Activities calendar

01 April 2017

18:05 - April 1, 2017

శ్రీకాకుళం : జిల్లాలో ఎలుగుబంట్లు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో తిష్టవేసి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఎలుగుబంట్ల దెబ్బకు తోటల్లోకి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.  
బెంబేలెత్తిపోతున్న స్థానికులు 
శ్రీకాకుళం జిల్లా ఎలుగుబంట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పలాస, వజ్రపుకొత్తూరు, మందస తదితర గ్రామాల్లో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువైంది. ఉద్దాన ప్రాంతంలోని జీడితోటల్లో పగటిపూట ఎలుగుబంట్లు తిష్టవేసి జీడిపిక్కలను తిని రాత్రిపూట కొండ ప్రాంతాలకు వెళ్లిపోతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. 
విచక్షణరహితంగా దాడి చేస్తున్నాయన్న గ్రామస్తులు 
జీడితోటల్లోని ముళ్లపొదల్లో దాక్కుని తమపై విచక్షణరహితంగా దాడి చేస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసుల, అటవిశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది పలాస, వజ్రపుకొత్తూరు, మందస గ్రామాల్లో ఎలుగుబంట్లు దాడులతో ఇద్దరు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతవరకు బాధితులకు ప్రభుత్వం తరపున ఎలాంటి నష్టపరిహారం అందలేదని వెల్లడిస్తున్నారు. తక్షణమే అటవిశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. 

 

17:58 - April 1, 2017

విజయవాడ : విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సెమినార్లు ఎంతో ఉపయోగడపతాయని... ఏపీ గవర్నమెంట్‌ స్పెషల్ గ్రేడ్‌ చీఫ్ సెక్రటరీ సుబ్రమహణ్యం అన్నారు. విజయవాడ తాడేపల్లిలోని కెఎల్ యూనివర్శిటీలో స్మార్ట్‌ ఇండియా హక్తాన్‌ జాతీయ సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 26 సెంటర్లలో ఈ నేషనల్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, పూనే, తెలంగాణ రాష్ట్రాలకుచెందిన విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 30 ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న 598 సమస్యలపై విద్యార్థులు 36గంటలపాటు ప్రాజెక్ట్ వర్క్ చేయనున్నారు. సెమినార్‌లో విజేతలకు బహుమానాలుకూడా అందజేయనున్నారు.

 

17:54 - April 1, 2017

ఖమ్మం : తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళం పాడేందుకు ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందా? ఓ వైపు వేతనాలు పెంచామని గొప్పలు చెబుతూనే.. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలు తొలగించేందుకు సన్నద్ధమవుతోందా? ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను  విలీనం చేస్తామనే ప్రతిపాదన.. అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉద్యోగం, వేతనాలకు భద్రత ఉంటుందా అన్న ప్రశ్నలు వారిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. 
పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనం 
పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటిని సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. ఉన్నత విద్యార్హతలున్నా ప్రభుత్వ కొలువులు రాక ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో బతుకీడుస్తున్నారు అంగన్‌వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం మాత్రం కేజీ టూ పీజీ వరకు విద్యనందించే పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తామనే ఆలోచన చేస్తుండటంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఇక తమ భవిష్యత్‌ ఏమిటని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆవేదన చెందుతున్నారు. 
అంగన్‌వాడీలు ఆందోళన
కేజీ టూ పీజీ వరకు నిర్వహించే పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రభుత్వ ఆలోచనను ప్రకటించడంతో.. ఐసీడీఎస్‌ పరిధిలో పనిచేసే అంగన్‌వాడీల్లో దీనిపై చర్చ సాగుతోంది. దీనిపై ఐసీడీఎస్‌కు ఎలాంటి గైడ్‌లైన్స్‌ రానప్పటికీ.. అంగన్‌వాడీలు మాత్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే విషయమై ఆందోళన చెందుతున్నారు. 
1,896 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1,605 మంది ఆయాలు
ప్రస్తుతం జిల్లాలో 1,896 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1,605 మంది ఆయాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.10,500 వేతనం, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రూ.6,500 వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తే ఎక్కువ విద్యార్హతలున్న టీచర్లకు ఫస్ట్‌ క్లాస్‌ బోధించే అవకాశం కల్పిస్తారని, తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఎల్‌కేజీ, యూకేజీ వరకు బోధించే అవకాశం కల్పిస్తారని చర్చ సాగుతోంది. ప్రభుత్వ ప్రకటనతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అంగన్‌వాడీలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

17:47 - April 1, 2017

హైదరాబాద్ : కొత్త డిసిసిల నియామకంపై కాంగ్రెస్ ఆచి తూచి అడుగులేస్తుంది. ఇప్పటికిప్పుడు డిసిసిలను ప్రకటించి కొత్త సమస్యలు తెచ్చుకునే కన్నా.. ఇంకాస్త వేచి చూడాల‌న్న ధోరణితో ఉంది. డిలిమిటేష‌న్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ ప్రకటన వెలువడిన తర్వాతే కొత్త డిసిసిలను నియమించాలని భావిస్తోంది. 
డిసిసిల ఎంపిక ప్రకటనపై పీసీసీ తర్జనభర్జన 
టిఆర్ఎస్ సర్కార్‌ తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం.. కాంగ్రెస్‌కు స‌వాళ్లను విసురుతోంది. జిల్లా సార‌థుల‌ను ఎంపిక చేయ‌డంపై త‌ర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే డిసిసిల‌ నియామకంపై క‌స‌ర‌త్తు చేసిన పీసీసీ.. ప్రకటించడంపై ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడే డిసిసిలను ప్రకటిస్తే లాభమా...? నష్టమా అన్న విషయంపై లెక్కలేస్తుంది.  
డిసిసిల నియామకం.. పిసిసిపై ఒత్తిడి 
కొత్త జిల్లాలో ఆరునెల‌లుగా పాల‌న కొన‌సాగుతుండ‌టంతో డిసిసిలను నియామకంపై పార్టీలోని క్యాడ‌ర్ నుంచి పిసిసిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిసిసిల‌తో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. కొత్త జిల్లా సార‌థుల ఎంపిక‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. డిసిసిల ఎంపికపై క‌స‌ర‌త్తు దాదాపు పూర్తిచేసినా..ఒక‌టి రెండు జిల్లాలో ఏకాభిప్రాయం రావాల్సిఉంది. కొత్త డిసిసిల ప్రకటన ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నేత‌లు చర్చించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే.. ఏ నేత ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తారో.. ఏ జిల్లా ఫ‌రిదిలో ఉంటారో స్పష్టత వస్తుందని పీసీసీ అంచనా వేస్తుంది. దీంతో కొత్త సారథుల‌ ఎంపిక‌కు మార్గం సుగ‌మం అవుతుందన్నది పీసీసీ యోచ‌న‌. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ప్రకటన వచ్చే వ‌ర‌కు వేచి చూడాలని పీసీసీ నిర్ణయించింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎద‌రుచూస్తున్న డిసిసిల నియామకానికి.. నియోజ‌క‌వ‌ర్గాల పునర్‌విభ‌జ‌న అంశం బ్రేకులు వేస్తుంది. 

17:46 - April 1, 2017

తూర్పుగోదావరి : అయేషా హత్య కేసులో నిర్దోషిగా తేలిన సత్యంబాబు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. ఈ మేరకు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు జైలు వద్దకు చేరుకున్నారు. కాగా సత్యంబాబు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:36 - April 1, 2017

విశాఖ : దక్షిణాది రాష్ట్రాల్లో లారీల బంద్‌ మూడోరోజు కొనసాగుతోంది.. 8 ప్రధాన డిమాండ్లతో 6 రాష్ట్రాల్లో లారీల యజమానులు సమ్మెకు దిగారు.. విశాఖలోని ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్‌ ప్లాంట్‌, పోర్ట్ ట్రస్ట్‌, గంగవరం, కోరమండల్‌ కంపెనీల్లో ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది.. లోడింగ్, అన్‌లోడింగ్‌ పనులు ఆగిపోయాయి.. దాదాపు 12వేల లారీలు సమ్మెలో ఉన్నట్లు విశాఖ లారీ ఆపరేటర్స్ ప్రకటించింది. తక్షణమే తమ సమస్యల పరిష్కరించాలని... లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.. ఈ బంద్‌కు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. లారీలు, టిప్పటర్లు, ఆయిల్‌ ట్యాంకర్లు, మినీ వ్యాన్‌లు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటున్నాయి.

 

17:34 - April 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక న్యాయం చేకూరే వరకు మేధావులు, ప్రజలను సంప్రదించి రాజకీయ ఉద్యమం నిర్మిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఈ సంవత్సరమే ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మహాజన పాదయాత్రను సీపీఎం కేంద్రకమిటీ అభినందించడం పట్ల తమ్మినేని వీరభద్రం ధన్యవాదాలు తెలిపారు.

 

17:21 - April 1, 2017

హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం రాజకీయ అవినీతిని ప్రోత్సహిస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పొలిటికల్‌ కరప్షన్‌ను రూపుమాపుతామన్న ప్రధాని నరేంద్రమోడీ.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ఏచూరి అన్నారు. కంపెనీల యాక్ట్‌ను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. కంపెనీలు తమకు నచ్చిన పార్టీకి ఎంతైనా విరాళాలు ఇచ్చేలా చట్టాలు రూపొందిస్తున్నారని అన్నారు. గతంలో కంపెనీలు 7.5 శాతం విరాళాలు మాత్రమే ఇచ్చేలా సీలింగ్‌ ఉండేదని.. ఇప్పుడు దాన్ని మార్చారన్నారు. దీనివల్ల రాజకీయ అవినీతి మరింత ఎక్కువవుతుందన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులను వేధించేలా ఇన్‌కం టాక్స్‌ సవరణలు చేశారని ఏచూరి ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై పోరు తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాసంఘాలతో కలిసి పార్లమెంట్‌ ముందు ఆందోళన చేపడుతామని ఏచూరి తెలిపారు. 

 

మంథని దళితుడి మృతిపై విచారణ జరపాలి : తమ్మినేని

హైదరాబాద్ : మంథనిలో దళితుడి మృతిపై విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గుతేల్చేందుకు రీపోస్టుమార్టం నిర్వహించాలని, దీనిపై నిజానిర్ధారణ కమిటీ వేయాలని ఆయన అన్నారు.

17:13 - April 1, 2017

కర్నూలు : పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ కర్నూలులో సీపీఎం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెంచిన ఛార్జీలతో ప్రజలపై మరింత భారం పడుతుందని ఆరోపించారు. వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తయారుచేస్తున్న సోలార్‌ విద్యుత్‌ ఎక్కడికి పోతోందని సర్కారును ప్రశ్నించారు.

మహాజన పాదయాత్ర కొనసాగింపుగా కార్యచరణ : తమ్మినేని

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగింపుగా మేధావులు, ప్రజాసంఘాలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయమే కీలకామని, పాదయాత్రతోనే ఎంబీసీ కార్పొరేషన్ తోపాటు, సంక్షేమ రంగాలకు కేటాయింపులు జరిగాయని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ ను ఎందుకు వాయిదా వేస్తున్నారని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ కు మాటలతో కాలయాపన చేయడం అలవాటని విమర్శించారు.

17:06 - April 1, 2017

విజయవాడ : విద్యుత్ ఛార్జీల పెంపుపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్ టీఆర్ సర్కిల్‌లో వినూత్నరీతిలో ధర్నా నిర్వహించారు. ఎన్నికలముందు ఎలాంటి చార్జీలు పెంచమంటూ అధికారంలోకివచ్చిన చంద్రబాబు... ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు.. పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరెంట్‌ చార్జీల పెంపుతో ఒక్క కృష్ణాజిల్లాలోని ప్రజలపైనే వందకోట్ల రూపాయల భారం పడుతుందని ఆరోపించారు.

16:59 - April 1, 2017

ఢిల్లీ : నల్లధనానికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఈడీ 3 వందల షెల్‌ కంపెనీలపై దాడులు చేస్తోంది. 16 రాష్ట్రాల్లో వంద స్థావరాలపై ఈడీ మెరుపు దాడులు చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్‌, కోల్‌కతా, పాట్నా, చండీగఢ్, భువనేశ్వర్‌, కొచ్చి తదితర ప్రాంతాల్లోని ఫేక్‌ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో 3 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో విలువైన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపినట్లు సమాచారం. 

 

కాసేపట్లో సీఎం దగ్గరకు కడప పంచాయతీ

గుంటూరు : కాసేపట్లో సీఎం దగ్గరకు కడప పంచాయతీ రానుంది. కడప నేతలతో సీఎం రమేష్, గంటా మంతనాలు జరుపుతున్నారు. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తే రామసుబ్బారెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతామన్నారు. రామసుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్ ఇస్తామని సీఎం రమేష్ రాయబారం వహించిన ఆర్టీసీ చైర్మన్ పదవికి రామసుబ్బారెడ్డి అంగీకరించలేదు.

జగన్ కంపెనీలో ఈడీ సోదాలు

ముంబై : జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. నవీముంబయిలోని రాజేశ్వర్ ఎక్స్ ఫోర్ట్స్ లో, జగన్ కు చెందిన సూట్ కేస్ కంపెనీల లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

ఓటు ఎవరికి వేసిన అది బీజేపీకే

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బింద్ స్థానానికి వారం రోజుల్లో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈవీఎంలను మీడియా ముందు ప్రదర్శించారు. ఓటు వేసిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేశామో తెలిపే (వీవీపీఏటీ ) తరహ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు గందరగోళం నెలకొంది. ప్రదర్శన సందర్బంగా ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే ఓటు పడినట్టు స్లిప్ రావడాన్ని మీడియా ప్రతినిధులు గుర్తించారు. దీని పై వెంటనే నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.

 

మోదీ ప్రభుత్వా ప్రమాదకార ధోరణి : ఏచూరి

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజా ఉద్యమాలను చేపడుతామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంభిస్తూ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు.రాజ్య సభును కాదని మనీ బిల్లు పేరుతో లోక్ సభలో సంఖ్యా బలంతో ఆమోదింపచేస్తోందని, జీఎస్టీ బిల్లు మనీ బిల్లు కిందే తీసుకొచ్చారని అన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చే నిధులను అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బ్రిటీష్ పాలన : పి. మధు

శ్రీకాకుళం : రాష్ట్రంలో బ్రిటీష్ పాలన నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. పేదల భూములను ప్రభుత్వం బడా కంపెనీలకు కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు. జిల్లాలోని థర్మల్, అణువిద్యుత్ ప్రాజెక్టుల పేరుతో స్థానికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ ముఖ్యులతో సీఎం చంద్రబాబు సమావేశం

గుంటూరు : కేబినెట్ విస్తరణపై చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. జ్యోతుల నెహ్రూ, కళా వెంకట్రావు, యనమల ఈ భేటీలో పాల్గొన్నారు. సాయంత్రం మరోసారి యనమల, వెంకట్రావుతో భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. సాయంత్రానికి కేబినెట్ విస్తరణ పూర్తికానున్నట్టు తెలుస్తోంది.

రైలు ఢీకొని పులి మృతి

భోఫాల్ : మధ్యప్రదేశ్ లోని సెహోరే ప్రాంతంలో ఓ పులి మృతి చెందింది. దీని మృతదేహన్ని స్థానిక రైలు పట్టాల పక్కన అధికారులు కనుగొన్నారు. పులిని రైలు ఢీకొనటం వల్ల పులి మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటన బుద్ని-మిడ్ ఘాట్ ప్రాంతంలో జరిగింది.

 

దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

ముంబై : నల్లధనానికి వ్యతిరేంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 3 వందల షెల్ కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహిస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో సోదాలు జరుగుతున్నాయి. అధికారులు విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.

 

మియామీ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లోకి సానియా జోడి

ఫ్లోరిడా : మియామీ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లోకి సానియా జోడి దూసుకెళ్లింది. హింగిస్-చాన్ యంగ్ పై సానియా-స్ట్రికోవా జోడి విజయం సాధించారు. సెమీస్ లో 7-6(8), 6-1(10-4) తేడాతో సానియా జోడి గెలుపొందింది.

13:31 - April 1, 2017

అమరావతి: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. సీఎం రమేశ్, మల్లికార్జున రెడ్డి, లింగారెడ్డి, బీటెక్‌ రవి, సుధాకర్‌ యాదవ్‌తోకలిసి మంత్రి గంటా దగ్గరకు వెళ్లారు.... కడప జిల్లా టిడిపి నేతలుకూడా గంటాకు ఫోన్‌చేసి ఆది నారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో తాము ఎన్నో పోరాటాలు చేశామని... నిన్నమొన్న పార్టీలోకివచ్చినవారికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.. రెండు ఎమ్మెల్సీ పదవుల్ని కడప జిల్లాకు కేటాయించాలని కోరుతున్నారు.. ఇప్పటికే రామసుబ్బారెడ్డి కేంద్రమంత్రి సుజనాచౌదరికి ఫోన్‌ చేసి ఇదే విషయం చెప్పారు.. ఆదినారాయణరెడ్డిని మంత్రిగా చేస్తే తాను టిడిపి లో ఉండనని హెచ్చరించారు..

13:29 - April 1, 2017

రాజమండ్రి : అయేషా హత్య కేసులో నిర్దోషిగా తేలిన సత్యంబాబు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. ఈ మేరకు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు జైలు వద్దకు చేరుకున్నారు. కాగా సత్యంబాబు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

13:27 - April 1, 2017

గుంటూరు : తెనాలిలో దారుణం జరిగింది.. భార్యపై అనుమానంతో ఆమె నోట్లో, ఒంటిపై భర్త యాసిడ్‌ పోశాడు.. తీవ్రంగా గాయపడ్డ రిజ్వానాను తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం బాధితురాలి భర్త బ్రహ్మం పరారీలో ఉన్నాడు.. అయితే బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిదింతుడి కోసం పోలీసులు కేసు నమోదు చేసిన గాలింపు చర్యలు చేపట్టారు.

13:25 - April 1, 2017

కృష్ణా : విజయవాడ గుణదలలోని పవర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ సబ్‌ స్టేషన్లు కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో అక్కడున్న పొదలు, విద్యుత్‌ పరికరాలకు నిప్పంటుకుంది. ఫలితంగా భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నాయి.

కాసేపట్లో జైలు నుంచి సత్యంబాబు విడుదల

రాజమండ్రి : కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్యంబాబు విడుదల కానున్నారు. జైలు వద్దకు ప్రజా, దళిత, విద్యార్ధి సంఘాల నేతలు చేరుకున్నారు. అయేషామీరా హత్య కేసులో సత్యం ను హైకోర్టు నిర్ధోషిగా తేల్చింది.

 

 

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు

గుంటూరు : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి  మంత్రి పదవి ఇవ్వొద్దని కడప జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గంటాను కడప జిల్లా టీడీపీ నేతలు కలిసారు. గంటాను కలిసిన వారిలో రామసుబ్బారెడ్డి, సీఎం రామేష్, మల్లిఖార్జునరెడ్డి, లింగరెడ్డి, బీటెక్ రవి, సుధాకర్ యాదవ్ ఉన్నారు.

 

తెనాలిలో దారుణం

గుంటూరు : జిల్లాలోని తెనాలిలో దారుణం జరిగింది. భర్త భార్యపై అనమానంతో నోట్లో యాసిడ్ పోశాడు . దీంతో భార్య రిజ్వాన తీవ్రంగా గాయాపడింది. భర్త బ్రహ్మం పరారీలో ఉన్నారు.

కనుమూరి బాపిరాజుకు గాయాలు

పశ్చిమ గోదావరి : జిల్లాలోని నిడదవోలులో కాంగ్రెస్ ప్రజాబ్యాలెట్ బైక్ ర్యాలీలో బైక్ అదుపు తప్పి బోల్తా పడి ఘటనలో టీటీడీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత కనుమూరి బాపిరాజు గాయాపడ్డారు. ఈ బైక్ ర్యాలీలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి , పనబాక లక్ష్మీ పాల్గొన్నారు.

 

తమిళనాడు రైతులకు స్టాలిన్ బాసట

ఢిల్లీ : కరువుతో అల్లాడుతున్న తమను ఆదుకోవాలని కోరుతూ తమిళరైతులు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత స్టాలిన్ మద్దతు పలికారు.

 

12:18 - April 1, 2017

కరీంనగర్ : జిల్లాలోని మంథని మండలం ఖానాపూర్ లో యువకుడి హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య వెనుకఎమ్మెల్యే పుట్ట మధు హస్తం వుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. మంథని మండలం ఖానాపూర్ చెందిన మధుకర్ శంకరయ్య వద్ద డ్రైవర్ గా పని చేశాడు. అయితే మధుకర్ శంకరయ్య కుటుంబంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. మధుకర్ తక్కువ కులానికి చెందిన వాడంటూ పెద్దలు వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. ఇంతలో మార్చి 14న మధుకర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే దీన్ని ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. తమ కొడుకును దారుణంగా హింసించి చంపారని మృతిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్చి 14న ఈ హత్య జరగగా మృతిని తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ కొడుకుది ముమ్మాటికి హత్యేనని, ఈ హత్య వెనుక ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు సీఐ హస్తం కూడా ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల పోరాటానికి దళితసంఘాలు, పోరాట సంఘం నేతలు మద్దతు తెలుపుతున్నారు. అస్సలు హత్య అయితే మర్మాంగాలు కోసేసి, కళ్లు పీకేసి, నోట్లు గడ్డి గుక్కిన ఆనవాళ్లు శరీరం పై కనపడుతున్నాయని బంధులు ఆరోపిస్తున్నారు.

అధికారుల అండదండలతోనే ఈ హత్య చేశారని కుమారస్వామి పౌరహక్కుల సంఘం నేత ఆరోపించారు.

పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

కేబినెట్ కూర్పుపై చంద్రబాబు తుది కసరత్తు

అమరావతి: ఏపి కేబినెట్ కూర్పుపై చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికి కొత్త మంత్రులకు చంద్రబాబు ఫోన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. కళావెంకట్రావు, సుజయకృష్ణా రంగరావు, నక్క ఆనంద్‌బాబు, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమరనాథరెడ్డిలకు దాదాపుగా మంత్రి పదవులు ఖరారయ్యాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి అనిత, జవహర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజికవర్గం నుంచి పార్దసారథి, కాల్వశ్రీనివాస్‌, శంకర్‌యాదవ్‌, బీద రవిచంద్రయాదవ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

11:55 - April 1, 2017

అమరావతి: ఏపి కేబినెట్ కూర్పుపై చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికి కొత్త మంత్రులకు చంద్రబాబు ఫోన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. కళావెంకట్రావు, సుజయకృష్ణా రంగరావు, నక్క ఆనంద్‌బాబు, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమరనాథరెడ్డిలకు దాదాపుగా మంత్రి పదవులు ఖరారయ్యాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి అనిత, జవహర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజికవర్గం నుంచి పార్దసారథి, కాల్వశ్రీనివాస్‌, శంకర్‌యాదవ్‌, బీద రవిచంద్రయాదవ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మైనార్టీల నుంచి చాంద్‌బాషా, జలీల్‌ఖాన్‌, షరీఫ్‌ల పేర్లు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి శిమరామరాజు, గుంటూరు నుంచి దూళిపాళ్ల, యరపతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఏపి కేబినెట్ నుంచి మంత్రులు రావెల, మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాతరెడ్డి, పీతల సుజాతకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయి.

 

11:54 - April 1, 2017

అమరావతి: అవినీతి అనకొండ గంగాధర్‌ నివాసాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి... ఏసీబీ తనిఖీల్లో కోట్ల కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయి.. ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్‌గాఉన్న గంగాధర్‌ నివాసాల్లో దాదాపు వందకోట్ల విలువైన ఆస్తుల్ని అధికారులు గుర్తించారు.. రోడ్డు కాంట్రాక్టర్‌ నాగభూషణం ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి.. బీమిలి 4లైన్ల రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గంగాధర్‌, నాగభూషణంపై ఆరోపణలున్నాయి.. ఏకకాలంలో విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..

11:52 - April 1, 2017

కరీంనగర్ : నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలకు ఉమ్మడి కరీంనరగ్‌ జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. పనులమీద బయటికి వెళ్లక తప్పని పరిస్థితుల్లో..తెల్లవారుజామునుంచి పనులు మొదలు పెడుతూ.. మధ్యాహ్నం 12గంటలకల్లా ఇళ్లుచేరుకుంటున్నారు. దీంతో పగటిపూట పట్టణప్రాంతాల్లో జనసంచారం కనిపించడంలేదు.

నిప్పులు కురిపిస్తున్న భానుడు....

కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. సాధారణంగా మార్చి నెలలో 40 డిగ్రిల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా.. ఈ యేడాది మాత్రం ఎండల తీవ్రత జన్నాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

రామగుండంలో ఏరియాలో అధిక ఉష్ణోగ్రతలు...

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ప్రాంతంలో అధికం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి సంస్థలో మద్యాహ్నం షిప్ట్ లో కార్మికుల హజరు శాతం తక్కువగా ఉంటోంది. అటు పట్టణ కేంద్రాల్లో ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్రూట్‌ జూస్‌, కొబ్బరి బొండాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఇక చిన్నారులైతే.. స్థానికంగా ఉన్న స్విమ్మిపూల్స్‌లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు.

కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు...

అటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల లో 39, నుంచి 40డిగ్రిల తీవ్రతతో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. మధ్యాహ్నం అయిందంటే ప్రజలు రోడ్ల పై కనిపించడం లేదు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పళ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ సేవించాలని సూచిస్తున్నారు. చల్లధనంకోసం ప్రజలు ఏసిలు, ప్రిజ్ లతోపాటు కూలర్లు, రంజన్లు కోనుగోలు చేస్తుండడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ బాగా పెరిగింది.

అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం...

ఈసారి ఎండల తీవ్రత అధికాంగా ఉండటంతో.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జనం వరడదెబ్బభారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు.

11:50 - April 1, 2017

వరంగల్ : కొండకోనల్లో రంజిల్లే ఈలపాటలు కాకతీయుల పట్టణంలో గొంతెత్తాయి. పకృతిని పలకరింపజేసే గడ్డిపూల సుగంధాలను నగరానికి మోసుకొచ్చింది గిరిజనం. లోక్‌జన్‌ప్రథా పండుగలో భాగంగా దేశం నలుమూలనుంచి తరలివచ్చిన జానపదకళలు వరంగల్‌లో పలకరించుకున్నాయి. హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఘల్లుమన్న జానపదంపై టెన్‌టీవీ ఫోకస్‌..

ఘల్లుమన్న జానపదం....

కీకారణ్యాల నుంచి..మారుమూల పల్లెలనుంచి.. మెట్రోనగరాల నుంచి.. జానపదాలు తరలివచ్చాయి. కళళకాణాచి.. కాకతీయుల నగరం ఓరుగల్లును తడిమిచూశాయి.

లోక్‌జన్‌ప్రథా మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా హన్మకొండలోని ఆర్ట్స్‌కళాశాల పులకించింది. దేశవ్యాప్తంగా 9రాష్ట్రాల నుంచి కళాకారులు తరలివచ్చి.. మరుగున పడిపోతున్న మన జానపదకళలను ప్రదర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కళాకారుల అద్భుత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గ్రామసీమలను రక్షించే ఎల్లమ్మ, పోలేరమ్మ, పోతరాజుల నృత్యాలు అబ్బురపరిచాయి. చిందుయక్షగానం, కోలాటం, డోలునృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఆదిలాబాద్‌జిల్లా నుంచి వచ్చిన తోటితెగ గిరిజన కళాకారులు ప్రదర్శించిన పాండవుల కథను ఆహూతులు ఆసక్తిగా విన్నారు. కిక్రీ, కుజ్జా,డాకీ వాయిద్య విన్యాసాలకు సభికులు కరతాళాలు కలిపారు.

అటు మహరాష్ట్రలోని సాంగ్లీప్రాంతానికి చెందిన గజనృత్యం కనువిందుచేయగా.. ఒడిశాలోని గంజాంప్రాంతానికి చెందిన సబర్‌ గిరిజనులు అమ్మవారిని స్వాగతిస్తూ చేసిన చడ్డేయ ప్రదర్శన సభికులను ఉర్రూతలూగించింది.

తమిళనాడు గరగనృత్యం, కేరళ నుంచి వచ్చిన మహిళా కళాకారులు ప్రదర్శించిన డోల్‌ విన్యాసాలు అదరహో అనిపించాయి.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరత్వాత కనుమరుగవుతున్న జానపదాలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయని పర్యాటకశాఖా మంత్రి చందూలాల్‌ అన్నారు.

కాకతీయుల కాలంలో ఆధరణపొందిన జానపదకళలకు మళ్లీ జీవం పోస్తే.. మన విశిష్ట సంస్కృతి ప్రపంచానికి తెలియడంతోపాటు.. తెలంగాణలో టూరిజం అభివృద్ధి చెందుతుందని ..వరంగల్ ప్రజలు అంటున్నారు.

11:37 - April 1, 2017

యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్రా అరెస్ట్

ఢిల్లీ : యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్రా అరెస్ట్ అయ్యారు. మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు సంజయ్ చంద్రా పై ఆరోపణలు ఉన్నాయి.

లారీ యజమానుల సంఘం ర్యాలీ

హైదరాబాద్: లారీ యజమానుల సమ్మెకు మద్దతుగా నేడు హయత్‌నగర్‌ నుంచి ఆటోనగర్‌ వరకు భారీ రాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లారీ యజమానుల సంఘం సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

10:51 - April 1, 2017
10:49 - April 1, 2017

ఖమ్మం: కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి. గతేడాది క్వింటా ధర 12 వేల నుంచి 13 వేలు పలకడంతో.. ఖమ్మం జిల్లాలో సుమారు 40 వేల హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. దిగుబడి బాగా పెరిగినా.. ధర సగానికి పడిపోవటంతో రైతుల అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

ధర భారీగా పతనమవ్వటంతో...

ప్రస్తుతం ధర క్వింటా 6,500 పలుకుతుండటంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ధర భారీగా పతనమవ్వటంతో మార్కెట్ కు తెచ్చిన మిర్చిని అమ్మలేక, దాచిపెట్టడానికి కోల్డ్ స్టోరేజీల్లో స్థలం లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని వాపోతున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో కేవలం 31 కోల్డ్ స్టోరేజీలే ఉన్నాయి. ఒక్కొక్క కోల్డ్ స్టోరేజీలో 70 వేల నుంచి లక్ష బస్తాలు మాత్రమే నిల్వచేసే అవకాశముంది. దీంతో నిల్వచేసేందుకు స్థలం లేక రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మిర్చి అమ్ముకోవాల్సి వస్తోంది. ఒకవేళ స్థలం ఉన్నా.. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాలు భారీగా ఛార్జీలను పెంచినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

మార్కెట్ కు పోటెత్తుతున్న మిర్చి.....

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీకి వారం రోజులుగా ఎర్ర బంగారం పోటెత్తుతోంది. సగటున రోజుకు 50 వేల బస్తాలకు పైగా వస్తున్నాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మిర్చి యార్డు పరిమితి కేవలం 30 నుంచి 40 వేల బస్తాల వరకే ఉండటంతో మార్కెట్ బయట మిర్చిని దింపుతున్నారు. గతేడాదితో పోలిస్తే సరుకుకు సగం ధర కూడా రైతులు పొందని పరిస్థితి నెలకొంది. సగటున క్వింటా ధర 6,500 మించలేదు. మార్కెట్ లో జెండా పాట క్వింటాకు 8 వేలు పలికినా రైతులకు ప్రయోజనం దక్కడం లేదు. సరుకు ఎంత నాణ్యతగా ఉన్నా వ్యాపారులు 6,500 మించి ధర పెట్టడం లేదు. కొద్దిగా తేమగా ఉన్నా 5 వేలలోపే చెల్లిస్తున్నారు. నాణ్యత లేని పంటకు 3 వేలకు మించి ధర రావటం లేదు. పొరుగు దేశాలకు ఎగుమతులు లేకపోవటంతో ధర బాగా మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు.

మూడురోజుల వ్యవధిలో ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య...

మరోవైపు మూడురోజుల వ్యవధిలో ఇద్దరు మిర్చి రైతులు చనిపోయారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామానికి చెందిన కౌలురైతు వాసం గోపి ఆత్మహత్య చేసుకోగా.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన సయ్యద్‌ సోంద్‌మియా గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చి పంటకు మద్దతు ధర పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

10:46 - April 1, 2017

హైదరాబాద్: గులాబీ దళపతి కేసీఆర్‌.. రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను తెలుసుకునేందుకు నిత్యం సర్వేలు చేయిస్తున్నారు. అయితే... ఈ సర్వే ఫలితాలు ఉద్యమ నేతల్లో ఆందోళనలు పుట్టిస్తున్నాయి. పార్టీ పటిష్టంగా ఉన్న జిల్లాల్లోనూ కొంతమంది నేతలపై వచ్చిన సర్వే ఫలితాలు అయోమయాన్ని సృష్టించే విధంగా ఉన్నాయంటున్నారు.

నేతలకు స్వయంగా అందిస్తున్న సీఎం కేసీఆర్‌..

సర్వే నివేదికలను నేతలకు స్వయంగా అందిస్తున్న సీఎం కేసీఆర్‌... వెనకబడిపోతున్నారన్న విషయాన్ని చెబుతున్నారు. దీంతో నేతలు ఆందోళనలకు గురువుతున్నారు. అయితే.. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే నేతల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేకపోవడం విశేషం. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో అందజేసిన సర్వే వివరాలపై ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి.. సర్వేకు పొంతన లేదనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల పై అసంతృప్తి...

నిజామాబాద్‌ జిల్లా అధికార పార్టీకి తిరుగులేని జిల్లాగా ఉన్నా.. ఆ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు వ్యతిరేకంగా వచ్చాయి. అందులో ఓ శాసనసభ్యుడికి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది. ఇదిలావుంటే గ్రేటర్‌ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ.. సర్వేలో మాత్రం ప్రజామోదం మెండుగా ఉందని నివేదికలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక సర్వే ఫలితాలు ఎలా ఉన్నా... సభ్యత్వ నమోదు కార్యక్రమంతో నియోజకవర్గాల్లో పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు గులాబీ నేతలు యత్నిస్తున్నారు.

10:42 - April 1, 2017

హైదరాబాద్: వందేళ్ల పండుగకు ఉస్మానియూ యూనివర్శిటీ సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే వందేళ్ల పండుగను మరో వందేళ్లు గుర్తుండేలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వందేళ్ల పండుగకు సిద్ధమైన సందర్భంగా ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఉస్మానియా యూనివర్శిటీలో ఎంతో ఘనంగా జరిగింది.

నాటి ఉద్యమాల నుంచి నేటి ఉద్యమాల వరకు...

నాటి ఉద్యమాల నుంచి నేటి ఉద్యమాల వరకు ఎంతో మంది పోరాటయోధుల్ని..మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని అందించిన ఉస్మానియా యూనివర్శిటీ..తన పూర్వ వైభవాన్ని కోల్పోతుందని ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పూర్వవిద్యార్థులైన వక్తలు అభిప్రాయపడ్డారు. దేశ ఉద్యమాలలో ఉస్మానియా యూనివర్శిటీ గొప్ప పాత్ర పోషించిదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఎచూరి అన్నారు. దేశంలోని అనేక యూనివర్శిటీలు మతోన్మాద శక్తుల చేతుల్లో నలిగిపోతున్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వామపక్ష విద్యార్ధి సంఘంపైన ఉందన్నారు.

దళిత పేద విద్యార్ధులు ఎక్కడ చదువుకుంటారో ...

దళిత పేద విద్యార్ధులు ఎక్కడ చదువుకుంటారో అని జేఎన్‌యూ వంటి యూనివర్శిటీల్లో పీహెచ్‌డి సీట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో...

పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో పాతతరం మొదలుకొని నేటి తరం వరకు వామపక్ష విద్యార్ధి సంఘాల్లో పనిచేసిన విద్యార్ధులంతా పాల్గొని ఎంతో ఉత్సాహాన్ని నింపారు. వందేళ్ల యూనివర్శిటీ సంబరాలను జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. బోల్ష్‌విక్ ఉద్యమ స్పూర్తితో యూనివర్శిటీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ఎస్ ఎఫ్ఐ లో పని చేశా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి....

ఒకప్పటి ఓయు విద్యార్ధిగా ఎస్‌ఎఫ్‌ఐలో తాను పనిచేసి ప్రగతిశీల భావాలతో ఎంతో నేర్చుకున్నానని ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమైనా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. మరోవైపు ప్రజాగాయకుడు గద్దర్ మాటలతోనే కాకుండా తన పాటలతో పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఉర్రూతలూగించారు.

ప్రస్తుత తరం విద్యార్ధులకు ఎన్నో బాధ్యతలున్నాయని...

ప్రస్తుత తరం విద్యార్ధులకు ఎన్నో బాధ్యతలున్నాయని..ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన యూనివర్శిటీని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ఉందని వ్యక్తలు అన్నారు. వందేళ్ల సంబరాలకు సిద్దమవుతున్నప్పటికీ యూనివర్శిటీలో నియామకాలపై ప్రభుత్వం స్పందించాలని వారు గుర్తుచేసారు. మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేయాలని వారు వక్తలు అభిప్రాయపడ్డారు.

10:38 - April 1, 2017

హైదరాబాద్: ఇప్పుడున్న పోటీప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించ‌డమే ఒక ఛాలెంజ్‌ అయితే..ఇక జాబ్‌లో చేరాక ప్రమోష‌న్లు పోందడం మ‌రో సవాల్‌ గా మారింది. పై అధికారి కనికరించాలంటే.. కానుకలు, కట్నాలు చాలానే చదివించుకోవాలి. దీనికి ప్రత్యక్షనిదర్శనమే ..తెలంగాణా ప్రజారోగ్య ఇంజనీరింగ్‌ విభాగంలో ఉన్నతాధికారి తీరు అంటున్నారు కిందిస్థాయి ఉద్యోగులు.

నిబంధనల ప్రకారం ప్రతి 3ఏళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి....

సర్కార్ నియ‌మావ‌ళి ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి ఉద్యోగులకు ప‌దోన్నతులు క‌ల్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు అయ్యాక ఖాళీల‌ను సంఖ్యను అనుసరించి అవసరం మేరకు రెండేళ్ల స‌ర్విస్ ఉన్నవారికి కూడా ప్రమోష‌న్లు కల్పించాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాని కొందరు అధికారుల‌కు మాత్రం అవేవి ప‌ట్టడం లేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రమోష‌న్ల ప్రక్రియ చేపట్టడంతో తెలంగాణ ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్ విభాగం ఉద్యోగులు సంతోపడ్డారు. అయితే వారి ఆశలమీద నీళ్లు చల్లుతున్నారు.. ఇంజనీరింగ్‌ అధికారులు.

ఇంచార్జ్‌ సీఈ గా మల్లికార్జునుడు విధులు.....

ఈ అధికారి పేరు మల్లికార్జునుడు. రామ‌గుండం కార్పొరేష‌న్‌లో సూరింటెండెంట్ ఇంజ‌నీర్ గా పనిచేస్తున్నారు. దాంతోపాటు ప‌బ్లిక్ హెల్త్ ఇంజ‌నీరింగ్ విభాగంలో ఇంచార్జీ సీఈ గా హెడ్‌ఆఫీస్‌లో కూడా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతిపై తనకు ఇంచార్జ్‌బాధ్యతలు ఇచ్చారని చెప్పుకుంటున్న ఈ అధికారి.. తన కిందిస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లలో మాత్రం తన సొంతరూల్స్‌ను అమలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా రికార్డుల‌కు తారుమారు చేస్తూ.. అర్హతలేనివారిని అంద‌లం ఎక్కించేందుకు పావులు క‌దుపుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి.

పీఎస్ సీ రూల్స్‌, రోస్టర్‌ విధానాన్నీ పట్టించుకోని ఉన్నతాధికారి......

వాస్తవానికి ప‌బ్లిక్ స‌ర్విస్ క‌మీష‌న్ ఇచ్చిన జాబితా ను అనుసరించి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఫిక్స్ చేయ్యాలి. కాని ఆ జాబితాను ప‌క్కన‌బెట్టి.. త‌న‌కు న‌చ్చినట్టు లిస్ట్ తాయ‌రు చేశారనే ఆరోపణలొస్తున్నాయి. ప‌బ్లిక్ స‌ర్విస్ క‌మీష‌న్ రూల్స్‌తోపాటు రోస్టర్ విధానాన్నికూడా పక్కనపెట్టేశారు. విషయం ఏంటని ప్రశ్నిస్తే.. తాను ఈ సీట్లోకి రాకముందే లిస్టు తయారైందని.. మాట దాటవేస్తున్నారు.

ఎన్ ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ , ప్రమోషన్లు...

ఈ ఇంచార్జ్‌ సీఈగారి సొంత రూల్స్‌లో.. కోర్టు తీర్పులు కూడా బేఖాతరు అవుతాయి. NMR ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తారు.. తర్వాత ప్రమోషన్లూ కల్పిస్తారు. అదేచేత్తో కోర్టు తీర్పుల ప్రకారం డీమ్డ్‌ యూనివర్సిటీ డిగ్రీలు చెల్లవంటూ.. ఇచ్చిన ప్రమోషన్ల నుంచి ఉద్యోగులకు రివర్షన్‌ ఇస్తారు. అంతటితో ఆగితే.. ఈ ఇంజనీర్‌ అధికారివారి ప్రత్యేక ఏముంది..! గతంలో తాను రివర్షన్‌ ఇచ్చిన ఇంజనీర్లకే తాజాగా తయారు చేసిన ప్రమోషన్ల లిస్టులో చోటు కల్పించి.. తనలో అసలు కోణాన్ని బయటపెట్టారు. కానుకలు భారీగా స్వీకరించి ఇలా తన ఇష్టం వచ్చినవారికి ప్రమోషన్లు కల్పిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.

తమకు అన్యాయం జరుగుతోందంటున్నతెలంగాణ ఇంజనీర్లు ....

ఉన్నతాధికారుల తీరుతో త‌మ‌కు నాయ్యంగా రావాల్సిన ప్రమోష‌న్లు కోల్పోతున్నామని కొందరు ఇంజ‌నీర్లు వాపోతున్నారు. నిబంధన‌లు తుంగ‌లో తొక్కి జాబితాల‌ను అడ్డదిడ్డంగా తాయ‌రు చేయడంవ‌ల్ల.. తమకు ప్రమోష‌న్లు చేజారుతున్నాయ‌ని అవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారుల‌కు మొర‌పెట్టుకున్నా ప‌ట్టించుకోకుండా ప్రోవిజిన‌ల్ లిస్ట్‌ తాయరు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూల్స్ కు విరుద్దంగా ప్రమోష‌న్లు ఎలా ఇస్తారు..?

ప్రమోష‌న్లలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగడంపై ఇంజనీరింగ్ అసోషియేష‌న్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చ‌ర్యలు ఉద్యోగుల హక్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అంటున్నారు వారు. మ‌రోవైపు డీమ్డ్ యూనివ‌ర్సిటి , దూర‌విద్య ప‌ట్టాలు పొందిన వారిని రూల్స్ కు విరుద్దంగా ప్రమోష‌న్ జాబితాల్లో చేర్చడం ఎంట‌నీ ప్రశ్నిస్తూన్నారు. ఈ చ‌ర్యల వ‌ల్ల డైరెక్టుగా రిక్రుట్ అయిన ఏఈలు తాము న‌ష్టపోతారని ఆందోళ‌న‌ చెందుతున్నారు. మాటెత్తితే రూల్స్ జపంచేసే అధికారులు.. సినియార్టీ లిస్ట్ పై ఒక్కోజోన్‌లో ఒక్కోవిధంగా వ్యవ‌హ‌రించ‌డం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆక్రమాల‌పై దృష్టిసారించి ప్రమోష‌న్ల‌లో న్యాయం చేయాలని తెలంగాణ ఇంజనీర్లు కోరుతున్నారు.

10:34 - April 1, 2017

భద్రాద్రి : భద్రాద్రి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో ప్రధాన వేడుకలు ఏప్రిల్ 5న శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 6న శ్రీరామపట్టాభిషేకం జరగనున్నాయి. ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారి కల్యాణ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు....

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వామివారి కల్యాణానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఏప్రిల్ 5 శ్రీ సీతారాముల కల్యాణం.....

భద్రాద్రిలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. ఏప్రిల్5న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి 2లక్షలకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 6న శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణానికి సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానుండటంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ఆటోడ్రైవర్లు, వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. భద్రాచలం పట్టణంలోకి వచ్చే వాహనాలను వారం రోజుల నుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అధిక సంఖ్యలో తలంబ్రాల కౌంటర్లు...

ఈ సారి గతంలో కంటే అధిక సంఖ్యలో తలంబ్రాల కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. తలంబ్రాలు గతంలో 60క్వింటాలు తయారు చేయిస్తే, ఈ ఏడాది అదనంగా మరో 40క్వింటాలు పెంచారు. 2లక్షలకు పైగా లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తున్నారు. దేవస్థానం తరుపున భక్తులకు పానకం, వడపప్పు అందజేస్తున్నారు. పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపడుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రామాలయానికి విద్యుదీలంకరణ గావించడంతో పరిసరాలు శోభాయమానంగా మారాయి.

09:37 - April 1, 2017
09:34 - April 1, 2017

విశాఖ: ఏపీ ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధర్, రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణం ఇళ్ల పై ఏసీబీ దాడి చేసింది. ఏక కాలంలో విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గంగాధర్, నాగభూషణం బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భీమిలి 4 లైన్ల రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.

నిజామాబాద్ జిల్లా జాకోరా గ్రామంలో దారుణం

నిజామాబాద్: వర్ని మండలం జాకోరా గ్రామంలో దారుణం జరిగింది. భార్యా భర్తలపై సాయిలు అనేక వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. భార్య సాయమ్మ(40) మృతి చెందగా భర్త నాగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.

08:51 - April 1, 2017

అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వస్థీకరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకున్నారు. మీడియా పాయింట్, అసెంబ్లీ లాబీలు, మంత్రుల చాంబర్లలో ఇదే విషయంపై సమాలోచనలు సాగాయి.

ఆశావహులతో నిండిన చంద్రబాబు, లోకేశ్ చాంబర్లు ...

మరోవైపు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్సీ లోకేశ్‌ చాంబర్లు ఆశావహులతోపాటు, పదవులు ఊడే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతున్న మంత్రులతో నిండిపోయాయి. తమ పదవులు తీయొద్దంటూ కొందరు మంత్రులు వేడుకొంటే, తమకు అవకాశం కల్పించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబును కలిశారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు, పీతల సుజాత, కిమిడి మృణాళిని కూడా ముఖ్యమంత్రిని కలిశారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.... ఎమ్మెల్సీ లోకేశ్‌ను విడిగా కలిసి తన వాదనలు వినిపించారు.

చంద్రబాబును కలిసిన చింతమనేని ప్రభాకర్‌ ...

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యంకాదని తనకు కలిసిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. పదవులు రాలేదని బాధపడవద్దని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ప్రాంతీయ, సామాజిక, రాజకీయ సమీకరణలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం కూర్పు ఉంటుందని సూచించారని చంద్రబాబును కలిసి వచ్చిన శాసనసభ్యులు చెబుతున్నారు. మండలి వాయిదా పడిన తర్వాత హోం మంత్రి చినరాజప్ప చాంబర్‌కు వచ్చిన లోకేశ్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. నక్కా ఆనంద్‌ బాబు, కల్వపూడి శివ, చాంద్‌బాషా, సర్వేశ్వరరావు, అనితలు కూడా చంద్రబాబు, లోకేశ్‌లో వేర్వేరుగా భేటీ అయ్యారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

మంత్రులకు సచివాలయంలో 19 చాంబర్లే ...

మరోవైపు విస్తరణ తర్వాత మంత్రివర్గంలో చేరే వారికి చాంబర్ల కేటాయింపు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో 19 చాంబర్లు మాత్రమే ఉన్నాయి. కొందరికి ఉద్వాసన పలికితే కొన్ని చాంబర్లు ఖాళీ అవుతాయి. తొలగించే వారికంటే ఎక్కువ మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎదురయ్యే చాంబర్ల కొరత సమస్యను ఎలా పరిష్కరించాలా ? అన్న అంశంపై చర్చలు జరుపుతున్నారు. సిబ్బంది, అధికారులు కార్యాలయాలను సర్దుబాటు చేసి, మంత్రుల కోసం కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

08:48 - April 1, 2017

నెల్లూరు : జిల్లాలో రోడ్డుప్రమాదం 20మందిని గాయాలపాలు చేసింది.. ఓజిలి మండలం రాజపాలెం హైవేపై ఆగిఉన్న లారీని ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో 20మంది గాయపడగా ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది..

08:47 - April 1, 2017

అమరావతి: ఏపీలో మంత్రివర్గ విస్తరణ వార్తలు టీడీపీ నేతలమధ్య చిచ్చుపెట్టాయి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవద్దంటూ మాజీమంత్రి రామసుబ్బారెడ్డి సూచిస్తున్నారు.. ఒకవేళ తీసుకుంటే తాను పార్టీలో ఉండనంటూ కేంద్రమంత్రి సుజనాచౌదరికి స్పష్టం చేశారు..

ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ చీఫ్ ఇంట్లో ఏసీబీ రైడ్

విశాఖ : ఏపీ ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధర్, రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణం ఇళ్ల పై ఏసీబీ దాడి చేసింది. ఏక కాలంలో విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గంగాధర్, నాగభూషణం బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భీమిలి 4 లైన్ల రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. భగ్గుమన్న విభేదాలు..

అమరావతి: ఏపి మంత్రివర్గ విస్తరణతో టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యేని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనను మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే పార్టీని వీడుతానని కేంద్ర మంత్రి సుజనా చౌదరితో రామసుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

ఆగివున్న లారీనీ ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నెల్లూరు : ఓజిలి మండలం రాజుపాలెం వద్ద హైవే పై ఆగి వున్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

07:32 - April 1, 2017

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వానికి కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అక్షింతలు వేసింది. ప్రభుత్వ తప్పిదాలను తన నివేదికలో ఎత్తిచూపింది. 2015-16 సంవత్సరానికి దాదాపు 37 వేల కోట్ల అధిక వ్యయం జరిగిందని తప్పుపట్టింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ తీరును కడిగి పారేసింది. ఏపీ ప్రజలపై చంద్రబాబు సర్కార్ విద్యుత్ భారం మోపింది. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఎస్ వినయ్ కుమార్, సీపీఎం నేత బాబూరావు, చందూ సాంబశివరావు పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

07:02 - April 1, 2017
07:00 - April 1, 2017

హైదరాబాద్: బీఎస్-3 వాహనాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌ - 3 వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్‌ చేయరాదన్న సుప్రీం ఆదేశాలతో... వాహన తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్ల్‌ ఇచ్చాయి. దీంతో షోరూంలకు జనం ఎగబడ్డారు. లక్షల వాహనాలు క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఈ రియాక్షన్‌ చూసిన కొన్ని షోరూంలు బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీశాయి.

ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమలు...

బీఎస్‌ 3 నిబంధనలు పాటించని వాహనాల విక్రయంపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమలు చేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో.. తెలుగు రాష్ట్రాల్లో ద్విచక్రవాహానాలు ఊహించనిరీతిలో అమ్ముడయ్యాయి. ఎంత పెద్ద వాహనమైనా భారీ డిస్కౌంట్‌ ఇవ్వటంతో క్షణాల్లో వాహనాలు అమ్ముడు పోయాయి. కొన్ని షోరూంలు ప్రీమియం బైక్‌లను ఎప్పుడో అమ్మేశాయి. హై అండ్‌ బైక్‌లను మాత్రం కొనలేక ఆశతో వచ్చిన వారు వెను తిరిగారు. బైక్‌ల కంటే స్కూటీలకు ప్రయారిటీ ఇచ్చారు వినియోగదారులు. అవి కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయాయి.

బైకులపై భారీ ఆఫర్లు ప్రకటించిన ఒక్క రోజే ...

బైకులపై భారీ ఆఫర్లు ప్రకటించిన ఒక్క రోజే ఉన్న వాహనాలన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం ఉదయం నుండి మధ్యాహ్నంలోపే బిఎస్3 వెహికల్స్ సేల్ అయ్యాయి... కొన్ని షోరూంలు అయితే తెరిచిన రెండు గంటలలోపే నో స్టాక్ బోర్డులు పెట్టాయి...ఒక్కసారిగా జనాలు పోటెత్తడంతో కొన్ని షోరూంలు షట్టర్‌ క్లోజ్‌ చేశాయి.

హీరో మోటో, హోండా, బజాజ్, సుజుకి తదితర కంపెనీలు.....

ఇక హీరో మోటో, హోండా, బజాజ్, సుజుకి తదితర కంపెనీలు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు ప్రకటించడంతో.. షోరూములన్నీ కిటకిటలాడాయి. ఇక హోండా యాక్టివా హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ఈ స్కూటర్ పై దాదాపు రూ. 12 వేల వరకూ తగ్గింపు ఉండటంతో యాక్టివా 3జీ వేరియంట్ ధర రూ. 50 వేలకు తగ్గడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. ఇప్పటికే తమ వద్ద నిల్వ ఉన్న స్కూటర్ వేరియంట్లన్నిటినీ విక్రయించామని ఇప్పటికే పలు షోరూంల యాజమాన్యాలు ప్రకటించాయి. పర్యావరణ పన్నుగా రూ. 500 చెల్లించి బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వీలున్నందునే ఇంతటి స్పందన వచ్చిందని అంటున్నారు.

అటు అనంతపురంలోనూ ..

అటు అనంతపురంలోనూ బీఎస్‌3 వాహనాలు భారీగా అమ్ముడయ్యాయి. షోరూముల్లోకి ఒక్కసారిగా జనం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేయాల్సి వచ్చింది. మరోవైపు కొన్ని షోరూంలు నోస్టాక్‌ బోర్డులు పెట్డడంపై జనం మండిపడ్డారు. చేసేదిలేక ఉసురుమంటూ వెనుదిరిగారు. ఇక షోరూం నిర్వాహకులు వాహనాల రిజిస్ట్రేషన్‌కు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజలు ఏదీ ఏమైనా భారీ డిస్కౌంట్‌తో ద్విచక్రవాహనాలు కొన్నవారు ఆనందంలో తేలిపోతుంటే..వచ్చిన అవకాశాన్ని దక్కించుకోలేనివారు నిరాశలో మునిగిపోతున్నారు.

06:56 - April 1, 2017

హైదరాబాద్: దేశభక్తి నవలలు, కవితలు సమాజాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదపడతాయని జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత సి. నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు అన్నారు. హైదరాబాద్‌లో అఖిల భారత పద్మశాలి సంఘం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో మాధవి ఐపీఎస్, యెల్డి వైడ్యూరాలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యెల్డి సుదర్శన్ రచించిన ఈ గ్రంధాలను వారు ఆవిష్కరించారు.

06:54 - April 1, 2017

విశాఖ : ఎంతో మంది విద్యావంతులను అందించిన ఆంధ్రా యూనివర్శిటీ పరువు వీధిన పడింది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన పాలకమండలి.. తప్పటడుగులు వేయడంపై విమర్శల జడివాన కురుస్తోంది. పరిశోధనలకు వేదిక కావాల్సిన విద్యాలయం ఫ్యాషన్ షోలు, మద్యం టెండర్లకు వేదిక కావడం దుమారం రేపుతోంది.

కళలకు పుట్టినిల్లు..

కళలకు పుట్టినిల్లు.. సర్ కట్టమంచి రామలింగారెడ్డి, సర్ సీవీ రామన్ లాంటి దేశ భక్తులు నడయాడిన అంధ్రా యూనివర్సిటీ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన పాలకమండలి ప్రభుత్వం కనుసనల్లో పనిచేస్తూ యూనివర్శిటీ పరువును బజారుకు ఈడుస్తోంది. పరిశోధనలు చేయాల్సిన చోట ఫ్యాషన్‌ షోలు, మద్యం టెండర్ల నిర్వహించడం కలకలం రేపుతోంది.

అంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ ప్రాంగణంలో...

ఫిబ్రవరి 20వ తేదీన అంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ ప్రాంగణంలో జరిగిన ఫ్యాషన్ షోను విద్యార్ధులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ పరువు తీయవద్దని ఉన్నతాధికారులను విద్యార్ధులు అప్పుడే హెచ్చరించారు. కాని ఏయూ అధికారుల తీరు మారలేదు. ఇప్పుడు ఏకంగా మద్యం టెండర్ల నిర్వహణ చేపట్టారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులు అరెస్ట్....

దీంతో ఏయూ అధికారుల తీరును నిరసిస్తూ టెండర్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్ధులను పోలీసులు అరెస్టు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే జిల్లా యంత్రాంగం క్యాంపస్‌లో మద్యం వేలం నిర్వహించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో తమ ప్రమేయం లేదని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. విద్యార్ధులు మాత్రం యూనివర్సిటీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. యూనివర్సిటీ వికృత చర్యలకు పాల్పడుతుందని అరోపిస్తున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న యూనివర్శిటీని తమ ఇష్టానుసారం వాడుకుంటే ఉద్యమాలు తప్పవని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

06:51 - April 1, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై మరోసారి విద్యుత్‌ పిడుగు పడింది. 2017-18 సంవత్సరానికి గానూ 3.6శాతం మేర కరెంట్‌ చార్జీలను పెంచుతున్నట్టు ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రకటించింది. ఈ పెంపుతో వినియోగదారులపై 800 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన విద్యుత్‌ చార్జీలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. 1.59 కోట్ల వినియోగదారులుంగా వారిలో 1.44 కోట్ల మందికి చార్జీల భారం పడడం లేదని ప్రభుత్వం చెబుతోంది. గృహ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ చార్జీలు విధించాలన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలనూ తోసిపుచ్చామని ఈఆర్‌సీ చైర్మన్‌ భవానీశంకర్‌ తెలిపారు.

విద్యుత్‌ చార్జీల పెంపునకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌....

విద్యుత్‌ చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో విద్యుత్‌ సంస్థలు ప్రజలపై చార్జీల పేరుతో బాదుడుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఏపీలో ఉన్న విద్యుత్‌ చార్జీలు... చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేవు. ఒకవైపు చంద్రబాబు దేశ విదేశాలు తిరుగుతూ రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు పెంచిన విద్యుత్‌ చార్జీలతో ఉన్న పరిశ్రమలు మూతపడే అసాధారణ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.

గృహ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు పెంపు లేదు...

గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఎలాంటి పెంపులేదని ఈఆర్‌సీ ప్రకటించింది. 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు 3శాతం చార్జీలను పెంచింది. వ్యవసాయ విద్యుత్‌కు మాత్రం చార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభించింది.15.47 లక్షల వ్యవసాయ కనెక్షన్లకూ ఎలాంటి చార్జీలు వర్తించబోవని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. మరోవైపు పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం వేస్తోందని మండిపడ్డారు. తక్షణమే పెంచిన చార్జీలను తగ్గించాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

ఇచ్చిన హామీని విస్మరించిన చంద్రబాబు....

విద్యుత్‌ చార్జీలను పెంచబోమని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు చార్జీలు పెంచమని చెప్పి.. అధికారం రాగానే కరెంట్‌ చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తారని మండిపడ్డారు.మొత్తానికి ఏపీలో విద్యుత్‌ చార్జీల పెంపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

06:48 - April 1, 2017

హైదరాబాద్: నెలరోజులుగా ఆస్తి పన్ను వసూళ్లలో బిజీబిజీగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మొత్తానికి టార్గెట్ రీచ్ అయ్యారు. 1200 కోట్ల రూపాయల ఆస్తిప‌న్ను వ‌సూలు చేసి రికార్డు నెల‌కొల్పింది బ‌ల్దియా.

జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయవ‌న‌రు ఆస్తిప‌న్ను...

జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయవ‌న‌రు ఆస్తిప‌న్ను. దీంతో నెలరోజులుగా బిల్ క‌లెక్టర్ మొద‌లుకుని క‌మిష‌న‌ర్ వ‌ర‌కూ అంద‌రూ ట్యాక్స్ క‌లెక్షన్లలో మునిగిపోయారు. గ‌తేడాది 1020కోట్ల రూపాయల ఆస్తిపన్ను వ‌సూలు చేసిన జీహెచ్‌ఎంసీ ఈసారి 1200కోట్ల రూపాయలు వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది.

గ్రేటర్ ప‌రిధిలో ఆస్తిపన్ను చెల్లింపులుదారులు 14ల‌క్షల 24వేలు....

గ్రేటర్ ప‌రిధిలో 14ల‌క్షల 24వేల‌మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో క‌మ‌ర్షియ‌ల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ 2లక్షల 34వేలు ఉండగా రెసిడెన్షియ‌ల్, క‌మ‌ర్షియ‌ల్ ఆస్తులు 17వేలు ఉన్నాయి. వీట‌న్నింటి ద్వారా 1112 కోట్ల రూపాయల ఆస్తి పన్ను రావాల్సి ఉంది. దీంతో మొదటి నుంచి పక్కా ప్లాన్ ప్రకారం పన్ను వసూలు చేయడం ద్వారా టార్గెట్ రీచ్ అయ్యామంటున్నాయి బ‌ల్దియా వ‌ర్గాలు.

టౌన్ ప్లానింగ్ ద్వారా ఈ ఏడాది రూ. 735కోట్లు....

బ‌ల్దియా ఖ‌జానాకు చేరాల్సిన ప్రధాన ఆదాయం ప‌ర్మిష‌న్ ఫీజు. టౌన్ ప్లానింగ్ ద్వారా ఈ ఏడాది 735కోట్ల రూపాయల ఆదాయం వ‌చ్చింది. వీటిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్ ద్వారా 530కోట్లు ఆదాయం రాగా, ఎల్ ఆర్ ఎస్ ద్వారా 200కోట్లు వ‌చ్చింది. 2015-16లో కేవ‌లం 42,836 ట్రేడ్స్ మాత్రమే ఉండ‌గా ఈ ఏడాది క్షేత్రస్థాయిలో స‌ర్వే చేసిన అధికారులు 76,620 ట్రేడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో వసూళ్లు 28కోట్ల నుంచి 42కోట్లకు పెరిగింది.

ఎర్లీ బ‌ర్డ్ ప‌థ‌కం ద్వారా గతేడాది రూ.177కోట్లు....

ఇక ఏప్రిల్ నెల‌లో ప్రక‌టించిన ఎర్లీ బ‌ర్డ్ ప‌థ‌కంలో గ‌డిచిన ఏడాది 177కోట్లు రాగా ఈ ఏడాది 212కోట్లు వ‌చ్చింది. మే,జూన్ మాసాల్లో పెట్టిన ల‌క్కి డ్రా స్కిమ్ ద్వారా కూడా బ‌ల్దియా ఖ‌జానాకు భారీగా ఆస్తిప‌న్ను జ‌మ అయ్యింది. ఇక పెద్ద నోట్ల ర‌ద్దును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలోనూ స‌క్సెస్ అయ్యింది. టైమ్ టు టైమ్ మానిట‌రింగ్ చేయడం ద్వారా టార్గెట్ రీచ్ అయ్యామని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థన్ రెడ్డి తెలిపారు. మొత్తమ్మీద ముందస్తు ప్లాన్‌తో ఈ ఏడాది టార్గెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు అందుకున్నారు.

06:45 - April 1, 2017

హైదరాబాద్: కొత్త డిసిసిల నియామకంపై కాంగ్రెస్ ఆచి తూచి అడుగులేస్తుంది. ఇప్పటికిప్పుడు డిసిసిలను ప్రకటించి కొత్త సమస్యలు తెచ్చుకునే కన్నా.. ఇంకాస్త వేచి చూడాల‌న్న ధోరణితో ఉంది. డిలిమిటేష‌న్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ ప్రకటన వెలువడిన తర్వాతే కొత్త డిసిసిలను నియమించాలని భావిస్తోంది.

కొత్త డిసిసిల‌ ఎంపికపై కాంగ్రెస్ ఫోక‌స్....

టిఆర్ఎస్ సర్కార్‌ తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం.. కాంగ్రెస్‌కు స‌వాళ్లను విసురుతోంది. జిల్లా సార‌థుల‌ను ఎంపిక చేయ‌డంపై త‌ర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే డిసిసిల‌ నియామకంపై క‌స‌ర‌త్తు చేసిన పీసీసీ.. ప్రకటించడంపై ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడే డిసిసిలను ప్రకటిస్తే లాభమా...? నష్టమా అన్న విషయంపై లెక్కలేస్తుంది.

గాంధీభ‌వ‌న్‌లో డిసిసిల‌తో ఉత్తమ్‌ భేటీ...

కొత్త జిల్లాలో ఆరునెల‌లుగా పాల‌న కొన‌సాగుతుండ‌టంతో డిసిసిలను నియామకంపై పార్టీలోని క్యాడ‌ర్ నుంచి పిసిసిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిసిసిల‌తో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. కొత్త జిల్లా సార‌థుల ఎంపిక‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. డిసిసిల ఎంపికపై క‌స‌ర‌త్తు దాదాపు పూర్తిచేసినా..ఒక‌టి రెండు జిల్లాలో ఏకాభిప్రాయం రావాల్సిఉంది. కొత్త డిసిసిల ప్రకటన ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నేత‌లు చర్చించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే.. ఏ నేత ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తారో.. ఏ జిల్లా ఫ‌రిదిలో ఉంటారో స్పష్టత వస్తుందని పీసీసీ అంచనా వేస్తుంది. దీంతో కొత్త సారథుల‌ ఎంపిక‌కు మార్గం సుగ‌మం అవుతుందన్నది పీసీసీ యోచ‌న‌. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ప్రకటన వచ్చే వ‌ర‌కు వేచి చూడాలని పీసీసీ నిర్ణయించింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎద‌రుచూస్తున్న డిసిసిల నియామకానికి.. నియోజ‌క‌వ‌ర్గాల పునర్‌విభ‌జ‌న అంశం బ్రేకులు వేస్తుంది.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

అమరావతి: ఆద్యంతం వాడీవేడిగా జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యాయి. శుక్రవారం నిరవధిక వాయిదా పడింది. మార్చి 10న గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2017-18 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం 14 రోజుల పాటు సభ జరిగింది.

06:35 - April 1, 2017

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌ ఎన్నికయ్యారు. జనవరి 17న ఎన్నికలు జరగగా.. కొంతమందిని కోర్టును ఆశ్రయించడంతో ఫలితాలు ప్రకటించలేదు. తాజాగా ఫలితాలను ప్రకటించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించడంతో... శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. వివేక్‌.. ప్రత్యర్థి విద్యుత్‌ జయసింహపై 68 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వివేక్‌కు 136 ఓట్లు రాగా... జయసింహకు 63 ఓట్లు వచ్చాయి. ఇక అన్ని స్థానాల్లోనూ వివేక్‌ ప్యానెల్‌ గెలుపొందింది. హెచ్‌సీఏకు పూర్వ వైభవం తీసుకువస్తానని ఈ సందర్భంగా వివేక్‌ ప్రకటించారు.

హెచ్‌సీఏ ఎన్నికల్లో వివేక్‌ గెలుపు

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌ ఎన్నికయ్యారు. జనవరి 17న ఎన్నికలు జరగగా.. కొంతమందిని కోర్టును ఆశ్రయించడంతో ఫలితాలు ప్రకటించలేదు. తాజాగా ఫలితాలను ప్రకటించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించడంతో... శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. వివేక్‌.. ప్రత్యర్థి విద్యుత్‌ జయసింహపై 68 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వివేక్‌కు 136 ఓట్లు రాగా... జయసింహకు 63 ఓట్లు వచ్చాయి. ఇక అన్ని స్థానాల్లోనూ వివేక్‌ ప్యానెల్‌ గెలుపొందింది. హెచ్‌సీఏకు పూర్వ వైభవం తీసుకువస్తానని ఈ సందర్భంగా వివేక్‌ ప్రకటించారు.

06:33 - April 1, 2017

హైదరాబాద్: పెట్రో ధరలు భారీగా తగ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై 3 రూపాయల 77 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల 91 పైసలు తగ్గింది. గడిచిన రెండున్నర నెలల్లో పెట్రోల్‌ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రిటైల్‌ బంకుల్లో రేటు మరింత తగ్గనుంది.

తగ్గిన పెట్రోలు, డీజిలు ధరలు

హైదరాబాద్: పెట్రోలు, డీజిలు ధరలు తగ్గాయి. పెట్రోలు లీటరుకు రూ.3.77, డీజిలు లీటరుకు రూ.2.91 చొప్పున తగ్గిస్తూ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరణ శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది.

Don't Miss