Activities calendar

28 March 2017

20:28 - March 28, 2017

టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు ధరమ్‌శాల టెస్ట్‌లో పోటీనే లేకుండా పోయింది. సిరీస్‌ నిర్ణయాత్మక టెస్ట్‌లో ఇండియా ఆల్‌రౌండ్‌షోతో ఆస్ట్రేలియాకు చెక్‌ పెట్టింది.సమిష్టిగా రాణించి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని తిరిగి దక్కించుకుంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది.టెస్టు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శనతో..... ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ధరమ్‌శాల వేదికగా ముగిసిన 4 మ్యాచ్‌ల సిరీస్‌లోని క్లైమాక్స్‌ టెస్ట్‌లో ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అంచనాలకు మించి రాణించింది.

నాలుగో ఇన్నింగ్స్ లో..
నాలుగో ఇన్నింగ్స్‌లో 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా చేధించింది. విజయ్‌,పుజారా తక్కువ పరుగులకే ఔటైనా రహానేతో కలిసి , ఓపెనర్‌ రాహుల్‌ అన్‌బీటెన్‌ హాఫ్‌ సెంచరీతో భారత్‌కు సునాయాస విజయాన్నందించాడు. 8 వికెట్లతో నెగ్గిన భారత్‌ సిరీస్‌తో పాటు సీజన్‌ను సైతం విజయంతో ముగించింది. 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో నెగ్గి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.

భారత్ కు ఏడో సిరీస్..
టెస్టుల్లో ఓటమంటూ లేకుండా భారత్‌కు ఇది వరుసగా 7వ సిరీస్‌ విజయం కావడం విశేషం.భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. సిరీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో నిలకడగా రాణించిన జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. 2016-17 సీజన్‌ను విజయంతో ముగించిన భారత్‌....ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకుంది. ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియాకు తిరుగేలేదని ఈ సిరీస్‌తో మరోసారి రుజువైంది.

 

20:26 - March 28, 2017

విజయవాడ : పట్టిసీమ తమ పాలిట దివ్యవరమైందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్లే పెద్దమొత్తంలో పంటలు పండాయని సంబరపడ్డారు. అసెంబ్లీకి తరలివచ్చి..సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో పంటలు పండాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు పట్టిసీమ ప్రాంత రైతులు. ప్రాజెక్టు వల్లే తమ జీవితాల్లో వెలుగు వచ్చిందని.. పట్టిసీమను పూర్తి చేసిన సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు అసెంబ్లీకి చేరుకుని.. సీఎంతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వారు పండించిన పంటలతో వండి తీసుకొచ్చిన పాయసం, అటుకులు, ధాన్యాలను సీఎంకు అందించారు. తమ జీవితంలో ఇప్పటి వరకూ ఏనాడూ 50 బస్తాల పంటను చూడలేదని రైతులు అన్నారు.

రైతులను వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి..
అసెంబ్లీకి వచ్చిన రైతులను స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి పలకరించారు. రైతులు నినాదాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలో నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో పట్టిసీమకు ప్రణాళికలు రూపొందించామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అనుకున్న సమయానికి పోలవరంను కూడా పూర్తి చేసి కరువును నిర్మూలిస్తామని ఆయన అన్నారు. కాగా రైతుల ఆనందాన్ని చూసి ప్రతిపక్ష నేతలు వాస్తవం తెలుసుకోవాలని అధికార పార్టీ నాయకులు అన్నారు. పట్టిసీమ నీళ్లు సముద్రం పాలయ్యాయంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా రైతులు వారు పండించిన కంకులను ప్రదర్శించారు..ఒకరికొకరు పాయసం తినిపించుకుని సంతోషం పంచుకున్నారు.

20:22 - March 28, 2017

విజయవాడ : ఏపీ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా పనిచేసిన సి. రామచంద్రయ్యకు నేటితో పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. కాంగ్రెస్‌ పార్టీ వాణిని రామచంద్రయ్య మండలిలో గట్టిగా వినిపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆరు సంవత్సరాల పదవీకాలం సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

20:20 - March 28, 2017

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ స్పీడు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. జనసేనను క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువతకు పార్టీలో పెద్దపీట వేస్తామని ఇప్పటికే ప్రకటించిన పవన్‌... పార్టీలోకి జన సైనికులకు ఆహ్వానం అంటూ పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణానికి అనంతపురం జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నారు. జనసేన పార్టీని పటిష్టం చేసే దిశగా పవన్‌ కల్యాణ్‌ అడుగులు వేస్తున్నారు. పార్టీ నిర్మాణంపై ఇప్పటికే పలు ప్రకటనలు చేసిన పవన్‌... జనసేన ఆవిర్భావ దినోత్సవంనాడు దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు. అనంతలో జరిగిన సభలో ఇక నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టిపెడతానని కూడా చెప్పారు. అంతేకాదు.. 2019లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు ఓ శుభవార్తను అందించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పటిష్టతకు పవన్‌ కసరత్తు ప్రారంభించారు.

జనసేన వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్న పవన్‌..
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటంలో యువతను భాగస్వామ్యం చెయ్యాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. యువతకు పార్టీలో పెద్దపీట వేస్తానని చెప్పిన పవన్‌.. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేన పార్టీలోని వివిధ విభాగాల్లో జనసైనికులను భాగస్వాములను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ఆయన ఆహ్వానం పలికారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున వాణి వినిపించేందుకు జిల్లాల వారీగా జనసైనికులను నియమించే పనిలో పడ్డారు. స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్నవారిని స్పీకర్స్‌గానూ, రైటింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారిని కంటెంట్‌ రైటర్స్‌గానూ... విశ్లేషణలను బాగా చేయగలిగిన వారిని అనలిస్టులుగా పార్టీకి సేవలందించేందుకు ఆహ్వానం పలికారు. ముందుగా అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు జనసేన వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. మిగతా వివరాలను ఆ వెబ్‌సైట్‌లోనే పొందుపర్చారు.

ఎన్నికల మేనిఫెస్టో..
ప్రజల నుంచి సూచనలు స్వీకరించడానికి కూడా ఈ వెబ్‌సైట్‌ను వేదికగా మలుస్తున్నారు. ప్రజలు సూచించే సమస్యలు, అభిప్రాయాల ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయనున్నట్టు జనసేనాని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన అంతిమ లక్ష్యమంటోన్న పవన్‌... వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలు, ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితుల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపారు. ఇక సమస్య వచ్చినప్పుడల్లా ట్విట్టర్‌ వేదికగా తన స్పందనను రాష్ట్రప్రభుత్వానికి తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా జనసేన అడుగులు వేస్తోంది. 2019 నాటికి జనసేన నిర్మాణాన్ని పటిష్టంగా తీర్చిదిద్దాలని పవన్‌ యోచిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీలోకి యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఒకపక్క ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే... మరోపక్క పార్టీ పటిష్టంపై దృష్టి పెట్టారు పవన్‌.

20:10 - March 28, 2017

హైదరాబాద్ : రాజ్ భవన్ లో హేవళంబి నామ సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..చంద్రబాబు నాయుడులు హాజరయ్యారు. రోశయ్య, తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేంద్ రెడ్డి, మంత్రులు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి, టిడిపి నేత రేవంత్ రెడ్డిలతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. తెలుగు వారు కాకపోయినా ఈ సంవత్సరాదికి ప్రాముఖ్యతనిచ్చి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ గా నరసింహన్ వచ్చినప్పటి నుండి రాజ్ భవన్ కు ఒక కళ ఉంటుందని తెలిపారు.

టి. 104, 108 ఉద్యోగులకు శుభవార్త..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 104, 108 ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీతాలను రూ. 4వేల చొప్పున పెంచారు. పెరిగిన జీతాలు 2016 నుండి వర్తించనున్నట్లు తెలిపింది. పెరిగిన జీతాలను ఉద్యోగుల అకౌంట్లలో జమ చేశారు.

ఏపీ ఉగాది కళారత్న పురస్కార గ్రహీతలు..

హైదరాబాద్ : ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారాలను ప్రకటించారు. గొల్లపూడి మారుతీరావు (రచయిత, విశాఖ), సతీష్ రెడ్డి (సైన్స్, నెల్లూరు), పొత్తూరి వెంకటేశ్వరరావు (జర్నలిజం, గుంటూరు), గరికపాటి నరసింహరావు (అవధానం, తూ.గో), వంగపండు ప్రసాదరావు (జానపదం, విశాఖ)లకు దక్కాయి.

19:47 - March 28, 2017

రోజా.. నగరి ఎమ్మెల్యే...తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత అసెంబ్లీలో రోజా వ్యవహార శైలి తీరుపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించింది. ఏపీ అమరావతిలో తాత్కాలికంగా అసెంబ్లీ..మండలి భవనాలు నిర్మాణమయ్యాయి. ఈ సమావేశాలకు రోజాను అనుమతిస్తారా ? లేదా ? అనే దానిపై చర్చ జరిగింది. రోజా తీరుపై నియమించబడిన ప్రివిలేజ్ కమిటీ నివేదిక స్పీకర్ కు అందచేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ అనే దానిపై సభ..స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ తీరు..విపక్షంపై అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు.. ఎమ్మెల్యే అనిత..ఇతరులపై రోజా అభిప్రాయాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ఆమెతో ముచ్చటించింది. ఈసందర్భంగా రోజా పలు విశేషాలు తెలియచేశారు. మరి 'రోజా' ఎలాంటి విషయాలు తెలిపారు..తదితర సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఇసుక తవ్వకాల పిటిషన్లపై ఏన్జీటీలో విచారణ..

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాల పిటిషన్లపై ఎన్జీటీలో విచారణ జరిగింది. తెలంగాణలో ప్రాజెక్టు లేకుండానే మేడికొండ వద్ద 5 కోట్ల క్యూ.మీటర్ల ఇసుక పూడికతీత పనులు చేపడుతున్నారని ఎన్జీటీ దృష్టికి పిటిషనర్ రేలా సంస్థ తీసుకొచ్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద పూడికతీతపై అధ్యయనం చేయాలని కేంద్ర పొల్యూషన్ బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణనను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.

19:37 - March 28, 2017

రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు హాజరయ్యారు. రోశయ్య, మంత్రులు, డీజీపీ, జానారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాబును కలిసిన అహుజా..

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు నాయుడిని ఐటీ పారిశ్రామిక వేత్త ఎ.ఎన్.ఎస్.ఆర్. గ్రూప్ ఛైర్మన్ లలిత్ అహుజా కలిశారు. సింటెక్ వ్యాలీలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిద్వారా వచ్చే నాలుగేళ్లలో పది వేల ఉద్యోగాల కల్పన, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ప్రపంచ శ్రేణి సంస్థలను విశాఖకు తీసుకరావడానికి కృషి చేస్తానని ఆహుజా సంస్థ సీఎంకు తెలిపింది.

