Activities calendar

07 April 2017

21:30 - April 7, 2017

చెన్నై: తమిళనాడులో త్వరలో జరిగే ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఆదాయపుపన్ను శాఖ మెరుపు దాడులు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌పై ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో ఓటర్లకు ఆయన డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు చెన్నైలోని ఆయన నివాసంతో పాటు పుదుక్కోటై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. మంత్రికి చెందిన క్వారీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఐటీ దాడుల్లో భారీగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి ఇంట్లో 2 కోట్ల 20 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో సీనియర్‌ నేత అయిన విజయ్‌భాస్కర్‌ జయలలిత కేబినెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పళనిస్వామి కేబినెట్‌లోనూ అదే శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అటు నటుడు శరత్‌కుమార్‌ ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

పెద్ద షాపూర్ లో మైనర్ విద్యార్థినిపై అత్యాచారం

రంగారెడ్డి : శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ లో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థినిపై సన్ని అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు నెలల గర్భవతి అయిన బాలిక కుటుంబంతో రూ.10వేలకు ఒప్పందం చేసిన గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించి బాలల సంరక్షణ సమితి సాయంతో పీఎస్ లో బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

20:42 - April 7, 2017

వాళ్ల నోటికి అడ్డూ అదుపూ ఉండదు. బండ బూతులు తిడతారు. వాళ్లు కాళ్లూ.. చేతులు ఆడిస్తారు. కంట్రోలు అనేదే ఉండదు. తాము ప్రజా ప్రతినిధులమని కాదు అంతకంటే ముందు మనుష్యులమనే సంగతి కూడా మర్చిపోతారు. ఆకాశం నుంచి ఊడిపడ్డామనే భ్రమపడతారు. అంతిమంగా చట్టసభలో ప్రజా ప్రతినిధులు ఎలా వుండకూడదో వాళ్లను ఉదాహరణగా చెప్పే వరకు వచ్చారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అలాంటి నేతలు ప్రతి రాష్ట్రంలో, ప్రతి రాజకీయ పార్టీలో కనిపిస్తున్న దురదృష్టర పరిస్థితి. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరీ.. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ప్రారంభమైన జాతీయ బాలల చలన చిత్సోత్సవం

విశాఖ : జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 3 రోజుల పాటు బాలల చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలన చిత్రోత్సవాల్లో మొత్తం 24 సినిమాల ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమంలో మొత్తం 40 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

తెలంగాణ లారీ యజమానుల సమ్మె విరమణ

హైదరాబాద్: తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి సచివాలయంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి పర్మిట్‌ కోసం చర్యలు తీసుకుంటామని, సింగిల్‌ పర్మిట్‌ కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, చెక్‌పోస్టుల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు.

స్వీడన్ లో ట్రక్కు బీభత్సం: ముగ్గురి మృతి

హైదరాబాద్: స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. బిజీ మార్కెట్లో ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ప్రమాదస్థలాన్ని బ్లాక్‌ చేసి వాహన రాకపోకలను నిలిపివేశారు.

19:55 - April 7, 2017
19:49 - April 7, 2017

హైదరాబాద్: తాను ప్రజాజీవితంలోకి వచ్చి.. ప్రజలసమస్యలపై గళం విప్పుతానంటున్నారు ప్రజాగాయకుడు గద్దర్‌ . ఎర్రజెండా వదిలి...బుద్ధ జెండా పట్టుకుంటున్న ... అలాగని నా మాతృ సంస్థ తో ఎలాంటి శత్రు వైరుద్యం లేదు... మిత్రు వైరుద్యం మాత్రమే ఉందన్నారు గ‌ద్దర్...మొదట్లో ఓటు వేయొద్దని ప్రచారం చేసిన తానే ఇపుడు ఓటు నమోదు చేసుకున్నానన్నారు. అలాగని ఏ రాజకీయ పార్టీ లో తను లేనన్నారు తెలిపారు.. ఓటుతో త్వర‌లో ప్రజల ముందుకు రాబోతున్నట్టు గద్దర్‌ చెప్పారు.

పార్లమెంట్‌లో ఉండాల్సింది .. మార్క్స్‌ ,పూలే , అంబేదర్క్‌ సిద్ధాంతాలు

భాగ్యవంతుల చేతిలో భారత దేశం ఉందని... పార్లిమెంట్ లో ఉండాల్సింది పూలె ,మార్క్స్ , అంబేద్కర్‌ సిద్ధాంతాలు ఆచరించేవారని అన్నారు గద్దర్‌. అందుకోసం మ‌రో రాజ‌కీయ పార్టీ రావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇప్పుడ బౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించామ‌ని ఇక సామాజిక తెలంణ సాధనకోసం ... అట్టడుగు నుండి అభివృద్ధి సాదించడానికి తాను పల్లె పల్లె కు పాట .... పార్లిమెంట్ కు బాట అనే నినాదాన్ని ఇస్తున్నట్టు గద్దరు అన్నారు.

గ‌ద్దర్ పై కాల్పులు ఘటనను గుర్తుచేసుకుని..

గ‌ద్దర్ పై కాల్పులు ఘటనను గుర్తుచేసుకుని ఆయన భార్య కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రతి సంవ‌త్సరం ఏప్రిల్ 6 వ‌స్తుందంటే చాలు ఆ దాడి క‌ళ్లముందు క‌దులుతుంది... ఆ రోజు గ‌ద్ద‌రిని ప్రజ‌లే బ‌తికించారని ఆమే క‌న్నీటితో చెప్పారు.

దక్షణి భారత్‌లో 175 ప్రాంతాల్లో పర్యటిస్తా - గద్దర్‌ ...

త్వరలోనే దక్షిణ భారత దేశం లో 175 ప్రాంతాలు తిరుగుతానని ... ఆరు నెలలో రెండున్నర లక్షల గ్రామాల్లో నేతలను కలుస్తానని గద్దర్ అన్నారు... దేశానికి స్వాతంత్ర్యం వస్తే..నాజాతికేమిస్తారని అంబేద్కర్‌ అడిగినట్టే.. తెలంగాణ సాకారమైతే బడుగు ప్రజలకు ఏమిస్తారని అపుడే నిలదీసి ఉండాల్సిందని గద్దర్‌ అభిప్రాయపడ్డారు.

19:22 - April 7, 2017

హైదరాబాద్: గద్దర్ అనే పేరు తెలియని వారే ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ యుద్ధ నౌక ఇప్పుడు కొత్తగా పంథా మార్చింది. సుదీర్ఘ కాలం విప్లవానికి దన్నుగా సాగిని ఈ యుద్ధ నౌక తన పంథా మార్చుకుంది. ఇకపై బుల్లెట్ కాదు.. తనది బ్యాలెట్టే అని అంటున్నారు గద్దర్. తాను కొత్తగా నిర్దేశించుకున్న గమ్యం వైపు సాగేందుకు తాను స్వయంగా ఓటు హక్కును పొందుతానంటున్నారు. పాలకులు తన శరీరంలోకి తూటాలు దించినా బెదరక దానికి ఆ పాటతోనే బదులిచ్చి విప్లవ ఉద్యమంలోనే కొనసాగిన గద్దర్ హఠాత్తుగా బ్యాలెట్ బాటను ఎందుకు పట్టారు? రాజకీయ క్షేత్రంలో ఆయన ఎలాంటి పాత్రను పోషించాలని అనుకుంటున్నారు? ఈ అంశాలపై గద్దర్ ఏమని తెలిపారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఎయిర్ ఇండియా సిబ్బందితో మరో ఎంపీ దురుసు ప్రవర్తన

ఢిల్లీ : ఎయిర్ ఇండియా సిబ్బందితో మరో ఎంపీ దురుసుగా ప్రవర్తించారు. టీఎంసీ ఎంపీ డోలాసేన్ తల్లి సీటును మరో చోటికు మార్చేందుకు సహకరించాలని ఎయిర్ ఇండియా కోరింది. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బందితో ఎంపీ డోలాసేన్ వాగ్వాదానికి దిగారు. ఎంపీ గొడవ కారణంగా ఫ్లైట్ 30 నిమిషాలు ఆలస్యం అయింది.

 

18:37 - April 7, 2017

అమరావతి: మంత్రిగా బాధ్యతలు చేపట్టారు లోకేశ్‌ నాయుడు.. సచివాలయం ఐదో బ్లాక్‌ ఐటీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చినబాబు.. మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఏపీలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు, ఏడాదిలో 50రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపుతోపాటు... యువతుల వివాహానికి 10వేల రూపాయల నగదు సహాయం, ప్రసూతి ప్రయోజనంకింద మరో 20వేలు, ప్రమాద బీమాకింద మరో 5లక్షలు అందే ఫైళ్లపై సంతకాలు చేశారు..

