Activities calendar

14 April 2017

ముస్లీం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : ఉత్తమ్

హైదరాబాద్ : ముస్లీం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీలు, దళితులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కును టీఆర్ ఎస్ ప్రభుత్వం కాలరాసిందన్నారు. 

 

22:08 - April 14, 2017
22:06 - April 14, 2017

కర్నాటక : బెంగళూరులో పాత నోట్ల కలకలం సృష్టించాయి. బాంబ్‌ నాగా అలియాస్‌ నాగరాజు ఇంట్లో 25 కోట్లు రద్దయిన పాతనోట్లు బయటపడ్డాయి. హోం థియోటర్‌ ఉన్న గదిలో రహస్యంగా దాచిపెట్టిన కోట్లాది రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై కేసు నమోదు చేశారు. 2013లో బాంబ్‌ నాగాపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. హైకోర్టు ఆదేశంతో అతనిపై ఉన్న గూండా యాక్ట్‌ను తొలగించారు. మాజీ పరిషత్‌ సభ్యుడైన బాంబ్‌ నాగా ఇల్లు మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతంలో ఉంది. బాంబ్‌ నాగా పలు హత్య కేసులో నిందితుడు. 

22:04 - April 14, 2017

ఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కాపాడేందుకు భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జాదవ్‌ కేసును దౌత్యపరంగా.... న్యాయపరంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమైంది. జాదవ్‌ కేసుకు సంబంధించిన చార్జిషీటును తమకు ఇవ్వాలని భారత్‌ పాక్‌ను డిమాండ్‌ చేసింది. మరోవైపు చట్ట ప్రకారమే విచారణ జరిపి జాదవ్‌కు మరణశిక్ష వేయడం జరిగిందని పాకిస్తాన్‌ చెబుతోంది. 
పాక్ విదేశాంగ కార్యదర్శితో భారత విదేశాంగ ముఖ్యకార్యదర్శి భేటీ 
గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన భారతీయుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కాపాడేందుకు భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ గౌతమ్‌ బంబావాలే పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహ్‌మినా జన్‌జువాను కలిశారు. పాక్‌ మిలటరీ కోర్టు కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్ష తీర్పు కాపీని, ఆయనపై దాఖలు చేసిన ఛార్జిషీటు కాపీలను ఇవ్వాలని భారత్‌ కోరింది. 
జాదవ్‌ను కలిసేందుకు అనుమతి నిరాకరణ 
జాదవ్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వాలని గౌతమ్‌ పాక్‌ను కోరారు. అయితే గూఢచర్యం కేసులో అనుమతి ఇవ్వడం కుదరదని తహ్మీనా భారత్‌కు స్పష్టం చేశారు. గతంలో 13సార్లు జాదవ్‌ను దౌత్యపరంగా కలిసేందుకు అభ్యర్థించినా పాకిస్తాన్‌ నిరాకరించింది.
జాదవ్‌ను రక్షించేందుకు అవకాశాల పరిశీలన
జాదవ్‌ను రక్షించేందుకు దౌత్యపరమైన అవకాశాలతో పాటు పాక్‌లోని చట్టాల ప్రకారం న్యాయపరంగా ఉన్న అవకాశాలను భారత్‌ పరిశీలిస్తోంది. ఆర్మీ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత్‌ అప్పీలు చేయనుంది. పాక్‌ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ జాదవ్‌ కుటుంబం కూడా అప్పీల్‌కు వెళ్లనుంది.
మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాక్ నిర్ణయం 
గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్‌కు ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాకిస్థాన్‌ ఓ నిర్ణయానికి వచ్చింది. జాదవ్‌ ఉద్యోగి కాదని, గూఢచర్యానికి పాల్పడుతున్నాడని పాక్‌ ఆరోపిస్తోంది. జాదవ్‌ నిర్దోషి అయితే రెండు పాస్‌పోర్టులు ఎలా ఉంటాయని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విదేశి వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ ప్రశ్నించారు. ఒకటి హిందూ పేరుతో మరోటి ముస్లిం పేరుతో పాస్‌పోర్టు ఉందని అజీజ్‌ అన్నారు. చట్ట ప్రకారం విచారణ జరిపిన తర్వాతే జాదవ్‌కు ఆర్మీ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిందని అజీజ్‌ చెప్పారు.

 

21:57 - April 14, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజల భవిష్యత్తు, సమస్యల పరిష్కారం కోసం కనెక్ట్‌ ఏపీ సీఎం యాప్‌తో సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ఈ యాప్‌ను ప్రజలు ఉపయోగించుకుని తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. 
కనెక్ట్‌ ఏపీ సీఎం పేరుతో యాప్‌
ప్రభుత్వ పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు సీఎంకు నేరుగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఓ యాప్‌ను తీసుకువచ్చింది.  మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూపొందించిన కైజాలా యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.  అనుభవ పూర్వక సూచనలు, సలహాలను ఈ యాప్‌ ద్వారా స్వీకరిస్తామని చంద్రబాబు చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలోనే ఈ యాప్‌ను ఉపయోగించామని.. ఇంకొంచెం డెవలప్‌చేసి కనెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎం యాప్‌ను తీసుకొచ్చామన్నారు.  
ఈ యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువలో ఏపీ సీఎం
ఏపీ సీఎం ఇప్పటికే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌ లాంటి మాధ్యమాల ద్వారా ప్రజలతో నేరుగా సంభాషిస్తున్నారు. ఇప్పుడు కనెక్ట్‌ ఏపీ సీఎం యాప్‌ ద్వారా ప్రజా సమస్యలు రియల్‌ టైంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.  ఒక వ్యక్తి ఏ ప్రాంతం నుంచి సమాచారం పంపుతున్నాడు, ఎప్పుడు పంపాడు, ఏ నంబర్‌ నుంచి పంపాడు వంటి సమగ్ర సమాచారం ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.  ముఖ్యమంత్రి కార్యాలయం, చంద్రబాబు దీనిని నేరుగా పర్యవేక్షిస్తుంటారు. ఈ యాప్‌ ద్వారా సమాచారంతోపాటు రియల్‌ టైమ్‌ పరిస్థితిని ఫోటోల ద్వారా కూడా పంపవచ్చు.  ఈ యాప్‌లో కాన్ఫిడెన్షియల్ ఆప్షన్‌ కూడా ఉంది. 
యాప్‌ ద్వారా సమస్యలను పరిష్కరించనున్న సీఎం
కనెక్ట్‌ ఏపీ సీఎం యాప్‌ ద్వారా వచ్చే  ముఖ్యమైన ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేబినెట్‌ మీటింగ్‌లోనూ, అధికారుల సమీక్షలోనూ చర్చించి పరిష్కారం చేయనున్నారు. అంతేకాదు ఈ యాప్‌ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా ప్రజాభిప్రాయాలను కూడా తెలుసుకునే వీలుంది.  ఏదైనా ఒక శాఖపై  సమీక్ష  నిర్వహించే ఒకరోజు  ముందు ఆ విషయాన్ని యాప్‌లో తెలియజేస్తారు.  దీనిపై వచ్చిన ప్రజాభిప్రాయాలను డిపార్ట్‌మెంట్‌ రివ్యూలో చర్చించి పరిష్కరిస్తారు. ఇలా చేయడం వల్ల అధికారులు ఇచ్చిన లెక్కలపైనే ఆధారపడకుండా.. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

 

21:53 - April 14, 2017

హైదరాబాద్ : భార‌తర‌త్న డాక్టర్ అంబేద్కర్ 126 జ‌యంతి ఉత్సవాలు హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగాయి. అన్ని రాజ‌కీయ పార్టీల‌తో పాటు, మేధావులు, ద‌ళిత, ప్రజా సంఘాలు బాబాసాహెబ్ కు నివాళులు అర్పించాయి.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌ అంతటా ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. 
అణగారిన వర్గాల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు తెలిపారు. 
గాంధీభవన్‌లో 
గాంధీభవన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకులు జరిగాయి. తెలంగాణలో దళితులను ప్రభుత్వం మోసం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 
ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో                  
ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో బాబాసాహెబ్‌కు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ నిధులను ఖర్చుపెట్టడం లేదని టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్. రమణ ఆరోపించారు.  స్పాట్‌..
బీజేపీ ఆధ్వర్యంలో
బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ హాజరయ్యారు. దళితుల అభివృద్ధికి ప్రధాని మోదీ పనిచేస్తున్నారని వెంకయ్య అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. 
ఇక లెఫ్ట్ పార్టీలు, సామాజిక ఉద్యమ నేత‌ల భారీ ర్యాలీ                   
ఇక లెఫ్ట్ పార్టీలు, సామాజిక ఉద్యమ నేత‌లు బ‌షీర్ బాగ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యరదర్శి త‌మ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, విప్లవ గాయ‌కులు గ‌ద్దర్,  మాజీ జ‌స్టిస్ చంద్ర కుమార్‌తో పాటు ప‌లువురు నేత‌లు ఈ ర్యాలీలో పాల్గోన్నారు.  తెలంగాణ‌లో సామాజిక న్యాయం అమలు చేయడంలో ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు త‌మ్మినేని విర‌భ్రం. సామాజిక న్యాయం కోసం అన్నిపార్టీల‌తో క‌ల‌సి పోరాటం చేస్తామ‌న్నారు. మొత్తమ్మీద అంబేద్కర్ జయంతి వేడుకలను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఘనంగా నిర్వహించాయి. 

 

21:49 - April 14, 2017

ఎక్కిరిచ్చినోళ్లకు హక్కులిచ్చిన వాడ... అందుకో అంబేద్కరా జన నీరాజనం, రైతుల మీద కేసీఆర్ వరాల పిచుకారి.. ఎరువుల మాట నిలవెటుకోవాలెమరి, దళితులు ఎన్నికలల పోటిజేస్తరా..? కుటుంబాన్ని ఎలేసిన అగ్రజాతోళ్లు, జీవచ్చావాలకు పునర్జన్మనిచ్చుర్రు.. ఎస్పీ, ఎమ్మెల్యే మంచి పని జేసిండ్రు, ఏడు నెలల సంది జీతాలిస్తలేరట.. ఆత్మహత్య చేసుకుంటమంటున్నరు, అంబేద్కర్ జన్మదినాన సినిమా షో ఫ్రీ... శరణం గచ్ఛామి ప్రొడ్యూసర్ ఆఫర్.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:34 - April 14, 2017

భారతదేశంలో దళితులపై దాడులు ఆగాయా? దళితుల బతుకుల్లో వెలుగులు నిండుతున్నాయా? రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కలలుగన్న సమాజం సిద్ధిస్తోందా?  పేద, ధనిక మధ్య అంతరాలు తొలగిపోతున్నాయా?  నాయకులు చెప్తున్నట్టు దళితులు అభివృద్ధి సాధిస్తున్నారా? ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అంబేద్కర్‌ జయంతి ఘనంగా జరపడానికి కారణమేంటి? 70ఏళ్ల స్వంతంత్ర భారతావనిలో దళితుల స్థితిగతులపై 10టీవీ కథనం..
అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో యావత్‌ భారతం  
యావత్‌ భారతదేశం అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో మునిగిపోయింది. భారతజాతి మొత్తం ఆయనను స్మరించుకుంది.  అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పాలకపక్షాలు, రాజకీయపార్టీలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఘనంగా అంబేద్కర్‌ జయంతిని నిర్వహించాయి. పాలకులు అంబేద్కర్‌ను ఆకాశానికెత్తారు. ఆయన  దళితులకు, భారతజాతికి సేవలను ఘనంగా కీర్తించారు. అంతేకాదు తెలంగాణలో 123 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకోసం కడియం శ్రీహరి నేతృత్వంలో అధ్యయనానికింటూ చైనాకు కూడా వెళ్లొచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం, స్మృతి వనానికి చంద్రబాబు శంకుస్థాపన నిర్వహించారు.
అంబేద్కర్‌ జయంతిని నిర్వహించిన బీజేపీ
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్‌ విషయమేమిటంటే... గతంతో అంబేద్కర్‌ పేరును కూడా పలకడానికి ఇష్టపడని బీజేపీ కూడా అంబేద్కర్‌ జయంతిని నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను నిర్వహించింది. దీక్షభూమిలో మోదీ నివాళులు అర్పించారు కూడా. పాలక పక్షాలతో పాటు విపక్షాలు కూడా అంబేద్కర్‌ జయంతి నిర్వహించాయి. అంబేద్కర్‌ పేరు వల్లెవేశాయి.
అంబేద్కర్‌ కలలు నిజమవుతున్నాయా?
పెద్దపెద్ద సభలు, గొప్పగొప్ప ఉపన్యాసాలు, అంబేద్కర్‌ను కీర్తించినంత మాత్రాన ఆయన కన్న కలలు నిజమవుతాయా? అంబేద్కర్‌కు పెద్దపెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసినంత మాత్రానా ఆయన చెప్పిన సమసమాజం సిద్దిస్తుందా? దళితులపై దాడులు ఆగుతాయా? అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింతగా పెరిగాయి.  ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా  దళితుల సంప్రదాయాలు, వారి కట్టుబొట్టు, ఆహారపు అలవాట్లపైనా దాడి జరుగుతోంది. అగ్రవర్ణాల అసహనం వారిపై వివిధ సందర్భాల్లో వ్యక్తమవుతూనే ఉంది. దళితులను ఉద్దరిస్తామని గొప్పగొప్ప ప్రసంగాలు చేస్తున్న నేతలు కనీసం వారి రక్షణకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. దళితులపై దాడులను ఆపకపోగా వాటిని మరింతగా ప్రోత్సహించేందుకు కారకులవుతున్నారు. స్వాంతంత్ర్యం వచ్చి 70ఏళ్లు అయినా ఇంకా పేద, ధనిక తేడాలు తొలగలేదు. దళితులు, అగ్రవర్ణాల మధ్య విభజన రేఖ చెరగిపోలేదు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ధనికులు మరింత ధనవంతులుగా రూపాంతరం చెందుతున్నారు. మరి పాలకులు చెప్తున్నట్టు దళితుల అభివృద్ధి ఎక్కడ? నేతి బీరకాయలో నేతి చందంగా తయారయ్యింది. ఊకదంపులు ఉపన్యాసాలు, సంవత్సరానికి ఒకసారి చేసే హడావుడితో పేదలు, దళితుల బతుకుల్లో మార్పు వస్తుందనుకుంటే అది అత్యాశే అవుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు.
 

 

ఐపీఎల్ 10లో తొలి హ్యాట్రిక్ నమోదు

హైదరాబాద్ : ఐపీఎల్ 10లో తొలి హ్యాట్రిక్ నమోదు అయింది. బెంగళూరు జట్టు క్రీడాకారుడు బద్రీ వరుసుగా మూడు వికెట్లు తీసిండు. బౌలర్ బద్రీ ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన మూడు వికెట్లు తీశాడు.

 

పాక్ నుంచి ఎలాంటి సమాచారం లేదు : రాజ్ నాథ్

ఢిల్లీ : కుల్ భూషణ్ కు సంబంధించి పాక్ నుంచి ఎలాంటి సమాచారం లేదని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 

20:16 - April 14, 2017

రాజకీయ నాయకులు, మనువాదులు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని వక్తలు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా.అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కరిజం.. అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఆర్ ఎస్ ఎస్ ప్రచారకర్త విజయసారధి, ఏపీ కేవీపీఎస్ నేత మాల్యాద్రి పాల్గొని, మాట్లాడారు. అంబేద్కర్ ను రాజకీయ నేతలు ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కులం, మతం రాజ్యమేలుతున్నాయని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా....

20:09 - April 14, 2017

తన కామెడీతో యావరేజ్ కథలను కూడా బ్లక్  బాస్టర్స్ గా తీర్చి దిద్దే టాలెంటెడ్ డైరక్టర్ శ్రీనూ వైట్లా... కొనిదెల కాంఫౌండ్ హ్యాండ్సమ్ హీరో.. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాను తెరకెక్కించాడు. హెబ్బాపటేల్, లావణ్యా త్రిపాఠీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించారు. ఈ రోజే థీయేటర్స్ లోకి వచ్చిన మిస్టర్ ఎలా ఉన్నాడు. ఎంత వరకూ ఆకట్టుకున్నాడో చూద్దాం... 
కథ..          
కథ విషయానికి వస్తే.. పిచ్చయ్య నాయుడూ అలియాస్ చేయ్... స్పెయిన్ లో హ్యాపీగా లైఫ్ గడిపేసే ఓ కూల్ గాయ్.. ఇండియానుండి అక్కడికి ఓ పనిమీద వెళ్లిన మీరాను చూసి ఇష్టపడుతాడు. ఆమెతో జరిగిన చిన్న జర్నీలో ఆమెను ప్రేమిస్తాడు. కాని ఆమె వేరొకరిని ప్రేమించాను అని చెప్పడంతో తాను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పకుండా ఉండిపోతాడు. అయితే ఇండియా వచ్చిన మీరా లవ్ కి ఓ అనూహ్యమైన ప్రబ్లమ్ ఎదురౌతుంది. తాను ప్రేమించిన అమ్మాయి ప్రబ్లమ్ లో ఉండటంతో దాన్ని సాల్వ్ చేయడానికి ఇండియాలో లాండ్ అవుతాడు చై. ఇంతకీ మీరా లవ్ కి ఎదురైన ఆ ప్రాబ్లమ్ ఏమిటి..? దాన్ని హీరో ఎలా పరీష్కరించాడు.. రెండోవ హీరోయిన్ అయిన చంద్ర ముఖీ ఎవరు ? ఆమె అసలు హీరోకి ఎలా కనెక్ట్ అయ్యింది.. ఇద్దరు హీరోయిన్స్ ప్రేమించిన మిస్టర్ చై ఎవరికి దక్కుతాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.. 
విశ్లేషణ..
నటీనటుల విషయానికి వస్తే ఆరడుగుల హైట్ తో అదిరిపోయో లుక్స్ తో ఫస్ట్ సినిమాతో ఇంప్రెస్ చేసిన వరుణ్, ఈ సినిమాలో కూడా ఎప్పీరియన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. కాని ఎమోషన్స్ పండించడంలో.. కామెడీ టైమింగ్ అందుకోవడంలో తడబడ్డాడు.. అయితే డాన్స్ ఫైట్స్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేయడంతో ఫర్వాలేదు అనిపించాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పటివరకూ స్కిన్ షోతో హీరోయిన్ గా నెట్టుకొస్తున్నా... ఫస్ట్ టైం ఆమెకు ఫర్ఫామెన్స్ కూడా మిక్స్ అయిన క్యారక్టర్ దొరికిందీ. లుక్స్ పరంగా ఆక్టుకున్నా .. యాక్టింగ్ పరంగా యావరేజ్ అనిపించింది హెబ్బా.. ఇక సెకండ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి పర్ఫామెన్స్ పరంగా మరోసారి ప్రూచేసుకోగా, స్క్రీన్ ప్రజెంట్స్ పరంగా కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సిందీ అనిపిస్తుంది...  తన కామెడీతో సినిమాలను నిలబెట్టే పృధ్వీకీ రెగ్యూలర్ క్యారక్టర్ దొరకడంతో తన కామెడీతో పంచ్ లతో హ్యూమర్ వర్కౌట్ చేయాలని చూశాడు. అది కొంత వరకూ రిలీవ్ అనిపిస్తుంది. జబర్దస్త్ బ్యాచ్ అయినా శకలక శంకర్,  శేషూ ఓకే అనిపించారు. పెళ్ళిచూపులు కమెడియన్ ప్రియదర్శి, సత్యా... రఘుబాబు, శ్రీనివాస్ రెడ్దీ  క్వాలిటీ కామెడీ పండించారూ... ఇక సీనియర్ నటులైనా నాజర్, తనికెళ్ళ భరణీ, మురళీ శర్మ.... చంద్రమోహన్, నాగినీడు అంతా తమ పాత్రల పరిదిమేర మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. 
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే. అందరి దృష్టీ ఆకర్షించిన వ్యక్తి శ్రీనూ వైట్ల.. దూకుడూ లాంటి బ్లక్ బాస్టర్ ఇచ్చిన. కంబ్యాక్ మూవీగా మిస్టర్ నిలుస్తుంది అని అంతా ఎక్స్ పెర్ట్ చేశారు. ఆ ఎక్స్ పర్టేషన్స్ అందుకోవడంలో శ్రీను వైట్ల మరోసారి ఫేయిల్ అయ్యాడు. అస్తవ్యస్తమైన కథా.. కంన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే.. బోర్ కొట్టించే కామెడీ.. అసలు ఏమాత్రం కనెక్ట్ కాని ఎమోషన్స్ తో మిస్టర్ ను తీర్చిదిద్దాడు.. చాలా సన్నివేశాలలో అతని టేకింగి మొదటి సినిమా డైరక్టర్ లా అనిపించింది. కొన్ని కామెడీ సన్నివేశాల్లో శ్రీన వైట్ల టచ్ కనిపిస్తుంది. కాని డైరక్షన్ పరంగా మెరుపులు ఏమీ లేవు.  ఈ సనిమా టెక్నీషయన్స్ లో అందరి కంటే ఎక్కువ మార్కులు వేయాల్సింది, సినిమాటో గ్రాఫర్ గుహన్ కు. లిమిటెడ్ బడ్జెట్ లో టాప్ క్లాస్ విజ్యూవల్స్ ఇచ్చడు. సినిమాటోగ్రాఫీ ఈ సినిమాకు ఓ రిలీఫ్ పాయింట్ గా నిలవడం ఓ విశేషం. మ్యూజిక్ డైరక్టర్ మిక్కీజే మేయర్ తన స్ట్రైల్ కనిపించేలా ఓ రెండు పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అవి తప్పిస్తే మ్యూజిక్ సినిమాకు ఏ విధంగానూ హెల్ప్ కాలేకపోయింది.. ఒకప్పుడు తన డైలగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీధర్ సిపాన తన పూర్ ఫామ్ ను ఈ సీనిమాలో కూడా కంటిన్యూ చేశాడు.  పేలవమైన డైలాగ్స్ అందించాడు.. ఇందులో గోపీ మోహన్ పని చేసినా అతని ఎసెన్స్ ఎక్కడా కనిపించలేదు.. ప్రొడక్షన్ వాల్యూస్ తిరుగులేదు.. ఆహ్లాదకురమైన లొకేషన్స్ లో అన్ కాంప్రమైజ్డ్ విజ్యూవల్స్ కోసం చాలా ఖర్చు చేశారూ.. 
ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించిన మిస్టర్               
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించినా మిస్టర్ అనుకున్నంత రేంజ్ లో లేదనే చెప్పాలి.. బలాలు కన్నా బలహీనతలు ఎక్కువగా ఉండటంతో. పడుతూ లేస్తూ చివరివరకూ నెట్టుకోచ్చాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కు చేరుకుంటాడో చూడాలి... 
ప్లస్ పాయింట్స్
మేకింగ్ వాల్యూస్
హీరో, హీరోయిస్స్
సినిమాటోగ్రాఫీ
మైనస్ పాయింట్స్
కథా
స్క్రీన్ ప్లే
డైరక్షన్ 
డైలాగ్స్
మ్యూజిక్
పేలని కామెడీ
పండని ఎమోషన్స్

రేటింగ్....1/5

 

19:56 - April 14, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు పనుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. రూ.75 కోట్ల విలువైన ఎక్సలివేటర్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు భారీగా అంటుకోవటంతో... మెషిన్ పూర్తిగా కాలిపోయింది. ఈ మెషిన్ బకెట్‌తో ఒక్కసారే 35 క్యూబిక్ మీటర్ల మట్టిని తీయవచ్చు. దీనిని పోలవరం పనుల కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. మెషిన్ పూర్తిగా కాలిపోవడంతో పోలవరం పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

 

19:54 - April 14, 2017

విజయవాడ : ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడంలో అధికార టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. నానీని లక్ష్యంగా చేసుకుని దేవినేని ఉమ వ్యూహాత్మకంగా నడిపిన రాజకీయంతోనే ఏళ్ల చరిత్ర కలిగిన కేశినేని ట్రావెల్స్‌ మూతపడిందన్న ప్రచారం ఊపందుకుంది. 
మారుతున్న రాజకీయ సమీకరణలు  
కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బెజవాడలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమల మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయని ఇటీవల జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 
నాని, ఉమల మధ్య విభేదాలు 
వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని నాని ప్రజారాజ్యంతో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి, తెలుగుదేశంలో చేరి విజయవాడ ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల నుంచి నాని, ఉమల మధ్య విభేదాలున్నాయి. విజయవాడ ఎంపీ సీటు కోసం పీవీపీ కోసం ఉమ ప్రయత్నించినా ,.చివరికి నానికే దక్కింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అభిప్రాయ్రబేధాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కోనేరు రాజేంద్రప్రసాద్‌ను ఆర్థికంగా తట్టుకోవాలంటూ నాని స్తోమత చాలదని చంద్రబాబుకు దేవినేని ఉమా నూరిపోశారని చెబుతున్నారు. కోనేరుకు పీవీపీ అయితేనే గట్టి పోటీ ఇస్తారంటూ, చంద్రబాబు వద్దకు తీసుకెళ్లిన దేవినేని వైఖరి నానికి నచ్చలేదు. చంద్రబాబుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చి టికెట్‌ దక్కించుకున్నారు. అప్పటి  నుంచి ఇద్దరి మధ్య దూరంగా పెరడంతోపాటు, అభిప్రాయబేధాలు తలెత్తాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ఎడముఖం, పెడముఖంగా ఉంటూనే వచ్చారు. 
కేశినేని ట్రావెల్స్‌ మూసివేత వెనుక దేవినేని ఉమ హస్తం ? 
నానిని రాజకీయంగా దెబ్బకొంట్టేందుకు అదును కోసం ఎదురు చూస్తున్న దేవినేనికి... రవాణ శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంతో నాని గొడవ పడిన అంశం కలిసి  వచ్చింది. నాని దురుసు, దుందుడుకు ప్రవర్తనతో పార్టీ పరువు కృష్ణానదిలో కలుస్తోందని దేవినేని ఉమ..ముఖ్యమంత్రి చంద్రబాబుకు నూరిపోసి, కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయించారని  ప్రచారం జరుగుతోంది. బాలసుబ్రహ్మణ్యంకు నాని క్షమాపణ చెప్పించడంలో కూడా దేవినని ఉమ కీలక పాత్ర పోషించాలని టీడీపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఆది నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు దూరంగా ఉంటూ ట్రావెల్స్‌ ద్వారా  స్వశక్తితో ఎదగాలని చూసిన కేశినేని నానీని కోలుకోలేని దెబ్బ తీయడంలో దేవినేని ఉమ సక్సెస్‌ అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. కేశినేని ట్రావెల్స్‌కు ఆరెంజ్‌ ట్రావెల్స్‌ పోటీగా నిలవడంలో కూడా దేవినేని ఉమ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కేశినేని ట్రావెల్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆరెంజ్‌ ట్రావెల్స్‌ను ప్రోత్సహించడంలో కూడా దేవినేని పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కళ్లముందే కూలిపోయిన కేశినేని ట్రావెల్స్‌ ఆర్థిక సామ్రాజ్యంపై దాడి చేయించింది దేవినేని ఉమేనని నాని గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య నివురుకప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు త్వరలో భగ్గుమనే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
 

బెంగళూరుపై ముంబై ఇండియన్స్ విజయం

ఐపీఎల్ 10 : బెంగళూరుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ఆరు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.

19:33 - April 14, 2017
19:30 - April 14, 2017

కడప : ప్రొద్దుటూరులో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక టీడీపీ నేతలకు కత్తి మీద సాములా తయారైంది. స్థానిక టీడీపీ నేతల వర్గపోరుతో ప్రొద్దుటూరు రాజకీయం రచ్చకెక్కింది. మున్సిపల్‌ చైర్మన్ పదవి కోసం టీడీపీలోని రెండు వర్గాల నేతలు చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహాలు లేవు.
సొంత పార్టీ నేతను ఓడించేందుకు వైసీపీతో చేతులు 
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రధానమైన వాణిజ్య కేంద్రం. రాజకీయంగా కూడా ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా జట్టు కడతారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఇదే జరుగుతోంది. ఒకే పార్టీలో ఉంటూ... సొంత పార్టీ నేతను ఓడించేందుకు వైసీపీతో చేతులు కలుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఆవిష్కృతమైంది. 
నంద్యాల వరదరాజులరెడ్డిది ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థులు ఏకం 
ప్రొద్దుటూరు రాజకీయాల్లో నంద్యాల వరదరాజులరెడ్డిది చెరగని ముద్ర. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేతలంతా ఆయనను పెద్దాయన అని పిలుచుకుంటారు. ఆ పెద్దాయన ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థులు ఏకమయ్యి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. అనంతరం పెద్దాయన వ్యతిరేక కూటమి బలపడుతూ వచ్చింది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కూడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వరదరాజుల రెడ్డి ఓటమే లక్ష్యంగా అటు సొంత పార్టీ నేతలు.. ఇటు ప్రత్యర్థి పార్టీ నేతలు పని చేస్తున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాల్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యర్థుల వ్యూహాలు 
ఇప్పుడు పెద్దాయన వరదరాజుల రెడ్డి అనుచరుల ఓటమే లక్ష్యంగా ప్రొద్దుటూరు మున్సిపాల్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత లింగారెడ్డి ఏకమవుతున్నారు. వరదరాజులరెడ్డి  ప్రొద్దుటూరు మున్సిపాల్ చైర్మన్‌ పదవికి ఆసం రఘురామిరెడ్డిని పోటీలోకి దింపుతున్నారు.
ఆసం రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా ముక్తియార్ 
ఆసం రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా లింగారెడ్డి... ముక్తియార్ ను దింపుతున్నారు. ముక్తియార్ ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే.. ముక్తియార్ కు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆశీస్సులు కూడ పుష్కలంగా ఉన్నాయి. దీంతో వరదరాజుల రెడ్డి అనుచరుడు ఆసం రఘురామిరెడ్డి ఓటమి లక్ష్యంగా లింగారెడ్డి, ప్రసాద్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ప్రొద్దుటూరులో 31 వార్డులు
మొత్తం 31 వార్డులున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో.. లింగారెడ్డి మద్దతుదారుడు ముక్తియార్‌కు 16 మంది సభ్యుల మద్దతుందని చెబుతున్నారు. వీరి ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు కూడ ఉన్నారు.  మరోవైపు ఆసం రఘరామిరెడ్డి కూడ తనకు అవసరమైన మద్దతు ఉందని చెబుతున్నారు. కానీ... లింగారెడ్డి వర్గం డిమాండ్‌లు వేరే ఉన్నాయి. ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌ చైర్మన్ జబీవుల్లా, టౌన్ ప్రెసిడెంట్ రాజీనామా  చేస్తే.. తాము పోటీ నుంచి తప్పుకుంటామని లింగారెడ్డి వర్గం చెబుతోంది. 
పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా టీడీపీ నేతల పోరు  
మొత్తానికి ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోరు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. గురివిరెడ్డి తర్వాత ఆసం రఘురామిరెడ్డే చైర్మన్ అని.. ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించినా... లింగారెడ్డి తన వర్గం అభ్యర్థిని బరిలోకి దింపారు. దీంతో టీడీపీ నేతలు ఇరువురికి సర్ది చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

 

19:23 - April 14, 2017

అనంతపురం : బీజేపీ, టీడీపీలు అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాయని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిరలో అంబేద్కర్‌ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ పదవుల కోసం పార్టీలు మారేవారు బలహీనులని విమర్శించారు. తాను బతికున్నంతవరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని... పార్టీమారే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 

 

19:17 - April 14, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్‌ టూరిజానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆమె టూరిజం శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. పేద కళాకారులకు ఆర్ధికసాయం చేసే ఫైల్‌పై ఆమె తొలిసంతకం చేశారు. అనంతరం ఏపీటీటీసీ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నుంచి అరకు పర్యాటక రైలు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. 

 

19:12 - April 14, 2017

కృష్ణా : ఆన్‌లైన్‌ చెల్లింపులతో అవినీతిని అరికట్టవచ్చని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ వైపు మళ్లాలని కోరారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు ఇబ్బందిపడిన మాట వాస్తవమేనన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి చేయూతనివ్వడానికి రాజ్యాంగంలో అంబేద్కర్‌ అనేక అంశాలు పొందుపర్చారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ అకౌంట్‌కు ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. 

 

పోలవరం ప్రాజెక్టు పనుల్లోఅగ్నిప్రమాదం...

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెషిన్ పూర్తిగా కాలిపోయింది. రూ.75 కోట్ల విలువైన ఎక్సలివేటర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మెషిన్ కాలిపోయింది. 

19:00 - April 14, 2017

గుంటూరు : చారిత్రక ఘట్టానికి తొలి అడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహానికి అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్‌ పేరుతో ఏర్పాటు చేయబోతున్న స్మృతివనంకు భూమి పూజ చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్మృతివనం నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఆ తర్వాత అంబేద్కర్‌ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.
20 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం 
అయినవోలు, శాఖమూరు గ్రామాల మధ్య 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం అంబేద్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేయబోతోంది.. స్మృతివనంలో అంబేద్కర్‌ 125 అడుగు విగ్రహం... లైబ్రరీ, ఓపెన్ థియేటర్‌ను కూడా నిర్మించబోతున్నారు.. ఈ డిజైన్స్‌కు చంద్రబాబు ఇప్పటికే ఆమోదం తెలిపారు.. ఈ నిర్మాణాలకోసం ప్రభుత్వం దాదాపు 97కోట్ల రూపాయలు కేటాయించింది.. 
విగ్రహం తయారీలో మట్టి, యమునా నది నీరు 
విగ్రహం తయారీలో మట్టి, యమునా నది నీరు, అంబేద్కర్‌ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మౌ గ్రామం నుంచి సేకరించిన మట్టి ఉపయోగించబోతున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ రెండు బృందాలుగా వెళ్లి వీటిని సేకరించారు. శంకుస్థాపనలో ఈ మట్టి, నీరు ఉపయోగించారు.. ఈ కార్యక్రమానికి 25 బౌద్ధ క్షేత్రాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. 
ఎస్సీ వర్గాల పిల్లల చదువు కోసం ప్రభుత్వ సహకారం : సీఎం చంద్రబాబు  
శంకుస్థాపన తర్వాత అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎస్సీ వర్గాల పిల్లలు చదువుకోసం ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
స్మృతవనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి నక్కా ఆనంద్ బాబు 
స్మృతవనం ఏర్పాట్లను మంత్రి నక్కా ఆనంద్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగా అన్నీ పూర్తయితే వచ్చే ఏడాది అంబేద్కర్‌ విగ్రహం అందరికీ అందుబాటులోకి రానుంది. 

 

దళితులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు

గుంటూరు : దళితులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. దళితుల అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. దళితులకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. అంబేద్కర్ పుస్తకాలకు గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దళితుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. 

 

 

జవాన్లపై దాడిచేసిన కేసులో ఐదుగురి అరెస్టు

జమ్మూకాశ్మీర్ : బడ్గాంలో సీఆర్ పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి చేరాయి. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తుల దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 

 

17:56 - April 14, 2017

హైదరాబాద్ : గులాబీ కూలీదినాల్లో భాగంగా మంత్రి కేటీఆర్‌ కూడా వర్కర్‌ అవతారమెత్తారు. కుతుబుల్లాపూర్‌ ఏరియాలో కేటీఆర్‌ జ్యూస్‌ చేశారు. ఐస్‌క్రీంలు అమ్మారు. యువనేత చేసిన జ్యూస్‌ను 5లక్షల రూపాయలకు ఎంపీ మల్లారెడ్డి కొన్నారు. కేటీఆర్‌ తయారుచేసిన ఐస్‌క్రీంలను లక్ష రూపాయలు చెల్లించి ఇతర నేతలు కొనుగోలు చేశారు. ఈ డబ్బును వరంగల్‌లో జరిగే పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లకు వినియోగించనున్నారు. 

17:50 - April 14, 2017

వరంగల్ : మిర్చి రైతుల కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. మూడు రోజుల పాటు మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో సరుకును నిల్వ ఉంచేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు వ‌రంగ‌ల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని శీతల గిడ్డంగుల వ‌ద్ద మిర్చి రైతులు ప‌డిగాపులు కాస్తున్నారు. గిడ్డంగుల్లో సరుకు పెట్టనివ్వడం లేదంటూ యాజమాన్యంతో రైతులు వాగ్వాదానికి దిగారు. వ్యాపారుల స‌రుకుల‌కు చోటు క‌ల్పిస్తున్న గిడ్డంగుల యాజ‌మ‌న్యం రైతుల సరుకు కోసం చోటు కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా లోపల వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని.. అందుకే కొంతసరుకును మాత్రమే తీసుకుంటున్నామని.. రైతులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 

కూలీ పని చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని సుచిత్రలో మంత్రి కేటీఆర్ కూలీ పని చేశారు. రాక్ స్టోన్ ఐస్ క్రీం పార్లర్ లో కేటీఆర్ ఐస్ క్రీం అమ్మారు. ఎంపీ మల్లారెడ్డి ఒక ఐస్ క్రీంను ఐదు లక్షల రూపాయలకు కొన్నాడు. కొలను శ్రీనివాస్ రెడ్డి మరో ఐస్ క్రీంను రూ.లక్షకు కొన్నాడు. మంత్రి కేటీఆర్ స్వయంగా జ్యూస్ తయారు చేసి అమ్మారు. ఈరోజు నుంచి 20 వరకు కూలీ దినాలుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ ప్లీనం కోసం గులాబీ కూలీ పనులు చేయాలని సూచించారు. 

