Activities calendar

16 April 2017

బెంగుళూరు విజయం లక్ష్యం 162 పరుగులు

ఐపీఎల్ 10 : రైజింగ్ పుణె, బెంగుళూరు మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరుగుతోంది. రైజింగ్ పుణె ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. బెంగుళూరు విజయం లక్ష్యం 162 పరుగులుగా ఉంది. 

 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీ : ఆది నారాయణరెడ్డి

కడప : ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని మంత్రి ఆది నారాయణరెడ్డి విమర్శించారు. న్యాయబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రవర్తన సక్రమంగా లేకే తాను వైసీపీని వీడానని తెలిపారు. 

21:59 - April 16, 2017
21:58 - April 16, 2017
21:57 - April 16, 2017

ఐపిఎల్ 10 : గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే... కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ చేధించింది. నితీష్ రానా 53 పరుగులు, రోహిత్ శర్మ 40 రన్స్ తో రాణించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

21:55 - April 16, 2017

ఢిల్లీ : సింగపూర్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ను  తెలుగు తేజం సాయి ప్రణీత్ గెలుచుకున్నాడు. ఫైనల్స్‌తో మరో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌పై 17-21, 21-17, 21-12 తేడాతో అద్భుత విజయం సాధించాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో శ్రీకాంత్‌, ప్రణీత్‌ హోరాహోరీగా తలపడ్డారు. తొలి గేమ్‌ కిదాంబికే దక్కినా... రెండో సెట్‌ ప్రణీత్ గెలుచుకున్నాడు. ఇదే ఊపులో ప్రణీత్‌ 21-12తో మూడో గేమ్‌నూ మ్యాచ్‌నూ కైవసం చేసుకొన్నాడు. కెరీర్‌లో ప్రణీత్‌కిదే తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌. 

 

21:52 - April 16, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ గుర్రాల బగ్గీపై మోజు పడ్డారు. బంగారు తాపడంతో తయారుచేసిన బగ్గీలో ప్రయాణించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్‌ బ్రిటన్‌లో పర్యటించనున్నారు. రాణి ఎలిజబెత్‌కు కలిసేందుకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు వెళ్లేటప్పుడు బంగారు రథంలో ప్రయాణించే ఏర్పాట్లు చేయాలని భద్రతా అధికారులను ట్రంప్‌ ఆదేశించారు. అయితే ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటనకు వచ్చినప్పుడు పదివేల మందికిపైగా ప్రజలు నిరసన వ్యక్తం చేసే అకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, ట్రంప్‌ ఆకాంక్షను వ్యతిరేకిస్తున్నారు. బ్రిటన్‌ అధికారులు కూడా భద్రత కష్టమని చెబుతున్నారు. రథం కంటే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు. 

21:49 - April 16, 2017

ఢిల్లీ : దేశంలోని విమానం హైజాక్ చేయాలన్న కుట్ర గురించి సమాచారం అందడంతో విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి హైజాక్ జరగొచ్చన్న సమాచారంతో  హై అలర్ట్ ప్రకటించారు. విమానాలను హైజాక్ చేసేందుకు ఆరుగురు యువకులు సిద్ధమవుతున్నట్లు... శనివారం ముంబై పోలీసులకు ఓ మహిళ ఇ..మెయిల్ చేసింది. దీంతో ఈ 3 విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓ.పీ. సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

21:46 - April 16, 2017

ఒడిషా : ట్రిపుల్ తలాక్ సరికాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న బీజేపీ కార్యదర్శుల సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మూడుసార్లు తలాక్ అని చెప్పడంతోనే.. విడాకులు రావడం సరికాదన్నారు. ఈ విషయంలో సామాజిక రుగ్మతలుంటే వాటిని పరిష్కరించేందుకు అందరూ కృషిచేయాలన్నారు. ఇందులో ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉండరాదన్నారు. ఈ అంశంలో ముస్లిం సమాజంలో వైరుధ్యాలు ఉండకూడదని కూడా మోదీ అభిప్రాయపడ్డారు.

21:42 - April 16, 2017

హైదరాబాద్ : జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్‌ పెరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మండలిలో జరిగిన చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో 90శాతం మంది ప్రజలు వెనకబడిన వర్గాల వారికి చెందిన వారని పేర్కొన్నారు. 50శాతం రిజర్వేషన్‌తో ఈ వర్గాలకు న్యాయం జరగదని చెప్పుకొచ్చారు. అందుకే రిజర్వేషన్‌ పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మతప్రాతిపదికన రిజర్వేషన్‌ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

 

21:37 - April 16, 2017

హైదరాబాద్ : ముస్లింలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ, టీడీపీ నిరసన చేపట్టాయి. అసెంబ్లీ లోపల, వెలుపల ఆందోళన కొనసాగించాయి. నల్లకండువాలు ధరించి అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన  బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌  మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. 
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం : బీజేపీ 
ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును బీజేపీ, టీడీపీలు నిరసించాయి. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లకండువాలు ధరించిన బీజేపీ ఎమ్మెల్యేలు ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్‌బండ్‌ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. 
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్‌ 
ముస్లింలకు రిజర్వేషన్‌లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టాక, బీజేపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్‌ పొడియం వద్దకు దూసుకువెళ్లి, సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్పీకర్‌ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. 
గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయింపు 
సభ నుంచి సస్పెండైన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. వారిని, పోలీసులు అరెస్టు చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతం పెంచకుండా కేవలం ముస్లింలకు మాత్రమే హెచ్చించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇదే అంశంపై నిరసన వ్యక్తంచేస్తూ అసెంబ్లీ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన భారతీయ జనత యువమోర్చతోపాటు, మహిళా మోర్చ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, టీడీపీ కూడా రిజర్వేషన్‌ల పెంపు అంశంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 

సూరత్ చేరుకున్న ప్రధాని మోడీ

గుజరాత్ : ప్రధాని మోడీ సూరత్ చేరుకున్నారు. ప్రధాని రాక సందర్భంగా సూరత్ లో రోడ్ షో నిర్వహించారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సూరత్ వెళ్లాడు.

సీఎం చంద్రబాబుపై రోజా విసుర్లు

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విసుర్లు విసిరారు. దళిత నేతలను అవమానిస్తూ అంబేద్కర్ విగ్రహం పెట్టడం పబ్లిసిటీ స్టంట్ మార్చడమేనని అన్నారు. చంద్రబాబు దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరులో పోలీసులు ఎన్ టిఆర్ భవన్ పని మనుషుల్లా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. కోర్టులు, ఈసీ పట్టించుకోకపోతే ప్రమాదం తప్పదన్నారు. ప్రజాస్వామ్యం పరిహారం అవుతోందన్నారు.  

 

21:14 - April 16, 2017
21:11 - April 16, 2017

కడప : పొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం.. రణరంగాన్ని తలపించింది. ఎన్నిక వాయిదా వేయాలంటూ టీడీపీ నేతలు... జరిపి తీరాల్సిందేనంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. పంతం నెగ్గించుకునేందుకు ఇరువర్గాలూ హంగామా సృష్టించాయి. టీడీపీ సభ్యులు బల్లలు, కుర్చీలు విరిచేయగా... వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఏకంగా ఆర్ డీవోను కొట్టినంత పనిచేశారు. 
కుర్చీలు విసిరివేత  
తమ్ముళ్లు కోపంతో కుర్చీలు విరిచేశారు. అదే ఊపులో బల్లలు పగలగొట్టారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు వైసీపీ నేతలూ తిట్లపురాణం అందుకున్నారు. అధికారులను అడ్డుకునే క్రమంలో దాదాపు కొట్టినంత పని చేశారు.
నేతల హంగామా 
ఇదీ ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో నేతల ప్రవర్తన తీరు.. రెండోరోజూ మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికలోనూ నేతలు హంగామా సృష్టించారు.. ఆదివారం ఉదయం... ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి, ఆర్‌డీవో వినాయకం, జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.. కౌన్సిలర్ల పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు..  అధికారుల విజ్ఞప్తితో వైసీపీ కౌన్సిలర్లు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.. టీడీపీ కౌన్సిలర్లు మాత్రం పేర్ల నమోదుకు ముందుకు రాలేదు.. తమ పార్టీకిచెందిన ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని... ఎన్నిక జరిగితే చైర్మన్‌ పదవి తమకు దక్కదని తెలుగు తమ్ముళ్లు భావించారు.. ఎన్నిక వాయిదావేయాలంటూ మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్‌ జాబీవుల్లా, కౌన్సిలర్‌ గణేశ్‌ బాబు, మరో 12మంది కౌన్సిలర్లు నిరసనకు దిగారు.. బెంచీలు, కుర్చీలు ధ్వంసం చేశారు.. 
ఎన్నిక ప్రక్రియ వాయిదా 
ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒకటిన్నరవరకూ ఈ ఆందోళన కొనసాగింది. ఉద్రిక్తత నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆర్‌డీవో ప్రకటించారు. ఈ సమస్యను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు. ఈ వాయిదాపై టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నిక వాయిదాపడగానే వైసీపీనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎమ్మెల్యే రాచమల్లు తమ పార్టీ కౌన్సిలర్లతోకలిసి   ఆర్‌డీవోతో వాగ్వాదానికి దిగారు.. ఇష్టంవచ్చినట్లు తిడుతూ దాదాపు కొట్టినంత పనిచేశారు. ఎన్నిక జరిపేంతవరకూ అక్కడినుంచి కదలమంటూ నేలపై పడుకుని ఆర్‌డీవోను అడ్డుకున్నారు..  
ఉద్రిక్త పరిస్థితి 
వైసీపీ నేతల నిరసనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సహాయం తీసుకున్న ఆర్‌డీవో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు ఎన్నిక వాయిదాపై మండిపడ్డ రాచమల్లు..... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.    తన కాలిచెప్పునుతీసుకొని చేతిపై కొట్టుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంత భద్రత ఉన్నా ఎందుకు ఎన్నిక నిర్వహించలేకపోయారని ప్రశ్నించారు.. 
సీఎం చంద్రబాబు ఆగ్రహం 
కొద్దిసేపటి తర్వాత రెండువర్గాలకు చెందిన కౌన్సిలర్లు అక్కడినుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.. శనివారం కూడా ఇదే తరహా హంగామాతో ఎన్నిక వాయిదా పడింది. సండేరోజూ ఇదే పరిస్థితి కొనసాగడంతో మరోసారి వాయిదాపడింది. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం గందరగోళంగా మారడంపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని... హింసాత్మక ధోరణి సరికాదని పార్టీలన్నీ సంయమనం పాటించాలని సూచించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు..  తమ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. 

21:01 - April 16, 2017

హైదరాబాద్ : ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును  బీజేపీ పూర్తిగా వ్యతిరేకించగా, కాంగ్రెస్‌, సీపీఎంలు సమర్థిస్తూ.. కొన్ని సూచనలు చేశాయి.  ముస్లింతోపాటు బీసీలు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలని సీపీఎం, టీడీపీ సభ్యుల సూచనలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. 
బిల్లుపై సభలో విస్తృత స్థాయిలో చర్చ 
ముస్లింలు, గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చించేందుకు శాసనసభను ప్రత్యేకంగా సమావేశ పరిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్లు పెంపు బిల్లుపై సభలో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. 
ముస్లీం రిజర్వేషన్లు 12 శాతానికి పెంపు
చారిత్రక కారణాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ బిల్లు తీసుకుకొచ్చారు. బీసీ-ఈ  గ్రూపులో ఉన్న ముస్లింలను అన్ని రంగాల్లో పైకి తీసుకువచ్చే లక్ష్యంతోనే రిజర్వేషన్లు పెంచుతున్నట్టు సీఎం వివరించారు. 
చర్చను ప్రారంభించిన జీవన్‌రెడ్డి
చర్చను కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉపనేత జీవన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ముస్లింల రిజర్వేషన్ల బిల్లుకు  ఆమోదం పొందడంతోనే సరిపెట్టకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దీనిని అమల్లోకి తీసుకొచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. 
మతపరమైన రిజర్వేష్లను తప్పుపట్టిన బీజేపీ
గిరిజన రిజర్వేషన్ల పెంపును సమర్ధించిన బీజేపీ, ముస్లింలకు మతపరంగా రిజర్వేష్లను కల్పించడాన్ని తప్పుపట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం రిజర్వేషన్లు పెంచుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్‌ల పెంపును వ్యతిరేకిస్తూ.. బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో, స్పీకర్‌ మధుసూదనాచారి వారిని సస్పెండ్‌ చేశారు. 
బీసీలు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలి : సున్నం రాజయ్య 
అనంతరం ఇతర సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. ముస్లింలు, గిరిజనులతోపాలు బీసీలు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యతోపాటు మరికొందరు శాసనసభ్యులు  సూచించగా, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారు. 
ముస్లింకులు మాత్రమే రిజర్వేషన్ల పెంచడాన్ని తప్పుబట్టిన కృష్ణయ్య 
బీసీల్లో ఉన్న ఏ, బీ, సీ, డీ గ్రూపులకు రిజర్వేషన్లు పెంచకుండా ఈ గ్రూపుగా ఉన్న ముస్లింకులు మాత్రమే రిజర్వేషన్ల పెంచడాన్నిటీడీపీ సభ్యుడు కృష్ణయ్య తప్పుపట్టారు. 
చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం 
ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదించేలా ఒత్తిడి తెస్తామని, అవసరమైతే లోక్‌సభను స్తంభింపచేస్తామని చెప్పారు. చర్చ తర్వాత ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత తెలంగాణ చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణ బిల్లు, జీఎస్‌టీ బిల్లులను ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధిక  వాయిదా పడింది. 
 

గిరిజన, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు టీ.అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్ : తెలంగాణలో గిరిజన, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు టీఎస్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. ఈ బిల్లును సభ్యులెవ్వరూ వ్యతిరేకించకపోవడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.. సుమారు నాలుగు గంటలపాటు బిల్లుపై చర్చ జరిగింది.. గిరిజనులకు 6నుంచి 10శాతం, బీసీ ఈలకు 4నుంచి
12శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

శివప్రసాద్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే బుద్దా వెంకన్న

హైదరాబాద్ : ఎంపీ శివప్రసాద్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఖండించారు. అనేక మంది దళితలను చంద్రబాబు చేరదీశారు. శివప్రసాద్ భాగోతం బటటపెడతామని చెప్పారు.

19:06 - April 16, 2017

విజయనగరం : జిల్లా టీడీపీ రాజకీయాల్లో కొత్త టెన్షన్ మొదలైంది. బొబ్బిలి ఎమ్యెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడంతో టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తి మొదలైంది. మంత్రి పదవి కోసం తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కెఎ నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ప్రతిపక్ష వైసీపీ నుంచి పార్టీలో చేరిన సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడంతో సీనియర్ నాయకులు కినుక వహించారు.

గతంలో మృణాళిణి....ఇప్పుడు కృష్ణ.......
గతంలోనూ మృణాళిని మంత్రిగా ఉన్పప్పుడు కూడా జిల్లా ఎమ్మెల్యేలు ఆమెకు అంతగా సహకరించలేదు. పక్క జిల్లాకు చెందిన మృణాళినికి మంత్రి పదవి కేటాయించడం జిల్లా నాయకులకు రుచించలేదు. ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చిన సుజయ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న తమను పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు సుజయకృష్ణ రంగారావు మాత్రం తనకు ఎవరితోనూ విభేదాలు లేవని స్పష్టంచేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాను డుచుకుంటానని తెలిపారు.

ముభావంగా ఎమ్మెల్యేలు........
మంత్రిపదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సుజయ రంగారావుకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఘనంగా స్వాగతం పలికినా...అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం ముభావంగానే కనిపించారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న మెజార్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేలను కాదని, నిన్న మొన్న పార్టీలోకి వచ్చి చేరిన వారిని అందలం ఎక్కించడంపై స్థానిక నేతలు లోలోపలే మదనపడిపోతున్నారు. మరి ఈ పరిస్థితిలను మంత్రి సుజయకృష్ణ రంగారావు ఎలా అధిగమిస్తారో.. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో వేచి చూడాలి.

 

 

18:57 - April 16, 2017

విశాఖపట్నం : అరకులోయకు సరికొత్త అందం చేకూరింది. అరకు అందాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అద్దాల రైలు అందుబాటులోకి వచ్చింది. రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అద్దాల రైలును ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన తర్వాత అద్దాల రైలులో కూర్చొని అరకు అందాలను చూడడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముగిసింది. రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం అనంతరం.. సభ... హెరిటేజ్, జీఎస్ టీ బిల్లులపై చర్చించింది. 2 బిల్లులకు ఆమోదం లభించాక... డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి... సభను నిరవధికంగా వాయిదా వేశారు.

 

18:53 - April 16, 2017

గుంటూరు : దళితులకు అన్యాయం జరుగుతోందని ఎంపి శివప్రసాద్ లేవనెత్తిన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే సమాధానం చెప్పాలని సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దళితులకు చంద్రబాబు అనేక హామీలిచ్చారని, కాని అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల భూములను బాబు... కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని మధు అన్నారు.

 

18:47 - April 16, 2017

గుంటూరు : ఎంపీ శివప్రసాద్ తీరు క్రమశిక్షణా రాహిత్యమే రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ అన్నారు. టీడీపీలో ఎంతటివారైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే చంద్రబాబునాయుడుకు చెప్పుకోవాలి తప్ప.. మీడియాలో విమర్శలు చేయడం సరికాదని శివప్రసాద్‌కు సూచించారు.

 

మండలిలో రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ మండలిలో రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రవేశపెట్టారు. 

17:42 - April 16, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్ల బిల్లుకు తాము వ్యతిరేకమని బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సభ నుంచి తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ బీజేపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుతో ప్రభుత్వం న్యాయవ్యవస్థను అవమాన పరిచిందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుతో తెలంగాణ ప్రజలందరికి నష్టం జరుగుతుందని అన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

17:29 - April 16, 2017

హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైతే కేంద్రం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ముందుకు రాకపోతే లోక్‌సభను స్తంభింపచేస్తామన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై జరిగిన చర్చకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. కొన్ని మతతత్వ పార్టీలు గుడ్డిగా ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లపై కొన్ని పార్టీలు వితండవాదం చేస్తున్నాయని పరోక్షంగా బీజేపీని నిందించారు. రిజర్వేషన్ల పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. రిజర్వేషన్ల పెంపు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన అంశం కాదన్నారు.  

17:21 - April 16, 2017

హైదరాబాద్ : ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లీంలు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. ముస్లీంలు ఈ దేశ పౌరులు కారా అని నిలదీశారు. పేదరికం, దుర్బరమైన జీవితం అనుభవిస్తున్న కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పు లేదని స్ఫష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం ముందుకు రాకపోతే లోక్ సభలో గలాట చేస్తామని హెచ్చరించారు. బీసీలు, ఎస్సీల రిజర్వేషన్లు కూడా పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 

17:20 - April 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముగిసింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సభను నిరవధిక వాయిదా వేశారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ బిల్లుతోపాటు హెరిటేజ్, జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజన, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లును సభ్యులెవ్వరూ వ్యతిరేకించకపోవడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సుమారు నాలుగు గంటలపాటు బిల్లుపై చర్చ జరిగింది. గిరిజనులకు 6 నుంచి 10 శాతం, బీసీ ఈలకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్లను పెంచారు.

 

17:08 - April 16, 2017

హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి 6 నెలలు ఎందుకని....అరగంట చాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వానికి బీసీల రిజర్వేషన్ పెంచాలనుకుంటే బీసీ కమిషన్ నుంచి సిఫారసు లేఖ తెప్పించుకోని రిజర్వేషన్లు పెంచవచ్చని తెలిపారు. బీసీలలోకి 14 ముస్లిం కులాలు పోతే మొత్తం 98 కలాలు అవుతాయని... బీసీల రిజర్వేషన్లు 52 శాతం పెంచాలని డిమాండ్ చేశారు.

16:15 - April 16, 2017

హైదరాబాద్ : బీసీలతోపాటు, ఎస్సీల రిజర్వేషన్లు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. బీసీ కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత మళ్లీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇందుకోసం బిల్లు తీసుకొస్తామని శాసనసభ దృష్టికి తెచ్చారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను కూడా ఒక శాతం పెంచేందుకు వీలుగా తర్వలో ఎస్సీ కమిషన్‌ను నియమిస్తామని కేసీఆర్‌ చెప్పారు.  

 

16:07 - April 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుకు సీపీఎం పూర్తి మద్దతు ప్రకటిచింది. ముస్లింలను బీసీ ఈ లో చేర్చడం సీపీఎం స్వాగతిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. మైనార్టీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారని...వారికి 12 శాతం రిజర్వేషన్లు రావడం శుభపరిణామమని తెలిపారు. అలాగే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడం మంచిదే.. కానీ ఎస్టీల్లో బోయవాళ్మికీలను చేర్చడం సరికాదని అన్నారు. ఇప్పటికే కోయ, లంబాడిల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

 

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్న సాయి ప్రణీత్

హైదరాబాద్ : సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాయి ప్రణీత్ గెలుచుకునన్నాడు. ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ పై 17..21, 21..17, తేడాతో ప్రణీత్ విజయం సాధించారు.

 

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్న సాయి ప్రణీత్

హైదరాబాద్ : సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాయి ప్రణీత్ గెలుచుకునన్నాడు. ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ పై 17..21, 21..17, తేడాతో ప్రణీత్ విజయం సాధించారు.

 

15:48 - April 16, 2017

కడప : ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు తన నిరసనను తెలిపారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజమల్లు హెచ్చరించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టి తీసుకెళ్తానని అధికారి తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులకు టీడీపీ వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీలో హెరిటేజ్ పై చర్చ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో హెరిటేజ్ పై చర్చ జరిగింది.  చారిత్రక ఆస్తుల పరిరక్షణ కోసమే ఈ యాక్ట్ తెస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హెరిటేజ్ యాక్ట్ ను ఎలా రూపొందిస్తే బాగుంటుందో అందరం కలిసి మాట్లాడుకొని తయారు చేద్దామని చెప్పారు. 

15:16 - April 16, 2017
13:19 - April 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 'ఒక్క రోజు' అసెంబ్లీలో బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక్క రోజు సమావేశమైంది. ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్ బిల్లును చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. గిరిజనుల రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిస్తోందని, గిరిజన వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘంగా మాట్లాడడంపై స్పీకర్ మధుసూధనచారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా మాట వినిపించుకోకుండా మాట్లాడడంతో మైక్ ను కట్ చేసి ఎమ్మెల్యే షకీల్ కు అవకాశం ఇచ్చారు. కానీ బీజేపీ సభ్యులు ప్లకార్డులతో ఆందోళన చేశారు. మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకుని సభ్యులు ఈ విధంగా చేయడం తగదని, మాట్లాడిన అనంతరం ఇతర సభ్యులకు అడ్డు పడడం సబబు కాదన్నారు. ఆందోళన విరమించుకపోవడంతో సభకు అంతరాయం కలుగ చేస్తున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్, టి. రాజాసింగ్, రామచంద్రారెడ్డిలను సస్పెన్షన్ తీర్మానం చేస్తున్నట్లు, దీనికి స్పీకర్ అనుమతించాలని కోరారు. అనంతరం సభ్యులను సెషన్ వరకు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

టీఎస్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మేల్యేల సస్పెన్షన్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయన వారిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, చింతల, రాజసింగ్ లు   ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయడంతో వారిని సస్పెండ్ చేశారు.

13:02 - April 16, 2017

హైదరాబాద్ : రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్ బిల్లును చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. గిరిజనుల రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిస్తోందని, గిరిజన వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక్క రోజు సమావేశమైంది. ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడారు. బీజేపీ తరపున నల్లు కండువా కప్పుకుని కిషన్ రెడ్డి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్ ఇదే శాసనసభలో ప్రవేశ పెట్టారని, తానొక్కడినే వ్యతిరేకించినట్లు చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకమని అనే వాదన వినకుండా నాలుగు శాతం పెడితే రెండుసార్లు రాష్ట్ర హైకోర్టు ముస్లిం రిజర్వేషన్ లను కొట్టివేసిందన్నారు. అదే రిజర్వేషన్ ను కొనసాగింపుగా 12 శాతం పెంచడం కొత్త వివాదానికి దారి తీస్తుందన్నారు.

స్పందించిన కేసీఆర్..
ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. రాజ్యాంగ వ్యతిరేక చర్య అనడం సబబు కాదని కేసీఆర్ పేర్కొన్నారు. మతపరమైందని హైకోర్టు కొట్టివేయలేదని, మతపరమైన రిజర్వేషన్ కానే కాదని స్పష్టం చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా ఇవ్వవచ్చని హైకోర్టు చెప్పడం జరిగిందని, ఆ విధంగానే తాము చేయడం జరుగుతోందన్నారు. సీఎం సభను తప్పుదారి పటిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సుధీర్ కమిటీ..బీసీ కమిషన్ రిపోర్టులో ఏం ఉందో చదువుకోవాలని సూచించారు. దీనికి సీఎం కేసీఆర్ అభ్యరంతరం వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రయత్నించారు. కానీ స్పీకర్ అనుమతించలేదు. కొత్త సంప్రదాయం ఎందుకు తెస్తారని, పార్టీ ఉన్నప్పుడు ఒక లైన్ ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

మౌలిక సూత్రాలకు విరుద్ధం..
మత ప్రాదికన రాజ్యాంగంలో పొందుపరచిన మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. ముస్లిం సమాజంలో కుల..సామాజిక అసమానతలు లేవన్నారు. ఇస్లాంలో కుల వివక్షత ఉండదని, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వవద్దని, సామాజిక ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విద్యాపరంగా..అక్షరాస్యత ఇతర వెనుకబడిన వర్గాలకంటే ఎక్కువగా ఉన్నారని, అనేక వందల మైనార్టీ ఇనిస్టిట్యూషన్స్ ఇక్కడ పని చేయడం జరుగుతోందన్నారు. విద్య రావడం లేదని వాస్తవం కాదన్నారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ తీసుకొస్తున్నారని తెలిపారు. మైనార్టీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని అప్పట్లో చర్చ జరిగిందని, 1949, మే 25-26వ తేదీలలో రెండు ఉన్నతస్థాయి శిఖరాగ్ర సదస్సులు జరిగాయన్నారు. ఇందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రముఖ వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు.

బీసీలకు అన్యాయమన్న కిషన్..
బీసీలకు అన్యాయం జరుగుతుందని, జరిగిందని ఏ విధంగా అన్యాయం జరగలేదో ప్రభుత్వం చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ లో 150 సీట్లు ఉన్నాయని అందులో 50 శాతం బీసీలకు రిజర్వు చేయడం జరిగిందన్నారు. అందులో 30 సీట్లు బీసీయేతరులు గెలిచారన్నారు. ఇది బీసీలకు న్యాయమా ? అన్యాయమా ? చెప్పాల్సినవసరం ఉందన్నారు.

దంపతుల ఆత్మహత్య

గుంటూరు : జిల్లాలోని పలకలూరులో విషాదం చోటుచేసుకుంది. బుజ్జి, శేషగిరి అనే దంపతుల ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఉరేసుకోగా... భార్య మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని మృతదుహలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి మృతి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

12:42 - April 16, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి..సీఎం కేసీఆర్ మధ్య కొంత సంవాదం జరిగింది. ఆదివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం జరగనుంది. మైనారిటీలు, ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడారు. 9 షెడ్యూల్ లో చేర్చే విధంగా కేంద్రం సూచించడం..అనంతరం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 9 షెడ్యూల్ లో చేరుస్తుందని విశ్వాసం ఉందా ? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లు అడగమని ధైర్యంగా చెప్పారని తెలిపారు. బీసీ ఈ గ్రూప్ కు సంబంధించి 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని విశ్వాసం ఉంటే శాసనసభ ఎన్నికల్లో ముస్లిం వర్గాలను ఓట్లు అడగమని చెప్పాలని సవాల్ విసిరారు. తమిళనాడు అంశం మాత్రం సుప్రీం పరిశీలనలో ఉందని, మొత్తం దేశానికి సంబంధించింది కాదన్నారు. దీనికి సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడుకు సంబంధించి జడ్జిమెంట్ ఆ రాష్ట్రానికి పరిమితం కాదని, అడ్వకేట్ అయి ఉండి జీవన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ఎన్నికలకు చాలా మంది విషయాలు చెప్పడం జరిగిందని, 9 షెడ్యూల్ మార్గంలో వెళ్లాల్సినవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం విఫలం అవుతుందని తెలిపారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలు తెలుసుకోవాల్సినవసరం ఉందని తెలిపారు. 9 షెడ్యూల్ అనేది రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాదని, 89 అంశాలు చేర్చబడిననవి జీవన్ రెడ్డి తెలిపారు.

మతపరమైన రిజర్వేన్లు రాజ్యంగ వ్యతిరేకం : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లు అమలు అంబేద్కర్ ఆశాయాలకు తుట్లు పోడవటమే....అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

దేశంలోని ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంపు

హైదరాబాద్ : ముంబై, చెన్నై, శంషాబాద్ ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచారు. హైజాక్ బెదిరింపుల దృష్ట్యా భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.

 

12:30 - April 16, 2017

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా రిజర్వేషన్లు ఉన్నాయి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా రిజర్వేషన్లు ఉన్నాయని... తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ లు అమలులో ఉన్నాయన్నారు. తెలంగాణలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఉన్నారని తెలిపారు. తెలంగాణలోరిజర్వేషన్లు పెంచాల్సిన అవసముందని కేసీఆర్ అన్నారు. రిజర్వేషన్ల పెంపు అధికారం కేంద్రం రాష్ట్రాలకు కల్పించాలని కోరారు. దీనిపై ఈనెల 23 నీతిఆయోగ్ సమావేశంలో ప్రధానితో మాట్లాడుతామని తెలిపారు.

సీఎం 9వ షెడ్యూల్ పై తప్పుదోవ పట్టిస్తున్నారు : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : సీఎం చంద్రశేఖర్ రావు 9వ షెడ్యూల్ పై తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. 9వ షెడ్యూల్లో తెలంగాణను చేర్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసారి  అని తెలిపారు.

 

11:51 - April 16, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్లను మత కోణంతో చూడవద్దని కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే సమావేశం జరగనుంది. మైనారిటీలు, ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడారు. బీసీ -ఈ 4శాతం ఉన్న దానిని 12 శాతం రిజర్వేషన్ కు పెంచే విధంగా..గిరిజనులకు అమలవుతున్న ఆరు శాతాన్ని పది శాతాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుందన్నారు. ముస్లిం..మైనార్టీ వర్గాలకు చెందిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలకు స్పష్టత రావాల్సినవసరం ఉందన్నారు.

హామీలిచ్చారు..ఇప్పుడు అమలు..
ముస్లీంలో ఉండే సామాజిక...ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా చూడాలని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఐదు శాతానికి కల్పించాలని నిర్ణయం తీసుకుందన్నారు. 50 శాతానికి మించడం కుదరదన్న నేపథ్యంలో నాలుగు శాతానికి కుదించడం జరిగిందన్నారు. మత కోణంతో చూడడం సరైంది కాదని సూచించారు. ముస్లిం సమాజంలో ఆర్థికంగా..వెనుకబడి ఉన్నారని, బీసీ ఈ కేవలం కొంతమందికి మాత్రమే కల్పించడం జరుగుతోందన్నారు. బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ప్రచారం చేయడం సబబు కాదన్నారు. ఎన్నికల ప్రణాళికలో రిజర్వేషన్లపై కేసీఆర్ పలు హామీలిచ్చారని గుర్తు చేశారు. కానీ నాలుగు నెలల తరువాత కూడా నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించలేదని, 9 నెలలకు కూడా కమిషన్ కూడా వేయలేదన్నారు. మూడు సంవత్సరాల అనంతరం ఇప్పుడు ఈ బిల్లులను ప్రవేశ పెట్టారని జీవన్ రెడ్డి విమర్శించారు. దీనిపై సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రొద్దుటూరులో మళ్లీ ఉద్రిక్తత

కడప : జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయంలోకి చోచ్చుకెళ్లేందుకు వరదరాజుల వర్గం యత్నం చేశారు.

11:37 - April 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఒక్క రోజు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. గిరిజన రిజర్వేషన్ బిల్లును తొలుత సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన బిల్లుపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని చాలా మంది అనుకున్నారని, తెలంగాణ వ్యతిరేక ప్రచారం కూడా నిర్వహించారని తెలిపారు. 11 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీగా ..ఉద్యమ సంస్థగా పేదలకు హామీలిచ్చామని అంతేగాకుండా 150-200 సభలలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న సభలలో హామీలిచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం ఏ విధంగా సాధిస్తామో మీడియా సమావేశాల్లో తాను చెప్పడం జరిగిందన్నారు. గిరిజనులకు రిజర్వేషన్..బీసీ ఈ వర్గాల రిజర్వేషన్ లు కొత్త రిజర్వేషన్ లు కావని, చాలా రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్నవేనని తెలిపారు. ఎవరూ గందరగోళానికి గురి కావద్దని ప్రజలకు సూచించారు.

కమిషన్ లు..
స్పష్టమైనా మెజార్టీని సాధించిన అనంతరం ఈ బిల్లును తలనెత్తుకున్నామని, మాజీ ఐఏఎస్ అధికారులను అధ్యయనం చేయాలని రెండు కమిషన్ లు నియమించినట్లు చెప్పారు. కులాలు..మతాల పేరిట రిజర్వేషన్లు ఇవ్వరని అందువల్ల సామాజిక ఆర్థిక వెనుకబాటు పేరిట రిజర్వేషన్లను అవలింబిస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో గిరిజనులను ఆరు శాతం లెక్కించారని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జనాభాతో పాల్చిన సమయంలో 9.8 శాతంగా ఉందన్నారు. ఆంధ్రాలో ఉన్న వాల్మికి బోయలను ఎస్టీల్లో కలపాలరని ఇక్కడున్న వారు ఆందోళన చెందుతున్నారని, అంతేగాకుండా కాగిత లంబాడీలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. కమిషన్ నిర్ధారించిన లెక్కల ప్రకారం 9.08గా ఉన్న ఎస్టీలతో పాటు వీరిని కలపాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు.

దళితుల రిజర్వేషన్లు పెంచాలి..
16.3 శాతం దళితులున్నారని, వారి జనాభాకునుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సినవసరం ఉందన్నారు. ఎస్సీ కమిషన్ త్వరలో నియమిస్తామన్నారు. కమిషన్ నియమించిన అనంతరం నివేదిక వచ్చిన అనంతరం రిజర్వేషన్ పెంచడం జరుగుతుందన్నారు. దళితులకు ఒక శాతం రిజర్వేషన్ పెంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. బ్యాక్ వర్డ్ క్లాస్ లకు అన్యాయం జరుగుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ ముప్పు ఉండదని, బీసీల రిజర్వేషన్ పెంచాల్సినవసరం ఉందన్నారు. ఆరు నెలల కాలంలో వచ్చే నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాష్ట్రాలకే అధికారాలివ్వాలి..
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం అని, 50 శాతం మించరాదని సుప్రీం పేర్కొంటూనే గణించదగిన గణాంకాలు ఉంటే ఇవ్వాల్సినవసరం ఉందని తెలపడం జరిగిందన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలున్న రాష్ట్రం తెలంగాణ అని, రిజర్వేషన్ 50 శాతం పరిమితి సరిపోదని పేర్కొన్నారు. రిజర్వేషన్లను నిర్ణయించుకొనే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు. 23వ తేదీన నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధాని పిలిచారని అందులో తాను మెమోరాండం సమర్పిస్తానని తెలిపారు. మాదిగ వర్గానికి చెందిన వారు ఉద్యమాలు చేయడం జరిగిందని, వర్గీకరణ చేసి కొంతకాలంపాటు అమలు చేయడం జరిగిందన్నారు. వర్గీకరణ, రిజర్వేషన్లను రాష్ట్రాలకే అధికారాలివ్వాలని కోరారు. ఈ బిల్లును ఆమోదించాలని సభను కోరారు.

'విస్టాడోమ్' రైలు ప్రారంభించిన సురేష్ ప్రభు

విశాఖపట్నం : విశాఖ, అరకు మధ్య 'విస్టాడోమ్' రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును మంత్రి ప్రారంభించారు.

10:37 - April 16, 2017

శశికళ పెరోల్ నిరాకరణ..

చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పెట్టుకున్న పెరోల్ దరఖాస్తును న్యాయమూర్తి తిరస్కరించారు. అన్న కుమారుడు టీవీ మహదేవన్ శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆమె పెరోల్ కు దరఖాస్తు చేశారు.

10:20 - April 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రథమ..ద్వితీయ సంవత్సర ఫలితాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఆదివారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో బాలికలే హావా కొనసాగింది. ప్రథమ..ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్ మొదటి స్థానంలో నిలిచింది. గతంలో లాగానే బాలికలే పై చేయి సాధించారని, మొదటి సంవత్సర ఫలితాల్లో 57 శాతం ఉంటే అందులో బాలికలు 63 శాతం ఉన్నారని తెలిపారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మొత్తంగా 66 శాతం ఉంటే అందులో 71 శాతం బాలికలున్నారని తెలిపారు. పాస్ అయిన వారిలో మొదటి ఏ గ్రేడ్ లో 50 శాతం సెకండియర్ ఏ గ్రేడ్ లో 53 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ లో టాప్ ప్లేస్ లో మేడ్చల్ జిల్లా నిలిచిందని ద్వితీయ స్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో మహబూబాబాద్ ఉందన్నారు. సెకండ్ ఇయర్ లో మొదటి స్థానం మేడ్చల్, తరువాత స్థానాల్లో రంగారెడ్డి, నిర్మల్, గద్వాల్, మహబూబాబాద్ జిల్లాలున్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మెరుగైన ఫలితాలు సాధించగా ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. మొదటి సంవత్సరంలో 61 శాతం ఉంటే సెకండియర్ లో 69 శాతం ఉందన్నారు. మే 15వ తేదీన ఇన్ స్టంట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామని, 22-04-2017 దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీ కౌంటింగ్ కోసం 22-04-2017 దరఖాస్తు చేసుకోవాలన్నారు.

లక్ష్యాలు..
2018లో ఇంటర్ మీడియట్ ఎగ్జామ్ లో 67 శాతం ఫలితాలు సాధించాలని, సెకండ్ ఇయర్ లో 75 ఉత్తీర్ణత శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 2017–18 సంవత్సరానికి కాలేజీల్లో బయో మెట్రిక్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కాపాడుకోవాల్సినవసరం ఉందని, ప్రస్తుతం 1.73 వేల మంది విద్యార్థులుంటే ఈ సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరానికి రెండు లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కడియం పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'తెలంగాణ ప్రభుత్వ ఉచిత ఇంటర్ విద్య' పోస్టర్ ను ఆవిష్కరించారు.
మార్చి నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.76 లక్షల మంది విద్యార్థులు రాశారు.
ఫస్ట్ ఇయర్ లో 4,75,874 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 2,70,738 మంది ఉత్తీర్ణులయ్యారు.
రెండో సంవత్సరంలో 4,14,213 మంది పరీక్ష రాయగా 2,75,273 మంది పాస్ అయ్యారు.

కాసేపట్లో టీఎస్ ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్ : కాసేపట్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ, ఉపముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేయనున్నారు. మూడు రోజుల క్రితం ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదతైన సంగతి తెలిసిందే

వరంగల్ ఫ్రూట్ మార్కెట్ లో రైతుల ఆందోళన..

వరంగల్ : ఫ్రూట్ మార్కెట్ లో రైతులు ఆందోళన చేపట్టారు. మామిడిపళ్లను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. మామిడిపళ్లను కొనుగోళ్లు చేయాలని కోరుతున్నారు.

కాట్రగడ్డ ప్రసూన అరెస్టు..

హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

09:44 - April 16, 2017
09:25 - April 16, 2017

విజయనగరం : మార్నింగ్ చేస్తున్న ఓ వ్యాపారిపై ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చిటఫండ్ వ్యాపారం నిర్వహించే జగన్ మోహన్ రావు ఆదివారం ఉదయం ఓ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఓ ఆగంతకుడు వెనుక వైపు నుండి కాల్పులకు తెగబడ్డాడు. దీనితో జగన్ వెన్నెముకలోకి రెండు బుల్లెట్లు దూసుకపోయాయి. ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అక్కడే మార్నింగ్ చేస్తున్న వారు వెంటనే తేరుకుని కాల్పులకు తెగబడిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని పట్టుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు చేసిన వ్యక్తి పశ్చిమబెంగాల్ కటక్ చెందిన కేశవ్ అనే వ్యక్తి అని తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. ఘటనలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

09:21 - April 16, 2017

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో 'మారుత' తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తీవ్ర వాయుగుండంగా తుపాన్ మారింది. ప్రస్తుతం మాయాబందర్ కు 340 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉత్తరాంధ్రలో వర్షాలు..

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో 'మారుత' తుఫాన్ కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం తుపాన్ గా మారింది. ప్రస్తుతం మాయాబందర్ కు 340 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

చిట్ ఫండ్ వ్యాపారిపై కాల్పులు..

విజయనగరం : జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. బొబ్బిలిలో చిట్ ఫండ్ వ్యాపారి జగన్ మోహన్ రావుపై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. స్థానికులు దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

నేడు కిదాంబితో ప్రణీత్ ఢీ..

ఢిల్లీ : సింగపూర్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లోకి కిదాంబి శ్రీకాంత్‌, బి. సాయి ప్రణీత్‌లు ప్రవేశించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న సాయి ప్రణీత్‌.. వరల్డ్‌ నెం.29 కిదాంబి శ్రీకాంత్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనున్నాడు.

07:17 - April 16, 2017
06:45 - April 16, 2017

మెదక్ : సంగారెడ్డిలోని కేశవరెడ్డి పాఠశాలలో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవిర్భావం నుండి ఇదే తొలి వార్షికోత్సవం కావడంతో భారీస్థాయిలో వేడుకలు నిర్వహించారు. చదువు, ఆటపాటలతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

 

06:43 - April 16, 2017

హైదరాబాద్ : విద్యుత్‌ రంగంలో చేపట్టిన అనేక సంస్కరణలను పరిశీలిస్తే అవి తిరోగమనంలో ఉన్నట్లు అర్ధమవుతుందని విద్యుత్‌ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 'విద్యుత్‌ సంస్కరణలు-ఒక పరిశీలన' అనే అంశంపై ఎలక్ట్రికల్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సీఐటీయూ ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన విద్యుత్‌ రంగ నిపుణులు.. విద్యుత్‌ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. దేశంలో 90వ దశకంలో ప్రారంభించిన విద్యుత్‌ సంస్కరణలను ఇప్పుడు సమీక్షిస్తే తిరోగమనంలో ఉన్నాయని.. ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులు వస్తే చౌకగా విద్యుత్‌ ఉత్పత్తి జరిగి వినియోగదారులు లబ్ధిపొందుతారన్న పాలకుల అభిప్రాయం తప్పని నేడు రుజువైందని ఆలిండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ శైలేంద్ర దూబే అన్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సీఐటీయూ నిర్వహించిన 'విద్యుత్‌ సంస్కరణలు-ఒక పరిశీలన' సదస్సులో పాల్గొన్న ఆయన.. 2014లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును గుజరాత్‌ సహా 18 రాష్ట్రాలు వ్యతిరేకించాయని.. దాన్ని మళ్లీ చట్ట సవరణలో ప్రభుత్వం తెస్తుందన్నారు. ఫిక్స్‌డ్‌ చార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారని... అందుకే విద్యుత్‌ కోనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
విద్యుత్‌ రంగంలో నష్టాలు తగ్గిస్తామని సంస్కరణలు తెచ్చిన ప్రభుత్వాలు.. ఎంతమేరకు నష్టాలు తగ్గించాయో చర్చకు రావడం లేదని విద్యుత్‌ రంగ నిపుణులు ప్రబీర్‌ పురాకస్త అన్నారు. విద్యుత్‌ రంగంలోని సమస్యలను ప్రజా సమస్యగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే అంతిమ లక్ష్యం సాధించగలమని విద్యుత్‌ రంగ నిపుణలు రఘు అన్నారు. విద్యుత్‌ రంగాన్ని కాపాడుకునేందుకు ఉద్యోగులంతా ఏకం కావాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

06:40 - April 16, 2017

విజయవాడ : రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకునేందు అనేక పాట్లు పడుతోంది. చేసిన ఉద్యమాలు కలిసి రాకపోవడం, పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం లాంటి అంశాలు పార్టీని కలవరపెడుతున్నాయి. మరోవైపు 2019 ఎన్నికలకు టీడీపీ, వైసీపీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తుండగా.. హస్తం పార్టీ మాత్రం ఇంకా మనుగడ కోసం ఆరాటపడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2019లో పరిస్థితి ఏంటని నేతలు మదనపడుతున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కోలుకోలేని దెబ్బతిన్న హస్తం పార్టీ పుంజుకునేందుకు అనేక అవస్థలు పడుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రస్తుతం ఉనికిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్న భావన అన్ని వర్గాల్లో ఏర్పడటంతో.. ఆ అభిప్రాయం తొలగించేందుకు హస్తం నేతలు అనేక అవస్థలు పడుతున్నారు.

సఫలం అవుతాయా ?
ఇక ప్రజల్లో గుర్తింపు పొందేందుకు హస్తం పార్టీ నేతలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని నెత్తిమీద వేసుకుని ప్రజల్లోకి వెళ్లినా పెద్దగా కలిసి రాలేదు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో... కాంగ్రెస్‌ ఎన్ని ఉద్యమాలు చేసినా సఫలీకృతం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకటి, రెండు అంశాలపై ఆందోళన చేస్తున్నప్పటికీ.. అవి పెద్దగా కలిసి రాకుండాపోయాయి. మరోవైపు పార్టీలో నాయకత్వ లేమి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పదవుల కోసం నేతలు పోటీ పడగా.. ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. దీంతో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఢిల్లీ నేతలను రాష్ట్రానికి పిలిపించి అనేక కార్యక్రమాలు చేపడుతోంది రాష్ట్ర కమిటీ. ఇదిలావుంటే ఎలాగైనా పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని నేతలు చెబుతున్నారు. ఒకప్పుడు గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ ఏపీలో కోలుకోవడం కస్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి ఉందని.. రాష్ట్రంలో అయితే.. పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. మొత్తానికి రాష్ట్ర విభజనతో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్‌.. బలోపేతానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.

06:37 - April 16, 2017

హైదరాబాద్ : మరో విద్యా ఉద్యమానికి ప్రజాసంఘాలు సిద్దమయ్యాయి. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియంతో కూడిన కేజీ క్లాసులు ప్రారంభించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఫీజులు నియంత్రించాలని, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్ధి, యువజన, ఉపాధ్యాయ, మహిళా సంఘాలతోపాటు తెలంగాణ తల్లిదండ్రులు సంఘం సమావేశమయ్యాయి. పేద విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

 

06:36 - April 16, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవ్వరు లంచాలు తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని... తెలంగాణ ఆరోగ్యశాఖామంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు.. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో మంత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు.. ఓపీ విభాగం, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, ఐసీయూ, పేషంట్ల వార్డులు, హెచ్ఐవీ యూనిట్‌ విభాగాలను మంత్రి పరిశీలించారు. హాజరుపట్టికను చూశారు. రోగులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఒక్కో విభాగంలోని లోపాల్ని గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూపరిండెంట్‌ను ఆదేశించారు.

06:33 - April 16, 2017

కర్నూలు : జిల్లా బేతంచర్ల శివారులో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. తాగునీటి విషయంలో వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇవరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

06:31 - April 16, 2017

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి మలేషియా వెళ్తున్న వ్యక్తి నుంచి 6 కిలోల డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 2 కోట్ల 37 లక్షల రూపాయల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. కుంకుమ డబ్బాల్లో డ్రగ్స్‌ తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.

06:29 - April 16, 2017

హైదరాబాద్ : రిజర్వేషన్ల అంశంపై సర్కార్‌ దూసుకుపోతుంది. ఎలాగైనా మైనారిటీలు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న టీఆర్‌ఎస్‌ ఆ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే మైనారిటీలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ఈరోజు శాసనసభ ప్రత్యేక సమావేశం కొనసాగనుంది. ఈరోజు తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మైనారిటీలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లులను ఆమోదించేందుకు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గం ఈ ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒక రోజు నిర్వహించనున్న శాసనసభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రిజర్వేషన్లతో పాటు జీఎస్టీ, చారిత్రక కట్టడాల పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే.. ప్రతిపక్షాలు రిజర్వేషన్లను సమర్ధిస్తూనే.. ప్రభుత్వంలోని లోపాలను వెతికే పనిలో పడ్డాయి. మరోవైపు శనివారం రాత్రి వరకు బిల్లు ప్రతులు అందకపోవడంతో.. వాటిని అధ్యయనం చేసేందుకు సమయం సరిపోదని.. అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరాయి. దీనికి అధికార పార్టీ అంగీకరించలేదు. ఎంత లేటయినా.. ఒక్కరోజులోనే సమావేశాలు ముగించాలని నిర్ణయించింది. మొత్తానికి రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రతిపక్షాలు.. సభలో నిలదీసేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో శాసనసభ ప్రత్యేక సమావేశం వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

పంజాబ్ పై ఢిల్లీ విజయం..

ఢిల్లీ : ఐపీఎల్ 10 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ జట్టుపై 51 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది.

ఐపీఎల్ 10 లో మ్యాచ్ లు..

ఢిల్లీ : ఐపీఎల్ 10లో నేడు ముంబై ఇండియన్స్ - గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో పుణె జట్టు తలపడనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు అద్దాల రైలు ప్రారంభం..

ఢిల్లీ : నేడు విశాఖ - అరకు మధ్య 'విస్టాడామ్' రైలు ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నేడు బీజేపీ ఆందోళనలు..

హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది.

నేడే టి.ఇంటర్ ఫలితాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకే సారి విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు.

నేడు ట్యాంక్ బండ్ వద్ద టి.టిడిపి ధర్నా..

హైదరాబాద్ : రిజర్వేషన్ బిల్ కు వ్యతిరేకంగా నేడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి ధర్నా చేపట్టనుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టివేత..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా వెళుతున్న వ్యక్తి నుండి 6 కిలోల కేటమైన్ స్వాధీనం చేసుకున్నారు.

Don't Miss