Activities calendar

19 April 2017

21:27 - April 19, 2017

ఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించింది. బిజెపి, సంఘ్‌ పరివార్‌ శక్తులు అనుసరిస్తున్న మతతత్వ విధానాలపై పోరాటాలకు పార్టీ పిలుపు ఇచ్చింది. ప్రజలతోపాటు రైతుల, మహిళా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు.

సంక్షోభంలో వ్యవసాయ రంగం ...

ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌ ఉద్యమాలకు రూపకల్పన చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలతో దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళుతోందని సీపీఎం కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దళితులు, మైనారిటీలపై జరుగుతున్నదాడులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.

ఆత్మహత్యల బాట పట్టిన అన్నదాతల సమస్యలపై ....

పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యల బాట పట్టిన అన్నదాతల సమస్యలపై సీపీఎం కేంద్ర కమిటీలో ప్రధానంగా చర్చించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి హమీ పథకానికి నిధులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీపీఎం కేంద్ర కమిటీ తప్పుపట్టింది. ప్రజా పంపణీ వ్యవస్థ నుంచి కిరోసిన్‌, పంచదారను ఉపసంహరించడాన్ని తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎన్నికల సంస్కరణపై కూడా సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై పరిమితి తొలగించడాన్ని సమావేశం తప్పుపట్టింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారానే డొనేషన్లు తీసుకోవాలన్నకేంద్ర సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే విధంగా ఉందని సీపీఎం కేంద్ర కమిటీ విమర్శించింది.

మహిళా బిల్లుపై ఎన్నికల హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ

మహిళా రిజర్వేషన్లపై కూడా ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ విమర్శించింది. రాజ్యసభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఉన్నా ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించింది. లోక్‌సభలోపాటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కూడా సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే దేశంలో ఏక పార్టీ పాలనకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కల్లోల కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ద్వారా ప్రయత్నించాలని సీపీఎం కేంద్ర కమిటీ సూచించింది.   

21:21 - April 19, 2017

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ప్లీనరీని విజయవంతం చేసేందుకు.. పార్టీ అగ్రనాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్‌ఎస్.. అప్పటి నుంచి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్లీనరీతో పాటు బ‌హిరంగ స‌భ‌ను నిర్వహించడాన్ని ఆనవాయితీగా మార్చుకుంది. గ‌త ఏడాది ప్లీనరీని ఎల్‌బి స్టేడియంలో నిర్వహించగా... ఈ సారి నగ‌ర శివార్లలోని కొంపల్లిలో నిర్వహిస్తున్నారు. ఈనెల 21న జరిగే ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే ఈ నెల 27న పార్టీ ఆవిర్భావం రోజున, వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వహించాల‌ని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

60 ఎక‌రాల స్థలాన్ని గులాబి పార్టీ వాడుకోనుంది....

కొంపల్లిలో ప్లీన‌రీ నిర్వహ‌ణ కోసం 60 ఎక‌రాల స్థలాన్ని గులాబి పార్టీ వాడుకోనుంది. స‌భా ప్రాంగణం మాత్రం ఐదున్నర ఏక‌రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. స‌భా ప్రాంగ‌ణానికి తెలంగాణ ప్రగతి ప్రాంగణం అని నామ‌క‌ర‌ణం చేశారు. దాదాపు రెండు వారాలుగా సాగుతున్న ఏర్పాట్లు ముగింపు ద‌శ‌కు వ‌చ్చాయి. శుక్రవారం జ‌రిగే ప్రతినిధుల స‌భ‌కు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కార్యక‌ర్తలు హాజ‌రు కానున్నారు. ఈ ప్రతినిధుల స‌మావేశంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జ‌రుగ‌నుంది. ఇందులో కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవ‌డం లాంఛ‌నమే.

పార్టీ ప‌రంగా కొత్త క‌మిటీల ఏర్పాటు కూడా..

ప్రతినిధుల స‌భ కోసం జ‌రుగుతున్న ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్‌, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు పలువురు నేతలు ప‌రిశీలించారు. పార్టీ ప‌రంగా కొత్త క‌మిటీల ఏర్పాటు కూడా పూర్తి కావ‌డంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. ప‌లు అంశాల‌పై ప్రతినిధుల స‌భలో తీర్మానాల‌ను స‌భ ఆమోదించ‌నుంది. అన్నీ అంశాల‌పై ప్రతినిధుల స‌భ‌లో చ‌ర్చిస్తామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

వడదెబ్బ తగలకుండా ఆరోగ్య కేంద్రాలు...

ఎండలు మండుతున్న కారణంగా, ప్లీనరీకి హాజరయ్యే వారికి వడదెబ్బ తగలకుండా ఆరోగ్య కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరాకు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకుంటున్నారు గులాబీ నేతలు. 

21:18 - April 19, 2017

ఢిల్లీ: ఈవీఎంల టాంపరింగ్‌పై దుమారం రేగడంతో కొత్త ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను వినియోగించేందుకు కేంద్ర కాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల్లో పేపర్‌ రసీదులతో కూడిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 16 లక్షల 15 వేల మిషన్లు అవసరమని ఈసీ సూచించిందని.... ఇందుకోసం 3 వేల 173 కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో టాంపరింగ్‌ వివాదం తెరపైకి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఈవీఎంల్లో ఓటు వేసిన తర్వాత ఓటరుకు పేపర్‌ రసీదు వస్తుంది. 2019 ఎన్నికలకు ఈ అప్‌గ్రేడెడ్‌ మిషన్లు వివిపిఏటిలను ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది.

20:37 - April 19, 2017

హైదరాబాద్: ఎండలు మండుతున్నాయ్ ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అని వుంటారు... ఎన్ని సార్లు విని వుంటారు. అవును మామూలుగా కాదు మధ్యాహ్నాం రోడ్ల పైకి వెళితే నిప్పుల కొలిమిలో మొహం పెట్టినట్లు, అగ్ని వర్షం కురుస్తున్నట్లు గా అనిపించడం లేదు. ఇంతా రొటీన్ సమ్మర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాదు. నాగరికంగా మారుతున్న మానవరహిత సమాజ స్వయం కృతాపరాధం అంటే సందేహం అనవసరం. మరి ఏప్రిల్ లోనే ఇలా వుంటే! మే పరిస్థితి ఏంటి? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:36 - April 19, 2017

హైదరాబాద్: రైతుల ఉసురు తీస్తున్న రాజకీయాలు...అబద్దాలే వల్లవేస్తున్న అన్ని పక్షాలు, మల్లా మిస్టేక్ మాట్లాడేసిన మంత్రి లోకేశం...అంటే ఫీలయితడని తెచ్చిన ప్రూఫ్, గులాబీ కూలి దినాలలో పజ్జన దోశలు..బీడీల బెండలు కడుతున్న రేఖా నాయక్, మామకు వెన్నుపోటు పొడువు హరీష్...సర్వం నేం చూసుకుంటా అంటున్న సర్వే, సర్కార్ భూమిని చెరబెట్టిన శ్రీధర్ రెడ్డి...అడ్డుకున్న దళిత సర్పంచ్ కి అవమానం, లోడ్ చేయమంటే పేల్చేసిన ఖాకీ...పోలీసోళ్లకే తెలవని తుపాకీ విద్యలు. ఇలాంటి అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:48 - April 19, 2017

హైదరాబాద్:  బాబ్రీ కేసులో బీజేపీ పార్టీలో అగ్రనేతలుగా చలామణి అవుతున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా బీజేపీ నేతలపై కేసుల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 12 మందిపై కేసుల పునరుద్ధరణకు, ఈ కేసును లక్నోలోని ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం పక్కకు పెట్టడం విశేషం. రోజు వారీ విచారణ చేపట్టి రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశం పై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాల నర్శింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత , తెలంగాణ కాంగ్రెస్ నేతమల్లు రవి, ప్రకాష్ రెడ్డి తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:47 - April 19, 2017

ఉత్తరప్రదేశ్‌ : అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్లు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్‌ జోష సహా 12 మందిపై బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు కొనసాగనుంది. బిజెపి నేతలపై కేసుల పునరుద్ధరణకు సీబీఐకి అనుమతినిచ్చింది.

ఈ కేసుకు సంబంధించి రెండు కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో...

ఈ కేసుకు సంబంధించి రెండు కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో కొనసాగుతోంది. కరసేవలకుపై నమోదైన కేసు లక్నో కోర్టులో.. బిజెపి నేతలకు ప్రమేయమున్న కేసు రాయ్‌బరేలి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసును ఒకే కోర్టులో ఎందుకు విచారణ జరపకూడదని అంతకు ముందు జరిపిన విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణను నాలుగు వారాల్లో రాయ్‌బరేలీ నుంచి లక్నో కోర్టుకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లక్నో కోర్టులో విచారణ సందర్భంగా వాయిదాలకు అనుమతి ఇవ్వొద్దని, ఈ కేసు విచారణ జరిపే న్యాయమూర్తిని బదిలీ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రాజస్థాన్‌ గవర్నర్‌గా ఉన్న యూపీ మాజీ సిఎం కల్యాణ్‌సింగ్‌కు మాత్రం ఈ కేసు నుంచి విముక్తి..

రాజస్థాన్‌ గవర్నర్‌గా ఉన్న యూపీ మాజీ సిఎం కల్యాణ్‌సింగ్‌కు మాత్రం ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున తర్వాత విచారణ చేపట్టాలని సూచించింది. వినయ్‌ కటియార్, సాధ్వి రితంబర తదితరులు ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంది.

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు...

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్‌సింగ్‌ వంటి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే లక్షలాది మంది కరసేవకులు మసీదును కూల్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో సీబీఐ ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అద్వానీ సహా ఇతర నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించింది.

18:50 - April 19, 2017

అమరావతి : సీఎం చంద్రబాబుతో శిల్పా సోదరులు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. శిల్పా సోదరుల భేటీ సమయంలోనే మంత్రి అఖిలప్రియ సీఎం చంద్రబాబును కలిశారు. శాఖాపరమైన అంశాలపై చర్చించానన్న అఖిలప్రియ.. చంద్రబాబును శిల్పా సోదరులు కలుస్తారనే విషయం తనకు తెలియదన్నారు. 

18:48 - April 19, 2017

విజయవాడ : రానున్న నంద్యాల ఉపఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తామని..త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. విజయవాడ భవానీ ద్వీపాన్నీ అఖిలప్రియ పరిశీలించారు. పున్నమీఘాట్‌ నుంచి బోట్‌లో భవానీ ద్వీపానికి వెళ్లి అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా మంత్రి, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుందని...ఆ మేరకు అందరూ సహకరిస్తారని అనుకుంటున్నామన్నారు.         

18:45 - April 19, 2017

అమరావతి: రైతులకు గిట్టుబాటు ధరల పతనం, పంటలకు మద్దతు ధర తగ్గడాన్ని నిరసిస్తూ... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. దీక్షకు సిద్ధమయ్యారు. ఈనెల 26,27 తేదీల్లో గుంటూరులో 2 రోజుల పాటు ఆయన దీక్ష చేపట్టనున్నారు. వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. గిట్టుబాటు ధర లభించక రైతులు.. ఇబ్బందులు పడుతున్నా... చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.

 

18:44 - April 19, 2017

చిత్తూరు: పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. తిరుమలలో 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భక్తులు ఎండ వేడిమికి అవస్థలు పడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కల్పించడానికి టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయం వద్ద కార్పెట్లు ఏర్పాటు చేసి.. నీటితో తడుపుతున్నారు. 

18:43 - April 19, 2017

కర్నూలు : ఉల్లి ధర రైతన్న వెన్ను విరుస్తోంది. కంటికి రెప్పలా కాపాడిన పంట, తనను కాపాడట్లేదని రైతు తల్లడిల్లిపోతున్నాడు. దేశంలోనే ఉల్లి ఉత్పత్తుల అమ్మకాలకు, అగ్రగామిగా నిలుస్తోన్న కర్నూలు మార్కెట్ యార్డులో.. క్వింటాలు ఉల్లి ధర మూడు వందల రూపాయల కనిష్టానికి పడిపోయింది.

కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణం...

ఉల్లి ధర రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. ఈ పంట ఒక ఏడాది నవ్విస్తే, మరో ఏడాది రైతు గుండె మండేలా చేస్తోంది. ఉల్లి సాగులో అగ్రగామిగా నిలుస్తోన్న కర్నూలు జిల్లాలో.. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

నిరుడు ఊరించిన ఉల్లి ధరలు..

నిరుడు ఊరించిన ఉల్లి ధరలు.. ఈ ఏడాది గణనీయంగా పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో ఉల్లి ధర 5 వేల రూపాయలు పలికింది. కానీ ఈ ఏడాది క్వింటాలు ఉల్లి ధర 3 వందల రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఎన్నో కష్టాలను తట్టుకొని పండించిన పంట, తనను ఆదుకోవడం లేదంటూ రైతన్న ఆవేదన చెందుతున్నాడు. కనీస గిట్టుబాటు ధర లేక అన్నదాతల కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయి.

రైతుకు లభించని మద్దతు ధర

హైదరాబాద్‌ మలక్‌పేట మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర కనీసం ఐదు వందల రూపాయలు పలుకుతోంది. అక్కడి మార్కెట్‌కి భారీ పరిమాణంలో ఉల్లి రావడం వల్లే ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, కర్నూలు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలో ఉల్లి దిగుబడి నిరుటి కన్నా బాగా తక్కువగా వచ్చింది. నిజానికి దానికి తగ్గట్లుగా ధర భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. కానీ, వ్యాపారుల మాయాజాలంతో.. ఉల్లిరైతుకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లికి ధర పెరిగితే, ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరను నియంత్రిస్తుంది. కానీ ధర తగ్గిన ఇలాంటి సమయాల్లో, నాయకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు. ఉల్లికి కనీస మద్దతు ధర 3 వేలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.

మరో రకంగా వినియోగదారుడి పరిస్థితి ...

ఇక వినియోగదారుడి పరిస్థితి మరో రకంగా ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు పక్కనే ఉన్న రైతు బజారులో ఉల్లి ధర 16 వందలు పలుకుతోంది. దళారులు కిలో ఉల్లిగడ్డను రెండు రూపాయల 50 పైసలకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని పక్కనే ఉన్న రైతు బజారులో 16 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక్క కిలో ఉల్లికి 13 రూపాయల 50 పైసల లాభం సంపాదించుకుంటున్నారు. 

18:39 - April 19, 2017

అనంతపురం : హిందూపురంలో తాగునీటి సమస్యపై చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలో ఉన్న సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ సాగించారు. కాగా ఎద్దులపై ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు రాసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీచార్జ్‌ చేసి... నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజా సమస్యలను గాలికొదిలేశాడంటూ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ విమర్శించారు. 

ఎంసెట్ లీకేజీ కేసులో కీలక నిందితుడు ఎస్ బీ సింగ్ అరెస్ట్

హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసులో కీలక నిందితుడు ఎస్ బీ సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఎస్ బీ సింగ్, అనూప్ ను పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. 2005 నుంచి పలు ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్లు గుర్తించారు.

ఈ దర్శన్ కేంద్రాలపై వెనక్కు తగ్గిన టీటీడీ

తిరుమల: దేశవ్యాప్తంగా ఈనెల చివరి వరకు ఈ దర్శన్ కేంద్రాలను టిటిడి ఓపెన్ చేసింది. భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. మరో వైపు నిర్వహణ భారం కారణంగా విజయ బ్యాంక్ చేతులెత్తేసింది. విజయ బ్యాంక్ వెనక్కి తగ్గటంతో టీటీడీ మూసివేతకు నిర్ణయంచింది.

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కమిటీ చర్చించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మే, జూన్ నెలల్లో దేశవ్యాప్త ఆందోళనకు కమిటీ పిలుపుఇచ్చింది.

కేసీఆర్ స్వగ్రామం చింతమడక వద్ద ఉద్రిక్తత

సిద్దిపేట: సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక వద్ద ఉద్రిక్తత నెలకొంది. చింతమడక శివారులో టిడిపి నేత రేవంత్ రెడ్డి, టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకొన్న రేవంత్ రెడ్డి గ్రామంలోకి వెళ్లారు. పంట నష్టపోయిన రైతులను రేవంత్ రెడ్డి పరామర్శిస్తున్నారు.

మున్సిపల్ శాఖకు తొలి ఈఏపీ ప్రాజెక్టు : మంత్రి నారాయణ

అమరావతి: మున్సిపల్ శాఖకు తొలి ఈఏపీ ప్రాజెక్టు వచ్చింది. ఏషియన్ ఇన్ ఫ్రాస్టక్చరల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు నుండి రూ.3700 కోట్ల రుణం అదిందంది మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 43 మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పింస్తామని, దీంట్లో 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందన్నారు. ఆగస్టులోపు రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్లు పూర్తి చేస్తామని, పరిపాలన నగరానికి సంబంధించిన డిజైన్స్ మే 10,15 తేదీల్లో ఖరారు చేస్తామన్నారు.

సీఎం చంద్రబాబు తో శిల్పా సోదరులు భేటీ

గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడితో శిల్పా సోదరులు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీఎం చంద్రబాబు తో శిల్పా సోదరులు భేటీ

గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడితో శిల్పా సోదరులు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

17:27 - April 19, 2017

ఖమ్మం : జిల్లాలోని తల్లాడ మండలం మల్లారంలో అప్పుల బాధతో మిర్చి రైతు కటికి నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేశ్వరరావు రెండు ఎకరాల మిర్చి, మూడు ఎకరాల పత్తి సాగుచేశాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేదన్న బాధతో మిరప తోటలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యలో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. 

17:25 - April 19, 2017

వరంగల్ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీచరు అవతారమెత్తారు. వరంగల్‌ జిల్లా, దేశాయిపేటలోని ఒయాసిస్ హైస్కూల్‌లో, పదవ తరగతి విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. వరంగల్‌లో ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు.. కూలీ పనుల ద్వారా నిధులను సేకరిస్తున్నారు. ఇందుకోసమే.. కడియం శ్రీహరి మరోసారి ఉపాధ్యాయుడిగా మారారు. గతంలో ఉపాధ్యాయుడిగా పని చేసిన కడియం, ఈ సారి గులాబీ సభ కోసం టీచర్‌గా మారారు. 

17:23 - April 19, 2017

హైదరాబాద్: ఎవరు ఏమనుకున్నా.. పేద ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఎవరిపైనో కోపంతోనే తాము జేఏసీగా చర్యలు చేపట్టడం లేదన్నారు. హైదరాబాద్‌ గండిపేట ప్రాంతంలో పునప్రారంభిస్తున్న హిందాల్కో కంపెనీకి అనుమతులు ఇవ్వాలని కోదండరామ్‌.. ప్రభుత్వ సీఎన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల 200 మంది కార్మికులకు పని దొరుకుతుందన్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా గోలివాడలో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టు అంశాన్నీ చర్చించినట్లు చెప్పారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా భూ సమీకరణ చేయడం సరికాదని కోదండరామ్‌ అన్నారు. శిల్పారామంలో.. చిన్న దుకాణాలను తొలగిస్తామనడం మంచిపద్దతి కాదని కోదండరామ్‌ అన్నారు. 

17:22 - April 19, 2017

హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం వల్ల, దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత రెండు దశల్లో చెరువుల మరమ్మతు చేశారని.. దీనివల్ల రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. నీటి వృధాను అరికట్టేందుకు ప్రజలు చైతన్యం కావాలని హరీష్‌రావు అన్నారు. 

17:20 - April 19, 2017

సంగారెడ్డి : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ విరాళాలు సేకరించారు. హోటళ్లు, వస్త్ర దుఖానాల్లో పనిచేసి విరాళాలు సేకరించారు. తన నియోజక వర్గం నుంచి భారీగా జన సమీకరణ జరుగుతోంది అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తెలిపారు. దారి ఖర్చుల కు కావాల్సిన నిధులను విరాళలు సేకరించినట్లు తెలిపారు. ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, సపండ వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.

 

గుంటూరులో జగన్ దీక్ష..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ దీక్ష పట్టనున్నారు. ఈనెల 26, 27వ తేదీల్లో గుంటూరులో దీక్ష చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడాన్ని నిరసిస్తూ ఈ దీక్ష చేయనున్నారు.

ఆర్వీనగర్ ప్రమాదంపై హోం మంత్రి దిగ్ర్భాంతి..

విశాఖపట్టణం : జీకే వీధి మండలం ఆర్వీనగర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి చిన రాజప్ప దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు. లారీ జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

బాబుతో అఖిల భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మంత్రి అఖిల ప్రియ భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తమ కుటుంబం నుండే పోటీ చేస్తారని భేటీకంటే ముందు అఖిల పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

16:55 - April 19, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తదుపరి చిత్రం కోసం వేగం పెంచాడు. గత కొన్ని సంవత్సరాలుగా 'బాహుబలి', ‘బాహుబలి-2’ సినిమా కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ఎలాంటి చిత్రాలు చేయలేదు. ఒక్క సినిమా కోసమే తాను పని చేయడం జరిగిందని ఆ తరుణంలో ఎలాంటి కథలు వినలేదని 'ప్రభాస్' ఈ మధ్య చెప్పారు. ఇటీవలే 'బాహుబలి -2’ సినిమాకు చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టడంతో ప్రభాస్ ఫ్రీ అయ్యారు. ఏప్రిల్ 28వ తేదీన చిత్రం విడుదల కానుంది. అనంతరం తన నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించారు. ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో 'ప్రభాస్' నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నారని సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేశారు. టీజర్ కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. లుక్ తో పాటు చిత్ర టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నారు. తరువాత 'బాహుబలి 2’ సినిమాతో పాటు టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి' రిలీజ్ అవుతున్న తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ప్రభాస్ 19 టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.

పలు హోటళ్లపై జీహెచ్ ఎంసీ అధికారుల దాడులు

హైదరాబాద్: నగరంలో పలు హోటళ్లపై జీహెచ్ ఎంసీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని బృందావన్ హోటల్, శివానీ, బావర్చి, విల్పి హోటళ్లకు రూ. 5వేల చొప్పున జరిమానా విధించారు.

ఐటీడీఏ ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ

విశాఖ: పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పాల్గొన్నారు. ఐటీడీఏ ను ఎస్ ఎఫ్ఐ, డీవైఎఫ్ ఐ కార్యకర్తలు ముట్టడించారు. సమావేశం హాలు నుంచి బయటకు రాకుండా నేతలు, అధికారులను విద్యార్థులు అడ్డుకున్నారు.

ఖమ్మం, కర్నూలులో @44 డిగ్రీలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. ఖమ్మం, కర్నూలులో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ 43, రామగుండం 43, కరీంనగర్ 42, వరంగల్ 42, కొత్తగూడెం 42, భద్రాచలం 42, తిరుపతి 43, అనంతపురం 43, కడప 42, నంద్యాల 42, నందిగామ 41, నెల్లూరు 40, విజయవాడ 38, కాకినాడ 38, విశాఖలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఫ్లై వుడ్ ఫ్యాక్టరీలో ఫైర్ ఆక్సిడెంట్..

ఉత్తర్ ప్రదేశ్ : గోరఖ్ పూర్ లోని ఓ ప్లై వుడ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.

16:07 - April 19, 2017

ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ స్వయంగా గుండు గీయించుకున్నాడు. ఇందుకో కారణం ఉంది. ఇటీవల ఆయన పలు వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. మసీదుల నుండి వచ్చే ప్రార్థనలు..లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే ఉపన్యాసాలు..ప్రార్థనా పిలుపులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన సోనూ ట్వీట్లపై కోల్ కతా ఓ మతగురువు స్పందించారు. సోనూ నిగమ్ కు గుండు కొట్టిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తానని పేర్కొంటూ ఫత్వా జారీ చేశారు. దీనితో సోనూ నిగమ్ స్పందించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు తనింట్లోనే ఉంటానని, ఎవరైనా వచ్చి గుండు చేయవచ్చని సవాల్ విసిరాడు. అనంతరం సోనూ నిగమ్ స్వయంగా గుండు గీయించుకుని మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ మతానికి..వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని తెలిపారు. తాను ఎవరికీ భయపడనని, ఇంకా ఫత్వాలు జారీ చేయడం ఏంటీ అని సోనూ ప్రశ్నించారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా ? ముదురుతుందా ? వేచి చూడాలి.

16:01 - April 19, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల పెంపు బిల్లు తప్పుల తడకగా ఉందని కేంద్ర మాజీమంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి అన్నారు. ఈ బిల్లు కోర్టులో నిలబడదని తెలిపారు. రిజర్వేషన్లు పెంచుతున్నామంటూ ముస్లింలు, గిరిజనులను కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల పెంపుకు మూడేళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చిందో కేసీఆర్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

15:59 - April 19, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జునసాగర్‌ జలాయంలో నీరు అడుగంటిపోతోంది. నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. సాగునీరు అంశాన్ని పక్కనపెడితే, తాగునీటికి కూడా నీరు విడుదల చేసే పరిస్థితిలేదు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:57 - April 19, 2017

విశాఖ : జిల్లాలోని జీకేవీధి మండలం ఆర్వీపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

లారీ బీభత్సం..ఆరుగురు మృతి..

విశాఖపట్టణం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీకే వీధి మండలం ఆర్వీపురంలో ఓ లారీ అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. బైక్ ను ఢీకొన్న లారీ దుకాణాలపైకి వెళ్లింది. దీనితో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడనే మృతి చెందగా దుకాణాల్లో ఉన్న మరో ముగ్గురు మృతి చెందారు. లారీ బీభత్సంతో జనాలు తీవ్ర భయాందోళనలు చెందారు.

ముస్లిం రిజర్వేషన్ లోపభూయిష్టం - జైపాల్ రెడ్డి..

హైదరాబాద్ : ముస్లింల రిజర్వేషన్ల బిల్లు లోపభూయిష్టంగా ఉందని, మోసపూరితమని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. మోడీ చేతిలో ఈ బిల్లు ఏమవుతుందో అందరికీ తెలుసని, గిరిజన రిజర్వేషన్లను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

 

భవానీ ఐలాండ్ లో మంత్రి అఖిలప్రియ,,

విజయవాడ : భవానీ ఐలాండ్ లో మంత్రి అఖిలప్రియ పర్యటించారు. ఐలాండ్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిగా భవాని ఐలాండ్ కు రావడం చాలా సంతోషంగా ఉందని, భవాని ఐలాండ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబం బరిలో ఉంటుందని, 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్ధంతి తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

మీడియా ప్రతినిధిపై ఉషా ముళ్లపూడి ఆసుపత్రి యాజమాన్యం దాడి..

కాకినాడ : రాజమహేంద్రవరంలో ఓ మీడియా ప్రతినిధిపై ఉషా ముళ్లపూడి ఆసుపత్రి యాజమాన్యం దాడికి పాల్పడింది. కెమెరా ధ్వంసం కావడంతో పాటు రిపోర్టర్ కు గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

15:55 - April 19, 2017

ఢిల్లీ: ఉన్నత విద్యామండలి వ్యవహారంపై తుది ఆదేశాలను కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని స్థిర, చర ఆస్తులు ఎక్కడి ఆస్తులు అక్కడి ప్రభుత్వానికే చెందుతాయని హోంశాఖ స్పష్టం చేసింది. నగదు మాత్రం 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సూచించింది.

మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రధానోత్సవం..

హైదరాబాద్ : మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మిషన్ కాకతీయతో చెరువులకు పునర్ వైభవం జరిగిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మిషన్ కాకతీయతో గ్రామాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఈసారి చెరువుల కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు.

దురాజ్ పల్లి జాతరలో పోలీసులపై పోలీసుల ఫిర్యాదు..

సూర్యపేట : దురాజ్ పల్లి జాతరలో పోలీసులపై వనస్థలిపురం పోలీసులు ఫిర్యాదు చేశారు. పెన్ పహాడ్ ఎస్ ఐ మల్లేష్, సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్ లు తమను కులం పేరిట దూషించారని చివ్వెంల పీఎస్ లో వనస్థలిపురం ఎస్ఐలు విజయ్, మహేష్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీనితో ఎస్ ఐ మల్లేష్, సీఐ ప్రవీణ్ లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

 

ధర్నా చౌక్ కోసం దీక్షలు..

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని కోరుతూ మఖ్దుం భవన్ లో యువజన సంఘాల రిలే నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.కోదండరాం ప్రారంభించారు. ధర్నా చౌక్ అంశాన్ని సీఎం పక్కదారి పట్టిస్తున్నారని, నిరసన తెలిపే హక్కు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు.

ఉన్నత విద్యామండలిపై కేంద్ర హోం శాఖ ఆదేశాలు..

ఢిల్లీ : ఉన్నత విద్యామండలి వ్యవహారంపై కేంద్ర హోం శాఖ తుది ఆదేశాలను బుధవారం వెల్లడించింది. గతేడాది మార్చి 18న సుప్రంకోర్టు తుదితీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు అనంతరం కేంద్ర హోం శాఖ..ఇరు రాష్ట్రాల అధికారులు మూడు పర్యాయాలు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయం తరువాత కేంద్ర హోం శాఖ తుది ఆదేశాలను జారీ చేసింది. ఇరు రాష్ట్రాల్లోని స్థిర..చరస్తాలు..ఎక్కడి ఆస్తులు అక్కడి ప్రభుత్వానికే చెందుతాని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎక్కడ పనిచేసే ఉద్యోగులు అక్కడే కొనసాగాలని, విభజన చట్టంలోని సెక్షన్ 48(1) ప్రకారం స్థిర..చరస్తాలు పంచుకోవాలని పేర్కొంది.

బాబుతో శిల్పా మోహన్ రెడ్డి సోదరుల భేటీ..

విజయవాడ : అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో శిల్పా మోహన్ రెడ్డి సోదరులు భేటీ కానున్నారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది.

15:29 - April 19, 2017

కొన్ని పెళ్లిళ్లు వివిధ కారణాల వల్ల ఆగిపోవడం చూస్తుంటాం. ఇటీవలే కొన్ని పెళ్లిళ్లు చిన్న చిన్న కారణాలకే రద్దు కావడం జరుగుతున్నాయి. భోజనం అందరికీ ఏర్పాటు చేయలేదని మొండికేసిన మగపెళ్లి వారిపై వధువు తిరగబడిన సంగతి తెలిసిందే. ఏకంగా తనకు పెళ్లే వద్దంటూ స్పష్టం చేసింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలో రసగుల్ల కోసం ఓ పెళ్లి ఆగిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నావ్ జిల్లాలో..కుర్మాపూర్ గ్రామానికి చెందిన శివ కుమార్ కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 14వ తేదీన పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వివాహానికంటే ముందు ఆడపెళ్లి వారు వరుడు బంధువులకు విందు ఏర్పాట్లు చేశారు. విందులో రసగుల్ల కూడా పెట్టారు. ఒకే రసగుల్లా వడ్డించాలని నిర్ణయించడంతో వధువు బంధువు అలాగే వడ్డిస్తున్నాడు. వరుడు తమ్ముడు మాత్రం తనకు ఇంకో రసగుల్లా వడ్డించాలని కోరాడు. దీనికి వడ్డిస్తున్న వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చినికిచినికి గాలివానగా మారి ఇరువైపులా వారు కొట్టుకొనే పరిస్థితికి వెళ్లిపోయింది. ఆహారా పదార్థాలు..ప్లేట్లు..ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ విషయం పోలీసులకు వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పెద్దమనుషుల సమక్షంలో పెళ్లికి ఒప్పించారు. కానీ వధువు మాత్రం ఒప్పుకోలేదు. రసగల్లా కోసం రచ్చ రచ్చ చేయడమే కాకుండా తన తండ్రి మీద కూడా చేయి చేసుకున్నారని..తాను పెళ్లి చేసుకోలేదని ఖరాఖండిగా చెప్పడంతో వరుడి తరపు వారు వెనుదిరగాల్సి వచ్చింది.

15:21 - April 19, 2017

‘క్యా తుమ్హె యకీన్ హై' అంటూ బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రశ్నిస్తున్నాడు. తన తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భజరంగీ భాయిజాన్’, 'ఏక్తా టైగర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి చిత్రమైన ‘ట్యూబ్ లైట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర టీజర్..ట్రైలర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరులో టీజర్ విడుదల చేసి మేలో ట్రైలర్ ను విడుదల చేస్తామని ఇటీవలే దర్శకుడు పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా బుధవారం ‘సల్మాన్’ ఒక పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. బ్యాక్ లుక్ తో ఉన్న ఈ ఫొటోను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్ సోషల్ మాధ్యలో ట్రెండీ మారిపోయింది. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్, లడక్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో షూటింగ్ చిత్రీకరించారు. సల్మాన్ సరసన చైనీస్ హీరోయిన్ జూ జూ నటిస్తోంది.

15:10 - April 19, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.. నిన్నటివరకూ పన్నీర్‌, పళని వర్గం విలీనాన్ని వ్యతిరేకించిన దినకరణ్.. తాజాగా వెనక్కితగ్గారు.. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు కలవడాన్ని తాను వ్యతిరేకించడంలేదని స్పష్టం చేశారు.. తనను పార్టీనుంచి బహిష్కరించారని... నిన్నటి తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నానని తెలిపారు.. పార్టీ బలహీనం కావడానికి తాను కారణం కాబోనని... పార్టీలో అందరూ ఐకమత్యంగా ఉండాలన్నదే అభిమతమని తేల్చిచెప్పారు.. పార్టీకి మేలుచేసే నిర్ణయాలు సహకరిస్తానని చెప్పారు.. 

14:32 - April 19, 2017

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. సిమ్లా, సిర్మావూర్‌ సరిహద్దులో అదుపుతప్పిన బస్సు నదిలో పడిపోయింది.. ఉత్తరాఖండ్‌లోని తువ్‌నీవైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఈ దుర్ఘటనలో 44మంది మృతి చెందారు.. ప్రమాదసమయంలో బస్సులో 56మంది ప్రయాణికులున్నారని తెలుస్తోంది.. గాయపడ్డవారిని చికిత్సకోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.. 

14:30 - April 19, 2017

హైదరాబాద్: ఇందిరాపార్క్‌ దగ్గరి ధర్నాచౌక్‌ను వెంటనే పునరుద్దరించాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. లేకుంటే మే 15న చలో ఇందిరాపార్క్‌ చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నాచౌక్‌ అంశాన్ని సీఎం కేసీఆర్‌ పక్కదారి పట్టిస్తున్నారని... ధర్నాలు ఎక్కడ చేయాలో సీఎం ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

కారుపై ఎర్రబుగ్గ వినియోగించరాదని కేంద్రం ఆదేశం

ఢిల్లీ : కారుపై ఎర్రబుగ్గ వినియోగించరాదని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 1వ తేది నుంచి కేంద్రమంత్రులు, అధికారుల కారుపై ఎర్రబుగ్గ వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు.

13:52 - April 19, 2017

చెన్నై : అమ్మకు శశికళ ద్రోహం చేశారని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తీవ్రస్థాయిలో శశికళపై విరుచుకపడ్డారు. అన్నాడీఎంకేలో చీలిక వర్గాలైన పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు మళ్లీ ఒక్కటయ్యేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పన్నీర్‌ సెల్వం మీడియాతో మాట్లాడారు. శశికళను అమ్మ ఏనాడు ఇష్టపడలేదని, జయలలిత ఆశయాలే తమకు ముఖ్యమన్నారు. ప్రజలే తమ ఎజెండా అని, రాజకీయాలు కాదని పేర్కొన్నారు. పార్టీని ఒక్క కుటుంబం చేతిలోకి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 

'నీ బెదిరింపులకు భయపడను' : కోమటిరెడ్డి

నల్గొండ : జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. గుర్రంపోడులో ప్రొటో కాల్ అంశంపై మంత్రి జగదీష్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. కోమటిరెడ్డిపై జగదీష్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తీరుపై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 'నీ బెదిరింపులకు భయపడను' అని కోమటిరెడ్డి అన్నారు. 'అహంభావంతో వ్యవహరిస్తున్నావు' చెప్పారు. 'నీ ఆటలు ఎక్కువకాలం చెల్లవు'అని కోమటిరెడ్డి అన్నారు. 

మంత్రి జగదీశ్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం

నల్గొండ : జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. గుర్రంపోడులో ప్రొటో కాల్ అంశంపై మంత్రి జగదీశ్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తీరుపై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

సిమ్లాలో రోడ్డు ప్రమాదం..44 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ : సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. 

13:40 - April 19, 2017

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 44 మంది పర్యాటకులు మృతి చెందారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

13:37 - April 19, 2017

నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి..టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్ వ్యవహరించడం లేదని..అవమానిస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొనడం..దీనిపై మంత్రి జగదీష్ పలు వ్యాఖ్యలు చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం జిల్లా జడ్పీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో మంత్రి జగదీష్..ఇతర అధికారులు..ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని దీనిపై వెంటనే కలెక్టర్ సమాధానం చెప్పాలని సమావేశానికి హాజరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి కల్పించుకుని నువ్వు రౌడివి, ఆర్డీవో పై దాడి చేశావని అనడడంతో వివాదం చెలరేగింది. మంత్రి తీరుపై కోమటిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.బెదిరింపులకు భయపడనని..ఆటలు ఇంకా సాగవని అన్నారు.

13:25 - April 19, 2017

రాజకీయాల్లో నేతలు గెలిచిన అనంతరం సంబరాలు జరుపుకుంటుంటారు. ర్యాలీలు..వినూత్నంగా నిర్వహిస్తూ సంతోషం వ్యక్త పరుస్తుంటారు. తాజాగా కేరళలో ఓ నాయకుడి విజయం సాధించిన తరువాత నిర్వహించిన సంబరాల ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయాయి. కేరళ..మళప్పురం నియోజకవర్గం నుండి లోక్ సభకు కున్హలికుట్టి విజయం సాధించారు. 12వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ తరపున కున్హలికుట్టి గెలుపొందారు. ఆయనకు మొత్తం 5,15,330 ఓట్లు పోలయ్యాయి. ఐయూఎంఎల్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఇ.అహ్మద్ కన్నుమూయడంతో మళప్పురంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కున్హలికుట్టి విజయం సాధించడంతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించాలని..విజయోత్సవాలు జరుపుకోవాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ముళప్పురంలో కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. విందులో అన్ని ఆకుపచ్చ ఆహార పదార్థాలు ఉండడం విశేషం. వంటకాలన్నీ ఆకుపచ్చ రంగులో ఉండడంతో ఒక్కసారిగా అందది దృష్టి దీనిపై పడింది. ఆకుపచ్చ చికెన్, ఆకుపచ్చ లడ్డు, ఆకుపచ్చ పాయసం.. ఇలా అన్నీ పచ్చ రంగులోనే వండారు. ముస్లిం లీగ్ అధికారిక రంగు ఆకుపచ్చ కావడంతో వంటలను కూడా అదే రంగులో వడ్డించాలని భావించి ఈ విధంగా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలి : ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని ప్రొ.కోదండరాం డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని కోరుతూ ముఖ్దుం భవన్ లో యువజన సంఘాలు చేపట్టిన రిలే నిరసన దీక్షలను జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ధర్నా చౌక్ అంశాన్ని సీఎం పక్కదారి పట్టిస్తున్నారని కోదండరాం అన్నారు. నిరసన తెలిపే హక్కు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదన్నారు. నిరసన తెలిపేది సీఎం నిర్ణయించడం సమంజసం కాదన్నారు. మే 14వరకు ధర్నా చౌక్ ను పునుద్ధరించకపోతే..మే 15న ఛలో ఇందిరాపార్క్ చేపడతామని హెచ్చరించారు.

ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని యువజన సంఘాల దీక్షలు

హైదరాబాద్ : ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని కోరుతూ ముఖ్దుం భవన్ లో యువజన సంఘాలు రిలే నిరసన దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను జస్టిస్ చంద్రకుమార్, ప్రొ.కోదండరాం ప్రారంభించారు. 

13:15 - April 19, 2017
13:12 - April 19, 2017
13:06 - April 19, 2017

పెద్ద నోట్లు రద్దు అయి రోజులు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఆ ప్రభావం ఇంకా పోలేదు. ఇంకా సరిపడా నగదు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 'స్వయం చలిత నగదు యంత్రాల' (ఏటీఎం) పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని ఒక సర్వే వెల్లడించింది. జనవరి..ఫిబ్రవరి మాసాల్లో పరిస్థితి కొంత ఫర్వాలేదనిపించినా మార్చి చివరి వారాల్లో..ఏప్రిల్ తొలి అర్థభాగంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిన్నట్లుగా ఒక సర్వే తెలిపింది. ఏటీఎంలో నగదు లభ్యత మరీ కష్టతరంగా మారిందని, దేశంలో అత్యధిక ఏటీంఎలు ఒట్టిపోయి కనిపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నెల 5-8 తేదీల్లో దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల మంది ద్వారా ఏటీఎం పని తీరుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని 11 ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఏటీఎం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. 83% ఏటీఎంలు నగదు లేక ఖాళీగా దర్శనమిస్తున్నట్లు సర్వేజనులు తెలిపారు. హైదరాబాద్ అనంతరం పుణె ఏటీఎంల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంది. ఏప్రిల్‌ 13-16 మధ్య కాలంలో పరిస్థితి మరింతగా మందగించి నగదు లభ్యత కొరత 43 శాతానికి చేరనట్టుగా సర్వే వెల్లడించింది.

నల్గొండ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాస

నల్గొండ : జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ప్రొటో కాల్ అంశంపై మంత్రి జగదీష్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది.

12:58 - April 19, 2017

హైదరాబాద్‌ : మలక్‌పేట్‌ మార్కెట్‌లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మలక్‌పేట్‌ - దిల్‌సుఖ్‌నగర్‌ రహదారిపై ఆందోళనకు దిగారు. మిర్చి బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. రహదారిపైనే మిర్చిని తగులబెట్టి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్వాపారులు రూ.4 వేలకు అడుగుతున్నారని, పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. క్వింటాల్‌ మిర్చికి 10వేల రూపాయల మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మిర్చి రైతులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మిర్చి రైతుల ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

మే 7లోపు టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలోని టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలను మే 7వ తేదీ లోపు విడుదల చేయాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మార్చి 14 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.

మే 7లోపు టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలోని టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలను మే 7వ తేదీ లోపు విడుదల చేయాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మార్చి 14 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.

12:52 - April 19, 2017

ప్రపంచంలో సోషల్ మీడియా రాజ్యం ఏలుతోంది. అందరూ సోషల్ మీడియా మోజులో పడి పోతున్నారు. ఇందులో నష్టాలు కూడా ఉన్నాయి. ఫేస్ బుక్ లో ఒకరికి బదులు మరొకరు...ఆడవారికి బదులు మగవారు అకౌంట్ క్రియేట్ చేస్తూ చాలా మందిని మోసం చేస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్‌ నేరగాళ్లు అనుకూలంగా మలుచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు, ఈమెయిల్ హాకింగ్‌లతోపాటు అకౌంట్ టెకోవర్, యూకే, యూఎస్ జాబ్స్ లాంటి మెయిల్ అడ్వర్టైజ్ మెంట్ లాంటి సైబర్ క్రైం మోసాలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడానికి పోలీసులు కొన్ని మార్గదర్శకాలు జారీచేసినా సైబర్ నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా మానవి 'మై రైట్' లో సైబర్ నేరాలపై ప్రముఖ లాయర్ పార్వతి విశ్లేషించారు. అంతేగాకుండా న్యాయ సలహాలకు తగిన సమాధానాలు..సూచనలు అందచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

పన్నీర్ సెల్వం కుమారుడు, సోదరుడికి ముందస్తు బెయిల్

చెన్నై : తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, ఆయన సోదరుడు రాజాలకు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆర్కే నగర్ ఉపఎన్నిక సందర్భంగా శశికళ వర్గీయులు, పన్నీర్ సెల్వం వర్గీయులు ఘర్షణపడ్డారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ కుమారుడు, సోదరుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా... వీరిద్దరికీ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

యువకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య

వికారాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దలూరులో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

పార్టీ నిర్ణయానికి తలొగ్గిన దినకరన్

చెన్నై : తమిళనాడు రాజయీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ నిర్ణయానికి దినకరన్ తలొగ్గారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటానని తెలిపారు. నిన్నటి నుంచే పార్టీ కార్యక్రలాపాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. పార్టీ బలహీనం కావడానికి కారణం తాను కాదని స్పష్టం చేశారు. బలం నిరూపించుకోవడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. పార్టీలో తనకు అందరూ సహోదరులేనని పేర్కొన్నారు. ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా గొడవలు లేవన్నారు. పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతన్నారు. 

 

12:24 - April 19, 2017

చెన్నై : తమినాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పార్టీ గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపారని దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేసింది. పన్నీర్ వర్గం..పళనీ వర్గాలు ఒకటయ్యేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దినకరన్ తిరుగుబాటుకు ప్రయత్నించారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బుధవారం మీడియాకు తెలపడం విశేషం. పార్టీ బలహీనం కావడానికి కారణం తాను కాదని, పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. బలం నిరూపించుకోవడానికి తాను సిద్దంగా లేనని ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీలో అందరూ తనకు సహోదరులేనని, ఎవరితోమ తనకు వ్యక్తిగతంగా గొడవలు లేవన్నారు. దినకరన్ వెనక్కి తగ్గడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయా ? దీనిపై పళనీ..పన్నీర్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

 

 

12:10 - April 19, 2017

వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలతో మార్కెట్ కళకళలాడుతుంటుంది. బంగారం వర్ణంలో మెరిసే మామిడి పండ్లు అంటే ఎవరికైనా మక్కువే. మామిడి తినడం వల్ల పలు ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మరి మామిడిలో ఏముంటాయి ? మామిడి పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయో చూడండి..

 • మామిడిలో వంద క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని వైద్యులు పేర్కొంటుంటారు.
 • మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య పరిష్కారవుతుంది.
 • పెద్దపేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది.
 • ఇది క్వేర్సిటిన్, ఐసోక్వేర్సిటిన్, ఆస్ట్రగాలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుంది.
 • క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొవ్వు పదార్థాలను సరియగు పాళ్ళలో వుంచి, చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
 • కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది.
 • ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
 • మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.
 • మామిడి పండ్లలో ఉండే పొటాషియం హార్ట్ రేటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. మరియు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.
 • విటమిన్ బి 6 మతిమరుపును నివారిస్తుంది. నార్మల్ నర్వ్ ఫంక్షన్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.
12:04 - April 19, 2017

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు

హైదరాబాద్ : నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విద్యాశాఖ నేటి నుంచి సెలవులు ప్రకటించింది. తీవ్ర వడ గాల్పులు,ఉష్ణోగ్రత పెరుగుదల, ఎండవేడి కారణంగా విద్యార్థులు బయట తిరిగే పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. 

 

11:57 - April 19, 2017

వరంగల్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో పసుపు..మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీనితో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా మిర్చి ధరలపై రైతులు ఆందోళన చెసిన సంగతి తెలిసిందే. వేల టన్నుల్లో మార్కెట్ కు మిర్చి..పసుపు బస్తాలు తరలివస్తున్నాయి. కానీ అధికారులు మార్కెటుకు ఈ నెల 23 వరకు వరుసగా 5రోజుల పాటు సెలవులు ప్రచటించారు. కొనుగోళ్లు ఆపు చేయడంతో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. కొనుగోళ్లు పూర్తయిన తరువాత సెలవులు ప్రకటించాలని కోరుతున్నార. మరి రైతుల ఆందోళనతో అధికారులు దిగొస్తారా ? లేదా ? అనేది చూడాలి. .

బాబ్రీ కేసు నుంచి కళ్యాణ్ సింగ్ కు మినహాయింపు

ఢిల్లీ : బాబ్రీ కేసు నుంచి కళ్యాణ్ సింగ్ కు మినహాయింపు లభించింది. రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నంత వరకు ఆయనకు మినహాయింపు ఇచ్చారు. 

11:54 - April 19, 2017

బాహుబలి -2 సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టికెట్లు ఎప్పుటి నుండి ఇస్తారా ? అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. తాజాగా సినిమా టికెట్ల విక్రయ సంస్థ 'బుక్ మై షో' టికెట్ల ముందస్తు విక్రయాలను ప్రారంభించడం విశేషం. వెబ్ సైట్ లో 28 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే సినిమా చూడాలని అనుకుంటున్న రోజు..సమయం..ఏ థియేటర్..టికెట్ ధర..ఎన్ని టికెట్లు కావాలి..వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. డబ్బు చెల్లిస్తే టికెట్లు ఇస్తామని చెబుతోంది. అంతేగాకుండా టికెట్లు మాత్రం గ్యారంటీ కాదని..లభ్యతను బట్టి ప్రయత్నిస్తామని పేర్కోంటోంది. టికెట్ మొత్తంలో తేడా ఉంటే మాత్రం డబ్బును వెనక్కిస్తామని అంటోంది. ఈ ముందస్తు బుకింగ్ కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నేతలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. అద్వానీ, జోషి, ఉమాభారతితోసహా బీజేపీ నేతలపై కేసుల పునరుద్ధరణకు సుప్రీంకోర్టుకు అనుమతించింది. లఖ్ నవూలోని ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతి ఇచ్చింది. అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. గతంలో విచారణ నుంచి అద్వానీని మినహాయించింది. రెండేళ్లలోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

11:47 - April 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుండే సెలవులను ప్రకటించారు. ఎండలు తీవ్రతరం అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి విద్యాసంవత్సరం ఈ నెల 22తో ముగియనుంది. దీంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమౌతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 40-43 డిగ్రీలకు చేరుకుంటుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లకు వెళ్లే వారి పరిస్థితి అంతా ఇంతా కాదు. బుధవారం సీఎం కేసీఆర్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుండే స్కూళ్లకు సెలవులివ్వాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ నుంచి సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానుంది.

11:45 - April 19, 2017

హైదరాబాద్ : లక్షలాది పుస్తకాలతో విజ్ఞాన ఖనిగా భాసిల్లుతోంది ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయం. దక్షిణాదిలో మూడవ పెద్ద లైబ్రరీగా గుర్తింపు పొందింది. విజ్ఞాన సర్వస్వాలు, పరిశోధన గ్రంథాలు, అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఈ లైబ్రరీ సొంతం. ఎంతో మందిని మేధావులుగా, ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు సన్నద్ధవుతోంది. యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాకులు ఉత్తమ పరిశోధనలు చేయడంలో ఈ లైబ్రరీ కీలక పాత్ర పోషిస్తోంది.

రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభం..
ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయం రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఓయూలో చదవి, ఈ లైబ్రరీని ఉపయోగించుకున్న ఎంతోమంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, క్రీడాకారులు, రాజకీయవేత్తలుగా రాణిస్తున్నారు. ఎందరో సరస్వతీ పుత్రులను ప్రపంచానికి అందించన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ... చాలా ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముల్కి ఉద్యమం మొదలు తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు అన్నీ కూడా ఇక్కడే పురుడుపోసుకున్నాయి.

5,40,387 పుస్తకాలు .....
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ చదువుల తల్లి. ఈ గ్రంథాలయంలో 5,40,387 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు హారజయ్యే విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతో బాగా ఉపయోగపడుతోంది.

360 రోజులు పని చేస్తుంది....
విద్యార్థుల అవసరాలకు అనుగుణగా లైబ్రరీ పని వేళలు, పని దినాలు ఉన్నాయి. ఏడాదిలో ఐదు రోజులు మినహా మిగిలిన 360 రోజులు పని చేస్తుంది. పద్నాలుగు విభాగాల్లో సేవలు అందిస్తోంది. విలువైన ఎన్నో గ్రంథాలను భవిష్యత్‌ తరాల కోసం డిజటలీకరణ చేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి చాలా మంది ప్రముఖులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. 6,825 చేతిరాత ప్రతులు, 45 వేల డిజిటల్‌ పుస్తకాలు, 253 పిరియాడికల్స్‌, 273 పిల్మ్‌లు ఈ లైబ్రలో విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్నాయి. తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన రాత ప్రతులు కూడా ఉస్మానియా యూనిర్సిటీ లైబ్రరీలో ఉన్నాయి. తెలుగు, తమిళనం, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, పార్సీ, అరబిక్‌, హిబ్రూ... ఇలా పలు భాషల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ లైబ్రరీని తీర్చిదిద్దారు. విజ్ఞాన భాండాగారం భాసిల్లుతున్నఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ భవిష్యత్‌ తరాలకు మరింత మెరుగైన సేవలు అందిచేలా దినదిన ప్రవర్థమానం చెందాలని అందరూ ఆశిస్తున్నారు.

 

11:42 - April 19, 2017

ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌతం, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీరాములు, ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గాంధీ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ ఎన్నికల హామీలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన చంద్రబాబు.. కేవలం జీతాలు పెంచి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. ఇంత వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని విమర్శించారు. అనంతరం శ్రీరాములు ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సీ వేసిందన్నారు. ఆర్టీసీలోనూ 3500 మంది కార్మిలకులను క్రమబద్ధీకరించామని తెలిపారు. ఇచ్చిన హామీలపై వెనక్కి పోయేదే లేదని స్పష్టం చేశారు. గాంధీ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రూ.18వేలు ఉన్న జీతాన్ని కేవలం రూ.27 లకు చేయడం దారుణమన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి.. ఇప్పుడు మోసం చేయడం సరికాదని హితవు పలికారు. దీనిపై మంత్రులను కలుస్తామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:40 - April 19, 2017

ప్రముఖ దర్శకుడు 'మణిరత్నం'..టాలీవుడ్ హీరో 'రామ్ చరణ్' కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాపై తెగ వార్తలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్' నటించిన 'ధృవ' హిట్ సినిమా అనంతరం సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్ మీద ఉండగానే మణిరత్నం చిత్రంలో 'చెర్రీ' నటిస్తున్నారని, ఇటీవలే స్ర్కిప్ట్ కు కూడా ఒకే చెప్పినట్లు టాక్. కానీ ఇటీవలే 'మణిరత్నం' దర్శకత్వం వహించిన 'చెలియా' సినిమా విడుదలైంది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో 'రామ్ చరణ్' పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మణిరత్నం కూడా మనసు మార్చుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్..మణిరత్నం సినిమాకు బ్రేక్ పడినట్లేనా ? కాదా ? అనేది తరువాతి రోజుల్లో తెలియనుంది.

11:25 - April 19, 2017

గుజరాత్ : వెస్టిండీస్‌ విధ్వంసకర క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచ చరిత్రలో పదివేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్‌లో గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఏప్రిల్‌ 14న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 22 పరుగులు చేసి హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో పదివేల పరుగులకు 3 అడుగుల దూరంలో నిలిచాడు. ఆదివారం రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ మ్యాచ్‌లో గేల్‌ తుది జట్టులోకి ఎంపిక కాలేదు. అతడి స్థానంలో వాట్సన్‌ను తీసుకోవడంతో ఈ మ్యాచ్‌ వరకు ఆగాల్సి వచ్చింది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్‌లో గేల్‌ ఏకంగా 18 శతకాలు బాదాడు. గాయం కారణంగా డివిలియర్స్‌ ఈ మ్యాచ్‌ ఆడకపోవడంతో గేల్‌కు అవకాశం దక్కింది. గేల్‌ చెలరేగిపోవడం, కోహ్లి, హెడ్, జాదవ్‌ బాదుడుతో బెంగళూరు 213 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. గుజరాత్‌ కేవలం 192 పరుగులేచేసి 21పరుగుల తేడాతో ఓడిపోయింది.

11:23 - April 19, 2017

ఢిల్లీ : బీజేపీ అగ్రనేతలకు షాక్ తగిలింది. బాబ్రీ కేసులో బీజేపీ పార్టీలో అగ్రనేతలుగా చలామణి అవుతున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా బీజేపీ నేతలపై కేసుల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 16 మందిపై కేసుల పునరుద్ధరణకు, ఈ కేసును లక్నోలోని ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా అలహాబాద్ కోర్టు తీర్పును సుప్రీం పక్కకు పెట్టడం విశేషం. రోజు వారీ విచారణ చేపట్టి రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే బాబ్రీ కేసు నుండి కల్యాణ్ సింగ్ కు మినహాయింపునిచ్చింది. రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నంత వరకు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. గతంలో విచారణ నుండి అద్వానీని అలహాబాద్ కోర్టు మినహాయించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీలో కలకలం రేగినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి రేసులో..ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్న అద్వానీపై ఈ కేసు ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 • 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి.
 • మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది.
 • ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి.
 • 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకుముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు.
 • 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది. అందులో పలువురు బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి.
 • అద్వానీ, ఉమాభారతి, జోషి, కల్యాణ్ సింగ్ తో సహా మొత్తం 22 మంది నేతలు గుర్తు తెలియని కరసేవకులను ప్రోత్సాహించారని కేసు నమోదైంది.
 • రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టు 2001, మే 4న విచారణ నుంచి తప్పించింది. వారిపై తగిన సాక్ష్యాధారాలు లేవంటూ కేసు కొట్టి వేసింది.
 • ఆ తీర్పును అలహా బాద్‌ హైకోర్టు 2010, మే 20న సమర్థించింది. దీన్ని సీబీఐ 2011 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.
 • 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు. దానిని తగుల బెట్టారు.
 • ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోను వందలాది మంది ముస్లింలు చనిపోయారు.
 • హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది.
 • తాజాగా సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లడంతో కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది.
11:20 - April 19, 2017

ఢిల్లీ : ఇక నుంచి ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు. మే 14న నుంచి దీనిని అమలు చేయనున్నట్లు పెట్రోల్‌ బంకు యజమానుల సంఘం తెలిపింది. పెట్రోలు వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను కాపాడుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీనిని అమలు చేయనున్నామని వెల్లడించారు. మే 14 నుంచి ప్రతీ ఆదివారం ఎనిమిది రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు పని చేయవు. వాటిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలున్నాయి. 

 

11:17 - April 19, 2017

కర్నూలు : మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టిడిపి సీనియర్‌ నేత శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం అందుకుంది. వైసీపీలోకి శిల్పామోహన్‌రెడ్డి వెళ్తున్నారంటూ టీడీపీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈనెల 21 లేదా 22న శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

11:14 - April 19, 2017

హైదరాబాద్‌ : నగరంలో మండే ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పుల వల్ల నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. అన్ని వయస్సుల వారు భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు. ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో హైదరాబాద్‌ నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం అయ్యిందంటే బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎక్కడ కాసింత నీడ దొరికినా సేద తీరుతున్నారు. చల్లని పానీయాలను  సేవిస్తున్నారు. వేడి తగలకుండా గొడుగులను, కర్చీఫ్‌లను  రక్షణగా వాడుకుంటున్నారు. ఈ ఏడాది ఎండలు దారుణంగా ఉన్నాయని.. తట్టుకోలేకపోతున్నామని  నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు  
భానుడు విజృభించడంతో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.  సూర్య కిరణాల్లో అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికంగా ఉండటంతో.. ఎండలో తిరిగే వారు అనారోగ్యానికి గురవుతున్నారు. చాలామంది వడదెబ్బ తగిలి.. డయేరియా బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో జనం వాంతులు.. విరోచనాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. డయేరియాతో ఉస్మానియాలో ఇద్దరు, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో నలుగురు, నిలోఫర్‌లో ఇద్దరు. గాంధీలో ముగ్గురు చేరినట్టు సమాచారం. డీహైడ్రేషన్‌ కారణంగానే  డయేరియా బారిన పడతారని.. శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే టోపీ, కాటన్‌ దుస్తులు.. కూలింగ్‌ గ్లాస్‌లు ధరించాలని సూచిస్తున్నారు. 

11:11 - April 19, 2017

హైదరాబాద్ : ఎవరైనా కూలీలు అంటే ఎలా ఉంటారు. పొట్ట కూటి కోసం రోజంతా కష్టపడి ఎంతో కొంత సంపాదించుకుంటారు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్ట్‌లీ కూలీలు దర్శనిమిస్తున్నారు. కొన్ని నిమిషాల పనికి లక్షల్లో కూలీ సంపాందిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ నాయకులు కాస్ట్‌లీ కూలీల అవతారమెత్తారు. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ సభ నిర్వహణకు నిధుల సేకరణకు కూలీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం పలు వ్యాపార సంస్థల్లో కొద్దిసేపు పనిచేస్తూ భారీగా కూలీ అందుకుంటున్నారు. రెండేళ్లకోసారి కూలీ పనులు నిర్వహించి తమ పార్టీ కార్యక్రమాలను భారీగా చేసుకోవడం గులాబీ నేతలు అనవాయితీగా పెట్టుకున్నారు. 
ఐస్‌క్రీమ్‌లు అమ్మి రూ. 7లక్షలు సంపాందించిన కేటీఆర్
గులాబీ నేతలు కూలీ పనులు చేస్తూ పార్టీకి భారీగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రి కేటీఆర్ కేవలం అరగంట సేపు ఐస్ క్రీంలు, జ్యూస్‌ అమ్మి దాదాపు 7 లక్షల రుపాయాలు సంపాదించారు. ఎంపీ కవిత నిజామాబాద్‌లోని వస్త్రాల దుకాణంలో చీరలు అమ్మిన కొద్దిసేపట్లోనే లక్ష రుపాయలకు పైగా ఆదాయాన్ని అర్జించారు. 
మంత్రులు, శాసనసభ్యులు కూలీ పనులు
మంత్రులు, శాసనసభ్యులు కూడా ఇదే స్థాయిలో కూలీ పనులు చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి తన నియోజకవ్గంలో గుమాస్తా అవతారం ఎత్తడంతో పాటు ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి రెండు లక్షల రుపాయలు ఒకే రోజులో సంపాదించారు. మరో మంత్రి తలసాని అభివృధ్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే మార్కెట్ యార్డ్, రైస్ మిల్లుల్లో కూలీ పనులు చేసిన కొద్ది సమయంలోనే  70 వేల రుపాయాలను పార్టీకి  నిధుల రూపంలో తెచ్చారు.
పార్టీ ఖర్చుల కోసం భారీగా ఆదాయం 
శాసనసభ్యులు, మంత్రులు గంటల వ్యవధిలో లక్షలాది రుపాయల విలువ చేసే పనులు చేస్తూ పార్టీ ఖర్చుల కోసం భారీగా ఆదాయం చేకూరుస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కూలీ అవతారమెత్తి భారీగా సంపాందించబోతున్నారు.  

 

వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో నిలిచిన కొనుగోళ్లు

వరంగల్ : వ్యవసాయ మార్కెట్ లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి పసుపు, మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్ కు ఈనెల 23వరకు అధికారులు సెలవు ప్రకటించారు. కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 

 

పార్టీలో నాపై ఎలాంటి వ్యతిరేకత లేదు : దినకరన్

చెన్నై : పార్టీలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదని దినకరన్ అన్నారు. పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెప్పారు. త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

పార్టీలో నాపై ఎలాంటి వ్యతిరేకత లేదు : దినకరన్

చెన్నై : పార్టీలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదని దినకరన్ అన్నారు. పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెప్పారు. త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

పన్ను ఎగవేత కేసుల్లో ఐటీ సోదాలు

చెన్నై : తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఐటీ శాఖ విస్తృ తనిఖీలు చేపట్టింది. పన్ను ఎగవేత కేసుల్లో 80 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

మహిళపై నాలుగు రోజులుగా అత్యాచారం

కృష్ణా : జిల్లాలో ఓ మహిళపై యువకులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఎ.కొండూరు మండలం గోపాలపురానికి చెందిన మహిళను నలుగురు యువకులు ఈనెల 14న కిడ్నాప్ చేశారు. ఓ లాడ్జిలో బంధించి నాలుగు రోజులుగా ఆమెపై అత్యాచారం చేశారు. రాత్రి తెనాలి బస్టాండ్ లో యువకులు మహిళను వదిలేశారు. ఎ.కొండూరు పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. 

10:39 - April 19, 2017

టాలీవుడ్ లో రాశీ ఖన్నా పలు చిత్రాల్లో ఛాన్స్ లు అందుకుంటూ దూసుకెళుతోంది. ఇప్పటికే ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే'లో అమాయకంగా, 'హైపర్' లో గ్లామర్ గా కనిపించిన 'రాశీ ఖన్నా' 'సాయిధరమ్ తేజ్‌' 'సుప్రీమ్' లో బెల్లం శ్రీదేవిగా ప్రేక్షకులను అలరించింది. ఇటీవల యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమాలోనూ ఆఫర్ పట్టేసింది ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మలయాళంలో అరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధమవుతోందంట. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ చిత్రానికి ఆదరణ లభించాలనే ఉద్ధేశ్యంతో ఉన్ని కృష్ణన్ ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయా భాషాల్లో పేరు గాంచిన పలువురు నటీ నటులను సినిమాలో నటించనున్నారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా హన్సిక, శ్రీకాంత్, మంజువారియర్ లాంటి స్టార్స్ నటిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇక ఈసినిమాలో 'రాశీ ఖన్నా' విలన్ గా నటిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓ అవినీతి పోలీసు అధికారిణిగా నటించబోతోందని మరో ప్రచారం జరుగుతోంది. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

10:37 - April 19, 2017

రంగారెడ్డి : జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడలోని భారత్ గ్యాస్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్యాలయంలోని కంప్యూటర్లు, సామాగ్రి, ఫైల్స్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని మంటలు అర్పారు. గ్యాస్ కార్యాలయంలో మంటలు అంటుకోవడంతో చుట్టుప్రక్కల వారు ఆందోళనకు గురయ్యారు.

 

10:28 - April 19, 2017

కర్నూలు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 8వ నంబర్ రహదారి పై డోన్ మండలం ఓబులాపురం మెట్ట వద్ద ఇన్నోవా వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో బెంగళూరు చెందిన కానిస్టేబుల్, అతని మిత్రుడు ఉన్నారు. గాయపడిన వారిలో ఎస్ఐ శ్రీనివాస్, ఆయన డ్రైవర్ ఉన్నారు. వీరు ఓ కేసు విచారణ గురించి హైదరాబాద్ వస్తున్నారు.

 

10:22 - April 19, 2017

మనిషి మృతి చెందిన అనంతరం ఆత్మ పగ తీర్చుకుంటుందా ? ఆత్మలున్నాయా ? సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఇంకా మూఢనమ్మకాలు వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా పాక్ కు చెందిన ఓ మీడియా తలా తోక లేని కథనం ప్రసారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు ఓంపురి ఆత్మ ముంబైలో తిరుగుతోందని..భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పై పగ తీర్చుకొనేందుకు ఆత్మ తిరుగుతోందని బోల్ న్యూస్ టీవీ ఛానెల్ వీడియోను ప్రసారం చేసింది. బాలీవుడ్ లోనే కాక ఇతర వుడ్ చిత్రాల్లో నటించిన ఓంపురి గత జనవరి 6వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. యూరీ సెక్టార్ లో దాడుల విషయంలో ఓపుంరి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓ కథనం ప్రసారం చేసింది. దీనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అయిన ఈ వీడియోలో తెల్ల కుర్తా ధరించిన వ్యక్తి కనిపించగా..అది ఓంపురి ఆత్మ అని..ముంబైలోని తన ఇంటి ముందు తిరుగుతోందని బోల్ న్యూస్ ఛానెల్ పేర్కొంది. గత జనవరి 14న ప్రసారం చేయగా దీనిని 'ఆజ్ తక్' అనే న్యూస్ ఛానెల్ ఇటీవలే ప్రసారం చేసింది.

10:16 - April 19, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో గంటగంటకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా టీటీవి దినకరన్ కు మరో షాక్ తగిలింది. దినకరన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రధాన విమాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు పంపారు. నేడు దినకరన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ గుర్తు కోసం ఈసీకి దినకరన్ లంచాలు ఇవ్వజూపారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉంటే బుధవారం మరోసారి పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య చర్చలు జరగనున్నాయి. దాదాపు రెండు వర్గాలు విలీనయ్యే దిశగా కదులుతున్నాయి. సెల్వం షరతుల మేరకు ఇప్పటికే పార్టీ నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగే ఈ చర్చల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

09:40 - April 19, 2017

వాషిగ్టన్ డీసీ : అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీని ట్రంప్‌ వంద రోజుల్లో నెరవేర్చినట్లయింది. హెచ్‌1 బి వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేస్తూ కొత్త విధానం అమలులోకి రానుంది. ఇకపై అత్యున్నత నైపుణ్యమున్నవారికే హెచ్‌1బీ వీసాలు జారీ చేస్తారు. ఉద్యోగాలకు తొలుత అమెరికన్ల పేర్లను పరిశీలించాకే విదేశీయులను పరిగణనలోకి తీసుకుంటారు. ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని.. అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్‌ కార్యవర్గం భావిస్తోంది. ఇది భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అమెరికాలో అత్యధిక హెచ్-1బీ వీసాలు పొందుతున్నది భారతీయులే.

 

09:33 - April 19, 2017

న్యూఢిల్లీ : శరీరాన్ని పూర్తిగా కవర్‌చేసేలా దుస్తులు వేసుక రావాలని విద్యార్థినిలకు జారీ చేసిన నోటీసుపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ ఐఐటీ హాస్టల్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఓ మహిళా హాస్టల్ ఈ నోటీసును ఇటీవలే జారీ చేసింది. ఈనెల 20న హౌస్ డే కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ ఐఐటీలో ఏడాదికొకసారి హౌస్‌ డే నిర్వహిస్తారు. దీనికి విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. దీనిపై హిమాద్రి హాస్టల్‌ వార్డెన్‌ సంతకంతో నోటీసు పెట్టారు. కార్యక్రమానికి మహిళలంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకుని రావాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు విమర్శలు రావడంతో నోటీసుపై వెనక్కి తగ్గారు.

09:23 - April 19, 2017

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాశ్మీర్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలను మంగళవారం మూసివేశారు. విద్యార్థులపై భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తన చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తూ కాశ్మీర్ వ్యాప్తంగా విద్యార్థులు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అల్లరకు పాల్పడే వ్యక్తులపై నేరుగా కాల్పులు జరిపేందుకు ప్లాస్టిక్‌ బుల్లెట్లు వాడనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే వేలాది ప్లాస్టిక్‌ బుల్లెట్లు కాశ్మీర్‌కు చేరాయి. ఐఎన్‌ఎస్‌ఏఎన్‌ రైఫిల్‌ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఈ బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయే పరిస్థితి ఉండదని అధికారులు ప్రకటించినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో భద్రతా దళాల హింసకు సంబంధించిన వీడియోలు అధికంగా వస్తుండడంతో వీటిని నిలువరించేందుకు కాశ్మీర్‌ లోయలో ఇంటర్‌నెట్‌ సేవలను సోమవారం నుంచి నిలిపేశారు.

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ నుంచి శశికళ కుటుంబసభ్యుల తొలగింపు తర్వాత పళనిస్వామి మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పన్నీర్‌ సెల్వం వర్గంతో పళనిస్వామి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంతర్వాత పార్టీ విలీనంపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

09:01 - April 19, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీనుంచి శశికళ కుటుంబసభ్యుల తొలగింపుతర్వాత పళనిస్వామి మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పన్నీర్‌ సెల్వం వర్గంతో పళనిస్వామి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంతర్వాత పార్టీ విలీనంపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి శశికళను, కుటుంబసభ్యుల్ని బహిష్కరిస్తూ పళనిస్వామి ప్రకటన చేశారు. 20మంది మంత్రులతో కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు శశికళ కుటుంబసభ్యుల తొలగింపు నిర్ణయాన్ని దినకరన్ వ్యతిరేకిస్తున్నారు. నేడు ఫెరా కేసులో దినకరన్ కోర్టు ముందుకు రానున్నారు. 

 

08:56 - April 19, 2017

ఎంసెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు శారద విద్యా సంస్థల జనరల్‌ మేనేజర్‌, ప్రముఖ మ్యాథ్స్‌ లెక్చరర్‌ జివిరావు లెక్చరర్‌ జివిరావు పలు సూచనలు, సలహీలు ఇచ్చారు. ఎంసెట్ కు ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశంపై జనపథంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కు తేదీ సమీపిస్తోంది. తొలిసారి ఆన్ లైన్ లో ఏపి ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24, 25, 26, 27తేదీలలో నిర్వహిస్తున్నారు. అగ్రికల్చరల్ ఎంట్రన్స్ టెస్టు ఏప్రిల్ 28న వుంటుంది. ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష కోసం దాదాపు 40వేల కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో కలిపి మొత్తం 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, హైదరాబాద్ లో మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ కేటాయిస్తారు. పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత పాస్ వర్డ్ ఇస్తారు. ఏపి ఎంసెట్ ను కాకినాడ జెఎన్ టియు నిర్వహిస్తోంది. అయితే, ఎంసెట్ కి ఎలా ప్రిపేరవ్వాలి? పరీక్ష రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?... అనే అంశాలపై మాట్లాడారు. మరిన్ని అంశాలను వీడియోలో చూద్దాం....

 

08:45 - April 19, 2017

కరీంనగర్ : బొమ్మకల్ లో కిడ్నాపైన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడు క్షేమంగా ఉన్నాడు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. శిశువు క్షేమంగా దొరకడంతో తల్లి ఆనందం వ్యక్తం చేసింది. బాలుడికి స్వల్పంగా అనారోగ్యం అయింది. ఎన్ ఐసీయూలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. 20 గంటల్లో కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని ఆనంద్ రావు ఆస్పత్రిలో నిన్న దంపతులు బాలున్ని కిడ్నాప్ చేశారు. ఓ జంటకు రూ.5 లక్షలకు శిశువును విక్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు చొప్పదండి ప్రాంతంలో బాబు ఆచూకీ కొనుగొన్నారు. అనిల్ అనే వ్యక్తిని అదుపులోకి విచారిస్తున్నారు. ఏసీపీ కమలాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్లను గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నేడు ఆంధ్రప్రదేశ్ లో ఎడ్ సెట్ పరీక్ష

విజయవాడ : నేడు ఆంధ్రప్రదేశ్ లో ఎడ్ సెట్ పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8,785 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్ లైన్ విధానంలో ఉదయం 10.30 గంటలకు పరీక్ష నిర్వహించనున్నారు. 

నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్

హైదరాబాద్ : ఐపీఎల్ 10లో భాగంగా నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

 

నేడు తనవర్గం ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం భేటీ

చెన్నై : నేడు తనవర్గం ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం సమావేశం కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

08:13 - April 19, 2017

వనపర్తి : జిల్లా కేంద్రమైన వనపర్తి నేటికీ రూపురేఖలు మారలేదు. జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి ఊపందుకుంటుందని భావించిన ప్రజల ఆశలు అడియాశలుగానే మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెలకొన్న పరిస్థితులే నేటికి దర్శనమిస్తున్నాయి. పాలకులు మారుతున్నా, పట్టణాలు మారుతున్నా, రాష్ట్రాలు ఏర్పడినా, జిల్లా కేంద్రమైనా వనపర్తి అభివృద్ధికి అమడదూరంలోనే ఉంది. అభివృద్ధికి కొలమానం రోడ్ల విస్తరణ.. ఇంత వరకు పట్టణంలో ఆ దిశగా పనులే మొదలుకాలేదు. ఇరుకు రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
రోడ్ల విస్తరణ పెరగడం లేదు 
వనపర్తి ప్రత్యేక జిల్లా అయిన దగ్గరి నుంచి వనపర్తిలో నివాసం ఉండడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ప్రముఖ విద్యాలయాలు ఇక్కడే ఉండడంతో ఇతర ప్రాంతాల ప్రజలు సైతం ఇక్కడ ఉండడానికి సుముఖత చూపుతున్నారు. అయితే జనాభా పెరుగుతున్నా అందుకు తగ్గట్లు రోడ్ల విస్తరణ మాత్రం పెరగడం లేదు. 
రోడ్లు చిన్నవిగా ఉండడంతో ప్రమాదాలు 
రోడ్లు చిన్నవిగా ఉండడంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతో రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వనపర్తిలో రోడ్ల విస్తరణ పనులపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించి 6 నెలలు కావస్తున్నా ఇంత వరకు విస్తరణ పనులకు మోక్షం లభించలేదని విపక్ష నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగితిన రోడ్ల విస్తరణకు చొరవ తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. 

 

08:05 - April 19, 2017

ఖమ్మం : ఆడవాళ్లు ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని చెప్పుకునే నేటి సమాజంలో ఆడబిడ్డ పుట్టింది అంటేనే పాపంగా పరిగణిస్తున్న వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తికాదు. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలియగానే కడుపులోనే ఆడబిడ్డను చంపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో కొంత మంది వైద్యులు లింగ నిర్థారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తూ ఆడపిల్లల ఊసురు పోసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పెరిగిపోతున్న భ్రూణ హత్యలపై 10 టీవీ ప్రత్యేక కథనం.
చట్ట విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు 
కొన్ని గ్రామాల్లో ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావిస్తున్నారు. కట్న కానుకలకు భయపడి కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. నిరుపేదలే కాదు బడాబాబులు కూడా భ్రూణ హత్యలకు పాల్పడడం విస్మయాన్ని కలిగిస్తోంది. వైద్యులకు డబ్బు ఆశ చూపి లింగ నిర్థారణ పరీక్షలు చేయిస్తూ ఆడపిల్ల అని తెలియగానే పిండాన్ని పిండేస్తున్నారు. వైద్యులు చట్ట విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలకు పాల్పడడంతో భ్రూణ హత్యలు ఖమ్మం జిల్లాలో ఎక్కువైపోతున్నాయి. 
భ్రూణహత్యలు అరికట్టడంలో అధికారులు విఫలం
ఖమ్మం నగరంలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణహత్యలే పనిగా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యకృత్యంగా మారిన భ్రూణహత్యలను అరికట్టడంలో ఉన్నతాధికారుల మొబైల్ బృందం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గర్భంలోనే ఆడశిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. కానీ జిల్లాలో లింగ నిర్థారణ పరీక్షలు ఎక్కువైనా అధికారులు కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. 
రంగంలోకి వైద్యాధికారులు 
భ్రూణ హత్యలపై ఫిర్యాదులు ఎక్కవ అవడంతో ఎట్టకేలకు వైద్యాధికారులు రంగంలోని దిగారు. నగరంలోని పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో దాడులు నిర్వహించి ఎలాంటి అనుమతి లేని ఆస్పత్రులను సీజ్ చేశారు. లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ కమిషనర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటికైనా జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భ్రూణ హత్యలపై అధికారులు ఉక్కుపాదం మోపి ఆడపిల్లల బంగారు భవిష్యత్‌ను కాపాడాలని సామాజిక వేత్తలు, మేధావులు కోరుతున్నారు. 

 

07:58 - April 19, 2017

కృష్ణా : విజయవాడలో దారుణం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా కిరణ్‌కుమార్ అనే యువకుడు కొట్టిన బంతి వైజయంతి అనే మహిళకు తగిలింది. దీంతో ఆమెకు క్షమాపణ చెప్పలేదని వైజయంతి కుమారుడు శ్రీకాంత్ చౌదరి కిరణ్‌కుమార్‌పై కత్తితో దాడికి పాల్పడడంతో కిరణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

07:55 - April 19, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సెగ తగిలే విధంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ శాఖలతో పాటు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసి ఉద్యోగాల కేలండర్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశాయి. హైదరాబాద్‌ ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన విద్యార్థి, నిరుద్యోగ ధర్మయుద్ధం బహిరంగ సభలో పలువురు నేతలు పాల్గొన్నారు. 
కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన
కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారని.. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తానని నమ్మబలికి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు దుయ్యబట్టాయి. ఉస్మానియూ విశ్వవిద్యాలయంలో 35 విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన విద్యార్థి, నిరుద్యోగ ధర్మయుద్ధం బహిరంగ సభకు హాజరై.. తమ పూర్తి మద్దతు ప్రకటించాయి. 2019లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు, టీజేఏసీ.. విద్యార్థి సంఘాల మద్దతుతో కార్యాచరణ రూపొందిస్తున్నాయి. 
మాట మారుస్తున్న కేసీఆర్‌ : ఉత్తమ్
ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు మాట మారుస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఖాళీలను ఎందుకు ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. 
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి : కోదండరాం 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల ప్రకటన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందన్నారు. 
సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవాలి : చాడ 
శత జయంతి ఉత్సవాల లోపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే.. ఉత్సవాలకు హాజరు కానున్న సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. 
పోరాటాలతోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం : విమలక్క 
పోరాటాలతోనే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు విమలక్క. కేసీఆర్‌ మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని ఆమె విమర్శించారు. 
బహిరంగ సభకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు 
మొత్తానికి విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన విద్యార్థి, నిరుద్యోగ ధర్మయుద్ధం బహిరంగ సభకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే.. తమ జీవితాలను అంధకారం చేస్తున్న ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తామని విద్యార్థులంటున్నారు. 

 

07:48 - April 19, 2017

గుంటూరు : రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వృద్ధి సాధించాలని ఆక్షాంకించారు. రెవెన్యూలో వెనకబడ్డ శాఖలు మరింత కష్టపడి అధిక ఆదాయం ఆర్జించాలని ఆర్థిక శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
వెలగపూడి సచివాలయంలో సమావేశం
అన్ని శాఖలు మంచి వృద్ధి సాధించి.. అధిక ఆదాయాన్ని ఆర్జించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో ఆదాయ ఆర్జనలపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు యనమల, శిద్ధా రాఘవరావు, జవహర్‌, అమర్‌నాథ్‌రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. 
అధికారులకు సీఎం దిశానిర్దేశం 
2015-16 ఏడాదిలో జరిగిన ప్రగతి, ఈ ఏడాది సాధించాల్సిన ప్రగతిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గతేడాది కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించడంపై పలు శాఖలు దృష్టి సారించాలని ఆదేశించారు. 2016-17కి పన్నుల ద్వారా 44,055 కోట్లు వచ్చాయని,.. పన్నేతర ఆదాయం ఆదాయం 5,046 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26,264 కోట్లుగాను, కేంద్ర గ్రాంట్‌ 24,365 కోట్లు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కేంద్రం నుంచి రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణానికి, పోలవరానికి సంబంధించి ఇంకా 3,358 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ ఆదాయంలో 5.88 శాతం వృద్ధి సాధించినట్లు సీఎం తెలిపారు. ఎక్సైజ్‌శాఖలో విశాఖ జిల్లా అత్యధిక రెవెన్యూ సాధించిందన్నారు. ఇక స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, అటవీ శాఖలో రెవెన్యూ తిరోగమనంలో ఉందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. త్వరలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి ఆస్కారం లేకుండా పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

07:44 - April 19, 2017

హైదరాబాద్ : జనసైనికుల ఎంపికకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొత్త  ప్రక్రియను ప్రారంభించారు. అర్హత పరీక్ష ఆధారంగా కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈనెల 21న అనంతపురం జిల్లా నుంచి జనసైనికుల ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి జనసేన నాందిపలుకుతోంది. జనసైనికుల ఎంపికకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనం కోసం పనిచేసే వారిని జనసైనికులుగా ఎంపిక చేయాలని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.
ఈనెల 21 నుంచి జనసైనికుల ఎంపిక
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు సమర్థులైన కార్యకర్తలను ఎంపిక చేసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కసరత్తు చేస్తున్నారు. ప్రజల గొంతుకను తమ గళంగా విపించేందుకు చొరవ, చొచ్చుకుపోయేతత్వం ఉన్నచురకత్తుల్లాంటి  సైనికులను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈనెల 21న అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 
ప్రకటన ద్వారా దరఖాస్తుల ఆహ్వానం 
జనసైనికుల ఎంపికకు జనసేనాని కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.  ప్రకటన జారీచేసి మరీ దరఖాస్తులు ఆహ్వానించారు. దీనికి  స్పందనగా ముందుకు వచ్చిన 3,600 మంది జనసైనికులను ఎంపిక  చేసేందుకు అనంతపురంలోని జీఆర్‌ గార్డెన్‌లో మూడు రోజులపాటు  రాతపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి  ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి, సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుతారు. సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై అగాహన ఉన్నవారిని ఎంపిక చేస్తారు. సమస్యలను చక్కగా విశదీకరించే వారిని విశ్లేషకులుగా, సమాచారాన్ని చక్కగా రాయగలిగేవారిని కంటెంట్‌ రైటర్స్‌గా నియమిస్తారు. ఈ ఎంపికలను అత్యంత పారదర్శకంగా, ప్రతిభకు పట్టంకట్టేలా నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. 
ఇతర పార్టీలకు భిన్నంగా జనసేన కార్యకర్తలు 
చిత్తశుద్ధి, అంకితభావం, నైతిక విలువలు ఉన్న వారినే జనసైనికులుగా ఎంపిక చేయాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఇతర పార్టీలకు భిన్నంగా జనసేన కార్యకర్తలు ఉండాలన్న ఉద్దేశంతోనే జనసేనాని ఈ కసరత్తు  చేస్తున్నారు. కార్యకర్తల ద్వారా పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నెల్లూరు : రాపూరు మండలం మసీదుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ట్రాక్టర్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 17 మందికి గాయాలయ్యాయి.

బొమ్మకల్ లో కిడ్నాపైన బాలుడు క్షేమం...

కరీంనగర్ : బొమ్మకల్ లో కిడ్నాపైన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడు క్షేమంగా ఉన్నాడు. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడికి స్వల్పంగా అనారోగ్యం అయింది. ఎన్ ఐసీయూలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. చెల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో నిన్న బాలున్ని కిడ్నాప్ చేశారు. 20 గంటల్లో కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

నేడు వరంగల్ జిల్లాలో మంత్రులు కడియం, తుమ్మల పర్యటన

వరంగల్ : జిల్లాలో నేడు మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటించనున్నారు. టీఆర్ఎస్ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 

నేడు చింతమడకలో రేవంత్ రెడ్డి పర్యటన

సిద్ధిపేట : చింతమడకలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 

 

నేడు కోర్టుకు ఎంసెట్ పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు

హైదరాబాద్ : ఎంసెట్ పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు ఎస్.బహదూర్ సింగ్ ను సీఐడీ నేడు కోర్టులో ప్రవేశపెట్టనుంది. 

Don't Miss