Activities calendar

08 April 2017

21:30 - April 8, 2017

ఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ తీరు ఏం మారలేదు. విమానయాన సంస్థలు ఆయన ప్రయాణంపై నిషేధం ఎత్తివేసి 24 గంటలు కాకముందే... మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌ఇండియా ఉద్యోగులు పిచ్చివాళ్లని వ్యాఖ్యానించాడు. వారు వివాదాన్ని ప్రారంభిస్తే తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంటు గౌరవానికి భంగం వాటిల్లినందుకు మాత్రమే తాను క్షమపణలు చెప్పానని గైక్వాడ్ పేర్కొన్నారు.

21:29 - April 8, 2017

ఢిల్లీ: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టోలు కేవలం కాగితాలకే పరిమితమైపోతున్నాయని అన్నారు. ఎన్నికలు- ఆర్థిక సంస్కరణలు' అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన సెమినార్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు ఖేహర్‌ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేక రాజకీయ నాయకులు కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని ఖేహర్‌ అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను పార్టీలు గుర్తుంచుకొని అమలయ్యేలా చూసుకోవాలని సూచించారు.

21:22 - April 8, 2017

విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా నోరుమెదిపారు. జగన్ తీరు భరించలేని నేతలు టీడీపీలోకి వచ్చారన్నారు. ఆయన విశాఖ లో మాట్లాడుతూ... గతంలో ఫిరాయింపులపై తాను ఫిర్యాదుచేసిన మాట వాస్తవమే కాని అప్పటి పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. వైఎస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించలేదా.. ప్రతి సంవత్సరం తన కుటుంబం యొక్క ఆస్తులను వెల్లడిస్తున్నామని.. జగన్‌కు తన ఆస్తులను వెల్లడించే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు.

 

20:14 - April 8, 2017

తమిళనాడు : చెన్నై ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఓటర్లకు భారీగా నగదు పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు 89 కోట్లు పంచినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి ఇంటి నుంచి 100 కోట్లు వెళ్లినట్లు సమాచారముందని... కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఐటీ శాఖ నివేదిక పంపింది. నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.

20:12 - April 8, 2017

హైదరాబాద్: బేగంపేట్‌లో మోహన్‌ కృష్ణ మృతికి పోలీసులే కారణమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని... నార్త్ జోన్‌ డీసీపీ సుమతి స్పష్టం చేశారు.. మోహన్‌కృష్ణకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సాయంత్రం ఐదింటికే ఇంటికి పంపారని... అనారోగ్యంవల్లే అతను చనిపోయిఉంటాడని తెలిపారు.. పోస్ట్‌మార్టం తర్వాత వివరాలు తెలుస్తామని సుమతి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:08 - April 8, 2017

హైదరాబాద్: 2019లో ముఖ్యమంత్రిని నేనే..టిక్కెట్లు కోసం ధరఖాస్తు చేసుకోండి, టిఆర్ ఎస్ పార్టీకి మల్లారెడ్డి మంట..హామీలు యాది చేస్తే వస్తదే తంట, మీసాలు లేకుంటే మొనగాడే కాదు...నిజామాబాద్ జిల్లాలో ఊరోళ్ల ఆచారం, పట్టపగటీలు నిద్రపోతున్న ప్రభుత్వ ఆఫీసరు..మేల్కోనేటట్టు చేస్తానంటున్న ఎమ్మార్వో సారు, సింగరేణి క్వార్టర్లలో నాగుబాముల దండయాత్ర...వారసత్వ కబ్జాకు దిగిన పాము పిల్లలు, సన్మానం పొందిన ముసలి లవకుశలు...పాత సినిమా హీరోయిన్లకు పట్టాభిషేకం ఇత్యాది అంశాలతో మల్లన్న ఘరం ఘరం ముచ్చట్లు మన ముందుకు తీసుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:02 - April 8, 2017

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో 11 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆస్పత్రిలో జగిత్యాలకు చెందిన ఐదు నెలల చిన్నారి స్వైన్‌ ఫ్లూకి చనిపోయింది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చికిత్స పొందుతున్న వారిలో నగరానికి చెందిన వారు ముగ్గురు, రంగారెడ్డికి చెందిన వారు న‌లుగురు, వికారాబాద్‌కి చెందిన వారు ఒక‌రు ఉన్నట్టు అధికారులు చెప్పారు.

ఉత్తరాంధ్రలోనూ పెరుగుతున్న స్వైన్‌ ఫ్లూ కేసులు...

ఏపీలో కూడా స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రిపాలు అవుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ఈ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ‍ ప్రస్తుతం విశాఖలో 24 కేసులు, శ్రీకాకుళంలో మూడు, విజయనగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా.. గత మూడు నెలల్లో విశాఖలో 30 మందికి స్వైన్‌ఫ్లూ సోకిందని డాక్టర్లు తెలిపారు. ఎవ‌రికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి ఈ వైరస్‌ సోకుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. దీనిపై పరిశోధనలు జ‌రుగుతున్నాయ‌ని వీలైనంత తొంద‌ర‌గానే ప‌రిష్కారం దొరుకుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం నుంచి చర్యలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

19:59 - April 8, 2017

హైదరాబాద్: మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కారు హల్‌చల్‌ చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ వాహనదారున్ని ఢీ కొట్టి డ్రైవర్‌ పారిపోయాడు. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడికి ఎమ్మెల్యే వర్గీయులు 10 వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కేసు ఉపసంహరించుకోవాలని బాధితుడిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:58 - April 8, 2017

యాదాద్రి: లక్ష్మినరసింహస్వామిని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ అధికారులు, అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు కేంద్రమంత్రి స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు ప్రకాశ్‌జవదేకర్‌...భువనగిరి పట్టణంలోని దళిత వాడల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కే. లక్ష్మణ్‌ ఉన్నారు.

19:55 - April 8, 2017

ఢిల్లీ: అన్ని దేశాలతో భారత్ స్నేహ సంబంధాలు కోరుకుంటోందన్నారు ప్రధాని నరేంద్రమోది. ఇరుగుపొరుగు దేశాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. స్నేహానికి మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని మోదీ స్పష్టం చేశారు. 1971 యుద్ధంలో... చనిపోయిన భారత సైనికులకు నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హహీనా వాజిద్ కూడా పాల్గొన్నారు.

19:53 - April 8, 2017

గోవా: విజ‌య్ మాల్యా కింగ్‌ఫిష‌ర్ విల్లా ఎట్టకేలకు అమ్ముడుపోయింది. గోవాలో ఉన్న ఆ విల్లాను టాలీవుడ్ నటుడు, బిజినెస్ మెన్ సచిన్ జోషి కొనుగోలుచేశాడు. 73 కోట్లకు విల్లా అమ్ముడుపోయింది. రుణవసూలు కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని విక్రయించింది. గ‌తంలో బిడ్ ధర ఎక్కువ కావడంతో... మూడుసార్లు విల్లాను అమ్మేందుకు జరిగిన ప్రయత్నాలు విఫ‌లమయ్యాయి. ఈసారి ధరను 73కోట్లకు తగ్గించడంతో... సచిన్ జోషి కొనుగోలు చేశారు. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్‌ను న‌డిపేందుకు సుమారు 9వేల కోట్లు అప్పుచేసిన మాల్యా.. ఆ సంస్థ దివాళా తీయడంతో.. బ్రిటన్‌కు పారిపోయాడు.

18:41 - April 8, 2017
18:40 - April 8, 2017

అమరావతి :ఏపీ రవాణాశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు.. నాలుగో బ్లాక్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఈ కార్యక్రమం పూర్తిచేశారు.. రోడ్డు సేఫ్టీ అథారిటీ జిల్లా కమిటీల ఏర్పాటుపై తొలిసంతకం చేసిన అచ్చెన్నాయుడు... రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు..

18:38 - April 8, 2017

పశ్చిమగోదావరి: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్క్ నిర్మాణాన్ని తీరప్రాంతానికి తరలించాల్సిందే అని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. నర్సాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు రోజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్యాక్టరీ యాజమాన్యం ఇచ్చే లాంచాలకు అలవాటు పడ్డ టిడిపి.. పరిశ్రమ పేరుతో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. తుందుర్రు, కె బేతపూడి, జొన్నలగరువు గ్రామాలలో ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం రోజున పోలీసులు లాఠీలతో కొట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రోజా విమర్శించారు.

18:36 - April 8, 2017

విశాఖ :29 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందించిన భారత నౌకదళ విమానం టీయూ-142 ఎం సేవలు నిలిచిపోనున్నాయి. ఈ విమానాన్ని విశాఖలో మ్యూజియంగా ఏర్పాటుచేయనున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లోని నేవీ స్తావరానికి వచ్చిన టీయూ-142 ఎం విమానంకు సీఎం చంద్రబాబు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌-32 విమానప్రమాద బాధిత కుటుంబాలకు 5లక్షల చెక్కులను చంద్రబాబు అందజేశారు.

