Activities calendar

30 March 2017

త్వరలో వేములఘాట్ ప్రజలు విజయం సాధిస్తారు : తమ్మినేని

సిద్ధిపేట : మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వేములఘాట్ ప్రజలు చేపట్టిన దీక్షకు నేడు 300వ రోజు పూర్తి అయింది. సిద్ధిపేట నుంచి వేములఘాట్ కు పాదయాద్ర, బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. దండం పెట్టి దరఖాస్తు పెడితే సమస్యలు పరిష్కారం కావు.. దండెం తీసుకుని దండయాత్ర చేయాలన్నారు. 300 రోజులుగా నిరవదిధక దీక్షలో పాల్గొనడం వేములఘాట్ ప్రజలు వీరోచిత పోరాటానికి నిరద్శనమన్నారు. కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని చెప్పారు. త్వరలో వేములఘాట్ ప్రజలు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

22:16 - March 30, 2017

ఏపీ ప్రభుత్వం, హెచ్ సీఎల్ మధ్య అవగాహన ఒప్పందం

గుంటూరు : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ సీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు, హెచ్ సీఎల్ చైర్మన్ శివనాడార్ పాల్గొన్నారు. అమరావతిలో బీపీఓల ఏర్పాటుకు హెచ్ సీఎల్ ఆసక్తి చూపారు. 

22:02 - March 30, 2017

ఢిల్లీ : జాతీయ రహదారులపై 5 వందల మీటర్ల దూరంలో ఉన్న మద్యం షాపులను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్‌పై రెండోరోజు కూడా విచారణ జరిగింది. జాతీయ, రాష్ట్ర రహదారులున్న చిన్న పట్టణాలు మున్సిపల్‌ కార్పోరేషన్లకు మినహాయింపు నివ్వాలని అటార్ని జనరల్ ముకుల్‌ రోహిత్గి వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ ఏడాది జారీ చేసిన లైసెన్స్‌ల కాల పరిమితి ముగిసేవరకు అనుమతించాలని మద్యం వ్యాపారుల సంఘం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై తీర్పును రేపు వెల్లడించే అవకాశం ఉంది.

22:00 - March 30, 2017

ఒడిషా : పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్‌ కీచకుడిగా మారాడు. విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన ఒడిషాలోని బారిపాడాలో జరిగింది. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న స్కూల్ టీచర్ దుర్గాచరణ్ గిరిపై మహిళల కోపం కట్టలు తెంచుకుంది. చెప్పులు, కర్రలతో చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్ళి స్థానికుల నుంచి అతడ్ని రక్షించారు. 

 

21:56 - March 30, 2017

నైజీరియా : గ్రేటర్‌ నోయిడాలో తమ దేశస్తులపై జరిగిన దాడిపై నైజీరియా స్పందించింది. నైజీరియాలోని భారత రాయాబారిని పిలిపించుకొని నిరసన తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని  నైజీరియా భారత్‌ను కోరింది. గ్రేటర్‌ నోయిడాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఆఫ్రికన్లపై ఓ మూక విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్లు తీవ్రంగా గాయపడ్డారు. నోయిడాకు చెందిన మనీశ్ కారి అనే పన్నెండో తరగతి విద్యార్థి డ్రగ్స్‌ అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటుతో మృతి చెందాడు. తమ పిల్లలకు డ్రగ్స్‌ సప్లయ్‌ చేస్తున్నారన్న ఆగ్రహంతో స్థానికులు నైజీరియన్లపై దాడికి చేశారు. 

 

21:53 - March 30, 2017

ఢిల్లీ : ఆర్థికబిల్లు 2017కు రాజ్యసభలో చేసిన రాజకీయ పార్టీల ఫండ్‌, ఐటి తదితర సవరణల్ని లోక్‌సభ  తిరస్కరించింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఆర్థికబిల్లును ప్రవేశపెట్టగా, విపక్షాలు ఐదు సవరణల్ని ప్రతిపాదించాయి. వీటిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మూడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండు సవరణల్ని ప్రతిపాదించగా.. ఓటింగ్‌ ద్వారా ఈ సవరణలతో కూడిన ఆర్థికబిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ ఐదు సవరణలతో ఆమోదం పొందిన ఆర్థికబిల్లును ప్రభుత్వం తిరిగి లోక్‌సభకు పంపించింది. ఆర్థికబిల్లుపై రాజ్యసభ చేసిన 5 సవరణలను తిరస్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీంతో 2017 18 బడ్జెట్‌కు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. 

 

21:49 - March 30, 2017

ఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయం చేయాలని ఎంపీ వినోద్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంపీ వినోద్ ఈ అంశంపై మాట్లాడారు. కృష్ణా ట్రిబ్యునల్ తీరుపై తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేసినా..ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదన్నారు. న్యాయంగా తమకు రావాల్సిన నీటి కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని వినోద్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఏపి, తెలంగాణ సిఎంల మధ్య సయోధ్య కుదరలేదని-దీనిపై కమిటీ వేశామని మంత్రి సంజీవ్‌కుమార్‌ బలయాన్‌ చెప్పారు. బజాజ్‌ కమిటి నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు.

 

21:46 - March 30, 2017

ఇంకెందరి జీవితాలతో ఆడుకుంటారు..? ఇంకెంత కాలుష్యాన్ని వెదజల్లుతారు..? ఎవరి లాభాలకు ఎవరి బతుకుల్ని పణంగా పెడతారు...? ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా...? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:42 - March 30, 2017

పండుగగోల్గే సొంతెండవెడ్తున్న రఘువీరా... ఇరవై రెండేండ్ల సందిజేస్తున్న ఉగాది నిరసన పాత పాలమూరు జిల్లాల ముస్లీంం పంచాంగం... ఉగాదినాడు ఈయన ఇంటికి ఉరుకొచ్చిన జనాలు, కూల్ డ్రింకులు తాగండి ఆరోగ్యం పాడుజేసుకోండ్రీ,... ఒంగోలు జిల్లాల ఒలకురావు చేసిన పెప్సి సీస, 
శ్రీకాకుళం రైతులకు ఎలుగుబంట్లతోని సీత గోస.. గెదువుదామని ఉర్కుతే మీద పడ్తున్నయట, కోడి గుడ్ల మీద పొదిగిన మానవుడు.. ఇంత పనులను జేస్తున్న ప్రెంచీ ఆర్టిస్టు, కొండచిలువు కడుపుల దొరికిన మనిషి జాడ, ఇండోనేషియా దేశంల అక్బర్ ఆత్మార్పణ,..అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:13 - March 30, 2017

2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయడం సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణు, వైసీపీ నేత కొణిజేటి రమేష్, ప్రముఖ విశ్లేషకులు తులసీదాస్, పాల్గొని, మాట్లాడారు. భూసేకరణ చట్టానికి ఏపీ సర్కార్ చేయబోయే సవరణలు నష్టదాయకంగా ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:00 - March 30, 2017

గుంటూరు : అభివృద్ధి పేరుతో వంద ఎకరాలు కాదు... ఎన్ని ఎకరాలైన ఇక నుంచి ఈజీగా సేకరించవచ్చు.. పునరావాసం లేకుండా.. 150 శాతం పరిహారంతో నోర్లు మూయించేయవచ్చు.. సామాజిక ప్రభావ అంచనాలు, గ్రామ సభలు ఇక కనిపించవు.. ఇది ..ఏపీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త భూ సేకరణ సవరణ చట్టం 2017. 
ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం 
నిర్వాసితులకు అండగా ఉన్న భూసేకరణ చట్టం 2013కు తూట్లు పొడిచేలా ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది.. ఆంధ్రప్రదేశ్  సవరణ చట్టం 2017 పేరుతో వచ్చిన ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదమే తరువాయి... నిర్వాసితుల హక్కులు, ప్రయోజనాలకు పక్కన పెట్టేసి తనకు కావాల్సిన రీతిలో ప్రభుత్వం  2013 చట్టానికి సవరణలు తీసుకొచ్చేసింది... చట్టంలోని కీలకమైన చాప్టర్-2, చాప్టర్-3లలో మిగతా సెక్షన్లలో ఉన్న సామాజిక ప్రభావ అంచనా, ఆహార భద్రత, మెజార్టీ ప్రజల ఆమోదం, గ్రామసభలు తదితర అంశాలను తాజా చట్టంలో పక్కనపెట్టేశారు.. సబ్ క్లాజ్ 10ఏ ద్వారా పీపీపీ పద్ధతిలో చేపట్టే నిర్మాణాలు, ప్రజల మేలు దృష్య్టా చేపట్టే నిర్మాణాలను ఇక ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా, సర్వేలు ఊసే లేకుండా భూమిని సేకరించవచ్చంటూ  డైరెక్ట్‌గా చెప్పేశారు... 
2013 భూసేకరణ చట్టం సెక్షన్ 31కి తూట్లు 
2013 చట్టం సెక్షన్‌ 31 ప్రకారం ... వంద ఎకరాలు అంతకన్నా తక్కువ సేకరిస్తే ... నిర్వాసితులకు పరిహారంతో పాటు పునరావాసం, సహాయం ప్రకటించాలి. ఆ తర్వాతే భూములు సేకరించాలి. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టంలో సెక్షన్ 31 ఏ అంటూ సవరణ తీసుకొచ్చారు. దీని ప్రకారం వంద ఎకరాలు అంతకన్నా తక్కువ భూమిని  సేకరిస్తే.. నిర్వాసితులకు పరిహారం కింద ఖరారు చేసిన ధరకు అదనంగా 50 శాతం ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చు.
మళ్లీ తెరపైకి కలెక్టర్ కన్సెంట్ అవార్డు.... 
2013 చట్టం ప్రకారం నిర్వాసితులు ఎంతమేరకైనా  పరిహారం, పునరావాసం కోరవచ్చు.. గతంలో ఉన్న కలెక్టర్ కన్సెంట్ అవార్డు అనే క్లాజ్ తొలగించి 2013 చట్టంలో నిర్వాసితుల అభిప్రాయానికే  పెద్ద పీట వేశారు.. అయితే తాజా సవరణ చట్టంలో ఏపీ మళ్లీ పాత చట్టంలోని క్లాజ్ చేర్చి... సెక్షన్ 23 ఏ కింద కలెక్టర్ కన్సెంట్ అవార్డు ఉండాలని ప్రతిపాదించింది.. దీని ప్రకారం కలెక్టర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్‌ ఖరారు చేసే భూ సేకరణ ధర... నిర్వాసితులు అంగీకరిస్తే అదే ఫైనల్ అవుతుంది... అలాగే పాత భూసేకరణ చట్టం ప్రకారం కలెక్టర్ అవార్డు పాస్ చేశాక... రైతు పరిహారం తీసుకోకపోతే ఆ సదరు మొత్తాన్ని కోర్టులో జమచేసి ప్రభుత్వం ఆ భూముల జోలికి వెళ్లేది కాదు.. అవార్డు పరిమితి కూడా ఐదేళ్లే ఉండేది. కొత్త చట్టంలో ఈ క్లాజ్ ను తీసేశారు.. కానీ పాతచట్టం, 2013 చట్టంలో ఉన్న క్లాజ్ లను పక్కన పెట్టేసి... కోర్టులో కేసు నడిచినంత కాలం భూమిని తీసుకోవద్దన్న నిబంధనకు మినహాయింపు ఇచ్చేశారు.. ఇది రైతులు, నిర్వాసితుల హక్కులకు తీవ్ర విఘాతమే..
పార్లమెంట్ అధికారాలపై గురి పెట్టిన ఏపీ సవరణ చట్టం 
కేంద్ర చట్టానికి సవరణలు చేసే అధికారం పార్లమెంట్ కే ఉంది. అయితే కేంద్ర చట్టానికి రాష్ట్రాలు సవరణలు ప్రతిపాదిస్తున్న పరిస్థితుల్లో సెక్షన్ 40 వద్ద క్లాజ్ 2 ను చేరుస్తూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సవరణలు చేసుకోవచ్చు అనే ప్రతిపాదనను చేర్చారు. దీని ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన రీతిలో చట్టంలో సవరణలు చేసేసుకోవచ్చు... వీటితో పాటు ప్రైవేట్‌ వ్యక్తులు క్లైయిమ్ చేసే భూములకు సరైన ఆధార పత్రాలు ఉంటే హక్కులు కల్పించేలా సవరణలో ప్రతిపాదించారు. 
భూ సేకరణ చట్టం సవరణలపై గందరగోళం 
2013 భూ సేకరణ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడిచింది. జీవో నెం 123 నుంచి లేటేస్ట్ జీవో నెం 38 దాకా భూ సేకరణ చట్టం సవరణలపైనే గందరగోళం నడుస్తోంది. అసెంబ్లీలో చట్టం చేసి పంపినా కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు... ఇంతలోపు చంద్రబాబు సర్కార్ కూడా  ఆంధ్రప్రదేశ్  సవరణ చట్టం 2017ను ప్రవేశపెట్టేసింది. అయితే పెండింగ్‌లో ఉన్న తెలంగాణ భూసేకరణ చట్టం 2016, ఏపీ సవరణ చట్టం 2017కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారా.. లేదా  భవిష్యత్తులో తేలాల్సి ఉంది. నిర్వాసితుల భవిష్యత్తును చీకటిలోకి నెట్టేందుకే... ఇలా సవరణలు చేశారని.. పలువురు విమర్శిస్తున్నారు. 

