Activities calendar

12 April 2017

జీహెచ్ ఎంసీలో మరో అవినీతి

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో మరో అవినీతి బట్టబయలైంది. నాలాల పూడికతీత పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు చేతివాటం ప్రదర్శించారు. సెంట్రల్ జోన్ పరిధిలోని 7ఏ, 7బీ, 9ఏ, 9బీ, 10 ఏ, 10బీ సర్కిల్స్ లలో పూడికతీత పనుల్లో గోల్ మాల్ జరిగింది. 

 

22:13 - April 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో సిఎం యోగి స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ సభ్యులు యువజంటను వేధింపులకు గురిచేశారు. మీరట్‌లోని ఓ ఇంట్లో యువజంట రొమాన్స్‌లో ఉండగా హిందూ యువవాహిని సభ్యులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వారితో అసభ్యంగా మాట్లాడారు. 'మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? మీ తండ్రి పేరేంటి? మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల పేర్లేమిటి?' అంటూ వారిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. యువకుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతుండగానే 'మీకంటే మీ కుటుంబసభ్యుల పేర్లెందుకు వేరేగా ఉన్నాయి? మతమార్పిడి చేసుకున్నారా?' అంటూ  ప్రశ్నించారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. అనంతరం ఆ జంటను పోలీసులకు అప్పగించారు. హిందూ యువవాహిని సభ్యులు పోలీసుల్లా ప్రవర్తించడం, మతాల ప్రస్తావన తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

22:10 - April 12, 2017

ఢిల్లీ : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బిజెపి యువమోర్చా నేత యోగేశ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది.  మమత తలకు  యోగేశ్11 లక్షలు వెలకట్టడంపై రాజ్యసభలో టిఎంసి  ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం పేరిట బెంగాల్‌లో బిజెపి అరాచకం సృష్టిస్తోందని టిఎంసి సభ్యులు సుఖేందు శేఖర్‌రాయ్‌ దుయ్యబట్టారు. యోగేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిజెపి ఆవులను రక్షించినట్లే మహిళలకు కూడా రక్షణ కల్పించాలని ఎస్పీ సభ్యులు జయాబచ్చన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యోగేశ్‌ వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. అతడిపై రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు.

 

22:07 - April 12, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగిశాయి. దీంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో జిఎస్‌టితో సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. జనవరి 31న ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగించడం ద్వారా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు విడతలుగా సమావేశాలు జరిగాయి. తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగగా, రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై బుధవారంతో ముగిశాయి.
లోక్‌సభ 178 గంటలు...రాజ్యసభ 129 గంటలు 
లోక్‌సభ మొత్తం 178 గంటల పాటు పనిచేసింది. బడ్జెట్‌ సమావేశాలు  జరిగిన తీరుపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ హర్షం వ్యక్తంచేశారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన కారణంగా 8 గంటల సమయం వృథా అయ్యిందని స్పీకర్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో మొత్తం 24 బిల్లులు ప్రవేశపెట్టగా చారిత్రక జిఎస్‌టి బిల్లుతో పాటు 23 బిల్లులు పాసయ్యాయి. ఆమోదం పొందిన వాటిలో జిఎస్‌టికి చెందిన నాలుగు బిల్లులు, దివ్యాంగుల బిల్లు, ఎయిడ్స్‌-హెచ్‌ఐవి, మెటర్నిటీ తదితర బిల్లులున్నాయి. రాజ్యసభ 129 గంటల పాటు జరిగింది.  జిఎస్‌టి లాంటి కీలక బిల్లులను కేంద్రం మనీబిల్లుగా ప్రవేశపెట్టడంపై  విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.  
బడ్జెట్‌ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ 
బడ్జెట్‌ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.  ఈవీఎంల టాంపరింగ్... ఆధార్‌ కార్డు అనుసంధానం తప్పనిసరి... అమెరికా, భారత్‌లో విద్వేషపూరిత దాడులు... అల్వార్‌లో గోరక్షణ పేరిట జరిగిన హత్య, బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ జాతి విద్వేష వ్యాఖ్యలు తదితర అంశాలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ మరణశిక్ష విధించడాన్ని పార్లమెంట్‌ ముక్తకంఠంతో ఖండించింది.
సమావేశాలు జరిగిన తీరుపై ప్రధాని మోది సంతృప్తి 
పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన తీరుపై ప్రధాని నరేంద్రమోది సంతృప్తి వ్యక్తం చేశారు. జిఎస్‌టితో పాటు కీలక బిల్లులు ఆమోదం పొందడంతో  సంస్కరణలు, అభివృద్ధికి మరింత వేగవంతం చేయడానికి ఆస్కారం కలిగిందని పేర్కొన్నారు.
సాధారణ బడ్జెట్‌లో రైల్వేబడ్జెట్‌
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తొలిసారిగా సాధారణ బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌లను కలిపి ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.  రైల్వేబడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలపడం ద్వారా మోది ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 

 

22:01 - April 12, 2017

హైదరాబాద్ : ఈ నెల 21న కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు ఉంటాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ జరుగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ నెల 14నుంచి 20వరకూ గులాబీ కూలీదినాలని... ఆ రోజుల్లో కూలీ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో సభకు రావాలని సూచించారు. ఎవరి ఖర్చులు వారే భరించాలన్నారు. తాను కూడా కూలీ పనిచేస్తానని చెప్పారు.

21:54 - April 12, 2017

హైదరాబాద్ : రాష్ట్ర పరిదిలోని విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల అమలులో కేంద్రం జోక్యం తగదన్నారు సీఎం కేసీఆర్‌. ఈ అంశాల్లో రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు రూపొందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. భిన్న పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించకుంటే.. ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. 
చాలా రాష్ట్రాల్లో 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు : కేసీఆర్‌
అవసరమైనప్పుడు 50శాతానికిమించి రిజర్వేషన్‌ అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్‌, జార్ఖండ్‌లో 60శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారని చెప్పారు.. తెలంగాణలో రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్‌ బిల్లును రూపొందిస్తామని తెలిపారు.. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతామని స్పష్టం చేశారు..
మేనిఫెస్టోలోని ప్రతి హామీ అమలు చేస్తున్నాం : కేసీఆర్‌
ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు.. నిన్ననే రైతు రుణమాఫీకి చివరిదశ నిధులుకూడా విడుదలచేశామని చెప్పారు.. రైతు రుణమాఫీ చారిత్రాత్తకమని ప్రకటించారు..
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు : కేసీఆర్‌
దాదాపు 30ఏళ్లుగా కరంటు కష్టాలతో సతమతం అయిన ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరట లభించిందన్నారు సీఎం కేసీఆర్‌. అప్పట్లో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అన్నట్టు ఉన్న పరిస్థితి నుంచి రాష్ట్ర బయటపడిందన్నారు. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్‌ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ప్రారంభమైతే..విద్యుత్‌కు కొరత ఉంటుందన్న వాదనను కేసీఆర్‌ కొట్టివేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యాపార వర్గాల్లో కూడా ధైర్యం వచ్చిందన్నారు. 

 

21:47 - April 12, 2017

ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా..? నాడు కంచికర్ల కోటేష్, నేడు మధుకర్, రాజేష్ ...ఎంతమంది బలవ్వాలి..? ఎందరి ఈ అన్యాయం జరగాలి..? పరువు పేరుతో సిగ్గు, ఎగ్గూ లేకుండా.. కుల దురహంకారమని, ఆదిమజాతి లక్షణాలతో విర్రవీగే కొందరు పశుప్రాయులు చేస్తున్న ఈ దారుణాలకు అంతం ఎప్పుడు..? ప్రభుత్వాలలో చలనం రాదా...? పోలీసు డిపార్ట్ మెంట్ కళ్లకున్న పొరలు వీడవా..? ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

మేము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు : కేసీఆర్

హైదరాబాద్ : తాము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల సభలో చెప్పామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు 16.3 శాతం జనాభా ఉందన్నారు. బీసీ..ఈ, గిరిజనులకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈనెల 16న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపరచాలని స్పీకర్ ను కోరామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వం టీసర్కార్ అన్నారు. 

బీసీ కమిషన్, చెల్లప్ప కమిషన్ రిపోర్టులకు టీకేబినెట్ ఆమోదం

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ కమిషన్, చెల్లప్ప కమిషన్ రిపోర్టులను ఆమోదించామని తెలిపారు. ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి కేబినెట్ భేటీ అవుతందని....అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు సీఎం ఛాంబర్ లో బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. 

 

21:20 - April 12, 2017
21:17 - April 12, 2017

కృష్ణా : ఏపీలో ప్రభుత్వ పథకాలు హామీలకే పరిమితమవుతున్నాయని... సీపీఎం ఆరోపించింది. జక్కంపూడిలో పర్యటించిన ఆ పార్టీ నేతలతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కృష్ణా జిల్లా జక్కంపూడిలో ఏడాదిక్రితం ఎన్ టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని.. శంకుస్థాపన చేసి 12నెలలు దాటినా ఇంతవరకూ పునాదిరాయి కూడా వేయలేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:50 - April 12, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరిగింది. సమావేశం ముగిసని అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో హెరిటేజ్ యాక్టు సరిగ్గా లేదు.. యాక్టులో సవరణలు చేయాలని కేబినెట్ లో నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ అమలు చేశామన్నారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. రైతుల రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయడం చారిత్రాత్మకమన్నారు. గవర్నర్ కోటా కింద మరోసారి ఎమ్మెల్సీలుగా రాజేశ్వర్ రావు, ఫరూఖ్ లను కొనసాగించాలని తీర్మానించామని చెప్పారు. 
బీసీ కమిషన్, చెల్లప్ప కమిషన్ రిపోర్టులకు ఆమోదం 
బీసీ కమిషన్, చెల్లప్ప కమిషన్ రిపోర్టులను ఆమోదించామని తెలిపారు. ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి కేబినెట్ భేటీ అవుతందని....అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు సీఎం ఛాంబర్ లో బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. 
మేము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు 
ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల సభలో చెప్పామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు 16.3 శాతం జనాభా ఉందన్నారు. బీసీ..ఈ, గిరిజనులకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. తాము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఈనెల 16న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపరచాలని స్పీకర్ ను కోరామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వం టీసర్కార్ అన్నారు. 
ఈనెల 16న అసెంబ్లీలో తెలంగాణ రిజర్వేషన్ బిల్లు 
ఈనెల 16న తెలంగాణ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. బీసీల రిజర్వేషన్లు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క హామిని అమలు చేస్తామని చెప్పారు. తమిళనాడులో 69, జార్ఘండ్ లో 60, మహారాష్ట్రలో 52, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో గిరిజనులకు 80 శాతం  రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయని తెలిపారు. గుజ్జర్లు, జాట్లలకు రాజస్థాన్ లో 68 శాతం పెంచాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. 
రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని రాజ్యాంగంలో లేదు
రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి వేరని, నాటి జనాభా, నేటి జనాభా వేరన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే, అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే అధికారాలు రాష్ట్రాలకు ఒదిలిపెట్టాలని సూచించారు. నిరంకుశంగా వెళ్తామంటే కుదరదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. రిపోర్టర్లకు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో కొన్ని చలోక్తులు కూడా వదిలారు. 

 

రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరిగింది. తెలంగాణ రైతులకు రుణమాఫీ అమలు చేశామన్నారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. రైతుల రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయడం చారిత్రాత్మకమన్నారు. 

 

హెరిటేజ్ యాక్టులో సవరణలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరిగింది. గతంలో హెరిటేజ్ యాక్టు సరిగ్గా లేదు.. యాక్టులో సవరణలు చేయాలని కేబినెట్ లో నిర్ణయించామని తెలిపారు. 

తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరిగింది. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. 

19:42 - April 12, 2017

అనంతపురం : నిరుపేద రోగుల డిమాండ్‌కు తగినట్లుగా 'అన్న సంజీవని మెడికల్‌ షాపుల్ని' ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురంలో 'అన్న సంజీవిని మెడికల్‌ షాపు'ను ఆమె సందర్శించారు. ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన మందుల్ని అందిస్తోందని... ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు సునీతా వెళ్లారు. పీజీ సీట్లు మంజూరు చేయాలంటూ సమ్మె చేస్తున్న డాక్టర్లను కలిశారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

 

19:31 - April 12, 2017

నెల్లూరు : కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశాలు రసాభాసగా మారాయి. బడ్జెట్‌ సమావేశాల ఆహ్వానం తమకు ఆలస్యంగా చేరిందని వైసీపీ కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరుగుతుండగానే నగర హెల్త్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలంటూ టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మేయర్‌ నుంచి సస్పెండ్‌ హామీ వచ్చే వరకూ కదిలేదిలేదంటూ వారు పోడియం ముందు బైటాయించారు. అయినా మేయర్‌ స్పందించకపోవడంతో కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

19:23 - April 12, 2017

విజయవాడ : వంగవీటి సినిమాపై రగడ కొనసాగుతోంది. మూవీలోని కొన్ని సన్నివేశాలపై తాజాగా విజయవాడ కోర్టులో వంగవీటి రాధాకృష్ణ పిటిషన్‌ వేశారు. రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని.. రంగా అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని రాధా ఆరోపించారు. వంగవీటి కుటుంబంతో ముందు చెప్పిన విధంగా రాంగోపాల్ వర్మ తీయలేదని విమర్శించారు. స్వయంగా కోర్టుకి హజరైన రాధా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పిటిషన్‌లో కోరారు.

 

18:46 - April 12, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సీపీఎం పోరాట ఫలితంగా పేదలకు కేటాయించిన 40ఎకరాల భూమిలో అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. జిల్లాలోని పాతకొత్తగూడెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పేదలకు కేటాయించిన భూములను పక్కదారిపట్టిస్తే ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.

 

18:21 - April 12, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సీపీఐ దీక్షలకు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మద్దతు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌కు వచ్చిన కోదండరాం.. దీక్ష చేస్తున్నవారికి సంఘీభావం తెలిపారు. కొత్తగూడెంలోని ఆస్తిదారులకు క్రమబద్దీకరణ పట్టాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజులుగా సీపీఐ నేతలు ఈ దీక్షలు చేపట్టారు.

 

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 

18:14 - April 12, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభన్‌లో ఆ పార్టీ నేతలు ధర్మయుద్ధం వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోనే కొద్దోగొప్పో ఉద్యోగాలు కల్పించారని.. కేసీఆర్‌ సర్కార్‌ మాత్రం.. రిక్రూట్‌మెంట్లను పక్కన పెట్టేసిందని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై పోరుబాట పడతామని అన్నారు. 

 

17:23 - April 12, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్' అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్ర లుక్స్ విడుదల కాకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. మురుగదాస్ చిత్రంలో ‘మహేష్’, ‘రకూల్ ప్రీత్ సింగ్’ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ప్రతి సినిమాలో సామాజిక కోణం చూపించే ‘మురుగదాస్’ ఇందులో కూడా ఓ అంశాన్ని చూపించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. చిత్ర షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా చిత్ర టైటిల్ ను కానీ ప్రకటించలేదు. అంతేగాకుండా 'మహేష్' లుక్స్ కూడా విడుదల కాకపోవడంపై అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5గంటలకు తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చేతిలో పిస్టల్ తో ఓ సైడ్ కి మహేష్ నిలబడిన పోస్టర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. మరి న్యూ లుక్ పై అభిమానుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం - ఉత్తమ్..

హైదరాబాద్ : 2019లో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఏడాది ముందే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పోరాటాలతో రైతు రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ వడ్డీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

16:57 - April 12, 2017

ఢిల్లీ : ఈవీఎంల ట్యాపరింగ్ అంశంపై ప్రతిపక్షాలు పోరును మరింత ఉధృతం చేశాయి. ఈ మేరకు 13 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి భవన్ కు వెళ్లాయి. అక్కడ ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై ట్యాపరింగ్ అంశంపై ఫిర్యాదు చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశం పెనుదుమారం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలతో పాటు వివిధ అంశాలపై విపక్షాలు రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించాయి. దేశంలో అభద్రతాభావం నెలకొందని ఇటీవల దాద్రీ, ఉనా, అల్వార్‌, జార్ఖండ్‌, ఉధంపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. గోవా, మణిపూర్‌లలో రాజ్యాంగ విరుద్ధంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సిబిఐ, ఈడీలతో దాడులు చేయించడం ద్వారా కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు.

16:51 - April 12, 2017

హైదరాబాద్‌ : నగరంలో రూ.5 రూపాయల భోజనం అద్భుతంగా ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశంసలు కురిపించారు. తనయోజకవర్గం మంగళగిరిలో సొంత ఖర్చుతో పేదలకు ఇలాగే భోజనం పెడతానని ప్రకటించారు. ఆయన మండుటెండలో 5 రూపాయల భోజనం దగ్గర క్యూకట్టారు. టోకెన్‌ తీసుకొని భోజనం పూర్తిచేశారు. 

16:46 - April 12, 2017

భువనేశ్వర్ : ఒడిశా కోరాపుట్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బందుగాంబ్లాక్ కొంబరికుట్టి వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. స్థానికుడికి గాయాలయ్యాయి. ఘటనా స్థలం వద్ద మూడు ఏకే 47లు, కిట్ బ్యాగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు సభ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడికి పాల్పడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:35 - April 12, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తాగునీరుకూడా లేక విలవిల్లాడుతుంటే.. బాబు మాత్రం బీజేపీని పొగడటంలోనే కాలం గడిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుబడిన ప్రాంతాలకు ప్రత్యేకప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి ఖర్చు కేంద్రమే భరించేలా ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రజలకు చేసిన వాగ్ధానాల్లో ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు జరపలేదని, రైతుల రుణమాఫీ అర్ధాంతరంగా ఆగిపోయిందని విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు చెందిన రుణమాఫీ రూ. 30వేల కోట్లు ఉందని అందులో ఔట్ స్టాడింగ్ బకాయిలు రూ. 15,854 కోట్లు ఉందని తెలిపారు. వీటిని చెల్లిస్తానని ప్రభుత్వం చెప్పి మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రూ. 400 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాయలసీమ..ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని మధు డిమాండ్ చేశారు.

16:27 - April 12, 2017

లక్నో : దేశంలో రోజు రోజుకు బీజేపీ నేతల వ్యాఖ్యలు శృతి మించిపోతున్నాయి. కేరళ సీఎం తలనరికితే తన యావదాస్తిని ఇస్తానని ఓ ఆర్ఎస్ఎస్ నేత పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ యువమోర్చా నేత యోగేశ్ వైష్ణేయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తల నరికి తెచ్చి వారికి రూ. 11 లక్షలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. హనుమాన్‌ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బీర్‌భూమ్‌ జిల్లాలో ర్యాలీ జరిగింది. జై శ్రీరాం నినాదాలు చేసిన హిందుత్వ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారని ఆరోపిస్తూ పై విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ- సరస్వతీ పూజ చేయనీయరు...రామనవమికి మేళా జరపనివ్వరూ.. పైగా హనుమాన్‌ జయంతి రోజు లాఠీలతో చితకబాదారని ఆరోపణలు గుప్పించారు. ముస్లింలను సంతోష పెట్టడానికి మాత్రం మమత ఇఫ్తార్‌ విందు ఇస్తారని యోగేశ్ పేర్కొన్నారు. మరి యోగేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

16:19 - April 12, 2017
16:17 - April 12, 2017

ఢిల్లీ : అమరావతిలో రూ. 97కోట్ల ఖర్చుతో అంబేద్కర్‌ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నక్కా ఆనంద్‌ బాబు ప్రకటించారు. ఈ నెల 14న 125 అడుగుల బాబాసాహెబ్‌ విగ్రహానికి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా పార్లమెంట్ నుండి మట్టిని అందుకోవడానికి ఆయన ఢిల్లీకి వచ్చారు. బుధవారం ఉదయం పార్లమెంట్‌లోని మట్టిని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చేతుల మీదుగా ఆనంద్‌ బాబు బృందం అందుకుంది. ఈ మట్టిని స్మృతివనంలో చల్లుతామని మీడియాకు మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 20 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీలో తెలిపారు.

 

16:08 - April 12, 2017

ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి..

విజయనగరం : ఒడికా, కోరాపూట్ జిల్లాలోని బందుగా బ్లాక్ కొంబరికుట్టి వద్ద పోలీసులు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు సభ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి జరిపారు. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఓ స్థానికుడికి గాయాలయ్యాయి. అనంతరం ఘటనా స్థలంలో మూడు ఏకే 47లు, కిట్ బ్యాగ్ లను స్వాధీనం చేసుకున్నారు.

మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గత నవంబర్ లో సీఎం జయలళిత చనిపోయిన నుండి తమిళ రాజకీయాలు అల్లకల్లోలంగా మారాయి. తాజా ముంబైలో గవర్నర్ విద్యాసాగర్ రావును డీఎంకే నేతలు కలిశారు. అర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే అభ్యర్థి దివకరన్ రూ.90 కోట్లు ఖర్చు చేశారని తేలడంతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వులపై టి.సర్కార్ నిబంధనలు..

హైదరాబాద్ : బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేసింది. బియ్యం..విద్యుత్ సబ్సిడీ..ఆసరా ఫించన్లకు ప్రతి మూడు నెలలకొకసారి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రపతిని కలిసిన సోనియా బృందం..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కలిశారు. ఆమె వెంట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆజాద్ తో పాటు 13 మంది సభ్యులున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్, జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు, అల్వార్ ఘటనను రాష్ట్రపతి దృష్టికి బృందం తీసుకొచ్చింది.

15:32 - April 12, 2017

యాదాద్రి : మధుకర్ రెడ్డి కేవలం మానసిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య స్వాతి అన్నారు. తన భర్తకు ఏప్పుడు పని ఒత్తిడిలో ఉండేవాడని....రోజురోజుకు బరవు తగ్గుగుతున్నానని బాధపడుతుండేవారని ఆమె తెలిపారు. కాలిఫోర్నియాలో మధుకర్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇతని మృతదేహం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంత్యక్రియల్లో స్వాతిపై మృతుడి బంధువులు దాడి చేశారు. ఈ సందర్భంగా బుధవారం టెన్ టివితో స్వాతి మాట్లాడారు. అంతక్రియలకు వస్తే తన మీద, తన తల్లిదండ్రుల మీద భర్త తరపు వారు దాడి చేశారని చెప్పారు. తనకు తన కూతురికి ప్రాణహాని ఉందని.....పోలీసులు రక్షణ కల్పించాలని, తనకు మీడియా సహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మధుకర్ తల్లిదండ్రులు మాత్రం తమ కోడలే హత్య చేసిందని ఆరోపిస్తున్నారు.

 

రోజూ మారనున్న పెట్రోల్..డీజిల్ ధరలు..

ఢిల్లీ : ఇకపై రోజు పెట్రోల్..డీజిల్ ధరలు మారనున్నాయి. ప్రయోగాత్మకంగా ఐదు నగరాల్లో మే 1 నుండి అమలు జరుపనున్నారు. పుదుచ్చేరి, విశాఖపట్టణం, ఉదయ్ పూర్, జంషెడ్ పూర్, చండీగఢ్ లలో మొదటగా రోజువారీ పెట్రో ధరల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లలో ఆయిల్ ధరలను బట్టి 15 రోజులకొకసారి ధరలను ఇంధన సంస్థలు సమీక్షించనున్నాయి.

పార్లమెంట్ మట్టిని అందుకున్న నక్కా ఆనంద్ బాబు..

ఢిల్లీ : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పార్లమెంట్ మట్టిని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీసుకున్నారు. స్పీకర్ సుమిత్ర మహాజన్ చేతుల మీదుగా పార్లమెంట్ మట్టిని అందుకున్నారు. అంబేద్కర్ స్వస్థలం మధ్యప్రదేశ్ నుండ్టి మట్టి..నీరును సేకరించడానికి మరో అధికార బృందం వెళ్లింది.

వేడెక్కిన తమిళనాడు రాజకీయాలు..

చెన్నై : తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముంబైలో గవర్నర్ విద్యాసాగర్ రావును డీఎంకే నేతలు కలిశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్ రూ. 90 కోట్లు చేశారని తేలడంతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది.

క్యాంటీన్ వివాదం

గుంటూరు : అమరావతి సచివాలయంలో క్యాంటీన్ వివాదం చెలరేగింది. పార్కింగ్ ప్రాంతంలో అనుమతి లేదని క్యాంటీన్ ను అధికారులు కూల్చేశారు. సీఆర్డీఏ అనుమతులు ఇచ్చాకే పనులు ప్రారంభించామని కాంట్రాక్టర్ చెబుతున్నారు. నష్టపరిహారం ఇవ్వలని ఆయన డిమాండ్ చేశారు.

14:28 - April 12, 2017
14:19 - April 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఇండియన్‌ ఐడల్‌ విజేతలు రేవంత్‌, రోహిత్‌ లు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, రేవంత్, రోహిత్‌లను కేటీఆర్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలంటూ ఇద్దరినీ మంత్రి అభినందించారు. 

14:12 - April 12, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నేరెడుపళ్లు తెంపుతు ప్రమాదవశాత్తు కింద పడి ఓ బిల్డర్ మృతి చెందాడు. ఈఘటన డొక్కాలమ్మ ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. నేరేడుపళ్లు తెంపాలని చిన్నా అనే బిల్డర్ ను ఓ వ్యక్తి కోరాడు. దీనితో మూడంతస్తు భవనంపై నున్న పిట్టగోడ ఎక్కి నేరేడుపళ్లు తెంపుతున్నాడు. ఒక్కసారిగా పిట్టగోడ కూలిపోవడంతో చిన్నా కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఇతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిన్నా మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

14:03 - April 12, 2017

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ సర్కార్ ది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని టీడీపీ నేత పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లో 150 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం చేస్తానన్న విషయాన్ని మరిచిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం టి.టిడిపి నేతలు ధర్నా చేపట్టారు. కేసీఆర్‌ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తామని చెప్పి ఆర్భాటంగా సెల్లార్‌ తవ్వి వదిలేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చెస్తానని చెప్పి కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు.

 

13:49 - April 12, 2017

చెన్నై : తమిళనాడులో ఐటీ సోదాలు గంటగంటకు మలుపులు తిరుగుతున్నాయి. రాధిక, శరత్ కుమార్ లకు ఐటీ సమన్లు జారీ చేసింది. సాయంత్ర 3 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. 7 కోట్లకు సంబంధించి ఆధారలు చూపాలని కోరింది. గత 48 గంటలుగా సినీ నటి రాధిక సీరియల్ నిర్మాణ సంస్థ రాడాన్ కార్యాలయంలో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. రాధిక భర్త శరత్ కుమార్ అర్కే నగర్ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాడానికి ఆ పార్టీ 7 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో ఐటీ దాడులు చేసింది.

 

13:46 - April 12, 2017

'అక్షయ' పాత్ర పేరిట మళ్లీ మోసాలు..అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్న గ్యాంగ్..సొమ్ము చేసుకుని పారిపోతున్న ముఠా..నగరంలో మరో గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాత్ర మీ ఇంట్లో కోటీశ్వరులే...దరిద్రం మీ ఇంట దరిచేరదు. ఇలాంటి మాటలతో మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా దొరికింది. మహానగరంలో ఇలాంటివి ఎన్నో గ్యాంగులున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఠాలోని ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద రెండు కార్లు..పుల్లింగ్ కు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:38 - April 12, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడ రిజిస్ట్రార్ బాలప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. స్థల విషయంలో రిజిస్ట్రేషన్ కోసం రూ.40 వేలు తీసుకుంటూ ఏసీబీకి దోరికిపోయారు. అతన్ని ఏసీబీ అధికారులు  అదుపులోకి తీసుకుని, రాజమండ్రి మెజిస్ట్రేట్ లో హాజరు పరుచనున్నారు.

 

13:33 - April 12, 2017

ఇంట్లోంచి ఇప్పుడే వస్తానంటూ వెళ్లింది..తెల్లారేసరికి ఊరి చివర డెడ్ బాడీ..ఇల్లాలిని ముక్కలు చేశారు..

భర్త కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తున్నాడు. ముగ్గురు పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన బాధ్యతగల ఆ ఇల్లాలు తప్పటడుగు వేసింది. అందుకు పర్యవసానం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. పాశ్చాత్య పోకడలు మరో మహిళను అంతం చేసింది. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మంగలంలోని గట్ల మల్యాల గ్రామంలో లావణ్య నివాసం ఉంటోంది. ఈమె భర్త దుబాయ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే పరుశురాంగౌడ్ తో లావణ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో లావణ్య మృతి చెందడం..మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం కలకలం రేగింది. పరుశురాం గౌడ్..ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

నేరేడుపళ్లు తెంపుతూ కిందపడి ఒకరి మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్ లో నేరేడు పళ్లను తెంపుతూ గోడపై నుంచి ఇద్దరు యువకులు కిందపడ్డారు. వారిలో చిన్నా అనే వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన డొక్కాలమ్మ ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మానసిక ఒత్తిడితోనే చనిపోయాడు: స్వాతి

హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలు, మానసిక ఒత్తిడితోనే చనిపోయాడాని, అందుకు తాను కారణం కాదని ఆయన భార్య స్వాతి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కొత్తపేటలో స్వగృహంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనెల 4న మధుకర్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. భర్తతో తనకెలాంటి విబేధాలు లేవని స్వాతి చెప్పారు.

రేవంత్, రోహిత్ లను సత్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఇండియన్ ఐడిల్ విజేతలు రేవంత్, రోహితలను మంత్రి కేటీఆర్ ఘనంగా సన్మాంచినారు.  బుధవారం ఆయన నివాసంలో రేవంత్‌, రోహిత్‌లను కలిసిన కేటీఆర్‌ వారికి అభినందనలు తెలియజేశారు. ఇరువురికి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు. ఆ తర్వాత వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను తెలంగాణ ఐటీశాఖ ట్విటర్లో పోస్టు చేసింది.

 

13:04 - April 12, 2017

జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న చిత్రం 'జై లవకుశ'..ఎన్టీఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో విశేషాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నివేదా థామస్' ఫొటోతో ఈ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ మధ్య పోస్టర్ తో మొదటి హీరోయిన్ 'రాశీ ఖన్నా' అని చిత్ర యూనిట్ కన్ ఫాం చేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, అందులో ఒకటి పూర్తిగా నెగటివ్ పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విలన్ పాత్రకు జతగా 'సమంత' నటించనుందని టాక్. ఇక 'నివేదా థామస్' జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం నాని నటిస్తున్న 'నిన్ను కోరి' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

12:42 - April 12, 2017

ఢిల్లీ : కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ వెనక్కు తగ్గింది. జాదవ్ ఉరిశిక్షను 60 రోజులు వాయిదా వేసింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి అసీఫ్ ప్రకటన చేశారు. రెండు నెలల సమయంలో జాదవ్ కు సుప్రీం కోర్టు వెళ్లాడానికి అవకాశం కల్పిచింది. భారత్ ఒత్తిడి వల్ల పాక్ దిగివచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుపుతునట్టు.... జాదవ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుకుంటున్నామని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. జాదవ్ ఎప్పుడో రిటైర్డ్ అయ్యాడని...ఒక విదేశియుడిని మరిశిక్ష విధిస్తే అంతర్జాతీయ న్యాయ సూత్రలను అనుసరించి ఆ దేశ కన్సలేట్ కు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. జాదవ్ కు న్యాయ సహాయం చేస్తామని ఆమె చెప్పారు. ఇది ఇలాఉంటే ఆ దేశ ప్రతిపక్ష పార్టీ పీఎంకే పలు ప్రశ్నలు సంధించింది. జాదవ్ కు భారత పాస్ పోర్టు ఉండగా అరెస్ట్ ఎలా చేశారో చెప్పాలని డిమాండ్ చేసింది. కుల్ భూషణ్ జాదవ్ కు గూఢచార్య ఆరోపణలపై పాక్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

నటి రాధిక, నటుడు శరత్ కుమార్ కు ఐటీ సమన్లు...

చెన్నై: రాడాన్ కార్యాలయంలో ఐటీ సోదాలు ముగిశాయి. నటి రాధిక, శరత్ కుమార్ లకు ఐటీ సమన్లు జారీ చేసింది. అంతే కాకుండా మధ్యాహ్నం 3 గంటలకువిచారణకు రావాలి ఆదేశించింది.

ఇరిగేషన్ అధికారులతో తమిళనాడు బృందం భేటీ

హైదరాబాద్: జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో తమిళనాడు బృందం భేటీ అయ్యింది. మిషన్ కాకతీయ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఏసీబీ పట్టుబడ్డ తూ.గో జిల్లా రిజిస్ట్రార్

తూ.గో: జిల్లా రిజిస్ట్రార్ బాల ప్రకాష్ రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద టి. టిడిపి ధర్నా

హైదరాబాద్: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద టి. టిడిపి ధర్నా చేపట్టింది. అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

12:18 - April 12, 2017

విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి సేకరించిన ప్రభుత్వ, అసైన్డ్ భూముల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూములను నిర్మాణ సంస్థ నవయుగకు అప్పగించే వరకు వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.

3014.43 ఎకరాల సేకరణ.....
కృష్ణాజిల్లా బందరు పోర్టు కోసం బందరు మండలంలోని మంగినపూడి, తవిసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి, బందరు రూరల్‌ ఏరియాలో 3014.43 ఎకరాలు సేకరించారు. వీటిలో ప్రభుత్వ భూమి 2360.52 ఎకరాలు.. అసైన్డ్ భూమి 653.91 ఎకరాలు ఉంది. అయితే ఆ భూములను నిర్మాణ సంస్థకు అప్పగించే వరకు..వాటి రక్షణకు అవసరమైన కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందనే అంశం సందిగ్ధంలో ఉంది.

నవయుగకు భూములు....
పోర్టు నిర్మాణానికి మొత్తం 5వేల 2వందల 96 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, వీటిలో 4వేల 8 వందల ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగకు అప్పగించాల్సి ఉంది. వీటిలో 3014.43 ఎకరాలు సిద్ధం కాగా,..మిగిలిన ప్రైవేట్‌ పట్టా భూములు దాదాపు 1800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు మొత్తంగా పట్టా భూములు 1300 ఎకరాలకు భూ సమీకరణ ప్రక్రియ పూర్తైంది. వీటిలో పోర్టుకు సంబంధించిన భూములు 400 ఎకరాలు ఉన్నట్టు సమాచారం. మిగిలిన భూములకు సంబంధించిన భూసమీకరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ....
అయితే పోర్టు కోసం బలవంతంగా తమ దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతూ పలు చోట్ల ఆందోళనలు కూడా చేశారు. ఈ మేరకు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను సేకరించడం సరికాదని..ఇది చట్ట విరుద్ధమని..ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలని సీపీఎం నేతలు కూడా హెచ్చరిస్తున్నారు. .

12:14 - April 12, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్' అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మహేశ్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రకూల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏ సమాచారం బయటకు రావడం లేదు. చిత్ర షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా చిత్ర టైటిల్ ను కానీ ప్రకటించలేదు. అంతేగాకుండా 'మహేష్' లుక్స్ కూడా విడుదల కాకపోవడంపై అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. త్వరలోనే లుక్స్ విడుదలవుతాయని చిత్ర యూనిట్ చెప్పినా ఇంతవరకు అలాంటి లుక్స్ విడుదల కాలేదు. తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5గంటలకు తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అఖిలేశ్ దాస్ గుప్తా మృతి

యూపీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అఖిలేశ్ దాస్ గుప్తా మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. యూపీఏ-1 ప్రభుత్వంలో ఆయన ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. లక్నో మేయర్ గా కూడా ఆయన విధులు నిర్వహించారు. 

12:06 - April 12, 2017

కేవలం..పది రూపాయలు..దాని కోసం ఏకంగా కట్టుకున్న భార్యను హత్య చేశాడో ఓ శాడిస్టు భర్త. మహారాష్ట్ర‌లోని ప‌ల్‌గ‌ర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చ‌వ్రేపాడ స‌మీపంలోని తండుల్వాడీ అట‌వీ ప్రాంతంలో లక్ష్మ‌ణ్‌, మాల‌తి ప‌ల్వ‌(45)లు నివాసం ఉంటున్నారు. వీరు కట్టెలు..కలప విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 4వ తేదీన అడవి నుండి భర్త కట్టెలు తెచ్చాడు. వీటిని సమీపంలో ఉన్న మార్కెట్లో మాలతి పల్వ విక్రయింయింది. ఇలా విక్రయించగా రూ. 100 వచ్చాయి. 70 రూపాయలతో చేపలు..కూరగాయలు తీసుకంది. మరో 20 రూపాయలను తిరిగి భర్తకు ఇచ్చేసింది. కానీ మరో పది రూపాయలు తక్కువగా ఇవ్వడంపై లక్ష్మణ్ ప్రశ్నించాడు. పది రూపాయలు ఏం చేశావని నిలదీశాడు. ఆ డబ్బుతో సారా తాగానని మాలతి పల్వ చెప్పడంపై లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడనే కర్రతో తలపై మోదాడు. దీంతో ఆమెకు తీవ్ర‌ర‌క్త‌స్రావమైంది. ఆస్ప‌త్రిలో చికిత్స‌లో పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నారు. క్ష‌ణికావేశంలో చేసిన ఓ త‌ప్పు.. ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది.

 

కృష్ణా నీటి వివాదం పై విచారణ ఏప్రిల్ 19కి వాయిదా

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కృష్ణా నీటి జలాలను నాలుగు రాష్ట్రాలకు పంపకాలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ కోరగా 4 రాష్ట్రాలకు పంపకాలు కుదరదని మహారాష్ట్ర, కర్ణాటక తేల్చి చెప్పాయి. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.

గోవులకు ఉన్న రక్షణ మహిళలకు లేదు : జయాబచ్చన్

ఢిల్లీ: మహిళల సంరక్షణపై రాజ్యసభలో రగడ చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని బెదిరించిన బిజెపి నేత పై చర్యలు తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేసింది. దేశంలో గోవులకు ఉన్న రక్షణ మహిళలకు లేకుండా పోయిందని జయా బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కుల్ భూషన్ విషయంలో వెనక్కి తగ్గిన పాక్

ఇస్లామాబాద్: గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత్ కు చెందిన నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ కు ఉరిశిక్ష విధించిన పాక్ వెనక్కి తగ్గింది. కుల్ భూషన్ జాదవ్ కు శిక్ష వెంటనే అమలు చేయమని తెలిపింది. భూషన్ అప్పీల్ కు 60 రోజుల గడువు వుందని తెలిపింది.

 

 

11:39 - April 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం కోసం బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పవన్' హీరోగా నటిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అంతేగాకుండా షూటింగ్ ను కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో 'పవన్' సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలక పాత్రను 'ఖుష్బూ' నటిస్తోంది. చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో ఆమె రీ ఎంట్రీ ఇస్తుందని చెప్పవచ్చు. ‘అత్తారింటికి దారేది' చిత్రంలో 'నదియా' పాత్ర ఎంత బలమైందో తెలిసిందే. అలాంటి బలమైన పాత్ర కోసం 'ఖుష్బూ'ని ఎంపిక చేశారని తెలుస్తోంది. తొలి రోజున షూటింగ్ కు వెళ్లినప్పుడు స్కూల్ కి వెళ్లినట్లుగా అనిపించిందని, తన పాత్ర కీలకం కావడంతోనే తాను ఒప్పుకోవడం జరిగిందని 'ఖుష్బూ' వెల్లడించింది. పవన్' సరసన 'ఇమ్మాన్యూయెల్', 'కీర్తి సురేష్'లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో 'ఖుష్బూ’ పాత్ర ఏమిటో తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

11:32 - April 12, 2017

విశాఖపట్నం : ఆంధ్ర, ఒడిషా రాష్ట్ర సరిహద్దు నారాయపట్నం అల్లేరి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. అక్కడే పనిచేసుకుంటున్న గిరిజనుడికి గాయాలయ్యాయి. గత కొద్ది  రోజులుగా ఏవోబీలో ఉద్రిత్త పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రింది విశాఖలోమ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. 

11:29 - April 12, 2017

టాలీవుడ్ నటి 'సమంత' మూగ పాత్ర పోషిస్తోందా ? ఓ సినిమాలో 'సమంత' రిస్క్ చేస్తోందని సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ'..సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'సమంత' కూడా నటిస్తోంది. ‘రామ్ చరణ్' వినికిడి లోపం ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడని, 'సమంత' మూగ అమ్మాయిగా నటిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జరుగుతున్న ప్రచారంపై సినిమా యూనిట్ స్పందించింది. ఈ సినిమాలో 'సమంత' మూగ పాత్ర పోషిస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దీనితో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 161పాయింట్లు పతనమై 29,626 వద్దకు నిఫ్టీ 51పాయింట్లు పతనమై 9185 వద్ద ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లకు సంబధించిన షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

 

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

హైదరాబాద్: ఫిలిప్పీన్స్‌లో ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దుతున్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 16 నగరాల్లో ప్రకంపనలు సంభవించాయని.. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైంది. భూకంప తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. 

11:23 - April 12, 2017

ఏంటీ విమానం రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఏంటీ ? గాల్లో ఎగురుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు కానీ రోడ్డు మీద ప్రమాదం జరగడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. ఈ ఘటన అమెరికాలోని మానే రాష్ట్రంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో ఓ చిన్న విమానం గాల్లో ప్రయాణిస్తోంది. కానీ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సినవసరం ఏర్పడింది. దీనితో విమానాన్ని నడుపుతున్న జాన్ గేలే ఓ రోడ్డుపై ల్యాండ్ చేశాడు. సేఫ్ గానే ల్యాండ్ అయినా తరువాత అదుపు తప్పింది. నేరుగా పక్కనే ఉన్నా మెటల్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. విమానంలో ఓ ప్రయాణీకుడు స్వల్పగాయాలతో బయటపడినట్లు సమాచారం.

ఈవీఎంల అంశంలో కాంగ్రెస్ లో విభేదాలు

ఢిల్లీ: ఈవీఎంల అంశంలో కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ల అబిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వీరప్ప మొయిలీమండిపడుతున్నారు.

 

11:14 - April 12, 2017

ఖమ్మం : పంట పండినా... కంట నీరు ఆగడం లేదు... ఆరుగాలం కష్టపడినా ఫలితం మాత్రం దక్కడం లేదు... ఏడాకేడాది రైతులకు అప్పులు.. ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక పక్క గిట్టుబాటు ధర లేక... ప్రభుత్వం పట్టించుకోక మిర్చి రైతులు వాపోతున్నారు.

అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి....
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకూ అగమ్య గోచరంగా తయారవుతోంది. తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని ఎర్ర బంగారం సాగు చేసిన రైతులకు చివరికి నష్టాల ఘాటు తగులుతోంది. ధర భారీగా పతనమవ్వడంతో మార్కెట్‌కు తెచ్చిన మిర్చిని అమ్మలేక, దాచిపెట్టడానికి కోల్డ్ స్టోరేజీల్లో స్థలం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

40 వేల ఎకరాల్లో మిర్చి సాగు......
జిల్లాలో ఈ సంవత్సరం 40 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. దీంతో దిగుబడి భారీగా పెరిగింది. ఈ మేరకు ఖమ్మం మిర్చి యార్డ్‌కు సగటున రోజుకు 50 వేల బస్తాలకు పైగా వస్తున్నాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. మిర్చి యార్డ్‌ పరిమితి కేవలం 30 నుంచి 40 వేల బస్తాల వరకే ఉండటంతో మార్కెట్ బయట రోడ్ల వెంట కూడా రైతులు మిర్చిని దింపుతున్నారు. అయితే గత రెండేళ్లలో మిర్చి ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు పలికింది. కానీ ఈ సంవత్సరం కేవలం రూ.6వేల నుంచి రూ.7 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్‌లో జెండా పాట క్వింటాకు రూ.8 వేలు పలికినప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. పేరుకే జెండా పాటగా ఉంది. సరుకు ఎంత నాణ్యంగా ఉన్నా వ్యాపారులు రూ.6,500 మించి ధర పెట్టడం లేదు. దీంతో కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని ఖమ్మం మార్కెట్‌కు రెండు జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి కూడా పంట ఇక్కడకు వస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో కేవలం 31 కోల్డ్ స్టోరేజీలే ఉన్నాయి. ఒక్కొక్క కోల్డ్ స్టోరేజీలో 70 వేల నుంచి ఒక లక్ష బస్తాలు మాత్రమే నిల్వచేసే అవకాశముంది. దాంతో దాచేందుకు చోటు లేక రైతులు తమ ఉత్పత్తులను వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. దీనికి తోడు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు స్టోరేజీ ఛార్జీలను భారీగా పెంచినట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కేంద్రానికి ప్రతిపాదనలు....
అయితే మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే మార్కెట్లలోకి మార్క్‌ఫెడ్ రంగ ప్రవేశం చేసి మద్దతు ధరతో మిర్చి పంటను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కాగా 1995 సంవత్సరంలో ఇదే మార్కెట్‌లో మార్క్‌పెడ్ మిర్చిని కొనుగోలు చేసింది.

సిండికేట్‌గా మారి....
జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల ఆరు వేల నుంచి పది వేల ఎకరాల్లో మిర్చి పంట నష్టం జరిగింది. ఇప్పుడు వ్యాపారులు సిండికేట్‌గా మారి.. పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు జరపనంత వరకు రైతులకు నష్టాలు తప్పేలా లేవు.  

11:10 - April 12, 2017

గుంటూరు : హైటెక్ హంగులకు ఏపీ సీఎం చంద్రబాబు మారుపేరు. రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయాలకు అనుసంధించిన ఏకైక వ్యక్తి. ఆది నుంచి తెలుగుదేశం పార్టీ సాంకేతికతకు పెద్దపీట వేసింది. లేటెస్ట్ టెక్నాలజీ ఏదొచ్చిన దానిని అందిపుచ్చుకుంటోంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అమలు చేసి కార్యకర్తల మనోభావాలు, వారి సమస్యలు, ఎన్నికలలో అభ్యర్ధుల ఎంపిక.. ఆన్‌లైన్‌ ద్వారా పార్టీ సభ్యత్వం ఇలాంటి విధానాలు తీసుకువచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది.

నారాలోకేష్‌ ఆధ్వర్యంలో....
ఇక 2014 ఎన్నికలకు ముందు యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు ఆన్‌లైన్ సంచలనం ఫేస్ బుక్‌ను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది. నారాలోకేష్‌ ఆధ్వర్యంలో తెలుగునాడు సాంకేతిక నిపుణుల విభాగంలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల బృందం సోషల్ ప్రమోషన్‌ను విజయవంతంగా నడిపారు. తెలుగుదేశం అధికారిక ఫేస్ బుక్ పేజీనే పద్దెనిమిదిన్నర లక్షల మంది ఫాలో అవుతున్నారంటే సోషల్ మీడియాలో టీడీపీ హవా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో వెనుబడిన టీడీపీ
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారంలో టీడీపీ వెనకబడిపోయింది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో టీడీపీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సైట్లను అనుచరుల సహకారంతో నడిపిస్తోన్న వైసీపీ తాజాగా ప్రఖ్యాత తెలుగు వెబ్ సైట్ ను కొనుగోలు చేసి తమ పార్టీ తరుపున ప్రచారం చేసుకునేందుకు సిద్ధమైందని సమాచారం. ఇలా పక్కా ప్లానింగ్‌తో ఆ పార్టీ దూసుకుపోతోంది.

టీడీపీ అధిష్టానం దీనిపై దృష్టి....
దీంతో టీడీపీ అధిష్టానం దీనిపై దృష్టిపెట్టింది. సోషల్ మీడియా ప్రచారంలో గల లోపాలను అంచనావేసింది. సరికొత్త ప్రణాళికలతో సోషల్ ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించేదుకు రెడి అవుతోంది. మంత్రులు ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు ఫేస్ బుక్ పేజీలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు యువనేత లోకేష్‌. విలేజ్ లెవల్ క్యాడర్ ఆసాంతం ఫేస్‌బుక్లో యాక్టీవ్ గా ఉంటూ.. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ ప్రజా ప్రయోజక నిర్ణయాలు జనంలోకి తీసుకెళ్తూనే మరోవైపు వైసీపీ ఆరోపణలకు చెక్ పెట్టేలా దిశానిర్దేశం చేస్తున్నారు చినబాబు.

ఐవిఆర్ ఎస్ సిస్టమ్ దార్వా
ఒక్క ఫేస్ బుక్కే కాకుండా.. ఐవిఆర్ ఎస్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ పధకాల ప్రచారం, వాట్స్ ఆప్, ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ వాయిస్ ను ప్రజల్లోకి పంపేదుకు టీడీపీ సిద్ధమవుతోంది.

 

11:07 - April 12, 2017

హైదరాబాద్ : ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ నెల 16వ తేదీన శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లను పెంచడంతో పాటు వస్తు సేవల పన్ను బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశముంది. మరోవైపు ముస్లిం మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై అధ్యనయం చేసిన బీసీ కమిషన్ తన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందించింది.

క్యాబినెట్ ముందుకు బీసీ అధ్యయన నివేదిక....

బీసీ - ఈ కేటగిరీలోని సామాజిక వర్గ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసిన ఐఏఎస్‌ అధికారి సుధీర్‌ నేతృత్వంలోని కమిషన్‌... ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ముస్లింల రిజర్వేషన్లు పెంచాలని కమిషన్‌ తన నివేదికలో సూచించింది. సుధీర్ కమిషన్ నివేదికలోని అంశాల ఆధారంగానే బీసీ కమిషన్ కూడా అధ్యయనం చేసింది. అటు మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెల్లప్ప నేతృత్వంలోని కమిషన్.. గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక అందించింది. ఈ కమిషన్‌ గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని సూచించింది. దీంతో మైనార్టీలు, గిరిజనులతోపాటు బీసీల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

మైనార్టీ, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించే అవకాశం....

మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై ఈనెల 16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులోనే మైనార్టీ, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించనుంది. తమిళనాడు తరహాలో 69శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. వీటితో పాటు పార్లమెంట్ ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సేవలు పొందేందుకు కేంద్రం తీసుకొచ్చిన రైటు టు సర్వీసేస్ బిల్లు కూడా శాసనసభ ముందుకు రానుంది.

 

గవర్నర్ తో కేసీఆర్ భేటి....

మరోవైపు కేసీఆర్‌ రాజ్‌భవన్‌లోగవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల విషయంపైనా చర్చించారు. ఇక బుధవారం సాయంత్రం జరిగే కేబినెట్‌ భేటీలో రిజర్వేషన్ల పెంపు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ సమావేశం తేదీ కూడా కేబినెట్‌ భేటీలో ఫైనల్‌ కానుంది.

 

థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఎస్సై కి బెయిల్

హైదరాబాద్: పేట్ బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావుకు మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యాపారావేత్త శివ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఎస్సై కోటేశ్వరరావు పై కేసు నమోదు అయ్యింది.

10:32 - April 12, 2017

భారీ బడ్జెట్ తో 'మహాభారతం' సినిమాను తెరకెక్కించాలని బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బాలీవుడ్ 'ఖాన్' త్రయం ఆధ్వర్యంలో కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో తాను భాగం అవుతున్నట్లు 'షారూఖ్ ' వెల్లడించారు. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌, కరణ్‌ జోహర్‌ కలిసి 'అక్షయ్ కుమార్' హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్‌ చేశారు. ఈ విషయం తెలిసి 'షారూఖ్‌' కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతానని తెలిపారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ తుది దశకు చేరుకుందని షారూఖ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ‘మహాభారతం’ సినిమా ప్రాజెక్టు భారీ స్థాయంలో ఉండడంతో సొంతంగా కాకుండా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సినిమా రూపొందించాలని షారూఖ్ యోచిస్తున్నట్లు టాక్. భారీ మార్కెట్‌ కూడా కావాల్సి ఉంటుందని, దీంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంతర్జాతీయ నిర్మాణ సంస్థలను ఆహ్వానించడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు షారూఖ్ వెల్లడించారు. అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు నిర్మిస్తే సినిమా రేంజ్‌, మార్కెట్‌ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు షారూఖ్‌ పేర్కొన్నారు.

10:30 - April 12, 2017

తమిళనాడు : తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఆర్కే నగర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఐటీ దాడుల దృష్ట్యా పళని ప్రభుత్వాన్ని బర్తరఫ్త చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై నేడు గవర్నర్ ను ముంబైలో కలిసి వినతిపత్రం సమర్పించనుంది. గత రెండు రోజుల ఐటి అధికారులు నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ ఇంట్లో, ఆయన భార్య రాడాన్ మీడియా అధినేత రాధిక కార్యాలయాల్లో వరుసగా రెండో కూడా ఐటీ దాడులు కొనసాగిస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి విజయ్ శరత్ కుమార్ రూ.7కోట్లు ఇచ్చారన్న పక్కా సమాచారంతో ఐటీ వర్గాలు దాడులు చేస్తున్నాయి. అర్కేనగర్ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే ఓటుకు 10వేల నుంచి 20 వేలు ఇస్తుందన్న సమాచారంతో విద్యాశాఖ మంత్రి ఇంట్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధినం చేసుకున్న విషయం తెలిసింది. ఈ అంశంపై డీఎంకే నేడు గవర్నర్ విద్యాసార్ రావును కలవనున్నారు. ఇది ఇలాఉంటే పళాని స్వామి వర్గం వారు ఇదంతా సేల్వం వెనుక ఉండి చేయిస్తున్నారని అన్నారు.

 

10:20 - April 12, 2017

వేసవి కాలం రాగానే పలువురి నివాసాల్లో ఉండే ఫ్రిజ్ లో ఐస్ ముక్కలుంటాయి. పండ్ల రసాలు..వివిధ అవసరాల కోసం ఈ ఐస్ ముక్కలను వినియోగిస్తుంటారు. కానీ వీటినే సౌందర్య సాధనంగా కూడా వాడవచ్చు. ఎలాగో తెలుసా...
తరచూ మీరు ప్రయాణాలు చేస్తుండడంతో ముఖం అలసటగా మారుతుందా ? ఐసు ముక్కలతో ముఖంపై అద్దుకోవాలి. చల్లదనం అలసటని దూరం చేస్తుంది.
చర్మం కందిపోయి ఉంటే పొడది తువాలులో ఐస్ ముక్కలను ఉంచండి. కందిపోయిన ప్రదేశంలో అద్ది చూడండి.
మొటిమలు ఉన్న వారికి ఎండకాలంలో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా మంట..నొప్పితో వీరు బాధ పడుతుంటారు. వీరు శుభ్రంగా ఉన్న పొడి వస్త్రంలో ఐసు ముక్కలను ఉంచి ఆ ప్రాంతంలో అద్దాలి. ఇలా పది నిమిషాలు చేయాలి.
పరిశుభ్రమైన నీటిలో తాజా రోజ్ వాటర్ కలిసి ఐస్ క్యూబ్ లను తయారు చేసుకోవాలి. రోజ్ వాటర్ ఐస్ క్యూబ్ లను పొడిచేసిన కర్పూరాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొంటే మొటిమలు తగ్గే అవకాశం ఉంది.

 

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

హైదరాబాద్: ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణపట్నం వద్ద లల్లేరి అటవీప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గిరిజనుడికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

రెండో రోజూ రాడార్ కార్యాలయంలో ఐటీ సోదాలు

చెన్నై : రెండో రోజు రాడాన్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ నుంచి శరత్ కుమార్ కు రూ. 7 కోట్లిచ్చినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందండంతో శరత్ కుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. తమిళనాడు సీఎం ను బర్తరఫ్ చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్కిల్లో నగదు పంపిణీ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు నేడు డు ముంబై వెళ్లనున్నారు.

09:56 - April 12, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ సరఫరాపై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 18 గంటలు, ప్రార్థనాలయాలు ఉన్న ప్రాంతాల్లో 24 గంటలు కరెంట్‌ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పాత బిల్లులపై సర్‌చార్జీని మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రెండవ కాబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చెరకు రైతుల బకాయిలను రెండు వారాల్లో తీర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. చెరకు రైతుల పాత బకాయిలను చెల్లించేందుకు 4 నెలల గడువు ఇచ్చింది. రైతుల నుంచి క్వింటాల్‌కు 487 చొప్పున ఆలుగడ్డలను కొనడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 18 వేల కిలోమీటర్ల మేర రోడ్లపై పడ్డ గుంతల మరమ్మత్తుల కోసం 4 వేల కోట్లను కేటాయించింది. 

09:52 - April 12, 2017

హైదరాబాద్: ధనా ధన్‌ టీ 20 లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌లో.....సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్‌,రెండు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి రౌండ్‌ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియంలో రంగం సిద్దమైంది.

బౌలింగ్‌ పవర్‌తో సన్‌రైజర్స్‌ .....బ్యాటింగ్‌ బలంతో ముంబై ఇండియన్స్‌ జట్లు...తొలి రౌండ్‌ మ్యాచ్‌కు సై అంటే సై అంటున్నాయి. ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన సన్‌రైజర్స్‌ జట్టుకు సెకండ్‌ లీగ్ మ్యాచ్‌లోనూ పోటీనేలేకుండా పోయింది.మూడో లీగ్‌ మ్యాచ్‌లో ముంబైను చిత్తు చేసి హ్యాట్రిక్‌ సాధించాలని పట్టుదలతో ఉంది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, దీపక్‌ హుడా వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది.ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల మోజెస్ హెన్రికేస్, బెన్ కటింగ్‌ వంటి హార్డ్‌హిట్టింగ్‌ ఆల్‌రౌండర్లతో సన్‌రైజర్స్‌ టీమ్‌ భీకరంగా ఉంది. రాయల్‌ చాలెంజర్స్‌తో ముగిసిన తొలి మ్యాచ్‌లో హెన్రిక్స్‌తో పాటు సిక్లర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ ఎంతలా చెలరేగాడో అందరికీ తెలిసిందే.ఇక గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకొచ్చిన వార్నర్‌ ....కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్‌కు సునాయాస విజయాన్నందించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించిన మోసెస్‌ హెన్రిక్స్‌ సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో కీలకంగా మారాడు.

బ్యాటింగ్‌లో బలంగానే ఉన్నా సన్ రైజర్స్ ప్రధాన అస్త్రం బౌలింగ్ మాత్రమే. లెఫ్టామ్ పేసర్లు అశిష్‌ నెహ్రా, స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లతో హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఎప్పటిలానే పదునుగా ఉంది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

మరోవైపు రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు...తొలి మ్యాచ్‌లో తేలిపోయినా....సెకండ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సంచలన విజయం సాధించి బోణీ కొట్టింది.

రోహిత్‌ శర్మ ,జో బట్లర్‌, పోలార్డ్‌,హార్దిక్‌ పాండ్య,నితీష్‌ రాణా వంటి హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది.మలింగా , మెక్‌లెనగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి మేటి బౌలర్లతో ముంబై పేస్‌ బౌలింగ్ ఎటాక్‌ సన్‌రైజర్స్‌కు ధీటుగా ఉంది. కానీ టర్బోనేటర్‌ హర్భజన్ సింగ్‌...అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుండటంతో ముంబై స్పిన్‌ విభాగంలో తేలిపోతోంది.

వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ పోటీలో భారీ స్కోర్లు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ ఇరు జట్లు సమానంగా ఆధిపత్యం ప్రదర్శించాయి. ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకూ 8 మ్యాచ్‌ల్లో పోటీ పడగా ఇరు జట్లు చెరో 4 విజయాలు సాధించాయి.

ప్రస్తుతం అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్‌ కంటే పటిష్టంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.కానీ హోంగ్రౌండ్‌ వాంఖడే స్టేడియంలో ముంబై జట్టును అసలే మాత్రం తక్కువ అంచనావేయలేం. ప్రస్తుత సీజన్‌లో సక్సెస్‌ ట్రాక్‌లో దూసుకుపోతోన్న సన్‌రైజర్స్‌ టీమ్‌...హ్యాట్రిక్‌ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌చేయాల్సిందే.

సన్‌రైజర్స్‌తో తలపడనున్న ముంబై

హైదరాబాద్: బ్లాక్‌ బస్టర్‌ లీగ్‌...ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 10 సీజన్‌లో సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. రోహిత్‌ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌ జట్టుతో కీలక మ్యాచ్‌కు పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్‌ టీమ్‌ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది.

'సీఎం మమతా బెనర్జీ తలనరికి తెస్తే రూ.11లక్షలు'

కోల్ కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెగనరికి తీసుకువచ్చిన వారికి రూ. 11 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత యోగేష్ వార్ష్నే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా బిర్భమ్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ అనే నినాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో, ర్యాలీ చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బీజేవైఎం నాయకుడు యోగేష్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమతా బెనర్జీ తలను నరికి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు.

లోక్ సభ స్పీకర్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ఢిల్లీ:: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నేటితో 73 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, బాల్క సుమన్ స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఏప్రిల్ 12, 1943న మహారాష్ర్టలో జన్మించారు. సుమిత్రా మహాజన్ 8సార్లు లోక్ సభకు ఎంపికయ్యారు. 

09:18 - April 12, 2017

హైదరాబాద్: బాలాపూర్ లో వరకట్న దాహానికి మరో ఇల్లాలు బలైపోయింది. మినార్ కాలనీకి చెందిన అంజుం పైజాన్, యాకత్ పురాకు చెందిన ఇర్ఫాన్ తో ఈ ఏడాది జనవరి 13న పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుండి అంజుం ను అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అంజుంఅత్తింటి వారి వేధింపులు వివరిస్తూ తన సెల్ ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేసింది. తరువాత బాత్రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాలాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తిరుమలలో గల్లంతైన వ్యక్తి మృతదేహం వెలికితీత

తిరుమల: తుంబూర తీర్థంలో నిన్న గల్లంతైన ఇన్ కంట్యాక్స్ ఉద్యోగి సుబ్రమణ్యం మృతదేహాన్ని వెలికితీశారు.

 

07:29 - April 12, 2017

హైదరాబాద్: ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ నెల 16వ తేదీన శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ముస్లిం మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై అధ్యనయం చేసిన బీసీ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. రుణమాఫీ పథకాన్ని సరిగా మలు చేయకపోతే మధ్యదళారీలకు దన్నుగా ఉంటుందా? మైనార్టీ రిజర్వేషన్ల ను బిజెపి అడ్డుకోవాలని ఎందుకుచూస్తోంది? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత నంద్యాల నర్శింహారెడ్డి, బిజెపి కాట్రగడ్డ ప్రసన్న, టిఆర్ ఎస్ నేత గొవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:59 - April 12, 2017

అమరావతి:ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని శాసించిన ప్రైవేట్ బస్ ట్రావెల్స్ హవాకు ఇప్పుడిప్పుడే చెక్ పడే రోజులొచ్చాయి. ప్రైవేట్ ట్రావెల్స్ జోరుకు ఆర్టీసీ సైతం బ్రేక్ వేయలేకపోయింది. ఇక ముందు నుంచి ఆర్టీసీని శాసించాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ జోరుకు కళ్లెం పడాలి. ఆ దిశగా రవాణా శాఖ కార్యాచరణలోకి దిగడంతో ప్రైవేట్ బస్ ఆపరేటర్ల వేగానికి ముకుతాడు పడింది. ప్రైవేట్ ఆగడాలను కట్టడి చేసే చర్యలు వేగవంతం చేయడంతో కొన్ని ప్రైవేట్ బస్ ట్రావెల్స్ మూతదిశకు చేరుకోవడంపై 10టీవీ ప్రత్యేక కథనం.

రవాణా రంగ రాజధాని విజయవాడలో..

రవాణా రంగ రాజధాని విజయవాడలో ప్రైవేట్ దిగ్గజ ట్రావెల్స్ ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. విజయవాడ నగర కేంద్రంగా నడుస్తున్న ప్రముఖ రవాణా సంస్థ కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం మూసివేసింది. మరో ప్రముఖ సంస్థ కాళేశ్వరి ట్రావెల్స్ గతంలోనే మూతపడింది. దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన ప్రైవేట్ ఆపరేటర్లు తమ సంస్థలను మూసివేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర నష్టాలబాటలో ఉన్న ఆర్టీసీకే సవాల్ విసిరిన ప్రైవేట్ ఆపరేటర్లు తమ సంస్థలను మూసివేయడం హాట్ టాపిక్‌గా మారింది.

మూతపడిన కేశినేని ట్రావెల్స్‌ ...

రెండున్నర దశాబ్దాల చరిత్ర కల్గిన సంస్థ కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్. 1992 ఫిబ్రవరి 1న ఈ ట్రావెల్స్‌ను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రైవేట్ తొలి బస్ నిలిపిన చరిత్ర కల్గిన కేశినేని వెంకయ్య మనువడు కేశినేని శ్రీనివాస్ ఈ సంస్థను స్థాపించారు. మొత్తం 425 షెడ్యూల్స్ తో ఈ సంస్థ 75 గమ్యస్థానాలకు యాత్రికులను చేరవేసేది. తొలుత విజయవాడ నుంచి హైదరాబాద్, ఇతర జిల్లాలకు బస్ లు నడిపారు. ఆ తర్వాత దేశంలోని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఆన్ లైన్ రిజర్వేషన్ చేపట్టిన ఘనత కూడా ఈ సంస్థే దక్కించుకుంది. ఇక కాళేశ్వరి ట్రావెల్స్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు నడిపేది. కేశినేని ట్రావెల్స్ తో పోటీపడి మార్కెట్ లో నిలబడగలిగింది. అయితే ఐదేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో కాళేశ్వరి ట్రావెల్స్‌ను మూసివేశారు.

1992 ఫిబ్రవరి 1న కేశినేని ట్రావెల్స్‌ ప్రారంభం ...

రెండు దశాబ్దాల కాలంపాటు ప్రైవేట్ ట్రావెల్స్ తమ విజయయాత్రను సాగించాయి. అయితే ప్రైవేట్ ఆపరేటర్ కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిట్‌ను కలిగి ఉన్నందున మోటార్ వాహనాల చట్టం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు, ఫీజులు చెల్లించాల్సి రావడంతో క్రమంగా ప్రైవేటు ట్రావెల్స్‌ నష్టాల బాటలో పయనించాయి. విభజన తర్వాత వేర్వేరు రాష్ట్రాల్లో ఇంటర్ స్టేట్ పర్మిట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఆర్థికంగా భారంగా మారింది. అలాగే కాంట్రాక్ట్ క్యారియర్ గా నిబంధనల మేరకు బస్ లోని ప్రతి సీటుకు సీటింగ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మోయలేని భారం. దీనికితోడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లు కొంతకాలంగా ఎక్కువగా ప్రమాదాలకు గురికావటంతో ప్రయాణికుల శాతం తగ్గింది.

కాంట్రాక్ట్‌ క్యారియర్‌ కలిగి ఉండడం ...

మరోవైపు రవాణాశాఖలో విప్లవాత్మకంగా వచ్చిన మార్పులు కూడా ప్రైవేట్ ఆపరేటర్ల ఆధిపత్యానికి తెరపడుతోందన్న వాదనలు వస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లు కేవలం కాంట్రాక్ట్ పర్మిట్ తో యాత్రికులను మాత్రమే నిర్ధేశిత ప్రాంతానికి ఒక సమూహాన్ని తీసుకెళ్లాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సుల మాదిరిగా స్టేజీ క్యారీయింగ్ చేసేవి. గతంలో ఒకే నెంబర్ ప్లేట్ మీద అనేక బస్సులు తిరిగేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా నిలిచింది. చెక్ పోస్టుల దగ్గర నిఘా కట్టుదిట్టం చేశారు. ఏ నెంబర్ బస్ ఏ సమయంలో ఎటు వెళ్తుంది..? తిరిగి ఎప్పుడొస్తుంది..? పలు వివరాలను ప్రతీది రికార్డు చేస్తున్నారు. దీంతో ఒకే నెంబర్ ప్లేట్ లో రెండు, మూడు బస్సులు తిప్పే సంప్రదాయం దాదాపు చెక్ పడే పరిస్థితి వచ్చింది. కంప్యూటరీకరణ వల్ల లెక్క పక్కాగా ఉండటం, పర్మిట్ల అవకతవకలకు పాల్పడితే చర్యలకు గురికావాల్సి రావటం జరుగుతోంది. దీనికితోడు భారీ జరిమానాల విధానం అమల్లోకి వచ్చింది. ఒక బస్ నిబంధనలకు విరుద్ధంగా లగేజీ తీసుకెళ్తే చర్యలు చాలా తీవ్రతరం చేస్తుండటంతో ప్రైవేట్ ఆగడాలకు, దూకుడుకు రవాణా శాఖ చరమగీతం పాడుతోంది.

06:55 - April 12, 2017

కరీంనగర్ : సిరిసిల్లలోని సంజీవయ్యనగర్‌లో ఓ ఇంట్లోని ప్రిజ్‌లో పాము దర్శనమిచ్చింది. రాజు అనే వ్యక్తి ఇంట్లో ప్రిజ్‌లో పాము దూరింది. గమనించిన కుటుంబ సభ్యలు పాములు పట్టే వారిని పిలిపించి పామును పట్టి బయట వదిలిపెట్టారు.

06:53 - April 12, 2017

అమరావతి: ఇప్పటికే మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించిన చంద్రబాబు.. ఐఏఎస్‌ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టారు. పాలనను గాడిలో పెట్టడంతో పాటు.. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బదిలీలు జరగనున్నాయి. సీఎం పేషీతో పాటు.. కలెక్టర్ల నుంచి కార్యదర్శుల వరకు స్థాన చలనం కలగనుంది.

దాదాపు 30 మంది అధికారులకు స్థానచలనం ...

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించిన చంద్రబాబు.. తాజాగా అధికారుల బదిలీలపై కసరత్తు చేస్తోంది. దాదాపు 30 మంది అధికారులకు దశలవారీగా స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా పదవులు పొందిన మంత్రులతో పాటు.. శాఖలు మారిన మంత్రులు కూడా తమకు అనుకూలమైన అధికారులు కావాలని చంద్రబాబును కోరడంతో... ఆ దిశగా సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం...

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని స్వయంగా చంద్రబాబే అనేకసార్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆ దిశగా బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మార్పులు, చేర్పులు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ బదిలీలలో కలెక్టర్లు, జేసీలు, కార్యదర్శుల స్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి, ప్రకాశం, కడప కలెక్టర్లకు స్థాన చలనం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక సీఎంతో సన్నిహితంగా ఉండే పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కలెక్టర్లను కూడా మార్చబోతున్నారనే ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను సీఎం పేషీలోకి తీసుకుంటారని సమాచారం.

మంత్రులు, ఎమ్మెల్యేల మాట వినని అధికారులపై వేటు ...

ఇక బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మాట వినని అధికారులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బదిలీలు జరగనున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కూడా పక్కన పెట్టాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తొలిసారి మంత్రులైన వారి పేషీలో సీనియర్‌ అధికారులను నియమించే అవకాశం కనిపిస్తోంది.

లోకేశ్‌ పేషీలోకి సాంబశివరావు ....

ఇదిలావుంటే.. టీటీడీ ఈవోగా ఉన్న సాంబశివరావు పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈయనను లోకేశ్‌ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమంది అధికారులను కీలక శాఖల్లోకి మార్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత పెద్ద ఎత్తున బదిలీలు జరగనున్న నేపథ్యంలో.. అటు అధికారులతో పాటు.. ఉద్యోగుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

06:50 - April 12, 2017

అమరావతి: రాష్ట్రంలో పలు మున్సిపాలిటీ వార్డుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఖంగుతింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్టణం మున్సిపాలిటీల్లో పలు వార్డులకు ఆదివారం ఉప ఎన్నికలు జరిగాయి. కేవలం మున్సిపాలిటీల్లో వార్డుల ఉప ఎన్నికలు అయినప్పటికీ.. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అయితే.. మొత్తం 16 వార్డుల్లో ఎన్నికలు జరగగా... కేవలం రెండు వార్డులను మాత్రమే వైసీపీ దక్కించుకుంది.

కీలక నేతలున్న ప్రాంతాల్లోనూ అభ్యర్థులు ఓటమి

మున్సిపాలిటీల్లో ఓటమితో వైసీపీ నేతలు నిరుత్సాహపడ్డారు. కీలక నేతలున్న చోట్ల కూడా అభ్యర్థులు ఓడిపోవడంపై కారణాలు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపాలిటీలోని 19వ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి 150 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.

మాచర్ల మున్సిపాలిటీ వార్డులో వైసీపీ ఓటమి

ఇక గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ వార్డులోనూ వైసీపీ ఓటమి చవిచూసింది. 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి 64 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. అదేవిధంగా మరో కీలక నేత బొత్స జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీలోని 7వ వార్డు ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి పాలయ్యింది. ఇక మరో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టిన చిత్తూరు మున్సిపాలిటీలోనూ వైసీపీ ఓటమి పాలయ్యింది. అయితే.. రాజధాని ప్రాంతంలో మాత్రం వైసీపీ పరువు దక్కించుకుంది. మంగళగిరి మున్సిపాలిటీ 31వ వార్డులో వైసీపీ అభ్యర్ధి గెలుపొందారు. అదేవిధంగా కడప జిల్లా రాయచోటిలోనూ వైసీపీ గెలుపొందింది. మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన వార్డు ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగడంతో వైసీపీ నేతలంతా నివారణ చర్యలపై దృష్టి సారించారు.

మున్సిపాలిటీ ఉప ఎన్నిక ఫలితాలు వైసీపీకి షాక్‌

అమరావతి : మున్సిపాలిటీ ఉప ఎన్నిక ఫలితాలు వైసీపీ షాక్‌ ఇచ్చాయి. కీలక నేతలు ఉన్న ప్రాంతాల్లోనూ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ అభ్యర్థులు ఓటమి చెందడంతో.. కారణాలు వెతికే పనిలో పడ్డారు కీలక నేతలు.

06:47 - April 12, 2017

హైదరాబాద్: తెలంగాణ‌లో కొత్త జిల్లాల‌ను అందుబాటులొకి తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వం..ఇప్పుడు నియోజ‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై సీరియ‌స్‌గా దృష్ఠిపెట్టింది. రీ ఆర్గనైజేషన్‌ను తొంద‌ర‌గా పూర్తి చేసుకోవాల‌ని త‌మ‌త‌హ‌లాడుతున్న అధికార పార్టీ..దానికోసం ఢిల్లీలో కావ‌ల్సిన తెర‌వెన‌క మంత్రాంగాన్ని న‌డిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు దీని ప్రకంపణలు ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్‌కు ప‌ట్టుకున్నాయి.

అప్పటి కాగ్రెస్ ప్రభుత్వం విభ‌జ‌న‌ చ‌ట్టంలో అనేక హామీలలు...

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అప్పటి కాగ్రెస్ ప్రభుత్వం విభ‌జ‌న‌ చ‌ట్టంలో అనేక హామీల‌ను ఇచ్చింది. వీటిలో ప్రధానంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, ఖ‌మ్మంలో ఉక్కు ప్యాక్టరీ, వ‌రంగ‌ల్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ప్రాణ‌హిత-చేవెళ్లకు జాతీయ హోదాతోపాటు ప‌లు ఉన్నాయి. అయితే వీటిలో ప్రాజెక్టుల డిజైన్ మార్పుతో ప్రాణ‌హిత రూపు రేఖ‌లును మార్చిన కేసీఆర్..ఇప్పుడు అసెంబ్లీ పున‌ర్విభ‌జ‌నపై పూర్తి స్థాయిలో కాన్సంట్రేష‌న్ చేస్తున్నారు. దీన్ని ఆయుధంగా చేసుకుని కేసీఆర్ త‌న రీ ఆర్గనైజేషన్‌ పాలిటిక్స్‌తో ప్రతిపక్షాలను మ‌రింత దెబ్బతీయాలని చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనిలో భాగంగా ప‌లువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజ‌క‌ర్గాల‌ను రిజ‌ర్వేష‌న్లను అస్త్రంగా చేసుకుని క‌నుమ‌రుగు చేయాల‌ని గులాబీబాస్ ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా..కొత్త జిల్లాల‌ను యూనిట్‌గా చేసుకోవాల‌ని అధికార పార్టీ పావులు క‌దుపుతోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ...

దీంతో ఇప్పుడు కాంగ్రెస్ అల‌ర్ట్ అయ్యింది. పున‌ర్విభ‌జ‌న‌పై కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్టిన హ‌స్తం నేత‌ల్లో ఆందోళ‌న వ్యక్తమవుతుంది. కొత్త జిల్లాలలో 12 ద‌క్షిణ తెలంగాణ‌లో ఉండ‌గా..ఉత్తర తెలంగాణ‌లో 19 జిల్లాలు ఉన్నాయి. దీన్ని రాజ‌కీయంగా వాడుకుంటు త‌మ‌కు ప‌ట్టున్న ఉత్తర తెలంగాణ‌లోని జిల్లాల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎక్కువ‌గా పెంచుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే..తమ‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం హ‌స్తం నేత‌ల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు హైదరాబాద్‌ను విభ‌జించ‌క పోవ‌డంతో ఇప్పడికి దీనిపై అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో దాదాపు నాలుగు కోట్ల జ‌నాభా ఉంటే..గ్రేట‌ర్, రంగారెడ్డిలోనే కోటిన్నరకు జ‌నాభా ఉంద‌ని అంచానా. అందుకే పాత జిల్లాల‌ను యూనిట్‌గా పున‌ర్విభ‌జ‌న చేయాల‌న్న డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తెర‌పైకి తీసుకురావాల‌ని డిసైడ్ అయ్యింది. అలా చేయ‌డం వ‌ల‌న ద‌క్షిన తెలంగాణ‌, అందులోను గ్రేట‌ర్ పరిదిలో నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయిని..ఇది ఖ‌చ్చితంగా తమ‌కు లాభిస్తుందని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు.

కేసీఆర్‌ ఎత్తుగడలను పసిగట్టిన కాంగ్రెస్ ...

పున‌ర్విభ‌జ‌న‌పై లాభ న‌ష్టాల‌ను బేరీజు వేసుకున్న కాంగ్రెస్..దీనిపై స్పష్టమైన స్టాండ్‌తో గులాబీబాస్‌ను టార్గెట్ చేయాల‌ని డిసైడ్ అయ్యింది. పాత జిల్లాల‌నే యూనిట్ చేసుకోవాల‌న్న డిమాండ్‌తో పాటు..విభ‌జ‌న చ‌ట్టంలోని మిగ‌తా హామీల‌ను కేసీఆర్ ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మ‌రి దీన్ని ఏ మేర‌కు ప్రజ‌ల్లోకి తీసుకువెళుతుందో చూడాలి.

జాదవ్‌ను విడిపించేందుకు దేనికైనా వెనకాడేది లేదు: కేంద్రం

ఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు మరణశిక్షను విధించడాన్ని పార్లమెంట్‌ ఖండించింది. జాదవ్‌కు ఉరిశిక్ష నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రం పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. జాదవ్‌ను విడిపించేందుకు దేనికైనా వెనకాడేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.

06:38 - April 12, 2017

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అరుణ్‌జైట్లీ, వి.కె.సింగ్‌ను ఆయన కలిశారు. రాష్ర్టానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో కేటీఆర్ చర్చించారు. సౌది అరేబియా కాన్సులేట్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని వీకేసింగ్‌ను కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. కంటోన్మెంట్ రహదారి మూసివేత అంశాన్ని అరుణ్‌జైట్లీతో చర్చిచారు. అలాగే స్కైవేల నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. అంబర్‌పేట్-రామాంతాపూర్ ఫ్లైఓవర్‌కు నిధులు కేటాయించినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌, ఉప్పల్‌ మార్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కైవే మార్గాల నిర్మాణానికి సాయం చేయాలని కోరారు..

పేదరికంలేని సమాజాన్ని చూడటమే జీవితాశయం- చంద్రబాబు

విశాఖ : పేదరికంలేని సమాజాన్ని చూడటమే తన జీవితాశయమని... ఏపీసీఎం చంద్రబాబు అన్నారు.. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.. 2022కల్లా భారత్‌లోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉండాలన్న టార్గెట్‌తో తాము పనిచేస్తున్నామని ప్రకటించారు.. విశాఖలో ఆత్మీయ సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు..

నాలుగో విడత రుణమాపీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ రుణమాఫీ హామీని నిలబెట్టుకుంది. ఇప్పటివరకు మూడు విడతలుగా రుణమాఫీ చేయాగా... తాజాగా నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసిది. దీంతో రుణమాఫీ హామీ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 36 లక్షల మందికి 17 వేల కోట్లు రుణమాఫీ చేశారు.

06:34 - April 12, 2017

హైదరాబాద్: 154 రోజుల మహాజన పాదయాత్రలో పాల్గొన్న నగేష్, ఆయన సతీమణి సరిత ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథులుగా పాల్గొంటున్నారు. తెలంగాణలో 4200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిన నగేష్ జన్మస్థలం సూర్యాపేట జిల్లా నేరేడ్ చర్ల. హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. నేరేడ్ చర్ల జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్ గా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరపున ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం మధ్యలోనే మానేసిన నగేష్ ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాటాల్లో, వ్యవసాయ కార్మికుల పోరాటాల్లోనూ, భూ పోరాటాల్లోనూ పాల్గొన్నారు. 4200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఎదురైన అనుభవాలు వివరించేందుకు నగేష్ '10టీవీ' జనపథంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:32 - April 12, 2017

హైదరాబాద్: ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ నెల 16వ తేదీన శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ముస్లిం మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై అధ్యనయం చేసిన బీసీ కమిషన్ తన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందించింది.

ఐఏఎస్‌ అధికారి సుధీర్‌ నేతృత్వంలోని కమిషన్‌...

బీసీ - ఈ కేటగిరీలోని సామాజిక వర్గ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసిన ఐఏఎస్‌ అధికారి సుధీర్‌ నేతృత్వంలోని కమిషన్‌... ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ముస్లింల రిజర్వేషన్లు పెంచాలని కమిషన్‌ తన నివేదికలో సూచించింది. సుధీర్ కమిషన్ నివేదికలోని అంశాల ఆధారంగానే బీసీ కమిషన్ కూడా అధ్యయనం చేసింది. అటు మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెల్లప్ప నేతృత్వంలోని కమిషన్.. గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక అందించింది. ఈ కమిషన్‌ గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని సూచించింది. దీంతో మైనార్టీలు, గిరిజనులతోపాటు బీసీల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ఈనెల 16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు..

మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై ఈనెల 16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులోనే మైనార్టీ, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించనుంది. తమిళనాడు తరహాలో 69శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. వీటితో పాటు పార్లమెంట్ ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సేవలు పొందేందుకు కేంద్రం తీసుకొచ్చిన రైటు టు సర్వీసేస్ బిల్లు కూడా శాసనసభ ముందుకు రానుంది.

మరోవైపు రాజ్‌భవన్‌లోగవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన కేసీఆర్‌ ..

మరోవైపు కేసీఆర్‌ రాజ్‌భవన్‌లోగవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల విషయంపైనా చర్చించారు. ఇక బుధవారం సాయంత్రం జరిగే కేబినెట్‌ భేటీలో రిజర్వేషన్ల పెంపు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ సమావేశం తేదీ కూడా కేబినెట్‌ భేటీలో ఫైనల్‌ కానుంది.

రెండు లారీలు ఢీ:ఒకరి సజీవ దహనం

తూ.గో : రెండు లారీలు ఢీ కొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం అయ్యారు. అంతేగాక మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఏలేశ్వరం మండలం చిన్నింపేటలో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు.

Don't Miss