Activities calendar

03 April 2017

21:33 - April 3, 2017

ఢిల్లీ: ఎయిర్‌ సెల్‌ మాక్సిస్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం మెడకు మరింత ఉచ్చు బిగుస్తోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ తన స్టేటస్‌ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇందులో చిదంబరం పాత్రపై ఆరోపణలకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 2 వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకు ముందు చిదంబరానికి వ్యతిరేకంగా రెండు వారాల్లో ఆధారాలు సేకరించాలని పిటిషనర్‌ సుబ్రహ్మణ్యస్వామిని కోర్టు ఆదేశించింది. ఎయిర్‌సెల్‌-మాక్సిస్ విషయంలో అప్పటి తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం క్యాబినెట్‌ అనుమతి లేకుండానే 3వేల 5 వందల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని స్వామి ఆరోపించారు. నిబంధనల ప్రకారం 6 వందల కోట్ల ఎఫ్‌డిఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని పేర్కొన్నారు.

21:31 - April 3, 2017

సికింద్రాబాద్‌ : కోటక్‌ మహీంద్ర బ్యాంకు వద్ద కత్తితో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బ్యాంకులోకి ప్రవేశించి చంపేస్తానంటూ అందరినీ బెదిరించాడు. అప్రమత్తమైన గోపాలపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అభినాశ్‌ను ఐటీ ఉద్యోగిగా గుర్తించారు. అతని భార్య ఇదే బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. అయితే రాత్రి భార్యతో గొడవ జరిగడంతో...ఆ కోపంతోనే భార్యను బెదిరించేందుకు కత్తితో వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

21:29 - April 3, 2017

కరీంనగర్ : వేములవాడ ఆలయంలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ ల‌భించింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లికి చెందిన బాలుడి కుటుంబం.. స్వామివారి దర్శనానికి వ‌చ్చారు. బాలుడిని అప‌హ‌రించిన దుండ‌గులు కారులో ప‌రార‌య్యారు. చిన్నారి అపహరణకు గురవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మికాంతవూరులో బాలుడు క్షేమంగా దొరికాడు. కిడ్నాపర్లుగా అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

21:27 - April 3, 2017

రంగారెడ్డి : జిల్లాలోని తాండూరు జనహిత జాగృతి సభ వేదికగా..కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని.. కాంగ్రెస్‌ ముగిసిన అధ్యాయమని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. 

20:45 - April 3, 2017

హైదరాబాద్: సుమారు 50 ఏళ్ల క్రితం ఓ అమాయకుడ్ని గుంజకి కట్టేసి తగులబెట్టారు. ఇప్పుడు మరో యువకుడిని చంపి ఊరి చివర విసేరేశారు. అప్పుడు.. ఇప్పుడు కారణం అదే. తక్కువ కులం. ఎక్కువ కులం అనే మూర్ఖ నమ్మకం. అస్సలు మధుకర్ ను ఎందుకు, ఎవరు చంపారు? అస్సలు ఇది హత్య కాదా? లేదా సర్కారీ పెద్దలు చెప్తున్నట్లు ఆత్మహత్యా? ఏది నిజం ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరీ మన ముందుకు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:35 - April 3, 2017

హైదరాబాద్: లోకేష్ మీద పాల్ టిట్టే రెడ్డి.. ఇద్దరికీ సోపతి ఏడ కలిసిందో గమ్మతి, తెలంగాణ రైతాంగానికి పంట కష్టం...ప్రభుత్వం మేలుకోకుంటే చాలా కష్టం, కర్నూలు జిల్లాలో మంచినీళ్ల కొట్లాట...చంద్రబాబు గారు చేస్తున్నరు తమాషా, తిరుమల కొండ మల్లెక్కిన గవర్నర్...గడుకోపారి ఇదేందంటున్న భక్తులు, అడకముందే రుణాలు ఇచ్చిన బ్యాంకు... అప్పులు కట్టమని రైతులకు నోటీసు, మరీ ఓవరాక్షన్ చేస్తున్న మంథని సీఐ...ఈయన సంగతి ఏమిటో చూడమంటున్న జనం ఇలాంటి అంశాలతో మన మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంతో మన ముందుకు వచ్చారు. మల్లన్న చెప్పే విశేషాలు ఏంటో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్ బీఐ

హైదరాబాద్‌: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. రుణాలపై 0.15శాతం వడ్డీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

18:36 - April 3, 2017
18:34 - April 3, 2017
18:33 - April 3, 2017

గుంటూరు : ప్రజా గాయకుడు డప్పు ప్రకాష్‌ అంత్యక్రియలు గుంటూరు జిల్లా..తెనాలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు అతని పా‌ర్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన గళంతో ప్రజలను చైతన్యవంతులను చేసిన గొప్ప వ్యక్తి డప్పు ప్రకాష్‌ అని పలువురు నాయకులు కొనియాడారు.

18:32 - April 3, 2017

గుంటూరు : అయేషామీరా హత్య కేసులో 8 ఏళ్లు శిక్ష అనుభవించి.. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబును రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. తమది నిరుపేద కుటుంబమని. . ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని సత్యంబాబు... రాజకుమారిని కోరారు. సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడి .. న్యాయం జరిగేలా కృషి చేస్తానని..అసలు దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని రాజకుమారి అన్నారు. 

18:28 - April 3, 2017

హైదరాబాద్: రష్యాలో టెర్రరిస్టులు మరోసారి పంజా విసిరారు. సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో పదిమంది మృతి చెందారు. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో చిన్నారులు ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులు రైలులోనే బాంబులు అమర్చి దాడులకు పాల్పడి ఉంటారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. రెండు మెట్రో స్టేషన్లలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముందు జాగ్రత్తగా మూడు మెట్రోస్టేషన్లను మూసివేసి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దుండగులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దాడి ఘటనను ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌- మృతులకు సంతాపం ప్రకటించారు. పుతిన్ సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ పర్యటనలో ఉండగా ఈ ఘటన జరగడం గమనార్హం.

 

రష్యాలో ఉగ్ర బీభత్సం: 10 మంది మృతి

హైదరాబాద్: రష్యాలో ఉగ్ర బీభత్సం కలకలం రేపుతోంది. సెయింట్ పీటర్స్ బర్గ్ మెట్రో స్టేషన్ లో బాంబు పేలి 10 మంది చనిపోయారు. మరో 50 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు పలు మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు సమాచారం.

17:57 - April 3, 2017

హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయనను జైలు నుంచి విడుదలచేయాలని ప్రొఫెసర్ హరగోపాల్‌, వరవరరావు కోరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని కోరుతూ సభ నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాల చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు.

17:55 - April 3, 2017

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్‌, కార్పొరేట్ ఫీజుల నియంత్రణపై ఓ కమిటీని వేయాలని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఫీజుల దోపిడిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

17:53 - April 3, 2017

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహరంపై ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్‌ నిప్పులు చెరిగారు. ప్రజల నమ్మకాన్ని ప్రజాప్రతినిధులు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉంటారని జోస్యం చెప్పారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఇతరపార్టీలతో కలిసి కాంగ్రెస్ ఉద్యమిస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం దారుణమన్నారు. 

17:52 - April 3, 2017

సిద్ధిపేట : నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీఓ శంకర్ కుమార్‌కు అందజేశారు. రాష్ట్రంలో ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దృష్టిసారించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 

17:51 - April 3, 2017

హైదరాబాద్: నకిలీ మిర్చి విత్తనాల నుంచి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల వలన నష్టపోయిన తన నియోజకవర్గ రైతులతో కలిసి బషీర్‌బాగ్‌లోని అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట సంపత్ ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు దర్జాగా మార్కెట్‌లో అమ్ముతున్నా ప్రభుత్వానికి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంపత్‌కు మద్దతుగా ధర్నాలో మాజీ ఎంపీ వీహెచ్‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

17:49 - April 3, 2017

ఖమ్మం : వైరా నియోజకవర్గ కేంద్రంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వైరా పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రైతులు పండించిన మిర్చి పంటకు ప్రభుత్వం 12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశారు.  

17:47 - April 3, 2017

నల్గొండ :మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భూ నిర్వాసితులు.. ప్రాజెక్ట్‌ పనులు అడ్డుకున్నారు. అయితే అక్కడకు వచ్చిన పోలీసులకు.. భూ నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేశారు. పూర్తిగా నష్టపరిహారం అందే వరకు పనులు జరగనివ్వమని నిర్వాసితులు తేల్చి చెబుతున్నారు.   

17:27 - April 3, 2017
17:20 - April 3, 2017

వరుసగా హిట్లు సాధిస్తూ 'జూనియర్ ఎన్టీఆర్' ఫుల్ జోష్ మీదున్నాడు. అదే జోష్ తో కొత్త చిత్రం కూడా చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో 'ఎన్టీఆర్' వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో ఏకంగా మూడు పాత్రలు పోషించనున్నాడని, అందులో ఒక పాత్ర నెగటివ్ క్యారెక్టర్ లో ఉంటుందని ప్రచారం జరిగింది. నెగటివ్ పాత్రకు సంబంధించిన 'ఎన్టీఆర్' లుక్స్ సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన లోగో శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించారు. 10.30గంటలకు లాంచ్ చేయనున్నట్లు, ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. భారీ అంచనాలతో ..అంతర్జాతీయ నిపుణుల సహకారం తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ లోగో ఎలా ఉంటుందనే దానిపై అభిమానులు ఉత్కంఠగా ఎదరు చూస్తున్నారు. పేరు ఖరారు కానీ ఈ చిత్రానికి 'జై లవ కుశ 'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

17:11 - April 3, 2017

సెన్సార్ కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎట్టకేలకు 'శరణం గచ్చామి' విడుదలకు నోచుకుంది. ఇటీవలే ఆడియో ఫంక్షన్ కూడా జరిగింది. పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు ఏకంగా రిలీజ్ ను ఆపివేసింది. దీనిపై వివిధ సంఘాలు, విద్యార్థులు పోరుబాట పట్టారు. చివరకు సెన్సార్ బోర్డు దిగివచ్చింది. నవీన్ సంజయ్ హీరోగా నటించగా ప్రేమ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంటుందని, అలాగే అంబేద్కర్ కలలుగన్న నవభారతం నేడు ఎలా వుందో చూపించే ప్రయత్నం చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంటోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా దళితులు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక ఈ మూవీని తెరకెక్కించినట్లు యూనిట్‌ తెలిపింది.

16:19 - April 3, 2017

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని విపక్ష నేత జగన్ విమర్శించారు. ఆయన ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడంపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేబినెట్ లో తమ పార్టీలో ఉన్నవారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. మంత్రి వర్గ విస్తరణలో స్థానం పొందిన నలుగురు అధికారికంగా తమ పార్టీలోనే ఉన్నారని ఆయన గవర్నర్ కు సూచించారు. ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావులు ఇంకా తమ పార్టీని వీడలేదని తెలిపారు. వారి చేత గవర్నర్నే ప్రమాణ స్వీకారం చేయిస్తే ఇంకా ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఈసీని, వివిధ పార్టీలను, అవసరం అయితే ప్రధాని మోదీని కలుస్తామని హెచ్చరించారు. 

పెదనందిపాడులో అగ్నిప్రమాదం..

గుంటూరు : పెదనందిపాడులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపులో సిలిండర్లు పేలుతున్నాయి. స్థానికులు పరుగులు తీశారు. షాపులో ఉన్న వృద్ధురాలిని స్థానికులు కాపాడారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ..

ఢిల్లీ : రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కాశ్మీర్ లోయలో భద్రతా సిబ్బందిపై జరుగుతున్న దాడులు..ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందించిన నివేదికపై చర్చించారు.

నిఫ్టీ సరికొత్త రికార్డులు..

ముంబై : నిఫ్టీ సరికొత్త రికార్డులు సృష్టించింది. 64 పాయింట్లు లాభపడి 9238 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది. 290 పాయింట్లు లాభపడి 29910 వద్ద సెన్సెక్స్ ముగిసింది.

డీజీపీ టీపీ పాండే రాజీనామా..

గుజరాత్ : డీజీపీ టీపీ పాండే రాజీనామా చేశారు. 2004లో ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ లో కేసులో నిందితుడిగా ఉన్నారు. డీజీపీ పదవి నుండి తప్పుకోకపోతే తామే తొలగిస్తామంటూ సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో పాండే రాజీనామా చేశారు.

బుచ్చయ్య చౌదరిని కలిసిన చిన రాజప్ప..

రాజమండ్రి : బుచ్చయ్య చౌదరి ఇంటికి హోం మంత్రి చిన రాజప్ప వెళ్లారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని బుజ్జగించే యత్నాలు చేపట్టారు. మంత్రి పదవి రాలేదని మనస్థాపంతో నిన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 

16:08 - April 3, 2017

అమరావతి :

ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో పలువురి శాఖల్లో మార్పులు జరిగాయి. నారా లోకేశ్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు ఇవ్వగా.. అఖిలప్రియకు టూరిజం శాఖ కేటాయించారు. చినరాజప్ప, కేఈలకు పాతశాఖలనే కొనసాగించగా.. చాలా మంది శాఖలు మారాయి. కిమిడి కళావెంకట్రావుకు విద్యుత్‌శాఖ, సుజయకృష్ణ రంగారావుకు గనులు, పితానికి కార్మికశాఖ, నక్కా ఆనందబాబుకు సాంఘీక సంక్షేమం, అమర్‌నాథ్‌రెడ్డికి పరిశ్రమలు, కాల్వ శ్రీనివాసులుకు సమాచార ప్రసార శాఖ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యవసాయశాఖ కేటాయించారు.

 

1. నారా చంద్రబాబు నాయుడు- ముఖ్యమంత్రి

2. కేఈ కృష్ణమూర్తి- ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌

3. నిమ్మకాయల చినరాజప్ప-ఉప ముఖ్యమంత్రి, హోం, విపత్తుల నిర్వహణ

4. యనమల రామకృష్ణుడు-ఆర్థిక, వాణిజ్యపన్నుల శాఖ

5. నారా లోకేష్‌- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ

6. కిమిడి కళా వెంకట్రావు-విద్యుత్‌ శాఖ

7. అచ్చెన్నాయుడు-రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి

8. వెంకట సుజయకృష్ణ రంగారావు- భూగర్భ, గనుల శాఖ

9. అయ్యన్నపాత్రుడు-రోడ్లు, భవనాలు

10. గంటా శ్రీనివాసరావు- మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ

11. జవహర్‌-ఎక్సైజ్‌

12. పితాని సత్యనారాయణ-కార్మిక, ఉపాధి కల్పన

13. మాణిక్యాలరావు- దేవాదాయశాఖ

14. కామినేని శ్రీనివాసరావు- ఆరోగ్యశాఖ

15. కొల్లు రవీంద్ర-న్యాయశాఖ, యువజన క్రీడలు

16. దేవినేని ఉమ- నీటిపారుదల శాఖ

17. నక్కా ఆనంద బాబు-సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమం

18. ప్రత్తిపాటి పుల్లారావు-పౌర సరఫరాల శాఖ

19. శిద్ధారాఘవరావు- అటవీశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

20. నారాయణ-మున్సిపల్‌ శాఖ

21. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి-వ్యవసాయశాఖ

22. ఆదినారాయణ రెడ్డి- మార్కెటింగ్‌, గిడ్డంగులు, పశు సంపర్థక, పాడి అభివృద్ధి

23. భూమా అఖిలప్రియ- టూరిజం

24. కాల్వ శ్రీనివాసులు-గ్రామీణ గృహనిర్మాణం, సమాచార ప్రసారశాఖ

25. పరిటాల సునీత-స్త్రీ, శిశు సంక్షేమం

26. అమర్‌నాథ్‌రెడ్డి-పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌

గవర్నర్ ను కలిసిన జగన్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

15:47 - April 3, 2017

విశాఖ : లారీ ఆపరేటర్ల సమస్యలపై ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమింపజేయుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని..సీఐటీయూ నాయకులు నరసింగరావు డిమాండ్ చేశారు. విశాఖ పబ్లిక్‌ లైబ్రరరీలో సీఐటీయూ, ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, విశాఖ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేటర్ల సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని నరసింగరావు కోరారు.

15:42 - April 3, 2017

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, అధికార ముద్రలేని మాంసం కొనుగోలు చేసిన హోటళ్లపై చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఆస్టోరియా హోటల్‌కు 20వేల జరిమానా విధించారు. మలక్‌పేట, ఐఎస్‌ సదన్‌లో పలు హోటల్స్‌ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో.. భారీగా జరిమానా విధించారు. 

15:41 - April 3, 2017

చిత్తూరు: బ్యాంకు ముఖం చూడకుండానే ఆ రైతులకు 14కోట్ల రూపాయల రుణం మంజూరయింది. కాని..ఒక్కపైస కూడా వారికి చేరలేదు. రైతుల పేరుతో కోట్లరూపాయలను పాలప్యాక్టరీ తన గల్లాపెట్టెలో వేసుకుంటే.. నోటీసులు మాత్రం రైతులకు ఇచ్చింది బ్యాంకు. అప్పు నోటీసులు అందుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. చిత్తూరుజిల్లాలో ఓ మిల్క్‌డెయిరీ నిర్వాకంపై టెన్‌టీవీ ఫోకస్‌..

రైతులకు నోటీసులు...

లోన్‌ బకాయి చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న రైతులు లబోదిబోమంటుండగా.. రైతుల పేరుతో రుణం మింగేసిన మిల్క్‌డెయిరీ యాజమాన్యం .. వారిపైనే ఎదురుదాడికి దిగితోంది.

2013లో పాడిఆవులు ఇప్పిస్తామన్న పాలఫ్యాక్టరీ....

నమ్మినోడి నెత్తికే చేతులు .. అనే సామెతను రుజువు చేసింది చిత్తూరుజిల్లా పిచ్చాటూరు మండలం నగరిలోని ఎస్వీ పాలఫ్యాక్టరీ యాజమాన్యం. 2013లో పాడి ఆవులు ఇస్తామని చెప్పి.. రైతులను పిలిపించారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకంతోపాటు ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, రేషన్‌కార్డుకు సంబంధించిన జిరాక్స్‌ తీసుకున్నారు. దాంతోపాటు లోన్‌పత్రాలపై వేలిముద్రలు కూడా వేయించుకున్నారు. రైతులకు నమ్మకం కలిగించడానికి అప్పటి ఎస్‌బీఐ మేనేజర్‌ మోహన్‌బాబు, అకౌంటెండ్‌ అరవింద్‌ సమక్షంలోనే ఈ తతంగం నడిపించారు. ఆ తర్వాత రుణం సంగతి ఊసేలేకుండా పోయింది. బ్యాంకు అప్పు ఇవ్వలేదేమోనని రైతులంతా అనుకున్నారు. కాని.. రెండేళ్ల తర్వాత ఉన్నట్టుంటి..బ్యాంకు నుంచి నోటీసులు ఊడిపడ్డాయి. పాడి ఆవులు ఇతరాల కోసం తీసుకున్న రుణం.. వడ్డితో సహా ఒక్కోరైతు 2లక్షల 90వేలు చెల్లించాలని పిచ్చాటూరు ఎస్‌బీఐ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో రైతులందరూ లబోదిబోమంటూ ఎస్వీ మిల్క్‌డెయిరీ యాజమాన్యం దగ్గరకు వెళ్లగా.. వారు బెదిరింపులకు దిగారని రైతులు వాపోతున్నారు.

లోన్‌ డబ్బు డెయిరీ కి .. నోటీసులు రైతులకు

లోన్‌ మంజూరు చేసిన బ్యాంకు.. డబ్బును మాత్రం మిల్క్‌ డైరీ యాజమాన్యం చేతిలో పెట్టి.. ఇపుడు నోటీసులు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఎక్కడ నుంచి చెల్లించాలి..? తమకు ప్రాణం తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడంలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.

మిల్క్‌ ఫ్యాక్టరీతో బ్యాంకు ఉద్యోగుల కుమ్మక్కు..!

అసలు బ్యాంకు ముఖం చూడకుండానే రుణం మంజూకావడం.. తమ ఖాతాల్లోనుంచి నగదును విత్డ్రా చేసుకున్నట్లు బ్యాంకు రికార్డుల్లో నమోదై ఉండడంపై.. అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పాలఫ్యాక్టరీ యాజమాన్యంతో బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారని మండిపడుతున్నారు.

సామాన్యుడికి అప్పులు ఇవ్వాలంటే..

సామాన్యుడికి అప్పులు ఇవ్వాలంటే.. సవాలక్ష కొర్రీలు పెట్టే బ్యాంకులు.. రైతుల పేరుతో.. వారికి తెలియకుండానే ఖాతాల నుంచి రుణం మొత్తాలు ఎలా విత్‌డ్రా అయ్యాయో తేల్చాల్సిన అవసరం ఉంది. తమ జీవితాలతో ఆడుకున్న ఎస్వీమిల్క్‌డెయిరీ యాజమాని తోపాటు, బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

15:36 - April 3, 2017

విశాఖ : మంత్రివర్గ విస్తరణలో పెందుర్తి ఎమ్మెల్యే బండారి సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వలేదని టీడీపీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. నల్ల బ్యాడ్జిలతో రోడ్లపై భైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి బండారి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. 

విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు..

ఢిల్లీ : విశ్వవిద్యాలయాల ర్యాంకులను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలవగా ఐఐటీ హైదరాబాద్ పదోస్థానంలో నిలిచింది. మేనేజ్ మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. విశ్వవిద్యాలయాల విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఏడో స్థానం..ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 23వ స్థానం..శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 43వ ర్యాంకు..ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 63వ స్థానం..ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ నైపర్ కు 5వ ర్యాంకు..లభించింది.

భార్యను దూషించడానికి కత్తితో దాడి..

విజయవాడ : అయోధ్యనగర్ లో దారుణం చోటు చేసుకుంది. తన భార్యని దూషించాడని కొబ్బరిబొండాల కత్తితో హనుమంతరెడ్డి అనే వ్యక్తిపై రామకృష్ణ దాడికి పాల్పడ్డాడు. అతడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

వైగో అరెస్టు..

చెన్నై : దేశ ద్రోహం కేసులో ఎండీఎంకే నేత వైగోను పోలీసులు అరెస్టు చేశారు. 2009లో దేశ సమైక్యతకు వ్యతిరేకంగా వైగో మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. వైగోకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

 

రెస్టారెంట్లు..హోటళ్లలో తనిఖీలు..

హైదరాబాద్ : నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు లేని మాంసం బయటపడడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని అస్టోరియా హోటల్ కు రూ. 20వేలు, నల్లగొండ క్రాస్ రోడ్డులోని సోయల్ హోటల్ కు రూ. 40వేలు జరిమాన విధించారు. ఐఎస్ సదన్ పారడైజ్ హోటల్ కు రూ. 20 వేలు జరిమాన పడింది.

14:11 - April 3, 2017

హైదరాబాద్ : నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముట్టడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రెండు రోజుల పాటు మద్యం బంద్..

హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని సీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఐదో తేదీ ఉదయం 6 గంటల నుండి 6వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాల బంద్ పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

13:56 - April 3, 2017

చిట్టి రాగులు తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. క్యాల్షియం..ఐరన్ వంటి పోషకాలు ఇందులో దండిగా లభిస్తాయి. మధుమేహులకు..పూబకాయలకు రాగులు మంచిగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్, వాలైన్, మెధియోనైన్, ఐసోల్యూసిస్, ధ్రియోనైన్ వంటి ఆమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి.

 • మధుమేహం నియంత్రణకు రాగుల్లోని ఫైటో కెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతాయి.
 • కొలెస్ట్రాల్ తగ్గేందుకు, కొవ్వును నిర్మూలిస్తుంది. థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.
 • రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గడానికి దోహదం చేస్తుంది.
 • క్యాల్షియం దండిగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి.
 • అధిక బరువు తగ్గడానికి రాగుల్లోనిక ట్రిప్టోధాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది.
 • ట్రిప్టోధాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది.
 • వయస్సుతో పాటు వచ్చే సమస్యలు...త్వరగా వృద్ధాప్యం రాకుండా చూసుకోవచ్చు.
13:56 - April 3, 2017

గుంటూరు : మంత్రులకు శాఖల కేటాయింపులపై సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి శాఖలు మారే అవకాశం ఉంది. లోకేశ్ కు పంచాయతీరాజ్, ఐటీ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రులు యనమల, చినరాజప్ప, దేవినేని ఉమ, నారాయణ పాత శాఖల్లో కొనసాగిస్తూ మిగిలిన వారికి శాఖలు మార్చే చాన్స్ ఉంది. చంద్రబాబు ఇవాళ శాఖల కేటాయింపు పూర్తి చేసి రేపు మంతివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

13:51 - April 3, 2017

ప్రకాశం : జిల్లాలో దారుణం జరిగింది. అన్నెంపుణ్యం ఎరుగని బాలున్ని ఓ యువకుడు పొట్టనపెట్టుకున్నాడు. సిగరెట్ తీసుకరాలేదని కోపంతో ప్రాణాలు తీశాడు. యువకుడి దాడిలో గాయపడిన బాలుడు మృతి చెందాడు. సిగరేట్ తీసుకురాలేదన్న కోపంతో ఐదురోజుల క్రితం వెంకట్రావు అనే బాలుడిపై యువకుడు దాడి చేశాడు. గదిలో నిర్బంధించి బాలున్ని చితకబాదాడు. శరీరంపై భాగంలో సిగరెట్ కాల్చాడు. అతని మర్మాంగ అయవాలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలున్ని గత నెల 31 న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ వెంకట్రావు మృతి చెందాడు. బాలుడి కుడుపులో గాజు పెంకులు, నాణేలు మత్తు పదార్ధాలను వైద్యులు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:51 - April 3, 2017

క్యాల్షియం..ఇది ఎముకలు..దంతాలు పటుత్వంగా ఉండటానికి ఉపయోగ పడుతుంది. రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవడం అవసరమని వైద్యులు చెబుతుంటారు. ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుండి లభిస్తుందనే సంగతి తెలిసిందే. ఇవి ఇష్టం లేని వారు ఏం చేయాలి ? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దామా..

 • బెండకాయ : బెండకాయలను ఒక కప్పు తీసుకోవడం వల్ల 82 మి.గ్రాముల క్యాల్షియం అందుతుంది. వీటిల్లో విటమిన్ బీ6, ఫోలైట్ వంటివి కూడా ఉంటాయి.
 • సారడైన్ చేపలు : మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ బీ 12 అందిస్తుంది. క్యాల్షియం ఎముకల్లోకి ప్రవేశించడానికి విటమిన్ డి సైతం వీటిల్లో ఉంటుంది.
 • నారింజ : రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఒక పెద్ద నారింజ పండు తీసుకుంటే 74 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది.
 • అంజీర : ఎండిన అంజీర పండ్లను అరకప్ర్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. పోటాషియం, పీచు లభిస్తుంది. మెగ్నీషియమూ వీటితో లభిస్తుంది.
13:39 - April 3, 2017

కరీంనగర్ : టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం శ్రీధర్ బాబు దళితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మధుకర్ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 

13:37 - April 3, 2017

ఆయేషామీరా హత్యకేసులో సత్వర విచారణ జరిపించాలని వక్తలు డిమాండ్ చేశారు. సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలన్నారు. అయేషామీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా తేలాడు. మరీ అసలు నేరస్ధుడు ఎవరు....? ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చ కార్యాక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, బేటీ బచ్చావో బేటీ పడావో కార్యకర్త గీతామూర్తి పాల్గొని మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే చూద్దాం...
దేవి...
'ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్ధోషి అని కోర్టు తేల్చింది. అతను కోల్పోయిన 8 ఏళ్ల జీవితం, అతను పడ్డ మానసిక సంఘర్షణ, అతని తల్లి అనుభవించిన కష్టాలకు ఎవరు బాధ్యులు. పోలీసులా, కోర్టులా, రాజకీయ నాయకులా సమాధానం చెప్పాల్సింది ఉంది. అయేషా మీరా హత్యకేసు లో దోషిని తేల్చాల్సి ఉందని' అన్నారు.
గీతామూర్తి 
అయేషామీరా హత్య కేసులో నేరస్థున్ని పట్టుకోవాల్సి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. హత్య జరిగినప్పుడు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు పోరాటం చేశారని, ఇప్పుడు ఆయనే సీఎం కాబట్టి దీనిపై సీబీసీఐడీ విచారణ చేయాలి. ఒక మధ్య తరగతి కుటుంబాల అమ్మాయిలు చదువుకోవలన్నా ఇటువంటి సంఘటనలతో వారు వెనక్కు వెళ్తుతున్నారు. అవసరమయితే రెండు రాష్ట్రాల మహిళ సంఘాల వారు మాట్లాడుకుని ఫిర్యాదు చేయాలని' అన్నారు.

 

 

ఐపీఎల్ మ్యాచ్ లకు పటిష్ట భద్రత..

హైదరాబాద్ : ఐపీఎల్ మ్యాచ్ ల భద్రత ఏర్పాట్లపై పోలీసుల సమీక్ష నిర్వహించారు. 8 ఐపీఎల్ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ పేర్కొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి 3గంటల ముందే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం జరుగుతుందని, భద్రత పర్యవేక్షణకు 1800 మంది సెక్యూర్టీ సిబ్బంది, షీ టీమ్ లు కూడా భద్రతా పర్యవేక్షణలో ఉంటాయన్నారు. 9వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

13:28 - April 3, 2017

విశాఖ : ఆర్ ఆండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరంను అధికారులు విశాఖ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారించిన అనంతరం ఏసీబీ కోర్టు గంగాధరంకు ఈనెల 14వరకు రిమాండ్ విధించింది. అంతకముందు గంగాధరం ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగించారు. డొల్ల కంపెనీల్లో గంగాధరం భారీగా పెట్టుబుడులు పెట్టినట్లు తెలుస్తోంది. గంగాధరంకు వంద కోట్లు ఉంటాయని అంచనాకు వచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

వ్యవసాయ శాఖ కార్యాలయం ముట్టడి..

హైదరాబాద్ : వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్, మిరప రైతులు ముట్టడించారు. నకిలీ మిరప విత్తనాల బారిన పడిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేశారు.

రెండు రైళ్లల్లో స్వస్థలాలకు గల్ఫ్ బాధితులు..

ఢిల్లీ : గల్ఫ్ బాధితులను సాయంత్రం రెండు రైళ్లలో స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోందని తెలంగాణ భవన్ రెసిడెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ అరవింద్ పేర్కొన్నారు. ప్రయాణ ఖర్చుల కోసం రూ. 1000 అందచేస్తున్నట్లు, వర్కింగ్ వీసా లేకుండా ఏజెంట్లు ఇరాక్ ఎలా పంపారనే అంశంపై హైదరాబాద్ లో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. మోసం చేసిన ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఖమ్మం మార్కెట్ లో నిలిచిన కొనుగోళ్లు..

హైదరాబాద్ : ఖమ్మం మార్కెట్ లో మిర్చి, పత్తి, కంది కొనుగోళ్లు నిలిచిపోయాయి. లారీల సమ్మెతో అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీనితో రైతులు ఆందోళన చేపట్టారు.

 

12:55 - April 3, 2017

కొలంబియా : కొలంబియాలో తుఫాను బిభత్సం సృష్టించింది. భారీ వర్షాల విలయానికి  254 మంది మృత్యువాతపడగా మరో 200 వందల మంది  జాడ తెలియకుండా పోయింది. సైన్యం రంగంలోకి దిగిన సహాయక చర్యలు చేపడుతోంది. 
254 మంది మృతి 
తుఫాను విలయానికి కొలంబియా దేశం చిగురుటాకులా వణికిపోతోంది.  ఎడతెగని వర్షాలతో చిన్నా, పెద్ద నదులు ఉథృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే0 254 మంది ప్రాణాలు కోల్పోగా మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు.  తుఫాను గాలుల బీభత్సానికి వందలాది మంది పౌరులు గాయాల పాలయ్యారు. 
ఒక్కరోజే 130 మిల్లీమీటర్ల వర్షం
శుక్రవారం రాత్రి నుంచి విరుచుకు పడుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థంగా మార్చాయి. ఒక్క రాత్రిలోనే 130 మిల్లీమీటర్ల వర్షపాతం పడటంతో.. కొండప్రాంతాల్లో .. వాగులు వంకలు ఉప్పొంగాయి. వరదనీటి ఉధృతికి కొండచరియలు విరిగిపడ్డాయి. నివాసప్రాంతాలపైకి కొండచరియలు దూసుకు రావడంతో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
1100 మంది జవాన్ల గల్లంతు
1985లో విరుచుకుపడిన తుఫాను బీభత్సాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు కొలంబియావాసులు.  అప్పట్లో  మొకొవా  నగర పరిసర ప్రాంతాల్లో  కొండచరియలు విరిగిపడ్డంతో దాదాపు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మొకొవా నగరాన్నే పకృతి బీభత్సం టార్గెట్‌ చేసింది. నగరం మొత్తం వరదనీటిలో చిక్కుకుంది. అటు పుటుమయో ఫ్రావిన్స్‌లో కొండచరియలు విరిగి భవనాల పై పడ్డాయి. వందలాది వాహనాలు బురదనీటిలో చిక్కుకున్నాయి. అధ్యక్షుడు జావాన్‌ మాన్యుల్‌ ఆదేశాలతో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.   సహాయక చర్యలో పాల్గొంటున్న 11వందల మంది జవాన్లు జాడలేకుండ పోవడంతో వారికోసం గాలింపు చేపట్టారు.  

 

కొనసాగుతున్న తమిళ రైతుల ఆందోళన..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర రైతుల ఆందోళన కొనసాగుతోంది. జంతర్ మంతర్ వద్ద వారు చేస్తున్న ఆందోళనలలో ఇతర రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు.

12:29 - April 3, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇటు భద్రాచలం, అటు ఒంటిమిట్టలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముడి కల్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు మజ్జిక, మంచినీరు , భోజనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
భద్రాచలంలో ముమ్మరంగా ఏర్పాట్లు
భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 5న జరుగనున్న రాములోరి కల్యాణాన్ని కమనీయంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు.. అందుకు తగ్గట్టుగా  ఏర్పాట్లలో మునిగిపోయారు. చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.  పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ..భక్తులకు మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచడానికి   ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీరాముడి కల్యాణానికి హాజరుకానున్న కేసీఆర్‌, నరసింహన్‌
భద్రాద్రి రామయ్య కల్యాణ ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.  5న జరిగే కల్యాణం, 6న జరిగే శ్రీరాముడి పట్టాభిషేకానికి సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ వస్తున్నందున అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.  సకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని  మంత్రులు సూచించారు. 
శ్రీరాముడి కల్యాణానికి ఆదివారం అంకురార్పణ 
మరోవైపు శ్రీరాముడి కల్యాణానికి ఆదివారం అంకురార్పణ జరిగింది. స్నపనం నిర్వహించి.. కల్యాణంలో పాల్గొనే రుత్వికులకు దీక్షా వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు.  గోవిందరాజ స్వామి వారి ఆలయం నుంచి పుట్టబంగారం సేకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఒంటిమిట్టలో జోరుగా ఏర్పాట్లు
అటు ఏపీలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాముని కళ్యాణం కన్నుల పండువగా వీక్షించేందుకు 30 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని నిర్మించారు. నాలుగో తేదీన అంకురార్పణ జరుగనుంది.  5న ధ్వజారోహణ, 10వ తేదీన సీతారామ కల్యాణం జరుగనుంది.  సీతారాముల కల్యాణోత్సవానికి టీటీడీ 5కోట్ల రూపాయలను విడుదల చేసింది.  కల్యాణోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొంటున్నారు. భక్తులకు భోజనం, త్రాగునీరు తదితర వసతులు కల్పిస్తున్నారు. దాదాపు 13 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీతారాముల కల్యాణానికి వీఐపీలు భారీగా రానుండడంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు.

 

12:29 - April 3, 2017

ఢిల్లీ : గల్ఫ్ బాధితులు తమ సొంతూళ్లకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని... తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాక్‌లో చిక్కుకున్న 31మంది ఢిల్లీ వచ్చారని తెలిపారు. బాధితులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నామని చెప్పారు. వారు రేపు ఉదయానికి తెలంగాణ చేరుకొనున్నారని తెలిపారు. బాధితులకు దారి ఖర్చుల కోసం రూ.1000 ఇచ్చామని చెప్పారు. ఇవాళ సాయంత్రం 31 మందిని తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ కు తరలిస్తామని తెలిపారు. అక్కడ నుండి వారు తమ స్వస్థలాలకు చేరుకుంటారని అన్నారు. కార్మికులను మోసం చేసిన ఏజంట్లపై విచారణ చేపడతామన్నారు. దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గల్ఫ్ వెళ్లేవారు వీసాలు ఉంటేనే వెళ్లాలని సూచించారు. 

మత్స్యకార్మికుల విడుదలపై సుష్మా హర్షం..

ఢిల్లీ : మత్స్యకార్మికుల విడుదలకు ఇరాన్ సమ్మతించడంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన 15 మంది మత్స్యకారులను బోట్ల ద్వారా తరలిస్తున్నారని పేర్కొన్నారు.

బాబుకు తలసాని సవాల్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయిస్తే తాను చేస్తానని తలసాని పేర్కొన్నారు. వేరే పార్టీ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవి ఇవ్వడంపై బాబు సమాధానం చెప్పాలన్నారు. గతంలో గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టారని తెలిపారు. నిప్పు..నిజాయితీ అనే పదాలు బాబు వాడకుంటే మంచిదని, మంత్రి పదవులు ఇవ్వొద్దని ఢిల్లీకి కాళ్లు అరిగేలా తిరిగారని విమర్శించారు.

ఇంటర్ బోర్డు ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన..

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన నిర్వహించింది. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే పుట్ట మధు మౌన దీక్ష..

పెద్దపల్లి : మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పుట్టమధు మౌన దీక్ష చేపట్టారు. దళిత యువకుడు మధుకర్ మృతిపై దళిత సంఘాలు చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఎమ్మెల్యే నిరసనకు దిగారు.

బాబుతో సీఎస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భేటీ..

విజయవాడ : నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడితో సీఎస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర సమావేశమయ్యారు. రాత్రికి శాఖల కేటాయింపులు ప్రకటించే అవకాశం ఉంది.

11:49 - April 3, 2017

తూర్పుగోదావరి : కాపు హక్కుల నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం చంద్రబాబుకు మరో లేఖ రాసారు. లేఖలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాగా... కూర్చీకోసం సొంతమామనే చెప్పులతో కొట్టించినవాడిని కాదని ఆయన పేర్కొన్నారు. తను తమ లాగా అవినీతి పరుడిని కాదని, చీకటి చరిత్ర ఉన్నవాడిని కాదని చంద్రబాబు ఉద్ధేశించి మాట్లాడారు. అబద్దాలు చెప్పే అలవాటు ఉన్నవాడిని కాదని, తన రాజకీయ చరిత్రలో పార్టీ పెద్దలు పిలిచి మరీ పదవులు ఇచ్చారని తెలిపారు. ఇతరుల కులం కోసం పోరాడితే పదవి నుంచి తప్పుకుంటారా అని సీఎంకు సవాల్ విసిరారు. అణగారిన వర్గాలు కలిసి మాట్లాడుకోవడం చూసి తమరు తట్టుకోలేరని అన్నారు. జాతి హక్కుల కోసం తాను పోరాడ కూడదా అని ప్రశ్నించారు.

11:49 - April 3, 2017
11:24 - April 3, 2017

గుంటూరు : పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే సహించేదిలేదన్నారు. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం కొందరు నేతలు శృతిమించి ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందన్నారు. ఏదైనా ఉంటే తనతో చెప్పాలని పేర్కొన్నారు. నేతలు ఈ వింధంగా వ్యవహిరించడం సరికాదని చెప్పారు. తమందరి లక్ష్యం 2019 సం.ఎన్నికల్లో గెలవడమేనని తెలిపారు. 26 మందికి మించి మంత్రివర్గంలో చోటుకల్పించేందుకు వీలులేదన్నారు. మంత్రివ్గరంలో అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. కొందరికి అర్హత ఉన్నా.... 26కు మించి ఇవ్వకూడదన్న నిబంధన అడ్డుగా మారిందని పేర్కొన్నారు. ఇవన్నీ తెలిసినా.. క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించడం సబబు కాదని చెప్పారు. ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలన్న విషయం అర్థం చేసుకొండి అని నేతలకు ఆయన హితబోధ చేశారు.

 

 

 

11:11 - April 3, 2017

కరీంనగర్ : వేములవాడ రాజరాజేశ్వరిస్వామి ఆలయంలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభించింది. ఖమ్మంలో బాలుడి ఆచూకీని పోలీసులు కొనుగొన్నారు. బాలుడు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఓ బాలున్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్వుపల్లి గ్రామానికి చెందిన యాదగిరి దంపతలు.. తన 11 నెలల బాలుడు వరుణ్ తేజ్ కు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్ని 12 గంటలకు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి వచ్చారు. స్వామి వారి ఎదుట ఆరు బయట నిద్రించారు. వారు నిద్రలో ఉండగా బాలున్ని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో లేచి చూసే సరికి బాలుడు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. చిన్నారిని కారులో ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాలున్ని ఇండికా కారులో ఖమ్మం జిల్లా తరలిస్తుండగా పోలీసులు గుర్తించినట్లుగా పక్కా సమాచారం ఉంది. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాలున్ని కిడ్నాప్ చేసిన వ్యక్తులు యాదగిరికి బాగా దగ్గరి బంధువులని తెలుస్తోంది. పోలీసులు పూర్తి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాలుడు క్షేమంగా ఉన్నట్లు వేములవాడ సీఐ శ్రీనివాస్ చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పార్టీ పరువు తీయకూడదన్న బాబు..

విజయవాడ : పార్టీ పరువు తీయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆయన అమరావతిలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

కాపులు..బీసీల మధ్య బాబు చిచ్చు - ముద్రగడ..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు ఒక టీంను రెడీ చేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. చంద్రబాబు కాపులు, బీసీల మధ్య చిచ్చు పెడుతున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పుడు విధానాలు మానుకోవాలని సూచించారు. తమని అరెస్టు చేసినా కాపు ఉద్యమం ఆగదన్నారు. మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యిందని, కమిషన్ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

10:51 - April 3, 2017

విశాఖపట్నం : అవినీతి అనకొండ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధర్ ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కాసేపట్లో గంగాధర్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. లాకర్లలో భారీగా బంగారం, ఆస్తుల పత్రాలు దాచినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంగాధర్ బినామీ అయిన కాంట్రాక్టర్ నాగభూషణంకు చెందిన 2 లాకర్లను తెరిచే అవకాశం ఉంది. గంగాధర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

10:46 - April 3, 2017

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తనయుడు 'అఖిల్' కొత్త చిత్రంలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరరావు మునిమనువరాలు సత్య సాగరి క్లాప్ నివ్వగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దేవుడి పటాలపై తొలి షాట్ ను చిత్రీకిరించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ‘మనం' ఎంటర్ ప్రైజస్ పతకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు నాగార్జున. 'ఓపికకు తెరపడింది. అఖిల్ మూవీ ప్రారంభమైంది. పూజ చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం' అని ట్వీట్ చేశారు. హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'అఖిల్' తన మొదటి చిత్రం పరాజయం కావడంతో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నాగార్జున' ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

గంగాధర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు

విశాఖపట్నం : అవినీతి అనకొండ గంగాధర్ ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కాసేపట్లో గంగాధర్ లాకర్లను ఏసీబీ తెరవనుంది. లాకర్లలో భారీగా బంగారం, ఆస్తుల పత్రాలు దాచినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గంగాధర్ బినామీ కాంట్రాక్టర్ నాగభూషణంకు  చెందిన 2 లాకర్లను తెరిచే అవకాశం ఉంది. గంగాధర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు ఇవాళ  కోర్టులో  ఏసీబీ పిటిషన్ వేయనుంది.

10:37 - April 3, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆదివారం గన్ మెన్, పీఏలను సత్యనారాయణ వెనక్కి పంపి, వెళ్లిపోయారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుంచీ బండారు కనిపించకుండా వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఆచూకీ తెలియదు. బండారు ఆచూకీ తెలపాలంటూ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:37 - April 3, 2017

సెల్ఫీ...యువతరంతో పాటు సెలబ్రిటీలు కూడా సెల్ఫీలు తీసుకోవడంలో ఆసక్తిని చూపుతుంటారు. తమ సెల్ఫీలను సోలల్ మాధ్యమాల్లో పెడుతూ అభిమానులను సంతృప్తి పరుస్తుంటారు. టాలీవుడ్ లో తన నటన..చిత్ర చిత్రానికి విభిన్న స్టైల్స్ తో కనిపించే నటుడు 'అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నాడు. తాజాగా ఆయన తన సతీమణి 'స్నేహారెడ్డి'తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 1.5 లక్షల మంది రియాక్షన్స్ ఇవ్వగా 660 మంది ఫొటోను షేర్ చేసుకున్నారు. ఇక ఈ ఫొటోపై పలువురు కామెంట్స్ కూడా చేశారు. అందమైన జంట అని..చక్కని ఫొటో అని..సూపర్ సెల్ఫీ అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఇక అల్లు అర్జున్ చిత్రాలకు సంబంధించి వస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘దువ్వాడ జగన్నాథమ్..డీజే' చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ బ్రాహ్మణ యువకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్ర టీజర్ విడుదలైంది. వేసవి కాలంలో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

గంగాధరం ఆస్తులపై సోదాలు..

హైదరాబాద్ : ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఆస్తులపై సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మూడు, విశాఖలో రెండు లాకర్లను ఏసీబీ తెరిచింది. విజయవాడలో గంగాధరం బినామీ కాంట్రాక్టర్ నాగభూషణంకు చెందిన మరో రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉంది.

బాలుడు క్షేమం..

హైదరాబాద్ : బాలానగర్ పీఎస్ పరిధిలో ఐడీపీఎల్ కాలనీలో ఐదు రోజుల క్రితం కిడ్నాపైన ఏడు నెలల బాలుడు రాఘవేంద్ర క్షేమంగా ఉన్నాడు. పిల్లలు లేని దంపతులకు బాలుడిని అమ్మినట్లు గుర్తించారు.

10:24 - April 3, 2017

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత శరత్ మరార్, సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పవన్..త్రివిక్రమ్ కాంబినేషన్ లో పలు సినిమాలు నిర్మితమైన సంగతి తెలిసిందే. ‘జల్సా'..’అత్తారింటికి దారేది' సినిమాలు రూపొందాయి. ఇక ఈ చిత్రంలో కూడా 'పవన్' సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ‘కీర్తి సురేష్', ‘అను ఇమ్మాన్యుయేల్' లు హీరోయిన్లగా ఎంపికయ్యారు. ఓ కీలక పాత్రను 'ఖుష్బూ' పోషించనున్నారు. ఇక ఈ చిత్రంలో 'పవన్' సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా నటించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న దళ సభ్యుల అరెస్టు..

పశ్చిమగోదావరి : జంగారెడ్డి గూడెంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న దళానికి చెందిన ముగ్గురు దళ కమాండర్లను పోలీసులు అరెస్టు చేశారు. నాటు తుపాకీ, 10 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి రూ. 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ రెగ్యులేటర్ పైపులో అమర్చి తరలిస్తుండగా పట్టుకున్నారు.

చిలకపాలెం కూడలి వద్ద ప్రమాదం..

శ్రీకాకుళం : ఎచ్చెర్ల (మం) చిలకపాలెం కూడలి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బయ్యన్నపేట వాసులు అప్పల్రాజు, ఝాన్సీలుగా గుర్తించారు.

శ్రీనగర్ ఎయిర్ పోర్టులో జవాన్ అరెస్టు..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ ఎయిర్ పోర్టులో జవాన్ ను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. జవాన్ నుండి రెండు గ్రైనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రైనేడ్లతో ఢిల్లీ వెళ్లేందుకు జవాన్ యత్నించాడు.

10:00 - April 3, 2017

భారీ చిత్రాలు రూపొందించడంలో 'శంకర్' స్టైలే వేరు అని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే గతంలో రూపొందిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆయన 'రోబో 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 350 కోట్ల రూపాయలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో 'రజనీకాంత్' సరసన 'ఏమీ జాక్సన్' నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరో..హీరోయిన్లు..విలన్ పలు గెటప్ లలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఐదు గెటప్‌లలోనూ, ఎమీజాక్సన్‌ రెండు గెటప్‌లలోనూ, అక్షయ్‌కుమార్‌ ఏకంగా 12 గెటప్‌లలో కనిపించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై దర్శకుడు శంకర్ స్పందించారు. తన వెబ్‌సైట్‌లో సింపుల్‌గా 'నో' అని పేర్కొన్నారు. రోబో 2 చిత్రంపై వస్తున్న ప్రచారం ఏదీ నిజం కాదని..తాము అధికారికంగా ప్రకటించేంత వరకు ఏ విషయాన్ని నమ్మవద్దని అభిమానులకు సూచించారు. దీపావళికి విడుదలయ్యే వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

09:51 - April 3, 2017

చెన్నై : తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా 'విశాల్' విజయం సాధించారు. గతంలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన నాయకత్వంలో ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలిచారు. తమిళ నిర్మాతల మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుంటారు. ఇందులో 1059 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడిన విశాల్ కు 478 ఓట్లు దక్కాయి. విజయానంతరం విశాల్ మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, నిర్మాతల మనోభావాలే తన గెలుపుగా మారాయని తెలిపారు. నిర్మాతల కష్టాలను తీర్చేందుకు తమ టీం ప్రయత్నిస్తుందని తెలిపారు.

09:41 - April 3, 2017
09:38 - April 3, 2017

ఢిల్లీ : ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణంలో చిక్కుకున్న తెలంగాణ బాధితులకు విముక్తి కలిగింది. బాధితులు ఢిల్లీకి చేరుకున్నారు. వారి వారి స్వగ్రామాలకు బయల్దేరారు. ఏజెంట్ల మాటలు నమ్మి కార్మికులు మోసపోయారు. ప్రమాదకర ఐఎస్ ఐఎస్ జోన్ నుంచి తెలంగాణ కార్మికులు విముక్తులయ్యారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవతో కార్మికులకు విముక్తి లభించింది. బాధితులు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రంలోగా కార్మికులు సొంతూళ్లకు చేరుకోనున్నారు.  
బాధితులు...
'ఏజెంట్ల మాటలు నమ్మి వెళ్లాం. చాలా మోసం చేశారు. ఇమ్మిగ్రేషన్ లేదు. రెసిడెన్సీ లేదు. బెదిరిస్తారు. బయట తిరగాలంటే ఇబ్బందికరంగా ఉండేది. అక్కడి పోలీసులు తమ పాస్ పోర్ట్, 200 డాలర్లు తీసుకున్నారు. లక్ష 50 వేలు పెట్టి...ఇరాక్ వెళ్లాం. మేము ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం ఉపాధి కల్పించాలి' అని కోరుతున్నారు. 

అజ్ఞాతంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ

విశాఖ : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అజ్ఞాతంలోనే ఉన్నారు. గన్ మెన్, పీఏలను సత్యనారాయణ వెనక్కి పంపారు. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 

 

ఢిల్లీ చేరుకున్న ఇరాక్ బాధితులు

ఢిల్లీ : ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణంలో చిక్కుకున్న బాధితులకు విముక్తి కలిగింది. బాధితులు ఢిల్లీకి చేరుకున్నారు. కార్మికులు వారి వారి స్వగ్రామాలకు బయల్దేరారు. 

08:47 - April 3, 2017

లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం కోసమే సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేశారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత డా.అరుణ్ కుమార్, టీడీపీ నేత దినకర్ పాల్గొని, మాట్లాడారు.  మంత్రివర్గ విస్తరణ అంతర్గతంగా, వ్యూహాత్మకంగా ఉందన్నారు. స్పీకర్ స్థానాన్ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:38 - April 3, 2017

ఢిల్లీ : ఇండియన్‌ ఐడల్‌ కిరీటం మరోసారి తెలుగువారి సొంతమైంది. సీనీ గాయకుడు రేవంత్‌ ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 9లో విన్నర్‌గా నిలిచాడు.  తన గాన మాధుర్యంతో, స్టెప్పులతో అందర్నీ కట్టిపడేశాడు. మరో ఇద్దరు పోటీదారులు రోహిత్‌, ఖుదాభక్ష్‌లతో హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో సత్తాచాటి కిరీటం ఎగరేసుకుపోయాడు.  క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నుంచి ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీని అందుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో తన పాటలతో రేవంత్‌ ఉర్రూతలూగించాడు. ఇండియన్‌ ఐడల్‌ కిరీటంతో పాటు యూనివర్సల్‌ మ్యూజిక్‌ కంపెనీతో ఒప్పందం, 25 లక్షల నగదు బహుమతిని రేవంత్‌ గెలుచుకున్నాడు. మరో తెలుగు గాయకుడు రోహిత్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

 

వేములవాడ రాజరాజేశ్వరిస్వామి ఆలయంలో బాలుడి కిడ్నాప్

కరీంనగర్ : వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఓ బాలున్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బృందాలు ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

08:30 - April 3, 2017

కరీంనగర్ : వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఓ బాలున్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్వుపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం 11 నెలల బాలుడికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు నిన్న రాత్ని 12 గంటలకు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. స్వామి వారి ఎదుట ఆరు బయట నిద్రించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో లేచి చూసే సరికి బాలుడు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో తీవ్ర  ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి పోలీసులు బాలుడి ఆచూచీ కోసం గాలిస్తున్నారు. కారులో బాలున్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గుజరాత్‌ లో రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి

గుజరాత్‌ : గోద్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. నర్సింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 13మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

విషపూరిత ఆహారం తిని 400 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అస్వస్థత

హైదరాబాద్ : విషపూరిత ఆహారం తినడంతో 400 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. కేరళ పల్లిపురంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చేపల కూర తిన్నారు. ఆహారం విషపూరితం కావడంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని త్రివేండ్రం ఆస్పత్రికి తరలించారు. 

నేడు, రేపు తెలంగాణలో కేంద్రబృందం పర్యటన

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలో కేంద్రబృందం పర్యటించనుంది. మిషన్ కాకతీయ పనుల్ని కేంద్రం బృందం పరిశీలించనుంది. 

 

నేడు మలక్ పేట్ మార్కెట్ యార్డును సందర్శించనున్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ : నేడు మలక్ పేట్ మార్కెట్ యార్డును కాంగ్రెస్ నేతలు సందర్శించనున్నారు. 

 

07:48 - April 3, 2017

లారీ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన లారీల సమ్మెతో నాలుగు రోజులుగా సరకు రవాణా స్తంభించిపోయింది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. వివిధ మార్కెట్లకు పూలు, పండ్లు, కూరగాయల సరఫరా తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు దారి తీసిన కారణాలేమిటి? ఈ సమ్మె విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా వుంది? ఇదే అంశాలపై భాస్కర్ రెడ్డి మాట్లాడారు.ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:45 - April 3, 2017

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి అభివృద్ధికి ఆటంకంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. గత 40ఏళ్లలో ఎంతోమంది పౌరులు చనిపోయారని.. దీనివల్ల ఎవరికైనా మేలుజరిగిందా అని ఆయన ప్రశ్నించారు. చెనాని నష్రి సొరంగమార్గం ప్రారంభించిన ప్రధాని.. పర్యాటకరంగంపై కశ్మీర్‌ రాష్ట్రం దృష్టిపెట్టి ఉంటే ఎంతో అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు.
చెనాని నష్రి సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ
ఆసియాలోనే అతిపెద్దదైన చెనాని నష్రి  సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు.  జమ్మూ కశ్మీర్‌ నవ యువకులు రాత్రి , పగలు శ్రమించి బండరాళ్లను పగులగొట్టి ఈ సొరంగ మార్గ నిర్మాణానికి ఎంతో సహకరించారని ప్రధాని కొనియాడారు.  ఇది అతి పొడవైన సొరంగ మార్గమే కాకుండా ఛాలెంజ్‌తో కూడినదని మోదీ అన్నారు.  అనుకున్న సమయంలోనే సొరంగ మార్గాన్ని పూర్తి చేసినందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీని ప్రధాని  ప్రశంసించారు. 
జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదంపై మోదీ విమర్శలు
ఉధంపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన మోదీ... ఉగ్రవాదంపై మండిపడ్డారు.  నేడు జమ్మూకశ్మీర్‌ యువత ముందు రెండు మార్గాలున్నాయని... అందులో ఒకటి టూరిజం కాగా... రెండోది టెర్రరిజం అన్నారు.  ఇందులో ఏది ఎంచుకోవాలో కశ్మీర్‌ యువతే నిర్ణయించుకోవాలన్నారు.  తప్పుదోవ పట్టిన కొందరు యువకులు ఓవైపు రాళ్లు రువ్వుతుండగా.. మరోవైపు కశ్మీర్‌కు చెందిన కొంతమంది యువకులు అదే రాళ్లతో జాతి నిర్మాణానికి తోడ్పడ్డారని కొనియాడారు.  రక్తపాతమార్గం ఎప్పటికీ సహాయపడదన్నారు.  జమ్మూకశ్మీర్‌లో పర్యాటకరంగంపై దృష్టిపెట్టి ఉంటే ప్రపంచమంతా కశ్మీర్‌ వ్యాలిలో విహరించేందని చెప్పారు. చెనాని- నష్రి సొరంగమార్గం జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి మరింత దోహం చేస్తుందని  మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
9.2 కి. మీ మేర సొరంగమార్గం నిర్మాణం
చెనాని నష్రి సొరంగ మార్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 9.2 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హెచ్ 44పై నిర్మించారు. 3వేల 720 కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగేళ్లలోనే ఈ నిర్మాణం పూర్తి చేశారు. దీంతో జమ్మూ శ్రీనగర్‌ మధ్య 30కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు... రెండు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఇందువల్ల రోజుకు 27లక్షల రూపాయల ఇందనం పొదుపు అవుతుందని అధికారులు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో సురక్షిత ప్రయాణానికి అనువుగా రెండు రహదారులతో దీనిని నిర్మించారు. వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్, ఎయిర్ కండిషన్, సిసి కెమేరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. వాహనదారులకు మార్గం స్పష్టంగా కనిపించేలా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు.  వాహనాల కదలికల గురించి నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

 

07:40 - April 3, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రానికి సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు శంకుస్థాపన చేశారు. ప్రగతివాద శక్తులు, బలహీన వర్గాలకు విజ్ఞానాన్ని అందించడాకి ఈ కేంద్రం ఉపయోగపడాలని ఆయన అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు జిల్లాకు చెందిన మేధావులు పాల్గొన్నారు.  హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ణాన కేంద్రం ఎన్నో గొంతుకులకు వేదిక అవుతుందని.. అలాగే ఈ సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కూడా వేదిక అవ్వాలని మధు అభిప్రాయపడ్డారు. 

 

07:36 - April 3, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ టీడీపీలో అసంతృప్తికి ఆజ్యం పోసింది. చాలా మంది ఎమ్మెల్యేల్లో నిరాశను నింపింది.  ఈసారైనా కేబినెట్‌లో  బెర్త్‌ఖాయం అనుకున్న వారికీ ఆశాభంగమే మిగిలింది.  దీంతో  కొంతమంది బాహాటంగానే  అసంతృప్తిని వెళ్లగక్కారు. మరికొంతమంది లోలోపలే మదనపడిపోతున్నారు. ఇంకొందరైతే  ఒకడుగు ముందుకేసి రాజీనామాలు సమర్పించారు. దీంతో అధిష్టానం దూతలు.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. 
నిరాశలో పలువురు ఎమ్మెల్యేలు
ఏపీ కేబినెట్‌ విస్తరణ ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైంది. సీనియర్‌ నేతల్లో అసంతృప్తికి ఆజ్యం పోసింది. మంత్రివర్గంలో చోటుదక్కుతుందని ఆశపడ్డ వారంతా నిరాశకు గురయ్యారు. దీంతో వారు అధిష్టానంపై బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కేబినెట్‌ నుంచి తనను తొలగించడంతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి  కినుక వహించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌తోపాటు ముఖ్యమంత్రికీ పంపారు.  దీంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి.. బొజ్జలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి గోరంట్ల రాజీనామా
కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల  బుచ్చయ్య చౌదరి అసంతృప్తిని వెలిబుచ్చారు.  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించినట్లు చెప్పారు. 
ధూళిపాళ్లలకు బాసటగా నిలిచిన మద్దతుదారులు
గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు పదవి దక్కకపోవడంపై ఆయన వర్గీయులు  పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో తన స్వగ్రామమైన  చింతలపూడిలో సన్నిహితులతో సమావేశమయ్యారు. 
ఎమ్మెల్యే పదవికి చింతమనేని రాజీనామా
అటు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. తాను పార్టీలో ఇమడలేనని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరనని కూడా ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే తానే కొత్త పార్టీ పెడతానని కూడా ఆయన స్పష్టం  చేశారు.
బోండా ఉమా నిరాశ
మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కకపోవడంపై ఎమ్మెల్యే బోండా ఉమా కూడా అలకపాన్పునెక్కారు. దీంతో ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ ఆయనను బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు.  మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తారా అని బోండా ఉమాకు చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారని, అప్పుడే మంత్రిపదవి ఆశించడమేంటని  బాబు ప్రశ్నించినట్టు సమాచారం.  సీఎం వార్నింగ్‌తో మెత్తబడ్డ బొండాఉమా.. చంద్రబాబు మాటలతో తాను సంతృప్తి చెందానని చెప్పారు.
అధిష్టానంపై కాగిత వెంకట్రావు అలక
ఇక కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కూడా మంత్రిపదవి దక్కకపోవడంతో ఒకింత అలకవహించారు. వెంకట్రావుకు మద్దతుగా పెడన, గూడురు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు చెందిన టీడీపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు పెడన నియోజకవర్గంలో సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. 
టీడీపీలో తుఫాను 
మొత్తానికి .. ఇన్నాళ్లు ఊరించిన మంత్రివర్గ విస్తరణ టీడీపీలో కొద్దిపాటు తుఫానునే సృష్టించంది. అధినేత చంద్రబాబు జోక్యంతో కొందరు నేతలు మెత్తబడుతున్నా.. మరికొందరు మాత్రం.. ఆశాభంగాన్ని జీర్ణించుకోలేక.. పార్టీ అధినేతకు ఎదరు మాట్లాడలేక తమలో తామే రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇంకొందరైతే..సమయం వచ్చినపుడు తామేంటో రుచి చూపిస్తామని బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. 
 

Don't Miss