Activities calendar

21 April 2017

21:35 - April 21, 2017

హైదరాబాద్: జేసీ దివాకర్‌రెడ్డి సోదరులు జగన్‌పై నోరు పారేసుకోవడం మానుకోవాలని వైసీపీ హితవు చెప్పింది. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. జేసీ సోదరులు దుర్భాషతో ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. 

21:16 - April 21, 2017

మరావతి: కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్‌ భేటీలో ఉద్యోగుల బదిలీలకు ఆమోద ముద్ర పడింది.. మే 1 నుంచి 31లోపు

ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.. మే 5 లోపు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అన్నిశాఖల ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారుల్ని ఆదేశించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు.. అలాగే బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని సీఎం ఆదేశించారు... అలాగే నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గింపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది..

కోఠి ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలకు ఇన్ ఫెక్షన్

హైదరాబాద్: కోఠి ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలకు ఇన్ ఫెక్షన్ సోకింది. ఆపరేషన్ తర్వాత బయటి ఆసుపత్రులకు డాక్టర్లు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందారు. కోఠీ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసిన వారిలో ఇద్దరు మృతి చెందారని వైద్య శాఖ తెలిపింది. మరో మహిళ హైబీపీతో మృతి చెందిందని, ఓ మహిళకు రెండో సర్జరీ జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఘటనలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ముగిసిన ఏపి కేబినెట్ సమావేశం

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపి కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25 నుండి వచ్చే నెల 24 వరకు ఉద్యోగుల బదిలీలు కౌన్సిలింగ్ విధానంలోనే ఉద్యోగుల బదిలీల ప్ర్రకియ చేపట్టాలని, మే 18 నుంచి 28 వరకు కౌన్సిలింగ్ పూర్తి చేయాలని, మే 5 లోపు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అన్ని శాఖల ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. నాలా పన్ను 9 శాతం నుంచి 3శాతానికి తగ్గిస్తూ కేబినెట్ ఆమోదించింది.

20:08 - April 21, 2017

హైదరాబాద్: యమునోళ్లనే ఉరికొచ్చి చంపిన లారీ...చిత్తూరు జిల్లాలో 20 ప్రాణాల హరి, పడమర దిక్కు పసందైన పార్టీ ప్లీనరీ...మళ్లా అధ్యక్షుడైన కల్వకుంట్ల పెద్దసారూ, సోషల్ మీడియా పీక కోసే పనిలో చంద్రం...యజ్ఞాలజీ నేతకే టెక్నాలజీ తిప్పలు,కూరగాయలు అమ్మిన కొండా సురేఖ...హోటళ్ల కూలీలైన పాలమూరు నేతలు, ఉద్యమ తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తాం... కొత్తపార్టీ వస్తుందన్న గద్దరన్న, భూమి తీసుకునేదాకా భూలక్ష్మి...భూమి లాక్కున్నక బోడలచ్చిమి. ఇలాంటి అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

టీఆర్ ఎస్ ప్లీనరీలో ఏడు తీర్మానాలు ఆమోదం

హైదరాబాద్: టీఆర్ ఎస్ ప్లీనరీలో ఏడు తీర్మానాలను ఆమోదించారు. కొంపల్లిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఒక్కో తీర్మానాన్ని ఒక్కో సభ్యుడు ప్రతిపాదించగా మిగిలినవారు దానికి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సంక్షేమంలో స్వర్ణయుగంపై తొలి తీర్మానాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో నూతనాధ్యాయంపై నిరంజన్‌రెడ్డి రెండో తీర్మానం ప్రవేశపెట్టారు. మూడో తీర్మానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం-వృత్తి పనులకు ప్రోత్సాహం అంశాన్ని కొండా సురేఖ ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.

19:43 - April 21, 2017

చిత్తూరు :జిల్లా ఏర్పేడులో లారీ దూసుకెళ్లడంతో 20మంది రైతులు చనిపోవడం బాధాకరమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. అధికారపార్టీ నేతల ఇసుక దందాను వ్యతిరేకిస్తున్న రైతులపై లారీ దూసుకెళ్లడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

19:41 - April 21, 2017

చెన్నై: త‌మిళ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు వ‌ల్లియూర్ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. మ‌హాభార‌తంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా కమల్‌హాసన్‌ హిందూ మతాన్ని అవమానించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వడానికి మే 5న కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని కమల్‌ను ఆదేశించింది. ఇంత‌కుముందు తిరునల్వేలీ కోర్టులోనూ హిందు మ‌క్కల్ క‌చ్చి స‌భ్యులు పిల్ దాఖ‌లు చేశారు. మ‌హాభార‌తంలో ద్రౌప‌దిని ఓ పావులాగా వాడుకొని పాండ‌వులు జూద‌మాడార‌ని, అలాంటి పుస్తకాన్ని హిందువులు గౌర‌విస్తున్నార‌ంటూ క‌మ‌ల్‌హాస‌న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ ఛానల్‌లో మహిళలపై దాడుల గురించి మాట్లాడుతూ కమల్‌ మహాభారతాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

19:40 - April 21, 2017

హైదరాబాద్: ముంబై దాడుల మాస్టర్‌ మైండ్‌ హఫీజ్‌ సయీద్‌కు ఉగ్రవాదంతో సంబంధం ఉందని పాకిస్తాన్‌ పేర్కొంది. హఫీజ్‌ ఉగ్రవాదేనంటూ లాహోర్‌ హైకోర్టులో పాకిస్తాన్‌ హోంశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. పాక్‌ ప్రభుత్వం తనను చట్ట విరుద్ధంగా కొన్ని నెలలుగా నిర్బంధంలో ఉంచిందని పేర్కొంటూ జమాత్‌-ఉద్‌-దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పాకిస్తాన్‌ హోంశాఖ- హఫీజ్‌ సయీద్‌కు ఉగ్రవాదంతో సంబంధం ఉందని ప్రమాణపత్రంలో పేర్కొంది. యాంటీ టెర్రరిజం యాక్ట్‌ ప్రకారం సయీద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లో శాంతి భద్రతలను అస్థిర పరుస్తున్నారని హఫీజ్‌పై ఆరోపణలున్నాయి. 

19:36 - April 21, 2017

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయం మూడు పువ్వులు ఆరుకాయల్లా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు... కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నకిలీ విత్తనాల నిరోధానికి, ఈనెల 27 తర్వాత మరోసారి అసెంబ్లీని సమావేశపరిచి, కఠినమైన చట్టాన్ని తీసుకు వస్తామన్నారు. కొంపల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.... ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ఘనంగా టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశం....

హైదరాబాద్‌ శివారులోని కొంపల్లిలో టీఆర్ఎస్‌ ప్లీనరీ ఘనంగా జరిగింది. ప్లీనరీ ప్రారంభసూచికగా గులాబీ దళపతి కేసీఆర్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం, ప్రారంభోపన్యాసం చేసిన కేసీఆర్‌.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలకు 40వేల కోట్లు కేటాయించామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. రైతే రాజన్న దాన్ని నిజం చేస్తామని, ఆదిశగా రైతులకు రెండు పంటలకూ ఎకరాకు 4వేల చొప్పున పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఏడాది మేలో 4వేలు, అక్టోబర్‌లో మరో 4వేలు అందించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్ధికసాయంలో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండబోదని, రైతులు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

ప్రతిపల్లెకూ కృష్ణా, గోదావరి నీటిని సరఫరా...

ఆరునూరైనా ఈ ఏడాది చివరినాటికి తెలంగాణలోని ప్రతిపల్లెకూ కృష్ణా, గోదావరి నీటిని సరఫరాచేసి ప్రజల దాహార్తిని తీర్చుతామని కేసీఆర్‌ హమీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యుత్‌ కష్టాలను అధిగమించామన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారు.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం ...

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్‌ హెచ్చరించారు. నకిలీ విత్తనతయారీ దారులపై ఇకనుంచి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిన మొత్తాన్ని ఆయా కంపెనీల నుంచే వసూలు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలు...

టీఆర్ఎస్‌ ప్లీనరీ నిర్వహించిన హైదరాబాద్‌ శివారులోని కొంపల్లి.. గులాబీ వర్ణశోభితమైంది. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ఎక్కడ చూసినా గులాబీ బ్యానర్లు, ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. నేతల ఉపన్యాసాలు, కళాకారుల ఆటపాటలతో ప్లీనరీ సమావేశాలు ఉత్సాహంగా సాగాయి. .... స్పాట్‌...

కార్యక్రమానికి ముందు.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు.. మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. తనను మళ్లీ ఎన్నుకున్న పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్లీనరీలో వివిధ అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. మరోవైపు, ప్లీనరీకి వచ్చిన నేతలు, కార్యకర్తలకు నిర్వాహకులు పసందైన వంటకాలను వడ్డించారు. దాదాపు 29 రకాల వంటలను రుచి చూపించారు. మటన్‌ బిర్యానీ, హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, చేపల పులుసు, కోడిగుడ్డు పులుసుతోపాటు వెజ్‌ వంటకాలను అతిథులు ఆరగించారు. ప్లీనరీ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

19:33 - April 21, 2017

అమరావతి: ఏపీ ముఖ్యమత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారన్న భావన వ్యక్తమవుతోంది. విజయవాడలోని చంద్రబాబు నివాసంలో, శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీ ఈమేరకు సంకేతాలను వెలువరించింది. రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు పాల్గొన్న ఈ భేటీలో, ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చిన చంద్రబాబు.. వివిధ పార్టీల బలాబలాలను విశ్లేషించారు.

సర్వే ఫలితాలను మదింపు చేసిన చంద్రబాబు

పార్టీ తరచుగా నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలను కూడా చంద్రబాబు సమన్వయ కమిటీ భేటీలో మదింపు చేశారు. గత సంవత్సరంతో పోల్చితే, టీడీపీ ఓట్ల శాతం 16.13 శాతానికి పెరగ్గా, వైసీపీ ఓట్ల శాతం 13.45 శాతానికి తగ్గిందని చంద్రబాబు వివరించారు . ప్రస్తుత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, కొత్త ఓటు బ్యాంకును సమకూర్చుకోవాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా, ఇకపై ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి పార్టీ వ్యవహారాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెడతానని చంద్రబాబు తెలిపారు. విమర్శలు ఎక్కుపెడుతున్న సొంత పార్టీ నేతలపై సీరియస్‌గా ఉంటానన్న సీఎం, ఇసుక విషయంలో కొందరు నేతల స్వార్థం, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు.

మహానాడు నిర్వహణపై చర్చ...

మహానాడు నిర్వహణ గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో, ఓసారి రాయలసీమలో నిర్వహించిన కారణంగా ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించాలని నేతలు చంద్రబాబుకు సూచించారు. తెలంగాణ పార్టీ నేతలతో చర్చించాక వేదిక ఖరారు చేద్దామని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ , పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని, సమర్థ నాయకులను సంస్థాగత ఎన్నికల కమిటీల్లో నియమించాలని సూచించారు. 

ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చిన చంద్రబాబు

అమరావతి: చంద్రబాబు ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికలకు మరెంతో సమయం లేదని, ప్రజలతో కలిసి నడుస్తూ.. ప్రభుత్వ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి మరింత చేరువ చేయాలని హితబోధ చేశారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు లో కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన మహిళ టీవి సెట్ లో బంగారం పెట్టి తీసుకొచ్చిన మహిళ నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

తలాబ్ కట్ట కలప గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: పాతబస్తీలో తలాబ్ కట్ట కలప గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

19:13 - April 21, 2017

చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమరవాణా పై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రైతులు చేస్తున్న ఆందోళనను కవర్ చేయడానికి వచ్చిన వివిధ వార్తా పత్రికల విలేకరులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

18:29 - April 21, 2017

చిత్తూరు: ఏర్పేడు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియానే ఈ ప్రమాదం చేయించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియాపై రైతులు... 6 నెలలుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై గతంలోనూ పలుమార్లు తహశీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో.. ఇవాళ ఆందోళనకు దిగారు. లారీ ప్రమాదానికి వారే రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:27 - April 21, 2017

హైదరాబాద్: గాంధీభవన్‌లో హస్తం నేతలు కొట్టుకున్నారు.. దిగ్విజయ్‌ సింగ్‌ముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి కొట్టుకున్నారు.. కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లాకే పరిమితం కావాలని నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.. దీనిపై రాజగోపాల్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.. నారాయణరెడ్డిని బ్రోకర్‌ అని దూషించారు.. ఇందికాస్తా ముదరడంతో ఇద్దరూ గొడవపడ్డారు.

హస్తం నేతల మధ్య గొడవలు ఏమీలేవు- నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు...

హస్తం నేతలమధ్య వార్‌పై నల్లగొండ డీసీసీ ప్రెసిడెంట్‌ భిక్షమయ్య స్పందించారు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిమధ్య చిన్న వాగ్వాదంమాత్రమే జరిగిందని స్పష్టం చేశారు.. ఆ తర్వాత దిగ్విజయ్‌ సింగ్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేశారంటున్నారు.

టీఆర్ ఎస్ పార్టీకి భారీగా విరాళం

హైదరాబాద్: టీఆర్ ఎస్ పార్టీకి ఎంపి మల్లారెడ్డి, సలీం కోటి రూపాయల చొప్పున, చినపరెడ్డి రూ. 25 లక్షల విరాళం ఇచ్చారు. చెక్కులను రాజ్యసభ సభ్యుల కేకేకు అందజేశారు.

గాంధీభవన్ లో కొట్టుకున్న నేతలు

హైదరాబాద్: గాంధీభవన్ లో నేతలు కొట్టుకున్నారు. ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ ముందే నల్గొండ నేతలు ఘర్షణ పడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు. కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లాకే పరిమితం కావాలని నారాయణరెడ్డి అన్నారు. దీంతో కోమటిరెడ్డి సోదరులు నారాయణ రెడ్డి బ్రోకర్ అని దూషించారు. దీంతో మాటా మాటా పెరిగి ఆగ్రహంతో రెచ్చిపోయి ఇరువురు నేతలు కొట్టుకున్నారు.

రైతే రాజు: సీఎంకేసీఆర్

హైదరాబాద్: కొంపల్లిలో జరుగుతున్న టీఆర్ ఎస్ 16వ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ముగింపు ఉపన్యాసం చేశారు. ఆయన మాటల్లోని హైలైట్ ఇవి..'రైతే రాజు, కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతాం, నష్టపోయిన రైతుకు కంపెనీయే పరిహారం చెల్లించాలి, దళిత, గిరిజన మహిళల కోసం ప్రతి రెవిన్యూ డివిజన్ కు రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకాల్లో అన్ని వర్గాలకు అవకాశం, ఇక మీదట ఏ శాఖపై అసత్య ఆరోపణలు చేసినా వారి పై మంత్రులు కేసులు పెట్టాలి'. ప్రతిపక్షాలు గుడ్డిగా విమర్శలు చేయడం మానుకోవాలని కేసీఆర్ సూచించారు.

'ఏర్పేడు' మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

అమరావతి : చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఓ లారీ బీభ‌త్సం సృష్టించి 20 మంది ప్రాణాలు తీసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఏపీ మంత్రివర్గం ప్రగాడ సానుభూతి ప్రకటించింది. మృతుల‌ కుటుంబాల‌కు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఏర్పేడు ప్ర‌మాదంలో మృతి చెందిన వారిలో ఆరుగురు నేరుగా లారీ ఢీకొన‌డంతో చ‌నిపోయార‌ని, మిగ‌తా 14 మంది ప్ర‌మాదం వ‌ల్ల సంభ‌వించిన విద్యుదాఘాతం, మంట‌ల ధాటికి మృత్యువాత ప‌డ్డార‌ని రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప వివ‌రించారు.

కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. రాజధాని డిజైన్లపై చంద్రబాబు... మంత్రులు, అధికారుల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌పై కూడా చర్చించే అవకాశం ముంది.

 

ప్రతిపల్లెకు కృష్ణా, గోదావరి జలాలను అందిస్తాం-కేసీఆర్

హైదరాబాద్: ఆరునూరైనా ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతిపల్లెకు కృష్ణా, గోదావరి నీటిని సరఫరా చేసి తెలంగాణ దాహర్తిని తీరుస్తామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకట్లోకి మగ్గిపోతుందని ఆనాడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అసత్య ప్రచారం చేశారని..కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్‌ కష్టాలను తీర్చి కరెంటు కోతల్లేకుండా చేశామన్నారు. మిషన్‌భగీరత, మిషన్‌కాకతీయ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

17:52 - April 21, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పర్యావరణ అనుమతుల కోసం సీఆర్డీఏ ఫోర్జరి నివేదికలు సమర్పించిదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమరావతికి పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రైబ్యున్‌లో దాఖలైన కేసులో వాదనలు ముగిశాయి. ఎన్జీటీతీర్పును రిజర్వు చేసింది. అమరావతి పర్యావరణ ప్రభావ అధ్యయనంపై టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ నివేదిక ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించింది. అయితే సీఆర్డీఏ ఆవిర్భావానికి ముందే ఇచ్చిన ఈ నివేదిక ఫోర్జరీదని ఎన్జీటీలో కేసు వేసిన శ్రీమన్నారాయణ అంటున్నారు. అమరావతి పర్యావరణ ప్రభావ అధ్యయనంపై ఎన్జీటీ అండ్ సీఆర్డీఏ ఇచ్చిన నివేదికపై శ్రీమన్నారాయణ అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోనుక్లిక్ చేయండి....

17:50 - April 21, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. రాజధాని డిజైన్లపై చంద్రబాబు... మంత్రులు, అధికారుల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌పై కూడా చర్చించే అవకాశం ముంది. 

17:48 - April 21, 2017

హైదరాబాద్: ఆరునూరైనా ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతిపల్లెకు కృష్ణా, గోదావరి నీటిని సరఫరా చేసి తెలంగాణ దాహర్తిని తీరుస్తామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకట్లోకి మగ్గిపోతుందని ఆనాడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అసత్య ప్రచారం చేశారని..కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్‌ కష్టాలను తీర్చి కరెంటు కోతల్లేకుండా చేశామన్నారు. మిషన్‌భగీరత, మిషన్‌కాకతీయ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామన్నారు కేసీఆర్. ప్లీనరీ ముగింపు ప్రసంగంలో కీలక ఉపన్యాసం చేసిన కేసీఆర్... నకిలీ విత్తనాలు విక్రయించే ఊరుకునేది లేదన్నారు. వరంగల్ సభ తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.

 

 

17:38 - April 21, 2017
17:34 - April 21, 2017

చిత్తూరు: జిల్లాలోని ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 25 మంది చనిపోగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి ఎస్పీతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను హోంమంత్రి చినరాజప్ప అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన సౌకర్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 57 పాయింట్లు నష్టపోయి 29,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 9,119 వద్ద ముగిసింది. 

16:41 - April 21, 2017

హైదరాబాద్: అక్ర‌మాస్తుల కేసులో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని పేర్కొంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం వాదనలు విని, ఈ నెల 28కి తీర్పును వాయిదా వేసింది. అయితే, మ‌రోవైపు న్యూజిలాండ్ వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ వేశారు. మే 15 నుంచి జూన్ 15 మ‌ధ్య 15 రోజులు వెళ్లేందుకు ఆయ‌న‌ అనుమ‌తి కోరారు. వేస‌వి సెల‌వుల నిమిత్తం కుటుంబంతో క‌లిసి వెళ్లాల‌ని జ‌గ‌న్ పిటిష‌న్ లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారించిన కోర్టు ప‌లు అభ్యంత‌రాలు తెలుపుతూ త‌మ‌ నిర్ణ‌యం ఈ నెల 28న తెలుపుతామ‌ని చెప్పింది.

