Activities calendar

28 April 2017

22:06 - April 28, 2017

హైదరాబాద్ : రెండేళ్లుగా  ఎదురుచూస్తున్న వెండితెర దృశ్యకావ్యం బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. బాహుబలి-టూ ని ముందుగానే చూడాలన్న తపనతో, అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. అభిమానుల ఉత్సాహాన్ని కొందరు బ్లాక్‌మార్కెటీర్లు దర్జాగా సొమ్ము చేసుకున్నారు. 
బాహుబలి సందడి 
తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా బాహుబలి సందడి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే షోలు ప్రారంభమయ్యాయి.  ఈ సందర్భంగా  అన్ని జిల్లాలోని థియేటర్ల ముందు అభిమానులు బారులు తీరారు. బాణాసంచా  కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీలు చేసి... బ్యాండ్‌, బాజాలతో హోరేత్తించారు. సినిమా అద్భుతంగా ఉందని... నటీనటులు పాత్రలకు ప్రాణం పోశారని ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు.
కూకట్‌పల్లి శ్రీ భ్రమరాంబ థియేటర్‌ వద్ద బాహుబలి బృందం సందడి
బాహుబలి-2 విడుదల సందర్భంగా కూకట్‌పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్‌ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్‌ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. 
అధిక ధరలకు బ్లాక్‌లో టిక్కెట్ల విక్రయం   
సందట్లో సడేమియలా సినిమాపై ఉన్న క్రేజ్‌ను కొంతమంది సొమ్ము చేసుకున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరులలో చాలా థియేటర్లలో అధిక ధరలకు బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించారు. వంద రూపాయల టిక్కెట్‌ను వెయ్యి రూపాయల వరకు టిక్కెట్‌ల విక్రయం జరిగింది.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు  మెరుపు దాడులు చేసి...బ్లాక్‌లో టిక్కెట్‌లు అమ్ముతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వేలల్లో నగదును..సినిమా టిక్కెట్లను  స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని దృశ్యాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.  దీంతో పైరసీదారుల ఆటకట్టించేందుకు చిత్ర యూనిట్‌ చర్యలు చేపట్టింది. 

 

22:02 - April 28, 2017

గుంటూరు : ప్రజల సంతృప్తే పరమావధిగా పని చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు... సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ...అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు.  
జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం 
వెలగపూడి సచివాలయంలో 13 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ ప్రాధాన్యాలను  ముఖ్యమంత్రి..కలెక్టర్లకు వివరించారు . ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి సంక్షేమ ఫలాలపై కలెక్టర్లకు  దిశానిర్దేశం చేశారు. రాబోయే  రెండేళ్లు ప్రభుత్వానికి చాలా కీలకమని...ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది అధికారులేనని సీఎం అన్నారు. ప్రభుత్వ పనితీరుపై 80 శాతం ప్రజలు సంతృప్తి పడే విధంగా పని చేయాలని సూచించారు. గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లు, సీసీ రహదారులు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వంటి కనీస వసతులను నూరు శాతం కల్పించాలని నిర్దేశించారు. అలాగే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి: చంద్రబాబు
రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి విద్యుత్ కనెక్షన్‌ను స్మార్ట్ మీటర్‌తో అనుసంధానిస్తున్నామని, దీంతో సరఫరాలో నష్టాలు వెల్లడవుతాయని చెప్పారు.  విద్యుత్ సంస్కరణల్లో కలెక్టర్లు భాగస్వాములు కావాలన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అలాగే అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు-సిబ్బంది ఆస్తులను స్వాధీనపరుచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. మెజార్టీ పౌర సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా ప్రయత్నించాలన్నారు. కాగా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే జిల్లాల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలపై సమాచారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. 

 

21:58 - April 28, 2017

అనంతపురం : జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువులో విషాదం చోటు చేసుకుంది. విహరయాత్ర విషాదయాత్రగా మారింది. తెప్ప బోల్తా పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 19 మంది ఉన్నారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులున్నారు.  విషయం తెలుసుకున్న గ్రామస్థులు ..పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. పరిమితికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

 

21:56 - April 28, 2017

ఖమ్మం : జిల్లాలో టీజేఏసీ రైతు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పాలేరు-కూసుమంచి మధ్య టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ను అరెస్ట్‌ చేశారు. టీ-జేఏసీ రైతు పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులంటున్నారు. ఖమ్మం మిర్చియార్డును కోదండరామ్‌ రేపు సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. కోదండరామ్‌ అరెస్ట్‌ను టీ-జేఏసీ నేతలు ఖండించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:54 - April 28, 2017

ఖమ్మం : మిర్చి రైతు కడుపు మండింది. ఇన్నాళ్లు సహనం వహించిన రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదన్న బాధను తట్టుకోలేక ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పంటను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు.. మార్కెట్‌ యార్డుపై విరుచుకుపడ్డారు. చైర్మన్‌ కార్యాలయంపై దాడి చేసి కుర్చీలు ధ్వంసం చేశారు. మరోవైపు తెచ్చిన పంటకు నిప్పుపెట్టారు.  దీంతో ఖమ్మం మార్కెట్‌ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
రైతుల్లో తీవ్ర ఆవేశం 
రోజురోజుకు పడిపోతున్న మిర్చి ధరలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఖమ్మంలో క్వింటాల్‌ మిర్చి ధర 3 వేలకు పడిపోవడంతో రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మార్కెట్‌కు తెచ్చిన మిర్చిని కొనుగోలు చేయకపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో రైతులంతా ఆందోళన బాట పట్టారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కుర్చీలు ధ్వంసం చేశారు. ఆగ్రహంతో నిప్పంటించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించారు. 
కలెక్టరేట్ ఎదుట ధర్నా 
మరోవైపు ఆరుగాలం శ్రమించి పంటను పండిస్తే.. వ్యాపారుల కారణంగా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా.. ఒక్క అధికారి తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఊరడింపు మాటలు వద్దని.. పరిష్కారం కావాలని రైతులంతా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఇస్తున్న ధర ప్రకారమైతే పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే చావే శరణ్యమంటున్నారు. 
పంటను వెంటనే కొనుగోలు చేయాలి : రైతులు
శుక్రవారం ఒక్కరోజే మార్కెట్‌కు 2.5 లక్షల మిర్చి బస్తాలు తరలిరావడంతో ధర పతనమైందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు శని, ఆది, సోమవారాల్లో మార్కెట్‌కు వరుస సెలవులు రావడంతో పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 
రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు 
ఇక రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. సంఘటనాస్థలాన్ని టీ-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క సందర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
రైతుల అండగా నిలిచిన సండ్ర వెంకటవీరయ్య 
అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా రైతుల అండగా నిలిచారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కార్యాలయం ఎదుట మిర్చి రైతులతో కలసి .. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన చేపట్టారు. మిర్చి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే.. ఖమ్మం మార్కెట్‌ యార్డు ఘటన టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. మార్కెట్‌యార్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. 
ఉద్యమాన్ని ఉధృతం చెస్తాం : రైతులు 
మొత్తానికి ఇన్ని రోజులుగా సహనం వహించిన రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిర్చిని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

బోటు బోల్తా ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

అనంతపురం : జిల్లాలోని గుంతకల్లు మండలం వైటీ చెరువులో బోటు బోల్తా ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 14 కు చేరింది. గల్లంతైన మిగిలి వారి కోసం గాలిస్తున్నారు. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 

21:42 - April 28, 2017

కండ్లెర్రజేసిన ఖమ్మం జిల్లా మిర్చి రైతులు...మద్దతు ధర కోసం మార్కెట్ మీద దాడి, కోదండరాంకు అడ్డంపడ్డ కారు క్యాడరు.... ఆయనదిరిగితే మీకేమైతుంది డర్, ఆడిమనుషులకు నాలుగు వందల కూలీ.... తాగిఊగినంక సూడాలే టీఆర్ఎస్ గాలి, కబ్జానామా సంవ్సరమైన యేడాది...పంచభూతాలను చెరవడుతున్న దొంగలు, కాలనీ ఇండ్లమీద రాళ్లేస్తున్న దయ్యాలు... పాణాలు చేతులవట్టుకోని జనం భయాలు, బాహుబలి సినిమా చూసేటందుకు కుస్తీలు.. ఇంట్ల పెండ్లపిల్లలుంటున్నరు పస్తులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:31 - April 28, 2017

హైదరాబాద్ : జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ.. సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సాక్షిలో ప్రసారమైన మాజీ సీఎస్‌ రమకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూతో జగన్‌కు సంబంధం లేదన్న ఆయన తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. సరైన కారణాలు చూపని కారణంగా సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. 
బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌ దాఖలు
ఈ కేసులో షరతులతో బెయిల్‌ పొందిన జగన్‌.. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని.. అందుకు ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. సాక్షి చానల్‌లో మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూ పక్కా ప్రణాళికతో రూపొందించారని సీబీఐ అభియోగం మోపింది. అయితే.. ఎడిటోరియల్‌ నిర్ణయం ప్రకారమే ఇంటర్వ్యూ జరిగింది తప్ప జగన్‌కు ఏ మాత్రం సంబంధం లేదని.. సీనియర్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్పారని జగన్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం..  బెయిల్‌ రద్దుకు సీబీఐ బలమైన కారణాలను చూపించలేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్‌కు అనుమతి
ఇక మే నెలలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్‌ కోర్టు అనుమతి కోరారు. మే 15 నుండి జూన్‌ 15 మధ్య విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.  మరోవైపు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో అభిమానులు, వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టివేయడంతో.. వైసీపీ శ్రేణులు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించారు. 

 

21:27 - April 28, 2017
21:26 - April 28, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నారా ? లేదా? అన్న అంశంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఇందుకోసం  కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేకంగా నియమించిన నిపుణుల కమిటీ పోలవరం పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పోలవరంలోని  ప్రధాన పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడంతోపాటు ఇతర అంశాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. 
వివాదాల మయంగా పోలవరం 
పోలవరం ప్రాజెక్టు... ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న జాతీయ పథకం. ప్రారంభం నుంచి కూడా ఈ ప్రాజెక్టు వివాదాల మయంగా మారింది. మొదటి రాష్ట్ర ప్రభుత్వ నిథులతోనే పనులు ప్రారంభించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించారు. పనుల్లో జరుగుతోన్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికే బదిలీ చేసింది. 
నిధుల ఖర్చు, పనుల పురోగతిపై కేంద్ర కమిటీ ఆరా 
ఈ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం... నిథుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఇచ్చిన నిథులను ఏ మేరకు ఖర్చు చేస్తున్నారు...., పనుల పురోగతి ఎలావుంది..., నిబంధనల మేరకు నిర్మాణాలు జరుతున్నాయా..., నిర్ధేశిత ప్రమాణాలను పాటిస్తున్నారా ..., లేదా .., అన్న అంశాలను పరిశీలించుందుకు కేంద్ర ప్రభుత్వ నిపుణల కమిటీని నియమించింది. ఈనెల 20 నుంచి 22 వరకు ఈ కమిటీ సభ్యులు పోలరవంలో పర్యటించి, జరుగుతున్న పనులను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు ప్రాజెక్టు పనులపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవాక్కయ్యారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. 
సబ్‌ కాంట్రాక్టర్లకు పనుల అప్పగింత తప్పు : నిపుణుల కమిటీ 
పోలవరం నిర్మాణ కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను కేంద్ర నిపుణల కమిటీ పరిశీలించి పలు తప్పులను వేలెల్తి చూపింది. కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రధాన కంపెనీలు పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని కేంద్ర కమిటీ తప్పుపట్టిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి కాదు... .రెండు కాదు... ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌, గేట్ల ఏర్పాటు, కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌... ఇలా అన్ని  పనులను ఉప కాంట్రాక్టర్లకు అప్పగిస్తే, ప్రధాన కాంట్రాక్టర్లు ఏం చేస్తారని నిపుణుల కమిటీ నిలదీయడంతో సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వ  అధికారులు నీళ్లు నమిలినట్టు ప్రచారం జరుగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వ హడావుడి చేస్తున్న విధంగా పనుల్లో వేగం లేదని గుర్తించింది. ప్రాజెక్టు హెడ్‌ వర్క్‌ను 2018 అక్టోబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... ఇంతవరకు 26 శాతం పనులను మాత్రమే  పూర్తి చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం.  
బిల్లుల చెల్లింపులో జాప్యంతో కొన్నిసార్లు పనుల నిలివేత  
పోలవరం ప్రాజెక్టులోని కొన్ని ప్రధాన పనులకు టెండర్లు పిలువకుండా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన అధికారుల తీరును కూడా కేంద్ర నిపుణుల కమిటీ తప్పు పట్టింది. ఐదవ ప్యాకేజీలో 142.88 కోట్ల పనులను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. ఆరు, ఏడు ప్యాకేజీల్లో 257 కోట్ల పనులు నామినేషన్‌ విధానంలో అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పద్ధతి నిబంధనలకు విరుద్ధమని కేంద్ర కమిటీ సభ్యులు చెప్పుడంతో చేసిన తప్పులను సమర్ధించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రకరకాల కారణాలు చెప్పి, దొరికిపోయారు. కంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంపై కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఆరా తీసినట్టు సమాచారం. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా కొన్నిసార్లు పనులు నిలివేస్తున్న విషయాలు కూడా కమిటీ దృష్టికి వచ్చాయి. ఇలా అయితే నిర్ధారిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు తక్కువేన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర నిపుణుల కమిటీ నిర్ణయించింది. 

 

21:19 - April 28, 2017

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు తన ఇంటిని కబ్జా చేశారని ఆరోపిస్తూ విజయవాడలో  సుమశ్రీ అనే మహిళ ఆందోళనకు దిగింది. క్యాన్సర్ తో బాధపడుతున్న తన కుమార్తెతో పాటు రెండురోజులుగా తన ఇంటి ముందే ఆందోళన చేస్తోంది. ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులమంటూ కొందరు  తనను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా దౌర్జనం చేస్తున్నారని సుమశ్రీ ఆరోపిస్తోంది. విజయవాడకు చెందిన సుమశ్రీకి కృష్ణలంకకు చెందిన శివకుమార్ భార్యాభర్తలు. వీరికి శివశ్రీ అనే కుమార్తె ఉంది. కొంతకాలం క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అయితే కుమార్తె  కోసం శివకుమార్ దుర్గాపురంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి ఇచ్చాడు. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన సుమశ్రీ .. కుమార్తెతో పాటు హైదరాబాద్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న కుమార్తె చికిత్స కోసం ఆ ఇంటిని విక్రయించాలని  సుమశ్రీ దుర్గాపురం వచ్చింది. ఇప్పుడు  ఆ ఇంటిని బొండా ఉమా అనుచరులు కబ్జా చేశారంటూ ఆందోళనకు దిగింది.  పోలీసులు కూడా ఎమ్మెల్యే వైపే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. 

 

21:17 - April 28, 2017

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చేనెల అమెరికాలో పర్యటించనున్నారు. బాబుతో పాటు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఐటీ-పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ సహ మొత్తం 17 మంది అధికారులు బాబు వెంట వెళ్తున్నారు. మే 4 నుండి 11వరకు వీరు అమెరికాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదలైంది. ఈ బృందం వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో నగరాల్లో పర్యటించనున్నారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్-2017లో చంద్రబాబుతో పాటు ఆయన బృందం సభ్యులు పాల్గోనున్నారు. 

 

21:15 - April 28, 2017

అనంతపురం : విహారయాత్ర విషాదయాత్రగా మారింది. చెరువులో బోటు బోల్తా పడడంతో 11 మంది మృతి చెందారు. 16 మంది విహార యాత్రకు వెళ్లారు. జిల్లాలోని గుంతకల్లు మండలం వైటీ చెరువులో బోటులో 16 మంది వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. దీంతో బోటులోని 11 మంది మృతి చెందారు. గల్లంతైన మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 

 

ప్రొ.కోదండరాం అరెస్టును ఖండించిన తమ్మినేని, బి.వెంకట్

హైదరాబాద్ : ప్రొ.కోదండరాం అరెస్టును సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ బి.వెంకట్ ఖండించారు. టీజేఏసీ రైతు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పాలేరు..కూసుమంచి మధ్య ప్రొ.కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు.

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ 10 : పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 
జరుగనుంది. 

టీజేఏసీ రైతు పర్యటనను అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం : టీజేఏసీ రైతు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పాలేరు..కూసుమంచి మధ్య ప్రొ.కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. రేపు మిర్చి మార్కెట్ సందర్శన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేశారు. సూర్యపేట పీఎస్ కు తరలించారు. టీజేఏసీ రైతు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. 

 

ఢిల్లీపై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం

ఐపిఎల్ 10 : ఢిల్లీపై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. ఢిల్లీ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కోల్ కతా మూడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 

 

మే 4 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా టూర్

గుంటూరు : సీఎం చంద్రబాబు మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో, ప్రాంతాల్లో బాబు పర్యటించనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేష్ వెళ్లనున్నారు. 

శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం : వీసీ రామచంద్రం

హైదరాబాద్ : శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని వీసీ రామచంద్రం అన్నారు. శతాబ్ధి ఉత్సవాలు కలిగించిన ఉత్సాహంతో యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. యూనివర్సిటీలో తీసుకురావాల్సిన మార్పులపై ఆలిండియా వీసీల కాన్ఫరెన్స్ లో చర్చించామని తెలిపారు. 
రాష్ట్రపతి కార్యాలయ ఆదేశాల ప్రకారమే ప్రారంభ వేడుకల్లో రాష్ట్రపతి ఒక్కరే మాట్లాడారని చెప్పారు. 

 

తెలంగాణ నుంచి తమిళనాడుకు వరకు ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమిళనాడుకు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో చల్లబడే అవకాశం ఉంది.

అంనతనాగ్ లో ఉగ్రవాదిని అరెస్టు

జమ్మూకాశ్మీర్ : అంనతనాగ్ లో ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్ పీఎఫ్ జవాన్ కు గాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

20:08 - April 28, 2017

ప్రపంచమంతా ఎదురు చూసిన ప్రౌడ్ మూవీ ఆఫ్ ఇండియా బాహుబలి రెండో పార్ట్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.రెండేళ్ల ఎదురుచూపులు తెరదించుతూ వెండి తెరపై ప్రత్యక్షమయింది ఈ ఎపిక్.ఈ సినిమా కథ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క పాయింట్ లీక్ చేసినా కూడా ఆ థ్రిల్ మిస్ అవుతారు.అయితే మొదటి పార్ట్ ని గుర్తు చేస్తూ టైటిల్స్ ముగించిన రాజమౌళి మొదటి పార్ట్ లోని గ్రాండియర్ కి తోడు కామెడీ ని కూడా యాడ్ చేస్తూ సెకండ్ పార్ట్ ని మొదలుపెట్టాడు.ఇక సినిమా మొదలయిన 10 నిమిషాలకే సినిమా లైన్ అర్ధం అవుతున్నట్టు ఉన్నా కూడా విజువల్ గ్రాండియర్ తో ఎంగేజ్ చేసారు.ఇక దేవసేన,అమరేంద్ర బాహుబలి ల లవ్ ట్రాక్ చాలా బాగుంది.ఆ లవ్ ట్రాక్ ని కామెడీ గా నడిపినా కూడా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమా పై ఇంత క్యూరియాసిటీ కలిగించిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దాన్ని చాలా కన్వీన్సింగ్ గా,ఎమోషనల్ గా చెప్పాడు రాజమౌళి.ఇక సినిమాలో నటీ నటుల విషయానికి వస్తే మొదటి పార్ట్ లో అదరగొట్టిన ప్రభాస్ ఈ పార్ట్ లో కూడా యాస్ యూజువల్ ఇరగదీసాడు.అమరేంద్ర బాహుబలిగా,శివుడిగా జీవించాడు.మొదటి పార్ట్ లో ఎక్కువగా యాక్షన్ కే పరిమితం కాగా ఈ పార్ట్ లో డైలాగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి.పైగా ఎమోషన్స్ ని కూడా చాలా చక్కగా బ్యాలెన్సింగ్ గా ప్రెసెంట్ చేసాడు.ఇక బాహుబలికి ఎసెట్ గా మారిన రానా ఈ పార్ట్ లో కూడా రెండు షేడ్స్ ని బాగా ప్రెసెంట్ చేసాడు.క్లైమాక్స్ ఫైట్ లో రానా కనిపించిన తీరు,పలికించిన హావభావాలు సింప్లి సూపర్బ్.దేవసేన అనుష్క.మొదటి పార్ట్ కి శివగామి ఎంత ప్లస్ ఏయిందో సెకండ్ పార్ట్ కి దేవసేన అంత ప్లస్ అయింది.శివగామి గా రమ్యకృష్ణ పేరు మరో పదేళ్ల పాటు మాట్లాడుకునేలా ఉంది.మొదటి పార్ట్ లో కేవలం రౌద్రాన్ని మాత్రమే చూపించిన శివగామి,ఈ సారి అన్ని రకాల టచెస్ మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.ఇక దేవసేన,శివగామి ల కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అయితే థియేటర్స్ లో క్లాప్స్ కొట్టిస్తున్నాయి.ఇక కట్టప్ప ఈ పార్ట్ లో కొంచెం వినోదం కూడా పండించాడు.అలాగే సినిమాకి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చాడు.సుబ్బరాజుకి కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కింది.బిజ్జలదేవుడిగా నాజర్ తన మెచ్యూర్డ్ నటనతో అలరించాడు.తమన్నా కేవలం చివరి ఫైట్ లో మాత్రమే కనిపిస్తుంది.ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే దర్శక ధీరుడు రాజమౌళి ఇకనుండి దర్శక మహాబలుడు.తెలుగు సినిమా ఊహించని విజువల్స్ అందించాడు.కధలో సామాన్యమయిన మలుపులను కూడా అతను డిజైన్ చేసిన తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పాలి.వి.ఎఫ్.ఎక్స్ లో మాత్రం కొంచెం శ్రద్ద వహించివుంటే బావుండేది అనిపిస్తుంది.ఇక సెంథిల్  కెమెరా వర్క్ కి ఎక్కడా పేరు పెట్టడానికి లేదు.ప్రతి ఫ్రేమ్ ని రిచ్ ఫుట్ వచ్చేలా డైరెక్టర్ తో కలిసి తీర్చి దిద్దాడు.ఇక కీరవాణి సంగీతం సినిమా స్థాయికంటే తగ్గింది అనిపిస్తుంది.ఆర్ ఆర్ మొదటి పార్ట్ లో ఉన్నంత డెప్త్ తో అయితే లేదు.ఇక ఆడియో లో హిట్ అయిన రెండు సాంగ్స్ తో పాటు హంస నావ సాంగ్ సినిమాలో బావుంది.ఇక ఎడిటింగ్ బావుంది.నిర్మాణ విలువలగురించి మాట్లాడక్కర్లేదు.సినిమాకు ఎంతకావాలో అంతా పెట్టారు.అది స్క్రీన్ పై ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది.ఎన్నెన్నో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అయిన బాహుబలి క్లయిమాక్స్ కొద్దిగా వీక్ అని కొంత మంది అంటున్నా నిజానికి సినిమాకి 1000 కోట్లు వసూలు చేసే దమ్ముంది అనేది చాలా మంది అభిప్రాయం.అదే నిజమయ్యే సూచనలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ కి మించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే బాహబలి తన పేరు నిలబెట్టుకుని ఇండియన్ సినిమా హిస్టరీ లో ఎపిక్ గా నిలిచిపోతుంది.

