Activities calendar

22 April 2017

21:30 - April 22, 2017

చిత్తూరు: ఏర్పేడు ప్రమాదంలో 17మంది మృతికి అధికారపార్టీ నేతలే కారణమని మునగలపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక దందాపై మంత్రి బొజ్జలకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొజ్జల అనుచరులే లారీలకొద్దీ ఇసుకను తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. లారీ ప్రమాదం వెనక ఇసుక మాఫియా హస్తం ఉందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఇసుక దందా ఎక్కడ, జరుగుతోంది? గ్రామస్తులు ఏమంటున్నారు? మరిన్ని వివరాలు మురళి అందిస్తారు..

21:22 - April 22, 2017

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమేనంటోంది టీటీడీపీ. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ముందుగా వచ్చినా.. ఎదురుకునేందుకు రెడీగా ఉన్నామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తెలుగు దేశానికి తగిన క్యాడర్‌ ఉందని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా యువ నాయకత్వంతో ముందుకు దూసుకు వెళ్తామని నేతలు భరోసాగా చెబుతున్నారు.

అమలు కాని హామీలపై నిలదీత

కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని టీటీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, రుణ మాఫీ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల నియామకాలు, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని టీటీడీపీ యోచిస్తోంది.

119 నియోజక వర్గాల్లో యువతకు ప్రాధాన్యం

ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో వివరిస్తామంటున్నారు తెలుగు దేశం నేతలు. మొత్తం 119 నియోజక వర్గాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చి.. గెలుపు దిశగా అడుగులు వేయిస్తామని చెబుతున్నారు. 

21:19 - April 22, 2017

శ్చిమగోదావరి :జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్వాసితుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం సహా పలువురిని అరెస్టు చేశారు. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను వేరొకచోటికి తరలించాలని డిమాండ్‌ చేస్తూ... తుందుర్రువాసులు, వామపక్షాలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలందరూ పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

చీరాల లో రౌడీషీటర్ కత్తి శీను హత్య

ప్రకాశం: చీరాల బోస్ నగర్ లో రౌడీషీటర్ కత్తి శీనును ప్రత్యర్థులు నరికి చంపారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

దండుమైలారంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వారిరువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

తెలంగాణ లో 8 స్థానిక సంస్థలకు అవార్డులు

హైదరాబాద్: తెలంగాణ లో 8 స్థానిక సంస్థలకు అవార్డులు వచ్చాయి. ఎల్లుండి లక్నోలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డులను అందుకునేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు లక్నో వెళ్లనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి తోమర్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.

20:32 - April 22, 2017

హైదరాబాద్: బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత దర్శక దీరుడు రాజమౌలిదే. బాహుబలి తో 600 కొట్లు కొల్లగొట్టిన రాజమౌలి, బాహుబలి 2 తో బాక్సాఫీస్ ను షెక్ చేయడానికి సిద్దంగా వున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంట అది 'బాహుబలి' మాత్రమే. రెండు పార్టులు కలిసి రూ. 200 నుండి 250 కోట్లలో సినిమాను పూర్తి చేయాలనే ఎస్టిమేషన్స్ తో సినిమా ప్రారంభించారు.'బాహుబలి-ది బిగినింగ్' ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొదటి భాగం భారీ విజయం సాధించడం, భారీ వసూల్లు రాబట్టడంతో రెండో భాగం 'బాహుబలి-ది కంక్లూజన్' పై నిర్మాతలు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:06 - April 22, 2017

హైదరాబాద్: కొమటిరెడ్లకు చేయి ఇవ్వబోతున్న కాంగ్రెస్...పార్టీ నుండి పంపించేందుకు పక్కా స్కెచ్, జాబు కావాలంటే బాబు రావాల్సిందే...బాబు వచ్చిన తరువాత ఆకు, అలం తినాల్సిందే, బాన్సువాడ కాడ బేతాలుని జాతర..మస్తయితంది చూస్తానికి పోతారా, నాసా వాళ్ల మనసు దోసిన మెదక్ బిడ్డ...అన్ని ఖర్చులు పెడతానని చెప్పి కేటీఆర్, శ్రీరాములు ఇంట్లోకి దూరిన ఎలుగుబంటి...బోన్లకి ఎక్కించ్చుండ్రు దాన్ని అనగబట్టి. ఇలాంటి అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పేట్లబురుజు ఆస్పత్రిలో మరో బాలింత మృతి

హైదరాబాద్: పాతబస్తీ పేట్లబురుజు ఆస్పత్రిలో మరో బాలింత మృతి చెందింది. ఆపరేషన్ అయిన కొద్ది సేపటికే ఆమె మృతిచెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. మృతురాలు రత్నమాల మహబూబ్ నగర్ జిల్లా వాసి.

మిషన్ భగీరథకు మరో జాతీయ అవార్డు

ఢిల్లీ: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు మరో జాతీయ అవార్డు లభించింది. ఇప్పటికే అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రశంసలు అందుకున్న మిషన్ భగీరథకు మరో అవార్డు వరించడంతో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్న పథకంగా మిషన్ భగీరథ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనలో మిషన్ భగీరథ వినూత్నమైన పథకమని హడ్కో ప్రశంసించింది.

తుందుర్రులో నిరవధిక నిరాహార దీక్ష భగ్నం

ప.గో: తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ నిర్వాసితుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ ను వేరొక చోటికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

వనస్థలిపురం లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్: వనస్థలిపురం సాయినగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటిముందు నిలుచున్న మహిళ మెడలో నుంచి 6 తులాల బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు.

19:07 - April 22, 2017
18:57 - April 22, 2017

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. నాయకులు యమ స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు. ఏపీ అధికార, ప్రతిపక్ష అధినేతలు తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ముందస్తు ఎన్నికలున్నాయని చంద్రబాబు సంకేతాలివ్వడంతో.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు సై అంటూ ట్వీట్ చేశారు.

ముందస్తు ఎన్నికలను ప్రస్తావించిన చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ముందస్తు ఎన్నికలు రానున్నాయని సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు సూచనలపై.. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలొస్తే తమ పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం అనంతపురం రిక్రూట్‌మెంట్‌ పనులతో బిజీగా...

పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం అనంతపురం రిక్రూట్‌మెంట్‌ పనులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ముందస్తు ఎన్నికలు వస్తే పరిస్థితేంటి అన్న విషయమై పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. చర్చల తరువాతే పవన్‌ ట్విట్టర్‌లో స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు ఎన్నికల యుద్ధానికి సిద్ధమేనంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా....

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు.. పవన్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించిన పవన్‌.. శ్రీకాకుళం, ప్రకాశం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నేతల ఎంపిక ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఆరు నెలలు పార్టీ రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు.. జనసేనా అధ్యక్షుడు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

2018 జనవరి కల్లా జనసేనా పార్టీ నిర్మాణం...

2018 జనవరి కల్లా జనసేనా పార్టీ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తరువాత ప్రజా సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. పార్టీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. 

18:54 - April 22, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండోరోజుకు చేరుకుంది. సీపీఎం, ఆక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం సాగుతోంది. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం సహా తొమ్మిది మంది గ్రామస్థులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రాణాలు పోయిన దీక్ష ఆపేది లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

18:52 - April 22, 2017

అమరావతి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమంటోంది వైసీపీ. జరగాల్సిన సమయం కంటే ముందస్తుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికనుగుణంగా ఏపీలో వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్న కేంద్రం...

మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయి.. వచ్చేది మన ప్రభుత్వమే.. వేదిక ఏదైనా ప్రతిపక్ష నేత జగన్‌ చెప్పేది మాత్రం ఇదే. కేంద్రం కూడా ఏకీకృత ఎన్నికలకు మొగ్గు చూపడంతో వైసీపీ ముందస్తు ఎన్నికల కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో వైసీపీ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జగన్‌ గత పదిరోజులుగా ముఖ్య నేతల సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి పార్టీలో చేరికలు...

ఎన్నికల వ్యూహంలో భాగంగా...వైసీపీ అధినేత జగన్‌... పలు చర్యలు చేపట్టారు. పార్టీని అన్ని నియోజకవర్గాల్లోనూ బలోపేతం చేసేందుకు... వలసలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ పట్ల అనుకూలత కలిగి... స్థానికంగా ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలోకి తీసుకోవాల్సిందిగా జిల్లాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. దీనికి తోడు వైసీపీ.... అధికార పార్టీలోని అసంతృప్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంది.

పైకి సిద్ధమంటున్న లోపల మదనపడుతున్న వైసీపీ నేతలు...

కాగా ముందస్తు ఎన్నికలకు వైసీపీ నాయకులు పైకి సిద్ధమంటున్నా.. లోపల మదనపడుతున్నారని సమాచారం. ఐదేళ్లు గడవకుండా ఎన్నికలు వస్తే ప్రతిపక్ష పార్టీకి నష్టం వాటిల్లుతుందనే వాదన వినబడుతోంది. అలాగే అప్పుడే ఎన్నికలంటే పార్టీ బలోపేతం, కమిటీలు నియామకం వంటి వాటికి సమయం సరిపోదనే భావనను వైసీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు టీడీపీ కూడా సై అంటుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

18:50 - April 22, 2017

అమరావతి: చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ధిక్కార స్వరం.. తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దళితులకు భూపంపిణీ మొదలు, పదవుల కేటాయింపు దాకా బాబు సర్కారులో అడుగడుగునా దళితులకు అన్యాయం జరుగుతోందని శివప్రసాద్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. చిత్తూరు ఎంపీ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని సంకేతాలూ పంపారు. అయితే, ఎంపీ శివప్రసాద్‌ వెనక్కు తగ్గలేదు సరికదా.. ప్రశ్నించిన తననే భూకబ్జాకోరుగా చిత్రించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానుగా వెళ్లి సీఎంను కలవకూడదని నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు సొంత జిల్లాలో, సొంత పార్టీకే చెందిన ...

చంద్రబాబు సొంత జిల్లాలో, సొంత పార్టీకే చెందిన ఎంపీ స్థాయి వ్యక్తి దళితుల అంశంపై, సర్కారుపైనే ధిక్కార స్వరం వినిపించడం, అందివచ్చిన అవకాశంగా విపక్ష వైసీపీ భావిస్తోంది. శివప్రసాద్‌ను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారమూ జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి శివప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. రోజాను శివప్రసాదే నటిగా వెండితెరకు పరిచయం చేశారు. అయితే, తనకు అలాంటి ఆలోచన లేకపోయినా.. తాను వైసీపీతో టచ్‌లో ఉన్నానంటూ లీకేజీలు ఇవ్వడం ద్వారా, చంద్రబాబు తనను అవమానిస్తున్నారని శివప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు తీరుపై ఎంపీ శివప్రసాద్ కొంత కాలంగా కోపంగా...

నిజానికి చంద్రబాబు తీరుపై ఎంపీ శివప్రసాద్ కొంత కాలంగా కోపంగా ఉన్నారు. ఓ భూమి క్రమబద్దీకరణకు సంబంధించిన ఓ చిన్న పనిని తాను సీఎం దగ్గర సాధించుకోలేక పోయానన్నది ఆయన ఆవేదన. అదే సమయంలో వాహనం పార్కింగ్ విషయంలో తిరుపతి నడిరోడ్డుపై తన కుమార్తెకు అన్యాయం జరిగినా.. పార్టీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన కృంగిపోయారు. అదికూడా చంద్రబాబుపై ఆగ్రహాన్ని పెంచిందంటున్నారు. కారణాలేవైనా, ఎంపీ శివప్రసాద్‌ లేవనెత్తిన అంశాలపై, చంద్రబాబు నోరు మెదపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

శివప్రసాద్‌పై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ఆచితూచి ...

అదలావుంచితే, శివప్రసాద్‌పై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఓ దళిత ఎంపీపై చర్య తీసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన్ను అలాగే వదిలేస్తే పార్టీలో క్రమశిక్షణ దెబ్బతింటుందని, ఒకవేళ శివప్రసాద్‌ వైసీపీలో చేరితే, ఆ జిల్లాకే చెందిన చంద్రబాబుకు ఇబ్బందికర అంశమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి, ఎంపీ శివప్రసాద్‌తో ఏర్పడిన అగాథాన్ని సీఎం చంద్రబాబు ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాలి. 

18:47 - April 22, 2017

అమరావతి: గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు హక్కుగా దక్కాల్సిన గౌరవవేతనాన్ని చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీసీల వేతనాన్ని 750 నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ హామీకి మూడేళ్లు నిండాయి. కానీ, ఇంతవరకూ అమలు దిశగా ఒక్క అడుగైనా పడలేదు.

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 1099 గ్రామ పంచాయతీలు ....

విఓ 2 : శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 1099 గ్రామ పంచాయితీలున్నాయి. సర్పంచ్‌లతో పాటు ఎంపీటీసీల ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటాయి. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.. సర్పంచ్‌లకు ఐదువేల రూపాయల గౌరవ వేతనం అందిస్తుంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటివరకూ గౌరవ వేతనాలే చెల్లించక పోవడం పట్ల సర్పంచ్‌ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.

మండలి ఎన్నికల సమయంలో బకాయిలు చెల్లిస్తామని హామీ......

విఓ 3 : శాసనమండలి ఎన్నికల సమయంలో ఎంపిటిసిలను మభ్యపెట్టేందుకే, వేతనాల పెంపు, మూడు నెలల జీతాలు, బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ హామీ ఇచ్చారని సర్పంచ్‌ల సమాఖ్య ఆరోపిస్తోంది. మండలి ఎన్నికలు ముగిశాక తమను పట్టించుకోవడం లేదని బాధిత గ్రామీణ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మాట నిలుపుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

 

18:32 - April 22, 2017
18:09 - April 22, 2017

హైదరాబాద్: స్కూల్‌ పిల్లలకు సెలవులొచ్చేశాయి. సెలవులంటే ఆటలు, పాటలు. అందులోనూ నగరాల్లో ఉండే పిల్లలకు ఆటలాడటానికి దొరికే సమయం చాలా తక్కువ. దీంతో హైదరాబాద్‌లో సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడానికి.. బల్దియా సిద్ధమవుతోంది. స్టూడెంట్స్‌కి ఆటల్లో శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్‌ను రెడీ చేసింది. ఈ నెల 24న ప్రారంభం కానున్న ఈ స్పెషల్ సమ్మర్‌ క్యాంపుల్లో.. లక్షన్నర మందికి జీహెచ్ఎంసీ ట్రైనింగ్ ఇవ్వనుంది.

వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించేందుకు...

ఎండలు మండిపోతున్నాయి. దీంతో స్కూల్‌ పిల్లలకు ప్రభుత్వం ముందుగానే సెలవులిచ్చిది. వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. ప్రతీ యేడులాగే ఈ సారి కూడా సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులను నిర్వహించడానికి.. బల్దియా ప్రణాళికలు రూపొందించింది.

నెల 24 ప్రారంభం .....

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో దాదాపు లక్షన్నర మందికి.. వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల 24న ప్రారంభం కానున్న ఈ క్యాంపుల్లో 51 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 2 వేల 14 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

1968 నుంచి క్యాంపుల నిర్వహణ ......

వేసవి శిక్షణ శిబిరాల నిర్వహిణకు అవసరమయ్యే ఆట వస్తువుల కొనుగోలుకు.. కార్పొరేషన్‌ తమ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. 1968 నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా.. కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తోంది. మొట్ట మొదటి వేసవి శిక్షణ శిబిరం 1400ల మంది అబ్బాయిలు, 200ల మంది బాలికలతో జరిగింది. ఇప్పుడు జరిగే శిబిరంలో 2 వేల 65 మంది నిపుణులు.. విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

32 లక్షల మంది.....

గడిచిన 49 ఏళ్ల నుంచి.. బల్దియా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల ద్వారా 32 లక్షల మంది శిక్షణ పొందారు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నవారు ఎందరో ఉన్నారు. ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్‌, మున్సిపల్ గ్రౌండ్‌ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక ఒలంపిక్స్‌ పథకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధు కూడా.. వేసవి శిక్షణ శిబిరంలోనే తన ఆటలో ఓనమాలు దిద్దింది.

521 క్రీడా మైదానాలు .....

ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 521 క్రీడా మైదానాలు, 7 స్మిమ్మింగ్‌ ఫూల్‌లు, 13 స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, 7 రోలర్స్‌ స్కేటింగ్‌ రింగ్‌లు, 5 టెన్నీస్‌ కోర్టులు ఉన్నాయి. ఆరేళ్ల నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు ఈ శిక్షణ శిబిరాల్లో పాల్గొనవచ్చని అధికారులు చెబుతున్నారు. సాహస క్రీడలు, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్, బాడీ బిల్డింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, చెస్, క్యారమ్స్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, టెన్నీస్‌, టేబుల్‌ టెన్నీస్‌, టెన్నీకాయిట్‌, వాలీబాల్‌, యోగాతో పాటు ఇంకా పలు గేమ్స్‌లలో శిక్షణలు ఉంటాయన్నారు.

రూ. 10 నుంచి రూ. 50 మాత్రమే .....

హైదరాబాద్‌లో చిన్నపాటి కోచింగ్‌లకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ క్యాంపుల్లో కేవలం 10 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. దీనిని సిటిజన్స్‌ సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరుతున్నారు. 

18:05 - April 22, 2017

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం. క్రిష్ణన్‌ అన్నారు. లేకుంటే మే 23న ఢిల్లీలోని ఆర్ధికశాఖ మంత్రి కార్యాలయం ముందు మహాధర్నాకు దిగుతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో తపాలశాఖ క్యాజువల్‌, కంటింజెంట్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ కేంద్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న క్రిష్ణన్‌... పోస్టల్‌ ఉద్యోగులకు 6వ వేతనసంఘం సిఫార్సులకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయినా పూర్తి బకాయిలు మాత్రం చెల్లించడం లేదన్నారు. జీడీఎస్‌ ఉద్యోగాల్లో అర్హత కలిగిన క్యాజువల్‌ ఉద్యోగులను భర్తీ చెయ్యాలని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చినా ఎక్కడా అమలు జరగటం లేదని ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగభూషణం అన్నారు. 

18:03 - April 22, 2017

ఖమ్మం :జిల్లా వైద్యాధికారి విధులను అడ్డుకున్న... స్వాతి హాస్పిటల్‌ యజమాని లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ప్రమాణాలు పాటించడం లేదని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే ఆస్పత్రిని సీజ్‌ చేశామని జిల్లా వైద్యాధికారి చెప్పారు. అయితే ఇన్‌పేషంట్లను దృష్టిలో పెట్టుకుని...ఐదు రోజుల పాటు వారికి ఆస్పత్రిలో చికిత్స జరిగేలా అనుమతి ఇచ్చామని చెప్పారు. 

18:01 - April 22, 2017

హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖామంత్రి లక్ష్మారెడ్డి కూలీగా మారారు.. గులాబీ కూలీదినాల్లోభాగంగా యశోద ఆస్పత్రిలో పనిచేశారు.. రోగులకు వైద్యం అందించారు.. ఆస్పత్రిలో లక్ష్మారెడ్డి చేసిన పనికి ఆస్పత్రి యాజమాన్యం 5లక్షల రూపాయల్ని కూలీగా ఇచ్చింది.. 

18:00 - April 22, 2017

సిర్పూర్ : ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలకు తాళలేక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగలంతా వాతావరణం అగ్నిగుండంలా ఉంటోంది. వడదెబ్బలకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. కొమురం భీం జిల్లాలో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కొనేరు కోనప్పకే వడదెబ్బ తప్పలేదు.

కాగజ్‌నగర్‌, సిర్పూరు, బెజ్జూరు, దహేగాం

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మండే ఎండలకు.. జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. కాగజ్‌నగర్‌, సిర్పూరు, బెజ్జూరు, దహేగాం, ఆసిఫాబాద్‌, కెరామేరి, రెబ్బెన, తిర్యాణి మండలాలలో తీవ్రమైన వేడి ప్రజలను అవస్థల పాల్జేస్తోంది.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

భానుడు విజృంభిస్తుండంతో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాడ్పులు ప్రజలను నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాయి. కాగజ్‌నగర్‌ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జనాలు లేక వ్యాపార కేంద్రాలు, సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు చలివేంద్రాలను, చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్నారు.

ఇంకా దారుణంగా ఉపాధి హామీ కూలీల పరిస్థితి..

వడగాడ్పుల కారణంగా, ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎండలో పని చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది వడదెబ్బ తగిలి మంచం పట్టారు. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బకు ముగ్గురు మరణించారు. దాదాపు 100 మంది వరకూ ఉపాధి హామీ కూలీలు వాంతులు విరోచనాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. సామాన్యులే కాదు సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా వడదెబ్బకు గురయ్యారు. బెజ్జూరు మండల పర్యటనలో వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తనుచరులు కాగజ్‌ నగర్‌లోని.. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోనప్ప కోలుకుంటున్నారు.

డీ హైడ్రేషన్‌కు గురై డయేరియా బారిన పడతారని...

ఎండల తీవ్రత వల్ల, శరీరంలో నీటి శాతం గణనీయంగా పడిపోతుందని, ఫలితంగా డీ హైడ్రేషన్‌కు గురై డయేరియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. 

17:56 - April 22, 2017

హైదరాబాద్: భూ స్వాములకు లాభం చేకూర్చేందుకే ఎకరాకు 4వేలు ఆర్థిక సాయం పథకాన్ని సీఎం కేసీఆర్‌ తెరపైకి తెచ్చారని విమర్శించారు టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. రుణమాఫీని పూర్తిగా చేయని కేసీఆర్‌...రైతుల నుంచి విమర్శలు రావద్దనే సాకుతోనే ఎరువుల పథకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రుణమాఫీలో అసలు మాత్రమే మాఫీ చేశారని..వడ్డీమాత్రం అలాగే ఉందన్నారు. వడ్డీ మొత్తం మాఫీ చేస్తేనే రైతులకు పాస్‌ పుస్తకాలు ఇస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తుందండడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. వివిధ జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీలు, హైదరాబాద్, రామగుండం లో 43 డిగ్రీలు, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా నదిగామంలో 43 డిగ్రీలు, క్నూలు, నంద్యాల 42 డిగ్రీలు, కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడ, నెల్లూరుల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం: అరెస్ట్

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 50 మంది నుంచి రూ. కోటి వసూలు, చేసి బాధితులకు నకిలీ నియామక పత్రాలు చేసినట్లు సమాచారం. 

17:11 - April 22, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హెయిర్ సెలూన్ ను ప్రారంభించారు. సెలూన్ ను ప్రారంభించిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అభిమానులకు ఆయన పెద్దపీట వేస్తారనే సంగతి తెలిసిందే. అభిమానుల కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కి హెయిర్ స్టైలిస్ట్ గా 'రామ్ కొనికి' పనిచేస్తున్నారు. ‘గోపాల గోపాల' సినిమా దగ్గరి నుండి ఈ ప్రయాణం కొనసాగుతోంది. ఇటీవలే రామ్ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి బంజారాహిల్స్ లో 'సెలూన్ కొనికి' పేరిట ఓ సెలూన్ ను తెరిచాడు. ఈ సెలూన్ ని 'పవన్ కళ్యాణ్' ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. స్వయంగా కొబ్బరి కాయను కొట్టిన 'పవన్' రామ్ కొనికికి బెస్టాప్ లక్ చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై 'టు రామ్..విత్ లవ్ పవన్ కళ్యాణ్' అని రాశారు. సెలూన్ పవన్ ప్రారంభించడం పట్ల రామ్ కొనికి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

17:08 - April 22, 2017

నెల్లూరు: బడికొస్తా పథకంలో భాగంగా నెల్లూరులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొమ్మిది వేల మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. నగరంలోని వీఆర్స్‌ సెంటర్ వద్ద బాలికలకు సైకిళ్లు అందజేశారు. అనంతరం సైకిల్ ర్యాలీని ప్రారంభించి... మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సైకిల్ తొక్కారు . ఏపీలో విద్యారంగానికి టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని.. అందులో భాగంగానే 75 కోట్ల రూపాయలతో ఏపీలో బడికొస్తా పథకం పెట్టి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తుందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

17:06 - April 22, 2017

ఢిల్లీ: అన్నాడీఎంకే నేత దినకరన్‌ ను.. ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. రెండాకుల గుర్తు కేటాయింపు కోసం.. ఈసీకి లంచం ఇచ్చినట్లుగా దినకరన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈసీకి లంచం ఇచ్చిన చంద్రశేఖర్‌తో దినకరన్‌కున్న సంబంధాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

17:04 - April 22, 2017

హైదరాబాద్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు దేశంలోనే ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న 'ఈ -నాం' ఆన్ లైన్ ట్రేడింగ్‌ తీరుకు.. ఎక్సలెన్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అవార్డు దక్కింది. ఈ-నాం విధానంలో రైతులకు లాభం కలుగడమే కాకుండా.. చెల్లింపులు కూడా పారదర్శకంగా జరుగుతున్నాయి. దీంతో.. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం నిజామాబాద్‌ మార్కెట్‌యార్డ్‌ దక్కించుకుంది.

2016 జూన్ 11న నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈ-నాం ప్రారంభం ...

ఉమ్మడి జిల్లా కేంద్రంగా 2016 జూన్ 11 నాడు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 'ఈ -నాం' సేవలను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సంవత్సర కాలంలోనే క్రయవిక్రయాల ద్వారా జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది నిజామాబాద్‌ మార్కెట్‌యార్డు. తెలంగాణాలో ఈ పథకం కింద మొదటి ఫేస్‌లో మలక్ పేట, వరంగల్, బాగేపల్లి, తిరుమలగిరి, నిజామాబాద్ మార్కెట్ యార్డులను ఎంపికచేశారు.

-పోర్టల్ ప్రాజెక్టును 2016 ఏప్రిల్‌ 14 ప్రారంభించిన ప్రధాని ...

అయితే అంతకు ముందే ఈ -పోర్టల్ ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 2016లో ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. రెండు నెలలు ఆలస్యంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నాం సేవలు ప్రారంభమయ్యాయి. అయినా తొలిమూడు నెలల్లోనే సుమారుగా 70 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం ద్వారా ఈ మార్కెట్‌యార్డు రికార్డు సృష్టించింది. ప్రధానంగా పసుపు, సోయాబీన్, ధాన్యం మొక్కజొన్న, ఆంచూర్ ,కూరగాయల విక్రయాలు జొరుగా సాగాయి. ఒక్క ఏడాదిలోనే ఈ -నాం ద్వారా 860 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇక్కడ జరిగిన క్రయవిక్రయాల ద్వారా యార్డుకు 8కోట్ల 50లక్లల రూపాయల కమీషన్‌ వచ్చింది. దాంతో ఈ -నాం కోనుగోళ్లపై కేంద్ర అవార్డు స్ర్కీనింగ్ కమిటీ నజర్ పడింది. ఈ మేరకు రెండు సార్లు కలెక్టర్ డిల్లీలొ స్ర్కీనింగ్ కమిటి ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఢిల్లీలో అవార్డు అందుకున్న కలెక్టర్‌ , మార్కెట్‌ కమిటీ కార్యదర్శి...

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు దేశంలోనే అత్యుత్తమ సేవలకు జాతీయ స్థాయిలో పురస్కారానికి ఎంపిక అయింది. కలెక్టర్ యోగితారాణా మార్కెట్ కమిటి కార్యదర్సి సంగయ్య డిల్లీలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మెత్తానికి దేశంలోనే అత్యుత్తమ క్రయవిక్రయాల మార్కెట్‌గా నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు పేరు పొందడంపై ఇందూరు ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

17:01 - April 22, 2017

తూ.గో: రాజమండ్రిలో ఓ గర్భిణీ ఆటోలోనే ప్రసవించింది.. తూర్పుగోదావరి జిల్లా కోలమూరుకుచెందిన రామలక్ష్మి అనే గర్భిణీ ప్రసవంకోసం రాజమండ్రి ప్రభుత్వాతస్పత్రికివచ్చింది.. డెలివరీకి ఇంకా సమయం ఉందని వైద్యులు చెప్పడంతో ఆటోలో ఇంటికి బయలుదేరింది.. మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులువచ్చాయి.. ఆటోను తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చేలోపు రామలక్ష్మి శిశువుకు జన్మనిచ్చింది.. వైద్యుల నిర్లక్ష్యంవల్లే ఇలా జరిగిందంటూ ఆమె బంధువులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిముందు ఆందోళనకు దిగారు. రెండురోజులక్రితం ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకివచ్చింది..

16:59 - April 22, 2017

అమరావతి: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల నుంచే ప్రచండ భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు.

ఉక్కపోత, వడగాడ్పులతో...

ఇళ్లల్లోనే ఉందామనుకున్నా.. ఉక్కపోత, వడగాడ్పులు ప్రజలను నానా అవస్థలకూ గురి చేస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎండలకు తాళలేక కొంతమంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.

ఎండలు ఈ స్థాయిలో నమోదవడంపై ప్రజలు కలవరం...

