Activities calendar

02 April 2017

21:51 - April 2, 2017

ఢిల్లీ : తెలుగు తేజం పీవీ.సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  గెలుచుకుంది. ఫైనల్స్‌తో స్పెయిల్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 21-19, 21-16తో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి కరోలినాపై సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో సింధు కెరీర్‌లో రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ దక్కించుకుంది. 

 

21:48 - April 2, 2017

హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్‌ను టీఎస్ పీఎస్సీకి అప్పగించామని ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో బడిబాట, స్కూల్ యూనిఫామ్స్, టాయిలెట్స్, ఇతర వసతులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపై జిల్లా విద్యాధికారులతో కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచడానికి తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ నెల 15 వరకు పుస్తకాల పంపిణి పూర్తి చేసి జూన్ 15 లోగా అన్ని స్కూళ్లకు యూనిఫామ్స్ సరఫరా చేయాలని అధికారులకు అదేశాలిచ్చారు.

 

21:45 - April 2, 2017

తిరుపతి : మంత్రివర్గ పునర్వస్థీకరణలో ముస్లిం మైనారిటీలు, గిరిజనులకు స్థానం కల్పించకపోవడాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబునాయుడు ఈ వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ అజెండాను అమలు చేస్తున్న చంద్రబాబునాయుడు మూడేళ్లుగా ఈ వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా దూరంగా ఉంచుతున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. 
 

21:41 - April 2, 2017

విశాఖ : పార్టీ ఫిరాయింపులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం అప్రజాస్వామికమన్నారు. రాజ్యాంగం పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించిన తర్వాత మంత్రి పదవులు ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. 

 

సీఎం గన్ మెన్ నంటూ వ్యక్తి హల్ చల్

హైదరాబాద్ : సీఎం గన్ మెన్ నంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. బోడుప్పల్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో కూల్ బీర్లు ఇవ్వలేదని సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సీఎం గన్ మెన్ నే పట్టించుకోరా అంటూ అంతు చూస్తానని సిబ్బందిని బెదిరించాడు. 

 

శాఖల కేటాయింపుపై ఉత్కంఠ

గుంటూరు : శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి శాఖలు కేటాయించాలనుకున్నా... అసంతృప్తుల కారణంగా రేపు ప్రకటించే అవకాశం ఉంది. 

 

ఎమ్మెల్యే పదవికి చింతమనేని రాజీనామా

అమరావతి : సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భేటీ ముగిసింది. అనంతరం చింతమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.  

 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

జమ్మూకాశ్మీర్ : నౌహటాలో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

20:46 - April 2, 2017

హీరోయిన్ రిచాపనయ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రిచా పనయ్ తన సినీ కెరీర్ విషయాలను తెలిపారు. తన సిని అనుభవాలను వివరించారు. పలు ఆసక్తికరమైన సంగతులు చెప్పారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

20:43 - April 2, 2017

యాదవ కులస్తులకు 20 లక్షల గొర్రెలు పంపిణీ : మంత్రి తలసాని

మెదక్ : నర్సాపూర్ లో యాదవ కులస్తుల బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదవ కులస్తులకు 20 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనినివాస్ అన్నారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయన్నారు. ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. 

 

70 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ : మంత్రి హరీష్ రావు

మెదక్ : నర్సాపూర్ లో యాదవ కులస్తుల బహిరంగ సభ నిర్వహించారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. గొల్ల, కుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు 70 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. పశువుల వైద్యానికి మొబైల్ అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

20:31 - April 2, 2017

కొలంబియా : నగరంలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటి వరకు 254 మంది మృత్యువాతపడ్డారు. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 400 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. పుటుమాయో ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగి భవనాలపై పడ్డాయి. వీటితో పాటు... భారీగా బురద పేరుకుపోవడంతో.. మృతుల సంఖ్య పెరిగింది. వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. మూడున్నర లక్షల మంది జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు. 

 

20:28 - April 2, 2017

దుబాయ్ : ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్‌ ఖలీఫా ఆవరణలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖలీఫా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో ఉదయం 6.30 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సహాయక సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో మంటలు అదుపుచేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దట్టంగా పొగలు వ్యాపిస్తుండడంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. మంటలు వ్యాపించిన భవనం దుబాయ్‌కి చెందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజ సంస్థ ఎమ్మార్‌కి చెందినదిగా గుర్తించారు. 

 

20:26 - April 2, 2017

జమ్మూకాశ్మీర్ : ఆసియా ఖండంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని జమ్ముకశ్మీర్‌లో ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. రహదారిని కాసేపు పరిశీలించిన ప్రధాని.. తరువాత జీపులో ప్రయాణించారు. 9.2 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని ఎన్ హెచ్ 44పై నిర్మించారు. 3వేల 720 కోట్ల రూపాయల ఖర్చుతో ఐదున్నరేళ్ల ఏళ్లలో దీని నిర్మాణం పూర్తైంది. దీంతో జమ్మూశ్రీనగర్‌ మధ్య 30కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు... రెండు గంటల ప్రయాణ సమయం ఆదాకానుంది. ఇందువల్ల రోజుకు 27లక్షల రూపాయల ఇందనం పొదుపు అవుతుందని అధికారులు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో సురక్షిత ప్రయాణానికి అనువుగా రెండు రహదారులతో దీనిని నిర్మించారు. వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్, ఎయిర్ కండిషన్, సిసి కెమేరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. ఈ రహదారితో జమ్మూకశ్మీర్‌కు యాత్రికుల సంఖ్య పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

20:23 - April 2, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు కొత్త సమస్యకు దారి తీసింది. మంత్రివర్గంలో చోటు రాలేందంటూ చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఇబ్బంది పడుతున్న అధిష్టానానికి మరో సమస్య వచ్చి పడింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 11మంది మంత్రుల్లో ఆరుగురికి తాత్కాలిక సచివాలయంలో చాంబర్లే లేకపోవడంతో ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియని పరిస్థితి నెలకొంది. 
టీడీపీ అధిష్టానానికి కొత్త సమస్యలు 
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ టీడీపీ అధిష్టానానికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఓ వైపు అసంతృప్తుల సెగ.. మరోవైపు కొత్త మంత్రులకు సచివాలయంలో చాంబర్లు లేని పరిస్థితి. మొన్నటి వరకు 20 మంది మంత్రులతో ఉన్న మంత్రివర్గం.. ఇప్పుడు 26 కు చేరింది. అయితే సచివాలయంలో కేవలం 19 మంది మంత్రులకే చాంబర్లు ఉన్నాయి. దీంతో కొత్తగా మరో ఆరు చాంబర్లు సిద్ధం చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. 
మొదటి బ్లాక్ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేటాయింపు
వాస్తవంగా సచివాలయంలో ఉన్న 5 బ్లాక్ ల్లో మొదటి బ్లాక్ పూర్తిగా ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేటాయించారు. దీంతో మొదటి బ్లాక్ లో కొత్తగా వచ్చే మంత్రులకు చాంబర్లు నిర్మించే అవకాశం లేదు. 2వ బ్లాక్ లో  మంత్రులు యనమల, చినరాజప్ప,నారాయణ, మాణిక్యాలరావు.. 3వ బ్లాక్ లో కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, పీతల సుజాత.. 4వ బ్లాక్ లో దేవినేని ఉమ, పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘనాథ్‌రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, అచ్చెన్నాయుడు చాంబర్లు ఉన్నాయి. ఇక 5వ బ్లాక్ లో కామినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, శిద్దా రాఘవరావు,  పరిటాల సునీత చాంబర్లు ఉన్నాయి. 
ఆరుగురికి చాంబర్ల కొరత
వీరిలో పల్లె, రావెల, పీతల సుజాత, మృణాళిని, బొజ్జల చాబర్లను కొత్తగా ఎంపికైన ఐదుగురు మంత్రులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఆరుగురి కోసం ప్రత్యేకంగా చాంబర్లు సిద్ధం చేయాల్సి ఉంది. దీనికితోడు సచివాలయంలో ఉన్న చాంబర్లు చిన్నవిగా ఉన్నాయని ఎప్పటి నుంచో మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు సచివాలయంలో ప్రస్తుతం ఎక్కడ కూడా  గదులు ఖాళీగా లేని పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆరుగురు మంత్రుల చాంబర్లు ఎలా సర్దుబాటు చేయాలని సీఆర్డీఏ అధికారుల తలలు పట్టుకుంటున్నారు. 
నారా లోకేష్‌కు 2వ బ్లాక్‌లో చాంబర్ సిద్ధం 
ఇప్పటికే నారా లోకేష్‌కు రెండో బ్లాక్‌లో చాంబర్ సిద్దమైంది. రెండో బ్లాక్ ముఖ్యమంత్రి బ్లాక్ ను ఆనుకుని ఉండడం, హోం, ఫైనాన్స్, రెవెన్యూ, మున్సిపల్ వంటి కీలక శాఖలు కూడా 2వ బ్లాక్ లోనే ఉండడంతో లోకేష్ చాంబర్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు.  సచివాలయం నిర్మించే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. హడావిడిగా మంత్రుల చాంబర్లు నిర్మించడంతో ఇప్పుడు సమస్య తలెత్తింది. మొత్తానికి కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన మంత్రుల్లో కనీసం ఆరుగురు మంత్రులకు సొంత చాంబర్‌ కావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. 

 

20:16 - April 2, 2017

గుంటూరు : మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆత్మీయులు, అయినవాళ్లు  రాకుండానే, చాలామంది, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. కార్యక్రమాన్ని అస్తవ్యస్తంగా నిర్వహించిన అధికారులపై కొత్త, పాత సచివులు మండిపడుతున్నారు. 
ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం 
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. వారి కుటుంబ సభ్యులు కూడా.. ప్రాంగణంలోకి ప్రవేశించలేని దయనీయ స్థితిని కల్పించారు. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి, ఆయన కుమార్తెలు, అల్లుడు వేదిక వద్దకు చేరుకోలేక పోయారు. విఐపీ గ్యాలరీ పూర్తిగా నిండిపోవడంతో, వారితోపాటు, చాలామంది కొత్త మంత్రుల బంధువులు, అనుచరులు ప్రాంగణం బయటే ఉండిపోయారు. 
ప్రాంగణం బయట  తీవ్ర గందరగోళం 
మరోవైపు, ప్రాంగణం బయట కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కొత్త మంత్రుల అనుచరులు, కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. టీడీపీ శ్రేణులు ఎంతమంది వస్తారో అంచనా వేయకుండా.. పోలీసు బందోబస్తును బాగా తక్కువగా ఏర్పాటు చేశారు. ఫలితంగా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఒకానొక సమయంలో.. కార్యకర్తలు బ్యారికేడ్లను తోసుకుని ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 
ఐదువేల మంది మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు 
నిజానికి, ఆదివారం నాటి కేబినెట్‌ పునర్వ్యస్థీకరణ కార్యక్రమానికి, ఏర్పాట్లు చేయాలంటూ.. సాధారణ పరిపాలన శాఖకు శుక్రవారం మధ్యాహ్నమే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారులు.. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సుమారు ఐదువేల మంది మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఒత్తిళ్లకు తలొగ్గి, అంతకుమించిన సంఖ్యలో పాసులను జారీ చేసిన ఫలితంగానే ప్రాంగణం బయట గందరగోళం నెలకొందని పరిశీలకులు భావిస్తున్నారు. 

 

20:10 - April 2, 2017

గుంటూరు : కొందరికి ఫలించిన స్వప్నం.. మరికొందరిని ఆవరించిన నైరాశ్యం..  ఇంకొందరికేమో అనూహ్య అవకాశం.. స్థూలంగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ తీరిది. అనంతపురం జిల్లాకు చెందిన చీఫ్ విప్ మంత్రి కాగా.. అదే జిల్లాకు చెందిన మంత్రి చీఫ్ విప్ అయ్యారు. అతిచిన్న వయసులోనే అఖిలప్రియ.. పుట్టినరోజు కానుకను అందుకున్నారు. మొత్తానికి, వేటు పడిన వారిలో ఆక్రోశం.. చోటు దక్కించుకున్నవారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇంతకీ కొత్త మంత్రుల ఎంపికకు, పాత మంత్రుల ఉద్వాసనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి..? ఏ సమీకరణాల ప్రాతిపదికన చంద్రబాబు కొత్త కేబినెట్‌ రూపుదిద్దుకుంది..? వాచ్‌దిస్‌ స్టోరీ.  
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
కొత్త, పాత కలయికలు..సామాజిక సమీకరణాల సమతుల్యతలు పాటిస్తూ సీఎం చంద్రబాబు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు కళావెంకట్రావ్, సుజయ్ కృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, జవహర్, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 
మంత్రివర్గ విస్తరణకు ముందు.. చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చలు     
మంత్రివర్గ విస్తరణకు ముందు.. చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చలే నడిచాయి. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోని సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే, చంద్రబాబు కొత్తవారిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లాలో మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి రావెలను తప్పించి, పశ్చిమగోదావరి జిల్లాలో మాదిగ సామాజికవర్గానికే చెందిన జవహర్‌కు పదవిని కట్టబెట్టారు. పశ్చిమ గోదావరిలో మాల సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతను తప్పించి, గుంటూరు జిల్లాలో అదే సామాజిక వర్గానికి  చెందిన నక్కా ఆనంద్ బాబును ఎంపిక చేశారు. 
పలువురికి ఉద్వాసన 
మంత్రివర్గం నుంచి పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మృణాళినిలు ఉద్వాసనకు గురయ్యారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అరోగ్య సమస్యల కారణంగా ఆయన్ని తొలగించారని చెబుతున్నారు. అయితే, జిల్లాలో ఆయన తనయుడి మితిమీరిన ప్రవర్తన కూడా బొజ్జల పదవికి ఎసరుతెచ్చిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకే చెందిన బొజ్జల.. జిల్లా సమస్యలపై సరిగా స్పందించడం లేదన్న పార్టీ శ్రేణుల ఫిర్యాదూ.. ఆయన ఉద్వాసనకు కారణమైందని విశ్లేషకులు అంటున్నారు. ఇక, మరో మంత్రి రావెల కిశోర్ బాబు.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం, ఆయన కుమారుడి వ్యవహారశైలి ఆయన పదవికి ఎసరు తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. పైగా ఆయనకు నియోజకవర్గ నేతలతో సమన్వయం కొరవడ్డం, ప్రజలకు అందుబాటులో ఉండరన్న అభియోగం కూడా ఆయన ఉద్వాసనకు కారణమైందంటున్నారు. 
కుటుంబ సర్దుబాటులో భాగంగా మృణాళినికి ఉద్వాసన 
ఇక మంత్రి మృణాళిని విషయానికొస్తే కేవలం కుటుంబ సర్దుబాటులో భాగంగానే ఆమెను తప్పించారు. కళా వెంకట్రావ్‌కు మృణాళిని సమీప బంధువు కావటంతో..ఆమె స్థానంలో కళావెంకటరావుకు చోటు కల్పించారు. అటు, పీతల సుజాత పదవికి జిల్లా రాజకీయాలే ముప్పు తెచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక నేతలతో సమన్వయ లోపం.. అధికారులతో సమర్థవంతంగా పనిచేయించలేకపోవటం.. మొదలైనవి ఆమె ఉద్వాసనకు కారణాలుగా భావిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డిని శాఖపరమైన అసమర్థత కారణంగానే తొలగించారని ప్రచారం జరుగుతోంది. ఐటీ వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు వేగాన్ని, ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పల్లె అందుకోలేకపోయారని, సమాచార శాఖ మంత్రి హోదాలో మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప శాఖాపర ప్రాధాన్యతలు ఇవ్వలేదని ఆయనపై ప్రధాన అభియోగం. అయితే సుదీర్ఘకాలంగా, పార్టీకి పల్లె చేసిన కృషిని, గతంలో చంద్రబాబు నేతృత్వంలోనే విప్‌గా కూడా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని,  ఆయనకు చీఫ్ విప్ పదవి కట్టబెట్టారని సమాచారం.   
ఐదుగురికీ ఉద్వాసన 
మొత్తానికి, ముందుగా ప్రచారం జరిగిన ప్రకారమే, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ ఐదుగురికీ ఉద్వాసన పలికారు. అయితే, ఉద్వాసన జాబితాలో ఉన్నారంటూ ప్రచారం జరిగిన వారిలో... కొందరికి పదవీ గండం ప్రస్తుతానికైతే దూరమైంది. దీంతో ఆయా మంత్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

 

ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ విజేత పీవీ సింధు

హైదరాబాద్ : ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో పీవీ సింధు విజయం సాధించారు. ఫైనల్ లో మారిన్ పై 21..19..21..16 తేడాతో సింధు గెలుపొందింది. సింధు...తన కెరీర్ లో రెండో సూపర్ సిరీస్ టైటిల్ సాధించింది. 

 

19:55 - April 2, 2017
19:53 - April 2, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు భవనానికి శంకుస్థాపన చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ నరసింగరావు తదితరులు హాజరయ్యారు. నేటితరానికి అలనాటి చరిత్రను అందించేందుకు ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు నేతలు తెలిపారు. 

 

19:51 - April 2, 2017

తూర్పుగోదావరి : ఆయేషామీరా హత్యకేసులో ఎనిమిదిన్నరేళ్లు జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా తేలిన సత్యంబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ కేసులో న్యాయమే గెలిచిందన్నారు. 8 ఏళ్లుగా జైలులో ఉండడంతో నా కుటుంబం చాలా దీనావస్థలో ఉంది. నేను లేకపోతే నా తల్లి..చెల్లి ఏమైపోతారో నాకు తెలుసునని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. నేను జైలుకు వచ్చినప్పటి నుంచి నా తల్లి కష్టపడి చెల్లెల్ని పెంచింది. నా తల్లిరుణాన్ని మర్చిపోలేను. ఇప్పుడు బయటకు వచ్చిన నేను ఏంచేయాలో అర్థం కావడంలేదన్నారు. తన లాగే ఎంతో మంది అన్యాయంగా జైల్లో మగ్గుతున్నారు.. వారందరిపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలన్నారు. 8ఏళ్లుగా జైలులో అన్న  సత్యంబాబు..అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు. అందరి సహకారంతోనే తాను కేసులో నిర్దోషిగా బయటకు వచ్చానన్నారు. 

 

19:49 - April 2, 2017

గుంటూరు : అనుకున్నట్లుగానే నారా లోకేశ్‌ ఏపీ మంత్రివర్గంలో చేరారు. ఆయన ఇటీవలే ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద హాజరయ్యారు. లోకేశ్‌తో పాటే, ఆయన తనయుడు దేవాన్ష్‌ ఈ కార్యక్రమంలోప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  
లోకేశ్‌కు ఘన స్వాగతం 
శాసనమండలిలో అతి పిన్నవయస్కుడుగా ఉన్న నారా లోకేశ్‌.. ఏపీ మంత్రివర్గంలో చేశారు. అమరావతిలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి  వచ్చిన లోకేశ్‌కు పలువురు నేతలు ఘనంగా స్వాగతం పలికారు. లోకేశ్‌ కూడా పార్టీ ప్రముఖులందరితోనూ కరచాలనం చేస్తూ విఐపీ లాంజ్‌లో ఉత్సాహంగా కలియదిరిగారు. లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు... ఆహ్వానితులు పోటీ పడ్డారు. కొందరు నేతలు లోకేశ్‌ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలియజేశారు. 
నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరు 
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి.. ముఖ్యంగా నారా లోకేశ్‌ పదవీ స్వీకార ప్రమాణానికి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విజయవాడ నుంచి రెండు కుటుంబాలు ప్రత్యేక బస్సులో అమరావతి చేరుకున్నాయి.  లోకేశ్‌ సతీమణి  బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్‌తో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. దేవాన్ష్‌ తల్లితో కలిసి నడిచివస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఎమ్మెల్యే బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌, నందమూరి హరికృష్ణ, రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి ఒడిలో కూర్చుకున్న దేవాన్ష్‌ను పలువురు ముద్దు చేశారు. 
కార్యకర్తల సంక్షేమ కమిటీ 
నారా లోకేశ్‌ చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీలో పార్టీ కార్యకర్తల సంక్షేమ కమిటీ సమన్వయకర్తగా పనిచేసిన లోకేశ్‌... ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతనెలలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మార్చి 30న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన లోకేశ్‌... ఇప్పుడు మంత్రి అయ్యారు.  మొదట కళావెంకట్రావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఆ తర్వాత లోకేశ్‌ ప్రమాణం చేశారు. వేదికపైకి వచ్చిన లోకేశ్‌ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. 
చంద్రబాబు, గవర్నర్ కు లోకేష్ పాధాబివందనం 
ప్రమాణస్వీకారం తర్వాత ముందుగా గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు వచ్చిన లోకేశ్‌.... గవర్నర్‌తో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా.. గవర్నర్‌ నరసింహన్‌.. లోకేశ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. తండ్రి బాటలో సాగాలని లోకేశ్‌కు సూచన చేసినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు వద్దకు వెళ్లి, కరచాలనం చేయడంతోపాటు, పాదాభివందనం చేసి, తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చంద్రబాబు సూచనమేరకు గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు వచ్చిన లోకేశ్‌... పాదాభివనం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత మంత్రులందరితో కలిసి గ్రూపు ఫోటో దిగారు. అనంతరం అల్పాహారం స్వీకరిస్తున్నప్పుడు చంద్రబాబునాయుడు తన మనవడిని ఒళ్లో కూర్చోపెట్టుకుని ముద్దు చేశారు. 

 

19:44 - April 2, 2017

గుంటూరు : అధిష్టానం తనకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై తన నియోజకవర్గంలోని పార్టీ నాయకత్వం చంద్రబాబును కలుస్తారని ధూళిపాళ్ల తెలిపారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబే చెప్పాలన్నారు. క్యాడర్ తొండరపడి రాజీనామా చేయవద్దని సూచించారు. 

 

19:39 - April 2, 2017

గుంటూరు : ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. మంత్రి పదవి కష్టపడి పనిచేసినందుకు ఇచ్చిన బాధ్యత అని స్పష్టం చేశారు. తనపై అసంతృప్తిగా ఉన్న రామసుబ్బారెడ్డిని కలుపుకొని పోతామని చెప్పారు. 

 

19:22 - April 2, 2017
19:17 - April 2, 2017

గుంటూరు : టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవచేస్తునా.. టీడీపీలో నేను సీనియర్ నాయకుడినని బుచ్చయ్య తెలిపారు. ప్రజాధరణ లేని నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడం విడ్డూరమన్నారు. 

 

18:53 - April 2, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో దళిత సంఘాలు ఆందోళనలు ఉధృతం చేశాయి. ఎమ్మెల్యే పుట్ట మధు ఫ్లెక్సీలను కాల్చివేస్తూ తమ నిరసన తెలిపారు. మంథని మధుకర్ మృతికి నిరసనగా దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటి నుంచి మధుకర్ సమాధి వరకు భారీ ర్యాలీ జరిగింది. మధుకర్ మృతిపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అలాగే మృతికి సహకరించిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

18:51 - April 2, 2017
18:41 - April 2, 2017

నిజామాబాద్ : లారీ యజమానులు చేస్తున్న సమ్మె నేడు నాలుగో రోజుకు చేరింది. సరుకు రవాణా లారీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు వ్యతిరేకంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లారీ యజమానులు ఆందోళనబాట పట్టారు. లారీలను ఎక్కడికక్కడే నిలిపివేసి మార్చి 30 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. పెంచిన చలాన్లు, టోల్‌గేట్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లారీ యజమానుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు ప్రారంభించలేదు. సమ్మె వల్ల నిత్యవసర వస్తువుల ధరులు పెరిగే అవకాశం ఉంది.

 

మహదేవ్ పూర్ జింకలవేట కేసులో ఎవరినీ వదలం : ఈటెల

కరీంనగర్ : మహదేవ్ పూర్ జింకల వేట కేసులో ఎవరినీ వదలమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంథనిలో మధుకర్ అనే యువకుడి మృతి ఘటనలో రీపోస్టుమార్టం జరిపి సమగ్రంగా విచారించాలని ఆదేశించామని చెప్పారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య ఉందన్నారు. 

18:33 - April 2, 2017

నల్లగొండ : జిల్లాలో కంది కొనుగోలులో అవినీతి తారాస్థాయికి చేరింది. అధికారులు, దళారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. నకిలీ రైతుల పేరుతో దళారులు కందుల విక్రయానికి పాల్పడుతున్నారు. తాజాగా కొనుగోలు చేసిన కందులలో భారీగా ఇసుక నింపి గోడౌన్లకు తరలిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు.    
అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు 
నల్లగొండ జిల్లాలో మార్కెటింగ్ శాఖలో అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, నగదు చెల్లింపుల విషయంలో ప్రతిసారి విమర్శలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ ఏడాది కందుల విక్రయాలలో అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల దగ్గరి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. మద్దతు ధరకు మార్కెట్ లో దళారులు అమ్ముకుంటున్నారు. ఇందులో దళారులతో పాటు మార్కెట్ అధికారులకు భాగం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 
నకిలీ రైతుల పేరుతో తప్పుడు దృవపత్రాలు                             
ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి తక్కువ ధరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన కందులను అధికారుల మద్దతుతో విక్రయించి లక్షల్లో పోగేసుకున్న తీరు సాక్షాత్తూ విజిలెన్స్ తనిఖీల్లోనే బట్టబయలైంది. మరోవైపు నకిలీ రైతుల పేరుతో తప్పుడు దృవపత్రాలు సృష్టించి రైతులను దోచుకుంటున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
భారీ స్కామ్                 
తాజాగా నిడమానూర్ మార్కెట్ కేంద్రంగా భారీ స్కామ్ వెలుగుచూసింది. కందుల బస్తాల్లో ఇసుకను నింపి దర్జాగా ప్రభుత్వ గోడౌన్ కు లారీ లోడ్ ను పంపారు.  కంది బస్తాల్లో ఇసుక వెలుగు చూడడంతో స్టేట్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ సంస్థ సిబ్బంది లోడును మళ్లీ మార్కెట్‌కు పంపించారు. తమ సరుకును కొనుగోలు చేయడానికి నానా సాకులు చూపుతున్నారని.. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని.. అలాంటప్పుడు సగానికి సగం ఇసుక ఉన్న కందులను ఎలా కొనుగోలు చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నిడమనూరు కేంద్రంలో అక్రమాలు                 
రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన హాలియా పట్టణానికి చెందిన నలుగురు వ్యాపారులు నిడమనూరు కేంద్రంలో అక్రమాలకు సూత్రధారులుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ హాకా కేంద్రం ఏర్పాటు ఆరంభం నుంచి పథకం ప్రకారం... ఇతర ప్రాంతాల నుంచి కందులను పెద్ద ఎత్తున లారీల్లో తరలించారు. అధికారుల మద్దతుతో మోసానికి పాల్పడినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కందుల కొనుగోలులో అవినీతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

 

18:32 - April 2, 2017

హైదరాబాద్ : మిర్చి పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిర్చికి క్వింటాల్‌కు 12వేలు కనీస మద్దతు చెల్లించాలని కోదండరామ్‌ డిమాండ్ చేశారు. ధర్నాచౌక్‌ ఎత్తివేయడాన్ని ఆయన నిరసించారు. తిరిగి అక్కడే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై గవర్నర్‌ దగ్గరకు కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 

18:29 - April 2, 2017

హైదరాబాద్ : మున్సిపల్ ఇంజినీర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. 1977 నుంచి మున్సిపల్ ఇంజనీర్ల సర్వీసులు మార్పుచేయలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మున్సిపల్ ఇంజనీర్ల కార్యాలయంలో ఇంజనీర్ల సంఘం సమావేశమైంది. పబ్లిక్ ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్లపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

 

18:26 - April 2, 2017

ఖమ్మం : కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. రైతులు తొందరపడి మిర్చిని అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

 

18:23 - April 2, 2017

వరంగల్ : మూడు తరాల ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం... ఉద్యమ నాయకుల, విప్లవకారుల ఆవాసం... కరుడుగట్టిన నేరగాళ్లకు సైతం బతుకుబాటను చూపిన నేస్తం..అదే వరంగల్‌ కేంద్ర కారాగారం.  ఇప్పుడు ఇది ఓ జ్ఞాపకంగా మారనుంది. సర్కార్ అడుగులతో ఇది భవిష్యత్ తరాలకు చరిత్రగా మాత్రమే  మిగలబోతుంది.
చరిత్రకు సజీవ సాక్ష్యం వరంగల్‌ కేంద్ర కారాగారం
వరంగల్‌  సెంట్రల్‌  జైల్.. తరతరాల చరిత్రకు సజీవ సాక్ష్యం. స్వాతంత్ర పోరు మొదలు.. తెలంగాణ సాయుధ పోరాటం, మావోయిస్టు పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న ఎందరో పెద్ద నాయకులు శిక్షాకాలం అనుభవించిన ఆవాసం. ఇక్కడ శిక్ష అనుభవించిన ఎందరో మహానుభావుల జైలు జీవితం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. మరెందరో  కరుడుగట్టిన  నేరగాళ్లను  మనుషులుగా మార్చింది. కారాగారంగానే కాకుండా... కర్మాగారంగా కూడా మారి.. పలువురు నేరస్థుల బతుకుల్లో వెలుగులు నింపింది. కూరగాయల పంట దగ్గర నుంచి.. వస్త్రాల తయారీ వరకూ జైల్లో రకరకాల వృత్తులను శిక్షపడ్డవారికి నేర్పుతూ.. వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచింది. తద్వారా, నేరస్థుల శిక్షానంతర జీవితాల్లో వెలుగులు నింపింది. అంతటి ప్రత్యేకత కలిగిన ఈ జైలుకు స్థానచలనం తప్పడం లేదు. నగరం నడిబొడ్డు నుంచి శివారు ప్రాంతాలకు తరలిబోతుంది.
జైలు తరలింపునకు పదేళ్ల క్రితమే ప్రతిపాదనలు
ఈ జైలును తరలించాలని పదేళ్ల క్రితం అప్పుటి హన్మకొండ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్.. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద ప్రతిపాదించారు. జైలు ప్రాంగణంలో ప్రాంతీయ గుండె జబ్బుల కేంద్రాన్ని నెలకొల్పాలని డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఆ ప్రతిపాదన బుట్టదాఖలైంది. తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు, సెంట్రల్ జైలును వేరే ప్రాంతానికి తరలించి, దీన్ని వైద్యశాలగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. 
సెంట్రల్‌ జైలు స్థలంలో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ 
పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వరంగల్‌ సెంట్రల్‌ జైలు తరలింపు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైలు, కాకతీయ మెడికల్ కళాశాల స్థలాన్ని పూర్తిస్థాయిలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసిన తర్వాతే కారాగారాన్ని తరలించాలని ఆయన జైళ్ల శాఖను ఆదేశించారు.  దీనికి సంబంధించి బడ్జెట్‌లో  కేటాయింపులు చేసి నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని సూచించారు. అలాగే ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడానికి కూడా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గుండె జబ్బులు, న్యూరో, క్యాన్సర్ మొదలైన సేవలు కూడా అందుబాటులో ఉండేలా దీనిని రూపొందించనున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా గాంధీ ఆస్పత్రిని  తీర్చిదిద్దేలా..  సీఎం కేసీఆర్‌ విధివిధానాలను ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. 
70 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉన్న జైలు
వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రస్తుతం 70 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో 35 ఎకరాలను  కాళోజీ హెల్త్‌ వర్సిటీకి  కేటాయించాలని నిర్ణయించారు. కాళోజీ వర్సిటికి సంబంధించిన పరిపాలన భవన నిర్మాణం, ఇతర సదుపాయాలకు ఈ స్థలాన్ని ఉపయోగిస్తారు. అలాగే ప్రస్తుతం రీజనల్‌ ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రి స్థాయిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వెయ్యి పడకల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించింది. 
2 వేల పడకల ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు
రెండు వేల పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆధునిక హంగులతో ట్విన్‌ టవర్స్‌గా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి గా మార్చనున్నారు. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్‌ సీకేఎం  ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. అనంతరం హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులు జనరల్‌ ఆస్పత్రులగా మారుతాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమవుతోంది. అలాగే వరంగల్ సెంట్రల్ జైలు తరలింపు  చరిత్రలో మరో నవ శకానికి తెరదీయబోతోంది. 

18:06 - April 2, 2017

గుంటూరు : ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందే ఉంటానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా గెలుస్తుందని ఆయన జ్యోతిష్యం చెప్పారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవికి గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజీనామా

హైదరాబాద్ : టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవికి గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజీనామా చేశారు. ఈమేరకు గోరంట్ల తన రాజీనామాను సీఎం చంద్రబాబుకు పంపారు.

17:53 - April 2, 2017

గుంటూరు : తనకు ఏ శాఖ కేటాయించిన తీసుకుంటానని దివంగత భూమా దంపతుల కూతురు అఖిలప్రియ అన్నారు. ఆమె టెన్ టీవీతో మాట్లాడుతూ తనకు ఏ శాఖ కేటాయించిన సమర్ధవంతంగా పని చేస్తానని తెలిపారు. సీనియర్ల సలహా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

17:30 - April 2, 2017
16:55 - April 2, 2017

విశాఖపట్నం : పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు తప్పు బట్టారు. విశాఖలో అల్లూరి విజ్ఞానకేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేశ్ కు మంత్రి పదవి కోసం మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణ చేశారని ఆరోపించారు. అవినీతిలో టీడీపీ అగ్రగామీగా ఉందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల తీరు బాగాలేదని అన్నారు. ప్రజా సమస్యలు చర్చించడంలో పాలక, ప్రతిపక్షాలు విఫలం చెందాయని విమర్శించారు. పట్టీసీమలో అవినీతి జరగలేదని మంత్రి చెబుతున్నారని... ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తిచేసినందుకు రూ.300 కోట్లు ప్రోత్సాహకంగా ఇచ్చారని మంత్రి చెప్పారు. కానీ ఆ డబ్బు కాంట్రాక్టర్ కు వెళ్లాయా లేక మంత్రికి వెళ్లాయో చెప్పాలని అన్నారు. 

16:53 - April 2, 2017

గుంటూరు : తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కినుక వహించారు. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధూళిపాళ్ల ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ధూళిపాళ్లకు మంత్రి ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సింబల్ ను చూసి ఓటు వేయ లేదని ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబాన్ని చూసి ఓటు వేసామని తెలిపారు. నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 

మంత్రి పదవి ఇవ్వనందుకు ధూళిపాళ్ల నరేంద్ర అలక

గుంటూరు : తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ధూళిపాళ్ల నరేంద్ర అలకబూనారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ధూళిపాళ్ల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. 

16:44 - April 2, 2017

గుంటూరు : తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ధూళిపాళ్ల నరేంద్ర అలకబూనారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ధూళిపాళ్ల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. 
అభిమానులు...
'ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి. ధూళిపాళ్ల ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004సం.లో జిల్లా వ్యాప్తంగా నరేంద్ర ఒకేఒక్క టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజీనామా చేస్తామని ఎంపిటిసి, జెడ్ పిటిసి లు అంటున్నారు. ధూళిపాళ్లకు కేబినెట్ లో స్తానం కల్పించాలి. 1983సం. నుంచి పార్టీలో ఆయన కుటుంబం పని చేస్తోంది. ధూళ్లిపాళ్ల వీరయ్యచౌదరి కుటుంబం పార్టీకి చాలా త్యాగాలు చేసింది. పార్టీ కోసం తపించారు.. కానీ పదవుల కోసం ఆశ పడలేదు. టీడీపీకి నీతి, నిజాయితీగా ఉన్నా కార్యకర్తలు పనికి రారు... పైరవీలు చేసే కార్యకర్తలు కావాలి. నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని' ఓ సీనియర్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:38 - April 2, 2017

గుంటూరు : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి ఎన్నికై టీడీపీలో చేరినవారు మంత్రి పదవులు పొందడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రాజ్యంగా విరుద్ధమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే అని అన్నారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి , గవర్నర్.. కర్త, కర్మ అయి రాజ్యాంగాన్ని ఉల్లఘించారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే రాజ్యాంగాన్ని ఉల్లఘించడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలే త్వరలో తీర్పిస్తారని తెలిపారు.

 

16:35 - April 2, 2017

గుంటూరు : తమకు మంత్రి పదవి రాలేదని అలకబూనిన అసంతృప్త నేతలను సీఎం చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. మంత్రి పదవి రాలేదని అలక వహించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమహేశ్వరావు సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం శాంతించారు. తమ నాయకుడు ఏది చెప్పినా శిరసావహిస్తామని బోండా అన్నారు. భవిష్యత్ లో తనకు ప్రధాన్యత ఉంటుందని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు. అటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కార్యకర్తలతోచర్చించారు. తను ఏ పార్టీలోకి వెళ్లనని.. అవసరం అయితే కొత్త పార్టీ స్థాపిస్తానని అన్నారు. పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో మాట్లాడానికి సీఎం చంద్రబాబు 3 సార్లు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. గుంటూరు విషయానికి వస్తే ఇక్కడ ఎంతో కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి రాకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. చింతళలపూడిలోని ధూళిపాళ్ల ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. రాజీనామా చేయాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. నరేంద్ర రాజీనామాకు మొగ్గు చూపుతునట్టు తెలుస్తోంది. నరేంద్రను బుజ్జగించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.

 

అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : మంత్రి పదవులు రాకపోవడంతో అసంతృప్తిగా నేతలను సీఎం చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబుతో భేటీ అయిన అనంతరం బొండా ఉమ మహేశ్వరరావు శాంతించారు. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలకబూనారు. అవసరమైతే కొత్తపార్టీ స్థాపిస్తానని చింతమనేని అన్నారు. సీఎం చంద్రబాబు.. బొజ్జలకు 3సార్లు ఫోన్ చేసి బుజ్జగించించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై ధూళిపాళ్ల నరేంద్ర కినుక వహించారు. ధూళిపాళ్ల ఇంటివద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ధూళిపాళ్లను మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు బుజ్జగిస్తున్నారు.

16:01 - April 2, 2017

గుంటూరు : చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తామని.. ఆయన మాటనే శాసనంగా పాటిస్తామని టీడీపీ ఎమ్మెల్యే  బోండా ఉమా మహేశ్వర్ రావు అన్నారు. తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ.. బాబుతో భేటీ అనంతరం శాంతించారు. మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు బాధపడ్డానని తెలిపారు. అయితే కొన్ని సమీకరణల్లో భాగంగా స్థానం కల్పించలేకపోయామని.. చంద్రబాబు తనకు చెప్పినట్టు తెలిపారు. కొత్తవారికి చోటు కోసం తనలాంటి వారు త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

 

శాంతించిన బోండా ఉమ మహేశ్వరావు

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వర్ రావు శాంతించారు. తనకు మంత్రి పదవి రాలేదని అలక బూని, అంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బోండా ఉమ.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం బోండా ఉమ తర్వాత శాంతించారు. తమ నాయకుడు ఏది చెప్పినా శిరసావహిస్తామని బోండా అన్నారు. భవిష్యత్ లో తనకు ప్రధాన్యత ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

15:20 - April 2, 2017

గుంటూరు : ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం.. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి కారణమైంది. తనకు ఉద్వాసన పలకడంపై కినుక వహించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. చంద్రబాబుతో పాటు స్పీకర్‌కు రాజీనామా లేఖ రాశారు. అటు బోండా ఉమామహేశ్వరరావు కూడా శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని భావించారు. ఇంకోవైపు చింతలపూడి ప్రభాకర్‌ కూడా ఇదే బాటలో సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం ప్రతినిధులు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. 
అలిగిన ఎమ్మెల్యే బోండా ఉమా 
మంత్రి పదవి ఇవ్వనందుకు ఎమ్మెల్యే బోండా అలిగారు. దీంతో బోండా ఉమాతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్ ఉంటుందని..చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో ఓ కార్యకర్తగా కొనసాగుతానని సీఎంకు చెప్పినట్లు సమాచారం. తొందరపడి పదవికి రాజీనామా చేయోద్దని ఎంపీ కేశినేని నాని  బోండాను బుజ్జగించారు. తనను కలవాలని సీఎం చంద్రబాబు ఫోన్లో సంప్రదించగా..అందుకు ముందుగా నిరాకరించిన ఉమా ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకొని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. 
అవసరమైతే కొత్తపార్టీ పెడతా : చింతమనేని 
మంత్రి పదవి ఇవ్వనందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అలకబూనారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కార్యకర్తలేనని..ఇప్పుడు ఆ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చింతమనేని ప్రకటించారు. సీఎం చంద్రబాబు దగ్గరకు స్వయంగా వెళ్లి తన రాజీనామా లేఖను అందచేస్తానని తన నివాసానికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో అన్నారు. అయితే ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్న చింతమనేని అవసరమైతే కొత్త పార్టీ పెడతానని సంచలన ప్రకటన చేశారు. 
ఎమ్మెల్యే పదవికి బొజ్జల రాజీనామా 
మంత్రి పదవి నుంచి తప్పించడంపై బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే పదవికి బొజ్జల రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు, స్పీకర్‌ కోడెలకు పంపించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడి పనిచేశానన్న బొజ్జల ఇక ఎమ్మెల్యేగా కొనసాగలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని బొజ్జల స్పష్టం చేశారు. 

 

బాబు నయా టీంపై జగన్ ఫైర్..

విజయవాడ : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడం కరెక్టు కాదన్నారు. సీఎం పనులను ప్రజలు గమనించాలని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కరెక్టు కాదన్నారు. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని, ఈ రోజు బ్లాక్ డే అని జగన్ పేర్కొన్నారు. వైసీపీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 4గురికి మంత్రి పదవులు దక్కాయి.

13:34 - April 2, 2017
13:32 - April 2, 2017

విజయవాడ : అనుకున్నట్లుగానే నారా లోకేశ్‌ ఏపీ మంత్రివర్గంలో చేరారు. ఆయన ఇటీవలే ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద హాజరయ్యారు. లోకేశ్‌తో పాటే, ఆయన తనయుడు దేవాన్ష్‌ ఈ కార్యక్రమంలోప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శాసనమండలిలో అతి పిన్నవయస్కుడుగా ఉన్న నారా లోకేశ్‌.. ఏపీ మంత్రివర్గంలో చేశారు. అమరావతిలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన లోకేశ్‌కు పలువురు నేతలు ఘనంగా స్వాగతం పలికారు. లోకేశ్‌ కూడా పార్టీ ప్రముఖులందరితోనూ కరచాలనం చేస్తూ విఐపీ లాంజ్‌లో ఉత్సాహంగా కలియదిరిగారు. లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు... ఆహ్వానితులు పోటీ పడ్డారు. కొందరు నేతలు లోకేశ్‌ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలియజేశారు.

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ దేవాన్ష్..
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి.. ముఖ్యంగా నారా లోకేశ్‌ పదవీ స్వీకార ప్రమాణానికి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విజయవాడ నుంచి రెండు కుటుంబాలు ప్రత్యేక బస్సులో అమరావతి చేరుకున్నాయి. లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్‌తో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. దేవాన్ష్‌ తల్లితో కలిసి నడిచివస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఎమ్మెల్యే బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌, నందమూరి హరికృష్ణ, రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి ఒడిలో కూర్చుకున్న దేవాన్ష్‌ను పలువురు ముద్దు చేశారు. నారా లోకేశ్‌ చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీలో పార్టీ కార్యకర్తల సంక్షేమ కమిటీ సమన్వయకర్తగా పనిచేసిన లోకేశ్‌... ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతనెలలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మార్చి 30న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన లోకేశ్‌... ఇప్పుడు మంత్రి అయ్యారు. మొదట కళావెంకట్రావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఆ తర్వాత లోకేశ్‌ ప్రమాణం చేశారు. వేదికపైకి వచ్చిన లోకేశ్‌ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.

పాదాభివందనం..
ప్రమాణస్వీకారం తర్వాత ముందుగా గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు వచ్చిన లోకేశ్‌.... గవర్నర్‌తో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా.. గవర్నర్‌ నరసింహన్‌.. లోకేశ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. తండ్రి బాటలో సాగాలని లోకేశ్‌కు సూచన చేసినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు వద్దకు వెళ్లి, కరచాలనం చేయడంతోపాటు, పాదాభివందనం చేసి, తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చంద్రబాబు సూచనమేరకు గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు వచ్చిన లోకేశ్‌... పాదాభివనం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత మంత్రులందరితో కలిసి గ్రూపు ఫోటో దిగారు. అనంతరం అల్పాహారం స్వీకరిస్తున్నప్పుడు చంద్రబాబునాయుడు తన మనవడిని ఒళ్లో కూర్చోపెట్టుకుని ముద్దు చేశారు.

13:29 - April 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పునర్‌వ్యవస్థీకరించారు. కొత్తగా 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తొలుత కళా వెంకట్రావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. చివరగా భూమా అఖిలప్రియ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. మరోవైపు పనితీరు, వ్యవహారశైలి సహా ఇతర కారణాలతో ఐదుగురు మంత్రులకు సీఎం చంద్రబాబు ఉద్వాసన పలికారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం అమరావతిలో ఘనంగా జరిగింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 11 మంది చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ నారా లోకేశ్‌ను అభినందించారు. ప్రమాణ స్వీకారం తర్వాత లోకేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌, తండ్రి చంద్రబాబు నాయుడులకు పాదాభివందనం చేశారు.

సందడి..
నారా లోకేశ్‌ తర్వాత ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. పితాని తర్వాత వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. వీరి తర్వాత టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బొబ్బిలి రాజవంశానికి చెందిన రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, ఆ తర్వాత రాయదుర్గం ఎమెల్యే కాల్వ శ్రీనివాసులు, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కొవ్వూరు ఎమెల్యే కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పలమనేరు ఎమ్మెల్యే ఎన్‌. అమర్‌నాథ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల్లో అతిపిన్న వయస్కురాలైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందరి కంటే చివరగా ప్రమాణస్వీకారం చేశారు. తన పుట్టినరోజు నాడే.. అఖిలప్రియ తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులంతా కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు. గవర్నర్ నరసింహన్‌, సీఎం చంద్రబాబుతో కలిసి 11 మంది కొత్త మంత్రులు కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు. కొత్తగా మంత్రిపదవులు తీసుకున్న వారి అనుచరులతో ప్రాంగణమంతా సందడిగా మారింది.

13:12 - April 2, 2017

విజయవాడ : టిడిపి నేతల్లో అసంతృప్తుల జ్వాలలు పెల్లుబికుతున్నాయి. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం..పదవులు కోల్పోయిన వారు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. 11 మందికి స్థానం కల్పించగా ఐదుగురు పదవులును కోల్పోయారు. దీనిపై మొదటగా ఎమ్మెల్యే బొజ్జా గోపాల కృష్ణారెడ్డి స్పందించారు. వెంటనే ఆయన రాజీనామా లేఖను స్పీకర్..సీఎం చంద్రబాబు నాయుడులకు పంపించారు. ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. బోండా ఉమ, ధూళిపాల, చింతమనేని ప్రభాకర్ లు రాజీనామా చేసేందుకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు బోండా ఉమతో మాట్లారు. కష్టపడిన వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వెంటనే తనను కలవాలని బోండాకు బాబు సూచించారు. ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. మరోవైపు చింతలపూడిలోని తన నివాసంలో ధూళిపాల కార్యకర్తలతో భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణతో సన్నిహితంగా ఉన్న వారికే పదవులు వచ్చాయని, వెంటనే రాజీనామ చేయాలని కార్యకర్తలు వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారు. రాజీనామా చేస్తానని స్వయంగా స్పీకర్..సీఎం చంద్రబాబు నాయుడులకు అందచేయనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర సీనియర్ నేత ఒకరు కూడా అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం. వైసీపీ నుండి వచ్చిన వారికి పదవులు దక్కడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధిష్టానం దీనిని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

12:54 - April 2, 2017
12:47 - April 2, 2017

తెలంగాణ అంటేనే పాట గుర్తొస్తుంది. ఇక్కడ పాట రాయని రచయిత లేడంటే అందులో ఆశ్చర్యం లేదు. తెలంగాణా సంస్కృతి, నిరంతర ప్రజాపోరాటాల చరిత్ర, ఇక్కడి దొరల దాష్టీకాలు, దౌర్జన్యాలు, దోపిడీలను చూసి చలించిన సృజనకారులెందరో గేయ రచయితలయ్యారు. అలాంటి వారిలో దుబ్బ రామచంద్రయ్య ఒకరు. ఆయన అనేక సామాజిక అంశాలపై అద్భుతమైన పాటలు రాశాడు. నల్గొండ కళాకారుడు గేయరచయిత దుబ్బ రామచంద్రయ్య గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:44 - April 2, 2017

సాహిత్యం ప్రజల్లో విజ్ఞాన వినోదాలను పంచి పెడుతుంది. చైతన్యం కలిగిస్తుంది. ప్రపంచం లోని అనేక సాహిత్యాలను సంస్కృతులను తెలియజేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న సృజనకారులెందరో మన మధ్య ఉన్నారు. వారిలో ప్రపంచమంతా పర్యటించి యాత్రాసాహిత్యాన్ని ఆదినారాయణ అందిస్తున్నారు. శతాబ్దాల నాటి నిశ్శబ్ద కవచాలని వొలుచుకుంటూ పుడమి పునాదుల్లో నుండి మొలకెత్తిన విత్తానాన్ని నేను.. ఏ దేశం తిరిగినా, కొత్త ప్రదేశం అని ఎక్కడా అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఓ గుండ్రని గ్రామం.. ప్రయాణాలే నా ప్రాణవాయువు ...నేను ఇండియన్ ని కాదు.. గ్లోబియన్ ని అంటున్న ప్రొఫెసర్ ఆదినారాయణ పై ప్రత్యేక కథనం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:31 - April 2, 2017

ఏలూరు : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవులు రాకపోవడం పట్ల పలువురు టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజీనామా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వీరిని బుజ్జగించేందుకు టిడిపి అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్పటికే బొజ్జ గోపాల కృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బోండా ఉమ కూడా రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. కార్యకర్తలనుద్ధేశించి ఆయన ప్రసంగించారు. తనను గెలిపించడానికి కార్యకర్తలు చాలా డబ్బు ఖర్చు పెట్టారని, ఎవరూ ఆవేశపడవద్దని సూచించారు. తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కార్యకర్తలు రాజీనామా చేయవద్దని సూచించారు. ఇతర పార్టీల్లోకి వెళ్లి కార్యకర్తలకు అన్యాయం చేయనని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

12:29 - April 2, 2017

కరీంనగర్ : లారీ యజమానులు చేస్తున్న సమ్మెతో సింగరేణిలో బొగ్గు నిలిచిపోయింది. బొగ్గు గనుల వద్ద లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత నెల 30వ తేదీ నుండి లారీల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సమ్మె ప్రభావం సింగరేణిపై స్పష్టంగా కనిపిస్తోంది. కోల్ యార్డులో బొగ్గు నిల్వలు పేరుకపోతున్నాయి. ఎండల తీవ్రతకు బొగ్గుకు మంటలు అంటుకున్నాయి. దీనితో సంస్థకు భారీ నష్టం కలుగుతోందని తెలుస్తోంది.

12:27 - April 2, 2017

విజయవాడ : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి రాకపోవడం పట్ల బోండా ఉమ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేసిన సంగతి తెలిసిందే. పలువురు పదవులు కోల్పోయారు. మంత్రి పదవి వస్తుందని ఆశించిన నేతల ఆశలు నెరవేరలేదు. మంత్రి పదవి వస్తుందని బోండా ఉమ ఆశించారు. కానీ పదవి దక్కకపోవడంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామా చేసి కార్యకర్తగా కొనసాగుతానని బోండా అనుచరులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సెంట్రల్ నియోజకవర్గ 17 మంది కార్పొరేటర్లు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ కేశినేని నాని రంగంలోకి దిగారు. బోండాను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంటనే బోండా ఉమతో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. కష్టపడిన వారికి భవిష్యత్ ఉంటుందని ఉమకు బాబు భరోసా ఇచ్చారు. వెంటనే తన నివాసానికి బోండాను తీసుకరావాలని ఎంపీ నానికి బాబు సూచించారు. దీనితో బోండాను వెంటపెట్టుకుని సీఎం నివాసానికి బయలుదేరారు. మరి బాబు బుజ్జగింపుతో బోండా సైలెంట్ అవుతారా ? లేదా ? అనేది చూడాలి.

చింతమనేని రాజీనామా..!..

ఏలూరు : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రకటించారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖను అందచేయనున్నట్లు తెలిపారు.

12:04 - April 2, 2017

మెగాస్టార్ రాంచరణ్ తేజ భక్తిరస ప్రధాన చిత్రంలో నటించనున్నారా. స్వామి శరణం అయ్యప్ప పాత్రలో నటించనున్నారా ? అని ఊహించుకోకండి. అవేమి కాదు. ఆయనకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువనే సంగతి తెలిసిందే. కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనే ముందు పుణ్యక్షేత్రాలకు వెళ్లి రావడం..దీక్షలు వేసుకోవడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నుండి షూటింగ్ కొనసాగనుంది. దాదాపు 40 రోజుల పాటు ఈ షూటింగ్ కొనసాగనుందని తెలుస్తోంది. దీనితో నియమనిష్టలతో షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్న ‘చెర్రీ’ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఫ్లైట్‌లో రాజమండ్రికి బయల్దేరిన రెండు ఫొటోలను సుష్మిత సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకన్నారు. ‘సుకుమార్‌ సినిమా కోసం రాజమండ్రిలో ల్యాండ్‌ అయ్యాం’ అని రాంచరణ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'రాంచరణ్‌' సోదరి సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150’ కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.

కొడుకును మంత్రి చేసేందుకు విస్తరణ - రాఘవులు..

విశాఖపట్టణం : తన కొడుకు లోకేశ్‌ను మంత్రిని చేసేందుకే సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ విస్తరణ చేశారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కేబినెట్ నుంచి తొలగించకపోవడం, ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన పేర్కొన్నారు.

 

బొజ్జలకు బాబు ఫోన్..

విజయవాడ : మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవి కోల్పోయిన మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మూడుసార్లు బొజ్జలకు ఫోన్ చేసి మాట్లాడారు.

11:43 - April 2, 2017

నిజామాబాద్ : జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు. వారు చెప్పిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ మాట వినని ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్‌నే టార్గెట్ చేసి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజాప్రతినిధుల తీరుకు నిరసనగా.. ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. నాయకులే కాదు.. వారి అనుచరులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు. దుర్బాషలాడుతూ, దాడులకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డిప్యూటి మేయర్ కుమారుడిని వాహనం ఆపి లైసెన్స్ అడిగినందుకు.. పోలీసులపై డిప్యూటి మేయర్ దాడి చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహరాన్ని పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. అయితే నామ మాత్రపు కేసులకే సరిపెట్టేలా నాయకులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ యోగితా రాణాను టార్గెట్ చేసిన కొందరు ఎమ్మల్యేలు ప్రగతి భవన్‌లో సీఎం ఎదుటే కలెక్టర్ తీరుపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఘటనపై నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.

రెంజల్ ట్రయల్ రన్..
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు గులాబీ పార్టీ నేతల నిర్వాకాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. బోదన్ నియోజకవర్గంలోని రెంజల్ ట్రయల్ రన్ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. బోదన్ ఎమ్మల్యే షకిల్ అనుచరుడు దుర్బషలాడాడని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్‌కు వినతి ప్రతం ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరుడిని అరెస్టు చేయాలంటూ పెన్ డౌన్ సమ్మెకు దిగారు. దీంతో సదరు నేత వచ్చి క్షమాపణ చెప్పటంతో ఆ వివాదం సద్దుమణిగింది. గతేడాది నవంబర్‌లో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రయత్నించగా..అక్కడికి చేరుకున్న కొందరు కార్పొరేటర్లు అధికారులపై విరుచుకుపడ్డారు. తమపై దాడులను నిరసిస్తూ ఉద్యోగులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టారు. తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. స్థానిక నేతలు జోక్యం చేసుకుని మున్సిపల్‌ ఉద్యోగులను సముదాయించడంతో..ఆందోళన విరమించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా పోలీసులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

11:34 - April 2, 2017

విజయవాడ : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ టిడిప నేతల్లో చిచ్చు రేపింది. మంత్రి పదవి ఆశించిన నేతలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పలువురు రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి బోజ్జా గోపాల కృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని నాని రంగంలోకి దిగి బోండాను బుజ్జగిస్తున్నారు. తాజాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మనస్థాపానికి గురయ్యారు. మంత్రివర్గంలో తన పేరు లేకపోవడంతో ఏలూరులో పార్టీ కార్యకర్తలు..అనుచరులతో సమావేశమయ్యారు. పదవికి రాజీనామా చేయాలని చింతమనేనిపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల మనోభావాలే తనకు మనోభీష్టమని చింతమనేని పేర్కొంటున్నట్లు సమాచారం. అలబూనారని తెలుసుకున్న అయ్యన్నపాత్రుడు, ఇతర కీలక నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరికొద్దిసేపట్లో ఆయన రాజీనామా చేస్తారా ? లేదా ? అనేది తేలనుంది.

చింతమనేని మనస్థాపం..

ఏలూరు : దెందూలూరు ఎమ్మెల్యే చింతమనేని అలకబూనారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలతో చింతమనేని సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చింతమనేని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

11:27 - April 2, 2017

కడప : మీకు కారు చౌకగా భూములు కొనాలని ఉందా? సేద్యం పేరుతో వచ్చే సబ్సిడీలు పొందాలనుకుంటున్నారా? అయితే మీ సమస్యను ఓ ఉద్యోగి గంటలో చక్కబెట్టేస్తాడు. ఏలాంటి ఆధారాలు లేకున్నాసరే మీకు పట్టాదారు పాసుపుస్తకం ఇప్పిస్తాడు. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారని అస్సలు అడగదు. లక్ష రూపాయలు మీవి కావనుకుంటే అప్పటికప్పుడు అన్ని సృష్టిస్తాడు. నమ్మశక్యం కలగడం లేదా ? బైకుపై కూర్చోని సెటిల్‌మెంట్‌ చేసుకుంటున్న వ్యక్తి పేరు వెంకటయ్య. కడప జిల్లా పుల్లంపేట మండలం వత్తలూరు-అనంతసముద్రం గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. కంచే చేను మేసినట్లుగా.. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఉద్యోగి.. ప్రభుత్వ భూములను కారుచౌకగా అమ్మేస్తున్నాడు. పైరవీల దగ్గరి నుంచి పట్టాదారుపాసు పుస్తకం వరకు ఏదీ కావాలన్నా క్షణాల్లో ఇప్పించేస్తాడు. మీరు చేయితడిపారా పత్రాలు ఉన్నా లేకున్నా నకిలీవి సృష్టించి మరీ పని పూర్తి చేస్తాడు.

టెన్ టివి కెమెరాకు దొరికిపోయాడు..
వత్తలూరు-అనంతసముద్రం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేసిన వీఆర్వో వెంకటయ్య..అమాయక రైతులకు టోకరా వేయడంలో సిద్ధహస్తుడు. ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకుని.. వారి పేరుమీద పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టిస్తాడు. ఈ పాసుపుస్తకాల ద్వారా ప్రభుత్వం అందజేసే డ్రిప్‌ సిస్టమ్‌, ఇతర సబ్సిడీలను వారికి అందేలా చూస్తాడు. అంతేకాదు ఒకరికి అమ్మిన భూమినే మరొకరికి అంటగడుతాడు. శ్రీనివాసరెడ్డి అనే రైతుకు 10 ఎకరాల భూమిని అమ్మేందుకు 18 లక్షలు వసూలు చేశాడు. ఇప్పడు ప్రభుత్వ భూమి అని చెబుతూ.. ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు వాపోతున్నాడు. దర్జాగా ఓ రైతును డబ్బులు డిమాండ్ చేస్తూ వీఆర్వో వెంకటయ్య.. 10 టీవీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ కథనం చూశాకైనా వీఆర్వో వెంకటయ్యపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

11:18 - April 2, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయనకు నాలుగు కీలక శాఖలను ప్రభుత్వం కేటాయించింది. ఐటీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం శాఖలను కేటాయించింది.

11:09 - April 2, 2017

రాజమండ్రి : సత్యంబాబుకు స్వేచ్చ లభించింది. అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్ధోషి అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి సత్యంబాబు విడుదలయ్యారు. ఏనిమిదేళ్లుగా సత్యంబాబు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. విడుదలైన అనంతరం సత్యంబాబు మీడియాతో మాట్లాడారు. తనలాగే ఎంతో మంది జైల్లో మగ్గుతున్నారని, వారికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. తాను బయటపడుతానని అనుకోలేదని, జైల్లో ఉండే డిగ్రీ పూర్తి చేసినట్లు చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

నారా లోకేష్ శాఖలు..

విజయవాడ : ఏపీ మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ నారాలోకేష్ చేరారు. ఆయన మంత్రిగా నేడు ప్రమాణం చేశారు. ఆయనకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఐటీ శాఖలు కేటాయించనున్నారు.

10:32 - April 2, 2017

విజయవాడ : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో టిడిపిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. కొత్తగా 11 మందిని చేర్చుకోగా ఐదుగురిని పదవీల నుండి తప్పించారు. దీనితో పదవి కోల్పోయిన వారు..మంత్రి పదవి వస్తుందని ఆశించిన పలువురు ఆశావాహులు నిరుత్సాహానికి గురయ్యారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం వద్ద ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి షాక్ పెట్టారు. ఎమ్మెల్యే పదవికి ఏకంగా రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. రాజీనామా లేఖను స్పీకర్..సీఎం చంద్రబాబు నాయుడులకు పంపించారు. ఎమ్మెల్యేగా కొనసాగలేనని, కేవలం సామాన్య కార్యకర్తగానే ఉంటానని పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ కినుక వహించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని నానిలు రంగంలోకి దిగారు. బోండా ఉమను బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. వీరితో లుకలుకలకు ఫుల్ స్టాప్ పడుతుందా ? మరికొంతమంది రాజీనామా చేస్తారో వేచి చూడాలి.

10:25 - April 2, 2017

ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్ష..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్-2017 ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బీటెక్/బీఈ, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు బీఆర్క్/ ప్లానింగ్ పరీక్ష జరుగనున్నది. ఈ పరీక్షకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

09:43 - April 2, 2017

విజయవాడ : ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అమరావతిలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సభ్యులచే ప్రమాణం చేయించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణం చేసిన వారిలో కళా వెంకట్రావు, నారా లోకేష్, పితాని సత్యనారాయణ రావు, నక్కా ఆనంద్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజన కృష్ణా రంగారావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కేఎస్ జవహార్, ఎన్.అమర్ నాథ్ రెడ్డి, ఉమా అఖిల ప్రియ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.

09:24 - April 2, 2017

ప్రారంభమైన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం..

విజయవాడ : ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం అమరావతిలో ప్రారంభమైంది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

నేడు పల్స్ పోలియో చుక్కలు..

హైదరాబాద్ : రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో ఆదివారం పోలియో చుక్కల పంపిణీ జరగనుంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 గంటలకు బదులుగా 6 గంటల నుండే కార్యక్రమం ప్రారంభం కానుంది.

అమరావతికి నందమూరి..నారా ఫ్యామిలీ..

విజయవాడ : నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం కాసేపట్లో అమరావతిలో జరగనుంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నారా లోకేష్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు నందమూరి కుటుంబసభ్యులు, నారా కుటుంబసభ్యులు అమరావతికి బయలుదేరారు.

08:29 - April 2, 2017

విజయవాడ : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తనను తప్పించడం పట్ల బొజ్జ గోపాల కృష్ణారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంత్రి పదవి నుండి తప్పించడంతో ఆయన ఎకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను స్పీకర్, సీఎం చంద్రబాబు నాయుడులకు పంపించారు. పార్టీ పెట్టినప్పటి నుండి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగిందని పేర్కొన్నారు. 1983 ఉండి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. సీనియర్ నేతగానే కాకుండా వ్యూహరచన చేయడంలో దిట్ట అని పేరు పొందారు.

08:18 - April 2, 2017

బొజ్జల రాజీనామా..

విజయవాడ : మంత్రి పదవి నుండి తప్పించడంపై బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనస్థాపం చెందారు. ఎమ్మెల్యే పదవికి బొజ్జల రాజీనామా చేశారు. రాజీనామ లేఖను స్పీకర్, సీఎం చంద్రబాబు నాయుడులకు పంపించారు.

08:09 - April 2, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో గుప్త నిధుల తవ్వకాల విషయం బయటపడింది. ఛత్రినాకాలో రహీంఖాన్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 250 మంది పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుండి తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తనిఖీలు నిర్వహించారు. 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. అంతేగాకుండా ఎలాంటి పత్రాల లేని 35 వాహనాలను సీజ్ చేశారు. రహీంఖాన్ నివాసంలో గుప్తు నిధుల కోసం ఏకంగా 20 అడుగుల గొయ్యి తవ్వి ఉండడం చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. రహీంఖాన్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

పాతబస్తీలో కార్చన్ సెర్చ్...

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు కార్చన్ సెర్చ్ నిర్వహించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న రహీంఖాన్ ను మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. అంతేగాకుండా ఎలాంటి పత్రాల లేని 35 వాహనాలను సీజ్ చేశారు.

07:33 - April 2, 2017
06:57 - April 2, 2017

హైదరాబాద్ : నల్లధనానికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 3 వందల షెల్‌ కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఈడీ జరిపిన దాడుల్లో జగన్‌కు చెందిన ఓ సూట్‌కేస్ కంపెనీ బయటపడడం గమనార్హం. ఫేక్‌ కంపెనీలు నడుపుతున్న పలువురిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. నల్లధనానికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. అక్రమంగా కొనసాగుతున్న షెల్‌ కంపెనీలపై కొరడా ఝళిపించింది. 16 రాష్ట్రాల్లో 3 వందల షెల్‌ కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్‌, కోల్‌కతా, పాట్నా, చండీగఢ్, భువనేశ్వర్‌, కొచ్చి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో వంద చోట్ల సోదాలు నిర్వహించింది.

7వందల సూట్ కేసులు..
ముంబైలో ఈడీ జరిపిన సోదాల్లో 7 వందల సూటుకేస్‌ కంపెనీలు బయటపడ్డాయి. ఈ కంపెనీల్లో 20 మంది డమ్మీ డైరెక్టర్లు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో జగన్‌కు చెందిన ఓ సూట్‌కేస్ కంపెనీ కూడా బయటపడింది. రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్టు కంపెనీతో జగన్‌కు సంబంధాలున్నట్లు ఈడీ.. గుర్తించింది. రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యాజమాన్యంతో జగన్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. యాదవ్‌సింగ్‌, చగన్‌భుజ్‌భల్‌ కంపెనీల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఛగన్‌ భుజ్‌బల్‌ కోసం 46.7 కోట్ల పాతనోట్లు మార్పిడి జరిగినట్లు ఈడీ సోదాల్లో తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వజ్యోతి రియల్టర్స్‌ కంపెనీకి సంబంధించిన 3.04 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ కంపెనీపై ప్రివెన్షన్‌ ఆప్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ ప్రకారం ఈడీ విచారణ జరుపుతోంది. షెల్‌ కంపెనీలపై జరిపిన దాడుల్లో విలువైన దస్తావేజులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అక్రమార్కులు షెల్‌ కంపెనీలను సృష్టించి కోట్లాది రూపాయలను విదేశాలకు మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

06:54 - April 2, 2017

హైదరాబాద్ : అసలే మండుటెండలు, అపై భానుడి భగభగలు. వెరసి నిప్పుల కొలిమిలాంటి ఎండలో విధులు నిర్వహించాలంటే కత్తిమీద సాములాంటిది. అలాంటిది మండుటెండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కష్టాలు వర్ణాణాతీతంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో నిప్పుల కొలిమి లాంటి మండుటెండల్లో ట్రాఫిక్ పోలీసుల విధులు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే సాధారణ సమయాల్లో ట్రాఫిక్ విదులు నిర్వహించడం ఒక ఎత్తైతే మండు టెండల్లో విధులు నిర్వహిచడం మరో ఎత్తు. దీంతో దినదిన గండంగా విధులు నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం నుంచి రెండు షిఫ్ట్‌లలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట దాటితే ట్రాఫిక్ విధులు పెద్ద సవాలుగా మారుతున్నాయి. నిప్పులు గక్కె మండుటెండల్లో కనీసం కూర్చోడానికి, సేదతీరేందుకు ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద సదుపాయాలు లేకపోవడంతో పోలీసుల ఇక్కట్లు కష్టతరంగా మారాయి.

గంటల తరబడి..
ఎండల్లో గంటల తరబడి నిల్చొని ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉంటారు. దీంతో వాయుకాలుష్యానికి తోడు ధ్వని కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఏరియాలో దాదాపు 8 ప్రధాన జంక్షన్ల వద్ద తప్పని సరిగా ట్రాఫిక్ విధులు నిర్వహించాల్సిందే. ప్రతి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో 50మంది మాత్రమే పోలీసులు విధులు నిర్వహిస్తుండగా 30 మందికి పైగా హోం గార్డులు సేవలు అందిస్తున్నారు.  వాస్తవానికి వేసవికాలానికి ముందే ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులకు సేఫ్టీ మెడికల్ కిట్టులను అధికారులు అందజేయాలి. అందులో వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్, గ్లూకోస్ పాకెట్స్, ఫేస్ మాస్క్ తో పాటు ఎండ నుంచి రక్షణ కవచంగా గాగూల్స్ ను అందజేయాలి. కాని అధికార యంత్రాంగం ట్రాఫిక్ పోలీసులకు తగిన వసతులు కల్పించలేకపోతోంది. వేసవికాలంలో తప్పనిసరిగా రెండు సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. తక్షణమే ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి కిట్టులను అందజేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

06:52 - April 2, 2017
06:51 - April 2, 2017

అనంతపురం : జిల్లా గుత్తి మున్సిపల్‌ ఆఫీసు రణరంగంగా మారింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌బ్లాన్‌ నిధులపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచార హక్కు చట్టం ద్వారా సబ్‌ప్లాన్‌ వివరాలను ఓ యువకుడు బయటపెట్టాడు. దీంతో చైర్‌పర్సన్‌ వర్గీయులు రెచ్చిపోయి యువకునిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుని చేయి విరిగింది. దీంతో ఆగ్రహించిన యువకుని తరుపు వర్గం చైర్‌పర్సన్‌ వర్గంపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల దాడితో మున్సిపల్‌ ఆఫీసు రణరంగంగా మారింది. ఆ తర్వాత ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా..చైర్‌పర్సన్‌ అసలు ఎస్సీనే కాదంటూ మరో వివాదం చెలరేగడంతో ఇరువర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

06:48 - April 2, 2017

హైదరాబాద్ : ఆయేషామీరా హత్యకేసులో నిర్ధోషి సత్యంబాబు... విడుదల ఆలస్యమవుతోంది. శనివారం రాత్రి వరకు విడుదల కాకపోవడంతో.. ఆయన విడుదల సోమవారానికి వాయిదా పడింది. జైలు అధికారులకు విడుదల కాపీలు ఇంకా అందకపోవడంతో... ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు తన కొడుకును చూసేందుకు తల్లి మరియమ్మ శనివారం ఉదయమే రాజమండ్రి జైలు దగ్గరకు చేరుకుంది. తన కొడుకు ఏ తప్పు చేయలేదని మొదటినుంచి చెప్తున్నా..పోలీసులు మాత్రం..అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. 8 ఏళ్లుగా తన కొడుకును అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసుల తీరును తప్పుబట్టారు. ఇప్పటికైనా సత్యంబాబు కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసి..అసలు దోషులను న్యాయస్థానం ముందు నిలపెట్టాలని సత్యంబాబు తరపు లాయరు డిమాండ్ చేశారు.

06:46 - April 2, 2017

హైదరాబాద్ : పొలిటికల్‌ కరప్షన్‌ను రూపుమాపుతామన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఆచరణలో మాత్రం అమలుకు దూరంగా ఉన్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కంపెనీలు తమకు నచ్చిన పార్టీకి ఎంతైనా విరాళాలు ఇచ్చేలా చట్టాలు రూపొందిస్తున్నారని చెప్పారు. దీనివల్ల రాజకీయ అవినీతి మరింత పెరుగుతుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకులను వేధించేలా ఇన్‌కం టాక్స్‌ సవరణలు చేశారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్‌ ముందు ఆందోళన చేపడుతామని ఏచూరి హెచ్చరించారు. రాజకీయ అవినీతిని అంతం చేస్తామని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఆవిధంగా చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఏచూరి.. కేంద్రం- కంపెనీల యాక్ట్‌ను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. కంపెనీలు తమకు నచ్చిన పార్టీకి ఎంతైనా విరాళాలు ఇచ్చేలా చట్టాలు రూపొందిస్తున్నారని అన్నారు. గతంలో కంపెనీలు 7.5 శాతం విరాళాలు మాత్రమే ఇచ్చేలా సీలింగ్‌ ఉండేదని.. ఇప్పుడు దాన్ని మార్చారన్నారు. దీనివల్ల రాజకీయ అవినీతి మరింత ఎక్కువవుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించేలా ఇన్‌కం టాక్స్‌ సవరణలు చేశారని ఏచూరి ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా సంఘాలతో కలిసి పార్లమెంట్‌ ముందు ఆందోళన చేపడుతామని ఏచూరి హెచ్చరించారు. రైతు రుణాలను మాఫీ చేయని కేంద్రం.. కార్పొరేట్ల నిరర్థక ఆస్తులను రద్దు చేయడాన్ని ఏచూరి తప్పుపట్టారు. మైనార్టీలను పూర్తిగా పక్కనపెట్టి, హిందూత్వ అజెండానే అభివృద్ధిగా చూపిస్తున్నారని ఏచూరి ఆరోపించారు. డీమానిటైజేషన్ వల్ల యూపీలో గెలిచామంటున్న బీజేపీ పంజాబ్‌లో ఎందుకు ఓడింపోయిందని ప్రశ్నించారు. తెలంగాణలో సామాజిక న్యాయం చేకూరే వరకు మేధావులు, ప్రజలను సంప్రదించి రాజకీయ ఉద్యమం నిర్మిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఈ సంవత్సరమే ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

మహాజన పాదయాత్రను సీపీఎం కేంద్రకమిటీ అభినందించడం పట్ల తమ్మినేని వీరభద్రం ధన్యవాదాలు తెలిపారు.

06:44 - April 2, 2017

హైదరాబాద్ : ఏసీబీ అధికారులకు భారీ అవినీతి తిమింగళం పట్టుబడింది. అక్రమార్గాన 100 కోట్లకు పైగా కూడబెట్టిన ఏపీ ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ గంగాధర్‌ అవినీతి బాగోతం బయటపడింది. ఏకకాలంలో 20చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ... సుమారు 100 కోట్లకుపైగా అక్రమాస్తులున్నట్టు గుర్తించింది. దీంతో గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనో ప్రభుత్వాధికారి. ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా ఉండాలి. కానీ పవిత్రమైన అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని అక్రమార్గం పట్టాడు. అవినీతి సామ్రాజ్యంతో రెచ్చిపోయాడు. ఒకటికాదు. రెండు కాదు.... ఏకంగా 100 కోట్లకు పైగా ఆస్తులు అక్రమార్గాన కూడబెట్టాడు. చివరికి పాపం పండి ఏసీబీ అధికారులకు దొరికాడు. దీంతో ఇన్నాళ్లు ఉన్నతాధికారిగా చెలామణి అయిన ఆయన అక్రమ బాగోతం బయటపడింది. ఆయనే ఏపీ ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం. గంగాధర్‌.

11 చోట్ల సోదాలు..
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం తెల్లవారుజాము నుంచే గంగాధర్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గంగాధర్‌తోపాటు ఆయన బంధువులు, కాంట్రాక్టర్‌ నాగభూషణం ఇళ్లలో సోదాలు జరిగాయి. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరుతో పాటు మొత్తం 20చోట్ల సోదాలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సుమారు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి రాంకీ టవర్స్‌లో 8కోట్ల విలువచేసే విల్లా, ప్రశాంత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లో రెండు ఇళ్లు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. కూకట్‌పల్లిలోని నివాసంలోనే 42 లక్షల నగదు సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 12 ఎకరాలు, విశాఖలో 9 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకులకు చెందిన లాకర్లనూ అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల ఆస్తులను కనుగొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో 100 కోట్ల వరకు ఉంటుందని లెక్కకట్టారు. ఇక ఓ ప్రైవేట్‌ సంస్థలో 1.50 కోట్ల పెట్టుబడులు ఉన్నట్టు ఏసీబీ నిర్దారించింది.

విజయవాడలోనూ..
విజయవాడలోని కాంట్రాక్టర్‌ నాగభూషణం ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 40 లక్షల నగదు సీజ్‌ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులోని గంగాధరం బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. కడప జిల్లా వేంపల్లిలోని గంగాధర్‌ బంధువులైన ఐదుగురి ఇళ్లలో దాడులు నిర్వహించింది. ఇక విశాఖలోని ఆదర్శనగర్‌లో నివాసం ఉంటున్న గంగాధర్‌ మిత్రుడు కాంట్రాక్టర్‌ అయిన కిశోర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. కిశోర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుమారు 50కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. మొత్తానికి ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించి గంగాధర్‌ అవినీతి బాగోతం బయటపెట్టింది. దీంతో పోలీసులు గంగాధర్‌ను అరెస్ట్‌ చేశారు. విశాఖలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.

06:40 - April 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తీర్ణలో యువతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. యువతరం నుంచి ఎమ్మెల్సీ నారా లోకేష్‌, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా నగదు బదిలీ పథకం ప్రస్తావన లోకేష్ సలహా ఆధారంగానే ప్రవేశపెట్టారు. 2014 సాధారణ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నారా లోకేష్..
1983వ సంవత్సరం జనవరి 23న హైదరాబాద్‌లో నారా లోకేష్ జన్మించారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎమ్‌బీఏ పూర్తిచేశారు. చదువు అనంతరం 2008 నుంచి తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ గ్రూపుకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇంకా ఎన్టీఆర్ హెల్త్‌కేర్ , ఎడ్యుకేషన్ ట్రస్ట్, స్కిల్స్ మేనేజ్‌మెంట్ వంటి పథకాలను లోకేష్‌ అభివృద్ధి చేశారు. రాజకీయల మీద మక్కువతో అధికారికంగా 2013లో టీడీపీ యూత్‌ వింగ్‌లో చేరారు. రాజకీయాల్లో లోకేష్ పనితీరును మెచ్చుకున్న సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టారు.

అఖిల ప్రియ..
ఇక యువతరం నుంచి మరో నేత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రిగా అవకాశం లభించింది. అతి చిన్న వయస్సులోనే మంత్రి పదవిని ఆమె చేపడుతున్నారు. కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులైన భూమా నాగారెడ్డి, శోభారెడ్డి దంపతుల పెద్ద కుమార్తె అఖిలప్రియ. 2014 సాధారణ ఎన్నికలకు ముందు శోభానాగిరెడ్డి అకాల మరణం అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇటీవలే ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు ఖాయమైంది.

06:38 - April 2, 2017
06:36 - April 2, 2017

హైదరాబాద్ : ఏపీ క్యాబినెట్‌ విస్తరణకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆదివారం ఉదయం 9.22 నిమిషాలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంత్రి వర్గంలో కొత్తగా 11 మందికి అవకాశం కల్పించగా.. ఐదుగురికి ఉద్వాసన పలికారు. అయితే.. మంత్రి పదవి కోల్పోయిన పల్లె రఘునాథరెడ్డికి చీఫ్‌ విప్‌ పదవి కేటాయించారు. ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్తగా 11 మందికి అవకాశం కల్పించబోతున్నారు. ఈ జాబితాలో చిత్తూరు జిల్లా నుంచి నారా లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావు, విజయనగరం జిల్లా నుంచి సుజయ్‌కృష్ణ రంగారావు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి జవహర్‌, పితాని, గుంటూరు జిల్లా నుంచి నక్కా ఆనంద్‌బాబు, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, కర్నూలు నుంచి భూమా అఖిల ప్రియకు అవకాశం దక్కినట్లు సమాచారం.

ఉద్వాసన..
ఇక ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. వారిలో పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, కిమిడి మృణాళిని ఉన్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో తీసుకునే వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో.. ఏ ప్రాతిపదికన తొలగిస్తున్నారో అన్న విషయాలను చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. జిల్లాలో బీసీకి మంత్రిగా అవకాశం ఇవ్వడం కోసం తనకు మంత్రి పదవి పోయినట్లు పల్లె రఘునాథ్‌రెడ్డి చెబుతున్నారు. అయితే.. తనకు చీఫ్‌ విప్‌ పదవి ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారన్నారు.

పోటీ పడిన ఆశావాహులు..
ఇక ఉదయం నుంచి సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆశావహులు పోటీపడ్డారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు స్వయంగా చంద్రబాబే ఫోన్లు చేసి బుజ్జగించారు. పలు జిల్లాలో పరిణామాల రీత్యా కొందరు జిల్లా నేతలు సీఎంను కలిశారు. ఇలా కలిసినవారిలో సీనియర్‌ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మంత్రి మృణాళిని, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సహా సీనియర్‌ ఎమ్మెల్యేలు కొందరు సీఎంను కలిశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా..సీఎం అంగీకరించలేదని సమాచారం. దీంతో ధూళిపాళ్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి బొజ్జల కూడా సీఎంను కలిసి కొంత నిరాశతోనే వెనుదిరిగినట్లు సమాచారం. కేబినెట్‌లో పయ్యావుల కేశవ్‌కు చోటు కల్పించాలని జేసీ కోరినట్టు తెలుస్తోంది. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు అంతరంగంలో ఏముందో తెలియడంలేదని, చివరి నిర్ణయం ఆయనదేనన్నారు.

కడపలో..
ఇక క్యాబినెట్‌ విస్తరణ నేపథ్యంలో కడప రాజకీయం రసకందాయంగా మారింది. ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారంతో కడప జిల్లా నేతలంతా విజయవాడలో మంత్రి గంటాతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని గంటా చెప్పినప్పటికీ కడప నేత రామ సుబ్బారెడ్డి మాత్రం ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీని వీడతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు..రామ సుబ్బారెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు, ప్రభుత్వ విప్‌ పదవి ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం సమసింది. మొత్తానికి క్యాబినెట్‌ విస్తరణ అంశం.. ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో హీట్‌ పెంచింది. మంత్రివర్గంలో చోటు దక్కిన వారు మోదం వ్యక్తం చేస్తే..వేటు పడిన మంత్రులు ఖేదం వ్యక్తం చేశారు.

బోరు తవ్వకాలపై నిషేధం..

హైదరాబాద్ : రాష్ట్రంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో కొత్తగా బోరు, బావుల తవ్వకంపై ప్రభుత్వం ఆరు నెలలు నిషేధం విధించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబ గద్వాల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోని 1055 గ్రామాల్లో నిషేధం విధిస్తూ సీఎస్ ఎస్పీసింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏస్ బీఐ కొత్త నిబంధనలు..

హైదరాబాద్ : ఏస్ బీఐ కొత్త నిబంధనలు అమలయ్యాయి. ఏప్రిల్ 1 నుండి ఇవి అమల్లోకి వస్తాయని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

నేడు ఏపీలో గవర్నర్ పర్యటన..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఏపీలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్క్..

ఢిల్లీ : ఏపీలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్క్ ను మలేషియా నెలకొల్పనుంది. ప్రధాని మోడీ, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు, మలేషియా ఇండస్ట్రీ గవర్నమెంట్ ఫర్ హై టెక్నాలజీ సంతకాలు చేసింది.

 

ఏపీ మంత్రివర్గ విస్తరణ జాబితా..

విజయవాడ : ఏపీ మంత్రివర్గ విస్తరణ జాబితా ఖరారైంది. మంత్రివర్గ విస్తరణలో 11 మందికి చోటు దక్కినట్లు సమాచారం. మంత్రుల జాబితాలో శ్రీకాకుళం నుండి కళా వెంకట్రావ్, విజయనగరం నుండి సుజయ కృష్ణ రంగరావు, ప.గో - జవహార్, ప.గో - పితాని సత్యనారాయణ, గుంటూరు - నక్కా ఆనంద్ బాబు, నెల్లూరు - సోమిరెడ్డి, కర్నూలు - అఖిలప్రియ, కడప - ఆది నారాయణరెడ్డి, చిత్తూరు -అమరనాథ్ రెడ్డి, నారా లోకేష్, అనంతపురం - కాల్వ శ్రీనివాసులు, కేబినెట్ నుండి ఐదుగురికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. మృణాళిని, పీతల, రావెల, పల్లె, బొజ్జలకు ఉద్వాసన పలికినట్లు సమాచారం.

Don't Miss