Activities calendar

11 April 2017

22:25 - April 11, 2017

హైదరాబాద్ : రైతు రుణమాఫీలో భాగంగా చివరివిడత  నిధులను కేసీఆర్‌ సర్కార్‌ విడుదల చేసింది. మొదటి మూడు విడతల్లో  4వేల 2వందల కోట్ల రూపాయలచొప్పున.. విడుదల చేసిన ప్రభుత్వం.. నాలుగో దఫాలో మిగిలిన  4వేల కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు కిస్తీల్లో 36 లక్షల మంది రైతులకు సంబంధించిన 17 వేల కోట్ల రూపాయల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది.

22:20 - April 11, 2017

ఢిల్లీ నడిబొడ్డున తమ బతుకులను విప్పిచూపెడుతున్నారు..బట్టలుకాదు వాళ్లు విప్పింది.. బతుకు మీద తీపిన విసిరివేస్తున్నారు. సర్కారుకు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. చట్టసభలో మా గురించి ఎందుకు మాట్లాడరూ నిలదీస్తున్నారు. దేశంలో అడుగడుగునా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతన్నలకు ప్రతినిధులుగా తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన దేశవ్యాప్త చర్చను లేవనెత్తుతోంది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం... పూర్తి వివరాలను వీడియోలో చూడండి. 

22:11 - April 11, 2017

పూలె ఆశయాల సాధనకు కృషి చేస్తాం...ఇంకా కృషికాడనే ఉంటే అమలెప్పుడు మరి, తెలంగాణల సరువైన ఎన్నికల పొత్తులు... టీఆర్ ఎస్ కు ధీటుగా రడైతున్న కూటమి, చెట్ల మీద ఇస్తర్లుకుడ్తున్న ముఖ్యమంత్రి.. గొర్లువంచుడు సంపదొచ్చుడు ఐపోయింది, అధికారం కోసం ఆరాట పడుతున్న కాంగ్రెస్... రైతు బాధలమీద రందిగల్ల పోరాటం, మీ పిల్లలను సర్కారు బల్ల చేర్పించాలి... ఎమ్మెల్యేల పిల్లలు ప్రయివేట్ బడికిపోతరు, ఇరవై ఏండ్లకే వంగిపోతున్న నడుములు...నీళ్ల మంత్రులేలిన అందని మంచినీళ్లు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

22:01 - April 11, 2017

జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ప్రజాశక్తి మాజీ ఎడిటర్ ఎస్.వినయ్ కుమార్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది. పూలే గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'మహిళా వ్యవస్థపై పోరాడిన లొతి సంఘ సంస్కకర్త పూలే. బ్రాహ్మణ మహిళా కష్టాలపై పోరాటం చేసిన పూలే. పూలే, మార్క్స్ సమకాలీకుడు. ప్రస్తుత సామాజిక సమకాలీన అంశాలకీ పూలే సిద్ధాంతమే ప్రాతిపదిక. ఒకరి గురించి ఒకరికి తెలియకున్నా.. ఇద్దరి పిలుపులో సారాంశం ఒక్కటే. మహాజన భావనకు ఆవిష్కకర్త పూలే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

21:55 - April 11, 2017

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్, ప్రముఖ బాలీవుడ్‌ నటి రేఖ డుమ్మా కొట్టడంలో రికార్డ్‌ సృష్టించారు. రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతిచే నామినేట్‌ అయిన వీరిద్దరు సభలో మాత్రం ఎప్పుడూ కనిపించరు. తాజాగా విడుదల చేసిన అటెండెన్స్‌ జాబితాలో సచిన్‌, రేఖ చివరి స్థానాల్లో నిలిచారు. 348 రోజుల్లో సచిన్ 23 రోజులు, రేఖ 18 రోజులు మాత్రమే సభకు హాజరయ్యారు. వీరిద్దరు కూడా 2012లో రాజ్యస‌భ‌కు నామినేట్ అయ్యారు. వీరితో పాటు నామినేట్ అయిన మిగ‌తా 10 మందిలో ఈ ఇద్దరి హాజ‌రుశాత‌మే మ‌రీ త‌క్కువ‌గా ఉంది.

21:46 - April 11, 2017

చెన్నై : సినీ నటి రాధికకు చెందిన ఆఫీసులో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. టీ నగర్‌లోని రాధికకు చెందిన రాడాన్ కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రాధికకు చెందిన రాడన్ సంస్థ పలు సీరియల్స్, సినిమాలను నిర్మిస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బు పంచుతున్నారన్న ఆరోపణల్లో..ఐటీ శాఖ ఇప్పటికే రాధిక భర్త శరత్‌కుమార్ ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. శరత్‌కుమార్‌ శశికళ వర్గానికి మద్దతుగా ఉన్నారు.

 

21:44 - April 11, 2017

ఢిల్లీ : రిలయన్స్‌ జియో మరో ధనాధన్‌ ఆఫర్‌ను ప్రకటించింది.. 309 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 84రోజులు రోజుకు 1 జీబీ డేటాను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. 509 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 84 రోజులపాటు రోజుకు 2జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. ఈ రెండు ప్లాన్స్‌ జియో ప్రైమ్‌ సభ్యులకు వర్తిస్తాయి. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు మూడు నెలలపాటు అపరిమిత కాల్స్‌, డేటా ఉపయోగించుకోవచ్చు. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోని చందాదార్లు 408 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. ఒకవేళ 2జీబీ డేటా కావాలనుకుంటే 608 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. ఈ ఆఫర్‌కు ముందు 303 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే మూడు నెలల పాటు అపరిమిత కాల్స్‌, డేటా వినియోగించుకునేందుకు జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ఈ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని టెలికాం నియంత్రణ సంస్థ ఆదేశించింది. దీంతో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను జియో రద్దు చేసింది.

 

21:40 - April 11, 2017

చంఢీఘర్ : పంజాబ్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ యూనివర్సిటీ విద్యార్థులంతా మూకుమ్మడిగా నిరసనకు దిగారు. విద్యార్థులను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి విషమించింది. పరిస్థితిని అదులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్‌కానన్‌లను ప్రయోగించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్‌ చేయడంతో పలువురు గాయపడ్డారు. విద్యార్థుల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

21:37 - April 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు... పలు జిల్లాల్లో పూలే జయంతి ఉత్సవాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.. బడుగులకు పూలే అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.. 
హైదరాబాద్‌లో 
మహాత్మా జ్యోతీరావ్ పూలే 191వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు .. పలువురు బీసీసంఘాల నేతలు.. రాజకీయపార్టీల నాయకులు హాజరయ్యారు.. (110417-055) రవీంద్రభారతిలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.. ఈ వేడుకల్లో పలువురు మంత్రులు పాల్గొని, పూలే సేవలను స్మరించుకున్నారు. 
టీడీపీ కార్యాలయంలో
టీడీపీ కార్యాలయంలోనూ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్ని ఘనంగా జరిపారు.. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు..
ఎంబీ భవన్‌లో 
హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే పాటుపడ్డారని వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వెంకట్ కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు..
ఆదిలాబాద్ జిల్లాలో 
ఆదిలాబాద్ జిల్లాలో పూలే 191వ జయంతి వేడుకలకు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ హాజరయ్యారు.. మావల పంచాయితీలో పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పూలే జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ గద్దెల పద్మ, మేయర్‌ నరేందర్‌ పాల్గొన్నారు. 
గద్వాల జిల్లాలో
అటు గద్వాల జిల్లాలోనూ పూలే జయంతి వేడుకలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్‌, డీకే అరుణ హాజరయ్యారు.
ఖమ్మంలో 
ఖమ్మంలో జ్యోతిరావు పూలు వేడుకలకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ హాజరయ్యారు.. పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు..
ఏపీలో పూలె జయంతి
ఏపీలోకూడా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. విజయవాడలో పూలే జయంతి కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమతోపాటు పలువురు హాజరయ్యారు.. 
ఒంగోలులో 
ఒంగోలు కొత్త మార్కెట్‌ కూడలి దగ్గర పూలే విగ్రహానికి మంత్రి శిద్ధ రాఘవరావు పూలమాలలువేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్, ఎస్‌పీ త్రివిక్రమ్ వర్మ, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పాల్గొన్నారు.
కర్నూలులో 
కర్నూలులో పూలే జయంతి వేడుకలకు మంత్రి అఖిలప్రియ హాజరయ్యారు. జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికోసం పోరాడిన మహనీయుడంటూ సీమాంధ్ర బీసీ సంఘం కొనియాడింది.. బీసీ ప్రధాన కార్యాలయంలో పూలేకు నివాళులు అర్పించింది..
ఢిల్లీలో...
అటూ దేశ రాజధాని ఢిల్లీలోనూ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ భవన్‌ గురజాడ హాల్‌లో ఘనంగా మహాత్మ జ్యోతిరావ్ పూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు.. పూలే చిత్రపటానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ ఎంపీలు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. 

 

21:32 - April 11, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక రానేరాదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా తేల్చి చెప్పేసింది. 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపి.. తామేమీ చేయలేమంటూ చేతులెత్తేసింది. దీంతో.. అంతో ఇంతో మిణుకుమిణుకు మంటున్న ఏపీ ప్రజల హోదా ఆశలు.. పూర్తిగా ఆడియాసలే అయ్యాయి. ఈ అంశంపై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ సహా, పలు పక్షాలు ఏపీకి హోదా కోసం గట్టిగానే పట్టుబట్టాయి. అయితే, మోదీ ప్రభుత్వం మాత్రం తన మొండి పట్టుదలను వీడలేదు. 
హోదా హుళక్కి
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీగా చర్చ జరిగింది.  కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు  ప్రత్యేక హోదాపై  ఇచ్చిన సావదాన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేవీపీ...  ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరిని  తప్పుపట్టారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని కోరారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : విజయసాయిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని చేసిన హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. 
ప్రత్యేక హోదా ఇవ్వాలి : టి.సుబ్బరామిరెడ్డి 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి కోరారు. అధిక ఆదాయం కలిగిన హైదరాబాద్ తెలంగాణకు పోవడంతో ఏపీ ఆర్దికంగా ఇబ్బంది పడుతోందన్నారు.
హోదా హామీని మరిచిన బీజేపీ, టీడీపీ 
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నాడు సభలో అరుణ్‌జైట్లీ, వెంకయ్య కోరారని కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌, దిగ్విజయ్‌సింగ్‌ గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రభుత్వం ఇచ్చిన హోదా హామీని, అనంతర ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఎన్నికల హామీగా మలచుకున్న విషయాన్నీ వారు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. 
ఏపీ ఎంపీలకు అండగా టీఎంపీలు  
ఏపీ ఎంపీలకు తెలంగాణ ఎంపీలు, కే కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్‌ కూడా అండగా నిలిచారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ చెప్పలేదన్నారు.  ఎన్డీసీ మీటింగ్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా విధి విధానాలపై చర్చజరపాలని కోరారు.
విపక్ష సభ్యుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌
విపక్ష సభ్యుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌.... జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ప్రకటించిందన్నారు. అందులో ఏపీ ప్రస్తావనే లేదని కొట్టి పారేశారు. ఇక నుంచి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమన్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చలో టీడీపీ నుంచి ఒక్కరూ కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

 

21:20 - April 11, 2017

  గుంటూరు : మిర్చి రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి హామీ ఇచ్చారని ఏపీ అగ్రికల్చర్‌ మినిస్టర్‌ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులను కలసి మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరామని  సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు నిబంధనలను మార్చైనా సరే.. రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని  అన్నారు. దీనిపై సమావేశమై రైతులను ఎలా ఆదుకోవాలో అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 

21:15 - April 11, 2017

ఢిల్లీ : ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌, వైసీపీలకు చెందిన రాజ్యసభ సభ్యులు డిమాండ్‌ చేశారు. 14వ ఆర్దిక సంఘం బూచి చూపి ప్రత్యేక హోదా కల్పించకపోవడం దారుణమన్నారు. 14వ ఆర్దిక సంఘం అసలు ఏపీకి హోదా ఇవ్వొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి పీఎం మన్మోహన్‌ సభలో ప్రకటించారని చెప్పారు. నాడు ప్రత్యేక హోదా కోరిన అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ఇప్పుడు అధికారపార్టీలో ఉన్నారని.. ఆ హామీని అమలు చేయాలన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సభ్యుల వాదనలకు.. తెలంగాణకు చెందిన కే. కేశవరావు, రాపోలు ఆనంద్‌భాస్కర్‌ కూడా మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 

 

జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ

గుంటూరు : ఈ నెలాఖరున ఏపీ అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం సభను సమావేశపరుస్తారని తెలుస్తోంది. రెండు నుంచి మూడురోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయని సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:12 - April 11, 2017

గుంటూరు : ఈ నెలాఖరున ఏపీ అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం సభను సమావేశపరుస్తారని తెలుస్తోంది. రెండు నుంచి మూడురోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయని సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:51 - April 11, 2017

విశాఖపట్నం : జిల్లాలోని గోపాలపట్నం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:48 - April 11, 2017

అనంతపురం : వీపు చర్మానికి ఇనుప కొక్కాలు.... చెంపలకు ఇనుప చువ్వలను గుచ్చుకోవడం ఒంటిమీద ఎక్కడపడితే అక్కడ ఇనుప కొక్కాలను బిగించుకోవడం ఇలాంటి మాటలను వింటేనే మనకు ఒళ్లు ఒక్కసారిగా జలదరిస్తుంది. అలాంటిది నిజంగా మన కళ్లకు కనిపిస్తే..వామ్మో అనకతప్పదు.  
ఒంటికి శూలాలు 
కానీ అనంతపురం జిల్లాలో సుబ్రమణ్యస్వామి భక్తులకు ఇవన్నీ మామూలే. ఒంటికి శూలాలు గుచ్చుకుని..స్వామికి వారికి మొక్కలు చెల్లించడమంటే ఇక్కడి భక్తులకు ఎంతో ఇష్టం. తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఎంతటి సాహసానికైనా తెగిస్తారు.   
ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు
50 ఏళ్ల క్రితం ఉపాధికోసం అనంతపురం జిల్లా హిందూరానికి వలస వచ్చిన శ్రీలంక తమిళులు..తమ ఆచారం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర షష్టి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. స్వామివారి  రథోత్సవంలో ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేశారు. 
ఒంటిపై శూలాలు, కత్తులు 
తమిళనాడులో జరిగే తంగణీఉత్తరం వేడుకలకు వెళ్లే స్తోమతలేని భక్తులు..ఇక్కడే ఉత్సవాలు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి మొక్కులు తీర్చుకునేందుకు..ఒంటిపై శూలాలు, కత్తులు పొడుచుకుని..నృత్యం చేస్తారు. వీపుపై చర్మానికి ఇనుపకొక్కాలను గుచ్చుకుని క్రేన్‌కు వేళాడతారు.   
ఈ తంగణీ ఉత్తర ఉత్సవాలు చూడ్డానికి చుట్టుపక్క గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. 

 

20:38 - April 11, 2017

ప్రకాశం : జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన కలకలం రేపింది. బీహార్‌కు చెందిన జితేందర్‌ ఉద్యోగం నిమిత్తం ఒంగోలులోని చిన్నగంజాంలో ఉంటున్నాడు. రైల్వే ట్రాక్‌మెన్‌ గా పని చేస్తున్నాడు. ఇతనికి 3 నెలల క్రితమే పెళ్లి జరిగింది. ఇవాళ చిన్నగంజాం కూరగాయల మార్కెట్‌ సమీపంలో జితేందర్‌ ఒంటిపై గాయాలతో శవమై కనిపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

20:28 - April 11, 2017

విశాఖపట్నం : ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవితాశయమని అన్నారు. 2022 సంవత్సరం కల్లా భారత్‌లోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉండాలన్న టార్గెట్‌తో తాము పనిచేస్తున్నామని ప్రకటించారు. 2029 సంవత్సరం వరకు రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరాలన్నది తమ ధ్యేయమని అన్నారు.

 

ఒంగోలులో యువకుడి అనుమానాస్పద మృతి

ప్రకాశం : ఒంగోలులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో అశోక్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువకుడి మృతదేహంతో సిరి ఆస్పత్రి వద్ద బంధువులు ధర్నా చేస్తున్నారు. అశోక్ కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. కేసిట్ వివరాలను ఆస్పత్రి సిబ్బంది తగలబెట్టారు. 

18:40 - April 11, 2017

హైదరాబాద్ : నగరంలోని రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి మాట్లాడుతూ పూలే ఆశయాలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అన్ని కులాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

 

అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

విశాఖ : అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారికి 3 కేజీల బంగారు ఆభరణాలు సమర్పించారు. 

18:29 - April 11, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలు వడగాలులతో సతమతమవుతున్నారు. పగటిపూట రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. చల్లదనం కోసం రకరకాల మార్గాలను వెతుక్కుంటున్నారు.
నిప్పుల కుంపటిగా నిజామాబాద్
భానుడు విజృంభించడంతో నిజామాబాద్‌ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. పదో తేదీన గరిష్టంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మే నెలలో 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
ప్రజలు నానా అవస్థలు
ఎండలతో పాటు వడగాలులు వీయడంతో పనుల కోసం బయటకొచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం శీతలపానీయాలు...కొబ్బరి బోండాలు తాగుతూ... సేద తీరుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారులు తమ దుకాణాలు మూసివేస్తున్నారు. పెరుగుతున్న ఎండల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు.. చిన్న పిల్లలు ఎండకు తిరగరాదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ముందుగానే అవగాహనను పెంచుకుని ఉండాలని చెబుతున్నారు.
ఏప్రిల్‌ నెలలోనే ఎండలు
మొత్తానికి ఏప్రిల్‌ నెలలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో.. ఏ విధంగా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.

 

18:18 - April 11, 2017

వరంగల్ : నిత్యం బాంబుల మోత... పగులుతున్న ఇంటి గోడలు.. బెదురుతున్న గుండెలు... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో జీవిస్తున్న ప్రజలు...ఎగసిపడే దుమ్ము..దూళి... నాశనమవుతున్న పంటలు... ఇది వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పలు మండలాల ప్రజల పరిస్థితి.
ఇల్లీగల్‌ దందా
జిల్లాలోని ఆత్మకూర్‌, శ్యాంపేట, దామెర మండలాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక్కడ 154 క్రషర్లు జిల్లా వ్యాప్తంగా ఇల్లీగల్‌ దందా నిర్వహిస్తూ ఇటు ప్రజల ప్రాణాలకు, రైతుల పంట పొలాలకు పెనునష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా.. యథేచ్ఛగా కొండలను తవ్వేస్తున్నారు. పెద్దఎత్తున బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ... ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇక్కడ నిత్యం బాంబుల మోత మోగడంతో ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు.
గ్రామస్థులు ఆందోళన.....
బ్లాస్టింగ్‌ల కారణంగా ఇళ్లు కూలిపోతాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి గోడలు బీటలు వారుతున్నాయని... ఎప్పుడు ప్రాణాలు పోతాయోనని భయంగా ఉంటుందని వాపోతున్నారు. అలాగే దుమ్ము..దూళితో పంటలు నాశనమవుతున్నాయి. అలాగే చాలామంది చర్మ సంబంధిత..శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే ఇక్కడ పలు హాస్టళ్లు ఉండడంతో విద్యార్థులు ఆ దారిలో పయనించేందుకు భయపడుతున్నారు. ఈ సమస్యపై గ్రామస్థులు ఆందోళన చేసినా.. పట్టించుకునేవారే కరువయ్యారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
క్రషర్లు అన్ని ప్రజాప్రతినిధులవే
జిల్లాలో ఉన్న చాలా క్రషర్లు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అరురి రమేష్‌సాయి దత్త, ధర్మారెడ్డి పేరుతో ఉన్నాయని.. గతంలో చీఫ్‌ విప్‌గా చేసిన గండ్ర వెంకటరమణరెడ్డికి 3, 4 క్రషర్లు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ క్రషర్ల జోలికి ఏ అధికారి రావడం లేదని.. వచ్చిన వారిని ఏదోలా నోచు మూయించేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్న ప్రజలు
ఇప్పటికైనా క్రషర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైన.. పట్టించుకోని అధికారులు.. ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

జడ్చర్ల మండలం చిన్నపల్లిలో అగ్నిప్రమాదం

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం చిన్నపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మామిడి తోట, వరిపంట దగ్ధం అయింది. లక్షల్లో ఆస్తి సంభవించింది. 

 

17:53 - April 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై గవర్నర్‌తో చర్చించారు. శాసనసభ ప్రత్యేక సమావేశాల ఏర్పాటునూ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 17,18 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశముంది. మరోవైపు రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుతోపాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

 

17:26 - April 11, 2017

విజయవాడ : ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు బయట ఎక్కువ విస్తీర్ణంతో భవనాలు నిర్మించడానికి సబ్ కమిటీ అమోదం తెలిపింది. అర్బన్ డెవలప్ మెంట్ పాలసీ సంస్కరణలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, సీఆర్ డీఏ అధికారులు హాజరయ్యారు.

 

17:24 - April 11, 2017
17:23 - April 11, 2017

గవర్నర్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. గిరిజన, మైనారిటీ రిజర్వేషన్లపై కేసీఆర్ చర్చించారు. కలెక్టర్ల సదస్సు వివరాలను గవర్నర్ కు వివరించారు. ఈనెల 17, 18 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముంది. రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. 

 

17:05 - April 11, 2017

హైదరాబాద్ : నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపీడికి వ్యతిరేకంగా పోరాడిన జ్యోతీరావుపూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన వాటాను సాధించుకోడానికి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. చట్టసభలో బీసీ రిజ్వరేషన్ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 

రాష్ట్రాలకు హోదాపై చర్చ జరగాలి : ఎంపీ కేకే

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు 
 మాట్లాడుతూ రాష్ట్రాలకు హోదాపై చర్చ జరగాలని అన్నారు.

ఏపీకి హోదా ఇవ్వాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారన్న జైరాం రమేష్

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ మంత్రి జైరాం రమేష్ మాట్లాడుతూ ఏపీకి హోదా పదేళ్లు ఇవ్వాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని గుర్తుచేశారు.

 

16:50 - April 11, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రోడ్ల అభివృద్ధితోపాటు.. వివిధ అంశాలపై గడ్కరీతో చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

 

 

16:40 - April 11, 2017

ఢిల్లీ : ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నిండు సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా అడిగిన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉందని... ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వడం లేదన్నారు. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధిక సంఘం చెప్పలేదన్నారు.

 

 

హోదా కోసం ఏపీలో ఆందోళనలు : రాపోలు

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. హోదా కోసం ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయని టీ.కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతాయా లేదా : డి.రాజా

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ సభలో లెవనెత్తారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంపీ డి. రాజా మాట్లాడతూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, అవి కొనసాగుతాయా లేదా అన్నది స్పష్టం చేయాలని అన్నారు. 

 

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు : కేవీపీ

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ సభలో లెవనెత్తారు. ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

 

ఏపీకి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ సభలో లెవనెత్తారు. 

16:13 - April 11, 2017

విజయవాడ : కాడిగడప చైతన్య కాలేజీలో వంట మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కోన సురేష్ కాడిగడప చైతన్య కాలేజీలో నాలుగు సంవత్సరాలుగా వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఇవాళ కాలేజీ నాలుగో అంతస్తుపై నుంచి కిందికి దూకారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాలేజీ యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. రహస్యంగా మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పెనమలూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:45 - April 11, 2017

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ సభలో లెవనెత్తారు. ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం సీపీఐ ఎంపీ డి. రాజా మాట్లాడతూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, అవి కొనసాగుతాయా లేదా అన్నది స్పష్టం చేయాలని అన్నారు. హోదా కోసం ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయని టీ.కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఏపీకి హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని కాంగ్రెస్ మాజీ మంత్రి జైరాం రమేష్ గుర్తుచేశారు. రాష్ట్రాలకు హోదాపై చర్చ జరగాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు.

 

కూచిపూడి మన వారసత్వ సంపద : సీఎం చంద్రబాబు

విశాఖ : కూచిపూడి మన వారసత్వ సంపద అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. కూచిపూడి అకాడమీకి అమరావతిలో భూమి కేటాయిస్తామని చెప్పారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

 

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కూచిపూడి ప్రదర్శన

విశాఖ : ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శనలో 7 వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు మహా నృత్య ప్రదర్శన నిర్వహించారు.

 

కాడిగడప చైతన్య కాలేజీలో వంట మాస్టర్ ఆత్మహత్య

విజయవాడ : కాడిగడప చైతన్య కాలేజీలో వంట మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంట మాస్టర్ కోన సురేష్ నాలుగో అంతస్తు పై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. కాలేజీ యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. రహస్యంగా మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పెనమలూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

15:02 - April 11, 2017

హైదరాబాద్ : వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంబీ భవన్‌లో జ్యోతిరావుబాపూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి ఆ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే పాటుపడ్డారని కొనియాడారు. అంతరాలు లేని సమాజం కోసం కలలు కన్నారని ఆయన పేర్కొన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. 

15:00 - April 11, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ భవన్‌ గురజాడ హాల్‌లో మహాత్మ జ్యోతిరావ్ పూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ ఎంపీలు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. దేశంలో విద్యావ్యాప్తికి పూలే కృషిచేశారని నేతలు కొనియాడారు.

 

విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టారు. 

 

నటుడు ధనుష్ కేసులో కాసేపట్లో మధురై కోర్టు తీర్పు

చెన్నై : తమిళ నటుడు ధనుష్ కేసులో కాసేపట్లో మధురై కోర్టు తీర్పు వెలువరించనుంది. డీఎన్ఎ టెస్టుకు అనుమతించాలని పిటిషనర్ కోరారు. ఇప్పటికే ధనుష్ తరపు వాదనలు పూర్తి అయ్యాయి. 

 

13:34 - April 11, 2017

నల్లగొండ : అమెరికాలోని కాలిఫోర్నియా లో వారం రోజుల క్రితం ఆత్మహత్యా చేసుకున్న మధుకర్ మృతదేహం నల్లగొండ జిల్లా స్వగ్రామానికి చేరుకుంది. మధకర్ తల్లిదండ్రులు తమ కొడుకుది ఆత్మహత్యా కాదని తమ కోడలు స్వాతి హత్య చేసి ఉరి వేసుకున్నట్టు చెబుతోందని వారు ఆరోపించారు. మధుకర్ భార్య స్వాతిపై మధుకర్ తరుపు వారు వారు దాడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణా హాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. మధుకర్, స్వాతి దంపతులకు 7 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో నివాసిస్తున్నారు. వారికి 3 సంవత్సరల కుతూరు ఉంది.

 

12:52 - April 11, 2017

ఢిల్లీ : కులభూషణ్ జాదవ్ జాదవ్ కు గూఢాచర్యాకి పాల్పపడ్డారన్న పాకిస్థాన్ ఆరోపణాలపై ఈ రోజు పార్లమెంట్ లో దుమారం రేగింది. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖార్గే లోక్ సభలో చర్చ లెవనెత్తారు. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడతూ కులభూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడలేదని, వ్యాపార నిమిత్తం ఇరాన్ వెళ్లిన జాదవ్ ను పాక్ అధికారులు కిడ్నాప్ చేశారని అన్నారు. జాదవ్ దగ్గర భారత పాస్ పోర్టు ఉందని ఆయన ప్రకటించారు. ఇదే విషయంపై రాజ్యసభలో సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ జాదవ్ మరణశిక్ష పై చర్చిస్తున్నామని తెలిపారు.

భువనగిరికి చేరకున్నమధుకర్ రెడ్డి మృతదేహం

యాదాద్రి : వారం రోజుల క్రితం కాలిఫోర్నిలో మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహం భువనగిరికి చేరుకుంది. మధుకర్ ఆత్మహత్యకు భార్య స్వాతి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా స్వాతి, ఆమె కుటుంబసభ్యులపై మధుకర్ రెడ్డి బంధువులు దాడిచేశారు. దీంతో స్వాతి తమ ప్రాణానికి హాని ఉందని పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

12:32 - April 11, 2017

హైదరాబాద్: 'గర్భనిరోధక ఇంజక్షన్లు' ఎంత వరకు సేఫ్ ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జనవిజ్ఞానవేదిక నేత డాక్టర్ రమ, బఠీపడావో..భేటీ బచావో స్టేట్ కన్వీనర్ గీతామూర్తి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:31 - April 11, 2017

హైదరాబాద్ : నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. యాత్ర గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమై  ఆ శోక్ నగర్, కవాడిగూడ, ఎక్స్ రోడ్డు మీదుగాతాడ్‌ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు  27 కిలోమీటర్ల దూరం  కొనసాగుతోంది.  సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యాత్ర సంద్భంగా నగరంలో భారీగా బందోబస్తు నిర్వహించనున్నమన్నారు.యాత్ర జరిగే  పుత్లిబౌలి, చాదర్ ఘాట్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ అంక్షలు విధిస్తామని అన్నారు. యాత్ర కవర్ చేసే విధంగా వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 

 

కూచిపూడి మన వారసత్వ సంపద: చంద్రబాబు

విశాఖ : కూచిపూడి మన వారస్తవ సందప అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూచి పూడి ప్రదర్శన జరిగింది. ఈ నృత్య ప్రదర్శనలో 7 వేల మండి పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు సాదించేందుకు మహానృత్య ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. కూచిపూడికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. కూచిపూడి అకాడమీకి అమరావతిలో భూమి కేటాయిస్తామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని, పేద పిల్లల చదువుకోసం ఎన్టీఆర్ రెసిడెన్షియన్ స్కూళ్లను ప్రారంభిచనట్లు తెలిపారు.

కుల్ భూషన్ గూఢచర్యానికి పాల్పడలేదు: రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : కుల్ భూషన్ ఏ గూఢచర్యానికి పాల్పడలేదని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. వ్యాపారం నిమిత్తం ఇరాన్ వెళ్లారని, పాకిస్తాన్ అధికారులు కుల్ భూషన్ ను కిడ్పా చేశారన్నారు. కుల్ భూషన్ వద్ద భారత పాస్ పోర్ట్ ఉందని స్పష్టం చేశారు. భూషన్ ను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామిన రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

 

ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర

హైదరాబాద్: గౌలిగూడ రామాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం అయ్యింది. తాడ్‌బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగే యాత్ర మార్గం 27 కిలోమీటర్ల పొడవున ఈ ర్యాలీ జరుగనుంది. 

కుల్ భూషణ్ విషయంలో పాక్ కుట్ర

ఢిల్లీ :రాజ్యసభలో కుల్ భూషన్ ఉరిశిక్ష అంశంపై సుష్మాస్వరాజ్ ప్రకటన చేశారు. కుల్ భూషణ్ విషయంలో పాక్ కుట్రపూరితంగా ఎలాంటి విచారణ జరపకుండానే జాదవ్ కు ఉరిశిక్ష విధించిందని మండి పడ్డారు. కులభూషన్ కు వ్యతిరేకంగా పాక్ దగ్గర ఒక్క ఆధారం లేదన్నారు.

రవీంధ్ర భారతిలో పూలే జయంతి వేడుకలు

హైదరాబాద్: రవీంధ్ర భారతిలో పూలే జయంతి వేడుకలుప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు కడియం శ్రీహరి, జోగురామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్శింహారెడ్డి, తదితరులు హాజరయ్యారు.

11:35 - April 11, 2017
11:33 - April 11, 2017

కృష్ణా : గుడివాడలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నేతలపై వైసీపీ కార్యక్తల రాళ్ల దాడి చేయడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.

11:31 - April 11, 2017

ఖమ్మం: మార్క్ ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆయన ఖమ్మం మిర్చి యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులు తమ గోడును ఆయనతో వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన '10 టివి'తో మాట్లాడుతూ మార్కెట్ నిండా, మార్కెట్ చుట్టూ మిర్చి రైతులు బస్తాలతో పడిగాపులు కాస్తున్నారని, వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చి క్వింటాలుకు 24 వేలు వుందని, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. మరో వైపు ఝార్ఖండ్ రాష్ట్రంలో కూడా 12 వేల వరకు ధర పలుకుతోందని పేర్కొన్నారు. మిర్చి ధర పడిపోవడానికి స్థానిక కారణాలే తప్ప మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అని మాటలు చెప్పడం తప్ప ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని ఆరోపించారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్క అయ్యి మిర్చి రైతులను నట్టేట ముంచుతున్నారని, కోల్డ్ స్టోరేజీలు కూడా రైతులకు కాకుండా.. వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాల5 గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెంటనే మిర్చి రైతులను ఆదుకోకపోతే అనేకమంది రైతులు ఆదే బాటపడతారని వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే సీఎం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రైతు పోరాటాలకు మద్దతుగా నిలిచి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

11:29 - April 11, 2017

గుంటూరు: ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తానని చెప్తున్నారని... కానీ ఏపీ ని నారాయణ హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు లో అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ను ఆపేసి ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా విద్యార్థి, ఉపాధ్యాయ మౌలిక సమస్యల పరిష్కరించలేదని ఆరోపించారు. సిపీఎస్ ను రద్దు చేయాలని, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని, పెర్ఫార్మెన్స్ ర్యాంకుల విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ, ఎరియర్ ఇవ్వాలి. హెల్త్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ప్యాప్టో, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు నేతలు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.. 

ఘాన్సిమియాగూడలో అక్రమ నిర్మాణాలకూల్చివేత..ఉద్రిక్తత

రంగారెడ్డి: శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. 200 మంది పోలీసు బందోబస్తు మధ్య హెచ్ ఎండీఏ కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు.

గుడివాడలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

కృష్ణా : గుడివాడలో టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నేతలపై వైసీపీ కార్యక్తల రాళ్ల దాడి చేయడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.

10:32 - April 11, 2017

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. గౌలిగూడ రామాలయం నుంచి తాడ్‌బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగే యాత్ర మార్గం 27 కిలోమీటర్ల పొడవున ఈ ర్యాలీ జరుగనుంది. , దీనిని కవర్ చేసే విధంగా వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 

చిత్తూరు కార్పొరేషన్ 38వ వార్డు ఉప ఎన్నికటిడిపి విజయం

చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ 38వ వార్డు ఉప ఎన్నికలో 1563 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి వసంత్ కుమార్ విజయం సాధించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. 

నేడు జ్యోతిబా పూలే 191వ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే 191వ జయంతి ఉత్సవాలు మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, గౌరవ అతిథిగా కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నారు.

ప్రభుత్వం దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తోంది: తమ్మినేని

ఖమ్మం: తెలంగాణ సర్కార్ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గించారని పేర్కొన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందకపోవడంతో 15 రోజుల్లో 5గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం మార్కె ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

తమ్మినేనికి ఖమ్మం మిర్చి రైతుల ఆవేదన

హైదారబాద్: ఖమ్మం మిర్చి యార్డు సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, వెంకటేశ్వరరావు, తదితర నేతలు పరిశీలించారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర అందక ఇబ్బందులు పడుతున్నామని తమ్మినేని ఎదుట రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వ్యాపారులు కుమ్మక్కై రూ.12 వేల ధరను రూ. 6 వేలకు కుదించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

08:27 - April 11, 2017

తిరుమల : తుంబూరుతీర్థంలో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి తిరుపతికి చెందిన ఇన్ కం ట్యాక్స్ ఉద్యోగి గా గుర్తించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 274 గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి నుంచి రూ.7.22 లక్షల విలువైన 274 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ర్టిక్ ఐరన్ బాక్స్ లో దాచి తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తుంబూరుతీర్థంలో వ్యక్తి గల్లంతు

తిరుమల : తుంబూరుతీర్థంలో వ్యక్తి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి తిరుపతికి చెందిన ఇన్ కం ట్యాక్స్ ఉద్యోగి గా గుర్తించారు.

07:32 - April 11, 2017

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తేస్తే కమ్యూనిస్టు అవుతావా అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు నగేష్, ఏఐకేఎస్ అధ్యక్షులుసారంపల్లి మల్లారెడ్డి, టిఆర్ ఎస్ నేత దినేష్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:20 - April 11, 2017

ఖమ్మం : జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకూ అగమ్య గోచరంగా తయారవుతోంది. తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని ఎర్ర బంగారం సాగు చేసిన రైతులకు చివరికి నష్టాల ఘాటు తగులుతోంది. ధర భారీగా పతనమవ్వడంతో మార్కెట్‌కు తెచ్చిన మిర్చిని అమ్మలేక, దాచిపెట్టడానికి కోల్డ్ స్టోరేజీల్లో స్థలం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 40 వేల ఎకరాల్లో మిర్చి సాగు...

జిల్లాలో ఈ సంవత్సరం 40 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. దీంతో దిగుబడి భారీగా పెరిగింది. ఈ మేరకు ఖమ్మం మిర్చి యార్డ్‌కు సగటున రోజుకు 50 వేల బస్తాలకు పైగా వస్తున్నాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. మిర్చి యార్డ్‌ పరిమితి కేవలం 30 నుంచి 40 వేల బస్తాల వరకే ఉండటంతో మార్కెట్ బయట రోడ్ల వెంట కూడా రైతులు మిర్చిని దింపుతున్నారు. అయితే గత రెండేళ్లలో మిర్చి ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు పలికింది. కానీ ఈ సంవత్సరం కేవలం రూ.6వేల నుంచి రూ.7 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్‌లో జెండా పాట క్వింటాకు రూ.8 వేలు పలికినప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. పేరుకే జెండా పాటగా ఉంది. సరుకు ఎంత నాణ్యంగా ఉన్నా వ్యాపారులు రూ.6,500 మించి ధర పెట్టడం లేదు. దీంతో కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో కేవలం 31 కోల్డ్‌ స్టోరేజీలు...

ఖమ్మం మార్కెట్‌కు రెండు జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి కూడా పంట ఇక్కడకు వస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో కేవలం 31 కోల్డ్ స్టోరేజీలే ఉన్నాయి. ఒక్కొక్క కోల్డ్ స్టోరేజీలో 70 వేల నుంచి ఒక లక్ష బస్తాలు మాత్రమే నిల్వచేసే అవకాశముంది. దాంతో దాచేందుకు చోటు లేక రైతులు తమ ఉత్పత్తులను వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. దీనికి తోడు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు స్టోరేజీ ఛార్జీలను భారీగా పెంచినట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు....

అయితే మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే మార్కెట్లలోకి మార్క్‌ఫెడ్ రంగ ప్రవేశం చేసి మద్దతు ధరతో మిర్చి పంటను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కాగా 1995 సంవత్సరంలో ఇదే మార్కెట్‌లో మార్క్‌పెడ్ మిర్చిని కొనుగోలు చేసింది.జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల ఆరు వేల నుంచి పది వేల ఎకరాల్లో మిర్చి పంట నష్టం జరిగింది. ఇప్పుడు వ్యాపారులు సిండికేట్‌గా మారి.. పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు జరపనంత వరకు రైతులకు నష్టాలు తప్పేలా లేవు.  

07:18 - April 11, 2017

నిజామాబాద్: కలిసి వస్తుందనుకున్న యాసంగి నిజామాబాద్‌ జిల్లా రైతులకు కన్నీరే మిగిల్చింది. సాగుకు తగిన నీరు అందక పంటలు ఎండిపోయాయి. జిల్లాలో యాసంగికి 2 లక్షల 69వేల 770 హెక్టార్లలో పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు లక్ష్యం నిర్దేశించగా 49 వేల 691 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో 7వేల 5 వందల 82 హెక్టార్ల వరి పంట.. వెయ్యి 50 హెక్టార్ల మొక్కజొన్న పంట ఎండిపోయినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే.. 50 వేల హెక్టార్లకు పైగా.. వరి ఆరు వేల హెక్టార్లకు పైగా మొక్కజొన్న ఎండిపోయినట్టు సమాచారం. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అడుగంటిన భూగర్భ జలాలు...

భూగర్భ జలాలు అడుగంటడం.. బోర్లు వట్టిపోవడంతో పంటలకు నీరందడం లేదు. దీంతో వేల్పూరు, బీంగల్ , రహత్ నగర్, బాబాపూర్, బోధన్‌ మండలాలో.. నీలా బొర్గాం, తాడ్ బిలోలి, కూనేపల్లి, సదాశివనగర్, ఆమర్లబండ మండలాలల్లో.. రూరల్ గ్రామలైన సిరికొండలలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నీలా గ్రామంలో సుమారుగా 170 ఎకరాలలో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. డీ 50 కాలువ ద్వారా అలీసాగర్ నీటిని విడుదల చేసిన అధికారులు చివరి ఆయకట్టుకు అందేలా చర్యలు చేపట్టడంతో విఫలమయ్యారు. పంటకు చివరి రెండు తడులు నీరందకపోవడంతో చేసేది లేక రైతులు ఎండిన పంటను పశువుల మేతకు వినియోగిస్తున్నారు.

కనీసం పెట్టుబడి డబ్బులు రాలేదని రైతుల ఆవేదన

ఎకరానికి 20 వేలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులు రాని పరిస్థితి నెలకొందని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా ఉన్న కొద్ది సాగునైనా కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. కెనాల్స్‌లో డీజిల్‌ ఇంజన్లు.. ట్రాక్టర్లు ..జనరేటర్ల ద్వారా పంటకు నీరందించి రక్షించుకుంటున్నారు.

కందకుర్తి ఎత్తిపోతల రెండో స్టేజీ పనులు పూర్తి చేయాలని రైతుల విజ్ఞప్తి...

పంటలకు నీరందకపోవడంతో కందకుర్తి ఎత్తిపోతల రెండో స్టేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు రైతులు జిల్లా మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌లను కలసి మొరపెట్టుకున్నారు. 

అనంతపురం జిల్లాలో ఘనంగా తంగణీఉత్తర ఉత్సవాలు

అనంతపురం : దేవునికి మొక్కులు చెల్లించుకోవడంలో..కొంతమంది భక్తులు ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. భగవంతునిమీద తనకున్న భక్తిని చాటుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయరు. అనంతపురం జిల్లాలో జరిగిన సుబ్రహ్మణ్యషష్టిని చూస్తే ఒళ్లు గగుర్పొడవక మానదు. ఆ ఉత్సవాల్లో భక్తులు ఎంతటి సాహసాలు చేశారో మీరే చూడండి.  

07:13 - April 11, 2017

మహాబూబ్ గనర్ : తెలంగాణలోనే అత్యంత వెనకబడిన జిల్లా పాలమూర్ జిల్లా.. ఈ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ జిల్లాలో చెరకు రైతులు తీవ్రదుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పండిన పంటకు మద్దతు ధర రాక పొట్టకూటి కోసం బతుకుపోరాటం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం, చెరకు పరిశమ్రల యాజమాన్యాల దోపిడి వెరసి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

జిల్లాలో ఉన్న ఏకైక కర్మాగారం కృష్ణవేణి చక్కెర కర్మాగారం..

జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర కర్మాగారం కృష్ణవేణి చక్కెర కర్మాగారం.. ఈ కర్మాగారం యాజమాన్యం చెరకు పంటకు మద్దతు ధర కల్పిచకపోగా డబ్బులు కూడా సరిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమొస్తే చక్కెర పరిశ్రమను ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా.. ఆ దిశగా కార్యాచరణే ప్రారంభంకాలేదు. మరోవైపు చెరుకు సాగు రైతులకు భారంగా మారింది. పెట్టుబడులు పెరగడం.. ఆ స్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

టన్ను చెరుకు నుంచి క్వింటాల్ చక్కెర దిగుబడి...

టన్ను చెరుకు నుంచి సుమారు క్వింటాలు చక్కెర దిగుబడి వస్తుంది. క్వింటాలు పంచదార ప్రస్తుత మార్కెట్‌లో రూ.4000 నుంచి రూ.4500 వరకు ఉంది. టన్ను చెరుకుకు క్వింటాల్‌ చక్కెరతో పాటు 800కిలోల పిప్పి, 45 కిలోల మొలాసిస్‌, 60 కిలోల ఫిల్టర్‌మడ్‌ వంటి ఉప ఉత్పత్తులు వస్తాయి. అలా వచ్చిన ఉపఉత్పత్తుల విలువ సుమారు రూ.1600 పైగా ఉంటుంది. పరిశ్రమలు లాభాలు అర్జిస్తూ తమకు తక్కువ డబ్బులు చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పరిశ్రమ యజమానులు టన్ను చెరుకుకు రూ.4,000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే తమ సమస్యలను పరిష్కారించాలని చెరుకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

07:10 - April 11, 2017

హైదరాబాద్‌ : నగరంలోని జలసౌధలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణపై ఈ సమావేశంలో చర్చించారు. చెరువులను కబ్జానుంచి కాపాడేందుకు... సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రావాలని సాగునీటి పారుదల, పురపాలక శాఖ అధికారుల్ని మంత్రులు ఆదేశించారు..

ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువు అభివృద్ధి...

చెరువుల పరిరక్షణలో భాగంగా మొదటిదశలో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును అభివృద్ధి చేయాలని మంత్రులు ఆదేశించారు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు.

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి.....

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణకోసం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖల అధికారులతో బృందం ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు.. త్వరలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు.

హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగా...

హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగా చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడతున్నామని మంత్రులు తెలిపారు.. పురపాలికలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ధి కోసం సాగునీటి శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హరీశ్‌ రావు స్పష్టం చేయగా.. పట్టణాల్లోని చెరువులను ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ మేయర్.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు...

07:08 - April 11, 2017

వరంగల్: రాష్ట్రంలో మిర్చి సెగలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది కాంగ్రెస్‌. దీనికోసం ఆ హస్తం నేతలు మార్కెట్‌ యార్డ్‌లనే అడ్డాగా చేసుకుని.. రైతులతో కలసి పోరాటబాట పడుతున్నారు. దీంతో గులాబీ సర్కార్‌కు కాంగ్రెస్‌కు మధ్య మిర్చి ఫైట్‌ సాగుతుంది. 

రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్న మార్కెట్లు

తెలంగాణాలో మార్కెట్లన్నీ మిర్చి రైతుల ఆందోళనతో అట్టుడికిపోతున్నాయి. పంటకు మద్దతు ధర లభించక.. దళారుల బాధ భరించలేక..ఎక్కడికక్కడ మిర్చి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా రైతుల పోరాటాన్ని కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

మార్కెట్‌ యార్డ్‌లను సందర్శిస్తున్న హస్తం నేతలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్‌ యార్డ్‌ల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించి రైతుల గోడు వింటున్నారు. మార్కెట్లలో సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. రైతులకు అండగా కదంతొక్కుతున్నారు. ఈ మేరకు కరీంనగర్‌లో శ్రీధర్‌బాబు.. పొన్నం ప్రభాకర్‌.. జీవన్‌రెడ్డి.. పాలమూరులో డీకే అరుణ.. ఖమ్మంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి... సంగారెడ్డిలో జగ్గారెడ్డి... హైదరాబాద్‌ మార్కెట్‌లో సుధీర్‌రెడ్డి...కోదండరెడ్డిలు.. నల్గొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కోమటి రెడ్డి ఆందోళన చేశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఏకంగా తమ నియోజకవర్గం రైతులతో కలిసి వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించి హల్‌చల్ చేశారు.

వరంగల్ టౌన్ లోని మార్కెట్ ను పరిశీలించిన ఉత్తమ్..

తాజాగా ఈరోజు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమారెడ్డి వరంగల్‌జిల్లా టౌన్‌లోని మార్కెట్‌ను సందర్శించారు. అయితే మిర్చి రైతుల దగ్గరకు ర్యాలీగా వెళ్తున్న ఉత్తం.. శ్రీధర్‌బాబు..గండ్ర వెంకట్‌ రమణారెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌పై ఉత్తం మండిపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని... తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కొత్తపేట్‌ పళ్ల మార్కెట్‌లో రైతుల ఆందోళన

హైదరాబాద్: వ్యాపారుల మెరుపుసమ్మె... రైతుల ధర్నాతో కొత్తపేట పళ్ల మార్కెట్‌ దద్దరిల్లింది.. సీజ్‌ చేసిన షాపుల్ని తెరిపించాలంటూ వ్యాపారులు... అది తమ పరిధిలో లేదంటూ అధికారులు తేల్చేయడంతో మామిడి అమ్మకాలు నిలిచిపోయాయి... ఈ విషయం తెలియక మార్కెట్‌కు వచ్చిన రైతులు పంట కొనేవారులేక ఆందోళనబాటపట్టారు.

07:04 - April 11, 2017

కడప : కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన రాములవారి కల్యాణం కన్నులపండువగా జరిగింది. నిన్న రాత్రి నిండు పున్నమిలో 8గంటల నుంచి 10గంటల వరకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కోదండరాముడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ కల్యాణోత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, డిప్యూటీ సీఎం కేఈ, టీటీడీ చైర్మన్‌ చదలవాడ పాల్గొన్నారు.

నిండుపున్నమిలో జరిగిన కల్యాణం...

రాములోరి కల్యాణం నిండుపున్నమిలో కావడంతో కళ్యాణమండపాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. పున్నమి వెలుగులు విద్యుత్‌ కాంతుల ధగధగల నడుమ రాములోరి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. రాములవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. అయితే కల్యాణ మండపంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. స్వామివారి కల్యాణానికి టిటిడి తరపున కూడా పట్టువస్త్రాలను సమర్పించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం టిటిడి పరిధిలోకి వెళ్లడంతో స్వామివారి కల్యాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని..గతేడాది కంటే ఈ సారి ఏర్పాట్లు ఘనంగా చేశామని టిటిడి ఈవో సాంబశివరావు తెలిపారు. స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించినందుకు టిటిడి సిబ్బందిని జేఈ అభినందించారు.

దేశంలో ఏ రామాలయంలో లేని విశిష్టతలు ఒంటిమిట్ట కోదండరాముడికి ...

దేశంలో ఏ రామాలయంలో లేని విశిష్టతలు ఒంటిమిట్ట కోదండరాముడికి ఉన్నాయి. హనుమంతుడి విగ్రహాం లేని సీతారామలక్ష్మణులు కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం కూడా రాత్రి వేళలో జరగడం మరో విశిష్టత. శ్రీరాముడు చైత్రశుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అందువల్ల పరిణయ మహోత్సవాలు అయోద్యలోనైనా, భద్రాద్రిలోనైనా దేశంలోని ఏ ఆలయంలోనైనా నవమినాడు అభిజిత్ లగ్నంలో పగటిపూట నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం కళ్యాణోత్సవం చైత్రశుద్ద చతుర్ధశి రోజు రాత్రిపూట నిర్వహిస్తారు. దేశమంతా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీరాముని కళ్యాణం చూసే భాగ్యం చంద్రునికి లేకుండా పోయిందని దీంతో చంద్రుడు బ్రహ్మోత్సవాలకు అధినాయకుడైన బ్రహ్మ ఎదుట తన ఆవేదన వెలిబుచ్చగా..ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో చతుర్ధశి నాటి రాత్రి సీతారామ కళ్యాణం తిలకించేలా చంద్రుడికి అవకాశం కల్పించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి.

ఘనంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం

కడప : జిల్లాలోని ఒంటిమిట్టలో రాములవారి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నిన్న రాత్రి 8 గంటలనుంచి పదిగంటలవరకూ అర్చకులు ఘనంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. కోదండరాముని కల్యాణినికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ దంపతులు రాగా..కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. 

07:01 - April 11, 2017

కర్నూలు : నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ తనకు టికెట్‌ ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వకుండా భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇస్తే.. టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నంద్యాల ముఖ్యనాయకుడు నాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సులోచన, కౌన్సిలర్లతో విడివిడిగా ఆయన మంతనాలు జరిపారు. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

06:59 - April 11, 2017

పెద్దపల్లి : కరీంనగర్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్..మృతుడు మధుకర్ తల్లిదండ్రుల సమక్షంలో పెద్దపల్లి జిల్లా మంథని ఖానాపూర్‌లో మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది....హైకోర్టు ఆదేశాలతో తరలివచ్చిన ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం పర్యవేక్షణలో మధుకర్‌ డెడ్‌బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించింది...దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన రీపోస్టుమార్టం ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు

శరీరం అవయవాలు సేకరణ...

ఇదిలా ఉండగా మధుకర్ డెడ్‌బాడీని వెలికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ బృందం అన్ని కోణాల్లో చూశారు.. ప్రతీ విషయాన్ని మధుకర్ తల్లిదండ్రులకు వివరిస్తూ వాటిని పరీక్షించారు... శరీరంలోని అవయవాలు సేకరించి వారితో పాటు తరలించారు...ల్యాబ్ పరీక్షలు చేయడం ద్వారా విషం సేవించాడా..? లేదా..? అన్న విషయాలు కూడా బయటపడతాయి.. పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యాకే హైకోర్టు ఆదేశాల మేరకు రిపోర్టును అందజేయనున్నారు...అయితే మరో వారం రోజుల్లో పూర్తి రిపోర్ట్‌ను సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు అందించేందుకు వైద్య బృందం ఏర్పాట్లు చేసుకుంటుంది...

భారీగా పోలీసుల బందోబస్తు...

మధుకర్ డెడ్‌బాడీ వెలికి తీసి రీపోస్టుమార్టం ద్వారా వాస్తవాలను ముందుంచాలని...సీల్డ్‌కవర్‌లో రిపోర్ట్ అందించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వైద్య బృందం సోమవారం ఏర్పాట్లు చేసుకుంది..ఈ విషయంపై అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో అన్ని విభాగాల ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు..ఇక పోలీసులకు సమాచారం రావడంతోనే ముందు జాగ్రత్తగా మధుకర్‌ను పాతిపెట్టిన ప్రాంతంలో ఆదివారం నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు... మధుకర్ మర్డర్ జరిగిందన్న అనుమానాలతో పాటు పెద్దోళ్ల పాత్ర ఉందన్న ఆరోపణలతో పూడ్చిన ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు...మధుకర్ కుటుంబీకులతో పాటు పోలీసులు కూడా రాత్రంతా అక్కడే కాపలా ఏర్పాటు చేశారు...ఇక రీపోస్టుమార్టం జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు చేశారు... వైద్య బృందం వచ్చి అక్కడ పనులు పూర్తి చేసుకుని వెళ్లేవరకు పోలీసులు ప్రతీ క్షణం నిఘా ఏర్పాటు చేశారు...

50 మందిని విచారించిన పోలీసులు..

మరోవైపు మధుకర్ డెత్‌ కేసుపై అపోహలు పెరగడంతో పోలీసులు విచారణ కొనసాగించారు..ఇప్పటికే 50 మంది అనుమానితులను విచారించినట్లు తెలుస్తోంది... మధుకర్, ప్రియురాలికి చెందినవారందరినీ విచారించి వివరాలు ఆరా తీశారు.. రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నరన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులతో పాటు ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చారు...అక్కడేం జరుగుతుందోనని తెలుసుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో పోలీసులు అప్రమత్తం చేశారు...

మధుకర్‌ మృతదేహానికి ముగిసిన రీపోస్టుమార్టం

పెద్దపల్లి : ఉత్కంఠ భరితమైన వాతావరణం...అందరిలో ఆసక్తి...అక్కడేం జరుగుతుందో చూడాలన్న కోరిక..అన్నింటికి మించిన పోలీసుల బందోబస్తు.. ఎప్పుడేం జరుగుతుందోనని నిఘా వర్గాల డేగకన్ను...దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన మంథని మధుకర్ డెడ్‌బాడీకి రీపోస్టుమార్టం ముగిసింది...అవయవాలు సేకరించిన వైద్య బృందం పరీక్షలకు తరలించారు...హైకోర్టు ఆదేశాల మేరకు వీడియో రికార్డింగ్ చేశారు...వారం రోజుల్లో ధర్మాసనానికి సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించనున్నారు...

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలి: కేసీఆర్

హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు పూర్తి అధికారాలు, వనరులు కలెక్టర్లకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో తప్పులు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్‌ వివిధ అంశాలపై చర్చించారు.

06:51 - April 11, 2017

ఢిల్లీ: కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న సందర్భంగా..ఢిల్లీలో సోమవారం ఎన్టీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీయే సమావేశం జరగడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో పాటు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన 33 పార్టీలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

మూడేళ్లలో ఎన్డీయే బాగా విస్తరించిందని...

ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని,.ఈ మూడేళ్లలో ఎన్డీయే బాగా విస్తరించిందని ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయేకు అపూర్వమద్దతు లభిస్తోందని,..తమ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత ఎన్డీయే సమూహం..అన్ని రాష్ట్రాల్లో కలిపి 33 పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నట్టు తెలిపారు. దేశ ఆర్థికవ్యవస్థను ఎన్డీయే బలపర్చిందని, అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎన్డీయేను సుస్థిరపరచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు జైట్లీ తెలిపారు.

కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్సేతర ప్రధానికి పూర్తి మద్దతు...

కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్సేతర ప్రధానికి పూర్తి మద్దతు లభించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు..ప్రధాని మోదీకి ప్రజల మద్దతు ఉందనడానికి యూపీ ఎన్నికల ఫలితాలే పెద్ద నిదర్శనమన్నారు. మొదటిసారి ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని, దానికి మోదీయే కారణమన్నారు. అన్ని రంగాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.

ఎన్టీయే ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని,.

గడిచిన మూడేళ్లలో ఎన్టీయే ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని,.ఇది ఈ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. నోట్లరద్దు, డిజిటలైజేషన్‌, జీఎస్టీ, డిజిటల్‌ పేమెంట్స్‌ అతిపెద్ద విజయాలన్నారు. రెండంకెల వృద్ధిరేటును సాధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై ఈ సమావేశంలో చర్చించలేదన్నారు సీఎం చంద్రబాబు.

33 పార్టీల ప్రతినిధులు హాజరు...

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఈ సమావేశానికి ఎన్టీయే భాగస్వామ్య పక్షాలైన 33 పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మూడేళ్లలో సాధించిన విజయాలు, చేయాల్సిన పనులు వంటి వాటిపై సుధీర్ఘంగా చర్చించారు. 

ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోంది-బాబు

ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎన్డీయే విస్తరించిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో పాల్గొన్న అరుణ్‌జైట్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయేకు అపూర్వమద్దతు లభిస్తోందని కొనియాడారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ..ఈ మూడేళ్లలో ఎన్టీయే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని విజయం సాధించిందన్నారు. ఎన్డీయే వైపు ప్రజలు చూస్తున్నారన్నదానికి ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలే పెద్ద నిదర్శనమన్నారు. 

06:47 - April 11, 2017

సికింద్రాబాద్‌ : హైదర్‌బస్తీలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్తీలోని ఓ ఎల్‌ఈడీ గోడౌన్లో 3వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 4 ఫైరింజన్లు గంటకు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Don't Miss