Activities calendar

13 April 2017

23:09 - April 13, 2017

   మన తెలుగు సినీ పరిశ్రమ లక్షలాది మంది కళా తపస్వులకు నెలవు. ప్రతి సంవత్సరం మన పరిశ్రమ నుండి వందలాది సినిమాలు వస్తుంటాయి. విడుదల అయ్యే ప్రతి చిత్రం ద్వారా మరికొంతమందిని అక్కున చేర్చుకుంటుంది ఆ కళామతల్లి. అటువంటి పరిశ్రమ గురించి , అందులోని మంచి చెడుల గురించి, అక్కడి వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు వారు పడే కష్టం గురించిన కథలు కూడా చాలా అందంగ , హృదయానికి హత్తుకునేలాగా ఉంటాయి. అటువంటి సప్తరంగుల హరివిల్లు లాంటి పరిశ్రమలో ఎలాగైనా సత్తా చాటుకోవాలని పరితపించే ఒక యువకుడి కథే ఈ "దర్శకుడు" లఘుచిత్రం. 

కథ : 

 సినిమానే ఆశగా శ్వాసగా అనుకునే ఒక యువకుడు  "యశ్వంత్ కశ్యప్" తన స్నేహితుడికి ఒక కథను వివరించే సంఘటనతో మొదలవుతుంది ఈ చిత్రం. అక్కడి నుంచి టైటిల్ సాంగ్ మొదలుకుని ఆఖరి ఘట్టం వరకు ఆ యువకుడు ఎదుర్కొన్న ఆటుపోట్ల సమాహారమే ఈ చిత్రం. ఆ యువకుడు అతని స్నేహితుడి ద్వారా ఇండస్ట్రీలోని  రకరకాల  శాఖలకు చెందిన  వ్యక్తులను పరిచయం చేసుకుంటు తన కథను వెండితెరపైకి తీసుకురావాలని చేసే ప్రయత్నమే ఈ కథ.

విశ్లేషణ:

ఈ చిత్రానికి కథ ఒకటే అని చెప్పలేము. నిజానికి ఇది వేరు వేరు ఉపకథల సమాహారం. ఆ ఉపకథలు ఇందులో చూపించకున్నా , వాటి తాలూకు అనుభవాలను అనుభూతులను వేర్వేరు పాత్రల ద్వారా మనకు పరిచయం చేసే ప్రయత్నం చేసారు. ఒక పూలహారం లాగా ప్రధాన కథ అయిన దారంతో ఆ కథలన్నీ చక్కగా అమర్చారు.
                  కథానాయకుడి హావభావాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కొత్తవాడే అయినా ఎటువంటి తడబాటు లేకుండా నటనతో మెప్పించాడు. పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చిన పాత్రలో నటన మాత్రమే కాకుండా , ఆహార్యంలో కూడ శ్రద్ధ చూపించారు. లఘు చిత్రాలలో కూడా ఇటువంటి చిన్న విషయాలను పొందుపరచటం హర్షణీయం.  అవకాశం దొరికినప్పుడు అతని ఆనందం, తనకు సాయం చేసే స్నేహితుని పట్ల కళ్ళతోనే అతను చూపించే కృతజ్నత, మోసపోయాడని తెలిసినప్పుడు అతని ఆక్రోశంతో కూడిన నిస్సహాయత... ఇలాంటి హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.
                      కథానాయకుడి స్నేహితుని పాత్రలో రోహిత్ పరకాయ ప్రవేశం చేసాడు. నిజంగా ఇటువంటి ఒక స్నేహితుడు ఉంటే ఎటువంటి కష్టాన్నైనా సులువుగా ఎదుర్కోవచ్చు అనే భరోసా ఇస్తాడు.
                      ప్రతినాయకుడి పాత్ర మరొక కీలక పాత్ర. అతని  మోసపూరిత ప్రొడ్యూసర్ పాత్రని బాగా డిజైన్ చేసారు. 
                  మిగిలిన పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించారు.
      సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శశాంక్ టైటిల్ ట్రాక్ తో ఆకట్టుకోవడమే కాదు, నేపధ్య సంగీతం తో కూడా కథలో లీనం అయ్యేలా చేసాడు.

పాజిటివ్ పాయింట్స్ : 

దర్షకత్వ ప్రతిభ.
కథానాయకుడి హావభావాలు.
నేపధ్య సంగీతం.
కథను నడిపించిన ఆసక్తికర విధానం.
కెమెరా పనితనం.
నిర్మాణ విలువలు.
బలంగా రాసుకున్న పాత్రలు.
చమత్కారం , నిజం కలిపి రాసిన డైలాగ్స్.

నెగెటివ్ పాయింట్స్ :

సినిమా నిడివి కేవలం 20 నిమిషాలు ఉండటం వలన కథలో మరిన్ని కోణాలు వెలుగులోకి రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. బహుశా లఘుచిత్రానికి ఉన్న పరిధుల వలన ఇలా జరిగి ఉండవచ్చు. 

ఇతరత్రా ఆసక్తికర అంశాలు: 
లఘుచిత్రం అనగానే మనం ముందుగానే అన్ని రకాల భావాలు , రసాలు ఉంటాయని అనుకోము.. కానీ 'ఇంతలోనే ఎన్నో వింతలు' అన్నట్టు నిడివి కొద్దిసేపే అయినా నవరసాలని ఇమిడ్చే ప్రయత్నం చేసిన దర్శకుడి ప్రతిభ అద్భుతం.
            కెమెరామెన్ పాత్రతో హాస్యాన్ని, ఆటోలో హీరో ని కలిసి గతాన్ని గుర్తుచేసుకునే పాత్రతో కరుణని , స్నేహితుల మధ్య ప్రేమని, కెమెరా పనితనంతో అద్భుతాన్ని, పతాక సన్నివేశాలలో వీరత్వాన్ని, రౌద్రాన్ని... ప్రొడ్యుసర్ పాత్రతో భయానకాన్ని ఇలా నవరసాలని ముందే టైటిల్ సాంగ్ లో చెప్పినట్టు చూపించి చిత్ర నిడివి అసలు సమస్యే కాదని నిరూపించారు .
 
కొసమెరుపు: 
                    కథానాయకుడు కథను చెపుతూ " క్లైమాక్స్ లో హీరోయిన్ హీరోని చంపేస్తుంది" అని వివరిస్తాడు. ఆ డైలాగ్ ద్వారా అసలు క్లైమాక్స్ ఎటువంటి పరిస్తితులలో ముగియబోతుందో ముందే చెప్పటం ఒక పొయెటిక్ టచ్.. 
          
                         చివరిగా ... చాలా  అరుదుగా వచ్చే లఘు చిత్రాలలో ఇది ఒకటి. సినిమాని ప్రేమించే వారికి , సినీ రంగాన్ని ఆరాధించేవారికి ఈ సినిమాని అంకితం ఇవ్వటం ద్వారా ఈ చిత్రం నిర్మించిన ఆశయాన్ని చెప్పకనే చెప్పారు. తప్పకుండా అందరూ చూడదగిన చిత్రం ఇది. 

వేములవాడ పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

రాజన్నసిరిసిల్ల : వేములవాడ పోలీసు స్టేషన్ లో ఓ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య, భర్తల వివాదంలో న్యాయం జరగదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  

సిద్దిపేటలో జిల్లా గ్రంథాలయం ప్రారంభం

సిద్దిపేట : జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయాన్ని మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రస్తుతం 10 జిల్లా కేంద్రాల్లోనే జిల్లా లైబ్రరీలు ఉన్నాయన్నారు.

 

గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. 7,306 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన నిబంధనలతో నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్ 921, టీజీటీ 4362, ఫిజికల్ డైరెక్టర్స్ (పాఠశాలకు) 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 566, ఆర్ట్ టీచర్ 372, క్రాఫ్ట్ టీచర్స్ 43, మ్యూజిక్ టీచర్స్ 197,  లైబ్రేరియన్ (స్కూల్స్ ) 256, స్టాఫ్ నర్స్ 533 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

21:56 - April 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మిర్చి రైతులు  నిండా మునుగుతున్నారు. అప్పుచేసి సాగుచేసిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో దిగాలు చెందుతున్నారు. అప్పులు తీర్చే దారి తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మిర్చి రైతుకు మద్దతు ధర కల్పించి వారిని ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు, సీపీఎం నాయకులు  ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మిర్చికి రైతుకు లభించని మద్దతు ధర
తెలంగాణలో మిర్చి రైతు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆశలేపెట్టుబడిగా సాగుచేసిన మిర్చి వారి కంట్లో కన్నీరు తెప్పిస్తోంది. పగలురాత్రి కష్టపడి సాగుచేసిన మిర్చీని... తీరా మార్కెట్‌కు తరలిస్తే  అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. గత సంవత్సరం క్వింటాల్‌కు  10వేలకు పైగా పలికిన మిర్చి ధర ఇప్పుడు 3 నుంచి 6వేలకు మించకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వేలకు వేలు అప్పుచేసి మరీ సాగుచేసిన మిర్చికీ కనీస ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 
ఎనుమాముల మార్కెట్‌కు భారీగా మిర్చి
వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌ అతిపెద్దది.  ఇక్కడికి రోజుల వేల క్వింటాళ్ల మిర్చి వస్తోంది. ఈ మార్కెట్‌లో క్వింటాల్‌ మిర్చిని 4500 నుంచి  5000 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆవేదన చెందిన కొందరు రైతులు తాము తీసుకొచ్చిన  మిర్చిని అందరూ చూస్తుండగానే దగ్దం చేశారు. పక్క రాష్ట్రాల్లో 10వేలకుపైగా మద్దతు ధర లభిస్తోంటే ఇక్కడెందుకు తగ్గిందని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. వీరికి రైతు సంఘాల నేతలు కూడా అండగా నిలిచారు. క్వింటాల్‌ మిర్చికి 10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మార్కెట్‌ను సందర్శించిన తమ్మినేని వీరభద్రం
ఎనుమాముల మిర్చి మార్కెట్‌ యార్డును సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు.  రైతులు తమ కష్టాలను తమ్మినేనితో మొరపెట్టుకున్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై స్పందించాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులే ప్రభుత్వం తిరగబడతారని హెచ్చరించారు. 
మిర్చి రైతులకు మద్దతుగా సీపీఎం ర్యాలీ
మిర్చి రైతులకు మద్దతుగా ఖమ్మంలో సీపీఎం నాయకులు ర్యాలీ  నిర్వహించారు. వర్తక సంఘం భవనం నుంచి గ్రైన్‌ మార్కెట్‌ వరకు  ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు.  క్వింటాకు పదివేల రూపాయాలు ఇచ్చి మిర్చిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. 
 

21:52 - April 13, 2017

క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సచిన్‌ ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీన్ని సచిన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మే 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అజహర్‌, ఎమ్‌.ఎస్‌. ధోని స్టోరీల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది. 

 

21:50 - April 13, 2017

ఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు మరణ శిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించడంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో తీర్పు చెప్పే స్థితిలో తాము లేమని యుఎన్‌ఓ పేర్కొంది. భారతదేశం, పాకిస్థాన్ మధ్య సంబంధాల విషయంలో ఉభయ దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాలను కనుగొనాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పీలు చేసుకోవడానికి పాక్‌ 6 నెలల గడువిచ్చింది. 

 

21:46 - April 13, 2017

ఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈవిఎంల టాంపరింగ్‌పై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వెసులుబాటు ఉందని, ఉత్తరప్రదేశ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మే 8 లోపు సమాధానం చెప్పాలని ఈసీని ఆదేశించింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు పేపర్ బ్యాలెట్ వాడేలా ఆదేశించాలని, ఒకవేళ ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే...బిల్లింగ్ తరహాలో ఓటర్ ఓటు వేసిన అనంతరం రసీదు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని మాయావతి పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

21:42 - April 13, 2017

జమ్ముకశ్మీర్‌ : శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్‌ ముగిసింది. కేవలం 2 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇంత తక్కువ శాతం నమోదు కావడం జమ్ముకశ్మీర్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏప్రిల్‌ 9న శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 7 శాతం ఓటింగ్‌ నమోదైంది. వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరణకు పిలుపునివ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 8 మంది మృతి చెందగా వంద మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో ఈసీ శ్రీనగర్‌ ఉపఎన్నికను రద్దు చేసి 38 పోలింగ్‌ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్‌ నిర్వహించింది. పోలింగ్‌ ప్రారంభమైన మూడు గంటలకు  పోలింగ్‌ 1 శాతం జరగగా.... సాయంత్రం 4 గంటలకు  పోలింగ్‌ ముగిసే సమయానికి కేవలం 2 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ బూతుల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయడంతో  హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు పోటీ చేశారు. 

 

21:40 - April 13, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ 4 బిల్లులకు రాష్ట్రపతి ప్రణ‌బ్‌ముఖ‌ర్జీ ఆమోదముద్ర వేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు. జులై 1నుంచి జిఎస్‌టి బిల్లును దేశంలో పూర్తిస్థాయిలో అమలుపరచాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుంది. 

21:38 - April 13, 2017

ఢిల్లీ : రైతుల ఆందోళనపై తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు మండిపడింది. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. రైతుల దుస్థితిపై మానవతా దృక్పథంతో స్పందించాలని కోర్టు సూచించింది. వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులు గత నెలరోజులుగా ఢిల్లీలో వినూత్నరీతిలో ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, కరువు ఉపశమన ప్యాకేజీని ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

21:35 - April 13, 2017

ఇప్పుడంతా జస్ట్ ఏ క్లిక్ అవే... సైబీరియా మంచు దేశంలో ఏం జరుగుతుందో..? సహారా ఒయాసిస్సులో ఏం జరుగుతుందో..? కశ్మీర్ గల్లీల నుంచి కన్యాకుమారి తీరం వరకు ఎప్పుడు..ఎక్కడ... ఏం జరుగుతుందో క్షణాల్లో ప్రపంచం ముందుకొస్తోంది. ప్రపంచ సమాచార తీరుతెన్నులను మార్చేసిన సోషల్ సైట్స్.. సమాచార విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్నాయిప్పుడు.. రాజకీయ నాయకుడైనా, మార్కెట్ లో దొరికే సరుకైనా.. సోషల్ సైట్ లో ప్రజలకు చేరువైతేనే.. భవిష్యత్ అంటే డౌట్ అనవసరం. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం...

21:14 - April 13, 2017
21:10 - April 13, 2017

'శివలింగ' మూవీతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం హీరో రాఘవ లారన్స్, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతలు మాట్లాడారు. సినిమా విషయాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

21:06 - April 13, 2017

అంబేద్కర్ పేరుతోటి చంద్రుల ఆటలు... జగ్గంపూడికాడ శిలాఫలకానికి బీటలు, అట్టడబ్బాలుమోస్తున్న జగదీశ్వర్ రెడ్డి...గంట పనికి మూడు లక్ష రూపాయల కూలీ... భవానీ ద్వీపానికి ఆంధ్రా సర్కార్ తద్దినం.. ప్రైవేట్ పరం చేసే ఆలోచన్ల నారావారు, యాదాద్రి జిల్లాల దూపకుచస్తున్న జనం... అయినా ఇసొంటివి ఎన్నిజూడలేమనం, కనిగిరి మోర్లదేలిన చంద్రన్నకానుకలు..దళారుల పాలైతున్న ప్రభుత్వ పథకాలు, మిర్యాలగూడ చెరువును మింగేస్తున్నరు...ఆకరిసూపుకోసం జనం ఎగవడ్తున్నరు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:50 - April 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌లో ఐటి అధికారులు చాయ్‌వాలా ఇంటి తలుపు తట్టారు. కోట్‌పుత్లీకి చెందిన లీలారామ్‌ గుజ్జర్‌ కోటి రూపాయలను పబ్లిగా బహిర్గతం చేసిన వీడియో వైరల్‌ కావడమే ఇందుకు కారణం. టీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న లీలారామ్‌ ఏప్రిల్‌4న ఆరుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. వారికి కట్నంగా కోటి 51 లక్షల నగదును బయటకు తీసి గ్రామస్తుల ముందు గట్టిగా అరుస్తూ వాటిని లెక్క పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌ కావడంతో డబ్బు వివరాలు లెక్క చెప్పాల్సిందిగా గుజ్జర్‌కు ఐటి శాఖ సమన్లు జారీ చేసింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని చాయ్‌వాలాను ఆదేశించారు. మరోవైపు వరకట్నం ఇవ్వడం నేరం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లీలారామ్‌ ఆరుగురు కూతుళ్లలో ఇద్దరు మాత్రమే మేజర్‌ అని తెలుస్తోంది. 

 

20:45 - April 13, 2017
20:43 - April 13, 2017
20:42 - April 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ జైళ్ల శాఖను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ తెలిపారు. గ్రాండ్‌ విజన్‌ 2025 కార్యక్రమంతో తెలంగాణాలోని ప్రతి పల్లెలో జైళ్ల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు.   

 

మిర్చి రైతు ఆత్మహత్య

ప్రకాశం : జిల్లాలో మిర్చి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకొల్లు మండలం పూసపాడులో వెంకటేశ్వర్లు (50) అనే మిర్చి రైతు రూ.6 లక్షలు అప్పు చేసి ఐదెకరాలు మిర్చి సాగు చేశాడు. కేవలం రూ.70 వేల దిగుబడి రావడంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

టీఆర్ ఎస్ కార్యకర్త హల్ చల్

రాజన్నసిరిసిల్ల : ఎల్లారెడ్డిపేటలో టీఆర్ ఎస్ కార్యకర్త హల్ చల్ చేశారు. మంత్రి కేటీఆర్ ఉన్న సమావేశం హాల్ లోకి పెట్రోల్ బాటిల్ తో వెళ్లేందుకు భూశంకర్ అనే కార్యకర్త ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకుని పీఎస్ కు తరలించారు. పదేళ్లుగా పార్టీ కోసం శ్రమించినా గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

విద్యార్థుల ఉన్నత విద్యకు సహకరిస్తాం : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఇంటర్మీడియట్ బైపీసీ టాపర్ నైమిషతో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. కార్డియాలజిస్టు కావాలన్న అభిలాషను నైమిష సీఎంకు తెలిపింది. ఇంటర్మీడియట్ టాపర్ షర్మిలను చంద్రబాబు అభినందించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు సహకరిస్తామని చెప్పారు. సోమవారం టాపర్ విద్యార్థులను కలుస్తామన్నారు. 

ఇంటర్ టాపర్లు నైమిష, షర్మిలకు చంద్రబాబు అభినందనలు

విజయవాడ : ఇంటర్మీడియట్ బైపీసీ టాపర్ నైమిషతో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. కార్డియాలజిస్టు కావాలన్న అభిలాషను నైమిష సీఎంకు తెలిపింది. ఇంటర్మీడియట్ టాపర్ షర్మిలను చంద్రబాబు అభినందించారు. 

 

20:12 - April 13, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో పద్మాపురస్కారాల ప్రదానం కలర్‌ఫుల్‌గా సాగింది. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం, శిల్పి ఎక్కా యాదగిరి పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అటు రియో ఓలింపిక్స్‌, పారా ఓలింప్స్‌లో ప్రతిభ కనబరచిన ఆటగాళ్లకు పద్మ పురస్కారాలు అందించారు. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ , జిమ్మాస్టర్‌ దీపా కర్మాకర్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పారాలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మరియప్పన్‌ తంగవేలు, డిస్కస్‌ త్రోవర్‌ వికాస్‌ గౌడ తోపాటు చెఫ్‌ సంజీవ్‌కపూర్‌, జితేంద్ర నాథ్‌ గోస్వామి, డా.సుబ్రోతో దాస్‌ కూడా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. పండిట్‌ విశ్వ మోహన్‌ భట్‌ పద్మభూషణ్‌ అవార్డు అందుకోగా.. ఆధ్మాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 

20:08 - April 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రైతులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తామని ప్రకటించారు. ఎరువుల కోసం ఎకరానికి 4వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మూడు నాలుగేళ్లలో కోటి ఎకరాలకు గోదావరి నీరు అందిస్తామన్న ఆయన.. రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.  
తెలంగాణ నవ శకానికి నాంది.. 
తెలంగాణ నవ శకానికి నాంది పలకబోతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రగతిభవన్‌ జనహితలో రైతులతో సమావేశమైన ఆయన.. పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు రూ.17వేల కోట్ల రుణ‌మాఫీ చేసి చరిత్ర సృష్టించామనీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులకు 26లక్షల టన్నుల ఎరువుల‌ను నూటికి నూరు శాతం ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌నున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 55లక్షల మంది రైతులు ఉన్నారనీ వారందరికీ ఎరువులు ఉచితంగా ఇస్తామన్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే తొలి నిధులు అన్నదాతలకే విడుదల చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకు ఉచితంగానే ఎరువులు సరఫరా చేస్తామన్నారు. 
'గ్రామ రైతు సంఘం' గా ఏర్పడాలి
ప్రతి ఊరిలోనూ 'గ్రామ రైతు సంఘం' గా ఏర్పడాలని అన్నదాతలకు కేసీఆర్‌ సూచించారు. ఈ సంఘాలు తమ గ్రామాల జాబితాను రూపొందించి నవీన వ్యవసాయ పద్ధతుల్ని తెలుసుకోవాలన్నారు. ఎకరానికి 2 దుక్కి మందు బస్తాలను, 3 యూరియా బస్తాలను ఉచితంగా ఇస్తామన్నారు. వీటికయ్యే మొత్తం 4 వేల రూపాయలు వచ్చే ఏడాది మే నెలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. దుక్కి మందు, యూరియా, పొటాష్ ప్రభుత్వమే ఇస్తుందని.. పురుగుల మందులు విత్తనాలు రైతులు కొనుగోలు చేయాలన్నారు. 
కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం..
తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరందించి తీరుతానని కేసీఆర్‌ స్పష్టంచేశారు. మూడు నాలుగేళ్లలోనే నీరు అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి పథంలో ఉంచితే తమకు డిపాజిట్లు కూడా దక్కవని కొందరు బాధపడుతున్నారని, నానా మాటలు అంటున్నారని చెప్పారు. గ్రామాల్లో క్రాప్‌ కాలనీలు రావాల్సి ఉందని, గిట్టుబాటు ధర అప్పుడే సాధ్యమవుతుందన్నారు. సీఎం వరాల జల్లుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసినందుకు వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతుల తరపున సీఎంను సన్మానించారు.

 

19:44 - April 13, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. సింగపూర్‌ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. అయితే రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఒట్టి మాటలేనని తేలిపోయింది. ఇందుకు సాక్ష్యంగా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయిన విజయవాడలోని భవానీ ద్వీపం నిలుస్తోంది.

కృష్ణమ్మ అందాలను......
విజయవాడలోని భవానీద్వీపం అందాలను రెట్టింపు చేస్తామని. కృష్ణమ్మ అందాలను నలుదిక్కులా చాటిచెబుతామని పదేపదే హామీలు కురిపించారు చంద్రబాబు. అయితే ఆ హామీలు కాగితాలకే పరిమితమైపోయాయి. పైగా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం రూ.50 కోట్లు ఎక్కడా........
భవానీద్వీపం అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లు ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి మంజూరు కాలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో భవానీ ద్వీపం అభివృద్ధి కోసం అధికారులు ప్రైవేట్ సంస్థల వైపు చూస్తున్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించి నదిలోని ద్వీపాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.

భవానీ ద్వీపాన్ని ప్రైవేటీకరణ........
2014 ఎన్నికల ముందు తర్వాత భవానీ ఐలాండ్ ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పిన టీడీపీ పాలకులు.. కృష్ణానదిలోని చిన్న చిన్న ద్వీపాలు, భవానీ ద్వీపాన్ని ప్రైవేటీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆలోచనను పర్యాటకాభివృద్ధి సంస్థలోని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల సంస్థలో పనిచేసే అనేక మంది ఉద్యోగులు, సిబ్బంది రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక రంగానికి భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని..కాదని ప్రైవేటీకరించాలని చూస్తే పెద్ద ఎత్తున పోరాడుతామని కార్మికసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

19:33 - April 13, 2017

విశాఖపట్నం : జిల్లాలో అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీఐఐసీకి చెందిన కంపెనీలు విడుదల చేసే వ్యర్ధాలను సముద్రంలోకి కలపడానికి వేస్తున్న పైప్‌లైన్‌ను స్థానికులు కొన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మరోసారి పైప్‌లైన్‌ పనులు చేయడానికి పూనుకోగా స్థానికులు ఆందోళనకు దిగారు. పైప్‌లైన్‌ నిర్మాణంతో తమ ఉపాధి పోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసన కారులను అరెస్ట్‌ చేశారు. బలవంతంగా వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పూడిమడక గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. నెలరోజులపాటు బయటి వ్యక్తులు ఈ గ్రామంలోకి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. పూడిమడకలో పోలీస్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.

 

 

19:28 - April 13, 2017

నెల్లూరు : విద్యార్థిని అయేషా మీరా హత్య కేసును పునర్విచారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐదో నగర పోలీస్‌ స్టేషన్‌లో నిర్మించిన ఆన్‌లైన్‌ రిసెప్షన్‌ సెంటర్‌ని, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయేషా మీరా హత్య కేసును మరోసారి విచారణ చేపట్టాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరారని డీజీపీ చెప్పారు. బీ.ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా 2007 సం.లో ఓ ప్రైవేట్ హస్టల్ లో అత్యచారం గావించబడి, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని విజయవాడ కోర్టు నేరస్థుడని నిర్థారించింది. కానీ అతను విజయవాడ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. సత్యంబాబును నిర్ధోషిగా తీర్పు ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. 

 

19:14 - April 13, 2017

గుంటూరు : ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఇంటర్‌ ఫలితాల్లో ఈసారి బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో బాలుర కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీలో ఫస్ట్‌ మొదటి ర్యాంకుల్లో బాలికలే నిలిచారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.

ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి......
ఈ ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 64 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 69శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 60శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణతా శాతం 77గా నమోదైంది. ఇందులో బాలికలు 80శాతం ఉత్తీర్ణత పొందితే బాలురు 74శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రథమ, ద్వితీయలో కృష్ణా టాప్......
ఫస్టియర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్‌ప్లేస్‌లో నిలవగా కడప జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఫస్టియర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా 77శాతంతో అగ్రస్థానంలో నిలవగా కడప జిల్లా 53శాతంతో చివరి స్థానంతో వెనకబడిపోయింది. సెకండ్‌ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లా టాప్‌ప్లేస్‌ సాధించగా కడప జిల్లా చివరిస్థానంలో నిలిచింది

మే 15 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు........
రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ గ్రేడింగ్‌ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు.

 

 

యువతిపై సామూహిక అత్యాచారం

పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఓ యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణ ఉంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

 

 

18:12 - April 13, 2017

హైదరాబాద్ : కులీకుతుబ్‌షాల పాలనలో హిందూ, ముస్లీంలకు సమాన అవకాశాలు లభించాయని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో మహ్మద్‌ కులీకుతుబ్‌ షా స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ ఉమ్మడి సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించడంలో స్వేచ్ఛను అనుభవించారని తెలిపారు. పాలకులు, పాలితులకు మధ్య మతం, భాషా, సాంస్కృతిక అంశాల్లో స్నేహ పూరిత వాతారణమే ఉండేదన్నారు.  కార్యక్రమంలో గవర్నర్‌ నర్సింహన్‌ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉపరాష్ట్రపతి ఢిల్లీ తిరిగి వెళ్లారు.

17:58 - April 13, 2017

రాజన్నసిరిసిల్లా : జిల్లాలోని వస్త్ర పరిశ్రమను అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లో జూకీ కుట్టు మీషన్ల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ టెక్స్ టైల్ పార్క్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. సిరిసిల్లా పట్టణంలో ప్రెస్‌క్లబ్‌ భవనానికి భూమిపూజ చేశారు. పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికుల ఆదాయాన్ని నెలకు 15 వేల రూపాయల వరకు సంపాదించేలా వనరులను కల్పించేదుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. అందులో భాగంగానే ఈ బడ్జెట్ లో 1284 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పారు. 

17:53 - April 13, 2017

పెద్దపల్లి : జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుల్తానాబాద్‌ మండలంలోని కాట్నపల్లిలో ఆరుగురు యువకులు వివాహితను 20 రోజుల క్రితం కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లారు. ఆమెకి మద్యం తాగించి అత్యాచారం చేశారు. ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు ఉంది. అయితే భర్తకు ఇదివరకే పెళ్లి అయిందని తెలిసాక అతనితో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. రైస్ మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

 

17:40 - April 13, 2017
17:33 - April 13, 2017

ఇంటిముందు అడుకుంటున్న చిన్నారి ఒకేసారి కనిపించకుండా పోతుంది. పక్కింటికి వెళ్లిన కుతూరు తిరిగిరాదు. ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతుంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అదృశ్యం అవుతున్నారు. ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి ? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

షార్ట్ సర్క్యూట్ తో మహిళ సజీవదహనం

కర్నూలు : జిల్లాలో విషాదం నెలకొంది. బుధవార్ పేట పరుపుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మహిళ సజీవదహనం అయింది.

సౌరాష్ట్ర కచ్ వైపు నుంచి వీస్తున్న గాలులు

హైదరాబాద్ : సౌరాష్ట్ర కచ్ వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. మరట్వాడలో అత్యధిక ఉష్ణోగ్రతలు సమోదు అయ్యాయి.
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాజస్తాన్ సరిహద్దు ప్రాంతం దార్మేర్ లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గుజరాత్ లోని కాండ్ల, భీరలో 44.5డిగ్రీల ఉష్ణోగ్రత, గుజరాత్ లోని గాంధీనగర్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. కర్నూలులో 43 డిగ్రీలు, నంద్యాల, అనంతపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కడప, నందిగామ, బంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఒంగోలు, కాకినాడలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

రేపు టీఆర్ ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ : నాయిని

హైదరాబాద్ : రేపు టీఆర్ ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించనున్నుట్లు హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి  తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారని చెప్పారు. నామినేషన్లస్వీకరణకు చివరి తేది ఈనెల 18 అని తెలిపారు. 19న నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 21వ తేదీన కొంపల్లిలో జరిగే ప్లీనంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు.

16:58 - April 13, 2017

సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపేడుతున్నాడు. జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేటలలో ఎండ తీవ్రత సుమారు 42.2 డిగ్రీలుగా నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రతపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేసింది టెన్ టివి. ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని, నీటి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వారు తెలిపారు. 

16:56 - April 13, 2017

కన్నతల్లితో బంధాన్ని తెంచేసుకున్నారు...మానవత్వాన్ని మంటగలిపారు..పేగు బంధాన్ని అపహాస్యం చేశారు..ఏడాదిగా వాష్ ఏరియాలోనే అమ్మ..ఇదంతా హెడ్ మాస్టర్ దుర్మార్గం..

పేగు బంధం మరోసారి అపహాస్యం అయ్యింది. కన్నతల్లిని ఏడాదిగా హింసిస్తున్న కొడుకు నిర్వాకం బయటపడింది. అంట్లు తోమే ప్రాంతంలో నిసత్తువుగా ఉన్న అమ్మను పడేసి దుర్మార్గంగా ప్రవర్తించాడు. అరవ లేక..ఆదుకొనే వారు లేక..ఆ అమ్మ రోదించింది. విషయం తెలిసిన అధికారులు ఆమెను విముక్తిరాలిని చేశారు. పలువురిని కంటతడిపెట్టించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో చోటు చేసుకుంది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ హెడ్ మాస్టర్ ఇలా చేశాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

హిందూపురంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అనంతపురం : హిందూపురంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో లావణ్య అనే విద్యార్థిని పురుగుల మందు తాగింది. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

16:43 - April 13, 2017

ఢిల్లీ : ఇటీవల 8 రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉప ఎన్నికలో ఆప్ డిపాజిట్ కోల్పోయింది. ఢిల్లీ రాజౌరి గార్డెన్‌ నియోజకవర్గంలోఆప్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. బిజెపి అభ్యర్థి మన్‌జిందర్‌ సింగ్‌ సిర్‌సా విజయం సాధించారు. కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలవగా, ఆప్‌ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  తమ అభ్యర్థి ప్రజలకు దూరం కావడం వల్లే ఓటమి చెందారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా చెప్పారు. కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్‌ మోదీ హవాకు బ్రేక్‌ వేసింది.

 

16:39 - April 13, 2017

టాలీవుడ్ సినిమాలో తనకంటూ ఒక క్రేజ్ ను తెచ్చుకున్న నటుల్లో 'రానా' ఒకరు. ‘లీడర్’ సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ నటుడు వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానులను సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా అతని రూట్ మారిపోయింది. జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకొన్న 'రానా' బాహుబలి -2 చిత్రంలో కూడా నటించారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే 'మాక్సీమ్' పత్రిక కవర్ పేజ్‌పై 'రానా'తళుక్కున మెరిశాడు. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య స్టైల్‌గా కూర్చొని ఉన్న 'రానా' పోస్టర్ ఆకర్షిస్తోంది.

16:20 - April 13, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాది నుండి ఎరువులను ఉచితంగా అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. గురువారం సాయంత్రం ప్రగతి భవన్ లో నిజామాబాద్ రైతులతో కేసీఆర్ సమావేమయ్యారు. రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసినందుకుగాను రైతులు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, రెండు, మూడేళ్లలో తెలంగాణలో కోటి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి 26 లక్షల టన్నుల ఎరువులను రైతులకు ఉచితంగా ఇస్తామని అన్నారు. రాష్ట్రం బంగారం కావాలని, కేవలం మాటలు మాట్లాడితే సరిపోదని చేతలు కూడా ఉండలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల జీవితం బొగ్గు బాయి, దుబాయిగా ఉందని, ఇప్పుడా పరిస్థితి ఉండదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావుదాక వెళ్లివచ్చినట్లు, రైతులు బాగుపడుతనే బంగారు తెలంగాణ అయినట్లు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కోటి ఎకరాలకు నీళ్లు అందించి తీరుతామన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, 24 లక్షల నుండి 26 లక్షల టన్నుల ఎరువుల సరఫరా చేస్తామన్నారు. రైతుల విత్తనాలు..పురుగుల మందు మాత్రమే కొనుక్కోవాలని సూచించారు. ప్రతి ఊరిలో ఒక గ్రామ రైతు సంఘం ఏర్పాటు చేయాలని, రైతు సంఘంలో అన్ని కులాల భాగస్వామ్యం ఉండాలన్నారు. గ్రామ, రైతు సంఘాలు అద్భుతమైన వేదికగా మారాలని సూచించారు. వ్యవసాయంలో రైతులు నవీన పద్ధతులు అవలింబించాలని, పైరవీలు జరగకుండా నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. మేలో ఎకరాకు రూ. 4 వేల చొప్పున రైతు అకౌంట్ లో జమ అవుతుందన్నారు.

 

15:52 - April 13, 2017

బాహుబలి -2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్...పోస్టర్స్ అభిమానులను ఎంతగానో అలరించాయి. మరో రెండు వారాల్లో విడుదల కావాల్సి ఉండగా కర్నాటక రాష్ట్రంలో అడ్డంకులు ఇంకా తొలగలేదు. ఈ సినిమాను కర్నాటక రాష్ట్రంలో ఏ ఒక్క థియేటర్ లో అడనివ్వమని కన్నడ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. నటుడు సత్యరాజ్ క్షమాపణలు చెప్పే వరకు తమ నిర్ణయంలో మార్పు ఉండదని కుండబద్ధలుగా చెబుతున్నాయి. తాము బాహుబలి 2 సినిమాకు వ్యతిరేకం కాదని, సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ కు మాత్రమే వ్యతిరేకం అని పేర్కొంటున్నారు. కావేరీ నది జిలాల విషయంలో నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం జరుగుతున్న తరుణంలో తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌ గతంలో తమిళనాడుకు కావేరీ నీటి సరఫరా అంశంపై కన్నడ సంఘాల పట్ల చులకనగా మాట్లాడారని ఆరోపణలున్నాయి. మరి చిత్ర విడుదల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

15:44 - April 13, 2017

కడప : జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. అధిష్టానం తమను పట్టించుకోవడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. పార్టీతో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కొంతమంది కడపలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర నిరాహార దీక్షకు దిగారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తీరును నిరసించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న కాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కాదని నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలోనూ పార్టీకి అండదండగా నిలిచిన తమను విస్మరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడి తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

 

15:41 - April 13, 2017

పశ్చిమ గోదావరి : వైద్య వృత్తికి పలువురు కలంకం తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటాయి. తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధుడిపై ఆసుపత్రి చేసిన నిర్వాకంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిడదవోలు ఆసుపత్రిలో ఓ వృద్ధుడు చికిత్స కోసం వచ్చాడు. అయితే వైద్యులు సరైన వైద్యం చేయలేకపోవడంతో మృతి చెందాడనే ఆరోపణలున్నాయి. వృద్ధుడి మృతదేహాన్ని బయట వదిలి వెళ్లడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వృద్ధుని నిండు ప్రాణం బలైందని, వెంటనే ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

15:24 - April 13, 2017

కడప : జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత 43 డిగ్రీలుగా నమోదు అవుతోంది. భానుడి దెబ్బకు ప్రజలు బయటకు రావడానికి భయడుతున్నారు. వేడికి తట్టుకోలేక జనం శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండలు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. నీటి కొరత చాలా ఉందని ఈ సమస్యపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైమరీ స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని, వృద్ధులు, పిల్లలు ఎండకు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయలన్నారు.

14:48 - April 13, 2017

క్రికెట్...ఆవేశాలు..భావోద్వేగాలకు పలువురు క్రికెటర్లు లోనవుతుంటారు. అవుట్ కాగానే హేళన చేయడం..తీవ్ర వత్తిడికి లోనై విమర్శలు గుప్పించడం ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు వీటికి చెక్ పడబతోంది. క్రికెట్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆటగాళ్లు ఇక దురుసు ప్రవర్తన చేస్తే వారిపై అంపైర్లు నిర్ణయం తీసుకోనున్నారు. అంపైర్లకు మరినిన్ అధికారాలు కట్టబెడబుతూ మెర్లీ బోన్ క్రికెట్ క్లబ్ సరికొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లపై కాసేపటి వరకు..లేదా మ్యాచ్ నుండి శాశ్వతంగా బయటకు పంపేందుకు అంపైర్లకు అధికారాలను కట్టబెట్టారు.
ఆటగాళ్ల దురుసు ప్రవర్తనకు కళ్లెం వేసేందుకు అంపైర్లకు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ మేర్లీబోన్ క్రికెట్ క్లబ్ సరికొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. నూతన నిబంధనల ప్రకారం మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లను కాసేపటి వరకూ లేదంటే ఆ మ్యాచ్ నుంచి శాశ్వతంగా బయటకు పంపేందుకు అంపైర్లకు వీలవుతుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. క్రికెటర్ల అనుచిత ప్రవర్తనకు, అంపైర్లతో దురుసుగా వ్యవహరించడానికి చెక్ పడుతుంది. ఇందుకు అంపైర్లు రెండు రకాల సిగ్నల్స్ ఇవ్వనున్నారు. ఆటగాణ్ని శాశ్వతంగా మైదానం విడిచి పోమ్మనడానికి లెవల్ 4 గా...తాత్కాలికంగానైతే లెవల్ 3గా పరిగణిస్తారు. ఆటగాణ్ని శాశ్వతంగా మైదానం విడిచి పొమ్మనడం కోసం అంపైర్ చూపుడు వేలిని చూపుతూ.. చేతిని చాపాల్సి ఉంటుంది. తాత్కాలికంగా మైదానం విడిచిపొమ్మనడం కోసం రెండు చేతులను భుజాల వరకూ పైకెత్తి వేళ్లు చాచాల్సి ఉంటుంది.

14:36 - April 13, 2017

ఖమ్మం : మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మంలో సీపీఎం నాయకులు వర్తక సంఘ భవనం నుంచి గ్రైన్‌ మార్కెట్‌ వరకూ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్వింటాకు పది వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. మిర్చి రైతులు భారీగా నష్టపోతున్నారని.. కనీసం వారికి మద్దతు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

14:31 - April 13, 2017

వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల మిర్చి మార్కెట్ యార్డును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల్లో క్వింటాల్‌ మిర్చి రూ. 12 వేల నుంచి రూ. 14 వేలు పలుకుతుంటుంటే తెలంగాణలో ఎందుకు తక్కువగా ఉందన్నారు. మార్కెట్ లో ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తునట్టు చెబుతున్నారని, మిర్చి ఇంతకంటే ఎక్కువ ఉత్పత్తి అయిన రోజులున్నాయని, అప్పుడు లేని ఇబ్బంది ఎందుకు ఏర్పడుతుందని సూటిగా ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్ పడిపోయిందని చెబుతున్నారని ఇది అబద్ధమని తెలిపారు. దేశీయ మార్కెట్ లో తెలంగాణ మార్కెట్ కంటే ఎక్కువ ధరలున్నాయన్నారు. ఒక రాష్ట్రంలో రూ. 10-14 వేల రేట్లు నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రూ. 2 - రూ.5వేలు ఎందుకుందని ప్రశ్నించారు. రెండు..మూడు రోజుల్లో మిర్చి రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి మార్కెట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

 

తరుణ్ విజయ్ పై పవన్ ఘాటు ట్వీట్లు..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తూ పలువురిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించిన జనసేనాని కొద్దిసేపటి క్రితం బీజేపీ నేత తరుణ్ విజయ్ పై విమర్శలు గుప్పించారు. తరుణ్ విజయ్ ఇటీవలే వర్ణ వివక్షపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, ఉత్తర భారత రాజకీయ నాయకుల, మేధావుల సంస్కారం ఎలాంటిదో తెలుస్తుందన్నారు. త

రాష్ట్రపతి భవన్ వద్ద యూకే డిఫెన్స్ మంత్రి..

ఢిల్లీ : యూకే డిఫెన్స్ మినిస్టర్ రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ సైనికులు నిర్వహించిన గౌరవవందనం స్వీకరించారు. అంతకుముందు అమర్ జవాన్ జ్యోతి వద్ద ఆయన నివాళులు అర్పించారు.

14:05 - April 13, 2017

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు..ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. మరి ఎండాకలం నుండి ఉపశమనం పొందాలంటే..కొన్ని చిట్కాలు..
ఉసిరి కాయను ఆహారంలో భాగంగా చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకపోకుండా చూస్తుంది. అంతేగాకుండా విటమిన్ సి అందుతుంది.
ప్రతి రోజు పుదీనా ఆకులను ఆహారంలో ఉపయోగించండి. పుదీనాను ఎలాగైనా వాడుకోవచ్చు. చట్నీ..సలాడ్..డికాషన్ లో వేసుకోవచ్చు. తలనొప్పి..వికారాలు..ఒత్తిడి..నీరసం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
గుప్పెడు తులసీ ఆకుల రసాన్ని తీసుకోండి. ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా అందుతుంది. రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుండి లభిస్తుంది. ఫలితంగా వికారం..తలనొప్పి వంటి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
గులాబీ రేకులను ఎండబెట్టి..వాటితో టీ తయారు చేసుకుని తాగాలి. వేడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.

13:57 - April 13, 2017

హైదరాబాద్ : ఆయుర్వేద ఉత్పత్తులు వాడటంవల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్టులు ఉండవని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. హైదరాబాద్‌ మణికొండలో బాలుహెర్బల్‌ 10వ బ్రాంచిని ఆయన ప్రారంభించారు. బాలుహెర్బల్‌ ఆయుష్‌ లైసెన్స్‌ పొందిన కంపెనీ అని తెలిపారు. నిపుణులైన వైద్యులు పర్యవేక్షణలోనే మందులు తయారు చేస్తున్నందున అందరూ వాడవచ్చన్నారు సుమన్‌. 

ఫైబర్ గ్రిడ్..కనెక్టివిటీ తయారీ రంగంపై లోకేష్ సమీక్ష..

విజయవాడ : ఫైబర్ గ్రిడ్..కనెక్టివిటీ తయారీ రంగంపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఫైబర్ నెట్ వర్క్స్ అందుబాటులోకి తేవాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

13:49 - April 13, 2017

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం ఉదయం నగరానికి వచ్చారు. అన్సారీకి గవర్నర్ నరసింహన్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్వాగతం పలికారు. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

 

కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై చర్చకు తాము సిద్ధమని, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుని తీరుతామన్నారు. అవసరమైతే ఢిల్లీలో అన్ని పార్టీలతో ధర్నా చేస్తామన్నారు.

 

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం - రూపాల..

కరీంనగర్ : మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల పేర్కొన్నారు. టీఆర్ఎస్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. 11 కోట్ల మంది సభ్యత్వంతో బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. అవసరం లేని వారు గ్యాస్ సబ్సిడీ వదుకోవాలన్న మోడీ పిలుపుతో దేశ ఖజానాకు రూ. 30 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. రెండు కోట్ల బంది పేదలకు గ్యాస్ కనెక్షన్లను ఇప్పించడం జరిగిందన్నారు.

కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై చర్చకు తాము సిద్ధమని, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుని తీరుతామన్నారు. అవసరమైతే ఢిల్లీలో అన్ని పార్టీలతో ధర్నా చేస్తామన్నారు.

13:36 - April 13, 2017

శ్రీకాకుళం : జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండలతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వాతవరణ కాలుష్యం కారుణంగా ఎండలు పెరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. అన్నారు.చిన్న పిల్లలు ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి స్కూల్ టైమింగ్ మధ్యాహ్నం 12 గంటలకు కాకుండా ఉదయం 11 గంటల వరకే ఉండాలని అన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30వరకు బయటకు ఎవరు వెళ్లడం లేదని తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

చంద్రబాబుకు ముద్రగడ అల్టిమేటం

అమరావతి: కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడాలని... వచ్చే నెల 7వ తేదీ లోపల ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో 7వ తేదీ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

12:57 - April 13, 2017

ఛాయ్ వాలా మెడకు ఐటీ ఉచ్చు బిగియడం ఏంటీ ? అతనేమన్నా బడా వ్యాపారి వేత్తనా ? ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉంటుందా ? అని ప్రశ్నలు వేయకండి. ఆయన చేసిన ఓ పనితో ఐటీ ఉచ్చు బిగిసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని కొత్పుట్లీ సమీపంలోని హుదుటా వద్ద లీలా రామ్ గుజ్జార్ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీన తన ఆరుగురు కూతుళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. ఈ పెళ్లి వేడుకల్లో మగ పెళ్లి వారికి భారీగా కట్నం ఇచ్చాడంట. పెళ్లి ఖర్చులు కాక..తన కూతుళ్లకు ఏకంగా కోటిన్నర కట్నమిచ్చాడు. ఛాయ్ వాలా ఏకంగా కోటిన్నర మేర కట్నం ఇచ్చాడనే వార్త దావానంలా వ్యాపించేసింది. ఇంకేముంది ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిదంని ప్రశ్నల వర్షం కురిపించింది. ఎక్కడి నుంచి ఈ మొత్తాన్ని సంపాదించారో తెలుపాలంటూ ఐటీ ఆఫీసు సమన్లు పంపింది. గురువారం వరకు ఆగుతామని, ఒకవేళ రిటర్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఆదాయార్జన పైన ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఐటీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా సమర్పించాలని ఆదేశించినట్లు ఐటీ పేర్కొంది.

ఈవీఎంల ట్యాంపరింగ్ పై మే8లోపు సమాధానం చెప్పండి: సుప్రీం

ఢిల్లీ:ఈవీఎంల ట్యాంపరింగ్ పై మే 8లోపు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే వెసులుబాటు ఉందని, ఉత్తరప్రదేశ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని, దీంతో భవిష్యత్ లో పేపర్ బ్యాలెట్ వాడేలా ఆదేశించాలని, లేని పక్షంలో ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే...బిల్లింగ్ తరహాలో ఓటర్ ఓటు వేసిన అనంతరం రసీదు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

12:46 - April 13, 2017

గాల్లో విమానంలో నుండి మనిషిని పడేస్తారా ? కానీ మెక్సికో పట్టణంలో ఇలాంటి ఘటన సంచలనం సృష్టిస్తోంది. సినోలా రాష్ట్రంలో ఎల్డొరాడో నగరంలో కొద్ది ఎత్తులో వెళుతున్న విమానంలో నుండి ఓ వ్యక్తిని బిల్డింగ్ పైకి పడేశారు. ఆ వ్యక్తి శరీరం ఐఎమ్ఎస్ఎస్ ఆసుపత్రి బిల్డింగ్ పై పడింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ అధికారి పేర్కొన్నారు. ఆసుపత్రి రూఫ్ నుండి వ్యక్తి శరీరాన్ని తీసుకొచ్చి చికిత్స చేసినా లాభం లేకుండా పోయిందని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తిని చంపేసి కిందపడేశారా ? లేదా ప్రాణాలతోనే కిందకు పడేశారా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉంటే సినోలా రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. ఈ డ్రగ్స్ ముఠాలు ఒకరిపై మరొకరు ప్రతికార దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

16న టీఎస్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదారాబాద్‌: ఈ నెల 16న టీఎస్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 16వ తేదీ ఉదయం 10గంటలకు సభ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు శాసనమండలి ప్రారంభమవుతుంది. 15వ తేదీ సాయంత్రం 4గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది.

12:31 - April 13, 2017

హైదరాబాద్ : నోట్ల రద్దుతో స్థిరాస్థులతో బెట్టింగ్...!ఐపీఎల్‌ పదో సీజన్‌ మొదలవడంతో హైదరాబాద్‌లో మళ్లీ బెట్టింగ్‌లు మొదలయ్యాయి..ఇప్పటికే పోలీసులు కొన్ని ముఠాలను పట్టుకోగా.. ఇంకా చాలా మంది నడిపిస్తున్నారన్న అనుమానాలున్నాయి..ప్రధానంగా హైదరాబాద్‌లో కాకుండా మకాం మార్చిన బుకీలు దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది...దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల కోట్ల వరకు పందేలు సాగుతాయనే అంచనా.

పాత వారే మళ్లీ మళ్లీ.....
బెట్టింగ్‌లు గతంలో నిర్వహించినవారే మళ్లీ మళ్లీ నడిపిస్తున్నారు...నగరంలోని ప్రధాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది...ఇక కొందరు తమ వ్యాపారాలకు స్వస్తి చెప్పి పందాల్లోనే మునిగిపోతుంటారు.. క్రికెట్‌ సీజన్ వచ్చిందంటే చాలు.. పోలీసులకు దొరికేది నామమాత్రమే...దీనికి కారణం ప్రధాన బుకీలంతా హైదరాబాద్‌ నుంచి మకాం మార్చేసి దేశంలోని వివిధ నగరాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు.

నగరంలో పోలీసుల నిఘా పెరగడం......
నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరు, గోవా, కేరళ, ముంబయి.. తదితర నగరాలకు మకాం మార్చేశారని తెలుస్తోంది..ఎక్కడో ఉంటూ అంతా ఆన్‌లైన్‌ ద్వారానే వ్యవహారం నడిపిస్తుంటారు..నగరంలో కలెక్షన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పందెంరాయుళ్లకు వల వేస్తున్నారు. ఒక్కో పంటర్‌ మ్యాచ్‌కు ముందే అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది...వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేయడం ద్వారా పంటర్లకు కూడా నమ్మకం కుదిరి ఆ తర్వాత పందాలకు రెడీ అవుతుంటారు.ఈ వ్యవహారం మొత్తం బుకీలు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు చూసుకుంటారు.

పేకాట క్లబ్లుల మూసివేతతోనే....
ప్రధానంగా నగరంలో పేకాట క్లబ్బులు మూసివేయడంతో క్రికెట్‌ బెట్టింగ్‌ల వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది..దీంతోనే కోట్లలో నడిచే దందా వందల కోట్లకు చేరింది. ఇక పోలీసులు దాడులు చేస్తున్న ప్రతీ సారి దొరికేది చిన్నవారే..అసలు బుకీలంతా ప్రధాన నగరాల్లో ఉంటున్నారు. తాజాగా ఐపీఎల్‌ పదో సీజన్‌ ప్రారంభం కావడంతో పంటర్లు, ఏజెంట్లు, బుకీల్లో ఉత్సాహం నెలకొంది...గతంలో కేసుల్లో చిక్కిన వారి కదలికలపై దృష్టి పోలీసులు సారించారు. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గా ఉన్నా కాలాన్ని బట్టి..అవకాశాలను బట్టి బెట్టింగ్‌లలో పద్దతులు మార్చేస్తున్నారు..అయితే ఈ సారి బెట్టింగ్‌ టెక్నాలజీ పరంగా వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..వాట్సప్‌లాంటి సామాజిక మాధ్యమాలతోపాటు యాప్‌లను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి, దిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో సాగే బెట్టింగ్‌ దందా సైతం యాప్‌ల ద్వారా కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

 

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

విజయవాడ: ఇంటర్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో తొలి స్థానం కృష్ణా జిల్లా 77 శాతంతో నిలవగా..రెండో స్థానంలో నెల్లూరు, మూడో స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. సెకండియర్‌లో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు, మూడో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయి. ఫస్టియర్‌, సెకండియర్‌లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

 

12:13 - April 13, 2017

విజయవాడ : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. ప్రథమ..ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. మొత్తం పది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని మంత్రి గంటా తెలిపారు. గతంలో రెండు దఫాలుగా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా కేవలం 24 రోజుల్లో రిజల్ట్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ లో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ లేకుండా చేస్తామని, స్పాట్ వాల్యుయేషన్ లో పాల్గొనే వారికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. ఆన్ లైన్ సిస్టంలో పేమెంట్ చేయడం జరిగిందన్నారు. అడాన్స్ డ్ సప్లిమెంటరీ 15-05-2017 జరుగుతుందన్నారు.10,31,376 మంది హాజరయ్యారని, ఇందులో రెగ్యులర్ 9,18,573 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో టాప్ 3లో మొదటి స్థానంలో 77 శాతంతో కృష్ణా జిల్లా నిలిచిందన్నారు. 69 శాతంతో నెల్లూరు ద్వితీయ, 67 శాతంతో వెస్ట్ గోదావరి మూడో స్థానంలో నిలిచిందన్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 86 శాతంతో కృష్నా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 80 శాతంతో నెల్లూరు..చిత్తూరు జిల్లాలు ద్వితీయ, 79 శాతంతో గుంటూరు తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. ఇక ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో కడప జిల్లా చివరిస్థానంలో నిలిచిందన్నారు.

  • ఇంటర్ ఫస్టియర్ లో 80 శాతం బాలికలు, 75 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.
  • ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో 69 శాతం బాలికలు, 60 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.
  • ఎంపీసీలో ప్రథమ స్థానం షేక్ షర్మిల 992 మార్కులు.
  • ద్వితీయ స్థానం దోసపాటి సాయి వంశీ 991 మార్కులు
  • తృతీయ స్థానం లోకేష్ బాబు 991 మార్కులు
  • బైపీసీ విభాగంలో
  • ప్రథమ స్థానం నైమిష 991 మార్కులు.
  • ద్వితీయ స్థానం లీమ 990 మార్కులు
  • తృతీయ స్థానం సారిక 990 మార్కులు

నాగర్ కర్నూల్ లో విషాదం....

నాగర్‌కర్నూలు: జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో విషాదం చోటు చేసుకుంది. వెనచర్లకు చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో తల్లి(27), కూతురు(3) మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కుటుంబకలహాలే కారణమని స్థానికులు చెప్తున్నారు.

 

 

11:58 - April 13, 2017

చెన్నై : తమిళనాడులో ఐటీ దాడులు ప్రకంపనలను సృష్టిస్తోంది. ఐటీ దాడులతో ఆ రాష్ట్ర సీఎం పళనీ స్వామికి కేంద్రం చుక్కలు చూపిస్తోంది. అధికార పార్టీ చెందిన మంత్రుల, పారిశ్రామికవేత్తల, సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మంత్రి విజయ్ భాస్కర్ నివాసం..కార్యాలయాలపై దాడి నిర్వహించిన ఐటీ ఆయన్ను విచారించనుంది. విజయ్ భాస్కర్ దగ్గర దొరికిన ఆదారాలతో మంత్రులు రాధాకృష్ణ, కామారాజులపై కేసు నమోదు చేశారు. ఏ క్షణమైనా మరో ముగ్గురు మంత్రులను ఐటీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. విజయ్ భాస్కర్ తో పాటు మరో ఇద్దరు మంత్రులపై పోలీసులకు ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ సోదాల సందర్భంగా మహిళా అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారని వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం సినీ నటులు శరత్ కుమార్, రాధికను ఐటీ సుదీర్ఘంగా ప్రశ్నించినవిషయం తెలిసిందే.

11:54 - April 13, 2017

చిత్తూరు : తిరుమలలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సర్కార్ పై పలు విమర్శలు గుప్చించారు. గురువారం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పేదలకు ఇళ్లు కట్టించని చంద్రబాబు హైదరాబాద్‌లో మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నారని రోజా విమర్శించారు. వసతులు లేకుండానే అమరావతికి ఉద్యోగులను హడివుడిగా తరలించారని, పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టిసీమలో చంద్రబాబుకు వచ్చిన ముడుపులతోనే హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నారని రోజా ఆరోపించారు.

 

ఢిల్లీలో ఆప్ స్థానంలో బిజెపి పాగా

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఆప్ స్థానంలో బిజెపి గెలుపొందింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా మాట్లాడుతూ, తమ ఓటమికి ప్రధాన కారణం తమ పార్టీ అభ్యర్థేనని చెప్పారు. ప్రజలకు కొంచెం దూరమయ్యామని... వారితో తమ పార్టీ సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఓటమి తమకు ఎదురుదెబ్బ కాదని... మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాజవొమ్మంగిలో ప్రకంపనలు

తూర్పు గోదావరి : రాజవొమ్మంగి మండల కేంద్రంలో భూప్రకంపనలు సంభవించాయి. ఎండల భయానికి అంతా ఇళ్లలోనే ఉంటున్న వేళ ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోవడంతో ఇళ్ల నుంచి రాజవొమ్మంగి వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. 

11:43 - April 13, 2017

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో సారి టీడీపీ ఎంపీలపై ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎంపీలు తమ స్వార్ధప్రయోజనాలకు కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టొద్దని అన్నారు. విభజన సమయంలో నార్త్ ఎంపీలు తమ ఎంపీలపై చేసిన దాడి చేసిన విషయాన్ని టీడీపీ మరిచిపోయిందా అని గుర్తు చేశారు. హోదాపై మాట్లాడిన తెలంగాణ ఎంపీలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. పవన్ ఆసక్తికరంగా ఈసారి వైసీపీని పొగిడారు. హోదాపై వైసీపీ పోరాటం అభినందనీయం, స్ఫూర్తిదాయకమని కల్యాణ్ ప్రశసించారు. కేంద్ర రాష్ట్రాలపై నమ్మకంతోనే బీజేపీ, టీడీపీని గెలిపించారని కానీ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని పవన్ ఘాటుగా విమర్శించారు. మరి పవన్ విమర్శలపై తెలుగుదేశం ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

11:42 - April 13, 2017

రాత్రి సమయాల్లో భారతదేశం ఎలా కనిపిస్తుంది ? ఎప్పుడైనా చూశారా ? దేశం ఎలా కనిపిస్తుంది ? అంతరిక్షం నుండి భారతదేశం నిశీధిలో ఎలా కనిపిస్తుందన్న చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలను 'నాసా' విడుదల చేసింది. అమెరికా అంతరిక్ష సంస్థ పలు చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2012లో భారత నైట్ విజన్ ను విడుదల చేసిన నాసా తాజా చిత్రాలను కూడా రిలీజ్ చేసింది. మరింత స్పష్టమైన శాటిలైట్ చిత్రాలను తీసేందుకు కృషి చేస్తున్నామని నాసా ఎర్త్ సైంటిస్ట్ మిగుల్ రోమన్ తెలిపారు. ఇందుకోసం కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నామని అన్నారు.

 

 

11:30 - April 13, 2017

నాగ చైతన్య..రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. మే 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రమిదని పేర్కొంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్, కౌసల్య ఇర్షాద్ (పరిచయం) తదితరులు నటించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.

11:23 - April 13, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇటీవలే ఆయన నటించిన 'కాటమరాయుడు' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఉండగానే 'కొరటాల శివ'తో చిత్రం చేయనున్నారని టాలీవుడ్ టాక్. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌' వంటి హ్యాట్రిక్‌ హిట్స్‌ను కొరటాల అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'తో కూడా ఓ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు..మురుగదాస్ కాంబినేషన్ లో చిత్రం తెరకెక్కుతోంది. ఈ గ్యాప్ లోనే కొరటాల ఓ పక్కా స్ర్కిప్ట్ ను సిద్ధం చేశారంట. ఈ కథను పవన్ కు వినిపించడం..కథను ఒకే చేశారని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి 'ఇంజినీర్ బాబు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. కొరటాల దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

10:50 - April 13, 2017

ఢిల్లీ : బంగారం ధర మళ్లీ పెరిగింది. వరుసుగా రెండో రోజు ధరలు పెరగడం పట్ల కొనుగోలు దారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో పసిడికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం సెషన్‌లో బంగారం రూ.60 పెరిగింది. కిలో వెండి రూ.925 ప్రియమై రూ.42,000కు చేరింది. బుధవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.410 పెరిగి వరుసగా రూ.29,760, 29,610గా పలికింది.

 

మరోసారీ టీడిపి ఎంపిలపై పవన్ కల్యాన్ ఆగ్రహం

హైదరాబాద్: ప్రత్యేక హోదా పై పార్లమెంట్ లో చర్చ జరుగుతుంటే టిడిపి ఎంపిలు మౌనంగా ఉండడం దారుణం అని జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి మండిపడ్డారు. హామీలు అమలు చేయమని కేంద్రాన్ని ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు. ఆంద్రుల ఆత్మగౌరవమైన ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టొద్దని టీడీపీని కోరుతున్నాని పవన్ తెలిపారు.

10:43 - April 13, 2017

ఢాకా : ఒక ఓవర్ లో ఆరు బంతులు వేయాల్సి ఉంటుంది. సిక్స్..బౌండరీలు..సింగిల్స్ ఉంటాయి. నాలుగు బంతుల్లో 92 పరుగులు ఎలా సాధ్యం..నాలుగు సిక్స్ లు కొట్టినా 24 పరుగులు వస్తాయి..అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశమే లేదు. అని అంటారా ? కానీ సాధ్యమైంది. ఈ అసాధారణ రికార్డు బంగ్లాదేశ్ లోని ఢాకా సెకండ్ డివిజన్ క్రికెట్ లీగ్ లో నమోదైంది. మంగళవారం ఆక్సియమ్..లాల్మాటియా క్లబ్ ల మధ్య మ్యాచ్ జర ఇగింది. లాల్మాటియా జట్టు ఓపెనింగ్ బౌలర్ సుజన్ మహ్మద్ బౌలింగ్ వేస్తున్నాడు. మొత్తం 15 నోబాల్స్ వేశాడు. ఈ క్రమంలో 13 వైడ్లు కూడా వేశాడు. ఆ బంతులన్నీ ఫోర్లు (ప్రతి బంతికి 5 పరుగులు) వెళ్లాయి. మొత్తంగా 80 పరుగులు వచ్చాయి. వేయాల్సిన నాలుగు బంతుల్లో 12 పరుగులు ఇచ్చాడు. ఇవన్నీ కలిపితే 92 పరుగులు వచ్చాయి. 50 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాల్మాటియా జట్టు 14 ఓవర్లలో 88 పరుగులకే అలౌటైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు ఇచ్చిన రికార్డు మాత్రమే ఉంది.

 

10:31 - April 13, 2017

ఢిల్లీ: ఇంధన ధరలను రోజువారీగా సమీక్షించాలని ప్రభుత్వ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర చమురుశాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. నిపుణుల సిఫార్సుల మేరకే రోజువారీ సమీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద మే 1 నుంచి ఐదు నగరాల్లో రోజువారీ ఇంధన ధరల సమీక్షను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, పుదుచ్చేరి, ఉదయ్‌పూర్‌, జంషెడ్‌పూర్‌, చండీగఢ్‌లలో ఈ ధరల సమీక్ష అమలవుతుందని చెప్పారు. దీని తర్వాతే దేశవ్యాప్తంగా సమీక్షించాలో లేదో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 15 రోజులకోసారి ఇంధన ధరల సమీక్ష నిర్వహిస్తున్నారు. 

10:24 - April 13, 2017

హైదరాబాద్: ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన జీహెచ్ ఎంసీ పాలక మండలి సమావేశం ఈ సారి దాదాపు 7 నెలల తరువాత జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను పరిష్కరించలేక సమావేశం జరపడం లేదని విపక్షాలు ఆరోపణలను సైదాబాద్ కార్పొరేటర్ కొట్టి పారేశారు. ఆమె '10టివి'తో మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడం వల్ల వాయిదా పడిందని తెలిపారు. ఈ రోజు జరిగే సమావేశాల్లో వివిధ అంశాలపై ఈ మండలి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. 

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు : రోజా

తిరుపతి: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు నాయుడికి చిత్త శుద్ధి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మూడేళ్లలో పేదలకు ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు కానీ అమరావతిలో వసతులు లేకుండానే ఉద్యోగులను తరలించారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో ఇంటి నిర్మాణం చేసుకున్నారని రోజా ఎద్దేవా చేశారు.

ఎనుమాముల మార్కెట్ లో తమ్మినేని వీరభద్రం

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ ను తెలంగాణ సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శిస్తున్నారు. మిర్చి రైతుల సమస్యల ను అడిగి తెలుసుకుంటున్నారు.

10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభం

ఢిల్లీ: 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభం అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ లో భోరంజ్ ఉప ఎన్నికలో బిజెపి ముందంజలో ఉంది. ఢిల్లీలో రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి, జార్ఖండ్ లితిపార ఉప ఎన్నికలో జేఎంఎం అభ్యర్థి, కర్ణాటక నంజగూడు లో కాంగ్రెస్, కర్ణాటక లోని గుండ్లుపేటె లో కాంగ్రెస్ అభ్యర్థి, రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో బిజెపి అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

09:32 - April 13, 2017

ఢిల్లీ:కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాకు ఢిల్లీ కోర్టు ఓపెన్‌ ఎండెడ్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సాధారణ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ మాదిరిగా దీనికి కాల పరిమితి ఉండదు. ఫెరా ఉల్లంఘన కేసులో కోర్టు సమన్లను ధిక్కరించినందుకు మాల్యాపై ఈ వారెంట్‌ జారీ అయింది. గతంలో కూడా మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయగా దాన్ని అమలు చేయలేదు. కేసుపై పురోగతికి సంబంధించి రెండు నెలల్లోగా నివేదిక అందించాలని కోర్టు ఈడీని ఆదేశించింది. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్యాపై సీబీఐ విచారణ కూడా కొనసాగుతోంది.

09:22 - April 13, 2017

హైదరాబాద్: అదిగో.. ఇదిగో అంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న గవర్నర్‌ పదవి.. కొద్ది రోజుల్లోనే టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులును వరించబోతుంది. వివిధ రాష్ట్రాల్లో ముగిసిన గవర్నర్ల స్థానంలో ఏదో ఒకచోట మోత్కుపల్లిని నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మోత్కుపల్లి కల నెరవేరనుంది.

ఏడాది క్రితమే రావాల్సిన పదవి ...

మోత్కుపల్లికి ఏడాది క్రితమే గవర్నర్‌ పదవి రావాల్సి ఉండగా.. అనేక కారణాల వల్ల అది ఆలస్యమైంది. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటు మంచి వాక్చాతుర్యం ఉన్న దళిత నేత కావడంతో గవర్నర్‌ పదవి పొందడంతో ఆయన ముందున్నారు. అధినేత చంద్రబాబు కూడా ఇచ్చి న హామీ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇవ్వాలనే అంశాన్ని ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించారు. మోత్కుపల్లిని వెంటబెట్టుకుని వెళ్లి మరీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కలిసి గవర్నర్‌ పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. మిత్రపక్షం కింద ఇవ్వాల్సిన పదవుల కేటాయింపులో ఆలస్యం జరిగిందని.. ఇప్పటికైనా వీలైనంత త్వరగా మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమించాలని కోరారు చంద్రబాబు. దీనికి అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రానున్న ఖాళీల భర్తీల మోత్కుపల్లి పేరుంటుందని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.

తమిళనాడు నియమిస్తారని వార్తలు .....

వాస్తవానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పదవీకాలం ముగిసిన వెంటనే మోత్కుపల్లి తమిళనాడు గవర్నర్‌గా పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి. అయితే నాటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. కాగా.. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ల పదవులను కూడా భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో ఈ దఫాలో మోత్కుపల్లికి అవకాశం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణకు కేరళ గవర్నర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ పి.సదాశివం....

అయితే.. మోత్కుపల్లిని ఏ రాష్ట్రానికి కేటాయిస్తారనే చర్చ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మే నెల చివరికి ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్‌ పదవి కూడా ఖాళీ కానుంది. ఇప్పటికే నరసింహన్‌ పదవీకాలం ఒకసారి పొడిగించడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం కేరళ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రిటైర్డ్‌ జస్టిస్‌ పి.సదాశివంను తెలంగాణకు రప్పించి.. కేరళ రాష్ట్రానికి మోత్కుపల్లిని పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న గవర్నర్‌ పదవి మోత్కుపల్లిని వరించే అవకాశం కనిపిస్తోంది. 

తమిళ మంత్రులపై కేంద్రానికి ఐటీ శాఖ ఫిర్యాదు...

చెన్నై: తమ విధులను తాము చేసుకోనీయకుండా మంత్రులు అడ్డుపడుతున్నారని తమిళనాడు మంత్రులపై ఐటీ శాఖ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మంత్రులు ఆర్ కామరాజ్, రాధాకృష్ణన్ లతో పాటు, ఢిల్లీలోని తమిళనాడు ప్రత్యేక ప్రతినిధి సుందరంపై ఆదాయపు పన్ను అధికారులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ నేతృత్వంలోనే ఆర్కే నగర్ లో డబ్బులు పంచుతున్నారని తెలిసిన తరువాత, ఆయన ఇంట్లో సోదాలకు వెళ్లినప్పుడు, వీరు తమ అధికారాన్ని ఉపయోగించి అడ్డంకులు సృష్టించారని ఐటీ శాఖ ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కాగా, రాష్ట్ర ఐటీ అధికారుల ఫిర్యాదుపై కేంద్రం స్పందన వెలువడాల్సి వుంది. 

అన్ని రాష్ట్రాల సీఎంలతో 24న కేంద్రం భేటీ

ఢిల్లీ: ఈ నెల 24న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి అశోక్‌ దల్వాయ్‌ మీడియాతో చెప్పారు. వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) నమూనా చట్టం ముసాయిదాలో మార్పులు చేర్పుల ఖరారుకు, మార్కెటింగ్‌ అవకాశాలను మెరుగుపరిచి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఈ చట్టాన్ని తెస్తున్నారు. దీని ప్రకారం రైతులు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.

కదిరిలో మరో అఘాయిత్యం

అనంతపురం: కదిరిలో సామూహిక అత్యాచారం ఆలస్యంగా వెలుగుచూసింది. కళాశాలకు వెళ్లి వస్తున్న ఇంటర్ విద్యార్థినిని అపహరించిన దుండగులు ఐదుగురు వారంరోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురి కోసం వెతుకులాట ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఆటోబోల్తాపడి 9 మంది కూలీలకు గాయాలు..

భద్రద్రి : జిల్లాలోని పినపాక మండలంలో ఆటోబోల్తాపడి తొమ్మిదిమంది కూలీలు గాయపడ్డారు. ఏడూళ్ల బయ్యారం, పోతిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన కూలీలు మిర్చిపంటను కోయడానికి జానంపేట గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. మార్గమధ్యలో ఐలాపురం గ్రామం వద్ద అటో అదుపు తప్పి రోడ్డు పక్కన 15అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 9మందికి కూలీలు గాయాలపాలయ్యారు. వీరిలో 5గురికి తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు వారిని 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులు పినపాక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఎసై రతీష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

08:16 - April 13, 2017

హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్ మీద రాజకీయ డ్రామా...అది అయ్యేదానా రాజ్యాంగంలో చూద్దామా, అంబేద్కర్ వారసులంతా అగ్రవర్ణాలేనా..నిద్రలోనే ఆశయసాధనలకు కృషులు, రొట్టెలు చేస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. నాయక్ అవతారమెత్తిన నాయకుడు, రికార్డింగ్ డ్యాన్సులు చూస్తున్న పోలీసులు.. సంతనూతలపాడు కాడ టీడీపీయవ్వారం, అమ్మను గచ్చులో పడేసిన కొడుకు కోడలు...కనకున్నా కన్నతల్లి లెక్క ఆదుకున్న ఆర్డీఓ, చల్లదనం కోసం ఫ్రిజ్ లో దూరిన జెర్రిపోతు.. బయటికి రానంటే రానని మారం చేస్తోన్నది ఇలాంటి అంశాలతో నేడు మల్లన్న మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

వచ్చే నెల 5న జీఎస్ ఎల్ వీ ప్రయోగం

శ్రీహరికోట : నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌(షార్‌) నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 వాహకనౌకను వచ్చే నెల 5వ తేదీన నింగిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే వచ్చే నెల 5 తేదీ సాయంత్రం 4.57 గంటలకు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను పంపాలని నిర్ణయించారు. ఈమేరకు అనుసంధాన పనులు పూర్తిచేయాలని సూచించారు.

07:33 - April 13, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, బీసీఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ లో సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఈ రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేష్లనా? ముస్లిం లకు రిజర్వేషన్లు కల్పించడం న్యాయసమ్మతమేనా? ఈ రిజర్వేషన్లను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఇదే అంశం పై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రజా శక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్, టిఆర్ ఎస్ నేత నందికొండ శ్రీనివాస్, బిజెపి నేత శ్రీధర్ రెడ్డి, బిజెపి నేత ఎస్ కుమార్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్: పాల‌మూరు, న‌ల్గొండ జిల్లాల‌ ప్రాజెక్టుల‌పై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. నిర్మాణాలు వేగ‌వంతం చేసేందుకు నిరంత‌ర స‌మీక్ష జరుపుతూ పర్యవేక్షణ జర‌పాల‌ని ప్రభుత్వం భావిస్తొంది. వారంలో ఒక‌రోజు క‌లెక్టర్లు స‌మీక్ష స‌మావేశం జ‌ర‌పాల‌నీ మంత్రి హ‌రీష్‌రావు ఆదేశించారు. కీల‌కమైన భూసేక‌ర‌ణ ప్రక్రియను వేగ‌వంతం చేసి ప్రాజెక్టు నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.  

07:03 - April 13, 2017

హైదరాబాద్: చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందిరాపార్క్‌ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ను ప్రభుత్వం ఎత్తేయలేదన్నారు. హైకోర్టులో స్థానిక ప్రజలు పిల్‌ దాఖలు చేశారన్న కేసీఆర్‌.. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తొలిగిపోయిందని స్పష్టం చేశారు.

బీసీ కమిషన్‌కు కేంద్రం రాజ్యాంగబద్ధత కల్పించడాన్ని తాను హర్షిస్తున్నట్లు జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్ల 30 ఏళ్లు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు. రైతన్నల కోసం ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామన్నారు కేసీఆర్‌.

ఇక ధర్నా చౌక్‌ తరలింపు అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేసీఆర్‌.. కోర్టు ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నారన్నారు.

ఓయూ శతాబ్ధి ఉత్సవాలు, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు వేటికి అవి జరుగుతాయన్నారు సీఎం కేసీఆర్‌. ఓయూ శతాబ్ధి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.

మొత్తానికి ప్రగతి భవన్‌ నిర్మాణం తర్వాత తొలిసారి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేసిన కేసీఆర్‌.. మరోసారి కలుసుకుని అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నారు. 

07:01 - April 13, 2017

హైదరాబాద్: తమ ప్రభుత్వం సమైఖ్య రాష్ర్ట చరిత్రలోనూ ఎన్నడు లేనంతగా బడ్జెట్‌లో చేనేత రంగానికి నిధులు కేటాయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రయోజనాలన్నీ చేనేత కార్మికులకే నేరుగా చేరాలన్నారు. ఇందులో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని,.ఆధార్, బయోమెట్రిక్ ఆధారంగా సబ్సిడీ అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నేరుగా చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీలు చేరేలా పాలసీలు తయారు చేయాలన్నారు. గత సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేనేతల స్థితిగతుల మీద చేనేత డైరెక్టరీని తయారు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నివేదికలో రాష్ర్టంలో ఉన్న చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, ఉత్పాదక సామర్ధ్యం ఎంత అనే అంశాలతో కూడిన పూర్తి గణంకాలు, అంచనాలతో కూడిన సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు చేనేతలకు, పవర్ లూమ్, టెక్స్ టైల్స్ రంగాల పట్ల ప్రత్యేకమైన విధానాలుండాలని అధికారులను ఆదేశించారు.

సబ్సిడీలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి ....

ప్రస్తుతం రాష్ర్టంలో నిర్వహిస్తున్న సర్వేలో 17 వేల చేనేత మగ్గాలున్నాయని తేలిందని, ఇప్పటికే 14,300 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత రంగంలో లాభదాయకత లేకుంటే ఇతర రంగాలకు తరలి వెళ్లేందుకు కూడా తాము సహకారం అందిస్తామన్నారు. ఇతర రంగాల్లోకి వెళ్లే కార్మికులకు ప్రత్యేకమైన సబ్సిడీలతో కూడిన రుణ సౌకర్యాన్ని కల్పించే ఆలోచన చేస్తున్నామన్నారు. చేనేత మగ్గాల మీద ఏ ఏ రకాల వస్ర్తాలను తయారు చేస్తున్నారో తెలుసుకోవాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా పట్టు చీరలు, కాటన్, గ్రే క్లాత్ వంటి రకాలను ఎంత మంది నేస్తున్నారనే వివరాలుంటే వారికోసం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్క రకం క్లాత్‌కు పూర్తి స్ధాయి వివరాలతో నివేదిక కావాలన్నారు. చేనేతలకు సబ్సిడీలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. తమ ఉత్పత్తులను ప్రభుత్వానికే కాకుండా బయట మార్కెట్ లో అమ్ముకునే అవకాశాన్ని సైతం కల్పిస్తామన్నారు.

రాష్ట్రంలో 17వేల చేనేత మగ్గాలు .....

ప్రభుత్వం చేనేత కార్మికులకు యార్న్ పైన 50 శాతం సబ్సిడీ ఇస్తోందని మంత్రి తెలిపారు. కాటన్, పాలిస్టర్, లినెన్, సిల్క్, వూల్ వివిధ రకాల యార్న్ ప్రొక్యూర్ మెంట్ ఎలా జరుగుతుందో, ఈ ప్రొక్యూర్ మెంట్ లో తీసుకురావాల్సిన మార్పులను చర్చించారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ యార్న్ డిపోల వివరాలు ఉన్నాయని,.సొంత డిపోలు ఏర్పాటు చేయాలని కోరారు. యార్న్ నేరుగా ఏర్పాటు చేస్తే ఉండే ప్రయోజనాల మీద చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్ టైల్ డైరెక్టర్ శైలజ రామయ్యర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చేనేత రంగంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో టెక్స్ టైల్, చేనేత శాఖాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు మ‌రిన్ని సంక్షేమ ప‌థకాలు అమలు చేస్తామ‌ని స్పష్టం చేశారు. 

06:59 - April 13, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ సర్కార్‌పై పోరుబాటకు కాంగ్రెస్‌ సమాయత్తమవుతోంది. సర్కారును ఎండగడుతూ.. 2019లో అధికారం పొందడమే లక్ష్యంగా ఈ పోరు కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ఉద్యమ ప్రణాళికలు రచిస్తోంది.

2019 ఎన్నికలే లక్ష్యంగా హస్తంపార్టీ వ్యూహాలు....

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పిదాలను ప్రచార అస్త్రాలుగా వాడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాట వ్యూహాలు రూపొందించుకుంటోంది. రైతులతో పాటు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల ఆధారంగా, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తోంది. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీని ప్రధాన అస్త్రంగా మలచుకుని.. యువతను ఆకట్టుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ధర్మయుద్ధం పేరుతో నిరుద్యోగ యువత పోరుబాట పట్టాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పులుపినిచ్చారు.

విడతలవారీ రుణమాఫీ వల్ల ప్రయోజనం రాలేదంటున్న రైతులు.....

రైతుల సమస్యలపైకూడా హస్తంపార్టీ పోరుబాట పడుతోంది. ముఖ్యంగా విడతలవారీగా రుణమాఫీవల్ల .. తమకు పెద్దగా ప్రయోజనం జరగలేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఈ అసంతృప్తిని ప్రభుత్వంపై అస్త్రంగా ప్రయోగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అంతేకాదు, 2019లో తాము అధికారంలోకి వస్తే.. రైతు రుణాలను రెండు లక్షల రూపాయల వరకూ ఏకమొత్తంగా మాఫీచేస్తామని హామీ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకమొత్తంలో రుణమాఫీచేసి రైతుల మనస్సు దోచుకున్నామని.. మరోసారి అదేవిధంగా చేస్తామనే ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లాలని హస్తంపార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ హైకమాండ్‌ నుంచి అనుమతిని కూడా పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మిర్చితోపాటు వివిధ పంటలకు మద్ధతు ధరలేక రైతులు ఆందోళనలో ఉన్న నేపథ్యంలో.. ఈసమస్యను కూడా ప్రచారాస్త్రంగా చేసుకుని సర్కార్‌ను మరింత ఇరుకున పెట్టాలని హస్తంపార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ఏడాది ముందుగానే అభ్యర్థుల ప్రకటన.....

ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోవడంతో పాటు, ఏడాది ముందుగానే ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తోన్న హస్తంపార్టీ నేతల వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

06:56 - April 13, 2017

హైదరాబాద్: వివిధ కార‌ణాల‌తో ఆలస్యమవుతూ వ‌చ్చిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్ పాల‌క‌మండ‌లి ఇవాళ స‌మావేశం అవుతోంది. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 19న కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. సాదార‌ణంగా మూడు నెల‌ల‌కోసారి స‌ర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే కౌన్సిల్ సమావేశం తేదీలను ఖరారు చేసిన తర్వాత పార్లమెంట్‌, శాస‌న స‌భాస‌మావేశాలు ప్రారంభం కావడంతో దానిని వాయిదా వేశారు. ఇత‌ర కార‌ణాల‌తో మ‌రోసారి వాయిదా స‌మావేశాన్ని వేశారు మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్. అయితే నగర సమస్యలపై జీహెచ్ఎంసి పాల‌క‌మండ‌లి ఎలాంటి చ‌ర్చలు చేయడంలేదని,.ఇంటా బ‌య‌ట వ్యతిరేకత వ‌చ్చింది. దాంతో ఎట్టకేలకు కౌన్సిల్ స‌మావేశానికి శ్రీకారం చుట్టారు మేయ‌ర్.

గతేడాది సెప్టెంబర్‌ 19న కౌన్సిల్‌ సమావేశం ...

చాలా కాలం త‌ర్వాత జ‌రుగుతున్న బ‌ల్దియా కౌన్సిల్ సమావేశానికి త‌మ‌త‌మ డివిజ‌న్లలోని సమస్యలపై చ‌ర్చించేందుకు సిద్ధమవుతున్నారు కార్పొరేట‌ర్లు. ముఖ్యంగా కార్పొరేట‌ర్ బ‌డ్జెట్ విడుద‌ల‌పై అధికార, ప్రతిప‌క్ష స‌భ్యులంద‌రూ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇక కొద్ది రోజుల నుండి హైద‌రాబాద్‌లోని హోటళ్లపై జరుగుతున్న దాడుల్లో అక్రమంగా వధిస్తున్న మాంసం ప‌ట్టుబ‌డుతుంది. దాంతో ఈ అంశంపై వాడివేడి చ‌ర్చ జరిగే అవ‌కాశం ఉంది. ఇక వర్షాకాలం వచ్చిన ఇబ్బందుల‌తో నాలాల విస్తరణ అంశం మ‌రోసారి ముందుకు వ‌చ్చింది. దాంతో త‌మ త‌మ ప్రాంతాల్లోని నాలాల విస్తరణ, ఆస్తుల‌ తొల‌గింపుపై చ‌ర్చించ‌నున్నారు. ప్రతి వార్డుకు అత్యాధునిక స్మశానవాటికను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ..పాల‌క మండ‌లి ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అభివృద్ది చేంద‌లేదు. ఇక స్వచ్చ్‌ హైద‌రాబాద్ కార్యక్రమం పూర్తి అయ్యి రెండేళ్లవుతున్నా అప్పుడు చేపట్టిన ప‌నులు ఇప్పటివరకు పూర్తికాలేదు. దీంతో ప్రతిపక్షాలు దానిపై నిలదేసే అకాశం ఉంది.

హోటళ్లలో అక్రమంగా వధిస్తున్న మాంసం ....

అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కోటి మంది జ‌నాభా ఉన్నా..బల్దియా మాత్రం నగరవాసులకు సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నగర పౌరులకు మెరుగైన సేవలు అందించే దిశ‌గా బల్దియా ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అందుకోసం క్రమం తప్పకుండా కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత కౌన్సిల్‌ సమావేశం

నేడు జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం

హైదరాబాద్: వివిధ కార‌ణాల‌తో ఆలస్యమవుతూ వ‌చ్చిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్ పాల‌క‌మండ‌లి ఇవాళ స‌మావేశం అవుతోంది. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 19న కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. సాదార‌ణంగా మూడు నెల‌ల‌కోసారి స‌ర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే కౌన్సిల్ సమావేశం తేదీలను ఖరారు చేసిన తర్వాత పార్లమెంట్‌, శాస‌న స‌భాస‌మావేశాలు ప్రారంభం కావడంతో దానిని వాయిదా వేశారు. ఇత‌ర కార‌ణాల‌తో మ‌రోసారి వాయిదా స‌మావేశాన్ని వేశారు మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్. అయితే నగర సమస్యలపై జీహెచ్ఎంసి పాల‌క‌మండ‌లి ఎలాంటి చ‌ర్చలు చేయడంలేదని,.ఇంటా బ‌య‌ట వ్యతిరేకత వ‌చ్చింది.

సీతారామ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో సీపీఎం టూర్‌

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు.. నిర్వాసిత గ్రామవాసులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.. ప్రాజెక్టుకోసం సేకరిస్తున్న భూమికి 2013 భూసేకరణచట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. ఈ పర్యటనలో CPIతోపాటు గిరిజన సంఘం నేతలు పాల్గొన్నారు.. 

06:52 - April 13, 2017

అమరావతి: తొలి నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. జాతీయ ప్రాజెక్ట్‌గా ఉన్నప్పటికీ నిర్మాణానికి సరిపడా నిధులు కేంద్రం నుంచి రావడం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్‌ పాత అంచనా వ్యయం మాత్రమే మేము భరిస్తామని కేంద్రం తేల్చేసింది. దీంతో ప్రాజెక్ట్‌ పూర్తిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

16 వేల కోట్లు మాత్రమే కేంద్రం భరిస్తుందని ప్రకటన....

పోలవరం ప్రాజెక్ట్‌ 2014 అంచనా వ్యయం ప్రకారం 16 వేల కోట్లు మాత్రమే కేంద్రం భరిస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి రాజ్యసభలో ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్‌ తర్వాత ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని 40వేల కోట్లకు పెంచింది. అలాగే 2018 నాటికి మరో 2వేల కోట్లు పెరిగే అవకాశం ఉంటుందని లెక్కలు చెబుతోంది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్‌కు కావాల్సిన మిగిలిన నిధులు ఎవరు భరిస్తారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యమా అనే సందేహాలు వస్తున్నాయి.

ప్రాజెక్ట్‌ నిధులపై కేంద్రం ఇచ్చిన క్లారిటీతో ...

ప్రాజెక్ట్‌ నిధులపై కేంద్రం ఇచ్చిన క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్ట్‌ వ్యయం కేంద్రం భరించకపోతే చట్ట ఉల్లంఘనే అవుతుందని అన్నారు.

ఎలా పూర్తవుతుంది..వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి...

కేంద్రం నిధులు ఇవ్వకపోతే ప్రాజెక్ట్‌ ఎలా పూర్తవుతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కేంద్రాన్ని చంద్రబాబునాయుడు నిలదీయకపోవడం దారుణమని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా తేలాల్సి ఉంది. పెంచిన అంచనాల వ్యయం కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేక రాష్ట్ర ఖజానా నుంచి నిధులు కేటాయిస్తారా అనేది వేచి చూడాలి.

06:49 - April 13, 2017

కృష్ణా : కేశినేని నాని...! ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అనూహ్యంగా, తన ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారాన్ని ఒక్కసారిగా మూసేసి.. కలకలం సృష్టించారు. ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులతో వివాదం వల్లే ఆయనీ నిర్ణయాన్ని తీసుకున్నారని అనుచరులు, కాదూ.. నష్టాల నుంచి గట్టెక్కుందుకేనని మరో వర్గమూ వాదనలు వినిపిస్తున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా.. నాని, తదుపరి వ్యూహం ఏంటి..? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన సంబంధాలు ఏమైనా బెడిసికొట్టాయా..? కేశినేని నాని రాజకీయ భవితవ్యం ఏంటి..? ఇప్పుడీ ప్రశ్నలే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి.

వ్యక్తిగత ఆసక్తి మేరకు, ఆయన రాజకీయాల్లోకి ...

కేశినేని నాని తొలి నుంచీ వ్యాపార రంగంలోనే కొనసాగారు. వ్యక్తిగత ఆసక్తి మేరకు, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. వ్యాపారంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎదిగేందుకు అమితంగా శ్రమించారు. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కాగలిగారు. ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, ప్రత్యర్థి వైఎస్సార్సీపీకి చెందిన కోనేరు ప్రసాద్‌ను ఓడించారు. నిజానికి కేశినేని నాని, తొలి నుంచీ టీడీపీలో ఏమీ లేరు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా కేశినేని నాని రాజకీయ రంగప్రవేశం చేశారు. అనుకోని పరిణామాలు ఎదురవ్వడం వల్ల పీఆర్పీ నుంచి బయటకొచ్చారు. అనంతరం, ప్రతిపక్ష నేత హోదాలో, పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడుకు బాసటగా నిలిచారు. కృష్ణా జిల్లాలో ఆ పాదయాత్రకు అయిన ఖర్చంతా కేశినేని నానియే భరించారు. అప్పట్లో, పాదయాత్ర కోసం దాదాపు 60 కోట్ల వరకూ ఖర్చయిందని, ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే, చంద్రబాబు కేశినేని నానికి పార్టీ టికెట్‌ ఇచ్చారని చెబుతారు.

విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని బాబు హామీ .....

నిజానికి కేశినేని నానికి పార్టీ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడే, తర్వాతి కాలంలో.. మారిన పరిస్థితుల దృష్ట్యా, పీవీపీకి టికెట్‌ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేశారు. ఓ దశలో బీజేపీలోకి వెళతారనీ ప్రచారం జరిగింది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ... పార్టీలోని ఓ వర్గం చేసిన ప్రచారాన్ని చంద్రబాబు నమ్మడం వల్లే, తనకు టికెట్‌ నిరాకరిస్తున్నారని తెలుసుకున్న నాని, తన ఆర్థిక పరిస్థితిని నిరూపించుకుని మరీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బి ఫామ్‌ తీసుకున్నారు. నాని పార్టీ ఎంపీగా గెలిచినా చాలాకాలంపాటు, చంద్రబాబు ఆయన్ను దూరంగానే ఉంచారు.

తన ప్రత్యేకతను తెలిపేందుకు కేశినేని పెద్ద కసరత్తే...

తెలుగుదేశం పార్టీలో తన ప్రత్యేకతను తెలిపేందుకు కేశినేని పెద్ద కసరత్తే చేశారు. చంద్రబాబునాయుడు తనతో అంటీముట్టనట్లుగా ఉన్న తరుణంలో, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని.. ఆయన్ను బెజవాడకు రప్పించారు. తన పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను టాటా ట్రస్ట్ చేపట్టేలా అంగీకరింప చేశారు. రతన్‌ టాటా పర్యటనలో చంద్రబాబుకు పెద్ద పీట వేయడం, టాటా ట్రస్ట్‌తో ప్రభుత్వ ఒప్పందాలు కుదుర్చుకునేలా చేయడంలో కేశినేని నాని చొరవ.. చంద్రబాబు వైఖరిలో మార్పు తెచ్చింది. ఆ తర్వాతే నానిని చంద్రబాబు దగ్గర తీయడం మొదలు పెట్టారు.

ఇటీవల కేశినేని నాని శైలిపై చంద్రబాబునాయుడు ఆగ్రహం

ఇటీవల ఎంపీ కేశినేని నాని వ్యవహరించిన తీరు అధినేత సహనానికి పరీక్ష పెట్టిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దురుసుగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు, అనేక విషయాల్లో కేశినేని నానిపై అధినేతకు ఆగ్రహం కలిగినట్లు సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అంతంతమాత్రం సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

నష్టాల్లో కేశినేని ట్రావెల్స్‌

తన రాజకీయ పవర్‌ను, వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఉపయోగించుకునే క్రమంలోనే కేశినేని నాని ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌తో దూకుడుగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కేశినేని ట్రావెల్స్ నష్టాల్లో నడవడంతో.. ప్రత్యర్థి ఆరెంజ్ ట్రావెల్స్‌ను నియంత్రించాలని కేశినేని ప్రయత్నించారని, ఇటీవల, విజయవాడలో జరిగిన ఓ యాక్సిడెంట్ ఆధారంగా, ఆరెంజ్ ట్రావెల్స్‌ను ఆంధ్రాలో తిరగనీయకుండా చేయాలని ఆయన ప్రణాళిక వేశారని చెబుతున్నారు. ఆరెంజ్‌ ట్రాన్స్ పోర్టు విషయంలో, నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అధికార యంత్రాంగం నిర్ణయించుకోవడం కేశినేనికి నచ్చలేదని, అందుకే, ట్రాన్స్ పోర్టు కమిషనర్ సుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు దాదాపు దాడిచేసినంత పనిచేశారని సన్నిహితుల కథనం.

కేశినేని శైలిపై చంద్రబాబునాయుడు సీరియస్‌.....

ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై కేశినేని నాని దాడి విషయం సీరియస్‌ కావడంతో సీఎం చంద్రబాబునాయుడు ఆయనతో పాటు, బోండా ఉమ, బుద్దా వెంకన్నలను తన దగ్గరకు పిలుపించుకుని.. ట్రాన్స్ పోర్టు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని సీఎం ఆదేశించారని సమాచారం. ఈ అవమానాన్ని తట్టుకోలేక కొద్దిరోజులపాటు ఎంపీ కేశినేని నాని ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అసలే సీఎం చంద్రబాబుకు, ఎంపీ నానికి ఉన్న అరకొర సంబంధాలు ఈ ఘటనతో మరింత తెగదెంపులయ్యాయని సమాచారం.. ఈ ఘటన జరిగినప్పటి నుంచీ, ఎంపీ నాని అధికారిక కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. ఆయన క్రమంగా పార్టీని వీడతారనే ప్రచారమూ జరుగుతోంది. మరి చంద్రబాబు కేశినేని నానిని వదిలించుకుంటారా..? లేక ఆయనకు నచ్చజెప్పి శాంతింప చేస్తారా..? దీన్ని బట్టే కేశినేని నాని రాజకీయ భవితవ్యం ఏమిటో తేలుతుంది. 

06:45 - April 13, 2017

యాదాద్రి భువనగిరి : కొన్ని గంటల క్రితం జరిగిన ఘటకు సంబంధించిన బాధితురాలు స్వాతి పెదవి విప్పారు... ఎన్నారై మధుకర్‌రెడ్డి మరణం అనుమానాస్పదమంటూ...అందుకు కారణం భార్య స్వాతి అని ఆమెపై అంత్యక్రియల సమయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే...తన భర్తను హింసించిందని...రకరకాలుగా వేధించిందని... చివరకు ఆమెనే చంపిందంటూ మెట్టినింటివారు.. బంధువులు స్వాతిపై దాడికి దిగారు...

మధుకర్‌రెడ్డి అంత్యక్రియల్లో జరిగిన దాడితో ...

మధుకర్‌రెడ్డి అంత్యక్రియల్లో జరిగిన దాడితో ఒక్కసారి ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది..ఊహించని విధమైన దాడితో స్వాతి..ఆమె కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు..అప్పటికే బంధువులు దాడిని అడ్డుకోగా... పోలీసులు రావడంతో కాస్త సద్దుమణిగింది..వెంటనే స్వాతి పేరెంట్స్‌తో కలిసి పోలీసు స్టేషన్ వెళ్లి తనకు ప్రాణహానీ ఉందంటూ...రక్షణ కల్పించాలంటూ వేడుకుంది...

తనకు సంబంధం లేదు..

కాలిఫోర్నియాలో ఉంటున్న మధుకర్‌రెడ్డి కొంతకాలంగా ఉద్యోగానికి సంబంధించిన డిప్రెషన్‌లో ఉన్నారని...అదే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది భార్య స్వాతి....తన భర్త అంత్యక్రియలకు వెళ్లినప్పుడు తనపై దారుణంగా దాడి చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన పాప ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతుంది స్వాతి..

మా మధ్య చిన్న గొడవలే..

మధుకర్‌ తనపై చేయి చేసుకున్నాడని...అయినా భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నానంటోంది స్వాతి... భార్యాభర్తల మధ్య గొడవలున్నాయని..అయితే అవి చంపుకునేంత..చచ్చిపోయేంత పెద్దవి కావంటోంది స్వాతి...

అత్తమామలకు చెప్పినా శూన్యం..

అయితే తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలున్నా..భర్త డిప్రెషన్‌లో ఉంటున్న విషయాన్ని ఎప్పటికప్పుడు అత్తమామలతో చెప్పానని..వారు మాత్రం పట్టించుకోలేదంటోంది స్వాతి...బంధువులు..ఇంట్లోవారు చెప్పిన మాటల ప్రభావంతో మధుకర్‌లో చాలా మార్పు వచ్చిందని..ఆ మార్పుకు నిదర్శనమే తనపై చేయి చేసుకోవడమని చెబుతోంది..ఏదీ ఏమైనా తన జీవితం అగమ్య గోచరమైందని...ఇప్పుడు జరిగిన దాడితో భయం కూడా పట్టుందంటోంది...

06:41 - April 13, 2017

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మిర్చి పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. మిర్చి ధరలు దారుణంగా పడిపోవడం, కోల్డ్ స్టోరీజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ధరల పతనం, మార్కెట్ల మాయాజాలం నుంచి తమను కాపాడాలంటూ రైతులు కోరుతున్నారు. మిర్చి పండించి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలొస్తున్నాయి. అసలు మార్కెట్ లో మిర్చి ధరలు ఇంతగా పడిపోవడానికి కారణం ఏమిటి? ధరల పతనం నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss