Activities calendar

23 April 2017

ఏర్పేడు ఘటనపై బాబు స్పందన..

ఢిల్లీ : ఏర్పేడు ఘటనలో ఎమ్మార్వోను సస్పెండ్ చేయడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడులను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని వారిని అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. ఏర్పేడు ఘటనప సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

21:22 - April 23, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ దీక్షచేస్తున్న ఉద్యమకారులు నిరాహారదీక్ష విరమించారు.. నర్సాపురం ఆస్పత్రిలో ఉన్న ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చిన అఖిలపక్ష నేతలు దీక్ష విరమింపజేశారు.. రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం దీక్షచేస్తున్న ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు నర్సాపురం ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడకూడా దీక్ష చేసిన ఉద్యమకారులకు సీపీఎం రాష్ట్ర నేత ఉమామహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.. దీక్ష విరమించినా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు..

21:20 - April 23, 2017

ఢిల్లీ : దేశంలో ఒకేసారి ఎన్నికలపై విస్తృత చర్చసాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి 3వ భేటీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రారంభోపన్యాసంలో ప్రధాని మోదీ, నవభారత్‌ అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలన్నారు. జీఎస్టీపై ఏకాభిప్రాయ సాధన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒకే దేశం, ఒకే ఆశయం, ఒకే నిర్ణయమే జీఎస్టీ లక్ష్యమన్నారు. దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు అన్న నినాదాన్ని మోదీ ప్రతిపాదించారు. పదిహేనేళ్ల విజన్‌ డాక్యుమెంట్‌పైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 15 సంవత్సరాల ముందస్తు ప్రణాళికకు సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్‌ ఆపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా సమర్పించారు. 15ఏళ్ల విజన్‌ డాక్యుమెంట్‌తోపాటు 7 సంవత్సరాల వ్యూహం - 3సంవత్సరాల అమలు పేరుతో జాతీయ అభివృద్ధి అజెండాను ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముసాయిదా అజెండాను వివరించారు. అన్ని రంగాల్లోని దాదాపు మూడు వందల ప్రత్యేక అంశాలతో పనగరియా నివేదిక తయారు చేశారు.

హాజరు కాని కేజ్రీ..మమత..
ఇక నీతిఆయోగ్‌ పనితీరుపై ఆ సంస్థ సీఈవో అమితాబ్‌కాంత్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాల సహకారంతో నీతి ఆయోగ్‌ పనిచేస్తుందని, దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని అమితాబ్‌కాంత్ తెలిపారు. మరోవైపు, జీఎస్టీపై కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అస్ముకి అదియా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జీఎస్టీతో భారత ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న ప్రయోజాలను సమావేశంలో వివరించారు. అన్ని రాష్ట్రాలూ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాలని అస్ముకి అదియా ఈ సందర్భంగా ముఖ్యమంత్రులను కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నీటిపారుదల, వ్యవసాయానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచాలని, రైతులకు టెక్నాలజీపై అవగాహన పెంచాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చవచ్చో చౌహాన్‌ ముఖ్యమంత్రులకు వివరించారు. డిజిటలైజేషన్‌, ఎనర్జీ , ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల పెంపుదల పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ భేటీకి ఢిల్లీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ హాజరుకాలేదు.

21:18 - April 23, 2017

చిత్తూరు : ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మునగలపాలెంలో ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్‌, ఇసుక మాఫియానే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ దందాలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు వాటాలు ఉన్నాయన్నారు. చిత్తూరు జిల్లా మునగలపాలెంలో ఏర్పేడు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి..ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచాలని ఆయనీ సందర్భంగా డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని జగన్‌ భరోసా ఇచ్చారు.

బాబుకు..లోకేష్ కు వాటా..
ఏర్పేడు మృతుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత, జగన్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ దందా జరుగుతోందని..అధికార టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు ఇసుక మాఫియాగా మారారన్నారు. ఇసుక మాఫియాతో టీడీపీ నేతలు 200 కోట్లు సంపాదించారని.. ఆ సొమ్మును రికవరీ చేసి బాధితులకు చెల్లించాలన్నారు. అక్రమ ఇసుక దందాలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ కు వాటా ఉందని అన్నారు.

ఫిర్యాదులపై స్పందనేది ?
ఇసుక మాఫియాపై మునగలపాలెం గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని జగన్‌ ప్రశ్నించారు. ఇసుక మాఫియాపై కేసులు పెట్టేందుకు వెళ్లి.. మునగలపాలెం గ్రామస్తులు, ప్రమాదంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎమ్మార్వోలు అందుబాటులో ఉండరని.. ఠాణాలకు వెళ్తే గేట్లు మూసివేస్తారని...ఎక్కడైనా పోలీస్‌ స్టేషన్‌ గేట్లు మూసేస్తారా అని నిలదీశారు.

21:16 - April 23, 2017

ఢిల్లీ : చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది చనిపోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మునగలపాలెం గ్రామస్తుల ఆందోళనకు కారణమైన చిరంజీవి నాయుడు, ధనుంజయనాయుడును టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. స్థానిక ఎమ్మార్వోనూ సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించారు. ఈ ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో విచారణ జరిపిస్తామన్నారు. నివేదిక అందగానే బాధ్యులను శిక్షిస్తామన్నారు. అవసరమైతే మోటార్‌ వెహికల్‌ చట్టంలో సవరణలు తీసుకొస్తామని చెప్పారు.

వీధి కుక్కల నియంత్రణకు బల్దియా నయా కార్యక్రమం..

హైదరాబాద్ : వీధి కుక్కల నియంత్రణకు బల్దియా కొత్త కార్యక్రమం నిర్వహిస్తోంది. వీధి కుక్కల దత్తత అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. గ్రేటర్ లో ఆరు లక్షల వీధి కుక్కలున్నాయని, దేశంలో మొదటిసారిగా కుక్కల నియంత్రణ కార్యక్రమం తీసుకొస్తున్నారు. చిన్న కుక్క పిల్లల దత్తతకు ముందుకు రావాలని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ కు నివేదిక - బాబు..

ఢిల్లీ : కన్వీనర్ గా స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ కు నివేదిక ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు నినాదానికి తాము సుముఖంగానే ఉన్నట్లు వెల్లడించారు.

గుజరాత్ లయన్స్ పై పంజాబ్ విన్..

రాజ్ కోట్ : ఎలెవన్ పంజాబ్ ఎట్టకేలకు గెలుపొందింది. నాలుగు వరుస పరాజయల తరువాత విజయం సాధించింది. ఐపీఎల్ 10లో భాగంగా గుజరాత్ లయన్స్ జట్టుతో పంజాబ్ ఢీకొంది. 26 పరుగుల తేడాతో గుజరాత్ ను పంజాబ్ ఓడించింది.

టీవీజేయూ ఎన్నికల్లో టెన్ టివి ప్రతినిధి గెలుపు..

హైదరాబాద్ : టీవీజేయూ ఎన్నికల్లో టెన్ టివి వీడియో జర్నలిస్టు వడ్డెమాన్ లక్ష్మణ్ విజయం సాధించారు.

20:27 - April 23, 2017

తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సమీర్‌. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన 'డీజే' లో తాను నటించానని, సినిమా చాలా బాగుంటుందని తెలియచేశారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏపీ గ్రూప్ పరీక్ష కు 64.8 శాతం హాజరు..

హైదరాబాద్ : ఏపీ గ్రూప్ -3 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 64.8 శాతం హాజరయ్యారు. ఈనెల 25న గ్రూప్ -3 పరీక్ష 'కీ' విడుదల చేసిన తరువాత ఏడు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

స్టీల్ ప్లాంట్ ను ఎన్ఎండీసీలో విలీనం లేదు - బీరేంద్ర సింగ్..

విశాఖపట్టణం : స్టీల్ ప్లాంట్ ను ఎన్ఎండీసీలో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ పేర్కొన్నారు. 2003లోగా 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తే లక్ష్యం పెట్టుకున్నట్లు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఉపయోగించే ఉక్కులో దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉక్కునే వాడాలని కేబినెట్ నోట్ ను ప్రిపేర్ చేశామన్నారు.

తాత్కాలికంగా తమిళ నాడు రైతుల దీక్ష విరమణ..

ఢిల్లీ : తాత్కాలికంగా తమిళనాడు రైతులు ఆందోళన విరమించుకున్నారు. తమిళనాడు సీఎం హామీ మేరకు దీక్షలు విరమించుకున్నారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తమిళ సీఎం హామీనిచ్చారు.

ఒక్క నిమిషంపై నిబంధన సడలింపు..

విజయవాడ : సోమవారం నుండి ఇంజినీరింగ్ ఆన్ లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిమిషం ఆలస్యం నిబంధనలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. సరైన కారణం ఉంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

19:03 - April 23, 2017
19:02 - April 23, 2017
18:59 - April 23, 2017

ఒకే సారి ఎన్నికలపై చర్చ జరగాలి --మోడీ..

ఢిల్లీ : ఒకదేశం, ఒక ఆకాంక్ష..ఒక ధృఢ సంకల్పానికి జీఎస్టీ స్పూర్తి అని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చలు కొనసాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నార. . రాష్ట్రాలు మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు.

 

దినకరన్ విచారణ..సెకండ్ డే..

ఢిల్లీ : క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట దినకరన్ రెండో రోజు హాజరయ్యారు. పార్టీ గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను దినకరన్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

18:12 - April 23, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలతో కేంద్రం సఖ్యతగా వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈమేరకు ఆదివారం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రాష్ట్రాల సాంప్రదాయాలు..సాంస్కృతిక..భాషలను గౌరవించి నడచుకోవాలని, భాష..జాతుల వైరుఢ్యాలకు నిలయమైన ఉప జాతీయత గుర్తింపును కేంద్రం గౌరవించాలని పేర్కొన్నారు. లేకుంటే దేశంలో వేర్పాటు ఉద్యమాలకు కేంద్రమే బలమైన పునాదులు వేసినట్లవుతుందని తెలిపారు.

ఢిల్లీ ముగిసిన మున్సిపల్ పోలింగ్..

ఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 272 వార్డులకు పోలింగ్ జరిగింది. మొత్తంగా 40 శాతానికైగా పోలింగ్ శాతం నమోదైంది. 1.3 లక్షల మంది తమ ఓటర్లున్నారు.

 

17:39 - April 23, 2017

హైదరాబాద్ : కారు పార్టీలో కమిటీల కయ్యం ప్రకంపనలు రేపుతోంది. స్థానిక నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పదవుల్లో అధికశాతం మంత్రి తుమ్మల వర్గానికే దక్కడంపై.. ఎంపీ పొంగులేటి సహా ఇతర ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారికి గాని, టిఆర్ఎస్ పార్టీని వెన్నంటి ఉన్నవారిని.. మండల అధ్యక్షులు, కార్యదర్శులుగా నియమించకుండా.. కొత్తగా పార్టీలో చేరిన వారిని అందలమెక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి తుమ్మల తనకు గాని, తన అనుచరులకు గాని ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎంపి పొంగులేటి వర్గం అసహానాన్ని వ్యక్తం చేస్తోంది. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు పోటీపడుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పువ్వాడ వ్యూహాలతో మంత్రి తుమ్మల, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టి తనదైన శైలీలో ముందకు పోతున్నారు. నియోజకవర్గంలోని 50 డివిజన్‌ కమిటీలకు గాను.. 47 కమిటీలు వేశారు. మిగతా ఒకటో డివిజన్, 49, 50 డివిజన్లు పాలేరు నియోజకవర్గంలో ఉండటంతో..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ మూడు కమిటీలను వేయాల్సి ఉంది. రఘునాథపాలెం మండల కమిటీతో పాటు గ్రామ కమిటీలను కూడా వేశారు.

పాలేరు నియోజకవర్గంలో...
పాలేరు నియోజకవర్గంలో మంత్రి తుమ్మల తన అనుచరులకు మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ, మార్కెట్ కమిటీలలో అవకాశాలు కల్పించారు. నేలకొండపల్లి , కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం అధ్యక్షులను నియమించారు. అయితే పాలేరులో ఎంపి పొంగులేటి తన వర్గాన్ని మండల అధ్యక్షులుగా నియమించుకోలేకపోయారు. ఇక వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్, ఎంపి పొంగులేటి అనుచర వర్గాలు ఎవరికి వారే కమిటీలు ప్రకటించుకున్నారు. వైరా ఎమ్మెల్యే తనను సంప్రదించకుండానే గ్రామ, మండల కమిటీలు వేసుకున్నారనే ఆగ్రహంతో ఎంపీ గ్రామ, మండల కమిటీలను ప్రకటించారు.

సత్తుపల్లి..
సత్తుపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తుమ్మల అనుచరులకే పదవులు దక్కాయి. సత్తుపల్లి ఇంఛార్జీగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఉన్నా..మంత్రి తుమ్మలదే పైచేయిగా మారింది. అటు మధిర నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. మధిర పట్టణ అధ్యక్షుడిగా దేవిశెట్టి రంగా.. అలే కార్యదర్శిగా అరక శ్రీనివాసరావు..మధిర మండల అధ్యక్షుడిగా దొండపాటి నాగేశ్వరరావును నియమించారు. బోనకల్ మండల అధ్యక్షుడిగా బందం శ్రీనువాసరావు..చింతకాని మండల అధ్యక్షుడిగా పెండ్యాల పుల్లయ్య...కార్యదర్శిగా నోముల కొండ దుర్గాచారిని నియమించారు.

ఇల్లందు నియోజకవర్గం..
ఇల్లందు నియోజవకర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే కొరం కనకయ్య, ఎంపి సీతారాం నాయక్ మధ్య వర్గపోరు కొనసాగుతోంది. నియోజవకర్గంలోని 7 మండలాల్లో ఒక్క కారేపల్లికి మాత్రమే అయిలయ్యను నియమించారు. ఎంపి, ఎంఎల్ఏ మధ్య అధిపత్య పోరుతో ఇల్లందు, గార్ల బయ్యారం, టేకులపల్లి, గుండాలలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేయలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, మంత్రి తుమ్మల, ఎంపి పొంగులేటి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. కనుగట్లు బాలకృష్ణ, బరిపటి వాసుదేవ్ రావు, మచ్చా శ్రీనివాసరావు, నాదేటి సంతోష్, వీరభద్రం పేర్లను ఎంపీ పొంగులేటి, తుమ్మల వర్గం ప్రాతిపాదించింది. ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాత్రం అధ్యక్షులుగా కిలారు నాగేశ్వరరావు, రాజు గౌడ్, సండ్రా వెంకటేశ్వర్లు, గంగాధర్ , కాలువ భాస్కర్, మల్లెల రవిచంద్ర , మురళీ, మధును నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. తన వర్గానికి చెందిన శివారెడ్డి, జానకి రెడ్డి, ముత్తయ్యను అధ్యక్షులుగా నియమించాలని ఎంపి పొంగులేటి పట్టు బడుతున్నారు. పాల్వంచ పట్టణంలోనూ ఇదే పరిస్థితి.

పినపాక నియోజకవర్గంలో..
పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరునికే అధ్యక్ష పదవి దక్కింది. పినపాక, గుండాల,అళ్లపల్లి, కరకగూడెం, అశ్వాపురం మండలాల్లోనూ తన అనుచరులతో కమిటీలు వేశారు. అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తుమ్మల వర్గం కావడంతో..అన్ని మండల, గ్రామ కమిటీలు తుమ్మల అనుచరులకే దక్కాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జెడ్ పి చైర్మన్ గడిపల్లి కవిత తుమ్మల అనుచర వర్గం కావటంతో తుమ్మల సమ్మతితోనే కమిటీలు వేశారు. నేతల మధ్య విభేదాలతో కమిటీల నియామకం మందకొడిగా సాగుతోంది.

17:34 - April 23, 2017

హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి తాయిలాలతో కార్మిక వర్గాన్ని పక్కదారి పట్టిస్తోందని సిఐటియు విమర్శించింది. ప్రభుత్వం ప్రకటిస్తున్న తాత్కాలిక తాయిలాల వెనక ఉన్న రహస్యాన్ని బయటపెట్టి కార్మికులను పోరాటాల వైపు మళ్లిస్తామని కార్మికసంఘం నేతలు స్పష్టం చేశారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ విస్తృత సమావేశాల్లో కేసీఆర్‌ ప్రభుత్వంపై కార్మిక సంఘాల నేతలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ విస్తృత సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కార్మిక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కార్మిక సమస్యలను చర్చించి, భవిష్యత్‌ పోరాటాలకు ఈ సమావేశాల్లో రూపకల్పన చేయనున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి చిన్న చిన్న తాయిలాలతో కార్మిక వర్గాన్ని పక్కదారి పట్టిస్తోందని సిఐటియు నేతలు ఆరోపించారు. ప్రధానమైన విషయాలను పక్కదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్ ప్రజాకర్షక ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాఘవులు విమర్శలు..
కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. అంగన్‌ వాడీ, విఆర్‌ఎల వేతనాలు పెంచడాన్ని సిఐటియు నేతలు స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మిగతా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న తాత్కాలిక తాయిలాల వెనక ఉన్న రహస్యాన్ని బయటపెట్టి.. కార్మికులను పోరాటాల వైపు మళ్లీంచేందుకు కార్యాచరణ రూపొందిస్తామని సిఐటియు నేతలు అంటున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేస్తామని సీఐటీయూ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

17:30 - April 23, 2017

హైదరాబాద్ : పేదల గొంతు వినిపించే ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే ఊరుకునేది లేదని ప్రజాగాయకుడు గద్దర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహరదీక్షలకు గద్దర్‌తో పాటు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. దీక్షలకు మద్దతు ప్రకటించారు. ధర్నాచౌక్‌ను మూసివేస్తే అసెంబ్లీనే ధర్నా చౌక్‌గా చేస్తామని గద్దర్ పేర్కొన్నారు.

17:28 - April 23, 2017

హైదరాబాద్ : కార్మిక సంఘాల్ని విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సీపీఎంపొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలకు రాఘవులు హాజరయ్యారు. చిన్న చిన్న రాయితీలు ఇస్తూ కార్మికుల్ని భ్రమలకు గురిచేస్తున్నారని విమర్శించారు.. సీఎం స్థాయిలోనే కార్మిక సంఘాల్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని రాఘవులు విమర్శించారు.

17:25 - April 23, 2017
17:07 - April 23, 2017

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి -2’. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే 'బాహుబలి' మేనియా వచ్చేసింది. పలు ప్రాంతాల్లో బాహుబలి హోర్డింగ్స్..ప్రభాస్ ఫొటోలతో అభిమానులు సందడి చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఒకే చిత్రానికి 'ప్రభాస్' పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం తన తదుపరి సినిమాపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అప్పుడే సిద్ధం చేశారంట. ‘బాహుబలి -2’ సినిమా విడుదల రోజునే 'సాహో' టీజర్ ను కూడా థియేటర్లలో ప్రదర్శించనున్నారుర. ఒక వైపు 'బాహుబలి-2 మరోవైపు 'సాహో' టీజర్ విడుదలవుతుండడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

16:50 - April 23, 2017
16:37 - April 23, 2017

విజయవాడ : అసభ్యకర మెసేజ్‌లతో మహిళల్ని వేధిస్తున్న ఇద్దరు నిందితుల్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాసరావు ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. బస్‌పాస్‌లపై ఉన్న నెంబర్లను తీసుకొని మెసేజ్‌లద్వారా వేధించాడు.. ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకిదిగిన పోలీసులు.. శ్రీనివాసరావుతో పాటు అతనికి సహకరిస్తున్న శ్యామ్యుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

16:35 - April 23, 2017

కర్నూలు : రాయలసీమ పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్షత కొనసాగిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. ఏపీలో అత్యంత వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు ఏ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సీమలో ఉపాధిలేక ప్రజలు వలసలుపోతుంటే.. పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. జూన్‌లో కర్నూలులో నిర్వహించనున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘ సమావేశం జరిగింది. ఈ సమాశానికి హాజరైన గఫూర్‌... టీడీపీ నేతలకు కమీషన్లయావ తప్ప... రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ది లేదని విమర్శించారు.

16:33 - April 23, 2017

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చామని బాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందని జగన్‌ ధ్వజమెత్తారు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు ఇసుక మాఫియాగా మారారని.. ఈ ఇద్దరు టీడీపీ నేతలకు అధికారుల వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాతో టీడీపీ నేతలు 200 కోట్లు సంపాదించారని.. ఆ సొమ్మును రికవరీ చేసి బాధితులకు చెల్లించాలన్నారు. ఇసుకతోనూ కోట్లు సంపాదించవచ్చని చంద్రబాబు బాబు నిరూపించారని ఆరోపించారు. ఇసుక మాఫియాపై సమగ్ర విచారణ జరపించాలని జగన్‌ డిమాండ్ చేశారు.
అంతేకంటే ముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మునగలపాలెం, ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకున్న జగన్‌..ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌ డిమాండ్ చేశారు.

16:10 - April 23, 2017

హైదరాబాద్ : నగరంలో ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా చేసిన డ్రైవింగ్ కు ఓ బాలుడి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మరో బాలుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన భోలక్ పూర్ లో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం తోళ్లను తరలించే డీసీఎంను డ్రైవర్ రివర్స్ తీసుకుంటున్నాడు. అజాగ్రత్తగా నడపడంతో అక్కడనే ఉన్న గోడను డీసీఎం ఢీకొట్టింది. దీనితో అక్కడనే ఆడుకుంటున్న మహ్మద్ బిలాల, సలీంలపై శిథిలాలు పడిపోయాయి. బిలాల అక్కడికక్కడనే మృతి చెందగా సలీంకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సలీంను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే డ్రైవర్ డీసీఎంను వదిలి పరారయ్యాడు. డీసీఎంను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలింపులు చేపట్టారు. బిలాల మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

భోలక్ పూర్ లో విషాదం..

హైదరాబాద్ : నగరంలోని భోలక్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డీసీఎం రివర్స్ తీసుకుంటుండగా మహ్మద్ బిలాల అనే బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు సలీంకు తీవ్రగాయాలయ్యాయి.

15:29 - April 23, 2017

విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మూడేళ్లపాటు ప్రభుత్వం, రాజధాని భూసమీకరణ, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, మండలి భవనాలు, రోడ్ల నిర్మాణంపై ఎక్కువ సమయం కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు టీడీపీ పటిష్టతకు నడుం బిగించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో లోక్‌సభ స్థానాల వారీగా మంత్రులను పార్టీల ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అంచనా వేయడంతోపాటు, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతలను ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. ఎక్కువ సమయం నియోజకవర్గాల్లో ఉంటూ పార్టీ నేతలు, కార్యక్తలను కలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

జిల్లాల వారీగా..
శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి పితాని సత్యనారాయణ, విజయనగరంకు గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నంకు నిమ్మకాయల చినరాజప్ప, అరకు లోక్‌సభ స్థానానికి నక్కా ఆనందబాబు, అనకాపల్లికి కేంద్ర మంత్రి అశోకగజపతిరాజును ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. కాకినాడ-కళావెంకట్రావు, అమలాపురం-సుజయకృష్ణ రంగారావు, రాజమండ్రి-కేఈ కృష్ణమూర్తి, నరసాపురం-కొల్లు రవీంద్ర, ఏలూరు-ప్రత్తిపాటి పుల్లారావు, విజయవాడకు నారా లోకేశ్‌, మచిలీపట్నం -యనమల రామకృష్ణుడును ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. గుంటూరుకు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నరసరావుపేట-సిద్దా రాఘవరావు, బాపట్ల-పరిటాల సునీత, ఒంగోలుకు నారాయణను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. నెల్లూరు అమర్‌నాథరెడ్డి, తిరుపతి-భూమా అఖిలప్రియ, చిత్తూరు-అచ్చెన్నాయుడు, రాజంపేట-ఆదినారాయణరెడ్డి, కడప-సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నంద్యాల-కాల్వ శ్రీనివాసులు, కర్నూలుకు కేంద్ర మంత్రి సుజనాచౌదరిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అనంతపురంకు దేవినేని ఉమ, హిందూపురంకు శామ్యూల్‌ జవహర్‌ బాబులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయ వేడి..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను పరిశీలిస్తే... ఆయా జిల్లాల్లోని పార్టీ బలాబలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని బాధ్యతలను అప్పగించినట్టు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలకు సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ కంచుకోటగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలకు జూనియర్లకు బాధ్యతలు కట్టబెట్టారు. ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కడపకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజంపేటకు ఆదినారాయణరెడ్డికి బాధ్యతలను అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పరిశీలిస్తే వైసీపీని దెబ్బతీసేందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌కు కీలకమైన విజయవాడ లోక్‌సభ స్థానం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. లోకేశ్‌ సతీమణి బ్రహ్మణి విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ముందస్తు ఎన్నికలపై చంద్రబాబునాయుడు వ్యూహాత్మంగా వేస్తున్న అడుగులు ఆంధ్రప్రదేశ్‌ పార్టీల్లో రాజకీయ వేడి రగులుతోంది. చంద్రబాబు ఇచ్చిన సంకేతాలను ఆధారంగా ఎవరికి వారు సన్నద్ధం అవుతున్నారు.

15:25 - April 23, 2017

విజయవాడ : కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు కోసం సీపీఎం చేపట్టిన 72 గంటల దీక్ష ముగింపు సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. కృష్ణలంక నుండి సిటీలోకి వెళ్లడానికి రోడ్డుమార్గం లేనందున..వెంటనే కృష్ణలంక నుండి బందర్‌ రోడ్డు వెళ్లడానికి యుద్ధ ప్రాతిపదికన మూడు వంతెనలు నిర్మించాలని ఇందుకు 15 రోజుల సమయం పెడుతున్నట్లు మధు తెలిపారు. ఒకవేళ సబ్‌వేలను నిర్మించకపోతే అన్ని సంఘాలు, పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. కృష్ణలంక రోడ్డు సమస్య పరిష్కరించకుంటే కరకట్ట మెయిన్‌రోడ్డును బంద్‌ చేస్తామని హెచ్చరించారు.

15:22 - April 23, 2017

నెల్లూరు : రవికిరణ్‌ అరెస్ట్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రవికిరణ్‌కు వైసీపీ జీతాలిచ్చి టీడీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కించపరిచే పోస్టింగులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయ్‌సాయిరెడ్డి బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. రవి కిరణ్ అనే వ్యక్తి చర్లపల్లి జైలులో ఉండి వచ్చాడని పేర్కొన్నారు.

15:19 - April 23, 2017

చిత్తూరు : జిల్లా ఏర్పేడులో లారీ ప్రమాద బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మునగలపాలెం, ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకున్న జగన్‌..ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని..అలాగే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచాలన్నారు.

జగన్ కు చేదు అనుభవం..

చిత్తూరు : ఏర్పేడులో జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ పర్యటన సందర్భంగా కార్యకర్తల హడావుడిపై మునగలపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జై జగన్ అనే నినాదాలు..కేరింతలు పెటొట్టద్దని జగన్..కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తిరుపతి ఎంపీ సర్దిచెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.

పెళ్లింట్లో అగ్నిప్రమాదం..

కొమరం భీం : కాగజ్ నగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగో రోజుల్లో ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పెళ్లి సామాన్లు కాలి బూడిదయ్యాయి.

14:30 - April 23, 2017

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాధికారులు హాజరయ్యారు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలం ఈ మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో 15ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికకు నీతి ఆయోగ్‌ ఈ సమావేశం ద్వారా నాంది పలకనుంది. దీంతో పాటు ఏడేళ్లకు వ్యూహాన్ని, మూడేళ్లకు కార్యాచరణ ప్రణాళికలనూ ముఖ్యమంత్రుల ముందు పెట్టి వారి అభిప్రాయాలను స్వీకరించనుంది.

14:28 - April 23, 2017

ఢిల్లీ : గో సంరక్షకుల అగడాలు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతవరకు ఆవులు తరలిస్తున్న వారిపై దాడులు చేస్తూ వస్తున్న గోసంరక్షులు ఇప్పుడు గేదెలను రవాణ చేస్తున్న వారిపైనా దాడులకు తెగబడుతున్నారు. ఢిల్లీలో అక్రమంగా గేదెలను తరలిస్తున్నారంటూ ముగ్గురు వ్యక్తులపై గోసంరక్షణ దళానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. గురుగావ్‌ నుంచి ఘజియాపూర్‌ మార్కెట్‌కు ట్రక్కులో గేదెలను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోసంరక్షకులతోపాటు గేదెలను తరలిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేశారు. అయితే అక్రమంగా గేదెలను తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో తాము అప్రమత్తమై ట్రక్కును వెంబడించి, పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు గోసంరక్షణ దళం సభ్యులు చెబుతున్నారు. ట్రక్కులో తరలిస్తున్న గేదెలు అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

14:25 - April 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం తుందుర్రులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరవదిక నిరహార దీక్ష రెండవ రోజు కొనసాగుతుండగా..పోలీస్ బలగాలు దీక్షను భగ్నం చేసి బలవంతంగా నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తామని సీపీఎం నాయకులు తెలిపారు. నిరవదిక దీక్ష చేస్తున్న వారిని పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో కొందరికి తీవ్రగాయాలయ్యాయని డాక్టర్‌ రత్నకుమారి తెలిపారు.

14:21 - April 23, 2017

నిజామాబాద్‌ : జిల్లా మాక్లూర్‌ మండలం దాస్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి రెండేళ్ల పాప సహా మరో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు 30 ఏళ్ల సాయికుమార్‌, 26ఏళ్ల దివ్య, రెండేళ్ల వర్షిణిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాలను మార్చురీకి తరలించారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ కాలనీకి చెందిన సాయి కుమార్‌కు దివ్య అనే మరో మహిళతో అక్రమ సంబంధం ఉండడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లేక ఎవరైనా వీరిని హత్య చేసారా అనే కోణంలొ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

14:16 - April 23, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది. టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని..ఈ విషయంపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించాలని కోరుతున్నట్లు..తన మరణం తరువాతైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆ కార్యకర్త సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ ఘటన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఆదివారం మార్నింగ్ వాక్ కు వచ్చిన కొంతమంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందడం ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి మహిపాల్ రెడ్డి అని గుర్తించారు. మృతదేహం వద్ద మూడు పేజీల సూసైడ్ లేఖ..ఓ వాహనం ఉంది. టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని, పార్టీ నియాకాల్లో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. టిడిపి నుండి వచ్చిన వారికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తన ఆత్మహత్య అనంతరం కార్యకర్తలకు న్యాయం కలుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇతను ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకరావాలని పేర్కొనడంతో ఆయన స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమే -బీజేపీ ఎంపీ

నల్గొండ : ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని బీజేపీ ఎంపీ సురేష్ ఆగాడి పేర్కొన్నారు. ఎన్డీయే హాయాంలో రాష్ట్రాలకు వచ్చే నిధులు పెరిగాయని, రాష్ట్రంలో పార్టీ సదస్సులు విజయవంతమయ్యాయని తెలిపారు. కేంద్ర పథకాల అమల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ యంత్రాగాన్ని సమాయత్తం చేస్తున్నామన్నారు.

 

ఏర్పేడులో బాధితులకు జగన్ పరామర్శ..

తిరుపతి : ఏర్పేడు రోడ్డు ప్రమాద బాధితులకు వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. మునగపాలెంలో 13 మంది మృతుల కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. ఇసుక మాఫియా వల్లే తమ వారు చనిపోయారంటూ జగన్ ఎదుట బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.

రైల్వే ఉద్యోగాల పేరిట భారీ మోసం..

వరంగల్ : రైల్వే ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. నిరుద్యోగుల నుండి రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు కాజీపేట పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.

వైసీపీపై మంత్రి సోమిరెడ్డి విమర్శలు..

నెల్లూరు : వైసీపీ తరపున జీతాలు ఇచ్చి సోషల్ మీడియాను నడిపిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి రవి కిరణ్ అని, రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని జగన్, విజయసాయిరెడ్డిలు కోరుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాకు చంద్రబాబు వ్యతిరేకమని వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాతలు..తండ్రులను అడ్డం పెట్టుకుని సంపాదించుకోవడం లోకేష్ కు తెలియదన్నారు.

 

12:16 - April 23, 2017

నిమ్మరసం..ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు..యాంటీ బాక్టీరియల్..యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీంరలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ 'సి' లభ్యం కావడం వల్ల చర్మం..దంత సమస్యలు తగ్గుతాయి. నీటిలో నిమ్మరసం కలుపుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడవని పేర్కొంటున్నారు.

  • నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తెల్లగా..ధృడంగా మారుతాయి. చిగుళ్ల నొప్పి కూడా తగ్గుతుంది.
  • జీర్ణ సంబంధ వ్యాధులు ఉంటే అవి తగ్గుముఖం పడుతాయి. గ్యాస్..అజీర్ణం..మలబద్ధకం..అసిడిటీ సమస్యలు దూరమౌతాయి.
  • వేసవి కాలంలో ఎదురయ్యే డీ హైడ్రేషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
  • దగ్గు..జలుబు వంటి శ్వాస కోశ వ్యాధులు నమమౌతాయి.
  • చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధికంగా బరువు ఉంటే తగ్గే అవకాశం ఉంది.
  • డయాబెటీస్ ఉన్న వారికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
  • డిప్రెషన్..ఆందోళన..ఒత్తిడి వంటివి తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
12:15 - April 23, 2017

ఢిల్లీ : భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి మాజీ కెప్టెన్ పూర్ణిమా రావుకు ఉద్వాసన పలికారు. ఈమె స్థానంలో జట్టు కోచ్‌గా బరోడా మాజీ క్రికెటర్ తుషార్ బాలచంద్ర అరోథె బాధ్యతలు స్వీకరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నెలరోజుల్లో మహిళల ప్రపంచకప్ మొదలవుతుందనగా ఇప్పుడిలా అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్వాసన పలకడంపై పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండేడ్లుగా మహిళా జట్టు కోచ్‌గా ఆమె సేవలందిస్తున్నారు. తాను కోచ్‌గా విజయవంతమయ్యానని, 8 సిరీస్ లలో విజయాలని సొంతం చేసుకోవడం జరిగిందని పూర్ణిమ పేర్కొన్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌కు చెందిన పూర్ణిమా రావు 2015లో భారత జట్టు కోచ్‌గా నియమితురాలైంది. ఇక కొత్త కోచ్‌గా ఎంపికైన 50 ఏండ్ల తుషార్ 2008 నుంచి 2012 వరకు జాతీయ మహిళా జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. వచ్చే ప్రపంచకప్ ముగిసేవరకు తుషార్ కోచ్‌గా బాధ్యతలు నెరవేరుస్తాడని బీసీసీఐ వెల్లడించింది.

12:11 - April 23, 2017

తెరపై నవ్వుతూ కనిపిస్తారు. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తారు.. కానీ, వారి జీవితాల్లో మరెన్నో విశేషాలుంటాయి. ఆ ప్రయాణంలో ఎన్నో మలుపులుంటాయి. ప్రపంచానికి తెలియని మరెన్నో కోణాలూ వారిలో ఉంటాయి. ప్రముఖ కథారచయిత కూనపరాజు కుమార్ రాసిన హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర ఇటీవల విడుదలయింది. ఆ వివరాలతో పాటు, కుమార్ రాసిన న్యూయార్క్ కథా సంపుటి విశేషాలు చూద్దాం.. 

12:08 - April 23, 2017

కవిత్వానికి కాలం చెల్లిందా? వచనం రాయలేని వాళ్లే కవిత్వం రాస్తున్నారా? సాహితీ ప్రక్రియల ప్రాధాన్యం కాలానుగుణంగా మారుతుందా? ఇప్పుడు వచన సాహిత్యానికి, పాటకు మాత్రమే సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉందా? కొందరు కవులు లేవనెత్తుతున్న ప్రశ్నలివి. దీనికి సమాధానం అంత తేలిక కాకపోవచ్చు. ఆధునిక కవిగా తన తెలుగు సాహిత్యంపై తన ముద్రవేసిన కవి ప్రసేన్ కథనంతో పాటు, న్యూయార్క్ కథలు, ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర వెలువరించిన కూనపరాజు కుమార్ ల ప్రత్యేక కథనాలతో ఈ వారం అక్షరం మీముందుకొచ్చింది.. కవిత్వంతో మొదలు పెట్టిన ప్రయాణం.... కవితాత్మక వచనం దిశగా సాగుతోంది. వ్యాసాలు, విమర్శలతో నడుస్తోంది.  రక్తస్పర్శ, ఏదీకాదు, ఇంకా ఉంది, కవిత్వం మొదలైన సంపుటాలతో తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితమైన కవి ప్రసేన్. పోస్టు మోడ్రన్ కవిగా, విమర్శకునిగా, పాత్రికేయునిగా, బహుముఖ ప్రజ్ఞతో రచనావ్యాసంగాన్ని సాగిస్తున్న ప్రసేన్ పై ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

12:01 - April 23, 2017

ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు..కానీ వీరి కాపురంలో 'మాంసం' చిచ్చు రేపింది. ఫలితంగా విడాకులకు దారి తీసింది. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. జైన మతానికి చెందిన ఓ యువతి..బీహార్ రాష్ట్రానికి చెందిన కరణ్ తో ప్రేమలో పడింది. కరణ్ వృత్తిరీత్యా కంప్యూటర్ వర్క్ చేస్తుండగా యువతి డిగ్రీ చదివింది. వీరిద్దరూ పరస్పరం ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. అయినా సరే తల్లిదండ్రులను ఎదిరించి కరణ్ ను ఆ యువతి పెళ్లి చేసుకుంది. ఇక్కడ ఓ కండీషన్ పెట్టింది. వివాహం అయిన తరువాత మాంసం తినొద్దని యువతి నిబంధన పెట్టింది. ఇదంతా ఆరేళ్ల క్రితం. వీరికి కవల పిల్లలు పుట్టారు. కానీ భర్త కరణ్ బయట నాన్ వెజ్ తినేసి ఇంటికి వస్తున్నాడని గ్రహించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్య కాలంలో కరణ్ నాన్ వెజ్ అధికంగా తింటున్నాడని గ్రహించిన యువతి తెగదెంపులు చేసుకోవడానికి నిర్ణయించింది. తనకు విడాకులు కావాలని కోరింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ఇద్దరి పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకొనేందుకు అంగీకారం కుదిరింది. జైన మతానికి చెందిన వారు మటన్..ఉల్లిపాయలు..ఇతరత్రా తినరనే సంగతి తెలిసిందే.

లారీ ప్రమాద ఘటనపై కొత్త విషయాలు

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..కడప నుంచి రేణిగుంట వరకు లారీని క్లీనర్‌ నడిపినట్లు తాజాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్‌ గురవయ్య మద్యం సేవించినట్లు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. రేణిగుంట నుంచి ఏర్పేడు వరకు మద్యం మత్తులో లారీని డ్రైవర్‌ గురవయ్య నడిపినట్లు గుర్తించారు. కడప సమీపంలో లారీని క్లీనర్ నడుపుతున్న దృశ్యాలను కడప టోల్‌గేట్‌ దగ్గర సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. 

11:40 - April 23, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి బిల్డింగ్‌ పైనుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ కు చెందిన గిరి (45) అనే రోగి కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఒక్కసారిగా ఆసుపత్రికి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేయడంతో అక్కడికక్కడే గిరి మృతి చెందాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న దానిపైన వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:35 - April 23, 2017

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..కడప నుంచి రేణిగుంట వరకు లారీని క్లీనర్‌ నడిపినట్లు తాజాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్‌ గురవయ్య మద్యం సేవించినట్లు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. రేణిగుంట నుంచి ఏర్పేడు వరకు మద్యం మత్తులో లారీని డ్రైవర్‌ గురవయ్య నడిపినట్లు గుర్తించారు. కడప సమీపంలో లారీని క్లీనర్ నడుపుతున్న దృశ్యాలను కడప టోల్‌గేట్‌ దగ్గర సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత క్లీనర్‌ మాయం కావడంతో ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:29 - April 23, 2017

పెద్దపల్లి : జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుల్తానాబాద్‌ సీఐ అడ్లూరి రాములు, ఎస్ ఐ దేవేందర్‌ జీవన్‌ల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమంలో సరైన ధ్రువప్రత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు ఆటోలు, కారుతోపాటు 150 గుడుంబా ప్యాకెట్లను పట్టుకున్నారు. కిలో స్పటిక, ఐదు కిలోల జీడి గింజలను స్వాధీనం చేసుకున్నారు.

11:27 - April 23, 2017

రంగారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. ఓ రియల్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన రియల్టర్‌ మహిపాల్‌రెడ్డి రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మహిపాల్‌రెడ్డి ఉరివేసుకున్న తీరును పరిశీలించిన పోలీసులు దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిపాల్‌రెడ్డి స్వయంగా ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైన హత్య చేసి, మృతదేహాన్ని తాడుతో వేలాడదీశారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సీసీటీవీల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

 

10:44 - April 23, 2017

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడు బాధితులను పరామర్శించేందుకు కాసేపట్లో వైఎస్‌ జగన్‌ ఏర్పేడుకు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మునగలపాలెం, ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకొని ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 16 కు చేరింది. మృతుల స్వగ్రామం మునగలపాలెంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాపేపట్లో ఏర్పేడుకు జగన్

చిత్తూరు : కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ ఏర్పేడుకు చేరుకోనున్నారు. లారీ ప్రమాద మృతుల కుటుంబాలను ఆయన  సందర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. 

 

నీతి ఆయోగ్ కమిటీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటలకు వరకు సమావేశం కొనసాగనుంది. ఏడు అంశాలతో ఎజెండాలు సిద్ధం అయ్యాయి. మూడేళ్ల ప్రణాళిక అమలుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు.

 

నీతి ఆయోగ్ కమిటీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటలకు వరకు సమావేశం కొనసాగనుంది. ఏడు అంశాలతో ఎజెండాలు సిద్ధం అయ్యాయి. మూడేళ్ల ప్రణాళిక అమలుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు.

 

గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపింది. 

09:43 - April 23, 2017
09:42 - April 23, 2017
09:40 - April 23, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ప్రాంతాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 270 స్థానాలకు గానూ 3 కార్పొరేషన్ల పరిధిలో కౌన్సిలర్ల స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం ఓటర్లు ఒక కోటీ 30 లక్షల మందికాగా..కొత్తగా లక్షా 10వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ 267 మందిని బరిలో ఉంచింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ తోపాటు బీఎస్పీ, జేడీయూ పార్టీలు బరిలో ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాబోతున్నాయని ఓటర్లు చెప్తున్నారు. మొత్తం 13 వేల 22 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 3 వేల సున్నిత కేంద్రాలు,  13 వేల కేంద్రాలను అతి సున్నిత కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల సంఘం తొలిసారి నోటా ప్రవేశపెట్టింది. ఎన్నికల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:28 - April 23, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగుతోంది. అన్నదాతల ఆందోళన 40 రోజులకు చేరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రోజుకో రీతిలో ప్రదర్శన నిర్వహిస్తున్న రైతులు నిన్న మూత్రం తాగి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించకపోతే తాము ఇవాళ మలం తిని నిరసన తెలుపుతామని రైతులు పేర్కొన్నారు. తమిళనాడులో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రుణమాఫీతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమిళనాడులో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రధాని మోది స్పందించడం లేదని నేషనల్‌ సౌత్‌ ఇండియన్‌ రివర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్ విమర్శించింది. మోదికి తాము మనుషులుగా కనపడడం లేదా అని ప్రశ్నించింది.

 

జంతర్ మంతర్ వద్ద తమిళ రైతుల ఆందోళన

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు తమిళనాడు సీఎం పళనిస్వామి సంఘీభావం తెలిపారు. 

09:20 - April 23, 2017

జగిత్యాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. బుగ్గారం మండలం బీరసాని గ్రామనికి చెందిన హరీష్, సాయి, మధుకర్, మహేష్ అనే నలుగురు యువకులు బైక్ పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ధర్మపురి మండలం రాయపట్నం బైక్ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెళ్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

కొనసాగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 3 కార్పొరేషన్ల పరిధిలో 272 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 1.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

08:54 - April 23, 2017

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి ది కన్‌క్లూజన్‌ సాంగ్‌ ప్రోమో రిలీజైంది. రాజమౌళి తన ట్విటర్‌ ద్వారా చిత్రంలోని సాహోరే బాహుబలి వీడియో సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. చిత్రంలో ఎలాంటి విజువల్స్‌ ఉండబోతున్నాయో.. రాజమౌళి ఊహా ప్రపంచం స్థాయి ఏంటో ప్రోమో చూస్తే తెలుస్తోంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 

08:53 - April 23, 2017

ఢిల్లీ : ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ జరిపారు. లంచం వ్యవహారం, మధ్యవర్తి సుకేశ్‌తో సంబంధాలు తదితర అంశాలపై దినకరన్‌ను పోలీసులు ప్రశ్నించారు.
క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు దినకరన్ హాజరు 
ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు హాజరయ్యారు. చాణక్యపురి ఇంటర్‌ స్టేట్‌ సెల్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండాకుల గుర్తు కోసం దినకరన్‌ మధ్యవర్తి సుఖేష్‌ చంద్రశేఖర్‌ ద్వారా ఈసీకి 50 కోట్లు లంచం ఇచ్చేందుకు  డీల్‌ కుదుర్చుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై  పోలీసులు ఆయనను ప్రశ్నించారు. దినకరన్‌ మధ్యవర్తితో కలిసి ఈసీ అధికారులను కలిశారా...లేదా అన్నదానిపై ఆరా తీసినట్లు అధికారవర్గాల సమాచారం. క్రైం బ్రాంచ్‌ పోలీసుల విచారణలో భాగంగా దినకరన్‌ తరపు లాయర్లకు అనుమతించలేదు. విచారణ సందర్భంగా దినకర్‌ ఫోన్‌ కాల్స్‌ను, వాట్సప్‌ మెసేజీలు, ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా అధికారులు పరిశీలించారు.
బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు సమన్లు 
ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు సమన్లు జారీ చేశారు. దినకరన్‌ దేశం విడిచి వెళ్లకుండా ముందస్తుగానే లుకౌట్‌ నోటీసు పంపారు. ఈ కేసులో దినకరన్‌ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్‌ చంద్రశేఖరన్‌ను ఇదివరకే ఢిల్లీ పోలీసులు ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి కోటి 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తనకు ఎన్నికల కమిషన్‌తో మంచి సంబంధాలున్నాయని, అన్నాడిఎంకే శశికళ వర్గానికి రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానని సుకేశ్‌- దినకరన్‌ను నమ్మించాడు. ఈ వ్యవహారం వెనక దినకరన్‌ ఉన్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. 

 

08:48 - April 23, 2017

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రులు యమపురికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. సర్కారీ దావాఖాలంటేనే జనం వణికిపోతున్నారు. ధర్మాసుపత్రిలో అడుగు పెడితే..ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయపడుతున్నారు. మొన్న నీలోఫర్‌లో ఐదుగురు బాలింతలు మరణిస్తే.. నిన్న కోటి ప్రసూతి ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు చనిపోయారు. ఇదేంటని రోగులు ప్రశ్నిస్తే..వారిపైనే దాడులు చేస్తున్నారు. దీంతో తమ ప్రాణాలకు ఎవరు బాధ్యులంటూ రోగుల నిలదీస్తున్నారు. 
అధర్మాసుపత్రులుగా ధర్మాసుపత్రులు... 
ధర్మాసుపత్రులు... అధర్మాసుపత్రులుగా మారుతున్నాయి. పేరులోనే ధర్మం ఉన్నా.. ఆచరణలో మాత్రం ధర్మం కాస్తా అధర్మంగా మారుతుంది. ఆసుపత్రిలో అడుగు పెట్టిన మరుక్షణం నుంచి మొదలవుతుంది అసలు ఆట. డెలివరీ కోసం నిండు గర్బిణీలు ప్రసూతి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు జలగల్లా పీల్చిపిప్పి చేసే ఆయాలు, ఆసుపత్రి సిబ్బంది చుట్టుముడతారు. పుట్టింది మగపిల్లాడైతే 1500 ఇస్తేనే బిడ్డను చూపిస్తామని పట్టుబడతారు ఆయాలు. డబ్బులివ్వలేదో ఇక అంతే సంగతి. పుట్టిన బిడ్డను కూడా తండ్రికి చూపించకుండా ప్రత్యక్ష నరకం చూపిస్తారు. ఇక ఆడపిల్ల పుడితే వెయ్యి రూపాయలు ముట్టచెప్పాల్సిందే. 
వైద్యానికి వస్తే ప్రాణాల్ని హరిస్తున్నారు
డెలివరీ తర్వాత స్ట్రెచర్‌ కావాలంటే పైసలు. బిడ్డకు స్నానం చేపించాలంటే పైసలు. ఇలా అడుగడుగునా ఆయాలు, ఆసుపత్రి సిబ్బంది చేతులు తడపాల్సిందే. కాదు కూడదంటే తిట్లపురాణం మొదలవుతుంది. ఇది కోఠీ ప్రసూతి ఆసుపత్రి తీరుపై రోగుల బంధవులు చెప్తున్న నిత్య సత్యాలు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ప్రభుత్వాసుపత్రులు తయారైయ్యాయని..వైద్యానికని వస్తే ప్రాణాల్నే హరించేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.  
కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు మృతి
రాష్ట్రంలోని పెద్దాసుపత్రులకు రాష్ట్ర నలుమూలల నుంచి పేద రోగులు వస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులంటేనే పేద ప్రజలు వణికిపోతున్నారు. గతంలో నీలోఫర్‌లో ఐదుగురు బాలింతలు వైద్యుల నిర్లక్ష్యంవల్లే మరణించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మొన్నీమధ్య గాంధీలో కూడా ఒక మహిళకు ఆపరేషన్ చేస్తుండగా అధిక రక్త స్రావం అయ్యి మరణించింది. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే నిన్న కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు ఆపరేషన్ చేస్తుండగా లో బీపీతో చనిపోయారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా..ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు మండిపడుతున్నారు. అయితే తమ వద్ద సరిపడా వైద్యులు లేకపోవడంతో తాము ఉస్మానియాకి పంపాల్సి వస్తుందని.. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆసుపత్రి ఆర్‌ఎంఓ చెబుతున్నారు. 
టెస్ట్‌లకు బయటకు పంపుతున్నారు..
అంతేకాదు ఇక్కడ స్కానింగ్ మిషన్స్ ఉన్నప్పటికీ బయటకు టెస్ట్‌లకు పంపుతున్నారని..వాటికే వేలరూపాయలు పెట్టాల్సి వస్తుందని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఫ్యాన్లు కూడా సరిగా లేవని..దీంతో పుట్టిన బిడ్డలు ఎండ వేడికి తల్లడిల్లిపోతున్నారని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదని రోగులు బంధువులు ప్రభుత్వాసుపత్రుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

ప్రారంభమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 3 కార్పొరేషన్ల పరిధిలో 272 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 1.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

 

ఐపీఎల్ 10 లో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ఐపీఎల్ 10 లో భాగంగా సాయంత్రం 4 గంటలకు రాజ్ కోట్ వేదికగా పంజాబ్...గుజరాత్ ఢీకొననున్నాయి. రాత్రి 8 గంటలకు కోల్ కతా వేదికగా బెంగళూరు, కోల్ కతా తలపడనున్నాయి. 

నేడు దినకరన్ ను మరోసారి ప్రశ్నించనున్న పోలీసులు

చెన్నై : ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో నేడు దినకరన్ ను మరోసారి ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు.

08:27 - April 23, 2017

గుంటూరు : ఏపీలో మెడికల్ సీట్ల భర్తీకి వైద్య విద్యాశాఖ నిబంధనలు కఠినతరం చేసింది. నిబంధనలు, రిజర్వేషన్ విధానాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసిఐ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కట్ ఆఫ్ తేదీలోగా పీజీ మెడికల్ అడ్మిషన్ల  భర్తీకి నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విలువైన వైద్య సీట్లు మిగిలిపోకుండా సద్వినియోగం చేసేందుకు ఏపీ మెడికల్ కళాశాలల ప్రవేశ నిబంధనలు 1997ను సవరించినట్లు స్పష్టం చేసింది. సవరించిన నిబంధనలను ఏప్రిల్ 26న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రకటించనుంది.
సీట్లు మిగిలిపోకుండా చర్యలు 
ఏపీలో వైద్య సీట్ల భర్తీకి పాటించాల్సిన నిబంధనలను కఠినతరం చేసింది రాష్ట్ర వైద్య విద్యాశాఖ. పీజీ మెడికల్ సీట్లు మిగిలిపోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐచ్చికాలు బ్లాక్ చేసుకోవడం వల్ల పీజీ సీట్లు భర్తీ కాకుండా వృధా అవుతున్న కారణంగా నిపుణులు, న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ రూపొందించిన కొత్త ప్రవేశ నిబంధనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
ఎంపిక చేసుకున్న కోర్సుల్లో తప్పనిసరిగా చేరాలి... 
కొత్త నిబంధనల ప్రకారం..తొలిదశ వెబ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థి ఎంపిక చేసుకున్న కోర్సుల్లో తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ విద్యార్థి తుదిదశ కౌన్సెలింగ్‌కు అనుమతించరు. కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు మార్చుకునే అవకాశం కల్పిస్తారు. తుదిదశ కౌన్సెలింగ్‌లో ఎంపిక చేసుకున్న సీటులో కచ్చితంగా చేరాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ విద్యార్థిని రాష్ట్రంలో మూడేళ్లపాటు డీబార్ చేస్తారు. ఒకవేళ కోర్సు చదవకుండా మానేస్తే మూడేళ్ల డీబార్‌తో పాటు  3 లక్షల వరకు జరిమానా విధిస్తారు. 
ఇన్ సర్వీసు కోటా సీట్లు నాన్‌ సర్వీస్‌ కోటాగా మార్పు 
ఇక ఇన్ సర్వీసు కోటా సీట్లు చివరి కౌన్సెలింగ్‌లో మిగిలిపోతే వాటిని నాన్ సర్వీసు కోటా కిందకు మార్చి భర్తీ చేస్తారు. భర్తీకాకుండా మిగిలిపోయే నాన్ సర్వీసు ఎస్సీ, ఎస్టీ, బీసీ సీట్లకు  కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. మహిళా కోటా సీట్లను ఆయా విభాగాల్లో జనరల్ కోటాగా మారుస్తారు. ఎస్సీ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఎస్టీ కోటాలోకి బదలాయిస్తారు. ఇదే తరహాలో ఎస్టీ సీట్లను ఎస్సీ సీట్లుగా మారుస్తారు. పూర్తి కాని సీట్లన్నింటినీ ఓసీ సీట్లుగా పరిగణిస్తారు. ఓసీ కేటగిరీలో సీటు పొందిన రిజర్వ్‌డ్ విద్యార్థి ఖాళీ చేస్తే ఆ సీటును అదే కేటగిరీలోనే భర్తీ చేస్తారు. ఇక ఓసీ కోటాలో భర్తీ కాని సీట్లను ఓసీ అన్ రిజర్వ్ డ్ సీట్లుగా మారుస్తారు. వీటి భర్తీకి స్థానికతతో సంబంధం లేకుండా అందరినీ పరిగణనలోకి తీసుకుంటారు. 
కళాశాల నోటీస్ బోర్డులో, వెబ్ సైట్ లో మెరిట్ లిస్టు 
మరోవైపు ప్రైవేట్ మెడికల్, డెంటల్ అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ కాలేజీలు నీట్ ప్రకారం మెరిట్ లిస్ట్ లోని విద్యార్థుల పేర్లను కళాశాల నోటీస్ బోర్డులోనూ, వెబ్ సైట్ లోనూ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబితా అనుమతి కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్‌లోని అభ్యర్థులకే ఈ కాలేజీలు పీజీ మెడికల్,  డెంటల్ సీట్లు కేటాయించాలి. ఇందుకోసం వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వేర్వేరుగా మూడు జీవోలు జారీ చేశారు. 

 

08:11 - April 23, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. భూములకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మెట్ట భూములు ఒక్కో ఎకరానికి 16 లక్షలుగా నిర్ణయించింది. అయితే.. భూసేకరణ పరిహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ పరిహారం తీసుకునేందుకు తాము సిద్దంగా లేమిని.. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు రైతులు. 
3,549 ఎకరాల భూసేకరణకు ప్రకటనలు జారీ 
రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతుల నుండి సేకరణ ద్వారా భూములు తీసుకునేందుకు నోటిఫికేషన్లు ఇచ్చిన గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రకటించింది. రాజధానిలో మొత్తం 24 రెవెన్యూ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో 3,549 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ ప్రకటనలు జారీ చేసింది. దీనిలో అత్యధికంగా తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి, మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు, నవులూరు గ్రామాల పరిధిలో ఉన్నాయి. త్వరలోనే మిగతా ఆరు గ్రామాలకు కూడా నోటిఫికేషన్లు జారీ చేసి జూన్‌, జులై నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్‌ భావిస్తోంది. 
మొదటగా నేలపాడుకు నోటిఫికేషన్‌ జారీ 
ఇక 18 రెవెన్యూ గ్రామాల్లో గతేడాది మొదటగా నేలపాడు గ్రామానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తాజాగా నేలపాడులో 4.33 ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో ఎకరాకు 16.03 లక్షల చొప్పున పరిహారం అందజేయనుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి విలువ కోటిన్నరకు పైగా ఉంటే.. ప్రభుత్వం 16 లక్షలు ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే 16 లక్షల కోసం తాము ఎదురుచూడటం లేదని.. అసలు తమ భూములకు చట్టబద్దత, భరోసా లేకపోతే ఎలా ఇస్తామంటున్నారు. ఒకవేళ భూసేకరణ చేసి పరిహారం తీసుకోమంటే.. ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. 
భూసేకరణతో రైతులకు మరో సమస్య
మరోవైపు భూసేకరణ కారణంగా రైతులను మరో ఇబ్బంది వెంటాడుతోంది. ఇప్పటివరకు జరీబు, మెట్ట భూములను సరైన రీతిలో విడదీయలేదని రైతులంటున్నారు. కృష్ణానదిని ఆనుకుని ఉన్న రాయపూడి, బోరుపాలెంలోని నిమ్మ తోటలను ఇంకా మెట్ట పంటలుగానే రికార్డుల్లో రాస్తున్నారంటున్నారు. కొంతమంది కావాలనే రాజకీయం చేస్తూ జరీబు, మెట్ట భూములను తారుమారు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ జరీబు భూములను ఆ విధంగా ప్రకటించకుండా భూసేకరణ చేస్తామంటే అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.  మొత్తానికి మరోసారి భూసేకరణ అంశంతో రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తోంది. 

 

07:30 - April 23, 2017

హైదరాబాద్ : గులాబీ దళపతి కార్యకర్తలకు ధీమా కల్పించేందుకు యత్నిస్తున్నారు. పార్టీపై కార్యకర్తలకు ఉన్న అసంతృప్తిని రూపుమాపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో కార్యకర్తలకు పదవులు, పనులు అప్పగిస్తామని కేసీఆర్‌ ప్రకటించడం దీనికి సంకేతామని నేతలు భావిస్తున్నారు. ఇదే నిజమైతే వరంగల్‌ సభ అనంతరం ఈ ప్రక్రియ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
సొంత పార్టీపై కార్యకర్తలు అసంతృప్తి
తెలంగాణా ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులు సొంత పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు తమ చేతలతో నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. ఉద్యమం నాటి నుంచి  కెసిఆర్‌ను నమ్ముకుని పార్టీలో  చురుగ్గా వ్యవహరించిన ఉద్యమకారులు ప్లీనరీలో  సైలెంట్‌గా ఉన్నారు. కేసీఆర్‌ ప్రసంగిస్తే తమ ఉత్సాహాన్ని ప్రదర్శించే గులాబి దళాలు.. ప్రస్తుతం ఏ మాత్రం స్పందించలేదు.  
కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు 
కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో కేసీఆర్‌ ఓ అడుగు దిగినట్లు కనిపిస్తోంది. పాలనలో ఇప్పటివరకు కడుపు, నోరు కట్టుకుని పని చేశామని, భవిష్యత్‌లో కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటివరకు  ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ చేయలేదు. అదేవిధంగా నామినేషన్ పద్ధతిలో పనులు దక్కడం లేదన్న అంసతృప్తి కార్యకర్తల్లో ఉంది. అయితే వచ్చే రెండేళ్లలో పదవులు, పనులకు ఢోకా ఉండదన్న ధీమాను కార్యకర్తల్లో కల్పించే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. పార్టీని బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో.. వరంగల్‌ సభ అనంతరం పదవులు, పనులు దక్కుతాయనే నమ్మకంతో కార్యకర్తలున్నారు. 

 

07:23 - April 23, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమకారులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీక్షాస్థలం పరిసరాల్లో కరెంట్‌ నిలిపివేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం సహా మరో 16 మందిని అరెస్ట్ చేశారు.  
తుందుర్రులో పోలీసుల కాఠిన్యం 
తుందుర్రులో ప్రభుత్వం బరితెగించింది. పోలీసులను ఉసిగొల్పి పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై ఉక్కుపాదం మోపింది. కరెంటు తీసి దీక్షభగ్నం చేసిన  వందలాది పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంతో సహా సుమారు 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీక్ష కొనసాగిస్తున్న వారి పట్ల విచక్షణారహితంగా వ్యవహరించి, బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. దీంతో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. తుందుర్రులో అరెస్టు చేసి మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన తరువాత.. రెండు వాహనాల్లో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈడ్చుకుంటూ వాహనంలో ఎత్తిపడేశారు
పోరాట కమిటీ నాయకుడు ఆరేటి వాసు దీక్షా శిబిరం పక్కనే ఉన్న ఓ దేవాలయంలోకి వెళ్లగా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి వాహనంలో ఎత్తిపడేశారు. అక్కడి నుంచి మొగల్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీక్షా శిబిరం వద్ద సామగ్రిని, బ్యానర్లను పోలీసులు చెల్లాచెదురు చేశారు. వాటిని మొగల్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన పోరాట కమిటీ కన్వీనర్‌ ఆరేటి వాసు, నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులును మరో వాహనంలో రహస్యంగా వేరే ప్రాంతానికి తరలించారు. వారి ఆచూకీ తెలియక మిగిలిన వారంతా తీవ్ర ఆందోళన చెందారు. 
వాసు, త్రిమూర్తులు రహస్య ప్రాంతానికి తరలింపు
నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చిన 14 మందికీ వైద్యులు పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నించగా ఆందోళనకారులు నిరాకరించారు. ఆసుపత్రిలోనే నిరసన కొనసాగించారు. ఆరేటి వాసు, త్రిమూర్తులు వచ్చాకా వైద్య పరీక్షలకు సహకరించే అంశాన్ని పరిశీలిస్తామని నిరసన కారులు తేల్చిచెప్పారు. దీంతో ఆసుపత్రి వద్ద రాత్రంతా ఉద్రిక్తత నెలకొంది. 

 

07:16 - April 23, 2017

ఢిల్లీ : 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికకు నీతి అయోగ్‌ నాంది పలకబోతుంది. ఏడేళ్లకు వ్యూహాన్ని, మూడేళ్లకు కార్యాచరణను రూపొందించనుంది. ఇందుకోసం ఈరోజు ఢిల్లీలో నీతి అయోగ్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అన్ని రాష్ట్రాల్లో సుపరిపాలన కోసం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించనున్నారు. 
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం 
ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతిఅయోగ్‌ పాలక మండలి సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, నీతిఅయోగ్‌ ఉపాధ్యక్షుడు, సభ్యులు పాల్గొననున్నారు. 
మూడు ప్రణాళికలపై చర్చ
నీతి అయోగ్‌ పాలకమండలి సమావేశంలో మూడు ప్రణాళికలపై చర్చ జరగనుంది. మొదటి మూడేళ్ల చర్యల ప్రణాళిక, ఏడేళ్ల వ్యూహాత్మక ప్రణాళికపత్రం, పదిహేనేళ్ల దార్మనిక పత్రం చర్చకు రాబోతున్నాయి. పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత రెండేళ్లలో నీతి అయోగ్‌ చేపట్టిన చర్యలను నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా వివరిస్తారు. ఇక వచ్చే ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు కార్యాచరణ ప్రణాళికను మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌  సమర్పిస్తారు. 
ఉత్తమ పద్ధతులు తెలుసుకుంటాం : మోదీ 
ఇక ఈరోజు జరిగే సమావేశంలో సుపరిపాలనపై వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటామని మోదీ తెలిపారు. ఈ సమావేశంలో జీఎస్టీపై కూడా చర్చిస్తామని మోదీ ట్వీట్‌ చేశారు. ఇక వివిధ కీలకాంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

 

నేడు పలు జిల్లాల్లో మంత్రి హరీశ్ రావు పర్యటన

రంగారెడ్డి : నేడు రంగారెడ్డి, మేడ్చల్...మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

నేటి నుంచి రైతు సంఘం రాష్ట్ర తొలి మహాసభ

జణగామ : నేటి నుంచి రైతు సంఘం రాష్ట్ర తొలి మహాసభ జరుగనుంది. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు మహాసభ కొనసాగనుంది. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా హాజరుకానున్నారు. ప్రధాన వక్తలుగా జస్టిస్ చంద్రకుమార్ (రిటైర్డ్ ) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పాల్గొననున్నారు. 

నేడు నీతి ఆయోగ్ సమావేశం

ఢిల్లీ : నేడు నీతి ఆయోగ్ సమావేశం జరుగనుంది.  ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు సమావేశం కొనసాగనుంది. ఏడు అంశాలతో ఎజెండాలు సిద్ధం అయ్యాయి. మూడేళ్ల ప్రణాళిక అమలుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకానున్నారు. 

Don't Miss