Activities calendar

01 May 2017

21:29 - May 1, 2017

హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌ కుల్గామ్‌ జిల్లాలో మిలిటెంట్లు బీభత్సం సృష్టించారు. జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన క్యాష్‌ డెలివరీ వ్యాన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మిలిటెంట్ల దాడిలో గాయపడ్డ సెక్యురిటీ గార్డు పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం ఉగ్రవాదులు క్యాష్‌ వ్యాన్‌లో ఉన్న 50 లక్షల నగదు, ఆయుధాలు తీసుకుని పరారయ్యారు. ఉగ్రవాదులు వ్యానులో ఉన్న బ్యాంకు అధికారులు, పోలీసులను బయటకు ఈడ్చి కాల్పులు జరిపినట్లు డిఐజి ఎస్‌.పి.పాణి తెలిపారు.

21:27 - May 1, 2017

హైదరాబాద్: పాకిస్తాన్‌ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కృష్ణఘాటి సెక్టార్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు పెట్రోలింగ్‌ జరుపుతున్న భారత జవాన్లపై పాకిస్తాన్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. మరో జవానుకు గాయాలయ్యాయి. మృతులను బిఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌సాగర్, ఆర్మీ జెసిఓ పరమ్‌జిత్‌సింగ్‌లుగా గుర్తించారు.

భారత జవాన్ల మృతదేహాలను ముక్కలు ముక్కలుగా...

అంతటితో ఆగని పాకిస్తాన్ బోర్డర్‌ యాక్షన్‌ టీం- భారత జవాన్ల మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరకడం ద్వారా తన పైశాచికత్వాన్ని చాటుకుంది. అత్యంత హేయమైన రీతలో జరిపిన ఈ కిరాతక చర్యకు తగిన రీతిలో బదులిస్తామని భారత ఆర్మీ ఉత్తర కమాండ్‌ ఓ ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది. పాక్‌ కాల్పులతో అప్రమత్తమైన భారత్‌ ఎదురు కాల్పులు జరిపి ధీటైన జవాబు చెప్పింది.

కశ్మీరీలకు తమ మద్దతు తమ మద్దతు కొనసాగుందన్న పాక్ ఆర్మీ...

తమ హక్కుల కోసం పోరాడుతున్న కశ్మీరీలకు తమ మద్దతు కొనసాగుతుందని పాక్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బాజ్‌వా మరోసారి వివాదస్పద ప్రకటన చేశారు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద పర్యటించిన ఆయన-ఇండియానే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

కశ్మీర్‌లో అలజడుల నేపథ్యంలో ...

కశ్మీర్‌లో అలజడుల నేపథ్యంలో పాక్‌ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో ఏడుసార్లు దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత్‌తో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది.

జమ్ముకశ్మీర్‌ కుల్గామ్‌ జిల్లాలో మిలిటెంట్లు బీభత్సం

జమ్ముకశ్మీర్‌ కుల్గామ్‌ జిల్లాలో మిలిటెంట్లు బీభత్సం సృష్టించారు. జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన క్యాష్‌ డెలివరీ వ్యాన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మిలిటెంట్ల దాడిలో గాయపడ్డ సెక్యురిటీ గార్డు పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం ఉగ్రవాదులు క్యాష్‌ వ్యాన్‌లో ఉన్న 50 లక్షల నగదు, ఆయుధాలు తీసుకుని పరారయ్యారు. ఉగ్రవాదులు వ్యానులో ఉన్న బ్యాంకు అధికారులు, పోలీసులను బయటకు ఈడ్చి కాల్పులు జరిపినట్లు డిఐజి ఎస్‌.పి.పాణి తెలిపారు.

21:23 - May 1, 2017

ఖమ్మం: కష్టాల్లోఉన్న రైతుల్ని కలిసేందుకు వెళ్లిన ప్రతిపక్షాల్ని ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు.. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి.. ఖమ్మం మార్కెట్‌ యార్డు ఘటనలో రైతుల్ని రౌడీలుగా మంత్రులు చిత్రీకరించారని మండిపడ్డారు.. అన్నదాతల సమస్యల్ని పట్టించుకోని సీఎం కేసీఆర్‌కు ఆ రైతులే బుద్దిచెబుతారని హెచ్చరించారు..

21:22 - May 1, 2017

హైదరాబాద్: రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నాణ్యమైనవి అందేలా చూడాలని అధికారుల్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.. నకిలీ విత్తనాలు, పురుగులమందులు అమ్మితే పీడీ యాక్టు పెట్టేలా కఠిన చట్టం చట్టం రూపొందించాలని సూచించారు.. దీనికి సంబంధించి త్వరలో ఆర్డినెన్స్‌ జారీ చేస్తామని ప్రకటించారు.. ఆహార పదార్థాల్ని కల్తీచేసేవారిపైకూడా ఉక్కుపాదం మోపే విధానం తయారుచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నాణ్యమైన కూరగాయలు, పండ్లను మన రైతులే పండించి అమ్మేలా తగు సహకారం అందించాలన్నారు.. పెట్టుబడినుంచి గిట్టుబాటు ధరవరకూ రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పారు.. కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌కు ఫోన్‌ చేసిన కేసీఆర్‌.. ఈ ఖరీఫ్‌కు సరిపడే ఎరువుల్ని అందించాలని కోరారు.. వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, పార్థ సారధి, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌ రావు, హార్టికల్చర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు..

21:19 - May 1, 2017

హైదరాబాద్:దరాబాద్: ప్రగతి భవన్ లో రోడ్లు భవనాల శాఖపై పనితీరును.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. రహదారులపై భారీగా గుంతలు ఏర్పడ్డాయని.. వాటన్నిటినీ నెలలోపు పూడ్చివేయాలని ఆయనీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొత్త రహదారుల నిర్మాణంతోపాటు రోడ్ల మరమ్మతులకూ నిధులిచ్చామని, అయినా ఇంకా రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయంటూ కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గుంతలు పూడ్చాలని గతంలోనే చెప్పినా పట్టించుకోలేదు: కేసీఆర్‌

తానీమధ్య వరంగల్‌ జిల్లాలో పర్యటించినప్పుడు రోడ్లపై అనేక గుంతలు కనిపించాయని కేసీఆర్‌ రివ్యూ సందర్భంగా చెప్పారు. రోడ్లపై గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చేయాలని గతంలోనే చెప్పానని... అయినా అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి రోడ్లపై ఎక్కడ గుంతలు కనిపించినా ఉపేక్షించబోమన్నారు. జూన్‌ 1 తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ... గుంతలు కనిపిస్తే అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. రోడ్ల మరమ్మతు ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగాలన్నారు.

15 రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశం....

నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలవాలని కేసీఆర్‌ ఆదేశించారు. 15 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాలను కూడా త్వరితగతిన నిర్మించాలని సూచించారు. ఆర్‌ అండ్‌ బీ, నీటి పారుదలశాఖలో సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టులను పెంచుకోవాలని కేసీఆర్‌ సూచించారు.  

పెరిగిన గ్యాస్, గ్యాస్ నూనె ధరలు

న్యూఢిల్లీ : సబ్సిడైజ్డ్ వంట గ్యాస్(ఎల్పీజీ) ధరలు పెరిగాయి. సిలిండర్ కు రెండు రూపాయల పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా కిరోసిన్ రేటు కూడా లీటరుకు 26 పైసలను పెరిగింది. చిన్న చిన్నగా ధరలు పెంచుతూ ప్యూయల్ పై అందిస్తున్న సబ్సిడీలను ప్రభుత్వం తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల సమాచారం మేరకు ఎల్పీజీ ధరలు ఢిల్లీలో 14.2కేజీల సిలిండర్ కు రూపాయి 87 పైసలు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో ఒక్కో సిలిండర్ రూ.442.77కు చేరింది.

20:36 - May 1, 2017

హైదరాబాద్: శ్రామిక లోక సౌభాగ్యానికి అశువులుబాసిన అమరులారా..వందనాలు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మానవజాతి అనుభవిస్తున్న హక్కుల వెనుక, సౌఖ్యాల వెనుక ఎందరో వీరుల త్యాగాల ఫలం ఉంది. ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి వైట్ కాలర్ ఉద్యోగి వరకు అందరి హక్కుల వెనుక ఆ త్యాగధనుల కృషి ఉంది. అలాంటి వారిని స్మరించుకుంటూ మరింత నాగరిక సమాజం వైపు పురోగమించాల్సిన అవసరం వుంది.మరి ముఖ్యంగా ఎంతో కష్టించి సాధించుకున్న హక్కులకు గండి కొట్టే విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ నేపథ్యంలో మేడే స్ఫూర్తిగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:21 - May 1, 2017

హైదరాబాద్: ప్రపంచ కార్మిక దినోత్సం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అరుణపతాక రెపరెపలాడింది. వీధివీధినా ఎర్రజెండాలు ఎగురవేసిన కార్మికులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 130 ఏళ్ల కిందట హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన చికాగో కార్మికులను స్మరించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యపోరాటాలతో ఎదుర్కోవాలని వివిధ ట్రేడ్‌యూనియన్ల నేతలు పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా

తెలంగాణ వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మంజిల్లాలో జరిగిన వేడుకల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. కార్మిక, పేదవర్గాలకు అండగా ఎర్రజెండా పార్టీలు పోరాటం చేస్తున్నాయని ఆయన అన్నారు.

నల్లగొండజిల్లా....

నల్లగొండజిల్లా మిర్యాలగూడలో మేడే వేడుకలు ఉత్సహాంగా జరిగాయి. సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఆధ్యర్యంలో వేలాదిమంది కార్మికులు, సీఐటీయూ నేతలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆదిలాబాద్ జిల్లాలో...

ఆదిలాబాద్‌ జిల్లాలో కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగురవేసి.. అమరవీరుల జ్ఙాపకాలను స్మరించుకున్నారు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను .. ప్రస్తుత ప్రభుత్వాలు, యాజమాన్యాలు కాలరాస్తున్నాయని.. హక్కులను కాపాడుకోడానికి కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కార్మికనాయకులు పిలుపునిచ్చారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో....

అటు జగిత్యాలాజిల్లా కేంద్రంలో కార్మిక దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, విద్యుత్‌ , మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు.

వనపర్తిజిల్లా వ్యాప్తంగా...

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా వనపర్తిజిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. సీఐటీయూ , ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలు ఎగురవేశారు. హక్కుల సాధన కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.

అశ్వారావుపేటలో ...

భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేటలో మేడే సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. పట్టణంలో వందలాది మంది కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. స్థానిక వివేకానంద సెంటర్‌లో నృత్యపదర్శన ఆకట్టుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా....

మేడే దినోత్సవం సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అరుణ పతాకలు రెపరెపలాడాయి. ప్రధాన కూడళ్లలో ఎర్రనితోరణాలు కట్టిన కార్మికులు పండుగ చేసుకున్నారు. అటు వరంగల్‌ పట్టణ జిల్లాలో కూడా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. బట్టలబజార్‌ నుంచి తపాలకూడలి వరకు భారి ప్రదర్శన నిర్వహించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నియోజకవర్గం కార్మికదినోత్సవ నినాదాలతో మార్మోగింది.

నిజామాబాద్ జిల్లాలో...

నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా కార్మికదినోత్సవం ఘనంగా జరిగింది. వేలాది మంది అసంఘటిత రంగకార్మికులు కవేడుకల్లో పాల్గొన్నారు. అటు కామారెడ్డిజిల్లాలో నిర్వహించిన ర్యాలీలో 131 మీటర్ల భారీ అరుణపతాక ఆకర్షణగా నిలిచింది.

కొమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా....

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌జిల్లా సిర్పూరు నియోజకవర్గంలో మేడే సంబరాలు ఘనంగా జరిగాయి.. కాగజ్‌నగర్‌లో సీఐటీయూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సిర్పూరు పేపర్‌మిల్లు గేటు దగ్గర ఎర్రజెండాను ఎగురవేశారు. కౌటాల, దహెగాం, బెజ్జూరు మండలకేంద్రాల్లో ఎర్రజెండాలు ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు.

ఉమ్మడి నల్లగొండి జిల్లాలో...

ఉమ్మడి నల్లగొండజిల్లా వ్యాప్తంగా ఎర్రజెండాలు ఎగురవేసిన కార్మికులు వేడుకలు జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ మండలాల్లో వేలాది మంది కార్మికులు ఎర్రజెండాలు ఎగురవేసి ప్రదర్శనలు నిర్వహించారు. అటు సూర్యాపేట జిల్లా కోదాడా, హుజూర్‌నగర్‌ లో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

మెదక్‌జిల్లా కేంద్రంలోనూ...

మెదక్‌జిల్లా కేంద్రంలోనూ కార్మికులు మేడేని ఉత్సాహంగా జరుపుకున్నారు. పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి రాందాస్‌ చౌరాస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, హమాలీ సంఘం నేతలు పాల్గొన్నారు.

130 ఏళ్ల కిందట హక్కుల సాధనకోసం...

130 ఏళ్ల కిందట హక్కుల సాధనకోసం ఉద్యమించిన చికాగో కార్మికుల త్యాగాలే స్ఫూర్తిగా.. ఉద్యమించాలని ట్రేడ్‌యూనియన్ల నేతలు పిలుపునిచ్చారు. హక్కులను కాపాడుకోడానికి ఐక్యంగా కదలాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోడానికి ఐక్యపోరాటాలు చేయాలన్నారు.

---

హైదరాబాద్‌లో ఘనంగా మేడే ఉత్సవాలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కార్మిక దినోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించింది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మేడే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధికీ కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులను నాయిని నరసింహారెడ్డి సన్మానించారు.

హైదరాబాద్‌లో నవ తెలంగాణ, 10టీవీ ఆధ్వర్యంలో...

హైదరాబాద్‌లో నవ తెలంగాణ, 10టీవీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్యతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. హక్కుల కోసం కార్మిక సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని వేణుగోపాల్‌ అన్నారు. సమసమాజ స్థాపన కోసం అందరూ కృషి చేయాలని వీరయ్య అన్నారు.

గాంధీభన్‌లోనూ...

అటు గాంధీభన్‌లోనూ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బిజెపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్ల మోజులో ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో...

జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ మేడే వేడుకలు వినూత్నంగా, వైభవంగా జరిగాయి. బల్దియా అధికారులు, కార్మికులు సహపంక్తి భోజనాలు చేశారు. కార్పొరేషన్‌ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు, మెడికల్ అధికారులు కార్మికులతో కలిసి భోజనం చేశారు.

ఓయూలో....

ఉస్మానియా యూనివర్సిటీలో మేడే వేడుకలు వైభవంగా జరిగాయి. లేడీస్‌ హాస్టల్‌ దగ్గర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భం నిర్వహించిన సదస్సులో ఐఎఫ్‌టీయూ నాయులు మాట్లాడారు.

వనస్థలిపురంలో ...

అటు వనస్థలిపురంలో కార్మిక దినోత్సవ సందర్భంగా బాలకార్మికురాలికి విముక్తి లభించింది. బాలలహక్కుల సంఘం, చైల్డ్‌లైన్‌ ప్రతినిధుల చొరవతో ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఇంట్లో పనిచేస్తున్న మైనర్‌ కు విముక్తి కల్పించారు.

ముషీరాబాద్‌ గోల్‌కొండ క్రాస్‌రోడ్‌లో...

ముషీరాబాద్‌ గోల్‌కొండ క్రాస్‌రోడ్‌లో ఎర్రజెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ కార్యాలయంలో సీనియర్‌ నాయకులు పీఎస్‌ఎన్‌ మూర్తి జెండాను ఎగురవేశారు. అనంతరం సుందరయ్య విజ్ఞనా కేంద్రం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

పటాన్ చెరు పారిశ్రామికవాడలో....

మేడే సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. పలు కంపెనీల ముందు సీఐటీయూ నాయకులు జెండాలు ఎగురవేసి కార్మిక దినోత్సవ ఔన్నత్యాన్ని తెలియజేశారు. మొత్తమ్మీద హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు రాజకీయాపార్టీలు, ట్రేడ్‌యూనియన్ల ఆధ్వర్యంలో 131వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.

 

విజయవాడలో....

విజయవాడలో మే డే సంబరాలు ఘనంగా జరిగాయి. కార్మికులు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటమటలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆవిష్కరించారు. హక్కుల కోసం 127 ఏళ్ల క్రితం చికాగోలో రగిలిన ఉద్యమ స్ఫూర్తి ఎర్రజెండా అని మధు అన్నారు.అలాగే భవానిపురం చెరువు సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

గోదావరి జిల్లాల్లో...

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో మే డే సందర్భంగా ... కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఆచంట మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో శివాలయం నుంచి కచేరి సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలం చలివేంద్రం ప్రారంభించారు. అలాగే నిడదవోలులోనూ కార్మికులు ఎర్రజెండాలతో నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించారు.

రావులపాలెంలో

అలాగే రావులపాలెంలో సీపీఐ, ఏఐటీయూసీ, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్స్‌ , ఇసుక ర్యాంపు జట్టు కార్మికులు మే డే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌లో, ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలలో జెండా ఎగురవేశారు. అలాగే రాజమండ్రిలోనూ సీపీఎం ఆధ్వర్యంలో అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.

చీరాలలో...

మే డే ను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా..చీరాలలో వివిధ సంఘాల కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు.

నెల్లూరులో....

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నెల్లూరులోనూ ఘనంగా నిర్వహించారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకమహాల్‌ సెంటర్‌లో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా చిన్న పెద్ద కంపెనీలలో పనిచేసే కార్మికులు... స్వయం ఉపాధి పొందుతున్న శ్రామికులు, ర్యాలీలలో పాల్గొని మే డే ను విజయవంతం చేశారు.

 

ఉత్తరాంధ్రలో ఘనంగా మే డే వేడుకలు

మే డే సందర్భంగా విశాఖపట్నంలో వాడవాడల ఎర్రజెండాలు ఎగురవేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.. అలాగే పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల పాటలు, కోలాటాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

విశాఖ ఏజెన్సీలో....

అలాగే విశాఖ ఏజెన్సీలోని పాడేరులోనూ మేడే ఘనంగా జరిగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలు అమలు కాకపోవడం వల్లే కార్మికులు నష్టపోతున్నారని...మే డే స్ఫూర్తితో చట్టాల అమలకు పోరాటం చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.

విజయనగరం జిల్లాలోనూ...

విజయనగరం జిల్లాలోనూ మే డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర జెండాలు ఆవిష్కరించారు. మే డే గొప్పదనాన్ని తెలియజేస్తూ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ...కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పలువురు నాయకులు విమర్శించారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లాలో ...

శ్రీకాకుళం జిల్లాలో మే డే సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులందరూ డైమండ్‌ పార్క్‌ నుంచి ఎన్‌జీవో హొమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో పాలక వర్గాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తున్నాయని సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్‌ అన్నారు. కార్మికులందరూ ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మే డే వేడుకల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. కార్మికుల ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పారు.

 

రాయలసీమ ప్రాంతంలో.....

ప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. వాడవాడలా అరుణ పతాకం రెపరెపలాడింది. చికాగో కార్మికుల త్యాగాలను స్మరించుకుంటూ...కార్మికులందరూ రహదారుల వెంట ర్యాలీగా కదిలారు.

కర్నూలులో

కర్నూలులో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. సుందరయ్య భవన్‌లో మే డే ఉత్సవాలను నిర్వహించారు. ఎర్రజెండాను ఎగురవేసి... కార్మిక పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏపీ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.గఫూర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు. అలాగే ఆలూరులోనూ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.

బద్వేలు పట్టణంలో

మే డే సందర్భంగా కడప...బద్వేలు పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్మిక ఉద్యమాల గురించి చర్చించారు. పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోవాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు.

అనంతపురం జిల్లాలో ఘనంగా మేడే

హిందూపురంలోనూ

సీఐటీయూ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా..హిందూపురంలోనూ, కొల్లకుంట స్పిన్నింగ్‌ మిల్లు లో ఎర్రజెండాలు ఆవిష్కరించారు. అలాగే పట్టణంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

చిత్తూరు జిల్లాలోనూ కార్మికులు మే డేను ఉత్సహాంగా జరుపుకున్నారు. తిరుపతిలోని సీఐటీయూ ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోరాటంతోనే కార్మిక హక్కులను కాపాడుకోవాలని మే డే సందర్భంగా కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకవర్గాలకు బుద్ధిచెప్పాలన్నారు. 

20:07 - May 1, 2017

హైదరాబాద్: ఓస్త్రీ రేపు రా అంటున్న సీఎం కేసీఆర్... కరెంట్ ముచ్చట మీద గతం కటింగ్, మద్దతు ధర ఇయ్యవల్సింది రాష్ట్రమే... మాట్లాడుతున్న దత్తన్న ఇట్లంటే కష్టమే, రైతుల నెత్తిమీద వడగండ్ల పిడుగు...సూర్యాపేట దిగ్గు తడిసిన కల్లం అడుగు, జమ్మికుంటు సీఐ ప్రశాంత రెడ్డి పనితనం...అన్యాయం చేసిన బహుజన బిడ్డ, కాల్వ దాటని శ్రీరాంపురం కన్నీల్లు.... ఒట్టి మాటలే అయిన పార్టీ నేతల హామీలు, దమాకును దొంగతనం చేసే టెక్నాలజీ... కొత్త వస్తువును కనిపెట్టిన శాస్త్రవేత్తలు, కార్మికులందరికీ మేడే ఉత్సవాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:58 - May 1, 2017

టీఎస్ జిల్లా కలెక్టర్లకు అత్యవసర నిధులు విడుదల

హైదరాబాద్: తెలంగాణాలో జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అత్యవసర నిధులను విడుదల చేసింది. ఒక్కో జిల్లా కలెక్టర్‌కు రూ. 75 లక్షలు చొప్పున అత్యవసర నిధులను విడుదల చేసింది. మొత్తం రూ. 23.25 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు రూ. 5 కోట్లు చొప్పున అత్యవసర నిధి నుంచి మొదటి త్రైమాసికానికి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది.

భారత్ జవాన్లను ముక్కలుగా నరికిన పాక్ ఆర్మీ

శ్రీనగర్ : ఫూంచ్‌ సెక్టార్‌లోని బీఎస్‌ఎఫ్‌ సైనిక స్థావరంపై గ్రనేడ్‌ రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలను పాక్‌ ఆర్మీ అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసింది. పాక్‌ దుశ్చర్యను భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. దీనిపై పాక్‌ తగిన సమాధానం చెప్పాలని, ఈ ఘటనకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామ‌ని భారత ఆర్మీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది.

తీహార్‌ జైలుకు దినకరన్‌....

చెన్నై : రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టు చేసిన టీటీవీ దినకరన్‌ను జ్యుడీషియల్‌ కస్టడికి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు సోమవారం సాయంత్రం తీహార్‌ జైలుకు తరలించారు. 

18:51 - May 1, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం నిమ్రా ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలోని ఇండిక్యాష్‌ ఏటీఎం లో మంటలంటుకున్నాయి.. మంటలు చెలరేగి పొగలు రావడంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. ఫైరింజన్‌ సహాయంతో సిబ్బంది మంటలు ఆర్పేశారు..

18:48 - May 1, 2017

విజయవాడ: తన తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించినందుకే అయేషాను చంపినట్లు ఒప్పుకున్నానని... ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు అన్నారు.. జైలులో ఉన్నప్పుడే తాను ఓపెన్‌ యూనివర్శిటీద్వారా డిగ్రీ పూర్తిచేశానని చెప్పారు.. ఆ డిగ్రీ సహాయంతో ఉద్యోగం వెతుక్కొని కుటుంబానికి తోడుగా ఉంటానని స్పష్టం చేశారు.. సత్యంబాబుకు మాలమహానాడు నేతలు అండగా నిలిచారు.. సత్యంబాబుకు ఇప్పటివరకూ నష్టపరిహారం అందించలేదని... నేతలు ఆరోపించారు.. శాఖాపరంగా పోలీసు ఉన్నతాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.. ఈ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.. 

18:47 - May 1, 2017

అమరావతి:  మే డే వేడుకలతో రహదారులన్నీ ఎర్రబారాయి... ప్రతి ప్రాంతంలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. కార్మికులందరూ నినాదమై కదిలారు. చికాగో కార్మికుల పోరాటాన్ని, తాగ్యాన్ని స్మరించుకున్నారు.

విజయవాడలో...

విజయవాడలో మే డే సంబరాలు ఘనంగా జరిగాయి. కార్మికులు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటమటలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆవిష్కరించారు. హక్కుల కోసం 127 ఏళ్ల క్రితం చికాగోలో రగిలిన ఉద్యమ స్ఫూర్తి ఎర్రజెండా అని మధు అన్నారు.

భవానీపురం చెరువు సెంటర్లో...

అలాగే భవానిపురం చెరువు సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

గోదావరి జిల్లాల్లో....

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో మే డే సందర్భంగా ... కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఆచంట మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో శివాలయం నుంచి కచేరి సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలం చలివేంద్రం ప్రారంభించారు. అలాగే నిడదవోలులోనూ కార్మికులు ఎర్రజెండాలతో నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించారు.

రావులపాలెంలో....

అలాగే రావులపాలెంలో సీపీఐ, ఏఐటీయూసీ, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్స్‌ , ఇసుక ర్యాంపు జట్టు కార్మికులు మే డే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌లో, ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలలో జెండా ఎగురవేశారు. అలాగే రాజమండ్రిలోనూ సీపీఎం ఆధ్వర్యంలో అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.

చీరాలలో....

మే డే ను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా..చీరాలలో వివిధ సంఘాల కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు.

నెల్లూరులో....

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నెల్లూరులోనూ ఘనంగా నిర్వహించారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకమహాల్‌ సెంటర్‌లో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా చిన్న పెద్ద కంపెనీలలో పనిచేసే కార్మికులు... స్వయం ఉపాధి పొందుతున్న శ్రామికులు, ర్యాలీలలో పాల్గొని మే డే ను విజయవంతం చేశారు.

పోలవరం రివ్యూలో సీఎం చంద్రబాబు సీరియస్‌

అమరావతి: పోలవరం రివ్యూలో నిర్మాణ సంస్థలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఎర్త్‌ వర్క్‌ పనులు లక్ష్యాలను చేరుకోలేకపోవడంపై సీఎం ధ్వజమెత్తారు. నిర్మాణ సంస్థలు చెప్పిన కారణాలు పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక కారణాలు సాకుగా చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మట్టి తవ్వకాలు సహా మిగతా పనులకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

18:43 - May 1, 2017

అమరావతి: పోలవరం రివ్యూలో నిర్మాణ సంస్థలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఎర్త్‌ వర్క్‌ పనులు లక్ష్యాలను చేరుకోలేకపోవడంపై సీఎం ధ్వజమెత్తారు. నిర్మాణ సంస్థలు చెప్పిన కారణాలు పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక కారణాలు సాకుగా చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మట్టి తవ్వకాలు సహా మిగతా పనులకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

18:41 - May 1, 2017

పెద్దపల్లి :జిల్లా అంతర్‌గాం మండలం గోలివాడ సుందిళ్ల పంప్‌హౌస్‌ దగ్గర నిర్వాసితులు ఆందోళనకు దిగారు.. తమకు పరిహారం చెల్లించాకే పంప్‌హౌస్‌ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.. నిర్వాసితుల నిరసనతో అక్కడకు చేరుకున్న పోలీసులు... 43మంది రైతులు, 15మంది మహిళల్ని అరెస్ట్ చేశారు..

18:39 - May 1, 2017

హైదరాబాద్: తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్‌ వెబ్‌సైట్‌ సృష్టించి ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారన్న వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ సీరియస్‌ అయ్యింది. దిగ్విజయ్‌ సింగ్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. హైదరాబాద్‌ ప్రజలకు దిగ్విజయ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా దిగ్విజయ్‌సింగ్‌ చౌకబారు వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. అనంతరం దిగ్విజయ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

18:32 - May 1, 2017

కుల్గాం జిల్లాలో రెచ్చిపోయిన మిలిటెంట్లు: 6గురుమృతి

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందిన కొద్దిగంటలకే మరో ఘటన చోటుచేసుకుంది. కుల్గాం జిల్లాలో మిలిటెంట్లు రెచ్చిపోయి.. ఓ నగదు తరలింపు వాహనంపై దాడి చేశారు. జమ్ము కశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన క్యాష్‌ డెలివరీ వ్యాన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నలుగురు పోలీస్‌ సిబ్బందిని, ఇద్దరు బ్యాంక్‌ అధికారులను కాల్చివేశారు. అనంతరం వ్యాన్‌లోని డబ్బుతో పరారయ్యారు.

17:05 - May 1, 2017

విశాఖ : విశాఖ సిటీలోని స్టీల్ ప్లాంట్, పరవాడ ఫార్మాసిటీ, ఎన్ఈపీసీ, పోర్ట్ హెచ్పీసీఎల్ ప్రాంతాల్లో మేడే వేడుకల్ని కార్మికులు ఘనంగా నిర్వహించారు. కార్మికుల పాటలు, కోలాటాలతో సిటీ సందడిగా మారింది. సీఐటీయూ ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ నుంచి జీవిఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పాక్ సైనికుల ఘాతుకం

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో పాక్ సైనికులు ఘాతుకానికి పాల్పపడ్డారు. కాల్పుల్లో చనిపోయిన ఇద్దరి భారత సైనికుల మృతదేహాలను ముక్కలు చేసి ఎల్ఓసీ వద్ద వదిలివెళ్లారు. పాక్ సైనిక చర్యపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. పాక్ తగిన రీతిలో సమాధానం చెబుతామని ప్రకటించింది.

17:03 - May 1, 2017

హైదరాబాద్: భీమా రంగంలో కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం చట్టాల సవరణను నిరసిస్తూ లైఫ్‌ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్‌ యూనియన్‌ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. అందరికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎల్ ఐ సి ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:53 - May 1, 2017

జమ్ముకశ్మీర్‌ : పూంఛ్ జిల్లా సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పాకిస్తాన్‌ రాకెట్ల ప్రయోగం, కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. మరో బిఎస్‌ఎఫ్‌ జవానుకు గాయాలయ్యాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్‌కు తగిన జవాబు చెబుతామని భారత్‌ స్పష్టం చేసింది. కశ్మీరీల హక్కుల కోసం తమ మద్దతు కొనసాగుతుందని పాక్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బాజ్‌వా మరోసారి వివాదస్పద ప్రకటన చేశారు. ఇండియానే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

16:51 - May 1, 2017

అస్సాం : దేశంలో గోరక్షణ పేరిట హిందుత్వ శక్తుల దాడులు ఆగడం లేదు. తాజాగా అస్సాంలోని నౌగావ్‌ జిల్లాలో గోరక్షణ పేరిట దారుణం జరిగింది. 20 నుంచి 25 ఏళ్లున్న ఇద్దరు యువకులు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో గోరక్షకదళం మూకుమ్మడిగా వారిపై దాడి చేసింది. కిలోమీటర్‌ మేర వారిని తరుముతూ కర్రలతో విచక్షణ రహితంగా గోరక్షకులు కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. అస్సాంలో గోరక్షణ పేరిట హత్య జరగడం ఇదే తొలిసారి. బిజెపి అధికారం చేపట్టాక ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

16:50 - May 1, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసిన సమంయలో తివారి ఇంట్లో లేరు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్‌ సిసిటివీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి సుమారు పదిమంది కలిసి తమ ఇంటిపై దాడి చేసినట్లు తివారీ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక కుట్ర ఉందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని మనోజ్‌ తివారీ ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ ఎంపీ ఇంట్లో అరగంటసేపు దుండగులు బీభత్సం సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గడ్కరీకి కేసీఆర్ ఫోన్

హైదరాబాద్ : కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. వరంగల్, బెంగళూరు, విజయవాడ మార్గాలకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువైనందుకు ఈ మూడు మార్గాల్లో వెలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని, అలాగే హైదరాబాద్ వరంగల్ మార్గంలో ఉప్పల్ ఘట్ కేసర్ వరకు 6.40 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ. 950 కోట్లు, హైతరాబాద్ మహబూబ్ నగర్ బెంగళూరు మార్గంలో అరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 10 కి.మీ కారిడార్ నిర్మాణానికి రూ.290 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 

16:47 - May 1, 2017

ఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ కశ్మీర్‌ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలొకొనేందుకు బహు పాక్షిక చర్చలు జరపాలని సూచించారు. ఈ చర్చల్లో టర్కీకి కూడా అవకాశం ఇవ్వాలని ఛానల్‌తో మాట్లాడుతూ ఎర్డోగన్‌ అన్నారు. కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని, భారత్‌, పాకిస్తాన్‌ల హితాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సూచిస్తున్నానని ఆయన చెప్పారు. టర్కీలో కుర్దుల సమస్య కశ్మీర్‌ అంశంతో పోల్చలేమని ఆయన తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన ఎర్డోగన్‌కు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. టర్కీ అధ్యక్షుడు...ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు బలోపేతం దిశగా.. పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 

సుందిళ్ల ముంపు ప్రజల ఆందోళన

పెద్దపల్లి : జల్లాలోని అంతర్ గాం మండలం గోలివాడ సుందిళ్ల పంప్ హౌస్ వద్ద నిర్వసితులు ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించిన తర్వాతే సుందిళ్ల పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు 43 మంది రైతులను, 15మంది మహిళలను అరెస్ట్ చేశారు

త్వరలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ : ఉత్తమ్

హైదరాబాద్ : కళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ అంశంపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమారు రెడ్డి అన్నారు. 2వేల అడుగుల ఎత్తు, 200కిలోమీటర్ల కాల్వలు తవ్వి ఒక పంటకు నీరిస్తారా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప చాలా మంది నాతో టచ్ లో ఉన్నారని తెలిపారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి భారీగా వలసలు మొదలౌతాయని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి సీన్ లేదన్నారు. 

టీడీపీ మహానాడు వేదిక ఖరారు

గుంటూరు : విశాఖపట్నంలో జరిగే మహానాడు వేదికను ఖరారు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ కాలేజీలోమ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.

16:01 - May 1, 2017

వన్డే ర్యాంకింగ్స్‌ను ఐసీసీ అప్‌డేట్ చేసింది. టాప్ సౌతాఫ్రికా నిలవగా భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కు ఐదు పాయింట్లు అదనంగా లభించడంతో రెండు పాయింట్లు మాత్రమే దక్కిన న్యూజిలాండ్ మూడు నుంచి నాలుగుకి పడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు రెండో ప్లేస్‌లో ఉంది.

తాజా వన్డే ర్యాంకింగ్స్ వివరాలు..
1) సౌతాఫ్రికా - 123 రేటింగ్ పాయింట్లు
2) ఆస్ట్రేలియా - 118
3) భారత్ - 117
4) న్యూజిలాండ్ - 115
5) ఇంగ్లండ్ - 109
6) శ్రీలంక - 93
7) బంగ్లదేశ్ - 91
8) పాకిస్థాన్ - 88
9) వెస్టిండీస్ - 79
10) ఆఫ్గనిస్థాన్ - 52
11) జింబాబ్వే - 46
12) ఐర్లాండ్ - 43

15:47 - May 1, 2017

హైదరాబాద్: సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేపటి నుంచి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని వాసవీ కాలేజీ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపాయి. దీంతో సచివాలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్‌ చేశారు. మరోవైపు తమకు రేపటి నుంచి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదిలావుంటే... ఇంటర్‌ బోర్డు అధికారులతో విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చర్చలు జరుపుతున్నారు. మే నెలలో పరీక్షలు రాయాలని అధికారులు సూచించగా.. దానికి విద్యార్థులు అంగీకరించడం లేదు. దీంతో తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. 

ఛత్తీష్ గఢ్ లో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

ఛత్తీస్ గఢ్ : మల్కన్ గిరి జిల్లా తంగుడా గ్రామంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య చేశారు. వారు సెల్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ను పేల్చివేశారు.

నంద్యాల్లో బరిలో ఉంటాము : ఎస్పీవై రెడ్డి

కర్నూలు : నంద్యాల టీడీపీ టీకెట్ భూమా కుటుంబంలో ఎవరికి ఇచ్చినా స్వాగతిస్తామని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఇతరుకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంటే తాము కూడా బరిలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. 

హైకోర్టుకు మధుకర్ రీపోస్టమార్టం నివేదిక

హైదరాబాద్ : మంథని మధుకర్ రీపోస్టుమార్టం నివేదిక హైకోర్టుకు చేరింది. ఫోరెన్సిక్ వైద్యులు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. హైకోర్టు సెలవుల తర్వాత సీల్డ్ కవర్ తెరవనుంది. 

హింసను ప్రేరేపించడానికే జగన్ దీక్ష

గుంటూరు : హింసను ప్రేరేపించడానికే జగన్ రైతు దీక్ష చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి రామచంద్రరెడ్డి ఆరోపించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధం చేశామని అన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సోమిరెడ్డి హెచ్చరించారు.

14:54 - May 1, 2017

సంగారెడ్డి : సంగారెడ్డి లో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి... ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని.. ఐక్య ఉద్యమాలతో వాటిని తిప్పికొడతామంటున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:53 - May 1, 2017

హైదరాబాద్: నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్‌లో 131వ మే డే సందర్భంగా.. ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో 131 మీటర్ల ఎర్ర జెండాతో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:47 - May 1, 2017

హైదరాబాద్: కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అవి బిజెపి, టీఆర్ఎస్ మాత్రమే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్పోరేట్ల మోజులో ఆ ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గాంధీభవన్ లో జరిగిన మేడే వేడుకల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కార్మికులకు పెద్దపీట వేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

కాల్పులకు తెగబడ్డ పాక్ సైన్యం

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో భారత్ పోస్టులపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. భారత సైనికులు పాక్ కాల్పులను తిప్పి కొడుతున్నారు. కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

14:45 - May 1, 2017

హైదరాబాద్: శాసనసభను టీఆర్ఎస్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి. భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగకుండా ఎందుకు హడావిడిగా ఆమోదించారో అర్ధం కాలేదన్నారు. రాబోయే రోజుల్లో ఈ బిల్లు ప్రజలకు శాపంగా మారుతుందన్నారాయన. ప్రతిపక్షాల ఉనికి జీర్ణించుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉందని విమర్శించిన రావుల ఇప్పటికైనా ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడి ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 

14:44 - May 1, 2017

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ పోలీసులు ఒక బోగస్ ఐఎస్ఐఎస్ సైట్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా ముస్లిం యువకులను ఐసిస్‌లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఓ మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి అత్యంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేదా అందుకు తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని దిగ్విజయ్ సింగ్‌ను డిమాండ్ చేస్తూ... కేటీఆర్ ట్వీట్ చేశారు. 

14:42 - May 1, 2017

హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ-ఏపీ ఇరిగేషన్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా బోర్డు విధించిన గడువు ముగియడంతో తెలంగాణ అధికారులు కుడి కాలువ గేట్లు మూసేశారు. మరోవైపు తమకు మరో టీఎంసీ నీళ్లు రావాలని ఏపీ అధికారులు వాదిస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

పురస్కారాలకు కమిటీ నియామకం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలకు కమిటీ నియామించింది. కమిటీ మంత్రి చందూలాల్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో ఉంది. సభ్యులుగా కేవీ రమణాచారి, రసమయి, నారదాసు, బుర్రా వెంకటేశం, హన్మాండ్ల భూమయ్య, నందిని సిద్దారెడ్డి, సూర్యప్రకాశ్, దేశపతి, మామిడి హరికృష్ణ, అలేఖ్య ఉన్నారు. మొత్తం 19 విభాగాల్లో పురస్కారాలను తెలగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 

14:00 - May 1, 2017

ఖమ్మం : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌లో రెండు రోజుల క్రితం జరిగిన విధ్వంసానికి సంబంధించి అమాయకులైన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇవాళ జానా నాయకత్వంలోని టీకాంగ్రెస్ సభ్యుల బృందం.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించింది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు జానా. తెరాస ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని... మానవతా దృక్పథంతో వ్యవహరించి రైతులను ఆదుకోవాలే గాని.. వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

 

13:52 - May 1, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. మే డేను పురస్కరించుకుని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయాల వద్ద ఆయన జెండాను ఆవిష్కరించారు. రైతులకు, వ్యవసాయ కార్మికులకు భూసేకరణ పేరుతో తీరని అన్యాయం చేస్తుందన్నారు. హక్కుల పరిరక్షణ కోసం మే డే స్పూర్తితో అన్ని సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. 

13:49 - May 1, 2017

కర్నూలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏపీ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ.గఫూర్ అన్నారు. జిల్లాల్లోని సుందరయ్య భవన్ లో జరిగిన మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అరుణ పతాకాన్ని ఎగురవేసి కార్మిక నాయకుల త్యాగాల్ని స్మరించుకున్నారు. అంతకు ముందు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో సుందరయ్య విగ్రహానికి పూలమాలు, వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు.

 

13:46 - May 1, 2017

'బాహుబలి-2’ సినిమా విడుదలై నాలుగు రోజులు గడుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లకు సంబంధించిన తారలు రాజమౌళి అద్భుత ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు. నటుడు ప్రభాస్..ఇతర ఆర్టిస్టుల ప్రతిభ అమోఘం అని కొనియాడుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ. 1000 కోట్లను అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే భారీ కలెక్షన్లు దిశగా దూసుకెళుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 450 కోట్లను దాటి ఉంటుందని చిత్ర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత చిత్రాల్లో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ చిత్రం 'పీకే' సాధించిన రూ. 792 కోట్ల కలెక్షన్స్ రికార్డుగా ఉండగా..బాహుబలి ఆ రికార్డును తొలివారంలోనే అధిగమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

13:44 - May 1, 2017

హైదరాబాద్‌ : నగరంలోని నవ తెలంగాణ, 10టీవీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు జరిగాయి. 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్యతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. హక్కుల కోసం కార్మిక సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని వేణుగోపాల్‌ అన్నారు. సమసమాజ స్థాపన కోసం అందరూ కృషి చేయాలని వీరయ్య అన్నారు. 

 

13:41 - May 1, 2017

హైదరాబాద్ : పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నారని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా విజయవాడలోని పటమటలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను మధు ఆవిష్కరించారు. కార్మికులను నిర్లక్ష్యం చేస్తే.. టీడీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ... పెట్టుబడిదారులకు తొత్తుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు పతనం తప్పదన్నారు. దేశంలో వామపక్షాలను మట్టుపెట్టాలనుకుంటున్న వారికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. హక్కుల కోసం 127 ఏళ్ల క్రితం చికాగోలో రగిలిన ఉద్యమ స్ఫూర్తి ఎర్రజెండా అని మధు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యునిజానికి మరణం లేదని తేల్చి చెప్పారు. కమ్యునిజాన్ని అణిచివేయాలనుకునే వర్గాలకు మరణం తప్పదన్నారు.

 

13:37 - May 1, 2017

గుంటూరు : జిల్లాలోని నల్లపాడులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుపు నిండ బాధ ఉన్న న్యాయం కోసం రైతుల పోరాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా చంబ్రబాబు బుద్ది, జ్ఞానం రావాలని కోరుకున్నారు. రైతులకు తోడుగా నిలబడేందుకే ఈ రైతు దీక్ష చేస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. అధాకార పక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడుతారని విమర్శించారు. ఎన్నికల ముందు స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తానని చెప్పి మరిచిపోయారని అన్నారు. 2010లో రైతుకు ఎరాకి రూ.10వేలు ఇవ్వలని డిమాండ్ చేసిన బాబు ఇప్పుడు మాత్రం రూపాయి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ రూ.5వేల కోట్లతో రైతు స్థిరికరణ నిధి ఏర్పాటు చేస్తానాని బాబు హామీ ఇచ్చారు కానీ దీన్ని కూడా చేయడం లేదని అన్నారు. రైతులకు రూ. 4,394 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీకి ఏగనామం పెట్టారని విమర్శించారు. గత ఏడాది రూ.14వేలే పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.2వేలకు పడిపోయిందని అన్నారు. జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు దీక్షలో పాల్గొననున్నారు.

13:29 - May 1, 2017

ఖమ్మం : కార్మికులకు ఎర్రజెండా ఎప్పుడూ అండగా ఉంటుందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో మే డే ఉత్సవాల్లో పాల్గొన్న తమ్మినేని.. ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎర్రజెండాకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు జరిగాయని.. అయినా అనేక దేశాల్లో ఎర్రజెండాలు అధికారంలోకి వచ్చాయన్నారు. కార్మికుల కోసం ఎర్రజెండా ఎప్పటికీ పాటుపడుతుందని తెలిపారు.

 

13:19 - May 1, 2017

హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. చందానగర్ లో వినీల భర్తతో కలిసి ఉంటుంతోంది. వినీల సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. ఈనేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపంతో వినీల ఆత్మహత్య చేసుకుంది. వినీల మృతికి భర్తే కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

13:06 - May 1, 2017

నల్గొండ : జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి. హుజూర్ నగర్, మిర్యాలగూడ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం నీట తడవంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

 

13:02 - May 1, 2017

హైదరాబాద్ : సొంతగడ్డపై తిరుగులేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి నిరూపించింది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి రుచి చూపించింది. అంతేకాకుండా వరుసగా ఉప్పల్‌లో ఐదో విజయాన్ని నమోదుచేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 59 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతో 126 పరుగులతో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వీరవిహారం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, మహ్మద్ సిరాజ్ 2, సిద్దార్ధ్ కౌల్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.
 

 

12:59 - May 1, 2017

ఢిల్లీ : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎర్డోగన్‌తో పాటు.. పలువురికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. మధ్యాహ్నం టర్కీ అధ్యక్షుడు...ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు బలోపేతం దిశగా.. పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

 

12:53 - May 1, 2017

విజయవాడ : ఎనిమిది గంటల పనిదినం కోసం చికాగోలో కార్మికులు ప్రదర్శన నిర్వహిస్తే యాజమాన్యాలకు అనాడు పోలీసులు తొత్తుగా వ్యవహరించడంతో అనేక మంది చనిపోయారని, అప్పుడు రగిలిన ఉద్యమ స్ఫూర్తె ఎర్రజెండా అని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పటమటలో సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను మధు ఆవిష్కరించారు. దేశంలో వామపక్షాలను మట్టుపెట్టాలనుకుంటున్న వారికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఈ సంద్భరండా ఆయన టెన్ టివితో మాట్టాడారు. ఎనిమిది గంటల పనికి ప్రభుత్వాలు తుట్లు పోడుస్తున్నాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు.

 

 

కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు : సీఎం చంద్రబాబు

కృష్ణా : కార్మికుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో సీఎం పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో 5 కోట్ల మందిలో 80 శాతం మంది అసంఘటిత కార్మికులున్నారని తెలిపారు. కార్మికుల కోసం రూ. 5 లక్షలతో చంద్రన్నబీమా పేరుతో బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వికలాంగులైతే రూ. 2 లక్షలు, సహజ మరణమైతే రూ.50వేలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. 44,443 క్లైమ్ లు వచ్చాయని అందులో 34, 322 క్రైమ్ లు పే చేశామని తెలిపారు.

కార్మికులకు అండగా ఉంటాం : సీఎం చంద్రబాబు

కృష్ణా : ప్రపంచంలో కుల, మత భేధాలు లేకుండా చేసుకునే పండగా మేడే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో సీఎం పాల్గొని, మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 1923 నుంచి మేడేను జరుపుకుంటున్నామని ఆయిన పేర్కొన్నారు.

 

ఒడిషా ప్రభుత్వంతో టీ.ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్ : రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హాజరయ్యారు. ఒడిశాలో పని చేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ఒడిశా ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. 
 

12:46 - May 1, 2017

ఆదిలాబాద్ : మనిషిని పోలిన మనుషులు ఉంటారు అనడానికి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తే ఎగ్జామ్ పుల్. ఇతని పేరు అయూబ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కల్ గూడలో ఉండే అయూబ్ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎంతో ఫేమస్ అయిపోయాడు. మోడీ పోలికలతో ఉన్న అయూబ్ తో సెల్ఫీలు దిగడానికి జనాలు తెగ ముచ్చటపడిపోతున్నారు. అంతేనా! ఆదిలాబాద్ మోడీ అంటూ కితాబిస్తున్నారు. ఇక అయూబ్ సంతోషానికి అవధులు లేవనుకోండి. అయూబ్ ది నిరుపేద కుటుంబం. ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గతంలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసిన అయూబ్ ఫిట్ నెస్ లోపం వల్ల సస్పెండ్ అయ్యాడట. అయితే బ్రతుకుదెరువు కోసం ప్రస్తుతం ఆటో నడుపుతున్నాడు. అధికారులు తిరిగి తన ఉద్యోగం తనకు ఇచ్చేస్తే తన పరిస్థితి చక్కబడుతుందని అయూబ్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోనే కాదండోయ్.. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు అయూబ్ హాట్ టాపిక్ అయిపోయాడు... ఆ నోటా.. ఈ నోటా ఈ మాట మన ప్రధాని మోడీకి చేరితే అయూబ్ ని చూసి ఆయన కూడా ముచ్చటపడతారేమో!

 

 

 

రవీంద్రభారతిలో మేడే ఉత్సవాలు

హైదరాబాద్ : రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని 
నర్సింహ్మారెడ్డి హాజరయ్యారు. 

12:22 - May 1, 2017

భారత్ కు చెందిన సుందర్ పిచాయ్..గూగుల్ సీఈవో..అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా టాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ జాబితాలో 'పిచాయ్' చేరిపోయారు. సుందర్‌ పిచాయ్ కు ఆ కంపెనీ నుంచి భారీ నజరానా పొందారు. గూగుల్‌ మాతృసంస్థ అల్పాబెట్‌ 2016 సంవత్సరానికి గాను 198.7 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,855 కోట్లు) స్టాక్స్‌ అందించాలని నిర్ణయించింది. 2015లో స్టాక్‌ అవార్డు కింద 99.8 మిలియన్‌ డాలర్లతో పోల్చితే ఇది రెట్టింపు. యూ ట్యూబ్‌ వ్యాపారంతో పాటు, ప్రధానమైన ప్రకటనల వ్యాపారం ద్వారా గూగుల్‌కు ఆదాయానికి మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు గాను పిచాయ్ కి ఈ భారీ నజరాన లభించింది. అలాగే మెషీన్‌ లెర్నింగ్‌, హార్డ్‌వేర్‌ , క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పెట్టుబడుల ద్వారా వృద్ధికి బాటలు చేశారు. 2015 అక్టోబర్‌లో గూగుల్‌ సిఇఒగా బాధ్యతలు తీసుకున్నారు.

మేడే వేడుకల్లో పాల్గొన్న జగన్

గుంటూరు : ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే వేడుకల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ఆర్టీసీని కేశినేని లేదా జేసీ దివాకర్ రెడ్డికి కట్టబెడతారేమోనని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను నారాయణ సంస్థలకు, జెన్ కో, ట్రాన్స్ కోలను సీఎం రమేష్, సుజనలకు అమ్మేస్తారేమోనని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామన్నారని..అధికారంలో వచ్చాక ఆ విషయాన్ని మరిచారని పేర్కొన్నారు.

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో మేడే వేడుకలు

గుంటూరు : ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే వేడుకల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు.

ఆర్ ఆండ్ బి శాఖపై సీఎం కేసీఆర్ రివ్యూ

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ఆర్ ఆండ్ బి శాఖపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

11:59 - May 1, 2017

గుంటూరు : రైతులకు మద్దతు ధర కల్పించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో దీక్షకు దిగనున్నారు. దీక్ష నేటి నుంచి రెండు రోజుల పాటు కొనసాగనుంది. జగన్ తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్ష చేయనున్నారు. ధీక్షాస్థలానికి భారీగా రైతుల, వైసీపీ శ్రేణులు, రైతులు చేకుంటున్నారు. అటు పాలకులు జగన్ దీక్షపై మండిపడుతున్నారు. రైతులను రెచ్చగొట్టేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జగన్ కాసేపట్లో నల్లపాడు చేరుకోనున్నారు.

11:39 - May 1, 2017

కృష్ణా : ప్రపంచంలో కుల, మత భేధాలు లేకుండా చేసుకునే పండగా మేడే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో సీఎం పాల్గొని, మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 1923 నుంచి మేడేను జరుపుకుంటున్నామని ఆయిన పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మందిలో 80 శాతం మంది అసంఘటిత కార్మికులున్నారని తెలిపారు. కార్మికుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందని చెప్పారు. కార్మికుల కోసం రూ. 5 లక్షలతో చంద్రన్నబీమా పేరుతో బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వికలాంగులైతే రూ. 2 లక్షలు, సహజ మరణమైతే రూ.50వేలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. 44,443 క్లైమ్ లు వచ్చాయని అందులో 34, 322 క్రైమ్ లు పే చేశామని తెలిపారు. యాజమాన్యం, కార్మికులు కుటుంబం ఉండాలి అన్నారు. 

11:38 - May 1, 2017

టాలీవుడ్ లో త్వరలో ఒక్కటి కాబోతున్న 'నాగ చైతన్య -సమంత'లపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా 'సమంత' పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో పలువురు పాల్గొని 'సమంత'కు విషెస్ తెలియచేశారు. సెంటరాఫ్ అట్రాక్షన్ గా 'నాగ చైతన్య'..’అఖిల్' నిలిచారు. వారి సమక్షంలో సమంత కేక్ ను కట్ చేసింది. ఈ బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి అక్కడ దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పార్టీలో సమంత కేక్‌ కట్‌ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్‌లో చక్కర్లు కొడుతోంది. ‘మై డార్లింగ్‌ వదిన సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఉత్తమంగా ఉండబోతోంది. లవ్యూ’ అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

11:38 - May 1, 2017

అనంతపురం : తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన చైతన్య స్వరూపి వేమనపై అనంతపురంలో సాహిత్య సమాలోచన కార్యక్రమం ఘనంగా జరిగింది. 250 సంస్థల ఆధ్వర్యంలో మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ వేత్తలు, కవులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేమనపై సాహిత్య సమాలోచన కార్యక్రమం
ప్రజాకవి వేమనపై అనంతపురంలో సాహిత్య సమాలోచన కార్యక్రమం ఘనంగా జరిగింది. 250 సంస్థల ఆధ్వర్యంలో మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ వేత్తలు, కవులు రచయితలతో పాటు ముఖ్య అతిథులుగా  మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సి గేయానంద్, పలువురు రచయితలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ బుక్ హౌస్ ప్రజాశక్తి బుక్ హౌస్ ఈ సదస్సులో 12 పుస్తకాలను ప్రదర్శనలో పెట్టింది.  
వేమన పద్యాలు తెలుగువారికి గొప్ప : పల్లె రఘునాథ్ రెడ్డి 
వేమన పద్యాలు తెలుగువారికి గొప్ప లాంటివని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. వేమన పద్యాలను పిల్లలకు నేర్పిస్తే సమాజంలో చైతన్యం, ఆలోచన వచ్చి తీరుతుందన్నారు. దేశంలో కుల వ్యవస్థ, అవినీతి అక్రమాలు, శ్రమదోపిడీ చెలరేగిపోతున్న నేటి సమయంలో వేమన సందేశం మనకు ఎంతో అవసరమని సాహితీ ప్రియులు అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద సభ ఇటీవల కాలంలో ఎక్కడా జరగలేదని ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి తెలిపారు. మొత్తమ్మీద ప్రజాకవి యోగి వేమన సమాలోచన రాష్ట్ర స్థాయి సదస్సు ఘనంగా జరిగింది. 

 

11:24 - May 1, 2017

ఖమ్మం : జిల్లాలో టీ-కాంగ్రెస్‌ నేతలు పర్యటిస్తున్నారు. మిర్చి వివాదంలో అరెస్ట్‌ అయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ముదిగొండ మండలం చిరుమర్రులో ఆనంద్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన నేతలు.. రైతులను రౌడీలు అనడం దుర్మార్గమన్నారు. అరెస్ట్‌ చేసినవాళ్లను రైతులు కాదని నిరూపించగలరా ? అని ప్రశ్నించారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు తమవాళ్లను అరెస్ట్‌ చేయడంతో.. రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ప్రభుత్వం రౌడీలుగా చిత్రీకరిస్తుందని ఆరోపించారు. అరెస్ట్‌ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని, మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

కాసేపట్లో జగన్ రైతు దీక్ష

గుంటూరు : నల్లపాడులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో రైతు దీక్ష చేపట్టనున్నారు. రైతన్నలపై సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా రెండు రోజులపాటు దీక్ష చేయనున్నారు. జగన్ తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్ష చేయనున్నారు. 
 

11:14 - May 1, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' చిత్రం కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన లుక్స్ ఇటీవలే విడుదలయ్యాయి. కానీ టీజర్ మాత్రం ఇంతవరకు రిలీజ్ కాలేదు. దీనితో చిత్రం ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమక్స్ లో మార్పులు..చేర్పులు చేసినట్లు టాక్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానుల్ని కాస్త అసహనానికి గురిచేసిన టీమ్‌ ప్రస్తుతం రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేసి నిరుత్సాహపరిచింది. అయినా ఆ వెంటనే ఆగష్టు తొమ్మిదిని కొత్త తేదీగా ప్రకటించి కాస్త ఊరటనిచ్చింది. ఆ మార్చిన స్క్రిప్ట్‌నే వచ్చే మే నెల మొదటి వారం నుండి చిత్రించనున్నారు. అది పూర్తైతే సినిమా మొత్తం దాదాపుగా అయిపోయినట్టే. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. తెలుగు..తమిళ భాషల్లో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో మహేష్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తుండగా 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది.

11:09 - May 1, 2017

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరో కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. రెడ్ కార్పెట్ పై పలువురు తారలు మెరువనున్నారు. ఇప్పటికే వాళ్లు రెడీ అయిపోతున్నారు కూడా. బాలీవుడ్ నుండి ముగ్గురు కథానాయికలు తళుక్కుమననున్నారు. ఫ్రెంచ్‌లోని రివేరాలో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ జరగనుంది. ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, సోనమ్‌ కపూర్‌ లు హాజరుకానున్నారు. వీరి ముగ్గురు లోరియల్‌ బ్రాండ్‌ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పాల్గొనే విషయాన్ని ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రచార కర్తలు ఎవా లాంగోరియా, జులియన్నే మూర్‌ తెలిపారు. దీపిక ఈ ఏడాది తొలిసారిగా లోరియల్‌ ప్రచారకర్తగా కేన్స్‌ ఎర్ర తివాచీపై మెరవనున్నారు. మే 17న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభమై, మే 28కు ముగియనుంది.

11:02 - May 1, 2017

తమను ప్రేమించడం లేదని..ప్రేమ విఫలం కావడంతో పలువురు ఆత్హహత్యలకు పాల్పడుతుండడం తెలిసిందే. ఇందులో సెలబ్రీటీలు కూడా ఉంటుంటారు. తాజాగా విక్రమ్ భట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ కోసం దర్శకుడు విక్రమ్ భట్ ఆత్మహత్యకు ప్రయత్నించారంట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. సుస్మిత బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాలన్నీ విక్రమ్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'భార్యతో విడిపోయాక సుస్మిత నేను ప్రేమించుకున్నాం. ఆ తర్వాత ఆమెతో బ్రేకప్‌ అయ్యింది. అదే సమయంలో నేను తీసిన 'గులామ్‌' సినిమా విడుదల కావాల్సి ఉంది. మరో పక్క నా కూతురిని చాలా మిస్సయ్యాను. ఈ ఆలోచనలన్నింటితో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. జీవితంలో మనం చేసే ప్రతి పనీ మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది' అని విక్రమ్ పేర్కొన్నారు.

11:00 - May 1, 2017

అనంతపురం : జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలో మృతుల కుటుంబాలను ఏపీ మంత్రి దేవినేని ఉమా, ఎంఎల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్రగౌడ్, కలెక్టర్ వీరపాండ్యన్ లు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారు తెలిపారు. వైటీ చెరువులో తెప్ప మునిగి 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

10:58 - May 1, 2017

మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్' తన వరుస చిత్రాలపై దృష్టి సారించాడు. ‘ధృవ' చిత్ర విజయం అనంతరం సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ రీమెక్ చిత్రంపై 'చెర్రీ' మనసు పారేసుకున్నట్లు టాక్. కన్నడ నటుడు అర్జున్‌ సర్జా నటించిన చిత్రం 'బహద్దూర్‌'. చేతన్‌ కుమార్‌ దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీన్ని తెలుగులో 'రామ్ చరణ్‌ తేజ్‌' హీరోగా రీమేక్‌ చేయడానికి ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్‌ హక్కులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ‘అల్లు అర్జున్’ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కానీ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది సస్పెన్ష్ గా మిగిలింది.

10:40 - May 1, 2017

ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసిన 'బాహుబలి -2’ రిలీజ్ అయి రికార్డులు సృష్టిస్తోంది. చిత్రాన్ని చూసిన పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజమౌళి అత్యద్భుత దర్శకుడని...తెలుగు సినిమా సత్తా చూపెట్టారని కొనియాడుతున్నారు. ‘ప్రభాస్'..'రానా' చిత్రంలో ప్రతొక్కరూ అద్భుత నటనను ప్రదర్శించారని మెచ్చుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ 'చిరంజీవి' కూడా 'బాహుబలి -2’ సినిమా చూశారు. ఈసందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు. చిత్రం చూసిన అనంతరం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'బాహుబలి- ది కంక్లూజన్‌ ఒక అద్భుతం.. ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి అభినందనీయుడు. తెలుగు సినిమా సత్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హ్యాట్సాఫ్‌. బాహుబలిలో నటించిన ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌, నాజర్‌ ఇతర నటీనటులతో పాటు ప్రత్యేకంగా విజయేంద్రప్రసాద్‌, కీరవాణి గారికి, సెంథిల్‌కి, మిగిలిన సాంకేతిక నిపుణులకు నా ప్రత్యేక అభినందనలు. జయహో... రాజమౌళి' అంటూ యూనిట్‌ సభ్యులను ప్రశంసలతో ముంచెత్తారు.

10:33 - May 1, 2017

మెరెనా : ప్రతి నోటుపై మహాత్మాగాంధీ ఫొటో ఉండే సంగతి తెలిసిందే. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల నోట్ల ముద్రించడంలో సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పెద్ద నోట్ల రద్దు అనంతరం అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రూ. 500, రూ. 2000 నోట్లను కొత్తగా ముద్రించారు. తాజాగా రూ. 500 నోట్లపై ‘గాంధీ’ ఫొటో లేకపోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మెరెనా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన గోవర్థన్‌ శర్మ అనే వ్యక్తి నగదు ఉపసంహరణ కోసం ఎస్‌బిఐ ఎటిఎంలోకి వెళ్లారు. అయితే అక్కడ ఎటిఎం నుంచి గాంధీ బొమ్మలేని రూ. 500 నోట్లు బయటకి వచ్చాయి. దీంతో శర్మ వెంటనే ఎటిఎం గార్డుకు ఈ విషయాన్ని తెలిపారు. ఫోన్‌ ద్వారా ఈ విషయాన్ని ఎస్‌బిఐ అధికారులకు గార్డు వివరించారు. ఈ నోట్లును పరిశీలించిన బ్యాంకు అధికారులు సదరు నోట్లు నకిలీవి కాదని నిర్థారించారు. అయితే గాంధీ బొమ్మను ప్రింట్‌ చేయడం మర్చిపోయారని తెలిపారు. కాగా, ఏప్రిల్‌ 25న షోపూర్‌లోని ఒక వ్యక్తి కూడా గాంధీ బొమ్మలేని రూ. 2000 నోట్లు లభించిన విషయం తెలిసిందే.

09:28 - May 1, 2017

విశాఖ : బీచ్‌ రోడ్డులో ఆదివారం రాత్రి ఓ స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. నోవాటెల్‌ వద్ద ఫుట్‌పాత్‌పై కూర్చున్న వారిపైకి బస్సు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడమే కారణమని తెలుస్తోంది. 

ఢిల్లీలో కాల్పుల కలకలం

ఢిల్లీ : మియాన్ వాలీలో కాల్పులు కలకలం రేపాయి. గ్యాంగ్ స్టర్ భూపేంద్రసింగ్ పై ప్రత్యర్థులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ సహా ముగ్గురు మృతి చెందారు.  

 

గోలివాడ పంపుహౌజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన

పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గామ్ మండలంలో గోలివాడ పంపుహౌజ్ నిర్మాణం పనులను రైతులు అడ్డుకున్నారు. వాహనాల కింద పడుకుని రైతులు ఆందోళన చేపట్టారు. పట్టా భూముల్లో కోర్టు స్టే ఉండగా తవ్వకాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. కంపెనీ నిర్వాహకులు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పనులు నిలిపివేసి..రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. 

09:17 - May 1, 2017

పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గామ్ మండలంలో గోలివాడ పంపుహౌజ్ నిర్మాణం పనులను రైతులు అడ్డుకున్నారు. వాహనాల కింద పడుకుని రైతులు ఆందోళన చేపట్టారు. పట్టా భూముల్లో కోర్టు స్టే ఉండగా తవ్వకాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. కంపెనీ నిర్వాహకులు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పనులు నిలిపివేసి..రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:00 - May 1, 2017

సూర్యాపేట : ఐపీఎల్ మ్యాచ్ ఆనందంగా చూశారు... తిరుగు ప్రయాణంలో విషాదం నెలకొంది. మ్యాచ్ ను తిలికించి సంతోషంగా తిరిగివస్తుండగా మృత్యువు వారిని కబళించింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది ఏపీ 27బీఎఫ్ 4653 కారులో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ కు వచ్చారు. మ్యాచ్ చూసిన అనంతరం అదే కారులో తిరుగుప్రయాణం అయ్యారు. తెల్లవారుజామున విజయవాడ...హైదరాబాద్ జాతీయ రహదారి దగ్గర చివ్వెంట మండలం గుంపుల తిరుమలగిరి వద్దకు చేరుకోగానే ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:49 - May 1, 2017

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, టీఆర్ ఎస్ రాకేష్, వైసీపీ నేత నాగార్జున, టీడీపీ నేత దుర్గాప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులను పట్టంచుకోవడం లేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:41 - May 1, 2017

మేడే స్ఫూర్తిగా కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలన్నారు. 'ఇవాళ మే డే. తమ హక్కుల సాధన కోసం, ఇప్పటికే సాధించుకున్న హక్కుల పరిరక్షణ కోసం మరోసారి కార్మికవర్గం తనతాను పునరంకితం చేసుకునే దినోత్సవం.  ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం ప్రతి ఏటా మే ఒకటో తేదీన మేడే జరుపుకుంటోంది.  131 ఏళ్ల క్రితం 1886 మే 1న షికాగోలో కార్మికులు నిర్వహించిన భారీ ప్రదర్శన, దానిపై అమెరికన్ పోలీసుల దాష్టీకాన్ని కార్మిక వర్గం ఎన్నటికీ మరచిపోలేదు. ఆనాడు నలుగురు కార్మికులు చేసిన ప్రాణత్యాగమే ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహణకు స్పూర్తి దాయకమైంది. షికాగోలో కార్మికుల రక్తతర్పణకు దారితీసిన కారణాలేమిటి? ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లేమిటి?'  అనే అంశాలపై శ్రీనివాస్ మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:34 - May 1, 2017

హైదరాబాద్ : ఇవాళ మే డే. తమ హక్కుల సాధన కోసం, సాధించుకున్నవాటిని నిలుపుకోవడం కోసం కార్మికవర్గం కదం తొక్కుతోంది. కార్మికవాడలు అరుణ పతాకాలతో రెపరెపలాడుతున్నాయి. ఎర్రఎర్రని జెండాలు చేబూనిన కార్మికులు   గత కాలపు పోరాటాలను స్మరించుకుంటూ, కార్మికవర్గ అమరవీరులకు జోహార్లప్పిస్తూ, తమను తాము పోరాటానికి సన్నద్దం చేసుకుంటున్నారు. 
130ఏళ్ల క్రితం నాటి రక్తతర్పణ
మేడే.. రెండే అక్షరాలు. ఆరే ఆల్ఫాబెట్స్. కానీ, ఆ చిన్న పదం విన్న ప్రతిసారీ ఎంత స్పూర్తి, ఎంత ఉద్వేగం.   మరెంత సమరోత్సాహం. మేడే ఒట్టి హాలీడే సెలబ్రేషన్ కాదు. 130ఏళ్ల క్రితం నాటి రక్తతర్పణను మన కళ్లెదుట నిలిపే ఓ పవిత్ర దినం.  1886 మే 1న షికాగోలో వెల్లువెత్తిన ఉద్యమం, ఆ తర్వాత ఎన్ని సంస్కరణలకు,  మరెన్ని చట్టాలకు దారితీసిందో .   
గర్జిస్తూ ఉదయించిందే మేడే  
ఎక్కడో ఒక చోట, ఏదో ఒక పని చేసి, జానెడు పొట్ట నింపుకోవడానికి ఎన్ని కష్టాలు. ఎన్ని వేదనలు. ఎన్ని అవమానాలు.  ఎన్ని అదిరింపులు. ఎన్ని చీదరింపులు. వీటన్నింటినీ ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, ఇంకానా ఇక పై సాగవింకా అంటూ గర్జిస్తూ ఉదయించిందే మేడే. ఆరుగురు వీరుల రక్తతర్పణను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే మేడే. మనిషిని మనిషిగా   బతకనివ్వండంటూ ఎలుగెత్తి చాటే నినాదమే మేడే.  గేట్లకు తాళాలు పెట్టి, చేతిలో దుడ్డుకర్రలు పట్టుకుని, క్షణమైనా కూర్చోనివ్వకుండా రోజుకి 18 గంటలు, 20 గంటలు పనిచేయిస్తూ కనీసం కడుపు నిండా   తిండైనా పెట్టకుండా బాధిస్తుంటే కడుపుమండి కార్మికవర్గం   స్రుష్టించిన తొలి విప్లవమే మేడే.
130 ఏళ్ల క్రితం నాటి పరిస్థితేమిటి? 
130 ఏళ్ల క్రితం నాటి పరిస్థితేమిటి? ఈ కాలంలో మనం సాధించుకున్నదేమిటి? వాటిలో నిలబెట్టుకున్నవేమిటి? పోగొట్టుకుంటున్నవేమిటి? ఇంకా సాధించుకోవాల్సిందేమిటి? ఇలాంటివేవీ ఆలోచించుకోక పోతే మేడే కి అర్ధమే వుండదు. మేడ్ ఇన్ ఇండియా    ఒకప్పటి మన  ఆంబిషన్.   మేక్ ఇన్ ఇండియా   ఇప్పటి మన ప్రభువుల అద్భుత ప్రవచనం.  అప్పుడు కార్మిక సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు. ఇప్పుడు సంస్కరణలు. సవరణలు.  సంస్కరణల యుగానికి పూర్వం మన దేశ ప్రభుత్వరంగ సంస్థల్లో 19.14 మిలియన్ల మంది కార్మికులండేవారు. 2010 నాటికే వారి సంఖ్య 17.55 మిలయన్లకు పడిపోయింది.  అప్పుడు ప్రయివేట్ రంగంలో 8.51 మిలియన్ల మంది కార్మికులుంటే ఇప్పుడు 11.45కు మిలియన్లకు పెరిగింది.  సంస్కరణలు ఎవరికి వరమయ్యో , ఎవరికి శాపమయ్యాయో అర్ధం చేసుకోవడానికి ఇంతకంటే వేరే లెక్కలేమి కావాలి. తోటి మనిషిని కుళ్ల బొడిచైనా, రూపాయిలు కూడబెట్టడం నేర్పే ఆర్థిక వ్యవస్థ పెద్ద కసాయి. కాపిటల్  రిఫార్మ్స్ ప్రవచించే హ్యూమన్ ఫేస్ పెద్ద బడాయి. దాంతో లడాయి పెట్టుకోవడమే అసలైన మేడే స్పిరిట్. రండి. లాస్ట్ మేడేకి ఈ మేడేకి మధ్య బ్యాలెన్స్ షీట్ చూసుకుందాం. మనం ఏం సాధించుకున్నమో, ఏం కోల్పాయోమో తేలిపోతుంది. 

 

08:23 - May 1, 2017

హైదరాబాద్ : ఈ రోజు మనం ఎనిమిది గంటలే పని చేస్తున్నాం. రోజుకు ఒక షిఫ్టే పని చేస్తున్నాం. ఇది 127 సంవత్సరాల క్రితం ఈ రోజు ప్రారంభించిన పోరాట ఫలితం. ఆ రోజు చేసిన వందలాది మంది ప్రాణత్యాగాలే ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలకు పునాది. నాడు చూపించిన లక్షలాదిమంది పోరాటపటిమే నేడు కార్మికులు ధైర్యంగా సమ్మె చేసుకునే పరిస్ధితిని కల్పించింది. కార్మికులు తమ హక్కుల కోసం నినదించిన రోజు.  శ్రమ విలువకు ఖరీదు కట్టమంటూ డిమాండ్‌ చేసిన రోజు.  కాల్పుల్లో చనిపోయిన కార్మికుల రక్తంతో ఎర్రజెండా పుట్టిన రోజు. అదే మేడే. కార్మిక దినోత్సవం.
127 ఏళ్ల క్రితం జరిగిన పోరాటం... మేడే
మనం జరుపుకుంటున్న మేడే ... ఒక్క రోజు జరిగిన పోరాటం కాదు. చికాగో నగరంలో 127 ఏళ్ల క్రితం కార్మికులు చేసిన పోరాట ఫలితం. పోలీసులు వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నా... కేసులు పెట్టి మరణశిక్షలు విధించినా... ఉద్యోగాలు పోయినా... పట్టు వదలకుండా ఉద్యమం చేసిన ఆ వీరులకు పెట్టుబడిదారులు తల వంచక తప్పలేదు. పని గంటలను నిర్ణయించారు. ప్రపంచ కార్మిక ఉద్యమాలకు ఇది తొలి ముందడుగు. 
1884లో ప్రారంభమైన పోరాటం
1884 సంవత్సరం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాలం. నూతన యంత్రాలతో ఉత్పత్తి చేస్తున్న రోజులవి. కార్మికులకు మాత్రం పని గంటలు లేవు. రోజుకు 14 గంటలు.. 16 గంటలు పని చేయించుకుంటున్నారు. సెలవులు లేవు. చెమటను చిందిస్తూ పని చేయటమే వారికి తెలుసు. అప్పటికే ఉన్న కార్మిక సంఘాలు పని 8 గంటలే ఉండాలని... 1886 మే 1 కల్లా దీన్ని ఎలాగైనా సాధించుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాయి. రెండు సంవత్సరాల ముందు నుంచే రకరకాల రూపాల్లో ఉద్యమం మొదలెట్టారు.
1886 మే 1 చికాగోలో సమ్మె ప్రారంభం
1886 మే 1  రానే వచ్చింది. మూడున్నర లక్షల మంది సమ్మెలోకి దిగారు. ఆ రోజు చికాగోలో 20 వేల మందితో భారీ ప్రదర్శన జరిగింది. 2వ తేదీ కూడా ప్రదర్శనలు, సభలు జరిగాయి. 3వ తేదీ ఒక ఫ్యాక్టరీ దగ్గర కార్మికుల సమావేశం జరుగుతోంది. సడెన్‌గా పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు కార్మికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. కార్మికులంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. 4 వ తేదీ మార్కెట్‌ చౌక్‌ వద్ద సభ పెట్టారు. దీనిపైనా పోలీసులు దాడి చేశారు. ఒక బాంబు పేలింది. ఒక పోలీసు చనిపోయాడు. కాల్పుల్లో వందలాది కార్మికులు చనిపోయారు.
ఏడుగురికి మరణ శిక్ష విధింపు
బాంబు పేలుడుపై కార్మికులపై కేసు పెట్టారు. 1886 ఆగస్టు 19న ఏడుగురికి మరణశిక్ష, ఒకరికి యావజ్జీవ శిక్ష విధించారు. 1887 నవంబర్‌ 11న మరణశిక్ష అమలు చేసే సమయంలో కార్మికులంతా ప్రత్యేక రైలులో వెళ్లారు. ఆ వీరులకు నివాళులర్పిస్తూ ఊరేగింపులో 5 లక్షల మంది పాల్గొన్నారు. 
ప్రపంచమంతా వ్యాపించిన పోరాటం
లక్షలాది కార్మికుల పోరాటంతో.... వందలాది కార్మికుల ప్రాణత్యాగాలతో.... 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. చికాగోలో జరిగిన ఈ పోరాటం ... దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా సాగింది. 1917లో రష్యా విప్లవం తర్వాత.. ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని ఆమోదించాల్సి వచ్చింది.  
సమాజ మార్పునకు చోదక శక్తి కార్మికవర్గం
ఏ దేశంలోనైనా సమాజ మార్పునకు చోదక శక్తి కార్మికవర్గమే. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మికులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలోని ఇతర వర్గాలను కలుపుకుని ఉద్యమాలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ భారతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, ఇతర సమస్యలపై ఉద్యమాలను నిర్మించాల్సి ఉంటుంది. రైతులతో ఇతర వర్గాలతో కార్మికులు భుజం,భుజం కలిపి పోరాడాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకుసాగాలి. అప్పుడే.. మార్క్స్‌, లెనిన్‌, ఫిడేల్‌ క్యాస్ట్రో లాంటి స్మరణీయులు ఎందరో కాంక్షించిన సమసమాజం.. సాకారమవుతుంది. 

 

నేటి నుంచి రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణ

ఢిల్లీ : నేటి నుంచి రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరల సవరించనున్నారు. విశాఖతోపాటు 5 నగరాల్లో అమలు చేయనున్నారు. 

 

నేడు ఆదోని, మంత్రాలయంలో ఎంపీ బుట్టా రేణుక పర్యటన

కర్నూలు : నేడు ఆదోని, మంత్రాలయంలో ఎంపీ బుట్టా రేణుక ర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. 

తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ హాట్ టిక్కెట్లు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ హాట్ టిక్కెట్లు ఇవ్వనున్నారు. వెబ్ సైట్ ద్వారా హాట్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మే 12న తెలంగాణ ఎంసెట్ నిర్వహించనున్నారు.

 

నేటి ఐపీఎల్ 10మ్యాచ్ లు

ఢిల్లీ : ఐపీఎప్ 10 లో భాగంగా ఇవాళ ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ముంబై వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పుణెతో గుజరాత్ తలపడనుంది. 

 

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం....ముగ్గురు మృతి

సూర్యాపేట : జిల్లాలోని చివ్వెంట మండలం గుంపులతిరుమలగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ...హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. 

07:49 - May 1, 2017

విజయవాడ : కృష్ణా నదిలో కబ్జాదారులపై మత్స్యకారులు కదం తొక్కారు. తమకు ఎన్నో తరాలుగా ఉపాధినిస్తోన్న కృష్ణమ్మను కబ్జా చేస్తే ఊరుకోబోమంటూ మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. తమకు అన్నంపెట్టే కృష్ణా నది జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని తేల్చి చెప్పారు. 
కృష్ణానది కబ్జాపై మత్స్యకారుల పోరుబాట
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న కృష్ణానది కబ్జాపై మత్స్యకారులు పోరుబాట పట్టారు. ఏకంగా కృష్ణానదినే ఆక్రమించి, కృత్రిమ ద్వీపం  నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్న బడాబాబులపై సమరశంఖం పూరించారు. బడాబాబుల తీరు నిరసిస్తూ.. 150 మంది మత్స్యకారులు నది మధ్యలో ఆందోళనకు దిగారు. 50 పడవలతో నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణమ్మను నమ్ముకుని జీవిస్తున్నామని.. ఇప్పుడు తమ జీవితాన్నే నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కృష్ణానదినే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
కృష్ణానదిపై అక్రమార్కుల కన్ను
కృష్ణా , గుంటూరు జిల్లా మధ్య నున్న కృష్ణానదిపై అక్రమార్కుల కన్నుపడింది. తాళ్లాయపాలెం, వెంకటపాలెం, గుంటుపల్లి గ్రామాల మధ్యనున్న కృష్ణానది ఆక్రమించడానికి కొంతమంది అక్రమార్కులు ప్లాన్‌ వేశారు. అక్కడ హోటల్స్‌ నిర్మించి సొమ్ము చేసుకోవాలని భావించారు. అనుకున్నదే తడువుగా రాత్రికి రాత్రే నదిలో 150 ఎకరాల మేర రెండువైపుల జెండాలతో మార్కింగ్‌ వేశారు. మార్కింగ్‌ ఉన్న ప్రాంతంలోకి వేటకు రావొద్దని మత్స్యకారులను బెదిరించారు.  వేటకోసం వస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కృష్ణానది కబ్జా బాగోతాన్ని మత్స్యకారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కబ్జా వ్యవహారంపై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. కృష్ణానది కబ్జా పర్వాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసింది. 
అక్రమంగా నదిలో ఫెన్సింగ్‌ ఏర్పాటు
కృష్ణానదిని పూడ్చి దాన్ని ద్వీపంలా తయారు చేయాలన్నది విజయవాడకు చెందిన ఓ బాడాబాబు ప్లాన్‌. హోటల్స్‌ నిర్మించి తద్వారా సొమ్ము చేసుకోవాలని స్కెచ్‌ వేశారు. కృష్ణానదిలో మార్కింగ్‌ ఏర్పాటు కూడా చేశారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అధికారపార్టీ నేతల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.  కృష్ణానదినే నమ్ముకుని తరాలుగా జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి ఏంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.అందుకే తాము ఆందోళన బాట పట్టామని చెబుతున్నారు.  తమ ఆందోళనతో ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అమరావతి నడిబొడ్డులో కృష్ణానది కబ్జా యథేచ్చగా సాగుతోంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణానది కబ్జా పర్వాన్ని ప్రభుత్వం ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి.
 

07:46 - May 1, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరన్నదానిపై టీడీపీలో సందిగ్ధత కొనసాగుతునే ఉంది.  భూమా అఖిలప్రియ, శిల్పా సోదరులతో  సీఎం చంద్రబాబు  ఆదివారం కూడా వేర్వేరుగా చర్చించారు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న చంద్రబాబు.... ఎవరికీ హామీ ఇవ్వలేదు. అమెరికా పర్యటన తర్వాత చంద్రబాబు, నంద్యాలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశముంది.
అభ్యర్థి ఎవరన్నదానిపై స్పష్టత రాలేదు.. 
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా సోదరులతో చంద్రబాబు చర్చలు జరిపినా అభ్యర్థి ఎవరన్నదానిపై స్పష్టత రాలేదు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న చంద్రబాబు తన నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టారు. 
అఖిలప్రియ, శిల్పా సోదరులతో చంద్రబాబు భేటీ
నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్ధిని ఖరారు చేయడంపై శనివారమే చంద్రబాబు టికెట్‌ ఆశిస్తున్న భూమా అఖిలప్రియ, శిల్పా సోదరులతో వేర్వేరుగా చర్చించారు.  తన తండ్రి మరణంతో ఖాళీ అయిన సీటును  తమ కుటుంబానికే కేటాయించాలని అఖిలప్రియ కోరింది.  తమ కుటుంబం తరపున సోదరుడికి అవకాశం కల్పించాలని కోరారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన శిల్పా మోహన్‌రెడ్డి...నంద్యాల సీటు తనకే కేటాయించాలని కోరారు. తమకు ఇస్తే పోటీ చేస్తాం.. లేదంటే ఇచ్చిన వారితో కలిసి పనిచేస్తామని శిల్పా చంద్రబాబుతో అన్నారు. 
కొలిక్కిరాని చర్చలు
శనివారం నాటి చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఆదివారం చంద్రబాబు ఇరువర్గాల అభిప్రాయాలను మరోమారు తెలుసుకున్నారు. ఇరు వర్గాల నేతలతో విడివిడిగా మాట్లాడిన చంద్రబాబు.... పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని సూచించారు. దీనికి వారు కూడా అంగీకరించారు. టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని చంద్రబాబు తమకు సూచించారని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. తనకే సీటు కేటాయించాలని కోరానని, సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. 
నంద్యాల సీటుపై ఎవరికీ లభించని హామీ
నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించకుండా సీఎం చంద్రబాబు తనదైన శైలిలో నాన్చుడు ధోరణి పాటిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు.  మే 4 నుంచి తాను అమెరికా పర్యటనకు వెళ్తుండడంతో... తిరిగి వచ్చిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తున్నారు.  ఇదే విషయాన్ని చంద్రబాబు ఇరువర్గాలకు స్పష్టం చేశారు.  మొత్తానికి చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాతే నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడనుంది.

 

07:39 - May 1, 2017

వరంగల్ : రైతు సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధ్రుతం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపాదించింది.  రైతులకు యూపీఏ ప్రభుత్వ హయాంలో లభించిన ధరలను, ప్రస్తుత ఎన్ డీఏ పాలనలో ఇస్తున్న ధరలను సరిపోల్చి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఆదేశించారు. 
వరంగల్‌ జిల్లాలో దిగ్విజయ్‌ సింగ్‌ పర్యటన
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. భీమదేవరపల్లి మండలం మల్కనూరు సహకార బ్యాంకును సందర్శించారు. రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారరెడ్డి, ఐఏసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొప్పుల రాజు, కాంగ్రెస్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌ వెంట ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, పంటలకు కనీస మద్దతు ధరలు లభించక రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దిగ్విజయ్‌సింగ్‌ విమర్శించారు.
వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిన కేసీఆర్‌ : ఉత్తమ్ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగేనని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ గుర్తు చేశారు. రైతు సమస్యలతోపాటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వాస్తవాలను చెప్పడం ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయంత్న చేయాలని కాంగ్రెస్‌ నేతలకు దిగ్విజయ్‌ సింగ్‌ మార్గనిర్దేశం చేశారు. 

 

07:34 - May 1, 2017

గుంటూరు : జగన్‌ చేపడుతున్న రైతు దీక్షపై ఏపీ మంత్రులు పండిపడుతున్నారు. రైతులకు రెచ్చగొట్టేందుకే  జగన్‌ దీక్షకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. రైతులకు రుణ మాఫీతోపాటు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో దేశానికే ఆదర్శమని చెబుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ గంటూరులో నిర్వహించతలపెట్టిన దీక్షను ప్రభుత్వం తప్పుపట్టింది. రైతులను మభ్యపెట్టేందుకే జగన్‌ దీక్ష చేస్తున్నారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. 
రైతు సమస్యలపై జగన్‌ మొసలి కన్నీరు : సోమిరెడ్డి 
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులు పండించిన పంటలకు ఎప్పుడైనా గిట్టుబాటు ధరలు లభించాయా ? అన్నిమంత్రులు ప్రశ్నిస్తున్నారు. రైతు సమస్యలపై జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టేందుకే జగన్‌ దీక్ష చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 
పాలన చూసి ఓర్చుకోలేకే జగన్‌ దీక్ష : ప్రత్తిపాటి  
ఏపీని అన్నపూర్ణగా మారుస్తున్న చంద్రబాబునాయుడు పాలనను చూసి ఓర్చుకోలేకే జగన్‌ దీక్ష చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ దీక్ష చేసే ముందు రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ది, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రులు కోతున్నారు. 

 

07:30 - May 1, 2017

గుంటూరు : రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు  గుంటూరులో నిరసన దీక్ష పేపట్టనున్నారు. నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డుకు దగ్గరలోనే దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు జగన్‌ దీక్ష ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. 
రైతు సమస్యలపై జగన్‌ పోరుబాట 
వైసీపీ అధినేత జగన్‌ రైతు సమస్యలపై పోరుబాట పట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. గుంటూరులో రెండు రోజుల పాటు రైతు దీక్ష చేపట్టనున్నారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో మిర్చియార్డుకు సమీపంలోనే దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరులో గతంలో రెండుసార్లు దీక్ష చేసిన ప్రదేశంలోనే ఈసారి కూడా నిరసన చేపడుతున్నారు. ఇంతకు ముందు ప్రత్యేక హోదాతోపాటు, యువభేరి దీక్షలు చేశారు. ఇప్పుడు మూడోసారి రైతు దీక్ష చేస్తున్నారు. ఉదయం పది గంటలకు జగన్‌ దీక్ష ప్రారంభమవుతుంది. పార్టీ నేతుల, కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తును హాజరుకానున్నారు. ఏపీలో నెలకొన్న కరవుతోపాటు పంటలకు గిట్టుబాటు ధరలేని అంశాన్ని జగన్‌ ప్రధానంగా ప్రస్తావిస్తారు. మిర్చికి గిట్టుబాటు ధరలేక రైతులు కల్లాల్లోనే తగలబెడుతున్న అంశం ప్రభుత్వాన్ని నిలదీస్తారు. వ్యవసాయ రుణాల మాఫీ, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న వాదాన్ని వైసీపీ నేతలు లేవనెత్తున్నారు. 
దీక్షకు అన్ని ఏర్పాట్లు 
జగన్‌ దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దీక్షా స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతాంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేందుకే  జగన్‌ దీక్ష చేపడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్‌ దీక్ష చేపట్టే నల్లపాడుతోపాటు, గంటూరు మిర్చియార్డు సమీపంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్ : నేడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లనున్నారు. రామానుజాచార్యుల స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. 

 

నేడు, రేపు గుంటూరులో జగన్ రైతు దీక్ష

గుంటూరు : నేడు, రేపు గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేపట్టనున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

నేడు ప్రధాని మోడీతో టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ భేటీ

ఢిల్లీ : నేడు ప్రధాని మోడీతో టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

హైదరాబాద్ : నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 

Don't Miss