి.. ఆదర్శాలుంటాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే రెంటాల కల్పన రచనల్లో.. ఒక కొత్తదనం ఉంటుంది. అందుకు ఉదాహరణే... ఆమె రాసిన సంచలన నవల...తన్హాయి 

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాలపై సంచలనాత్మక నవలలు వెలువడ్డాయి.. అందులో చలం మైదానం. ఒకటి.
ఆ.. నవలలోని ఇతివృత్తం అప్పట్లో సంచనలం సృష్టించింది. పెళ్లైన రాజేశ్వరి..ఒక ముస్లిం యువకుని వెంట వెళ్లి స్వేచ్ఛగా జీవించిన ఇతివృత్తం అప్పట్లో ఓ విస్ఫోటనాన్నే సృష్టించింది. సమాజంలోని కట్టుబాట్లను తెంచి తుప్పుపట్టిన మానవ మస్తిష్కాలను కొత్తగా ఆలోచింపజేసిన నవల అది. చాలా ఏళ్ల తర్వాత అదే దారిలో ఓ నవలను రాసి పెను సంచలనం సృష్టించారు కల్పనా రెంటాల.. తన్హాయి నవలతో పలు చర్చలకు తెర లేపారు. పాఠకుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించారు..

ప్రవాసాంద్రులైన రెండుకుటుంబాలలోని పెళ్లైన స్రీపురుషుల మధ్య జరిగే ప్రేమతాలూకు అనుభూతుల కెమిట్రీచుట్టూ ..అల్లిన నవల ఇది. స్వేచ్ఛ.., అంత: సంఘర్షణ.., సమాజపు కట్టుబాట్లు.., భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ రాహిత్యం, విదేశాల్లో ఉన్న భారతీయుల కుటుంబ సంబంధాలు ఇత్యాది అంశాల చుట్టూ అల్లిన నవల తన్హాయి. ఎన్నో ప్రశ్నలు..చర్చలు..లేవదీసిన..తన్హాయి నవల..రచయిత్రికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

కల్పన రెంటాల తొలుత కవయిత్రిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. 2001 లో వెలువరించిన  నేను కనిపించే పదం అనే కవితా సంకలనంలో స్త్రీవాద కవితలతో పాటు వస్తువైవిధ్యం శిల్ప సోయగం ఉట్టి పడే కవితలెన్నో ఉన్నాయి. అవన్నీ ఆమెను.. కవయిత్రిగా.. తెలుగు కవితా రంగంపై నిలబెట్టాయి. అంతేకాదు.కల్పనా రెంటాల..ఒక జర్నలిస్టుగా ఎన్నో మానవీయ కథనాలకు పత్రికల్లో అక్షరరూపమిచ్చిన అనుభవంతో అద్భుతమైన కథలు రాశారు.. ఆమె రాసిన కథల్లో.. స్లీపింగ్ ఫిల్, అయిదో గోడ, కప్లెట్, ఇట్స్ నాట్ ఓ.కె కథలు అప్పట్లో పాఠకులను ఎంతగానో అలరించాయి.ఆలోచింపజేశాయి. కథానిర్మాణంలో పాత్ర చిత్రణలో... వాతావరణ కల్పనలో.. సంఘటనల కూర్పులో ..వాస్తవిక దృశ్యాల చిత్రణలో.. సహజత్వం ఉట్టి పడే కథలవడంతో రచయిత్రికి తెలుగు కథాసాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. 

నిజం చెప్పాలంటే కల్పనా రెంటాలకు సాహిత్య అభిలాష, అభినివేశం ఆమె తండ్రి రెంటాల గోపాలకృష్ణ నుంచి వచ్చిందని చెప్పాలి. ఇక ఆమె సహచరుడు ప్రముఖకవి అప్సర్ తో కలసి అనంతపురం నుండి అమెరికా వరకు ప్రయాణించిన ...జీవితం, సాహిత్యం కలబోసిన ప్రయాణంలో ఆమె సృజనాత్మకత వేయి పూలుగా వికసించింది. 2003 లో అమెరికా వెళ్లాక కల్పన రెంటాల కల్పనలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అద్భుతమైన నవల తన్హాయి అక్కడే అక్షరీకరింపబడింది. 2011 లో ఆమె బ్లాగు తూర్పు పడమరలో ఆ...నవల సీరియల్ గా 10 నెలలపాటు వచ్చింది. విశేష ఆదరణ పొందిన తన్హాయి నవల ఆమెకు ఎందరో అభిమాన పాఠకులను తెచ్చి పెట్టింది .

విజయవాడలోనే పుట్టి పెరిగిన కల్పన 1980లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో టెలివిజన్ కళాసాంస్కృతిక రంగాల సమీక్షలు రాసే జర్నలిస్టుగా  ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత స్వాతి వారపత్రికలో పనిచేశారు. విజయవాడ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు. ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తూనే ప్రవృత్తిగా రచనా రంగంలో కృషిచేశారు. ఆమె రాసిన నేను కనిపించే పదం కవితా సంకలనానికి అజంతా అవార్డు లభించింది. అలాగే `ఆమెపాట` పేరుతో కల్పన రెంటాల ఆంధ్రభూమిలో రెండేళ్లపాటు వివిధ భాషల్లో వచ్చిన స్త్రీల కవితల విశ్లేషణతో  ఆమెకు మంచి  గుర్తింపు వచ్చింది. 

తెలుగు స్త్రీవాద సాహిత్యంలో తనదైన గొంతు వినిపించిన కవయిత్రిగా.. కథాసాహిత్యంలో తనదైన సృజన శిల్ప ప్రతిభలను ప్రదర్శించిన కథనశిల్పిగా... తన్హాయి లాంటి ఒక్క నవలతో సంచలన నవలాకారిణిగా గుర్తింపు పొందిన కల్పన,  అప్సర్ తో పాటు సారంగ వెబ్ మాగజైన్ నిర్వహణలో తనదైన కృషిచేస్తూ.. కొత్త కవులకు రచయితలకు బాసటగా కూడా నిచిచారు. 

జర్నలిస్టుగా.. కవయిత్రిగా, నవలా కారిణిగా బహుముఖీనమైన కృషి చేస్తున్న కల్పన రెంటాల కలం నుండి భవిష్యత్తులో మరెన్నో కవితా.. కథా సంకలనాలతో పాటు సంచలన నవలలు కూడా వెలువడాలని ఆశిద్దాం...

13:28 - March 26, 2017

ఆధునిక తమిళ కథా, నవలా సాహిత్యంలో విశేష కృషిచేసిన సుప్రసిధ్ధ రచయిత అశోక్ మిత్రన్. జీవిత వాస్తవికతకు అద్దం పట్టే కథలు, నవలలను రాసిన అశోక మిత్రన్ అసలు పేరు జగదీశ త్యాగరాజన్. ఆయన 1931 సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ లో జన్మించారు. 20 ఏళ్లు సికింద్రాబాద్ లోనే చదువుకున్నారు. తర్వాత 1952 లో మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ జెమిని స్టూడియోలో దశాబ్దం పైగా పని చేశారు.
200 కథలు, 8నవలలు
అశోక్ మిత్రన్ 200 కథలు, 8నవలలు. ఆయన కథల్లో సినీ జీవుల వ్యథలు, సామాన్య ప్రజల జీవన చిత్రాలు, జీవితానుభవాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.1953 లో ఆయన రాసిన అన్ బిన్ పరిసు నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. తన్నీర్, మానస సరోవర్, పావమ్ దళ్ పతడో మెుదలైన నవలలు అశోకమిత్రన్ కు ఎంతో కీర్తిని తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన తన్నీర్ నవలను దర్శకుడు వసంత్ సినిమాగా తీశాడు.
తమిళ సాహిత్యంలో గుర్తింపు 
మిత్రన్ వ్యాసరచయితగా, విమర్శకునిగా తమిళ సాహిత్యంలో గుర్తింపు పొందారు. 1966 లో ఆయన రాసిన మై ఇయర్స్ విత్ బాస్  కాలమ్స్ మిత్రన్ కు మంచిగుర్తింపునిచ్చాయి. ఆయన కథలు, నవలలు ఇంగ్లీషుతో పాటు పలు యూరోపియన్ భాషల్లోకి అనువాదమయ్యాయి.
అవార్డులు, రివార్డులలతో సత్కారం...
అశోక్ మిత్రన్ సాహితీ కృషికి ఎన్నో సంస్థలు అవార్డులు రివార్డులిచ్చి సత్కరించాయి. 1995లో అశోక్ మిత్రన్ వెలువరించిన అప్పవిన్ స్నేగిధర్ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి క్రియేటివ్ రైటింగ్ ఫిలోషిప్, యం.ఆర్ .జి అవార్డు, లిలీ మెమోరియల్ అవార్డు, అక్షర తదితర అవార్డులెన్నో అందుకున్నారు. సాధారణ కుటుంబంనుంచి, గొప్ప రచయితగా ఎదిగి ఇటీవల కన్ను మూసిన అశోక్ మిత్రన్ కు 10 టి.వి.అక్షరం నివాళులర్పిస్తోంది.

 

13:28 - March 26, 2017

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు చెమటరూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు. దీనికి చికిత్స చేస్తే సరిపోతుంది. శరీష ఉష్ణోగ్రత తగ్గే విధంగా చూడాలి. మెడ..ఇతర భాగాల్లో ఐస్ ప్యాక్ లు పెట్టారు. వడ దెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకరావాలి. బట్టలను వదులు చేయాలి. నీటితో శరీరాన్ని తడపాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం. బయటకు వెళ్లిన సందర్భంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

13:26 - March 26, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి 2’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున్న ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిష్మతి సెట్ వేదికగా అట్టహాసంగా ఫంక్షన్ ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 500 మందికి పైగా నిపుణులైన కార్మికులు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రీ రిలీజ్ వేడుక సెట్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహిష్మతి సామ్రాజ్యం కనిపించేలా ఎత్తైన భవంతులు, జలపాతాన్ని తీర్చిదిద్దారు. భల్లాలదేవుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాంతం ముందు ఈ వేడుక జరగనుంది. అతిథులు కూర్చొనేందుకు సింహాసన ఆకృతిలో ఉన్న కుర్చీలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డ్యాన్సర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

రెండో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల టెస్టు: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 108 పరుగుల వద్ద లోకేష్ రాహుల్ (60) ఔటయ్యాడు.

 

 

13:10 - March 26, 2017

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో పురుగుల మందుతాగి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచ్చేరికిచెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి ఈనెల 24 న మంత్రాలయంలోని ఓ లాడ్డిలో 52 వ రూమ్ తీసుకున్నారు. లాడ్జీ సిబ్బంది... ఈరోజు రూమ్ తెరిచి చూశారు. ముగ్గురూ మృతి చెందిన ఉన్నారు. వచ్చిన రోజే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో అన్నాచెల్లెల్లు ఉన్నారు. సూసైడ్‌ నోట్ లభ్యం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రభుత్వం స్పందించకుంటే పెన్ డౌన్ : ఉద్యోగ సంఘాలు

విజయవాడ : ఆర్టీఏ కమిషనర్ తో ఉద్యోగసంఘాల సమావేశం జరిగింది. శనివారం జరిగన ఘటన పై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు టీడీపీ నేతల దౌర్జాన్యం పై భగ్గుమంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల తీరు సక్రమంగా లేదని వారు అన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుండి పెన్ డౌన్ చేస్తామని వారు హెచ్చరించారు.

13:00 - March 26, 2017

కృష్ణా : విజయవాడలోని రోడ్‌ట్రాన్స్‌పోర్టు కార్యాలయంముందు టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రౌడీయిజం చేశారని.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం కాకపోతే ఈ ముగ్గురిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాల్సివస్తుందని హెచ్చరించారు.

 

12:57 - March 26, 2017

హైదరాబాద్‌ : అత్తింటివేధింపులతో మరో వివాహిత బలి అయింది. బేగంపేటలో భాగ్యలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది కిందట శశిధర్‌ అనే వ్యక్తితో భాగ్యలక్ష్మి ప్రేమ వివాహం జరిగింది. ఇటీవలే వివాహ మొదటి వార్షికోత్సవం జరుపుకున్న ఆసందర్భంగా దంపతులు గొడవపడ్డారు. భర్త, అత్తింటివారి వేధింపలపై బేగంపేట పోలీస్టేషన్‌లో భాగ్యలక్ష్మి ఫిర్యాదు కూడా చేసింది. అయితే.. పోలీసుల నుంచి సహకారం అందలేదని.. దీంతో అత్తంటివారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని .. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెటర్‌ రాసి ఇంట్లో ఉరివేసుకుంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లోకేష్ రాహుల్ అర్ద సెంచరీ

ధర్మశాల టెస్టు: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో లోకేష్ రాహుల్ అర్ధ సెంచరీ చేశాడు. 108 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

12:51 - March 26, 2017

గుంటూరు : జిల్లా నరసరావుపేటలో దారుణ హత్య కలకలం సృష్టించింది. వినుకొండ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేశారు. తల, మొండాన్ని వేరుచేసిన దండగులు తలను మాయం చేశారు. తెల్లవారుజామున స్థానికులు చూసి.... పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్స్ తో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆత్యహత్య చేసుకున్న అన్నాచెల్లెళ్లు

కర్నూలు : మంత్రాలయంలోని ఓ లాడ్జిలో అన్నా, ఇద్దరు చెల్లెళ్లు పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నారు. మృతులు పుదుచ్చేరికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మృతదేహల వద్ద సూసైడ్ నోట్ లభించింది. నోట్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులో దారుణం...

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు పశావికంగా హత్య చేశారు. నింధితులు వినుకొండ రోడ్డులో యువకుని తల, మొండెం వేరుచేసి తలను మాయం చేశారు. మృతుని వివరాలు తెలుసుకునేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు.

బేగంపేటలో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ : బేగంపేటలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బేగంపేటకు చెందిన శశిధర్, భాగ్యలక్ష్మి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతుల మధ్య గొడవలు రావడంతో భర్తపై భాగ్యలక్ష్మి పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకు పోలీసులు రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొదటి మ్యారేజ్ డే వేడుకలో మళ్లీ గొడువకావడంతో మనస్తాపంతో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపులే కారణమని, సీఎస్ కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆమె సూసైడ్ నోట్ రాసారు.

12:15 - March 26, 2017

మీవాహనం నంబర్‌ ఏంటో మీరు టక్కున చెప్పగలరా..? మీ ఫ్రెండ్స్‌ ఫోన్‌ నంబర్‌ అడిగితే వెంటనే చెప్పగలరా..? కొద్దిగా కష్టమే అంటారు చాలామంది. కాని  తెలంగాణ అసెంబ్లీ ముందు ట్రాఫిక్‌ హోంగార్డు మాత్రం  తన సొంతనంబర్లే కాదు.. ఒక్కసారి అలా చూశాడంటే.. అంతే  ఏ వాహనం నంబర్‌ అయినా.. యజమానితో సహా చెప్పేస్తాడు. అద్భుతమైన మెమరీపవర్‌ను ప్రదర్శిస్తున్న హోంగార్డు దావూద్‌ టెన్ టివితో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...

