Activities calendar

06 April 2017

21:30 - April 6, 2017

ఢిల్లీ : చారిత్రాత్మక జిఎస్‌టి బిల్లు అమలుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. జిఎస్‌టికి చెందిన సిజిఎస్‌టి, ఐజిఎస్‌టి, యూటీ జిఎస్‌టి, పరిహార చట్టాలకు సంబంధించి రాజ్యసభలో రెండు రోజుల పాటు చర్చ జరిగింది. అనంతరం 4 బిల్లులు రాజ్యసభలో పాసయ్యాయి. జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా జిఎస్‌టి అమలులోకి రానుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుంది. కేంద్రం జిఎస్‌టిని మనీబిల్లుగా ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో బిల్లులో సవరణలు చేయడానికి రాజ్యసభకు ఎలాంటి అధికారం ఉండదు. జిఎస్‌టి బిల్లుకు సహకరించిన విపక్షాలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి పనిచేస్తుందన్నారు.

21:28 - April 6, 2017

ఢిల్లీ: రాజస్థాన్‌లోని అల్వార్‌ వద్ద గోరక్షణ పేరిట జరిగిన దాడిని రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రస్తావించింది. రాజస్థాన్‌లో శాంతి భద్రతలు గాడితప్పాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోరక్షక్‌ పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తాయి. ఈ అంశంపై సభలో చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ సభలో నినాదాలు చేశారు.

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఖండించారు...

కాంగ్రెస్‌ ఆరోపణలను కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఘటనలు ఏవీ చోటుచేసుకోలేదని చెప్పారు. నక్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ స్పందించారు. మంత్రి దగ్గర తప్పుడు సమాచారం ఉందని....కొందరు కొట్టడం వల్లే అల్వార్‌లో వ్యక్తి చనిపోయాడని భారత్‌తో సహా విదేశీ మీడియాలో వచ్చిన వార్తను చదివి వినిపించారు.

హర్యానాకు చెందిన15 మంది వ్యక్తులు జైపూర్‌ నుంచి...

హర్యానాకు చెందిన15 మంది వ్యక్తులు జైపూర్‌ నుంచి ఆరు వాహనాల్లో ఆవులను తరలిస్తుండగా అల్వార్‌ వద్ద వారిని అడ్డుకున్ని చితకబాదారు. గోరక్షక్‌ కార్యకర్తలు జరిపిన దాడిలో 55 ఏళ్ల పహలూఖాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

21:26 - April 6, 2017

ఢిల్లీ: సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సిబిఐ తన వాదనలు వినిపించింది. మసీదు కూల్చివేత ఘటనలో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషి, ఉమాభారతి సహా 13మంది మళ్లీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 195 మంది సాక్షులకు లక్నో ట్రయల్‌ కోర్టు విచారించిందని..మరో 300 మంది సాక్షులను విచారించాల్సి ఉందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. 2010లో బీజేపీ సీనియర్‌ నేతలను నిర్థోషులుగా తేలుస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో..హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మళ్లీ విచారణ కొచ్చింది. 

21:19 - April 6, 2017

అమరావతి: ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కామన్‌ లే అవుట్‌ రూల్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మిర్చికి గిట్టుబాటు ధరపై మంత్రివర్గంలో చర్చించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో 5 వేల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. వేసవిలో తాగునీటి అవసరాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడిని నివారించాలని.. చెరువులు, కుంటల మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కాల్వ తెలిపారు. అదేవిధంగా జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కాల్వ శ్రీనివాసులు.

 

21:12 - April 6, 2017

విజయవాడ: సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రిప్ షెడ్ వద్ద పట్టా పక్కకు ఒరిగింది. ప్రయాణీకులను దించి యార్డుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించి మరమ్మత్తులు చేశారు.

20:37 - April 6, 2017

హైదరాబాద్: గోడదూకే నేతల్ని ప్రోత్సహించడంలో అన్ని ప్రధాన పార్టీలదీ అదే నీతి. ఒక రాష్ట్రంలో తప్పు.. మరో రాష్ట్రంలో ఒప్పు. ఫిరాయింపు పర్వంలో అన్ని పార్టీలదీ అదే తీరు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంతో మొదలైన వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. తెలంగాణ లో టిడిపి ఎమ్మెల్యే విషయంలో గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ అదే పనిని చాలా ఉత్సాహంగా చేసి పదవులను కట్టబెట్టడం చాలా విమర్శలకు తావిస్తోంది. నైతిక విలువలు పక్కన పెట్టి ఫిరాయింపులకు తావు ఇస్తున్న పార్టీల తీరుపై నేటి వైడాంగింల్ స్టోర్టీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:05 - April 6, 2017

హైదరాబాద్: కయ్యాలు తీస్తున్న కర్నూలు కలెక్టర్...తెలంగాణ ముచ్చట తీయొద్దట బరాబర్, ఒకర్ని ఒకరు పొగుడుకున్న అన్నా, చెల్లె.... మురిసిపోతున్నదట తెలంగాణ పల్లె, 50 రోజులు దాటినా ఓడ్వని ధర్నాలు...జనగాం దిక్కు గుడిసె జనాల అవస్తలు, వడగళ్ల వానకు వరిచెట్లన్నీ ఆగం ఆగం..పంట పొలాల పొంటి తిరిగిన ప్రతిపక్షపోళ్లు, శ్రీరామ నవమికి మేకలు, కోళ్ల బలి...ఉండాల మండలంలో గమ్మత్తు పెళ్లి, యాదగిరి నర్సన్నను భయపెట్టిన గాలి..ఇంక గంట సేపు వస్తే గాయ గాయే అవ్వు. ఇత్యాది అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

విజయవాడ: సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రిప్ షెడ్ వద్ద పట్టా పక్కకు ఒరిగింది. ప్రయాణీకులను దించి యార్డుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించి మరమ్మత్తులు చేశారు.

దేవతలగుట్టలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే

హైదరాబాద్: దేవతలగుట్టలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదికతో అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశించింది.

కామన్ లే అవుట్ రూల్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కామన్ లే అవుట్ రూల్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి మినహా ఏపీ మొత్తానికి ఒకే విధానం ఉంటుందని తెలిపారు. పరిశ్రమలకు 300 గజాలు, చిన్న వర్క్ షాపులకు 50 గజాలు, కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్ల కోసం 10 ఎకరాల లేఅవుట్ లో 10 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అమరావతికి సీఎం రిలీఫ్ ఫండ్ బ్యాంక్ అకౌంట్ బదిలీ అయ్యింది.

బాలింత మరణాలు సున్నా శాతానికి చేరాలి: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో బాలింత మరణాలు సున్నా శాతానికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళకు ఇచ్చే ఆర్థిక సాయంపై సీఎం ఇవాళ సమీక్ష చేశారు. కేసీఆర్ కిట్, బాలింతలకు ఇచ్చే రూ. 12 వేల ఆర్థికసాయం పథకాలపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కిట్ ద్వారా శిశువుకు అందించే వస్తువులను సీఎం పరిశీలించారు. 

19:00 - April 6, 2017

తూ.గో:కాకినాడ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు మృతిచెందారు. యానాం సమీపంలోని కాపులపాలెం గ్రామానికి చెందిన 19 మంది విహారయాత్రలో భాగంగా కాకినాడ బీచ్‌కు వచ్చారు. వీరంతా సముద్ర స్నానానికి వెళ్లగా అందులో ఐదుగురు మంది గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన కోస్ట్‌ గార్డ్ గాలింపు చేపట్టగా... ముగ్గురి మృతదేహాలు.. మరో ఇద్దరి కోసం కోస్ట్‌ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. 

18:57 - April 6, 2017

ఢిల్లీ: జగన్‌కు కోర్టులో కేసులు విచారణకు వస్తున్నప్పుడు ఢిల్లీ గుర్తుకొస్తుందన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై జగన్‌ రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఏమీ ఉండదని.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరుగుతుందని జేసీ అన్నారు.

18:54 - April 6, 2017

ఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగిపై దాడి చేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి తనపట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తాను ఓ ఎంపీన‌ని చెప్పగా.. అయితే ఏంటి? నువ్వేమైనా మోదీవా అని అడిగాడ‌ని గైక్వాడ్ స‌భ‌కు చెప్పారు. ఈ మాట అన్న త‌ర్వాత అత‌న్ని తాను తోసేశాన‌ని, ఈమాత్రం దానికే త‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు ఎలా న‌మోదు చేస్తార‌ని ప్రశ్నించారు. ప్రయాణించే హక్కును విమాన సంస్థలు నిలిపివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ప్రయాణించేలా పార్లమెంట్‌ తనకు న్యాయం చేయాలని గైక్వాడ్ విజ్ఞప్తి చేశారు. తాను ఏమైనా త‌ప్పు చేసి ఉంటే స‌భ‌కు క్షమాప‌ణ చెబుతున్నాన‌ని, ఆ ఉద్యోగికి మాత్రం చెప్పన‌ని ఆయ‌న స్పష్టంచేశారు. ఎయిర్‌ ఇండియా సిఎండిపై చర్యలు తీసుకోవాలని గైక్వాడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు స్పష్టం చేశారు. 

18:50 - April 6, 2017

ఢిల్లీ: పార్లమెంట్‌లో శివసేన తీరును టీడీపీ ఖండించింది. శివసేన ఎంపీలు ప్రవర్తించిన తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారు. 

18:31 - April 6, 2017

కేసీఆర్ కిట్, బాలింతలకు సయంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : బాలింతలకు రూ.12వేల ఆర్థిక సయం, కేసీఆర్ కిట్ పై ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకాల అమలు కార్యాచరణ, రూపకల్పనకు సీఎం కేసీఆర్ మహిళ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ సభ్యులుగా శాంతి కుమారి, వాకాటి అరుణ, స్మితా సబర్వాల్, యోగితారాణా, ప్రియంక వర్గీస్ లను నియమించారు.

 

 

నిజామాబాద్ మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం

నిజామాబాద్ : జిల్లాలోని ప్రగతి భవన్ లో మున్సిపల్ అధికారులతో మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత, డి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

17:38 - April 6, 2017

హైదరాబాద్: కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిక్రూట్‌మెంట్‌పై అభ్యర్థులు చేసిన ఓపెన్‌ చాలెంజ్‌కు సమాధానమివ్వకుండా కొత్తవాళ్లకు ట్రైనింగ్‌ ఇవ్వడం సరికాదని కానిస్టేబుల్‌ అభ్యర్థులంటున్నారు. పోలీసు ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ కానిస్టేబుల్‌ అభ్యర్థులు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. అభ్యర్థుల సమస్యలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

17:36 - April 6, 2017

సిద్దిపేట : కొమురవెళ్లి మండలంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఐనాపూర్‌, గురువన్నపేట, తపాస్‌పల్లి గ్రామాల్లో వరి పంటలు, మామిడి తోటలను పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని..విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పంటనష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించేలా నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  

17:34 - April 6, 2017

వరంగల్‌ : జిల్లాలోని భట్టుపల్లి శివారు ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దుండగులు సజీవ దహనం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

17:33 - April 6, 2017

హైదరాబాద్: మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతి కేసులో రీపోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజి మరియు కాకతీయ మెడికల్‌ కాలేజి ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రీ-పోస్ట్‌మార్టంను వీడియో తీయాలని.. చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌, మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రీపోస్ట్‌మార్టం నివేదికను సీల్డ్‌కవరులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

17:28 - April 6, 2017

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై... పురందేశ్వరి లేఖ, జగన్ రాష్ట్రపతిని కలవడంపై ప్రధానంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దటిపై కూడా కేబినెట్ చర్చించనుంది. 

బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంలో ముగిసిన వాదనలు

ఢిల్లీ : బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంలో వాదనలను ముగిసాయి. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. అద్వాణీతో పాటు మరో 14 మందిపై కేసు పునర్ విచారణ జరపాలంటూ సీబీఐ చేసిన అపీల్ పై మంగళవారంలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం నేతలను కోరింది.

స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకుల గల్లంతు

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది  యువకుల గల్లంతు అయ్యారు. మూడు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. మృతులను యానాం వాసులుగా గుర్తించారు.

మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం : హైకోర్టు

హైదరాబాద్ : కుటుంబ సభ్యుల సమక్షంలో మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని హైకోర్టు ఆదేశం. హైదరాబాద్ నుంచి మంథనికి ఫోరెన్సిక్ నిపుణులను పంపాలని సర్కారు హైకోర్టు ఆదేశించింది. పోస్ట్ మార్టం నివేదిక సీల్డ్ కవరులో అందజేయాలని సూచించింది.

16:33 - April 6, 2017

హైదరాబాద్: మాస్టర్ మైండ్స్ అడ్మిషన్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ సీఎ ఏర్యాంకర్లతో ఎడ్యుకేషన్ము ప్లస్ లో ముఖి నిర్వహించారు.  పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

వరంగల్ లో దారుణం

వరంగల్ : జిల్లాలోని భట్టుపల్లి శివారు ఇందిరామ్మ కాలనీలో దారుణం జరిగింది. యవకుడు సజీవ దహనం హత్య లేక ఆత్యాహత్య అనేదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

వరంగల్ లో దారుణం

వరంగల్ : జిల్లాలోని భట్టుపల్లి శివారు ఇందిరామ్మ కాలనీలో దారుణం జరిగింది. యవకుడు సజీవ దహనం హత్య లేక ఆత్యాహత్య అనేదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

గుంటూరు : సచివాలయంలో ఏపీ  కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంపై పురందేశ్వరి లేఖ, జగన్ రాష్ట్రపతిని కలవడంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్ననీటి ఎద్దడిపై, విశాఖ, చిత్తూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూముల కేటాయంపుపైనా చర్చ జరగనుంది.

మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో మంత్రులు తలసాని, కడియం, సీఎస్ ఎస్పీ సింగ్ తో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గొర్రెల, మేకల పెంపక లబ్ధిదారుల ఎంపికపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో మంత్రులు తలసాని, కడియం, సీఎస్ ఎస్పీ సింగ్ తో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గొర్రెల, మేకల పెంపక లబ్ధిదారుల ఎంపికపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

15:48 - April 6, 2017

యాదాద్రి : భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలోకలుషిత రసాయనాలు రైతుల్ని నిలువునా ముంచేశాయి.. చెరువులోకి మూసీనది వ్యర్థాలు వదలడంతో 10 లక్షల రూపాయల విలువైన చేపలు చనిపోయాయి.. మరో నెలరోజుల్లో ఈచేపల్ని అమ్మి అప్పులు కట్టాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.. చేపలపెంపకంకోసం అప్పులుతెచ్చిమరీ పెట్టుబడి పెట్టామని... ఇప్పుడు తాము ఏం చేయాలని రైతులు ఆవేదన చెందుతున్నాడు..

15:46 - April 6, 2017

అమరావతి: ఏపీలో లారీ యజమానులు సమ్మె విరమించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో లారీ యజమానుల చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని లారీ యజమానుల సంఘం నేతలు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ ఆరు సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందించారు. అయితే.. ఇందులో రెండు సమస్యలు కేంద్ర పరిధిలో ఉన్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 

15:44 - April 6, 2017

ఢిల్లీ: తమ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్‌ జగన్‌తో పాటు వైసీపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇదే అంశంపై అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

విజయవాడలో కూలిన నారాయణ జునియర్ కాలేజీ భవనం

విజయవాడ : నిడమానురు జాతీయ రహదారి సమీపంలో నారాయణ జూనియర్ కాలేజీ భవనం కూలింది. రోడ్డు వెడల్పు పనులు చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. కాలేజీకి సెలవులు కావడంతో భవనంలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 

15:42 - April 6, 2017

ఢిల్లీ: లోక్‌సభలో శివసేన ఎంపీ గైక్వాడ్‌ వ్యవహారంపై లోక్‌సభలో గందరగోళం నెలకొంది. గైక్వాడ్‌ విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించడాన్ని నిరసిస్తూ కేంద్ర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజుతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా కొంతమంది ఎంపీలు అశోక్‌గజపతిరాజుపై దాడికి యత్నించారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతి ఇరానీలు శివసేన ఎంపీలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో జరిగిన ఘటనకు శివసేన ఎంపీ గైక్వాడ్‌ క్షమాపణ చెప్పారు. 

ఏపీలో లారీ యజమానుల సమ్మె విరమణ

గుంటూరు : ఏపీ లారీ యజమానులు సమ్మెను విరమించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె వివమిస్తున్నామని లారీ యజమానల ప్రకటన చేశారు. రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో లారీ యజమానుల చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్టు లారీ యజమానులు తెలిపారు. ఆరు సమస్యలపై లారీ యజమానులు వినతి పత్రం ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరులో రెండు కేంద్రం పరధిలో ఉన్నాయని ఆయన తెలిపారు.

 

 

 

ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ ప్రకటన

ముంబై : ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంపై ప్రకటన విడుదల చేసింది. రెపో రేటు 6.25శాతం యథాతథంగా కొనసాగించి, రివర్స్ రెపో రేటును 5 శాతానికి పెంచింది. 2017,2018 సంవత్సరానికి వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచన వేసింది.

15:13 - April 6, 2017

శివసేన ఎంపీల దురుసు ప్రవర్తన

ఢిల్లీ : శివసేన ఎంపీ గైక్వాడ్ పై విమానాయాన సంస్థల నిషేధంపై వివాదం రజుకుంది. సభ వాయిదా పడిన వెంటనే శివసేన ఎంపీలు పౌరవిమానాయన శాఖ మంత్రి అశోక గజపతి రాజు పట్ల దురుసుగా ప్రవర్తించారు. శివసేన ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి అనంత్ గీత గజపతి రాజుపై దాడి యత్నాం చేశారు. వివాదం ముదరకుండా గీతను స్మృతి ఇరానీ, అహ్లూవాలియా పక్కకు తీసుకెళ్లారు. అశోక గజపతి దగ్గరకు రాజ్ నాథ్ వెళ్లి గొడవ జరగకుండా చూసారు.

 

14:52 - April 6, 2017

అమరావతి : దళితుల భూముల్ని సీఎం చంద్రబాబు అక్రమంగా లాక్కుంటున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహించారు. లింగాయపాలెం గ్రామంలో రాజధాని ప్రాంత వ్యవసాయ, కౌలు, అసైన్డ్‌, లంక దళిత రైతుల హక్కుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మధుతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు కమలమ్మ, ఎమ్మెల్యే ఆర్కే, సీహెచ్‌ బాబురావు, వడ్డే శోభనాద్రేశ్వరరావు, మేధావులు హాజరయ్యారు. దళితుల భూముల విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి తమ సత్తా ఏంటో చూపిస్తామని మధు హెచ్చరించారు. 

14:48 - April 6, 2017

సూర్యాపేట : చింతలపాలెం మండలం నక్క గూడెం గ్రామంలో నిర్వహించిన ఎడ్ల పందాల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్లపందాల్లో ఒక్కసారిగా ఎద్దులు బెదరిపోయాయాయి. దీంతో ఉత్సవాల్లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఉత్తమ్‌తో పాటు పలువురికి స్పల్ప గాయాలయ్యాయి.  

14:45 - April 6, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులతో పాటు శాఖలు మారిన వారు ఈరోజు తమ బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు, గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు, మార్కెటింగ్‌, సహకార, పశుసంవర్థక, మత్స్య, గిడ్డంగుల శాఖ మంత్రిగా ఆదినారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటును అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు ఇంకా చాంబర్‌ కేటాయించనందున తాత్కాలికంగా ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించి అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు పాత చాంబర్‌లోనే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మూడు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికొస్తుందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

14:44 - April 6, 2017

ఆర్మూర్ : సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతు రుణాల మాఫీ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన జనహిత ప్రగతి సభలో ప్రస్తావించారు. ఆర్మూర్‌ సభలో అన్నా చెల్లెళ్లు ఒకే వేదికపై ప్రసంగించారు. కేటీఆర్‌, కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. నిజామాబాద్‌లో మినీ టీ హబ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కవిత కోరారు. 

ఎండ్ల పందెల్లో టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు గాయాలు

సూర్యపేట : జిల్లా సూర్యపేట జిల్లా నక్కగూడెం శ్రీరామనవమి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఎండ్ల పందెలు ప్రారంభిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కమార్ రెడ్డి కిందపడ్డారు. ఉత్తమ్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి.

 

 

రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న జగన్

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జగన్ భేటీ కానున్నారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ప్రణబ్ తో చర్చించనున్నారు.

ప్రజల సంక్షేమామే ప్రభుత్వా ధ్యేయం :కేటీఆర్

నిజామాబాద్ : ఆర్మూర్ జనహిత ప్రగతి సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమామే ప్రభుత్వా ధ్యేయామని అన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ కష్టాలు ఉంటాయన్నారు కానీ అందరి నోళ్లు మూయించేలా విద్యత్ అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కు మొదటి నుండి నిజామాబాద్ జిల్లా అండగా ఉందని అన్నారు. 40లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామ, అమ్మఒడి పేరుతో గర్భిణీలకు రూ.12వేలు ఇస్తున్నామని తెలిపారు. నిజాం హయంలోనే నిజాంమాబాద్

తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ : కవిత

నిజామాబాద్ : అర్మూర్ జనహిత ప్రగతి సభలో ఎంపీ కవిత మాట్లాడతూ దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని, రాష్ట్రంలో పచ్చపార్టీ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ తప్ప కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో రాజకీయ సుస్థిరత లేదని తెలిపారు. కేటీఆర్ అన్న మాత్రమే కాదు కష్టాల్లో ఉన్నఆడబిడ్డలందరికీ సోదరుడని అన్నారు.

బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతల కేసులను పునరుద్ధరించాలని సీబీఐ వాదానలు వినిపించింది. అద్వానీ,మురళీ మనోహర్, ఉమాభారతి సహా 14 మందిపై లక్నో కోర్టులో విచారణ జరపాలంటూ సీబీఐ వాదన కొనసాగించింది. 195 మంది సాక్షులను లక్నో ట్రయల్ కోర్టు విచారించందని, మరో 300 మందిన విచారించాల్సి ఉందని అత్యున్నత న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. రాయబరేలి కోర్టు 57 మంది సాక్షులను విచారించిందని. మరో 100 సాక్షులను విచారించాల్సి ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది.

బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించడంపై సీఎం కేసీఆర్ హర్షం

హైదరాబాద్ : జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యంగ బద్ధత కల్పించడానికి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బీసీల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. బీసీ కమిషన్ కు రాజ్యంగ బద్ధత కల్పించడం ప్రగతశీలమైన చర్య అని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందని ఆయన తెలిపారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతోపాటు పార్టీ తరపున మద్ధతు నిలువాలని కేసీఆర్ ఎంపీలను కోరారు.

 

రాజ్యసభలో గైక్వాడ్ వివరణ

ఢిల్లీ : ఎయిర్ ఇండియా మేనేజర్ పై దాడి ఘటనపై రాజ్యసభలో శివసేన ఎంపీ గైక్వాడ్ వివరణ ఇచ్చారు. తను ఎవరిపట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, ఎయిర్ ఇండియా సిబ్బందే తనను అమమానించారని అన్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది తనను నువ్వు ఎంపీవి...ప్రధానివి కావంటూ ఎద్దేవా చేశారని ఆయన తెలిపారు. ఈ అంశాన్ని మీడియా తప్పుగా ప్రచారం చేసిందని ఆరోపించారు.

12:41 - April 6, 2017

అమ్మ చేత్తో గోరుముద్ద..నాన్నతో షికార్లు..అమ్మమ్మలు..నాయినమ్మల వద్ద గారాలు..అలిసిపోయే విధంగా ఆడుకోవడం..తోబుట్టువులతో అల్లిబిల్లికజ్జాలు..స్కూల్ కు వెళ్లనని మారాం చేయడం..అంతే కదా బ్యాలం అంటే..కానీ బాలలందరి బాల్యం అంతే అందంగా ఉందా ? అసలు బాల్యం భద్రంగా ఉంటోందా ? చిన్న ప్రాయంలో తల్లులవుతున్న బాలికల దీనస్థితిపై మానవి ఫోకస్..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

డీజీపీ ఆఫీస్ ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థుల యత్నాం

హైదరాబాద్ : డీజీపీ ఆఫీస్ ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రయత్నాం చేశారు. ఆందోళన చేస్తున్నా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు  మాట్లాడతూ ఓపెన్ ఛాలెంజ్ విధానం ద్వారా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై తాము  ఆందోళన చెందుతున్నామని అన్నారు.

12:36 - April 6, 2017

ఢిల్లీ : ఆల్వార్‌ ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది.. గోరక్షక్‌ పేరుతో దాడి, వ్యక్తి మృతి ఘటన దారుణమంటూ కాంగ్రెస్‌ మండిపడింది.. ఈ అంశంపై సభలో చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు హస్తం నేతలు.. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ సభలో నినాదాలు చేశారు.. గోరక్షక్‌ పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు.

12:34 - April 6, 2017

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నగర పర్యటన కోసం కాషాయ దళాలు..శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కానీ వారి ఆశ నెరవేరడం లేదు. అమీత్ షా నగర పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం అమిత్‌ షా రేపు నగరానికి రావాల్సి ఉంది. పాతబస్తీలోని దళితవాడలో జరిగే సహపంక్తి భోజనం కార్యక్రమంతో పాటు, పార్టీ కార్యకర్తలు, బ్యాంకు ఉద్యోగుల సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కానీ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో రాష్ట్రపతి ఎన్నికపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన రద్దయింది. త్వరలోనే ఆయన పర్యటన ఖరారు కానుందని తెలుస్తోంది.

12:31 - April 6, 2017

హైదరాబాద్ : మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి కేసును పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. అయితే మధ్నాహ్నం 2.30 గంటలకు లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ హైకోర్టులో విచారణకు రానుంది. రేపు రీ పోస్టుమార్టమ్ జరిగే అవకాశాలున్నాయి.

12:27 - April 6, 2017

నిజామాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఒకే వేదికపై కనిపించారు. నిజామాబాద్‌ జిల్లాలో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సభలు, శాసన సభాపక్ష సమావేశాల్లో ఇతర ప్రజాప్రతినిధులతోపాటు కేటీఆర్‌, కవితలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరుకావడం ఇదే మొదటిసారి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని సభకు హాజరు కావాల్సిందిగా ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌ లను కోరగా వారు అంగీకరించారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉండడంతో పర్యటన రద్దు అయినట్టు తెలుస్తోంది. అమిత్ షా రేపు నగరానికి వచ్చి పార్టీ కార్యకర్తల, బ్యాంకు ఉద్యోగుల భేటీల్లో పాల్గొనాల్సి ఉంది. పర్యటన రద్దు కావడంతో కార్యక్రమాలన్ని రద్దయ్యాయి.

12:25 - April 6, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులతో పాటు శాఖలు మారిన వారు ఈరోజు తమ బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు, గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు, మార్కెటింగ్‌, సహకార, పశుసంవర్థక, మత్స్య, గిడ్డంగుల శాఖ మంత్రిగా ఆదినారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటును అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు ఇంకా చాంబర్‌ కేటాయించనందున తాత్కాలికంగా ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించి అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు పాత చాంబర్‌లోనే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మూడు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికొస్తుందని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

మంథని మధుకర్ మృతిపై హైకోర్టు ఆశ్రయించిన పౌరసంఘాలు

హైదరాబాద్ : మంథని మధుకర్ మృతిపై పౌరహక్కుల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మధుకర్ కేసును హత్య కేసుగా నమోదు చేసి ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు లంచ్ మోషన్ లో విచారణకు రానుంది.

12:14 - April 6, 2017

ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో వారు కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే ఏమి చేయాలి.

  • ఉదయం లేవగానే చేతులను..మెడను..కాళ్లు..చేతులను అటూ ఇటూ కదుపుతూ చిన్న పాటి వ్యాయామాలు చేయండి. ఇలా బెడ్ పై కూడా చేయవచ్చు.
  • ఉదయాన్నే తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. కనీసం 8గంటల పాటు పడుకొనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ కూడా పడుకోవద్దు.
  • ఉదయం లేవగానే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలో పిహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.
  • ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.
  • ఇక రాత్రి పడుకొనే సమయంలో నిద్ర రాకపోతే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆందోళనలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
  • వీకెండ్ రోజుల్లో కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి.

ప.గో ఆక్వాఫుడ్ పార్క్ మృతుల సంస్మరణ సభ

పశ్చిమ గోదావరి : జిల్లాలో మొగల్తూరు మండలంలో నల్లావారితోటలో ఆనంద్ ఆక్వాఫుడ్ పార్క్ మృతుల సంస్మరణ జరగింది. సంస్మరణ సభలో ఏపీ సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు గపూర్ పాల్గొన్నారు.

రాజ్యసభలో అల్వార్ ఘటనపై చర్చ

ఢిల్లీ : రాజ్యసభలో అల్వార్ ఘటనపై చర్చ జరిగింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతూ కొంత మంది గోరక్షక్ పేరిట రౌడీయిజం చేస్తున్నారని, అల్వార్ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అల్వార్ లో గోవులను తరలిస్తున్న వాహనంపై గోరక్షక్ సేవకులు దాడి చేశారు. దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

 

ఏపీ సీఎం అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ బలోపేతంపై, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అన్నిజిల్లాల పార్టీ నేతలతో నేతలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆర్మూర్ లో జనహిత ప్రగతి సభ

నిజామాబాద్ : జిల్లాలోని ఆర్మూర్ లో జనహిత ప్రగతి బహిరంగా సభ జరుగనుంది. ఈ సభలో మంత్రి కే. తారాక రామరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఒకే వేదిక పైకి అన్న చెల్లెలు కేటీఆర్, కవిత వస్తుండంతో కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

పక్షి వల్ల విమానం అత్యవసర ల్యాండింగ్

కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రైట్ వింగ్ సమీపంలో పక్షి రావడంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 

11:24 - April 6, 2017

హైదరాబాద్ : చర్లపల్లి జైలులో ఖైదీలు ఆందోళన చేపట్టడం కలకలం సృష్టిస్తోంది. డిప్యూటి జైలర్ దశరథం వేధింపులు ఆపాలంటే వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వేధిస్తున్నారంటూ గతంలో కూడా ఖైదీలు ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. జీవిత ఖైదీగా ఉన్న మల్లేష్ పై ఆయన కక్ష పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. భోజనం సరిగ్గా లేదనడమే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుండి వరంగల్ జైలుకు మల్లేషం తరలింపును ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

గాంధీలో ఒప్పంద కార్మికుల ఆందోళన

హైదరాబాద్ : సికిద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఒప్పంద పరిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ఉదయం ఆందోళన చేపట్టారు. తమకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విధులను బహిష్కరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగారు. కార్మికుల ఆందోళన కారణంగా ఆసుపత్రిలోని పలు వార్డుల్లో చెత్త పేరుకపోయి దుర్వాసన వచ్చి రోగులు, వారి సహాకులు ఇబ్బంది పడుతున్నారు.

 

ఎలుబంటి దాడిలో రైతుకు గాయాలు

కరీంనగర్ : జిల్లాలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్ లో ఓ ఎలుగుబంటి రైతుపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో రైతు స్వల్పంగా గాయపడ్డారు. అంకుషాపూర్ చెందిన రవీందర్ రెడ్డి గురువారం ఉదయం తన మొక్కజోన్న చేనుకు నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పంట చేనులో అలజడి కావడంతో వెళ్లి చూడగా ఎలుగుబంటి అతడిపై దాడి చేసింది.

 

సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన

సిద్దిపేట : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కన్నపేట మండలం ధర్మావరంలో వడగళ్ల వానతో దెబ్బతిన్న మామిడి తోటలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వెంటనే పంపిచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

లోకేశ్ కు తెలివితేటలున్నాయి : అయ్యన్న...

గుంటూరు : నారా లోకేష్ కు తెలివితేటలున్నాయని మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనకు గతంలో రెండుసార్లు ఆర్ అండ్ బీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. లోకేశ్ కు అనుభవం లేకపోయినా అధికారుల సలహాలతో మంత్రిగా ఆయన రాణిస్తాడని అయ్యన్న తెలిపారు.

 

టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కోసం కమిటీ..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాల రూపకల్పనకు సీఎం కేసీఆర్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా కే.కేశవరావును నియమించారు. సభ్యులుగా ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి, ఎంపీలు ఉండనున్నారు.

ఆదినారాయరెడ్డి మంత్రిగా బాధ్యతల స్వీకరణ

గుంటూరు : మార్కెటింగ్, సహకార, గిడ్డంగులు,పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఆదినారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం

ఖమ్మం : భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోంది. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

చర్లపల్లి జైల్లో ఖైదీల ఆందోళన

హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో ఖైదీల ఆందోళన నిర్వహించారు. డిప్యూటీ జైలర్ దశరథం వేధిస్తున్నాడని ఖైదీలు నిరసన తెలిపారు. డిప్యూటీ జైలర్ పై వెంటనే చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

09:34 - April 6, 2017

హీరో క్యారెక్టర్ ను అతని స్టైల్ కు తగినట్లుగా ఎలివేట్ చేయడంలో 'వినాయక్' ది అందెవేసిన చెయ్యి. ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ లో నటించడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతుంటారు. ఈయన దర్శకత్వంలో వహించన 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘చిరంజీవి'కి ఇది 150వ చిత్రం. అనంతరం ఆయన ఎవరితో సినిమా తీస్తారనే ప్రశ్నలు ఉదయించాయి. గతంలో 'చిరు' తో 'ఠాగూర్' సినిమా తీశారు. తమ్ముడు 'పవన్' తో సినిమా తీయాలని 'వినాయక్' భావించారు. కానీ అప్పుడు అది వర్కవుట్ కాలేదు. తాజాగా మరోసారి 'పవన్' కోసం 'వినాయక్' ప్రయత్నాలు మొదలు పెట్టాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి 'పవన్' ప్రవేశించడం..ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తానని 'పవన్' ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కానీ పక్కాగా ఉంటుందని మరో ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలకంటే ముందు రిలీజ్ అయ్యే విధంగా పక్కా ప్లాన్ వర్కవుట్ చేస్తున్నట్లు టాక్. ఒక పొలిటికల్ అంశంతో ప్రజల ముందుకు వస్తే ఎన్నికల్లో కలిసి వస్తుందని 'పవన్' యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో 'పవన్' కోసం పవర్ ఫుల్ స్ర్కిప్ట్ ను వినాయక్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా ? వీరి కాంబినేషన్ లో చిత్రం ఉంటుందా ? అంటే వేచి చూడాలి.

09:18 - April 6, 2017

చిత్తూరు : లారీల సమ్మె తీవ్రతరమౌతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా లారీ యజమానులు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వాలు స్పందించకపోతుండడంతో నేటి నుండి సమ్మెలో నిత్యావసర సరుకులు రవాణా చేసే లారీలు పాల్గొంటున్నాయి. దీనితో ఇప్పటికే పెరిగిన ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తిరుమలలోని శ్రీవారి లడ్డూపై సమ్మె ఎఫెక్ట్ కనిపిస్తోంది. వేసవి కాలంలో భక్తులు అధికంగా వస్తారని ముందే ఊహించిన టిటిడి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఏకంగా ఆరు లక్షల లడ్డూలను నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంది. కానీ సమ్మె ప్రభావంతో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి..శెనగపిండి కొరత ఏర్పడుతోంది. అంతేగాకుండా లడ్డూ తయారీ సరుకు నిల్వలు తగ్గుతున్నాయి. టిటిడి వద్ద నాలుగు రోజులకు సరిపడా సరుకు నిల్వలున్నాయి. మరో మూడు రోజులు సమ్మె కొనసాగితే లడ్డూ తయారీ కష్టమని సిబ్బంది పేర్కొంటున్నారు. సరుకులు తెప్పించేందుకు టిటిడి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

09:13 - April 6, 2017

కడప : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కరెంటు రావడంతో పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన తండ్రి కొడుకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. దీనితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తొందూరు మండలంలోని సైదాపురంలో జగదీశ్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తండ్రి కొడుకులు నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి కరెంటు రావడంతో చీని తోటకు నీరు పెట్టేందుకు వీరు పోలానికి వెళ్లారు. మోటార్ పనిచేయకపోవడం సరిచేసే క్రమంలో విద్యుద్ఘాతం తగిలి చనిపోయారని తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. ఉదయం వీరిద్దరూ పొలంలో మృతి చెందారని తెలుసుకున్నారు. దీనితో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

సైదాపురంలో విషాదం..

కడప : జిల్లాలోని కొందూరు (మం) సైదాపురంలో విషాదం చోటు చేసుకుంది. పొలం వద్ద విద్యుత్ షాక్ తండ్రీకొడుకులు మృతి చెందారు. జగదీశ్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలుగా గుర్తించారు.

09:01 - April 6, 2017

విక్టరీ 'వెంకటేష్' నటించిన 'గురు' చిత్రంపై మంచి టాక్ వినిపిస్తోంది. క్రీడాంశ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. హిందీలో వచ్చిన 'సాలా ఖడూస్'ని తెలుగులో రీమెక్ చేశారు. ఈ సినిమాలో 'వెంకీ' బాక్సింగ్ కోచ్ కనిపించారు. సుధా కొంగర కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హావా కొనసాగుతోందని తెలుస్తోంది. ఇప్పుడీ ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ హీరో మాత్రం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ‘వెంకీ'ని పక్కన పెట్టి 'రానా'ను తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సీక్వెల్ స్టోరీని రానాకు సుధా వినిపించారని..కథ నచ్చడంతో దానికి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో 'రానా' నటిస్తున్నాడు. మరోవైపు బాహుబలి-2 విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సుధా కొంగరతో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్.

08:53 - April 6, 2017

త్రిష...'గౌతమీపుత్ర శాతకర్ణీ' లో పర్ ఫెక్ట్ నటనకు ఆమెపై ప్రశంసలు కురిశాయి. ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపిస్తూనే, కావాల్సినంత గ్రేస్ తో సినిమాకి ఎసెట్ లా నిలిచిందనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. బాలయ్య సరసన గత చిత్రాల్లో కూడా 'త్రిష' నటించింది. తాజాగా మరోసారి బాలయ్యతో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ 101వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక కథానాయికగా ముస్కాన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో హీరోయిన్ గా 'త్రిష'ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక మూడో కథానాయికగా 'ఛార్మీ'ని సెలక్ట్ చేస్తారని టాక్. కానీ ఈ సినిమాలో 'ఛార్మీ'తో ఐటమ్ సాంగ్ చేయిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయక తప్పదు.

శ్రీవారి లడ్డూ తయారీపై లారీ సమ్మె ఎఫెక్ట్..

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై లారీల సమ్మె ప్రభావం కనిపిస్తోంది. లడ్డూ తయారీ సరుకు నిల్వలు తగ్గుతున్నాయి.

ధర్మారంలో మంత్రి హరీష్ పర్యటన..

సిద్ధిపేట : అక్కన్నపేట (మం) ధర్మారంలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. వడగళ్ల వానకు పాడైన మామిడి తోటలను ఆయన పరిశీలించారు.

08:27 - April 6, 2017

హైదరాబాద్ : ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దుమ్మురేపింది. బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో యువరాజ్‌ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో మోతమోగించాడు. యూవీ బ్యాటింగ్‌ ప్రదర్శన అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అద్భుతమైన ఆఫ్‌సెంచరీ చేసిన యూవీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్‌ ఓడిన హైదరాబాద్‌ ముందుగా బ్యాటింగ్‌కు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హైదరాబాద్‌ కెప్టెన్‌ వార్నర్‌.. అనికేత్‌ వేసిన ఓవర్‌లో ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టి జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత 14 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. ఈ దశలో శిఖర్‌ ధావన్‌... హెన్రిక్స్‌తో జత కలిశాడు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు రాబట్టారు. వాట్సన్‌ వేసిన ఓవర్లో ధావన్‌ నాలుగు ఫోర్లు బాదడంతో అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగింది. ఆతర్వాత 40 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర స్టువర్ట్‌ బిన్నీ వేసిన ఓవర్లో సచిన్‌ బేబీకి క్యాచ్‌ ఇచ్చి శిఖర్‌ దావన్‌ పెవిలియన్‌ చేరాడు.

207 పరుగులు..
ధావన్‌ ఔటయ్యాక.. యువరాజ్‌ హెన్రిక్స్‌తో జతకలిశాడు. ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ఫోర్‌ బాదిన యూవీ... ఆతర్వాత అనికేత్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4,6,4 బాది అభిమానులను ఉర్రూతలూగించాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర యూవీ ఇచ్చిన క్యాచ్‌ను అరవింద్‌ వదిలేశాడు. దీంతో యూవీ మరింతగా రెచ్చిపోయాడు. 23 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేశాడు. యూవీకి ఐపీఎల్‌లో ఇదే వేగవంతమైన హాఫ్‌ సెంచరీ. 19వ ఓవర్లో మిల్స్‌ వేసిన తొలి రెండు బంతుల్లో ఓ ఫోర్‌, సిక్స్‌ బాదిన యూవీ... ఆ తర్వాత బంతికి బౌల్డయ్యాడు. చివర్లో కటింగ్‌,దీపక్‌ హుడా చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి హైదరాబాద్‌ 207 పరుగులు సాధించింది.

172 పరుగులకే ఆలౌట్..
తర్వాత 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్స్‌ క్రిస్‌గేల్‌, మన్‌దీప్‌సింగ్‌ మంచి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ చక్కటి స్కోరు సాధించారు. గేల్‌ వీరవిహారంతో బెంగళూరు 5ఓవర్లలో 48 పరుగులు చేసి విజయంపై ధీమా పెంచింది. ఆ తర్వాత రషీద్‌ వేసిన ఓవర్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర మన్‌దీప్‌ పెవిలియన్‌ చేరగా.. హుడా వేసిన తర్వాతి ఓవర్‌లోనే గేల్‌ ..వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కేదార్‌జాదవ్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. రషీద్‌ వేసిన తర్వాత ఓవర్లోనే హెడ్‌ కూడా అవుట్‌ కావడంతో బెంగళూరు ఆశలు సన్నగిల్లాయి. చివర్లో వాట్సన్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా బెంగళూరు విజయం సాధించలేకపోయింది. 19.4 ఓవర్లలో 172 పరుగులకే ఆల్‌ఔట్‌ అయ్యింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నెహ్రా, భువనేశ్వర్‌, రషీద్‌ తలా రెండు వికెట్లు తీయగా.... హుడా, బిపుల్‌శర్మ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక బెంగళూరు బౌలర్లలో మిల్స్‌, అనికేత్‌, చాహల్‌, స్టువర్ట్‌ బిన్నీ తలో వికెట్‌ తీశారు. సన్‌రైజర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

08:23 - April 6, 2017

నల్గొండ : జిల్లాలో దురాచారం వెలుగులోకి వచ్చింది. భక్తి పేరిట జంతుబలి ఇస్తున్న ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని పెద్దపూర (మం) రామన్నగూడెం తండాలో కాళికామాత జాతర జరుగుతుంటుంది. శ్రీరామనవమి అనంతరం ఇక్కడ అర్ధరాత్రి జాతర జరుగుతుంది. కానీ జాతరలో జంతుబలి ఇస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి 40 దున్నపోతలను బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న మీడియా ఘటనను చిత్రీకరించడానికి వెళ్లారు. వీరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో దున్నపోతల బలి ఆగిపోయింది. ప్రతి సంవత్సరం 116 దున్నపోతులను బలి కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది. ఈ జాతరకు వరంగల్, ఖమ్మం, గుంటూరు, కర్నూలు ప్రాంతాల నుండి వచ్చారు. బలి ఇచ్చిన జంతువుల తలలను సమీప పోలాల్లో పాతి పెడుతారు. పోలీసులకు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 1944 సంవత్సరం నుండి ఆచారం కొనసాగుతోందని, దీనిని వదిలిపెట్టుకోలేమని అక్కడున్న వారు ఖరాఖండిగా చెబుతున్నారు.

 

నేడు ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరూ కూడా కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు.

మంత్రి కేటీఆర్ జిల్లాల బాట..

నిజామాబాద్ : మంత్రి కేటీఆర్ జిల్లాల బాట కొనసాగుతోంది. నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆర్మూరులో జరిగే జిల్లాబాట కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.

07:38 - April 6, 2017

గోరక్షణ పేరిట హిందుత్వ శక్తుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని అల్వర్‌లో గోరక్షణ పేరిట జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హర్యానాకు చెందిన15 మంది వ్యక్తులు ఆరు వాహనాల్లో ఆవులను తరలిస్తుండగా బహరోర్‌ వద్ద వారిని అడ్డుకున్ని చితకబాదారు. శనివారం నాడు జరిగిన ఈ ఘటనలో 55 ఏళ్ల పహలూఖాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో పాటు ఇతర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఇందిరా శోభన్ (కాంగ్రెస్), కుమార్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:17 - April 6, 2017

154 రోజుల పాటు 4200 కిలోమీటర్ల పాదయాత్రలో రమణ పాల్గొన్న సంగతి తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో జన్మించిన రమణ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు, వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్యమండలి, కల్లుగీత కార్మిక సంఘాలలో పనిచేసిన రమణ చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ కన్వీనర్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1989లో ఉద్యమాల్లో ప్రవేశించిన రమణ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. పరకాల, మహబూబాబాద్ భూ పోరాటాల్లో క్రియాశీలకంగా పని చేసిన రమణ అనేక కేసులు ఎదుర్కొని జైలు జీవితం సైతం గడిపారు. వీరి సతీమణ స్వర్ణలత సైతం మహిళా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి జనపథంలో రమణ..ఆయన సతీమణి స్వర్ణలత..వీరి కుమార్తె స్పందన పాల్గొన్నారు. ఈసందర్భంగా పాదయాత్ర అనుభవాలు రమణ తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

07:09 - April 6, 2017

విశాఖపట్టణం : ఎగిసిపడే కెరటాలను చూస్తే ఆనందం... లయగా వచ్చే అలల ఘోషను వింటే ఆహ్లాదం. అలతో పాటు ఎగిరిగంతేయాలనే తాపత్రయం. కాని ఆ ఆనందం వెనుక.. ఆ ఆహ్లాదం వెనుక మృత్యుగీతం వినిపిస్తోంది. మధురానుభూతులకు బదులు చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. సువిశాల సాగర తీరం విశాఖ సిగలో మణిమకుటం. ఎగసిపడే పాల నురగల్లాంటి అలలు..తీరానికి దూసుకొచ్చే కెరటాలు.. ఇలా సముద్ర సొబగులు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఈ ఆనందమంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు అంతా విషాదం. తల్లుల కడుపుకోత..కన్నహృదయాల తీరని వేదన. ఆహ్లాదకర అలల ఘోష వినిపించిన చోటే మృత్యు ఘోష వినిపిస్తోంది. విశాఖ బీచ్‌ ప్రమాదాలకు నెలవుగా మారింది. నిత్యం ఎవరో ఒకరిని సాగర తీరం బలి తీసుకుంటోంది. ఏడాదికేడాది బీచ్‌లో మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన ఆరేళ్లలో బీచ్‌లో 180 ప్రమాదాలు జరిగితే 215 మంది ప్రాణాలు కోల్పోయారు.

2011లో 36 ప్రమాదాలు 39 మంది మృత్యువాత
2012లో 30 ప్రమాదాలు 37 మంది మృత్యువాత
2013లో 33 ప్రమాదాలు 39 మంది మృత్యువాత
2014లో 43 ప్రమాదాలు 45 మంది మృత్యువాత
2015లో 28 ప్రమాదాలు 35 మంది మృత్యువాత
2016లో 10 ప్రమాదాలు 20 మంది మృతి

30 కిలో.మీటర్లు..
విశాఖ సాగర తీరం 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఎవరు ఎక్కడ బీచ్‌లో ఆడుకోవడానికి దిగుతున్నారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా యువత ఎవరూ లేని ప్రదేశాన్ని ఎంచుకుంటోంది. దీంతో అక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇతరులకు తెలియని పరిస్థితి. తాజాగా జరిగిన ప్రమాదంలో కూడా ఇదే జరిగింది. విశాలాక్షి నగర్‌ తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన ఇంటర్‌ విద్యార్థులు పోటోలు దిగుతుండగా అలల ధాటికి ఇద్దరు సముద్రంలోకి కొట్టుకుపోయారు. గల్లంతైన అమృత, కల్యాణ్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా.. కొన్ని గంటల తర్వాత అమృత మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. కల్యాణ్‌ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.

రిప్ కరెంటు..
విశాఖ బీచ్‌లో తరచూ రిప్‌ కరెంటు ప్రవాహం కనిపిస్తోందని అధ్యాయనాలు చెబుతున్నాయి. రిప్ కరెంటనేది కెరటాలతో సంబంధం లేనిది. ఇది రెండు పక్కల నుంచి వచ్చి మధ్యలో నుంచి లోపలికి తిరిగి వెళ్లే ఓ ప్రవాహం. ఈ సమయంలో ఆ మధ్యలో ఉన్న వారంతా ఎంత తీరానికి సమీపానున్నా సరే కొట్టుకుపోతారు. గజ ఈతగాళ్లు సైతం దాని నుంచి బయటపడటానికి గిజగిజలాడుతారు. అమెరికా వంటి దేశాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏటా వందలమంది ఈ రిప్‌ కరెంటులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. విదేశీ బీచ్‌లలో ఈ రిప్‌ కరెంటు గురించి అధ్యయనాలు, ఎప్పటికప్పడు బీచ్‌లో పబ్లిక్ అడ్రస్‌సిస్టంలో హెచ్చరికలు వంటివి ఉంటాయి. లైఫ్‌ బోట్లు, లైఫ్‌ జాకెట్లు ధరించిన లైఫ్‌ గార్డులు సిద్ధంగా ఉండి బైనాక్యులర్స్‌తో పరిశీలిస్తూ ఎవరన్నా మునిగిపోతుంటే తక్షణమే పరుగెత్తుకెళ్లి రక్షిస్తారు. ఈ ఏర్పాట్లేవి విశాఖ బీచ్‌లో లేవు. కళ్ల ముందే బీచ్‌లో స్నానానికని వెళ్లి మృత్యుఒడిలోకి చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

07:04 - April 6, 2017

తూర్పుగోదావరి : పోలవరం ఎడమ కాలువ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఎడమ కాలువ వ్యవహారం ముందుకొచ్చింది. ఎన్నికలకు ముందు ఎలైన్‌మెంట్‌ మారుస్తామని చెప్పిన నేతలు.. ఇప్పుడు పట్టించుకోకపోవడంతో నిర్వాసిత గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పరిహారం విషయంలోనూ తేడాలు చూపడంతో స్థానికులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించారు. కానీ ఈ పనులు నేటికీ పూర్తి కాలేదు. గతంలో పట్టిసీమ కోసం కుడికాలువ పనులను హడావిడిగా పూర్తి చేయించిన ప్రభుత్వం.. ఇప్పుడు పురుషోత్తపట్నం లిఫ్ట్‌ కోసం ఎడమ కాలువపై దృష్టి సారించింది.

హామీనిచ్చిన బాబు..
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం చేపడితే... తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారాల్సి వస్తోంది. అందుకే అప్పట్లో ఈ కాలువ పనులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు కాలువ పనులు అనివార్యంగా చేపట్టాల్సి రావడంతో మరోసారి నిర్వాసితుల సమస్య తెరపైకి వచ్చింది. కుమ్మరలోవ వాసులకైతే తప్పక ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ఎడమ కాలువ ఎలైన్‌మెంట్‌ మారుస్తామని చంద్రబాబు స్థానికులకు ఎన్నికలకు ముందు హామీనిచ్చారు. గ్రామాల నుంచి కాకుండా... పోలాల మధ్య నుంచి కాలువ వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తామన్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. తమకు పోలవరం ఎడమకాలువ పనులతో ఏ ఆపద ఉండదని స్థానికులు భావించారు. అయితే ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు కాలువ పనులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

తప్పుబట్టిన స్థానిక ఎమ్మెల్యే..
ఎలైన్‌మెంట్‌ మార్చకుండా కాలువ తవ్వకాలు చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నష్టపరిహారం విషయంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కాలువ తవ్వకాలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ అమలు విషయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఒక రకంగానూ.... పేదలకు మరో రకంగానూ అమలు చేస్తున్నారు. పరిహారం విషయంలో తేడాలేంటని స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా కాలువ పనులు చేపడుతున్నారని చెప్పారు. ప్యాకేజీ అమలు విషయంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులకు పెద్దమొత్తంలో ప్యాకేజీ ఇస్తూ.... సాధారణ పేదలకు అన్యాయం చేయడం తగదని చెబుతున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎన్నికలకు ముందు ఒకమాట... అధికారం వచ్చిన తర్వాత మరోమాట చెబుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.... చివరికి పరిహారం విషయంలోనూ తేడా చూపడం ప్రజల ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా అందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలంటున్న పేదల గోడును ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందో.. లేదో వేచి చూడాలి.

06:57 - April 6, 2017

హైదరాబాద్ : ఎక్కడి లారీలక్కడే నిలిచి పోయాయి. వారం రోజులుగా లారీల సమ్మెతో దక్షిణాది రాష్ట్రాల్లో సరుకు రవాణా స్థంభించింది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకూ వెనక్కి తగ్గేది లేదని లారీ యాజమాన్యాలు తెగేసి చెబుతుండగా.. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయని వ్యాపారులు, కృత్రిమ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ ఏపీ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లారీ ఓనర్ల అసోషియేషన్‌ తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో చేపట్టిన లారీల సమ్మె తీవ్రతరం అవుతోంది. గడచిన వారం రోజులుగా సరుకులు రవాణా స్థంభించిపోతోంది. నిత్యావసర సరుకుల రవాణా కూడా బంద్‌చేస్తామని లారీ యజమానుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. లారీ యజమానుల పోరాటానికి ప్రజా సంఘాలతో పాటు సి.ఐ.టి.యు సంఘీభావం ప్రకటించింది.

సిఐటియు మద్దతు..
శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రా - ఓడిస్సా రాష్ట్రాల సరిహద్దు.. ఎ.ఎస్. పేట వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిభిరాన్ని పలువురు కార్మిక సంఘాల నేతలు సందర్శించి మద్దతు ప్రకటిస్తున్నారు. పెంచిన థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం, టోల్ ట్యాక్స్ లను తగ్గించడంతోపాటు సింగల్ పర్మిట్ విధానం అమలు చెయ్యాలని లారీ యజమాన్య సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వారం రోజులవుతున్నా.. తమ ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవడంపై లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల సమ్మెకు కార్మికసంఘం సీఐటీయూ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వాలు దిగివచ్చేవరకు పోరాడతామంటున్నారు.

పలు ఇబ్బందులు..
లారీల సమ్మె ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్చాపురం బోర్డర్, శ్రీకాకుళం, రాజాం, నరసన్నపేట, పలాస ప్రాంతాలలో నిత్యావసర సరుకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పురుషోత్తపురం ఎ.ఓ.బి చెక్ పోస్ట్ వద్ద వేలాది వాహనాలు నిలిచిపోయాయి. పండ్లు రవాణా, కూరగాయలు, సరుకుల సరఫరా స్తంభించిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లారీల రాకపోకలు నిలచిపోవడంతో అటు మార్కెట్ వర్గాలకు కూడా ఆందోళన చెందుతున్నారు. కళకళలాడాల్సిన మార్కెట్లు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చర్చలకు రావాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడంతో.. ఆంధ్రప్రదేశ్‌ లారీ యాజమాన్య సంఘాలు ఇవాళ చర్చలకు వెళ్లుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే.. సమ్మెను మరింత ఉదృతం చేస్తామని.. ఇకపై అత్యవసర సర్వీసులు సైతం నిలిపివేస్తామంటున్నారు. లారీ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికైన అటు కేంద్రప్రభుత్వం , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

బాబుతో నేడు లారీ ప్రతినిధుల భేటీ..

విజయవాడ : లారీల సమ్మె కొనసాగుతోంది. నేడు సీఎం చంద్రబాబు నాయుడితో చర్చలకు వెళ్లుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్ల అసోషియేషన్‌ తెలిపింది.

06:51 - April 6, 2017

విజయవాడ : మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తికావడంతో ఇక ఇతర పదవులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. మండలిలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక పదవులతో పాటు కార్పొరేషన్‌ పదవుల భర్తీపైనా ఆయన కసరత్తు చేపట్టారు. మంత్రివర్గ విస్తరణలో ఎక్కువ మందికి చోటు కల్పించలేకపోయిన చంద్రబాబునాయుడు... చట్టసభల్లో పలు కీలక పదవులను త్వరగా భర్తీ చేయడం ద్వారా ఇతర ఆశావహులను సంతృప్తిపరచవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు మండలిలో త్వరలో ఖాళీ కానున్న పలు కీలక పోస్టులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. మే లో పదవీ విరమణ ద్వారా ఖాళీ కానున్న శాసనమండలి చైర్మన్‌ పదవిని రాయలసీమకు చెందిన నేతకు అప్పగించనున్నారు. శిల్పా చక్రపాణి రెడ్డిని మండలి చైర్మన్‌గా ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది.

ఎవరిని ఎంపిక చేస్తారు ?
అలాగే మండలి చీఫ్‌ విప్‌ పదవి పార్టీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌కు అప్పగించనున్నట్టు సమాచారం. ఇతర రెండు-మూడు విప్‌ పదవులకు అన్నం సతీష్‌, బుద్దా వెంకన్న, బీదా రవిచంద్రయాదవ్‌, టీడీ జనార్దన్‌, యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్‌లను పరిగణనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. అలాగే మే నెలలో గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఒకటి కడపకు కేటాయించనున్నారు. కడప జిల్లాలోనూ రెండు వర్గాల్లో ఒకరైన ఆదినారాయణరెడ్డికి మంత్రి అవకాశం ఇచ్చినందున.. మరో వర్గానికి చెందిన రామసుబ్బారెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వనున్నారు. ఇంకో ఎమ్మెల్సీ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది తేలాల్సి ఉంది.

బాబు నిర్ణయం ఏంటో ?
పార్టీ పరంగా కీలకమైన అధ్యక్ష పదవి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్‌గానే ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ప్రస్తుతం కళా వెంకట్రావ్‌ ఉన్నారు. ప్రస్తుతం కళా వెంకట్రావ్‌ మంత్రివర్గంలోకి తీసుకున్నందున.. ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేస్తారా ?..లేదా ఆయన్నే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి. అలాగే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల భర్తీలో స్థానం కల్పించలేకపోయిన పుష్పరాజ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి హామీ ఇచ్చారు. పుష్పరాజ్‌ ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ, వైద్య మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇలా పలు కీలక కార్పొరేషన్లతో పాటు ఇతరత్రా కొన్ని ఖాళీలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఆలయ కమిటీలను త్వరగా భర్తీ చేస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం కూడా సంతృప్తి చెందుతుందన్నది అధినేత ఆలోచనగా తెలుస్తోంది.

06:49 - April 6, 2017

హైదరాబాద్ : లంచమడిగితే చెప్పుతో కొట్టమన్న కేటీఆర్‌.. ప్రజలను మోసం చేసిన వారిని ఏం చేయాలో కూడా చెబితే బాగుంటుందన్నారు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు. దళితులను సీఎం చేస్తానని మాటతప్పిన వారిని ఏం చేయాలని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌, దళితులకు మూడెకరాల భూమి హామీ ఇచ్చి జనాన్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా అని వీహెచ్‌ అన్నారు.

06:47 - April 6, 2017

కరీంనగర్‌ : జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, జడ్పీటీసీ వీరేశలింగం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటెలకు ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు. కొంతమంది నేతలు తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వీరేశలింగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాను జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయనని వీరేశలింగం స్పష్టం చేస్తున్నారు.

06:45 - April 6, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ నేతలు బిజీగా గడుపుతున్నారు. మూడు సభలు...ఆరు సభ్యత్వాలు అన్న చందంగా నేతలంతా బిజీ అయ్యారు. అన్ని జిల్లాల్లో పార్టీ సభలు నిర్వహిస్తుండడంతో సభ్యత్వ నమోదు కూడా మరింత ఊపందుకుంది. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా సభ్యత్వాలను నమోదు చేయాలని లక్ష్యంతో గులాబీ పార్టీ నేతలు తెగాహడావిడి పడుతున్నారు. గత ఏడాది 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసుకుంటే ఈసారి దాదాపు 60 లక్షల వరకు సభ్యత్వ నమోదు చేయాలనే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పరుగులు పెడుతున్నారు. మార్చి నెలలో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల మూడో వారం వరకు నిర్వహించే అవకాశం ఉంది. గ్రామ, మండల కమిటీల ఏర్పాటును ఏప్రిల్‌ 11,12 తేదీల్లోగా పూర్తి చేయాలని గులాబి బాస్ కెసిఆర్ నేతలను ఆదేశించారు. ఆలోపు ఆయా గ్రామాల్లో సభ్యత్వ నమోదు పూర్తి కానుంది. ఇప్పటికే 50 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు పుస్తకాలను నేతలను పార్టీ కార్యాలయం అందచేసింది. సభ్యత్వ నమోదుకు మరో వారం పది రోజుల సమయం ఉండడంతో అదనంగా 22 లక్షల సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే సభ్యత్వ నమోదులో కొన్ని చోట్ల నాయకుల మధ్య విభేదాలు కూడా తలెత్తున్నాయి. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న నేతలకు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. అయితే.. వీటిని పార్టీపెద్దలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. సభ్యత్వనమోదు కోసం నేతల్లో తీవ్ర పోటీ నెలకొన్న కారణంగానే అక్కడక్కడా సమస్యలు తెరపైకి వస్తున్నాయన్ని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు సర్దుబాటుగా మాట్లాడుతున్నారు.

06:39 - April 6, 2017

విజయవాడ : దళితుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కొందరు కావాలని విమర్శిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అడ్డగోలుగా విభజించిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. దెయ్యాలకు కూడా పింఛన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది అని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. దళితుల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా.. కొంతమంది అదేపనిగా విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలనకు కట్టుబడి ఉన్నామన్నారు. అవసరమైతే మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువస్తామన్నారు సీఎం.

149 రూపాయలకే 15 ఎంబీపీఎస్..
రాబోయే మూడేళ్లలో పేదలకు పది లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు చంద్రబాబు. అలాగే ప్రతి ఇంటికి వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో 149 రూపాయలకే ప్రతి ఇంటికి 15 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీని ఇస్తామన్నారు. బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్‌ చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచే వ్యక్తి అని కొనియాడారు. దళితుల సంక్షేమం కోసం 50 ఏళ్ల పాటు పోరాడారన్నారు చంద్రబాబు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దళితుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

06:36 - April 6, 2017

విజయవాడ : పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్న జగన్‌ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ రాష్ట్రపతితో సమావేశం అవుతున్నారు. అటు ప్రధాని సహా ఇతర జాతీయ పార్టీల పెద్దలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరించనున్నారు. వైసీపీ నుంచి గెలిచి, అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు, మంత్రి పదవులు ఇవ్వడాన్ని జగన్‌ పార్టీ తప్పుబడుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇప్పటికే గ‌వ‌ర్నర్‌ న‌ర‌సింహ‌న్‌కు ఫిర్యాదు చేసిన జ‌గ‌న్... ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాల‌ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గురువారం జగన్‌తో పాటు ఎంపీలు, ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.

మూడు రోజుల పాటు..
3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న వైసీపీ అధినేత జగన్‌... రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఇత‌ర జాతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి ఏపీలో పార్టీ ఫిరాయింపుల తీవ్రతను వివ‌రించ‌నున్నారు. అన్ని రాజ‌కీయ‌పార్టీల అభిప్రాయాలు తీసుకుని స‌మ‌గ్రచ‌ట్టం రూపొందించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశ‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు ప‌డేవ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని జగన్‌ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై జాతీయ పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

బీజేపీ ఆవిర్భావ వేడుకలు.

హైదరాబాద్ : నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నేతలు పాల్గొననున్నారు.

నేడు మంత్రులుగా పలువురు బాధ్యతలు..

విజయవాడ : నేడు మంత్రులుగా కాల్వ శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, జవహార్ లు బాధ్యతలు స్వీకరించనున్నారు.

నెదర్ లాండ్ కన్సల్టెన్సీ ఇచ్చిన డీపీఆర్ కు సీఎం ఆమోదం..

విజయవాడ : కొండవీటి వాగుకు సంబంధించి నెదర్ లాండ్ కన్సల్టెన్సీ ఇచ్చిన డీపీఆర్ కు సీఎం ఆమోదం తెలిపారు. వర్షాకాలం రాకముందే వాగులకు సంబంధించి ప్రధాన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటి కెనాళ్ల వెడల్పునకు 1536 ఎకరాల అవసరమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం..

హైదరాబాద్ : ఐపీఎల్ 10 లో రాయల్ ఛాలెంజర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపొందింది. రాయల్ ఛాలెంజర్స్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ : 207/4, బెంగళూరు 172 (ఆలౌట్).

ఢిల్లీలో జగన్..

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్రపతిని జగన్ కలువనున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు.

Don't Miss