Activities calendar

04 April 2017

21:32 - April 4, 2017

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 10వ సీజన్‌ ప్రారంభ వేడుకలు ఉప్పల్‌స్టేడియంలో వినూత్నంగా నిర్వహించనున్నారు. ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సీజన్‌ ఆరంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రిటీష్‌ బ్యూటీ ఎమీ జాక్సన్‌ లేటెస్ట్‌ బాలీవుడ్ హిట్‌ సాంగ్స్‌కు స్టెప్పులేసి సందడి చేయనుంది.6 నిమిషాల పాటు సాగనున్న ఎమీ జాక్సన్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌....ఓపెనింగ్‌ సెర్మనీకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిపోనుంది.8 జట్ల కెప్టెన్లు స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వేడుకలకు తెరపడనుంది.భారత క్రికెట్‌ దిగ్గజాలతో పాటు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఈ వేడుకలకు హాజరు కానున్నారు.ఉప్పల్‌ స్టేడియంలో అట్టహాసంగా ఆరంభ వేడుకలు.....ఆ తర్వాత సన్‌రైజర్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ మ్యాచ్‌....హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది.

 

21:29 - April 4, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో రైతులకు రుణమాఫీ చేయాలని క్యాబినెట్‌ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన తొలి కాబినెట్‌ సమావేశం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయాలని యోగి నిర్ణయించారు. సిఎం నిర్ణయంతో 36 వేల కోట్ల రుణాలు మాఫీ కానుండగా... 86 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.

21:24 - April 4, 2017

హైదరాబాద్: 2012, 13 సంవత్సరాలకు ఎన్టీఆర్‌, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను ఏపీ సర్కార్‌ ప్రకటించింది. 2012 సంవత్సరానికి ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, 2013కు హేమమాలినిని ఎంపిక చేశారు. అలాగే 2012 బీఎన్‌రెడ్డి నేషనల్‌ అవార్డు సింగితం శ్రీనివాసరావుకు, 2013 కోదండరామిరెడ్డికి ప్రకటించారు. ఇక 2012 నాగిరెడ్డి-చక్రపాణి నేషనల్‌ అవార్డు సురేష్‌బాబుకు, 2013కు దిల్‌రాజుకు ప్రకటించారు. 2012 రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును కోడి రామకృష్ణకు, 2013కు శ్రీమతి వాణిశ్రీకి ప్రకటించారు. అదేవిధంగా 2014, 15, 16 అవార్డులను ఈ ఏడాది చివరినాటికి అందజేస్తామని కమిటీ తెలిపింది. 

21:22 - April 4, 2017

అమరావతి: హైకోర్టు ఆదేశించడం... అసెంబ్లీలో ప్రతిపక్షాల డిమాండ్లు, బాధితులు ఆందోళనలతో ఏపీ సీఐడీ అగ్రిగోల్డ్‌ కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ఇద్దరి డైరెక్టర్ల శ్రీనివాస్, రాంమోహన్ లను అరెస్ట్‌ చేసి బినామీ ఆస్తులపై ఆరా తీసింది. అయితే పిటిషనర్ తరుపు న్యాయవాది గతంలో ఆస్తుల వివరాలు అందజేసినా.. అమ్మకాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. మొత్తం కలిపి 100 కోట్ల ఆస్తులకు వేలం వేయలేక పోయారు.

ఆస్తులు ఎక్కువ ధర పలికేలా ప్రతిపాదనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

అయితే సమస్యలు లేకుండా ఆస్తులు ఎక్కువ ధరకు పలికేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలపాలని హైకోర్టు... సీఐడీని ఆదేశించింది. దీంతో సీఐడీ ఆస్తులను రెండు కేటగిరీలుగా విభజించింది. 50 కోట్లకు పైగా ధర పలికే తొమ్మిది ఆస్తులను గుర్తించింది. వాటి ద్వారా 1300 కోట్లు రానున్నట్టు తెలిపింది. కాకాని వద్ద ఉన్న హాయిల్యాండ్ అత్యంత ఖరీదైన స్థలంగా తెలిపింది. 85 ఎకరాలు విస్తరించి ఉన్న హాయిల్యాండ్ ప్రభుత్వం ధర 90 కోట్లు కాగా.. మార్కెట్ విలువ 600 కోట్లని సీఐడీ పేర్కొంది. విజయవాడలోని కమర్షియల్ భవనానికి 150 కోట్లు విలువ ఉందని తెలిపింది.

కీసర ప్రాంతంలో 324 ఎకరాలు...

అలాగే సీఆర్‌డీఏ పరిధిలోని కీసర ప్రాంతంలో 324 ఎకరాలు...ప్రకాశం జిల్లాలోని 37 ఎకరాలు.. ఉన్నట్టు పేర్కొంది. ఇలా మొత్తం 9 ఆస్తులు కలిపి 2 వేల 65 ఎకరాలు.. 13 వేల స్వేయిర్ యార్డ్స్ కమర్షియల్ భవనాలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ 1320 కోట్లుగా చెప్పగా.. వీటిపై 238 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని హైకోర్టుకు సీఐడీ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఆస్తుల వివరాలు ఆన్ లైన్‌లో ఉంచాలని సీఐడీకి హైకోర్టు అదేశించింది. ప్రత్యేక ఫోర్టల్ ఏర్పాటు చేసి వేలానికి సిద్ధం చేయాలని సూచించింది.

అగ్రిగోల్డ్‌ బాధితులపై తెలంగాణ సీఐడీ శీతకన్ను...

ఇక తెలంగాణ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులపై శీతకన్నేసింది. మూడు లక్షల మంది బాధితులు... 400 కోట్ల రూపాయలు నష్టపోయినా.. చర్యలు తీసుకోవడం లో వెనకంజ వేస్తున్నారు. ఇప్పటికీ ఎక్కెడక్కడ ఆస్తులు ఉన్నాయో గుర్తించినా.. వాటి విలువలు ఇవ్వలేదు. బినామీ పేర్ల మీద ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని సీఐడీ గుర్తించింది. వీటిపై ఏపీ, తెలంగాణ పోలీస్ అధికారులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. కారణం ఏంటో తెలియదు.. ఆ సమావేశం మరో వారం పాటు వాయిదా వేశారు. ఏదిఏమైనా అగ్రిగోల్డ్ కేసులో తెలంగాణ సీఐడీ మొద్దు నిద్రను వీడడం లేదని అపవాదును మూటకట్టుకుంది. ఇప్పటికైనా వెయ్యి కోట్ల రూపాయల అస్తులను ఒకే సారి వేలం వేసి బాధితుల్లో గుండే ధైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

21:20 - April 4, 2017

అమరావతి: నూతన సచివాలయంలో చాంబర్లను రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేష్‌ పరిశీలించారు. అధికారులతో పాటు వెళ్లిన ఆయన.. చాంబర్లలో కలియతిరిగారు.

 

21:19 - April 4, 2017

అమరావతి : ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలను ఎప్పకప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలో జరుగుతోందని.. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ పాలనలో వారిని భాగస్వామ్యులను చేయాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్‌, కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర పాల్గొన్నారు.

21:17 - April 4, 2017

హైదరాబాద్: దగ్గుబాటి పురందేశ్వరి. ఆమె సంచలనాలకు మారుపేరు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తన తండ్రి స్థాపించిన టీడీపీని కాదని అప్పట్లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాదు కేంద్ర మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరారు. ఏపీలో మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. అయితే.. తాజాగా మంత్రివర్గ విస్తరణలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి ఆమె రాసిన లేఖ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

పార్టీ ఫిరాయింపులపై మోదీ, షాలకు లేఖ...

పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడాన్ని ఆమె లేఖలో తప్పుపట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేయకుండా.. వేరే పార్టీలో చేరి మంత్రి పదవులు పొందడం అప్రజాస్వామికమన్నారు.

ఏపీలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న బిజెపి...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి భాగస్వామిగా ఉన్న బీజేపీ.. ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుందని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తేవాలని ఆమె కోరారు.

తమ పార్టీలో గెలిచిన వారికి మంత్రి పదవులా? వైసీపీ

ఓవైపు తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. ఇదే సమయంలో పార్టీ అధిష్టానానికి పురందేశ్వరి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు పురందేశ్వరి లేఖపై టీడీపీలోనూ చర్చ జరుగుతోంది. ఆమె లేఖ అంశాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుందని.. తాము మాత్రం బీజేపీతో ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తామన్నారు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు. జగన్‌ అవినీతి, అక్రమాలపై పురందేశ్వరి ఎప్పుడైనా అడిగారా అని కాల్వ ప్రశ్నించారు.

టీడీపీ తీరుపై వైసీపీ ఆందోళనలకు...

మరోవైపు టీడీపీ తీరుపై వైసీపీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ చర్యలకు నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న పోరుకు తాజాగా పురందేశ్వరి రాసిన లేఖ మరింత ఆజ్యం పోసే విధంగా మారింది. మరి.. ఈ లేఖ మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

20:38 - April 4, 2017

హైదరాబాద్: తెలిసి చేశారో.. తెలియకచేశారో...అస్సలు చేయలేదో మొత్తానికి ఊచలు లెక్కపెడుతున్నారు. కానీ ఏ విషయం తేల్చాలి కదా? అయితే బయటికి.. లేదంటే లోపలికి పంపాలి కదా? కానీ బీ అండర్ ట్రైల్ గానే ఉంచేస్తున్నారు. అస్సలు కంటే కొసలుతోనే శిక్షిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల సత్యం బాబు లాంటి వారు అనే మంది అన్యాయం శిక్షను అనుభవిస్తున్నారు. వీరిలో నిరుపేద దళితులు, ఎస్టీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్నారని సర్కారీ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో బడుగు జీవులకు న్యాయం జరగకుండా ఆమడ దూరంలో ఉందని స్పష్టం అవుతోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ సోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పొదలకూరు మండలం ముదిగేడులో యాసిడ్ దాడి

నెల్లూరు: పొదలకూరు మండలం ముదిగేడులో యాసిడ్ దాడి జరిగింది. ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి పై యాసిడ్ దాడి జరిగింది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి డబ్బుల లావాదేవీలే కారణం అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు వాసులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

20:10 - April 4, 2017

హైదరాబాద్: రాచకొండ గుట్టలల్లో జేఏసీ ఛైర్మన్ కోదండం.. రైతులు పెడుతున్నరు కోదండం కో దండం, కరువు పైసలు మింగిన చంద్రాలు....గ్యాసు నూనె మీద పోసుకున్న జనాలు, ట్విట్టర్లో స్పందిస్తున్న కల్వకుంట్ల కవిత... ఇట్ల నన్న మారాలే తెలంగాణోళ్ల భవిత, ఈవిఎం సాక్షిగా తొడగొట్టిన ఎన్నికల సంఘం....దమ్ముంటే రమ్మని తిట్టేటోళ్లకు సవాళ్లు, చెప్పులు కుట్టేటాయన ఐటీ లెక్కలు చెప్పు...శరం లేని పని చేసిన ఇన్ కంట్యాక్స్ వాళ్లదే తప్పు, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పోలీసులు..అయినా అది వాళ్ల అయ్య చుట్టమే గదా. ఇలాంటి అంశాలతో నేడు 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చారు. మరి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి:సమస్యల్ని, సంక్షోభాలను అవకాశంగా తీసుకున్న శ్రీరాముడు మానవాళికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెల 10న కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో ప్రభుత్వం సీతారామకల్యాణాన్ని నిర్వహిస్తోందని సీఎం వెల్లడించారు.

19:58 - April 4, 2017

విజయవాడ: దాదాపు 9 ఏళ్లుగా ఆయేషా మీరా హత్య కేసులో జైలు జీవితం అనుభవించి, ఇటీవలే జైలు నుంచి నిర్ధోషిగా సత్యంబాబు విడుదలయ్యారు. ఆయనతో 'టెన్ టివి' స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. మ‌న దేశంలో బ‌డాబాబులు, రాజ‌కీయ నాయ‌కుల ప‌లుకుబ‌డి ఏ విధంగా ఉందో చెప్పేందుకు ఈ సంఘ‌ట‌నే ప్రత్య‌క్ష నిద‌ర్శ‌నం. డ‌బ్బులిస్తే చాలు, తిమ్మిని బ‌మ్మిని, బ‌మ్మిని తిమ్మిని చేస్తున్న రోజులివి. అలాంటిది ఓ సామాన్యుడు బ‌డాబాబులు ఇరికించిన కేసు నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. ఇంకా న్యాయం బ‌తికే ఉంద‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను న‌మ్ముకుంటే ఏనాటికైనా న్యాయం జ‌రుగుతుంద‌ని తెలియ‌జెప్పే సంఘ‌ట‌న కూడా ఇదే. ఇంకా సత్యం బాబు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:12 - April 4, 2017

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. మిర్చి ధరలు దారుణంగా పడిపోవడంతో తమకు న్యాయం చేయాలని నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఆందోళనకు సీపీఎం, రైతుసంఘాలు మద్దతు తెలిపాయి. ఇదే అంశం పై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ రైతు సంఘం నేత టి. సాగర్, ఏపీ రైతుసంఘం నేత కేశవరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:08 - April 4, 2017

తూ.గో : తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లలమావిడాడలోని కోదండరామాలయం. ఏపీలో ఈ ఆలయం దివ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రకృతి అందాల మధ్య అలరారుతున్న ఈ గుడికి ఏపీలో మరో భద్రాద్రిగా వెలుగొందుతోంది.

గొల్లలమామిడాడ కోదండరామాలయానికి ప్రత్యేకతలు...

గొల్లలమామిడాడ కోదండరామాలయానికి ప్రత్యేకతలు ఉన్నారు. అపూర్వ శిల్ప సంపద ఈ దేవాలయం సొంతం. ఆలయ శిఖరంపై బాలల రామాయణాన్ని తెలిపే శిల్పాలు కనువిందు చేస్తాయి. రెండు రాజగోపురాల మధ్య నిర్మించిన దేవాలయంలో మూలమూర్తులు కొలువుతీరారు. తూర్పు గోపురాన్ని తొమ్మిది అంతస్థుల్లో 160 అడుగుల ఎత్తున నిర్మించారు. పశ్చిమ గోపురాన్ని 11 అంతస్థుల్లో 206 అడుగుల ఎత్తున కట్టారు. వీటిని ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉంది. భక్తకోటి ఈ ఆలయానికి చేరుకున్న వెంటనే భక్తిపావశ్యంలో మునిగిపోతారు. ఆధ్యాత్మికంగా తన్మయత్వంలో మునిగిపోతారు. పచ్చని కొబ్బరి తోటల మధ్య నిర్మించిన కోనేరు గొల్లలమావిడాడ కోదండరామాలయం ప్రత్యేకత.

1889లో నిర్మించిన చిన్న ఆలయాన్ని...

గోలలమామిడాడలో 1889లో నిర్మించిన చిన్న ఆలయాన్ని 1934లో పునర్నిర్మాణం చేశారు. సీతా రామచంద్రులు, లక్ష్మణుడు, హనుంతుడి కొయ్యబొమ్మలను ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ జరిగే రామయ్య కల్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామనవమికి రెండు నెలల ముందు నుంచే గోటితో తలంబ్రాలు వలవడం ప్రారంభిస్తారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోదండరామాలయంగా ఈ గుడి ప్రసిద్ధి చెందింది. పెళ్లికాని వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే కల్యాణ గడియలు సమీపిస్తాయని భక్తుల నమ్మకం. పిల్లలులేని వారు గొల్లలమావిడాడ రామయ్య చెంతకు వచ్చి మొక్కుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు.

శ్రీరానవమి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కల్యాణ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 

19:06 - April 4, 2017

హైదరాబాద్‌: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కూకట్‌ పల్లి, గచ్చిబౌలి, జీడిమెట్ల, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో భారీవర్షంతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. జీడిమెట్ల, షాపూర్‌లో వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి చల్లబడి... భారీవర్షంతో నగరవాసులను ముంచెత్తింది

19:04 - April 4, 2017

విజయవాడ :ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ ఎంట్రన్స్‌లో విజయవాడ నారాయణ కాలేజి విద్యార్థి 38వ ర్యాంక్‌ పొందాడు. ఐఐఎస్సీ ఎంట్రన్స్‌లో తమ విద్యార్థి విజయం సాధించడం అభినందనీయమన్నారు కాలేజి ప్రిన్సిపాల్‌ బాబ్జి. దేశవ్యాప్తంగా 2 లక్షలమంది పరీక్ష రాయగా.. కంటె వినేశ్‌కు 38వ ర్యాంక్‌ లభించిందన్నారు. తనకు 38వ ర్యాంక్‌ రావడం పట్ల వినేశ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ర్యాంక్‌ సాధించానన్నారు వినేశ్‌. ర్యాంక్‌ సాధించిన వినేశ్‌ను తోటి విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు. 

19:02 - April 4, 2017

అమరావతి: జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నాయకత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారని ఏపీ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. జగన్‌కు బ్లాక్‌డేలు ప్రకటించడం అలవాటై పోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1980లో పార్టీ మారిన రోజును బ్లాక్‌ డేగా ప్రకటిస్తావా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ అభివృద్ధి నిరోదకశక్తిగా తయారు అయ్యారని కాల్వ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక జర్నలిస్ట్‌ అయిన తనకు చంద్రబాబు సమాచార శాఖ మంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. 

19:01 - April 4, 2017

పశ్చిమగోదావరి: మొగల్తూరులో ఉన్న ఆనంద్‌ ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీని అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంతోపాటు మరికొందరు నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఇటీవల ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలోన్ని అన్ని విభాగాలను అఖిలపక్ష నేతలు పరిశీలించారు. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న కాలుష్య వర్థాలను గోంతేరు కాలువలో కలుపుతున్న యాజమాన్యంపై అఖిలపక్ష ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:59 - April 4, 2017

నెల్లూరు : జిల్లాలో చీరల మాటున అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనంచేసుకున్నారు. చిల్లకూరు మండల పరిధిలోని బూదనం టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖిల్లో చెన్నై నుంచి కలకత్తా వెళ్తున్న కంటైనర్‌లో గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

 

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన..

హైదరాబాద్: ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డులను మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల వివరాలను సినీనటులు బాలకృష్ణ, మురళీ మోహన్‌ ప్రకటించారు.

నగరంలో వర్షం

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కూకట్‌పల్లి, బాలానగర్‌, భరత్‌నగర్‌, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, మాదాపూర్‌, సనత్‌నగర్‌, ఎస్సార్‌ నగర్‌, జంబారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో వడగళ్ల వాన పడింది.

18:45 - April 4, 2017

హైదరాబాద్ : నవీన్‌ సంజయ్, తనిష్‌ తివారి,తవ్వి మల్లర్‌ ముఖ్య పాత్రల్లో ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్‌ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న 'శరణం గచ్చామి' చిత్రం ఎట్టకేలకుఏ 7వ తేదీన విడుదల కానుంది. భార‌త రాజ్యంగం లో రిజ‌ర్వేష‌న్ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ద‌ర్శ‌కుడు ప్రేమ్ రాజ్ తెర‌కెక్కించిన చిత్రం `శ‌ర‌ణం గ‌చ్చామి`. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని మొదట్లో సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఈ చిత్రం యూనిట్ తో '10 టివి' స్పెషల్ చిట్ చాట్... పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:04 - April 4, 2017

హైదరాబాద్ : బల్దియాలో వార్డు కమిటీలు అటకెక్కాయి. నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు వార్డు కమిటీల ప్రక్రియ పూర్తి కాలేదు. కొన్ని వార్డుల్లో కమిటీలు ఎన్నుకున్నా నియామక ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. దీంతో స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచుతామంటున్న పాలకులు... చేతల్లో మాత్రం వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

74 రాజ్యాంగ సవరణతో స్థానిక సంస్థలకు హక్కులు, బాధ్యతలు....

74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు హక్కులు, బాధ్యతలు, నిధులను బదలాయించింది పార్లమెంట్‌. తద్వారా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తమకు తాముగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు కలిగింది. దాంట్లో భాగంగానే జనాభా దామాషా ప్రకారం వివిధ వర్గాలతో వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకుని టౌన్‌హాల్‌ మీటింగ్‌ల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిశీలించి ప్రణాళికలు రూపొందించుకోవాలి.

జీహెచ్‌ఎంసీలో వార్డు కమిటీల ఏర్పాటుకు 2016 ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌...

గ్రేటర్‌ పరిధిలో 150 డివిజన్లలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయడానికి 2016 ఏప్రిల్‌లో జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానికంగా నివాసముంటూ సంక్షేమ సంఘాల్లోని సభ్యులు, స్లమ్‌లెవల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, కార్యదర్శులు ఈ కమిటీకి అర్హులు. అంతేకాదు... ఎన్‌జీవోలు, మహిళా మండలి సభ్యులు, ట్రేడ్‌ యూనియన్‌ నేతలు, మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు, వాలంటరీ ఆర్గనైజేషన్స్‌తోపాటు వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులు కూడా వార్డు కమిటీకి అర్హులే. ప్రతి కమిటీలోనూ 50శాతం మహిళలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే 150 వార్డులకు మొత్తం 5600 దరఖాస్తులు రాగా... వీటిలో 4600 మందిని అర్హులుగా అధికారులు ప్రకటించారు. వీరిలో ప్రతి వార్డుకు 8 నుంచి 12 మంది సభ్యులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. 50శాతం మహిళలు లేనందున 13 వార్డుల్లో కమిటీలే ఏర్పాటు కాలేదు. టెక్నికల్‌ సమస్యలతో మరో 6 వార్డుల్లోనూ వార్డు కమిటీల ఎంపిక వాయిదా పడింది.

వార్డు కమిటీల ఎంపికకకు జీహెచ్‌ఎంసీ కాలయాపన...

వార్డు కమిటీలను ఎన్నుకోవడానికి జీహెచ్‌ఎంసీ నెలల తరబడి కాలయాపన చేసింది. ఇక ఎన్నుకున్న వారిని కూడా అధికారికంగా ప్రకటించడానికి మరింత సమయం తీసుకుంటోంది. నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు కమిటీలను ప్రకటించలేదు. దీంతో పనుల్లో వార్డు కమిటీల చొరవ లేకుండా పోయింది. దీంతో అంతా కార్పొరేటర్‌ ఇష్టారాజ్యంగానే పరిస్థితి మారింది.