 

గవర్నర్ తో ముగిసిన ఇరు రాష్ట్రాల మంత్రుల సమావేశం

హైదరాబాద్: గవర్నర్ తో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 17న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఉద్యోగుల అంశం పై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

12:03 - March 26, 2017

హైదరాబాద్ : ఉన్నదే చిన్నదారి..  ఆకాస్త మార్గంలో మెట్రో పనులు.. మామూలుగానే ట్రాఫిక్‌తో చుక్కలుచూస్తున్న హైదరాబాద్‌వాసులకు మెట్రో పనులు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.. ఉన్న ఆకాస్త రోడ్లపై బారికేడ్ల ఏర్పాటుతో ముందుకు వెళ్లలేక... వెనక్కిరాలేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.. 
హడలిపోతున్న ప్రయాణికులు
వారాలు, నెలలు, సంవత్సరాలు గడచిపోతున్నాయి.. అయినా నగరవాసుల కష్టాలు అలాగే ఉన్నాయి... మెట్రో ఎప్పుడు పూర్తవుతుందో ఈ ట్రాఫిక్‌ కష్టాలు ఎన్నడు తీరతాయో తెలియక జనాలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా నారాయణగూడనుంచి కోఠివరకు ప్రయాణమంటే స్థానికులు హడలిపోతున్నారు.. 
గల్లీగా మారిన నారాయణగూడ..కోఠి రోడ్డు 
మెట్రో పనులతో నారాయణగూడ నుంచి కోఠివరకు వెళ్లేదారి మరింత ఇరుకుగా మారింది.. ఆటో వెళ్లాలంటేనే ఇబ్బందిగాఉండే ఈ దారిలో బస్సులు నడుస్తున్నాయి.. ఇష్టారాజ్యంగా రోడ్లు తవ్వేయడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ దారి గల్లీగా మారిపోయింది.. 
ప్రజలకు మరిన్ని అవస్థలు 
మెట్రో వస్తుంది తమ సమస్యలు తీరతాయనుకున్న ప్రజలకు ఈ పనులు మరిన్ని అవస్థలకు గురిచేస్తున్నాయి... మెట్రో రైలు పిల్లర్లు, సెగ్మెంట్లకోసం నడిరోడ్లపైనే బ్యారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు.. దీనికితగినట్లు రోడ్లు వెడల్పు చేయకపోవడంతో ఈ దారినుంచి వెళ్లేవారికి ప్రతిరోజూ నరకం కనిపిస్తోంది.. చిన్న దూరానికే గంటలకొద్దీ సమయంపట్టడం, పైగా ట్రాఫిక్‌లో ప్రయాణం జనాలకు చుక్కలు చూపిస్తోంది. త్వరగా ఈ మెట్రోనైనా పూర్తిచేయండి.. లేకపోతే రోడ్లనైనా వెడల్పు చేసి తమను ఈ కష్టాలనుంచి గట్టెక్కించాలని నగరవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

 

అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆలోచిస్తున్న కేంద్రం : హరిబాబు

అనంతపురం : ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు పై కేంద్రం ఆలోచిస్తోందని ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రాజ్యాంగ సవరణ లేదా విభజన చట్టంలో మార్పులు తేవాలో త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగానే కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్ విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కేంద్రం ఇప్పటికే 85 శాతం అమలు చేసిందని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. బీజేపీతో పవన్ కల్యాణ్ కటీఫ్ అంటే కటీఫ్ అంతే అని ఆయన ప్రకటించారు.

11:56 - March 26, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' మరింత స్టైలిష్ గా మారిపోయారు. తాజా చిత్రం 'రాజు గారి గది -2’ లో 'నాగ్' ను దర్శకుడు ఓంకార్ మరింత స్టైలిష్ గా మార్చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో ఆకట్టుకొంటోంది. ఓంకార్ సూచనలు చేస్తుండగా 'నాగ్' బైక్ పై ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఓంకార్ సెట్ లో ఏదో లాంగ్ షాట్ కోసం కసరత్తులు చేస్తున్నట్లు ఉంది. మెడలోనూ, చేతికి ప్రత్యేకమైన గొలుసులు తొడిగించి మరోసారి మాస్ అభిమానులను ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రాన్ని పివిపి సినిమా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుపుకుంది. ఇప్పటి వరకు చేయని వైవిధ్యమైన పాత్రలో 'నాగ్' కనిపించనున్నారని టాక్. ఇక ఈ చిత్రంలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

11:56 - March 26, 2017

గుంటూరు : అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్లు బావున్నాయంటూ టీడీపీ నేతల నుంచి ప్రశంసలొస్తున్నాయి. రాయపూడి, లింగాయపాలెం గ్రామాలమధ్యగా కొండమరాజుపాలెంవరకూ దాదాపు మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో డిజైన్లు నేతల్ని ఆకట్టుకున్నాయి. కృష్ణానదివైపు ఐకానిక్‌ టవర్స్, హొటళ్లు, రిక్రేషన్‌ సెంటర్లు రాబోతున్నాయి.. ఆ డిజైన్లపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:53 - March 26, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ మంత్రుల సమన్వయ కమిటీ మూడోసారి భేటీ కానుంది. రాజ్‌భవన్‌లో కాసేపట్లో ప్రారంభంకాబోయే ఈ సమావేశంలో హైదరాబాద్‌లో ఏపీ భవనాల అప్పగింత, విద్యుత్ ఉద్యోగుల అంశంపై మంత్రులు చర్చించనున్నారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన కమిటీలు పలు అంశాలపై నిర్ణయం తీసుకున్నాయి. విద్యుత్ ఉద్యోగుల విభజనపై అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి... ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులవిషయంపై రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు తెలంగాణ సచివాలయంలో సమావేశమై చర్చించారు. తెలంగాణలో 1256 మంది ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు ఉన్నారు. వీరిలో పదవి విరమణ చేసినవారు, మరణించినవారుకాకుండా మరో 11వందల 6మంది ఉన్నారు. ఈ వివాదంపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అది తేలకుండా ఏ నిర్ణయం తీసుకోవడం వీలు కాదని ముఖ్యకార్యదర్శుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

 

11:48 - March 26, 2017

కృష్ణా : ఏపీ ఎక్సైజ్‌శాఖ కొత్త విధానంతో కృష్ణా జిల్లాలో మద్యం షాపులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం గ్రామగ్రామాన ఏరులై పారనుంది. శ్లాబ్‌ ధరలు కూడా ప్రభుత్వం తగ్గించడంతో మద్యంషాపుల లైసెన్స్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు కృష్ణా జిల్లా కలెక్టర్‌ నూతన లైసెన్స్‌ల కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏరులైపారుతున్న మద్యాన్ని నిషేధించాలని డిమాండ్‌ వ్యక్తమవుతున్నా..ప్రభుత్వం మాత్రం కొత్త లైసెన్సులు మంజూరు చేసే పనిలో పడింది.
త్వరలోనే నూతన లైసెన్స్‌లు
కృష్ణా జిల్లాలోని విజయవాడ , మచిలీపట్నం యూనిట్లలో మొత్తం 343 మద్యం షాపులు నడుస్తున్నాయి. వీటిలో విజయవాడ యూనిట్‌ పరిధిలో 168 మద్యం షాపులు ఉండగా... మచిలీపట్నం యూనిట్‌ పరిధిలో 175 ఉన్నాయి. వీటన్నిటికీ త్వరలోనే నూతన లైసెన్స్‌లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇందులో భాగంగానే విజయవాడ యూనిట్‌ పరిధిలోని మద్యం షాపుల కోసం 24న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు గడువు ఇచ్చారు.  మార్చి 31న కలెక్టర్‌ హాల్‌లో లాటరీ ప్రక్రియ చేపట్టనున్నారు. లాటరీలో గెలుపొందిన వారికి నూతన లైసెన్సులు మంజూరుతోపాటు షాపులకు పర్మిట్‌ గది రిజిస్ట్రేషన్‌ కోసం ఒక్కొక్క షాపుకు 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 
విజయవాడ పరిధిలో 19 షాపులకు నూతన లైసెన్స్‌లు
మచిలీపట్నం యూనిట్‌ పరిధిలోని 33 షాపులకు మాత్రమే ఏప్రిల్‌ 1న నూతన లైసెన్సుల ద్వారా అమ్మకాలు చేపడతారు. మిగిలిన షాపులు  జూలై 1న కొత్త లైసెన్సుల ద్వారా పనిచేయనున్నాయి. అప్పటి వరకు పాత లైసెన్స్‌దారులే కొనసాగుతారు. ఇక విజయవాడ యూనిట్‌ పరిధిలోని 19 షాపులు మాత్రమే ఏప్రిల్‌ ఫస్టు నుంచి  కొత్త లైసెన్సుల ద్వారా అమ్మకాలు చేపట్టనుండగా.. మిగిలిన షాపులు జూలై 1నుంచి పనిచేయనున్నాయి.
భారీగా తగ్గిన శ్లాబ్‌ ధరలు
ఎక్సైజ్‌శాఖ కొత్త పాలసీ ద్వారా మద్యం షాపుల శ్లాబ్‌ ధరలు బాగా తగ్గాయి. 100 నుంచి 25శాతానికి పడిపోయాయి. 2015లో గరిష్టంగా 65 లక్షలుగా ఉన్న శ్లాబ్‌ధర నూతన విధానంతో 12.25 లక్షలకు పడిపోయింది. కనిష్టంగా ఉన్న 30లక్షల శ్లాబ్‌ ధర 7.50 లక్షలకు తగ్గించారు. మున్సిపాలిటీల్లోనూ శ్లాబ్‌ ధరలు భారీగా తగ్గాయి. మచిలీపట్నం, గుడివాడ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం గరిష్టంగా ఉన్న శ్లాబ్‌ధర 45 లక్షలుకాగా..నూతన విధానంతో దీని ధర 11.25 లక్షలకు తగ్గించారు. పెడన మున్సిపాలిటీలో గరిష్టంగా ఉన్న 40 లక్షల శ్లాబ్‌..10 లక్షలకు పడిపోయింది. శ్లాబ్‌ ధరలు భారీగా తగ్గడంతో లైసెన్స్‌ల కోసం పోటీపడేవారి సంఖ్య గణనీయంగా పెరుగనుంది.
మహిళలు ఆగ్రహం  
నూతన మద్యం పాలసీతో విచ్చల విడిగా మద్యంషాపులు పెరిగే అవకాశముందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకునే మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వొద్దని వారు కోరుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు మద్యం దెబ్బకు చిన్నాభిన్నం అవుతున్నాయని మహిళా లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బెల్టుషాపులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

 

11:48 - March 26, 2017

ఎండాకాలం..ఈసారి సూర్యుడు భగభగలాడనున్నాడు. ఫిబ్రవరి నుండే ఎండలు మండిపోతున్నాయి. ఈ భానుడి ప్రతాపం మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాయలసీమ, కోస్తా జిల్లాలో విపరీతమైన ఎండలు ఉండనున్నాయని, సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కొనసాగే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కర్నూలులో రూ.41.1, అనంతపురంలో 40.7, జంగమేశ్వరపురంలో 41, తిరుపతిలో 40.5, నందిగామలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతల 40 డిగ్రీల సెల్సియస్ ను తాకింది. ఆదిలాబాద్ లో 41 డిగ్రీలు, నిజామాబాద్ లో 40.2, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాచలంలో 40 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది. ఎండలు తీవ్రతరం అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులకు వ్యాపారాలు మానేసి ఇంటికే పరిమితమౌతున్నారు. ఉపాధి హామీ కూలీలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటోంది. మరోవైపు ఎండవేడిమితో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈనెల 6వ తేదీన 9,003 మెగావాట్ల వినియోగం ఇప్పటి వరకు అత్యధికంగా ఉంది. మార్చి 24వ తేదీన గతంలో ఎప్పుడూ లేనంతగా 9,051 మెగావాట్ల వినియోగం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

11:35 - March 26, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' 151వ చిత్రం మొదలు కాకముందే సోషల్ మాధ్యమాల్లో అనేక వార్తలు వెలువడుతున్నాయి. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని 'చిరు' చేయనున్నారని, దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పక్కాగా స్ర్కిప్ట్ ను తయారు చేసుకున్నట్లు, సాధ్యమైనంత త్వరగా సెట్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'అక్షయ్ కుమార్' ‘రోబో 2.0’ లో విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 'అక్షయ్' ఏ తరహా పాత్ర పోషించనున్నారనేది సస్పెన్స్ గా పెడుతున్నారు. మరి 'చిరంజీవి' చిత్రంలో 'అక్షయ్' నటించనున్నారా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

11:35 - March 26, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బిజెపి భారీ విజయంతో కమలనాథులు హిందుత్వ ఎజెండాను మళ్లీ తెరపైకి తెస్తున్నారా? ఔననే సూచిస్తున్నాయి తాజా పరిణామాలు. ఆవును చంపితే ఉరిశిక్ష విధించాలని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యసభలో ప్రయివేట్‌ బిల్లును ప్రవేశపెట్టడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
రాజ్యసభలో గోరక్షణ బిల్లు 
గోవుల పరిరక్షణ పేరుతో బిజెపి కఠినమైన బిల్లు తేవాలని చూస్తోంది. గోవధపై నిషేధం కోసం ఉద్దేశించిన గోరక్షణ బిల్లు-2017ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆవును చంపితే ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ స్వామి ప్రైవేటు బిల్లును రూపొందించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించాలన్నారు. ఇందులో పశుసంవర్థక, వ్యవసాయం, ఆర్థిక, పశు సంక్షేమ, పురాతన భారతీయ చరిత్ర, సంస్కృతి రంగాలకు చెందిన నిపుణులను నియమించాలని విన్నవించారు. అయితే ఈ బిల్లు తదుపరి సమావేశాల్లో చర్చకు రానుంది. 
బిల్లు పాస్‌ కావడం అసాధ్యం
ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గోవధ శాలలను, మాంసం దుకాణాలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్వామి రాజ్యసభలో గోరక్షణ బిల్లును ప్రవేశ పెట్టడం గమనార్హం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 37, ఆర్టికల్‌ 48 ప్రకారం గోసంరక్షణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్‌లో ప్రతి సమావేశంలో ప్రయివేట్‌ బిల్లులు ప్రవేశపెట్టడం సర్వసాధారణం. అయితే ఈ బిల్లు పాస్‌ కావడమన్నది దాదాపు అసాధ్యం. ఇప్పటివరకు పార్లమెంట్‌ చరిత్రలో ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లు ఒక్కసారి మాత్రమే చట్టంగా రూపొందింది.
రెచ్చిపోతున్న హిందుత్వ శక్తులు 
యోగి అండతో యూపీలో హిందుత్వ శక్తులు రెచ్చి పోతున్నాయి. బుధవారంనాడు హత్రాస్‌లో ముస్లింలకు చెందిన మూడు మాంసం షాపులను దగ్దం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చికెన్‌ సెల్లర్స్‌ శుక్రవారం ఆందోళన చేశారు. తమకు కొంత సమయమివ్వాలని లేకుంటే వ్యాపారంలో నష్టపోతామని మాంసం అమ్మకందారులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా 
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను దేశ వ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. హిందుత్వవాది...సన్యాసి... యోగి ఆదిత్యానాథ్‌ను యూపీ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా బిజెపి తన వైఖరేంటో చెప్పకనే చెప్పింది. 

 

భైంసాలో ప్రేమజంట ఆత్మహత్య

నిర్మల్ : భైంసాలో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు సునిల్, సోనిగా గుర్తించారు. పెద్దలు ప్రేమ పెళ్లికి నిరాకరించటంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

11:29 - March 26, 2017

జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ సృష్టిస్తోంది. ఆ ఫొటో చూస్తే భయం కలగక మానదు. బాబీ దర్శకత్వంలో 'జూనియర్ ఎన్టీఆర్' ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మూడు పాత్రలను పోషించనున్నట్లు, ఓ పాత్ర పూర్తిగా నెగటివ్ గా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మేకప్ చిత్రాలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు వాన్స్ గార్ట్ వేల్ 'ఎన్టీఆర్' కు లుక్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కంటి స్థానంలో పలుచని సిలికాన్ మాస్క్ లను వాడుతూ వేసిన మేకప్ ఫైనల్ అయినట్లు సమాచారం. వాటి చిత్రాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రానికి 'జై లవకుశ' పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

11:24 - March 26, 2017

కృష్ణా : విజయవాడ నగరం మహా గ్రేటర్‌గా రూపాంతరం చెందేందుకు రంగం సిద్ధమైంది. నగరాన్ని గ్రేటర్ సిటీగా మలిచి..2019కల్లా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రణాళికలు రచిస్తోంది. పాలనా పరంగా, కార్పొరేట్ హంగులతో రూపుదిద్దుకుంటున్న విజయవాడను గ్రేటర్ నగరంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గ్రేటర్ విజయవాడకు మార్గం సుగమం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 
మహానగరంగా బెజవాడ 
బెజవాడ మహానగరంగా అవతరించనుంది. 2018 ఏడాది పూర్తయ్యేలోపు నగరాన్ని గ్రేటర్ విజయవాడగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం వడివడిగా అడుగులేస్తోంది. నగర పరిసరాల్లోని 45 గ్రామాల విలీనం గ్రేటర్‌కు అవసరమంటూ చేసిన ప్రతిపాదనను త్వరలో జరగబోయే విజయవాడ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. కౌన్సిల్ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పంపనుంది.  
గ్రేటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు 
2013-2014లో నగర కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినా ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోపాలిటన్ ప్రాంతంగా విజయవాడను ఎంపిక చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌ను కూడా తెరపైకి తీసుకొచ్చింది. విజయవాడలోని 59 డివిజన్లలో జనాభాను సమాన ప్రాతిపదికన విభజించాలని, తర్వాత డివిజన్ల సంఖ్య పెంచాలని అధికారులు, నాయకులు గతంలో ప్రతిపాదించారు. గణాంకాల ప్రకారం డివిజన్‌కు దాదాపు 12వేల మంది ఓటర్లు ఉండే విధంగా అధికారులు విభజన గణాంకాలు పూర్తిచేశారు. ఈ లెక్కల ప్రకారం 59 డివిజన్లు 80కిపైగా పెరిగే అవకాశం ఉంది. ఇలా పెరిగే డివిజన్లతోపాటు 45 గ్రామాల విలీనం అనంతరం పెరగబోయే డివిజన్లను వేర్వేరుగా కాకుండా గ్రేటర్ ప్రక్రియగా మార్చనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం విజయవాడ గ్రేటర్ గా రూపుదిద్దుకుంటే 59గా ఉన్న డివిజన్లు 135కుపైగా పెరుగతాయని అంచనా వేస్తున్నారు. 
గ్రేటర్ పరిధిలోకి 32 గ్రామాలు...?
విజయవాడ రూరల్, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు మండలాల పరిధిలోని మొత్తం 32 గ్రామాలను గ్రేటర్ పరిధిలోకి మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ జనాభా 11 లక్షల 97 వేల మంది ఉన్నారు. గ్రామాలు విలీనమైతే విజయవాడ నగర జనాభా 15 లక్షలు దాటుతుంది. నగర విస్తీర్ణపరంగా 64 చదరపు కిలోమీటర్లుగా ఉంది. గ్రేటర్‌గా మారితే 403.70 కిలోమీటర్లకు చేరుకుంటుంది. విజయవాడ నగరాన్ని త్వరితగతిన గ్రేటర్‌గా మారిస్తే ప్రభుత్వానికి ఫ్లస్ అవుతుందని ఇప్పటికే నివేదికలు సైతం సర్కార్ చేరడంతో గ్రేటర్ సంగతేంటో చూడడంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూలంకషంగా సమగ్ర నివేదికలు మరోమారు ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వపెద్దలు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. 

 

కాసేపట్లో ఏపీ, టీఎస్ మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ, తెలంగాణ మంత్రుల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. కమిటీ రాజ్ భవన్ లో మూడోసారి సమావేశం కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు జరిగాయి. ప్రధానంగా ఏపీ భవనాల అప్పగింత, విద్యుత్ ఉద్యోగుల అంశం పై చర్చ జరిగే అవకాశం ఉంది. కమిటీలో తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు, వివేక్, ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులు ఉన్నారు.

11:16 - March 26, 2017
11:15 - March 26, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో గాంధీ ఆస్పత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కాలంచెల్లిన ఇంజక్షన్లను పదిమంది చిన్నారులకు వేశారు. ఆవెంటనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇంజక్షన్‌లపై ఉన్న డేట్‌ అయిపోయిందని గుర్తించిన తల్లిదండ్రులు వైద్యులకు ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం బాధిత పిల్లలకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలి : మల్లాది విష్ణు

విజయవాడ : ఆర్టీఏ అధికారుల పై టీడీపీ నేతల దాడిని కాంగ్రెస్, ఉద్యోగసంఘాల నేతలు ఖండించాయి. ఆర్టీఏ కార్యాలయనికి ఉద్యోగసంఘాల నేతలు చేరుకున్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీఏ కమిషనర్ దాడి చేసిన వారి పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , ఏపీసీసీ అధికార ప్రతినిధి శివాజీ డిమాండ్ చేశారు.

11:07 - March 26, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ తరలించవద్దంటూ ఎస్ వీకే నుంచి ఇందిరాపార్క్‌ వరకు నిర్వహించతలపెట్టిన 2కే రన్‌ను అడ్డుకోవడాన్ని లెఫ్ట్‌ నేతలు, ప్రజాసంఘాలు తప్పుబట్టాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. ధర్నా చౌక్‌ను తరలించొద్దని డిమాండ్ చేశారు. పథకం ప్రకారం కేసీఆర్ నియంతృత్వ పోకడలు పాటిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం విమర్శించారు. అంతకముందు ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను తరలించడాన్ని నిరసిస్తూ వామపక్షాలు 2 కే రన్ తలపెట్టాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు 2రన్ నిర్వహించారు. 2కే రన్ లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర తమ్మనేని వీరభద్రం, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, న్యూడెమోక్రసీ నాయకురాలు సంధ్య, ఎంపీజే జాతీయ కార్యదర్శి ఎండీ గౌస్ అరెస్టు చేశారు. మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
తమ్మినేని వీరభద్రం 
'2 రన్ కు అనుమతి అవసరమా..? ప్రతి కార్యాక్రమానికి అనుమతి తీసుకోవాల్సిన అవరసం లేదు. కేసీఆర్ ది నిరంకుశ పాలన. పథకం ప్రకారం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు పోతున్నారు. మైకులు పెట్టి చేసే ధర్నా లాంటి కార్యమాలకు అనుమతి తీసుకుంటారు. ధర్నా చౌక్ రద్దు చేయడాన్ని విడిగా చూడలేము. ప్రజల అసంతృప్తిని అణిచి వేయడానికి, అణగదొక్కడగానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు పొంతన లేదు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ చర్యలు తీసుకుంటుంది. పథకం ప్రకారం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు పోతున్నారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడతున్నారు. ప్రజలందరూ ప్రశ్నించాలి, నిలదీయాలి.
కోదండరాం...
'ధర్నా చౌక్ ను మూసివేయడాన్ని నిరసిస్తున్నాం. జిల్లాల నుంచి వచ్చే పేద ప్రజలకు ఇందిరాపార్కు ధర్నా చౌక్ తప్ప వేరే స్థలం లేదు. అన్ని వర్గాల ఆకాంక్షలు వ్యక్త పరిచే వేదిక ఇందిరా ధర్నా చౌక్. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ... ప్రభుత్వం ధర్నా చౌక్ ను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంగన్ వాడీ, పొదుపు సంఘాలు..ప్రతి ఒక్కర రావాలి.. ప్రభంజనం లాగా హైదరాబాద్ కు తరలి వస్తారు. ఇది ఆరంభం మాత్రమే' అని చెప్పారు. 

 

10:54 - March 26, 2017

కొలంబో : శ్రీలంక నేవీ సిబ్బంది మరోసారి జులుం ప్రదర్శించారు. 12 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీపుకున్నారు. మత్స్యకారుల నుంచి రెండు బోట్లు స్వాధీనం చేసుకున్నారు. పుదుకొట్టాయ్‌ వద్ద తమ జలాల్లో ప్రవేశించారంటూ తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న శ్రీలంక జాలర్లతో భారత మత్స్యకారులు గొడవపడ్డంతోనే లంక నేవీ అధికారులు మనవారిని నిర్బంధించారని స్థానిక తమిళ జాలర్లు అంటున్నారు. 

 

10:47 - March 26, 2017

అమెరికా : ఒబామాకేర్‌ హెల్త్‌ పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టాలన్న ట్రంప్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో బిల్లుపై చర్చ సందర్భంగా మెజార్టీ సభ్యులు గురువారం చర్చకు హాజరు కాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్‌లో తగినంత మద్దతు లభించకపోవడంతో ఒబామా కేర్‌ స్థానంలో ప్రవేశపెట్టిన హెల్త్‌ కేర్‌ బిల్లును ఉపసంహరించు కుంటున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.  కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే ఇతర మార్గాల్లో దాన్ని ట్రంప్‌ అమలు చేస్తారని వైట్‌హౌస్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌ మిక్‌ ముల్‌వనే హెచ్చరించారు.

 

10:44 - March 26, 2017

చెన్నై : తమిళనాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ శ్రీలంక పర్యటన రద్దు చేసుకున్నారు. రజనీ శ్రీలంక పర్యటనపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో జాఫ్నాలో రోబో-2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా నిర్మించిన 150 గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీ పాల్గొనాల్సి ఉంది. తమిళులను అణచివేసిన రాజపక్సే కుటుంబంతో లైకా సంస్థకు సంబంధాలు ఉన్నాయని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపించాయి. వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు తనను శ్రీలంక వెళ్లొద్దని కోరారని, వాళ్లతో తనకున్న సంబంధాల దృష్ట్యా  పర్యటనను రద్దు చేసుకున్నానని రజనీకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

 

10:41 - March 26, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పటియాలా హౌస్‌ కోర్టు నోటీసు జారీ చేసింది. కేజ్రీవాల్‌పై విచారణ జరిపేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు ఆప్ నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను కోర్టు మే 20కి వాయిదా వేసింది. జైట్లీ తరపు లాయర్లు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని రాఘవ్‌ చద్దా ఆరోపించారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేజ్రీవాల్ సహా  కుమార్ విశ్వాస్, ఆశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ వాజ్‌పేయిలపై అరుణ్ జైట్లీ పదికోట్ల పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 

 

మొదటి వికెట్ కోల్పోయిన ఇండియా

ధర్మశాల టెస్టు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది. 21పరుగుల వద్ద మురళి విజయ్(11) ఔటయ్యాడు.

 

 

గాంధీ ఆస్పత్రిలో మరో ఘోరం...

హైదరాబాద్ : సికిద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరించారు. చిన్నారులకు నర్సులు కాలం చెల్లిన ఇంజక్షన్ లు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. నర్సుల నిర్లక్ష్యం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

వైమానిక దాడుల్లో ఆల్ ఖైదా సీనియర్ నేత ఖారీ యాసిన్ మృతి

ఆఫ్గాన్ : ఆల్ ఖైదా సీనియర్ లీడర్ ఖారీ యాసిన్ హతమయ్యారు. ఆఫ్గాన్ లో జరిగిన వైమానిక దాడుల్లో యాసిన్ మృతి చెందారు. అల్ ఖైదా శిబిరాలపై ఈనెల 19 న అమెరికా ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. 2009 లో శ్రీలంక క్రికెట్ టీమ్ పై దాడిలో యాసిన్ ప్రమేయం ఉంది. 

10:11 - March 26, 2017

ఆఫ్గాన్ : ఆల్ ఖైదా సీనియర్ లీడర్ ఖారీ యాసిన్ హతమయ్యారు. ఆఫ్గాన్ లో జరిగిన వైమానిక దాడుల్లో యాసిన్ మృతి చెందారు. అల్ ఖైదా శిబిరాలపై ఈనెల 19 న అమెరికా ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. 2009 లో శ్రీలంక క్రికెట్ టీమ్ పై దాడిలో యాసిన్ ప్రమేయం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:55 - March 26, 2017

హైదరాబాద్ : అధికారపక్షాన్ని వదిలేసి స్వపక్షంపైనే  నిప్పులు చెరుగుతున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. సభలో ఒక్కటిగా ఉండాల్సినవారు ..విడిపోయి ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. పార్టీలో సమాజిక న్యాయం లోపిస్తోందని కొందరు వాదిస్తుంటే.. స్వార్థంతోనే అసంతృప్తి ప్రకటిస్తున్నారని మరికొందరు లీడర్లు అంటున్నారు. ఇదీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పరిస్థితి. ఇంతకీ సీఎల్పీలో ఏంజరుగుతోంది..?
కాంగ్రెస్‌ ఇంటిపోరు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటిపోరు రచ్చకెక్కుతోంది. శాసనసభలో సర్కార్‌ను నిలదీయాల్సిన ఎమ్మెల్యేలు స్వంతపార్టీ నేతలతోనే కీచులాటకు దిగుతున్నారు. అసెంబ్లీలో ఎస్సీ,ఎస్టీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడింది. కీలకమైన చర్చలో తనకు మాట్లాడే అవకాశం.. సొంతపార్టీ నేతల వల్లే రాకుండాపోయిందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చినట్టు ఆయన చెప్పారు.  
జానారెడ్డిపై ఎమ్మెల్యే సంపత్‌ గుర్రు
అసలు ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అసంతృప్తికి కారణం ఏంటన్న దానిపై కాంగ్రెస్‌లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. దళితుడినైన కారణంగానే పార్టీ పెద్దల నుంచి తనకు నైతిక మద్దతు లేకుండా పోతోందని సంపత్‌ అంటున్నారు. సభలో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డిలకే సీఎల్పీనేత జానారెడ్డి అవకాశం కల్పిస్తున్నారని సంపత్‌కుమార్‌ అంటున్నారు. తనకు కాకుండా వేరేవారికి మైక్‌ ఇవ్వాలంటూ జానారెడ్డి స్పీకర్‌ను కోరారని సంపత్‌ ఆరోపిస్తున్నారు. ఇటు సీఎల్పీ, అటు పీసీసీ నేతలు తన గొంతునొక్కుతున్నారని సంపత్‌ తన వాదన వినిపిస్తున్నారు. పార్టీలో తన ఎదుగుదలను కొందరు పెద్దలు ఓర్చుకోలేపోతున్నారని ఆయన ఆరోప్తుస్తున్నారు. 
ఉత్తమ్‌పై అసంతృప్తితోనే సంపత్‌కుమార్‌ నిరసన..!
ఎమ్మెల్యే సంపత్‌  నిరసనకు అసలుకారణం.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తేనని మరికొందరు పార్టీనాయకులు చెప్పుకుంటున్నారు. ఉత్తమ్‌ తీరుపై గుర్రుగా ఉన్న సంపత్‌కుమార్‌ చివరికి ఇలా తన అసంతృప్తిని బయటపెడుతున్నారని పార్టీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మరికొందరు మాత్రం సంపత్‌కుమార్‌ గులాబీపార్టీవైపు చూస్తున్నారని కొత్తవాదనకూడా వినిపిస్తున్నారు. అందుకే  పీసీసీచీఫ్‌కూడా ఈ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోవడంలేదని చెప్పుకుంటున్నారు. 
కాంగ్రెస్‌కు డ్యామేజీ తప్పదు..!
మొత్తానికి ప్రధాన ప్రతిపక్షంగా సభలో అధికారపక్షానికి చుక్కలు చూపించాల్సిన  కాంగ్రెస్‌లో ఇపుడు సెల్ఫ్‌గోల్సే ఎక్కువైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పీసీసీ అధ్యక్షుడు అసంతృప్తులకు బ్రేక్‌ వేయకుంటే.. పార్టీకి మరింత డ్యామేజీ తప్పదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 

 

08:50 - March 26, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందింతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్రిగోల్డ్ కేసు సహారా కేసు లాంటిదని డీజీపీ సాంబశివరావు అన్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తెలిపారు.

 

08:48 - March 26, 2017

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి.. నిజామాబాద్ రైల్వే లైన్‌ను రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. దేవరకద్ర, జక్లేర్‌ లైను కూడా ప్రారంభించి ఈ రెండు మార్గాల్లో ప్యాసింజర్‌ రైళ్లకు జెండా ఊపారు. సికింద్రాబాద్‌...మహబూబ్‌ నగర్‌ లైను డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా  మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరిన డెమో రైలులో జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ టికెట్‌ తీసుకుని ప్రయాణించారు. అలాగే పెద్దపల్లి...నిజామాబాద్‌ రైలు ప్రారంభంకావడంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.  

 

08:37 - March 26, 2017

కృష్ణా : విజయవాడ ఆర్టీఏ కార్యాలయం దగ్గర హైడ్రామా నడిచింది. రవాణాశాఖ కమిషనర్‌, డిటీసీలు అవినీతిపరులంటూ టీడీపీ నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఏకంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని రంగంలోకి అధికారులను దుర్భాషలాడారు.  కమిషనర్‌ను ఘెరావ్‌ చేసిన నాని..క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చివరకు విజయవాడ పోలీస్‌కమిషనర్‌ ఇద్దరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించడంతో వివాదం సద్దుమణిగింది.
ఆర్టీఏ కార్యాలయం దగ్గర హైడ్రామా
విజయవాడలోని ఆర్టీఏ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు ఓవరాక్షన్‌కు దిగారు. నానా హంగామా సృష్టించారు. దీంతో కాసేపు అక్కడ హైడ్రామా నడిచింది. ఏపీలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను నియంత్రించాలంటూ టీఎన్‌టీయూసీ నేతలు రవాణాశాఖ కమిషనర్‌ను కలిసేందుకు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.  టీఎన్‌టీయూసీ నేతల ఫిర్యాదును కమిషనర్‌ స్వీకరించకపోవడంతో టీడీపీ ఎంపీ నాని నేరుగా రంగంలోకి దిగారు.
ఆర్టీఏ కమిషనర్‌ కారును అడ్డుకున్న ఎంపీ కేశినేని నాని
ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న కమిషనర్‌ను ఎంపీ నాని అడ్డుకున్నారు. తమ నుంచి తప్పించుకునేందుకే వెళ్తున్నారా అంటూ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీవో అధికారులకు, కేశినేని నానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దీంతో మండిపడ్డ ఆయన  రవాణాశాఖ అధికారులను దుర్భాషలాడారు. కమిషనర్‌, డీటీసీలు అవినీతిపరులంటూ ఆరోపణలు చేశారు. ప్రైవేట్‌ బస్సులకు అక్రమంగా పర్మిషన్లు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. దీనివల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుందో మీకు తెలుసా అంటూ అధికారులపై ప్రశ్నలు గుప్పించారు. కేశినేని నానికి ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా జతకలిశారు. దీంతో టీడీపీ నేతలు రవాణాశాఖ అధికారులపై రెచ్చిపోయారు.
అధికారులు సర్దిచెప్పినా వినిపించుకోని నాని
టీడీపీ నేతలకు ఆర్టీవో అధికారులు సర్దిచెప్పినా వినిపించుకోలేదు. పోలీసులు జోక్యం చేసుకున్నా కేశినేని పట్టించుకోలేదు. దీంతో పోలీస్‌ కమిషనర్‌  గౌతం సవాంగ్‌ రంగంలోకి దిగారు. ఎంపీ నానిని, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరితో చర్చించారు.  దాదాపు గంటకుపైగా ఇరువర్గాల మధ్య చర్చలు నడిచాయి. అనంతరం మాట్లాడిన కేశినేని... ఏపీలో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల బస్సులను కట్టడి చేస్తామని కమిషనర్‌ హామీఇచ్చినట్టు  చెప్పారు.  కింది స్థాయిలో జరుగుతున్న అవినీతి ఉన్నతాధికారులకు తెలియడంలేదని... దాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చామన్నారు. రవాణా శాఖ అధికారులకు, టీడీపీ నేతల మధ్య చర్చలు ఫలించడంతో అందరూ  ఊపిరిపీల్చుకున్నారు. వివాదం సద్దుమణిగింది.

 

08:26 - March 26, 2017

హైదరాబాద్ : ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను తరలించడాన్ని నిరసిస్తూ వామపక్షాలు 2 కే రన్ తలపెట్టాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు 2రన్ నిర్వహించారు. 2కే రన్ లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర తమ్మనేని వీరభద్రం, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, న్యూడెమోక్రసీ నాయకురాలు సంధ్య, ఎంపీజే జాతీయ కార్యదర్శి ఎండీ గౌస్ అరెస్టు చేశారు. మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అంతకముందు రన్ లో పాల్గొనేందుకు సీపీఎం, సీపీఐ కార్యకర్తలు, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, పశ్యపతిలను అరెస్టు చేశారు. 250 మందిని అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే పార్కుకు వాకింగ్ కు వచ్చే వారిని కూడా క్షుణ్ణగా తనిఖీలు చేస్తూ అడ్డగిస్తూ వారికి తీవ్ర అసౌకర్యం కలిగిచండంతో ఇదేమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాకర్స్ ను అడ్డగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ వీకే వద్ద కర్ఫ్యూ వాతావారణం నెలకొంది. ఉద్రిక్తత సుందరయ్య విజ్ఞాన కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

08:00 - March 26, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యే దిశ‌గా పావులు క‌దుపుతోంది. పార్టీ నేత‌ల స‌మావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సంబంధించి నిర్ణయాలను వెల్లడించారు. సభ్యత్వ న‌మోదుతో పాటు పార్టీని నిర్ణణాత్మక శ‌క్తిగా తీర్చిదిద్దేందుకు పార్టీ క‌మిటీల్లో భారీ మార్పులు చేసేందుకు గులాబి బాస్ రెడీ అవుతున్నారు. 
మంత్రులకు పార్టీ ప్లీనరీ బాధ్యతలు 
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలని నాయకులను ఆదేశించారు. వచ్చే నెల జరగనున్న పార్టీ ప్లీనరీ బాధ్యతలను మంత్రులు, పార్టీ నేతలకు కేసీఆర్‌ అప్పగించారు.  
పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం 
ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలకు మరింత ప్రచారం చేస్తూ.. ప్రజలకు చేరువకావాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 
పార్టీ సభ్యత్వనమోదును సమీక్షించిన కేసీఆర్‌
పార్టీ సభ్యత్వ న‌మోదు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మీక్షించారు. సభ్యత్వ న‌మోదు నుంచే పార్టీ పటిష్టతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని నేతలకు సూచించారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కీల‌కంగా మారేలా పార్టీ క‌మిటీల్లో కూడా భారీగా మార్పులు చేస్తామ‌న్న సంకేతాల‌ను ముఖ్యమంత్రి ఇచ్చారు.  గ్రామ స్థాయి నుంచి మండ‌ల‌, రాష్ట్ర క‌మిటీల‌ను నియ‌మించాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్టు స‌మాచారం. నియోజ‌కవ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు స‌హ‌కారం అందించే విధంగా సమన్వయ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని  నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
ఏప్రిల్‌ 27 వరంగల్‌లో పార్టీ మహాసభ
ఏప్రిల్‌ నెల 21న హైదరాబాద్ కోంపల్లిలో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో పార్టీ నియమావళిలో సవరణలకు ఆమోదం తెలిపేందుకు కూడా గులాబీబాస్‌ సిద్ధమయ్యారు. అలాగే ఏప్రిల్ 27న వరంగల్‌లో మహాసభ నిర్వహించనున్నారు. 
ఎంపీ స్థానలపై కేసీఆర్‌ సర్వే
ఎంపీలపై నిర్వహించిన స‌ర్వే ఫ‌లితాల‌ను కూడా  పార్టీనేతల ముందు ఉంచారు కేసీఆర్‌.  ప్రస్తుత స‌ర్వే ఫ‌లితాల ప్రకారం.. 15 ఎంపీ స్థానాలు టీఆర్ ఎస్ పార్టీకే ద‌క్కనున్నాయ‌ని కేసీఆర్ వెల్లడించినట్లు తెలిసింది.   స‌ర్వేప్రకారం  స‌రైన  ప‌నితీరు దక్కని ఎంపీల‌కు ప‌లు  సూచ‌న‌లు చేసిన ముఖ్యమంత్రి..  ప‌రిస్థితుల‌ను  చ‌క్కదిద్దుకోవాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.  అటు  నేత‌ల‌ను  ఊరిస్తున్న నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై కూడా ముఖ్యమంత్రి స‌మావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన‌ట్లు తెలిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రక్రియ మ‌రో రెండు నెల‌ల్లో మొద‌లౌతుంద‌ని కేసీఆర్  స్పష్టం చేసిన‌ట్లు సమాచారం. 
బహిరంగసభకు విరాళాలు సేకరించాలన్న కేసీఆర్‌
అటు వరంగల్‌లో నిర్వహించనున్న పార్టీ బహిరంగసభకు కూలీపనులు చేసి  విరాళాలు సేకరించాలని కేసీఆర్ పార్టీ లీడర్లను ఆదేశించారు. తాను కూడా  ఒక రోజు కూలీలో పాల్గొంటాన‌ని వెల్లడించారు. మొత్తానికి అభివృద్ధి సంక్షేమ పథకాలపై జనాల్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు గులాబీపార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. 

 

07:54 - March 26, 2017

గుంటూరు : 9 సిటీలు.. 27 టౌన్‌ షిప్‌లతో నూతన రాజధాని అమరావతి నిర్మితమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నమూనా ప్రదర్శనను తిలకించిన ఆయన అమరావతి క్లీన్‌, గ్రీన్‌ బ్లూ సిటీగా తీర్చి దిద్దుతామన్నారు. అమరావతి రూపకల్పనలో ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
అమరావతికి దృశ్యరూప వివరణ
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి దృశ్యరూప వివరణ ఇచ్చారు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు. ఎక్కడ అసెంబ్లీ భవనం ఉంటుంది.. ఎక్కడ ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ వస్తాయి.. అనే అంశాలను సవివరంగా వివరించారు. ఈ ప్రజెంటేషన్‌ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం సాధ్యం : సీఎం చంద్రబాబు  
రైతుల త్యాగంతోనే ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యమవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రాజధానిలో మొత్తం 9 సిటీలు, 27 టౌన్‌ షిప్పులు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. పోలవరం, అమరావతి పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్న చంద్రబాబు.. రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. 
ఇటుక కూడా పెట్టలేదు : జగన్ 
మరోవైపు ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తప్పుపట్టారు. చంద్రబాబు పాలనకు మూడేళ్లు అయినా ఏపీ రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. రాజధాని డిజైన్లను అసెంబ్లీలో ప్రదర్శించగా.. దీన్ని వీక్షించేందుకు జగన్‌ హాజరు కాలేదు. దీనిపై కారణాలను అడిగిన మీడియా ప్రతినిధులతో  వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు ఇస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. ఆ ప్రజెంటేష‌న్‌తో సమయం వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు.
అమరావతి పేరుతో ఎందుకింత హడావుడి : సోము వీర్రాజు 
అమరావతి పేరుతో ఎందుకింత హడావుడి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.  దేశంలో కొత్తగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అవన్నీ ఇంత హంగామా చేశాయా అని ఆయన ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డే కట్టిందని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హడావుడి చేస్తోందని ఆయన సోము వీర్రాజు విమర్శించారు.
డ్రైవర్‌ రహిత వాహనాలు
రాజధాని భవన నిర్మాణాలకు వాస్తు, దేవాలయ ఆకృతులను పరిగణనలోకి తీసుకున్నట్టు ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అసెంబ్లీ భవనం ముందు నీటి మడుగులో మ్యూజియం ఏర్పాటు ఆలోచన ఉందన్నారు. లండన్‌లోని పబ్లిక్‌ పార్కు తరహాలో భారీ ఉద్యానవనం నిర్మించనున్నట్టు చెప్పారు. అమరావతిలో ప్రతి భవనం చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండబోతున్నట్లు వివరించారు. అమరావతి పరిపాలన నగరం ప్రధాన రహదారిలో డ్రైవర్‌ రహిత వాహనాలకు ప్రతిపాదన ఉందన్నారు. 

 

తమ్మినేని, కోదండరాంతోపాటు పలువురు అరెస్టు

హైదరాబాద్ : ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను తరలించడాన్ని నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు 2రన్ తల పెట్టారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2కే రన్ లో పాల్గొనేందుకు వస్తున్న సీపీఎం రాష్ట్ర తమ్మనేని వీరభద్రం, జేఏసీ కోదండరాం, సంధ్యతోపాటు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకముందు రన్ లో పాల్గొనేందుకు సీపీఎం, సీపీఐ కార్యకర్తలు, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, పశ్యపతిలను అరెస్టు చేశారు. 250 మందిని అరెస్టు చేశారు.

07:13 - March 26, 2017

హైదరాబాద్ : కాసేపట్లో సీపీఎం, వామపక్షాల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను తరలించడాన్ని నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు రన్ ఉంటుంది. సీపీఎం రాష్ట్ర తమ్మనేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జేఏసీ కోదండరాం పాల్గొననున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2కే రన్ లో పాల్గొనేందుకు సీపీఎం, సీపీఐ కార్యకర్తలు, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, పశ్యపతిలను అరెస్టు చేశారు. 250 మందిని అరెస్టు చేశారు. అలాగే పార్కుకు వాకింగ్ కు వచ్చే వారిని కూడా క్షుణ్ణగా తనిఖీలు చేస్తూ అడ్డగిస్తూ వారికి తీవ్ర అసౌకర్యం కలిగిచండంతో ఇదేమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాకర్స్ ను అడ్డగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ వీకే వద్ద కర్ఫ్యూ వాతావారణం నెలకొంది. సుందరయ్య విజ్ఞాన కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కాసేపట్లో సీపీఎం, వామపక్షాల ఆధ్వర్యంలో 2కే రన్

హైదరాబాద్ : కాసేపట్లో సీపీఎం, వామపక్షాల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను తరలించడాన్ని నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు రన్ ఉంటుంది. సీపీఎం రాష్ట్ర తమ్మనేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జేఏసీ కోదండరాం పాల్గొననున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2కే రన్ లో పాల్గొనేందుకు సీపీఎం, సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

 

నేడు అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ : నేడు అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లో 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి 17,028 మంది పరీక్ష రాయనున్నారు.  

 

నేడు గవర్నర్ తో తెలుగు రాష్ట్రాల మంత్రులు భేటీ

హైదరాబాద్ : నేడు గవర్నర్ తో తెలుగు రాష్ట్రాల మంత్రులు భేటీ అయ్యారు. విద్యుత్, సచివాలయ ఉద్యోగుల పంపిణీ, పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లోని సంస్థలు, ఢిల్లీలో ఏపీ భవన్ విభజన, షిలాబిడే కమిటీ సిఫార్సులపై చర్చించనున్నారు. 

 

Don't Miss