Activities calendar

25 April 2017

ఓయూకు వందేళ్ల శుభాకాంక్షలు : పవన్

హైదరాబాద్ : ఓయూ శతాబ్ధి ఉత్సవాలలు జరుపుకుంటున్న సందర్భండా ఓయూ విద్యార్థులకు జనసేన అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మందికి జ్ఞానాన్ని అందిస్తున్న ఓయూ వందనం అని అన్నారు. ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులను తీర్చిదిద్దిన ఓయూ తల్లికి శతాబ్ది శుభాకాంక్షలు.

21:50 - April 25, 2017

ఛత్తీస్‌గఢ్‌ :  రాష్ట్రంలోని  సుకుమా జిల్లాలోని కాలాపత్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై జరిపిన దాడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయం కల్పించేందుకు రోడ్లు వేస్తున్న బృందానికి రక్షణగా వచ్చిన 150 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు లంచ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అదనుగా మావోయిస్టులు వారిపై తుపాకి గుళ్లవర్షం కురిపించారు. మావో మెరుపు దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా...మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మావోలపై ఎదురుదాడికి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

దాడి జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారం
బుర్కాపాల్‌ క్యాంప్‌ నుంచి చింతగుఫా వైపు వెళుతున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై దాడి జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఇంత త్వరగా జరుగుతుందని అధికారులు అంచనా వేయలేకపోయారు. రోడ్డు నిర్మాణపు పనుల్లో ఉన్న 40 మందిని పోలీసులు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టులు కూడా పది మంది మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. వారు వెంటనే శవాలను లాక్కెళ్లినట్లు చెబుతున్నారు.

సూత్రధారి మావోయిస్టు కమాండర్‌ హిడ్‌మాగా
సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై మెరుపుదాడి వెనక ప్రధాన సూత్రధారి మావోయిస్టు కమాండర్‌ హిడ్‌మాగా భావిస్తున్నారు. ఇతడు గెరిల్లా దాడుల్లో ఎక్స్‌పర్ట్‌. 3 వందల మావోయిస్టులతో కలిసి పోలీసులపై గెరిల్లా దాడికి పథక రచన చేసినట్లు సమాచారం. పాతికేళ్ల హిడ్‌మాపై ప్రభుత్వం 25 లక్షల బహుమానం ప్రకటించింది. దక్షిణ బస్తర్‌లోని సుకుమా-బీజీపూర్‌ ప్రాంతంలో మావో సుప్రీం కమాండర్‌గా హిడ్‌మా పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 11న సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై జరిపిన దాడికి హిడ్‌మా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 12 మంది జవాన్లు మృతి చెందారు. మావోల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నల్లటి దుస్తుల్లో వచ్చిన మావోలు రాకెట్‌ లాంచర్లు, గ్రనేడ్లు, క్రూడ్‌ బాంబులతో దాడి చేసినట్లు వారు చెప్పారు. దాడికి పాల్పడ్డ వారిలో మహిళా మావోలు కూడా అధికశాతంలో ఉన్నట్లు చెబుతున్నారు. దాడిలో మృతి చెందిన జవాన్ల నుంచి మావోలు ఆయుధాలను అపహరించుకుపోయారు.

రాజ్‌నాథ్‌సింగ్‌, రమణ్‌సింగ్‌ నివాళులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఛత్తీస్‌గడ్‌ సిఎం రమణ్‌సింగ్‌ నివాళి అర్పించారు. మావోయిస్టుల దాడిని పిరికిపందల చర్యగా హోంమంత్రి వర్ణించారు. డోర్నపాల్‌ ఎన్‌కౌంటర్‌కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి ఉమ్మడి కార్యాచరణతో మావోయిస్టులకు తగిన బుద్ధి చెబుతామని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే సుకుమా జిల్లాలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోంది. రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అదే గనక జరిగితే తమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళనతోనే మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

21:43 - April 25, 2017

హైదరాబాద్ : భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. దుర్గం చెరువుపై కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. బుధవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 184 కోట్ల వ్యయంతో 365.85 మీటర్ల పొడవుతో ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి. బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి ఎలివేటెడ్‌ కారిడార్‌తో కేబుల్‌ బ్రిడ్జిని అనుసంధానం చేయడం వల్ల దూరం బాగా తగ్గనుంది. 

21:40 - April 25, 2017

గుంటూరు : అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. వార్షిక మహానాడు, పార్టీ పటిష్టతపై చర్చించారు. మే 10 నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిపి మే 24న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ తరపున ఐదు కమిటీలు వేసి అధ్యయనం చేస్తామన్నారు.   

21:38 - April 25, 2017

హైదరాబాద్‌ : ప్రసూతి ఆస్పత్రుల్లో సంభవిస్తున్న బాలింతల మరణాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన బాట పట్టింది. మాజీ మంత్రులు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతితో పాటు...పలువురు మహిళా నేతల బృందం నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులను సందర్శించారు. పాతబస్తీలో పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిని పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

నెలరోజుల్లో 15 మంది బాలింతల మృతి
ఆస్పత్రి సందర్శనలో భాగంగా నెలరోజుల్లో 15 మంది బాలింతల మృతిపై కాంగ్రెస్‌ నేతలు ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. రోజుకు 8 వందల మంది రోగులు వచ్చే ఆస్పత్రిలో కేవలం ఆరుగురు వైద్యులు మాత్రమే ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీసం బ్లడ్‌ బ్యాంక్‌ లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయని ఎటువంటి సదుపాయాలు లేవని డీకే అరుణ అన్నారు. వార్డుల్లో శుభ్రతే లేదని మండిపడ్డారు. ఎన్నో ఆశలతో వస్తున్న పేదలు ఆరోగ్యం అందక చనిపోతున్నారని...ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో బాలింతలు చనిపోతున్నా ఆస్పత్రులను సందర్శించే తీరిక మంత్రులకు లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రికి ప్లీనరీ కూలీపై ఉన్న శ్రద్ధ ఆస్పత్రులను సందర్శించడంలో లేదని ఆమె విమర్శించారు. ఆస్పత్రిల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. పేదల సమస్యలపై ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడేంత వరకు ...పోరు ఆపేది లేదని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు.

 

21:33 - April 25, 2017

హైదరాబాద్ : వ్యవసాయం పండుగలా మారిన రోజే బంగారు తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్‌. భవిష్యత్‌లో తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా నిలుస్తాడన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చేపట్టబోతున్న సంస్కరణలపై వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఎరువుల కోసం రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇస్తామన్నారు. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు కేసీఆర్‌. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రైతుహిత సదస్సులో సీఎం, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమాజంలో గౌరవం తగ్గడం బాధాకరమన్నారు కేసీఆర్‌. గతంలో ఎరువులు పోలీస్‌స్టేషన్‌లో పెట్టి పంపిణీ చేశారని.. ఇప్పుడు ఎరువులు, విద్యుత్‌ కొరత లేకుండా చేయగలిగామన్నారు. వచ్చే ఏడాది నుండి రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఎరువులు కొనుగోలు చేసేందుకు ఉచితంగా ఇస్తామన్నారు. ఈ మొత్తాన్ని మే 15లోపు ఒకసారి, అక్టోబర్‌ 15లోపు మరో విడత చెల్లిస్తామన్నారు.

రైతు సంఘాల్లో అవినీతి లేకుండా చూడాలి
రానున్న రోజుల్లో వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన ప్రణాళికలను సీఎం వివరించారు. అధికారులు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. రైతు సంఘాల్లో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ఏఈవోలపై ఉందన్నారు. వచ్చే జూన్‌ నాటికి రాష్ట్రంలోని సాగు భూమి వివరాలను రికార్డులో పొందుపర్చాలని సూచించారు. భూసార పరీక్షలకు రాష్ట్రంలో 2 వేల పరిశోధక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక ప్రగతిలో నెంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ.. వ్యవసాయం రంగంలో పండుగ జరుపుకునే రోజు రావాలన్నారు. దీనిని నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

త్వరలో 500 ఏఈవోల రిక్రూట్ మెంట్
పండించిన పంట మార్కెట్‌ చేసే విధానంపై అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు కేసీఆర్‌. ప్రధాని మోదీతో కూడా తాను వ్యవసాయ రంగంపై చర్చించానన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించేలా ప్రోత్సహించేలా చూడాలని తెలిపానన్నారు. దీంతో దేశం మొత్తం క్రాప్‌ కాలనీగా మార్చవచ్చన్నారు. వ్యవసాయశాఖలో 500 మంది ఏఈవోల రిక్రూట్‌మెంట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వ్యవసాయ అధికారులకు ల్యాప్‌టాప్‌లు, గ్రామాలలో పర్యటించేందుకు వాహనాల కోసం వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని ప్రకటించారు. అనుకున్న ఫలితాలు రావాలంటే అధికారులు ప్రజల భాషలో మాట్లాడి వారితో మమేకం కావాలన్నారు. 

21:18 - April 25, 2017

నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లిలో ఘోరం జరిగింది. నిర్మలమ్మ చెరువులో ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతైయ్యారు. వారు గల్లంతైన చాలా సమయం వరకు తల్లిదండ్రులు గుర్తించ లేదు. చెరువు కట్టపై చెప్పులు ఉండడంతోమ చెరువులో పడినట్లు గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు అధికారులకు తెలపడంతో వారు వచ్చి, గజ ఈతగాళ్లును రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ముగ్గురి బాలికలు, ఓ బాలుడి మృతదేహం వెలికితీశారు. మీగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

21:12 - April 25, 2017

 

100ఏళ్ల ప్రస్థానం... ఎంతోమంది మేధావులు తయారు చేసిన పరిశ్రమల గని ఓయూ. రేపటి నుంచి ఓయూ వందేళ్ల ఉత్సవాలు మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

 

నల్లగొండలో ఘోరం

నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లిలో ఘోరం జరిగింది. నిర్మలమ్మ చెరువులో ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ముగ్గురి బాలికలు, ఓ బాలుడి మృతదేహం వెలికితీశారు. మరో బాలుడి కోసం గాలింపె కొనసాగుతోంది.

 

సూర్యపేటలో విషాదం

సూర్యపేట : జిల్లాలోని మంఠంపల్లి మండలం మట్టపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతాయ్యరు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు నాగార్జున సిమెంట్ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు నవ్యతేజ(24), రాజేష్(25)గా గుర్తించారు.

రంజిత్ సిన్హాపై ఎఫ్ఐఆర్

 

ఢిల్లీ : సీబీఐ మాజీ డైరక్టర్ రంజిత్ సిన్హాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బొగ్గు కుంబకోణం కేసులో రంజిత్ పై సీబీఐ కేసు నమోదు చెసినట్టు తెలుస్తోంది.

ఉచిత ఎరువుల పంపిణీని స్వాగతించిన నీతిఆయోగ్

ఢిల్లీ : రైతులకు ఎరువులు ఉచిత పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని నీతిఆయోగ్ స్వాగతించింది. రుణమాఫీ కన్నా ఉచితంగా ఎరువులు సరఫరా వల్ల పంట ఉత్పాదకత పెరుగుతోందని అభిప్రాయపడింది.

 

20:02 - April 25, 2017

టెన్ టీవీలో ఉస్మానియా యూనిర్సిటీ పై నిర్వహించిన చర్చలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మిరెడ్డి భరద్వాజ్, విద్యార్థి డెవిడ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, పూర్వ విద్యార్థి పిడమర్తి రవి పాల్గొన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ యూనివర్సిటీ తన ప్రభావాన్ని కోల్పోయిందని అన్నారు.అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందన్నారు. యూనివర్సిటీ బాగుపడలాంటే విద్యార్థి విద్యార్థిలాగా ఉండాలి, ప్రొఫెసర్ ప్రొఫెసర్ లాగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు గ్రూప్ లుగా ఉంటే యూనివర్సిటీ మారడం కష్టం అన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు పాన్ డబ్బలగా మారాయన్నారు. డెవిడ్ మాట్లాడుతూ నిజాం గొప్ప ఆలోచనతో విశ్వవిద్యాలయాన్ని నిర్మించారని, అప్పుడు రూ.50 ఫెల్లో షిప్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఉస్మానియాలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నయన్నారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచాలని, వెంటనే పాలక మండలి ఏర్పాడు చేయాలని డిమాండ్ చేశారు. రెండు అంశాలపై రాష్ట్రపతికి లేఖ రాశామని అందులో ఖాళీగా ఉన్న 700 పోస్టులు భర్తీ చేయాలి, విద్యార్థులకు ఫెల్లో షిప్ ఇవ్వలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.200 కేటాయిస్తే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడదల చేయ్యలేదన్నారు. కొన్ని యూనివర్సిటీలకు వీసీలు లేరని అన్నారు. నాగేశ్వర్ మాట్లాడుతూ పూర్వ వైభవం తీసుకురావాలని, యూనివర్సిటీ నిర్థిష్టంగా పై ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. రవి మాట్లాడుతూ ఉస్మానియాకు పూర్వవైభం తీసుకురావడానికి ప్రభుత్వ కృషి చేస్తోందని అన్నారు. ఉత్సవాల తర్వాత యూనివర్సిటీపై చర్చిస్తామని తెలపారు.

 

 

19:10 - April 25, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో డీజల్ కు డబ్బులు లేక పనులు నిలిచిపోయినట్టు తెలిసింది. ట్రాన్స్ రాయ్, త్రివేణి కంపెనీలు 600 వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశాయి. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు పర్యటించినప్పుడు ఒక్క రోజు పనులు నిలిచిపోతే 25 కోట్లు నష్టం వస్తుందని తెలిపారు. కానీ బిల్లులు చెల్లించపోవడంతో పనులు నిలిచిపోవడం వల్ల 50 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి సమాధానం రావడం లేదు.

పెళ్లికొడుకు కాబోతున్న జహీర్ ఖాన్

ముంబై : టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుగ్ నటి సాగరికా ఘాట్గే జహీర్ ప్రేమించుకుని  ఇటివలే నిశ్చితార్థం జరిగినట్లు సాగరికా ఓ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ప్రస్తుదం ఐపీఎల్ లో జాక్ బిజీగా ఉన్నాడని, టోర్ని పూర్తియ్యాక వివాహం గురించి మాట్లాడుకుంటామని ఆమె తెలిపారు.

 

18:55 - April 25, 2017

కృష్ణా : ఆ అమృత ఫలం రైతన్నకు చేదు రుచినే చూపిస్తోంది. ప్రతీ యేటా లాభాల ఫలాన్ని చూపుతుందని ఆశగా ఎదురు చూస్తున్న రైతుకు మామిడిపండు నష్టాన్నే మిగులుస్తోంది. ఇటు కాత లేక కాసిన కాయలకు గిట్టుబాటు ధర రాక రైతుల ఆశలన్నీ నీరు గారిపోతున్నాయి. పండ్లలో రారాజుగా పిలువబడే మామిడి దుస్థితి ఇది. మామిడిని సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఏ యేటికాయేడు పరిస్థితి మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నప్పటికీ రైతుకు ఆశించిన ఫలితాన్ని మామిడి ఇవ్వలేకపోతోంది. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా మామిడి రైతులు పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చెట్లకు సరైన కాపు లేకపోవడంతో రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. మామిడి ఒక ఏడాది కాపు బాగుంటే.. మరో ఏడాది కాపుండదు. ఇది ఈ పంట లక్షణం. ప్రతికూల వాతావరణం, తెగుళ్లతో దిగుబడి చాలా తగ్గింది. మరోపక్క వ్యాపారులు కుమ్మక్కై కాసిన కాతకు కూడా ధర లేకుండా చేస్తున్నారు.

రవాణా ఖర్చులు కూడా రావడం లేదు
వ్యాపారుల జిమ్మిక్కులతో వచ్చినంతే చాలని రైతులు పంటనమ్ముకుంటూ నష్టాల పాలవుతున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యకు పరిష్కారం కల్పిచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలో మామిడిని అత్యధికంగా పండించే తొలి ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఏపీలో దాదాపు 3.25 లక్షల హెక్టార్లకు పై బడి మామిడి సాగవుతోంది. అందులో ఎక్కువభాగం కృష్ణాజిల్లాలో 1.65 లక్షల హెక్టార్లు, చిత్తూరులో 83 వేలు, కడప జిల్లాలో 26, 400 హెక్టార్లు, ప్రకాశం, విజయనగరం, ఉభయగోదావరి, కర్నూలు తదితర జిల్లాలోనూ మామిడి సాగవుతోంది.

అకాల వర్షాలు...
ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో తేమ, మంచు ఎక్కువగా ఉండటం.. మార్చిలో పలు చోట్ల అకాల వర్షాలు కురవటంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నవంబర్‌లో పూత ముందే బాగా వచ్చినా.. ప్రతికూల వాతావరణంతో పంట దెబ్బతింది. నవంబర్‌, డిసెంబర్‌లో చినుకులు కురిసి చిత్తూరు జిల్లాలో మామిడికి మేలు చేసినా అక్కడ కూడా సరైన ధర పలకడం లేదు. కొందరు రైతులు 50, 60 రోజుల వ్యవధిలో 12 నుంచి 13 సార్లు పురుగు మందుల్ని పిచికారి చేసినా తెగుళ్లు అదుపులోకి రాలేదు. ఉద్యానవన శాఖ అంచనా ప్రకారం సగటున ఎకరాకు 8.6 టన్నులు దిగుబడి రావాల్సి ఉంటే.. ఈ ఏడాది టన్ను కూడా రాలేదు. ఫలితంగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నాణ్యత లేని కారణంగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. విజయవాడ మార్కెట్లో మామిడి కాయల్ని మూడు రకాలుగా వర్గీకరించి రేటు నిర్ణయిస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో మార్కెట్‌కు రోజుకు 200 టన్నులు వస్తే ఈ ఏడాది 100 టన్నులకు మించడం లేదు. గతేడాది టన్ను 30 వేల రూపాయలు అమ్మిన బంగినపల్లి రకం ఇప్పుడు గరిష్టంగా 13 వేల రూపాయలు పలుకుతోంది. తోతాపురి రకం గత ఏడాది టన్ను 15 వేలు ఉంటే ఇప్పుడు 6, 7 వేల రూపాయలకు పడిపోయింది. బయట మార్కెట్లో డజను మామిడి రసాలు 250 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఏదేమైనా నష్టం తమకే వస్తుండటంతో.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

 

18:50 - April 25, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలో జరగనున్న అండర్‌ 19 ఫుట్‌బాల్‌ టాలెంట్‌ హంట్‌ టోర్నమెంట్‌ లోగో ఆవిష్కరణ వేడుకలో వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరితో పాటు హీరో నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అండర్‌ 19 ఫుట్‌బాల్‌ టాలెంట్‌ హంట్‌ టోర్నమెంట్‌ లోగోను ఆవిష్కరించారు. హీరో నాని మాట్లాడుతూ దేశంలో ఫుట్‌బాల్‌ ఆటకు ఆదరణ లేదని, ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ఆటకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ప్రపంచంలో భారతీయుల పేరు వినిపించాలంటే ఫుట్‌బాల్‌లో ఇక్కడి యువత రాణించాలన్నారు. పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందడానికి ఆటలు ఎంతగానే ఉపయోగపడతాయన్నారు వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు.  

18:46 - April 25, 2017

ప్రకాశం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెస్తవారిపేట మండలం కలగొట్ల గ్రామసమీపంలో కారును టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఒంగోలుకు చెందిన గంగోజి యోగేంద్రబాబు, గంగోజి ఓంకార బాబు, యూసఫ్‌గా గుర్తించారు. వీరంతా ఒంగోలు నుంచి నంద్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

18:42 - April 25, 2017

ప్రకాశం : అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఐటివరం గ్రామానికి చెందిన తంగిరాల వెంకటేశ్వర్‌రెడ్డి నాలుగు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాడు. ఈ ఏడాది నాలుగు బోర్లు వేశాడు. వీటిలో నీళ్లు పడకపోవడంతో..పంట ఎండిపోయింది. సాగుకు, బోర్లకు నాలుగు లక్షల అప్పు కావడంతో.. ఎలా తీర్చాలో అర్థం కాక మనస్థాపంతో పొలంవద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యా, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.

18:39 - April 25, 2017

చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు లారీ ప్రమాదానికి కారకులైన లారీ ఓనర్‌ రమేష్‌, ఇద్దరు డ్రైవర్లు గురవయ్య, సుబ్రమణ్యంను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రమాద సమయంలో లారీని నడిపింది సుబ్రమణ్యమని చిత్తూరు జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఇద్దరు డ్రైవర్లకు హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ లేదన్నారు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇసుక మాఫియాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. 

18:35 - April 25, 2017

గుంటూరు : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. టూరిజం అభివృద్ధికి కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్ట్‌లపై చర్చించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం, కన్సల్టెంట్లను నియమించుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే చారిత్రక ప్రాధాన్యం ఉన్న గ్రామాలను టూరిజం ప్లేస్‌లుగా మలిచేందుకు ప్రయత్నించాలన్నారు. 2020 నాటికి దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలవాలని 2029 నాటికి మొదటి స్థానానికి చేరుకోవాలని లక్ష్యం నిర్దేశించారు. అలాగే రాజమండ్రి, విజయవాడ, విశాఖలో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిల ప్రియ రాష్ట్రంలో స్ట్రీట్‌ థియేటర్ల నిర్వహణ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. 

నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు

పశ్చిమ గోదావరి : జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో డీజల్ కు డబ్బులు లేక పనులు నిలిచిపోయినట్టు తెలిసింది.

అబొట్టాబాద్ లో ఎట్టకేలకు శివపూజలు

ఇస్లామాబాద్ : దేవాలయ భూమిలో వివాదం ఏర్పడంతో 20 ఏళ్లుగా పూజకు నోచుకోని పాకిస్థాన్ లోని అబొట్టాబాద్ ఖైబర్ పష్తూన్ కాలోని శివజీ దేవాలయంలో ఎట్టాకేలకు పూజలు జరగునున్నాయి. ఆ దేవాలయంలో పూజాలు చేసుకునేందుకు హిందువులు పెషావర్ హై కోర్టు నుంచి అనుమతి వచ్చింది.

17:47 - April 25, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై 'పట్నం' ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లధనం ఎంత వెలికి తీశారో కేంద్రం దగ్గర సరైన సమాధానం లేదన్నారు. అత్యవసర సమయంలో కూడా నగదు డ్రా చేయాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని. ఈ సమస్యపై బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

17:42 - April 25, 2017

కరీంనగర్ : రైతుల కోరిక మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తక్కువ ధరకు వరి ధాన్యాన్ని అమ్ముకోవద్దని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి జరిగితే వాటిలో 40 లక్షలకు పైగా ధాన్యాన్ని సివిల్‌ సప్లై సంస్థ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి 2 లక్షలకు పైగా జనాన్ని తరలిస్తామన్నారు.

17:37 - April 25, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ వందేళ్ల పండగకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా..ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఓయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణం వేదిక కాబోతుంది. సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళాకారులు సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరుకానున్న నేపథ్యంలో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లును పరిశీలిస్తున్న పెద్దపల్లి ఎంపీ బాల్క సమన్ మాట్లాడుతూ ఉస్మానియా విద్యార్థిగా ఉండడం అదృష్టమని, శతాబ్ధి ఉత్సవాల ఏర్పాట్ల ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల నుంచి ఎటువంటి గొడవలు లేకుండా మాట్లాడామని పేర్కొన్నారు. పిడమర్తి రవి మాట్లాడుతూ ఉస్మానియాలోనే ఉద్యమ స్ఫూర్తి ఉందన్నారు.

తెలుగు తమ్ముళ్ల గలాట

తూర్పు గోదావరి : పి.గన్నవరంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో ఘర్షణ చెలరేగింది. ఎమ్మెల్యే నారాయణ మూర్తి ఎదుటే పి.రాంబాబు, జి.నాగసత్యనారయణ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో నేతలు ఎన్నికలు వాయిదా వేశారు.

17:22 - April 25, 2017

సమ్మర్ రాగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి పండ్లు , ఇవి వేసవి సీజన్‌లో విరివిగా లభించే పండ్లు . ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో చాల విసరివిగా లభిస్తాయి. బంగారపు వన్నె కలిగి పసుపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు . అలాంటి మామిడి పండును ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పరిశోధకులు తెలిపారు. అలాంటి మామిడి పండులో క్యాలరీల శక్తి, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు పదార్థం ఇలా అనేక పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఈ పండును ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణిస్తారు. మామిడి పెద్ద పేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరొటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది. మామిడిలో ఉండే పొటాషియమ్‌ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్‌ డిసీజెస్‌)నూ, రక్తపోటునూ నివారిస్తుంది. మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.

చంద్రబాబును కలిసిన టీటీడీపీ నేతలు

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీపీ నేతులు కలిసారు. ముందస్తు ఎన్నికలు, పొత్తులు అంశాలపై ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అనుసరిస్తోన్న వైఖరిపై టీ.టీడీపీ నేతల అభ్యంతరం తెలిపారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవరిస్తున్నారని బాబుకు నేతలు వివరించారు.

 

ఏపీలో సూర్యిడి భగభగ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధికంగా నంద్యాల, తిరుపతిలో 44, కడప, కర్నూలు, నెల్లూరులలో 43 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైయింది. 

తెలంగాణలో @43

హైదరాబాద్ : తెలంగాణలోమ ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా నల్లగొండ, భద్రాచలం, ఖమ్మంలో 43, మహమూబ్ నగర్, రామగుండంలో 42, హైదరాబాద్, నిజామాబాద్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

 

రేపు నగరంలో ట్రాపిక్ ఆంక్షలు

హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 వరకు బేగంపేట నుంచి ఓయూ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రేపు సాయంత్రం ఇప్లూ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 

16:50 - April 25, 2017

ముంబై : మాలేగావ్‌ పేలుళ్లు కేసులో 5 లక్షల పూచికత్తుపై సాధ్వి ప్రగ్యసింగ్‌ ఠాకూర్‌కు ముంబై హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నగదుకు ఇద్దరు హామీగా ఉండాలని...ప్రగ్య పాస్‌పోర్టును ఎన్‌ఐఏకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ట్రయల్‌ కోర్టులో విచారణకు ప్రగ్య హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంతకుముందు సరైన సాక్షాధారాలు లేవన్న కారణంతో దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సాధ్వికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కాగా... ట్రయల్‌ కోర్టు ఆమెకు బెయిల్‌ నిరాకరించింది. ఈ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌కు మాత్రం బెయిల్‌ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. 2008లో మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. మోటార్‌ సైకిళ్లలో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు సాధ్వి ప్రగ్యతో పాటు 11 మందిని అరెస్ట్‌ చేశారు. తర్వాత ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు.

 

ఓయూలో ముందస్తు అరెస్టులు

హైదరాబాద్ : ఓయూ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీవీయూవీ నేత రమేష్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

16:43 - April 25, 2017

విజయవాడ : నగంలో భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి అలంకార్‌ ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 'చలో విజయవాడ' కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించమని గత మూడేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని భవన నిర్మాణ కార్మికులంటున్నారు. రాబోయే అన్ని సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

16:39 - April 25, 2017

హైదరాబాద్ : సేవ్‌ ధర్నాచౌక్‌ పేరుతో సీపీఐ ఆందోళన ఉద్ధృతమవుతోంది. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ మహిళా సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకొనే వేదిక ధర్నా చౌక్‌ అని దానిని ఎత్తివేయడం అప్రజాస్వామికమని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. మే 14 వరకు రిలే దీక్షలు కొనసాగుతాయని.. మే 15న చలో ఇందిరాపార్క్‌ నిర్వహిస్తామని చెప్పారు. 

16:34 - April 25, 2017

సిరిసిల్ల : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్‌ బట్టల చెరువు భూ నిర్వాసితులను కలుసుకున్నారు. చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అవకతవకలను తెలుసుకున్నారు. 70, 80 సంవత్సరాల నుంచి ఈ భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. కొంతమంది బినామీలు పరిహారం పొందారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

 

16:28 - April 25, 2017

హైదరాబాద్‌ :నగంలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ సలహాదారు ఆర్‌. విద్యాసాగర్‌ రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్య చికిత్సకు విద్యాసాగర్‌ రావు బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం వెంటిలేషన్‌ లేకుండా శ్వాస తీసుకోగలిగారని వైద్యులు సీఎంకు తెలిపారు. 

స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు

ముంబై : స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ రికార్డు క్రియేట్ చేసింది. నిఫ్టీ తొలిసారి 9,300 మార్కును దాటింది.

 

16:16 - April 25, 2017

సూర్యపేట : జిల్లాలోని హూజుర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గ పోరు మొదలైయింది. వరంగల్ బహిరంగ సభ సన్నాహక కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.శంకరమ్మ మండల స్థాయి నాయకులకు సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. పరిశీలకునిగా వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే ఇరువర్గాలు గొడవకు దిగారు.దీంతో ఆయన ఇరువర్గాలను సముదాయించే ప్రయత్న చేశారు. అయితే శంకరమ్మ స్థానిక నేత కాకపోవడంతో మొదటి నుంచి అక్కడి నేతలు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. 

మార్కెట్లోకి ఫోక్స్ వేగన్ పోలో జీటీ స్పోర్ట్

ఢిల్లీ : జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్ వేగన్ మంగళవారం జీటీ స్పోర్ట్ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.9.21లక్షలుగా కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ లో అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. 1.2లీటర్ ఇంజన్ కలిగిన పెట్రోల్ వెరియంట్ ధర రూ.9.11లక్షలుగా, 1.5 ఇంజిన్ కలిగిన డీజిల్ వాహనం ధర రూ.9.21లక్షలుగా ఉంది.

 

15:50 - April 25, 2017

హైదరాబాద్ : ఎందరో విద్యావేత్తలను, మేధావులను తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నాటి హైదరాబాద్‌ రాజ్యంలో ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం. వందేళ్లనాటి ఇంజనీరింగ్‌ ప్రతభను నేటీకీ చాటుతూ ఆద్భుతంగా భాసిల్లుతోంది.. ఆర్ట్స్‌ కళాశాల భవనం. హైద‌రాబాద్ అంటే చార్మనార్‌ ఎలా గుర్తుకు వ‌స్తుందో .. ఉస్మానియా యూనివ‌ర్సిటి అనగానే ఇక్కడి ఆర్ట్స్ కాలేజీయే అందరి మదిలోనూ మెదులుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రతిపాదన 1873లోనే జరిగింది. ఆనాటి ఇద్దరు ప్రముఖ మేధావులు రఫత్ యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్‌ఘనీ ఈ విషయమై చొరవ తీసుకున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ కాలంలోనే జమాలుద్దీన్‌ అఫ్‌ఘనీ పారిస్ నగరంలో స్థిరపడ్డారు. అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన బ్లంట్‌ని 1882లో కలిసినప్పుడు హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ఏర్పాటు గురించి ప్రస్తావించారట. అలా ఈ చదువుల సౌధానికి తొలి ప్రతిపాదన జరిగింది. ఆతర్వాత బ్రిటీష్‌ఎంపీ బ్లంట్ నిజాం ఆస్థానంలోని ప్రధానమంత్రి సాలార్‌జంగ్-2ను కలిసి.. విశ్వవిద్యాలయ ఏర్పాటుపై చర్చించారట. అనంతరం ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు 1883 జనవరి 24న వర్సిటీ ఏర్పాటుకు లిఖిత పూర్వక ప్రతిపాదన అందజేశారు. 1913లో ప్రాంతంనుంచే హైదరాబాద్‌ రాజ్యంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ.. దార్-ఉల్-ఉలూం పేరిట విద్యార్థులు నగరంలో ప్రదర్శనలు కూడా జరిపేవారట. ఈ నేపథ్యంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సింహాసనం అధిష్ఠించారు. 1914లో విద్యార్థి సంఘం నాయకులు పబ్లిక్ గార్డెన్స్‌లోని టౌన్ హాలులో ఏడవ నిజాం ప్రభువును కలిసి తమ ప్రతిపాదనను ఆయన ముందుంచారని, దీనిపై స్పందించిన నిజాం నవాబు తన అంగీకారం తెలిపాడని చరిత్రకారులు చెబుతారు.

అద్దె భవనంలో మొట్టమొదట తరగతులు..
ఓవైపు ఆరవ నిజాంకాలంలో జరిగిన కృషి, విద్యార్థులు, మేధావుల కోరిక మేరకు 1917 ఏప్రిల్‌ 26న 7వ నిజాం లాంఛనంగా ఫర్మానా జారీ చేశారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుత అబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో మొట్టమొదట తరగతులు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్‌ సర్ పాట్రిక్ గాడ్డెస్ నేతృత్వంలో అడిక్‌మెట్ ప్రాంతంలో 1700 ఎకరాల విశాలమైన స్థలాన్ని విశ్వవిద్యాలయం కోసం కేటాయించింది ఏడవ నిజాం ప్రభుత్వం. ఆ తర్వాత వర్సిటీ భవన నిర్మాణానికై నమూనాల ఎంపిక కోసం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు నవాబ్ జైన్ యార్‌జంగ్, సయ్యద్ అలీ రజాలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో ఈజిప్టులో బెల్జియం ఆర్కెటెక్ట్ జాస్పర్‌ను కలిసి హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ బిల్డింగ్స్‌ రూపకల్పనపై చర్చించారట. తర్వాత నవాబ్ జైన్, ఆయన మిత్రులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, విశ్వవిద్యాలయ భవన రూపకల్పన కోసం ఈజిప్టు ఆర్కిటెక్ట్ జాస్పర్ పేరును 7వ నిజాందగ్గర ప్రతిపాదించారు. అలా నిజాం అనుమతితో జాస్పర్ పదవీ బాధ్యతలు చేపట్టి బీదర్, గోల్కొండ, చార్మినార్, ఎల్లోరా, అజంతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భారతీయ శిల్పకళ, సంస్కృతీ విధానాలను ఆకళింపు చేసుకుని, హైదరాబాద్ సంస్కృతితో మేళవించి.. ప్రస్తుతం ఉన్న ఓయూ ఆర్ట్స్ కళాశాల భవన నమూనాను రూపొందించారు. దీంతో వర్సిటీ భవన నిర్మాణ పనులకు ఏడో నిజాం పునాది రాయి వేశారు. ఈ భవన నిర్మాణంలో సుమారు 35 వేల మంది కార్మికులు శ్రమించారు. కళాశాల ప్రధాన భవనం 110 మీటర్ల వెడల్పు, 119 మీటర్ల ఎత్తుతో రెండంతస్తుల్లో నిర్మించారు. సుమారు 164 విశాలమైన తరగతి గదులతో ఈ చదువుల కోవెల కొలువుదీరింది. దీని నిర్మాణం కోసం ఆ రోజుల్లో దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేసింది నిజాం ప్రభుత్వం. సుమారు ఐదున్నరేళ్లపాటు నిరంతరంగా కొనసాగి.. 1919 డిసెంబర్ 5 నాటికి పూర్తయింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణంలో హ్యూమ్ పైప్ కంపెనీ, హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కళాశాల నిర్మాణ శైలిలో సర్వమత సమ్మేళనం కనిపించేలా తీర్చిదిద్ది.. తమ విశాల దృక్పథాన్ని చాటుకున్నారు నిజాంపాలకులు.

87దేశాలకు చెందిన 4వేల మంది విద్యార్థులు
భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ..1919లో ఇంటర్ తరగతులతో కళాశాల ప్రారంభమైంది. 1921 నాటికి బీఏ, 1923 నుంచి పీజీ తరగతులు మొదలయ్యాయి. కాలేజీ ప్రారంభంలో ఉర్దూ మాధ్యమంలోనే తరగతులు నిర్వహించినా.. 1948 నుంచి ఇంగ్లిష్‌లో కూడా బోధన ప్రారంభించారు. యూనివర్సిటీలో విదేశీ భాషల్లోనూ బోధన జరుగుతోంది. ప్రస్తుతం 87దేశాలకు చెందిన 4వేల మంది విద్యార్థులు ఓయూలో చదువుకుంటున్నారు. వందేళ్లనుంచి విద్యావెలుగులను పంచుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మేధావులు, ప్రముఖులను దేశానికి అందించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ వైవీరెడ్డి, ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఆజారుద్దీన్‌ లాంటివారు ఈ విశ్వవిద్యాయలంలో చదువుకున్నవారే. చదువులకే కాదు.. సమకాలీన సమస్యలపై గళం విప్పి.. ప్రత్యక్ష్య ఉద్యమంలో దూకడానికి ఓయూ సదా సిద్ధంగా ఉంటూనే వచ్చింది. స్వాతంత్ర్య పోరాటం నుంచి రజాకార్ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు .. ఈ యూనివర్సిటీ విదయార్థులు సమరశీల పోరాటాలు జరిపారు. ఇలా ఈ విశ్వవిద్యాలయం భవనం ఉన్నత చదువులు, రాజకీయ, సామాజిక ఉద్యమాలకు వేదిగా.. తన విశిష్ట చరిత్రను కళ్లముందు నిలపడంతోపాటు.. జాతి వారసత్వ సంపదగా ఓయూ భవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

 

 

 

చోటాకు ఏడేళ్లు జైలు

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్  చోటా రాజన్ నకిలీ పాస్ పోర్టు కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడించింది. పాటియాలహౌస్ కోర్టు చోటా రాజన్ కు 7 ఏళ్లు శిక్ష విధించింది. ఆయనతో పాటు బెంగళూర్  పాస్ పోర్టు ఆఫీస్ లో చోటా రాజన్ సహకరించిన ముగ్గురు అధికారులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

15:29 - April 25, 2017

హైదరాబాద్ :తెలంగాణలో కార్పొరేట్‌ కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ స్వీకరించిన హైకోర్టు, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీతో పాటు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌మిడియట్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కార్పొరేట్‌ కాలేజీల ఫీజుల దోపిడీని ప్రభుత్వానికి వివరించినా స్పందించలేదని..అందుకే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని పిటిషనర్‌ చొప్పదండి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మేడిపల్లి సత్యం అన్నారు.

ఆర్టీఏ కమిషనర్ పై దాడి సుమటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్ : విజయవాడ ఆర్టీఏ కమిషనర్ పై దాడి కేసును హైకోర్టు సమోటోగా స్వీకరించింది. మీడియీ కథనాలను పిటిషన్ గా కోర్టు స్వీకరించింది. ఈ కేసులో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో సహా 11 మందికి కోర్టు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. కొన్ని రోజుల క్రింద ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలసి ఆర్టీఏ కమిషనర్ బాల సుబ్రమణ్యం దాడిపై చేశారు. దీనిపై సీఎం ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధులు కమిషనర్ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.

15:19 - April 25, 2017

హైదరాబాద్ : విజయవాడ ఆర్టీఏ కమిషనర్ పై దాడి కేసును హైకోర్టు సమోటోగా స్వీకరించింది. మీడియీ కథనాలను పిటిషన్ గా కోర్టు స్వీకరించింది. ఈ కేసులో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో సహా 11 మందికి కోర్టు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. కొన్ని రోజుల క్రింద ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలసి ఆర్టీఏ కమిషనర్ బాల సుబ్రమణ్యం దాడిపై చేశారు. దీనిపై సీఎం ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధులు కమిషనర్ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.

విద్యాసాగర్ రావుకు సీఎం పరామర్శ

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నగంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్. విద్యాసాగర్ రావును పరామర్శించారు.

14:56 - April 25, 2017

హైదరాబాద్ : బీఎస్ ఎన్ఎల్ టెలి కమ్యూనికేషన్స్‌ రంగం కమర్షియల్‌ వైఫై ఫోర్‌ జీ ప్లస్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని అబిడ్స్‌ భారత్‌ సంచార్‌ నిఘం లిమిటెడ్‌ కార్యాలయంలో బీఎస్‌ఎన్‌ ఎల్‌ తెలంగాణ కమ్యూనికేషన్స్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ వైఫై ఫోర్‌ జీ ప్లస్‌ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఆరు ప్రాతాలలో వైఫై సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. తెలంగాణలో మరో 121 లోకేషన్స్‌లో 921 అక్సెస్‌ పాయింట్స్‌ హాట్‌ స్పాట్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని జీఎం తెలిపారు.

 

14:53 - April 25, 2017

నల్లగొండ : నల్లగొండ జిల్లా, కొండమల్లెపల్లి మండలం, కొర్రోనితండాలో విషాదం చోటు చేసుకుంది. కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

14:49 - April 25, 2017

హైదరాబాద్ : వ్యవసాయ పథకల్లో అమలులో అధికారులదే కీలక పాత్ర పొషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే వ్యవసాయ పెట్టుబడుల పంపణీ పథకంలో దళారులకు ప్రమేయం లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆయన కోరారు. నకిలీ పాసు పుస్తకాలతో తహసీల్దార్లు, బ్యాంకు మేనేజర్లు పంట రుణమాఫీని దోచుకుతిన్న విధంగా వ్యవసాయ పెట్టుబడుల పంపిణీ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.

 

14:43 - April 25, 2017

హైదరాబాద్ : వ్యవసాధికారులకు ఇజ్రాయిల్‌ పర్యటన యోగం పట్టనుంది. ఇజ్రాయిల్‌ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు రెండు వందల మందిని ఆదేశం పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని దేశించారు. పంటలకు వచ్చే చీడపీడల నివారణ, ఎరువుల వాడకంపై అధ్యయనం చేసేందుకు ఇజ్రాయిల్‌ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

14:41 - April 25, 2017

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 500 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగిన వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. అలాగే వ్యవసాయ సమాచారం భద్రపరిచేందుకు వ్యవసాయాధికారులందరికీ పన్నెండు రోజుల్లో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు కొనివ్వాలని కోరారు.

 

రాయదుర్గంలో చిరుత కలకలం

అనంతపురం : జిల్లాలోని రాయదుర్గం మండలం మల్లాపురంలో గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. శ్రీనివాస్ రెడ్డి అనే రైతుకు చెందిన రెండు పశువులపై దాడి చేసింది. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

14:18 - April 25, 2017

గుంటూరు : వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తుళ్లూరు పీఎస్ లో పోలీసు విచారణకు హాజరైయ్యారు. ఇతనిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇందూరి రవికిరణ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మధుసూదర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇందూరి రవికిరణ్ కు , వైసీపీ సంబధంలేదని ఆయన తెలిపారు. రవికిరణ్ టీడీపీ పైనే కాకుండా అన్ని పార్టీలపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టారని అన్నారు. టీడీపీ వెబ్ సైట్ లో జగన్ , కేసీఆర్ లపై సెటైర్లు వేశారని వాటిని చూపించారు. రవికిరణ్ మాట్లాడుతూ కేవలం వైసీపీపై అభిమానంతో పోస్టులు పెట్టానే తప్ప వైసీపీ తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

 

విచారణకు హాజరైన మధుసూదన్ రెడ్డి

గుంటూరు : వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తుళ్లూరు పీఎస్ లో పోలీసు విచారణకు హాజరైయ్యారు. ఇతనిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటూరి రవికిరణ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మధుసూదర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

 

13:39 - April 25, 2017

హైదరాబాద్: మిర్చి రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక కల్లాల్లోనే తగలబెట్టే పరిస్థితులు దాపురించాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా మిర్చి మంటలే కనిపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం కామెలపేటలో గిట్టుబాటు ధర లేక 50 క్వింటాళ్ల మిర్చిని రైతులు తగలబెట్టారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా రవాణ ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో కల్లంలోనే తగలబెట్టినట్టు రైతులు చెబుతున్నారు.

13:38 - April 25, 2017

ఢిల్లీ : మావోయిస్టుల చర్యను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ దీన్ని అంగీకరించరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికే చర్యలను తీసుకుంటోందని వెంకయ్యనాయుడు తెలిపారు.

 

13:37 - April 25, 2017

హైదరాబాద్: మాజీ మంత్రులు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి, ఎమ్మెల్యే ఆకుల లలిత పలువురు మహిళా నేతల బృందం పాతబస్తీలోని ప్లేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిని సందర్శించింది. బాలింతల వరస మరణాలపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎటువంటి సదుపాయాలు లేవని..ఆస్పత్రికి పేదవారు నానా ఇబ్బందులు పడుతున్నారని డీకే అరుణ అన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మానేసి...ఇప్పటికైనా ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

13:35 - April 25, 2017

ఛత్తీస్‌గఢ్‌ : డోర్నపాల్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 26మంది సీఆర్పీఎఫ్‌ అమర జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాయ్‌పూర్‌లో నివాళులర్పించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ వెంట ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కూడా అమరజవాన్లకు నివాళులర్పించారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన రాజ్‌నాథ్‌సింగ్‌..26 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టులపై ప్రతీకార దాడి తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చత్తీస్‌గఢ్‌, ఒడిస్సా, ఆంధ్రా సరహద్దుల్లో మవోయిస్టుల కోసం భారీ ఎత్తున కూంబింగ్‌ చేపట్టామన్నారు. డోర్నపాల్‌ ఎన్‌కౌంటర్‌కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి ఉమ్మడి కార్యాచరణతో మావోయిస్టులకు సమాధానం చెప్తామని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. అమరజవాన్ల త్యాగాలను వృధా కానివ్వమని..దీటుగా సమాధానం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

29,30 తేదీల్లో విశాఖలో బిజెపి కార్యకవర్గ సమావేశం

అమరావతి: 29,30 తేదీల్లో విశాఖలో బిజెపి కార్యకవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం పై చర్చించనున్నట్లు సమాచారం.

పిట్లబురుజు ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ మహిళా నేతలు

హైదరాబాద్: పిట్లబురుజు ఆస్పత్రిని మాజీ మంత్రులు డీకే అరుణ, సునిత, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. బాలింతల మరణాల నేపథ్యంలో నేతలు సందర్శించారు.

ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ..ప్రతీకారం తీర్చుకుంటా: రాజ్ నాథ్

ఛత్తీస్ గఢ్ : సుక్మా జిల్లాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉదయం రాయ్ పూర్ కు వచ్చిన ఆయన, మృతదేహాలకు నివాళులు అర్పించిన ఆయన, జవాన్ల త్యాగాన్ని వృథాకానీవ్వబోమని అన్నారు. ఈ ఘటనను ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ గా అభివర్ణించిన ఆయన, ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఈ రీజియన్ లో అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సల్స్ వ్యూహమని, ఇకపై తాము వామపక్ష తీవ్రవాదంపై వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్పారు. షెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉన్న ప్రాంతాలపై పట్టును చూపుకునేందుకే మావోలు తెగబడ్డారని, వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

12:35 - April 25, 2017

హైదరాబాద్: తెలంగాణను క్రాప్ కాలనీలుగా విభజిస్తామని, 500ల మంది ఏఈఓల నియామకంచేపడతామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైటెక్స్ లో వ్యవసాయ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...అగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల భాషలో మాట్లాడాలన్నారు. రైతులకు అర్థమయ్యేలా ఆధునిక విధానాలు వివరించాలన్నారు. ఎక్కువ మందికి ఉపాధి కలిగించేది వ్యవసాయ రంగమేనన్నారు. వ్యవసాయం అంటే ప్రత్యేక జీవన సరళి ఉండాలన్నారు. రాష్ట్ర విభజన కాకముందు తెలంగాణ లో వ్యవసారంగం దుర్భరంగా ఉందన్నారు. వ్యవసాయాన్ని లాబసాటిగా మార్చేందకు శాస్త్రీయ పద్ధతులను అవలంభించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లో వ్యవసాయం ఎందుకు నష్టాల్లో ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణ లో కరెంట్ పోతే వార్త తప్ప ఉంటే వార్త కాదన్నారు. వ్యవసాయరంగంలో మరో 500 ల మంది పోస్టులను భర్తీ చేస్తామని, నెలలోపు రిక్రూట్ మెంట్ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు. రైతులకు ఎరువుల సాయాన్ని ప్రకటించగానే కాంగ్రెస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఏడాది మేలో 4వేలు, అక్టోబర్ లో 4 వేలు ఇచ్చి తీరుతామన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ యొక్క పద్దతి మారాలన్నారు. గ్రౌండ్ లెటస్ ట్రస్ట్ ఆఫీసర్స్ గా ఉండాలన్నారు. తెలంగాణాలో వ్యవసాయ లాభాసాటిగా మార్చేందుకు యజ్ఞం మొదలైందన్నారు. ఇద భారత దేశానికే దిక్చూకి అవుతుందన్నారు. రైతుల సహాయంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యమ కాలంలో చేసిన ఇపుడు ఇప్పుడు నిజమౌతున్నాయన్నారు. ఎరువుల కొరత లేకుండా ప్రతి గ్రామంలో ఏఈఓ ఆధ్వర్యంలో రైతు సంఘం ఏర్పాటు చేయాలన్నారు. ఈ స్కీలో పైరవీ కారులు, దొంగలు రావద్దని విజ్ఞప్తి చేశారు.

12:32 - April 25, 2017

హైదరాబాద్: ఎందరో మేధావుల్ని అందించిన ఉస్మానియ యూనివర్శిటీ శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటోంది. ఓయూ లో మహిళల పాత్ర ఇదే అంశంపై మానవి 'వేదిక' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తొలిమహిళా ప్రిన్సిపల్ గా పని చేసిన లక్ష్మి, తొలి రిజిస్ట్రార్ గా పని చేసిన బీనా పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

హైటెక్స్ లో వ్యవసాయ అధికారుల సమావేశం

హైదరాబాద్: హైటెక్స్ లో వ్యవసాయ అధికారుల సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

గడియ గౌరారం సమీపంలోని కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

నల్గొండ: చింతపల్లి మండలం గడియ గౌరారం సమీపంలోని కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.2కోట్ల ఆస్థి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

కాలిబూడిదైన సింగరేణి కార్మికుడు

ఆసిఫాబాద్: జిల్లాలోని రామకృష్షపూర్ లో సింగరేణి కార్మికుడు బొద్దుల దశరథం తన ఇంట్లో అనుమానస్థితిలో కాలిబూడిదై మృతి చెందాడు. ఘటనలో ఇళ్ళు పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. మృతుని భర్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వడగాల్పులు ప్రారంభమయ్యాయి. సూర్యడి నుంచి వస్తున్న బ్లూరేస్‌ నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. అల్ట్రావైలెట్‌ రేస్‌ శరీరంపై పడితే ప్రమాదమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్ర 5 గంటల వరకు బయట తిరగవద్దని సూచిస్తున్నారు.

11:37 - April 25, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వడగాల్పులు ప్రారంభమయ్యాయి. సూర్యడి నుంచి వస్తున్న బ్లూరేస్‌ నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. అల్ట్రావైలెట్‌ రేస్‌ శరీరంపై పడితే ప్రమాదమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్ర 5 గంటల వరకు బయట తిరగవద్దని సూచిస్తున్నారు.

11:36 - April 25, 2017

చెన్నై: రైతుల కోసం డీఎంకే సహా ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ తమిళనాడులో కొనసాగుతోంది. దీన్ని అఖిలపక్ష బంద్‌గా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మరికొన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే తదితర పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి. తమిళనాడు వర్తకుల సమాఖ్య, వ్యాపారుల సమాఖ్య, రవాణా కార్మికుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. 10వేల పెద్ద, చిన్న హోటళ్లు మూతపడ్డాయి. పౌరసరఫరాలు, ప్రజా రవాణా దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సులను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయన్న కారణంతో భారీ బందోబస్తు నడుమ వాటిని తిప్పుతున్నారు. బస్టాండ్లలోనూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. చెన్నైలో 13వేల మంది..రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.

11:35 - April 25, 2017

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని డోర్నపాల్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్రం కోరంది. దీంతో నివేదికను సీఆర్పీపీఫ్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారు. సాయంత్రంలోగా ఎన్‌కౌంటర్‌పై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు. అయితే డోర్నపాల్‌ ఎన్‌కౌంటర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్ల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏకే 47కు సంబంధించిన 22 రైఫిళ్లు అలాగే ఏకేఎం-4, ఇన్‌సాస్‌ రైఫిల్స్‌-2, ఇన్‌సాస్‌ ఎల్‌ఎంజీ-2ను మావోయిస్టులు ఎత్తుకెళ్లిపోయారు.

11:33 - April 25, 2017

మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్విప్రగ్యాకు బెయిల్

హైదరాబాద్: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్విప్రగ్యాకు బెయిల్ మంజూరు అయ్యింది. రూ.5లక్షల పూచీకత్తుతో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రాయ్ పూర్ కు చేరుకున్న రాజ్ నాథ్

ఛత్తీస్ గఢ్: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాయ్ పూర్ కు చేరుకున్నారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన జవాన్ల మృతదేహాలకు రాజ్ నాథ్ నివాళులర్పించనున్నారు.

రేపు రాష్ట్రపతి రాక .. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి హైదరాబాద్‌లో బుధవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందనిసిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ కార్యక్రమం తరువాత రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

పోలీసుల ముందుకు వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి

అమరావతి: వైసీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధుసూదన్ రెడ్డి నేడు తుళ్లూరు (అమరావతి) పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. శాసనమండలిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నేపథ్యంలో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో, నేడు ఆయన తుళ్లూరు పోలీసుల ముందు హాజరవుతున్నారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికుమార్ తో ఈయనకు ఉన్న సంబంధాల గురించి పోలీసులు విచారణ జరపనున్నారు.

10:46 - April 25, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల సంబరాలకు సిద్ధమైంది. ఒకప్పుడు ఎంతో ఘనకీర్త వహించిన ఈ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థుల రాశి పెరిగినా, ప్రమాణాల వాసి పెరగలేదు. ఒప్పుడు దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రమాణాలు పడిపోవడంతో నాక్‌ గుర్తింపు కోల్పోయింది.

ఏదో ఒక సిద్ధాంత వ్యాసం రాసినా పీహెచ్‌డీ ....

క్లాసులకు హాజరు కాకపోయినా, పరీక్షల్లో మార్కులు వేస్తారన్న భావన విద్యార్థుల్లో ప్రబలింది. ఏదో ఒక సిద్ధాంత వ్యాసం రాసినా పీహెచ్‌డీ పట్టా ఇచ్చేస్తారన్న ధీమాతో రీసర్చ్‌ స్కాలర్లు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ చేసిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్తగా అధ్యాపకులను తీసుకోవడంలేదు. భర్తీ చేసినా కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమిస్తున్నారు. ఇలాంటి వారు బోధనపై ఆసక్తి చూపడంలేదన్న వాదనలు వినిపిన్నాయి. దీంతో మొక్కుబడి తంతుగా పాఠాలు చెబుతున్నారన్న అపవాదును ఈ విశ్వవిద్యాలయం ఎదుర్కొంటోంది.

2013 తర్వాత బోధనా సిబ్బంది నియామకాలు లేవు ...

విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అధ్యాపకులు తగ్గిపోతున్నారు. 2013 తర్వాత బోధనా సిబ్బంది నియమాకాలు జరగలేదు. నిబంధల ప్రకారం 15 వందల నుంచి రెండు వేల మంది వరకు అధ్యాపకుల ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్నది 530 మంది మాత్రమే. 2018 నాటికి 150 ప్రొఫెసర్టు ఉద్యోగ విమరణ చేయబోతున్నారు. దీంతో ప్రొఫెసర్ల కొరతలో బోధనతోపాటు, పరిశోధన పడకేసింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థాయిలో అధ్యాపక నియామకాలు జరుగుతాయి. ప్రమోషన్‌ మీద అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆ తర్వాత ప్రొఫెసర్‌ అవుతారు. ఇందుకు 13 ఏళ్ల సమయం పడుతుంది. దీనిని బట్టి పరిశీలిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సమీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు. పరిశోధక విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రొఫెసర్లే లేకపోవడంతో పీహెచ్‌డీ నోటిఫికేషన్లు కూడా జారీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. యూనివర్సిటీలోనే పీహెచ్‌డీ పూర్తి చేసిన 443 మందిని కాంట్రాక్టు ప్రాతిపదికపై అధ్యాపకులుగా నియమించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి వచ్చే నిధులు కూడా ఏటేటా తగ్గిపోతున్నాయి.

ప్రామాణిక విద్యా బోధనకు రూ. 500 కోట్లు కావాలి ...

ఉస్మానియా యూనివర్సిటీ తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. ప్రామాణిక విద్యా బోధన జరగాలంటే బడ్జెట్‌లో 500 కోట్లు రూపాయల నిధులు కేటాయించాలి. దీనిలో 300 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పెన్షన్లకే సరిపోతుంది. మిగిలిన 200 కోట్ల రూపాయలు మౌలిక వసతులు, పరిశోధనతోపాటు ఇతర రంగాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇరవై ఏళ్ల బడ్జెట్‌ చరిత్రను తీసుకుంటే కేటాయింపులు 270 కోట్లకు మించలేదు. ఏటా 230 కోట్ల రూపాయల లోటుతో యూనివర్సిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. లోటును యూనివర్సిటీయే పూడ్చుకోవాలని ప్రభుత్వ తెగేసి చెప్పడంతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్జులు ప్రారంభించి కొంత మేర నిధులు సంపాదించుకుంటోంది.

విద్యా ప్రమాణాలు తగ్గడానికి మరికొన్ని కారణాలు ...

విద్యా ప్రమాణాలు తగ్గడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కానీ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలు, బోధనలో మార్పు లేకపోవడంతో కూడా ప్రమాణాలు పడిపోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్నాతకోత్సవ ఫీజు 1990లో రూ.20, ఇప్పుడు రూ. 1500 ...

యూనివర్సిటీ నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తగ్గాయి. దీంతో విద్యార్థులపై భారం మోపుతున్నారు. అన్ని రకాల ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. 1990లో విద్యార్థుల నుంచి 20 రూపాయలు వసూలు చేసిన స్నాతకోత్సవ ఫీజును ఇప్పుడు ఏకంగా 1500 రూపాయలకు పెంచారు. యూనివర్సిటీలను ఆర్థికంగా ఆధుకోవాల్సి ప్రభుత్వాలు నిధుల కొరత పేరుతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుండటంతో ప్రమాణాలు పతనమవుతున్నాయి. నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి నేటి తెలంగాణ ప్రభుత్వం వరకు ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలోనైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. విద్యా ప్రమాణాలు ఇంకా ఎక్కవుగా దిగజారి, విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ మరింత మసకబారక ముందే పాలకులు ఈ ఉన్నత విద్యాసంస్థపై దృష్టి పెట్టాలి. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు.

10:42 - April 25, 2017

హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో చోటా రాజన్‌ను.. పటియాల హౌస్ కోర్టు దోషిగా ఖరారు చేసింది. తప్పుడు చిరునామాతో దొంగ పాస్‌పోర్టు కలిగి ఉన్నట్టు సీబీఐ అధికారులు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసులో పాస్‌పోర్టుకు సరైన విచారణ జరపకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. నకిలీ పాస్ పోర్టు కేసులో ఐపీసీ 420,471తో పాటు మరో 4 సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. ఛోటారాజన్ పై దేశవ్యాప్తంగా హత్యలు, డ్రగ్స్, స్మగ్లింగ్, బెదిరింపులకు సంబంధించి... 85 పైగా ఉన్న కేసులు విచారణలో ఉన్నాయి. 2015 అక్టోబర్ 25 న ఛోటా రాజన్ ను ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేయగా... నవంబర్‌ 6న ఇండియాకు తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజన్ తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నాడు.

ఎన్ కౌంటర్ పై నివేదిక కోరిన కేంద్రం

ఢిల్లీ : ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ పై కేంద్రం నివేదిక కోరింది. సాయంత్రంలోగా సీఆర్పీఎఫ్ నివేకను సమర్పించనుంది.

10:19 - April 25, 2017

ఛత్తీస్ గఢ్ : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లను నివాళులు అర్పిస్తారు. బాధితుల కుటుంబాలను కలుసుకి ఓదార్చుతారు. అలాగే మావోయిస్టుల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న జవాన్లను పరామర్శిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షిస్తారు. మావోయిస్టుల కాల్పుల్లో 26 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఎనిమిది మంది జవాన్ల ఆచూకీ లభించలేదు.

10:17 - April 25, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలాజీనగర్‌లో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా, అద్దంకికి చెందిన ప్రత్యూష రెడ్డి దారుణ హత్యకు గురైంది. ప్రత్యూషకు ఏడేళ్ల క్రితం అంజిరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. గత మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అంజిరెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకరితో ప్రత్యూష చనువుగా ఉండేది. కొన్ని రోజుల క్రితం ప్రత్యూష సొంతూరుకు వెళ్లింది. అయితే 3 రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఉందని.. ఊరి నుంచి భర్త వద్దకు సర్టిఫికెట్లు తీసుకొని వచ్చింది. తరువాత బాలాజీనగర్‌లోని ఓ పెంట్‌హౌస్‌లో శవమై కనిపించింది. పోలీసుల దర్యాప్తులో పెంట్‌హౌస్‌ ప్రత్యూష చనువుగా ఉండే వ్యక్తిదని తేలింది. మృతురాలి ఒంటిపై బట్టలు లేకపోవడం, కత్తిపోట్లు ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

10:16 - April 25, 2017

అమరావతి : 2014 ఎన్నిక‌ల‌లో విజ‌యం త‌మ‌దేనని భావించి నిరాశపడిన వైసీపీ అధినేత జ‌గ‌న్.. 2019 సాధారణ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాలతో పార్టీ నేతలను గ్రామాల్లో, పట్టణాల్లో ప‌రుగులు పెట్టిస్తున్నారు. రాబోయే ఎన్నికలను డుఆర్‌డై మ్యాచ్‌గా భావిస్తున్నాజగన్‌... ప్రముఖ రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్రశాంత్ కిషోర్ సేవ‌ల‌ని ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణయించారు. దీనికోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్ లోని త‌న నివాసంలో ప్రశాంత్ కిషోర్‌తో జగన్‌ భేటీ అయ్యారు. జగన్‌ సరికొత్త పొలిటికల్‌ స్ట్రాటజీపై టెన్‌టీవీ ఫోకస్‌ .. look.

మోదీ, నితీశ్‌కుమార్‌లకు సలహాలు ఇచ్చిన ప్రశాంత్‌కిషోర్‌

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో నరేంద్రమోదీ ప్రచార బాధ్యత‌ల‌ను ప్రశాంత్ కిషోర్ చూసుకున్నారు. ఆ ఎన్నిక‌ల‌లో బీజేపీ తిరుగు లేని విజ‌యం సాధించింది. ఆ త‌రువాత అటు బీహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నితీష్ కుమార్ త‌రపున ప్రచార బాధ్యత‌లు నిర్వహించారు ప్రశాంత్‌. ఈనేపథ్యంలో ఈ పొలిటికల్‌ వ్యూహకర్త సేవ‌లను వ‌చ్చే ఎన్నికల్లో ఉప‌యోగించుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్ నిర్ణయించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని వైసీపీ నేతలకు జగన్‌ సూచనలు

జగన్‌ కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్ అండ్‌ టీమ్ ఇప్పటికే ఏపీలో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇకనుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తారని వైసీపీ నేతలకు జగన్‌ చెప్పిట్టు తెలుస్తోంది. దీన్లో భాగంగానే అన్ని నియోజ‌కవ‌ర్గాల‌లో బూత్‌స్థాయి క‌మిటిలు ఎర్పాటు చేసుకుని.. పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టిపెట్టాలని.. అవి పూర్తయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన సూచనలు అందిస్తారని వైసీపీ లీడర్లకు జ‌గ‌న్ చెప్పిట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల పార్టీ నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వహిస్తున్న జ‌గ‌న్ ..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చిన్ని చిన్న త‌ప్పులకారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని .. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి టీడీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దన్న ముందస్తు ఆలోచనతోనే జగన్‌ ప్రశాంత్‌కిషోర్‌తో కాంటాక్ట్‌ అయ్యారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వంపై అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్‌ ...

టీడీపీ ప్రభుత్వంపై ఆసంతృప్తిగా వున్న వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ సూచ‌న‌లు ఉప‌యోగప‌డ‌తాయ‌ని జ‌గ‌న్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నిక‌ల ప్రచారం ఎలా వుండాలి, ప్రజ‌ల‌ను ప్రసంగాల‌తో ఎలా ఆక‌ట్టుకోవాలి, ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ని ప్రజ‌ల‌కు ఆర్ధం ఆయ్యేలా ఎలా వివ‌రించాలి .. లాంటి విష‌యాల‌పై పార్టీ నేత‌ల‌తో పాటు, అధినేత జగన్‌కు కూడా స‌ల‌హాలు ఇవ్వడానికి ప్రశాంత్‌కిషోర్ అండ్‌ టీమ్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు విశ్వశనీయ వర్గాల సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంతకిషోర్ ఇచ్చే సూచ‌న‌లు, సలహాలు ఏపీలో ఎంతవరకు వర్కౌట్‌ అవుతాయో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

10:12 - April 25, 2017

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. ఒకవైపు డాక్టర్లు నిర్లక్ష్యం.. మరోవైపు లంచాలకు మరిగిన సిబ్బంది. వెరసి ధర్మాసుపత్రులంటేనే జనం హడలిపోయే పరిస్థితి దాపురించింది. గవర్నమెంట్‌ దవాఖాన పేరు చెబితేనే జనం పారిపోతున్నారు. అసలు పెద్దాసుపత్రులకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? ఏ మందు వేస్తే ఈ రోగం నయమవుతుంది.?

పెద్దాసుపత్రులపై పేదలకు సన్నగిల్లుతోన్న నమ్మకం

సర్కార్‌ దవాఖానాలంటే పేదల ప్రాణాలకు భరోసా కేంద్రాలు. చేతిలో పైసలు లేనివారు.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారు ప్రభుత్వ దవాఖానాలకు వస్తుంటారు. తమ రోగంనయం చేయించుకుని ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పేదలకు పెద్దాసుపత్రులపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ధర్మాసుపత్రుల్లో చూపించుకుంటే వారి ప్రాణాలకు భరోసా లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు నమ్మకంగా వచ్చిన జనం ఇప్పుడు ఖర్చులు భారమైనా ప్రాణాలమీద ఆశతో ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో వరుస ఘటనలు...

హైదరాబాద్‌లోని ప్రభుత్వా సుపత్రుల్లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. నిలోఫర్‌ ఆస్పత్రిలో 5గురు గర్భిణులు ప్రాణాలు విడిచిన ఘటన మరువకముందే... ఇప్పుడు కోఠి మెటర్నిటీ, పేట్ల బురుజు ఆస్పత్రిలో గర్బిణులు ప్రాణాలు విడిచారు. ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో గాంధీకి తరలించి వైద్యం అందిస్తుండగా నలుగురు చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ప్రాణాలు వదులుతున్నారు. గాంధీ, ఉస్మానియా, ఛాతీ ఆస్పత్రిలో జరుగుతున్న వరుస ఘటనలతో జనం బెంబేలెత్తుతున్నారు.

కోఠి ఆస్పత్రిని సందర్శించిన చెరుకు సుధాకర్‌

కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో గర్ణిణులు చనిపోవడంతో ఆ ఆస్పత్రిని తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్‌ సందర్శించారు. రోగులను అడిగి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.

లంచావతారులతో నిండిపోయి కోఠి ఆస్పత్రి...

కోఠి మెటర్నిటీ హాస్పత్రి లంచావతారులతో నిండిపోయిందని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి లంచం అడుగుతూ తమ రక్తాన్ని పీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తమకు పుట్టిన బిడ్డలను చూడనీయకుండా దాచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోఠి ఆస్పత్రిలో అరకొర సిబ్బంది

కోఠి ఆస్పత్రిలో సరిపడ సిబ్బంది లేకపోవడంతో దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తం ఆస్పత్రిలో 14మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఈ 14మంది వైద్యులే సంవత్సరానికి 13వేల డెలివరీలు చేయాల్సి వస్తోందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అంటున్నారు.

కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు...

తెలంగాణ రాష్ట్రాంలోనే కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతేకాదు... అత్యాధునిక టెక్నాలజీతో డెలివరీలు చేసేలా పరికరాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన సౌకర్యాలు అందించి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వైద్యం, ఆరోగ్యంపై సీఎం టెలికాన్ఫరెన్స్

అమరావతి: వైద్యం, ఆరోగ్యంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అధికారులు, వైద్య ఖర్చులు ప్రతి కుటుంబంపై పెనుభారమౌతున్నాయి. పరిసరాల శుభ్రతపైనే ఆర్యోగం ఆధారపడి ఉంటుందని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్య రక్ష, ఉచిత క్లీనికల్ టెస్టులు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

కారు లారీ ఢీ: ముగ్గురి మృతి

ప్రకాశం: లారీ కారు ఢీ కొన్ని ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం జిల్లాలోని బేస్తవారిపేట మండలం కలగట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

కాసేపట్లో టీటీడీ పాలకమంలి సమావేశం

తిరుమల: కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. రేపటితో టీటీడీ పాలకమండలి గడువు ముగియనుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది.

09:34 - April 25, 2017

హైదరాబాద్: వాంఖడే స్టేడియంలో రైజింగ్‌ పూణె విజయఢంకా మోగించింది. వరుసగా ఆరువిజయవాలతో ఊపుమీదున్న ముంబైని సొంతగడ్డపైనే పూణే మట్టికరిపించింది. బెన్‌స్టోక్‌ అద్భుత బౌలింగ్‌తో బలమైన ముంబైని కట్టడిచేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 3పరుగుల తేడాతోపూణే గెలిచింది. పూణే నిర్దేసించిన 161పరుగుల విజయలక్ష్యతో బరిలోకి దిగిన ముంబైట్టు ..20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ 39బంతుల్లో 6ఫోర్లు 3సిక్స్‌లతో వజృంభించినా.. చివరికి ఓటమిని తప్పిచుకోలక పోయింది ముంబైజట్టు. అంతకు ముందు టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ చేసిన పూణేజట్టు ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి 31 బంతుల్లో 45 పరుగులు, రహానే 32 బంతుల్లో 38 పరుగుల చేయడంతో.. 20వోవర్లలో 6వికెట్లనష్టానికి 160 పరుగుల మాత్రమే చేయగలిగింది రైజింగ్‌ పూణే. రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా.. పూణే బౌలర్లు రెచ్చిపోవడంతో ముంబై గెలుపు ముంగిట చతికిలబడింది.

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి ఉగ్ర ఉప్పు

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లను కశ్మీర్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మోదీ, యోగి హత్యకు లండన్‌లో పథకం వేసిన ఉగ్రవాదులు బృందాలుగా విడిపోయి యూపీ, ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వారెక్కడ ఉన్నదీ తెలియనప్పటికీ ఉగ్రముప్పు సమాచారాన్ని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు రక్షణ కల్పించే అధికారులకు చేరవేశారు.

నేటి నుండి ట్రాఫిక్ రూల్స్ కఠినతరం..

హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వాహనాలను అడ్డగోలుగా నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలను సవరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక మునుపటిలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పోదు. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏళ్లపాటు రద్దు చేస్తారు.

నేడు గోవా పర్యటనకు రాష్ట్రపతి

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేడు గోవాలో పర్యటించనున్నారు. గోవా విశ్వవిద్యాలయం వార్షిక స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. గోవా నుంచి ఆయన తెలంగాణ చేరుకుంటారు. హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ప్రారంభకార్యక్రమంలో బుధవారం ప్రసంగిస్తారు.

08:11 - April 25, 2017

హైదరాబాద్: కశ్మీర్‌ అంశం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. విద్యార్థుల ఆందోళనతో గత వారం రోజులుగా లోయలో పరిస్థితులు మరింత దిగజారాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానమంత్రి మోదీతో మంతనాలు జరిపారు. ముఫ్తీ ఢిల్లీ పర్యటనలో ఉండగానే పీడీపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చండంతో ఉద్రిక్తతలు మరింతపెరిగాయి.

పుల్వామాలో భద్రతాదళాలు, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ...

జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడలేదు. పుల్వామాలో భద్రతాదళాలు, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా వారం రోజుల తర్వాత విద్యాసంస్థలు తెరచుకున్నాయి. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. శ్రీనగర్‌లోని ఎస్పీ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన భద్రతా దళాలపై విద్యార్థులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆజాదీ నినాదాలు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఫొటో జర్నలిస్టులు గాయపడ్డారు.

ప్రధానితో కశ్మీర్ సీఎం భేటీ

అంతకు ముందు జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ప్రధానమంత్రి నరేంద్రమోది, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. కశ్మీర్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు. వేర్పాటువాద గ్రూపులతో చర్చలు జరపాలని ముఫ్తీ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే రెండు మూడు నెలల్లో కశ్మీర్‌ పరిస్థితిలో మార్పు వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

మెహబూబా ముఫ్తి ఢిల్లీ పర్యటనలో ఉండగానే పుల్వామా...

జమ్ముకశ్మీర్‌ సిఎం మెహబూబా ముఫ్తి ఢిల్లీ పర్యటనలో ఉండగానే పుల్వామా జిల్లా పిడిపి అధ్యక్షుడు అబ్దుల్‌ గనిదార్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఆందోళనకారులు వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగించుకుని ...

జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లను పోలీసులు వివరించారు. ఆందోళనకారులు వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగించుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడానికి సుమారు 300 వాట్సాప్‌ గ్రూపులను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో వాట్సాప్‌ గ్రూపులో 250 మంది ఉన్నారు. 3 వందల వాట్సాప్‌ గ్రూపుల్లో 90 శాతం మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.

07:57 - April 25, 2017

హైదరాబాద్: హిందూపురం ఎపి నిమ్మల కిష్టప్ప తనయుడు టోల్ గేట్ వద్ద వీరంగం, ఒకే ప్రాంతంలో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ సారి జరిగిన ఎన్ కౌంటర్లో 26 మంది జవాన్లు మృతి చెందారు. దీనికి ఎపుడు ఎండ్ కార్డు పడదా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ నగేష్ బిజెపి నేత ప్రకాష్ రెడ్డి, జనసేన నేత దిలీప్, టిడిపి నేత సాంబశివరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:50 - April 25, 2017

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు:ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిరప కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగరికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబైపై పూణె విక్టరీ

హైదరాబాద్: వాంఖడే స్టేడియంలో రైజింగ్‌ పూణె విజయఢంగా మోగించింది. వరుసగా ఆరువిజయవాలతో ఊపుమీదున్న ముంబైని సొంతగడ్డపైనే పూణే మట్టికరిపించింది. బెన్‌స్టోక్‌ అద్భుత బౌలింగ్‌తో బలమైన ముంబైని కట్టడిచేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 3పరుగుల తేడాతోపూణే గెలిచింది. పూణే నిర్దేసించిన 161పరుగుల విజయలక్ష్యతో బరిలోకి దిగిన ముంబైట్టు ..20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ 39బంతుల్లో 6ఫోర్లు 3సిక్స్‌లతో వజృంభించినా.. చివరికి ఓటమిని తప్పిచుకోలక పోయింది ముంబైజట్టు.

దద్దరిల్లిన దండకారణ్యం

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ సుక్మాజిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 25కు చేరింది. క్షతగాత్రులను జగ్దల్‌పూర్‌, రాయ్‌గఢ్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. మరోవైపు 8 మంది జవాన్ల ఆచూకీ లభించకుండా పోయింది. ఈదాడిలో పలువురు మావోయిస్టులు కూడా హతం అయినట్టు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు. దాడి అనంతరం జవాన్ల నుంచి భారీసంఖ్యలో ఆయుధాలను ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

07:08 - April 25, 2017

హైదరాబాద్: ఢిల్లీలో కేసీఆర్‌ బిజీ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన కేసీఆర్‌ ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమస్యలను వివరించారు. వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని.. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు నష్టం కలగకుండా చూడాలని ప్రధానిని కోరారు. అలాగే.. హైకోర్టు విభజన, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు, రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యి హైకోర్టు విభజన, 2013 భూసేకరణ చట్టం అంశాలపై చర్చించారు.

వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వండి..

ఢిల్లీ పర్యటనలో భాగంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చినట్లే వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.

జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు నష్టం జరగకుండా...

జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని ప్రధానిని కోరారు. అలాగే గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచామన్నారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశామని.. దానికి కేంద్ర ఆమోదం కావాలని కోరారు. అలాగే రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థల్లో, నియామకాల్లో ఎవరికెంత రిజర్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు. ఎస్సీ వర్గీకరణలో న్యాయం ఉందన్న కేసీఆర్‌.. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు.

శాసనసభ సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని...

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనట్లు తెలంగాణలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన 1400 కోట్ల కాంపా నిధులను విడుదల చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే.. సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విన్నవించారు. కేసీఆర్‌ లేవనెత్తిన పలు అంశాలకు ప్రధాని సానుకూలంగా స్పందించారు.

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ ...

ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్‌ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని రవిశంకర్ ప్రసాద్‌ను కేసీఆర్ కోరారు. ఈ చట్టం వల్ల భూ నిర్వాసితులకు తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగవంతమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. దీనికి రవిశంకర్‌ప్రసాద్‌ సానుకూలంగా స్పందించారని టీఆర్ఎస్‌ నాయకులు తెలిపారు. అలాగే ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలన్న వినతికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. .మొత్తానికి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిని కేంద్రం ఎంతవరకు అమలు చేస్తుందో చూడాలి.

07:07 - April 25, 2017

అమరావతి: భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని ప్రాంతంలోని పెనమాక గ్రామంలో భూసేకరణపై కోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలు తీసుకునే వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.

రాజధాని నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్న ఏపీప్రభుత్వానికి హై కోర్ట్‌లో బ్రేకులు పడ్డాయి. ఇప్పటి వరకు 20 రెవెన్యూ గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వానికి.. తాడేపల్లి మండలం పెనమాక గ్రామ రైతులు షాక్ ఇచ్చారు. తమ గ్రామానికి భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నోటిఫికేషన్ పై స్టే విధించింది.

ఏప్రిల్‌ 11న పెనమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్‌

ఈ నెల 11న పెనమాక గ్రామానికి ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 904 మంది రైతులకు చెందిన 660 ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 60 రోజుల్లోగా అభ్యంతరాలు చెప్పాలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులందరూ హై కోర్ట్ లో పిటిషిన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు..రైతులను అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని, అప్పటి వరకు రైతులు తమ భూములు సాగుచేసుకోవచ్చని స్పష్టం చసింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టేవి విధించి . రైతుల అభ్యంతరాలను తీసుకునే వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. హై కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పుకలగాలని కోరుతున్నారు.

3.50 కి.మీ యాక్సిస్‌రోడ్డు కోసమే నోటిఫికేషన్‌

నిజానికి 3.50 కి.మీ కీలకమై యాక్సిస్‌రోడ్డు ఈ పెనమాక గ్రామం నుండే వెళ్లాల్సి ఉంది. అందుకే ఈ గ్రామంలో భూసేకరణ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైతులు భూములు ఇవ్వకపోవడంతో, ఈ ప్రాంతాన్ని మినహాయించి, మిగతా గ్రామాల్లో రోడ్డు పనులు చేస్తున్నారు. తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, రెండు నెలల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చి, భూములు తీసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈనేపథ్యంలో కోర్ట్ స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ప్రయత్నానికి బ్రేక్‌పడినట్టైంది. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఇబ్బంది పెట్టినా ..తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని పెనమాక రైతులు తేల్చి చెబుతున్నారు.

పెనమాక బాటలో మరికొన్ని గ్రామాలు

మరోవైపు పెనమాక రైతుల బాటలోనే ఇతర గ్రామాలు కూడా నడవడానికి సిద్ధం అవుతున్నాయి. మంగళగిరి మండలంలోని నిడమర్రు,కురగల్లు, బేతపూడి గ్రామాల రైతులు తమ గ్రామాలకు ఇచ్చిన నోటిఫికేషన్ల పై కోర్ట్ కు వెళ్లాలిన భావిస్తున్నారు. ఒకవేళ పెనమాక గ్రామం మాదిరిగానే మరికొన్ని గ్రాములు కూడా హై కోర్ట్ కు వెళ్లి స్టే తెచ్చుకుంటే... చంద్రబాబు సర్కార్‌పై తాము చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్టే అంటున్నారు రాజధాని ప్రాంతరైతులు.

నేడో రేపో కోమటిరెడ్డికి షోకాజ్

హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్ అయింది. గాంధీ భవన్‌లో రెండురోజుల క్రితం కోమటిరెడ్డి, గూడురు నారాయణ రెడ్డి గొడవపై దిగ్విజయ్.. రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చారు. దీనిపై రాహుల్ గాంధీ... పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించారు. రాహుల్‌తో ఉత్తమ్‌ భేటీ అనంతరం... కోమటిరెడ్డికి షోకాజ్ జారీ అయ్యే అవకాశముంది.

 

06:58 - April 25, 2017

అమరావతి: ఏపీలో సిమెంట్‌ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. నగదు రద్దుతో కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న నిర్మాణరంగంపై ఇప్పుడు సిమెంట్‌ ధరల పిడుగుపడింది. బిల్డర్లు, సొంతిళ్లు నిర్మించాలనుకున్న ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సిమెంట్‌ ధరలపై 10టీవీ కథనం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానంతో ఇబ్బందుల్లో నిర్మాణరంగం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో నిర్మాణంరంగం దివాళ తీస్తోంది. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు నిర్మాణరంగం కుదేలవ్వడానికీ అనేక కారణాలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. దీంతో చేతిలో నగదులేక నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఏపీలో భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. అమరావతి చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. బిల్డర్లు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

నిర్మాణరంగంపై మరో పిడుగు

ఆరు నెలల తర్వాత నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్టు ఇప్పుడు నిర్మాణరంగానికి మరోసారి ఇబ్బందులు వచ్చిపడ్డాయి. నెలరోజుల్లోనే బ్రాండెడ్‌ కంపెనీల సిమెంట్ ధరలు 50 కిలోల బస్తాపై దాదాపు 60 రూపాయలు పెరిగింది. సిమెంట్‌ ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కోబస్తాపై 60 రూపాలకుపైబడి పెరగడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. సిమెంట్‌ ధరతోపాటు ఇసుక, ఇనుము, కంకర ధరలూ పెరిగాయి. గతంలో టన్నుకు 42,500 ఉన్న ఇనుము ధర ఇప్పుడు 48వేలకు పెరిగింది. అంటే టన్ను ఐరన్‌కు 5,500 పెరిగిందన్నమాట. లారీ కంకర ధర 9 వేల నుంచి 11వేలకు పెరిగింది. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న నిర్మాణరంగానికి మరింతగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. బిల్డర్లే కాదు... సొంతింటి కళలు కంటున్న మధ్యతరగతి ప్రజల ఆశలూ అడియాసలయ్యే పరిస్థితులు దాపురించాయి.

ఇబ్బందుల్లో భవన నిర్మాణ కార్మికులు

నిర్మాణ రంగం దివాళా తీస్తుండడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. ఎప్పుడు పనిదొరుకుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులకు పూటగడవటం కష్టంగా మారింది.

సిమెంట్‌ కంపెనీలు సిండికేట్‌గా మారాయని బిల్డర్ల ఆరోపణ

సిమెంట్‌ కంపెనీలు సిండికేట్‌గా మారి సిమెంట్‌ ధరలను అనూహ్యంగా పెంచాయని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. సిమెంట్‌ కంపెనీల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని కోరారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

సిమెంట్‌ ధరల నియంత్రణపై గుంటూరులో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

సిమెంట్‌ ధరల నియంత్రణపై గుంటూరులో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. సీఎం ఆదేశాలతో సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యామని మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు తెలిపారు. సిమెంట్‌ ధరల తగ్గింపుపై ఈనెల 27న మరోసారి భేటీ అవుతామన్నారు. జూన్‌ నెలాఖరు వరకు సిమెంట్‌ కంపెనీలకు సి-ఫారమ్‌ ఇస్తామని తెలిపారు. సిమెంట్‌ కంపెనీ ప్రతినిధులు రెండు రోజుల సమయం కోరారన్నారు. ప్రభుత్వ భవనాలకు, ఆర్‌ అండ్‌ బీ, పోలవరం ప్రాజెక్టులకు గతంలో నిర్ణయించిన 230, 240, 250 రూపాయలకే బస్తా సిమెంట్‌ సరఫరా చేయడానికి కంపెనీలు అంగీకరించాయి. సిమెంట్ ధర కనీసం 60 రూపాయలు అయినా తగ్గే అవకాశం ఉందని మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు తెలిపారు.

06:55 - April 25, 2017

సంగారెడ్డి : ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే... ఒకరిపై ఒకరు పోటీ పడి మరి విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధే లేదంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. రెండేళ్లలో చాలా చేశామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ .. ఒకరిపై ఇంకొకరు పై చేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో సందర్భంలో స్థాయిల్ని మరిచి తిట్టుకుంటున్నారు.

జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌...

జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌... సొంత పార్టీలోనే ఎవరు చేయని సాహసం చేస్తారని జగ్గారెడ్డికి పేరు. ప్రస్తుతం జగ్గారెడ్డి స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. సంగారెడ్డికి మంజూరైన వైద్య కళాశాలను ...మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటకు తరలించుకుపోవడంపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన కళాశాలను ...హరీష్‌రావు తీసుకుపోతుంటే...ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఏం చేస్తున్నాడంటూ...ఘాటుగా విమర్శించారు. ఐఐటీ, అగ్రి కల్చరల్‌ ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు తమ హాయాంలోనే వచ్చాయని ..ఆ విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు గుర్తించుకోవాలని అన్నారు.

జగ్గారెడ్డి విమర్శలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ కూడా ఘాటుగా

జగ్గారెడ్డి విమర్శలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ కూడా ఘాటుగా స్పందించారు. అసలు సంగారెడ్డికి మెడికల్‌ కళాశాల మంజూరైందని ఎవరు చెప్పారంటూ ఎదురుదాడికి దిగారు. విజ్ఞత మరిచి విమర్శలకు దిగితే ఊరుకునేది లేదని సమాధానం చెప్పారు.

మధ్యలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రవేశించి....

వీరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతుండగా...మధ్యలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రవేశించి..జగ్గారెడ్డిపై పరుష పదజాలంతో విమర్శించి ..వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. మన జిల్లాలో ఓ పిచ్చోడు ఉన్నాడంటూ జగ్గారెడ్డిని ఎద్దేవా చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు మానేసి... నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

06:52 - April 25, 2017

హైదరాబాద్‌ : బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉస్మానియా యూనివర్శిటీ వందేళ్ల ఉత్సవాలపై సెమినార్‌ జరిగింది.. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, మా జీ ఎమ్మెల్సీ  ప్రొఫెసర్‌ నాగేశ్వర్, విద్యావేత్త చుక్కా రామయ్య, జేఎన్ యూ స్టుడెంట్స్ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ శతరూప చక్రవర్తి, నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్య హాజరయ్యారు.. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేలా యూనివర్శిటీల్లో విద్య సాగాలని వక్తలు సూచించారు... అయితే ప్రస్తుతం విద్యను వస్తువు కింద మార్చే ప్రక్రియ నడుస్తోందని విమర్శించారు.

06:45 - April 25, 2017

అమరావతి: తొలిసారిగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న ఏపి ఎంసెట్ నిన్న మొదలైంది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, నిన్న దాదాపు 60వేల మంది పరీక్ష రాశారు. మిగిలిన అభ్యర్ధులు ఇవాళ, రేపు, ఎల్లుండి పరీక్ష రాయబోతున్నారు. ఏపి ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు చివరి క్షణాల్లో మ్యాథ్స్ పేపర్ ను ఎలా ప్రిపేరవ్వాలి. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో సూచనలు సలహాలిచ్చేందుకు నారాయణ అమరావతి ఐఐటి ఏసి క్యాంపస్ నుంచి బి.శ్రీనివాసరావుగారు విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు.వారు ఏఏ అంశాలపై సూచనలు చేశారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss