Activities calendar

09 April 2017

కుటుంబం ఆత్మహత్యాయత్నం..బాలుడు మృతి

తూర్పుగోదావరి : కొత్తపేట మండలం పలివెల వద్ద కాలువలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాలుడు మృతి చెందాడు. స్థానికులు ఇద్దరిని రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

22:20 - April 9, 2017

గుంటూరు : పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. చట్టంలోని లొసుగులను సవరించి...  సమగ్ర చట్టం తీసుకురావాలని కోరారు.  పార్టీ ఫిరాయింపును జగన్‌ ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని  ఆయన మండిపడ్డారు. 

 

22:14 - April 9, 2017

నటి అస్మితతో టెన్ టివి స్పెషల్ చిచ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడింది. ఆస్మిత పలు అసక్తరమైన విషయాలు తెలిపింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:09 - April 9, 2017

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు.  అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా  భూములను లాక్కొంటోందని ఆరోపించారు.  శ్రీకాకుళం జిల్లాలో దళితుల సాగులో ఉన్న 173 ఎకరాలను  పతంజలి సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మాకినేని బసవపున్నయ్య 25 వర్దంతి సందర్భంగా విజయవాడలో సమకాలీన భారతదేశంలో ప్రభుత్వ భూ కబ్జాలు అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మధు.. బసవపున్నయ్య ఆశయాలను , సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు జిల్లాల్లో బసవపున్నయ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇదే కార్యక్రమంలో  జేఎన్‌యూ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌ ఝా పాల్గొని స్మారకోపన్యాసం చేశారు. ప్రజల అనుమతితోనే ప్రభుత్వం భూములు తీసుకోవాలన్నారు. 

 

22:06 - April 9, 2017

ఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలను పరిష్కరించే ఇంటర్ స్టేట్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పూంచీ కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొన్న పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రాల శాసన అధికారాలు రాజ్యాంగంలో ఎలా ఉన్నాయో.. అలాగే ఉంచాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. ఈ సమావేశానికి త్రిపుర, ఒడిషా ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. 

 

22:02 - April 9, 2017

కడప : జిల్లాలోని రాయచోటిలో లారీ-స్కూటర్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ఢీకొన్న వెంటనే స్కూటర్‌కు మంటలంటున్నాయి. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. 

 

21:59 - April 9, 2017

భద్రాద్రి : కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. భీమునిగుండం కొత్తూరు ప్రధాన రహదారిపై మణుగూరు వైపు వెళ్తున్న లారీ భద్రాచలం వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరిని మణుగూరుకు చెందిన కిరణ్‌, కొలిపాక దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరూ పాల్వంచలోని పెద్దమ్మతల్లి గుడికి ఆటోలో వెళ్తున్నారు. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

21:57 - April 9, 2017

ఖమ్మం : జిల్లాలో దారుణం జరిగింది. కన్నకొడుకే కాలయముడయ్యాడు. ఆస్తితగాదాలతో కన్నతండ్రినే చంపాడో కసాయి.  కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన రాయల వెంకటేశ్వర్లకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. రెండో కొడుకైన రాయల లక్ష్మణ్‌ తండ్రికి ఉన్న రెండెకరాల భూమిని తనపేరు మీద రాయాలంటూ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి వెంకటేశ్వర్లు అంగీకరించకపోవడంతో తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఇవాళ బయటకు వెళ్లిన తండ్రిపై... లక్ష్మణ్‌రావు గొడ్డలితో దాడి చేశాడు.  వెంకటేశ్వర్లు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి మరీ చంపాడు.  ఆ తర్వాత కిరోసిన్‌ పోసి  శవాన్ని తగులబెట్టాడు.  రెండో భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

21:52 - April 9, 2017

సౌదీ అరేబియా : సరిహద్దులోని నజ్రాన్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఓ తెలుగు వాడు చనిపోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరుకు చెందిన అరవ వెంకటసుబ్బారెడ్డి, ఓబులేసు 8 నెలల క్రితం సౌదీకి వెళ్లారు.  కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి యెమెన్‌ దేశస్తులు నజ్రాన్‌లో బాంబులు విసిరారు.  ఈ ఘటనలో వెంకటసుబ్బారెడ్డి చనిపోగా... ఓబసులేసు గాయపడ్డాడు.   వెంకటసుబ్బారెడ్డి మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పులు తీర్చడానికి తన భర్త సౌదీ వెళ్లాడని.... బాంబు దాడిలో చనిపోయినట్టు ఫోన్‌ వచ్చిందని మృతుని భార్య ఈశ్వరమ్మ కన్నీరుమున్నీరయ్యింది.  సౌదీ నుంచి తన భర్త మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.  తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 

21:49 - April 9, 2017

గుంటూరు : రాజధాని నిర్మాణం పేరుతో  అవసరానికి మించి వేలాది ఎకరాలు సేకరించారని కాంగ్రెస్‌పార్టీ ఏపీ ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా  రైతుల భూములు దోపిడీకి గురైయ్యాయని ఆయన ఆరోపించారు. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు. 14ఏళ్ల క్రితం ఇదేరోజున మహాప్రస్థానం పాదయత్రతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

21:48 - April 9, 2017
21:46 - April 9, 2017

హైదరాబాద్ : బసవతారకం కేన్సర్‌ ఆస్పిటల్‌ ట్రస్ట్‌ ద్వారా లక్షలాది మంది పేదలకు వైద్యసహాయం అందుతోందని ట్రస్ట్‌ చైర్మన్‌  బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రిలో కొత్తగా డార్మెటరీ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. భవిష్యత్తులో ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. సంపాదనలో కొంత సర్వీసు కోసం ఖర్చుపెట్టాలని దాతలకు పిలుపు నిచ్చారు బాబు. 

 

21:42 - April 9, 2017

రాయ్ పూర్ : చత్తీస్‌గఢ్‌ రాయపూర్‌ రైల్వేస్టేషన్‌లో  గుర్తితెలియని వ్యక్తులు   బైకులకు నిప్పుపెట్టారు. పార్కింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాలుకు నిప్పు పెట్టడంతో బైక్‌లన్నీ మంటల్లో కాలిపోయాయి. సుమారు వంద బైక్‌లు కాలిబూడిదైనట్టు తెలుస్తోంది. 

 

21:40 - April 9, 2017

తమిళనాడు : చెన్నై మౌంట్‌ రోడ్డులో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడటంతో.. వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అకస్మాత్తుగా ఏర్పడ్డ గోతిలోకి ఓ బస్సు, కారు కూరుకుపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. వెంటనే
ట్రాఫిక్‌ మళ్లించి... సహాయక చర్యలు చేపట్టారు.

21:38 - April 9, 2017

అనంతపురం : జిల్లాలోని గుత్తిలో మరో కీచకపర్వం వెలుగుచూసింది. ఏడో తరగతి విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్‌ చేసి బెంగళూరు తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌ చేశారు. 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి..అర్ధరాత్రి బాలికను ఇంటిదగ్గర వదిలివెళ్లారు.  
సురేష్‌, రవితేజ, అశోక్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. గుత్తి పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

21:37 - April 9, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లిజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నేరుడుపల్లికి చెందిన  ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిర్చికి మద్దతు ధర లేకపోవడంతో.. అప్పలు తీరే మార్గంలేక ప్రాణం తీసుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. గిట్టుబాటు ధర లకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షనేతలు ధర్నాకు దిగారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పదిలక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు.  

 

21:35 - April 9, 2017

కృష్ణా : గుడివాడ మున్సిపాల్టీ 19వ వార్డు ఉపఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ కలకలం రేపింది. టీడీపీ, వైసీపీ జోరుగా డబ్బులు పంచారని తెలుస్తోంది. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడ డీఎస్పీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వర్‌ రావు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

21:34 - April 9, 2017

ఢిల్లీ : అమెరికా ఉత్తరకొరియా మధ్య వైరం మరింత ముదురుతోంది. అమెరికాకు చెందిన నావికాదళ బృదం ఉత్తరకొరియా ద్వీపం సమీపంలోకి వెళ్లింది. దికార్ల్‌ విన్సాన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌గా పిలిచే బృందం యుద్దనౌకలు, విమాన వాహకనౌకతో సహా ఆ ప్రాంతానికి వెళ్లాయి. అమెరికాలోని పసిఫిక్‌ కమాండ్‌ ఆదేశాల మేరకు అవి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ఉత్తర కొరియాతో వివాదాన్ని అమెరికా ఒంటరిగానే తేల్చుకోగలదని ప్రకటించారు. ఉత్తరకొరియా చర్యలతో ఆ దేశాన్ని ఈ ప్రాంతంలో మొట్టమొదటి ముప్పుగా అమెరికా భావిస్తోంది. ఇటీవల కొనసాగిస్తున్న ఆణ్వాయిధ , క్షిపణి కార్యక్రమాలు అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బుధవారం ఉత్తరకొరియా జపాన్‌ జలాల్లోకి క్షిపణులను ప్రయోగించడం పరిస్థితిని మరింత జఠిలం చేసింది.

 

21:32 - April 9, 2017

ఢిల్లీ : భారత్‌, చైనా ఏకమయ్యాయి. అరేబియా సముద్రంలో దొంగల బారి నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు భారత్‌-చైనా నావికాదళాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. మలేషియాలోని కెలాంగ్‌కు పోర్ట్‌ఆఫ్‌ అడెన్‌కు మధ్య ప్రయాణిస్తున్న ఒక భారీ వాణిజ్య నౌకపై సముద్ర దొంగలు దాడిచేశారు. దీనిని రక్షించేందుకు ఐఎన్‌ఎస్‌ ముంబయి, ఐఎన్‌ఎస్‌ తారక్ష్ రంగంలోకి దిగాయి. ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ నౌకలు రంగంలోకి దిగాయి. ఈ మార్గాన్ని చైనా, ఇటలీ, పాకిస్థాన్‌కు చెందిన నౌకలు కూడా పరిరక్షిస్తుంటాయి. దీంతో ఈ దేశాల నౌకలు కూడా దాడిపై స్పందించాయి. కానీ భారత నావికాదళం వేగంగా స్పందించి సదరు వాణిజ్య నౌకకు ఒక హెలికాప్టర్‌ను పంపించింది. అదే సమయంలో చైనాకు చెందిన ప్రత్యేక బలగాలు నౌకలోకి ప్రవేశించి సముద్రదొంగల కోసం గాలింపు చేపట్టాయి. దీంతో సముద్రదొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా చైనా బలగాలు.. భారత బలగాలకు కృతజ్ఞతలు తెలిపాయి. 

21:28 - April 9, 2017

హైదరాబాద్ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో హెల్మెట్‌ పాఠాలు చెప్పారు. ఏప్రిల్‌ 5న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ కోసం సచిన్‌ హైదరాబాద్‌ విచ్చేశారు. ఆ సమయంలో సచిన్‌ ప్రయాణిస్తున్న కారు సిగ్నల్‌ వద్ద ఆగింది. అప్పుడు పక్క నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హెల్మెట్‌ లేకుండా వెళుతున్నారు. అది చూసిన సచిన్‌ కారు విండో తీసి హెల్మెట్‌ పెట్టుకోండి.. జీవితం చాలా విలువైనది.. ఇకముందు ఎప్పుడూ హెల్మెట్‌ లేకుండా బయటికి వెళ్లకండి.. అది చాలా డేంజర్‌ అని చెప్పారు. ఈ వీడియోను సచిన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

21:26 - April 9, 2017

రంగారెడ్డి : దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు ఇప్పుడు ప్రమాదం పడ్డాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  రిజర్వేషన్లు వద్దంటూ అగ్రకులాలు భిన్న వాదనలు తెరపైకి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. దళితులు ఎంతోకొంత అభివృద్ధి సాధించారంటే అందుకు రిజర్వేషన్లే కారణమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దళిత బహుజనుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఇందులో పాల్గొన్న తమ్మినేని..  దళితులకు, అగ్రవర్ణాలకు సమానమైన విద్యనందిస్తే ఎవరి టాలెంట్‌ ఏంటో తెలుస్తుందన్నారు.  కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుకున్న వారికి, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న వారికి పోటీ ఎలా పెడతారని ప్రశ్నించారు.  అంబేద్కర్‌ కల్పించిన రిజర్వేషన్లు రక్షించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

21:23 - April 9, 2017
21:04 - April 9, 2017

విజయవాడ : అభివృద్ధి పేరుతో దేశంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రకాష్ ఝా ఆరోపించారు. మాకినేని బసవపున్నయ్య 25వ వర్థంతి సందర్భంగా సమకాలీన భారతదేశంలో భూ కబ్జాలు అనే అంశంపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో స్మారకోపన్యాసం సభ జరిగింది. ఈ సభకు ఉపన్యాసకులుగా  ప్రొఫెసర్ ప్రకాష్ ఝావ్యవహరించారు. 

 

21:01 - April 9, 2017

నెల్లూరు : జిల్లా కేంద్రంలోని సీపీఎం నగర కమిటి కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయశాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో కాసేపు ముచ్చటించారు. సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య ఆశీస్సులు తీసుకున్నాడు.  అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అనేక ఉద్యమాలలో వామపక్షాలతో కలిసి పని చేశానని అన్నారు. 

 

20:56 - April 9, 2017
20:54 - April 9, 2017

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో కార్మికశాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. తన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తానని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పరిశ్రమల్లో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. 

 

20:52 - April 9, 2017

నల్గొండ : మంత్రి జగదీశ్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. నల్లగొండజిల్లా కట్టంగూర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌ను  ఢికొట్టిన ఇన్నోవా కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన జగదీశ్‌రెడ్డి  డ్రైవర్‌  కారును సేఫ్‌గా ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో జగదీశ్‌రెడ్డి అటెండర్‌కు తీవ్ర గాయులు కావడంతో  .. ఆయనను ఆస్పత్రికి తరలించారు. అటెంబర్‌ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు డాక్టులు తెలిపారు. 

 

చంద్రగిరి అటవీ ప్రాంతంలో కూబింగ్

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ దిగారు. ఎర్రచందన కూలీలు కంటపడడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు ఎర్రచందన కూలీలు లొంగిపోయారు. వారి నుంచి పోలీసులు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్ ఆర్ పాదయాత్రకు 14 ఏళ్లు

విజయవాడ : నేటితో వైఎస్ ఆర్ పాదయాత్రకు 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ లో దిగ్విజయ్, రఘువీరా కేక్ కట్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, పావలా వడ్డీ, ఉచిత వైద్యం పథకాలు కేంద్రం ఆదేశాలతోనే వైఎస్ ఆర్ అమలు చేశారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ, వెంకయ్య, చంద్రబాబులు ఏపీని మోసం చేశారని ఆయన ఆరోపించారు.

మంత్రి జగదీశ్ రెడ్డికి తప్పిన ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని కట్టంగూరు సమీపంలో విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ లో ఒక కారును మరో కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.అటెండర్ కు తీవ్ర గాయపడంతో ఆసుపత్రికి తరలించారు.

 

 

భూపాలపల్లిలో విషాదం

భూపాలపల్లి : జిల్లాలో విషాదం జరిగింది. మిర్చి పంటకు మద్దతు ధరలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పదిలక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

 

కడపలో రోడ్డు ప్రమాదం

కడప : జిల్లాలోని రాయచోటిలో లారీ, స్కూటర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

 

మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు

విశాఖ : జిల్లాలోని చింతపల్లి మండలం కోరుకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులకు చెందిన రెండు కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

విశాఖలో పాత నోట్ల మార్పిడి

 

విశాఖ : నగరంలో రూ.1.40 కోట్ల పాత నోట్ల పట్టుబడ్డాయి. పాతనోట్లు మారుస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఐదుగురుని అరెస్ట్ చేసి నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

 

రోడ్డులో కురుకుపోయిన ఆర్టీసీ బస్సు

తమిళనాడు : చెన్నై మౌంట్ రోడ్డులో రోడ్డు కుంగింది. కుంగిన రోడ్డులో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. అయితే బస్సులో ఎవరు లేకపోవడంతో  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

 

కొనసాగుతున్న స్టాడింగ్ కమిటీ సమావేశం

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన 11వ అంతర్ రాష్ట్ర మండలి స్టాడింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, త్రిపుర, ఒడిషా ముఖ్యమంత్రులు, ఏపీ మంత్రి యనమల హాజరైయారు.

 

కేంద్ర ప్రభుత్వం వెనుక ఆర్ఎస్ఎస్ : సురవరం

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ మద్దతుతో గోరక్షక దళాలు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. మేధావులపై దాడులు కొనసాగడం బాధకరమని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలపై దాడులు పెరిగాయని అన్నారు.

 

చంద్రబాబు దొరకని దొంగ : అంబాటి

గుంటూరు : విశాఖలో చంద్రబాబు మాట్లాడిన తీరు సిగ్గుచేటాని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారని కానీ  వ్యవస్థను మేనేజ్ చేసే సామర్ధ్యం ఉండటం వల్ల దొరకని దొంగయ్యారని చంద్రబాబు జగన్ ను విజయ్ మాల్యా పోల్చి రాక్షసానందం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పితాని

గుంటూరు : కార్మిక మంత్రిగా పితాని సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. మొదటి అంతస్తు రెండో బ్లాక్ లో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఘెర రోడ్డు ప్రమాదం

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని అజాంగఢ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

అనంతపురంలో దారుణం

అనంతపురం : జిల్లాలోని గుత్తిలో దారుణం జరిగింది. ఏడో తరగతి చదువుతోన్న విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. బాలికను కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు బాలిక తెలిపింది. కామాంధులు 3రోజులుగా బాలికను చిత్రహింసలకు గురి చేసి శనివారం అర్దరాత్రి ఇంటిదగ్గర వదిలివెళ్లారు.

 

 

12:49 - April 9, 2017

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల మేకింగ్ లో వేగం పెంచేసాడు. సినిమాకి సినిమాకి గాప్ ఇచ్చి ఫాన్స్ ని నిరుత్సహపరచడం ఇష్టం లేకో లేక నేమ్ అండ్ ఫేమ్ ఉన్నపుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని ఆలోచనో మొత్తానికి సినిమా తరువాత సినిమా చక చక చేసెయ్యడానికి ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు. 'సరైనోడు'సినిమాతో మాస్ హిట్ సాధించిన 'అల్లు అర్జున్' తన రీసెంట్ సినిమా హరీష్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'దువ్వాడ జగన్నాధం' పేరుతో రాబోతున్న ఈ సినిమాలో 'అల్లు అర్జున్' తో పాటు 'పూజ హెగ్డే' హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ దువ్వాడ జగన్నాధం సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకొని మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. అలానే ఏ సినిమా ట్రైలర్ కి రాని డిస్ లైక్స్ ఈ సినిమా ట్రైలర్ కి వచ్చాయి. అల్లు అర్జున్ డిఫరెంట్ గా ఆచారి పాత్రలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. మరి ఈ సినిమా తరువాత 'అల్లు అర్జున్' నెక్స్ట్ సినిమా ఏంటి హీరోయిన్ ఎవరు ?

కాస్ట్లీ రైటర్ వక్కంతం వంశీ..
టాలీవుడ్ లో కాస్ట్లీ రైటర్ గా పేరు తెచ్చుకుని కధలను మంచి రేట్ కి అమ్ముకునే రైటర్ 'వక్కంతం వంశి'. 'కిక్ 2’ వంటి భారీ ప్లాప్ ని 'రవితేజ' అకౌంట్ లో వేసిన ఈ రైటర్ ఇప్పుడు డైరెక్టర్ గా మారలనుకుంటున్నాడు. 'టెంపర్' సినిమా తరువాత జూనియర్ ఎన్ టి ఆర్ తో సినిమా చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చినా అవి ఏవి ఫలించలేదు. 'టెంపర్' సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో జూనియర్ ఎన్ టి ఆర్ 'జై లవకుశ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టెంపర్ సినిమా తరువాత ఆడియన్స్ వ్యూ మారింది అని తెలుసుకున్న ఎన్ టి ఆర్ కొత్తదనం కోసం వంశీని వదిలి బాబీ డైరెక్షన్ లో త్రిపాత్ర అభినయం చేస్తున్నట్టు సమాచారం.

ప్రేక్షకులు ఆదరిస్తారా ?
అల్లు అర్జున్ కి 'రేసుగుర్రం' మంచి హిట్ సినిమా. ఈ సినిమాతో 'అల్లు అర్జున్' మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ సినిమాకి కథను అందించింది వక్కంతం వంశీ. ఇప్పుడు 'అల్లు అర్జున్' 'దువ్వాడ జగన్నాధం' తరువాత వక్కంతం వంశి డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు. సోషల్ మెస్సేజ్ తో ఈ సినిమా కథను 'అల్లు అర్జున్' కి వినిపించిన వంశి, డైరెక్టర్ అవ్వబోతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో నటుడిగా చిన్న చిన్న పాత్రలు వేసుకొని, ఆ తరువాత రైటర్ గా మారి కమర్షియల్ హిట్ కొట్టి ఇప్పుడు డైరెక్టర్ గా చేంజ్ అవ్వబోతున్నారు వక్కంతం. మరి ఈ కాంబినేషన్ ను ప్రేక్షకులు ఆదరిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

బిల్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో పోగలు

ప్రకాశం : జిల్లాలోని చీరాల వద్ద పూరి నుంచి తిరుపతి వెళ్తున్న బిల్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఇంజన్ నుంచి పోగలు వెలువడ్డాయి. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. గంటకుపైగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

 

12:15 - April 9, 2017

హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే పెద్ద పొరపాటు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. సెంటిమెంట్ పేరిట టికెట్లు అమ్ముకోవచ్చని కేసీఆర్ యోచించారని విమర్శించారు. తెలంగాణ రాదని అనుకున్నాడని, ఇంకా దుకాణం నడిపించుకోవచ్చని అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఎలాంటి అనుభవం లేని కేటీఆర్..కవిత కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.

 

బసవ పున్నయ్య 25వ వర్ధంతి సభ

విజయవాడ : మాకినేని బసవ పున్నయ్య 25వ వర్ధంతి సభ విజయవాడలోని  ఎంబీ భవన్ లో జరిగింది. సభలో సమాకలిన భారతదేశంలో ప్రభుత్వ భూకబ్జాలు అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొ. ప్రవీణ్, సీపీఎం ఏపీ కార్యదర్శి హాజరైయ్యారు. నేతలు బసవ పున్నయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. మాకినేని బసవ పున్నయ్య గొప్ప వ్యక్తి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు.  ఆయన ఆశయాలు, సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు జిల్లాల్లో బసవ పున్నయ్య కేంద్రాలు ప్రారంభించామని ఆయన తెలిపారు.

11:57 - April 9, 2017

ఎవరో ఒకరు ఊరికే పలకరిస్తారు గాని.. లోపలి నిశ్శబ్దాన్ని కదిపేదెవరు? అంటూ సున్నిత భావాలను తన కవిత్వంలో పలికించిన కవయిత్రి అరుణ నారదభట్ల. ఆమె ఇటీవల 'ఇన్నాళ్ళ మౌనం తరువాత' అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. చైత్రానికి చిగురాకుకూ మధ్య తీయని సంగమమే కవిత్వం అంటున్న అరుణ కొత్త డిక్షన్ తో భావనా బలంతో కవిత్వం రాస్తున్నారు. అరుణ నారదభట్ల మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

బసవతారకంలో డార్ మెటరీ ప్రారంభించిన ఏపీ సీఎం

హైదరాబాద్ : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో డార్ మెటరీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమాంలో క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

 

11:53 - April 9, 2017

సాహిత్యం సమాజంలోని దుర న్యాయాలను, దుర్మార్గాలను ఎండగడుతుందా? ఎక్కడ అన్యాయాలు జరిగితే అక్కడ పాటై భగ్గుమంటుందా ? ప్రజాఉద్యమాలకు ఊపునిస్తుందా? అంటే కచ్చితంగా నిజమేనంటారు సృజనకారులు. కారం చేడు, చుండూరు, లక్ష్మింపేట లాంటి సంఘటనలు చూసి దళిత కవులు, పులులై గర్జించారు. పాటల తూటాలు పేల్చారు. కులరక్కసి గుండెల్లో వణుకు పుట్టించారు. ఈ నాడు పాటలేని ప్రజా ఉద్యమాలను ఊహించలేం. ఉద్యమాలు వేడెక్కాలన్నా... ప్రజలు ఉద్యమ ప్రవాహంలో కలవాలన్నా, సాంస్కృతిక కళా రూపాల పాత్ర చాలా ఉంటుంది. అందులో పాటది మరింత ప్రత్యేకమైన స్థానం. అలాంటి పాటను తన గానం చేస్తూ దళిత బహుజన ఉద్యమాలకు ఊపిరి పోసిన కళాకారుడు డప్పు ప్రకాశ్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ డప్పుతో ప్రత్యక్షమై..పాటందుకుని ప్రజలను ఉద్యమాల బాట పట్టించిన గానకళా భాస్కరుడతడు. ఆయన ఇటీవలే కన్నుమూశారు.. డప్పు ప్రకాశ్ కు నివాళిగా అక్షరం ప్రత్యేక కథనం కోసం వీడియో క్లిక్ చేయండి.

జమ్మూలో చెలరేగిన హింస

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో జరుగుతోన్న ఉప ఎన్నిక పోలింగ్ లో హింస చెలరేగింది. బడ్గాం జిల్లాలో పోలింగ్ కేంద్రంపై నిరసనకారులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. పోలీసులకు నిరసన కారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.

 

మద్యం తాగి ఫ్లైట్ నడిపిన పైలెట్

ఢిల్లీ : మద్యం తాగి వాహనం నడిపితేనే నేరం అలాంటిది ఏకంగా ఓ పైలెట్ మద్యం సేవించి విమానం నడిపాడు. దీంతో సదదు విమానయన సంస్థ అతనిపై 3 నెలలు విధుల నుంచి తప్పించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పైలెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో బడ్జెట్ ఎయిర్ లైన్స్ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. అతను శనివారం ఢిల్లీ నుంచి దుబాయి వెళ్లే విమానంలో విధులు నిర్వహింస్తున్నారు. అతనికి నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో విఫలమయ్యాడు.

 

సినీ నటుడు అర్జున్ రాంపాల్ పై కేసు

ఢిల్లీ : బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పై కేసు నమోదైయింది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో శనివారం రాత్రి రాంపాల్ డీజేయింగ్ చేస్తుండగా ఓ మీడియా ఫోటోగ్రాఫర్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆయన అతడి నుంచి కెమెరా లాక్కుని విసిరేశారు. అక్కడే డ్యాన్స్ చేస్తున్న శోభిత్ అనే యువకుడికి కెమెరా తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ శోభిత్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

 

గుడివాడలో ఉద్రిక్తత

కృష్ణా : జిల్లాలోని గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డు ఉపఎన్నిలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్దకు టీడీపీ నాయకులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి రావి వెంకటేశ్వర్ రావు గుడివాడ డీఎస్పీతో ఘర్షణకు దిగారు.

 

11:09 - April 9, 2017

అల్లు అర్జున్..టాలీవుడ్ స్టైలిష్ స్టార్. ప్రతి సినిమాకు వైవిధ్యంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇతని తాజా చిత్రం కూడా ఇదే కోవలోకి చెందుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రంలో 'అల్లు అర్జున్' హీరోగా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. బ్రాహ్మణ పాత్రలో 'బన్నీ' కనిపించనున్నాడు. వంట చేయడం..రుచికరమైన శాకాహార భోజనం చేయడంలో జగన్నాథమ్ ప్రసిద్ధి. కేవలం వంట చేయడమే కాదు..తేడా వస్తే ఉతిరి ఆరేయడమే అంటున్నాడు. తాజాగా విడుదల చేసిన ఫొటో చూస్తే కరెక్టు అనిపిస్తుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫొటోలో రౌడీలతో బ్రాహ్మణ వేషంలో ఉన్న బన్నీ ఫైటింగ్ చేస్తున్నట్లుగా ఉంది. తాజాగా విడుదల చేసిన ఈ ఫొటో బన్నీ అభిమానులను అలరిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

10:59 - April 9, 2017

బాలీవుడ్ నటుడు 'అర్జున్ రాంపాల్' ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ హీరోపై కేసు కూడా నమోదైంది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ కు 'అర్జున్ రాంపాల్' విచ్చేశాడు. ఈసందర్భంగా ఓ ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తున్నాడు. ఫొటోలు తీస్తుండడంపై 'అర్జున్ రాంపాల్' అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ అతను ఫొటోలు తీస్తుండడంతో రాంపాల్ ఆగ్రహానికి గురై చేతిలో ఉన్న కెమెరాను విసిరి కొట్టాడు. తనపై దాడికి పాల్పడి గాయపరిచాడని ఫొటోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించాడు. దీనితో పోలీసులు రాంపాల్ పై కేసు నమోదు చేశారు. అర్జున్ రాంపాల్ తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించాడు. అనంతరం సినిమాల్లో హీరోగా నటించాడు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను రూపొందించిన అర్జున్ రాంపాల్ ప్రస్తుతం టెలివిజన్ షోలతో బిజీగా ఉన్నాడు.

10:45 - April 9, 2017

తండ్రిని చంపిన తనయుడు

ఖమ్మం : జిల్లాలోని కామేపల్లి మండలం ముచ్చర్లలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రిని కొడుకు హత్య చేశాడు. తండ్రిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

రేపు కడపకు గవర్నర్, ఏపీ సీఎం

కడప : జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతోన్నాయి. రేపు కోదండరాముడికి కళ్యాణోత్సవానికి  గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.

10:17 - April 9, 2017

మెదక్ : గీతం యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు లేవని..విద్యార్థులకు సరైన సెక్యూర్టీ లేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సుహాస్ అనే విద్యార్థి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెల్ ఫోన్ దొంగించాడని తోటి విద్యార్థి కాలేజీ ప్రిన్స్ పాల్ కు సుహాస్ పై ఫిర్యాదు చేశాడు. దీనితో ప్రిన్స్ పాల్ సుహాస్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. తీవ్రమనస్థాపానికి గురైన అతడు గదిలో ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన ఈనెల 6వ తేదీన జరిగింది. ఇది గమనించిన ఇతరులు అతడిని పటన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. వివాదానికి కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని కాలేజీ యాజమాన్యం పేర్కొంటోంది. ఈ మధ్యకాలంలో డల్ గా ఉన్నాడని..చదువులో వెనుకబడడంతో మార్కులు కూడా తక్కువగా వస్తున్నాయని అతడి తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగిందని తెలిపింది. సుహాస్ తల్లిదండ్రులు..కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరైన సెక్యూర్టీ లేకపోతే ఎలా అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. యూనివర్సిటీలో అసలు మెంటెనెన్స్ లేదని, తల్లిదండ్రులకు క్షోభ పెట్టారని వాపోయారు.

కాసేపట్లో ఎంబీ స్మారక సభ..

విజయవాడ : మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10.30గంటలకు ఎంబీ స్మారక సభ జరగనుంది. ‘సమకాలిన భారతదేశంలో ప్రభుత్వ భూ కబ్జాలు' అనే అంశంపై జేఎన్ యూ ప్రొఫెసర్ ప్రవీణ్ ఝూ ఉపన్యసించనున్నారు.

గీతం యూనివర్సిటీ విద్యార్థి మృతి..

సంగారెడ్డి : మూడు రోజుల క్రితం గీతం యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి సుహాన్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

శంషాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

రంగారెడ్డి : శంషాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 15 మంది కేసులు నమోదు చేశారు. 15 వాహనాలను సీజ్ చేశారు.

 

పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో భూ ప్రకంపనాలు..

శ్రీకాకుళం : పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో ఆదివారం ఉదయం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది.

09:21 - April 9, 2017

భద్రాద్రి కొత్తగూడెం : ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళుతూ మృత్యు ఓడిలోకి చేరుకున్నారు. ఈ విషాద ఘటన అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. పాల్వంచలో ఉన్న పెద్దమ్మ గుడికి వెళ్లడానికి ఓ కుటుంబం కిరాయి ఆటో తీసుకుంది. అందులో వెళుతున్నారు. కానీ మొండికుంట గ్రామ శివారు వద్దకు చేరుకోగానే మణుగూరుకు వేగంగా వెళుతున్న ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొట్టింది. దీనితో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కృష్ణమూర్తి, పవన్, ఆదిత్యలు గా గుర్తించారు. ఇంకా ఒకరిని గుర్తించాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

09:06 - April 9, 2017

ఆహారంలో అల్లం..దాల్చినలు ఉపయోగిస్తుంటారు. ఇవి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొంతమంది వీటిని అంతగా ఉపయోగించారు. మరి అల్లం..దాల్చినలతో ఎలాంటి ఉపయోగాలున్నాయో చదవండి...
దాల్చిన చెక్కలో శక్తివంతమైన పోషకాలున్నాయి. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. దాల్చిన చెక్క పొడి చేసుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది. మామాలు టీలోనూ కొద్దిగా కలుపుకుంటే ఆరోగ్యానికి మేలు. దీనిని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాపూ..మంట..అలెర్జీతో పాటు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
అల్లం తీసుకోవడం వల్ల జలుబు..అలర్జీల వంటివి తగ్గుతాయి. హృదయానికి రక్త ప్రసరణ సక్రమంగా అందుతుంది. నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధ పడుతున్న వారు కప్పు అల్లం చారులో చెంచా తేనె వేసి తాగితే ఫలితం ఉంటుంది. జీర్ణాశయానాఇ్న శుభ్రం చేసి అరుగుదల పెంచుతుంది. శాస్వకోశ సంబంధ సమస్యలున్న వారు అల్లంచారు తీసుకుంటే మంచిది.

08:52 - April 9, 2017

ఛత్తీస్ గడ్ : తన భర్త మృతి చెందాడని స్వయంగా ఓ న్యూస్ రీడర్ వార్త చదవడం పలువురిని కదిలించివేసింది. న్యూస్ రీడర్ వృత్తి పట్ల ఆమె తన నిబద్ధత చాటుకున్నారు. తన జీవిత భాగస్వామి మృతి చెందాడని తెలిసినప్పటికీ ఆ బాధను సైతం దిగమింగుకుని తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించింది. ఆమె ధైర్యం ముందు విషాదం సైతం చిన్నబోయింది. న్యూస్ రీడర్ సుప్రీత్ కౌర్ ఓ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తోంది. ఆమెకు హర్షద్ కవాడేతో గతేడాది వివాహం జరిగింది. వీరిద్దరూ రాయ్ పూర్ లో నివాసం ఉంటున్నారు. రోజు వారి న్యూస్ బులిటెన్ లో భాగంగా ఆమె వార్తలు చదువుతున్నారు. విదార ప్రాంతంలో డస్టర్ కారు ప్రమాదానికి గురైందని అందులో ఐదుగురు ప్రయాణీకుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రిపోర్టర్ వివరాలను అందించారు. ఆ కారు తన భర్తదేనని సుప్రీత్ కు అర్థమైంది. చనిపోయిన వారిలో తన భర్త కూడా ఉన్నాడని తెలిసినా వృత్తిధర్మాన్ని గుర్తు చేసుకుని వార్త చదివారు. బాధను దిగమింగుకుని బులిటెన్ ను కంప్లీట్ చేశారు. వార్త తెలవడంతో ఆమె బయటకు వెళ్లిపోతుందని భావించినా పని పట్ల నిబద్ధతతో ఇతరులకు మాటలు రానియ్యలేదు. సుప్రీత్ కౌర్ గుండె ధైర్యానికి అంతా చలించిపోయారు.

08:21 - April 9, 2017

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 64వ జాతీయ చలన చిత్ర అవార్డులపై ఆయన ఘాటుగా స్పందించారు. అవార్డుల విజేతల జాబితాను శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జ్యూరీ సభ్యుల పక్షపాత వైఖరిని ఉందని అవార్డులు స్పష్టంగా తెలియచేస్తున్నాయని, జ్యూరీ సభ్యులపై వత్తిళ్లు ఉన్నాయన్నారు. 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈసారి తమిళ చిత్ర పరిశ్రమకు 4 అవార్డులు మాత్రమే దక్కాయి. ఉత్తమ నేపథ్యగాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌లతోపాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులను కోలీవుడ్‌ దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో మహేష్ బాబు హీరోగా మురుగదాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' లేదా 'స్పైడర్' టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

08:17 - April 9, 2017

మెగా కుటుంబం నుండి వచ్చి తనదైన శైలిలో చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న నటుడు..వరుణ్ తేజ్...తాజాగా ఆయన 'మిస్టర్' చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. వేడుకలో మెగాస్టార్ 'చిరంజీవి' హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరుణ్ తేజ్ నిరంతరం శ్రమిస్తూ ఉంటాడని, ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఆకట్టుకొనే సినిమాలు చేస్తున్నాడని కితాబిచ్చారు. తమ వెనుక అభిమానులున్నారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని కష్టంతో సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి సినిమాను మొదటి చిత్రంగా భావించి పనిచేయాలని చిరు సూచించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

అంతర్ రాష్ట్ర మండలి సంఘం భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతనలో నేడు అంతర్ రాష్ట్ర మండలి 11వ స్థాయి సంఘం భేటీ కానుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పూంచ్ కమిషన్ సిఫార్సులపై చర్చ జరగనుంది.

07:55 - April 9, 2017

హైదరాబాద్ : బ్లాక్‌ బస్టర్‌ లీగ్‌...ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 10 సీజన్‌లో సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సురేష్‌ రైనా సారధ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ జట్టుతో పోటీకి పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగనుంది.ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన హైదరాబాద్‌ టీమ్‌ సెకండ్‌ రౌండ్‌ మ్యాచ్‌లోనూ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని తహతహలాడుతోంది. ధనా ధన్‌ టీ 20 లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌లో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్‌ మ్యాచ్‌కు ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో రంగం సిద్దమైంది.

సన్ రైజర్స్ బ్యాటింగ్ బలం..
బౌలింగ్‌ పవర్‌తో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ బలంతో గుజరాత్‌ లయన్స్‌ జట్లు...తొలి రౌండ్‌ మ్యాచ్‌కు సై అంటే సై అంటున్నాయి. ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన సన్‌రైజర్స్‌ జట్టు సెకండ్‌ లీగ్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, దీపక్‌ హుడా వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది.ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల మోజెస్ హెన్రికేస్, బెన్ కటింగ్‌ వంటి హార్డ్‌హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లతో సన్‌రైజర్స్‌ టీమ్‌ భీకరంగా ఉంది. రాయల్‌ చాలెంజర్స్‌తో ముగిసిన తొలి మ్యాచ్‌లో ధావన్‌, హెన్రిక్స్‌తో పాటు సిక్లర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ ఎంతలా చెలరేగాడో అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌లో బలంగానే ఉన్నా సన్ రైజర్స్ ప్రధాన అస్త్రం బౌలింగ్ మాత్రమే. లెఫ్టామ్ పేసర్లు అశిష్‌ నెహ్రా, స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లతో హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది. ఇక ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే అఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు.

గుజరాత్ లయన్స్..
మరోవైపు తొలి లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తేలిపోయిన గుజరాత్‌ లయన్స్‌ జట్టు డైలమాలో పడింది. రెండో మ్యాచ్‌లో అయినా నెగ్గి...సీజన్‌లో బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. బ్రెండన్‌ మెకల్లమ్‌, జేసన్‌ రాయ్‌, సురేష్‌ రైనా,డ్వేన్ స్మిత్‌, ఆరోన్‌ ఫించ్‌ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో లయన్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ సన్‌రైజర్స్‌కు ధీటుగా ఉంది. కానీ కోల్‌కతాతో ముగిసిన మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన గుజరాత్‌ బౌలింగ్‌ ఎటాక్‌ బలహీనంగా ఉంది. దీంతో గుజరాత్‌ టీమ్‌....బ్యాట్స్‌మెన్‌ మీదే భారం వేసింది. హార్డ్‌ హిట్టర్లతో పవర్‌ప్యాకెడ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన లయన్స్‌ టీమ్‌ అంచనాలకు తగ్గట్టుగా చెలరేగితే హైదరాబాద్ బౌలింగ్ ఎటాక్ కు కష్టాలు తప్పవు. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ పోటీలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.ఇక ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ గుజరాత్‌ లయన్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తిరుగులేని ట్రాక్‌రికార్డ్‌ ఉంది. ఇప్పటివరకూ గుజరాత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌ జట్టే నెగ్గింది. అన్ని విభాగాల్లోనూ బెంగళూర్‌ కంటే పటిష్టంగా కనిపిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రెండో లీగ్‌ మ్యాచ్‌లోనూ హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ను హోంగ్రౌండ్‌ హైదరాబాద్‌లో ఓడించాలంటే గుజరాత్‌ లయన్స్‌ జట్టుకు పెద్ద సవాలే. మరి సీజన్‌కు అదిరిపోయె ఆరంభాన్నిచ్చిన సన్‌రైజర్స్‌ టీమ్‌ సెకండ్‌ లీగ్‌ మ్యాచ్‌లోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌చేయాల్సిందే.

నేడు ఉప్పల్ లో గుజరాత్ లయన్స్ - సన్ రైజర్స్ మ్యాచ్..

హైదరాబాద్ : ధనా ధన్‌ టీ 20 లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌లో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్‌ మ్యాచ్‌ నేడు సాయంత్రం ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనుంది.

సోమవారంతో ముగియనున్న వసంతోత్సవాలు..

చిత్తూరు : తిరుమలలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు ఈ వేడుకలు ముగియనున్నాయి. ఆదివారం  శ్రీనివాసుడు స్వర్ణ రథంపై మాడ వీధుల్లో విహరించనున్నాడు. ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. తొలిరోజు వసంత మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

 

07:50 - April 9, 2017

చిత్తూరు : తిరుమలలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలిరోజు వసంత మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈరోజు శ్రీనివాసుడు స్వర్ణ రథంపై మాడ వీధుల్లో విహరించనున్నాడు. రేపు ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు.

 

07:49 - April 9, 2017

విజయవాడ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర సదస్సు నిర్ణయించింది. విజయవాడలో APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టుల రాష్ట్ర సదస్సు జరిగింది. 13 అంశాలతో కూడిన ప్రధాన డిమాండ్లపై సదస్సులో నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సదస్సులో మాజీ పాత్రికేయులతో పాటు వర్కింగ్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.

07:44 - April 9, 2017

చెన్నై : ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎవరికి వారు గెలిచేందుకు డబ్బులు వెదజల్లుతున్నారు. దాదాపు 100 కోట్ల మేర డబ్బు పంచినట్లు లెక్కలు బయటపడ్డాయి. దీంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. పలువురు నేతల ఇళ్లపై దాడులు చేసి.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. భారీ ఎత్తున డబ్బులు పంచడంతో.. ఉప ఎన్నికపై ఈసీ దృష్టి సారించింది. ఎన్నికను వాయిదా వేయాలని ఈసీ యోచిస్తోంది. దీంతో ఉప ఎన్నిక జరుగుతుందా ? లేదా ? అనే టెన్షన్‌ అభ్యర్థులను వెంటాడుతోంది. అన్ని పార్టీలు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. అయితే.. గతంలో అన్నాడీఎంకే సాధించుకున్న ఈ సీటుకు ఇప్పుడు.. ఆ పార్టీ మూడు ముక్కలై పోటీ చేయడం విశేషం. ఈ ఉప ఎన్నికకు అన్ని పార్టీలకు చెందిన 60 మంది పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు లేకుండా పోటీలో దిగుతోంది.

12న ఉప ఎన్నిక..
ఇక ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఐటీ శాఖ మెరుపు దాడులు చేస్తోంది. ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బును పంచుతున్నారనే సమాచారంతో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దాదాపు 86 కోట్ల రూపాయలు పంచిపెట్టినట్లు ఐటీ నిర్దారించింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి టిటివి దినకరన్‌ భారీ మొత్తంలో ధనాన్ని పంచినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి విజయ్‌ భాస్కర్‌తో పాటు.. నటుడు శరత్‌కుమార్‌ నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అయితే.. ఉప ఎన్నికలో ధన ప్రవాహం భారీ ఎత్తున ఉండడంతో ఈసీ దృష్టి సారించింది. ఐటీ దాడులపై ఆరా తీస్తోంది. ఓటర్లకు భారీగా డబ్బులు పంచడంతో ఎన్నికను రద్దు చేసే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నగదు పంపిణీ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అభ్యర్థులను వెంటాడుతుంది. మరి.. సమయం దగ్గర పడుతుండడంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

07:05 - April 9, 2017

హైదరాబాద్ : బేగంపేట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన‌ క్యాబ్‌ డ్రైవర్‌ మోహ‌న్‌ కృష్ణ అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. పోలీసుల దెబ్బల‌కే చ‌నిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇది లాకప్‌ డెత్ కాద‌ని వాదిస్తున్నారు. దీంతో పోస్టుమార్టం రిపోర్టు అత్యంత కీల‌కంగా మారింది. ఇంతకీ పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్తోంది. మోహన్‌కృష్ణది లాకప్‌డెత్తా ? లేక సహజ మరణమా? హైదరాబాద్‌ బేగంపేట్ పోలీస్‌స్టేష‌న్‌లో క్యాబ్‌ డ్రైవర్‌ మోహన్‌కృష్ణ అలియాస్‌ రాము డెత్ మిస్టరీగా మారింది. కుటుంబ గొడవల పరిష్కారానికి పోలీస్ స్టేషన్‌లో కేసుపెడితే.. విచారణ పేరుతో రాముని లాఠీలతో కొట్టి చంపార‌ని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అనారోగ్యం కారణంగా రాము చనిపోయాడని,. లాఠీలతో కొట్టి చంపారనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు.

పీఎస్ లో ఫిర్యాదు..
క్యాబ్‌ డ్రైవర్‌ మోహన్‌కృష్ణ ఓ కేసు వ్యవహారంలో విచారణ నిమిత్తం బేగంపేట పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం విడిచిపెట్టారు. ఇంటికి వెళ్లిన మోహనకృష్ణ మృతిచెందాడు. మోహన్‌కృష్ణకు భార్య లావణ్య, 13 నెలల కొడుకు ఉన్నారు. పాత పాటిగడ్డలోని మోహన్ ఇంటి సమీపంలోనే వరుసకు మరదలయ్యే ఓ విద్యార్థిని కుటుంబీకులు కూడా నివాసముంటున్నారు. అయితే చదువును మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటున్న బాలిక పట్ల మోహన్‌ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహనకృష్ణ అసభ్య ప్రవర్తన గురించి భార్య లావణ్యతో పాటు..బాలిక కుటుంబసభ్యులకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని బంధువులంతా మోహన కృష్ణని హెచ్చరించారు. అయితే వరసకు మరదలైన ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టాడు. ఇదే విషయంపై మూడు రోజులగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు నచ్చచెప్పినా వినకపోవడంతో మరదలి బంధువులు, మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులు బేగంపేట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల కౌన్సెలింగ్..
దీంతో మోహన్‌ను పీఎస్‌కు తీసుకెళ్లి అందరి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే విచక్షణారహితంగా మోహన్‌ను పోలీసులు లాఠీలతో కొట్టారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. లాఠీల దెబ్బల శబ్దం వినిపిస్తుంటే..ఆపేందుకు వెళ్లిన తనను కూడా పోలీసులు అడ్డుకున్నారని మోహన్‌ తల్లి ఆరోపించింది. తన భర్తని మందలించి పంపించమంటే..తీరా కాటికే పంపేశారని మృతుని భార్య లావణ్య రోధిస్తోంది. తన భర్తను చంపిన పోలీసులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. అయితే పోలీసులు మాత్రం..మోహన్‌పై 70సీ కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ చేస్తుండగా..కొద్ది సేపటికే కళ్ళు తిరిగి కిందపడిపోయాడని..దీంతో వెంటనే ఆస్పత్రికి తరిలించామని చెప్తున్నారు. కానీ లాఠీలతో కొట్టి చంపామనడంలో ఎలాంటి వాస్తవం లేదని నార్త్ జోన్ డీసీపీ సుమతి అన్నారు. మరోవైపు పోస్టుమార్టం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు కూడా ఇదే విషయాన్ని ప్రాథమికంగా నిర్థారిస్తున్నారు. మోహన్‌ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని..పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. ఇంతకీ పోలీసుల దెబ్బలకే మోహన్ కృష్ణ చనిపోయాడా..లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం అతనికి ఆరోగ్యం బాగలేకపోవడంవల్లే చనిపోయాడనే విషయం తెలుస్తోంది. మోహనకృష్ణ మృతిపై పోస్టుమార్టం పూర్తినివేదిక వస్తేగానీ అసలు విషయం బయటపడదు.

07:01 - April 9, 2017

విశాఖపట్టణం : జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామస్తులు మరోసారి ఆందోళనకు దిగారు. ఏపీఐఐసీ కంపెనీల పైప్‌లైన్‌ పనులు నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమకు ప్రకటించిన పరిహారం ఇవ్వకుండా పైన్‌లైన్‌ పనులు చేపడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీఐఐసీ సిబ్బంది పైప్‌లైన్‌ మెటీరియల్‌ తీసుకురావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీఐఐసీ తీరును నిరసిస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. వందలాదిగా వచ్చిన జనం టెంట్‌ వేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మత్స్యకార గ్రామమైన పూడిమడకలోని సముద్రంలో ఏపీఐఐసీ కంపెనీలు వ్యర్ధాలను వదిలేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకోసం పూడిమడక గ్రామస్తులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. చదువుకున్న యువకులకు ఉద్యోగం, 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏడాదికి 1,25,000 ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేదు. ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. పరిహారం అందజేయలేదు. దీంతో గ్రామస్తులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

వెనుదిరిగిన పోలీసులు..
ఇచ్చిన హామీలు, ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలేదని గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలో ఏపీఐఐసీ పైప్‌లైన్‌ పనులు చేపట్టేందుకు ఆదివారం మెటీరియల్‌ తీసుకొచ్చింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పైన్‌లైన్‌ పనులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులు వేసుకున్న టెంట్‌ను కూల్చివేశారు.ఆందోళనకారులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి తమ వాహనాల్లో ఎక్కించారు. పోలీసుల తీరుపై పూడిమడక గ్రామస్తులు మండిపడ్డారు. యువకులంతా సముద్ర తీరంలో నించుని నిరసన తెలిపారు. పూడిమడక గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం, సీపీఐ, వైసీపీ మద్దతు తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు.

06:39 - April 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ అధికారం చేపట్టి మూడేళ్లు కావొస్తున్నా ఇంకా వాగ్ధానాలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం- తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్‌లో మహాజన పాదయాత్ర బృంద సభ్యులను సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తెలంగాణలో మహాజన పాదయాత్ర సరికొత్త రికార్డును సృష్టించింది. 152 రోజులపాటు... 4200 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది. పల్లెపల్లెను తడుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంది. స్వరాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతున్న తీరును ఎండగట్టింది. పాలకులు పదేపదే పటిస్తున్న బంగారు తెలంగాణ జపం ఏమేరకు అమలు జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసింది. రాజధానిలో కూర్చొని చేస్తున్న ప్రకటనలకూ... క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుకు ఎక్కడా పోలికేలేని ఘటనలు అనేకం బాహ్యసమాజానికి మహాజనపాదయాత్ర బృందం వెల్లడి చేసింది. సుదీర్ఘంగా సాగిన ఈ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలకు, పార్టీలకు అతీతంగా రాజకీయనేతలు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ఈ మహాజన పాదయాత్రకు నాయకత్వం వహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోసహా ఇతర సభ్యులను సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఘనంగా సత్కరించింది.

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా..
ప్రజల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగులుతోందన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తెలంగాణ ప్రజల బతుకులు ఏమాత్రం మారలేదని దుయ్యబట్టారు. ఖరీప్‌ నాటికి కాలేశ్వరానికి నీళ్లిస్తామంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటన ఓ జోక్‌ అంటూ తమ్మినేని కొట్టి పారేశారు. ఈ ప్రాజెక్టుపై బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లోఉందని.. భూసేకరణ డైలమాలో పడిందని.... ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ నాటికి నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మహాజన పాదయాత్ర ద్వారా తెలంగాణలోని కార్మిక వర్గానికి మేలు జరిగిందని పాదయాత్ర బృందం సభ్యురాలు రమా అన్నారు. అంగన్‌వాడీ, ఐకేపీ, వీఆర్‌ఏసహా పలువురికి వేతనాలు పెంచడం పాదయాత్ర ప్రభుత్వంపై పెంచిన ఒత్తిడే కారణమన్నారు. మహాజన పాదయాత్ర లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించుకోవడానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. ఉద్యమానికి నిర్మాణ రూపం తీసుకొస్తామన్నారు. ఇందుకు కలిసొచ్చే అన్ని శక్తులతో పోరాటం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

06:36 - April 9, 2017

హైదరాబాద్ : గులాబీ పార్టీకి కమలం గుబులు పట్టుకుంది. ఉత్తరాదిన వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న బీజేపీ.. దక్షిణాదిపై దృష్టి సారించిందనే ప్రచారం జరుగుతుండడంతో టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగులేదని అంచనా వేస్తున్న గులాబీ దళపతి.. కమలనాథుల ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుంటుంటే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు గుబులు పట్టుకుంది. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే వీటన్నింటిని ఎదుర్కొనేందుకు గులాబీ దళపతి వ్యూహం రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏ ఎన్నికలు జరిగినా కమలనాథులు తమ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఉత్తర భారతంలో పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించింది. ఏపీలో తమ మిత్రపక్షమైన టీడీపీయే అధికారంలో ఉండడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు.

బీజేపీ నేతల స్కెచ్..
తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లోని ఏడు స్థానాలను టార్గెట్‌ చేసుకుని.. ఆ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని శాసనసభ స్థానాలపై దృష్టి పెట్టాలని బీజేపీ నేతలు స్కెచ్‌ వేశారు. కేంద్ర మంత్రులను రంగంలోకి దించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ దృష్టి పెట్టడంతో టీఆర్‌ఎస్‌లో గుబులు మొదలైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న గులాబీ దళపతి.. బీజేపీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలైన ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ లాంటి సంస్థలపై కూడా టీఆర్‌ఎస్‌ కన్నేసింది. ఇప్పటికే సర్వేలతో నేతలను అప్రమత్తం చేస్తున్న కేసీఆర్‌... పార్టీ బలోపేతంపై సీరియస్‌గా ఉన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో బలపడితే బీజేపీ పట్టు సాధించడం ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న టీఆర్‌ఎస్‌.. తెలంగాణలో బీజేపీ వైఖరితో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

06:34 - April 9, 2017

విజయవాడ : అనుకున్నదొకటి.. అయ్యిందొక్కటి చందంగా మారింది టీడీపీ పరిస్థితి. నేతల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయని అధినేత భావించినప్పటికీ.. మంత్రివర్గ విస్తరణతో అవి తారాస్థాయికి చేరాయి. ఎన్నిసార్లు సర్దిచెప్పినా సరే అంటున్న నేతలు.. మళ్లీ అదే బాట పడుతున్నారు. దీంతో కొత్త, పాత నేతల మధ్య నిత్యం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మంచి పేరు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఆ పరిస్థితి దారి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరింది మొదలు.. కొత్త, పాత నేతల మధ్య మనస్పర్ధలు తెరపైకి వచ్చాయి. అధినేత చెబుతున్న ప్రతిసారీ తలూపుతున్న నేతలంతా.. బయటకు వచ్చాక యథావిధిగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణతో ఈ వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. కడప, ప్రకాశం జిల్లాల్లో తమ్ముళ్ల మధ్య సయోధ్యకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోతుంది.

సీఎం రమేష్ పై దాడి..
కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు టీడీపీ ఇన్‌చార్జ్‌ రామసుబ్బారెడ్డి వ్యతిరేకించినప్పటికీ.. చంద్రబాబు, సీఎం రమేష్‌ సర్దిచెప్పి ఒప్పించారు. ఇక రామసుబ్బారెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి, విప్‌ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా జమ్మలమడుగులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మరోసారి తెలుగు తమ్ముళ్లు విరుచుకుపడ్డారు. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని నిరసిస్తూ.. సభకు వచ్చిన సీఎం రమేష్‌పై దాడికి యత్నించారు. కుర్చీలు విసిరి బీభత్సం సృష్టించారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

గొట్టిపాటి రవి, కరణం బలరాం మధ్య వార్‌..
ఇక ప్రకాశం జిల్లా అద్దంకిలో గొట్టిపాటి రవి, కరణం బలరాం మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో గొట్టిపాటి రాకను బలరాం వ్యతిరేకించారు. ఆ తర్వాత కరణంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలో అద్దంకిలో గొట్టిపాటి రవి చెప్పిందే ఫైనల్‌ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పటినుంచి కామ్‌గా ఉన్నా బలరామ్‌.. తాజాగా ఓ ఆర్డీవోపై ఫైర్‌ అయ్యారు. నేను చెప్పిందే వినాలంటూ హుకుం జారీ చేశారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో నక్కా ఆనంద్‌బాబుకు మంత్రి పదవి దక్కడంతో... ఎమ్మెల్యే శ్రావణ్‌ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక కార్యక్రమాల్లో నక్కా ఆనంద్‌బాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ఇరువురు నేతలను పిలిచి.. సర్దిచెప్పారు. ఇక ఇప్పటికే మంత్రి పదవి దక్కలేదని సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకబూనారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ కొత్త, పాత నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు ఎన్నిసార్లు నేతలు తీరులో మార్పు రావడం లేదు. మరి ఈ పరిణామాలు శృతి మించితే.. అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి !

06:31 - April 9, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మోదీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు తుంగలో తొక్కారని ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ, కిల్లికృపారాణి తదితరులు పాల్గొన్నారు. తమ పార్టీ నుండి వెళ్లిన వారంతా అవకాశవాద రాజకీయ వాదులేనని దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు.

06:30 - April 9, 2017

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌ జరిగే టీఆర్‌ఎస్‌ సభ... మరో చరిత్రను తిరగరాస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా ఈ సభను నిర్వహిస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తో కలిసి సభా ఏర్పాట్లను హరీశ్‌రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చా అతిపెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. అనంతరం మాట్లాడిన కడియం శ్రీహరి... టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

06:27 - April 9, 2017

విజయవాడ : ఆర్ధిక నేరగాడు చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారంటూ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏమాత్రం విలువలు పాటించని జగన్‌... చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా జగన్‌ ఢిల్లీలో రాజకీయపక్షాల మద్దతు కూడగట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ చేసిన ట్వీట్‌కు జగన్‌ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. విశాఖ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ప్రత్యేక విమానంలో విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్నారు. భారత నౌకాదళ సేవల ఉంచి ఉపసంహరించిన యుద్ధ విమానం టీయూ 142 ఎంకు చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. విమాన సిబ్బందికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఏఎన్‌-32 విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.

సింహాచలం..
అక్కడి నుంచి చంద్రబాబు నేరుగా సింహాచలంలోని అప్పన్న స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి గోశాలలో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కల్యాణ మండపం, సత్రాలు, డార్మిటరీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొదటి సారి పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు పెదవి విప్పారు. ఇతర పార్టీ వాళ్లను జగన్‌ ఎప్పుడూ చేర్చుకోలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు తమ పార్టీని వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని.. జగన్‌ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒక ఆర్ధిక నేరస్తుడు చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నాడు మాపార్టీ నేతలను చేర్చుకుని జగన్‌ ఆనందపడిపోయారు.. ఇప్పుడు టీడీపీలో వైసీపీ నేతలు చేరితే మాత్రం గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. విలువలు అనేవి స్వతహాగా పాటించి ఇతరులకు చెబితే బాగుంటాయని చంద్రబాబు హితవు పలికారు.

కఠినంగా వ్యవహరిస్తా..
మంత్రివర్గ విస్తరణపైనా చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ విస్తరణ చేశానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని అసంతృప్త నేతలను ఆయన హెచ్చరించారు. తాను ఎంత సున్నితంగా ఉంటానో... తేడా వస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. రాజకీయాలను పక్కనబెట్టి తాను పూర్తిగా రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారించినట్టు చెప్పుకొచ్చారు చంద్రబాబు.

ఐటీ శాఖపై లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష..

విజయవాడ : ఐటీ శాఖపై మంత్రి నారా లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఐటీ రంగం, అభివృద్ధి, ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ తయారీ సేవలపై లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఐటీ, ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులపై అధికారులు లోకేష్ కు వివరించారు.

 

బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ (మం) బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి.

 

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై బెంగళూరు విజయం..

ఢిల్లీ : ఐపీఎల్ 10లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ పై బెంగళూరు జట్టు విజయం సాధించింది. 15 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. బెంగళూరు స్కోర్ 157/8. ఢిల్లీ : 142/9.

 

బీటెక్ విద్యార్థి మృతి..

ప్రకాశం : కందుకూరులో ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థి ఫణీంద్ర మృతి చెందాడు. కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఫణీంద్ర అద్దంకి మండలం దామరవారిపాలెం వాసి.

పుణెపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం

ఢిల్లీ : ఐపీఎల్ -10లో పుణెపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో పుణెపై పంజాబ్ గెలుపొందింది. పుణె స్కోర్ 163/6. పంజాబ్ స్కోర్ 164/4.

సోమవారం మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం..

పెద్దపల్లి : మంథని (మం) ఖానాపూర్ మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నిర్వహించే ఈ పోస్టుమార్టంలో సిట్టింగ్ జడ్జీ, ఓయూ, కేయూ మెడికల్ కాలేజీ, ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొననున్నారు.

 

నీరు - ప్రగతి సదస్సులో బాబు..

విజయవాడ : నీరు - ప్రగతి సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఎకరానికి నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, భవిష్యత్ లో రైతులకు రిమోట్ కంట్రోల్ మోటార్లు అందిస్తామన్నారు. రైతులకు పగటిపూటే వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వనున్నట్లు, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని సూచించారు. కాలువల మరమ్మత్తుకు డ్రోన్ టెక్నాలజీని వాడడం జరుగుతుందని, వర్షాకాలం వచ్చేలోగా చెరువుల్లో ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు.

మొక్కజొన్న పంటకు నిప్పు...

సిద్ధిపేట : రాయపోలులో మొక్కజొన్న పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బాలసాయిలు అనే రైతుకు చెందిన రెండు ఎకరాల పొలం దగ్ధమైంది.

 

Don't Miss