18:47 - March 28, 2017
18:43 - March 28, 2017
18:38 - March 28, 2017
18:35 - March 28, 2017

కర్నూలు : జిల్లాలో ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ఉత్సాహంగా సాగింది. కొన్నాళ్లుగా ఈ సమరం సంప్రదాయంగా వస్తోంది. వీరభద్ర స్వామి, కాళికాదేవీ ప్రేమ వివాహం సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఉగాది పండుగ ఒక రోజు ముందు ఇది జరుగుతుంది. పొప్పుల దొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, మిల్లెకల్లు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. ఈ వేడుక చూడటానికి సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. మరి వారు ఎలా కొట్టుకున్నారో వీడియోలో చూడండి.

18:31 - March 28, 2017
18:29 - March 28, 2017

విజయవాడ : రాజధాని భూ సమీకరణ గ్రామాల పరిధిలోని భూమి లేని నిరుపేదలకు నెలవారి ఫించన్లు ఇవ్వాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాతిపదిత సంస్థ నిర్ణయించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయంలో సీఆర్డీఏ 9వ సమావేశం జరిగింది. ఈభేటీలో రాజధాని కాలనీల రహదారులు..ఇంటిగ్రేటెడ్ అంశాలపై చర్చించారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లోని భూమి లేని నిరుపేదలకు నెలకు రూ. 2500 ఫించన్ అందిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు.

దాసరి డిశ్చార్జ్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 29న శ్వాస సంబంధ సమస్యతో హైదరాబాదులోని కిమ్స్ లో దాసరి చేరిన సంగతి తెలిసిందే.

18:09 - March 28, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తిస్తున్న తీరును సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ వాకౌట్ చేయడం పట్ల ఆయన మాట్లాడారు. వైసీపీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. వారు ఎప్పుడొస్తారో తెలియదు..వాకౌట్..వాక్ ఇన్..ఏంటో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ సభ్యులు సభను అడ్డుకోవడం తప్పని, ప్రతిపక్షం హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఏపీ అసెంబ్లీకి రూ. 114 కోట్లు ఖర్చు పెడుతున్నామని చంద్రబాబు సభకు తెలిపారు.

18:08 - March 28, 2017

విజయవాడ : ఏపీలో జనరల్ సైన్స్ పేపర్ 1 లీకేజ్ పై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పేపర్ లీక్ కాలేదని..మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని సభకు తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయంపై మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగిందని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులతో చెలగాటమాడవద్దని, తప్పుడు పనులు చేస్తే మాత్రం ఉపేక్షించమని బాబు స్పష్టం చేశారు.

ఏపీకి పోలవరం ఓ వరం: సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు : ఏపీకి పోలవరం ఓ వరమని అందుకే కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని, సభలో వైసీపీ సభ్యులు వింతగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. భూమానాగిరెడ్డి సంతాప తీర్మానానికి జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా క్షమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

విశాఖలో గన్లు..బుల్లెట్లు స్వాధీనం..

విశాఖపట్టణం : పోలీసులు జరిపిన తనిఖీల్లో నాలుగు కంట్రీమేడ్ గన్లు, నాలుగు మేగజైన్లు, 50 బుల్లెట్లు, 1.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

బీసీ రాయ్ పురస్కారాల ప్రదానం

ఢిల్లీ : వైద్య రంగంలోఅత్యున్నత పురస్కారం బీసీ రాయ్ అవార్డుల ప్రదానం జరిగింది. వైద్య రంగంలో విశేష కృషి చేసిన వైద్యులకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి బీసీ రాయ్ పురస్కారాలు ప్రదానం చేశారు. 2014 సంత్సరానికి బీసీ రాయ్ పురస్కారం డాక్టర్ కర్రి రామిరెడ్డి అందుకున్నారు. 2016 ఏడాదికి ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు రఘురామ్ అందుకున్నారు.

17:30 - March 28, 2017

సూర్యాపేట : జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాధారం వద్ద ప్రమాదం జరిగింది. కృష్ణానదిలో బల్లకట్టుపైన ఉన్న సిమెంట్‌ లోడుతో ఉన్న లారీ ప్రమాదవశాత్తు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ నీటిలో మునిగిపోగా..లారీ డ్రైవరు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. బల్లకట్టుపై ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

 

17:28 - March 28, 2017
17:27 - March 28, 2017
17:26 - March 28, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల పోలీస్‌ చెక్‌పోస్ట్‌లో అధికారుల వసూళ్ల దందా బయటపడింది. రెవెన్యూ, పోలీస్‌, టీఎస్‌ఎండీసీ అధికారులు కలిసికట్టుగా ఇసుక లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మార్వో రమేష్‌ ఆకస్మిక తనిఖీల్లో ఈ దందా బయటపడింది. తనిఖీల సమయంలో కానిస్టేబుల్‌ మల్లేష్‌ డబ్బు సంచితో పరుగులు తీసి.. పక్కింటిలో విసిరేశాడు. చెక్‌పోస్ట్ ప్రాంగణంలో... విసిరేసిన సంచిలో ఉన్న 14 వేల 130 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకుని.. విచారణ ప్రారంభించారు.

17:23 - March 28, 2017

హైదరాబాద్ : గృహనిర్మాణ రంగంలోని జాయింట్ వెంచ‌ర్ ప్రాజెక్ట్స్‌లో అప‌రిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలంగాణ మంత్రివ‌ర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్, మహేందర్‌ రెడ్డి, గృహ నిర్మాణశాఖ అధికారులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. డెవ‌ల‌ప‌ర్స్ నుంచి ప్రభుత్వానికి రావల్సిన బకాయిలను వసూలు చేయడంతో పాటు.. ప్లాట్లూ, విల్లాలు కొన్న కొనుగోలుదారుల‌కు రిజిస్ట్రేష‌న్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

17:21 - March 28, 2017

హైదరాబాద్ : రబీ సాగు ఏర్పాట్లు... వ్యవసాయ శాఖ తీరుతెన్నులపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సాగవుతున్న పంట విస్తీర్ణంపై ఖచ్చితమైన లెక్కలు నమోదుచేయాలనీ, అకాల వర్షాలు, వడగళ్ళతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నందున అర్హులైన రైతుల వివరాలను సర్వే చేసి పంపించాలనీ అధికారులను అదేశించారు. అలాగే భూసారాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రతి విస్తరణాధికారి పరిధిలో ఒక మినీ భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనన్నట్లు మంత్రి ప్రకటించారు. రైతులందరు తప్పనిసరిగా క్రాఫ్ ఇన్సురెన్స్ తీసుకునే విధంగా వ్యవసాయ అధికారులు ప్రచారం చేయాలని పోచారం అధికారులను అదేశించారు.

ఏపీలో నీట్ పరీక్షా కేంద్రాల పెంపుకు కేంద్రం అంగీకారం

ఢిల్లీ : ఏపీలో నీట్ పరీక్షా కేంద్రాల పెంపునకు కేంద్రం అంగీకారించింది. రాజమడ్రి, కర్నూలులో నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో స్పందించిన కేంద్రం కేంద్రాల ఏర్పాటుకు సిద్దం అయ్యింది. అంతే కాకుండా నీట్ పీజీ అర్హత మార్కుల శాతం తగ్గించేందుకు కేంద్రం ఒకే చెప్పింది. నీట్ అర్హత మార్కుల శాతం 7.5 తగ్గించేందుకు కేంద్రం ఒప్పుకుంది.

 

17:19 - March 28, 2017

హైదరాబాద్ : 2017-18 బడ్జెట్‌ వాస్తవాలకు దూరంగా ఉందని ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. గత 2016-17 బడ్జెట్‌ కూడా వాస్తవాలకు విరుద్దంగా ఉందని..కాగ్‌ తప్పుబట్టినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంకెల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి బడ్జెట్‌లను రూపొందించాలని ప్రభుత్వాన్నికోరారు.

 

17:17 - March 28, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు అందిస్తున్న సహకారంతో పోలీసులు ప్రజాభద్రతకు భరోసా కల్పిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్రిమినల్స్‌ను ట్రాక్‌ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌ టెక్నాలజీని హోంమంత్రి నాయినితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో సీసీ కెమెరాలతో క్రైమ్‌ రేట్‌ను తగ్గించడంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సక్సెస్‌ అయిందని కేటీఆర్‌ అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్తున్న పోలీసులు.. షీటీమ్స్‌కు దేశంలోనే గుర్తింపు తెచ్చారన్నారు.

16,562 ఇళ్లకు టెండర్లు పూర్తి : కేటీఆర్

హైదరాబాద్: నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి , మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 16,562 ఇళ్లకు టెండర్లు పూర్తై పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో మరో 16వేల ఇళ్లకు టెండర్లు పిలుస్తామని కేటీఆర్ తెలిపారు. మిగిలిన 70వేల ఇళ్లకు ఒకేసారి టెండర్లు పిలుస్తామని అన్నారు. త్వరలో మరిన్ని చోట్ల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన ప్రకటించారు.

బాపూ భవన్ లో అగ్నిప్రమాదం..

లక్నో : రాష్ట్ర సచివాలయంలోని బాపూ భవన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు కోహ్లీ దూరమా...?

ధర్మశాల: ఐపీఎల్-10 ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ అడతాడా లేదా అన్నది ప్రశ్నగా మిగిలింది. రాంచీ టెస్టులో కోహ్లీ ఫిల్డింగ్ లో గాయాపడ్డాడు. దీంతో ధర్మశాల టెస్టులో కోహ్లీ ఆడలేకపోయాడు. ఏప్రిల్ 4న హైదరాబాద్ తో జరిగే అరంభ మ్యాచ్ లో కోహ్లీ ఆడటం అనుమానంగా మారింది.

 

టెన్త్ పేపర్ లీకేజ్ పై సర్కార్ ఎందుకు స్పందించడం లేదు - జగన్..

విజయవాడ : టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కావడం విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని, తప్పు జరిగిందని తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లదేని జగన్ పేర్కొన్నారు. పేపర్ లీక్ అయ్యిందని ఏగ్జామినేషన్ బోర్డు రిపోర్టు ఇవ్వడమే కాకుండా నారాయణ స్కూల్ అటెండర్ ప్రశ్నాపత్రం లీక్ చేశాడని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాస్ చెప్పారని తెలిపారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పై సీబీఐ విచారణ ఎందుకు అనుమతినివ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ బినామీ కనుకే స్పందించడం లేదన్నారు.

బీసీసీఐ క్యాష్ రివార్డు..

ఢిల్లీ : బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు ప్లేయర్ లలో ఒక్కోక్క క్రీడాకారుడికి రూ. 50 లక్షలు, హెడ్ కోచ్ అనీల్ కుంబ్లేకు రూ. 25 లక్షలు, సపోర్టు స్టాఫ్ కు రూ. 15 లక్షల రివార్డును ప్రకటించింది.

16:33 - March 28, 2017

విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ జైలుకెళుతారా ? అనే సందేహాలు వెలువడుతున్నాయి. సీబీఐ సమన్లు జారీ చేయడమే ఇందుకు కారణం. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ షరతులతో కూడిన బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు షరతులతో జారీ చేసిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారని, సీబీఐకి వ్యతిరేకంగా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని కేసుల్లో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఆరోపించారని, కేసులపై ప్రభావం పడుతుందని సీబీఐ పేర్కొంది. సాక్షులను తారుమారు చేస్తారని పలుసార్లు తాము పేర్కొనడం జరిగిందని ప్రస్తుతం అది రుజువవుతోందని తెలిపింది. ఏప్రిల్ 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ కు సూచించింది. ఇందులో రాజకీయ అంశాలు ముడిపడ్డాయని జగన్ తరపు న్యాయవాది పేర్కొంటున్నారు.

జగన్ కు సీబీఐ సమన్లు..

విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారని, సీబీఐకి వ్యతిరేకంగా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఏప్రిల్ 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ కు సూచించింది.

16:23 - March 28, 2017

విజయనగరం : భోగాపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొంగవానిపాలెం గ్రామంలో ఉన్న పూరి గుడిసెలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దాదాపు 26 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. కట్టుబట్టలతో తాము రోడ్డున పడ్డామని పేదలు విలపించారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో రెవెన్యూ అధికారులు చెప్పాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

ముగిసిన సబ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : పెండింగ్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో అపరిష్కృత సమస్యలపై త్వరలో పరిష్కారం చూపుతామని సబ్ కమిటీ స్పష్టం చేసింది. అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఎజెండా అంశాలను సీఎం దృష్టికి  తీసుకెళ్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

16:12 - March 28, 2017

విజయవాడ : ఏపీ శాసనసభలో వైసీపీ చేసిన ఆరోపణలవన్నీ తప్పుడు ఆరోపణలని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని టిడిపి సభ్యుడు కూన రవికుమార్ పేర్కొన్నారు. పలు బిల్లులు ఆమోదం పొందిన అనంతరం ఆయన శాసనసభలో మాట్లాడారు. రూ. 97వేల కోట్ల అప్పులున్నాయని వైసీపీ చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హాయాంలో 2003-04లో ఉమ్మడి రాష్ట్రంలో రూ. 55,770 కోట్లు అప్పులున్నాయన్నారు. ఐదున్నర సంవత్సరాల్లో వంద శాతం అప్పులు పెరిగాయన్నారు. ఆనాడు ఆదాయాలు విపరీతంగా రావడం జరిగిందని, కానీ రాష్ట్ర ఆదాయ వనరులను వారు పూర్తిగా కైంకర్యం చేశారని ఆరోపించారు. 29 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంటే విద్యుత్ ఉత్పత్తి ఎందుకు పెంచుతున్నారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోందన్నారు. 2016 నుండి జనవరి 2017 వరకు చూసుకుంటే 6,630 మెగావాట్ల విద్యుత్ కోరత ఉందన్నారు. ఏపీ జెన్ కో టెండర్ల విషయంలో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారని, వైఎస్ హాయాంలో పవర్ ప్రాజెక్టులు..వాటాల విషయంలో తిప్పలు పడ్డారని విమర్శించారు.

16:09 - March 28, 2017

విజయవాడ : నారాయణ విద్యాసంస్థల్లో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ ఆరోపించారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. టెన్త్‌ క్లాస్‌ పరీక్షాపత్రాల లీకేజీలో మంత్రులు నారాయణకు, గంటాకు ప్రమేయం ఉందన్నారు. ప్రమేయం లేకపోతే అసెంబ్లీలో చర్చలో పాల్గొనేందుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. నారాయణను ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

భద్రచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్ కు రైల్వేబోర్డు పచ్చజెండా

హైదరాబాద్ : భద్రచలం రోడ్­-సత్తుపల్లి రైల్వేలైన్ కు రైల్వేబోర్డు అనుమతినించింది. రూ.703 కోట్ల అంచనా వ్యయంతో రైల్వేలైన్ కు అంగీకారం. రూ.80 కోట్లతో భూసేకణకు బోర్డు తక్షణ అనుమతి తెలిపింది.

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పదవ తరగతి పేపర్ లీక్ పై చర్చకు వైసీపీ పట్టు , స్పీకర్ పోడియం వద్ద ఎమ్మెల్యేల ఆందోళన.  సభ్యుల నిరసనల మధ్య పలు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది.

భారత్ లో అమెరికా పౌరుడు అదృశ్యం

 

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో అమెరికా పౌరుడు జాన్ అదృశ్యం అయ్యాడు. మావోయిస్టులు కిడ్నాప్ చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాన్ ఈ నెల 14న బైక్ పై ముంబాయ నుండి ఛత్తీస్ గఢ్ వెళ్లారు.

15:20 - March 28, 2017

హైకోర్టులో కానిస్టేబుళ్ల అవకతవకల పిటిషన్..

హైదరాబాద్ : టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఏఆర్ లో 5 మార్కులు కలిపారని హైకోర్టులో పిల్ దాఖలైంది. కానిస్టేబుళ్ల అవకతవకల పిటిషన్ తో పాటు ఈ పిల్ ను కూడా ఏప్రిల్ 3న విచారిస్తామని హైకోర్టు వాయిదా వేసింది.

ఆందోళన మధ్యే బిల్లుల ప్రవేశం..

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షాల చేస్తున్న ఆందోళనల మధ్య ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశ పెట్టింది. సభకు సహకరించాలని స్పీకర్ కోడెల చేసిన సూచనలు విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నారు.

కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి గంటా..

ఢిల్లీ : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. ఏపీలో విద్యా సంస్థల పనుల వేగం పెంచాలని గంటా విజ్ఞప్తి చేశారు. అనంతపురం సెంట్రల్ వర్సిటీ, విజయనగరం ట్రైబల్ వర్సిటీల బిల్లుకు ఆమోదం లభిస్తే అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందని, విద్యాభివృద్ధి కోసం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామన్నారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీఠ వేయడం జరుగుతుందని, పదో తరగతి పేపర్ లీక్ అయ్యిందని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు.

అహ్మదాబాద్ కు యెల్లో వార్నింగ్..

ఢిల్లీ : అహ్మదాబాద్ కు యెల్లో వార్నింగ్ జారీ చేసినట్లు, రెండు రోజుల పాటు ఇది వర్తిస్తుందని ఐఎండీ డైరెక్టర్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్లే వార్నింగ్ జారీ చేసినట్లు తదనంతరం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు.

అంబానీకి అంతర్జాతీయ గౌరవం..

ఢిల్లీ : రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని అట్లాంటిక్‌ కౌన్సిల్‌ బోర్డు సభ్యుడిగా ఆయన ఎంపిక అయ్యారు.

అసెంబ్లీలో లోకాయుక్త బిల్..

ఢిల్లీ : ఉత్తారఖండ్ అసెంబ్లీలో లోకాయుక్త బిల్ ను ప్రవేశ పెట్టారు. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపించారు. ఒక నెలలో కమిటీ నివేదిక ఇవ్వనుంది.

శ్రీనివాసుని భక్తులకు కుచ్చుటోపి

చిత్తూరు : తిరుమలలో భక్తులకు కుచ్చుటోపి పెట్టారు. భక్తులకు రూ.50 అద్దె గదిని రూ.1200కు దళారి విక్రయించాడు. నిజం తెలుసుకుని టీటీడీ సమాచార కేంద్రంలో వారు ఫిర్యాదు చేశారు. అధికారులు  స్పందించడంలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లపై మంత్రుల సమావేశం

హైదరాబాద్ : సచివాలయంలో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలెక్టర్, అధికారులతో మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై చర్చించారు.

తిరుపతిలో దళారీ కుచ్చుటొపి..

చిత్తూరు : తిరుపతిలో ఓ దళారీ ఓ భక్తుడికి కుచ్చుటోపీ పెట్టాడు. రూ. 50 అద్దె గదిని రూ. 1200కు దళారి విక్రయించాడు. టిటిడి సమాచార కేంద్రంలో ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

 

14:24 - March 28, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ మూడోసారి కూడా వాయిదా పడింది. ప్రశ్నాపత్రం లీకేజీపై వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో 10 నిమిషాల పాటు సభను స్పీకర్‌ వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని సభలో నిరసన తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం ఇస్తుందని అధికార పార్టీ సభ్యులు చెప్పినా.. వినిపించుకోలేదు. ద్రవ్య వినిమయ బిల్లుకు సహకరించాలని మంత్రులు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది.

సభ్యుల ఆందోళన..
పేపర్‌ లీకేజీపై చర్చించాలని వైసీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ద్రవ్య వినియమ బిల్లుకు సహకరించాలని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు ప్రతిపక్ష సభ్యులకు వినిపించారు. ప్రభుత్వం తప్పుకుండా సమాధానం ఇస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు.

సభలో గందరగోళం..
ప్రశ్నాపత్రం లీకేజీపై వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సమాధానంపై వైసీపీ సభ్యులు సంతృప్తి చెందలేదు. లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం ఇస్తుంని యనమల చెప్పినా.. సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

14:21 - March 28, 2017

హైదరాబాద్ : గౌతమిపుత్ర శాతకర్ణి..రుద్రమదేవీ చిత్రాలకు ప్రభుత్వాలు ఇచ్చిన వినోదపుపన్ను మినహాయింపు రగడ చెలరేగింది. 'బాలకృష్ణ' కథానాయికుడిగా 'గౌతమిపుత్ర శాతకర్ణి'..!'అనుష్క' ప్రధాన పాత్రలో 'రుద్రమదేవి' చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయా నిర్మాతలు ప్రభుత్వాలను కోరడం..వెంటనే వారికి పన్ను మినహాయింపు కల్పించారు. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. బాలకృష్ణతోపాటు గౌతమీపుత్ర శాతకర్ణి , రుద్రమదేవి మూవీ ప్రొడ్యూసర్లకు ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వినోదపు పన్ను మినహాయింపు ప్రేక్షకులకే చెందేలా ఆదేశించాలని పిటీషనర్‌ తన ఫిర్యాదులో కోరారు. గతంలో తమిళనాడు లో కోర్టు తీర్పును పిటిషనర్ తన పిల్‌లో ప్రస్తావించారు. చరిత్ర తెలుసుకోవడాకి..చూడటానికి ప్రేక్షకులకు రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ నిర్మాతలకు ఇవ్వాల్సి ఉండేది కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మేం చెప్పిందే కాగ్ చెప్పింది : జానారెడ్డి

హైదరాబాద్: మేం చేప్పిందే కాగ్ కూడా చెప్పిందని సీఎల్పీ నేత జానా రెడ్డి అన్నారు. బడ్జెట్ లో లోపాలను ఎత్తిచూపాం, బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని మందే చేప్పామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందన్న రేవంత్ రెడ్డి ఆరోపణల్లో పసలేదని అన్నారు.రేవంత్ రెడ్డి మాట్లాడితే స్పందించను, చంద్రబాబు మాట్లాడితే సమాధానం చెబుతానని ఆయన తెలిపారు.

