Activities calendar

10 April 2017

22:20 - April 10, 2017
22:13 - April 10, 2017

హైదరాబాద్ : కేసీఆర్, కేటీఆర్ లపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ టీఆర్ ఎస్ సభకు రాబంధుల సభ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సొంత ఆలోచనలే లేవు అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆలోచనలనుటీఆర్ఎస్ కాపీ కొడుతుందని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ నాయకులు ప్రజలను పీక్కు తింటున్నారని అన్నారు. 

 

22:04 - April 10, 2017

విశాఖ : మత్స్యకారుల ఉపాది, ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్న అభివృద్ధి ఎవరికి కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పుడిమడకలో ఆయన ఇవాళ పర్యటించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఏపీఐఐసీ పైప్‌లైన్‌ను సముద్రంలోకి నిర్మిస్తోందని ఆరోపించారు. ఈ పైప్‌లైన్‌ వల్ల సముద్రంపై ఆధారపడే 26 మత్స్యకార గ్రామాల పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు. పైప్‌లైన్‌ నిర్మాణంపై సర్కారు వెనక్కితగ్గాలని... లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.. 

22:00 - April 10, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను మరింతగా ఉధృతం చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.  సామాజిక శక్తులతో చర్చించి త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. స్వరాష్ట్రంలోనూ తెలంగాణ పేదల బతుకులు ఏమాత్రం మారలేదన్న తమ్మినేని... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ పాలన సాగడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో టీయూజేఎఫ్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన.... కేసీఆర్‌ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకొని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 
టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే ఆధ్వర్యంలో మీట్‌ ది ప్రెస్‌
తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య, హైదరాబాద్‌  యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న తమ్మినేని.. మహాజన పాదయాత్ర అనుభవాల గురించి తెలిపారు. తాము చేపట్టిన పాదయాత్రకు  ప్రజల నుంచి ఊహించిన దానికంటే  ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. పల్లెపల్లెనా ప్రజలు పాదయాత్రకు ఆత్మీయ స్వాగతం పలికారని చెప్పారు. పాదయాత్ర ముగింపుగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభ విజయవంతమైందన్నారు.  తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని తమ్మినేని విమర్శించారు. తెలంగాణ రాకముందు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారకపోగా... మరింత దిగజారిందన్నారు.  
సామాజిక న్యాయం ఎజెండా చర్చనీయాంశం... 
తెలంగాణ రాజకీయ అవనికపై సామాజిక న్యాయం అనే ఎజెండాను చర్చనీయాంశం చేశయడంలో సక్సెస్‌ అయ్యామని తమ్మినేని అన్నారు. ఎప్పుడూ మిషన్‌ భగీరథ,  మిషన్‌ కాకతీయ, విశ్వనగరం, టీహబ్‌, స్కైవేలంటూ ఊదరగొట్టే కేసీఆర్‌ కూడా సామాజిక తరగతుల అభివృద్ధిపై దృష్టి సారించేలా మహాజన పాదయాత్ర చేయగలిగిందన్నారు.  మహాజన పాదయాత్ర డిమాండ్స్‌ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిఫలించాయన్నారు.  బీసీ సబ్‌ప్లాన్‌, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లపై చట్టం చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. త్వరలోనే అన్ని సామాజిక శక్తులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
వామపక్షాలతో కలిసి పనిచేయడానికి గద్దర్‌ సుముఖత
వామపక్షాలతో కలిసి పనిచేయడానికి ప్రజాగాయకుడు గద్దర్‌ కూడా సుముఖంగా ఉన్నారని.. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపామన్నారు.  రాష్ట్ర సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ కూడా ఆయన విధానం ప్రకటిస్తే కలిసి పనిచేయడానికి ఆలోచిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. 
 

 

21:53 - April 10, 2017

హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు పూర్తి అధికారాలు, వనరులు కలెక్టర్లకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో తప్పులు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్‌ వివిధ అంశాలపై చర్చించారు.
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం వేగవంతం 
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఒంటరి మహిళల గుర్తింపు, బీడీ కార్మికులకు పెన్షన్‌ స్కీమ్‌, కొత్త జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీల భవనాల ఏర్పాటుపై చర్చించారు.  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని  కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు.  ప్రతి నియోజకవర్గానికి 1400 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయనున్నట్టు తెలిపారు.  అయితే లబ్దిదారుల ఎంపిక మాత్రం పారదర్శకంగా జరగాలని సూచించారు.  గ్రామసభల్లోనే ఎంపీడీవో, తహసీల్దార్‌లు లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు గురికావొద్దని కలెక్టర్లకు సూచించారు.
గొర్రెల పంపిణీపై కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్న కేసీఆర్‌
గొర్రెల పంపిణీపై కేసీఆర్‌ కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్‌ 20 నుంచి గొర్రె పిల్లల కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ పథకాన్ని కలెక్టర్లే పర్యవేక్షించాలన్నారు.  గొర్రెల పంపిణీతో రాబోయే రెండేళ్లలో 20వేల కోట్ల సంపద పెరుగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు. పశువుల సంరక్షణకు ప్రతి నియోజకవర్గంలో వెటర్నరీ మొబైల్‌ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఒంటరి మహిళలను గుర్తించాలని కేసీఆర్‌ ఆదేశం
తెలంగాణలో మూడు లక్షల వరకు ఒంటరి మహిళలు ఉన్నారని.. వారందరికీ పెన్షన్‌ స్కీం వర్తింప జేయాలని కలెక్టర్లను కేసీఆర్‌ ఆదేశించారు. మరో 81వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్‌ స్కీమ్‌ను వర్తింపచేయాలని సూచించారు.  నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల భవనాలపైనా సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త భవనాల్లో పాలన కొనసాగించాలన్నారు. 

 

21:47 - April 10, 2017

ఢిల్లీ : ప్రవాస భారతీయ భవన్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎన్డీయే మిత్రపక్ష నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో ఎన్డీయే పక్షాల భవిష్యత్‌ ఎన్నికల ప్రణాళిక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి రేసులో థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, సుమిత్రా మహాజన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో ఎంపీ హుకుందేవ్‌ నారాయణ్‌, వెంకయ్యనాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

21:40 - April 10, 2017
21:22 - April 10, 2017

పద్నాల్గేండ్ల వనవాసం తర్వాత పండుగ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల కాంగ్రెస్ పార్టీ కేక్ కటింగులు, మోడీ ఆఫీసు ముంగట రైతుల బరిబాత... ఎర్రటెండల మరీ బట్టలు ఇప్పేసి నిరసన, మంత్రి పోచారం జిల్లాల మట్టిమనిషి గోస... ఎండుతున్న ఎవుసానికి ట్యాంకర్లే భరోసా, హిందూపురంల పెయ్యిమీదికెక్కిన భక్తి.. సుబ్రహ్మణ్యస్వామి కోసం సూదుల సూక్తి, అమ్మనెలగొట్న ఐదుగురు కొడుకులు... యాపచెట్టుకిందనే బతుకున్న ముసలి తల్లి, ఎస్సారెస్పీ కాలువల ఎలుగుబంటి ఆత్మహత్య... ఎంకులాడినా దొరకని సూసైట్ లెటర్.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

వైసీపీలోకి శిల్పా మోహన్ రెడ్డి...?

కర్నూలు : జిల్లా నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ టికెట్‌ ఇస్తే పోటీ చేయాలని... ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారే యోచనలో ఉన్నారు. వైసీపీలో చేరి బరిలో నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సులోచన, కౌన్సిలర్లతో విడివిడిగా మంతనాలు జరుపుతున్నారు.  ఏదేమైనా మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

 

20:07 - April 10, 2017

లాల్...నీల్ జెండాలు ఏకం కావాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు ప్రొ.తిరుపతి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు, సామాజికవేత్త సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కెవిపిఎస్ నేత జాన్ వెస్లీ పాల్గొని, మాట్లాడారు. మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు ఐక్యం కావాలని సూచించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రేమికులు ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి

శ్రీకాకుళం : పొందూరు మండలం వంతాడలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు ఈశ్వర్ రావు మృతి చెందారు. ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

19:47 - April 10, 2017

హైదరాబాద్ : లాల్‌.. నీల్‌..! ఇప్పుడీ నినాదం.. సరికొత్త ఆలోచనలకు.. వినూత్న ప్రయోగాలకు వేదిక కానుంది. మహాజన పాదయాత్ర ద్వారా.. సీపీఎం వినిపించిన ఈ నినాదం.. సరికొత్త సకల సామాజిక శక్తులకు ఉత్సాహాన్నిస్తోంది.. నవ్య రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.. అంతేనా, ప్రశ్నించే శక్తులను తట్టి లేపి, పాలకుల ఏకపక్ష ధోరణులు ఇక చెల్లవని చాటి చెప్పింది. ఇంతకీ లాల్‌ నీల్‌ నినాదం ఎందుకు..? ఏ లక్ష్య సాధనకు..? 
రాజకీయాల్లో కొత్త కదలికకు కారణమైన పాదయాత్ర
తెలంగాణ రాష్ట్ర సంక్షేమం అంటే.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే అంటూ.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. నాలుగువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగించారు. ఈ మహాజన పాదయాత్ర సరికొత్త చరిత్రను సృష్టించడమే కాదు.. రాజకీయాల్లోనూ ఓ కొత్త కదలికకు కారణమైంది. అణగారిన వర్గాలను ప్రశ్నించే దిశగా.. ప్రశ్నించే శక్తుల్లో చేతనత్వాన్ని నింపే దిశగా ఈ పాదయాత్ర సాగింది. ఆ చైతన్యమే, వివిధ శక్తుల ఏకీకరణకు, సరికొత్త సమీకరణలకు ఊతమిస్తోంది. 
పాదయాత్ర ఆద్యంతాలూ ఓ హిస్టరీ
అసలు సీపీఎం మహాజన పాదయాత్ర ఆద్యంతాలూ ఓ హిస్టరీ. పాదయాత్ర బృందాన్ని గ్రామాల్లోకి రానీయకండి అంటూ సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే ఇచ్చిన పిలుపును ప్రజలు బేఖాతరు చేయడం ఒక ఎత్తయితే.. బహిరంగ సభాస్థలి విషయంలోనూ అడ్డంకులు సృష్టించిన పాలకుల ఎత్తుగడలను తిప్పికొట్టి.. సభ ఆసాంతమూ విజయవంతం చేయడం మరొక ఎత్తు. ఇది కేవలం పాదయాత్ర ఆద్యంతాలు విజయవంతం కావడాన్ని మాత్రమే కాదు.. ప్రజల్లో మొలకెత్తిన ఆలోచనలకూ దర్పణం పట్టింది. ఇంతకీ ప్రజల్లో అంకురించిన ఆ ఆలోచన ఏది..? అదే.. లాల్‌.. నీల్‌..!
ఎంబీసీల్లో చైతన్యంనింపిన పాదయాత్ర బృందం
ఎంబీసీలపై ప్రభుత్వం హామీలవర్షం
సీపీఎం పాదయాత్ర బృందం.. తన పర్యటనల ద్వారా.. ప్రజల్లో ముఖ్యంగా ఎంబీసీల్లో నింపిన చైతన్యం.. పాలకుల్లో కంగారు పుట్టించింది. ప్రశ్నించేందుకు జనం గళాన్ని సవరించుకుంటుండడాన్ని చూసి.. పాలకులు హడలెత్తారు. అందుకే, హడావుడిగా ఎంబీసీలను ప్రతి కులపు నేతలనూ పిలిపించుకుని, వారికి హామీలు కురిపించడం ప్రారంభించారు. పాదయాత్ర ముగింపు నాటికి, కీలక సామాజిక వర్గాల వారిని బుజ్జగిస్తూ సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ను అర్థం చేసుకోవాలి. పాదయాత్ర నినదించిన లాల్‌ నీల్‌ దెబ్బకు హడలెత్తిన సర్కారు., అసలు ఎంబీసీలు అన్న పదానికి అర్థం, నిర్వచనం ఇవ్వకుండానే, ఏకంగా వెయ్యికోట్లు ఎంబీసీలకు అందిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని బట్టే, సర్కారుపై లాల్‌ నీల్‌ నినాదం ఏమేరకు ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 
పాలకుల ఓటు బ్యాంకు రాజకీయమే
పాలకులది ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు రాయితీలు ప్రకటిస్తారు.  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు... ఆఖరికి కార్పొరేషన్లకు చైర్మెన్ల ఎంపికలోనూ అగ్రవర్ణాల ప్రతినిధులకే అగ్రతాంబూలం ఇస్తారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్ పదవుల్లో ఒక్క ఎంబీసీకి అవకాశం రాలేదు. బీసీల్లో ఎక్కువ జనాలున్న కులాల్ని చేరదీయటంపై దృష్టిపెట్టిన పాలకులు.. కులాన్ని కాపాడుతూ బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.. 
లాల్‌ నీల్‌ నినాదం అర్థం ఏంటి..? 
ప్రభుత్వాన్ని ఇంతగా బెంబేలెత్తించిన ఈ లాల్‌ నీల్‌ నినాదం అర్థం ఏంటి..? విప్లవ పంథాలో సాగే ఎర్రజెండా, అంబేడ్కరిజానికి ప్రతీక అయిన నీలపు జెండా.. కలగలిసి సాగాలన్నదే ఈ లాల్‌ నీల్‌ కలయిక ఆంతర్యం. బడుగులు అందరూ ఈ లాల్‌ నీల్‌  ఉమ్మడి జెండాల నీడలోకి వస్తే.. పాలకులను ప్రశ్నించే తెగువ, హక్కులను సాధించుకునే హక్కు సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు. పాలకులది ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు రాయితీలు ప్రకటిస్తారు.  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు... ఆఖరికి కార్పొరేషన్లకు చైర్మెన్ల ఎంపికలోనూ అగ్రవర్ణాల ప్రతినిధులకే అగ్రతాంబూలం ఇస్తారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్ పదవుల్లో ఒక్క ఎంబీసీకి అవకాశం రాలేదు. బీసీల్లో ఎక్కువ జనాలున్న కులాల్ని చేరదీయటంపై దృష్టిపెట్టిన పాలకులు.. కులాన్ని కాపాడుతూ బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.. 
చక్కని వేదికగా నిలుస్తున్న లాల్‌-నీల్‌
 పాలకులకు కులవివక్షగానీ, అణగారిన తరగతులనుంచి వచ్చిన మేధావులు, మధ్య తరగతి ఉద్యోగుల ఆత్మగౌరవంగానీ  అవసరం లేదు. కులవివక్ష నుండి ఉద్భవించిందే ఈ ఆత్మగౌరవ సమస్య. బడుగు బలహీన వర్గాల ప్రజానీకాన్ని పౌరులుగా వీరు అంగీకరించరు.. వీరిని ఓటర్లుగా మాత్రమే చూస్తూ... ఓటు బ్యాంకును సిద్ధపరచుకునేందుకు ఎత్తుగడలువేస్తారు.. ఇందుకోసం కొందరికి ఎరవేసి అందరినీ మభ్యపెడతారు. పార్టీ ఏదైనా తెలంగాణలో అట్టడుగు వర్గాల పరిస్థితిని పట్టించుకున్నవారేలేరు.. టీఆర్‌ఎస్‌ కన్నా ముందునుంచిఉన్న పార్టీలుకూడా దీనికి బాధ్యులే.. అందుకే ఎన్నికల లక్ష్యాలు దాటి వీరు ఒక్క మాటైనా మాట్లాడలేకపోయారు. తమను ఓటర్లుగా మాత్రమే పరిగణించే నాయకుల తీరుపై.. ప్రజల్లో ఎన్నాళ్ల నుంచో అసంతృప్తి, అసహనం గూడుకట్టుకుని ఉన్నాయి. తమ ఆగ్రహాన్న ప్రదర్శించేందుకు, హక్కుల గురించి ప్రశ్నించేందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో, ఉద్భవించిన లాల్‌-నీల్‌ ఆలోచన, ఇలాంటి వారికి చక్కటి వేదికగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే, వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యతా నినాదం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.. రాజకీయ పునరేకీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి, చర్చకు పెట్టింది. 

 

కొనసాగుతోన్న కలెక్టర్ల సదస్సు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. జిల్లాల్లో ఒంటరి మహిళల గుర్తింపు, విధి విధానాల ఖరారుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. మొత్తం 459 సెంటర్లలో బాలింతలకు కేసీఆర్ కిట్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బాలింతలకు రూ.12వేలతో పాటు రూ.2 వేల విలువైన కిట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 

పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాముఖ్యత : టూరిజం కార్యదర్శి

ఐజ్వాల్ : పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని టూరిజం కార్యదర్శి వెంకటేశం అన్నారు. మిజోరాంలో తెలంగాణ టూరిజం రోడ్ షో నిర్వహించారు. టూరిజం కార్యదర్శి వెంకటేశం రోడ్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ టూరిజంలో దేశంలోనే హైదరాబాద్ ది ప్రత్యేక స్థానమని తెలిపారు. మిజోరాం ప్రజలు వైద్యం కోసం ముంబై వెళ్తున్నారని చెప్పారు. ముంబై కంటే హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే అధునాతన వైద్యం అందుతుందన్నారు. 

ఏసీబీకి చిక్కిన పామర్రు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఆనంద్ భూషణ్

కృష్ణా : పామర్రు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఆనంద్ భూషణ్ ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 

రాష్ట్ర వ్యాప్తంగా జల సంరక్షణ ఉద్యమాలు : మంత్రి దేవినేని

విజయవాడ : ఏప్రిల్ 15 నుంచి జులై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జల సంరక్షణ ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమా అన్నారు. జల సంరక్షణ ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. 3 నెలల పాటు జల సంరక్షణ ఉద్యమాలు ఉంటాయని పేర్కొన్నారు. 

తమిళనాడులో రోడ్డు ప్రమాదం...ఆరుగురి మృతి

చెన్నై : పుదుకొట్టై జిల్లా పుదునగర్ వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

 

తమిళనాడులో రోడ్డు ప్రమాదం...ఆరుగురి మృతి

చెన్నై : పుదుకొట్టై జిల్లా పుదునగర్ వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

 

19:01 - April 10, 2017

కృష్ణా : జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. వీరులపాడు బొడవాడు గ్రామంలో అంబేద్కర్‌ జయంతి రోజున ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి చిన్నారితో సహా కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఆడుకునేందుకు బయటకు వచ్చిన పాపపై గుంటి ఇసాక్‌ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో పాప ఇంకా రాలేదంటూ బయటకువచ్చిన చిన్నారి అమ్మమ్మ ఇసాక్‌ను చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు పారిపోయాడు.

 

18:55 - April 10, 2017

ఢిల్లీ : సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ఎన్నిక దగ్గరపడుతుండటంతో ఎన్డీఏ భవిష్యత్‌ కార్యాచరణపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మిత్రాపక్షాల మధ్య ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మెహబూబా ముఫ్తీ, ఉద్దవ్‌ థాక్రే సహా పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి రేసులో ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, సుమిత్రా మహాజన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో ఎంపీ హుకుందేవ్‌ నారాయణ్‌, వెంకయ్యనాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

18:43 - April 10, 2017

కర్నూలు : నంద్యాలలో రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల ఎమ్మెల్యే సీటుపై మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి కన్ను పడింది. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ టికెట్‌ ఇస్తే పోటీ చేయాలని... ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారే యోచనలో ఉన్నారు. వైసీపీలో చేరి బరిలో నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సులోచన, కౌన్సిలర్లతో విడివిడిగా మంతనాలు జరుపుతున్నారు.  ఏదేమైనా మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

18:22 - April 10, 2017

హైదరాబాద్‌ : శివారు ప్రాంతమైన బాలాపూర్‌లోని దేవతలగుట్టలో తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని ప్రైడ్‌ ఇండియా బిల్డర్స్ ఎండీ తన్వర్‌ బేగ్‌ అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారని తెలిపారు. తమ వెంచర్లో వీరభద్రస్వామి మందిరము ఉందని.... దాని కూల్చివేసి నిర్మాణాలు చేపట్టినట్టు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. 

18:17 - April 10, 2017
18:15 - April 10, 2017

కరీంనగర్ : మధుకర్‌ ఒంటిపై గాయాలు కనిపించలేదని.. రీ పోస్టుమార్టం చేసిన వైద్యుడు కృపాల్‌సింగ్‌ తెలిపారు. కొన్ని అవయవాలు సేకరించామని తెలిపారు.  విషం తీసుకుంటే ల్యాబ్‌ రిపోర్టులో తేలుతుందన్నారు. వారంరోజుల్లో ఫైనల్‌ రిపోర్టు వస్తుందని తెలిపారు. మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తైంది. ఉస్మానియా, కేఎంసీ వైద్యుల పర్యవేక్షణలో రీపోస్టుమార్టం నిర్వహించారు. దాదాపు 5 గంటలుగా రీపోస్టుమార్టం కొనసాగింది. గ్రామస్తులు, దళిత, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

 

18:14 - April 10, 2017

మేడ్చల్‌ : దుండిగల్‌ మండలంలోని బహదూర్‌పల్లి గ్రామంలో ఉన్న టీఎన్ ఆర్ సైనిక్‌ అకాడమి యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రధానమంత్రి కౌసల్‌ వికాస్‌ యోజన పథకం ద్వారా 120 మందికి అర్బన్ సెక్యూరిటీ గార్డు సర్వీస్ లో ట్రైనింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఎన్ డీసీ ద్వారా ఐడీ కార్డు, డైరీ, బ్యాక్ పాక్స్, టీషెర్ట్స్ లు...టీఎన్ ఆర్ సైనిక్‌ అకాడమీ ద్వారా ట్రాక్ సూట్, షూస్ పంపిణీ చేశామని అకాడమీ చైర్మన్‌ టీ.ఎన్ రావు తెలిపారు. శిక్షణ అనంతరం స్కిల్‌ కార్డు, సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు. భవిష్యత్తులో ఐదు వేలమంది యువతకు ట్రైనింగ్‌ ఇవ్వడానికి అనుగుణంగా ప్రణాళికా తయారు చేశామన్నారు.

 

 

18:11 - April 10, 2017

కరీంనగర్ : మంథని మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో.... ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన రీపోస్టుమార్టం ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు చేశారు. వారం రోజుల్లో ఫైనల్‌ రిపోర్టు వస్తుందని పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. రీపోస్టుమార్టంతో నిజాలు తేలుతాయని మధుకర్ తండ్రి ఎల్లయ్య, బంధువులు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...మెడలు, చేతులను పోస్టుమార్టం చేశారు. నడుమపై గాయాలు చూశారు. పుడుసాలకు మిరియాలు చెల్లినట్లు అనిపించింది. మొదటిపోస్టుమార్టంలో మధుకర్ పొట్టమాత్రమే చీరారు. సరిగ్గా పోస్టుమార్టం చేయలేదు. రెండో  పోస్టుమార్టంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను' అని తెలిపారు. 

 

17:59 - April 10, 2017

హైదరాబాద్ : మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను పండుగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జోగురామన్న అన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం నూతన గురుకుల పాఠశాలలు నెలకొల్పుతున్నామని చెప్పారు. విదేశాల్లో చదివే విద్యార్ధులకు 20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

 

నంద్యాలలో వేడెక్కిన రాజకీయలు

 కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో రాజకీయలు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత శిల్పమోహన్ రెడ్డి కార్యకర్తలతో రహస్య భేటీ నిర్వహించారు.

17:52 - April 10, 2017

హైదరాబాద్ : వ్యాపారుల మెరుపుసమ్మె... రైతుల ధర్నాతో  కొత్తపేట పళ్ల మార్కెట్‌ దద్దరిల్లింది. సీజ్‌ చేసిన షాపుల్ని తెరిపించాలంటూ వ్యాపారులు... అది తమ పరిధిలో లేదంటూ అధికారులు తేల్చేయడంతో మామిడి అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక మార్కెట్‌కు వచ్చిన రైతులు పంట కొనేవారులేక ఆందోళనబాటపట్టారు.
రోడ్డెక్కిన రైతులు
ఎప్పుడూ రైతులు, వ్యాపారుల అమ్మకాలు, కొనుగోళ్లతో కళకళలాడే కొత్తపేట్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యాపారులు అమ్మకాలు ఆపేయడంతో రైతన్నలు రోడ్డెక్కారు. మామిడిపళ్లను కృత్రిమంగా పండిస్తున్న షాపులపై అధికారులు గతంలో దాడులు చేశారు. పళ్లను మక్కించేందుకు హానికర రసాయనాలు వాడుతున్న 90 షాపులను సీజ్‌ చేశారు. దీనిపై ఆగ్రహించిన వ్యాపారులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఏజెంట్లు, దళారులతోకలిసి సమ్మెకు దిగారు.
నిలిచిన మామిడికాయల అమ్మకాలు, కొనుగోళ్లు  
వ్యాపారుల సమ్మెతో మార్కెట్‌లో మామిడికాయల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి... సమ్మె విషయం తెలియని రైతులు దాదాపు 60వేల టన్నుల మామిడి కాయల్ని మార్కెట్‌కు తెచ్చారు.. అర్ధరాత్రినుంచి ఎదురుచూసినా పంటను కొనేవారే కరువయ్యారు.. అసలే గిట్టుబాటుధరలేక అల్లాడిపోతున్నవారికి సమ్మె మరింత అవస్థల్ని తెచ్చిపెట్టింది.. 
మార్కెట్‌యార్డుకు వచ్చిన మంత్రి జూపల్లి
రైతుల నిరసన విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మార్కెట్‌కు వచ్చారు. అధికారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా అధికారులు, వ్యాపారులమధ్య రాజీ కుదరలేదు. సీజ్‌ చేసిన షాపుల్ని వెంటనే తెరిపిస్తేనే తాము మామిడి కాయల్ని కొనుగోలుచేస్తామని వ్యాపారులు స్పష్టం చేశారు. వ్యాపారుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని... మార్కెటింగ్ శాఖ చైర్మన్‌ చెబుతున్నారు. 
గందరగోళంగా రైతుల పరిస్థితి 
అధికారుల వాదన ఇలా ఉంటే పంట కొనేవారులేక రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. వెంటనే కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం ఆదేశించినా వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఇద్దరిమధ్యా చర్చలు కొలిక్కిరాక రైతులు మరింత నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. ప్రభుత్వమే తమ పంటను కొనాలని కోరుతున్నారు.

 

17:44 - April 10, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఇందులో.. ఒంటరి మహిళలు, బీడీ వర్కర్లు, గొర్రెలు, మేకల పెంపకం, ఆర్థిక ప్రగతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు .. కలెక్టర్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణంపై ప్రధానంగా సమీక్షించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రధానుల రైలు ప్రయాణం

ఢిల్లీ : మెట్రో రైలులో భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు ప్రయాణించారు. రైలులో ప్రధాని మోడీతో ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బుల్ సెల్ఫీ తీసుకున్నారు. అక్షర్ ధాం మందిర్ ను ఇద్దరు ప్రధానులు సందర్శించారు.

 

17:09 - April 10, 2017

విజయవాడ : ఏపీ లో పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యంకనాన్ని ఉపాధ్యాయులు బహిష్కరించారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉపాధ్యాయ సంఘాలైన ఫ్యాక్టో, జాప్టో తెలిపాయి. గత రెండేళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోగా, కొత్త సమస్యలు సృష్టించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఫ్యాక్టో చైర్మన్ బాబురెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు పీఆర్సీ, ఏరియర్స్, డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్ల జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. రేపటి నిరసనలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనాలని కోరారు.

 

 

 

కొనసాగుతున్న కేసీఆర్..కలెక్టర్ల సదస్సు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఒంటరి మహిళలు..గొర్రెలు..మేకల పెంపకం..బీడీ వర్కర్లు..ఆర్థిక ప్రగతి..డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం..కలెక్టర్లు..ఎస్పీల కార్యాలయాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

'కేసీఆర్ వ్యతిరేకశక్తుల పునరేకీకరణకు టిడిపి ప్రధాన పాత్ర'..

హైదరాబాద్ : భవిష్యత్ లో కేసీఆర్ వ్యతిరేకశక్తుల పునరేకీకరణకు టిడిపి ప్రధాన పాత్ర పోషిస్తుందని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు బంగారు తెలంగాణ పునరేకీకరణ జరగలేదని, గ్రామ, మండల, డివిజన్ కమిటీలపై 2019 ఎన్నికలకు పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందన్నారు. కేటీఆర్..హరీష్ మధ్య మనస్పర్థలు తొలగించే పనిలో కేసీఆర్ ఉన్నారని, ఈ పనిలో పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు.

 

ప్రగతి భవన్..పైరవీ భవన్ - ఎల్.రమణ..

హైదరాబాద్ : పైరవీ భవన్ గా మారిన ప్రగతి భవన్ పై టిడిపి జెండా ఎగురవేస్తామని టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. 2019లో అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రభుత్వాసుపత్రిగా మారుస్తామని, మూడేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. పంటలు..రైతులకు గిట్టుబాటు ధరలపై సమీక్షించలేదని, రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాలన్నారు. పేదల పక్షాన పోరాడేది ఒక్క టిడిపినేనని పేర్కొన్నారు.

భారత్ నేవీ మాజీ అధికారికి పాక్ మరణ శిక్ష..

పాకిస్తాన్ : భారత్ నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్షణ విధిస్తూ పాక్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2016లో పాక్ లో అక్రమంగా ప్రవేశించి గూడచర్యానికి పాల్పాడ్డారనే ఆరోపణలున్నాయి.

వ్యవసాయ శాఖపై సోమిరెడ్డి సమీక్ష..

విజయవాడ : వ్యవసాయ శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటీవలే నూతనంగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

16:32 - April 10, 2017

కరీంనగర్ : మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రీపోస్టుమార్టం నిర్వహించారు. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన రీపోస్టుమార్టం ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు చేశారు. సేకరించిన శాంపీల్స్ ను వైద్యులు రెడ్డిస్ ల్యాబ్ కు పంపించారు. వైద్యులు వారం రోజుల్లో రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించనున్నారు. 15 రోజుల్లో మధుకర్ ది హత్యా..? లేక ఆత్మహత్యా ? అన్నది తేల్చనున్నారు. హత్య వెనుక మంథని ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందని మధుకర్ సోదరుడు సమ్మయ్య ఆరోపిస్తున్నారు. తన తమ్ముడిని ఓదెల్, లక్ష్మయ్య, మొగిలి కలిసి హత్య చేసినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. రీపోస్టుమార్టం నిర్వహించిన ప్రదేశానికి గ్రామస్తులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంథని మండలం ఖానపూర్ లో గత నెల 14న మధకర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే మధుకర్ తల్లిదండ్రులు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

 

16:29 - April 10, 2017
15:49 - April 10, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కుంటలు, చెరువుల పరిరక్షణపై దృష్టిసారించింది. ఈమేరకు జలసౌధలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుంటలు, చెరువులను పరిరక్షించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. 

 

15:40 - April 10, 2017

నిజామాబాద్‌ : మత సామరస్యానికి ప్రతీకగా భావించే నిజామాబాద్‌ జిల్లాలోని బడాపహడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు చుట్టు పక్కల జిల్లాల నుండే కాకుండా కర్నాటక, మహరాష్ర్ట నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణా రాష్ర్టంలోనే అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రంగా పేరుగాంచిన దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 
అధికారికంగా ఉర్సు ఉత్సవాలు  
నిజామాబాద్‌ జిల్లా జలాల్‌పూర్‌ గ్రామంలో బాబా ఫాదుల్లా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 8న ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి ఉత్సవాలను మొట్టమొదటి సారిగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బడాపహడ్ సయ్యద్ షాదుల్లా బాబా దర్గా ఉర్సును జలాల్ పూర్లోని ముజాపర్ గపార్ ఇంటి ముందు మొదట గుర్రం ఒంటెకు ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం నెయ్యి గందంతో కూడిన నైవేద్యాన్ని ఒంటెపై పెట్టి గ్రామ నడిబొడ్డున ఉన్నచావిడి వద్దకు తీసుకొని వచ్చారు. అక్కడ ఖవ్వాలి నిర్వహించిన అనంతరం సందాల్‌తో దర్గాకు ఊరేగింపుగా బయలు దేరుతారు. ఊరేగింపు పెద్దగుట్టకు చేరుకోవడంతో సందాల్‌ను దర్గాలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
ముజావర్ల ఇంటి నుండి గంథాలు ప్రారంభం 
నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో ఆనవాయితీగా ముజావర్ల ఇంటి నుండి గంథాలను ప్రారంభిస్తారు. 1957 నుండి ఇప్పటివరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉర్సు ఉత్సవాలను సైతం వక్స్‌ బోర్డు నిధులతో రెవెన్యూ అధికారులు కమిటీసభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఉర్దు క్యాలెండర్‌ ప్రకారం రజ్ఞాప్‌ మాసంలో యధవిధిగా సంప్రదాయం ప్రకారం ముజావర్లు ఇంటి నుండి జోహర్‌ సమాజ్‌ అనంతరం అధికారికంగా గందాలను ప్రారంభిస్తారు. రెండో రోజు కవాలి దీపారాదన, మూడోరోజు కత్మకూరన్‌ చదివి పసర్‌ సమాజ్‌ అనంతరం ఉదయం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రసాదాన్ని పంచిపెడతారు. 
రాములవారి ఆలయ దర్శనం అనంతరం దర్గాకు 
భక్తులు ముందుగా స్నానాలు ఆచరించి రాముల వారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరమే దర్గాకు వెళతారు. అయితే ఈ ఉర్సు ఉత్సవాలను తిలకించేందుకు ఆదిలాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక తదితర ప్రాంతాల నుండి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చి..తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలంగాణా జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇక్కడ కుల, మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. 

 

15:29 - April 10, 2017

వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ ఎస్ అసమర్థ పరిపాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని వరంగల్‌ ఎనుమాముల మార్కెట్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ టెన్ టివితో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వంలో కేసీఆర్ మాటే నడుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ సంబురాల్లో పాల్గొని మాట్లాడుతున్నారు కానీ....మిర్చి రైతుల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చికి మద్దతు ధర లేదని, కొనుగోలూ లేదని వాపోయారు. మిర్చికి 12 వేల రూపాయల మద్దతు ధర ఇచ్చి, ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. 

షుగర్ పాలసీని ప్రకటించాలి : పి. మధు

విశాఖపట్నం : ప్రభుత్వం స్పష్టమైన షుగర్ పాలసీని ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. మూతపడిన కోఅపరేటివ్, షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని...పంచదారపై పన్ను భారం అధికంగా ఉండటంతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని ఆయన అన్నారు. తెల్లరేషన్ కార్డులపై చక్కెరను ఇచ్చే పద్దతిని తీసేయాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వం విరమిమచుకోవాలని ఆయన హెచ్చరించారు.

 

ఒంటిమిట్టలో రాత్రి కల్యాణోత్సవం..

కడప : ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5గంటల నుండి 6 గంటల వరకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు...రాత్రి 8 నుండి 10గంటల వరకు కల్యాణోత్సవం..సాయంత్రం రాత్రి 10 నుండి 12గంటల వరకు గజవాహన సేవ జరగనుంది.

సుప్రీంలో భారత్..పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం..

ఢిల్లీ : భారత్..పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం రద్దు చేయాలన్న పిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

'అమరవీరుల పేర్లను తెలుగు, గోండు భాషల్లో లిఖించాలి'..

హైదరాబాద్ : ఇంద్రవెల్లిలో ఉన్న స్మారక స్థూపానికి అమరవీరుల పేర్లను తెలుగు, గోండు భాషల్లో లిఖించాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, స్మారక పరిరక్షణ కమిటీ కన్వీనర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున కవులు, కళాకారులు ఇంద్రవెల్లి స్థూపం వద్ద నివాళులు అర్పించాలని సూచించారు.

'పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటా'..

అనంతపురం : మూడేళ్లుగా మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు సీఎం ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు, మిగతా రెండేళ్లు నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటానని, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసావహిస్తానని తెలిపారు.

14:59 - April 10, 2017

హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో  కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. గొర్రెల పంపిణీపై విధి విధానాలు, అమ్మ ఒడి పథకం, రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడిపై కలెక్టర్లతో చర్చించనున్నారు.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలు.. భూసేకరణ, న్యాయపరమైన సమస్యలు చర్చకు రానున్నాయి. 

 

14:55 - April 10, 2017

హైదరాబాద్ : గడ్డిన్నారం ఫ్రూట్స్‌ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మామిడికాయల లోడ్‌ను మార్కెట్‌లోనే నిలిపివేసి రైతులు నిరసన వ్యక్తంచేశారు. వ్యాపారులు సరుకును తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:53 - April 10, 2017
14:52 - April 10, 2017

ఢిల్లీ : బిజెపి నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఇష్టానుసారంగా తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు.  ఆ పార్టీకి చెందిన మరో నేత వివాదాస్పద వ్యఖ్యలు చేశారు. దక్షిణ భారతీయుల పట్ల వివక్ష చూపేలా బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం రేగింది. భారత దేశాన్ని విభజించే రీతిలో సదరు నేత మాట్లాడారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  బిజెపి తమ ఐడియాలాజీని దేశంపైకి రుద్దుతోందని విమర్శించారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన తరుణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. భారత్‌ సెక్యులర్‌ దేశమని... కులం, మతం, కలర్‌ ఆధారంగా దేశాన్ని విభజించలేమని, తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన విషయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గుర్తు చేశారు. తమిళ తల్లికి దత్తత పోయినట్లు తరుణ్‌ స్వయంగా చెప్పారని తెలిపారు. రాజ్‌నాథ్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ సభ్యులు సంతృప్తి చెందలేదు.

 

14:50 - April 10, 2017

పెళ్లి..పలు ప్రాంతాల్లో రకరకాలుగా ఈ తంతు జరుగుతుంటుంది. ఈ పెళ్లి వేడుకల్లో మగ పెళ్లి వారి హావా కనిపిస్తుంటుంది. తెగ హడావుడి చేస్తూ కనబడుతుంటారు. అమ్మాయి తరపు వారు అణిగిమణిగి ఉండాలని..ప్రతి విషయంలో పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఫుడ్ విషయంలో మంకు పట్టు పట్టిన మగపెళ్లి వారికి ఓ నవ వధువు షాక్ ఇచ్చింది. తనకు పెళ్లే వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. కర్నాటక రాష్ట్రంలోని కోణనకుంటలోని ఓ కళ్యాణ మండపంలో నాగేంద్రప్రసాద్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం జరగనుంది. శనివారం రాత్రి కళ్యాణ మండపంలో మగ పెళ్లి వారికి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కానీ మగ పెళ్లి వారి తరపున వచ్చిన కొంతమందికి భోజనం అందలేదు. దీనితో తమకు అవమానం జరిగిందంటూ నాగేంద్రప్రసాద్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. చెప్పిన దానికంటే ఎక్కువ సంఖ్యలో రావడంతో ఇలా జరిగిందని, మరలా వంట చేసి పెడుతామని ఆడపెళ్లి వారి తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినిపించుకోకుండా అర్ధరాత్రి వరకు గొడవ కొనసాగింది. చివరకు ఎలాగొ అలా పెద్దవాళ్లు మెత్తబడ్డారు. కానీ ఈ విషయాన్ని పెళ్లి కూతురు సీరియస్ గా తీసుకుంది. పెళ్లి కానప్పుడే ఇలా ఉంటే పెళ్లి అయిన తరువాత పరిస్థితి ఏంటీ అని ఆలోచించింది. వెంటనే తనకు పెళ్లి కొడుకు వద్దని తేగేసి చెప్పింది. ఇరు కుటుంబాలవారు ఆదివారం ఉదయం వరకూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో ఆ పెళ్లి కాస్తా ఆగిపోయింది. నాగేంద్ర ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి, వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు ఆమె స్పష్టం చేసింది.

14:45 - April 10, 2017

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో గత 28 రోజులులగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్నారు. కరవుతో అల్లాడుతున్న తమను ఆదుకోవాలని వారు నిరసనలు చేపడుతున్నారు. కానీ కేంద్రం స్పందించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా నిర్వహిస్తున్న వీరి ఆందోళనలకు పలు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. నిరసనలో భాగంగా సోమవారం వీరు నగ్నంగా ప్రదర్శన చేయడం కలకలం రేగింది. ప్రధానిని కలవడానికి వెళ్లిన వీరిని అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓపిక నశించిన వారు నగ్నంగా నార్త్ బ్లాక్ ముందు పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. చివరికి స్పందించిన పోలీసులు ఏడుగురిని ప్రధాని కార్యాలయానికి తీసుకెళ్లారు. వారు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గడిచిన 140 ఏళ్లలో ఎన్నడు ఇటువంటి కరువు రాలేదని వారు తెలిపారు. తమిళనాడులో దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని...వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

విజయనగం : జిల్లాలోని డెంకాడ మండలం మోపాడ గ్రామ వీఆర్వో ఎ. ఉషారాణి రూ.35వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ముందస్తూ సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడి చేయడంతో వీఆర్వో పట్టుబడ్డారు. 

నగ్నంగా తమిళ రైతుల నిరసన..

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో గత 28 రోజులులగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్నారు. కరవుతో అల్లాడుతున్న తమను ఆదుకోవాలని వారు నిరసనలు చేపడుతున్నారు. కానీ కేంద్రం స్పందించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా నిర్వహిస్తున్న వీరి ఆందోళనలకు పలు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. నిరసనలో భాగంగా సోమవారం వీరు నగ్నంగా ప్రదర్శన చేయడం కలకలం రేగింది. ప్రధానిని కలవడానికి వెళ్లిన వీరిని అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓపిక నశించిన వారు నగ్నంగా నార్త్ బ్లాక్ ముందు పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు.

గడ్డి అన్నారంలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం

హైదరాబాద్ : మామిడి పండ్ల లో ఎట్టిపరిస్థితుల్లో కార్బైడ్ వినియోగించరాదని నిర్ణయించడంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో వ్యాపారుల ఆందోళనకు దిగారు. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో అధికారులు కార్బైడ్ అనుమతికి హామీ ఇవ్వటంతో వ్యాపారులు ఆందోళన విరమించి యార్డులో మామిడి కాయలను కొనుగోళ్లు చేస్తున్నారు.

 

తెలంగాణ ప్రజల బ్రతుకు మారలేదు : తమ్మినేని

హైదరాబాద్ : తెలంగాణ వచ్చినా ప్రజల బ్రతుకుల్లో మార్పులేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టే మహాజన పాదయాత్ర చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుంటుపడిందని, గిరిజనులపై దౌర్జన్యాలు పెరిగాయన్నారు. సీఎం మాటలు విని మిర్చి, కంది పంట పడించిన రైతులు కనీస మద్దతు ధర లేక విలవిలలాడుతున్నారని అన్నారు. జనాభాను బట్టి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ తో కలిసి ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

మధ్యప్రదేశ్ లో బస్సు - ట్రక్కు ఢీ..ముగ్గురి మృతి..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని సిది ప్రాంతంలో ఓ బస్సు - ట్రక్కు లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 42 మందికి గాయాలయ్యాయి. వీరిలో 15 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వీరందరినీ రేవా ఆసుపత్రికి తరలించారు.

13:25 - April 10, 2017

పెద్దపల్లి : మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం కొనసాగుతోంది. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రీ పోస్ట్‌మార్టంను నిర్వహిస్తున్నారు. ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టంలో పాల్గొంటోంది. రీపోస్టుమార్టం ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు. నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ... కోర్టు డైరెక్షన్ లో రీపోస్టుమార్టం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.మధుకర్ ప్రేమించిన అమ్మాయి మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

ఇండియా - ఆస్ట్రేలియా ప్రతినిధుల సమావేశం...

ఢిల్లీ : భారతదేశం - ఆస్ట్రేలియా దేశాల ప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఇరు దేశాల ప్రధాన మంత్రులు హాజరయ్యారు.

 

13:23 - April 10, 2017

హైదరాబాద్‌ : జీడిమెట్ల పరిధి దుండిగల్‌లోని ఎస్ ఆర్ వెంచర్‌లో అక్రమంగా నిర్మించిన విల్లాలను హెచ్‌ఎండీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో 197 విల్లాలు ఉండగా.. 44 విల్లాలకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. 

13:20 - April 10, 2017

ఢిల్లీ: రాత్రి 7 గంటలకు ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ఎన్నిక దగ్గరపడుతుండటంతో ఎన్డీఏ భవిష్యత్‌ కార్యాచరణపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మిత్రాపక్షాల మధ్య ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మెహబూబా ముఫ్తీ, ఉద్దవ్‌ థాక్రే సహా పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి రేసులో ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, సుమిత్రా మహాజన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో ఎంపీ హుకుందేవ్‌ నారాయణ్‌, వెంకయ్యనాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

నేడు ఎన్డీఏ కీలక సమావేశం

ఢిల్లీ : ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక... కేంద్రమంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి రేసులో ఎల్ కే అద్వానీ, సుష్వాస్వరాజ్, సుమిత్రా మహజన్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో ఎంపీ హుకుందేవ్ నారాయణ్, వెంకయ్యనాయుడు ఉన్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

అనుమతిలేని భవనల కూల్చివేత

హైదరాబాద్ : దుండిగల్ మండలం బౌరంపేట పరిధిలో ఎస్ ఆర్ కే గ్రీన్ పార్క్ వెంచర్ లో అనుమతిలేకుండా నిర్మించిన 44 విల్లాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

 

కొనసాగుతున్న తమిళనాడు రైతుల ఆందోళన..

ఢిల్లీ : దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు అర్థనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. వెంటనే కరవు రిలీఫ్ ఫండ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

12:52 - April 10, 2017

హైదరాబాద్: తెల్లటి కాగితంపై నల్లని అక్షరాలు ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయి. బడుగు, బలహీన జీవుల వెనకబడి వెతలను ఆవిష్కరించే ఆయుధాలు అవి. అవి ప్రజల్లో చైతన్యాన్ని కలుగజేస్తాయి. ఆలోచింపచేస్తాయి. బడుగు, బలహీన వర్గాల, పీడితుల బాధితుల సమస్యలను అక్షరీకరించిన మహారచయిత్రులు ఎందురో ఉన్నారు. అటువంటి అక్షర కణికల ద్వారా సమాజాన్ని ప్రశ్నించిన ఓ అతివ కథనంతో మీ ముందుకు వచ్చింది స్ఫూర్తి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:51 - April 10, 2017

ప్రారంభమైన కల్టెకర్ల సదస్సు

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో గొర్రెల పంపిణీపై విధివిధానాలు..అమ్మఒడి పథకం..రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరగనుంది. గ్రామాల్లో తాగునీటి సమస్యలను ఎలా అధిగమించాలి...మిషన్ భగీరథ...మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలు..భూసేకరణ..న్యాయపరమైన సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అంతేగాకుండా ఒంటరి మహిళల పెన్షన్..గ్రామీణ ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి ఆవకాశాలు..సాదా బైనామాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

12:46 - April 10, 2017

పెద్దపల్లి : మధుకర్‌ మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టంకొనాసగుతోంది. పెద్దపల్లి జిల్లా ఖానాపూర్‌లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రులు,. ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టం చేస్తున్నారు. రీపోస్టుమార్టం ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనున్నారు. 

12:42 - April 10, 2017

హైదరాబాద్: ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ సదస్సులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, క్షేత్ర స్థాయిలో వస్తున్న సమస్యలపై చర్చించేందుకు 31 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈసమావేశానికి హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న కిట్లు అమలు ఏ విధంగా అమలు జరుగుతున్నది, చేపలపెంపకం, గొర్రెరల మేకల పెంపకం అమలు, తీరుతెన్నులపై చర్చించిస్తున్నట్లు సమాచారం. ఎండలు ముదురుతున్న సమస్యల తీసుకోవాల్సిన చర్యలు, మిషన్ భగీరథ, కాకతీయ మిషన్ వీటన్నింటి కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

12:31 - April 10, 2017

బాలీవుడ్ హీరోయిన్ 'అనుష్క శర్మకు' బీఎంసీ నోటీసులు జారీ చేసింది. అక్రమంగా నిర్మాణంపై ఈ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అనుష్క ముంబై లోని వర్సోవా ప్రాంతంలోని బద్రినాథ్ టవర్స్ నివాసం ఉంటోంది. ఈ టవర్ లోని 20 అంతస్తులో 'అనుష్క' కు మూడు ప్లాట్లున్నాయి. ఎవరి అనుమతి లేకుండానే ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ పెట్టించుకున్నారంటూ టవర్ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి బీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బీఎంసీ వెంటనే జంక్షన్ బాక్స్ తొలగించి వివరణ ఇవ్వాలంటూ 'అనుష్క'కు నోటీసులు జారీ చేసింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే జంక్షన్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని 'అనుష్క' మేనేజర్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

12:28 - April 10, 2017

హైదరాబాద్ : తాము నిర్వహించిన పాదయాత్రలో ఏ ఒక్కరూ ప్రశ్నించలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ప్రశ్నించాలని..పాదయాత్రను అడ్డుకోవాలని అధికారపక్షం ఇచ్చిన పిలుపును ఎవరూ పట్టంచుకోలేదని పేర్కొన్నారు. తమకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారని తెలిపారు. ఇటీవలే సీపీఎం మహాజన పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో టిడబ్ల్యూజేఎఫ్, హెచ్ యుజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాదయాత్ర విశేషాలను వెల్లడించారు. టిఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు తమ పాదయాత్రకు మద్దతు తెలియచేశారని తెలిపారు. టీఆర్ఎస్ పెద్దలు కొందరు తమను ఆహ్వానించి..భోజనం..ఆర్థికం సహాయం చేసిన వారున్నారని, కాంగ్రెస్, టిడిపి, వైసిపి, లోక్ సత్తా, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయని, న్యూ డెమోక్రసీకి చెందిన నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలిపాయన్నారు.

సామాజిక న్యాయం కోసం ఐక్య కార్యాచరణ..
సామాజిక న్యాయం సాధించడం కోసం ఒక ఐక్యకార్యచరణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, రాజకీయ సంఘంగా ఏర్పాటు చేయాలా ? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి ఒక రూపు వస్తుందని, మే నెలలో ఒక వేదిక ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున్న ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. పాదయాత్ర అనంతరం పలు రాజకీయ సంఘాలు ముందుకొస్తున్నాయని, గద్దర్ ముందుకు రావడం..పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని ప్రకటించడం..కోదండరాం మరింత ఉద్యమాలు చేయడానికి ఏర్పాట్లు చేయడం...బీసీ నేత కృష్ణయ్య కూడా ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. వీరందరితోనూ మాట్లాడడం జరుగుతోందని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తమ్మినేని వెల్లడించారు.

నారా వారి ఇంటా గృహ ప్రవేశ సందడి

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లోని నారా చంద్రబాబు నాయుడు ఇంటా గృహ ప్రవేశ సందడి నెలకొంది. ఆయన ఇంటికి బాలకృష్ణ, నారా కోహిత్, కళ్యాణ్ రాం కుటుంబ సభ్యులు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

మంత్రి ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్ : రామంతాపూర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్య ఆరోగ్యా శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు విధులకు హాజరు కాలేదు. దీంతో సకాలంలో హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

 

మిషన్ కాకతీయపై సమీక్ష

హైదరాబాద్ : జలసౌధలో మిషన్ కాకతీయ పనులపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఏరియాలోని చెరువుల పునరుద్ధరణ పనులపై సంబంధిత అధికారులతో మంత్రులు సమీక్షించారు. వానకాలం నాటికి చెరువుల పునరుద్ధరణ పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు.

 

కుటుంబం ఆత్మహత్యాయత్నం..నలుగురు మృతి..

తూర్పుగోదావరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేగింది. కొత్తపేట మండలం పలిమేల వంతెన వద్ద ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన ప్రమీల, ఆమె చెల్లి పుష్పాలతతో సహా ఐదుగురు కాల్వలోకి దూకారు. అక్కడనే ఉన్న స్థానికులు దీనిని గమనించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఒకరిని మాత్రం కాపాడారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపులు చర్యలు చేపట్టారు. ఆదివారం ఒకరి మృతదేహం లభ్యం కాగా సోమవారం ఉదయం మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణాలని తెలుస్తోంది.

11:33 - April 10, 2017
11:32 - April 10, 2017

తూర్పు గోదావరి :: జిల్లాలో విషాదం నెలకొంది. కాలువలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో ఇవాళ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఒకరి మృతదేహాం లభ్యమవ్వగా.. మరొకరిని స్థానికులు రక్షించారు. కొత్తపేట మండలం పలివెల వంతెన దగ్గర అక్కాచెల్లెల్లైన ప్రమీల, పుష్పవతి వారి పిల్లలు కాల్వలోకి దూకారు. 

11:30 - April 10, 2017

వరంగల్: మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని వరంగల్‌ ఎనుమాముల మార్కెట్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మార్కెట్‌యార్డులోకి కాంగ్రెస్ నేతలు, రైతులు చొచ్చుకెళ్లారు. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, గండ్ర పాల్గొన్నారు. గత కొద్ది రోజులు సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చికి మద్దతు ధర కల్పించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినా ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో ఈ రోజు వారికి కాంగ్రెస్ తోడై ఆందోళనను ఉధృతం చేశాయి. మార్కెట్ కమిటి చైర్మన్ కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.

11:28 - April 10, 2017

ప్రపంచంలో టాలీవుడ్ సత్తా ఏంటో చూపెట్టిన చిత్రం 'బాహుబలి'..ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన 'రాజమౌళి' 'బాహుబలి -2' చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే చిత్ర ఆడియో వేడుకలను అట్టహాసంగా నిర్వహించిన చిత్ర యూనిట్ రిలీజ్ కు సిద్ధం చేశారు. ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇతర సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఈ సమయంలో చిత్రం విడుదల చేయకపోవడమే మంచిదని 'బాహుబలి' హావాలో తమ సినిమాలు కొట్టుకపోతాయని గ్రహించి రిలీజ్ డేట్ లను మార్చుకుంటున్నారు. కానీ టాలీవుడ్ లో తన నటనతో అభిమానులను అలరిస్తున్న యువ నటుడు 'నిఖిల్' పెద్ద సాహసం చేస్తున్నాడని టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆయన నటిస్తున్న 'కేశవ' చిత్రం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. 'స్వామి రారా' సినిమా తీసిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే చిత్ర పోస్టర్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఆసక్తికరమైన రివేంజ్ డ్రామాతో ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈనెలలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. 'బాహుబలి -2' రిలీజ్ కు దగ్గరలోనే 'కేశవ'ను కూడా విడుదల చేయాలని ప్లాన్స్ వేస్తున్నట్లు టాక్. మరి ఇది నిజమా ? కాదా ? అనేది చిత్ర యూనిట్ ధృవీకరించాల్సి ఉంది.

11:27 - April 10, 2017

పెద్దపల్లి :హైకోర్టు ఆదేశాల ప్రకారం మరికాసేపట్లో మంథని మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా ఏసీపీ సింధుశర్మ తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా రాత్రి నుంచి మధుకర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్పాట్‌లో పోలీసులతో పాటు మధుకర్ కుటుంబసభ్యులనూ ఉంచామని ఆమె తెలిపారు. రీపోస్టుమార్టం తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామన్నారు.  

11:24 - April 10, 2017

అమరావతి: వెలగపూడి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రతిపాటి పుల్లారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. పౌరసరఫరాల శాఖను నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతుల పండించిన పంటలకు మద్దతు ధర అందించి వారిని ఆదుకుంటామని చెప్పారు. 

11:23 - April 10, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దుపై ఏఐడీఎంకే స్పందించింది. తాను ఎన్నికల్లో గెలవడం ఈసీకి ఇష్టంలేదని ఏఐడీఎంకే అభ్యర్థి దినకరన్‌ ఆరోపించారు. పోలింగ్ మాత్రమే వాయిదా పడిందని, తన విజయం కాదన్నారు. ఉప ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచారనే నెపంతో పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇవాళ కొత్త షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. 

11:21 - April 10, 2017

పెద్దపల్లి : మధుకర్‌ మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. పెద్దపల్లి జిల్లా ఖానాపూర్‌లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రీ పోస్ట్‌మార్టం చేయనున్నారు. ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టం చేయనుంది. రీపోస్ట్‌మార్టంతో వాస్తవాలు వెలుగుచూస్తాయని కుటుంబసభ్యులు అంటున్నారు. మధుకర్‌ది ముమ్మాటికి హత్యే అని ఆరోపిస్తున్నారు. 

11:19 - April 10, 2017

అనసూయ..బుల్లితెరపై తన అందం..నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే వెండి తెరకు కూడా పరిచయమైంది. పలు చిత్రాల్లో నటించడం..ప్రత్యేక పాటల్లో నటించడం చేస్తోంది. అంతేగాకుండా పలువురు ప్రముఖ హీరోల సినిమాల్లో సైతం 'అనసూయ' ఛాన్స్ లు అందుకుంటోంది. 'నాగార్జున' 'సొగ్గాడు చిన్ని నాయన'..ఇటీవలే వచ్చిన 'విన్నర్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. తాజాగా 'రామ్ చరణ్' హీరోగా నటిస్తున్న సినిమాలో 'అనసూయ'కు ఛాన్స్ లభించిందని టాక్. సుకుమార్ దర్శకత్వంలో 'చెర్రీ' హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రకు గాను 'అనసూయ'ని చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని తెలుస్తోంది. కానీ 'చెర్రీ' సినిమాలో ఆమె పాత్ర ఏంటీ అనేది తెలియరావడం లేదు. స్పెషల్ సాంగ్ ఉంటుందా ? లేక ఏదైనా పాత్ర ఉంటుందా ? అనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

రాయ్ పూర్ లో అగ్నిప్రమాదం

ఛతీస్ గఢ్ : రాయ్ పూర్ లోని రెహ్మానియా చౌక్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అంటుకొని ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఓ హోటల్, దుకాణాల్లో మంటల వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని  మంటలార్పుతున్నారు.

 

10:59 - April 10, 2017

ఆహారంలో శ్రద్ధ వహించకపోతే శరీరంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. నిత్యం ఏదో ఒకరమైన అనారోగ్యంతో బాధ పడుతుంటుంటారు. ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. పౌష్టికాహారం తినడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
క్యాలీ ఫ్లవర్ లో ఎక్కువగా మినరల్స్..విటమిన్స్..న్యూట్రీన్స్..యాంటి ఆక్సిడెంట్ లతో పాటు క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. అధికరక్త పోటును అదుపులో ఉంచుతుంది. క్యాలీ ఫ్లవర్ లో ముఖ్యంగా విటమిన్ సి, కె, ప్రోటీన్లు, మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
ఆకుకూరలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఎక్కువగా విటమిన్ సి, ఏ, కెలు సమృద్ధిగా లభిస్తాయి. శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి. ఐరన్ ఎక్కువ శాతం కూడా ఉంటుంది.
బాదం..బీన్స్..శనగలు..చిక్కుడు వంటి గింజల్లో ప్రోటీన్స్..ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది.

10:58 - April 10, 2017

బాలీవుడ్ హీరోయిన్ 'అనుష్క శర్మ' మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' తో 'అనుష్క' మరోసారి నటించనున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ' ది రింగ్' చిత్రంలో 'షారూఖ్'తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో షారూఖ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. మొదటగా 'కత్రీనా కైఫ్' ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ ను 'దీపికా పదుకొనే'ను ఎంపిక చేశారు. కానీ 'దీపికా'తో నటించేందుకు 'కత్రీనా' విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీనితో 'దీపిక' స్థానంలో 'అనుష్క' బెటర్ ని చిత్ర యూనిట్ భావించిందని, అనుష్క విషయంలో కత్రీనా సానుకూలంగా ఉండడంతో ఆమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. షారూఖ్ తో మరోసారి నటించేందుకు అవకాశం రావడం పట్ల 'అనుష్క' సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న బయోపిక్ 'దత్' చిత్రంలో 'అనుష్క శర్మ' అతిథి పాత్ర పోషిస్తోంది.

నిలిచిన పండ్ల మార్కెట్ విక్రయాలు

హైదరాబాద్ : గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో విక్రయాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకుని మార్కెట్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. మార్కెట్ లోని సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి క్రయవిక్రయాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

భారత్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం

శ్రీనగర్ :జమ్మూకాశ్మీర్ లోని కెరాన్ సెక్టార్ ప్రాంతంలో నలుగురుమ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. వారిని భారత సైన్యం హతమార్చింది.

09:42 - April 10, 2017

హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణానికి భిన్నంగా వైరస్‌ విజృంభిస్తోంది. 3 నెలల్లో హైదరాబాద్‌లో 488 కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందారు. అటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఈఏడాది ఇప్పటివరకు 466 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 12 కేసులు రికార్డయ్యాయి.  

రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్ ప్లూ

హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ శివారులో స్వైన్ ప్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో గత వారం రోజుల్లో 12 స్వైన్ ప్లూ కేసులు నమోదయ్యాయి. వాతావరణానికి భిన్నంగా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్ లో 12మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

09:14 - April 10, 2017

పెద్దపల్లి: మధుకర్ ది ముమ్మాటికి హత్యే అని దళిత సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మంథనిలో అనుమానాస్పద మృతిగా భావించిన మధుకర్ మృత దేహానికి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ మనుధర్మశాస్త్రం పరిపాలన చేస్తోందన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘానికి కూడా చేస్తామని హెచ్చరించారు. నాకు న్యాయం కావాలని మధుకర్ తల్లి పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

08:08 - April 10, 2017
07:52 - April 10, 2017

హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆర్థిక నేరస్తుడుగా పదేపదే ప్రస్తావిస్తున్న సీఎం చంద్రబాబు రాజధాని భూ సేకరణ పేరుతో చేస్తున్నదీ ఆర్థిక నేరమేనని, ఆయనే అసలైన ఆర్థిక నేరస్తుడని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఆర్థిక నేరస్థుడు జగనా? లేదా చంద్రబాబా? ఎవరు?. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పక్కకు నెట్టి ఆర్థిక నేరం పై ఎందుకు మాట్లాడుతున్నారు?, వైసీపీ కాంగ్రెస్ కలిసిపోనుందా? నిజామాబాద్ సభలో అన్నను ఆశీర్వదించండి అని కవిత అంటే, 20 ఏళ్లు కేసీఆరే సీఎం గా ఉంటారని హరీష్ రావు అన్నారు. కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు పార్టీలో జరగుతుందా? ఈఅంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, వైసీపీ నేత కొండారాఘవరెడ్డి, టిడిపి నేత విజయ్ కుమార్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఈజిప్ట్‌లో భారీ పేలుడు :21 మంది మృతి

హైదరాబాద్: ఈజిప్ట్‌లో భారీ పేలుడు సంభవించింది. టన్టా పట్టణంలోని పట్టణంలోని మార్‌ గర్జెస్‌ కోప్టిక్‌ చర్చిలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పేలుడు పదార్ధాలతో వచ్చి చర్చిలో తనని తాను పేల్చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడ్డ వారికి వైద్యం అందించేందుకు మిలిటరీ ఆస్పత్రులు వెంటనే తెరవాలని అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా ఆదేశించారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఐసిస్‌ ప్రకటించింది.

ఉద్రిక్తతల మధ్య ముగిసిన శ్రీనగర్ లోక్‌సభ బైపోల్

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. గతంలో ఎన్నడూ లేనంత అతి తక్కువగా 6.5 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరుకోలేక పోవడంతో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. పోలింగ్ ప్రక్రియను వేర్పాటువాద శక్తులు, ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు పలు పోలింగ్ బూత్‌లపై రాళ్ల వర్షం కురిపించారు. భద్రతా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపి హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నేరుగా కాల్పులకు దిగారు.

07:03 - April 10, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకరవు తాండవిస్తోంది. రాష్ట్రంలో భానుడి భగభగలతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బోరుబావులపైనే అధికంగా ఆధారపడ్డ రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతేడాది కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు, డ్యామ్‌లు నిండడంతో రెండేళ్ల వరకు నీటికొరత ఉండదని భావించిన రైతులు.. ఈ యాసంగిలో ఉత్సాహంగానే పంటల సాగు చేపట్టారు. అయితే దిగుబడి చేతికి వచ్చే సమయానికి నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఏమి చేయాలో తోచక సతమతమవుతున్నారు.

82 గ్రామాల్లో భూ గర్భ జలాలు ప్రమాదకర స్థాయికి...

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 82 గ్రామాల్లో భూ గర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దాదాపు 15 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోతుండడం రైతాంగంలో ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాలు ప్రమాద స్థాయికి పడిపోవడంతో, ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో కొత్త బోర్ల తవ్వకాన్ని, సమీప చెరువుల్లో పూడిక తీత పనులను నిషేధించింది. దీన్ని బట్టే, ఇక్కడి భూగర్భ జల సంపద ఏమాత్రం అందుబాటులో ఉందో అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో.. ఎండుతున్న పైర్లను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆపసోపాలు పడుతున్నారు.

కరీంనగర్ జిల్లా పరిధిలో...

కరీంనగర్ జిల్లా పరిధిలో చొప్పదండి, గంగాధర, చిగురు మామిడి, గన్నేరువరం.. జగిత్యాల జిల్లాలో కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి, కొడిమ్యాల... రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, ఎల్లారెడ్డి పేట, చందుర్తి, ముస్తాబాద్, కోనరావు పేట మండల్లాలోనే సుమారు 82 గ్రామాల్లో బోర్ల తవ్వకాన్ని నిషేధించారు. ఇవన్నీ పూర్తి వర్షాభావ ప్రాంతపు మండలాలే. అంతేకాదు, ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోకి రాని గ్రామాలు. విపరీతమైన ఎండల కారణంగా నీటి వాడకం పెరగడంతో ఆ ప్రభావం పంటలపై పడింది. దీంతో యాసంగి పంటలు పశువులకు మేతగా మిగిలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండిన పంటలను ఇటీవలే ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. యాసంగి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని భరోసా కల్పించారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంపై రైతులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

07:01 - April 10, 2017

కృష్ణా : జిల్లాలోని మెవ్వ మండలంలోని కాజ గ్రామంలో స్వచ్ఛభారత్‌ వైపు అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో ఈ గ్రామాన్ని మెగా ఇంజనీరింగ్‌ సంస్థ చైర్మన్‌ పి.పి.రెడ్డి దత్తత తీసుకున్నారు. కాజను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

కాజ గ్రామాన్ని సందర్శించిన పి.పి.రెడ్డి....

దత్తత తీసుకున్న కాజ గ్రామాన్ని ఆదివారం పి.పి.రెడ్డి సందర్శించారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇక నుంచి కాజ గ్రామంలో ఎవరూ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామంలోని మూడు వందల కుటుంబాలకు పి.పి.రెడ్డి రెడీమేడ్‌ టాయిలెట్స్‌ను పంపిణీ చేశారు.

కాజ ప్రధాన సెంటర్‌లో సభను ఏర్పాటు...

కాజ ప్రధాన సెంటర్‌లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న పి.పి.రెడ్డి... గ్రామాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఐక్యంగా ముందుకు సాగితే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. త్వరలోనే గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చుతానని హామీనిచ్చారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుపుతానన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు పి.పి.రెడ్డికి..

కాజ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు పి.పి.రెడ్డికి తెలియజేశారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు... త్వరలోనే సేవా కార్యక్రమాలు చేపడుతామనని గ్రామస్తులకు పి.పి.రెడ్డి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సుధారాణితోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

06:58 - April 10, 2017

తూర్పు గోదావరి : జిల్లాలో విషాదం నెలకొంది. కాలువలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొత్తపేట మండలం పలివెల వంతెన దగ్గర అక్కాచెల్లెల్లైన ప్రమీల, పుష్పవతి వారి పిల్లలు కాల్వలోకి దూకారు. వీరిలో ఓ బాలుడు చనిపోయారు. ఇద్దరిని స్థానికులు రక్షించారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

06:57 - April 10, 2017

విశాఖ. అంతర్జాతీయంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నగరం. ఇక్కడి పరిశ్రమలు ఒక ఎత్తయితే.. ప్రకృతి రమణీయత మరో ఎత్తు. దీంతో రాష్ట్ర విభజన అనంతరం విశాఖ అత్యంత పెద్ద నగరంగా రూపాంతరం చెందింది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్‌ సిటీ జాబితాలో విశాఖను చేర్చారు. వేలాది కోట్లతో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ప్రకటించారు.

పాలకులు ఊదరగొట్టిన అభివృద్ధి ఏదీ నగరంలో ...

అయితే.. పాలకులు ఊదరగొట్టిన అభివృద్ధి ఏదీ నగరంలో కనిపించడం లేదు. స్లమ్స్‌ లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 632 వందల చదరపు కిలోమీటర్లు ఉన్న విశాఖ నగరంలో కేవలం 0.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మాత్రమే స్మార్ట్‌ సిటీగా ప్రకటించడం జరిగిందని నగరవాసులంటున్నారు. ఇది కూడా ధనవంతులు ఉండే ప్రాంతమే అంటున్నారు.

నగరంలో స్లమ్స్‌ పెరిగి మురికివాడల నగరంగా...

రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో నగరంలో స్లమ్స్‌ పెరిగి మురికివాడల నగరంగా తయారైందని ప్రజలంటున్నారు. మురికివాడల సంఖ్యను తగ్గించేందుకు వందల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలో 2013లో నగరంలో 741 ఉన్న స్లమ్స్‌ ఉండగా.. అవి 790కి పెరిగాయని ప్రకటించింది. అదేవిధంగా మురికివాడల్లో ఉండే జనాభా సంఖ్య 352 శాతం పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే విశాఖ నగరం ముంబయి తరహాలో మురికివాడల నగరంగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

జీవీఎంసీ బడ్జెట్‌లో 40 శాతం నిధులు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ ...

ఇక మురికివాడల నిర్మూలనకు జీవీఎంసీ బడ్జెట్‌లో 40 శాతం నిధులు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ పాలకులు అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో క్రమక్రమంగా స్లమ్స్‌ పెరిగిపోతున్నాయి. అయితే.. నగరంలో మురికివాడలను నిర్మూలించకుండా స్మార్ట్‌సిటీ ఎలా చేస్తారని స్వచ్చందసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్‌ సిటీ పేరుతో పేదలను స్లమ్స్‌ నుంచి ఖాళీ చేయించి విలువైన భూములు కొట్టేయ్యడానికి ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే.. అధికారుల వాదన మరోలా ఉంది. 2022లోగా మురికివాడలన్నీ నిర్మూలించి పేదలకు ఇళ్లు కట్టిస్తామంటున్నారు. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా చేస్తామంటూ గొప్పలు చెబుతున్న పాలకులు.. మురికి వాడల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

 

06:53 - April 10, 2017

కడప : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన రాములవారి కల్యాణానికి రంగం సిద్దమైంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారి కళ్యాణం జరుగనుంది. దీనికోసం రాములవారి కల్యాణమండపాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. పున్నమి వెలుగులు విద్యుత్‌కాంతుల ధగధగలతో రాములవారి కల్యాణమండపం కళకళలాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు పర్యటన రద్దు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టు వస్త్రాలు, ముత్యాలు తలంబ్రాలు సమర్పించనున్నారు.

ముఖ్య అతిధిగా గవర్నర్ నరసింహన్....

సీతారాముల వారి కల్యాణానికి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు,..సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నారు. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారన్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కళ్యాణ మండపంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా భారీకేడ్లు ఏర్పాటు చేసి మహిళలకు, వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఏ రామాలయంలో లేని విశిష్టతలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో

దేశంలో ఏ రామాలయంలో లేని విశిష్టతలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఉన్నాయి. హనుమంతుడి విగ్రహాం లేని సీతారామలక్ష్మణులు కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామివారి కల్యాణం కూడా రాత్రి వేళలో జరగడం మరో విశిష్టత. శ్రీరాముడు చైత్రశుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అందువల్ల పరిణయ మహోత్సవాలు అయోద్యలోనైనా, భద్రాద్రిలోనైనా దేశంలోని ఏ ఆలయంలోనైనా నవమినాడు అభిజిత్ లగ్నంలో పగటిపూట నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం కల్యాణోత్సవం చైత్రశుద్ద చతుర్ధశి రోజు రాత్రిపూట నిర్వహిస్తారు.

కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రనలుమూలలనుంచే కాకుండా..

సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రనలుమూలలనుంచే కాకుండా పక్కరాష్ట్రాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

నేడు ఒంటిమిట్ట ఆయలంలో రాములోరి కల్యాణం...

కడప : జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి నిండు పున్నమిలో 8 గంటల నుంచి కల్యాణం మొదలుకానుంది. ఇందుకోసం కోదండరామస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ కాంతుల్లో రాములోరి కల్యాణ మండపం వెలిగిపోతోంది. సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి మాణిక్యాలరావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

06:50 - April 10, 2017

కడప :జిల్లా రాజకీయాలు.. అంతకంతకు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు జిల్లా రాజకీయాల కాకను తారస్థాయికి చేరుస్తోంది. మొన్నటివరకూ వైసీపీలో కొనసాగిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, టీడీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీలోనే కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి వర్గం దీన్ని జీర్ణించుకోలేక పోయింది. దీనికితోడు, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కూడా కట్టబెట్టడాన్ని, రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓ దశలో, రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెబుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇస్తానని హామీ ఇవ్వడంతో, ఆ వర్గం కాస్తంత శాంతించినట్లు కనిపించింది.

కుటుంబాల మధ్య సుమారు 3 దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌ ...

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య సుమారు 3 దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌ నడుస్తోంది. అయితే, 30 ఏళ్లుగా టీడీపీలో ఉండి దేవగుడి ఆదినారాయణరెడ్డి సోదరులపై పోరాడుతున్న తమకు అన్యాయం చేశారన్న భావన రామసుబ్బారెడ్డి వర్గంలో వ్యక్తమవుతోంది. అనుచరులైతే పార్టీని వీడదామంటూ రామసుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే.. రామసుబ్బారెడ్డి మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ క్రమంలో.. జమ్మలమడుగులో జరిగిన పార్టీ సమావేశాన్ని, తమ కోపాన్ని వ్యక్తం చేసేందుకు వేదికగా ఎంచుకున్నారు.. రామసుబ్బారెడ్డి అనుచరులు. ముఖ్యంగా సీఎం రమేశ్‌ లక్ష్యంగా కుర్చీలతో దాడి చేశారు. ఆదినారాయణరెడ్డిని ప్రోత్సహిస్తూ, రామసుబ్బారెడ్డిని పార్టీకి దూరం చేయడంలో రమేశ్‌దే కీలక భూమిక అని, రామసుబ్బారెడ్డి వర్గీయులు భావిస్తున్నట్లు ఈ దాడిద్వారా తేటతెల్లమైంది.

కడప జిల్లాలో వైసీపీ హవా తగ్గించి టీడీపీని బలోపేతం చేసేందుకు...

కడప జిల్లాలో వైసీపీ హవా తగ్గించి టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నారు. దీనికి ఆదినారాయణరెడ్డి కృషే ప్రధాన కారణమని గుర్తించారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపికి గౌరవప్రదమైన సీట్లు సాధించిపెట్టేందుకు, ఆదినారాయణ రెడ్డి వర్గం ఉపకరిస్తుందని నమ్మారని, అందుకే చంద్రబాబు ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారన్నది ఆయన వర్గీయుల వాదన. మొత్తానికి ఇంతకాలం వేర్వేరు పార్టీల్లో ఉండి ఫ్యాక్షన్‌ నడిపిన ఇరు వర్గాలూ ఇప్పుడు, ఒకే పార్టీలోనే ఉంటూ ఘర్షణకు దిగుతున్నారు. ఇది టీడీపీకి ఇబ్బందిని కలిగించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, నివురుగప్పిన నిప్పులా ఉన్న కడప జిల్లా టీడీపీ అంతర్గత విభేదాలు భవిష్యత్తులో మరెన్ని మలుపులు తీసుకుంటాయోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

వేడెక్కుతున్న కడప జిల్లా రాజకీయాలు

కడప : జిల్లాలో తెలుగు దేశం నేతల మధ్య కుమ్ములాటలు శ్రుతిమించుతున్నాయి. ముఖ్యంగా, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు.. మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొన్నటి వరకూ వేర్వేరు పార్టీల్లో ఉంటూ తలపడిన ఈ ఇద్దరు నేతలూ.. ఒకేపార్టీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈరెండు వర్గాల మధ్య ఘర్షణ... ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కడంతో తారస్థాయికి చేరాయి. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు చెప్పినా.. ఆయన వర్గం సంతృప్తి చెందడం లేదు.

బసవతారకం ఆస్పతిల్రో డార్మెటరీ భవనం ప్రారంభం..

హైదరాబాద్: బసవతారకం కేన్సర్‌ ఆస్పిటల్‌ ట్రస్ట్‌ ద్వారా లక్షలాది మంది పేదలకు వైద్యసహాయం అందుతోందని ట్రస్ట్‌ చైర్మన్‌ బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రిలో కొత్తగా డార్మెటరీ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. భవిష్యత్తులో ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. సంపాదనలో కొంత సర్వీసు కోసం ఖర్చుపెట్టాలని దాతలకు పిలుపు నిచ్చారు బాబు.

06:45 - April 10, 2017

తమిళనాడు : చెన్నై మౌంట్‌ రోడ్డులో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడటంతో.. వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అకస్మాత్తుగా ఏర్పడ్డ గోతిలోకి ఓ బస్సు, కారు కూరుకుపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడాన్ని గమనించి వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. వారంతా కిందకు దిగిన వెంటనే బస్సు గోతిలో కూరుకుపోయింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైలు పనుల కారణంగానే రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడిందని భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో గోయ్యిలో కూరుకుపోయిన బస్సు, కారును బయటకు తీశారు.

06:44 - April 10, 2017

హైదరాబాద్ : సంచలనం రేపిన మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత పోలీసులు కేసును ఆత్మహత్యగా చిత్రీకరించి చేతులు దులుపుకున్నారు. అయితే.. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగిన కమిషనర్‌ దుగ్గల్‌ కుటుంబ సభ్యులను కలిసి పూర్తిస్థాయికి ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను వేటు వేశారు.

మొదటి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై నమ్మకం లేని కుటుంబ సభ్యులు ...

ఇక మొదటి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై నమ్మకం లేని కుటుంబ సభ్యులు రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. స్థానిక మెజిస్ట్రేట్‌, కుటుంబ సభ్యుల సమక్షంలో.. ఉస్మానియా ఆస్పత్రి, కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్యుల బృందం ఈరోజు రీపోస్ట్‌మార్టం నిర్వహించనుంది.

ఇది ఖచ్చితంగా హత్యేనని కుటుంబ సభ్యులు...

ఇది ఖచ్చితంగా హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ తమ్ముడిని కొట్టి చంపారని మధుకర్‌ సోదరుడు సమ్మయ్య అంటున్నారు. తిరిగి పోలీసులు తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొదటినుంచి పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళితుడు కాబట్టే ఇలాంటి వివక్ష కొనసాగుతుందంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దళిత నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే... సెల్‌పోన్‌ డేటా ఆధారంగా 30 మందిని అదుపులోకి తీసుకుని విచారించామని.. ఇంకా అనేకమందిని విచారిస్తున్నామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పుట్టా మధు..

ఇదిలావుంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పుట్టా మధు.. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి అనేక ట్విస్టులు నెలకొన్న ఈ అనుమానాస్పద మృతి కేసులో రీపోస్ట్‌మార్టంతో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

నేడు మధుకర్‌ మృతదేహానికి రీపోస్ట్‌మార్టం

హైదరాబాద్ : సంచలనం రేపిన మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత పోలీసులు కేసును ఆత్మహత్యగా చిత్రీకరించి చేతులు దులుపుకున్నారు. అయితే.. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగిన కమిషనర్‌ దుగ్గల్‌ కుటుంబ సభ్యులను కలిసి పూర్తిస్థాయికి ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను వేటు వేశారు.

06:40 - April 10, 2017

చెన్నె : తమిళనాడులోని ఆర్కేనగర్‌ శాసనసభ స్థానానికి ఈనెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఈ ఎన్నిక కోసం 89 కోట్లు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సమావేశమైన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌....

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ స్థానానికి 12న ఉప ఎన్నిక జరగాల్సిఉండగా.. అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ పలువురు ఇళ్లపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా 90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీగానే ఉంటాయని ఐటీ శాఖ భావించింది. ఎన్నికల కోసం విచ్చలవిడిగా సాగుతున్న ధన ప్రవాహంపై ఈసీకి ఐటీ శాఖ సమగ్ర రిపోర్టు అందజేసింది. దీనిని సమగ్రంగా పరిశీలించిన ఈసీ ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

విచ్చలవిడిగా డబ్బులు పంచిన అభ్యర్థులు డైలామాలో ...

ఉప ఎన్నిక వాయిదా పడడంతో విచ్చలవిడిగా డబ్బులు పంచిన అభ్యర్థులు డైలామాలో పడ్డారు. ఇప్పుడేమీ చేయాలా.. అని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారా అని ఆలోచనలో పడ్డారు. ఇదిలావుంటే ఎన్నికల సంఘం మాత్రం ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలుపుతామని ప్రకటించింది.

ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా...

చెన్నె : అందరూ ఊహించినట్లే జరిగింది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో ధన ప్రవాహం ఏరులై పారడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 12న జరగాల్సిన ఉప ఎన్నికను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు ఉప ఎన్నిక నిర్వహించేంది త్వరలోనే తెలుపుతామని ప్రకటించింది.

06:37 - April 10, 2017

హైదరాబాద్ : 154 రోజుల పాదయాత్రలో పాల్గొన్నవారిలో అత్యంత పిన్నవయస్సుడు నైతం రాజు. కేవలం 29 ఏళ్ల వయస్సులోనే 4200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి బ్యాచిలర్ గా కూడా నైతం రాజు రికార్డు సృష్టించారు. కొమురంభీం జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నైతం రాజు సిర్పూర్ కాగజ్ నగర్ లో డిగ్రీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నైతం రాజు ఎనిమిదిసార్లు అరెస్టయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డతర్వాత ఆదివాసీ సమస్యల మీద, పోడు భూముల సమస్యల మీద పోరాడుతున్నారు. మహాజన పాదయాత్రలో పాల్గొన్న నైతం రాజు తన అననుభవాలు వివరించేందుకు ఇవాళ్టి జనపథంకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss