Activities calendar

15 April 2017

పంజాబ్ విజయలక్ష్యం 189 పరుగులు

ఐపీఎల్ 10 : ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విజయలక్ష్యం 189 పరుగులుగా ఉంది. 
 

21:58 - April 15, 2017

హైదరాబాద్ : ముస్లిం, గిరిజన రిజ‌ర్వేష‌న్ల బిల్లు ఆమోదం కోసం రేపు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్పీక‌ర్ మ‌ధుసూదనాచారి అధ్యక్షత‌న జ‌రిగిన బీఏసీ మీటింగ్‌లో  ఒక్కరోజు అసెంబ్లీని స‌మావేశప‌ర్చాల‌ని నిర్ణయించారు. అయితే ఈ బీఏసీ మీటింగ్‌కు టీడీపీ స‌భ్యుడు సండ్రను అనుమతించ‌కపోవ‌డం వివాదాస్పదమైంది. 
వాడీవేడీగా బీఏసీ స‌మావేశం
ఆదివారం ఒక్కరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ శాసనసభ బిజినెస్ అడ్వైజరి కమిటీ నిర్ణయించింది. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాటి అసెంబ్లీ సమావేశంలో ముస్లిం, గిరిజన రిజర్వేషన్, బిల్లుతో పాటు..  జీఎస్టీ, హెరిటేజ్ బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. స్పీక‌ర్ చాంబ‌ర్లో జరిగిన బిఏసీ స‌మావేశంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క.. చిన్నా రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ పాల్గొన్నారు. 
పలు బిల్లులను బీఏసీకి వివరించిన సీఎం కేసీఆర్ 
ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి వచ్చిన జీఎస్టీ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న రిజర్వేషన్ల బిల్లు, తెలంగాణ హెరిటేజ్ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ బీఏసీకి వివరించారు. దీనికోసం ఒక్క రోజు సమావేశాన్ని నిర్వహిస్తే సరిపోతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఐతే దీనిపై కాంగ్రెస్, బీజేపీలు అభ్యంత‌రం వ్యక్తం చేశాయి. కనీసం మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మ‌రోవైపు బిల్లు కాపీల‌ను పంపించ‌క‌పోవ‌డంపై ప్రశ్నించిన కాంగ్రెస్.. స‌భ్యుల‌కు స‌మాచారం లేకుండా  స‌భ‌లో ఎలా మాట్లాడాల‌ని నిల‌దీశారు.
ముస్లిం రిజ‌ర్వేష‌న్లపై బీజేపీ అభ్యంత‌రం 
ముస్లిం రిజ‌ర్వేష‌న్లపై బీజేపీ అభ్యంత‌రం వ్యక్తం చేసింది. అందులోనూ ఎస్టీ రిజ‌ర్వేష‌న్ బిల్లును, ముస్లిం రిజ‌ర్వేష‌న్‌ల‌తో ఎలా క‌లిపి స‌భ‌లో పెడ‌తారని ప్రశ్నించింది. రాజ్యాంగబ‌ద్ధమైన ఎస్టీ రిజ‌ర్వేష‌న్‌ల‌ను.. మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లతో ఎలా క‌లుపుతార‌ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అయితే విప‌క్షాలు కావాల‌ని రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. దీంతో వారికి ముస్లిం, ఎస్టీలప‌ట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో తేలిపోయింద‌ని టీఆర్ఎస్ మండిప‌డింది. 
టీసర్కార్ తీరుపై టీడీపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం 
మరోవైపు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను స్పీకర్ అనుమతించక పోవ‌డం గంద‌ర‌గోళం సృష్టించింది. గత సమావేశాల్లో రేవంత్ రెడ్డి, సండ్రను సస్పెండ్ చేసినందు వల్ల.. ఇప్పుడు అవే సమావేశాలు కొనసాగుతున్నందున సస్పెన్షన్ కంటిన్యూ అవుతోందని స్పీకర్ తేల్చి చెప్పడంతో సండ్ర వెనక్కి వచ్చేశారు. దీనిపై టీడీపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు. 
వారిపై చర్యలు తీసుకుంటాం : స్పీకర్ 
టీడీపీ స‌భ్యుల‌కు పొర‌పాటుగా తమ కార్యాలయం లేఖ పంపించిందని.. వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. మ‌రోవైపు బిల్లు కాపీల‌ను స‌భ్యుల ఇంటికి పంపిస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. స‌భ్యుల‌కు వాటిని చ‌దివేందుకు స‌మ‌యం లేనందున.. దీనికోస‌మై.. ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మావేశం కావ‌ల్సిన అసెంబ్లీ .. 11 గంట‌ల‌కు స‌మావేశ‌మ‌వ్వాల‌ని స్పీక‌ర్ నిర్ణయించారు.

21:51 - April 15, 2017

హైదరాబాద్ : ముస్లిం మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. మైనార్టీలకు 12, గిరిజనులకు 10శాతం చొప్పున రిజర్వేషన్‌ పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది.  రేపు ప్రత్యేకంగా సమావేశంకానున్న అసెంబ్లీ..  రిజర్వేషన్ల పెంపు ముసాయిదా బిల్లులను ఆమోదించనుంది. 
టీ.కేబినెట్‌ లో కీలక నిర్ణయాలు 
తెలంగాణ మంత్రివర్గం.. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  రెండుగంటలకు పైగా సాగిన సమావేశంలో మొత్తం 31 అంశాలపై చర్చించారు. ప్రధానంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కేబినెట్‌ నిర్ణయించింది. రిజర్వేషన్ల పెంపుపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని సీఎం సహచర మంత్రులతో వ్యాఖ్యానించారు.  న్యాయపరమైన చిక్కులు లేకుండా రిజర్వేషన్లు పక్కాగా ఉండేలా చూడాలన్నారు.
ముస్లిం మైనార్టీలకు 12, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ 
ఉమ్మడి రాష్ట్రంలో బిసి -ఈ కింద ముస్లింలకు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన రిజర్వేషన్లు ఎందుకు నిలిచిపోయాయో ఒకసారి చూసుకుని.. మళ్లీ అలాంటి ఆటంకాలు కలుగకుండా అమలు చేయాలని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైంది 4శాతమేనని.. అందులోనూ దూదేకుల కులం బీసీ -బి కింద ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు దీన్ని కూడా బీసీ -ఈ కిందకు తీసుకొచ్చి మొత్తంగా 12శాతాన్ని యధాతథంగా అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక గిరిజనుల విషయంలో మాత్రం ఎటువంటి ఆటంకం లేదని... 2011 నుంచి గిరిజన జనాభా పెరిగిందని... వీరికి 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సిందేనని నిర్ణయించారు.
1300 మంది ఫారెస్ట్‌ అధికారుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన 10అంశాలు, నీటి పారుదలశాఖలోని వివిధ అంశాలను కేబినెట్‌ ర్యాటిఫికేషన్‌ చేసినట్టు తెలుస్తోంది.  వీటితోపాటు ఆదిలాబాద్‌లోని పోలీస్‌ బెటాలియన్‌కు 111 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 10ఎకరాలు, 1300 మంది ఫారెస్ట్‌ డిఫార్ట్‌మెంట్‌ అధికారుల పోస్టు భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మత్స్యకారుల ఎక్స్‌గ్రేషియాను  6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  మొత్తానికి ఆదివారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రెండు రిజర్వేషన్ల బిల్లులతోపాటు జీఎస్టీకి కూడా సభ ఆమోదముద్ర వేయనుంది.

 

21:45 - April 15, 2017

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన

హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన బీజేపీ పిలుపునిచ్చింది. 

 

హైదరాబాద్ పై కోల్ కతా విజయం

ఐపీఎల్ 10 : హైదరాబాద్ పై కోల్ కతా విజయం సాధించారు. సన్ రైజర్స్ పై 17 పరుగుల తేడాతో కోల్ కతా గెలుపొందింది. కోల్ కతా ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 

 

21:27 - April 15, 2017
21:25 - April 15, 2017
21:24 - April 15, 2017
21:22 - April 15, 2017

పోంగ్యాంగ్ : ఉత్తర కొరియా భారీ ఆయుధ సంపదను ప్రదర్శించింది. అమెరికాతో సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా ఏ తరహా దాడులు చేసినా దానికి తగిన సమాధానం చెబుతామని హూంకరిస్తోంది. అవసరమైతే తాము అణు దాడులు చేసేందుకు వెనకాడమని అగ్రరాజ్యాన్ని హెచ్చరిస్తోంది. ఉత్తర కొరియా దూకుడు చూస్తుంటే యుద్ధం తప్పదేమేనని అనిపిస్తోంది.
కిమ్‌ రెండవ సంగ్‌ 105వ జయంత్యుత్సవాలు
ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ రెండవ సంగ్‌ 105వ జయంత్యుత్సవాల ప్యొంగ్‌యాంగ్‌లో భారీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ప్యొంగ్‌యాంగ్‌లో జరిగిన మిలిటరీ పరేడ్‌లో ఉత్తర కొరియా తమ సైనిక బలగాన్ని ప్రదర్శించింది... కిమ్‌ సైన్యాధికారులకు అభివాదం చేశారు.
భారీ పరేడ్‌ 
సైనికులు, యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధ సంపత్తితో భారీ పరేడ్‌ నిర్వహించారు. ప్రభుత్వ టెలివిజన్‌ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. సైనికాధికారులు, పార్టీ నేతలతో కలిసి కిమ్‌ పరేడ్‌ను చూశారు. కిమ్‌ రెండవ సంగ్‌ 105వ జయంత్యుత్సవాల సందర్భంగా శక్తిప్రదర్శన నిర్వహించినట్లు టీవీలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.
ఏ తరహా దాడులు చేసినా జవాబు చెబుతాం : చో ర్యోంగ్ హే
ఈ వేడుకల్లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ ప్రసంగించలేదు. కిమ్‌ తర్వాత నెంబర్‌ టూగా ఉన్న మిలిటరీ అధికారి చో ర్యోంగ్‌ హే మాట్లాడారు. ఎలాంటి అణుదాడికైనా సమాధానం చెప్పేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఏ తరహా దాడులు చేసినా తాము జవాబు చెబుతామని హెచ్చరించారు. కిమ్‌ జోంగ్‌ ఆరో అణు పరీక్షకు ఆదేశించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఉ.కొరియా భారీ ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం ద్వారా తన వైఖరేంటో చెప్పకనే చెప్పింది.
ఏ క్షణంలోనైనా యుద్ధం జరగొచ్చు : చైనా 
ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో ఏ క్షణంలోనే యుద్ధం జరిగే అవకాశం ఉందని చైనా ఆందోళన చెందుతోంది. ఉద్రిక్తతలను సడలించేందుకు సహాయం చేయాలని రష్యాను కోరింది. సంయమనం పాటించాలని చైనా, రష్యాలు ఇరు దేశాలకు సూచించాయి. 
ఉ.కొరియా అణ్వాయుధ ప్రయోగాలపై అమెరికా ఆగ్రహం 
ఐక్యరాజ్యసమితి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా అణ్వాయుధా ప్రయోగాలను చేపట్టడంపై అమెరికా ఆగ్రహంతో ఉంది. దక్షిణ కొరియాకు రక్షణగా తమ దేశ నేవీ దళాన్ని మోహరించింది. ఉత్తర కొరియా బెదిరింపులకు తలొగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. 

 

 

21:12 - April 15, 2017

హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రగతినగర్ గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రగతి నగర్ గ్రామంలోని అంబీర్ చెరువును పరిశీలించారు. చెరువులో పేరుకున్న గుర్రపు డెక్కను తొలగించి శుద్ది చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్ నుండి జెఎన్ టీయూకు వెళ్ళే రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు సీహెచ్.మల్లారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కె.పి.వివేకానంద గౌడ్, శాసనమండలి సభ్యులు శంబీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ యం.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

21:10 - April 15, 2017

హైదరాబాద్ : గులాబీ కూలీ దినాలంటూ టీఆర్ఎస్ నేతలు ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దానం నాగేందర్‌ విమర్శించారు. మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి కొన్ని నిమిషాలు పనిచేయగానే అన్ని లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అదే ప్రాంతంలో తాము... మంత్రులు చేసిన పనే చేస్తామని... తమకు కూడా అంత నగదు కూలీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే అక్కడే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 

20:57 - April 15, 2017

కాబూల్ : ఆఫ్గానిస్థాన్‌లోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల రహస్య స్థావరాలపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబు దాడిలో మృతిచెందిన మిలిటెంట్ల సంఖ్య 90కి చేరింది. ఈ విషయాన్ని నన్‌గర్హార్ ప్రావిన్స్ ప్రతినిధి అటావుల్లా ఖోగ్యని తెలిపారు. అంతకు ముందు 36 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా ఆఫ్గన్‌ పోలీసులు పేర్కొన్నారు. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌గా పిలిచే జీబీయూ 43 అతి పెద్ద బాంబును నన్‌గర్‌హార్‌ ప్రాంతానికి చెందిన అచిన్‌ జిల్లాలోని ఐసిస్‌ స్థావరాలపై గురువారం రాత్రి జారవిడిచింది. ఆఫ్గనిస్తాన్‌-పాక్‌ సరిహద్దులో నేలమాలిగళ్లో దాగిన ఐసిస్‌ ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును ప్రయోగించింది. ఈ బాంబు దాడిలో ఐఎస్‌ గ్రూపునకు చెందిన టన్నెల్ సముదాయం పూర్తిగా నేలమట్టమైంది. ఈ బాంబు బరువు 9 వేల 8 వందల కిలోలు. 

 

20:53 - April 15, 2017

గోవా : కేంద్ర రక్షణ శాఖ మంత్రి పదవిలో ఒత్తిడి కారణంగానే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా హాజరైన ఓ కార్యక్రమంలో పారికర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు పిటిఐ కథనం. ఢిల్లీలో ఉన్నపుడు కశ్మీర్‌ సహా పలు కీలక అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉండడం వల్ల తనపై ఒత్తిడి ఉండేదని పారీకర్‌ పేర్కొన్నారు.  గోవాకు సిఎంగా అవకాశం రావడంతో వెంటనే అంగీకరించడానికి అదొక కారణమని పారీకర్‌ చెప్పారు. ఒత్తిడి కారణంగా రక్షణశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారన్న పిటిఐ కథనాన్ని బీజేపీ మీడియా సెల్‌ ఓ ప్రకటనలో ఖండించింది. రక్షణ మంత్రిగా పారీకర్‌ విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారని కితాబిచ్చింది.

20:50 - April 15, 2017

జమ్మూకాశ్మీర్ : శ్రీనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి  ఫరూఖ్‌ అబ్దుల్లా విజయం సాధించారు. పిడిపి అభ్యర్థి నజీర్‌ ఖాన్‌పై ఆయన 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజల మద్దతు కోల్పోయిన పిడిపి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఫరూక్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు.  ఏప్రిల్‌ 9న శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అల్లర్ల కారణంగా పోలింగ్‌ అత్యల్పంగా 7 శాతం పోలింగ్‌ నమోదైంది.  బుద్గాం జిల్లాలోని 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్‌ నిర్వహించారు. పీడీపీ నేత తారిఖ్‌ హమీద్‌ కర్రా రాజీనామతో  శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో 8 మంది మృతి చెందారు. 

20:48 - April 15, 2017

హైదరాబాద్ : ఇంత హడావుడిగా బీఏసీ, ఆ తర్వాత వెంటనే ఒకరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని.... కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి... చర్చ జరిపిన తర్వాతే ముందడుగువేస్తే బావుండేదని సూచించారు. అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. 

 

20:45 - April 15, 2017

హైదరాబాద్ : హడావుడిగా బీఏసీ... ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తప్పుబట్టారు. అంత వేగంగా ఇంత ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. తాజా బిల్లులపై రెండు రోజులపాటు చర్చ జరిగేలా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిల్లులపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. 

 

20:43 - April 15, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్ల అంశాన్ని వేగంగా ముగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌ రెడ్డి విమర్శించారు. హడావుడి సమావేశాలు సరికాదన్నారు. బిల్లులను చదివే సమయంకూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లను ఒకే బిల్లులో పెట్టడం సరికాదని మండిపడ్డారు.

 

20:39 - April 15, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో ఎండ వేడి తట్టుకోలేక 6 కోడెలు మృత్యువాతపడ్డాయి. దేవస్థానంలోని గోశాలలో ఈ గోవుల్ని పట్టించుకునేవారే కరువయ్యారు. మార్చి 31న పచ్చగడ్డి టెండర్‌ ముగిసింది. మళ్లీ టెండర్‌ నిర్వహించినా సరైన ధర రాక టెండర్‌ రద్దు చేశారు. దీంతో కోడెలకు పచ్చగడ్డివేసేవారే కరువయ్యారు. 

 

20:37 - April 15, 2017

వ‌రంగ‌ల్ : పండ్ల మార్కెట్‌లో నిషేధిత రసాయనాలు వినియోగిస్తున్న దుకాణాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ యార్డులోని ప‌లు దుకాణ‌ల్లో తనిఖీలు నిర్వహించి... సుమారు 15 కిలోల నిషేధిత చైనా పౌడ‌ర్  వాడుతున్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. మార్కెట్ యార్డులో ఇథిలిన్ ఛాంబ‌ర్లు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో... వినియోగంలోకి రాలేదు. ప్రభుత్వం నిషేధం విధించినా... వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుందన్న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

20:32 - April 15, 2017

హైదరాబాద్ : ఇందిరాపార్క్‌ నుంచి ధర్నాచౌక్‌ ఎత్తివేతపై పోరు ఉధృతమవుతోంది. ధర్నాచౌక్‌ను రక్షించుకునేందుకు  పరిరక్షణ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.  సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు రిలే నిరసన దీక్షలకు దిగాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ధర్నాచౌక్‌ను పరిరక్షించుకోవాలని నిర్ణయించాయి. 
ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత
ఇందిరాపార్క్‌ దగ్గరి ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత పెరుగుతోంది. విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. ధర్నా చౌక్‌ పరిరక్షణకు నడుంబిగించాయి. వామపక్షాలు , పలు ప్రజాసంఘాల నేతలు ధర్నాచౌక్‌ పరిరక్షణే లక్ష్యంగా మగ్దూం భవన్‌లో రిలే నిరసన దీక్షలకు దిగారు. ఈ దీక్షలను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రారంభించారు. వామపక్ష నాయకులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ధర్నా చౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు నెలరోజుల పాటు సాగనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి ట్రాన్స్‌జెండర్ల వరకు ప్రతిరోజు  దీక్షలో కూర్చోనున్నారు. 
కేసీఆర్‌ నియంత పాలన : తమ్మినేని 
తెలంగాణలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడానికే ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలని కుట్రపన్నిందన్నారు. ధర్నాచౌక్‌ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ధర్నాల అవసరం లేని ధర్మ పాలన : చాడ  
ఉద్యమాల ద్వారానే తెలంగాణను సాధించుకున్నామన్న విషయాన్ని కేసీఆర్‌ మర్చిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ధర్నాచౌక్‌ వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ధర్నాల అవసరం లేని ధర్మ పాలన కేసీఆర్‌ చేస్తున్నారా అని మండిపడ్డారు. ధర్నాచౌక్‌ పరిరక్షణకు అన్ని సంఘాలు కలిసి వస్తున్నాయి. జిల్లాల్లోనూ విస్తృతంగా రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహించాలని నేతలు సూచించారు. ధర్నా చౌక్‌ను రక్షించుకోవడానికి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

 

20:22 - April 15, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజర్వేషన్ల బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గిరిజనులకు 10, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. రెండు ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి నీరు తరలించేలా ఎత్తిపోతలకు ఆమోద ముద్ర వేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణకు తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 3.66 శాతం డీఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. వాల్మీకి బోయలు, కాయిత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

20:19 - April 15, 2017

హైదరాబాద్ : బీఏసీ సమావేశానికి రమ్మంటూ ఆహ్వానించి తమను తీవ్రంగా అవమానించారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తీరా బీఏసీకి వచ్చాక అసెంబ్లీలో సస్పెన్షన్‌ కొనసాగుతుందని చెప్పడం అన్యాయమని విమర్శిస్తున్నారు. తమను ఎందుకు సస్పెండ్‌ చేశారో.. వీడియో ఫుటేజ్‌ బయటపెట్టాలని స్పీకర్‌ను అడిగినా సమాధానం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.

 

20:14 - April 15, 2017

హైదరాబాద్ : రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. శాసనసభ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రిజర్వేషన్లు, జీఎస్టీ, హెరిటేజ్ బిల్లులపై చర్చ జరగనుంది. రేపటి సమావేశం గురించి... స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం నుంచి ఖాద్రీపాషా హాజరయ్యారు. అయితే సమావేశానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మధ్యలోనే వెళ్లిపోయారు. తనపై సస్పెన్షన్‌ కొనసాగుతుండటంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. 

 

రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ : రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. శాసనసభ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రిజర్వేషన్లు, జీఎస్టీ, హెరిటేజ్ బిల్లులపై చర్చ జరగనుంది. 

మరో కేసులో చిక్కుకున్న సంజయ్‌ దత్‌

ముంబై : బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ మరో కేసులో ఇరుక్కున్నారు. దర్శక నిర్మాత షకిల్‌ నూర్‌ అలీని బెదిరించిన కేసులో సంజయ్ దత్ కు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. అరెస్టు వారెంట్ ను కూడా జారీ చేసింది. 
 

20:10 - April 15, 2017

ముంబై : బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ మరో కేసులో ఇరుక్కున్నారు. దర్శక నిర్మాత షకిల్‌ నూర్‌ అలీని బెదిరించిన కేసులో సంజయ్ దత్ కు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. అరెస్టు వారెంట్ ను కూడా జారీ చేసింది. 
 

20:04 - April 15, 2017

గుంటూరు : జెండా మోయలేదు... పార్టీకోసం కష్టపడి పనిచేయలేదు...అనుకోకుండా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదృష్టం వరించి ఆపై మంత్రయ్యారు. కానీ ఏం లాభం అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకున్నారు. ఇదంతా ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధం. ఇంతకీ ఆ నేత ఎవరు.. ఆయన కాలదన్నుకున్న అవకాశం ఏంటి..?  వాచ్ దిస్ స్టోరీ.. 
రావెల దూకుడుకు కళ్లెం
రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. నిన్నటిదాకా మంత్రివర్గంలో ఓ వెలుగు వెలిగారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో పనిచేయకపోయినా తటస్థుల కోటాలో చివరి క్షణంలో ఎమ్మెల్యే టిక్కెట్టు సంపాదించగలిగారు. చదువుకున్న వ్యక్తి, మంచి మాటకారి కావటంతో చంద్రబాబునాయుడు రావెలకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు.
దూకుడుగా వ్యవహరించిన రావెల
అదృష్టం వరించి మంత్రి అయ్యారో లేదో.. రావెల దూకుడును పెంచారు. ప్రతిపక్ష నేత జగన్‌మ్మోహన్‌రెడ్డిపై తరచూ విమర్శలు చేసేవారు. పార్టీ ప్రోత్సాహంతో తనకు ఇక పార్టీలో తిరుగే లేదన్న విధంగా రావెల వ్యవహరించేవారు. జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలను సైతం ఆయన లెక్కచేసేవారు కాదని వాదనలు బలంగా వినిపించేవి. ఇక ద్వితీయ శ్రేణి నాయకులతో విభేదాలు ఆయనకు తీవ్ర ప్రతికూల అంశంగా మారాయి. 
కుమారుడి నిర్వాకం 
హైదరాబాద్ లో కుమారుడి నిర్వకంతో రావెల గ్రాఫ్ రోజురోజుకు పడిపోతూ వచ్చింది. రావెల కుమారుడు, ఓ యువతిని కారులో వెంబడించి టీజ్‌ చేస్తున్నట్లుగా వెలువడ్డ సీసీటీవీ దృశ్యాలు తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ.. అధికార తెలుగుదేశం పార్టీని టార్గెట్‌ చేసి..  విపక్ష వైసీపీ దుమ్మెత్తి పోసింది. ఇక కాకుమాను మండలంలో నిధుల మంజూరులో రావెల అతిజోక్యం మొదటికే మోసం తెచ్చింది. కాకుమాను జెడ్పీటిసి, జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న జానీమూన్ రావెల తన ఇంటిపైకి రౌడీలను పంపి చంపుతానని బెదిరిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారం కాస్తా చినికి చినికి గాలివానలా మారడంతో సీఎం చంద్రబాబు రావెల కిశోర్ బాబుపై సీరియస్ అయ్యారు. 
వివాదాల వల్లే రావెలకు ఉద్వాసన? 
ఇవన్నీ పక్కనపెడితే సరిగ్గా రెండు మాసాల క్రితం ఓరోజు రాత్రి వేళ గన్ మెన్‌లను వదిలిపెట్టి, రావెల అదృశ్యం కావటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ వర్గాలతోపాటు, ఇంటిలిజెన్స్ వర్గాలు కూపీలాగాయి. తాను స్నేహితుని ఇంటికి వెళ్లానంటూ రావెల చెప్పినా.. ఆయన వెళ్లింది జగన్ మేనమామ, ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిసేందుకేనన్న ప్రచారం జోరుగా సాగింది. పార్టీకోసం కష్టపడ్డ నేతలను కూడా కాదని తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నికైనా రావెలకు మంత్రి పదవి ఇచ్చి ఆదరిస్తే , చివరకు పార్టీకి నష్టం కలిగించేలా తయారయ్యారన్న రిపోర్టుల నేపథ్యంలో, చంద్రబాబు,  రావెలను మంత్రి వర్గం నుంచి తొలగించారని సమాచారం. 
విదేశాలకు వెళ్ళిన రావెల కిశోర్ బాబు
మంత్రి పదవి కోల్పోయిన మరునాడే, రావెల కిశోర్‌బాబు, కుటుంబసభ్యులతో కలసి విదేశాలకు వెళ్ళిపోవటం, వెళ్తూ వెళ్తూ ఓ బహిరంగ లేఖను నియోజకవర్గ ప్రజలకు రాయటం హాట్‌టాపిక్‌గా మారింది. కొంత మంది కావాలనే తన మంత్రి పదవిపోయేలా కుట్రపన్నారని, ఈ క్రమంలోనే నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహించి తనపై  లేనిపోని ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి, రావెలకు మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల కథనం. మొత్తానికి, అనూహ్యంగా మంత్రి పదవి దాకా చేరిన రావెల రాజకీయం.. కేవలం రెండున్నర సంవత్సరాల్లోపే మసక బారడం.. రావెల స్వయంకృతమేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

 

19:56 - April 15, 2017

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. సొసైటీ అధ్యక్షుడి మార్పుపై కార్యకర్తలు గొడవకు దిగారు. సమావేశానికి హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌ కూడా కార్యకర్తలతో జతకలిశారు. సొసైటీ అధ్యక్షుడి మార్పుకు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డే కారణమని ఆరోపించారు.  పుట్టపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగకుండా పల్లె అడ్డుకున్నారని మండిపడ్డారు.  మూడు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీకి మంజూరైన 11 కోట్ల నిధులను ఖర్చుచేయకుండా అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.

 

19:42 - April 15, 2017

గుంటూరు : ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను టీడీపీ కావాలనే వాయిదా వేయించిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నిక వాయిదా వేస్తే కౌన్సిలర్లను బెదిరించి తమకు మద్దతు ఇచ్చేలా చేసుకోవాలనే ఇలా చేసిందని మండిపడ్డారు. ఓటమిని ఓర్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని కోరారు. టీడీపీ దౌర్జన్యాన్ని అరికట్టలేని స్థితిలో పోలీసులు ఉన్నారని విమర్శించారు. 

19:38 - April 15, 2017

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ ముఖ‍్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను భూ కబ్జాదారుడిగా చిత్రీకరించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలపై తాను మాట్లాడానని.. దళితులకు న్యాయం జరగాలని కోరడం తప్పా అని శివప్రసాద్‌ ప్రశ్నించారు. దళితులకు కేటాయిస్తున్న నిధులు, లబ్దిదారుల పేర్లు ఎంపీలకు, మంత్రులకు కూడా తెలియడం లేదని.. నిధులు వెనక్కి వెళ్లేది మాత్రమే తమకు తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

19:21 - April 15, 2017
19:14 - April 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. రిజర్వేషన్ల పెంపుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. గిరిజనులకు 10శాతం, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటు మరో 30 ఇతర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించింది. మత్స్యకారులకు పరిహారం పెంపు, కాళేశ్వరం, మిడ్‌ మానేరు ప్రాజెక్టుల టెండర్ల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:37 - April 15, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందు కేటీఆర్ సంస్కారం నేర్చుకోవాలని, ఆ తర్వాత తమపై విమర్శలు చేయాలని సూచించారు. దమ్ముంటే టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలంటూ సవాల్‌ విసిరారు.

18:32 - April 15, 2017

ఖమ్మం : టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూలీల అవతారమెత్తారు. గులాబీ కూలీదినాల్లో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు కూలీ పని చేశారు. కొత్తగూడెంలోని వివిధ వ్యాపార సముదాయాల్లో కూలీ పని చేశారు. చాయ్‌ అమ్మారు, పరోటా చేశారు ఇలా సేకరించిన డబ్బుతో కార్యకర్తల్ని టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పంపిస్తామని ఆయన తెలిపారు.
బస్తాలు మోసిన గంగుల 
కరీంనగర్‌ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కూలీ పనులు చేశారు. మేయర్‌ రవీందర్‌సింగ్‌తోపాటు కార్పొరేటర్లు ఈ పనుల్లో సాయం చేశారు. బట్టల దుకాణంలో సామాన్లు మోశారు. సేల్స్‌బాయ్‌గా కూడా పనిచేశారు. ఈ పనులకు కూలీగా ఎమ్మెల్యే రూ. 21 వేలను తీసుకున్నారు. ఈ డబ్బును టీఆర్ఎస్ భారీ బహిరంగసభకు ఖర్చు పెడతానని తెలిపారు.

18:25 - April 15, 2017

హైదరాబాద్ :ఈనెల 17న రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కే. చంద్రశేఖర్ రావులు గవర్నర్ సమక్షమంలో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న  ఆస్తులు, విద్యుత్ ఉద్యోగుల విభజనపై గవర్నర్ వారితో చర్చించనున్నారు. ఇంతకు ముందు రెండు రాష్ట్రల మంత్రులు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. దీనికి కొసాగింపుగా ఈ సమావేశం జరుగనుంది. ఈ విషయాన్ని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

18:16 - April 15, 2017

హైదరాబాద్ : నల్లనివి అన్నీ నీళ్లు కాదు... తెల్లనివి అన్నీ పాలు కాదు.. అదేవిధంగా పసుపు పచ్చగా కనిపించే మామిడి పండ్లు అన్నీ స్వచ్చమైనవి కాదు. లాభార్జనే ధ్యేయంగా వ్యాపారులు కృత్రిమంగా పండ్లను మగ్గబెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వ్యాపారుల దందా మాత్రం ఆగడం లేదు.

ఎండాకాలం అంటేనే మామిడిపండ్లు.....
ఎండాకాలం అంటేనే మామిడిపండ్ల సీజన్‌. ఈ కాలంలో మామిడి పండ్లను తినేందుకు ప్రజలంతా ఆసక్తి కనబరుస్తారు. అయితే.. తియ్యటి పండ్లు తినే భాగ్యం ప్రజలకు దక్కడం లేదు. హైదరాబాద్‌లో ఏ మార్కెట్‌లో చూసినా.. మామిడి పండ్లన్నీ కార్బైడ్‌, చైనా నుంచి దిగుమతి అవుతున్న ఈథైలిన్‌ రసాయనాల ద్వారా మగ్గబెట్టినవే లభిస్తున్నాయి. దీంతో తియ్యటి మామిడిపండ్లు తినాలన్న నగరవాసుల కోరిక నెరవేరడం లేదు.

రసాయనాల ద్వారానే పండ్లు.......
వేసవి కాలంలో మామిడిపండ్లకు మంచి గిరాకి ఉంటుంది. దీనిని అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు మామిడిపండ్లను కృత్రిమంగా పండించి.. డబ్బులు దండుకుంటున్నారు. ఆరోగ్యం కోసం మామిడిపండ్లను తింటున్న ప్రజలు మాత్రం అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతి మార్కెట్‌లోనూ కార్బైడ్‌, చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈథైలిన్‌ రసాయనాల ద్వారానే కాయలను పండిస్తున్నారు. దీంతో కాయలు రంగు మారినా.. రుచి మాత్రం మారడం లేదు.

కార్బైడ్‌ వాడకంపై హైకోర్టు అభ్యంతరం...
కార్బైడ్‌ వాడకంపై హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో మార్కెట్లలో అధికారులు అడపా దడపా దాడులు చేస్తున్నారు. కార్బైడ్‌ వినియోగిస్తున్న వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల షాపులను కూడా మూసివేశారు. ఇంత చేసినా వ్యాపారుల తీరులో మార్పు రావడం లేదు. పైగా కార్బైడ్‌ను వినియోగిస్తున్న షాపులను మూసివేయడాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఆందోళనకు దిగడం విశేషం.

రైతులకు మిగిలేది ఆవేదన మాత్రమే.....
వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు భారీగా లాభాలు దండుకుంటుంటే.. రైతులు మాత్రం తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకు వచ్చిన సరుకును సగం ధరకే కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు.

దళారీ వ్యవస్థ రాజ్యం....
మొత్తానికి ఫ్రూట్‌ మార్కెట్‌లలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. అటు రైతులు, ఇటు ప్రజలను మోసం చేస్తూ దండుకోవడమే ప్రధాన ధ్యేయంగా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే.. రైతులు, వ్యాపారుల సమస్యను త్వరలో తీరుస్తామని గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంటున్నారు.

18:05 - April 15, 2017

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు గుక్కెడు నీటి కోసం కాళ్లు అరిగేలా కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 210 గిరిజన తండాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే నియోజకవర్గంలోని మనూరు మండంలోనే మంజీర నది ప్రవహిస్తున్నా గొంతు తడుపుకోవడానికి కూడా నీరు చిక్కని దుస్థితి ఏర్పడింది.
అడుగంటిన భూగర్భ జలాలు
నియోజకవర్గంలో భూగర్భ జలాలన్ని అడుగంటిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులంతా నీటి కోసం కిలోమీటర్లు నడుస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరమైన బావుల్లోకి దిగుతూ ప్రాణాలతో కుస్తీపడుతున్నారు. ఇలా నీరు తోడుతూ కాలు జారి బావుల్లో పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తండాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బురద నీటినే తాగుతూ అనారోగ్యంపాలవుతున్నారు.
తాగడానికి నీరు లేదు కానీ మరుగుదొడ్లు కట్టుకోవాలా
తాగడానికే నీరు దొరక్క తాము అవస్తలు పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం మరుగుదొడ్లు కట్టుకోవాలని సూచిస్తున్నాయని.. తాగేందుకే నీరు లేనప్పుడు మరుగుదొడ్లకు నీరు ఎక్కడ నుంచి వస్తుందని స్థానికులు ఆవేదనను వెల్లిబుచ్చుతున్నారు. తాము ఇన్ని కష్టాలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని.. కేవలం ఓట్ల కోసమే తమ దగ్గరకు వస్తారని వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపరంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను తీర్చి తమను ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు.

 

 

17:59 - April 15, 2017

యాదాద్రి భువనగిరి : కొండలు గుట్టలు ఎక్కి దిగాలికాలినడకన కిలోమీటర్లు ప్రయాణించాలి.. గంటల కొద్ది నిరీక్షించాలి... మండుతున్న ఎండలో పడిగాపులుకాయాలి... ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా? గుక్కెడు నీళ్లు కోసం..అవును.. బిందెడు నీళ్లు కోసం పల్లెవాసులు నానా కష్టాలు పడుతున్నారు. ఎన్నో అవస్థలతో గొంతు తడుపుకుంటున్న యాదాద్రి భువన గిరి జిల్లా నీటి గోసపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం

రాష్ట్ర రాజధానికి సమీపంలో.......
జిల్లా రాష్ట్ర రాజధానికి చాలా సమీపంలో ఉన్న ప్రాంతం. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ పల్లెలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. పల్లెవాసులు బిందెడు నీటి కోసం కోటి పాట్లు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి.. కొండలు.. గుట్టలు ఎక్కి దిగి..నీళ్లు తెచ్చుకుంటున్నారు. వ్యవసాయ పొలాల వద్ద బోర్ల నుంచి... పక్క గ్రామాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వృద్ధులు దూరం వెళ్లలేక... బిందెడు నీళ్లు తెచ్చిపెట్టమని తెలిసిన వాళ్లను బతిమాలుకుంటుంటారు.

మూడు రోజులుకొకసారి స్నానాలు........
గ్రామస్థులు ఇంత కష్టపడి తెచ్చుకున్న ఒకటి, రెండు బిందెల నీటిని రెండు రోజుల పాటు నిల్వ ఉంచుకుని.. వాడుకుంటుంటారు. నీటి కొరత వల్ల రెండు..మూడు రోజులుకొకసారి స్నానాలు చేస్తున్నారు. తుర్కపల్లి మండలంలోని పలు తాండాల్లో, రెడ్డినాయక్‌ తాండాకు ఆనుకుని ఉన్న చిన్న తాండాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కర్షల గడ్డ తాండాలో ఒకే ఒక్క బోరుబావి ఉంది..దాని నుంచి వచ్చే చిన్న నీటిధార ఆ తాండాకు దిక్కుగా మారింది. గ్రామానికి చుట్టూ.. మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు ఏ నీటి వనరు అందుబాటులో లేకపోవడంతో తాండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎవరు పట్టించుకోవడం లేదు......
ఐదేళ్లుగా తాము తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. తమ గోసను ఎవరు పట్టించుకోవడం లేదని వివిధ తాండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ వస్తే తమ గ్రామానికి నీరు వస్తుందని చెప్పడంతో.. కాలువ తవ్వడానికి పొలం ఇచ్చామని.. అయితే ఇప్పటివరకు ఆ కాలువలో ఒక్కసారి కూడా నీరు రాలేదని మీటి తండాకు చెందిన గిరిజన మహిళలు అంటున్నారు

వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు .......
వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పారని.. గ్రామంలో పైపులైన్ కూడా వేశారని.. కానీ ఇప్పటివరకు అతిగతీ లేదని స్థానిక మహిళలు చెబుతున్నారు. గ్రామాల్లో కుళాయిలున్నాయి కానీ.. నీరు మాత్రం రావడం లేదని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు నీళ్లు వచ్చేలా చేయాలని కోరుతున్నారు.

ఊరికి పిల్లను ఇవ్వడానికి జంకుతున్నారని.........
తీవ్ర నీటి కొరత వల్ల తమ ఊరికి ఆడపిల్లను ఇవ్వడానికి కూడా జంకుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీళ్లు లేకపోవడంతో తమ పిల్లలు పట్నం నుంచి గ్రామానికి కూడా రావడం లేదని వాపోతున్నారు. ఏ అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.

ఉత్సవ విగ్రహాల్లా చేతి పంపులు, ట్యాంక్ లు...........
గ్రామీణ నీటి పథకంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించారు. అయితే ఈ వాటర్‌ ట్యాంక్‌లు.. చేతి పంపులు ఉత్సవ విగ్రహాలను తలపిస్తున్నాయి. ప్రారంభంకాకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి నిరుపయోగంగానే ఉన్నాయి. అయినా వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతంలో నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మోత్కుర్‌లో ఖాళీ బిందెలతో ఓ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అయినా అధికారులు.. ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 

17:52 - April 15, 2017

ముంబై : విహారయాత్రకు వెళ్లి ఉల్లాసంగా, ఆనందంగా గడపి రావాలనుకున్నారు. కానీ మృత్యువు వారిని కబలించింది. విహారయాత్రకు వెళ్లి అనంతలోకాలకు వెళ్లారు. విహారయాత్రకు వచ్చే ముందు తల్లిదండ్రులకు, కాలేజీ యాజమాన్యానికి తిరిగి వస్తామని టాటా, గుడ్ బై చెప్పారు. కానీ వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చి వెళ్లారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు వైరీ బీచ్‌లో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు మృతి చెందారు. కర్ణాటకలోని బెల్గాంలో మరాఠా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 60 మంది విద్యార్థులు విహారయాత్రకు వచ్చారు. బీచ్‌లోకి దిగగా.. 11 మంది అందులో పడిపోయారు. ముగ్గురు విద్యార్థులను స్థానికులు రక్షించారు. 8మంది మృతి చెందారు. 

17:42 - April 15, 2017

గుంటూరు : జిల్లాలోని ఉండవల్లి సెంటర్‌లో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఫిషర్‌మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్‌ బాబూరావు, రాష్ట్ర ప్రత్యేకహోదా కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కొండవీటివాగు నిర్మూలన పేరుతో ప్రభుత్వం పల్లెకారుల పొట్టగొడుతోందని ఆరోపించారు. వాగుని తొలగిస్తే ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

17:25 - April 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీినివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి, బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నుంచి సండ్రా వీరయ్య సమావేశానికి రావడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్రా వీరయ్యలు కలిసి బీఏసీ ఆహ్వాన పత్రాన్ని తీసుకోని స్పీకర్ వద్దకు వెళ్లారు. టీఆర్ఎస్ రేపు ఒక్కరోజే సభను నిర్వహించాలని నిర్ణయిస్తే.. కాంగ్రెస్ మాత్రం సమావేశాలు రెండు రోజులు జరగాలని కోరింది. ఇంకా బీజేపీ మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తోంది. 

కేసీఆర్ కు.. అంబేద్కర్ కు పూలమాల వేసే టైం లేదా..

హైదరాబాద్ : కేసీఆర్ కు అంబేద్కర్ కు పూలమాల వేసే టైం లేదా.. అని టీకాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. 'కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో' అని అన్నారు. కాంగ్రెస్ పై ఉమ్మివేస్తే ఆకాశంపై ఉమ్మివేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ పై విమర్శలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 'దమ్ముంటే మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి' అని సవాల్ విసిరారు. ముస్లీంలు, ఎస్టీలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. జాట్లు, పటేల్ లకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా పెట్టారో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పాలని ప్రశ్నించారు.

 

వివిధశాఖల అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసింగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతులకు మద్దతు ధర తక్కువ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు 48 గంటల్లోపు పంట విక్రయ సొమ్ము చెల్లింపులు జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ కు ధాన్యం తెచ్చిన 24 గంటల్లోనే రైతులు అమ్ముకునేలా చూడాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. 

 

16:58 - April 15, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావడానికి భయపడుతున్నారు. జిల్లాలోని జగిత్యాలలో 43, పెద్దపల్లిలో 42, రాజన్న సిరిసిల్లాలో 41 డిగ్రీలు ఉష్ణొగ్రతలకు నమోదయ్యాయి. నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండే రాజీవ్ రాహదారి ఎండలతో బోసిపోతోంది. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

వివిధశాఖల అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసింగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతులకు మద్దతు ధర తక్కువ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు 48 గంటల్లోపు పంట విక్రయ సొమ్ము చెల్లింపులు జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ కు ధాన్యం తెచ్చిన 24 గంటల్లోనే రైతులు అమ్ముకునేలా చూడాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. 

 

16:48 - April 15, 2017

గుంటూరు : ఏపీ రాజధానిలో పరిపాలన భవనాల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవనాల నిర్మాణానికి అనువుగా లింగాయపాలెం, కొండరాజుపల్లిలో భూములను చదును చేస్తున్నారు. చదును చేయడంలో భాగంగా పెద్ద పెద్ద వృక్షాలను తీసివేస్తున్నారు. భూమిని చదును చేసి, నిర్మాణ సంస్థలకు అప్పగించాల్సి ఉంది. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే సమయం మించిందని ప్రతిపక్షాలు విమర్శించడంతో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుంది.

కాసేపట్లో తెలంగాణ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బీఏసీ సమావేశం జరుగనుంది. రేపు జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్న  మైనారిటీ రిజర్వేషన్లపై ఎజెండాను బీఏసీ రూపొందించనుంది. 

16:21 - April 15, 2017

ఈనెల 17న రెండు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ భేటీ

హైదరాబాద్ : ఈ నెల 17న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల విభజన, ఉమ్మడి రాష్ట్రాల ఆస్తులపై చర్చించనున్నారు. 

16:20 - April 15, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం కాబోతోంది. క్యాబినెట్ భేటీ అనంతరం ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రేపు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై, సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై అన్ని పార్టీల శాసన సభాపక్ష నేతలతో చర్చిస్తారు. రేపు అసెంబ్లీలో ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లు, జీఎస్టీ బిల్లులను ప్రభుత్వం సభా ముందుకు తీసుకురానుంది.

16:01 - April 15, 2017
15:43 - April 15, 2017

ఖమ్మం : జిల్లాలో మిర్చి రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్ లో మిర్చి ధర గరిష్ఠంగా రూ.6 వేలు పలడంతో రైతులు ఉసురుమన్నారు. మార్కెట్ లో మిర్చి కొనేవారు లేక ఎంతోకొంతకు అమ్ముకొని ఆవేదనతో తిరిగి వెళ్లుతున్నారు. ధర సగానికి సగం పడిపోవడంతో, కనీసం పెట్టుబడిలో సగం కూడా రావట్లేదంటూ రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మాటల రాజే తప్ప చేతల రాజు కాదని విమర్శిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యా చేసుకోవడం ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఎడ్చిచిన రాజ్యం బాగుపడలేదటా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చికి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.  

14:42 - April 15, 2017

ఇస్లామాబాద్ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ను రా ఏజెంట్‌గా ఆరోపించిన పాకిస్తాన్‌ తాజాగా మరో కుట్రకు తెరలేపింది. ఆక్రమిత కశ్మీర్‌లో ముగ్గురు అనుమానస్పద భారత గూఢాచారులను అరెస్ట్‌ చేసినట్లు పాక్‌కు చెందిన డాన్‌ పత్రిక వెల్లడించింది. పోలీస్‌ స్టేషన్‌ పేల్చివేత ఘటనతో పాటు జాతివ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్లు వీరిపై ఆరోపణలున్నట్లు తెలిపింది. అబ్బాస్‌పూర్‌లో టరోటీ గ్రామానికి చెందిన ఖలీల్‌, ఇంతియాజ్, రషీద్‌లు భారత ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ రా నుంచి జీతభత్యాలు పొందుతున్నారని పాక్‌ పోలీసులు పేర్కొన్నారు. చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ లక్ష్యంగా వీరు గూఢచర్యం నిర్వహిస్తున్నట్లు పాకిస్తాన్‌ ఆరోపించింది. ఈ ముగ్గురిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

14:38 - April 15, 2017

చిత్తూరు : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవో గా చేయడానికి ఐఏఎస్ లు పోటీ పడుతోన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ టీటీడీ ఈవోగా చేయడానికి ఉత్సహాం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేక్ చెందిన ఐఏఎస్ లు కూడా పోటీ పడుతున్నారు. ఓ అడుగు ముందుకేసి ఉత్తరాది వారికి అవకాశం ఇవ్వోద్దంటూ ఏపీ ఐఏఎస్ అధికారుల అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఈవొగా తన పేరును పరిశీలించాలని ఐఏఎస్ జవహర్ రెడ్డి కోరారు. ఆయనే కాకుండా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్ వీ ప్రసాద్ పోటీలో ఉన్నట్టు తెసుస్తోంది. ప్రభుత్వం ఎవరిని నియామిస్తుందో చూడాలి .

14:24 - April 15, 2017

హైదరాబాద్ : మరి కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో రిజర్వేషన్ల పెంపుపై ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేయనున్నారు. మొత్తం 40 అంశాలు అజెండాతో సమావేశంలో చర్చించనున్నారు. టేబుల్ ఐటమ్స్ గా 9 అంశాలు రానున్నాయి. గిరిజనులకు, ముస్లిములకు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. కానీ బీజేపీ మాత్రం మత ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పిస్తే చూస్తూ ఉరుకోబోమని స్పష్టం చేసింది. కేంద్రంతో పోరాడైన రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇది ఇలా ఉంటే బీసీల రిజర్వేషన్లు తెరపైకి వచ్చాయి.

13:37 - April 15, 2017

ఢిల్లీ : 'మోడీ..ఆదుకో..కేంద్రం కనికరించాలి..మమ్మల్ని ఆదుకోండి'..అంటూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆవేదన కేంద్రం చెవికి ఎక్కడం లేదు. కరవు సాయం ప్రకటించాలని..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా రైతులు హస్తినలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న ఆందోళనకు పలు పార్టీల నేతలు సంఘీభావం కూడా తెలియచేశాయి. కానీ కేంద్రం స్పందించకపోవడంతో వారు వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్నారు. చనిపోయిన రైతుల పుర్రెలతో నిరసన తెలియచేసిన రైతులు మొన్న నగ్నంగా ఆందోళన చేపట్టారు. తాజాగా శనివారం ఉదయం నిండుగా చీరలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మెడలో ఉన్న తాళులను తెంపుతూ ఏడుస్తూ..ఆదుకోవాలంటూ నినదించారు. 100రోజుల నిరసన ప్రణాళికలో భాగంగా రోజుకో రీతిలో రైతులు తమ ఆవేదనను తెలుపనున్నారు. ఇప్పటికైనా కేంద్రం కనికరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

 

13:35 - April 15, 2017
13:31 - April 15, 2017
13:25 - April 15, 2017

కడప : ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎన్నిక సమయంలో టీడీపీ-వైసీపీ సభ్యులు ఘర్షణకు దిగారు. హాల్లో ఫర్నిచర్‌ను టీడీపీ కౌన్సిలర్లు ధ్వంసం చేశారు. మినిట్స్‌ పుస్తకాలను లాక్కెళ్లారు. అడ్డుకునేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాగా ఓటమి భయంతోనే టీడీపీ ఎన్నిక వాయిదా వేయించిందని వైసీపీ సభ్యులు ఆరోపించారు.

 

 

13:19 - April 15, 2017

హైదరాబాద్‌ : సీపీఐ కార్యాలయంలో వామపక్ష, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించారు. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో సీపీఎం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని...ఉద్యమాలోంచి వచ్చిన పార్టీ కాబట్టి పాలన బాగుంటుందని అందరూ ఆశించడం జరిగిందన్నారు. కానీ ధర్నాలు చెయ్యోద్దుంటూ కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తివేస్తున్నారని తెలిపారు. ఎన్ కౌంటర్లు లేని రాజ్యం అని చెప్పిన కేసీఆర్ నేడు దారుణంగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని విమర్శించారు. సాగర్, శృతి ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా చేసిన ధర్నాను సైతం అణిచివేశారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:57 - April 15, 2017

హైదరాబాద్ : నగరంలో పలు బస్తీల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. శనివారం ఉదయం జీడిమెట్ల ప్రాంతానికి వెళ్లారు. పారిశ్రామిక వాడల్లో ఆయన పర్యటించారు. ఆప్ల్యూఎంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. శాంపిల్ కలెక్షన్ విధానంపై మంత్రి కేటీఆర్ అంసతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక విధానాలను అనుసరించాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో వాటర్ గ్రీడ్ పై చర్చించారు. మంత్రి కేటీఆర్ వెంట జీహెచ్ఎంసీ కమిషనర్..ఇతర ఉన్నతాధికారులున్నారు.

 

 

గవర్నర్ తో భేటీ కానున్న అచ్చెన్నాయుడు, కాల్వ..

విజయవాడ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో ఈనెల 17న మంత్రులు అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు భేటీ కానున్నారు. విభజన సమస్యలు, షెడ్యూళ్లు, 9,10లోని సంస్థలపై చర్చించనున్నారు. గవర్నర్ తో చర్చించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడితో మంత్రి యనమల చర్చించనున్నారు.

ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల ప్రయత్నం..

హైదరాబాద్ : మత రిజర్వేషన్ లపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ప్రగతి భవన్ ముట్టడికి ఎబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీనితో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

12:31 - April 15, 2017

కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు - డీఎస్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మాటిస్తే కచ్చితంగా నెరవేరుస్తారని, ఎవరినో కాపీ కొట్టాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని ఎంపీ డీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని, గొప్ప విజన్ ఉన్న నాయకుడని తెలిపారు.

చెస్ట్ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు..

హైదరాబాద్ : చెస్ట్ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

 

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా..

కడప : ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టిడిపి - వైసిపి సభ్యులు ఘర్షణకు దిగారు. మినిట్స్ పుస్తకాలను టిడిపి సభ్యులు లాక్కొనేందుకు ప్రయత్నించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

 

11:55 - April 15, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని వంతెన వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయాంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘనటప విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రమాద స్థలానికి చేరుకుని వారిని పరామర్శించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడినట్టు ప్రయాణికులు తెలిపారు.

 

11:47 - April 15, 2017

గుంటూరు : చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంపీ శివప్రసాద్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు శివప్రసాద్ అంశాన్ని ఆరా తీశారు. అమర్ నాథ్ రెడ్డిని విషయాలను అడిగి తెలుకున్నారు. పార్టీ, ప్రభుత్వం చెడ్డపేరు తెస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు తెలుసని, దళితులను లోక్ సభ, అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత టీడీపీదేనని తెలిపారు. అధినేతను టార్గెటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

జీడిమెట్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

జీడిమెట్ల : పారిశ్రామిక వాడలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్ లో ఆయన తనిఖీలుచేశారు.

11:35 - April 15, 2017

గుంటూరు : ఏపీలో వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి.భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే ఎండ, వేడిమితో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడగాల్పులను తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రతపై 10 టీవీ ప్రత్యేక కథనం.

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు..
ఏపీలో వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతోంది. విజృంభిస్తున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతోండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక జనం బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదువుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయాయి. దీంతో గాలిల్లో తేమ శాతం తగ్గిపోతూ, ఉక్కబోత పెరుగుతోంది. దీంతో వివిధ పనులపై వీధుల్లోకి వస్తున్న జనం చెమటతో తడిచిముద్దవుతున్నారు. శరీరంలోని నీరు స్వేదం రూపంలో బయటకు పోతుండటంతో నీరసించిపోతున్నారు. వడగాల్పులు ఈడ్చికొడున్నాయి. ఏప్రిల్‌లోనే ఈస్థాయిలో ఎండలు ఉంటే, ఇక మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ భయాందోళనకు గురవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఇలాంటి ఎండలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.

ఉపశమనం కోసం శీతల పానీయాలు..
ఎండలను తట్టుకోలేని ప్రజలు ఉపశమనం కోసం శీతల పానీయాలు, చెరకు రసం, కొబ్బరి బొండాలు, పుచ్చకాయ ముక్కలను ఆశ్రయిస్తున్నారు. ముఖాలకు స్కార్ఫ్‌లను కట్టుకుకోనిదే ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయింది. స్కార్ఫ్‌లు లేనిదే ముఖం మాడిపోవడంతోపాటు, ముక్కులు మండిపోయే పరిస్థితి ఉంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరాణాలు నేరుగా భూమిని తాకుతోండటంతో ఎండలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేరుగా నేలకు చేరుతున్న అల్ర్టావైలెట్‌ రేస్‌ శరీరం మీద పడితే కంది, కమిలిపోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. వీటి నుంచి రక్షణ పొందేందుకు దేహం మొత్తం కవరయ్యేలా కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని చెబుతున్నారు. గర్భిణిలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కడుపులోని బిడ్డకు అతినీలలోహిత కిరణాలు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అమెరికా బాంబు దాడిలో 90 మంది ఉగ్రవాదుల మృతి..

అప్ఘనిస్తాన్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబు దాడిలో 90 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు.

11:24 - April 15, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో పార్టీ అంతర్గాత ఆధిపత్యాలు ప్రతిపక్ష వైసీపీని ఇబ్బందిపెడుతున్నాయి. అసలే పార్టీ ఫిరాయింపులతో సతమవుతున్న ఆ పార్టీకి ఇప్పుడు నేతల తీరు కలవరంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల కుమ్ములాటలపై ప్రత్యేక కథనం.

రెండుగా చీలిన వైసీపీ క్యాడర్..
జిల్లాలో ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ ఎంపీ అనంతబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్మే రాజేశ్వరి అయినా అనంతబాబు అన్ని తానే వ్యవహరించేవారు. ఎమ్మెల్యే లెటర్‌హెడ్‌ సైతం అనంతబాబు దగ్గరే ఉంచుకుని పెత్తనం చేసిన విషయంపై పెద్ద దుమారం రేగింది. దీనిపై పార్టీ అధిష్టానానికి ఆమె ఫిర్యాదుచేయడంతో అనంతబాబుకు వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

రాజేశ్వరి వర్గీయులు ఆగ్రహం..
ఎస్టీ ఎమ్మెల్యే మీద మరొకరి పెత్తనం ఏంటని రాజేశ్వరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విభేదాలకు పార్టీ అధిష్టానం తక్షణమే చెక్ పెట్టకపోతే నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 

సీపీఐ కార్యాలయంలో రిలే దీక్షలు..

హైదరాబాద్ : సీపీఐ కార్యాలయంలో వామపక్ష ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలను చుక్కా రాములు ప్రారంభించారు. ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

చిత్తూరు ఎంపీపై బాబు ఆగ్రహం..

విజయవాడ : చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందని మంత్రి అమర్ నాథ్ ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం మంత్రులతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు తెలుసని, దళితులను లోక్ సభ, అసెంబ్లీ స్పీకర్ లుగా చేసిన ఘనత టిడిపిదేనని బాబు పేర్కొన్నారు.

11:15 - April 15, 2017

ఇండస్ట్రీలో పాతతరం హీరోలు నటులు రీ ఎంట్రీ ఇవ్వడం మామూలే. ఇలా ఒక టైం లో ఫామిలీ హీరోగా మెప్పించిన సాఫ్ట్ హీరో తరువాత కాస్లీ విలన్ గా మారాడు. ఇప్పుడు సూపర్ పవర్ ఫుల్ రోల్ లో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తెలుగు స్టోరీ లైన్ స్ట్రాంగ్ గా ఉండే సినిమాలను తెరెకెక్కించే సంస్థ వారాహి. ఈ బేనర్ నుండి వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా 'ఊహలు గుసగుసలాడే'. అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమా లో లవ్ అండ్ కామెడీ పర్ఫెక్ట్ గా కుదిరి టోటల్ ఫామిలీ అండ్ యూత్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఈ సినిమాతో 'రాశీఖన్నా', 'నాగశౌర్య' హీరో హీరోయిన్స్ గా శభాష్ అనిపించుకున్నారు. ఒకప్పుడు ఫామిలీ స్టోరీస్ ని హిట్ చేసిన నటుడు హీరో జగపతిబాబు. హీరో నుండి విల‌న్‌గా మారిన సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు మ‌ళ్ళీ హీరోగా మారి 'ప‌టేల్ S.I.R’ సినిమాతో మ‌ళ్ళీ హీరోగా మారుతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్ కి కొత్త కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని, ద‌ర్శ‌కుడు వాసు ప‌రిమి జ‌గ‌ప‌తిబాబును స‌రికొత్త స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నాడ‌ని టీజ‌ర్ చూసిన ప్రేక్ష‌కులు అంటున్నారు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. భావ‌న మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే మ‌రో హీరోయిన్‌గా తాన్య హోప్ న‌టిస్తోంది.

11:09 - April 15, 2017

సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ ఉంటాయి. లక్కీగా కొన్ని సార్లు వర్క్అవుట్ ఔతాయి కూడా. అక్కినేని ఫామిలీ ఈ విషయాన్నీ బాగా నమ్మినట్టుంది. నాగార్జున కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో వారసుడి సినిమాకి ఓకే చెప్పి సెట్స్ మీదకి తీసుకెళ్లింది. 'నాగార్జున'కు ఉన్న 'మన్మధుడు' అనే పేరును సార్ధకం చేసిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'. 'నాగార్జున' డ్యూయెల్ రోల్ చేసి మెప్పించిన సోషియో ఫాంటసీ ఫిలిం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ తో పాటు లావణ్య త్రిపాఠి స్క్రీన్ ని పంచుకున్నారు. ప్రతి ఫ్రేమ్ లో అందాన్ని చూపించిన ఈ సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. హంస నందిని, అనసూయ వంటి హాట్ అండ్ గ్లామర్ బ్యూటీ లని మంచి సాంగ్ లో వాడేసి మాస్ పల్స్ టచ్ చేసాడు డైరెక్టర్. మొత్తానికి ఈ సినిమా నాగార్జున ఖాతాలో హిట్ గా పడింది. 'ప్రేమమ్' సినిమాతో నటనలో పర్ఫెక్షన్ చూపించాడు నాగ చైతన్య. 'అక్కినేని' వారసుల్లో గుడ్ జాబ్ అని ఆడియన్స్ తో అనిపించుకున్న నటుడు నాగ చైతన్య. మలయాళం మూవీ 'ప్రేమమ్' కి తెలుగు టచ్ ఇచ్చి ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఉన్న ఫిలింని అందించాడు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమాలో 'నాగచైతన్య' వేరియషన్ ఉన్న పాత్ర ప్లే చెయ్యడం వల్ల అతనిలో నటన బాగా హై లెట్ అయింది. 'ప్రేమమ్' సినిమా తెలుగు స్క్రీన్ మీద హిట్ కొట్టింది. 'నాగచైతన్య' ప్రెజెంట్ ఒక ఫామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా స్పీడ్ గా జరిగిపోతోంది. ఈ సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో హిట్ ఇచ్చిన కల్యాణ కృష్ణని రిపీట్ చేశారు అక్కినేని ఫామిలీ. నాగ‌చైత‌న్య హీరోగా ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా 'రా రండోయ్‌..వేడుక చూద్దాం' అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నాగ‌చైత‌న్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాను స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా మే 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

10:58 - April 15, 2017

హైదరాబాద్ : దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ ఎంతో మంది విద్యార్థులను మేధావులు, మహానేతలుగా తీర్చిదిద్ది న ఘనచరిత్ర ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ... ఘన చరిత్రను, కీర్తిని సాధించిన విశ్వవిద్యాలయం ప్రారంభమై వందేళ్లు పూర్తయింది. ఈనెల 26, 27, 28 తేదీల్లో వందేళ్ల సంబురాలు జరుపుకోవడానికి ఈ చదువుల కోవెల సిద్దమైంది. ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీ పై 10టివి స్పెషల్ ఫోకస్.

స్వదేశీ రాజులు పాలిస్తున్న కాలం.....
19వ శతాబ్దిలో దేశంలో అత్యధిక ప్రాంతాలను స్వదేశీ రాజులు పాలిస్తున్న కాలం అది. ఆరోజుల్లోనే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారు అప్పటి బ్రిటిష్‌పాలకులు. అదేస్ఫూర్తితో హైదరాబాద్‌ రాజ్యంలోకూడా ఉన్నత విద్యను అందించాలని అప్పటి నిజాం పాలకుడు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ సంకల్పించారు. దాని ఫలితమే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావం. 1917లో ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించారు. అయితే.. దీని వెనక ఎంతో మంది ప్రముఖుల ఆలోచనలు, ప్రతిపాదనలు, దశాబ్దాల నిరీక్షణ ఉన్నాయి. ముఖ్యంగా కైరోలో అల్‌ అజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మౌల్వీ జమాలుద్దీన్ అప్ఘానీ, డబ్ల్యూ ఎస్‌ బ్లంట్ అనే బ్రిటీష్ విద్యావేత్తల పాత్ర మరువలేనిది.

1885 ఏప్రిల్‌ 22న అంకురార్పణ......
ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనకు 1885 ఏప్రిల్‌ 22న అంకురార్పణ జరిగింది. పబ్లిక్‌ గార్డెన్స్‌లో, 6వ నిజాం మీర్‌ మహబూబ్ అలీఖాన్ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నప్పుడు కొంతమంది విద్యార్ధులు, ప్రముఖులు.. నిజామీయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు లేవనెత్తారు. ఆ తరువాత 1895లో నిజాం కాలేజీ బహుమతి ప్రధానోత్సవంలో విశ్వవిద్యాలయ అవసరాన్ని గుర్తుచేసారు వక్తలు. అప్పట్లో సంస్థానంలో జరిగిన రాజకీయ మార్పులు, దేశంలో బ్రిటీష్ ప్రభుత్వం తీసుకున్న విద్యాసంస్కరణల నేపథ్యంలో వర్సిటీ ప్రతిపాదనలలకు ప్రాధాన్యం ఏర్పడింది.

సంస్థానాల్లోకూడా వర్సిటీలు ఏర్పాటు......
తర్వాత 1913లో తమ పరిపాలనలో ఉన్న ప్రాంతాలతోపాటు ..సంస్థానాల్లోకూడా వర్సిటీలు ఏర్పాటు చేయాలనిబ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్లోభాగంగా 1916లో మైసూర్‌ విశ్వవిద్యాలయం, వారణాసిలో బెనారస్‌ వర్సిటీలను ప్రారంభించారు. అటు పాట్నాలోకూడా యూనివర్సిటీ స్థాపను సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ..ఇక్కడ నిజాం రాజ్యంలోకూడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. 1917 ఏప్రిల్‌ 22న విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సర్‌ అక్బర్‌హైదరీ వర్సిటీ తక్షణ ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ నిజాంకు మెమోరాండం ఇచ్చారు. అదీ స్వదేశీ భాష అయిన ఉర్దూ మాధ్యమంలో బోధన జరిగేలా యూనివర్సిటీ స్థాపించాలని ప్రతిపాదించారు అక్బర్‌ హైదరీ.

ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్టు ఫర్మానా జారీ.......
ఈ పరిణామక్రమంలో ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్టు ఫర్మానా జారీ చేసారు 7నిజం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌. దీంతో దేశీయ భాషల్లో స్థాపించిన మొట్టమొదటి విశ్వవిద్యాయంగా ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలో పేరుపొందింది. అయితే .. బోధన భాషగా ఉర్దూను ప్రవేశపెట్టడంతో ప్రశంశలతోపాటు వ్యతిరేకత వ్యక్తం అయింది. అప్పటి సంస్థానం జనాభాలో 14శాతం మంది మాట్లాడే ఉర్దూను భోదనా భాషగా ఉండాలా? లేక అత్యధికులు మాట్లాడే తెలుగు, కన్నడ, మరాఠీ భాషాల్లో కూడా భోదించాలా..?అనే ప్రశ్న ముందుకు వచ్చింది. అప్పటి గణాంకాల ప్రకారం సంస్థానంలో కోటి 16లక్షల 34వేల మంది జనాభా వున్నారు. ఇందులో 85శాతం మంది హిందువులు, మిగితా ముస్లీంలు. కాని పాలకుల అభీష్టం మేరకు ఉర్దూకే మొగ్గు చూపారు.

 

తొలిసారిగా ఇంటర్మిడియట్ తరగతులు........
సాధారణంగా ఉస్మానియా యూనివర్శిటీ అంటే ఆర్ట్స్ కాలేజీనే అందరికీ గుర్తుకు వస్తుంది. కాని క్లాసులు ప్రారంభమైంది మాత్రం గన్‌ఫైండ్రీ లోని అప్పటి ప్రధాని మహరాజ ప్రతాప్‌ సింగ్ కు చెందిన భవంతిలో. తొలిసారిగా ఇంటర్మిడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. 1917లో ప్రారంభం అయినప్పటికీ అందుబాటులో పలు భవంతుల్లో 1919 వరకు క్లాసులు బోధించారు. అయితే తొలి ఇంటర్మిడియట్ బ్యాచ్ కి 1921లో పరీక్షలు జరిగాయి. బీఏ పరీక్షలు 1923లో ప్రారంభమయ్యాయి. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పరీక్షలు 1925లో మొదలయ్యాయి. వైద్యశాస్త్ర పుస్తకాలు సైతం ఉర్దూలోకి అనువదించాక తొలి ఎంబీబీఎస్‌ బ్యాచ్ కి జులై 1927లోనూ ఇంజనీరింగ్ విద్యకు 1929లోనూ ప్రారంభించారు. అలా ఆరంభమయినా వర్శిటీ తరువాతి కాలంలో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోఖ్యాతిని పొందింది.

వందేళ్ల ప్రస్థానం.....ఎందరో గొప్పవ్యక్తులు.....
వందేళ్ల ప్రస్థానంలో ఉస్మానియా యూనివర్శిటీ ఎంతో మంది విద్యార్థులను గొప్పగొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దింది.ప్రపంచానికి ఎంతోమంది ఆణిముత్యాలను అందించింది. ప్రారంభంలో కేవలం 500మందితో ప్రారంభమయిన వర్సిటీ వందేళ్ల కాలంలో లక్షలాది మందికి విద్యను అందించింది. తన ప్రస్థానంలో ఎన్నో చారిత్రక పరిణామాలను, సమస్యలను అధిగమించింది.

భారతీయభాషను బోధనా మాద్యమం.......
భారతీయభాషను బోధనా మాద్యమంగా 1917లో ఉస్మానియా వర్సిటీ ఏర్పడింది. 1918లో ఆర్ట్స్, సైన్స్ కాలేజీలు రూపుదిద్దుకున్నాయి. 1923లో ఎల్‌ఎల్‌బీ, ఎంఏ కోర్సులను ప్రవేశపెట్టారు. తర్వాత 1924లోనే యూనివర్సిటీలో తొలిసారిగా మహిళా కళాశాల ఏర్పాటైంది. 1927 లో ఎంబీబీఎస్‌, 1928లో కాలేజ్ ఆఫ్‌ ఎడ్యుకేషన్, 1929లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటయింది. ఆ తరువాత 1942లో కామర్స్ కోర్సును కూడా అందుబాటులోకి తెచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. వీటితోపాటు స్వాతంత్ర్యానికి ముందే ఇక్కడ వ్యవసాయ, పశువైద్య కోర్సులను ఇంటర్‌డ్యూస్ చేయడం విశేషం.

సికింద్రాబాద్ లో ఆర్ట్స్ , సైన్స్ కాలేజీలను ప్రారంభం.....
స్వతంత్ర భారతంలో 1947లో సికింద్రాబాద్ లోని ఆర్ట్స్ , సైన్స్ కాలేజీలను ప్రారంభించారు. తర్వాత 1887లో మద్రాస్ వర్శిటీకి అనుబంధంగా ఏర్పాటైన నిజాం కాలేజీని.. 1948లో ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా మార్చారు. అటు 1950లో దేశంలోనే తొలిసారిగా సాయంకాల కోర్సును ప్రవేశపెట్టి.. విద్యార్థులకు మరింత చేరువయింది యూనివర్సిటీ. మరోవైపు 1962లో జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రిని ప్రారంభించిన తొలి దేశీయ వర్శిటీగా కూడా ఉస్మానియాకు పేరుగాంచింది. అంతేకాదు.. 1963లో ఈశాన్య ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్ .. రంగాపురంలోని అబ్జర్వేటరీలో ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది ఉస్మానియా.

1977లో కరస్సాండెన్స్ కోర్సులను ఆరంభం......
ఇక పెద్దగా చదువుకోలేని యువజనులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించే లక్ష్యంతో 1977లో కరస్సాండెన్స్ కోర్సులను ఆరంభించింది యూనివర్సిటీ. ప్రస్తుతం దాన్నే ప్రొఫెసర్ జి రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గా పిలుస్తున్నారు. 1982 లో అండర్‌ గ్రాడ్యుయేట్ స్థాయిలో బయో మెడికల్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించిన తొలి వర్శిటీ కూడా ఓయునే కావడం విశేషం. 2004లో సికింద్రాబాద్ పీజి కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ను ప్రవేశపెట్టిన ఓయూ... అంతకు ముందే 2000ల సంవత్సరంలో అడ్మిషన్స్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈవిధంగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు నెలవుగా ఉన్న ఉస్మానియా.. ఆనాటి వైభవాన్ని కోల్పోతోందనే ఆవేదన వ్యక్తంఅవుతోంది. వందేళ్ల సంబురాలతో అయినా వర్సిటీ పూర్వ వైభవానికి బాటలు పడాలన్న ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

 

 

 

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం

లక్నో : యూపీలోని రాంపూర్ లో రైలు ప్రమాదం జరిగింది. రాజ్యరాణి ఎక్స్ ప్రెస్  8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.

విశాఖలో దారుణం

విశాఖపట్నం : జిల్లాలోని నాతవరం మండలం కృష్ణాపురంలో జంట హత్యలు జరిగాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ భర్త భార్యను, సబంధం పెట్టుకున్న యువకుడిని చంపాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

10:24 - April 15, 2017

ఎండకాలంలో శరీరం..చర్మానికి పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. చర్మం కమలడంతో పాటు ఇతర రోగాలు దరిచేరుతుంటాయి. చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే చల్లటి ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తే సరిపోతుంది.
తేనె..దొసకాయలను తీసుకోవాలి. ఇవి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. దోసకాయ రసం తీసుకుని అందులో రెండు చెంచాల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 30 నిమిషాలు పట్టించాలి. తరువాత కడుక్కోవాలి.
రెంచు చెంచాల గంధపు పొడిలో అంతే మోతాదులో గులాబీ నీల్లు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల అనంతరం కడుక్కోవాలి.
పుచ్చకాయ రసంలో కొద్దిగా పెరుగు, ఐస్ ముక్కలు వేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల అనంతరం కడిగేయాలి.
రెండు చెంచాల కలబంద జెల్ లో రెండు చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని 20 నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.

10:14 - April 15, 2017

క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ దక్షిణ రోమ్ లోని ఫారెట్రస్ జైలును సందర్శించారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ వేడుకలో భాగంగా నిర్వాహణలో భాగంగా మానవత్వాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ జైలును సందర్శించి 12 మంది ఖైదీల కాళ్లు కడిగి..ముద్దాడారు. చనిపోయే ముందు రాత్రి ఏసుక్రీస్తు కూడా ఇలగే 12 మంది శిష్యుల కాళ్లు కడిగినట్లు క్రైస్తవులు చెప్పుకుంటుంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ...ఇతరుల పట్ల సేవానిరతితో ఉండాలని ఖైదీలకు పోప్‌ సూచించారు. మన వ్యవహార శైలిని మార్చుకోవడం ఎంతో మంచిదని, ఎందుకంటే, దేవుడి మనసును చేరుకోవడానికి అది ఉత్తమమైన మార్గం అని పలియానో జైలు వచ్చే ముందు పోప్ ప్రాన్సిస్ ట్వీట్ చేశారు.

గోలివాడలో నేడు గ్రామ సభ..

పెద్దపల్లి : అంతర్ గామ్ (మం) గోలివాడలో నేడు గ్రామ సభ జరగనుంది. కాళేశ్వరం - మేడిగడ్డ ప్రాజెక్టు కోసం పంప్ హౌస్ నిర్మాణానికి భూములు ఇవ్వాలని రైతులపై వత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రామసభ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు మోహరించారు.

ఉత్తర్ ప్రదేశ్ లో రైలు ప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. రాంపూర్ వద్ద మేరఠ్ - లక్నో రాణి ఎక్స్ ప్రెస్ కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సింగపూర్ సిరీస్ సెమీ ఫైనల్..

ఢిల్లీ : నేడు జరిగే సెమీఫైనల్లో ఆంటోనీ గినిటింగ్‌ (హాంగ్‌కాంగ్‌)తో కిదాంబి శ్రీకాంత్‌, లీ డాంగ్‌ కెన్‌ (దక్షిణ కొరియా)తో సాయి ప్రణీత్‌లు తలపడనున్నారు.

09:27 - April 15, 2017

విజయవాడ : సత్యంబాబును నిర్ధోషిగా తేల్చుతూ సంచలన తీర్పు ఇచ్చిన ధర్మాసనం ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించింది.. హైకోర్టు ఇచ్చిన షాక్‌తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయేషా కేసును సవాలుగా తీసుకుంది.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచుకోవడంతో పాటు...నాటి నిజాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సీబీఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా కేసు తొమ్మిదేళ్ల పాటు కోర్టుల్లో నడిచి చివరకు హైకోర్టు తీర్పుతో అదే సంచలనం రేపింది... ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌కు కాస్త ఇరకాటంలో పెట్టినట్లయింది. దాంతోనే కోర్టు తీర్పుకు అనుగుణంగా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీబీఐకి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో జరిగిన తీరుపై ధర్మాసనం వ్యక్తం చేసి అనుమానాలతో పాటు దర్యాప్తు అధికారుల తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే ముందుగా కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకున్నా ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని తిరిగి పునర్విచారణ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన లీగల్ పాజిబులిటీస్‌పై చూడాలని పోలీసు శాఖకు సూచించింది. దీంతో కేసును రీ ఇన్‌వెస్టిగేషన్ చేసేందుకు సిద్దపడింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించి అప్రతిష్టను తొలగించుకోవాలని చూస్తుంది.

9 ఏళ్లు..
9 తొమ్మిదేళ్ల అనంతరం ఆయేషా మీరా మర్డర్ కేసులో అసలు దోషులెవరు..? ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉంది..? దీనికి వెనుక అసలు 'హస్తం' ఎవరిదనేది డిటైల్డ్ గా ఆధారాలు సేకరించనున్నారు. ఈ కేసును సీబీఐకి ఇచ్చినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. గతంలో జరిగినట్లు ప్రస్తుత పరిస్థితుల్లో జరగకపోవచ్చన్న భావన ఉంది. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థకే ఈ కేసు సవాల్ గా మారడంతో అటు పోలీస్ ఉన్నతాధికారులు కేసును మళ్లీ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేసును తిరిగి దర్యాప్తు చేపట్టనున్నామని, న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు డీజీపీ తేల్చిచెప్పడం చూస్తే ఆయేషా కేసు ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ సవాల్ గా తీసుకుందనేది అర్థమవుతుంది.


ఎలాంటి చర్యలుంటాయి ?
ఆయేషా మీరా హత్య కేసు సంఘటనలో ఆనాడు ఇబ్రహీంపట్నం సబ్ ఇన్ స్పెక్టర్ గా జి.శ్రీనివాసరావు, దర్యాప్తు అధికారిగా సీఐ ఎస్.మురళీమోహన్, నందిగామ డీఎస్పీగా ఎం.శ్రీనివాస్, వెస్ట్ జోన్ ఏసీపీగా ఎల్.విజయకుమార్, సెంట్రల్ జోన్ ఏసీపీగా ఎన్.రామచంద్రమూర్తి, వెస్ట్ జోన్ ఏసీపీగా పి.ప్రకాశరావు పనిచేశారు. బెజవాడ పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ ఉన్నారు. నాడు దర్యాప్తు అధికారిగా వెస్ట్ జోన్ ఏసీపీ పనిచేశారు. మొదట ఎల్.విజయ్ కుమార్, తర్వాత పి.ప్రకాశరావు పనిచేశారు. అభియోగ పత్రం ప్రకాశరావు 2008 నవంబర్ 14న దాఖలు చేశారు. ప్రస్తుతం సీఐ మురళీమోహన్ కాకినాడలో డీఎస్పీగా ఉన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పదవీ విరమణ చేశారు. శాఖపరమైన చర్యలకు పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించారు...అయితే ఈ కేసు పునర్విచారణ నేపథ్యంలో ఎవరెవరిపై ఎలాంటి చర్యలుంటాయో ? ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయోనని బెజవాడవాసులు ఎదురుచూస్తున్నారు.

09:24 - April 15, 2017

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యంగా నడపడం..మద్యం మత్తులో నడపడం..మితిమీరిన వేగాలతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలు రెండు ఆటోల్లో వెళుతున్నారు. రాజునాయక్‌ తండా వద్ద ఈ ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

09:21 - April 15, 2017

హైదరాబాద్ : ముస్లిం మైనారిటీలు, గిరిజనులకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా.. తనకు ఇష్టమొచ్చినట్లు రిజర్వేషన్లు ప్రకటించేలా కేసీఆర్‌ చూస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక్కరికి న్యాయం చేయడం కోసం.. నలుగురిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ స్పందించింది. బీసీలకు రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. అలాగే బీసీల రిజర్వేషన్లు దిబ్బతింటే ఊరుకునేది లేదని టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకరికి న్యాయం చేయడం కోసం నలుగురికి అన్యాయం చేయడం సరికాదంటున్నారు.

రిజర్వేషన్లు స్పష్టంగా ఉండాలంటున్న నేతలు..
కేసీఆర్‌ ఎన్నికల హామీని అమలు చేయకుండా.. ప్రజలను మోసం చేస్తున్నరని టీడీపీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కేవలం కొన్ని వర్గాలను సంతృప్తి పరచడం కోసం ఈ రిజర్వేషన్లను ప్రకటించారంటున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా ఆదివారం జరిగే ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం రిజర్వేషన్లపై అట్టుడికిపోయే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు స్పష్టంగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది.

09:19 - April 15, 2017

ఢిల్లీ : ఐపీఎల్ 10లో ముంబయి ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి విజయం సాధించింది. మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబయి జట్టును కునాల్ పాండ్య, పోలార్డ్‌ ఆదుకున్నారు. హాఫ్‌ సెంచరీతో పోలార్డ్ రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్‌లలో 142 పరుగులు మాత్రమే చేసింది. విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 62 పరుగులతో స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ జట్టును బెంగళూరు స్పిన్నర్ బద్రి ఇబ్బందికి గురిచేశాడు. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదుచేశాడు. అయితే పొలార్డ్, పాండ్య జోరుతో... ముంబై ఇండియన్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

09:08 - April 15, 2017

తనకు ప్రమోషన్స్ తో హడావుడి చేయడం ఇష్టం ఉండదని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో 'ట్యూబ్ లైట్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సల్మాన్' తో 'ఏక్ థా టైగర్', ‘బ్రజంగీ భాయిజాన్' వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు కావడంతో 'సల్మాన్' ను ఏ విధంగా చూపించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ‘సల్మాన్' చిత్రాలు 'ఈద్' కు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈద్ కు విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేశారు. ఈద్ డేట్ సమీపిస్తున్నా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కబీర్ ఖాన్ స్పందించారు. సినిమా విడుదలకన్నా నెలల తరబడి ముందునుండే ప్రమోషన్స్ హడావుడి చేయడం తనకిష్టం ఉండదని కుండబద్ధలు కొట్టాడు. టైమ్ దగ్గర పడుతోంది కనుక ఏప్రిల్ చివర్లో..టీజర్ ను రిలీజ్ చేస్మాని..మే నెలలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అప్పటి వరకు వేయిట్ చేయాల్సిందే.

విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు..

నల్గొండ : ఆర్టీసీ డిపోలో కార్మికులు విధులను బహిష్కరించారు. 8గంటల డ్యూటీని 12గంటలు చేయిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా కార్మికులు బస్సులను నిలిపివేశారు. సంఘీభావంగా నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆరు డిపోల్లో సిబ్బంది విధులను బహిష్కరించారు. మిగతా డిపోలకు చెందిన బస్సుల రాకపోకలు యదాతథంగా తిరుగుతున్నాయి.

అరకు చేరుకున్న అద్దాల రైలు..

విశాఖపట్టణం: జిల్లాలోని అరకు ప్రాంతానికి అద్దాల రైలు చేరుకుంది. ఆదవారం అద్దాల రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. భువనేశ్వర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించనున్నారు. విశాఖ నుండి అరకు వెళ్లే పర్యాటకుల కోసం ఈ రైలును రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా అద్దాల బోగీలను ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదం..నలుగురు పోలీసుల మృతి..

బీహార్ : ముజఫర్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనం - లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఒక ఖైదీ ఉన్నారు.

 

భూ సేకరణ సామాజిక ప్రభావిత కమిటీ పర్యటన..

విజయవాడ : ఉద్దండరాయని పాలెంలో భూ సేకరణ సామాజిక ప్రభావిత అంచనా కమిటీ పర్యటించనుంది. జాయింట్ కలెక్టర్ కృతిక శుక్లా, అధికారులు పాల్గొననున్నారు.

 

సిక్కోలులో మంత్రి కామినేని పర్యటన..

శ్రీకాకుళం : నేడు మంత్రి కామినేని జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు.

08:07 - April 15, 2017

మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్' తన తాజా చిత్రంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటోంది. సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. పల్లెటూరు నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్. ఇక 'రామ్ చరణ్' సరసన 'సమంత' నటిస్తోంది. మూగవాడిగా 'రామ్ చరణ్' పాత్ర ఉంటుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ కోసం చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నట్లు టాక్. బాలీవుడ్ నటులను తీసుకోవాలా ? టాలీవుడ్ లో ఉన్న వారిని తీసుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కానీ విలన్ గా 'జగపతిబాబు'ను తీసుకుంటే బాగుంటుందని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే అగ్ర హీరోల సరసన స్టైలిష్ విలన్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇంతకుముందు సుకుమార్ చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జగపతిబాబే విలన్ అనే సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ తో సుకుమార్ మళ్లీ ఆయననే తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్.

ఓయూ సెట్ 2017 నోటిఫికేషన్..

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష (ఓయూసెట్‌) 2017 నోటిఫికేషన్‌ను 16వ తేదీన విడుదల చేయనున్నారు. ఓయూతో పాటు తెలంగాణ మహాత్మా గాంధీ, పాలమూరు వర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష జరగనుంది. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

07:39 - April 15, 2017

తెలంగాణలో ముస్లిం మైనారిటీలకు ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై శనివారం మధ్యాహ్నం కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇదే అంశంపై ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ముస్లిం మైనారిటీ, గిరిజన కమిషన్లు ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఇందిర (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:31 - April 15, 2017
06:57 - April 15, 2017

ఉత్తర్ ప్రదేశ్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి రోజున ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మహనీయుల పేరిట ఉన్న సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై మహనీయుల జయంతి రోజుల్లో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ఉండబోవని సిఎం స్పష్టం చేశారు. అందుకు బదులుగా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను ఆ రోజు విద్యార్థులకు బోధించాలని సూచించారు. చాలా మంది దీన్ని తప్పుగా భావించే అవకాశం ఉందని...మహా పురుషుల కార్యక్రమాలు జరపడం ద్వారా వారి గురించి తెలుసుకునే అవకాశముంటుందని యోగి అభిప్రాయపడ్డారు. యూపీలో 365 రోజుల్లో 192 రోజులు ప్రభుత్వ సెలవుల కిందే పోతున్నాయి. ఆయా కులాలు, మతాల ప్రజలను సంతోషపరచేందుకు మహనీయుల పేరిట సెలవులు ప్రకటించారు. దళితులు, వెనకబడిన తరగతుల అభ్యున్నతికి పాటు పడతామని యోగి చెప్పారు.

06:52 - April 15, 2017

చిత్తూరు : పాత కరెన్సీ నోట్లు టీటీడీకి పెనుభారంగా మారాయి. హుండీల్లో కుప్పలు.. తెప్పలుగా పడుతున్న పాత నోట్లతో అధికారులు సతమతమవుతున్నారు. ఈ విషయంలో ఆర్‌బీఐ ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతో అయోమయంలో పడ్డారు టీటీడీ అధికారులు. పాత కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయంతో కుదేలైన ప్రజలు దాని నుంచి బయటపడినా... శ్రీవారు మాత్రం ఇంకా బయటపడలేదు. ఇంకా తిరుమల శ్రీవారి హుండీలోకి రద్దైన పెద్దనోట్లు భారీగా వచ్చి చేరుతున్నాయి. స్వామివారికి మొక్కులే చెల్లించాలనుకున్నారో? పాతనోట్లు వదిలించుకోవాలనుకున్నారో తెలియదు కాని గడచిన వంద రోజుల్లో రూ.16 కోట్లకు పైగా చెల్లని పెద్దనోట్లను భక్తులు కానుకలుగా సమర్పించారు. చేసేది లేక టీటీడీ అధికారులు ఈ పాతనోట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచి కాపలా కాస్తున్నారు.

పరిష్కారం చూపని రిజర్వ్‌ బ్యాంక్‌..
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం 60 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వచ్చిన భక్తులు స్వామివారికి నిత్యం కోట్ల రూపాయల్లో కానుకలు వేస్తుంటాయి. అయితే కేంద్రం పాతకరెన్సీ నోట్లను రద్దు చేసినా భక్తులు మాత్రం కానుకల రూపంలో శ్రీవారికి పాతనోట్లనే హుండీల్లో వేస్తున్నారు. ఈ నోట్ల విషయంలో టీటీడీ అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. రిజర్వ్‌ బ్యాంకుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వారి నుంచి ఎటువంటి పరిష్కారం లభించలేదని.. వారి సమాధానం కోసం చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా చట్టరీత్యా రద్దైన పాత నోట్లు కలిగి ఉండడం నేరం.. దీంతో పాతనోట్ల విషయంలో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు రిజర్వ్‌బ్యాంక్‌ అధికారులకు రిపోర్ట్‌ చేస్తున్నారు. కానీ అక్కటి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆ నగదును టీటీడీ తమ ఖాజనాలోనే భద్రపరుస్తోంది. ఏదేమైనా ఆర్బీఐ నుంచి సానుకూల స్పందన వచ్చేవరకు శ్రీవారికి ఈ పాతనోట్ల కష్టాలు తప్పేలా లేవు.

06:50 - April 15, 2017

పెద్దపల్లి : జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో అపార బొగ్గు నిక్షేపాల్ని అధికారులు గుర్తించారు. అన్వేషణ విభాగం సర్వేలో వందల మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు తేలింది. తాజా నిల్వలతో సింగరేణి సంస్థ మరింత విస్తరించబోతోంది. బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. ఇక సింగరేణి సంస్థ విస్తరణలేదని అనుకుంటున్న సమయంలో అన్వేషణ విభాగం తీపి కబురు చెప్పింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో అపార బొగ్గు నిక్షేపాలున్నాయని తేల్చింది. తాజా సర్వే అధికారుల్లో సంతోషం నింపింది.

ముందు జాగ్రత్త చర్యలు..
బొగ్గువాడకం పెరగడం, వేగంగా నల్లబంగారాన్ని వెలికితీయడంతో ఈ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బొగ్గుకు ఇబ్బంది తప్పదని భావించిన అధికారులు ముందు జాగ్రత్తచర్యలు చేపట్టారు. బొగ్గునిల్వల్ని గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ముఖ్యమైన ప్రాంతాల్లో బొగ్గుకోసం పరిశోధించిన సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ డిపార్ట్‌మెంట్ పెద్దపల్లి జిల్లాలో భారీగా నల్ల బంగారం నిల్వలు ఉన్నాయని గుర్తించింది. బొగ్గు నిల్వల్ని గుర్తించేందుకు రామగుండం డివిజన్-1 పరిధిలో సింగరేణి అన్వేషణ విభాగం సర్వే కొనసాగించింది.. దుబ్బపల్లి బ్లాక్‌లో జరిపిన పరిశోధనలో 225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని అధికారులు గుర్తించారు.. దాదాపు ఆరున్నర కిలోమీటర్ల పరిధిలో విస్తరించిఉన్న దుబ్బపల్లి బ్లాకులో... 450నుంచి 600 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నాయని తేల్చారు.. బొగ్గు నిల్వలపై పూర్తివివరాల్ని సేకరించిన అధికారులు ఈ నివేదికను సింగరేణి యాజమన్యానికి, ప్రభుత్వానికి పంపారు.

180 మిలియన్ టన్నులు..
దబ్బపల్లితో పాటు... అడ్రియాల ప్రాజెక్టు బొగ్గుగనిలో కూడా నల్ల బంగారం నిల్వలున్నాయని అధికారుల పరిశోధనలో తేలింది. 4 కిలోమీటర్ల వైశాల్యంలో 130మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. ఈ నిల్వలు 600 మీటర్ల నుంచి 800 మీటర్ల లోతులో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఇదే ప్రాంతంలో ఇప్పటికే 180 మిలియన్ టన్నుల నిక్షేపాలను గుర్తించిన అధికారులు... అత్యంత అధునిక పద్దతిలో ఈ బొగ్గును బయటకుతీస్తున్నారు. తాజా అన్వేషణతో... సింగరేణిలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అడ్రియాలాకు మరింత గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఊరట..
దబ్బపల్లి, అడ్రియాలకు తోడు రామగుండం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-2లోనూ బొగ్గు నిల్వల్ని అధికారులు కనుగొన్నారు.. మూతబడిన జీడీకే 5, 5ఏ గనుల్లో ఈ నిల్వలు దాగిఉన్నాయని తేల్చారు. భూగర్భ గనిలో అత్యాధునిక యంత్రాల ద్వారా ఈ బొగ్గును వెలికితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండెం రీజియన్‌లో పాత గనులకుతోడు దుబ్బపల్లి బ్లాక్‌, ఆడ్రియా నిల్వలు సింగరేణి సంస్థకు ఊరటనిచ్చాయి. ఈ బొగ్గు నిల్వలతో సింగరేణి జీవితకాలం పెరిగే అవకాశం ఉంది. బొగ్గు తవ్వకాల కోసం మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.

06:47 - April 15, 2017

శ్రీకాకుళం : చేపలవేట నిషేధంతో మత్స్యకార కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు వేటకు వెళ్లలేక... ఇటు ప్రభుత్వం పరిహారం ఇవ్వక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. ఈ ఏడాది నిషేధం మరో 15రోజులు పెంచడంతో గంగపుత్రుల జీవితాలు దయనీయంగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 15 నుంచి ప్రభుత్వం చేపలవేట నిషేధించడంతో ఏంచేసి బతకాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.. జిల్లాలోని 104 గ్రామాల్లో వేలాదిమంది గంగపుత్రులు చేపలవేటపై ఆధారపడి బతుకుతున్నారు. చేపలవేట నిషేధంతో వీరికి ఉపాధి కరువైంది.

రెండు నెలల పాటు నిషేధం..
ప్రతి ఏడాది చేపలు గుడ్డుపెట్టే సమయంలో ప్రభుత్వం చేపల వేటను నిషేధిస్తుంది. ఈ సమయంలో వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది. గత ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి మే 31వరకూ చేపలవేటకు వెళ్లొద్దని నిషేదం విధించింది. అయితే ఈసారి ఈ గడువును జూన్‌ 15వరకూ పొడిగించింది. ఏకంగా రెండు నెలలపాటు చేపలవేటకు వెళ్లొద్దన్న ఆదేశాలతో మత్స్యకార కుటుంబాలు సమస్యల్లో పడ్డాయి.

ఆర్థిక సాయం చేయాలంటున్న మత్స్యకారులు..
సాధారణంగా వేటకు వెళ్లకుండా 45రోజులు బతకడమే కష్టం. అలాంటిది ఈసారి 15రోజులు పెరగడంతో గంగపుత్రులు మరింత ఇబ్బందుల్లోపడ్డారు. అయితే ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుంది. ఈసారి బియ్యంతోపాటు ఆర్థికసహాయంకింద కొంత డబ్బుకూడా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఎంత నగదు ఇవ్వాలోమాత్రం తేల్చలేదు. దీంతో ఈ హామీ ఇంతవరకూ అమలులోకి రాలేదు. వేట నిషేదం సమయంలో ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయలు చెల్లించాలని మత్స్యకార కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే తాము పస్తూలుండక తప్పదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. తమకు ఆర్థిక సాయం చేయాలని గంగపుత్రులు కోరుతున్నారు.

06:44 - April 15, 2017
06:43 - April 15, 2017

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. చరిత్ర తిరగరాసే విధంగా సభకు జనాన్ని తరలించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. బహింగసభ జరిగే ప్రకాశ్‌రెడ్డి పేటలో భూమిని చదును చేయడంతోపాటు ఎత్తైన వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ జరిగే ప్రదేశంలో భూమి చదును చేస్తున్నారు. పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తొలగించి... భూమిని చదును చేస్తున్నారు. మండువేసవిలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు వచ్చే వారికి కోసం నీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు బోర్లు వేశారు. దుమ్మురేగకుండా భూమిని ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక రోడ్లు వేయడంతోపాటు, వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యనేతల కటౌట్లు..
టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జన సమీకరణపై నేతలు దృష్టి పెట్టారు. గ్రామ గ్రామం నుంచి ప్రజలను తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాల సమీకరణకు చర్యలు ప్రారంభించారు. వరంగల్‌ నగరాన్ని సుందర నందవనంలా చేయాలని నిర్ణయించారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతూ.. బ్యానర్లు, పోస్టర్లు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ జరిగే ప్రదేశంతోపాటు, నగరంలోని వివధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ ముఖ్యనేతల భారీ కటౌట్లు పెట్టాలని నిర్ణయించారు. ఓరుగల్లు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా భారీ స్వాగతద్వారాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వేదకపై నుంచి నేతలు చేసే ప్రసంగాలు అందరికి వినిపించి, కనిపించేలా మైనాదంలో భారీ ఎల్‌ఈడీ తెరలు పెట్టాలని నిర్ణయించారు.

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా..
బహిరంగ సభ కోసం తెలంగాణ జిల్లాల్లో పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫ్లడ్‌ లైట్లు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మొత్తంమీద వరంగల్‌ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లను దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

06:38 - April 15, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు తావిస్తున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సీఎం ప్రకటిస్తున్న వరాలు దేనికి సంకేతమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేదిలేదని గులాబీ బాస్‌ చెబుతున్నా... ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు అంతుచిక్కడంలేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంతరంగం ఏంటి ? రాజకీయ ఎత్తుగడల్లోని ఆంతర్యం ఏంటి ? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యోగుల్లో తక్కువ వేతనాలు పొందుతున్న వారికి జీతభత్యాలు పెంచుతున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు వెయ్యి కోట్లతో ప్రత్యేక ఆర్థిక సహాయ సంస్థ ఏర్పాటు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలకు వేతనాల పెంపు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ వంటి కీలక నిర్ణయాలు ప్రతిపక్షాల నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ముస్లిం రిజర్వేషన్ల పెంపుకు చర్యలు..
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని విషయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేవస్తున్నారు. ప్రగతి భవన్‌కు ఒక్కో వర్గాన్ని పిలిపించుకుని మాట్లాడుతూ, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. విధానపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో హామీల్లో కీలకమైన ముస్లిం రిజర్వేషన్ల పెంపుకు చర్యలు చేపట్టారు. మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను సమీక్షించి, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.

యాదవులకు గొర్రెలు, మేకల పంపిణీ పథకం..
రైతులకు చివరి విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం... వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీరికి ఉచితంగా ఎరువులు అందించాలని నిర్ణయించింది. ఎవరి ఊహకు అందని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాల ఆంతర్యం టీఆర్ఎస్‌ నేతలకే అంతుచిక్కడంలేదు. అలాగే రాష్ట్రంలో మాసం ఉత్పత్తిని పెంచడంతోపాటు, యాదవులకు ఆదాయాన్ని పెంచేందుకు గొర్రెలు, మేకల పంపిణీ, చేనేత కార్మికుల ఆర్థిక కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. అలాగే ప్రమాదాల్లో మరణించే కల్లుగీత కార్మికులకు బీమా పెంపు వంటి కార్యక్రమాలు దేనికి సంకేతం అన్న ప్రశ్నకు తావిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదంటూ కేసీఆర్‌ స్పష్టం చేసినా ఈ విషయంలో స్వపక్ష, విపక్ష నేతల్లో అనుమానాలు లేకపోలేదు. రాజకీయ ఎత్తుగడల్లో దిట్టగా పేరు పొందిన కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని టీఆర్‌ఎస్‌తోపాటు, ఇతర పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

06:35 - April 15, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్ల బిల్లు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగ పెంచింది. బిల్లును అసెంబ్లీలో పెట్టి క్రెడిట్‌ కొట్టేయ్యాలని గులాబీ పార్టీ తహతహలాడుతుండగా దీన్ని ఎలాగైనా అడ్డుకోవాల్సిందేనని బీజేపీ కాలు దువ్వుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఈ బిల్లు సంకటంగా మారింది. బిల్లును సమర్ధించాలా ? వ్యతిరేకించాలా ? తేల్చుకోలేక తర్జన భర్జన పడుతుంది. తెలంగాణలోని రాజకీయ పార్టీలలో రిజర్వేషన్లు కాకరేపుతున్నాయి. మైనారిటీ రిజర్వేషన్ల బిల్లు మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ముందుకు రానుండటంతో.. ఈ హీట్‌ మరింత పెరిగింది. ఈ రిజర్వేషన్ల కోటాలో తమ పొలిటికల్ వాటా కోసం అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. వడ్డించేవాడిగా క్రెడిట్‌ అంతా తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌ఎస్‌ జోరు మీద ఉండగా.. దీన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

కాంగ్రెస్ కు సంకటం..
అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అయితే.. ఎవరు ఎటువైపో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నామంటూ గులాబీ పార్టీ హడావుడి చేస్తుంది. మాట నిలబెట్టుకున్నందుకు తమకే క్రెడిట్‌ వస్తుందంటున్న అధికార పార్టీ.. ఇదే అదనుగా విపక్షాలను కార్నర్‌ చేయాలని చూస్తోంది. దీంతో బిల్లుకు వ్యతిరేకమా ? అనుకూలమా తేల్చి చెప్పాల్సిన పరిస్థితి విపక్షాలకు ఎదురైంది. ఇదే ఇప్పుడు ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌కు సంకటంగా మారింది. తమకు సాంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ముస్లింలు, గిరిజనులు ఉండటంతో కాంగ్రెస్‌కు అత్యంత సున్నితంగా మారింది. దీనితో సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై కాంగ్రెస్‌ విస్తృత సమావేశంలో చర్చించింది. రిజర్వేషన్లను వ్యతిరేకించే పరిస్థితి లేదు.. అలాగని సీఎం కేసీఆర్‌ చర్యను సమర్ధించి జేజేలు కొట్టలేమని నేతల అభిప్రాయం. అయితే ఈ విషయంలో తేడాగా వ్యవహరిస్తే.. అది నేరుగా ఓటుబ్యాంక్‌పై ప్రభావం పడుతుందని భావించిన నేతలు.. ఆచితూచిగా వ్యవహారం నడపాలని డిసైడ్‌ అయ్యారు. కర్ర విరగకుండా.. పాము చావకుండా బిల్లును ఎదుర్కోవాలని చూస్తున్నారు.

నిలదీస్తామన్న ఉత్తమ్..
రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని.. కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయించి కేంద్రానికి పంపి కేసీఆర్‌ చేతులు దులుపుకునే పనిలో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. దీనిపై కేసీఆర్‌ను గట్టిగా నిలదీస్తామంటున్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఇక దీనిపై బీజేపీ వన్‌సైడ్‌గా ముందుకెళ్లనుంది. ఇప్పటికే మత ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామంటున్న బీజేపీ దీనిపై సభలో తేల్చుకుంటామంటున్నారు. టీఆర్‌ఎస్‌పై పోరుతో హిందూ ఓటుపై కన్నేసిన కమలనాథులు.. దీన్ని ఆయుధంగా వాడుకోవాలని డిసైడ్‌ అయ్యారు. మొత్తానికి గులాబీ సర్కార్‌ రిజర్వేషన్‌ బిల్లు అస్త్రంగా ఆడుతున్న పొలిటికల్‌ గేమ్‌లో విక్టరీతో మైలేజ్‌ లెక్కలు వేసుకుంటున్నాయి విపక్షాలు. మరి ఎవరు ఎటు.. ఎవరికి ఎంత లాభమో అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

06:29 - April 15, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ముస్లిం మైనారిటీలకు ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ఈరోజు మధ్యాహ్నం కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇదే అంశంపై ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ముస్లిం మైనారిటీ, గిరిజన కమిషన్లు ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. సభలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలతో పాటు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే దీనిపై అసెంబ్లీలో చట్టబద్దత కల్పించాల్సిన అవసరమున్న నేపథ్యంలో... ఆదివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఒక్కరోజు పాటు జరిగే ప్రత్యేక సమావేశంలో.. ముస్లిం, మైనారిటీలతో పాటు.. గిరిజనులకు కూడా రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించనున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది.

రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్న కేసీఆర్..
అయితే.. రాజకీయంగా ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేస్తున్నారు. ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ కట్టుబడి ఉందంటున్నారు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రిజర్వేషన్లు ఉన్నాయని... రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే వెసులుబాటు కల్పించాలంటున్నారు సీఎం. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచుతామంటున్నారు. అయితే.. ఈ రిజర్వేషన్లు ఎంతమేరకు పెంచాలనే అంశంపై బీజీ కమీషన్‌ అండ్‌ మైనారిటీ మరియు గిరిజన కమిషన్‌ తమ నివేదికలను ప్రభుత్వానికి అందజేశాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ఈరోజు మధ్యాహ్నం కేబినెట్‌ సమావేశం కానుంది. అయితే. ఇరువర్గాలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని బయటకు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అది ఫైనల్‌గా ఎంత ఉంటుందనేది నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ముస్లిం మైనార్టీలకు బీసీ-ఈ హోదా కల్పిస్తే బీసీ వర్గాల రిజర్వేషన్లు దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్న సర్కార్‌.. బీసీలకు కూడా రిజర్వేషన్లు కొంత మేర పెంచేవిధంగా కసరత్తు చేస్తోంది. ఇక ముస్లిం, గిరిజనులకు ఎంత మేర రిజర్వేషన్లు కల్పిస్తారనేది ఈరోజు జరిగే కేబినెట్‌ భేటీలో ఫైనల్‌ కానుంది.

నేడు బీజేపీ ఎగ్జిక్యూటివ్ భేటీ..

ఢిల్లీ : నేడు భువనేశ్వర్ లో జాతీయ స్థాయి బీజేపీ ఎగ్జిక్యూటివ్ భేటీ కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అద్వానీలు హాజరు కానున్నారు.

సీపీఐ కార్యాలయంలో రిలే నిరహార దీక్షలు.

హైదరాబాద్ : సీపీఐ కార్యాలయంలో నేటి నుండి రిలే నిరహార దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

పుణె జట్టుపై గుజరాత్ విజయం..

ఢిల్లీ : ఐపీఎల్ 10 మ్యాచ్ లో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పుణె జట్టుపై గుజరాత్ విజయం సాధించింది. పుణెపై 7 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. పుణె : 171/8.. గుజరాత్ -172/3.

Don't Miss