హీరో బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: హీరో బాలకృష్ణతో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాల నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 2వారల్లో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. పన్ను మినహాయింపులు ప్రేక్షకులకు అందేలా చేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది.

 

 

13:43 - March 28, 2017

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అందోళన చేపట్టారు. జగన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టెన్త్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ లో వ్యవహారంలో ఎంతటి వారున్నా...వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభా సజావుగా జరిగేందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరారు. అందరి సభ్యుల హక్కులను కాలరాయడం నేరమని టీడీపీ ఎమ్మెల్యే రవి కుమార్ అన్నారు. బిల్లుపై చర్చకు రావడానికి ప్రతిపక్షానికి ఇష్టం లేదన్నారు. ఎప్పుడో జరిగిపోయిన అంశాలను సభలోకి తీసుకొస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.  

 

13:37 - March 28, 2017

టాలీవుడ్..బాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సెలబ్రెటీల విషయాలపై పలువురు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇందుకు సంబంధించిన వార్తలు కూడా వెలువడుతుంటాయి. వారి పెళ్లి..వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్..రూమర్స్ వస్తుంటాయి. దీనిపై ఆయా హీరోలు..హీరోయిన్లు సందర్భానుసారంగా స్పందిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ 'బిపాషా బసు'పై కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె గర్భవతి అయ్యిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నటుడు 'కరణ్ సింగ్ గ్రోవర్' ను ఆమె వివాహమాడిన సంగతి తెలిసిందే. దీనిపై 'బిపాషా' స్పందించింది. ఈ వార్తలను 'బిపాషా' ఖండించింది. 'తాను గర్భవతి కావాలని చాలా మంది ఆతృతగా ఉన్నారని... అయితే, తాను గర్భవతిని కాదని..మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ' అని చెప్పింది. పిల్లల్ని కనాలనే ఆలోచన తమకు ప్రస్తుతానికి లేదని ట్వీట్ చేసింది. పిల్లల్ని కనడం చాలా సంతోషకరమైన విషయమని... ఆ సందర్భం వస్తే తప్పకుండా అందరితో పంచుకుంటానని చెప్పింది. ముక్కు సూటిగా ఉండే తాను ఏ విషయం గురించైనా సూటిగా చెబుతానని తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.

లోక్ పాల్ నియామకం సాధ్యం కాదు : కేంద్రం

ఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో లోక్ పాల్ నియామకం సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 

 

13:32 - March 28, 2017

గుంటూరు : నారాయణ విద్యా సంస్థల్లో పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకైనట్టు వచ్చిన వార్తలు అన్నీ అవాస్తవమని మంత్రి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్‌ కాలేదన్నారు. నారాయణ సంస్థల ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రతిపక్షం పన్నిన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

విషమంగా వాసుదేవ ఆరోగ్యం

చిత్తూరు : పదోతరగతి విద్యార్థి వాసుదేవరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషయమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.జిల్లాలోని కాలూరు నారాయణ స్కూల్ విద్యార్థి వాసుదేవరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం అదే స్కూల్ లో పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

13:27 - March 28, 2017

విద్య, ఉపాధి కోసం అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. హాస్టల్ లో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. మరి ప్రైవేట్ హాస్టళ్లలో అమ్మాయిలకు రక్షణ ఎంత.. ? అనే అంశంపై నిర్వహించిన మావని వైదిక చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ సురేష్ కుమార్, ఉమెన్స్ హాస్టల్ నిర్వహకుడు శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. హాస్టల్ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి, రిజస్ట్రేషన్ చేసుకోవాలనే రూల్స్ లేవన్నారు. అనుమతి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 

13:17 - March 28, 2017

గుంటూరు : అమరావతిలో రహదారి భద్రత వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏపీ రాష్ట్రంలో ఏటా 24వేల రోడ్డు ప్రమాదాల్లో 8వేల మందికి పైగా చనిపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రమాదాల కారణాలపై సమగ్ర అధ్యయనం చేశామన్నారు. రహదారి భద్రత వాహనాలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై పర్యవేక్షణ కోసం 66 భద్రతా వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

రాష్ట్రం ఏర్పాడ్డక నేరాలు తగ్గాయి : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నేరాల సంఖ్య తగ్గిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ ను మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాంతిభద్రతలపైనే సీఎం కేసీఆర్ ప్రధాన దృష్టి పెట్టారని తెలిపారు. శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అన్నారు. 

 

 

భక్తరామదాసులో ప్రాజెక్టులో సాంకేతిక లోపం

ఖమ్మం : భక్తరామదాసు ప్రాజెక్టులో సాంకేతిక లోపం తలెత్తడంతో పంప్ హౌజ్ లోకి భారీగా చేరుకున్న నీరుతో మోటర్లు మునిగిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

12:56 - March 28, 2017

హైదరాబాద్ : మలక్ పేట్ మహబూబ్ గంజ్ సమస్యలకు నిలయంగా మారింది. మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ సమస్యలను పట్టించుకునే నాథుడే లేరా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
మార్కెట్‌లో తిష్ట వేసిన సమస్యలు  
తెలంగాణలోని అతిపెద్డ మార్కెట్ అయిన మలక్ పేట వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు తిష్ట వేశాయి. పక్క రాష్ట్రాల నుంచి సైతం రోజు రైతులు పంట అమ్ముకోవడానికి మార్కెట్‌కు వస్తుంటారు. అయితే కనీస మద్దతు ధర అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ వ్యవస్థ ఇంతవరకు మార్కెట్‌లో అమలవ్వడంలేదు. 
పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన 
ఏజెంట్లు ఇష్టానుసరంగా రెచ్చిపోతున్నా పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్‌ పనిచేయకపోవడంతో తూకం సరిగ్గా రావడంలేదని దీంతో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. 
యాజమాన్యం నిర్లక్ష్య ధోరణీ 
ఇంతే కాకుండా మార్కెట్‌లో విశ్రాంతి గదులు, టాయిలెట్స్ లేక రైతులు, వ్యాపారులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు నిధులు మంజూరవుతున్నా సౌకర్యాలు కల్పించండంలో యార్డు యాజమాన్యం నిర్లక్ష్య ధోరణీ కనబరుస్తోందని ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మార్కెట్‌లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. 

 

12:54 - March 28, 2017

ఏంటీ ఈ వార్త అని నమ్మకండి.. ఇది నిజం కాదు. కానీ 'రాంగోపాల్ వర్మ' హఠాన్మరణం చెందినట్లు ఓ పోస్టర్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హఠాన్మరణం అంటూ ఓ పోస్టర్ పెట్టి, నివాళులర్పిస్తున్నామంటూ ఓ డిజైన్ తయారు చేశారు కొంతమంది. 'సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలు సినీ ప్రముఖులు ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం' అంటూ కేఆర్ఎస్ @ఓపీఎం..పీఎస్ పీకే ఫ్యాన్.. అంటూ ఓ పోస్టర్ కలకలం సృష్టిస్తోంది. గతంలో కూడా ఇలాంటి పోస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'వర్మ' ఈ పోస్టర్ ను పోస్టు చేస్తూ పలు కామెంట్స్ చేశారు. 'వర్మ' ఎప్పటి నుండో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఫ్యామిలీపై పలు వ్యాఖ్యలు చేస్తుండడంపై అభిమానులు గుర్రుగా ఉంటున్నారు. తాజాగా వచ్చిన దీనిపై ఎలాంటి విమర్శలు..ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో వేచి చూడాలి.

12:53 - March 28, 2017

గుంటూరు : ప్రతిపక్ష నేత జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో ప్రజా ససమ్యలపై చర్చ జరగక్కుండా సభా సమయాన్ని వైసీపీ సభ్యులు వృథా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత విమర్శించారు. ప్రజా ససమ్యలపై చర్చ జరగక్కుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌.. వాళ్ల సభ్యులకు ఏం సందేశం ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులకు మాట మీద నిలబడే స్థాయి లేదన్నారు. 

 

హర్యానాలో కాల్పుల కలకలం

ఛంఢీఘర్ : హర్యనా లోని రోహ్ తక్ కోర్టు అవరణలో కాల్పులు జరిగాయి. దుండగుడు మహిళా వేషధారణలో వచ్చి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు ఇద్దరికి గాయాలయ్యాయి.

12:50 - March 28, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ రెండోసారి కూడా వాయిదా పడింది. టెన్త్‌ పరీక్ష పత్రాల లీకేజీపై  దుమారం రేగింది. ప్రశ్వాపత్రాల లీకేజీపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైసీపీ .. చర్చకు పట్టుబట్టింది. అయితే వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరిండంతో  వైసీపీ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంది. స్పీకర్‌పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ సభ్యులు చెప్పినా.. వైసీపీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళం చోటుచేసుకోవడంతో సభను స్పీకర్‌ రెండోసారి వాయిదా వేశారు.

 

12:38 - March 28, 2017

తెలుగులో మంచి నేమ్ తో సినిమాలు చేసి ఆడియన్స్ కి గుర్తుండిపోయిన హీరోయిన్ కొంతకాలం తెలుగు తెరకు దూరం అయింది. ఇప్పుడు మళ్ళీ తనని రీసెంట్ ఫిలిం తో తెలుగు ప్రేక్షకులు గుర్తుతెచ్చుకుంటారు అంటోంది ఈ ఒకప్పటి హీరోయిన్. 'లక్సుపాప' అనే వెంటనే గుర్తొచ్చే గ్లామరస్ హీరోయిన్ 'ఆశా షైనీ'. తెలుగులో మంచి సినిమాలు చేసి గుర్తుండిపోయే సినిమాలు చేసిన ఈ హీరోయిన్ కొంతకాలంగా బాలీవుడ్ లో రోల్స్ చేస్తూ బిజీ అయిపోయింది. పేరుకూడా మార్చుకుని 'ఫ్లోరా షైనీ' గా ప్రొఫైల్ తయారు చేసుకుంది ఈ లక్సుపాప. తెలుగులో 'జెడి చక్రవర్తి'తో కలిసి 'మనీ మని మరి మని' అనే సినిమాలో చేసింది ఫ్లోరా షైనీ. త్వరలో విడుదల కానున్న 'బేగమ్ జాన్' మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది ఆశా షైనీ. 'విద్యా బాలన్' లీడ్ రోల్ చేయగా.. గుజరాత్ కు చెందిన మైనా అనే ఓ ట్రైబల్ పాత్రలో 'ఫ్లోరా షైనీ' కనిపించనుంది. ఈ మూవీని చూసిన తర్వాత తనకు మళ్లీ టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది ఫ్లోరా. "టాలీవుడ్ జనాలకు పంక్చువాలిటీ ఎక్కువ. అందుకే తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ జనాలు నన్ను మర్చిపోయారు. నేను తెలుగు ఫ్లుయెంట్ గా మాట్లాడగలను. 'బేగమ్ జాన్' తర్వాత మళ్లీ తెలుగు సినిమాల ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నా" అంటోంది ఈ భామ.

12:36 - March 28, 2017

'ఊహలు గుసగుసలాడే' కంప్లీట్ హెల్తీ కామెడీతో నడిచే లవ్ స్టోరీ. 'అవసరాల శ్రీనివాస్' డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమా ఒక ఊపు ఊపింది. చిన్న సినిమాల ఒరవడిలో బెస్ట్ హిట్ అందుకున్న సినిమా కూడా ఇదే. స్వచ్ఛమైన కామెడీతో ఎక్కడా డబుల్ మీనింగ్ మాటలకి ప్లేస్ ఇవ్వకుండా మంచి లవ్ స్టోరీని అందించాడు అవసరాల. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు నాగశౌర్య, రాశిఖన్నా ఇద్దరూ కొత్తవారు పరిచయం అయ్యారు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి నేమ్ వచ్చింది అవసరాలకి. హిందీ లో హిట్ టాక్ తో వచ్చిన 'హంటర్' అనే సినిమాని మక్కికి మక్కి తెలుగులో దింపేసాడు నవీన్ మేడారం. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నా అని ప్రకటించిన అభిషేక్ నామ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. 'హంటర్' సినిమాని తెలుగు రీమేక్ 'బాబు బాగా బిజీ' అనే టైటిల్ తో తీసుకురాబోతున్న ఈ ప్రయత్నంలో మసాలా కొంచెం గట్టిగానే వేశారు అనే చెప్పాలి. ఒరిజినల్ హంటర్ లో ఉండే మసాలా ఈ తెలుగు 'బాబు బాగా బిజీ'లో కూడా దింపేశారు డైరెక్టర్. ఈ సినిమాలో 'అవసరాల శ్రీనివాస్' హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ ఐన ట్రైలర్ 'అవసరాల' లుక్ ని కంప్లీట్ గా మార్చేసింది. అసలు 'అవసరాల' ఏంటి ఇలా నటించడం ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా ట్రైలర్ లోనే మసాలా వాసనలు భయంకరంగా ఉన్నాయని 'అవసరాల' ఫామిలీ ఆడియన్స్ వర్గం అనుకుంటున్నారు.

12:35 - March 28, 2017

విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 'సాలఖడూస్' అనే సినిమాకి రీమేక్. సుధా కొంగర డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరో 'వెంకటేష్' ఒక పాట కూడా పాడాడు. ఆ పాట ఆల్రెడీ జనాల్లోకి గట్టిగ వెళ్ళిపోయింది. విక్ట‌రీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు. 'రితిక సింగ్' శిష్యురాలి పాత్ర‌లో రూపొందిన చిత్రం 'గురు'వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధ‌కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ఎస్‌.శ‌శికాంత్ నిర్మించారు. 'గురు' చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ తమిళంలో, హిందీలో ఘన విజయం సాధించిన చిత్రం కావడం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కి మరో కారణం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది 'గురు' చిత్రం. హీరో 'వెంకీ' కి సినిమా సెలక్షన్ మీద కమెండ్ వచ్చింది. తన పెర్సనాలిటీకి ఎలాంటి రోల్స్ సూట్ అవుతాయి అన్న విషయాన్నీ తెలుసుకున్నాడు. అలా అని మరీ ప్రయోగాలు కూడా చెయ్యట్లేదు. సినిమాలో కంటెంట్ ఉంటె చాలు పాత్ర జనాల్లోకి వెళ్తుంది అనుకున్నాడేమో 'వెంకీ' 'గురు'తో రాబోతున్నాడు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 7న విడుద‌ల చేస్తార‌ని అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా మార్చి 31నే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఈ సినిమా మీద ఏ మాత్రం ఇంటరెస్ట్ తగ్గకుండా 'గురు' మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. మరి 'గురు' అలరిస్తాడా లేడా అన్నది చూడాలి.

12:33 - March 28, 2017

ఉత్తమ నటుడిగా ఇప్పటిదాకా చాలా అవార్డులే అందుకున్నాడు 'జూనియర్ ఎన్టీఆర్'. ఐతే తొలిసారిగా అతను 'కింగ్ ఆఫ్ బాక్సాఫీస్' అనే కొత్త పురస్కారాన్ని తీసుకున్నాడు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డుల వేడుకలో 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ రూ.55 కోట్ల దాకా షేర్ సాధిస్తే.. ‘జనతా గ్యారేజ్’ రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్-3 హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు ఈ అవార్డు అందజేశారు. ఇంతకుముందు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి పేరుండేది కానీ... బాక్సాఫీస్ రేసులో మాత్రం బాగా వెనుకబడి ఉండేవాడు. ఐతే ‘టెంపర్’ దగ్గర్నుంచి సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుని ‘జనతా గ్యారేజ్’తో అనూహ్యమైన స్థాయిని అందుకున్నాడు.

సమంత..
తన అందంతో ఆకట్టుకుంటూ అభినయం తో మాయ చేసే హీరోయిన్ సమంత .అ ఆ సినిమాలో తన నటన అందరిచేత క్లాప్స్ కొట్టించింది. అమాయకంగా నటించినా ఈ అక్కినేని కోడలు త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కి న్యాయం చేసింది అనే చెప్పాలి. ఇదే సినిమా అవార్డుల పురస్కారాల్లో మరోవైపు సమంత 'క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్' అవార్డును అందుకోవడం విశేషం. ఆమె గత ఏడాది ‘అఆ’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించింది. ఎన్టీఆర్.. సమంతల అవార్డుల్లో వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాకు భాగస్వామ్యం ఉండటం విశేషమే. తమిళ స్టార్ హీరో సూర్య ‘సెన్సేషన్ ఆఫ్ సౌత్’ అవార్డుకు ఎంపికయ్యాడు.

ఏపీ సీఎంకు బియ్యపు పొంగలి, అటుకులు

గుంటూరు: పట్టిసీమ రైతులు ఏపీ సీఎం చంద్రబాబు గారిని కలిశారు. వారు ఉగాదిని పురస్కరించుకుని కొత్త బియ్యం పొంగలి,అటుకులు ముఖ్యమంత్రికి అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గత సీజన్లో పంటకు 56 టీఎంసీలు నీటిని కృష్టా డెల్టా భూములకు అందించామని ఆయన తెలిపారు.

 

12:27 - March 28, 2017

శ్రీకాకుళం : చింతపండు గిరిపుత్రులకు చింతలే మిగిలుస్తోంది. అమ్మేందుకు గిట్టుబాటు ధర ఉండక.. గిరిజన సహకార సంస్థ చేయూత లేక.. శ్రీకాకుళం జిల్లాలో చింతపండు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
చింతపండు రైతుల ఇబ్బందులు 
శ్రీకాకుళం జిల్లాలో చింతపండు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతపండు సీజన్ ముగియడంతో అమ్మకాలకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ సంతలలో క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ఏటా ఈ సీజన్ లో రెండువందల టన్నులకు పైగా చింతపండు జిల్లా నుంచి ఎగుమతులు అవుతుంటే.. కేవలం సీతంపేట ఐ.టి.డి.ఏ పరిధి ఏజెన్సిలోని తొమ్మిది మండలాల్లో ఎనభై టన్నుల వరకూ చింతపండు దిగుబడులు వస్తున్నాయి. 
రైతులకు శ్రమ తప్పా ప్రయోజనం లేదు.. 
అయితే రైతులకు మాత్రం శ్రమ తప్పా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చింతపండు పచ్చిరకం నలభై రూపాయల వరకూ పలుకుతూ ఉంటే.. గిరిజనుల సహకార సంస్థ ఇరవై రూపాయలకు, దళారులు ఇరవై అయిదు రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ధర వ్యత్యాసం, దళారుల దోపిడి వలన రైతులు నష్టపోతున్నారు. 
శీతల గిడ్డంగి నిర్వహణ లోపం
ఇదిలా ఉంటే.. చింతపండు నిల్వలకు ఐ.టి.డి.ఏ సీతంపేటలో శీతల గిడ్డంగి నిర్మించినా నిర్వహణ లోపం, మరమ్మత్తుల పుణ్యమా అంటూ వినియోగంలోకి రాలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ కష్టాలను తీర్చాలని చింతపండు రైతులు కోరుతున్నారు. 

 

12:22 - March 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. బెజవాడలో భానుడు విరుచుకుపడుతున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యుడి ప్రకోపానికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. చల్లధనం కోసం పరుగులు తీస్తూ శీతల పానియాలతో సేద తీరుతున్నారు. పనిలో పనిగా..పళ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ వ్యాపారులు దండుకుంటున్నారు. 
ఏపీలో ఎండలు 
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా విరుచుకుపడుతున్నాయి. ఉక్కపోతకు తోడు వేడిగాలులు దడపుట్టిస్తున్నాయి. విజయవాడలో  ఎండలు తీవ్రస్థాయికి చేరుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రకోపానికి విజయవాడ వాసులు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఠారేత్తిస్తుండటంతో.. ఇళ్లనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వడదెబ్బ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంకోపక్క భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో..మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్కపోత, వడగాలులు సైతం పెరగడంతో వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. 
అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు..
ఈ వేసవిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని  పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఉష్ణోగ్రతలు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏపీ, తెలంగాణలో ఈ ప్రభావం మరింతగా ఉంటుందని..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఏటికేడు వడగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.  వీటిధాటికి 2015లో 1,369 మంది మృత్యువాతపడితే, 2016లో 723 మంది చనిపోయారు. ఏప్రిల్ రెండోవారం నుంచి మే నెలాఖరు వచ్చే సరికి రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి మాసంలోనే..తిరుపతి, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఏలూరులో ఎండలు తీవ్రమమయ్యాయి. 
మధ్యాహ్న సమయంలో బయటతిరగరాదు...
అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటతిరగకూడదని.. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు పూర్తి చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పళ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఎండలు అన్యూహంగా పెరుగుతున్నాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 
సంగారెడ్డి జిల్లాలో 
సంగారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రచండరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సూర్యుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మార్చిలోనే విపరీతమైన ఎండలు మండిపోతుండడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండవేడికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 
భానుడు ఉగ్రరూపం
సంగారెడ్డి జిల్లాలో ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండల తీవ్రతకు జిల్లా ఉడికిపోతోంది. జిల్లావ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే ... నిప్పుల కొలిమిని తలపించే సెగలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఇళ్లకే  పరిమితం అవుతున్నారు. భానుడి ప్రతాపానికి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఆయాస పడుతున్నారు. ఇప్పుడే ఇంత విపరీతంగా ఎండలు ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయమేస్తోందని ప్రజలంటున్నారు. 
బయటకాలు పెట్టాలంటే జంకుతున్న ఉద్యోగులు  
ఇక ఉద్యోగులు బయటకు కాలు పెట్టాలంటే జంకుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. చిన్నచిన్న శామియానాలు, గొడుగుల సహకారంతో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. రోడ్లు, బస్టాండ్లు, వివిధ కార్యాలయాలు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెరిగిన ఎండలకు ఉపాధి కూలీలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారికి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. 
చిరువ్యాపారులకు వడదెబ్బ 
తోపుడు బళ్లు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే తొందరగా వడదెబ్బకు గురికావడం ఖాయమని డాక్టర్లు హెచ్చ రిస్తున్నారు. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు శీతల పానియాల వైపు అడుగులు వేస్తున్నారు. పట్టణ కేంద్రాల్లో ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్రూట్‌ జూస్‌, కొబ్బరి బొండాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలకు అందు బాటులో వ్యాపారులు ఉంటూ తమ వ్యాపారాలు చేసు కొని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొబ్బరి బోండాలు, నిమ్మరసం పానియాలకు డిమాండ్‌ పెరిగింది. 

 

రెన్యూవల్ చేస్తే వడ్డీ మాఫీ: పోచారం

హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట విస్తీర్ణంపై ఖచ్చితమైన లెక్కలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి ఏఈవో పరిధిలో మినీ భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రైతు యూనిట్ గా భూసార పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. లక్షలోపు రుణం తీసుకున్న రైతులందరు సంవత్సరంలోగా రెన్యూవల్ చేయించుకుంటే వడ్డీమాఫీ వర్తింప చేస్తామని ప్రకటించారు. రైతులు తప్పనిసరిగా క్రాఫ్ ఇన్సురెన్స్ తీసుకునేవిధంగా వ్యవసాయ అధికారులు ప్రచారం చేయాలని అన్నారు.

12:17 - March 28, 2017

హైదరాబాద్ : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.  మరోవైపు పండ్లను ముట్టుకుంటే అంటుకుంటున్నాయి. వేసవిలో ఆరోగ్యాన్ని పంచే పండ్లను తిందామంటే సామాన్యులకు తలకు మించిన భారంగా మారింది. అయితే వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా భావించి పండ్ల ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచి దోచుకుంటున్నారు. 
అమాంతంగా పెరిగిన పండ్ల ధరలు
మండు వేసవిలో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా ఇతర కాలాల కంటే ప్రస్తుతం పండ్లకు గిరాకీ అధికంగా ఉండడంతో.. పండ్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పండ్ల ధరలు మూడింతలు పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్న సామాన్యులకు ధరలు చూసి మైండ్‌ దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడే ధరలు ఇలావుంటే రానురాను ఇంకేంత పెరుగుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
రెచ్చిపోతున్న వ్యాపారులు  
ఇదిలావుంటే ఇదే ఆసరాగా చేసుకుని హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సరుకును వేలం వేయకుండా రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో ఇష్టం వచ్చినట్లు రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. 
పెరిగిన విదేశీ పండ్ల ధరలు 
గతంలో 80 పలికిన గ్రేప్స్‌.. 100కు పెరిగింది. పుచ్చకాయలు 45 రూపాయలు, సంత్రా ఒక్కటి 10 రూపాయలకు చేరింది. ఇక మామిడికాయలైతే.. 120 రూపాయలు పలుకుతున్నాయి. మరోవైపు విదేశీ పండ్ల ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగిపోయాయి. 
ఇష్టానుసారంగా పండ్ల ధరల నిర్ణయం 
ఇదిలావుంటే.. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో పండ్ల ధరలను ఇష్టమొచ్చినట్లు నిర్ణయించి విక్రయిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలంటున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే.. గతేడాది కంటే ఈసారి పండ్ల ధరలు పెరిగాయని వ్యాపారులంటున్నారు. ఏది ఏమైనా వేసవిలో పండ్లు తింటే అనారోగ్యానికి గురికాకుండా ఉంటామనే నమ్మకంతో ప్రజలు ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు. 

 

12:11 - March 28, 2017

హైదరాబాద్ : పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు జనసేనాని పవన్‌కళ్యాణ్‌ ఆహ్వానం పలికారు. ప్రజాసమస్యలపై పార్టీ తరపున పోరాడేవారికోసం అన్వేషణ మొదలుపెట్టారు. జిల్లాలవారిగా జనసైనికులను నియమించాలని పవన్‌ యోచిస్తున్నారు. మొదటి విడతలో అనంతపురం జిల్లాలో తీసుకోవాలని యోచిస్తున్నారు. నేటి నుంచి ఏప్రిల్‌ 4 వరకు జనసేన పార్టీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకునే అవకాశం కల్పించారు.  

11:58 - March 28, 2017

గుంటూరు : పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తమని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రశ్నాపత్రం లీకైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థలపై ఇప్పటివరకు ఒక్క ఆరోపణ కూడా లేదని.. తమకు అడ్డదారులు తొక్కాల్సిన పని లేదన్నారు. వైసీపీ సభ్యులు శాసనసభ కార్యకలాపాలు అడ్డుకోవడం సరికాదన్నారు.

 

11:57 - March 28, 2017

గుంటూరు : రాష్ర్టంలో 10వ తరగతికి చెందిన మూడు ప్రశ్నాపత్రం పేపర్లు లీకు అయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ అన్నారు. నారాయణ విద్యాసంస్థల నుంచే ప్రశ్నాపత్రం లీకైందన్నారు. దీనిపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. 

 

నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తేనేటీ విందు

హైదరాబాద్: నేడు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనేటీ విందు ఇవ్వనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు,

మంత్రులు హాజరుకానున్నారు.

11:52 - March 28, 2017

చిత్తూరు : వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించడం ఆ పథక లక్ష్యం. భూగర్భ జలాలు వృద్దిచెందించి.. తేమ శాతాన్ని పెంచడం ద్వారా రైతులకు దిగుబడులు పెంచడమే ముఖ్యోద్దేశం. సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పథకం పక్కదారి పడుతోంది. అక్రమార్కులకు వరసంజీవనిగా మారింది. కుంటలో నీటి జాడమాత్రం లేదుగానీ...అక్రమార్కుల ఖాతాలనిండా నగదు చేరింది.  చిత్తూరు జిల్లాలో అక్రమాలకు నిలయంగా మారిన పంటసంజీవని పథకంపై 10టీవీ ప్రత్యేక కథనం...
వాటర్‌షెడ్‌లో భాగంగా పంటసంజీవని అమలు
వర్షపు నీటిని ఒడిసిపట్టి దానిని భూమిలోకి ఇంకించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  పంట సంజీవని కార్యక్రమాన్ని తీసుకుంది. 2015 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పొలాల్లో కుంటలు తవ్వి వర్షపునీటిని నిల్వ చేయడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. వాటర్‌షెడ్‌లో భాగంగానే పంటసంజీవని కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పంటసంజీవని ఉద్దేశ్యం మంచిదే. దీని ద్వారా భూగర్భ జలాలు వృద్దిచెంది తేమశాతం పెరుగుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు పెరుగుతాయి. విద్యుత్‌ వినియోగం కూడా పొదుపు చేసే వీలు కలుగుతుంది. అంతేకాదు.. మేకలు, గొర్రెలు, పశువులతోపాటు ఇతర పశుపక్ష్యాదుల తాగునీటి కొరతను తీర్చవచ్చు. కుంటలు నిండడం ద్వారా వాటి అడుగు భాగాన చేరే ఒండ్రుమట్టిని పంటలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. 
పంటసంజీవని లక్ష్యానికి తూట్లు
ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ప్రవేశపెట్టిన పంట సంజీవని పథకం సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే దారి తప్పుతోంది. అక్రమార్కులు చేరి పథకం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. జరగని పనులు జరిగినట్టుగా చూపుతూ ప్రభుత్వ ధనాన్ని లూఠీ చేస్తున్నారు. ఇదిగో మీరు ఈ కుంట చిత్తూరు జిల్లా వి. కోట మండలంలోనిది. ఈ మండలంలోని పలు గ్రామాల్లో పంట సంజీవని అమలు చేస్తున్నారు.  పలు స్వచ్చంద సంస్థలు, ఇంటిగ్రేడెట్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ మహిళా స్వయం సహాయ సంస్థైన ఏపీమాస్,కొంగాటం, ఐడబ్ల్యూఎంపీ సంస్థలు  ఈ పనులను చేపట్టాయి. పారదర్శకంగా జరగాల్సిన పనులన్నీ అవినీతిమయంగా మారాయి. అధికార పార్టీ నాయకులతో వాటర్‌షెడ్‌ సిబ్బంది కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడు గ్రామాల్లో పనులు చేపట్టిన ఐఆర్‌డీఎస్‌ సంస్థ
వి. కోట మండలంలోని పాముగానిపల్లి మెగా వాటర్‌షెడ్‌ పేరుతో ఏడు రెవెన్యూ గ్రామాల్లో ఐఆర్‌డీఎస్‌ సంస్థ పనులు చేపట్టింది. ఇక ఐడబ్ల్యూఎంపీ సంస్థ 20 గ్రామాల్లో పనులు నిర్వహిస్తోంది.  ఈ గ్రామాలన్నిచోట్ల కలిపి సుమారు 4.15 కోట్ల మేర పనులు జరుగుతున్నట్టు అధికారులు  చెప్తున్నారు. 
నిమ్మకు నీరెత్తినట్టుగా డ్వామా సిబ్బంది
వాటర్‌షెడ్‌లో భాగంగా చేపడుతోన్న పంట సంజీవని పనులను ఏపీ మాస్‌ స్వచ్చంద సంస్థ బోయచిన్నాగనపల్లి, ఓగు, ముదరందొడ్డి పంచాయతీల్లో పనులు చేస్తోంది. ఒక్క కొంగాటంలోనే సుమారు రెండుకోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపుతున్నారు. ఈ మొత్తాన్ని నిజాయితీగా ఖర్చు చేయకుండా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూలీలతోనే పనులు చేయించాలని ఉన్నా.. అధికారపార్టీ నాయకులు పనులు పంచుకుని రాత్రికి రాత్రే యంత్రాలతో కుంటలు తవ్వి బిల్లులు వసూలు చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రైతులకు నయా పైసా ఇవ్వని లీడర్లు
ఇక ఎర్రినాగేపల్లిలో రైతుల అనుమతులు లేకుండానే వారి పంట పొలాల్లో కుంటలు తవ్వి, బిల్లులు తీసుకున్నారు. రైతులకు మాత్రం నయాపైసా చెల్లించిన పాపానపోలేదు. వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ను రైతులు నిలదీయగా బిల్లులు ఇంకా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. దీంతో రైతులు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లగా... వారి పంట పొలాల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఎప్పుడో మంజూరైనట్టు తెలిసి లబోదిబోమంటున్నారు.
యధేచ్చగా ప్రజాధనం స్వాహా
పొలిటికల్‌ లీడర్లు యంత్రాలతో పని చేసి... మనుషులతో పని చేయించినట్టు తప్పుడు నివేదికలు, తప్పుడు ఫోటోలు పంపుతూ పంటసంజీవని పథకం నిధులను యథేచ్చగా కాజేస్తున్నారన్న విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల 2011 నాటి నుంచి తవ్విన కుంటలను కూడా ఇప్పుడే తవ్వినట్టు చూపుతూ... ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  ప్రభుత్వ సొమ్మును దోచుకోవడమే లక్ష్యంగా కొందరు నాయకులు అవసరంలేని చోట కూడా కుంటలు తవ్వి బిల్లులుపెట్టి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.  వాలు ప్రదేశాల్లోనే కుంటలు తవ్వాల్సి ఉండగా.. కొండ, మిట్ట ప్రాంతాల్లోనూ కుంటలు తవ్విపోశారు. దీంతో అసలు పంట సంజీవని పథక లక్ష్యమే దెబ్బతింటోంది. అయినా అధికారులు మాత్రం కళ్లుమూసుకుని బిల్లులు చెల్లిస్తున్నారు.  
డ్వామా అధికారుల ఉదాసీనత 
వాటర్‌షెడ్‌ పనులను పర్యవేక్షించాల్సిన డ్వామా ఉన్నతాధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వి. కోట మండలంలో పంట సంజీవని పథకంలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని, స్వాహా చేసిన నిధులను వసూలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరుస్తారో లేదో వేచి చూడాలి.

11:47 - March 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో పాతనోట్లు మార్పిడి చేస్తున్న 10 మంది సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్‌బాగ్‌లోని మొఘల్స్ కోర్టులో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 10 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి దాదాపు 8 కోట్లకుపైగా పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ఫజలుద్దీన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

11:37 - March 28, 2017

ధర్మశాల టెస్టు : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్ ను 2..1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. సీజన్ ను నెంబర్ వన్ ర్యాంక్ తో ముగించింది. 

జన సైనికులు ఏర్పాటు : పవన్

గుంటూరు : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి రంగంలోకి దిగారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున పోరాడటానికి జన సైనికులను నియమించాలని ఆయన నిర్ణయించారు. జనసేనాని జిల్లాల వారిగా జన సైనికులను నియమించనున్నారు. అనంతపురం జిల్లా నుంచి అన్వేషణ ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 4 వరకు జనసేన పార్టీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు.

11:25 - March 28, 2017

గుంటూరు : వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. ఏపీ అసెంబ్లీలో టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీపై దుమారం రేగింది. ప్రశ్నా పత్రాల లీక్ పై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. క్వశ్ఛన్ అవర్ తర్వాత చర్చిస్తామని చెప్పారు. 
అయినా వైసీపీ సభ్యులు వినలేదు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
టీడీపీ సభ్యుడు 
వైసీపీ సభ్యులు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. వీళ్లల్లో 90 మందికి భయం లేదు. ఒక్క ప్రశ్న జరగనిస్తే సమాధానం ఇస్తాం. గత పదేళ్లలో జరగనిది...ఈ రెండేళ్లలో జరిగింది. ప్రతిపక్షం ఎందుకు గొడవ చేస్తున్నారో చెప్పాలి..
ప్రజా సొమ్ము తింటున్నారు. సభా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని చేతులు ఎత్తి జోడించి వేడుకున్నారు. ఈ దెయ్యాలు, పిశాచులను మార్షల్స్ ను పెట్టి కూర్చోపెట్టాలని వైసీపీ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. 
రావెల కిషోర్ బాబు 
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చర్చ జరిగేటప్పుడు..వైసీపీ సభ్యులు వెల్‌లోకి వస్తున్నారు. ప్రభుత్వం సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు. దళిత, గిరిజన వ్యతిరేక శక్తులు ప్రతిపక్ష సభ్యులు అని అన్నారు. 
టీడీపీ సభ్యుడు
వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధాకరం. ప్రతిపక్ష సభ్యులు సభను తప్పుదారి పట్టిస్తున్నారు. 

 

11:14 - March 28, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శించారు. టెన్త్ క్లాస్ పశ్నాపత్రాల లీక్ కు మంత్రులు గంటా శ్రీనివాస్, నారాయణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకుపై సమాధానం చెప్పాలన్నారు. పేపర్ లీకుల్లో నారాయణ కాలేజీలే మొదటిస్థానంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. గంటాను, మంత్రి నారాయణలను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఇద్దరు మంత్రుల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. గంటా, నారాయణ కోట్లాది రూపాయలు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. మంత్రి నారాయణతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 

 

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

ధర్మశాల టెస్టు : భారత్­-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 8వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. 

 

10:48 - March 28, 2017

రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యరద్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, సీనియర్ విశ్లేషకులు, ది హిందూ రెసిసెండ్ ఎడిటర్ నగేష్ కుమార్, బీజేపీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన  పాల్గొని, మాట్లాడారు. రైతు సమస్యలను తీర్చడం కోసం ప్రభుత్వాలు కృషి చేయడం లేదన్నారు. రైతు ఆత్మహత్యలపై కమిటీలు వేస్తే సరిపోదన్నారు. వ్యవసాయ మహిళా కూలీల పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రెండో వికెట్ కోల్పోయిన భారత్

 

ధర్మశాల టెస్టు: భారత్-­ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగుల వద్ద పుజారా డకౌట్.

 

 

 

 

సిగ్గు, మానం ఉంటే రాజీనామా చేయాలి : రోజా

గుంటూరు : సిగ్గు, మానం ఉంటే మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న మంత్రులను సీఎం వెనకేసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నారాయణ తన జిల్లాలో ఉండగానే ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంపై ఆమె ఆనుమానం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావులను మంత్రి పదవి నుంచి భర్తరపు చేయాలని డిమాండ్ చేశారు.

 

ప్రశ్నాపత్రం లీకేజీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు: విద్యశాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించారు.

 

ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణకు ఆదేశం

గుంటూరు : పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణకు ఆదేశించామని సభలో తెలిపారు. నారాయణ విద్యా సంస్థలపై వైసీపీ కుట్రపూరిత ఆరోపణ చేస్తోతోందని ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కాలేదని మంత్రి స్పష్టం చేశారు. నారాయణ విద్యాసంస్థలకు అడ్డదారులు తోక్కాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

 

ఏపీ అసెంబ్లీ వాయిదా

గుంటూరు: ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా పడింది. టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానంపై స్పీకర్

చర్చకు నిరాకరించడంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ పట్టుపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు.  సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్ సభ 10 నిమిషాలు వాయిదా వేశారు.

 

ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా..

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. 

 

09:22 - March 28, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ద్రవ్య వినిమయ బిల్లు, చంద్రన్న బాట పథకం, గిరిజన సలహామండలి, పట్టిసీమ ఎత్తిపోతల ప్రయోజనాలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. క్వశ్చన్ అవర్ తర్వాత వాయిదా తీర్మానం చేపడతామని స్పీకర్ తెలిపారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే క్వశ్చన్ అవర్ తర్వాత వాయిదా తీర్మానం చేపడతామని చెప్పింది. కానీ వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. 
టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతి రోజు వృథా చేయడం సరికాదు. బీఏసీ నిర్ణయాలను గౌరవించాలి. తప్పుచేయడమే తమ హక్కు అన్న విధంగా వైసీపీ వైఖరి ఉంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధం. ప్రజల్లో చులకన అవుతామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
క్వశ్చన్ అవర్ కు అంతరాయం కలిగించడం భావ్యం కాదు. దీంతో సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదు. ప్రతి పక్షాలు కూర్చోవడం కంటే నిల్చున్న సమయం అధికం. ప్రతిపక్ష సభ్యులు అరుస్తున్నారు. జంతువులు ఒర్లినట్లు ఒర్లుతున్నారు. ప్రజాస్వామ్యంలో గొంతు ఎలా నొక్కుతారు. ప్రతిపక్ష నేతకు జాలి కలగడం లేదు.
మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి....
సమస్యలపై చర్చిండానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విలువైన సయయాన్ని ప్రతిపక్షం వృధా చేస్తోంది. వైసీపీ సభ్యులు అనేకసార్లు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు.

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ద్రవ్య వినిమయ బిల్లు, చంద్రన్న బాట పథకం, గిరిజన సలహామండలి, పట్టిసీమ ఎత్తిపోతల ప్రయోజనాలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

 

09:06 - March 28, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు, చంద్రన్న బాట పథకం, గిరిజన సలహామండలి, పట్టిసీమ ఎత్తిపోతల ప్రయోజనాలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:55 - March 28, 2017

టీ.ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని సీఐటీయూ నాయకురాలు, సీపీఎం మహాజన పాదయాత్ర బృందం ఎస్ రమ అన్నారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో రమతోపాటు ఆమె వెంకన్న పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణ ఆడబిడ్డ భారతదేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఆమె ఎవరో కాదు. వివిధ ప్రజాసమస్యలపై జనపథం కార్యక్రమంలో తన గళం వినిపించిన రమ. సిపిఎం నిర్వహించిన మహాజన పాదయాత్రలో 154 రోజుల పాటు 4200 కిలోమీటర్లు తెలంగాణను కాలినడకన చుట్టివచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం టి బంజర గ్రామంలో జన్మించిన రమ బాల్యం నుంచే విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. వామపక్ష భావాలున్న కుటుంబంలో జన్మించిన రమ విద్యార్థి దశలో పిడిఎస్ యు కార్యకర్తగా అనేక ఉద్యమాల్లో పాల్గొని, పోలీసు కేసులు సైతం ఎదుర్కొన్నారు. 2003 నుంచి ట్రేడ్ యూనియన్ రంగంలోకి ప్రవేశించిన రమ సిఐటియు నిర్మాణంలో కీలకంగా పనిచేస్తున్నారు. బీడీ కార్మికుల సమస్యలు, మధ్యాహ్న భోజనం వర్కర్ల సమస్యలు, వర్కింగ్ ఉమెన్ సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. రమ భర్త వెంకన్న నవ తెలంగాణ దిన పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. 5 నెలల పాదయాత్ర అనుభవాలను రమతో పాటు ఆమె భర్త వెంకన్న వివరించారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:39 - March 28, 2017

చిత్తూరు : టీటీడీ  వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై నియంత్రణ విధించింది. వచ్చే నెల 7 నుంచి పది వారాల పాటు శుక్ర, శని, ఆదివారాల్లో  ప్రముఖుల ఉత్తరాలపై మంజూరు చేసే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. ఈ మూడు రోజుల్లో ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోటులో పని చేస్తున్న 332 మంది, ఉగ్రాణంలో సేవలు  అందిస్తున్న  మరో 65 మంది కాంట్రాక్ట్‌  కార్మికులతోపాటు,  172 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సర్వీసులను ఏడాది పాటు పొడిగించారు. పలు కార్యక్రమాలకు నిధుల మంజూరు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
 

08:37 - March 28, 2017

గుంటూరు : మున్సిపల్ స్కూళ్లలో తెలుగు మీడియం చదివితే భవిష్యత్ కష్టమని మున్సిపల్‌ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ స్కూళ్లలో తెలుగు మీడియం చదివితే ఐఐటీలకు ఎంపిక కాలేరని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని అన్ని మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం బోధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రయోగాత్మకంగా  కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న ఇంగ్లీషు మీడియం బోధన సత్పలితాలివ్వడంతో మిగిలిన స్కూళ్లకు కూడా వర్తింప చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మున్సిపల్‌ స్కూళ్లలో తెలుగు మీడియం కొనసాగించాలంటూ కొన్ని సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను నారాయణ తప్పుపట్టారు. 

 

08:29 - March 28, 2017

గుంటూరు : ఏపీలో మరో రెండు నీట్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం విశాఖ, విజయవాడలకు తోడుగా కొత్తగా గుంటూరు, తిరుపతిల్లో నీట్‌  పరీక్షా కేంద్రాలు మంజూరు చేశారు. కర్నూలు, రాజమండ్రిలో కూడా నీట్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెబుతున్నారు. 
 

08:27 - March 28, 2017

హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 13 రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో  అధికారపక్షం తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించగా...   ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ఫోకస్‌ పెట్టాయి. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నంచగా.... అధికారపక్షం వాటికి సమాధానం చెప్తూ ధీటుగా ఎదుర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తంగా 5 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అయితే బడ్జెట్ సమావేశాలు నడిచిన తీరుపై విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. 
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్‌
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈనెల 10న గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగా...  13వ తేదీన ఆర్దికమంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  లక్షా 49వేల కోట్లతో ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్‌లో సంక్షేమం, కులవృత్తులకు పెద్దపీట వేసినట్టు అధికారపక్షం నొక్కి వక్కాణించింది. ముఖ్యంగా కులవృత్తులను ప్రోత్సహించడం లాంటి నూతన నిర్ణయాలను ఈ బడ్జెట్‌లో తీసుకున్నారు. 
అధికార , విపక్షాల మధ్య హాట్‌హాట్‌గా చర్చ
బడ్జెట్ సమావేశాల్లో వివిధ అంశాలపై అధికార విపక్షాల మధ్య చర్చ హాట్‌హాట్‌గా సాగింది. ఎంబీసీలపై చర్చ సందర్భంగా కేసీఆర్‌ - జానారెడ్డి మధ్య వాడీవేడీగా  చర్చ జరిగింది. బీసీల్లో వందకుపైగా కులాలున్నాయని.. వాళ్లలో ఎంబీసీలు ఎవరని గుర్తిస్తేనే న్యాయం జరుగుతుందని జానారెడ్డి  గట్టిగానే ప్రభుత్వానికి సూచించారు.  బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చుపై తాను గతంలో చెప్పిన వాటిని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాలంలో పెట్టేందుకు జానా ప్రయత్నించారు. ఎస్సీ,ఎస్టీ నిధులపై భట్టి విక్రమార్క, గీతారెడ్డి,  వ్యవసాయం, రైతురుణమాఫీ, మెడికల్‌, హెల్త్‌, ద్రవ్యవినిమయ బిల్లుపై జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకె అరుణ ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఇక మిషన్‌ భగీరథపై చర్చ సందర్బంగా మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగాయి. మొత్తానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెలగారడీగా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.  
కిషన్‌రెడ్డి, కేసీఆర్‌ మధ్య మాటలయుద్ధం
ఇక తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదంటూ సొంతపార్టీ నేతలపైనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అలకబూనడం చర్చనీయాంశమైంది.  జానా, ఉత్తమ్‌ జోక్యం చేసుకోవడంతో సంతప్‌ అలకవీడి సభకు హాజరయ్యారు. ఇక బీజేపీ సభ్యులు మొదల్లో కూల్‌గా ఉన్నా.. బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాత్రం దూకుడు ప్రదర్శించారు.  కిషన్‌రెడ్డి, కేసీఆర్‌ మధ్య మాటలయుద్ధం నడిచింది.  విద్యుత్‌పై చర్చ సందర్భంగా కూడా మంత్రి జగదీష్‌రెడ్డికి, బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య వార్‌ నడిచింది.  అధికారపక్షం సభను నడిపించిన తీరుపై బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అభిమానినన్న కేసీఆర్‌
బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ వాయిస్‌ వినిపించకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.  తొలిరోజు గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలారంటూ రేవంత్‌, సండ్రను బడ్జెట్‌ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేసి తన వైఖరేంటో స్పష్టం చేసింది.  టీడీపీకి ముఖ్యనేతలు సస్పెండ్‌ కావడంతో ఆపార్టీ  తరపున ఆర్‌. కృష్ణయ్య  చర్చల్లో పాల్గొన్నారు. ఇక కమ్యూనిస్టు సిద్ధాం తాలకు తాను పెద్ద అభిమానినన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. మావో, లెనిన్‌ చెప్పిన సిద్ధాంతాలను కమ్యూనిస్టులు పాటించడం లేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్ర అభ్యంతరం తెలిపారు. కమ్యూనిస్టులను అవహేళన చేస్తే ఊరుకునే సమస్యలేదని హెచ్చరించారు.
ఏకపక్షంగా సాగిన బడ్జెట్‌ సమావేశాలు
బడ్జెట్‌ సమావేశాలు మొత్తం ఏకపక్షంగానే సాగాయని చెప్పవచ్చు. ఈ మొత్తం సమావేశాల్లో అధికారపార్టీదే పైచేయిగా కనిపించింది. విపక్ష సభ్యులను కట్టడి చేసేందుకు గులాబీ పార్టీ ముందునుంచే పావులు కదిపింది. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలకు అధికార ఇబ్బందిపడకుండానే సమాధానం చెప్పింది.మొత్తానికి అధికార పార్టీ తాము రచించుకున్న వ్యూహాన్ని సభలో సమర్ధవంతంగా అమలు చేసింది. 
మొత్తం 13 రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు...
బడ్జెట్‌ సమావేశాలు మొత్తం 13 రోజులపాటు జరుగగా... 72 గంటల 33 నిమిషాలు చర్చ జరిగింది.  ఇక  65 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. 5 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 

 

08:21 - March 28, 2017

గుంటూరు : విజయవాడలో ఆర్టీఏ అధికారులపై టీడీపీ ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేసిన ఘటన అసెంబ్లీ లోపలా.. బయటా పెను దుమారం లేపింది. ఘటనకు కారకులైన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ... అసెంబ్లీ ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది.
సభలో గందరగోళం 
రవాణా శాఖ అధికారులపై దాడి చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన మధ్యే సభా కార్యక్రమాలను స్పీకర్‌ కొనసాగించారు.  
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన చెవిరెడ్డి నిరసన  
మరోవైపు ఇదే అంశంపై నల్ల దస్తులతో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెవిరెడ్డికి మద్దతుగా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బైఠాయించారు. చెవిరెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు పరామర్శించారు. టీడీపీ నేతల చర్యను విష్ణకుమార్‌రాజు తప్పుపట్టారు. 
చెవిరెడ్డి అరెస్టు    
అసెంబ్లీ ఆవరణలో బైఠాయించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు మంగళగిరి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు లోపలికి అనుమతించకుండా గేటు వేశారు. దీంతో గేటు దూకి పోలీసు స్టేషన్‌లోకి వెళ్లిన  గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డిని కలుసుకునేందుకు అనుమతించని పోలీసుల చర్యను నిరసిస్తూ వైసీపీ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ముందు  నిరసన వ్యక్తం చేశారు. 
ఆందోళన తర్వాత చెవిరెడ్డి విడుదల 
వైసీపీ సభ్యుల ఆందోళన తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. అయితే రవాణా శాఖ అధికారులపై దౌర్జన్యం చేసిన టీడీపీ ప్రజా ప్రతినిధులపై చర్య తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తానని చెవిరెడ్డి ప్రకటించారు.
దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం  
ఆర్టీఏ అధికారులపై దాడి చేసి క్షమాపణలు చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం అయినట్లు కాదని.. సీపీఎం మండిపడింది. విజయవాడ అంటే రౌడీయిజానికి మారుపేరులా అధికార పార్టీ నేతలు మార్చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు ప్రశ్నించారు. దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకుంటే.. రాబోయే రోజుల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మంగళగిరి పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు 
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంపై వైసీపీ నేతలు మంగళగిరి డీఎస్పీ, సీఐ, ఎస్సైలపై స్పీకర్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడమే కాకుండా.. ఆయనను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసు స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 

 

నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తేనేటీ విందు

హైదరాబాద్ : నేడు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనేటీ విందు ఇవ్వనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 

నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 
 

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

న్యూఢిల్లీ : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు, పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 

Don't Miss