16:32 - April 21, 2017

జగన్ బెయిల్ పై వాదనలు పూర్తి..

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈ నెల 28కి వాయిదా వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తిరుమలలో భారీ వర్షం..

చిత్తూరు : తిరుమలలో భారీ వర్షం కురిసింది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. ఈ నీటిని బయటకు పంపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. యత్నిస్తున్నారు. వర్షం కురవడంతో భక్తలకు కాస్త ఉపశమనం లభించినట్టయింది.

16:02 - April 21, 2017

ఉద్యోగులకు బహుమానంగా స్కూటర్లు అందచేస్తున్నారా ? ఎక్కడ ? ఎప్పుడు అంటూ ప్రశ్నలు వేయకండి. ఇదంతా ప్రభుత్వ ఉద్యోగులకు కాదు..ఈ రాష్ట్రంలో కూడా కాదు. గుజరాత్ లోని సూరత్ రాష్ట్రంలో ఓ వ్యాపారి తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఈ బహుమానం ఇస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన డైమండ్ వ్యాపారం చేసే యజమాని దీపావళి పండుగ రోజున తన ఉద్యోగస్తులకు..ఇళ్లు..కార్లు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్ష్మీ దాస్ అనే వ్యక్తి డైమండ్ వ్యాపారం చేస్తుంటాడు. ఆర్థిక మందగమనంలోనూ మంచి ఫలితాలు సాధించింనందుకు ఉద్యోగస్తులకు బహుమానం ఇవ్వాలని దాస్ నిర్ణయించుకున్నాడు. 125 మందికి హోండా యాక్టివా 4 జీ స్కూటర్లను కానుకగా ఇచ్చాడు. ఇందుకు రూ. 50 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈయన కంపెనీలో 5,500 మంది పనిచేస్తున్నారు. వజ్రాలను సానబెట్టి ఎగుమతి చేయడంలో సూరత్ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.

15:51 - April 21, 2017

గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తే ఆపరేషన్ లు నిర్వహిస్తుంటారు. గుండె మార్పిడి సైతం చేసుకుంటుంటారు. కానీ ఇవన్నీ ఖరీదుతో కూడిన వ్యవహారం. కానీ ఓ వ్యక్తి మాత్రం తన గుండె బాగు చేయించుకోవడానికి ఏకంగా రూ. 90 లక్షల పరికరం పెట్టుకోవడంతో వార్తల్లోకి ఎక్కాడు. దోషి (49) అనే వ్యాపారికి ఐదేళ్ల క్రితం గుండె పోటు వచ్చింది. అంతే గాకుండా హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఏర్పడింది. దీనితో ఆసుపత్రులను సందర్శించాడు. గుండె మార్పిడి చేయించుకుంటే సరిపోతుంది..కానీ అతడికి టీబీ కూడా వ్యాధి ఉండడంతో ఖరీదైన పరికరం అమర్చుకోవాల్సి వచ్చింది. లెఫ్ట్ వెంట్రికుల్యర్ ఆసిస్ట్ డివైజ్ (ఎల్ వీఏడీ) అనే పరికరాన్ని ముంబైలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు అమర్చారు. 9 నెలల క్రితం ఓ మహిళకు ఇదే పరికరం అమర్చినా ఆమె కన్నుమూసిందని, ప్రస్తుతం దోషికి జరిపిన చికిత్స విజయవంతమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఎల్ వీఏడీ అనేది కృత్రిమ గుండె కాదని, ఉన్న గుండెను మెరుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడే పరికరం మాత్రమేనని వైద్యులు పేర్కొంటున్నారు.

15:40 - April 21, 2017

హీరోలు పలు సినిమాలు చేస్తూ..వ్యాపారాలు నిర్వహిస్తూ రెండు చేతుల్లా డబ్బులను సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. వచ్చిన డబ్బులతో విలాసవంతమైన కార్లు..భవనాలు కొనుక్కొంటుంటారు. కానీ ఓ హీరో మాత్రం ఏకంగా ప్రైవేటు జెట్ విమానాన్ని కొనుక్కొన్నాడు. ‘ఉడ్తా పంజాబ్' సినిమాతో బాలీవుడ్ కు 'దిల్ జిత్ దోసాన్జ్' పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సైతం దక్కించుకన్నాడు. అనంతరం అనుష్క శర్మ తెరకెక్కించిన 'ఫిల్హౌరి' సినిమాలో కూడా నటించాడు. తాజాగా ఓ ప్రైవేటు జెట్ విమానం కొనుగోలు చేయడం విశేషం. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 'ప్రైవేటు జెట్ తో సరికొత్త ఆరంభం మొదలైంది'..అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే టీమ్ తో ప్రపంచమంతటా సంగీత కచేరీలు నిర్వహింబోతున్నట్లు తెలుస్తోంది.

15:36 - April 21, 2017

ఏర్పేడు ప్రమాదంపై జగన్ దిగ్ర్భాంతి..

చిత్తూరు : జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఓ లారీ బీభత్సానికి 25 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.

15:31 - April 21, 2017

ఇటీవల పలువురు హీరోలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కోర్టు సమన్లు జారీ చేయడంపై చర్చానీయాంశమైంది. మహాభారతం..ద్రౌపదిపై కమల్ పలు వ్యాఖ్యలు చేశారని, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. దీనితో వల్లియార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. మరి కమల్ కోర్టుకు హాజరౌతారా ? లేదా ? అనేది చూడాలి.

15:30 - April 21, 2017

మాటలకందని విషాదం:25 మంది మృతి

చిత్తూరు: జిల్లాలోని ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిలో ఏర్పేడు పోలీసు స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ విద్యుత్‌ స్తంబాన్ని ఢీకొట్టి... దుకాణాల్లోకి దూసుకుపోవడంతో ఎక్కువమంది మృత్యువాత పడ్డారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.. వీరిని చికిత్సకోసం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పూతలపట్టు-నాయుడుపేట మార్గంలో వాహనాలరాకపోకలు స్తంభించాయి. వివరాల్లోకి వెళితే....మోదుగుపాలెం రైతులు తమ ప్రాంతంలో గత కొన్ని ఏళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని వాటిని అరికట్టాలని దగ్గరలోని ఏర్పేడు పీఎస్ కు వచ్చి సీఐ ని కలిసి వినపత్రం సమర్పించేందుకు వచ్చారు. గత మూడు నెలలుగా ఈ అంశంపై ఫిర్యాదు చేస్తున్నా సీఐ సాయిబాబు పట్టించుకోవడం లేదని రైతుల మాటలను పెడచెవిన పెడతున్నారని, ఈ రోజు రైతులంతా వచ్చి అమీ తుమీ తేల్చుకునేందుకు పీఎస్ వచ్చారు. అయితే పీఎస్ లోపలికి కొంతమందిని మాత్రమే అనిమతించారు. చాలా మంది రైతులు బయట ఉన్నారు. ఈ సమయంలో పూతలపట్టు నుండి శ్రీకాళహస్తి వెళ్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయి వేచివున్న రైతులపైకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న అనేక దుకాణాల మీదుగా కరెంట్ స్థంబాలను ఢీ కొట్టింది. దీంతో అక్కడ ఉన్న మోటారు వాహనాలపై కరెంట్ తీగలు తెగిపడిపోయాయి. వెంటనే పెట్రోలు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో 25 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. మరి కొన్ని శరీరాలు నల్లగా మాడి బూడిదయ్యాయి. తిలారీ దూసుకొస్తున్న సమయంలో రహదారి పక్కన ఎక్కువ మంది నిలబడిఉన్నారు. లారీ మీదికి దూసుకురావడంతో వారంతా హాహాకారాలు చేస్తూ నలుదిక్కులకూ పరుగులు తీశారు. కొందరు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

వామపక్షాలు, వైసీపీ ఆందోళన

ఘటనకు బాధ్యులై సీఐ సాయిబాబును సస్పెండ్ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు వెడల్పు చేయాలి: స్థానికులు

ఏర్పేడు పీఎస్ వున్న రోడ్డు కు స్పీడ్ బ్రేకర్లు లేవని, రోడ్డు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

15:23 - April 21, 2017

దక్షిణాఫ్రికా : ఓ చిన్నారిని సజీవంగా పూడ్చిపెట్టినా ప్రాణాలతో బయటపడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...క్వాజులు - నాటల్ ప్రావిన్స్ లో ఓ 25 ఏళ్ల మహిళ టింబర్ డిపోలో పనిచేస్తోంది. ఇటీవలే పండటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియవద్దని ఆ పసికందును పనిచేస్తున్న చోటే పూడ్చేసింది. కానీ మూడు రోజులకు ఆ చిన్నారి ఏడుపులు అక్కడి వారికి వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు శిశువును కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ పెష్ స్టోన్ రీజనల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే తల్లిపై పోలీసులకు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదం పై చంద్రబాబు విచారం

చిత్తూరు: జిల్లాలోని ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి ఎస్పీతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను హోంమంత్రి చినరాజప్ప అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన సౌకర్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎకరానికి రూ.4వేల పెట్టుబడి ఇస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొంపల్లిలో టీఆర్ ఎస్ ప్లీనరి కొనసాగుతోంది. రైతు రాజు కావాలని, ఎకరానికి రూ.4వేల పెట్టుబడి ఇస్తామన్నారు. రెండు పంటలకు రూ.4వేల చొప్పున ఇస్తామన్నారు. ప్రతీ గ్రామంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సమాఖ్యల కోసం వచ్చే బడ్జెట్ లో రూ.500 కోట్ల విత్తన నిధి ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజిస్తామన్నారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

శ్రీకాకుళం : పలాస విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి చేశారు. రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏఈ నాగేశ్వర్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాల్సిందే : గంటా

విశాఖ : సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాల్సిందేనని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరుస్తామంటే ఊరుకునేది హెచ్చరించారు.  

 

విశాఖలో రష్యన్ ప్రతినిధుల బృందం పర్యటన

విశాఖ : నగరంలో రష్యన్ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుపై మంత్రి గంటా శ్రీనివాస్ తో చర్చిస్తున్నారు. 

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం... ఆరుగురి మృతి

మహారాష్ట్ర : సాంగ్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

14:12 - April 21, 2017

చిత్తూరు : జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ ప్రజలపైకి దూసుకెళ్లడంతో 15 మంది మృత్యువాత పడిన విషాద ఘటన ఏర్పేడు పీఎస్ సమీపంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఓ లారీ జనాలపైకి దూసుకెళ్లిన ఘటన మరిచిపోకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో చాలా మంది రైతులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే....ఏర్పేడు పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది రైతులు తమ సమస్యను విన్నవించేందుకు ఏర్పేడు పీఎస్ ప్రాంతానికి చేరుకున్నారు. సమస్యను చర్చించిన అనంతరం వాళ్లందరూ తమ స్వస్థలాలకు బయలుదేరే  సమయంలో వేగంగా వేచ్చిన ఓ లారీ అక్కడేనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దాంతో స్థంబం నేలకొరిగి హైటెన్షన్ వైర్లు పక్కనే ఉన్న దుకాణాలపై పడటంతో 15 నుండి 20మంది రైతులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. తిరుపతి ఎస్సీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శరీర భాగాలు చల్లాచెదురుగా పడిపోవడం అక్కడ బీతావాహ వాతారవణం నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరికొంతమంది రైతులకు శరీరం కాలిపోవడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

14:11 - April 21, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేకంగా గ్రామస్థులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆక్వాఫుడ్ పార్క్ పై ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం..అధికారులు..యాజమాన్యం మొండి వైఖరిని అవలింబిస్తున్నాయి. పోలీసులను మోహరించి ఆందోళనపై ఉక్కుపాదం మోపుతున్నారు. పార్క్ ను మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ పోరాట హక్కుల నేతలు దీక్షలకు దిగనున్నారు. దీనితో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో నలుగురు పోరాట సమితి నేతలను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

జనాలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి

చిత్తూరు : ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

14:02 - April 21, 2017

చెన్నై : ప్రముఖ నటుడు సత్యరాజు కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆయన ట్విట్టర్ ద్వారా రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని, తాను ఎప్పుడు కర్ణాటక ప్రజలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన మీద ఉన్న కోపంతో 'బాహుబలి 2' సినిమా అడ్డుకోవద్దని కోరారు. ఎప్పుడు తమిళులకు మద్దతగానే మాట్లాడతానని సత్యరాజు పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పాలని కోరుతున్న వారు కట్టప్ప చెప్పిన సారీతో శాంతిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

 

14:01 - April 21, 2017

క్లాస్ రూం అంటే ఎలా ఉండాలి ? వృత్తి పట్ల ఎంత మంది టీచర్లు నిబద్ధతగా పనిచేస్తున్నారు ? కానీ ఓ టీచర్ ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలోని కందాడు ప్రైమరీ పాఠశాలలో అన్నపూర్ణ మోహన్ అనే ఇంగ్లీషు టీచర్ పనిచేస్తున్నారు. ఈ క్లాస్ రూంలో ఉన్న పిల్లలకు మంచి సౌకర్యాలు ఉండాలని అభిలషించారు. అందరికీ ఇంగ్లీష్ భాష వచ్చే విధంగా కృషి చేయాలని భావించారు. కానీ దీనికి డబ్బు అవసరం పడింది. దీనితో ఆమె నగలు అమ్మి సౌకర్యాలను సమకూర్చింది. క్లాస్ రూంలో ఉన్న సౌకర్యాలు..తరగతికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంగ్లీష్ బోధన చేసే సమయంలో తనకు కొన్ని సమస్యలు ఏర్పడడం జరిగిందని, అయితే బోధనలో విద్యార్థులను మమేకం చేస్తూ స్కిట్ లు తదితర పద్ధతుల్లో పాఠాలు బోధించే దానినని పేర్కొన్నారు. విద్యార్థుల ఇంగ్లీష్ సామర్థ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా విశేష స్పందన వచ్చిందన్నారు. కొంచెం కృషితో పేద విద్యార్థులకు క్వాలిటీ విద్యనందించే అవకాశం ఉందని అన్నపూర్ణ పేర్కొన్నారు.

13:59 - April 21, 2017

హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌ వాసులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడితే నగరంలో ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.  
నాలుగు రిజర్వాయర్లు ప్రారంభం 
హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు నిర్మించిన నాలుగు రిజర్వాయర్లను మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ రిజర్వాయర్లను మెగా ఇంజనీరింగ్‌ సంస్థ కేవలం 11 నెలల వ్యవధిలో నిర్మించింది. ప్రజలకు నీటి కొరతను తీర్చాలనే లక్ష్యంతో కూకట్‌పల్లి...మియాపూర్‌, నల్లగండ్ల, గోపాన్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు రిజర్వాయర్లను నిర్మించారు. నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ.1900 కోట్లతో 56 రిజర్వాయర్లు నిర్మించేందుకు వాటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.
నగరవాసులకు మిషన్ భగీరథ ఫలితాలు : కేటీఆర్ 
మిషన్‌ భగీరథ తొలి ఫలితాలు నగరవాసులకు అందుతున్నాయని మంత్రి కేటీఆర్‌  అన్నారు. నగరంలో తాగునీటి సమస్యను తొలగించేందుకు మరో 42 రిజర్వాయర్లను అందుబాటులోకి తెస్తామని..అన్నారు. ఆగస్టు నాటికి 10 రిజర్వాయర్లు ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. జనాభా ఐదు రెట్లు పెరిగినా నీటికి ఇబ్బందులు ఉండకుండా తమ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుందన్నారు. ఈ మేరకు శామీర్‌ పేట్‌ ప్రాంతంలో 20 టీఎంసీల సామర్థ్యం గల భారీ రిజర్వాయర్‌ను 7వేల 700 కోట్లతో నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నామన్నారు. అలాగే ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 168 గ్రామాలకు కూడా నీటిని సరఫరా చేస్తామని అందుకోసం రూ.628 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. 
అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు : కేటీఆర్ 
అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉండాల్సిన అవసరం ఉందని.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి మరీ  ప్రభుత్వం నల్లా కనెక్షన్లు ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాగే నాలాలు.. చెరువుల కబ్జాలపై కఠినంగా ఉంటామన్నారు. నాలాలపై నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ అన్నారు.   

 

13:53 - April 21, 2017
13:50 - April 21, 2017

నోబెల్ బహుమతి మలాల పాక్ పై పలు విమర్శలు..అత్యధిక వృద్ధురాలు కన్నుమూత..మరుగుదొడ్లు లేక మహిళల ఇబ్బందులు..తగిన కారణాలు లేకుండానే తలాక్ చెబితే సామాజిక బహిష్కరించాలని పిలుపు..గునాలో ఓ రైతు చేసిన చర్యపై పెద్దలు దారుణ తీర్పు..నేపాల్ అధ్యక్షురాలు భారత్ లో పర్యటన..ట్రిపుల్ తలాక్ పై అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పందన..రెజ్లర్ గీతా ఫొగట్ కామన్ వెల్త్ క్రీడలపై దృష్టి...పూర్తి వార్తల విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

13:47 - April 21, 2017

విజయవాడ : ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయంలేదని పార్టీ నేతలకు బాబు సంకేతాలు పంపారు. బాబు తన నివాసంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గతేడాదితో పోల్చుకుంటే టీడీపీ ఓట్లు 16.13 శాతం పెరిగాయని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే వైసీపీ ఓట్ల శాతం 13.45 తగ్గిందని అన్నారు. ఇక నుంచి ఎన్నికలే ఎంజెండాగా నేతలందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఇకపై సాయంత్రం 6 తర్వాత పార్టీకే సమయం కేటాయిస్తానని తెలిపారు.

13:37 - April 21, 2017

కృష్ణా : ఐటీలో ఇండియా నెంబర్ వన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీలో విదేశాల్లో పెద్ద పెద్ద హోదాల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. విభజనతో కట్టుబట్టలతో, అప్పులతో హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చి మళ్లీ తమ పాలన మొదలు పెట్టామని తెలిపారు. మూడేళ్లలో అభివృద్ది ఎంతో అభివృద్ధి సాధించామని, ప్రజా సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నామని అన్నారు.

రైతులకు ఎరువులు ఉచితం : సీఎం కేసీఆర్

మేడ్చల్ : రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రుణమాఫీ చేసిన విధంగానే పెట్టుబుడులు ఇస్తామని చెప్పారు. రైతు రాజు కావాలని ఆకాంక్షించారు. ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి ఇప్తామని భరోసా ఇచ్చారు. రెండు పంటలకు రూ. 4 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజిస్తామని చెప్పారు. 

 

2001 సం.లో గులాబీ జెండా ఎగిరినా అనుమానాలే : కేసీఆర్

మేడ్చల్ : 2001సం.లో గులాబీ జెండా ఎగిరినా అన్నీ అనుమానాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పార్టీ నిలబడుతుందా..తెలంగాణ వస్తదా అనే అనుమానం ఉండేదని చెప్పారు. చాలామంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించామన్నారు.

మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు : కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. 16 వ సారి టీఆర్ ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 

 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు సన్మానం

హైదరాబాద్ : ఆర్టీసీ కళాభవన్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించినందుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, లక్ష్మణ్, ఎల్.రమణ, బీసీ సంఘం నేత నేత ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు.  

