Activities calendar

18 April 2017

21:22 - April 18, 2017

తూ.గో: ప్రజా సంక్షేమం కోసం ఏపీ సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రజలంతా ఆయనకు అండగా నిలవాలని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకే తాను పంచాయతీరాజ్‌ శాఖ తీసుకున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు చోట్ల 12కోట్ల నిధులతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధికి తెదేపా ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షం బురదచల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

21:20 - April 18, 2017

అమరావతి: ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 26,664 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తూన్నా ప్రభుత్వాలు వీరి సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడంతో వీరిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఎన్నికల ప్రణాళికలో హామీ...

2014 అసెంబ్లీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో నెగ్గి, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమ సర్వీసులు క్రమబద్ధీకరణ జరుగుతుందని వీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో విజ్ఞప్తులు తర్వాత మూడేళ్లకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు... పలుమార్లు భేటీ అయిన క్రమబద్ధీకరణ ఊసెత్తకుండా ప్రస్తుతానికి యాభై శాతం వేతనాల పెంపుతో సరిపెట్టింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన సమస్యలు ఉన్నాయన్న వాదాన్ని ప్రభుత్వం లేవనెత్తుతోంది.

సర్వీసుల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన అవరోధాలు ...

సర్వీసుల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయంటున్న ప్రభుత్వం వాదనపై కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని చేర్చినప్పుడు న్యాయపరమైన సమస్యలు గుర్తుకు రాలేదా ? అన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి ఏరుదాటిన తర్వాత తెప్పతగలేసిన చందంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

21:18 - April 18, 2017

హైదరాబాద్‌: నగరంలో రవాణా..మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. వారసత్వ కట్టడాలను పరిశీలించి..వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నగరంలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్...

మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ నగరంలో విస్తృతంగా పర్యటించి.. నూతనంగా నిర్మించిన పలు భవనాలను... ప్రారంభించారు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఫరూక్‌ నగర్‌లో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన బస్‌డిపో, బస్టాండ్‌లను ప్రారంభించారు. అలాగే ఫిల్మ్‌ నగర్‌లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు అంతస్తుల కమ్యూనిటీ హాల్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మొగల్‌పురా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్.. మైలార్‌ దేవులపల్లిలో కోటిన్నర రూపాయలతో చేపట్టిన ప్లే గ్రౌండ్‌, ఆధునిక నిర్మించిన ఏసీ టాయిలెట్స్‌, మోడల్‌ మార్కెట్‌లను కూడా ప్రారంభించారు.

తన పర్యటనలో భాగంగా నగరంలోని ...

తన పర్యటనలో భాగంగా నగరంలోని చార్మినార్‌ పరిసరాల్లో ఉన్న క్లాక్‌టవర్‌తో పాటు వివిధ చారిత్రక కట్టడాలను కేటీఆర్‌ పరిశీలించారు. వాటి అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాగా పాత నగరంలో గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని చేస్తున్నామన్నారు కేటీఆర్‌. రవాణా వ్యవస్థ మెరుగైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే నగరంలో తాగునీటి, కరెంట్ సమస్యలు లేకుండా చేస్తామన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

20:58 - April 18, 2017

హైదరాబాద్: అసహనం... అడుగడుగునా అసహనం. పక్కవాడి నీడను కూడా సహించలేని తనం, పొరుగువాడి నమ్మకాలను భరించలేని తనం, నా మతమే కరెక్ట్, నా మతమే నిజం, వేరే మతం వాడిని సహించేది లేదు. అస్సలు దేవుడే లేడన్న వాడిని ప్రాణాలతో వుంచేది దేనికి?! ఈ తరహా ఘోరాలు జరుగుతున్నాయా? భిన్న మతాలు, భిన్న సంస్కృతులు వున్న దేశాల్లో శాంతి సామరస్యాలను దెబ్బతీసే అడుగులు పడుతున్నాయా? నాస్తికులపై దాడులు పెరుగుతున్నాయా? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:42 - April 18, 2017

హైదరాబాద్: త్రిబుల్ రైడింగ్ చేస్తున్న చంద్రాలు...బడిబాట కార్యంలో బాబు గారి లీలలు, జోరందుకున్న గులాబీ కూలీల దినాలు...బాసన్ను తోముడొక్కటే తక్కువ ఉన్నది ఇగ, సిధిలమవుతున్న శీనన్న ధర్మపురి శిలాఫలకం..పన్నెండేండ్ల సంధి పడావు వున్న పైపులు, గ్రామ సింహాలతోని నాలుగో సింహం దీక్ష...రాజస్థాన్ రాష్ట్రంలో పోలీసోళ్ల కే లేదు రక్షణ, తమిళ రైతుల ఉసురు తగలక మానునా...ఇంత చేసినా మోడీ సర్కార్ కరుణించునా, కూడు బెట్టని కుల వృత్తులతోని కుస్తీ....కుమ్మరన్న కొలిమికొచ్చిన సుస్తి ఇలాంటి అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంతో మన ముందుకు వచ్చాడు. మరి ఆ వివరాలు ఏంటో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:03 - April 18, 2017

హైదరాబాద్: బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూన్‌ 8న తమ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్రెగ్జిట్‌ ప్లాన్‌ విషయంలో పలు విధాలుగా ప్రతిపక్ష పార్టీ ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో తన నిర్ణయం సరైనదో కాదో తెలుసుకునేందుకు.. తాను ప్రధాని హోదాకు తగిన వ్యక్తినో కాదో తెలుసుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని... అందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్‌ ఓటు వేసిన తర్వాత థెరిసా మే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

19:58 - April 18, 2017

ఢిల్లీ: రైతులకు భారత వాతావరణశాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశా డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేష్‌ తెలిపారు. దేశంలో ఈ ఏడాది 96శాతం వర్షపాతం నమోదువుతుందని..అలాగే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. మే 15వరకు దేశవ్యాప్తంగా ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటాయని..కేరళలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాతే ఊష్ణోగ్రతలు తగ్గుతాయని రమేష్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:56 - April 18, 2017

హైదరాబాద్: బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా లండన్‌లో అరెస్ట్‌ అయ్యారు. అరెస్ట్‌ అయిన 3 గంటలకే ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన అరెస్ట్‌పై భారత్‌ మీడియా అత్యుత్సాహం చూపిందని ట్విట్టర్‌లో మాల్యా అన్నారు.

ఫలించిన భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు...

భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేసులో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాను లండన్‌ టైం ప్రకారం ఉదయం తొమ్మదిన్నరకు స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంటనే మాల్యాను వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రవేశ పెట్టారు. మూడు గంటల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

17 బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణాలకు మాల్యా ఎగనామం...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా 17 బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణాలకు మాల్యా ఎగనామం పెట్టారు. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మార్చి2, 2016లో దేశం విడిచి పారిపోయారు. విజయ్‌ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం మాల్యా వీసాను కూడా రద్దు చేసింది. మాల్యాను తమకు అప్పగించాలని ఫిబ్రవరిలో భారత విదేశాంగ శాఖ యూకే ప్రభుత్వాన్ని కోరింది.

మనీలాండరింగ్‌ కేసులో మాల్యాకు ఈడీ పలుమార్లు సమన్లు...

మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు మాల్యాకు ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత్‌కు రాలేనని... రుణాల చెల్లింపు విషయంలో బ్యాంకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు మాల్యాపై ఆరు సార్లు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 9 న వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు మాల్యాను ఆదేశించినా స్పందించలేదు. ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ కూడా విచారణ జరుపుతోంది.

మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును...

మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్‌ వేసింది. అయితే దీనిపై కూడా మాల్యా స్పందించలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఓపెన్‌ ఎండెడ్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తన అరెస్ట్‌పై భారత్‌ మీడియా అతిగా ప్రవర్తించిందని విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశారు. భారత్‌కు అప్పగింతపై కోర్టులో వాదనలు మొదలయ్యాయని మాల్యా పేర్కొన్నారు. మొత్తానికి మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి మార్గం సుగమమైంది. త్వరలో సిబిఐ వర్గాలు లండన్‌కు వెళ్లనున్నాయి.

19:52 - April 18, 2017

కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు త‌న‌యుడు రాష్ట్ర మంత్రి లోకేష్‌ మ‌రోసారి నోరు జారారు. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సమీపంలోని క‌ర‌ప‌ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆయన... తాగునీటి స‌మ‌స్య సృష్టించ‌డ‌మే త‌న ల‌క్ష్యమంటూ తడబడ్డారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు.. రెండు మూడు సంవత్సరాల్లో గ్రామాల్లో తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేస్తానన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కుగురయ్యారు. గ‌తంలో అంబేద్కర్ జ‌యంతిని వ‌ర్థంతి అంటూ వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

అమీన్ పూర్ రాఘవేంద్ర కాలనీలో దారుణం

సంగారెడ్డి: అమీన్ పూర్ రాఘవేంద్ర కాలనీలో దారుణం జరిగింది. భార్య అనూషను గ్యాస్ స్టౌవ్ పైకి భర్త రాంనరేష్ రెడ్డి నెట్టేశాడు. దీంతో గ్యాస్ స్టౌవ్ మంటల్లో అనూషకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అనూష పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కొండవీటి వాగులో ఆక్రమణలను తొలగిస్తున్నాం: ఏపీ సర్కార్

ఢిల్లీ: అమరావతి పర్యావరణ అనుమతులపై ఎన్ జీటీ లో విచారణ జరిగింది. కొండవీటి వాగు ప్రవాహ దిశను మళ్లిస్తున్నారన్న పిటిషనర్ల వాదనను ఏపీ సర్కార్ తోసిపుచ్చింది. కొండవీటి వాగులో ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా పడింది.

అక్రమ కెమికల్స్ గోదాములపై రెవెన్యూ అధికారులు దాడి

మేడ్చల్: జీడిమెట్ల సుభాష్ నగర్, రామిరెడ్డి నగర్ లో అక్రమ కెమికల్స్ గోదాములపై రెవెన్యూ అధికారులు దాడి చేశారు. అనుమతులు లేని పలు గోదాములను అధికారులు సీజ్ చేశారు. మరి కొన్నింటికీ నోటీసులు ఇచ్చారు.

18:57 - April 18, 2017

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎన్ ఆర్ ఐ సలహాదారు వేమూరి రవికుమార్ తో '10టివి' ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:54 - April 18, 2017

హైదరాబాద్: జనసైనికుల ఎంపిక కోసం జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఏప్రిల్ 21న అనంతపురంలోని జీఆర్‌ గార్డెన్స్‌లో జనసైనికుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని జనసేన పార్టీ ప్రకటించింది. జనసైనికుల కోసం పవన్‌కల్యాణ్‌ పిలుపునివ్వగా...అనంతపురం జిల్లా నుంచి 3,600 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారికి 3 రోజుల పాటు అర్హత పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. జనసైనికుల ఎంపిక అత్యంత పారదర్శకంగా,.ప్రతిభకు పట్టంకట్టే విధంగా జరుగుతాయని పార్టీ ప్రకటించింది.

18:53 - April 18, 2017

అమరావతి: ఏపీలో పనిచేస్తున్న 26,664 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు యాభై శాతం వేతనాలు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అంశాన్ని మంత్రివర్గ ఆమోదం కోసం సిఫారసు చేస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కేబినెట్‌ ఆమోదించిన తర్వాత ఈనెల నుంచే వర్తించే విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచుతారు. దీని వలన ప్రభుత్వంపై ఏటా 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పని చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

18:51 - April 18, 2017

అమరావతి: బెజవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూది ఓ ప్రత్యేక స్థానం. పార్టీలు మారినా ఆయన పరపతి మాత్రం తగ్గలేదు. అలాంటి వ్యక్తి మృతి పార్టీకే కాదు.. ఆయన కుమారుడికి... అనేకమంది రాజకీయ నాయకులకు కూడా తీరని లోటుగా మారింది. దేవినేని నెహ్రూ లోటును పూడ్చేదెవరు..? నెహ్రూ అనుచరులతో పాటు.. పార్టీ నేతల్లోనూ ఇప్పుడీ సంశయమే వెంటాడుతోంది.

విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన దేవినేని నెహ్రూ.....

దేవినేని నెహ్రూ ఆకస్మిక మరణం.. కుటుంబ సభ్యులకే కాదు.. పార్టీ నాయకత్వానికీ షాక్‌నిచ్చింది. ఆయన మృతి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఓ శూన్యాన్ని నింపిందన్న భావన వ్యక్తమవుతోంది.

విద్యార్థి దశ నుంచి అంచలంచెలుగా ఎదిగి..

విద్యార్థి దశ నుంచి అంచలంచెలుగా ఎదిగి.. రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన నెహ్రూ, బెజవాడపై తనదైన ముద్రను వేశారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం జరుపుకున్న నెహ్రూ.. ఎన్టీఆర్‌ హయాంలో పార్టీలో కీలక నేతగా ఎదిగారు.. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్‌లో చేరి.. అనంతరం కొంతకాలం క్రితమే నెహ్రూ టీడీపీ గూటికి చేరారు. ఏ పార్టీలో ఉన్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు నెహ్రూ.

నెహ్రూ తనయుడు అవినాష్‌ రాజకీయ భవితపై అనిశ్చితి.....

రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న నెహ్రూ.. రాజకీయ వారసుడిగా, తన కుమారుడు అవినాష్‌ను ప్రోత్సహించారు. నెహ్రూ మృతితో అవినాష్‌ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్న భావన వ్యక్తమవుతోంది. తండ్రిగానే కాకుండా.. రాజకీయ గురువుగా కూడా వ్యవహరించిన తండ్రి నెహ్రూ మరణంతో.. అవినాష్‌ భరోసానూ కోల్పోయారని అనుచరులు చెప్పుకుంటున్నారు. తండ్రి చాటు బిడ్డగా ఉన్న అవినాష్‌.. నెహ్రూ అడుగుజాడల్లోనే రాజకీయ ఓనమాలు దిద్దారు. విద్యార్థి నేతగా అవతరించి.. సమైక్యాంధ్ర ఉద్యమంతో పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. 2014లో ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ పార్లమెంట్‌కు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేశారు. అలాగే అదే సంవత్సరం తూర్పు నియోజకవర్గానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

కుమారుడి భవిష్యత్తు కోసం టీడీపీ గూటికి చేరిన దేవినేని నెహ్రూ

వాస్తవానికి కాంగ్రెస్‌లో ఉన్న దేవినేని నెహ్రూ..తనయుడు అవినాష్‌ భవిష్యత్తు కోసమే టీడీపీ గూటికి చేరారు. అవినాష్‌ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే, దేవినేని నెహ్రూ అన్నింటా తగ్గి వ్యవహరించారని అనుచరులు చెప్పుకుంటారు. అవినాష్‌ను ....సీఎం తనయుడు నారా లోకేష్‌కు దగ్గర చేయడానికి దేవినేని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్‌కు అసెంబ్లీ టికెట్‌ దాదాపుగా ఖరారు చేయించారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవినేని నెహ్రూ మృతి చెందడం, ఆయన తనయుడు దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందవుతుందనే భావన వ్యక్తమవుతోంది.

కొండంత బలంగా నిలిచిన అనుచరులు...

బెజవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూకు ఆయన అనుచరులే కొండంత బలం. మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్టీలో కీలకమైన నేతగా ఎదుగుతున్నకొద్దీ అనుచరగణం కూడా పెరుగుతూ వచ్చింది. అటు పార్టీలోనూ, ఇటు వ్యాపారాల్లోనూ వారిని ఆదుకునేందుకు నెహ్రూ కృషిచేశారు. ఇపుడు దేవినేని నెహ్రూ లేకపోవడం వారి రాజకీయ భవితవ్యానికి, వ్యాపార సామ్రాజ్యాలకు ఇబ్బందవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆయన అనుచరుడిగా ఉన్న కడియాల బుచ్చిబాబు కొంతమేర నెహ్రూ లోటును భర్తీ చేసే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది. మరి నెహ్రూ తనయుడు అవినాష్‌.. తండ్రి బాటలో నాయకత్వ పటిమను సాధిస్తారా..? లేక అనుచర గణం ఇతర నాయకుల వైపు మరలిపోతుందా..? కృష్ణా జిల్లాలో ఏ నలుగురు కలిసినా.. ఇవే ప్రశ్నలే చర్చనీయాంశాలవుతున్నాయి.

5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగించాలి: అశోక్ బాబు

అమరావతి: ఉద్యోగ జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంపును స్వాగతిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరినట్లు ఏపీ జేఏసీ అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. మే నెలాఖరుకు ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. గత జులై డీఏ బకాయిలు చెల్లించాలని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవదహనం

ప.గో : తణుకు మండలం దువ్వ గ్రామ సమీపంలోని బాణా సంచా గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవదహనం అయ్యారు.

వన్యప్రాణుల మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్...

హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ ముర్గీ చౌక్ లో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంత్రి లక్ష్మారెడ్డిని సన్మానించిన 108 ఉద్యోగులు

హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని 109 ఉద్యోగులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. 108 ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, అవసరం అయితే జీవీకే సంస్థతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

18:30 - April 18, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా మణుగూరులో కొత్తగా నిర్మించిన మల్లెపల్లి ఓసీలో విషాదం చోటుచేసుకుంది. ఓసీలోని బంకర్‌ కూలడంతో మైపాల్‌రెడ్డి, ప్రవీణ్‌ అనే ఇద్దరు మైనింగ్‌ కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. బంకరు నిర్మాణ సమయంలో నాణ్యతా లోపం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే జరిగిన ప్రమాదంపై సింగరేణి సీజీఎం మల్లేశ్‌ స్పందిస్తూ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

 

21 నుండి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఎంపిక: పవన్ కల్యాన్

అనంతపురం:జ‌న‌సేన కోసం ప‌నిచేసే సైనికులను నియ‌మించుకోవ‌డం కోసం ఉత్సాహ‌వంతులైన యువ‌త నుంచి ఆ పార్టీ అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర‌ఖాస్తులు కోరిన విష‌యం తెలిసిందే. ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ‌ ప్ర‌క్రియ ముగియ‌డంతో ఈ రోజు ఆయ‌న దానిపై ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నెల 21 నుంచి అనంత‌పురం జిల్లాలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఎంపిక జ‌ర‌ప‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అనంత‌పురం జిల్లా నుంచి మొత్తం 3,600 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని తెలిపారు. త‌మ పార్టీ సైనికుల ఎంపిక కోసం మూడు రోజుల పాటు అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

18:25 - April 18, 2017

వరంగల్‌ : ఈ నెల 27న జరిగే టీఆర్‌ఎస్‌ బహిరంగసభ.. చరిత్రను తిరగరాస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సభకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 13 కమిటీలను ఏర్పాటు చేసి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు హరీష్‌రావు తెలిపారు. పార్కింగ్‌కు 1200ఎకరాల స్థలం కేటాయించమన్నారు. ఎండ వేడిని ద్రుష్టిలో పెట్టుకొని ప్రజలకి అన్ని వసతులు వాటర్, మజ్జిగ ప్యాకెట్లు అందించేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

18:18 - April 18, 2017

అనంతపురం : ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో అట్టుడికిన ప్రాంతం.. కక్షలతో ఉక్కిరిబిక్కిరై..ఊళ్లకుఊళ్లు ఖాళీ అయిన జిల్లా. ఒకవైపు కరువుకాటు మరోవైపు ఫ్యాక్షన్ గొడవలు. ఉపాధికోసం సొంతూరును వదిలి వలసవెళ్లిన జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనంతపురంజిల్లా సస్యశ్యామలం అవుతోంది.

నిన్నటిదాకా కరువుతోపాటు ఫ్యాక్షన్ కుంపట్లతో...
నిన్నటిదాకా కరువుతోపాటు ఫ్యాక్షన్ కుంపట్లతో విలవిల్లాడిన అనంతపురం జిల్లాలో .. పరిస్థితులు మారుతున్నాయి. దేశంలోనే అతి తక్కువర్షపాతం నమోదయ్యే రెండవ జిల్లా అయిన అనంతపురంలో క్రమంగా పచ్చదనం వెల్లివిరుస్తోంది. భూగర్బజలాలు పాతాళంలోకి దిగజారి.. పొలాలన్నీ బీళ్ళుగా మారిన పరిస్థితుల్లో జిల్లావాసులు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్లిన విషాదఛాయలు ఇపుడు కనుమరుగవుతున్నాయి. కరువుతో ఇక పంటలు వేయలేమనుకున్న పరిస్థితుల్లో హాంద్రీనీవా సుజల స్రవంతి తమకు వరప్రదాయినిగా మారిందంటున్నారు రైతన్నలు.

హాంద్రీనీవా నీటితో జిల్లా కరువు పరిస్థితుల్లో మార్పు...
హాంద్రీనీవా నీటితో అనంతపురంజిల్లా కరువు పరిస్థితుల్లో మార్పువచ్చింది. జిల్లాలోని జీడిపల్లి,గొల్లపల్లి రిజర్వాయర్లలలో జలకళ, వీటితోపాటు జిల్లావ్యాప్తంగా పలుచెరువులను కృష్ణాజలాలతో నింపడంతో భూగర్బజలాలు పెరిగాయి. జలసిరులు అందుబాటులోకి రావడంతో గుతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజక వర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలపై ఆధారపడి పంటలు...
జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన గ్రామాలే ఎక్కువ. ఇక్కడి రైతులు గతంలో పూర్తిగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేసేవారు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో అప్పులపాలయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు కృష్ణాజలాలు ఉపశమనం కలిగించాయంటున్నారు. పచ్చటి పొలాలను చూసి పదిహేనేళ్లు అయిందని ఈ పంటలను చూస్తుంటే ఇక.. ఇక తమప్రాంతంలో ఫ్యాక్షన్‌కు తావేలేదంటున్నారు అన్నదాతలు.

కొన్నివేల ఎకరాలు మాత్రమే...
అయితే హాంద్రీనీ ప్రాజెక్టు ద్వారా కొన్నివేల ఎకరాలు మాత్రమే నీరందుతోందని..జిల్లాలో ఇంకా లక్ష ఎకరాలు సాగులోకి తీసుకురావాల్సి ఉందంటున్నారు రైతులు. హాంద్రీనీవా కాలువను వెడల్సుచేసి జిల్లాకు వీలైనన్ని ఎక్కువ నీటిని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

 

18:00 - April 18, 2017

విజయనగరం : విజయనగరం, బొబ్బిలి రాజవంశాల మధ్య బద్ధ శత్రుత్వం ఈనాటిది కాదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడకపోయినా.. ఒకే పార్టీలో ఆ ఇద్దరు కొనసాగుతున్నారు. ఒకరు అశోక్ గజపతిరాజు.. మరొకరు సుజయ్‌ కృష్ణ రంగారావు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో సుజయ్‌ కృష్ణకు చోటు దక్కడంతో.. విజయనగరం పాలిటిక్స్‌ ఉత్కంఠ రేపుతున్నాయి. నిన్నటి వరకు అశోక్ బంగ్లా కేంద్రంగా కొనసాగిన జిల్లా రాజకీయాలు...ఇప్పుడు బొబ్బిలి కోటకు మళ్లుతాయా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

టీడీపీ ఆవిర్భావం నుంచి అశోక్ గజపతిరాజు....
విజయనగరం జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి అశోక్ గజపతిరాజు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో పౌర విమానయాన శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లా టీడీపీ...అంటే అశోక్ బంగ్లా కేరాఫ్ అడ్రస్. పార్టీకి సంబంధించిన సమావేశాలు, సభలు, కీలక నిర్ణయాలు, నేతల రాకపోకలు అన్నింటికీ అశోక్ బంగ్లాయే కేంద్రం. అయితే, అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టాక ఎక్కువ సమయం ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమకి అందుబాటులో ఉండి...సమస్యలను వినే సరైన నేత కోసం పార్టీ జిల్లా కేడర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది.

మంత్రివర్గంలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ క్రుష్ణ రంగారావు..
ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ క్రుష్ణ రంగారావుకు చోటు దక్కడంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సుజయ్‌ ఇంటికి జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు తాకిడి మొదలైంది.. పార్వతీపురం డివిజన్‌లో సుజయ్‌ కృష్ణ రాజకీయంగా మంచి పట్టు ఉంది. బొబ్బిలి నుంచి సుజయ్ మూడు సార్లు గెలిపొందారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా సుజయ్ కి మంత్రిపదవి కట్టబెట్టిన సీఎం చంద్రబాబు....జిల్లాలో పార్టీ బలోపేతం చేసే బాధ్యత ఆయనకు ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించే బాధ్యత అశోక్ కంటే..సుజయ్ కే ఎక్కువ అన్న ప్రచారం మొదలైంది. దీంతో అధికార కేంద్రం కూడా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మృణాళిని మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి హడావిడి కనిపించలేదు. మొత్తం మీద...ఇద్దరు రాజవంశీయుల పాలనలో పవర్ సెంటర్ ఎక్కడ షిఫ్ట్‌ అవుతుందో చూడాలి.  

17:57 - April 18, 2017

లండన్ : అరెస్ట్ అయన 3 గంటల్లో విజయ్ మాల్యాకు వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

17:27 - April 18, 2017

హైదరాబాద్ : ఉల్లి పంట మళ్లీ రైతు కంట నీరు రప్పిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లికి కనీస మద్దతు ధర కూడా పలకడం లేదు. గత ఏడాది రూ.15 వందలు పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా మూడోవంతుకు పడిపోయింది. దీంతో ఉల్లి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కన్నీళ్లే మిగిలాయి.....
ఉల్లి రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగిలాయి. పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కలత చెందుతున్నారు. గత సంవత్సరం ఉల్లిపాయలు మంచి ధర పలకడంతో... రైతులు ఈ సారి భారీ విస్తీర్ణంలో ఉల్లిని సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాలు ఉల్లి ధర 3 వేల రూపాయల వరకూ పలికింది. అదే ఉత్సాహంతో, నిరుడు ఒక ఎకరా ఉల్లి సాగు చేసిన రైతులు... ఈసారి నాలుగైదు ఎకరాలకు దాన్ని విస్తరించారు. ప్రకృతి కరుణించి, సమృద్ధిగా నీరూ అందడంతో ఈఏడాది దిగుబడులూ బాగానే వచ్చాయి. అయితే అనూహ్యంగా ధర పడిపోవడం రైతుకు అశనిపాతమైంది.

క్వింటాలు రూ. 300.....
తెలంగాణాలోని అతిపెద్ద మార్కెట్‌ అయిన మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి ధర క్వింటాలు రూ. 300 రూపాయలకు పడిపోయింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద మార్కెట్‌ అయిన కర్నూలులోనూ క్వింటాలు ఉల్లి కొనుగోలు ధర ఐదు వందలకు పడిపోయింది. అతిపెద్ద మార్కెట్లలోనే ధరలు ఈ రీతిగా పతనమైపోతే, చిన్న మార్కెట్లలో పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పొలం నుంచి మార్కెట్‌కు ఉల్లిని తరలించేందుకు అయిన రవాణా ఖర్చులు కూడా కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తగ్గిన డిమాండ్.......
ఉల్లి కొనుగోలుదారులు, ధర పతనం కావడానికి రైతులే కారణమంటున్నారు. ఈ ఏడాది రైతులు ఉల్లిసాగు ఎక్కువగా చేశారని.. మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా రావడంతో.. డిమాండ్‌ తగ్గి ధర పడిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర చెల్లించి ఉల్లిని కొనుగోలు చేసి.. తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తమను నష్టాల్లో కూరుకుపోకుండా చూడాలని కోరుతున్నారు.

 

17:07 - April 18, 2017

ఖమ్మం : లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినా పలు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే దాడులు నిర్వహించి ఆసుపత్రులకు తాళాలు వేశారు. శ్రీశ్రీ ఆస్పత్రితో పాటు మీనాక్షి సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆస్పత్రి, స్పందన ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్టన్లు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. లింగ పరీక్షలు చేస్తున్నారని నిర్ధారించుకున్న అనంతరం ఆసుపత్రులకు తాళాలు వేశారు. పరీక్షలు నిర్వహిస్తూ భ్రూణహత్యలకు కారణమవుతున్న అధికారులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న షేక్‌ గఫార్, సంపేట అశోక్‌, అర్వపల్లి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. 

వై2కే హోటల్ సీజ్..

హైదరాబాద్ : పంజాగుట్టలోని వై2కే హోటల్ ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న నాన్ వెజ్ పదార్థాలు అమ్ముతున్నారని హోటల్ ను అధికారులు సీజ్ చేశారు.

మాల్యాకు బెయిల్...

లండన్ : పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు బెయిల్ లభించింది. అరెస్టయిన మూడు గంటల్లోనే బెయిల్ లభించడం విశేషం. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన కేసులో మాల్యా పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబుకు కేవీపీ లేఖ

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ఈ నెల 23న జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లడం కష్టమని చెప్పారు. 

ఎమ్మెల్యే సండ్ర సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్: టీ.టీడీపీ ఎమ్మెల్యే సండ్ర సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. బిఏసీ సమావేశానికి ఆహ్వానించి, అనుమతించలేదని సదారాం పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

16:28 - April 18, 2017

ఐఐటి ఢిల్లీలోని ఓ మహిళా హాస్టల్ వార్డెన్ పేరిట పంపిన ఓ నోటీసులు కలకలం సృష్టిస్తోంది. తమ హౌస్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మహిళలు అంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే..శుభ్రమైన మంచి పాశ్చాత్య..భారతీయ దుస్తులు ధరించి రావాలని నోటీసులో పేర్కొంది. ఐఐటీ ఢిల్లీలో హిమాద్రి..కైలాష్ అనే రెండు అమ్మాయిల హాస్టల్స్ లు ఉన్నాయి. ఏడాదిలో ఢిల్లీ ఐఐటీ హౌస్ డే ఒకసారి కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇందులో విద్యార్థినిలు గంట పాటు అతిథులను హాస్టల్ కు ఆహ్వానించవచ్చు. ఈ కార్యక్రమం ఈనెల 20న తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హిమాద్రి హాస్టల్ వద్ద వార్డెన్ సంతకంతో నోటీసు పెట్టారు. ఈ నోటీసు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. గతంలో కూడా తమకు పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు వేసుకరావాలని నోటి మాటగా చెప్పారని, కానీ నోటీసును పెట్టడం మాత్రం మొదటిసారి అని అక్కడి విద్యార్థినిలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నోటీసు ఎలాంటి ప్రకంపనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి నివారణకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 

హైదరాబాద్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్: నగరంలో ఈ రోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గత పదేళ్లలో హైదరాబాద్ లో ఇదే అత్యధిక ఉష్టోగ్రత అని తెలుస్తోంది.

మే నెల చివరకు రుతుపవనాలు...

ఢిల్లీ: భారత దేశంలో రైతులకు శుభవార్త. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 38 శాతం అధిక వర్షపాత నమోదుకు అవకాశాలు వున్నట్లు తెలిపింది. మే చివరిలో నైరుతి రుతుపవనాలు కేరళను తాఏ అవకాశం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ తెలిపారు.

15:58 - April 18, 2017

ఢిల్లీ : లండన్ లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రెగొటరీ ఆధారంగా మాల్యాను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మాల్యాను వెస్ట్ మినిష్టర్ కోర్టులో హాజరుపరుచనున్నారు. మాల్యా బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టిన విషయంలో ఆయనకు ఈడీ నోటిసులు ఇచ్చింది. ఈడీ ముందు హాజరు కాకుండా మార్చి 2, 2016లో దేశం విడిచి పారిపోయాడు. దీంతో అతనిపై ముంబై స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, పాస్ పోర్టు రద్దు చేసింది. మాల్యా ఎస్ బిఐతో సహా 17 బ్యాంకుల్లో 9వేల కోట్లు అప్పులు చేశారు. మాల్యా అరెస్ట్ ను సీబీఐ ధృవీకరిచింది. మాల్యాను త్వరలో ఇండియాకు తరలించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

 

 

15:54 - April 18, 2017

ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓ హైదరాబాదీ ఓ అమ్మాయికి అత్యవర సమయంలో సహాయం చేసి వార్తల్లోకి ఎక్కాడు. తనకు సాయం చేసింది ఈ ఆటోవాలా అంటూ ఆ యువతి సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఆమె తన ఫేస్‌బుక్‌లో అతనికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు పెట్టింది. ఆ ఆటోవాలా మరెవరో కాదు.. హైదరాబాద్‌కు చెందిన బాబా. వివరాల్లోకి వెళితే...వరిజ శ్రీ అనే యువతి నగరానికి వచ్చింది. వీసా ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది. ఆమె రూ. 5వేలు చెల్లించాల్సి ఉంది. కేవలం రూ. 2వేలు మాత్రమే నగదు ఉంది. దీనితో డబ్బును తీసుకొనేందుకు ఏటీఎంలను ఆశ్రయించింది. కానీ ఏటీఎంలో క్యాష్ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలో డబ్బు ఉందో తెలుసుకొనేందుకు బాబా అనే వ్యక్తి ఆటో ఎక్కింది. హైదరాబాద్‌లో సుమారు 10 నుంచి 15 ఏటీఎంలకు వెళ్లింది. ఎక్కడా పనిచేయకపోవడం..క్యాష్ లేకపోవడంతో వరిజ దిగాలు చెందింది. తన కార్డు స్వైప్ చేసుకుని రూ. 3వేలు ఇవ్వాలని వివిధ దుకణదారులను కోరింది. కానీ వారు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడారు. ఆమె బాధ అర్థం చేసుకున్న బాబా... తన దగ్గర రూ.3వేలు ఉన్నాయని, అవి తీసుకుని చెల్లించండి అని చెప్పాడు. తన సమస్యను తీర్చిన అతనికి కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే ఆమె.. బాబాతో ఓ సెల్ఫీ తీసుకుని, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టును 6,093 మంది షేర్ చేసుకున్నారు. బాబాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

15:51 - April 18, 2017

అదిలాబాద: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా మంత్రి పాత్ర ప్రధానం. జిల్లాకు పెద్దన్న పాత్ర పోషించే మంత్రి లేకపోతే ఆ జిల్లా అభివృద్ధిని ఊహించలేం. కానీ తెలంగాణలో జిల్లాల విభజనతో మంత్రే కాదు ఇన్‌చార్జి మంత్రి కూడా కరువయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడంతో జోగురామన్న ఆదిలాబాద్‌కు, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌కు పరిమితమయ్యారు. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్‌లకు మంత్రులు లేకుండా పోయారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో..
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అనేక జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి విడిపోయిన మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలదీ ఇదే పరిస్థితి. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహించే వారు. జిల్లాల విభజనతో ఆదిలాబాద్‌కు జోగురామన్న, నిర్మల్‌కు ఇంద్రకరణ్‌ రెడ్డి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రి వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం వినిపిస్తోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో.. ప్రతి జిల్లాకూ మంత్రిని నియమించే పరిస్థితులు లేనందునా ఇన్‌చార్జీ మంత్రుల నేతృత్వంలోనే ప్రభుత్వ పాలన సాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకూ మంత్రి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీల పాలనలో ప్రతి జిల్లాకూ మంత్రి ఉన్నా, వేరే జిల్లాకు చెందిన ఇన్‌చార్జి మంత్రి ఉండేవారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలతోపాటు ఆయా జిల్లాల్లో జరిగే అన్ని కీలక సమావేశాలను ఇన్‌చార్జి మంత్రులే ముందుండి నడిపించేవారు. అలాగే శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులు వెచ్చించే విషయంలోనూ వీరికి 50 శాతం అధికారం ఉండేది. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని 10 జిల్లాలకు ఓ మంత్రి తప్పనిసరిగా ఉండడంతో సీఎం కేసీఆర్‌ ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థను తొలగించారు. ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారిలో సీనియర్‌కే ప్రోటోకాల్‌ ప్రకారం బాధ్యతలు అప్పగించారు.

కుంటుపడుతున్న పాలన..
అటు మంత్రులు లేక ఇటు ఇంచార్జి మంత్రులు లేక కొత్త జిల్లాల్లో పాలన కుంటుపడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా పరిధి ఖానాపూర్‌ సెగ్మెంట్‌లోని జన్నారం మండలం మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఒక్కరే ప్రభుత్వంలో విప్‌ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మి , సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నప్పటికీ ప్రభుత్వంలో బాధ్యతలేమీ లేవు. దీంతో నియోజకవర్గాల్లోని స్థానిక ఎమ్మెల్యేలే ప్రభుత్వ కార్యక్రమాలకు కీలకమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల కలెక్టర్లే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రాతినిథ్యం ఉండేది. వీరు కొత్త జిల్లాల మంత్రులుగా మారడంతో తూర్పు జిల్లాల ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశతో ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు స్థానం కల్పిస్తారో లేదో చూడాలి.

వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని సస్పెండ్

వరంగల్ : వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశారు. బ్యాంకులో అక్రమాలు జరిగినట్టు విచారణాధికారులు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రైతు శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన పాలక వర్గం ఖజానాకు గండి కొట్టినట్టు ఆరోపణలొచ్చాయి. ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో లావాదేవీలు, రుణాలు, అద్దెల కేటాయింపులు తదితర అంశాలపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒక కమిటీని కూడా వేసింది. అక్రమాలు నిజమేనన్న కమిటీ నివేదిక ఆధారంగా బ్యాంకు పాలకవర్గాన్ని రద్దు చేశారు.

15:41 - April 18, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. దేశంలో విలయతాండవం చేస్తున్న కరవు, వ్యవసాయ ఉత్పత్తలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మంచినీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సమావేశంలో విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గోసంరక్షకులు చేస్తున్న దాడులపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్రపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడుతూ...ప్రజల మధ్య గడపటానికి ఎంచుకున్న మార్గం పాదయాత్ర అని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించనట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ...ట్రిపుల్ తలాక్ పై బీజేపీ అనవసరంగా కల్పించుకొంటోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాతంత్ర శక్తులకు కలుపుకుని బలమైన ఉద్యమం నిర్మించాలని సమావేశాల్లో నిర్ణయించారు.

లండన్ లో విజయమాల్యా అరెస్ట్

హైదరాబాద్:కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యా లండన్ లో అరెస్టు అయ్యారు. మాల్యాను స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు వెస్ట్ మినిస్టర్ కోర్టుకు తరలిస్తున్నారు. ఏ క్షణమైనా భారత్ కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

'వందేమాతరం' ను తప్పనిసరి చేయాలంటూ సుప్రీం లో పిల్

న్యూఢిల్లీ : అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరిగా పాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. దీనిపై కేంద్ర అభిప్రాయం కోరుతూ నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 23కు కోర్టు వాయిదా వేసింది. ఇక సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించినప్పుడు వికలాంగులకు వెసులుబాటు కల్పించింది కోర్టు. వికలాంగులు లేచి నిలబడాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఆరోగ్యశాఖలో 16వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు:కామినేని

అమరావతి: ఆరోగ్యశాఖలోనే 16వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ న్యాయం జరుగుతుందని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై కోర్టు ఉత్తర్వులు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు.

'ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు 50శాతం వేతనాలు పెంచాలి'

అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై సబ్ కమిటీ సమావేశం ముగిసింది. పై26,664 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 శాతం వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి సబ్ కమిటి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపుతో ప్రభుత్వం పై రూ.199.72 కోట్ల అదనపు భారం పడనుంది. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ఉండదని మంత్రి కాల్వ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది శాఖల వారీగా కాంట్రాక్టు ఉద్యోగులను వారే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి కాల్వ తెలిపారు. భవిష్యత్ లో కాంట్రాక్టు ఉద్యోగుల నియామాకానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని కాల్వ స్పష్టం చేశారు.

పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం సీసీ టీవీకి చిక్కింది. డివైడర్‌పై నిలబడి ఉన్నవారిని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. నడి వయసు మహిళ సుజాత కారు డ్రైవ్ చేస్తూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మగతగా అనిపించడంవల్ల కారుపై నియంత్రణ కోల్పోయానని, డివైడర్‌ను చూసుకోలేదని సుజాత చెప్పారు. 

కేటీఆర్ కు కాంగ్రెస్ ఫోబియా: గండ్ర

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్‌ ఫోబియా పట్టుకుందని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా రాజకీయ విమర్శలా? అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి వారసత్వాల ఉద్యోగాల కేసు కొట్టివేతకు ప్రభుత్వ అసమర్ధతే కారణమని ఆయన మండిపడ్డారు.

15:01 - April 18, 2017

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ఏదంటే 'బాహుబలి -2’ అని ఠక్కున చెబుతారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. సుమారు 6500 స్ర్కీన్లపై సినిమాను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రికార్డులు సృష్టించింది. తాజాగా సినిమా సెన్సార్ బోర్డుకు వెళ్లింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే చిత్ర బృందం ఎలాంటి అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు' అనే ప్రశ్నకు ఈ సినిమాలో సమాధానం దొరకనుంది. కీరవాణి సంగతం అందించిన ఈ చిత్రంలో ప్రభాస్..రానా..అనుష్క..తమన్న..నాజర్..రమ్యకృష్ణ..సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.

గీత దాటితే వేటే! : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌ : సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తనదైన శైలిలో దూసుకెళుతున్న యోగి ఆదిత్యనాథ్‌, పాలనలో మరింత పారదర్శకత పెంచి, అవినీతిని తగ్గించే దిశగా, మంత్రులకు సరికొత్త ప్రవర్తనా నియమావళిని తయారు చేశారు. వీటిని పాటించకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. 

టీఎస్ సీఎస్ తో ఉద్యోగ సంఘా జేఏసీ నేతల భేటీ...

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్‌తో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు, సాధారణ బదిలీలు, వేతన సవరణ బకాయిలు, ఏపీలో పని చేస్తున్న రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగుల అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. సీఎస్‌తో భేటీ ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ చెప్పారని పేర్కొన్నారు. వారంలోగా సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. వారంలోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆ తర్వాత తమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

ముగ్గురు టిడిపి నేతలకు షోకాజ్ నోటీసులు...

విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు టీడీపీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండల సంస్థాగత ఎన్నికల సమయంలో క్రమశిక్షణా రాహిత్య చర్యలకు పాల్పడ్డారంటూ... ఉయ్యూరు ఏఎంసీ ఛైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, ఉయ్యూరు మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల శ్రీనివాస్ బాబు, ఉయ్యూరు టౌన్ వార్డు కమిటీ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాస్ లకు నోటీసులు జారీ అయ్యాయి. ఏడు రోజుల్లోగా నోటీసులకు సంజాయషీ ఇవ్వాలంటూ పార్టీ ఆదేశించింది. 

14:41 - April 18, 2017

ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో రెజోనెన్స్‌ విద్యార్ధులు విజయకేతనం ఎగురవేశారు. సీనియర్‌ ఎంపీసీలో రెజోనెన్స్‌ విద్యార్ధిని కె. నిఖిత.. 993 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఇదే విద్యాసంస్థకు చెందిన సాయిచరణ్‌ 992 మార్కులు సాధించగా... యశస్వినీ 990 మార్కులు సాధించింది. ఇక ఫస్టియర్‌లోనూ రెజోనెన్స్‌ సత్తా చాటింది. ఫస్టియర్‌ ఎంపీసీలో పూర్ణిమ 466 మార్కులు సాధించింది. సీనియర్‌ బైపీసీలో బోడా అనుషా 982 మార్కులు సాధించి రెజోనెన్స్ ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింప చేసింది. విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల రెజోనెన్స్‌ డైరెక్టర్స్ నాగేందర్‌కుమార్‌, శ్రీధర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

 

14:39 - April 18, 2017

మయన్మార్ లో జరిగిన వాటర్ ఫెస్టివల్ శ్మశాన వాటికగా మారిపోయింది. సంతోషంగా జరుపుకొనే పండుగ దుఖాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల పాటు జరిగిన తింగ్యాన్ వాటర్ ఫెస్టివల్ లో 285 మంది మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్త సంవత్సరంలో వేసవి ముగుస్తుందనగా ఈ వేడుకను అక్కడి ప్రజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది చేసిన పాపాలు ఈ ఏడాది నూతన సంవత్సరంతో నీటితో కడిగేసుకొంటే పోతాయనేది అక్కడి వారి నమ్మకం. ఒకరిపై ఒకరు నీళ్లతో కొట్టుకుంటూ వేడుకను నిర్వహించుకుంటుంటారు. గురువారం నుండి శనివారం వరకు ఫెస్టివల్ జరిగింది. ప్రమాదవశాత్తు 285 మంది మృత్యువాత పడడం సంచలనం సృష్టించింది. మరో 1073 మందికి గాయాలయ్యాయి. అత్యధికంగా యంగూన్ ప్రాంతంలో 44 మంది, మాండాలే‌లో 36 మంది, బగోలో 37 మంది, షాన్ రాష్ట్రంలో 28 మంది, అయేవాడే రీజియన్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. సాగింగ్ ప్రాంతంలో 26 మంది, నై పీ తావ్‌లో 10 మంది, తానిత్యారీలో 11 మంది, మాంగ్వేలో 11 మంది, మాన్‌లో 20 మంది, రిఖైనేలో 17 మంది మరణించారు. గతేడాది జరిగిన ఉత్సవాల్లోనూ 272 మంది ప్రాణాలు కోల్పోయారు.

14:38 - April 18, 2017

ఖమ్మం :ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో శ్రీనారాయణ జూనియర్ కళాశాల విద్యార్ధులు సత్తాను చాటారు. ప్రథమ సంవత్సరం ఎంపిసీ విభాగంలో వాసుకీ 466 మార్కులు, మణికంఠ 463 మార్కులు సాధించారు. బైపిసీ విభాగంలో వెంకటేష్ 426 మార్కులు సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో ఎంపిసీ విభాగంలో పూర్ణావెంకట్ 980 మార్కులు, బైపిసీలో పద్మప్రియా 968 మార్కులు, షాహీనా 968 మార్కులు సాధించారు. టాప్‌ మార్కులు సాధించిన తమ విద్యార్థులను శ్రీనారాయణకళాశాల చైర్మన్‌, డైరెక్టర్లు అభినందించారు. 

14:34 - April 18, 2017

రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేటలోని ఓ చెరువులో చేపలు భారీగా చనిపోయాయి. నిర్జీవంగా పడిఉన్న చేపలను చూసి మత్స్యకారులు భోరున విలపించారు. చేపల మృతితో తాము రోడ్డునపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడం వల్లే చేపలన్నీ చనిపోయాయని ఆరోపించారు. చేపల మృతితో చేసిన అప్పును ఎలా తీర్చాలని కన్నీరుమున్నీరయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. చేపలపై విషప్రయోగం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు చెరువు నీటిని, చేపల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు.

 

 

శ్రీనగర్ లో భూకంపకం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో మంగళవారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 5గా నమోదైంది. శ్రీనగర్‌ వ్యాలీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. లడఖ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

14:26 - April 18, 2017

నాగార్జున తనయుడు 'అఖిల్' హిట్ కోసం తాపత్రయపడుతున్నాడు. తన మొదటి చిత్రం 'అఖిల్' ప్రేక్షకాదరణ పొందకపోయేసరికి సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. అనంతరం ఇటీవలే తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. 'ఇష్క్’, 'మనం, ‘24’ వంటి చిత్రాలతో ఫామ్‌లో వున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 'నాగార్జున' తన సొంత ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసిక్తకరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో 'అఖిల్' కి విలన్ గా 'అజయ్'ని ఎంపిక చేసినట్లు టాక్. ‘ఇష్క్', ‘24’ చిత్రాల్లో 'అజయ్' నటించారు. మళ్లీ తన తరువాతి సినిమాకు అతడిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆల్రెడీ అజయ్ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. మరి అఖిల్..అజయ్ మధ్య జరిగే సన్నివేశాలు ఎలా ఉంటాయో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

14:20 - April 18, 2017

జంగిల్ బుక్ గురించి తెలియని వారుండరు. అచ్చం ఆ పుస్తకంలోని మోగ్లీ బాయ్ క్యారెక్టర్ లాగే ఇటీవలే కోతులతో ఓ బాలిక ఆడుకుంటున్న అనే విషయం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రెయిన్ అడవీలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దృష్టిలో ఈమె కంటపడిన సంగతి తెలిసిందే. ఓ కోతుల గుంపుతో ఆడుకుంటూ..వాటితోనే జీవిస్తూ..చేతులతో కాకుండా నోటితోనే ఆహారం తీసుకుంటున్న దృశ్యాలు పోలీసుల కంట్లో పడ్డాయి. ఎస్సై సురేష్‌ యాదవ్‌ రెండు నెలల క్రితం మోతీపూర్‌ పరిధిలోని కర్ణిఘట్‌ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించగా ఈ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈమెను రక్షించాలని పోలీసులు నిర్ణయించారు. అతి కష్టం మీద కోతుల గుంపును చెదరగొట్టి బాలికను రక్షించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో చేరిపించారు. ఈ కోతిపిల్లను మాములు మనిషిగా మార్చేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కోతుల్లాగే పళ్లికిలించడం, తనకు నచ్చిన వస్తువులేమైనా ఎదుటి వారి చేతిలో కనిపిస్తే గభాల్న లాగేసుకోవడం వంటి కోతి చేష్టలను చేసింది. వీటిని మానిపించేందుకు వైద్యులు చికిత్సలు చేశారు. తాజాగా సోమవారం ఈమెను డిశ్చార్జ్ చేశారు. బెలూన్స్ అనే షెల్టర్ హోమ్ కు తరలించారు. చాలా ఏళ్లు అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో ఆమె కడుపులో పురుగులు చేరాయి. ఈ పురుగులను బయటకు తీయడానికి వైద్యులు చికిత్స అందించారు. పురుగులు బయటకు వచ్చేందుకు ట్యాబ్లెట్లు అందించారు. మూడు నుండి ఐదు సెంటిమీటర్ల పొడవుండే పురుగులు బయటకొచ్చాయి. ప్రస్తుతం బాలిక వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.
అసలు ఈ పాప ఎక్కడినుంచి అడవిలోకి వచ్చింది ;? తప్పిపోయిందా ? ఎవరైనా పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అడవిలో కావాలనే వదిలిపెట్టారా ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.

14:01 - April 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా ఏప్రిల్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉష్ణోగ్రత భారీ స్థాయిలో నమోదు అవుతోంది. 42డిగ్రీలతో పట్నం మండుతోంది. ఉదయం 9 దాటిన తర్వాత ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్డుపై చిరు వ్యాపారులకు ఎండలకు గిరాకి లేక ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా ఖాళీ రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఇకా పల్లెల్లో కూడా ఎండ వేడిమి జనాలను తీవ్ర అవస్థలకు గురిచేస్తుంది. ఎండలతో చిన్నపిల్లలు, వృద్ధులు విలవిలాడుతున్నారు. ఎండలకు తాలలేక ప్రజలు శీతాలపానీయలను ఆశ్రయిస్తున్నారు. పుచ్చకాయ, దోసాకాయ, మజ్జికలకు డిమాండ్ పెరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వడగాలులు వస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

అన్నాడీఎంకే చీలిక వర్గాల విలీనానికి కమిటీ ఏర్పాటు : సెంగొట్టయ్య

చెన్నై: అన్నాడీఎంకే చీలిక వర్గాల విలీనానికి కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి సెంగొట్టయ్యన్ తెలిపారు. దినకరన్ నివాసంలో మంత్రులు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సెంగొట్టయ్య మాట్లాడుతూ విలీనానికి పన్నీర్ సెల్వం వర్గం ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. పార్టీ ఐక్యంగా ఉండాలన్నదే అందరి అభిమతమని పేర్కొన్నారు. 

13:34 - April 18, 2017

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళపై తీవ్ర విమర్శలు చేశారు. శశికళను అమ్మ ఏనాడు ఇష్టపడలేదని జయలలిత ఆశయాలే తమకు ముఖ్యమని రాజకీయాలు కాదని అన్నారు. అమ్మకు శశికళ ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. తమిళనాడు రాజకీలు మరోసారి వేడెక్కిన సంగతి తెలిసిందే. పార్టీ చిహ్నం కోసం ఈసికి లంచం ఇవ్వచూపుతూ దినకరన్ అడ్డంగా బుక్కయ్యారు. దీనితో వైరి వర్గాలైన పన్నీర్..పళనీ వర్గాలు ఒక్కటయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు పన్నీర్ వర్గం కొన్ని షరతులు విధిస్తోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా పన్నీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జయలలిత మృతిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శశికళను, దినకరన్ లను పార్టీ పదవుల నుంచి తొలగించాలని అన్నారు. పార్టీని ఒక్క కుటుంబం చేతిలోకి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల విలీనానికి అన్నాడీఎంకే పార్టీ సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

13:31 - April 18, 2017

పెరుగు..ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో చాలా ఉపయోగకరం. పెరుగును అందంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
మజ్జిగలో పలుచటి బట్టను ముంచి ఆ బట్టను ముఖం మీద వేసుకోవాలి. ఇలా పది నిమిషాలకి నాలుగైదు సార్లు చేయాలి. అనంతరం శుభ్రమైన పొడిబట్టతో తుడుచుకోవాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లలో బట్టను ముంచి తుడుచుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం బాగుంటుంది.
మెటిమలు ఎక్కువగా ఉన్నవారుర పెరుగులో శనగపిండిని కలపాలి. ఈ ముద్దను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.
ముల్లంగి రసంలో మజ్జిగ కలిపి పట్టించి గంటసేపటి అనంతరం కడుక్కోవాలి.
బాదం నూనె, ఒక స్పూన్ మజ్జిగ కలిపి ముఖానికి..మెడకు..శరీరానికి స్నానం చేసే ముందు పట్టించాలి. అరగంట అనంతరం బట్టతో తుడుచుకుని స్నానం చేయాలి. తలకు పెరుగును బాగా పట్టించి మర్దన చేసి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది.

13:24 - April 18, 2017

రోజు వారి పనుల్లో భాగంగా మన గురించి మనమే పట్టించుకోవడం మానేశాం. ప్రస్తుతం అలాంటి రోజులున్నాయి. కానీ అలా పట్టించుకోకుండబా ఉండడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా కోల్పోతుంటాం. రాత్రి పడుకొనే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే అందం మెరుగయ్యే అవకాశం ఉంది.
రాత్రి పడుకొనే ముందు తాజా కొబ్బరినూనెతో ముఖానికి మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కోమలంగా ఉండడమే కాకుండా ముఖంపై వచ్చే ముడతలు రావు.
కనురెప్పలు ఎంత మృదువగా ఉంటే అంత అందంగా ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు కనురెప్పలకు ఆముదం నూనె రాస్తే చాలా ఉపయోగకరం.
కలబంద జెల్ గాని, జ్యూస్ కానీ ముఖానికి రాసుకుని గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ముఖంపై మీద ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
ఆల్మండ్ నూనెలో కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి..కళ్ల క్రింది భాగంలో రాసుకొంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఉదయం లేచే సమయానికి ముఖం కాంతివంతంగా మారుతుంది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

అమరావతి : కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఈ భేటీకి మంత్రులు యనమల రామకృష్డుడు, కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. 

'అమ్మ'కు ద్రోహం చేసిన శశికళ : పన్నీరు సెల్వం

చెన్నై : శశికళపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. అమ్మకు శశికళ ద్రోహం చేశారని సెల్వం మండిపడ్డారు. శశికళను అమ్మ ఏనాడు ఇష్టపడ లేదన్నారు. జయలలిత ఆశయాలే ముఖ్యం తమకు ముఖ్యం..రాజకీయాలు కాదని స్పష్టం చేశారు. పార్టీని ఒక్క కుటుంబం చేతిలోకి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదన్నారు. జయలలిత మృతిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శశికళ, దినకరన్ ల పార్టీ పదవులను నుంచి తొలగించాలన్నారు. 

 

కృష్ణానదిలో మత్స్యకారులు జలదీక్ష

అమరావతి : కృష్ణానదిలో మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువన సీతానగరం వద్ద ఇళ్ల తొలగింపును నిరసిస్తూ బోట్లతో మత్స్యకారులు జల దీక్ష చేస్తున్నారు. సీపీఎం నేత బాబురావు, ఎమ్మెల్సీ బొడ్డు దీక్షకు మద్దతు తెలిపారు. 

13:12 - April 18, 2017

ట్రిపుల్ తలాక్..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు ప్రముఖులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళలు మండిపడుతున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తలాక్ చెప్పి తమ జీవితాన్ని నాశనం చేయొద్దని కోరుతున్నారు. నోటి మాటతో, ఫోనులో, సోషల్ మీడియాలో ఒక్క మాట తలాక్ అంటే భార్యాభర్తలు విడిపోవచ్చుననే ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయంపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ పోరు కొనసాగిస్తోంది. ఈనేపథ్యంలో 'ట్రిపుల్ తలాక్' అంశంపై మానవి వేదిక చర్చ చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా, ఐద్వా సభ్యురాలు షమీన పాల్గొన్నారు. వారు తమ అభిప్రాయాలను తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

మణుగూరు ఓపెన్ కాస్టులో బంకర్ కూలి..ఇద్దరి మృతి

భద్రాద్రి : మణుగూరు ఓపెన్ కాస్టులో బంకర్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. లారీలో బొగ్గు లోడ్ చేస్తుండగా బంకర్ కూలింది. మృతులు రఘుపాల్ రెడ్డి, పవన్ గా గుర్తించారు. 

13:04 - April 18, 2017

స్టార్ 'పవన్ కళ్యాణ్' తన నెక్ట్స్ సినిమా ప్రారంభమై రోజులు గడుస్తోంది. ‘కాటమరాయుడు' చిత్రం అనంతరం మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో 'పవన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 25వ సినిమా ముస్తాబవుతున్న ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో తెగవార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించనున్నాడని టాక్. ఇందుకు 'ఇంజినీర్ బాబు' అని..'దేవుడు దిగివస్తే అయిపోయింది'..అనే టైటిల్స్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 'పరదేశ ప్రయాణం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. రెండు ఫ్లాప్ ల అనంతరం వస్తున్న ఈ చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం గురించి విషయాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత : కేటీఆర్

హైదరాబాద్ : పాతనగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫరూఖ్ నగర్ బస్ డిపో, ప్రయాణ ప్రాంగణాన్ని మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం స్థల సేకరణ చేస్తామని చెప్పారు. ఫలక్ నుమాలో రోడ్ల నిర్మాణానికి జీహెచ్ ఎంసీకి సహకారం అందిస్తామన్నారు. బండ్లగూడ రవాణ శాఖ ఆఫీస్ కు సల్లావుద్ధీన్ పేరు నామకరణం చేస్తునట్లు 
పేర్కొన్నారు. 

ఫరూఖ్ నగర్ బస్ డిపో, ప్రయాణ ప్రాంగణం ప్రారంభం

హైదరాబాద్ : ఫరూఖ్ నగర్ బస్ డిపో, ప్రయాణ ప్రాంగణాన్ని మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే మోజంఖాన్, సోమారపు హాజరయ్యారు.  

శశికళ వర్గంలో పనిచేసేందుకు పన్నీర్ సెల్వం షరతులు

చెన్నై : శశికళ వర్గంలో పనిచేసేందుకు పన్నీర్ సెల్వం షరతులు విధించారు. పళనీస్వామియే సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వం అన్నారు. శశికళ కటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలని తెలిపారు. కేబినెట్ లోకి తనను తీసుకోవాలని షరతు విధించారు. 

12:38 - April 18, 2017

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా మందే వీక్షించి ఉంటారు. కానీ ఈ మ్యాచ్ లో సంజూ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ఆయన చేసిన ప్రదర్శనకు ప్రేక్షకులు..జట్టు సభ్యులు ప్రశంసించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం కోల్ కతా బ్యాటింగ్ కు దిగింది. ఐదు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 10 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో పాండే 58, వోక్స్ 2 పరుగులతో ఆడుతున్నారు. 19ఓవర్ రెండో బంతికి నైట్ రైడర్స్ బ్యాట్ మె న్ మనీష్ పాండే ఓ భారీ షాట్ కొట్టాడు. అది దాదాపు సిక్సర్ అని భావించారు. అక్కడ ఫీల్డింగ్ చేసుతన్న సంజూ అనూహ్యంగా కుడివైపు భారీ జంప్ చేశాడు. గాల్లోనే బంతి పట్టుకున్నాడు. రెప్పపాటులోనే దానిని మైదానంలోకి విసిరేసి బౌండరీ లైన్ అవతలివైపు పడిపోయాడు. సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్న సంజూను అభినందించారు. ఇది అద్భుతమైన ఫీట్ అంటూ కొనియాడారు.

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చెన్నైపర్యటన వాయిదా

ఢిల్లీ : దినకరన్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెన్నై పర్యటన వాయిదా వేసుకున్నారు. మొదట ఢిల్లీలో దర్యాప్తు పూర్తి చేస్తామని పోలీసులు తెలిపారు. 

రాబోయే రోజుల్లో కాబోయే సీఎం లోకేష్ : చినరాజప్ప

తూర్పుగోదావరి : రాబోయే రోజుల్లో కాబోయే సీఎం నారా లోకేష్ అని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

12:34 - April 18, 2017

వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన టీటీడీపీ నేతలు

హైదరాబాద్ : వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని టీటీడీపీ నేతలు ముట్టడించారు. 
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

12:30 - April 18, 2017

విజయవాడ : టీడీపీ సీనియర్‌నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. గుణదలలోని వ్యవసాయక్షేత్రంలో అధికారిక లాంఛనాల మధ్య నెహ్రూ అంత్యక్రియలు పూర్తి చేశారు. నెహ్రూ కుమారుడు అవినాష్‌ తలకొరివి పెట్టారు. దేవినేని నెహ్రూ అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు నెహ్రూ ఇంటి నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నెహ్రూ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

 

12:24 - April 18, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇక శశికళ శకం ముగిసిపోయే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శశికళకు చెక్ పెట్టేలా రాజకీయాలు మలుపు తీసుకుంటున్నాయి. రెండుగా చీలిన పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటవుతుండడమే దీనికి కారణం. పార్టీ చిహ్నం కోసం ఈసీకి లంచం ఇవ్వడంలో దినకర్ అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. పన్నీర్..పళని వర్గాలు ఒక్కటి కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలకు మధ్యవర్తిగా ఎంపీ తంబితురై వ్యవహిరిస్తున్నారు. ఇందుకు పన్నీర్ వర్గం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇందుకు పన్నీర్ షరతులు విధిస్తున్నారు. పళనిస్వామియే సీఎంగా కొనసాగాలని..శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలని..కేబినెట్ లోకి తనను తీసుకోవాలని పన్నీర్ షరతులు విధించారని తెలుస్తోంది. కొద్దిగంటల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

ఆరు రోజుల శిశువు కిడ్నాప్

కరీంనగర్ : జిల్లాలో శిశువు కిడ్నాప్ కలకలం రేపింది. ఆరు రోజుల శిశువును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ముందు పాప బంధువులు ధర్నాకు దిగారు. ఆస్పత్రి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 

కొనసాగుతున్న దేవినేని నెహ్రూ అంతిమయాత్ర

విజయవాడ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంతిమయాత్ర కొనసాగుతోంది. గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో నెహ్రూ అంత్యక్రియలు జరుగనున్నాయి. అధికార లాంఛనాలతో నెహ్రూ అంత్యక్రియలు జరుగనున్నాయి. నెహ్రూ గుండెపోటుతో నిన్న హైదరాబాద్ లో మృతి చెందారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో 
చికిత్స పొందుతూ మృతి చెందారు. 

12:00 - April 18, 2017

హైదరాబాద్‌ : నగరంలో మంగళవారం మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటిస్తున్నారు. పలు ప్రారంభోత్సవాలు..శంకుష్థాపనలు చేస్తున్నారు. హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌ పరిధిలోని గౌతంనగర్‌లో కోటి రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు..ఈ సంవత్సరం లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని, పేదలందరికీ ఇళ్లు నిర్మించి వారి సమస్యలను తీర్చి స్లమ్‌ ప్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

 

 

పల్లె తల్లి వంటిది.. పట్నం ప్రియురాలు వంటిది : నారా లోకేష్

తూర్పుగోదావరి : పల్లె తల్లి వంటిది.. పట్నం ప్రియురాలు వంటిది అని ఏపీ మంత్రి నారా లోకేష్ చమత్కరించారు. జిల్లాలో మంత్రి పర్యటిస్తున్నారు. జి.మేడపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరికోరి పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని తెలిపారు. రెండేళ్లలో అన్ని పల్లెలను అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు.

 

11:55 - April 18, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పోరాటాల పురిటిగడ్డ. సామాజిక స్పృహతో ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడిన నేల. వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు రక్తం చిందించిన రుధిరభూమి. ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాడిన ఉద్యమకారులకు నెలవు. నాటి ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశ పోరాటం వరకు చాలా ఉద్యమాలు ఉస్మానియా నుంచే ఉద్భవించాయి. అన్యాయాన్ని ఎదిరించి వీరోచిత పోరాటాలకు కేంద్రంగా నిలించిన ఉస్మానియా యూనివర్సిటీపై 10 టీవీ ప్రత్యేక కథనం....

వందేళ్ల చరిత్ర.....
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఈ చదువులమ్మ ఒడిలో ఎందరో మేధావులు ఉదయించినట్టే ఎన్నో ఉద్యమాలు కూడా  ఊపిరిపోసుకున్నాయి.

1918 నుంచే ఉద్యమాలకు వేదిక.....
ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ప్రారంభమైతే, అప్పటి నుంచే చిన్న ఉద్యమాలకు వేదికైంది. ఆతర్వాత పెద్ద ఉద్యమాలు మొదలయ్యాయి. ఆబిడ్స్‌ గన్‌ ఫౌండ్రీలో నడిచే యూనివర్సిటీకి సొంత క్యాంపస్‌ కోసం విద్యార్థులు చేపట్టిన పోరాటంతో ఉద్యమాల చరిత్ర ఆరంభమైంది. ఆ తర్వాత వరుసగా ఉద్యమాలు 1935లోనే హైదరాబాద్‌ ఈజ్‌ ఫర్‌ హైదరాబాదీస్‌ ఆందోళన నడిచింది. దేశ స్యాతంత్రయోద్యమ కాలంలో ఇక్కడే ప్రారంభమైన వందేమాతం ఉద్యమం రాజకీయ చైతన్యానికి వేదికయింది. రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో పోరాటాలు జరిగాయి. ముల్కీ నిబంధనలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉద్యమం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. 1969 లో జరిగిన తెలంగాణ ఉద్యమం నుంచి 2002లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఉస్మానియా

బీ హాస్టల్‌లో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం........
1938లో ఉస్మానియా బీ హాస్టల్‌లో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. బ్రిటీషు పాలకుల ఆదేశానుసారం యూనివర్సిటీ అధికారులు ఈ గీతాలాపనను నిషేధించినా, ఈ ఆజ్ఞలను ఉల్లంఘించిన 350 మంది విద్యార్థులపై 1938 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 10 వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇలాంటి వారిలో మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, టీ హయగ్రీవాచారి, దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఉస్మానియాలో జరిగిన వందేమాతరం ఉద్యమానికి గాంధీ, నెహ్రూ, సుభాస్‌ చంద్రబోస్‌ వంటి ఎందరో మద్దతు లభించింది. క్విట్‌ కాలేజీ ఉద్యమంలో పాల్గొన్న పీవీ నరసింహారావు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వెళ్లి చదువు కొనసాగించారు.

ముల్కీ వ్యతిరేక పోరాటం........
వందేమాతరం ఉద్యమం తర్వాత తెలంగాణలో ముల్కీ వ్యతిరేక పోరాటం సాగింది. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన వారితోపాటు, పదిహేనేళ్లు స్థిరనివాసం ఉన్నవారే ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి అర్హులంటూ నిజాం పాలకులు జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. మాడపాటి హనుమంతరావు, రాజా రావు బహదూర్‌ వెంకట్రామిరెడ్డి వంటి ఎందరో ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ముల్కీ అనుకూల, వ్యతిరేక ఉద్యమాలతో 1952లో ఈ ప్రాంతం అట్టుడికింది. ముల్కీ ఆందోళన తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ముల్కీ నిబంధనలు చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ తెలంగాణవాదులు, విద్యార్థులు ప్రారంభించిన పోరాటం ఉద్యమం రూపం అందుకుంది. జామై ఉస్మానియా రైల్వే స్టేషన్‌ను విద్యార్థులు దహనం చేసిన తరవ్వాత పోరాటంపై పోలీసులు ఉక్కపాదం మోపారు. ఈ ఉద్యమంలో చాలా మంది అమరులయ్యారు.

సీమాంధ్రలో జై ఆంధ్రా ఉద్యమం......
తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ 1972లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును నిరసిస్తూ సీమాంధ్రలో జై ఆంధ్రా ఉద్యమం పుట్టుకొచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఈ ఉద్యమం చల్లారిపోయింది. హైదరాబాద్‌లో 15 ఏళ్లు ఉన్నవారే స్థానికులుగా గుర్తిస్తూ జారీ చేసిన నిబంధలను 12 ఏళ్లకు తగ్గిస్తూ కుదర్చుకున్నదే పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఉస్మానియాలో విద్యార్థి పోరాటాలు ఎగసిపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనాజీ, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. ఏబీవీపీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ పూర్వపు విద్యార్థులు పోరాటాల్లో తమ ప్రాతను గుర్తు చేసుకుంటున్నారు.

శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఇషాంత్‌రెడ్డి ఆత్మత్యాగాలు ....
తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పెట్టింది. కేసీఆర్‌ ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి విద్యార్థి శక్తి తోడవడంతో ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కేసీఆర్‌ ఖమ్మంలో దీక్ష చేసిన సమయంలో ఉస్మానియా క్యాంపస్‌ ఆరని ఆగ్నిగుండగా మారింది. పోలీసుల లాఠీలు, తూటాలు, బాష్పవాయుగోళాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగుని పోరాటం చేశారు. కేసీఆర్‌ ఏ పిలుపు ఇచ్చినా క్యాంపస్‌ విద్యార్థులే ముందు ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉస్మానియా విద్యార్థులు శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఇషాంత్‌రెడ్డి ఆత్మత్యాగాలు చేశారు. 2009లో తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చి, 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు పోరుబాటలో విద్యార్థులదే కీలక పాత్ర. రాజకీయ పోరాటేలే కాదు, పాలకులు అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలపై కూడా పోరాటం చేసిన ఘన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఉద్యమాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. 

లక్ష బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : లక్ష బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో మంత్రి పర్యటిస్తున్నారు. ఈమేరకు ఫిలింనగర్ లో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఫసుద్దీన్ పాల్గొన్నారు. 

11:44 - April 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గురుకుల కాలేజీలు తమ సత్తా చాటాయి. ఉత్తీర్ణతలో ప్రైవేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోమంటూ మరోసారి రుజువుచేశాయి. ఇంటర్ ఫలితాల్లో గురుకులాల సత్తాపై ప్రత్యేక కథనం. కార్పొరేటు కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో మంచి ఫలితాలు రావడం విశేషం.

ప్రైవేట్‌ కాలేజీలకు ధీటుగా...
ప్రైవేటు కాలేజీల్లో ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం, సెకండియర్ లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో 76 శాతం, రెండవ సంవత్సరంలో 88 శాతం సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్ లో 75శాతం, సెకండ్ ఇంటర్ లో 87శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

గురుకులాల్లో కాన్సెప్ట్ స్టడీ - ప్రవీణ్ కుమార్...
తమ విద్యార్థులు కష్టపడి చదవడం వలనే ఈ ఫలితాలు వచ్చాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ అంటున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఉండే బట్టి విధానానికి వ్యతిరేకంగా గురుకులాల్లో కాన్సెప్ట్ స్టడీ ఉండటం వల్లే విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.

విద్యార్థుల హర్షం..
ఇక ప్రైవేట్‌ కాలేజీలకు ధీటుగా ఫలితాలు సాధించడం పట్ల గురుకుల విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గురుకులాల స్ఫూర్తితో భవిష్యత్‌లో ఉన్నతమైన శిఖరాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఫిలింనగర్ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఫిలింనగర్ లో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఫసుద్దీన్ పాల్గొన్నారు. 

11:39 - April 18, 2017

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, అమ్మ అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ కచ్చితంగా తెలుస్తుంది. ఎన్ని ఉన్నా ‘తల్లి’ లేని లోటు పూడ్చలేనిది. ఎంత డబ్బు..ధనవంతులు..మంది మార్బలం ఉన్నా 'తల్లి' లేని లోటు పూడ్చలేనిది. తనకు ‘అమ్మే’ గుర్తుకొస్తుందని బ్రిటన్ యువరాజు ‘హ్యారీ’ తెలిపారు. తన తల్లి ప్రిన్సెస్ డయాన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. హ్యారీ 12 ఏళ్ల వయస్సునప్పుడు డయానను కోల్పోయాడు. ఆగస్టు 31, 1997లో ఓ కారు ప్రమాదంలో డయానా మృతి చెందారు. ప్రస్తుతం హ్యారీకి 32 ఏండ్లు. ఓ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను తెలియచేశారు. తల్లి దూరమవటం తనను ఎంతగానో కలిచివేసిందని, తనలో తానే వేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి క్షణం తన తల్లే గుర్తుకొచ్చేదని, ఎంతో భావోద్వేగానికి గురవుతుండే వాడినని తెలిపారు. ఇందులో నుండి బయటపడాలని తాను విశ్వప్రయత్నాలు చేయడం జరిగిందని, మానసికంగా కృంగిపోయిన తాను డయాన జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు. చివరికి మానసిక నిపుణులతో తర్ఫీదు కూడా తీసుకున్నానని హ్యారీ పేర్కొన్నారు.

11:34 - April 18, 2017

హైదరాబాద్ : ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం పోలీసుల ప్రథమ కర్తవ్యం. కొన్ని సందర్భాలలో తమ విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలను కోల్పోవడం చూస్తుంటాం. దుండగులు, ముష్కరులు అవసరమైతే పోలీసులపై ఎదురుదాడులకు పాల్పడుతూ కాల్చిచంపిన ఘటనలు చూశాం. ఇక ఇలాంటి దాడులన్నింటికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు.

స్వీయ రక్షణ అవసరం...
ప్రజల భద్రతతోపాటు స్వీయ రక్షణపై దృష్టి సారించారు సైబరాబాద్ పోలీస్‌ ఉన్నతాధికారులు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాంటి స్క్వాడ్‌కి తోడు ట్యాక్టికల్ ట్రైనింగ్ శిక్షణ తరుగతులను పోలీసులకు అందింస్తున్నారు. యాంటిస్క్వాడ్‌కు విభిన్నంగా ట్యాక్టికల్ ట్రైనింగ్‌ పూర్తి చేస్తున్నారు. పోలీసు కమీషనరేట్ లో 9వ బ్యాచ్ పోలీసులు ట్యాక్టికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందారు. ఇప్పటివరకు 9 టీంలు శిక్షణపై పూర్తిచేసుకున్నాయి. గతంలో పోలీసులపై జరిగిన మెరుపు దాడులు, దుండగుల ఎదురుకాల్పులను దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇచ్చారు.

భద్రత అంశాలు...
ట్యాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా వాహనాలు తనిఖీలు చేయడం, అనుమానితులను ప్రశ్నించడం, వెహికిల్ ఇంటర్ సెప్షన్ రౌండింగ్స్, షార్ప్ షూటర్స్ టీమ్స్, నేరస్తులపై నిఘా పెట్టడం, తదితర అంశాలపై పోలీసులు మెలకువలు తెలుసుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 9వ బ్యాచ్ టీమ్‌కు జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం సర్టిఫికేట్లను అందజేశారు. దుండగులు, ముష్కరుల ఆటకట్టించడంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

డ్రైవింగ్ స్కూళ్లపై ఆర్టీఏ దాడులు

రంగారెడ్డి : జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్లపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న సాయిదుర్గ, సత్యసాయి డ్రైవింగ్ స్కూళ్లకు చెందిన మూడు కార్లను సీజ్ చేశారు. జరిమానా విధించారు. 

11:28 - April 18, 2017

కరీంనగర్ : జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఓ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం రేగింది. ఈ ఘటన చల్మెడ ఆనంద రావు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. జిల్లా చామనపల్లి చెందిన ప్రవీణ్, రమ దంపతులకు చల్మెడ ఆనంద రావు ఆసుపత్రిలో ఆరు రోజుల క్రితం బాబు జన్మించాడు. మంగళవారం ఉదయం శిశువు కనిపించకపోవడంతో రమ కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కోపోద్రిక్తులైన బంధువులు ఆసుపత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటెజ్ ఆధారంగా శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. పోలీసులు రెండు టీంలుగా విడిపోయి గాలింపు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల్లో ఉమ్మడి కరీంనగరర్ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ సాధారణంగా మారిపోయింది. మొన్న వేములవాడలో 6 నెలల శిశువును కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్ : ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. జీతాలు చెల్లించలేదంటూ కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలుపుతున్నారు. 

 

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో ప్రారంభం అయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్ పయనిస్తోంది. 60 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ ఉంది. 

మంత్రి లోకేష్ తూ.గో జిల్లా పర్యటనలో దొంగల హల్ చల్

తూర్పుగోదావరి : జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. జి.మేడపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా దొంగలు హల్ చల్ చేశారు. పలువురి మొబైల్స్, పర్సులను దొంగలు కొట్టేశారు.

దినకరన్ నివాసంలో మంత్రులు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్ భేటీ

చెన్నై : శశికళ మేనల్లుడు దినకరన్ నివాసంలో మంత్రులు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

ప్రారంభమైన దేవినేని నెహ్రూ అంతిమయాత్ర

విజయవాడ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంతిమయాత్ర ప్రారంభం అయింది. గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో నెహ్రూ అంత్యక్రియలు జరుగనున్నాయి. అధికార లాంఛనాలతో నెహ్రూ అంత్యక్రియలు జరుగనున్నాయి. నెహ్రూ గుండెపోటుతో నిన్న హైదరాబాద్ లో మృతి చెందారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో 
చికిత్స పొందుతూ మృతి చెందారు. 

11:01 - April 18, 2017

బాలీవుడ్ లో కండలు చూపించే నటుల్లో 'జాన్ అబ్రహం' ఒకరు. ఆయన అణు పరీక్ష నిర్వహించడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? పూర్తిగా తెలియాలంటే చదవాల్సిందే. జాన్ అబ్రహం.. హీరోయిన్లతో ఘాటు ఘాటు రోమాన్స్ చేస్తూ, యాక్షన్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యాక్షన్..రోమాంటిక్ చిత్రాలు చేయడమే కాకుండా తనలో నిర్మాత కూడా ఉన్నాడని నిరూపించాడు. ఆయన నిర్మాణంలో రూపొందించిన 'విక్కీ డోనర్', ‘మద్రాస్ కేఫ్' చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. వీర్యదానం అనే అంశం నేపథ్యంలో నిర్మాతగా 'విక్కీ డోనర్' చిత్రాన్ని 'జాన్' తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు లభించడంతో 'జాన్' ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీలంక అంతర్యుద్ధం..రాజీవ్ గాంధీ హత్య లాంటి సున్నిత రాజకీయాలు సృశిస్తూ 'మద్రాస్ కేఫ్' చిత్రాన్ని నిర్మించారు. తాజాగా మూడో చిత్రంపై ఆయన దృష్టి సారించారు. 1998 ఫోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ఈ మేరకు జాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో కథానాయకుడిగా 'జాన్' నటించనున్నారు. ఇప్పుడు నిర్మించే ఈ సినిమా తన ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని, ప్రొఖాన్ అణుపరీక్షల నాటి పరిస్థితులపై 'అభిషేక్' మూడు సంవత్సరాలు పరిశోధన చేసి స్ర్కిప్ట్ రూపొందించారని జాన్ పేర్కొన్నారు. డిసెంబర్ 8వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్...

హైదరాబాద్ : బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్ రెడ్డిని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ వారం రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అరబీ, ఉర్దూ భాషలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈనేపథ్యంలో కిషన్ రెడ్డి కాచిగూడ, నారాయణగూడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాపు చేస్తున్నారు. షార్జా నుంచి బెదిరింపు కాల్స్ వస్తునట్లు పోలీసులు గుర్తించారు. 

10:58 - April 18, 2017

హైదరాబాద్ : బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ వారం రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అరబీ, ఉర్దూ భాషలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈనేపథ్యంలో కిషన్ రెడ్డి కాచిగూడ, నారాయణగూడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాపు చేస్తున్నారు. షార్జా నుంచి బెదిరింపు కాల్స్ వస్తునట్లు పోలీసులు గుర్తించారు. ముస్లీం రిజర్వేషన్లను వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ముస్లీం రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నావని.. నిన్ను చంపేస్తామని' బెదిరింపు కాల్స్ చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని సీపీ మహేందర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

10:46 - April 18, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గత కొద్ది రోజుల కిందట సీఎం జయలలిత మృతి చెందిన అనంతరం పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హాట్ హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే విలీనం దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు మధ్యవర్తిగా తంబిదురై వ్యవహరిస్తున్నారు. పళని స్వామికి సీఎం పదవి, పన్నీరుకు పార్టీ  ప్రధాన కార్యదర్శి పదవులు వచ్చే విధంగా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. నేడు మంత్రులతో పన్నీరు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు వర్గాలు విలీనం అయితే శశికల శకం ముగిసినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే శశికల మేనల్లుడు దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఈసీకి అంచం ఇవ్వజూపి విషయంలో అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. 

10:46 - April 18, 2017

టాలీవుడ్ లో తన స్టైల్ తో ఇరగదీస్తున్న 'అల్లు అర్జున్' మరోసారి వైవిధ్యమైన స్టైల్ తో ప్రేక్షకులు ముందుకొస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రంలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ‘సరైనోడు' మూవీ అనంతరం బన్నీ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర కథానాయికగా 'పూజా హెగ్డే' నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా అనంతరం 'వక్కంతం వంశీ' దర్శకత్వంలో 'బన్నీ' ఓ చిత్రం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'అల్లు అర్జున్' ఇందులో సైనికుడిగా కనిపించబోతున్నారని టాక్. బన్నీ ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర పోషించలేదనే సంగతి తెలిసిందే. ‘సరైనోడు' లో ఆర్మీ దుస్తుల్లో కనిపించినా అది కొద్దిసేపు మాత్రమే. పూర్తిగా ఆర్మీ అధికారిగా 'బన్నీ' కనిపించబోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

10:42 - April 18, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శశికళ మేనల్లుడు దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు దినకరన్ కు నోటీసులు ఇవ్వనున్నారు. నేడు దినకరన్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకీ రూ.50 కోట్లు ఇచ్చే ప్రయత్నంలో దినకరన్ బుక్ అయ్యారు. అన్నాడీఎంకే చీలిక వర్గాలు విలీనం దిశగా సాగుతున్నాయి. శశికళకు చెక్ పెట్టేందుకు స్కెచ్ వేశారు. పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు ఒక్కటయ్యే దిశగా కొనసాగుతున్నాయి. పళనిస్వామికి సీఎం బాధ్యతలు, పన్నీరు సెల్వం పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. నేడు మంత్రులతో పన్నీరు సెల్వం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మంత్రులంతా చెన్నైలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరు వర్గాల కలయికకు ఎంపీ తంబిదురై మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విలీనం దిశగా అన్నాడీఎంకే చీలిక వర్గాలు

చెన్నై: అన్నాడీఎంకే చీలిక వర్గాలు విలీనం దిశగా సాగుతున్నాయి. శశికళకు చెక్ పెట్టేందుకు స్కెచ్ వేశారు. పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు ఒక్కటయ్యే దిశగా కొనసాగుతున్నాయి. పళనిస్వామికి సీఎం బాధ్యతలు, పన్నీరు సెల్వం పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. నేడు మంత్రులతో పన్నీరు సెల్వం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మంత్రులంతా చెన్నైలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరు వర్గాల కలయికకు ఎంపీ తంబిదురై మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. 

 

10:37 - April 18, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'..మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు..పోస్టర్స్ విడుదల కాలేదు. దీనితో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అభిమానుల నిరుత్సాహానికి అర్థం చేసుకున్న చిత్ర యూనిట్ ఏప్రిల్ 13వ తేదీన యూ ట్యూబ్ లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇప్పటి వరకు 20 లక్షల మంది వీక్షించారు. అంతేగాకుండా యూ ట్యూబ్ ట్రెండింగ్ లో ఈ వీడియో మూడోస్థానంలో కొనసాగుతుండడం విశేషం. ఈ చిత్రంపై ‘మహేష్’ భారీ ఆశలు పెట్టుకున్నారు. సామాజిక కథాంశంతో చిత్రాలు తెరకెకిక్కించే ‘మురుగదాస్’ ఈ చిత్రంలో కూడా ఓ సామాజిక కోణాన్ని ఆవిష్కరించారని తెలుస్తోంది. సినిమాకు ‘స్పైడర్’ పేరును పెట్టనున్నారు. మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ కథానాయికగా,ఎస్.జె.సూర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. హ్యారీస్ జయరాజ్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంలో 'మహేష్' నటన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే చిత్రం విడుదల కావాల్సిందే.

10:35 - April 18, 2017

కృష్ణా : సొమవారం తెల్లవారుజామున గుండె పోటుతో మరణించిన టీడీపీ నేత దేవినేని నెహ్రూ అంతిమయాత్ర ప్రారంభమైంది. స్వగ్రామం గుణదలలో జరుగుతున్న అంతిమయాత్రకు భారీ స్థాయిలో కార్యకర్తలు..అభిమానులు హాజరౌతున్నారు. నెహ్రూ మిత్రుడు మోహన్ బాబు కుటుంబం పాల్గొంది. అంతిమయాత్ర 2గంటల పాటు కొనసాగనుంది. ఆయన వ్యవసాయ క్షేత్రంలో సోదరుల సమాధుల ప్రక్కన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:28 - April 18, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఆయన నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథమ్' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పోస్టర్..టీజర్స్ విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం అనంతరం 'వక్కంతం వంశీ' దర్శకత్వంలో 'బన్నీ' ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు 'బొమన్ ఇరానీ' ప్రధాన పాత్ర పోషిస్తారని టాలీవుడ్ టాక్. టాలీవుడ్ లో ఇటీవలే వచ్చిన 'అత్తారింటికి దారేది', 'బెంగాల్ టైగర్' సినిమాలో బొమన్ నటించి అభిమాలను అలరించారు. బన్నీ సినిమాలో ఓ పాత్రకు బొమన్ కరెక్టుగా సరిపోతారని అందుకే ఆయన్ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

10:21 - April 18, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' చైనాకు చేరుకున్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న నటుల్లో 'అమీర్' ఒకరు. ప్రయోగాత్మకమైన చిత్రాల్లో నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'దంగల్' సినిమా విజయదుందుభి మ్రోగించింది. ఆయన నటనకు ప్రశంసలు కూడా లభించాయి. ఈ చిత్రాన్ని 'చైనా'లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి 'అమీర్' చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో అమీర్ కు ఉన్న పాపులార్టీ ఏంటో ఈ ఫొటోలను బట్టి చూస్తే తెలుస్తుంది. అక్కడ యువత అమీర్ తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పుష్పగుచ్చాలిచ్చి ఆనందం వ్యక్తం చేశారు. చైనా ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందని, చైనీయులకు నా పనితనం నచ్చడం చాలా సంతోషంగా ఉందని అమీర్ పేర్కొన్నారు. ఈ మధ్య 'ధూమ్ 3, ‘పీకే' చిత్రాలు చైనాలో బాగా ఆడాయని తెలిపారు.

10:14 - April 18, 2017

భారతీయ సినీ పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భారతీయ ఇతిహాసమైన 'మహాభారతం'ను వెండితెరమీద ఆవిష్కరించనున్నారనే గత కొన్నిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. తెలుగు అగ్ర దర్శకుడు 'రాజమౌళి' దీనిన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడానికి పక్కా ప్లాన్స్ చేస్తున్నారని టాక్. మహాభారతం సినిమా తీస్తే అందులో తాను 'కృష్ణుడు' పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే 'అమీర్ ఖాన్' స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తారని తెలుస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న నటీనటులు..సాంకేతిక నిపుణులు ఇందులో భాగస్వాములు కానున్నారని సమాచారం. ఈ సినిమాను రూ. వెయ్యి కోట్లతో నిర్మిస్తారని, యూఏఈలోని భారతీయ వ్యాపారవేత్త బీఆర్ షెట్టి ఈ చిత్ర నిర్మాణానికి సహాకారం అందిస్తారని తెలుస్తోంది. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంగ్లీష్..హిందీ..మలయాళం..తెలుగు..కన్నడ..భాషల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రముఖ నటులతో పాటు భారతీయ ప్రముఖ నటులు ఇందులో ప్రధాన పాత్రల కోసం ఎంపిక చేయనున్నారని టాక్. భీముడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తారని దర్శకుడు పేర్కొన్నారు. ప్రముఖ మలయాళ రచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ రచించిన 'రండమాళమ్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. 2018సెప్టెంబర్ మాసంలో ప్రారంభమయ్యే ఈ సినిమా 2020 ప్రథమార్థంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

10:13 - April 18, 2017
08:48 - April 18, 2017

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని వక్తలు విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలు, టీసర్కార్ పాలన అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీకాంగ్రెస్ అధినేత రాకేష్, టీఆర్ ఎప్ నేత గోవర్ధన్ పాల్గొని, మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. కాబట్టి టీఆర్ ఎస్ లో ఆందోళన మొదలైందని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయి కనుకనే ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను తరలించారని చెప్పారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:48 - April 18, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని విశాఖ..హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రాలు సోమవారం రాత్రి వెల్లడించాయి. ప్రకాశం..నెల్లూరు..రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వేడిగాలుల తీవ్రత గణనీయంగా ఉందని, కోస్తా జిల్లాలో ఉక్కపోత అధికంగా ఉందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన దడిగెల వెంకటయ్య (75), కోనరావు పేట మండలం మరిమడ్లకు చెందిన తిక్కల భూమయ్య (60), మెదక్ జిల్లా చిన్న శంకరం పేటకు చెందిన కూలీ ఎర్రి నర్సింహులు (55) ఎండవేడిమికి మృతి చెందారు.

నేటి నుంచి గురుకుల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : టీఎస్ లో నేటి నుంచి గురుకుల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. టీజీటీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మిగతా పోస్టులకు ఈనెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

నేడు జగిత్యాలలో తలసాని, కవిత పర్యటన

జగిత్యాల : నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవిత జగిత్యాలలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు నేతలు శంకుస్థాపన చేయనున్నారు. 

 

08:32 - April 18, 2017

అంగన్ వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. అంగాన్ వాడీలు అనేక సమస్యలతో సతమవుతున్నారని... వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 'ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు మరోసారి పోరుబాటపట్టారు. ఈ నెల 20న అంటే ఎల్లుండి అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఐసిడిఎస్ కమిషనర్ కు ఈ మెయిల్ చేసినట్టు యూనియన్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో మాదిరిగా తమకు కూడా వేతనాలు పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల సమస్యలపై ఆమె మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

08:23 - April 18, 2017

విశాఖ : ఏజెన్సీలో గిరిజనుల ఆరోగ్య దుస్థితిపై టెన్‌ టీవీ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చింది. గిరిపుత్రుల మరణాలపై మంత్రుల బృందం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి..రోగులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది. 10 టీవీ కథనాలు కదం తొక్కుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో వైద్యం అందక కొనసాగుతున్న గిరిపుత్రుల మరణాలపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలతో ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. 
మంత్రుల బృందం సమావేశం 
ఏజెన్సీలో వైద్యసదుపాయాల కల్పనపై విశాఖ కలెక్టరేట్ లో ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. ఏజెన్సీలో మరణాలను ఎలా తగ్గించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో 4 కొత్త పీహెచ్‌సీలు.. పాడేరులో జిల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏజెన్సీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న స్పెషలిస్టులకు నెలకు రెండు లక్షలు, ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులకు లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఏజన్సీలో తమ శాఖను ప్రారంభిస్తే వారికి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇస్తామన్నారు.
రోడ్ల లేమి 
అలాగే రోడ్లు లేమి కూడా ప్రధాన సమస్యగా గుర్తించారు. దీనిలో భాగంగా తొలుత మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు బీటీ రోడ్లు ఏడాదిలో నిర్మించాలని నిర్ణయించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో 1200 కోట్ల రూపాయల నిధులతో మరిన్ని రోడ్లు వేయనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ మన్యంలో వైద్యం అందని దైన్యస్థితిపై వరుస కథనాలు ప్రసారం చేసి.. ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు కృషిచేసిన టెన్‌టీవీకి ఏజెన్సీ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు. 

08:15 - April 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో అమ్మ ఒడి కార్యక్రమం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ స్కీం అమలుకు సంబంధించి మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రజలకు మరో కానుక అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జూన్‌ 2నుంచి అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్ల పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఈ పథకం అమలు ఏర్పాట్లపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్షించారు.
పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ 
అమ్మ ఒడి అమలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. సాఫ్ట్‌వేర్‌ పనితీరును తెలుసుకున్న మంత్రి.. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి పుట్టిన శిశువుకు టీకాలవరకూ పూర్తి సమాచారం ఇందులో ఉండాలని ఆదేశించారు. గర్భిణీలకు చికిత్సలు, పరీక్షలు, ప్రసవం జరిగిన వైద్యశాల, డెలివరీ టైంలో సమస్యలు, ఆ సమయంలో తలెత్తిన సమస్యలు, సుఖ ప్రసవమా?  సిజేరియనా?లాంటి సమస్త సమాచారం రికార్డు కావాలని సూచించారు.. 
ఆధార్ అనుసంధానంతో గ‌ర్భిణీల‌కు బ్యాంక్ అకౌంట్లు
గర్భిణీలకు ఎలాంటి సమస్యలు రాకుండా అమ్మ ఒడి కిట్లను పంపిణీ చేయాలని అధికారుల్ని లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఆధార్ అనుసంధానంతో గ‌ర్భిణీల‌కు క‌చ్చితంగా బ్యాంక్ అకౌంట్లు తెరిపించాల‌ని సూచించారు. గర్భిణీలకు పరీక్షలు నిర్వహించే సమయంలో 4వేల రూపాయలు, ప్రసూతి సమయంలో మరో నాలుగువేలు, ప్రసవం తర్వాత బిడ్డల టీకాలకోసం 4వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు.. ఆడపిల్ల పుడితే అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలని అధికారులకు గుర్తుచేశారు.
ప్రభుత్వ ప్రసవ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలన్న మంత్రి
కేసిఆర్ కిట్ల ప‌థ‌కం సక్రమంగా అమలుకావాలంటే ప్రభుత్వ ప్రసవ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలని లక్ష్మారెడ్డి చెప్పారు.. ఎంసీహెచ్‌ సెంటర్లని పూర్తిస్థాయిలో అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు.. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్ తివారీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.. 

 

08:08 - April 18, 2017


కామారెడ్డి : వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హమాలీ అవతారం ఎత్తారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే టీఆర్ ఓస్ సభ రవాణ ఖర్చుల కోసం కూలి పని చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం బస్తాలను ట్రాక్టర్‌లోకి ఎత్తి  రెండు లక్షల రూపాయలు సంపాదించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

08:06 - April 18, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ను ఎత్తివేయడంపై కాంగ్రెస్‌ పోరుబాటపట్టింది. ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌నేతలు  నిరసనకు దిగారు. ఆందోళన చేపట్టడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను సీఎం కేసీఆర్‌  కాలరాస్తున్నారని  కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. 
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌ : నేతలు 
కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. వీహెచ్‌ , దానంగేందర్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 
అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పణ
ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి వేదికగా ఉన్న ధర్నాచౌక్‌ చుట్టూ పోలీసులను మోహరించిన  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్‌నేతుల మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌ దగ్గర అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పిస్తూ.. నిరసన తెలిపారు.  
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోన్న టీసర్కార్ : ఉత్తమ్‌ 
ఉద్యమపార్టీగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌పార్టీ.. ధర్నాచౌక్‌ వద్ద నిరసనలను రద్దుచేసి.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అన్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని కాంగ్రెస్‌నేతలు హితవు చెబుతున్నారు. ధర్నాచౌక్‌పై సానుకూలంగా స్పందించకుంటే.. మరింత ఉదృతంగా ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు. 

 

08:01 - April 18, 2017

కృష్ణా : విజయవాడలో.. మల్లెతీగ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మధుమాలక్ష్మీ చాంబర్స్‌లో కవి, సాహితీ విమర్శకులు బిక్కి కృష్ణ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఇందులో విమ్‌హాన్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి, "రేపటికోసం" మాసపత్రిక ఎడిటర్‌ బొప్పన విజయకుమార్‌, మల్లెతీగ ఎడిటర్‌ కలిమిశ్రీ, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్‌ చైర్మన్‌ కాంతికృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవమల్లెతీగ మాసపత్రికనూ ఆవిష్కరించారు. 

 

07:59 - April 18, 2017

విజయవాడ : గుండెపోటుతో మృతిచెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేనికి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు నివాళులర్పించారు. దేవినేనిని కడసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఆయన ఇంటికి పోటెత్తారు. ఇవాళ మధ్యాహ్నం గుణదలలోని దేవినేని వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించనున్నారు. 
నెహ్రూ గుండెపోటుతో మృతి 
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నెహ్రూ కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. మరణవార్త తెలుసుకున్న నెహ్రూ కుటంబ సభ్యులు విజయవాడ నుంచి  హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. 
నెహ్రూకు పలువురు నివాళులు 
దేవినేని నెహ్రూ మరణించారన్న విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు హైదరాబాద్‌ ఆస్పత్రిలోనే నెహ్రూ మృతదేహాన్ని దర్శించిన నివాళలర్పించారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు హరికృష్ణ, తెలంగాణ మంత్రి తమ్మల నాగేశ్వరావు, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ నెహ్రూ పార్థివదేహానికి నివాళర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన సానుభూతి తెలియచేశారు. 
మృతదేహం విజయవాడకు తరలింపు
నెహ్రూ మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడ గుణదళలోని ఆయన నివాసానికి తరలించారు. గుణదళలో పలువురు ప్రముఖులు నెహ్రూ పార్థివదేహానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఇతర మంత్రులు, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు తదితరులు.. నెహ్రూ మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. 
నెహ్రూ మరణం పార్టీకి తీరని లోటు : లోకేష్  
దేవినేని నెహ్రూ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ నివాళులర్పించారు. ప్రజాసేవ కోసం నిరంతరం పరితపించిన నేత నెహ్రూ అంటూ స్మరించుకున్నారు. నెహ్రూతో తనకు ఉన్న అనుంబంధాన్ని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ గుర్తు చేస్తున్నారు. ప్రజా సేవకు అంకితమైన నేత నెహ్రూ అని నివాళులర్పించారు. నెహ్రూ మరణంతో ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెహ్రూ మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 

07:53 - April 18, 2017

చెన్నై : తమిళనాడులో శశికళ వర్గానికి మరో షాక్‌ తగిలింది. ఆమె మేనల్లుడు దినకరన్‌పై అవినీతి కేసు నమోదైంది. పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపాడని దినకరన్‌పై ఆరోపణ. తనపై వచ్చిన ఆరోపణలను దినకరన్‌ ఖండించారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ 
శశికళ వర్గం తరపున ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల బరిలో ఉన్న ఆమె మేనల్లుడు దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌ అధికారులకు లంచం ఇవ్వ జూపాడన్న ఆరోపణలతో దినకరన్‌పై అవినీతి కేసు నమోదైంది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో మధ్యవర్థి సుకేశ్‌ చంద్రశేఖర్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. తనకు ఎన్నికల కమిషన్‌తో మంచి సంబంధాలున్నాయని, అన్నాడిఎంకే శశికళ వర్గానికి రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానని సుకేశ్‌ దినకరన్‌ను నమ్మించాడు. ఈ పని కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వడానికి 50 కోట్లు బేరం కుదుర్చున్నాడు. ఇందులో భాగంగా కోటి 30 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. సుకేశ్‌పై ఎఫ్‌ఐర్‌ నమోదు చేసిన పోలీసులు ఆయన వద్ద కోటి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దినకరన్‌తో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని.... ఈ డబ్బులు దినకరన్‌వేనని పోలీసుల విచారణలో సుకేశ్‌ చెప్పడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలను దినకరన్‌ ఖండించారు. సుకేశ్ చంద్రశేఖర్‌ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. నాకు సమన్లు జారీ అయ్యాకే దీనిపై స్పందిస్తానని దినకరన్‌ చెప్పారు. దీన్ని తాను లీగల్‌గానే ఎదుర్కొంటానన్నారు.
అవినీతికి పాల్పడిన శశికళ వర్గం : పన్నీర్‌సెల్వం వర్గం 
ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అవినీతికి పాల్పడిందని పన్నీర్‌సెల్వం వర్గం ఆరోపిస్తోంది. ప్రజలపై నమ్మకం లేనందునే దినకరన్ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని, ఇదే పాలసీని ఈసీతోనూ కొనసాగించే యత్నం చేశారని విమర్శించింది.
పార్టీ గుర్తు ఫ్రీజ్‌ 
అన్నాడీఎంకే గుర్తు రెండాకుల కోసం శ‌శిక‌ళ‌, ప‌న్నీరుసెల్వం వ‌ర్గాలు ప్రయత్నించినా... పార్టీ గుర్తును ఈసీ ఎవ‌రికీ కేటాయించ‌కుండా ఫ్రీజ్‌ చేసింది. దీని స్థానంలో రెండు వ‌ర్గాల వారికి రెండు కొత్త గుర్తుల‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్‌కె నగర్‌ ఉపఎన్నికలో డబ్బులు పంచడం ద్వారా పెద్దమొత్తంలో ఓటర్లను ప్రభావితం చేశారని దినకరన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. తాజాగా ఈసీకీ లంచం ఇవ్వజూపారన్న ఆరోప‌ణ‌ల‌తో శశికళ వర్గం మ‌రింత చిక్కుల్లో ప‌డింది. పోలీసులు త్వరలో దినకరన్‌కు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.

 

ఏపీలో భారీగా అధికారుల బదిలీలు

హైదరాబాద్ : ఏపీలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ గా హెచ్.అరుణ్ కుమార్, డిప్యూడీ సీఈవోగా అపర్ణ ఉపాధ్యాయ బదిలీ అయ్యారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కమిషనర్ గా లక్ష్మీనరసింహం బదిలీ అయ్యారు. పర్యాటకం, యువజన విభాగం ముఖ్మకార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బదిలీ చేశారు. ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీగా కాంతిలాల్ దండే బదిలీ నియమించారు. వ్యవసాయ, సహకార శాఖ సీఎండీగా వి.రమణ బదిలీ అయ్యారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవోగా కేవీ సత్యనారాయణను బదిలీ చేశారు. కడప జిల్లా కలెక్టర్ గా టి.బాబురావు నాయుడు బదిలీ అయ్యారు.

నేడు గుజరాత్ వర్సెస్ బెంగళూరు

ఐపీఎల్ 10 : నేడు గుజరాత్, బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. రాజ్ కోట్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 
 

07:30 - April 18, 2017

విజయవాడ : బడికొస్తా కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు సీఎం చంద్రబాబు.. వారి సమస్యలు తెలుసుకున్నారు.. తల్లి ఆర్థిక సమస్యలవల్ల చదువుకోవడం చాలా కష్టంగా మారుతోందని పలువురు విద్యార్థినులు సీఎం చంద్రబాబు ముందు తన ఆవేదన చెప్పుకుంది.. పదో తరగతి తర్వాత చదువుమానేసి పనికివెళ్లాలంటూ తన తల్లి సూచిస్తోందని మరో విద్యార్థిని కన్నీరుమున్నీరైంది.. స్టేజ్‌మీదే విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకోవడంతో మంత్రులతో పాటు... చంద్రబాబు కూడా చలించిపోయారు.. బాలిక సమస్యపై స్పందించిన సీఎం.. ఈ విద్యార్థినిని రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఉంచి చదివిస్తామని... ఆమె చెల్లికి చెరో 25వేల రూపాయలు డిపాజిట్‌ చేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.. చక్కగా చదువుకోవాలని సూచించారు.

 

07:27 - April 18, 2017

జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల జనహిత ప్రగతి సభ వేదికగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో జీవన్‌రెడ్డి పోషించిన పాత్రేంటని ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ నిరుద్యోగులుగా కాంగ్రెస్ నాయకులకే తాము జీవన భృతి ఇస్తమన్నారు. 
విపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్‌ కామెంట్లు, సెటైర్లు 
జగిత్యాల జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ విపక్ష పార్టీలపై హాట్‌ హాట్‌ కామెంట్లు, సెటైర్లతో కాక పుట్టించారు. జగిత్యాల దెబ్బ ఎలా ఉంటుందో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబుకు తెలిసిందన్నారు. పేదవాళ్లకు సబ్సిడీ ఇవ్వడమంటే తిరోగమన చర్య అని చంద్రబాబు విమర్శించారని.. కానీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా నిలబడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన కేటీఆర్‌.. తెలంగాణ ఉద్యమంలో జీవన్‌రెడ్డి పోషించిన పాత్రేంటని ప్రశ్నించారు. పొరపాటున ఆనాడు కేసీఆర్ ఓడిపోయి ఉంటే నేడు తెలంగాణను చూసేవాళ్లమా అన్నారు. పొరపాటున కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. 
రైతులకు 9 గంటల నాణ్యమైన కరెంట్ : కేటీఆర్  
కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ..ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు పట్టపగలు 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం రైతులు బాధపడ్డారని.. ఇప్పుడు సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. 
జగిత్యాల జిల్లా కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారన్న కవిత
జగిత్యాల జిల్లా కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని ఎంపీ కవిత అన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలకు 150 కోట్లు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు కవిత ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఎమ్మేల్యే జీవన్‌రెడ్డి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అంతకు ముందు కోరుట్ల నియోజక వర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌కు..గండిహనుమాన్ ఆలయం వద్ద స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. 

 

07:22 - April 18, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకిప్పుడే లేదన్నారు మంత్రి కేటీఆర్‌. మరో పదేళ్లవరకు కేసీఆర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్‌..తాజా రాజకీయాలపై స్పందిస్తూ  తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ లేదన్నారు.  
కేటీఆర్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు 
తెలంగాణ రాష్ట్ర తాజా రాజకీయాలపై మంత్రి కేటీఆర్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ లేదని..మరో 10 ఏళ్లు రాష్ట్రానికి కేసీఆరే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌..రాజకీయాల్లో 64 ఏళ్లు పెద్ద వయసేం కాదని..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడే ముఖ్యమంత్రిని అయిపోవాలన్న కోరిక కూడా తనకేమీ లేదన్నారు. మరో పదేళ్లు కేసీఆరే రాష్ట్రానికి సీఎం అని స్పష్టం చేశారు. 
హరీశ్‌రావుతో నాకు భేదాభిప్రాయాల్లేవన్న కేటీఆర్  
మంత్రి హరీశ్‌రావుతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్న మంత్రి కేటీఆర్‌.. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లరని.. తమ మధ్య మంచి అవగాహన ఉందని స్పష్టం చేశారు. హరీష్‌రావు ఇంటర్యూలు..తన సభలు యాదృచ్ఛికమేనని స్పష్టం చేశారు.  
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదు
మున్సిపల్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రజలతో మమేకం కావడం తగ్గిందని..అందుకోసమే జనహిత పేరుతో సభలు నిర్వహిస్తున్నానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే సిద్దిపేట జనహిత సభలో పాల్గొంటాననీ కేటీఆర్‌ తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమే లేదని.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దిక్కులేదని కేటీఆర్‌ విమర్శించారు. గుజరాత్‌లోనూ బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం లేకే ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికల కోసం బీజేపీ ఎదురు చూస్తోందని.. అందులో భాగంగానే తెలంగాణలో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఎవరు వచ్చినా తమకు ఎదురులేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం తప్పా అని కేటీఆర్‌ విపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. 
హరీష్‌రావు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లరు.. 
మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లరని మంత్రి కేటీఆర్‌ క్లారీటీ ఇచ్చారు. హరీష్‌రావు ఏ పార్టీలో చేరబోరని.. ఆ అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హరీష్‌రావుకు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించారు. 

 

మేడపాడులో నేడు మంత్రి లోకేష్ పర్యటన

తూర్పుగోదావరి : మేడపాడులో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పంచాయతీరాజ్ శాఖలపై సమీక్షించనున్నారు. 

నేడు దేవినేని నెహ్రూ అంత్యక్రియలు

విజయవాడ : గుణదలలోని వ్యవసాయం క్షేత్రంలో నేడు దేవినేని నెహ్రూ అంత్యక్రియలు జరుగనున్నాయి. నిన్న గుండెపోటుతో నెహ్రూ మృతి చెందారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

Don't Miss