Activities calendar

20 April 2017

21:30 - April 20, 2017

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్ పరిధి పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై కారు బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ నజీమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెనక నుండి వేరే వాహనాలేవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హయత్‌ నగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వెళ్తున్న కారు.. మూల మలుపు వద్ద ఒక్కసారిగా ఫల్టీ కొట్టింది. కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్‌ ట్రాఫిక్ పోలీసులు.. కారును తరలించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. 

21:29 - April 20, 2017

హైదరాబాద్: అంబేద్కర్‌, జ్యోతిరావుపూలే ఆశయ సాధన కోసం మహాజన సమాజం ఆవిర్భవించిందని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. మహాజన సమాజం గౌరవ అధ్యక్షుడుగా గద్దర్‌ను ఎన్నుకున్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యాలతో ఆవిర్భవించిన మహాజన సమాజం భావి సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. సమాజం కోసం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను కలుసుని, మహాజన సమాజం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. 

21:28 - April 20, 2017

వరంగల్: తెలంగాణలో క్వింటాల్‌ మిర్చీకి పదివేల రూపాయలు చెల్లించాలని... ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వెంటనే మిర్చీ రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు.. అలాగే రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తమ్మినేని పర్యటించారు.. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కళావతి కుమారుడి వివాహానికి హాజరయ్యారు..ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, వాసుదేవ రెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలుకూడా పాల్గొన్నారు.. 

21:26 - April 20, 2017

వరంగల్ : గులాబీ కూలీదినాల్లోభాగంగా ఎమ్మెల్యే కొండా సురేఖ కూరగాయలు అమ్మారు.. కూరగాయల అమ్మకంలో ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళికూడా సహాయం చేశారు.. కొండా సురేఖ దగ్గర కిలో టమాటల్ని 2వేల రూపాయలు చెల్లించి మున్నా అనే వ్యక్తి కొనుగోలు చేయగా... మరికొందరు ఇతర కూరగాయాల్ని కొన్నారు.. కూరగాయాలు అమ్మి కొండా దంపతులు 51వేల రూపాయలు సంపాదించారు.. ఈ డబ్బును TRS సభకు వినియోగిస్తామని తెలిపారు.. 

21:24 - April 20, 2017

అనంతపురం : తన పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించి...నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పామిడిలో ప్రగతి పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం బాలికల జూనియర్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు.

అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని ...

అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని ఇక్కడి ప్రజలు టీడీపీ కష్టకాలంలో కూడా అమితంగా ఆదరించారని..అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసి తీరుతామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ జిల్లాలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూ గర్భ జలాల పెంపుదలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రతి రైతు తమ పొలంలో పంటకుంటలను తవ్వి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అలాగే చెరువుల్లో పూడికలు తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కేటీఆర్‌ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.. నీటి లభ్యత, భూగర్భ జలాలు పెంపొందించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నేషనల్ ఫార్క్ సమీపంలో నిర్మించిన శిల్పారామాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. నీరు-ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్.. మంత్రులు..దేవినేని ఉమ..పరిటాల సునీత, కాల్వశ్రీనివాసులు.. కలెక్టర్ కోనశశిధర్..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు..ఇతర ప్రజాప్రతినిధులు..పాల్గొన్నారు. 

21:22 - April 20, 2017

హైదరాబాద్: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇదే అంశంపై యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ సభ్యుడు నాచియప్పన్‌ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని నియమించారు. 2015 డిసెంబర్‌ 17న తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించారు. జమిలి ఎన్నికలకు ఆ కమిటీ సై చెప్పింది. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరగడం, దీని వల్ల వ్యయ భారం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దీంతో చాలామంది జమిలి ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

ఇక జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ...

ఇక జమిలి ఎన్నికల నిర్వహణ కోసం అనేక మార్గాలను కమిటీ నిర్దేశించింది. రాష్ట్ర శాసనసభ గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల సంఘానికి ఇచ్చిన అధికారాన్ని మరింత విస్తృతపరచాల్సిన అవసరముంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఈ అధికారాలను ఇవ్వాలి. జమిలి ఎన్నికలు నిర్వహణకు అనుగుణంగా ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల గడువును ఎన్ని నెలలైనా పొడిగించడం లేదా తగ్గించడం చేస్తే సరిపోతుందని నాచియప్పన్‌ కమిటీ పేర్కొంది.

జమిలి ఎన్నికల నిర్వహణ సాధాసాధ్యాలను పరిశీలించడంతోపాటు ...

జమిలి ఎన్నికల నిర్వహణ సాధాసాధ్యాలను పరిశీలించడంతోపాటు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రంలో కొందరు సీనియర్‌ మంత్రులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో చేయాల్సిన సవరణలను కూడా ఈ కమిటీనే సూచించనున్నట్లు తెలిసింది. ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలతో చర్చలు కూడా జరిపి అందర్నీ జమిలి ఎన్నికల కోసం ఒప్పించే బాధ్యతను కూడా ఈ కమిటీకే మోదీ కట్టబెట్టనున్నట్లు తెలిసింది.

2019 జూన్‌ వరకు గడువు ఉన్న లోక్‌సభకు...

ఇది ఒకే అయితే.. 2019 జూన్‌ వరకు గడువు ఉన్న లోక్‌సభకు 2019 జనవరి నుంచి జూన్‌లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. అయితే ఈ గడువు పొడిగించేందుకు గానీ... కుదించేందుకు వీలుండదు. అలాగే లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ నిబంధనను దేశంలోని 29 రాష్ట్రాల్లోని సగానికి పైగా రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఎన్నికలకు ఇంకా గడువు ఉన్నా రాష్ట్రాలు అంగీకరిస్తాయా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రధాని మోదీ తన ఆలోచనను ఇప్పటికే ఎన్డీయే సమావేశంలో...

ప్రధాని మోదీ తన ఆలోచనను ఇప్పటికే ఎన్డీయే సమావేశంలో మిత్రపక్షాలతో పంచుకున్నారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ అధికారిక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, దాని మిత్రపక్షాలు 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా ముఖ్యమంత్రులంతా జమిలికి సూత్రప్రాయంగా అంగీకరించారు.

2018 ఆఖరిలో లోక్‌సభతో పాటు..

2018 ఆఖరిలో లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ యోచిస్తున్నారు. దాదాపు 2018 నాటికి 17 రాష్ట్రాల అసెంబ్లీ గడువు అటూఇటూగా ముగియనుంది. మరోవైపు అంతకుముందే ముగిసే రాష్ట్రాల అసెంబ్లీ గడువును జమిలి ఎన్నికల వరకు పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల గడువు తగ్గించాల్సి ఉంటుంది. ఈ కోవలోకి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కింలు వస్తాయి. ఈ రాష్ట్రాలకు 2019 ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్న తలెత్తుతంఉది. అయితే దీనికి రెండేళ్ల కాలాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. 2018 ఆఖరునాటికి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలన్నింటిని జమిలిలో చేరుస్తారు. ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ పదవీకాలం ఉన్న రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని 2023 వరకు పొడిగిస్తారు. దీంతో 2023లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన చూసుకుంటే... 2018లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, రాజస్థాన్‌, ఏపీ, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, ఢిల్లీ బీహార్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతాయి. 2021 ఏప్రిల్‌, మే వరకు కాలపరిమితి ఉన్న అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో ఇటీవలే ఎన్నికలు జరిగిన గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీల గడువును 2023 వరకు పొడిగించి.. అప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే ఆయా ప్రభుత్వాలు మరో రెండేళ్లు అధికారంలో కొనసాగుతాయి. అయితే.. అప్పటివరకు పదవీకాలాన్ని పొడిగించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. రాష్ట్రాపతి పాలన విధించే అవకాశముంది.

జమిలి ఎన్నికల వల్ల దేశంలో

జమిలి ఎన్నికల వల్ల దేశంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని మోదీ భావిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ భారం భారీగా తగ్గుతుందంటున్నారు. దీనివల్ల సమయం, డబ్బు కలిసి వస్తాయంటున్నారు. అయితే.. జమిలి ఎన్నికల నిర్వహణపై మేధావులు అనేక సందేహాలు వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. కేంద్రంలో సంకీర్ణం ఏర్పడి.. అది ఐదేళ్లకే కుప్పకూలిపోతే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే ఈ జమిలి ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదం నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తానికి వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న బీజేపీ.. జమిలి ఎన్నికలతో మరింత లబ్ధి పొందేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. మరిన్ని మోదీ ఆలోచనకు ఇతర పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

20:07 - April 20, 2017

హైదరాబాద్: గొర్రులు మేకల నడుమ బాబుగారి జయంతి...అంగరంగ వైభవంగా అన్న పుట్టినరోజు, కోతకు రాని పంట కోసిన హరీష్ రావు...ఇట్లమ్మినా మద్దతు ధర కూడా రావు, హిందూపురంలో విపరీతమైన నీళ్ల పంచాయతీ...బాలికాక మీద కాక మీదున్న జనాలు, పక్కపొంటే ప్రాజెక్టు ఉన్నా తాగునీళ్లకు కరువు..నిజామాబాద్ దిక్కు పోతున్నది సర్కార్ పొరువు, అర్థకి పావుసేరు ధరకొచ్చిన మిర్చి పంట..పట్టించుకోని ప్రభుత్వాల మీద రైతన్నల మంట, చెరువు కింద బయటపడ్డ మరొక చెరువు..ఇప్పటికన్నా తీరాలే ఏలూరు కరువు ఇలాంటి అంశాలతో ఈ రోజు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

వ్యవసాయ వర్శిటీలకు పూర్వవైభవం తెస్తాం: కేసీఆర్

హైదరాబాద్: వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు పూర్వి వైభవం తెస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. భూసారప పరీక్షల కోసం ల్యాబొరేటర్ల సంఖ్యను పెంచుతామని, రైతు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కార్యక్రమలు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపుతామని, అవసరం అయితే కొత్త చట్టం తెస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

ధాన్యం సేకరణపై ప్రతి రోజూ సమీక్ష: మంత్రిహరీష్ రావు

హైదరాబాద్: ధాన్యం సేకరణపై ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, దాన్యంలో 17శాతంలోపు తేమ ఉండేలా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ఏ రోజు ధాన్యం ఆ రోజే మార్కెట్ నుంచి మిల్లులు, గోదాములకు తరలించాలని తెలిపారు.

19:22 - April 20, 2017

హైదరాబాద్: 2018 చివర్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచింస్తోందా? లోక్ సభ, అసెంబ్లీలకు జమిలిగా నిర్వహణ చేస్తారా? మోదీ నోట ' ఒక దేశం-ఒకేసారి ఎన్నికల' నినాదంతో ముందుకు వస్తున్నారా?అంతర్గాతంగా బిజెపి కసరత్తు ముమ్మరం చేస్తోందా? ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి సీనియర్ రాజకీయ విశ్లేషకులు, కొనసాగల మహేష్ కాంగ్రెస్ నేత, ఆచారి బిజెపి నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్ లు : డీజీపీ సాంబశివరావు

అమరావతి: ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని డీజీపీ సాంబశివరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన రెండు రోజుల పర్యటన ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో రూ.50 లక్షలతో సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, త్వరలో రూ.25 కోట్లతో పోలీస్ వాహనాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం నిమిత్తం స్టేషన్లను పరిశీలిస్తున్నానని, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి చర్యలు చేపడతామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ప్రమోషన్ల జాబితాను తయారు చేయాలని ఈ సందర్భంగా సాంబశివరావు ఆదేశించారు.

శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల

కర్నూలు : శ్రీశైలం డ్యాం నుంచి 2 సూయిజ్ గేట్లు ఎత్తివేసి ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు ఎస్ ఈ మల్లిఖార్జున రెడ్డి తెలిపారు.రోజుకు 14 వేల క్యూసెక్కుల చొప4 నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

జకీరా నాయక్ కు నాన్ బెయిలబుల్ వారెంట్

హైదరబాద్: మతబోధకుడు జకీర్ నాయక్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఒక వారంలో రెండు సార్లు నాయక్ ను నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఎన్ఐఏ జారీ చేసింది.

18:49 - April 20, 2017

తూ.గో : ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కేసు చివరి దశకు చేరింది. ఈ కేసు విచారణ కోసం నియమించిన.. జ‌స్టిస్ సోమ‌యాజులు కమిషన్‌ పలు మార్లు రాజ‌మండ్రిలో పర్యటించింది. 19 నెలలుగా సుదీర్ఘ విచారణ జరిపి..ప‌లువురి వాద‌న‌లు రికార్డ్ చేసింది. ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆధారాలు సేక‌రించింది. కమిషన్‌ సేకరించిన ఆధారాల్లో అనేక దోషాలున్నాయ‌ని...ఈ కేసులో బాధితుల తరపు లాయరు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు.

ఆధారాల్లో తప్పులున్నాయంటున్న బాధితుల తరపు లాయర్‌ ....

చంద్రబాబు సర్కార్ త‌న తప్పును కప్పిపుచ్చుకోవ‌డానికి ప్రయత్నిస్తోందని విప‌క్ష నేతలు విరుచుకుపడుతున్నారు. కేసులో సాక్ష్యాధారాల‌ను మాయం చేశారని ఆరోపిస్తున్న సీపీఎం నేత‌లు...విషయాన్ని క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ కెమెరా ఫుటేజ్ లేద‌ని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు.

సాక్ష్యాధారాలను మాయం చేశారంటున్న సీపీఎం నేతలు. అటు బాధితులు కూడా నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో న్యాయం జరగలేదని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ కుటుంబాల‌ను ఆదుకోవాలని కోరుతున్నారు.

చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు...

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. 2015 గోదావరి పుష్కరాల్లో తొక్కిస‌లాట‌లో 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుష్కర స్నానం చేసిన స‌మ‌యంలో..భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం..గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లో నిలుచుకున్న భ‌క్తులు ఒక్కసారిగా దూసుకురావ‌డం వల్లే తొక్కిస‌లాట జరిగిందని పలువురు ఆరోపించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ వాద‌న‌ను తోసిపుచ్చింది. పుష్కర ఘాట్లలో భ‌క్తుల కోసం స‌క‌ల ఏర్పాట్లు చేశామ‌ని...స‌మ‌న్వయలోపంతోనే తొక్కిసలాట జ‌రిగింద‌ని చెబుతోంది. ఏదీఏమైనా నిజాల నిగ్గు తేల్చేందుకు నియమించిన జస్టిస్‌ సోమయాజులు కమీషన్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 

18:46 - April 20, 2017

తూర్పు గోదావరి :జిల్లాలో టీడీపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ సమయంలో జిల్లాలోని మంత్రుల శాఖలను మార్చడానికే చంద్రబాబు సాహసించలేదు. కానీ ఇప్పుడు జడ్పీ చైర్మన్‌ పదవి విషయంలో టీడీపీ నేతల మధ్య కుంపటి రాజుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఛైర్మన్‌ పదవి విషయంలో మార్పులు జరిగే సూచన ...

తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి విషయంలో మార్పులు జరిగే సూచన కనిపిస్తోంది. జడ్పీ చైర్మన్‌గా ఉన్న నామన రాంబాబును ఆ పదవి నుంచి తొలగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో జ్యోతుల నెహ్రూ తనయుడికి అవకాశం ఇవ్వడానికి టీడీపీ అధినేత నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ....

జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి పార్టీ ఫిరాయించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగినప్పటికీ సామాజిక సమీకరణాల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు ఆయన కుమారుడికి జడ్పీ చైర్మన్‌ పదవి కట్టబెట్టి న్యాయం చేయాలని టీడీపీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

నామన రాంబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి....

అలాగే నామన రాంబాబుకు ఎటువంటి అన్యాయం జరగకుండా... జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏడాదిన్నరగా ఈ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు దీనిని భర్తీ చేయడం అనివార్యంగా మారింది. దీంతో దానిని నామనకు కట్టబెట్టడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించి.. జడ్పీ పదవిని విడిచిపెట్టాలని మంత్రి నారా లోకేష్‌ కూడా సూచించినట్టు తెలుస్తోంది. కాగా నామన రాంబాబును జడ్పీ చైర్మన్‌గా కొనసాగించి.. పార్టీ అధ్యక్ష పదవిని జ్యోతుల నెహ్రూ తనయుడికి కట్టబెట్టవచ్చని కూడా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా.. ఇద్దరిలో ఒకరికి జడ్పీ పీఠం..మరొకరికి పార్టీ పీఠం ఖాయంగా మారింది.  

18:42 - April 20, 2017

కడప: కడప మార్కెట్ యార్డును వైసీపీ నేతలు సందర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌ భాష, రఘురామిరెడ్డిలు.. పసుపు రైతు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

18:40 - April 20, 2017

కడప: జిల్లాలో తమ్ముళ్లను పక్కన పెట్టిన.. తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే తగిలేలా ఉంది. ఇక తాడోపేడో తేల్చుకోవడానికి టీడీపీ సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. దానికి ఫలితమే ఇదిగో ఈ ఆమరణ నిరాహార దీక్ష. తమ ఉనికి కోసం నిరసన బాట పట్టారు.

కడప జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీలో...

కడప జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీలో చెలరేగుతున్న అసంతృప్తి.. పార్టీ అధిష్టానికి తలనొప్పిగా మారుతోంది. జిల్లాలో టీడీపీ పట్టు సాధించడం అంత సులువు కాదన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ మధ్యే వైసీపీలోని బలమైన నాయకత్వాన్ని టీడీపీ అధిష్టానం పార్టీలోకి తీసుకుంది. వైసీపీ నేతలు టీడీపీలోకి రావడాన్ని కొందరు వ్యతిరేకించారు. కానీ పార్టీ పటిష్టత కోసం రాజీ పడ్డారు.

పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన సీనియర్లను కాదని..

పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన సీనియర్లను కాదని.. వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యమివ్వడం.. జిల్లా తెలుగు దేశంలో కాక పుట్టిస్తోంది. ఇటీవలే జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తలు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఆందోళనకు దిగారు. అది చల్లారక ముందే కడప నగరంలో సీనియర్ టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఏకంగా ఎన్టీఆర్‌ విగ్రహం ముందు నిరాహార దీక్షకు దిగారు. అయితే వారి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

వైసీపీలోంచి వచ్చిన వారి హవానే...

ఇప్పుడు కడప జిల్లాలో వైసీపీలోంచి వచ్చిన వారి హవానే నడుస్తోంది. వాళ్లకే కాంట్రాక్టులు, పదవులు, ప్రాధాన్యత దక్కుతోందని టీడీపీ సీనియర్ నేతలు వాపోతున్నారు. ఇటీవల కడప నగరానికి దాదాపు 15 కోట్ల పనులకు నిధులు విడుదల అయ్యాయి. ఇందులో చాలా వరకు వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. సీనియర్ కార్యకర్తల్ని ఎవరినీ పట్టించుకోవడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. మొత్తానికి కడప జిల్లాలో టీడీపీ మినీ వైసీపీగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

18:34 - April 20, 2017
18:05 - April 20, 2017

హైదరాబాద్‌ : ఏసీబీ అధికారులకు పట్టబడ్డ ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు రోజు రోజుకూ బయటపడుతూనే ఉన్నాయి. జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించారు. బాగ్‌ అంబర్‌పేట్‌ ఆంధ్రా బ్యాంక్‌, ఉప్పల్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లలో ఐదు లాకర్లను తెరిచిన అధికారులు రెండు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను గుర్తించారు. 

18:03 - April 20, 2017

విశాఖ : సవాళ్లను ఎదుర్కోడానికి ఇండియన్‌ నేవీ సదా సిద్ధంగా ఉంటుందని .. నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్‌ సునీల్‌లాంబా అన్నారు. విశాఖలో తూర్పునావికాదళ పతకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పొల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి నౌసేనా మెడల్‌తోపాటు విశిష్టసేవా పతకాలను ఆయన ప్రదానం చేశారు. పరిస్థితులను అనుసరించి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామని సునీల్‌ లాంబా అన్నారు. 

18:01 - April 20, 2017

హైదరాబాద్: తెలంగాణలో మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని.... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చీ కొనుగోళ్లు జరపాలని కోరారు.. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డును చాడ వెంకట్‌రెడ్డి సందర్శించారు.. మిర్చి రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు..

17:57 - April 20, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో ఆహారభద్రతా కమిటియే వేయని ప్రభుత్వం సంక్షేమంలో నెంబర్‌ వన్‌ ఎలా అవుతుందని ప్రశ్నించారు పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. దీనిపై తాము త్వరలోనే కార్యాచరణ చేపట్టబోతున్నామన్నారు. ఇక ప్రజాప్రతినిధులకు చర్చించేందుకు అసెంబ్లీ వేదికయితే ప్రజలకు ధర్నాచౌక్‌ వేదిక అన్నారు.కోర్టులు శాంతి భద్రతల పేరుతో నిరసనలు ఆపడం సమంజసం కాదని తెలిపాయి. సంక్షేమ పథకాలను హక్కుగా పొందే చట్టం వచ్చింది. ఆహారభద్రతా చట్టాన్ని అమలుకు పూనుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సమస్యను ఇంకా పటిష్టంగా అమలు చేసే అవకాశం వుంది. సుధీర్ కమిటీని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం వుందని కోదండరామ్ సూచించారు.

గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు పేరు మార్పు..

గుంటూరు : వ్యవసాయ మార్కెట్ యార్డు పేరును ఏపీ ప్రభుత్వం మార్చి వేసింది. ఎన్టీఆర్ మార్కెట్ యార్డుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

బాబుకు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయలేమనడం సరికాదని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని లేఖలో కోరారు. పదో పీఆర్సీ నిబంధనలను వర్తింప చేయాలని కోరారు.

నాబ్ కోసం ఏపీ ఒప్పందం..

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రులకు నాబ్ కోసం క్వాలిటీ ఆఫ్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కామినేని సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. 2018లోగా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఎన్ఏబీహెచ్ పరిధిలోకి తేవాలని నిర్ణయించడం జరిగిందని, రక్త సేకరణ మొబైల్ వాహనాలను సీఎం బాబు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి జిల్లాకు రూ. 40 లక్షల విలువైన ఓ వాహనం కేటాయించడం జరుగుతుందని, స్వచ్ఛమైన రక్తం రోగులకు అందించేలా రక్త నిధి వాహనాలు పనిచేస్తాయన్నారు.

ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ లాకర్లను తెరిచిన ఏసీబీ..

హైదరాబాద్ : ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన లాకర్లను ఏసీబీ తెరిచింది. బాగ్ అంబర్ పేట ఆంధ్రా బ్యాంక్, ఉప్పల్ కొటక్ మహీంద్రా బ్యాంక్ లలో ఐదు లాకర్లను అధికారులు తెరిచారు. కోటికి పైగా బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

మోడీకి గిరిజన యువత సంచలన లేఖ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిరిజన యువత సంచలన లేఖ రాసింది. కాశ్మీర్ లో సైనికులపై రాళ్ల దాడులకు సంబంధించిన ఫొటోలు..వీడియోలు చూసి తమ మనస్సులు రగులుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్య ఎదుర్కొనేందుకు ఒడిసెల దళం రూపొందించడం జరిగిందని, తమ సేవలు వినియోగించుకోవాలని గిరిజనులు కోరారు. కాశ్మీర్ లో అల్లరు జరిగిన సమయంలో తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు.

పాక్ ప్రధానిపై సుప్రీం సంచలన తీర్పు..

ఢిల్లీ : పనామా పత్రాల లీక్ కేసులో పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ భవిష్యత్ నిర్ధేశించేలా తీర్పు ఉంది. అక్రమాస్తుల ఆరోపణలపై జాయింట్ ఇన్వేస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని, 60 రోజుల్లోగా జేఐటీ నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. జేఐటీ ఎదుట హాజరు కావాలని షరీఫ్, ఆయన ఇద్దరు కుమారులకు ఆదేశాలు జారీ చేసింది. 1990 లో రెండు సార్లు ప్రధానిగా ఉన్న సమయంలో షరీఫ్ లండన్ లో అక్రమాస్తులు కూడ బెట్టారని షరీఫ్ పై కోర్టులో విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ తో సహా కొందరు పిటిషన్ దాఖలు చేశారు.

15:54 - April 20, 2017

వయస్సు 36 సంవత్సరాలు..బరువు మాత్రం 500కిలోలు..గుర్తుడే ఉంటుంది కదా. అధిక బరువుతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న 'ఇమాన్ అహ్మద్ అబ్దులాటి'ని ప్రస్తుతం చూసి షాక్ తింటున్నారు. ఇంకా బరువు పెరిగిందా ? అని అనుమానించకండి. ఆమె బరువు తగ్గుతోంది. ఈజిప్టుకు చెందిన ఈ అమ్మాయి బరువు తగ్గించుకోవడానికి భారతదేశానికి వచ్చింది. ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో చేరిపించేందుకు అష్టకష్టాలు పడ్డారు. కార్గో విమానంలో తీసుకరావడం..అక్కడి నుండి టెంపోలో ఆసుపత్రికి...భారీ క్రేన్ సహాయంతో ఆమె పడుకున్న బెడ్ ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లి చికిత్స చేయడం ఆరంభించారు. రెండు నెలల అనంతరం ఆమె శరీరంలో పూర్తి మార్పు వచ్చింది. సగానికి పైగా బరువును ఆమె కోల్పోవడంతో ఇప్పుడు వీల్ చెయిర్ లో కూడా కూర్చొనే స్థితికి చేరుకుంది. గతంలో పోలిస్తే చాలా సన్నగా..సంతోషంగా ఉంటోందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా ఆమెకు ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని తెలిపారు.

15:44 - April 20, 2017

హైదరాబాద్: చుక్కా రామయ్య ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్రొగ్రెస్‌ ట్రస్ట్‌ ద్వారా తెలంగాణాలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య , వసతి అందిస్తున్నట్టు ట్రస్టు కార్యదర్శి దయాకర్‌ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 350 మంది విద్యార్థులకు ఉచిత విద్య, వసతి అందిస్తామని...మే 14న జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు . 1995లో ప్రగతి నగర్‌లో ఏర్పడిన ఈ ట్రస్టు ద్వారా ఉచితంగా విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే వంద పడకలతో పీపుల్స్‌ ఆస్పత్రిని నిర్వహిస్తున్నామని ..త్వరలో వంద గదులతో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తామని తెలిపారు . అలాగే ఎటువంటి లాబాపేక్ష లేకుండా , సామాజిక దృక్పథంతో పీపుల్స్ ట్రస్ట్‌ నిర్వహిస్తున్నారని చుక్కా రామయ్య అన్నారు . సామాజికంగా..రాజకీయంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా విద్య, వసతి అందించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు. 

15:41 - April 20, 2017

హైదరాబాద్ : విమానం హైజాక్‌ అంటూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన వంశీకృష్ణను వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. విమానం హైజాక్‌ చేసేందుకు ఒక ముఠా హోటల్‌ బుక్‌ చేసుకుందని వంశీకృష్ణ ముంబై పోలీసు కమిషనర్‌కు తప్పుడు మెయిల్‌ పంపాడు. ఒక మహిళ పేరిట పంపిన ఈ మెయిల్‌లో విమానం హైజాక్‌ కు కుట్ర పన్నిన ముఠాను అరెస్టు చేయాల కోరాడు. ఇదంతా నిజమనుకుని పోలీసులు నానా హైరానా పడ్డారు. చివరకు ఆరా తీస్తే తప్పుడు సమాచారమని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఒక మహిళ కోసం వంశీకృష్ణ ఈ నాటకం ఆడినట్టు తేల్చిన పోలీసులు, ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ అడ్రస్‌ ఆధారంగా వంశీకృష్ణను అరెస్టు చేశారు. 

15:38 - April 20, 2017

ఒకడు ప్రేమ పేరిట వల విసురుతాడు..వాంఛలు తీసుకుని వదిలేస్తాడు..మరొకడు కట్నం కోసం పెళ్లి చేసుకుంటాడు..ఆ తరువాత సరిపోలేదని చేసుకున్న పెళ్లిని పెటాకులు చేస్తాడు..ఇంకొకడు మరొక కారణం.. ఎవరేం చేసినా దుర్మార్గుల లక్ష్యం అమాయకుల జీవితాలతో ఆడుకోవడమే. మూడు ముళ్లు వేసి తాళిని ఎగతాళి చేస్తున్న వారికి పడుతున్న శిక్షలెన్నీ ? ఇలా వెళ్లి అలా వెళ్లి మరొక అమాయకురాలి జీవితాలను నాశనం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ముగ్గురు అబలలు పోరాటం చేస్తున్నారు. వారు ఎవరు ? పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

15:38 - April 20, 2017

హైదరాబాద్: బాహుబలి 2 కన్నడ మూవీపై నిరసనల ప్రభావం పడకుండా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు.. సోషల్‌ మీడియా పేజ్‌లో వీడియో పోస్ట్ చేసిన జక్కన్న... సినిమా రిలీజ్‌ను అడ్డుకోవద్దంటూ కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. కన్నడలో మాట్లాడిన రాజమౌళి... తనకు కన్నడ భాష సరిగారాదని... ఏవైనా తప్పులుంటే క్షమించాలంటే మాటలు మొదలుపెట్టారు.. చాలాఏళ్లక్రితం సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాహుబలిని అడ్డుకోవద్దని కోరారు.. ఆ వ్యాఖ్యలు కేవలం సత్యరాజ్‌ వ్యక్తిగత అభిప్రాయంమాత్రమేనని స్పష్టం చేశారు.. ఆ విమర్శలతో బాహుబలి యూనిట్‌కు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు.. సినిమాకోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారని జక్కన్న చెప్పారు.. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే రెండో భాగాన్ని కూడా ఆదరించాలని కన్నడ ప్రజలను కోరారు..

15:36 - April 20, 2017

చిత్తూరు : గంగవరం మండలం మబ్బువారిపేటలో దారుణం జరిగింది.. స్కూల్‌లోనే లేడీ టీచర్‌ను ఉపాధ్యాయుడు పొడిచి చంపాడు.. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రేమ కుమారిపై అదే స్కూల్‌లోని టీచర్‌ చంద్రమౌళి కత్తితో దాడిచేశాడు.. తీవ్రగాయాలపాలైన ప్రేమకుమారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది..  

15:29 - April 20, 2017

బాలీవుడ్ భామ 'ప్రియాంక చోప్రా' హాలీవుడ్ లో అదరగొడుతుంది. 'క్వాంటికో' సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ 'బేవాచ్' అనే చిత్రంలో ప్రతి నాయకి పాత్ర పోషిస్తోంది. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే పేరిట సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మే 25వ తేదీన విడుదల కానుంది. తాజాగా 'ప్రియాంక చోప్రా' హాట్ గ్లాసెస్ తో ఉన్న రావిషింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కి క్యాప్షన్ గా గో ఏహెడ్ మరియు స్టేర్ అని రాశారు. 'ఐత్ రాజ్ 'అనే మూవీతో 'ప్రియాంక' బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన విషయం విదితమే. 'బేవాచ్' చిత్రంలో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, కెల్లీ రోహ్రబాక్, అలెజాండ్ర దాద్రిరియో వంటి హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. మంచిర్యాలలో ఏకంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓపెన్ కాస్ట్ బావుల్లో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నగరానికి 'మిషన్ భగీరథ' నీరు - కేటీఆర్..

హైదరాబాద్ : మిషన్ భగీరథ ఫథకం తొలి ఫలాలను హైదరాబాద్ కు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నల్లగండ్ల రిజర్వాయర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

టీచర్ ను పొడిచిన సహా ఉపాధ్యాయుడు..

చిత్తూరు : గంగవరం మండలం సుబ్బువారి పేటలో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలు ప్రేమకుమారిని స్కూల్ లోనే సహా ఉపాధ్యాయుడు చంద్రమౌళి కత్తితో పొడిచాడు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

వరంగల్ : హన్మకొండ సుబేదారి మహిళా పీఎస్ లో మహిళా కానిస్టేబుల్ జమున ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండడం ఏంజీఎంకు తరలించారు.

 

14:55 - April 20, 2017

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు దేశంలోనే ప్రామాణిక విద్యాసంస్థ. ప్రతిభకు పట్టం కట్టిన ప్రతిష్టాత్మ విద్యాసంస్థగా ఖ్యాతి పొందింది. విద్యాప్రమాణాలు, ప్రయోగశాలు, ఇంజినీరింగ్‌ వర్క్‌ షాపులు, బోధన ఆధారంగా నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్ అక్రెడేషన్‌ కౌన్సిల్‌... నాక్‌ ఇచ్చే ర్యాకింగ్స్‌లో ఒకప్పుడు పైపైకి ఎగబాకింది. కానీ కాలక్రమంగా ప్రమాణాలు పతనం కావడంతో ఇప్పుడు గ్రేడింగ్‌ కోల్పోయింది.

గ్రేడింగ్‌లో ఒకప్పుడు దేశంలోనే ముందు ...

నాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా ఏ విద్యాసంస్థలో చదవాలన్న అంశంపై విద్యార్థులు ఒక నిర్ణయానికి వస్తారు. మంచి ర్యాంకు ఉన్న యూనివర్సిటీ చదవాలనుకుంటారు. గ్రేడింగ్‌ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పుడు దేశంలోనే ముందు ఉండేది. 2003లో ఫైవ్‌ స్టార్‌ హోదా సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ ఘనకీర్తి, ఆ తర్వాత దిగిజారిపోయింది. 2008లో A గ్రేడు పొందింది. కానీ యూనివర్సిటీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు నాక్‌ గుర్తింపును కోల్పోయింది.

2013తో ముగిసిన `` గ్రేడు కాలపరిమితి ...

ప్రతి ఐదేళ్లకు ఒకసారి యూనివర్సిటీల్లోని ప్రమాణాలపై నాక్‌ అధ్యయనం చేస్తుంది. 2008లో ఇచ్చిన A గ్రేడు కాలపరిమితి 2013తో ముగిసిపోయింది. కానీ ర్యాకింగ్‌ పునరుద్ధరణ కోసం యూనివర్సిటీ అధికారులు నాక్‌ను సంప్రదించకపోవడంతో గ్రేడింగ్‌కు గ్రహణం పట్టింది. విదేశీ యూనివర్సిటీల్లో చదవాలన్నా, ఉద్యోగాలు పొందాలన్నా ముందుగా విద్యార్థి చదివిన విద్యాసంస్థకు ఉన్న గ్రేడును పరిశీలిస్తారు. అధ్యాపకుల్లో ఎంతమందికి పీహెచ్‌డీ ఉందన్న విషయంపై అధ్యయనం చేస్తారు. ల్యాబ్‌లు, ఇంజినీరింగ్‌ వర్క్‌షాపుల, ఇతర సౌకర్యాలను పరిశీలించి గ్రేడింగ్‌ ఇస్తారు. కానీ నిధుల కొరతతో సతమతమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈ విషయాల్లో వెనకబడిపోవడంతో నాక్‌ గ్రేడింగ్‌ కోల్పోయింది.

గ్రేడింగ్‌ లేకపోవడంతో యూజీసీ నిధులు కోల్పోయిన ఉస్మానియా .....

నాగ్‌ ర్యాంకింగ్‌ కోల్పోవడంతో ఉస్మానియా యూనివర్సిటీకి జరిగిన నష్టం ఇంతా, అంతా కాదు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉంచి వచ్చే కోట్లాది రూపాయల నిధులను కోల్పోయింది. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నిర్వహణ భారంగా మారింది. యూనివర్సిటీకి నాక్‌ గ్రేడింగ్‌ లేకపోవడంతో విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకుంటున్నతమ భవిష్యత్‌ అంథకార బంధురంగా మారుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఉస్మానియా యూనివర్సిటీ గ్రేడింగ్‌ కోల్పోవాల్సి వచ్చిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. నాక్‌ గ్రేడింగ్‌ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, కేంద్రంపై ఒత్తిడి తెస్తే మినహా తిరిగి గుర్తింపు సాధించే అవకాశంలేదు. ఈ లోగా వసతులు మెరుగుపరచాలి. శతాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా నాక్‌ గుర్తింపు కోసం ప్రయత్నిస్తారో... లేదో.. చూడాలి.

------------------

14:49 - April 20, 2017

విశాఖ: రాష్ట్రంలో స్కూల్‌ విద్యార్థినులకు 1లక్షా 80వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. చదుకునే అమ్మాయిలు మధ్యలోనే బడిమానేయకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికోసం 75కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. బడికొస్తా కార్యక్రమంలో విశాఖజిల్లాలో 13వేల సైకిళ్లను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంటా పాల్గొన్నారు. 

14:46 - April 20, 2017

హైదరాబాద్‌: మియాపూర్‌, నల్లగుండలలో.. నూతనంగా నిర్మించిన రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. హడ్కో రుణంతో చేపట్టిన రిజర్వాయర్లు..పైపలైన్ల ద్వారా జూన్‌ నాటికి శివారు ప్రాంతాల్లో నీటి సమస్యను తీరుస్తామని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని..దాని కోసం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్‌ అన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 

14:44 - April 20, 2017

అనంతపురం: నీరుప్రగతి కార్యాక్రమంలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో నీరుప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. వర్షపునీటిని సంరక్షించుకోడానికి పొలాల్లో పంటకుంటలు తవ్వుకోవాలన్నారు. తాగుడు అలవాటు మానుకోవాలని ప్రలజకు పిలుపునిచ్చారు. ప్రజలందరి సమస్యలకంటే తానకే ఎక్కువగా కష్టాలు ఉన్నాయన్నారు చంద్రబాబు .

14:40 - April 20, 2017

కర్నూలు : నంద్యాల సాయిబాబానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే కొడుకును బంధించాడు. నరకయాతనకు గురిచేశాడు. మొదటి భార్య కొడుకు రెహాన్‌ను తండ్రి ఐదు రోజు పాటు ఇంట్లో నిర్భందించారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇంటితాళాలు పగలగొట్టి బాలుడిని రక్షించారు. 

14:10 - April 20, 2017

అనంతపురం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేస్తాం : చంద్రబాబు

అనంతపురం : జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పామిడిలో 'నీరు..ప్రగతి' ఉద్యమం ప్రారంభించారు. నీటి కుంటకు భూమి పూజతో 'నీరు.. ప్రగితి'కి శ్రీకారం చుట్టారు. 'నీరు...ప్రగతి' పైలాన్ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 3,41,163 పంట కుంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పంట కుంటలు తవ్వితే రైతుల కష్టాలు తీరుతాయని చెప్పారు. హంద్రీనీవా కాలువను వెడెల్పు చేసి చెరువులకు నీళ్లిస్తామని తెలిపారు. 

'నీరు...ప్రగతి' పైలాన్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అనంతపురం : పామిడిలో 'నీరు..ప్రగతి' ఉద్యమం ప్రారంభించారు. నీటి కుంటకు భూమి పూజతో 'నీరు.. ప్రగతి'కి శ్రీకారం చుట్టారు. 'నీరు...ప్రగతి' పైలాన్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 3,41,163 పంట కుంటలను సీఎం జాతికి అంకితం చేశారు. 

మంచినీటి సరఫరాను సవాల్ గా తీసుకున్నాం : కేటీఆర్

హైదరాబాద్ : మియాపూర్, కూకట్ పల్లి, నల్లగుండ్లలో రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో మంచినీటి సరఫరాను ఓ సవాల్ గా తీసుకున్నామన్నారు. మిషన్ భగీరథ తొలి ఫలితాలను హైదరాబాద్ కు అందిస్తున్నామని చెప్పారు. నగరంలో పైపు లైన్ ఏర్పాటు బృహత్తర కార్యక్రమమని తెలిపారు. 
11 నెలల ముందే ఐదు రిజర్వాయర్లను పూర్తి చేశామని పేర్కొన్నారు.  

13:43 - April 20, 2017

హైదరాబాద్‌ : మియాపూర్‌, నల్లగుండలలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. హడ్కో రుణంతో చేపట్టిన రిజర్వాయర్లు పైపలైన్ల ద్వారా జూన్‌ నాటికి శివారు ప్రాంతాల్లో నీటి సమస్యను తీరుస్తామని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దాని కోసం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్‌ అన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు.

 

13:38 - April 20, 2017
13:34 - April 20, 2017

అనంతపురం : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అధైర్య పడలేదని ముందుకే వెళ్లామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు 17 కోట్లు ఇన్ పుట్ సబ్సీడి ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో లక్ష వరకు రుణమాఫీ చేస్తే ఉత్తర ప్రదేశ్ లో లక్ష వరకు చిన్న, సన్నకారు రైతులకు రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం రూ.1.50 వేల మాఫీ చేయడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అని ఇక్కడి నుంచి మీకోసం యాత్ర మొదలు పెట్టి 2880 కిలోమీటర్లు నడిచినట్లు తెలిపారు. దేశంలో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే జిల్లాల్లో రెండవది కాబట్టి వర్షపు నీటిని భూమిలోకి పంపాలని సూచించారు. దానికోసమే ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని మొదలు పెట్టామనన్నారు.

మే 10 న తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్ : మే 10 వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 9 వ తేది నుంచి ఏప్రిల్ 10 వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. 

 

13:25 - April 20, 2017

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె 'శృతి హాసన్' 'కత్తి' పట్టారు. తన తదుపరి చిత్రం కోసం ఆమె విన్యాసాలు నేర్చుకొంటోంది. సుందర్ సి.డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. పాత్రలో ఒదిగిపోవాలనే ఉద్ధేశ్యంతో 'శృతి' బాగా కష్టపడుతున్నారంట. పోరాట యోధురాలైన యువరాణి పాత్రను ఆమె పోషించనుంది. దీనితో యుద్ధవిద్యలో నిపుణుడైన ప్రత్యేక శిక్షకుడి పర్యవేక్షణలో కత్తి యుద్దాలకు సంబంధించిన మెళుకవులను నేర్చుకొంటోంది. శృతి విన్యాసాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

13:21 - April 20, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసిపి నేత రోజా మళ్లీ విమర్శలు గుప్పించారు. పాలనలో ప్రజలకు సిన్మా చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బాబు అధికారంలోకి వచ్చి 3ఏళ్లు గడిచినా.. రాష్ట్రానికి కరువు తప్ప వేరేం మిగలలేదన్నారు. ముడుపులు, మోసాలు , అరాచకాలతో బాబు పాలన వెలిగిపోతోందన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 వందల హామీల్లో ఒక్కదాన్ని కూడా ప్పూర్తిగా నెరవేర్చలేదని రోజా ఆరోపించారు.ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు చినబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వెంటనే ప్రమోషన్ పై మంత్రి పదవి కూడా ఇచ్చారని ఎద్దేవా చేశారు.

రాజ్ భవన్ కు చేరుకున్న తమిళ రాజకీయాలు

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రాజ్ భవన్ కు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్ తో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రి జయకుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్ కు వివరించారు. 

 

మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరైన హిమాచల్ ప్రదేశ్ సీఎం

సిమ్లా : మనీలాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు సీఎంను విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. 

 

12:56 - April 20, 2017
12:55 - April 20, 2017

అన్ని రకాల ఉత్పత్తుల్లో మహిళలదే కీలక పాత్ర. కానీ వారి శ్రమకు గుర్తింపు మాత్రం రావటం లేదు. కుటుంబ సభ్యుల వ్యవహారం నుండి మొదలుకొని అన్ని పనులు వాళ్లే చూసుకొంటుంటారు. వంట‌, ఇంటిశుభ్రం, పిల్ల‌ల పెంపకం, అతిధి మ‌ర్యాదలు, పెద్ద‌వారికి సేవ‌లు…ఇవ‌న్నీ ప్ర‌పంచంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక నిరంత‌ర ప్ర‌వాహంలా జ‌రిగిపోతున్నాయి. ఉత్ప‌త్తికి అనుకూలంగా ప్ర‌పంచాన్ని నిర్వ‌హిస్తున్న‌ది ఎవరు ? ప్ర‌పంచంలో ఆర్థికం కాని ఏకైక అంశంగా మ‌హిళా శ్ర‌మ ఇప్ప‌టికీ మిగిలి ఉంది. కానీ సమాజంలో మహిళ అంటే ఇంకా చులకన భావం ఉంది. పురుషులతో సమానంగా వేతనాలు ఇంకా అందడం లేదు. ప్రతి రంగంలో మహిళలు చేస్తున్న శ్రమ అసమానం. మరి వారికి ప్రాధాన్యం ఎక్కడ...? మహిళలుకు సరైన గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మానవి 'ఫోకస్'. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:52 - April 20, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. పన్నీరు సెల్వం సీఎం సీటుపై పట్టుపట్టడంతో పళని వర్గం ఒప్పుకోవడం లేదు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావుతో తంబిదురై భేటీ అయ్యారు. భేటీకి ముందు ఆయన ఇరు వర్గాలతో చర్చించారు. పళని స్వామికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి కేంద్రం రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పళని స్వామి వర్గం ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్ మాయం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతర్ నుంచి ఓ ప్రయాణికుడి బ్యాగ్ మాయం అయింది. బ్యాగులో 10 గ్రాముల బంగారం, పాస్ పోర్టు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 

టీఆర్ ఎస్ లో హరీష్ రావును పక్కన పెడుతున్నారు : ఉమేష్ కుమార్

హైదరాబాద్ : టీఆర్ ఎస్ లో ముసలం పుట్టిందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఉమేష్ కుమార్ అన్నారు. టీఆర్ ఎస్ లో హరీష్ రావును పక్కన పెడుతున్నారని పేర్కొన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు, పనిమంతుడు.. అలాంటి వారు కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. హరీష్ ను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 
అవమానపడుతూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నారు. హరీష్ రావుకు కాంగ్రెసే సరైన పార్టీ అని పేర్కొన్నారు. 

12:41 - April 20, 2017

లండన్ : భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీని విదేశాల్లో కూడా ఆదరిస్తుంటారు. పలు దేశాల్లో ఆయన విగ్రహాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. గాంధీ చిత్ర పేరిట ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి. స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ మహాత్ముడి చిత్రం పేరిట ఉన్న నాలుగు స్టాంపుల వేలం వేసింది. ఈ వేలంలో పలువురు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 5లక్షల పౌండ్లు పాడి చేజిక్కించుకున్నాడు. భారత కరెన్సీలో దాదాపు రూ. 4.1 కోట్లు. ఓ భారత స్టాంప్ కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని పలువురు పేర్కొంటున్నారు. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు అక్కడి నిర్వాహకులు పేర్కొనట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం నాలుగింటిని మాత్రమే వేలం వేయగా మరో నాలుగు ఫిలాటెలిక్ కలెక్షన్ హౌస్ లో ఉన్నట్లు సమాచారం.

చంద్రబాబుకు బర్త్ డే విషెష్ తెలిపిన కేసీఆర్

హైదరాబాద్ : ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు. తెలంగాణ సీఎం కేసీఆర్.. చంద్రబాబుకు బర్త్ డే విషెష్ తెలిపారు. 

గవర్నర్ ను కలిసిన సీఎం పళనిస్వామి వర్గీయులు

చెన్నై: సీఎం పళనిస్వామి వర్గీయులు ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతోపాటు పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 

 

12:25 - April 20, 2017

హైదరాబాద్ : గాంధీ భవన్ కు తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చేరుకున్నారు. టీపీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి..భవిష్యత్ లో చేపట్టబోయే చర్యల గురించి చర్చిస్తున్నారు. ఖాళీగా ఉన్న డీసీసీ పదవుల భర్తీపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు చేయాలని ఈ సందర్భంగా నేతలకు దిగ్విజయ్ సింగ్ సూచించారు.

12:23 - April 20, 2017

ఓయూ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం

హైదరాబాద్ : ఓయూ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణపై మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.  

అగ్రిగోగల్డు ఆస్తుల వేలం ప్రక్రియలో వేగం పెంచాలి : పోతిన మహేష్

విజయవాడ : అగ్రిగోగల్డు ఆస్తుల వేలం ప్రక్రియలో వేగం పెంచాలని అగ్రిగోల్డ్ బాధితుల కో..ఆర్డినేటర్ పోతిన మహేష్ అన్నారు. అగ్రిగోల్డు ఆస్తులను కొందరు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు వెంటనే చెల్లించాలని కోరారు. 
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని చెప్పారు. 

అగ్రిగోల్డు బాధితుల ధర్నాకు జనసేన నేతల మద్దతు

విజయవాడ : ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డు బాధితులు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డు బాధితులు చేస్తున్న ధర్నాకు జనసేన నేతలు మద్దతు తెలిపారు. 

 

12:03 - April 20, 2017

వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నేచురల్ స్టార్ 'నాని' మరింత జోరు పెంచాడు. టాలీవుడ్‌లో ఏ హీరోకు లేన‌ట్టుగా 'నాని'కి ప్ర‌స్తుతం ఆరు వ‌రుస హిట్లు ఉన్నాయి. ఓ వైపు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు ఒక్క హిట్ కొట్టేందుకు నానా తంటాలు ప‌డుతుంటుంటే 'నాని' మాత్రం విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. గతేడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈసారి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. శివ నిఆర్మణ దర్శకత్వం వహిస్తున్న 'నిన్ను కోరి' షూటింగ్ చివరి దశలో ఉంది. అనంతరం 'దిల్' రాజు నిర్మాణ సంస్థలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా 'ఎమ్ సీఏ' చిత్రాన్ని చేయబోతున్నారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి' అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే తనతో 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' చిత్రం తీసిన హను రాఘవమూడి దర్శకత్వంలోనే 'నాని' మరో చిత్రం చేయబోతున్నారు. ఆగస్టులో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

11:50 - April 20, 2017

రష్యా టెన్నిస్ స్టార్...ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్..షరపోవా మళ్లీ వస్తోంది..ఏప్రిల్ నెల నుండి టెన్నిస్ బ్యాట్ ను పట్టనుంది. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన షరపోవా రెండేళ్లు పాటు నిషేధం విధించారు. దీంతో రియో ఒలింపిక్స్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు. ముందుగా రెండేండ్లు విధించగా, తరువాత దాన్ని 15 నెలలకు తగ్గించిన విషయం తెలిసిందే. అనంతరం షరపోవా మళ్లీ మైదానంలో ప్రవేశించినుంది. ఈ నెల 24 నుంచి జర్మనీలో జరిగే డబ్ల్యూటీఎ స్టట్గార్ట్‌ ఓపెన్‌లో షరపోవా పాల్గొంటుంది. 26వ తేదీన షరపోవా తొలి మ్యాచ్‌ జరుగుతుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఆమె బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ అనంతరం మాడ్రిడ్‌ ఓపెన్‌, ఇటాలియన్‌ ఓపెన్‌ల్లో కూడా షరపోవా బరిలో దిగనుంది.

ప్రజలను మోసగిస్తోన్న కేంద్రం : చలసాని శ్రీనివాస్

విజయవాడ : ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ముష్టి రూ.50 కోట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏం సాధించారని వెంకయ్యను సన్మానిస్తున్నారని అడిగారు. ఉమ్మడి ఆస్తులను అడగడానికి సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కేంద్రం పెద్దలను ఎందుక నిలదీయరన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెటాట్టరని ఆరోపించారు. 

'బడికొస్తా' కార్యక్రమం ప్రారంభం

విశాఖ : బడికొస్తా కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థినులకు 13 సైకిళ్లు పంపిణీ చేశారు. ఇకపై అన్ని సెట్ లు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామన్నారు. 

11:39 - April 20, 2017

విజయవాడ : నమ్ముకున్న సంస్థ రోడ్డున పడేసింది... గడ్డుకాలంలోనూ చేదోడుగా నిలిచిన కార్మికుల పొట్టగొట్టింది. కొన్ని నెలలుగా జీతాలివ్వక... అవస్థలు పాలు చేసింది. సంస్థను మూసివేసి శాశ్వతంగా వారిని రోడ్డుపాలు చేసింది.ట్రావెల్స్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగిన కేశినేని ట్రావెల్స్‌ మూతబడింది. దీంతో ఆ సంస్థనే నమ్ముకుని జీవిస్తున్న సిబ్బంది భవిష్యత్తు అంధకారమైంది. దాదాపు 500 మందికి పైగానే కేశినేని ట్రావెల్స్‌ను నమ్ముకుని జీవిస్తున్నారు. సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా... అన్నం పెడుతుందన్న భావనతో ఆకలి బాధలు చంపుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. నాని మీద ఉన్న అభిమానంతో అవమానాలు పడ్డారు. రెండు షిఫ్టుల పనిని ఒక్కరే చేసేవారు. నెలల తరబడి వేతనాలివ్వకున్నా ట్రావెల్స్‌ను ముందుండి నడిపించారు. కానీ సంస్థ మాత్రం కార్మికుల పట్ల నిర్ధాక్షణ్యంగా ప్రవర్తించింది.. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా.. కార్యాలయం చుట్టూ తిప్పించుకుంది.. అదిగో...ఇదిగో అంటూ కాలం వెల్లబుచ్చింది.. చివరికి సంస్థను మూసివేసి మొండి చేయి చూపింది.

ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి....
డ్రైవర్లందరికీ గత నెల 26న ఫోన్లు చేసి.. బస్సులను విజయవాడలోని రామవరప్పాడు రింగ్‌ వద్ద షెడ్‌లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. బస్సుల పర్మిషన్లలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని ..రెండు, మూడు రోజుల్లో బస్సులు తిరుగుతాయని చెప్పడంతో వారంతా బస్సులను తీసుకువచ్చారు. జీతాలు గురించి అడిగితే ఏప్రిల్‌ 15వ తేదీలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు.. ఈరోజుకి జీతాలు పడలేదు. దీంతో కార్మికులు ఎంపీ కేశినేని నాని కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గత 20ఏళ్లుగా కేశినేని ట్రావెల్స్‌లో పనిచేస్తున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా వెళ్లిపోమంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంపీ నాని సమాధానం చెప్పాలంటూ కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి కార్మికుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదని వామపక్ష నేతలు మండిపడ్డారు. అయితే కేశినేని ఉద్యోగుల ఆందోళన సబబు కాదని, సంస్థ నష్టాల్లో ఉన్నందున కొంత ఆలస్యమౌతుందని కేశినేని నాని కార్యాలయం సిబ్బంది అంటున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తారని ఓపిక పట్టాలని చెబుతున్నారు.

బొలెరో వాహనం బోల్తా...

చిత్తూరు : తిరుమల 2 వ ఘాట్ లింక్ రోడ్డు వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. 

గాంధీభవన్ లో టీపీసీసీ సమావేశాలు

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీపీసీసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. బ్లాక్, మండల కమిటీల నియామకంపై చర్చిస్తున్నారు.

ఏడేళ్ల కుమారుడిని ఇంట్లో నిర్బంధించిన తండ్రి

కర్నూలు : నంద్యాల సాయిబాబానగర్ లో దారుణం జరిగింది. తండ్రి ఏడేళ్ల కుమారుడిని ఐదు రోజులుగా ఇంట్లో నిర్బంధించాడు. రెహాన్ ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఇంటి తాళాలు పగలగొట్టి బాలుడిని రక్షించారు. 

 

11:25 - April 20, 2017

చెన్నై : తమిళనాడులో అన్నాడీఎంకేలో హైడ్రామా కొనసాగుతోంది. నిన్నటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఆశించిన పన్నీరు సెల్వం నేడు ఏకంగా సీఎం సీటుకే ఎసరు పెట్టారు. అంతేకాకుండా పొయెస్ గార్డెన్ ను జయలలిత స్మారక చిహ్నంగా మార్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు పదవిని వదులుకోవడానికి సీఎం పళనిస్వామి విముఖం చూపిస్తున్నారు. కాసేపట్లో పన్నీరు వర్గీయులు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి పన్నీరు సెల్వం, పళని స్వామిలు సమావేశం అయ్యే అవకాశ ఉంది.

ముగ్గురు ఐసిస్ అనుమానితుల అరెస్టు

ఢిల్లీ : యూపీ, ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. జలంధర్, ముంబై, బిజ్నూర్ లలో ముగ్గురు ఐసిస్ అనుమానితులను అరెస్టు చేశారు. 

అన్నాడీఎంకేలో కొనసాగుతోన్న పొలిటికల్ హైడ్రామా

చెన్నై : అన్నాడీఎంకే లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఓపీఎస్, ఇపీఎస్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీఎం సీటు కోసం పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారు. పదవిని వదులుకోవడానికి సీఎం పళనిస్వామి విముఖంగా ఉన్నారు. పొయెస్ గార్డెన్ జయలలిత స్మారక చిహ్నంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో పన్నీర్ సెల్వం వర్గీయులు భేటీ అయి...భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సాయంత్రానికి పన్నీర్ సెల్వం, పళనిస్వామి భేటీ అయ్యే అవకాశం ఉంది. 

ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డు బాధితులు ధర్నా

విజయవాడ : ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డు బాధితులు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డు బాధితులు చేస్తున్న ధర్నాకు జనసేన నేతలు మద్దతు తెలిపారు. 

 

11:13 - April 20, 2017

ముంబై : ప్రముఖ గాయకుడు సోనూనిగమ్‌ గుండు గీయించుకున్నాడు. దీంట్లో వింత ఎముందనుకున్నారా. ప్రార్థన ఆలయాలు, మసీదులపై సోనూ చేసిన ట్వీట్లు దుమారం రేపాయి. సోనూకి గుండు కొట్టించి వూరేగించినవారికి 10లక్షలు ఇస్తానని పశ్చిమ బెంగాల్‌కి చెందిన మతగురువు మౌలావి ఫత్వా జారీ చేశాడు. దీనిపై సోనూ స్పందిస్తూ గుండు గీయించుకోవడానికి సిద్ధమని ప్రకటించాడు. అన్నప్రకారం సోను గుండు గీయించేసుకుని మీడియా ముందుకు వచ్చాడు. తాను చెప్పినట్లే గుండు గీయించుకున్నానని... 10లక్షలు తీసుకురావాలని సోనూ మీడియా ద్వారా మౌలావిని డిమాండ్‌ చేశారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలలో చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను 'గూండాగిరీ'గా అభివర్ణిస్తూ సోనూ నిగమ్‌ ట్వీట్లు చేయడంతో వివాదం రేగింది. తాను లెఫ్టిస్ట్, రైటిస్టు కానని...తనకు దేనితో సంబంధం లేదని సోను చెప్పుకొచ్చాడు.

11:08 - April 20, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు దేశంలోనే ప్రామాణిక విద్యాసంస్థ. ప్రతిభకు పట్టం కట్టిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా ఖ్యాతి పొందింది. విద్యాప్రమాణాలు, ప్రయోగశాలు, ఇంజినీరింగ్‌ వర్క్‌ షాపులు, బోధన ఆధారంగా నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్ అక్రెడేషన్‌ కౌన్సిల్‌... నాక్‌ ఇచ్చే ర్యాకింగ్స్‌లో ఒకప్పుడు పైపైకి ఎగబాకింది. కానీ కాలక్రమంగా ప్రమాణాలు పతనం కావడంతో ఇప్పుడు గ్రేడింగ్‌ కోల్పోయింది.

నాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా..
నాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా ఏ విద్యాసంస్థలో చదవాలన్న అంశంపై విద్యార్థులు ఒక నిర్ణయానికి వస్తారు. మంచి ర్యాంకు ఉన్న యూనివర్సిటీ చదవాలనుకుంటారు. గ్రేడింగ్‌ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పుడు దేశంలోనే ముందు ఉండేది. 2003లో ఫైవ్‌ స్టార్‌ హోదా సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ ఘనకీర్తి, ఆ తర్వాత దిగిజారిపోయింది. 2008లో A గ్రేడు పొందింది. కానీ యూనివర్సిటీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు నాక్‌ గుర్తింపును కోల్పోయింది.

యూనివర్సిటీల్లోని ప్రమాణాలపై నాక్‌ అధ్యయనం
ప్రతి ఐదేళ్లకు ఒకసారి యూనివర్సిటీల్లోని ప్రమాణాలపై నాక్‌ అధ్యయనం చేస్తుంది. 2008లో ఇచ్చిన A గ్రేడు కాలపరిమితి 2013తో ముగిసిపోయింది. కానీ ర్యాకింగ్‌ పునరుద్ధరణ కోసం యూనివర్సిటీ అధికారులు నాక్‌ను సంప్రదించకపోవడంతో గ్రేడింగ్‌కు గ్రహణం పట్టింది. విదేశీ యూనివర్సిటీల్లో చదవాలన్నా, ఉద్యోగాలు పొందాలన్నా ముందుగా విద్యార్థి చదివిన విద్యాసంస్థకు ఉన్న గ్రేడును పరిశీలిస్తారు. అధ్యాపకుల్లో ఎంతమందికి పీహెచ్‌డీ ఉందన్న విషయంపై అధ్యయనం చేస్తారు. ల్యాబ్‌లు, ఇంజినీరింగ్‌ వర్క్‌షాపుల, ఇతర సౌకర్యాలను పరిశీలించి గ్రేడింగ్‌ ఇస్తారు. కానీ నిధుల కొరతతో సతమతమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈ విషయాల్లో వెనకబడిపోవడంతో నాక్‌ గ్రేడింగ్‌ కోల్పోయింది.

నాగ్‌ ర్యాంకింగ్‌ కోల్పోయిన ఉస్మానియా..
నాగ్‌ ర్యాంకింగ్‌ కోల్పోవడంతో ఉస్మానియా యూనివర్సిటీకి జరిగిన నష్టం ఇంతా, అంతా కాదు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉంచి వచ్చే కోట్లాది రూపాయల నిధులను కోల్పోయింది. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నిర్వహణ భారంగా మారింది. యూనివర్సిటీకి నాక్‌ గ్రేడింగ్‌ లేకపోవడంతో విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకుంటున్నతమ భవిష్యత్‌ అంథకార బంధురంగా మారుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా...
అధికారులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఉస్మానియా యూనివర్సిటీ గ్రేడింగ్‌ కోల్పోవాల్సి వచ్చిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. నాక్‌ గ్రేడింగ్‌ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, కేంద్రంపై ఒత్తిడి తెస్తే మినహా తిరిగి గుర్తింపు సాధించే అవకాశంలేదు. ఈ లోగా వసతులు మెరుగుపరచాలి. శతాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా నాక్‌ గుర్తింపు కోసం ప్రయత్నిస్తారో... లేదో.. చూడాలి.

తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు

చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య సయోధ్య కుదరడం లేదు. కాసేపట్లో తన వర్గీయులతో పన్నీర్ సెల్వం భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.  

10:56 - April 20, 2017

మహాభారతం...భారీ బడ్జెట్ తో వెండితెరపై తెరకెక్కించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని ఇటీవల టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అప్పుడే దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. బహుభాషా చిత్రంగా 1000 కోట్లతో ఈ సినిమాను బి.ఆర్.శెట్టి నిర్మించనున్నట్లు, శ్రీకుమార్ మీనన్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు టాక్. భీముడిగా మోహన్ లాల్, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్, అర్జునుడిగా హృతిక్ రోషన్ పేర్లను ఖరారు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీ కృష్ణుడి పాత్ర కోసం పలువురి సెలబ్రెటీల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహాభారతంలో శ్రీ కృష్ణుడి పాత్రను పోషించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణుడి పాత్రకు 'మహేష్ బాబు' పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర పట్ల మహేష్ కూడా ఆసక్తిని కనబరుస్తున్నట్లు టాక్. మరి శ్రీ కృష్ణుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

10:48 - April 20, 2017

రాంగోపాల్ వర్మతో సినిమా చేయాలని ఉందని మలయాళ సూపర్ స్టార్ తన అభిమతాన్ని తెలిపారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఎక్కే వర్మ పలు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం లేదు. దీనితో పలువురు హీరోలు వర్మపై ఆసక్తిని కనబరుస్తుండడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'సర్కార్ 3’ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం 'వర్మ'తో సినిమా చేయాలని ఉందని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. మలయాళంలో వరుస విజయాలతో ‘మోహన్ లాల్’ దూసుకపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య తెలుగు సినిమాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి. అంతేగాకుండా ప్రముఖ హీరోల సినిమాల్లో ఆయన నటించి మెప్పిస్తున్నారు. బాలీవుడ్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలనుకున్నారేమో 'వర్మ' దర్శకత్వంలో చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. గతంలో వర్మ సినిమా 'కంపెనీ' లో మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. మరి వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మూడు ఇళ్లల్లో చోరీ...

సూర్యాపేట : జిల్లాలోని దుండగులు చోరీకి పాల్పడ్డారు. చిలుకూరు మండలం బేతవోలులో గత రాత్రి మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. 22 తులాల బంగారం, నగదు, బైక్‌ను దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

10:27 - April 20, 2017

మెదక్‌ : తాను వరి కోస్తే తనకు రూ.100..మంత్రికి రూ.200 ఇచ్చారని అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం పలువురు నేతలు కూలీలుగా మారుతున్నారు. వారు కొద్దిసేపు చేసిన కూలీ పనికి వేలాది రూపాయలు దక్కుతున్నాయి. తాజాగా అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా కూలీగా మారారు. ఫరీద్ పూర్ లోని పంట పొలాల్లోకి దిగి వరి కోశారు. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. జిల్లాలో అత్యధికంగా వరి సాగు కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. వరి పోలాల్లోకి రాగానే ఎంతో సంతోషంగా ఉందన్నారు. వరి సాగు పెరగడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కారణమన్నారు. తనకు వరి కోసినందుకు రూ.100 ఇచ్చారని తెలిపారు.

నేడు హైదరాబాద్‌కు దిగ్విజయ్

హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్‌సింగ్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. నాంపల్లిలోని గాంధీభవన్‌లో జిల్లాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. ఈ సమీక్షలలో దిగ్విజయ్ సింగ్ పాల్గొననున్నారు. అనంతరం నేతలకు ఆయన పలు సూచనలు చేయనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు సమాచారం.

 

10:18 - April 20, 2017

పెద్దపల్లి : గుర్తింపు ఎన్నికలు జరపాలని వారు విధులు బహిష్కరించడమే నేరమా ? వారు విధులు బహిష్కరించడంతో తమకు నష్టం వాటిల్లిందని కోర్టును యాజమాన్యం ఆశ్రయించడం..కార్మికులకు నోటీసులు జారీ చేయడం..వారిపై యాజమాన్యం వేటు వేయడం జరిగిపోయాయి.
ఇదంతా జిల్లాలోని బసంత్ నగర్ కేశోరామ్ సిమెంట్ సంస్థలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గుర్తింపు ఎన్నికలు జరపాలని కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించారు. దీనిపై యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు విధులు బహిష్కరించిన కార్మికులకు నోటీసులు జారీ చేసింది. దీన్ని సాకుగా చూపుతూ యాజమాన్యం ఆ కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీనిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించిన వారిని విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు.

వివాహిత సజీవదహనం

విశాఖపట్టణం : జిల్లాలో విషాదం నెలకొంది. కారులో మంటలు చెలరేగి వివాహిత సజీవదహనం అయింది. దంపతులు కారులో విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఎస్.రాయవరం మండలం గడ్డపాడు వద్ద కారులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. కారులో నుంచి భర్త బయటపడ్డాడు. కారులో చిక్కుకుపోయిన భార్య సజీవదహనమైంది. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

10:15 - April 20, 2017

దేశంలో అమానవీయ దృశ్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట విషాదమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే పలువురు తమ సభ్యుల మృతదేహాలను మోసుకెళ్లిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మరో విషాదం వెలుగు చూసింది. దంతేవడాలోని ఒక గిరిజన యువకుడు బిజ్జీ (37) మృతి చెందాడు. అడవి పంది దాడి చేయడంతో అతను కన్నుమూశాడు. ఈ ప్రమాదంపై గ్రామస్తులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని చెప్పారు. మృతదేహాన్ని తీసుకరావాలని ఆదేశించారు. కానీ పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వాహనాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. మృతదేహాన్ని తీసుకరావడానికి మృతుడి కుటుంబసభ్యుల్లో ఎవరికీ వాహనం లేదు. చేసేది ఏమీ లేక మృతదేహాన్ని మంచానికి కట్టేసి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంధువుల రోదనల మధ్య మృతదేహాన్ని తీసుకెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమ్యంలో వైరల్ అయిపోయాయి. దీనిపై పోలీసులు స్పందిచంఆరు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం..వారి కుట్రలో భాగమని ఆరోపణలు గుప్పించడం గమనార్హం.

కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో 21 మంది కాంట్రాక్టు కార్మికుల సస్పెన్షన్

పెద్దపల్లి : బసంత్ నగర్ లోని కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో 21 మంది కాంట్రాక్టు కార్మికులను సస్పెండ్ చేశారు. మార్చి 27న సమాచారం ఇవ్వకుండా ఆందోళన చేయడంతో నష్టం వాటిల్లిందంటూ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కోర్టు నోటీసులతో కార్మికులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఎన్నికలు నిర్వహించమని యాజమాన్యం నోటీసు బోర్డు వేసింది.

09:50 - April 20, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలకు విచ్చేసే ప్రతినిధులకు ఘనంగా ఆతిధ్యం ఇచ్చేందుకు గులాబీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వంటకాలన్నీ మెనూలో చేర్చారు. ఈ జాబితాలో 26 రకాల నోరూరించే వంటకాలున్నాయి. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా.. ప్రతినిధులకు నోరూరించే రుచులు అందజేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. తెలంగాణలో గుర్తింపు పొందిన అన్ని వంటకాలను మెనూలో చేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

15 వేల మంది ప్రతినిధులకు భోజనం..
ప్రతినిధుల సభకు హాజరయ్యే 15 వేల మంది ప్రతినిధులకు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోది ఫుడ్‌ కమిటీ. దాదాపు ఆరు భోజనశాలలను ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతినిధుల అవసరాల కోసం దాదాపు వెయ్యి మంది వాలంటీర్లు స్వచ్చందంగా సేవలు అందించనున్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు.. వేసవిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ మజ్జిగ, అంబలి, చల్లటి నీరు అందేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సభా ప్రాంగణంలో ప్రత్యేక భోజనశాల...
ఇక కేసీఆర్‌ సహా 50 ప్రముఖులు భోజనం చేసేందుకు సభా ప్రాంగణంలో ప్రత్యేక భోజనశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజనశాలల్లో రద్దీ లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులు, అనుచరులు, మీడియా ప్రతినిధులు, డ్రైవర్లు, గన్‌మెన్లకు వేర్వేరు చోట్ల డైనింగ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్లీనరీ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ ప్లీనరీ సమావేశాలకు పాసులు ఉన్నవారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిచ్చనున్నారు. భారీగా తరలిరానున్న ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.... ఇద్దరు మృతి

ఢిల్లీ : కాశ్మీర్ గేట్ వద్ద పాదాచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి ఇంటర్ విద్యార్థిని అరెస్టు చేశారు. 

 

09:48 - April 20, 2017

ఢిల్లీ : తమకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో వీడియో పోస్టు చేసిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ పై వేటు పడింది. సర్వీసు నుండి తొలగిస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. కానిస్టేబుల్‌ హోదా కలిగిన జవాను తప్పుడు అభియోగాలు మోపినట్టు దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకునేందుకు అతనికి మూడు నెలల గడువు వుంటుంది.
సరిహద్దు వెంబడి రాత్రి..పగలు అనే తేడా లేకుండా ఎంతో మంది జవాన్లు పహార కాస్తుండడం తెలిసిందే. వీరికి నాణ్యమైన భోజనం..ఇతరత్రా సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ బీఎస్ఎఫ్ జవాన్ యాదవ్‌ సామాజిక మాధ్యమంలో మూడు వీడియోలు పోస్టు చేశారు. ఈ వీడియోలు వైరల్ అయిపోయాయి. వీడియోలు పోస్టు చేసిన తర్వాత అతనిని జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా నియంత్రణ రేఖ వద్దకు బదిలీ చేశారు. తనను వేధిస్తున్నారంటూ మార్చిలో మరో వీడియోను బహదూర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

09:39 - April 20, 2017

ఢిల్లీ : డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణా రాష్ట్రం టాప్‌టెన్‌లో నిలిచింది. డిమానిటైజేషన్‌ నేపథ్యంలో.... ప్రభుత్వ అనుసరించిన ముందస్తు ప్రణాళికపై కేంద్ర ఆర్థికశాఖ సైతం ప్రశంసల వర్షం కురిపించింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆన్‌లైన్‌ ట్రాన్జక్షన్స్‌ జరిగేలా ప్రజలను చైతన్య పర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దనోట్ల రద్దుతో దేశం మొత్తం అతలాకుతలమైంది. అన్ని రాష్ట్రాలు ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఫలితంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటి పది రాష్ట్రాల్లో స్థానం సంపాదించుకుంది. గోవా, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలు ముందు వరుసలో నిలవగా.. తెలంగాణ ఆరోస్థానాన్ని సాధించింది.

టాప్‌టెన్‌లో నిలిచిన అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ..
డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం టాప్‌టెన్‌లో నిలిచిన అతిపెద్ద రాష్ట్రమని కేంద్ర ఆర్థిక శాఖ అభివర్ణించింది. ప్రజలకు తొలుత కొంత సమస్య వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని నిలదొక్కుకుందని కితాబునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 15కోట్ల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గతేడాది నవంబర్‌ వరకు స్వైపింగ్‌ మిషన్లు 34 వేలు ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 61 వేలకు చేరింది. అలాగే ఏటీఎంల సంఖ్య 8 నుంచి 9 వేల మధ్యలో ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 62,745 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.31 కోట్లుగా ఉంది.

 

09:32 - April 20, 2017

గుంటూరు : గోదావరి పుష్కరాల తొక్కిసలాట కేసు ద‌ర్యాప్తు ముగింపు ద‌శ‌కు చేరింది. ఈ ఘటనకు బాధ్యులెవ‌రన్న దానిపై 19 నెల‌లుగా సుదీర్ఘ విచార‌ణ సాగింది. విచారణలో భాగంగా.. వివిధ వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించారు. జ‌స్టిస్ సోమ‌యాజులు నేతృత్వంలోని క‌మిష‌న్ పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, బాధితుల వాద‌నలు విన్నది. ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కేసు చివరి దశకు చేరింది. ఈ కేసు విచారణ కోసం నియమించిన.. జ‌స్టిస్ సోమ‌యాజులు కమిషన్‌ పలు మార్లు రాజ‌మండ్రిలో పర్యటించింది. 19 నెలలుగా సుదీర్ఘ విచారణ జరిపి..ప‌లువురి వాద‌న‌లు రికార్డ్ చేసింది. ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆధారాలు సేక‌రించింది.

ఆధారాల్లో అనేక దోషాలు....
కమిషన్‌ సేకరించిన ఆధారాల్లో అనేక దోషాలున్నాయ‌ని...ఈ కేసులో బాధితుల తరపు లాయరు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ త‌న తప్పును కప్పిపుచ్చుకోవ‌డానికి ప్రయత్నిస్తోందని విప‌క్ష నేతలు విరుచుకుపడుతున్నారు. కేసులో సాక్ష్యాధారాల‌ను మాయం చేశారని ఆరోపిస్తున్న సీపీఎం నేత‌లు...విషయాన్ని క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ కెమెరా ఫుటేజ్ లేద‌ని చెప్పడం విడ్డూరంగా ఉంద‌ంటున్నారు.

నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో
అటు బాధితులు కూడా నష్టపరిహారం చెల్లింపు విష‌యంలో న్యాయం జరగలేదని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ కుటుంబాల‌ను ఆదుకోవాలని కోరుతున్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. 2015 గోదావరి పుష్కరాల్లో తొక్కిస‌లాట‌లో 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుష్కర స్నానం చేసిన స‌మ‌యంలో..భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం..గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లో నిలుచుకున్న భ‌క్తులు ఒక్కసారిగా దూసుకురావ‌డం వల్లే తొక్కిస‌లాట జరిగిందని పలువురు ఆరోపించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ వాద‌న‌ను తోసిపుచ్చింది. పుష్కర ఘాట్లలో భ‌క్తుల కోసం స‌క‌ల ఏర్పాట్లు చేశామ‌ని...స‌మ‌న్వయలోపంతోనే తొక్కిసలాట జ‌రిగింద‌ని చెబుతోంది. ఏదీఏమైనా నిజాల నిగ్గు తేల్చేందుకు నియమించిన జస్టిస్‌ సోమయాజులు కమీషన్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

09:24 - April 20, 2017

ఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అద్వాని, మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతితో సహా 12 మంది బిజెపి నేతలపై కేసు పునరుద్ధరణకు సిబిఐకి కోర్టు అనుమతించింది. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి రెండు కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో కొనసాగుతోంది. కరసేవలకుపై నమోదైన కేసు లక్నో కోర్టులో.. బిజెపి నేతలకు ప్రమేయమున్న కేసు రాయ్‌బరేలి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసును ఒకే కోర్టులో ఎందుకు విచారణ జరపకూడదని అంతకు ముందు జరిపిన విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణను నాలుగు వారాల్లో రాయ్‌బరేలీ నుంచి లక్నో కోర్టుకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లక్నో కోర్టులో విచారణ సందర్భంగా వాయిదాలకు అనుమతి ఇవ్వొద్దని, ఈ కేసు విచారణ జరిపే న్యాయమూర్తిని బదిలీ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కల్యాణ్‌సింగ్‌కు మినహయింపు...
రాజస్థాన్‌ గవర్నర్‌గా ఉన్న యూపీ మాజీ సిఎం కల్యాణ్‌సింగ్‌కు మాత్రం ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున తర్వాత విచారణ చేపట్టాలని సూచించింది. వినయ్‌ కటియార్, సాధ్వి రితంబర తదితరులు ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంది. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్‌సింగ్‌ వంటి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే లక్షలాది మంది కరసేవకులు మసీదును కూల్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో సీబీఐ ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అద్వానీ సహా ఇతర నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించింది.

09:12 - April 20, 2017

హైదరాబాద్ : ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని అసెంబ్లీ సాక్షిగా గొప్పగా చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..అంతలోనే వెనకడుగు వేసింది. ఇంటర్ అడ్మిషన్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయని.. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌తో వాటికి చెక్‌పెడతామంది.. కానీ ఈ ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్‌ కష్టమని తేల్చిచెప్పడం విద్యార్థి లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం పడుతుందని..
ఇంటర్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానం అమల్లోకి వస్తే.. కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం పడుతుందని విద్యార్థులు భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు.. విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానానికి మద్దతు తెలిపినా.. ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గిందో సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు, కార్పోరేట్ కాలేజీలు సగానికి పైగా అడ్మిషన్లు పూర్తి చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ అమలైతే తమ కాలేజీలో కాక వేరే కాలేజీలో సీటు రావొచ్చని.. సొమ్ము వెనక్కి ఇచ్చే పరిస్థితి వస్తుందని ఊహించి కార్పోరేట్ శక్తులు ప్రభుత్వంతో ములాఖత్ అయ్యారని మండిపడుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఇంటర్మిడియట్ అడ్మిషన్లు ఆన్‌లైన్లో చేపట్టి గ్రామీణ పేద విద్యార్ధులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.

09:02 - April 20, 2017

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ (35) తల్లి కాబోతోంది. త్వరలో తాను తల్లి కాబోతున్నట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ప్రస్తుతం తాను 20 వారాల గర్భవతి అని పేర్కొంది. రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఓహానియన్ తో సెరెనా విలియమ్స్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ గత డిసెంబర్ లో నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు స్నాప్ చాట్ లో తన ఫొటో కూడా పెట్టింది. కానీ కొద్దిసేపటి అనంతరం ఆ ఫొటోను తొలగించింది. ఈ పోస్టును చూసిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళౄ టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విషెష్ చెప్పింది. మార్చిలో జరిగిన ఇండియన్ వేల్స్ టోర్నీ నుండి మోకాలి గాయంతో తప్పుకుంటున్నట్లు సెరెనా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

మే 5న ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌

హైదరాబాద్ : మే 5న ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 8 వ తేదీ నుంచి 22వ తేది వరకు గడువు ఇవ్వనున్నారు. రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు. రూ. 200 ఆలస్య రుసుముతో మే 23, 24 తేదీల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో జూన్ 12 నుంచి తరగతులను నిర్వహించాలని దోస్త్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) సమావేశంలో నిర్ణయించారు. 

 

08:12 - April 20, 2017

ఢిల్లీ :పరిపాలనలో మార్పు తేవాలని, తనదైన మార్కు కనిపించాలనేది మోదీ తపన. అందుకోసమే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా లోక్‌సభతో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2018 చివరిలో జమిలి ఎన్నికలు నిర్వహించి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది.

నాచియప్పన్‌ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ...
దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇదే అంశంపై యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ సభ్యుడు నాచియప్పన్‌ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని నియమించారు. 2015 డిసెంబర్‌ 17న తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించారు. జమిలి ఎన్నికలకు ఆ కమిటీ సై చెప్పింది. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరగడం, దీని వల్ల వ్యయ భారం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దీంతో చాలామంది జమిలి ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాల గడువును పొడిగించడం లేదా తగ్గించడం
ఇక జమిలి ఎన్నికల నిర్వహణ కోసం అనేక మార్గాలను కమిటీ నిర్దేశించింది. రాష్ట్ర శాసనసభ గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల సంఘానికి ఇచ్చిన అధికారాన్ని మరింత విస్తృతపరచాల్సిన అవసరముంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఈ అధికారాలను ఇవ్వాలి. జమిలి ఎన్నికలు నిర్వహణకు అనుగుణంగా ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల గడువును ఎన్ని నెలలైనా పొడిగించడం లేదా తగ్గించడం చేస్తే సరిపోతుందని నాచియప్పన్‌ కమిటీ పేర్కొంది.

కమిటీ వేయాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది
జమిలి ఎన్నికల నిర్వహణ సాధాసాధ్యాలను పరిశీలించడంతోపాటు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రంలో కొందరు సీనియర్‌ మంత్రులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో చేయాల్సిన సవరణలను కూడా ఈ కమిటీనే సూచించనున్నట్లు తెలిసింది. ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలతో చర్చలు కూడా జరిపి అందర్నీ జమిలి ఎన్నికల కోసం ఒప్పించే బాధ్యతను కూడా ఈ కమిటీకే మోదీ కట్టబెట్టనున్నట్లు తెలిసింది.

రాజ్యాంగ సవరణ చేయాలి...
ఇది ఒకే అయితే.. 2019 జూన్‌ వరకు గడువు ఉన్న లోక్‌సభకు 2019 జనవరి నుంచి జూన్‌లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. అయితే ఈ గడువు పొడిగించేందుకు గానీ... కుదించేందుకు వీలుండదు. అలాగే లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ నిబంధనను దేశంలోని 29 రాష్ట్రాల్లోని సగానికి పైగా రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఎన్నికలకు ఇంకా గడువు ఉన్నా రాష్ట్రాలు అంగీకరిస్తాయా ? అనే సందేహాలు ప్రధాని మోదీ తన ఆలోచనను ఇప్పటికే ఎన్డీయే సమావేశంలో మిత్రపక్షాలతో పంచుకున్నారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ అధికారిక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, దాని మిత్రపక్షాలు 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా ముఖ్యమంత్రులంతా జమిలికి సూత్రప్రాయంగా అంగీకరించారు.

2018 ఆఖరిలో లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు
2018 ఆఖరిలో లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ యోచిస్తున్నారు. దాదాపు 2018 నాటికి 17 రాష్ట్రాల అసెంబ్లీ గడువు అటూఇటూగా ముగియనుంది. మరోవైపు అంతకుముందే ముగిసే రాష్ట్రాల అసెంబ్లీ గడువును జమిలి ఎన్నికల వరకు పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల గడువు తగ్గించాల్సి ఉంటుంది. ఈ కోవలోకి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కింలు వస్తాయి. ఈ రాష్ట్రాలకు 2019 ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్న తలెత్తుతంఉది. అయితే దీనికి రెండేళ్ల కాలాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. 2018 ఆఖరునాటికి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలన్నింటిని జమిలిలో చేరుస్తారు. ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ పదవీకాలం ఉన్న రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని 2023 వరకు పొడిగిస్తారు. దీంతో 2023లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన చూసుకుంటే... 2018లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, రాజస్థాన్‌, ఏపీ, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, ఢిల్లీ బీహార్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతాయి. 2021 ఏప్రిల్‌, మే వరకు కాలపరిమితి ఉన్న అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో ఇటీవలే ఎన్నికలు జరిగిన గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీల గడువును 2023 వరకు పొడిగించి.. అప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే ఆయా ప్రభుత్వాలు మరో రెండేళ్లు అధికారంలో కొనసాగుతాయి. అయితే.. అప్పటివరకు పదవీకాలాన్ని పొడిగించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. రాష్ట్రాపతి పాలన విధించే అవకాశముంది. జమిలి ఎన్నికల వల్ల దేశంలో శరవేగంగా జరుగుతుందని మోదీ భావిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ భారం భారీగా తగ్గుతుందంటున్నారు. దీనివల్ల సమయం, డబ్బు కలిసి వస్తాయంటున్నారు. అయితే..

కేంద్రంలో సంకీర్ణం ఏర్పడి కుప్పకూలిపోతే...
జమిలి ఎన్నికల నిర్వహణపై మేధావులు అనేక సందేహాలు వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. కేంద్రంలో సంకీర్ణం ఏర్పడి.. అది ఐదేళ్లకే కుప్పకూలిపోతే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే ఈ జమిలి ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదం నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తానికి వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న బీజేపీ.. జమిలి ఎన్నికలతో మరింత లబ్ధి పొందేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. మరిన్ని మోదీ ఆలోచనకు ఇతర పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

08:01 - April 20, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌2 లీకేజీ కేసులో కీలక సూత్రధారి ఎస్.బీ సింగ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఎస్.బీ సింగ్‌ సహా అతని అనుచరుడు అనూప్‌కుమార్‌ను యూపీలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎస్.బీ సింగ్‌ 2005 నుంచి పలు పశ్నాపత్రాలు లీక్‌ చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. తొమ్మిదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 12సార్లు ప్రశ్నపత్రాలు లీక్‌చేసినట్లు నిర్ధారించారు.

ఢిల్లీలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి...
తెలంగాణ ఎంసెట్‌ -2 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కీలక సూత్రధారి శివ బహదూర్ సింగ్‌ని సీఐడీ పోలీసులు హైదరాబాద్ తరలించారు. ఎస్బీ సింగ్‌ తో పాటు అతని సహాయకుడు అనూప్‌ కుమార్‌ అలియాస్ సోనీను కూడా ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రశ్నాపత్రం బయటకు తెచ్చింది ఎస్‌బి సింగేనని సీఐడీ అధికారులు తెలిపారు. ఎస్బీసింగ్‌ 2005 నుంచి పలు ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

అనేక చోట్ల లీక్ చేసినట్లు...
ఇతనికి 9 ఏళ్లుగా 12 ప్రశ్నాప్రతాలతో సంబంధం ఉన్నట్లు తేలింది. దేశంలో అనేక చోట్ల నిందితులు పలు ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి.. లక్నో రైల్వే గ్రూప్-డి, 2008లో అలహాబాద్‌లో రైల్వే డ్రైవర్స్ పరీక్ష, 2015లో పంజాబ్‌ టెట్‌, పీఎస్‌సీ పరీక్ష లీకేజికి సంబంధించి రెండు కేసులు, 2015లో జమ్ము కశ్మీర్ టీచర్ల ప్రవేశపరీక్ష, కోల్‌ ఇండియా కేసు, మహారాష్ట్రలో వార్ధా మెడికల్ కాలేజీ ఎంట్రెన్స్, చండీగఢ్ టీచర్ల ప్రవేశ పరీక్ష. కోల్‌కతా టెట్, 2016 డిసెంబర్‌లో డీఎంఆర్‌సీ పరీక్ష పేపర్ లీకేజి కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. జౌన్‌పూర్‌ న్యాయస్థానంలో నిందితులను హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్ తరలించారు.

 

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

అమరావతి : నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు. ప్రధాని మోడీ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

 

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

అమరావతి : నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు. గవర్నర్ నరసింహన్ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

 

07:52 - April 20, 2017

మెదక్‌ : రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తామని.. ఎవరూ తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని హరీష్‌రావు అన్నారు. జిల్లాలోని ఫరీద్‌పూర్‌లో మంత్రి పర్యటించారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు విరాళం కోసం పంటపొలాల్లో హరీష్ రావు తొలికోత చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ఘణనీయంగా సాగు పెరగడంతో రైతు ముఖాల్లో ఆనందం చూస్తున్నామన్నారు.  

07:46 - April 20, 2017

పుడిమడకలో వివిధ కంపెనీల నుంచి విష వ్యర్థాలను సముద్రంలోకి మోసుకొచ్చే పైప్ లైన్ ను నిర్మించొద్దని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం నాయకులు అప్పలరాజు అన్నారు. ఇవాళ్టి జనపథంలో కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మత్య్యకారులు చేస్తున్న ఆందోళన పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. పైప్ లైన్ నిర్మించి మత్స్యకారుల పొట్టకొట్టద్దన్నారు. పైపు లైన్ వేయడం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు కొత్త కష్టాలొస్తున్నాయి. మత్స్యకారుల జీవనోపాధికే ప్రమాదం వాటిల్లే రోజులొస్తున్నాయి. దాదాపు 50 కంపెనీల నుంచి విడుదలయ్యే విషపూరిత వ్యర్థాలను పుడిపడక సముద్రతీరంలో కలిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం పైప్ లైన్ నిర్మించేందుకు ఏపిఐఐసి ప్రయత్నిస్తోంది. ఈ పైప్ లైన్ నిర్మాణం జరిగితే, మత్స్య సంపదకు పెనుశాపంగా మారుతోంది. వివిధ కంపెనీల నుంచి విష వ్యర్థాలను సముద్రంలోకి మోసుకొచ్చే పైప్ లైన్ కి వ్యతిరేకంగా మత్సకారుల సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. మరోవైపు మొన్న 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు సముద్రంలో చేపలవేట నిషేధం అమలులోకి వచ్చింది'. ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

 

తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో 
మూడు రోజుల ముందు నుంచే స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కడియం శ్రీహరి 
ఇవాళ్టి నుంచి సెలవులు ప్రకటించారు. 

07:09 - April 20, 2017

 

గుంటూరు : ఏపీలో రైతు సమస్యలపై పోరాటానికి ప్రతిపక్ష వైసీపీ సిద్ధమైంది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోన్న పార్టీ అధినేత జగన్‌.. రెండు రోజుల పాటు దీక్షను చేపట్టనున్నారు. గుంటూరులో అధినేత దీక్షకు వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.

రైతులకు గిట్టుబాటు..

ఏపీలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్‌తో మరో పోరాటానికి విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. పార్టీ అధినేత జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రెండు రోజుల పాటు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు గుంటూరును వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో దీక్ష చేయనున్నట్టు వైసీపీ ప్రకటించింది.

మిర్చి ధరలు పడిపోతున్నాయి..
ఇటీవల గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వైసీపీ ఆరోపణ. ఇటీవలే పార్టీ అధినేత జగన్‌.. గుంటూరు మిర్చియార్డును సందర్శించి, రైతుల కష్టాలను తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఉదాసీనత.....
పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మిర్చి మాత్రమే కాకుండా ఇతర పంటలకూ మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉందని ఆయన భావిస్తున్నారు. పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు వచ్చిన రైతులను దళారులు మోసం చేస్తున్నారనీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌, ఈనెల 26, 27 తేదీలలో దీక్షకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రారంభించాయి. 

07:04 - April 20, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు, దిగువస్థాయి సిబ్బంది అందరూ... ఒకే బ్లాకులో ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. వివిధ పనులపై సచివాలయానికి వచ్చే సామాన్యులు... ఏ అధికారి ఎక్కడ ఉన్నారో వెతుకున్నే పనిలేకుండా నిర్మాణాలు ఉండాలని సీఆర్ డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
తొమ్మిది వందల ఎకరాల్లో పరిపాలన నగరం 
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన పరిపాలనా నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తొమ్మిది వందల ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరం ఎలా ఉండాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షించారు. కొత్త సచివాలయంలో మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండే విధంగా నిర్మాణాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు, ఆయా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది ఒకే చోట పనిచేసే విధంగా సెక్రటేరియట్‌ నిర్మాణాలు చేపట్టాలని సీఆర్‌డీఏ అధికారులను చంద్రబాబునాయుడు ఆదేశించారు. పరిపాలనా నగరంలో నిర్మించే సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ భవనాలపై నార్మన్‌ అండ్‌ పోస్టర్స్‌ రూపొందిస్తున్న డిజైన్ల పురోగతిపై కూడా చంద్రబాబు సమీక్షించారు.
27 టౌన్‌ షిప్‌లు, సీడ్‌ యాక్సిస్‌ రోడ్లు...
అమరావతిలో నిర్మించే నవ నగరాలు, 27 టౌన్‌ షిప్‌లు, సీడ్‌ యాక్సిస్‌ రోడ్ల పురోగతిపై కూడా చంద్రబాబునాయుడు సమీక్షించారు. రాజధానికి దారితీసే ప్రతి రోడ్డు జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానంగా ఉండాలని ఆదేశించారు. అన్ని రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కోరారు. వెలగపూడి సచివాలయం రోడ్లపై వేసిన స్పీడ్‌ బ్రేకర్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో.. లేవో.. పునఃపరిశీలించాలని సూచించారు. కృష్ణానదిలోని సప్త ద్వీపాలను వెంటనే స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణానదిపై నిర్మించే అద్భుత వంతెను ఆకృతులను వచ్చే జూన్‌ 15 లోగా సిద్ధం చేయాలని కోరారు.

 

 

నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనంతపురం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. 

నేడు పంజాబ్, ముంబై ఐపీఎల్ మ్యాచ్

హైదరాబాద్ : ఐపీఎల్ 10 లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇండోర్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

06:57 - April 20, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక భూమా, శిల్పా వర్గాల్లో చిచ్చు రేపుతోంది. తాము పోటీ చేస్తామంటే.. తామే పోటీ చేస్తామని ఇరు వర్గాలు సిద్ధమవుతున్నాయి. తన తండ్రి అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో పోటీ చేసే అవకాశం తమకే దక్కుతుందని భూమా అఖిలప్రియ అంటుండగా.. ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన కేడర్‌ చెదిరిపోతుందని శిల్పా మోహన్‌రెడ్డి అంటున్నారు. దీంతో చంద్రబాబు ఇరు వర్గాలతో చర్చలు ప్రారంభించారు.
నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీలో హీట్‌
భూమా నాగిరెడ్డి అకాల మృతితో ఖాళీ అయిన నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీలో హీట్‌ పెరుగుతోంది. ఖాళీ అయిన స్థానం తమ కుటుంబానికే చెందుతుందని మంత్రి అఖిలప్రియ చెబుతుండగా.. ఖచ్చితంగా తానే పోటీ చేస్తానని నంద్యాల టీడీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి చెబుతున్నారు. అయితే.. ఈ ఇద్దరు నేతలు సీఎం చంద్రబాబును కలవడంతో పోటీ చేసేందుకు ఎవరికి అవకాశం దక్కుతుందా అనే టెన్షన్‌ పెరిగిపోయింది.
పార్టీ మారనున్న శిల్పా మోహన్‌రెడ్డి 
గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైన్నట్లు తెలుస్తోంది. అయితే.. చివరి నిమిషంలో రంగంలోకి దిగిన మంత్రులు, నేతలు శిల్పాను చంద్రబాబు దగ్గరకు తీసుకువచ్చారు. చంద్రబాబుతో భేటీ అయిన శిల్పా సోదరులు గంటసేపు నంద్యాల ఉప ఎన్నికపై చర్చించారు. తన నిర్ణయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్‌ను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేనని చెప్పినట్లు శిల్పా మోహన్‌రెడ్డి తెలిపారు. అయితే తొందరపడవద్దని చంద్రబాబు సూచించారన్నారు. మండలి చైర్మన్‌ పదవి తమ్ముడికి ఇచ్చినా.. నేను పోటీలో లేకుంటే కేడర్‌ చెదిరిపోతుందని నూటికి నూరుపాళ్లు పోటీ చేయాలనుకుంటున్నట్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు శిల్పా మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
శిల్పా సోదరులు బాబుతో భేటీ
ఇక ఉప ఎన్నికపై మంత్రి అఖిలప్రియ కూడా స్పందించారు. శిల్పా సోదరులు బాబుతో భేటీ అయ్యేందుకు వచ్చిన సమయంలో ఆమె కూడా చంద్రబాబును కలిశారు. సాధారణంగా మంత్రి, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుందని.. ఆ మేరకు అందరూ సహకరిస్తారనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. మొత్తానికి ఉప ఎన్నిక ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరి ఈ సమస్యను చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. 

 

 

 

 

నేడు బడుగు, బలహీన వర్గాల గర్జన సభ

టీఎస్ : తాండూరులో నేడు బడుగు, బలహీన వర్గాల గర్జన సభ నిర్వహించనున్నారు.  హామీలకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
దిగ్విజయ్, కొప్పుల రాజు, కుంతియా హాజరు కానున్నారు. 

Don't Miss