Activities calendar

26 April 2017

టీటీడీ సూపరిండెంట్ అరెస్ట్

తిరుమల : నకిలీ డోనర్ల పాస్ పుస్తకాలు, సిఫారసు లెటర్లు..కుంభకోణంలో టీటీడీ సూపరిండెంట్ ఎ.ధర్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం డిమాండ్ కు తరలించారు.

 

 

 

 

21:52 - April 26, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఢిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈనెల 23న పోలింగ్‌ నిర్వహించారు. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. మూడు నగరపాలక సంస్థల్లోని 272 వార్డులకు గాను 270 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ 180 వార్డుల్లో విజయం సాధించింది. ఢిల్లీలో అసెంబ్లీలో అధికారంలో ఉన్నఆమ్‌ ఆద్మీ పార్టీ 45 వార్డులతో రెండో స్థానంలో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 35 స్థానాలతో సరిపెట్టుకుని మూడో స్థానంలో నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు గాను ఆప్‌ 67 సీట్లు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యత కనపరిచినా, నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. ఎన్నికల ఫలితాలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌తోపాటు, ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని కాంగ్రెస్‌ ఎంసీడీ ఎలక్షన్లలో కొద్దిగా పుంజుకుంది.

వరుసగా ఇది మూడోసారి
ఢిల్లీ నగరపాలక సంస్థలో బీజేపీ అధికారంలోకి రావడం వరుసగా ఇది మూడోసారి. ఉత్తర ఢిల్లీలోని 103 వార్డులకు గాను 68 చోట్ల బీజేపీ గెలిచింది. ఆప్‌ 18, కాంగ్రెస్‌ 16 వార్డుల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ నెగ్గారు. దక్షిణ ఢిల్లీలోని 104 వార్డులకు గాను బీజేపీ 68 చోట్ల విజయం సాధించింది. ఆప్‌ 19, కాంగ్రెస్‌ 11 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఆరు వార్డుల్లో ఇతరులు గెలిచారు. తూర్పు ఢిల్లీలోని 63 వార్డులకు గాను 44 స్థానాల్లో బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ ఎనిమిదేసి చోట్ల విజయం సాధించాయి. ఇతరులు మూడు చోట్ల నెగ్గారు. ఎన్నికల్లో విజయం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా తీర్పును శిరసావహిస్తామని కాంగ్రెస్‌
ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఎన్నికల హామీలను మూడు నెలల్లో అమలు చేయాలని కోరింది. మరోవైపు ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై నెపం వేసిన ఆప్‌, ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను బీజేపీ టాంపరింగ్‌ చేసిందని మరోసారి ఆరోపించింది. అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వరుస విజయాలతో కమలనాథులు ఆనందోత్సాహాంతో ఉన్నారు. చత్తీస్‌గఢ్‌ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు జరిపిన దాడిలో 26 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయి, వీరి కుటుంబాలు విషాదంలో మునిగివున్న నేపథ్యంలో ఎంసీడీ ఎన్నికల్లో విజయోత్సవాలకు కమలదళం దూరంగా ఉంది. మొత్తాని ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ విజయం ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే గుజరాత్‌, వచ్చే ఏడాది జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

21:44 - April 26, 2017
21:42 - April 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఈనెల 30న మరోసారి ప్రత్యేకంగా సమావేశం కానుంది. భూసేకరణ బిల్లులో సవరణలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భూసేకరణ బిల్లుపై కేంద్రం చేసిన అభ్యంతరాలు, బిల్లులో మార్పులు, చేర్పులు చేసే అంశంపై కూడా చర్చిస్తారు. అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపి మళ్లీ కేంద్రానికి పంపుతారు. ఈ బిల్లుతో పాటు నకిలీ విత్తనాలు అరికట్టడానికి ఓ చట్టం రూపొందించి ఆ బిల్లును కూడా కేంద్రానికి పంపనున్నారు.

 

21:39 - April 26, 2017

హైదరాబాద్ : ముందు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత నాలుక్కరుచుకుని రాజీ పడడం తెలంగాణ సర్కార్ కు పరిపాటిగా మారింది. ప్రభుత్వంలో తమకెదురు లేదని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలన్నీ నీరుగారి పోతున్నాయి. ఇప్పటికే అత్యంత కీలకమైన భూ సేకరణ బిల్లుపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు పట్టించుకోకుండా బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపింది.. ఢిల్లీలో ఉన్న పలుకుబడితో బిల్లును ఆమోదించుకోవచ్చు అనుకోని భంగపడింది. దీంతో బిల్లులో సవరణలు సూచిస్తూ వెనక్కి పంపారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన రెండో రోజే కేబినెట్‌ను కూడా సంప్రదించకుండా కేసీఆర్‌.. విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించారు. కానీ.. అప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా జీవో నెం.16ని జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ సంస్థలు,ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లలో పని చేస్తున్నవారి సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ఇక వివిధ గ్రేడింగ్‌లు, వయో పరిమితి, రోస్టర్‌ సిస్టమ్‌ వంటి అంశాలను సాకుగా చూపి సంఖ్యను 25 వేలకు తగ్గించారు. అయితే ఇందులో కార్పొరేషన్లలో పని చేసేవారిని రెగ్యులరైజ్‌ చేయడం కుదరదని సీఎస్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల అధ్యయన కమిటీ తేల్చి చెప్పింది. ఇక క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. రెండేళ్లుగా విచారణ చేసిన కోర్టు.. తీర్పు వెలువరించింది. జీవో 16ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. 1996 తర్వాత రిక్రూట్‌ చేసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలోనూ క్రమబద్దీకరించరాదని చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ అంచనా ప్రకారం ఉన్న 25 వేల సంఖ్య మరింత కుదించబడడం ఖాయం. మొత్తానికి తొందరపాటు నిర్ణయాలతో తెలంగాణ సర్కార్‌ చేస్తున్న చర్యల పట్ల అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

21:33 - April 26, 2017

గుంటూరు : రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్‌ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ డిజైన్స్‌ తయారీ పనిని లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్స్‌ ప్రతినిధులకు అప్పగించారు. వారు 900 ఎకరాల్లో నిర్మించబోయే పరిపాలన నగరానికి సంబంధించి డిజైన్స్‌పై కసరత్తులు చేశారు. చివరకు మూడు రకాల డిజైన్స్‌ను సిద్ధం చేసి... ప్రభుత్వానికి అందజేశారు. వీటిని సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించి... వివిధ అంశాలను జోడించి.. కొత్తగా రెండు డిజైన్స్‌ సిద్ధం చేయాలని కోరారు. నెల రోజుల అనంతరం మరో రెండు డిజైన్స్‌ను సిద్ధం చేశారు. వీటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రే స్వయంగా ఈ డిజైన్స్‌ను గురించి వివరించారు. వచ్చే నెలకి డిజైన్స్‌ ఖరారు చేయాలని కూడా భావించారు. కానీ ఇంతలోనే ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు ఇచ్చిన డిజైన్స్‌పై మరింత అధ్యయనం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.. దీనికోసం రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణను ఆదేశించారు. ఒక కమిటీలోమంత్రులు.. మరో కమిటీలోముఖ్య కార్యదర్శులు ఉండాలని సూచించారు. డిజైన్స్‌ను ఈ కమిటీలు అధ్యయనం చేసి..నివేదిక ప్రభుత్వానికి అందించనున్నాయి. వారిచ్చిన రిపోర్ట్‌ను క్యాబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. అయితే డిజైన్స్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయం చర్చానీయాంశంగా మారింది. డిజైన్స్‌ ఖరారు అయిపోయాయనుకునే సమయంలో మళ్లీ కమిటీలు వేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. రాజధాని ప్రకటన, ల్యాడ్‌ పూలింగ్‌, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు తప్ప వేరే మంత్రి జోక్యం లేదు. ఈ విషయంలో చాలా మంత్రులకు అసంతృప్తి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మంత్రులకు ప్రాధాన్యం కల్పించేందుకే కమిటీ వేసినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా రాజధాని డిజైన్స్‌ ఎంపిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

 

 

 

21:29 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతోత్సవం ఘనంగా జరిగింది. ఓయూ శతాబ్ది ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉత్సవాల పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. వందేళ్ల క్రితం ఇదే రోజు ఓయూ ఓ విజన్‌తో ప్రారంభమైందన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌. వందేళ్లలో వర్సిటీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. వందేళ్ల క్రితమే ఉన్నత విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామన్నారు. ఉన్నత విద్యకు భారత్ ఎప్పటి నుంచో అంతర్జాతీయ చిరునామా అని పేర్కొన్నారు. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్శిటీ ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ఐఐటీల ఏర్పాటు విద్యావ్యవ‌స్థలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయ‌ని చెప్పారు. దేశంలో ఉన్న ఐఐటీల్లో,ఎన్ఐటీల్లో, ఐఐఎస్సీల్లో 100శాతం క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఈ క్రమంలోనే యూనివ‌ర్శిటీల‌ను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైంద‌న్నారు. యూనివ‌ర్శిటీల్లో నాణ్యాతా ప్రమాణాలు పెర‌గాల్సి ఉంద‌న్నారు.

మాట్లాడని సీఎం కేసీఆర్‌
మరోవైపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సమస్యలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతారని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ సీఎం ప్రసంగించకుండానే వెను తిరగడం... అటు గవర్నర్‌ నరసింహన్ కూడా మౌనంగా వెళ్లిపోవడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్రపతి సభ నుంచి బయటకు వెళ్లగానే విద్యార్ధులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్ధులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేయడంతో..క్యాంపస్‌లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి ప్రారంభ సభలో రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే గవర్నర్, సీఎం కేసిఆర్ స్పీచ్‌ ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. కానీ విద్యార్థులు నిలదీసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే, వారు ప్రసంగించకుండా వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం ప్రసంగించకపోవడంపై హస్తం నేతలు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఓయూ శతాబ్ది వేడుకల్లో మాట్లాడలేక పారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన ఓయూ విద్యార్థుల త్యాగాలను స్మరించుకోవాల్సిన తరుణంలో.. కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదీఏమైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఓయూకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. మాట్లాడకుండానే వెనుతిరగడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

21:24 - April 26, 2017

ముందస్తుకు ఎవరు ఒప్పుకోరు

గుంటూరు : సంవత్సరం ముందు ముంస్తు ఎన్నికలకు ఎవరు ఒప్పుకోరని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా గెలుస్తామని ఆయన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెపిస్తాయని పేర్కొన్నారు. 

21:01 - April 26, 2017

31ఏళ్లు గడిచాయి నేటికీ ఆ విషాదపు ఆనవాళ్లు పచ్చిగానే ఉన్నాయి. అణువిద్యుత్ కేంద్రాలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలవో కళ్లకు కట్టింది. ఆ ప్రదేశంలో మరో 20వేల ఏళ్లకు కానీ మనిషనేవాడు బతికలేడని తేల్చింది. అయినా బుద్ది రావటం లేదు. పాఠాలు నేర్చుకోవటం లేదు. ఇంకా పక్కలో బాంబు పెట్టుకుని మురిసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ పరుగులో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అణు విద్యుత్ కేంద్రాలతో పొంచి ఉన్న ప్రమాదాలకు అతిపెద్ద ఉదాహరణగా నిలిచిన చెర్నోబిల్ ఘటనకు ముప్ఫైఒక్క ఏళ్లయిన సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం. చెర్నోబిల్ అణు ప్రమాద దుర్ఘటనకు ముప్ఫైఒక్క ఏళ్లు. అయినా.. ప్రపంచానికి మాత్రం అణు ముప్పు తప్పలేదు. 2011లో ఫుకుషిమా ఘటన వణికించింది. న్యూక్లియర్ రియాక్టర్లలో అణువంత ప్రమాదం జరిగినా దాని ప్రభావం మానవాళిపై తీవ్రంగా ఉంటుంది. పట్టణాలు, నగరాలు మరుభూమిగా మారకతప్పదు. దీనికి ఉదాహరణలుగా మూడు ఘటనలు నిలుస్తున్నాయి..

