Activities calendar

05 April 2017

21:33 - April 5, 2017

హైదరాబాద్: వాయవ్య సిరియాలో జరిగిన రసాయన విష వాయువు దాడుల్లో మృతుల సంఖ్య 72కి పెరిగింది. మృతుల్లో 20 మంది పిల్లలు, 17 మంది మహిళలు ఉన్నట్లు సిరియాలోని బ్రిటన్‌కు చెందిన మానవహక్కుల సంస్థ పేర్కొంది. సిరియాలో యుద్ధ నేరాలు కొనసాగుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్ భద్రతా సమితిలో డిమాండ్‌ చేశాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తేలలేదు. సిరియా ప్రభుత్వ బలగాలు లేదా రష్యా యుద్ధవిమానాలు దాడి చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తాము రసాయన ఆయుధాలు ఉపయోగించలేదని సిరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ విమానాలు ఎలాంటి దాడులు చేయలేదని రష్యా తేల్చి చెప్పింది.

21:31 - April 5, 2017

పెద్దపల్లి : కలకలం రేపుతున్న పెద్దపల్లి జిల్లా మంథని ఖానాపూర్‌లోని దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై పోలీసుల యాక్షన్ మొదలయింది..మధుకర్ మార్చి 14న చనిపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... అనుమానాస్పద మృతి చెందినట్లుగా అనుమానిస్తూ కలకలం రేపింది.. మధుకర్ ప్రేమ వ్యవహారంలోనే పరువు హత్య జరిగి ఉంటుందని అనుమానించడంతో ఈ కేసు తీవ్రస్థాయికి చేరింది..దళిత యువకుడు కావడంతో సంఘాల నాయకులు రంగంలోకి దిగి ఆందోళనలు పెంచారు... ఇదిలా ఉండగా సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన మధుకర్ మృతిపై పోలీసుల యాక్షన్ మొదలయింది... మధుకర్ మృతి రాజధాని నగరానికి కూడా సెగతాకడంతో స్వయంగా పోలీసు కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్‌ రంగంలోకి దిగారు... చనిపోయిన మధుకర్ కుటుంబీకులను స్వయంగా వెళ్లి కలిసిన దుగ్గల్ వివరాలు సేకరించారు..అయితే మధుకర్ ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం రిపోర్టు రాకముందే ఆత్మహత్యగా కేసు నమోదు చేశారన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సీఐ ప్రభాకర్‌పై వేటు పడింది... కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నదానిపై ఆరోపణలు పెరిగాయి..దీంతో సీఐ ప్రభాకర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ గతంలో మంథని ఎస్సైగా చేసిన నటేష్‌కు కొత్త సీఐగా ఉత్తర్వులు జారీ చేశారు...

కేసులో విచారణకు ఏసీపీ సింధూ శర్మ...

మధుకర్‌ డెడ్‌బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించాలని...అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుండడంతో విచారణాధికారిగా ఏసీపీ సింధూ శర్మను నియమించారు...ఇప్పటికే సింధూ శర్మ మధుకర్ చనిపోయిన స్థలాన్ని పరిశీలించారు..మధూకర్‌ అనుమానాస్పద మృతిపై వాస్తవాలు వెల్లడయ్యేందుకు రెండు, మూడు అంశాలు కీలకంగా మారనున్నాయి. ప్రేమవ్యవహారమే మధూకర్‌ మృతికి కారణమని బంధువులు బలంగా చెబుతున్నారు. ఆత్మహత్య కాదని, హత్యేనంటున్నారు...దీనిపై ఆ యువతిని విచారిస్తే కొంత తెలిసే అవకాశం ఉంది...పురుగుల మందు తాగిన యువతిని మార్చి 13న బంధువులు కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందినట్లు పోలీసులు చెబుతున్నారు.

మార్చి 13న ఏం జరిగింది..?

మార్చి 13న ఏం జరిగిందనేది తేలాల్సిన విషయం...ఆ రోజు..అంతకు ముందు ప్రేమికులిద్దరూ ఏ మాట్లాడుకున్నారు..? ఆ యువతి ఫోన్ చేసి మధుకర్ బంధువులకు ఫలానా చోట ఉన్నాడని ఎలా చెప్పింది...యువతిని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడేలా ఉన్నాయి...రీపోస్టుమార్టం స్థానిక అధికారులతో కాకుండా హైదరాబాద్‌ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించాలన్న డిమాండ్‌తో అధికారులు ఆయా ఏర్పాట్లలో ఉన్నారు....

మధు మృతిపై పౌరహక్కుల విచారణ...

మరోవైపు పౌరహక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్‌తో పాటు నేతలు మధుకర్ మృతిపై విచారణ మొదలుపెట్టారు.. మధుకర్ కుటుంబీకులతో పాటు గ్రామ సర్పంచ్‌ను విచారించారు... డెడ్‌బాడీ స్పాట్‌ను పరిశీలించి.. సీఐ ప్రభాకర్‌ను కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు... మొత్తం మీద మధుకర్ మృతిపై చెలరేగుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అన్ని వర్గాల నుంచి చేస్తున్న విచారణతో వాస్తవాలు బయటకు రానున్నాయి...

21:28 - April 5, 2017

ఢిల్లీ: ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల అంశంపై రాజ్యసభలో ర‌భ‌స జ‌రిగింది. ఇటీవ‌ల ముగిసిన యూపీ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. 267 నిబంధన కింద చర్చించాలని బిఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుబట్టాయి. ఈ నిబంధన కింద చర్చకు అనుమతించమని డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ తెలపడంతో విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

యూపీ ఎన్నికల్లో ఈవీఎంల‌ పనితీరుపై అనుమానాలున్నాయని,

అతిపెద్ద రాష్ట్రం యూపీ ఎన్నికల్లో ఈవీఎంల‌ పనితీరుపై అనుమానాలున్నాయని, అక్కడ చాలా స్మార్ట్‌గా ట్యాంప‌రింగ్ జ‌ర‌గ‌డం వ‌ల్ల ఇలాంటి ప‌రిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. మరికొద్దిరోజుల్లో జరిగే ఉప ఎన్నికలతో పాటు గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్రదేశ్ ఎన్నిక‌ల‌్లో ఈవీఎంల‌ను వాడ‌రాద‌ని గులామ్ న‌బీ ఆజాద్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రతిపక్షాల ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది...

ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారన్న ప్రతిపక్షాల ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల ఓట‌మిని అంగీక‌రించాల‌ని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ న‌ఖ్వీ అన్నారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలు, బిహార్‌ ఎన్నికల్లో కూడా ఈవీఎంలనే ఉపయోగించారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈవీఎంల‌ అంశం ఎన్నికల కమిషన్‌కు సంబంధించిందని, ఈ విషయాన్ని ఈసీ దగ్గర తేల్చుకోవాలని డిప్యూటి చైర్మన్ కురియ‌న్ విపక్షాలకు స్పష్టం చేశారు.

20:35 - April 5, 2017

హైదరాబాద్: హెచ్ -1 పై నియంత్రణలు.. గ్రీన్ కార్డులపై నిబంధనలు, బై అమెరికన్.. హైయ్యర్ అమెరికన్ నినాదాలు, గ్లోబల్ కాదు.. అంతా లోకలే అంటూ ట్రంప్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒక్క అమెరికా నుంచే విమర్శలు కాకుండా కోర్టు ల నుండి రివర్సు జడ్జిమెంట్లు వెరసి ట్రంపు పాలనలో ఏ రోజు ఏం జరుగుతుందో అన్న ఆశక్తి నెలకొంది. మరో ప్రక్క భారతీయుల పట్ల ట్రప్ నిరంకుశత్వ భావం ఎంత అనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

లారీ యజమానులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్

అమరావతి: లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో చర్చలు జరపనున్నారు.

20:08 - April 5, 2017

హైదరాబాద్: సీతమ్మ మెడలో రామయ్య పుస్తె... కనుల విందే ఉన్నది అది జూస్తే, ఒక రోజులో 14 కాన్పులు... సర్కారు దవాఖానాల్లో మెరుగైన వైద్యం, లంచం అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు...పబ్లిక్ కు మంత్రి కేటీఆర్ గొప్ప ఆఫర్, కేసీఆర్ మాట విని మోసపోయిన రైతులు...పత్తి ఇడిసి పెట్టి మిర్చి వేస్తే ఆగమైన ధరలు, భార్యాభర్తల పంచాయతీలో ఎస్ ఐ ఏలు...ముగ్గుర్ని పట్టుకుని తీసిండు తోలు, అంబేద్కర్ సార్ విగ్రహానికి అవమానం...కదిరి పట్నం దిక్కు కమిరేగాళ్ల పనితనం. ఇలాంటి హాట్ హాట్ అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న తెచ్చిన అంశాలను వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఫీల్డింగ్ ఎంచుకొన్న బెంగళూరు

హైదరాబాద్: ఐపీఎల్‌-10లో భాగంగా ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొన్నాడు. మాజీ క్రికెటర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ ఈ మ్యాచ్‌కు రెఫరీగా వ్యవహరిస్తున్నాడు. గాయపడ్డ కోహ్లీ స్థానంలో వాట్సన్‌ తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

19:35 - April 5, 2017

ఢిల్లీ : దేశంలో గోవధతో పాటు బీఫ్‌పై నిషేధం విధించాలని వ్యాఖ్యలు చేసినందుకు అజ్మేర్‌ దర్గా దివాన్‌ సయ్యద్ జైనుల్ ఆబెదీన్‌ తగిన మూల్యాన్నే చెల్లించుకున్నారు. దివాన్‌ పదవి నుంచి జైనుల్‌ను తొలగిస్తున్నట్లు ఆయన సోదరుడు అలావుద్దీన్ ఆలిమి ప్రకటించినట్లు సమాచారం. తనని తాను అజ్మీర్‌ దర్గా దివాన్‌గా అలావుదీన్‌ ప్రకటించుకున్నారు. హిందూ ముస్లింల మధ్య వివాదానికి బీఫ్‌ కారణమవుతోందని, అందుకే దీనిపై నిషేధం విధించాలని జైనుల్‌ అభిప్రాయపడ్డారు. గోహత్యకు పాల్పడేవారికి జీవిత ఖైదు శిక్ష విధించాలని...ఆవును జాతీయ పశువుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 12వ శతాబ్దికి చెందిన సూఫీ మతగురువు ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ 805వ ఉర్స్‌ ఉత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

19:33 - April 5, 2017

హైదరాబాద్: క‌శ్మీర్‌లో కొంతమంది యువకులు అతిగా ప్రవర్తించారు. క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ క్లబ్‌ టీమ్‌ ఆటగాళ్లు పాకిస్థాన్‌ జెర్సీలు వేసుకోవడమే కాకుండా.. ఆ దేశ జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. శ్రీనగర్‌కు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో కలకలం రేపుతోంది. ఆటగాళ్ల తీరుపై భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వాళ్లంతా ఇంటి నుంచి పారిపోయారని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

19:32 - April 5, 2017

యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలుల ధాటికి కొండపై ఉన్న ప్రసాద విక్రయ కేంద్రాల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో అందులోని ఫర్నీచర్‌, సామాగ్రి ధ్వంసమయ్యాయి.

19:27 - April 5, 2017

కడప : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఘణంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

నవమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా ...

కోదండ రామాలయంలో నవమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. స్వాగత తోరణాలు.. పువ్వులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 9 గంటలకు వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృ‌ష్ణమూర్తితో పాటు పలువురు అధికారులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీతారాములను ప్రతి ఒక్కరూ దర్శించుకుని.. ఆశీస్సులు పొందాలని చదలవాడ కృష్ణమూర్తి భక్తులకు పిలుపునిచ్చారు.

ఏకశిలానగరిలో పోతన జయంతి...

వేడుకల్లో భాగంగా సాయంత్రం ఏకశిలానగరిలో పోతన జయంతిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవులతో కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. రాత్రికి శేష వాహనంపై సీతారాములు మాడవీధుల్లో ఊరేగించనున్నారు. పదో తేదీన సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది.ఈ కల్యాణానికి ముఖ్యమంత్రి దంపతులతో పాటు.. గవర్నర్‌ దంపతులు కూడా పాల్గొనున్నారు. వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాములను దర్శించుకున్నారు.

19:25 - April 5, 2017

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ భవన్‌లలో జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించగా.. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో ఉన్న జగజ్జీవన్ విగ్రహానికి వివిధ పార్టీల నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

గుంటూరులో..

గుంటూరులో జరిగిన కార్యక్రమంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జగజ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచే వ్యక్తి బాబూ జగజ్జీవన్‌రామ్‌ అని ఆయనన్నారు. 50 ఏళ్ల పాటు దళితుల సంక్షేమం కోసం జగజ్జీవన్‌రామ్‌ పోరాడారని కొనియాడారు.

సిద్దిపేటలో జగజ్జీవన్‌రామ్‌ భవన్‌కు...

బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా.. తెలంగాణ సాగునీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేటలో జగజ్జీవన్‌రామ్‌ భవన్‌కు శంకుస్థాపన చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందనిఆయనీ సందర్భంగా అన్నారు.

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో....

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన జగజ్జీవన్ జయంతి ఉత్సవాల్లో మంత్రి శిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. ఏపీలోని విజయవాడలోనూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కామారెడ్డిలో జరిగిన జయంతి ఉత్సవాల్లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జగజ్జీవన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

యూపీ డిగ్రీ కాలేజీల్లో జీన్స్, టీషర్ట్స్ పై నిషేధం..

యూపీ: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో జీన్స్ టీషర్ట్స్ పై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ ఉన్నతవిద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దని పేర్కొంది.

'2వేల రూపాయల నోట్లను రద్దు అవాస్తవం'

ఢిల్లీ: 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు మధుసూధన్ మిస్త్రీ అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. కొత్త నోట్లకు నకిలీ కరెన్సీ తయారు చేయడం సాధ్యం కాదన్నారు. చాలా సెక్యూరిటీ ఫీచర్స్ తో కొత్త నోట్లను విడుదల చేశామన్నారు. నకిలీ నోట్ల నిర్మూలనకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు.

 

ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ -10 సందడి

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ -10 సందడి నెలకొంది. స్టేడియానికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. కాసేపట్లో ఏఆర్ రెహ్మాన్, నటి అమీజాక్సన్ ఆటాపాటలతో ఐపీఎల్ -10 సీజన్ ప్రారంభం కానుంది.

లోక్ పాల్ కోసం మళ్లీ అన్నాహజారే సత్యాగ్రహ దీక్ష

ఢిల్లీ: లోక్ పాల్ కోసం మళ్లీ అన్నాహజారే సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్ పాల్ అమలు చేయడంలో విఫలమైందన్నారు. లోక్ పాల్ నియామకంపై ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి హజారే లేఖ రాశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం

యాదాద్రి భువనగిరి : జిల్లాలో పలు మంలల్లో భారీ వర్షం కురిసింది. యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, తుర్కపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం వల్ల వరి పంట, పండ్ల తోటలకు భారీ నష్టం జరిగింది.

17:43 - April 5, 2017

అమరావతి: పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ ఆందోళనలకు సిద్దమవుతోంది. రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయబోతుంది. వైఎస్‌ జగన్‌తో సహా వైసీపీ నేతలు రేపటి నుంచి మూడు రోజల పాటు ఢిల్లీ బాట పట్టనున్నారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మోదీ, ఈసీలకు ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా ఇదే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తో సహా అన్ని జాతీయ పార్టీ నేతల అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు వైసీపీ నేతలు.

17:41 - April 5, 2017

వేములవాడ: శ్రీరామ నామస్మరణతో తెలుగురాష్ట్రాల్లోని రామాలయాలు మార్మోగుతున్నాయి. సీతారాముల కల్యాణ వేడుకను తిలకించి భక్తజనం పరవశించిపోతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. సీతారాముల కల్యాణ సమయానికి జోగినిలు, శివసత్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని వివాహం చేసుకుంటారు. ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని మురిసిపోతుంటారు. సాక్షాత్‌ పరమశివున్నే తమ భర్తగా ఊహించుకుంటారు. అక్కడి కళ్యాణ వేడుక విశిష్టతపై మా ప్రతినిధి సతీష్‌ మరింత సమాచారం అందిస్తారు.

మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం

పెద్దపల్లి : మార్చి 14 మంథని మండలం ఖానాపూర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంథని మధుకర్ మృతదేహనికి ఎల్లుండి వరంగల్ కాకాతీయ మెడికల్ కాలేజీ వైద్యులు రీపోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.మధుకర్ మృతి కేసులో పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. అనుమానతుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సెల్ ఫోన్స్ కాల్స్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

17:39 - April 5, 2017

హైదరాబాద్‌ : బాగ్‌లింగంప‌ల్లి శ్రీరామ్‌న‌గ‌ర్లో శ్రీరామ‌న‌వ‌మి వేడుక ఘ‌నంగా జ‌రిగింది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు అభిజిత్‌ల‌గ్నంలో రాములోరు- సీత‌మ్మకు మాంగళ్యధార‌ణ చేశారు. బ‌స్తీ ప్రజ‌లంతా క‌ల‌సి ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క‌ళ్యాణ మ‌హోత్సవానికి స్ధానిక ఎమ్మెల్యే ల‌క్ష్మణ్‌, టిడిపి నేత‌లు, పలువురు కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. అనంత‌రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

17:38 - April 5, 2017

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. దూల్‌పేట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర..నగరంలోని ముఖ్యమైన 7 ప్రాంతాలగుండా కొనసాగనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే శోభాయాత్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

17:36 - April 5, 2017

పెద్దపల్లి : మంథనిలో సంచలనం రేపిన మధుకర్‌ హత్య కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితులు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా వారి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఇదిలావుంటే.. ఎల్లుండి మధుకర్‌ మృతదేహానికి వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్యులు రీపోస్ట్‌మార్టం చేయనున్నారు.

17:35 - April 5, 2017

హైదరాబాద్: తెలంగాణ భవన్‌ కొత్త శోభను సంతరించుకోబోతుంది. కొద్ది రోజుల్లోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రానున్న నేపథ్యంలో.. తెలంగాణ భవన్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈరోజు మంత్రి కేటీఆర్‌ పనులను పర్యవేక్షించారు. కొన్ని మార్పులను కేటీఆర్‌ సూచించారు. అదేవిధంగా.. పనులు త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్‌ సూచించారని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

వాట్సాప్, ఫేస్ బుక్ ప్రైవసీపై హైకోర్టులో విచారణ

 

హైదరాబాద్ : వాట్సాప్, ఫేస్ బుక్ ప్రైవసీ రూల్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు ఐదుగురు న్యామూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేసింది. 

తిరుపతి, కల్యాణదుర్గం ప్యాసింజర్ రైలు పొడగింపు

ఢిల్లీ : తిరుపతి, కల్యాణదుర్గం ప్యాసింజర్ రైలు కదిరి దేవరపల్లి వరకు పొడిగించారు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, అశోక్ గజపతిరాజు ఈ ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా సరేష్ ప్రభు మాట్లాడతూ ఏపీలో నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని తెలిపారు.

భారత్ కు చైనా అల్టిమేటం

బీజింగ్ : అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటనపై చైనా భగ్గుమన్నది. వివాదాస్పద ప్రాంతంలో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్ చైనా అల్టిమేటం జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటనను అనుమతించి భారత్ తమతో సంబంధాలు చెడగొట్టుకునే సాహసం చేసిందని చైనా వాఖ్యలు చేసింది.

యూపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో జీన్స్ టీషర్ట్స్ నిషేధం

లక్నో : యూపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో జీన్స్ పై నిషేధం విధించారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు జీన్స్, టీ షర్ట్స్ వేసుకోవద్దని ఆ రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేశారు.

మలేషియా ఓపెన్ లో ముగిసిన భారత్ కథ

కౌలాలంపూర్  : మలేషియా ఓపెన్ తొలి రౌండ్ లో నిష్ర్కమించిన భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు రెండవ రౌండ్ లో నిష్ర్కమించారు. ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లో 13వ సీడ్ చెన్ యూఫీ చేతిలో సింధు ఓడిపోయింది. రెండవ ర్యాంక్ ప్లేయర్ అక్నే యమగూచి చేతిలో సైనా ఓటమిపాలైంది.

లాభాలతో ముగిసిన స్టాక్ మర్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 64 పాయింట్లు లాభాపడి 29,974వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు లాభాపడి 9,265వద్ద ముగిసింది.

తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు

ఢిల్లీ : హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఖరారైయింది. ఈ నెల 7న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటిస్తారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే ధ్యేయంగా ఈ పర్యటన జరపుతున్నట్టు తెలుస్తోంది.

 

15:49 - April 5, 2017

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. దూల్‌పేట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర..నగరంలోని ముఖ్యమైన 7 ప్రాంతాలగుండా కొనసాగనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే శోభాయాత్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

రేపు ఢిల్లీకి జగన్

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ రేపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలో ఢిల్లీ వెళ్లనున్నారు. వీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కేబినెట్ చోటు కల్పించడంపై రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలకు ఫిర్యాదు చేయనున్నారు.

 

15:46 - April 5, 2017

భద్రాచలం : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది... మిథిల మైదానానికి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చిన అర్చకులు... శాస్ర్తోక్తంగా కల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు.. సీతారాముల కల్యాణం చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సున్నం రాజయ్య, కోరం కనకయ్య జడ్జి ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

15:44 - April 5, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని.. అలాగే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలని కలుస్తామని ధర్మాన తెలిపారు.

15:42 - April 5, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో రైతుల రుణాలను మాఫీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సరైన నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశంసించారు. ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకు రుణాల నుంచి యూపీ రైతులకు కొంత ఊరట లభించిందన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రైతుల కష్టాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, రాష్ట్రాల మధ్య వివక్ష చూపకూడదని రాహుల్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు. మంగళవారం జరిగిన యూపి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని రైతులకు 36,359 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్లు సిఎం యోగి ప్రకటించారు.

15:41 - April 5, 2017

రాజస్థాన్ : గోరక్షణ పేరిట హిందుత్వ శక్తుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని అల్వర్‌లో గోరక్షణ పేరిట జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హర్యానాకు చెందిన15 మంది వ్యక్తులు ఆరు వాహనాల్లో ఆవులను తరలిస్తుండగా బహరోర్‌ వద్ద వారిని అడ్డుకున్ని చితకబాదారు. శనివారం నాడు జరిగిన ఈ ఘటనలో 55 ఏళ్ల పహలూఖాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పహలూఖాన్‌ ఆవులను ఖరీదు చేసినట్లు రసీదు చూపినప్పటికీ వినకుండా విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆవులను జైపూర్‌ నుంచి హర్యానాలోని నూహ్‌ జిల్లాకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

జై జవాన్

ఢిల్లీ : దేశ రక్షణే లక్ష్యంగా ఉగ్రవాదులతో పోరాడి మరణం అంచుల దాకా వెళ్లొచ్చాడు ఓ సైనికుడు నెల రోజుల పాటు కోమలో ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. శరీరంలో 8 బుల్లెట్లు, కంటిలో తూటా దిగినా మనోధైర్యమే ఆయన్ని కాపాడింది. బందిపొర ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సీఆర్ పీఎఫ్ జవాన్ చేతన్ కుమార్ చీత కోమా నుంచి బయటపడ్డారు.

ఇరాక్ లో ఆత్మాహుతి దాడి

బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బగ్దాద్ మరోసారి రక్తసిక్తం అయింది.కొందరు దుండగులు నగరంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.ఈ పేలుళ్లలో 22 మంది మృతి చెందారు. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి వెనుక ఐఎస్ఐఎస్ ఉన్నట్టు ఇరాక్ భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

ప్రారంభమైన శ్రీరామ శోభయాత్ర

హైదరాబాద్ : ధూల్ పేట్ నుంచి శ్రీరామ శోభయాత్ర ప్రారంభమైంది. యాత్రకు భారీగా జనం తరలివచ్చారు. ప్రస్తుతం సీతారాంబాగ్ వద్ద శోభయాత్ర కొనసాగుతోంది.

14:43 - April 5, 2017

హైదరాబాద్: యూపీలోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి దారా రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యూనివర్సిటీ భవనం మూడవ అంతస్థు నుంచి దూకి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని బీహెచ్‌యూ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై రాజు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కాలేజీని కేంద్ర ప్రభుత్వం ఐఐటీగా మార్పు చేసింది. మృతుడు రాజు బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట స్వగ్రామం. రాజు తండ్రి కృష్ణయ్య నాయుడుపేటలో రైల్వే ఉద్యోగి పని చేస్తున్నారు. రాజు ఇకలేడన్న విషయం తెలుసుకున్న తల్లిందడ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

14:41 - April 5, 2017

గుంటూరు : రాష్ట్రంలో నీతి వంతమైన పాలనకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్‌ హాయాంలో దెయ్యాలకు కూడా పింఛన్‌లు ఇచ్చారని.. టీడీపీ హాయాంలో అలాంటి అవకతవకలు జరగకుండా పింఛన్లు అందిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో కాల్‌సెంటర్‌లు పెట్టి.. వివిధ ప్రాంతాల్లో జరిగే అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాని అన్నారు.

రాబోయే మూడేళ్లలో పదిలక్షల ఇళ్ల నిర్మాణం: సీఎం చంద్రబాబునాయుడు

రాబోయే మూడేళ్లలో పది లక్షలు ఇళ్లు కట్టి పేదలకు ఇస్తానని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.అలాగే ప్రతి ఇంటికి వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామన్నారు. రాబోయే సంవత్సరంలో 149 రూపాయలకే ప్రతి ఇంటికి 15 ఎంబీపీఎస్‌ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీని ఇస్తానని సీఎం చెప్పారు. పేదల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

చిరస్థాయిగా పేదల గుండెల్లో ఉండే వ్యక్తి బాబూజగజ్జీవన్‌రామ్‌: సీఎం చంద్రబాబునాయుడు

చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచే వ్యక్తి బాబూజగజ్జీవన్‌రామ్‌ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. 50 ఏళ్ల పాటు దళితుల సంక్షేమం కోసం జగజ్జీవన్‌రామ్‌ పోరాడారని కొనియాడారు. గుంటూరులో బాబూ జగజ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులకు అన్యాయంగా జరగకుండా.. రాజకీయంగా, సామాజికంగా.. ఆర్థికంగా సమన్యాయం జరిగే బాధ్యతను తెలుగు దేశం పార్టీ తీసుకుంటుందని సీఎం అన్నారు.

 

14:38 - April 5, 2017

హైదరాబాద్: ఇండియన్‌ ఐడల్‌-9 విజేత రేవంత్‌కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. తన పాటలతో అందరిని మంత్రముగ్దుల్ని చేసిన రేవంత్‌ను నగరవాసులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. అందరి సహకారం వల్లే తాను ఇండియన్‌ ఐడల్‌ విజేత నెంబర్‌వన్‌గా నిలిచానని రేవంత్‌ తెలిపాడు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని రేవంత్‌ స్పష్టం చేశారు.

మంథని సీఐపై బదిలీ వేటు

పెద్దపల్లి : మంథని సీఐ ప్రభాకర్ ను  వీఆర్ కు బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ విక్రమ్ జిత్ ఉత్తర్వులు జారీ చేశారు. మధుకర్ హత్యకేసులో సీఐ ప్రభాకర్ పై ఆరోపణలు వస్తుండడంతో వేటు వేసినట్టు తెలుస్తోంది. మంథని కొత్త సీఐగా నరేష్ నియామించారు.

13:32 - April 5, 2017

ఢిల్లీ : పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత్‌ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులకు తెగబడింది. జమ్ములోని పూంచ్‌ సెక్టార్‌లో దేగ్వార్‌ ప్రాంతంలో కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

13:30 - April 5, 2017
13:24 - April 5, 2017

హైదరాబాద్ : నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. ధూల్ పేట నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. నాంపల్లి దగ్గర్లోని సీతారాంబాగ్ నుంచి కోఠీలోని హనుమాన్ టెక్డీ వ్యాయామశాల దాకా శోభాయాత్ర జరగనుంది. రెండు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఒకటి సీతారాంబాగ్ నుంచి మొదలైతే మరోటి ధూల్ పేట్ లోని గంగాబౌలి రాణి అవంతిబాయినగర్ కమ్యూనిటీ హాల్ నించి శోభా యాత్ర ప్రారంభమైంది. రెండు యాత్రలు మంగళ్ హాట్ దగ్గర కలుస్తాయి. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి చౌరస్తా, కమల్ కాన్ దేవ్డి, క్లాసిక్ చౌరస్తా, సిద్ధం అంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ టెక్డీ హనుమాన్ వ్యాయామశాల దాకా ఒక శోభయాత్ర జరగతుంది. ధూల్ పేటలోని రాణి అవంతిబాయి భవన్ నుంచి మరో శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్ హాట్ నుంచి జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, గౌలిగూడ మీదుగా చివరకు హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. శోభాయాత్రకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చేసింది. సీసీ కెమెరాలతో పాటు 12 వేల పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్రకు బల్దియా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేశామని నిర్వాహకులు టెన్ టివితో తెలిపారు.

అంగరంగావైభవంగా జరిగిన సీతారాముల కల్యాణం

ఖమ్మం : భద్రాద్రి సీతారాముల కల్యాణం అంగరంగావైభవంగా జరిగింది. లక్షలాది భక్తుల మధ్య అభిజిత్ లగ్న ముహూర్తంలో పుజారి గారు సీతారాముల కల్యాణం జరిపించారు.

 

13:11 - April 5, 2017

భద్రాద్రి : పుణ్య దంపతులుగా భక్తులు భావించే సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో ఈ కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడుముళ్లు వేశాడు. ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సులపైనుంచి జాలువారాయి. వేదమంత్రోచ్ఛరణలతో భద్రాద్రి మారుమోగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి లు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతరు అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.00 గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. శిల్పకళా శోభితమై అలరారే కల్యాణమండపంలో జరిగే జగదభి రాముడి కల్యాణాన్ని కనులారా తిలకించి తరించేందుకు భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

లాహోర్ లో ఆత్మాహుతి దాడి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని లాహోర్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ వాహనం సమీపంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు సైనికులుతో సహా ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సహాయక సిబ్బంది హూటహటిన ఆసుపత్రికి తరిలించారు. పోలీసులు మాట్లాడుతూ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

లోయలో పడిన కళాకారుల బస్సు

కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని ఝెట్లా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంత మంది కళాకారులతో ప్రయాణిస్తున్న బస్సు పశ్చిమ మిడ్నాపూర్ వద్ద ఆదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 35 మంది గాయాపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.

భద్రాద్రికి కేసీఆర్ మనవడు

ఖమ్మం : భద్రాచలం సీతారాములకు కేసీఆర్ మనవడు హిమాన్షురావు పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ ప్రతినిధిగా పట్టువస్త్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది.

విజయనగరంలో ఘనంగా సీతారాముల కల్యాణం

విజయనగరం : జిల్లాలోని రామతీర్థం కల్యాణోత్సవం ఘనంగా జగిరింది. ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి మణిక్యాలరావు స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే నారాయణస్వామి, జెడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి దంప, బొత్స దంపతులు హాజరయ్యారు.

ఈవీఎం ట్యాంపరింగ్ పై చర్చ రచ్చ

ఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ లపై రాజ్యసభలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా పోడియం వద్ద కాంగ్రెస్, బీఎస్పీ సభ్యుల నిరసన తెలిపారు. గుజరాత్ లో జరగబోయే ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగించవద్దని, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే యూపీలో బీజేపీ గెలిచినట్టు బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ఆరోపించారు.2009లో ఉపయోగించిన ఈవీఎంనే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించామని ప్రభుత్వం తెలిపింది.

ఎన్నారై తో శ్రీయా భూపాల్ పెళ్లి ?

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగర్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. అఖిల్..జీవీకే మనవరాలు శ్రీయభూపాల్ తో నిశ్ఛితార్థం అయిన సంగతి తెలిసిందే. కానీ అంతోనే వీరి పెళ్లి అగిపోయినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఇది ఇలా ఉంటే శ్రీయభూపాల్ కు ఓ ఎన్నారై వ్యక్తితో పెళ్లి నిశ్చయమైనట్టు...? సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాల్సి ఉంది.

12:13 - April 5, 2017

మీకు వేళకు ఆకలి అవుతుందా ? జీర్ణశక్తి బాగానే ఉందా ? బాగానే ఉంది అంటే..ఒకే..కానీ లేదు అంటే మంచి ఆరోగ్య సూచన కాదు. ఆకలని పట్టించుకోకపోవడం..వేళకు తినకపోవడం..వేళ మించాక తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు ఏంటీ ?
ఆకలి పెరిగి పోయే వరకు ఆగకండి..అలాగే ఆకలి వేయగానే వెంటనే తినయకండి. క్రమం తప్పకుండా ఒకే సమయంలో తినడం అన్ని విధాల మంచిది. కాస్త ఆలస్యమైనా పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలను తినాలి.
కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైంది కాదు. పూర్తిగా భర్తీ చేసేయడం..ఈ రెండూ మంచిది కాదు.
భోజనం రుచిగా ఉందని ఎక్కువ తినేయకండి. దీనివల్ల వచ్చే అనర్థాలు ఎన్నో ఉంటాయి.
పాప్ కార్న్, శ్నాక్స్..సాఫ్ట్ డ్రింక్స్ లాంటి చిరు తిండ్లకు దూరంగా ఉండండి. వీటి స్థానంలో దోస ముక్కలు..క్యారెట్..టమాటో ముక్కలు వంటి సలాడ్స్ తీసుకోవడం బెటర్.
మటన్..చికెన్..ఇతర మాంసకృత్తులు తీసుకుంటే వాటితో పాటు ఉడికించిన కూరగాయాలు, పండ్లు తినండి.
బ్రేక్ ఫాస్ట్..మధ్యాహ్న..రాత్రిళ్లు భోజనం సరియైన సమయాన్ని పాటించండి. రాత్రి వేళ పరిమిత భోజనం చేయండి. భోజనంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్..జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది.
భోజనం సమయంలో వీలైనంత నీళ్లు తాగకుండా ఉండండి. భోజనం పూర్తయ్యాకే నీళ్లు తాగండి.

12:03 - April 5, 2017
11:59 - April 5, 2017

బాలీవుడ్ అలనాటి నటుడు 'వినోద్ ఖన్నా' ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన బుధవారం ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఆయన డీ హైడ్రేషన్ తో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆయన కుమారుడు రాహుల్ ఖన్నా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడిందని, త్వరలోనే ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారని పేర్కొన్నారు. వినోద్ ఖన్నా తన నైటన..డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం 'దిల్ వాలే' సినిమా.

అస్వస్థతకు గురైన సినీ నటుడు

ముంబై : ఆలనాటి బాలీవుడు నటుడు వినోద్ ఖన్నా ఆసుపత్రిలో చేరారు. ఆయన గత కొంతకాలంగా డీహైడ్రెషన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆయన కుమారుడు రాహుల్ ఖన్నా వెల్లడించారు.

రాజ్యసభలో ఈవీఎంల లొల్లి..

ఢిల్లీ : రాజ్యసభలో ఈవీఎంల టాంపరింగ్ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ‘ఈవీఎంకి యే సర్కార్ నహీ చలేగీ..నహీ చలేగీ' నినాదాలతో విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీనితో స్పీకర్ సభను 11.30 గంటలకు వాయిదా వేశారు.

 

బాబు జగ్జీవన్ రాంకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

గుంటూరు : బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా జిల్లాలోని మార్కెట్ యార్డులో బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.

 

11:32 - April 5, 2017

ఏ గడియల సుర్వు జేశిందో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కోసం 123 జీవోను.. ఆ జీవోతోని ఏడ ముంగటవడ్తలేదు ప్రాజెక్టు.. కేంద్ర ప్రభుత్వ చట్టం ముంగట గంటగంటకు ఓడిపోతనే ఉన్నది ఈ 123 జీవో.. మల్లన్న సాగర్ జనం 2103 సట్టం గురించి సకులం దెల్సుకోని లడాయి జేస్తుంటె.. ఇగో ఇంకోదిక్కుగూడ రగిలింది మళ్ల అసొంటి పంచాదే..నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శెర్లగూడం డిండి ఎత్తిపోతల పథకం పనులకు అడ్డం పడ్డరు. ఈసందర్భంగా ఓ రైతు తన ఆక్రందనను తెలియచేశాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

అంగరంగావైభవంగా రాముని కల్యాణ మహోత్సవం

ఖమ్మం : భద్రాచలంలో శ్రీరాముని కల్యాణ మహాత్సవం అంగరంగావైభవంగా జరుగుతోంది. స్వామివారి కల్యాణానికి టీటీడీ తరుపున ఎవో సాంబశివరావు పట్టువస్ర్తాలు సమర్పించారు. సీతారాముల కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు హాజరైయ్యారు.

 

11:20 - April 5, 2017

రిలయెన్స్..మార్కెట్ లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇటీవలే టెలికాం రంగంలో 'జియో'తో ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇతరుకు చుక్కలు చూపిస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉంటే టీవీ రంగంలో ప్రధానంగా మారిన 'సెట్ టాప్' బాక్స్ లోకి ప్రవేశించాలని రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ లో జియో సెట్ టాప్ బాక్స్ అంటూ హల్ చల్ చేస్తున్నాయి. 'జియో' లోగోతో ఉన్న రిమోట్, సెట్ టాప్ బాక్సులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 300 ఛానెళ్లకు పైగా వస్తాయని, 50 హెచ్ డీ ఛానెళ్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది. సిమ్‌ల తరహాలోనే డీటీహెచ్ సేవలను కూడా తక్కువ ధరకే 'జియో' అందుబాటులోకి తేనున్నట్లు టాక్. త్వరలోనే దీనిని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటీహెచ్ మార్కెట్ లో పాగా వేయాలన్న ముకేశ్ అంబానీ పాచికలు పారుతాయా ? లేదా ? అన్నది చూడాలి.

స్వామివారికి పట్టు వస్ర్తాలు

ఖమ్మం : భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరుపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

 

 

అనవసర రాజకీయం తగదు : పోచారం

హైదరాబాద్ : రైతుల విషయంలో రాజకీయం తగదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, తాను స్వతహాగా రైతులమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మిర్చి సాగు బాగా జరిగింది. దిగుబడి కూడా బాగానే వచ్చింది. మిర్చి కొనగోళ్లుకు కేంద్ర సహాయన్ని కోరామని కేంద్రంనుంచి అనుమతి రాగనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాజకీయలకు పాల్పడుతోందని విమర్శించారు.

 

10:57 - April 5, 2017

భారత పేస్ ఇషాంత్ శర్మకు ఊరట దక్కింది. ఐపీఎల్ 10 వేలంలో ఇతడిని ఎవరూ కొనుక్కోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. తమ జట్టు పేస్‌ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇషాంత్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతగా ఫామ్ లో లేకపోవడంతో ఇషాంత్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదని తెలుస్తోంది. వేలంలో రూ.2 కోట్ల మేరకు బేస్‌ప్రైస్‌ను నిర్ణయించారు. అయినా ఇతర ప్రాంచైజీలు అతణ్ని పరిగణలోకి తీసుకోలేదు. మొత్తానికి పంజాబ్ నిర్ణయంతో ఇషాంత్ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, డెక్కన్ చార్జర్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఇషాంత్ ఆడాడు.

ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ వేళల్లో మార్పులు

హైదరాబాద్ : సికింద్రాబాద్, హౌరా ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గుంటూరు నుంచి నేటి ఉదయం 4.06 నిమిషాలకు ఎక్స్ ప్రెస్ ఫలకునుమాకు చేరుకుంటుంది.4.10కి అక్కడ నుంచి బయల్దేరుతుంది.ఉదయం 5.14కు పిడుగురాళ్లకు చేరుకుటుంది. మిర్యాగూడకు 6.10కి చేరుకుంటుంది.

కాసేపట్లో సీతారాములు కల్యాణ మహోత్సవం

ఖమ్మం : కాసేపట్లో భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. అభిజిత్ లగ్న సుముహూర్తాన వివాహ వేడుకు జరగానుంది. కల్యాణ మహోత్సవానికి మంత్రులు ఇంద్రకారణ్ రెడ్డి, కడియం శ్రీహరి హాజరుకానున్నారు.స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.

10:34 - April 5, 2017

యూపీలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

లక్నో : యూపీ వారణాసి బెనారస్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రాజు నెల్లూరు జిల్లా నాయుడిపేట వాసిగా అధికారులు గుర్తించారు. రాజు బెనారస్ ఐఐటీలో సెకండియర్ చుదువుతున్నాడు.

 

10:25 - April 5, 2017

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవకుశ' మోషన్ పోస్టర్ విడుదలైంది. శ్రీరామనవమి సందర్భంగా యూ ట్యూబ్ లో ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ‘శ్రీరామ జయ రామ..రఘురామ..జై..జై..శ్రీరామ..’ అనే పాటతో ప్రారంభమైంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో బాబి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు..అందుకు ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేశారని టాక్. ఒక పాత్రలో పూర్తిగా నెగటివ్ గా 'ఎన్టీఆర్' కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘సమంత' కూడా విలన్ పాత్రలో కనిపించనుంది. ‘జనతా గ్యారేజ్' హిట్ అనంతరం 'ఎన్టీఆర్' చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేయడం విశేషం. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇది పౌరాణిక చిత్రమా ? అనేది తెలియరాలేదు.

10:18 - April 5, 2017

రికార్డుకు చేరువలో స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మర్కెట్ మరో రికార్డుకు చేరువైంది. ఈ రోజు ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ దాదాపు 30,000 పాయింట్ల సమీపంలోకి వెళ్లి 29996 వద్ద ట్రేడైంది. నిఫ్టీ అల్ టైమ్ హైకి కేవలం 19 పాయింట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం నిఫ్టీ 9242 వద్ద, సెన్సెక్స్ 29901 వద్ద ట్రేడవుతున్నాయి.

పంజాబ్ లో భారీగా హెరాయిన్ పట్టివేత

ఛండీఘర్ : పంజాబ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడింది. అమృత్ సర్ జిల్లాలో రూ.75కోట్ల విలువైన 15 కిలోల హెరాయిన్ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూలో పాక్ కాల్పులు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ మరోసారి కాల్పులు విరమణకు తూట్లు పొడిచింది. భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడింది. దీంతో పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. 48 గంటల్లో పాక్ నాలుగో సారి కాల్పులకు ఉల్లంఘనకు పాల్పడింది.

ముంబైలో హై అలర్ట్

ముంబై : భారత ఆర్థిక రాజధాని లో హై అలర్ట్ ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల తెలపాయి. అధికారులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఓడ రేవుల్లో అప్రమత్తం చేశారు. మహనగరంలో పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పోలీసుల అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

 

09:52 - April 5, 2017

ముంబై : భారత ఆర్థిక రాజధాని ముంబైపై ముష్కరులు దృష్టి సారించారా ? మరోసారి కల్లోల్లం సృష్టించేందుకు సిద్ధమయ్యారా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ముంబైలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనితో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కోస్టల్ ప్రాంతం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. సముద్ర తీరం గుండా ముగ్గురు..లేదా నలుగురు ఐసీస్ ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం అందించారు. ప్రజలు ఆందోళన చెందుతారనే కారణంతో  ఈ విషయం వెంటనే బయటకు చెప్పలేదని తెలుస్తోంది. సోమవారం రాత్రి నుండి గస్తీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. వాహనాలతో పాటు అనుమానితులను భద్రతా దళాలు తనిఖీలు చేపడుతున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఓడ రేవుల్లో అప్రమత్తత ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

09:43 - April 5, 2017

రాఖీ సావంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారంట..ఆమె ఆచూకి తెలియడం లేదంట. ఆమెను అరెస్టు చేశారని మంగళవారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ ఆమెను అరెస్టు చేయలేదని, లూథియానా నుండి ముంబై వెళ్లిన పోలీసులకు ఆచూకి లభ్యం కాలేదని లూథియానా పోలీసు కమిషనర్ కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. మహారుషి వాల్మీకిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
గతేడాది ఓ ప్రైవేటు టెలివిజన్ కార్యక్రమంలో వాల్మికీ కమ్యూనిటీపై రాఖీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. వాల్మీకి గురించి ఆమె చేసిన వ్యాఖ్యల‌పై పలు హిందూ సంస్థలు ఆమెపై దావా వేయ‌డంతో పలుసార్లు కోర్టు ఆమెకు సమన్లు కూడా జారీ చేసింది. అయితే, వాటిపై 'రాఖీ' స్పందించ‌లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లూధియానా కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీ చేయ‌డంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాఖీ లొంగిపోతుందా ? లేక అరెస్టు చేస్తారా చూడాలి.

09:34 - April 5, 2017
09:27 - April 5, 2017

క్యారక్టర్ కి తగ్గట్టు డిమాండ్ మేరకు హీరోలు సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు... ఈ మధ్య ఇది ఓ ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు మూవీ ఓకే అవ్వగానే ఆ మూవీకి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నారు. సినిమా ప్రిప్రొడక్షన్ వర్క్ నడుస్తుండగానే మరో పక్క క్యారక్టర్ డిమాండ్ కు తగ్గట్టు బాడీని డెవలప్ చేసుకుంటున్నారు. జిమ్ముల్లో కుమ్ముతూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా తెలుగు హీరోలు కొత్త ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. ఈమధ్య కాలంలో దాదాపుగా ప్రతి అగ్ర కథానాయకుడూ కొత్త సినిమాల కోసం, కొత్త పాత్రల కోసం అవసరమైన కసరత్తులు చేసిన తరువాతే కెమెరా ముందుకు వెళుతున్నాడు. పాత కొత్త హీరో అని లేకుండా ప్రతి ఒక్క హీరో బాడీ డెవలప్ చేసుకున్న తరువాత సినిమా స్టార్ట్ చేస్తున్నారు. 'బాహుబలి' కోసం ప్రభాస్‌, రానా పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాహుబలి, భల్లాల దేవ పాత్రల కోసం ఆ ఇద్దరూ వంద కిలోలకిపైగా బరువు పెరిగారు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ కోసం నెలల తరబడి శిక్షణ తీసుకొన్నారు. ప్రభాస్‌, రానాలే కాకుండా.. హీరోయిన్లుగా చేసిన అనుష్క, తమన్నా వారితో పాటు సత్యరాజ్‌లాంటి నటులు కూడా కత్తియుద్ధాల్లో శిక్షణ తీసుకొన్నారు.

బరువు తగ్గుతున్న ప్రభాస్..రానా..
త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న సుజీత్‌ చిత్రం కోసం ప్రభాస్‌ బరువు తగ్గి నాజూకైన లుక్‌లో కనిపించబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ప్రభాస్. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' నుంచి బయటికి రాగానే, ‘ఘాజీ' కోసం ఒక్కసారిగా బరువు తగ్గాడు 'రానా' ప్రస్తుతం సత్య శివ అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ కోసం 'రానా' ఇంకొంచెం పలచగా మారిపోయి నటిస్తున్నాడు. 'ఈ నాలుగేళ్ల కాలంలో ఆ బాడీతో చాలా ప్రయోగాలు చేశాడు రానా. 'ఘాజీ' కోసం బరువు తగ్గిన తరువాత 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' కోసం మళ్లీ కండలు పెంచాల్సి వచ్చింది. అలవాటైన బాడీ కావడంతో తట్టుకోగలిగింది అంటున్నాడు ఈ హైట్ హీరో..

09:12 - April 5, 2017

కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన 'లావణ్య త్రిపాఠి'కి స్టార్ స్టేటస్ మాత్రం చేరువ కావటం లేదు. టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ 'అందాల రాక్షసి'తోనే ఈ నార్త్ బ్యూటీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత కూడా వరుస సక్సెస్ లు సాధించినా.. కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. తాజాగా 'రవితేజ' హీరోగా తెరకెక్కుతున్న 'టచ్‌ చేసి చూడు' ఛాన్స్‌ కూడా 'లావణ్య' చేజారిందని టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. విక్రమ్‌ సిరిని దర్శకునిగా పరిచయం చేస్తూ, నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా 'టచ్‌ చేసి చూడు’. ఈ సినిమాలో 'రాశీఖన్నా’, 'లావణ్య త్రిపాఠి'లను హీరోయిన్లుగా ఫైనల్ చేశారు. ప్రస్తుతం 'రాశీఖన్నా'తో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మరో కథానాయిక 'లావణ్య త్రిపాఠి' సీన్స్‌ ఏప్రిల్‌లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. మరి ఆ షెడ్యూల్ లో 'లావణ్య' షూటింగ్ లో పాల్గొంటుందా.. లేక యూనిట్ మరో హీరోయిన్ తో లాగించేస్తుందో చూడాలి.

09:03 - April 5, 2017

'ధృవ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో 'రామ్ చరణ్' ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి పల్లెటూరి వాతావరణంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా డిఫరెంట్ కాస్టింగ్ కోసం ప్రయత్నించిన సుక్కు.. మాలీవుడ్ బ్యూటి 'అనుపమా పరమేశ్వరన్' ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. ఇక అంతా ఓకే అయిపోయింది సినిమా సెట్స్ మీదకు వెళ్లటమే లేటు.. అనుకుంటున్న సమయంలో అనుకోకుండా 'అనుపమ'కు హ్యాండ్ ఇచ్చారు చిత్ర యూనిట్. కారణాలేంటో బయటకు రాలేదు కానీ.. 'అనుపమ' ప్లేస్ లో 'సమంత'ను ఫైనల్ చేశారు. భారీ బడ్జెట్ తో రిస్క్ తీసుకొని చేస్తున్న సినిమా కావటంతో 'సమంత' ఇమేజ్ సినిమాకు హెల్ప్ అవుతుందని భావించి ఉంటారు. కానీ 'అనుపమ' ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించి ఉండుంటే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునేదని టాక్ వినిపిస్తున్నాయి.

08:26 - April 5, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తో నటించే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అందులో హీరోయిన్స్ కూడా ఉంటుంటారు. ‘పవన్' సరసన నటించే ఛాన్స్ 'అను ఇమ్మాన్యూయెల్' కి దక్కింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'పవన్' హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పవన్ కళ్యాణ్' నటించిన 'కాటమరాయుడు' ఇటీవలే రిలీజైంది. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్ర పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. సోమవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజు షూటింగ్ లో 'పవన్' పాల్గొనగా 'అనూ ఇమ్మాన్యూయెల్' షూటింగ్ కు హాజరైంది. తొలి రోజు షూటింగ్ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేసింది. ‘అద్భుతాలు జరగబోతున్నాయి..పీకే 25 ఫస్ట్ డే షూటింగ్' అంటూ కామెంట్ చేసింది. ‘పవన్' సరసన 'కీర్తి సురేష్' కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ సాప్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపంచనున్నాడని టాక్.

08:18 - April 5, 2017

హైదరాబాద్ : ఈసారి భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరు కావడం లేదు. ప్రభుత్వం తరపున శ్రీరాముడికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. కానీ బుధవారం ఉదయం వరకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు కాలేదు. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయ్యింది. దీనితో ప్రభుత్వం తరపున శ్రీరాముడికి పట్టువస్త్రాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దంపతులు అందచేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు బాబు జగ్జీవన్‌రాం జయంతి..

హైదరాబాద్: బాబు జగ్జీవన్‌రాం 110వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. జగ్జీవన్ రాం చౌక్ లో నిర్వహించనున్న జయంతి కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు.

 

భద్రాద్రిలో డిప్యూటి సీఎం కడియం..మంత్రులు..

భద్రాద్రి : డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దంపతులు, మంత్రి తుమ్మల చేరుకున్నారు. రామక్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వీరు పాల్గొననున్నారు.

భద్రాద్రి కేసీఆర్ పర్యటన రద్దు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రి పర్యటన రద్దయ్యింది. శ్రీరాములోరి కళ్యాణంలో కేసీఆర్ దంపతులు పాల్గొనాల్సి ఉంది. పర్యటన రద్దు కావడానికి కారణాలు తెలియరాలేదు.

07:45 - April 5, 2017

గుంటూరు మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్ర స్పందించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నేత పురంధేశ్వరీ పార్టీ అధిష్టానానికి, ప్రధాన మంత్రికి లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), రాధాకృష్ణ (రైతు సంఘం నేత), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:45 - April 5, 2017

భద్రాద్రి : రాములోరి పెళ్లికి వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేలాది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కళ్యాణ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరౌతారా ? లేదా ? అనేది సమాచారం లేదని ఆర్డీవో టెన్ టివికి తెలిపారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ఎండ వేడిమి అధికంగా ఉందని ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. పూర్తి విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

06:43 - April 5, 2017

హైదరాబాద్ : ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 10వ సీజన్‌ ప్రారంభ వేడుకలకు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం సిద్ధమైంది. ప్రారంభం ఉత్సవాల్లో భాగంగా లేజర్‌ లైటింగ్‌ షో, బ్రిటీష్‌ బ్యూటీ ఎమీ జాక్సన్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌....ఓపెనింగ్‌ సెర్మనీకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిపోనున్నాయి. ఇవాళ్టి మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ జట్టు బెంగళూరు ను ఢీకొట్టబోతోంది. సాయంత్రం 8గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. బ్రిటీష్‌ బ్యూటీ ఎమీ జాక్సన్‌ లేటెస్ట్‌ బాలీవుడ్ హిట్‌ సాంగ్స్‌కు స్టెప్పులేసి సందడి చేయనుంది.6 నిమిషాల పాటు సాగనున్న ఎమీ జాక్సన్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌....ఓపెనింగ్‌ సెర్మనీకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిపోనుంది. 8 జట్ల కెప్టెన్లు స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వేడుకలకు తెరపడనుంది.భారత క్రికెట్‌ దిగ్గజాలతో పాటు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో అట్టహాసంగా ఆరంభ వేడుకలు..ఆ తర్వాత సన్‌రైజర్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ మ్యాచ్‌....హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది.

06:40 - April 5, 2017

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగింది. ప్రత్యేక రాష్ట్రంలోనే తమకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా విద్యార్ధులు, నిరుద్యోగ యువత కదం తొక్కింది. తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ స్వరాష్ట్రంగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో అనేక హామీలను ప్రజలకు ఇచ్చి టీఆర్‌ఎస్‌పార్టీ అధికారం చేపట్టింది. ఇంటికో ఉద్యోగమిస్తామంటూ కేసీఆర్‌ ఎన్నికల సభల్లో ప్రకటించారు. తమ మేనిఫెస్టోలోనూ పొందుపర్చారు. మరి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచింది. మరి ఎంతమందికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఉద్యోగాలు ఇచ్చిందని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది..?

నిరుద్యోగుల్లో ఆందోళన..
టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన కొత్తలో నూతన ఉద్యోగాల భర్తీ కోసం కొంత ఆర్బాటం చేసిందే తప్ప ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం పోలీస్‌, విద్యుత్‌శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినా వాటిలో కూడా పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. గత ఏడాది నవంబర్‌లో గ్రూప్‌ -2 పరీక్ష నిర్వహించినా నేటికి వాటి ఫలితాలు విడుదల చేయలేదు. ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతుండడంతో... అసలు గ్రూప్‌ -2 పోస్టులను భర్తీ చేస్తారా? లేదా? అన్న ఆందోళన నిరుద్యోగుల్లో మొదలైంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల మీద యువతలో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో వారంతా వలసబాట పడుతున్నారు. స్వరాష్ట్రంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ ఉద్యోగాలు దొరకకపోవడంతో నిరుద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొంతమంది స్వయం ఉపాధి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదు.

రెండు లక్షల ఖాళీలు..
రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గ్రూప్‌ -1లో 1200 పోస్టులు, గ్రూప్‌ -3లో 8వేల ఉద్యోగాలు, గ్రూప్‌ -4లో 36వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక 40వేల టీచర్‌ పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. వీటితో పాటు 6వేల జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, 4500 ఎయిడెడ్‌ టీచర్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇవే కాకుండా .. లైబ్రేరియన్లు, పీఈటీ, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సర్కార్‌ మాత్రం ఇప్పటి వరకు కేవలం 3వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. గ్రూప్‌ -2లో 1000కిపైగా పోస్టులకు పరీక్ష కూడా నిర్వహించింది. ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. గురుకుల టీచర్స్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసి... ఆ తర్వాత రద్దు చేసింది. ఇంత వరకు మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ ఊసేలేదు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు , మండలాల్లో పోస్టుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఖాళీగా ఉన్న పోస్టులను ఆయాశాఖల్లోని ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు తప్పితే... భర్తీ మాత్రం చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఆగ్రహంతో పెల్లుబిగుతోంది. అధికారం చేపట్టి మూడేళ్లైనా ఉద్యోగాల భర్తీ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే మరో ఉద్యమం తప్పదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

06:36 - April 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో మేధోమథనం మొదలైంది. మూడేళ్లుగా పార్టీ పనితీరులో మార్పు రాకపోవడంపై నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను రాజకీయంగా వాడుకోవడాలని డిసైడ్‌ అయ్యారు. గాంధీభవన్‌లో జరిగిన సీనియర్‌ నేతల సమావేశంలో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్ల నేతల సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా నేతలు చర్చించారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే... మరోవైపు సర్కార్‌పై పోరుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కేసీఆర్‌ సర్కార్‌పై ప్రధాన ప్రతిపక్షంగా తాము చేయాల్సినంత పోరాటం చేయడంలేదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది. కేవలం ప్రెస్‌మీట్లకు పరిమితం కావడంతప్ప.. గడిచిన మూడేళ్లలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించడంలో పీసీసీ విఫలమైందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని... దీనిపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ తీసుకోకపోవడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

బీసీ గర్జన సభ..
అసెంబ్లీలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరుపైనా సీనియర్లు పెదవి విరిచారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చేజార్చుకున్నామని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షనేత జానారెడ్డి తీరుపైనా కొందరు పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బీసీలకు కేసీఆర్‌ తాయిలాలు ప్రకటించడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆడుతున్న దోబూచులాటను ఆయా వర్గాలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఓ కార్యాచరణ తీసుకోలేకపోయామని నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ జపిస్తున్న బీసీ మంత్రాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, త్వరలోనే బీసీ గర్జన సభను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఇంకా రెండేళ్ల సమయం..
సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. దేశంలోనే టీఆర్‌ఎస్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వమని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనడానికి సింగిల్‌ బిడ్‌ దాఖలే దీనికి నిదర్శనమన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే కాంగ్రెస్‌ పార్టీ మేల్కొని... పార్టీ బలోపేతం చేసే దిశగా కార్యాచరణపై దృష్టి పెట్టింది. కేవలం ప్రకటనలు, ప్రెస్‌మీట్‌లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలతో ప్రజల్లోకి వెళ్లాలని హస్తంపార్టీ డిసైడ్‌ అయ్యింది. మరి హస్తం నేతల మేధోమథనం పార్టీలో ఏ మేరకు మార్పు తీసుకొస్తుందో వేచి చూడాలి.

06:31 - April 5, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీటింగ్‌లో పాల్గొనడానికి వచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీ కే. కేశవరావుకు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు 500 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా ఓయూకు ఎలా వచ్చారని కేకేను విద్యార్థులు నిలదీశారు. నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పీఎస్‌కు తరలించారు.

06:29 - April 5, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. మిర్చి ధరలు దారుణంగా పడిపోవడంతో తమకు న్యాయం చేయాలని నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఆందోళనకు సీపీఎం, రైతుసంఘాలు మద్దతు తెలిపాయి. మిర్చి ధరలు పడిపోవడంతో గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు సీపీఎం, రైతుసంఘాలు మద్దతు తెలిపాయి. చిలకలూరిపేట జాతీయరహదారిపై రైతులు బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని.. క్వింటాల్‌ మిర్చిని రూ. 10 వేల మద్దుతు ధరకు కొనాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

స్పందించాలి..
కమిషన్‌, మచ్చుల పేరుతో మిర్చియార్డులో అధిక వసూళ్లని అరికట్టాలని, రైతుబంధు పధకం ద్వారా కోల్డ్‌ స్టోరేజీలో రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మిర్చి ధర ఎంతని అడిగిన రైతులపై హోంగార్డు దాడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి యార్డులో మిర్చి పంటను అమ్మడానికి వేచిచూస్తున్నామని.. కానీ ఇంత వరకు పంటను కొనలేదని వాపోతున్నారు. తక్షణమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గిట్టుబాటు ధరపై ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఆందోళనలను ఇలాగే కొనసాగిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

06:26 - April 5, 2017

విజయవాడ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ఎపీలో వైసిపి ప్రత్యక్ష ఆందోళనలకు సిద్దమవుతోంది. తెలుగుదేశం పార్టీని ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నాలను మొదలు పెట్టింది. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలను తేవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మంత్రి వర్గ విస్తరణతో ఎపీలో మొదలైన పొలిటికల్ హీట్ ను మరింత పెంచేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. అధికార పక్షం తీరును ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ అవుతోంది. వైసీపీ సింబల్‌పై విజయం సాధించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పెద్ద ఎత్తున అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు తాజాగా మంత్రి పదవులు కూడా దక్కాయి. వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పోరాటానికి సిద్ధమయ్యారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు తేవాలన్న డిమాండ్ ను జాతీయ స్థాయిలో చర్చకు తేవాలని వైసీపీ భావిస్తోంది. మరో వైపు ఈ అంశాన్ని ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్లి.. టీడీపీ తీరును ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. దీనికోసం ఈనెల ఏడో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ధర్నాలకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని వైసిపి కోరుతోంది. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలకోసం ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్న పార్టీలను కలుపుకుని.. రాష్ట్రంలో అధికార టీడీపీని మరింతగా ఇరుకున పెట్టాలని వైసీపీ అధినేత ప్లాన్స్‌ సిద్ధం చేస్తున్నారు.

06:22 - April 5, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభ వెల్లివిరుస్తోంది. సీతారాముల కళ్యాణానికి ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. భద్రాచలం ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండువగా మొదలయ్యాయి. ఆలయం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. సీతారాముల కళ్యాణానికి అంకురార్పణగా శ్రీరామచంద్రునికి-సీతమ్మకు ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీరామచంద్రుని తరపున ఒకరు - సీతమ్మవారి తరపున మరొకరు భాష్యకులుగా వ్యవహరించిన అర్చకులు .. స్వామివారి ఘనతను, అమ్మవారి రూపలావణ్యాలను కొనియాడారు. మేళతాళాలు..మంగళవాయిద్యాల మధ్య ఎదుర్కోలోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవారికి మంగళహారతులిచ్చారు. అనంతరం సీతారాముల కల్యాణ శుభలేఖను చదివి వినిపించారు. సకల భక్తకోటిని కళ్యాణోత్సవానికి ఆహ్వానించారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా మిథిలాప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. కల్యాణానికి వచ్చే భక్తులందరికీ ప్రసాదాలకు కొరత లేకుండా నిరంతరం లడ్డూలను తయారుచేస్తున్నారు. కల్యాణం తర్వాత భక్తులకు కల్యాణ తలంబ్రాలు పంచేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా కూడా తొక్కిసలాటకు తావులేని రీతిలో బ్యారికేడ్లతో క్యూలైన్లు అందుబాటులోకి తెచ్చారు.

ఒంటిమిట్టలో కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు..

కడప : ఒంటిమిట్టలో నేటి నుండి శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 8.30గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది.

నేడు భద్రాద్రిలో రాములోరి కళ్యాణం..

భద్రాద్రి : నేడు రామక్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.

 

ముదిగేడులో యాసిడ్ దాడి..

నెల్లూరు : పొదలకూరు (మం) ముదిగేడులో యాసిడ్ దాడి జరిగింది. ఓబుల్ రెడ్డి అనే వ్యక్తిపై గిద్దలూరు వాసులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. డబ్బుల లావాదేవీలే కారణమని తెలుస్తోంది.

ఛాలెంజ్ గా పనిచేస్తా - నారా లోకేష్...

విజయవాడ : రివ్యూలో గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చించడం జరిగిందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తాగునీటి సమస్యలపై స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయని, అయ్యన్నపాత్రుడు మంచి మార్పు తెచ్చారని ప్రశంసించారు. ఐటీలో తన పరిచయాల ద్వారా పెట్టుబడులు తీసుకొస్తానని, పెట్టుబడులకు వైసీపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. తనకు కీలక శాఖలు అప్పగించారని, ఛాలెంజ్ గా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పనిలో తనకు ముఖ్యమంత్రితోనే పోటీ అని తెలిపారు.

గన్ మెన్లను వెనక్కి పంపిన చింతమనేని..

పశ్చిమగోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలకమానలేదు. మంత్రివర్గంలో స్థానం సంపాదించలేదనే కారణంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు గన్ మెన్లను డ్యూటి నుండి మంగళవారం వెనక్కి పంపించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఇంటర్వ్యూలపై స్టే..

విజయవాడ : ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఇంటర్వ్యూలపై ట్రిబ్యునల్ స్టే విధించింది. ఈనెల 18వ తేదీ నుండి 2011 గ్రూప్ -1 ఇంటర్వ్యూలు జరగాలిస్ ఉంది.

అమరావతి హోటల్ కు జరిమాన..

హైదరాబాద్ : గ్రేటర్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూడా దాడులు కొనసాగించారు. నాగోల్ లోని అమరావతి హోటల్ కు రూ. 30 వేల జరిమానను విధించారు. మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఆస్టోరియా హోటల్ తో పాటు పలు హోటళ్లకు కూడా జరిమాన విధించిన సంగతి తెలిసిందే.

Don't Miss