ప్లస్ పాయింట్స్ :
కథ 
కధనం 
కట్టప్ప ట్విస్ట్ 
విజువల్ గ్రాండియర్ 
లీడ్ కాస్టింగ్
కెమెరా వర్క్
డైలాగ్స్  
మైనస్ పాయింట్స్ 
అక్కడక్కడా క్వాలిటీ తగ్గిన సి.జి వర్క్ 
అంతగా ఇంపాక్ట్ లేని ఆర్.ఆర్ 
ఊహించిన క్లయిమాక్స్

రేటింగ్ మరియు మహేష్ కత్తి అనాలిసిస్ కోసం వీడియో చూడండి.. 

19:41 - April 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ నుంచి సారా మహమ్మారిని తరిమికొట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏటా ఎన్నో కుటుంబాలకు అన్నం లేకుండా చేస్తున్న ఈ రక్కసి నుంచి ప్రజలకు రక్షించేందుకు నడుం బిగించింది. తెలంగాణ నుంచి గుడుంబాను సమూలంగా దూరంచేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 నాటికి సారా రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
ఎన్నో ప్రాణాలను కబళిస్తోన్న సారా  
గుడుంబా... సారా.. పేరు ఏదైనా ఈ మహమ్మారి ఏటా ఎన్నో ప్రణాలను కబళిస్తోంది. గ్రామాలు, తండాల్లో గుండా జాఢ్యం మరీ ఎక్కువ. ఈ రక్కసి కోరల్లో చిక్కుకుని ఎన్నో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు ఏ కోరలను పీకేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
కూలి పైసలు గుడుంబాకు తగలేస్తున్న మద్యంప్రియులు
పురుషుల గుడుంబా అవాటులో మహిళలు పడుతున్న కష్టా ఇన్నీ అన్నీకాదు. కూలో, నాలో చేసుకుని సంపాదించే కొద్దిపాటి పైసలను పురుషులు గుడుంబాకు తగలేస్తుంటే, కుటుంబ సభ్యులు పస్తులు ఉండాల్సి వస్తోంది. సారా వ్యసనాన్ని మాన్పించేందుకు ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా ఫలితాలు రాకపోవడంతో, తెలంగాణ నుంచి గుడుంబాను దూరంచేసి, సారా రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. 
ప్రత్యామ్నాయ ఉపాధి హామీతో గుడుంబా తయారీకి దూరం 
హైదరాబాద్‌ పాతబస్తీ దూల్‌పేటలోని పేద కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా గుడుంబా తయారు చేసి, జీవనోపాధి పొందేవి. వీరితో ఈ వృత్తి మాన్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న హామీతో ఈ జాఢ్యాన్ని దూరంచేసింది. ఇప్పుడు ఇదే పద్ధతిని రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. గుడుంబా తయారీదారులతోపాటు, అమ్మేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు బడ్జెట్‌లో 157.75 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఎక్సైజ్‌ సిబ్బందితో  సారా బట్టీలను గుర్తించి, వీరికి నయానో, భయానో నచ్చచెప్పి ఈ వృత్తిని మాన్పించేందుకు చర్యలు చేపట్టింది. 
ప్రత్యామ్నాయ ఉపాధికి ఒక్కొక్కరి రూ. 2 లక్షల సాయం 
తెలంగాణలో గుడుంబా తయారుచేసి, అమ్మేవారు వేలాది మంది ఉన్నట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. మొత్తం 7,886 మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 2,404 మంది ఎస్టీలు, 1686 మంది ఎస్సీలు ఉన్నారు. అలాగే  3,630 మంది బీసీలు, 165 మంది మైనారిటీలు ఉన్నట్టు ఎక్సైజ్‌ శాఖ లెక్కలు తేల్చింది. గుడుంబా తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల వంతున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై సారా తయారీదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
సారా రహిత రాష్ట్రంగా ప్రకటించాలని ప్రభుత్వం లక్ష్యం 
రాష్ట్రావతరణ దినోత్సవం దినోత్సవం వచ్చే జూన్‌ 2వ తేదీ నాటికి తెలంగాణను సారా రహిత రాష్ట్రంగా ప్రకటించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా  మహిళాలోకం అభిమానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో గుడుంబా లేకుండా చేస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందన్న భావంతో టీఆర్‌ఎస్‌ సర్కారు ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. 

 

19:35 - April 28, 2017

హైదరాబాద్ : సవరణల పేరుతో 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భూనిర్వాసితుల పోరాట కమిటీ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు అత్యంత లోపభూయిష్టంగా  ఉన్నాయన్నారు. భూసేకరణ చట్టంలో మార్పుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కమిటీ నేతలు విమర్శించారు. 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  

 

19:32 - April 28, 2017

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కార్యాలయం ఎదుట మిర్చి రైతులతో కలసి .. టీడీపీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఆందోళన చేపట్టారు. మిర్చి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే..దానికి  ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని  సండ్రా వెంకట వీరయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కింటాకు పది వేల చొప్పున ఇచ్చి మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.

 

19:29 - April 28, 2017

గుంటూరు : ఉచిత ఇసుక విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంపై ఏపీ వ్యాప్తంగా విమర్శలు తలెత్తడంతో పాటు.. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనకు ఇసుక మాఫియా కారణమనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని, అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సుజయకృష్ణ రంగారావు తెలిపారు. 
ఉప ముఖ్యమంత్రులు కే.ఈ. కృష్ణమూర్తి, చినరాజప్పలతో పాటు మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

19:19 - April 28, 2017

చెన్నై : అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో పోలీసులు హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్‌ చేశారు. పార్టీ సింబల్‌ కోసం దిన‌క‌ర‌న్ ఈసీ అధికారికి  సుమారు 50 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయ‌త్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మ‌ధ్యవ‌ర్తిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖ‌ర్‌ను ఇదివరకే అరెస్టు చేశారు. సుకేష్‌ చంద్రశేఖరన్‌కు 10 కోట్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు అంగీకరించిన హ‌వాలా ఆప‌రేట‌ర్‌ నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్‌తో పాటు మరో ఇద్దరు హవాలా వ్యాపారులు గోపి, ఫైస‌ల్ షాను అరెస్టు చేసినట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ రంజన్‌ తెలిపారు.  ఈ కేసులో అరెస్ట్‌ అయిన దినకరన్‌ను  చెన్నైలోని ఆయన నివాసంలో విచారణ జరుపుతున్నారు. 

19:18 - April 28, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సైనికులు, అధికారులు పాల్గొని మృత వీరులకు నివాళులర్పించారు. కుప్వారా జిల్లాలో గురువారం ఆర్మీబేస్‌పై ముగ్గురు ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ ఘటనలో  కెప్టెన్‌తో పాటు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా....మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు.

 

19:16 - April 28, 2017

కోల్ కతా : నారదా స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించి తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీకి మరింత ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్‌ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో తృణమూల్‌కు చెందిన 13 మంది నేతలపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వారిలో ఎంపీలు, మంత్రులు, కోల్‌కతా మేయర్‌ తదితరులున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఎంసి నేతలు లంచాలు తీసుకుంటూ నారదా స్టింగ్‌ ఆపరేషన్‌కు చిక్కారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సిబిఐ నారదాస్టింగ్‌ ఆపరేషన్‌కు చిక్కినవారిపై దర్యాప్తు చేపట్టింది. ఇపుడు తాజాగా ఈడీ కూడా దర్యాప్తు చేయనుంది.

 

18:59 - April 28, 2017

చంఢీఘర్ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి తన భర్త వాద్రాకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకాగాంధీ వెల్లడించారు. ఆ భూమిని తన డబ్బుతోనే కొన్నానని ఆమె స్పష్టం చేశారు. ప్రియాంక కొనుగోలు చేసిన భూమికి వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ, డీఎల్‌ఎఫ్‌ కంపెనీల నుంచి డబ్బులు వచ్చాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. 2006లో ఫరీదాబాద్‌లోని 5 ఎకరాల వ్యవసాయ భూమిని 15లక్షలకు కొన్నానని, డబ్బు చెక్‌ ద్వారా ఇచ్చానని ప్రియాంక చెప్పారు.  నాలుగేళ్ల తర్వాత 2010లో అదే యజమానికి మార్కెట్‌ ధర ప్రకారం 80లక్షలకు భూమిని అమ్మేసినట్లు... చెక్‌ ద్వారానే డబ్బు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. 

 

18:45 - April 28, 2017
18:44 - April 28, 2017
18:43 - April 28, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి మహిళా ఎంపి ఓ పోలీసు అధికారిని బహిరంగంగా హెచ్చరించారు. ప్రవర్తన బాగా లేదన్న కారణంతో గ్యానాంజయ్‌సింగ్‌ అనే పోలీసు అధికారిపై బారాబాంకీ ఎంపి ప్రియాంకా సింగ్ రావత్ మండిపడ్డారు. బతికుండగానే చర్మం వలిచేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోది...యూపీలో యోగి ఉన్నారని...పనిచేసే వారే ఇక్కడ ఉండాలని...ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రియాంకసింగ్‌ చెప్పారు.

 

18:40 - April 28, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్నవాడే... భార్యను హతమార్చాడు.  కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి రాంబాబు.. భార్య లక్ష్మి ఇచ్చి చంపాడు. కామవరపుకోట మండలం..గండివారిగూడెంకు చెందిన లక్ష్మీ, రాంబాబులకు మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

18:37 - April 28, 2017

తూర్పుగోదావరి : వర్గపోరుతో  ఏపీ కమలం పార్టీ రగిలిపోతోంది. పైకి అంతాఓకే అంటున్నా.. అంతర్గతంగా రెండువర్గాలుగా ఎవరి శిబిరాలు వాడు నడుపుతున్నారు.  వెంకయ్యనాయుడు అనుకూల, వ్యతిరేకవర్గాల ఆదిపత్యపోరుతో   ఏపీలో బీజేపీ రాజకీయాలు రక్తికడుతున్నాయి.  తూర్పుగోదావరి జిల్లాలో ఇరువర్గాల నేతలు విడివిడిగా పార్టీ కార్యాలయాలే తెరిచి.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. 
వర్గపోరుతో కాషాయపార్టీ కుతకుత
ఏపీలో బీజేపీకి బలం అంతంత మాత్రమే. గడిచిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు దక్కించుకుంది కమలంపార్టీ.  వాటిలో తూర్పుగోదావరి నుంచి ఓ సీటును గెలుచుకుంది.  అయితే ఎన్నికల వరకు అంతా బాగానే ఉన్నా.. ప్రస్తుతం.. తూర్పుగోదావరి జిల్లాలో కాషాయపార్టీ వర్గపోరుతో రగిలిపోతోంది. 
రెండు వర్గాలుగా ఏపీ బీజేపీ..!
ఏపీలో  బీజేపీ అంతర్గతంగా రెండు ప్రధాన వర్గాలుగా విపోయినట్టు కనిపిస్తోంది.. పార్టీనేతలు వెంకయ్యనాయుడు అనుకూల, వ్యతిరేక వర్గాలు విడిపోయి..పార్టీలో  ఆదిపత్యపోరును రంజుగా నడిపిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం బీజేపీ అంతర్గత పోరు బాహాటంగా కనిపిస్తోంది.  వెంకయ్యకు అనుకూలంగా కంభంపాటి హరిబాబు,  వ్యతిరేకంగా  సోము వీర్రాజు వర్గాలు ..వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. 
అధ్యక్షపదవికోసం పోటాపోటీ 
కొద్దిరోజుల క్రితం జరిగిన తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షపదవి కోసం బీజేపీలో  రెండు వర్గాలు పోటాపోటీగా తలపడ్డాయి. ఈ ఆదిపత్యపోరులో సోమువీర్రాజు వర్గం తన పట్టును నిలుపుకుంది. వీర్రాజు వర్గీయుడైన  మాలకొండయ్యకు జిల్లాపార్టీ అధ్యక్షపీఠం దక్కింది. అటు రాజమహేంద్రవరంలో కూడా రెండు వర్గాలు పార్టీ పదవుల కోసం కత్తులు దూసుకున్నాయి. నగర అధ్యక్షపదవిలో తన వర్గానికి చెందిన బొమ్మలదత్తును కూర్చోబెట్టడానికి సోము వీర్రాజు వర్గం గట్టిప్రయత్నమే చేయాల్సి వచ్చింది.  ఇక్కడ ఆకుల సత్యనారాయణ తన వర్గీయుడైన బాలసుబ్రహ్మణ్యం సింగ్‌ను పోటీలో పెట్టారు.  కాని చివరికి సోము వీర్రాజు వర్గానిదే పైచేయిగా నిలిచింది. దీంతో రాజమహేంద్రి కాషాయపార్టీలో  కస్సుబుస్సుల పంచాయితీలు మరింత పెరిగినట్టైంది. 
ఆధిపత్యం కోసం ఆరాటం 
ఇలా తూర్పుగోదావరి జిల్లాలో రెండు వర్గాలుగా విడిపోయిన కమలంపార్టీ నేతల మధ్య సఖ్యత చేకూర్చేందుకు పార్టీ పెద్దలు తెల ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇది ఎంతవరకు పోయిందంటే..  ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గాలు పార్టీ కార్యక్రమాలను కూడా విడివిడిగా నర్వహిస్తూ.. ఆదిపత్యంకోసం ఆరాటపడుతున్నారు.  పార్టీ ఆవిర్భావ వేడుకలు, ఇటీవల పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సందర్భంగా విజయోత్సవాలు..  అన్నీ రెండు వర్గాలు విడివిడిగానే నిర్వహిస్తున్నాయి. చివరికి ఈ ఆదిపత్యపోరుతో ఆకుల, సోము వర్గాలు పార్టీ కార్యాలయాలు కూడా వేరువేరుగానే పెట్టుకుని.. కమలం పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీని మించిపోయే రీతిలో తూర్పుగోదావరిజిల్లాలో కమలం పార్టీ రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీ ఒకటే అయినా.. ఎవరి దుకాణం వారు పెట్టుకుని ..తాముకూడా ఆ తానులో ముక్కలమే అనిపిస్తున్నారని  తూగోజిల్లాప్రజలు చెప్పుకుంటున్నారు. 

 

17:44 - April 28, 2017

విశాఖ : రోజూ వందల్లో తిరిగే రైళ్లు. గేటు పడిందంటే గంటలకొద్దీ నిలబడాల్సిన దుస్థితి.  ఒక్కరుకాదు ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది జనాభా 20 ఏళ్లుగా ఆ రైల్వేగేట్‌తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రాణాలపై నమ్మకం వదిలేసుకోవాల్సిందే. అలాంటి రైల్వేగేట్‌ సమస్యకు పరిష్కారం దొరికింది. 20ఏళ్ల సమస్య 4 గంటల్లోనే మాయమైంది. ఇంతకీ ఎక్కడా రైల్వేగేట్‌? ఏమీటా పరిష్కారం?  టెన్‌ ప్రత్యేక కథనం...
కంచరపాలెంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం
విశాఖలోని గొల్లకంచరపాలెం, రామ్మూర్తి పంతులుపేట మీదుగా గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. ప్రజలు కూడా ఎలాంటి కష్టంలేకుండా రాకపోకలు సాగించేవారు. 1996లో కంచరపాలెంలో ప్లైఓవర్‌ నిర్మించారు. దీంతో బస్సుల తిరిగే మార్గం మారిపోయింది. దీంతో రామ్మూర్తిపంతులు పేట, గొల్లకంచరపాలెంతోపాటు సమీపంలోని  ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే వారు  ఆర్పీపేట రైల్వే గేటు గుండానే  రాకపోకలు సాగించాలి. రైళ్ల రద్దీ ఎక్కువవ్వడంతో ఈ గేటు రోజుకు 20 గంటలూ మూసి ఉంచడంతో అవతలి వైపున్న ప్రజలు అష్టకష్టాలు పడేవారు.  గంటలకొద్దీ నిరీక్షించేవారు.  ఈ సమస్యతో వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతమంది నేతలకు మొరపెట్టుకున్నా సమస్యమాత్రం తీరలేదు. ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
కేవలం 4 గంటల్లోనే అండర్‌పాత్‌వే నిర్మాణం
ప్రజల విజ్ఞప్తుల మేరకు 2016 ఆగస్టులో రామ్మూర్తిపంతులు పేట దగ్గర అండర్‌పాత్‌వే నిర్మించేందుకు  రైల్వేశాఖ అనుమతులు ఇచ్చింది.  స్థానిక ఎమ్మెల్యే గణబాబు అండర్‌పాత్‌వే నిర్మాణం కోసం నియోజకవర్గం అభివృద్ధి నిధుల్లోంచి 3కోట్ల రూపాయలను రైల్వేకు బదలాయించారు. దీంతో శంకుస్థాపన పూర్తిచేసుకుని నిర్మాణానికి తొలి అడుగుపడింది.  అయితే రైళ్లు ఎప్పుడూ తిరుగుతుండడంతో అండర్‌పాత్‌వే నిర్మాణానికి అడ్డంకిగా మారింది. దీనిపై రైల్వేశాఖ కసరత్తు చేసి 25వ తేదీ అర్ధరాత్రి  12 గంటలు ముహూర్తంగా ఖరారు చేసింది. 
అండర్‌పాత్‌వే కాంక్రీట్‌ పలకలు 
25వతేదీ అర్ధరాత్రి 12 గంటలకు కూలీలతోపాటు జేసీబీలు, పరికరాలు, సామాగ్రి అక్కడకు చేరుకుంది. విశాఖ నుంచి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లగానే పనులు ప్రారంభించారు. ముందు రైలు పట్టాలను తొలగించారు. ఆ తర్వాత గోతులు తవ్వారు.  ఆ తర్వాత అండర్‌పాత్‌వే కాంక్రీట్‌ పలకలను అమర్చారు. ఆ తర్వాత క్రేన్లతో మట్టిని పూడ్చివేశారు. అండర్‌పాత్‌ వే నిర్మించాక దానిపై మళ్లీ రైలుపట్టాలను బిగించి ఓ రైలును దానిమీదుగా పంపారు. కేవలం 4 గంటల్లోనే అండర్‌పాత్‌నే నిర్మించారు. దీంతో కంచరపాలెం, ఆప్పీపేట, దయానందనగర్‌ ప్రాంతవాసుల్లో ఆనందం వెల్లి విరిసింది. 20 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు అండర్‌పాత్‌వే నిర్మాణంతో తొలగిపోయాయి. దీంతో స్థానికులు ఎమ్మెల్యేతోపాటు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 

 

17:38 - April 28, 2017

విశాఖ : ఒక్క రూపాయితో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తోంది. పేరం గ్రూప్‌. ఉత్తరాంధ్ర ప్రజల కోసం పేరం గ్రూప్‌ ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. 75 శాతం బ్యాంక్‌ లోన్‌, 25 శాతం పేరం గ్రూప్‌ సహకారంతో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇలాంటి స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామంటున్నారు  పేరం గ్రూప్‌ అధినేత పేరం హరిబాబు. 

 

17:36 - April 28, 2017

ప్రకాశం : జిల్లాలోని చీమకుర్తి మండలం..గోనుగుంట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తులు ..ఎస్సీ కాలనీలో ఉండే దళితులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. గ్రామ రక్షణ  పేరుతో రాయిని పాతి.. దాని చుట్టూ ముళ్ల కంచె వేసి.. దళితుల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఇదేమిటని ప్రశ్నించడంతో...వారిని కులం పేరుతో దూషిస్తూ...  కత్తులతో దాడికి ప్రయత్నించారు. దీంతో దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ త్రివిక్రమ వర్మ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

 

17:33 - April 28, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని కోరుతూ.. సీపీఐ కార్యాలయంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. 14వ రోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతున్నాయి. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం అప్రజాస్వామిక చర్య అని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గొంతెత్తి చాటుతారనే భయంతోనే కేసీఆర్‌ ధర్నా చౌక్‌ను ఎత్తివేసే కుట్ర చేస్తున్నారన్నారు. మే 14 వరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మే 15న చలో ఇందిరాపార్క్‌ నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు. 

 

17:30 - April 28, 2017

ఢిల్లీ : దక్షిణ భారతదేశంలో విశేష సేవలు అందిస్తున్న హెరిటేజ్‌ సంస్థ...ఉత్తర భారతదేశంలోనూ తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. ఢిల్లీలో త్వరలో హెరిటేజ్ సొంత పాల పార్లర్లు ఏర్పాటు చేస్తామని హెరిటేజ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తెలిపారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నాణ్యత గల పాలను వినియోగదారులకు అందిస్తామని.. 2022 సంవత్సరానికల్లా ఆరు వేల కోట్ల వ్యాపారాన్ని చేరుకోవడమే సంస్థ లక్ష్యమని అన్నారు. 

17:10 - April 28, 2017

సూర్యపేట : కేసీఆర్ మూడేళ్లపాటు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల కోసం రైతు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదన్నారు. టీఆర్ ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. టీసర్కార్ ఘోర ఓటమి చూడబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఒకేసారి రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడే అవకాశం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం పొంచి ఉంది. రానున్న రెండు రోజుల్లో ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని తెలిపింది.

దేశ వ్యాప్త ఆందోళన చేపడుతాం - అశోక్ బాబు..

ఢిల్లీ : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం దేశ వ్యాప్త ఆందోళన చేపడుతామని తెలిపారు.

బ్యాంకులోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లోని ఓ బ్యాంక్ లోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఒక ఉగ్రవాది ఫైరింగ్ చేయడంతో సెక్యూర్టీ గార్డుకు గాయాలయ్యాయి. ఒక ఉగ్రవాది పరాయ్యాడు.

సుఖేష్ కు జ్యుడిషియల్ కస్టడీ..

చెన్నై : ఏఐఏడీఎంకే పార్టీ గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చారన్న కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న సుఖేష్ కు మే 12వ తేదీ వరకు జ్యుడిషయల్ కస్టడీ విధిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు వెల్లడించింది. అలాగే నరేష్ కు ఏప్రిల్ 30వరకు రిమాండ్ విధించింది.

ప్రీతీ జైన్ కు శిక్ష ..

ఢిల్లీ : ముంబైకి చెందిన మోడల్ ప్రీతీజైన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రీతీజైన్ కు ఈ శిక్ష విధించారు.

16:35 - April 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల దరఖాస్తులకు బ్రేక్ పడింది. బదిలీ దరఖాస్తులను ఆమోదించవద్దని తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. విధి విధానాలు ఖరారు చేసే వరకు నిర్ణయం తీసుకోవద్దని ఆయా శాఖలకు సీఎస్ సర్క్యూలర్ జారీ చేశారు. పాలసీ నిర్ణయం తీసుకునే వరకు ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ వేయాలని సూచించిచారు. మరిన్ని వివరాలను వీడదియోలో చూద్దాం...

 

అమెరికాకు బాబు..లోకేష్..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. మే 4వ తేదీ నుండి పర్యటన ప్రారంభం కానుంది. వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. బాబు వెంట మంత్రులు యనమల, లోకేష్ వెళ్లనున్నారు.

'కేసీఆర్ అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు'..

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని, రీ డిజైన్ల పేరిట చేస్తున్న దోపిడిని మాత్రమే అడ్డుకుంటున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ను విమర్శించేందుకే సభ – పొంగులేటి..

హైదరాబాద్ : కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసేందుకు సభ ఏర్పాటు చేసినట్లు ఉందని, చవటలు..దద్దమ్మలు అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని టి.కాంగ్రెస్ నేత పొంగులేటి పేర్కొన్నారు. సోనియా వల్ల తెలంగాణ వచ్చిందన్న కృతజ్ఞత కూడా కేసీఆర్ కు లేదని పేర్కొన్నారు.

గోవాలో బంగారం స్వాధీనం..

గోవా : ఎయిర్ క్రాఫ్ లో ఓ సీటు కింద ఉన్న బంగారాన్ని ఏఐయూ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 34 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

16:02 - April 28, 2017

ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'బాహుబలి 2'...ది కంక్లూజన్ ఇవాళ ప్రేక్షల ముందుకు వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో అంతకముందు వచ్చిన బాహుబలి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలసిందే. బాహుబలి 2 పై 10 టివి స్పెషల్ రివ్యూ నిర్వహించింది. బాహుబలి 2 ఎలా ఉంది..? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? బాహుబలి 2 గ్రాఫిక్స్ మంత్రముగ్దులను చేసిందా...? అనే విషయాలపై 10 టివి ఇన్ పుట్ ఎడిటర్ శ్రీధర్ బాబు, అసోసియేట్ ఎడిటర్ సతీష్ మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే.. 
'బాహుబలి 2 బాగుంది. స్ర్కీన్ ప్లే బాగుంది. విజువల్స్ ఎఫెక్ట్ బాగుంది. ఇది రివేంజ్ స్టోరీ. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చూపించాడు. ఫ్యామిటీ మెలోడీ డ్రామా. బాహుబలిగా ప్రభాస్ పూర్తిగా పాత్రలో ఒదిగిపోయారు. పాత్రల ఎంట్రీలు బాగున్నాయి. అనుష్క ఎంట్రీ బాగుంది. రిపీట్ ఆడియన్స్ ఉండరు. ఫస్ట్ ఆఫ్ అంత ఫీల్ లేదు. నటన పరంగా అందరూ బాగా చేశారు. ప్రభాస్, రానా పోటీ పడి చేశారు. ఎక్కువ విలనిజాన్ని రానా పండించారు. యుద్ధ సన్నివేశాలు బాగా ఉన్నాయి. కట్టప్ప పాత్ర బాగుంది. శివగామి షేడింగ్ కూడా విలనిజమే. అయితే పాత్రలు సడెన్ గా డల్ అయ్యాయి. శివగామి పాత్ర డల్ అయింది. శివగామి పాత్రను తగ్గించారని అనిపించింది. సినిమా లెన్త్ అయింది. భల్లాలదేవ భార్య ఎవరనేది రివీల్ కాలేదు . కథలో తప్పులు ఉన్నాయి. తమన్నా రోల్ చివరి వరకు కనిపించలేదు. తమన్నాను పూర్తిగా ఇగ్నోర్ చేశారు'. పూర్తి రివ్యూ చూడాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. 

 

15:48 - April 28, 2017

టీమిండియా క్రికేటర్లకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంట. అవును సోషల్ మీడియాలో దీనిపై తెగ వార్తలు వస్తున్నాయి. టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటూ వస్తోంది. న్యూజిలాండ్..ఆస్ట్రేలియా వరకు విజయాలు సాధించింది. ఈ విజయాలను చూసిన బీసీసీఐ ఏకంగా నజరానాలను కూడా ప్రకటించేసింది. తాజాగా వీరికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. టెస్టు ఆడిన అనంతరం 15 నుండి నెల రోజుల్లో మ్యాచ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ.15 ల‌క్ష‌లు, వ‌న్డే మ్యాచ్ ఆడితే రూ.6 ల‌క్ష‌లు, టీ20కి రూ.3 ల‌క్ష‌లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ప్రస్తుతం బోర్డు ఆర్థిక వ్యవహారాలు చూసుకొంటోంది. వీరి అనుమతి లేనిదే ఒక్క రూపాయి కూడా విడుదలయ్యే అవకాశం లేదు. సో..కొన్ని కొన్ని కారణాల వల్ల ప్లేయర్స్ కు జీతాలు చెల్లించడం లేదని సమాచారం.

15:43 - April 28, 2017

'బాహుబలి -2’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడన్న ఉత్కంఠ తొలగింపోయింది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం 'బాహుబలి -2’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంపై టెన్ టివిలో స్పెషల్ రివ్యూ నిర్వహించారు. టెన్ టివి అసొసియేట్ ఎడిటర్ శ్రీధర్ బాబు విశ్లేషణ అందించారు. సినిమాలోని కొన్ని పాత్రలపై ఇంకా శ్రద్ధ తీసుకుంటే బాగుండేదనని తెలిపారు. 'శివగామి' పాత్ర నిరుత్సాహ పరిచిందని, మొదటి పార్ట్ లో అత్యద్భుతంగా నటించిందని కితాబిచ్చారు. పిల్లల విషయంలో ఎవరి మాట నమ్మాలి ? ఎవరి మాట నమ్మకూడదన్న అంశంలో క్యారెక్టర్ రాజమాతకు కుట్రలు తెలుసుకొనే అవకాశం ఉంటుందని, అనుష్క ప్రశ్నలు కూడా ఆమె పాత్ర ఫెయిల్యూర్ కనిపిస్తోందన్నారు. ‘శివగామి' పేరిట ఒక బుక్ వచ్చిందని కానీ సినిమాలో అంత లేదన్నారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

ఉద్యోగుల బదిలీల దరఖాస్తులకు బ్రేక్..

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల దరఖాస్తులకు బ్రేక్ పడింది. బదిలీలపై ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. విధి విధానాలు ఖరారు చేసే వరకు ఏనిర్ణయం తీసుకోవద్దని, బదిలీల దరఖాస్తులను ఆమోదించవద్దని ఆయా శాఖలకు తెలంగాణ సీఎస్ సర్క్యూలర్ ను జారీ చేశారు.

కోదండరాం గో బ్యాక్ అన్న గులాబీ కార్యకర్తలు..

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు వ్యవసాయ మార్కెట్ ను ప్రో.కోదండరాం సందర్శించారు. కోదండరాం గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు..జేఏసీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

నందిగామలో ఫ్లెక్సీల తొలగింపు వివాదం..

కృష్ణా : జిల్లా నందిగామలో ఫ్లెక్సీల తొలగింపు వివాదం నెలకొంది. వైసీపీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను తొలగించేందుకు వచ్రిన మున్సిపల్ సిబ్బందిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కార్యకర్తలు భారీగా మోహరించారు. టిడిపి ఫ్లెక్సీలను కూడా తొలగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

 

'ఇసుక మాఫియా కట్టడిపై చర్యలు'..

విజయవాడ : ఇసుక మాఫియా కట్టడిపై మంత్రులు సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. డిప్యూటి సీఎంలు కేఈ, చిన రాజప్పతో పాటు మైనింగ్, హోం, విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. మూడు కేటగిరీలుగా ఇసుక రీచ్ లను విభజించడం జరిగిందని, మైనింగ్..హోం..రెవెన్యూ శాఖలుగా విభజించినట్లు మంత్రులు పేర్కొన్నారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి నెలా మూడు శాఖల మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టోల్ ఫ్రీకి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

13:35 - April 28, 2017

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల బాధలు కొనసాగుతున్నాయి. మిర్చికి మద్దతు ధర కల్పించాలని మార్కెట్ లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. గత కొంత కాలంగా మిర్చి ధరను తగ్గిస్తూ నేడు 6వేలకు దిగిపోవడంపై ఖమ్మం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర తగ్గింపుపై మార్కెట్ కమీటీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో రైతులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరంగం సృష్టించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మద్దతు తెలిపారు. 

ఇసుక మాఫియాపై కేబినెట్ సబ్ కమిటీ..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఇసుక మాఫియా కట్టడి చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు కేఈ క్రిష్ణమూర్తి, చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావులు పాల్గొన్నారు. వారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏర్పేడు ఘటన తర్వాత ఇసుక మాఫియాను అరికట్టే దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఈ భేటీ జరుగుతోంది. ఇసుక అక్రమాలపై ఇప్పటివరకు 4 వేల ఫిర్యాదులు వచ్చినట్లు, మొత్తం 189 కేసులు నమోదైనట్లు, 257 మంది అరెస్ట్ చేసినట్లు, 465 వాహనాలు సీజ్ చేసినట్లు కమిటీ పేర్కొంది.

13:22 - April 28, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి కి చురకలు అంటించింది. బాధ్యతంగా ఉండాలని సూచింది. కోర్టులో జగన్ తరుపు నీరంజన్ రెడ్డి, సీబీఐ తరుపున సురేందర్ రావు వాదించారు.నీరంజన్ రెడ్డి వాదానతో ఏకిభంచిన కోర్టు సీబీఐ పిటిషన్ రద్దు చేసింది. జగన్ కు అనుకులంగా తీర్పు రావడంతో వైసీపీ శ్రేణులు ఉపిరి పీల్చుకున్నారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లఘిస్తున్నారని సీబీఐ ఆరోపిస్తూ , సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

జగన్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : వైసీపీ నేత జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. జగన్ తరపు న్యాయవాదుల వాదనలపై కోర్టు ఏకీభవించింది. జగన్ న్యూజిలాండ్ పర్యటనకు కూడా కోర్టు అనుమతించింది. కుటుంబంతో కలిసి వెళ్లాలని షరతు విధించింది.

13:10 - April 28, 2017

మెగాస్టార్ ‘చిరంజీవి' 'ఖైదీ నెంబర్ 150’ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి దాదాపు రోజులు గడుస్తోంది. చిత్రం శతదినోత్సవం కూడా జరుపుకొంది. కానీ తదుపరి చిత్రం ఇంకా మొదలు కాకపోవడంపై అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ‘చిరంజీవి' 151వ సినిమా 'ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి' ఉంటుందని, త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ రోజులు గడుస్తున్నా ఎలాంటి న్యూస్ రాలేదు. తాజాగా 'చిరు' తనయుడు 'రామ్ చరణ్ తేజ' దీనిపై ఓ ప్రకటన చేశారు. ‘చిరు'151వ సినిమా ఆగస్టులో మొదలు కాబోతుందని వెల్లడించారు. కానీ అంతవరకు ఎందుకు ఆగుతున్నారనే దానిపై పలు కథనాలు వెలువడుతున్నాయి. చిత్ర పాత్ర కోసం బరువు భారీగా తగ్గాలని ఉండడంతో ఆ మేరకు 'చిరు' ఎక్సర్ సైజులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సినిమాకి ఇప్పటి వరకు కథానాయికలు, సాంకేతిక బృందం ఎంపిక కూడా పూర్తి పనిలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఆగస్టులో పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

13:08 - April 28, 2017

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలకుర్తిలో పర్యటిస్తున్నారు. ఇంటికో పాడి..పశువులను ఇస్తామని హామీనిచ్చారు. రాఘవాపురంలో మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఆయన  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత బమ్మెర వెళ్లి మహాకవి పోతన సమాధిని సందర్శించారు. ఆ తర్వాత అభివృద్ధి పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 14 కోట్ల రూపాయల మేర స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేస్తారు.

 

13:06 - April 28, 2017
13:05 - April 28, 2017

101ఏళ్ల బామ్మ 100మీటర్ల పరుగు పందెం...98ఏళ్ల మరో బామ్మ యోగాతో అశ్చర్యపరుస్తున్నారు..మన్ ప్రీత్ కౌర్ స్వర్ణం సొంతం చేసుకుంది. 18.35 మీటర్లు దూరం త్రో చేసి స్వర్ణం గెలుచుకున్నారు..ఆనంది అండర్ 19 మహిళ క్రికెట్ సెలక్ట్ ..నిషేధం తర్వాత రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా మరోసారి తన సత్తా చూటింది..టాటా కమ్యూనేషన్ డైరెక్టర్ గా రేణుక ఎంపిక...రోదసిలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా ఫెంకీ విల్స్ న్ రికార్డు..పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జగన్ కు ఊరట..

హైదరాబాద్ : సీబీఐ ప్రత్యేక కోర్టులో వైసీపీ నేత జగన్ కు ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు.

12:55 - April 28, 2017

నిజామాబాద్ : అగ్ని ప్రమాదాలు జరుగకుండా వ్యాపార వాణిజ్య సంస్తలు, అపార్ట్‌మెంట్లు లాంటి నిర్మాణాల్లో అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేసుకొవాలి. కాని కొంత మంది మాత్రమే దీన్ని పాటిస్తున్నారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తినష్టంతోపాటు విలువైన ప్రాణాలు కూడా పోతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలో ఫైర్‌యాక్సిటెంట్స్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిజామాబాద్‌ జిల్లాలోనే ప్రతి సంవత్సరం దాదాపుగా 800 వరకు అగ్నిప్రదాలు సంభవిస్తుంటాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదాల్లో సగటున 10 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పాతఇళ్లలో సరైన విద్యుత్ వైర్లు లేక, విద్యుత్‌షాట్‌సర్క్యూట్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు వ్యాపార వాణిజ్య సముదాయలలొ కూడా సరైనా ఎలక్ర్టికల్ వ్యవస్త లేకపొవటం తో తరచూ ప్రమాదాలు జరుతున్నాయని జిల్లా అగ్నిమాపక అధికారులు అంటున్నారు.

వ్యాపార సంస్థలు 200 వరకు ఉన్నాయి
ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వ్యాపార సంస్థలు 200 వరకు ఉన్నాయి. ప్రవైట్‌ ఆస్పత్రులు కూడా దాదాపు 180 వరకు ఉన్నాయి. అయితే సగానికి పైగా సంస్థల్లో అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం పరికరాలేవి ఏర్పాటు చేసుకోలేదు. చాలా సంస్థల్లో గత పదేళ్లుగా జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రజల ప్రాణాలు గాల్లోకలిసి పోయాయి. కోట్ల రూపాయల ఆస్థి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.  

ఖమ్మం మిర్చి యార్డుపై రైతుల దాడి..

 

ఖమ్మం : మిర్చియార్డు కార్యాలయంపై రైతులు దాడి చేశారు. మార్కెట్ చక్ష్మర్మన్ కార్యాలయంపై రైతులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కనీస మద్దతు ధర కల్పించడం లేదని పేర్కొంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

12:50 - April 28, 2017

కృష్ణా : మనం ఇప్పటి వరకు ఖాళీ భూములను కబ్జా చేయడం చూశాం. అటవీ భూములను ఆక్రమించుకోవడం చూశాం. చివరికి కొండలను , గుట్టలనూ వదలకుండా కబ్జాలకు పాల్పడిన తీరునూ చూశాం. కానీ ఏకంగా నదినే కబ్జా చేయడం ఎప్పుడైనా మీరు చూశారా. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న కృష్ణానదినే కబ్జా చేసేందుకు అక్రమార్కులు రంగం సిద్దం చేసుకున్నారు. ఇదిగో ఇవి చూడండి. నీటిలో కనబడుతున్న ఈ జెండాలను చూసి ఏదో పోటీలు జరుగుతున్నాయని భ్రమపడకండి. వీటిని కబ్జా రాయుళ్లు ఏర్పాటు చేశారు. ఇంత వరకు తమ భూమి ఉందని చెప్పడానికి ఇలా జెండాలతో మార్కింగ్‌ చేశారన్నమాట. 130 నుంచి 150 ఎకరాలు ఇక్కడ తమ భూమి ఉందంటూ కబ్జాదారులు చెప్తున్నారు. రాత్రికి రాత్రే జెండాలతో మార్కింగ్‌లనూ ఏర్పాటు చేశారు. ఇదంతా ఉద్దండరాయునిపాలెం, గుంటుపల్లికి మధ్యలోని కృష్ణా నదిలో కబ్జారాయుళ్లు చేసిన తంతు.

పక్కాగా ప్లాన్‌
కృష్ణానదిలో ఇప్పటి వరకు అనేక ద్వీపాలు ఉన్నాయి. చుట్టూరా నీరు ఉండి, ప్రకృతి సిద్ధంగా సహజంగా వెలిసే వాటిని ద్వీపాలు అంటారు. కృష్ణానదిలో అమరావతి నుంచి మొదలుకొని ప్రకాశం బ్యారేజీ వరకు 10పైగా ద్వీపాలున్నాయి. ఈ ద్వీపాల్లో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు విజయవాడకు చెందిన కొందరు వ్యక్తులు ప్రకృతి సిద్ధంగా వెలిసిన ద్వీపాలు తమకు సొంతం కావడంలేదని.. తామే ఓ ద్వీపాన్ని సృష్టించి సొమ్ము చేసుకోవాలని భావించారు. ఇందుకు పక్కాగా ప్లాన్‌ రూపొందించారు. ఉద్దండరాయునిపాలెం, గుంటుపల్లి మధ్య ఉన్న కొన్ని ద్వీపాలను హద్దులుగా పెట్టుకుని కృష్ణానదిలో ఓ కృత్రిమద్వీపం ఏర్పాటు చేయాలని కుట్ర పన్నారు. దీనికోసం నది నీటిలో తేలియాడే పెద్దపెద్ద వాటర్‌ టిన్‌లను ఉపయోగించి, వాటికి జెండాలుపాతి 130 ఎకరాల వరకు మార్కింగ్‌ చేశారు. గతం 20 రోజులుగా రాత్రి వేళ్లలో గట్టుచప్పుడు కాకుండా ఇందంతా చేస్తున్నారు. నదిలో చేపలుపట్టుకునే మత్స్యకారులు వారిని ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే ఆ ప్రాంతమంతా తమదేనని చెప్తున్నారు. ఇక్కడ ద్వీపాన్ని నిర్మించి టూరిస్ట్‌ ప్లేస్‌గా మార్చుతామని చెప్పారని మత్స్యకారులు తెలిపారు. తమను అటువైపు వేటకు రావొద్దంటు హెచ్చరించారని చెబుతున్నారు.

పెద్దల అండదండలు...
కృష్ణానదిలో మార్కింగ్‌ చేయడం నదిని కబ్జా కోసమేనని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చేపల వేటే తమ జీవనాధారమని, ఇప్పుడు తమను ఇటువైపు వేటకు రావొద్దంటే ఏంచేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కృష్ణానదిని కబ్జాచేయడమేంటని మండిపడుతున్నారు. కబ్జారాయుళ్లు ఇంతలా బరితెగిస్తోంటే ప్రభుత్వం ఏంచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నది మధ్యలో కబ్జాలకు పాల్పడుతున్న వారికి ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని ఉద్దండరాయునిపాలెం వాసులు ఆరోపిస్తున్నారు. చుక్కపల్లి ప్రసాద్‌ అనే వ్యక్తి మార్కింగ్‌ చేసినట్టు చెప్తున్నారు. గతంలోనూ అతను ఉద్దండరాయునిపాలెంలో 70 ఎకరాల్లో కొబ్బరిమొక్కలు నాటి ఆ భూములు తమవేనంటూ గొడవ చేశాడని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు అతనికి ఆ భూములతో ఎలాంటి సబంధం లేదని తేల్చిచెప్పారు. మళ్లీ అతనే కృష్ణానదినే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కృష్ణానదిలో మార్కింగ్‌కు సంబంధించి అధికారులను 10టీవీ వివరణ కోరగా ఆ విషయం తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు. కబ్జా విషయమేది తమకు తెలియదంటున్నారు. నది మధ్యలో బాహాటంగా కబ్జాకు పాల్పుడుతోంటే ప్రభుత్వ అధికారులు, పాలకులు కళ్లుమూసుకుని చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబ్జారాయుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పూచికపాడులో ఉద్రిక్తత..

పశ్చిమగోదావరి : జీలుగుమిల్లి (మం) పూచికపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్ టీఆర్ భూములు గిరిజనులకే చెందుతాయన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. 1/70 యాక్టు ఉన్న భూముల్లో మామిడి కాయలు కోసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజును గిరిజనులు అడ్డుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.

12:39 - April 28, 2017

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ 'రిషీ కపూర్' ఈతరం సినీ నటులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి పిలిస్తే వెళుతారు కానీ సీనియర్ నటుడు 'వినోద్ ఖన్నా' అంత్యక్రియలకు హాజరు కారా ? అంటూ కోపం ప్రదర్శించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు 'వినోద్ ఖన్నా' గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, జాకిష్రాఫ్, అర్జున్ రాంపాల్, కిరణ్ బేడీ తదితరులు హాజరయ్యారు. దీనిపై 'రిషకపూర్' తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తరం సోకాల్డ్ స్టార్స్‌ పై తనకు చాలా కోపం వస్తోందని, ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి ఈ తరం చెమ్చా గ్యాంగ్‌ మొత్తం వెళ్లారని..వినోద్ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం హాజరయ్యేందుకు వారికి తీరిక లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆయనతో నటించిన వారు కూడా రాకపోవడం దారుణమని, ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. భవిష్యత్ లో తాను మరణించినా, తన శవాన్ని మోస్తారన్న గ్యారెంటీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

12:19 - April 28, 2017

ఖమ్మం : ఆరుగాళం పాటు కష్టపడి పంట పండించారు..తమ కష్టానికి పడిన ఫలితం వస్తుందని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. తమకు మద్దతు ధర కల్పించాలంటూ రోజుల తరబడి 'మిర్చి' రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం..అధికారులు స్పందించకపోయే సరికి ఆందోళనకు దిగారు. శుక్రవారం మిర్చి యార్డులో ఆందోళనకు దిగారు. రూ.6వేల ధర మాత్రమే పలకడంపై తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తమ ఆవేదనను మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు తెలియచేయాలని కార్యాలయానికి వచ్చారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహానికి గురయ్యారు. కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. కానీ వారు ఏ మాత్రం వినిపించుకొనే స్థితి లేని పరిస్థితి నెలకొంది. రైతుల ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మద్దతు తెలిపారు.

 

దినకరన్ కేసులో మరొకరి అరెస్టు..

చెన్నై : టీటీవీ దినకరన్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలతో దినకరన్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖరన్ కు 10 కోట్ల రూపాయలు అందజేసిన హవాలా ఏజెంట్ నరేష్ ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయ్ లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన నరేష్ ను ఢిల్లీ పోలీసులు, ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

11:59 - April 28, 2017

హైదరాబాద్ : గత కొంత కాలంగా విచారణ జరుగుతోన్న  జగన్ ఆక్రమాస్తుల కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణకు  జగన్ నాంపల్లి కోర్టు కు హాజరైయ్యారు. అయితే కోర్టు ఈ విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. కానీ బెయిల్ రద్దు పై కొద్ది సేపట్లో తీర్పు వెల్లడించనుంది.

పాలకుర్తిలో సీఎం కేసీఆర్.

వరంగల్ : జనగామలోని పాలకుర్తిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రాఘవాపురంలో మిషన్ భగీరథ..డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

బీబీ నగర్ నిమ్స్ ఆసుపత్రిలో లక్ష్మారెడ్డి..

యాదాద్రి : బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రిని మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల ఆలస్యంపై సంబంధిత కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ సేవలను వెంటనే ప్రారంభించాలని, రెండు నెలల్లో ఐపీ సేవలను కూడా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.

11:39 - April 28, 2017

గుంటూరు : తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చీఫ్‌ విప్‌ పదవుల పంపిణీపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఏపీ చీఫ్‌ విప్ కాల్వ శ్రీనివాసులు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ పదవి కోసం ప్రధానంగా పల్లె రఘునాథరెడ్డి పేరు వినిపిస్తుంది. అలాగే మండలి చీఫ్‌ విప్‌ స్థానానికి పయ్యావుల కేశవ్‌, టీడీ జనార్దన్‌ పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవి నుంచి తొలగించినందున పల్లె రఘునాథరెడ్డికి చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టాలని సన్నిహితుల నుంచి బాబుపై ఒత్తిడి వస్తుందని సమాచారం. దానికి చంద్రబాబునాయుడు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. సీనియర్‌ నేత కావడం...మంచి వాగ్ధాటి ఉండడంతో పయ్యావుల కేశవ్‌ను శానస మండలి చీఫ్‌ విప్‌గా ఎంపిక చేయాలని బాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పదవికి టీడీ జనార్దన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే జనార్దన్‌కు చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టడం పార్టీకి అన్ని విధాల మంచిదని కొందరు సీనియర్ల భావన. మరోవైపు ఈ రేసులో అనంతపురం జిల్లాకు చెందిన పార్థసారధితో పాటు బండారు సత్యనారాయణ మూర్తి, గౌతు శివాజీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 

11:34 - April 28, 2017

గుంటూరు : జిల్లా కలెక్టర్లతోమ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అక్ష్యాలపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. సంక్షేమ పథకాల అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిత్తూరు ఏర్పేడు ఘటనతో తీవ్ర స్పందించిన సీఎం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను చంద్రబాబు  ఆదేశించారు.

ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతుల ఆందోళన..

 

ఖమ్మం : మిర్చి యార్డుకు భారీగా మిర్చి వచ్చింది. కనీస మద్దతు ధర కల్పించడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ ఛైర్మన్ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. రైతుల ఆందోళనలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మద్దతు పలికారు.

11:23 - April 28, 2017

ఏంటీ రూపాయికి బంగారమా ? ఏంటీ మజాక్ చేస్తున్నారా ? అంటారా ? కానీ ఇది నిజమే. ప్రముఖ డిజిటల్‌ వ్యాలెట్‌ సంస్థ తమ వినియోగదారులకు ఆక్షయ తృతీయ సందర్భంగా రూపాయికే బంగారాన్ని అందించనుంది. ఇందుకు 'డిజిటల్‌ గోల్డ్‌' పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ ద్వారా అతి తక్కువగా రూపాయికే బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ పేర్కొంటోంది. ఎంఎం టీసీ-పీఏఎంపీ కలిసి పేటీఎం వేదికగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఫలితంగా పేటీఎం వినియోగదారులు 24 క్యారెట్ల గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. డిజిటల్‌ గోల్డ్‌ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు తమ వినియోగదారులకు సులభ మార్గాన్ని తీసుకొచ్చామని పేటీఎం సీఈవో విజరు శేఖర్‌ శర్మ పేర్కొన్నారు. కొనుగోలుదారుల కోరిక మేరకు బంగారు నాణేలను ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వనున్నామని, తిరిగి వీటిని ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించుకోవచ్చని తెలిపారు.

11:22 - April 28, 2017

హైదరాబాద్ : జగన్ బెయిల్ పిటిషన్ రద్దు పై నాంపల్లి కోర్టులో కాసేపట్లో తుది తీర్పు రానుంది. జగన్ ఆక్రమాస్తుల కేసులో జగన్ నాంపల్లి కోర్టు కు హాజరైయ్యారు. అయితే కోర్టు ఈ విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దయితే కోర్టు అవరణలో ఎటువంటి అవంచనీయ ఘటనలు జరగకుండా కోర్టు అవరణలోకి ఎవరిని అనుమతించడం లేదు. సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సీబీఐ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

లక్నో పెట్రోల్ బంకుల్లో ఎస్టీఎఫ్ బృందం తనిఖీలు..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ఎస్టీఎఫ్ బృందం పలు పెట్రోల్ బంక్ లో తనిఖీలు నిర్వహిస్తోంది. లక్నోలోని ఏడు పెట్రోల్ బంకుల్లో బృందం తనిఖీలు చేసింది. గత రాత్రి నిర్వహించిన ఈ తనిఖీల్లో కొన్ని పెట్రోల్ బంక్ లలో ఎలక్ట్రానిక్ చిప్స్ ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు తెలుస్తోంది.

కలెక్టర్లతో బాబు సమావేశం..

విజయవాడ : అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బాబు చర్చిస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇసుక మాఫియా కట్టడిపై బాబు సూచలను అందచేస్తున్నారు.

శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుండి 1250 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

 

కోణార్క్, డెక్కన్ రైళ్లకు హాల్టింగ్..

హైదరాబాద్ : లింగంపల్లి రైల్వే స్టేషన్ లో మరో రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళు హాల్డింగ్ కు అనుమతి లభించింది. భువనేశ్వర్ నుండి ముంబై మధ్య నడిచే కోణార్క్ ఎక్స్ ప్రెస్..హైదరాబాద్ నుండి పూణె మధ్య నడిచే డెక్కన్ ఎక్స్ ప్రెస్ లకు అనుమతి లభించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సర్క్యూలర్ జారీ చేసింది.

హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు..

హైదరాబాద్ : హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను పొడిగిస్తూ సీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మే ఆరో తేదీ నుండి ఉదయం 6గంటల నుండి ఆగస్టు 4వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. హైకోర్టు ఆ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ వెల్లడించారు.

 

10:20 - April 28, 2017

హైదరాబాద్ : జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నాడని సీబీఐ ఈ పిల్ వేసింది. దీనిపై కోర్టులో వాదానలు జరిగాయి. జగన్ తరుపు న్యాయవాదులు సీబీఐ వాదనలను తప్పుబట్టారు. మీడియాలో ప్రసారమైన మాజీ సీఎస్ రమాకాంత్ ఇంటర్వ్యూ కు, జగన్ కు సంబంధంలేదని జగన్ తరుపు లాయర్లు కోర్టు తెలిపారు. కోర్టు తుది తీర్పుపై వైసీపీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బెయిల్ రద్దయితే వైసీపీ అధ్యక్షడు ఎవరనేది ప్రశ్నగా మారింది. సీబీఐ కోర్టు ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య తీర్పు వెల్లడించనుంది.

 

బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : వ్యవసాయం..అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది మట్టి నమూనాల విశ్లేషణ వంద శాతం పూర్తి కావాలని, ఖరీఫ్ ముందస్తు ప్రణాళిక అమలుకు నెల రోజులే ఉందని తెలిపారు. ఖరీఫ్ సేద్యానికి రైతులను సన్నద్ధం చేయాలని, మే నెలాఖరుకల్లా ఇన్ పుట్ సబ్సిడీ రైతులకు అందించాలని, సాగర్ ఆయుకట్టులో తొలి పంటగా అపరాలు, మెట్ట పంటలను పోత్సాహించాలని అధికారులకు సూచించారు.

10:04 - April 28, 2017

హైదరాబాద్ : కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపడో సమాధానం దొరికింది. నేడు విడుదలైన బాహుబలి 2 ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది. బాహుబలి 2సినిమా కోసం అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ కు ప్రేక్షులు భారీ స్థాయిలో వచ్చారు. అటు కాచిగూడ తారకరామ థియేటర్ వద్ద కూడా ప్రేక్షకులు కోలహలం నెలకొంది.

09:44 - April 28, 2017

రోజు రోజుకు టెక్నాలజీ మారిపోతోంది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పలు కంపెనీలు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ 'ఎగిరే కార్ల' తయారీలో నిమగ్నమైంది. జర్మనీకి చెందిన 'స్టార్టప్‌' కంపెనీ లిలియం ఏప్రిల్‌ 20న బవేరియాలో ఓ ఎగిరే కారును విజయవంతంగా నడిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో హల్ చల్ చేసింది. గంటకు 300 కి.మీ. వేగంతో గాలిలో ప్రయాణించనుంది. ఐదు సీట్ల ఎగిరే కారును మార్కెట్లోకి తెచ్చేందుకు ఈ కంపెనీ మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. వోలో అనే మరో కంపెనీ కొన్నేండ్లుగా ఎగిరే కారుపై ప్రయోగాలు జరుపుతోంది. జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్‌ అనుబంధ సంస్థ ఇటల్‌ డిజైన్‌ గిగియారో(ఇటలీ)తో కలిసి ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ కంపెనీ కూడా ఎగిరే కార్ల తయారీపై దృష్టి పెట్టింది. మొత్తంగా ఓ డజను కంపెనీలు 'ఎగిరే తయారీ'లపై దృష్టి పెట్టాయి. 2020 కల్లా తమ 'ఎగిరే కార్లు' మార్కెట్‌లోకి రానున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

09:18 - April 28, 2017

గుంటూరు : తెలుగు రాష్ట్రల్లో బాహుబలి ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లలో ఎక్కడ చూసిన అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. గుంటూరులో పలు థియేటర్ల వద్ద ప్రిమియర్ షోలు ముగిశాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. తిరుపతిలో కూడా జక్కన్న దృశ్య కావ్యం కోసం ప్రేక్షకులు అత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి కోసం కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరి సినిమా చూస్తున్నారు. విజయవాడ కూడాలో బాహుబలి ఇప్పటికే రెండు షోలు ముగిశాయి. రాజమౌళి గారు మంచి సినిమా తీశారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి 2 చిత్రం 2000 కోట్లు క్రాస్ చేస్తోందని ప్రేక్షకులు కరఖండిగా చెబుతున్నారు.

 

09:05 - April 28, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' న్యూ చిత్రం 'సాహో' చిత్ర టీజర్ వచ్చేసింది. 'ఆ రక్తం చూస్తేనే అర్థమౌతోంది..రా..వాడిని చచ్చేలా కొట్టారని..సార్ అది వాడి రక్తం కాదు..మనవాళ్లది..ఇట్స్ షో టైమ్' అనే డైలాగ్స్ ఉన్నాయి. ఈ టీజర్ ను 'బాహుబలి -2’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లలో ప్రదర్శించనున్నారు. ‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమా కోసం కొన్ని ఏళ్లు కష్టపడిన 'ప్రభాస్' ఆ సమయంలో ఏ చిత్రాన్ని ఒప్పుకోలేదన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి 2’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన అనంతరం 'సుజీత్' దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి 'ప్రభాస్' కమిట్ అయ్యాడు. మొదటగానే టీజర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేశారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందనుందని చిత్ర టీజర్ చూస్తే అర్థమౌతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రం రూపొందనుంది. మే 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

కలెక్టర్లతో చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్

గుంటూరు : నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరపనున్నారు. సమావేశంలో పాలన పరమైన అంశాల్లో సూచనలు, ప్రభుత్వ ప్రాథమ్యాలు సీఎం వివరించనున్నారు. 

08:47 - April 28, 2017

ఎయిర్ పోర్టులో భారీగా బంగారం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి 1.250 కిలోల బంగారం పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి రిలీజ్

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో బాహుబలి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. బ్లాక్ లో టికెట్ 3వేల నుంచి 5వేలు పలుకుతోంది.

 

08:27 - April 28, 2017
08:26 - April 28, 2017

హైదరాబాద్ : నేడు ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో బాహుబలి రిలీజ్ అవుతోంది. టికెట్ల కోసం థియేటర్ల వద్ద అభిమానుల పడిగాపులు పడుతున్నారు. బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో టికెట్ 3వేల నుంచి 5వేల ధర పలుకుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. కాచిగూడ లో మొదటి షో 7.15 ప్రారంభమైంది.

 

08:16 - April 28, 2017

టీఆర్ఎస్ పార్టీ క్రమంగా తన ప్రభావన్ని కోల్పోతోందని టెన్ టివి న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ చర్చ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత శ్రీనివాస్, నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ప్లీనరీలో చెప్పిన మాటలు బహిరంగ సభలో చెప్పారని వీరయ్య అన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ను మాత్రమే విమర్శించారని బీజేపీ విమర్శించకపోవడంపై టీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాలను విమర్శించడం కోసం మాత్రమే టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించదని నాయక్ ఆరోపించారు. కానీ ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నా సమస్యలపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. రాష్ట్రలో మిర్చి రైతుల పరిస్థితి ప్రభుత్వం నికర్లక్ష్యం చేస్తోందని అన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ.6 లక్షలు ఇవ్వడంలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ది ప్రగతి నివేదన సభ కాదు టీఆర్ఎస్ పార్టీ ఆవేదన సభ అని దుర్గాప్రసాద్ అన్నారు. కేసీఆర్ మాటలు మాత్రడే మాట్లాతారని తెలిపారు. సభ భారీ సక్సెస్ అయిందని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ తెలిపారు. ప్రగతి నివేదన సభ 2019 ఎన్నికల టార్గెట్ గా జరిగిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు పుట్టగతులుండవని తమపై విమర్శలు చేస్తున్నారిన ఆయన ఆరోపించారు.

 

07:51 - April 28, 2017

రైతుల సమస్యలపై రైతు సంఘం అధ్యక్షులు సాగర్ జనపథం చర్చలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులందరు ఆవేదనతో ఉన్నారని, మూడు సంవత్సరాల కాలంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 6లక్షల నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. వచ్చే సంత్సరం రైతులకు ఎరాకు రూ.4వేల ఇస్తామని చెప్పారు, కానీ ప్రస్తుతం మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో దాదాపు 14 లక్షలు మంది కౌల్ రైతులు ఉన్నారని, వారి గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలి అని అన్నారు. స్వామినాథ్ సూచనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతులను ఆదుకోవాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్లు ఇచ్చి, రైతులకు రుణా మాఫీ చేస్తే కొందరు అంభ్యంతరం తెలపడం దారుణమాన్నారు. రాష్ట్రంలో 231 మండలాలు కరువు ఉన్నాయి, కేంద్ర విడుదల చేసిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోని కేవలం 35శాతం రైతులకు విడుదల చేశారని అన్నారు.  

07:34 - April 28, 2017

గుంటూరు : అక్రమాస్తుల కేసు వ్యవహారం మరోసారి వైసీపీకి తలనొప్పిగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం జగన్‌ బెయిల్‌మీద ఉన్నారు. అయితే సాక్షులను ప్రభావితం చేసేలా జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు..జగన్‌ బెయిల్‌పై తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శుక్రవారం తుది తీర్పును వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఎండబోతుంది అనే అంశం ఇపుడు పార్టీలో ఉత్కంఠను రేపుతోంది. పార్టీలో ఉన్న కీలక నేతల నుండి సామాన్య కార్యకర్త వరకూ కోర్టు తీర్పు కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా పార్టీలోఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించి బెయిల్‌ను రద్దు చేస్తే..జగన్‌ మరోసారి జైలుకు వెళ్లడం ఖాయం. ఇదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటంటూ నేతలు గుబులు పడుతున్నారు. కోర్టు జగన్‌ బెయిల్‌ను రద్దు చేస్తే పార్టీ బాధ్యతలు ఎవరు చేపడతారు అనే దానిపై పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలు సైతం జగన్‌కు బెయిల్ రద్దవడం ఖాయమని ప్రకటనలు చేయడంతో వైసీపి నేతల్లో టెన్షన్‌ మరింత పెరిగింది.

మదన పడుతున్న పార్టీ నేతలు....
అయితే కోర్టు తీర్పుపై లోలోపల మదన పడుతున్న పార్టీ నేతలు..పైకి మాత్రం ఈ కేసుతో ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక మానసికంగా దెబ్బతీసేందుకు టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తుందంటున్నారు. జగన్ ఎలాంటి తప్పు చెయ్యలేదంటూనే న్యాయ వ్యవవస్థపై తమకు నమ్మకముందంటున్నారు. దీంతో పాటు ఈ కేసులో తప్పకుండా జగన్ నిర్దోషిగా బయటకు వస్తాడంటున్నారు. టీడీపీ కావాలనే జగన్ పైన బురదచల్లే ప్రయత్నం చేస్తుందని వైసిపి నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే అధినేత జగన్ మాత్రం కేసుల గురించి పట్టించుకోకుండా పార్టీ బలోపేతంపైనే దృష్టి సారిస్తున్నారు. జిల్లాల వారిగా కీలక నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ బిజీ బిజిగా గడుపుతున్నారు.

07:30 - April 28, 2017

గుంటూరు : దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సర్వే నిర్వహించింది. మొత్తం 20 రాష్ట్రాల్లో అవినీతిపై ఈ సర్వే కొనసాగించింది. అవినీతి పెరిగిన రాష్ట్రాల్లో కర్నాటక మొదటి స్థానంలో నిలవగా... ఇక ఆంధ్రప్రదేశ్‌ రెండవ స్థానంలో నిలిచింది. కర్నాటకలో లంచాలు ఇవ్వడం, అధికారులు అవినీతికి పాల్పడటం పెరిగి 77శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఏపీ 74శాతం అవినీతితో దేశంలో రెండో స్థానం ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ నిలిచాయి.

సీఎంఎస్‌ సర్వే..
కరప్షన్‌పై సీఎంఎస్‌ నిర్వహించిన సర్వే వివరాలను నీతి ఆయోగ్‌ సభ్యుడు బిబేక్‌ దేబ్‌రాయ్‌ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. రంగాల వారీగా సర్వే నిర్వహించినట్టు సీఎంఎస్‌ నిర్వాహకుడు డాక్టర్‌ భాస్కరరావు తెలిపారు. 2005తో పోలిస్తే 2016లో అవినీతి బాగా తగ్గిందన్నారు. ఏడాదికాలంగా పది సర్వీసు రంగాల్లో ఐదు రాష్ట్రాల్లో లంచాలు ఇవ్వడం, అధికారులు అవినీతికి పాల్పడడం పెరిగిందన్నారు. 2005లో పోలీసు, జ్యుడీషియల్‌, బ్యాంకింగ్‌, విద్యుత్‌, పౌరసరఫరాలు, ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో సగటున అవినీతి 73శాతం ఉండేదని.. గత సంవత్సరం ఇది 43 శాతంగా ఉందన్నారు. సగటున దేశం మొత్తం మీద లంచాలు ఇవ్వడం తగ్గినా మహారాష్ట్ర, ఏపీసహా ఐదు రాష్ట్రాల్లో మాత్రం పెరిగిందన్నారు. సంవత్సరానికి సగటున ఒక కుటుంబం ప్రభుత్వ సేవల కోసం 1840 రూపాయలను లంచం ఇవ్వాల్సి వస్తోందని సీఎంఎస్‌ తన సర్వేలో తేల్చింది. రేషర్‌కార్డు మొదలుకొని స్కూల్‌లో అడ్మిషన్‌ కోసం 20 రూపాయల నుంచి 50వేల వరకు ప్రభుత్వ సేవల కోసం అధికారులు ప్రజల నుంచి లంచం తీసుకుంటున్నారని సీఎంఎస్‌ తేల్చింది. ఏపీలోని అన్ని ప్రభుత్వం సేవలలో అవినీతి పెరిగినట్టు సీఎంఎస్‌ స్పష్టంచేసింది. 

07:07 - April 28, 2017

వరంగల్ : ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గులాబీ దళపతి కేసీఆర్‌. వరంగల్‌ ప్రకాశ్‌రెడ్డిపేటలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌.. ఈరోజు 70 లక్షల మంది సభ్యత్వంలో దేశంలోనే ఓ రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తున్న మాదిరిగానే.. 2019లోనూ బ్రహ్మాండమైన విజయం సాధించి.. మనం కోరుకున్న బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు కేసీఆర్‌. బహిరంగ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు భయపడి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకుల వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని.. వారిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు కేసీఆర్‌.

దేశంలోనే ధనిక రైతుగా తెలంగాణ రైతు
గ్రామీణ రైతులు బాగుపడాల్సిన అవసరముందన్నారు ముఖ్యమంత్రి. దేశంలోనే ధనిక రైతుగా తెలంగాణ రైతును నిలుపుతామన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులంతా సమాఖ్య ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రభుత్వమే పెట్టబడి ఇస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మనమంతా తలుచుకుంటే.. రైతు రందీ లేని వ్యవసాయం చేసే రోజు వస్తుందన్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ పాలనలో బీసీ వర్గాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని కేసీఆర్‌ అన్నారు. కానీ తమ సర్కార్‌ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్ని కుల వృత్తులను ఆదుకుంటామన్నారు కేసీఆర్‌. ఈ సభలో జయశంకర్‌ సార్‌ లేకపోవడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్‌. పోరుగల్లు అయిన వరంగల్‌లో జరిగిన అనేక సభలలో జయశంకర్‌ సార్‌ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే వాడినని ఇప్పుడు ఆయన లేకపోవడం బాధ కలిగిస్తుందన్న కేసీఆర్‌ జయశంకర్‌ సార్‌ అమర్‌రహే అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నిలుపుకున్నామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా సీఎం పీఠం కోసమే చూస్తున్నారని..కానీ తెలంగాణ బాహుబలి కేసీఆరే అన్నారు కడియం. టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన కళాకారులు ధూంధాం అందరినీ ఆకట్టుకుంది.

 

07:05 - April 28, 2017

వరంగల్ : ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గులాబీ దళపతి కేసీఆర్‌. వరంగల్‌ ప్రకాశ్‌రెడ్డిపేటలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌.. ఈరోజు 70 లక్షల మంది సభ్యత్వంలో దేశంలోనే ఓ రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తున్న మాదిరిగానే.. 2019లోనూ బ్రహ్మాండమైన విజయం సాధించి.. మనం కోరుకున్న బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు కేసీఆర్‌. బహిరంగ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు భయపడి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకుల వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని.. వారిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు కేసీఆర్‌.

దేశంలోనే ధనిక రైతుగా తెలంగాణ రైతు
గ్రామీణ రైతులు బాగుపడాల్సిన అవసరముందన్నారు ముఖ్యమంత్రి. దేశంలోనే ధనిక రైతుగా తెలంగాణ రైతును నిలుపుతామన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులంతా సమాఖ్య ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రభుత్వమే పెట్టబడి ఇస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మనమంతా తలుచుకుంటే.. రైతు రందీ లేని వ్యవసాయం చేసే రోజు వస్తుందన్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ పాలనలో బీసీ వర్గాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని కేసీఆర్‌ అన్నారు. కానీ తమ సర్కార్‌ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్ని కుల వృత్తులను ఆదుకుంటామన్నారు కేసీఆర్‌. ఈ సభలో జయశంకర్‌ సార్‌ లేకపోవడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్‌. పోరుగల్లు అయిన వరంగల్‌లో జరిగిన అనేక సభలలో జయశంకర్‌ సార్‌ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే వాడినని ఇప్పుడు ఆయన లేకపోవడం బాధ కలిగిస్తుందన్న కేసీఆర్‌ జయశంకర్‌ సార్‌ అమర్‌రహే అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నిలుపుకున్నామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా సీఎం పీఠం కోసమే చూస్తున్నారని..కానీ తెలంగాణ బాహుబలి కేసీఆరే అన్నారు కడియం. టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన కళాకారులు ధూంధాం అందరినీ ఆకట్టుకుంది.

 

06:59 - April 28, 2017

కడప : బాహుబలి 2 సినిమా విడుదల సందర్భంగా జిల్లాలోని రైల్వే కోడూరులో ప్రభాస్‌ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. బ్యాండు భాజాలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ర్యాలీలో 9 తెల్లగుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్థానిక సిద్దేశ్వర థియేటర్‌ దగ్గర అన్నదానం చేశారు. 

జనగామలో సీఎం కేసీఆర్ పర్యటన

వరంగల్ : తెలంగాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం రాఘవురంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. బమ్మెర పోతన సమాధ సందర్శంచినున్నారు. అభివృద్ధి , సంక్షేమ పథలకాలపై సీఎం సమీక్షంచనున్నారు.

Don't Miss