రాష్ట్రంలో ఏప్రిల్‌ మాసంలోనే ఎండలు ఈ స్థాయిలో నమోదవడంపై ప్రజలు కలవరపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే మే నెల రోహిణి కార్తెలో ఎండలు ఇంకెలా ఠారెత్తిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో వరుణుడు కరుణించేవారకూ ఎండ తీవ్రతను తట్టుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే, జూన్ లలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని...44 నుంచి 47 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఏసీలు, ఫ్లాన్లకు ఫుల్ డిమాండ్ ...

ఎండలు అధికంగా ఉండడంతో ఏపీలో ఏసీలు, ఫ్లాన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనానికి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఎండాకాలంలో అన్ని వయస్సుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా, వీలైనంత ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడాలంటున్నారు. ఎండా కాలం ముగిసేంత వరకూ పిల్లలు, పెద్దలు , గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

16:57 - April 22, 2017

హైదరాబాద్: కాలిఫోర్నియా హైవేపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు.. కారును ఢీకొట్టడమే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లింది. హైవేపై నిస్సాన్‌ కారులో వెళుతున్న ఓ వ్యక్తిని పక్క నుంచి వెళుతున్న ట్రక్కు ఢీకొట్టింది. దాంతో కారు డోర్ ట్రక్కు వెనక ఇరుక్కుపోయింది. ఈ విషయం ట్రక్కు నడుపుతున్న డ్రైవర్‌కి తెలియలేదు. అదే సమయంలో హైవేపై వెళుతున్న బ్రైన్‌ స్టీమ్కే అనే వ్యక్తి.. ట్రక్‌ డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. ఇంత జరిగినా కారులో ఉన్న డ్రైవర్‌కి ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియోని స్టీమ్కే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

ఆటోలోనే ప్రసవం..

రాజమండ్రి : ప్రభుత్వాసుపత్రులు గర్భిణీల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఈ ఘటన నిరూపిస్తోంది. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఓ గర్భిణీ వచ్చింది. డెలివరీకి టైం ఉందంటూ వెనక్కి పంపారు. తిరిగి ఆటోలో వెళుతుండగా డెలివరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జీహెచ్ఎంసీలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఉద్యోగాలిప్పిస్తామని మోసానికి పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 50 మంది నుండి రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితులకు నకిలీ నియామక పత్రాలను ఇచ్చారని కనుగొన్నారు.

 

 

ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఎంపీ విజయ సాయిరెడ్డి ఫోన్..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఎంపీ విజయ సాయిరెడ్డి ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్న 40 మంది వైసీపీ అభిమానులను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రవికిరణ్ పెట్టిన పోస్టింగులు ఇక నుండి తాను పెడుతానని, ఏవైనా చర్యలు తీసుకుంటే తనపై తీసుకోవాలని సవాల్ విసిరారు. లోకేష్ ముమ్మాటికి పప్పేనని పేర్కొన్నారు. వైసీపీ అనుబంధ విభాగాలన్నింటికీ తాను ఇన్ ఛార్జీనని, నోటీసులు ఇవ్వాలని అనుకుంటే తనకే ఇవ్వాలని సూచించారు.

16:21 - April 22, 2017

ఆకుకూరలు..ఆరోగ్యానికి ఎంతో మంచిది..నిత్య ఆహారంలో ఆకు కూరలను భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయి. ఆకుకూరల్లో పాలకూర ఒకటి. మహిళలకు పాలకూర వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మహిళలు తప్పనిసరిగా పాలకూరను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి.
దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.
శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.

క్రైమ్ బ్రాంచ్ ఎదుట దినకరన్..

ఢిల్లీ : రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఎదుట దినకరన్ విచారణకు హాజరయ్యారు. రెండాకుల గుర్తు కేటాయింపు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపారని దినకరన్ పై ఆరోపణలున్నాయి.

మండుతున్న ఎండలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. శనివారం అత్యధికంగా ఆదిలాబాద్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, రామగుండం లో 43, ఖమ్మ, మెదక్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా నందిగామలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల 42 డిగ్రీలు, కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

15:48 - April 22, 2017

హైదరాబాద్: ఆఫ్గనిస్తాన్‌లో శుక్రవారం సైనిక శిబిరంపై తాలిబన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో వంద మందికి పైగా సైనికులు మృతి చెందారు. మజార్‌-ఎ-షరీఫ్‌ పట్టణ సరిహద్దులో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉగ్రదాడి జరిగింది. ఆర్మీకి చెందిన రెండు జీపుల్లో సైనిక దుస్తుల్లో వచ్చిన తాలిబన్లు 209 మంది సైనికులున్న శిబిరంపై రాకెట్‌ గ్రేనేట్లు, రైఫిళ్లతో మెరుపు దాడి చేసినట్లు ఆఫ్గన్‌ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. సైనికులు జరిపిన ఎదురుదాడిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆత్మాహుతి జాకెట్‌తో పాటు ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. సైనికులు మసీదులో నమాజు చేస్తుండగా దాడి జరిగింది. ఈ దాడి కొన్ని గంటల పాటు జరిగిందని, సైనికులు ఉగ్రదాడిని ధైర్యంగా తిప్పికొట్టారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. మజార్‌ ఎ షరీఫ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోది తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు.

 

15:46 - April 22, 2017

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది మొదలు.. క్రమశిక్షణకు మారుపేరుగా పేరు తెచ్చుకుంది. పార్టీలో ఎంతటి నాయకుడైనా సరే.. తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలుండేవి. పార్టీ, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేది. అవసరమైతే క్రమశిక్షణ తప్పిన నేతలను పార్టీ నుంచి బహిష్కరించేందుకూ నాయకత్వం వెనుకాడేది కాదు. అప్పట్లో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న రేణుకాచౌదరిని, ఎన్టీఆర్‌ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్‌ చేశారు. ఓసారి మోహన్‌బాబు తప్పు చేశారని భావించి, ఆయనపైనా చర్య తీసుకున్నారు. క్రమశిక్షణ విషయంలో ఇంతటి కఠినంగా ఉండేది కాబట్టే, ఎన్నో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొందన్నది పార్టీ సీనియర్లు చెబుతుంటారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా .....

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీడీపీ నాయకులు తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించారే తప్ప.. అధినేతకు గానీ, పార్టీకి గానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అట్లాంటి పార్టీలో, ఇటీవల క్రమశిక్షణ గాడితప్పినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో పార్టీ నాయకుల తీరు, వర్గ రాజకీయాలు, టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. మంత్రులు మొదలు ఛోటామోటా నాయకులంతా తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవలి మంత్రివర్గ విస్తరణ అనంతరం కొందరు నాయకులు అనుసరించిన తీరు, అధినేత ఉదాసీనత.. టీడీపీలో క్రమశిక్షణ నేతిబీర చందమే అన్న భావనను కలిగించింది.

తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వ్యవహార శైలి..

తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వ్యవహార శైలి.. టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందంటూ ఏకంగా చంద్రబాబునే టార్గెట్‌ చేశారాయన. దళిత ఎంపీనైన తనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదన్నది ఆయన మరో అభియోగం. ఇక కడప జిల్లా ప్రొద్దటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎంపిక తీరులో, తెలుగుతమ్ముళ్ల శైలి పార్టీకి తలవంపులు తెచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. చైర్మన్‌ స్థానం కోసం, ఎంపీ సీఎం.రమేశ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వరదరాజుల రెడ్డి వర్గాల మధ్య పంతం.. పార్టీని బజారుకీడ్చిందని టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. ఇక కృష్ణా జిల్లా పెనమలూరులో సంస్థాగత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే బోడేప్రసాద్‌, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ల విభేదాలు.. పరస్పరం తన్నుకునే దాకా వెళ్లింది.

నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ టీడీపీలో సెగలు...

ఇక భూమానాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ టీడీపీలో సెగలు రేపుతున్నాయి. నంద్యాల టికెట్‌ కోసం భూమా, శిల్పా కుటుంబాల మధ్య పోరు సాగుతోంది. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక లేదా ఆయన సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి నంద్యాల రేసులో ఉన్నారు. మాజీమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కూడా భూమా కుటుంబానికే మద్దతు తెలిపారు. ఈ సీటు విషయంలో ఎవరికివారు పంతాలకు వెళుతుండడంతో, అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మనుగడలో ఉన్న జాతీయ పార్టీ తెలుగుదేశంలో.. కాంగ్రెస్‌ తరహా కుమ్ములాటల సంస్కృతి రావడంపై పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలను పార్టీ వేదికలపైనే...

పార్టీ అంతర్గత వ్యవహారాలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని, రోడ్డుకెక్కితే ఎలాంటివారినైనా సహించేది లేదని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే, తెలుగు తమ్ముళ్ల తీరు మాత్రం మారడం లేదు. క్రమశిక్షణ రేఖను దాటి వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇది విపక్షానికి బలంగా మారే అవకాశం లేకపోలేదని టీడీపీ కార్యకర్తలు కలవరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం, ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పెద్ద సంఖ్యలో వలస వచ్చిన ఇతర పార్టీల నాయకుల తీరు కూడా క్రమశిక్షణ లోపించడానికి కారణమన్న భావన వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా, తమ్ముళ్లను దారిలో పెట్టి క్రమశిక్షణను పునరుద్ధరించాలని, అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకైనా సిద్ధపడాలని వారు కోరుతున్నారు. మరి అధినేత అంతటి కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా..? తెలుగు తమ్ముళ్ల తీరులో మార్పు వచ్చే అవకాశం ఉందా..? కాలమే తేల్చాలి. 

15:43 - April 22, 2017

మెదక్‌ : శివ్వంపేట మండలం.. చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్‌ గోపిచంద్‌, చాముండేశ్వరినాథ్‌ సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పక్కన గల ఎత్తైన కొండపై ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్మించనున్న 111 అడుగుల పంచలోహ హనుమాన్‌ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు.  

15:40 - April 22, 2017

హైదరాబాద్ : కోఠీ ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల మరణాలపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోతున్నారని ఆరోపిస్తున్నారు. తీరా డెలివరీ అయ్యే సమయానికి ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారని..అందువల్లే మరణాలు సంభవిస్తున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పలు జిల్లాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు..

హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తూ టి.సర్కార్ జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ మినహా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 95వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసింది. మహబూబ్ నగర్ లో 14 నియోజకవర్గాలకు 14వేలు..వరంగల్ కు 12 వేలు, రంగారెడ్డికి 6 వేలు..మెదక్ కు 9 వేలు..ఆదిలాబాద్ జిల్లాకు 10 వేలు..నిజామాబాద్ కు 9 వేలు, కరీంనగర్ జిల్లాకు 13వేలు, ఖమ్మం కు 10 వేలు, నల్గొండ జిల్లాకు 12 వేల ఇళ్లను మంజూరు చేసింది.

రైతుల సంక్షేమమే ధ్యేయం - పోచారం..

కామారెడ్డి : బిక్కనూరు (మం) రామేశ్వరపల్లిలో రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి పోచారం పాల్గొన్నారు. త్వరలో 500 అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

గజ్వేల్ లో మంత్రులు ఈటెల..హరీష్ లు పర్యటన..

సిద్ధిపేట : గజ్వేల్ పట్టణంలో మంత్రులు ఈటెల, హరీష్ రావులు పర్యటించారు. షాదీఖానా నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.

ఓల్డ్ సిటీలో క్రికెట్ బెట్టింగ్..

హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద రూ. 7 లక్షలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సిరిసిల్లలో టాస్క్ ఫోర్స్ దాడులు..

సిరిసిల్ల : పట్టణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 34 లక్షలను విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

 

సభకు రైతులు భారీగా రావాలి - కడియం..

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల రాజులా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. రెండు పంటలకు ఆర్థిక సాయం చేయడం దేశంలోనే గొప్ప నిర్ణయమన్నారు. టీఆర్ఎస్ సభకు రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

మండలి బుద్ధ ప్రసాద్ కు డాక్టరేట్..

కృష్ణా : యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ కు డాక్టరేట్ ప్రధానం చేశారు.

భీమ్ యాప్ ద్వారా రుణాల పంపిణీ చేసిన స్మృతి ఇరానీ..

విజయవాడ : చేనేత, హస్తకళలు, చేతివృత్తుల కార్మికులకు సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీలు పాల్గొన్నారు. భీమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో రుణాలను స్మృతి ఇరానీ అందచేశారు.

అంబర్ పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణం - తుమ్మల..

హైదరాబాద్ : అంబర్ పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన ఆర్ అండ్ బి శాఖపై సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, రహదారి వెంట ఉన్న మద్యం దుకాణాల అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల అధికారిక నివాసాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు.

 

14:46 - April 22, 2017

హైదరాబాద్: చెరువుల పక్కన సరదాగా గడపడటమంటే.. ఎవరికైనా ఇష్టమే. పట్టణాల్లో అయితే అలా ఉల్లాసంగా కాలం గడపాలని తహతహలాడిపోతుంటారు. కానీ హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. సిటీలోని ఏ చెరువు చూసినా మురికి కూపంగా మారిపోయింది. సిటీ చెరువుల్ని క్లీన్‌ చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు.. జీహెచ్‌ఎంసీ చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.

ప్రమాదంలో జలచరాలు, పక్షుల మనుగడ

ఎక్కడ చూసినా గుర్రపు డెక్కా చెత్తా చెదారంతో చెరువులు.. కుంటలు తన స్వరూపాన్ని కోల్పోతున్నాయి. చెరువుల్లో పెరిగిన కాలుష్యం వల్ల దుర్గంధం వస్తుండటంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చర్మవ్యాధులు పెరగడంతో పాటు.. సిటిజన్స్‌ పలు రోగాల బారిన పడుతున్నారు. అంతే కాకుండా ఈ నీటితో జలచరాలు, పక్షుల మనుగడ కూడా ప్రమాదంలో పడింది.

విషతుల్యమైన చెరువులు...

హైదరాబాద్‌ నగరం ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందింది. ప్రస్తుతం చాలా చెరువులు, కుంటలు మాయమై వాటి పేరు మీదే కాలనీలు వెలిశాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వెలువరించే కాలుష్యకారక వ్యర్థాలతో.. చెరువులు విషతుల్యం అయ్యాయి. దీంతో సర్కార్‌ చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతామని.. వాటిని పరిరక్షిస్తామంటూ లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అయినా ఇప్పటికీ సిటీలోని చెరువుల పరిస్థితి అలాగే ఉంది.

పచ్చని పచ్చిక బయళ్లను తలపిస్తున్నాయి,,,,

కొన్నేళ్ల క్రితం వరకు మురికి గుంటలుగా ఉన్న చెరువులు.. ప్రస్తుతం పచ్చని పచ్చిక బయళ్లను తలపిస్తున్నాయి. పచ్చిక బయలులా కనిపించే ఈ పచ్చదనం భయంకరమైన గుర్రపు డెక్క. నగరంలో ఉన్న చెరువులకు పూర్వవైభవం తీసుకురావడానికి.. రెండేళ్ల క్రితం అధికారులు ప్రత్యేక యంత్రాలను హైదరాబాద్‌కు తెప్పించారు. ఎంతో ఆర్భాటంగా మంత్రులందరూ వాటిని ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదని నగరవాసులంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 60 చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించడానికి బల్దియా ప్రణాళికలు రూపొందించింది. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా దీన్ని పట్టించుకోకపోతే సిటిజన్స్‌కు.. రానున్న వర్షాకాలంలో కష్టాలు తప్పేలా లేవు. 

14:45 - April 22, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన పనులు పడకేశాయి. అధికారుల పని తీరు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఫలితంగా ట్యాంక్‌బండ్‌ దగ్గర దుర్వాసన దంచి కొడుతోంది. ఈ దెబ్బతో నగరవాసులు, పర్యాటకులు అటువైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. హుస్సేన్‌సాగర్‌ వద్ద ముక్కుపుటాలు అదిపోయేంత దుర్వాసన. రెండు నిమిషాలు కూడా మనుషులు నిలవలేని దుస్థితి.

కెమికల్స్‌, రసాయనాలు, చెత్తాచెదారాలతో ....

హుస్సేన్‌సాగర్‌ కెమికల్స్‌, రసాయనాలు, చెత్తాచెదారాలతో నిండిపోయింది. ప్రక్షాళన పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయో లేక.. అధికారుల అలసత్వమో హుస్సేన్‌సాగర్‌ యథాతథ దుస్థితికి చేరుకుంది. గతంలో సాగర్‌ నీటి వ్యర్థాల తీవ్రతను తెలుసుకునేందుకు.. ఆస్ట్రియా నిపుణుల బృందం నమూనాలను సేకరించింది. ఆ ఫలితాల ఆధారంగా, మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా, చెత్త తొలగింపు పనులు ప్రారంభించింది. అయితే ఆ పనులు నామమాత్రంగానే సాగడంతో హుస్సేన్‌ సాగర్‌ వద్ద దుర్వాసన యథావిధిగానే వెలువడుతోంది. దీని ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడుతోంది.

కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం శూన్యం

నెక్లెస్‌ రోడ్‌ నుంచి లుంబినీ పార్క్‌ వరకు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరించాలంటేనే.. నగరవాసులు, పర్యాటకులు భయపడిపోతున్నారు.కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యంగా మారింది.

హుస్సేన్‌సాగర్‌లో విషపూరిత రసాయనాలు ఇంకా అలాగే.....

హుస్సేన్‌సాగర్‌లో విషపూరిత రసాయనాలు ఇంకా అలాగే ఉన్నాయి. నీటి అడుగు భాగాన ఉన్న వ్యర్థాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అసలు అందులోని రసాయనాలు ఏంటి? వాటిని పూర్తిగా బయటకు తొలగించే వీలు లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వ్యర్థాలను బయటకు తీస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏమిటి.. వ్యర్థాలను ఎక్కడ వేయవచ్చు. ఈ విషయంలో టీ సర్కార్ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. సాగర్‌ నీటిని పూర్తిగా ఖాళీ చేసి ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌ భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుస్సేన్‌సాగర్‌ పరిస్థితి మారలేదు. ఇంకా నాలాల మళ్లింపు పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం వ్యర్థజలాలు సాగర్‌ను కలుషితం చేస్తూనే ఉన్నాయి.

పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ...

హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్‌, నగర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు చెప్పారు. కానీ అది ఆచరణలోకి రావడం లేదు. పైగా ఎక్కడ లోపం ఉందన్నది ఇప్పటికీ ప్రభుత్వానికి అంతుచిక్కని సమస్యగానే మారింది. ఇప్పటికైనా సాగర్‌ ప్రక్షాళనను పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. 

ఓట్ల కోసమే రైతుల ప్రేమ – కోమటిరెడ్డి..

హైదరాబాద్ : ఓట్ల కోసమే రైతులపై కేసీఆర్ ప్రేమ కురిపిస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి విమర్శించారు. మూడేళ్ల తరువాత కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారని, అందుకే ప్లీనరీలో కేసీఆర్ రైతు జపం చేశారని విమర్శించారు. ప్రాజెక్టు రీ డిజైన్, మిషన్ భగీరథలతో కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని విమర్శించారు. అవినీతి ఆరోపణలు చేస్తే కేసులు పెడుతామంటున్న కేసీఆర్ ఏ శాఖలో అవినీతి లేదో సీఎం చెప్పాలని సూచించారు. పథకాల్లో అవినీతిపై విచారణ జరిపించాలని, తనది తప్పైతే కేసులు పెట్టాలని..ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ - వెంకయ్య...

కృష్ణా : ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, పార్లమెంట్ లో బీజేపీకి 352 మంది ఎంపీలున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన మూడేళ్ల ప్రగతిపై గన్నవరలో బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. దేశ మంతటా మోడీ నినాదమే మార్మోగుతోందని, బీజేపీ సిద్ధాంతాలు దేశానికి శ్రీరామరక్ష అని అభివర్ణించారు. మోడీ పేరు ప్రతి ఇంటికి..ప్రతి గ్రామానికి చేరిందన్నారు.దేశంలో 65 శాతం భూభాగంలో బీజేపీ జెండా ఎగురుతోందని, బీజేపీలోనే అత్యధికంగా దళిత..పేద ఎంపీలు..మహిళా ఎంపీలున్నారని చెప్పుకొచ్చారు.

14:38 - April 22, 2017

హైదరాబాద్: సోషల్ మీడియాలో అసెంబ్లీపై అనుచిత వాఖ్యలు చేసిన కేసులో అదుపులో తీసుకున్న రవికిరణ్ ను గుంటూరు పోలీసులు ఇంటిదగ్గర వదిలిపెట్టి వెళ్లారు. నిన్న తెల్లవారుజామున రవికిరణ్ ని అదుపులోకి తీసుకున్న తరువాత నేరుగా విజయవాడ కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. అసెంబ్లీని కించపరిచే విధంగా వాఖ్యలు పై ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై మరోసారి పోలీస్‌ స్టేషన్ కి వచ్చి వివరణ ఇవ్వాల్సి వుంటుందని పోలీసులు చెప్పి తనని ఇంటి దగ్గర వదిలిపెట్టారని రవికిరణ్ తెలిపారు.

14:36 - April 22, 2017

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య గొడవలు సహజమేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వర్గపోరు అన్ని పార్టీల్లోనూ ఉందన్నారు. టీఆర్‌ఎస్‌, టీడీపీలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరుందన్నారు. కాంగ్రెస్‌లో తలెత్తే చిన్నచిన్న వివాదాలు సమసిపోతాయన్నారు. సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన... మిషన్‌భగీరథ అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. కేసీఆర్‌ ఉచిత ఎరువుల ప్రకటన రాజకీయలబ్దికోసమేనన్నారు. 

14:34 - April 22, 2017

పెద్దపల్లి : కూతురు నిశ్చితార్థం చెట్టుకింద జరిపించే దుస్థితి ఓ తండ్రికి ఎదురైంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన రామలక్ష్మయ్య భూమిపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. రామలక్ష్మయ్య భూమిని రెవిన్యూ అధికారులు మరొకరికి కేటాయించారు. దీంతో అతనికి ఇళ్లు నిర్మించడం సాధ్యపడలేదు. తనకు జరిగిన అన్యాయంపై రామలక్ష్మయ్య కోర్టు ఆశ్రయించాడు. కోర్టు కూడా రామ లక్ష్మయ్యకే అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ అధికారులు, ఓ రాజకీయ నేత అడ్డుతగిలారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రామలక్ష్మయ్య కూతురు నిశ్చితార్ధాన్ని చెట్టుకిందే నిర్వహించాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. రామలక్ష్మయ్య చెట్టుకిందనే నిర్వహించడం అందరినీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన భూమి తనకు ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు.

వైసీపీ సోషల్ మీడియా ఆఫీసులో పోలీసులు తనిఖీలు..

హైదరాబాద్ : వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

14:32 - April 22, 2017

జమ్ముకశ్మీర్‌ : రైసీ జిల్లాలో గోరక్షణ పేరిట దాడి జరిగింది. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలికతో పాటు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ సంచార కుటుంబం పశువులతో పాటు వెళ్తుండగా తల్వారా ప్రాంతంలో వారిని గోరక్షకుల సమూహం అడ్డుకుంది. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా వారిపై గోరక్షకులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమను బాగా కొట్టారని, వృద్ధులను సైతం వదలలేదని, తమపై అత్యాచారానికి యత్నించగా అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితులు చెప్పారు. తమ పదేళ్ల బాలుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమవద్దనున్న మేకలు, 16 ఆవులతో సహా కుక్కలను కూడా తీసుకెళ్లినట్లు బాధితులు చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, దాడి చేసిన వారిలో ఐదుగురిని గుర్తించామని పోలీసులు చెప్పారు. ఇంతవరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు.

కోఠి ప్రసూతి ఆసుపత్రిలో రోగుల అవస్థలు..

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన వసతులు లేకపోవడంతో రోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని రోగులు పెట్టుకుంటున్నారు. పరీక్షల కారణంగా మరో రెండు రోజుల పాటు గర్భిణీలకు ఆపరేషన్ లు బంద్ కానున్నాయి.

14:25 - April 22, 2017
13:48 - April 22, 2017

చిత్తూరు : ఏర్పేడు మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ , బొజ్జలకు చేదు అనుభవం ఎదురైంది. ఇందంతా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని బాధితులను వారిని నిలదీశారు. మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని వెనుక ఇసుక మాఫియా ఉందన్న వాదానను లోకేష్ ఖండించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ.10 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. శుక్రవారం లారీ ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందారు. వీరు ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ వెళ్లారు. ఫిర్యాదుపై సీఐ స్పందించలేదు. అయితే అక్కడే ఉన్న వారి పైకి లారీ దూసుకొచ్చింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 21 మందికి గాయాలైన విషయం తెలిసిందే.

 

గన్నవరంలో బీజేపీ విజయోత్సవ సభ

కృష్ణా : ఎన్ డీఏ ప్రభుత్వం సాధించిన మూడేళ్ల ప్రగతిపై గన్నవరంలో బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరై, ప్రసంగించారు. దేశమంతా ప్రధాని మోడీ నినాదమే మార్మోగుతోందన్నారు. మోడీ పేరు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి చేరిందన్నారు. పార్టీ కార్యకర్తల భుజస్కందాలపై మహత్తర బాధ్యత ఉందన్నారు. 

13:34 - April 22, 2017

అదిలాబాద్ : ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలకు తాళలేక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగలంతా వాతావరణం అగ్నిగుండంలా ఉంటోంది. వడదెబ్బలకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. కొమురం భీం జిల్లాలో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కొనేరు కోనప్పకే వడదెబ్బ తప్పలేదు. భానుడు విజృంభిస్తున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజల్ని అల్లాడిస్తున్నాడు.
45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత..
కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మండే ఎండలకు.. జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. కాగజ్‌నగర్‌, సిర్పూరు, బెజ్జూరు, దహేగాం, ఆసిఫాబాద్‌, కెరామేరి, రెబ్బెన, తిర్యాణి మండలాలలో తీవ్రమైన వేడి ప్రజలను అవస్థల పాల్జేస్తోంది. భానుడు విజృంభిస్తుండంతో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాడ్పులు ప్రజలను నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాయి. కాగజ్‌నగర్‌ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జనాలు లేక వ్యాపార కేంద్రాలు, సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు చలివేంద్రాలను, చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్నారు.
ఉపాధిహామీ కూలీల పరిస్థితి దయనీయం
వడగాడ్పుల కారణంగా, ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎండలో పని చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది వడదెబ్బ తగిలి మంచం పట్టారు. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బకు ముగ్గురు మరణించారు. దాదాపు 100 మంది వరకూ ఉపాధి హామీ కూలీలు వాంతులు విరోచనాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. సామాన్యులే కాదు సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా వడదెబ్బకు గురయ్యారు. బెజ్జూరు మండల పర్యటనలో వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తనుచరులు కాగజ్‌ నగర్‌లోని.. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోనప్ప కోలుకుంటున్నారు. ఎండల తీవ్రత వల్ల, శరీరంలో నీటి శాతం గణనీయంగా పడిపోతుందని, ఫలితంగా డీ హైడ్రేషన్‌కు గురై డయేరియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

 

 

'బాహూలి 2' కు లైన్ క్లియర్..

బెంగళూరు : కర్ణాటకలో బాహూలి 2 కు లైన్ క్లియర్ అయింది. సత్యరాజ్ క్షమాపణలతో తగ్గిన కన్నడ సంఘాలు వెనక్కు తగ్గాయి. కన్నడ సంఘాల సమాఖ్య సినిమా విడుదలకు అంగీకరించాయి. 

12:54 - April 22, 2017

చిత్తూరు : ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 16 కు పెరిగింది. నిన్న 15 మంది మృతి చెందారు. మృతుల స్వగ్రామం మునగలపాలెంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. దాదాపు ప్రతి ఇంటి ముందు మృతదేహంతో గ్రామస్తులు ఆర్తనాదాలతో మారుమ్రోగుతున్నాయి. మంత్రి లోకేష్ ఇంటింటికి తిరుగుతూ మృతుల కుటుంబాలను పరామర్శించి, చెక్కులు అందిస్తున్నారు. 

12:41 - April 22, 2017

గుంటూరు : అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తున్న ఏపీ సర్కార్‌.. విడతలవారీగా ఉన్నతాధికారుల బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే ఓ విడత ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేన ప్రభుత్వం.. త్వరలో మరోసారి బదిలీలకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఐపీఎస్‌లకు స్థానభ్రంశం కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బదిలీల విషయంలో సర్కార్‌ స్పీడ్‌కు సొంతపార్టీ నేతలే బ్రేక్‌లు వేస్తున్నారు. ప్రక్రియను కొంతకాలం నిలుపుదల చేయాలని కొందరు నేతలు కోరుతుండగా .. మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం.. తక్షణం బదిలీలను చేపట్టాల్సిందిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులు తమ మాట వినడంలేదని ఇటీవల జరిగిన సంఘటనలను ఉదాహరణగా చూపుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకటపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరు నేతల తీరుపై బాబు అసహనంగా ఉన్నట్టు పార్టీనేతలు చెప్పుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల ప్రక్రియ నేతలమధ్య విమర్శలకు దారితీసినట్టు తెలుస్తోంది. తమ అభిప్రాయాలు తీసుకోకుండా.. కొందరి మాటకే కట్టుబడి బదిలీలు చేపట్టారని నేతలు బహిరంగంగానే బాబుతీరును విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో.. నేతల మధ్య కస్సుబుస్సుల పంచాయితీలు మరింత పెరుగుతున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుపై ఒత్తిడి...
మరోవైపు అధికారులు కూడా తాము కోరుకున్న ప్లేస్‌కు బదిలీలకోసం ముఖ్యమంత్రిపై విజ్ఞాపనలతో ఒత్తడి చేస్తున్నట్టు సమాచారం. అధికారపార్టీ నేతల అశీస్సులు ఉన్న చోట పోస్టింగులకోసం తహతహలాడుతున్నారని సమాచారం. దీనికోసం కొందరు అధికారులు.. మంత్రులు, అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని పార్టీనేతలు చెప్పుకుంటున్నారు. అటు నాయకుల డిమాండ్లను, ఇటు అధికారుల విన్నపాలను సమన్వయం చేయడానికి సీఎం చంద్రబాబు విస్తృతంగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఒకేచోట రెండేళ్లుగా పనిచేస్తున్న అధికారుల్లో ఎవరిని ఎక్కడికి పంపాలన్న దానిపై ప్రభుత్వం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్, గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠి, కృష్ణాజిల్లా ఎస్పీ విజయకుమార్, పశ్చిమ గోదావరి భాస్కర భూషణ్, తూర్పుగోదావరి ఎస్పీ రవి ప్రకాష్, చిత్తూరు ఘట్టమనేని శ్రీనివాస్, అనంతపురం ఎస్పీ రాజశేఖర్ బాబు, కర్నూలు రవికృష్ణ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతోపాటు ఇతర అధికారులకు ఆయా స్థానాల్లో రెండేళ్లు గడువు పూర్తయింది. వీరందర్నీ ఏ స్థానాలకు బదిలీ చేయనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కోస్తాంధ్రకు చెందిన ఒక సీనియర్ అధికారిని బదిలీ చేయాలని భావించినా.. మావోయిస్టుల కదలికలు, సరిహద్దుల్లో ఎన్ కౌంటర్లను దృష్టిలో పెట్టుకుని సదరు అధికారిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుపస్తోంది.  
ప్రభుత్వ పెద్దల అశీస్సులు...
కమ్యూనిటీ పోలీసింగ్ తో చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ముద్రగడ కాపు ఉద్యమం అంశంలో తూర్పుగోదావరి ఎస్పీ రవి ప్రకాష్ ప్రభుత్వ పెద్దల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఈసారి బదిలీల్లో వారికి కీలక స్థానాల్లోకి పోస్టింగ్స్ ఉండవచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్‌కు కీలక పోస్టింగ్‌ కల్పించాలని కొందరు మంత్రులుకూడా పట్టబడుతున్నట్టు సమాచారం. అటు అధికారుల నుంచికూడా ముఖ్యమంత్రికి విన్నపాలు వెల్లవెత్తుతున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ, సీఐడీ, గ్రే హౌండ్స్, పీటీసీ లాంటి విభాగాల్లో ఉన్న సీనియర్ అధికారులు కొందరు ఈసారి బదిలీల్లో తమకు ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా కోరుతున్నారని సమాచారం. ఎక్కువగా మంది పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీలుగా పోస్టింగ్‌లు కావాలని తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా. అటు కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన పోలీస్‌ అధికారులు కూడా తమకు ఉన్నత పోస్టింగ్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే..త్వరలో చేపట్టబోయే బదిలీ కోసం ఆయా విభాగాల్లో రెండేళ్లు పాతుకుపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను, వారి ట్రాక్ రికార్డులను డీజీపీ నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలుగజేసుకోకుండా నేరుగా సీఎం చంద్రబాబే కొందరి పేర్లను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. మొత్తానికి .. అటు నాయకులు, ఇటు అధికారుల హడావిడితో.. ఏపీలో అధికారుల బదీల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపుగా సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

12:40 - April 22, 2017

ఢిల్లీ : తమిళనాడు రైతులు చేపడుతున్న ఆందోళనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై వారు గత కొంతకాలంగా దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే కరవు సహాయం చేయాలని వీరు ఆర్థిస్తున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు పలువురు పార్టీ నేతలు కూడా సంఘీభావం తెలియచేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మౌనముద్రలో ఉండడంతో వీరు వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్నారు. చనిపోయిన రైతుల పుర్రెలతో...మౌనంగా..అర్ధనగ్నంగా...నగ్నంగా..ఇలా వినూత్నంగా నిరసన తెలియచేశారు. అయినా కేంద్రం స్పందంచలేదు. తాజాగా శనివారం చేపట్టిన వినూత్నంగా నిరసన తెలియచేశారు. రైతులు యూరిన్ తాగుతూ ఆందోళన చేపట్టారు. కరవు సహాయం చేయాలని..రైతులకు రుణాలు మంజూరు చేయాలన్న డిమాండ్ కు కేంద్రం ఇప్పటికైనా దిగొస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

12:31 - April 22, 2017

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు శవ రాజకీయాలకు దిగడం దురదృష్టకరమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, లారీ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. మృతుల్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని... వారికి పార్టీ తరపున మరో 2 లక్షల ఆర్ధికసాయం చేస్తామన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బాధ్యులు ఎంతటివారైనా శిక్షిస్తామని చెప్పారు.

కృష్ణా యూనిర్సిటీ 4 వ స్నాతకోత్సవం

విజయవాడ : కృష్ణా యూనిర్సిటీ 4 వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 

12:25 - April 22, 2017

హైదరాబాద్ : పేదవాళ్లు ఆత్మగౌరవంగా బతికేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బన్సీలాల్‌పేటలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మంత్రి తలసానితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల 33వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చామని తెలిపారు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. 

12:19 - April 22, 2017

బెంగళూరు : కర్ణాటకలో బాహూలి 2 కు లైన్ క్లియర్ అయింది. సత్యరాజ్ క్షమాపణలతో తగ్గిన కన్నడ సంఘాలు వెనక్కు తగ్గాయి. కన్నడ సంఘాల సమాఖ్య సినిమా విడుదలకు అంగీకరించాయి. సత్యరాజ్ బాహుబలిలో కేవలం పాత్ర ధారి అని హీరో, దర్శకుడో కాదని సినిమా విడుదలకు సహకరించాలని దర్శకుడు రాజమౌళి కోరారు. కర్ణాటకలో సినిమా విడుదలు అడ్డుకుంటే తమిళనాడులో కన్నడ సినిమా అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవరంలో వెనక్కు తగ్గడం మంచిదని భావించి సినిమా విడుదలకు సంఘ నాయకులు ఒకే   చెప్పారు. తొమ్మిది  సంవత్సరాల క్రితం తమిళనాడు సత్యరాజ్ కావేరి జలాలపై కర్ణాటకకు వ్యతిరకంగా మాట్లాడడంతో ఆయన నటించిన బాహుబలి 2 సినిమాను కర్ణాటకలో అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

రెండోరోజు తుందుర్రు గ్రామస్తుల నిరాహార దీక్ష

పశ్చిమగోదావరి : తుందుర్రు ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. దీక్షలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, 9 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. 

12:11 - April 22, 2017

టీఆర్ఎస్ ప్లీనరీ అనగానే నేతల ప్రసంగాలతో పాటు తెలంగాణ ఘుమఘుమలు గుర్తుకొస్తాయి. ప్లీనరీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వంటకాలను వచ్చే అతిథులకు వడ్డిస్తుంటారు. తాజాగా కొంపల్లిలోని 16వ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కూడా ఘుమఘుమలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు..రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులు తెలంగాణ వంటకాలను ఆరగించారు. సుమారు 15-20 వేల మంది ప్రతినిధులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వంటకాలన్నీ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఓ ప్రముఖ సంస్థ క్యాటరింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 26 వంటకాలను వండారు. దీనికి సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చయినట్లు అంచనా.

ఇక మెనూను పరిశీలిస్తే..
2,500 కిలోల మటన్‌తో దమ్‌కా బిర్యానీ...3,000 కిలోల చికెన్‌తో దమ్‌కా బిర్యానీ..15 వేల గుడ్లతో గుడ్డు పులుసు..200 కిలోల చేపలు..200 కిలోల రొయ్యల వేపుడు..700 కిలోల మాంసంతో మటన్‌ కర్రీ...300 కిలోల మాంసంతో మటన్‌ దాల్చా..200 లీటర్ల పాలతో పైనాపిల్‌ ఫిర్నీ స్వీట్‌..ఫ్లమ్‌ కేక్‌ ఐస్‌క్రీమ్‌..ఇక..శాకాహారుల కోసం మిర్చీకా సాలన్..ఆలుగోబీ టమాటా కుర్మా..గంగవాయిలి కూర పప్పు..వెజ్‌ దాల్చ..పచ్చి పులుసు..పెరుగు చట్నీ..పెరుగు..దోసకాయ చట్నీ..ఫ్రూట్‌ సలాడ్..ఐస్‌క్రీం..లున్నాయి. ఈ వంటకాలన్నీ తయారు చేయడానికి 150 మంది శ్రమించారు. 350 మంది వాలంటీర్లు అతిథులకు వడ్డించారు.

అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : పేదలు ఆత్మగౌరవంతో ఉండాలనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. బన్సీలాల్ పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు కేటీఆర్ పర్యటించారు. జీవైఆర్ బస్తీలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2.33 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఈ ఏడాది లక్ష ఇళ్లు నిర్మిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక, కరెంట్, నీళ్ల సమస్య తీరిందని తెలిపారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం 500 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

12:01 - April 22, 2017

ఇంటి వద్దకే అన్నీ వస్తే ఎంత బాగుండు..అని చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఒక్క క్లిక్ తో నేరుగా ఇంటి వద్దకే సరుకులు..ఇతరత్రా వచ్చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో 'పెట్రోల్' కూడా చేరిపోయింది. అవును ఇది వాస్తవం. పెట్రోల్ కోసం బంకుకు పరుగెత్తడం..వంటి వాటికి త్వరలో చెక్ పడబోతోంది. ఇంటి దగ్గరకే పెట్రోల్ తెచ్చుకొనే సౌకర్యం కోసం కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ తీవ్ర కసరత్తు జరుపుతోంది. ఈ దిశగా డోర్ టు డోర్ డెలివరీ సర్వీసులు అందించేలా ఈ కామర్స్ విధానాన్ని పరిశీలించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే మే 14వ తేదీ నుండి పలు రాష్ట్రాల్లో ఉన్న బంకులు ఆదివారం మూసి ఉంచాలని బంకు ఓనర్లు యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ బుకింగ్..డోర్ డెలివరీ విధానం తెస్తే బాగుంటుందని..అంతేగాకుడా క్యాష్ లెస్ ను ప్రోత్సాహించినట్లు అవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇది కార్యరూపం దాలుతుందా ? లేదా ? అనేది చూడాలి.

11:57 - April 22, 2017

డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

హైదరాబాద్ : బన్సీలాల్ పేటలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవైఆర్ బస్తీలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

 

11:54 - April 22, 2017

సంగారెడ్డి : జిల్లాలోని అమీన్‌పూర్‌లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌కు చెందిన రాజు, తరుణ్‌ మరో ఇద్దరు కలిసి నిన్న మధ్యాహ్నం చెరువులో ఈతకు వెళ్లారు. తరుణ్‌ లోతు తెలుసుకోకుండా చెరువులోకి ఈతకు దిగి మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు రాజు ప్రయత్నించి తానూ మునిగిపోయాడు. ఇది గమనించిన సిద్దు, సమీర్‌లు భయంతో ఇంటికి వెళ్లి ఎవ్వరికీ చెప్పలేదు. రాత్రి 10 గంటలైనా రాజు, తరుణ్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతుండగా జరిగిన విషయాన్ని సమీర్‌ చెప్పాడు. పోలీసుల సహాయంతో తరుణ్‌ తల్లిదండ్రులు అర్ధరాత్రి చెరువులో గాలించారు. ఈ ఉదయం మత్స్యకారుల సహకారంతో మృతదేహాలను వెలికితీశారు. 

11:52 - April 22, 2017

బ్యాకింగ్ రంగంలో దానికొక ప్రముఖ స్థానం ఉంది. ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకుల్లో 'హెచ్ డీ ఎఫ్ సి' ఒకటి. ఈ బ్యాంకు అనతికాలంలోనే వినియోగదారులను ఆకట్టుకుంది. దీనితో దేశ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలను నెలకొల్పింది. వేలాది కొలది జాబ్స్ కల్పించింది. కానీ పరిస్థితి తారుమారైపోయింది. పెద్ద నోట్లు రద్దు..క్యాష్ లెస్ లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో బ్యాంకు పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్వార్టర్స్ లోనూ భారీగా ఉద్యోగాల కోత పెట్టినట్లు వెల్లడైంది. 2016 డిసెంబర్ తో ముగిసిన క్వార్టర్ లో 90,421గా ఉన్న బ్యాంకు ఉద్యోగులు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్ లో 84,325గా ఉన్నారు. అంటే దాదాపు 6096 మంది ఉద్యోగులను బ్యాంకు సాగనంపిట్లేగా. 2016 డిసెంబర్ తో ముగిసిన క్వార్టర్ లోనూ బ్యాంకు 4581 మంది ఉద్యోగులను తగ్గించింది. అంతేగాకుండా ఉద్యోగుల ఖర్చులను కూడా బ్యాంకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో 300-400 బ్రాంచీలను ప్రారంభిస్తే ఈ ఏడాది కేవలం 195 బ్రాంచీలను మాత్రమే ప్రారంభించారంటే పరిస్థితిలో ఏంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఉద్యోగుల తగ్గింపు ప్రభావం బ్యాంకు అభివృద్ధిపై పడదని బ్యాంకు యాజమాన్యం పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

11:51 - April 22, 2017

పశ్చిమ గోదావరి : బెల్టు తీస్తా..! ఎక్కడ కనిపించినా సరే బెల్ట్‌ తీస్తా..!! ఇదీ జిల్లాకు చెందిన ఓ మంత్రిగారి మంత్రం. ఇప్పుడాయన బెల్ట్‌ అన్న పేరు చెబితే చాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇంతకీ సదరు మంత్రిగారి కోపానికి కారణమేంటి..? ఆయన బెల్ట్‌ తీస్తానంటున్నది దేని గురించి..? చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ విస్తరణ.. కొందరిని బాధపెడితే, మరికొందరిలో ఆవేశాన్ని నింపింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా, పశ్చిమగోదావరి జిల్లాకు దక్కిన ఎక్సైజ్‌ శాఖ.. బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావులో కోపాన్ని రగిలించింది. విస్తరణలో కొత్తపలల్లి జవహర్‌కు ఎక్సైజ్‌ శాఖ దక్కింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత, ఇప్పటి వరకూ మణిక్యాలరావు, జవహర్‌లు కలుసుకునేదే లేదు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో పరిధిలోని బెల్టు షాపులపై ఏకంగా యుద్ధాన్నే ప్రకటించారు ఆయన. బెల్టుషాపులు కనిపిస్తే చాలు.. మూసేయించే పనిలో పడ్డారు. ఇంతకీ బెల్టు షాపులపై ఆయనకు ఉన్నట్టుండం కోపమెందుకు వచ్చిందా.? జిల్లా వాసులల్లో ఈ ప్రశ్న చర్చనీయాంశమైంది.
బిజేపీ రెండు వర్గాలు
తన నియోజకవర్గంలో బెల్ట్‌ షాపులను మూసివేయించాలన్న మాణిక్యాలరావు పంతానికి రాజకీయ కారణాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజేపీ రాష్ట్ర శాఖలో ఇప్పటికే రెండు వర్గాలు ఉన్నాయి. ఇందులో మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గంలో కొనసాగుతున్నారు. సహజంగానే, మాణిక్యాలరావుకు సొంత పార్టీలోనే శత్రువులు తయారయ్యారు. దీనికి తోడు టీడీపీ నాయకుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుతోనూ మాణిక్యాలరావుకు చాలాకాలంగా వైరం కొనసాగుతోంది. అనూహ్యంగా విస్తరణలో, బాపిరాజుకు సన్నిహితుడైన కొత్తపల్లి జవహర్‌కు మంత్రి పదవి దక్కింది. దీంతో మిత్రపక్షంలోని వైరివర్గం బాగా బలం పుంజుకుందని మాణిక్యాలరావు భావిస్తున్నారు. అదీకాకుండా, ఇటీవలి కాలంలో, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వివాదాలు నిత్యకృత్యమయ్యాయి.
తనకంటూ ప్రత్యేక వర్గం
బీజేపీలోను, టీడీపీలోనూ శత్రువర్గం బలపడిపోతుండడంతో... మాణిక్యాలరావు, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని సిద్ధం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారని భావిస్తున్నారు. దీంతోపాటే, కొత్తపల్లి జవహర్‌కు ఇబ్బందులు సృష్టిస్తే, టీడీపీలో తన శత్రువు ముళ్లపూడి బాపిరాజును దెబ్బతీసినట్లు అవుతుందని కూడా మాణిక్యాలరావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటితో పాటే, రాజకీయంగా తన ఎదుగుదల కోసం, మాణిక్యాలరావు సొంతంగా ఓ వర్గాన్ని, ఓటుబ్యాంకును తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, ప్రజల సంక్షేమం కోసమే తాను బెల్ట్‌షాపులపై యుద్ధభేరి మోగించానని ఆయన చెబుతున్నారన్నది విశ్లేషకుల భావన. మాణిక్యాలరావు తీరుపై తెలుగుతమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు సంబంధం లేని శాఖలో ఆయన కలగజేసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గత మూడేళ్లుగా లేని బెల్టు షాపులు ఇప్పుడే పుట్టుకొచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు.

 

మంత్రి లక్ష్మారెడ్డికి గంట కూలీ... రూ. 5లక్షలు

హైదరాబాద్ : సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో టీఆర్ ఎస్ ప్లీనరీ కోసం మంత్రి లక్ష్మారెడ్డి వైద్యం చేశారు. గంట కూలీ కింద యాజమాన్యం... మంత్రి లక్ష్మారెడ్డికి రూ. 5 లక్షలు అందజేశారు. 

11:42 - April 22, 2017

లక్ష్యం...ఆ లక్ష్యం చేరుకున్న అనంతరం పెళ్లి చేసుకుంటానని కొంతమంది నిర్ణయం తీసుకుంటుంటారు. మంచి ఉద్యోగం..మంచి జీతం..స్థిరపడిన అనంతరం వివాహం చేసుకోవాలని యువకులు అనుకుంటుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం ఇవేమీ కాదనుకున్నాడు. అందరికీ 'మరుగుదొడ్లు' నిర్మాణం అయిన తరువాతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న లక్ష్యం నెరవేరిన తరువాత పెళ్లి చేసుకున్నాడు...ఏక్కడ..అనేది తెలుసుకోవాలంటే చదవండి...

మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ జిల్లాలోని సంగం గ్రామంలోని హేవరి ప్రాంతంలో కిశోర్ విభూతే నివాసం ఉంటున్నాడు. గ్రామానికి సేవకుడిగా పనిచేస్తున్నాడు. గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదని భావించారు. 2014 సంవత్సరంలో 351 ఇళ్లకు గాను 174 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లున్నాయని గ్రహించాడు. మిగతా 177 ఇళ్లలో కూడా మరుగుదొడ్లు నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని నాసిక్ లో జరిగిన ఓ సమావేశంలో కిశోర్ శపథం చేశాడు. అందుకు తగిన కార్యచరణ ప్రారంభమైంది. ఏడాది క్రితమే నిర్మాణాలు పూర్తయ్యాయి. నాసిక్ జిల్లా యంత్రాంగం గురువారం తనిఖీలు చేసి అధికారికంగా గుర్తింపునిచ్చింది. దీనితో లక్ష్యం పూర్తి కావడంతో పెళ్లి పీటలెక్కాడు...

శ్రీకాకుళం జిల్లాలో దేవినేని, అచ్చెన్నాయుడు, సునీత పర్యటన

శ్రీకాకుళం : జిల్లాలో మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత పర్యటించారు. రేగులపాడు ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు. ఆఫ్ షోర్ వరద కాల్వ పనులు పరిశీలించారు. 

ముందస్తు ఎన్నికలపై స్పందించిన పవన్

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికలను యుద్ధంతో పోల్చాడు. ఎన్నికలు వచ్చినా తమ పార్టీ సిద్ధమన్నారు. 

11:38 - April 22, 2017
11:32 - April 22, 2017

టాలీవుడ్ లో త్వరలో ఒక్కటయ్యే ఓ యువజంటపై రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ మన్మథుడు 'అక్కినేని నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య', నటి 'సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. నిశ్చితార్థం జరగకముందే వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు హల్ చల్ చేశాయి. తాజాగా నిశ్చితార్థం అనంతరం చైతూ..సమంతలు ప్రేమ జీవితంలోని మధురానుభూతుల్ని ఆస్వాదిస్తున్నారు. ఇదివరకు పలు సందర్భాల్లో కూడా 'చైతూ' గరిటె తిప్పుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తాజాగా 'సమంత' ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. 'నాగచైతన్య' వంట చేస్తుండగా 'సమంత' రుచి చేస్తున్నట్లుగా ఆ ఫొటోలో కనబడుతున్నారు. తాను వంటకి సాయం చేస్తుండగా..నాగ చైతన్య గరిటె తప్పుతున్న ఈ ఫొటోలు సందడి చేస్తున్నాయి.

11:23 - April 22, 2017

చెన్నై : ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో విచారణ నిమిత్తం అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన శశికళ మేనల్లుడు దినకరన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.  విచారణలో ఏం చెప్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మధ్యవర్తి చంద్రశేఖర్ చెప్పిన వివరాలతో దినకరన్ పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది రోజుల కింద దినకరన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.  ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో తమకు రెండు ఆకుల గుర్తు కేటాయించాలని దినకరన్ మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ఇవ్వ జూసిన సంగతి తెలిసిందే. 

11:22 - April 22, 2017

తాను వివాహం చేసుకొనే యువతి ఎంతో అందంగా ఉందని యువకుడు కలలు అనుకుంటుంటాడు. అందమైన భార్య దొరకితే చాలు అని కోరుకుంటుంటాడు. నీ భార్య చాలా అందంగా ఉందని పొగిడితే గర్వంగా ఫీలవుతాడు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య అందంగా ఉండటాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అనుమానం పెంచకుని వికృతంగా మారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమై కూర్చుండిపోయింది. ఆమె ఎవరితోనూ మాట్లాడినా అనుమానం పెంచుకొనే వాడు. భార్య అందం అతనికి శత్రువై పోయింది. వివాహం అయిన తరువాత ఆమె ఒక ప్రైవేటు సంస్థలో పని చేసింది. వీరికి నాలుగేళ్ల వయస్సున్న కుమారుడున్నాడు. పెళ్లి తరువాత ఉద్యోగాన్ని మానిపించాడు. పుట్టింటి వారితో ఎక్కువగా మాట్లాడకూడదు..కూరగాయలు తేవద్దు..బయటకు పోవద్దంటూ నిబంధనలు విధించాడు. పిల్లవాడిని బడిలో చేరిపించాలని..మళ్లీ ఉద్యోగానికి వెళుతానని ఆమె పట్టుబట్టింది. దీనితో ఒక్కసారిగా వికృతంగా మారిపోయాడు. ఏకంగా ఆమెను బంధించి గుండు చేయించాడు. దాడికి పాల్పడ్డాడు. ఆమె మొహంపై గాయాల్నీ చేశాడు. ఎలాగోలా బయటకు తప్పించుకున్న ఆ మహిళ తన స్నేహితురాళ్ల సహకారంతో పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ అనుమానపు భర్తతో విసిగిపోయిన ఆ మహిళ పుట్టింటికి చేరుకుంది.

11:00 - April 22, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా ? 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికలకు టిడిపి పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని..ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. తాము సిద్ధంగానే ఉన్నట్లు పలు పార్టీలు ప్రకటించేశాయి కూడా. ఎప్పుడు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 'జనసేన' అధినేత 'పవన్ కళ్యాణ్' కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ‘ఎన్నికల యుద్ధం ఒక వేళ ముందస్తుగా వస్తే జన'సేన' సిద్ధమే'. అంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్ అయిపోయింది. ఇప్పటికే తన రాజకీయ కార్యాచరణనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు తగిన జనసేన సేనికులను ఎంపిక చేస్తోంది. అనంతపురంలో ఇప్పటికే రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

10:54 - April 22, 2017
10:37 - April 22, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన తాజా చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ సినిమా అనంతరం హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' బన్నీ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా చేస్తున్నాడు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన టీజర్స్..పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కూడా. శరవేగంగా చిత్ర షూటింగ్ జరుపుకొంటోంది. కానీ సినిమా విడుదల విషయంలో సోషల్ మీడియాలో పలు వార్తలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టుకు సినిమాను వాయిదా వేసినట్లు పుకార్లు షికారు చేశాయి. దీనితో రిలీజ్ కు సంబంధించిన డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావించింది. జూన్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఒక పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది. 'పూజా హెగ్డే' కథనాయికగా నటిస్తోంది. మరి డీజే ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

10:35 - April 22, 2017

చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు మండలం మునగాలపాలెంలో విషాదం నెలకొంది. 15 మంది మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 12 మంది మృతదేహలకు పోస్టుమార్టం పూర్తియింది. మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. మృతుల కుటుంబాల్లో రోధనలు మిన్నంటాయి.మృతదేహాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతికి ప్రత్యేక్షంగా కారణమైన లారీ డ్రైవర్ ను, పరోక్షంగా కారణమైన ఏర్పేడు మండల సీఐ, ఏంఆర్వో, లారీ ఓనర్ పై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారం రూ. 5లక్షలు సరిపోవని రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. నిన్న జరిగిన ప్రమాద ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. 21 మందికి స్విమ్స్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గురువయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తప్పతాగి లారీ నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు లైసెన్స్ తో గురువయ్య హెవీ వెహికల్స్ నడుపుతున్నాడు. ఏడాది కాలంగా లారీ నడుపుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్న వివరాలు వీడియోలో చూడండి.

 

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు : 'బడికి వస్తా' కార్యక్రమంలో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీఆర్ సీ గ్రౌండ్ లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వీఆర్ సీ నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 

మునగాలపాలెంలో విషాదఛాయలు

చిత్తూరు : జిల్లా ఏర్పేడు మండలం మునగాలపాలెంలో విషాదం నెలకొంది. 15 మంది మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. మృతదేహాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. నిన్న జరిగిన ప్రమాద ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. 21 మందికి స్విమ్స్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గురువయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తప్పతాగి లారీ నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

09:47 - April 22, 2017

రంగారెడ్డి : హయత్ నగర్ లో పాతనేరస్తుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మునగానూర్ లో గణేష్, రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గణేష్ అంగీకరించాడు. పిలాయిపల్లిలోని క్రషర్ లో పని చేస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అతన్ని క్రషర్ లన్నీ తిప్పారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుని గణేష్ క్వారీ గుంతలోకి దూకాడు. దీంతో గణేష్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. గణేష్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో తాము పీఎస్ దగ్గరే ఉన్నామని.. తమను, మీడియాను పోలీసులు లోపలికి అనుమతించలేదని చెప్పారు. పోలీస్ స్టేషన్ లోనే గణేష్ మృతి చెందారని అంటున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసి, కథనం అల్లుతున్నారని చెప్పారు. క్వారీలో దూకి చనిపోయాడంటూ పోలీసులు కథనం చెబుతున్నారని అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:27 - April 22, 2017

హైదరాబాద్ : నూరేళ్ల కిందట పురుడు పోసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పుడు వందేళ్ల సంబురాలకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ సంయుక్తంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో శతాబ్ది ఉత్సవాల ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలను రూపొందించారు.
రాష్ట్రపతి రాక...
ఈనెల 26న ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎం కేసిఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపి కే కేశవరావు, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు దేశంలో ఓయు పాత్ర పై సెమినార్, నోబుల్ లెక్చర్ నిర్వహించనున్నారు. 27న ఆల్ ఇండియా వైస్‌చాన్స్‌లర్ల సమావేశానికి ముఖ్య అథితిగా ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ హాజరుకానున్నారు. అదే రోజు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఉండనుంది. 28న ఇండియన్, ఇంటర్నేషనల్ సైన్స్‌ఫెయిర్ ఉంటుంది. రాబోయే 50 యేళ్లలో తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యచరణపై ఓయు విజన్ పేరుతో సదస్సును నిర్వహించనున్నారు.
మూడంచెలుగా ఆహ్వానితులు..
ఇక శతాబ్ధి ఉత్సవాలకు మొత్తం మూడంచెలుగా ఆహ్వానితులని A గ్రౌండ్ లోపలికి అనుమతించనున్నారు. ఏ, బి, సి లుగా వారికి పాసులు మంజూరు చేయనున్నారు. A సెగ్మెంట్‌లో వీవీఐపీలు, వీఐపీలు, మీడియా, B సెగ్మెంట్‌లో పూర్వ విద్యార్థులు, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, అఫ్లియేటెడ్ కాలేజీల నుంచి ప్రతినిధులకు అనుమతిస్తారు. సి సెగ్మెంట్‌లో వికలాంగులు, ప్రస్తుత విద్యార్ధులకు అనుమతిస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న 200 కోట్లలో కేవలం 20 కోట్లు మాత్రమే శతాబ్ధి ఉత్సవాలకు ఖర్చు చేసి మిగితా నిధులను యూనివర్శిటీ అభివృద్ధికి వెచ్చించే విధంగా ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. ఈనెల 26న ప్రారంభ సమావేశానికి రాష్ట్రపతి రానుండటంతో ఆయన చేతుల మీదుగా 3 కొత్త భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయించనున్నారు. శతాబ్ధి ఉత్సవాల నేపథ్యంతో రూపొందించిన పైలాన్‌ను రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. మరోవైపు ఓయు శతాబ్ధి ఉత్సవాలకు నిజాం కుటుంబం నుంచి కూడా పాల్గొనబోతున్నారని వీసి తెలిపారు.
పాట రాసిన సుద్దాల అశోక్‌తేజ
ఓయు సెంటినీరీ సెలబ్రేషన్స్ సంధర్భంగా రచయిత సుద్దాల అశోక్‌తేజ రాసిన పాటను గాయకులు వందేమాతరం శ్రీనివాస్ పాడారు. జర్నలిజం డిపార్టుమెంట్ ఓయు శతాబ్ధి ఉత్సవాలకు డాక్యుమెంటరీ విడుదల చేసారు. మొత్తంగా ఓయు వందేళ్ల ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

09:12 - April 22, 2017
09:04 - April 22, 2017

సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని వక్తలు విమర్శించారు. సీఎం ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రరెడ్డి, టీఆర్ ఎస్ అధికార ప్రతనిధి రాకేష్ పాల్గొని, మాట్లాడారు. వినయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చే రూ.4వేలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారని తెలిపారు. కానీ రైతులకు డబ్బులు ఇవ్వడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయంటే చెప్పడం కష్టంమన్నారు. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా వారికి రుణాలు ఇవ్వడం గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంలో దళారి వ్యవస్థ ఉన్నంత కాలం రైతులు బాగుపడడం కష్టమని చెప్పారు. రామచంద్రరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను మళ్లీ మోసం చేస్తున్నారని విమర్శించారు. సీఎం ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాకేష్ మాట్లాడుతూ గత పాలకుల 50 సంవత్సరాల నుంచి తెలంగాణను ధ్వసం చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

హయత్ నగర్ లో పాతనేరస్తుడు అనుమానాస్పద మృతి

రంగారెడ్డి : హయత్ నగర్ లో పాతనేరస్తుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మునగానూర్ లో గణేష్, రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గణేష్ అంగీకరించాడు. పిలాయిపల్లిలోని క్రషర్ లో పని చేస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అతన్ని క్రషర్ లన్నీ తిప్పారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుని గణేష్ క్వారీ గుంతలోకి దూకాడు. దీంతో గణేష్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. 

08:35 - April 22, 2017
08:34 - April 22, 2017

నేచురల్ స్టార్ 'నాని' వరుసగా విజయంతమైన చిత్రాలు చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. విలక్షణ పాత్రలు..కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. తన తాజా చిత్రం 'నిన్ను కోరి' షూటింగ్ లో 'నాని' బిజీగా గడుపుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో 'నివేదా థామస్' కథానాయికగా నటిస్తోంది. అంతేగాకుండా 'ఆది పినిశెట్టి' ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మేజర్ షెడ్యూల్ షూటింగ్ ను అమెరికాలో జరిపినట్లు నిర్మాత డీవీవీ దానయ్య పేర్కొన్నారు. వైజాగ్ లో ఈ నెల 17వ తేదీ నుండి షూటింగ్ కొనసాగుతోతందని 29వరకూ అక్కడే షూటింగ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 23వ తేదీన 'నిన్ను కోరి' సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నట్లు టాక్..

08:30 - April 22, 2017

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక సెలబ్రెటీల సంగతి చెప్పనక్కర్లేదు. వివిధ సినిమా షూటింగ్ లు సైతం ఎండల వేడిమికి షెడ్యూల్ ను మార్చి వేసుకుంటున్నాయంట. కానీ పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ మాత్రం తన తాజా చిత్ర షూటింగ్ లో మాత్రం పాల్గొంటున్నారని టాక్. తన షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా తన పని తాను కానిచ్చేస్తున్నాడు. 'పవన్' - 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యాక్రమాలను ప్రారంభించుకున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాలో 'పవన్’ ఇంజినీర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించాలని ‘పవన్’ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేసన్ దర్శకత్వంలో తదుపరి సినిమాను 'పవన్' మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎండను సైతం లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

08:23 - April 22, 2017

చిత్తూరు : జిల్లాలో జరిగిన లారీ బీభత్స ఘటనలో లారీ డ్రైవర్ గురువయ్యను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ తప్పతాగి లారీ నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అధిక మొతాదులో మద్యం సేవించి లారీని నడపటంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసును పోలీసులు కేసు విచారిస్తున్నారు. అతని వద్ద స్మాల్ వెహికిల్ లైసెన్స్ మాత్రమే ఉండడంతో లారీ యాజమని ఎలా డ్రైవర్ గా నియమించాడో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు ప్రమాదం వెనుక ఇసుక మాఫియ ఉన్నట్లు కొందరు అనుమానిస్తున్నారు. నేడు మునిగాయపాలెంకు మంత్రి లోకేష్ రానున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తియింది. నేడు మునుగాయపాలెంలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పూతలపట్టు-నాయుడుపేట రహదారిలో ఏర్పేడు పోలీసు స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి... దుకాణాల్లోకి దూసుకుపోవడంతో ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. 

విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

విశాఖ : పాడేరు ఘాట్ రోడ్ లో గంజాయి పట్టుకున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 500 కిలోల గంజాయి, లారీ స్వాధీనం చేసుకున్నారు.

 

లారీ బీభత్స ఘటనలో డ్రైవర్ అరెస్టు

చిత్తూరు : జిల్లాలోని లారీ బీభత్స ఘటనలో లారీ డ్రైవర్ గురువయ్యను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ తప్పతాగి లారీ నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. 

 

08:04 - April 22, 2017

చెన్నై : ప్రముఖ తమిళ నటుడు ధనుష్‌ తమ కుమారుడేనని మధురై కోర్టుకెక్కిన మేలూరు గ్రామానికి చెందిన కదిరేశాన్, మీనాక్షి దంపతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తామే తల్లిదండ్రులమన్న వృద్ధ దంపతుల వాదనను మద్రాస్‌ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్‌ కొట్టి వేసింది. తాము వృద్ధాప్యంలో ఉన్నందున నటుడు ధనుష్ నుండి నెలసరి 60 వేల రూపాయిల జీవన భృతిని కోరుతూ గత ఏడాది కదిరేశన్‌ దంపతులు మధురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ వాదనను సమర్థించుకునేందుకు ధనుష్‌కు చెందిన టెన్త్‌ క్లాస్‌ సర్టిఫికేట్‌ పొందు పరిచారు. అందులో ధనుష్‌కు చెందిన పుట్టుమచ్చల వివరాలు కూడా పేర్కొన్నారు.
రుజువు కాని ఆధారాలు 
ధనుష్‌కు డిఎన్‌ఏ పరీక్షలు కూడా జరపాలని కదిరేశన్‌ దంపతులు డిమాండ్‌ చేశారు. ధనుష్‌ తరపు న్యాయవాది ఇందుకు నిరాకరించారు. కదిరేషన్‌ దంపతులు చెప్పేదంతా అవాస్తవమని ఈ కేసును కొట్టి వేయాలని లాయర్ విజ్ఞప్తి చేశారు. ధనుష్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే దంపతులుగా అవతారమెత్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఐడెంటిఫికేషన్‌ మార్క్స్‌కు సంబంధించి ధనుష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మధురై మెడికల్‌ కళాశాల వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ధనుష్‌ శరీరంపై రెండు పుట్టుమచ్చలున్నట్లు నిర్ధారణ కాలేదు. దీంతో కేసు ధనుష్‌కు అనుకూలంగా మారింది. చదువుకునే సమయంలో హాస్టల్ నుంచి పారిపోయిన ధనుష్‌ దర్శకుడు కస్తూరీరాజాను కలుసుకున్నాడని కదిరేషన్‌దంపతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. కనిపించకుండాపోయిన కుమారుడు తదనంతరం సినిమాల్లో హీరో ధనుష్ గా దర్శనమిచ్చాడని తెలిపారు. సినిమాల్లో విజయం సాధించడంతో కస్తూరీరాజా కుటుంబం ధనుష్‌ను కొడుకుగా దత్తత తీసుకున్నట్లు అప్పట్లో వెల్లడించారు. కదిరేశన్‌ దంపతులు చూపిన ఆధారాలేవీ రుజువు కాకపోవడంతో ధనుష్‌కు పెద్ద ఊరట లభించింది.

 

 

 

07:58 - April 22, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో యువతను అన్ని రంగాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ను పెంపొందించేందుకు ద ఇండస్‌ ఫౌండేషన్‌ విశిష్ట సేవలందిస్తుందని ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ అనుమోలు తెలిపారు. ఇండో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇండో గ్లోబల్‌ స్కిల్‌ సమ్మిట్‌ ఎక్స్‌పో పేరుతో హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని 75 శాతం యువతీ యువకులకు 42 విభాగాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతినిధులు తెలిపారు. -

 

07:55 - April 22, 2017

నిజామాబాద్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ అవార్డు దక్కింది. ఎక్సలెన్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. జాతీయ స్థాయిలో 'ఈ- నాం' ను విజయవంతంగా అమలు చేసినందుకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ నాం విధానంలో రైతులకు లాభం కలుగడమే కాకుండా.. చెల్లింపులు కూడా పారదర్శకంగా జరుగుతున్నాయి. దీంతో.. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం నిజామాబాద్‌ మార్కెట్‌యార్డ్‌ దక్కించుకుంది.
'ఈ నాం' సేవలు
ఉమ్మడి జిల్లా కేంద్రంగా 2016 జూన్ 11 నాడు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 'ఈ నాం' సేవలను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సంవత్సర కాలంలోనే క్రయవిక్రయాల ద్వారా జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది నిజామాబాద్‌ మార్కెట్‌యార్డు. తెలంగాణాలో ఈ పథకం కింద మొదటి ఫేస్‌లో మలక్ పేట, వరంగల్, బాగేపల్లి, తిరుమలగిరి, నిజామాబాద్ మార్కెట్ యార్డులను ఎంపికచేశారు.అయితే అంతకు ముందే ఈ -పోర్టల్ ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 2016లో ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. రెండు నెలలు ఆలస్యంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నాం సేవలు ప్రారంభమయ్యాయి. అయినా తొలిమూడు నెలల్లోనే సుమారుగా 70 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం ద్వారా ఈ మార్కెట్‌యార్డు రికార్డు సృష్టించింది. ప్రధానంగా పసుపు, సోయాబీన్, ధాన్యం మొక్కజొన్న, ఆంచూర్ ,కూరగాయల విక్రయాలు జొరుగా సాగాయి. ఒక్క ఏడాదిలోనే ఈ -నాం ద్వారా 860 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇక్కడ జరిగిన క్రయవిక్రయాల ద్వారా యార్డుకు 8కోట్ల 50లక్లల రూపాయల కమీషన్‌ వచ్చింది. దాంతో ఈ -నాం కోనుగోళ్లపై కేంద్ర అవార్డు స్ర్కీనింగ్ కమిటీ నజర్ పడింది. ఈ మేరకు రెండు సార్లు కలెక్టర్ డిల్లీలొ స్ర్కీనింగ్ కమిటి ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మార్కెట్ యార్డు... దేశంలోనే అత్యుత్తమ సేవలు
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు దేశంలోనే అత్యుత్తమ సేవలకు జాతీయ స్థాయిలో పురస్కారానికి ఎంపిక అయింది. కలెక్టర్ యోగితారాణా మార్కెట్ కమిటి కార్యదర్శి సంగయ్య ఢిల్లీలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మెత్తానికి దేశంలోనే అత్యుత్తమ క్రయవిక్రయాల మార్కెట్‌గా నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు పేరు పొందడంపై ఇందూరు ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

07:47 - April 22, 2017

హైదరాబాద్ : ఓవైపు మండుతున్న ఎండలు.. ఇంకోవైపు అడుగంటుతున్న భూగర్భజలాలు.. శివారు ప్రాంతాలను దాహార్తితో అలమటించేలా చేస్తున్నాయి. అయినా, బల్దియా చోద్యం చూస్తూనే ఉంది. ఏటా ఏప్రిల్‌ ఫస్ట్‌ నాటికి ప్రారంభం కావాల్సిన సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమైంది. టెండర్లు ఎప్పటికి ఫైనలైజ్‌ అవుతాయో... శివారు ప్రజలకు తాగునీరు ఎప్పటికి దక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
జంట‌ జ‌లాశ‌యాలకు అగిన నీటి స‌ర‌ఫ‌రా 
నగర జంట‌జ‌లాశ‌యాలకు నీటి స‌ర‌ఫ‌రా అగిపోయింది. ఓవైపు కృష్ణ, మరోవైపు గోదావరి నీటిని అందించలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఇక సింగూరు, మంజీరాల నుంచి వ‌స్తున్న నీరూ స‌గానికి త‌గ్గిపోయింది. ఎండ‌లు మండిపోతుండ‌టంతో భూగ‌ర్భజ‌లాల ప‌రిస్థితికూడా ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. ఇక శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం మూడు వేల 120 పవర్‌ బోర్లుంటే, కేవలం రెండు వేల 469 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2909 చేతిపంపులకు గాను, వెయ్యీ 777 పంపులే పనిచేస్తున్నాయి. దీంతో ఆయా శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నానాటికీ తీవ్రమవుతోంది. జంటనగరాలకు తాగునీరు అందించే కీలకమైన వనరులు, అందుబాటులో లేకుండా పోతున్నా.. అధికార యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదు. నిజానికి హైదరాబాద్‌లోని కోర్‌ ఏరియాలో పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో మెట్రో వాటర్‌ బోర్డు, నీటి సదుపాయం లేని ప్రాంతాలతో పాటు శివారు బస్తీలకు బల్దియా నీటిని సరఫరా చేస్తున్నాయి. సమ్మర్‌లో నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్లు, పవర్‌ బోర్స్‌ లాంటి వాటిని మార్చి చివరికల్లా సిద్ధంగా ఉంచుతుంటారు. ఏటా ఏప్రిల్‌ ఒకటోతేదీ నాటికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తుంటారు. కానీ, ఈ ఏడాది ఇప్పటికీ, సమ్మర్‌ ప్లాన్‌ ఫైళ్ల దశను దాటలేదు.
పరిపాలన అనుమతుల్లో నిర్లక్ష్యం..
సమ్మర్‌ ప్లాన్‌కు పరిపాలన అనుమతుల మంజూరు దశలోనే అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంగా మారింది. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం 122 పనులకు, 9కోట్ల 58 లక్షల రూపాయల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో పాతబోర్ల మరమ్మతులకు 53 లక్షలు, బోర్ల మోటార్లు, తదితరాల రిపేర్లకు ఐదు కోట్ల 10 లక్షలు, అదనపు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు 92 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. కానీ, ఈ ప్రతిపాదన ఇప్పటికీ ఫైల్‌లోనే మురుగుతోంది. అధికారుల ఉదాసీనత కారణంగా, రాబోయే రెండు నెలలూ తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు కోసం, ప్రజలు కార్పొరేటర్లపైనా, వారు అధికారులపైనా ఒత్తిడిని పెంచుతున్నారు. బల్దియా అధికారులు ఇప్పటికైనా స్పందించి యాక్షన్‌ ప్లాన్‌ అమలు దిశగా కదులుతారో లేదో వేచి చూడాలి. 

07:41 - April 22, 2017

హైదరాబాద్ : అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ దుస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బస్సులు పార్కింగ్‌లోనే మగ్గుతున్నాయి. సిఎం చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సమయం దొరక్క..కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ప్రయాణికులకు సేవలందించాల్సిన విలువైన బస్సులు 5 నెలలుగా ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి.
అలంకారప్రాయంగా బస్సులు 
ఆదాయాన్ని పెంచుకునే మార్గాలున్నా తెలంగాణ ఆర్టీసీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన 300లకు పైగా బస్సులు..షెడ్డుకు పరిమితం కావడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. గత నవంబర్‌లో సుమారు మూడు వందల బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. బాడీ నిర్మాణం పూర్తిచేసుకుని షెడ్డుకే పరిమితమయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసిన బస్సులు అలంకారప్రాయంగా మారాయి. ఆర్టీసికి ఆదాయం వచ్చే సీజన్‌లో.. కొత్తగా కొనుగోలు చేసిన బస్సులు సిద్ధంగా ఉన్నా అధికారులు వాటిని రోడ్డెక్కించలేకపోయారు. సంక్రాంతి సీజన్ లో అందుబాటులోకి తెచ్చినట్లైతే.. కొనుగోలు చేసిన ఖర్చులో సగమైనా వచ్చేదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. వేసవి సీజన్‌లోనూ...బస్సులు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోసారి కొత్త బస్సుల ప్రారంభోత్సవం వాయిదా..
ఒక్కో ఎక్స్‌ప్రెస్‌ బస్సు ద్వారా సాధారణంగా రోజుకు 10 వేల వరకు ఆదాయం వస్తుంది. గరుడా, రాజధాని లాంటి బస్సుల ద్వారా 20 వేల నుంచి 30 వేలు వచ్చే అవకాశం ఉంది. 300 బస్సులు నెలకు 10 కోట్ల నుంచి 12 కోట్ల ఆదాయాన్ని తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 5 నెలల్లో సుమారు 50 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్టీసి కోల్పోవడానికి కారణమెవరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కావడంలేదని ఓసారి, సిఎం అపాయింట్‌ మెంట్‌ దొరకడం లేదని మరోసారి వాయిదా వేయడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నాయి. సుమారు మూడు వందల కొత్తబస్సులు సిద్ధంగా ఉన్నాయని నెల క్రితం ఆర్టీసి ఎండి రమణారావు చెప్పారు. గత నెలాఖరునే వాటిని ప్రారంభిస్తామన్నారు. నెల గడిచినా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా వేసవి సీజన్‌ ముగియక ముందే కొత్త బస్సులను అందుబాటులోకి తేవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

07:33 - April 22, 2017

హైదరాబాద్ : తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ అని కాంగ్రెస్‌నేతలు చెబుతుంటారు. మీటింగ్‌ ఏదైనా పార్టీ వ్యవహారాలపై స్వేచ్ఛగా మాట్లాడటం హక్కు తమ పార్టీలోనే ఉందంటూ గొప్పలు పోతుంటారు. ఆ ప్రజాస్వామ్యమే ఒక్కోసారి శృతి మించి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. నేతలు పార్టీ ఆఫీసులే వేదికగా కుమ్ములాటలకు దిగిన సందర్భాలు అనేకం. ఇదే సీన్‌ మరోసారి గాంధీభవన్‌లో రిపీట్‌ అయ్యింది. అగ్రనేతల ముందే నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు రచ్చరచ్చ చేశారు.
ఆగ్రహంతో ఊగిపోతూ పిడిగుద్దులు..
కొద్ది రోజులుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో ఆధిపత్యపోరు బయటపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి మధ్య ఘర్షణ తలెత్తింది. భువనగిరి ఎంపీ నియోజకవర్గంలో తాను చెప్పిన వారినే కమిటీలో నియమించాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పడంతో వివాదం తలెత్తింది. కోమటిరెడ్డి భువనగిరికి నాన్‌లోకల్‌ అని, వారు నల్లగొండకే పరిమితం కావాలని గూడూరు నారాయణ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన కోమటిరెడ్డి గూడూరుపైకి దాడికి దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ పిడిగుద్దులు కురిపించారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.
అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా..?
కోమటిరెడ్డి దాడితో తేరుకున్న గూడూరు నారాయణరెడ్డి కూడా ప్రతిదాడికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దిగ్విజయ్‌, జానా, ఉత్తమ్‌ వారిస్తున్నా కోమటిరెడ్డి వినిపించుకోలేదు. ఆగ్రహంతో ఊగిపోతూ తన సర్వీస్‌ రివాల్వర్‌ను బయటకుతీసి కాల్చేస్తానంటూ గూడూరును భయభ్రాంతులకు గురిచేశారు. ఈ హఠాత్పరిణామంతో దిగ్విజయ్‌, ఉత్తమ్‌, జానా , భిక్షమయ్య షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత భిక్షమయ్య, జానా జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. ఈ పరిణామంపై సీరియస్‌ అయిన దిగ్విజయ్‌... క్రమశిక్షణను పాటించాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని హెచ్చరించారు. అధిష్టానం పెద్దల ముందే కోమటిరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి ఫైటింగ్‌కు దిగడం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

07:25 - April 22, 2017

చిత్తూరు : దూసుకొచ్చిన లారీ..క్షణాల్లో విగతజీవులైన 20 మంది గ్రామస్థులు..అవయవాలు తెగిపడిన వారి ఆర్తనాదాలతో భీతావహస్థితి..గగుర్పొడిచే భయానక దృశ్యాలు. జిల్లాలోని ఏర్పేడులో ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. ధర్నా చేస్తున్న ప్రజలపైకి లారీ దూసుకెళ్లడంతో.. 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి, రుయా, శ్రీకాళహస్తి, చెన్నై, వెల్లూరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.. లారీ అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుంటే, ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందన్న వాదనా వినిపిస్తోంది. ఓ లారీ సృష్టించిన బీభత్సానికి సాక్ష్యాలీ దృశ్యాలు. ఇసుక మాఫియాను నిలువరించాలంటూ మునగలపాలెం గ్రామస్థులు చేస్తున్న ఆందోళన.. అనూహ్యంగా ఇలా భీతావహంగా మారిపోయింది. లోడుతో వస్తోన్న లారీ ఒక్కసారిగా ఆందోళనకారులపైకి దూసుకు వచ్చింది. దీంతో తప్పించుకునే అవకాశం కూడా లేకుండా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు.
దుర్ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం
ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామంలో పెచ్చుమీరిన ఇసుక మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా, గ్రామస్థులంతా ఏర్పేడు మండల కార్యాలయానికి వచ్చారు. అదే సమయానికి తిరుపతి అర్బన్‌ ఎస్పీ, స్థానిక పోలీసు స్టేషన్ వచ్చారని తెలిసి.. వారంతా స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలి వచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.. లారీ పోలీసు స్టేషన్‌కు దగ్గర్లోని విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి.. అదే వేగంతో, గ్రామస్థుల మీదకు దూసుకొచ్చింది.. లారీ చక్రాలకింద పడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు, విద్యుత్‌ స్తంభం నుంచి తెగిపడ్డ తీగ కారణంగా, విద్యుదాఘాతానికి గురై మరికొందరు ప్రాణాలు వదిలారు. లారీ ఢీకొన్న కారణంగా, మరికొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఈ దుర్ఘటనతో ప్రాంతమంతా.. ఒక్కసారిగా రక్తపు ధారలతో.. బాధితులు, స్థానికుల హాహాకారాలతో భీతావహంగా మారింది. ఏర్పేడు ప్రమాదంలో గాయపడ్డ 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని చెన్నై, వేలూరు ఆస్పత్రులకు తరలించారు.. గాయపడ్డవారిలో సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణలతో పాటు, ముగ్గురు విలేకరులూ ఉన్నారు. ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుర్ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తముందన్న ప్రచారమూ జరుగుతోంది.
సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి
మరోవైపు, ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం ప్రకటించారు. ఏపీ మంత్రులు, వైసీపీ అధినేత జగన్‌, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఘటనాస్థలాన్ని సందర్శించారు.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు.

 

 

 

06:59 - April 22, 2017

గుంటూరు : అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ఉద్యోగులకు తీపి కబురు పంపింది. మే 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగుల జాబితా తయారు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మే 18 నుంచి బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే మే 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిశ్చయించింది. ఇక ఆస్తుల విభజనపై కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని ఏపీ కేబినెట్‌ వ్యతిరేకించింది.. ఈ అంశంపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.. ఒకవేళ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన నోటు ప్రకారం 9, 10 షెడ్యూల్ ఆస్తుల పంపిణీ జరిగితే ఏపీకి తీరని నష్టం జరుగుతుందని, కొత్తగా ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
భూసేకరణ వేగవంతం...
అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణానికి 24వేల కోట్లు ఖర్చవుతుందని ఏపీ కేబినెట్ అంచనా వేసింది. ఈ రహదారి నిర్మాణానికి 20 వేల ఎకరాలు భూసేకరణ జరపాల్సి ఉంటుందని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే జాతీయ రహదారికి ఇరు వైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతేగాక రహదారికి ఇరువైపులా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.
నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గింపు..
నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతం 50శాతం పెంచే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పెంచిన జీతం మే 1నుంచి అమల్లోకి రానుంది. అలాగే క్వింటాల్‌ మిర్చీ పంటకు 1500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు.. హౌసింగ్‌ కార్పొరేషన్‌కు హడ్కో నుంచి 2003 కోట్లు రుణంగా తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అనుమతించింది. 

06:53 - April 22, 2017

మేడ్చల్ : జిల్లాలోని కొంపల్లి జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వన్ మెన్‌ షోగా నడిచింది. పార్టీ అధినేత కేసీఆర్‌ అంతా తానై ప్లీనరీని పూర్తి చేశారు. 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రులంతా వేదిక మీద తమ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అలాగే ప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్‌ ప్రసంగం సైతం గతంలో మాదిరిగా ఆకట్టుకునే విధంగా లేదని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ప్లీనరీ సమావేశాలను నిర్వహించిన టీఆర్‌ఎస్‌... పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రైతుల కోసం చేపట్టిన పథకాలను వివరిస్తూ మిగతా సంక్షేమ పథకాల గురించి సీఎం వివరించారు. గత మూడేళ్లుగా పాలనపై పట్టు కోసం కృషి చేశామన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే నోరు, కడుపు కట్టుకుని పని చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు.
ఆశించిన మేర రాని కార్యకర్తలు 
ఇక ప్లీనరీ సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుంచి 60 మంది కార్యకర్తలను పిలిచినా కూడా అందులో సగం మంది కూడా వచ్చినట్లు కనిపించడం లేదు. ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేసినా.. కార్యకర్తలకు ఆశించిన మేర రాకపోవడం నేతలను అయోమయానికి గురి చేస్తోంది. దీంతో సభను షెడ్యూల్‌ ప్రకారం నడిపించలేదు. ఇక సమావేశానికి నేతలు భారీగా హాజరైనా అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. మంత్రులకు సైతం ఆ చాన్స్‌ దక్కలేదు. హరీష్‌రావు, కేటీఆర్‌లతో పాటు కవితకు ప్రతినిధుల సభలో మాట్లాడే అవకాశం రాలేదని వారి అనుచరులు నిరాశ చెందారు. ఇక తీర్మానాల సందర్బంగా నేతలు లేవనెత్తిన అభిప్రాయాలపై సీఎం కేసీఆర్‌ స్వయంగా వివరణ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభా ప్రాంగంణంలోనే ఉన్న కేసీఆర్‌.. మొత్తం వన్‌ మెన్‌ షోలా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకునే విధంగా లేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

 

నేడు పాలిసెట్ పరీక్ష

హైదరాబాద్ : నేడు పాలిసెట్..2017 పరీక్ష జరుగనుంది. ఉదయం 11 గంటలకు నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. 52 ప్రధాన కేంద్రాల్లో 393 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్ : నేడు ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు కవాడిగూడలో మంత్రులు కేటీఆర్, తలసాని పర్యటన

హైదరాబాద్ : నేడు కవాడిగూడలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 

 

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు

ఐపీఎల్ 10 : నేటి ఐపీఎల్ మ్యాచ్ లు రైజింగ్ పుణె వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తలపడనున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్, ముంబై వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు

ఐపీఎల్ 10 : నేటి ఐపీఎల్ మ్యాచ్ లు రైజింగ్ పుణె వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తలపడనున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్, ముంబై వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు ఇండియన్ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం

విశాఖపట్నం : నేడు ఏయూలో ఇండియన్ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జరగనుంది. 

 

Don't Miss