Activities calendar

27 March 2017

23:00 - March 27, 2017

మత కోణంలో నిషేధించారా.. లేక మరేదైనా అంశం ఇందులో ఉందా...? ఎవరేం తినాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా... ? ప్రజల ఆహారపు అలవాట్లను చట్టాలు నియంత్రించగలవా..? యూపీలో కబేళాల మూసివేత అంశంపై ఎన్నో వాదనలు, మరెన్నో ప్రశ్నలు. ఇది యూపీతోని ఆగుతుందా.. లేదా దేశమంతటా అమలయ్యే అవకాశాలున్నాయా..? ఈ నిర్ణయం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, ఉపాధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈరోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..
మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూడండి. 

22:51 - March 27, 2017
22:48 - March 27, 2017

నెల్లూరు : పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కలెక్టరేట్ లో కిరోసిన్ పోసుకుని వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసులు అతన్ని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. పెన్షన్ ఇవ్వడం లేదని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:39 - March 27, 2017

ధర్మశాల టెస్ట్‌ : ధర్మశాల టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించింది.జడేజా ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో 32 పరుగుల కీలక  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన టీమిండియా ...బౌలింగ్‌లోనూ డామినేట్‌చేసింది. భారత బౌలర్ల జోరు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో ఆతిధ్య జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం  ప్రదర్శించింది. మూడో రోజే మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్‌ ... విజయానికి 87 పరుగుల దూరంలో నిలిచింది. 
భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం
ధర్మశాల టెస్ట్‌లో భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. సిరీస్‌ నిర్ణయాత్మక టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కంగారూల జోరుకు చెక్‌ పెట్టింది. జడేజా ఆల్‌రౌండ్‌ షో...అశ్విన్‌,ఉమేష్‌ యాదవ్‌ల మ్యాజిక్‌తో మూడో రోజే మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్‌ ... విజయానికి  87 పరుగుల దూరంలో నిలిచింది. 6 వికెట్లకు 248 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్ ఓవర్‌నైట్‌స్కోర్‌కు మరో  84 పరుగులు జోడించింది. జడేజా ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో 32 పరుగుల కీలక  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన టీమిండియా ....బౌలింగ్‌లోనూ డామినేట్‌చేసింది. 
భారత బౌలర్ల జోరుకు కంగారులు బేజారు.. 
మూడో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల జోరు ముందు కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. రెన్‌ షా ,డేవిడ్‌ వార్నర్‌లను ఉమేష్‌ యాదవ్‌ ఔట్‌ చేసి శుభారంభాన్నిచ్చాడు.సూపర్‌ ఫామ్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ బౌల్డ్‌ చేసి భారత్‌ను పోటీలో నిలిపాడు. మ్యాక్స్‌వెల్‌, మాథ్యూవేడ్‌ పోరాడినా....మిగతా బ్యాట్స్‌మెన్‌  తేలిపోవడంతో ఆసీస్‌ టీమ్‌ భారత్‌ ముందు భారీ లక్ష్యాన్నుంచడంలో విఫలమైంది. అశ్విన్‌, జడేజా పోటీలు పడి వికెట్లు తీయడంతో కంగారూ టీమ్‌  కోలుకోలేకపోయింది. 
137 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా 
137 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌ ముందు 106 పరుగుల లక్ష్యాన్నుంచింది. భారత బౌలర్లలో ఉమేష్‌ ,అశ్విన్‌,జడేజా తలో మూడు వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రాహుల్‌, మురళీ విజయ్‌ శుభారంభాన్నిచ్చారు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. సిరీస్‌ ఆధ్యంతం ఆతిధ్య జట్టుకు గట్టి పోటీనిచ్చిన ఆస్ట్రేలియాకు ఆఖరి టెస్ట్‌లో మాత్రం ఓటమి తప్పేలా లేదు. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే లక్ష్యాన్ని చేధించి...సిరీస్‌తో పాటు  బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. 

 

22:35 - March 27, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు. కార్పోరేట్లకు 11 లక్షల కోట్లను మాఫీ చేసిన కేంద్రం- రైతుల రుణాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత రెండు వారాలుగా జంతర్ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న తమిళనాడు రైతులను పరామర్శించిన ఏచూరి- వారికి తమ మద్దతు తెలిపారు. రైతుల సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని వారికి హామీ ఇచ్చారు. ఎలుకలను నోట్లో పెట్టుకుని రైతులు నిరసన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళ రైతులకు 20 వేల కోట్ల నష్టం జరిగింది. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి రైతులకు తక్షణమే కేంద్రం నిధులు విడుదల చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

22:28 - March 27, 2017

ఢిల్లీ : దేశంలో రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖెహర్... దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోగా తెలపాలని.. కేంద్రానికి నోటీసులు జారీచేశారు. గుజరాత్ రైతు సమస్యలపై సిటిజన్ రిసోర్స్ యాక్షన్ ఇనిషియేటివ్ అనే ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ ధర్మాసనం విచారించింది. దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... కేంద్రప్రభుత్వం వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా పాలసీ తీసుకురావడం లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్.. కేంద్రానికి నోటీసులు జారీచేశారు.

22:22 - March 27, 2017

పశ్చిమగోదావరి : మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా రోజురోజుకు ఉద్యమం ఉధృతమవుతోంది. అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. నిర్భందాన్ని సైతం ఎదుర్కొంటూ.. ఉద్యమిస్తున్నారు. మరోవైపు అరెస్ట్‌లతో ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. 
రోడ్డెక్కిన తుందుర్రు గ్రామస్థులు  
పశ్చిమగోదావరి జిల్లా... భీమవరం మండలంలో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ మాకొద్దంటూ మరోసారి తుందుర్రు గ్రామస్థులు రోడ్డెక్కారు. నినాదాలు.. ర్యాలీలు... ధర్నాలు.. ప్రదర్శనలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెలలోనే మూడు సార్లు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. తమ నిరసన స్వరాలను వినిపించేందుకు..కలసికట్టుగా ముందుకు కదిలారు. 
మార్చి 8న మహిళల ఆందోళన
మహిళా దినోత్సవం స్ఫూర్తితో ఈనెల ఎనిమిదో తేదీన ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా 32 గ్రామాల మహిళలు ఆందోళన
చేపట్టారు. అలాగే 14వ తేదీన  ఆయా గ్రామాలకు వెళ్లిన అఖిలపక్షం నాయకులను... గ్రామస్థులు కలవనివ్వలేదు. వారం రోజుల క్రితం అమరావతిలోని అసెంబ్లీ వద్ద మంత్రులను.. ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్లిన ఆక్వాఫుడ్ పార్క్‌ వ్యతిరేక కమిటీ నాయకులను ముందస్తుగానే అరెస్ట్‌ చేశారు. 
అక్రమ అరెస్ట్‌ల పై ప్రజలు పోరాటం...
కమిటీ నాయకుల అక్రమ అరెస్ట్‌లపై ఆగ్రహించిన తుందుర్రు, కంసాల బేతపూడి, జొన్నలగరువు గ్రామాల ప్రజలు ఈరోజు మళ్లీ పోరాటాన్ని చేపట్టారు. అయితే గ్రామస్థులపై పోలీసులు తమ జులుంను ప్రదర్శించారు. ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా నిర్భందించారు. 144 సెక్షన్‌ అమలులో ఉందంటూ... చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారిని బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. ముఖ్యంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంను, సీపీఎం నాయకులు గోపాలం, త్రిమూర్తులు, వర్మ, కల్యాణీలతో సహా 60 మందిని పోలీసులు అరెస్ట్‌లు చేశారు.
పోలీసులపై గ్రామస్థులు మండిపాటు
తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా.. అఘాయిత్యాలకు పాల్పడుతున్న పోలీసులపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఆంధ్రాబ్యాంక్‌కు, తుందుర్రు పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ను స్థాపిస్తే..సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

22:15 - March 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంకెలగారడీతో ప్రజలను మభ్య పెడుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దుయ్యబట్టారు. తెరాస ప్రభుత్వ విధానాల వల్ల.. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. అయితే ప్రభుత్వం దీన్ని దీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ హయాంలోని అప్పులకు, తాము చేస్తున్న అప్పులకూ అసలు పోలికే లేదని తేల్చి చెప్పింది. ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ అనంతరం.. సభ నిరవధికంగా వాయిదా పడింది. 
ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన ఈటల  
తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై వాడీవేడీగా చర్చ నడిచింది. సభలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చను ప్రారంభించారు.  తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ అంకెల గారడీని తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో క్రమంగా అప్పులు పెరిగిపోతున్నాయని వివరించారు. నాలుగేళ్లలోనే అప్పులు రెట్టింపు అయ్యాయన్న ఉత్తమ్‌... 2017-18 నాటికి  1,40,523 కోట్లకు అప్పులు  చేరాయన్నారు. ఇంత భారీ మొత్తంలో అప్పులు చేయడం రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. 
ఉత్తమ్‌ విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్‌ 
ఉత్తమ్‌ విమర్శలను కేసీఆర్‌ తిప్పికొట్టారు.  కాంగ్రెస్‌ హయాంలో చేసిన అప్పులకు ...  తమ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు చాలా తేడా ఉందన్నారు. అప్పులు చేయడమేకాదు.. వాటిని తీర్చే సత్తా తమకుందని స్పష్టం చేశారు.
బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి : సున్నం రాజయ్య
బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలనే అంశాన్ని సభలో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ ప్రస్తావించారు. వెంటనే బీసీ సబ్‌ప్లాన్‌ను తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీలు పెంచాలని, హాస్టల్‌ సిబ్బందిని క్రమబద్దీకరించాలని సున్నం రాజయ్య కోరారు.
బీసీ సబ్‌ప్లాన్‌కు కట్టుబడి ఉన్నాం : సీఎం కేసీఆర్‌ 
బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ సభలో స్పష్టం చేశారు. ఏడాదిలోగా బీసీలకు సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొస్తామని హామీనిచ్చారు. సంక్షేమ రంగంలో దేవంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.  వసతి గృహాల విద్యార్ధులకు మెస్‌ చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 950, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు 1400, ప్రొఫెషనల్‌ కోర్సు స్టూడెంట్స్‌కు 1500  ఇవ్వనున్నట్టు చెప్పారు. 
కేజీ టూ పీజీ ఉచిత విద్యపై నిలదీసిన విపక్షాలు
కేజీ టూ పీజీ ఉచిత విద్యపై అధికారపక్షాన్ని విపక్ష సభ్యులు నిలదీశారు.  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.  విపక్షసభ్యుల ప్రశ్నలపై స్పందించిన కేసీఆర్‌... కేజీ టూ పీజీ తన డ్రీమ్‌ ప్రాజెక్టని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా విధానం అమలు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుందన్నారు.  
ముస్లిం రిజర్వేష్లపైనా కేసీఆర్ క్లారిటీ 
ముస్లిం రిజర్వేష్లపైనా కేసీఆర్ సభలో క్లారిటీ ఇచ్చారు. మతపరమైన రిజర్వేషన్లు తాము ప్రతిపాదించడం లేదన్నారు.  ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లను పెంచుతామన్నారు. వారం రోజుల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుపుతామని చెప్పారు. ఇక విద్యుత్‌ రంగం, ఎంబీసీలకు  కమిషన్‌, రుణమాఫీ, హైదరాబాద్‌ మద్యం అమ్మకాలు సహా పలు అంశాలపై విపక్ష సభ్యులు ప్రశ్నలు సంధించారు. దీనికి అధికారపక్షం సమాధానం చెప్పింది. ఆ తర్వాత  ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించింది. అనంతరం శాసన సభను స్పీకర్‌ మధుసూదనాచారి నిరవధికంగా వాయిదా వేశారు. 

22:03 - March 27, 2017

గుంటూరు : విజయవాడలో రవాణా శాఖ అధికారులపై టీడీపీ ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేసిన ఘటన అసెంబ్లీని కుదిపేసింది. ఈ ఘటనకు కారకులైన తెలుగుదేశం నేతలపై కేసు పెట్టి అరెస్టు చేయాలన్న డిమాండ్‌తో వైసీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో అసెంబ్లీ స్తంభించింది. విజయవాడ ఘటనపై  ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభా కార్యక్రమాలను కొనసాగించారు. 
టీడీపీ ప్రజా ప్రతినిధుల దౌర్జన్యం 
విజయవాడలో రవాణా శాఖ అధికారులపై టీడీపీ ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేసిన ఘటన అసెంబ్లీలో తీవ్ర రగడకు దారి తీసింది. అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన  విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. 
వైసీపీ సభ్యుల నినాదాలు
వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ కార్యక్రమాలను కొనసాగించారు. బడ్జెట్‌ డిమాండ్లతోపాటు, పలు బిల్లులపై చర్చ చేపట్టారు. వైసీపీ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పలు బిల్లులకు సభ ఆమోదం 
వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే బడ్జెట్‌ పద్దులతోపాటు పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కాకినాడలో 350 కోట్ల రూపాయలతో లాజిస్టిక్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును ముఖ్యమంత్రి తరుపున కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. అలాగే ఒకే భూమిని ఒకరికి తెలియకుండా మరొకరికి విక్రయించే ద్వంద్వ రిజిస్ట్రేషన్లను నిషేధించేందుకు ఉద్దేశించిన 1908 ఏపీ రిజిస్ట్రేషన్ల చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. మద్యం విక్రయాల్లో జరిగే అవకతవకలను అరికట్టేందుకు ఉద్దేశించిన ఏపీ ఎక్సైజ్‌ చట్ట సవరణ బిల్లుతోపాటు, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ ఎనర్జీ  యూనివర్సిటీ, ఏపీ నౌకాయాన బోర్డు ఏర్పాటు బిల్లులకు  కూడా ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత  స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

 

21:56 - March 27, 2017

పదో తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని వక్తలు కోరారు. పదో తరగతి పరీక్ష పత్రాలు...లీకేజీ.. అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జూ.లెక్చరర్స్ ఆసోసియేషన్ నేత మధుసూదన్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ నేత నర్సిరెడ్డి, భౌతికశాస్త్ర నిపుణులు కృష్ణకుమార్, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు.  'విద్యార్థుల జీవితాలతో తెలంగాణ విద్యాశాఖ చెలగాటమాడుతుంది. ప్రశ్నపత్రాల వరుస లీకేజీలతో పదో తరగతి విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. దీనికితోడు అవుట్‌ ఆఫ్‌ సిలబస్‌ నుంచి ఫిజిక్స్‌ ప్రశ్నాపత్రం రావడం.. అనుభవం లేని కన్సల్టెంట్లు పేపర్లు తయారు చేయడం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షలు.. విద్యార్థుల జీవితానికే పరీక్షగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:47 - March 27, 2017

మహారాష్ట్ర : పాకిస్తాన్‌ ఫౌండర్‌ మహ్మద్ అలీ జిన్నా ఇల్లును కూల్చాలని ముంబైలోని ఓ టాప్ బిల్డర్ ప్రభుత్వాన్ని కోరాడు. ద‌క్షిణ ముంబైలో రెండున్నర ఎక‌రాల్లో ఉన్న జిన్నా ఇంటిని కూల్చి.. ఆ ప్రదేశంలో ఓ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాల‌ని రియల్‌ ఎస్టేట్‌ ప్రమోటర్ మంగ‌ళ్ ప్రభాత్ లోధా సూచించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ 2600 కోట్లు ఉంటుంది. 1930ల్లో నిర్మించిన ఈ భారీ భ‌వనం నిర్వహణ కోసం కోట్లు వృథా చేస్తున్నార‌ని ఆరోపించారు. దేశ విభ‌జ‌న కుట్రకు బీజం ప‌డింది ఈ ఇంటి నుంచేనని  ...అందుకే దీన్ని కూల్చేయాలని లోధా వాదిస్తున్నాడు. చాలా కాలం వ‌ర‌కు బ్రిట‌న్ డిప్యూటీ హైక‌మిష‌న‌ర్ నివాసంగా ఉన్న ఈ ఇల్లు 1982 నుంచి  ఖాళీగానే ఉంది. ఈ ఇంటిని త‌మ‌కు అమ్మడ‌మో, లీజుకు ఇవ్వడ‌మో చేయాల‌ని పాకిస్థాన్ ప్రభుత్వం చాలాసార్లు కోరింది. అయితే భార‌త్ ఈ కోరిక‌ను మ‌న్నించ‌లేదు.. అలాగ‌ని నిరాక‌రించ‌లేదు.

 

21:45 - March 27, 2017

ఢిల్లీ : జీఎస్టీకి సంబంధించిన 4 సహాయక బిల్లులు-ఐజీఎస్టీ, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ పరిహార చట్టాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై మంగళవారం చర్చించే అవకాశం ఉంది. మార్చి 30లోపు లోక్‌స‌భ‌లో జీఎస్టీ బిల్స్‌ను పాస్ చేయించాల‌ని కేంద్రం భావిస్తోంది. అనంతరం 4 జిఎస్‌టి బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఏమైనా స‌వ‌ర‌ణ‌లు సూచిస్తే.. వాటిపై చ‌ర్చించ‌డానికి లోక్‌స‌భ‌కు త‌గిన స‌మ‌యం దొరుకుతుంది. ఆ స‌వ‌ర‌ణ‌ల‌ను లోక్‌స‌భ ఆమోదించ‌వ‌చ్చు లేదా తిరస్కరించ‌వ‌చ్చు. వీటిని ద్రవ్య బిల్లులుగానే ప్రవేశ‌పెడుతున్నా.. పార్లమెంట్‌ ఉభయ స‌భ‌ల్లోనూ త‌గిన చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లులు పాసయ్యాక వీటిని విధానసభలకు పంపనున్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీని అమ‌లు చేయాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. 
 

21:43 - March 27, 2017

ఢిల్లీ : ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం తప్పుపట్టింది. ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న బిల్లును తాము వ్యతిరేకిస్తామని రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందని ఆరోపించారు. 

 

21:38 - March 27, 2017

ఢిల్లీ : సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని సూచించింది. అయితే బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఆదాయపు పన్ను వివరాల నమోదు లాంటి వాటికి మాత్రం ప్రభుత్వం ఆధార్‌ను తొలగించబోదని న్యాయస్థానం వెల్లడించింది. ఆధార్‌ అనుసంధానంపై పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావట్లేదని తెలిపింది.

 

21:36 - March 27, 2017

ఢిల్లీ : ఎయిర్‌ ఇండియా అధికారిపై దాడి చేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ త్వరలో విమానం ఎక్కనున్నారా...? ఆయనపై ఏడు విమానసంస్థలు విధించిన నిషేధం సమసిపోనుందా? గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న శివసేన ఎంపీలు చేసిన విజ్ఞప్తికి కేంద్రం దిగివచ్చినట్లే కనిపిస్తోంది.
నిషేధ అంశం లోక్‌సభలో చర్చ
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను విమాన సంస్థలు నిషేధించిన అంశం లోక్‌సభలో చర్చకు వచ్చింది. జీరో అవర్‌లో శివసేన ఎంపీ ఆనందరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎయిర్‌ ఇండియా అధికారి ఎంపీతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే గైక్వాడ్‌ సహనం కోల్పోయారని అన్నారు. అయితే అధికారిని కొట్టడం తప్పేనని  ఒప్పుకున్నారు.  గ్వైక్వాడ్‌ను  విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించడం సరికాదని ఆనందరావు చెప్పారు. ఎయిర్ ఇండియా ఉద్యోగుల‌తో దురుసుగా ప్రవ‌ర్తించిన కపిల్‌ శర్మను ఎందుకు బ్యాన్‌ చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.  
ఎంపీ కూడా ఓ ప్రయాణికుడే : అశోక్ గజపతిరాజు 
శివసేన లేవనెత్తిన అంశంపై కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు స్పందించారు. ఎంపీ కూడా ఓ ప్రయాణికుడేనని, ప్రయాణికుల విషయంలో అధికారులు భేదభావం చూపరని స్పష్టం చేశారు. ఓ ఎంపి ఇలాంటి గొడవలో ఇరుక్కుంటారని తాను ఊహించలేదన్నారు.  గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలన్న శివసేన డిమాండ్‌ను మంత్రి తోసిపుచ్చారు. ప్రయాణికుల సంరక్షణ విషయంలో రాజీ పడేది లేదన్నారు.  
నిషేధం ఎత్తివేసేందుకు రంగంలోకి శివసేన ఎంపీలు 
రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు శివసేన ఎంపీలు రంగంలోకి దిగారు. కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు, స్పీకర్‌ సుమిత్రామహాజన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో సదరు ఎంపీపై నిషేధం ఎత్తివేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రయాణించే హక్కుకు గౌరవం కల్పించాలన్న కారణంతో గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని త్వరలో ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది.
విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం 
ఇటీవ‌ల ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన శివసేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానశ్రయంలో ఓ అధికారిని చెప్పుతో కొట్టారు. దానికి క్షమాప‌ణ చెప్పేందుకు కూడా ఆయ‌న నిరాక‌రించారు. దీంతో 7 విమాన సంస్థలు విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

 

21:22 - March 27, 2017

హైదరాబాద్ : విద్యార్థుల జీవితాలతో తెలంగాణ విద్యాశాఖ చెలగాటమాడుతుంది. ప్రశ్నపత్రాల వరుస లీకేజీలతో పదో తరగతి విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. దీనికితోడు అవుట్‌ ఆఫ్‌ సిలబస్‌ నుంచి ఫిజిక్స్‌ ప్రశ్నాపత్రం రావడం.. అనుభవం లేని కన్సల్టెంట్లు పేపర్లు తయారు చేయడం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షలు.. విద్యార్థుల జీవితానికే పరీక్షగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
లీకేజీల కోసం ప్రైవేటు విద్యాసంస్థల ప్యాకేజీలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మూడు లీకేజీలు.. ఆరు తప్పుల తడకలుగా సాగుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు, ప్రభుత్వ టీచర్లు కొందరు కుమ్మక్కై లీకేజీల కోసం ప్యాకేజీలు మాట్లాడుకోవడం.. అది బహిర్గతం కావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. తాజాగా సిలబస్‌తో సంబంధం లేకుండా టెన్త్ క్లాస్ ఫిజిక్స్ ప్రశ్నాపత్రం ఉండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రశ్నాపత్రాల తయారీని ఎవరో కన్సల్టెంట్‌కు అప్పగించి... చేతులు దులుపుకుంది విద్యాశాఖ.. సదరు కన్సల్టెన్సీ..సిలబస్‌తో  సంబంధం లేని ఫిజిక్స్‌ పేపర్‌ ఇచ్చి..విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. నిబంధనలకు తిలొదకాలిచ్చి .. ఫిజిక్స్‌తో సంబంధం లేని వారు ఫిజిక్స్ పేపర్ తయారీ బాధ్యతనివ్వడంతోనే విద్యాశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది.  
భౌతికశాస్త్రం ప్రశ్నాపత్రం తయారీలో నిబంధనను పాటించని విద్యాశాఖ
సాధారణంగా ప్రభుత్వ పరీక్షల విభాగం.. పదో తరగతి పరీక్షల నిమిత్తం ..నిపుణులతో ఒక్కో సబ్జెక్టుకు ఆరు పేపర్లను తయారు చేయిస్తుంది. తయారుచేసిన వాటిని మరోసారి పరిశీలించేందుకు ఒక కమిటీ ఉంటుంది. ఇందులోని సభ్యులను మాడరేటర్లు అంటారు. ప్రశ్నాపత్రాల తయారీకి బ్లూ ప్రింట్‌ ప్రకారం, ప్రతి పేపర్‌ కూడా 40శాతం సాధారణంగా, 30శాతం  సాధారణం కన్నా తక్కువగా, మరో 30 శాతం కఠినంగా ఉండేలా రూపొందించాలి. ఈ బ్లూ ప్రింట్‌ ప్రకారం ప్రశ్నాపత్రం ఉందా..? లేదా..? అనే అంశాన్ని మాడరేటర్లు పరిశీలిస్తారు. వీరిలో ఒకరు కచ్చితంగా ఆ సబ్జెక్టు నిపుణుడై.. పాఠశాలలో బోధిస్తూ ఉండి ఉండాలి. మరొకరిని ప్రొఫెసర్‌ను గానీ మరెవరినైనా విద్యా, పరీక్షల నిపుణుడిని నియమించుకోవచ్చు. కానీ, భౌతిక శాస్త్రం ప్రశ్నాపత్రం తయారీలో ఈ నిబంధనను పాటించలేదనే ఆరోపణలొస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగుల నియామకం 
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 55 ప్రకారం .. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ప్రభుత్వ శాఖల్లో సలహాదారులు, ఓఎస్ డీలు కన్సల్టెంట్లుగా నియమించకూడదు. కానీ విద్యాశాఖ మాత్రం ఈ నిబంధనలకు నీళ్లొదిలేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్ని వివిధ స్థాయుల్లో తిరిగి నియమించింది. ఈ విధంగానే ప్రశ్నాపత్రాల తయారీకి  కన్సల్టెంట్లను నియమించింది. పత్రాలు తయారు చేసే టీం..సంబంధిత సబ్జెట్ నిపుణుడు లేరంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మూడు పశ్నపత్రాలు లీకేజీ..!
ఇప్పటికే పదోతరగతికి సంబంధించి మూడు ప్రశ్నాపత్రాలు లీకేజీ అయినట్టు వార్తలొచ్చాయి. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు.. గతంలో ఎంసెట్ పేపర్ లీకేజీ అవ్వడం.. ఒంటిపూట బడులపై క్లారిటీ లేకపోవడం, గురుకులాల్లో పోస్టుల భర్తీకి వయో పరిమితి, నిబంధనలపై గందరగోళం.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది... ఈ పరిణామాలపై విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసహనం కనిపిస్తోంది. 

 

21:10 - March 27, 2017

విశాఖ : ఖద్దరు మాటున పేదల భూములను అప్పనంగా కొట్టేయాలనుకున్నారు. అధికారుల అండదండలతో రెచ్చిపోయారు. ప్రభుత్వమే భూములు సేకరిస్తుందంటూ నమ్మించారు. నేతల కబ్జా వ్యవహారం బట్టబయలు కావడంతో.. ల్యాండ్‌ సర్వే అధికారుల అవినీతి అక్రమాల డొంక కదులుతోంది. 
కబ్జారాయుళ్ల ఆగడాలు 
విశాఖ జిల్లాలో కబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. హౌసింగ్ కాలనీలు నిర్మించాలని ఉడా నిర్ణయించడంతో.. ఇదే అదనుగా కొందరు నాయకులు పేదల భూములు కొట్టేయడానికి పెద్ద పథకమే వేశారు. పద్మనాభం, అనందపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ఉడా ప్రతిపాదించింది. పద్మనాభం, ఆనందపురం మండలాల్లో.. 400 ఎకరాలను భూసేకరణ పేరుతో అక్రమార్కులు లాక్కున్నారన్న వార్తలు కలకలం రేపాయి.  మరోవైపు పెందుర్తీ మండలం ముదపాకలో 40 ఎళ్ల క్రితం 400 మంది భూమి లేని దళిత రైతులకు 450 ఎకారాలు అప్పటి ప్రభుత్వం పంపిణి చేసింది.  వాటికి డి పట్టాలు అందజేసింది. పట్టణ జనాభా పెరగడంతో పెందుర్తి ప్రాంతంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి..ఉడా ప్రకటనతో అక్రమార్కులు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. ఎకరానికి 10 లక్షలు చెల్లిస్తామని కోతలు కోశారు. చివరకు లక్ష చొప్పున చెల్లించి 236 మంది రైతుల నుంచి 280 ఎకరాలకు సంభందించిన పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా దుమారం రేపడంతో.. పెందుర్తీలో ల్యాండ్ పూలింగ్‌కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
అవినీతి అధికారుల భాగోతం 
ఇక కబ్జారాయుళ్లకు సహకరించిన అవినీతి అధికారుల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. అనందపురం భూముల కుంభ కోణంలో అధికార పార్టీ పెద్దలకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీమిలి తహసిల్ధార్ రామారావు..ఏసీబీకి పట్టుబడ్డాడు. భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ సుమారు 50 కోట్ల ఉంటుందని అంచనా. విశాఖ వెబ్‌ల్యాండ్‌లో అక్రమంగా పలు మార్పులు చేసినట్టు ఎసీబి గుర్తించింది. ఇక మరో అధికారి రాజేశ్వరరావు కరెప్షన్‌ స్టోరీ కలకలం రేపుతోంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే విభాగంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ రైడ్స్‌ నిర్వహించి..సుమారు 20 కోట్లు ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 

21:07 - March 27, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నీటి సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. కృష్ణానదిపై వాటర్ స్టోరేజీ కోసం బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుంది. అలాగే మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా మరో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ప్రతిపాదనలు రూపొందిస్తోంది. 
కృష్ణా నదిపై మరో వంతెన 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల దిగువన బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 
గనిఆత్కూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం
ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉంది. ఏపీ రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈ ప్రాంతంలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్ ఏర్పడింది. ఈ కొత్త వంతెనకు రూ.2,500 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రాథమిక సర్వే పూర్తిచేసింది. 
బ్యారేజీ నిర్మాణంపై కసరత్తు 
రాజధాని ప్రాంతం కావడంతో కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మాణం కీలకంగా మారింది. దీంతో మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేసింది.  వర్షాలకు మున్నేరు నుంచి వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజీలో నిల్వ ఉంచి మిగతా నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. దీంతో 50 టీఎంసీల దాకా నీరు వృథా అవుతోంది. బ్రిడ్జి నిర్మాణంతో 15 టీఎంసీల నీటినైనా నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో కొత్త వంతెనను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

 

21:03 - March 27, 2017

విశాఖ : పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పీలా శ్రీనివాసరావు, అతని అనుచరులపై విశాఖపట్నం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అర్థరాత్రి న్యూసెన్స్‌ చేస్తున్నారని తెలవడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లగా పీలా శ్రీనివాస్‌.. అతని అనుచరులు పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఈ మేరకు వారిపై సీఐ మురళి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

 

21:00 - March 27, 2017

విశాఖ : ఉన్నతాధికారులు తనను వేధించారంటూ కల్యాణి అనే ఉద్యోగి విశాఖ రేంజ్‌ డీఐజీ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి అచ్చంనాయుడిని అడ్డంపెట్టుకుని ఉన్నతాధికారులు తనను మానసికంగా, లైంగికంగా  వేధించారని పోలీసులకు తెలిపింది. కాగా దళిత ఉద్యోగి అయిన కల్యాణికి న్యాయం చేయాలని..ప్రస్తుతం దళితులు బతకలేని పరిస్థితి ఉందని వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు. కల్యాణికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

20:57 - March 27, 2017

గుంటూరు : భాష్యం పేరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ భాష్యం గోపీ మెమోరియల్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా.. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ వైద్యశిబిరంలో 45 మంది స్పెషల్టిస్ట్‌ డాక్టర్లు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. పెదపరిమి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారు.

20:55 - March 27, 2017

గుంటూరు : టీడీపీ ప్రజా ప్రతినిధులు విజయవాడలో ఆర్టీఏ అధికారులపై దౌర్జన్యం చేసిన ఘటన తీవ్ర రగడకు దారి తీసింది.  తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా వైసీపీ సభ్యులు తమ పంతం వీడలేదు. రవాణ శాఖ అధికారులపై దౌర్జన్య చేసిన ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేయడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. వైసీపీ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభా కార్యక్రమాలను కొనసాగించారు. వైసీపీ సభ్యుల ఆందోళన నినాదాల మధ్యే బడ్జెట్‌ పద్దులతోపాటు పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

 

20:52 - March 27, 2017

గుంటూరు : ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐజీ స్థాయి అధికారిపై గుండాయిజం చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రశ్నించారు. అదే తమపై చిన్న కారణాలతో కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వం.. టీడీపీ నేతలను ఎందుకు వదిలేస్తోందన్నారు. టీడీపీకి ఓ న్యాయం వైసీపీకి మరోన్యాయం ఉంటుందా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. 
  

20:49 - March 27, 2017

గుంటూరు : మంగళగిరి పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యేలు... సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు, సీఐ బ్రహ్మయ్య, ఎస్సై బాలకృష్ణలపై స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం, పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న చెవిరెడ్డిని కలిసేందుకు వెళ్లిన మ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. 

 

20:47 - March 27, 2017

గుంటూరు : ఆర్టీఏ అధికారులపై దాడులను నిరసిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆందోళన చేపట్టగా.. అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళగిరి పీఎస్‌కు తరలించారు. చెవిరెడ్డిని కలిసేందుకు వెళ్లిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు స్టేషన్‌లోకి అనుమతించలేదు. పోలీసుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  
ముస్తఫా అరెస్టు 
మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో చెవిరెడ్డిని కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో.. చివరకు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గేటు దూకి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

19:52 - March 27, 2017

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో..గద్వాల సంబరాలు రెండో రోజు ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమంలో పలు నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా గాయకుడు గద్దర్‌ పలు పాటలతో ప్రేక్షకులను అలరించారు. గద్వాల చేనేతలు దేశానికే గర్వకారణమని.. ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఈ సంబరాల ద్వారా గద్వాల  సంస్కృతి, సంప్రదాయాలను మళ్లీ గుర్తుచేశారన్నారు. 

19:50 - March 27, 2017

హైదరాబాద్ : స్కూల్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ...హైదరాబాద్‌లోని..లాలాగూడ శాంతినగర్‌లో ఉన్న తక్షశిల పబ్లిక్‌ స్కూల్‌ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు స్కూల్‌ యాజమాన్యానికి..తల్లిదండ్రులకు వాగ్వాదం జరిగింది. ఈ సంవత్సరం ఒకే సారి 15 శాతం ఫీజులు పెంచారని... ఇలా పెంచితే ఎలా భరించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి...ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

19:48 - March 27, 2017

ఖమ్మం : పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యంపై అవగాహన కలగాలంటే కరెన్సీ నోట్లపై వన చిత్రాలను ముద్రించాలని.. పద్మశ్రీ వనజీవి రామయ్య అన్నారు. పర్యావరణం అంశంలో రాష్ట్రపతి  చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్‌ను అందుకుంటున్నన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రపతి అనుమతిస్తే వివిధ రకాల మొక్కలను రాష్ట్రపతి భవన్లో నాటుతానన్నారు. పర్యావరణ పరిరక్షణపై విస్త్రత ప్రచారం జరగాలని వనజీవి రామయ్య అన్నారు. 

 

19:46 - March 27, 2017

హైదరాబాద్ : ఆస్తిపన్ను బకాయిదారులపై కొరడా జులిపించారు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అధికారులు. తాడ్‌బండ్‌లోని పలు దుకాణాలను సీజ్‌ చేశారు. తాడ్‌బండ్‌లోని స్టెప్‌ ఇన్‌ హోటల్‌, కృష్ణారెడ్డి స్వీట్‌ హౌజ్‌, టీవీఎస్‌ షోరూంతో పాటు పలు షాపులను సీజ్‌ చేశారు. ఆస్తి పన్ను చెల్లించని అన్ని షాపులనూ సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు. 

19:45 - March 27, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవ విరుద్దంగా ఉందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు.  బడ్జెట్‌లో ఎలాంటి అద్బుతాలు లేవన్నారు.  బడ్జెట్‌ అంచనాలకు , వాస్తవాలకు పొంతనే లేదన్నారు. వాస్తవ విరుద్దమైన బడ్జెట్‌... తెలంగాణ ప్రజల జీవితాలను ఎలా మార్చుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నాలన్నింటినీ అధికారపక్షం అడ్డుకుందని  భట్టి ఆరోపించారు. 

 

19:40 - March 27, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం తాహతకు మించి అప్పలు చేయడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బల్లుపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. గత అరవైఏళ్లలో 69వేల కోట్లు అప్పులు తెస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే దాదాపు 90వేల కోట్ల రూపాయలు అప్పలు తెచ్చిందని.. ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి చేటు తెస్తుందన్నారు.

 

వచ్చే నెల 15 నుంచి సింగరేణి కార్మికుల సమ్మె

 

పెద్దపల్లి: గోదావరిఖనిలో సింగరేణి ఐదు జాతీయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. వారసత్వ ఉద్యోగాలు కల్పించకుంటే వచ్చే నెల 15 నుంచి సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

నెల్లూరు కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: జిల్లాలోని కలెక్టరేట్ లో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడే డ్యూటిలో ఉన్న పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. అధికారుల చుట్టు ఎంత తిరిగిన పెన్షన్ మంజూరు చేయడం లేదని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

 

నెల్లూరులో బాంబు కలకలం

నెల్లూరు: జిల్లాలోని చిల్లకూరు మండలం తిక్కవరంలో ప్రభుత్వ పాఠశాలలో బాంబు కలకలం రేగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందిడంతో  బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసి బాంబు లేదని పోలీసులు తెలిపారు. పాఠశాలలో ఉన్న వస్తువులను రాగి చెంబు, కార్బన్ పదార్ధాలుగా పోలీసులు  గుర్తించారు.

డైరీ ఆవిష్కరణ

గుంటూరు: మున్సిపల్ మంత్రి నారయణ సచివాలయంలో మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ డైరీని అవిష్కరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మున్సిపల్ హైస్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ మున్సిపల్ స్కూల్ విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని, అనంతరం విశాఖ, రాయలసీమలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

మణిపూర్ లో లోయలో పడ్డ బస్సు...10 మంది మృతి

ఇంఫాల్ : మణిపూర్ లో ఓ బస్సు లోయలో పడి పది మంది మృతి చెందారు. ఇంఫాల్-­దిమాపూర్ మార్గంలో పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తు  లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ప్రశ్నించే వారిని సస్పెండ్ చేస్తారా : రేవంత్

హైదరాబాద్ : ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని సస్పెండ్ చేస్తారా అని టీడీపీ శాసనభాపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గవర్నర్ ఆదేశాలు లేకుండా సభ్యులను సస్పెండ్ చేయడం చరిత్రలో లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం హామీలను విస్మరిస్తుంటే కనీసం సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు నిలదీసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. 

 

17:05 - March 27, 2017

డ్రై ఫూట్స్ తో ఆరోగ్యానికి ఎంతో మేలు అనే సంగతి తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా రక్త హీనతను దూరం చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండుద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండుద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి.

చెవిరెడ్డి విడుదల

గుంటూరు : మంగళగిరి పీఎస్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలయ్యారు. తన దీక్షను కొనసాగిస్తానని, తనను నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. చంద్రబాబు పాలన తాలిబన్ల పాలనలా ఉందన్నారు. సామాన్యులకు, ఉద్యోగులకు రక్షణ లేదని ఆయన విమర్శించారు.

చెవిరెడ్డి అరెస్ట్ దారుణం : జగన్

గుంటూరు: ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ దారుణమని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. స్పీకర్ కు చెబుదామంటే ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడంలేదని, స్పీకర్ నోరు తెరవకపోగా తమ నోరు కట్టేస్తున్నారని ఆయన తెలిపారు. అధికార యంత్రాంగం తప్పుదారి పట్టిందన్నారు. సీఎం సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను పరామర్శించడానికి వెళ్లిన నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. 

రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 అలౌట్

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయ లక్ష్యం 106 పరుగులుగా ఉంది. భారత్ బౌలర్స్ జడేజా, అశ్విన్, యాదవ్­ లు మూడేసి, భువనేశ్వర్ ఒక్క వికెట్  తీశారు.

 

 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది.122 వద్ద ఒకీఫ్ (0)ఔటయ్యాడు.

 

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది.121 వద్ద కమ్మిన్స్ (12)ఔటయ్యాడు.

 

15:52 - March 27, 2017

టాలీవుడ్ ఒకప్పుడు తెలుగు నేలకే పరిమితమైన మాట. ఇక్కడ కలెక్షన్లు లెక్కలతో పాటు ఖండాలు దాటుతున్నాయి. తన యాంక్టింగ్ తో ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేసిన హీరో నాని. 'నాని' నటించిన 'నేను లోకల్ 'సినిమా తెలుగు రాష్టాల్లోనే కాకుండా తెల్ల దేశాల్లో కూడా కాసులు కురిపించింది. 'నాని' నాచురల్ యాక్టింగ్, 'కీర్తి సురేష్' అందం, అభినయం కామెడీ డైలాగ్స్ అన్ని కలిపి ఆడియన్స్ కి ఆనందాన్ని, ప్రొడ్యూసర్ కి డబ్బుల్ని అందించాయి. ఈ సినిమాలో 'నాని' తన ప్రేమని గెలిపించుకునే ప్రేమికుడి పాత్రలో నటించి మెప్పించాడు.

నిన్ను కోరి..
ఇప్పటి వరకు వరస హిట్స్ అందుకున్నాడు కాబట్టి ఆ హిట్ మేనియాని కంటిన్యూ చేస్తూ వారసత్వ హీరోలకు చెమట్లు పట్టిస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. అలా 'నాని' సైన్ చేసిన ప్రాజెక్ట్ లో ఒకటి 'నిన్ను కోరి'. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్మాణ, దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'. రీసెంట్‌గా 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని 'ఆది పినిశెట్టి' పోషిస్తున్నారు.

జులై 11న విడుదల..
'నాని', 'నివేద' అంటే ఇంటరెస్ట్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ప్రెజెంటేషన్ అనే ఫీల్ ఉంది. ఇది ఇలా ఉంటె ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే యు.ఎస్‌. హ‌క్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి. రెడ్ హార్ట్స్ సంస్థ 'నిన్ను కోరి' సినిమా యు.ఎస్‌. హ‌క్కుల‌ను 3.75 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా నాని 'నేను లోకల్' సినిమా యు.ఎస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్ చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఉన్న యంగ్ హీరోస్‌లో 'నాని'కి ఓవ‌ర్‌సీస్‌లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ 'నిన్ను కోరి' సినిమాను జూలై 11న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ల్యాప్ ట్యాప్ లు

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆర్థిక శాఖ గిప్టులు ఇవ్వనుంది. ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓచర్లు పంపిణీ చేసి, రేపు ల్యాప్ టాప్ లు అందించనున్నారు.

15:49 - March 27, 2017

గుంటూరు : పోలవరం పూర్తిచేయడం ప్రస్తుతం చాలా అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరంపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌కుముందు సభ్యులకు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సీఎం తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల నీళ్లలో వీలైనంతవరకూ నీళ్లను వాడుకునేలా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రకటించారు. 2018కి గ్రావిటీ ద్వారా పోలవరం నీటి వినియోగం ఉంటుందన్నారు. 

 

15:45 - March 27, 2017

హైదరాబాద్ : బీసీలకు సబ్‌ప్లాన్‌ అమలు చేయడం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్ల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, వారికి వేతనాలు పెంచాలని కోరారు. ఆశ్రమ పాఠశాల్లోని సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మూతపడ్డ చిన్న పరిశ్రమలను తెరిపించి.. కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

 

15:42 - March 27, 2017

హైదరాబాద్ : ప్రస్తుతం ఇస్తున్న కళ్యాణలక్ష్మి ఆర్థిక సహాయం రూ.51వేల నుంచి 75వేల రూపాయలు పెంచుతామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. పేద తల్లిండ్రులకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు ఉన్నతవర్గాల్లో ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. 
 

 

15:38 - March 27, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలకు ఏమాత్రం తీసిపోని సంఖ్యలో ప్రైవేట్‌ పాఠశాల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారుని.. ఒకేసారి కేజీ టూ పీజీ తీసుకు వస్తే నిరుద్యోగ సమస్య తలెత్తు తుందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ హఠాత్తుగా కేజీ టూ పీజీ అమలు చేయలేమని స్పష్టం చేశారు. కేజీ టూ పీజీ విధానాన్ని క్రమంగా విస్తరిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యత కలిగిన విద్యను తెలంగాణలో అందించాలనే ఉద్దేశంతోనే కేజీ టూ పీజీ విధానం తీసుకువస్తున్నామని సీఎం అన్నారు. కేజీటూ పీజీ విధానంపై కాంగ్రెస్‌నేతలు విమర్శలు చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

15:32 - March 27, 2017

'మిస్టర్' సినిమా ట్రైలర్ రిలీజ్ తో 'శ్రీనువైట్ల' ఈజ్ బాక్ అనుకుంటున్నారు ఇండస్ట్రీ పీపుల్. ఒకప్పుడు టాప్ లెవెల్ లో ఉన్న శ్రీనువైట్ల ట్రెండ్ మిస్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. కామెడీ ట్రాక్ తో యాక్షన్ స్టోరీ లైన్స్ మిక్స్ చేసి సినిమాలు తీసే డైరెక్టర్ చాల గ్యాప్ తరువాత 'మెగా' సినిమాతో మళ్ళీ రాబోతున్నాడు. కామెడీ ని వెపన్ గా మార్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యగల డైరెక్టర్ తన సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ కి కూడా పెద్ద పీట వేసే టాప్ రేంజ్ డైరెక్టర్ శ్రీను వైట్ల. 2011లో 'దూకుడు' తో సూపర్ హిట్ సినిమాని తెలుగు సినిమా ప్రపంచానికి ఇచ్చాడు శ్రీను వైట్ల. 'మహేష్ బాబు' లాంటి హీరో కి సూట్ అయ్యే యాక్షన్ స్టోరీ లైన్ ని ఫాదర్ సెంటిమెంట్ తో కనెక్ట్ చేసి హ్యూమర్ తగ్గకుండా ప్రెజెంట్ చేసి హిట్ కొట్టాడు శ్రీను వైట్ల. ఇండస్ట్రీ లో ఆల్మోస్ట్ అందరూ పెద్ద హీరోలను తన స్క్రిప్ట్ తో బంధించి సినిమాలు తీసాడు. 'దూకుడు' తరువాత అదే తరహా కధలు ఎంచుకోవడం వల్ల ఆడియన్స్ జడ్జిమెంట్ కి పక్కకెళ్ళిపోయి కొత్త థాట్స్ తో మళ్ళీ రాబోతున్నాడు శ్రీను వైట్ల.

మెగా ఫామిలీ లో పర్ఫెక్ట్ ఫిజిక్, మంచి ఎక్సప్రెస్సివ్ ఎలెమెంట్స్ ఉన్న నటుడు 'వరుణ్ తేజ్'. బాలీవుడ్ నటుడి లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ మెగాహీరో తాను సెలెక్ట్ చేసుకునే కధల్లో వైవిధ్యం ఉండేలా జాగర్తపడుతూ అడుగులు వేస్తున్నాడు. నటించింది మూడు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాల్లోవింగ్ తో ఉన్నాడు వరుణ్ తేజ్. కుల వ్యవస్థ మీద వచ్చిన ప్రేమకథ చిత్రం 'కంచె'. ఈ సినిమా లో మెచూర్డ్ యాక్టింగ్ పెర్మార్మ్ చేసి ఆడియన్స్ తో వెరీ గుడ్ అనిపించుకున్నాడు వరుణ్.

ఆకట్టుకున్న ట్రైలర్..
రీసెంట్ గా రిలీజ్ ఐన ట్రైలర్ లో అన్ని అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయ్. అందమైన ప్రేమ కథను... శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ ఇది. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్‌ ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. ఈనెల 29న ఆడియోను రిలీజ్ చేసి... ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

15:31 - March 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన తర్వాత...స్పీకర్‌ మధుసూదనాచారి శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బడ్జెట్‌ సమావేశాలు ముగిసినట్టయ్యింది. ఈ బడ్జెట్‌ సమావేశాలు మొత్తంగా 13 రోజులపాటు జరిగాయి. 72 గంటల 33 నిమిషాలపాటు సభ నడిచింది. మొత్తం 5 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సమావేశాల్లో 65 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. 

బీజేపీలో చేరిన ఆప్ ఎమ్మెల్యే..

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ సతీష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ రోజు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆప్ విఫలమైందని ప్రకాష్ ఆరోపించారు.

15:27 - March 27, 2017

తమిళ్ సినిమా కత్తికి రీమేక్ గా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' కి చిరు ఫాన్స్ కలక్షన్స్ తో వెల్కమ్ చెప్పారు. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటూ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు మెగాస్టార్. తన ఎంట్రీ అవ్వడం ఆలశ్యం, ఆడియన్స్ ఇంకా తనని యాక్సెప్ట్ చేస్తున్నారు అని కంఫర్మ్ చేసుకున్న 'చిరంజీవి' వరుస సినిమాలకి ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఇంతకు ముందులా సంవత్సరానికి ఒక సినిమా తియ్యకుండా ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు మెగాస్టార్. 'ధృవ' టైమ్ లోనే తన తర్వాతి సినిమా చిరంజీవితో చేయబోతున్నట్లు సురేందర్ రెడ్డి చెప్పాడు కానీ.. అప్పట్లో ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారంతా. కానీ మెగా151ని చేజిక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చిన సూరి.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. సూరి చేసిన మార్పులకు ముగ్ధుడైన మెగాస్టార్.. ఇదే స్క్రిప్ట్ ను లాక్ చేసేసుకోమని చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఉయ్యాలవాడ..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమాలో కథ ప్రకారం ముగ్గురు భార్యలుంటారట. అయితే... దర్శకులు అసలు కథ ప్రకారం ఈ ముగ్గురు భార్యలను ఉంచుతారా.. లేదంటే మెగాస్టార్ తో స్క్రీన్ పైనా ఏకపత్నీవ్రతం చేయిస్తారా అన్న చర్చ ఫిలిం సర్కిళ్లలో నడుస్తోంది. 'ఉయ్యాలవాడ'కు ముగ్గురు భార్యలుండే వారని చెబుతుంటారు. ఆ ప్రకారమే సినిమాలోనూ 'చిరంజీవి'కి ముగ్గురు భార్యలను ఉంచుతారో లేదో చూడాలి. అసలే.. మెగాస్టార్ సరసన నటించదగ్గ కథానాయికలకు కరవు రావడంతో ఏకంగా ముగ్గురిని వెతకాలంటే కష్టమే.

15:21 - March 27, 2017

కాటమరాయుడు తో పవన్ కళ్యాణ్ మరో సారి థియేటర్స్ మీద దండయాత్ర చేసాడు. ఎక్కడ చుసిన కాటంరాయుడు మేనియా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కి కూడా కాటంరాయుడు బెస్ట్ ఎంటర్టైనర్ అంటున్నారు. 'సర్ధార్ గబ్బర్ సింగ్' తరువాత 'పవన్ కళ్యాణ్' హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టోరీ లైన్ లో కొత్తదనం కోరుకునే తెలుగు ఆడియన్స్ కోసం 'వీరం' సినిమాని తెలుగులో రీమేక్ చేసి 'కాటమరాయుడు' పేరుతో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసాడు పవర్ స్టార్. తమ్ముళ్లకు అన్నగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో వచ్చిన 'కాటంరాయుడు' సినిమా మాస్ ఆడియన్స్ కి క్లాస్ ఆడియన్స్ కి నచ్చేస్తుంది.

90 శాతం థియేటర్లు..
టీజర్ ని రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసిన పవన్. కాటంరాయుడు షూటింగ్ సెట్ లో శివబాలాజీ నుండి కత్తిని బహుమతిగా అందుకున్నాడు. 'కాటమరాయుడు' సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం థియేటర్లలో రిలీజ్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా, ఎంజాయ్ చేస్తూ చేసిన ఈ ‘కాటమరాయుడు’ చిత్రంతో ఆయన మరోసారి అభిమానులు మెచ్చే కథానాయకుడని అనిపించుకున్నారు. ఉగాది కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది.

15:18 - March 27, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిఒక్క వృత్తి పనివారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సభలో సభ్యులడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. బీసీకులాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. తెలంగాణ సామాజిక పరిస్థితిని అనుసరించి 50శాతం రిజర్వేషన్ల నిబంధన సరిపడదని పేర్కొన్నారు. తమిళనాడులో ప్రస్తుతం అమలవుతున్న మాదిరగానే రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటుందని చెప్పారు. 

 

ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది.106 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్(45) ఔటయ్యాడు.

 

ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

చిత్తూరు: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. వేసవి రద్దీ కారణంగా సామాన్య భక్తుల దర్శనానికి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శుక్ర, శని, ఆది వారాల్లో 10 వారాల పాటు ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుకు నిర్ణయం తీసుకుంది. మిగితా రోజుల్లో యథాతథంగా ఎల్1, ఎల్2 వీఐపీ బ్రేక్, ఎల్3 భక్తులకు కూడా ఎల్2 దర్శనానికి అనుమతి ఇవ్వనుంది. కడప జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణ మండపం నిర్మాణ ఇంజినీరింగ్ పనులకు రూ.86 కోట్లు కేటాయించింది.

15:02 - March 27, 2017

గుంటూరు : రాష్ట్రంలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ  గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రతి రోజు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రభుత్వాలు మంచినీటి పరఫరాపై నిర్లక్ష్యం చేశాయని గుర్తు చేశారు. కేంద్రం... కాకినాడ, తిరుపతి, వైజాగ్ లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం... కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంను స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. 

 

14:55 - March 27, 2017

హైదరాబాద్ : చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. కార్పొరేషన్లకు వెయ్యి నుంచి 1500 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. వచ్చే ఏడాది దళితుల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. 18 లక్షల మందికి లబ్ధి జరుగనుందని పేర్కొన్నారు. 

 

టి.అసెంబ్లీ నిరవధిక వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారి వెల్లడించారు. కొద్దిసేపటి క్రిందట ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ వెల్లడించారు.

 

ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది.92 పరుగుల వద్ద మార్ష్ (1) ఔటయ్యాడు.

 

 

త్వరలో 24 వేల టీచర్ ఉద్యోగాలు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: నిరుద్యోగుల కోసం త్వరలో 24 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గుడిసెలు వేసుకున్న లక్షా 25వేల మంది పేదలకు పట్టాలిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది దళితుల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

నగరంలో డ్రగ్స్ పంపిణీ జరుగుతోంది - అక్బరుద్దీన్..

హైదరాబాద్ : నగరంలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పంపిణీ జరుగుతోందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. వివిధ పాఠశాలల వద్ద వైట్ నర్, డ్రగ్స్, క్యాప్సుల్స్ పంపిణీ చేస్తున్నారని, ఎలక్ట్రానిక్ సిగరేట్ లో ఒక రసాయనం వేస్తున్నారని పేర్కొన్నారు. యువత చెడుమార్గంలో పయనిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మార్చి 29న జీఎస్టీ బిల్లుపై చర్చ..

ఢిల్లీ: మార్చి 29వ తేదీన లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరగనుంది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు.

పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలకు అవగాహన..

విజయవాడ : అసెంబ్లీ కమిటీ హాల్ లో పోలవరం ప్రాజెక్టు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి పోలవరం, అమరావతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని, పోలవరం ప్రాజెక్టుకు నా బార్డ్ ద్వారా ఆర్థిక సహాకారం అందిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ సేకరణకు అంచనా వ్యయం పెరిగిందని, 2018కి గ్రావిటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నుండి నీటిని వినియోగించుకుంటామన్నారు.

ముగిసిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై చర్చించడం జరిగిందని సీపీఐ జాతీయ నేత నారాయణ పేర్కొన్నారు. భవిష్యత్ లో ఎన్డీయే ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, కాంగ్రెస్ తో పాటు ప్రజాతంత్ర పార్టీలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు సరికాదని, అధికారులపై దాడి చేసిన వారిని మూడు నెలలు సస్పెండ్ చేయాలన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్నారని తెలిపారు.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది.87పరుగుల వద్ద హండ్ స్కోబ్ (18) ఔటయ్యాడు.

 

 

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

భోపాల్: మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. నీచీ గ్రామంలోని కూలీలను పనికోసం తీసుకెళ్తున్నా మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మణం చెందారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరిలించారు.

2018కి ఎట్టిపరిస్థితుల్లో పోలవరం నుంచి నీరు: చంద్రబాబు నాయుడు

గుంటూరు: 2018కి గ్రావిటీ ద్వారా ఎట్టిపరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి పోలవరం, అమరావతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు అంచనా వ్యయం పెరిగిందని ఆయన తెలిపారు. సీఎం అసెంబ్లీ కమిటీ హాల్ లో పోలవరం ప్రాజెక్టు పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అవగాహన సమావేశం నిర్వహించారు.

రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.31 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ (17)ఔటయ్యాడు.

 

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంపు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచారు. పెంపు వల్ల 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.ప్రీ మెట్రిక్ 3 నుంచి 7వ తరగతి విద్యార్ధులకు రూ.970 పెంపు, 8నుంచి తరగతుల విద్యార్థులకు రూ.1100 పెంచనున్నారు. 

13:30 - March 27, 2017

హైదరాబాద్: సంక్షేమ రంగంలో ఇండియాలో నే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నామని కేసీఆర్ తెలిపారు. టీఎస్ అసెంబ్లీ ఆయన ద్రవ్యవినిమయ బిల్లు పై చర్చ జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ... బీసీలకు రిజర్వేషన్ లు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహించడం లేదని, ఆశావర్కర్లకు భృతి పెంచుతామన్నారు. హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతున్నాం, 18 లక్షల మందికి లబ్ధి జరుగుతుందన్నారు. మైనార్టీ రిజర్వేషన్ల పై చట్టం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ సమస్య ఎలా వుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం కరెంట్ సమస్యను అధిగమించామన్నారు. కరెంట్ సరఫరా కోసం రూ.12,136 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. బీడీ కార్మికులందరకీ పెన్షన్ వర్తింప చేస్తామన్నారు. సంక్షేమ రంగంలో ఇండియాలో నే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. 21వేల కోట్ల రూపాయలను రైతులకు రుణాలు మాఫీ చేశామన్నారు. కేజీ టూ పీజీ విద్య అనే నా డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిపారు. ఇండియాలోనే ఎక్కడా లేని విద్యావిధానం తెలంగాణలో అమలు చేస్తామన్నారు. శాస్వత సమస్యలు కొన్ని తెలంగాణకు దూరం కావాలన్నారు.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రోత్సహించాలి: కృష్ణయ్య

హైదరాబాద్: వ్యవసాయ అనుంబంధ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించాలని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎక్సైజ్ ను ప్రోత్సహిండం సరికాదని, కమర్షియల్ ట్యాక్స్ ఎగవేతకు చాలామంది ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. డీసెంట్రలైజ్డ్ ప్రోత్సహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 

 

 

 

 

బీసీల రిజర్వేషన్ల పెంపు పై అధ్యయనం: కేసీఆర్

హైదరాబాద్: బీసీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం జరగాలని , అధ్యయనం తర్వాతే బీసీ రిజర్వేషన్ల పెంపు పై నిర్ణయం తీసుకుంటామనిసీఎం కేసీఆర్ తెలిపారు. మేం మతపరమైన రిజర్వేషన్లను ప్రతిపాదించలేదని , మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీ పోరోగ్ చేయకుండా వారంలోగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన అన్నారు. విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతామని దీని వల్ల 8 లక్షల మందికి లబ్ధి జరుగుతుందని, హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని , ఆశ వర్కర్ల భృతి పెంచుతామని ప్రకటించారు.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రోత్సహించాలి: కృష్ణయ్య

హైదరాబాద్: వ్యవసాయ అనుంబంధ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించాలని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. కేవలం ఎక్సైజ్ ను ప్రోత్సహిండం సరికాదని, కమర్షియల్ ట్యాక్స్ ఎగవేతకు చాలామంది ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. డీసెంట్రలైజ్డ్ ప్రోత్సహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

12:56 - March 27, 2017
12:56 - March 27, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' అనగానే ఆయన చేసే ఫైట్లు..డ్యాన్స్ లు ముందుగా గుర్తుకొస్తుంటాయి. దీనితో పాటు ఆయన పక్కన ఎవరు నటిస్తారనే దానిపై కూడా చర్చ జరుగుతుంటుంది. 'చిరు'కు ధీటుగా హీరోయిన్ డ్యాన్స్ చేస్తుందా ? లేదా ? మాట్లాడుకుంటుంటారు. తాజాగా ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ద్వారా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముందుకొచ్చి అదరగొట్టారు. ఈ సినిమా హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ బాగా కష్టపడిందని టాక్ వినిపించింది. ఎంతో మంది హీరోయిర్ల పేర్లు వినిపించినా చివరకు 'కాజల్' ను ఖరారు చేశారు. తాజాగా 'చిరు' 151 సినిమాపై దృష్టి పెట్టారు. ఈసినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తీయనున్నారని టాక్. ఇక 150వ చిత్రానికి వచ్చిన కష్టాలే మళ్లీ వచ్చాయని ప్రచారం జరుగుతోంది. 60 ప్లస్ లో ఉన్న 'చిరంజీవి'కి సరిపడా హీరోయిన్ ను వెదకడం కష్టంగా ఉందంట. ఇప్పుడా కష్టాన్ని సురేందర్ రెడ్డి అనుభవిస్తున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి టైటిల్ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాక్. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

12:55 - March 27, 2017

మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ధర్మశాల : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. 10 పరుగుల వద్ద వార్నర్(6) ఔటయ్యాడు.

 

12:54 - March 27, 2017

p { margin-bottom: 0.21cm; }

పెద్దపల్లి :బసంత్‌ నగర్‌ కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఎందుట కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన ఉద్రిక్తంగా మారింది.. కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రస్తుతంఉన్న గుర్తింపు సంఘం విఫలమైందంటూ కార్మికులు కంపెనీ గేట్‌ముందు నిరసన చేపట్టారు.. గుర్తింపుసంఘం ఎన్నికల కాలం ముగిసినా ఎందుకు ఎన్నికలు నిర్వహించడంలేదంటూ మక్కాన్‌ సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికసంఘం ప్రశ్నించింది.. ఇదికాస్తాముదిరి రెండు కార్మికసంఘాల నేతలు ఒకరిపై మరొకరు దూషించుకున్నారు.. వెంటనే రంగప్రవేశంచేసిన పోలీసులు రెండువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. అయినా పట్టించుకోని కార్మికులు తమ ఆందోళన కొనసాగించారు.. లాఠీచార్జ్‌చేసిన పోలీసులు కార్మికుల్ని చెదరగొట్టారు..

12:50 - March 27, 2017

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ..రాష్ట్రాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుపతి విమానాశ్రయంలో తాము నిరసన తెలిపినందునే అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వం .. ఇపుడు అధికారపార్టీ నేతలు అధికారులపై దాడులకు తెగబడుతున్నా.. సీఎం చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు.

కంసాలబేతపూడిలో ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి: కంసాలబేతపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మోగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్నా ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళలను సైతం ఈడ్చుకెళ్లారు. ప్రభుత్వం తమ పై కక్షా సాధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12:46 - March 27, 2017

అమరావతి: పోలీస్‌ అధికారులమీద దౌర్జన్యం మంచిపద్దతి కాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. అనుచరులు, అధికారం ఉందికదా అని.. దౌర్జన్యాలకు దిగడాన్ని ఆయన ఖండించారు. అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్య చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఆయన సంఘీభావం తెలిపారు.

12:44 - March 27, 2017

.గో : ఏలూరు సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ వెంకటరామారావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్రి గోల్డ్‌ ఎండీ నాగశేషు కూడా అస్వస్థతకు గురికావడంతో ఆయన్నిచికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

12:43 - March 27, 2017

అమరావతి: విశాఖ భూకబ్జాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని... మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. నివేదిక వచ్చినతర్వాత ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు.. తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

12:42 - March 27, 2017

అమరావతి: విశాఖలో కబ్జారాయుళ్ల అరాచకాలు దారుణంగా ఉన్నాయని.. ప్రభుత్వం దృష్టికితెచ్చారు.. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు.. రైతులను నమ్మించి, బెదిరించి వెయ్యి ఎకరాల అసైన్డ్‌ భూముల్ని ఆక్రమించారని ఆరోపించారు.. అందులో రోడ్లుకూడా వేశారంటూ అసెంబ్లీలో కొన్ని ఆధారాల్ని చూపారు.. ఈ అన్యాయంపై హౌస్‌ కమిటీవేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు..

12:41 - March 27, 2017

హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌. ఏ సంవత్సరం కేటాయించిన నిధులను ఆ సంవత్సరమే ఖర్చు చేయాలని సూచించారు. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం సరైన చర్య కాదని, బెల్టు షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

12:39 - March 27, 2017

హైదరాబాద్: దళితులకు మూడుఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం .. మాటతప్పిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితులకు భూమిపై స్పష్టంగా హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌పార్టీ.. ఇపుడు భూమి లేదండం ఏంటని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గతంలో లక్షల ఎకరాలు భూములు పంచితే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం దళితులకు భూమి పంపకంలో చిత్తశుద్ధితో లేదన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

12:37 - March 27, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఏడాదిలో 20శాతం తగ్గిపోయిందన్నారు ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గొర్రెలపెంపకానికి 75శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించినట్టే.. పాడిపశువులకు కూడా సబ్సిడీని ఇవ్వాలని ఉత్తమకుమర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గతం అమలు చేసిన పశుక్రాంతి పథకాన్ని కొనసాగించాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణణీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు ఉత్తమ్‌.

12:36 - March 27, 2017

హైదరాబాద్: పౌల్ర్టీ రంగాన్ని అగ్రి కల్చర్‌ స్టేటస్‌గా గుర్తించాలని గతంలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి ఈటెల రాజేందర్‌ అసెంబ్లీలో వివరించారు. పౌల్ర్టీ రంగాన్ని ఆదుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను గతంలోనే చెల్లించామని చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్‌. ఎప్పుడు కూడా పెండింగ్‌ ఉంచడం లేదని వివరించారు. హామీ ఇచ్చిన విధంగానే మార్చి 31 లోపే బకాయిలను చెల్లించామన్నారు.

12:35 - March 27, 2017

గుడ్ బై అన్నారు..తరువాత మార్చుకున్నారు...

టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుల్లో 'కీరవాణి' ఒకరు. ఆయన పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆయన చేసిన పలు ట్వీట్స్ కలకలం రేపుతున్నాయి. 'బాహుబలి-2' సినిమాకు ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం తాను సినిమాలు చేయనని అప్పట్లో ప్రకటించారు. తాజాగా 'బాహుబలి 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఇక్కడ రిటైర్ మెంట్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వేడుక ప్రారంభానికంటే ముందు తన రాజీనామా విషయం..ఇతర విషయాల్లో ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కీరవాణి ప్రకటించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కీరవాణి ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. తన పక్కన ఉన్నంతవరకు రాజమౌళిని ఎవరూ టచ్ చేయలేరని..ఇండస్ట్రీలో ఎక్కువమంది బుర్రలేని వాళ్లతో పనిచేశానని ట్వీట్ చేయడం గమనార్హం. పరిశ్రమలో గుడ్డి-చెవిటి దర్శకులే ఎక్కువమంది ఉన్నారని, కేవలం డబ్బు కోసమే అలాంటి బుద్ధిలేని దర్శకులతో పనిచేశానని చెప్పుకొచ్చారు. కీరవాణి చేసిన ట్వీట్స్ ఎలాంటి దుమారం సృష్టిస్తుందో చూడాలి.

మిర్చికి మద్దతు ధర ప్రకటించాలి: ఉత్తమ్

హైదరాబాద్: రాష్ట్రంలో మిర్చి ధర భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని టి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. వారి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వెంటనే మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది : సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అసెంబ్లీలో సీఎం చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.అప్పులు తీసుకోవడంతో పాటు రీపేమెంట్ కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది రూ.20వేల కోట్లు అప్పు చెల్లించనున్నామని ఆయన ప్రకటించారు.

 

తెలంగాణ మండలిలో పలు బిల్లుల ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో పలు బిల్లులు  ఆమోదం పొందాయి. వేతనాలు, పెన్షన్ల చెల్లిలంపు, 1953ను సవరించే బిల్లులు, భూదాన్ గ్రంధన్, యాక్ట్ 1965 బిల్లు, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది.

11:56 - March 27, 2017

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించనున్నట్లు, ఒక పాత్ర పూర్తిగా నెగటివ్ కోణంలో ఉంటుందని టాక్. నెగటివ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకమైన గెటప్ ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను చిత్ర దర్శకుడు ఎంపిక చేశారు. ఒకరు రాశీఖన్నా కాగా మరొకరు నివేదిథా థామస్. తాజాగా 'హంస నందిని' కూడా వచ్చి చేరిందని తెలుస్తోంది. హీరోయిన్ గా కాకున్నా ఒక ప్రత్యేక మైన పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్లు సమాచారం. గతంలో 'రామయ్య వస్తావయ్య' సినిమాలో 'హంస'అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే 'రాజ్ తరుణ్' హీరోగా విడుదలైన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త 'సినిమాలో ఈమె ఐటెం సాంగ్ చేసింది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

332 పరుగులకు భారత్ అలౌట్

ధర్మశాల:భారత్ తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులకు అలౌట్. భారత్ బ్యాటింగ్ రాహుల్­ 60, పుజారా-57,జడేజా ­63, సాహ-31, అశ్విన్ -30, విజయ్-11, రహానె-46, నాయర్-5, కుల్ధీప్-7 పరుగులు చేశారు.

11:44 - March 27, 2017

'ప్రభుత్వాధికారులు రోజుకు 18-20గంటలు పనిచేయాల్సిందే..లేకుంటే ఉద్యోగం వదులుకోవాలి' అంతే...ఉండేదే 24గంటలు..అందులో 20 గంటల పాటు పనిచేస్తే ఇక తిండి..నిద్ర...ఇతర పనులు ఏ సమయంలో చేయాలి ? అని అనుకుంటున్నారా ? కానీ చేయాల్సిందేనంట. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఉత్తర్ ప్రదేశ్ లో...ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కిన 'యోగి ఆదిత్యనాథ్' తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పటికే పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ అధికారుల విషయంలో ఆయన పై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆదివారం యోగి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు..ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఎవరైతే రోజుకు 18-20 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారో వారే ఇక్కడ ఉండాలని, లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లినా ఎలాంటి అభ్యంతరం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారంట. మరి ఈ నిర్ణయంపై అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకటరామారావుకు గుండె పోటు

పశ్చిమ గోదావరి: ఏలూరు సబ్ జైల్లో అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకటరామారావుకు గుండె పోటు వచ్చింది. సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడకు తరలించాలని డాక్టర్లు సూచించారు.

11:39 - March 27, 2017

అమరావతి: బాబు వస్తే జాబు వస్తుందన్న హామీకి ఇప్పటికీ కట్టుబడిఉన్నామని... అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు.. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగభృతి కల్పిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు

11:38 - March 27, 2017

.గో: ఏలూరు సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ వెంకటరామారావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఒకసారి సర్జరీ చేసి స్టంట్ చేశారు. కానీ షుగరు, బీసీ ఎక్కువగా ఉండడంతో మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. అయితే దానికి సంబంధించిన వైద్యం ఏలూరులో లేకపోవడంతో విజయవాడకు తరలించి చికిత్స అందించనున్నారు.

11:35 - March 27, 2017

అమరావతి: విజయవాడ ఆర్టీఏ ఘటనపై ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం సాగింది.. టిడిపి నేతలకు ఉద్యోగులంటే లెక్కలేదని వైసీపీ నేతలు అసెంబ్లీలో మండిపడ్డారు.. ఉద్యోగస్తులను పని చేసుకోనివ్వడంలేదని విమర్శించారు... ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏమైందని ప్రశ్నించారు.. వీటిపై స్పందించిన కాల్వ శ్రీనివాసులు... క్షమాపణతో ఇది ముగిసిపోయిందని స్పష్టం చేశారు.. జగన్‌ చాలాసార్లు అధికారులపై దౌర్జన్యం చేశారని.. అతన్ని పార్టీ అధ్యక్ష పదవినుంచి తొలగించే తీర్మానం చేస్తారా అంటూ మండిపడ్డారు..

 

శ్రీనగర్ లో అగ్నిప్రమాదం..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లోని చినార్ బాగ్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలు గృహాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

11:33 - March 27, 2017

అమరావతి: గోదావరి పుష్కరాల్లో 27మంది మృతి ఘటనపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌ చర్చ నడిచింది.. ఈ దుర్ఘటనపై ఇంకా ఎన్నిరోజులు విచారణ కొనసాగుతుందని... వైసీపీ సభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన మంత్రి యనమల... విచారణ తర్వాత రిపోర్ట్‌ రాగానే తగు చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు..

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 318 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహ(31) ఔటయ్యాడు.

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల టెస్టు: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 317 పరుగుల వద్ద రవీంద్ర జడేజా(63) ఔటయ్యాడు.

 

 

రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానం: ఉత్తమ్

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి 2700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో , మహిళ రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన సభలో తెలిపారు.. రైతుల ఆత్మహత్యల నివారణకుమ చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వన్ని కోరారు. కేజీ టూ పీజీ విద్యలో ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు.

బడ్జెట్ అంచనాలు వాస్తవానికి విరుద్ధం: కాగ్

హైదరాబాద్: అసెంబ్లీలో 2105­ 2016 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రవేపెట్టింది.బడ్జెట్ అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ మిగులు రూ.238 కోట్లు ద్రవ్యలోటు జీఎస్ డీపీ-3.23శాతం, రుణాలు జీఎస్ డీపీ-21.37 శాతంగా నివేదికలో కాగ్ నివేదికలో పేర్కొంది. 14వ ఆర్థికసంఘం సూచించిన 21.55శాతం పరిధిలో రుణాలను పీడీఖాతాలలో ప్రభుత్వం విధానం అతిక్రమించిందని, నీటి పారుదల, రహదారి రంగాల్లో పనులు ఆలస్యం వల్ల కేటాయింపులు పెరిగాయని కాగ్ తెలింది.  

11:01 - March 27, 2017

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన ఆకులను తీసుకోవాలి. ఇవి ఒక్కోటి వంద గ్రాములుండాలి. అందులో చిటికెడు పసుపు వేసుకుని పొడిగా మిక్సీ చేసుకోవాలి. వాడే సమయంలో రెండు స్పూన్ల పొడికి తగినంత పన్నీరు వేసుకుని కలుపుకుని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అర టీ స్పూన్‌ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్‌ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. తులసి ఆకు ఎంతో శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. తులసీ ఆకుల్లో కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.

పడిపోయిన ఆహార ధాన్యాల ఉత్పత్తి - ఉత్తమ్..

హైదరాబాద్ : ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్రంలో పడిపోయిందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ పేర్కొన్నారు. టి. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన చర్చను ప్రారంభించారు. కేంద్రం నుండి వచ్చే ఇన్ ఫుట్ సబ్సిడీ పూర్తి కాలేదని ఆరోపించారు. 13-14లో జూన్ 2లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని, పది జిల్లాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులు ఉందని, కానీ 14-15 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 30 శాతం పడిపోయి 72 లక్షల టన్నులకు చేరుకుందన్నారు. 15-16 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మరో 25 శాతానికి పడిపోయి 51 లక్షల టన్నులకు చేరుకుందన్నారు.

ఏపీ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న వైసీపీ సభ్యుడు చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వాహనంలో ఆయన్ను తరలిస్తుండగా వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

10:20 - March 27, 2017

బాహుబలి 2 ఫీవర్ మొదలై పోయింది. ట్రైలర్ బయటకు రాగానే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చిత్ర యూనిట్ అట్టహాసంగ నిర్వహించింది. అశేష అభిమానుల మధ్య ఆద్యంతం వైవిధ్యంగా ఈ కార్యక్రమం జరిగింది. 'బాహుబలి' చిత్ర బృందంతో పాటు బాలీవుడ్ దర్శక, నిర్మాత 'కరణ్ జోహార్' పాల్గొన్నారు. 'కృష్ణంరాజు' ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే 'బాహుబలి 2' సినిమాకు ఎంత వ్యయం అయ్యింది ? ఎంత కలెక్షన్లు సాధిస్తుంది ? రికార్డులు సృష్టిస్తుందా ? అభిమానులు ఇప్పటి నుండే లెక్కల్లో పడిపోయారు. ఎన్ని కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషణకు దిగిపోయాయి. మరోవైపు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. వినూత్నంగా మార్కెట్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. మరి ఈ సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుంది ? రికార్డులు సృష్టిస్తుందా ? లేదా ? అనేది ఏప్రిల్ 28 తరువాత తెలిసిపోతుంది.

10:19 - March 27, 2017

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... బడ్జెట్‌ పద్దుల విషయంలో కొంత ఎక్కువ చేసి చూపిస్తున్నట్లు ఉందన్నారు. రాష్ట్రంలో క్రమంగా అప్పులు పెరిగిపోతున్నాయని.. ఈ నాలుగేళ్లలోనే రెట్టింపు అప్పులు పెరిగాయన్నారు. 2017-18 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,40,523కోట్లకు చేరాయని.. ఇంత భారీ మొత్తంలో అప్పులు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదన్నారు. విడతల వారీ రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదన్నారు. రైతులపై వడ్డీ భారం పడకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చి మూడు నెలలైనా నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ, పాడి రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.  కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, గిరజనులకు 12 శాతం రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించారు. అకారణంగా ధర్నా చౌక్ ను ఎత్తే ప్రయత్నం చేస్తోందని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఎరియర్స్ ను త్వరగా చెల్లించాలని, మహదేవ్ పూర్ వద్ద దుప్పిల వేటలో  నిందితులను పేర్ల తప్పించే ప్రయత్నం జరుగుతోందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

అప్పులు మంచిది కాదన్న జానా..మంచిదన్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. మధ్యలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రెండు సంవత్సరాల్లోనే 31-35 కోట్లకు పెరిగిందని ఉత్తమ్ పేర్కొన్నారని, ఇది మరింతగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పులు తీసుకోవడం మంచిది కాదని ఉత్తమ్ పేర్కొనడం జరిగిందని సీఎల్పీ నేత జానా సభకు తెలిపారు. దీనిపై కేసీఆర్ స్పందించారు. రూ. 20వేల కోట్ల రూపాయలు రీ పేమెంట్స్ చేయడం జరుగుతోందని, కాంగ్రెస్ హాయాంలో చేసిన దానికి, ఇప్పుడు అప్పు చేసిన దానికి చాలా తేడా ఉంటుందన్నారు.

అప్పులు తీసుకరావడం శ్రేయస్కరం కాదు - ఉత్తమ్..

హైదరాబాద్ : నాలుగేండ్లలో 70 వేల కోట్లు అప్పు తీసుకరావడం రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఔట్ సోర్సింగ్ గ్యారెంటీస్ రూ. 16,787 కోట్లు ఉండేదని, మూడేండ్లలో ఈ ఔట్ సోర్సింగ్ గ్యారెంటీస్ రూ. 31వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయన్నారు.

ఐఏఎస్ లపై టిడిపి నేతల దాడిని ఖండిస్తున్నాం: బిజెపి

అమరావతి: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేల నిరసనకు బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు. ఐఏఎస్ లపై టిడిపి నేతల దాడిని ఖండిస్తున్నామన్నారు. ఏ పార్టీ వారికైనా ఒకే న్యాయం ఉండాలని, న్యాయం వెరివైపు ఉంటే వారికే బిజెపి మద్దతు ఉంటుందన్నారు. దాడులు చేసిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వ విజ్ఞతతకే వదిలేస్తున్నామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసిన స్పీకర్ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించారు. టి.కాంగ్రెస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు.

10:04 - March 27, 2017

బాహుబలి -2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రామోజీ ఫిలింసిటీలో ఈ వేడుక కన్నులపండుగగా జరిగింది. బాలీవుడ్ నుండి 'కరణ్ జోహార్' ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 'బాహుబలి-2' సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారందరూ వేడుకకు హాజరయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రాజమౌళి'పై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఈ వేడుకల్లో 'రాజమౌళి' భావోద్వేగానికి గురయ్యారు. సంగీత దర్శకుడు 'కీరవాణి'..'రాజమౌళి'పై రూపొందించిన ప్రత్యేక ఏవీ వీడియోను ప్రదర్శించడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 'ఎవ్వడంట..ఎవ్వడంట..? బాహుబలి తీసింది..మా పిన్నికి పుట్టాడు..ఈ నంది కాని నంది'..అంటూ సాగే పాటను స్వయంగా 'కీరవాణి' పాడారు. ఇక 'బాహుబలి -2' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.

టీఎస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు

హైదరాబాద్: నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రధానంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది.

కేశోరామ్ సింమెట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన

పెద్దపల్లి: బసంత్ నగర్ కేశోరామ్ సింమెట్ ఫ్యాక్టరీ ఎదుట కాంటాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్నికల గడువు ముగిసినా గత యూనియన్ తో యాజమాన్యం కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించడం లేదని విధులు బహిష్కరించిన 1500 మంది కార్మికులు ఆందోళన చేపట్టారు.

తుందుర్రులో ఉద్రిక్తత

ప.గో: తుందుర్రులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఆకావ్ఫఉడ్ ఫ్యాక్టరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

టీఎస్ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానం

హైదరాబాద్: నేడు తెలంగాణ అసెంబ్లీలో భూపాలపల్లి జిల్లాలో దుప్పలను వేటాడిన ఘటనపై బిజెపి వాయిదా తీర్మానం ఇచ్చింది.

అసెంబ్లీ మీడియా పాయింట్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆందోళన

అమరావతి: ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బైఠాయించారు. రవానా శాఖ కమిషనర్ పై దాడి చేసిన టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం పై నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టారు.

అలకవీడని అలంపూర్ ఎమ్మెల్యే సంతప్ కుమార్

హైదరాబాద్: టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఎపిసోడ్ ఇపుడే సమసి పోయే అవకాశాలు కనిపించడం లేదు. అలిగిన ఎమ్మెల్యే సంతప్ ను బుజ్జగించేందుకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి రావాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యారు. పలుమార్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కబురు పంపినా జానారెడ్డి, ఉత్తమ్ ను కలిసిఏందుకు సంపత్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

జీహెచ్ ఎంసీ మహిళా కార్మికులపై దూసుకెళ్లిన క్యాబ్

హైదరాబాద్: మాదాపూర్ లో క్యాబ్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశారు. జీహెచ్ ఎంసీ కార్మికులపై క్యాబ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు.

08:44 - March 27, 2017

ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4. 6 తీవ్రతతో నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. నిన్న కూడా ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5. 0 పాయింట్ల తీవ్రతతో నమోదైన భూకంపంతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు మయన్మార్‌లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాయి.

08:43 - March 27, 2017

పశ్చిమగోదావరి: ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం ఉధృతమయింది. సీపీఎం ఆధ్వర్యంలో తుందుర్రు ప్రజలు ఆందోళనబాటపట్టారు. ప్రజా ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోంది. తుందుర్రు పరిసర గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

08:41 - March 27, 2017

హైదరాబాద్: ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌కు కేరాఫ్‌ అడ్రెస్‌ అయిన రెడ్‌బుల్‌ మరో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. స్కై డైవింగ్‌, వింగ్‌ సూట్‌ డైవింగ్‌ తరహాలోనే స్కై డ్యాన్సింగ్‌ కాన్సెప్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా పోటీలు నిర్వహించాలని ప్లాన్‌లో ఉంది.

 

08:40 - March 27, 2017

హైదరాబాద్: టాలీవుడ్ లేటెస్ట్‌ మూవీ కాటమరాయుడు చిత్రాన్ని... తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. అనంతరం హీరో పవన్‌ కల్యాణ్‌కు, డైరెక్టర్‌ డాలీతో పాటు చిత్రబృందానికి కేటీఆర్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని అన్నారు. ఈ సినిమా ద్వారా చేనేతకు ప్రచారకర్త దొరికాడని పవన్‌పై కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో ఆయన తీసుకున్న సెల్పీని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అటు మూవీని చూసి.. అభినందనలు తెలిపినందుకు... పవన్‌ కల్యాణ్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

08:37 - March 27, 2017

హైదరాబాద్: సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై చిత్రకారుడు జాకీర్‌ హుస్సేన్‌ అద్భుతమైన చిత్రాలను గీశారని ప్రముఖ శిల్పి, పద్మశ్రీ ఎక్కా యాదగిరిరావు అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో కర్నాటకకు చెందిన జాకీర్‌హుస్సేన్‌ గీసిన పెయింటింగ్‌ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎక్కా యాదగిరిరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాతావరణ కలుషితంపై, స్ర్తీలపై జరుగుతున్న అన్యాయాలపై అద్భుతమైన చిత్రాలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ గుడిపూడి విజయరావు పాల్గొన్నారు.

07:54 - March 27, 2017

హైదరాబాద్: ఏపీ ఆర్టీఏ కమిషనర్‌పై టీడీపీ నేతల దాడి వివాదం సద్దుమణిగింది. కమిషనర్‌పై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ కావడంతో కమిషనర్‌ను క్షమాపణలు కోరారు. మరోవైపు టీడీపీ నేతల దాడిని విపక్ష నేతలు తప్పుపట్టారు. అటు ఉద్యోగ సంఘాల నేతలూ టీడీపీ నేతల దాడిని ఖండించారు. యూపీలో కొత్తగా ఎన్నికైన యోగి కబేళాలను మూసివేయాలని పిలుపునిచ్చారు. దీంతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆర్థిక సంక్షోబానికి దారి తీయనుందా? కలబేళాల మూసివేత మతపరమైన అంశంగా మారబోతోందా? ధర్నా చౌక్ తరలించడం దారుణం, 2కె రన్ కు అనుమతి నిరాకరించడం దారుణం అన్నారు. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బిజెపి అద్దేపల్లి శ్రీధర్, టిడిపి నేత చంద్రసాంబశివరావు, వైపీపీ నేత రమేష్, సీనియర్ విశ్లేషకులు తెలకపల్లి రవి, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

సిద్దిపేటలో తాగుబోతు వీరంగం.

సిద్దిపేట: నగరంలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో కానిస్టేబుల్స్‌పైనే చేయి చేసుకున్నాడు. నానా దుర్బాషలాడాడు. సిద్దిపేటలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోకి.... నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన కిషన్‌ తాగి వచ్చాడు. పీకలదాకా తాగిఉన్న కిషన్‌... పోలీసులను తిడుతూ హల్‌చల్‌ చేశాడు. మందలించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేశారు.

ఆర్టీఏ కమిషనర్‌తో టీడీపీ నేతల దురుసు ప్రవర్తన

విజయవాడ: ఏపీ ఆర్టీఏ కమిషనర్‌పై టీడీపీ నేతల దాడి వివాదం సద్దుమణిగింది. కమిషనర్‌పై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ కావడంతో కమిషనర్‌ను క్షమాపణలు కోరారు. మరోవైపు టీడీపీ నేతల దాడిని విపక్ష నేతలు తప్పుపట్టారు. అటు ఉద్యోగ సంఘాల నేతలూ టీడీపీ నేతల దాడిని ఖండించారు.

విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీల భేటీ

హైదరాబాద్: విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏర్పాటైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు రాజ్‌భవన్‌లో సమావేశమయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ త్రిసభ్య కమిటీ సభ్యులు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ పాల్గొన్నారు. ఏపీ తిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు భేటీకి హాజరయ్యారు.

06:59 - March 27, 2017

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న కరవు సమస్యలను అధ్యయనం చేసేందుకు పాదయాత్ర చేయాలని ఉందని అనంతపురంలో జరిగిన సభలో ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని కచ్చితంగా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా జనసేనాని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ....

అనంతపురంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొత్తులు, ఎత్తులు విషయాన్ని పక్కన పెడితే, యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానన్న హామీతో యువత ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపుతూపడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతల వెన్నులో వణుకు పుడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ, వైపీసీల మధ్య ప్రధానంగా పోరు జరిగింది. 2019 ఎన్నికల్లో ఇది మూడు పార్టీల మధ్య పోటీకి దారితీస్తుంది. జనసేన, టీడీపీ, వైసీపీల మధ్య పోరుగా మారనుంది. జనసేన పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ, వైసీపీల్లో ఎవరికి దెబ్బ అన్న అంశంపై విస్తృతంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

అనంతపురం అర్బన్‌లో కాపు ఓటర్లు అధికం.....

వపన్‌ కల్యాణ్‌ అనంతపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాయలసీమ మొత్తంపై పడుతుందని భావిస్తున్నారు. అనంతపురం అర్బన్‌ ఏరియాలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే జనసేనాని జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఉంటారని విశ్లేషిస్తున్నారు. దీంతో పవన్‌ పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని ఇతర పార్టీల్లోని నేతలు ఒత్తిడికి గురువుతున్నారు. అనంత సభలో పవన్‌ ప్రధానంగా రైతులు, చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రెండు వర్గాలతో పాటు ఇతరులు కూడా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జనసేనానితో టీడీపీ, కాంగ్రెస్‌ నేతల సంప్రదింపులు ......

మరోవైపు జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్‌ నేతల్లో కొందరు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. జనసేనానితో సంప్రదింపులు జరుపుతున్నారని వినిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ మంది జనసేనలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడంతో జిల్లాలో టీడీపీ ప్రభ మసకబారుతోందని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా నేతల్లో మార్పు రాకపోగా, నేతల గొడవలతో పార్టీ పరువు బజారుకెక్కుతోంది. దీంతో కొంత మంది టీడీపీ నేతలు జనసేన వైపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవైపు జనసేన కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తమ నేతకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఆ లోగా జనసేనాని జిల్లా సమస్యలపై మరింత ఆధ్యయనం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది పార్టీకి మరింత కలిసొచ్చే అంశమని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.

06:56 - March 27, 2017

విశాఖ : జిల్లాలో కబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. హౌసింగ్ కాలనీలు నిర్మించాలని ఉడా నిర్ణయించడంతో.. ఇదే అదనుగా కొందరు నాయకులు పేదల భూములు కొట్టేయడానికి పెద్ద పథకమే వేశారు. పద్మనాభం, అనందపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ఉడా ప్రతిపాదించింది. పద్మనాభం, ఆనందపురం మండలాల్లో.. 400 ఎకరాలను భూసేకరణ పేరుతో అక్రమార్కులు లాక్కున్నారన్న వార్తలు కలకలం రేపాయి. మరోవైపు పెందుర్తీ మండలం ముదపాకలో 40 ఎళ్ల క్రితం 400 మంది భూమి లేని దళిత రైతులకు 450 ఎకారాలు అప్పటి ప్రభుత్వం పంపిణి చేసింది. వాటికి డి పట్టాలు అందజేసింది. పట్టణ జనాభా పెరగడంతో పెందుర్తి ప్రాంతంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి..ఉడా ప్రకటనతో అక్రమార్కులు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. ఎకరానికి 10 లక్షలు చెల్లిస్తామని కోతలు కోశారు. చివరకు లక్ష చొప్పున చెల్లించి 236 మంది రైతుల నుంచి 280 ఎకరాలకు సంభందించిన పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా దుమారం రేపడంతో.. పెందుర్తీలో ల్యాండ్ పూలింగ్‌కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కబ్జారాయుళ్లకు సహకరించిన అవినీతి అధికారుల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. అనందపురం భూముల కుంభ కోణంలో అధికార పార్టీ పెద్దలకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీమిలి తహసిల్ధార్ రామారావు..ఏసీబీకి పట్టుబడ్డాడు. భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ సుమారు 50 కోట్ల ఉంటుందని అంచనా. విశాఖ వెబ్‌ల్యాండ్‌లో అక్రమంగా పలు మార్పులు చేసినట్టు ఎసీబి గుర్తించింది. ఇక మరో అధికారి రాజేశ్వరరావు కరెప్షన్‌ స్టోరీ కలకలం రేపుతోంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే విభాగంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ రైడ్స్‌ నిర్వహించి..సుమారు 20 కోట్లు ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

విశాఖ జిల్లాలో కబ్జారాయుళ్ల ఆగడాలు

విశాఖ : ఖద్దరు మాటున పేదల భూములను అప్పనంగా కొట్టేయాలనుకున్నారు. అధికారుల అండదండలతో రెచ్చిపోయారు. ప్రభుత్వమే భూములు సేకరిస్తుందంటూ నమ్మించారు. నేతల కబ్జా వ్యవహారం బట్టబయలు కావడంతో.. ల్యాండ్‌ సర్వే అధికారుల అవినీతి అక్రమాల డొంక కదులుతోంది.

06:54 - March 27, 2017

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల దిగువన బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని వినిపిస్తున్న డిమాండ్ .....

ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉంది. ఏపీ రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈ ప్రాంతంలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్ ఏర్పడింది. ఈ కొత్త వంతెనకు రూ.2,500 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రాథమిక సర్వే పూర్తిచేసింది.

మున్నేరు వరద నీటి ఆధారంగా బ్యారేజీ నిర్మాణంపై కసరత్తు ...

రాజధాని ప్రాంతం కావడంతో కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మాణం కీలకంగా మారింది. దీంతో మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. వర్షాలకు మున్నేరు నుంచి వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజీలో నిల్వ ఉంచి మిగతా నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. దీంతో 50 టీఎంసీల దాకా నీరు వృథా అవుతోంది. బ్రిడ్జి నిర్మాణంతో 15 టీఎంసీల నీటినైనా నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో కొత్త వంతెనను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఏపీ రాజధానికి తాగునీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నీటి సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. కృష్ణానదిపై వాటర్ స్టోరేజీ కోసం బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుంది. అలాగే మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా మరో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

జీహెచ్ ఎంసీ వార్షిక బడ్జెట్ ఆమోదం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2017-18 వార్షిక బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. కొత్త పాలకవర్గం ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్‌ను పాల‌క‌మండ‌లి ప్రవేశపెట్టింది. 5643 కోట్ల రూపాయలతో బడ్జెట్ ముసాయిదాను అధికారులు రూపొందించారు.

06:51 - March 27, 2017

హైదరాబాద్: జీహెచ్ఎంసీ 2017-18 సంవత్సరానికి గాను 5643 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది బల్దియా పాలకమండలి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు రూపొందించిన బడ్జెట్ కే ఓకే చెప్పారు కార్పొరేట‌ర్లు. 2016- 17కు 5600కోట్ల బ‌డ్టెట్ ప్రతిపాదించ‌గా ఈసారి కేవ‌లం 43కోట్లు మాత్రమే పెంచి 5643 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశారు.

నగరాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన- మేయర్ బొంతు ....

న‌గ‌రవాసుల‌కు మ‌రిన్ని వ‌స‌తులు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా బ‌డ్జెట్ రూపొందించామ‌న్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహన్. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి,నాలాల వైడ‌నింగ్, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణం, ఎల్ ఈ డి వీధి దీపాలు, శానీటేష‌న్ ప‌రిర‌క్షణ‌కు ప్రత్యేక చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

రోడ్ల నిర్మాణానికి రూ. 1611.14కోట్లు కేటాయింపు ...

ఇక గ‌త బ‌డ్జెట్ లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన అధికారులు ఈసారి రోడ్ల పై దృష్టి సారించారు. రోడ్ల కోసమే 1611 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. అలాగే 2240కోట్లను అప్పుల రూపంలో స‌మీక‌రించేందుకు సిద్ధమ‌య్యారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ నుంచి నిధుల‌ను భారీగా తెచ్చేందుకు అన్నిర‌కాల చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదన్న మాజీ మేయర్....

అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని మాజీమేయ‌ర్ , ఎంఐఎం కార్పొరేట‌ర్ మాజీద్ హుస్సేన్ ప్రశ్నించారు. 2వేల కోట్లు అడిగితే కేవ‌లం 1000కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని.. డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, నాలాల వైడినింగ్ వంటి వాటికి ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేద‌న్నారు. మొత్తమ్మీద కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదముద్ర వేసింది.

06:48 - March 27, 2017

గుంటూరు : రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలోని రైల్వేకాలనీలో నిరాశ్రయులైన బాధితుల కోసం అవసరమైతే జైలుకు వెళతానని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 40 సంవత్సరాలుగా రైల్వేకాలనీలో జీవిస్తున్న వారికి ఇళ్లు ఖాళీ చేయమని రైల్వే బోర్డు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా సీఎం చంద్రబాబు మోహం చాటేస్తున్నారని విమర్శించారు.

06:45 - March 27, 2017

సిద్దిపేట: నగరంలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో కానిస్టేబుల్స్‌పైనే చేయి చేసుకున్నాడు. నానా దుర్బాషలాడాడు. సిద్దిపేటలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోకి.... నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన కిషన్‌ తాగి వచ్చాడు. పీకలదాకా తాగిఉన్న కిషన్‌... పోలీసులను తిడుతూ హల్‌చల్‌ చేశాడు. మందలించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేశారు.

06:43 - March 27, 2017

హైదరాబాద్‌: నాగోల్ లో పద్మశాలీ చైతన్య సదస్సు ఘనంగా జరిగింది. నాగోల్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌తో పాటు టి-టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ, బీసీ సంఘం చైర్మన్‌ జి.రాములు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పద్మశాలీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పద్మశాలీల అభివృద్ధి-వాటికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యనేతలు చర్చించారు.

శ్రీహేవిళంబి సంవత్సర గంటల పంచాంగం ఆవిష్కరణ

హైదరాబాద్: బ్రహ్మశ్రీ బావగర్ల శ్రీనివాసశర్మ రచించిన శ్రీహేవిళంబి నామ సంవత్సర గంటల పంచాగం ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పంచాగాన్ని మెట్రో ఇండియా దినపత్రిక చైర్మన్‌ సి. లక్ష్మిరాజ్యం, చల్లభవస రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మీరాజ్యం... పంచాంగం అంటే కరదీపిక లాంటిదని చెప్పారు. జీవితం అనే ప్రయాణంలో కరదీపికను ఉపయోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

06:41 - March 27, 2017

హైదరాబాద్: బ్రహ్మశ్రీ బావగర్ల శ్రీనివాసశర్మ రచించిన శ్రీహేవిళంబి నామ సంవత్సర గంటల పంచాగం ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పంచాగాన్ని మెట్రో ఇండియా దినపత్రిక చైర్మన్‌ సి. లక్ష్మిరాజ్యం, చల్లభవస రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మీరాజ్యం... పంచాంగం అంటే కరదీపిక లాంటిదని చెప్పారు. జీవితం అనే ప్రయాణంలో కరదీపికను ఉపయోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

హైదరాబాద్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఒహయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున... ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా.. 15 మంది గాయపడ్డారు. కాల్పుల్లో గాయ‌ప‌డ్డ వారిని స్థానిక ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. నిందితుడిని పట్టుకునేందుకు.. పోలీసులు వేట ప్రారంభించారు.

06:38 - March 27, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు పోరుబాటపట్టారు. ఈ నెల 28న రేపు చలో విజయవాడ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్మకులకు 151 జీవో ప్రకారం జీతాలు చెల్లిస్తామంటూ నవంబర్ లో చేసిన ప్రకటనను అమలు చేయకపోవడం, వర్తింపచేయకపోవడం వీరి ఆందోళనకు కారణం. గ్రామ పంచాయతీ ఆదాయంలో జీతాలు ఖర్చులు 30శాతానికి మించకూడదన్న నిబంధన పెట్టి, జీతాలు పెంచడం లేదు. గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సిఐటియు నాయకులు కె. ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss