Activities calendar

27 April 2017

21:46 - April 27, 2017
21:40 - April 27, 2017

ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుంది : సీఎం కేసీఆర్

వరంగల్ : టీఆర్ఎస్ ప్రగతి నివేదన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో నీళ్లులేక ఎండిపోయిన పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్‌ దద్దమ్మలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

21:23 - April 27, 2017

వరంగల్ : టీఆర్ఎస్ ప్రగతి నివేదన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో నీళ్లులేక ఎండిపోయిన పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్‌ దద్దమ్మలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ట్రిబ్యునల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకొని తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకొని తీరని ద్రోహం చేశారని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్‌ నేతలను తరిమికొట్టాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

 


 

21:11 - April 27, 2017

వచ్చేస్తోంది.. మరికొద్ది గంటల్లో.. బాహుబలి-2.. అన్ని థియేటర్ల లోకి వచ్చేస్తోంది. ఆన్ లైన్ టిక్కెట్లు జోరుగా అమ్ముడుపోయాయి.... భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూలు కట్టారు... దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్ష్ గా మిగిలిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు విడుదల అవుతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డుల సృష్టిస్తోందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్ట్ వన్ వస్తున్నప్పుడే అంచనాలు ఆకాశాన్నంటాయి. కథనంలో కొనసాగించిన బిగువుతో.. పార్ట్ టూ పై అంతులేని ఉత్కంఠ. అసలు కథంతా పార్ట్ టూలో ఉందని ఎదురు చూశారు ప్రేక్షకులు.. ఈ ఎదురు చూపులకు ముంగింపు పడి.. ఇండస్ట్రీకి వసూళ్ల వర్షం కురిపించే సినిమాగా బాహుబలి ఉండబోతోందా? సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలే ఈ సినిమాకున్న క్రేజ్ కున్న నిదర్శనం. ఐమాక్స్ ఎదురుగా కట్టిన కిలోమీటర్ పొడవు క్యూలే ప్రేక్షకుల ఉత్కంఠకు ఉదాహరణగా నిలుస్తోంది. టికెట్ బుకింగ్ కోసం ఉధృతంగా సాగుతున్న ఆన్ లైన్ ట్రాఫిక్కే.. బాహుబలి బలం ఎంతో చెప్పే కొలత. వెరసి బాహుబలి ఓపెనింగ్స్ తోనే భారీ రికార్డు నెలకొల్పే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.టీజర్ మరిన్ని బాహుబలి విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత కేవలం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటమే ఆలస్యం బిజినెస్ అలా అలా జరిగిపోయింది. కేవలం పదినిమిషాల వీడియో చూసి ఫస్ట్ పార్ట్ వసూలు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే ఎక్కువ చెల్లించి మరీ కొనేశారు. ఇదీ బాహుబలి సత్తా.. ఇదీ రాజమౌళి క్రియేటివిటీ సృష్టిస్తున్న సినిమా సునామీ.. ఈ సునామీ తీరాన్ని తాకే సమయం ఆసన్నమైంది..

20:54 - April 27, 2017

వరంగల్ : 31 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో ప్రొ.జయశంకర్ సార్ లేకపోవడం బాధగా ఉందని, స్వర్గం నుంచి సార్ తమను అశీర్వదిస్తారని కేసీఆర్ అన్నారు. 16ఏళ్లు పార్టీని నడిపించిన ఘనత కార్యకర్తలదే అని పేర్కొన్నారు. 31 జిల్లా నుంచి వచ్చిన రైతులకు కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ఎంతోమ పోరాడి తెలంగాణ సాధంచుకున్నాం. 2014 జూన్ 2 తెలంగాణ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు వాటిని అధికమిస్తూ బంగారు తెలంగాణ దశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. మఖ్యంగా కరెంటు సమస్య లేకుండా చేసి రైతులకు, కార్మికులకు అండగా నిలిచామని తెలిపారు. ఆసుపత్రుల్లో చనిపోయి శవాన్ని తీసుకెళ్లాడానికి డబ్బులేక బాధపడుతున్న వారిని చూసి పరమ పథం పేరిట ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రూ.40,000కోట్లుమ కేటాయించామని తెలిపారు. 40 లక్షల మందికి పిఛన్లు ఇస్తున్నామని, యావదవులకు గొర్రెలు, నాయబ్రహ్మలకు అధనిక క్షౌర శాలలు 100 శాతం సబ్సిడీ పై కట్టిస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4వేలు ఇస్తామని, ప్రతి గ్రామంలో గ్రామరైతు సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ సన్నాసులు, దద్ధమ్మలు ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో పదవుల కోసం తెలంగాణను తాకట్లు పెట్టారని విమర్శించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేయాలేదని ఆరోపించారు.

19:52 - April 27, 2017

వరంగల్ : పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన మహా నేత కేసీఆర్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో 100 శాతం అమలు చేస్తున్నామని తెలిపారు. 4లక్షల మందికి పింఛన్లు ఇస్తూ టీఆర్ఎస్ దేశానికి ఆదర్శంగా నిలిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడుగా అన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ లేదు, వైసీపీకి ఆధారణ లేదు, బీజేపీకి క్యాడర్ లేదు, కాంగ్రెస్ కు నాకులు లేరని ఆయన అన్నారు. కేసీఆర్ ను మంచి మనస్సుతో అశీర్వదించండని కోరారు.

కేసీఆర్ మహానేత : కడియం

వరంగల్ : పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన మహా నేత కేసీఆర్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల ఏనిఫెస్టో 100 శాతం అమలు చేస్తున్నామని తెలిపారు. 4లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న టీఆర్ఎస్ దేశానికి ఆదర్శంగా నిలిందన్నారు.

కాసేపట్లో ప్రగతి నివేదన సభ

వరంగల్ : కాసేపట్లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలు సభా స్థలికి చేరుకున్నారు.

 

18:46 - April 27, 2017

హైదరాబాద్ : ఒక్క ప్రశ్న దేశాన్నే కుదిపేసింది. ఒకే ఒక్క ప్రశ్న ఎందరి మెదళ్లనో తొలిచేసింది. ఆ ఒక్క ప్రశ్న చర్చోపచర్చలకు దారితీసింది. దేశ ప్రధానే ఆ ప్రశ్నపై చర్చించారంటేనే..ఆ క్వశ్చన్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో తెలుస్తుంది. అదే బాహుబలి చిత్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రెండేళ్లుగా సమాధానం కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు ఉత్కంఠ వీడనుంది. బాహుబలి 2కు జక్కన్న ఎలాంటి ముగింపు ఇచ్చాడన్న టెన్షన్‌కు తెరపడనుంది.

జమ్మూలో ఉద్రిక్తత

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని కుప్పారాలో ఉద్రిక్తత నెలకొంది. వేర్పాటువాదుల ఆర్మీ క్మాంప్ పై రాళ్లదాడి చేశారు. దీంతో ఆందోళన కారులపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ వృద్ధుడు మృతి చెందాడు. నలుగురికి గాయాలైయ్యాయి.

 

 

జమ్మూకు అభివృద్ధి నిధులు కేటాయించిన కేంద్రం

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి రూ.19వేల కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేసింది.

 

ప్రభాస్ 'సాహో' టీజర్ విడుదల

 

హైదరాబాద్ : ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం సాహో టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ను నాలుగు బాషాల్లో విడుదల చేశారు.

18:09 - April 27, 2017
18:04 - April 27, 2017

అనంతపురం :  క్రమశిక్షణకు మారుపేరు ఆయన టీడీపీలో రోజురోజుకు కుమ్మూలటాలు పెరగుతున్నాయి. తాజాగా జిల్లాలో తెలుగుతమ్ముళ్లు బాహబాహికీ దిగారు. గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు మస్తానయ్య, రామాంజనేయులు చెప్పులతో కొట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ సమక్షంలోనే గొడవ జరిగింది. 

18:00 - April 27, 2017

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రూ. 10 రూపాయల కాయిన్స్‌పై వస్తున్న వదంతులను నమ్మవద్దని బ్యాంక్‌ అధికారులు అంటున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కాయిన్స్‌ను రద్దు చేస్తే ఆర్బీఐ ప్రకటిస్తుందంటున్నారు. మరోవైపు ఇదే అదనుగా కొంతమంది 10 రూపాయల నకిలీ కాయిన్స్‌ సృష్టిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో వ్యాపారులు 10 రూపాయల కాయిన్స్‌ తీసుకునేందుకు వెనకాడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తమ వద్ద కాయిన్స్‌ బ్యాంక్‌లో జమ చేయవచ్చంటున్న విద్యానగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌ గణేష్‌తో టెన్ టివితో మాట్లాడుతూ ఆర్బీఐ రూ.10 కాయిన్స్ రద్దు చేస్తే పేపర్ ప్రకట ఇస్తుందని తెలిపారు.

 

17:53 - April 27, 2017

జగిత్యాల : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభతో కార్యకర్తలకు పండుగ వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు ట్రాక్టర్లు, బండ్లపై వరంగల్‌కు తరలి వెళ్తున్నారు. అయితే ఈ మధ్యలో కొన్నిచోట్ల కార్యకర్తలు రోడ్లపైనే మందుతాగి చిందులేస్తున్నారు. జగిత్యాల నుంచి ట్రాక్టర్‌లో బయల్దేరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే గొడవపడి కొండగట్టు దగ్గర రోడ్డుపై కాసేపు హంగామా చేశారు. మందుబాబుల తీరును చూసి ప్రజలు ఇదేంటి అని నవ్వుకుంటున్నారు. మందుబాబుల హంగామాను కొంతమంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. 

17:25 - April 27, 2017

మూడో ఉగ్రవాది కోసం గాలింపు - భద్రతా అధికారి..

కుప్వార : మూడో ఉగ్రవాది కోసం గాలిస్తున్నట్లు భారత భద్రతా బలగాల అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు..బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను హత మార్చినట్లు, ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

17:11 - April 27, 2017
16:58 - April 27, 2017

హైదరాబాద్ : మామిడి పండ్లంటే ఇప్పటివరకు బంగినపల్లి, నూజీవీడు ఇంకా కొన్ని బ్రాండ్లు గుర్తుండేవి. ఈ రకాలే ఇప్పటివరకు అత్యంత నాణ్యమైనవిగా మనం భావించి తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి జగిత్యాల మామిడి వచ్చి చేరింది. రుచిలో ఎప్పటినుంచో జగిత్యాల మామిడి నెంబర్‌వన్‌గా ఉన్న బ్రాండ్‌పేరులేక అది ప్రజాదరణకు నోచుకోలేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ జగిత్యాల మామిడికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. జగిత్యాల ఆర్డీవో టెన్ టివితో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జగిత్యాల మామిడి ఆధారణ అభించలేదన్నారు. జగిత్యాల మామిడికి ఉత్తర భారతదేశంలో గిరాకి ఉందని తెలిపారు. 

టి.అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 30వ తేదీన ఉదయం 11గంటలకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శాసనమండలి జరగనుంది. 29వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

దినకరన్ భార్యను ప్రశ్నించనున్న పోలీసులు ?

చెన్నై : ఈసీ లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ భార్యను కూడా ఢిల్లీ పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దినకరన్ భార్య 'జయ' టీవీ బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మంలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, రామగుండంలో 43 డిగ్రీలు..హన్మకొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లలో 42 డిగ్రీలు..హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 41 డిగ్రీలు.. మెదక్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో కూడా ఎండల తీవ్రత కొనసాగుతోంది. అనంతపురం, కర్నూలు, తిరుపతి, నంద్యాలలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, నెల్లూరు, విజయవాడలో 42 డిగ్రీలు..తునిలో 40 డిగ్రీలు..కాకినాడలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి రిమాండ్ పొడిగింపు..

కరీంనగర్ : మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి రిమాండ్ పొడిగించారు. ఇటీవల సోదాల్లో విదేశీ మద్యం లభించడంతో మోహన్ రెడ్డిని ఎక్సైజ్ కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టారు. మే 10వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది.

16:48 - April 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బాహుబలి ప్రీమియర్‌ షో రద్దైంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి, సుదర్శన్‌ థియేటర్లలో ప్రీమియర్‌ షోను రద్దు చేశారు. దీంతో ప్రీమియర్‌ షో చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. కొన్న టికెట్‌కు డబ్బులు వాపస్‌ చేస్తారని అభిమానులు థియేటర్‌కు వస్తే, యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు.

 

16:26 - April 27, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతల మరణలపై కాంగ్రెస్ పార్టీ మహిళ నేతలు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీకె. అరుణ మాట్లాడుతూ ప్రభుత్వా ఆసుపత్రుల్లో బాలింతాలు మరణిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆసుపత్రుల్లో బాగానే ఉందని వస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆసుపత్రుల్లో స్టాప్, పరీక్ష చేసే పరికారలు లేవని తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.5లక్షలు నష్టపరిహారం ఇవ్వలని ఆమె డిమాండ్ చేశారు.

2019 అధికారంలో కాంగ్రెస్ - ఉత్తమ్...

సూర్యాపేట : మఠంపల్లిలో రైతుల అభినందన సభ జరిగింది. మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని, ఎకరాకు రూ. 4వేలు వచ్చే నెల నుండే అమలు చేయాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ డిమాండ్ చేశారు.

బాలింత మరణాలపై హెచ్చార్సీ ఆదేశాలు..

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న బాలింత మరణాలపై ఆగస్టు 3వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని హెచ్ ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. బాలింతల మరణాలపై టి.కాంగ్రెస్ మహిళా నేతలు హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఖమ్మం టు వరంగల్ రైలు..

ఖమ్మం : వరంగల్ సభకు ప్రత్యేక రైలును మంత్రి తుమ్మల జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.

 

 

సహారా చీఫ్ కు సుప్రీం హెచ్చరికలు..

ఢిల్లీ : సహారా చీఫ్ సుబ్రతారాయ్ ని సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది. జూన్ 15వ తేదీలోగా రూ. 2500 కోట్లు చెల్లించాలని, లేదంటే జైలు తప్పదని హెచ్చరించింది. డబ్బు కట్టకపోతే అంబీ వ్యాలీ వేలం తప్పదని తెలిపింది.

15:56 - April 27, 2017

వావి వరుసలు ఉండవు..వయస్సుతో సంబంధం లేదు..వారి లక్ష్యం ఆడాళ్లతో కలిసి సంచారం..నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లడం..ఎదురు తిరిగితే చంపేయడం..నగర శివార్లలోని ఘోరంపై మిస్టరీ వీడింది..

నగరంలో మృగాళ్ల ముఠాలు సంచరిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులను పోలీసులు పట్టుకున్నారు..పాతికేళ్లు కూడా నిండని యువకులు చేస్తున్న ఘోరాలు చూసి కాప్స్ కలవరపడ్డారు. కల్లు దుకాణాల వద్ద వీరు మాటు వేసి అక్కడకు వచ్చే మహిళలకు గాలం వేసేవారు. వయస్సుతో సంబంధం లేకుండా..వావి వరుసలు మరిచి కిరాతకం చేస్తున్న దుర్మార్గుల పాపం పండింది.. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:49 - April 27, 2017

స్థిరపడేందుకు అవకాశం దొరికింది..అప్పు చేసి గల్ఫ్ కు పోవాలని అనుకున్నాడు..రెండు లక్షలను ఏజెంట్ కు పంపాడు..అక్కడకు వెళ్లాక అసలు కథ తెలిసింది.

దేశం కాని దేశంలో ఎక్కువ సంపాదించుకోవాలన్న కోరిక వారిని ఎన్నో కష్టాలకు గురి చేస్తోంది..ఏజెంట్ల మోసాల బారిన పడిన వారు అష్టకష్టాలు పడుతున్నారు. కొంతమంది అయితే మృత్యువాత పడుతున్నారు. కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్యాల హరీష్ అనే యువకుడు చొప్పదండి కొలిమికొట్టకు చెందిన వాడు. డ్రైవింగ్ నేర్చుకున్న ఇతను గల్ఫ్ కు పోవాలని అనుకున్నాడు. ఏజెంట్ ను కలిసి అప్పులు చేసి గల్ఫ్ కు వెళ్లాడు. డ్రైవర్ గా చేస్తూనే ఇతర పనులు చేయాలని చెప్పేవారు. తాను పడుతున్న కష్టాలను తల్లిదండ్రులకు చెప్పి రోదించే వాడు. చివరకు డిసెంబర్ 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు నెలల అనంతరం హరీష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో..ఏజెంట్ల మోసాలకు బలికాకండి..పక్కా వివరాలు తీసుకున్న అనంతరం విదేశాలకు వెళ్లండి..అని పలువురు సూచిస్తున్నారు.

15:47 - April 27, 2017

గుంటూరు : మత్స్యకారులను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, చేపల వృత్తికి భంగం కల్గిస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజధాని ప్రాంతంలోని నదిపరివాహాక ప్రాంతాల్లోని పల్లెకారులను ఖాళీ చేయించడం దారుణమని అన్నారు. గుంటూరు జిల్లా శీతానగరం వద్ద పల్లెకారులు చేస్తున్న వంటవార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 

15:44 - April 27, 2017

గుంటూరు : ఏడాదికి మూడు పంటలు పండే జరీబు భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదని రాజధాని ప్రాంత రైతులు తేల్చిచెబుతున్నారు. భూ సేకరణ పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూములను లాక్కోవడం అన్యాయమని పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెనుమాక సీఆర్డీఏ కార్యాలయం వద్ద తమ పొలాల్లో పండిన పంటలు, కూరగాయాలను రోడ్డుపై పోసి, ఉచితంగా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాలను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

15:35 - April 27, 2017

న్యాయం చేయాలని పోలీసులను కోరింది..పోలీసులు స్పందించలేదు..కలత చెందిన అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించింది..చివరకు పోలీసులు స్పందించారు. కాప్స్ మీద నమ్మకం లేని ఆ యువతి పోరాటానికి దిగింది..

ఓ యువకుడు తన జీవితంతో ఆడుకుంటున్నాడు..అని ఓ యువతి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు ఎలా స్పందించాలి ? వెంటనే యాక్షన్ తీసుకోవాలని అంటారు కదా. కానీ పోలీసులు స్పందించలేదు. దీనితో ఆ యువతి నేరుగా ఆ ఇంటి యువకుడి ఎదుట ఆందోళనకు దిగింది. చివరకు పోలీసులు స్పందించారు. బుజ్జగించే ప్రయత్నాలు జరిపారు. గిదేం పోలీసింగ్ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయం చేయాలంటూ వచ్చిన యువతికి అప్పుడే స్పందిస్తే బాగుండేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మాయికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. యువతి గ్రామానికి చెందిన ఓ యువకుడు నిశ్చితార్థం జరిగిన వరుడికి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు పీఎస్ లో ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యంగా పోలీసులు సమాధానం ఇచ్చారని యువతి పేర్కొంటోంది. న్యాయం చేయాలంటూ..యువతి కోరుతోంది.. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:24 - April 27, 2017

హైదరాబాద్ : బాహుబలి ప్రీమియర్, బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతలు వచ్చి అడిగితే ఆలోచిస్తామని మంత్ర తలసాని తెలిపారు. అధిక ధరలు వసూలు చేస్తే థియేలర్లపై చర్యలు తప్పవిని ఆయన  హెచ్చరించారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు టికెట్లు కొన్న అభిమానులు అందోళన చెందుతున్నారు. ఇది ఇలాఉంటే 'బాహుబలి 2' సినిమా టికెట్ల పెంపు గందరగోళం నెలకొంది. థియేటర్ల యాజమానులు బాహుబలి టికెట్ల రెట్లను పెంచేస్తున్నారు. దీనిపై వారిన వివరణ కోరగా కోర్టు ఆదేశాల ప్రకారమే టికెట్లు ధరను రూ.100 నుంచి 120 పెంచామని, తమ దగ్గర కోర్టు కాఫీలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కోర్టు మల్టిప్లెక్స్ లకు మాత్రమే టికెట్టు ధర 20 నుంచి 25 శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పిచింది.

పేపర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

మహారాష్ట్ర : ఔరంగాబాద్- సోలాపూర్ జాతీయ రహదారిపై ఉన్న పేపర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పేందుకు 15 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

కడపలో ప్రభాస్ అభిమానుల సందడి..

కడప : బాహుబలి సినిమా కొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. దీనితో రైల్వేకోడూరులో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. సిద్దేశ్వర థియేటర్ దగ్గర గురువారం పదివేల మందికి అన్నదానం చేశారు.

 

 

29న టి.బీఏసీ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 30వ తేదీన ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న సాయంత్రం నాలుగు గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. అందులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై చర్చించనున్నారు.

14:58 - April 27, 2017

హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా బాహుబలి 2 మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోం. బాహుబలి 2 టీజర్‌ విడుదలైన కొంత సమయంలోనే కోటీ వ్యూస్‌ దాటింది. ఇదే రేంజ్‌లో సినిమా కూడా దూసుకుపోతుందన్న అంచనాలు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో బాహుబలి 1 సినిమా 600 కోట్లు కొల్లగొట్టింది. అమీర్‌ఖాన్‌ పీకే చిత్రం 792 కోట్ల క్లబ్‌ను బాహుబలి 2 బ్రేక్‌ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. విడుదలకు ముందే 500 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్లు దాటుతుందని మార్కెట్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే దేశ సినీ చరిత్రలో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ను ఏ చిత్రం చేరుకోలేకపోయింది. జక్కన్న చెక్కిన బాహుబలి 2 మ్యాజిక్‌ ఫిగర్‌ను క్రాస్‌ చేస్తుందో...? లేదో..? చూడాలి మరి...!

 

కేసీఆర్ గొంతు మూగబోయింది - రేవంత్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టి.టిడిపి నేత రేవంత్ పలు విమర్శలు గుప్పించారు. ఓయూలో కేసీఆర్ గొంతు మూగబోయిందని, పది నిమిషాల్లో కార్యక్రమం ముగించి వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ చేయ్యి ఊపడానికి కూడా ధైర్యం చేయలేదని, నాలుగు కోట్ల ప్రజల గొంతు నొక్కిన కేసీఆర్ ను ఓయూ విద్యార్థులు పీక నొక్కారని తెలిపారు. వరంగల్ లో జరిగే ప్రగతి సభ కాదని..దోపిడీ సభ అని తెలిపారు. కేసీఆర్ కుటుంబం కోసమే ఓయూ శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించారని, ప్రతిపక్షాలను ఎవర్నీ ఉత్సవాలకు ఆహ్వానించలేదని తెలిపారు.

 

14:53 - April 27, 2017

సిమ్లా : విమానయానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా విమానాశ్రయంలో ఉడాన్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. విమానాయాన రంగంలో ప్రాంతీయ అనుసంధానత పెంచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉడాన్‌లో భాగంగా విమానంలో గంట ప్రయాణానికి 2,500 రూపాయలలోపు టికెట్‌ ధర నిర్ణయిస్తారు. ముందుగా సిమ్లా-ఢిల్లీ, కడప-హైదరాబాద్‌, హైదరాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-ముంబైలకు ఉడాన్‌ విమాన సర్వీసులను ప్రారంభించారు. ఉడాన్‌ పథకంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ముంబైలో 'బాహుబలి-2’ ప్రీమియర్ వాయిదా..

హైదరాబాద్ : ముంబైలో 'బాహుబలి -2’ ప్రీమియర్ షో వాయిదా పడినట్లు చిత్ర దర్శకులు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వెటరన్ యాక్టర్ 'వినోద్ ఖన్నా' మృతికి సంతాపకంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు.

14:49 - April 27, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఓయూ విద్యార్థులకు భయపడే కేసీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు పూర్వవిద్యార్థులను కానీ, ప్రతిపక్ష నేతలను గానీ ఆహ్వానించకపోవడం శోచనీయమన్నారు. వరంగల్‌లో ప్రగతినివేదన సభ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, అసలు మూడేళ్లలో కేసీఆర్‌ సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలన్నారు. 

14:45 - April 27, 2017

గుంటూరు : రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటమిలేదన్నారు. గతంలో కొన్ని పొరపాట్లు చేయడంతో ఇప్పట్లో ఓడిపోయాని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. ఎన్నికలు ఎప్పుడచ్చిన సిద్ధమేనని ప్రకటించారు.

 

చెన్నైకి దినకరన్..

చెన్నై : క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. టిటివి దినకర్ ను కూడా తీసుకొచ్చారు. పార్టీ గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపారనే ఆరోపణతో దినకర్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

వెంకయ్యను కలిసిన స్పీకర్ కోడెల..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఏపీ స్పీకర్ కోడెల కలిశారు. అసెంబ్లీ స్థానాల పెంపు..నర్సరావుపేట..సత్తెనపల్లి..నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉందని కోడెల పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీని డిజిటలైజేషన్ చేయడానికి కేంద్రం తోడ్పాటు అందించాలని వెంకయ్యను కోరడం జరిగిందన్నారు. కాగిత రహిత పాలన..అసెంబ్లీ సెషన్ నిర్వాహణ జరిగాలన్నదే తమ ధ్యేయమన్నారు.

టి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు..

హైదరాబాద్ : తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల పునరుద్ధరణ బలోపేతం కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు.

14:42 - April 27, 2017

గుంటూరు : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధమేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను బాబు స్వాగతించారు. మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. బుధవారం లోకేష్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా చంద్రబాబు స్పందించడం ప్రాధన్యత సంతరించుకుంది.

బాహుబలి కోసం ఆందోళన

హైదరాబాద్ : సుదర్శన్ ధియేటర్ లో బాహుబలి అభిమానులు ఆందోళనకు దిగారు. ప్రీమియర్ షోకు టికెట్లు విక్రయించిన థియేటర్ యాజమాన్యం షో రద్దయిందని చెప్పడంతోమ ప్రేక్షకులు అగ్రహాం వ్యక్తం చేశారు. 

14:22 - April 27, 2017
13:52 - April 27, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి--2’ మేనియా పట్టుకుంది. శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి' సినిమాలో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ‘బాహుబలి-2’ సినిమా ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కించిన సినిమా రికార్డుల సొంతం చేసుకుంటుందని టాక్. వేయి కోట్ల క్లబ్ లో చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా మొదటి రివ్యూ వచ్చేసిందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. దుబాయ్ లో సినిమా చూసిన యూఏఈ, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. ఏకంగా 5/5 రేటింగ్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది.
ఈ సినిమా హాలీవుడ్ సినిమాల సరసన నిలుస్తుందని, అద్భుతంగా తెరకెక్కించారని, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్', ‘హారీపోటర్'లతో సినిమాను పోల్చడం విశేషం. సినిమాలో బలమైన కథ..మహిష్మతి నగరం..జలపాతం..ఎత్తైన శిఖరాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని పేర్కొన్నారు. అందరూ పోటీ పడి నటించారని, ప్రభాస్ తన జీవితంలోనే అత్యద్భుతమైన నటనను కనబరచారని, భల్లాలదేవ పాత్రలో 'రాణా' తప్ప వేరే వ్యక్తిని ఊహించుకోలేమని పేర్కొన్నారు. భారతీయ సినీ దర్శకుల్లో 'రాజమౌళి' అద్భుతమైన వ్యక్తి అని, కథను తెరకెక్కించే విధానంలో ఆయన ఎవరూ సాటిరారని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

13:21 - April 27, 2017

హైదరాబాద్: ఒక్క ప్రశ్న దేశాన్నే కుదిపేసింది. ఒకే ఒక్క ప్రశ్న ఎందరి మెదళ్లనో తొలిచేసింది. ఆ ఒక్క ప్రశ్న చర్చోపచర్చలకు దారితీసింది. దేశ ప్రధానే ఆ ప్రశ్నపై చర్చించారంటేనే..ఆ క్వశ్చన్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో తెలుస్తుంది. అదే బాహుబలి చిత్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రెండేళ్లుగా సమాధానం కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు ఉత్కంఠ వీడనుంది. బాహుబలి 2కు జక్కన్న ఎలాంటి ముగింపు ఇచ్చాడన్న టెన్షన్‌కు తెరపడనుంది. 

13:19 - April 27, 2017

వరంగల్: నేడు వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ 16వ వార్షిక సభకు.. రైతులు వేలాది ట్రాక్టర్లలో బయల్దేరారు. రైతులు మహాసభకు రావడం చెప్పుకోదగిన విషయమని.. రోడ్లు మరియు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం బైపాస్‌ రోడ్డులో మంత్రి తుమ్మల స్వయంగా ట్రాక్టర్‌ నడిపించారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కలిసి 120 ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. బహిరంగ సభకు వచ్చే రైతాంగానికి వారు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ సభకు ట్రాక్టర్లలో బయల్దేరిన రైతులు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. వరంగల్‌లో జరిగే సభకు బయల్దేరారు. మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ఆధ్వర్యంలో 2 వందలకు పైగా వాహనాల్లో పార్టీ కార్యకర్తలు బయల్దేరారు. వివిధ మండలాల నుంచి గులాబీ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు భారీ కాన్వాయ్‌తో వస్తున్నారు. మార్కెట్‌ యార్డు లక్ష్మీదేవి చంద్రశేఖర్‌ రెడ్డి, కార్యకర్తలు భారీ సమూహంతో వైఎస్‌ఆర్‌ సర్కిల్ వద్ద కేసీఆర్‌ ఫోటోకు పాలాభిషేకాలు చేశారు. పూల మాలలు సమర్పించి బాణసంచా పేలుస్తూ ముందుకు సాగారు. గట్టు, ధరూర్‌, మల్ధకర్‌, గద్వాల మండలాల నుంచి కార్యకర్తలు అధికసంఖ్యలో సభకు బయల్దేరారు. 

12:52 - April 27, 2017

హైదరాబాద్: ప్రస్తుతం ఆధునికతతో పాటు ఆరోగ్య సమస్యల్లో స్త్రీలను ఎక్కువగా వేధించేది పీసీఓడీ అనేది ప్రధానంగా ఉంది. భారత్ లో ఎక్కువ శాతం మంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. పిసిఓడీ ఉన్న స్త్రీలకు సంతాన లేమి సమస్యలు కూడా కలుగజేస్తుంది. మిర ఈ సమస్యల కారణాలు ఏమిటి? నేటి 'మానవి హెల్త్ కేర్' లో తెలుసుకుందా. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏపీపీఎస్సీ ఎదుట గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన..

హైదరాబాద్ : ఏపీపీఎస్సీ ఎదుట గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆందోళనకు ఆర్.కృష్ణయ్య సంఘాభావం ప్రకటించారు.

 

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో హెచ్ఆర్సీ..

హైదరాబాద్ : మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో హెచ్ఆర్సీ జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతల మరణాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రసూతి ఆసుపత్రుల్లో మరణాలు ప్రభుత్వ హత్యలే అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో డీకే అరుణ, సబిత, సునీతా లక్ష్మారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలపై హెచ్ఆర్సీలో నేతలు ఫిర్యాదు చేశారు.

12:36 - April 27, 2017

హైదరాబాద్: గర్భిణీగా ఉన్న మహిళ నవమాసాలు నిండిన తరువాత ప్రసవ వేదన పడి బిడ్డను కంటుంది. ప్రస్తుతం పురిటి నొప్పులు పడకుండానే కడుపు కోతలతో బిడ్డలు పుట్టిస్తున్నారు. మరి రానున్న కాలంలో తల్లికి ప్రసవవేదన లేకుండానే బిడ్డలు పుట్టే పరిస్థితులు తలెత్తుతున్నాయా? దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జరిగే కాన్పులను పరిశీలిస్తే నిజమేనని అనిపిస్తుంది. అటు ప్రభుత్వాసుపత్రుల్లో నూ., ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజు రోజుకి కడుపు కోతలు పెరగడానికి కారణాలు ఏమిటి? ఇదే అంశం పై 'మానవి' ఫోకస్ లో చర్చను చేపట్టింది. మరి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

12:30 - April 27, 2017
12:28 - April 27, 2017

అమరావతి : దక్షిణ కొరియా దిగ్గజ కార్ల సంస్థ కియా మోటార్స్‌ ప్రతినిధులు...సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఇందుకోసం 600 ఎకరాల స్థలం గుర్తించింది. దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడితో ఈ కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కియా మోటార్స్‌కు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 

12:23 - April 27, 2017

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నా కొద్దిసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, వ్యాధి మరింతగా పెరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, 2014లో గురుదాస్ పూర్ నుంచి వినోద్ ఖన్నా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. మొత్తం 141 చిత్రాల్లో నటించిన ఆయన, పలు చిత్రాలను స్వయంగా నిర్మించారు. వినోద్ ఖన్నా మృతిపై బాలీవుడ్ వర్గాలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపాయి.

40 మంది ఎమ్మెల్యేలతో లోకేష్..

విజయవాడ : ఏపీ మంత్రి నారా లోకేష్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అమరావతిలోని సచివాలయం సెకెండ్ బ్లక్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలను మంత్రి లోకేష్ తీసుకున్నారు.

12:07 - April 27, 2017

'ఆప్' పంజాబ్ చీఫ్ రాజీనామా..

ఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఓటమితో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామాలకు సిద్ధమౌతున్నారు. తాజాగా ఆప్ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

'ఉడాన్' విమానాన్ని ప్రారంభించిన మోడీ..

హిమాచల్ ప్రదేశ్ : 'ఉడాన్' విమానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. తక్కువ ధరలకే వివిధ ప్రాంతాలకు ఈ విమానం అందుబాటులోకి రానుంది.

టీఆర్ఎస్ సభ కోసం హమాలీలు..

సూర్యాపేట : వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సభ కోసం హమాలీలను తరలించి మార్కెట్ ను బంద్ పెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ సంజీవరెడ్డిని అడ్డుకుని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కియా పెట్టుబడులు..

హైదరాబాద్ : ఏపీకి మరో అంతర్జాతీయ ఆటో మొబైల్ దిగ్గజం రానుంది. ఏపీలో పెట్టుబడులకు ప్రముఖ కార్ల కంపెనీకి కియా సంసిద్ధత వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లాలో రూ. 15వేల కోట్ల పెట్టుబడితో చిన్న కార్ల తయారీకి కేంద్రం ఏర్పాటు చేయనుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కియా సంస్థ ప్రతినిధుల ఒప్పందం కుదిరింది. 2019 నుండి కార్ల తయారీని కియా సంస్థ ప్రారంభించనుంది. ఏపీ ఆర్థికాభివృద్ధిలో తమ వంతు సాయం అందిస్తామని కియో మోటార్స్ అధ్యక్షుడు హాన్ వూ పార్క్ వెల్లడించారు.

11:41 - April 27, 2017

వివాహాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుడడం తెలిసిందే. చిన్న వయస్సు వారితో వివాహం చేసుకోవడం..జంతువులతో పెళ్లిలు..ఇతరత్రా జరుగుతుంటాయి. తాజాగా ఓ మహిళ యువతితో వివాహం చేసుకున్న ఘటన సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మంజీత్ కౌన్ ప్రభుత్వ అధికారి. ఈ అధికారి జలంధర్ నగరంలోని ఓ దేవాలయంలో 27 ఏళ్ల యువతిని వివాహం ఆడడం చర్చనీయాంశమైంది. వీరి పెళ్లి జరిగిన కాసేపటికే వివాహానికి సంబంధించిన ఫొటోలు..వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వీరి పెళ్లిపై మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. హిందూ సంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో సమీప బంధుమిత్రులు పాల్గొన్నారు. సంప్రదాయ బద్ధంగా తన 'భార్య'ను మంజీత్ తన ఇంటికి తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం కింద వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.

11:32 - April 27, 2017
11:29 - April 27, 2017

గ్యాస్ సిలిండర్..లేనిది వంట అయ్యే పరిస్థితి లేదు. కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల పర్యావరణానికి హాని చేకూరడంతో పాటు..వారి ఆరోగ్యం కూడా దెబ్బతినేది. గ్యాస్ సిలిండర్లు వినియోగంలోకి వచ్చాక ఆ సమస్య తీరింది. తొందరగా వంట కూడా అయ్యే వీలుంది. కానీ గ్యాస్ సిలిండర్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. సిలిండర్‌ తొందరగా ఇంటికొస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. ఏదీ గమనించకుండా సిలిండర్‌ను ఇంట్లో దించేసుకుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది..ఆ జాగ్రత్తలు మీ కోసం..

 1. సిలిండర్ తీసుకోగానే అది ఎంత బరువు ఉందో గమనించాలి. తక్కువగా ఉంటే బరువెంతో చెక్ చేసి తీసుకోవాలి. ముందుగానే దాని ఎక్స్ పైరీ డేట్ చూసి తీసుకోవాలి.
 2. ఎక్స్ పైరీ డేట్ ఎలా తెలుస్తుంది అంటారా ? సిలిండర్ ను చేతిలో పట్టుకొనే ప్లేస్ లో ఉంటాయి.
 3. ఇంగ్లీషులో ఎ, బి, సి, డి అనే అక్షరాలు లేదా రెండంకెల సంఖ్య ఉంటుంది. ఇవి నెలను సూచిస్తాయి. ఉదాహరణకు ఎ అనే అక్షరం వుంటే జనవరి నుంచి మార్చి వరకు (తొలి త్రైమాసికం) అనే అర్థం.
 4. బి అనే అక్షరం వుంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు, సి అంటే జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు, డి అంటే అక్టోబర్‌ నుండి డిసెంబర్‌ వరకు త్రైమాసికాలను గుర్తిస్తుంది.
 5. సిలిండర్లో సి 14 అనే సంఖ్య ఉంటే 2014 సెప్టెంబర్‌ వరకు ఉపయోగించవచ్చునని అర్థం.
 6. ఇక సిలిండర్‌ సీల్‌ను తప్పకుండా చెక్‌ చేయాలి. సిలిండర్‌ సీల్‌ ప్యాక్‌ అయ్యిందా ? లేదా ? నేది చూసుకోవాలి.
 7. సిలెండర్‌ రెగ్యులేటర్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా సమస్య వుంటే గ్యాస్‌ లీకేజ్‌ అవుతుంది.
 8. గ్యాస్‌ లీకేజ్‌ అయితే వెంటనే సప్లై చేసే వారి వద్దే రెగ్యులేటర్‌ ప్లస్‌ రబ్బర్‌ పైప్‌ను మార్చుకోవడం ఉత్తమం.
11:25 - April 27, 2017

అమరావతి: పెనుమాకలో భూ సమీకరణకు వ్యతిరేకంగా ఆ గ్రామ రైతులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట పొలాల్లో పండిన కూరగాయలు రోడ్డు పై పడేసి ఆందోళన చేపట్టారు. మేము వ్యవసాయమే చేస్తాం..అని మా భూములు ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోం ఈ వీడియోను క్లిక్ చేయండి..

బ్రిటీష్ కౌన్సిల్ తో ఏపీ ఉన్నత విద్యామండలి ఒప్పందం..

విజయవాడ : లక్ష మంది విద్యార్థులకు ఆంగ్ల నైపుణ్యం పెంపొందించేందుకు బ్రిటీష్ కౌన్సిల్ తో ఏపీ ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదిలో లక్ష మంది విద్యార్థులకు ఆంగ్ల నైఫుణ్యం పెంపొందించేందుకు ముందుకొచ్చిన బ్రిటీష్ కౌన్సిల్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

11:05 - April 27, 2017

వరంగల్ : ఓరుగల్లు 'గులాబీ' జెండాలతో ముస్తాబైంది. సాయంత్రం భారీ బహిరంగసభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుక్ను గులాబీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని సభకు తరలించారు. సుమారు 12 లక్షల మందిని తరలించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తరలించడానికి రైళ్లు..ఆర్టీసీ బస్సులు..ప్రైవేటు బస్సులు..ఇతరత్రా రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో పలు బస్టాండ్లు బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. బస్సులు లేక ప్రయాణీకులు ఆగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను సభకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

వరంగల్ టీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు..

కరీంనగర్ : టీఆర్ఎస్ వరంగల్ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలిస్తున్నారు. దీనితో బస్టాండ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. బస్సులు లేకపోవడంతో గంటల తరబడి ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు.

సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన..

గుంటూరు : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాల్లో పండిన కూరగాయలను రోడ్డుపై పారబోసి పెనుమాక..ఉండవల్లి రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

10:57 - April 27, 2017

బీహార్ : రాష్ట్రంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది..మామ..కోడలు పరారై పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన పుర్ణియాలో చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా మామ..కోడలి మధ్య ప్రేమ చిగురించింది. దీనితో వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. దీనితో తన సొంత తండ్రిపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఫిర్యాదుతో అతని తండ్రిని అరెస్టు చేశారు. సమాచారం తెలుసుకున్న సదరు మహిళ పీఎస్ కు వెళ్లి తన భర్తను విడిపించుకుంది. విడుదల అనంతరం కలిసి జీవిస్తామని ప్రమాణం చేశారు.

10:51 - April 27, 2017

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తల్లి కాబోతుందా ? వారి కుటుంబంలోకి ఇంకొకరు అని ఉపాసన పేర్కొన్నట్లు..అంటే ఆమె గర్భవతి అని ఏవోవో ఊహించుకోకండి. అపోలో ఆస్పత్రి చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి మనవరాలు అయిన ఉపాసనను రాంచరణ్‌ 2012 జూన్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల తన నిర్మాణంలో రూపొందిన 'ఖైదీ నంబర్‌ 150’, 'ధృవ' సినిమాలు విజయవంతంగా కావడంతో 'చరణ్‌' ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా 'ఉపాసన' ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మెగా కుటుంబంలోకి మరొకరు కొత్తగా చేరారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియచేశారు. అందమైన ఆడ గుర్రం పిల్ల తమ కుటుంబంలోకి చేరిందని, అది పుట్టిన మూడు గంటలకు ఈ ఫొటో తీశామంటూ..చరణ గుర్రం పిల్లలను ప్రేమగా నిమురుతున్న ఫొటోను పోస్టు చేశారు. అదండి సంగతి..

'బాహుబలి-2’ రిలీజ్ రేపా ? ఈ రోజా ?

హైదరాబాద్ : బాహుబలి -2 సినిమా రిలీజ్ పై సందిగ్ధత నెలకొంటోంది. గురువారం రాత్రి మల్టీఫ్లెక్స్లు..ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న థియేటర్ లలో సినిమా విడుదలవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. రాత్రి 9గంటలకు సినిమా విడుదలకు ఏర్పాట్లు చేశారు. కానీ దీనిపై మంత్రి తలసాని స్పందించారు. రేపు సినిమా విడుదలవుతుందని వెల్లడించారు. శుక్రవారం నుండి ఐదు షోలకు అనుమతినివ్వడం జరిగిందని, ఈ రోజు విడుదలకు అనుమతి లేదన్నారు. బెనిఫిట్ షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ సినిమా ప్రదర్శనకు థియేటర్లు టికెట్లు విక్రయించాయని తెలుస్తోంది.

డమాస్కస్ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు..

సిరియా : డమాస్కస్ ఎయిర్ పోర్టు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆస్తి..ప్రాణ నష్టం సంభవించిందా ? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

మాడుగులలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..

నల్గొండ : మాడుగులలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో వీరు ఆత్మహత్యకు ప్రయత్నించారు.

 

వేర్పాటు వాద మహిళా నేత అరెస్టు..

జమ్మూ కాశ్మీర్ : వేర్పాటు వాద మహిళా నేత ఆసియా అంద్రాబిని పోలీసులు అరెస్టు చేశారు. సైన్యంపై రాళ్ల దాడులకు మహిళలను ప్రేరేపించారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.
 

10:25 - April 27, 2017

హైదరాబాద్: తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటైన దగ్గరి నుంచి పరిపాలన వ్యవస్ధ అస్తవ్యస్థంగా తయారైందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డర్ టూ సర్వ్ విధానం ద్వారా తమ కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నామని.. వెంటనే శాశ్వత బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

బదిలీల మార్గదర్శకాల రూపకల్పన...

ఉద్యోగుల ఆగ్రహంతో ప్రభుత్వం ఆగమేఘాలమీద బదిలీల కసరత్తుకు మార్గదర్శకాలను రూపొందించింది తెలంగాణ సర్కార్‌. వచ్చేనెల మొదటి వారంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమై మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తోంది. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెగ హడావిడి చేస్తున్నారు.

ఏ జిల్లాలో పనిచేస్తారో ఉద్యోగులకే ఆప్షన్స్‌...

ఇదిలా ఉంటే.. నూతన మార్గదర్శకాల ప్రకారం.. తాము ఏ జిల్లాలో పనిచేస్తారో ఉద్యోగులే ఎంచుకుని అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. దీనికోసం ఉమ్మడి జిల్లాల స్థానికతే ప్రామాణికంగా తీసుకోడానికి అధికారులు రెడీ అయ్యారు. దీంతో ఒక ఉద్యోగి త‌న‌ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఫ‌లితంగా ఉమ్మడి జిల్లా ఎన్ని జిల్లాలుగా విడిపోతే అన్ని జిల్లాల ప‌రిధిలో తాను కోరుకున్న చోట స్థానిక‌త పొందే వెసులబాటు ఉద్యోగికి రానుంది.తమ బదిలీల సమస్యలపై వేగంగా స్పందిస్తున్నట్లే ఇతర పెండింగ్ సమస్యలపైన కూడా వేగంగా స్పందించాలని ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

10:24 - April 27, 2017

హైదరాబాద్: జమ్ము-కశ్మీర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కుప్వారా జిల్లా చౌకీబల్‌ ఆర్మీ క్యాంపుపై హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్‌ సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ఐదుగురు జవాన్లను శ్రీనగర్‌ సైనిక ఆస్పత్రికి తరలించారు. మన జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాద దాడితో సైనికులు కుప్వారా ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత్‌-పాక్‌ సరిహద్దు నియంత్రణ రేఖకు ఐదు కిలో మీటర్ల దూరంలోనే చౌకీవల్‌ ఆర్మీ క్యాంపు ఉంది. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైనిక, ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ కానున్నరు. 

10:20 - April 27, 2017

హైదరాబాద్: తెలంగాణలో బాహుబలి 2 విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు విడుదలకు అనుమతి లేదన్న మంత్రి తలసాని... ఎలాంటి బెనిఫిట్‌ షోలు వేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి నుంచి 5 షోలకు అనుమతిచ్చామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

09:58 - April 27, 2017

మెంతులు..ఇది ఆహారంలోనే కాకుండా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది జట్టు సమస్యలను దూరం చేస్తుంది. చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారడాన్ని నిరోధిస్తుంది. గుప్పెడు మెంతులను రోజంతా నానబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి జుట్టును తడపాలి. మూడు..నాలుగు గంటల పాటు జుట్టును ఆరనిచ్చిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మెంతులు..మెంతి ఆకుల్లో నికోటినక్..లెసిథిన్ లు కుదుళ్లు బలంగా మారేందుకు..జుట్టు ఎదగడానికి సాయం చేస్తాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే మెంతి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగి మిక్సీ పట్టాలి. ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంట అనంతరం స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. చర్మంపై పేరుకున్న దుమ్ము..ధూళి..మురికి కూడా వదలగొడుతుంది.

09:58 - April 27, 2017

ఎండకాలం..అనగానే చర్మ సంబంధిత వ్యాధులు ముందుగా గుర్తకొస్తాయి. చర్మాన్ని రక్షించేందుకు పలువురు బ్యూటిపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. మాయిశ్చరైజర్..కండీషనర్ లు అంటూ ఏవో రాసుకుంటూ ఉంటారు. ఇందులో రసాయనాల ప్రభావం చర్మంపై పడుతుందని తెలిసిందే. ఇలా కాకుండా సహజసిద్ధమైన నూనెలు రాసుకుంటే ఎలా ఉంటుంది ? కొన్ని చిట్కాలు..

 • కొబ్బరినూనె..ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ కలిగిన కొబ్బరినూనెను రాత్రి పడుకొనే ముందు చర్మానికి పట్టిస్తే బాగుంటుంది.
 • జొజొబా నూనె పేరు విన్నారా..ఈ నూనె చర్మానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. విటమిన్ సి..ఇ. ఉంటాయి. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మ కణాల పునర్ ఉత్పత్తికి తోడ్పాటు అందిస్తాయి.
 • నువ్వునూనె..ఈ నూనె కూడా చర్మాన్ని రక్షిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఇ పుష్కలంగా లభిస్తాయి. కణాల ఉత్పత్తికి సహాయ పడడమే కాకుండా ముడతలను తగ్గిస్తుంది.
 • అవకాడో నూనె..మచ్చలు..సన్నటి గీతలను తొలగిస్తుంది. అధిక మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ట్రై చేసి చూడండి.
09:20 - April 27, 2017

ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 'బాహుబలి -2’ సినిమా కొద్దిగంటల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు థియేటర్లను అందంగా ముస్తాబు చేశారు. తమ అభిమాన నటుడు 'ప్రభాస్'ను వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్..పోస్టర్స్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు ఈ చిత్రంతోనే 'ప్రభాస్' కమిట్ అయ్యాడు. షూటింగ్ ముగిసిన అనంతరం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు 'ప్రభాస్' సైన్ చేశారు. అభిమానులను సంతృప్తి పరిచేందుకు ముందుగానే టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ఈ చిత్రానికి 'సాహో' అని నామకరణం చేశారు. ‘బాహుబలి -2’ రిలీజ్ అయిన థియేటర్ లలో 'సాహో' టీజర్ ను విడుదల చేయనున్నారు. దీనితో అభిమానుల సంతోషం రెట్టింపు అయినట్లైంది. 'ప్రభాస్' 19వ సినిమాగా వస్తున్న ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయనుంది.

08:55 - April 27, 2017

మహిళా వ్యాపారవేత్త..భారతదేశ ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ సతీమణి..నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా గవర్నింగ్ బాడీకి చెందిన రెండు కీలక కమిషన్లలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఒలింపిక్ ఛానెల్ తో పాటు ఒలింపిక్ విద్యా కమిషన్ లో అంబానీని సభ్యురాలిగా నియమిస్తూ ఐవోసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 26 కమీషన్లను ఐవోసీ ప్రకటించింది. అమెరికా ఒలింపిక్ కమిటీ చైర్మన్ లారెన్స్‌ఫ్రాన్సిస్ అధ్యక్షత వహిస్తున్న 16 మంది సభ్యులతో కూడిన ఒలింపిక్ చానెల్‌లో నీతా సభ్యురాలు కానున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కమిటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు. కమీషన్ లో 38 శాతం మహిళలు పదవుల్లో కొనసాగుతున్నారని సమాచారం. మరిన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

08:36 - April 27, 2017

శ్రీకాకుళం : పలాస కాశీబుగ్గ మున్సిపల్‌ కమిషనర్‌ జగన్మోహన్‌ రావుపై దాడి జరిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పురపాలక సంఘం చైర్మన్‌ పూర్ణ చంద్ర మరో ఇద్దరు కౌన్సిలర్లు కలిసి కొట్టారని జగన్మోహన్ రావు ఆరోపించారు. వాళ్ల అవినీతికి తాను సహకరించకపోవడం వల్లే దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

08:31 - April 27, 2017

జమ్ము-కశ్మీర్‌ : ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కుప్వారా లోని ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారు. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాద దాడితో సైనికులు కుప్వారా ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

 

07:58 - April 27, 2017

హైదరాబాద్:యూనివర్సిటీలు మేధావుల ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రణబ్, ఓయూ వందేళ్లు పూర్తి చేసుకోవడం స్ఫూర్తిదాయకమని, తానీ వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నాటి మీర్ ఉస్మాన్ స్వప్నం నేడు సుసంపన్నమైందన్నారు. మరోవైపు గవర్నర్‌ నర్సింహన్, సీఎం కేసీఆర్ ఈ వేదికపై ప్రసంగించకపోవడం పట్ల విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ సాధ్యం కాదన్నారు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌. ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే సూచించారని తెలిపారు. ఏడాది ముందే ఎన్నికలంటే ఎవరూ ఒప్పుకోరన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయ్ కుమార్, టిడిపి విద్యాసాగర్, వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి, టిఆర్ ఎస్ నేతమన్నె గోవర్థన్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ : కుప్వారా జిల్లాలో ఆర్మీ క్యాంప్ పై ఉగ్రదాడి జరిగింది. సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఐదు ప్రైవేటు బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ

రంగారెడ్డి: శంషాబాద్ మండలం కిషన్ గూడ వద్ద హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని ఐదు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. మరో 15 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేసింది.

నేడు జెఇఇ మెయిన్ ఫలితాలు

హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్ ఐటీలు, ట్రిబపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జెఇఇ అడ్వాన్స్ డ్ కు అర్హత పొందేందుకు నిర్వహించిన జెఇఇ మెయిన్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి.ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.35 లక్షల మంది పరీక్ష రాశారు.

07:12 - April 27, 2017

వరంగల్ : గులాబీ దళపతి కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతమంతా హోరెత్తించారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ప్రజలపై పథకాలను జోరుగా గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలోనే టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలంటూ ఆదేశించడంతో పార్టీ శ్రేణులన్నీ అంగరంగ వైభవంగా బహిరంగసభ నిర్వహణకు అంతా సిద్ధం చేశాయి.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నడిబొడ్డిన...

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నడిబొడ్డిన ఉన్న ప్రకాశ్ రెడ్డిపేట ప్రాంతంలో ఎంపిక చేసిన కూడలిలో భారీ బహిరంగ సభకు అంతా సిద్ధమైంది. ఈ సభకు ప్రగతి నివేదన సభగా నామకరణం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వరంగల్లో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో కమిటీలు రూపుదిద్దుకున్నాయి. కేసీఆర్ గతంలో పార్టీ పరంగా మూడు అతిపెద్ద బహిరంగ సభకు వరంగల్ లోనే నిర్వహించారు. అదే సెంటిమెంట్ తో ఈ భారీ బహిరంగ సభను కూడా వరంగల్ నే ఎంచుకున్నారు.

2001 జూన్ 21న హన్మకొండలో టీఆర్‌ఎస్‌ తొలి సభ.....

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన భారీ బహిరంగ సభలలో ఎక్కువగా వరంగల్ లోనే జరిగాయి. 2001 ఏఫ్రిల్ 27 పార్టీ ఆవిర్భావం తర్వాత 2001 జూన్ 21వ తేదీన హన్మకొండ కేడిసి మైదానంలో తొలి బహిరంగసభ జరిగింది. ఆ తర్వాత 2002 అక్టోబర్ 28 న భూపాలపల్లిలో బహిరంగసభ జరిగింది. 2003 లో టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పది లక్షల మంది తో హన్మకొండ ప్రకాశ్ రెడ్డిపేటలో బహిరంగసభను అప్పట్లో ఘనంగా నిర్వహించారు. 2003 మే 12న జనగామ గడ్డపై పోరుగల్లు వీరగర్జన పేరుతో సభను నిర్వహించారు. తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 2005 జులై 17న భారీ బహిరంగసభను నిర్వహించారు.

276 ఎకరాల్లో సభాస్థలి ఏర్పాటు ...

ప్రకాశ్ రెడ్డి పేటలో సభకోసం మొత్తం 276 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8400 స్క్వేర్ ఫీట్లలో 10 ఫీట్ల ఎత్తుతో భారీ సభా వేదిక ఏర్పాటు చేయడమే కాకుండా వేదికపై సుమారుగా 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం 20 ప్రవేశ ద్వారాలను, 20 అవుట్ గేట్లను ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే వాహనాల కోసం 1463 ఎకరాల్లో తొమ్మిది పార్కింగ్ స్థలాలను ఎంచుకున్నారు. మరుగుదొడ్లు, వైద్యశిబిరాలు, ఇతర వసతుల కోసం 45 ఎకరాల్లో, విఐపి ల వాహనాల పార్కింగ్ కోసం 54 ఎకరాలు, వివిఐపిల వాహనాల కోసం 34ఎకరాల్లో కేటాయించారు. సభా స్థలికి, పార్కింగ్ స్థలాలు కూడా అదే క్యాంపస్ లో ఉండడంతో వచ్చి పోయే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

100 అడుగుల స్వాగత తోరాణాలు ...

కాకతీయుల వారసత్వ నగరం ఓరుగల్లు గులాబీ రంగును పులుముకుంది. నగరాన్ని అందంగా అలంకరించారు. నగరం నలుదిక్కులు గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగర ముఖ ద్వారాలు లక్షాలాదిగా తరలివచ్చే ప్రజలకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్లు అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనికి తోడు నగర జంక్షన్ల సుందరీకణ, ప్రధాన రహదారుల వెంట వేసిన అందమైన రంగుల క్యాన్వాస్ బొమ్మలు.. అందంగా తీర్చి దిద్దారు. నగర అలంకరణలో స్వాగత తోరణాలు.. భారీ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. నగరానికి వచ్చే ఆరు ముఖ ద్వారాల వద్ద 100 అడుగుల స్వాగత తోరాణాలు ఏర్పాటు చేశారు. 40 లైటిం గ్ బెలూన్లు నగరంలో ఏర్పాటు చేస్తు న్నారు. 200 హోర్డింగ్‌లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

గులాబీ మయం అయిన ఓరుగల్లు నగరం

వరంగల్ : 2019 ఎన్నికలే టార్గెట్ గా గులాబి దళం కదులుతోందా? మళ్లీ అధికారం హస్తగతానికి వార్షికోత్సవ సభ వారధిగా మారబోతుందా? నాటి ఉద్యమ హోరు.. నేటి పథకాల జోరుతో ఎన్నికలకు రెడీ అవుతోందా..? కేడర్ కు భవిష్యత్ దిశా నిర్ధేశానికి గులాబి దళపతి రెఢీ అయ్యారా? సభ కోసం కేసీఆర్ ఓరుగల్లునే ఎంచుకోవడం వెనుక ఎత్తుగడ ఏంటి..? టీఆర్‌ఎస్‌ వరంగల్‌ సభ ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ సాధ్యం కాదు: మంత్రి లోకేష్‌

అమరావతి: వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ సాధ్యం కాదన్నారు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌. ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే సూచించారని తెలిపారు. ఏడాది ముందే ఎన్నికలంటే ఎవరూ ఒప్పుకోరన్నారు. 2018 ద్వితీయార్థంలో ఏ రాష్ట్రనికి ఎన్నికలు లేవని లోకేష్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని లోకేష్ చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రాన్ని సీఎం ఎంతో అభివృద్ధి చేశారని.. ఎన్నికలు ఎపుడు వచ్చినా టీడీపీ గెలుపు ఖాయమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

నేటి నుంచి ఓయూలో వీసీల సమావేశం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూలో నేటి నుంచి రెండు రోజులపాటు వీసీల సమావేశం నిర్వహిస్తుననారు. దీనికి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 177 మంది వీసీలు హాజరవుతున్నారని ఓయూవీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం తెలిపారు. యూనివర్సిటీల్లో అధ్యాపకులు , నిధుల కొరతపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌ను కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే ప్రారంభిస్తారని తెలిపారు.

 

07:06 - April 27, 2017

అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్‌ ఎంపిక ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. లండన్‌ కంపెనీ ఇచ్చిన డిజైన్స్‌ పట్ల ఆసక్తి కనబరిచినా ...మరింత అధ్యయనం చేసేందుకు ....మళ్లీ కమిటీలు వేశారు. సడన్‌గా అభిప్రాయం మార్చుకోవడం తో ఈ అంశం చర్చానీయాంశంగా మారింది.

రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్‌....

రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్‌ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ డిజైన్స్‌ తయారీ పనిని లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్స్‌ ప్రతినిధులకు అప్పగించారు. వారు 900 ఎకరాల్లో నిర్మించబోయే పరిపాలన నగరానికి సంబంధించి డిజైన్స్‌పై కసరత్తులు చేశారు. చివరకు మూడు రకాల డిజైన్స్‌ను సిద్ధం చేసి... ప్రభుత్వానికి అందజేశారు. వీటిని సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించి... వివిధ అంశాలను జోడించి.. కొత్తగా రెండు డిజైన్స్‌ సిద్ధం చేయాలని కోరారు. నెల రోజుల అనంతరం మరో రెండు డిజైన్స్‌ను సిద్ధం చేశారు. వీటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రే స్వయంగా ఈ డిజైన్స్‌ను గురించి వివరించారు. వచ్చే నెలకి డిజైన్స్‌ ఖరారు చేయాలని కూడా భావించారు.

డిజైన్స్‌ విషయంలో అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్న ప్రభుత్వం...

కానీ ఇంతలోనే ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు ఇచ్చిన డిజైన్స్‌పై మరింత అధ్యయనం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.. దీనికోసం రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణను ఆదేశించారు. ఒక కమిటీలోమంత్రులు.. మరో కమిటీలోముఖ్య కార్యదర్శులు ఉండాలని సూచించారు. డిజైన్స్‌ను ఈ కమిటీలు అధ్యయనం చేసి..నివేదిక ప్రభుత్వానికి అందించనున్నాయి. వారిచ్చిన రిపోర్ట్‌ను క్యాబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు.

చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ నిర్ణయం...

అయితే డిజైన్స్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయం చర్చానీయాంశంగా మారింది. డిజైన్స్‌ ఖరారు అయిపోయాయనుకునే సమయంలో మళ్లీ కమిటీలు వేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. రాజధాని ప్రకటన, ల్యాడ్‌ పూలింగ్‌, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు తప్ప వేరే మంత్రి జోక్యం లేదు. ఈ విషయంలో చాలా మంత్రులకు అసంతృప్తి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మంత్రులకు ప్రాధాన్యం కల్పించేందుకే కమిటీ వేసినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా రాజధాని డిజైన్స్‌ ఎంపిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

07:03 - April 27, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్ల కంపెనీ 'కియా' సంస్థ ముందుకొచ్చింది. దక్షిణకొరియాకు చెందిన ఈ సంస్థ అనంతపురం జిల్లాలో రూ.12 వేల కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

ఏటా 3లక్షల కార్ల తయారే లక్ష్యం....

ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకోడానికి కియా సంస్థ సిద్ధమైంది. ఏటా 3లక్షల కార్ల తయారీ లక్ష్యంతో ఏర్పాటుకానున్ ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభించనుంది.

పెనుకొండలో ప్లాంటు నిర్మాణం...

అనంతపురం జిల్లాలోని పెనుకొండలో ఈ ప్లాంటును నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ప్లాంట్ నిర్మాణం చేపట్టి.. 2019 ద్వితీయార్థానికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇక్కడ తయారయ్యే కార్లను 90శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయించనున్నారు. 

ఏపీకి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం అడుగుపెట్టనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కార్ల కంపెనీ 'కియా' ముందుకొచ్చింది. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధలు ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

07:01 - April 27, 2017

అమరావతి: ఏపీలో బీజేపీ పాగా వేయడానికి వ్యూహాలు రచిస్తోందా? ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ తమకు సానుకూల పరిస్థితులు ఉంటాయన్న అంచనాకు నేతలు వచ్చారా? ఏపీలో పాగా వేయడానికి బీజేపీలో సాగుతున్న అంతర్మథనంపై 10టీవీ కథనం..

ఐదు రాష్ట్రాలు, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఊహించని విజయం

దేశంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ బీజేపీకి ఊహించని విజయాలు దక్కాయి. దీంతో కమలనాథులు భవిష్యత్‌ తమదేనంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. దక్షిణాదినా బీజేపీ దృష్టిసారించింది. ఏపీపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇటీవలే ఏపీ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే ఒంటరిగా బీజేపీ పోటీచేసి తన బలాన్ని నిరూపించుకుంటుందని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఏపీ పాలిటిక్స్‌లో వెంకయ్య చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఏపీలో పాగా వేయడానికి బీజేపీ వ్యూహరచన చేస్తుందన్న చర్చ సాగుతోంది.

2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ

2014 ఎన్నికల్లో ఏపీలో బలహీనంగా ఉన్న బీజేపీ... టీడీపీతో జతకట్టింది. పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దింపి వైసీపీకి వెళ్లే ఓటుబ్యాంకును టీడీపీ, బీజేపీవైపు మళ్లించింది. మూడేళ్లుగా ఏపీలో పుంజుకోవడానికి దశలవారీగా చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి ఏపీకి అధిక నిధులు మంజూరు చేయిస్తోంది. మొత్తానికి ఏపీలో పాగా వేసేందుకు అనేక చర్యలు చేపడుతోంది.

ఏపీలో టీడీపీ - వైసీపీ మధ్యే రాజకీయపోరు

ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్యే రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. బీజేపీ టీడీపీకి మిత్రపక్షంగానే కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా బీజేపీ నాయకత్వంలో మార్పు వచ్చింది. పదవులు, ప్రాధాన్యత విషయంలో టీడీపీ తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో కాషాయనేతలున్నారు. దీంతో పలుసందర్భాల్లో టీడీపీ, బీజేపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపాయి. ఏపీ బీజేపీ ఇంచార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌సింగ్‌, చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఇరుపార్టీల నేతల్లో మాత్రం సమన్వయం రావడంలేదు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు , లభిస్తోన్న ఆదరణను చూసి బీజేపీ నాయకత్వం ఏపీలో కూడా పాగా వేయడానికి పావులుకదుపుతోంది. దీనిపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లో సర్వే నిర్వహించింది. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్టు కమలనాథులు ఓ నిర్దారణకు వచ్చారు. అందుకే వెంకయ్యనాయుడు ఏపీలో బీజేపీ సొంతంగా పోటీచేయడానికి సిద్దంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు.

పరిస్థితులు అనుకూలిస్తాయా?

వాస్తవానికి ఏపీలో బీజేపీ పాగా వేయడానికి పరిస్థితులు అనుకూలిస్తాయా? అంటే అంత తేలికకాదన్న సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ హవా కొనసాగడం, కులాలు, మతాల వారీగా ఓటర్లు చీలిపోయి ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతల కలలు కల్లలుగానే మిగులుతాయన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా 2019లో పాగా వేయాలని బీజేపీ.... అడ్డుకునే దిశగా టీడీపీ, వైసీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నాయి.

06:58 - April 27, 2017

విశాఖ: పార్టి పుట్టినప్పటి నుంచి సేవలు అందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు జిల్లాల్లో పెద్దదిక్కుగా నడిపారు. 2014లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినా.. మంత్రిపదవి దక్కలేదు. మంత్రివర్గ విస్తరణలోనూ మొండిచెయ్యే ఎదురైంది. దీంతో పార్టీ అధినాయకత్వంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి. LOOK

టీడీపీలో చల్లారని అసంతృప్తులు.....

మంత్రి వర్గ విస్తరణ రగిలించిన అసంతృప్తులు విశాఖజిల్లా టీడీపీలో ఇంకా చల్లార లేదు. ఎమ్మేల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపినా.. పార్టీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బండారు సత్యనారాయణ మూర్తి......

టీడీపీ ప్రారంభం నుంచి పార్టీలో ఉన్న బండారు సత్యనారాయణమూర్తి 4 సార్లు ఎమ్మేల్యేగా గెలిచారు. గతంలో చంద్రబాబు క్యాబినేట్ లో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆ తరువాత టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలోనూ పార్టీకోసం నిరంతరం పనిచేశారు. తర్వాత 2014 లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తనకు మంత్రిపదవి గ్యారెంటీ అనుకున్నారు. కాని.. పీఆర్పీ నుంచి టీడీపీలోకి వచ్చిన గంటాశ్రీనివాసరావుకు మంత్రిగా అవకాశం రావడంతో.. బండారు అపుడే అసంతృప్తికి లోనయ్యారు. జిల్లానుంచి మరొకరికి మాత్రమే అవకాశం ఇవ్వడానికి బాబు నిర్ణయించడంతో.. ఆ అవకాశం అయ్యన్నపాత్రుడికి దక్కింది. మంత్రి అయ్యన్నపాత్రుడి సామాజిక వర్గం బండారు సత్యనారాయణమూర్తి సామాజిక వర్గం ఒక్కటే కావడంతో.. ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యంకాదని అప్పట్లో చంద్రబాబు బండారును ఊరడించారు. దీంతో మరో దఫా విస్తరణలో తనకు అవకాశం వస్తుందని సత్యనారాయణ మూర్తి ఆశపెట్టున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా సత్యనారాయణ మూర్తికి మరోసారి ఆశాభంగం కలిగింది.

మరోసారి మునుపటి ఈక్వేషన్లే చెప్పి బండారు మొండిచేయి.....

ఇక ఈ సారి విస్తరణలో కూడా మునపటి ఈక్వేషన్లనే చెప్పిన చంద్రబాబు.. బండారుకు మరో సారి మొండి చెయ్యి చూపించారు. ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి.

మొదట్లో ఆయన అనుచరులు ధర్నాలు చేయడం, గన్‌మెన్‌ను వెనక్కి పంపి కొద్దిరోజులు అజ్ఢాతంలోకి వెళ్లడం.. తదితర రూపాల్లో తన అసంతృప్తిని బయటపెట్టినా .. పార్టీ అధినేత కరగలేదు.

మంత్రి గంటా, ఎంపీ అవంతి చర్చలు జరిపినా.. బెట్టువీడని బండారు....

కినుక వహించిన బండారును సముదాయించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావులు ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపారు. అయినా.. ఎమ్మెల్యే బండారు బెట్టువీడలేదు. సందర్భాన్ని బట్టి అసమ్మతిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు నగర పర్యటనకు వచ్చినా.. బండారు అక్కడ కనిపించలేదు. ఇదిలావుంటే.. జూన్‌ నెలలో తన కుమార్తె వివాహం ఉన్నందున.. అప్పటి వరకు బండారు సైలెంట్‌గానే ఉంటారని.. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణకు పూనుకుంటారని అనుచరవర్గం చెప్పుకుంటున్నారు.

మే 27,28,29 విశాఖలో టీడీపీ మహానాడు....

మరోవైపు మేనెలలో విశాఖలో పార్టీ మహానాడు జరగనుంది. ఈనేపథ్యంలో మహానాడు కార్యక్రమానికైనా ఎమ్మెల్యే బండారుసత్యనారాయణ మూర్తి హాజరవుతారా అనేది.. అనుమానంగా మారింది. మంత్రి పదవులపై అశలు పెట్టుకున్న చింతమనేని, శివాజీ, దూళిపాల లాంటి వారికి నయానో భయానో సర్దిచెప్పిన సీఎం చంద్రబాబు.. బండారును ఎలా డీల్ చేస్తారనేది.. ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

06:57 - April 27, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ ప్రభుత్వానికి కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైంది. 2013 భూ సేకరణ చట్టాన్ని బైపాస్‌ చేస్తూ.. కేసీఆర్‌ సర్కారు ప్రతిపాదించిన సరికొత్త చట్టాన్ని కేంద్రం వెనక్కి తిప్పిపంపింది. బిల్లుకు మార్పులు చేసి పంపాలని సూచించడంతో.. తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈనెల 30 ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సవరణలు ఆమోదించాలని భావిస్తోంది టీఆర్‌ఎస్‌ సర్కార్‌.

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని తోసిరాజంటూ..

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని తోసిరాజంటూ.. సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించిన కేసీఆర్‌ ప్రభుత్వానికి హస్తినలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక తెలంగాణ భూ సేకరణ బిల్లు యథాతథ ఆమోదానికి కేంద్రం నో చెప్పింది. 2013 భూ సేకరణ చట్టానికి లోబడి ప్రత్యేక చట్టం ఉండాలని..విపక్షాలు, నిపుణులు, ప్రజా సంఘాలు నెత్తీనోరు బాదుకుని చెప్పినా వినకుండా, అంసెబ్లీలో సంఖ్యాబలం అండగా, కేసీఆర్‌ సర్కారు భూసేకరణ కొత్త బిల్లును పాస్‌ చేయించి, రాష్ట్రపతి అమోదానికి పంపింది. ఈ బిల్లు గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ బిల్లు తరహాలో ఉంటుందని.. మోదీ ప్రభుత్వం ఈజీగా ఆమోద ముద్ర వేస్తుందని ఆశించింది. కానీ హస్తినలో సీన్ రివర్స్ కావడంతో టీఆర్ఎస్‌ కంగుతింది.

కేసీఆర్‌ ప్రభుత్వానికి హస్తినలో చుక్కెదురు....

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త భూ సేక‌ర‌ణ చట్టం బిల్లు డ్రాప్ట్‌పై కేంద్ర న్యాయశాఖ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కలెక్టర్లకు ఫెయిర్ compensation ఇస్తామని అనే పదం.. ascertain బదులు revisit అనే పదం పెట్టమని.. అలాగే క్లాస్ 3,10లనూ తొలగించమని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేదు. దీంతో గుజ‌రాత్ త‌ర‌హా భూ సేక‌ర‌ణ విధానాన్ని తెలంగాణ‌లోనూ అమ‌లు చేసేందుకు కేబినెట్‌లో చర్చించింది. రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో అధ్యయన కమీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల పేరుతో కొత్త భూ సేకరణ చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించింది. దీని ద్వారా పరిహారం త్వరగా చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పింది.

బిల్లుపై కేంద్ర న్యాయశాఖ అభ్యంతరాలు ....

ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారిందని గుర్తించిన ప్రభుత్వం గతంలో 123 జీవో తెచ్చింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయే బాధితులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మరోవైపు మెదక్ జిల్లాలో నిమ్జ్ భూసేకరణ విషయంలో కొందరు రైతు కూలీలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో భూ నిర్వాసితులకు,రైతు కూలీలకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూసేకరణకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన సర్కార్.. హడావుడిగా కొత్త బిల్లును రూపొందించింది.

భూసేకరణ అడ్డంకులను అధిగమించేందుకు 123 జీవో ...

ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసిఆర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిసి.. ప్రత్యేక తెలంగాణ భూసేకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని కోరారు. మార్పులు అనివార్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో చేసేది లేక సీఎం కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. వచ్చీరాగానే రెవిన్యూ,నీటి పారుదల శాఖ అధికారులు, సిఎస్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. కేంద్రం ఎత్తి చూపిన లోపాలను అధిగమించే విషయంపై న్యాయనిపుణులతో చర్చించారు.

బిల్లును ఆమోదించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరిన కేసీఆర్‌ .....

కేంద్రం చెప్పినట్లు మార్పులు చేర్పులు చేసినా.. బిల్లును తిరిగి అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. సంఖ్యా బలంతో బిల్లు మరోసారి ఆమోదం పొందినా.. ప్రతిపక్షాల నుంచి సర్కార్‌కు ఇక్కట్లు తప్పేలా లేవు. ఈనెల 30న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సవరణలు ఆమోదించాలని సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. 

మూడోరోజు నిలిచిన పోలవరం ప్రాజెక్టు పనులు

పశ్చిమగోదావరి : జిల్లాలో మూడోరోజూ పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.. ట్రాన్స్‌ట్రాయ్‌, త్రివేణి కంపెనీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి.. సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో కంపెనీలు సిబ్బందికి జీతాలు నిలిపివేశాయి. అటు డీజిల్‌ కొరతతో 600 వాహనాల ఎక్కడివక్కడే ఆగిపోయాయి.. రోజుకు లక్షా 40వేల లీటర్ల డీజిల్ అవసరంకాగా... ప్రస్తుతం 60వేల లీటర్ల డీజిల్ మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

హైదరాబాద్: ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మట్టి కరిసింది. కాంగ్రెస్‌ కంగుతిన్నది. ఢిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో కూడా బీజేపీ అధికారం దక్కించుకుంది. MCD ఎన్నికల్లో కమలనాథులు గెలవడం వరుసగా ఇది మూడోసారి. 

దినకరన్ కు 5రోజుల పోలీస్ కస్టడీ

ఢిల్లీ: అన్నాడిఎంకే పార్టీలో శశికళ, దినకరన్‌ల పరిస్థితి మరింత దిగజారింది. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌కు కోర్టు ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఎఐఎడిఎంకే కార్యాలయంలో శశికళ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. దీంతో పన్నీర్‌సెల్వం వర్గం, పళని స్వామి వర్గం విలీనానికి మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది.

Roll PKG

06:47 - April 27, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యమంలో మరో కీలక పరిణామం జరుగుతోంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జెఏసి ఆవిర్భవించబోతోంది. ఈ నెల 30వ తేదీన విజయవాడలో ఆవిర్భావ సదస్సు నిర్వహిస్తున్నారు. రాఘవయ్యపార్కు దగ్గర వున్న యం.బి. విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు బాలకాశి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss