Activities calendar

29 March 2017

21:31 - March 29, 2017

ఢిల్లీ : తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోందా? సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? కబాలి తమిళ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తలైవా రాజకీయ రంగప్రవేశంపై తమిళ ప్రజలు ఏమంటున్నారు? ఏప్రిల్‌ 2న కబాలి అసలు ఏం ప్రకటించబోతున్నారు? రజనీకాంత్‌... ఆ పేరే ఒక సంచలనం. క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి హీరో వరకు అంచెలంచెలుగా ఎదిగాడు రజనీకాంత్‌. తన స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతిసినిమాలో ఆయన చూపించే స్టైల్‌ వేరియేషన్‌తో పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్‌ ఉన్నారు. రజనీ స్టైల్‌, పంచ్‌ డైలాగులకోసమే ఆయన సినిమాలకు ప్రేక్షకులు వస్తారు. ముత్తు, బాషా, పెదరాయుడు, నరసింహా మొదలుకొని కబాలి వరకు ఆయన చూపించిన స్టైల్స్‌ థియేటర్స్‌లో వైబ్రేషన్స్‌ సృష్టించాయి. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు కురిపించాయి.

ఏప్రిల్‌ 2న అభిమానులతో రజనీ భేటీ..
రజనీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రం చేస్తారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. తమిళనాట రజనీ నేతృత్వంలో కొత్త పార్టీ రాబోతోందన్న ప్రచారం జోరందుకుంది. ఏప్రిల్‌ 2న అభిమానులను రావాలంటూ రజనీ నుంచి ఆహ్వానం వెళ్లింది. దీంతో దళపతి రాజకీయ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇదే తమిళనాట హాట్‌టాఫిక్‌గా మారింది.

రజనీ కీలక ప్రకటన చేసే ఛాన్స్‌?
రజనీకాంత్‌ పాలిటిక్స్‌లోకి రావాలంటూ ఆయన అభిమానులు రెండు దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నారు. కానీ కబాలి మాత్రం ఏనాడు రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. ముత్తు రాజకీయాల్లోకి వస్తే సొంతపార్టీతోనే రావాలనేది అభిమానుల కోరిక. తలైవా వేరేపార్టీలో చేరడమనేది అభిమానులు జీర్ణించుకోలేని అంశం. రజనీ రాజకీయాల్లోకి వస్తే అది సొంత పార్టీ ద్వారానే రావాలని కోరుకుంటున్నారు. అయితే అభిమానుల ఆశలకు బలం చేకూర్చేలా వారిని ఏప్రిల్‌ 2న రావాలంటూ రజనీ నుంచి పిలుపు అందింది. అజెండా ఏమిటనేది మాత్రం స్పష్టంగా తెలియదు. దీంతో రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అభిమానుల మధ్య కీలక ప్రకటన చేస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి తమిళుల తలైవర్‌.. రాజకీయ అరంగేట్రం చేస్తారా..? కొత్త పార్టీని ఏర్పాటుపై ప్రకటన చేస్తారా? లేక ఎప్పటిలాగే తూచ్‌ అంటారా..? ఇది తెలియాలంటే ఏప్రిల్‌ 2 వరకు ఆగాల్సిందే.

21:28 - March 29, 2017

ఢిల్లీ : వస్తు సేవల పన్ను బిల్లును లోక్‌సభ ఆమోదించింది. జీఎస్టీ బిల్లుపై ఏడు గంటలపాటు చర్చ జరిగింది. జిఎస్‌టి బిల్లును విప్లవాత్మకమైనదిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ఈ బిల్లు వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా జిఎస్‌టి బిల్లు గేమ్‌ చేంజర్‌ కాదని, ఇంకా పిల్ల దశలోనే ఉందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. జిఎస్‌టి అమలు ఆలస్యం కావడం వల్ల దేశం 12 లక్షల కోట్లు నష్టపోయిందని విమర్శించింది. జిఎస్‌టికి చెందిన సిజిఎస్‌టి, ఐజిఎస్‌టి, యూటీ జిఎస్‌టి, పరిహార చట్టాలకు సంబంధించిన 4 బిల్లులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌స‌భ‌లో చర్చను ప్రారంభించారు. ఇదో విప్లవాత్మక బిల్లు అని, దీని వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని జైట్లీ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం, సిఫార్సుల కోసం ఇప్పటి వరకు 12 సమావేశాలను నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్ టార్గెట్..
చర్చలో భాగంగా కాంగ్రెస్‌ బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. జీఎస్టీ బిల్లు అమ‌లు ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల దేశం సుమారు 12 ల‌క్షల కోట్లు న‌ష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ ఆరోపించారు. ప్రభుత‍్వం చెబుతున్నట్టుగా ఇది గేమ్‌ చేంజర్‌ కాదనీ, పిల్లదశ మాత్రమేనని చెప్పారు. జిఎస్‌టి బిల్లును రాజ్యసభ కంటే ముందే లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై మొయిలీ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభలో ఈ బిల్లుపై ముందుగా చర్చించకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యసభపై ఏ మాత్రం గౌరవం వున్నా బీజీపీ సభ్యులు రాజీనామా చేయాలని వీరప్ప మొయిలీ డిమాండ్‌ చేశారు. జిఎస్‌టి బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోది, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ లోక్‌సభకు హాజరయ్యారు. జిఎస్‌టి బిల్లును జులై 1 నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 12తో ముగియ నుండడంతో ఆలోపు జిఎస్‌టి 4 బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదింప జేసేందుకు యత్నిస్తోంది.

నాలుగు జీఎస్టీ బిల్లులకు ఆమోదం..

ఢిల్లీ : నాలుగు జీఎస్టీ అనుబంధ బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. సీజీఎస్టీ, సీఎస్ జీఎస్టీ, ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. జీఎస్టీ పన్ను రేటు 5 ,12, 18, 28 శాతాలుగా ప్రతిపాదించారు. వచ్చే నెలలో ఏ వస్తువును ఏ పన్ను శ్రేణిలో చేర్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం లోక్ సభ గురువారానికి వాయిదా పడింది.

21:20 - March 29, 2017

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంవో సరస్వతిపై వేటు పడింది. డీఎంఈకి ఆమెను సరెండర్‌ చేస్తూ మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడంతో మంత్రి లక్ష్మారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దాదాపు రెండుగంటలపాటు ఆస్పత్రి తిరిగి పేషెంట్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఓపీ విభాగంలో స్ట్రెచర్‌ లేకపోవడంతో ఆర్‌ఎంవోపై మండిపడ్డారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో భేటీ అయ్యారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. త్వరలోనే గాంధీలో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో నెలరోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

21:18 - March 29, 2017

హైదరాబాద్ : ఆర్ధికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏడాదికి 20వేల కోట్ల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రజలకు హేవళంబినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అటు రాజకీయ పార్టీ కార్యాలయాల్లోనూ ఉగాది వేడుకలను నిర్వహించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో ప్రజలంతా ఆనందంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌- జనహితలో హేవళంబి నామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందిన బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తాయని, దీంతో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ సక్సెస్‌ఫుల్‌గా సాగుతాయన్నారు. అయితే రాజకీయం కొంత ఆటపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ఓ ప్రముఖ నేతకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. దీంతో ఆ ప్రముఖ వ్యక్తి ఎవరన్నది చర్చనీయాంశమైంది.

వేడుకల్లో కేసీఆర్..
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.... తెలంగాణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, ఆర్ధికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఏడాదికి 20వేల కోట్ల ఆదాయం పెరుగుతోందన్నారు. అనేక అవస్థలు పడ్డ తెలంగాణ ఇవాళ సగర్వంగా తలెత్తుకొని నిలబడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మంచిరోజులు రాబోతున్నాయన్నారు. గత జనవరి మాసం నుంచే ఉత్తమ్‌కు యోగం ప్రారంభమైందని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుందని తెలిపారు. అనంతరం పంచాంగకర్తలను కాంగ్రెస్‌ నేతలు ఘనంగా సత్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఉగాది వేడకలు ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం చెప్పించారు. ఈ ఏడాదిలో బీజేపీకి యోగం బాగుందని పంచాంగకర్త తెలిపారు. అనంతరం బీజేపీ నేతలంతా ఉగాది పచ్చడి రుచిచూశారు. అందరూ పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తే విజయం సాధించడం కష్టమేమీకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో భవిష్యత్‌ మనదేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులుతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలంతా ఉగాది పచ్చడిని సేవించారు. త్వరలోనే టీడీపీకి మంచిరోజులొస్తాయని ప్రంచాంగకర్త తెలిపారు.

20:56 - March 29, 2017

తెలుగు తెరపై విభిన్నమైన విలనిజాన్ని పండించే నటుల్లో 'రావు రమేష్‌' ఒకరు. ఆయనకు వచ్చిన ప్రతి పాత్రను కొత్త తరహాలో నడిపిస్తుంటారు. హీరో..హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటిస్తూ మరోవైపు విలన్‌గా మెప్పిస్తున్నాడు.'అత్తారింటికి దారేది' సినిమాలో 'పవన్‌ కళ్యాణ్' కి మామయ్యగా నటించి సంగతి తెలిసిందే. తాజాగా 'పవన్ కళ్యాణ్' హీరోగా నటించిన 'కాటమరాయుడు' చిత్రంలో ఆయన నటించారు. ఈ సందర్భంగా సినిమా ముచ్చట్లను ఆయన తెలియచేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

పాక్ బౌలర్ పై నిషేధం..

పాకిస్తాన్ : బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏడాది నిషేధం విధించింది. అంతేగాకుండా 1000 అమెరికన్ డాలర్ల జరిమానాను విధించింది. పీఎస్ఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధిం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

20:19 - March 29, 2017

ఏ పూటకు ఆ పాట వాడుడు మనం రాజకీయనాయకుల దగ్గరనే జూశ్నం ఇన్నొద్దులు గని.. ఆఖరికి పంచాంగం జెప్పె అయ్యగార్లు గూడ అట్లనే తయ్యారైండ్రు.. వాళ్లు గూడ ఏ ఎండకు ఆ గొడ్గు వడ్తున్నరు.. పంచాంగం అనేది ఒక్కటే తీర్గ ఉండాలేగని పార్టీ ఆఫీసులు మారినప్పుడల్ల పంచాంగం మారుతదా..? కని మారుతున్నది మన అయ్యాగార్ల పుణ్యాన..సూడండి ఎలానో..

20:18 - March 29, 2017

ఏ పూటకు ఆ పాట వాడుడు మనం రాజకీయనాయకుల దగ్గరనే జూశ్నం ఇన్నొద్దులు గని.. ఆఖరికి పంచాంగం జెప్పె అయ్యగార్లు గూడ అట్లనే తయ్యారైండ్రు..కడ్పుల పిండం కడ్పుల ఉండంగనే.. బారసాల పండుగ జేశి బందవస్తు దావతిచ్చిండట ఎన్కటికి ఒకాయిన.. ప్రజాస్వామ్యాన్ని కూనీ జేస్తున్న మిమ్ములను ఏమనాలే చెప్పుండ్రి..మొన్న బోదన్ కాడ మెడలు దిర్గనాయిన ప్రభుత్వ ఆఫీసర్లను నోటికొచ్చినట్టు తిట్టెగదా..? అగో ఆ పంచాది ఇంకా అయిపోలే..ఘనతలు చెబుతున్న నేతలు ఈ సంగతి చూడండి..దేవుండ్ల పెండ్లిల జర్గిన పంచాది ముదిరి ముదిరి వేల ఏండ్ల సంది ఇంకా ముఠకక్షల రూపంల నడుస్తనే ఉన్నది..గొప్ప మహనీయుని పుట్టిన రోజు రావోతున్నదిగదా..? అందుకే అప్పుడె తెలంగాణ పల్లెలళ్ల ఆయన పండుగ సుర్వైంది

ముంబైలో డ్రోన్లు, గ్లైడర్లపై నిసేధం

ముంబై : మహా నగరంలో డ్రోన్లు, గ్లైడర్లపై పోలీసులు నిషేధం వింధించారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 29 వరకు నిషేధం వర్తింపు. గగనతల దాడుల దృష్ట్యా ముంబై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు .

 

కొడుకును చంపిన తండ్రి

కామారెడ్డి : జిల్లాలోని మడ్నూరు మండలం పెద్దటాక్లి గ్రామంలో ఓ తండ్రి కొడుకును కొట్టి చంపాడు. కుటుంబ కలహాల కారణంగా తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో తండ్రి కొడుకు తలపై కొట్టడంతో కొడుకు అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సింహాద్రి అప్పన్ప పాదాలను తాకిన సూర్య కిరణాలు

విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న పాదాలను సూర్యకిణాలు తాకాయి. ఏట ఉగాది రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకడం ఆనవాయితిగా వస్తుంది.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

గుంటూరు : గుంటూరులో ఘనంగా టీడీపీ 36వ ఆవిర్భావ వేడులకలు జరిగాయి. ఈ వేడకల్లో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నేతలను, కార్యకర్తలను సీఎం సన్మానించారు. ఎన్టీఆర్ స్పూర్తితో అనేక మంది రాజకీయల్లోకి వచ్చారని సీఎం అన్నారు.

 

 

ఇండియాన్ ఓపెన్ లో పీవీ సింధు విజయం

హైదరాబాద్ : ఇండియాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో పీవీ సింధు విజయం సాధించింది. అరుంధతి పంతవానెపై 21-27, 21-6 తేడాతో సింధు విజయం

యంత్రాలలో బంగారం రవాణా

చెన్నై : తమిళనాడులోని తీర ప్రాంతం వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి ఎలక్ట్రానిక్ యంత్రాలలో బంగారం రవాణా చేస్తూ నింధితులు డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రూ.4.7 కోట్ల విలువచేసే 16 కిలోల బంగారన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

18:42 - March 29, 2017

టాలీవుడ్ దర్శకుడు 'పూరి జగన్నాథ్' ‘రోగ్' తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. 'ఇడియట్' తరువాత మళ్లీ 'రోగ్' టైటిల్ కింద 'మరో చండిగాడి ప్రేమకథ' అని ట్యాగ్ లైన్ పెట్టారు. కొత్త హీరో 'ఇషాన్' వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. ఇషాన్ సరసన మన్నారా చోప్రా, ఏంజెలినా నటించారు. మార్చి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో..హీరోయిన్లతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా వారి వారి అనుభవాలను తెలియచేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:37 - March 29, 2017
18:36 - March 29, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో హేవళంబి నామ సంవత్సర ఉగాది పర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఉగాది వేడుకను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా విజయవాడలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

తుమ్మలపల్లి..
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. దేవాదాయ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు మంత్రులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. కళాకారులు ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన 90 మంది ప్రముఖులకు చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందజేశారు. మరో 40 మందికి కళారత్న అవార్డులు ప్రదానం చేశారు. వేదాంతం రాజగోపాలచక్రవర్తి పంచాగశ్రవణం చేశారు. హేవలంబి నామ ఉగాది సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా నిర్విగ్నంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌... ముఖ్యమంత్రి చంద్రబాబును ముద్దాడి అందరి దృష్టికి ఆకర్షించారు.

లోటస్ పాండ్ లో..
హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పార్టీ అధినేత జగన్‌తోపాటు, నాయకురాలు లక్ష్మీపార్వతి, పలువురు నేతలు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేసిన రామచంద్రశాస్త్రి.... ఏపీ మంత్రివర్గంలో నారా లోకేశ్‌ చేరికతో చంద్రబాబు ఆధిపత్యానికి తెరపడినట్టేనని రాజకీయ పంచాంగాన్ని వినిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు పార్లమెంటు భవన్‌ వద్ద కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాదాస్‌ హత్వాలే, ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌తోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, అధికారులు, అనధికారులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంతోపాటు రాజకీయ పార్టీల కార్యాలయాలల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.

18:31 - March 29, 2017

విజయవాడ : కుర్చీ ఎక్కేదాకా ఒక మాట.. ఆ తర్వాత మరోమాట.. ఏపీ సీఎం చంద్రబాబుపై మహిళలు మండిపడుతున్నారు. సీఎంగా చేసిన తొలి ఐదు సంతకాల్లో భాగంగా బెల్ట్ షాపులు తొలగించేందుకు కూడా ఆదేశాలిచ్చారు. కాని ఇచ్చిన మాటను గట్టుమీద పెట్టినట్టు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు సంఖ్యను పెంచడానికి సీఎం మరోసారి సిద్దమవతున్నారు. రహదారులకు 500 మీటర్ల దూరంగా మద్యంషాపులను నెట్టేయాలని సుప్రీంకోర్టు చెబుతున్న నేపథ్యంలో.. రహదారులను వదిలేసి.. ఇళ్లమధ్యలో మద్యాన్ని ఏరులై పారించడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందనే విర్శలు వస్తున్నాయి. బాబువస్తే జాబువస్తుందంటూ ఎన్నికల ప్రచారం ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబులు ఇవ్వడం సంగతి అటుంచి.. కొత్త మద్యంపాలసీతో యువతను మద్యానికి బానిసలుగా మార్చేందుకు సిద్ధమయ్యారనే యూత్‌ ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.

499 షాపులు..మరో 46 షాపులు..
అధికారం చేపట్టిన తొలిరోజు.. సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకాల్లో భాగంగా రాష్ట్రంలో బెల్టుషాపులను ఎత్తేస్తూ ఆదేశించారు. తర్వాత ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. సందుల్లో గొందుల్లో ఎక్కడబడితే అక్కడే బెల్డుషాపులు వెలిశాయి. రాత్రి పగలు లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఊరిలో వీధి వీధినా.. తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారు. స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాల సమీపంలో మద్యంషాపులకు అనుమతి ఇవ్వడంతో.. ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో, ఇళ్లమధ్యన వైన్‌షాపులు తీసేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. పైగా అన్ని జిల్లాల్లో మద్యంషాపులను పెంచడానికి కొత్త మద్యంపాలసీని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. ఒక్క తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఇప్పటికే 499షాపులు నిర్వహిస్తుండగా తాజాగా మరో 46 మద్యంషాపులకు అనుమతులిచ్చారు.

స్వర్ణాంధ్రప్రదేశ్‌ అంటూ..
స్వర్ణాంధ్రప్రదేశ్‌ అంటూ రంగుల ప్రపంచాన్ని కళ్లకు కట్టిన చంద్రబాబు .. రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మారుస్తున్నారని మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. మద్యం అమ్మకాలతో కాసులు లెక్కబెట్టుకుంటున్న ఏపీ సర్కార్‌.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 24గంటలపాటు దుకాణాలు తెరిచి అమ్మకాలు సాగిస్తుండగా.. అదీ చాలదన్నట్టు టార్గెట్లుపెట్టిమరీ స్వయంగా అధికారులే మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో మహిళపై దాడులు పెరిగి.. నేరాల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలవడం గ్యారెంటీ అంటూ విమర్శిస్తున్నాయి మహిళాసంఘాలు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని మహిళలు కోరుతున్నారు. జనావాసాల మధ్య మందుషాపులను ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామంని మహిళాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఖాతాదారులకు ఎస్ బీఐ బంపర్ ఆఫర్

ముంబయి : ఎస్ బీఐ తమ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నా తమ ఖాతాదారులకు ఉచిత క్రెడిట్ కార్డులు అందిస్తామని ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. ఖాతాలో రూ.20 నుంచి రూ.25వేల వరకు నిల్వ ఉంచుతున్న వినియోగదారులు ఈ ఉచిత క్రెడిట్ కార్డులు పొందోచ్చని ఆమె తెలిపారు.

 

ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఢిల్లీ : ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక బిల్లుకు కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్, సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. సవరణలపై ఓటింగ్ అనంతరం ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది.

కర్ణాటక మాజీ సీఎంపై సుప్రీం కోర్టు విచారణ..

ఢిల్లీ : ఇనుప గనుల తవ్వకాల కేసుపై సుప్రీకోర్టులో విచారణ జరిగింది. కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్, కుమారస్వామిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సిట్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రొసిడింగ్ పై స్టే విధిస్తూ ఎలాంటి తీర్పు ఇవ్వకూడదన్న సుప్రీం కోర్టు, 3 నెల్లల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు కోర్టు ఊరటనిచ్చింది. 

17:37 - March 29, 2017

భద్రాద్రి : భద్రాద్రిలో ఇవాళ్టినుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి... 14 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. తొలిరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ, పంచాంగ శ్రవణం, తిరువీధిసేవ జరుపుతారు. ఏప్రిల్1న ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. 5న మిథిలా ప్రాంగణంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు. మరుసటి రోజు 6న శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. 10న వసంతోత్సవం, 11న చక్రతీర్ధం తదితర పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

గవర్నర్..కేసీఆర్..ల రాక..
బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని అధికారులు సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్‌లైట్లతో రామాలయం పరిసరాలు శోభాయమానంగా మారాయి. సీతారాముల కల్యాణ మహోత్సవం, శ్రీరామపట్టాభిషేకాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది 2లక్షలకు పైగా భక్తులు శ్రీ సీతారాములవారి కల్యాణానికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల కోసం పట్టణంలో తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ చర్యలు చేపడుతోంది. కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌లు హాజరు కానున్నారు.

ఏర్పాట్లు..
కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బస్సులలో ప్రయాణించే వారికి స్వామివారి తలంబ్రాలు అందజేయనున్నారు. రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా కల్యాణ మండపంలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ టిక్కెట్ల బుకింగ్‌ కొరకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏర్పాట్లను దేవస్థానం ఈవో రమేబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లక్ష మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ కలిపిన నీరును అందుబాటులో ఉంచనున్నారు.

17:34 - March 29, 2017

ఖమ్మం : చేతిలో సంచి, మాసిన పంచె, తల చుట్టూ చెట్ల ప్రాధాన్యం చెప్పే కవచం. ఎవరెంత హేళన చేసినా వనంతోనే జనం అని గట్టిగా నమ్మారు. తనకు నచ్చిన దారిలో వెళ్లారు. తాను నడిచిన దారి వెంట లెక్కలేనన్ని మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం, నాటిన వాటికి నీళ్లు పోయటం ఇదే ఆయన దినచర్య. వన పోషణ కోసం చివరకు కుటుంబం, పిల్లల పోషణనూ పక్కనబెట్టారు. అతని వనదీక్షను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. కోటికి పైగా మొక్కలు నాటి పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న డాక్టర్ రామయ్యపై 10టీవీ ప్రత్యేక కథనం.

మొక్కలు నాటడం అలవాటు..
ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన దరిపల్లి లాలయ్య, పుల్మ దంపతుల కుమారుడు దరిపల్లి రామయ్య. రామయ్య 5ఏళ్ల వయస్సు నుంచే మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు. వివాహం అనంతరం కుటుంబంతో రెడ్డిపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. పర్యావరణ సంరక్షణకు మొక్కల పెంపకమే ఏకైక మార్గమనే తలంపుతో మొక్కలు నాటేవారు. ప్రస్తుతం తనకున్న నాలుగు ఎకరాల భూమిలో కూడా మొత్తం మొక్కలనే నాటారు. ఇలా 5 ఏళ్ల వయస్సు నుంచి ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటి ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. ఖాళీ పాత్రలు కనిపిస్తే చాలు అందులో మట్టిపోసి ఓ మొక్కను నాటుతారు. నాటడమే కాదు వాటిని బతికించటంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. రహదారుల వెంట విత్తనాలు సేకరిస్తూ ఖాళీ స్థలాల్లో చల్లుతుంటారు.

కూతుళ్లు..కొడుకులకు మొక్కల పేర్లు..
వనజీవి రామయ్య కేవలం మొక్కలను నాటి వాటిని పెంచటమే కాకుండా అద్భుతమైన శిల్పి కూడా ఇంటి వద్ద గ్రానైట్ రాళ్లపై అద్భుతమైన శిల్పాలను కూడా చెక్కారు. ఆ శిల్పాలపై దేవుని చిత్రాలతో పాటుగా వృక్షోరక్షతి రక్షిత: అంటూ నినాదాలు కూడా చెక్కుతుంటారు. దరిపల్లి రామయ్య ఇంట్లో ప్రతి వస్తువుపై వృక్షో రక్షతి రక్షిత: అనే నినాదాలు ఉంటాయి. గోడలపైన , తలుపుల పైనా , ఇంట్లో ప్రతి వస్తువుపై మొక్కల నినాదాలే . తన కుమారుడు , కూతురు వివాహాలకు తయారు చేయించిన శుభలేఖలపై సైతం మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించాలంటూ ముద్రించారు. రామయ్య కృషిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2000వ సంవత్సరంలో టీవీఎస్ మోపెడ్ బహుమనంగా ఇచ్చారు. అలాగే బండి పెట్రోల్‌కు నెలకు 1500 రూపాయలు ఇచ్చేవారు. దీంతో ఆ బండిపై రామయ్య తిరుగుతూ మొక్కల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. తరువాత ప్రభుత్వాలు మారడంతో ఖర్చులను భరించలేక సైకిల్‌పైనే ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు ఓ వాహనం ఇస్తే గ్రామం గ్రామం తిరిగి మొక్కల గురించి ప్రచారం చేస్తానంటున్నారు వనజీవి. విశేషం ఏమిటంటే తన కుమారుల, కూతుళ్లకూ మొక్కల పేర్లనే పెట్టారు. అలాగే తనకు ఉన్న నలుగురు మనవరాళ్లకు కబందపుష్పం, చందన పుష్పం, వనశ్రీ, హరితారణ్య అంటూ నామకరణం చేశారు.

17:29 - March 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు చేసే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కాంగ్రెస్ నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాశంమైంది. ఉగాది పండుగ రోజున నేతలు నంది ఎల్లయ్య, డీకె అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీ తదితరులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధి, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులపై వారు కేసీఆర్ తో చర్చించారు. వెంటనే పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులు డిజైన్ల పై కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

సమైక్య పాలకుల నిర్లక్ష్యంతోనే..
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని, 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని కేసీఆర్ వారికి తెలిపారు. పాలమూరు జిల్లాను గోదావరి జిల్లాకు ధీటుగా తయారు చేయడం జరుగుతుందని, గోదావరి, కృష్ణా నదుల్లోని నీటిని సద్వినియోగం చేసుకుంటే ఇరు రాష్ట్రాలకు పుష్కలంగా నీళ్లివ్వొచ్చని చంద్రబాబు నాయుడికి చెప్పడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నీటిని సద్వినియోగం కోసం సమగ్ర జల విధానం రూపొందిస్తున్నట్లు తెలిపారు. భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిచ్చిందని వారికి కేసీఆర్ తెలిపారు. గద్వాల్ - మాచెర్ల రైల్వే లైన్ చేపట్టాలని కేంద్రాన్ని కోరడం జరిగినట్లు మరోసారి ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి ప్రభుని కలుస్తానని హామీనిచ్చారు. అంతేగాకుండా గద్వాల్ లో హాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, మరిన్ని సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే కేసీఆర్ తో వీరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం జిల్లా అభివృద్ధి కోసమే చర్చించారా ? ఇతర రాజకీయ అంశాలు ఏవైనా ఉన్నాయ అనేది తెలియరాలేదు.

హైవేకి 500 మీటర్ల దూరంలోనే మద్యం షాపులు : సుప్రీం

ఢిల్లీ : హైవేలపై మద్యంషాపుల నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 500మీటర్ల పరిధిని తగ్గించాలని మద్యం దుకాణాల సంఘం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం హైవేకి 500మీటర్ల దూరంలో మద్యంషాపులు నడపాలని స్పష్టం చేసింది

 

 

 

17:21 - March 29, 2017

హైదరాబాద్ : నగరాలు మహానగరాలుగా మారుతున్నాయి. బస్సులు పెరిగిపోతున్నాయి. ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు పెరగడం లేదు. నగరాభివృద్దిలో భాగంలో మోడ్రన్‌ బస్టాపులు నిర్మిస్తామన్నారు. బస్‌బేలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అవన్నీ ఉట్టి ప్రకటనలకే పరిమితమని తేలిపోయింది. ఓవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు బస్టాపులలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రయాణం అంటేనే భయమేస్తోంది. ఓవైపు పాడైన రోడ్లు.. మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసంతో కూడుకున్న పని. సాధారణంగా బస్టాప్‌లలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప ఆర్టీసీ బస్సులు దొరకని పరిస్థితి. అయితే.. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు
హైదరాబాద్‌లో ఏళ్లు గడుస్తున్నా బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రం పూర్తి కావడంలో లేదు. 2008లో ఆర్టీసీ బస్సు షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది. నగరంలో మొత్తం 1832 బస్టాప్‌లు అవసరమని గుర్తించిన ఆర్టీసీ అధికారులు... ప్రతిపాదనలను బల్దియాకు పంపారు. యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు. అయితే.. బస్సు షెల్టర్ల నిర్మాణానికి ఐదు సార్లు టెండర్లు పిలిచినా కేవలం... 840 బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ ప్రాంతాల్లో బస్సు షెల్టర్ల నిర్మాణానికి యాడ్‌ ఏజెన్సీలు ముందుకు వచ్చినా.. ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తుందో అక్కడ మాత్రమే బస్సు షెల్టర్లు నిర్మించి మిగతావాటిని వదిలేశారు.

35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పైగా ఉండడంతో ప్రయాణికులు బస్టాప్‌లలో నిలబడాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ నుండి రక్షణ కోసం చెట్లు, భవనాల నీడలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు బస్టాప్‌లలో క్షణం పాటు బస్సులు నిలపకపోవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 100 రోజుల్లో నగరంలో 50 ప్రాంతాల్లో బస్‌బేలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మెట్రో రైలు పనుల కారణంగా రోడ్డు వైడనింగ్‌లో ఉన్న బస్సు షెల్టర్లను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

17:12 - March 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి ఈ ఏడాదంతా శుభాదిపత్యమేనని శృంగేరి పీఠానికి చెందిన బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి తెలిపారు. జనహితలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. రాష్ట్రంలో కర్షక అనుకూల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి సూచించారు. సాఫ్ట్‌వేర్ రంగం మందకొడిగా ఉంటుందన్నారు. కావేరి నదికి ఈసారి పుష్కరాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని పేర్కొన్నారు.

మెరీనా బీచ్ లో యువకుల ఆందోళన

చెన్నై: మెరీన బీచ్ లో యువకులు ఆందోళన నిర్వహించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జలదీక్ష చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ తో పాలమూరు కాంగ్రెస్ నేతల సమావేశం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో పాలమూరు కాంగ్రెస్ నేతల సమావేశం అయ్యారు. సమావేశంలో నంది ఎల్లయ్య, డీకె అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులు డిజైన్ల పై కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 121 పాయింట్లు లాభపడి 29,531 వద్ద ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 9,143 వద్ద ముగిసింది. భారత్ స్టేజ్(బీఎస్)-3 వాహనాలపై సుప్రీం నిషేధం విధించడంతో ఆటో మొబైల్ రంగం షేర్లు నష్టపోయాయి.

సాగునీటి ప్రాజెక్టుల పై కేసీఆర్ సమిక్ష

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమైఖ్య పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరు వలస జిల్లాగా మారిందని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 18లక్షల ఎకరాలకు నీరిస్తామని సీఎం ప్రకటించారు.

16:36 - March 29, 2017

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే వరుసుగా గాంధీ ఆసుపత్రిలో పలు ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉగాది పండుగ రోజున మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ 2 ఆసుపత్రికి చేరుకున్నారు. ఉదయం 11గంటల నుండి తనిఖీలు మొదలు పెట్టారు. ఆసుపత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు పడింది. డీఎంఈకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా వహిస్తే ఎవరినీ కూడా ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు. అనంతరం అధికారులు..ఉద్యోగులు..ఇతరులతో మంత్రి మాట్లాడారు. గాంధీలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు.

16:10 - March 29, 2017

ప్రకాశం : మద్యం సేవించాలని అనుకుని ఓ కూల్ డ్రింక్ కొనుక్కొని తాగిన ఓ యువకుడు సృహ కోల్పోయాడు. ఈఘటన చీరాలలో చోటు చేసుకుంది. అన్వేష్ ప్రసాద్ అనే యువకుడు చీరాలలో ఉన్న మద్యం దుకాణం వద్దకు బుధవారం మధ్యాహ్నం వచ్చాడు. అనంతరం కూల్ డ్రింక్ తీసుకుని తాగాడు. కాసేపటికే నోరంత బంకగా మారడం..పెదాలు కూడా తెరచుకోలేదు. ఇదంతా చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ యువకుడికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఆ ఆధార్ సంస్థ పై చర్యలు

ఢిల్లీ : భరత్ క్రికెటర్ ధోని ఆధార్ వివరాలను బహిర్గతం చేసిన వ్యవహరంలో యూఐడీఏఐ సదరు సంస్థపై వేటు వేసింది.ధోని వివరాలను బయటకు తెలిపిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ సీ)ను పదేళ్ల పాటు బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్టు యూఐడీఏఐ చీఫ్ ఏబీ పాండే బుధవారం ప్రకటించారు.

15:48 - March 29, 2017
15:45 - March 29, 2017

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందని..ప్రతి సంవత్సరం 15 నుంచి 20వేల కోట్లు అదనంగా ఆదాయం సమకూరగల రాష్ట్రం..తెలంగాణ అని మనకు తేలిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతుందని.. వేదపడింతులు చెబుతున్నారని కేసీఆర్‌ అన్నారు. కచ్చితంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

15:43 - March 29, 2017
15:41 - March 29, 2017

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పండితులు అందించిన ఉగాది పచ్చడిని చంద్రబాబు తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ రంగాల్లోని 86 మందికి, కళా రంగంలో 39 మంది ప్రముఖులకు ఉగాది పురస్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు..

ఆలోచిస్తూనే ఉండాలి..
సమాజం కోసం  అనునిత్యం ఆలోచిస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులు, అధికారులకు పిలుపునిచ్చారు. విజయవాడలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.  మనిషి జీవతంలోనూ , జీవితానంతరం సమాజంలో నిలిచిపోయే పనులు చేయాలని బాబు అన్నారు.  మంత్రులు, అధికారులు నిత్యం ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరగాలని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

15:39 - March 29, 2017

విజయవాడ : అమరావతి చుట్టూ 186 కి.మీ. పొడవున రింగు రోడ్డు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు, కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి దారితీసే ఏడు రోడ్ల నిర్మానానికి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎర్రబాలెంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తొమ్మిది నగరాలు, 27 టౌన్‌షిప్‌లను కలుపుతూ ఈ రింగు రోడ్డు ఉంటుందని ఉంటుందని చెప్పారు. వచ్చే ఉగాది నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆరు జాతీయ రహదారులను కలిపే విధంగా 915 కోట్లతో ఈ రోడ్లను నిర్మిస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు రింగు రోడ్డు నిర్మాణం అంశాన్ని ప్రస్తావించారు.

వరంగల్ లో పాస్ పోర్ట్ కేంద్రం ప్రారంభం

వరంగల్: ఉగాది రోజు వరంగల్ ప్రజలకు పాస్ పోర్ట్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.హన్మకొండలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు.

 

బీఎస్-3 వాహనాలపై సుప్రీం నిషేధం

ఢిల్లీ : ఏప్రిల్ 1 తర్వాత భారత్ స్టేజ్ (బీఎస్)-3 వాహనాల విక్రయాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆటో మొబైల్ సంస్థల ప్రయోజనాల కన్నా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

15:12 - March 29, 2017

చెన్నై : సినిమాల వరకు మాత్రమే పరిమితమైన సూపర్ స్టార్ 'రాజకీయ నేత'గా మారనున్నారా ? గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అనేక వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటినీ సున్నితంగా ఆయన తిరస్కరిస్తూ వస్తున్నారు. కానీ ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారా ? అని లక్షలాది మంది అభిమానులు ఎదురు చూస్తూ వస్తున్నారు. ఆయన ఎవరో కాదు..’రజనీకాంత్'...తమిళనాడులో 'జయలలిత' మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభాన్ని భర్తీ చేసేందుకు వివిధ పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 'రజనీకాంత్' రాజకీయాల్లో రావాలని అభిమానులు..ఇతరుల నుండి వత్తిడి వస్తోంది. కానీ దీనిపై మాత్రం 'రజనీ' స్పందించలేదు. తాజాగా అభిమానులందరూ చెన్నైకి రావాలని 'రజనీ' పిలుపునిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో అన్ని జిల్లాల్లో ఉన్న అభిమానులకు ఈ మేరకు సంకేతాలు వెళ్లాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అభిమానులతో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని 'రజనీ' నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

చెన్నైకి రావాలని అభిమానులకు రజనీ పిలుపు..

చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా ? ఏప్రిల్ 2వ తేదీన చెన్నైకి రావాలని అభిమానులకు రజనీకాంత్ పిలుపునిచ్చారు.

అమరావతి కొత్త చరిత్రకు నాంది : సీఎం చంద్రబాబు

గుంటూరు : అమరాతిలో 7 ప్రధాన రోడ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఏడాది లోపు ఏడు రోడ్లు పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతిని మళ్లీ రాజధానిగా ప్రకటించి కొత్త చరిత్రకు నాంది పలికామని ఆయన అన్నారు. మూడేళ్ల ముందు ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని ఎవరూ అనుకోలేదని, కొందరు రాజధానిపై వివాదాలు సృష్టించాలని ప్రయత్నాం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

భూసేకరణ సవరణల వల్ల ప్రజలకు అన్యాయం : పి.మధు

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో భూసేకరణ చట్టంపై చర్చ జరగకుండా సమరణలు ఆమోదించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. సవరణలతో రైతులు, నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లింపు అధికారలు కలెక్టర్ కు కట్టబెట్టడం కేంద్ర చట్ట స్పూర్తికి విరుద్ధమని అన్నారు. 100 ఎకరాల లోపు సేకరిస్తే నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ వర్తంచకుండా చేయడం అన్యాయామని, భూసేకరణ చట్ట సవరణలకు వ్యతిరేకంగా రైతులు , వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

14:36 - March 29, 2017

ఫిబ్రవరి చివరి వారం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలు పెట్టారు. మార్చి నెలాఖరు రోజుల్లో ఎండలు మరింత ముదురుతున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండలో వెళ్లడం ద్వారా పలు చర్మ..ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వచ్చు.

  • ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా జ్యూస్ లు తీసుకోవాలి.
  • ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకండి. గొడుగు, సన్ స్ర్కీన్ లోషన్స్, క్యాప్..వదులైన దుస్తులు ధరించాలి.
  • తేలికైన వదులుగా ఉన్న లేత రంగుల వస్త్రాలు ధరించాలి.
  • ఆల్కాహాల్, కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్ కు కారణమవుతాయి. వీలైనంత వరకు వేసవిలో వాటికి దూరంగా ఉండాలి.
  • ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది.
  • రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. వడదెబ్బ తగిలిన వెంటనే వైద్యుడిని సంప్రదించడి.

నోయిడాలో విదేశీయురాలిపై దాడి

ఢిల్లీ: దేశంలో విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ సమీపంలో కెన్యా మహిళపై స్థానికులు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఎటువంటి గొడవ లేకుండా స్థానికులు కొందరు తనపై దాడికి పాల్పడ్డారంటూ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.

14:25 - March 29, 2017

పండుగ..పుట్టిన రోజు..ఇతర ముఖ్యమైన సందర్భాల సమయాల్లో ఆయా చిత్రాల ఫస్ట్ లుక్స్..టీజర్స్..ప్రచార చిత్రాలను దర్శక, నిర్మాతలు విడుదల చేస్తుంటారు. తమ అభిమాన నటులు ఎలా ఉన్నారు..లుక్స్ ఎలా ఉన్నాయి..టీజర్..ట్రైలర్..ఎలా ఉన్నాయి అనే దానిపై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. వీరి ఉత్సాహానికి అనుగుణంగా దర్శక, నిర్మాతలు..హీరోలు..హీరోయిన్లు తమ చిత్రాలకు సంబంధించిన లుక్స్ ను విడుదల చేస్తుంటారు. కానీ మురుగదాస్..మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన లుక్స్ కాని ఎలాంటి విడుదల కావడం లేదు. కనీసం 'ఉగాది' పండుగకైనా 'మహేష్' లుక్స్ విడుదలవుతాయని అభిమానులు ఆశించారు. కానీ ఎలాంటి లుక్స్ విడుదల కాకపోవడంతో అభిమానులు కాసింత నిరుత్సాహానికి గురయ్యారని టాక్. షూటింగ్ చివరిదశకు చేరుకుందని, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'వియత్నాం'లో జరుగుతోందని తెలుసుస్తోంది. వియత్నాంలో షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఏప్రిల్ 2వ తేదీ నాటికి చెన్నైకి చిత్ర యూనిట్ రానుందని తెలుస్తోంది. ఈ సమయంలోనే 'మహేష్' చిత్రానికి సంబంధించిన వివరాలు చిత్ర యూనిట్ తెలియచేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. సామాజిక అంశాలను తెరకెక్కించే 'మురుగదాస్' ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక కోణాన్ని తీసుకున్నారనేది తెలియడం లేదు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా 'రకుల్' నటిస్తోంది.

  

   

14:17 - March 29, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నితిన్' ఒకరు. ‘అ..ఆ' సినిమా విజయవంతం అనంతరం నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను రాఘవపూడి' దర్శకత్వంలో 'నితిన్' హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రానికి ‘రాఘవపూడి' దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొనసాగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ సినిమాలో 'నితిన్' సరసన 'మేఘ ఆకాష్' హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ కు ఇది 24వ సినిమా. ఉగాది పండుగ సందర్భంగా దీనికి సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. 'నితిన్' ఇమేజ్‌కి సరిపోయేలా తన స్టైల్లో హను రాఘవపూడి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

14:04 - March 29, 2017

అక్కినేని నాగార్జున తనయుడు 'అక్కినేని నాగచైతన్య' నటిస్తున్న తాజా చిత్రం సైలెంట్ గా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిష్టర్ అయ్యిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇవన్నీ నిజమని తేలింది. ఎందుకంటే 'ఉగాది' పండుగ సందర్భంగా 'నాగచైతన్య' నటిస్తున్న కొన్ని లుక్స్ విడుదలయ్యాయి. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో నాగ్ తన ట్విట్టర్ లో లుక్స్ ని పోస్టు చేశారు. విడుదల చేసిన రెండు లుక్స్ లో మొదటిది తనది అని, రెండోది కళ్యాణ కృష్ణదని నాగ్ పేర్కొన్నారు. ఒక పోస్టర్ లో చైతూ గంభీరంగా ఉంటే..రెండో పోస్టర్ లో టైటిల్ కు తగ్గట్టు చైతూ, రకూల్ ప్రీత్ సింగ్ లున్నారు. మరి ఈ రెండు పోస్టర్ లలో అభిమానులకు ఏవి నచ్చుతాయో చూడాల్సిందే.

జీఎస్టీ ఆలస్యం వల్ల రూ.12 లక్షల కోట్ల నష్టం : వీరప్ప మొయిలీ

ఢిల్లీ : లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా వీరప్ప మొయిలీ మాట్లాడుతూ ఈ బిల్లు ఆలస్యం వల్ల దేశం రూ.12 లక్షల కోట్లు నష్టపోయిందని ఆయన ఆరోపించారు. బిల్లు తీసుకురావడానికి కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు ప్రయత్నాలు చేసిందిని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నుంచి జీఎస్టీ ఐడియాను బీజేపీ తస్కరించిందని అన్నారు.

స్మగ్లర్ సంగీత చటర్జీకి 14 రోజుల రిమాండ్

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సంగీత చటర్జీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సంగీత చటర్జీని చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు.

13:23 - March 29, 2017

హైదరాబాద్ :లోటస్ పాండ్ వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు జగన్, ఆ పార్టీ నేత లక్ష్మీ పార్వతి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు హాజరైయారు. ఈ సందర్భంగా జగన్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ

ఢిల్లీ : లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ ప్రారంభం. జీఎస్టీ బిల్లుపై చర్చను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. జీఎస్టీ బిల్లు ఓ విప్లవాత్మక ముందడుగని, ఈ బిల్లుతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

12:55 - March 29, 2017

హైదరాబాద్: అభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీహేవళంబి నామ సంవత్సరం ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని కేసీఆర్‌ అన్నారు. కొత్త ఏడాది అద్భుత ఫలితాలు ఇస్తుందని.. మూడొంతులు శుభాధిపత్యమే ఉంటుందని పండితులు చెప్పారన్నారు. ఈసారి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. 

కూచిపూడికి పూర్వవైవభం : సీఎం చంద్రబాబు

విజయవాడ : కూచిపూడికి పూర్వవైభం తెచ్చేందుకు రూ. 100 కోట్లతో నాట్యరామం ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.అలాగే తెలుగు భాష అభివృద్ధికి తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

 

12:38 - March 29, 2017

హైదరాబాద్: ప్రగతిభవన్‌లోని జనహితలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో పంచాంగ పఠన కార్యక్రమం జరుగనుంది. వేడుకకు సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, పలువురు రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి స్వాగతోపన్యాసం చేశారు. వేద పండితులు సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచనం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ లో 21% గ్రోత్ ఉందన్నారు. 3500పరిశ్రమలతో 2లక్షల మంది పై చిలుకు ఉద్యోగ కల్పన ఇవ్వనున్నారు. సంక్షేమంలో అగ్రస్థానంలో ఉంటూ పురోగమిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. 

వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

హైదరాబాద్ : వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. వేడుకలకు జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు హాజరైయారు.

ఖమ్మంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం

ఖమ్మం : జిల్లా రూరల్ మండంలో మద్దపలపల్లిలో 26 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. అనంతరం అబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు.

బీజేపీ కార్యాలయంలో ఉగాది సంబురాలు

హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. వేద పండితులతో పంచాంగ శ్రవణ పఠనం జరిగింది. సంబురాలకు దత్తాత్రేయ, లక్ష్మణ్, మురళీధర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైయారు.

 

టీటీడీ గోవింద, తిరుమల యాప్ ల ఆవిష్కరణ

చిత్తూరు: తిరుమల టీటీడీ మొబైల్ యాప్ లను ఆలయ ఈవో ఆవిష్కరించారు. గోవింద,తిరుమల పేరిట మొబైల్ యాప్ లు ప్లేస్టోర్ లో లభించనున్నాయి.

 

లోక్ సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ఢిల్లీ: లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యాక్రమం చేపట్టింది.

మణిపూర్‌లో పేలుడు..

హైదరాబాద్: మణిపూర్‌లో ఒక ఆలయం వద్ద బుధవారం స్వల్ప పేలుడు సంభవించింది. టెగ్నోపాల్‌ ప్రాంతంలోని మోర్హ్‌దళపతి వద్ద ఉన్న శివాలయం వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఐఈడీ వినియోగించి పేలుడుకి పాల్పడినట్లు భావిస్తున్నారు

వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్యూకట్టిన ముస్లింలు

కడప : జిల్లాలోని 'దేవుని కడప'లో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా ఈ రోజు ముస్లింలు భారీ సంఖ్యలో బారులు తీరారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఇక్కడి ముస్లింలకు అలవాటు. బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అని, ఆమెను వివాహమాడిన వెంకటేశ్వరస్వామి తమ అల్లుడని ఇక్కడి వారి విశ్వాసం. దీంతో ఏటా ఉగాది పండుగ రోజు వారు స్వామి వారిని దర్శించుకుని మొక్కులుంటే తీర్చుకుంటుంటారు.

11:45 - March 29, 2017

విజయవాడ: అ అంటే అమ్మ, అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..మనిషిలో అచెంచలమైన శక్తిని ఉపయోగించడానికి నమ్మకం కావాలన్నారు.సమస్యలు ఉన్నాయని భయపడకుండా క్రైసిస్ ను అధిగమించగలిగితే సంతోషం వస్తుందన్నారు. ఎవ్వరికీ లేనటువంటి సంప్రదాయాలు భారతీయలకు ఉన్నాయి. సుసపన్నమైన సంస్కృతి సంప్రదాయాలు మనకు ఉన్నాయి. భాషను కాపాడుకోవాలి. తెలుగువారి గౌరవాన్ని పెంచేలా రాజధాని అమరావతిని కట్టి తీరుతానన్ని తెలిపారు. భవిష్యత్ లో వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నారు. సమస్యలు ఉన్నాయని ఏమి చేయలమని అనుకుంటే అది చరిత్ర అన్నారు. పట్టిసీమ ఏడాది లోపు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. ఏ వూరిలో పడిన వర్షాన్ని ఆ వూరిలోనే నిల్వ చేయగలిగే కరువు రాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి కోరుకున్నారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డిప్యూటీ సీఎం కే.ఈ కృష్ణమూర్తి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

11:10 - March 29, 2017

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి కోరుకున్నారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డిప్యూటీ సీఎం కే.ఈ కృష్ణమూర్తి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

మద్దులపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం...

ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దత్తత గ్రామమైన మద్దులపల్లిలో రూ.1.38 కోట్లతో నిర్మించిన 22 డబుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తైయ్యాయి. ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈవాళ ఈ ఇళ్లను ప్రారంభించి సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా సత్తుపల్లి నియోజకవర్గం లంకపల్లిలో కూడా 28 గృహాలను ఏప్రిల్ తొలివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు

విజయవాడ: ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం చంద్రబాబు పలు సంస్థల పంచాంగాలను ఆవిష్కరించారు.

తండ్రైన హీరో నాని

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరో నాని తండ్రి అయ్యారు. ఉగాది పర్వదినాన ఆయన సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పీఆర్వో మహేష్‌ కోనేరు ట్విటర్‌ ద్వారా తెలుపుతూ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. 

10:09 - March 29, 2017

బిజెపి కార్యాలయంలో ఉగాది సంబురాలు

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉగాది సంబురాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేద పండితులతో పంచాంగ శ్రవణం పఠనం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్, ఆ పార్టీ నేత మురళీధర్ రావు, తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. వివిధ రంగాల్లోని 86 మందికి, కళా రంగంలో 39 మందికి సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాలను అందజేయనున్నారు.

 

09:25 - March 29, 2017

తిరుపతి :ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తిన మహిళా స్మగ్లర్‌ సంగీత చటర్జీని చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.. కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెనుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ విమాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తూ, ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌కు దగ్గరైన సంగీత.. అక్రమ రవాణాలో అడుగుపెట్టింది.. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు హవాలా ద్వారా సంగీత భారీగా నగదు మార్చినట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీనిపై లోతుగా అన్వేషించిన చిత్తూరు పోలీసులు గత ఏడాది కోల్‌కతాలోని ఆమె నివాసంలో దాడులు చేశారు.. విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తెరిపించి, నకిలీ తుపాకీ లైసెన్సులనూ స్వాధీనం చేసుకున్నారు. పలుసార్లు ఆమెను అరెస్టుచేయాలని పోలీసులు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అడ్డంకులు ఎదురయ్యాయి.. 15రోజులపాటు కోల్‌కతాలో రెక్కీ నిర్వహించిన పోలీసులు చివరకు సంగీతను అరెస్టు చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చారు. 

09:22 - March 29, 2017

అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణంలో మరో ముఖ్యమైన కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంతంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా సులువుగా చేరుకునేలా నిర్మాణం చేయబోతున్న 11 రోడ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశ 7 సబ్ ఆర్టీరియల్ రోడ్లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేయనున్నారు. ఎర్రబాలె గ్రామంలో 7 సబ్ ఆర్టీరియల్ రహదారులకు శంఖుస్థాపన శిలాఫకాలన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించునున్నారు. 29 గ్రామాలను కలుపుతు ఈ సబ్ ఆర్టీరియల్ రహదారులు నిర్మాణం కాబోతున్నాయి. 

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సంగీత చటర్జీ అరెస్ట్

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సంగీత చటర్జీ అరెస్ట్ అయ్యారు. 8 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న సంగీత చటర్జీని నిన్న కోల్ కతాలో పోలీసులు అరెస్ట్ చేసి రాత్రి చిత్తూరుకు తీసుకువచ్చారు. నేడు పాకాల కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు.

09:09 - March 29, 2017

హైదరాబాద్: సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు ... అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఇవాళ 36వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిపతాకల్ని- తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరేసిన టీడీపీ.. 1982 మార్చి 29 తేదీన పురుడు పోసుకుంది. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ఖంగుతినిపిస్తూ.. అధికారానికొచ్చిన ఈ పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొంటూ.. ఎన్నో చరిత్రపుటల్ని తన పేరిట నిక్షిప్తం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధే నినాదంగా..., తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం సాధించి అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తోంది.

ఉవ్వెత్తున లేచే కెరటం.

ఉవ్వెత్తున లేచే కెరటం. తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరితూగే పదమిది. ఒకటి కాదు... రెండు కాదు... మూడు దశాబ్థాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదర్కొంటూ వచ్చిన ఈ పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పడిలేచిన సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసింది. పార్టీ పని అయిపోయిందన్న సూటిపోటి మాటలు.. ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు...ఫినిష్ అంటూ మరికొందరి బెదిరింపులు... ఇక ఈ పార్టీ గెలవటం అసాధ్యం.. అంతా మా గాలేనంటూ ప్రత్యర్థి పార్టీలు చేసిన మాటల దాడులనూ తట్టుకున్న పసుపుదళం.. దూసుకెళ్లే శరంలా ప్రజామద్దతును కూడగట్టుకుంది. ప్రత్యర్ధులంతా ఏకమై చేసిన మానసిక దాడులన్నింటినీ అధిగమించి ప్రజా మద్దతుతో ఆంధ్రప్రదేశ్ 2014లో తిరిగి అధికారం చేజిక్కించుకుంది. రాజకీయ పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ...., సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ...., ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగించిన తెలుగుదేశం ఇవాళ 36వ వసంతంలోకి అడుగుపెడుతోంది.

1982 మార్చి 29న హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో...

1982 మార్చి 29న హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఒక చిన్న గదిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఇదే ఓ చారిత్రక అవసరం అన్నట్లుగా.... ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యమ్నాయంగా 30 ఏళ్లపాటు తట్టుకొని నిలబడ్డ ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్ర సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ తనదైన పాత్రను విజయవంతంగా పోషించింది. ఎన్టీఆర్...ఆ తర్వాత చంద్రబాబు పార్టీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. అయితే 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు అనేక కష్టాలు ఎదుర్కొన్న టీడీపీ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించకుంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే అనుమానాలతోనే విజయం సాధించింది. అంతకుముందు పార్టీ విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ఆయనకు విజయాన్ని వరించి పెట్టింది.

విభజనపై ఏదో ఓవైపు మొగ్గు చూపాల్సిన తరుణంలోనూ....

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు విభజనపై ఏదో ఓవైపు మొగ్గు చూపాల్సిన తరుణంలోనూ సమతుల్యత విధానాన్నే పాటించిన తెలుగుదేశం.. విభజన తర్వాత దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ లో సునాయాస విజయాన్ని అందుకున్న ఈ పార్టీ.. తెలంగాణాలో మాత్రం ప్రస్తుతానికి గడ్డుపరిస్థితిని ఎదుర్కోంటోంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ ఏడాది నుంచి స్థానిక పాలన అందించటంతో పాటు పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమరావతి కేంద్రంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరనే అంతర్మథనం ...

అయితే.. ఇప్పుడు పార్టీలో చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరనే అంతర్మథనం మొదలైంది. చంద్రబాబు తనయుడు నారా లోకేషే తమ భవిష్యత్ నేత అనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఏపీలో పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తే..లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలపై తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శితో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ రెండు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన లోకేష్‌ రేపు మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలోనూ చేరనున్నారు.

రాజకీయ పార్టీ అంటే...

రాజకీయ పార్టీ అంటే రాజకీయపరమైన లక్ష్యాలతోనే కాకుండా సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. కుటుంబసభ్యులంతా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తమ వంతు సేవలందించటంలో కలసి కట్టుగా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలుకుని ప్రాంతీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభించినా.. జాతీయ దృక్పధంతో వ్యవహరించింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా... హస్తినలో చక్రం తిప్పగలిగింది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ఈ తరుణంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాబవాన్ని కనబరుస్తుందో వేచి చూడాలి.  

ఓఆర్ ఆర్ శివారులో కెమికల్ ట్యాంకర్ లో మంటలు

సంగారెడ్డి: అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ వద్ద ఓఆర్ ఆర్ శివారులో కెమికల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.

08:06 - March 29, 2017

హైదరాబాద్: మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ ఫ్యాక్టరీలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరించన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఘటన ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

ఉగాది సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు

తిరుమల : నేడు శ్రీవారి ఆలంయలో ఉగాది ఆస్థానం, బంగారు వాకిలిలో అర్చకులు పంచాంగం శ్రవణం చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి టీటిడి అనుమతించనుంది. ఉగాది సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు.

కూలర్ల తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్: మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

07:30 - March 29, 2017

హైదరాబాద్: ఏపీలో పదవ తరగతి జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1 లీక్‌ అయిందన్న అంశం అసెంబ్లీని కుదిపేశాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో అసెంబ్లీ స్తంభించింది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళానికి దారితీయడంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఆర్ ఎస్ ఎస్ నేత మోహన్ ను రాష్ట్రపతి చేయాలి అన్న అంశాన్ని బిజెపి తప్పు పడుతోంది. ఇదే అంశాలపై నేటి న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బిజెపి నేత ఆచార్య, టిడిపి నేత విజయకుమార్, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:10 - March 29, 2017

ఢిల్లీ : తమ పిల్లలకు డ్రగ్స్‌ అలవాటు చేస్తున్నారన్న కారణంతో నోయిడాలో నైజీరియన్లపై మూకుమ్మడి దాడి చేశారు. కత్తులు, ఇటుకలు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని యూపీ సిఎం యోగిని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆదేశించారు. దాడికి సంబంధించి గుర్తు తెలియని 3 వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ తీసుకోవడం కారణంగా ఇంటర్‌ విద్యార్థి మృతి...

రెండు రోజుల క్రితం గ్రేటర్‌ నోయిడాలో డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ తీసుకోవడం కారణంగా ఇంటర్‌ విద్యార్థి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన స్థానికులు నైజీరియన్లను టార్గెట్‌ చేశారు. తమ పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

నైజీరియా విద్యార్థులపై స్థానికులు కత్తులు, రాడ్లు, ఇటుకలతో దాడి...

సోమవారం రాత్రి నైజీరియా విద్యార్థులపై స్థానికులు కత్తులు, రాడ్లు, ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్‌ విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఓ గుంపు వచ్చి తమపై దాడికి పాల్పడిందని...తమపై ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తెలియదని బాధితులు పేర్కొన్నారు. సహాయం కోసం అరచినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పోలీసులు, కళాశాల సిబ్బంది తమకు సహాయం చేయకపోవడంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్‌ చేశామని బాధితులు చెప్పారు. తమ ప్రాణాలకు ముప్పుందని, రక్షణ కల్పించాలని మంత్రిని కోరారు.

ఘటనపై విచారణకు ఆదేశం...

ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ -యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. నైజీరియన్లకు రక్షణ కల్పించాలని, ఈ దాడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సిఎంను ఆదేశించారు.ఈ ఘటనలో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 3 వందల మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.నోయిడాకు చెందిన ఇంటర్‌ విద్యార్తి మనీష్‌ ఖారీ మార్చి 25న మోతాకు మించి డ్రగ్స్‌ తీసుకోవడంతో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

07:07 - March 29, 2017

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా ఉద్యోగిపై దాడి చేసిన శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌కు ఇబ్బందులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. ముంబై నుంచి ఢిల్లీకి ఆయన టికెట్ బుక్ చేసుకోగా.. ఎయిరిండియా దానిని ర‌ద్దు చేసింది. ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకుఎయిరిండియాతోపాటు 7 విమానయాన సంస్థలు విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో గైక్వాడ్‌పై నిషేధాన్ని తొలగించాలన్న శివసేన ఎంపీల విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఈ ఘటన తర్వాత గైక్వాడ్‌ ఢిల్లీ నుంచి పుణెకు బుక్ చేసుకున్న టికెట్‌ను కూడా ర‌ద్దయింది. దీంతో ఆయ‌న రైల్లో ప్రయాణించాల్సి వ‌చ్చింది.

07:05 - March 29, 2017

ఢిల్లీ: ఓబిసి రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయడం లేదని బిఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై తర్వాత చర్చిద్దామని సభకు అంతరాయం కలిగించొద్దని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ చేసిన విజ్ఞప్తిని విపక్షాలు పట్టించుకోలేదు. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి -దళితులు, వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళన మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు సభ పలుమార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమయ్యాక ఆర్థిక బిల్లుపై చర్చ పూర్తి చేయాలని, ఓబిసి అంశంపై బుధవారం చర్చిద్దామని డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ విజ్ఞప్తి చేసినా సభ్యులు ఆందోళన విరమించలేదు. సభ్యుల గందరగోళం మధ్య కురియన్ రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. వెనకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగపరంగా చట్టబద్దత కల్పించకుండా ఓబిసి కమిషన్‌ని తెరపైకి తెచ్చిందని ఎస్పీ ఆరోపిస్తోంది. 

స్మార్ట్‌ పోలిసింగ్‌లో తెలంగాణ మరో ముందడుగు

హైదరాబాద్: క్రైమ్‌ను కంట్రోల్‌ చేయడానికి ... టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర పోలీసులు.. స్మార్ట్‌ పోలిసింగ్‌లో మరో అడుగు ముందుకేశారు. సీసీ కెమెరాలతో నేరాలకు చెక్‌ పెడుతున్న పోలీసులు ఇప్పుడు Go-Live, సిటిజన్‌ సర్వీసెస్‌ ప్రాజెక్ట్‌లతో క్రిమినల్స్‌ను ట్రాక్‌ చేయనున్నారు. 

జనసేనను పటిష్టం చేసే దిశగా పవన్‌ అడుగులు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ స్పీడు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. జనసేనను క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువతకు పార్టీలో పెద్దపీట వేస్తామని ఇప్పటికే ప్రకటించిన పవన్‌... పార్టీలోకి జన సైనికులకు ఆహ్వానం అంటూ పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణానికి అనంతపురం జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నారు. 

06:55 - March 29, 2017

భద్రాద్రి : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. తొలిరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ, పంచాంగ శ్రవణం, తిరువీధిసేవ జరుపుతారు. ఏప్రిల్1న ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. 5న మిథిలా ప్రాంగణంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు. మరుసటి రోజు 6న శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. 10న వసంతోత్సవం, 11న చక్రతీర్ధం తదితర పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ముస్తాబయిన భద్రాద్రిద ఆలయం...

బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని అధికారులు సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్‌లైట్లతో రామాలయం పరిసరాలు శోభాయమానంగా మారాయి. సీతారాముల కల్యాణ మహోత్సవం, శ్రీరామపట్టాభిషేకాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఏడాది 2లక్షలకు పైగా భక్తులు....

ఈ ఏడాది 2లక్షలకు పైగా భక్తులు శ్రీ సీతారాములవారి కల్యాణానికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల కోసం పట్టణంలో తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ చర్యలు చేపడుతోంది. కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌లు హాజరు కానున్నారు. కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

బస్సులలో ప్రయాణించే వారికి స్వామివారి తలంబ్రాలు ...

బస్సులలో ప్రయాణించే వారికి స్వామివారి తలంబ్రాలు అందజేయనున్నారు. రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా కల్యాణ మండపంలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ టిక్కెట్ల బుకింగ్‌ కొరకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏర్పాట్లను దేవస్థానం ఈవో రమేబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లక్ష మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ కలిపిన నీరును అందుబాటులో ఉంచనున్నారు. 

నేటి నుండి భద్రాద్రి రాములోరి బ్రహోత్సవాలు...

భద్రాద్రి : రాములోరి బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 11 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 14 రోజుల పాటు భక్తులను కనువిందు చేయనున్నాయి. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

06:52 - March 29, 2017

అమరావతి: ఈనెల 25న జరిగిన పదవ తరగతి జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1 ముందుగానే వెల్లడైందన్న ప్రతిపక్ష వైసీపీ సభ్యుల ఆరోపణలపై అసెంబ్లీ అట్టుడికింది. ఈ అంశంపై సభలో చర్చకోసం వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుపట్టారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఇందుకు అనుమతించకపోవడంతో వైసీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.

లీకేజీ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని వైసీపీ సభ్యులు పట్టు...

పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజీ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఈ నెల 30న సభలో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చింది. అయినా ప్రతిపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మధ్యాహ్నంలోపే సభను మూడుసార్లు వాయిదా వేశారు.

మధ్యాహ్నం సభ పునఃప్రారంభైన తర్వాత కూడా...

మధ్యాహ్నం సభ పునఃప్రారంభైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు తమ ప్రశ్న పత్రం లీకేజీ ఆరోపణలపై తమ పంతాన్ని వీడలేదు. ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని పట్టుపట్టారు. లీకేజీకి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు కారణమంటూ, వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష సభ్యులు తీరును ఆర్థిక మంత్రి యనమల తీవ్రంగా ఆక్షేపించారు.

నిరసనల మధ్యే పలు బిల్లులు ఆమోదం...

ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్యే పలువురు మంత్రులు తమతమ శాఖలకు సంబంధించిన చట్టాల సవరణ బిల్లులను సభలో ప్రవేశెట్టిన ఆమోదింప చేసుకున్నారు. వైసీపీ సభ్యులు నినాదాల మధ్యే ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ద్రవ్య వినిమయ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలోకి వచ్చి, ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. పదవ తరగతి జనరల్‌ సైన్స్‌ పేపర్‌ -1 లీకేజీపై స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఆ తర్వాత ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం...

ఆ తర్వాత ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు పాల్గొనలేదు. ద్రవ్యవినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బుధవారం ఉగాదిని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, సభను గురువారానికి వాయిదా వేశారు. 

ప్రశ్న పత్రం లీక్.. దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ

హైదరాబాద్: ఏపీలో పదవ తరగతి జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1 లీక్‌ అయిందన్న అంశం అసెంబ్లీని కుదిపేశాయి. దీనిపై YCP MLAలు చర్చకు పట్టుపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో అసెంబ్లీ స్తంభించింది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళానికి దారితీయడంతో వాయిదాల పర్వం కొనసాగింది. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలింది. 

06:47 - March 29, 2017

హైదరాబాద్: తెలుగు వారి ఆత్మీయ పండుగ ఉగాది .. తెలుగు వారి నమ్మకాలకు పునాది ఉగాది.. కోయిల పాడితే ఉగాది .. చెట్లు చిగురిస్తే ఉగాది .. ఆరు రుచులు కలబోస్తే ఉగాది .. ఆస్వాదించే మనసుంటే ... అడవేకాదు అపార్ట్ మెంటైన సరే అంటూ ఆమని ఇట్టే వచ్చేస్తుంది. సుఖ సంతోషాలను తన వెంట మోసుకొచ్చింది హేవళంబి నామ సంవత్సరం.

తెలుగువారి పండుగలలో ముఖ్యమైనది...

ఉగాది. తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. మొదటిది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున .. బ్రహ్మ సృష్టి నిర్మాణం ఆరంభించాడని సూర్య సిద్ధాంతం అనే ఖగోళ జ్యోతిష గ్రంథం చెబుతోంది. దీని ఆధారంగానే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు.

వసంత ఋతువు కూడా ఉగాదితోనే...

వసంత ఋతువు కూడా ఉగాదితోనే మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.

ఉగాది మనిషికి కొత్త ఆశలు మోసుకోస్తుంది.

ఉగాది మనిషికి కొత్త ఆశలు మోసుకోస్తుంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని రుచులను పరిచయం చేస్తుంది. కోయిలమ్మల కమ్మనిగానం మనసును హాయిరాగాలు పలికిస్తుంది.

ప్రకృతికి దూరమౌతోన్న మనిషి ...

ప్రకృతికి దూరమౌతోన్న మనిషి తనకు తానే వికృతంగా మారిపోతున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తే మనిషి తనను తాను ప్రేమించుకుంటాడు. తనను తాను ప్రేమించుకుంటే ప్రేమ పరమార్ధం అర్ధమౌతుంది. ఇలాంటి అద్భుతమైన భావనను మన సొంతం చేసే ఏకైక పండగ ఉగాది. ఈ ఏడాది హేవళంబి నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆశిద్దాం. 

06:44 - March 29, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సభ్యుడిగా పదేళ్ల పాటు సేవలందించిన ఎంవిఎస్ శర్మ పదవీ విరమణ చేస్తున్నారు. 2007, 2011 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎంవిఎస్ శర్మ 2017 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలం ఇవాళ్టితో ముగుస్తోంది. పదేళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన ఎంవిఎస్ శర్మ సాధించిన విజయాలేమిటి? వర్తమాన రాజకీయ పోకడలపై ఆయన అభిప్రాయాలేమిటి? భవిష్యత్ జీవితాన్ని ఎలా గడపబోతున్నారు? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ విజయవాడ కు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Don't Miss