సభ్యుల ఎన్నికలోనూ అంతా రాజకీయమే ...

అటు వార్డు కమిటీల సభ్యుల ఎన్నికలోనూ అంతా రాజకీయమే నడుస్తోంది. తమ వారిని వార్డు కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడానికి ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వార్డు కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్న విమర్శలు నెలకొన్నాయి. వార్డు కమిటీ సభ్యుల ఎన్నికలో రాజకీయ జోక్యం తగదని, పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచాలంటున్నాయి సిటీజన్‌ ఫోరమ్స్‌. అప్పుడే స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు.

18:02 - April 4, 2017

గద్వాల : ఓ భక్తురాలు శ్రీరాముడుపై తనకున్న భక్తిని వినూత్నంగా చాటుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా.. రాఘవేంద్ర కాలనీకి చెందిన లక్ష్మీ వెంకటేశ్వర్లు లక్షా 50 వేల బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రాసింది. ఇలా రాసిన కొన్ని బియ్యం గింజలను రేపు భద్రాచలంలో జరగబోయే స్వామివారి కల్యాణ మహోత్సవానికి సమర్పిస్తామని.. అలాగే స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో 10 వేల 116 బియ్యం గింజలను ఇస్తున్నట్టు లక్ష్మీ వెంకటేశ్వర్లు చెప్పారు. మూడేళ్లుగా బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తున్నట్టు ఆమె చెప్పారు. 

17:49 - April 4, 2017

పెద్దపల్లి : ఇచ్చిన అప్పు తిరిగి అడిగిన పాపానికి ఓ మహిళను దారుణంగా కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్యచేశాడో దుర్మార్గుడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన స్రవంతి, సంతోష్‌ దంపతులు రెండేళ్ల క్రితం ఇంటి ఎదురుగా ఉండే రాదాటి శ్రీనివాస్‌ అనే యువకునికి 40 వేల రూపాయల అప్పు ఇచ్చారు. అప్పు విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. స్రవంతి భర్త సంతోష్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ ఆమెతో గొడవపడి కిరోసిన్‌ పోసి నిప్పు అంటించాడు. శ్రీనివాస్‌ పారిపోవడానికి ప్రయత్నించగా.. అతన్ని ఆమె పట్టుకోవడంతో సగం కాలిపోయాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలైన స్రవంతి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

17:46 - April 4, 2017

నిజామాబాద్ : లారీ ఓనర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లారీల బంద్‌తో నిజామాబాద్ మార్కెట్‌ యార్డులో ఆరు రోజుల నుంచి పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:43 - April 4, 2017

నల్గొండ : దామరచర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో మిర్చి పంటలను సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వంపై విఫలమై...రైతులకు అన్యాయం చేస్తుందని జూలకంటి విమర్శించారు. ఇప్పటికైనా మద్దతు ధర కల్పించాలని.. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

17:40 - April 4, 2017

హైదరాబాద్: సిరియాలో రసాయనిక ఆయుధాలతో జరిగిన దాడి 58 మందిని బలితీసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఇడ్లిబ్ నగరంలో...ఉదయం ఆరున్నర సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. దాడి కారణంగా అస్వస్థతకు గురైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ బలగాలు లేదా రష్యా యుద్ధవిమానాలు దాడి చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తాము రసాయన ఆయుధాలు ఉపయోగించలేదని సిరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ విమానం నుంచే రాకెట్ ద్వారా ఈ దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆరేళ్లుగా అంతర్యుద్ధంగా ఉన్న సిరియాలో ఇదే అతిపెద్ద రసాయనిక దాడి. 

17:38 - April 4, 2017

హర్యానా : బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన దొంగలను ఇద్దరు మహిళా ఉద్యోగినులు ధైర్యంగా అడ్డుకున్న ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. దొంగలను పట్టుకోవడమే కాదు...వారిని చావగొట్టిన విజువల్స్‌ సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. కస్టమర్లలాగా నటించిన ఇద్దరు యువకులు కౌంటర్‌ వద్దకు వెళ్లారు. రివాల్వర్‌, కత్తితో సిబ్బందిని బెదిరించారు. కౌంటర్ వద్ద ఉన్న డబ్బు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. వీరు తప్పించుకోకుండా ఇద్దరు మహిళా ఉద్యోగులు అడ్డుపడ్డారు. వాళ్లను పట్టుకుని బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు వేసి అడ్డంగా నిలబడ్డారు. ఇంతలో స్థానికులు లోపలికి రావడంతో ఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళా ఉద్యోగులను అందరూ కొనియాడుతున్నారు.

17:36 - April 4, 2017

చెన్నై : తీవ్ర కరువుతో అల్లాడిపోతున్న తమిళ రైతులకు మద్రాస్‌ హైకోర్టు ఊరట నిచ్చింది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 5 ఎకరాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అయితే రుణమాఫీని రైతులందరికీ వర్తింప చేయాలని కోర్టు సూచించింది. గత కొన్ని నెలలుగా తమిళనాడులో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుల బాధతో సగటున రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తమను ఆదుకోవాలంటూ గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హైకోర్టు తీర్పుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

17:35 - April 4, 2017

ఢిల్లీ: తనపై అరుణ్‌జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఫీజును ప్రజలే చెల్లించాలన్న ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వాదనపై బిజెపి దాడికి దిగింది. ఇతరులపై అసత్య ఆరోపణలు చేసే కేజ్రీవాల్‌-తనదాకా వచ్చేసరికి ప్రజలపైకి నెట్టేస్తున్నారని మండిపడింది. తన తరపున వాదిస్తున్న లాయర్లకు ఫీజుల రూపంలో కేజ్రీవాల్‌ 3.8 కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించింది. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్‌ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తింది. జైట్లీ వేసిన పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ లాయర్‌ రాంజెఠ్మలానితో పలువురు ఇతర లాయర్లు వాదిస్తున్నారు. వీరికి చెల్లించే 3.8 కోట్ల ఫీజును ప్రభుత్వ ఖ‌జానా నుంచి చెల్లించేలా డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా బిల్స్‌పై సంత‌కం చేసి లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్నర్ అనిల్ బైజాల్ ద‌గ్గరికి పంపించారు. దీనికి ఆమోదం తెలుపాలా వ‌ద్దా అన్నదానిపై ఎల్జీ నిపుణుల అభిప్రాయం కోరారు.

స్పందించిన జెఠ్మలానీ....

జైట్లీ పరువునష్టం దావా కేసులో లాయర్లకు చెల్లించాల్సిన ఫీజును ప్రజలే చెల్లించాలన్నా కేజ్రీవాల్‌ వాదనపై సీనియ‌ర్ లాయ‌ర్ రాంజెఠ్మలానీ స్పందించారు. తాను డ‌బ్బులున్నవారి ద‌గ్గరే ఫీజు వ‌సూలు చేస్తాన‌ని, పేద‌వారి త‌ర‌ఫున ఉచితంగా వాదిస్తాన‌ని జెఠ్మలానీ స్పష్టం చేశారు. ఈ రాద్దాంతానికి అరుణ్‌జైట్లీయే కారణమన్నారు. కోర్టులో తాను సంధించే ప్రశ్నల‌కు భ‌య‌ప‌డే అరుణ్‌జైట్లీ ఈ అంశాన్ని తెర‌పైకి తెచ్చార‌ని జెఠ్మలానీ ఆరోపించారు. ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్‌ ఫీజు చెల్లించకున్నా ఈ కేసులో తాను ఉచితంగా వాదిస్తానని తెలిపారు. కేజ్రీవాల్‌ను కూడా పేద‌ క్లయింట్‌గానే చూస్తానన్నారు.

17:27 - April 4, 2017

హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులను చట్టానికి లోబడి పంపాకాలు చేసుకోవాలి. కానీ ఆస్తులన్నీ మాకు చెందాలంటే... మాకే చెందాలని ఒక రాష్ట్రంపై...మరొక రాష్ట్రం పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక నీటి పంపకాల విషయంలో పరిస్థితి చాలా దూరం వెళ్లింది. దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన భవనాలు ..ఆస్తుల పంపకాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో.. కమిటీలు వేయడం జరిగింది. ఉమ్మడి గవర్నర్ మధ్య వర్తిత్వంతో త్రి సభ్య కమిటీలు నియమించుకున్నాయి.

మూడు సార్లు సమావేశమైన కమిటీలు....

ఈ కమిటీలు ఇప్పటికీ మూడు సార్లు సమావేశమయ్యాయి. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న 12 ఉమ్మడి సంస్థల విభజన పై ఏకాభిప్రాయం కుదిరిందని ప్రకటించినా ఇంత వరకు ఆచరణలో మాత్రం ఒక్కటి కూడా అమలు కాలేదు. అంతే కాదు అన్నింటి పైనా ఇరు వైపులా సానుకూలత వ్యక్తమైందని ఇరు రాష్ట్రాల వారు ప్రకటించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న మళ్లీ ఈ కమిటీలు భేటికానున్నాయి.

భవనాలపై దృష్టి సారించిన తెలంగాణా ప్రభుత్వం...

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం భవనాల పై దృష్టి సారించింది. ఏపీ ప్రభత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నీ నిర్వహణ లేక పాడై పోతున్నాయని..వాటిని తమకు అప్పగిస్తే ప్రజా అవసరాలకు వినియోగిస్తామని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనికి ఏపీ కూడా సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించింది. కానీ దీనిపై ఇరు రాష్ట్రాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎందుకు స్టెప్‌ తీసుకోవడం లేదనేది ప్రశ్నగా మారింది. అయితే ఇందులో కూడా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్లకున్నట్టు తెలుస్తుంది.

ప్రతిపక్షానికి బయపడే ఏపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని సమాచారం....

ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రతిపక్షానికి బయపడే కాలయాపన చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాల సమాచారం. నోటుకు ఓటు కేసు బహిర్గతం కావడంతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వంలో కలవరం మొదలై... ఎడాదిన్నర కాలంలోనే రాజధానిని నిర్మించుకుంది.. అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంది. ఇంకా ఏడేళ్లు రాజధానిగా హైదరాబాద్‌ను వినియోగించుకునే హక్కు ఉన్నా...ఇప్పుడు అసలు హైదరాబాద్‌తో సంబంధం లేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. అలాగే అక్కర్లేని భవనాలకు ట్యాక్స్‌లు.... మెయింటెనెన్స్‌ చార్జీలు చెల్లించడం అనవసరమనే భావనలో ఉన్న ఏపీ ప్రభుత్వం... భవనాలను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడిగా ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో ఉద్దేశ పూర్వకంగానే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాలే ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తోంది.  

17:09 - April 4, 2017

తెలుగు సినిమాలకు టైటిల్స్ దొరకట్లేదండి .నిజం ..పాటల చరణాలు ,స్టోరీ లైన్ తో సంబంధం లేని టైటిల్స్ తెగ వచ్చేస్తున్నాయి . ఆల్రెడీ సినిమా స్టార్టింగ్ లో వర్కింగ్ టైటిల్ ఒకటి అనుకుంటారు మరి ఆలా అనుకుంటే ఫాన్స్ ఊరుకుంటారా పబ్లిసిటీ తో తమ అభిమాన నటుల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. 'శ్రీమంతుడు' సినిమాతో మంచి జోష్ మీద ఉన్నాడు 'మహేష్ బాబు'. తన కొత్త సినిమా నేషనల్ లెవెల్ లో రిలీజ్ సెలెక్టివ్ లేంగ్వేజెస్ లో రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా 'మహేష్ బాబు'కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ని కూడా ఇచ్చింది. గ్రామాలని దత్తత తీసుకుని సర్వీస్ కూడా మొదలు పెట్టాడు ఈ సూపర్ స్టార్. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సబ్జెక్టు తో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో 'రకుల్' హీరోయిన్ గా నటిస్తుంది.

మహేష్..మురుగదాస్..
తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేసి తరువాత 'గజినీ' సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ 'మురుగదాస్'. తెలుగులో కూడా 'గజినీ' సినిమా సూపర్ హిట్ అయింది ఇక్కడ హీరో సూర్యకు మంచి ఫాన్స్ ని సంపాదించి పెట్టింది. ఏ ఆర్ మురుగదాస్ కి సెపరేట్ వర్కింగ్ స్టైల్ అనేది ఉంది. సబ్జెక్టు ఏదైనా యాక్షన్ ని జోడించి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే డైరెక్టర్స్ లో మురుగదాస్ ఒకరు. అందుకే తమిళం లో సూపర్ హిట్ అయిన 'కత్తి' సినిమాని మరో ఆలోచన లేకుండా 'చిరంజీవి' తెలుగులో ఖైదీ నెంబర్ 150గా తెరకెక్కించాడు. 'మహేష్', 'మురుగదాస్' కాంబినేషన్ లో గుడ్ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సబ్జెక్టు ప్రకారం కధ ప్రకారం ఈ సినిమాకి సోషల్ ఎలిమెంట్ తో సంబంధం ఉండటం వల్ల ఫస్ట్ లో అనేక టైటిల్స్ అనుకున్నారు. ఈ  సినిమా ఫస్ట్ లుక్, ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే అందుకు కారణం టైటిల్ విషయంలో క్లారిటీ రాకపోవడమే అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ సమస్య తొలిగిపోయింది. ఈ సినిమా నిర్మాతలు ఎన్.వి ప్రసాద్, ఠాకూర్ మధులు ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ లో కొత్త టైటిల్ రిజిస్టర్ చేయించారు.  'స్పై-డర్' అని రిజిస్టర్ చేయించారు నిర్మాతలు. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా మలయాళం, హిందీ భాషలకు కూడా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. దాంతో ఇదే టైటిల్ ఖాయమని చెప్పొచ్చు.

ఢిల్లీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి..

ఢిల్లీ : దేశ రాజధానిలోని జీవన్ నగర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సన్ లైట్ కాలనీలోని జీవన్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

16:04 - April 4, 2017

పలు వివాదాల్లో తలదూర్చే బాలీవుడ్ నటి 'రాఖీ సావంత్' చిక్కుల్లో పడింది. మహారుషి వాల్మీకిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతేడాది ఓ ప్రైవేటు టెలివిజన్ కార్యక్రమంలో వాల్మికీ కమ్యూనిటీపై రాఖీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. వాల్మీకి గురించి ఆమె చేసిన వ్యాఖ్యల‌పై పలు హిందూ సంస్థలు ఆమెపై దావా వేయ‌డంతో పలుసార్లు కోర్టు ఆమెకు సమన్లు కూడా జారీ చేసింది. అయితే, వాటిపై 'రాఖీ' స్పందించ‌లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లూధియానా కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీ చేయ‌డంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

15:55 - April 4, 2017

ఢిల్లీ : తమిళ రైతుల ఆందోళన కొనసాగుతోంది. 22 రోజులుగా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. రుణమాఫీ, కరవు నిధుల విడుదల, సాగు నీటి కల్పన డిమాండ్లతో రైతులు ధర్నా చేపట్టారు. తమిళ రైతుల ఆందోళనకు ఆమ్‌ ఆద్మీ నేతలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. తమిళ రైతుల ఆందోళనకు సంబందించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. 

15:52 - April 4, 2017

విశాఖ : విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వేజోన్ కోసం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అమర్ నాథ్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. 200 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర జరగనుంది. అన్ని పార్టీలకు ఆహ్వానం పలికాయి. పోరాటాలకు ముందుడే పార్టీలు వామపక్షాలు తన పాదయాత్రకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం మరింత పోరాటం చేస్తామని తెలిపారు.

15:49 - April 4, 2017

మహబూబ్ నగర్ : డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా బ్రోకర్లు చెబితే వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పక్కా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దివిటిపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులను కేటీఆర్‌ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

వీడిన ఒడిశా యువతి హత్య కేసు..

ఢిల్లీ : ఎట్టకేలకు ఒడిశా యువతి హత్య కేసు వీడింది. ప్రియుడే నిందితుడని పోలీసులు తేల్చారు. ప్రియుడు రెడ్డమ్ నరేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తన పెళ్లికి అడ్డుగా వస్తుందనే కారణంగా ప్రియురాలిని నరేష్ హత్య చేశాడు. గత నెల 18న కసింకోటలోని ఈచౌడువాడలో యువతిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు.

15:45 - April 4, 2017

విజయనగరం :పార్వతీపురంలో ఏసీబీకి అవినీతి చేప చిక్కింది. వాణిజ్యపన్నుల విభాగంలో డిసిటిఓగా పనిచేస్తున్న మన్మధరావు, ఎసిటిఓ నరసింహ్మ మూర్తి 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.

తెలంగాణ భవన్ ఎదుట జేఎన్ యూ విద్యార్థులు ధర్నా

ఢిల్లీ : తెలంగాణ భవన్ ఎదుట జేఎన్ యూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో దళిత యువకుడు మధుకర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఆరడుగుల గోతి తీస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అగ్రిగోల్డ్ బాధితుడు గుండెపోటుతో మృతి..

కర్నూలు : బనగాపల్లెలో అగ్రిగోల్డ్ బాధితుడు నారాయణరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. అగ్రిగోల్డ్ స్కాంపై కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్తుల వివరాలతో కూడిన నివేదిక హైకోర్టుకు సీఐడీ సమర్పించింది.

రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తాం - వైసీపీ ఎంపీ వైవీ..

ఢిల్లీ : ఫిరాయింపులపై త్వరలో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అన్ని పార్టీలను కలిసి మద్దతు కోరుతామని, ఈనెల 7న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఫిరాయింపుల వ్యవహారం ఒక్క పార్టీకి సంబంధించింది కాదని, పార్టీ మారిన వారిపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం బాబుకు కొత్త కాదన్నారు.

 

వన్యమృగాల కేసులో అక్బర్ ఖాన్ కు రిమాండ్..

పెద్దపల్లి : వన్యమృగాల వేట కేసులో నిందితులు అక్బర్ ఖాన్ మున్నాను మంథని కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించింది. వన్యమృగాల వేటలో 14 మంది కేసు నమోదు చేయగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వన్యమృగాలను తాను వేటాడలేదని, రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్ర చేసి కేసులో ఇరికించారని అక్బర్ ఖాన్ పేర్కొన్నారు. తనను ఇరికించిన వారి అంతు చూస్తానని హెచ్చరించారు.

 

పార్వతీపురంలో ఏసీబీ దాడులు..

విజయనగరం : జిల్లా పార్వతీపురం వాణిజ్యపన్నుల విభాగంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి డీసీటీవో మన్మథరావు, ఏసీటీవో నరసింహూర్తి పట్టుబడ్డారు.

14:59 - April 4, 2017

హైదరాబాద్: లారీల సమ్మె కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలొ ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సరుకుల రవాణా నిలిచిపోయి.. నిత్యవసర సరుకుల ధరలు వివపరీతంగా పెరిగిపోతున్నాయి.

లారీల సమ్మెతో నిలిచిన సరుకుల రవాణ.....

మార్చి 30 నుండి లారి యజమానులు సమ్మెకు దిగడంతో.. తెలంగాణలో నిత్యావసర సరుకుల రవాణా కటకటగా మారింది. నిజామాబాద్ జిల్లాలో లారీలను రోడ్ల పై తిరుగకుండా లారీయజమానులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై సమ్మె మరింత ప్రభావాన్ని చూపుతోంది.

నిజామాబాద్‌ - 2400, కామారెడ్డిజిల్లాలో- 460 లారీలు బంద్‌.....

ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2400, కామారెడ్డి జిల్లాలో 460 లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర , రాష్ర్ట ప్రభుత్వాలు ఇష్టారీతిగా పన్నులు పెంచుతూ తమపై భారం వేస్తున్నారని లారీ ఓనర్లు అంటున్నారు. డిజిల్ రేట్లు పెరగడం, రవాణా పన్నులు, ఇన్సూరెన్స్ ఫిట్ నెస్ పర్మిట్ రేట్లు పెంచడంపై లారీ యజమానులు సమ్మెకు ఆగ్రహంగా ఉన్నారు.

రవాణాశాఖ చదువు నిబంధనతో ప్రమాదంలో పడిన డ్రైవర్ల ఉపాధి....

మరోవైపు కొత్త రవాణా నిబంధనలతో వేలాది మంది లారీడ్రైవర్లు, క్లీనర్లు ఉపాధికోల్పోయే పరిస్థితులు వచ్చాయనే ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్లకు చదువు తప్పనిసరి అంటున్న నిబంధనతో తాము జీవనాధారా కోల్పోతున్నామని.. 15 నుంచి 30సంవత్సరాల అనుభమున్న సీనియర్‌ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లారీల సమ్మెతో కూరగాయల ధరలకు రెక్కలు....

అటు సరుకుల రవాణా గిపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు., ముఖ్యంగా కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. అసలే ఎండకాలం..కూరగాయల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో.. సహజంగానే ధరలు మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఇపుడు లారీల సమ్మెతో రవాణా స్థంభించింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిజామాబాద్‌, కామారెడ్డిజిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని లారీ యజమానులు, డ్రైవర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. 

14:54 - April 4, 2017

భద్రాద్రి : భద్రాచలంలో రేపు జరిగే శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణానికి కొబ్బరి బోండాలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన రాజులూరి రామారెడ్డి అనే భక్తుడు గత 17 ఏళ్లుగా స్వామివారి కళ్యాణానికి కళ్యాణ కొబ్బరి బోండాలను తయారుచేసి సమర్పిస్తున్నాడు. స్వామివారి కళ్యాణం రోజున ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బోండాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో భక్తి శ్రద్దలతో తయారుచేసిన కొబ్బరి బోండాలు ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తున్నాయి. 

14:52 - April 4, 2017

భద్రాద్రి : శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీరామాలయంలో స్వామి వారి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా... అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... భద్రతా చర్యలు కూడా తీసుకున్నామని ఎమ్మెల్యే సున్నం రాజయ్య చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:49 - April 4, 2017

అమరావతి: పార్టీ ఫిరాయింపులు నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరూతూ బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని పురందేశ్వరి కోరారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని మోదీ, అమిత్‌షాకు రాసిన లేఖలో పురందేశ్వరి ప్రస్తావించారు.

సన్ లైట్ కాలనీలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : సన్ లైట్ కాలనీలోని జీవన్ నగర్ లో ఉన్న అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 8 ఫైరింజన్ ల సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

13:55 - April 4, 2017

అమ్మ అంటే నిలువెత్తు వాత్సల్యానికి ప్రతీక. తమలోని మాతృప్రేమను రంగులతో రంగరించి చిత్రించిన ఈ మగువల చిత్రా కళా ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేం. తమలోని ప్రతిభను చాటుకుంటూనే మాతృప్రేమను కూడా చిత్రాల్లో అవిష్కరించారు. రాగ రంజితంగా అమ్మతనాన్ని ప్రతిభింబించే మహిళ కళాచిత్ర ప్రదర్శనతో మీ ముందుకు వచ్చింది ఈనాటి స్ఫూర్తి. పూర్తి వివరాలను వీడియోలో చూడండి.

 

మోడీ..షాలకు పురంధేశ్వరీ లేఖ..

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్ షాలకు ఏపీ బీజేపీ నేత పురంధేశ్వరి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్లం అపహాస్యమౌతోందని, పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఏపీలో ఎలా సమర్థించుకుంటారని లేఖలో ప్రశ్నించారు. టిడిపికి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఈ ఫిరాయింపులను సమర్థిస్తున్నట్లు సంకేతాలు వెళుతున్నాయని తెలిపారు. ఫిరాయింపుల నిరోధానికి చట్టాలు తేవాలని సూచించారు.

 

13:17 - April 4, 2017

తూర్పుగోదావరి : తునిలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాద ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

 

తునిలో బాణాసంచా తయారీలో పేలుడు..

తూర్పుగోదావరి : తునిలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది గాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

13:04 - April 4, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని మొగల్తూరులో ఉన్న ఆనంద్‌ ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీని అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శించింది. వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంతోపాటు మరికొందరు నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఇటీవల ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలోన్ని అన్ని విభాగాలను అఖిలపక్ష నేతలు  పరిశీలించారు. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న కాలుష్య వర్థాలను గోంతేరు కాలువలో కలుపుతున్న యాజమాన్యంపై అఖిలపక్ష ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మహబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..

మహబూబ్ నగర్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దివిటిపల్లిలో డబుల్ బె డ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇళ్ల మంజూరులో ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇళ్లపై ప్రతిపక్షాల ఆరోపణలు తగవని, త్వరలో మహబూబ్ నగర్ పురపాలికలో పర్యటిస్తానని కేటీఆర్ హామీనిచ్చారు.

13:02 - April 4, 2017

గుంటూరు : జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది 'మిర్చి'..ఎందుకంటే ఏషియాలోనే ఈ 'మిర్చి' అంత పాపులార్టీ సంపాదించుకుంది. ఇక్కడి మిర్చి దేశ..విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. కానీ దీనిని పండించే రైతు ప్రస్తుతం కన్నీరు కారుస్తున్నాడు. కనీస మద్దతు ధర లేక విలవిలలాడుతున్నాడు. అరుకాలం కష్టపడి పండించిన పంటకు 'మద్దతు ధర' లేకపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మిర్చి యార్డులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. క్వింటాలుకు ధర రూ. 2వేలు కూడా పలకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు ఏకంగా మార్కెట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరి ఆందోళనకు సీపీఎం, రైతు సంఘాలు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నాయి. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆందోళనకు మద్దతు తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడుతూ...మార్క్ ఫెడ్ వెంటనే రంగంలోకి దిగి మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆందోళన నిర్వహిస్తున్నా సర్కార్ లో చలనం కూడా లేదని విమర్శించారు. గత కొద్ది రోజుల కింద అఖిలపక్ష తీర్మానం చేయడం జరిగిందని, ఈ తీర్మానాన్ని సీఎంకు పంపామని మరొకరు పేర్కొన్నారు. మార్క్ ఫెడ్ వద్ద రూ. 200 కోట్లు ఉన్నా డబ్బు లేదని చెప్పడం సబబు కాదన్నారు. గతంలో వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్న పుల్లారావు హామీ ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందించి రైతులు సమస్య తీరుస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

 

 

 

12:50 - April 4, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఘోరం జరిగింది. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జిల్లాలోని కరీంనగర్ మండలం దుర్శేడ్‌ గ్రామంలో ఓ మైనర్‌ బాలికపై అశోక్‌ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు అశోక్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అశోక్‌ ఇంట్లోని వస్తులు, ఫర్నీచర్‌ను అంతా గ్రామస్తులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా నిందితుడు అశోక్‌ను పట్టుకొని బాలిక బందువులు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు..నిందితుడు అశోక్‌ను అదుపులోకి  తీసుకున్నారు. ఈఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

 

12:46 - April 4, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఇంటర్‌ కాలేజీలపై ఇంటర్‌బోర్డు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్‌ కాలేజీలపై అధికారులు కొరఢా ఝలింపించారు. సమ్మర్‌ హాలీడేస్‌లో స్పెషల్‌ క్లాసులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కాలేజీతో పాటు మరికొన్ని కాలేజీలకు అధికారులు నోటీసులు జారీచేశారు. కోచింగ్‌ పేరుతో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని అధికారులు కాలేజీ యాజమాన్యాలను నిలదీశారు. 

12:43 - April 4, 2017

ఇంటర్ కాలేజీల్లో అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ : ఇంటర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోచింగ్ పేరిట ఫస్టియర్, సెకండియర్ క్లాసులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో ప్రత్యేక క్లాసులను కాలేజీలు నిర్వహిస్తున్నాయి. మియాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీతో పాటు మరో రెండు కాలేజీలకు నోటీసులు జారీ చేశారు.

స్కూల్ ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ కార్యాలయంలో స్కూల్ ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ తిరుమలరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.

కేంద్ర బృందం ఇంజినీర్లతో ఇరిగేషన్ అధికారుల భేటీ..

హైదరాబాద్ : జలసౌధలో కేంద్ర బృందం ఇంజినీర్లతో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. మిషన్ కాకతీయపై బృందం అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే.

12:32 - April 4, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో యువనేత కేటీఆర్‌కు మరింత ప్రాధాన్యత పెంచేందుకు గులాబీ దళపతి పావులు కదుపుతున్నారా? పార్టీలో నెంబర్‌ టూ కేటీఆర్‌ అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారా? ప్రభుత్వంలో చురుగ్గా  బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌కు పార్టీలోనూ కీలకంగా వ్యవహరించేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారా? జిల్లాల వారీగా జనహిత సదస్సులు నిర్వహించడంలో ఉద్దేశం అదేనా?  
పార్టీలో కీలకంగా మారబోతున్న కేటీఆర్‌
గులాబీ పార్టీలో కేటీఆర్‌ను భవిష్యత్‌ నేతగా ప్రజెంట్‌ చేసేందుకు కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. నెంబర్‌ టూ పొజిషన్‌ ఎవరిదన్న సందేహాలు నేతలను వెంటాడుతున్నా..ఆ స్థానం పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు దక్కదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌...ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తుండటంతో..జనహిత జాగృతి పేరుతో కేటీఆర్‌ ప్రజల్లోకి వెళ్తున్నారు. 
కరీంనగర్‌ సభలో స్థానికనేతలపై కేటీఆర్‌ వరాల జల్లు 
జనహిత జాగృతి సభల కోసం పార్టీలో తన అనుయాయులుగా మద్రపడ్డ నేతల నియోజకవర్గాలనే కేటీఆర్‌ ముందుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన సభలో స్థానిక నేతల పనితీరును కేటీఆర్‌ ప్రశంసించారు. తాజాగా రంగారెడ్డి జిల్లా తాండూరు సభలో ...ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కేటీఆర్‌ అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. ఇది పేదల ప్రభుత్వమో.. పెద్దల ప్రభుత్వమో ఆలోచించాలన్నారు. 

 

12:24 - April 4, 2017

కృష్ణా : జిల్లాలో దారుణం జరిగింది. భార్యను హత మార్చి అనంతరం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెన్నారావు, విజయలక్ష్మీ దంపతులు చాట్రాయి మండలం చనుబండలో నివాసముంటున్నారు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెన్నారావుకు మద్యం తాగే అలవాటు ఉంది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. పనికి వెళ్లే క్రమంలో భోజనం పెట్టే సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో చెన్నారావు కత్తిపీటతో భార్య విజయలక్ష్మి గొంతు కోశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. తర్వాత చెన్నారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చెన్నారావు పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. పోలీసులు చెన్నారావుపై హత్య కేసు, ఆత్మహత్యాయత్నం కేసులను నమోదు చేశారు. చెన్నారావు, విజయలక్ష్మీల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. చెన్నారావు నిత్యం మద్యం తాగుతాడని చెప్పారు. కావాలనే చెన్నారావు భార్యను హత మార్చారని స్థానికులు చెబుతున్నారు. అయితే దంపతులకు  ఇద్దరు పిల్లలున్నట్లు తెలుస్తోంది. గొడవ జరిగిన సమయంలో పిల్లలు ఇంట్లో లేరని సమాచారం.  

వెంకయ్యపై రామకృష్ణ ఆరోపణలు..

కృష్ణా : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. స్వర్ణభారతి ట్రస్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వెంకయ్య నాయుడు కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు క్విడ్ ప్రో కో కింద భవనాలు నిర్మించి ఇచ్చారని ఆరోపించారు. వెంకయ్య తప్పులు చేయడం వల్లే రాష్ట్ర సమస్యలను ప్రధానికి వివరించలేకపోతున్నారని విమర్శించారు. స్వర్ణభారతి ట్రస్టుపై విచారణ కోరుతూ సీఎంకు లేఖ రాయడం జరిగిందని, బాబు స్పందించకపోతే రాష్ట్రపతికి లేఖ రాస్తానని హెచ్చరించారు. లారీ ఓనర్ల సమ్మె ఉధృతం కాకముందే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం..

కరీంనగర్ : దుర్శేడులో మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగ్రహంతో గ్రామస్తులు ఇంటిపై దాడి చేసి యువకుడిని చితకబాదారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. గ్రామంలోకి పోలీసులు రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.

11:40 - April 4, 2017

గుంటూరు : జిల్లా మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా నిర్వహించారు. రోడ్లపై బైఠాయంచి ఆందోళన చేపట్టారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. క్వింటాల్ మిర్చిని రూ.10 వేల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాపారులు, నేతలు సిండికేట్ గా మారి మిర్చి ధరను రూ.2 వేలకు తగ్గించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు సీపీఎం, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. రైతుల ఆందోళలనలో పాల్గొన్నాయి. 
రైతులు...
'మిర్చి గిట్టుబాటు ధరను రూ.10 వేల నుంచి 12 వేలకు పెంచాలి. మిర్చి రైతులను ఆదురోవాల్సింది పోయి సంబరాలు చేసుకుంటున్నారు. రుణాలు ఇచ్చి రైతు బంధు పతకం ద్వారా ఆదుకోవాలి. మార్క్ ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలి. మిర్చి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే మంత్రి పదవులను హూస్టింగ్' చేస్తామని హెచ్చరించారు. 


 

 

11:38 - April 4, 2017

టీమిండియా క్రికేటర్ల వేతనాలపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా దేశాల క్రికెటర్లతో పోలిస్తే రూ. 2 కోట్లు మాత్రం చాలా తక్కువ అని రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా బోర్డులు భారత్ కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా క్రికెటర్ల జీతాలను రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఏ గ్రేడ్ క్రికెటర్లకు రూ. కోటి స్థానంలో రూ. రెండు కోట్లు.. బి గ్రేడ్ కి రూ. కోటి..సి గ్రేడ్ కి రూ. 50 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. మరి రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

 

11:05 - April 4, 2017

విశాఖ : ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధర్ అక్రమాస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉందని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. గంగాధర్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి భారీగా ఆస్తుల్ని సంపాదించినట్లు తెలుస్తోంది. గంగాధర్ చిత్తూరు జిల్లాలో 19 ఎకరాల భూమిని, మరో 6 ఎకరాల డీ పట్టా భూమిని ఆక్రమించకున్నట్లు అధికారులు తెలిపారు. నేల్లూరు జిల్లాలో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో బయపడింది. అంతే కాకుండా హైదరాబాద్, విశాఖల్లో బ్యాంకు లాకర్లలో రెండు కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

 

 

10:59 - April 4, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణం అగ్రిగోల్డ్ కేసులో కీలక ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. మొత్తం 229 ఆస్తుల వివరాలను సీఐడీ కోర్టు ముందుంచింది. ఇందులో సీఐడీ 9 ఆస్తుల విలువ రూ. 1200 కోట్లుగా తేల్చింది. మిగిలిన ఆస్తుల విలువను రూ.900 కోట్లుగా నిర్ధారించింది. కోర్టుకు సమర్పించిన వివరాలలో హాయిలాండ్ కూడా చేర్చారు. హాయిలాండ్ విలువ రూ.600 కోట్లుగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆన్ లైన్ లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అయితే తెలంగాణలో అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కుగా ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాని దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించ లేదు. అగ్రిగోల్డ్ సంస్థ...ఖాతదారులను మోసం చేసింది. దాదాపు 40 అక్షల మంది బాధితుల నుంచి రూ.7 వేల కోట్లు సమీకరించింది. దీంతో బాధితులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

 

10:58 - April 4, 2017

నిజామాబాద్ : లారీల సమ్మె కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలొ ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సరుకుల రవాణా నిలిచిపోయి.. నిత్యవసర సరుకుల ధరలు వివపరీతంగా పెరిగిపోతున్నాయి. మార్చి 30 నుండి లారి యజమానులు సమ్మెకు దిగడంతో.. తెలంగాణలో నిత్యావసర సరుకుల రవాణా కటకటగా మారింది.  నిజామాబాద్ జిల్లాలో లారీలను రోడ్ల పై తిరుగకుండా లారీయజమానులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై సమ్మె మరింత ప్రభావాన్ని చూపుతోంది. 
నిజామాబాద్‌ 2400, కామారెడ్డిలో 460 లారీలు బంద్‌
ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2400, కామారెడ్డి జిల్లాలో 460 లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర , రాష్ర్ట ప్రభుత్వాలు ఇష్టారీతిగా పన్నులు పెంచుతూ తమపై భారం వేస్తున్నారని లారీ ఓనర్లు అంటున్నారు.  డిజిల్ రేట్లు పెరగడం, రవాణా పన్నులు,  ఇన్సూరెన్స్  ఫిట్ నెస్ పర్మిట్ రేట్లు పెంచడంపై లారీ యజమానులు సమ్మెకు ఆగ్రహంగా ఉన్నారు.
ఆందోళనలో లారీడ్రైవర్లు, క్లీనర్లు
మరోవైపు కొత్త రవాణా నిబంధనలతో వేలాది మంది లారీడ్రైవర్లు, క్లీనర్లు ఉపాధికోల్పోయే పరిస్థితులు వచ్చాయనే ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్లకు చదువు తప్పనిసరి అంటున్న నిబంధనతో తాము జీవనాధారా కోల్పోతున్నామని.. 15 నుంచి 30సంవత్సరాల అనుభమున్న సీనియర్‌ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
కూరగాయల ధరలకు రెక్కలు
అటు సరుకుల రవాణా గిపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు., ముఖ్యంగా కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. అసలే ఎండకాలం..కూరగాయల ఉత్పత్తి  తక్కువగా ఉండటంతో.. సహజంగానే ధరలు మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఇపుడు లారీల సమ్మెతో రవాణా స్థంభించింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిజామాబాద్‌, కామారెడ్డిజిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని లారీ యజమానులు, డ్రైవర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. 

 

10:54 - April 4, 2017

హైదరాబాద్ : పార్టీ మారిన వారకి చంద్రబాబు మంత్రిపదవులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ మండిపడ్డారు. తాను ఆరోజు పార్టీ మారినపుడు నోటికి వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు.. తన దాకా వచ్చే సరికి.. అన్ని నియమాలు, నీతులు తుంగలో తొక్కారని తలసాని విమర్శించారు. నేను నిప్పు, నిజయాతీ లాంటి మాటలు చంద్రబాబకు సూట్‌ కావన్నారు. క్రమశిక్షణ గల పార్టీ అంటూ.. ఇంకా చంద్రబాబు సొంతడబ్బా కొట్టుకుంటున్నారని తలసాని ఎద్దేవాచేశారు. 
వారికి మంత్రి పదువులు ఎలా ఇచ్చారు...?
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాటల తూటాలు పేల్చారు. పార్టీ మారిన వారికి నీతిలేదని తన విషయంలో మాట్లాడిని చంద్రబాబు.. ఇవాళ వైసీపీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ఆయన నిలదీస్తున్నారు. సత్య హరిశ్చంద్రుడు మాట్లాడినట్టు మాట్లాడే చంద్రబాబు .. పార్టీ మారిన వారికి ఎలా మంత్రి పదవులిచ్చారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. నేను నిప్పు, నిజయాతీ లాంటి మాటలు చంద్రబాబకు సూట్‌ కావన్నారు. 
చంద్రబాబు మాట తప్పారు : తలసాని 
ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉన్నాయి .. అన్నట్టు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. గతంలో మీరు చెప్పిన మాటలు.. ఓసారి గుర్తుచేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. జీవితంలో బీజేపీతో కలవనని  చెప్పిన చంద్రబాబు అందరికంటే ముందుగానే  బీజేపీ నాయకులతో  కలిసిపోయారని  తలసాని విమర్శించారు.   
చంద్రబాబుతోనే పార్టీలో కమీషన్ల కల్చర్‌ : తలసాని
మీపార్టీ , మీఇష్టం.. మీరు ఎవరికి పదవులు ఇచ్చినా.. ముఖ్యమంత్రి హోదాలో పదవుల కేటాయింపు మీఇష్టం.. కాని.. ఎదువారికి ఒక వేలు చూపించేప్పుడు.. నాలుగువేళ్లు నిన్నే చూపిస్తాయంటున్నారు.. తలసాని. అవసరం వచ్చినపుడు.. సమయానుకూలంగా రంగులు మార్చడం చంద్రబాబుకు అలవాటే అన్నారు తలసాని. ఎన్టీరామారావు పార్టీ పెట్టిన నాటి సిద్ధాంతాలు, నియమాలు కాస్తా .. పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక కార్పొరేట్‌కల్చర్‌, కమీషన్ల వ్యవహారంగా మర్చేశారని తలసాని విమర్శించారు. 
చేతనైతే నాతో ఎన్నికల్లో తలపడండి : తలసాని
ఇప్పటికైనా మీరు మాట్లేడేటపుడు ఆచీతూచి మాట్లాడండని .. చంద్రబాబుకు సలహా ఇచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ . రాజీనామా చేసి ఎన్నికల్లో సత్తా నిరూపించుకోవాలని తలసాని విసిరిన సవాల్‌ను టీడీపీ అధినేత ఎలా తీసుకుంటారో వేచిచూడాలి.

 

గుంటూరు మిర్చి యార్డులో రైతుల ఆందోళన..

గుంటూరు: మార్కెట్ యార్డులో మిర్చి రైతులు ఆందోళన చేపటాటరు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు సీపీఎం, రైతు సంఘం మద్దతు తెలిపింది. క్వింటాల్ మిర్చికి రూ. 10 వేల మద్దతు ధర ఇవ్వాలని, ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

10:49 - April 4, 2017

విజయవాడ : పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవంటున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఇంతకీ చంద్రబాబుకు కోపం ఎందుకొచ్చింది..? పార్టీ నేతలపై బాబు సీరియస్‌ కావడానికి కారణం ఏంటీ..?  వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు
రాష్ట్ర విభజన అనంతరం సీఎం అయిన చంద్రబాబు.. పార్టీలో సీనియర్లు, మరికొంతమంది జూనియర్లకు తన కేబినెట్‌లో అవకాశం కల్పించారు.  అప్పుడు కేబినెట్‌లో చోటు దక్కని సీనియర్లంతా  మళ్లీ మంత్రివర్గ విస్తరణ జరిగే తప్పకుండా అవకాశం వస్తుందని ఆశించారు. ఇన్నాళ్లుగా మంత్రిపదవిపై ఆశలు పెంచుకున్న వారు చాలా మందే ఉన్నారు. కేబినెట్‌ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని ఆశించారు. అయితే చాలా మంది సీనియర్లకు కేబినెట్‌ విస్తరణలో నిరాశే మిగిలింది. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలూ భంగపాటుకు గురయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసిన వారు మనస్తాపానికి చెందారు. కొంతమంది అలక వహించారు.   అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు.  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్‌లాంటి వారు ఒకడుగు ముందుకేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేశారు. మరికొంతమంది మంత్రిపదవి దక్కలేదన్న కోపంతో తమ ప్రాంతంలోని టీడీపీ కార్యకర్తలతో మూకుమ్మడి రాజీనామాలు చేయించారు.  అధిష్టానానికి తమ అసంతృప్తి బహిరంగంగానే వినిపించారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఆ నియోజకవర్గ బంద్‌కు కూడా వెనుకాడలేదు.  వైసీపీ నుంచి వచ్చిన వారికి, ఎప్పుడూ పార్టీలు మారుతున్న వారికే చంద్రబాబు పట్టంకట్టారంటూ  అసంతృప్త నేతలు అధినేతపై విమర్శలు గుప్పించారు. దీంతో అసంతృప్తుల వ్యవహారం రచ్చకెక్కింది.
అసంతృప్త నేతలను బుజ్జగించిన పార్టీ అధిష్టానం
అసంతృప్త నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు చేసింది. పార్టీ నుంచి దూతలను పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల దృష్ట్యా కేబినెట్‌ కూర్పు, సామాజిక సమీకరణాలను నేతలకు వివరించారు. దీంతో కొంతమంది శాంతించగా... మరికొంత మంది ఇంకా అలకపాన్పు దిగలేదు. కేబినెట్‌ విస్తరణతోనే అన్ని అవకాశాలు అయిపోలేదని.. భవిష్యత్‌లో న్యాయం చేస్తామంటూ అధిష్టానం నుంచి హామీలు అందడంతో కాగిత వెంట్రావు లాంటి నేతలు కొందరు మెత్తబడినా.. మరికొందరు ఇంకా లోలోపల చంద్రబాబు తీరుపై రగిలిపోతూనే ఉన్నారు. 
అసంతృప్తు నేతలపై బాబు సీరియస్ 
పార్టీ అధినేత చెప్పిన మాటలను ఈచెవితో విని.. ఆ చెవితో వదిలేస్తుండడంతో చంద్రబాబు వారిపై సీరియస్‌ అయ్యారు. పార్టీ క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవంటూ ఘాటూగా హెచ్చరించారంచడంతో అసంతృప్తనేతలు ప్రస్తుతానికి మెత్తబడ్డట్టే కనిపిస్తోందంని టీడీపీలో చెప్పుకుంటున్నారు. 

 

ఒడిశాలో అగ్నిప్రమాదం..

ఒడిశా : సాంబ్లాపూర్ గోలాబజార్ మండిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వందకు పైగా దుకణాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పినట్లు సమాచారం.

బారాముల్లాలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ..

జమ్మూ కాశ్మీర్ : బారాముల్లాలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగుతోంది. కాశ్మీర్ కు చెందిన 19వేల మంది యువత రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొన్నారు.

10:45 - April 4, 2017

ప్రపంచంలో అందమైన మహిళలు ఎంత మంది ఉంటారు ? దీనిపై బజ్ నెట్ అనే మీడియా సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. 30 మందితో ఈ జాబితా ఉంది. అందులో బాలీవుడ్ నటి 'ప్రియాంక చోప్రా' రెండోస్థానంలో ఉండడం విశేషం. ఇక మొదటి స్థానంలో హాలీవుడ్‌ సింగర్‌, లిరిసిస్ట్‌, నటి బియాన్సే నిలిచింది. ‘ప్రియాంక చోప్రా' బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ లో కూడా కనిపిస్తోంది. ‘క్వాంటికో' సీరియల్ ద్వారా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ లో 'బేవాచ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'క్వాంటికో' సిరీస్‌కు గానూ రెండుసార్లు పీపుల్‌ ఛాయిస్‌ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అలాగే ఆస్కార్‌ వేదికపై మెరవడంతోపాటు పలు అంతర్జాతీయ షోస్‌లో కూడా పాల్గొంది.

అందమైన మహిళల జాబితా :
బియాన్సే, ప్రియాంక చోప్రా, టేలర్‌ హిల్‌, ఎమ్మా వాట్సన్‌, డకోటా జాన్సన్‌, హిల్లరీ క్లింటన్‌, మార్గట్‌ రాబీ, ఏంజెలినా జోలీ, ఫరీరు ఎవ్సెన్‌, అలెగ్జాండ్రియా డెడారియా, విక్టోరియా రుఫో, ఎమ్మా స్టోన్‌, గిగి హాడిడ్‌, నికి కరీమీ, ఆప్లే గ్రహమ్‌, గల్‌ గడౌట్‌, బ్లేక్‌ లైవ్లీ, అమాండా సెర్నీ, ఆండ్రియానా లిమా, హైఫా వెబే, మిషేల్‌ ఒబామా, ఓప్రా విన్‌ ఫ్రే, ఎలిజావెటా బొయాస్కయా, రోండా రుసే, మాన్యులా ఆర్కురి, అనీ కర్టిన్‌, నౌమీ క్యాంప్‌బెల్‌, తరానే అలీదూస్తీ, అలిషయా వికందర్‌, మొజ్దా జమల్‌జదా.

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కృష్ణా : జిల్లాలోని చాట్రాయి (మం) చనుబండలో దారుణం చోటు చేసుకుంది. కత్తితో భార్య విజయలక్ష్మి గొంతు కోసిన భర్త చెన్నారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నారావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

నలుగురు చిన్నారులపై దూసుకెళ్లిన ట్రక్కు..

జార్ఖండ్ : పలాము వద్ద ట్రక్కు బీభత్సం సృష్టించింది. నది ఒడ్డున నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. నలుగురు చిన్నారులు అక్కడికక్కడనే మృతి చెందారు.

అగ్రిగోల్డ్ ఆస్తులపై హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 9 ఆస్తులతో పాటు మరో 220 ఆస్తులను కూడా హైకోర్టుకు ఏపీ సీఐడీ అధికారులు సమర్పించారు.

వన్యమృగాల కేసు విచారణ వేగవంతం..

భూపాలపల్లి : వన్యమృగాల వేట కేసులో విచారణ వేగవంతమైంది. ప్రధాన నిందితుడు, జెడ్పీటీసీ భర్త అక్బర్ ఖాన్, మున్నాలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కాసేపట్లో మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు.

పెగడపల్లిలో క్షుద్రపూజలు..

పెద్దపల్లి : కాల్వశ్రీరాంపూర్ (మం) పెగడపల్లిలో క్షుద్రపూజలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు మంత్రగాళ్లు పారిపోయారు. రాజేశ్వరి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గంగాధరం అక్రమాస్తులు రూ. 300 కోట్లకు పైగానే..

హైదరాబాద్ : ఏపీలో ఆర్ అండ్ బి ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన గంగాధరం అక్రమాస్తులు రూ. 300 కోట్లకు పైగానే ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఏసీబీ సోదాల్లో వాస్తవాలు వెల్లడవుతున్నాయి. కాంట్రాక్టర్లతో గంగాధరం చేతులు కలిపి భారీగా ఆస్తులని సంపాదించుకున్నాడు. చిత్తూరు జిల్లాలో 19 ఎకరాల భూమిని, మరో ఆరు ఎకరాల డీ పట్టా భూమిని గంగాధరం ఆక్రమించుకున్నాడని, నెల్లూరు జిల్లాలో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

09:40 - April 4, 2017

ఏంటీ హీరోయిన్ గా నటిస్తూ విజయవంతంగా ముందుకెళుతున్న 'సమంత' రూటు మార్చిందా ? ఆమె విలన్ గా నటించనుందా ? ఇదే ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైవిధ్యమైన పాత్రలు చేయాలని పలువురు హీరోయిన్లు కొరుకొంటారనే సంగతి తెలిసిందే. కథనంతో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉంటే దానికి ఒకే చెప్పేస్తుంటారు. తాజాగా 'సమంత' విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ‘జూనియర్ ఎన్టీఆర్' చిత్రంలో ఆమె విలన్ గా నటించబోతున్నట్లు టాక్. ‘ఎన్టీఆర్' బావి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ఎన్టీఆర్' మూడు భిన్నమైన పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే మూడు పాత్రల కోసం రాశిఖన్నా, నివేదా థామస్‌లను కథానాయికలుగా ఎంపిక చేశారు. తాజాగా మూడో పాత్ర సరసన నటించేందుకు 'సమంత'ని చిత్ర యూనిట్‌ సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం. కానీ సమంత పాత్ర నెగటివ్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ఎనౌన్స్‌ చేయబోతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈచిత్రాన్ని ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి 'సమంత' ఈ చిత్రంలో విలన్ నటించారా ? నటిస్తే ఎలా నటించారు అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

09:30 - April 4, 2017

టాలీవుడ్ లో మాస్ మహారాజగా పేరొందిన 'రవితేజ' ప్రస్తుతం స్పీడు పెంచాడు. ‘బెంగాల్ టైగర్' అనంతరం సంవత్సరం దాక గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఈ సంవత్సరంలో పలు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' అనే చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే 'రాజా ది గ్రేట్' చిత్రాన్ని తాను చేయనున్నట్లు ఇదివరకు 'రవితేజ' ప్రకటించిన విషయం తెలిసిందే. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'రవితేజ' సరసన 'మెహరీన్' హీరోయిన్ గా నటించనుంది. తాజాగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్లింది. ఓ పిక్ ను సోషల్ మాధ్యమాల్లో చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఈ చిత్రాల అనంతరం 'రవితేజ' ఓ రీమెక్ చిత్రంలో నటించనున్నారని టాక్.

జార్ఖండ్ లో ట్రక్కు బీభత్సం

జార్ఖండ్ : పలాము వద్ద ట్రక్కు బీభత్సం సృష్టించింది. నది ఒడ్డున నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. 

09:20 - April 4, 2017

టాలీవుడ్..బాలీవుడ్.. మల్టిస్టారర్ చిత్రాలు తెరకెక్కుతుంటాయి. కానీ టాలీవుడ్ లో మాత్రం అడపదడపా మాత్రమే వస్తున్నాయి. తమ అభిమాను సంతృప్తి పరిచేందుకు అగ్ర హీరోలు ఆయా చిత్రాల్లో ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత వెండి తెరపై కనిపించిన 'చిరంజీవి' 151వ చిత్రంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ఘన విజయం సాధించింది. 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ద్వారా 'చిరంజీవి' కనిపించనున్నాడని టాక్. దీనిపై అప్పుడే సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘చిరంజీవి' సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో విక్టరీ 'వెంకటేష్' ఓ పాత్రలో మెరవనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటించాలని 'వెంకీ'ని 'రాంచరణ్' అడిగినట్లు అప్పట్లో వినిపించింది. అయితే కొన్ని కారణాల వలన 'వెంకటేశ్' ఆ పాత్రను చేయడం కుదరలేదని, ఇప్పుడు మాత్రం 151వ సినిమాలో చేస్తారని టాక్. మరి నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

నేడు విశాఖలో మంత్రి కామినేని పర్యటన

విశాఖ : నేడు విశాఖలో మంత్రి కామినేని శ్రీనివాస్ పర్యటించనున్నారు. నిమ్స్ లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కేజీహెచ్, విక్టోరియా ఆస్పత్రులపై సమీక్ష చేయనున్నారు.

08:49 - April 4, 2017

పార్టీ ఫిరాయింపులపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు నగేష్ కుమార్, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత విజయ కుమార్ పాల్గొని, మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులతోపాటు పలు అంశాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:37 - April 4, 2017

మిర్చి, కందులతోపాలు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత కిసాన్ సభ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మళ్లీ పాత చరిత్రే వెక్కిరిస్తోంది. మార్కెట్ కు వెళ్లిన రైతులు గుండెలు బాదుకుంటున్నారు. తమ కష్టాన్ని కళ్లెదుటే దళారీలు కొల్లగొడుతున్న ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు చిక్కుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం పదివేల రూపాయలకు పైగా పలికిన మిర్చి ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. నాలుగు వేల రూపాయల దగ్గర నుంచి వ్యాపారులు బేరం మొదలుపెడుతున్నారు. కందుల ధర పన్నెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల అయిదు వందల రూపాయలకు పడిపోయింది. ఇలాగైతే బతికేదెట్టా? పెట్టుబడులు పూడేదెట్టా? ఇదే ప్రశ్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటలు చేతికొచ్చిన వేళ రైతుల ముఖాల్లో సంతోషం ఎందుకు మాయమవుతోంది? ధరల మాయాజాలం వెనక వున్న మతలబు ఏమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:28 - April 4, 2017

కెనడా : వాంకోవర్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బ్రిటీష్ కొలంబియా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ మంత్రి అమ్‌రిక్ విర్క్, వాటా ప్రతినిధి రామకృష్ట హాజరయ్యారు. కార్యక్రమంలో చిన్నారులు... తెలుగు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆహుతులను అలరించారు.  

 

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

మహబూబ్ నగర్ : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.  

 

08:23 - April 4, 2017

బీహార్ : ఆర్జేడి చీఫ్‌ లాలు తనయుడు, బీహార్‌ వైద్యశాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ధర్మ నిర్పేక్ష సేవక్‌ సంఘ్‌-డిఎస్‌ఎస్‌ పేరిట ఓ సంస్థను స్థాపించి ప్రచారం చేస్తున్నారు.  మతతత్వాన్ని,  దేశ విభజన భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను అడ్డుకోవడమే తమ ధ్యేయమని తేజ్‌ప్రతాప్‌ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హిందూ యువవాహిని పేరుతో హిందూత్వ భావజాలన్ని బీహార్‌లోకి ప్రవేపెట్టాలనుకుంటున్నారని దీన్ని డీఎస్సెస్‌ అడ్డుకుంటదని ఆయన స్పష్టం చేశారు.  దేశంలో శాంతి, స్నేహపూర్వక వాతవరణాన్ని నెలకొల్పడమే డీఎస్సెస్‌ ముఖ్య ఉద్దే‍శ్యమని యాదవ్‌ అన్నారు.

 

08:20 - April 4, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. హైవేపై సిఆర్‌పిఎఫ్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. మరో పౌరుడు కూడా గాయపడ్డట్లు సమాచారం. ఆదివారం నౌహట్టాలో పోలీస్‌ టీంపై గ్రేనేడ్‌ విసిరిన దాడిలో ఓ పోలీసు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానాలకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు అశాంతిని సృష్టిస్తున్నారు. 

08:17 - April 4, 2017

మాస్కో : రష్యాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాస్కోలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మరో 50మందికిపైగా గాయపడ్డారు.  బాంబు పేలుడుతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో పేలుళ్లు
రష్యాలో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. మాస్కోలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో బాంబులు పేల్చారు. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో ఎక్కడివారు అక్కడ భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుళ్లతో  మాస్కో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.   రద్దీగా ఉన్న మెట్రోస్టేషన్లను టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.  రెండు మెట్రోస్టేషన్లలో పేలుళ్లు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పేలుళ్లలో 10మంది మృతి
ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లతో మొత్తం 10మంది రష్యన్‌లు చనిపోయారు. మరో 50మంది వరకు గాయపడ్డారు.  బాంబు పేలుడు జరిగిన బోగీ దగ్గర మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.  రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
పేలుళ్లతో రష్యా ప్రభుత్వం అలర్ట్‌
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్లతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. సమీపంలోని  8 స్టేషన్లనూ మూసివేశారు.  మాస్కోలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రష్యన్‌ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.  రైలులోని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  ఐఈడీ బాంబుతో బోగీని పేల్చివేసినట్టు అంచనా వేశారు. మరోవైపు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా అధికారులతో పుతిన్‌ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.  ఘటనపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామన్నారు. పేలుడు బాధితులకు పుతిన్‌ సంతాపం తెలిపారు. 
 

 

08:14 - April 4, 2017

అనంతపురం : పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడదాకులపల్లికి చెందిన గోవింద్‌.. 9 నెలలుగా ఉపాధి హామీ పథకంలో భాగంగా పనికి వెళ్తున్నాడు. అయితే  ఇంతవరకు అతనికి కూలీ డబ్బులు మాత్రం రాలేదు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌ జరుగుతుండగా అధికారులతో తన గోడు వెళ్లబోసుకున్నాడు.  అయినా అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన గోవింద్‌... ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

 

08:12 - April 4, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు మధుకర్‌ హత్య కేసును.. ఏసీపీ సింధుశర్మకు బదలాయించినట్టు.. డీసీపీ విజయేందర్‌రెడ్డి తెలిపారు.  దీంతో ఏసీపీ సింధుశర్మ.. ఖానాపూర్‌లోని ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని... అందులో మధుకర్‌ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలిందన్నారు ఏసీపీ. రిపోర్ట్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపిస్తామన్నారు. బాధితు కుటుంబ సభ్యుల కోరిక మేరకు రీపోస్టుమార్టం చేయడానికి  స్థానిక తహసీల్దార్‌కు లేఖ రాస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. 

 

 

08:08 - April 4, 2017

హైదరాబాద్ : గల్ఫ్‌లో జాబ్‌ అన్నారు. వేల రూపాయల జీతం అన్నారు. వచ్చే జీతంతో మీ జీవితాలే మారిపోతాయన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి అందినకాడికి నొక్కేశారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గల్ఫ్‌ వెళ్లిన తెలంగాణ బాధితులు నానా కష్టాలు పడుతూ దుర్భర జీవితం అనుభవించారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో మొత్తానికి స్వదేశానికి చేరుకున్నారు.
ఆశలు..అడియాశలు
ఉన్న ఊళ్లో ఉపాధి లేక..ఉరిమే కరువుతో సాగు కలిసిరాక ఇరాక్‌ వెళ్లిన తెలంగాణ కష్టజీవుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. నాలుగు రాళ్లు సంపాదించుకుందామని గల్ఫ్‌ వెళ్లిన వారి ఆశలు..అడియాశలే అయ్యాయి. ఏజెంట్ల చేతిలో నిండామోసపోయి రెండేళ్లుగా ఇరాక్‌లో దుర్భర జీవితం గడిపారు. చివరకు మంత్రి కేటీఆర్‌ చొరవతో స్వదేశం చేరుకున్నారు.
ఉపాధి కోసం ఇరాక్ కు 31 మంది  
మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల నుంచి 31 మంది ఉపాధి కోసం ఇరాక్ వెళ్లారు. చాలిచాలని జీతాలతో పూటగడవడమే వారికి గగనమైపోయింది. కన్నీళ్లను  దింగమింగుతూ రోజులు లెక్కపెట్టుకున్నారు. ఇరాక్‌లో ఉన్న తెలుగువారి సాయంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించి.. తమ గోడు వెల్లబోసుకున్నారు. గల్ఫ్ బాధితుల కష్టాలు తెలుసుకున్న  మంత్రి కేటీఆర్..వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు మూడు నెలలపాటు శ్రమించారు. మొత్తానికి ఆయన కృషి ఫలించడంతో.. తెలంగాణ బాధితులు ఇరాక్‌ నుంచి స్వదేశానికి  చేరుకున్నారు. ఇరాక్‌ నుంచి దుబాయ్‌కి.. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వీరితోపాటు ఏపీకి చెందిన మరో వ్యక్తి గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. 
స్వగ్రామాలకు చేర్చేందుకు ఏర్పాట్లు 
గల్ఫ్ బాధితులను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బాధితులను హైదరాబాద్‌ పంపిస్తున్నారు. దారి ఖర్చులకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చామని తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. మోసం చేసిన ఏజెంట్లపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. 
ఏజెంట్ల మాటలకు మోసపోవద్దు.. 
ఏజెంట్ల మాటలకు మోసపోవద్దని.. ఉన్నఊళ్లోనే వ్యవసాయం లేదా మరో కష్టం చేసుకుని బతకాలని గల్ఫ్‌ బాధితులంటున్నారు. తమ కష్టాలు పగవాడికి కూడా రాకూడదంటున్నారు. తమ కష్టాలు తెలుసుకుని సాయం చేసిన మంత్రి కేటీఆర్‌కు గల్ఫ్‌ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

08:02 - April 4, 2017

హైదరాబాద్ : గ్రూప్‌ 2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యయి. సోమవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. మొత్తం 4లక్షల 83వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. 49వేల 100 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఎంపికయిన వారిలో గరిష్టంగా 129.59 మార్కులు, కనిష్టంగా 74.49 మార్కులు సాధించిన వారు ఉన్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. 104 మంది కూడా మంచిమార్కులే సాధించినా.. ఓఎమ్మార్ షీట్‌పై వైట్‌నర్‌ తో జవాబులను సరిదిద్దడం లాంటి చర్యల వల్ల వారిని పరిగణలోనికి తీసుకోలేదన్నారు.  మరో 12వేల 573 మంది జవాబుపత్రాలు తప్పుగా నింపినందువల్ల వారి  జవాబు పత్రాలు వాల్యూషన్‌ చేయలేదన్నారు. వచ్చేనెలలో మెయిన్స్‌ పరీక్ష జరగనుందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.  

 

08:00 - April 4, 2017

మెదక్ : మిషన్ కాకతీయను అధ్యయనం చేసేందుకు న్యూఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాల అధికారులతో కూడిన కేంద్రబృందం తెలంగాణలో పర్యటిస్తోంది. హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో  కేంద్రబృందానికి మిషన్ కాకతీయపై ఇరిగేషన్ అధికారులు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం.. వివిధ రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజినీర్లు తూప్రాన్ చెరువును సందర్శించారు. మిషన్ కాకతీయతో చెరువు ఎలా అభివృద్ధి జరిగిందో.. తెలుసుకున్నారు. 

 

07:56 - April 4, 2017

విజయవాడ : కొన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు తనకు మంత్రి పదవి కేటాయించలేకపోయారని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, మంత్రి దేవినేని ఉమాతో కలిసి చంద్రబాబును కాగిత వెంకట్రావు కలిశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు కొంత హడావిడి చేశారని తెలిపారు. వేరే పార్టీలోకి వెళ్లే సమస్యే లేదని స్పష్టంచేశారు. 

 

07:54 - April 4, 2017

హైదరాబాద్ : ఒక పార్టీకి ఇబ్బంది అయినంత మాత్రాన పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే సాధ్యంకాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. పార్టీ మారిన వ్యక్తి రాజీనామా చేయాలని రాజ్యాంగంలో ఉందన్నారు. వైఎస్ హయాంలో కూడా ఫిరాయింపులు జరిగాయని వెంకయ్య చెప్పారు. 

 

07:51 - April 4, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానప్రతిపక్షం వైసీపీ అధికార పార్టీపై మరింత దూకుడు పెంచింది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూనే జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
మరో ప్రధాన అస్త్రంగా మంత్రివర్గ విస్తరణ 
ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీకి మరో ప్రధాన అస్త్రంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రి వర్గంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న  వైసీపీ ఎమ్మెల్యేలకు నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే అదునుగా తెలుగుదేశం పార్టీ తీరును ఎండగట్టాలని వైసీపీ నిర్ణయించింది. తెలంగాణ మంత్రి వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ గుర్తు చేస్తోంది.
గవర్నర్ ను కలిసిన జగన్ 
ఇందులో భాగంగా ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వైసీపీ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని  గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని కూడా జగన్ నిర్ణయించారు. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

నేడు సాగు, నీటి పారుదల అధికారులతో కేంద్ర బృందం సమావేశం

హైదరాబాద్ : తెలంగాణలో నేడు సాగు, నీటి పారుదల అధికారులతో కేంద్ర బృందం సమావేశం జరుగనుంది.
  

నేడు ఏపీలో పీజీ మెడికల్ సీట్ల దరఖాస్తుకు నోటిఫికేషన్

హైదరాబాద్ : ఏపీలో పీజీ మెడికల్ సీట్ల దరఖాస్తుకు నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఎన్ టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

నేడు ఉత్తరప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం

లక్నో : నేడు ఉత్తరప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

Don't Miss