 

20:41 - April 26, 2017

గుంటూరు : ముందస్తు ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవలే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాము సిద్ధమేనని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనగా ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు ఎవరు ఒప్పుకోరని లోకేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా గెలుస్తామని, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పలేదని, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే ఆయన సూచించారని పేర్కొన్నారు. 2004 సంవత్సరంలో బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లి నష్టపోయారు కనుకే లోకేష్ దీనిని వ్యతిరేకిస్తునట్టు తెలుస్తోంది.

19:13 - April 26, 2017
19:03 - April 26, 2017

గుంటూరు :  దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించడంతో పాటు.. ఎన్నికల వ్యూహాల కసరత్తులు ప్రారంభించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అటు అధికార పార్టీ టీడీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీలతో పాటు జనసేనా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. దీంతో జనసేన అభిమానుల్లో, కార్యకర్తల్లో ఎన్నికల వేడి మొదలైంది.

ఇంత వరకూ పార్టీ నిర్మాణం
జనసేన పార్టీ పెట్టి మూడేళ్లవుతున్నా.. ఇంత వరకూ పార్టీ నిర్మాణంపై పవన్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో అధికార టీడీపీ మొదటి నుంచి నిర్మాణ పరంగా పటిష్టంగా ఉన్న పార్టీ. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారనే భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ముందస్తు ఎన్నికలు వస్తే పార్టీ పరిస్థితేంటి అనే గందరగోళంలో పవన్‌ అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకూ కొన్ని సమస్యలపై మాత్రమే తన ఘళాన్ని వినిపించిన పవన్‌ పూర్తి స్థాయిలో.. ప్రజా సమస్యలపై సమయం కేటాయించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ
వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి స్వార్ధపరులు కాకుండా నిజాయితీ, నిబద్ధత కలిగిన యువకులను నాయకులుగా తయారు చేస్తామని పవన్‌ చెప్పారు. అయితే పవన్‌ కళ్యాణ్‌కు సమయం తక్కువ ఉండటంతో పార్టీలోకి ఎవరిని తీసుకుంటారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుని పార్టీ నిర్మాణం చేపడతారు అనే సందేహాలు జనసేన అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు వస్తే పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలపై జనసేన ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రకటించినా సినిమాలతో బిజీగా ఉన్న పవన్‌.. వాటిని పక్కన పెట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కళ్యాణ్ తనకున్న ఇమేజ్‌ని మాత్రమే నమ్ముకొని.. ఎన్నికల బరిలోకి దిగితే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులంటున్నారు. మరి పవన్‌ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

 

18:57 - April 26, 2017

నెల్లూరు :  జిల్లా రాజకీయాల్లో కీలకమైన ఆనం సోదరులు తమ రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో పడ్డారా ? ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి...ఆనం బ్రదర్స్‌గా గుర్తింపు పొందారు. రాజకీయ విలక్షణతకు వీరు మారు పేరు. తమ రాజకీయ చతురతతో ప్రత్యర్థులతోపాటు, సొంతపార్టీ నేతలను ఢీ కొట్టి, అన్ని వేళలా ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకునే నాయకులు. కాంగ్రెస్‌లో ఉండగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఆనం సోదరులు. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన వీరు ఇప్పుడు పసుపుదళంలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నట్టు కనిపిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్ధేశించుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

కొంత కాలం రాజకీయాలకు దూరం
2014 ఎన్నికల తర్వాత ఆనం సోదరులు కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్‌ నిర్ధేశించుకునే ఆలోచనల్లో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన మున్సిపల్‌ మంత్రి నారాయణ ద్వారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబుతో భేటీ దరిమిలా ఆనం వివేకానందకు ఎమ్మెల్సీ, రామనారాయణరెడ్డికి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తామన్న కొన్ని స్పష్టమైన హామీలతో టీడీపీలో చేరిన వీరికి, కొద్ది రోజుల్లో సీను అర్థమైంది. ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఉన్న ఒకేఒక్క మార్గం గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులే. మంత్రివర్గ విస్తరణకు ముందు రోజు వీటిలో ఒకటి కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే పొన్నాల రామసుబ్బారెడ్డికి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డిని శాంతపరిచేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో రెండో ఎమ్మెల్సీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారన్న బాధతో ఉన్న ఆనం సోదరలు పార్టీ మారే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉండగా అన్ని విషయాల్లో స్వేచ్ఛ, స్వతంత్రంగా వ్యవహరించిన ఆనం సోదరులకు... క్రమశిక్షణకు మారు పేరైన టీడీపీలో చేరిన తర్వాత నోరు కట్టేసినట్టు అయ్యింది. పార్టీ విషయాల్లో కొన్నిసార్లు స్వతంత్రంగా వ్యవహరించిన సందర్భాల్లో టీడీపీ అధినాయకత్వం నుంచి వార్నింగ్‌లు తప్పలేదు. ఆనం సోదరులు దీనిని అవమానంగా భావిస్తున్నట్టు వినిపిస్తోంది. టీడీపీలో గుర్తింపు లేక, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించలేకపోయమన్న భావంతో వీరు ఉన్నారు. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న తర్వాత తమ అంచనాలు తలకిందులయ్యాన్న బాధ ఆనం సోదరుల్లో కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది.

పట్టించుకోని అధికార పార్టీ నాయకులు
ఇక పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఆనం సోదరులకు పిలుపురాని పరిస్థితి. పార్టీ నేతలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆనం సోదరులను పట్టించుకోవడంలేదన్న బాధ వీరిలో గూడుకట్టుకుని ఉంది. నెల్లూరు మేయర్‌ ఆజీజ్‌ కూడా ఆనం సోదరులపై ఆధిపత్యం చెలాయించే స్థాయి రావడంతో టీడీపీలో తమ పరిస్థితి అగమ్యగోచరమన్న ఆలోచనకు ఆనం సోదరులు వచ్చారు. మంత్రి నారా లోకేశ్‌ కూడా మేయర్‌ అజీజ్‌ను సమర్థించడం.. ఆనం బ్రదర్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. మున్సిపల్ మంత్రి నారాయణ ఒక్కరే వీరికి కొద్దో గొప్పో గుర్తింపు ఇస్తున్నా.. చిన్నా చితక పనులను కూడా ఈయన దృష్టికి తీసుకెళ్లి సిఫారసు చేయించుకోవాల్సి వస్తోందన్న బాధతో ఉన్నారని వినిపిస్తోంది. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రైన తర్వాత ఆనం సోదరులకు అసలు గుర్తింపే లేకుండా పోయిందని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వస్థీకరణకు ఆనం సోదరులకు ఆహ్వానం అందినా ఉద్దేశపూర్వంగా డుమ్మాకొట్టి, టీడీపీ నాయకత్వానికి తమ అసంతృప్తి వ్యక్తం చేశారాని ప్రచారం జరుగుతోంది. టీడీపీ విధానాలతో విసిగిపోయిన ఆనం సోదరులు కొత్త దారులు వెతుకుంటున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరితేనే రాజకీయంగా భవిష్యత్‌ ఉంటుందని వీరు భావిస్తున్నాట్టు సమాచారం. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న భూమన కరుణాకర్‌రెడ్డి ఇటీవల ఆనం వివేకానందరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. వైపీసీలో చేరితే పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని భూమన హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కూడా తన సోదరుడు వివేకానందరెడ్డి బాటలోనే నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

18:52 - April 26, 2017

కడప : జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. ఖాజీపేట నుండి తిరుపతి వెళ్తున్న ఇంటర్‌ విద్యార్థి నవీన్‌కుమార్‌రెడ్డిపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలైన నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష రాసేందుకు నవీన్‌ తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటనకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

18:50 - April 26, 2017

గుంటూరు : రోడ్డు ప్రమాదాల నివారణపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏర్పేడు ప్రమాదం తర్వాత నిబంధనల్ని కఠినంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా, మద్యం సేవించి వాహనాలు నడిపినా, హెల్మెట్‌ ధరించకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో పోలీసు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులతో మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

18:47 - April 26, 2017

గుంటూరు : 'ప్రపంచంలోనే రాజధానులకు ధీటుగా 'అమరావతి'ని నిర్మిస్తాం..అన్ని సదుపాయాలు కల్పిస్తాం..అతి త్వరలోనే నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంచుతాం'..అని పాలకులు చెబుతున్న మాటలు ఇప్పట్లో కార్యరూపం దాలుస్తాయా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే రాజధానికి సంబంధించిన డిజైన్స్ పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
రాజధాని డిజైన్స్‌ ఎంపిక మరింత ఆలస్యం అయ్యేలా అవకాశం కనిపిస్తోంది. లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ కంపెనీ ఇచ్చిన డిజైన్స్‌పై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మరో రెండు కమిటీలు ప్రభుత్వం నియమించనుంది. ఈ మేరకు మంత్రులతో కూడిన కమిటీ, ముఖ్య కార్యదర్శులతో కూడిన మరో కమిటీని ప్రభుత్వం నియమించిందని మంత్రి నారాయణ చెప్పారు. డిజైన్స్‌ అధ్యయనం చేసి, ఓ నివేదికను ఈ కమిటీలు ప్రభుత్వానికి అందిస్తాయని ఆయన అన్నారు. అనంతరం వీటిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.

18:42 - April 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. మొన్న సింగరేణి..నిన్న భూసేకరణ బిల్లు వాపస్..నేడు క్రమబద్ధీకరణ. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు హైకోర్టు బ్రేకు వేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవో 16పై ఓయూ విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. 1996 తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయవద్దని వారు కోరారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారించింది. తదనంతరం జీవోను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందా ? లేదా ? చూడాలి.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు హైకోర్టు బ్రేక్

హైదరాబాద్ : తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు హైకోర్టు బ్రేకు వేసింది. కాంట్రాక్టు ఆద్యోగుల క్రమబద్దీకరణ జీవో 16పై ఓయూ విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. 1996 తర్వాత కాంట్రాక్టు పద్ధతిలోమ తీసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయవద్దని కోర్టు జీవోను కొట్టివేసింది. ప్రభుత్వం 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకు నిర్ణయించారు.

స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న జోరు

ముంబై : స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ తొలిసారిగా 30వేల మార్కును దాటి 190 పాయిట్లు లాభపడి 30,133 వద్ద ముగిసింది.

 

బోడోలాండ్ ప్రతినిధులతో హోంమంత్రి రాజ్ నాథ్ భేటీ

ఢిల్లీ : హోం మంత్రి రాజ్ నాథ్ తో బోడోలాండ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బోడోలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

సింహాద్రిపురంలో ఉద్రిక్తత

తూర్పు గోదావరి : జిల్లాలోని సింహాద్రిపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీలోని రెండు వర్గాల వారు మరుణాయుధలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దాడుల్లో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

18:17 - April 26, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని సింహాద్రిపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీలోని రెండు వర్గాల వారు మరుణాయుధలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దాడుల్లో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సింహాద్రిపురంలో గత 5రోజులుగా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత వాతవరణం నడుస్తోంది. ఎంపీ తోట నరసింహాం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మధ్య గొడవలే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ గ్రామంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. దాడి చేసుకున్న నాయకులు పరారీలో ఉన్నారు.

మరోసారి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ : మరోసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 30న సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. భూసేకరణ సవరణల బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.

17:56 - April 26, 2017

హైదరాబాద్ : మరోసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 30న సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. భూసేకరణ సవరణల బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం సూచనలతో భూ సేరణ బిల్లులో మూడు సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

17:50 - April 26, 2017

కామారెడ్డి : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభకు కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ నుండి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంద ట్రాక్టర్లు బయల్దేరాయి. సభకు వెళ్తున్న వారంతా జాగ్రత్తగా వెళ్లాలని మంత్రి సూచించారు. సభకు రానున్న కార్యకర్తలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోచారం తెలిపారు.

17:45 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటి వరకు పాలకమండలిని నియమించకపోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. కూలీల పేరిట లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలా వసూలు చేసిన డబ్బులను ప్రజల సంక్షేమానికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. యూనివర్సిటీల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర చేస్తోందని, విద్యార్థుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని చాడ పేర్కొన్నారు.