13:04 - April 21, 2017

మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతు రాజు కావాలని టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ పేర్కొన్నారు. 16వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కొంపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రారంభోపన్యాసం చేశారు. 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ కేవలం కొంత మందితో ప్రారంభమై నేడు 75 లక్షల సభ్యత్వాలకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు.

హేళన..అవమానాలు..
టీఆర్ఎస్ పార్టీని ఎంతో మంది అవమానించారని, అవహేళన చేశారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ముందుకెళ్లి స్వరాష్ట్రం సాధించుకున్నట్లు తెలిపారు. జూన్ 2, 2014 తెలంగాణ అవిర్భావం అప్పుడు వ్యవసాయం బాగాలేదని, కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు, ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ పథకం ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని, కానీ నేడు విద్యుత్ లో దూసుకుపోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా మిషన్ భగీరథ పథకం చేపడుతున్నట్లు, సమైక్య రాష్ట్రంలో నిరాధారణకు గురైన చెరువుల పునరుద్దరణ కోసం మిషన్ కాకాతీయ పథకం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.

పలు పథకాలు..
గడిచిన 60 ఏళ్ల కాలంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనలో కులవృత్తులు దెబ్బతిన్నాయని అన్నారు. నాయి బ్రాహ్మణులకు లక్ష సబ్సీడీతో సెలున్ లను నిర్మిస్తామని, ముదిరాజుల కోసం చేప పిల్లలను ఉచితంగా అందించామని..గీత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలను తెరిపించామన్నారు. గీత కార్మికులు ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. దేశంలో ధనవంతులు అయ్యే విధంగా గొళ్ల కుర్మలకు ఉచితంగా గొర్రె పిల్లలు అదిస్తామని అన్నారు. త్వరలో టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేస్తానని తెలిపారు.

రెండు పంటలకు రూ. 4వేలు..
టీఆర్ఎస్ రైతుల కోసం ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టిందని, రైతులకు ప్రతి ఏడాది రెండు పంటలకు రూ.4వేలు బ్యాంకులో వేస్తామన్నారు. మొదటి విడత మేలో...రెండో విడత సెప్టెంబర్ జమ చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేస్తామని, అలాగే మండల, రాష్ట్ర స్థాయిలో రైతు సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర రైతు సంఘానికి రూ.500కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే 2112మంది వ్యవసాయ అధికారులను నియామించామని, త్వరలో 500 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు.

నరేగాకు వ్యవసాయం అనుసంధానం చేయాలి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతామని వెల్లడించారు. వ్యవసాయం చేసే సీజన్‌లో రైతులకు కూలీలు దొరకడం కష్టంగా ఉందని ఈ క్రమంలోనే నరేగా (ఉపాధి హామీ పథకం)ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానం చేస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రతిపాదనకు ప్లీనరీ ఆమోదించింది. ఈనెల 23వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో తీర్మానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందచేయడం జరుగుతుందన్నారు.

కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన నటుడు సత్యరాజ్

హైదరాబాద్ : నటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. వివాదానికి ముగింపు పలకాలని కన్నడ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 

ధనిక రైతుల రాష్ట్రం కావాలి : సీఎం కేసీఆర్

మేడ్చల్ : తెలంగాణ.. ధనిక రైతుల రాష్ట్రం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
అందరి ముఖాల్లో చిరునవ్వు చూసేందుకే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. కులవృత్తులకు చేయూతనందిస్తున్నామని తెలిపారు.

తుందుర్రు ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష

పశ్చిమగోదావరి : తుందుర్రు ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆక్వాఫుడ్ పార్కును మరో ప్రాంతానికి తరలించాలని డిమాండు చేశారు. తుందుర్రులో పోలీసులు భారీగా మోహరించారు. నలుగురు పోరాట సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రతినెల జిల్లాలో బహిరంగసభలు : సీఎం చంద్రబాబు

కృష్ణా : ప్రతి నెలా జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఓటు బ్యాంక్ ను బలోపేతం చేసుకోవాలని తెలిపారు. ఇకపై పార్టీకి ఎక్కు సమయం కేటాయిస్తానని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తానని చెప్పారు. విజయనగరంలో మంత్రి సుజయకృష్ణ సమావేశం పెడితే ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తేస్తే ఎవరినీ ఊపేక్షించనని హెచ్చరించారు. 

ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు : సీఎం కేసీఆర్

మేడ్చల్ : ప్రతీ గ్రామంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి రైతు సంఘాలలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ.500 కోట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు సంఘటితం కావాలన్నారు. తెలంగాణలో రెండున్నర ఎకరాల లోపు భూమి ఉన్నవారు 62 శాతం ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 97 శాతం మంది ప్రజలకు 10 ఎకరాల లోపే భూమి ఉందన్నారు. 

 

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టం : సీఎం కేసీఆర్

మేడ్చల్ : తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాల్లో సీఎం మాట్లాడారు. కోటి ఎకరాలకు నీళ్లు అందించాలని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. 45,600 చెరువులను మిషన్ కాకతీయతో పునరుద్ధరించామని చెప్పారు. 

ఇండియాలో ఎక్కడాలేని విధంగా పరిశ్రమలకు అనుమతులు : సీఎం కేసీఆర్

మేడ్చల్ : ఇండియాలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో రైతులు రాజులు కావాలన్నారు. ఏకరానికి రూ.4 వేల పెట్టుబడి ఇస్తామని ఇస్తామన్నారు. గీత వృత్తిని ప్రోత్సహించేందుకు ఈత, తాటి చెట్లను నాటుతామన్నారు. గొల్లకుర్మల కోసం జూన్ నుంచి గొర్రె, మేక పిల్లలను పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులు సంఘటితం కావాలన్నారు. గ్రామ రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఎన్నో ఏళ్లు కృషి ఫలితం తెలంగాణ రాష్ట్రం : సీఎం కేసీఆర్

మేడ్చల్ : ఎన్నో ఏళ్లు కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని టీఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీర్   తెలిపారు. కొంపల్లిలో జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. సమైక్య పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. భవిష్యత్ లో రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన నడుస్తోందని చెప్పారు. కుల వృత్తులు పునురుజ్జీవం చెందాలన్నారు. బతుకమ్మను రాష్ట్ర పండుగా చేసుకున్నామని తెలిపారు. 

ప్రారంభమైన టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు

మేడ్చల్ : కొంపల్లిలో టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. 

11:39 - April 21, 2017

చెన్నై : హీరో ధనుష్ పై తుది తీర్పు వెల్లడైంది. ధనుష్ తమ కొడుకేనని..తమ బాగోగులు చేసుకోవడం లేదని మేలూర్ కు చెందిన కదిరేషన్ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మద్రాసు హైకోర్టు శుక్రవారం తుదితీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ధనుష్ కు ఊరట లభించినట్లైంది. కదిరేషన్ దంపతులు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని...అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కే రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో ధనుష్ పిటిషన్ దాఖలు చేశారు. 1985 నవంబర్7న మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కదిరేషన్ వృద్ధ దంపతులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తుది తీర్పును వెల్లడించింది.

మద్రాసు హైకోర్టులో నటుడు ధనుష్ కు ఊరట

చెన్నై : మద్రాసు హైకోర్టులో నటుడు ధనుష్ కు ఊరట లభించింది. ధనుష్ తమ కుమారుడంటూ మేలూరు దంపతులు కోర్టులో పిటిషన్ వేశారు. మద్రాస్ హైకోర్టు ముధురై బెంచ్ ఈ కేసును కొట్టివేసింది.

మద్రాసు హైకోర్టులో నటుడు ధనుష్ కు ఊరట

చెన్నై : మద్రాసు హైకోర్టులో నటుడు ధనుష్ కు ఊరట లభించింది. ధనుష్ తమ కుమారుడంటూ మేలూరు దంపతులు కోర్టులో పిటిషన్ వేశారు. మద్రాస్ హైకోర్టు ముధురై బెంచ్ ఈ కేసును కొట్టివేసింది.

కార్లపై నీలి బుగ్గలు తొలగించిన ఏపీ మంత్రులు

గుంటూరు : ఏపీ మంత్రులు నారా లోకేష్, కామినేని శ్రీనివాస్, చినరాజప్ప, సునీత, అమర్నాథ్ లు తమ కార్లపై ఉన్న నీలి బుగ్గలను తొలగించారు. కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తొలగించారు. మే 1వ తేదీ నుంచి నీలి బుగ్గల తొలగింపు అమలులోకి రానుంది.

సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, సబిత, శ్రీలక్ష్మీ, రాజగోపాల్

హైదరాబాద్ : జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు విజయసాయిరెడ్డి, సబిత, శ్రీలక్ష్మీ, రాజగోపాల్ హాజరయ్యారు. 

11:22 - April 21, 2017

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

  • ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
  • రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.
  • టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు..నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.

చంద్రబాబు, లోకేష్ పై పొలిటికల్ సెటైర్లు..యువకుడు అరెస్టు

హైదరాబాద్ : ఫేస్ బుక్ లో సీఎం చంద్రబాబు, లోకేష్ పై పొలిటికల్ సెటైర్లు వేసిన రవికిరణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి శంషాబాద్ లో రవిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. 

 

11:07 - April 21, 2017

ఒక సినిమా కోసం హీరో..హీరోయిన్లు ఎంతో కష్టపడుతుంటారు. పాత్రలో లీనమై పోవాలని వారు భావిస్తుంటారు. అందుకనుగుణంగా శిక్షణలను సైతం తీసుకుంటుంటారు. అందులో హీరోయిన్లు కూడా శిక్షణలను పొందుతుండడం గమనార్హం. ఇటీవలే వచ్చిన 'బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల్లో 'అనుష్క' యుద్ధ విద్యలలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. తరువాత 'సంఘమిత్ర' కోసం 'శృతి హాసన్' ఏకంగా కత్తి విన్యాసాలు నేర్చుకొంటోంది. తాజాగా 'సమంత' ఇందులో చేరింది. ఈమె కర్రసాము నేర్చుకొంటోంది. ‘సమంత' చేస్తున్న కర్రసాము వీడియో సోషల్ మీడియాలో వైరల అవుతోంది. ప్రస్తుతం 'రాజు గారి గది -2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా 'రామ్ చరణ్' - ‘సుకుమార్' కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కూడా 'సమంత' నటిస్తోంది. కర్రసాము ఏ చిత్రంలో ఉండనుందో తెలియరావడం లేదు. ‘నాకు సవాళ్లంటే ఇష్టం..కర్రసాము నేర్చుకోవడం ఓ సవాల్ గా తీసుకున్నా..ఇప్పుడు దీనితోనే నా సహవాసం' అంటూ సమంత పేర్కొంది. మరి ఆమె సమంత కర్రసాము ఎలా చేసిందో..ఏ చిత్రంలో చేసిందో చూడాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఎలుగబంటి దాడిలో ముగ్గురికి గాయాలు

కర్నూలు : కొత్తపల్లి సింగరాజుపల్లెలో ఎలుగబంటి ప్రవేశించింది. ముగ్గురిపై దాడి చేసి, గాయపర్చింది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

అమరావతి : టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలు, మహానాడు నిర్వహణ, నంద్యాల అభ్యర్థిత్వంపై చర్చించనున్నారు. 
 

10:51 - April 21, 2017
10:50 - April 21, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' నటించిన 'బాహుబలి -2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అనంతరం 'ప్రభాస్' తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. గత ఎన్ని ఏళ్లుగా ఒక్కచిత్రానికే ప్రభాస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ఈ చిత్రానికి 'సాహో' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. చిత్ర టీజర్..మొదటి లుక్స్ పై చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్ ఏప్రిల్ 23నే విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రోజున మొదటి లుక్ ఉండదని ప్రచారం జరుగుతోంది. దీనితో ప్రభాస్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక 'బాహుబలి -2' సినిమా విడుదలైన థియేటర్స్ లలో 'సాహో' టీజర్ ను ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. ఈ టీజర్ పై అందరిలోను మరింతగా ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో, ఫస్టులుక్ లాంచ్ ను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలన్నిటిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

10:33 - April 21, 2017

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. 16 వ సారి టీఆర్ ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. 

 

కాసేపట్లో టీఆర్ ఎస్ ప్లీనరీ

మేడ్చల్ : కాసేపట్లో కొంపల్లిలో టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఏడు తీర్మానాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. తీర్మానాల ప్రవేశం, ఆమోదానికి మంత్రులకు అవకాశం లేదు.  

 

తిరుపతిలో రోడ్డు ప్రమాదం... ఇద్దరి మృతి

చిత్తూరు : తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతి నగరానికి చెందిన ముగ్గురు యువకులు నగరానికి దూరంగా గురువారం అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని మద్యం సేవించి కారులో తిరుపతి బయలుదేరారు. మార్గంమధ్యలో తిరుపతి గ్రామీణ మండలం ఎమ్మార్‌పల్లిలో రోడ్డు పక్కన ఉన్న ఓ గ్యాస్‌ గోదాం గోడను బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన శశికాంత్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. జయకుమార్‌ ఆచారి, రూపేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు.

10:17 - April 21, 2017

మేడ్చల్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షడిగా కేసీఆర్ మరోసారి ఎంపికయ్యారు. తెలంగాణ భవన్ లో ఆయన పేరును ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నాయినీ ప్రకటించారు. మొత్తం దాఖలైన 12 సెట్లలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించారని, అందుకే ఆయన్ను టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అనంతరం నేతలు స్వీట్లు ఒకరినొకరు తినిపించుకున్నారు.
ఇదిలా ఉంటే కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ప్లీనరీలో 7 తీర్మానాలను ఆమోదించనున్నారు. తీర్మానాల్లో 1.సంక్షేమంలో స్వర్ణయుగం. 2. నీటిపారుదల వ్యవసాయంలో నూతన అధ్యాయం. 3. గ్రామీణాశివృద్ధి వ్యవస్థ పరిపుష్టం, వృత్తిపనులకు ప్రోత్సాహం. 4.విద్యుత్ రంగంలో విజయం, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన. 5.వినూత్న విధానాలు, ప్రగతికాముక పథకాలు. 6. తాగునీటి సమస్య తీర్చే మిషన్ భగీరథ. 7.సామాజిక సమస్యలపై సమరం తీర్మానాలున్నాయి. సాయంత్రం 5.30కు కేసీఆర్ ముగింపు ఉపన్యాసం ఇవ్వనున్నారు.

వృద్ధున్ని ఢీకొట్టిన మంత్రి సోమిరెడ్డి వాహనం

కడప : ఏపీ మంత్రుల పర్యటనలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాహనం టీవీఎస్‌ పై వెళ్తున్న వృద్ధున్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి గాయాలయ్యాయి. వేముల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం మంత్రి వాహనం వేంపల్లెకు బయలు దేరింది. అదే కార్యక్రమానికి హాజరైన వృద్ధుడు బొగ్గలయ్య టీవీఎస్‌ పై తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో కడప-పులివెందుల ప్రధాన రహదారిలో టీవీఎస్ పై వెళ్తున్న బొగ్గలయ్యను మంత్రి కారు ఢీకొట్టింది. దీంతో వృద్ధుని తలకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి.

09:48 - April 21, 2017

ముంబై : అవినీతి భరతం పట్టాలంటే పెద్ద నోట్లు (రూ. 500, రూ. 1000) నోట్లు రద్దు ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రజలకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అనంతరం రూ. 2000 వేలు, రూ. 500 నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల కూడా సామాన్యుడు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా అంధులు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్పర్శతో వాటి విలువను గుర్తించలేకపోతున్నారు. కొత్త నోట్లను ప్రింట్‌ చేసేటప్పుడు విలువను సూచించే అంకెలను కాస్త ఉబ్బెత్తుగా (ఎంబోసింగ్‌) ప్రింట్‌ చెయడం లేదు. దీంతో వాళ్లు రూ. 500, రూ. 2000 నోటు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నట్టు జాతీయ అంధుల సమాఖ్య(ఎన్‌ఏబీ) గురువారం వెల్లడించింది. పాత నోట్లు రద్దు చేసినప్పుడే ఈ సమస్యను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి మార్పులను కొత్త నోట్లలో గమనించలేదని ఎన్‌ఏబీ కార్యదర్శి జొవాకిమ్‌ రాపోజ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది అంధులు పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పద్ధతుల్లో కొత్త నోట్లను గుర్తించే విధానాన్ని నేర్పుతున్నట్లు ముంబైలోని ఓ అంధుల పాఠశాల ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు.

09:47 - April 21, 2017

ఫ్రాన్స్ : దేశ రాజధాని పారిస్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండుగుడు హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు పారిస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో పారిస్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికలకు మూడు రోజుల ముందు రాజధానిలో ఈ దాడి జరగడంపై ఆందోళన నెలకొంది.

09:43 - April 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ రోజు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న అనంతరం రాత్రికి ఆయన బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే నీతి అయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్‌ మూడో సమావేశంలో కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2030 విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చ జరగనుంది. కాగా మీటింగ్‌ అనంతరం ప్రధానితో సీఎం కేసీఆర్‌ కొద్దిసేపు ఏకాంతంగా భేటి అవ్వనున్నట్టు సమాచారం. ముస్లీం మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

09:41 - April 21, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ప్రఖ్యాత ఐదు నక్షత్రాల హోటల్ లో అది ఒకటి. ఆ హోటల్ ను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అదే..’తాజ్ హోటల్'....వేలం వేసేందుకు న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వేలం ఎందుకు నిర్వాహించాల్సి వస్తుందో కారణాలు విశ్లేషిస్తే..ఈ హోటల్ ను ప్రభుత్వ స్థలంలో నిర్మించారు. 33 ఏండ్ల లీజు ఒప్పందంతో ఈ హోటల్ ను టాటా గ్రూప్ నిర్వహించింది. ఈ ఒప్పందం 2011లో ముగిసిపోయింది. కానీ అప్పటి నుండి 9సార్లు లీజు గడువును టాటా గ్రూప్ కు ఎన్ డీఎంసీ పొడిగిస్తూ వచ్చింది. అద్దె విషయంలో గిట్టుబాటు కావడం లేదంటూ ఎన్ డీఎంసీ భవనాన్ని వేలం వేసేందుకు నిర్ణయించింది. వేలాన్ని టాటా గ్రూప్‌ వ్యతిరేకించడంతో ఎన్‌డీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో వేలానికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు..వేలంలో టాటా గ్రూప్‌ దాన్ని దక్కించుకోకపోతే ఖాళీ చేసేందుకు ఆరు నెలల గడువు ఇవ్వాలని ఎన్‌డీఎంసీకి సూచించింది.

09:37 - April 21, 2017

మేడ్చల్ : టీఆర్ఎస్ ప్లీనరీలో నోరూరించ వంటకాలు స్వాగతం పలుకుతున్నాయి. కొంపల్లిలో ఈ ప్లీనరీ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్లీనరికీ వచ్చే ప్రజా ప్రతినిధులకు, ఇతరులకు భోజనాలు అందించేందుకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేశారు. వంటల్లో 9 రకాల నాన్ వెజ్ వంటకాలు వండుతున్నామని నిర్వాహకుడు టెన్ టివికి తెలియచేశారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యాని, కోడిగుడ్డు పులుసు, మటన్ పులుసు, చేపల పులుసులున్నాయన్నారు. 22 రకాల వెజ్ వంటకాలు, ఐస్ క్రీమ్, స్వీటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వంటకాలను తాను గత కొన్ని ఏళ్లుగా చేయిస్తున్నానని, ఇటీవలే సీఎం కేసీఆర్ చేసిన ఆయుత చండీయాగంలో కూడా తానే భోజన సౌకర్యాలు చూసుకొన్నట్లు వెల్లడించారు.

09:34 - April 21, 2017

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాకుడు శ్రీశ్రీ రవిశంకర్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఆర్ ఆఫ్ లివింగ్ యుమన నది వద్ద భారీ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో నష్టం వాటిల్లిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నిపుణల కమిటీ నివేదిక సమర్పించింది. నష్టం భర్తీ చేసేందుకు ఏకంగా పదేండ్ల సమయం పడుతుందని, రూ. 13.29 కోట్లు ఖర్చువుతుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై శ్రీశ్రీ రవిశంకర్ పలు వ్యాఖ్యలు చేశారు. యమునా కరకట్టలు భారీగా దెబ్బతిన్నాయని, వాటిని సరిచేసేందుకు పదేండ్ల సమయంతో పాటు పెద్దమొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఇచ్చిన నివేదికపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వివక్షతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని, వారు తమకు తోచినట్టు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నట్టుగా భావిస్తున్నారని ట్రిబ్యునల్‌ ఆక్షేపించింది. మే 9న తదుపరి విచా రణ చేపడతామని ప్రకటించింది.

09:23 - April 21, 2017

మహానటి..తెలుగు వెండి తెరపై మహానటిగా గుర్తింపు పొందారు. ఆమెనే 'సావిత్రి'. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘సావిత్రిగా' కీర్తి సురేష్..మహిళా పాత్రికేయురాలిగా 'సమంత'లు నటిస్తున్నారు. తాజాగా 'అనుష్క' కూడా ఈ చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారని సమాచారం. చిత్రంలో నటించడానికి 'అనుష్క' సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. 'సావిత్రి' జీవితంలోని పలు కోణాలను, మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలకు సంబంధించిన విశేషాల్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. మరి 'అనుష్క' నటిస్తుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

09:19 - April 21, 2017

మేడ్చల్ : కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభం కానుంది. మొదటగా పార్టీ పతాక అవిష్కరణ తర్వాత తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించి సమావేశం ప్రారంభించనున్నారు. 9.55 నిమిషాలకు మంత్రి నాయిని పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్ ను ప్రతిపాదిస్తూ 11 నామినేషన్లు దాఖలు చేశారు. కేసీఆర్ ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. సీఎం వచ్చే రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రణాళికల్ని వివరించనున్నారు. టిన్ టివితో మానకొండూరు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ లో ఎటువంటి అసంతృప్తులు లేవని అన్నారు. సమావేశంలో తెలంగాణ పాటల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

పట్టాలు తప్పిన ఔరంగాబాద్.. హైదరాబాద్‌ ప్యాసింజర్ రైలు

బెంగళూరు : ఔరంగాబాద్.. హైదరాబాద్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కల్గూపూర్‌-భీల్కీ రైల్వేస్టేషన్ల మధ్య ఈ రోజు ఉదయం రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రైలు ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌ : 040-23200865, పర్గీ : 02446-223540, వికారాబాద్ : 08416-252013, బీదర్‌: 08482-226329.

08:43 - April 21, 2017

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలకు కొంపల్లి సిద్ధమైంది. శుక్రవారం నిర్వహించే పదహారవ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై సమీక్ష, భవిష్యత్తులో అనుస‌రించాల్సిన విధానాల‌పై చర్చ జరిగే అవకాశముంది. రెండేళ్లకోసారి జరగబోయే అధ్యక్ష ఎన్నికకు కూడా ప్లీనరీ వేదిక కానుంది. 
అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ మరోసారి ఎన్నిక ?
అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ మరోసారి ఎన్నిక కాబోతున్నారు. ఎనిమిదోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అధ్యక్ష ఎన్నికతోపాటు.. ఈ సమావేశంలో పార్టీ నియ‌మావ‌ళికి స‌వ‌ర‌ణలు చేసే అవ‌కాశం ఉంది. ప్లీనరీలో 7 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్‌ కూడా కనిపిస్తోంది. అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ క‌మిటీల నియామ‌కంలో మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఇక పార్టీ ప‌రంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కెటిఆర్ కు ద‌క్కుతుంద‌ని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్లీన‌రీలో ఆ ప్రస్తావన ఉండకపోవచ్చనికూడా చర్చ నడుస్తోంది.
6 ఎక‌రాల్లో స‌భా ప్రాంగ‌ణం
ప్లీనరీ కోసం దాదాపు 6 ఎక‌రాల్లో స‌భా ప్రాంగ‌ణం తయారు చేశారు. 35 ఎకరాల స్థలాన్ని వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. ప్రధాన వేదికను కూడా అందంగా ముస్తాబు చేశారు. 60 అడుగుల పొడ‌వు, 40 అడుగ‌ల వెడ‌ల్పుతో వేదిక సిద్ధం చేశారు.. సాంస్కృతిక కార్యక్రమాలకోసం 24 అడుగుల వెడ‌ల్పు, 36 అడుగుల పొడ‌వుతో మ‌రో వేదిక‌ను రెడీగా ఉంచారు. ఈసారి ప్లీనరీకి 8 నుంచి 10 వేల మంది ప్రతినిధులు వస్తారని నిర్వాహకులు అంచనావేస్తున్నారు. 
అన్ని ఏర్పాట్లు పూర్తి 
ప్లీనరీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల నుంచి వచ్చేవారు ఔట‌ర్ రింగ్ రోడ్ నుంచి రావాలని ముందే ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్లీనరీకి వచ్చే వారికోసం నోరూరించే 26 ర‌కాల వంట‌కాలు తయారు చేస్తున్నారు. భోజనాల సమయంలో ఒకేసారి రెండు వేల మందికి స‌రిప‌డేలా ఐదు డైనింగ్ హాళ్లను తయారుగా ఉంచారు. ప్లీనరీలో సీఎంతోసహా వీఐపీలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్టీ ప్రతినిధులకు అందుబాటులో ఉండేలా వెయ్యిమంది వాలంటీర్లను ఉపయోగిస్తున్నారు. ఉద‌యం 10 గంట‌లకు పార్టీ ప‌తాక ఆవిష్కరణతో ప్లీనరీ ప్రారంభం అవుతుంది. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించాక అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.. ఆ తర్వాత సభ మొదలవుతుంది. ఈ ప్లీనరీలో తెలంగాణతోపాటు.. ఎన్‌ఆర్‌ఐ శాఖలకుచెందిన పలువురు నేతలుకూడా పాల్గొనబోతున్నారు.

08:32 - April 21, 2017

టీఆర్ఎస్ ప్రతి అడుగు ఎన్నికల వైపు వేస్తోందని వక్తలు అన్నారు. టీఆర్ఎస్ మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. 'టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం' అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, టీఆర్ఎస్ నేత దినేష్ పాల్గొని, మాట్లాడారు. వీరయ్య మాట్లాడుతూ ఎన్నికలు, సీఎం ఎవరు అన్న అంశాలు టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశంలో ప్రధానంగా చర్చకు అవకాశం ఉందని అన్నారు. ఇందిరా శోభ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదన్నారు. ప్రశ్నించే వారి గోంతు నొక్కుతున్నారని అందుకే ధర్నా చౌక్ ఎత్తివేశారని తెలిపారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్టులను అధికార పార్టీ పూర్తి చేసి తాము చేశామంటూ చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లలో బీసీలను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దినేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశామని ఇంకా రెండేళ్ల పాలన సమయం ఉందన్నారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు సృష్టించాలని చూస్తున్నాయని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:10 - April 21, 2017

అవగాహనతో ఎంసెట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లాలని శారదా ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఎండి వై.శారదాదేవి అన్నారు. విద్యార్థులు ఆన్ లైన్ పరీక్ష తొలిసారిగా రాస్తున్నారు కాబట్టి ముందుగా ఆన్ లైన్ మాక్ టెస్ట్ లు రాయలని సూచించారు. 'ఎంసెంట్ ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ కావాలి' ? అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అర్ధగంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లాన్నారు. పరీక్షలో ముందుగా మాథ్య్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేయాలని తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కు తేదీ సమీపిస్తోంది. తొలిసారి ఆన్ లైన్ లో ఏపి ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24, 25, 26, 27తేదీలలో నిర్వహిస్తున్నారు. అగ్రికల్చరల్ ఎంట్రన్స్ టెస్టు ఏప్రిల్ 28న వుంటుంది. ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష కోసం దాదాపు 40వేల కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో కలిపి మొత్తం 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, హైదరాబాద్ లో మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ కేటాయిస్తారు. పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత పాస్ వర్డ్ ఇస్తారు. ఏపి ఎంసెట్ ను కాకినాడ జెఎన్ టియు నిర్వహిస్తోంది. అయితే, ఎంసెట్ కి ఫిజిక్స్‌ పేపర్‌ ఎలా ప్రిపేరవ్వాలి? పరీక్ష రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి'? అనే అంశాలపై ఆమె మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రేపు పాలీసెట్ ఎగ్జామ్..

మెదక్‌ : రేపు పాలీసెట్ పరీక్ష జరుగనుంది. పాలీసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కో ఆర్డీనేటర్ సుశీల్‌కుమార్ విలేకరులకు తెలిపారు. జిల్లా కేంద్రం మెదక్‌లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 1610 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 798 మంది, ప్రభుత్వ బాలికల పాఠశాలలో 250, పాలిటెక్నిక్ కళాశాలలో 200, సిద్దార్థ్ మోడల్ పాఠశాలలో 362 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. నేడు కొంపల్లిలో జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం ఉ. 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మూడవ సమావేశం జరుగనుంది. 

07:58 - April 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీలో పొదుపు చర్యలు కార్మికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కార్యకలాపాల పరంగా వేర్వేరుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు అధికారికంగా ఇంకా విడిపోలేదు. కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులకు మంగళం పాడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏపిఎస్‌ఆర్టీసి అధికారులు. తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల్లో పదిహేను వేల వరకు పెన్షనబుల్‌ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంస్థ పీఎఫ్ జమచేస్తుంది. బేసిక్ పే, డీఏ కలిపి 15 వేలు దాటితే తన వాటా పీఎఫ్‌ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసి పీఎఫ్‌ బోర్డు సమావేశానికి తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం ఓ లేఖ రాసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పూర్తికాని ఆర్టీసీ విభజన...
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. ఇందులో యాజమాన్యం, కార్మిక సంఘాల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పిఎఫ్ కోత విధించడం వల్ల రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసిలకు ఆరువందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

07:47 - April 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి, మలి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది. దీంతో ఇప్పుడు వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు జరగనున్న శతాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఉండేందుకు.. మొత్తం 30 కమిటీలు పని చేస్తున్నాయని తెలిపారు.
రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ..
ఏడాది పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26న ఓయూ శతాబ్ధి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారని తెలిపారు. 27 న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు పాల్గొంటారని.. మధ్యాహ్నం జరిగే ఉప కులపతుల సదస్సును కేంద్రమంత్రి జవదేకర్ ప్రారంభిస్తారని తెలిపారు. అయితే శతాబ్ధి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసిందని.. ఎక్కడా చిన్నలోటు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కడియం తెలిపారు. 

07:41 - April 21, 2017

విజయవాడ : వజ్రాలు పొదిగిన కంటాభరణాలు.. ఔరా అనిపించే వడ్డాణాలు..మిరుమిట్లు గొలిపే పచ్చల హారాలు.. ఇలా ఒకటేమిటి... ఏసీబీకి పట్టుబడ్డ ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజినీర్‌ బి.జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు తవ్వే కొద్దీ బయపడుతున్నాయి. బయటపడుతున్న బంగారు ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులు నివ్వెరపోతున్నారు.
మొత్తం ఎనిమిది లాకర్లు..
ఏసీబీ దాడుల్లో భాగంగా జగదీశ్వర్‌రెడ్డి భార్య, ముగ్గురు కుమార్తెల పేరిట మొత్తం ఎనిమిది లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిల్లోనూ కొటక్‌ మహీంద్ర, ఆంధ్రాబ్యాంకుల్లోని మొత్తం 5 లాకర్లను అధికారులు తెరిచారు. బాగ్ అంబ‌ర్ పేట్, రామంతాపూర్‌లోని ఆంధ్రాబ్యాంకులు, ఉప్పల్‌లోని కొట‌క్ మ‌హింద్రా బ్యాంకుల్లోని లాకర్లను ఓపెన్‌ చేశారు. వాటిల్లో 3 కిలోల బంగారు ఆభరణాలు, రూ.38 లక్షల నగదు లభ్యమైంది. బంగారు ఆభరణాల విలువ రూ.కోటికి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క బాగ్ అంబర్ పేట్ ఆంధ్రాబ్యాంక్‌ లాకర్‌లోనే కేజీన్నర బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమాస్తుల గుర్తింపు వేగవంతం 
4 రోజుల క్రితం ఏసీబీకి చిక్కిన విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు గుర్తించడంలో అధికారులు స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏక‌కాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌సహా ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి సుమారు 20 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించారు.

 

 

07:33 - April 21, 2017

హైదరాబాద్ : ధాన్యం సేకరణను ఇకపై ప్రతిరోజు సమీక్షించాలని మంత్రి హరీష్‌రావు జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన హరీష్‌రావు... ధాన్యం క్రయ, విక్రయాలపై మీడియాలో వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను హరీష్‌రావు ఆదేశించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని.. తేమ శాతం 17లోపు ఉండేలా రైతులలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐకేపీల ద్వారా ప్రచారం చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయొచ్చని.. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్టం చేయాలని హరీష్‌రావు సూచించారు.
ధాన్యం కేంద్రాలలో ముందు జాగ్రత్త చర్యలు..
వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కేంద్రాలలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు హరీష్‌రావు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్ల తర్వాత రైతులకు చెల్లింపులు 48 గంటల్లోనే జరిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు, క్రయ విక్రయాల్లో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలన్నారు. ఏ రోజుకారోజు మార్కెట్‌ నుంచి ధాన్యం మిల్లులకు, గోడౌన్లకు తరలించాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణా కోసం అవసరమైతే రవాణాశాఖను సంప్రదించి లారీల కోసం ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని హరీష్‌రావు సూచించారు. 

నేటి నుంచి తుందుర్రు ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష

పశ్చిమగోదావరి : తుందుర్రు ఆక్వాఫుడ్ పార్కును మరో ప్రాంతానికి తరలించాలంటూ నేటి నుంచి ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి : నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 'నీరు..ప్రగతి', 'స్పోర్ట్స్ పాలసీ'కి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 

నేడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

విజయవాడ : నేడు టీడీపీ సమన్వయ కమిటీ జరుగనుంది. ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

07:04 - April 21, 2017

హైదరాబాద్ : ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంపు తర్వాత.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ కొనసాగుతోంది. ఐదారు నెలల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దీని కోసం సర్వే చేయాలని బీసీ కమిషన్‌ను కోరారు. దీంతో బీసీ కమిషన్‌ కసరత్తు మొదలు పెట్టింది. మరోవైపు రిజర్వేషన్ల పెంపు అంశంపై బీసీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందనే దానిపై కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు బీసీ నేతలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వంపై బీసీలకు ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశాన్ని ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ద్వారా కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంపు
అయితే.. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు పెంచి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. బీసీలకు ఉన్న 25 శాతం రిజర్వేషన్లను.. మరో ఏడెనిమిది శాతం పెంచే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ఇదే అంశాన్ని ఈరోజు జరిగే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే 27న జరిగే బహిరంగ సభలో మరోసారి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రిజర్వేషన్ల అంశంపై పొలిటికల్‌ జేఏసీతో పాటు ప్రజాసంఘాలు, పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేదని.. దీంతో మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

 

నేడు వివిధ రాష్ట్రాల నేతలతో రాహుల్ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటలకు ఆ పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశం కానున్నారు. నేతలకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

06:59 - April 21, 2017

గుంటూరు : . ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులతో పాటు.. రాజధాని డిజైన్స్‌పై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయాలపై మంత్రులు, అధికారుల అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకోనున్నారు.
డ్రాఫ్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం?
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే సందర్భంలో విధించే నాలా చార్జీల తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్‌ భూమార్పిడి చట్టం 2006లో మార్పులు చేస్తూ రూపొందించిన డ్రాఫ్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ బిల్లును త్వరలో జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక రాష్ట్రంలో వేడి తీవ్రత కారణంగా పెరిగిన తాగునీటి సమస్యకు పరిష్కారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమంపై మరింత లోతుగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఆదరణ పథకం పునరుద్ధరణపై చర్చ
ఇక గతంలో ఉన్న ఆదరణ పథకం పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పసుపు, కంది పంటలకు మద్దతు ధర, మిర్చి ధరలు పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం కోరడంపైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక జీఎస్టీ బిల్లును ఆమోదించడం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. అలాగే స్పోర్ట్స్‌ పాలసీని ఆమోదించడంతో పాటు శ్రీకాకుళంలోని రణస్థలంలో 130 ఎకరాల భూమిని పరిశ్రమలకు డెవలప్‌ చేసుకునేందుకు అనుమతిచ్చే అవకాశం ఉంది.ఇక మంత్రివర్గ సమావేశానికి ముందే ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ కో-ఆర్డినేషన్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీడీపీ సంస్థాగత ఎన్నికలు, మహానాడు నిర్వహణ, నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది.

 

నేడు రెండో రోజు టీ.కాంగ్రెస్ జిల్లాల సమావేశం

హైదరాబాద్ : నేడు రెండో రోజు తెలంగాణ కాంగ్రెస్ జిల్లాల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో దేశంలో, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు కొంపల్లిలో టీఆర్ ఎస్ ప్లీనరీ

హైదరాబాద్ : కొంపల్లిలో నేడు టీఆర్ ఎస్ ప్లీనరీ జరుగనుంది. ఈ ప్లీనరీకి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్లీనరీ దగ్గర కేసీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉ. 10.45 గం.లకు ఆయన ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఉ11.15 గం.ల నుంచి 7 తీర్మానాలను ప్రవేశపెట్టి, నేతలు ఆమోదించనున్నారు. ప్లీనరీ నిర్వహణ కోసం వెయ్యి మంది వాలంటీర్లు పని చేయనున్నారు. 

నేడు టీఆర్ ఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 9.55 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ ఎన్నికల అధికారి నాయిని నర్సింహ్మారెడ్డి ఫలితాన్ని ప్రకటించనున్నారు. 

నేడు కోల్ కతా, గుజరాత్ మధ్య మ్యాచ్

కోల్కతా : ఐపీఎల్ 10 లో భాగంగా నేడు కోల్ కతా, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు రాష్ట్రాల నేతలతో రాహుల్ భేటీ

ఢిల్లీ : నేడు సాయంత్రం 4గంటలకు వివిధ రాష్ట్రాల నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. నేతంకు వివిధ రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు నేడు ఢిల్లీ వెల్లనున్నారు. మూడు రోజులు పాటు ఢిల్లీలో సీఎం పర్యటించారు. 23న నీతిఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. అనంతం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు.

Don't Miss