Activities calendar

24 April 2017

పీజీటీ, టీబీటీ, పీడీ పరీక్షల తేదీల్లో మార్పులు

హైదరాబాద్ : తెలంగాణలో పీజీటీ, టీబీటీ, పీడీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టాప్ సెలక్షన్ కమిషన్ పరీక్ష ఉన్నందున 28వ తేదీ నుండి మే 31కి టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది.

21:31 - April 24, 2017

ఢిల్లీ : పార్టీ సింబల్‌ రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు వరుసగా మూడోరోజు కూడా ప్రశ్నిస్తున్నారు. చాణక్యపురి ఇంటర్‌ స్టేట్‌ సెల్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. పార్టీ సింబల్‌ కోసం దినకరన్‌ మధ్యవర్తి సుఖేష్‌ చంద్రశేఖర్‌ ద్వారా ఈసీ అధికారికి 50 కోట్లు లంచం ఇచ్చేందుకు డీల్‌ కుదుర్చుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఆయనను విచారణ జరుపుతున్నారు. ఇవాళ దినకరన్‌-సుఖేష్‌ను ముఖా ముఖిగా ప్రశ్నించే అవకాశం ఉంది. రెండు రోజుల విచారణలో దినకరన్‌ నుంచి పోలీసులు పలు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో దినకరన్‌ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్‌ చంద్రశేఖరన్‌ను ఇదివరకే ఢిల్లీ పోలీసులు ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి కోటి 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

21:28 - April 24, 2017

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడలేదు. పుల్వామాలో భద్రతాదళాలు, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా వారం రోజుల తర్వాత విద్యాసంస్థలు తెరచుకున్నాయి. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. శ్రీనగర్‌లోని ఎస్పీ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన భద్రతా దళాలపై విద్యార్థులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆజాదీ నినాదాలు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఫొటో జర్నలిస్టులు గాయపడ్డారు. అంతకు ముందు జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ప్రధానమంత్రి నరేంద్రమోది, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. కశ్మీర్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు. వేర్పాటువాద గ్రూపులతో చర్చలు జరపాలని ముఫ్తీ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే రెండు మూడు నెలల్లో కశ్మీర్‌ పరిస్థితిలో మార్పు వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

పిడిపి అధ్యక్షుడు హతం..
జమ్ముకశ్మీర్‌ సిఎం మెహబూబా ముఫ్తి ఢిల్లీ పర్యటనలో ఉండగానే పుల్వామా జిల్లా పిడిపి అధ్యక్షుడు అబ్దుల్‌ గనిదార్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లను పోలీసులు వివరించారు. ఆందోళనకారులు వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగించుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడానికి సుమారు 300 వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో వాట్సాప్‌ గ్రూపులో 250 మంది ఉన్నారు. 3 వందల వాట్సాప్‌ గ్రూపుల్లో 90 శాతం మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.

సుకుమా..ఎన్ కౌంటర్ మృతుల వివరాలు..

ఛత్తీస్ గడ్ : సుకుమా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 26 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. రఘువీర్ సింగ్, కేకే దాస్, సంజయ్ కుమార్, రామేశ్వర్ లాల్, నరేష్ కుమార్, సురేందర్ కుమార్, బన్నా రామ్, ఎల్పీ సింగ్, నరేష్ యాదవ్, పద్మనాభవన్, సౌరభ్ కుమార్, అభయ్ మిశ్రా, బన్మలిరామ్, ఎస్ పీ సోంకర్, కేకే పాండే, వినయ్ చంద్ర బర్మన్, పి. అలగు పిండి, అభయ్ కుమార్, ఎస్.సెంథిల్ కుమార్, ఎస్.తిరుమురుగన్, రంజిత్ కుమార్, ఆశీష్ సింగ్, మనోజ్ కుమార్, అనుప్ కర్మాకర్, రామ్ మెహర్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు.

సుకుమా ఎన్ కౌంటర్ లో సీఐ..ఎస్ఐల..ఏఎస్ఐలు..

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో సీఐ, ఎస్ఐ, ముగ్గురు ఏఎస్ఐలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 14 మంది కానిస్టేబుళ్లున్నారు.

21:25 - April 24, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా కె.విశ్వనాథ్‌ పాల్కే పురస్కారాన్ని అందుకోనున్నారు. స్వాతికిరణం, సాగర సంగమం, శృతిలయలు, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, ఓ సీతకథ, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, ఆపద్భాందవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో అద్భుత సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం రావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు సినీ రంగ ప్రముఖులు. దాదాసాహెబ్‌ అవార్డు రావడంపై కళాతపస్వి కె.విశ్వనాధ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటి దర్శకుల్లోకూడా చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని చెప్పారు.. అవకాశం ఇస్తే అద్భుతమైన సినిమాలు తీస్తారని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. దాదాసాహెబ్‌ అవార్డుకు ఎంపికైన విశ్వనాథ్‌కు పలువురు కంగ్రాట్స్ చెప్పారు. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు దక్కిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.

21:22 - April 24, 2017

హన్మకొండ : అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణా కేంద్రంలో అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఆలస్యంగా వచ్చారంటూ వాజేడి అంగన్‌వాడీ కార్యకర్తలను అధికారులు శిక్షణకు అనుమతించలేదు. దీంతో శిక్షణా కేంద్రం ముందు 40 మంది కార్యకర్తలు ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు. వీరిలో కొందరు గర్భిణీ స్త్రీలు కావడం, మరి కొందరికి చిన్న పిల్లలు ఉండటంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. అంగన్ వాడీలు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం వివాదాస్పదమైంది.

21:20 - April 24, 2017

గుంటూరు : ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికోసం నిధులు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కార్యక్రమానికి పురంధేశ్వరి హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ద్వారా డబ్బు ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

21:18 - April 24, 2017

విజయవాడ : టీడీపీ మహానాడుకు వేదిక ఖరారయ్యింది. మే 27, 28, 29 తేదీల్లో మహానాడును విశాఖలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులతో కూడిన 20 వేల మందికి పైగా పాల్గొంటారని, అందరికీ వసతి, భోజన ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేసింది.

21:17 - April 24, 2017

హైదరాబాద్ : ఢిల్లీలో కేసీఆర్‌ బిజీ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన కేసీఆర్‌ ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమస్యలను వివరించారు. వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని.. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు నష్టం కలగకుండా చూడాలని ప్రధానిని కోరారు. అలాగే.. హైకోర్టు విభజన, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు, రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యి హైకోర్టు విభజన, 2013 భూసేకరణ చట్టం అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చినట్లే వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.

గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు..
జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని ప్రధానిని కోరారు. అలాగే గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచామన్నారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశామని.. దానికి కేంద్ర ఆమోదం కావాలని కోరారు. అలాగే రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థల్లో, నియామకాల్లో ఎవరికెంత రిజర్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు. ఎస్సీ వర్గీకరణలో న్యాయం ఉందన్న కేసీఆర్‌.. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనట్లు తెలంగాణలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన 1400 కోట్ల కాంపా నిధులను విడుదల చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే.. సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విన్నవించారు. కేసీఆర్‌ లేవనెత్తిన పలు అంశాలకు ప్రధాని సానుకూలంగా స్పందించారు.

మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ..
ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్‌ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని రవిశంకర్ ప్రసాద్‌ను కేసీఆర్ కోరారు. ఈ చట్టం వల్ల భూ నిర్వాసితులకు తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగవంతమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. దీనికి రవిశంకర్‌ప్రసాద్‌ సానుకూలంగా స్పందించారని టీఆర్ఎస్‌ నాయకులు తెలిపారు. అలాగే ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలన్న వినతికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిని కేంద్రం ఎంతవరకు అమలు చేస్తుందో చూడాలి.

21:14 - April 24, 2017

ఛత్తీస్‌గఢ్‌ : మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులకూ, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 35 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఒకరు కాదు...ఇద్దరు కాదు...3 వందల మంది మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. జవాన్ల ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుబూతి ప్రకటించారు. సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా సాగిన ఎన్‌కౌంటర్‌లో 35 మంది జవాన్లు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం హెలిక్యాప్టర్‌లో జగదల్‌పూర్‌, రాయపూర్‌ ఆసుపత్రులకు తరలించారు.

74వ బెటాలియన్‌..
74వ బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చింతగుఫాలో రోడ్డు నిర్మాణపు పనుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ బస్తర్‌లోని బుర్కాపాల్ గ్రామ సమీపంలో ఒంటిగంట సమయంలో గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై 3 వందల మంది మావోయిస్టులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. దాడి జరిగిన విషయం తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోయిస్టుల దాడి ఘటనతో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఖండించారు. తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన రాయపూర్‌కు చేరుకుని అత్యవసర సమావేశం నిర్వహించారు. దక్షిణ బస్తర్‌కు చెందిన సుక్మా జిల్లా మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం. ఇక్కడే మార్చి 11న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. 2013 తర్వాత ఇదే అతిపెద్ద దాడి.

20:52 - April 24, 2017

కళాతపస్వి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం దర్శకశిరోమణికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ప్రజల రివార్డులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవార్డులు ఎన్నింటినో పొందిన కాశీనాథుని విశ్వనాథ్‌.. సినీరంగ పితామహుడిగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే పేరిట నెలకొల్పిన పురస్కారాన్నీ అందుకోనుండడం.. కళామతల్లిని గౌరవించుకోవడమే. సనాతన సంస్కృతి, కళా సంపదల వారసత్వానికి, చలనచిత్ర మాధ్యమం ద్వారా శాశ్వత అస్థిత్వాన్ని కల్పించి ధన్యులయ్యారు కాశీనాథుని విశ్వనాథ్‌.. అదే కె.విశ్వనాథ్‌. 1930లో గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో జన్మించిన విశ్వనాథ్‌... సినిమాలపై ఆసక్తితో చెన్నై చేరుకున్నారు. టెక్నీషియన్‌గా, సహాయదర్శకుడిగా కొన్నాళ్లు పనిచేశాక, ఆత్మగౌరవం సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. తొలి చిత్రం నుంచే తనలోని కళాపిపాసను.. కమర్షియల్‌ సినిమాతో మిళితం చేసి విమర్శకుల ప్రశంసలను పొందారు. ఆ తర్వాత ఆయన రూపొందించిన ఓసీత కథ, సీతామాలక్ష్మి,శారద, చెల్లెలి కాపురం లాంటి సినిమాలు.. సినీజగత్తును విశ్వనాథుని శకం వైపు మళ్లేలా చేశాయి.

సంగీత, సాహిత్యాలకు పెద్దపీఠ..
కె.విశ్వనాథ్‌ సినిమాల్లో సంగీత, సాహిత్యాలు ఢీ అంటే ఢీ అంటాయి. పండితులనే కాదు.. పామరులనూ ఓలలాడిస్తాయి. అయితే, తనకు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానమే లేదని విశ్వనాథ్‌ చాలాసార్లు చెప్పుకున్నారు. కానీ, ఆయన సినిమాల్లో సాహిత్యంతో పోటీపడే సంగీతాన్ని ఆస్వాదించిన వారు.. విశ్వనాథ్‌కు స్వర పరిజ్ఞానం లేదంటే నమ్మేవారే కాదు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని శంకరాభరణం ద్వారా ప్రవచించిన విశ్వనాథ్‌.. ఆ సినిమా ద్వారానే, పాశ్చాత్య సంగీతపు పెడదారుల్లో సాగుతున్న యువతను మేలుకొలిపి, శాస్త్రీయ సంగీతపు బాట పట్టించేందుకు... ఓ చిరు ప్రయత్నాన్ని, సుతిమెత్తగా, ఓ చురకగా తగిలించారు. సంగీత, సాహిత్యాలకు పెద్దపీఠ వేసే విశ్వనాథ్‌, సంగీత, సాహిత్యాలకు పట్టిన మకిలిని వదిలించేందుకు ఎప్పుడూ కృషి చేసేవారు. సాగర సంగమం చిత్రంలో.. విపరీత పోకడలు పోతోన్న తెలుగు సినిమా సంగీతం గురించి ఓ పాట ద్వారా చక్కగా సెటైర్లు విసిరారు. అంతటితో ఆగకుండా అదే సినిమాలోనే అద్భుతమైన సంగీత, సాహిత్యపు విలువలతో.. సినిమా సంగీతపు ఝరి ఎంత మహోధృతమైనదో వివరించారు విశ్వనాథ్‌. విశ్వనాథుని నాయికా నాయకులు ఎప్పుడూ మహోన్నతులే. స్వాతికిరణంలో మూర్తీభవించిన విద్వాంసుడు, శంకరాభరణంలో ఛాందసంగా అనిపించినా మానవీయ విలువల్ని గుర్తించి ఆచరించిన శాస్త్రి, శుభలేఖలో ఒక అపవాదుకు చలించి కూతుర్ని ఇంటి నుంచి పంపేసిన తండ్రి, శుభసంకల్పం సినిమాలో యజమాని ఆశయాలను తన స్థాయికి మించి నిర్వర్తించిన జాలరివాడు.. ఇలా మానవ స్వభావాన్ని తన హీరో ద్వారా ఎన్ని కోణాల్లో ఆవిష్కరించ వచ్చో అత్యద్భుతంగా ఆచరించి చూపారు విశ్వనాథ్‌.

హస్యం..
కె.విశ్వనాథ్‌ సినిమాలో హాస్యానికి ఎప్పుడూ పెద్దపీటే. సినిమా ఇతివృత్తానికి ఏమాత్రం దూరం జరకుండా, కథలో ఇమిడిపోయేలా, హాస్యరసాన్ని అద్భుతంగా చొప్పించడంలో విశ్వనాథ్‌ దిట్ట. దానికి స్వర్ణకమలం లాంటి సినిమాల్లోని హాస్యరస సన్నివేశాలు చక్కటి తార్కాణమని చెప్పాలి. సనాతన సంస్కృతి, కళా సంపదల వారసత్వానికి, చలనచిత్ర మాధ్యమం ద్వారా శాశ్వత అస్థిత్వాన్ని కల్పించి ధన్యులయ్యారు కాశీనాథుని విశ్వనాథ్‌.. కళాతపస్విగా చిరపరిచితమైన కాశీనాధుని విశ్వనాధ్ ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారు. చలన చిత్ర చరిత్రలో.. అగ్రనటులందరూ విశ్వనాథ్‌ సినిమాలో నటించడాన్ని ఓ గౌరవంగా.. తాము డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్నట్లుగా భావించేవారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున తదితరులెందరో విశ్వనాథ్‌ దర్శకత్వంలో నటించారు. ఆ దర్శక దిగ్గజం వద్ద నటనలో మెలకువలెన్నో నేర్చుకున్నారు. అనంతర నటజీవితంలో సమున్నత శిఖరాలకు ఎదిగారు.

40 సినిమాలకు దర్శకత్వం..
విశ్వనాథ్‌ దాదాపుగా 40 సినిమాల వరకూ దర్శకత్వం వహించారు. అటూ ఇటుగా ఓ 20 సినిమాల్లో నటించారు. ఇటీవలి కాలంలో దర్శకత్వానికి పూర్తిగా దూరమైన విశ్వనాథ్‌.. అడపాదడపా నటిస్తూ తనలోని కళాపిపాసిని సంతృప్తి పరచుకుంటున్నారు. ఆయన సినిమాలకు జాతీయ, ప్రాంతీయ పురస్కారాలు ఎన్నో వచ్చాయి. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్నీ విశ్వనాథ్‌ పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ తో గౌరవించింది. ఇప్పుడు తాజాగా, దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో.. విశ్వనాథుని కీర్తికిరీటం మరింత శోభాయమానమైంది. విశ్వనాథుని ప్రతి చిత్రం ఓ అద్భుతం. వాటిల్లోని ప్రతి దృశ్యం మనోహరం. ఆయన సినిమాలన్నింటినీ ప్రస్తావించాలంటే, ఎన్ని గంటలైనా చాలదు. దాదా సాహెబ్‌ పురస్కారం విశ్వనాథ్‌ను వరించి వచ్చిన సందర్భంగా.. విశ్వనాథునికి టెన్ టివి అభినందనలు తెలియ చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:41 - April 24, 2017

భిన్న సంస్కృతులు, భాషలున్న దేశంలో ఒకే భాషకు పట్టంకట్టడం సాధ్యమా? కేంద్రం ఆ ప్రయత్నాల్లో ఉందా? హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారా?

మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ సంకేతాలిస్తున్నాయి? అనుసంధాన భాషగా ఎదగాల్సిన హిందీ పట్ల సర్కారు అత్యుత్సాహం వ్యతిరేకతను పెంచుతోందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం.. భాష ఒక గుండె చప్పుడుని మరో గుండెకు అర్ధమయ్యేలా శబ్దమై పలుకుతుంది.. అంతిమంగా మనిషికి మనిషికి మధ్య అనుసంధానకర్తగా మారుతుంది. అది తెలుగు తమిళ్ మలయాళం, హిందీ, ఇంగ్లీషు... భాష ఏదైనా ప్రయోజనం సమాచార ప్రసారమే. మాతృభాష , మార్కెట్ భాష అంటూ రెండు భాషలు కాకుండా మిగిలిన ఏ భాషైనా ప్రజలకు సమాన దూరమే.. ఈ అంశాన్ని కేంద్రం మరచిపోతోందా? హిందీ గో బ్యాక్ అంటున్నాడు.. పవన్ కల్యాణ్..హిందీని రుద్దితే సమించమంటున్నారు సౌతిండియన్లు...హిందీ కంపల్సరీ చేస్తామంటోంది కేంద్రం...

మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చాయి..?
ఈ భాషా విభేదాలు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చాయి..? ఒకప్పటి గందరగోళం మళ్లీ మొదలవుతుందా? భిన్న సంస్కృతులు, భాషలు ఉన్న దేశం భారత్. ఇలాంటి చోట.. మాతృభాష కాకుంగా ఏ ఇతరభాషనైనా సహృదయతతో ఆదరించాలంటే.. సామరస్యంగా పరిచయం చేయాలి తప్ప... రుద్దటం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. హిందీ వస్తే.. దేశంలో మెజారిటీ జనాభాతో కలిసిమెసలే అవకాశం పెరుగుతుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. భాష ప్రాధాన్యం గురించి కొత్తగా చెప్పుకునేదేం లేదు. కానీ, మాతృభాష, మార్కెట్ భాషగా రెండు స్థానాలు నిర్దారణ అయిన తర్వాత.. మరో కొత్త భాష అనేది వ్యక్తుల ఛాయిస్ గా ఉండాలి తప్ప సర్కారీ రుద్దుడు సరికాదనే వాదనలున్నాయి. అదే సమయంలో సామరస్యంగా పరిచయం చేస్తే అనుసంధాన భాషగా హిందీ ఎదిగే అవకాశం ఉంది.. లేదంటే అరవైల నాటి పోరాటాలు మళ్లీ పరిస్థితిని గందరగోళ పరిచే అవకాశాలున్నాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:35 - April 24, 2017

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల హీట్ నెలకొంది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వాహణపై విస్తృత చర్చ జరుగుతోంది. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రముఖంగా ప్రధాని ప్రస్తావించారు. ఒకేసారి ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు చర్చ జరపాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీనితో ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంకేతాలు వదులుతున్నారు. ముందస్తుకు తమ సైన్యం సిద్ధమంటూ పవన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అల్జాపూర్ శ్రీనివాస్ (బీజేపీ), దుర్గాప్రసాద్ (టిడిపి), రమేష్ (వైసీపీ), తాడూరి శ్రీనివాస్ (ఎంబీసీ ఛైర్మన్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

ఎన్ కౌంటర్ పఐ స్పందించిన రాజ్ నాథ్ సింగ్..

ఢిల్లీ : సుకుమా జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. మావోయిస్టులు జరిపిన దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాను మాట్లాడుతానని పేర్కొన్నారు.

జవాన్ల దాడిని ఖండించిన రాష్ట్రపతి..

ఢిల్లీ : సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. మావోయిస్టులు జరిపిన దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సుకుమాలో జవాన్ల మృతిపై సంతాపాలు..

ఢిల్లీ : సుకుమా జిల్లాలో మావోయిస్టులు జరిపిన ఎన్ కౌంటర్ లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంపై నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దాడిని ఖండించారు. ఈ ఘటనపై దృష్టి సారించినట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. దాడిని తీవ్రంగా ఖండించారు.

19:12 - April 24, 2017

ఛత్తీస్ గడ్ : సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం కాల్పులతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు..సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరగడంతో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా సుకుమా జిల్లాలోని డోర్నపాలెం, బూర్గపాలెంలో ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. కాంట్రాక్టర్..ఇతరులకు బెదిరింపులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం 74వ బెటాలియన్ కు చెందని సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు రెప్పపాటులో దాడులకు తెగబడ్డారు. సుమారు 300 మంది మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో 24 మంది జవాన్లు మృతి చెందగా 7గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు జవాన్ల ఆచూకి తెలియడం లేదని తెలుస్తోంది. పోలీసుల వద్దనున్న భారీగా ఆయుధాలను మావోయిస్టులు అపహరించినట్లు సమాచారం. క్షతగాత్రులను రాయ్ గఢ్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. సమాచారం అందుకున్న డీఐజీ, ఐజీలు రాయ్ గఢ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో హై అలర్ట్ ప్రకటించారు. దాడుల వెనుక మావోయిస్టులు ఎంత మంది ఉన్నారనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన ముగిసింది. కాసేపటి క్రితం హైదరాబాద్ కు బయలుదేరారు. ప్రధాన మంత్రి, పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు.

 

అంగన్ వాడీ కార్యకర్తలపై చర్యలు..

వరంగల్ : హన్మకొండ విద్యానగర్ లో అంగన్ వాడీ కార్యకర్తల శిక్షణా కేంద్రంలో వాజేడు అంగన్ వాడీ కార్యకర్తలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలస్యంగా వచ్చారంటూ అనుమతించలేదు. ఉదయం నుండి శిక్షణా కేంద్రం ముందు 40 మంది పడిగాపులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

పెరుగుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ల మృతులు..

చత్తీస్ గఢ్ : మావోయిస్టు ఘాతుక చర్యకు పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. మృతి చెందిన వారి సంఖ్య 24కి చేరుకుంది. సుమారు 300 మంది మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. సుకుమా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

18:54 - April 24, 2017

కాకినాడ : ఇళ్లు ఇస్తామని ఆశ చూపించారు. లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. భవనాలు సిద్ధమయ్యాయి. కానీ వాటిని కేటాయించడానికి మాత్రం డబ్బులు కట్టించుకున్నవాళ్లు రెడీగా లేరు. ఎప్పటికప్పుడు ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం అంటూ వాళ్ల కలలను కల్లలు చేస్తున్నారు. కాకినాడ నగరంలో ఐహెచ్‌ఎస్‌ఎల్‌ స్కీమ్‌ లబ్ధిదారుల గోడుపై ప్రత్యేక కథనం. కాకినాడ 15వ డివిజన్ ఏటిమొగలో నిరుపేదల కోసం కేంద్రం కేటాయించిన హౌసింగ్‌ స్కీమ్‌లో.. అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరిగింది. మంజూరు చేయడానికి రంగులు కూడా వేసి సిద్ధం చేశారు. కానీ పంపిణీ మాత్రం చేయడం లేదు.

అదనంగా డబ్బుల వసూలు..
ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఇప్పటికే అదనంగా డబ్బులు వసూలు చేశారని కొందరు చెబుతున్నారు. మళ్లీ డబ్బులు వసూలు చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో  లబ్ధిదారుల్లో ఆందోళన రేగుతోంది. దీనంతటికీ కారణం నగర ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ అనే ఆరోపణలున్నాయి. ఆయన మనుషులే ఇళ్ల పేరుతో భారీ దందాలకు సిద్ధపడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కేటాయించకపోవడంతో ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు ఇవి వేదికలవుతున్నాయి. తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలన్నీ ఆయన అన్న సత్యనారాయణ చూస్తుంటారు. ఇక్కడ ఏటిమొగ ఇళ్ల కేటాయింపులో కూడా ఆయన మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చాలా కాలంగా ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న బాధితులు చివరకు ఐహెచ్ఎస్‌ఎల్‌ నిర్మాణాల వద్ద ఆందోళనకు దిగుతారు. తమకు ఈ నెలాఖరులో ఇళ్లు కేటాయించకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగుతామంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే సోదరుడి నిర్వాహకం మరోసారి వివాదాస్పదమవుతున్నట్టు కనిపిస్తోంది.

18:33 - April 24, 2017
18:31 - April 24, 2017

విజయవాడ : అగ్రిగోల్డ్‌ ఆస్తులపై మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ నేతల కన్ను పడిందని అందుకే సమస్యను పరిష్కరించడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. అగ్రిగోల్డ్‌లో 32లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాయని.. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వారికి ఇచ్చే మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నాయని.. వాటిని అమ్మితే సమస్య త్వరగా పరిష్కారమవుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అంబటి డిమాండ్‌ చేశారు.

18:30 - April 24, 2017

అనంతపురం : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి ఆరవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సత్యసాయి మహాసమాధి వద్ద ట్రస్ట్‌ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానంతో పాటు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులతో పాటు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. వచ్చే గురుపౌర్ణమికి అన్నపూర్ణ నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభిస్తామని, బాబాకు సంబంధించిన వస్తువులు భద్రపరిచేందుకు భవనాన్ని నిర్మిస్తామన్నారు.

18:28 - April 24, 2017

విజయవాడ : ఏపీలో రైతుల పండించిన పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. పంటల గిట్టుబాటు ధరలు, కరవు సహాయక చర్యలు, ప్రభుత్వ విధానాలపై విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మిర్చి, పసుపు పంటల్ని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఎం, వైసీపీ కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.

18:25 - April 24, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా కె.విశ్వనాథ్‌ పాల్కే పురస్కారాన్ని అందుకోనున్నారు. స్వాతికిరణం, సాగర సంగమం, శృతిలయలు, శంకరాభరణం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, ఓ సీతకథ, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, ఆపద్భాందవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో అద్భుత సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం రావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు సినీ రంగ ప్రముఖులు.

వీఆర్ చిట్స్ బాధితులకు పరిహారం అందచేసిన బాబు..

విజయవాడ : విశాఖలో గతంలో బోర్డు తిప్పేసిన వీఆర్ చిట్స్ బాధితులకు పరిహారం ఈ రోజు అందింది. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై తన చేతుల మీదుగా బాధితులకు పరిహారం అందజేశారు.

 

కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 2016 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి విశ్వనాథ్ ను ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

ఛత్తీస్ గడ్ సీఎం అత్యవసర సమావేశం..

ఛత్తీస్ గడ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రిందట సుకుమా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన సంగితి తెలిసిందే. దీనితో సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

17:26 - April 24, 2017

వరంగల్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేయడంతో విద్యార్థుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో చదువులమ్మ ఒడిలో విద్యార్థులు నిత్యం నరకం చూస్తున్నారు. ఎటు చూసినా సమస్యలే. ఏం చేద్దామన్నా పనులు ముందుకు కదలని పరిస్థితి. చదువులమ్మ ఒడిలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ వైపు తినడానికి సరైన తిండీ లేదు. ఇక వసతి సౌకర్యం గురించి చెప్పక్కర్లేదు. నీళ్లు రాని ట్యాప్స్‌, చెత్తగా మారిన బాత్‌రూమ్‌లు. ఇది కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్‌ దుస్థితి. వరంగల్ జిల్లా, కాకతీయ యూనివర్సిటీ సమస్యల వలయంగా మారింది. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే. అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి సుమారు 3 వేల మంది విద్యార్థులు ఉంటారు. కానీ ఇక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు.

14 హాస్టళ్లు..
కాకతీయ యూనివర్సిటీలో మొత్తం 14 హాస్టల్స్‌ ఉన్నాయి. ఇక్కడ అధికారులు అమ్మాయిలకు హాస్టల్స్‌ సరిపోకపోవడంతో.. కేయూలోని గెస్ట్‌ హౌస్‌లను హాస్టల్స్‌గా మార్చివేశారు. మరికొన్ని గర్ల్స్‌ హాస్టల్స్‌లో నీళ్లు రావడం లేదని.. అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అమ్మాయిలన్నాక ఎన్నో సమస్యలుంటాయి. కనీసం నీటి సౌకర్యమైనా కల్పించాలని కోరుతున్నారు. ఇటు సమ్మర్‌ కావడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అబ్బాయిల హాస్టల్స్‌లో పై కప్పులు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి. గణపతి దేవా హాస్టల్స్‌ మూడింటి పరిస్థితి ఇదే. వాష్‌రూమ్‌లు సరిగా లేక విద్యార్థులు హాస్టల్స్‌ బయటే స్నానం చేస్తున్నారు. పైగా ఫ్యాన్లు, లైట్లు కూడా సరిగా లేని దయనీయ పరిస్థితి. ఇక ఇక్కడ మెస్‌ పరిస్థితి చెప్పనవసరం లేదు. వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు కేవలం రెండు మెస్‌లు మాత్రమే ఉన్నాయి.

సమస్యలు వాస్తవమే..
అమ్మాయిల మెస్‌ అయితే మరీ చిన్నగా ఉంది. అపరిశుభ్ర వాతావరణం, పైగా కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఒకేసారి వేల మందికి స్టీమ్‌ రైస్‌ పెడుతుండటం, ఎలాంటి పోషకాలు లేని సాంబారు, మజ్జిగ ఇస్తుండటంతో.. ఫుడ్‌ పాయిజనై అనారోగ్యాలపాలవుతున్నారు. విద్యార్థుల సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి, వైస్‌ ఛాన్స్‌లర్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోందని విద్యార్ధి సంఘాల నాయకులంటున్నారు. యూజీసీ ఇచ్చే నాక్‌ గ్రేడ్‌ కోసం యూనివర్సిటీలో పైపై మెరుగులు దిద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని హాస్టల్స్‌ అండ్‌ మెస్‌ డైరెక్టర్ ప్రసాద్‌ చెప్పారు. గణపతి దేవా హాస్టల్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే ఏడాది విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టల్స్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామంటున్నారు. ఇకనైనా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

17:16 - April 24, 2017

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. హైకోర్టు విభజన అంశంతో పాటు భూ సేకరణ చట్టం 2013 సవరణపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ, సచివాలయం భవనాలను నిర్మించుకుందని.. హైకోర్టును కూడా విభజించాలని కేంద్ర మంత్రిని కోరారు. రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, జితేందర్‌రెడ్డి, వినోద్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, ప్రభుత్వ సలహాదారు రాజీశ్‌శర్మ ఉన్నారు.

 

17:11 - April 24, 2017

ఛత్తీస్ ఘడ్ : మళ్లీ అడవి ఎరుపెక్కింది. కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. మరో ఏడు మంది జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. డోర్నపాలెం, బూర్గపాలెంలో ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాలను మావోయిస్టులు అడ్డుకుంటారనే భావనతో 74వ బెటాలియన్ కు చెందని సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు సోమవారం ఒక్కసారిగా విరుచకపడ్డారు. ముందుగా డోర్నపాలెంలో బందోబస్తు నిర్వహిస్తున్న వారిపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటలనలోఈ కాల్పుల్లో ఎస్ ఐ రఘువీర్ సింగ్ కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం బూర్గపాలెంలో కూడా కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా రెండు ప్రాంతాల్లో కాల్పులు చేయడంతో ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. కాల్పుల్లో 11 మంది జవాన్లు నేలకొరిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి..

ముంబై : సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు జరిపిన ~కాల్పుల్లో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దుర్మరణం చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.

పలు అంశాలపై మోడీతో కేసీఆర్ చర్చలు - ఎంపీ వినోద్..

హైదరాబాద్ : హైకోర్టు విభజన విషయంలో కాలయాపన చేస్తోందని..ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారని ఎంపీ వినోద్ తెలిపారు. హైకోర్టు విభజన అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారని పేర్కొన్నారు. బీసీ -ఈ వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ప్రభుత్వం పెంచిందని దానికి రాజ్యాంగ బద్ధత హక్కు కల్పించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరడం జరిగిందన్నారు. ఎస్సీ ఏబీసీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాన్ని ప్రధానితో చర్చించారని తెలిపారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు తెలిపారు.

16:41 - April 24, 2017

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అల్లర్లను పోలీసులు వివరించారు. ఆందోళనకారులు వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగించుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడానికి సుమారు 300 వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో వాట్సాప్‌ గ్రూపులో 250 మంది ఉన్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సమాచారం చేరవేసుకుంటూ ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్న ప్రాంతాలకు ఆందోళనకారులు చేరుకుని రాళ్లు రువ్వుతున్నారని పోలీసులు తెలిపారు. 3 వందల వాట్సాప్‌ గ్రూపుల్లో 90 శాతం మూసివేసినట్లు వారు పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డవారిని గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

16:39 - April 24, 2017

జమ్మూ కాశ్మీర్ : రియాసీ జిల్లాలో ఓ సంచార కుటుంబంపై గోరక్షకులు జరిపిన దాడికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. రేకుల షెడ్‌లో ఉన్న కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడి జరిపి భయబ్రాంతులకు గురి చేసినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మరక్షణ కోసం ఆ కుటుంబసభ్యులు గట్టిగా కేకలు వేశారు. అయినా వారు ఏమాత్రం కనికరించకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలికతో పాటు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు మాత్రం ఇద్దరే తీవ్రంగా గాయపడ్డారని, 9 ఏళ్ల పాప గాయపడ్డారన్నది అవాస్తవమని అధికారులు చెబుతున్నారు. మరో బాలుడు తప్పిపోయాడన్న వార్త కూడా నిరాధారమైనదని కొట్టిపారేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది గోరక్షకులను అరెస్ట్‌ చేశారు. ఓ సంచార కుటుంబం పశువులతో పాటు వెళ్తుండగా తల్వారా ప్రాంతంలో వారిని గోరక్షకుల సమూహం అడ్డుకుంది.

16:37 - April 24, 2017

జమ్మూ కాశ్మీర్‌ : పుల్వామా జిల్లా పిడిపి అధ్యక్షుడు అబ్దుల్‌ గనిదార్‌పై ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌ సిఎం మెహబూబా ముఫ్తి ఢిల్లీ పర్యటనలో ఉండగా పిడిపి నేతపై కాల్పులు జరగడం గమనార్హం. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ముఫ్తి ప్రధాని మోదికి వివరించారు.

16:35 - April 24, 2017

ఢిల్లీ : నకిలీ పాస్‌పోర్టు కేసులో చోటా రాజన్‌ను పాటియాల హౌస్ కోర్టు దోషిగా ఖరారు చేసింది. తప్పుడు చిరునామాతో దొంగ పాస్‌పోర్టు కలిగి ఉన్నట్టు సీబీఐ అధికారులు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసులో పాస్‌పోర్టుకు సరైన విచారణ జరపకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. నకిలీ పాస్ పోర్టు కేసులో IPC 420,471తో పాటు మరో 4 సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. కోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది.
చోటారాజన్ పై దేశవ్యాప్తంగా హత్యలు, డ్రగ్స్, స్మగ్లింగ్, బెదిరింపులకు సంబంధించి 85 పైగా ఉన్న కేసులు విచారణలో ఉన్నాయి. 2015 అక్టోబర్ 25 న ఛోటా రాజన్ ను ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేయగా నవంబర్‌ 6న ఇండియాకు తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజన్ తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నాడు.

16:32 - April 24, 2017
16:31 - April 24, 2017

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆస్పత్రి 60 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. రోగుల బంధువులు ఆయనకు అస్పత్రిలోని సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 60 ఏళ్ల క్రితం ఆసుపత్రి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని సుధాకర్‌ చెప్పారు. తరచూ బాలింతలు చనిపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

16:28 - April 24, 2017
16:14 - April 24, 2017
16:12 - April 24, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో టి.కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ నేతలు ఘర్షణలు చేసుకోవడంపై హై కమాండ్ సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. దీనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి వస్తుండంతో హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఢిల్లీకి రావాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. దీనితో సోమవారం ఉత్తమ్ ఢిల్లీకి చేరుకుని దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. అనంతరం రాహుల్ తో సమావేశం కానున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల కిందట గాంధీ భవన్ లో దిగ్విజయ్ సమక్షంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..గూడూరు నారాయణరెడ్డిలు ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న హై కమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై నివేదిక ఇవ్వాలని హై కమాండ్ కోరడంతో దిగ్విజయ్ సింగ్ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అనంతరం రెండు..మూడు రోజుల్లో కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ జారీ చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

దినకరన్ మూడో రోజు..

ఢిల్లీ : టిటివి దినకరన్ ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. వరుసగా మూడో రోజు పోలీసులు విచారణ చేపట్టారు. పార్టీ గుర్తు కేటాయింపు కోసం ఈసీకి దినకరన్ లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

సుకుమాలో ఎదురు కాల్పులు..

ఛత్తీస్ గడ్ : సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు..మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇన్ స్పెక్టర్ రఘువీర్ సింగ్ తో సహా నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

చోటా రాజన్ కు మంగళవారం శిక్ష ఖరారు..

ఢిల్లీ : నకిలీ పాస్ పోర్టు కేసులో చోటా రాజన్ దోషి అంటూ పాటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మంగళవారం శిక్షను ఖరారు చేయనుంది.

15:36 - April 24, 2017

ఢిల్లీ : నకిలీ పాస్ పోర్టు కేసులో చోటా రాజన్ దోషి అంటూ పాటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మంగళవారం శిక్షను ఖరారు చేయనుంది. భారత్ గ్యాంగ్ స్టర్ చోటారాజన్‌ను ఆస్ట్రేలియా అధికారుల సహకారంతో ఇంటర్ పోల్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇతను సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. చిన్నచిన్న నేరాలు చేస్తూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కొంతకాలంగా కుడిభుజంగా మెలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో, దావూద్‌కు బద్ద శత్రువుగా మారాడు. మొదట చిన్న దొంగతనాలు చేశాడు. బడా రాజన్‌గా పేరొందిన రాజన్ నాయర్ గ్యాంగ్ తరఫున చోటా రాజన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడు. ముంబై పేలుళ్ల అనంతరం మరింత కార్యకలాపాలు విస్తృతం చేశాడు. బెదిరించడం..వసూళ్లు చేయడం..స్మగ్లింగ్..డ్రగ్స్ ఇతరత్రా వాటిల్లో నిందితుడు.

15:32 - April 24, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం దేవునిగుట్టలో గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని సీపీఎం ఖండించింది. పదిహేడేళ్లుగా అడవిలో ఉంటూ, భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమికొట్టడాన్ని తప్పుపట్టింది. 2006 అటవీ చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి, భూముల నుంచి తరిమికొడుతారా ? అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లను తగులబెట్టి, పసు సంపదను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

15:29 - April 24, 2017

హైదరాబాద్ : ఎర్రబుగ్గలను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని జై కొట్టారు. కారుపై ఉన్న ఎర్ర బుగ్గ బల్బును ఆయన స్వయంగా తొలగించారు. ఈ క్షణమే తీసివేస్తానంటూ తన కారుపై ఉన్న బుగ్గ బల్బును తీసివేశారు. ప్రధానమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఓ మంచి సందేశాన్ని ప్రజల్లో తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మంత్రి తలసాని యాదవ్‌ అన్నారు.

15:24 - April 24, 2017

హైదరాబాద్ : బాహుబలి-2 సినిమా నిర్మాతలు ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. తెలంగాణాలో సినిమా ప్రదర్శనకు సంబంధించి ఆయనతో చర్చించారు. బాహుబలి-2 సినిమా ప్రమోషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తాదని మంత్రి తలసాని అన్నారు. వారంరోజుల పాటు ఐదు షో లు వేసుకుంటామని వారు అడిగారని దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పామని ఆయన అన్నారు.

15:22 - April 24, 2017

విజయవాడ : రాష్ట్రంలో ఐదువేల జనాభా పైబడిన అన్ని గ్రామాల్లో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సాగునీరు, తాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు విజయవాడలో జరిగిన పంచాయతీ రాజ్‌ దినోత్సవంలో మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. రెండేళ్లలో 12 వేల కిలో మీటర్ల సిమెంటు రోడ్లు వేయాల్సివుందని, అన్ని కార్యక్రమాల అమల్లో సర్పంచ్‌లు కీలక బాధ్యతలు తీసుకోవాలని లోకేశ్‌ కోరారు.

15:19 - April 24, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. 7 రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలు మొదలుకొని నిన్న మొన్నటి బీసీ-ఈ రిజర్వేషన్ల దాకా అనేక కీలక అంశాలపై సుమారు గంటన్నర పాటు చర్చించారు. సీఎం ప్రధానంగా బీసీ-ఈ గ్రూపు రిజర్వేషన్ల పెంపు బిల్లు, వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపు, అసెంబ్లీ సీట్ల పెంపు, రిజర్వేషన్ల విషయంలో రాష్ర్టాలకు స్వేచ్ఛ, ఎస్సీ వర్గీకరణ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు, హైకోర్టు విభజన తదితర అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీటితో పాటు ప్రధాని ప్రస్తావించిన ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు అంశం, నోట్ల రద్దు అనంతర పరిణామాలు తదితర జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

 

15:08 - April 24, 2017

నల్గొండ : జిల్లాలో మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధుడు చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. బ్యాంకులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. క్లాక్ టవర్ సమీపంలో ఉన్న బ్యాంకుకు నాగేశ్వరరావు వృద్ధుడు వచ్చాడు. క్యూలో నిలుచున్న ఇతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడనే ఉన్న వారు ఓ గోడ వైపుకు కూర్చొబెట్టి సపర్యలు చేశారు. అనంతరం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ వృద్ధుడు పరిస్థితి ఎలా ఉందో ఎవరూ గమనించలేదు..చూడలేదు. చివరకు అతడిని చూసిన కొంతమంది అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని గుర్తించారు. ముందే ఒకవేళ ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలిస్తే బతికి ఉండేవాడోమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

పెన్షన్ కోసం వచ్చి కుప్పకూలిన వృద్ధుడు..

నల్గొండ : జిల్లాలోని ఓ ఎస్ బీఐ బ్యాంకులో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు కుప్పకూలిపోయి మృతి చెందాడు. గంటల సేపు అక్కడనే ఉన్నా ఎవరూ స్పందించలేదు.

సిమెంట్ ధరల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

గుంటూరు : సిమెంట్ ధరల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. సీఎం ఆదేశాలతో సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో ఈ భేటీ జరిగింది. మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడులు చర్చల్లో పాల్గొన్నారు. సిమెంట్ ధరల తగ్గింపుపై ఈనెల 27వ తేదీన మరోసారి భేటీ అయి ఎంత తగ్గించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని, జూన్ నెలాఖరు వరకు సిమెంట్ కంపెనీలకు సి ఫారమ్ ఇస్తామని ప్రభుత్వం వారికి చెప్పిందని మంత్రులు పేర్కొన్నారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల సమయం కోరారని, ప్రభుత్వ భవనాలకు, ఆర్ అండ్ బీ, పోలవరం ప్రాజెక్టులకు గతంలో నిర్ణయించిన రూ. 230, రూ. 240, రూ.

రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ రాజీనామా..

ఢిల్లీ : అప్ఘనిస్తాన్ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ రాజీనామా చేశారు. ఇటీవల ఆర్మీ క్యాంప్ పై తాలిబన్ల దాడికి నైతిక బాధ్యత వహిస్తూ అఫ్ఘాన్ ఆర్మీ చీఫ్ రాజీనామా చేశారు.

పిడిపి జిల్లా అధ్యక్షుడిపై 'ఉగ్ర' దాడి..

జమ్మూ కాశ్మీర్ : పిడిపి జిల్లా అధ్యక్షుడు పుల్వామ అబ్దుల్ ఘనిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

14:12 - April 24, 2017
14:11 - April 24, 2017

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. మూడు సంవత్సరాల కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర సమస్యలు..పెండింగ్ అంశాలు..ఇతరత్రా వాటిపై మోడీ దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు విభజన..అసెంబ్లీ స్థానాల పెంపుపై చర్చించారు. అంతేగాకుండా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదింప చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింప చేయాలని, వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని కోరారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు ఇంకా అమలు కావడం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుండి అందాల్సిన సహాయంపై కేసీఆర్ ఓ నివేదిక సమర్పించారు. మరి కేంద్రం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

టిడిపి మహానాడు వేదిక ఖరారు..

విజయవాడ : టిడిపి మహానాడు వేదిక ఖరారైంది. విశాఖ వేదికగా మహానాడును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 27, 28, 29 తేదీల్లో టిడిపి మహానాడు జరగనుంది.

 

 

మోగిన ఫైర్ అలారం..ఏపీ ఉద్యోగుల పరుగులు..

విజయవాడ : అమరావతి సచివాలయంలో మూడో బ్లాక్ లో ఫైర్ అలారం మోగింది. దీనితో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. క్యాంటీన్ నుండి అధిక వేడి రావడంతో ఫైర్ అలారం మోగిందని అధికారులు నిర్ధారించారు. దీనితో సచివాలయ ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు.

‘నవతెలంగాణ' స్టాఫ్ రిప్టోర్టర్ కు బ్రెయిన్ స్ట్రోక్..

హైదరాబాద్ : ‘నవ తెలంగాణ' రంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ నర్సింహాచారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

పారుమంచాలలో ఇద్దరు పిల్లలు..తల్లి ఆత్మహత్యాయత్నం..

కర్నూలు : జూపాడు బంగ్లా (మం) పారుమంచాలలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు మృతదేహాలు వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలింపులు చేపట్టారు.

గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడిని ఖండిస్తున్నాం: తమ్మినేని

హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా దేవుని గట్టులో గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడిని ఖండిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దాడులు బందిపోటు దొంగలను తలపిస్తున్నాని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, గిరిజనులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధిహామీ పనికి లింగు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రబుత్వం ఎకరానికి రూ. 4వేలు పెట్టుబడి ఇవ్వడంతో పెద్దరైతులే లాభపడతారని, మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలని తమ్మినినేని పేర్కొన్నారు.

13:27 - April 24, 2017
13:26 - April 24, 2017

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా నిర్మాతలు ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. తెలంగాణాలో సినిమా ప్రదర్శనకు సంబంధించి ఆయనతో చర్చించారు. బాహుబలి-2 సినిమా ప్రమోషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తాదని మంత్రి తలసాని అన్నారు. వారంరోజుల పాటు ఐదు షో లు వేసుకుంటామని వారు అడిగారని ...దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పామని ఆయన అన్నారు.

13:25 - April 24, 2017

నిజామాబాద్‌ : బోధన్‌ మండలంలోని పెగడపల్లిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న బాలిక భాగ్యలక్ష్మిపై.. గుర్తు తెలియని దుండగుడు కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలిసిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

నిలకడగా ఆర్. విద్యాసాగర్ రావు ఆరోగ్యం

హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని. 24 గంటల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తామని కాంటినెంటల్ ఆస్పత్రి ఎండీ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

విశాఖ లో మే 27 నుండి 29 వరకు మహానాడు

అమరావతి: టిడీపీ మహాను వేదిక ఖరారు అయ్యింది. విశాఖ వేదిక గా మే 27,28,29 తేదీలో మహానాడు నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది.

12:49 - April 24, 2017
12:40 - April 24, 2017

హైదరాబాద్: నాన్నకు మాట, చిన్న నాటి గురుతులు ఆమెను సేవా నిరతి వైపు నిలిపింది. కష్టాలను చూసి చెలించిపోయే మనస్థత్వం ఎంతో మంది చిన్నారులకు చక్కని భవిష్యత్ అందిస్తోంది. అలాంటి అతి కథనంతో నేటి 'స్ఫూర్తి '. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏసీబీకి పట్టుబడ్డ ట్రాన్స్ కో ఇంజనీర్

అనంతపురం : బుక్కరాయి సముంద్రం ట్రాన్స్ కో ఇంజనీర్ గోపాల్ రెడ్డి ఓ రైతు వద్ద రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

12:23 - April 24, 2017

హెన్నా పెట్టుకున్న ఓ యువతి చేతులు కాలిపోయాయి. ఈ ఘటన షార్జాలో చోటు చేసుకుంది. యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ యువతి చేతికి హెన్నా పెట్టించుకుంది. ఈ హెన్నాను ఆర్టిస్టు పెట్టింది. కానీ డిజైన్ పెట్టుకున్న కొద్ది నిమిషాలలోపే చేతులు మంటగా అనిపించాయి. అరగంటలోనే చేతులపై బొబ్బలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే చేతులు కడుక్కొంది. అయినా మంటలు తక్కువ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు చేతులకు వివిధ రకాల ఆయింట్ మెంట్ లు రాశారు. తాను రెడ్ హెన్నా పెడుతున్నానని ఆ ఆర్టిస్టు చెప్పిందని..అది డార్క్ గా ఉండంతో తనకు మొదట్లోనే అనుమానం కలిగిందని సదరు యువతి పేర్కొంటోంది. వారం రోజుల తరువాత ఎలర్జీ ఎక్కువ కావడంతో ఆమెను ఎమర్జెన్సీకి తరలించారు. తనకు టాబ్లెట్లతో పాటు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారని..నొప్పి భరించలేకపోతున్నట్లు వాపోయిందంట. యూనివర్సిటీ వర్గాలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

12:17 - April 24, 2017
12:14 - April 24, 2017

హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్నే ఆపుతారా? అంటూ, టోల్ గేటు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్ లో తన అనుచరులకు విషయం చెప్పి, వారిని పిలిపించి ఆపై దాడికి దిగారు. టోల్ గేటులోని కంప్యూటర్లను నాశనం చేసిన ఆయన అనుచరులు, ప్లాజాలోని అద్దాలను ధ్వంసం చేశారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై టోల్ గేటు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

12:08 - April 24, 2017

జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన నటించిన సినిమాలు భారీ విజయాలు నమోదు చేసుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో చాలా విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని..అందులో ఒక పాత్ర విలన్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 'ఎన్టీఆర్' సరసన 'రాశీఖన్నా'.., 'నివేదా థామస్'.., 'నందితా దాస్'..లు నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. చిత్రంలో 'సమంత' విలన్ పాత్రలో అలరించనున్నట్లు టాక్. ఇటీవలే చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్ ను విడుదల చేశారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ 'చిలుకూరి బాలాజీ' టెంపుల్ ఆవరణలో జరుగుతోంది. అక్కడ హీరోయిన్ 'రాశీఖన్నా'..'ఎన్టీఆర్' పెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఇంతవరకు అధికారికంగా వెలువడడం లేదు. 

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, రిజర్వేషన్లు, ప్రత్యేక హైకోర్టు సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

టోల్ గేట్ వద్ద ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడి వీరంగం

హైదరాబాద్: హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు కర్ణాటకలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్నే ఆపుతారా? అంటూ, టోల్ గేటు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్ లో తన అనుచరులకు విషయం చెప్పి, వారిని పిలిపించి ఆపై దాడికి దిగారు. టోల్ గేటులోని కంప్యూటర్లను నాశనం చేసిన ఆయన అనుచరులు, ప్లాజాలోని అద్దాలను ధ్వంసం చేశారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై టోల్ గేటు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు.

11:37 - April 24, 2017
11:35 - April 24, 2017

హైదరాబాద్‌..: సాఫ్ట్‌వేర్‌ రాజధాని. కానీ ఇప్పుడీ భాగ్యనగరం.. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే మోసాలకు, అక్రమాలకూ రాజధానిగా మారిపోయింది. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే మాయా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు హైదరాబాద్‌లో కోకొల్లలు. అట్లాంటి ఓ మోసకారి సంస్థ గుట్టును 10tv బట్టబయలు చేసింది. ఇంతకీ ఆ సంస్థ ఏది..? దాని మాయాప్రపంచం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

జెనెసిస్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ...

హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని మధుశాల బార్‌ పైఅంతస్థులో.. జెనెసిస్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉంది. నిజానికి జెనెసిస్‌ అన్నది లండన్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ పేరు. గతంలో, ఇండియాలోని నొయిడా, హైదరాబాద్‌లలో తన శాఖలను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం.. అనివార్య కారణాల వల్ల ఈ సంస్థను మూసివేశారు. సరిగ్గా అక్కడే తెరపైకి వచ్చారు అక్రమార్కులు.

జెనెసిస్‌ మూసివేతను తమకు అనుకూలంగా...

జెనెసిస్‌ మూసివేతను తమకు అనుకూలంగా మలచుకుంటూ.. మాయగాళ్లు అదే పేరుతో సరికొత్త దుకాణాన్ని తెరిచారు. డూప్లికేట్‌ కంపెనీని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌, హైదరాబాద్‌ వద్ద రిజిస్టర్‌ చేయించారు. రికార్డుల ప్రకారం, సంస్థలో ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు.

సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ చిరునామాలో...

వీరిలో కోడూరు లక్ష్మీనరసింహం, తడిమేటి రాజకుమారి శేషు అనే వ్యక్తులు ఇద్దరూ, విశాఖపట్టణంలోని సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ చిరునామాలో ఉన్నట్లు రికార్డుల్లో చూపారు. వీరిద్దరూ 2007 ఏప్రిల్‌ 9న డైరెక్టర్లుగా రిజిస్టర్‌ చేయించుకున్నారు.

సంస్థ డైరెక్టర్లలో మూడోవాడైన రామకృష్ణ కూడా ...

సంస్థ డైరెక్టర్లలో మూడోవాడైన రామకృష్ణ కూడా విశాఖపట్టణానికి చెందినవాడే. ఇతను స్థానిక ఎంవిపి కాలనీకి చెందినవాడని, ఇతను, 2010 నవంబర్‌ 20న సంస్థ డైరెక్టర్‌గా చేరినట్లు రికార్డుల్లో ఉంది. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ దగ్గర నమోదైన ఈ చిరునామాలను వెతుక్కుంటూ వెళ్లిన 10టీవీ పరిశోధక బృందానికి, అక్కడ జెనెసిస్‌ డైరెక్టర్లుగా పేర్కొన్న వారు ఎవరూ లేరని తేలింది.

నకిలీ వెబ్‌సైట్‌ను...

విషయాన్ని ఆరాతీస్తే, మూతబడిన జెనెసిస్‌ కంపెనీ వెబ్‌సైట్‌లోని పేజీలు కాపీకొట్టి సరికొత్తగా www.egenisis.com పేరిట నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. దీనిద్వారా నిరుద్యోగులను ఆకర్షిస్తూ.. బ్యాక్‌డోర్‌ ఎంట్రీల పేరిట ఉద్యోగాలు కల్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేయడం మొదలుపెట్టారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు డబ్బు వసూలు కాగానే, ఈ సంస్థను ఎత్తివేసే ఆలోచనలో నకిలీ జెనెసిస్‌ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

గతంలో ఇదే రీతిలో బ్యాక్‌డోర్‌ ఎంట్రీల పేరిట...

గతంలో ఇదే రీతిలో బ్యాక్‌డోర్‌ ఎంట్రీల పేరిట అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఆక్స్‌లాట్‌ సొల్యూషన్స్‌ సంస్థ తరహాలో.. నకిలీ జెనెసిస్‌ నిర్వాహకులు భారీగా డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు. అప్పట్లో ఆక్స్‌లాట్‌ సొల్యూషన్స్‌ సంస్థ నిర్వాహకులు, నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేసి వారికి సంస్థలోనే ఉద్యోగాలు కల్పించి, ఓ మూడు నెలలు సవ్యంగా జీతాలూ అందించి, ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. ఇప్పుడు నకిలీ జెనెసిస్‌ సంస్థ కూడా ఇదే బాటలో సాగుతున్నట్లు అనుమానాలున్నాయి.

ఈ నకిలీ జెనెసిస్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో..

ఈ నకిలీ జెనెసిస్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో.. తమ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన చిరునామాలో ఇతరత్రా 28 కంపెనీలు ఉన్నమాట నిజమే కానీ, అందులో, ఈ నకిలీ జెనెసిస్‌ లేదని తేలింది. అంతేకాదు, వెబ్‌సైట్‌లోని లండన్‌ ఆఫీసు ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే.. అది వేరే ఎవరికో వెళుతోంది.

10tV పరిశోధనలో...

భరత్‌ నిర్వహిస్తోన్న నకిలీ జెనెసిస్‌ సంస్థ.. స్థానికంగా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రకటించుకుంటోంది. అయితే, అందులో ఏమాత్రం వాస్తవం లేదని, వారి మాటలన్నీ ఉత్తుత్తివేనని 10tV పరిశోధనలో తేలింది.

ట్రావెల్‌ డాట్‌ కామ్‌, 1979 నుంచి అమెరికాలో...

నకిలీ జెనెసిస్‌ సంస్థ, ఇండియాలోను, విదేశాల్లోనూ తాము ఎన్నో ప్రాజెక్టులు నిర్వహించినట్లు పేర్కొంది. గో ట్రావెల్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ తాము రూపొంచిందేనన్నది నకిలీ జెనెసిస్‌ మాయగాళ్ల మాట.

నిజానికి ఈ గో-ట్రావెల్‌ డాట్‌ కామ్‌, 1979 నుంచి అమెరికాలో టూర్‌ ఆపరేటర్‌గా ఉంది. ఈ సంస్థ ఇప్పటివరకూ ఇండియాలో నిర్వహించిన టూర్‌ ఒక్కటీ లేదు. కానీ, సదరు నకిలీ జెనెసిస్‌, గో-ట్రావెల్‌ డాట్‌ కాం డిజైన్‌ను తామే చేశామని చెప్పుకుంటోంది.

మోతీనగర్‌లోని జైస్వాల్‌ ఆసుపత్రి వెబ్‌సైట్‌ను...

ఇదేనా, హైదరాబాద్‌ మోతీనగర్‌లోని జైస్వాల్‌ ఆసుపత్రి వెబ్‌సైట్‌ను కూడా తామే రూపొందించి ఇచ్చినట్లు.. నకిలీ జెనెసిస్‌ పేర్కొంది. ఇంకా దాని పని పూర్తి కానందున, అది వెబ్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు. కానీ, ఆసుపత్రి నిర్వాహకులతో వారి వెబ్‌సైట్‌ గురించి ప్రస్తావిస్తే.. అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టం చేయడం గమనార్హం.

ప్రస్తుతమున్న జెనెసిస్‌ సంస్థ బోగస్‌ నని...

ఏతావాతా తేలిందేమిటంటే, ప్రస్తుతమున్న జెనెసిస్‌ సంస్థ బోగస్‌. కేవలం డబ్బులు లాగేసుకుని, బోర్డు తిప్పే రకం. అందుకే.. నిరుద్యోగులూ.. హుషార్‌..! ఇలాంటి బోగస్‌ కంపెనీలను నమ్మకండి. మీ కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోకండి.

11:29 - April 24, 2017

హైదరాబాద్: ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. 11గంటల 45 నిమిషాలకు ప్రధానితో సమావేశం అవుతురాఉ. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, సమస్యలు, రిజర్వేషన్‌లపై మోదీతో చర్చించే అవకాశంఉంది.. అలాగే ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని పీఎంను కోరనున్నారు..

కాసేపట్లో ప్రధాని మోదీ తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. 11గంటల 45 నిమిషాలకు ప్రధానితో సమావేశం అవుతురాఉ. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, సమస్యలు, రిజర్వేషన్‌లపై మోదీతో చర్చించే అవకాశంఉంది.. అలాగే ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని పీఎంను కోరనున్నారు..

11:27 - April 24, 2017

చెన్నై: తమిళనాడు అన్నా డీఎంకే లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జయలలిత మరణం తర్వాత రెండుగా చీలిపోయిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు భేటీ అవుతున్నాయి. చెన్నైలోని అన్నా డీఎంకే కార్యాలయంలో 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో వీలీనంపై చర్చలు జరుపనున్నారు. పన్నీరు సెల్వంకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఈయన వర్గం పట్టుపడుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామికి ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇస్తామని సెల్వం వర్గం ప్రతిపాదిస్తోంది. అయితే ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది.

11:26 - April 24, 2017

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మరో రెండు గ్రామాల్లో భూసేకరణకు సీఆర్డీఏ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ య్యింది. మంగళగిరి మండలం కొంరగల్లు, నవలూరు గ్రామాల్లో భూములను సేకరిస్తారు. కొంరగల్లులో 128 మంది రైతుల నుంచి 148 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. నవలూరులో 152 మంది రైతుల నుంచి 196 ఎకరాల సేకరిస్తారు. ఈ నోటిఫికేషన్‌పై 60 రోజుల్లో అభ్యంతరాలు తెలిజయేసే అవకాశం కల్పించారు.

ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ సీఎం భేటీ

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తో జమ్మూకశ్మీర్ సీఎం మెహ‌బూబా ముఫ్తీ భేటీ అయ్యారు. వీరి భేటీ రాష్ట్రంలో ఆందోళ‌న‌ల‌ను శాంతింప‌చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించే అవ‌కాశం ఉంది. ఇత‌ర రాష్ట్రాల్లో చ‌దువుతున్న క‌శ్మీర్ విద్యార్థుల‌పై జ‌రుగుతున్న దాడుల అంశాన్ని చ‌ర్చించ‌నున్నారు. శ్రీన‌గ‌ర్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మోదీ, ముఫ్తీ భేటీ కీల‌కం అయ్యింది.

ప్రారంభమైన ఏపీ ఎంసెట్

హైదరాబాద్: నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. మూడు రోజులు పాటు ఇంజినీరింగ్‌, ఒకరోజు బైపీసీ విద్యార్థుకు పరీక్ష నిర్వహిస్తారు. మొదటిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. నిమిషం ఆలస్యం నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఆలస్యానికి సరైన కారణం చెబితే పరీక్షకు అనుమతి ఇస్తారు. ఇది విద్యార్థులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పరీక్ష జరుగుతుంది.

9ఏళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు...

నిజామాబాద్: తొమ్మిదేళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలకు తాళలేక అరుస్తున్న బాలికను గమనించిన స్థానికులు మంటలు ఆర్పి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోధన్ మండలం పెగడపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు

తిరుమల: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ, ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితులు వారికి ఆశీర్వాదం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

09:44 - April 24, 2017

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ రెండువేల సమ్మర్‌ కోచింగ్‌ సెంటర్లను ప్రారంభించనుంది. నేటి నుంచి ఈ కేంద్రాల్లో 52 క్రీడల్లో శిక్షణ ఇస్తారు. కోచింగ్‌కు 10 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తారు. నెల రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఈ వేసవిలో లక్షన్నర మంది బాలబాలికలకు శిక్షణ ఇవ్వాలని జీహెచ్ ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

09:42 - April 24, 2017

హైదరాబాద్: రైతులు పంటసాగులో మరింత లాభం పొందాలన్నదే తమ లక్ష్యమని.. గ్రోమోర్‌ కంపెనీ ఎండీ సమీర్‌ గోయల్‌ తెలిపారు. విచక్షణారహితంగా కాకుండా భూసారానికి తగినట్లుగా ఎరువులు వాడాలని ఆయన సూచించారు. కోరమండల్‌ కంపెనీ రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా అందించే భూసార పరీక్షల గురించి తెలుసుకోవాలని రైతులకు సూచించారు.... హైదరాబాద్‌లో గ్రోమోర్‌ రైతు ఖజానా విజేతల్ని కంప్యూటర్‌ లక్కీ డ్రాద్వారా గోయల్‌ ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం చేసిన కామెడీ స్కిట్స్ అందరినీ అలరించాయి.

కొరంగల్లు, నవలూరులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ

అమరావతి: మంగళగిరి మండలం కొరంగల్లు, నవలూరులో భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. కొంరగల్లులో 128 మంది రైతులకు చెందిన 148 ఎకరాలు, నవలూరులో 152 మంది నుంచి 196 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

 

07:59 - April 24, 2017

హైదరాబాద్: ఒకేసారి పార్లమెంట్ కు , రాష్ట్ర అసెంబ్లీకు ఎన్నికలు నిర్వహించాలంటూ చేస్తున్న నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా వేదిక ఉపయోగించుకున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, దేశాభివృద్ధికి తీసుకోవాల్సి చర్యలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరైన పనీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రధాని మోదీ తన రాజకీయ అజెండాను ప్రచారం చేసుకునేందుకు వాడుకున్నారు. సోషల్ మీడియా పై ఏపీ సర్కార్ కత్తి గట్టింది ఎందుకు? ఇవే అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' చర్చలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టిడిపి నేతదినకర్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు.

ఊటిలోని జయలలిత ఎస్టేట్ లో వాచ్ మెన్ హత్య

హైదరాబాద్: తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలి కు సంబంధించిన ఊటీలోని ఎస్టేట్ లో వాచ్ మెన్ దారుణ హత్యకు గురయ్యారు. అంతే కాకుండా ఎస్టేట్ లో కీలక డాక్యుమెంట్లను ఆగంతకులు ఎత్తులెళ్లారు.

నేటి నుంచి ఏపీలో ఎంసెట్‌ పరీక్ష.......

అమరావతి: ఏపీలో సోమవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజనీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ఇతర కోర్సుల ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,96,977 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. ఇక మెడికల్‌ విభాగంలో 79,611 మంది రాస్తున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..కడప నుంచి రేణిగుంట వరకు లారీని క్లీనర్‌ నడిపినట్లు తాజాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్‌ గురవయ్య మద్యం సేవించినట్లు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. రేణిగుంట నుంచి ఏర్పేడు వరకు లారీని డ్రైవర్‌ గురవయ్య నడిపాడా లేక క్లీనర్‌ నడిపాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప సమీపంలో లారీని క్లీనర్ నడుపుతున్న దృశ్యాలను కడప టోల్‌గేట్‌ దగ్గర సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు.

ఏర్పేడు ఘటనలో టీడిపి నేతల పై వేటు

చిత్తూరు : ఏర్పేడు ఘటనపై సీఎం చంద్రబాబు యాక్షన్‌ ప్రారంభించారు. ఇద్దరు టీడీపీ నేతలపై వేటు వేశారు. స్థానిక ఎమ్మార్వోను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీ బిజీ

హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు.. నిన్న నీతి ఆయోగ్‌ సదస్సుకు హాజరైన కేసీఆర్‌.. ఇవాళ ఉదయం 11గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, సమస్యలు, రిజర్వేషన్‌లపై మోదీతో చర్చించే అవకాశంఉంది.. అలాగే ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని పీఎంను కోరనున్నారు..

ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం

హైదరాబాద్: నవభారత నిర్మాణానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమష్టిగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అప్పుడే నూతన భారతదేశం ఆవిర్భవిస్తుందన్నారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్‌ పాలకమండలి 15 ఏళ్ల విజన్‌ డాక్యుమెంట్‌పైనే ప్రధానంగా చర్చించింది.

07:03 - April 24, 2017

పశ్చిమగోదావరి : తుందుర్రులో అక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు ఉద్యమకారులు. గత శుక్రవారం నుంచి చేస్తున్న నిరహార దీక్షలను విరమించారు. నర్సాపురం ఆస్పత్రిలో దీక్షచేస్తున్న ఉద్యమకారులకు సీపీఎం నేత ఉమామహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి.. దీక్ష విరమింపజేశారు.

ఈనెల 21 న నిరాహార దీక్షలకు దిగిన ఉద్యమకారులు .....

ఈ నెల 21న సీపీఎం ఆధ్వర్యంలో ఆక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక గ్రామాల ప్రజలు తుందుర్రులో నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టారు.. శనివారం ఈ దీక్షాశిబిరంపై పోలీసులు విరుచుకుపడి సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాంతో సహా... మరో 16మందిని అరెస్ట్ చేశారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో ఆందోళకారులు గాయడటంతో నరసాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగించడంతో .. ఉద్యమకారులకు మద్దతుగా భీమవరం, ఉండి, నరసాపురంలో ప్రజలు ఆందోళ చేపట్టారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకం నినాదాలు చేశారు.

అఖిలపక్ష భేటీలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం.....

అఖిలపక్షనేతల సూచనలతో దీక్షలను విరమించిన ఉద్యమకారులు.. ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామంటున్నారు. ఆక్వాఫుడ్‌ పార్కును తరలించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు.

07:01 - April 24, 2017

అమరావతి: ఏపీలో సోమవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజనీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ఇతర కోర్సుల ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,96,977 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. ఇక మెడికల్‌ విభాగంలో 79,611 మంది రాస్తున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొదటిసారి ఆన్‌లైన్‌లో ఏపీ ఎంసెట్‌.....

ఎంసెట్‌ పరీక్షను ఏపీ ప్రభుత్వం మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. పరీక్ష పూర్తైన తర్వాత ప్రశ్నాపత్రాన్ని విద్యార్ధుల ఈ- మెయిల్స్‌కు పంపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక నిమిషం ఆలస్యం నిబంధనను ప్రభుత్వం సడలించింది. పరీక్షకు విద్యార్ధులు ఆలస్యంగా వస్తే... దానికి సరైన కారణం చెప్పాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కారణం చెప్పిన వారిని పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు.

ఈనెల 28 ప్రాథమిక కీ విడుదల....

ఈనెల 28న ఎంసెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ కీ పై మే 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నందున విద్యార్ధులెవరూ ఆందోళన చెందవద్దని విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. పేపర్‌ను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని ఆన్సర్‌ చేయాలని సూచిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు

హైదరాబాద్: వరంగల్‌ బహిరంగ సభ ద్వారా సత్తా చాటేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా మంత్రులు రంగంలోకి దిగారు. జిల్లాల వారీగా జన సమీకరణకు టార్గెట్లు నిర్ణయించారు. భారీగా జనసమీకరణ చేసి ప్రజాక్షేత్రంలో తమ పట్టు చెదిరిపోలేదని నిరూపించుకునేందుకు గులాబీపార్టీ నేతలు హడావిడిచేస్తున్నారు.

06:58 - April 24, 2017

వరంగల్ : టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిర్వం సిద్ధం చేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను పలుమార్లు పరిశీలించారు. ఇంతకుముందెన్నడూ జరుగని విధంగా సభను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమాయాత్తం చేస్తున్నారు.

బహిరంగసభకు భారీ జనసమీకరణే టార్గెట్‌.....

బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికే జిల్లాల నేతలకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. దీంతో బహిరంగ సభకు జనాన్ని పెద్ద సంఖ్యలో తరలించేందుకు జిల్లాల నేతలు సమాయాత్తం అవుతున్నారు. ప్లీనరీ తర్వాత నేతలంతా తమ నియోజకవర్గ నేతలను కలుపుకుని జనసమీకరణపై దృష్టి పెట్టారు. పది లక్షల మందికిపైగా జనాన్ని సమీకరించి సత్తా చాటాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన వరంగల్‌.......

గులాబీపార్టీకి మొదటి నుంచి మంచి పట్టున్న జిల్లా వరంగల్లాలో ఉద్యమ సమయంలోనూ ఆపార్టీ నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయి. తాజాగా అదేజిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో జన సమీకరణకు సమస్య ఉండబోదని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి జనాన్ని భారీ సంఖ్యలో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మందికి తగ్గకుండా జనాన్ని సమీకరించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లడంతో.. కిందిస్థాయినేతలు తెగ హడావిడి చేస్తున్నారు.

రంగంలోకి దిగిన మంత్రులు.....

జన సమీకరణకు జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ణయించడంతో మంత్రులు రంగంలోకి దిగారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ నేతలకు సమీకరణ బాధ్యతలు అప్పగిస్తుననారు. ఎక్కువగా రైతులను సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్‌ సభ ద్వారా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రైతు ప్రభుత్వమన్న ముద్రవేసుకోవాలని భావిస్తోంది.

06:55 - April 24, 2017

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌లో 9 లక్షల 12 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో చాలా చోట్ల రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది. ఇది వేసవి కాలంలో అయితే ఎప్పుడు నీళ్లు వస్తాయో అర్ధం కాని పరిస్థితి. కానీ ప్రస్తుతం జలమండలి తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. నీళ్లు సక్రమంగా రాకపోయినా.. నీటి బిల్లులు మాత్రం భారీగా పంపిస్తున్నారు.

జలమండలి అధికారులపై నగరవాసులు ఆగ్రహం.....

జలమండలి అధికారులపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌పై 500 నుంచి 800 రూపాయల వరకు అధికంగా బిల్లులు బాదుతున్నారని ప్రజలంటున్నారు. మరోవైపు పని చేయని నీటి కనెక్షన్లకు సైతం బిల్లులు వసూలు చేస్తున్నారంటున్నారు. వినియోగించిన నీటి పరిమాణం ఆధారంగానే నీటి బిల్లులు వేయాల్సి ఉన్నప్పటికీ.. నీళ్లు విడిచిన సమయం ప్రకారం.. వాటర్‌ రాకపోయినా బిల్లులు వసూలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్‌ను జలమండలి ని...

మరోవైపు పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్‌ను జలమండలి 5,545 డాకెట్లుగా విభజించింది. ఎక్కువ లేదా తక్కువ నీళ్లు వాడుకున్నా సరే బిల్లు మాత్రం ఒకే విధంగా అధికారులు వసూలు చేస్తున్నారు. ప్రతినెలా నీటి చార్జీల కింద జలమండలి కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ప్రజలపై 10 కోట్ల మేర అదనపు భారం పడుతుందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి.. ప్రతిరోజు నీళ్లు సరఫరా చేయడంతో పాటు.. బిల్లులు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తాత్కాలికంగా దీక్ష విరమించిన తమిళనాడు రైతులు

ఢిల్లీ: తమను ఆదుకోవాలంటూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్న తమిళనాడు రైతులు... తాత్కాలికంగా తమ దీక్ష విరమించారు. 15రోజుల్లోగా వారి సమస్యలు పరిష్కరిస్తామని తమిళనాడు సీఎం పళని స్వామి హామీ ఇవ్వడంతో.. మే 25 వరకు దీక్ష విరమిస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్‌ భేటీ కోసం ఢిల్లీ వచ్చిన తమిళనాడు... రైతులను కలుసుకొని హామీ ఇచ్చారు. కరవు కోరల్లో చిక్కుకున్న తమను ఆదుకొని... పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ.. 21 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆరాష్ట్ర రైతులు ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చారు.

06:42 - April 24, 2017

ఢిల్లీ: తమను ఆదుకోవాలంటూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్న తమిళనాడు రైతులు... తాత్కాలికంగా తమ దీక్ష విరమించారు. 15రోజుల్లోగా వారి సమస్యలు పరిష్కరిస్తామని తమిళనాడు సీఎం పళని స్వామి హామీ ఇవ్వడంతో.. మే 25 వరకు దీక్ష విరమిస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్‌ భేటీ కోసం ఢిల్లీ వచ్చిన తమిళనాడు... రైతులను కలుసుకొని హామీ ఇచ్చారు. కరవు కోరల్లో చిక్కుకున్న తమను ఆదుకొని... పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ.. 21 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆరాష్ట్ర రైతులు ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌ సంస్థలపై వైట్‌హౌస్‌ ఆరోపణలు

హైదరాబాద్: హెచ్ 1 బి వీసాల విషయంలో భారత ఐటీ కంపెనీలు అనైతిక విధానాలకు పాల్పడినట్టుగా అమెరికా ఆరోపించింది. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లపై వైట్ హౌస్ ఈ ఆరోపణలు చేసింది. ఈ 3 సంస్థలు భారీగా వీసాలకు దరకాస్తు చేసుకొని లాటరీ పద్ధతిలో ఎక్కువ వీసాలు పొందినట్లుగా ఆరోపించింది. అవసరం లేకున్నా కూడా ఈ మూడు సంస్థలు అధికంగా వీసాలు తీసుకున్నట్టు తెలిపింది. దీంతో పాటు వేతనాల ఖర్చు తగ్గించుకునేందుకు.. ఈ సంస్థలు... తక్కువ వేతనం ఉన్న వారిని అమెరికాకు పంపాయని వారి వార్షిక వేతనం 65 వేల డాలర్లేనని తెలిపింది.

06:40 - April 24, 2017

హైదరాబాద్: హెచ్ 1 బి వీసాల విషయంలో భారత ఐటీ కంపెనీలు అనైతిక విధానాలకు పాల్పడినట్టుగా అమెరికా ఆరోపించింది. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లపై వైట్ హౌస్ ఈ ఆరోపణలు చేసింది. ఈ 3 సంస్థలు భారీగా వీసాలకు దరకాస్తు చేసుకొని లాటరీ పద్ధతిలో ఎక్కువ వీసాలు పొందినట్లుగా ఆరోపించింది. అవసరం లేకున్నా కూడా ఈ మూడు సంస్థలు అధికంగా వీసాలు తీసుకున్నట్టు తెలిపింది. దీంతో పాటు వేతనాల ఖర్చు తగ్గించుకునేందుకు.. ఈ సంస్థలు... తక్కువ వేతనం ఉన్న వారిని అమెరికాకు పంపాయని వారి వార్షిక వేతనం 65 వేల డాలర్లేనని తెలిపింది.

06:39 - April 24, 2017

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీని, వందమంది ప్రభావశీలుర జాబితాలో చేర్చింది... విఖ్యాత టైమ్స్‌ మ్యాగజైన్. మోదీని ఈ జాబితాలో ఎందుకు ఎంపిక చేశారో వివరించే టైమ్స్‌ వ్యాసం.. భారత్‌లో మోదీ పాలన తీరుకు అద్దం పడుతోంది. మూడేళ్ల కాలం గడిచినా.. మోదీ ఇచ్చిన హామీలు వాస్తవానికి చాలా దూరంలో ఉన్నాయని టైమ్స్‌ మ్యాగజైన్‌ పేర్కొంది.

మ్యాగజైన్‌లో మోదీ గురించిన వ్యాఖ్యానం...

భారత ప్రధాని నరేంద్ర మోదీని.. ప్రఖ్యాత ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌ "టైమ్స్‌".... వందమంది ప్రభావశీలుర జాబితాలో చేర్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ మ్యాగజైన్‌లో.. మోదీ గురించి పంకజ్‌మిశ్రా రాసిన క్లుప్తమైన వ్యాఖ్యానం కూడా ఉంది. ఇది, భారత్‌లో మోదీ పరిపాలన తీరు డొల్లతనాన్ని ఎండగట్టింది.

సోషల్‌మీడియాను మోదీ ఉపయోగించుకున్న తీరు...

ప్రధానిగా ఎంపికయ్యేందుకు నరేంద్ర మోదీ సోషల్‌మీడియాను ఎలా ఉపయోగించుకున్నదీ టైమ్స్‌ మ్యాగజైన్‌ కథనంలో వివరించారు. సంప్రదాయిక మీడియాను తోసిరాజంటూ.. ట్విట్టర్‌ వేదికగా, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకున్నారని ఆ కథనం వివరించింది. స్వయంసత్తాహకంగా దేశాన్ని తీర్చిదిద్దుతానని, భారత ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రక్షాళనకు కృషి చేస్తానని

మోదీ ఇచ్చిన హామీలకు, ప్రస్తుత పాలనతీరు వాస్తవ దూరంగా ఉందని మ్యాగజైన్‌ కథనం పేర్కొంది.

హిందుత్వవాదుల శైలిని కథనంలో ప్రస్తావించిన టైమ్స్‌....

మోదీతో పాటు, హిందుత్వ వాదుల వ్యవహారశైలినీ టైమ్స్‌ మ్యాగజైన్‌ కథనంలో వివరించారు. గుజరాత్‌ ముస్లింల ఊచకోతను ప్రోత్సహించారన్న అభియోగాలు ఎదుర్కొన్న విషయాన్నీ, తమ వైఫల్యాలకు లౌకిక, స్వేచ్ఛవాదులు, పేద ముస్లింలను బలిపశువులను చేస్తున్న వైనాన్ని ఈ కథనంలో ప్రస్తావించారు. అయితే, దేశంలో మోదీ హవా ఇప్పటికీ తగ్గలేదంటూ ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల విజయాన్ని ప్రస్తావించింది. అణగారిన వర్గాల ప్రజల్లో ప్రస్తుతమున్న భయాలు, సాంస్కృతిక అభద్రతను తనకు అనుకూలంగా వినియోగించుకునే రాజకీయ సమ్మోహన కళలో మోదీ నిపుణుడని కూడా టైమ్స్‌ మ్యాగజైన్‌ పేర్కొంది.

06:36 - April 24, 2017

హైదరాబాద్: డాక్టర్లు జెనెరిక్ మందుల పేర్లే రాయాలంటూ కొంతకాలంగా పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలు తొలి విజయం సాధించాయి. వీరు సాగిస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం, ఎంసిఐ స్పందించాయి. డాక్టర్లు పేషెంట్లకు కచ్చితంగా జెనెరిక్ మందులనే రాయాలని, అలారాయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ భారతీయ వైద్య మండలి ఎంసిఐ హెచ్చరించింది. పేషెంట్లకు బ్రాండెడ్ మందులను రాయడానికి వీల్లేదని, పెద్ద అక్షరాలతో స్పష్టంగా అర్ధమయ్యేలా రాయాలని కూడా ఎంసిఐ స్పష్టం చేసింది. అయితే ఇల్లు అలకగానే పండుగ కానట్టు, జెనెరిక్ మందుల విషయంలో ఎంసిఐ తాజా ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత పౌర సమాజం మీద వుంటుంది. ఇంతకీ జెనెరిక్ మందులంటే ఏమిటి? వీటికి బ్రాండెడ్ మందులకు వున్న తేడా ఏమిటి? జెనెరిక్ మందులు నాణ్యమైనవేనా? చౌకగా లభించే జెనెరిక్ మందులు బ్రాండెడ్ మందులంత శీఘ్రంగా పనిచేస్తాయా? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జెనెరిక్ మందుల ఉద్యమనేత , ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవిపాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Don't Miss