 

20:55 - March 30, 2017

గుంటూరు : ఎమ్మెల్సీగా చినబాబు నారా లోకేశ్ ప్రమాణస్వీకారంచేశారు.... అమరావతిలోని మండలి చైర్మన్‌ చక్రపాణి చాంబర్‌లో ఉదయం 9గంటల 48 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు... లోకేశ్‌తోపాటు కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

20:52 - March 30, 2017

గుంటూరు : ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2న ఉదయం 9.25 నిమిషాలకు కొత్త మంత్రులు అమరావతిలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకోసం సచివాలయం పక్కన విశాఖ ప్రాంగణంలో  ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. మంత్రివర్గంలో ఐదుగురికి స్థానం కల్పించే అవకాశంఉందని భావిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన లోకేశ్‌కు మంత్రివర్గంలో బెర్తు కాయమని ప్రచారం జరుగుతోంది. అలాగే భూమా అఖిల ప్రియకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికే చాన్స్‌ ఉందని భావిస్తున్నారు. అలాగే కొందరికి శాఖలు మారే అవకాశం ఉంది. 

 

ఏప్రిల్‌ 2 న ఏపీ మంత్రివర్గ విస్తరణ

గుంటూరు : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్‌ 2న ఉదయం 9.25 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

20:47 - March 30, 2017

'సినీ మహల్' సినిమా టీమ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ లక్ష్మణ్, హీరోహీరోయిన్ లు అలీ, తేజస్వినిలు మాట్లాడారు. తమ సినిమా అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:40 - March 30, 2017

ప్రకాశం : జిల్లాలోని బెస్తవారిపేట మండలం నేకునాంబాద్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వాడాల నరేంద్ర అనే వ్యక్తి మూడో తరగతి చదువుతున్న బాలుడిని కాల్చి.. హింసించాడు. మెట్టెల వెంకట్రావు అనే అబ్బాయిని రాత్రంతా ఇంట్లో నిర్బంధించి ..ఒళ్లంతా సిగరెట్‌తో కాల్చాడు. గాయాలపాలైన బాలుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా కేవలం పది రూపాయలు తీసుకుని.. తిరిగి ఇవ్వలేదనే నెపంతోనే ఇలా చేశాడని సమాచారం. 

 

20:37 - March 30, 2017

గుంటూరు : అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిభ కనపరిచిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవార్డులు ప్రకటించారు. ప్రతిపక్ష వైసీపీని ఎదుర్కోవడంతో దూకుడు ప్రదర్శించిన నలుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు అభినందించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావు, దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, బొండా ఉమ, నక్కా ఆనందబాబు, ఆనందరావులను ముఖ్యమంత్రి అభినందించారు. 

20:33 - March 30, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థి పేరును టీడీపీ ఖరారు చేసింది. తమ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు.. రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఇప్పటివరకు మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న సతీశ్‌రెడ్డి పదవీ కాలం నిన్నటితో ముగియడంతో తదుపరి అభ్యర్థి ఎవరనే దానిపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. శిల్పా చక్రపాణిరెడ్డి, షరీఫ్‌, పయ్యావుల కేశవులు, రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్లు పరిశీలనకు వెళ్లగా.. చంద్రబాబు తూర్పు గోదావరికి జిల్లాకు చెందిన శెట్టి బలిజ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు. దీంతో ఆయన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.

 

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు ఖరారు

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థి పేరును టీడీపీ ఖరారు చేసింది. తమ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు.. రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. 

 

20:29 - March 30, 2017

హైదరాబాద్ : మొగల్తూరు ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆనంద్‌ ఆక్వాఫుడ్‌ కంపెనీలో అమ్మోనియా లీకై ఐదుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న కంపెనీలను వెంటనే సీజ్‌ చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.  ఇలాంటి ఘటనల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని.. కాలుష్య నియంత్రణ అధికారుల పనులకు అడ్డుతగలవద్దన్నారు. తాను కంపెనీలకు వ్యతిరేకం కాదన్న పవన్‌ పొల్యూషన్‌ వెదజల్లే ఫ్యాక్టరీలను సమర్థించేది లేదన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పవన్‌ కోరారు. 

 

20:27 - March 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని నర్సాపురం ప్రభుత్వం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో ఆక్వా పార్క్ మృతుల కుటుంబాలను మంత్రులు అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, మాణిక్యాలరావులు పరామర్శించారు. తుందుర్రు పార్కును నిలిపివేయాలంటూ గ్రామస్తులు, సీపీఎం నేతల ఆందోళన చేపట్టారు. సీపీఎం, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆనంద్ ఆక్వా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. 

20:15 - March 30, 2017

కర్ణాటక : ఎండలు మండిపోతున్నాయి. నీటి కోసం మనుషులే కాదు మూగజీవాలు సైతం అల్లాడుతున్నాయి. కర్ణాటకలో దాహార్తితో అల్లాడుతున్న ఓ కోబ్రాకు నీళ్లు తాగించి దాహం తీర్చారు అటవీశాఖ సిబ్బంది. నీటి జాడను వెతుక్కుంటూ ఏకంగా జనావాసాల్లోకి వచ్చిన పాముకు అటవీశాఖ సిబ్బందితో కలిసి గ్రామస్తులు దాహార్తిని తీర్చారు. ఓ బాటిల్‌లో నీళ్లు పట్టి పాముకు పట్టించగా, అది గటగటా తాగేసింది. అనంతరం దానిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. పాము నీరుతాగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

 

20:13 - March 30, 2017

హైదరాబాద్ : నగరాలు మహానగరాలుగా మారుతున్నాయి. బస్సులు పెరిగిపోతున్నాయి. ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు పెరగడం లేదు. నగరాభివృద్దిలో భాగంలో మోడ్రన్‌ బస్టాపులు నిర్మిస్తామన్నారు. బస్‌బేలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అవన్నీ ఉట్టి ప్రకటనలకే పరిమితమని తేలిపోయింది. ఓవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు బస్టాపులలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. 
పాడైన రోడ్లు, ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసుల ఇక్కట్లు
హైదరాబాద్‌ నగరంలో ప్రయాణం అంటేనే భయమేస్తోంది. ఓవైపు పాడైన రోడ్లు.. మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసంతో కూడుకున్న పని.  సాధారణంగా బస్టాప్‌లలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప ఆర్టీసీ బస్సులు దొరకని పరిస్థితి. అయితే.. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 
బస్సు షెల్టర్ల బాధ్యత జీహెచ్‌ఎంసీకి అప్పగింత
హైదరాబాద్‌లో ఏళ్లు గడుస్తున్నా బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రం పూర్తి కావడంలో లేదు. 2008లో ఆర్టీసీ బస్సు షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది. నగరంలో మొత్తం 1832 బస్టాప్‌లు అవసరమని గుర్తించిన ఆర్టీసీ అధికారులు... ప్రతిపాదనలను బల్దియాకు పంపారు. యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు. అయితే.. బస్సు షెల్టర్ల నిర్మాణానికి ఐదు సార్లు టెండర్లు పిలిచినా కేవలం... 840 బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ ప్రాంతాల్లో బస్సు షెల్టర్ల నిర్మాణానికి యాడ్‌ ఏజెన్సీలు ముందుకు వచ్చినా.. ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తుందో అక్కడ మాత్రమే బస్సు షెల్టర్లు నిర్మించి మిగతావాటిని వదిలేశారు.
35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 
ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పైగా ఉండడంతో ప్రయాణికులు బస్టాప్‌లలో నిలబడాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ నుండి రక్షణ కోసం చెట్లు, భవనాల నీడలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు బస్టాప్‌లలో క్షణం పాటు బస్సులు నిలపకపోవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 
100 రోజుల్లో 50 ప్రాంతాల్లో బస్‌బేలు నిర్మాణం
100 రోజుల్లో నగరంలో 50 ప్రాంతాల్లో బస్‌బేలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మెట్రో రైలు పనుల కారణంగా రోడ్డు వైడనింగ్‌లో ఉన్న బస్సు షెల్టర్లను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

 

20:09 - March 30, 2017

హైదరాబాద్ : ఆ అధికారి గీసిందే గీత , రాసిందే రాత. ఒక్క క‌లంపోటుతో ఉద్యోగుల జీవితాల్నే తారుమారు చేస్తారు.  స‌ర్వీస్‌రూల్స్, ప్రభుత్వ నియ‌మాలు అన్నీ.. అయ‌న‌గారి సొంతరూల్స్ ముందు బ‌లాదూర్. చివరికి సుప్రింకోర్టు తీర్పును సైతం పక్కనపెట్టేస్తారు. తెలంగాణ ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో జ‌రుగుతున్న ప్రమోషన్ల భాగోతంపై టెన్‌టీవీ ఫోకస్‌..
ప్రమోష‌న్లు పోందడం సవాల్‌ 
ఇప్పుడున్న పోటీప్రపంచంలో ప్రభుత్వ  ఉద్యోగం సాధించ‌డమే ఒక   ఛాలెంజ్‌ అయితే..ఇక జాబ్‌లో చేరాక ప్రమోష‌న్లు పోందడం  మ‌రో సవాల్‌ గా మారింది.  పై అధికారి కనికరించాలంటే.. కానుకలు, కట్నాలు చాలానే చదివించుకోవాలి. దీనికి ప్రత్యక్షనిదర్శనమే ..తెలంగాణా ప్రజారోగ్య ఇంజనీరింగ్‌ విభాగంలో ఉన్నతాధికారి తీరు అంటున్నారు కిందిస్థాయి ఉద్యోగులు. 
ఉద్యోగుల ఆశలపై నీళ్లుచల్లుతున్న ఉన్నతాధికారులు
సర్కార్ నియ‌మావ‌ళి ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి ఉద్యోగులకు  ప‌దోన్నతులు క‌ల్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు అయ్యాక ఖాళీల‌ను సంఖ్యను అనుసరించి అవసరం మేరకు రెండేళ్ల స‌ర్విస్ ఉన్నవారికి కూడా ప్రమోష‌న్లు కల్పించాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  కాని  కొందరు  అధికారుల‌కు  మాత్రం అవేవి  ప‌ట్టడం లేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత  ప్రమోష‌న్ల ప్రక్రియ చేపట్టడంతో తెలంగాణ  ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్ విభాగం ఉద్యోగులు సంతోపడ్డారు. అయితే వారి ఆశలమీద నీళ్లు చల్లుతున్నారు.. ఇంజనీరింగ్‌ అధికారులు.  
ఉద్యోగుల ప్రమోషన్లలో సొంతరూల్స్‌ 
ఈ అధికారి పేరు మల్లికార్జునుడు.  రామ‌గుండం కార్పొరేష‌న్‌లో  సూరింటెండెంట్ ఇంజ‌నీర్ గా పనిచేస్తున్నారు. దాంతోపాటు ప‌బ్లిక్ హెల్త్ ఇంజ‌నీరింగ్ విభాగంలో ఇంచార్జీ సీఈగా హెడ్‌ఆఫీస్‌లో కూడా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై తనకు ఇంచార్జ్‌బాధ్యతలు ఇచ్చారని చెప్పుకుంటున్న ఈ అధికారి.. తన కిందిస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లలో మాత్రం తన సొంతరూల్స్‌ను అమలు చేస్తున్నారు.  ఇష్టానుసారంగా రికార్డుల‌కు తారుమారు చేస్తూ..  అర్హతలేనివారిని అంద‌లం ఎక్కించేందుకు పావులు క‌దుపుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. 
పీఎస్ సీ రూల్స్‌, రోస్టర్‌ విధానాన్నీ పట్టించుకోని ఉన్నతాధికారి
వాస్తవానికి ప‌బ్లిక్ స‌ర్విస్ క‌మీష‌న్ ఇచ్చిన జాబితా ను అనుసరించి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఫిక్స్ చేయ్యాలి. కాని ఆ జాబితాను  ప‌క్కన‌బెట్టి.. త‌న‌కు న‌చ్చినట్టు లిస్ట్ తాయ‌రు చేశారనే  ఆరోపణలొస్తున్నాయి. ప‌బ్లిక్ స‌ర్విస్ క‌మీష‌న్ రూల్స్‌తోపాటు రోస్టర్ విధానాన్నికూడా పక్కనపెట్టేశారు.  విషయం ఏంటని ప్రశ్నిస్తే.. తాను ఈ సీట్లోకి రాకముందే లిస్టు 
ప్రమోషన్లలో ఇంజార్జ్‌ సీఇ మల్లికార్జుడు చేతివాటం..!
ఈ ఇంచార్జ్‌ సీఈగారి సొంత రూల్స్‌లో.. కోర్టు తీర్పులు కూడా బేఖాతరు అవుతాయి. ఎన్ ఎమ్మార్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తారు.. తర్వాత ప్రమోషన్లూ కల్పిస్తారు.  అదేచేత్తో కోర్టు తీర్పుల ప్రకారం డీమ్డ్‌ యూనివర్సిటీ డిగ్రీలు చెల్లవంటూ.. ఇచ్చిన ప్రమోషన్ల నుంచి ఉద్యోగులకు రివర్షన్‌ ఇస్తారు. అంతటితో ఆగితే.. ఈ ఇంజనీర్‌ అధికారివారి ప్రత్యేక ఏముంది..! గతంలో తాను రివర్షన్‌ ఇచ్చిన ఇంజనీర్లకే తాజాగా తయారు చేసిన ప్రమోషన్ల లిస్టులో చోటు కల్పించి.. తనలో అసలు కోణాన్ని బయటపెట్టారు. కానుకలు భారీగా స్వీకరించి ఇలా తన ఇష్టం వచ్చినవారికి ప్రమోషన్లు కల్పిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
ప్రమోష‌న్లు కోల్పోతున్నాం : ఇంజ‌నీర్లు 
ఉన్నతాధికారుల తీరుతో త‌మ‌కు నాయ్యంగా రావాల్సిన ప్రమోష‌న్లు కోల్పోతున్నామని కొందరు ఇంజ‌నీర్లు వాపోతున్నారు. నిబంధన‌లు తుంగ‌లో తొక్కి జాబితాల‌ను  అడ్డదిడ్డంగా తాయ‌రు చేయడంవ‌ల్ల.. తమకు ప్రమోష‌న్లు  చేజారుతున్నాయ‌ని అవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారుల‌కు మొర‌పెట్టుకున్నా  ప‌ట్టించుకోకుండా ప్రోవిజిన‌ల్ లిస్ట్‌ తాయరు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూల్స్ కు విరుద్దంగా ప్రమోష‌న్లు ఎలా ఇస్తారు..?  
ప్రమోష‌న్లలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగడంపై ఇంజనీరింగ్ అసోషియేష‌న్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చ‌ర్యలు ఉద్యోగుల హక్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అంటున్నారు వారు. మ‌రోవైపు డీమ్డ్ యూనివ‌ర్సిటి, దూర‌విద్య  ప‌ట్టాలు పొందిన వారిని రూల్స్ కు విరుద్దంగా ప్రమోష‌న్ జాబితాల్లో చేర్చడం ఎంట‌నీ ప్రశ్నిస్తూన్నారు. ఈ చ‌ర్యల వ‌ల్ల డైరెక్టుగా రిక్రుట్ అయిన ఏఈలు తాము న‌ష్టపోతారని ఆందోళ‌న‌ చెందుతున్నారు. మాటెత్తితే రూల్స్ జపంచేసే అధికారులు.. సినియార్టీ లిస్ట్ పై ఒక్కోజోన్‌లో ఒక్కోవిధంగా  వ్యవ‌హ‌రించ‌డం వివాదాస్పదంగా మారుతోంది.  ఇప్పటికైనా  ప్రభుత్వం ఈ  ఆక్రమాల‌పై దృష్టిసారించి ప్రమోష‌న్ల‌లో న్యాయం చేయాలని తెలంగాణ ఇంజనీర్లు కోరుతున్నారు. 

 

19:28 - March 30, 2017

కొత్తగూడెం భద్రాద్రి : అదో మారుమూల గ్రామం. గిరిజన అటవీ ప్రాంతం. అక్షర జ్ఞానం లేని గిరిజన రైతాంగం పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇలాంటి భూములపై సర్కార్‌ కన్నుపడింది. ఎలాగైనా ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన గిరిజనులు ఫారెస్ట్‌ సిబ్బందికి ఎదురుతిరిగారు. 
గిరిజనులపై ఫారెస్ట్‌ సిబ్బంది ప్రతాపం 
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్‌ సిబ్బంది ప్రతాపం చూపిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు అధికారులకు ఎదురుతిరుగుతున్నారు.
భూములు ఆక్రమించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది యత్నం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రేగులగూడెంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన భూములను ఆక్రమించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది యత్నించారు. ఇందుకోసం జేసీబీతో సహా పలు వాహనాలను తీసుకువచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన గిరిజనులు ఫారెస్ట్‌ సిబ్బందికి ఎదురు తిరిగారు. ఫారెస్ట్‌ సిబ్బందికి చెందిన జేసీబీతో సహా మూడు బైకులను తగలబెట్టారు. 
నిందితుల కోసం గాలింపు 
ఇక సమాచారం అందుకున్న కొమరారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గ్రామంలోని ఇళ్లన్నీ సోదా చేశారు. ఎవరూ దొరకకపోవడంతో.. 20 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మండలమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. 

18:52 - March 30, 2017

కరీంనగర్‌ : జిల్లా కేంద్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్‌ భూమి పూజ చేశారు. స్థానిక పద్మానగర్ సమీపంలో పది ఎకరాల స్థలంలో జీ ప్లస్‌-5 విధానంలో 14 వందల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్నట్టు మంత్రి ఈటల చెప్పారు. నిజమైన పేదవారికే ఇళ్లు కేటాయింపు జరుగుతుందని ఆయన అన్నారు.

18:50 - March 30, 2017

సిద్ధిపేట : మల్లన్న సాగర్‌కు వ్యతిరేకిస్తూ వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన దీక్ష మూడువందల రోజులకు చేరింది. దీక్షకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో సిద్ధిపేట్‌ నుంచి వేములఘాట్‌వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.. ఇవాళ సాయంత్రం వేములఘాట్‌లో భారీ బహిరంగసభ జరగనుంది.. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు.

 

18:46 - March 30, 2017

నిజామాబాద్ : బోదన్‌లో ఎమ్మెల్యే షకిల్‌ అనుచరుడు ప్రభుత్వ ఉద్యోగులపై దుర్భాషలాడినందుకు నిరసనగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఆ నేతపై నామమాత్రంగా కేసులు నమోదు చేశారని.. అరెస్ట్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....

 

 

18:41 - March 30, 2017

ఢిల్లీ : హెచ్‌ 1 బి వీసాలపై అమెరికా ఆంక్షలు విధించడంపై సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయుల ఉద్యోగాల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హెచ్‌ 1 బి వీసాలతో భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్నది అవాస్తమన్నారు. భారతీయ ఐటి కంపెనీలు లక్షా 50 వేల మంది అమెరికన్లకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించాయని, మరో 4 లక్షల మంది అమెరికన్లు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అమెరికాలో భారతీయ కంపెనీలు 2 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారని, 20 బిలియన్‌ డాలర్ల పన్ను చెల్లించడం జరిగిందని మంత్రి చెప్పారు. ఇరు దేశాల మధ్య పరస్పర లాభసాటి వ్యాపారం సాగుతోందని, ట్రంప్‌ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇరుదేశాలకు నష్టమేనని సుష్మా పేర్కొన్నారు. భారతీయుల ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సభకు హామీ ఇచ్చారు. 

18:36 - March 30, 2017

ఢిల్లీ : గ్రేటర్‌ నోయిడాలో ఆఫ్రికన్లపై జరుగుతున్న విద్వేషపూరిత దాడులపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జెడియూ నేత శరద్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ సభ్యులు ఆనంద్‌శర్మ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆఫ్రికన్లపై జరుగుతున్న విద్వేషపూరిత దాడుల వల్ల ప్రపంచంలో ఇండియాకు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. దీనిపై ప్రత్యేక తీర్మానం చేయాలని సిపిఎం సభ్యులూ ఏచూరి డిమాండ్‌ చేశారు. దీనిపై విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. ఇంటర్ విద్యార్థి మృతితో పాటు నైజీరియన్లపై జరిగిన దాడులపై తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

 

18:32 - March 30, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాఖ్‌కు అంశంలో రాజ్యంగబద్ధతపై దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు అప్పగించింది. ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం వేసవి సెలవుల్లో మే 11 నుంచి విచారణ జరపనుంది. ఉమ్మడి పౌరస్మృతి ప్రాధాన్యతపై డిబేట్ జరపడం లేదని అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. అయితే ఇది సీరియస్ అంశమే కాకుండా చాలా సున్నితమైన అంశం కావడంతో కోర్టు తప్పనిసరిగా విచారణ చేపట్టాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.  మతం కల్పించిన హక్కులను కోర్టులు ప్రశ్నించలేవని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వాదించింది.

 

18:19 - March 30, 2017

గుంటూరు : బాలకృష్ణ నటించిన గౌతమీపుత్రశాతకర్ణి సినిమాలోని సమయంలేదు మిత్రమా.... శరణమా... రణమా.. అన్న డైలాగ్‌ ఏపీ అసెంబ్లీలో మార్మోగుతోంది. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి అధికారపక్ష సభ్యులు, మంత్రులు తరచూ ఈ డైలాగ్‌ను తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. మొన్న కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఉపయోగించిన ఈ డైలాగ్‌ను ఇవాళ చంద్రబాబునాయుడు తనకు అకూలంగా అన్వయించుకున్నారు. పదవ తరగతి ప్రశ్న పత్రం లీకు దర్యాప్తుపై ప్రతిపక్షం తేల్చుకోవాలంటూ చంద్రబాబునాయుడు.. సమయంలేదు... అన్న డైలాగ్‌ను వాడారు. 

 

18:17 - March 30, 2017

గుంటూరు : పదవ తరగతి ప్రశ్న పత్ర లీకేజీపై ఏపీ అసెంబ్లీలో తీవ్ర రగడ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. లీకేజీ దర్యాప్తు నుంచి విద్యార్హతల వరకు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. బాబు, జగన్‌ ఒకరి విద్యార్హతలపై మరొకరు విమర్శించుకున్నారు.  

 

18:12 - March 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని మొగల్తూరులో దారుణం జరిగింది. ఆనంద్‌ ఆక్వాఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలో అమ్మోనియం గ్యాస్‌ లీకై ఐదుగురు కూలీలు మృతిచెందారు. రసాయన ట్యాంకులను శుభ్రం చేయడానికి వెళ్లిన ఐదుగురు కూలీలు గ్యాస్‌ లీక్‌ కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. మృతులు నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, ఈగ ఏడుకొండలు, జక్కంశెట్టి ప్రవీణ్‌, తోట శ్రీనులుగా గుర్తించారు. ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు కంపెనీపై  రాళ్ల దాడి చేశారు. కంపెనీ కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు భారీగా చేరుకుని గ్రామస్తులను అదుపు చేశారు. తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న 33 గ్రామాల్లో మొగల్తూరు కూడా ఉండటంతో.. అన్ని గ్రామాల ప్రజలు ఆనంద్‌ ఫుడ్‌ కంపెనీకి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రులు అయ్యన్నపాత్రుడు, మాణిక్యాలరావును  మొగల్తూరు పంపారు. అటు వైసీపీ అధినేత జగన్‌ సైతం మొగల్తూరు వెళ్లనున్నారు. 

 

యాజమాన్యం విద్యార్థుల మధ్య వివాదం

గుంటూరు : ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు యాజంమాన్యం మధ్య వివాదం చేలరేగింది. కళాశాల భవనం అద్దాలు విద్యార్థులు ధ్వసం చేశారు. పోలీసులు విద్యార్థులకు సర్దిచెప్పడంతో గొడవ ముగిసింది. ప్రాక్టికల్స్ విషయంలో వివాదం చెలనేగినట్టు తెలుస్తోంది.

నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి : నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో ఆనంద్ ఆక్వా పార్క్ మృతుల కుటూంబాలను పరామర్శించడానికి మంత్రులు అయ్యన్న, పీతల, మాణిక్యాలరావు వచ్చారు. మంత్రుల ఎదుట తుందుర్రు పార్క్ ను నిలిపివేయాలంటూ గ్రామస్తులు, సీపీఎం నేతల ఆందోళన చేపట్టారు. సీపీఎం, టీడీపీ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మొగల్తూరు ఘటన : గపూర్

విజయవాడ : మొగల్తూరు ఘటన మాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్ అన్నారు. ఫ్యాక్టరీలో అధికారుల నిరంతర తనిఖీలు జరగడం లేదని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

17:10 - March 30, 2017

వరంగల్‌ : జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర లేదంటూ మిర్చిని తగులబెట్టారు. ఐదు రోజుల క్రితం 9 వేల రూపాయలకు క్వింటాలు మిర్చి ధర ఉండగా.. నేడు 4 వేలే పలకడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా మార్కెట్‌కు సెలవు ప్రకటించి ధర తగ్గించారని ఆరోపించారు. 

కోడెలతో టీటీడీపీ ఎమ్మెల్యేల భేటీ

గుంటూరు : ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ అసెంబ్లీ సిబ్బంది 100 మందిని వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కోడెల శాసన సభ సమావేశాలు ముగిసిన తర్వాత వారిని రిలీవ్ చేస్తామని హామీ ఇచ్చారు.

17:04 - March 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో  విషాదం చోటు చేసుకుంది. మొగల్తూరులోని ఆనంద్‌ ఆక్వాఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో అమ్మోనియం గ్యాస్‌ లీకయింది. ఈప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. కంటైనర్‌ ట్యాంక్‌  
శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

17:00 - March 30, 2017

గుంటూరు : పదో తరగతి పరీక్ష పేపర్‌ లీకేజ్‌ కాలేదని..అది కేవలం మాల్‌ ప్రాక్టీస్‌ అని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక వేళ అది పేపర్‌ లీక్‌ అయితే..నేనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాగా మాల్‌ ప్రాక్టీస్‌కి సంబంధించి అంశంపై తగిన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. పరీక్షా తర్వాత పేపర్‌ వాట్సాప్‌ ద్వారా బయటకు వచ్చిందన్నారు.

 

16:58 - March 30, 2017

గుంటూరు : ఏపీలో పదవ తరగతి ప్రశ్న పత్రం లీకుపై అసెంబీలో అడ్డుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది. లీకేజీకి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు బాధ్యులంటూ, వీరి రాజీనామాకు వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని.. ఈ వ్యవహారంపై న్యాయ విచారణకైనా సిద్ధమన్నారు. అయితే ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేశారు. 

 

16:53 - March 30, 2017

గుంటూరు : టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. లీకేజీ అంశంపై సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షం వాదోపవాదాలకు దిగారు. పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. లీకేజీ వివరాలను సీఎం చంద్రబాబు సభ ముందుంచారు. ఎవరు తప్పుచేసినా ఊరుకునేది లేదని చంద్రబాబు అన్నారు. ఆధారాలు ఉంటే చూపించండి వెంటనే అరెస్టు చేస్తామని చంద్రబాబు చెప్పారు. పేపర్ లీకేజీ వెనక సాక్షి హస్తం ఉందని అనుమానం ఉందన్నారు. పేపర్ లీకేజీపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం సరికాదని తెలిపారు. జంబ్లింగ్ విధానాన్ని తామే అమలులోకి తెచ్చామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. తెలిపారు. 1978లోనే జంబ్లింగ్ విధానంలో పరీక్షలు రాశారని చెప్పారు. కదిరిలో హిందీ పేపర్ లీక్ అయిందని పేర్కొన్నారు. నారాయణ కాలేజీ సిబ్బంది స్లిప్పులు అందించారని ఆరోపించారు. వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

టీఎస్ 3 కార్పొరేషన్లకు చైర్మన్ల ప్రకటన

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ 3 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మనగా తాడుర్ శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొషన్ చైర్మన్ గా కె. దామోదర్ గుప్తా, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా కృష్ణమూర్తి నియామకం.

టూవీలర్స్ కంపెనీల భారీ డిస్కౌంట్

ఢిల్లీ : ద్విచక్ర వాహననాలపై భారీ డిస్కౌంట్లు ఆటో మొబైల్ కంపెనీలు ప్రకటించాయి. రూ. 12,500 గరిష్ట డిస్కౌంట్ ను హీరో మోటోకార్ప్ ప్రకటించింది. రూ.10 వేల వరకు డిస్కౌంట్ హోండా మోటార్ సైకిల్స్ ప్రటించింది. డిస్కౌంట్టు ఇవాళ, రేపు వర్తిస్తాయని ఆ కంపెనీలు ప్రకటించాయి.

మండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థి గా సుబ్రహ్మణ్యం

గుంటూరు : ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా బీసి వర్గ సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును చంద్రబాబు ఖరారు చేశారు. 

ట్రిపుల్ తలాక్ అంశం ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి బదిలీ : సుప్రీం

 

 

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై సుప్రీంలో వాచరణ జరిగింది. ట్రిపుల్ తలాక్ అంశాన్ని సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సర్వోన్నత న్యాయస్థానం మే 11కు వాయిదా వేసింది.

రెండు విమానాల ఢీ

సింగపూర్ : సింగపూర్ లోని ఓ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రన్ వేపై టెకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అయితే పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి ప్రయాణికులు సుక్షితంగా బయటపడ్డారు. గురువారం తెల్లవారుజమున ఈ సంఘటన  జరినట్టు తెలుస్తోంది.

మొగల్తూరులో ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి : జిల్లాలోని మొగల్తూరులో ఉద్రిక్తత నెలకొంది. ఐదుగురు కూలీల మృతిపై గ్రామస్తుల ఆగ్రహంతో ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై రాళ్ల దాడి చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ లో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు అమ్మోనియం గ్యాస్ లీకేజీతో మృతి చెందిన విషయం తెలిసిందే.

చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారంటూ బంధువుల ఆందోళన

హైదరాబాద్ : సైఫాబాద్ లోటస్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారంటూ బంధువుల ఆందోళన దిగారు. బంధువులు ఆసుపత్రి అద్దాలు ధ్వసం చేశారు.

ఎనుమాముల మార్కెట్ లో రైతుల ఆందోళన

వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగారు. ఐదురోజుల క్రితం రూ.9వేల ధర పలికిన మిర్చి ధర నేడు రూ.4వేలు ఉండటంతో గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు : సీఎం చంద్రబాబు

గుంటూరు : టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీలో ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఘటన జరిగిన మరుటిరోజే డీఈవో నివేదిక ఇచ్చారని తెలిపారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఘటన జరిగిన నారాయణస్కూల్లో ఇన్విజిలేటర్లు అంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ఆయన పేర్కొన్నారు.

5 నిమిషాల ముందే పరీక్షా పత్రం లీక్ : జగన్

 

గుంటూరు : అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాల ముందే పరీక్షా పత్రం లీక్ అయ్యిందని అన్నారు. నారాయణ స్కూల్ యాజమాన్యానికి చెందిన ఉద్యోగి ఫోటోలు తీసి ఆన్సర్లు తయారు చేసి విద్యార్థులకు పంచారని జగన్ ఆరోపించారు.

13:34 - March 30, 2017

అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం అంశం నేడు ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. దీనిపై మంత్రి గంటా సభలో వివరణ ఇచ్చారు. పరీక్ష ప్రారంభినికి ముందే పేపర్ లీకైతే నేనే రాజీనామా చేసేవాడినని గంటా స్పష్టం చేశారు.వాట్సప్ లో పేపర్ రాగానే ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశామన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక వాట్సప్ లో పేపర్ లీకూందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నది మండిపడ్డారు. 

13:32 - March 30, 2017

విజయవాడ: ప్రజాసమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేయాలి ముందుచు వచ్చాను. వామపక్షాల పార్టీలపై ఉన్న అభిమానంతో నేను ముందుకు వచ్చాని అన్నారు. ఈ మధ్యాహ్నం విజయవాడలో అగ్రీగోల్డ్ బాధితులతో మాట్లాడిన ఆయన, ఆపై ప్రసంగిస్తూ, తొలి రోజున అగ్రీగోల్డ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన సమయంలోనే ప్రభుత్వం స్పందించివుంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి వుండేవి కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు బాధితులపై ఆధిపత్యం చూపడం, వారి ఆందోళనపై పోలీసులను ప్రయోగించడం తనను కలచి వేసిందని తెలిపారు. 1995లో ప్రారంభించిన కంపెనీ ఇదని, వీళ్ల పెట్టుబడులన్నీ పేదల నుంచి పెట్టుబడులు స్వీకరించారని గుర్తు చేసిన పవన్, పేదలు కాబట్టే ఈ కేసులో ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని అన్నారు. చట్టం బలహీనులపై బలంగా, బలవంతులపై బలహీనంగా పని చేస్తోందని, తప్పు చేస్తే ప్రశ్నించే దమ్ము, ధైర్యం సమాజానికి ఉండాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగం కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ లాంటి కంపెనీలకు అనుమతి ఇవ్వకూడదని, బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూస్తే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఇదే అంశంపై వామపక్షాలతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు.అప్పుల కంటే ఆస్తులే ఎక్కువగా ఉన్నాయని, టాస్క్ ఫోర్స్ కమిటి వేసి ఆస్తులు వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

13:27 - March 30, 2017

అమరావతి: ప్రశ్నా పత్రం లీక్ అంశంపై మంత్రి గంటా వివరణ ఇచ్చారు.ఆ వివరణ పై అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ... ఆ ప‌రీక్ష ఉద‌యం 9.30కు ప‌రీక్ష ప్రారంభ‌మైందని, అయితే నారాయ‌ణ ఉద్యోగి 9.25కే వాట్స‌ప్‌లో ఫొటోలు తీసి పంపించారని జ‌గన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నారాయ‌ణ స్టాఫ్ అంద‌రికీ ఆ మెసేజ్‌ పంపించారని అన్నారు. అందుకే నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు మంచి ర్యాంకులు వ‌స్తోంటే.. ఇది ప్ర‌భుత్వానికి మోసంలా క‌న‌ప‌డ‌డం లేదా? అని జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు. పరీక్ష ప్రారంభానికి ముందే వాట్సప్ లో మెసేజ్ పంపిస్తే ప్రభుత్వం మాత్రం మరోలా కారణాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. 

ఇండియాన్ ఆయిల్ ట్యాంకర్లపై ఎన్జీటీ నిషేధం

ఢిల్లీ : ఇండియాన్ ఆయిల్ ట్యాంకర్లపై ఎన్జీటీ నిషేధం విధించింది. కాలం చెల్లిన 621 ఇండియన్ అయిల్ ట్యాంకర్లను ఢిల్లీలో తిరగడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. నేటి నుంచి నుంచి నిషేధం అమలు చేయాలని ఎన్జీటీ రవాణా శాఖ అదికారులను ఆదేశించింది.

13:06 - March 30, 2017

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. లోకేశ్‌తో పాటు తెదేపా నుంచి బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, బీటెక్‌ రవి, పోతుల సునీత, దీపక్‌రెడ్డి, భాజపా నుంచి మాధవ్‌, పీడీఎఫ్‌ నుంచి కత్తి నరసింహారెడ్డి, శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

గుడివాడలంక ఎంటీసీపై హత్యాయత్నం

పశ్చిమ గోదావరి : జిల్లాలోని గుడివాడలంక ఎంపీటీసీ స్వామిపై హత్యాయత్నం జరిగింది. ఏలూరు ఎండీవో కార్యాలయంలో వద్ద భద్రగిరి స్వామిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అగ్రిగోల్డ్ మమ్మల్ని నిలువునా ముంచింది: బాధితులు

విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థ మమ్మల్ని నిలువునా ముంచిందని బాధితులు జనసేన అధినేత పవన్ కల్యాన్ కు తమ ఆవేదనను తెలియపరిచారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో జనసేన అధినేత పవన్ కల్యాన్ ముఖా ముఖి నిర్వహిస్తున్నారు.

12:34 - March 30, 2017

విజయవాడ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో వామపక్షాలు మొదటి నుండి పోరాటం అమోఘం అని ఓ బాధితురాలు తెలిపింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జనసేన అధినేత పవన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించింది. ఆమె మాట్లాడుతూ... ఇప్పటి వరకు మేము బ్రతికి ఉన్నామంటే వామపక్షాల వల్లేనని తెలిపింది. అగ్రిగోల్డ్ లో తాను ఒక కస్టమర్ అని, తన భర్త ఆరోగ్యం బాగా లేకపోవడం..పస్తులు పడుకోవాల్సి వస్తుందని అనుకుని ఏజెంట్ గా చేరడం జరిగిందన్నారు. అనేక వేల మంది ఇలానే బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు వామపక్షాలు సహాయం చేశాయని ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని పవన్ ను కోరింది. తమిళనాడులో రైతులకు మద్దతుగా సినీ నటి ప్రకాశ్ రాజు, హీరో విశాల్ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తో కలిసి సమస్య పరిష్కారానికి చొర చూపుతున్నారని. అలానే మీరు కూడా చేయాలని సూచించింది. 2014 లోబీజేపీ, టిడిపి పార్టీలకు మద్దతు తెలియచేసిన పవన్ సీఎం చంద్రబాబు నాయడితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు. ఇప్పటి వరకు 107 మంది మృతి చెందారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పవన్ వేడుకుంటున్నాని తన ఆవేదనను వెల్లబోసుకున్నారు.

టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ పై సీఎం చంద్రబాబు సమావేశం

గుంటూరు : అమరావతిలో సీఎం చంద్రబాబు టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీపై మంత్రి గంటా, అధికారలతో సమావేశం నిర్వహించారు. లీకేజీ వ్యవహారంలో సీఎం అధికారుల నుండి పూర్తి సమాచారం తెలుసుకున్నారు.

12:13 - March 30, 2017

విశాఖ జిల్లాలో అగ్నిప్రమాదం

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ మండలం చినమూసిరివాడలో అగ్నిప్రమాదం జరుగుతోంది. 200 ఎకరాల్లో తగలబడుతున్న యూకలిప్టస్ తోటలు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయాత్నిస్తున్నారు.

12:07 - March 30, 2017

అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం ఎంత - పవన్..

విజయవాడ : అగ్రిగోల్డ్ సంస్థలకు మొత్తం ఎంత ఆస్తులున్నాయో ప్రభుత్వం చెప్పాలని, దీనిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందో లేదో తనకు తెలియదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన అగ్రిగోల్డ్ బాధితులతో భేటీ అయ్యారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడారు. దీనిపై రకరకాల అభియోగాలున్నాయని, కొందరు వత్తిడి చేస్తున్నట్లు కూడా సమాచారం ఉందన్నారు. ఉద్ధానానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదో చిక్కుముడిలాంటిదని, డెడ్ లైన్లతో దీనిని పరిష్కరించాలనుకోకూడదన్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం మానుకోవాలని పిలుపునిచ్చారు.

అగ్రిగోల్గ్ బాధితులతో పవన్ సమావేశం ప్రారంభం

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో పవన్ సమావేశం ప్రారంభమైంది. పవన్ తో బాధితులు తమ గొడును వెల్లబోసుకుంటున్నారు.

హెచ్ సీఎ ఎన్నికల ఫలితాలు విడుదల చేయండి : హైకోర్టు

హైదరాబాద్ : హెచ్ సీఎ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హెచ్ సీఎ ఎన్నికల ఫలితాలు విడుదల విడుదల చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ హెచ్ సీఎ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి టీఆర్ఎస్ నేత వివేక్, జయసింహ పోటీ చేశారు.

11:19 - March 30, 2017

ప.గో: మొగల్తూరు ఆనంద్ ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఆమోనియం గ్యాస్ లీక్ అయి ఐదుగురు కార్మికులు మృతి కార్మికులు ట్యాంక్ కంటెనర్ శుభ్రం చేస్తుండగా ఆమ్మోనియ గ్యాస్ లీక్ అవడం వల్ల వీరు మరణించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కరెంట్ షాక్ తగింలి చనిపోయారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఫ్యాక్టరీలోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇప్పటిక జిల్లాలో ఆక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు జరుగుతున్న వేళ ఇలాంటి సంఘటనలు జరగడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

11:14 - March 30, 2017

విజయవాడ: అగ్ని గోల్డ్ బాధితులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని బాధితుల సంఘం నేత నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు జరిపి తీరాల్సిందేనన్నారు. ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి ప్రోగ్రాం ను ప్లాన్ చేసుకోబోతున్నామన్నారు. 50 మంది చనిపోయినపుడే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే బాగుండేది. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు. ఒక్క పైసా వదలకుండా తెచ్చుకుందామని భరోసా నిచ్చారు. వ్యక్తిగత ఆస్తులు,బినామీ ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు.

 

టెక్సాన్ లో ఘెర రోడ్డు ప్రమాదం

అమెరికా : టెక్సాన్ లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఓ మినీ బస్సును పికప్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్సాన్ శాన్ అంటోనియో పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో గార్నర్ స్టేట్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది.  

11:05 - March 30, 2017

అమరావతి : టెన్త్‌ ప్రశ్నాపత్రం పేపర్‌ లీకేజీపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌. ప్రజా సమస్యలపై చర్చించడానికి వెనుకంజ వేస్తోందన్నారు. ఎంతసేపు జగన్‌ను తిట్టడానికి ప్రాధాన్యమిస్తున్నారని, బిల్లులు పాస్‌ చేసుకోవడానికి సభను నడుపుతున్నారని విమర్శించారు. మాట్లాడేందుకు తమకు సభలో అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.

10:56 - March 30, 2017

అమరావతి: ప్రశ్నా పత్రం లీక్ అనేది ఒక నీచ సంస్కృతి అని వైసీపీ ఎమ్మెల్యే అన్నారు. ప్రజా సమస్యలపై గందరగోళం చేస్తున్నాం తప్ప అమర్యాదగా ప్రవర్తించడం లేదన్నారు. మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో లీక్ అవ్వడాన్ని మీరు బాధ్యతగా తీసుకోరా అన్ని ప్రశ్నించారు. మూడు రోజులుగా జగన్ కు మైక్ అడుగుతుంటే అగౌరవ పరుస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాడటం అనే మా హక్కు అని పేర్కొన్నారు.

జనంలోనే దారుణం

రాజస్థాన్ : రాజస్థాన్ చురలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డు మీద గొడవ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసింది. ఆటో డ్రైవర్ ను సిమెంట్ రాయితో పాల వ్యాపారి కొట్టి చంపాడు. ఇదంతా జనం మధ్యే జరిగింది.

10:54 - March 30, 2017

అమరావతి : వైసీపీ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సభా మర్యాదలను మంట గలిపాలరని టిడిపి ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో '10టివి'తో మాట్లాడుతూ. ప్రశ్నా పత్రం లీకు చేసిన బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు. ఒక సాక్షి రిపోర్టర్ ద్వారా వాట్సప్ లో పెట్టి ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళన చేసి, సభామర్యాదలు మంటల కలిపిన వాళ్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో చాలా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ప్రజా సమస్యలను వైసీపీ సభ్యులు గాలికి వదిలేశారని మండి పడ్డారు. 

గ్యాస్ లీక్ తో ఐదుగురి మృతి

పశ్చిమ గోదావరి : మొగల్తూరు ఆనంద్ ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఆమోనియం గ్యాస్ లీకేజీ జరిగింది. దీంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు మృతి చెందారు. కార్మికులు ట్యాంక్ కంటెనర్ శుభ్రం చేస్తుండగా ఆమ్మోనియ గ్యాస్ లీక్ అవడం వల్ల వీరు మరణించినట్లు తెలుస్తోంది.

10:43 - March 30, 2017

ఏమైంది..పూరీ 'హే భగవాన్' ఎందుకు అంటున్నారు అని అనుకుంటున్నారా ? అదేం కాదు...పూరి జగన్నాథ్..వరుసగా పరాజయాలు ఎదురు కావడంతో ఏలాగైనా హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు. అందులో భాగంగా ఒక కొత్త హీరోను పరిచయం చేస్తూ 'రోగ్' సినిమాతో ముందుకొస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఉండగానే 'బాలకృష్ణ'తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'హే భగవాన్' టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఈ సినిమా కాన్సెప్ట్ వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. దేవుళ్ల వల్ల ప్రపంచానికి జరుగుతున్న నష్టం గురించి ఈ సినిమాలో చూపిస్తానని 'పూరీ' ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. ఇతర భాషల్లో దేవుళ్లపై చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో 'పీకే'..'ఓ మై గాడ్' వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి 'పూరి' సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

10:34 - March 30, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీ మరో సారి వాయిదా పడింది. వాయిదా ప్రారంభమైన సభలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ పై చర్చించాలని పట్టుబడుతూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులతో నానాదాలతో ఆందోళన చేస్తున్నారు. దీంతో మరోసారి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై స్పందించిన బిజెపి ఎమ్మెల్యే ప్రతిపక్ష సభ్యుల తీరు సరికాదని తెలిపారు. స్పీకర్ ఎంత వారించినా వినకపోవడంతో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ మరో సారి వాయిదా

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో గందగోళం నెలకొంది. వైసీపీ సభ్యులు స్పీకర్ ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ చర్చకు వైసీపీ పట్టు గందరగోళం మధ్య సభను స్పీకర్ మరోసారి వాయిదా వేశారు.

10:24 - March 30, 2017

విశాఖ ఏజెన్సీ: ఆశ్రమ వసతి గృహాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. రక్తహీనత, పచ్చకామెర్లు, మలేరియా, డయేరియా వ్యాధులు ఆదివాసీ బిడ్డలను పట్టిపీడిస్తున్నాయి. 15 రోజుల్లో ఎనిమిది మంది గిరిజన విద్యార్థులు మృత్యువాతపడటం ఏజెన్సీలో కలకలం రేపుతోంది. పరిస్థితి చేయిదాటిపోతున్నా..ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రమ హాస్టళ్లలో గిరిజన విద్యార్థుల మరణాలపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.

ఆకలి బాధల నుంచి విముక్తులవుతారని...

విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి..అమ్మనాన్నల ఆశదీపాలు ఆరిపోతున్నాయి. తమ బిడ్డలు ప్రయోజకులవుతారని కొందరు.. ఆకలి బాధల నుంచి విముక్తులవుతాడని మరి కొందరు తల్లిదండ్రులు ఆశ్రమపాఠశాలల్లో తమ పిల్లలను చేర్చుతున్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత విద్యార్థుల పాలిట యమగండంగా మారుతోంది. విశాఖ ఏజెన్సీలోని ఆశ్రమ వసతి గ్రృహాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది.

గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలు ఆందోళన ...

ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 15 ఏళ్లలోపు బాలబాలికలు మృత్యువాత పడుతుంటడం కలవరం రేపుతోంది. ముందస్తుగా విద్యార్థుల అనారోగ్య సమస్యలు గుర్తించకపోవడంతో..అది విషమంగా పరిణమిస్తోంది. పరిస్థితి చేయిదాటిన తర్వాతే ఆస్పత్రులకు తీసుకెళ్లడంతో.. చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెదబయలు గురుకులం, రింతాడ, చింతపల్లి, డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పచ్చకామెర్లు, రక్తహీనత, జ్వరం వంటి అనారోగ్య పరిస్థితుల వల్ల వీరంతా చనిపోతున్నారు. 15 రోజుల వ్యవధిలో 8 మంది విద్యార్థులు మృత్యువాత పడటం చర్చనీయాంశంగా మారింది.

ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి ...

ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి విద్యార్థులకు ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించాలని గిరిజన సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. పౌష్టికాహారం, రక్తహీనతో ఎక్కువ మంది చనిపోతున్నారని.. హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులకు అనుబంధ పోషకాహారం సరఫరా చేయాలంటున్నాయి.

గిరిజనుల్లో ఎక్కువ మంది పోషకాహార లోపంతో ...

గిరిజనుల్లో ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పౌష్టికాహార సమస్యకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు గిరిజన విద్యార్థులకు చేరడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు అడ్డుకట్టవేయాలని విద్యావేత్తలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

10:24 - March 30, 2017

నితిన్ లుక్ మొత్తం మార్చేశాడు. గుబురుగా పెరిగిన గడ్డంతో కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నేడు ఆయన జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ లుక్ ని విడుదల చేసింది. చిత్రానికి 'లై' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హను రాఘవపూడితో ఈ చిత్రానికి దర్శకుడు. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రానికి ‘రాఘవపూడి' దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'నితిన్' సరసన 'మేఘ ఆకాష్' హీరోయిన్ గా నటిస్తోంది. 'నితిన్' కు ఇది 24వ సినిమా. ఉగాది పండుగ సందర్భంగా దీనికి సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. 'నితిన్' ఇమేజ్‌కి సరిపోయేలా తన స్టైల్లో హను రాఘవపూడి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది వరుసుగా మూడు సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్..త్రివిక్రమ్ శ్రీనివాస్ లు తీస్తున్న చిత్రం కూడా ఉంది.

తుమ్మలపల్లికి భారీగా తరలివచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రనికి అగ్రిగోల్డ్ బాధితులు భారీగా చేరుకున్నారు. శాంతి భద్రతాల దృష్ట్యా కేవలం పవన్ కళ్యాన్ తో 400 మంది బాధితులు సమావేశానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.

10:17 - March 30, 2017

అమరావతి: ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా చేరికలు, కొందరి తీసివేతలు మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏప్రిల్‌ 2వ తేదీనే దీనికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏవైనా కారణాలవల్ల 2వ తేదీ కుదరకపోతే... 6న కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, కల్వపూడి శివ, బీద రవిచంద్ర, ధూళిపాళ్ల రవీంద్ర, నక్క ఆనందబాబు, అమర్‌నాథ్‌రెడ్డి, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు ఉన్నారు. వీరికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాసేపట్లో విజయవాడకు పవన్

 

విజయవాడ : కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ విజయవాడకు చేరుకొనున్నారు. 11.30 నిమిషాలకు అగ్రిగోల్డ్ బాధితులతో పవన్ సమావేశం కానున్నారు.  

10:05 - March 30, 2017

ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారం

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ చక్రపాణి లోకేష్ తో ప్రమాణస్వీకారం చేయించారు. లోకేష్ తో పాటు 9 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు.

కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం

కోల్ కత్తా : గోల్డెన్ పార్క్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వంట గదిలో మంటలు అంటుకొని ఇద్దరు వ్యక్తుల సజీవదహనం అయ్యారు.

 

యూపీ టెన్త్ పరీక్షల్లో భారీగా మాస్ కాఫీయింగ్

లక్నో : యూపీ టెన్త్ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరగడంతో కాపీయింగ్ పై సీఎం యోగేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేశారు. మరో 57 పరీక్ష నిర్వహణ కేంద్రాలను ప్రభుత్వం నిలివేసింది. మాస్ కాపీయింగ్ పాల్పడిన 70 మంది విద్యార్థులతో పాటు 111పరీక్ష కేంద్రాలు, 178 ఇన్విజిలేటర్లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

 

09:44 - March 30, 2017

సంగారెడ్డి : పండుగలు..ఉత్సావాలు వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఇటీవలే ఓ ప్రాంతంలో పిడకల సమరం చూసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలో కూడా వినూత్నంగా ఈ పండుగను నిర్వహిస్తుంటారు. పేరుగాంచిన రామమందిర్ లో ప్రసాదాన్ని విసిరేస్తే దానిని పట్టుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. బుధవారం రాత్రి రామమందిర్ కు ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా బొంగులు..పేళాలతో తయారు చేసిన లడ్డూలను ఆలయం పై నుండి కిందకు విసిరేశారు. ఈ లడ్డూలను పట్టుకోవడానికి భక్తులు భారీగా పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. రామమందిర్ లో అనాదిగా ఈ సంప్రదాయం వస్తోందని తెలిపారు. 50 సంవత్సరాల నుండి చూడడం జరుగుతోందని, ఈ లడ్డూలను రామాలయంలోనే తయారు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి లడ్డూలను పంపిణీ చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ వాయిదా

అమరావతి: ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని వ్యతిరేకించిన వైసీపీ ప్రశ్నా పత్రం లీకేజీ పై చర్చించాలని స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్, మంత్రులు ఎంత వారించాన వినకపోవడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

09:15 - March 30, 2017

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమాశాలు ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ ప్రశ్నా పత్రం లీకేజీ పై చర్చించాలని పట్టుబట్టాయి. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

సభను సజావుగా జరిగేందుకు సహకరించాలి: కాల్వ

సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కాల్వ శ్రీనివాస్ విపక్షానికి విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రశ్నా పత్రం లీకేజీ అంశంపై సీఎం స్వయంగా తెలిపారు. ఆ సమయంలో చెప్పకుండా సభ నుండి వెళ్లిపోయారని తెలిపారు. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వ్యవహరించడ దారుణం అన్నారు.

గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొనేందుకు...

గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొనేందుకు సభను చెప్పకుండా వైసీపీ సభ్యులు వెళ్లిపోయారని మంత్రి దేవినేని ఆరోపించారు. అదే రోజు సభలో ఉండి ఉంటే ప్రశ్నా పత్రం లీకేజీ పై సమాధానం దొరకేదన్నారు. అయినప్పటికి వినని వైసీపీ సభ్యులు నారా వారి బినామీ నారాయణ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తూనే ఉన్నారు.

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమాశాలు ప్రారంభం అయ్యాయి. వెంటనే వైసీపీ ప్రశ్నా పత్రం లీకేజీ పై చర్చించాలని పట్టుబట్టాయి. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

08:48 - March 30, 2017

నెల్లూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. విజయవాడనుంచి తిరుపతివెళుతున్న ఆర్టీసీ బస్సును బెంగళూరు వెళుతున్న మరో బస్సు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో 20మందికి గాయాలయ్యాయి.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. వీరిని గూడూరు, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు.. గూడూరు రూరల్‌ మండలం చిల్లకూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.. ముందున్న టిప్పర్‌ను తప్పించబోయేక్రమంలో బస్సు అదుపుతప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు..

08:46 - March 30, 2017

కృష్ణా : విజయవాడలో ఇవాళ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటించబోతున్నారు.. ఉదయం పదకొండున్నరగంటలకు అగ్రిగోల్డ్‌ బాధితులతో మాట్లాడనున్నారు.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధితులను పరామర్శించనున్నారు..

08:44 - March 30, 2017

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లారీ యాజమాన్య సంఘాలు.. సింగిల్‌ పర్మిట్‌ విధానం తీసుకురావాలని, లోడింగ్‌- అన్‌లోడింగ్‌ ప్రక్రియలో భాగమైన మామూళ్లను తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెలో పాల్గొంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సమ్మె కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పన్ను మొత్తాన్నే.. రాష్ర్టాల పరిధి తగ్గిపోయినప్పటికీ ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ కొనసాగిస్తుండటంతో లారీ యజమానులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను మొత్తాన్ని తగ్గించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా స్పందించలేదని, దాంతో తాము సమ్మెలో పాల్గొన తప్పట్లేదని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్ష ప్రధాన్య కార్యదర్శులు ఎన్‌.భాస్కర్‌రెడ్డి, జి.దుర్గాప్రసాద్‌ వెల్లడించారు. సమ్మెతో తెలంగాణలో 2.5 లక్షల లారీలు నిలిచిపోనున్నాయి. నిత్యావసర సరుకులతోపాటు పెట్రోల్‌. డీజిల్‌ రవాణా నిలిపోనుండటంతో ప్రజలపై ప్రభావం చూపనుంది.

కరణం బలరాం ఫ్లెక్సీల చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు

గుంటూరు: చిలకలూరిపేటలో ఎమ్మెల్సీ కరణం బలరాం ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. నేడు కరణం బలరాం ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

 

08:26 - March 30, 2017

అమరావతి: సభను వైసీపీ అవమానించిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జైనాగేశ్వర్ ఆరోపించారు. ఆయన అసెంబ్లీ ఆవరణ లో '10టివి'తో మాట్లాడుతూ.. 344 నిబంధనల ప్రకారం ఒక అంశం కూడా చర్చకు రాకుండా విపక్షం అడ్డుపడుతోందన్నారు. కనీసం వారు వేసిన ప్రశ్నకు కూడా సమాధానం వినే ఓపిక లేకుండా విపక్షం ప్రదర్శించడం దారుణం అన్నారు. సభలో వైసీపీ ప్రదర్శిస్తున్న తీరుపై ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. మరో వైపు ఈ రోజు శాసనమండలిలో నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏప్రిల్ 2న మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న అంశంపై విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. శవపరీక్ష విధానంలో సమస్యలు, జాతీయ ఆ్రగామీణ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం నిధులు, రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణీ పై ప్రధానం గా చర్చ జరగనున్నట్లు సమాచారం.

 

నేటి ఏపీ అసెంబ్లీలో ...

అమరావతి: టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. శవపరీక్ష విధానంలో సమస్యలు, జాతీయ ఆ్రగామీణ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం నిధులు, రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత విద్యార్థినులకు సైకిల్ల పంపిణీ పై ప్రధానం గా చర్చ జరగనున్నట్లు సమాచారం.

నేడు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం...

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ ఈరోజు ఉదయం ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. శాసన మండలి చైర్మన్‌ చక్రపాణి చాంబర్లో ఉదయం 9.45 గంటలకు ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు కొత్తగా ఎన్నికైన 21 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికీ నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగు శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

07:33 - March 30, 2017

హైదరాబాద్: అగ్రి గోల్డ్ అంశం ఏపీ అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. ఆ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోందని సీపీఎం నేత బాబూరావు పేర్కొన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్నా ఆయన అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయడం లేదా? అఆగ్రిగోల్డ్ యాజమాన్యం పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. మరో వైపు ఈ రోజు జనసేన అధినేత బాధితులను ఈ రోజు కలవనున్నారు. ఈ చర్చలో బాబూరావుతో పాటు లోక్ స్త నేత శ్రీనివాస్, టిడిపి నేత సూర్య ప్రకాశ్ రావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

నేటి నుండి దక్షిణాది రాష్ట్రాల్లో లారీల సమ్మె

హైదరాబాద్: లారీల యజమానులు సమ్మెబాట పట్టారు. ఇవాళ్టి నుంచి ఎక్కడి లారీలే అక్కడే నిలిచిపోతున్నాయి. దక్షిణాది లారీల ఓనర్స్ అసోసియేషన్ తలపెట్టిన ఈ సమ్మె కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల్లోని 16 లక్షల లారీల రవాణా స్తంభించిపోతుంది.

07:09 - March 30, 2017

ఉత్తరప్రదేశ్‌ : నేటి తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. జబల్‌పూర్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ కుల్‌పహాడ్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 8 బోగీలు పట్టాలు తప్పడంతో.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వస్తు సేవల పన్ను బిల్లును లోక్‌సభ ఆమోదం

ఢిల్లీ : వస్తు సేవల పన్ను బిల్లును లోక్‌సభ ఆమోదించింది. జీఎస్టీ బిల్లుపై 7 గంటలపాటు చర్చ జరిగింది. జిఎస్‌టి బిల్లును విప్లవాత్మకమైనదిగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. ఈ బిల్లు వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా జిఎస్‌టి బిల్లు గేమ్‌ చేంజర్‌ కాదని, ఇంకా పిల్ల దశలోనే ఉందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. జిఎస్‌టి అమలు ఆలస్యం కావడం వల్ల దేశం 12 లక్షల కోట్లు నష్టపోయిందని విమర్శించింది.

07:05 - March 30, 2017

హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జలవిధానం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామని చెప్పారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ ఆ జిల్లా కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ను కలిశారు.

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని వినతి....

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో పాలమూరులోని నీటి వనరులు, ప్రాజెక్టు డిజైన్లపై కేసీఆర్‌ వారికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమైక్యపాలనలో జరిగిన అన్యాయం నుంచి పాలమూరు జిల్లాలను బయటపడేయాలన్నది తమ అభిమతమని చెప్పారు.

గోదావరి, కృష్ణాలో 4వేల టీఎంసీల నీరు....

గోదావరి, కృష్ణా నదుల్లో 4వేల టీఎంసీలకుపైగా ఉన్న నీరును సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరాకు నీరివ్వొచ్చని కేసీఆర్‌ చెప్పారు. నీటికోసం తగాదాలు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదన్నారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతోనూ తాను చెప్పినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సమగ్ర జలవిధానం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రాజెక్టులను రీడిజైన్‌ చేశామన్నారు. పాలమూరు జిల్లాకు నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందిస్తామని.. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశామని చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామన్న సీఎం... పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తామని స్పష్టం చేశారు.

పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం: కేసీఆర్‌

పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఖరీఫ్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. తుమ్మిళ్ల లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు సీఎం చెప్పారు. సమైక్యపాలనలో ఎంతో నష్టపోయిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.

07:02 - March 30, 2017

జయశంకర్ భూపాలపల్లి: వన్యప్రాణులను వేటాడిన కేసు దర్యాప్తులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు బలంగా వినిసిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ అటవి ప్రాంతంలో జరిగిన జింకలవేటలో లభించిన ఆధారాలను నీరుగార్చి అసలు నేరస్తులను తప్పించేందుకు కుట్ర జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసు పురోగతిపై 10టీవీ ప్రత్యేక కథనం.

ఈ నెల 19అర్థరాత్రి వేటగాళ్ల తూటాలకు 5 దుప్పిలు ప్రాణాలు కొల్పోయాయి....

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవి ప్రాంతంలో ఈ నెల 19అర్థరాత్రి వేటగాళ్ల తూటాలకు 5 దుప్పిలు ప్రాణాలు కొల్పోయాయి. వాటిని వాహనాల్లో తీసుకెళ్తుండగా గ్రామస్తులు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించి వేటగాళ్ల కారుతో పాటు రెండు దుప్పిలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన నిందింతుల్లో అధికార పార్టీ ముఖ్య నేతల కుమారులు ఉండడంతో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది.

అసెంబ్లీ సమావేశాల్లో దుప్పిల వేటకు సంబంధించి చర్చ...

ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో దుప్పిల వేటకు సంబంధించి చర్చకు రావడంతో ప్రభుత్వం విచారణలో వేగం పెంచింది. ఈ క్రమంలో అమాయకులను నిందితులుగా చిత్రీకరించి కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇక నిందింతులను సైతం గుట్టుచప్పుడు కాకుండా...

ఇక నిందింతులను సైతం గుట్టుచప్పుడు కాకుండా పెద్దపల్లి జిల్లాలోని మంథని కోర్టులో హాజరుపర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ4 నిందింతుడిగా ఉన్న మహదేవ్ పూర్ టీఆర్‌ఎస్ జడ్పిటీసీ భర్త అక్బర్‌ఖాన్‌ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.

నిందింతుల్లో మంత్రి, డిప్యూటి సీఎం కొడుకులు ఉన్నారనే ప్రచారం...

నిందింతుల్లో మంత్రి, డిప్యూటి సీఎం కొడుకులు ఉన్నారనే ప్రచారం పై ప్రభుత్వం ఇంత వరకు నోరు మెదపలేదు. దీనిని బట్టి చూస్తుంటే కేసులోని ప్రధాన నిందింతులను తప్పించే కార్యక్రమం జరగుతోందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

06:58 - March 30, 2017

నిజామాబాద్ : జిల్లాలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య విబేదాలు రచ్చకెక్కాయి. బోదన్ నియోజకవర్గంలో కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సందర్భంగా నీటి పారుదల శాఖ ట్రాన్స్ కో అధికారులను టీఆర్ఎస్ నేత అబీద్ పరుష పదజాలంతో దూషించారు. దీంతో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని బహిష్కరించారు.

కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను ...

కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను మాజీమంత్రి సుదర్సన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో అక్కడకు చేరుకున్న టీఆర్ఎస్ నాయకులు అధికారులపై తిట్ల పురాణం మొదలుపెట్టారు. తమకు తెలియకుండా ట్రయల్ రన్ ఎలా ప్రారంభిస్తారని రెచ్చిపోయారు. తమను దుర్బషలాడిన నేతను వెంటనే అరెస్టు చేయాలని లేదంటే జిల్లా అధికారులమంతా సమ్మెకు దిగుతామని కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

టీఆర్‌ఎస్ నేతలు అధికారులపై రెచ్చిపోవడం ఎక్కువైందని...

ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్ నేతలు అధికారులపై రెచ్చిపోవడం ఎక్కువైందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా జిల్లా కలెక్టర్ పైనా సైతం అధికార పార్టీ ఎమ్మల్యేలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయంశంగా మారింది. జిల్లా అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్న కలెక్టర్‌పై ఫిర్యాదు చేయడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే టీఆర్ఎస్ నేత అబిద్‌ను అరెస్టు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

06:56 - March 30, 2017

శ్రీకాకుళం :జిల్లాలో ఎలుగుబంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పలాస, వజ్రపుకొత్తూరు, మందస తదితర గ్రామాల్లో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువైంది.

ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో ...

ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో పగటిపూట ఎలుగుబంట్లు తిష్టవేసి జీడిపిక్కలను తిని రాత్రిపూట కొండ ప్రాంతాలకు వెళ్లిపోతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

జీడితోటల్లోని ముళ్లపొదల్లో దాక్కుని ...

జీడితోటల్లోని ముళ్లపొదల్లో దాక్కుని తమపై విచక్షణరహితంగా దాడి చేస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసుల, అటవిశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఎలుగుబంట్లు దాడులతో ఇద్దరు మరణించగా ...

గతేడాది పలాస, వజ్రపుకొత్తూరు, మందస గ్రామాల్లో ఎలుగుబంట్లు దాడులతో ఇద్దరు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతవరకు బాధితులకు ప్రభుత్వం తరపున ఎలాంటి నష్టపరిహారం అందలేదని వెల్లడిస్తున్నారు. తక్షణమే అటవిశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

06:54 - March 30, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు ఒక బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభిరామ్‌ ఏది మాట్లాడినా విజిల్‌ సౌండ్‌ వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఎక్స్‌ రేలు, సిటీ స్కాన్‌ తీసినా సమస్య అంతుపట్టలేదు. చివరికి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చెవి, ముక్కు, గొంతు విభాగం వైద్యులు హనుమంతు, శ్రీకాంత్‌ బృందం అభిరామ్‌కు ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి ఊపిరితిత్తుల్లో విజిల్‌ ఉన్నట్టు నిర్ధరించారు. అభిరామ్‌కు రెండు గంటలపాటు ఆపరేషన్‌ చేసి, ఊపిరితిత్తుల నుంచి విజిల్‌ను బయటకు తీశారు. అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు.

06:52 - March 30, 2017

విజయవాడ : తెలుగు విశిష్టత, సంస్కృతి సాంప్రదాయాలు అద్దంపట్టేలా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మామిడి తోరణాలు, అరటిచెట్లు, కొబ్బరి మట్టలతో ఎంబీకే కేంద్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్, నాస్తిక కేంద్రం నిర్వాహకులు డాక్టర్ విజయం, పర్యావరణ వేత్త తుమ్మల శ్రీకుమార్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 14 మంది కవులు ఉగాది వైభవాన్ని కూలంకషంగా వివరించారు. ప్రజాశక్తి ఆధ్వర్యంలో జరిగిన పలు సాంస్కృతిక, హాస్యనాటిక పోటీలు అలరించాయి.

06:50 - March 30, 2017

ఖమ్మం: అదో మారుమూల గ్రామం. గిరిజన అటవీ ప్రాంతం. అక్షర జ్ఞానం లేని గిరిజన రైతాంగం పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇలాంటి భూములపై సర్కార్‌ కన్నుపడింది. ఎలాగైనా ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన గిరిజనులు ఫారెస్ట్‌ సిబ్బందికి ఎదురుతిరిగారు.

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై...

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్‌ సిబ్బంది ప్రతాపం చూపిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు అధికారులకు ఎదురుతిరుగుతున్నారు.

భూములు ఆక్రమించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది యత్నం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రేగులగూడెంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన భూములను ఆక్రమించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది యత్నించారు. ఇందుకోసం జేసీబీతో సహా పలు వాహనాలను తీసుకువచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన గిరిజనులు ఫారెస్ట్‌ సిబ్బందికి ఎదురు తిరిగారు. ఫారెస్ట్‌ సిబ్బందికి చెందిన జేసీబీతో సహా మూడు బైకులను తగలబెట్టారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ....

ఇక సమాచారం అందుకున్న కొమరారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గ్రామంలోని ఇళ్లన్నీ సోదా చేశారు. ఎవరూ దొరకకపోవడంతో.. 20 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మండలమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

06:48 - March 30, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ పేరును రాష్ట్రపతి పదవికి పరిశీలించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్డీఏ సర్కార్‌కు సూచించని నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది ఎప్పటికీ జరిగేది కాదని, తాను ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే పనిచేస్తానని భగవత్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌లో చేరేముందే తాను అన్ని తలుపులు మూసేశానన్నారు. రాష్ట్రపతి పదవిపై వస్తున్నవన్నీ వదంతులు మాత్రమేనని... పొరపాటున ఎవరైనా తన పేరు ప్రతిపాదించినా తాను ఎప్పటికీ ఒప్పుకోబోనని ఆయన కుండ బద్దలుకొట్టారు. భారత్ హిందూ దేశంగా ఉండాలన్న కల నెరవేరాలంటే రాష్ట్రపతిగా భగవత్‌ను ఎంపిక చేయాలని శివసేన సూచించిన విషయం తెలిసిందే.

06:46 - March 30, 2017

ఢిల్లీ: ఆటోమొబైల్‌ కంపెనీలకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా బీఎస్‌-3 వాహనాల అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి కోర్టు ఆదేశాలు అమలులోకి రానున్నాయి. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ప్రధానమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కాలుష్యాలను వెదజల్లే వాహనాలు రోడ్డుపైకి వచ్చేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ తయారీదార్ల వద్ద సుమారు 8.5 లక్షల బీఎస్‌-III వాహనాలు స్టాక్‌ ఉన్నాయి. వీటిల్లో 96వేలు వాణిజ్య వాహనాలు, 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 40 వేల త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 12 వేల కోట్లు ఉంటుందని అంచనా.

06:44 - March 30, 2017

ముంబై : ఇండియన్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆధార్‌ వివరాలను బహిర్గతం చేసిన కామన్‌ సర్వీస్‌ సెంటర్‌పై యూఐడిఐఏ చర్యలు చేపట్టింది. సిఎస్‌సిని పదేళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్లు యూఐడిఏఐ చీఫ్‌ ఏబీ పాండే తెలిపారు. ధోని ఆధార్‌ కార్డు వివరాలను నమోదు చేసిన కామన్‌ సర్వీస్‌ సెంటర్- ట్విటర్‌ ద్వారా ఆ వివరాలను బయటపెట్టింది. ఈ వ్యవహారంపై ధోని భార్య సాక్షిసింగ్‌ మండిపడ్డారు. వ్యక్తిగత వివరాలను ఎలా బయటపెడతారని సిఎస్‌సిని ప్రశ్నించారు. సాక్షి ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమ దృష్టికి తెచ్చినందుకు మంత్రి సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. రవిశంకర్‌ ప్రసాద్‌ ఆదేశాల మేరకు సదరు సంస్థపై యునిక్‌ ఐడింటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది.

06:42 - March 30, 2017

హైదరాబాద్: లారీల యజమానులు సమ్మెబాట పట్టారు. ఇవాళ్టి నుంచి ఎక్కడి లారీలే అక్కడే నిలిచిపోతున్నాయి. దక్షిణాది లారీల ఓనర్స్ అసోసియేషన్ తలపెట్టిన ఈ సమ్మె కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల్లోని 16 లక్షల లారీల రవాణా స్తంభించిపోతుంది. లారీ యజమానుల సమ్మెకు కారణం ఏమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? లారీ రవాణా రంగం విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎలా వున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఏప్రిల్ 1న బ్యాంకులు బంద్ : ఆర్బీఐ

ముంబై : ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఊరటనిస్తూ ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలతో సంబంధం ఉన్న అన్ని బ్యాంకులు మార్చి 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో సహా పని చేయాలని గత వారం ఆదేశించింది. ఇందులో మార్పు చేస్తూ ఏప్రిల్ 1న బ్యాంకులు మూసివేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. ఆ రోజు తెరిచి ఉంచడం వల్ల వార్షిక క్లోజర్ సాఫీగా సాగే అవకాశం ఉండదని, ముఖ్యంగా కొన్ని బ్యాంకుల విలీనం ఆ రోజు నుంచి అమలులోకి వస్తున్నందున నిర్ణయంలో మార్పు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

యూపీలో పట్టాలు తప్పిన మహాకోశల్ ఎక్స్ ప్రెస్

యూపీ : జబల్‌పూర్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళుతున్న మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్‌లోని కుల్‌పహాడ్‌ వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Don't Miss