18:34 - April 8, 2017

గుంటూరు : బాపట్లలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. దాడిలో తీవ్రగాయాలైన వ్యక్తిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుండి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లైన్‌మెన్‌ నాయక్‌ను సాంబశివరావు అనే వ్యక్తి నిలదీశాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సాంబశివరావుపై లైన్‌మెన్‌ కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రగాయాలైన సాంబశివరావు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

18:32 - April 8, 2017

సిరిసిల్ల : మిషన్ భగీరథలో భాగంగా ఈ సంవత్సరం చివరికల్లా సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీటిని అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల పట్టణాన్ని 200 సీసీ కెమెరాలతో సేఫ్‌ జోన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. దీంతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు పట్టణంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

 

18:31 - April 8, 2017

నాగర్ కర్నూలు : అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో యురేనియం తవ్వకాలకు అనుమతులు నిరసిస్తూ.. స్థానికులు రోడ్డెక్కారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్, పదర మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌ చేపట్టారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై మన్ననూర్ వద్ద ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. యురేనియం తవ్వకాల వల్ల జార్కండ్‌లో చెంచులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఇక్కడ తవ్వకాలు చేపడితే నాగర్‌కర్నూలు, నల్లగొండతో పాటు హైదరాబాద్‌లోనూ అలాంటి సమస్యలే వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఘనంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్ : ప్రముఖ  సినీ నటుడు అల్లు అర్జును జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమానికి అర్జున్ హాజరై కేక్ కట్ చేశారు. బన్నీ కాసేపు అభిమానులతో ఫొటోలు దిగి సందడి చేశారు.

టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్ : కొంపల్లి గార్డెన్ లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ 3వ ఫ్లీనరీ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వివేక్, శంభీపూర్ రాజు, బొంతు రామ్మోహన్ పరిశీలించారు. 15వేల మంది కార్యకర్తలకు భోజనం ఇతర సదుపాయల ఏర్పాట్లపై నేతలు వర్కర్లను అడిగి తెలుసుకున్నారు.

తక్షణమే విధుల్లో చేరండి : పోచారం

హైదరాబాద్ : కొత్తగా నియామితులైన ఏవో, ఏఈవోలు వెంటనే విధుల్లో చేరాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు చేస్తూ ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

సంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం బస్టాప్ వద్ద ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని కేకలు వేయడంతో స్థానికులు డ్రైవర్ ను చితకబాదారు.

విద్యుత్ లైన్ మెన్ పై కత్తితో దాడి

గుంటూరు : జిల్లాలోని బాపట్లలో ఓ సాంబశివరావు విద్యుత్ లైన్ మెన్ పై కత్తితో దాడి చేశాడు. కరెంట్ సరఫరా విషయంలో లైన్ మెన్ నాయక్, సాంబశివరావు అనే వ్యక్తి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో లైన్ మెన్ పై కత్తితో సాంబశివరావు దాడి చేశాడు. 

16:52 - April 8, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు దేశవ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి.. ఈ పథకాల అమలును తెలుసుకునేందుకు పలు రాష్ట్రాల అధికారులు తెలంగాణకు వస్తున్నారు.. యూపీ అప్పటి సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కూడా మిషన్‌ భగీరథపై ఆసక్తిచూపారు.. ప్రభుత్వ ఇంజనీర్ల బృందాన్ని తెలంగాణాకు పంపి ఈ స్కీంపై నివేదికకూడా తెప్పించుకున్నారు.. బెంగాల్‌ సర్కారుకూడా ఈ రెండు పథకాలపై స్టడీ టూర్‌ చేసింది..

మహారాష్ట్ర, ఎంపీ, యూపీ, ఒడిషా ఇంజనీర్ల టూర్‌...

అటు కేంద్రంకూడా మిషన్‌ కాకతీయ ఫలితాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.. తెలంగాణకువెళ్లి మిషన్‌ కాకతీయపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఉమాభారతి ఆదేశించారు.. మంత్రి ఆదేశాలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిషా ఇంజనీర్లు మెదక్‌ జిల్లాలో పర్యటించారు.. పథకాల రూపకల్పన, ఖర్చు, ప్రయోజనాలు, ఫలితాల వివరాల్ని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వీరందరికీ మంత్రి హరీశ్ రావు, నీటిపారుదల అధికారులు వివరించారు..

ఈ నెల 10న తమిళనాడు ఇంజనీర్ల బృందం పర్యటన..

తాజాగా మరో స్టడీ టీమ్‌కూడా తెలంగాణకు రానుంది.. ఈ నెల పదిన తమిళనాడుకు చెందిన ఇంజనీర్ల అధ్యయన బృందం రాష్ట్రానికి రానుంది.. మూడు రోజులపాటు మిషన్‌ కాకతీయ వివరాల్ని తెలుసుకోనుంది.. ఇరిగేషన్ ఇంజనీర్లు, ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు బృందాలుగా ఇక్కడికి రానున్నారు... ఈ బృందాలు క్షేత్ర స్థాయి పర్యటనలతోపాటు సాగునీటి పారుదల, మిషన్ భగీరథ, పురపాలక శాఖ, రూరల్ వాటర్ సప్లై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 11 న మిషన్ కాకతీయపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనున్నారు.

జయలలిత హయాంలోనే ఈ అధికారుల బృందం..

తెలంగాణకువస్తున్న తమిళనాడు బృందానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుచేయాలని అధికారుల్ని హరీశ్ రావు ఆదేశించారు.. అయితే జయలలిత హయాంలోనే ఈ అధికారుల బృందం రాష్ట్రానికి వస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది.. ఆమె చనిపోవడంతో అది వాయిదాపడింది.. ఆ తర్వాత ఇప్పుడు ఈ టూర్‌కు ప్రస్తుత సీఎం గ్రీన్‌ ఇచ్చారని తెలుస్తోంది..

తెలంగాణలో 46,531 చిన్ననీటి వనరుల పునరుద్ధరణ...

తెలంగాణలో 46వేల 531 చిన్ననీటి వనరుల పునరుద్ధరణలోభాగంగా మిషన్ కాకతీయ -1, మిషన్ కాకతీయ - 2 కింద పనులు జరిగాయి... త్వరలో మూడోదశ ప్రారంభం కాబోతోంది.. రెండు విడతల్లో దాదాపు 5 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇక ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందించే కార్యక్రమం మిషన్ భగీరథ పనులుకూడా వేగంగా సాగుతున్నాయి.. నీటిపారుదల పథకాలను వస్తున్న స్పందనపై టీఎస్‌ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.. మరింతమందిని ఇందులో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది..

16:49 - April 8, 2017

అనంతపురం : జనసేన...సైనికులను సమీకరించుకునే పనిలో పడింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీనికి విశేష స్పందన కూడా వచ్చింది. అనంతపురం జిల్లా నుంచి పది వేలకుపైగా యువత పార్టీలో పనిచేయడానికి అప్లికేషన్లు పంపించారు.

పార్టీలో పనిచేసేందుకు యువతకు పిలుపునిచ్చిన జనసేన...

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు యువతను భాగస్వామ్యం చేయాలని జనసేన అధినేత పవన్ నిర్ణయించారు. పనిచేసే కార్యకర్తల కోసం ఆయన ఆహ్వానం కూడా పలికారు. స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి సమస్యలపై అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గానూ, రైటింగ్‌ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గానూ చక్కటి విశ్లేషణలను చేయగలవారిని అనలిస్టులుగా పార్టీకి సేవలందించేందుకు ఆహ్వానం పలికింది జనసేన.

జనసేన నోటిఫికేషన్‌కు మంచి రెస్పాన్స్‌...

రాజకీయాల్లో నూతన ఒరవడికి నాంది పలుకుతూ జనసేన విడుదల చేసిన.. ప్రకటనకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనంతపురం జిల్లా నుంచి 10 వేల మందికి పైగా పని చేసేందుకు ముందుకు వచ్చారు. తొమ్మిది వేల మందికి పైగా పార్టీ వెబ్ సైట్ ద్వారా తమ అప్లికేషన్లు పంపగా. మిగతా వాళ్లు అనంతపురం బాలాజీ రెసిడెన్సీలో నేరుగా దరఖాస్తులు సమర్పించారు. అయితే స్పీకర్స్‌గా, అనలిస్టులుగా పనిచేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు.

ఏప్రిల్‌ చివర్లో అనంతపురంలో పర్యటించనున్న జనసేన టీం...

ఇక దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పూర్తి కావడంతో ఎంపిక ప్రక్రియ మాత్రమే మిగిలింది. ఏప్రిల్ రెండో వారం చివర్లో గాని, మూడోవారంలోగాని అనంతలో పర్యటించనున్న జనసేన టీం, దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి క్యాడర్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధికారికంగా వారి పేర్లను ప్రకటించనున్నారు.

16:46 - April 8, 2017

విజయవాడ: పార్టీ ఫిరాయింపులకి కాంగ్రెస్‌ వ్యతిరేకమన్నారు హస్తం నేతలు. తమ పార్టీ నుండి వెళ్లిన వాళ్లకి కూడా చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారని.. ఫిరాయించిన వారెవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు మాజీ కేంద్ర పల్లంరాజు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏపిసిసి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌, కుంతియా, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై సమన్వయ కమిటీలో చర్చించారు.

16:44 - April 8, 2017

అనంతపురం : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుళ్లకు మొక్కుతారని..అలాగే జగన్‌ కూడా అక్రమాస్తుల కేసు తెరపైకి వచ్చినప్పుడల్లా రాష్ట్రపతితో పాటు ఇతర పెద్దలతో భేటీ అవుతున్నాడని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన జేసీ..తమ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రపతి ఏం చేస్తారని అన్నారు.

పాతబస్తీలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టాయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదుగురుయ వ్యక్తులను అరెస్ట్ చేసి 65 గ్రాముల కొకైన్, రూ.90వేలు, 10 సెల్ ఫోన్లు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

 

ఏపీ సీఎంపై మేథాపాట్కర్ ఫైర్

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై పర్యావణవేత్త మేథాపాట్కర్ విమర్శలు చేశారు. ఏపీ రాజధానిలో అసైన్డ్ భూములన్నీ ప్రభుత్వ భూములేనని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారని ఆమె విమర్శించింది. 2013 భూసేకరణ చట్టానికి మార్పులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆమె అన్నారు.