గ్రేటర్ కాంగ్రెస్ నేతల సమావేశం

హైదరాబాద్ : గ్రేటర్ కాంగ్రెస్ నేతలు గావధీ భవన్ లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కుంతియా, గ్రేటర్ కాంగ్రెస్ నేతలు హాజరైయారు.

 

 

 

 

18:34 - April 7, 2017

అమరావతి: పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సేవ్‌ డెమోక్రసీ పేరుతో ఏపీలో వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.. టీడీపీ టార్గెట్‌గా వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. కడప జిల్లా పులివెందులలో సేవ్‌ డెమోక్రసీ పేరిట వైఎస్‌ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వివేకానందరెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశామన్నారు.

డప తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట...

అటు కడప తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అంజాద్‌ బాష ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో నగర మేయర్‌ సురేష్‌ బాబుతో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైసిపి గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్యే అంజాద్‌ బాష ధ్వజమెత్తారు.

కర్నూలు జిల్లాలో...

కర్నూలు జిల్లాలో సేవ్‌ డెమోక్రసీ పేరిట జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. నగరంలో ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ధర్నా చేపట్టగా.. ఎమ్మిగనూరులో పార్టీ ఇన్‌చార్జి జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకోకు దిగారు.

విజయవాడ ధర్నాచౌక్‌లో ...

విజయవాడ ధర్నాచౌక్‌లో మాజీ మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు దివాలా కోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్థసారథి ఆరోపించారు. వైసీపీ నేతల ధర్నాకు వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు గౌరవం ఉన్నట్లయితే పార్టీ మారిన వైసీపీ నేతలతో రాజీనామా చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరులో ...

ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరులో వైసీపీ శ్రేణలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలోనూ...

అటు శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబాడ్జిలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.

18:30 - April 7, 2017

కృష్ణా : ముదినేపల్లి మండలం చిగురుకోట వీరాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

 

18:28 - April 7, 2017

కడప : జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తల సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సీఎం రమేష్‌పై రామసుబ్బారెడ్డి వర్గీయులు కుర్చీలు విసిరారు. సీఎం రమేష్ గోబ్యాక్ అంటూ నినాదాలతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

టీ.ఎస్ ఆలయాలకు పాలక మండలి సభ్యులు

 

హైదరాబాద్ : ఆలయాలకు తెలంగాణ ప్రభుత్వం పాలక మండలి సభ్యులను నియామించింది. 13 ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

 

18:24 - April 7, 2017

నల్గొండ: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో యురేనియం తవ్వకాలకు అనుమతించాలని... తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి మండిపడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల జార్కండ్‌లో చెంచులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని..ఇక్కడ తవ్వకాలు చేపడితే నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో అలాంటి సమస్యలే వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు అమ్రాబాద్, పదరా మండలాల బంద్‌ చేపడతామన్నారు.

జమ్మలమడుగులో ఉద్రిక్తత

కడప : జిల్లాలోని జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రమేష్ పై రామసుబ్బరెడ్డి వర్గీయులు కుర్చీలు విసిరారు. ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇవ్వడంపై కార్యకర్తలు సీఎం రమేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

 

 

 

నవజ్యోత్ సింగ్ సిద్దూ కామెడీ షోపై హైకోర్టు అభ్యంతరం

చండీఘర్ : నవజ్యోత్ సింగ్ సిద్దూ ఓ టీవీ ఛానల్ లో కామెడీ షోలో నటించడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రిగా ఉండి కామెడీ షోలో నటించడం సరికాదని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మే 11కు వాయిదా వేసింది.

 

ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు దారుణం : తుమ్మల

ఖమ్మం : భక్తరామదాసు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడం దారుణమని ఆర్ అండ్ బీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటా కోసం కర్ణాటకతో పోరాడాలని ఆయన హితవు పలికారు.

 

17:40 - April 7, 2017

ఢిల్లీ: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం హేయమైన చర్య అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఫిరాయింపులపై పార్లమెంట్‌లో పోరాడుతామం సురవరం స్పష్టం చేశారు. వైసీపీ నేత జగన్ ఏపీలో పార్టీ ఫిరాయింపుల పై వివిధ పార్టీల నాయకులతో భేటీ అయి చర్చిస్తున్నారు. అందులో భాగంగా సురవరంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలన్నారు. ఈసీ పార్టీఫిరాయింపుల చట్టాన్ని మరింత సమర్ధవంతంగా ఇప్లిమెంట్ చేయాలని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ లో టిడిపి నేతలు టిఆర్ ఎస్ లోకి వెళ్లినపుడు చంద్రబాబు నాయుడు గవర్నర్ ను కూడా అవమానకరంగా మాట్లాడారని, అలాంటి గవర్నర్ చేత ఈ రోజు పార్టీ ఫిరాయింపు దారుల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం దారుణం అన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

విజయవాడలో అయిల్ ట్యాంకర్ బోల్తా

విజయవాడ : రామస్వామి ఫ్లైఒవర్ వద్ద అయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు డబ్బాలతో పెట్రోల్ తీసుకెళ్తున్నారు.

నీటి పారుదల శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర రైతాంగానికి అత్యంత అవసరమని, ప్రతి నెలా నీటి పారుదల శాఖకు కచ్ఛితంగా చెల్లింపులు చేసి నిధుల కొరత లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం అటవీ అనుమతులు సాధించేందుకు అవసరమైతే ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడుతానని సీఎం స్పష్టం చేశారు.

 

అమ్రాబాద్, పదరా మండలల్లో బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

హైదరాబాద్ : నల్లమల్లలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ రేపు అమ్రాబాద్, పదరా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే నల్లమల్లలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజలప్రాణాలను, అడవులను పణంగా పెడుతోందని వంశీ ఆరోపించారు. ఈ తవ్వకాలున చేపడితే చెంచుజాతి కనుమరుగవుతుందని ఆయన తెలిపారు.

 

17:36 - April 7, 2017

ఢిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. వైసీపీ నుంచి టిడిపి లోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యే లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వడాన్ని జగన్‌ తప్పుపట్టారు. చంద్రబాబు తీరు అనైతికమన్న జగన్... దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని కూడా జగన్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుకు జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

17:35 - April 7, 2017

హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. నాగార్జునసాగర్, కాకతీయ కాల్వల పనుల పురోగతి తెలుసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని... ఈ నీటిని వీలైనంత ఎక్కువగా పొలాలకు అందించాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రకటించారు. ప్రతీ నెలా నీటి పారుదల శాఖకు ఖచ్చితంగా చెల్లింపులు చేస్తామని... నిధుల కొరత రాబోదని హామీ ఇచ్చారు. ఈ మేరకు పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ బ్యారేజి పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగాలని ఆయన అన్నారు. బ్యారేజి నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడాలని సూచించారు. 2018 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్‌పి కాలువలోకి నీళ్లు మళ్లించాలని అధికారులకు తెలిపారు.

17:33 - April 7, 2017

ప.గో :తుందుర్రులో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని.. దానిని సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌ చేస్తూ నరసాపురంలో వైసీపీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో సహా పలువురు నేతలకు ఎమ్మెల్సీ ఆళ్ల నాని సంఘీభావం తెలిపారు. తుందుర్రులో పోలీసు రాజ్యం నడుస్తోందని.. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తుందని నాని విమర్శించారు.

16:18 - April 7, 2017

ఢిల్లీ: శివసేన వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ విమాన ప్రయాణాలపై ఎయిరిండియా నిషేధం ఎత్తివేసింది. గత నెల మార్చి 23న ఎయిరిండియా సిబ్బందిపై చెప్పుతో దాడి అనంతరం ఆయన విమానప్రయాణాలపై ఎయిరిండియా నిషేధం విధించింది. ఈ విషయంలో నిన్న లోక్‌సభ పెద్ద రగడ జరిగింది. ఈ విషయంలో తన తీరును మన్నించాలంటూ క్షమాపణలు కోరుతూ.. గ్వైకాడ్ అశోక గజపతిరాజుకు లేఖ రాశారు. విజ్ఞప్తిని మన్నించిన అశోక గజపతిరాజు... గైక్వాడ్‌ ప్రయాణాలపై నిషేధాన్ని ఎయిరిండియాకు లేఖ రాసింది. దీంతో గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎయిర్ ఇండియా ఎత్తివేసింది.

16:16 - April 7, 2017

ఢిళ్లీ: బిజెపి మాజీ ఎంపి తరుణ్‌ విజయ్‌ జాతివివక్ష వివాదంలో చిక్కుకున్నారు. దక్షిణ భారతీయుల పట్ల వివక్ష చూపేలా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. భారత్‌లో ఆఫ్రికన్లపై జరిగిన విద్వేషపూరిత దాడులకు సంబంధించి విజయ్‌ అల్‌ జజీరా టీవీ చర్చలో పాల్గొంటూ.. తాము దక్షిణ భారతీయులతో కలిసి ఉండడం లేదా అని దక్షిణాదివారిపై చులకనభావంతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు దుమారం సృష్టించడంతో ట్విట్టర్‌ ద్వారా క్షమాపణ చెప్పారు. కృష్ణ భగవానుడు కూడా నల్లగా ఉంటారని ఉదహరిస్తూ ఎలాంటి విద్వేషాలు లేవని పేర్కొన్నారు.

కేంద్ర పర్యటక శాఖ మంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీ : కేంద్ర పర్యటక శాఖ మంత్రిని టీఆర్ఎస్ ఎంపీలు కలిసారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని, కాళేశ్వరం టెంపుల్, దర్మపురి, కోటిలింగాల ఆలయం, గాంధారివనం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, బౌద్ద ఆరామాలను ఇంటిగ్రేటెడ్ టూరిజం కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశామని ఎంపీలు తెలిపారు.

 

 

హైదరాబాద్ పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. గాలులతో అక్కడక్కడ చెట్లు విరిగి పడ్డాయి. వర్షం వల్ల ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం చేకురింది.

అశోకగజపతి రాజుకు క్షమాపణ చెప్పిన గైక్వాడ్

ఢిల్లీ : కేంద్రమంత్రి అశోకగజపతి రాజకు శివసేన ఎంపీ గైక్వాడ్ క్షమాపణ చెప్పారు. మంత్రికి క్షమాపణలు కోరుతూ గైక్వాడ్ లేఖ రాశారు. గైక్వాడ్ వినతిని గజపతి రాజు మన్నించారు. గైక్వాడ్ పై నిషేధం ఎత్తివేయాలని ఎయిర్ ఇండియాకు అశోక గజపతి రాజు లేఖ రాశారు. దీంతో గైక్వాడ్ పై ఎయిర్ ఇండియా నిషేధం ఎత్తివేసింది.

 

 

అరుణ్ జైట్లీతో జగన్ భేటీ

ఢిల్లీ : పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల గురించి వారు చర్చినట్టు తెలుస్తోంది.

 

 

 

 

సురవరం సుధాకర్ రెడ్డిని కలిసిన జగన్

ఢిల్లీ : వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిసారు. ఫిరాయింపులదారులకు మంత్రి ఇవ్వడంపై జగన్ సధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సీపీఐ ఫిరాయింపులను వ్యతిరేకింస్తుందని, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉండేలా చట్టాన్ని బలోపేతం చేయాలని అన్నారు.

 

15:25 - April 7, 2017

హైదరాబాద్: ఎస్సై పరీక్ష ఫలితాలు వెల్లడిచేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఎస్సై అభ్యర్థులు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో పీఏకి వినతిపత్రం సమర్పించారు. లాంగ్వేజెస్‌ ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్‌ అందిస్తారు.

15:23 - April 7, 2017

హైదరాబాద్: తానా..! తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా..! ఇది అమెరికాలోని సుప్రసిద్ధ తెలుగు సంఘం. ఇప్పుడీ సంస్థ ప్రాభావం మసకబారుతోంది. తానా నిర్వాహాకులు అక్రమాలు, అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పదవీ వ్యామోహులు ముగ్గురు.. తానాను అడ్డం పెట్టుకుని.. స్వీయ లబ్ది పొందుతున్నారని..భారత్‌లో రాజకీయ ప్రాబల్యాన్ని గడిస్తున్నారని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా గడచిన అర్ధ దశాబ్దంగా.. తానాపై వచ్చిన, వస్తోన్న ఆరోపణలు, వెల్లువెత్తుతోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తానా

తానా ముసుగులో వ్యాపారాలు చేస్తూ స్వీయ లబ్దే లక్ష్యంగా పెట్టుకున్నవారి ఆధిపత్యం తానాలో పెరిగిందన్న ఆరోపణలున్నాయి. గతంలో సేవలు చేసిన దాఖలాలు లేనివారే నేడు తానాపై పెత్తనం చలాయిస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖుల పరిచయాలు పెంచుకుని లబ్ది పొందేందుకే తానాను వాడుకుంటున్నారని.. బోర్డు మాజీ సభ్యులు కూడా వాపోతున్నారు. ఏటా తానా నిర్వహించే ఉత్సవాలకు పంపే ఆహ్వాన పత్రాలను కూడా విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారని, ఇండియన్‌ రెస్టారెంట్స్‌లో పనివారిని కూడా అక్రమ మార్గాల్లో అమెరికా తీసుకు వస్తున్నారని తానా నాయకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తానా ఇన్విటేషన్స్‌ అమ్మేందుకు.. సినిమావాళ్లతో బేరాలు కుదుర్చుకోవడానికి హైదరాబాద్‌లో పర్మనెంట్‌ బ్రోకర్‌నూ ఏర్పాటు చేసుకున్నారని.. విమర్శలు వస్తున్నాయి.

తానా ముసుగులో దందాలు .....

తానా మహాసభలకు వసూలయ్యే విరాళాలకు లెక్కలు చూపడం లేదని, అడిగిన వారినే తప్పుపడుతూ... సంస్థకు దూరం చేసే కుట్రలు చేస్తున్నారని.. తానా సభ్యులు విమర్శిస్తున్నారు. వాగ్ధాటి ఉన్న వారికి పదవులు కట్టబెట్టి నోరు మూయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. తానా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అంతా మోసమని, ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు తానా లైఫ్‌ మెంబర్‌ రాజా కర్ణమ్‌ ఆరోపించారు. తానా ఎన్నికల ప్రక్రియనంతా పూర్తిగా మార్చాల్సిన అవసరముందన్నారు. కేవలం రెండు వారాల్లోనే 7వేల మంది లైఫ్‌మెంబర్లు తానాపై విమర్శలు గుప్పించడం దేనికి సంకేతమో ఆలోచించాలన్నారు.

మహాసభలకు వసూలయ్యే విరాళాలకు లెక్కలు లేవు .....

అసలు తానా నిధులు ఎలా సేకరిస్తోంది. ఇప్పటివరకు ఎన్ని నిధుల్ని సేకరించింది? ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏంటి అన్న దానికి

లెక్కా పత్రాలు లేవని.. ఈ అంశంలో జవాబుదారి తనం లోపించిందన్నారు రాజా కర్ణమ్‌. నిధుల సేకరణ, ఖర్చులో పారదర్శకత లేకుండా.. ఆ నిధుల్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. తెలిసి తెలియక జీవితకాల సభ్యత్వం తీసుకున్న వాళ్లలో కొంతమంది తాజా ఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌-1, హెచ్‌-4 వీసాలపై తీసుకునే నిర్ణయాలతో కొందరు సభ్యులు భవిష్యత్‌పై బెంగపెట్టుకుంటున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తులు, బ్యూరోక్రాట్స్‌, పారిశ్రామికవేత్తలు, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు తానా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. మరోవైపు తానాను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని.. సంస్థకు మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్న దానిపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ప్రధానంగా ఎన్నికలపై దృష్టిసారించి తానాను సంస్కరించాల్సిన విషయాన్ని గుర్తుచేశారు.

అసలు తానా నిధులు ఎలా సేకరిస్తోంది? ...

తానా నాయకులు చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సభ్యులంతా ఏకం కావాలని.. బహిరంగ లేఖల ద్వారా లైఫ్‌మెంబర్లు పిలుపునిస్తున్నారు. మొత్తానికి సుదూర ఖండంలో.. తెలుగు ఖ్యాతిని ఇనుమడింపచేయాల్సిన తెలుగు సంఘం.. ఇలా అప్రతిష్టపాలు కావడం.. తెలుగువారందరినీ కలవరానికి గురిచేస్తోంది. విభేదాలు విడనాడి.. తెలుగువారంతా ఐకమత్యంతో ఉండేలా అమెరికా తెలుగు పెద్దలు ప్రయత్నించాలన్న సూచనలు వెలువడుతున్నాయి.

15:19 - April 7, 2017

ఢిల్లీ: వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యే లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తప్పుపట్టారు. చంద్రాబు చర్య అనైతికమని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే లకు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు పై ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి జగన్‌ ఫిర్యాదు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి డీ రాజాలతో జగన్‌ భేటీ అయ్యారు.

------------------------------------

15:16 - April 7, 2017

అమరావతి: ఏపీలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల పథకం ప్రారంభమైంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో 222 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పథకం అమలు చేస్తారు. ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండే ఆరుగురు వైద్యుల్లో ఐదుగురు ప్రత్యేక నిపుణులు ఉంటారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో ముప్పై రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రోగులకు ఉచితంగా మందులు ఇస్తారు.

పోలవరంలో దారుణం

తూర్పుగోదావరి : జిల్లాలోని పోలవరంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య భూలక్ష్మిని భర్త రవి హత్య చేశాడు. అనంతరం తను ఆత్మహత్యా చేసుకున్నాడు. వారికి ఏడాదిన్నర కుతూరు ఉంది. తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నారి అనాథగా మారింది.

 

శాసన సభ్యులకు హరీష్ రావు లేఖ

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శాసన సభ్యులకు లేఖ రాశారు. మిషన్ కాకతీయ మూడో దశకు అందరు సహకరించాలని విన్నవించారు. దీంట్లో ప్రజలను భాగస్వాములను చేయాలని  ఆయన సూచించారు. రెండు దశల్లో 11400 చెరువుల పనులు పూర్తి అయ్యాయి. మిగతా 6600చెరువుల పనులను మే 31నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

 

ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం

హైదరాబాద్ : శంషాబాద్ మండలం కొత్వాల్ గూడా ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న కారులో మంటలు ఎగసిపడ్డాయి. డ్రైవర్ మంటలురాగానే కారునుంచి దిగారు. కారు క్షణాల్లో కాలిపోయింది. 

13:33 - April 7, 2017

వరంగల్ : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వరంగల్ కు చేరుకున్నారు. హన్మకొండలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. కానీ ఓ కార్యకర్త హల్ చల్ చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి అనే కార్యకర్త బాబును కలవాలని ప్రయత్నించాడు. అక్కడున్న సెక్యూర్టీ గార్డు నివారించారు. తన బాధను తెలియ చేయాలని కోరాడు. కానీ పలువురు అడ్డుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న వారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

13:29 - April 7, 2017

డీజీపీ కార్యాలయం వద్ద ఎస్ఐ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ : డీజీపీ కార్యాలయం వద్ద ఎస్ఐ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. వెంటనే ఎస్ఐ పరీక్షా ఫలితాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

 

ముదినేపల్లిలో బాణాసంచా పేలి ఇద్దరు మృతి

కృష్ణా : జిల్లాలోని ముదినేపల్లి మండలం చిగురుకోటలో వీరాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి ఇద్దరు మృతి చెందారు. నలుగురికి గాయాలు అయ్యాయి.  గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

13:10 - April 7, 2017
13:08 - April 7, 2017

64వ జాతీయ చలన చిత్ర అవార్డులను కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన 'పెళ్లి చూపులు' ఉత్తమ తెలుగు చలన చిత్రంగా అవార్డు సాధించింది. అంతేగాకుండా ఉత్తమ సంభాషణలు విభాగంలో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'శతమానం భవతి'...ఉత్త‌మ నృత్య‌ద‌ర్శ‌కుడిగా రాజు సుంద‌రం (జ‌న‌తా గ్యారేజ్‌)లకు అవార్డులు లభించాయి. తెలుగు చలన చిత్రాలు అవార్డులు రావడం పట్ల టాలీవుడ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

 • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- శతమానం భవతి
 • ఉత్త‌మ‌ న‌టుడు- అక్ష‌య్ కుమార్ (ర‌ుస్తుం)
 • ఉత్త‌మ‌ న‌టి-సుర‌భి ల‌క్ష్మి
 • ఉత్త‌మ నృత్య‌ద‌ర్శ‌కుడు- రాజు సుంద‌రం (జ‌న‌తా గ్యారేజ్‌)
 • ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- బాపు ప‌ద్మ‌నాభ (అల్ల‌మ‌-క‌న్న‌డ‌)
 • ఉత్త‌మ మాటల రచయిత - త‌రుణ్ భాస్క‌ర్ (పెళ్లిచూపులు)
 • ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌- శివాయ్
 • ఉత్త‌మ క‌న్న‌డ చిత్రం- రిజ‌ర్వేష‌న్
 • ఉత్త‌మ సామాజిక చిత్రం- పింక్
 • ఉత్త‌మ త‌మిళ చిత్రం-జోక‌ర్
 • ఉత్తమ ఫైట్ మాస్టర్- పీటర్ హెయిన్స్ (పులి మురుగన్)
 • ఉత్త‌మ స‌హాయ‌న‌టి- జైరా వసీం

 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం జరిమానా

ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు చైర్ పర్సన్, సభ్యులను నియమించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్న 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. 4వారాల్లోగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు చైర్మన్, సభ్యులను నియమించాలని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

 

 

 

64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

ఢిల్లీ : కేంద్రం 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన చేసింది. ఉత్తమ జాతీయ సాంఘీక చిత్రంగా పింక్, ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం), ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు, ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జా, ఉత్తమ కన్నడ చిత్రంగా రిజర్వేషన్, ఉత్తమ తమిళ చిత్రంగా జోకర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా శివాయ్, ఉత్తమ డ్యాన్స్ డైరెక్టర్ గా రాజుసుందరం( జనతా గ్యారేజ్), ఉత్తమ సంగీత దర్శకుడు బాపు పద్మనాభ (కన్నడ), ఉత్తమ సంభాషణలు తరుణ్ భాస్కర్ ( పెళ్లి చూపులు), ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతి  చిత్రాన్ని ఎంపిక చేశారు.

 

12:58 - April 7, 2017

పట్టుదలకు ప్రతిరూపం ఆమె..ఎన్నో అవమానాలను ఎదుర్కొంది..గుజరాత్ డీజీపీగా మహిళ నియామకం..మిగ్ విమానాన్ని నడింపేందుకు సిద్ధమౌతున్న అతివ..బాల్య వివాహానికి హాజరైన వారికి జైలు శిక్ష ఖాయం..గాయని అమోంగర్ మృతి..భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది..కానీ మతసామరస్యం వెల్లువిరిసింది..బంగ్లా ప్రధాని షేక్ హసినా భారతదేశంలో పర్యటించనున్నారు..ఆపదలో చిక్కుకున్న స్నేహితురాలిని చిన్నారి కాపాడింది..మహిళ సింగిల్స్ లో సింధు విజయం..పూర్తి విశ్లేషణ..సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి..

నర్సింగ్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కామినేని ఆరా

గుంటూరు : ఒంగోలులో నర్సింగ్ విద్యార్థునుల అస్వస్థతపై ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఆరా తీశారు. ఘటనపై విచారణ జరపాలని, అస్వస్థతకు గురైన విద్యార్థునులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

12:23 - April 7, 2017

హైదరాబాద్ : 'మా నాన్న చనిపోయిందే మంచిదైంది..ఇష్టం వచ్చినట్లు కొట్టారు..గడ్డపారలు..పారలు..ఇనుప రాడ్లతో చావబాదారు..ఆస్తి కోసం ఇదంతా చేశారు' అంటూ దుబ్బాక ఘటనలో సజీవదహనమైన దంపతుల పెద్ద కూతురు రేణుక పేర్కొంది. సుదర్శన్..రాజేశ్వరీ దంపతులను కుటుంబసభ్యులు సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం వీరు మృతి చెందారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి వద్ద రేణుకతో టెన్ టివి మాట్లాడింది. ఆస్తి కోసమే తన తల్లిదండ్రులను హతమార్చారని వాపోయింది. మంత్రాల నెపం తీసుకొచ్చి ఈ దాడి చేశారని, సుదర్శన్ సోదరుడు ఇదంతా చేశారని తెలిపింది. మొన్న రాత్రి నుండి కొడుతున్నారని, తెల్లారి బాపును కూడా విపరీతంగా కొట్టారని తల్లి తనతో ఫోన్ లో చెప్పిందన్నారు. వెంటనే తాను దుబ్బాకకు రావడం జరిగిందన్నారు. కానీ చాలా మందిని పోగు చేసి వారు తమపై దాడి చేశారని, విపరీతంగా కొట్టి చంపారని కన్నీళ్ల పర్యంతమైంది. తన తండ్రికి మూడు..నాలుగు గుంటల భూమి..ఇళ్లు ఉందని తెలిపింది. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని, మంత్రాల నెపంతో ఈ దారుణానికి ఒడిగట్టారని వాపోయింది.

12:17 - April 7, 2017

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండో రోజు హస్తిన పర్యటన కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులు..రాష్ట్రంలో చంద్రబాబు జరుపుతున్న పాలనపై ఆయన వివిధ పార్టీ నేతలతో కలిసి వివరిస్తున్నారు. రెండో రోజు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టిడిపిలో చేరిన నలుగురు నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన అంశాన్ని ఆయనకు వివరించారు. ఇలాగే జరుగుతుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దీనికి ముందుకు రావాలని కోరారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి పదును పెట్టాల్సినవసరం ఉందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని జగన్ పేర్కొంటున్నారు. దీనిపై పార్లమెంట్ లో ఒక బలమైన ఏజెండాను రూపొందించాలని నేతలతో ఆయన కోరనున్నారు. కాసేపట్లో సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులను జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా భేటీ కానున్నారు. కేంద్రంపై వత్తిడి తీసుకొస్తే లాభం జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. కానీ ఏం లాభం లేదని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి పార్లమెంట్ లో వైసీపీ సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతల స్వీకరణ

గుంటూరు : న్యాయ, క్రీడ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

 

 

 

హసన్ పర్తి రైల్వే ట్రాక్ పై విద్యార్థుల మృతదేహాలు..

వరంగల్ : జిల్లాలోని కాజీపేట హసన్ పర్తి రైల్వే ట్రాక్ పై ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగుతోంది. వీరిలో ఒకరు మాస్టర్ జీ డిగ్రీ కాలేజీ విద్యార్థిగా రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

 

11:52 - April 7, 2017

'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే' సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో పవన్, సోనియా దీప్తి, మను, శకలక శంకర్, తాగుబోతు రమేష్, గీతా సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి సంతోష్ నేలంటి దర్శకత్వం వహించారు. రజిని గట్టు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంగీతం రాప్ రాక్ షకీల్ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్ 7వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా టెన్ టివి చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియచేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:43 - April 7, 2017

గుంటూరు : మిర్చి ధరల పతనంపై గుంటూరు జిల్లాలో రైతులు..రైతు సంఘాల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లు భేటీ జరిపారు. ఈ సమావేశానికి రైతులతో పాటు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు హాజరయ్యాయి. మిర్చి ధరల పతనం నేపథ్యంలో మార్క్ ఫెడ్ ను తక్షణమే రంగంలోకి దిగించి మిర్చిని కొనుగోలు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరారు. మార్క్ ఫెడ్ కొనుగోలు జరిపినా మిర్చిలను ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్ లు ఖాళీగా లేవని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు పేర్కొన్నాయి.

గోరక్షక్ పేరుతో దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం

ఢిల్లీ : గోరక్షక్ పేరుతో జరుగుతున్న దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆరు రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటిసులు జారీ చేసింది. రాష్ట్రాలను మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్రాలను కోర్టు  ఆదేశించింది.

 

11:38 - April 7, 2017

గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఐదో బ్లాక్ లో ఈ కార్యక్రమం జరగింది. ఐటీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఆయనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడు పైళ్ల పై సంతకాలు చేశారు. ఏపీలో ఎల్ ఈడీ బల్బుల ఏర్పాటు..ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికుల గుర్తింపుతో పాటుగా యువతుల వివాహానికి రూ. 10వేల నగదు సహాయం..ప్రసూతి సదుపాయం కింద మరో రూ. 20వేలు..ప్రమాద బీమా కింద రూ. 5లక్షలను అందించే ఫైళ్లపై నారా లోకేష్ సంతకాలు చేశారు.

 

ఎంపీ గైక్వాడ్ ఫ్లైట్ టికెట్ మరోసారి రద్దు

ఢిల్లీ : శివసేన ఎంపీ గైక్వాడ్ ఫ్లైట్ టికెట్ ఎయిర్ ఇండియా మరోసారి రద్దు చేసింది. ఈ నెల 17న ఢిల్లీ నుంచి ముంబైకి, 24న ముంబై నుండి ఢిల్లీకి వెళ్లేందుకు గైక్వాడ్ బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్ ఇండియా రద్దు చేసింది.

 

11:26 - April 7, 2017

కరీంనగర్ : మంథని మధుకర్ కేసు విషయంలో దోషులను కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. దళిత యువకుడు మంథని మధుకర్ కేసు వీడడం లేదు. ఆయనను ఎమ్మెల్యే పుట్టా మధు హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ నిష్పక్షపాతకంగా జరగడం లేదని భావిస్తూ ప్రజా సంఘాలు, సీపీఎం నేతలు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టెన్ టివి వారితో మాట్లాడింది. దోషులను కఠినంగా శిక్షించాలని, మధుకర్ ది పరువు హత్యేనని పేర్కొన్నారు. మధుకర్ హత్య విషయంలో పోలీసు శాఖ నుండి మొదలు కొని రాజకీయ అంశాలున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే బంధువు కుమార్తెను మధుకర్ ప్రేమించడం జరిగిందని, కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే పుట్టా మధు మందలించారని తెలిపారు. దీని బట్టి చూస్తే అర్థమౌతుందన్నారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు శాఖ ద్వారా అనుకూలంగా నివేదిక మధు తెప్పించుకున్నారని ఆరోపించారు. దళిత యువకుడు హత్యకు గురయితే నిష్పక్షపాతికంగా విచారణ జరగాల్సింది పోయి పోలీసు శాఖ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మృతుడితో మాట్లాడారా ? లేదా ? బెదిరించారా ? లేదా అనేది చెప్పాలని సవాల్ విసిరారు.

బాబు ఎదుట టిడిపి కార్యకర్త ఆత్మహత్యాయత్నం..

వరంగల్ : మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి పెళ్లికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త హల్ చల్ చేశాడు. టీడీపీలో కార్యకర్తలకు విలువ లేదంటూ స్వామి అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

 

జగన్ బెయిల్ విచారణ..

హైదరాబాద్ : జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్  పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. కోర్టు తదుపరి విచారణ నిమిత్తం కేసును ఈ నెల 21తేదీకి వాయిదా వేసింది.

 

11:13 - April 7, 2017

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో ఏ 1గా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. షరతలుతో కూడిన జగన్ బెయిల్ పొందారు. కానీ ఆయన సాక్షులను తారుమారు చేస్తున్నారంటూ రమాకాంత్ ఇంటర్వ్యూను సీబీఐ పేర్కొంది. దీనిపై ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. జగన్ తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. సాక్షులను తారుమారు చేసే విధంగా రమాకాంత్ ఇంటర్వ్యూ లేదని పేర్కొంది. కేవలం రాజకీయ కోణంలో కక్షపూరితంగా సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. సాక్షులను తారుమారు చేసే విధంగా ఉందని సీబీఐ వాదించింది. చివరకు ఈనెల 21కి తుది విచారణనను వాయిదా వేసింది. మరి జగన్ బెయిల్ ను రద్దు చేస్తుందా ? లేదా ? అనేది ఆ రోజున తేలనుంది.

జమ్మూకాశ్మీర్ లో భారీ వర్షాలు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బాటలిక్ ప్రాంతంలో రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు జవాన్ల గల్లంతయ్యారు. ఈ ఘటనలో రెస్క్యూటీం ఇద్దరు జవాన్ల మృత దేహాలను బయటకుతీసింది. జమ్మూకాశ్మీర్ లో గత ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 

 

10:58 - April 7, 2017

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు 'మంచు మనోజ్’. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో 'ఒక్కడు' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. గురువారం నుండి ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ రెండు భిన్నమైన పాత్రలు పోషించనున్నారని, ఒక పాత్ర కోసం ఏకంగా 12 కేజీలు తగ్గారని తెలిపారు. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ట్రైలర్..ఆడియో తేదీలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

మిర్చి ధర తగ్గుదలపై వ్యాపారులతో మంత్రుల సమావేశం

గుంటూరు : జిల్లా కలెక్టరేట్ లో మిర్చి ధర తగ్గుదలపై మిర్చి వ్యాపారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు.

 

యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన ముస్లిం మహిళలు

లక్నో : ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ను ముస్లిం మహిళలు కలిసారు. తీన్ తలాక్ వ్యవహారంపై వారు ఆదిత్యనాథ్ కు ఫిర్యాదు చేశారు.

 

వరంగల్ కు ఏపీ సీఎం చంద్రబాబు

వరంగల్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరంగల్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి పెళ్లికి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరైయ్యారు.

10:28 - April 7, 2017
10:27 - April 7, 2017
10:19 - April 7, 2017

కరీంనగర్ : మంథని మధుకర్ ది ఆత్మహత్య కాదు..హత్యే అని మృతుడి కుటుంసభ్యులు నినదిస్తున్నారు. ఇటీవలే దళిత యువకుడు మధుకర్ మృతి ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓ యువతిని ప్రేమించాడన్న కారణంతో హత్య చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే పుట్టా మధు హస్తం ఉందని మృతుడి కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా టెన్ టివి మధుకర్ సోదరి..సోదరుడితో మాట్లాడింది. మధుకర్ ను అతికిరాతకంగా హత్య చేశారని మృతుడు సోదరుడు ఆరోపించారు. ఇతని హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరాడు. హత్యపై రాజకీయ వత్తిడి తీవ్రంగా ఉందని, ఎమ్మెల్యే పుట్టా మధుకు వీరు బంధువులరని పేర్కొన్నారు. హత్యను కప్పిపుచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇంటి వెనుక కాల్వలో వెతుక్కోవాలి..దొరుకుతుందని మధుకర్ ప్రేమించిన యువతి ఫోన్ లో తెలిపినట్లు పేర్కొన్నారు. మధుకర్ చాలా ధైర్యవంతుడని..ఆత్మహత్య చేసుకొనేంత పరికివాడు కాదని మృతుడి సోదరి పేర్కొన్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్

గుంటూరు : ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో లోకేశ్ తన ఛాంబర్ ను ప్రారంభించారు.

10:16 - April 7, 2017

సిద్ధిపేట : మంత్రాల నెపం అనే మూఢనమ్మకం ఇంకా కొంతమంది ప్రజలను వీడడం లేదు. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొంతమంది దాడులు చేయడం..హత్యలు చేస్తుండడం తెలిసిందే. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దంపతులిద్దరినీ బంధువులు నిర్బందించి సజీవదహనం చేశారు. సుదర్శన్..రాజేశ్వరీ అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు..ఒక కుమారుడున్నాడు. కానీ ఇంట్లో తరచూ జరుగుతున్న గొడవలకు..ఆస్తి తగదాలకు సుదర్శన్..రాజేశ్వరీ కారణమని తమ్ముళ్లు శ్రీనివాస్..మల్లేష్ లు భావించారు. మంత్రాలతో ఇదంతా చేస్తున్నట్లు భావించి సొంత అన్న..తమ్ముళ్లే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వీరికి ముగ్గురు సహకరించారని సమాచారం. ఈ ఘటనలో వారి కుమారుడు..కుమార్తెలకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సుదర్శన్ ను గాంధీ ఆసుపత్రికి..రాజేశ్వరీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ రాజేశ్వరీ మార్గమధ్యలో మృతి చెందగా శుక్రవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో సుదర్శన్ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

అన్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

చిత్తూరు : తిరుమల శ్రీవారి దర్శనానికి జూలై నెలకు సంబంధించి 58,067 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఇందులో సుప్రభాతం 6,542, తోమాల 120,అర్చన 120, విశేషపూజ 1875, ఆష్టాదళం 60, నిజపాద దర్శనం 1500, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3000, ఆర్జిత బ్రహోత్సవం 6,450, వసంతోత్సవం 12,900, సహస్ర దీపాలంకరణ సేవ 14, 250 టికెట్లుగా ఉన్నాయి. నేటి నుంచి బుక్ చేసుకునే అవకాశం.

దుబ్బాకలో దారుణం..

సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాకలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో దంపతులను బంధువులు సజీవదహనం చేశారు. తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. వీరిద్దరూ సుదర్శన్, రాజేశ్వరీలుగా నిర్ధారించారు.

09:32 - April 7, 2017

ఐపీఎల్‌లో పూణే బోణీకొట్టింది. ముంబైఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో స్మిత్‌, రహనే.. బౌలింగ్‌లో ఇమ్రాన్‌తాహిర్‌ విజృభించడంతో పూణే అద్భుత విజయాన్ని సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్‌బట్లర్‌ 19 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 38 పరుగులు చేయగా.. పార్థివ్‌ పటేల్‌ 14 బందుల్లో నాలుఫోర్లు బాది 19 పరుగులు చేశాడు. పేసర్‌ అశోక్‌ దిండా వేసిన ఆఖరి ఓవర్లో ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్య సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోరు తో పాటు ఓవర్లో చివరి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో లాస్ట్‌ ఓవర్లో ముంబై స్కోరు రాకెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టింది. అయితే స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ 28 పరుగులకు 3వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ ను కట్టడిచేశాడు. తర్వాత 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పూణే వారియర్స్‌.. రహానెతో పాటు స్టీవ్‌ స్మిత్‌ రాణించడంతో లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది పుణే జట్టు. రహానె, స్టీవ్‌స్మిత్‌లు ఫోర్లు సిక్స్‌లతో విరుచుకుపడి ముంబై ఇండియన్స్‌కు చక్కులు చూపించారు. 34 బంతుల్లో మూడు సిక్స్‌లు 4ఫోర్లతో రహానే 60 పరుగులు చేయగా 54 బంతుల్లో 7ఫోర్లు 3 సిక్స్‌లతో 84 పరుగుల చేసిన స్టీవ్‌స్మిత్‌ ..పూణే విజయంలో కీలకపాత్ర పోషించాడు.

09:27 - April 7, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉండగా ఈ దాడులు కొనసాగించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఏకంగా మంత్రి విజయ్ భాస్కర్ నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మంత్రి ఇళ్లు..కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు..వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో విజయ్ భాస్కర్ భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పుదుకొట్టాయ్ తో సహా 30 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కొట్టివొక్కమ్ లో నటుడు శరత్ కుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరపడం గమనార్హం. పలువురు పారిశ్రామిక వేత్తల నివాసాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఐటీ శాఖ మధ్యాహ్నం వెల్లడించే అవకాశం ఉంది.

తమిళనాడులో ఐటీ దాడులు..

చెన్నై : తమిళనాడులో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తోంది. మంత్రి విజయ్ భాస్కర్, నటుడు శరత్ కుమార్..ఇతర ప్రారిశ్రామిక వేత్తల నివాసాలపై ఐటీ శాఖ దాడులు చేసింది. మంత్రి ఇళ్లు..కార్యాలయాలు..35 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. కొట్టివొక్కమ్ లో నటుడు శరత్ కుమార్ ఇంట్లో సోదాలు చేసింది.

 

నేడు ముదునూరు ప్రసాద్ రాజు నిరహార దీక్ష..

పశ్చిమగోదావరి : నరసాపురంలో నేటి నుండి రెండు రోజుల పాటు మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు నిరహార దీక్షకు పూనుకోనున్నారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని హాజరు కానున్నారు. తుందుర్రు ఆక్వాపుడ్ పార్క్ ను సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

09:15 - April 7, 2017

కరీంనగర్ : దళిత యువకుడు మంథని మధుకర్ హత్య ? ఆత్మహత్య అనేది విచారణలో వెల్లడవుతుందని హత్యే గనుక వస్తే అందులో ఎవరున్నా సరే వారిని ఉరి తీయాలని ఎమ్మెల్యే పుట్టా మధు పేర్కొన్నారు. మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతి కేసులో రీపోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా మెడికల్‌ కాలేజి మరియు కాకతీయ మెడికల్‌ కాలేజి ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై టెన్ టివి పుట్టా మధుతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అధికంగా పాలించిందని, మార్ఫింగ్ లు చేసి సోషల్ మీడియాను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని తెలిపారు. దుద్దెల శ్రీధర్ నీచమైన వ్యవహారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. మూడు సంవత్సరాల కాలంగా అభివృద్ధి పనులు చేస్తున్నానని, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు అయినప్పటి నుండి చివరి ఆయుకట్టు వరకు నీరందించామని, ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. చరిత్ర ఉండదని కుట్ర పన్ని కల్పితాలు సృష్టిస్తున్నారని, ఇక్కడున్న ప్రజలకు అన్నీ విషయాలు తెలుసన్నారు. ఇక్కడి వర్గాలు స్పందించాలి కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. నిజ నిర్ధారణ కమిటీ పుట్టా మధుపై ఆరోపణలు చేసిందని ఆరోపించారు. రీ పోస్టుమార్టం అనంతరం నివేదిక వస్తుందని, వాస్తవాలు తెలుస్తాయన్నారు. రోజులు గడుస్తున్నా కొద్ది ఆరోపణలు అనేకం వస్తున్నాయని పుట్టా మధు పేర్కొన్నారు.

08:58 - April 7, 2017

కైరా అద్వాని...’ఎం ఎస్ ధోని' చిత్రంలో ధోని భార్య సాక్షి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ బాలీవుడ్ కథానాయిక ప్రేక్షకుల..విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ధోనీ బయోపిక్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైందది. తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకుంది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే 'మహేష్ బాబు' వంటి స్టార్ సరసన నటించే అద్భుత అవకాశం దక్కించుకుంది. ‘మహేష్', ‘కొరటాల శివ' కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో 'కైరా'ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ చిత్రానికి 'భరత్ అను నేను' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం 'మహేష్ బాబు' మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని జూన్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారని తెలుస్తోంది.

 

08:48 - April 7, 2017

తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో 'అజిత్' ఒకడు. తల అని ముద్దుగా పిలుస్తుంటారు. వైవిధ్యమైన కథలు..స్టన్నింగ్ లుక్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 'వివేగం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై పలు లుక్స్ విడుదలైనా అభిమానులను అంతగా ఆకట్టుకోలేదని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. అందుకని మరొక లుక్ విడుదల చేశారు. ఈ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. మే 1 న అజిత్ బర్త్ డే ఉన్నందున అభిమానులకు గిఫ్ట్ గా టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

08:25 - April 7, 2017

లోక్ సభలో విమానాయాన మంత్రి అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు వ్యవహరించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఎయిరిండియా ఉద్యోగినిని చెప్పుతో కొట్టిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం లోకసభలో మాట్లాడిన అనంతరం అనంత్ గీతే కల్పించుకొని, ఎలాంటి విచారణ జరపకుండానే ఎయిరిండియా ఎలా నిషేధం విధిస్తుందని ప్రశ్నించారు. అనంత్ గీతేతో పాటు ఇతర ఎంపీలు అశోక్ వైపు దూసుకు వచ్చారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), గోవర్ధన్ రెడ్డి (టీఆర్ఎస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

08:20 - April 7, 2017

బాబు వస్తే జాబు వస్తుందన్నది టిడిపి ఎన్నికల స్లోగన్. చూస్తుండగానే కాలం కరిగిపోతోంది. టిడిపి అధికారంలోకి వచ్చే మూడేళ్లయ్యింది. కానీ, నిరుద్యోగులకు జాబ్స్ మాత్రం రాలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 42వేల ఖాళీలున్నాయి. అవి భర్తీ చేయడం లేదు. స్కూల్స్ లో 4,500 టీచర్ పోస్టులు ఖాళీగా వున్నట్టు ప్రభుత్వమే కోర్టుకి నివేదించింది. అవీ భర్తీ చేయడం లేదు. ఇక నిరుద్యోగులకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న వాగ్ధానమూ అమలుకావడం లేదు. మొన్న బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు కేటాయించిన్నప్పటికీ ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమల్లోకానీ, ఎస్ ఈ జడ్ లలోకానీ స్థానికులకు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యల మీద సమరం సాగించేందుకు ఆంధ్రప్రదేశ్ లో డివైఎఫ్ఐ సర్వసన్నద్ధమవుతోంది. టెన్ టివి జనపథంలో ఈ అంశంపై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు వివి శ్రీనివాసరావు విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.

 

రాష్ట్రంలో మోస్తరు వర్షాలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఒకటి రెండుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. విదర్భ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్టు తెలిపారు.

06:51 - April 7, 2017

హైదరాబాద్ : మొబైల్ ప్రపంచంలో వీవో మొబైల్ సంచలనం సృష్టిస్తోంది. అమ్మకాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. 20 మెగా పిక్సల్‌ కెమెరా, సెల్ఫీ కోసం ఫ్లాష్‌ లైట్‌ ఫ్రంట్‌ కెమెరా ఇలా ఎన్నో ఫీచర్లతో మొబైల్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. తక్కువ ఖర్చు ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఏకైక ఫోన్‌గా వినియోగదారులను ఆకర్షిస్తోంది. VIVO స్మార్ట్‌ఫోన్‌ మొబైల్‌ మార్కెట్‌లో స్మార్ట్‌గా దూసుకుపోతోంది. VIVO మొబైల్ అమ్మకాలు మరింత పుంజుకుంటున్నాయి. ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉండటం వల్ల వినియోగదారులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెల్ఫీలపై పెరిగిన మోజును దృష్టిలో ఉంచుకుని VIVO మార్కెట్‌లోకి కొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. సెల్ఫీ విత్‌ మూన్‌ లైట్‌ ఫ్లాష్‌ ఆప్షన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన వి5, వి5 ప్లస్‌ మోడళ్లు అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. 4 జీబీ నుంచి 6 జీబీ ర్యామ్‌, ఫ్రంట్‌ కెమెరా 20 మెగా ఫిక్స్‌ల్‌తో భారీ స్పెసిఫికేషన్లతో వచ్చింది. 5.5 అంగుళాల హెచ్‌డీ తెర, 1.8 గిగా హెడ్జ్‌ అక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 652 ప్రాసెసర్‌, 32 జీబీ అంతర్గత మెమరీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 13 మెగాఫిక్సెల్‌ వెనుక కెమెరాతో ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి.
ఇక వీవో స్మార్ట్‌ఫోన్‌లో మరో ప్రత్యేకత ఉంది. ఇందులో మెమరీ కార్డు అవసరం లేకుండా ఇన్‌బిల్ట్ మెమరీ 32GB వరకు ఉంది. ఈ మొబైల్ ఫోన్ల ధరలు అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఉన్నాయని కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు. డిఫరెంట్ పీచర్స్‌తో 8 వేల నుంచి 30 వేల వరకు ధరలు ఉన్నాయంటున్నారు. వీవో మొబైల్ మరింత ఆదరణ పొందేందుకు కొత్త కొత్త ఫీచర్స్‌తో మరెన్నో మోడళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వహకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీవో స్మార్ట్‌ఫోన్లు అమ్మకాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

06:46 - April 7, 2017

ఢిల్లీ : జీఎస్టీ బిల్లుతో పేద ప్రజలపై ఆర్థికభారం మరింత పెరుగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులపై భారం పెరుగుతుందని పేర్కొన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల భారాలు పెరిగి నష్టపోతాయని..దీనివల్ల ప్రైవేటీకరణ సమస్య తలెత్తుతుందన్నారు. జీఎస్టీ అమలుతో రేట్లు తగ్గి సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు.

06:44 - April 7, 2017

ఢిల్లీ : డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ పర్సనాలిటీలకు ఇచ్చే శౌర్యచక్ర అవార్డు తెలంగాణా పోలీస్‌ను వరించింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా టెర్రరిస్టును పట్టిబంధించిన కానిస్టేబుల్‌ కె.శ్రీనినివాస్‌ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. 2016 జనవరి 23న బెంగళూరు సమీపంలోని దొడ్డనాగమాగల రోడ్‌లో తనకు ఎదురుపడిన టెర్రటిస్టును పట్టుకున్నాడు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌. బైక్‌పై వెళ్లుతున్న అనుమానితులను కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ పోలీసులు వెంబడించారు. ఛేజ్‌ చేస్తూ వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను టెర్రరిస్టులు ఒక్కసారిగా బైక్‌తో ఢీకొట్టారు. తర్వాత కత్తితో దాడి చేశారు. ఈ పెనుగులాటలో తనకు గాయాలవుతున్నా శ్రీనివాస్‌ వెనుకడుగు వేయలేదు. చేతుల్తో టెర్రరిస్టును పట్టి బంధించాడు. తనకు ప్రాణాపాయం ఉన్నా దేశద్రోహులు పారిపోకుండా పట్టుకున్నందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అందుకున్నారు కె.శ్రీనివాస్‌.

 

06:41 - April 7, 2017

తూర్పుగోదావరి : కాకినాడ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు మృతి చెందారు. యానాం సమీపంలోని కాపులపాలెం గ్రామానికి చెందిన 19 మంది విహారయాత్రలో భాగంగా కాకినాడ బీచ్‌కు వచ్చారు. వీరంతా సముద్ర స్నానానికి వెళ్లగా అందులో ఐదుగురు మంది గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన కోస్ట్‌ గార్డ్ గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు మరో ఇద్దరి కోసం కోస్ట్‌ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు.

06:39 - April 7, 2017

హైదరాబాద్ : మంథని దళిత యువకుడు మధుకర్ డెత్‌ కేసుపై హైకోర్టు స్పందించింది. బాధితుల పిటిషన్‌ స్వీకరించిన ధర్మాసనం రీపోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. పలు రకాల సూచలు చేస్తూ వీడియో తీయాలని..బాధిత కుటుంబీకులు ఉండాలని నివేదిక సీల్డ్ కవర్‌లో కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతి కేసులో రీపోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజి మరియు కాకతీయ మెడికల్‌ కాలేజి ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రీ-పోస్ట్‌మార్టంను వీడియో తీయాలని చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌, మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రీపోస్ట్‌మార్టం నివేదికను సీల్డ్‌కవరులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టులో పిటిషన్ దాఖలు..
పెద్దపల్లి జిల్లా మంథని ఖానాపూర్‌లోని దళిత యువకుడు మధుకర్‌ అనుమానాస్పద మృతిపై హైకోర్టులో ఉదయాన్నే పేరెంట్స్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మధు అనుమానాస్పద మృతిని హత్యకేసుగా నమోదు చేయాలంటూ పౌరహక్కుల సంఘం నేతలు అండగా ఉండగా మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు జారీచేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి కేసును పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి మధ్నాహ్నం 2.30 గంటలకు విచారణ చేసి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో మధుకర్ కేసు మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఎన్నో ఆందోళనలు పెరగడంతో పాటు ధర్మాసనం ఉత్తర్వులతో రీపోస్టుమార్టంతో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

06:36 - April 7, 2017

హైదరాబాద్ : ప్రజాగాయకుడు గద్దర్‌ తన గుండె చప్పుడు వినిపించారు. మొదట్లో విప్లవోద్యమం వైపు నడిచిన తాను.. ఇపుడు ఓటు నమోదు చేసుకుని ప్రజల్లోకి వెళ్లుతున్నానని తెలిపారు. గద్దర్‌పై కాల్పుల ఘటన జరిగి 20 ఏళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'గద్దర్‌ గుండెచప్పడు' పేరుతో కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా తాను త్వరలో ప్రజల్లోకి వెళ్లతానని .. ప్రజాసమస్యల పరిష్కారానికి గళం విప్పుతానన్నారు గద్దర్‌. ఎర్రజెండా వదిలి...బుద్ధ జెండా పట్టుకుంటున్న ... అలాగని నా మాతృ సంస్థతో ఎలాంటి శత్రు వైరుధ్యం లేదు... మిత్రు వైరుధ్యం మాత్రమే ఉందన్నారు గ‌ద్దర్. మొదట్లో ఓటు వేయొద్దని ప్రచారం చేసిన తానే ఇపుడు ఓటు నమోదు చేసుకున్నానన్నారు. అలాగని ఏ రాజకీయ పార్టీ లో తను లేనన్నారు తెలిపారు. ఓటుతో త్వర‌లో ప్రజల ముందుకు రాబోతున్నట్టు గద్దర్‌ చెప్పారు.

175 ప్రాంతాలు..
భాగ్యవంతుల చేతిలో భారత దేశం ఉందని... పార్లిమెంట్ లో ఉండాల్సింది పూలె, మార్క్స్, అంబేద్కర్‌ సిద్ధాంతాలు ఆచరించేవారని అన్నారు గద్దర్‌. అందుకోసం మ‌రో రాజ‌కీయ పార్టీ రావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇప్పుడ భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించామ‌ని ఇక సామాజిక తెలంణ సాధన కోసం అట్టడుగు నుండి అభివృద్ధి సాదించడానికి తాను పల్లె పల్లె కు పాట .... పార్లిమెంట్ కు బాట అనే నినాదాన్ని ఇస్తున్నట్టు గద్దరు అన్నారు. గ‌ద్దర్ పై కాల్పులు ఘటనను గుర్తుచేసుకుని ఆయన భార్య కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రతి సంవ‌త్సరం ఏప్రిల్ 6 వ‌స్తుందంటే చాలు ఆ దాడి క‌ళ్లముందు క‌దులుతుంది. ఆ రోజు గ‌ద్ద‌రిని ప్రజ‌లే బ‌తికించారని ఆమే క‌న్నీటితో చెప్పారు. త్వరలోనే దక్షిణ భారతదేశంలో 175 ప్రాంతాలు తిరుగుతానని ఆరు నెలలో రెండున్నర లక్షల గ్రామాల్లో నేతలను కలుస్తానని గద్దర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వస్తే నా జాతికేమిస్తారని అంబేద్కర్‌ అడిగినట్టే తెలంగాణ సాకారమైతే బడుగు ప్రజలకు ఏమిస్తారని అపుడే నిలదీసి ఉండాల్సిందని గద్దర్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి, పాశం యాదగిరి త‌దిత‌ర ప్రజాసంఘాల నాయ‌కులు, క‌ళాకారులు హాజరయ్యారు.

06:32 - April 7, 2017

ఢిల్లీ : హైదరాబాద్‌ టూ అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై అధ్యయనానికి త్వరలో సలహా సంస్థలను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ ఏఐనిర్ణయించింది. గత రెండున్నర ఏళ్లుగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాధన కేంద్రం దగ్గర పెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ మార్గనిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్‌ నియంచాలని ఎన్‌హెచ్‌ ఏఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఎక్స్‌ ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య దూరం 3గంటలకు తగ్గిపోనుంది. అటు బెంగళరూరు -హైదరాబాద్‌ రహదారిపైన కూడా అధ్యయనానికి జాతీయ రోడ్‌ నిర్మాణ సంస్థ ఓకే చెప్పింది. అయితే ముందుగా తెలుగు రాష్ట్రాల అనుసంధానం పైనే దృష్టిపెట్టాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.

06:30 - April 7, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేకుండాపోతుందని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జగన్‌తో సహా వైసీపీ నేతలు హస్తినకు చేరారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసిన నేతలు.. చంద్రబాబు వ్యవహారంపై జాతీయ నేతలను కలిసేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్‌ జగన్‌తో సహా.. వైసీపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అనైతిక చర్యలను ప్రణబ్‌కు వివరించినట్లు జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామని.. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు వైఎస్‌ జగన్‌.

అవినీతికి పాల్పడుతున్న బాబు..
చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతితో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. మట్టి నుంచి మద్యం దాకా.. గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగుతున్నాడన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ ఒక్క పార్టీకో సంబంధించి కాదని.. భవిష్యత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు అన్ని పార్టీలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జాతీయ పార్టీల నేతలను కలవనున్నట్లు జగన్‌ తెలిపారు. అలాగే ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు.. అవినీతికి పాల్పడుతున్నట్లు జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

టిడిపి స్పందన..
ఇదిలావుంటే జగన్‌ ఢిల్లీ పర్యటనపై టీడీపీ స్పందించింది. జగన్‌కు కేసులు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు మాత్రమే ఢిల్లీ గుర్తుకువస్తుందన్నారు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయని.. రాష్ట్రపతి, ప్రధానిని కలిసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. జగన్‌ రాజకీయాలు మానేసి తనపై ఉన్న కేసుల గురించి ఆలోచించాలన్నారు జేసీ. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశం ఢిల్లీ చేరింది. అయితే.. జగన్‌ బీజేపీతో సహా ఇతర పార్టీల నేతలను కలవనున్న నేపథ్యంలో ఏవరైనా స్పందిస్తారా ? లేదా చూడాలి.

06:27 - April 7, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్‌ భేటీలో కొత్త పాత మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిర్చికి గిట్టుబాటుధర, వేసవిలో తాగునీటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. వర్షాకాలం వచ్చేనాటికి చెరువులు, కుంటలు, కాలువల మరమ్మతులు పూర్తి చేయడంతోపాటు... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్‌డ్యాంల్లో పూడికను తీయాలని నిర్ణయించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 వేల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని కూడా నిర్ణయంచారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులు చేపట్టాలని మంత్రి వర్గంలో చర్చించినట్టు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ కేబినెట్‌ చర్చించింది. దీనికోసం పంచాయతీరాజ్‌ శాఖలో టోల్‌ఫ్రీనంబర్‌ ఏర్పాటు, కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కేంద్రాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల మంచినీటి సమస్యలపై రాష్ట్రంలో ఏప్రాంతం నుంచైనా ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు కు వీలుకలుగుతుందన్నారు మంత్రి కాల్వశ్రీనివాసులు. అటు వేసవిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయలు కల్పించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ మంత్రి వర్గం చర్చిందింది. గుంటూరు మిర్చియార్డును సందర్శించి.. పరిస్థితిని సమీక్షించాలని వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి, ధరల నియంత్రణశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది.

చర్లపల్లిలో ఖైదీల మధ్య ఘర్షణ..

మేడ్చల్ : చర్లపల్లి జైలులో బ్లేడుతో ఖైదీ గొంతును మరో ఖైదీ కోశాడు. బాధితుడి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఖైదీలకు పంపిణీ చేసే గుడ్లు..పాల విషయంలో ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న జగన్ ఢిల్లీ పర్యటన..

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను జగన్ కలవనున్నారు.

ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు..

విజయవాడ : ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ ఏడాది 5వేల చెక్ డ్యాములు నిర్మించాలని..వర్షాకాలం వచ్చేనాటికి అన్ని చెరువులు..కాలువల మరమ్మత్తు పనులు పూరి చేయాలని..కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని..హీరో మోటో కంపెనీతో సేల్ డీడ్ లో సవరణకు ఏపీఐఐసీకి ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్ 2017 ముసాయిదా రూపొందించాలన్న ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రైజింగ్ పూణె విజయం..

ఢిల్లీ : ఐపీఎల్ 10లో భాగంగా ముంబై ఇండియన్స్ పై రైజింగ్ పూణె విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ పై ఏడు వికెట్లతో పూణె గెలుపొందింది. ముంబై 184/8, పూణె 187/3.

Don't Miss