Activities calendar

30 April 2017

22:07 - April 30, 2017

హైదరాబాద్ : ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్ఫూర్తిదాయక విజయం నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఆ జట్టు 10వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన మొహాలిలో అత్యుత్తమ బౌలింగ్‌తో పంజాబ్‌ జట్టు ఆకట్టుకుంది.  పంజాబ్‌ బౌలర్స్‌ సందీప్‌శర్మ, వరుణ్‌ ఆరోన్‌, అక్షర్‌పటేల్‌ చెలరేగడంతో  ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌  67 రన్స్‌కే కుప్పకూలింది.  68 రన్స్‌ టార్గెట్‌లో బరిలోకి దిగిన పంజాబ్‌ కేవలం 7.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ విక్టరీతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ ఐదో స్థానానికి ఎగబాకింది.

 

22:05 - April 30, 2017

ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్య వేదికల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. సాయిబాబాతో పాటు నిరాధారాలతో అరెస్టు చేసిన ప్రజాహక్కుల నేతలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు, గిరిజనుల గురించి మాట్లాడేవారిని ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా ప్రజాహక్కుల నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజాస్వామ్య వేదికల సభ్యులు,  విద్యార్ధులు పాల్గొన్నారు. 

 

22:03 - April 30, 2017

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్థిరాస్తి చట్టం అమల్లోకి రానుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. దీని ద్వారా స్థిరాస్తి వ్యాపారంలో ఇక కొనుగోలుదారే రారాజు అని అన్నారు. ఈ చట్టం ద్వారా స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటికల పూర్తి చేసేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. 

22:01 - April 30, 2017

ఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడూ ముఖ్యమనే భావనతోనే వీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాధారణ ప్రజలు ముఖ్యమన్నా మోదీ.. వీఐపీ కల్చర్ స్థానంలో ఈపీఐ-ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ కల్చర్ తీసుకొస్తున్నామని ప్రకటించారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ వేసవిలో మన ఇళ్లకు వచ్చే పోస్ట్‌మ్యాన్, పాలు వేసే వ్యక్తి, కూరగాయాలు అమ్మేవారికి మంచినీరు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల అంశంపై ప్రత్యేక సెమినార్లు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మన్ కీ బాత్ ద్వారా చిన్నారుల ఆలోచనలు, యువత అభిలాష, పెద్దల ఆలోచనలు తెలుసుకోవాలనుకున్నానని మోదీ తెలిపారు. మే 5న నిర్వహించనున్న దక్షిణాసియా ఉపగ్రహం ఈ ప్రాంతానికి భారతదేశం ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు. 

 

21:56 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ చట్ట సవరణ బిల్లును, రాష్ట్ర ఉభయ సభలు మూజువాణి ఓటుతో ఆమోదించాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన సవరణలను ప్రతిపాదిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇంతకీ కేంద్రం ఏఏ అంశాలపై సవరణలను సూచించింది. తెలంగాణ సర్కారు ఎలాంటి మార్పులు చేసింది..?
మూజువాణి ఓటుతో ఆమోదం
భూసేకరణ చట్ట సవరణ బిల్లును, తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. గతంలో ఆమోదించిన బిల్లుకు.. కేంద్రం నాలుగు సవరణలను సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సవరణలన్నింటినీ చేర్చుతూ కొత్త బిల్లును అసెంబ్లీ ముందుకు తెచ్చింది.
రాష్ట్ర భూసేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచే అమలు
ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, భూసేకరణ చట్టం 2014 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, అదేసమయంలో, అధికారిక గెజిట్‌ వెలువడిన తేదీ నుంచి చట్టం అమలవుతుందంటూ బిల్లులోని 3వ క్లాజ్‌లో పేర్కొన్నారు. ఈ రెండింటి మధ్య అయోమయాన్ని నివారించేందుకు, 3వ క్లాజ్‌ను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. 
క్లాజ్‌ అనవసరమన్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013 ప్రకారం, నోటిఫికేషన్‌కు ముందే ఆయా జిల్లాల కలెక్టర్లు భూమి ధరను రివైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం 2016 ప్రకారం, భూమి ధరను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా, పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ క్లాజ్‌ అనవసరమని తేల్చి చెప్పింది. దీంతో, కేసీఆర్‌ సర్కారు, ఈ క్లాజ్‌ను తొలగించింది.
వ్యక్తిగత ప్రయోజనాలకు విఘాతం కలగరాదన్న కేంద్రం
భూసేకరణ బిల్లులోని 7, 8 క్లాజులలో మార్పులు చేయాలని కేంద్రం సూచించింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకూ విఘాతం కలగకూడదని కేంద్రం స్పష్టం చేసింది. 2013 చట్టంతో పోలిస్తే, పరిహారం అందే కుటుంబాలకు అన్యాయం జరగకుండా, పునరావాసం కోసం చెల్లించే పరిహారంలో పెద్దగా వ్యత్యాసం రాకుండా చూడాలని కేంద్రం సూచించింది. భూసేకరణ పరిధిలోకి వచ్చే కుటుంబాల జాబితాలో.. వ్యవసాయాధారిత కూలీలు కూడా ఉంటారు కాబట్టి, వారికీ పరిహారం చెల్లిస్తామని బిల్లులో పేర్కొన్నామని ప్రభుత్వం పేర్కొంది. 
పార్లమెంటు ఆమోదం అనవసరం.. ప్రభుత్వ అనుమతి చాలు
అత్యవసరం అనుకునే పనుల కోసం జిల్లాల కలెక్టర్లు అవార్డు పాస్‌ చేసి భూసేకరణ జరపవచ్చని, దీనికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదని, ప్రభుత్వ అనుమతి ఉంటే సరిపోతుందని కేంద్రం ప్రతిపాదించిన 2013 భూసేకరణ చట్టం చెబుతోంది. ఈ చట్టం కల్పించిన వెసులుబాటునే 2016 భూసేకరణ బిల్లులో ప్రతిపాదించామని, అయినా, కేంద్రం సూచన మేరకు క్లాజ్‌ 10ని తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తానికి కేంద్రం చేసిన సూచనల మేరకే భూసేకరణ చట్టం -2016కు అన్ని మార్పులూ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసి, ఏకపక్షంగా బిల్లును ఆమోదింప చేసుకోవడం విమర్శలకు కారణమవుతోంది. 
        

 

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు 11మందిపై కేసులు

ఖమ్మం : మిర్చి మార్కెట్‌ యార్డు ధ్వంసం ఘటనలో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమందిని పోలీసులు  ఇవాళ  అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. 

21:49 - April 30, 2017

ఖమ్మం : మిర్చి మార్కెట్‌ యార్డు ధ్వంసం ఘటనలో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమందిని పోలీసులు  ఇవాళ  అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో వారికి  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మరిన్ని విరాలను వీడియో చూద్దాం...

 

21:36 - April 30, 2017
21:30 - April 30, 2017

అనంతపురం : తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన చైతన్య స్వరూపి వేమనపై అనంతపురంలో సాహిత్య సమాలోచన కార్యక్రమం ఘనంగా జరిగింది. 250 సంస్థల ఆధ్వర్యంలో మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ వేత్తలు, కవులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కుల వ్యవస్థ, అవినీతి అక్రమాలు, శ్రమదోపిడీ చెలరేగిపోతున్న నేటి సమయంలో వేమన సందేశం మనకు ఎంతో అవసరమని సాహితీ ప్రియులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సి గేయానంద్, పలువురు రచయితలు, మేధావులు పాల్గొన్నారు.

21:28 - April 30, 2017

అనంతపురం : రైతుల్ని రెచ్చగొట్టడానికే జగన్ గుంటూరులో రైతు దీక్ష చేస్తున్నాడని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్  రెడ్డి విమర్శించారు. సొంత మీడియాను, మనుషులను వాడుకుంటూ కావాలని హడావిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు తమ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందో జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ రద్దైతే సంబరాలు జరుపుకోవడం కాదని.. సిబిఐ 11 కేసుల్లో నిర్దోషిగా బయటపడితే అప్పుడు జరుపుకోవాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. 

21:22 - April 30, 2017

విజయనగరం : ఆటపాటలతోనే ఒత్తిడిని నుంచి బయట పడగలమని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రస్తుతం సమాజంలో శిక్షణకు, శిక్షలకు తేడా లేకుండా పోయిందని ఆయన అన్నారు. విజయనగరంలో జరిగిన 'హ్యాపీ స్ట్రీట్' కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు  పాల్గొన్నారు. సిటీలోని బాలాజీ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సైకిల్ తొక్కి సందడి చేశారు.  ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీతలు పాల్గొన్నారు. రకరకాల గేమ్స్ తో హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 

21:18 - April 30, 2017
21:18 - April 30, 2017
21:16 - April 30, 2017
21:15 - April 30, 2017

హైదరాబాద్ : కాదేది కబ్జాకనర్హమంటూ.. కబ్జారాయుళ్లు ఏకంగా పార్కులు, రోడ్లపైనే కన్నేశారు. హైదరాబాద్‌ నగరంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని.. పాలకులు, అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో కబ్జాల పాలవుతున్న రోడ్లు, పార్కులపై ఓ ప్రత్యేక కథనం. 
రోడ్లను సైతం వదలడం లేదు
గ్రేటర్‌ హైదారాబాద్ కార్పొరేషన్‌లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. చెరువులు.. నాలాలు.. ప్రభుత్వ స్థలాలు.. ఇలా ఖాళీ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ జెండా పాతేస్తున్నారు. ఇంతటితో ఆగని కబ్జారాయుళ్లు జీహెచ్‌ఎంసీ రోడ్లను సైతం వదలడం లేదు. అయినా బల్దియా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిగో.. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్థలంలో కొత్తగా గోడను కట్టారు. ఇది తమ భూమి అంటూ బోర్డు పెట్టారు. కానీ ఇది రోడ్డు. మన్సూరాబాద్ సర్వే నంబర్ 30లో వివేకానంద నగర్‌ లే అవుట్ ప్రకారం.. ఇక్కడ 25 ఫీట్ల రోడ్డు ఉంది. ఇదే మార్గంలో తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లు ఉన్నాయి. కబ్జారాయుళ్లు ఏకంగా వీటిపైనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఈ తంతు ఏళ్ల తరబడి జరుగుతోంది. గతంలో ఈ భూమిపై కన్నేసిన వాళ్లు ఇక్కడ నిర్మించిన పైపులైన్లను డామేజ్ చేశారు. దీంతో అందుకు కారణమైన వారిపై 40 వేలు ఫైన్ వేసి అధికారులు.. క్రిమినల్ కేసు నమోదు చేశారు. 
ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం
ఇక్కడ సీసీ రోడ్లను నిర్మించడంతో పాటు పైపులైన్లను మరింత పటిష్టం చేయాలని.. బల్దియా అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అంచనాలను రూపొందించిన అధికారులు 19 లక్షలు ఖర్చు అవుతుందని ప్లాన్ చేశారు. అయినా స్థానికంగా ఉండే టౌన్ ప్లానింగ్ అధికారులు.. ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మరొకరు ఈ స్థలంపై కన్నేశారు. దీని చుట్టూ గోడను కట్టేశారు. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా టౌన్‌ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. 
60 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయాలని కోర్టు తీర్పు
సాయిరాం నగర్‌ శాంతి శిఖరా లే అవుట్‌లో 60 ఫీట్ల రోడ్డు ఉండాలి. ఒకవైపు వెడల్పు ఉన్న ఈ రోడ్డు మరోవైపు మాత్రం ఇలా ఇరుకుగా ఉంది. లే అవుట్ ప్రకారం 60 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయాల్సిందేనంటూ కోర్టు బల్దియాకు సూచించింది. అయినా అధికారులు వీటిని తొలగించకపోగా లే అవుట్‌ ప్రకారం నిర్మించిన ఇళ్లకే నోటీసులు ఇవ్వడం కొసమెరుపు. ఈ విషయం పై అధికారులకు తెలియడంతో మరోసారి సర్వే నిర్వహించి నోటీసులు ఆపేశారు. మరొక నిర్మాణం ఇలాగే రోడ్డుపైకి వస్తున్నా పట్టించుకోవాల్సిన ఈ సెక్షన్‌ ఆఫీసర్‌.. తనకేమీ తెలియదంటూ బుకాయిస్తున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. కమీషనర్‌ అయినా తమ సమస్యను పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారు. 
60 ఫీట్ల రోడ్డుగా పునరుద్ధరణ
సాయిరాం నగర్‌ రోడ్డును ఇటీవలే పరిశీలించామని దానిని 60 ఫీట్ల రోడ్డుగా పునురుద్ధరిస్తామని.. ఎల్బీనగర్‌ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ముందుగా రోడ్డులోని సెంటర్ మీడియంను నిర్మించి.. తరువాత రోడ్డును వెడల్పు చేస్తామంటున్నారు. ఇక్కడ కొత్తగా వస్తున్న నిర్మాణ అనుమతులను  పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ.. టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. 
రూ. 3 కోట్ల విలువైన స్థలం 
ఇది సరస్వతి నగర్‌ కాలనీ పార్క్. చింతల్‌ కుంట సమీపంలో జాతీయ రహదారికి అతి దగ్గరంగా ఉండే చోటు. ఇక్కడ మూడు కోట్ల విలువైన 16 వందల గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. కానీ పార్క్ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. స్థలం తమదంటూ పత్రాలు సృష్టించారు. ఇది మున్సిపాలిటీ పార్క్‌ అంటూ 1999లోనే పత్రికా ప్రకటన ఇచ్చింది ఎల్బీనగర్ మున్సిపాలిటీ. ఇది కాలనీ సంక్షేమ సంఘానికి చెందుతుందంటూ కోర్టు 2008లో తీర్పునిచ్చింది. అప్పటికే ఈ ప్రాంతం జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో దీనిని పరిరక్షించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదేనని తేల్చి చెప్పింది. జోనల్ కమిషనర్‌ రఘు ప్రసాద్ నేరుగా ఇక్కడ పర్యటించి.. దీనిని పార్కుగా అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు. ఏడాది గడుస్తుంది కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.  

 

21:08 - April 30, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ కార్మికుల రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించకుండా ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాలకు.. మేడే శుభాకాంక్షలు చెప్పే అర్హత లేదన్నారు సాయిబాబు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కార్మిక సంఘాల నేతలు ఖండించారు. 

 

21:03 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజల నుంచి ప్రభుత్వం వారి భూములను లాక్కొంటోందని మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం సేకరించిన భూముల్లోకి ఇప్పటికీ పరిశ్రమలే రావడంలేదన్నారు. హైదరాబాద్‌లోసి సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వాసిత రైతుల రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. భూసేకరణ చట్టం -2013కు ప్రభుత్వం సవరణలు చేసి రైతులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు చేసిన భూసేకరణ చట్టాన్ని రాష్ట్రపతికి పంపొద్దని భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్‌ బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. రైతు రాజ్యం అంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... రైతులకు నష్టం చేసేలా కొత్త భూసేకరణ చట్టం తీసుకురావడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి సభకు రాకుండానే సవరణలు ఆమోదించడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని విమర్శించారు.

 

21:01 - April 30, 2017

హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. 2013 చట్టం కంటే ఈ చట్టం ద్వారా భూనిర్వాసితులకు న్యాయం జరగదని చెప్పారు. 

 

20:57 - April 30, 2017

హైదరాబాద్ : రైతులకు మేలు జరగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా .. అసెంబ్లీలో గందరగోళం సృష్టించడానికే కాంగ్రెస్‌ నేతలు వచ్చారన్నారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో ఇప్పటికే చర్చ జరిగిందని.. కేవలం కేంద్రం సూచించిన సవరణలను మాత్రమే ఈ రోజు చేశామన్నారు. రైతులకు మేలు చేసే విధంగా బిల్లు రూపొందిస్తే.. కాంగ్రెస్‌ లేనిపోని రాద్ధాంతం చేస్తుందన్నారని తెలిపారు. 

20:54 - April 30, 2017

సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యుల ప్రయత్నం : హరీష్

హైదరాబాద్ : స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని భూసేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు 38 కేసులు పెట్టారని... భూసేకరణ చట్ట సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే కేసులన్నింటినీ కొట్టివేస్తారని కాంగ్రెస్ భయం పడుతుందన్నారు. 

సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు : తమ్మినేని

ఖమ్మం : 2013 భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రపతి వద్ద, న్యాయస్థానంలో బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తేలడం ఖాయమని స్పష్టం చేశారు. 

 

20:40 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఏకపక్షంగా సాగింది. విపక్షాలకు ఏమాత్రం చాన్స్‌ ఇవ్వకూడదన్న వ్యూహాన్ని కేసీఆర్‌ సర్కార్ సభలో అమలు చేసింది. కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనల మధ్యే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా బిల్లు సవరణలకు సభ ఆమోదముద్ర వేయించింది. రైతు సమస్యలపై చర్చించాలని సభలో కాంగ్రెస్‌ సభ్యుల పట్టుబట్టినా.. బీఏసీ నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని చెప్పిన  స్పీకర్‌...సభను నిరవధిక వాయిదా వేశారు. ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.
భూసేకరణ చట్ట సవరణకు అమోదం 
భూసేకరణ చట్ట సవరణకు తెలంగాణ శాసనసభ అమోదం తెలిపింది. గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేయాలని సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలోనూ వ్యూహాత్మకంగా విపక్షాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. చట్టసవరణకు మూజువాణి ఓటుతో ఆమోదముద్రను  వేయించింది. మిర్చిరైతుల సమస్యలపై చర్చను జరపాలన్న విపక్షాల డిమాండ్‌ను స్పీకర్‌ మధుసూదనాచారి తోసిపుచ్చారు. దీంతో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే బిల్లును ఉపముఖ్యమంత్రి  మహమూద్‌ అలీ సభలో ప్రవేశపెట్టగా.. దాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించి, సభను 9 నిమిషాల్లోనే ముగించేశారు. 
సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన 
ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభలోనే నిరసన తెలిపారు. సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే, ఆయన బయటకు వెళ్లకుండా చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో స్పీకర్‌కు రక్షణగా మార్షల్స్ సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా మార్షల్స్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరుగగా తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రైతు సమస్యలపై చర్చించని సభ ఎందుకంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. సభలో తమ గొంతు నొక్కి భూసేకరణ చట్ట సవరణకు ఆమోదముద్ర వేసుకున్నారని విమర్శించారు. మిర్చి కొనుగోలు కోసం వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 
ప్రభుత్వ నియంతృత్వ ధోరణి : సున్నం రాజయ్య
ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకోకుండా భూ సేకరణ చట్టాన్ని ఆమోదించడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా తప్పుబట్టారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రవర్తిస్తోందని ఆక్షేపించారు. భూసేకరణ చట్టం ఆమోదం కోసం సభలో కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం నియంతృత్వ విధానాలకు అద్దం పడుతుందని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మొత్తంగా విపక్షాల అభ్యంతరాలను బుల్డోజ్‌ చేస్తూ ప్రభుత్వం భూ సేకరణ చట్టానికి సవరణలను ఆమోదించడంపై.. ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. 

 

20:27 - April 30, 2017
20:25 - April 30, 2017

హైదరాబాద్ : చరిత్రాత్మక కట్టడాలకు....హైటెక్‌ అందాలకు నెలవు హైదరాబాద్‌. ఎన్నో విశేషాలున్న రాజధాని ప్రాంతాన్ని ఇప్పటి వరకు బస్సులు...ట్రైన్‌లు... బోట్లలో తిరుగుతూ.. చూసి సంబరపడ్డాము.. అయితే, గగనతలంలో విహరిస్తూ చార్‌సౌ కా షహర్‌ను చూస్తే... ఆ ఆనందం.. థ్రిల్లింతే వేరు కదూ.. టూరిజం శాఖ ఆ థ్రిల్‌ను ప్రజలకు అందించేందుకు మరోసారి గగనవిహారానికి అవకాశాన్ని కల్పించింది. హెలీటూర్‌తో ప్రజలు హైదరాబాద్‌ అందాలను గగనం నుంచే చూస్తూ.. మురిసిపోతున్నారు. 
హెలికాప్టర్‌లో విహరిస్తూ హైదరాబాద్‌ సందర్శన
ఇక నుంచి రాజధాని అందాలను గగన విహారంతోనూ వీక్షించవచ్చు. హెలికాప్టర్‌లో  విహరిస్తూ హైదరాబాద్‌ హైటెక్‌ అందాలను తిలకించవచ్చు. చార్మినార్‌... గోల్కోండ... బిర్లామందిర్‌... టాంక్‌బండ్‌...జూ పార్క్‌ ఇంకా చాలా చూడదగ్గ ప్రాంతాలు భాగ్యనగరంలో ఎన్నో కొలువై ఉన్నాయి. వీటిని తిలకించేందుకు ఎంతోమంది పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. వారిని మరింతగా అలరించేందుకు తెలంగాణ పర్యాటకశాఖ  విభిన్నమైన ఆఫర్లను ప్రకటిస్తోంది.  ఇందులో భాగంగానే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. జాయ్‌రైడ్స్‌ సంస్థ సహకారంతో దీనిని ప్రారంభించింది. 
శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు గగనవిహారం
శుక్రవారం నుంచి 30వ తారీఖు వరకు...వచ్చేనెల 9వ తేదీ నుంచి 14 వరకు గగనవిహారపు అవకాశం అందుబాటులో ఉంచుతోంది పర్యటక శాఖ. ఒకేసారి 12 మంది ప్రయాణించగలిగే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ అందాలను ఆస్వాదింప చేసే బృహత్తర కార్యక్రమమే ఈ గగనవిహారం. 
అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు 
ఈ అవకాశం అందరికీ అందుబాటులో ఉండేలా పర్యాటక అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం టిక్కెట్‌ ధర విషయంలో డిస్కౌంట్‌లు ప్రకటించారు. టిక్కెట్‌ ధరను 3500 రూపాయలుగా నిర్ణయించారు.   నాలుగు టిక్కెట్లను కొంటే.. ఒక్కో టిక్కెట్‌పై 500 రూపాయల తగ్గిస్తున్నారు. అలాగే పది టిక్కెట్లు కొంటే ఒక్కో టిక్కెట్‌పై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నారు. యాత్రికుల రద్దీని బట్టి ట్రిప్‌లు ఉంటాయని...నిర్వాహకులు చెబుతున్నారు.     
గగన విహారానికి ఒకే హెలికాప్టర్‌
ప్రస్తుతం గగన విహారానికి ఒకే హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచామని, పర్యాటకుల సంఖ్య పెరిగితే, హెలికాప్టర్ల సంఖ్యనూ పెంచుకుంటూ వెళతామని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల అనుమతులూ పొందామని చెప్పారు.  

 

18:50 - April 30, 2017
18:48 - April 30, 2017

ఆదిలాబాద్ : భానుడి భగ భగలకు పల్లెలు గొంతెండిపోతున్నాయి. తాగేందుకు చుక్కనీరు లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. పల్లెల్లో భూగర్భ జలాలన్నీ అడుగంటి పోవడంతో బిందెడు నీటికోసం గిరిపుత్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వాగులు, వంకల్లోని ఉత చెలిమలే వారి దాహార్తిను తీర్చుతున్నాయి. 
కరువు కోరల్లో గిరిజన ప్రజలు  
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రజలు ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని కొట్టు మిట్టాడుతున్నారు. భూగర్భ జలాలన్నీ అడుగంటి పోవడంతో భీంపూర్ మండలం గుంజాల సమీపంలో కొలం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వారంరోజులుగా తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడడంతో గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచివెళ్తున్నారు. 40కి పైగా జనాభా ఉన్న ఈ పల్లెలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో..పల్లెకు సమీపంలో ఉన్న వాగులో చెలిమెలు తవ్వుకొని నీళ్లను తెచ్చుకుంటున్నారు. దీంతో చెలిమలలోని కలుషిత నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు.
ప్రజలు కన్నీటి కష్టాలు 
భానుడి భగభగకు భూగర్భజలాలు అడుగంటి పోవడంతో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదురుకుంటున్నారు. సిరికొండ మండలంలోని నిజాంగూడ ప్రజలు బిందెడు నీటికోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. గ్రామంలోని బావులు, చేతి పంపులు పనిచేయక పోవడంతో కిలో మీటరు దూరంలో ఉన్న బావి నుండి ఎండను సైతం లెక్కచేయకుండా నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం పనులకు సైతం వెళ్లడం లేదని,చిన్నా పెద్ద తేడా లేకుండా నీటికోసమే ఉంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటికోసం మైళ్ళ దూరం 
రక్షిత మంచినీటి పథకాలు..పడకేస్తుండటంతో ఇంద్రవెల్లి మండలంలోని మారుతీ గూడ, టెకడి గూడ, గట్టెపల్లి, దొండాడతండా, చిత్తగూడ, కొలాంగూడ తదితర గిరిజన గ్రామాల్లో త్రాగునీటికోసం గ్రామాల  సమీపంలోని వాగులోని చెలిమెల నీటికోసం మైళ్ళ దూరం వెళ్లి రాత్రిబవళ్ళు పడిగపలు పడాల్సి వస్తుంది. 
కాగితాలకే పరిమితమౌతున్న ప్రణాళికలు 
వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రణాళికలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత శాఖా అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రజలపాలిట శాపంగా మారుతుంది. తాగునీటి ఎద్దడి తీర్చేందుకు రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమౌతున్నాయి.

18:44 - April 30, 2017

హైదరాబాద్ : ఎండలు దంచికొడుతున్నాయి. జలాశయాలు ఆవిరవుతున్నాయి. పాలకవర్గాల్లో మాత్రం చలనం లేదు. జలాశయాలు అడుగంటుతున్నా తెలంగాణ పాలకులు మాత్రం ప్లీనరీలు, బహిరంగసభలంటూ కాలమెల్లదీస్తున్నారు. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదముంది. తెలంగాణలో అడుగంటుతున్న ప్రాజెక్టులపై 10టీవీ కథనం...
మండిపోతున్న ఎండలు
తెలంగాణలో ఎండలు ఎన్నడూలేనంతగా మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. సూర్యుడు రోజురోజుకు ప్రతాపం చూపుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అనుకున్నదానికంటే ముందే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఎండల ధాటికి ప్రజలతోపాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. చాలా  ప్రాంతాల్లో ప్రజలు ప్రచంచ భానుడి భగభగలతో  బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఉదయం 9 గంటలకే కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు.
ఆవిరైపోతున్న జలాశయాల్లని నీరు
సూర్యుడి ప్రతాపంతో తెలంగాణలోని జలాశయాలు కూడా ఆవిరైపోతున్నాయి. ఇప్పటికిప్పుడు జలాశయాలకు వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా..... రానున్న రోజులను తలచుకుంటేనే పాలకుల గొంతులు తడారిపోతున్నాయి.  దీంతో ప్రభుత్వం  ముందుజాగ్రత్తలు తీసుకుంటుందని ప్రజలు భావిస్తోంటే...  పాలకులు మాత్రం ప్లీనరీ, బహిరంగ సభలు, పార్టీఫండ్‌కోసం కూలిపనులంటూ పట్టించుకోవడం లేదు. 
సాగు, తాగునీరందిస్తున్న గోదావరి, కృష్ణా నదులు
ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగు,తాగునీరు అందిస్తున్నవి కృష్ణా, గోదావరి నదులే. ఒకరాష్ట్రం ముందుచూపులేక... మరోరాష్ట్రం పట్టింపులేకపోవడంతో జలాశయాలు అడుగంటి పోతున్నాయి. దీంతో సాగు, తాగునీరుకు  ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడనున్నాయి.   కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 7.6 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 3.47 టీఎంసీల నీరు ఉంది. లోయర్‌ మానేరులో పూర్తిస్థాయి నీటిమట్టం 24 టీఎంసీలు అయితే.... ప్రస్తుతం 5.26 టీఎంసీలే ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 20 టీఎంసీలు అయితే... ప్రస్తుతం 11 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి.  అటు  సింగూరులోనూ 29 టీఎంసీలకు 18 టీఎంసీలే ఉన్నాయి.  ఇక నిజాంసాగర్‌ పూర్తిస్థాయి  నీటిమట్టం 17.08 టీఎంసీలు అయితే1.7 టీఎంసీల నీరే ఉంది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి చూస్తే వేసవికి ఢోకా లేదు. ఖరీఫ్‌ సీజన్‌కూ నీరు ఇవ్వవచ్చు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.  ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే అటు సాగునీరుకు, ఇటు తాగునీరుకు కటకట ఏర్పడనుంది.
అడుగంటి పోతున్న శ్రీశైలం
దక్షిణ తెలంగాణకు , ఏపీకి అత్యంత కీలకమైన బ్యాలెన్సింగ్‌  రిజర్వాయన్‌ శ్రీశైలం. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాలకే కాక పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా ఇక్కడి నుంచే మంచినీరు అందిస్తుంటారు.  శ్రీశైలంలో  ప్రస్తుతం 24 టీఎంసీల నీరే ఉంది.  నాగార్జునసాగర్‌ జలాశయంలో  507 అడుగుల నీటిమట్టాన్ని యధావిధిగా కొనసాగేటట్లు చేసేందుకు శ్రీశైలం నుంచి 14వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం పూర్తిగా అడుగంటి పోయే ప్రమాదముంది.  తుంగభద్ర, పులిచింతలలోనూ నీరు అడుగంటి పోతోంది. దీంతో దక్షిణ ప్రాంతంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగుంటుతోంది. కృష్ణా  జలాలనే హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నందన  రాజధాని ప్రజల దాహార్తికి పెద్ద కష్టమే వచ్చిపడేలా ఉందని అధికారులంటున్నారు.  ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టిసారించి.. ఎగువ రాష్ట్రాలతో మాట్లాడి కొంతనీటిని జలాశయాల్లోకి రప్పించి పెడితే వచ్చే పరిణామాలను సునాయాసంగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. 

18:39 - April 30, 2017

గద్వాల : అక్కడ అత్తా, అల్లుడు ఆధిపత్యం కోసం పోరాటం మొదలెట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఆ ఇద్దరూ ఒకరు గులాబీ గూటిలో ఉంటే.. మరొకరు కాంగ్రెస్‌లో ఉన్నారు. కృష్ణమోహన్‌ రెడ్డి, డికె. అరుణ రెండు రాజకీయ పార్టీలుగా విడిపోయారు. దీంతో ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో.. ప్రొటోకాల్‌ సమస్యతో స్థానిక నేతలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
ప్రోటోకాల్‌ రగడ 
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మొదటి నుండీ ప్రోటోకాల్‌ రగడ జరుగుతోంది. ఇందులో ఉన్న ప్రత్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అధికారం కోసం మేనల్లుడు కృష్ణమోహన్‌ రెడ్డి, ఆధిపత్యం కోసం డి. కె అరుణ.. ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యక్రమాల సాక్షిగా తలపడుతూ ఉంటారు. 
కృష్ణమోహన్‌ రెడ్డి, డి.కె అరుణలపై విమర్శలు 
వీళ్లిద్దరూ ఉద్రిక్తమైన ప్రసంగాల చేస్తూ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజలను ఫ్యాక్షన్ గ్రూపులుగా, కార్యకర్తలను అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లిస్తూ.. వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపే క్రమంలో కూడా అధికారులకు అవకాశం ఇవ్వకుండా స్టేజ్‌లపై ఇరువర్గాలు, ప్రోటోకాల్ అంటూ రగడ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ తప్పనిసరి పరిస్థితిలో ఒకే  కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరికి ఓట్లు వేసి రాజకీయ పట్టం కట్టడం ఆనవాయితీగా మారింది.
శాసన సభ్యుడిగా అవకాశం రావొచ్చనే ఊహాగానాలు
15 ఏళ్ల రాజకీయ చరిత్ర 
టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ స్థానిక గద్వాల శాసన సభ్యురాలు డికె అరుణకి కొరకరాని కొయ్యగా మారాడు. జిల్లా పరిషత్ చైర్మన్‌ మాటలు మంత్రులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడే చైర్మన్‌కు వచ్చే ఎన్నికల సమయంలో శాసన సభ్యుడిగా అవకాశం రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. 15 ఏళ్ల రాజకీయ చరిత్రలో మంత్రిగా, శాసన సభ సభ్యురాలిగా డీకే అరుణ మన్ననలు పొందారు. కానీ చైర్మన్ ఆవిడ లోపాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల దృష్టిలో ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం మరో సామాజిక వర్గానికి రుచించడం లేదు. దీంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయని విశ్లేషకులంటున్నారు. 

 

18:26 - April 30, 2017

నిజామాబాద్ : మిర్చి రైతులకు మద్దతు ధరపై తెలంగాణ సర్కార్‌ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు  కేంద్రం తరపున ప్రయత్నిస్తామని చెప్పారు.  నిజామాబాద్‌ జిల్లా పర్యటకు వెళ్లిన ఆయన... లక్కంపల్లి సెజ్‌ కోసం కేంద్రం 110 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు.  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా... నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించకపోవడం సిగ్గుచేటన్నారు.  ప్రజలు టీఆర్‌ఎస్‌ను క్షమించబోరని దత్తాత్రేయ అన్నారు. 

 

18:23 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి ప్రత్యేక సమావేశం నాలుగు నిమిషాల్లోనే ముగిసింది. మండలిలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. తొలుత కాంగ్రెస్‌ సభ్యుడు షబ్బీర్‌అలీకి మాట్లాడేందుకు చైర్మన్‌ స్వామిగౌడ్‌ అనుమతివ్వగా.. మిర్చికి మద్దతు ధరపై చర్చ చేపట్టాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. బీఏసీ నిర్ణయం ప్రకారం.. బిల్లుపై మాత్రమే మాట్లాడాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. దీంతో ఎటువంటి చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణ బిల్లును చైర్మన్‌ ఆమోదించారు. బిల్లు ఆమోదం తర్వాత మండలిని.. చైర్మన్‌ నిరవధికంగా వాయిదా వేశారు. 

 

18:18 - April 30, 2017

కృష్ణా : విజయవాడ దుర్గగుడి పైవంతెన పనులు ఒక అడుగు ముందుకు..ఆరు అడుగుల వెనక్కు అన్న చందంగా మారాయి. ఈ ఏడాది చివరికల్లా  పైవంతెన పనులను పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నా పనులు మాత్రం నత్తనడక సాగుతున్నాయి. దీంతో పైవంతెన నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అన్న అనుమానం నగరవాసుల్లో కలుగుతోంది. 
దుర్గగుడి పైవంతెన నిర్మాణానికి కొత్త చిక్కులు 
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం చెంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్లై ఓవర్ పై వంతెన, నాలుగు వరసల రహదారి నిర్మాణంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ రెండు ప్యాకేజీల మొత్తానికి 430 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. గుత్తేదారులకు ఇప్పటి వరకూ 150 కోట్లు చెల్లించారు. 5 కిలోమీటర్ల మేర నాలుగు వరసలు, రెండున్నర కిలోమీటర్ల పైవంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే నిర్మాణ పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఖరారు కాని ఆరు స్తంభాల ఆకృతులు 
జాతీయ రహదారికి మొత్తం మూడు ప్రాంతాల్లో అండర్ పాస్ ల నిర్మాణం జరగాల్సి ఉంది. దుర్గగుడి పైవంతెనకు సంబంధించి మొత్తం 47 స్తంభాలు ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే 35 స్తంభాల నిర్మాణం పూర్తవ్వగా, పన్నెండు పిల్లర్ల నిర్మాణం మాత్రం వివిధ దశల్లో ఉండగా.. వీటిలో 6 స్తంభాల ఆకృతులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు 
ప్లై ఓవర్ పనులు ఆలస్యం జరుగుతున్నాకొద్ది హైదరాబాద్, భద్రాచలం వైపు వెళ్లే వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి భారీ వాహనాలను నూజివీడు వైపు, ఇతర వాహనాలను గొల్లపూడి నుంచి బైపాస్ మీదుగా ఊర్మిళానగర్, కబేళా, మిల్క్ ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ ను వేగవంతంగా పూర్తి చేసి ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.  

 

18:09 - April 30, 2017

నిజామాబాద్ : పొట్ట చేతపట్టుకొని గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. నాలుగు రాల్లు సంపాదించుకుందామని అనుకున్నాడు. భార్య తన కుటుంబంతో హాయిగా జీవనం కొనసాగిద్దామనుకున్నాడు. కానీ విధి వక్రీకరించింది. చేయని నేరానికి దుబాయిలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తన భర్తను విడిపించండని భార్య కనిపించిన వారినల్లా వేడుకుంటోంది. కానీ పోలీసులు మాత్రం నామమాత్రంగానే కేసు నమోదు చేసి నిందితులను పట్టించుకోకుండా వదిలేసారని బాధితుని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. 
జీవనోపాధి కోసం దుబాయికి 
ఇక్కడ ఈ ఫోటోలో కన్పిస్తున్న ఈయన పేరు పూసల శ్రీనివాస్‌. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాడ్పకల గ్రామానికి చెందిన పూసల శ్రీనివాస్..7 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లాడు తిరిగి సెలవుపై 2016లో వచ్చాడు. ఆ తర్వాత..2016 ఏప్రిల్ 16 నాడు కమ్మర్ పల్లి మండలం నల్లూరు గ్రామానికి  చెందిన లతికను వివాహం చేసుకున్నాడు 4 సెప్టెంబర్ 2016లో తిరిగి దుబాయికి వెళ్లాడు. ఆతర్వాత మోర్తాడ్ మండలానికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ యజమాని మహేశ్ ఇచ్చిన డ్రగ్స్ కారణంగా జైలు పాలయ్యాడు. 
భర్త కోసం భార్య  న్యాయపోరాటం 
గల్ఫ్‌ దేశాలలో నిషేధించిన మందులను రవాణా చేస్తూ దుబాయి ఎయిర్ పోర్టులో పట్టుబడిన తడ్ పాకల్ శ్రీనివాస్‌కు విధించిన శిక్షను రద్దు చేసేందుకు అక్కడి కోర్టు అవకాశాన్ని కల్పించింది. అయితే మందుల మాఫియా అసలు సూత్రదారిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి పత్రాలను తమకు సమర్పిస్తే శ్రీనివాస్‌కు క్షమాబిక్ష ప్రసాదిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ మందులతో తమకు సంబందం లేదని శ్రీనివాస్ మొరపెట్టుకున్నా ఫలితంలేదు. దీంతో తన భర్తను విడిపించుకునేందుకు భార్య అతిక న్యాయ పోరాటం ఆరంభించింది.  
ఏడేళ్ల జైలు శిక్ష, 9 లక్షల జరిమానా 
శ్రీనివాస్‌ నిషేదిత మందులను తెచ్చినందుకు అక్కడి కోర్టు 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 9 లక్షల జరిమానా విధించింది. అయితే శ్రీనివాస్‌ను విడిపించేందుకు అతని స్నేహితుడు అనిల్ యాదవ్..ఒక అడుగు ముందుకేసి దుబాయికి విజిటింగ్ వీసాపై వెళ్లి అక్కడి జైల్లో శ్రీనివాస్‌ను కలిశాడు. 
శ్రీనివాస్‌కు క్షమాభిక్షకు అవకాశం 
అయితే శ్రీనివాస్‌కు దుబాయ్‌ కోర్టు క్షమాభిక్ష పెట్టేందుకు అవకాశం కల్పించింది. భారత్‌ నుండి మందుల సూత్రదారిపై కేసు నమోదు అయినట్లు కోర్టు ద్వారా ఇండియన్ ఎంబసీకి వస్తే వాటిని దుబాయి కోర్టులో సమర్పిస్తే శ్రీనివాస్‌కు విముక్తి కలుగనుంది. మే3 లోపల ఈ ప్రక్రియనంతా పూర్తిచేస్తే శ్రీనివాస్‌ క్షేమంగా భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. 

 

18:01 - April 30, 2017
17:53 - April 30, 2017
16:40 - April 30, 2017

గుంటూరు : చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ ముగిసింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయామని, అన్నివిధాలా నష్టపోయినందున నంద్యాల టికెట్ మాకే ఇవ్వాలని చంద్రబాబును కోరామని శిల్పా సోదరులు అన్నారు. అమెరికా టూర్‌ తర్వాత నిర్ణయం చెబుతానని సీఎం చెప్పారన్నారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.

 

16:37 - April 30, 2017

హైదరాబాద్ : మిర్చి రైతుల గురించి మరోసారి సమావేశం పెట్టుకొని చర్చించుకోవచ్చని.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూ సేకరణ చట్టం చేసింది కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కాబట్టి.. క్రెడిట్ అంతా వారికే దక్కాలని చూశారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలను కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 
కాంగ్రెస్‌ పార్టీని తీవ్రంగా విమర్శించిన మంత్రి తుమ్మల 
కాంగ్రెస్‌ పార్టీని టీఆర్‌ఎస్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగం కోసం భూ సేకరణ చట్టాన్ని చేసిందని చెప్పారు. భూ సేకరణ చట్ట సవరణ కాపీలు తీసుకొని.. ఏమీ తెలియదని మాట్లాడారని ఆరోపించారు. 

 

16:34 - April 30, 2017

హైదరాబాద్ : బిల్లుపై చర్చ జరగాల్సిన అవసరముందని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని.. తాము ముందే చెప్పినట్లు జానారెడ్డి చెప్పారు. సభలో మాట్లాడటానికి సమయమివ్వలేదని మండిపడ్డారు. ఆదివారం సభ పెట్టాల్సిన అవసరమేముందని జానారెడ్డి ప్రశ్నించారు. 
రైతు సమస్యలపై చర్చించని సభ ఎందుకు : ఉత్తమ్‌
రైతు సమస్యలపై చర్చించని సభ ఎందుకు అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. అన్యాయంగా రైతులపై కేసులు పెడుతున్నారని.. వారి ఆందోళనకు రాజకీయాన్ని ఆపాదించడం దారుణమని మండిపడ్డారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మిర్చి కొనుగోలు కోసం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌గా ప్రభుత్వం 1000 కోట్లు ప్రకటించాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
రైతులను బేషరతుగా విడుదల చేయాలి : మల్లు భట్టివిక్రమార్క   
ఖమ్మం మార్కెట్‌ యార్డులో మిర్చి రైతుల ఆందోళనను రౌడీల దాడిగా పోల్చడాన్ని మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. అరెస్ట్ చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు.    

 

కొత్త ఆలోచనలతో రైతుల సంక్షేమం అమలు : మంత్రి ఈటల

హైదరాబాద్ : కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో రైతుల సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ రైతుల సంక్షేమంలో భాగమేనని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే తమకు భవిష్యత్ ఉండదనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ఇప్పటికే అధోపాతాళానికి పోయింది... ప్రాజెక్టులపై ఇదే వైఖరి ప్రదర్శిస్తే మరింత దారుణమైన స్థితికి వెళ్తోందన్నారు.

2013 భూసేకరణచట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం

హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు  తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి చైర్మన్ స్వామిగౌడ్ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.

 

భూనిర్వాసితుల కనీస హక్కులు కాలరాస్తోన్న టీఆర్ ఎస్ : బి.వెంకట్

హైదరాబాద్ : భూనిర్వాసితుల కనీస హక్కులను టీఆర్ ఎస్ కాలరాస్తోందని తెలంగాణ భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ బి.వెంకట్ అన్నారు. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా ప్రవరిస్తోందని పేర్కొన్నారు. అధికార గర్వంతో కనీస ప్రజాస్వామ్య హక్కులను కూడా ప్రజలకు కల్పించడం లేదన్నారు. సీఎం సభకు రాకుండానే భూసేకరణ చట్టానికి సవరణ ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు. భూ నిర్వాసితుల సమస్యలపై పోరాడేందుకు వివిధ ప్రజా సంఘాలతో వేదిక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

15:45 - April 30, 2017

విజయవాడ : కృష్ణా నదిలో భారీ కబ్జాకు పాల్పడ్డారు. నది మధ్య నీటిలో 200ఎకరాలలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెన్సింగ్ కు వ్యతిరేకంగా కృష్ణా నదిలో పడవల మీద మత్స్యకారులు జల దీక్ష చేపట్టారు. ఫెన్సింగ్ తో మత్స్య సంపదకు తీవ్ర నష్టమని మత్స్యకారులు అంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం...

 

భూసేకరణ చట్ట సవరణ బిల్లు పాస్ చేయడం నీతిమాలిన చర్య : ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేసి 5 నిమిషాల్లోనే భూసేకరణ చట్టం సవరణల బిల్లును పాస్ చేయడం నీతి మాలిన చర్య అని అన్నారు. భూసేకరణ బిల్లును కేంద్రం ఆమోదించవద్దని సూచించారు. 

విచ్చలవిడిగా ప్రభుత్వం భూసేకరణ : ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : వ్యవసాయ మార్కెట్లలో చాలామంది చైర్మన్లు అవినీతికి పాల్పడుతున్నారని ప్రొ.కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం విచ్చలవిడిగా భూసేకరణ చేస్తోందన్నారు. బెదిరించి భూసేకరణకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంకా కేంద్రం అనుమతివ్వలేదన్నారు. ఫార్మాసిటీ కోసం ఏ కంపెనీలు కూడా ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రజల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మే 15న చలో ఇందిరాపార్క్ చేపడతామని చెప్పారు. గోలివాడ, ఎర్రగుంటపల్లిలో త్వరలో పర్యటిస్తామని చెప్పారు. శిల్పారామం పరిరక్షణకు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. 

 

చందానగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ : చందానగర్ పీఎస్ పరధిలో గంగారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులే కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు.

13:44 - April 30, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మద్యం ప్రియలు బార్లు, వైన్స్ వైపు పరిగెడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు మద్యంబాబులు బీర్లను తాగడానికే ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ఒక్కసారిగా బీర్ల రేట్లను పెంచేశారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 352 వైన్ షాపులు, 184 బార్ అండ్ రెస్టారెంట్లు, 3 క్లబ్ లు ఉన్నాయి. ఒక్కో బీర్ సీసాపై ఐదు రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఎక్కువ వసూలు చేస్తూ మందుబాబుల జేబుళ్లను వ్యాపారులు గుళ్ల చేస్తున్నారు. ధరలను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీరు సీసాకు అదనంగా డబ్బులు వసూలు చేయడంతో రోజువారీ బీర్లకు అదనంగా రూ.7 లక్షలు సిండికేటు రూపంలో వస్తోంది. 2016 ఫిబ్రవరిలో లక్ష 89వేలు, మార్చిలో లక్ష 96వేలు, ఏప్రిల్ లో రెండు లక్షల10వేల కేసుల బీర్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష 90వేలు, మార్చిలో 2లక్షల 15 వేలు, ఏప్రిల్‌ 25వ తేదీ వరకు లక్ష 60 వేల బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఈ లెక్కనా నెలకు రూ.2.40 కోట్ల అదనపు ఆదాయం వస్తోంవెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సిండికేట్‌గా మారిన వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మందుబాబులు కోరుతున్నారు.

 

 

13:32 - April 30, 2017

వేమన..ఈ పేరు తెలియని తెలుగువారుండరు. సమాజంలోని మూఢనమ్మకాలను మూర్ఖాచారాలను, కట్టుబాట్లను, ఛాందసవాదాలను చావుదెబ్బతీస్తూ...ఆటవెలది పద్యాల్లో నిజాలను నిర్భయంగా వెల్లడించిన సాంఘిక విప్లవకారుడాయన. ప్రజల భాషకు పట్టంగట్టిన ప్రజాకవి ఆయన. విశ్వదాభిరామ వినురవేమ మకుటంతో.. పద్యాలు రాసి.., శ్రమములోన పుట్టు సర్వముతానేను అంటూ విప్లవాత్మక భావజాలాన్ని ఆనాడే చెప్పిన తాత్విక కవి ఆయన. లోతైన విప్లవ భావాలతో జీవితానుభవాల నేపథ్యంలో..సమాజంలోని అనేక అంశాలపై పద్యాలల్లి నూతన భావాలు తెలుగు నాట అందించాడు వేమన. ప్రజాకవి వేమన సాహితీ సమాలోచనా సదస్సు అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా ఈ ఆదునిక కాలంలో వేమన పద్యాల పరిస్థితేంటి? ఆధునిక ప్రపంచంలో ఆయన భావాల ప్రాధాన్యత ఉందా? అసలు వేమన ప్రజాకవి ఎందుకయ్యాడు? మొదలైన అంశాల గురించి చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ తెలకపల్లి రవిగారు, సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు డా. పిల్లలమర్రి రాములు గారు చర్చలో పాల్గొన్నారు.

 

13:22 - April 30, 2017

హైదరాబాద్ : ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకోకుండా వెంటనే భూ సేకరణ చట్టాన్ని ఆమోదించడం దారుణమని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నుంచి తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని.. ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని ముందు నుంచి డిమాండ్ చేసినాపట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వంగా ప్రవర్తించిందని.. సీపీఎం పార్టీ తరపున ఆయన తీవ్రంగా ఖండించారు. 

 

13:03 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లుగానే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తన వ్యూహాన్ని అమలు చేసింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే చర్చ లేకుండానే భూసేకరణ చట్టానికి ఆమోదం పొందింది. 9 నిమిషాల్లోనే ప్రత్యేక సమావేశాన్ని ముగించిన స్పీకర్‌.. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. మిర్చి రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకొచ్చారు. స్పీకర్‌కు రక్షణగా మార్షల్స్‌ రంగంలోకి దిగడంతో.. కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్‌ మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై కాంగ్రెస్ సభ్యులు నిప్పులు చెరిగారు.

 

12:58 - April 30, 2017

గుంటూరు : సీఎం నివాసంలో కర్నూలు టీడీపీ నేతలు శిల్పా సోదరులు చంద్రబాబుతో ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు వదిలేసినట్టు తెలిపారు. గత ఎన్నికల్లో తను పోటీ చేసి ఓడిపోయా అని, అఖిల ప్రియాకు మంత్రి ఇచ్చారు కాబట్టి తనుకు ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వలని కోరినట్టు తెస్తోంది. సీఎం చంద్రబాబు వచ్చే నెల 11న అమెరికా నుంచి తిరిగి వచ్చాక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. 

12:42 - April 30, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా భూ సేకరణ బిల్లు ఆమోదించడాన్ని సీఎల్పీ నేత జానా రెడ్డి తప్పు బట్టారు. రైతులను అరెస్ట్ చేయడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పింకపోవడం, ప్రశ్నించేవారి గోంతు నొక్కండం దారుణమన్నారు. దీనికి ప్రజలే సమాధానం చెపాలని కోరారు. నేడు తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరు కలిసి ఖమ్మం వెళ్తున్నామని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత మూడేళ్లుగా రైతులు నష్టపోతున్నారని అన్నారు. పత్తి పంట విత్తకండి అని రైతులకు చెప్పిన ప్రభుత్వం కందులకు ధర కల్పించలేకపోయారని విమర్శించారు. భూ సేకరణ బిల్లు లో రైతులకు అన్యాయం చేసే విధంగా సవరణలు చేశారని తెలిపారు. రైతులు కడుపు మండి ఆందోళన చేస్తే దానికి విద్రోహం చర్య అనడం దారుణమన్నారు. భట్టి మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన వారు రైతులే. సీఎం ఖమ్మం వస్తే నిరూపిస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఖమ్మం రైతులు ఎవరికి భయపడారని అన్నారు. ఖమ్మంలో సెక్షన్ 144 విధించి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.

సీఎం నివాసానికి శిల్పా సోదరులు

గుంటూరు : సీఎం నివాసానికి కర్నూలు టీడీపీ నేతలు శిల్పా సోదరులు చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

11:55 - April 30, 2017
11:53 - April 30, 2017

గుంటూరు : రాజకీయ వ్యూహాలు రచించడం.. ప్రజలను ఆకట్టుకునేలా నేతల కార్యక్రమాలను రూపొందించడంలో పేరు పొందిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఇప్పుడు ఇతని పేరు ఏపీలో బాగా బలంగా వినిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలకు వ్యూహకర్తగా, సలహాదారుగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్ . 2014 ఎన్నికల్లో మోడీకి ప్రధాన ప్రచారకర్తగా.. ఆయన వేసిన ఎత్తులు, పైఎత్తులు బిజెపికి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక ప్రశాంత్ కిశోర్ బీహార్ ఎన్నికలకు నితీష్ కుమార్ బృందానికీ ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు.. ఆ ఎన్నికల్లో నితీష్ టీం విజయం సాధించింది.. మొన్న మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహం పారకపోయినా.. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టడంలో ప్రశాంత్‌ వ్యూహమే ప్రధానమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అట్లాంటి ప్రశాంత్‌కిశోర్‌.. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి
నిజానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ గడువు 2019 వరకూ ఉంది. కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలంటూ మోడీ లేవనెత్తిన అంశంపై నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ముందస్తు వచ్చే అవకాశం ఉందన్న భావనతో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టడం మొదలుపెట్టేసాయి. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్, ప్రశాంత్ కిశోర్‌తో మాట్లాడినట్లు సమాచారం. తాజాగా ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి 5రోజులు మకాం వేశారని చెబుతున్నారు. ఇక వచ్చే 5 నెలల్లో ఆయన టీం ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులు, జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుందట. అది పూర్తయ్యేవరకు తనను ఎవరూ సంప్రదించవద్దని నవంబర్ నుంచి తాను పార్టీకి టచ్ లోకి వస్తానని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం.

వైసీపీదే గెలుపని అంచనా వేశాయి
2014లో అన్ని సర్వే సంస్థలు వైసీపీదే గెలుపని అంచనా వేశాయి. కానీ జగన్ వ్యూహ లోపాలు.. చివరి నిమిషంలో చంద్రబాబు రాజకీయ చాణక్యత.. అటు పవన్ బీజేపీతో జతకట్టాలని తీసుకున్న నిర్ణయం వైసీపీ విజయావకాశాలపై నీళ్లు చల్లాయి. 2014 ఫలితాలు రిపీట్‌ కాకూడదని భావిస్తోన్న వైసీపీ అధినేత జగన్‌.. గెలిచేందుకు వీలున్న అన్ని అవకాశాలనూ పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే, ఈసారి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో.. ఎన్నికలు ఎదుర్కోవాలని జగన్‌ భావిస్తున్నట్లు భోగట్టా. మరి ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు.. తెలుగు రాష్ట్రంలో ఫలిస్తాయా..? జగన్ పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయా? ఏమో కాలమే తేల్చి చెప్పాలి.

 

 

11:45 - April 30, 2017
11:41 - April 30, 2017

విశాఖ : జిల్లాలోని గొల్లకంచరపాలెం, రామ్మూర్తి పంతులుపేట మీదుగా గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. ప్రజలు కూడా ఎలాంటి కష్టంలేకుండా రాకపోకలు సాగించేవారు. 1996లో కంచరపాలెంలో ప్లైఓవర్‌ నిర్మించారు. దీంతో బస్సుల తిరిగే మార్గం మారిపోయింది. దీంతో రామ్మూర్తిపంతులు పేట, గొల్లకంచరపాలెంతోపాటు సమీపంలోని ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే వారు ఆర్పీపేట రైల్వే గేటు గుండానే రాకపోకలు సాగించాలి. రైళ్ల రద్దీ ఎక్కువవ్వడంతో ఈ గేటు రోజుకు 20 గంటలూ మూసి ఉంచడంతో అవతలి వైపున్న ప్రజలు అష్టకష్టాలు పడేవారు. గంటలకొద్దీ నిరీక్షించేవారు. ఈ సమస్యతో వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతమంది నేతలకు మొరపెట్టుకున్నా సమస్యమాత్రం తీరలేదు. ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

స్థానిక ఎమ్మెల్యే గణబాబు 3కోట్ల..
ప్రజల విజ్ఞప్తుల మేరకు 2016 ఆగస్టులో రామ్మూర్తిపంతులు పేట దగ్గర అండర్‌పాత్‌వే నిర్మించేందుకు రైల్వేశాఖ అనుమతులు ఇచ్చింది. స్థానిక ఎమ్మెల్యే గణబాబు అండర్‌పాత్‌వే నిర్మాణం కోసం నియోజకవర్గం అభివృద్ధి నిధుల్లోంచి 3కోట్ల రూపాయలను రైల్వేకు బదలాయించారు. దీంతో శంకుస్థాపన పూర్తిచేసుకుని నిర్మాణానికి తొలి అడుగుపడింది. అయితే రైళ్లు ఎప్పుడూ తిరుగుతుండడంతో అండర్‌పాత్‌వే నిర్మాణానికి అడ్డంకిగా మారింది. దీనిపై రైల్వేశాఖ కసరత్తు చేసి 25వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు ముహూర్తంగా ఖరారు చేసింది. 25వతేదీ అర్ధరాత్రి 12 గంటలకు కూలీలతోపాటు జేసీబీలు, పరికరాలు, సామాగ్రి అక్కడకు చేరుకుంది. విశాఖ నుంచి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లగానే పనులు ప్రారంభించారు. ముందు రైలు పట్టాలను తొలగించారు. ఆ తర్వాత గోతులు తవ్వారు. ఆ తర్వాత అండర్‌పాత్‌వే కాంక్రీట్‌ పలకలను అమర్చారు. ఆ తర్వాత క్రేన్లతో మట్టిని పూడ్చివేశారు. అండర్‌పాత్‌ వే నిర్మించాక దానిపై మళ్లీ రైలుపట్టాలను బిగించి ఓ రైలును దానిమీదుగా పంపారు. కేవలం 4 గంటల్లోనే అండర్‌పాత్‌నే నిర్మించారు. దీంతో కంచరపాలెం, ఆప్పీపేట, దయానందనగర్‌ ప్రాంతవాసుల్లో ఆనందం వెల్లి విరిసింది. 20 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు అండర్‌పాత్‌వే నిర్మాణంతో తొలగిపోయాయి. దీంతో స్థానికులు ఎమ్మెల్యేతోపాటు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 

11:24 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కేవలన 10 నిమిషాల వ్యవధిలో మూడు సవరణలు చేపి బిల్లును అమోందించి. సవరణలను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు. మిర్చి రైతుల పై చర్చించాలని కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

11:02 - April 30, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత డీకె అరుణ విరుచుకపడ్డారు. తాము టీఆర్ఎస్ చేసిన భూసేకరణ బిల్లు చెల్లదని ఆనాడే తెలిపామని అన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని భంగపడిందని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. రైతుల గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులను చప్పట్లు అడుకుంటున్నారని ఎత్తిపోడిచారు. కేసీఆర్ నియంతలా వ్యవరిస్తున్నాడని తెలిపారు. భూసేకరణ బిల్లు కన్నా ముందు మిర్చి రైతుల పై చర్చించాలని డిమాండ్ చేశారు.

10:54 - April 30, 2017

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో భూ సేకరణ బిల్లుకు సవరణలు చేయనున్నారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు మండలి సమావేశం కానుంది. గవర్నర్ నరసింహాన్ పదవి కాలం మే లో ముగుస్తుండగా ఈలోపు కేంద్ర తిప్పి పంపిన భూ సేరకరణ బిల్లు పై సవరణలు చేసి వెంటనే ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బిల్లులో నష్టపరిహారం, కలెక్టర్లకు అధికారలపై కేంద్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు సభలో సర్కారును ఎండగట్టేందుకు విసక్షాలు ఏకమవుతున్నాయి. గతంలో చేసిన తప్పులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయబోతున్నాయి. మిర్చి రైతుల సమస్యలపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టనుంది. నిన్న జరిగిన బీఏసీ సమావేశానిక బీజేపీ, టీడీపీని ఆహ్వానించపోవడంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి.

భారత్ కు టర్కీ అధ్యక్షుడు

ఢిల్లీ : టర్కీ అధ్యక్షుడు టయ్యిస్ ఎర్డోగాన్ భారత్ చేరుకున్నారు. భారత్ తో సంబంధలు నెలకోల్పడమే లక్ష్యంగా పర్యటన చేస్తున్ననాని ఆయన అన్నారు.

ఢిల్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీ : దేశ రాజధానిలోని మాల్వియానగర్ లో అగ్నాప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందారు, ఇద్దరికి గాయాలయ్యాయి. 30 చెత్త గోదాంలు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరకుని మంటలార్పుతున్నారు.

జైనథ్ లో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్ : జిల్లాలోని జైనథ్ మండలం మాండగడలో గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 పెంకుటింళు, 2 పశువుల పాకలు దగ్ధం అయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

08:45 - April 30, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హబ్సిగూడలోని విద్యాసాగర్‌ రావు ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అంబర్‌పేట శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్‌రావు కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాసవిడిచారు. 

నేడు టీఎస్ అసెంబ్లీ సమావేశం

హైదరాబాద్ : నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతోంది. ఈ సమావేశంలో భూ సేకరణ బిల్లుకు సవరణలు చేయనున్నారు.

08:34 - April 30, 2017

ఢిల్లీ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనం వీడారు. పంజాబ్‌, గోవా, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వరుస పరాజయం తర్వాత పార్టీ నేతలు టార్గెట్‌ చేయడంతో కేజ్రీవాల్‌ ట్వీట్టర్‌ ద్వారా స్పందించారు. గత రెండు రోజులుగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లతో కూడా మాట్లాడానని కేజ్రీవాల్‌ చెప్పారు. తమ పార్టీ పొరపాట్లు చేసిందని అంగీకరించారు. వరుస పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకుంటానని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 272 స్థానాలకు గాను ఆప్‌ కేవలం 48 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిజెపి 181 స్థానాలను కైవసం చేసుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్‌ చేయడం వల్లే ఆప్‌ ఓటమి చవిచూసిందని కేజ్రీవాల్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

08:31 - April 30, 2017

ఢిల్లీ : బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా 2019 ఎన్నికలే లక్ష్యంగా 95 రోజులపాటు దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం జమ్ము చేరుకున్నారు. బిజెపికి ఏమాత్రం పట్టులేని రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు అమిత్‌ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు 6 వందల మందితో కూడిన ఫుల్‌ టైం టీం కృషి చేస్తోంది. బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు గుజరాత్‌, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, లక్ష్యద్వీప్‌లలో అమిత్‌ షా 15 రోజుల పాటు తిష్ట వేయనున్నారు.

 

08:27 - April 30, 2017

ఆదిలాబాద్ : జిల్లాలోని మారుమూల గిరిజన ప్రజలు ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని కొట్టు మిట్టాడుతున్నారు. భూగర్భ జలాలన్నీ అడుగంటి పోవడంతో భీంపూర్ మండలం గుంజాల సమీపంలో కొలం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వారంరోజులుగా తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడడంతో గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచివెళ్తున్నారు. 40కి పైగా జనాభా ఉన్న ఈ పల్లెలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో..పల్లెకు సమీపంలో ఉన్న వాగులో చెలిమెలు తవ్వుకొని నీళ్లను తెచ్చుకుంటున్నారు. దీంతో చెలిమలలోని కలుషిత నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు.భానుడి భగభగకు భూగర్భజలాలు అడుగంటి పోవడంతో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదురుకుంటున్నారు. సిరికొండ మండలంలోని నిజాంగూడ ప్రజలు బిందెడు నీటికోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. గ్రామంలోని బావులు, చేతి పంపులు పనిచేయక పోవడంతో కిలో మీటరు దూరంలో ఉన్న బావి నుండి ఎండను సైతం లెక్కచేయకుండా నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం పనులకు సైతం వెళ్లడం లేదని,చిన్నా పెద్ద తేడా లేకుండా నీటికోసమే ఉంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రిబవళ్ళు పడిగపలు..
రక్షిత మంచినీటి పథకాలు..పడకేస్తుండటంతో ఇంద్రవెల్లి మండలంలోని మారుతీ గూడ, టెకడి గూడ, గట్టెపల్లి, దొండాడతండా, చిత్తగూడ, కొలాంగూడ తదితర గిరిజన గ్రామాల్లో త్రాగునీటికోసం గ్రామాల సమీపంలోని వాగులోని చెలిమెల నీటికోసం మైళ్ళ దూరంవెళ్లి రాత్రిబవళ్ళు పడిగపలు పడాల్సి వస్తుంది. వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రణాళికలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు.తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత శాఖా అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రజలపాలిట శాపంగా మారుతుంది.తాగునీటి ఎద్దడి తీర్చేందుకు రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమౌతున్నాయి

08:23 - April 30, 2017

విశాఖ : సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కన్నులపండుగగా జరిగింది. విశాఖలోని సింహగిరిపై జరిగిన ఈ వేడుకకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు. ఏడాదిలో 364 రోజులు నిత్యరూపంలో దర్శనమిచ్చే స్వామివారు..వైశాఖ శుద్ధ తదియనాడు, నిజరూపంలో దర్శనమిస్తారు. నిజరూపంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భక్తి పారవశ్యంతో ఎదురుచూశారు. తెల్లవారుజామున ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు స్వామివారికి పట్టువస్త్రాలు, చందనం సమర్పించారు. అనంతరం గవర్నర్ నరసింహన్‌, మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, ఎమ్మెల్యే, ఎంపీలు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే లక్షలాది మంది భక్తులు సింహగిరికి పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని..గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. 

08:20 - April 30, 2017

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ నజర్‌ పెట్టారా? కాంగ్రెస్‌ ముఖ్యనేతలే టార్గెట్‌గా గులాబీ బాస్‌ వ్యూహాలు రచిస్తున్నారా? కాంగ్రెస్‌ నేతలకు చెక్‌ పెట్టేందుకు కేసీఆర్‌ పన్నిన పన్నాగం ఏమిటి? నల్లగొండలో కాంగ్రెస్‌ను చిత్తు చేసేందుకు కేసీఆర్‌ వేసిన ఎత్తుగడ ఏంటి? పాత నల్లగొండ జిల్లాపై ఎప్పుడూ కాంగ్రెస్‌ ఆధిపత్యమే కొనసాగింది. ఆ ఆధిపత్యం నేటికీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ గాలి దావానంలా రాష్ట్రమంతా వ్యాపించినా.. నల్లగొండలో మాత్రం కాంగ్రెస్‌ చెక్కుచెదరలేదు. టీఆర్‌ఎస్‌ హవాను తట్టుకుని నిలబడింది. 2 పార్లమెంట్‌ , 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరిసగం గెలిచాయి. అందులోనూ మూడుచోట్ల టీఆర్‌ఎస్‌ అత్తెసరు మెజార్టీతో గెలుపొందింది. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడంలోనూ నల్లగొండ జిల్లా ముఖ్యపాత్ర పోషించిందనే చెప్పాలి. అందుకే నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కు పీసీసీ అధ్యక్షుడయ్యారు. అదే జిల్లాకు చెందిన జానారెడ్డి ప్రతిపక్ష నేత కాగలిగారు.

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌..
ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించింది. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌నాయక్‌ కూడా టీఆర్‌ఎస్‌ తీర్ధంపుచ్చుకున్నారు. మిగిలిన కాంగ్రెస్‌ నేతలంతా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారే కావడంతో వారు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్‌కు జిల్లాలో చెక్‌ పెట్టడానికి అధికార పార్టీ వ్యూహరచన చేస్తోంది.

గులాబీ బాస్‌ వ్యూహాలు..
నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే దిశగా గులాబీ బాస్‌ వ్యూహాలు రచిస్తున్నారు. నల్లగొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుపొంది చరిత్ర తిరగరాయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈసారి నల్లగొండ జిల్లా నుంచే పోటీ చేయనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సన్నిహితుల దగ్గర దీనిపై చర్చించినట్టు సమాచారం. జిల్లాలో ఇదే ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది. అన్ని పార్టీల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల్లో మాత్రం ఈ ప్రచారం ఉత్సాహాన్ని ఇస్తోంది.నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రైతు ఈ మధ్య కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలతోపాటు జిల్లా రాజకీయాలపైనా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో తాను నల్లగొండ జిల్లాలో పోటీ చేయాలన్న ఆలోచనను కేసీఆర్‌ ఆ రైతుతో ప్రస్తావించినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌తోపాటు నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు మనోగతాన్ని బయటపెట్టారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి ఇప్పుడు నల్లగొండలో హాట్‌టాఫిక్‌గా మారింది. నల్లగొండ జిల్లాలో కేసీఆర్‌ ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటన్నదానిపై చర్చ నడుస్తోంది.

100 సీట్లు సాధించడమే గులాబీ బాస్‌ లక్ష్యం
2019లో జరుగనున్న ఎన్నికల్లో 100 సీట్లు సాధించడమే గులాబీ బాస్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీకి పటిష్ట పునాదులు ఉన్నాయి. ఇక దక్షిణ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో పార్టీ బలహీనంగానే ఉంది. 100 సీట్లు సాధించాలంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి గండికొడితేనే అది సాధ్యమని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే అక్కడి నుంచి పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్నారు. మరి కేసీఆర్‌ వ్యూహాన్ని కాంగ్రెస్‌ నేతలు ఎలా తిప్పికొడతారో చూడాలి.

08:15 - April 30, 2017

పశ్చిమ గోదావరి : రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిరుద్యోగులకు భృతితో పాటు... రేషన్‌కు బదులుగా నగదు కావాలంటే ఇచ్చేందుకూ సిద్ధమేనని ప్రకటించారు. రాష్ట్రంలో వందశాతం వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్న జిల్లా పశ్చిమగోదావరి జిల్లాయేనని, ప్రజలకు నీతిమంతమైన, సమర్థమైన పాలన అందజేస్తామని స్పష్టంచేశారు. రాజకీయ నాయకులు నీతివంతమైన పాలనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు అవినీతికి పాల్పడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. జూన్‌ నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు.

పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారు..
పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో వందశాతం వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్న జిల్లా పశ్చిమగోదావరేన‌ని అన్నారు. వ్యవసాయానికి 7గంటలు, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్‌ అందజేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 47లక్షల మందికి వెయ్యి పింఛను చొప్పున ఇస్తున్న ఘనత TDP ప్రభుత్వానిదేనన్నారు. తాను కాలుష్యం అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ముందుకు వెళుతున్నాన‌ని, అది పెర‌గ‌డాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోన‌ని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు నల్లజర్ల మండలం పోతవరంలో పర్యటించిన చంద్రబాబు... ఎన్‌టీఆర్‌ గృహనిర్మాణ పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం... అంగన్‌వాడీ పాక్స్‌ గోదాము, పీహెచ్‌సీ, ఆర్‌ఎంసీ వంతెన నిర్మాణ పనులతో పాటు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 

08:09 - April 30, 2017

ఖమ్మం : పుడమినే నమ్ముకున్నారు. పుట్టెడు కష్టాలను తట్టుకుని ఇంటిల్లిపాదీ శ్రమించారు. మొక్కమొక్కకూ నీరుపోసి ప్రాణంగా పెంచారు. తెగుళ్ల బారిన పడిన పంటను పురుగుమందు చల్లి కాపాడుకున్నారు. శ్రమనంతా ధారపోసి దిగుబడి తీశారు. ఎన్నో ఆశలతో పంటను మార్కెట్‌ను తరలిస్తే అన్నదాతకు ఆక్రందనే మిగిలింది. గిట్టుబాటు ధరలేక మిర్చిరైతు అల్లాడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోతే ప్రభుత్వంపై కన్నెర్రజేశారు. ఖమ్మం జిల్లాలో ప్రతిఏటా 19వేల హెక్టార్లలో మిర్చిపంట సాగు చేస్తుంటారు. అయితే గత ఖరీఫ్‌ సీజన్‌లో 29వేల హెక్టార్లలో సాగు చేశారు. ఖరీఫ్‌లో పత్తిపంటను సాగు చేయొద్దని ప్రభుత్వమే ప్రచారం చేసింది. ఈసారి తెల్ల బంగారానికి మద్దతు ధర ఉండదని చెబుతూ మిర్చి , అపరాల పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. దీంతో రైతులంగా అత్యధికంగా మిర్చి పంటను సాగుచేశారు. సాధారణ విస్తీర్ణం కంటే 10వేల హెక్టార్లలో మిర్చి విస్తీర్ణం పెరిగింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రతిఏటా వచ్చే ఉత్పత్తి కంటే అదనంగా ఉత్పత్తి వచ్చింది.

భారీ స్థాయిలో మిర్చి పంట
సాధారణంగా డిసెంబర్ మొదలుకొని మే నెల వరకూ మిర్చిపంట మార్కెట్‌కు అమ్మకానికి వస్తుంది. గతేడాది అయితే ఒకరోజు లక్ష బస్తాల మిర్చి మార్కెట్‌కు విక్రయానికి వచ్చింది. ఇదే రికార్డు అనుకుంటే ఈ ఏడాది ఒకే రోజు లక్షా 50వేల బస్తాలకుపైగా మిర్చి వచ్చింది. ప్రతి ఏడాది ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పాత ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్‌, నల్లగొండ, సూర్యాపేట, ఆంధ్రలోని కృష్ణా జిల్లా నుంచి మిర్చి వస్తుంది. ఈ ఏడాది కూడా ఖమ్మం మార్కెట్‌కు ఈ జిల్లాల నుంచే మిర్చి వచ్చింది. వారం రోజుల నుంచి మార్కెట్‌కు మిర్చి భారీగా వస్తోంది. సరిగా కొనుగోళ్లు చేయకపోవడంతోమార్కెట్‌ బయట రోడ్లపై మిర్చి బస్తాలను ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పీఎస్‌ఆర్‌ రోడ్డులో మూడు బొమ్మల సెంటర్‌ వరకూ మిర్చి బస్తాలు పేరుకుపోయాయి.

కొద్ది రోజుల్లోనే 2వేల రూపాయలకు
ఊహించని విధంగా మార్కెట్‌కు మిర్చి తరలివస్తుండడంతో దళారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మార్కెట్‌ అధికారులూ దళారులతో కలిసి పోయారు. రైతులను నిండా ముంచేందుకు స్కెచ్‌ వేశారు. జనవరిలో రూ. 12,500 పలికిన క్వింటా మిర్చి ధరను రోజురోజుకూ తగ్గించుకుంటూ వచ్చారు. ఏప్రిల్‌ నెల వచ్చేసరికి క్వింటాల్‌ ధర 3వేల రూపాయలకు పడిపోయింది. అంతేకాదు... కొద్ది రోజుల్లోనే 2వేల రూపాయలకు పడిపోయింది. వ్యాపారులు, మార్కెట్‌ అధికారులు కలిసి రైతులకు గత్యంతరంలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ధర తక్కువ ఉన్నందున కోల్డ్‌ స్టోరేజీల్లోనైనా దాచుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. కమీషన్‌ ఏజెంట్ల స్టాక్‌ అందులో మూల్గుతుండడంతో రైతులు మిర్చిని ఎక్కడ దాచాలో తెలియక ఆశలే పెట్టుబడిగా పెట్టి సాగుచేసిన పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. సీజన్‌ ప్రారంభానికి ముందు ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధర రూ. 12వేల పైచిలుకూ పలికింది. ఫిబ్రవరిలో అదికాస్తా రూ. 10వేలకు, ఆ తర్వాత 6వేలకు పడిపోయింది. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై మిర్చి రైతును నిలువునా దోచుకుంటున్నారు. దీంతో అన్నదాతలు కన్నీమున్నీరయ్యారు. మిర్చి ధర పడిపోవడంతో అన్నదాతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిలువు దోపిడీ చేస్తున్న వారిపై తిరగబడ్డారు. మార్కెట్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అన్నదాడ కడుపు మండితే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చూపించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. కొనుగోళ్లను ప్రారంభించింది.

 

08:03 - April 30, 2017

హైదరాబాద్ : భూసేకరణ చట్ట సవరణల కోసం.. తెలంగాణ శాసనసభ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. గతంలో తెలంగాణ భూసేకరణ చట్టం బిల్లును.. తమ సవరణలను బేఖాతరు చేస్తూ ఆమోదింపచేసుకున్న కేసీఆర్‌ సర్కారును.. ఈసారి తీవ్రంగా ఎండగట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని విపక్షాలు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది. భూ సేకరణ బిల్లుకు ఉమ్మడి సభల ఆమోదం పొందాక.. బిల్లు ప్రతిని ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. గతంలో కేంద్రానికి పంపిన బిల్లుకు కేంద్ర న్యాయశాఖ కొన్ని సవరణలను సూచించింది. కలెక్టర్లకు అధికారం ఇచ్చినా ...ఫెయిర్ కాంపెన్జేషన్‌ ఇస్తామన్న పదం జోడించాలని,నిర్ధారించేందుకు అనే పదాన్ని రీ విజిట్ అన్న పదంతో మార్పు చేయాలని, (3,10) క్లాజ్‌లను తొలగించాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. ఈమేరకు కేసీఆర్‌ సర్కారు, సిఎస్ , ఇరిగేషన్ , రెవిన్యూ, న్యాయ శాఖల అధికారులతో సమావేశమై.. కేంద్ర సూచనల మేరకే సవరణలు చేసింది.

వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధం
ఆదివారం నాటి సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. గత సమావేశంలో 2013 భూసేకరణ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని విపక్షాలన్ని పట్టుపట్టినా.. అధికార పార్టీ సంఖ్యా బలంతో బిల్లును పాస్ చేయించి కేంద్రానికి పంపింది. అది కేంద్రం నుంచి తిరుగుటపాలో రావడంతో, దీన్ని అస్త్రంగా మలచుకుని కేసీఆర్‌ సర్కారును నిలదీయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సేకరణ చట్టం 2013నే అమలు చేయాలని సీపీఎం పట్టుబడుతోంది.

బీఏసీ భేటీకి, టీడీపీ, బీజేపీల అందని ఆహ్వానం
ఇక సభలో విపక్షాలకు ఛాన్స్‌ ఇవ్వరాదని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. శనివారం జరిగిన బిఏసీ భేటీకి, టీడీపీ, బీజేపీలను ఆహ్వానించక పోవడం కూడా వ్యూహాత్మకమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్‌ టాపిక్‌గా ఉన్న మిర్చి రైతు సమస్యలపై చర్చకూ... బీఏసీలో కాంగ్రెస్‌ పట్టుబట్టింది. అయితే, భూసేకరణ చట్టం సవరణలకు మాత్రమే సభ పరిమితమని కేసీఆర్‌ సీఎల్పీ నాయకులకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం నాటి అసెంబ్లీ భేటీ.. ఎలా సాగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 

07:55 - April 30, 2017

హైదరాబాద్ : రాష్ట్రాభివృద్దికి కీలకమైన భూసేకరణ బిల్లులో సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లులో కేంద్రం సవరణలు కోరింది. భూసేకరణ బిల్లులో విపక్షాలు అనేక సూచనలు చేసినా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సభలో తమ సంఖ్యాబలంతో బిల్లును పాస్‌ చేయించుకుని విపక్షాల సూచనలను తుంగలో తొక్కింది. ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీసుకొచ్చిన ఈ బిల్లుకు కేంద్రం ప్రభుత్వం సవరణలు కోరింది. దీంతో భూసేకరణ బిల్లులో సవరణలు చేయడానికి ఇవాళ శాసనసభా సమావేశం నిర్వహిస్తోంది.

2013కు లోబడే తమకంటూ ప్రత్యేక చట్టం ఉండాలని
భూసేకరణ చట్టం -2013కు లోబడే తమకంటూ ప్రత్యేక చట్టం ఉండాలని విపక్షాలు, నిపుణులు , ప్రజాసంఘాలు ముందునుండి వాదిస్తున్నాయి. అయితే ఈ మాటలను ప్రభుత్వం మాత్రం పెడచెవినే పెట్టింది. అంతేకాదు విపక్షాలు చేసిన సూచనలను సైతం పట్టించుకోకుండా తనకున్న సంఖ్యాబలంతో అసెంబ్లీలో బిల్లును పాస్‌ చేయించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఈ బిల్లును పరిశీలించిన కేంద్రం పలు సవరణలు చేయాలంటూ వెనక్కి పంపింది. ప్రధానంగా మూడు అంశాలకు కేంద్రం సవరణలను కోరింది. భూసేకరణ చట్టం జనవరి 2014 నుంచి అమల్లోకి వస్తుందని ఒకచోట, గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి అమలవుతుందని మరోచోట పేర్కొన్నారు. ఇదే అంశాన్ని కేంద్ర న్యాయశాఖ లేవనెత్తింది. ఒకేచట్టం అమలుకు రెండు తేదీలు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. దాన్ని మార్చకుంటే న్యాయపరంగా చిక్కులు తలెత్తుతాయని సూచించింది. దీంతో కేంద్ర భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్ర చట్టం కూడా అమల్లోకి వస్తుందనే సవరణను చట్టంలో చేర్చనున్నారు.

పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్రం తప్పుపట్టింది
చట్టంలో తెలంగాణ సర్కార్‌ పేర్కొన్న మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్రం తప్పుపట్టింది. భూసేకరణ సమయంలో స్థానిక మార్కెట్‌ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. దీనిని తప్పుపట్టిన కేంద్రం.... పాత మార్కెట్‌ విలువ కాకుండా భూసేకరణ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించేలా సవరణ చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగానే సేకరణకు ముందు ఆయా నిర్దిష్ట ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువను సవరించి ఈసారి చట్టంలో పొందుపర్చనున్నారు. కేంద్ర చట్టంకంటే మెరుగైన పరిహారం ఇచ్చేదానిపైనా కేంద్రం సవరణ చేయాలని సూచించింది. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడురెట్లు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో నాలుగురెట్ల పరిహారం ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టంలో ఉంది. అంతకంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్రప్రభుత్వం చట్టంలో పేర్కొంది. ఐతే ఇందుకు సంబంధించిన పదజాలంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. ఆ మేరకు సవరణలు చేసి బిల్లులో పొందుపర్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బిల్లును రూపొందించింది. ఈసారి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా రాష్ట్రపతి ఆమోదం పొందాలన్న ఆలోచనలో ఉంది. ముసాయిదా కాపీపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటోంది. విపక్షాలు మాత్రం రైతులకు మేలు చేసే భూసేకరణ చట్టం 2013నే అమలు చేయాలని కోరుతున్నాయి. మొత్తానికి భూసేకరణ చట్టం బిల్లుపై అసెంబ్లీ మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్దమైంది. ఈసారైనా ప్రభుత్వం విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి సర్కార్‌ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

07:46 - April 30, 2017

గొర్రెలు, మేకల కొత్తగా చేపట్టే వారు తక్కువ ఖర్చుతో మొదలుపెట్టాలని చెప్పారు. షెడ్డు నిర్మాణం పై ప్రముఖ్యం ఇవ్వల్సిన అవసరం లేదన్నారు. షెడ్డును తాటకులతో గానీ రెకులతో గాని వేసుకోవాలి. జీవాల పెంపకం తాము ట్రైనింగ్ ఇస్తున్నమన్నారు ఈ సారి మే 7 నుంచి ట్రైనింగ్ ఇస్తునట్టు తెలిపారు. తామను సంప్రదించాలంటే 9000322264ఫోన్ చేయాలని తెలిపారు. గొర్రెల, మేకల పెంకంలో మూడు పద్దతులు ఉన్నాయిని అన్నారు. మొదటిది ఉదయం తీసుకెళ్లి సాయంత్రం రావడం, రెండవది జీరోగ్రెజింగ్, మూడవది సెమిస్టర్ పద్దతి అని చెప్పారు. జీరోగ్రెజింగ్ లో పశులవులను షెడ్డులో పెంచాలని తెలిపారు. ఈ విధానంలో ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో తల్లిని బిడ్డతో జతచేసిన తర్వాత గంట తర్వాత విడగొట్టాలి. ఆ సమయంలో దాన ఇవ్వలి. ఇలా ప్రతి రెండు గంటలకు దాన అందజేయాలని అన్నారు. కనీసం 100 గొర్రెలు లేదా మేకలతో మొదలు పెడితే ఖర్చు తక్కువగా వస్తుందని తెలిపారు.

 

బీజేపీ ఎమ్మెల్యేల పాదయాత్ర

 

హైదరాబాద్ : నేడు ఉదయం 10గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేయనున్నారు. అమరవీరుల స్థూపం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర కొనసాగనుంది. తన సస్పెన్షన్ ను ఎత్తి వేయాలి బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో విద్యాసారగర్ అంత్యక్రియలు

హైదరాబాద్ : ఉదయం 9 గంటలకు అంబర్ పేట శ్మశానవాటిలో నీటి పారుదల రంగ నిఫుణుడు విద్యాసాగర్ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరుపనున్నారు.

Don't Miss