ప్రారంభమైన వసంతోత్సవాలు

చిత్తూరు : తిరుమలలో వసంతోత్సవాలున వైభంగా ప్రారంభమైయ్యాయి. వసంత మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం జరుగుతోంది.

 

తెలంగాణలో టీడీపీ కథ ముగిసింది : హరీష్

వరంగల్ : తెలంగాణలో టీడీపీది ముగిసిన చరిత్రాని మంత్రి హరీష్ రావు అన్నారు. సంక్షేమంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. తమని విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీఇంటికి తాగునీటిని అందిస్తున్నామని హరీష్ తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ధర్నాలు చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ ది అని ఆయన విమర్శించారు. కోతలు లేకుండా కరేంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు.

 

15:42 - April 8, 2017

గుంటూరు : మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరులో రైతులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకు ఉధృతం అవుతోంది. గుంటూరులోని కలెక్టరేట్‌ దగ్గర సీపీఐ ఆధ్వర్యంలో మిర్చి రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.,..-రైతు సమస్యలు పరిష్కరిస్తే ఓట్లు వేస్తారన్న నమ్మం ప్రభుత్వానికి లేదు. అందుకే కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టి ఓట్ల మంత్ర చేస్తూ... రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారత్ కు విదేశీ మారకద్రవ్యం సంపాదించే వాటిలో ఒకటి మిర్చి పంట అని కీలక వాణిజ్య పంటను అశ్రద్ధ చేస్తే మిర్చి ఘాటుకు ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. మార్కెఫెడ్, నార్క్ ఫెడ్ ను వెంటనే మార్కెట్లో కి దింపాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఓయూ శతాబ్ది ఉత్సవాలకు 'గ్రౌండ్ ఎ ' ఎంపిక

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వేదికగా ' గ్రౌండ్ ఎ 'ను ఎంపిక చేశారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానున్నారు.

 

15:37 - April 8, 2017

తుళ్లూరు: ఏపీలోని తూళ్లూరు మండలం బోరుపాలెం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు.. అమరావతికోసం భూమిని సేకరించిన అధికారులు ... తమ 14ఎకరాల నిమ్మతోటను జరీబుకింద రాయలేదని ఆరోపించారు.. రెండేళ్లనుంచి సీఆర్డీఏ అధికారులతోపాటు... జాయింట్‌ కలెక్టర్‌ చుట్టూతిరిగినా తమకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సమస్యపై స్పందించిన తహసిల్దార్‌ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.. తహసిల్దార్‌ హామీతో రైతులు ఆందోళన విరమించారు..

15:36 - April 8, 2017

నెల్లూరు : నెల్లూరు జడ్‌పీ సమావేశం రసాభాసగా మారింది.. సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డితో ఎమ్మెల్సీ వాకాటి వాగ్వాదానికి దిగారు.. మంత్రుల సమక్షంలోనే ఇద్దరు వాదించుకున్నారు..

అంజెడానే మిగిలింది : తమ్మినేని

హైదరాబాద్ : పాదయాత్ర జయప్రదంగా ముగిసిందని ఇకా అజెండానే మిగిలింది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాత్రలో ప్రస్తావించిన అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వామపక్ష సంఘాలను కలుకొని వెళ్తామని ఆయన తెలిపారు. బూర్జువా రాజకీయ పార్టీల విధానాలు మారాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోరుకునే పాలన సాగినప్పుడు అభివృద్ధి సాధ్యమని తమ్మినేని అన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా ఎస్పీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు.

ముగిసిన ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం

విజయవాడ : ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పార్టీ ఫిరాంయిపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడారు. కానీ ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మండల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని వారు అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల చిరంజీవి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడంలేదని పల్లంరాజు అన్నారు. చిరంజీవి ఎప్పటికీ కాంగ్రెస్ లో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

14:48 - April 8, 2017

ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్‌ వాహనం ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. తాండూరు మండలం రేపెల్లె వాడ సమీపంలో కొమరంభీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ వాహనం ఓ మహిళను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

 

14:46 - April 8, 2017

హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది... గాంధీ ఆస్పత్రిలో ఈ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది.. జగిత్యాలకుచెందిన మోక్షశ్రీ స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది.. చికిత్స పొందుతూ చనిపోయింది.. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:41 - April 8, 2017

హైదరాబాద్‌ :బేగంపేట్‌లో మోహన్‌ కృష్ణ అనుమానాస్పద మృతిపై ఉద్రిక్తత కొనసాగుతోంది... తమ బిడ్డను పోలీసులే హత్య చేశారంటూ మృతుని బంధువులు గాంధీ ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. పాతపాటిగడ్డలో ఉండే మోహన్‌కు భార్య, 13నెలల కొడుకు ఉన్నాడు.. వరుసకు మరదలయ్యే బాలికను తాను పెళ్లిచేసుకుంటానంటూ కొద్దిరోజులుగా గొడవచేస్తున్నాడు.. పెద్దలు నచ్చజెప్పినా వినలేదు.. దీంతో అతడి భార్య బేగంపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది.. ఆ తర్వాత పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.. తెల్లారేసరికి మోహన్‌ శవమయ్యాడు.. మోహన్‌ను పోలీసులే కొట్టి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.. అటు మృతుని కుటుంబసభ్యులను కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి పరామర్శించారు.. మోహన్‌కృష్ణ కేసులో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

మోహన్‌ కృష్ణ మృతికి పోలీసులే కారణమని తేలితే చర్యలు : డీసీపీ సుమతి

బేగంపేట్‌లో మోహన్‌ కృష్ణ మృతికి పోలీసులే కారణమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని... నార్త్ జోన్‌ డీసీపీ సుమతి స్పష్టం చేశారు.. మోహన్‌కృష్ణకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సాయంత్రం ఐదింటికే ఇంటికి పంపారని... అనారోగ్యంవల్లే అతను చనిపోయిఉంటాడని తెలిపారు.. పోస్ట్‌మార్టం తర్వాత వివరాలు తెలుస్తామని సుమతి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

బంగ్లా ప్రధాని హసీనాతో కలిసి మోడీ ప్రెస్ మీట్

ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధాని మంత్రి మోడీ ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఉగ్రవాద నిరోధం, భద్రతా సహకారంపై చర్చించామని ఆయన తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య న్యాయ సహకార ఒప్పందంపై, పౌర అణు సహకారం సహా 22 అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగాయి మోడీ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రధాని అన్నారు. బంగ్లాదేశ్ కు భారత్ సుదీర్ఘకాలం నమ్మదగిన మిత్రదేశామని మోడీ స్పష్టం చేశారు.

 

స్వైన్ ప్లూతో చిన్నారి మృతి

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ప్లూ విజృంభిస్తుంది . తాజాగా సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ప్లూ తో జగిత్యాలకు చెందిన చిన్నారి మృతి చెందింది. 

13:29 - April 8, 2017

గాంధీ ఆసుపత్రికి మోహన్ కృష్ణ మృతదేహం

హైదరాబాద్ : బేగంపేట్ పీఎస్ లో లాకప్ డెత్ కు గురైన మోహన్ కృష్ణ మృతదేహం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని మృతదేహనికి  పోస్టుమార్టం నిర్వహించారు. మోహన్ కృష్ణ మృతిపై న్యాయ విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ ను కలుస్తామని ఆయన తెలిపారు.

 

13:22 - April 8, 2017

విజయవాడ : బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులకు అడ్డంకులు తొలిగాయి. ఎట్టకేలకు డిజైన్లు ఖరారు కావడంతో పనులను త్వరితగతిన ప్రారంభించాడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పైవంతెన పనులు 2018కల్లా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత రద్దీగా ఉండే బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఫ్లైఓవర్‌ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఫ్లైఓవర్‌ పనులను ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఫ్లైఓవర్‌ నిర్మాణంపై కలెక్టర్‌ బాబు సమీక్షించారు. ఈసమీక్షలో ఫ్లైఓవర్‌ ఆకృతులకు ఇంజనీరింగ్‌ నిపుణులు, ఉన్నతాధికారులు ఓకే చెప్పారు.

2018 కల్లా పూర్తి కావాలన్న బాబు..
అటు దుర్గగుడి పైవంతెన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేలోగా బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 2018 కల్లా ఈ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బెంజ్‌ సర్కిల్‌ రూపురేఖలు మారకుండా పైవంతెన నిర్మించాలని, అందుకు అనుగుణంగానే ఆకృతులు ఉండాలని చంద్రబాబు సూచించారు. బందరు రోడ్‌ నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణకు, బెంజ్‌ సర్కిల్‌ పైవంతెన కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచింది ప్రభుత్వం. దాదాపు 1462 కోట్లు అంచనా వ్యయంగా లెక్కట్టింది. 64.60 కిలోమీటర్ల బందరు రోడ్‌కు 740. 70 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఖరారు చేసిన ఆకృతుల ప్రకారం పైవంతెన 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. దీన్ని జ్యోతి కన్వెన్షన్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ వరకు నిర్మించనున్నారు. విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు వెంటనే ఫ్లైఓవర్‌ను నిర్మించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. ఇప్రటికైనా పనులు త్వరగా పూర్తిచేసి ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగించాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు.

13:19 - April 8, 2017

కరీంనగర్ : గోదావరిఖనిలో ఓ కాలేజీ డైరెక్టర్ కుచ్చుటోపి పెట్టాడు. ఏకంగా రూ.3 కోట్లతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలోని గాంధీ జూనియర్ కాలేజీ ఉంది. ఈ కాలేజీకి డైరెక్టర్ గా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నాడు. కాలేజీ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీ సిబ్బంది దగ్గర అతను భారీగా అప్పులు తీసుకున్నాడు. ఇందుకు చెక్కులను కూడా ఇచ్చాడు. డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేస్తుండడంతో శ్రీనివాస్ ఉడాయించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు.

13:16 - April 8, 2017

సంగారెడ్డి : జిల్లా గ్రంథాలయం సరికొత్త హంగుల్ని సంతరించుకుంటోంది.. కలెక్టర్‌ చొరవతో సమస్యలనుంచి బయటపడుతోంది.. అత్యాధునిక గదులు, అన్నిరంగాలకు సంబంధించిన పుస్తకాలతో ఇక్కడ అడుగుపెట్టగానే కొత్త ప్రపంచంలోకి వెళ్లామన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ లైబ్రరీ ప్రారంభం కానుంది. ఒకప్పుడు సంగారెడ్డి గ్రంథాలయం అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు.. తెలిసినవారు పుస్తకాలు చదువుకునేందుకు ఇక్కడకు వచ్చినా కనీస సౌకర్యాలులేక వెనుదిరిగేవారు.. ఇదంతా కలెక్టర్‌ మాణిక్‌ కణ్ణణ్ రాకముందు పరిస్థితి.. కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక గ్రంథాలయం రూపురేఖలే మారిపోయాయి. 1965లో ఏర్పాటైన ఈ పుస్తకాలయం మెదక్‌ జిల్లా వాసులకు ఎన్నో పుస్తకాలు చదువుకునే అవకాశం కల్పించింది. ఎంతోమందిని పుస్తకాలద్వారా చైతన్యంచేసిన ఈ గ్రంథాలయాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం కూర్చునేందుకు కుర్చీలుకూడాలేని దీనస్థితికి చేరింది. పుస్తకాలుకూడా అంతంతమాత్రంగా రావడంతో లైబ్రరీకి జనాల రాక తగ్గింది. వచ్చినవారు వసతులలేమితో అక్కడ ప్రశాంతంగా చదువుకోలేకపోయారు.

సంగారెడ్డి కలెక్టర్..
సంగారెడ్డి కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కణ్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఈ లైబ్రరీ పరిస్థితి చూశారు.. గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.. పుస్తకాలయం రూపురేఖలే మార్చేలా చర్యలు చేపట్టారు.. అన్నివర్గాల ప్రజలు చదువుకునే పుస్తకాలు ఇక్కడ లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. దిన, వారపత్రికలు, మామూలు పుస్తకాలతోపాటు.. పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్‌నుకూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ లైబ్రరీల ఆలోచనకూడా చేస్తున్నారు. చిన్నారులకు డిజిటల్‌ లైబ్రరీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లైబ్రరీలో సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టిపెట్టారు.. ఇక్కడికివచ్చే పుస్తకప్రియులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఫ్యాన్లు, లైట్లను బిగించారు. మంచి గాలి, వెళుతురు వచ్చేలా రీడింగ్‌ హాల్‌, రిఫరెన్స్ హాల్‌ సిద్ధం చేస్తున్నారు. కేవలం పుస్తకాలేకాకుండా లైబ్రరీ ఆవరణనుకూడా మార్చేస్తున్నారు. చుట్టుపక్కల పచ్చని మొక్కలతో కళకళలాడుతూ కనిపించేలా చర్యలు చేపట్టారు. అధికారుల చొరవతో లైబ్రరీకి కొత్త రూపురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలలేమి నుండి బయటపడ్డ సంగారెడ్డి గ్రంథాలయం త్వరలో ప్రారంభం కాబోతోంది. యువతీ యువకులు, వృద్ధులు, విద్యార్థులు అందరూ చదువుకునే బుక్స్‌ పుస్తకప్రియుల్ని అలరించబోతున్నాయి.

యాదాద్రిలో కేంద్ర మంత్రి జవదేకర్

యాదాద్రి భువనగిరి  : జిల్లాలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్రప్రభుత్వం యాదాద్రిని గొప్పగా అభివృద్ధి చేస్తోందని ఆయన కితాబిచ్చారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు బీజేపీ శాసన సభా పక్ష నేత అక్ష్మణ్ పాల్గొన్నారు.

 

ఎస్పీ వాహనం ఢీకొని మహిళ మృతి

మంచిర్యాల : జిల్లాలోని తాండురు మండలం రేపల్లెవాడ వద్ద ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందారు. మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.

విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

హైదరాబాద్ : నగరంలో ఉప్పల్ భరత్ నగరంలోని జోషి విద్యానికేతన్ స్కూల్ లో దారుణం జరిగింది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూల్ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని

చితకబాదారు

12:29 - April 8, 2017

ప్రకాశంలో మిర్చి లారీ బోల్తా

ప్రకాశం : జిల్లాలోని ఇంకొల్లు మండలం కొనికి వద్ద మిర్చి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

12:26 - April 8, 2017

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు వచ్చారు. ఐఎన్ఎస్ డేగా వద్దకు టీయూ 142ఎం యుద్ధ విమానం చేరుకుంది. నౌకాదళ సేవల నుండి ఉపసంహరించిన యుద్ధ విమాన స్వీకరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విమానానికి ఘన స్వాగతం పలికి నౌకాదళ ప్రధాన అధికారి నుండి యుద్ధ విమానాన్ని లాంఛనంగా అందుకున్నారు. గల్లంతైన ఏఎన్ -32 విమాన బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల పరిహార చెక్కులను బాబు పంపిణీ చేశారు. అనంతరం సింహాచలం ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో బాబు పాల్గొంటారు.

12:21 - April 8, 2017
12:14 - April 8, 2017

హైదరాబాద్ : హిమాయత్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆటో వాలాలు నగరంలో సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆటోల సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హిమాయత్ నగర్ నుండి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కానీ ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వారు తప్పుబట్టారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం జరిగింది. చివరకు ఆటోవాలాలను..కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు టెన్ టివితో మాట్లాడారు. పెంచిన ఇన్సూరెన్స్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ఓలా..ఉబెర్ క్యాబ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు, కానీ పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

కాకినాడలో స్వైన్ ప్లూ కేసు

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడ జీజీహెచ్ లో స్వైన్ ప్లూ లక్షణాలతో 12మంది చేరారు. వారిలో ఒకరికి స్వైన్ ప్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్

వరంగల్ : ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగసభ ఏర్పాట్లును భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ సుమారు 190 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభ కోసం పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సభకు వచ్చిన వారు ఏమాత్రం అసౌకర్యానికి గురి కాకుండా తాగునీరు, రవాణా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు.

11:58 - April 8, 2017

ప్రభుదేవా..ఇండియన్ మైకైల్ జాక్సన్ గా గుర్తింపు పొందాడు. టాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా హీరోగా కూడా పలు చిత్రాలు చేసిన ఈ నటుడు దర్శకత్వం కూడా చేస్తున్నారు. అతని దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి. బాలీవుడ్ లో రాణిస్తున్న 'ప్రభుదేవా' కోలీవుడ్ లో కూడా తన ప్రతిభను చూపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విశాల్..కార్తీ సినిమాలతో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
'కరుప్పు రాజా వెల్ల రాజా' పేరుతో రూపొందే ఈ మల్టీస్టారర్‌ను తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారని సమాచారం. కార్తీ, విశాల్ లు ఎప్పటి నుండో ఓ చిత్రంలో నటించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంఘం భవన నిర్మాణానికి నిధుల సేకరణకు తామిద్దరం సినిమాలో నటిస్తామని చెప్పారు. ఇక ఈ సినిమాలో 'అఖిల్' హీరోయిన్ 'సాయేషా సైగల్‌'ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా స్వీయ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

విదేశీయుడిపై దాడి ఘటనపై సుష్మా ఆరా

ఢిల్లీ : జర్మనీ చెందిన యువకుడిపై దుండగుల దాడి ఘటనపై విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆరా తీశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు.

11:50 - April 8, 2017

'తాను అవార్డు కోసం డబ్బులివ్వలేదు..ఎవరినీ మోసగించలేదు..అంతేగాకుండా ఆశ కూడా చూపలేదు'..అని బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్' స్పష్టం చేశారు. గతంలో అవార్డులపై నటుడు 'రిషీ కపూర్' పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా ‘రుస్తుం' చిత్రానికి గాను 'అక్షయ్' ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'అక్షయ్' మీడియాతో మాట్లాడారు. చాలా రోజులుగా అవార్డు కోసం తాను కష్టపడుతున్నట్లు, అవార్డు వచ్చినందుకు సంతోషంగా..ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేసినందుకు జాతీయ చలన చిత్రాల అవార్డు జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతుడిని అంటూ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అవార్డు షోలో ప్రదర్శనలు ఇచ్చిన సమయంలో సగం డబ్బులిచ్చి..మిగతా సగానికి అవార్డులు ఇస్తామని చెప్పేవారని పేర్కొన్నారు. తనకు అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానులు పొందడమే ముఖ్యమన్నారు.

11:45 - April 8, 2017

మూడు కోట్లతో కాలేజీ డైరెక్టర్ జంప్

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖనిలో గాంధీ జూనియర్ కాలేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రూ.3కోట్లతో ఉడాయించాడు. మోసపోయిన 25మంది బాధితులు కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్నారు.

