Activities calendar

31 March 2017

22:13 - March 31, 2017

బాధితులుయ...32 లక్షల మంది....మోసం రూ.6380కోట్లు, కన్నీళ్లు కొలవలేనన్ని, న్యాయం జరుగుతుందా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:06 - March 31, 2017

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అభిమాన సంఘాలతో సమావేశం నేపథ్యంలో రజనీ రాజకీయాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అభిమాన సంఘాలతో సమావేశం జరపడం సాధారణమేనని రజనీ తెలిపారు. అభిమాన సంఘాలతో తరచూ సమావేశాలు జరపడం వల్ల సత్సంబంధాలు మెరుగు పడతాయని అన్నారు.

 

21:59 - March 31, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దినేశ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు CSగా పని చేసిన అజయ్‌  కల్లం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో దినేశ్‌ కుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అజయ్‌ కల్లం నుంచి దినేశ్‌ కుమార్‌ చార్జ్‌ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. 
 

21:56 - March 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టు ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మిషన్‌ కాకతీయలో తీసిన పూడికమట్టి వల్ల ఐదేళ్లలోరాని పంటల దిగుబడి గత ఖరీఫ్‌లో అధికంగా వచ్చిందని చెప్పారు. మిషన్‌ కాకతీయ-3 కింద మంజూరైన చెరువుల మట్టిని సాయిల్‌ టెస్ట్‌ చేయించాలని సూచించారు. 
అధికారులతో మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌
జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులతో మిషన్‌ కాకతీయ పనుల గురించి సమీక్షించారు. అలాగే భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్‌లలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత గురించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ఉన్న బాటిల్‌ నెక్‌ సమస్యలు గుర్తించి.. వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిహరీష్‌రావు .. అధికారులకు సూచించారు.  సూర్యాపేట జిల్లాలో లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజీ 2 పనులను ఖరీఫ్‌ కల్లా పూర్తి చేయాలన్నారు. 
7న ఢిల్లీలో కేంద్రప్రభుత్వ జలవనరుల శాఖ సమావేశం
ఢిల్లీలో ఏప్రిల్‌ 7న కేంద్ర ప్రభుత్వ జలవనరులశాఖ ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీఏడీడబ్ల్యుఏఎం కింద ప్రతిపాదనలు ఇరిగేషన్‌ అధికారులు వెంటనే ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆయకట్టు లోకలైజేషన్‌ ప్రక్రియ, మిషన్‌ కాకతీయ-2 పనులన్నింటిని  వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.  మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్ట్‌ల పనుల పురోగతిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌కు సూచించారు. అలాగే సిద్దిపేట జిల్లా శనిగరం చెరువు ఆధునికీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పనుల విషయంలో ఇరిగేషన్‌..రెవెన్యూ, వ్యవసాయ అధికార యంత్రాంగంతో ..జిల్లా కలెక్టర్లు  సమన్వయం చేసుకుని నిర్వహించాలని మంత్రి సూచించారు.

 

21:49 - March 31, 2017

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వానికి కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌  అక్షింతలు వేసింది.  ప్రభుత్వ తప్పిదాలను తన నివేదికలో ఎత్తిచూపింది. 2015-16 సంవత్సరానికి దాదాపు 37 వేల కోట్ల అధిక వ్యయం జరిగిందని తప్పుపట్టింది.  సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ తీరును కడిగి పారేసింది. 
కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2015-16లో 36,856 కోట్ల అధిక వ్యయం జరిగిందని కాగ్‌ తప్పుపట్టింది. 2015-16లో ద్రవ్యలోటు 22,057 కోట్ల రూపాయలుగా తేల్చింది. రెవెన్యూ రాబడుల అంచనాల కన్నా 1476 కోట్లు తగ్గినట్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్దంగా జీతాలు పెంచిన సర్కారు మొత్తంగా 4650 కోట్లు కేటాయించిందని కాంగ్‌ ప్రభుత్వాన్ని తలంటింది.  రుణమాఫీ పథకానికి 2015-16లో 4300 కోట్లు కేటాయిస్తే.. అందులో కేవలం 743 కోట్లు మాత్రమే పంపిణీ చేసిందని ఆక్షేపించింది. మిగిలిన 3557 కోట్ల నిధులను ఇతర పద్దులకు మళ్లించిందని మండిపడింది. 
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్‌
సాగునీటి ప్రాజెక్టులపైనా ఏపీ ప్రభుత్వాన్ని కాగ్‌ కడిగి పారేసింది.  274 సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని కాగ్‌ నివేదికలో తెలిపింది.  63 సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు 24,182 కోట్లకు పెంచారని... దీనివల్ల ఖర్చులు పెరగడంతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాలనూ రాష్ట్రం కోల్పోయిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టులపై ఖర్చు చేసిన దానికి.. దాని వల్ల పొందే ప్రయోజనానికి మధ్య పొంతనేలేదని తెలిపింది. 
2011-16 మధ్యలో 90 మార్కెట్‌యార్డుల్లో లావాదేవీలు జరుగలేదు: కాగ్‌
2011 నుంచి 2016 వరకు 90 మార్కెట్‌ యార్డుల్లో లావాదేవీలు జరుగలేదని, రైతుల కమిషన్ల రూపంలో 466 కోట్లు ఏజెంట్లకు చెల్లించారని కాగ్‌ తన నివేదికలో తెలిపింది. అవసరం లేకున్నా ఏజెంట్లకు భారీ మొత్తంలో కమిషన్లు చెల్లించినట్టు పేర్కొంది. మార్కెట్‌ యార్డుల్లో ఆరోగ్యకరమైన పోటీలేదని స్పష్టం చేసింది.  గుంటూరు జిల్లాలోని ఏఎంసీలో బిడ్లు లేకుండా 93.3శాతం మిరప వర్తకం జరిగిందని కాగ్‌ తెలిపింది. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఇంతవరకు ఈ- పంచాయతీ  ప్రాజెక్టు లక్ష్యాలను సాధించలేకపోయారని తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల్లో నీటి ఆడిట్‌ను నిర్వహించలేదని రిపోర్టులో పేర్కొంది. 
రాజధానిలో ఉపాధి కోల్పోయిన 23,500 కుటుంబాలు
రాజధానిలో ఉపాధికోల్పోయిన 23,500 కుటుంబాలకుగానూ 19,075 కుటుంబాలకే పెన్షన్‌ ఇస్తున్నట్టు కాగ్‌ తెలిపింది. వృద్దాప్య పెన్షన్ల కోసం చేసిన దరఖాస్తులు లక్షలకొద్దీ పెండింగ్‌లో ఉన్నాయని..వయోవృద్ధుల సంక్షేమం కోసం పెద్దగా నిధులు విడుదల చేయడంలేదని ఆక్షేపించింది. ఇక 2015-16లో అమృత్‌ పథకం కింద 382 కోట్లు విడుదల చేయగా ఇందులో కేవలం 6 కోట్లే ఖర్చు చేశారని మండిపడింది. విజయనగరం పోలీసు శిక్షణా కేంద్రంలో చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడంతో 2.44 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయని ఆక్షేపించింది. యోగి వేమన యూనివర్సిటీలో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో 29.50 కోట్ల రూపాయలు వృథా అయ్యాయని అక్షింతలు వేసింది.

21:39 - March 31, 2017

ఢిల్లీ : జాతీయ రహదారులపై మద్యం షాపులు నిర్వహించే యజమానులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దేశవ్యాప్తంగా లైసెన్స్‌లు ఉన్నంతవరకు జాతీయ రహదారులపై మద్యం షాపులు కొనసాగించుకోవచ్చని  సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో సెప్టెంబర్‌ 30 వరకు తెలంగాణ, జూన్‌ 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులపై మద్యం షాపులు నిర్వహించుకునేందుకు వీలు కలిగింది. 20 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో జాతీయ,రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండవద్దని కోర్టు తెలిపింది. అక్టోబర్‌ 1, 2017 నుంచి జాతీయ రహదారులకు 5 వందల మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భౌగోళిక స్వభావం దృష్ట్యా మేఘాలయ, సిక్కిం లకు 500 మీటర్ల నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. ఈ ఏడాది జారీ చేసిన లైసెన్స్‌ల కాల పరిమితి ముగిసేవరకు అనుమతించాలని మద్యం వ్యాపారుల సంఘం కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

 

21:04 - March 31, 2017

విద్యుత్ ఛార్జీల పెంపు సరికాదని వక్తలు అన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది. ప్రస్తుత ధరల కంటే 3.6 శాతం ఛార్జీలు పెంచారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తులసీదాస్, బీజేపీ నేత రాజ, కాంగ్రెస్ నేత రాజేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:59 - March 31, 2017

ఆంధ్రా కష్టాలకు ఆయనగారే ఇరుగుడు.. మంత్రి పదవి కోసమే చినబాబు ఎమ్మెల్సీ, గద్వాల సంబురాలల్ల జితేందర్ జిందాక...ఐదు రోజుల పండుగ అవల్దార్ జేసిర్రు, ఎండల కష్టపడుతున్న ఆర్థికమంత్రి ఈటెల.. ఇంతపనిజేస్తున్న నేతకు ఇంకొకరు సాటేలా, మల్లన్న సాగర్ పంచాదీ 300 రోజులు.... అయినా పట్టుఇడువమంటున్న పబ్లిక్కు, ఫించని కోసం ఎదురుచూస్తున్న దేవుడు... ఖమ్మం జిల్లా పానకాల స్వామి పస్తులు, గాడ్దులతోటి బండ్లుదింపిన భక్త జనాలు... కర్నూలు జిల్లాల ఉగాది తెల్లారి పండుగలు, ముల్ల పందిని మింగిన పాము... ఆ తర్వాత దాని అవస్తలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

కేశినేని బస్సుల రద్దుపై ప్రకటన చేసేందుకు ఎంపీ నాని ప్రెస్ మీట్

విజయవాడ : కేశినేని బస్సుల రద్దుపై ప్రకటన చేసేందుకు ఎంపీ నాని ప్రెస్ మీట్ కు కూర్చున్నారు. నానికి సీఎం చంద్రబాబు ఫోన్ చేసి..ఎలాంటి ప్రకటన చేయవద్దని నానికి హితవు పలికారు. 

20:36 - March 31, 2017

విజయవాడ : బీఫార్మసి విద్యార్థి ఆయేషామీరా హత్యకేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంపై బెజవాడ బార్‌ అసోసియేషన్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2007 డిసెంబర్‌ 26న ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్‌ హాస్టల్లో జరిగిన హత్యపై కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా హైకోర్టులో న్యాయం గెలిచిందన్నారు. ఈ కేసులో అసలు దోషులెవరో అందరికి తెలుసని..కానీ వారు తప్పించుకొని అమాయకుడైన సత్యంబాబుని అన్యాయంగా ఇరికించారని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విమర్శించారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:33 - March 31, 2017

హైదరాబాద్ : కోర్టుల్లో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని సత్యంబాబు తరపు న్యాయవాది ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినప్పుడే ఇలాంటి తప్పిదాలు జరుగుతాయన్నారు. సత్యంబాబు దోషికాదని ఆయేషా తల్లి కూడా చెబుతూనే ఉందని తెలిపారు. అయినా పోలీసులు అసలు దోషులను వదిలిపెట్టి.. అమాయకుడైన సత్యం బాబును ఇరికించారని చెప్పారు. ఏమైనా సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంపై అందరికీ కోర్టులపై గౌరవం పెరుగుతుందన్నారు. 

20:27 - March 31, 2017

విజయవాడ : హైకోర్టు తీర్పుపై ఆయేషా తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమార్తె హత్య కేసుతో సత్యంబాబుకు సంబంధం లేదన్న విషయాన్ని తాము ఆనాడే చెప్పిన విషయాన్ని ఆయేషా మీరా తల్లిదండ్రులు సయ్యద్‌ షంషాద్‌ బేగం, ఇక్బాల్‌ బాషా గుర్తు చేశారు.  అసలు దోషులు  దివంగత మాజీ మంత్రి కోనేరు రంగారావు కుటుంబ సభ్యులేనని  ఆరోపించారు. తన కుమార్తె చదవిన కాలేజీ హాస్టల్‌ వార్డెన్‌ కోనేరు పద్మ,  ఆమె భర్త శివరామకృష్ణలను విచారిస్తే  నిజాలు వెలుగు చూస్తాయంటున్నారు. 

 

20:23 - March 31, 2017

విజయవాడ : రాజు తలుచుకుంటే కొరఢా దెబ్బలకు కొదువా... ఇది నిజమే...పోలీసులు తలచుకుంటే నేరగాళ్లు ఈజీగా బయటపడొచ్చు...వారి చేతుల్లోనే అంతా ఉంటుంది...అమాయకులు చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవించొచ్చు..ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి కూడా..తాజాగా ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో మరోసారి పోలీసుల నిర్లక్ష్యం..స్వార్థం బయటపడింది... సంచలనం రేపిన బెజవాడ విద్యార్థిని ఆయేషామీరా కేసులో అసలు దోషులెవరు..? ఇంతకాలం సత్యంబాబునే నేరస్థుడిగా చూపించిన పోలీసులు దోషులను తప్పించినట్లేనా..? ఈకేసులో ప్రముఖులున్నారన్నది వాస్తవమేనా..? వారిని తప్పించేందుకు అమాయకుడిని కేసులో ఇరికించారన్నది నిజంకాదా...? హైకోర్టు సంచలన తీర్పు చెప్పడంతో ఇప్పుడు ఆయేషా కేసు మళ్లీ మొదటికి వచ్చింది... 
ఆయేషా కేసులో సత్యంబాబు నిర్ధోషి...
బెజవాడ బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా కేసులో సత్యంబాబు నిర్ధోషి...ఎనిమిదేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్యంబాబు సచ్చీలుడిగా బయటపడనున్నాడు.. దర్యాప్తు అధికారులను చివాట్లు పెట్టిన ధర్మాసనం సత్యంబాబుకు పరిహారంగా లక్ష చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది... 
సంచలన హత్యలో సంచలన తీర్పు...
విజయవాడలోనే కాదు..యావత్‌ దేశంలో సంచలనం రేపిన బీఫార్మసీ స్టూడెంట్‌ ఆయేషా మీరా హత్యోదంతం కేసులో తీర్పు కూడా సంచలనం రేపుతోంది....హైకోర్టులో ఉన్న ఈ కేసు వాదనలు పూర్తయి తుది తీర్పు వెలువడింది...ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబును నిర్ధోషిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది...ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు స్పాట్‌లో దొరికిన లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు....అయితే ఈ కేసులో ఎన్నో అనుమానాలు కలిగాయి...కేసును తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న కుట్రగా ప్రజా సంఘాలు అభివర్ణించాయి..ఇదిలా ఉంటే ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబుని ప్రధాన నిందితుడిగా గుర్తించి 2008 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేశారు...విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సత్యంబాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ.. తీర్పు చెప్పింది...దీనిపై హైకోర్టుకు కేసు అప్పీలు వెళ్లడంతో ఇన్నేళ్లుగా వాదనలు జరిగాయి...ఈ కేసులో పూర్తి వాదనలు విన్న ధర్మాసనం..సాక్ష్యాలను పరిశీలించి సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది...అంతే కాకుండా దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సత్యంబాబుకు హైకోర్టు సూచించింది.

ఏపీలో 3.6 శాతం విద్యుత్‌ చార్జీల పెంపు

హైదరాబాద్ : ఏపీలో విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. ప్రస్తుత ధరల కంటే 3.6 శాతం ఛార్జీలు పెంచారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయానికి, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు... ఛార్జీల పెంపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గృహ వినియోగదారులకు 200 నుంచి 500 యూనిట్ల వరకు 3 శాతం ఛార్జీల పెంచారు. ఈ పెంపునతో ప్రజలపై 800 కోట్ల భారం పడనుంది. 

20:16 - March 31, 2017

హైదరాబాద్ : ఏపీలో విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. ప్రస్తుత ధరల కంటే 3.6 శాతం ఛార్జీలు పెంచారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయానికి, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు... ఛార్జీల పెంపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గృహ వినియోగదారులకు 200 నుంచి 500 యూనిట్ల వరకు 3 శాతం ఛార్జీల పెంచారు. ఈ పెంపునతో ప్రజలపై 800 కోట్ల భారం పడనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:12 - March 31, 2017

సుధా కొంగర డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించిన సినిమా గురు. ఆల్రెడీ హిట్ టాక్ తో వచ్చిన సాలకడోస్ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా రితిక సింగ్ నటించింది. 

సాలకడున్ సినిమా లో మాధవన్ పోషించిన పాత్ర కావడం తో వెంకీ ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చెయ్యగలడు అనే ఆసక్తి అందరిలో ఉంది .ఫామిలీ హీరోగా , మంచి టైమింగ్ ఉన్న కామెడీ హీరోగా ,యాక్షన్ స్టోరీస్ కి జస్టిస్ చేసి  మెప్పించగల వెంకటేష్ ఈ గురు సినిమా లో ఎంతవరకు పాత్రకు ప్రాణం పోసాడో లేదో గురు సినిమా చూస్తే తెలుస్తుంది .
 
గోపాల గోపాల ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టి స్టారర్ సినిమాలు చేసి సోలోగా బాబు బంగారం సినిమా తో వచ్చిన వెంకీ ప్రెజెంట్ కాంపిటీషన్ లో వెనుకబడ్డాడా అనే డౌట్ కామన్ ఆడియన్ కి రాక మానదు .తన వయసుకు తన ఫిజిక్ కి తగ్గట్టు పాత్రలు ఎంచుకుంటూ సినిమా ని ప్లాన్ చేసుకొని  పవర్ఫుల్ బాక్సింగ్ కోచ్ పాత్రలో గురు సినిమాలో కనిపించరు విక్టరీ వెంకటేష్ .

డైరెక్టర్ గా ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర తీసిన ఈ గురు  సినిమా చుసిన ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామా ? గురు సినిమాపై 10టివి పర్ ఫెక్ట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ 
రితిక సింగ్ 
కధ, కధనం 
డైరెక్షన్
సినిమాటోగ్రఫీ 
మ్యూజిక్ 
ఎమోషన్స్ 
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ 
సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ 

రేటింగ్ 2.75/5

20:07 - March 31, 2017

పూరి జగన్నాధ్ ట్రెండీ ఫిలిం  రోగ్ . ఈ  సినిమా లో  తెలుగు తెరకు కొత్త నటుడు ఇషాన్ హీరోగా పరిచయం అయ్యాడు. మన్నారు చోప్రా, ఎంజీల క్రిస్లింజి హీరోయిన్స్ గా నటించారు. పూరి జగన్నాధ్ తన స్టైల్ అఫ్ మేకింగ్ తో వచ్చిన రోగ్ సినిమా  ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది.

ఇజం సినిమా తరువాత పూరి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆలోచన అందరిలో ఉంది .టెంపర్ ,ఇజం లాంటి సోషల్ మెస్సేజ్ తో కమర్షియాలిటీ మిక్స్ చేసి తీసిన పూరి ఈ  రోగ్ సినిమాని ఎలా మలిచాడు అనే ఇంటరెస్ట్ కామన్ ఆడియన్స్ నుండి సినీ క్రిటిక్స్ వరకు అందరిలో ఉంది .

తన సినీ ప్రస్థానం లో హిట్ ఐన ఇడియట్ సినిమా టాగ్ లైన్ ని మళ్ళీ రిపీట్ చేసి మరో చంటిగాడి ప్రేమ కధ అని టాగ్ లైన్ తో రోగ్ సినిమాని వదిలాడు పూరి .మరి రోగ్ సినిమా మీద సినిమా చుసిన ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామా ?

ప్లస్ పాయింట్స్ :
పూరి మార్క్ డైలాగ్స్ 
ఇషాన్ 
సినిమాటోగ్రఫీ  
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ :
కధ
రొటీన్ స్క్రీన్ ప్లే 
పండని కామెడీ 
ఫీల్ లేని కొన్ని సన్నివేశాలు 

రేటింగ్ 1.5/5

నీట్ ను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఢిల్లీ : నీట్ ను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఏడాది నుంచే నీట్ ను ఉర్దూలో నిర్వహించాలని పిటిషన్ వేశారు. పిటిషన్ పై సమాధానం తెలిపేందుకు కేంద్రం గడువు కోరింది. కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది.  

గో సంరక్షణ బల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం

గాంధీనగర్ : గో సంరక్షణ బల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై గో హత్యకు పాల్పడితే జీవిత ఖైదు విధించనున్నట్లు ప్రకటించారు. గోవుల అపహరణకు పాల్పడితే 10 ఏళ్లు జైలు శిక్ష వేయనున్నట్లు తెలిపారు.

 

18:29 - March 31, 2017

నిజామాబాద్ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడిమిని  భరించలేక జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మధ్యహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 40 డిగ్రీలు దాటుతున్న  ఉష్ణోగ్రతలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి.
3డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
సూరీడు మండుతున్నాడు. రికార్డు స్తాయిలొ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  గత నాలుగురోజుల్లోనే  మూడు డిగ్రీలు  పెరిగిన ఎండల తీవ్రత జనాన్ని భయపెడుతోంది. రాబోయె రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని అటు  వాతావరణశాఖా చెబుతోంది.
మార్చి 26న 41.2 డిగ్రీల ఎండ 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిన్నమొన్నటిదాకా సాధారణంగా ఉన్న ఎండలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. ఈ నెల 26 నాడు ఏకంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.   
వడగండ్లతో కొద్దిగా ఉపశమనం పొందిన ప్రజలు
ఉదయం 9 గంటల నంచే సుర్రుమంటున్న ఎండ ..   మధ్యాహ్నానికి నిప్పుల కుంటపటిని తలపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం ఐదు గంటలవరకు కూడా ఎండమంటలు చల్లారడంలేదు.  ఇటీవల జిల్లాలో అక్కడక్కడా పడిన వడగండ్ల వానలు కొంత ఉపశమనాన్ని ఇచ్చినా.. మళ్లీ ఒకటి రెండురోజుల్లోనే నేల పొగలు కక్కుతోంది. ప్రజలు  కొబ్బరిబొండాలు, నిమ్మరసం తాగుతూ వేసవి తాపం తీర్చుకుంటున్నారు. 
రికార్డుస్థాయిలో ఎండల తీవ్రత
గత మూడు సంవత్సరాల నుంచి నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్తాయిలొఉష్నొగ్రతలు నమోదు అవుతున్నాయి. 2013 మేలో 45.6 డిగ్రీలు, 2014 మార్చిలో  43.6. , 2015 లో 46.5. , 2016 లో ఏప్రిల్‌లో 44.4.డిగ్రీల  గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఇక ఈ ఏడాది  మార్చి 13న  36 డిగ్రీలు నమోదు కాగా.. 26 తేదీనాటికి  41.2.  డిగ్రిలకు చేరుకుని సెగలు కక్కుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే.. రాబోయే రెండున్నర నెలలు ఎలా గడుస్తుందోనని ప్రజల్లో  ఆందోళన నెలకొంది. 

 

18:23 - March 31, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. లా కమిషన్ సిఫార్సులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో పెన్ డౌన్ చేశారు. కోర్టు బయటకు వచ్చి నిరసన తెలిపారు. తమ అనుమతి లేకుండా లా కమిషన్ సిఫార్సులను చట్టం చేయవద్దని వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....

 

18:21 - March 31, 2017

నల్గొండ : జిల్లాలోని హాలియాలో ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతల ఘరానామోసం బయటపడింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు. నాగార్జునాసాగర్‌, హాలియా, మిర్యాలగూడలోని నిరుద్యోగుల నుంచి దాదాపు 40 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జెన్‌కో, టూరిజం శాఖ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను నిరుద్యోగులకు అందజేశారు. అయితే.. చాలారోజులు ఎదురుచూసినా.. ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని వారిని నిలదీశారు. దీంతో చేసేది ఏమీలేక ఓ నేత ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో నిరుద్యోగ బాధితులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. తమ డబ్బులు వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నారు. 

 

18:17 - March 31, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ చేసిన మోసాన్ని కార్మికులకు తెలియజేస్తామన్నారు. త్వరలో జరగనున్న సింగరేణి ట్రేడ్ యూనియన్‌ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీతో కాంగ్రెస్‌ కలిసి ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. కాగా ఈ ఎన్నికలకు గండ్ర వెంకటరమణ రెడ్డిని చైర్మన్‌గా నియమించడం జరిగింది.

 

18:12 - March 31, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంటోంది. గతేడాది కంటే భారీ స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శాసనసభ్యులు ఇప్పుడు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు. ఇదిలావుంటే.. సభ్యత్వ నమోదు ప్రక్రియ నేతల మధ్య వివాదాలకు కారణమవుతోంది. ఇప్పుడే ఇలా వుంటే భవిష్యత్‌లో గ్రామ, మండల కమిటీల ఏర్పాటులో ఎన్ని సమస్యలు వస్తాయోనన్న టెన్షన్‌ నేతలను వెంటాడుతోంది. 
ఊపందుకున్న గులాబి పార్టీ సభ్యత్వ నమోదు 
గులాబి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంది. ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందే గ్రామ కమిటీల ఎంపికతో పాటు రాష్ట్ర  అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. రాబోయే ఎన్నికలకు కూడా ఇప్పుడు నియమించే కమిటీలే ఎదుర్కోవాల్సి ఉండడంతో  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా గులాబి బాస్ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల వారిగానే భారీగా సభ్యత్వ నమోదు చేయడంతో పాటు రాజకీయంగా బలమైన శక్తిగా పార్టీని తీర్చిదిద్దేందుకు  తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌ దృష్టి సారించారు.
నియోజకవర్గాల వారిగా లక్ష్యాలు 
పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది చేపట్టిన సభ్యత్వ నమోదును దృష్టిలో ఉంచుకుని అంతకంటే ఎక్కువగా ఈ విడత సభ్యత్వ నమోదును చేయాలని నియోజకవర్గాల వారిగా లక్ష్యాలను పార్టీ నిర్ణయించింది.  ఇప్పటివరకు జరిగిన సభ్యత్వ నమోదులో నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో  73 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. మరో  వారం రోజులు సభ్యత్వ నమోదుకు అవకాశం  ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లోనూ మరింత ఊపందుకుంటుందన్న ధీమాలో గులాబి పార్టీ నేతలున్నారు.
సభ్యత్వ నమోదులో బిజీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నిన్న, మొన్నటి వరకు శాసనసభా సమావేశాల్లో బిజీగా గడిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు సభ్యత్వ నమోదులో బిజీగా మారారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా వలసలు పెరగడంతో సభ్యత్వ నమోదు.. నేతల్లో ఆధిపత్య పోరు తెరపైకి తెస్తోంది.  ఇతర పార్టీల నుంచి గులాబి పార్టీలో చేరిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో వర్గ పోరు తీవ్రమవుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలు అవుతున్నాయి.  సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ, మండల కమిటీల నియామకం  సందర్భంగా  గులాబి నేతల్లో అంతర్గత పోరు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

17:51 - March 31, 2017

హైదరాబాద్ : ఉస్మానియాలో తాను రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులు ఆయన మాట్లాడారు. తన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకున్నా..  తాను జాతీయస్థాయిలో రాజకీయనాయకునిగా గుర్తింపు పొందడానికి ఉస్మానియాలో దిద్దిన్న పాఠాలేనని సీతారం ఏచూరి అన్నారు. వామపక్ష భావజాలాన్ని ఎదుర్కోడానికి యూనివర్సిటీలనే మూసేయడానికి కేంద్రం కుట్ర పన్నుతుందని తెలిపారు. 

 

17:48 - March 31, 2017

మెదక్ : ప్రజలు తమ పనులకోసం అధికారులను అడుక్కునే పరిస్థితి రాకూడదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ మాణిక్‌ రాజ్‌కణ్ణన్‌ అన్నారు. వినూత్న విధానాలతో ప్రజలకు చేరువవుతూ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జిల్లా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సంగారెడ్డి కలెక్టర్ మాణిక్ రాజ్ కణ్ణన్‌ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉన్న హక్కులను అమలు చేయడమే అధికారుల బాధ్యతన్నారు. విద్యార్థుల ఇంటికే వెళ్లి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలను అందచేస్తున్నామని తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరగకుండా చూస్తున్నామని చెప్పారు. ఉపాధిహామీ పథకంతో పేద రైతుల బీడు భూములను చదును చేస్తున్నామని పేర్కొన్నారు. 6వేల ఎకరాల్లోని బీడు భూముల్లో ఈ ఏడాది ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 6వేల ఎకరాలను చదును చేస్తే.. వాస్తవంగా సాగులోకి వచ్చేది 2వేల ఎకరాలు ఉంటుందని తెలిపారు. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు వెనకాడుతుంటారు..అలాంటి వారికోసం.. లైబ్రరీల్లో కాంపిటీటివ్‌ బుక్స్‌కు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 

 

17:42 - March 31, 2017

హైదరాబాద్ : నిలోఫర్‌ ఆస్పత్రిలో పసిపిల్లలను నిర్లక్ష్యంగా తరలించిన సిబ్బందిపై వేటు పడింది. దీనికి కారణమైన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని  సూపరింటెండెంట్‌ రమేష్‌రెడ్డి తొలగించారు. చిన్నారిని చేతులపై మోసుకువెళ్లిన వారిని ప్రశ్నించామని.. విధుల్లోంచి తొలగించామని డాక్టర్‌ రమేష్‌ చెప్పారు. కాగా చిన్న చిన్న సమస్యలు మినహా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండడమే కాకుండా.. అన్ని రకాల పరీక్షలు చేయడానికి కూడా ల్యాబ్‌ అందుబాటులో ఉందన్నారు. 

 

17:40 - March 31, 2017

ఢిల్లీ : రాష్ట్రానికి రావాల్సిన సెంట్రల్ సేల్స్‌ ట్యాక్స్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌...  కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి పార్లమెంటు భవన్‌లో పలువురు కేంద్రమంత్రులతో  ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు. వివిధ పథకాల కింది కేంద్రం ఇవ్వాల్సిన నిధులను వెంటనే  విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఏపీ మంత్రివర్గంలో కోసం ఎమ్మెల్యేల ముమ్మర ప్రయత్నాలు

గుంటూరు : ఏపీ మంత్రివర్గంలో కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌ను ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తులు చేశారు. మరోవైపు పదవీ గండం ఉన్న మంత్రులు కొందరు.. తమను తొలగించవద్దంటూ.. కూడా విశ్వప్రయత్నాలు ప్రారంభించారు. 

17:34 - March 31, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే  40 డిగ్రిల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ జనాన్ని భయపెడుతున్నాయి. నిప్పులు కక్కుతున్నఎండల నుంచి ఉపశమనం కోసం జనం శీతల పానియాలు ఆశ్రయిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతొ మద్యాహ్నం వరకు  రోడ్లన్ని నిర్మానుష్యం మారుతున్నాయి. 
విలవిల్లాడుతున్న ప్రజలు 
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలకు ఉమ్మడి కరీంనరగ్‌ జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. పనులమీద బయటికి వెళ్లక తప్పని పరిస్థితుల్లో..తెల్లవారుజామునుంచి పనులు మొదలు పెడుతూ.. మధ్యాహ్నం 12గంటలకల్లా ఇళ్లుచేరుకుంటున్నారు. దీంతో పగటిపూట పట్టణప్రాంతాల్లో జనసంచారం కనిపించడంలేదు.  
నిప్పులు కురిపిస్తున్న భానుడు
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో  భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. సాధారణంగా మార్చి నెలలో 40 డిగ్రిల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా.. ఈ యేడాది మాత్రం ఎండల తీవ్రత జన్నాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   
రామగుండంలో ఏరియాలో అధిక ఉష్ణోగ్రతలు
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ప్రాంతంలో అధికం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి సంస్థలో మద్యాహ్నం షిప్ట్ లో కార్మికుల హజరు శాతం తక్కువగా ఉంటోంది. అటు పట్టణ కేంద్రాల్లో ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్రూట్‌ జూస్‌, కొబ్బరి బొండాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఇక చిన్నారులైతే.. స్థానికంగా ఉన్న స్విమ్మిపూల్స్‌లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు. 
కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల లో 39, నుంచి 40డిగ్రిల తీవ్రతతో ఎండలు మంటపుట్టిస్తున్నాయి.   మధ్యాహ్నం అయిందంటే ప్రజలు రోడ్ల పై కనిపించడం లేదు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పళ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ సేవించాలని సూచిస్తున్నారు. చల్లధనంకోసం ప్రజలు  ఏసిలు, ప్రిజ్ లతోపాటు   కూలర్లు, రంజన్లు కోనుగోలు  చేస్తుండడంతో మార్కెట్లో వీటికి డిమాండ్  బాగా పెరిగింది. ఈసారి ఎండల తీవ్రత అధికాంగా ఉండటంతో.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జనం వరడదెబ్బభారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు.  

 

17:28 - March 31, 2017

ఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ రాజ్యసభకు హాజరయ్యారు. సభలో మాట్లాడడానికి పారీకర్‌ ప్రయత్నించగా విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేసి అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి పారీకర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేశారు. గోవాకు రావాలని విపక్ష సభ్యులను పారీకర్‌ ఆహ్వానించారు. పారీకర్‌ కేంద్ర రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సిఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గోవాలో మెజారిటీ లేకున్నా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ రాజ్యసభలో చర్చకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. 

17:24 - March 31, 2017

ఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అయోధ్య రామమందిర నిర్మాణం కేసును త్వరగా పరిష్కరించాలన్న స్వామి అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రామ మందిర వివాదంపై త్వరితగతిన విచారణ నిర్వహించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సుబ్రమణ్యం స్వామి సభ్యులుగా ఉన్న విషయమే తమకు తెలియదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత  ఏంటని సుబ్రమణ్యం స్వామిని ప్రశ్నించింది. రామమందిరం కేసులో మీ పిటిషన్‌ను ఇప్పటికిప్పుడు విచారించేందుకు తమకు సమయం లేదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణపై కూడా కోర్టు తేదీని నిర్ణయించలేదు.

 

17:23 - March 31, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆర్బీఐ కార్యాలయాలముందు జనాలు భారీగా బారులు తీరారు. నోట్ల మార్పిడికి ఇవాళే చివరిరోజు కావడంతో నగదు మార్పిడి కోసం ఎండను లెక్కచేయకుండా క్యూ కట్టారు. పాస్‌పోర్టు, కస్టమ్స్‌ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు ఉంటేనే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. నోట్ల మార్పిడి గడువు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

17:16 - March 31, 2017

హైదరాబాద్ : వకుళాభరణం లలిత మృతి మహిళా, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ రచయిత్రి వకుళాభరణం లలిత సంస్మరణ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మహిళల జీవన స్థితిగతులు, వారి సమస్యలపై వకుళాభరణం లలిత ఎన్నో పుస్తకాలు రచించారని అన్నారు. మహిళా సమస్యలపై పరిశోధనాత్మక వ్యాసాలు, పుస్తకాలు, సంచార జాతులు, దేవదాసీ వ్యవస్థలో మగ్గుతున్న తీరును ఆమె సమాజానికి తెలియజేశారని చెప్పారు. మహిళలకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. 
 

17:00 - March 31, 2017

వరంగల్ : ఏనుమాముల మార్కెట్‌లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు..మార్కెట్ పరిసరాల్లో నాలుగుచోట్ల నిన్న మిర్చిని దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావంగా టీడీపీ నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క, గండ్ర సత్యనారాయణ, వామపక్షాల బృందం ఇవాళ మార్కెట్‌ను పరిశీలించింది. పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించి ఆదుకోవాలని టిడిపి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

 

16:58 - March 31, 2017

గుంటూరు : ఏపీ మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌ను ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తులు చేశారు. మరోవైపు పదవీ గండం ఉన్న మంత్రులు కొందరు.. తమను తొలగించవద్దంటూ.. కూడా విశ్వప్రయత్నాలు ప్రారంభించారు. నేతలు ఒక్కొక్కరుగా వెళ్లి తమ అభిప్రాయాలు చెబుతున్నారు. మృణాళిని, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డిలను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రజనీకాంత్ ఇంటికి వచ్చిన మలేషియా ప్రధాని నజీబ్

చెన్నై : మలేషియా ప్రధాని నజీబ్ రజనీకాంత్ ఇంటికి వచ్చారు. మలేషియా ప్రధాని మర్యాదపూర్వకంగానే కలిశారని రజనీకాంత్ తెలిపారు. మలేషియాలో షూటింగ్ లో ఉన్నప్పుడు ప్రధాని నజీబ్ రజాక్ ను కలవలేకపోయానని రజనీకాంత్ అన్నారు. మలేషియాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు.

 

ఏపీ అసెంబ్లీ, మండలి నిరవధిక వాయిదా

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, మండలి చైర్మన్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకముందు సభల్లో పలు అంశాలపై వాడీవేడీ చర్చ జరిగింది.

16:13 - March 31, 2017

హైదరాబాద్ : ఆనంద ఆక్వా ఫుడ్‌ ప్రమాద ఘటనపై జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు. ఐదుగురు మరణానికి కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా డిమాండ్ చేశారు. 2012లోనూ ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదం జరిగిందని.. అయినా ఇప్పటి వరకూ వాళ్లపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఫుడ్‌ పార్క్‌ల వల్ల కాలుష్యం పెరుగుతుందని.. పర్యావరణం కాపాడడం కోసం పర్యావరణ వేత్తలతో కలసి జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. 

 

16:05 - March 31, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వాఫుడ్ పార్క్‌ను ముట్టడించేందుకు కె.బేతంపూడి నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:00 - March 31, 2017

గుంటూరు : ప్రతిపక్షనాయకుడు అంటే జగన్ కు అర్థం తెలియదని టీడీపీ జవహర్ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. సమావేశాలను పూర్తిగా వాయిదా వేసి, ప్రజలను తప్పుదోవపట్టించాలని జగన్ కోరుకున్నారని తెలిపారు. 16 పద్దులకు సంబంధించిన అంశాలపై వైసీపీకి స్పష్టత లేదని విమర్శించారు. సలహాలు, సూచనలు ఇవ్వాలన్న వైసీపీ సభ్యులకు లేదన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీకి పంపిస్తే వాయిదాలు వేయించుకునేందుకు సభకు వస్తారని పేర్కొన్నారు. స్పీకర్ ముఖం మీద ప్లకార్డులు ప్రదర్శించారని మండిపడ్డారు. 'రెచ్చగొడితే రెచ్చిపోతావా... గంగలో దూకమంటే దూకుతావా' అని జగన్ ఉద్ధేశించి జవహర్ వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:53 - March 31, 2017

గుంటూరు : ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్‌ పొడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి, గొడవచేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పు పట్టారు. పొడియం వద్దకు వచ్చే సభ్యులను ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ చేసేలా రెడ్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షానికి శ్రద్ధలేదని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాలేదన్నారు. వైసీపీ సభ్యులకు క్రమశిక్షణ నేర్పించాలని కోరారు. 

 

15:45 - March 31, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 10న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 14 రోజుల పాటు సభ జరిగింది. చివరి రోజు మొగల్తూరు ఆక్వా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై రగడ జరిగింది. ఆక్వా ప్రమాదంపై కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. మంత్రి ప్రకటనతో ప్రతిపక్ష వైసీపీ సంతృప్తి చెందలేదు. స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా వేసిన స్పీకర్

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 10న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 14 రోజుల పాటు సభ జరిగింది.

వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన సీఎం చంద్రబాబు

గుంటూరు : వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలకు రూల్స్ తెలియజేయాలని స్పీకర్ ను కోరారు. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో సభ్యులు హుందాగా ఉండాలని సూచించారు. 

 

అయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ : అయేషా మీరా హత్య కేసులో హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్లుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సత్యంబాబు నిర్దోషిగా ప్రకటించింది. ఇన్నేళ్లుగా సత్యంబాబును జైల్లో ఉంచినందుకు అప్పటి పోలీసు అధికారులను హైకోర్టు మందలించింది. అలాగే లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

ఆక్వా ఫుడ్‌ ప్రమాద ఘటనపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్ : ఆనంద ఆక్వా ఫుడ్‌ ప్రమాద ఘటనపై జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు. ఐదుగురు మరణానికి కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా డిమాండ్ చేశారు. 2012లోనూ ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదం జరిగిందని.. అయినా ఇప్పటి వరకూ వాళ్లపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఫుడ్‌ పార్క్‌ల వల్ల కాలుష్యం పెరుగుతుందని.. పర్యావరణం కాపాడడం కోసం పర్యావరణ వేత్తలతో కలసి జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. 

వంతేరు డ్రేన్‌కు పైప్‌లైన్‌ ఎందుకు వేశారన్న జగన్

గుంటూరు : నిన్న జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉంటే వంతేరు డ్రేన్‌కు పైప్‌లైన్‌ ఎందుకు వేశారని ప్రశ్నించారు.

ఆక్వా ఘటనను వైసీపీ రాజకీయ చేస్తోంది : మంత్రి అచ్చెన్నాయుడు

గుంటూరు : ఆక్వా ఘటనను వైసీపీ రాజకీయ చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆక్వా ప్రమాదంలో పోల్యూషన్‌ వల్ల చనిపోలేదని, సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఐదుగురు చనిపోయారని మంత్రి వివరణ ఇచ్చారు. 

ఆక్వా ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు వివరణ

గుంటూరు : ఆక్వా ప్రమాద ఘటనపై అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 

14:57 - March 31, 2017

గుంటూరు : మొగల్తూరులో నిన్న జరిగిన అక్వాఫుడ్ ప్రమాద ఘటనపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలు మధ్య వాదోపవాదాలు నడిచాయి. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఆక్వా ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్వా ఘటనను వైసీపీ రాజకీయ చేస్తోందన్నారు. ఆక్వా ప్రమాదంలో పోల్యూషన్‌ వల్ల చనిపోలేదని, సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఐదుగురు చనిపోయారని మంత్రి వివరణ ఇచ్చారు. నిన్న జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉంటే వంతేరు డ్రేన్‌కు పైప్‌లైన్‌ ఎందుకు వేశారని ప్రశ్నించారు.
జగన్‌, అచ్చెన్నాయుడు మధ్య డైలాగ్‌ వార్‌
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌ మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది. ఇంగ్లీషు సరిగా చదవడం మంత్రిగారు నేర్చుకోవాలని జగన్‌ అనడంతో అచ్చెన్నాయుడు దానికి కౌంటర్‌ ఇచ్చారు. తనకు ఇంగ్లీషు వచ్చి ఉంటే... జగన్‌ను సభలో ఒక్క నిమిషం కూడా ఉండకుండా చేసేవాడినని అన్నారు. 
వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలకు రూల్స్ తెలియజేయాలని స్పీకర్ ను కోరారు. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. 
అసెంబ్లీలో సభ్యులు హుందాగా ఉండాలని సూచించారు. 

 

13:54 - March 31, 2017

అమరావతి: మొగల్తూరు ఘటనపై సభలో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత జగన్ మధ్య వాడి వేడి చర్చ జరిగింది. అస్సలు విషయాన్ని పక్కకు పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగడం కొసమెరుపు. దీని పై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేవౄరు. దీనిపై విపక్ష నేత జగన్ మాట్లాడుతూ..ట్రీట్ మెంట్ ప్లాంట్ వుంటే పైపు లైను ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఆనంద ప్రాన్ ప్రాసెసింగ్ కంపెనీకి తుందుర్రులో పర్మిషన్ ఇచ్చారు. ఈ రెండేళ్లుగా ప్రజలు ఈ పరిస్థితులు చూసి ఈ పరిశ్రమలు మాకొద్దని ఆందోళన చేస్తున్నారు. గతంలో జీరో పొల్యూషన్ అన్నారు. ప్రస్తుతం ఇచ్చిన వివరణలో మార్పు వుందని తెలిపారు. నా చదువకు సంబంధించి ఆరోపణలు రుజువు చేయలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. పరిశ్రమలురావడానికి అభ్యంతరం లేదు. పరిశ్రమలు సీ కోస్టు వద్ద పెడితే అభ్యంతరం లేదు. కొంతేరు(మూడు గ్రామాల్లో 10వేల మంది ఉన్నారు) డ్రైన్ వద్ద పెట్టడమే అభ్యంతరకరం అన్నారు. తుందురు ప్రాంతంలో నిర్మించే ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ పూర్తి ప్రైవేట్ కంపెనీ. దీనికి సముద్రం వరకు పైప్ లైన్ ఎవరు వేస్తారు? 30 కిలో మీటర్లు వేయాలంటే 40 కోట్లు అవుతుంది? భూములు ఎవరు ఇస్తారు? నాగార్జు యూనివర్శిటీ ప్రొఫెసర్లు పరిశీలించిన అంశాలను బట్టి... సముద్ర ఉపరితలం కన్నా తుందుర్రు, బేతపూడి గ్రామాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

జగన్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందన

మొగల్తూరు ఆక్వాఫుడ్ పార్క్ కు అనుమతి వుంది. ఈ ఘటనలో పొల్యూషన్ వల్ల కార్మికులు మృతి చెందలేదని, సేఫ్టీ మెదడ్ లేకపోవడం వల్ల చనిపోయారన్నారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని, మరిన్ని పరిశ్రమలు రావాలని కోరారు. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తరువాత అస్సలు విషయాలు బయటపడతాయని తెలిపారు. మరో వైపు వామపక్షాలు కూడా అర్థం చేసుకోవాలని... పరిస్థితులకు తగ్గట్టు మారాలని విజ్ఞప్తి చేశారు. కారణాలు తెలియకుండా పరిశ్రమను మూసివేయాలనడం సరికాదన్నారు. గోదావరి అక్వాప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ ఫుడ్ పార్క్ వల్ల ఏ ఒక్కరికి నష్టం లేకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

13:27 - March 31, 2017

హైదరాబాద్: అయేషా మీరా హత్య కేసులో హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్లుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సత్యంబాబు నిర్దోషిగా ప్రకటించింది. ఇన్నేళ్లుగా సత్యంబాబును జైల్లో ఉంచినందుకు అప్పటి పోలీసు అధికారులను హైకోర్టు మందలించింది. అలాగే లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

13:26 - March 31, 2017

విశాఖ: ఏయూ కాన్వకేషన్‌ హాల్‌లో మద్యం షాపుల లాటరీ నిర్వహణ వివాదానికి దారితీసింది.. విద్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు..

 

13:24 - March 31, 2017

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు మరో అంతర్జాతీయ అవార్డు అందుకోనున్నారు.. ఏపీ సీఎంకు యూఎస్ ఐ బిసి ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్‌ అవార్డును ప్రకటించింది యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌... మే 8న కాలిఫోర్నియాలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.. అదేరోజు కీలకోపన్యాసం చేయాలంటూ చంద్రబాబుకు యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆహ్వానం పంపింది.. 

12:53 - March 31, 2017

హైదరాబాద్: వేసవి కాలంలో మహిళలు అనేక చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో చర్మం పలు సమస్యలకు గురి అవుతూ వుంటుంది. ఈ క్రమంలో వేసవి కాలంలో మహిళలకు చర్మ సమస్యల గురించి మానవి హెల్త్ కేర్ తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

12:42 - March 31, 2017

ఢిల్లీ : కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌. జీఎస్టీ అమలుకంటే ముందే తెలంగాణకు రావాల్సిన సీఎస్టీని అమలు చేయాలని, వెనకబడిన 4 జిల్లాల అభివృద్ధి కోసం గతంలో ఇస్తామని చెప్పిన 450 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరుతామని చెప్పారు ఈటెల.

 

12:40 - March 31, 2017

హైదరాబాద్: అమెరికాలోని ఓ ఆస్పత్రిలో డ్యాన్స్‌ చేసిన వైద్యులపై సస్పెన్షన్‌ వేటుపడింది.. కాలినగాయాలతో సతమతమవుతున్న రోగిముందే డాక్టర్లు ఈ పనిచేశారు.. సర్జరీ చేయాల్సిన డాక్టర్‌తోసహా మహిళాసిబ్బంది అంతా చిందేశారు.. కొలంబియాలోని బొలివర్ శాంతాక్రూజ్ డీ బోకాగ్రాండ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.. సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియో హల్ చల్ చేస్తోంది. రోగికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారని.. ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చిపనులు అంటూ సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీడియోచూసిన ఆస్పత్రి మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంది. సర్జరీ సమయంలో పేషేంట్‌కు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంది. ఆ సిబ్బందిలో ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ట్రీట్‌మెంట్ సందర్భంగా కొన్ని నియమాలు పాటించలేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు...

12:38 - March 31, 2017

శ్రీకాకుళం : కొడుకుల ఆదరణ కరువై... శ్రీకాకుళం జిల్లా.. పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో ఓ తండ్రి ఆందోళన చేపట్టాడు. కాస్తంతా నీడనివ్వాలని కోరుతూ ధర్మారావు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాడు. ఫోర్జరీ సంతకాలతో తన యావత్ ఆస్తిని లాక్కున్న బిడ్డల నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగాడు.

ధర్మారావుకు ఇద్దరు కొడుకులు....

ధర్మారావు ఇద్దరు కుమారుల్లో ఒకరు ఆర్మీలో విధులు నిర్వహిస్తుండగా మరొకరు స్థానికంగా ఆర్‌ఎంపీ డాక్టర్..అయితే ఇద్దరు కొడుకులు చూసుకోకపోవడంతో అనాథలా మిగిలాడు. ఇద్దరు కొడుకులు తనను పట్టించుకోవడం లేదని.. తన దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం లాక్కుని బయటకు గెంటేశారని ధర్మారావు వాపోతున్నాడు. రెండో పెళ్లి చేసుకునన్నా కోపంతో తనను అనాథలా వదిలేశారని...ఆవేదన వ్యక్తం చేశాడు.

కోల్‌కత్తాల హిందూస్థాన్‌ మోటార్స్‌లో కార్మికుడిగా పనిచేసిన ధర్మారావు....

డిప్లమో వరకూ చదువుకున్న ధర్మారావు కోల్‌కత్తాలో హిందుస్థాన్‌ మోటార్స్‌లో కార్మికుడిగా పని చేసేవాడు. తన కష్టంతో సంపాదించిన ఇల్లు, ఆస్తిని బిడ్డలకు అందించాడు. అయితే తన పేరుపై ఉన్న 50 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో పెద్దకొడుకు కాజేశాడని ధర్మారావు చెబుతున్నాడు. అలాగే తండ్రి ఆస్తి మొత్తం అన్న తీసుకున్నాక తనెందుకు తండ్రిని పోషించాలని చిన్న కొడుకు నరేంద్ర వర్మ ప్రశ్నిస్తున్నాడు. తండ్రి ఆస్తి కోసం అన్నను ప్రశ్నిస్తే తనపై క్రిమినల్ కేసులు పెట్టి వేధించారని చెబుతున్నాడు. కాగా ధర్మారావు దీక్షతో స్పందించిన రెవెన్యూ అధికారులు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

12:36 - March 31, 2017

ప్రకాశం: అంతజేస్తాం.. ఇంతజేస్తాం.. అందలమెక్కిస్తాం అని ఓట్లేయించుకున్నారు. తర్వాత మా బాధలను మమ్మల్ని వదిలేశారు. కుర్చీల్లో కూర్చున్నోళ్లకు మా అవస్థలు పట్టడంలేదు. రోగాలతో వణికిపోతున్నాం కాపాడమంటే.. కలెక్టర్‌కు చెప్పుకోండని వైద్యాధికారులు బెదరిస్తున్నారు. ప్రకాశంజిల్లా, ముండ్లమూరు మండలంలోని సుంకరవారిపాలెం గ్రామస్తుల ఆవేదన ఇది. ఊరు ఊరంతా విషజ్వరాలతో వణికొపోతూ సాయంకోసం ఎదురుచూస్తోంది.

టీవీ వాళ్లకు ఫిర్యాదు చేస్తారా..

విన్నారుగా..! జర్వాలతో ప్రాణాపోయేట్టున్నాయి..కాపడంటంటే.. వైద్యం చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్లు గ్రామస్తులను ఎలా బెదిరిస్తున్నారో..!

రోగం వస్తే.. మూల్గుతూ ఇంట్లో పడుకోకుండా.. మాగురించి పేపరోళ్లకు, టీవాళ్లకు చెబుతారా..! మేం వైద్యం చేయం.. మాకు తీరిక ఉన్నపుడే వస్తాం.. లేదంటే కలెక్టరుకు ఫిర్యాదు చేసుకోపో.. అని బెదిరిస్తున్నారు.

సుంకరవారిపాలంలో విషజ్వరాలు

ప్రశాశంజిల్లా, ముండ్లమూరు మండలం, సుంకరవారిపాలెం గ్రామంలో విషజర్వాలు విజృంభిస్తున్నాయి. దాదాపు నెలరోజులుగా వణికించే జ్వరాలు, కీళ్లు పట్టుకుపోవడం లాంటి సమస్యలతో చిన్నాపెద్దా సతమతమవుతున్నారు. గ్రామంలో 90శాతం మంది పేదలే ఉన్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమతలేక.. ప్రభుత్వ వైద్యులు కనికరించక ఊరు ఊరంతా మంచంపట్టింది. పొద్దంతా పొలంలో పనిచేసి వచ్చి కొద్దిసేపు విశ్రాంతిగా కుర్చుంటే కీళ్లన్నీ పట్టుకుపోతున్నాయని ఆవేదన చెందున్నారు.

వాటర్‌ట్యాంక్‌ ఉన్నా ..ఊరికంతా ఒకటే కుళాయి

సుంకరవారిపాలెంలో తాగునీటికి కటకటగా ఉంది. వాటర్‌ట్యాంక్‌ ఉన్నా.. ఒకటే కుళాయి పనిచేస్తోంది. ఒకబోరు పనిచేస్తున్నా దాని నుంచి కూడా చౌడు కలిసిన నీరేవస్తోంది. గ్రామంలో ఉన్న బోర్లన్నీ ఇదిగో ఇలా సంవత్సరకాలంగా పాడుబడిపోయాయి. వీటిని బాగుచేయాలని ఎన్నిసార్లు ముండ్లమూరు మండల అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతిలేక చౌడుతో కలుషితం అవుతున్న నీటినే తాగుతున్నామంటున్నారు. ఓట్లు అడగడానికి వంగివంగి ఇళ్లముందుకు వచ్చే నాయకులు.. ఇపుడు మా గ్రామంవైపు కన్నెత్తికూడా చూడ్డంలేదంటున్నారు.

అధ్వాన్నంగా పరిశుధ్యం

గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఏ వీధి చూసినా దుర్గంధం వెదజల్లుతున్నాయి. చాలా చోట్ల మురుగు కాల్వలు లేక నీరంతా వీధుల్లో నిలిచిపోతోంది. అధికారులను అడిగితే మమ్మల్నే ప్రశ్నిస్తారా.. మీ అంతుచూస్తాం అంటూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చస్తున్నారు.

గ్రామంవైపు చూడని నాయకులు.....

సీఎం చంద్రబాబు అమరావతి అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామంటున్నారు.. నాయకులేమో గ్రామాలముఖమే చూడ్డం మానేశారు. ఇక అధికారులేమో అడిగతేతంతాం అన్నట్టు బెదిరిస్తున్నారు. మాగతేంది ముఖ్యమంత్రిగారు..! మీరైనా పట్టిచుకోవాలని కోరుతున్నారు.. సుంకరవారపాలెం వాసులు. ఇప్పటికైనా ప్రకాశం జిల్లా వైద్యాధికారులు వణికిస్తున్న విషజ్వరాలకు వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

12:31 - March 31, 2017

హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మించనున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు ఆటంకాలు తప్పేలా లేవు. ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల సంఘం వద్దకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వానికి భంగపాటు ఎదురయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌కు సిడబ్ల్యూసి అనుమతిని నిరాకరించింది. ప్రాజెక్టు సామర్థ్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది సిడబ్ల్యూసి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు, వివరణలతో సంతృప్తి చెందని కేంద్ర జలసంఘం ప్రాజెక్టు సామర్థ్యంపై గోదావరి బోర్డు అనుమతి తీసుకోవాలని సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది. అనుమతులు రాకుండానే, భూసేకరణ చేయకుండానే, ప్రజలు భూసేకరణపై చేస్తున్న ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండానే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించిన సర్కారుకు ప్రాజెక్టు భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది.

కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో బ్యారేజి...

ప్రాణహిత చేవెళ్ల డిజైన్‌ మార్చి కాళేశ్వరం ఎత్తిపోతలను తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. షేక్‌ హ్యాండ్ ప్రాజెక్టులను నిర్మిస్తామని చెప్పారు. దీని ప్రకారం కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజి 103 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. మేడిగడ్డ బ్యాక్ వాటర్ ఆధారంగా అన్నారం వద్ద మరో ప్రాజెక్టు నిర్మిస్తారు. అక్కడనుండి నీటిని ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేస్తారు. అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చివరన సుందిల్ల వద్ద మరో ప్రాజెక్టు నిర్మిస్తారు. అక్కడ నుంచి ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటాయి. నదిలోనే నీటిని ఎగువకు పంపింగ్ చేసే విధంగా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. దాదాపు 140 కిలోమీటర్ల దూరం నీటిని వెనక్కి పంపింగ్ చేస్తారు. ఎల్లంపల్లి నుండి మధ్య మానేరు డ్యాంకు అక్కడ నుండి కొత్తగా నిర్మించే మల్లన్న సాగర్‌కు నీటిని తరలిస్తామని సిఎం చెప్పారు.

పాత డిజైన్‌ ప్రకారం 160 టిఎంసిల ప్రాణహిత నీటిని వాడుకునేందుకు వీలు....

పాత ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం 160 టిఎంసిల ప్రాణహిత నీటిని వాడుకునేందుకు మాత్రమే వీలుంటుంది. కొత్త డిజైన్‌ ప్రకారం 225 టిఎంసిల నీటిని వాడుకోవచ్చని ప్రభుత్వ పెద్దల వాదన. అయితే గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించే నూతన బ్యారేజీలకు, తుమ్మిడి హట్టి వద్ద లభించే నీటిలభ్యత కంటే ఏమాత్రం తేడా ఉండదు. కొత్తగా ప్రకటించిన 225 టిఎంసిల నీటిని ఎలా వాడుకుంటారని కేంద్ర జలసంఘం తెలంగాణ సర్కారును ప్రశ్నించింది. దీనికి తమకు బచావత్‌ అవార్డు ప్రకారం కేటాయించిన నీటి నుండి వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు సిడబ్ల్యూసి. నదీ జలాలను పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు కోరింది. నదీ జలాల పునఃపంపిణీ విషయాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోవాలని సిడబ్ల్యూసి సూచించింది. దీంతో ప్రాజెక్టు అనుమతుల అంశం మొదటికి వచ్చింది.

ఇప్పటికే 88వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో...

ఇప్పటికే 88వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ఆచరణలో సాధ్యం కాదనే విమర్శలూ వినిపిస్తున్న నేపథ్యంలో జలసంఘం అనుమతి నిరాకరణ సర్కారు ప్రయత్నానికి ఎదురు దెబ్బఅయింది. రాష్ట్రంలో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ తో హడావుడి చేసిన సర్కారు జలసంఘం ముందు సరిగ్గా వాదించలేదనే విమర్శలూ ఉన్నాయి. గోదావరి జలాల పునః పంపిణీకి బోర్డు అనుమతిస్తుందా అనే సందిగ్దత నడుమ కేసిఆర్‌ రీడిజైన్‌కి ఆమోదం లభిస్తుందా? అనేది వేచిచూడాల్సి ఉంది.

12:29 - March 31, 2017

అమరావతి : అత్యంత వివాదస్పద కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి బ్రేక్ పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇది జపాన్ కు చెందిన తోషిబా కార్పొరేషన్ కు అనుబంధ సంస్థ. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులు వెస్టింగ్ హౌస్ కంపెనీ పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూనే వున్నారు. దాని మాతృ సంస్థ తోషిబా కూడా ఇప్పుడు వెస్టింగ్ హౌస్ కంపెనీ దివాళా తీసినట్టు ప్రకటించుకోబోతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 31న వెస్టింగ్ హౌస్ దివాళా గురించి తోషిబా అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. అదే నిజమైతే, కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం దాదాపు నిలిచిపోయినట్టే.

ఉత్తరాంధ్ర కు అది మరణం శాసనం ...

కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఉత్తరాంధ్ర కు అది మరణం శాసనం అవుతుందన్న ఆందోళన ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. కాకినాడ, రాజమండ్రి వరకు పర్యావరణం దెబ్బతింటుందన్న భయాలున్నాయి. అణువిద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా భారీస్థాయిలో ఉద్యమాలు నడుస్తున్నా ప్రభుత్వం లెక్క చేయకుండా భూ సేకరణ చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఇప్పటికే 960 మంది రైతుల నుంచి 1473 ఎకరాల డి పట్టా భూములను సేకరించింది. ఈ నెల 31న వీరికి ఎకరాకు 18 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరికొంత భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం పెట్టి, తమ జీవితాలు నాశనం చేయొద్దంటూ స్థానికులు చాలాకాలంగా పోరాటాలు చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే వెస్టింగ్ హౌస్ దివాళా తీసిందన్న వార్తలు రావడంతో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణమే ప్రశ్నార్ధకంగా మారిన్నప్పుడు రైతుల నుంచి భూమిని సేకరించడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

12:27 - March 31, 2017

హైదరాబాద్: సుధీర్ఘ కాలం తరువాత సింగరేణి సంస్థలో సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. హక్కుల కోసం... వేతనాల సాధన కోసం సమ్మె చేపట్టే గని కార్మికులు ఈసారి తమ వారసులకు ఉపాధి కల్పించడానికి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. సింగరేణిలో ఐదు జాతీయా సంఘాలు వారసత్వ ఉద్యోగాల సాధన కోసం ఏప్రిల్ 17 తరువాత సమ్మెలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఐదు జాతీయ సంఘాలు...

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఐదు జాతీయ సంఘాలు సిఐటియు, హెచ్ఎంఎస్, ఎఐటియుసి, ఐఎటీయూసీ, బిఎంఎస్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. నిరవధిక సమ్మె చేపట్టడం ద్వారానే ఉద్యోగాలను సాధించవచ్చుననే అభిప్రాయానికి వచ్చాయి. హైకోర్టు తీర్పుతో నిలిచిపోయిన వారసత్వ ఉద్యోగాల నియామాక ప్రక్రియను సింగరేణి యాజమాన్యంతో ఒప్పందం ద్వారా కొనసాగించవచ్చనే నిర్ణయానికి కార్మిక సంఘాలు రావడం జరిగింది.

సంస్థ ఎండి శ్రీధర్‌ను కలిసి సమ్మె నోటీస్‌ను ...

ఈ మేరకు ఈ నెల 31న సంస్థ ఎండి శ్రీధర్‌ను కలిసి సమ్మె నోటీస్‌ను అందచేయాలని నిర్ణయించాయి. ఏప్రిల్ 17వ తేది లోపు ప్రభుత్వం, యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోతే నిరవధిక సమ్మెను కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చాయి. సింగరేణిలో గతంలో ఉన్న వారసత్వ సర్క్యూలర్ ను యథావిధిగా కొనసాగించినట్లయితే న్యాయపరమైన చిక్కులు వచ్చేవి కావని కార్మిక సంఘాలు అభిప్రాయాపడుతున్నాయి.

సమ్మె చేపట్టడం ద్వారా విఆర్ఎస్ సాధిస్తామని...

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగాలను సాధించడానికి సమ్మె నోటీస్ ఇవ్వడమే శ్రేయస్కరమని.. సమ్మె చేపట్టడం ద్వారా విఆర్ఎస్ సాధిస్తామని కార్మిక సంఘాలు దీమా వ్యక్తం చేస్తున్నాయి.

12:19 - March 31, 2017

ఏపీ అసెంబ్లీ 10నిమిషాలు వాయిదా

అమరావతి: ఏపీ అసెంబ్లీని మూడోసారి 10 నిమిషాలు వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఆందోళనల మధ్యే పలు బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది.

 

12:05 - March 31, 2017

అమరావతి: రెండు సార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఆందోళనల మధ్యే పలు బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

'రామ మందిరం నిర్మాణం కేసును త్వరగా విచారించలేం'

ఢిల్లీ: ఆయోద్యలో రామ మందిరం నిర్మాణం కేసును త్వరగా విచారించడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ సుప్రీం కోర్టు తిరస్కరించింది. అన్ని వర్గాలకు తగినంత సమయం కేటాయిచాలని సుప్రీం తెలిపింది.

ఉత్తరాఖండ్ లో మద్యం విక్రయాలపై నిషేధం

నైనిటాల్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మద్యం విక్రయాలపై నిషేదం విధించింది. చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూడు జిల్లాల్లో మద్యం విక్రయాలపై నిషేదం అమల్లో ఉంటుంది. ఉత్తర్‌కాశి, చమోలి, రుద్రప్రయోగ్ జిల్లాల్లో మద్యం అమ్మకాలపై నిషేదం. గతేడాది సెప్టెంబర్ 8న నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును అనుసరించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

11:32 - March 31, 2017

అమరావతి : ఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదికను సర్కార్ ప్రవేశ పెట్టింది. '2015 -16 లో రూ.36,856 కోట్లు అధిక వ్యయం జరిగింది. 2015-16 లో ద్రవ్యలోటు రూ.22,057 కోట్లు, రెవెన్యూ రాబడులు రూ. 1476 కోట్లు అంచనాల కన్నా తగ్గాయి. నిబంధనలకు విరుద్ధంగా జీతాల చెల్లింపు కోసం గంపగుత్తగా రూ. 4,659 కోట్లు కేటాయించారు. రాజధాని భూసమీకరణలతో భూములు కోల్పోయిన వారికి 19,075 కుటుంబాలకు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు'. అని తెలిపింది.

హెరిటేజ్ కి లోకేష్ రాజీనామా

హైదరాబాద్: హెరిటేజ్ కి నారా లోకేష్ రాజీనామా చేసినట్లు ట్విట్టర్లో తెలిపారు. మా అమ్మ, భార్య నాయకత్వంలో హెరిటేజ్ మా అమ్మ, భార్య నాయకత్వంలో హెరిటేజ్ మరింత విజయం సాధిస్తుందని భావిస్తున్నాని, 9 ఏళ్ల నా హెరిటేజ్ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించడం తృప్తినిచ్చిందన్నారు.

11:06 - March 31, 2017

అమరావతి: రాష్ర్ట ప్రయోజనాలను, అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు రాజోలు టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు. సభను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. సభా సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. 

11:05 - March 31, 2017

అమరావతి: ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై అనవసరంగా ఆందోళన చేయడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు. ఆఖరిరోజు సభ సజావుగా సాగేలా జగన్‌మోహన్‌ రెడ్డి సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చ సాగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. 

వచ్చే ఏడాది ఎన్టీఆర్ సినిమా: బాలకృష్ణ

అమరావతి: వచ్చే ఏడాది ఎన్టీఆర్ జీవిత విశేషాలతో తీసే సినిమా వస్తుందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 2న విజయవాడలోనే ఉంటున్నాని నటుడ, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అనంతపురానికి ఎన్నడూ లేని విధంగా నీటి కేటాయించామన్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో పాటు ఏపీ అసెంబ్లీ కూడా బాగుందన్నారు. రహదారులు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 

ఓయూకు న్యాక్ గుర్తింపు

హైదరాబాద్ : ఓయూలో వసతులు, శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు కేకే, ఓయూ వీసీ, రిజిస్ట్రార్ పరిశీలించారు. ఓయూకు న్యాక్ గుర్తింపు వచ్చినట్లు రిజిస్ట్రా తెలిపారు.

10:45 - March 31, 2017

అమరాతి : ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనలతో ఏపీ అసెంబ్లీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న జరిగిన ఆక్వా ప్రమాద ఘటనపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆక్వా ప్రమాదంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ... ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి... ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సభా సంప్రదాయాలను కాపాడాలని స్పీకర్‌ చెప్పినా... ప్రతిపక్ష సభ్యులెవరూ వినిపించుకోలేదు. సభకు సహకరించాలని స్పీకర్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా... పట్టించుకోలేదు. సభలో తీవ్ర గందరగోళం నెలకోనడంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. 

10:42 - March 31, 2017

అమరాతి: సభా సంప్రదాయాలను అగౌరవపరస్తున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ చీప్‌ విఫ్ కాల్వ శ్రీనివాసులు. వైసీపీ సభ్యులపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయాలని స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీ చివరి సమావేశాల రోజు అయినా.. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం లేకుండా పోతోందన్నారు. 

10:39 - March 31, 2017

అమరావతి: ప్రతిపక్ష నాయకుడు జగన్‌ తీరుతో ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం రావడం లేదన్నారు పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ. సభా సంప్రదాయాలను పాటించకుండా.. స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చిన ఆందోళనలు చేస్తున్న వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్మ కోరారు. 

10:37 - March 31, 2017

అమరావతి: ప్రజాసమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు... పవన్‌ కల్యాణ్‌కూ చిత్తశుద్దిలేదని... రోజా ఆరోపించారు.. మొగల్తూరు ఘటపై సమగ్రవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. ఐదుగురు కార్మికుల మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

ఏపీ అసెంబ్లీ మరోసారి వాయిదా

అమరావతి: ఏపీ అసెంబ్లీ రెండోసారి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఎలాంటి మార్పులేదు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ప్రతిదాన్ని అడ్డుకుంటున్నారు :బుచ్చయ్య చౌదరి

అమరావతి: సభలో రూల్స్ ప్రకారం జరగాల్సిన ప్రతి దాన్ని అడ్డుకుంటున్నారుని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తించే తీరు గర్హనీయమన్నారు. పరిమశ్రమలపై జగన్ రెండు నాల్కుల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మత్స్య పరిశ్రమను కాపాడుకోవాలి, దీనిపై లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. చిన్న చిన్నఘటనలు జరుగుతుంటాయని, వాటిని సమన్వయంతో పరిష్కరించుకోవాలి జగన్ హితవు పలికారు. 

స్టేట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధం: యనమల

అమరావతి: మొగల్తూరులో ఆనంద్ ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదం పై ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం అయిన తరువాత ప్రకటిస్తామని తెలిపారు. అయినా వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టడం దారుణం అని అన్నారు.

తిరిగి ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ

మరావతి: వాయిదా అనంతరం తిరిగి ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైంది. స్పీకర్ ప్రశ్నోత్తరాల చేపట్టడంతో మళ్లీ వైసీపీ సభ్యులు మొగల్తూరు ఆక్వాఫుడ్ ప్రమాద ఘటనపై చర్చ చేపట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళలను సభ వ్యవహారాల మంత్రి కాల్వ శ్రీనివాస్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని స్పీకర్ ను కోరారు.

09:31 - March 31, 2017

అమరావతి: ఏపీ శాసనసభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే అక్వాఫుడ్ బాధితులకు న్యాయం చేయాలని, దానిపై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టూ చేరిప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చేతపట్టి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంత చెప్పినా వినకపోవడం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ శాసనసభ వాయిదా

అమరావతి: ఏపీ శాసనసభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే అక్వాఫుడ్ బాధితులకు న్యాయం చేయాలని, దానిపై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంత చెప్పినా వినకపోవడం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం

నెల్లూరు: గూడూరులో దారుణం జరిగింది. ప్రైవేటు నర్సింగ్ స్కూల్ లో నలుగురు విద్యార్థినులపై వాచ్ మెన్ అత్యాచారయత్నం చేయగా ప్రతిఘటించిన విద్యార్థినులపై వాచ్ మెన్ సుబ్రమణ్యం దాడి చేశాడు. విద్యార్థినులకు గాయాలయ్యాయి. విషయాన్ని బయటపెట్టవద్దని యాజమాన్యం బెదిరింపులకు దిగుతోంది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

అమరావతి: ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మొగల్దూరు ఆక్వాఫుడ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

09:15 - March 31, 2017

హైదరాబాద్: ఒడిశాలో మావోయిస్టులు గురువారం అర్థరాత్రి డోయ్‌కల్‌ రైల్వేస్టేషన్‌పై దాడి చేసి స్టేషన్‌ను మందుపాతరలతో పేల్చివేశార. ఈ ఘటనలో రైల్వేస్టేషన్‌ ధ్వంసం కాగా.. సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మావోయిస్టుల దాడితో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రూర్కెలా-కోరాపుట్‌, ధన్‌బాద్‌-అలెప్పి, విశాఖ-కొర్బా, కొర్బా-విశాఖ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఆందోళన

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొగల్తూరు ఆనంద్ ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో చనిపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరో వైపు పూర్తి వివరాలను సభ అయిపోయే లోపు, లేదా ప్రశ్నోత్తరాల కార్యక్రం అయిన తరువాత సంబంధిత మంత్రి వివరణ ఇస్తారని మంత్రి యనమల, స్పీకర్ విపక్షానికి అభ్యర్థిస్తున్నారు. అయినా ఆపకుండా వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగా మొగల్తూరు ఆనంద్ ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో చనిపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఏపీ అసెంబ్లీలో నేటి ప్రధాన ప్రశ్నలు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ముక్తేశ్వరపురం ఎత్తిపోతల, చంద్రన్న బీమా పథకాలు, ఇళ్ల స్థలాలు, సాంఘిక భద్రతా పింఛన్లు, నదుల కరకట్ట పరిస్థితి, కాంట్రాక్ట్ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలపై నేడు ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

08:48 - March 31, 2017

హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కళింగ ఎన్‌క్లేవ్‌లో దంపతుల ఆత్మహత్య స్థానికంగా విశాదం నింపింది.. దంపతులిద్దరూ కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు.. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.. 

ఉద్యోగాల పేరుతో టీఆర్ ఎస్ నేతల మోసం

నల్గొండ: ఉద్యోగాల పేరుతో టీఆర్ ఎస్ నేతల మోసం వెలుగుచూసింది. సాగర్, హాలియా, మిర్యాలగూడలో నిరుద్యోగుల నుంచి సతీష్ రెడ్డి, పల్ రెడ్డి, కృష్ణా రెడ్డి అనే నేతలు రూ. 40 లక్షలు వసూలు చేశారు. జన్ కో, టూరిజం శాఖ పేరుతో బాధితులకు నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందజేశారు. అస్సలు విషయం బయటపడటంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిరుద్యోగులు ఒత్తిడి చేశారు.ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డిని సతీష్ రెడ్డి నిలదీశాడు. కృష్ణారెడ్డి ఐపీ నోటీసులు పంపడంతో సతీష్ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.

ఒడిశాలోని డోల్ కల్ రైల్వే స్టేషన్ పేల్చివేసిన మావోలు

హైదరాబాద్: ఒడిశాలోని డోల్ కల్ రైల్వే స్టేషన్ ను మావోయిస్టులు పేల్చి వేశారు. స్టేషన్ సిబ్బంది క్షేమంగా ఉన్నారని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో విజయనగరం మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

08:38 - March 31, 2017

హైదరాబాద్: మొగల్తూరులో దారుణం జరిగింది. నల్లావారి చెరువులోని ఆనంద్‌ ఆక్వా ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్‌ లీకై ఐదుగురు కూలీలు మృతిచెందారు. రసాయన ట్యాంకులను శుభ్రం చేయడానికి వెళ్లిన ఐదుగురు కూలీలు గ్యాస్‌ లీక్‌ కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. యాజమాన్యం మాత్రం కంరెట్ షాక్ వల్ల చనిపోయారు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ చివరికి అమ్మోనియం లీక్ వల్లే చనిపోయారని తేలింది. యాజమాన్యం పై కేసు ఎందుకు నమోదు చేయలేదు? బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి? ఈ అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎం గఫూర్, టిడిపి నేత దినకర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

మొగల్తూరు ఆక్వాఫుడ్ ప్రమాదం పై వైసీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్: కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీలో మొగల్తూరు ఆక్వాఫుడ్ ప్రమాదం పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అంతే కాకుండా తుందుర్రు అక్వాఫుడ్ పార్క్ పై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

08:34 - March 31, 2017

అమరావతి: మొగల్తూరు లో ఆనంద్ ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ లో అమ్మోనియంగ్యాస్ లీకై 5గురు చనిపోయిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీ ఆవరణలో '10టివి'తో మాట్లాడుతూ... వామపక్షాలు, వైసీపీ కలిసి తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరకంగా పోరాటం చేస్తున్నామని ఆదే అంశం పై అలానే పోరాడతామని తెలిపారు. పరివ్రమలకు వ్యతిరేకం కాదని, కాలుష్యం ఇష్టారీతిన వెల్లువెత్తుతూ.. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల ప్రయోజనాలు కన్నా పారిశ్రామిక వేత్తలు ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం ఇంటి స్థలం లేని ప్రతి పేదవానికి ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. 

చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా:-పవన్‌

విజయవాడ: చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని అగ్రిగోల్డ్ విషయంలో అది రుజువైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ స్కాంలో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నా..ప్రభుత్వం మాత్రం వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేయడంలేదని మండిపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ..అవసరమైతే బాధితులకు న్యాయం చేసేందుకు వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. 

చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా:-పవన్‌

విజయవాడ: చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని అగ్రిగోల్డ్ విషయంలో అది రుజువైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ స్కాంలో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నా..ప్రభుత్వం మాత్రం వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేయడంలేదని మండిపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ..అవసరమైతే బాధితులకు న్యాయం చేసేందుకు వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. 

చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా:-పవన్‌

విజయవాడ: చట్టం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని అగ్రిగోల్డ్ విషయంలో అది రుజువైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ స్కాంలో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నా..ప్రభుత్వం మాత్రం వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేయడంలేదని మండిపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ..అవసరమైతే బాధితులకు న్యాయం చేసేందుకు వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. 

ఏప్రిల్‌ 2న ఏపీ మంత్రివర్గం విస్తరణ

అమరావతి: ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 2న కొత్త మంత్రులు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన లోకేశ్‌కు మంత్రివర్గంలో బెర్తు ఖాయమని తెలుస్తోంది. అలాగే భూమా అఖిల ప్రియకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికే చాన్స్‌ ఉందని.. కొందరికి శాఖలు మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

07:04 - March 31, 2017

హైదరాబాద్: ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2న మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 9 గంటల 25 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. అమరావతిలోని త్కాత్కాలిక సచివాలయం పక్కన ఇందుకు కోసం విశాల స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు, మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన ?

మంత్రివర్గ విస్తరణకంటే పునర్వవస్థీకరణకే చంద్రబాబు ప్రాధాన్యాత ఇస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఐదుగుర్ని తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంమీద పది మందిని కేబినెట్‌లో స్థానం కల్పించ వచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో చంద్రబాబుతో కలిపి 20 మంది ఉన్నారు. మంత్రుల సంఖ్యను 26కు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విస్తరణలో బెర్తు కాయమని భావిస్తున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీకాకుళం నుంచి పదవి ఆశిస్తున్న గౌతు శ్యామసుందర శివాజీ

ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకునే చాన్స్‌ ఉందని భావిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన గౌతు శ్యామసుందర శివాజీ కూడా మంత్రి పదవి ఆస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు, సీనియర్‌ శాసనసభ్యుడు సతివాడ నారాయణస్వామి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత రేసులో ఉన్నారు. తూర్పుగోదారి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పుకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించి, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూకు స్థానం కల్పించ వచ్చని భావిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, యరపతినేని శ్రీనివాసరావు పదవులు ఆశిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి రిజర్వుడు ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఎవరికి ప్రాధాన్యం కల్పిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమగోదావరి నుంచి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మంత్రి పదవి ఆశిస్తున్నారు.

సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మండలి చైర్మన్‌ చాన్స్‌ ?

ల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్రల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సోమిరెడ్డికి మంత్రిపదవి ఇవ్వకపోతే మండలి చైర్మన్‌ పదవి కట్టబెట్టే చాన్స్‌ ఉందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అమర్‌నాథ్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేసేందుకు చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు.

వాదోపవాదాల మధ్య పక్కదారి పట్టిన చర్చ

అమరావతి: టెన్త్‌ క్వష్చన్‌ పేపర్‌ లీకేజీ అంశంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ అంశంపై దర్యాప్తు విషయంలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి సభ్యుల పరస్పర ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో అసెంబ్లీ అట్టుడికింది. లీకేజీకి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు బాధ్యులని వైసిపి సభ్యులు ఆరోపిస్తూ, వీరి రాజీనామాకు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపిస్తామని చంద్రబాబు ప్రకటించగా, ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం సిబిఐ దర్యాప్తునకు పట్టుపట్టారు. 

07:00 - March 31, 2017

పశ్చిమగోదావరి :మొగల్తూరులో దారుణం జరిగింది. నల్లావారి చెరువులోని ఆనంద్‌ ఆక్వా ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్‌ లీకై ఐదుగురు కూలీలు మృతిచెందారు. రసాయన ట్యాంకులను శుభ్రం చేయడానికి వెళ్లిన ఐదుగురు కూలీలు గ్యాస్‌ లీక్‌ కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. మృతులు నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, ఈగ ఏడుకొండలు, జక్కంశెట్టి ప్రవీణ్‌, తోట శ్రీనులుగా గుర్తించారు.

ఆగ్రహించిన గ్రామస్తులు కంపెనీపై రాళ్ల దాడి...

ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు కంపెనీపై రాళ్ల దాడి చేశారు. కంపెనీ కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో..పోలీసులు భారీగా చేరుకుని గ్రామస్తులను అదుపు చేశారు. తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న 33 గ్రామాల్లో మొగల్తూరు కూడా ఉండటంతో.. అన్ని గ్రామాల ప్రజలు ఆనంద్‌ ఫుడ్‌ కంపెనీకి చేరుకుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఘటనపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రులు...

మరోవైపు మంత్రులు అయ్యన్నపాత్రుడు, మాణిక్యాలరావు, పీతల సుజాత నర్సాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా అక్కడ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మధు...

మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కంపెనీ 25లక్షల రూపాయలు, ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మధు డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తున్నామని మధు తెలిపారు.

జగన్ కూడా...

అటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఐదుగురు నిరుపేద కూలీలు చనిపోయారని ఆరోపించారు.

మొగల్తూరు ఘటన దురదృష్టకరం. పవన్

మొగల్తూరు ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆనంద్‌ ఆక్వాఫుడ్‌ కంపెనీలో అమ్మోనియా లీకై ఐదుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న ఇలాంటి కంపెనీలను వెంటనే సీజ్‌ చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

మృతుని కుటుంబానికి ఎక్స్గ్రేషియా మరింత పెంచాలి...

ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో మృతుని కుటుంబానికి యాజమాన్యం తరుపున 15 లక్షల రూపాయలు, అలాగే ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అయితే ప్రకటిచిన ఎక్స్‌గ్రేషియాను మరింత పెంచాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

మృతుల కుటుంబాలను పరామర్శించిన మధు, జగన్

శ్చిమగోదావరి : మొగల్తూరులో దారుణం జరిగింది. ఆనంద్‌ ఆక్వాఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలో అమ్మోనియం గ్యాస్‌ లీకై ఐదుగురు కూలీలు మృతిచెందారు. రసాయన ట్యాంకులను శుభ్రం చేయడానికి వెళ్లిన ఐదుగురు కూలీలు గ్యాస్‌ లీక్‌ కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు కంపెనీపై రాళ్ల దాడికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మరోవైపు మృతుల కుటుంబాలను వైసిపి అధినేత జగన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించారు. 

06:54 - March 31, 2017

హైదరాబాద్: సీఎం కేసిఆర్ సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌ర‌ని..ప్రజాప్రతినిధులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని ఫాం హౌస్ నుంచే పాల‌న సాగిస్తుంటారని కాంగ్రెస్‌ తరచు చేసే విమర్శ. అయితే ప్రగతి భ‌వ‌న్ నిర్మాణంతో కేసిఆర్ జ‌నంతో మ‌మేకం కావ‌డం.. ఎమ్మెల్యేల‌కు టైం కేటాయిస్తుండటంతో కాంగ్రెస్ తన స్వరాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు కేసీఆర్‌ వ్యూహాలు, ఇస్తున్న షాకులతో హస్తం నేతలు ఖంగుతింటున్నారు.

క్యాంప్‌ ఆఫీస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వింత అనుభవాలు ....

క్యాంప్‌ ఆఫీస్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు జరిగిన వింత అనుభవాలను తలుచుకుని కలవరపడిపోతున్నారు. గ‌తంలో ఎస్సీ ఎస్టీ స‌బ్ ప్లాన్‌పై చర్చించేందుకు క్యాంపు ఆఫీస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. దీంతో మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క, సంప‌త్ కుమార్‌ మీటింగ్‌కు వెళ్ళారు. స‌బ్‌ప్లాన్‌‌పై జ‌రిగిన సమావేశంలో భ‌ట్టి, సంప‌త్ కుమార్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తినట్లు మ‌రుస‌టి రోజు వార్తలు రావడం చూసి అవాక్కయ్యారు.

గద్వాల మాచర్ల రైల్వే లైన్‌ నిధుల కోసం పాలమూరు నేతల ప్రయత్నాలు...

ఇక పాలమూరు జిల్లా నుంచి వెళ్లిన ప్రజాప్రతినిధులు మరో వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. గ‌ద్వాల నుంచి మాచ‌ర్ల రైల్వే లైన్‌కు నిధులు మంజూరు చేయాలని..అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపి నంది ఎల్లయ్య కేసిఆర్‌కు విన‌తిప‌త్రం సమర్పించారు. ఆ తర్వాత సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో.. డికే అరుణ నేతృత్వంలో హస్తం నేతలు ప్రగతి భ‌వ‌న్ వెళ్ళారు. అక్కడ కేసీఆర్‌ చూపించిన రంగుల సినిమా చూసి షాక్‌ అయ్యారు. అంతేకాదు.. మ‌రుస‌టి రోజు మీడియాలో వచ్చిన వార్తలు చూసి ముక్కున వేలేసుకున్నారట.

పాలమూరు ప్రాజెక్టుల మీదకు మ్యాటర్‌ తీసుకెళ్లిన సీఎం ...

గ‌ద్వాల మాచ‌ర్ల రైల్వే నిధుల మంజూరుపై తొలుత సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. హస్తం నేతలను మాటల్లోకి దించారు. విష‌యాన్ని కాస్త పాల‌మూరు ప్రాజెక్టుల మీదికి తీసుకెళ్లి.. ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. స‌మైక్యపాల‌న‌లో తెలంగాణకు జ‌రిగిన అన్యాయం ఇది అంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు వచ్చిన వార్తల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రైల్వే లైన్ నిధుల మంజూరు ప్రస్తావన లేకుండా.. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై కేసిఆర్ ఇచ్చిన ప్రెజెంటేష‌న్‌పై ఫోకస్‌ చేయడం చూసి కంగుతిన్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మీడియా ముందుకు వ‌చ్చి త‌మ ఆవేద‌న వ్యక్తపరచాల్సిన పరిస్థితి నెలకొంది. కేసిఆర్ అపాయింట్‌మెంట్‌ అంటేనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వామ్మో అంటున్నారు. ఎక్కడ మెలిక పెడతారో అని ఆందోళన చెందుతున్నారు.  

06:52 - March 31, 2017

హైదరాబాద్: దండం పెట్టే చేతులతోనే పాలకులపై దండయాత్ర చేయాలని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులతో ఆడుకుంటున్న సర్కార్‌ను గద్దె దింపే వరకు ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల దీక్షలకు సంఘీభావం పలికిన తమ్మినేని..వేములఘాట్‌ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.

రైతులను మోసం చేసి భూములను లాక్కోవాలని...

రైతులను మోసం చేసి భూములను లాక్కోవాలని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చూస్తుందని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. మల్లన్నసాగర్‌లో 14 వేల ఎకరాల భూములను తీసుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి వేములఘాట్‌ ఉద్యమం ఒక గుణపాఠం కావాలన్నారు. దండం పెట్టే చేతులతోనే పాలకులపై దండయాత్ర చేయాలన్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల దీక్షలు శుక్రవారంతో 300 రోజులకు చేరుతున్న సందర్భంగా..తమ్మినేని వారి దీక్షలకు మద్దతు పలికారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అంతకుముందు సిద్దిపేట నుంచి వేములఘాట్‌ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ వేములఘాట్‌ ప్రజల పోరాటం వల్ల మంచి ఫలితం రాబోతుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మించడానికి నీళ్లు కావాలంటే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు ద్వారానే వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

వేములఘాట్‌ పోరాటం స్ఫూర్తిదాయకం....

కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే డీపీఆర్‌ లేదన్న తమ్మినేని.. కేంద్రం దగ్గర ప్రాణిహిత చేవేళ్ల సంబంధించిన డీపీఆర్‌ ఉందన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రం మొత్తం నీటితో పంటలు పండించడానికి అవకాశం ఉందని రిటైర్డ్‌ ఇంజనీర్లు చెప్పినట్లు గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇవేవి పట్టించుకోకుండా మలన్నసాగర్‌ కట్టితీరుతామని చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వేములఘాట్‌ స్ఫూర్తితో సీపీఎం మహాజన పాదయాత్ర నిర్వహించిందని చెప్పారు. పాదయాత్రలో ఎన్నో అనుభవాలను చూశామని వివరించారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తే సహించబోమన్నారు.

2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి...

తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్న తమ్మినేని వీరభద్రం.. భూములు కోల్పోతున్న ప్రజలకు మేలు చేయడం కోసమే తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

06:48 - March 31, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 26న కేంద్ర ప్రభుత్వం మొత్తం 86 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా.. అందులో 39 మందికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను ప్రదానం చేశారు.

పద్మ అవార్డులు అందుకున్న వారిలో ...

పద్మ అవార్డులు అందుకున్న వారిలో రాజకీయ ఉద్దండులు శరద్‌పవార్‌, మురళీమనోహర్‌జోషి, క్రికెటర్‌ విరాట్‌కోహ్లీ, బాలీవుడ్‌ గాయని అనురాధా పౌడ్వాల్‌లు ఉన్నారు. ఇస్రో మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు, యోగా గురుస్వామి నిరంజనానంద సరస్వతి, థాయ్‌రాకుమారి మహాచక్రి సిరిండోర్న్‌, భారత్‌లో లాప్రోస్కోపిక్‌ సర్జరీ పితామహుడు టెహెంటన్‌ ఎరాచ్‌ ఉద్వాదియూలకు ప్రణబ్‌ముఖర్జీ పద్మవిభూషణ్‌ అవార్డులను ప్రదానం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి ...

తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. వ్యాపారవేత్త మోహనరెడ్డి, వనసంరక్షకులు దరిపల్లి రామయ్య ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ అగ్రనేత అద్వానీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

39 మందికి పద్మ పురస్కారాలను అందజేసిన రాష్ట్రపతి

ఢిల్లీ : 39 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు హాజరయ్యారు. 

ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు

హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ.. పోరాటం ఆగదని యజమానులు తేల్చి చెబుతున్నారు. 

06:45 - March 31, 2017

హైదరాబాద్: 154 రోజులు, 4200 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్న అబ్బాస్ ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో జన్మించిన అబ్బాస్ 1999 లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ మాథ్య్స్ పూర్తి చేశారు. ఆ వెంటనే అబ్బాస్ పూర్తికాలపు డివైఎఫ్ఐ కార్యకర్తగా మారిపోయారు. పాలకుర్తి హాస్టల్ లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో బషీర్ బాగ్ లో అరెస్టయి జైలుకెళ్లారు. 2002లో గుజరాత్ మారణకాండను నిరసిస్తూ ఉద్యమించారు. అదే సమయంలో ఏర్పాటైన ఆవాజ్ సంస్థకు తొలి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక పోరాటాల్లో పాల్గొన్న అబ్బాస్ 104, 108 ఉద్యోగుల సమస్యలపై పోరాడారు. 154 రోజుల పాదయాత్ర అనుభవాలను ఇవాళ్ట జనపథంలో అబ్బాస్ వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

7విమానాశ్రయాల్లో స్టాంపింగ్, ట్యాగింగ్ నిలిపివేత

ఢిల్లీ : విమాన ప్రయాణికుల హ్యాండ్ లగేజీపై స్టాంపింగ్, ట్యాగింగ్ కు స్వస్తి చెప్పనున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో స్టాంపింగ్, ట్యాగింగ్ నిలిపివేయనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, కోల్ కతా, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి విమానాశ్రయాల్లో హ్యాండ్ లగేజీ పై స్టాంపింగ్, ట్యాగింగ్ నిలిపివేస్తారు. కాగా, హ్యాండ్ లగేజీగా అంతర్జాతీయ సర్వీసుల్లో 7 నుంచి 10 కేజీల వరకు అనుమతిస్తుండగా, ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 8 కేజీల బరువును ప్రయాణికుడితో పాటు అనుమతిస్తున్నారు. ఈ లగేజీపై కూడా ట్యాగింగ్ అనంతరం స్టాంపింగ్ ఉండేది.

Don't Miss