Activities calendar

29 April 2017

22:35 - April 29, 2017
22:31 - April 29, 2017
22:25 - April 29, 2017
22:23 - April 29, 2017

ఢిల్లీ : అండర్‌ వరల్డ్‌ డాన్‌, ఇండియా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడా? దావూద్‌ గుండెపోటుకు గురయ్యాడా? అతడి పరిస్థితి విషమంగా ఉందా? ఔనంటూ పాక్‌ మీడియాలో వార్తలొచ్చాయి. భాయ్‌ భేషుగ్గానే ఉన్నాడంటూ అతడి అనుచరుడు ఛోటా షకీల్‌ చెబుతున్నాడు. ఇంతకీ డాన్‌ పరిస్థితి ఏంటి..?
దావూద్ కు తీవ్ర అస్వస్థ
పాకిస్తాన్‌లోని కరాచీలో తల దాచుకుంటున్న అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు గుప్పుమన్నాయి.  61 ఏళ్ల దావూద్‌కు గుండెపోటు రావడంతో కరాచీలోని ఆగాఖాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పాక్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 20 రోజుల క్రితం తీవ్రస్థాయిలో పక్షవాతం రావడంతో దావూద్‌ కుడి వైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయిందని మరో వార్తాసంస్థ తెలిపింది. చావుబతుకుల మధ్య ఉన్న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో కణతి ఉందని వైద్యులు సూచించారు. దావూద్‌కు బ్రెయిన్‌ ట్యూమర్‌ను తొలగించేందుకు వైద్యులు చేసిన ఆపరేషన్ విఫలం కావడంతో.... ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు.  దావూద్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
అస్వస్థతపై వార్తలను ఖండించిన ఛోటా షకీల్  
దావూద్‌ అస్వస్థతపై వచ్చిన వార్తలను ఆయన సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ ఖండించాడు. దావూద్‌కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ వదంతులేనని స్పష్టం చేశాడు.  భారతీయ మీడియాతో మాట్లాడుతూ... నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయ్‌ బ్రహ్మాండంగా ఉన్నారని ఛోటా షకీల్ చెప్పాడు.
బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం
1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం. ఆనాటి బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా...7 వందల మంది గాయపడ్డారు. దావూద్‌ను తమకప్పగించాలని భారత్‌ ఎప్పటినుంచో పాకిస్తాన్‌ను కోరుతోంది. కానీ పాక్‌ మాత్రం దావూద్‌ తమవద్ద లేదని బుకాయిస్తోంది.

 

22:04 - April 29, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ను రాజకీయం చేయడం సరికాదని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. బసవాచార్య జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని.... ముస్లిం మహిళలకు మూడు తలాక్‌ల నుంచి విముక్తి కల్పించేందుకు ముస్లింలే ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో భారతీయ ముస్లింలే ప్రపంచానికి మార్గదర్శకులు కావాలని మోది ఆకాంక్షించారు.

 

22:00 - April 29, 2017

హైదరాబాద్ : నీళ్ల నిపుణుడు విద్యాసాగరరావు కన్నుమూశారు. జలవనరుల ఇంజనీర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యాసాగర్ రావు మృతికి ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు విద్యాసాగరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారుగా విద్యాసాగర్ రావు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 
విద్యాసాగర్‌ రావు మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
మారుమూల కుగ్రామంలో జన్మించి.. సమున్నత స్థాయికి ఎదిగిన జలవనరుల ఇంజనీర్‌ ఆర్‌.విద్యాసాగరరావు.. శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్‌ రావు మృతి పట్ల.. ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
విద్యాసాగర్‌ భౌతిక కాయాన్ని కేసీఆర్‌ సందర్శించిన సీఎం 
విద్యాసాగర్‌ భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించి.. తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. హబ్సిగూడ లోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి విద్యాసాగరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. విద్యాసాగరరావు లేని లోటు భర్తీ చేయలేనిదన్న కేసీఆర్‌, ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నీటి పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బలంగా వినిపించారన్న కేసీఆర్‌, నీళ్లు - నిజాలు రచన ద్వారా, సాగునీటి రంగంపై అందరికీ అవగాహన కల్పించారన్నారు. విద్యాసాగరరావు స్మృతి చిహ్నంగా.. ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు ఆయన పేరును పెట్టాలని అధికారులను ఆదేశించారు. 
విద్యాసాగరరావు మృతికి మంత్రి హరీశ్‌రావు సంతాపం 
విద్యాసాగరరావు మృతికి మంత్రి హరీశ్‌రావు కూడా సంతాపం తెలిపారు. కుడి భుజం పోయినంత పనైందని హరీశ్‌, ప్రాజెక్టుల రీడిజైన్లలో విద్యాసాగర్‌రావు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. బండారు దత్తాత్రేయ, ప్రొఫెసర్ కోదండరాం, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు విద్యాసాగర్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  

 

21:46 - April 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఓవైపు ఎండలు హీటెక్కిస్తుంటే.. రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఈరోజు జరిగిన బిఏసీ సమావేశం మొత్తం హాట్ హాట్ గా సాగింది. తెలంగాణలో భూసేకరణ సవరణ బిల్లుపై చర్చ కోసం రేపు జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ భేటీ కోసం బీఏసీ జరిగింది. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. మరోవైపు తమను సమావేశానికి ఆహ్వానించలేదని బిజేపీ ఫైరైంది.
అజెండా ఖరారు కోసం బీఏసీ సమావేశం 
ఆదివారం జరగనున్న అసెంబ్లీ సమావేశంలో అజెండా ఖరారు కోసం బీఏసీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ పక్షాన సీఎల్పీ నేత జానారెడ్డి, చిన్నారెడ్డి, ఎంఐఎం నుండి పాషాఖాద్రి ఈ సమావేశానికి హాజరయ్యారు. గత సెషన్ లో సస్పెండ్ అయినందున... ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీలను ఆహ్వానించలేదని ప్రభుత్వం తెలిపింది.
ఖమ్మం ఘటనపై హాట్ హాట్ చర్చ
స‌మావేశం  జరిగింది 15 నిముషాలైనా ఆద్యంతం వాడివేడిగా సాగింది. స‌మావేశంలో జానారెడ్డి, చిన్నారెడ్డి ప్రభుత్వంపై వ‌ర్షం కురించారు. రాష్ట్రంలో మద్దతు ధ‌ర అంద‌క‌, పంట‌ను కొనేవారు లేక రైతులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని.. దీనిపై మొద‌ట అసెంబ్లీలో చ‌ర్చించి త‌ర్వాత .. భూ సేక‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని  బీఏసీలో ప‌ట్టుప‌ట్టారు. అందుకు కేసీఆర్ ససేమిరా అన్నారు. భూసేకరణ బిల్లుకు సవరణల కోసమే సమావేశం పరిమితమని తేల్చిచెప్పారు. అంతేకాదు రైతుల ఆందోళనల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని సీఎం అనడంతో కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. సీఎం సమాధానాలపై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ నేతలు రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుంటే సభను అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారు. 
బీజేపీ, టీడీపీలను ఆహ్వానించని ప్రభుత్వం
మరోవైపు ఈ సమావేశాలకు బిజేపి, టిడిపిల‌కు ఆహ్వానం అందకపోవడంతో ఆ పార్టీలు గరం గరంగా ఉన్నాయి. మొత్తానికి భూసేకరణ బిల్లుకు సవరణలు చేసేందుకు సమావేశం కానున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం హాట్ హాట్ గా సాగనుందని తెలుస్తోంది.  

 

21:42 - April 29, 2017

కర్నూలు : నంద్యాల అసెంబ్లీకి బైపోల్ అభ్యర్థి విషయంలో శిల్పా, భూమా వర్గాలు మెట్టుదిగాయి. ఇరువర్గాలతో ఇవాళ మంత్రి కళా వెంకట్రావు చర్చలు జరిపారు. ఇరువర్గాలు మెట్టు దిగి తుది నిర్ణయం చంద్రబాబుకే వదిలేశారు. ముందు నుంచి నంద్యాల సీటు తమకే కావాలని అటూ భూమా వర్గం, ఇటు శిల్పా వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగిన కళా వెంకట్రావు.. ఇరువర్గాలను ఒప్పించారు. దీంతో చంద్రబాబు నిర్ణయం మేరకు నడుచుకుంటామని ఇరువర్గాలు ప్రకటించాయి. 

21:40 - April 29, 2017

ఘాటు మీదికొచ్చిన మిర్చి చేటు పంచాది... ఖమ్మం పట్నంల పోలీసు సెక్షన్లు విధింపు, కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఎనుకేసున్నడు... మళ్లోపంచాది ముంగటేసుకున్న కోమటిరెడ్డి, చంద్రన్న కుప్పంల కుప్పల కొద్ది అవినీతి.. ఇంట్ల ఓడి రచ్చ గెలుస్తున్న చంద్రాలు, వరంగల్ సభకు ప్లాప్ కు పోలీసోల్లే కారణం... క్యాడర్ రానియ్యలేదని కారు బాస్ కన్నెర్ర, కామారెడ్డి కాడా స్మశాన వాటిక కబ్జా.... 55 ఎకరాలకు రియల్ ఎస్టేట్ పూజ, తప్పైందని చెంపలేసుకుంటున్న కేజ్రీవాల్...ఢిల్లీల ఓటమితర్వాతైన జ్ఞానోదయం.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

రైతు రుణమాఫీ జగన్ కు కనిపించడం లేదా ? : మంత్రి నక్కా అనంద్ బాబు

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు మేలు జరగడం జగన్ కు ఇష్టం లేదన్నారు. కేంద్రంతో చర్చించి రైతులకు బోనస్ కూడా ఇప్పిస్తున్నామని చెప్పారు. జగన్ దీక్షకు ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. 

 

ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై జీఎండీ బాషా సస్పెన్షన్

కడప : ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై జీఎండీ బాషాపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ కేసు డీల్ కోసం ఎస్సై మహిళను లాడ్జీకి పిలిపించుకున్నారు. 

బెంగళూరుపై పుణె విజయం

ఐపీఎల్ 10 : బెంగళూరుపై పుణె విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో బెంగళూరు పుణె గెలుపొందింది. పుణె మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.

భూమా, శిల్పా వర్గాలతో కళా వెంకట్రావు చర్చలు సఫలం

గుంటూరు : నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై ఎంపికపై భూమా, శిల్పా వర్గాలతో కళా వెంకట్రావు చర్చలు సఫలం అయ్యాయి. శిల్పా, భూమా వర్గాలు చెరో మెట్టు దిగాయి. ఇరు వర్గాలు చంద్రబాబుకే తుది నిర్ణయం వదిలేశాయి. కాసేపట్లో చంద్రబాబుతో ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. 

20:46 - April 29, 2017

హ్యాపీడేస్ హీరో టైసన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటాపురం మూవీ విశేషాలు తెలిపారు. 
తన సినీ కెరీర్ వివరించారు. మరిన్ని విరాలను ఆయన మాటల్లోనే...'నా ఫేవరెట్ హీరోయిన్ శృతిహాసన్. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుంది'. అని అన్నారు. నటుడు అజయ్ ఘోష్ ఫ్రాంక్ కాల్ చేశాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

20:38 - April 29, 2017

ఖమ్మం : టీప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క్ మండిపడ్డారు. ఖమ్మం మిర్చియార్డులో వ్యాపారులు, దళారులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారని .. ఆయన ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌ యార్డును సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో 12 వేలు ఉన్న మిర్చి ధర ప్రస్తుతం 2వేలకు పడిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల పాలైన రైతన్న .. విధి లేకనే తన నిరసనకు దిగుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. 

 

20:33 - April 29, 2017

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మిర్చి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేదని మనస్తాపంతో రమేష్‌.. ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలైన రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. రమేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:27 - April 29, 2017

హైదరాబాద్ : ప్రతిపక్షాలపై విమర్శలు మాని.. మిర్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలకు పిచ్చి పట్టాయని మంత్రి తుమ్మల అనడం దారుణమన్నారు. రైతులకు మద్దతు తెలిపిన నాయకులను అరెస్ట్‌ చేయడం దారుణమని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. వెంటనే మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని తెలిపారు. 

19:55 - April 29, 2017
19:54 - April 29, 2017
19:51 - April 29, 2017

చిత్తూరు : తిరుమల కొండపై నీటి కరువు పొంచిఉంది. కొండపై ఉన్న జలశయాలు దాదాపుగా అడుగంటాయి. ఇప్పటికే గోగర్భం, ఆకాశగంగ డ్యాంలు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనం, కుమారధార-పసుపుధార జలాశయాలు దాదాపుగా అడుగంటాయి. వరుణుడు కరుణిస్తే తప్ప మరోమార్గం లేకపోవడంతో...టీటీడీ పాలకమండలి  తెగ హైరానా పడుతోంది.  
కొండపై నీటికి కటకట
కోనేటిరాయుడి కొలువులో తాగునీటికి కటకటగా మారింది. కొండపై ఉన్న జలాశయాలు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి. తిరుమల కొండపై ఉన్నగోగర్భం, ఆకాశగంగ డ్యాములు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనంతోపాటు  కుమారధార-పసుపుధార జంట ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా భారీగా తగ్గాయి. దీంతో తిరుమలలో ప్రస్తుతం ఉన్న ఉన్న నీరు  126 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారుల ఆందోళన పడుతున్నారు. అటు తిరుపతిలోని  కళ్యాని డ్యామ్‌ నీటిని కలుపుకుంటే 185 రోజులవరకూ నెట్టుకు రావచ్చని అధికారులు అంచానా వేస్తున్నారు.  
నిత్యం శ్రీవారి దర్శనానికి 70నుంచి 1లక్షమంది భక్తులు
నిత్యం  శ్రీవారి దర్శనంకోసం 70 వేల నుండి లక్షమంది వరకూ భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తుల అవసరాలతోపాటు  ఆలయం, నిత్యాన్నదానం కాటేజీలు, అతిథిగృహాలు, కళ్యాణకట్ట తదితరాల కోసం నిత్యం 30 నుంచి 35 లక్షల గ్యాలన్ల వరకూ నీరు అవసరం అవుతోంది. అటు జలాశయాల్లో నీరు నిండుకోవడంతో.. టీటీడీ అధికారులు హైరానా పడుతున్నారు. 2015 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆతరవాత 2016 లో వరుణుడు మొహంచాటేయడంతో  వర్షాలు పడలేదు. దీంతో  డ్యామ్‌ల్లో నీటిని టీటీడీ  పొదుపుగా వాడుతోంది. ఈనేపథ్యంలో జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో .. ఉన్ననీటితోనే నెట్టుకొస్తున్నారు అధికారులు. 
తెలుగు గంగ నుంచి నీటిని తీసుకోవాలని టీటీడీ ప్లాన్‌
వాస్తవానికి  తిరుమలలో నీటిఎద్దడిపై దశాబ్దకాలంగా  అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అందుకే  తెలుగుగంగ నీటిని తిరుమల అవసరాలకు వినియోగించుకోవాని  2015లోనే నిర్ణయించారు. రోజుకు 10 యం.యల్.డి.ల నీటిని తరలించి.. తిరుపతి, తిరుమల అవసరాలు తీర్చాలని అంచనావేశారు. కాని..  ఆతరవాత కురుసిన వర్షాలకు తిరుమల కొండపై డ్యాములు పూర్తిగా నిండడంతో టీటీడీ అప్పటికి ఆ ఆలోచనను విరమించుకుంది.  కాని.. గతఏడాది మళ్లీ వర్షాలు తక్కువగా పడ్డంతో.. జలశయాలు పూర్తిగా అడుగంటే పరిస్థతి తలెత్తింది. దీంతో ఇపుడు తెగహడావిడి పడుతున్నారు టీటీడీ అధికారులు. ముందుచూపులేని టీటీడీ పాలకమండలి తీరువల్లనే తిరుమలకు నీటిఎద్దడి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

19:45 - April 29, 2017
19:39 - April 29, 2017

విజయవాడ : రోడ్డు వేస్తుంటే కాపలా ఉన్న జవాన్లను మావోయిస్టులు హతమార్చడం దారుణమని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. అభివృద్ధికి మావోయిస్టులు వ్యతిరేకమన్న విషయం మరోసారి రుజువైందని ఆయన అన్నారు. విజయవాడలోని ఏఆర్ గ్రౌండ్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ కమిషనరేట్ కి సంబంధించిన సీపీ డాష్ బోర్డును సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆన్ లైన్ కేసుల వివరాలు, విచారణ, ట్రాఫిక్ చలానాలు, పాస్ పోర్ట్ జారీ ప్రక్రియలకు సంబంధించిన అన్ని వివరాలను డాష్ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చని డీజీపీ సాంబశివరావు చెప్పారు.  అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంతో పాటు.. ఆయేషా కేసును పునర్విచారణ చేయిస్తామని సాంబశివరావు అన్నారు. 

 

19:35 - April 29, 2017

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు తన ఇంటిని కబ్జా చేసారంటూ విజయవాడలో తన ఇంటిముందే ఆందోళన చేస్తున్న సుమశ్రీ ఈరోజు నిరాహారదీక్షకు దిగింది. పోలీసులు సైతం బొండా ఉమ అనుచరులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సుమశ్రీ ఆరోపిస్తోంది. క్యాన్సర్ తో బాధపడుతున్న కుమార్తె శివశ్రీతో పాటు దీక్ష చేస్తున్న సుమశ్రీకి ఆమ్ ఆద్మీ నేతలు మద్దతు పలికారు. కబ్జారాయుళ్ల నుండి తన కూతురిని.. తన ఇంటిని కాపాడమని సుమశ్రీ వేడుకుంటోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:31 - April 29, 2017

హైదరాబాద్‌ : సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మిర్చి దండలు మేడలో వేసుకుని నిరసన తెలిపారు. రైతులు మిర్చిని తగలబెట్టొద్దని.. ప్రభుత్వంపై తిరగబడాలని ఐద్వా సీనియర్‌ నేత మల్లు స్వరాజ్యం పిలుపునిచ్చారు. కుట్రలు చేస్తున్నది విపక్షాలు కాదని..ప్రభుత్వమే రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. ఖమ్మం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులపై కేసులు ఎత్తివేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.  

19:29 - April 29, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని జమ్మికుంట మండలంలోని విలాసాగర్‌ గ్రామంలో.. ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది. తనకు దక్కని అమ్మాయి.. ఎవరికీ దక్కకూడదనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఒక్క ఫోన్‌తో ఆ అమ్మాయి జీవితాన్ని తలకిందులు చేశాడు. నిశ్చితార్థాన్ని ఆపేశాడు. దీంతో న్యాయం చేయాలంటూ సుమలత ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. చందు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో.. కేసును తప్పు దారి పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగదన్న అవమాన భారంతో బాధితురాలు సుమలత ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు పెళ్లి జరిపించేంత వరకూ ఊరుకునేది లేదంటూ.. చందు ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళన చేస్తోంది. 

19:26 - April 29, 2017
19:25 - April 29, 2017

హైదరాబాద్ : సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించిన ఆ గొంతు మూగబోయింది. ఎన్నో కథలు.. కవిత్వాలు రాసిన ఆ కలం ఆగిపోయింది. టీఎంసీల గురించి.. క్యూసెక్కుల గురించి చెప్పిన లెక్కల మాస్టారు ఇక లేరు. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి.. ఇంజనీర్  గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన జలయోధుడు విద్యాసాగర్ రావు అనారోగ్యంతో కన్నుమూసారు. 
1939 నవంబర్ 14న జననం
నల్లగొండ జిల్లా ఓల్డ్ సూర్యాపేట తాలూకాలోని జాజిరెడ్డి గూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ జన్మించారు. విద్యాసాగర్ తండ్రి ఆర్‌.రాఘవరావు టీచర్‌గా పనిచేశారు. విద్య విలువ తెలిసిన రాఘవరావు పిల్లలందరికీ ఉన్నత విద్యను అందించారు. జాజిరెడ్డిగూడెంలో ఫస్ట్ మెట్రిక్యులేషన్ పాసైంది విద్యాసాగరరావు తండ్రి రాఘవరావే. అలాగే ఫస్ట్ గ్రాడ్యుయేట్ విద్యాసాగరరావు సోదరుడే. ఇక ఆ ఊళ్లో మొట్టమొదట ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకుంది విద్యాసాగరరావే. ఆయన చెల్లెళ్లు కూడా విద్యావంతులే. చిన్నప్పటి నుంచి ఆట పాటల్లో విద్యాసాగర్ ఎక్కువ మక్కువ చూపించేవారు. చాలా చిన్నవయసులో ఆయన రాసిన కథలు అచ్చయ్యాయి కూడా. చదువుకునే రోజుల్లో నాటకాలు వేసేవారు. కవిసమ్మేళనాల్లో పాల్గొనేవారు. అలా ఆయనకు కళలపట్ల ఎంతో ఆసక్తి ఉండేది. 
ఉమెన్స్ కాలేజ్ లో ఇంజనీర్‌గా మొదటి ఉద్యోగం
బీటెక్ పూర్తి చేసిన విద్యాసాగర్ మొదట క్యాంపస్ లోని ఉమెన్స్ కాలేజ్ లో  మెయెంటెన్స్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తరువాత కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, నీటిపారుదల శాఖలో ఇంజనీర్ గా పనిచేశారు. అప్పుడే నీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించారు. రిటైర్మెంట్ తరువాత తిరిగి హైదరాబాద్ కు వచ్చారు విద్యాసాగర్. 
కేసీఆర్‌తో విద్యాసాగర్‌కు తొలి పరిచయం
హైదరాబాద్ కు వచ్చిన తరువాత 2002 ఏప్రియల్ 14న విద్యాసాగర్ కు కేసీఆర్ తో పరిచయం ఏర్పడింది.  అంబేద్కర్ జయంతి సందర్భంగా హబ్సిగూడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన కేసీఆర్ స్వయంగా విద్యాసాగర్ ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. తెలంగాణకు నీటి పంపకాల్లో అన్యాయం గురించి ప్రజలను చైతన్యపరచాలని స్వయంగా కేసీఆర్‌ విద్యాసాగరరావును కోరారు. దీంతో, తన అనుభవాన్ని రంగరించి, ఆయన సాగునీటిరంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను, నీటి వనరుల లభ్యతపై వివక్షను సమర్థవంతంగా ఎత్తిచూపారు. అంతేకాదు నీళ్లు నిజాలు అనే పుస్తకాన్నీ రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా పదవీ బాధ్యతలు విద్యాసాగర్ చేపట్టారు. 

 

19:18 - April 29, 2017

హైదరాబాద్ : మిర్చికి మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం...కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ధ్వజమెత్తారు. ఖమ్మం మార్కెట్‌యార్డులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మార్కెట్‌యార్డుపై రైతులు దాడి చేయలేదని.. కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు దాడి చేశారని తెలిపారు. రైతులకు నష్టం చేసే ప్రయత్నాలు చేయొద్దని విపక్షాలను కోరుతున్నామని తెలిపారు. 

19:12 - April 29, 2017

హైదరాబాద్ : భూసేకరణ చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపే బిల్లుపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. దీనికి సంబందించి బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపటి అసెంబ్లీ సమావేశంలో ముందు రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్‌ పట్టుపట్టింది. రైతు సమస్యలపై చర్చించాకే భూసేకరణ చట్టంలో సవరణలపై చర్చించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అన్నారు. భూసేకరణ చట్టంలో సవరణలకు మాత్రమే సభ పరిమితమని స్పష్టం చేశారు. అయితే 2013 భూసేకరణ చట్టం కంటే.. కొత్త బిల్లుపై మెరుగైన అంశాలు ఏమున్నాయో చెప్పాలని జానారెడ్డి డిమాండ్ చేయగా... కేసీఆర్‌ మాట దాటవేశారు. 

 

18:59 - April 29, 2017

కడప : జిల్లాలో వైసీపీ పట్టుసడలుతోందా? ఒకప్పుడు ప్రత్యర్థులకు సవాల్‌గా ఉండే ప్రాంతం.. ఇప్పుడు రెడ్‌ కార్పెట్‌ పరుస్తోందా? కడపలో ఏం జరుగుతుంది? వైసీపీ ప్రాబల్యం కోల్పోతుందా? ప్రస్తుతం వైసీపీ శ్రేణులలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి.
వైసీపీకి ఎదురుదెబ్బ
వైసీపీ అధినేత జగన్‌  కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. ప్రత్యర్థులకు పట్టు దొరకని ప్రాంతం. వైఎస్ రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు.. అంచెలంచలుగా జిల్లాలో తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చారు.  కడప జిల్లా అంటే వైఎస్.. వైఎస్ అంటే కడప జిల్లా అనేంతగా జిల్లాలో ఎదిగారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 
స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్‌ వివేకానందరెడ్డి
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ జగన్.. బాబాయ్  వివేకానందరెడ్డి ఓడిపోయారు. దీంతో జిల్లా మీద జగన్ కుటుంబం పట్టు సడులుతోందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. శతవిధాల ప్రయత్నించినా...వైఎస్  వివేకా ఓడిపోవడం పార్టీ శ్రేణుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో తొమ్మిది మంది  వైసీపీ ఎమ్మెల్యేలు  గెలిచినా... అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే  భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఓటమికి నాయకత్వ లోపమే కారణమని విమర్శలు
అధికార పార్టీ డబ్బు ఎర చూపి గెలిచిందని.. ఎంత చెప్పుకున్నా...పార్టీ శ్రేణుల్లో మాత్రం అది స్థైర్యాన్ని నింపలేకపోతోంది. జిల్లాలో పటిష్టమైన నాయకత్వ లోపం కారణంగానే వైసీపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని పలువురు అంటున్నారు.  తండ్రి తరహాలో జగన్‌ వ్యవహార శైలి లేకపోవడం... జగన్‌ పులివెందులకే పరిమితం కావడంతో జిల్లాలో వైసీపీ బలహీన పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు జిల్లాలో బలమైన నేత అయిన ఆదినారాయణరెడ్డి పార్టీని వీడటం లాంటి పరిణామాలు కూడా పార్టీని దెబ్బతీస్తున్నాయంటున్నారు. అలాగే జిల్లా నాయకత్వం ప్రెస్‌ మీట్‌లకే పరిమితమవుతోందని..క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా  ఉంది. అలాగే  ఆకేపాటి అమరనాథ్ రెడ్డి.. జిల్లా అధ్యక్షుడిగా విఫలమయ్యారని పార్టీ వ్యక్తులే చెబుతున్నారు.  
నష్ట నివారణకు యోచిస్తున్న జగన్‌
అయితే  నష్ట నివారణ చర్యలు తీసుకోవాలనే  యోచనలో జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మళ్లీ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి...తమ కుటుంబ ముద్ర చెరిగిపోకుండా ఉండేందుకు పార్టీ జిల్లా పగ్గాలు వైఎస్ వివేకాకు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు  టీడీపీ నాయకులు మాత్రం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. స్థానిక నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం వరకు ఎవరు పార్టీలోకి వచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 

 

18:54 - April 29, 2017

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత జిల్లాలో టీడీపీ రాజకీయాలు తలనొప్పిగా తయారయ్యాయా... నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి పార్టీ మొత్తానికి నష్టం కల్గించనుందా.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు, చంద్రబాబుకు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తయా ? తాజా పరిణామాలతో ఏం చేయాలో తెలియని ఆయోమయస్థితిలో చంద్రబాబు ఉన్నారా...? టీడీపీ రాజకీయాల్లో ఈ విషయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.  
టీడీపీలో ముసలం 
ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ముందు నుంచి టీడీపీకి కంచుకోట.. మధ్యలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మరీ తక్కువుగా ఉండేది కాదు.. అయితే గత కొద్ది రోజులుగా పార్టీ నేతల్లో ఏర్పడిన ముసలం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.. పట్టభద్రుల  నియోజకవర్గ ఎమ్మెల్సీల్లో టీడీపీ అభ్యర్థిగా మంత్రి నారాయణ సమీప బంధువుకు టిక్కెట్‌ ఇవ్వడంతో ప్రారంభమైన అసంతృప్తి సెగులు ఇప్పుడు పొగలు కక్కుతున్నాయి. ఇప్పుడు మరో విషయమై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శివమెత్తేంత వరకు వచ్చింది... మధ్యలో బొజ్జల ఎపిసోడ్ కు ఇంకా ఎండ్ కార్డు పడలేదు... 
పార్టీ మారిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 
చంద్రబాబు సీఎం పదవిలో ఉన్నా... లేకున్నా..టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన కనుసన్నల్లోనే చిత్తూరు టీడీపీ రాజకీయం నడుస్తోంది... పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు పార్టీ మారినా.. కొందరు చంద్రబాబు మాట  జవదాటకుండా టీడీపీలోనే కొనసాగారు.. 2014లో అధికారంలో వచ్చిన వెంటనే.. చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తే.. సీనియర్ నేత , మాజీ మంత్రి బొజ్జలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు... అలాగే చదలవాడ కృష్ణమూర్తి లాంటి నేతలకు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.. అయితే తాజా మంత్రివర్గ విస్తరణలో బొజ్జలను తొలగించడం.. మొన్నటి ఏర్పేడు ఘటన నేపథ్యంలో బొజ్జల అనుచరులు ఇద్దరిపై పార్టీ పరంగా సస్పెన్షన్ విధించడంతో అసంతృప్తి మరింత రాజుకొంది.. దీంతో విజయవాడలో జరిగిన చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షా సమావేశానికి బొజ్జలతోపాటు, ఎంపీ శివప్రసాద్ గైర్హాజరయ్యారు. 
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎంపీ శివప్రసాద్‌ 
ఇక ఎంపీ శివప్రసాద్ విషయానికోస్తే.. శివప్రసాద్, చంద్రబాబు విద్యార్థి దశ నుంచే మంచి స్నేహితులు... కానీ ఈ మధ్యన శివప్రసాద్ బహిరంగంగానే చంద్రబాబు తీరుపై , పాలనపై నిప్పులు చెరిగారు.. దీనిపై చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యారు... ఎంపీగా ఉన్న తనను గౌరవించకపోవడం, ఢిల్లీ వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఓ భూ వ్యవహారంలో సీఎం సానుకూలంగా లేకపోవడం శివప్రసాద్ అసంతృప్తికి కారణమంటున్నారు.. శివ ప్రసాద్ ఇంకా వెనక్కితగ్గలేదు.. చంద్రబాబే ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా పార్టీ సమావేశానికి ఆయన హాజరు కాలేదు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో చిత్తూరు టీడీపీ నేతల్లో కోపం 
బొజ్జలను తొలగించి... వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అమర్ నాథ్ రెడ్డిని క్యాబినెట్ లో తీసుకోవడం టీడీపీ శ్రేణులకు మరింత కోపాన్ని తెప్పించింది... అమర్ నాథ్ రెడ్డితో పాటు చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఈ జిల్లా నుంచి క్యాబినెట్ లో ఉన్నారు... ఈ రెండు ఎపిసోడ్ లు జరగకముందు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికే.. చిత్తూరు జిల్లాలో మెజార్టీ టీడీపీ నేతలకు కోపాన్ని తెప్పించింది.. ఈ ఎన్నికల్లో మంత్రి నారాయణ కు స్వయానా బావమరిదిని అభ్యర్థిగా చంద్రబాబు సెలక్ట్ చేయడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.. టీడీపీ నేతలు బొమ్మల చెరువు శ్రీరాములు, విజయకుమార్ , సూర్యప్రకాశ్ వంటి నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం వస్తుందని ఆశించారు.. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత దినకర్ పేరు కూడా చివరి వరకు వినిపించింది.. కానీ చంద్రబాబు  మంత్రి నారాయణ మాటకే విలువ ఇవ్వడంతో నేతలకు అసంతృప్తి కల్గించింది.. ఈ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓటమి చవిచూశారు..
ద్వితీయశ్రేణి నేతల్లో పెరిగిన అసంతృప్తి 
ఇలా వరుస సంఘటనలతో టీడీపీ లో శ్రేణులు నిస్తేజమవుతున్నాయని.. పార్టీ కోసం కష్టపడే వారిని విస్మరిస్తున్నారని వాపోతున్నారు.. మొత్తానికి సొంత జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో పెరిగిన అసంతృప్తి .. మాజీ మంత్రి బొజ్జల, ఎంపీ శివప్రసాద్ ల స్థాయి వరకు వ్యాపించడంతో జిల్లాలో టీడీపీ కి ఇబ్బందికర పరిస్థితులు  కనిపిస్తున్నాయి.  మరో వైపు మాజీ సీఎం కిరణ్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి ని టీడీపీలో చేర్పించేందుకు గల్లా అరుణ కుమారి ప్రయత్నించడం మరికొందరి నేతల్లో అసంతృప్తి దారి తీసింది.. సొంత ఇంటి నేతలను బాబు దారిలోకి తేస్తారా లేక బుజ్జగించి.. తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తారా అనేది వేచి చూడాల్సిందే... 

 

18:48 - April 29, 2017

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మిర్చి రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేదని మనస్తాపంతో రమేష్ అనే రైతు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

విద్యాసాగర్ రావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు

హైదరాబాద్ : విద్యాసాగర్ రావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్, సతీమణి శోభ, ఎంపీ కవిత నివాళులర్పించారు.
విద్యాసాగర్ రావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని సీఎం కంటతగి పెట్టుకున్నారు. 

 

ఎలిగేడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి : ఎలిగేడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో జితేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు కాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. 

మిర్చికి గిట్టుబాటుధర లేదని రైతు ఆత్మహత్యాయత్నం

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మిర్చి రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేదని మనస్తాపంతో రమేష్ అనే రైతు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

18:28 - April 29, 2017

పశ్చిమగోదావరి : అధికారుల అవినీతికి అంతే లేకుండా ఉంది... గ్రామ సభలు నిర్వహించరు... ప్రజాభిప్రాయసేకరణ చేయరు... నియమ..నిబంధనలు అసలే పాటించరు...అడ్డగోలుగా భూ సేకరణ నిర్వహిస్తూ... అమాయక గిరిజనుల పొట్టగొడుతున్నారు. 
పోలవరం ప్రాజెక్ట్‌ భూసేకరణలో అధికారుల అవినీతి
పోలవరం ప్రాజెక్ట్‌ భూసేకరణలో రెవెన్యూ అధికారుల అడ్డదారులు తొక్కుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా...బుట్టాయిగూడెం, జీలుగమిల్లి, దొరమామిడి మండలాల్లో   చట్ట వ్యతిరేకంగా భూములు  సేకరిస్తున్నారు. సాగులో ఉండే భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారని స్థానికులు చెబతున్నారు. అంతే కాదు  గిరిజన భూములను  గిరిజనేతరులకు అప్పగించి రెవెన్యూ అధికారులు  సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపుగా 1869 ఎకరాల భూ సేకరణలో అవినీతి జరిగినట్టు సమాచారం. గిరిజన చట్టం ప్రకారం ఈ భూముల్లో గిరిజనులు ఉండాలి...లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి...కానీ ఎల్ టీఆర్, ఏడబ్ల్యుయూడీ భూములు గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నట్టు అధికారులు చూపించి ..సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులు 
నిజానికి గిరిజనుల చట్టం ప్రకారం మూడేళ్లు వరసగా గిరిజనులు భూమిని సాగు చేస్తే ఆ భూమి వారికే చెందాలి. కానీ ఇక్కడ 20 ఏళ్లుగా గిరిజనులు భూమి సాగు చేస్తున్నా...ఆ భూములను గిరిజనేతరులవిగా చూపిస్తున్నారు. లెక్కప్రకారం చూసుకుంటే 1869 ఎకరాలలో 1400 ఎకరాల భూమి గిరిజనులకే చెందుతుంది. కానీ ఇక్కడ కేవలం 300 ఎకరాలు మాత్రమే గిరిజనుల భూమిగా చూపిస్తున్నారు.
కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు
అధికారులు అమాయక ప్రజలనే కాదు....కోర్టులను  కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. పెసా చట్టం ప్రకారం భూ సేకరణ చేసేటప్పుడు  గ్రామ, మండల పరిషత్‌ల తీర్మానాలు చేసి... వెరిఫికేషన్‌ చేసి... నోటిఫికేషన్‌  ఇవ్వాలి...కానీ అధికారులు  ఇవేమీ చేయకుండానే 2016లో భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపై గిరిజనులు కోర్టుకు వెళ్లడంతో ... భూ సేకరణలో లోపాలున్నాయని..పూర్తి వివరాలు తెలిజేయాలని చెబుతూ కోర్టు ఆరు నెలల స్టే విధించింది. కానీ దీనిని కూడా అధికారులు ధిక్కరించి...ముందే సేకరించిన భూములకు 2017లో గ్రామ సభలు నిర్వహించారు.. దీనిని గిరిజనులు వ్యతిరేకించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని ...అడ్డుగోలుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

 

18:23 - April 29, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాజధానిప్రాంతం బెజవాడలో  రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు.  చెవుళ్లకు చిల్లులు పడే శబ్ధాలతో నానా అవస్థలు పడుతున్నారు.   మోతమోగుతున్న శబ్దకాలుష్యంతో  వినికిడి సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు.  
బెజవాడలో శబ్దకాలుష్యం
విజయవాడ నగరాన్ని శబ్ధభూతం వెంటాడుతోంది. బందరు రోడ్, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు, భవానీపురం, గొల్లపూడి జంక్షన్, ఏలూరు రోడ్, కృష్ణలంక ప్రాంతాల్లో  పరిమితికి మించిన శబ్దాలు నమోదవుతున్నాయి. లారీలు, బైక్‌లు, ఆర్టీసీ బస్ లు వల్ల ఎక్కువగా ధ్వని కాలుష్యం నగరంపై కమ్ముకుంటుంది. నిబంధనలకు మించి వాహనాల హారన్లు మార్మోగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 100 డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యం నమోదువుతుదంటే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. 
శబ్ధ కాలుష్యంతో అనారోగ్యం 
వాహనాల పెరుగుదలతో రోజు రోజుకు నగరంలో వాయుకాలుష్యంతో పాటు శబ్ధ కాలుష్యం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. 
నిబంధనలకు విరుద్ధంగా హారన్‌లు 
శబ్ధ స్థాయిలను గుర్తించేందుకు బందరు రోడ్ లోని ఆకాశవాణి కేంద్రంలో ప్రత్యేక మీటర్ ఏర్పాటు చేశారు. ఇలాగే పలుచోట్ల మీటర్లు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హారన్‌లు వాడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు అంటున్నారు. హారన్ల కెపాసిటీ ఎక్కువ ఉన్న వాహనాలతోపాటు ... అక్రమంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

 

18:16 - April 29, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి.. రాష్ట్రవిభజనతో ఏపీలో పూర్తిగా కుదేలైన హస్తం పార్టీకి ఇప్పుడు ముందస్తు ఎన్నికల ప్రచారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆంధ్రపదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ‌భ‌విష్యత్ అగ‌మ్యగోచ‌రంగా త‌యారైంది. రాష్ట్ర విభజనతో అసలే ఉనికిని కొల్పోయి సతమవుతుంటే తాజాగా ముందస్తు ఎన్నికల ప్రచారం హస్తం నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సన్నద్ధమవుతుంటే హస్తం పార్టీలో కనీసం దానిపై చర్చించే నాథుడే లేకుండా పోయారు. దీంతో పార్టీ భవిష్యత్ ఏంటని సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 
రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తి 
పార్టీ అధిష్టానం నుంచి కూడా ఇంతవరకు ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర నాయకత్వాన్ని దిశానిర్దేశం చేయకపోవడంపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎలా సిద్ధం కావాలనే అయోమ‌యంలో పడిపోతున్నారు పీసీసీ నాయకులు. అసలు ముందస్తు ఎన్నికలు కాదుకదా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అభ్యర్థుల దొరికే పరిస్థితి కూడా లేదని కాంగ్రెస్‌నాయకులే చెప్పుకుంటున్నారు.  

 

18:11 - April 29, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఆర్మీ అధికారి వెంకటరమణ అంత్యక్రియలు ఈరోజు సైనిక లాంఛనాలతో జరిగాయి. పలువురు ఆర్మీ, నేవీ అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. వెంకటరమణ మృతితో అతని స్వస్థలమైన విశాఖ జిల్లా ఆశవాణిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:06 - April 29, 2017

నల్లగొండ : జిల్లాలో దారుణం వెలుగుచూసింది. అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హాలియా పరిధిలోని ఆంజనేయ తండాలో మతిస్థిమితం లేని బాలికపై జగన్ అనే యువకుడు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం 5నెలల గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జగన్...3 రోజుల క్రితం కానిస్టేబుల్‌ శిక్షణకు వెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. 

 

17:38 - April 29, 2017

హైదరాబాద్ : ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం వాల్మార్ట్‌.. తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో 10 వాల్మార్ట్ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే  రిటైల్‌ పాలసీని తీసుకొస్తామని  కేటీఆర్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా స్టోర్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

 

మంత్రి తుమ్మల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: తమ్మినేని

ఖమ్మం:జీవో 123, భూసేకరణ చట్టం గురించి మంత్రి తుమ్మల మాట్లాడటం సిగ్గు చేటని, మంత్రి తుమ్మల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. ఆయన ఖమ్మం సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చాడ, ఇతర వామపక్ష నేతలను వెంటనే విడుదల చేయాలని, రేపు ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో నిరసనలు చేపడతామని, నిరసనలకు కాంగ్రెస్, వైసీపీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మే 2న ఉదయం 10-11 గంటల మధ్య ఖమ్మ జిల్లా దిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు.

17:07 - April 29, 2017

గుంటూరు : రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఏపీలో డ్రగ్స్ వ్యాపారం శృతిమించుతోందని..తక్షణమే చర్యలు తీసుకుని యువత భవిష్యత్తును కాపాడాలని లేఖలో తెలిపారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో డ్రగ్స్ ఉత్పత్తి, అక్రమ రవాణాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించి..మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విశాఖపట్టణం, తుని,తీర ప్రాంత గోదావరి జిల్లాల నుండి దక్షిణ భారతదేశవ్యాప్తంగా గంజాయి సరఫరా జరుగుతుందని..నార్కొటిక్స్ విభాగం ద్వారా గంజాయి స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. 

 

17:00 - April 29, 2017
16:56 - April 29, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో లుచ్చాలు, లఫంగుల పరిపాలన సాగుతోందని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీసర్కార్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందన్నారు. అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ లో 144 సెక్షన్ విధించడమేంటని ప్రశ్నించారు. టీసర్కార్ కు బుద్ధి చెప్పేందుకు, తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని.. ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రేపు అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపైనే చర్చిస్తామని ఉత్తమ్ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఖమ్మం జిల్లాలో ఆందోళనలు కృత్రిమం : కేసీఆర్

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల ఆందోళనలు కృత్రిమం అని సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయ పక్షాలు వెనుకుండి ఆందోళనలు నడిపిస్తున్నాయని ఆందోళనలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం...

హైదరాబాద్: తెలంగాణ బిఏసీ సమావేశం ముగిసింది. రేపటి అసెంబ్లీ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని బిఏసీ సమావేశం కాంగ్రెస్ పట్టుబట్టింది. రైతు సమస్యలపై చర్చించాకే భూసేకరణ చట్టంలో సవరణలపై చర్చించాలని జానారెడ్డి పట్టుబట్టారు. దానికి అంగీకరించని సీఎం కేసీఆర్ భూ సేకరణ చట్టంలో సవరణలకు సభ పరిమితం అని తేల్చి చెప్పారు. 2013 భూసేకరణ చట్టం కంటే మెరుగైన అంశాలున్నాయో చెప్పాలని జానారెడ్డి అడగ్గా వివరాలు చెప్పకుండా కేసీఆర్ దాటవేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు: సుమశ్రీ

విజయవాడ: దుర్గాపురంలో తన ఇంటిని కబ్జా చేశారంటూ ఇంటి ముందే సుమశ్రీ అనే మహిళ నిరాహార దీక్ష చేపట్టింది. ఎమ్మెల్యే బోండా అనుచరులే కబ్జా చేశారంటూ ఆరోపిస్తోంది. ఈ విషంయపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే కబ్జాదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుమశ్రీ ప్రశ్నిస్తోంది. తనకు న్యాయం చేయకపోతే కూతురితో కలిసి ఆందోళన కొనసాగిసామని బాధితురాలు సమశ్రీ హెచ్చరించారు.

16:31 - April 29, 2017

హైదరాబాద్ : గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పరిపాలన చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిక్కచ్చిగా మూడు గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు రాజకీయాలే కొత్త అని ఎద్దేవా చేశారు. భూసేకరణకు తొందరేంటని ఉత్తమ్ కుమార్ అంటున్నారని..
అది అతని పిచ్చిమాట అన్నారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:20 - April 29, 2017

కళా వెంకట్రావుతో మంత్రి భూమా అఖిల ప్రియ భేటీ

అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో మంత్రి భూమా అఖిల ప్రియ భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నిక పై చర్చిస్తున్నట్లు సమాచారం. అ భేటీ మంత్రి నారాయణ, ఎంపీ ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు.

16:11 - April 29, 2017

ఖమ్మం : జిల్లాలో మిర్చి రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోగా... అక్రమ అరెస్టులు చేస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

 

ప్రమాదవశాత్తు బావిలో పడి ముగ్గురు బాలురు మృతి

గుంటూరు : జిల్లాలో ఈపూరు మండలం ముప్పాళ్లలో విషాదం నెలకొంది. ప్రమాద వశాత్తు బావిలో పడి ముగ్గురు బాలురు మృతిచెందారు. మృతులు సాయికృష్ణ(12), మోహన కృష్ణ(11) లుగా గుర్తించారు.

16:04 - April 29, 2017

అనంతపురం : జిల్లాలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. మూడు నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో కరువుతో అల్లాడిపోతున్నారు. కూలిడబ్బులకోసం అధికారులు చుట్టూ తిరిగి  విసుగెత్తిపోతున్నారు. మండిపోతున్న ఎండలల్లో పనిచేస్తున్నా.. పాలకులు కరుణించడంల లేదని  ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.  
వలసబాటలో అనంత ప్రజలు
అనంపురంజిల్లా ప్రజలు మరోసారి వలసబాటపట్టారు. నమ్ముకున్న ఉపాధిహామీ పథకం పడకేయడంతో.. కరువుతో అల్లాడిపోతున్నారు. 90రోజులుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఉపాధిహామి కూలీల జీవితాలు కటకటగా మారాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నాలుగులక్షల ఇరవైవేల మంది కూలీలు పనిచేయగా,వారికి 67కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వుంది. అస్తవ్యస్తంగా చెల్లింపులు వుండడంతో కూలిడబ్బులు ఎప్పుపుడు వస్తాయో తెలియక అల్లాడిపోతున్నారు. 
మండుతున్న ఎండల్లోనే కష్టపడుతున్న ఉపాధి కూలీలు
మరోవైపు మండుతున్న ఎండల్లో పనిచేస్తున్న కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు.  వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వంనుంచి ఎలాంటి సహాయం అందడం లేదు.  ప్రభుత్వం మాత్రం కూలీలకు మజ్జిగపాకెట్లు,వాటర్ సదుపాయం కల్పిస్తామంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి కనేపించడంలేదు. కూలీలకు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై అటు అధికారులు కూడా చెప్పకలేక పోతున్నారు.
ఇల్లుగడవక వలస పోతున్న పేదలు 
మరోవైపు ఎంతకీ కూలిడబ్బులు రాకపోవడంతో.. ఇల్లుగడవని పరిస్థితుల్లో.. అనంతజిల్లా పేదలు వలసబాట పట్టారు. అటు ప్రభుత్వం మాంత్రం నిమ్మకునీరెత్తినట్టు సైలెంట్‌గా ఉంటోంది.  వలస పోయినవారిని వెనక్కి రప్పిచంటం అటుంచి..ఉపాధిహామీ పనులను నమ్ముకుని గ్రామాల్లోనే ఉన్నవారుకూడా కరువుతో విలవిల్లాడుతున్నారు. 
నీరుగారి పోతున్న ఉపాధి హామీ పథకం
కరువును జయించడానికి, వలసలను అడ్డుకోడానికి ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం.. ఇలా నీరుగారి పోవడంతో.. పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన బాటపడట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  వెంటనే తమకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది.

 

ఎలిగేడు ధాన్యం కొనుగులు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి: ఎలిగేడు ధాన్యం కొనుగులు కేంద్రంలో జితేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ రైతు పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు కాకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

15:57 - April 29, 2017

ప్రకాశం : అంతర్గత సెగలతో ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పాత నేతలు, వలస నేతల మధ్య పొత్తు పొసగడంలేదు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో అధికారపార్టలో అసంతృప్తులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఫైర్‌బ్రాండ్‌ దివి శివరామ్‌ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. దీంతో అవకాశంకోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు బలంపెంచుకునే పనిలో పావులు కదుపుతున్నాయి.
వర్గపోరుతో సతమతం 
ప్రకాశం జిల్లాలో వర్గపోరుతో అధికారపార్టీ సతమతం అవుతోంది. వలస నేతలతో వచ్చిపడ్డ సమస్యకు పార్టీ అధిష్ఠానం మందు కనిపెట్టలేకపోతోంది. తొలుత.. తమను వారిని హారోలుగా చూపిన  పార్టీ అధినేత చంద్రబాబు.. ఇపుడు  జీరోలుగా మార్చేస్తున్నారని.. ఓడిన నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నేతల మధ్య వర్గపోరు పోలీస్ స్టేషన్‌ వరకు చేరి .. బలాబలాలు నిరూపించుకునేదాకా వెళ్లింది. 
దివి శివరామ్ ఓటమి 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివి శివరామ్, వైసీపీ నుంచి పోతల రామారావుతో తలపడ్డారు. ఈ పోటీలో దివి శివరామ్ ఓటమి పాలయ్యారు. అయితే గతంలో శివరామ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక దఫా ఎన్నికయ్యారు. దశాబ్ధకాలంగా నియోజకవర్గంలో టీడీపీ కి పెద్దదిక్కుగా నిలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీ అధికారంలో ఉండటంతో కందరుకూరు నియోజకవర్గంలో తన హవాకు ఎదురు లేదనుకున్నారు దివి శివరామ్‌.  
టీడీపీలో చేరిన  ఎమ్మెల్యే పోతల 
అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యే పోతల రామారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పాత, కొత్త నాయకత్వాల మధ్య కస్సుబుస్సులు మొదలయ్యాయి. నియోజవర్గంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని.. దివిశివరామ్‌ గళం ఎత్తారు. కాని.. పార్టీ అధినేత చంద్రబాబు తన మార్కు అజమాయిషితో అసంతృప్తిని బయటికి పొక్కకుండా చేయగలిగారు. కాని.. పాతనేతల అసంతృప్తులు మాత్రం నివురుగప్పిన నిప్పులా ఎగిసిపడడానికి సిద్ధంగానే ఉన్నాయి.
ఎన్నికలకు సమాయత్తమవుతున్న మానుగుంట 
గతంలో కందుకూరు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. ఇద్దరు అభ్యర్థులే బరిలో వుండే వారు. కాని ఇప్పుడు సీన్ మారింది. కందుకూరు రాజకీయాన్ని కాచివడబోసిన మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనాయకుడు  మానుగుంట మహీదర్‌ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు సమాయత్త మవుతున్నారు. దీంతో  వైసీపీ ఆయనతో టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది.  
విస్తరిస్తున్న వర్గ పోరు  
మరోవైపు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే.. పార్టీలోని పోతల, దివి వర్గాలు ఏకమవ్వాలి. అయితే టీడీపీ నుంచి పోతల రామారావుకే మరోసారి అవకాశం ఇవ్వడానికి పసుపు పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోతల రామారావుకు .. శివరామ్‌ మద్దతు ఇస్తారా..అంటే ఆయన మద్దతు దారులు మాత్రం లేదనే చెబుతున్నారు. దివి శివరామ్ ప్రస్తుతానికి అధిష్ఠానం చెప్పినట్టే నడుచుకుంటున్నా.. అంతర్గతంగా మాత్రం వర్గ పోరు విస్తరిస్తూనే ఉంది. 
కందుకూరులో దివిశివరామ్‌ పాత్ర కీలకం 
టీడీపీలో అసంతృప్తి సెగలు క్రమంగా పెరుగుతుంటే.. అటు వచ్చేఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న మహీధర్‌రెడ్డి మాత్రం చాపకింద నీరులా తన పని కానిచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మహీధర్‌రెడ్డే నంటూ  ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీ అభ్యర్థిగా పోతల మారావు బరిలోకి దిగడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో .. కందుకూరులో దివిశివరామ్‌ పాత్ర కీలకంగా మారింది. 
దివిశివరామ్‌ అసంతృప్తికి చంద్రబాబు చెక్‌ ..?
అయితే.. ఎన్నికల నాటికి దివిశివరామ్‌ అసంతృప్తికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెక్‌పెడతారని టీడీపీ క్యాడర్‌  చెప్పుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థిగా మరోసారి  సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోతల రామారావే ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు    తాను కూడా బరిలో ఉంటానని.. ఆలాగని పార్టీమారే ప్రసక్తికూడా లేదంటున్నారు దివిశివరామ్‌. దీంతో దివిశివరామ్‌ అధికార టీడీపీకి లోపల ఉండే పొగబెడతారని .. కందుకూరు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
కందుకూరులో త్రిముఖపోటీ..?
శివరామ్‌ కూడా తాను బరిలో ఉంటనాని చెబుతుండటంతో .. 2019 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో త్రిముఖపోటీ తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏంచేస్తారనే దానిపైనే నియోజకవర్గంలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీ అధినాయకత్వం.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని గందరగోళంలోకి నెట్టారని కందుకూరు టీడీపీ క్యాడర్‌ అభిప్రాయపడుతున్నారు.  

 

15:47 - April 29, 2017

పశ్చిమ గోదావరి : ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలన్నారు. రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడి ఉండాలని సూచించారు. అవినీతి లేని పరిపాలనలో అధికారులంతా భాగస్వామ్యం కావాలని కోరారు. గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. నూటికి నూరుశాతం ప్రతి ఇంటికి వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప.గో జిల్లాలో 100శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 

బిఏసి సమావేశానికి బిజెపి, టిడిపికి అందని ఆహ్వానాలు

హైదరాబాద్: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకుబీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బిజెపి, టిడిపిలకు ఇంత వరకు ఆహ్వానం అందలేదు. ప్రభుత్వం తీరుపై బిజెపి గరంగరంగా ఉంది.

మతి స్థిమితం లేని బాలికపై నెలల తరబడి అత్యాచారం

నల్గొండ: హాలియా పరిధిలోని ఆంజనేయ తండాలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని బాలికపై నెలల తరబడి యువకుడి అత్యాచారానికి పాల్పతున్నాడు. 5 నెలల గర్భవతిని చేసిన జగన్ అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం జగన్ కానిస్టేబుల్ శిక్షణకు వెళ్లాడు.

15:41 - April 29, 2017

ఢిల్లీ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనం వీడారు. పంజాబ్‌, గోవా, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వరుస పరాజయం తర్వాత పార్టీ నేతలు టార్గెట్‌ చేయడంతో  కేజ్రీవాల్‌ ట్వీట్టర్‌ ద్వారా స్పందించారు. గత రెండు రోజులుగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లతో కూడా మాట్లాడానని కేజ్రీవాల్‌ చెప్పారు. తమ పార్టీ పొరపాట్లు చేసిందని అంగీకరించారు. వరుస పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకుంటానని ఆయన అన్నారు.  మున్సిపల్‌ ఎన్నికల్లో 272 స్థానాలకు గాను ఆప్‌ కేవలం 48 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిజెపి 181 స్థానాలను కైవసం చేసుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్‌ చేయడం వల్లే ఆప్‌ ఓటమి చవిచూసిందని కేజ్రీవాల్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

 

15:37 - April 29, 2017

హైదరాబాద్ : అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అస్వస్థకు గురైనట్లు సమాచారం. 61 ఏళ్ల దావూద్‌కు గుండెపోటు రావడంతో కరాచీలోని ఆగాఖాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మీడియాలో వార్తొలొచ్చాయి. దావూద్‌ అస్వస్థతపై ఆయన సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. అతడి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, దావూద్‌కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ వదంతులేనని స్పష్టం చేశాడు.  భారతీయ మీడియాతో మాట్లాడుతూ... 'నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయీ బ్రహ్మాండంగా ఉన్నారని' ఛోటా షకీల్ చెప్పారు. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం. ఆనాటి బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా...7 వందల మంది గాయపడ్డారు.

 

ఐదేళ్లలో తెలంగాణ లో 10 వాల్ మార్ట్ లు :మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ - వాల్ మార్ట్ ప్రతినిధుల సమక్షంలో టీఎస్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న ఐదేళ్లలో తెలంగాణ లో 10 వాల్ మార్ట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఐదు, జిల్లాలో ఐదు వాల్ మార్ట్ ష్ర్లో ఏర్పాటుకు అగీకారం కుదిరింది. ఒక్కో వాల్ మార్ట్ లో 2 వేల మందికి ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

15:32 - April 29, 2017

అనంతపురం : తెప్ప బోల్తా ఘటనలో ప్రాణాలు విడిచిన మృతుల కుటుంబాలను మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  మృతుల కుటుంబాలకు పిల్లలకు లక్ష రూపాయలు, పెద్ద వాళ్లకు మూడు లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. మంత్రులు కాలువ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌.. కూడా బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపు అన్ని విధాల సహాయం అందిస్తామని మంత్రి పరిటాల సునీత అన్నారు.

 

15:27 - April 29, 2017

పశ్చిమ గోదావరి : గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నూటికి నూరుశాతం ప్రతి ఇంటికి వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే జిల్లాలో 100శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడాలన్నారు. అవినీతి లేని పరిపాలనలో అధికారులంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు వీడియోను చూడండి. 

 

ఏపీలో డ్రగ్స్ వ్యాపారం మితిమీరుతోంది: కేవీపీ

అమరావతి: ఏపీలో డ్రగ్స్ వ్యాపారం మితిమీరుతోందని, కేంద్రం జోక్యం చేసుకుని యువత భవిష్యత్తును కాపాడాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎంపి కేవీపీ లేఖ రాశారు. లేఖ సారాంశం ఈ క్రింది విధంగా ఉంది. 'చిత్తూరు, విశాఖ జిల్లాల్లో డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మత్తు పదార్థాల బారిన పడిన వారిని తిరిగి మామూలు స్థాయికి తెచ్చేందుకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాటిలైట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏజెన్సీ ప్రాంతంలో మత్తు పదార్థాల పంటలను నాశనం చేయాలని' రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖలో కేవీపీ విజ్ఞప్తి చేశారు.

రేపుఅంబర్ పేట శ్మశాన వాటికలో విద్యన్న అంత్యక్రియలు

హైదరాబాద్: తెలంగాణ ఆర్థికరంగ నిపుణులు విద్యాసాగర్ రావు అంత్యక్రియలు రేపు ఉదయం 10గంటలకు అంబర్ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం

ఖమ్మం: టిడిపి కార్యాలయం నుంచి కార్యకర్తల ర్యాలీ పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే సండ్ర, నామా సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా కొణిజర్ల వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడతో పాటు 25 మంది నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

 

దళితులను వేధిస్తున్నారు: ఎమ్మెల్యే సంపత్

హైదరాబాద్: అలంపూర్ నియోజకవర్గంలో దళితులను వేధిస్తున్నారని ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. హెచ్ ఆర్సీకి పోలీసులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని, నా ప్రజలకు రక్షణ లేదనే గన్ మెన్ ను వెనక్కి పంపించానన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప.గో జిల్లాలో 100 శాతం గ్యాస్ కనెక్షన్లు:సీఎం

ప.గో: జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నల్లజర్లలో బహిరంగసభ లో ప్రసంగిస్తూ...గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నామన్నారు. నూటికి నూరుశాతం ప్రతి ఇంటికి వంటగ్యాస్ కనెక్షన్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలోనే ప.గో జిల్లాలో 100 శాతం గ్యాస్ కనెక్షన్లు వున్నాయని, రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడాలన్నారు. అవినీతి లేని పరిపాలనలో అధిఆకరులంతా భాగస్వాములు కావాలన్నారు. ప్రజల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా చేయాలని సీఎం సూచించారు.

సుందర్ పిచాయ్ కు భారీ నజరానా

హైదరాబాద్: గూగుల్‌ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్‌ పిచాయ్‌కు కంపెనీ నుంచి భారీ నజరానా దక్కింది. 2016 సంవత్సరానికి గానూ.. 198.7 మిలియన్‌ డాలర్ల స్టాక్‌ అవార్డును సుందర్‌ పిచాయ్‌కు ఇచ్చింది గూగుల్‌ సంస్థ. ఈ మేరకు కంపెనీ కమిటీ నజరానాను అందజేసింది. 2015తో పోలిస్తే.. గతేడాది రెట్టింపు అవార్డును తీసుకున్నారు పిచాయ్‌. 2015లో స్టాక్‌ అవార్డు కింద 99.8 మిలియన్‌ డాలర్లను గూగుల్‌ పిచాయ్‌కు అందజేసింది.

స్వగృహానికి విద్యాసాగర్ మృతదేహం

హైదరాబాద్: విద్యాసాగర్ రావు భౌతికకాయాన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆసుపత్రి నుండి హబ్సిగూడలోని ఆయన ఇంటికి తరలించారు.

13:46 - April 29, 2017
13:41 - April 29, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ హాయాంలో తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వాటిని దాచి పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అత్యాచారానికి గురైన బాధితులకు అందించాల్సిన పరిహారాలను ప్రభుత్వం అందించడం లేదని.. ఆయన అన్నారు. ఈ విషయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

 

13:39 - April 29, 2017

ఢిల్లీ : కేంద్రం మిర్చికి మద్దతు కల్పిస్తుందని కేంద్ర మంత్ర బండారు దత్తాత్రేయ టెన్ టివి తెలిపారు. అయితే మిర్చి వణిజ్య పంట అని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. కానీ తను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడానని తెలంగాణ ప్రభుత్వం నివేదిక పంపితే ఆలోచిస్తామని చెప్పారని తెలిపారు. ఈ సారి రైతులు 3 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారని అన్నారు. రైతులపై లాఠీ చార్జీ చేయడం మంచిది కాదని అన్నారు.కేంద్రం కందులను కొనుగోళు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

13:31 - April 29, 2017

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చ నాయకుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ముదిగొండకు చెందిన రైతు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ముదిగొండ పీఎస్‌లో మల్లు భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. 

13:30 - April 29, 2017

ఢిల్లీ : వేర్పాటువాద నేతలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. కశ్మీర్ శాంతి కోసం వేర్పాటువాదులతో కేంద్రం చర్చలు జరపాలని, కశ్మీర్ లో పెల్లెట్ గన్ లన వ్యతిరేకిస్తూ జెకె బార్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ సందర్భంగా కేంద్ర పై విధంగా స్పందించింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చట్టబద్ధంగా అర్హులైన వ్యక్తులను గుర్తిస్తే చర్చిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా అర్హులైన వ్యక్తుల పేర్లను తెలపాలని పిటిషనర్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు పోలీసులపై రాళ్లు రువ్వడం ఆపితేనే చర్చలకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. భద్రతాదళాలు విద్యార్థులను కొట్టడం వల్లలోయలో ఆశాంతి నెలకొందని పిటిషనర్ వాదించారు. 

12:57 - April 29, 2017

ఖమ్మం : మిర్చి రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి వామపక్ష నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూండుగా పోలీసులు వారిని అడ్డుకుని.బలవంతంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చ నాయకుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ముదిగొండకు చెందిన రైతు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ముదిగొండ పీఎస్‌లో మల్లు భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. కాసేపట్లో ఖమ్మం కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రానున్నారు.

జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద మృతి

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాలెం జిల్లాలోని అత్తూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే, కనకరాజుది ముమ్మాటికే హత్యేనని జయలలిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

12:50 - April 29, 2017

ఢిల్లీ :ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన బాధాకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. మిర్చి రైతుల పరిస్థితి గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో మాట్లాడడం జరిగిందని...ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని అన్నారు.

12:44 - April 29, 2017

ఖమ్మం : భానుడి ప్రతాపం ప్రాణాల్ని హరిస్తోంది. ఖమ్మం జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో.. నెల రోజుల్లోనే వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. అనధికార లెక్కల ప్రకారం 12 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద 50 వేల రూపాయలు అందిస్తోంది. ప్రతీ ఏడాది ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నా.. అధికారులు కొందరికే పరిహారం అందిస్తున్నారనే విమర్శలున్నాయి. గతేడాది 100 మంది వడదెబ్బతో మృతి చెందగా.. అందులో సగం బాధిత కుటుంబాలకు కూడా పరిహారం అందలేదు.

ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేలు
60 ఏళ్ల లోపు ఉండి వడదెబ్బతో చనిపోతే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. దీనికి అన్ని ధృవీకరణ పత్రాలు, నివేదికలు అందితేనే సాయమందుతుంది. అర్హులను గుర్తించడానికి తహసీల్దార్, వైద్యుడు, ఎస్సైలతో తీమెన్ కమిటీ ఉంటుంది. అయితే వడదెబ్బతో చనిపోయినవారికి ఆర్థిక సాయం అందుతుందనే అవగాహన .. చాలా మంది నిర్ధారణ పరీక్షలు లేకుండానే అంత్యక్రియలు చేసేస్తున్నారు. తరువాత తెలిసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ రాయడానికి, పంచనామా చేయడానికి ముందుకు రావడం లేదు.

ఈ నెలలో పెళ్లిళ్లు....
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతతో పెళ్లిళ్ల నిర్వహకులు ఠారెత్తిపోతున్నారు. దూర ప్రయాణాలు చేయడానికి, పత్రికలు పంచడానికి అపసోపాలు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. పనులకు, ఉద్యోగాలకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గొడుగులు, మాస్క్‌లు వాడుతున్నారు. అత్యవసరమైతే తప్పా బయటికెళ్లొద్దని, ఉదయం..సాయంత్రం మాత్రమే పనులు చూసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నీటితోపాటు పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు.

వేడి గాలులు..
వడగాలులు, ఉక్కపోతకు తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎండతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే.. మేలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎండ ఇప్పుడే రోహిణిలో ఉన్నంత మండిపోతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ 2 గంటలకోసారి నీరు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే డీ హైడ్రేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

12:40 - April 29, 2017

చిత్తూరు : తిరుమల కొండపై నీటి కరువు పొంచిఉంది. కొండపై ఉన్న జలశయాలు దాదాపుగా అడుగంటాయి. ఇప్పటికే గోగర్భం, ఆకాశగంగ డ్యాంలు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనం, కుమారధార-పసుపుధార జలాశయాలు దాదాపుగా అడుగంటాయి. వరుణుడు కరుణిస్తే తప్ప మరోమార్గం లేకపోవడంతో...టీటీడీ పాలకమండలి తెగ హైరానా పడుతోంది. తిరుమల కొండపై ఉన్నగోగర్భం, ఆకాశగంగ డ్యాములు పూర్తిగా ఎండిపోగా.. పాపవినాశనంతోపాటు కుమారధార-పసుపుధార జంట ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా భారీగా తగ్గాయి. దీంతో తిరుమలలో ప్రస్తుతం ఉన్న ఉన్న నీరు 126 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారుల ఆందోళన పడుతున్నారు. అటు తిరుపతిలోని కళ్యాని డ్యామ్‌ నీటిని కలుపుకుంటే 185 రోజులవరకూ నెట్టుకు రావచ్చని అధికారులు అంచానా వేస్తున్నారు.

నిత్యం శ్రీవారి దర్శనం
నిత్యం శ్రీవారి దర్శనంకోసం 70 వేల నుండి లక్షమంది వరకూ భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తుల అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్నదానం కాటేజీలు, అతిథిగృహాలు, కళ్యాణకట్ట తదితరాల కోసం నిత్యం 30 నుంచి 35 లక్షల గ్యాలన్ల వరకూ నీరు అవసరం అవుతోంది. అటు జలాశయాల్లో నీరు నిండుకోవడంతో.. టీటీడీ అధికారులు హైరానా పడుతున్నారు. 2015 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆతరవాత 2016 లో వరుణుడు మొహంచాటేయడంతో వర్షాలు పడలేదు. దీంతో డ్యామ్‌ల్లో నీటిని టీటీడీ పొదుపుగా వాడుతోంది. ఈనేపథ్యంలో జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో .. ఉన్ననీటితోనే నెట్టుకొస్తున్నారు అధికారులు.

అధికారుల్లో ఆందోళన...
వాస్తవానికి తిరుమలలో నీటిఎద్దడిపై దశాబ్దకాలంగా అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అందుకే తెలుగుగంగ నీటిని తిరుమల అవసరాలకు వినియోగించుకోవాని 2015లోనే నిర్ణయించారు. రోజుకు 10 యం.యల్.డి.ల నీటిని తరలించి.. తిరుపతి, తిరుమల అవసరాలు తీర్చాలని అంచనావేశారు. కాని.. ఆతరవాత కురుసిన వర్షాలకు తిరుమల కొండపై డ్యాములు పూర్తిగా నిండడంతో టీటీడీ అప్పటికి ఆ ఆలోచనను విరమించుకుంది. కాని.. గతఏడాది మళ్లీ వర్షాలు తక్కువగా పడ్డంతో.. జలశయాలు పూర్తిగా అడుగంటే పరిస్థతి తలెత్తింది. దీంతో ఇపుడు తెగహడావిడి పడుతున్నారు టీటీడీ అధికారులు. ముందుచూపులేని టీటీడీ పాలకమండలి తీరువల్లనే తిరుమలకు నీటిఎద్దడి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

అధికారిక లాంఛనాలతో విద్యాసాగర్ రావు అంత్యక్రియలు

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు విద్యాసాగర్ రావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు.

12:36 - April 29, 2017

రాజన్న సిరిసిల్ల : 60 ఏళ్ల చరిత్ర ఉన్నా...గుడిలింగాపూర్‌ గ్రామం .. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం లేదు. మొన్నటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న మానాల గ్రామం కింద ఉండే ఈ గుడిలింగాపూర్‌ తండా... బైఫరకేషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడింది. అందమైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. శివుని ఆలయం ఉండడంతో ఈ ప్రాంతానికి గుడిలింగాపూర్‌గా నామకరణం చేశారు. 1957లో సుకంద స్వామి అనే ఓ వ్యక్తి...అతని శిష్యుడు ధర్మానాయక్‌ గుడిలో పూజలు చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడ అటవిని శుద్ధిచేసి..వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అప్పటి నుంచి 20 కుటుంబాలు.. 200 మంది వరకు ఈ గ్రామంలో ఉంటున్నారు.

విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు..
ఒక బస్సు కూడా ఈ గ్రామానికి వెళ్లిన దాఖలాలు లేవు. అసలు రహదారి కూడా లేకపోవడంతో గ్రామస్థులే మట్టిరోడ్డును వేసుకున్నారు. మండల కేంద్రం రుద్రంగికి పోవాలంటే ...గుట్టలు ఎక్కుతూ...దిగుతూ దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. గ్రామపెద్ద ధర్మానాయక్‌ కూడా గుర్రం మీదనే ప్రయాణిస్తుంటాడు. గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు.. చాలామంది చీకటిలోనే మగ్గుతున్నారు. ఆలయం వరకూ ఉన్న విద్యుత్‌ వైరును...కట్టెల ద్వారా రుద్రంగి మండలంలో ఇలాంటి గ్రామాలు ఇంకా 15 ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైన ఈ గ్రామ తాండాలను గుర్తించి వాటి ప్రభుత్వ రికార్డులో నమోదు చేయాలని...ఇలాంటి గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయాలని కోరుతున్నారు.  

విద్యాసాగర్ రావు మృతి తీవ్రంగా కలిచివేసింది: కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు విద్యాసాగర్ రావు మృతి తీవ్రంగా కలిచివేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. నీటిపారుదలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గణాంకాలతో సహా ప్రజలకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ జాతి విద్యాసాగర్ రావును ఎన్నటికీ మరవదని, నాకు, మా కుటుంబానికి విద్యాసాగర్ రావు మంచి మిత్రుడని కేసీఆర్ చెప్పారు. నాకు పెద్దన్నలాగా వ్యవహరించేవారని, సాగర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూమతి తెలిపారు.

 

12:32 - April 29, 2017

విశాఖ : మంత్రి వర్గ విస్తరణ రగిలించిన అసంతృప్తులు విశాఖజిల్లా టీడీపీలో ఇంకా చల్లార లేదు. ఎమ్మేల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపినా.. పార్టీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టీడీపీ ప్రారంభం నుంచి పార్టీలో ఉన్న బండారు సత్యనారాయణమూర్తి 4 సార్లు ఎమ్మేల్యేగా గెలిచారు. గతంలో చంద్రబాబు క్యాబినేట్ లో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆ తరువాత టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలోనూ పార్టీకోసం నిరంతరం పనిచేశారు. తర్వాత 2014 లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తనకు మంత్రిపదవి గ్యారెంటీ అనుకున్నారు. కాని.. పీఆర్పీ నుంచి టీడీపీలోకి వచ్చిన గంటాశ్రీనివాసరావుకు మంత్రిగా అవకాశం రావడంతో.. బండారు అపుడే అసంతృప్తికి లోనయ్యారు. జిల్లానుంచి మరొకరికి మాత్రమే అవకాశం ఇవ్వడానికి బాబు నిర్ణయించడంతో.. ఆ అవకాశం అయ్యన్నపాత్రుడికి దక్కింది. మంత్రి అయ్యన్నపాత్రుడి సామాజిక వర్గం బండారు సత్యనారాయణమూర్తి సామాజిక వర్గం ఒక్కటే కావడంతో.. ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యంకాదని అప్పట్లో చంద్రబాబు బండారును ఊరడించారు. దీంతో మరో దఫా విస్తరణలో తనకు అవకాశం వస్తుందని సత్యనారాయణ మూర్తి ఆశపెట్టున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా సత్యనారాయణ మూర్తికి మరోసారి ఆశాభంగం కలిగింది.

ఈక్వేషన్లనే చెప్పిన చంద్రబాబు...
ఇక ఈ సారి విస్తరణలో కూడా మునపటి ఈక్వేషన్లనే చెప్పిన చంద్రబాబు.. బండారుకు మరో సారి మొండి చెయ్యి చూపించారు. ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి. మొదట్లో ఆయన అనుచరులు ధర్నాలు చేయడం, గన్‌మెన్‌ను వెనక్కి పంపి కొద్దిరోజులు అజ్ఢాతంలోకి వెళ్లడం.. తదితర రూపాల్లో తన అసంతృప్తిని బయటపెట్టినా .. పార్టీ అధినేత కరగలేదు.

బండారు బెట్టువీడలేదు
కినుక వహించిన బండారును సముదాయించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావులు ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపారు. అయినా.. ఎమ్మెల్యే బండారు బెట్టువీడలేదు. సందర్భాన్ని బట్టి అసమ్మతిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు నగర పర్యటనకు వచ్చినా.. బండారు అక్కడ కనిపించలేదు. ఇదిలావుంటే.. జూన్‌ నెలలో తన కుమార్తె వివాహం ఉన్నందున.. అప్పటి వరకు బండారు సైలెంట్‌గానే ఉంటారని.. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణకు పూనుకుంటారని అనుచరవర్గం చెప్పుకుంటున్నారు. మరోవైపు మేనెలలో విశాఖలో పార్టీ మహానాడు జరగనుంది. ఈనేపథ్యంలో మహానాడు కార్యక్రమానికైనా ఎమ్మెల్యే బండారుసత్యనారాయణ మూర్తి హాజరవుతారా అనేది.. అనుమానంగా మారింది. మంత్రి పదవులపై అశలు పెట్టుకున్న చింతమనేని, శివాజీ, దూళిపాల లాంటి వారికి నయానో భయానో సర్దిచెప్పిన సీఎం చంద్రబాబు.. బండారును ఎలా డీల్ చేస్తారనేది.. ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

12:23 - April 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు మృతి చెందారు. ఆయన గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విద్యాసాగర్ రావు 1939లో నల్లగొండలో జన్మించారు. ఉస్మానియాలో చదివి కేంద్ర ఇంజనీర్ స్థాయికి ఎదిగారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు జయశంకర్ తర్వాత విద్యాసాగర్ రావు దగ్గరగా ఉన్నారు. ఆయన ఐక్యరాజ్య సమితి చిన్ననీటి పారుదలలో పని చేశారు. కేంద్రంలో సెంట్రల్ వాటర్ బోర్డులో కూడా పనిచేశారు. తెలంగాణలో నీటి వనరులపై నీళ్లు నిధులు అనే పుస్తకం రాశారు. 300 పైగా అర్టికల్స్ రాశారు.

ఆంధ్రజ్యోతి ఆఫీసులో అగ్రిప్రమాదం...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆంధ్రజ్యోతి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నది.

తెలంగాణ ఓ గొప్ప మేధావిని కోల్పోయింది: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు మృతికి మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ ఓ గొప్ప మేధావిని, ఇంజనీర్ ను కోల్పోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేయాలనుకుంటున్న సీఎం కేసీఆర్ కు విద్యాసాగర్ రావు వెనుదన్నుగా నిలబడ్డారాని తెలిపారు. ఆయన లేని లోటు తెలంగాణ సమాజం పూడ్చలేనిదని హరీష్ వ్యాఖ్యానించారు.

12:02 - April 29, 2017

హైదరాబాద్ : అనంతపురం తెప్ప బోల్తా మృతులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. 13 మంది ప్రాణాలు కోల్పోడం బాధకరమని అన్నారు. గుండెలు పిండేసే విధంగా ప్రమాద దృశ్యాలు ఉన్నాయని తెలిపారు. ఇకనైన ప్రజాప్రతినిధులు మేల్కోవాలని ఆయన సూచించారు. ఇలాంటి విషాధ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

 

కరెంటు తీగలు తగిలి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధం

అనంతపురం: హిందూపురం మండలం కిరికెర వద్ద ప్రమాదం జరిగింది. కరెంటు తీగలు తగిలి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధం అయ్యింది. ఈఘటనలో మంటలు అంటుకొని టిప్పర్ ట్రైవర్ పాషా సజీవదహనం అయ్యాడు.

11:45 - April 29, 2017
11:44 - April 29, 2017

ఖమ్మం : జిల్లాలోని సీపీఎం కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వలయంలో సీపీఎం కార్యాలయం. ఖమ్మం పట్టణం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం మార్కెట్ వెళ్లకుండా సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్యాలయం నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖమ్మం చేరుకున్నారు. ర్యాలీగా వెళ్తున్న సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిన ఖమ్మం పట్టణానికి దూరంగా తరలిస్తున్నారు. మహిళ పోలీసులు లేకుండా మహిళాలను అరెస్ట్ చేస్తున్నారు. ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

నీటిపారుదల రంగ నిఫుణులు విద్యాసాగర్ రావు కన్నుమూత

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల రంగ నిఫుణుడు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలి లోని కాంటినెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రవీంధ్ర భారతిలో శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు

హైదరాబాద్: రవీంధ్ర భారతిలో ఘనంగా 884వ శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని, పోచారం, చందూలాల్, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఎంపి బీబీ పాటిల్ హాజరయ్యారు.

ఖమ్మం సీపీఎం కార్యాలయాన్ని ముట్టడించిన పోలీసులు

ఖమ్మం: సీపీఎం కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం

నల్లగొండ: రేవంత్ రెడ్డి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపుతున్నారు.

వైటీ చెరువు మృతులకు పవన్ సంతాపం

అనంతపురం : వైటీ చెరువు మృతులకు జనసేన అధినేత పవన్ కల్యాన్ సంతాపం తెలియజేశారు. 13 మంది ప్రాణాలు కోల్పోవడం భాదాకరమన్నారు. ప్రమాద దృశ్యాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు మేల్కోవాలని, ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులకు తగిన పరిహారం అందించాలని పవన్ డిమాండ్ చేశారు.

11:10 - April 29, 2017

ప.గో జిల్లాలో చంద్రబాబు పర్యటన...

ప.గో: నల్లజర్ల మండలం పోతవరానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం కేసీఆర్ రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, అన్నదాత ఆవేదన కట్టలు తెగుతోందనడానికి ఖమ్మం ఘటనే నిదర్శనం అని రేవంత్ రెడ్డి ఆ లేఖ లో పేర్కొన్నారు.

10:42 - April 29, 2017

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఆహారం తీసుకునే ముందు గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను వేసుకుని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కెలొరీలు కూడా చాలా తక్కువ.

సబ్జా గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సాయపడతాయి. గ్లాసు నీళ్లలో నాలుగు చెంచాల సబ్జా గింజలను వేసి నానబెట్టాలి. అరగంట తర్వాత గ్లాసు పచ్చిపాలలో వేసుకుని, కొన్నిచుక్కల వెనిల్లా కలిపి తాగాలి. ఇది టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనాన్నిస్తుంది. సబ్జా గింజల పాలను కాఫీ, టీలకు బదులు తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గుతాయి.

మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింప చేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది. ఈ సబ్జా గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.

ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగండి, సమస్య తగ్గడంతో పాటు మానసికంగా ప్రశాంతత కూడా ల‌భిస్తుంది.

వీటిలో విటమిన్లూ, పోషకాలూ, ఇనుమూ ఎక్కువగా ఉంటాయి. చిన్న కప్పు సబ్జా గింజలను తరచూ తీసుకోవడం వల్ల కావాల్సినంత ఇనుమూ, పోషకాలూ శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి సొంతమవుతుంది.

క్రీడాకారులకు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తున్న‌ప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

సబ్జా గింజల‌ను రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. వీటిలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి. ఈ గింజలు కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.

రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

10:36 - April 29, 2017

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌ అభివృద్ధిలో నగరవాసులను భాగ్యస్వామ్యం చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మాటలకే పరిమితమైంది. కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటై 14నెలలు పూర్తైన ఇంత వరకు ఒక్క వార్డు కమిటీ కూడా ఏర్పాటు కాలేదంటే జీహెచ్‌ఎంసీ పాలకమండలి పనితీరు ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. గ‌త ఏడాది ఏప్రిల్ లో జరగాల్సిన వార్డు కమిటీ ఎన్నికలు నేటికీ పూర్తి కాలేదు. ఇందుకు రాజకీయ నాయకుల జోక్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీల్లో త‌మ అనుచ‌రుల‌కు అవ‌కాశం క‌ల్పించాలని కార్పొరేట‌ర్లు, ఎమ్యేల్యేలు పోటీపడుతున్నారు. దీంతో ఆలస్యమవుతూ వచ్చిన కమిటీల ఎన్నిక చివరకు కొన్ని వార్డుల్లో మాత్రమే జరగనున్నాయి.

ఈ నెల మొదటివారంలోనే తుది జాబితాను విడుదలచేసింది
ఇందుకోసం ఈ నెల మొదటివారంలోనే తుది జాబితాను విడుదలచేసింది పాలకమండలి. అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు పనులు ప్రారంభించలేదు. వార్డు క‌మీటిలు పూర్తి స్థాయిలో ప‌ని చేయాలంటే ముందు ఏరియా స‌భ‌ల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ స్పూర్తికి విఘాతం క‌లుగ‌కుండా వెంట‌నే ఏరియా స‌భ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి సిటిజ‌న్ ఫోర‌మ్స్. స్థానిక సంస్థల‌కు పెద్ద పీఠ‌వేస్తామంటూ చెప్పుకునే పాల‌కులు ఇప్పటికైనా స్థానిక పాల‌న ప్రజ‌ల‌కు అప్పచెప్పాల్సిన అవ‌సరం ఎంతైనా ఉందని సిటిజన్ ఫోరమ్స్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.  

10:31 - April 29, 2017

ఖమ్మం : జిల్లాలోని మార్కెట్ యార్డులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం మిర్చి ధర ఏకంగా 3వేలకు పడిపోడంతో సహనం కోల్పోయిన రైతులు మార్కెట్ లో ఆందోళనకు దిగి చైర్మన్ కార్యాలయంపై దాడి చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా వస్తుండడంతో యార్డులో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. మార్కెట్లోకి రైతులను మాత్రమే అనుమతిస్తున్నారు. మార్కెట్ యార్డు రావడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత పోంగులేటి సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముదిగొండకు చెందిన రైతు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ముదిగొండ పీఎస్‌లో మల్లు భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చ నాయకుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు అత్యుత్సహంగా వ్యవరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.అయితే ఇంత జరిగిన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు గానీ స్పందించకపోవడం, నేడు కూడా మిర్చి ధర క్వింటాల్ కు రూ.3వేలు చెల్లిస్తుండడంతో రైతులు ఆవేదనగా ఉన్నారు. ఈ రోజు మార్కెట్ కు 70 నుంచి 80 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. ఉదయం వాన చినకులు పడుతుండంతో రైతులు ఆందోళనగా ఉన్నారు. ఇది ఇలాఉంటే ఉదయం 10 గంటల తర్వాత కలెక్టరేట్ ఎదుట ప్రతిపక్షాలు నిర్వహించనున్నారు.

 

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పనగారియా

రంగారెడ్డి : ముచ్చింతల లో స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నీతి ఆయోగ్ సీఈవో పనగారియా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

ముదిగొండ పీఎస్ లో పీసీసీ నేత భట్టి నిరసన

ఖమ్మం: మార్కెట్ గోడవలో ముడిగొండ రైతును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు అరెస్టుకు నిరసనగా ముదిగొండ పీఎస్ లో పీసీసీ నేత భట్టి విక్రమార్క నిరసనకు దిగారు.

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

ప్రకాశం: దొనకొండ మండలం భట్టిప్రోలులో దారుణం చోటుచేసుకుంది. భర్త భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు పేర్కొన్నారు. నిందితుడు భర్త పరారీలో వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

నేడు టీఎస్ బీఏసీ సమావేశం...

హైదరాబాద్: ఈ నెల 30న ప్రత్యేక సమావేశం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు ఎజెండాపై చర్చించేందుకు శనివారం సాయంత్రం నాలుగింటికి సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ బీఏసీ సమావేశం జరగనుంది. దీనికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రి హరీశ్‌రావు, విపక్ష నేత జానారెడ్డి ఇతర నేతలు ఇందులో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం జరుగుతుంది. సాయంత్రం మూడు గంటల నుంచి శాసనమండలి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

09:59 - April 29, 2017

ఎస్సై కారు ఢీకొని టిప్పర్ డ్రైవర్ మృతి

జగిత్యాల: వెల్గటూరు మండలం కిషన్‌రావుపేట వరంగల్ జిల్లాకు చెందిన ఎస్సై కారు ఢీకొని టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు. నీళ్లు తాగడానికి టిప్పర్ దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాజయ్యగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు కొడకండ్ల ఎస్సైకి చెందినదిగా గుర్తించారు.

కారు-లారీ ఢీ: ముగ్గురి మృతి

జనగామ: లారీ- కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని తొర్రూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు మల్లికార్జునరావు, కృష్ణయ్య, అన్వర్‌పాషాగా గుర్తించారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

09:56 - April 29, 2017

కామారెడ్డి : వాళ్లంతా ఇళ్లు లేని ఉద్యోగులు. ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తానంది. వేతనంలో నెలసరి వాయిదాలు చెల్లిస్తే సొంత ఇంటివారు అవుతారని 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి.. రాజీవ్‌ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇల్లు లేని ఉద్యోగులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ పథకం.. ఇప్పటికి 8 ఏళ్లు కావస్తున్నా ఏ ఒక్క లబ్ధిదారునికి ఇల్లు అందించలేకపోయింది. పథకం ప్రారంభంలో ఎన్నో ఆశలు కల్పించిన ప్రభుత్వం చివరకు ఇల్లు నిర్మించి ఇచ్చే సమయానికి.. ధరలు పెరిగాయని మాట మార్చింది. 6 లక్షలకు ఇచ్చే ఇళ్లను అమాంతంగా 11 లక్షలకు, 11 లక్షల విలువ చేసే ఇళ్లను 22 లక్షలకు ఇస్తామని చెప్పటంతో ఉద్యోగులు ఇళ్లు తీసుకోవడానికి వెనకడుగు వేశారు. ప్రస్తుతం పాత ధరకే ఇళ్లను అందిస్తే ఉద్యోగులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి పట్టణానికి సమీపంలో రెండు కిలో మీటర్ల దూరం అడ్లూరు శివారులో.. ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని భావించింది. రైతుల వద్ద నుంచి 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో 30 ఎకరాలకు రైతులకు డబ్బులను చెల్లించి.. మరో 20 ఎకరాల రైతులకు తరువాత డబ్బులు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 540 మంది తమకు రాజీవ్ స్వగృహ ద్వారా ఇల్లు కావాలని డిడిలు చెల్లించి దరఖాస్తులు చేసుకున్నారు.

బ్యాంక్‌ లోన్‌తో వాయిదాలను చెల్లించవచ్చని ఒప్పందంలో తెలిపారు
ప్రభుత్వం ఏడాదిలోనే ఇల్లు నిర్మించి ఇస్తామని బ్యాంక్‌ లోన్‌తో వాయిదాలను చెల్లించవచ్చని ఒప్పందంలో తెలిపారు. కానీ ఇళ్ల నిర్మాణం సంవత్సరమైనా పూర్తి కాకపోవడంతో.. ఇళ్ల ధరలను అమాంతంగా పెంచేశారు. దీంతో ఉద్యోగులు ఇల్లు తీసుకోవటానికి వెనుకంజ వేశారు. పట్టణంనోనే 7 లక్షల నుంచి 24 లక్షల వరకు ఇండిపెండెంట్ ఇల్లు దొరుకుతుండటంతో లబ్ధిదారులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం 313 ఫ్లాట్లు , 101 భవనాలను నిర్మాణం చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. 23 భవనాల నిర్మాణం పూర్తయ్యింది. 35 భవనాల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. మరో 36 బేస్మెంట్ లెవెల్‌లో ఉండగా మిగితావి నిర్మించాల్సి ఉంది.

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు నాలుగు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

పరవాడపాలెం వద్ద ఓ వోల్వో బస్సు దగ్ధం

విశాఖ: కశింకోట మండలం పరవాడపాలెం వద్ద ఓ వోల్వో బస్సు దగ్ధమైంది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి అనకాపల్లికి పెళ్లి బృందం ఈ బస్సులో వెళ్తొంది. బస్సు నుంచి పొగలు వస్తున్నాయని పక్కనే కారులో వెళ్తున్నవారు చెప్పడంతో వెంటనే ప్రయాణికులు దిగిపోయారు. అనంతరం బస్సులో మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

09:48 - April 29, 2017

అనంతపురం : జిల్లాలోని గుంతకల్ మండలం వైటి చెరువులో తెప్ప మునక దుర్ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఐదేళ్ల చిన్నారి శివగా గుర్తించారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. శుక్రవారం సాయంత్రం రామచంద్రయ్య అనే వ్యక్తి తన తోబుట్టువులతో కలిసి ప్రయాణిస్తూండగా ఈ సంఘన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో తెప్పలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

 

09:39 - April 29, 2017

విశాఖ : జిల్లాలో ఓల్వా బస్సు దగ్ధం కలకలం రేపింది. కావేరి ట్రావేల్స్ చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అనకాపల్లికి పెళ్లి వారిని తీసుకెళ్తుంది. ఈ రోజు ఉదయం కాళ్లపాలెం ఎన్ హెచ్ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. 

09:32 - April 29, 2017

ఖమ్మం : జిల్లాలోని మార్కెట్ యార్డులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం మిర్చి ధర ఏకంగా 3వేలకు పడిపోడంతో సహనం కోల్పోయిన రైతులు మార్కెట్ లో ఆందోళనకు దిగి చైర్మన్ కార్యాలయంపై దాడి చేశారు. నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వస్తుండడంతో యార్డులో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. మార్కెట్లోకి రైతులను మాత్రమే అనుమతిస్తున్నారు. మార్కెట్ యార్డు రావడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేత పోంగులేటి సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత జరిగిన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు గానీ స్పందించకపోవడం, నేడు కూడా మిర్చి ధర క్వింటాల్ కు రూ.3వేలు చెల్లిస్తుండడంతో రైతులు ఆవేదనగా ఉన్నారు. ఇది ఇలాఉంటే ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఎదుట ప్రతిపక్షాలు నిర్వహించనున్నారు.  

యువకుడి అవయవదానం

యాదాద్రి : జిల్లాలోని ఆత్మకూరు రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయన లొడి శ్రీరాములు అవయవదానం చేశారు. శ్రీరాములు 8 మందికి అవయవదానం చేసి అమరవీరుడిగా నిలిచాడు. తన కుమారుడి కోరిక మేరకు అవయవదానం చేశామని తల్లిదండ్రులు తెలిపారు.

వైటీ చెరువలో మరో మృతదేహం

అనంతపురం : జిల్లాలో తెప్ప మునక ప్రమాదంలో మరో మృతదేహం అభ్యమైంది. మృతురాలు ఐదేళ్ల చిన్నారి శివగా గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మంత్ర కాల్వ శ్రీనివాసులు గాయాపడిన వారి పరామర్శించారు.

 

ఖమ్మం మార్కెట్లో భారీ పోలీసు బందోబస్తు

ఖమ్మం : జల్లాలోని వ్యవసాయ మార్కెట్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

 

08:51 - April 29, 2017

విశాఖ : సింహగిరిపై చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు స్వామివారికి పట్టువస్త్రాలు, చందనం సమర్పించారు. అనంతరం గవర్నర్ నరసింహన్‌, మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, ఎమ్మెల్యే, ఎంపీలు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే వేలాది మంది భక్తులు సింహగిరికి పోటెత్తారు. స్వామి వారిని దర్శంచుకోవడం ఆనందంగా ఉందని..గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అలాగే భక్తులు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. 

అమెరికాలో మరో భారతీయుడి హత్య

అమెరికా : గత కొంత కాలంగా అగ్రదేశంలో అమెరికాలో జాతి వ్యతిరేక కాల్పులు జరుగుతోన్నాయి. తాజాగా టెన్నీస్సేలోని ఓ హోటల్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో భారతీయుడు ఖండుపటేల్ మృతి చెందారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడి దేశవ్యాప్త పర్యటన

ఢిల్లీ : నేటి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పశ్చిమ గోదావరిలో సీఎం పర్యటన

పశ్చిమ గోదావరి : నేడు జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఖమ్మంలో సీపీఎం, సీపీఐ నేతల పర్యటన

ఖమ్మం : నేడు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.

08:27 - April 29, 2017

మిర్చి రైతులకు మద్దతు ధర ప్రటించాలని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నరసింహరెడ్డి, కాంగ్రెస్ నేత మానవత రాయ్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత రాజమోహన్ రెడ్డి మాట్లాడారు.నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో మిర్చిధర పడిపోవడంతో రైతులు ఆవేదనతో మిర్చి యార్డుపై దాడి చేశారని అన్నారు. ప్రభుత్వం పత్తి వద్దని చెబితే రైతులు కందులు, మిర్చి పంటలు వేశారు, కానీ ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం దారుణమన్నారు. ఖమ్మంలో నాలుగు మండలాలు రైతులు నకలీ విత్తనాల వల్ల నష్టపోతే ఇంక పరహారం ఇవ్వలేదని తెలిపారు. మానవత రాయ్ మాట్లాడుతూ రైతుల కడుపు మండి ఆందోళన చేస్తే, ప్రభుత్వం ప్రతిపక్షాల కుట్ర అనడం శోచనీయమని అన్నారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం కందులకు 400 కోట్లు కేటాయించి నాఫెబ్ ద్వారా కొనుగోళ్లు చేశామని తెలిపారు. మిర్చి పంటపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. మిర్చి ధర పెంచడం కేంద్రం పరిధిలో లేదని పేర్కొన్నారు. రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ సభ విజయవంతం కావడం ప్రతిపక్షాలు తట్టులేక కుట్ర చేశారని ఆరోపించారు.

08:08 - April 29, 2017

వ్యవసాయానికి ప్రభుత్వ సహకరం ఉండాలని సేంద్రియ నిపుణుడు వి. పురుషోత్తం అన్నారు. ఆయన మట్టి మనిషి కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు చేశారు. రైతులు ఎక్కువగా నకిలీ విత్తనాల ద్వారా మోసపోతున్నారని, రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసారిగా రసీదు తీసుకోవాలని తెలిపారు. వర్షకాలం ముందు అధికారులు రైతులకు విత్తనాల కంపెనీల గురించి చెప్పాలని కోరారు. వ్యవసాయ రంగంపై వాతవరణం కూడా ప్రభావం చూపుతోందని, పరిస్థితులకు తగ్గట్టుగా పంటలు వేయాలని పేర్కొన్నారు. సిటీకి 30 కిలోమీటర్ల ఉన్న గ్రామల్లో ఆకు కురలు పండిస్తే మంచి లాభం ఉంటుందని తెలిపారు. మార్కెట్లో కోత్తిమీరకు మంచి గిరాకీ ఉంటుందని అన్నారు. రైతులు రకరకాల పంటలు వేయాలని, మూస పద్దతిలో కాకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించాలని పేర్కొన్నారు. అందరు మిర్చి పంట వేయడంతో ధర పడిపోయిందని అన్నారు. తాము యువ రైతులకు శిక్షణ ఇస్తున్నామని తమను సప్రందించాలని ఫోన్ నెంబర్ ఇచ్చారు. నెంబర్ 7207501515. తము అలు 166 విత్తనాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు

07:43 - April 29, 2017

హైదరాబాద్ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒక్కటి.. ఈ యూనివర్శిటీ ఎందరో మహా మహా ఉద్దండులను దేశానికి అందించిన చదువుల తల్లి.. యూనివర్శిటీని స్థాపించి వందేళ్లు పూర్తైన సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రారంభఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన వీరంతా ఎంతో నిరుత్సాహనికి గురయ్యారు. వందేళ్ల పండుగ అంటే ఎంతో గొప్పగా ఊహించుకున్న వారందిరినీ ఈ వేడుకలు తీవ్ర అసంతృప్తిగా గురిచేశాయి. దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ వేడులకలు అందరినీ ఆకట్టుకోలేకపోయాయి. ఉస్మానియా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మాత్రం ఈ ఉత్సవాలు జరగలేదనే విమర్శలు మొదలయ్యాయి.

కనిపించని విద్యార్థులు...
ఉత్సవాల ప్రారంభ సభ వేదిక చుట్టుపక్కల ఎక్కడా విద్యార్థులు కనిపించలేదు.. మొత్తం సభ ప్రభుత్వ సభలాగే కొనసాగింది. ముందు నుంచి
యూనివర్శిటీ సమస్యలపై గళమెత్తుతూ వస్తున్న విద్యార్ధులు రాష్ట్రపతి వస్తున్న సభలో ఏదైనా ఆటంకం కలిగిస్తారనే నెపంతో స్టేజి కి దాదాపుగా కొన్ని వందల మీటర్ల దూరంలో విద్యార్ధుల గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభ సభ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమంలా సాగాయని విద్యార్ధులు మండిపడుతున్నారు. వేడుకలు జరిగిన మూడు రోజుల పాటు ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రణాళిక లేకుండా నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల కార్యక్రమాల్లో విద్యార్థుల భాగ్యస్వామ్యం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

07:39 - April 29, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి అంతా బాగుందని టీఆర్‌ఎస్‌ మహాసభ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిందని, కానీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు నచ్చాయో లేదో 2019 ఎన్నికల్లో తేల్చి చెబుతారన్నారు జానారెడ్డి. 

07:36 - April 29, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ ఆవిర్భావ సభలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు. ప్రగతి నివేదన సభగా చెప్పుకున్న టీఆర్ఎస్‌ నాయకులు, కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసే సభగా మార్చారంటూ హస్తం నేతలు విరుచుకుపడుతున్నారు. మూడేళ్ల పాటు నిద్రపోయిన కేసీఆర్‌.. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాక.. ఇప్పుడు రైతు జపం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం చేసే జిమ్మిక్కేనని ఎద్దేవా చేశారు.

ప్రగతినివేదన కాదు ఆవేదన సభ
ప్రగతినివేదనకు బదులుగా అధికార ఆరాట ఆవేదన సభగా పేరు పెట్టిఉంటే బావుండేదని కాంగ్రెస్‌ నాయకులు చురక వేశారు. అసెంబ్లీలోను, ప్రగతిభవన్‌లోనూ ప్రదర్శించే తరహా జిమ్మిక్కులనే కేసీఆర్‌ మరోసారి వరంగల్‌ సభలో చూపారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీపై వరంగల్‌ సభలో చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ ఉపసంహరించుకోకుంటే, ఎల్లుండి భూసేకరణ బిల్లుపై జరగనున్న అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించి కేసీఆర్‌కు ఝలక్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. భూసేకరణ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కేసీఆర్‌.. అసెంబ్లీలో భూసేకరణ చట్టానికి ప్రతిపాదించే సవరణలు ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ను శాంతింప చేస్తారా..? లేక తన పార్టీకున్న సంఖ్యాబలంతో, కాంగ్రెస్‌ గైర్హాజర్‌ హెచ్చరికను లైట్‌గా తీసుకుంటారా..? వేచి చూడాలి. 

07:28 - April 29, 2017

కృష్ణా : విజయవాడ చెందిన ఈమె పేరు సుమశ్రీ. కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్ తో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి సాయి శివశ్రీ అనే కూతురు ఉంది. మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. అయితే శివకుమార్ కూతురు శివశ్రీ కోసం సిటీలోని దుర్గాపురంలో ఒక ఇల్లు కొనిచ్చాడు. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన సుమశ్రీ కూతురితో పాటు హైదరాబాద్ లో తన పేరెంట్స్ దగ్గర ఉంటోంది. శివశ్రీ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. కూతురి ట్రీట్ మెంట్ కి డబ్బులు సరిపోక సుమశ్రీ భర్త ఇచ్చిన ఇంటిని విక్రయించాలని విజయవాడకు వచ్చింది. అప్పుడు తెలిసొచ్చింది తన ఇల్లు కబ్జా అయిందని. అది కూడా ఎమ్మెల్యే అనుచరులే కబ్జాకోరులని. దీంతో సుమశ్రీ హతాశురాలైంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న కూతురితో పాటు తన ఇంటిముందే ఆందోళనకు దిగింది.
బొండా ఉమ అనుచరుల హెచ్చరికలు..
ఇల్లు కావాలంటే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమని కలిసి సెటిల్ మెంట్ చేసుకోవాలని ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారన్నది సుమశ్రీ ఆరోపణ. రెండురోజులుగా ఇంటిబయట కూతురితో పాటు నరకయాతన అనుభవిస్తోందామె. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సాయం చేయకపోగా ఎమ్మెల్యే బొండా ఉమకు వత్తాసు పలుకుతున్నారని సుమశ్రీ ఆరోపిస్తోంది. తన కుమార్తె ప్రాణాపాయంలో వుందని, ఆమెకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే బొండా ఉమ బాధ్యత వహించాలని సుమశ్రీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి నవ్యాంధ్ర రాజధానిగా ఈ ప్రాంతం ఎంపికయ్యాక, బెజవాడలో కబ్జాలు పెచ్చుమీరిపోయాయి. తాజా ఘటనలో బోండా ఉమామహేశ్వరరావు పేరు కూడా ఈ కబ్జాకోరుల జాబితాలో ఉన్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం. ఇటీవలే, ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై దాడి ఘటనపై, ఉమను మందలించిన సీఎం చంద్రబాబు.. కబ్జా ఘటనల్లోనూ ఉమ పేరు రావడంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

07:05 - April 29, 2017

ఖమ్మం : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖమ్మం మిర్చియార్డులో వ్యాపారులు, దళారులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గతంలో 12 వేలు ఉన్న మిర్చిధర ప్రస్తుతం 2వేలకు పడిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల పాలైన రైతన్న .. విధిలేకనే తన నిరసనకు దిగుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం మార్కెట్‌ యార్డును సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.  

ప్రారంభమైన సింహద్రి అప్పన్న చందనోత్సవం

విశాఖ : సింహగిరిపై అప్పన్న చందనోత్సవం ప్రారంభమైంది. విద్య శాఖ మంత్రి గంటా అప్పన్నకు చందనం సమర్పించారు.

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు

ఐపీఎల్ 10 : నేడు పుణె వారియర్స్ వర్సెస్ బెంగళూరు పుణె వేదికగా సాయంత్రం 4 గంటలకు జరగనుంది. గుజరాత్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రాజ్ కోట్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.

Don't Miss