11:37 - April 8, 2017

విజయవాడ : తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. అమరావతి కోసం భూములను సేకరించిన అధికారులు తమ 14 ఎకరాల నిమ్మతోటను జరీబు కింద ఎందుకు రాయలేదని రైతులు నిలదీశారు. బోరుపాలెం గ్రామ చిన్న / సన్నకారు రైతు నిమ్మతోటల జరీబీఉ ప్యాకేజీ సత్వర పరిష్కారం చూపాలని కోరుతూ రిలే దీక్షలు చేపట్టారు. రెండేళ్ల నుండి సీఆర్డీఏ అధికారులు, జాయింట్ కలెక్టర్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తహశీల్దార్ స్పందించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతానని చెప్పడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ఆటోల బంద్

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని ఆటో డ్రైవర్లు బంద్ నిర్వహింస్తున్నారు. పెంచిన థర్డ్ పార్టీ బీమా ప్రీమియంకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు ఈ బంద్ కు పిలుపునిచ్చారు. అలాగే ఓలా, ఉబర్ క్యాబ్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.బంద్ వల్ల లక్షా నాలుగువేల ఆటోలు ఆగిపోయాయి. ఈ బంద్ 15 లక్షల ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. 

11:30 - April 8, 2017

ఇతర దేశాలకు భిన్నంగా భారతీయ మహిళలు బంగారంపై మక్కువ పెంచుకుంటుంటారు. బంగారు ఆభరణాలను ఎంతో ఇష్టంగా కొనుక్కుంటుంటారు. అంతేగాకుండా పలువురు కానుకలు కూడా ఇస్తారు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్నా..కానుకగా వచ్చిన ఈ ఆభరణాలు పాతబడిపోతే..గీతలు పడితే బాధ పడుతుంటారు. కానీ చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యలు రావు.

  • వివిధ ఫంక్షన్లకు వేసుకునే ఆభరణాలను చల్లటి..పొడి ప్రదేశంలో పెట్టాలి.
  • ముత్యాలను సబ్బు..ఫర్ ఫ్యూమ్ తో కడుగవద్దు. దీనివల్ల కోటింగ్ తొందరగా తొలగిపోతుంది.
  • బంగారు ఆభరణాలను బీరువాలో కాకుండా వీలైనంత విశాలంగా పెట్టేందుకు ప్రయత్నించండి. ఇరుకుగా పెట్టడం వల్ల గీతలు పడే అవకాశం ఉంది.
  • వజ్రాలు..ముత్యాలు కడగాల్సి వస్తే గ్లాసు నీళ్లలో బేకింగ్ సోడా వేసుకోవాలి. అనంతరం ఆభరణాలను రుద్ది అనంతరం కాటన్ బట్టతో శుభ్రంగా తుడిస్తే ఎలాంటి సమస్య రాదు.
  • జ్యువెలరీ పాతబడితే వేడినీటిలో నానబెట్టి కడుగకూడదు. కాస్మోటిక్ పదార్థాలు..ఫర్ ఫ్యూమ్ వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాటి రంగు మారుతుంది.

విజయవాడలో డిగ్గీ రాజా..

విజయవాడ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విజయవాడకు చేరుకున్నారు. ఏపీ పీసీసీ కోఆర్డినేషన్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. కాసేపటి క్రితం సమావేశం ప్రారంభమైంది. కేవీపీ, రఘువీరా రెడ్డి, పళ్లంరాజు, నాదెండ్ల, కిల్లి కృపారాణీ తదితర నేతలు హాజరయ్యారు.

11:15 - April 8, 2017

హైదరాబాద్ : ఇతరులపై చేయని నిబంధనలు కేవలం ఆటోలపై ఎందుకు నిబంధనలు విధిస్తున్నారిన కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆటోలపై బీమా, పెనాల్టీలను విధించడంపై వ్యతిరేకిస్తూ నగరంలో ఆటోల బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని వివిధ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కానీ వారిని నిలువరించడంతో హిమాయత్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద నిలిచిపోయారు. ఈసందర్భంగా పలువురు కార్మిక నేతలు టెన్ టివితో మాట్లాడారు. ఆటో రంగంలో స్వయం ఉపాధిపై ఉన్న వారని, వీరి ఆదాయాన్ని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెనాల్టీలను దండిగా పెంచారని, ఇన్యూరెన్స్ పెంచారని దీనిపై నిలదీస్తే లెక్కలు చెప్పడం లేదన్నారు. ఓలా, ఉబెర్ క్యాబ్ లు నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఆటో వాలాలపై మాత్రం నిబంధనలు పెడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఓలా, ఉబెర్ క్యాబ్స్ లను రద్దు చేయాలని కోరారు. పెంచిన పెనాల్టీ, ఇన్యూరెన్స్ లను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

చెన్నైలో ముగిసిన ఐటీ సోదాలు

చెన్నై : తమిళనాడులోని ఆర్ కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో చెన్నైలో గత రెండు రోజులుగా జరుగుతోన్న ఐటీ సోదాలు ముగిసాయి. ఐటీకి ఓటర్లుకు డబ్బు పంపిణీ చేసినట్టు తమిళ మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో వివరాలు లభ్యమయ్యాయి.ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఒక్కొఓటుకు రూ.10 నుంచి 20 వేలవరకూ డబ్బు పంచినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడులతో ఉప ఎన్నికపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

11:11 - April 8, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక తెగ టెన్షన్ కొనసాగుతోంది. ఒక్కసారిగా ఐటీ దాడులు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈనెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బులు పంపిణీ జరుగుతోందని ప్రచారం జరిగింది. దీనిపై దృష్టి సారించిన ఐటీ శాఖ శుక్రవారం తెల్లవారుజామునుండే దాడులకు ఉపక్రమించింది. ఏకంగా మంత్రి విజయ్ భాస్కర్..నటుడు శరత్ కుమార్..పారిశ్రామిక వేత్తలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో వంద కోట్లకు సంబంధించిన ఆస్తులు..80 కోట్లకు సంబంధించిన నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఐటీ సోదాలు ముగిసినట్లు తెలుస్తోంది. దాడులకు సంబంధించిన విషయాన్ని ఐటీ శాఖ మీడియాకు వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే నేతలపైనే ఐటీ దాడులు చేయడం..పార్టీకి సంబంధించిన పారిశ్రామిక వేత్తలపై దాడులు జరగడం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఓటుకు రూ. 10 వేల నుండి రూ. 20వేల వరకు పంచారనే వార్త తీవ్ర కలకలం రేపుతున్నాయి.

జయ మృతి అనంతరం..
జయలలిత మృతి అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక్కడ గెలవాలని అన్నాడీఎంకే తీవ్ర ప్రయత్నాలు చేపడుతోంది. ఇతర నేతలు కూడా పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఆర్కే నగరంలో పెద్ద ఎత్తున్న డబ్బులు పంచుతున్నట్లు పన్నీర్ సెల్వం వర్గం ఆరోపిస్తోంది. అధికారం కోసం దినకరన్ భారీ ఎత్తున డబ్బులు పంచుతున్నారని విమర్శలు చేస్తోంది. మరి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు

విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో విశాఖకు రానున్న టీయూ 142 యుద్ధవిమానానికి సీఎం స్వాగతం పలకనున్నారు.

10:56 - April 8, 2017

ఇండోర్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10 వ సీజన్‌ తొలి పోటీకి రంగం సిద్ధమైంది. స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలోని రైజింగ్‌ పూణే సూపర్‌జెయింట్‌ జట్టుకు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ నాయకత్వంలోని పంజాబ్‌కింగ్స్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి జోరు మీదున్న పూణె జట్టు పంజాబ్‌ను సైతం ఓడించి జైత్రయాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌కు ఇండోర్‌లోని హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి జోరు మీదున్న పూణె జట్టు జైత్రయాత్ర కొనసాగించాలని తహతహలాడుతుండగా... 10వ సీజన్‌లో తమదైన ముద్ర వేయాలని పంజాబ్‌ కింగ్స్‌ జట్టు పట్టుదలతో ఉంది. స్టీవ్‌స్మిత్‌, రహానే, ధోనీ,వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు బెన్‌ స్టోక్స్‌ వంటి హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌తో పూణే బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో రహానే, స్మిత్ మెరుపు హాఫ్‌ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. లోయర్‌ ఆర్డర్‌లో బెన్‌స్టోక్స్‌, ధోనీ సైతం చెలరేగితే పూణే బ్యాటింగ్‌కు తిరుగుండదు. ధోనీ స్థానంలో కెప్టెన్‌గా ప్రమోట్‌ అయిన స్టీవ్‌ స్మిత్‌ సారధిగా తొలి మ్యాచ్‌లోనే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆకట్టుకున్నాడు.

ఇమ్రాన్‌ తాహిర్‌, ఆడమ్‌ జంపా వంటి మ్యాజిక్‌ లెగ్‌ స్పిన్నర్లతో పదునుగా ఉన్న స్పిన్‌ విభాగం పూణె పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ మాత్రం బలహీనంగా ఉంది. అశోక్‌ దిండా తొలి మ్యాచ్‌లోభారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఈశర్‌ పాండే,జయదేవ్‌ ఉనద్కత్‌లలో ఒకరికి ప్రధాన పేసర్‌గా ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది.

పటిష్టంగా పంజాబ్..
మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కొత్త కెప్టెన్‌, కొత్త జెర్సీతో సరికొత్త సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ప్లాన్‌లో ఉంది.డైనమిక్‌ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ నాయకత్వంలో బరిలోకి దిగబోతోన్న పంజాబ్‌ జట్టు....ఆల్‌రౌండ్ పవర్‌తో పటిష్టంగా ఉంది. హషీమ్‌ ఆమ్లా, మార్టిన్‌ గప్తిల్‌, ఓయిన్‌ మోర్గాన్‌, డేవిడ్‌ మిల్లర్‌,గ్లెన్‌ మాక్స్‌వెల్‌, షాన్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌, డారెన్‌ శామీ, మ్యాట్ హెన్రీ వంటి విదేశీ స్టార్లు వృద్ధిమాన్‌ సాహా, మనన్‌ ఓహ్రా, మోహిత్‌ శర్మ, వరుణ్‌ ఆరోన్‌,సందీప్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ వంటి స్వదేశీ ఆటగాళ్లతో పేపర్‌ మీద బలంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్‌ విభాగం టాప్‌క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పవర్‌ ఫుల్‌గా ఉన్నా బౌలర్లు రాణించడం మీదనే పంజాబ్‌ జట్టు విజయావకాశాలు ఆధారపడిఉన్నాయనడంలో అనుమానమే లేదు. మొదటి మ్యాచ్‌లోనే పవర్‌ ప్యాకెడ్‌ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రైజింగ్‌ పూణే జెయింట్‌ను ఓడించాలంటే మాత్రం పంజాబ్‌ టీమ్‌ అంచనాలకు మించి రాణించాల్సిందే.

10:52 - April 8, 2017

హైదరాబాద్ : పార్టీ పదవుల నియామకంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాలస్థాయిల్లో కమిటీల రూపురేఖలను పూర్తిగా మర్చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇక నుంచి ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాల ప్రచార బాధ్యతను కమిటీలకే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కమిటీల్లో స్థానంకోసం గులాబీ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరిగినందున పార్టీలో బలమైన నేతలను తయారు చేయాలని టీఆర్‌స్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారని గులాబీపార్టీలో చెప్పుకుంటున్నారు. పార్టీ కమిటీల నియామకాల్లో కూడా మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్.

వేగంగా కసరత్తులు..
అటు పార్టీ రాష్ట్ర కమిటీ, పోలిట్ బ్యూరో, జిల్లా కమిటీలను స్మార్ట్‌గా మార్చేందుకు గులాబీదళపతి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా జంబోస్థాయిలో కాకుండా వీలైనంత తక్కువ మందితోనే కమిటీలను పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు జిల్లాల్లో ఇంచార్జ్ లుగా ..ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఐదు లేదా ఆరుగురు సభ్యులను పరిశీలకులుగా నియమించే కూడా చాన్స్ కనిపిస్తోంది. పార్టీ ప్లీనరీ నాటికి మొత్తం కమిటీల నియామకం పూర్తిచేసేందుకు టీఆర్‌ఎస్‌ బాస్‌ వేగంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

20 మంది సభ్యులతో కమిటీ..
ఇక నియోజకవర్గ స్థాయిలో 20 మంది సభ్యులతో ఓ సమన్వయ కమిటీని నియమించి.. పూర్తి అధికారాలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాలని గులాబీ పార్టీ అధినేత భావిస్తున్నారట. ఈ సమన్వయ కమిటీల్లో జడ్పీటీలు, ఎంపీపీలతోపాటు సీనియర్ నేతలకూ సభ్యులుగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను జిల్లాస్థాయి కమిటీ సభ్యులే పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగిస్తారన్నచర్చ జోరుగా సాగుతోంది. దీంతో కమిటీల్లో స్థానం కోసం గులాబీ నేతలు ఎవరిస్థాయిలో వారు అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

దేశ రాజధానిలో మరో విదేశీయుడిపై దాడి

ఢిల్లీ : మొన్న కెన్యా దేశీయుడిపై దాడి ఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి విదేశీయుడిపై దాడి జరింగింది. 19ఏళ్ల జర్మనీ విద్యార్థిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గీతాకాలనీలో చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థి పేరును బెంజిమన్ స్కాట్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

 

 

10:49 - April 8, 2017

విజయవాడ : నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఖర్చు చేసే బాధ్యత ఎవరిది..? ఈ ఫండ్స్‌తో చేయాల్సిన పనులను ఎవరు ఖరారు చేస్తారు..? ఈ ప్రశ్నలకు ఏడో తరగతి విద్యార్థిని అడిగినా.. ఎమ్మెల్యే అన్న సమాధానమే వస్తుంది. అయితే, ఘనత వహించిన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం.. ఆ బాధ్యతను తమ పార్టీ నేతలకు కట్టబెట్టేసింది. దీనికోసం ఏకంగా ఓ జీవోనే జారీ చేసింది. రాజకీయవర్గాల్లో ఈ జీవో కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే బాధ్యతను, ప్రజా ప్రతినిధుల నుంచి ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేల నుంచి లాగేసుకుంటోంది. పసుపు కండువా కప్పుకున్న వారికే నియోజకవర్గ నిధుల వినియోగపు అధికారాన్ని కట్టబెడుతోంది. విపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో.. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసే బాధ్యతను తెలుగుదేశం నాయకులకే కట్టబెడుతూ.. జీవో ఆర్టీ నంబర్‌:236 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. విపక్ష ఎమ్మెల్యేలున్న మొత్తం 31 నియోజకవర్గాల్లోనూ వర్తించేలా, మార్చి 31న, గుట్టుచప్పుడు కాకుండా ఈ జీవోను జారీ చేసింది.

రెడీ అవుతున్న వైసీపీ..
ప్రణాళిక విభాగపు, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి సంజయ్‌గుప్తా పేరిట 236 జీవో జారీ అయింది. దీని ప్రకారం, విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో.. రెండేసి కోట్ల రూపాయల చొప్పున నిధులను, ఇకపై తెలుగుదేశం నాయకులే ఖర్చు పెట్టొచ్చన్నమాట. అంటే విపక్ష ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేస్తూ.. రాజ్యాంగ విరుద్ధంగా, ప్రభుత్వం పార్టీ నేతలకే నిధులను అప్పగించిందన్నమాట. దీనిపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 236 జీవోకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు విపక్ష వైసీపీ సమాయత్తమవుతోంది.

10:46 - April 8, 2017

విజయవాడ : 2019లో జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారా? విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారా? 2019 ఎన్నికల కోసం చంద్రబాబు సిద్దం చేసుకుంటోన్న మాస్టర్‌ ప్లాన్‌ ఏంటి? కొత్త మంత్రులకు చంద్రబాబు ఇస్తున్న డైరెక్షన్‌ ఏమిటి? 2019 టార్గెట్‌గా చంద్రబాబు చేస్తోన్న కసరత్తుపై 10టీవీ ప్రత్యేక కథనం...2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ ఇప్పడి నుంచే సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు రెండేళ్ల ముందునుంచే పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. విజయమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు పాలిటిక్స్‌, అటు పాలనాపరమైన కార్యక్రమాలను యాక్టివేట్‌ చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో సమూల మార్పులకు శ్రీకారంచుట్టి తన మార్కు ఎలక్షన్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత జరిగిన మొదటి కేబినెట్‌ సమావేశంలోనే చంద్రబాబు తన మాస్టర్‌ ప్లాన్‌ను మంత్రుల ముందుంచినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలకు ఆయన నిర్దేశించినట్టు సమాచారం.

హెచ్చరికలు..
ఎన్నికలకు రెండేళ్ల సమయమే ఉందని... సరైన ప్రణాళికతో ముందుకెళ్తూ ప్రజల మన్నలను పొందాలని సూచించారు. తమకు కేటాయించిన శాఖలపై పట్టుసాధించి... ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తానని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోని వారిపై అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని సునిశితంగా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో తమ శాఖలపై పట్టుసాధించేందుకు మంత్రులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు తమశాఖల పనుల్లో బిజీ అయిపోయారు. ఇక శుక్రవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌.... ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. 2019 ఎన్నికలే టార్గెట్‌గా చంద్రబాబు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ను అమలు చేసేందుకు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కృషిపై సత్ఫలితాలను ఇస్తుందా... పార్టీకి , ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తుందా, మంత్రుల్లో ఎవరు అధినేతనంచి మన్ననలు ఎవరికో.. చీవాట్లు ఎవరికోనని.. కొత్తపాత మంత్రులు తమ పనుల్లో అతిజాగ్రత్త పడుతున్నట్టు టీడీపీలో చెప్పుకుంటున్నారు.

10:27 - April 8, 2017

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని మూసాపేట ఓ ప్రాంతంలో డీసీఎం బీభథ్సం సృష్టించింది. పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మూసాపేట ఐడీయల్ రోడ్డుపై ప్రతి రోజు పలువురు మార్నింగ్ వాక్ చేస్తుంటారు. శనివారం ఉదయం పలువురు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ డీసీఎం అదుపు తప్పింది. నడుస్తున్న వారిపైకి దూసుకొచ్చింది. ఓ మహిళ అక్కడికక్కడనే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

10:22 - April 8, 2017

భారత్ లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన

ఢిల్లీ : భారత్ లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటన ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు.

 

10:17 - April 8, 2017
10:14 - April 8, 2017

కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు అనంతరం తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లు దొరకకపోవడం..చిల్లర దొరక్కపోవడం..ఏటీంఎలు ఖాళీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు అనంతరం ఇప్పటికీ కూడా పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్మాణ రంగ స్థితిగతులు ఎలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చా ? ఇలా అనేక సందేహాలు పలువురిలో వ్యక్తమౌతున్నాయి. మరి కొనుగోలు చేయవచ్చా ? ఇతరత్రా అంశాలకు వీడియో క్లిక్ చేయండి.

10:06 - April 8, 2017

పాకిస్తాన్ లో తన సినిమా విడుదల చేయవద్దని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. ఆయన నటించిన 'దంగల్' చిత్రం ఏ మేర విజయం సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం భారీగా కలెక్షన్లు సైతం రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనా పాక్ లో మాత్రం విడుదల కాలేదు. 2016 జమ్మూ కాశ్మీర్ లోని ఉరి దాడుల అనంతరం పాక్ లో భారత సినిమాలను ప్రదర్శించడం లేదనే సంగతి తెలిసిందే. అనంతరం గొడవలు సద్దుమణిగిన అనంతరం సినిమాలప నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో 'దంగల్' సినిమాను పాక్ లో విడుదల చేయాలని పాక్ లో ఉన్న లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కోరారు. దీనికి 'అమీర్' ఒప్పుకున్నారు. కానీ 'దంగల్' సినిమాలోని ఓ సన్నివేశంలో భారత జాతీయ జెండా...జాతీయగీతం ఉండడంతో ఈ సన్నివేశాలని తొలగించాలని పాక్ సెన్సార్ బోర్డు ఆదేశించడం పట్ల 'అమీర్' తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీడకు సంబంధించిన అంశమని..భారత్..పాక్ కు ఎలాంటి సంబంధం లేదని..అలాంటప్పుడు జాతీయ గీతం సన్నివేశాలను తొలగించాల్సినవసరం ఏంటీ ? అని అమీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పాక్ లో సినిమాను విడుదల చేయడానికి అమీర్..చిత్ర యూనిట్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

సినీ నటుడు కమల్ హసన్ ఇంట్లో అగ్నిప్రమాదం

చెన్నై : తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు కమల్ హసన్ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగినట్టు కమల్ హసన్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో కొన్ని పుస్తకాలు దగ్ధమైనట్లు, ఎవరికి గాయాలు కాలేదని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

09:53 - April 8, 2017

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని కమల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణాపయం లేదని ట్వీట్ చేశారు. తనను రక్షించిన సిబ్బందికి కృతజ్ఞలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఆల్వార్ పేటలో ఆయన నివాసమున్న సంగతి తెలిసిందే. ప్రమాదానికి ఫ్రిజ్ లో షార్ట్ సర్కూట్ కారణమని తెలుస్తోందని, దీనివల్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో మూడో అంతస్తు నుండి దిగొస్తున్నట్లు, తన లంగ్స్ లోకి చాలా పొగ వెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కొన్ని పుస్తకాలు కూడా దగ్ధమైనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

09:49 - April 8, 2017

నగరంలోని రిలయన్స్ ఫ్రెష్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సైదాబాద్ వినయ్ నగర్ లో రిలయన్స్ ఫ్రెష్ లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.

కూకట్ పల్లిలో టిప్పర్ బీవత్సం

హైదరాబాద్ : కూకట్ పల్లిలో టిప్పర్ బీవత్సం సృష్టించింది. వాకింగ్ చేస్తున్న వారిపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి.

09:12 - April 8, 2017

విజయవాడ : కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలకు తాళాలు పడ్డాయా ? ట్రావెల్స్ మూతపడిందా ? నష్టాల్లో నడుస్తుండడంతో కేశినేని ట్రావెల్స్ ను అమ్మకానికి పెడుతున్నారా ? అనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యంతో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు దురుసుగా ప్రవర్తించడం తెలిసిందే. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లడం..ఆయన సీరియస్ అయ్యారు. దీనితో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ట్రాన్స్ పోర్టు కమిషనర్ కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. చివరకు కేశినేని ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు..మూసివేయడానికి గల కారణాలు మీడియాకు చెప్పేందుకు ఎంపీ కేశినేని నాని సిద్ధమయ్యారు. ఈ విషయం సీఎం కార్యాలయానికి తెలవడంతో ఎంపీని సీఎం క్యాంపు ఆఫీసుకు రావాలని పిలుపువచ్చింది. దీనితో చివరి నిమిషంలో మీడియా సమావేశాన్ని కేశినేని రద్దు చేశారు. ట్రావెల్స్ మూసివేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, తద్వార కొన్ని సమస్యలు ఏర్పడుతాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది.
ఆర్టీఐ అధికారి దాడిపై ఎంపీ కేశినేని నాని పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేగాకుండా ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు మితిమీరడం..ప్రమాదాలు జరుగుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని ట్రావెల్స్ నష్టాల్లో నడుస్తోందని దీనితో ట్రావెల్స్ ను విక్రయించాలని కేశినేని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేశినేనితో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ట్రావెల్స్ కార్యాలయాలు మాత్రం మూతపడ్డాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సిబ్బందికి యాజమాన్యం సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

మూతపడిన కేశినేని ట్రావెల్స్..

విజయవాడ : కేశినేని ట్రావెల్స్ మూత పడింది. దేశ వ్యాప్తంగా ట్రావెల్స్ సర్వీసులు నిలిచిపోయాయి. కొద్ది రోజులుగా వివిధ రాష్ట్రాల్లోని కార్యాలయాలను మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కొంతకాలంగా ట్రావెల్స్ నడుస్తోందని దీనితో ట్రావెల్స్ విక్రయించాలని కేశినేని యోచిస్తున్నట్లు సమాచారం.

జనాలపైకి దూసుకెళ్లిన డీసీఎం..

హైదరాబాద్ : మూసాపేట ఐడీఎల్ వద్ద ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి మార్నింగ్ వాక్ వెళుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది.

08:27 - April 8, 2017

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో నేడు ఆటోలు తిరగడం లేదు. వీరంతా అర్ధరాత్రి నుండి ఒక్క రోజు సమ్మె చేపట్టారు. బంద్ తో సుమారు లక్షా నాలుగు వేల ఆటోలు నిలిచిపోయాయి. ఏఐటీయూసీ, ఐఎఫ్ టీయూ, సీఐటీయూ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగుతోంది. దీనితో పలువురు ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం భద్రతా ప్రీమియాన్ని ఆటోవాలాలు వ్యతిరేకిస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా ఓలా, ఉబర్ క్యాబ్ లు రావడంతో తమకు కష్టాలు ఎదురవుతున్నాయని, వెంటనే వీటిని రద్దు చేయాలని కోరుతున్నారు. ఆటోలు బంద్ కావడంతో ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సుమారు 500 అదనపు బస్సులను తిప్పనుంది.

08:23 - April 8, 2017

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరొక కీలక అంశం బీజేపీ నేత త‌రుణ్‌ విజ‌య్‌ చేసిన జాతి వివ‌క్ష వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలో ఆఫ్రికా విద్యార్థుల‌పై జ‌రిగిన విద్వేషపూరిత దాడికి సంబంధించి ఓ టీవీ చానెల్‌ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ద‌క్షిణ భార‌తీయుల ప‌ట్ల చులకన భావంతో మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో వార్త హల్ చల్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కేటీఆర్ ను నియమిస్తారని..ఇప్పటికే పక్కా ప్రణాళికలు..వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), శ్రీనివాస్ యాదవ్ (టి.కాంగ్రెస్), వీరేష్ (టీఆర్ఎస్), కుమార్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:16 - April 8, 2017
08:10 - April 8, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ తరలించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్‌ పోరుకు సిద్ధమవుతోంది. ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. తమ ఆందోళనతో ప్రభుత్వం దిగిరాకపోతే హోంమంత్రి ఇంటి ముట్టడికి సిద్ధమంటోంది కాంగ్రెస్‌ పార్టీ. ధర్నా చౌక్‌ను సిటీ శివారుకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ధర్నాచౌక్‌ తరలింపును పొలిటికల్‌గా తమకు అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఇప్పుడు దీనిపై ప్రత్యక్ష పోరు కోసం గాంధీభవన్‌లో గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు సమావేశం అయ్యారు. ధర్నాచౌక్‌పై పోరాటానికి దిగాలని ఈ సమావేశంలో పార్టీ నేతలకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సూచించారు.

17న ధర్నా..
ఈనెల 17న ట్యాంక్‌బండ్‌ దగ్గరి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించనున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. హోంమంత్రి ఇంటిని, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు. ధర్నాచౌక్‌ పోరాటంలో కలిసొచ్చే వారందరితో ఆందోళన నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్‌ ఉంది. వామపక్షాలతో పాటు టీజేఏసీ, ప్రజా సంఘాలకు మద్దతు పలకాలని నిర్ణయించింది.

08:05 - April 8, 2017
08:02 - April 8, 2017

హైదరాబాద్ : మిషన్ కాకతీయ మూడోదశ పనులను వేగవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇందుకు రాష్ట్రంలోని శాసన సభ్యులందరిని భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. చెరువుల పునరుద్దరణ అవశ్యకత, పథకం విధివిధానాలపై పూర్తి నివేదికను లేఖలో పొందుపరిచారు. రాష్ట్రంలోని 46500 చెరువులను పునరుద్దరించడానికి చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో చిన్న నీటివనరుల కోసం కేటాయించిన 265 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకొని సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి అనేక వర్గాల ప్రజలు విరాళాల రూపంలో మిషన్ కాకతీయకు సంఘీభావం ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇచ్చారని , ఇప్పటిదాకా మిషన్ కాకతీయ ట్రస్టుకు ప్రజల నుంచి 17.09 కోట్లు విరాళాలుగా అందాయని.. హెటిరో,క్రెడయ్, అరబిందో ఫార్మా వంటి సంస్థలు 30 చెరువులను దత్తత తీసుకొని పునరుద్దరణకు పూనుకున్నాయని హరీష్‌రావు వివరించారు. ఇప్పటిదాకా రెండు దశల్లో 11400 చెరువుల పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మిగతా 6600 చెరువుల పనులు మే 31నాటికి పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించినట్లు లేఖలో పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు జాతీయ, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 3,4 తేదిల్లో మిషన్ కాకతీయ పనులను పరిశీలించారన్నారు. చెరువుల పునరుద్దరణ వల్ల అదనంగా 5లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని, భూగర్భ జలమట్టం సరాసరి పదిమీటర్లు పెరిగిందని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ మూడో విడత పనులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను మొదలుపెట్టాలని కోరారు.

07:57 - April 8, 2017

విశాఖపట్టణం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖజిల్లాలో పర్యటించనున్నారు. నౌకాదళస్థావరాన్ని సందర్శిస్తారు. అనంతరం సింహాచలం వెళతారు. వివిధ కార్యక్రమాల్లో బిజిబిజీగా గడపపున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం పదిన్నరకు విశాఖకు చేరుకుని.. నేరుగా నౌకాదళస్థావరం అయిన ఐఎన్‌ఎస్‌డేగాకు వెళతారు. అక్కడ గంటపాటు ఉంటారు. బీచ్‌లో మ్యూజియంగా ఏర్పాటుచేయనున్న పురాతన యుద్ధవిమానం టీయూ -142ను నౌకాదళ అధికారుల నుంచి అందుకుంటారు. అనంతరం ఇటీవల ఏఎన్‌ -32 విమాన ప్రమాదంలో మృతిచెందిన ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు పంపిణీ చేస్తారు.

సుడిగాలి పర్యటన..
మధ్యాహ్నం 12గంటలకు సింహాచలం చేరుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్కడ గోశాల వద్ద 5కోట్ల 75లక్షలతో దేవస్థానం అభివృద్ధి చేసిన సౌరవిద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. దాంతోపాటు 3కోట్ల 20లక్షల రూపాయలతో నిర్మించిన ఘాట్‌ రోడ్‌ను ప్రారంభించి..అప్పన్నస్వామిని దర్శించుకుంటారు. అనంతరం కొత్తగా నిర్మించనున్న ఘాట్‌రోడ్డు, కల్యాణమండపం తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి. తర్వాత మధ్యాహ్నం 1.15 నిముషాలకు విశాఖకు తిరిగి వెళ్లతారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా విశాఖ జిల్లా యంత్రాంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.

07:54 - April 8, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో జాతీయ పార్టీల నాయకులను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సహా ములాయం సింగ్, శరద్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌ రెడ్డి, సీతారాం ఏచూరి తదితరులను జగన్‌ కలిశారు. వైఎస్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చిన అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జేడీయూ అధినేత శరద్‌ యాదవ్‌ను కలిసి..ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్‌.. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురికి, చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామికన్నారు. ఇలాంటి అనైతిక చర్యను అడ్డుకోవాలని నేతలను కోరినట్లు తెలిపారు. ఆయన తమ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారన్నారు.

జైట్లీ..వామపక్ష నేతలతో భేటీ..
కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతోనూ జగన్‌ భేటీ అయ్యారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారన్నారు. అనర్హత పిటిషన్లను పెండింగ్‌లో ఉంచారన్నారు. అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల ఆవేదనను జైట్లీకి వివరించినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పునరాలోచించాలని జైట్లీని కోరినట్లు తెలిపారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసిన జగన్‌ బృందం.. ఏపీలో ప్రస్తుత పరిస్థితులతో పాటు, పాలకపక్షం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వైనాన్నీ వివరించారు. పార్టీ ఫిరాయింపులపై పటిష్ట చట్టం తేవాలని పోరాడుతున్న జగన్..జాతీయ పార్టీల నేతలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు.

07:51 - April 8, 2017

హైదరాబాద్ : నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ రైతాంగానికి అత్యంత అవసరమని, అందుకే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామన్నారు. ప్రాజెక్టులకు అటవీ అనుమతుల కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడతానన్నారు సీఎం కేసీఆర్‌. ప్రగతిభవన్‌లో నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులన్నీ శరవేగంతో పూర్తి చేయాలని.. నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో.. వర్కింగ్‌ ఏజెన్సీలు కూడా తమ పనితీరును నిరూపించుకోవాలన్నారు కేసీఆర్‌.

2018 నాటికి..
గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉందన్నారు కేసీఆర్‌. అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి వెంట ప్రాజెక్టులు కడతామని.. కృష్ణాజలాలను వ్యూహాత్మకంగా, వాస్తవిక ధోరణిలో ఆలోచించి వాడుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా జూరాల నుంచి నీటి వాడకం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. శ్రీశైలంతోపాటు ఇతర అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. బ్యారేజీ నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు పూర్తిచేయాలని.. 2018 మార్చి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని సూచించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు, మిడ్‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీరు అందించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఛానళ్లలో ఇసుక పేరుకుపోకుండా చూడాలన్నారు.
ఇక చైనాలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను గొప్పగా నిర్మించి.. నిర్వహిస్తున్నారన్నారు కేసీఆర్‌. వాటిని ఇరిగేషన్‌ శాఖ అధికారులు, ఇంజనీర్ల బృందం పరిశీలించి.. ఆ పద్ధతులను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షా సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డితో పలువురు అధికారులు పాల్గొన్నారు.

07:47 - April 8, 2017

విజయవాడ : కొందరు వైద్యులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని... అరకొర వైద్యంతో మోసాలకు పాల్పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తోందన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను చంద్రబాబు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే క్రమంలో మరో ముందడుగు వేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 54 పట్టణాల్లో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించనున్నారు.

అన్ని జిల్లాలో..
వెలగపూడి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ప్రారంభారు. పీపీపీ విధానము ద్వారా ఈ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. 365 రోజుల పాటు ఉచితంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ సరిగా పనిచేయలేట్లదని వీటి స్థానంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఈ-ఔషధి ద్వారా ఉచితంగా మందులు సరఫరా చేస్తామన్నారు. డాక్టర్లు రోగులకు ఇచ్చే మందులపైనా కూడా ఇక నుండి సమీక్ష చేసి పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 222 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పని తీరు ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని.. త్వరలో చిన్నారుల కోసం బాలసురక్షా కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవకు 5,700 కోట్లు ఖర్చు చేశామని..త్వరలోనే మహాప్రస్థానం పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కిడ్నీ బాధితుల కోసం అన్ని జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పుతామన్నారు. ఉద్దానం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సమస్య పరిష్కారానికి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

07:44 - April 8, 2017

హైదరాబాద్ : నగరంలోని బేగంపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌ కలకలం రేపింది. లాఠీ దెబ్బలకు తాళలేక రాము అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అర్ధరాత్రి పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు.
కారు డ్రైవర్‌గా పనిచేసే రాము... కొన్నాళ్లుగా మరదలి వరుసైన బాలికను పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నాడు. రాముకు పెళ్లై భార్య, కొడుకు ఉన్నారని .. పద్దతి మార్చుకోవాలని పెద్దలు మందలించారు. అయినా రాము మొండికేయడంతో బాలిక తల్లిదండ్రులు, రాము భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాముని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. లాఠీలతో చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా వినిపించుకోని ఖాకీలు లాఠీలు విరిగేదాకా బాదారని రాము కుటుంబసభ్యులు అంటున్నారు. దీంతో స్ఫృహతప్పిన రామును ఆస్పత్రి తరలించగా అక్కడ చనిపోయాడు. అయితే పోలీసులు మాత్రం తాము కొట్టలేదని.. కౌన్సిలింగ్‌ ఇస్తుండగా నీరసించాడని అందుకే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగానే చనిపోయడని అంటున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన రాము భార్య లావణ్య బంధువులతో కలిసి అర్థరాత్రి పీఎస్‌ ముందు ఆందోళనకు దిగింది. బుద్ధి చెప్పాలని కంప్లైంట్‌ ఇస్తే.. చంపేశారని బోరున విలపిస్తోంది.

 

రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షాభియాన్ నిధులు - అమలుపై సదస్సు

విశాఖపట్టణం : నేడు గ్రీన్ పార్క్ హోటల్ లో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షాభియాన్ నిధులు - అమలుపై సదస్సు జరగనుంది. ఈ సదస్సును మంత్రి గంటా ప్రారంభించనున్నారు. రూసా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ పాండాదాస్, వీసీలు పాల్గొననున్నారు.

నేడు వామపక్షాలు..ప్రజా సంఘాల సదస్సు..

హైదరాబాద్ : నేడు ధర్నా చౌక్ పరిరక్షణపై వామపక్షాలు, ప్రజా సంఘాలు సదస్సు జరగనుంది. ధర్నా చౌక్ ను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పలు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ధర్నా చౌక్ పరిరక్షణ పేరిట కమిటీ ఏర్పాటైంది.

విశాఖలో నేడు సీఎం బాబు పర్యటన..

విశాఖపట్టణం : నేడు విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఐఎన్ఎస్ డేగా వద్ద నౌకాదళ సేవల నుండి ఉపసంహరించిన యుద్ధ విమాన స్వీకరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. గల్లంతైన ఏఎన్ -32 విమాన బాధిత కుటుంబాలకు పరిహార చెక్కులను బాబు పంపిణీ చేయనున్నారు. సింహాచలం ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో బాబు పాల్గొంటారు.

బేగంపేటలో వ్యక్తి లాకప్ డెత్..

హైదరాబాద్ : బేగంపేట పీఎస్ లో వ్యక్తి లాకప్ డెత్ కు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. పీఎస్ ఎదుట మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

Don't Miss