 

17:36 - April 14, 2017
17:33 - April 14, 2017

ముంబై : ఆపరేషన్ క్లీన్ మనీ ఫేజ్ టూను ఐటీ శాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా 60వేల మందికి ఐటీ నోటిసులు జారీ చేసింది. నోటిసులు జారీ చేసిన వారిలో 1300 ధనవంతులు ఉన్నారు. గత ఏడాది నవంబర్ 8 నుంచి ఈ ఏడాది ఫ్రిబవరి 8 వరకు 3334 కోట్ల అక్రమా ధనాన్ని ఐటీ బయటపెట్టింది. జనవరి 31న ఐటీ ఈ ఆపరేషన్ క్లీన్య మనీ మొదలుయ పెట్టింది. ప్రధాన మోడీ పెద్ద నోట్లు తర్వాత నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన లావాదేవిలపై ఐటీ శాఖ క్షుణంగా పరిశీలించింది. తొలి ఫేజ్ లో భాగంగా 5లక్షల కోట్లు డిపాజిట్లు చేసిన 18 లక్షల అనుమానిత ఖాతాదారులకు ఆన్ లైన్ నోటిసులు జారీ చేసింది. ఇందులో 9,40,000 సమాధానం చెప్పారు. మీగతా వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.

మాజీ కార్పొరేటర్ ఇంట్లో రూ.40 కోట్లు పట్టివేత

బెంగళూరు : మాజీ కార్పొరేటర్ ఇంట్లో భారీగా నగదు పట్టుకున్నారు. మాజీ కార్పొరేటర్ నాగరాజు ఇంట్లో రూ.40 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రద్దయిన రూ.1000, రూ.500 నోట్లు అభ్యం అయ్యాయి. నాగరాజుపై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

 

17:07 - April 14, 2017

నాగ్ పూర్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమ్‌ ఆధార్‌ యాప్‌ను నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. భీమ్‌ ఆధార్‌ యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ భీమ్‌ను వాడుతున్న యూజ‌ర్లకు మోదీ ఓ కుడా ఆఫ‌ర్ ప్రక‌టించారు. ఓ యూజ‌ర్ మ‌రో వ్యక్తిని భీమ్‌ యాప్‌కు యాడ్ చేయాలి. ఆ వ్యక్తి గనక మూడు లావాదేవీలు జరిపితే ఆ యూజ‌ర్ అకౌంట్‌కు 10 రూపాయలు జ‌మ‌ అవుతాయ‌ని ప్రధాని వెల్లడించారు. ఈ ఆఫ‌ర్ అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. భీమ్‌ ఆధార్‌ యాప్‌ను అంబేడ్కర్‌కు అంకితం చేస్తున్నట్లు మోది ప్రకటించారు.

 

17:02 - April 14, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ వివాదం పతాక స్థాయికి చేరింది. సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి సేకరణ ద్వారా భూములు తీసుకుంటోంది. ఆరు నెలలుగా గ్రామాల వారీగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు కీలకమైన పెనమాకలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో వివాదం తారా స్థాయికి చేరింది. దీనిపై తాడో పేడో తేల్చుకొనేందుకు రైతులు సిద్ధమవుతున్నారు

కొత్త మలుపు.......
ఏపీ రాజధాని అమరావతిలో భూ సేకరణ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి సేకరణ ద్వారా భూములు తీసుకొంటున్న ప్రభుత్వం రాజధానిలో అత్యంత కీలకమైన పెనుమాకలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. అమరావతి కోసం 29 గ్రామాల్లో చేపట్టిన సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా తీసుకొంటోంది. ఈ గ్రామాల్లో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని సేకరించాల్సివుంది. పెనమాక, ఉండవల్లి, ఎర్రబాలెం, నిడమర్రు ఎక్కువ భూమి సేకరించాల్సి ఉంది. ముందుగా చిన్న గ్రామాలో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ముందుగా పెద్ద గ్రామాల్లో భూసేకరణ చేస్తే వివాదం ముదురుతుందన్న ఉద్దేశంతో చిన్న గ్రామాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో నేలపాడులో 28 ఎకరాల భూమి సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు పెనమాకపై దృష్టి పెట్టింది.

రైతులు మండిపాటు......
పెనమాకలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. గ్రామంలో 930 మంది రైతుల నుంచి 660 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. అభ్యంతరాలు చెప్పేందుకు రైతులకు 60 రోజుల గడువు ఇచ్చారు. మూడు పంటలు పండే భూమిని రాజధాని కోసం ఇవ్వడానికి రైతులు అంగీకరించడంలేదు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భూసేకరణను వ్యతిరేకించిన విషయాన్ని పెనమాక రైతులు గుర్తు చేస్తున్నారు.

హైకోర్టును ఆశ్రయించనున్న రైతులు....
భూసేకరణ నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో పెనమాన రైతులు ఉన్నారు. ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డుతున్నారు. రైతులందర్నీ కలుపుకుని భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంతోటు, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగగా ఉద్యమించాలని పెనమాక రైతులు నిర్ణయించారు.

 

16:54 - April 14, 2017

గుంటూరు : ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో మాగ్నజిల్‌ కామర్స్‌ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని సంస్థ అధినేత రేపాల రవికుమార్‌ చెప్పారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించిన అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంఈసీ ఫలితాల్లో బి.అన్నపూర్ణ 980 మార్కులు సాధించగా జూనియర్‌ ఇంటర్‌ ఎంఈసీ ఫలితాల్లో 482 మార్కులు తమ విద్యార్థికే లభించాయని అన్నారు. వ్యక్తిగత పర్యవేక్షణ, ప్రణాళికా బద్ధమైన విద్యవల్లే ఈ ఫలితాలు సాధ్యమైనట్టు ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.

 

16:51 - April 14, 2017

గుంటూరు : ఈ రోజు వెలగపూడిలోని సచివాలయంలో భూగర్భ గనులశాఖ మంత్రిగా సుజయకృష్ణ రంగారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ మైనింగ్‌ను నియంత్రిస్తామని ఏపీ భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

 

16:44 - April 14, 2017

గుంటూరు : ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. జూనియర్‌ ఇంటర్‌లో ఎంఈసీ విద్యార్థి సీహెచ్‌ స్నేహాంజలి 493 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ సాధించినట్టు సంస్థ అధినేత మట్టుపల్లి మోహన్‌ తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో బి.దివ్య, యశశ్విని సౌమ్య, అవినాష్‌, శ్రీలక్ష్మి 981 మార్కులు సాధించినట్టు ప్రకటించారు. ఉత్తమ విద్యాబోధనే దీనికి కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.

 

16:41 - April 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లురవి విమర్శించారు. తెలంగాణ వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌ ఆ హామీని అమలు చేయలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు అటకెక్కాయని, కేసీఆర్‌కు ప్రజలే సరైన సమయంలో అంబేద్కర్‌ కల్పించిన ఓటు హక్కుతో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

 

16:40 - April 14, 2017

గులాబీ..సుగంధ పరిమాణాలు వెదజల్లుతుంది. సౌందర్య సాధనంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం శుభ్రంగా..కోమలంగా ఉంచుకోవాలంటే గులాబీ వాటర్ ను ఉపయోగిస్తే చాలు. ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకుని దానిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సహజసిద్ధంగా మాస్క్ ని తొలగించుకోవాలంటే గులబీ నీటిని వాడవచ్చు. ఒక గ్లాసులో గులాబీ వాటర్ ను తీసుకుని అందులో కాటన్ ముంచి ముఖంపై ఉన్న మాస్క్ ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది.
చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్ లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
చర్మపై ఎక్కడన్నా కాలినా..కమిలినట్లు అనిపిస్తే గులాబీ నీళ్లలో కాటన్ ను ముంచి ఆ ప్రాంతంలో ఉంచడం వల్ల మంట తగ్గి..చర్మం..చల్లగా మృదువుగా మారుతుంది.
ఎక్కువగా ఒత్తిడి గురయినట్లు అనిపిస్తే రాత్రి పడుకొనే ముందు గోరు వెచ్చటి నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేసి చూడండి.

రేపు బీజేపీ జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్ భేటీ

ఒడిషా : రేపు భువనేశ్వర్ లో బీజేపీ జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్ భేటీ జరుగనుంది. ప్రధాని మోడీ, అమిత్ షా, అద్వానీ, 13 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారు. రెండురోజులపాటు ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కొనసాగనున్నాయి. 

 

గ్రూప్ 2 ఫైనల్ 'కీ' టీఎస్ పీఎస్సీ విడుదల

హైదరాబాద్ : గ్రూప్ 2 ఫైనల్ 'కీ' టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. http://tspsc.gov.in//tspscweb0508//group2-keys.jspలో ఫైనల్ 'కీ'ను అధికారులు ఉంచారు.

 

16:24 - April 14, 2017

వారం రోజుల క్రితం కౌన్సెలింగ్..అయినా ఆలుమగల మధ్య ఘర్షణ..భార్యల చేతిలో హతమైన భర్త...

భార్య..భర్తల మధ్య అనురాగం కొరవడుతోంది..చిన్న సమస్యలకు..విషయాలకు బెదిరిపోతూ ఘోరాలకు పాల్పడుతున్నారు. నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ లో తిరుమలయ్య అనే వ్యక్తి రామ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సింగరేణిలో పనిచేసి రిటైరయిన ఇతనికి ఇద్దరు భార్యలు. భార్యల మధ్య నిత్యం ఘర్షణలు జరిగేవి. వారం రోజుల క్రితం కమాన్ పూర్ లో కౌన్సిలింగ్ జరిగింది. కానీ రెండు రోజుల తరువాత పాత పద్దతే. ఈ తరుణంలో ఇద్దరు భార్యలు గొడ్డలితో తిరుమలయ్యను నరికి చంపారు.

16:15 - April 14, 2017

విజయవాడ : సంచలనం సృష్టించిన విజయవాడ బీఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు విభాగం ఇరకాటంలో పడింది. సత్యంబాబును విడుదల చేస్తూనే ఆయేషా కేసులో దర్యాప్తు చేసిన అప్పటి అధికారులపై చర్యలకు ధర్మాసనం ఆదేశించింది. అయితే ఆయేషా కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడ్డ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చివరకు మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని మొదట్లో భావించినా ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతోనే ముందుకు పోవాలని పునర్విచారణ కోసం సన్నాహాలు చేస్తుంది.

ప్రభుత్వానికి ఆయేషా తల్లిదండ్రుల వినతులు..
ఇదిలా ఉండగా ఆయేషా హత్య కేసులో మళ్లీ విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలంటూ హతురాలి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వినతి చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ట్రయల్స్..అప్పీల్‌ కూడా పూర్తయినందున పునర్విచారణకు ఎలాంటి అవకాశాలున్నాయన్నదానిపై లీగల్‌ అథారిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. రీ ఇన్‌వెస్టిగేషన్‌కు కావాల్సిన లీగల్ ప్రొవిజన్స్‌ దొరకడం వల్ల సన్నాహాలు చేస్తున్నట్లు డీజీపీ చెబుతున్నారు. ఏదీ ఏమైనా మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఆయేషా కేసు విచారణ ప్రారంభం కానుంది. దీనిపై ఇప్పటివరకు జరిగిన లోటుపాట్లను సరిచేసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారా ? లేక మామూలుగానే దర్యాప్తు కొనసాగుతుందా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది. మరోవైపు ఆయేషా కేసులో అప్పట్లో అనుమానాలున్న వ్యక్తులను విచారిస్తారా..? లేక రాజకీయ ఒత్తిళ్లతో కేసు విచారణ నత్తనడకలా కొనసాగిస్తూ జాప్యం చేస్తారాన్నది చూడాల్సిందే.

గత నిబంధనలపై అభ్యంతరాలతో మార్పులు : ఘంటా చక్రపాణి

హైదరాబాద్ : గురుకుల విద్యాలయాల్లో 7,306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. గత నిబంధనలపై అభ్యంతరాలతో మార్పులు చేశామని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈనెల 18 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. రిక్రూట్ మెంట్ చేయాల్సిన పోస్టులు ఎక్కువగా ఉన్నాయన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో భర్తీ సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. 2011 గ్రూప్..1 అంశంపై ప్రభుత్వ అనుమతి రావాలన్నారు. గురుకుల టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టులకు మే 28న స్ర్కీనింగ్ టెస్టు ఉంటుందని తెలిపారు. వారం లేదా 10 రోజుల్లో గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. 

16:10 - April 14, 2017

20 రోజులయినా తేలని నిజాలు..డిగ్రీ స్టూడెంట్ రాజేష్ ది హత్యా ? ఆత్మహత్యా? ప్రేమ వ్యవహారంలోనే ఘోరం జరిగిందా ?

మరో దళిత కుటుంబం న్యాయం కోసం 20 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తోంది. మర్రిపాలెం గూడెం కు చెందిన రాజేష్ నిరుపేద కుటుంబం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాజేష్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దళిత యువకుడు రాజేష్ చదువుతున్నాడు. రాజేష్ బావిలో శవమై కనిపించాడు. ప్రేమ వ్యవహారంలోనే హత్యకు గురయ్యాడని కన్నవారు చెబుతుండగా పోలీసులు మాత్రం ఆత్మహత్యే అంటూ పేర్కొంటున్నారు. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని కుటుంసభ్యులు ప్రశ్నిస్తున్నారు. మరి వీరికి న్యాయం దక్కుతుందా ? రాజేష్ ది హత్యా ? ఆత్మహత్యా ? అనేది తేలుతుందా ? చూడాలి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

16:03 - April 14, 2017

నెలరోజులు కావస్తున్నా వీడని అనుమానాలు..హత్య చేశారంటూ తల్లిదండ్రుల పోరాటం..అధికారుల చుట్టూ ప్రదిక్షణలు..ప్రేమ వ్యవహారాంలోనే ఈ ఘోరం జరిగిందా ? పరువు కోసమే యువకుడి హత్య ?

మంథని మధుకర్ మృతి మిస్టరీ వీడకముందే నిజామాబాద్ జిల్లాలో మరో ఘోరం జరిగిపోయింది. దళిత యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనం కలిగిస్తోంది. నెల రోజులవుతున్నా 'ఇజ్రాయిల్' అనే యువకుడి మిస్టరీ వీడడం లేదు. మెదక్ జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్ పై యువకుడి మృతదేహం ఎలా వచ్చింది ? చంపి పడేశారా ? లేక చంపేందుకు రైల్వే ట్రాక్ ను ఎంచుకున్నారా ? పోలీసులు మాత్రం అతడిది ఆత్మహత్యేనని అంటున్నారు. మార్చి 18న పెళ్లి వేడుకులకు వెళ్లిన ఇజ్రాయిల్ తిరిగి రాలేదు. దీనితో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజుల అనంతరం మెదక్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై ఇజ్రాయిల్ మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొంటుండగా కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. మరి ఇజ్రాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక హత్య చేశారా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

పాక్ విదేంశాగ కార్యదర్శితో భారత విదేశాంగ ముఖ్య కార్యదర్శి భేటీ

ఢిల్లీ : పాకిస్తాన్ విదేంశాగ కార్యదర్శితో భారత విదేశాంగ ముఖ్య కార్యదర్శి భేటీ అయ్యారు. కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విధింపు అంశంపై చర్చిస్తున్నారు. 

 

15:33 - April 14, 2017

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎం.పి. కవిత పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏ.సి. కాన్ఫరెన్స్ హాల్ ను కవిత ప్రారంభించారు. ఉద్యమంలో తమతో నడిచిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతో ఆదుకుంటుందని, హెల్త్ కార్డుల విషయంలో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని కార్పొరేట్ ఆసుపత్రులతో మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. ప్రెస్ క్లబ్ కొత్త భవనానికి 5 కోట్ల రూపాయాలు తన వంతుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కొత్త భవనం ఎక్కడ, ఎలా ఉండాలో నిర్ణయం తీసుకుంటారని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

15:28 - April 14, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాస్‌మండివాసులపై వరాల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లోభాగంగా బస్తీకి వచ్చిన కేటీఆర్‌ అక్కడి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. బస్తీలో అత్యాధునిక లైబ్రరీ నిర్మాణంకోసం 3కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.లైబ్రరీలో కేవలం బుక్స్ కాకుండా ఈ లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో గదుల నిర్మాణానికి 25లక్షలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

 

15:24 - April 14, 2017

ఈ మధ్య 'చిరంజీవి'పై 'నాని' చేసిన పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ‘చిరంజీవి' ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఆయన కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో వరుస విజయాలతో 'నాని' దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. అసలు 'నాని'కి 'చిరు' ఏ మాట ఇచ్చాడనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా 'నాని' మరో ట్వీట్ చేశాడు. ‘చిరు' మాట నిలబెట్టుకున్నారని ట్వీట్ చేశారు. చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు 'నాని' ఇటీవలే వెళ్లాడు. ‘మాస్టర్’ సినిమాకు తాను సైకిల్ పై వెళ్లడం జరిగిందని, కానీ టికెట్ దొరికిన ఆనందంలో తన సైకిల్ ను మరిచిపోయాయని ‘నాని’ ఆ షోలో పేర్కొన్నాడు. షో లో గెలుచుకున్న డబ్బుతో ఓ కొత్త సైకిల్ కొనుక్కుంటానని 'నాని' పేర్కొన్నాడు. తాను నటించిన సినిమా చూసేందుకు వెళితే సైకిల్ పోయింది కనుక, మరో కొత్త సైకిల్ ను తానే కొనిస్తానని నాటి షో లో 'చిరంజీవి' మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో 'నాని'కి కొత్త సైకిల్ ను 'చిరంజీవి' పంపించారు. సైకిల్ పక్కనే నిలబడిన ఉన్న ఫొటో 'నాని' పోస్టు చేశారు.

15:14 - April 14, 2017

గుంటూరు : వనరుల ఉపయోగంపై గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చి అభివృద్ధి సాధిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దళితులకు  చదువే ఆయుధమని ఆయన అన్నారు. ఎస్సీవర్గాల పిల్లలు చదువుకోడానికి ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందన్నారు. చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్ లోని ఆదయ్యనగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సనత్ నగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వేగం పెంచుతామని పేర్కొన్నారు.

ఆదయ్యనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని ఆదయ్యనగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 

సికింద్రాబాద్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. మంత్రి కేటీఆర్ హాజరు

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో నిర్వహించిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 

 

ఇంటర్నెట్, ఫోన్ లేకుండానే నగదు చెల్లింపులు : మోడీ

నాగ్ పూర్ : ఇంటర్నెట్, ఫోన్ లేకుండానే నగదు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. భీమ్...ఆధార్ యాప్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వేలిముద్రలతోనే చెల్లింపులు జరిగేలా భీమ్..ఆధార్ యాప్ రూపొందిచినట్లు పేర్కొన్నారు. భీమ్..ఆధార్ యాప్ ను అంబేద్కర్ కు అంకితం ఇస్తున్నానని చెప్పారు. దేశం కోసం బతికే అవకాశం తమందరికీ లభించిందని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అవకాశం తమందరికీ రాలేదన్నారు. 

 

భీమ్...ఆధార్ యాప్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

నాగ్ పూర్ : భీమ్...ఆధార్ యాప్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇంటర్నెట్, ఫోన్ లేకుండానే నగదు చెల్లింపులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. వేలిముద్రలతోనే చెల్లింపులు జరిగేలా భీమ్..ఆధార్ యాప్ రూపొందిచినట్లు పేర్కొన్నారు. భీమ్..ఆధార్ యాప్ ను అంబేద్కర్ కు అంకితం ఇస్తున్నానని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అవకాశం తమందరికి రాలేదన్నారు. 

14:28 - April 14, 2017

చిత్తూరు : ఏపీ టీడీపీలో రోజు రోజుకు అసమ్మతి పెరిగిపోతునట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై తమకు స్థానం దక్కలేదని పలువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉండడమే కాకుండా రాజీనామాలు కూడా చేసేశారు. విజయవాడలో కేశినేని నాని పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు 16 శాతం ఉంటే కేవలం 2 మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీలకు అన్యాయం చేశారని అన్నారు. కేంద్రంలో టీడీపీకి రెండు మంత్రి పదవులు వస్తే రెండు ఓసీలకే ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం కారు పార్కింగ్ విషయంలో ప్రసాద్ కూతురు ఆందోళన చేశారు. ఓ వ్యక్తి దూషించడంతో న్యాయం చేయాలని ఆమె రోడ్డుపై ధర్నాకు దిగారు కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో ఎంపీ కూతురికి అన్యాయం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆమె తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ అంసతృప్తితోనే ఎంపీ శివప్రసాద్ ఈ వ్యాఖ్యలను చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టిస్తాయా ? లేదా ? అనేది చూడాలి.

 

 

14:19 - April 14, 2017

రాంగోపాల్ వర్మ..ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. పలువురు సెలబ్రెటీలు..ఘటనలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్విట్టర్ ద్వారా ఆయన పలు ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల మెగాస్టార్ కుటుంబంపై ఆయన పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చెలరేగాయి కూడా. గతంలో 'ఖైదీ నెంబర్ 150’ సినిమా కార్యక్రమంలో 'నాగబాబు' పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వర్మ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. ఒక్కసారిగా 'రాంగోపాల్ వర్మ' శుక్రవారం ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. ‘చిరంజీవి లాంటి అన్యయ్య నాకుంటే నేను మాట్లాడే మాటలకి ఆయన నన్ను కొట్టేవారు. నాగబాబు గారు మాటలతో వదిలేశారు..ఆయనకి సారీ చెబుతున్నా' అంటూ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. కానీ ఉన్నట్టుండి వర్మ ఎందుకు క్షమాపణలు చెప్పారు అని పలువురు బుర్రగొక్కుంటున్నారు.

మోండా మార్కెట్ లో కేటీఆర్..

హైదరాబాద్ : మోండా మార్కెట్ లో ప్రజలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. మంత్రి తలసాని నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం నివాసాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టి చూపిస్తామన్నారు.

14:01 - April 14, 2017

హైదరాబాద్ : అంబేద్కర్‌ 126వ జయంతి సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా జైభీమ్‌ లాల్‌ సలామ్‌ నినాదాలు, డప్పు చప్పుళ్లతో మార్మోగింది. సామాజిక న్యాయ పోరాటం కోసం అంబేద్కర్‌ స్ఫూర్తితో.... మహాత్మా పూలే ఆలోచనలతో ముందుకు సాగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం కోసం అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని తెలిపారు. కేంద్రం జీవించే హక్కును హరిస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ మోజులో తప్ప రాష్ట్ర ప్రజల బతుకుల గురించి పట్టడం లేదన్నారు. ఈ ర్యాలీలో ప్రజా గాయకుడు గద్దర్‌, ఇతర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

 

13:41 - April 14, 2017

హైదరాబాద్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ పార్టీల, సంఘాల నేతలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి ట్యాంక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. భారత రాజ్యంగా నిర్మత, సంఘసంస్కకర్త , దళిత పోరాట యోధుడని జానారెడ్డి కొనియాడారు. కేవలం జయంతి జరుపుకుంటే కాదని ఆయనను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.

అంబేద్కర్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత.......
అంబేద్కర్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాతని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. కోదండరామ్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన బాటలో జేఏసీ నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రజలందరితో సమిష్టిగా ఉద్యమాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా అన్ని కులాలకు సమానవకాశలు రావాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎలా కృషి చేశామో అలా తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.

13:36 - April 14, 2017

ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఓ స్వతంత్ర ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని అచల్ పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బాచ్చు కడు గెలుపొందారు. అక్కడ రైతు ఆత్మహత్యలపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. పూటుగా తాగడం మూలంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వచ్చిన కామెంట్స్ పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యలపై ఆయన మాట్లాడారు..75 శాతం మంది ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు తాగుతారని, హేమా మాలిని రోజూ హెవీగా తాగుతారని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అంతమాత్రాన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. తాగడం వల్ల రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఈ సందర్భంగా బాచ్చు కడు స్పష్టం చేశారు. దీనిపై హేమా మాలిని ఎలా స్పందిస్తారో చూడాలి.

13:13 - April 14, 2017

గుంటూరు : డా.బి.ఆర్.అంద్కేర్ మహనీయుడని..అందరికీ స్పూర్తి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం..అంబేద్కర్ స్మృతి వనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడుతూ..అంబేద్కర్ లాంటి మహానీయుడు పుట్టడం మన అదృష్టమని అన్నారు. ప్రపంచం మెచ్చే వ్యక్తి అంబేద్కరని....రాష్ట్ర రాజధానిలో అంబేద్కర్ 125అడుగుల ఎత్తు విగ్రహంకు శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందని తెలిపారు. ఎప్పటికి గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అంబేద్కర్ అని, ఎంతో మంది పుడుతుంటారని..మరణిస్తుంటారు..కానీ ప్రజల గుండెల్లో కొందరు మాత్రమే ఉంటారని అలాంటి వారిలో అంబేద్కర్ ఒకరన్నారు. ఆయన ఎన్నో అవమానాలు ఓర్చుకుని, రాజీ పడకుండా ముందుకు సాగారని తెలిపారు. అంబేద్కర్ ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నారని, వారు జ్యోతి రావు పూలే, కబీర్, గౌతమ బుద్ధుడు అని చంద్రబాబు నాయుడు  తెలిపారు. 

12:53 - April 14, 2017
12:52 - April 14, 2017

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం రీజియన్ లో పెద్ద స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నట్టు సింగరేణి అన్వేషణ విభాగం పేర్కొంది. ఓసీపీ 2, జీడీకే 5,5ఏ గనుల్లో భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని....ఏఎల్పీఈ ప్రాజెక్టులో ప్యానల్ 1 నుంచి 4 వరకు 180 బిలియన్ టన్నులు, ప్యానల్5, 6 కింద 130 మిలియన్ టన్నులు ఉన్నట్లు మైనింగ్ అధికారులు తెలిపారు.దుబ్బపల్లి బ్లాక్ లో 225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. బొగ్గు నిక్షేపాల నివేదికను ప్రభుత్వానికి సింగరేణి అధికారులు పంపారు.

12:51 - April 14, 2017

'పాకిస్థాన్ బాలిక మలాల మరో ఘనత సాధించింది...ఓ వివాహిత ఆత్మహత్యకు ముందు సెల్ఫీ తీసుకోవడం కలకలం రేగింది. ధర్మాసనానికి సారధ్యం వహించే ఘనతను ఓ మహిళ సాధించింది..ట్రిపుల్ తలాక్ పై భారత ఉప రాష్ట్రపతి సతీమణి స్పందించారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు గిన్నిస్ బుక్ రికార్డు కోసం కూచిపూడి నాట్యం చేశారు.. వరల్డ్ హాకీలో అమ్మాయిల రాణింపు..రియో ఒలింపిక్స్ విజేత సాక్షి మాలిక్ మరో ఘనత సాధించింది..పివి సింధు ఎన్నికల బరిలో'..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:37 - April 14, 2017

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ ధర్నాకు దిగింది.మందకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన చేశారు. మందకృష్ణ మాట్లాడుతూ దళితులపై దాడులు, అత్యచారాలను అరికట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు పెట్టి దళితులను మభ్యపెడుతున్నారని దళితులకు న్యాయం చేయకపోతే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం విగ్రహాలు, పెడుతున్నారని విమర్శించారు.

12:26 - April 14, 2017

గుంటూరు : తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు నేతలు ఆయన విగ్రహాలకు ఘననివాళులర్పిస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ స్మృతి వనానికి, 125 అడుగుల విగ్రహనికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ద బిక్షవులు, మంత్రులు, టీడీపీ నేతలు  పాల్గొన్నారు.

నివాళులర్పించిన ఎంపీ కవిత..
హైదరాబాద్
: నిజామాబాద్ ఎంపీ కవిత ట్యాంక్ బాండ్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అంబేద్కర్ రచించిన రాజ్యంగంతోనే అర్టికల్ 3తో తెలంగాణ వచ్చిందన్నారు. దళితుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, దళితులకు మూడెకరాల భూమి, కల్యాణ లక్ష్మీ పథకం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

 

నాగ్ పూర్ లో మోడీ..

నాగ్ పూర్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాగ్ పూర్ కు చేరుకున్నారు. అక్కడ దీక్ష భూమిలో అంబేద్కర్ నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

హోదా ముగిసిన అధ్యాయం - విష్ణుకుమార్ రాజు..

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ ఉద్యమిస్తాననడంలో అర్థం లేదని, హోదా పోరాటం అంటే సమైక్యాంద్ర కోసం మాట్లాడినట్లుందన్నారు. ఉద్యమాల పేరిట సమయాన్ని వృదా చేయడం సరికాదన్నారు.

వ్యవసాయంపై బాబు టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ లో రైతుల అవసరాలకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని, విత్తనాలు..ఎరువులు..పంట రుణాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ పెట్టుబడికి ఉపయోగపడేలా ఇన్ పుట్ సబ్సిడీ అందించాలన్నారు. వ్యవసాయంలో మధ్యప్రదేశ్ 25 శాతం వృద్ధి సాధించిందని, మధ్యప్రదేశ్ స్పూర్తితో 30 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. సూక్ష్మ పోషకాలు..సేంద్రీయ ఎరువల వాడకంపై దృష్టి పెట్టాలని, తెగుళ్లు, చీడ పురుగుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సుజయ కృష్ణ రంగారావు బాధ్యతల స్వీకరణ..

విజయవాడ : మైనింగ్ శాఖ మంత్రిగా సుజయకృష్ణ రంగారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి వచ్చిన సంగతి తెలిసిందే.

అమెరికా బాంబు దాడిలో 36 మంది ఉగ్రవాదుల మృతి..

అమెరికా : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్‌లో అతిపెద్ద బాంబును విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది. 9,525 కిలోల బరువు కలిగిన ఆ భారీ బాంబును ఎంసీ-130 ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి వదిలినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు.

11:43 - April 14, 2017
11:41 - April 14, 2017

విజయనగరం : తాను ఏడు నెలల గర్భవతి..అని..విధుల విషయం..ఇతరత్రా విషయంలో కొద్దిగా ఆలోచించాలని వేడుకున్నా ఆ ఎస్ఐ వినిపించుకోలేదని..అందుకే తాను ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించినట్లు ఓ మహిళా కానిస్టేబుల్ పేర్కొనడం సంచలనం రేకేత్తించింది. ఈఘటన దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జివలస పీఎస్ లో చోటు చేసుకుంది. బూర్జివలస పీఎస్ లో బద్నల శశి మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఈమె గురువారం రాత్రి చీమల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. గర్భవతి అయిన తనను ఎస్ఐ రమేష్ నాయుడు రాత్రి వేళల్లో డ్యూటికి హాజకావాలని వేధించేవాడని, గర్భవతి అని చెప్పిన వినకుండా రోల్ కాల్ రావల్సిందిగా ఆదేశించేవాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా దుర్బాషలాడడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాను ఎలాంటి వేధింపులు చేయలేదని ఎస్ఐ రమేష్ పేర్కొంటున్నారు. విధుల్లో భాగంగానే తాను రమ్మనడం జరుగుతోందని తెలిపారు.

 

11:36 - April 14, 2017
11:33 - April 14, 2017
11:32 - April 14, 2017

రామగుండంలో భారీగా బొగ్గు నిక్షేపాలు..

పెద్దపల్లి : రామగుండం రీజియన్ లో భారీగా బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేని అన్వేషణ విభాగం గుర్తించింది. దుబ్బపల్లి బ్లాక్ లో 225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించింది. ఎల్ ఎల్పీ ప్రాజెక్టులో ప్యానల్ 1-4 వరకు 180 మిలియన్ టన్నుల బొగ్గు, ప్యానల్ 5,6 కింద 130 మిలియన్ టన్నులతో పాటు ఓపీసీ -2, జీడీకే 5, 5ఏ గనులకు సంబంధించి భూగర్భంలో భారీగా నల్ల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తిరుమలగిరి ప్రమాద మృతులకు పోస్టుమార్టం పూర్తి..

హైదరాబాద్ : తిరుమలగిరి రోడ్డు ప్రమాద మృతులకు గాంధీ ఆసుపత్రిలో రీ పోస్టుమార్టం పూర్తయ్యింది. కానీ మృతదేహాలను తీసుకొనేందుకు బంధువులు నిరాకరించారు. పరిహారంపై లిఖితపూర్వక హామీనివ్వాలని డిమాండ్ చేశారు.

 

స్వాతి ఆత్మహత్యాప్రయత్నం..

హైదరాబాద్ : ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. కొత్తపేటలోని ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల అమెరికాలో మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మృతికి స్వాతియే కారణమని బంధువులు ఆరోపణలు గుప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది.

చీమల మందు తాగిన మహిళా కానిస్టేబుల్..

విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం ఎస్. బూర్జివలస పీఎస్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రమేష్ నాయుడు వేధింపులే కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.

ట్యాంక్ బండ్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. దళితులపై దాడులు, అత్యాచారాలను అరికట్టలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.

11:17 - April 14, 2017

హైదరాబాద్ : ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యా యత్నం చేశారు. గురువారం రాత్రి బాత్ రూంలో హర్పిక్ తాగి పడిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుం ఆమె పరిస్థితి ఎలా ఉందనేది తెలియరాలేదు. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో మధుకర్ రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మధుకర్ అంత్యక్రియలకు వచ్చిన స్వాతిపై మృతుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. దీనితో తనకు రక్షణ కల్పించాలని స్వాతి పోలీసులను ఆశ్రయించింది. మధుకర్ మృతికి స్వాతియే కారణమని బంధువులు తీవ్ర ఆరోపనలు చేయడంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించిందని సమాచారం.

 

11:02 - April 14, 2017

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో మంటలు అంటుకున్నాయి. క్షణకాలంలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి గుడిసె వాసులు పరుగులు తీశారు. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. దీనితో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 40కి పైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. దీనితో కట్టుబట్టలతో 60 నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వస్వం కొల్పోయామాని పేదలు విలపిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిని ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.

 

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం

విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం ఎస్. బూర్జివలస పీఎస్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రమేష్ నాయుడు వేధింపులే కారణమని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. 

10:54 - April 14, 2017

విజయవాడలో కుంగిన రోడ్డు..

విజయవాడ : వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద రోడ్డు కుంగింది. అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ల ట్రైల్ రన్ లో లీకేజీ ఏర్పడడంతో గొయ్యి ఏర్పడినట్లు తెలుస్తోంది. పుష్కరాల సమయంలో రోడ్డు నిర్మాణం వేశారు. రోడ్డు మధ్యలో గొయ్యి ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

10:50 - April 14, 2017

హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గురువారం రాత్రి తిరుమలగిరి ప్రాంతంలో జీహెచ్ఎంసీ టిప్పర్ వాహనం ఢీకొనడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో తండ్రి, ముగ్గురు పిల్లలు అజర్ (37), అమన్ (9), అశ్వియా (7), ఆలీనా (3) అక్కడికక్కడనే మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఇమ్రానబేగం (35), చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వీరు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన బేగం వెన్నుపూస దెబ్బతిన్నదని తెలుస్తోంది. మృతి చెందిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులకు రూ. 5 లక్షల చొప్పున మంత్రి కేటీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వార్త తెలుసుకున్న మంత్రి తలసాని, పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లు ఘటనా స్థలిని సందర్శించారు. ఘటనకు కారణమైన డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

అంబేద్కర్ స్మృతి వనానికి ఏపీ సీఎం భూమి పూజ

గుంటూరు : అమరావతిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తుతో తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో బౌద్ద బిక్షువులు పాల్గొన్నారు.

 

10:42 - April 14, 2017

యాదాద్రి : జిల్లా భువనగిరి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జమ్మాపురం గ్రామంలో ఉన్న టైర్లకంపెనీ మంటల్లో చిక్కుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఊపిరాడక స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

10:40 - April 14, 2017

కృష్ణా : పందిని తప్పించబోయిన ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు గాయాల పాలయ్యారు. ఈ ఘటన జిల్లా నందిగామలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. నందిగామ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన కూలీలు చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామానికి వ్యవసాయపనుల నిమిత్తం శుక్రవారం ఉదయం ఆటోలో వెళుతున్నారు. నందిగామ పట్టణంలోని కేవీఆర్‌ కాలేజీ సమీపంలో అడ్డుగా వచ్చిన పందిని తప్పించబోయి డ్రైవర్‌ సడెన్‌బ్రేక్‌ వేయడంతో ఆటో ఒక్కసారిగా ఫల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డంతో విజయవాడకు తరలించారు.

ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్ : ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యా యత్నం చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. 

 

10:38 - April 14, 2017

హైదరాబాద్ : ఐస్ క్రీమ్ తిందామని ఓ సైడ్ కి నిలబడిన వారిని చెత్త లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో తండ్రి, ముగ్గురు పిల్లలు అజర్, అమన్, అశ్రియ, ఆలీలున్నారు. తల్లి, మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు బన్సీలాల్ పేట వారిగా గుర్తించారు. అదే సమయంలో సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు మంత్రి కేటీఆర్ తన కాన్యాయ్ తో వస్తున్నారు. తన కాన్వాయ్ లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మృతులకు రూ. 5 లక్షల చొప్పున మంత్రి కేటీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వార్త తెలుసుకున్న మంత్రి తలసాని, పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లు ఘటనా స్థలిని సందర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:33 - April 14, 2017

తెలంగాణ రాష్ట్ర రైతులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వచ్చే ఏడాది నుండి ఉచితంగా రైతులకు ఎరువులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రూ. 4వేల చొప్పున రైతుల అకౌంట్ లో జమ చేస్తామని హామీనిచ్చారు. ఈ అంశాలపై టెన్ టివి మార్నింగ్ న్యూస్ లో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), దుర్గా ప్రసాద్ (టిడిపి), రాకేష్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:26 - April 14, 2017

154 రోజుల సిపిఎం మహాజన పాదయాత్ర బృందానికి ఉప నేతగా వ్యవహరించిన జాన్ వెస్లీ, ఆయన సతీమణి భారతి టెన్ టివి జనపథంలో పాల్గొన్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లా నేటి వనపర్తి జిల్లా అమరచింత లో జన్మించిన జాన్ వెస్లీ విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తొలుత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లోనూ, ఆ తర్వాత పిడిఎస్ యులోనూ పనిచేసిన జాన్ వెస్లీ 1996 నుంచి సిపిఎంలో చేరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆవిర్భావంలోనూ, నిర్మాణంలోనూ కీలకంగా పనిచేసిన జాన్ వెస్లీ ప్రస్తుతం ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ పోరాట సమితికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. జాన్ వెస్లీ సతీమణి ఓ ప్రయివేట్ కాలేజీలో లైబ్రరేరియన్ గా విధులు నిర్వహిస్తున్నారు. 4200 కిలోమీటర్ల పాదయాత్రలో ఎదురైన అనుభవాల గురించి జాన్ వెస్లీ వివరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:23 - April 14, 2017

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ర‌హదార్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌నీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. ప‌నుల్లో అల‌స‌త్వం ప్రదర్శించే ఏజెన్సీలపై చ‌ర్యలు తీసుకోవడంతో పాటు ఇష్టానుసారం ఎస్టిమేట్‌లు పెంచ‌డాన్ని అరిక‌ట్టాల‌ని అధికారుల‌కు నిర్థేశించారు మంత్రి. అందుకు అవ‌స‌ర‌మైతే అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీల‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల‌నీ అధికారుల‌కు స్పష్టం చేసారు మంత్రి జూప‌ల్లి. గ్రామీణ ప్రాంత రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యాన్ని, నాణ్యతా లోపాన్ని సహించేదిలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీలతో నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణంలో ఇష్టారాజ్యంగా అంచనాలను పెంచడం, అసాధారణ జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. వర్క్ ఏజెన్సీలేవైనా పనుల్లో జాప్యం చేస్తే ఎప్పటికప్పుడు మెమోలు జారీ చేయడంతో పాటు,..ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు సూచించారు. అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పనులకు అనుమతి వచ్చిన వారంలోపే ప్రారంభించాలని,..15 రోజుల్లోగా శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా లేఖలు రాస్తామన్నారు.

వారం రోజుల్లో ప్రతిపాదనలు..
ప్రస్తుతం జరుగుతున్న నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రహదారులు వంతెనల పనులను 3నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాల్లో PMGSY కింద జరుగుతున్న 71 వంతెనలు, 37 రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే నాబార్డ్ కింద నాలుగు సర్కిళ్లలో 334.72 కోట్లతో జరుగుతున్న 181 పనుల్లో 40 మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన వాటిని జూన్ నెలాఖారులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇచ్చే కాల పరిమితిని తగ్గించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన మార్పులకు సంబందించి వారం రోజుల్లో ప్రతి పాదనలు అందజేయాలని ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డిని ఆదేశించారు. గతంలో రెండు, మూడేళ్లపాటు కూడా రోడ్డు నాణ్యత పరీక్షలు జరగని పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలా జరగకూడదని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రధానంగా సాయిల్ టెస్ట్, డిజైనింగ్‌ల్లో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

10:20 - April 14, 2017

హైదరాబాద్ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాల‌ని డిసైడ్ అయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..గాంధీభ‌వ‌న్‌ను వీడి గ్రౌండ్‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనికోస‌ం బ‌స్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో ప్రజా స‌మ‌స్యలపై ప్రజలకు దగ్గర కావ‌డంతోపాటు.,పార్టీలోని నేత‌ల కుమ్ములాట‌ల‌కు బ్రేకులు వేయ‌వ‌చ్చనేది కెప్టెన్ స్కెచ్‌. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేక‌పోయింది కాంగ్రెస్. 2014లో అధికారాన్ని చేజార్చుకున్న హ‌స్తం పార్టీ..2019లో మాత్రం ఎట్టిప‌రిస్థితిల్లో అధికారాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని త‌హ త‌హ‌లాడుతోంది. దీనికోసం ఇప్పటి నుంచే ప‌క్కా స్కెచ్‌తో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముందస్తు హామీల‌కు ప‌దునుపెడుతున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

బస్సు యాత్ర..
2019లో అధికారమే ల‌క్ష్యంగా పెట్టుకుని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జనానికి ద‌గ్గర కావాలంటే..జ‌నాక‌ర్షక ప‌థ‌కాలే అని గుర్తించిన ఉత్తమ్‌..ఇప్పటికే రైతు రుణ‌మాఫి అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. అంతేకాకుండా మ్యానిఫెస్టోను ఏడాది ముందే ప్రకటించడం..రుణ‌మాఫీ ఎంత ఇవ్వాల‌న్నదానిపై క‌స‌ర‌త్తు కూడా మొద‌లు పెట్టారు. ఇక దీనితో పాటు..ఇవ‌న్ని ఒక‌టైతే..తానుగా జ‌నంలోకి వెళ్ళిన‌ప్పుడే ప్రయోజ‌నం అని డిసైడ్ అయిన ఉత్తమ్‌,..తాను సార‌థిగా బ‌స్సు యాత్రకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న ప్రజా సమస్యలనే ప్రధాన ఏజెండాగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు.

పెద్దల అనుమతి..
ఇక బ‌స్సు యాత్ర అన్నది కాంగ్రెస్‌కు అచ్చి వ‌చ్చిన అంశంగా ట్రాక్ రికార్డ్ ఉంది. గ‌తంలో 2004లో గులాబ్ న‌బీఆజాద్ రాష్ట్ర ఇంచార్జీగా ఉండ‌గా అప్పట్లో పార్టీ చేసిన బ‌స్సు యాత్ర బాగా క‌లిసి వ‌చ్చింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు ఉప‌యోగించుకోవాల‌నే నిర్ణయానికి వ‌చ్చిన ఉత్తమ్‌..గులాబి స‌ర్కార్‌పై బ‌స్సు పోరుకు సిద్ధమవుతున్నారు. ఆ యాత్ర ద్వారా.. ప్రజలకు దగ్గర కావ‌డంతోపాటు.. ముఖ్యంగా పార్టీలోని అంత‌ర్గత పోరుకు బ్రేకులు వేయ‌వ‌చ్చనేది ఉత్తమ్‌ స్కెచ్‌. దీంతో పార్టీలో ఎవ‌రికి వారుగా ఉన్న పార్టీ నేత‌ల‌ను త‌న బ‌స్సు యాత్ర ద్వారా ఏక‌తాటిపైకి తీసుకురావడంతోపాటు పార్టీలో తానే లీడ‌ర్ అన్న సంకేతాల‌ను లీడర్ టూ క్యాడ‌ర్‌కు పంప వ‌చ్చన్నది ఉత్తమ్‌ ఫ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికి టిఆర్ఎస్ స‌ర్కార్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన పీసీసీ చీఫ్‌..ఈ బ‌స్సు యాత్రతో ఇటు ప్రజల్లో..అటు పార్టీలో గ్రాఫ్ పెంచుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఢిల్లీ పెద్దల అనుమ‌తి రాగానే బ‌స్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసేందుకు కాంగ్రెస్ కెప్టెన్ సిద్ధపడుతున్నారు.

10:16 - April 14, 2017

హైదరాబాద్ : దాదాపు 7నెల‌ల త‌రువాత జ‌రిగిన జిహెచ్ఎంసి కౌన్సిల్ స‌మావేశం వాడి వేడిగా జ‌రిగింది. ఎంపిక చేసిన ప్రశ్నలన్నింటిపై సభ్యులు చ‌ర్చించారు. ముఖ్యంగా న‌గ‌రంలోని గ్రేవ్ యార్డులు, శానిటేష‌న్, నాలాలు, రోడ్ల అభివృద్దిపై ఫోక‌స్ చేశారు. స్టాండింగ్ క‌మిటీ అమోదం తెలిపిన 57 అంశాల‌తో పాటు మ‌రో 7 అంశాల‌కు ఒకే చెప్పింది కౌన్సిల్‌.గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సాధార‌ణ కౌన్సిల్ మీటింగ్ నగరంలోని ప‌లు స‌మస్యల‌పై చ‌ర్చింది. సభ్యుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలతో కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. గ్రేట‌ర్‌ ప‌రిధిలోని గ్రేవ్‌యార్డుల అభివృద్ధిపై త‌గినంతగా దృష్టి పెట్టలేదంటూ సైదాబాద్ కార్పొరేట‌ర్ సింగిరెడ్డి స్వర్ణల‌త అధికారుల తీరుపై అస‌హ‌నం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నేరుగా సంద‌ర్శించి త‌మ డివిజ‌న్ లోని స్మశాన వాటిక అభివృద్దికి 2కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే దానిని అభివృద్ది చేయడంలో త‌గిన శ్రద్ద పెట్టడంలేద‌న్నారు. ఇత‌ర స‌భ్యులు కూడా త‌మ త‌మ ప్రాంతాల్లో గ్రేవ్ యార్డుల అభివృద్దిపై అధికారుల‌ను ప్రశ్నించారు.

896 శ్మశాన వాటికల్లో..
గ్రేట‌ర్ పరిధిలోఉన్న మొత్తం 896 శ్మశాన వాటిక‌ల్లో 24 గ్రేవ్ యార్డుల‌ అభివృద్దికి 25కోట్లు ఖ‌ర్చు చేస్తున్నట్టు క‌మిష‌న‌ర్ జ‌నార్దన్ రెడ్డి చెప్పారు. అయితే స్మశానాల‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత స‌భ్యులంద‌రిపైనా ఉంద‌న్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. అంతకు ముందు కౌన్సిల్‌ సమావేశం కాగానే మాజీ మేయ‌ర్ ఎంఐఎం సభ్యుడు మాజీద్ హుస్సేన్ .. స‌మ్మర్ యాక్షన్ ప్లాన్ పై చ‌ర్చించాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. అయితే ప్రశ్నోత్తరాల‌పై చ‌ర్చ త‌రువాతే మిగతా విషయాలపై చర్చిద్దామని మేయర్‌ సూచించడంతో సభలో కొద్దిసేపు గంద‌ర‌గోళం నెల‌కొంది. తర్వాత సిటీలో శానిటేష‌న్ కార్మికుల హాజ‌రు, వేత‌నాల చెల్లింపులో చెప‌ట్టిన సంస్కర‌ణ‌ల‌పై కౌన్సిల్‌లో చర్చజరిగింది. అకౌంట‌బులిటి పెంచేందుకే బ‌యోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామ‌ని అధికారులు సమాధానం చెప్పారు. అయితే శానిటేష‌న్ కార్మికులను సూప‌ర్‌వైజ్ చేయాల్సిన శానిట‌రీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత10 ఏళ్లుగా ఒకే చోట ప‌నిచేయడం వ‌ల్ల స‌మ‌స్యలు వ‌స్తున్నాయ‌ని.. వారిని మార్చడానికి స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరారు. మరోవైపు కార్పొరేష‌న్ ప‌నుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఒకే కాంట్రాక్టర్ ప‌దుల సంఖ్యలో ప‌నులు తీసుకుంటూ వాటిని స‌కాలంలో పూర్తి చేయడంలో విఫ‌ల‌మౌతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ప్రతిపనిలోనూ అవినీతికి పాల్పడుతున్నార‌ని స‌భ్యులు అరోపించారు.

విపక్ష సభ్యుల ఆరోపణలు..
పాల‌క మండ‌లి జ‌నరల్ బాడి స‌మావేశం చాలా అర్థవంతంగా జ‌రిగింద‌న్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. దీనిపై పై ప్రతిప‌క్ష స‌భ్యులు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. ఒక అంశంపై పూర్తిస్థాయిలో చ‌ర్చించ‌కుండానే మ‌రో అంశంలోకి వెళ్తున్నార‌ని మండిప‌డుతున్నారు వారు. అధికారులు అవినీతికి పాల్పడుతుండటంతో.. కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా వ్యహరిస్తున్నారని. దీంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయక..గ్రేటర్‌ సిటీమొత్తం అస్తవ్యస్తంగా మారుతోందని విపక్షసభ్యులు ఆరోపించారు.

10:14 - April 14, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. రెండు అంతర్జాతీయ సదస్సులకు హాజరుకావాలని ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలో జరిగే ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సుకు రావాలని కేటీఆర్‌ని అమెరికా ఇంజినీర్ల సంఘం ఆహ్వానించింది. ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సులో మిషన్ భగీరథపై మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌ను అమెరికా ఇంజినీర్ల సంఘం కోరింది. మే 21 నుంచి 25 వరకు ఈ సదస్సు జరుగనుంది. వాటర్ కాంగ్రెస్‌లో ప్రారంభోపన్యాసం చేసే తొలి విదేశీ వ్యక్తి మంత్రి కేటీఆర్ కానున్నారు. అదేవిధంగా మే 18, 19 వ తేదీల్లో జరుగనున్న వార్షిక సదస్సులో ప్రసంగించాలని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కేటీఆర్‌ను ఆహ్వానించింది. రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు గుర్తింపుగా అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానాలు అందినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

10:12 - April 14, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్న వారికి ఢిల్లీలో ఘన సన్మానం జరిగింది. సమైక్య తెలుగు ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన డాక్టర్‌ త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, ఎక్కా యాదగిరిరావు, చింతకింది మల్లేషం, మహ్మద్‌ అబ్దుల్‌ వహీద్‌ను ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ అవార్డు దక్కడం తమకు ఆనందంగా ఉందని అవార్డు గ్రహీతలు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:10 - April 14, 2017

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎంపీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతు పలికిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు ఆనంద భాస్కర్‌లకు పవన్ కృతజ్ఞలు తెలిపారు. అటు వైసీపీ ఎంపీలు హోదాకోసం పోరాడుతున్న తీరును కూడా పవన్‌ అభినందించారు. ప్రత్యేక హోదా పై టీడీపీ రాజీపడుతోందని.. ఇలా రాజీపడే హక్కు ఆపార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదన్నారు జనసేనాని. హోదా అంశం పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మౌనంగా కూర్చోవడం, టీడీపీ ఎంపీలు సభకే రాకపోవడం వంటి దృశ్యాలు తీవ్రంగా బాధించాయని పవన్ ట్వీట్‌ చేశారు. అటు బీజేపీ నేతల వర్ణవివక్ష కామెంట్స్‌ను మరోసారి ట్విటర్‌లో ప్రస్తావించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల విభజన విషయంలో వివక్షచూపుతోందని పవన్‌ ట్విటర్‌లో విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విభజన డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నా.. కేవలం దక్షిణాది రాష్ట్రాలనే ఎందుకు విడదీస్తున్నారని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నలు సంధించారు. అటు ఉత్తరాది నేతల వర్ణ వివక్షపై కూడా జనసేన అధ్యక్షుడు మరో సారి ఘాటుగా ట్వీట్‌చేశారు. దక్షిణ భారతీయులపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. ఒకవేళ తరుణ్‌విజయ్‌, బీజేపీ నేతలు నిజంగా తమ చర్యలకు క్షమాపణ చెప్పాలని భావిస్తే.. వారు ద్రవిడ భాష ఒక్కటైనా నేర్చుకోవాలి..అప్పుడే వారు దక్షిణాదివారిని ఎంతటి వేదనకు గురిచేస్తున్నారో అర్థమవుతుందని కామెంట్‌ పెట్టారు జనసేన అధినేత. వర్ణవివక్ష లాంటి కుట్రలను ఎదుర్కోవాలంటే.. దక్షిణాదిన రాజకీయపార్టీలన్నీ ఒకే తాటిమీదకు రావాలని పవన్‌కళ్యాణ్‌ ట్విటర్‌లో రాశారు.

10:08 - April 14, 2017

విజయవాడ : మరో బృహత్తర కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రాజధానిలో అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చారిత్రక ఘట్టానికి ఇవాళ తొలి అడుగులు పడబోతున్నాయి. రాజ్యాంగ నిర్మాత... దళితుల ఆశాజ్యోతి బీఆర్‌ అంబేద్కర్‌కు అమరావతిలో ఘనమైన నివాళి లభించబోతుంది. దేశంలోని ఎక్కడలేని విధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విగ్రహంతో పాటు స్మృతివనం పేరుతో లైబ్రరీని, ఓపెన్ ధియేటర్‌ను నిర్మించబోతున్నారు. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో 98 కోట్ల వ్యయంతో శాఖమూరు ..ఐనవోలు గ్రామాల మధ్య ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డిజైన్స్‌కు ముఖ్యమంత్రి ఆమోదం కూడా తెలిపారు. ప్రారంభించిన ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బాబు శంకుస్థాపన..
అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. విగ్రహ నిర్మాణానికి అంబేద్కర్‌ జన్మస్థలం, పార్లమెంట్ నుంచి మట్టిని కూడా సేకరించారు. యమున నది నుంచి నీటిని కూడా తీసుకొచ్చి విగ్రహ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ రెండు బృందాలుగా వెళ్లి వీటిని సేకరించారు. శంకుస్థాపనలో వీటిని ఉపయోగించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి దళితులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి నక్కా ఆనంద్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

10:05 - April 14, 2017

హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనేక సవరణలు చేసిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వివిధ గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ విడుదలైంది. గతంలో ఫిబ్రవరి 7న విడుదల చేసిన నోటిఫికేషన్‌పై విద్యార్థుల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. డిగ్రీ, పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత కావాలని, పీజీటీ పోస్టులకు మూడేళ్ల బోధనానుభవం ఉండాలని నిబంధనలు పెట్టారు. దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత రావడంతో సీఎం కేసీఆర్‌ స్పందించారు. ప్రథమ శ్రేణి నిబంధనను తొలగించాలని సూచించారు. దీంతో నిబంధనలను పరిశీలించిన అధికారులు.. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

7,306 పోస్టులు..
మొత్తం 7,306 పోస్టుల భర్తీకి గాను టీఎస్‌పీఎస్సీ 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు 921, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు 4,362, ఫిజికల్‌ డైరక్టర్లు 6, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు 616, ఆర్ట్‌ టీచర్లు 372, క్రాఫ్ట్‌ టీచర్లు 43, మ్యూజిక్‌ టీచర్లు 197, లైబ్రరియన్లు 256, స్టాఫ్‌ నర్సులు 533 చొప్పున మొత్తం 7,306 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇవి ఎస్సీ గురుకులాల్లో 2,136, గిరిజన గురుకులాల్లో 934, బీసీ గురుకులాల్లో 1,789, మైనారిటీ గురుకులాల్లో 2,080, సాధారణ గురుకులాల్లో 307 పోస్టుల చొప్పున ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తానికి గురుకులాల్లో ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

10:02 - April 14, 2017

హైదరాబాద్‌ :  తిరుమ‌ల‌గిరి ఆర్టీఎ ఆఫీస్ ముందు ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను జీహెచ్ఎంసీ టిప్పర్ ఢీకొట్టడంతో టూ వీలర్‌పై వెళ్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన నలుగురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరిలించారు. డ్త్రెవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో ఉన్నట్లు గుర్తించిన‌ పోలీసులు,.డ్రైవర్‌పై ఎలాంటి కేసు పెట్టలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన ముంగిచుకోని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాద ఘటనను చూసి చల్లిచిపోయారు. మంత్రి స్వయంగా క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. క్షతగాత్రులకయ్యే చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

10:00 - April 14, 2017

ఢిల్లీ : ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అమెరికా దాడులను ముమ్మరం చేసింది. ఇటీవలే సిరియాలో క్షిపణి దాడితో విధ్వంసం సృష్టించిన అమెరికా..ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో మరో భారీ దాడికి పాల్పడింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్‌లో అతిపెద్ద బాంబును విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది. 9,525 కిలోల బరువు కలిగిన ఆ భారీ బాంబును MC-130 ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి వదిలినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఇంత భారీ బాంబుతో దాడి చేయడం అమెరికాకు ఇదే తొలిసారి కావడం విశేషం. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ MOABగా పిలుచుకునే ప్రపంచంలోనే అతి పెద్ద బాంబును అమెరికా గురువారం ప్రయోగించింది. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్‌ సొరంగాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా బీకర దాడులకు పాల్పడింది. రాత్రి 7 గంటల సమయంలో నంగర్‌హర్‌ రాష్ట్రం అచిన్‌ ప్రాంతంలోని ఖొరాసన్‌ సొరంగంపై 9,797 కిలోల బరువున్న అతిపెద్ద బాంబును అమెరికా యుద్ధ విమానం MC-130 జారవిడిచింది. GBU-43 పేరున్న ఈ MOABని యుద్ధ కేత్రంలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పెంటగన్‌ ప్రతినిధి ఆడమ్‌ స్టంప్‌ తెలిపారు..

సిరియాపై దాడి..
ఇటీవలే సిరియాలో క్షిపణి దాడితో విధ్వంసం సృష్టించిన అమెరికా..ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై దృష్టిపెట్టింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్‌ ప్రాంతం లక్ష్యంగా చేసుకొని బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఆఫ్టనిస్తాన్‌పై ప్రయోగించిన బాంబుల్లో అతిపెద్దదైన జిబియూ-43 అనే ఈ బాంబు అణు రహిత బాంబు అని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేస్తోంది. బాంబులకు తల్లి అని ముద్దుగా పిలుచుకునే ఈ బాంబు ప్రభావం 300 మీటర్ల వ్యాసార్ధం వరకూ ఉంటుంది. అయితే బాంబు ప్రయోగించే సమయంలో సాధారణ పౌరులకు నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ చెప్పారు.

ఎంత నష్టం ?
అఫ్గాన్‌లోని ఐసిస్‌ను ఓడించేందుకు కొనసాగుతున్న దాడుల్లో భాగంగానే ఈ బాంబును ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికారులు వెల్లడించారు. నిజానికి MOAB అంటే మాసివ్‌ ఆర్డినెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ అని అర్థం. 2003లో ఇరాక్‌ యుద్ధ సమయంలో ఈ బాంబు తయారుచేసినా ఇంతవరకూ వినియోగించలేదు. ఈ బాంబు తయారుచేసిన కొద్ది కాలానికే అంటే 2007లో MOAB కంటే శక్తివంతమైన ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్‌ను రష్యా తయారుచేసింది. దీని ప్రభావం కూడా 300 మీటర్ల వరకు ఉంటుంది. అయితే అమెరికా ప్రయోగించిన MOAB బాంబు వల్ల ఏ ఉగ్రవాద గ్రూపునకు ఎంత నష్టం వాటిల్లిందని ఇంకా తెలియరాలేదు. అయితే ఉగ్రవాదులకు మాత్రం మూడిందని రక్షణ నిపుణుల ద్వారా తెలుస్తోంది.

నేడు బీఆర్ అంబేద్కర్ జయంతి..

హైదరాబాద్ : నేడు డా.బి.ఆర్.అంబేద్కర్ 126వ జయంతి. ఈ సందర్భంగా ఉదయం పది గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్, సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొననున్నారు.

అంబేద్కర్ విగ్రహానికి బాబు శంకుస్థాపన..

విజయవాడ : నేడు డా.బి.ఆర్.అంబేద్కర్ 126వ జయంతి. ఈ సందర్భంగా అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు.

భీమ్ - ఆధార్ యాప్ ను ఆవిష్కరించనున్న మోడీ..

ఢిల్లీ : నేడు డా.బి.ఆర్.అంబేద్కర్ 126వ జయంతి. ఈ సందర్భంగా భీమ్ - ఆధార్ యాప్ ను ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించనున్నారు. డిజిటల్ చెల్లింపుల దిశగా వ్యాపారులు, వినియోగదారులను ప్రోత్సాహించేందుకు రెండు పథకాలను మోడీ ప్రారంభించనున్నారు.

నేడు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు..

హైదరాబాద్ : శుక్రవారం టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పార్టీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న నాయినీ వెల్లడించారు. 11గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఈనెల 18 అని తెలిపారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. 21న కొంపల్లి ప్లీనంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని నాయినీ పేర్కొన్నారు.

 

ఏపీలో 'కనెక్టడ్ ఏపీ సీఎం' యాప్...

విజయవాడ : నేడు 'కనెక్టడ్ ఏపీ సీఎం' యాప్ ఆవిష్కరణ జరగనుంది. ఈ యాప్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు, సూచనల కోసం ఈ ప్రత్యేక యాప్ ను రూపొందించారు.

ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు.

ఢిల్లీ : ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్ లో బెంగళూరు - ముంబాయి జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాజ్ కోట్ వేదికగా గుజరాత్ - పుణె జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

రైల్వే ట్రాక్ పై సెల్ఫీ..ముగ్గురి మృతి..

బెంగాల్ : హౌరాలో రైలు ఢీకొన్ని ముగ్గురు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. ట్రాక్ పై సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదర్ గూడలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో హైదర్ గూడలో చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

బసవతారకం క్యాన్సర్ డాక్టర్ సూసైడ్..

హైదరాబాద్ : మాదాపూర్ లోని మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. అతిథి గృహంలో ఫ్యాన్ కు డాక్టర్ అనూష ఉరి వేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో అనూష ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అనూష స్వస్థలం విశాఖ జిల్లా గాజువాకగా గుర్తించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అనూష పనిచేస్తోంది.

 

పంజాబ్ పై కోల్ కతా విజయం..

ఐపీఎల్ 10 మ్యాచ్ లో పంజాబ్ జట్టు పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో కోల్ కతా గెలుపొందింది. పంజాబ్ స్కోర్ 170/9...కోల్ కతా స్కోర్ -171/2.

తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం..

సికింద్రాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి, ముగ్గురు పిల్లలు అజర్, అమన్, అశ్రియ, ఆలీలున్నారు. తల్లి, మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు బన్సీలాల్ పేట వారిగా గుర్తించారు. అదే సమయంలో సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు మంత్రి కేటీఆర్ తన కాన్యాయ్ తో వస్తున్నారు. తన కాన్వాయ్ లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మృతులకు రూ. 5 లక్షల చొప్పున మంత్రి కేటీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Don't Miss