17:39 - April 26, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీ సిటీగా చేయడమే తమ లక్ష్యమని మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని, పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. దుర్గం చెరువుపై కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దుర్గం చెరువు సుందరీకరణ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. చెరువు చుట్టూ ఉన్న వాకింగ్‌ ట్రాక్‌ ప్రాంతాన్నంతటినీ కాలినడకన సందర్శించారు. దుర్గం చెరువును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని. దీనికోసం 12 కోట్లు అవసరం అవుతాయని అన్నారు. ముందుగా రెండు కోట్లతో పనులు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకకం
నగరంలో శాశ్వతంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగా సిటీలో జరుగుతున్న పలు పనులకు 2600 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగానే దుర్గం చెరువుపై కేబుల్‌ స్టెయిడ్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్‌ అన్నారు. 365 మీటర్ల పొడవు ఏర్పాటు చేస్తున్న ఈ బ్రిడ్జిపై నాలుగు లైన్ల రోడ్డు అందుబాటులోకి రానుంది. అలాగే జూబ్లీ హిల్స్‌ బంజారాహిల్స్‌ ప్రాంతాల వైపు నుంచి 12 లైన్ల రోడ్డు అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రోడ్‌ నెంబర్‌ 45 నుంచి 80 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కాగా దుర్గం చెరువు పరిసరాల్లో జరుగుతున్న భూ కబ్జాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. ఆక్రమణలపై సరైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

17:29 - April 26, 2017

వరంగల్ : ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి రెడీ అయ్యింది. ఈ వేడుకలను పురస్కరించుకుని వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇప్పటికే బహిరంగ ఏర్పాట్లను గులాబీ నేతలు పూర్తి చేశారు. 276 ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇక పార్కింగ్‌ కోసం 1463 ఎకరాలను కేటాయించారు. సభకు సమీపంలోనే పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. 10ఫీట్ల ఎత్తులో వేదికను భారీగా తీర్చిదిద్దారు. సీనియర్‌ సిటిజన్లు, వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 12 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నారు.

భారీ జనసమీకరణ
ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సభకు టీఆర్‌ఎస్‌ భారీ జనసమీకరణ చేస్తోంది. ముఖ్యంగా ఈ సభకు రైతులను పెద్ద ఎత్తున తరలించే పనిలో గులాబీ నేతలు పడ్డారు. ఈ సభను రైతు ప్రదర్శన సభగా అధికారపార్టీ భావిస్తోంది. తమది రైతు ప్రభుత్వంగా చెప్పుకోవాలని గులాబీ బాస్‌ యోచిస్తున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఈ సభ ద్వారా తెలియజేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. జిల్లాల వారీగా రైతులను సమీకరించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులకు పార్టీ అప్పగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ జనసమీకరణపై ఆరా తీస్తున్నారు.

తెలంగాణ భవన్‌ నుంచి సైకిల్‌ యాత్ర
ఇప్పటికే తెలంగాణ భవన్‌ నుంచి సైకిల్‌ యాత్రతో వరంగల్‌కు గులాబి దళాలు బయలుదేరాయి. వరంగల్‌కు దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి ట్రాక్టర్లు బయలుదేరాయి. ఉత్తర తెలంగాణ నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు భారీగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు వందలకు తగ్గకుండా ట్రాక్టర్లలో రైతులను తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఉద్యమం సమయంలో వరంగల్‌లో నిర్వహించిన సభ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు కూడా అదేస్థాయిలో సభను నిర్వహించాలని అధికారపార్టీ పావులు కదుపుతోంది. బహిరంగ సభకు 3వేల ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను తరలించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. అంతేకాదు.... పలు ప్రత్యేక రైళ్లలో కూడా రైతులను వరంగల్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు స్వాగతం పలికేందుకు హెలికాప్టర్ల ద్వారా రైతులపై పూలవర్షం కురిపించాలని కూడా టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. 

17:05 - April 26, 2017

ప్రకాశం : ప్రకాశంజిల్లాలో వర్గపోరుతో అధికారపార్టీ సతమతం అవుతోంది. వలస నేతలతో వచ్చిపడ్డ సమస్యకు పార్టీ అధిష్ఠానం మందు కనిపెట్టలేకపోతోంది. తొలుత.. తమను వారిని హారోలుగా చూపిన పార్టీ అధినేత చంద్రబాబు.. ఇపుడు జీరోలుగా మార్చేస్తున్నారని.. ఓడిన నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నేతల మధ్య వర్గపోరు పోలీస్ స్టేషన్‌ వరకు చేరి .. బలాబలాలు నిరూపించుకునేదాకా వెళ్లింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరునుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివి శివరామ్ , వైసీపీ నుంచి పోతల రామారావుతో తలపడ్డారు. ఈ పోటీలో దివి శివరామ్ ఓటమి పాలయ్యారు. అయితే గతంలో శివరామ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక దఫా ఎన్నికయ్యారు. దశాబ్దకాలంగా నియోజకవర్గంలో టీడీపీ కి పెద్దదిక్కుగా నిలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీ అధికారంలో ఉండటంతో కందరుకూరు నియోజకవర్గంలో తన హవాకు ఎదురు లేదనుకున్నారు దివి శివరామ్‌.

పోతల రామారావు టీడీపీ తీర్థం
అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యే పోతల రామారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పాత, కొత్త నాయకత్వాల మధ్య కస్సుబుస్సులు మొదలయ్యాయి. నియోజవర్గంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని.. దివిశివరామ్‌ గళం ఎత్తారు. కాని.. పార్టీ అధినేత చంద్రబాబు తన మార్కు అజమాయిషితో అసంతృప్తిని బయటికి పొక్కకుండా చేయగలిగారు. కాని.. పాతనేతల అసంతృప్తులు మాత్రం నివురుగప్పిన నిప్పులా ఎగిసిపడడానికి సిద్ధంగానే ఉన్నాయి. గతంలో కందుకూరు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. ఇద్దరు అభ్యర్థులే బరిలో వుండే వారు. కాని ఇప్పుడు సీన్ మారింది. కందుకూరు రాజకీయాన్ని కాచివడబోసిన మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనాయకుడు మానుగుంట మహీదర్‌ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు సమాయత్త మవుతున్నారు. దీంతో వైసీపీ ఆయనతో టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే.. పార్టీలోని పోతల , దివి వర్గాలు ఏకమవ్వాలి. అయితే టీడీపీ నుంచి పోతల రామారావుకే మరోసారి అవకాశం ఇవ్వడానికి పసుపు పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నాట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోతల రామారావుకు .. శివరామ్‌ మద్దతు ఇస్తారా..అంటే ఆయన మద్దతు దారులు మాత్రం లేదనే చెబుతున్నారు. దివి శివరామ్ ప్రస్తుతానికి అధిష్ఠానం చెప్పినట్టే నడుచుకుంటున్నా.. అంతర్గతంగా మాత్రం వర్గ పోరు విస్తరిస్తూనే ఉంది.

టీడీపీలో అసంతృప్తి సెగలు
టీడీపీలో అసంతృప్తి సెగలు క్రమంగా పెరుగుతుంటే.. అటు వచ్చేఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న మహీధర్‌రెడ్డి మాత్రం చాపకింద నీరులా తన పని కానిచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మహీధర్‌రెడ్డే నంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీ అభ్యర్థిగా పోతల మారావు బరిలోకి దిగడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో .. కందుకూరులో దివిశివరామ్‌ పాత్ర కీలకంగా మారింది.

చంద్రబాబు చెక్‌పెడతారు
అయితే ఎన్నికల నాటికి దివిశివరామ్‌ అసంతృప్తికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెక్‌పెడతారని టీడీపీ క్యాడర్‌ చెప్పుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థిగా మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోతల రామారావే ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు తాను కూడా బరిలో ఉంటానని.. ఆలాగని పార్టీమారే ప్రసక్తికూడా లేదంటున్నారు దివిశివరామ్‌. దీంతో దివిశివరామ్‌ అధికార టీడీపీకి లోపల ఉండే పొగబెడతారని .. కందుకూరు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. శివరామ్‌కూడా తాను బరిలో ఉంటనాని చెబుతుండటంతో .. 2019 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో త్రిముఖపోటీ తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏంచేస్తారనే దానిపైనే నియోజకవర్గంలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీ అధినాయకత్వం.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని గందరగోళంలోకి నెట్టారని కందుకూరు టీడీపీ క్యాడర్‌ అభిప్రాయపడుతున్నారు.

 

 

 

 

16:48 - April 26, 2017

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెస్తున్న అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై ప్రతిపక్ష వైసీపీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ అధినేత జగన్‌ అన్ని విషయాల్లో చరుగ్గా వ్యవహరిస్తున్నా... వైసీపీ నేతలు మాత్రం ప్రజలకు చేరువకాలేకపోయారన్నభయంతో నేతలు ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నంత క్రియాశీలకంగా కార్యకర్తులు లేకపోవడంతో ముందస్తు భయం పట్టుకుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని వైసీపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం పద్రర్శిస్తున్నా... లోలోపల మాత్రం కలవరపడుతున్నట్టు కనిపిస్తున్నారు.

వైసీపీకి ముందస్తు భయం..
గత ఎన్నికల్లో దూరమైన అధికారాన్ని 2019 ఎన్నికల్లో దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ ముందస్తు భయం పట్టుకుంది. ఎలక్షన్లకు మరో రెండేళ్లు గడువు ఉంది కదా... అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు కొద్దిగా ఉదాసీనంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, చంద్రబాబు మందుస్తు ప్రతిపాదనతో కంగుతిన్నారు. ఒక్కసారిగా ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు సంసిద్ధులు కావాల్సి రావడం సమస్యగా మారింది. గత ఎన్నికల్లో నెగ్గిన 21 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార టీడీపీలో చేరారు. ఇది ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఎమ్మెల్యేల వలసలతో పార్టీకి కొంతమేర పూడ్చుకోలేని నష్టం జరిగిందని భావిస్తున్నారు.

అలాగే వైసీపీ అధినేత జగన్‌ను ఆస్తుల కేసులు మళ్లీ వెంటాడుతున్నాయి. దీంతో భవిష్యత్‌ పరిణాలు ఎలా ఉంటాయోనని అటు జగన్‌తోపాటు ఇటు పార్టీ నేతలు కవలరపుడుతున్నారు. కేసుల కారణంగా పార్టీ నేతల్లో ప్రజా సమస్యలపై పోరాట పటిమ తగ్గిపోతున్నట్టు కనిపిస్తోందని వైసీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. జగన్‌ కానీ, పార్టీ నేతలు కానీ గతంలో నిర్వహించిన విధంగా ఇప్పుడు ఉద్యమాల పట్ల ఆసక్త తగ్గిందని వినిపిస్తోంది. పార్టీ ప్రజలకు చేరువకాలేదకపోవడానికి ఇదో కారణంగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మందస్తు ఎన్నికలు వస్తే ఎలా.. అని వైసీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. అయితే పైకి మాత్రం ముందుస్తుకు సై అంటున్నారు.

అప్పులు తీరలేదని నేతలు బాధపడుతున్నారు....
2014 ఎన్నికల్లో టీడీపీ నేతలు బాగా డబ్బు విరజిమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా ఆర్థిక వనరులు సమకూర్చుకున్నారు. వచ్చే ఎన్నికలకు కూడా ఢోకా లేకుండా డబ్బును సంపాదించుకున్నారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్థిక వనరులు విషయంలో వైసీపీ నేతలు బాగా వెనుకబడి ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు కూడా బాగానే ఖర్చు చేసినా, చాలా మంది ఓడిపోయారు. చేసిన అప్పులు ఇంకా తీరలేదని చాలా మంది నేతలు బాధపడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడంతో ఎమ్మెల్యేలు కూడా ఆర్థికంగా పరిపుష్ఠంగా లేరు. ఈపరిస్థితుల్లో ముందస్తు ఎన్నికల మాట ఎత్తితేనే వైసీపీ నేతలు భయపడుతున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో మార్పుతప్పదంటున్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వ విధానాలతో విసిగెత్తిపోయిన ప్రజలు ఈసారి ఎన్నికల్లో వివేకమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉందని వామపక్ష నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సంకేతాల తర్వాత టీడీపీ నేతలు ముందస్తు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటునారు. వైసీపీ ఇంకా దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఇకనైనా వైసీపీ అధినాయకత్వం ముందస్తు ఎన్నికలకు వ్యూహాత్మకంగా ముందుకుసాగాలని పార్టీలోని సీనియర్లు సూచిస్తున్నారు.

 

16:40 - April 26, 2017

హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థి సాయి కుమార్‌ మృతికి ఫేస్‌ బుక్‌ ఇన్సిడేంటే కారణమని పోలీసులు తేల్చారు. గత నెల 30 సాయికుమార్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలు సరిగా రాయలేదన్న మనస్తాపంతోనే తమ కుమారుడు చనిపోయాడని ముందు తల్లిదండ్రులు భావించారు. ఆ తర్వాత సందేహంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకిదిగిన పోలీసులు ఆత్మహత్యకు అసలు కారణాలన్ని బయటకుతీశారు. మహేశ్‌ ఓ ఉపాధ్యాయురాలి పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్ చేశాడు. అందులో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయం గుర్తించిన కొందరు పూర్వ విద్యార్థులు సాయికుమార్‌ను ఈ విషయమై నిలదీశారు.. అదేరోజు ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు తీసుకువెళ్లి అకౌంట్‌ డిలీట్ చేయించారు. ఆ తర్వాత ఇంటికివెళ్లిన సాయికుమార్‌ ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువుపోతుందని భయపడ్డారు. అదే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తేల్చారు..

 

16:36 - April 26, 2017

చెన్నై : శశికళకు సంబంధించిన వాటిని తొలగించాలని మాజీ సిఎం పన్నీర్‌సెల్వం వర్గం డిమాండ్‌ మేరకు అన్నాడిఎంకే కార్యాలయంలో శశికళ ఫ్లెక్సీలను తొలగించారు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు దినకరన్‌ అరెస్టయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. పార్టీ కార్యాలయాన్ని పవిత్రంగా ఉంచేందుకు వీలైనంత త్వరగా శశికళ పోస్టర్లను తొలగించాలని పన్నీర్‌సెల్వం వర్గం మంగళవారం డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడిఎంకే పార్టీతో సంబంధం లేకుండా శశికళను పూర్తిగా దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. శశికళను, ఆమె కుటుంబాన్ని పూర్తిగా దూరం పెడితేనే పార్టీ విలీనానికి ఒప్పుకుంటానని పన్నీర్‌ సెల్వం షరతు విధించిన విషయం తెలిసిందే. శశికళ పోస్టర్లను తొలగించిన నేపథ్యంలో ఎఐఎడిఎంకే రెండు వర్గాల విలీనానికి అడ్డంకులు తొలగినట్లే కనిపిస్తోంది. 

వెస్ట్ బెంగాల్ లో బయటపడ్డ సొరంగం..

వెస్ట్ బెంగాల్ : ఇండియా - బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ ఓ సొరంగాన్ని కనుగొన్నారు. నార్త్ దినజ్ పూర్ ప్రాంతంలో ఉన్న ఈ సొరంగాన్ని స్మగ్లింగ్ కు ఉపయోగించుకున్నారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

16:19 - April 26, 2017

ఢిల్లీ : తమిళనాడు అన్నాడీఎంకే ఉప కార్యదర్శి దినకరన్ కు కోర్టు రిమాండ్ విధించింది. ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తమకు రెండాకుల గుర్తు కేటాయించడం కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం దినకర్ ను పోలీసులు తీస్ హజారీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 7 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కోసం దినకరన్ తరపు న్యాయవాదులు ప్రయత్నించారు కానీ కేసు విచారణ దశలో ఉందని పోలీసుల తరపు న్యాయవాది వాదించడంతో కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

16:17 - April 26, 2017

కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..ఒంటిరిగా పోరాటం చేస్తోంది...అత్తింటి ముందు మౌనపోరాటం..న్యాయం జరిగే వరకు కదలంటున్న ఇల్లాలు..విశాఖలో వీధిన పడిన మరో ఇల్లాలు..

పోలీసుతో పెళ్లి అయ్యింది..బాగానే ఉందని అనుకున్నారు..కానీ కొన్నాళ్లకే అత్తింటి వారు విశ్వరూపం చూపించడం మొదలు పెట్టారు..డబ్బు కోసం నిత్యం హింసించారు. భర్త బోర్డర్ లో పనిచేస్తుండగా ఆ ఇంటి కోడలిని పుట్టింటికి పంపారు. భర్త వచ్చాడని తెలిసి వెళితే...ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఇప్పుడా ఆ ఇల్లాలు ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. జీవీఎంసీ మూడో వార్డులోని పాత డెయిరీ ఫారం ప్రాంతానికి చెందిన వివేకానంద నగర్ వీధి నెంబర్ 6లో నివాసం ఉంటున్న ఓ ఇల్లాలు మౌనపోరాటానికి దిగింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాధకు బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కనకల సురేష్ తో 2015లో వివాహం జరిగింది. తనకు న్యాయం చేయాలని మౌనపోరాటానికి దిగిన రాధకు న్యాయం జరుగుతుందా ? లేదా ? మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

రాజ్ నాథ్ తో బోడోలాండ్ ప్రతినిధుల భేటీ..

ఢిల్లీ : హోం మంత్రి రాజ్ నాథ్ తో బోడో లాండ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బోడోలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కోర్టులో దినకరన్..

ఢిల్లీ : ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపారనే ఆరోపణతో అరెస్టయిన దినకర్ ను తిజ్ హజరి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. మరోవైపు బెయిల్ కోసం దినకరన్ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

16:03 - April 26, 2017

మూడు రోజుల తరువాత వెలుగు చూసిన దారుణం..పెంట్ హౌస్ నుండి వస్తున్న దుర్వాసన...తలుపులు తెరిచి చూస్తే కన్పించిన ఘోరం..

పచ్చని కాపురాన్ని నిట్టనిలువునా కూల్చుకుంది..తాను వేసిన తప్పటడుగు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది..చివరకు అదే ప్రాణం తీసింది..హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన ప్రత్యూష హత్య కేసులో పోలీసులు లోతుగా శోధిస్తున్నారు. ప్రత్యూషను కిరాతకంగా చంపిందెవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. బాలాజీ నగర్ లో ఉన్న ఓ ఇంటి పైనున్న పెంట్ హౌస్ నుండి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఓ మహిళ శవం కుళ్లిపోయి కనిపించింది. ఒంటిపై దుస్తులు లేకుండా దేహంపై కత్తిపోట్లతో మృతదేహం కనిపించింది.
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రత్యూష ఏడేళ్ల క్రితం ఓ వ్యాపార వేత్తతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. వ్యాపార నిమిత్తం భర్త శ్రీలంకకు వెళ్లాడు. అంజిరెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ తో ప్రత్యూష చనువుగా ఉండేదని తెలుస్తోంది. మూడు నెలల క్రితం అంజిరెడ్డి స్వదేశానికి వచ్చాడు. భార్య వ్యవహార శైలిపై అంజిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశాడు. చివరకు ఏమైంది. ? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:53 - April 26, 2017

ఇంటి ముందు టులెట్ బోర్డు ఉంది..అద్దెకు కావాలంటూ వచ్చిన ముగ్గురు..ఇంట్లోకి వెళ్లి ఏం చేశారు ?

పెద్దింట్లో ఒంటిరిగా ఉంటున్నారా ? అద్దెకిస్తే ఎవరైనా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా ? కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. టు లెట్ బోర్డు పెట్టారంటే అద్దెకు వచ్చే వారు ఎవరో...ఎలాంటి వారో తెలియదు కదా..తెలిసిన వారికివ్వడమే మేలు. అపరిచితులకు ఇస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాకినాడలో అద్దె కావాలని అడిగి వచ్చిన ఓ దుర్మార్గుడు గొంతుకోసి దొరికింది దోచుకెళ్లారు. దీనితో వరుసగా కాకినాడలో జరుగుతున్న నేరాలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

15:49 - April 26, 2017

సంగారెడ్డి : జిల్లాలో భూకబ్జారాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈదులనాగులపల్లిలో రియల్ ఎస్టేట్ సంస్థ  ఏకంగా చెరువునే ఆక్రమించింది. చెరువుతో పాటు ప్లాట్లు కూడా కబ్జా చేయడంతో బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు కలెక్టర్ కు ఆర్డీవో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

భయపడే ప్రసంగించలేదు - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : విద్యార్థులకు భయపడే గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ లు ఓయూ శతాబ్ధి ప్రారంభ వేడుకలో ప్రసంగించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. మూడేళ్ల తరువాత ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ మూగవాడిగా వెనుదిరిగారని విమర్శించారు. విద్యార్థుల నిరసనలను ఎదుర్కొనలేకే కేసీఆర్ మాట్లాడలేదని, కేసీఆర్ పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యతిరేకత నెలకొందన్నారు.

15:30 - April 26, 2017

గుంటూరు : జిల్లాలోని హైవేపై అగ్నిప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం, పొందుగుల వాణిజ్య పన్నుల చెక్‌పోస్టు వద్ద మిర్చి లారీ దగ్ధమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్ల మండలం, ఈర్లపాలెం నుంచి మిర్చి లోడ్‌ను తీసుకొస్తున్నారు. దాచేపల్లి వస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో 358 బస్తాల మిర్చి, 25 లక్షల విలువ చేసే లారీ బూడిదయ్యాయి. మిర్చి విలువ 9 లక్షల వరకు ఉంటుందని రైతులు చెప్పారు. మొత్తం 34 లక్షల నష్టం జరిగింది. లారీలోని రైతులు, డ్రైవర్‌ అప్రమత్తమవ్వడంతో ప్రాణనష్టం తప్పింది. 

15:27 - April 26, 2017

అనంతపురం : పశువుల ఆకలి తీర్చాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు ఏపీ పీసీసీ మద్దతు తెలిపింది. ఏకంగా తహశీల్దార్ కార్యాలయంలో పశువులను కట్టేసి తమ నిరసన తెలియచేశారు. జిల్లాలోని మడశిరలోఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. పశువుల ఆకలి తీర్చాలంటూ తహశీల్దార్ కార్యాలయ అవరణలో వంద పశులతో ఆందోళనకు దిగారు. పశువులకు వెంటనే గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూగజీవాల వేదనను పట్టించుకోవడం లేదని రఘువీరా ఆరోపించారు.

మారణాయుధాలతో ఇరువర్గాల దాడులు..

తూర్పుగోదావరి : కిర్లంపూడి (మం) సింహాద్రిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మారణాయుధాలతో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

15:14 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ఉత్సవంలో మాట్లాడకపోవడంపై విద్యార్థులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏ గ్రౌండ్ నుంచి అర్ట్స్ కాలేజీ వరకు సుమారు 600 మంది విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. 100 ఏళ్ల ఉస్మానియాకు అవమానం జరిగిందని విద్యార్థులు ఆవేదన వెలుబుచ్చారు. సీఎం యూనివర్సిటీకి వరాలు ప్రకటిస్తారని ఎదురు చూసిన తమకు నిరాశ మిగిలిందని, కనీసం గవర్నర్ కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

రాజధాని డిజైన్ల ఎంపికకు రెండు కమిటీలు..

విజయవాడ : రాజధాని డిజైన్ల ఎంపికకు రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు కమిటీ..ప్రిన్స్ పల్ సెక్రటరీలతో కూడిన కమిటీలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనితో రాజధాని డిజైన్ల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాజధాని డిజైన్లపై మళ్లీ చర్చించి సూచనలు తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో సీఎం కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ కమిటీలు ఇచ్చే రిపోర్టులపై కేబినెట్ లో చర్చించి నార్మన్ ఫోస్టర్న్ ప్రతినిధులకు అందచేయడం జరుగుతుందని, మే 2,3,4 తేదీల్లో సీఆర్డీఏ బృందం లండన్ లో పర్యటిస్తుందన్నారు.

ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరిన మంత్రి జూపల్లి..

శంషాబాద్ : పెద్ద గోల్కోండ వద్ద ఓఆర్ఆర్ రహదారిపై సందడి నెలకొంది. వరంగల్ లో జరిగే సభకు 200 ట్రాక్టర్లతో మంత్రి జూపల్లి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో రైతులు పాల్గొన్నారు. కాసేపట్లో ఆలేరుకు ర్యాలీ చేరుకోనుంది.

మిర్చి కొనుగోళ్లపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష..

గుంటూరు : మిర్చి కొనుగోళ్లపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, నక్క ఆనందబాబులు పాల్గొన్నారు. యార్డులో మిర్చి క్రయవిక్రయాలను మంత్రులు పరిశీలించయారు. ఎక్కువ సరుకు నిల్వలపై మంత్రులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్ ప్రసంగించకపోవడం పట్ల విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ డౌన్..డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

14:55 - April 26, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై నెపం నెట్టిన ఆప్‌..ఎంసీడీ ఎన్నికల్లో కూడా ఇదే పల్లవి అందుకుంది. ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపించింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో విజయం సాధించిన బీజేపీ ప్రజా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని అజయ్‌ మాకేన్‌ కోరారు. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రజా సమస్యలను మూడు నెలల్లో చక్కదిద్దాలని సూచించారు.

 

14:51 - April 26, 2017

ఢిల్లీ : దేశ రాజధాని నగరపాలక సంస్థలో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఢిల్లీ నగరపాలక సంస్థలోని 272 వార్డులకు గాను 270 స్థానాలకు ఈనెల 23న పోలింగ్‌ జరిగింది. ఈ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఆప్‌ రెండో స్థానంలో, కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి. బీజేపీ 180 వార్డుల్లో విజయం సాధించింది. ఆప్‌ 45, కాంగ్రెస్‌ 35 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇతరు పది చోట్ల విజయం సాధించారు. ఢిల్లీ నగరపాలక సంస్థలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుంది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా జనరంజకమైన పాలన అందిస్తామని కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌ చెప్పారు.

 

14:46 - April 26, 2017

హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ యూనివర్శిటీల్లో ఒకటైన ఉస్మానియూ యూనివర్శిటీ శతాబ్ధి ఉత్సవాలను రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని యూనివర్శిటీ వీసీ వై రామచంద్రన్‌ అన్నారు. గత వందేళ్లలో యూనివర్శిటీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుందన్నారు. యూనివర్శిటీ పరిశోధనలకు పెద్దపీట వేస్తుందన్న వీసీ, యూనివర్శిటీ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం సంతోషించదగ్గ పరిణామాన్నారు.

 

14:42 - April 26, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఐఐటీలో చదివిన వారికి వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని, ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాయాలు వేదికలుగా నిలుస్తున్నాయని మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా యూనివర్శిటీల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

14:37 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. వందేళ్ల క్రితం ఇదేరోజు ఒక విజన్‌తో ఓయూ ప్రారంభమైందన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సావనీర్‌ను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఓయూ అత్యున్నత విశ్వవిద్యాలయం. వందేళ్ల క్రితం మీర్‌ అలీ ఉస్మాన్‌ ఖాన్‌ దీన్ని ప్రారంభించారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో వందల సంవత్సరాల క్రితమే భారత్‌ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. 

లోకేష్ పై వచ్చిన ప్రచారంలో తప్ర్పు లేదన్న ఉండవల్లి..

తూర్పుగోదావరి : సోషల్ మీడియాలో మంత్రి లోకేష్ పై వచ్చిన ప్రచారంలో తప్పు లేదని ఉండవల్లి పేర్కొన్నారు. గతంలో రాహుల్ పై సోషల్ మీడదియాలో కామెంట్లు చేశారని, ప్రజాజీవితంలో ఉన్నవారు ఎలాంటి విమర్శలైనానా ఎదుర్కొనాలని, కేంద్రంలో భాగస్వామి ఉండి కూడా చంద్రబాబు ఏపీకి దక్కాల్సిన ఆస్తులను సాధించలేకపోయారన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు.

 

డిప్యూటి సీఎం కేఈ అకస్మిక తనిఖీలు..

కర్నూలు : కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేకపోవడంపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాజంపేటలో దారుణం..

కడప : రాజంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి సునీల్ కుమార్ రెడ్డిపై తమిళనాడుకు చెందిన వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సునీల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సునీల్ వాంగ్మూలాన్ని రాజంపేట మెజిస్ట్రేట్ రికార్డు చేసింది.

 

మళ్టీ టి.అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

హైదరాబాద్ : ఆధార్ వివరాలపై కేంద్రం ఇచ్చిన సూచనలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భూ సేకరణ బిల్లుకు మార్పులు చేయాలని, మరోసారి అసెంబ్లీ సమావశపరిచి భూ సేకరణ బిల్లును ఆమోదింప చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమోదం పొందిన అనంతరం కేంద్రానికి పంపనుంది. ఇప్పటికే భూ సేకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే.

ఆధార్ వివరాలు లీక్ చేస్తే జైలు శిక్ష - కేంద్రం..

ఢిల్లీ : వ్యక్తుల ఆధార్ వివరాలను లీక్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఏదైనా అధికారిక వెబ్ సైట్ లలో ఆధార్ వివరాలను ఉంచితే ఆయా శాఖల అధికారులదే బాధ్యత అని కేంద్రం తేల్చిచెప్పింది. ఈమేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

'మోడీ హావా కాదు..ఈవీఎంల హావా'..

ఢిల్లీ : రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవి చూసింది. బీజేపీ ఘన విజయం సాధించింది. ఇది మోదీ హ‌వా కాదు.. ఈవీఎం హ‌వా అంటూ ఆప్ పార్టీ నేత‌, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.

 

13:22 - April 26, 2017

ఎమన్ అహ్మద్..గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక బరువుగల మహిళగా గుర్తింపు పొందింది. అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎమన్ చికిత్స కోసం ముంబైకి వచ్చింది. ఎంతో వ్యయప్రయాసల నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 500 కేజీల బరువుతో ఉన్న ఈమె చికిత్స అనంతరం బరువు తగ్గుతోందనే వార్తలు వచ్చాయి. సుమారు 100కు పైగానే బరువు తగ్గిందని, చికిత్సకు సహకరిస్తోందని..వీల్‌చైర్‌లో కూర్చోగలుగుతోందంటూ వైద్యులు ప్రకటించినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలన్నీ ప్రస్తుతం నిజం కాదని ఎమన్ అహ్మద్ సోదరి షైమా ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. తన సోదరికి చికిత్స అందడం లేదని, ఎమన్ ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఉందని..వైద్యులు అబద్దాలు చెబుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ ఆరోపణలతో చికిత్స చేస్తున్న వైద్యురాలు తీవ్ర నిరాశకు గురైనట్లు, రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఎమన్‌ను డిశ్చార్జ్ చేయనున్నామనీ.. ఈలోపే ఉన్నట్టుండి షైమా తమపై ఎందుకు ఆరోపణలు చేస్తుందో తెలియడం లేదని సదరు వైద్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

500 కేజీల బరువున్న ఎమన్‌ను ఈజిప్టు నుంచి ముంబైలోని సైఫీ ఆస్పత్రికి ఫిబ్రవరి 11న ప్రత్యేక విమానంలో తరలించారు. మార్చి 7న ఆమెకు ఆపరేషన్ జరిపారు. చేశారు. ఒక నెలలోనే ఎమన్ 130 కిలోల వరకూ బరువు తగ్గిందని డాక్టర్ ముఫజల్ ఇటీవల ప్రకటించించిన సంగతి తెలిసిందే. ఈ రెండు నెలల్లో ఆమె ఏకంగా 242 కేజీల బరువు తగ్గిపోయినట్టు వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమన్ సోదరి చేసిన ఆరోపణలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

13:17 - April 26, 2017
13:16 - April 26, 2017

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరపాలక సంస్థలో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఢిల్లీ నగరపాలక సంస్థలోని 272 వార్డులకు గాను 270 స్థానాలకు ఈనెల 23న పోలింగ్‌ జరిగింది. ఈ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఆప్‌ రెండో స్థానంలో, కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి. బీజేపీ 180 వార్డుల్లో విజయం సాధించింది. ఆప్‌ 45, కాంగ్రెస్‌ 35 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇతరు పది చోట్ల విజయం సాధించారు. ఢిల్లీ నగరపాలక సంస్థలో బీజేపీ అధికారం దక్కించుకోవడం వరుసగా ఇది మూడోసారి

మహారాష్ట్రలో కూలిన చిన్న విమానం..

ముంబై : మహారాష్ట్రలో బుధవారం ఓ చిన్న విమానం కూలిపోయింది. గోండియా నది సమీపంలో విమానం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు.

13:08 - April 26, 2017

హైదరాబాద్:యూనివర్శిటీలు కొత్త ఆలోచనలకు వేదికలు కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్రపతి మాటల్లో' ఓయూ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉంది. ఓయూ ఓ ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీ, వందేళ్ల క్రితం ఓయూను మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ ప్రారంభించారు. ఈ వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1956 లో యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటైంది. ఉన్నత విద్యలో వందల ఏళ్ల క్రితం నుంచే భారత్ ఆదర్శంగా నిలిచింది. ఉన్నత విద్యలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఐఐటి చదివిన వారికి దాదాపు 100 శాతం ఉద్యోగాలు వస్తున్నాయి. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించాం. మేధావుల ఆలోచనకు యూనివర్శిటీలు వేదికగా నిలుస్తున్నాయి. యూనివర్శిటీలు కొత్త ఆలోచనలకు వేదికలు కావాలి, దేశంలో మరిన్ని ఐఐటీలు, ఎన్ ఐటీలు ఏర్పాటు చేయాలి' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

పరిశోధనల మీద దృష్టి పెట్టాలి - ప్రణబ్..

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన వారు విదేశాలకు వెళ్లిపోతున్నారని, పరిశోధనల మీద దృష్టి పెట్టకపోవడంతో చాలా వెనుకబడిపోతున్నట్లు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్యా సంస్థలను తప్పుబట్టడం తన ఉద్ధేశ్యం కాదని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించేలా పరిశోధనలు జరగాలని, అందుకు విశ్వవిద్యాలయాలు వేదికగా నిలవాలని సూచించారు. సమకాలీన సమస్యలను పరిష్కరించేలా విద్యా సంస్థల్లో బోధన సాగాలని, యూనివర్సిటీ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు - ప్రణబ్..

హైదరాబాద్ : ఉన్నత విద్యలో ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1956లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటైందన్నారు. ఐఐటీల్లో దాదాపు క్యాంపస్ ఎంపికలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంతా పాత ఐఐటీల్లో 100 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఐఐటీల్లో చదివిన వారికి 100 శాతం ఉద్యోగాలు వస్నున్నట్లు తెలిపారు.

ఓయూ అత్యున్నత విశ్వ విద్యాలయం - ప్రణబ్..

హైదరాబాద్ : ఓయూ అత్యున్నత విశ్వ విద్యాలయమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వందేళ్ల క్రితమే ఉన్నత విద్యలో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. దేశానికి ఉస్మానియా వర్సిటీ గర్వకారణమని, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాల్లో ఎందరో విద్యనభ్యసించారని, విశ్వ విద్యాలయాలు మేధావులకు, కొత్త ఆలోచలనలకు వేదికలుగా నిలుస్తాయన్నారు.

సంతోషంగా ఉంది - ప్రణబ్..

హైదరాబాద్ : ఓయూ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషానిచ్చిందని, శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. శతాబ్ధి పైలాన్ ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈసందర్భంగా వందేళ్ల ప్రత్యేక సంచికను గవర్నర్ ఆవిష్కరించారు. తొలి సంచికను రాష్ట్రపతి ప్రణబ్ కు అందించారు. ఈసందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ..వందేళ్ల క్రితం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం..

హైదరాబాద్ : భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితం ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరకున్నారు.

12:34 - April 26, 2017

ఒక్కటి కాదు..రెండు కాదు...మూడు కాదు..ఏకంగా 50 గంటల పాటు ముద్దు పెట్టారు. ఇలా ముద్దు పెట్టి ఏకంగా కారును బహుమతిగా పొందింది. అసలు కారు గెలుచుకోవడం ఏంటీ ? ముద్దు పెట్టడం ఏంటీ ? అని బుర్రగొక్కుంటున్నారా ? అయితే తెలుసుకోవాలంటే చదవండి..

ఓ కార్ల సంస్థ 'కియా ఆప్టిమా ఎల్ఎక్స్' అనే కారును మార్కెట్ లోకి విడుదల చేశారు. ‘97.6 కిస్' అన ఎఫ్.ఎమ్ సంస్థ సదరు కార్ల సంస్థతో ఓ ఒప్పందం చేసుకుంది. ‘కిస్ ఎ కియా' అనే కాంటెస్ట్ పెట్టింది. మార్కెట్ లోకి విడుదల చేసిన కారును ఎక్కువ సమయం ఎవరు ముద్దాడుతారో వారికి కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీనితో ఇరవవై మంది ఉత్సాహవంతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అందులో డిలినీ జయసూర్య కూడా ఉన్నారు. ఈమె ఏకంగా 50 గంటల పాటు కారును ముద్దాడి విజయం సాధించి కారును సొంతం చేసుకున్నారు. కొందరు కారుపై తలపెట్టి పడుకోవటం...నేలమీద అతుక్కుని ఉండటం...ఇలా రకరకాల ఫోజుల్లో కారును ముద్దాడారు. ‘కిస్‌ ఎ కియా' ఫొటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

12:33 - April 26, 2017

హైదరాబాద్: జ్యోతి ప్రజ్వలన చేసి ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. 

12:22 - April 26, 2017

ఎండలని సైతం లెక్క చేయకుండా అభిమానుల కోసం బాబాయ్ (పవన్ కళ్యాణ్) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని..ఆయనకు హ్యాట్యాఫ్ చెప్పాలని మెగా స్టార్ చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్ చరణ్ తేజ పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ గత కొన్ని రోజులుగా రాజమండి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రతి రోజు వందలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈసందర్భంగా రామ్ చరణ్ వారినుద్ధేశించి ప్రసంగించారు. రాజకీయంగా..ఇంకే రకంగా బాబాయ్ పనిచేసినా అభిమానులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక తన తండ్రియైన 'చిరంజీవి' 151వ సినిమా ఆగస్టులో మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంతవరకు కనిపించని పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారని, తన సినిమా అందర్నీ అలరిస్తుందని రామ్ చరణ్ పేర్కొన్నారు.

180 వార్డుల్లో బీజేపీ గెలుపు..

ఢిల్లీ : ఎంసీడీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 272 వార్డులకు 270 స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరిగింది. కౌంటింగ్ బుధవారం జరిగింది. 180వార్డుల్లో బీజేపీ విజయం సాధించగా కాంగ్రెస్ 35, ఆప్ 45స్థానాల్లో విజయం సాధించాయి.

 

12:16 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బేగం పేట ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్ అలీ, స్పీకర్ మదుసూధనాచారి, మండలి ఛైర్మన్ స్వాగతం పలికారు. అనంతరం ఉస్మానియా యూనివర్శి శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించేందుకు బయలు దేరారు.

కాంగ్రెస్ కు అజయ్ మాకెన్ రాజీనామా..

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అజయ్ మాకెన్ ప్రకటించారు. ఎంసీడీ పోల్స్ లో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు, సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని మాకెన్ స్పష్టం చేశారు.

12:02 - April 26, 2017

'ఒకే ఒక్కడు'.సినిమా గుర్తుండే ఉంటుంది కదా. ఆ చిత్రంలో హీరో ఒకే ఒక్క రోజు సీఎంగా ఉండి పలు సంస్కరణలకు నాంది పలికిన సంగతి తెలిసిందే. అట్లాంటిదే ఒకటి ఓ కంపెనీలో చోటు చేసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో ప్రముఖ పేరు సంపాదించుకున్న కంపెనీల్లో 'ఫ్లిప్ కార్డ్' ఒకటి. ఫ్లిప్ కార్ట్ ను ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. బిగ్ 10 సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక్క రోజు 'సీఈవో'గా ఎందుకు కావాలని అనుకుంటున్నారు ? కారణాలు తెలుపుతూ పోటీలో ఎంట్రీలో పాల్గొనాలని నిబంధనలు పెట్టింది. పలువురు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్ లో 'పద్మిని పగడాల' ఎంపికైంది. కంపెనీలో వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ గా నాలుగేళ్ల నుండి పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సీఈవోగా ఆమె విధులు నిర్వర్తించారు. మళ్లీ సాయంత్రం కళ్యాణ్ కు సీఈఓ బాధ్యతలను యధావిధిగా అప్పగించారు. సీఈవో కళ్యాణ్‌ సమక్షంలో తాను సీఈవోగా పనిచేయడం సంతోషంగా అనిపించిందని పద్మిని పేర్కొన్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలు.. కళ్యాణ్ పాల్గొనే రోజువారీ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు, ఈరోజు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని తెలిపారు.

బేగంపేటకు చేరుకున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు..ఇతరులు స్వాగతం పలికారు.

ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు..

సంగారెడ్డి : గోకుల్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

11:49 - April 26, 2017

'బాహుబలి -2’ కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అంతటా 'బాహుబలి' ఫీవర్ నెలకొంది. టికెట్ల కోసం థియేటర్ల ఎదుట ప్రేక్షకులు బారులు తీరారు. విడుదలవుతున్న సినమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటి చెప్పిన 'బాహుబలి' సీక్వెల్ గా 'బాహుబలి -2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా చూడటానికి పలు కంపెనీలు సెలవులు..మరికొన్ని కంపెనీ ఉద్యోగులకు టికెట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమౌతున్నాయని తెలుస్తోంది. తాజాగా తనకు కూడా డైరెక్టర్ లీవ్ మంజూరు చేశాడని టాలీవుడ్ యంగ్ హీరో 'మంచు మనోజ్' కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఆయన నటిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' సినిమా షూటింగ్ కు ఏప్రిల్ 28న విరామం ఇచ్చారు. ‘బాహుబలి -2’ సినిమా చూసేందుకు విరామం ఇచ్చారని మంచు మనోజ్ పేర్కొన్నారు.

మిర్చి, పసుపు కొనుగోళ్లపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స..

విజయవాడ : తన సరుకు అమ్ముడు పోలేదని అర్హుడైన ఏ రైతు బాధపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మిర్చి, పసుపు కొనుగోళ్లపై మంగళవారం సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

11:39 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు సన్నద్ధవుతోంది. యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాకులు ఉత్తమ పరిశోధనలు చేయడంలో ఈ లైబ్రరీ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రపంచానికి మేధావులను అందించిన ఓయూ లైబ్రరీ...

ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయం రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఓయూలో చదవి, ఈ లైబ్రరీని ఉపయోగించుకున్న ఎంతోమంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, క్రీడాకారులు, రాజకీయవేత్తలుగా రాణిస్తున్నారు. ఎందరో సరస్వతీ పుత్రులను ప్రపంచానికి అందించన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ... చాలా ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముల్కి ఉద్యమం మొదలు తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు అన్నీ కూడా ఇక్కడే పురుడుపోసుకున్నాయి.

అందుబాటులో 5,40,387 పుస్తకాలు ...

ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ చదువుల తల్లి. ఈ గ్రంథాలయంలో 5,40,387 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు హారజయ్యే విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతో బాగా ఉపయోగపడుతోంది.

ఏడాదిలో 360 రోజులు పని చేస్తున్న ఓయూ లైబ్రరీ ...

విద్యార్థుల అవసరాలకు అనుగుణగా లైబ్రరీ పని వేళలు, పని దినాలు ఉన్నాయి. ఏడాదిలో ఐదు రోజులు మినహా మిగిలిన 360 రోజులు పని చేస్తుంది. పద్నాలుగు విభాగాల్లో సేవలు అందిస్తోంది. విలువైన ఎన్నో గ్రంథాలను భవిష్యత్‌ తరాల కోసం డిజటలీకరణ చేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి చాలా మంది ప్రముఖులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. 6,825 చేతిరాత ప్రతులు, 45 వేల డిజిటల్‌ పుస్తకాలు, 253 పిరియాడికల్స్‌, 273 పిల్మ్‌లు ఈ లైబ్రలో విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్నాయి. తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన రాత ప్రతులు కూడా ఉస్మానియా యూనిర్సిటీ లైబ్రరీలో ఉన్నాయి. తెలుగు, తమిళనం, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, పార్సీ, అరబిక్‌, హిబ్రూ... ఇలా పలు భాషల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ లైబ్రరీని తీర్చిదిద్దారు.

విజ్ఞాన భాండాగారం భాసిల్లుతున్నఉస్మానియా ...

విజ్ఞాన భాండాగారం భాసిల్లుతున్నఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ భవిష్యత్‌ తరాలకు మరింత మెరుగైన సేవలు అందిచేలా దినదిన ప్రవర్థమానం చెందాలని అందరూ ఆశిస్తున్నారు. 

వెస్ట్ బెంగాల్ లో తుపాకుల స్వాధీనం..

పశ్చిమబెంగాల్ : ఐదుగురు వ్యక్తుల వద్ద పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద 24 తుపాకులు, 50 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఐమాక్స్ వద్ద సందడి..

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద 'బాహుబలి' అభిమానులతో సందడి నెలకొంది. టికెట్ల కోసం జనాలు బారులు తీరారు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

11:29 - April 26, 2017

కాసేపట్లో నగరానికి రాష్ట్రపతి ప్రణబ్..

హైదరాబాద్ : కాసేపట్లో ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేటకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేరుకోనున్నారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎం కేసీఆర్ లు ఘన స్వాగతం పలుకనున్నారు.

11:24 - April 26, 2017

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్' విడుదల తేదీలో మార్పు జరిగిందా ? అనుకున్న సమయానికంటే లేటుగా రిలీజ్ చేయనున్నారా ? అనే చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రంలో 'మహేష్ బాబు' నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా కొనసాగుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు. సినిమాను జూన్ 23వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. కానీ ఆగస్టు 9వ తేదీన మహేష్ జన్మదినం ఉండడంతో ఆ రోజున సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ చిత్రీకరణను హైదరాబాద్ లో తీయనున్నట్లు, మే నెలాఖరు వరకు చిత్రీకరణ అంతా పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా మురుగదాస్ ఎలాంటి సందేశం ఇవ్వనున్నారో సినిమా విడుదలయ్యే వరక వేచి చూడాల్సిందే.

 

11:19 - April 26, 2017

సాయంత్రం పెట్రోల్ అందుబాటులో ఉండదా ? అయితే ఎలా ? అని ఆలోచిస్తున్నారా ? ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉదయం 6 నుండి సాయంత్రం వరకు పెట్రోల్ బంక్ లు పనిచేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదంతా పక్క రాష్ట్రమైన ఏపీలో అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మే మూడో వారం నుండి రాష్ట్రంలో పరిమిత గంటల్లో మాత్రమే పెట్రోల్ బంక్ లు పనిచేయనున్నాయని, మే 15వ తేదీ నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాల కృష్ణ పేర్కొనట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డీలర్లు కమిషన్లు పెంచకపోతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వాహణ వ్యయం తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

తెలుగు వాడికి గర్వకారణం - పవన్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన పవన్ పుష్పగుచ్ఛంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, శాలువతో సత్కరించారు.

 

దేవినేని ఇంటికి లోకేష్..

విజయవాడ : దేవినేని నెహ్రూ ఇంటికి మంత్రులు లోకేష్, చిన రాజప్ప, దేవినేని ఉమలు వెళ్లారు. కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఇటీవలే దేవినేని నెహ్రూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దుర్గం చెరువుపై అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన..

హైదరాబాద్ : దుర్గం చెరువుపై జరిగే అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. రూ. 187 కోట్లతో దుర్గం చెరువు ఆధునీకరణ చేయనున్నట్లు, రూ. 3.50 కోట్లతో దుర్గం చెరువు సుందరీకరణ చేయనున్నట్లు వెల్లడించారు.

10:38 - April 26, 2017

ఏంటీ అగ్ర హీరో 'విక్రమ్' సినిమాలో టాలీవుడ్ కమెడియన్ 'పృథ్వీరాజ్' విలన్ గా కనిపిస్తున్నారా ? అని అనుకుంటున్నారా ? అదేం కాదు.. 'పృథ్వీరాజ్' అంటే కోలీవుడ్ నాయకుడు. ఇతను 'కనా కండేన్' చిత్రం ద్వారా కోలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే. అనంతరం హీరోగా మారారు. 'కావియ తలైవన్' చిత్రంలో సిద్దార్థ్ తో కలిసి నటించారు. ‘నాన్ సబానా' చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించిన ఇతను రెండేళ్లుగా తమిళ చిత్ర సీమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'విక్రమ్' హీరోగా 'ధృవ నట్చత్తిరం' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో 'రావణన్' చిత్రంలో విక్రమ్ తో పృథ్వీ నటించారు. 'ధృవ నట్చత్తిరం'లో విలన్ గా పృథ్వీ నటించనున్నారా ? లేదా ? అనేది అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

10:34 - April 26, 2017

హైదరాబాద్: మాదాపూర్‌ దుర్గం.. కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. 184 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ద్వారా జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల నుంచి వేగంగా ఐటీ ఏరియాకు చేరుకోవచ్చు. 

10:33 - April 26, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆదివారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 272 వార్డులకుగాను 270 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఆప్‌ రెండో స్థానంలో కొసాగుతోంది. కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంది.

 

10:32 - April 26, 2017

బాహుబలి -2 జ్వరం పట్టుకుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతంది. ప్రపంచ వ్యాప్తంగా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కాకముందే రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనన్న చర్చ ఫిల్మ్ వర్గాల్లో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'బాహుబలి -2’ చిత్రాన్ని రూపొందించారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..తదితర సస్పెన్ష్ విషయాలను ఈ చిత్రంతో తొలగిపోనున్నాయి. ఈ చిత్రానికి నటుడు 'ప్రభాస్' ఐదేళ్లు కష్టపడి పనిచేశారు. షూటింగ్ జరిగే సమయంలో ఏ చిత్రానికి 'ప్రభాస్' సంతకం చేయలేదు. ఒక హీరో ఒక ప్రాజెక్టు కోసం ఇన్ని ఏళ్లు కేటాయించడం అరుదుగా చూస్తుంటామని రాజమౌళి పేర్కొన్నారు. అందుకని ప్రభాస్ కు రాజమౌళి ఒక విలువైన బహుమతిని అందచేశారని టాక్. ‘బాహుబలి' చిత్రంలో అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో 'ప్రభాస్', ‘రానా', ‘అనుష్క', ‘తమన్నా'లు కీలక పాత్రల్లో నటించారు.

10:31 - April 26, 2017

హైదరాబాద్: కళా తపస్వి, ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాథ్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కలిశారు. సినీరంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌కు వరించడంతో ఆయనకు పవనకళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా కళాతపస్వి కే విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

10:26 - April 26, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దయి చాలా రోజులవుతోంది. కానీ ఇప్పటికీ అక్కడక్కడ సమస్యలు ఇంకా తీరడం లేదు. నెల ప్రారంభంలోనే పలు ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య ఇలా ఉండగానే మరో సమస్య జఠిలమౌతోంది. రూ. 10 కాయిన్ చెల్లడం లేదంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రూ. 10 కాయిన్ ఉన్న వారు ఏం చేసుకోవాలా ? అని తర్జనభర్జనలు పడుతున్నారు. చిరు వ్యాపారులకు..వినియోగదారులకు తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బజార్ల నుండి మొదలు కొని ఆర్టీసీ..పెట్రోల్ బంక్..చిల్లర దుకాణాలు..ఇలా చాలా వరకు ఈ కాయిన్ ను ఎవరు తీసుకోవడం లేదు. డైరెక్ట్ గా ఈ కాయిన్ చెల్లదు..నోటు ఉంటె ఇయ్యండి అనడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. బ్యాంక్‌ అధికారులు సైతం ఈ పుకార్ల విషయమై ఎటువంటి ప్రకటనా సరిగా చేయలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా బ్యాంక్‌ అధికారులు స్పందించి రూ.10 కాయిన్స్‌ విషయంలో పుకార్లను ఖండించేలా కార్యక్రమాలు ప్రజల మధ్యలో నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు.

ఢిల్లీ మున్సిపల్ కౌంటింగ్..తాజా సమాచారం..

ఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 183, కాంగ్రెస్ 35, ఆప్ 39, ఇతరులు 13 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు.

సౌత్ ఢిల్లీ
బీజేపీ 70, కాంగ్రెస్ 13, ఆప్ 16, ఇతరులు 05 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు.
నార్త్ ఢిల్లీ
బీజేపీ 71, కాంగ్రెస్ 13, ఆప్ 16, ఇతరులు 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు.
ఈస్ట్ ఢిల్లీ
బీజేపీ 40, కాంగ్రెస్ 11, ఆప్ 09, ఇతరులు 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు.

సెన్సెక్స్ ఆల్ టైం రికార్డు..

ముంబై: సెన్సెక్స్ ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. 30వేల మార్క్ ని తాకింది. సెన్సెక్స్ 116, నిఫ్టీ 28 పాయింట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో కాల్పుల కలకలం..

ఢిల్లీ : రోహిని సెక్టార్ -లో ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఇద్దరు క్రిమినల్స్ కు ..పోలీసుల కు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయని, మరొకరు పరారయ్యాడని తెలుస్తోంది.

విశ్వనాథ్ ఇంటికి పవన్..త్రివిక్రమ్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ ఇంటికి సినీ నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ లు వెళ్లారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న విశ్వనాథ్ ను అభినందించేందుకు వారు వెళ్లారు .

బీజేపీ 71 స్థానాల్లో ఆధిక్యం..

ఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ పార్టీ 71 స్థానాల్లో, కాంగ్రెస్ 16, ఆప్ 14 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఎంసీడీ పోల్స్..

ఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన జానక్ పురి (వెస్) నుండి నరేందర్ చావాల, జానకీపురం (సౌత్) నుండి వీణ శర్మలు గెలుపొందారు.

09:35 - April 26, 2017

గుంటూరు : డెల్టా ప్యాసింజర్ రైల్లో దోపీడీ జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద రైలు నిలిపివేసి చోరీ కి పాల్పడ్డారు. ఈ ఘటనలో దుండగులు 20 సవర్ల బంగారం, రూ.60 వేలు ఎత్తుకెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ల్లో ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు.

09:33 - April 26, 2017

హైదరాబాద్: ఎందరో విద్యావేత్తలను, మేధావులను తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నాటి హైదరాబాద్‌ రాజ్యంలో ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం. వందేళ్లనాటి ఇంజనీరింగ్‌ ప్రతభను నేటీకీ చాటుతూ ఆద్భుతంగా భాసిల్లుతోంది.. ఆర్ట్స్‌ కళాశాల భవనం. హైద‌రాబాద్ అంటే చార్మనార్‌ ఎలా గుర్తుకు వ‌స్తుందో .. ఉస్మానియా యూనివ‌ర్సిటి అనగానే ఇక్కడి ఆర్ట్స్ కాలేజీయే అందరి మదిలోనూ మెదులుతుంది.

1873లోనే ఓయూ మొదటి ప్రతిపాదన ....

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రతిపాదన 1873లోనే జరిగింది. ఆనాటి ఇద్దరు ప్రముఖ మేధావులు రఫత్ యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్‌ఘనీ ఈ విషయమై చొరవ తీసుకున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ కాలంలోనే జమాలుద్దీన్‌ అఫ్‌ఘనీ పారిస్ నగరంలో స్థిరపడ్డారు. అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన బ్లంట్‌ని 1882లో కలిసినప్పుడు హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ఏర్పాటు గురించి ప్రస్తావించారట. అలా ఈ చదువుల సౌధానికి తొలి ప్రతిపాదన జరిగింది. ఆతర్వాత బ్రిటీష్‌ఎంపీ బ్లంట్ నిజాం ఆస్థానంలోని ప్రధానమంత్రి సాలార్‌జంగ్-2ను కలిసి.. విశ్వవిద్యాలయ ఏర్పాటుపై చర్చించారట. అనంతరం ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు 1883 జనవరి 24న వర్సిటీ ఏర్పాటుకు లిఖిత పూర్వక ప్రతిపాదన అందజేశారు.

1913లో దార్-ఉల్-ఉలూం పేరుతో విద్యార్థుల ప్రదర్శలు...

1913లో ప్రాంతంనుంచే హైదరాబాద్‌ రాజ్యంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ.. దార్-ఉల్-ఉలూం పేరిట విద్యార్థులు నగరంలో ప్రదర్శనలు కూడా జరిపేవారట. ఈ నేపథ్యంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సింహాసనం అధిష్ఠించారు. 1914లో విద్యార్థి సంఘం నాయకులు పబ్లిక్ గార్డెన్స్‌లోని టౌన్ హాలులో ఏడవ నిజాం ప్రభువును కలిసి తమ ప్రతిపాదనను ఆయన ముందుంచారని, దీనిపై స్పందించిన నిజాం నవాబు తన అంగీకారం తెలిపాడని చరిత్రకారులు చెబుతారు.

1917 ఏప్రిల్‌ 267వ నిజాం వర్సిటీ ఏర్పాటుపై ఫర్మానా...

ఓవైపు ఆరవ నిజాంకాలంలో జరిగిన కృషి, విద్యార్థులు, మేధావుల కోరిక మేరకు 1917 ఏప్రిల్‌ 26న 7వ నిజాం లాంఛనంగా ఫర్మానా జారీ చేశారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుత అబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో మొట్టమొదట తరగతులు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్‌ సర్ పాట్రిక్ గాడ్డెస్ నేతృత్వంలో అడిక్‌మెట్ ప్రాంతంలో 1700 ఎకరాల విశాలమైన స్థలాన్ని విశ్వవిద్యాలయం కోసం కేటాయించింది ఏడవ నిజాం ప్రభుత్వం.

బిల్డింగ్‌ నమూనా ఎంపికలో ఆర్కిటెక్ట్‌ల కృషి ...

ఆతర్వాత వర్సిటీ భవన నిర్మాణానికై నమూనాల ఎంపిక కోసం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు నవాబ్ జైన్ యార్‌జంగ్, సయ్యద్ అలీ రజాలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో ఈజిప్టులో బెల్జియం ఆర్కెటెక్ట్ జాస్పర్‌ను కలిసి హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ బిల్డింగ్స్‌ రూపకల్పనపై చర్చించారట. తర్వాత నవాబ్ జైన్, ఆయన మిత్రులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, విశ్వవిద్యాలయ భవన రూపకల్పన కోసం ఈజిప్టు ఆర్కిటెక్ట్ జాస్పర్ పేరును 7వ నిజాందగ్గర ప్రతిపాదించారు.

బీదర్, గోల్కొండ, చార్మినార్, ఎల్లోరా..

అలా నిజాం అనుమతితో జాస్పర్ పదవీ బాధ్యతలు చేపట్టి బీదర్, గోల్కొండ, చార్మినార్, ఎల్లోరా, అజంతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భారతీయ శిల్పకళ, సంస్కృతీ విధానాలను ఆకళింపు చేసుకుని, హైదరాబాద్ సంస్కృతితో మేళవించి.. ప్రస్తుతం ఉన్న ఓయూ ఆర్ట్స్ కళాశాల భవన నమూనాను రూపొందించారు. దీంతో వర్సిటీ భవన నిర్మాణ పనులకు ఏడో నిజాం పునాది రాయి వేశారు. ఈ భవన నిర్మాణంలో సుమారు 35 వేల మంది కార్మికులు శ్రమించారు. కళాశాల ప్రధాన భవనం 110 మీటర్ల వెడల్పు, 119 మీటర్ల ఎత్తుతో రెండంతస్తుల్లో నిర్మించారు. సుమారు 164 విశాలమైన తరగతి గదులతో ఈ చదువుల కోవెల కొలువుదీరింది. దీని నిర్మాణం కోసం ఆ రోజుల్లో దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేసింది నిజాం ప్రభుత్వం. సుమారు ఐదున్నరేళ్లపాటు నిరంతరంగా కొనసాగి.. 1919 డిసెంబర్ 5 నాటికి పూర్తయింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణంలో హ్యూమ్ పైప్ కంపెనీ, హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కళాశాల నిర్మాణ శైలిలో సర్వమత సమ్మేళనం కనిపించేలా తీర్చిదిద్ది.. తమ విశాల దృక్పథాన్ని చాటుకున్నారు నిజాంపాలకులు.

1919లో ఇంటర్ తరగతులతో కళాశాల ప్రారంభం...

భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ..1919లో ఇంటర్ తరగతులతో కళాశాల ప్రారంభమైంది. 1921 నాటికి బీఏ, 1923 నుంచి పీజీ తరగతులు మొదలయ్యాయి. కాలేజీ ప్రారంభంలో ఉర్దూ మాధ్యమంలోనే తరగతులు నిర్వహించినా.. 1948 నుంచి ఇంగ్లిష్‌లో కూడా బోధన ప్రారంభించారు. యూనివర్సిటీలో విదేశీ భాషల్లోనూ బోధన జరుగుతోంది. ప్రస్తుతం 87దేశాలకు చెందిన 4వేల మంది విద్యార్థులు ఓయూలో చదువుకుంటున్నారు.

మాజీ ప్రధాని పీవీ , ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి ,అజారుద్దీన్‌ ఓయూ స్టూడెంట్స్‌

వందేళ్లనుంచి విద్యావెలుగులను పంచుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మేధావులు, ప్రముఖులను దేశానికి అందించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ వైవీరెడ్డి, ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఆజారుద్దీన్‌ లాంటివారు ఈ విశ్వవిద్యాయలంలో చదువుకున్నవారే. చదువులకే కాదు.. సమకాలీన సమస్యలపై గళం విప్పి.. ప్రత్యక్ష్య ఉద్యమంలో దూకడానికి ఓయూ సదా సిద్ధంగా ఉంటూనే వచ్చింది. స్వాతంత్ర్య పోరాటం నుంచి రజాకార్ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు .. ఈ యూనివర్సిటీ విదయార్థులు సమరశీల పోరాటాలు జరిపారు. ఇలా ఈ విశ్వవిద్యాలయం భవనం ఉన్నత చదువులు, రాజకీయ, సామాజిక ఉద్యమాలకు వేదిగా.. తన విశిష్ట చరిత్రను కళ్లముందు నిలపడంతోపాటు.. జాతి వారసత్వ సంపదగా ఓయూ భవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

09:23 - April 26, 2017
08:31 - April 26, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు 35 కౌటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. మూడు కార్పొరేషన్లలో 272 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి, ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.

 

ప్రారంభమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్

ఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఫలితాల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విస్తృత ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు 35 కౌటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

 

డెల్టా ప్యాసింజర్ రైల్లో దోపీడీ

గుంటూరు : డెల్టా ప్యాసింజర్ రైల్లో దోపీడీ జరిగింది. దాచేపల్లి మండలం పొందుగుల వద్ద రైలు నిలిపివేసి చోరీ కి పాల్పడ్డారు. ఈ ఘటనలో దుండగులు20 సవర్ల బంగారం, రూ.60 వేలు ఎత్తుకెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ల్లో ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు.

07:58 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఉస్మానియా గత వైభవాన్ని నిలుపుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రతి గ్రామానికి రైతు సంఘాన్నిఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ముందు పండి కందులు, మిర్చి రైతులను ఆదుకునే వారు ఎవరు? పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం లేదా?రైతు ఉద్యమాల్లో రైతుల సలహాలను తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు నడిపంల్లి సీతారామరాజు, టిఆర్ ఎస్ నేత కె.రాజీమోహన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,మాజీ ఎంపీ, టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి, బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హాపై సీబీఐ కేసు

ఢిల్లీ : కోల్‌స్కాం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సిబిఐ చీఫ్‌గా ఉన్నపుడు కోల్‌ స్కాం నిందితులను రంజిత్ సిన్హా త‌న అధికారిక నివాసంలో చాలాసార్లు క‌లిశార‌ని, కొందరు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారని ఆయనపై అభియోగాలు వచ్చాయి. కోల్‌ స్కాం కేసులో రంజిత్‌ సిన్హా పాత్రపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ మాజీ డైరెక్టర్ ఎంఎల్ శ‌ర్మ నేతృత్వంలోని కమిటి విచారణ జరిపింది. దీనిపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.

07:07 - April 26, 2017

ఢిల్లీ: త్రిముఖ వ్యూహంతో రైతు ఆదాయం రెట్టింపు చేయవచ్చని నీతి ఆయోగ్‌ తన నివేదికలో తెలిపింది. అభివృద్ధిపరమైన చర్యలు, సాంకేతికపరమైన మార్పులు, విధానపరమైన సంస్కరణలతో రైతు ఆదాయం రెట్టింపుచేయచ్చని సిఫార్సు చేసింది. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో 40 పేజీల నివేదికను తయారుచేసి ..ముఖ్యమంత్రుల అందజేసింది. ఏటా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్‌ సరఫరా చేయడం , పంటకు గిట్టుబాటుధర కల్పించడం వల్ల రైతు ఆదాయాన్ని పెంచవచ్చని స్పష్టం చేసింది.

నేడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఫలితాల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విస్తృత ఏర్పాట్లు చేసింది. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవ్వనుంది. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు 35 కౌటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

 

07:04 - April 26, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌ బంక్‌ల యజమానులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా పోరుకు సిద్దమయ్యారు. వచ్చేనెల 10 నుంచి వరుసగా నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు. తమ నిరసనతో అటు ప్రభుత్వం, ఇటు ఆయిల్‌ కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వంపై పోరుకు రెడీ అవుతున్న పెట్రోల్‌ బంక్‌ యజమానులు

ఏపీలో పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు ప్రభుత్వంపై పోరుకు సిద్దమయ్యాయి. తమకు మార్జిన్‌ కమీషన్‌ పెంచే వరకు ఆందోళన నిర్వహించాలని డిసైడ్‌ అయ్యాయి. ఇందుకోసం ఆందోళనబాట పట్టాలని నిర్ణయించాయి. ఏపీకి చెందిన పెట్రోల్‌ కంపెనీల యజమానుల సమావేశం విజయవాడలో జరిగింది. తమ సమస్యలతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపైనా చర్చించారు.

అపూర్వచంద్ర కమిటీ సిఫార్సులు పట్టించుకోని ప్రభుత్వం

అపూర్వచంద్ర కమిటీ సిఫార్సులను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతీ జనవరి, జూలైలో మార్జిన్‌ కమీషన్‌ను పెంచాలని అపూర్వచంద్ర కమిటీ సూచిందన్నారు. ఈ సిఫార్సును ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. బంకుల నిర్వహణకు ఖర్చు పెరుగుతోందని.... మార్జిన్‌ కమీషన్‌ పెరగకపోవడంతో తమకు నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు.

మే 10 నుంచి నిరసన తెలపాలని నిర్ణయం

పెట్రోల్‌ బంక్‌ యజమానులు ... మే 10 నుంచి నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు. అదే రోజు నుంచి ఆయిల్‌ కంపెనీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలును నిలిపివేస్తామన్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని.. లేదంటే.. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయిన వారు హెచ్చరించారు. 

07:00 - April 26, 2017

జనగాం: తెలంగాణ రైతు సంఘం మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభలను విజయవంతం చేసేందుకు జనగాం రైల్వే స్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడం పట్ల వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎరువులతో పాటు విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

విజయవాడ ఆర్టీఏ కమిషనర్‌పై దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

కృష్ణా: విజయవాడ ఆర్టీఏ కమిషనర్‌పై దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మీడియా కథనాలనే పిల్‌గా స్వీకరించింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో సహా 11 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. 

విజయవాడ ఆర్టీఏ కమిషనర్‌పై దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

కృష్ణా: విజయవాడ ఆర్టీఏ కమిషనర్‌పై దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మీడియా కథనాలనే పిల్‌గా స్వీకరించింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో సహా 11 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. 

తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం- రావుల

హైదరాబాద్: అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. వార్షిక మహానాడు, పార్టీ పటిష్టతపై చర్చించారు. మే 10 నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిపి మే 24న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ తరపున ఐదు కమిటీలు వేసి అధ్యయనం చేస్తామన్నారు.   

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి -కేసీఆర్‌

హైదరాబాద్: వ్యవసాయం పండుగలా మారిన రోజే బంగారు తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్‌. భవిష్యత్‌లో తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా నిలుస్తాడన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చేపట్టబోతున్న సంస్కరణలపై వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఎరువుల కోసం రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇస్తామన్నారు. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు కేసీఆర్‌.

06:49 - April 26, 2017

హైదరాబాద్‌ : నేడు నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నగరంలో పర్యటించే ప్రాంతాల్లో ఆయా సమయాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

మధ్యాహ్నం 12.30కు ఓయూకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మధ్యాహన్నం 12న్నర గంటల తర్వాత బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు.

కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. రాష్ట్రపతి పర్యటించే ఈ రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సులను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీస్‌ అధికారులు సూచించారు.

అడిక్‌మెట్‌ -ఆర్ట్స్‌ కాలేజీ -తార్నాక వెళ్లే వాహనాలను.. సీతాఫల్‌ టీజంక్షన్‌ వద్ద సీతాఫల్‌మండి వైపు మళ్లింపు

రాష్ట్రపతి పర్యటించే సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. అడిక్‌మెట్ ఫ్లైఓవర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ టీ జంక్షన్ వద్ద సీతాఫల్‌మండి వైపు మళ్లిస్తారు. అటు హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను రాజ్యాభిలేఖ తార్నాక స్ట్రీట్ నెం.1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ద నిలిపివేస్తారు.

వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల మళ్లింపు

ఇక ఆర్టీసీ బస్సుల ను కూడా వివిధ రూట్లలో మళ్లించనున్నారు. ఎన్‌సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మానియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు. ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్ వద్ద ఉంటుందని పోలీసులు తెలిపారు.

తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్‌పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే

ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్‌పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలని పోలీస్‌ అధికారులు తెలిపారు.

దిల్‌సుఖ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ 107 బస్సులు :

అటు దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు, ఈ బస్సులు హిందీ మహా విద్యా లయ, ఆర్టీసి ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్‌లో నడుస్తాయి. ట్రాఫిక్‌ నియంత్రణ, నిబంధనలకు పౌరులు సహకరించానలి సీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. 

నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: ఓయూ వందేళ్ల ఉత్సవాలను ప్రారంభించడానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

06:45 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో యూనివర్సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు, విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇందుకోసం క్యాంపస్‌లోని గ్రౌండ్స్‌ను ముస్తాబు చేశారు.

విద్యార్థి సంఘాలతో నగర పోలీసు కమిషనర్‌ చర్చలు ...

అయితే.. సంబురాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు ఓయూలోని విద్యార్థి సంఘాలతో నగర పోలీసు కమిషనర్‌ చర్చలు జరిపారు. ఉత్సవాలు సామరస్యంగా.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా వారిని ఒప్పించారు.

కొంతమంది నేతలను అరెస్టు చేయడంతో ....

విద్యార్థి సంఘాలు సహకరిస్తామని చెప్పినప్పటికీ.. ఇప్పటికే కొంతమంది నేతలను అరెస్టు చేయడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఓయూ ఉత్సవాలను దేశం గర్వించే విధంగా నిర్వహిస్తామంటున్నారు ఓయూ విద్యార్థి, ఎంపీ బాల్క సుమన్‌. ఎంతోమంది మేధావులు రాజకీయ నేతలను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ.. శతాబ్ధి ఉత్సవాల్లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి.

నేడు ప్రణబ్ ముఖర్జీ రాక

ఇక బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రానున్న నేపథ్యంలో జాతీయ భద్రతా దళాలు ఓయూని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాసులు ఉన్నవారిని తప్ప ఇతరులను లోపలికి అనుమతించేది లేదంటున్నారు. అలాగే యూనివర్సిటీలో భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థులు ముఖ్యమంత్రిని అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు మరిన్ని బలగాలను మోహరించే అవకాశం ఉంది.

చరిత్రలో నిలిచిపోయే విధంగా ...

మొత్తానికి ఓయూ ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే.. ప్రతిరోజు సాయంత్రం ఓయూ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 

వందేళ్ల పండుగకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధం

హైదరాబాద్: అపురూపమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. శతాబ్ధి ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మారింది. ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరవుతున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

06:41 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఉస్మానియా గత వైభవాన్ని నిలుపుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలోచర్చను చేపట్టింది. ఈ చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని, లేడీస్ హాస్టల్ కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఎస్ ఎల్ పద్మ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss