Activities calendar

02 May 2017

21:58 - May 2, 2017
21:29 - May 2, 2017

ఢిల్లీ:అమర జవాన్లకు దేశ ప్రజలంతా అండగా ఉన్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు.ప్రేమ్‌సాగర్‌ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఆయనకు సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఒక తలకు ప్రతీకారంగా 50 మంది పాకిస్థాన్‌ సైనికుల తలలు తీసుకురావాలని ప్రేమ్‌సాగర్‌ కుమార్తె సరోజ అన్నారు.

అమర జవాను సుబేదార్‌ పరమ్‌జిత్‌ సింగ్‌ మృతదేహాం..

అమర జవాను సుబేదార్‌ పరమ్‌జిత్‌ సింగ్‌ మృతదేహాన్ని పంజాబ్‌లోని ఆయన స్వగ్రామం తరన్‌తారన్‌ గ్రామానికి తరలించారు. భారీ సంఖ్యలో వచ్చిన గ్రామస్తులు వీర జవానుకు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఆయనకు అంత్యక్రియలు జరిపారు. భారత జవాన్లను అత్యంత కిరాతకంగా హతమార్చిన పాక్‌ సైన్యంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని సుబేదార్‌ పరమ్‌జీత్‌సింగ్‌ సోదరుడు పేర్కొన్నారు. నా తండ్రి అమరవీరుడైనందుకు గర్వంగా ఉందని కూతురు సిమరన్‌ దీప్‌ తెలిపింది.

పాకిస్తాన్‌ దుశ్చర్యపై అంతర్జాతీయ సమాజం,...

పాకిస్తాన్‌ దుశ్చర్యపై అంతర్జాతీయ సమాజం గమనిస్తోందని...ఈ విషయంలో పాకిస్తాన్‌కు తగినరీతిలో భారత్‌ బుద్ధి చెబుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

కృష్ణఘాటి సెక్టార్‌లో పెట్రోలింగ్‌ జరుపుతున్న...

కృష్ణఘాటి సెక్టార్‌లో పెట్రోలింగ్‌ జరుపుతున్న భారత జవాన్లపై పాకిస్తాన్ బోర్డర్‌ యాక్షన్‌ టీం రాకెట్‌ లాంఛర్లను ప్రయోగిస్తూ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో మృతి చెందిన బిఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌సాగర్, ఆర్మీ జెసిఓ పరమ్‌జిత్‌సింగ్‌ల మృతదేహాలను పాక్‌ ఆర్మీ ముక్కలు ముక్కలుగా నరకడం ద్వారా తన పైశాచికత్వాన్ని చాటుకుంది. 

21:23 - May 2, 2017

హైదరాబాద్: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో ఆప్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆప్‌ కీలక నేత కుమార్‌ విశ్వాస్‌ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కుమార్‌ విశ్వాస్‌ బీజేపీ ఏజెంట్‌ అని, ఆప్‌లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తాను బీజేపీ ఏజెంటును కాదని, ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని కుమార్‌ విశ్వాస్‌ స్పష్టం చేశారు. తాను సిఎం, డిప్యూటి సిఎం కావాలని అనుకోవడం లేదని...తన నోరు ఎవరూ మూయించలేరని తెలిపారు. 24గంటల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు.  

21:16 - May 2, 2017

హైదరాబాద్: భర్త నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు పింఛను అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్ధికంగా వారికి చేయూతనివ్వాలని సంకల్పించింది. అయితే కనీసం ఏడాది నుంచి భర్తకు దూరంగా ఉంటున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

అవివాహితులు కూడా పథకానికి అర్హులే....

ఇక ఈ పథకానికి పల్లెల్లో అయితే 30 ఏళ్లు..పట్టణాల్లో అయితే 35 ఏళ్లు దాటిన అవివాహితులు కూడా అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే అధికారులు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చాలని తెలిపింది. వేరే ఏ ఇతర పింఛన్లు తీసుకోని ఒంటరి మహిళలకు మాత్రమే ఆర్ధిక భృతి అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

21:14 - May 2, 2017

అమరావతి: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, సిమెంట్‌ ధరల నియంత్రణపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. నవనిర్మాణ దీక్షలు, చంద్రబాబు అమెరికా పర్యటన తదితర అంశాలపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు.

సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలకు కేబినెట్‌ ఓకే ....

అమరావతిలో జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 42: 58 నిష్పత్తిలో ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్టియంలకు వాటాలు ఉండనున్నాయి.

సిమెంట్ ధరలపై కేబినెట్‌లో చర్చ....

అటు అడ్డేలేకుండా పెరిగిపోతున్న సిమెంట్‌ధరల నియంత్రణపై మంత్రివర్గం చర్చించింది. సిమెంట్‌ కంపెనీల తీరుపై మంత్రి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేట్లు తగ్గించకపోతే సిమెంట్‌ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయంచినట్టు సమాచారం. రేట్లు తగ్గించని కంపెనీలకు రాయితీలు కట్‌ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో వివిధ పోస్టుల స్థాయి పెంపు, కొత్త పోస్టుల కల్పనపై కూడా కేబినెట్‌ ప్రధానంగా చర్చించింది.

నవ నిర్మాణ దీక్షలపై మంత్రుల కమిటీ ...

మరోవైపు జూన్‌ నెలల్లో చేపట్టనున్న నవ నిర్మాణ దీక్షపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇదిలావుంటే సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో పలు కీలక అంశాలపై కూడా కేబినెట్‌ చర్చించినట్టు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీకి వెళ్లి.. అక్కడ నుంచే బాబు అమెరికాకు బయల్దేర నున్నారు. 

21:12 - May 2, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మిర్చి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం మిర్చియార్డు ధ్వంసం ఘటనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ అఖిలపక్షం చేపట్టిన ఖమ్మం దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మానికి వచ్చే రహదారులన్నిటి లెప్ట్‌, టీడీపీ నేతలు దిగ్బంధించారు. రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులపై కేసులు ఎత్తివేయడంతోపాటు మిర్చిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.

రహదారులపై బైఠాయించిన వామపక్ష నేతలు...

రఘునాథపలెం దగ్గర ఖమ్మం- ఇల్లెందు, ఖమ్మం - బోనకల్లు రహదారులపై బైఠాయించిన వామపక్ష నేతలు, టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. కొణిజర్ల మండలం తణికెళ్లలోనూ అఖిలపక్ష నేతలు రహదారిపై బైఠాయించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లెఫ్ట్‌, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. ముదిగొండలో రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

వరంగల్‌ జిల్లా ఎనుమాముల మార్కెట్‌ దగ్గర ...

వరంగల్‌ జిల్లా ఎనుమాముల మార్కెట్‌ దగ్గర మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. పాసుపుస్తకాలు ఉన్న రైతులను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమను వ్యాపారులు నిలువునా దోపిడీ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. పండించిన పంటకు కూలిడబ్బులు కూడా రావడం లేదని.. ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్‌ నేత ఎనుమాముల మార్కెట్‌కు వచ్చారు. దీంతో గండ్ర వెంకటరమణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

21:09 - May 2, 2017

హైదరాబాద్: మిర్చి రైతుల పరిస్థితి అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి అన్నట్లుగా మారింది. మిర్చికి మద్దతు ధరలేక రైతులు అల్లాడుతున్నారు. వ్యాపారులు క్వింటాలుకు 2500 రూపాయలు మాత్రమే అడుగుతుండటంతో..అన్నదాత ఆందోళన బాట పట్టాడు. మరోవైపు వినియోగదారులను మిర్చి ధర బెంబేలెత్తిస్తోంది. కిలో ఎండుమిర్చి 110 రూపాయలు పలుకుతోంది. మిర్చి ధరలేక అన్నదాత, భారం ఎక్కువై వినియోగదారుడు గగ్గోలుపెడుతున్నారు. ఇంతకీ మిర్చి ధర ఎవరికి మోదం - ఎవరికి ఖేదాన్ని పంచుతోంది... 10టీవీ ప్రత్యేక కథనం..

వినియోగదారుడికి మంటపుట్టిస్తోన్న మిర్చి

తెలుగువారికి కారం లేనిదే గొంతులోకి ముద్దదిగదు. కారం కొనడానికని దుకాణానికి వెళ్తే మిర్చి ధర మంటపుట్టిస్తోంది. కిలో ఎండుమిర్చి కొనాలంటే 100 నుంచి 120 రూపాయల కావాల్సిందే. వినియోగ దారుడికి ధరతో మంటపెడుతున్న మిర్చి అన్నదాతకు ఏమైనా మేలు చేస్తోందా అంటే అదీ లేదు. రైతులను కంట తడి పెట్టిస్తోంది. క్వింటాల్‌ మిర్చికి 4వేలకు మించి ధర పలకడం లేదు. మిర్చి ధరలతో అటు అన్నదాత, ఇటు వినియోగదారుడు ఎవరూ సంతోషంగా లేరు. వినియోగ దారుడు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంటే ఆ ప్రతిఫలం రైతులకు దక్కాలి. కానీ రైతు కూడా సంతోషంగా లేడు. గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నాడు. మరి ఇంతకీ మిర్చి అమ్మకం.. కొనుగోలులో ఎవరు లాభం పొందుతున్నారు?

మద్దతు ధర ఇవ్వడంలేదంటూ కొద్దిరోజులుగా మిర్చి రైతుల ఆందోళన

కొద్దిరోజులుగా తమ పంటకు మద్దతు ధర లభించడం లేదంటూ మిర్చి రైతులు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో పలుచోట్ల ఆందోళన చేస్తున్నారు. క్వింటాల్‌ మిర్చికి 2500 రూపాయలకు మించి కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన అన్నదాత ఖమ్మం మార్కెట్‌ యార్డును ధ్వంసం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర మార్కెట్లలోనూ మిర్చి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్వింటాల్‌ మిర్చిని 10వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయినా అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై క్వింటాల్‌కు 4500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి 2500లకు కూడా వ్యాపారులు అడుతున్నారు.

రూ. 45కే కిలో మిర్చిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

4500 రూపాయలకు క్వింటాల్‌ మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేస్తే కిలో మిర్చికి 45 రూపాయలు చెల్లిస్తున్నట్టు లెక్క. మరి వినియోగదారుడికి దగ్గరికి వచ్చే సరికి మిర్చి ధర 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఎండు మిర్చిని కారంగా చేసి 250 నుంచి 275 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులకు రవాణా, ఇతర చార్జీలు కలిపి కిలోకు పది రూపాయలు ఖర్చు అవుతుందని అనుకుందాం. అంటే ఎంత లేదన్నా కిలో ఎండు మిర్చికి 50 నుంచి 60 రూపాయలను వ్యాపారులు లాభంగా పొందుతున్నారు. రైతు పగలనకా, రాత్రనకా కష్టపడి సాగుచేస్తే రైతుకు మిగిలేదేమో అప్పులు. వ్యాపారులు ఏకష్టం చేయకుండా కాలుమీద కాలేసుకుని దర్జాగా కూర్చొని రైతులను దోపిడీ చేస్తూ కిలో మిర్చికి 50 నుంచి 60 రూపాయలు సంపాదిస్తున్నారు. దీంతో అటు అన్నదాతలు, ఇటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పథకం ప్రకారమే ధరలు పతనం

గతేడాది మిరప క్వింటాకు 11550 నుంచి 13500 వరకు ధర పలికింది. దీంతో ప్రభుత్వం కూడా తెల్లబంగారం వద్దని మిర్చిని విరివిగా సాగుచేయాలని రైతులకు సూచించింది. దీంతో రైతులు మిర్చిని సాగు చేశారు. ఈ ఏడాది జనవరిలో క్వింటా మిర్చికి 12,500 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి నుంచి మిర్చి మార్కెట్‌కు భారీగా తరలివస్తుండడంతో ధరను తగ్గించుకుంటూ వచ్చారు. ఏప్రిల్‌ 15 నాటికి క్వింటా ధర ఏకంగా 7,500లకు పడిపోయింది. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ జెండాపాట ఒకధర అయితే... క్షేత్రస్థాయిలో ధర మరోరకంగా మారింది. జెండాపాట 5,500గా నిర్ణయిస్తే ఈ ధరకు 10శాతం మాత్రమే కొన్నారు. మిగతా 90శాతం సరకు నాణ్యత లేదంటూ 2,500 అమ్మితే కొంటామంటూ తేల్చి చెప్పారు. అంటే అధికారులు, వ్యాపారులు కలిసి మిర్చి ధరను ఒక పథకం ప్రకారం తగ్గించుకుంటూ వచ్చారు. చివరికి రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పించారు.

రైతుల శ్రమను దోచుకుంటోన్న దళారులు, వ్యాపారులు

దళారులు, వ్యాపారులు మిర్చి రైతుల రక్కాన్ని జలగలా పీల్చుతున్నా ప్రభుత్వంకానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవడంలేదు. సమాజానికి అన్నంపెట్టే రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమైన వ్యాపారులు, దళారులపై ఏ చర్యలు తీసుకోవడం లేదు. కడుపుమండి మార్కెట్‌ కార్యాలయాన్ని ధ్వంసంచేస్తే.... రైతులపైనే కేసులు బనాయించింది. రైతుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్న వారికి ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఇకనైనా మిర్చి రైతులకు అండగా నిలిచి 10వేలకు మిర్చిని కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.

20:35 - May 2, 2017

హైదరాబాద్: వందరోజులు.. వంద అబద్ధాలు.. అడుగడుగునా.. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం, ఉన్న తప్పులను కప్పి పుచ్చుకోవడం, ఇతరులపై నెపం వేయడం, నోటికొచ్చినట్లు మాట్లాడేయటం, చేతికి నచ్చినట్లల్లా ట్వీటటం, ఇది ట్రంప్ వంద రోజుల పాలనపై అమెరికా మీడియా చేస్తున్న కామెంట్. ఎన్నికల టైం నుండి వివాదాదాస్పదంగా మారిన ట్రంప్ పదవి చేపట్టాక కూడా అతని తీరు లో ఎలాంటి మార్పు కనిపించని పరిస్థితి. ఇప్పుడు వందరోజుల పాలనపై సర్వేలు ట్రంప్ కు వ్యతిరేకంగా వస్తున్నాయి. తగ్గుతున్న పాపులారిటీ స్పష్టం చేస్తున్నాయి. ఇదే అంవంపై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:08 - May 2, 2017

హైదరాబాద్: కేంద్రం మెడకు 12 % గంట..కేసీఆర్ కారు పార్టీకి సరికొత్త తంట, రోడ్ల మీద గుంతలు కనిపీయొద్దు...ఆఫీసర్ల మీద కన్నెర చేసిన సీఎం, బీసీల వాటా బీసీలకు దక్కవల్సిందే... అడుక్కోవదుద్ద ఇక గుంజుకునుడే, పోలీసు మార్కెట్ అయిన ఎనుమాముల...రైతులను కుట్రదారులను చేసిన సర్కార్, పాటలు పాడుతున్న ఆనం వివేకా...ఒంగోలు గిత్త సిన్మా స్టోరీ చెపుకుంటా, వనపర్తి దిక్కు దిగంబర బాబాలు...భట్టలు లేకుంట బయలెల్లిన భక్తులు ఇత్యాది అంశాలపై మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ముగిసిన ఏపీ కేబినెట్

అమరావతి:ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎంచంద్రబాబు అధ్యక్షతన సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రంలో వివిధ పోస్టుల స్థాయి పెంపు, కొత్త పోస్టుల కల్పనపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. రేపు సీఎం దిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

18:58 - May 2, 2017

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సమాయత్తమైంది. సార్క్‌ దేశాలన్నీ ఉపయోగించునేందుకు వీలుగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటూ.. ప్రధాని నరేంద్రమోదీ 2014 జూన్‌ 30న తనను కలిసిన శాస్త్రవేత్తలకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు, ఇస్రో శాస్త్రవేత్తలు సమాచారవ్యవస్థకు ఉపకరించే ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ శాటిలైట్‌ను, జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-9 వాహక నౌక ద్వారా, ఈనెల ఐదున సాయంత్రం ప్రయోగించనున్నారు.

జీశాట్ 9 బరువు : 2,230 కిలోలు...

ప్రస్తుతం నింగిలోకి పంపనున్న జీ శాట్‌ ఉపగ్రహాన్ని 2,230 కిలోల బరువుతో రూపొందించారు. ఈ ప్రయోగానికి భారత ప్రభుత్వం 235 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జీశాట్‌ ప్రయోగం ద్వారా భార‌త్‌తో పాటు నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో.... స‌మాచార వ్యవస్థ కొత్తపుంతలు తొక్కనుంది. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండ‌ర్లు ఉంటాయి. టెలీక‌మ్యునికేష‌న్, డీటీహెచ్‌, వీశాట్స్‌, టెలీ ఎడ్యుకేషన్‌, టెలీమెడిసిన్‌, విప‌త్తుల స‌మ‌యాల్లో నిర్వహణ సాయం వంటి సేవ‌లను ఈ ఉపగ్రహం ద్వారా పొందవచ్చు. అలాగే ద‌క్షిణాసియాలో భూకంపాలు, తుపాన్లు, వ‌ర‌ద‌లు, సునామీల వంటి ప్రమాదాలను ముందుగా తెలుసుకునే వీలుంటుంద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జీశాట్ 9 ప్రయోగానికి సిద్ధమవుతున్న శ్రీహరికోట...

సార్క్‌ దేశాలకు మేలు కలిగేలా భారతదేశం ప్రయోగిస్తోన్న జీశాట్‌ ఉపగ్రహంపై పాక్ మినహా అన్ని దేశాలూ హర్షం వ్యక్తం చేశాయి. తమ దేశ సున్నితమైన సమాచారం భారత్‌కు తెలిసిపోతుందని పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. ఈ ఉపగ్రహానికి గతంలో పెట్టిన సార్క్ శాటిలైట్ పేరును దక్షిణాసియా ఉపగ్రహంగా మార్చారు. రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సెంటర్ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక సమావేశాన్ని బుధవారం నాడు నిర్వహించనున్నారు. ఆ తరువాత లాంచ్ ఆథరైజేషన్ బోర్డు మీటింగ్ కూడా జరగనుంది. ఇవన్నీ పూర్తైన వెంటనే ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. తరువాత కౌంట్ డౌన్ మొదలై ఐదో తేదీన రాకెట్ కక్ష్యలోకి వెళ్తుంది. ఈ ప్రయోగంపై సార్క్ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

18:56 - May 2, 2017

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌ పదవీ కాలం తాత్కాలికంగా పొడగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలో కొనసాగాలని హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు. 

18:55 - May 2, 2017

విశాఖపట్నం: కొండవాలు ప్రాంతంలో జీవిస్తున్న పలు కుటుంబాలు అల్లాడుతున్నాయి. కొండ కూలిపోవడంతో ... అక్కడ నుంచి ఖాళీ చేయలేక... ఉండను లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అద్దెలు కట్టలేక...తలదాచుకునేందుకు నీడ లేక..చాలా కుటుంబాలు కొండలపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని చినగదిలి.. పెదగదిలి.. దీనదయాల్‌పురం, తోటగరువు, ఆరిలోవ, గణబాబునగర్‌, సుందరయ్యనగర్ ఇలా అనేక ప్రాంతాలలో కొండలపై స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. అయితే కొండలపై బతుకులు దిన దిన గండంగా మారాయి. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో...ఎటునుంచి ఏ బండరాళ్లు వచ్చి పడతాయో తెలియని పరిస్థితి.

హనుమంతువాక వద్ద కూలిన కొండవాలు ప్రాంతం...

ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో హనుమంతువాక వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొండవాలు ప్రాంతం కూలిపోయింది. ముందు భాగం మాత్రమే కూలడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ జంక్షన్ నుంచి వంద మీటర్ల వరకూ రక్షణ గోడ నిర్మించడానికి జీవీఎంసీ పనులు చేపట్టింది. దీంతో మరింతగా కొండ ప్రాంతం కూలడం ప్రారంభించింది. ఈ పరిణామంతో అధికారులు అక్కడ జీవిస్తున్న వారిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో అక్కడున్నవారు ఎక్కడకు వెళ్లాలంటూ వాపోతున్నారు. ఏదో ఒక నిలువ నీడ చూపితే ఇక్కడ నుంచి వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా... పాలకులు, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

18:50 - May 2, 2017
18:49 - May 2, 2017

అమరావతి: మిర్చీ రైతుల సమస్యలపై గళమెత్తారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విదేశీ కార్పొరేట్‌ కంపెనీలపై చూపే శ్రద్ద దేశానికి అన్నంపెట్టే రైతన్నపై చూపకపోవడం దారుణమని విమర్శించారు.. ఈ సీజన్లో మిర్చీ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో రైతులకు తెలియజేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని ఆరోపించారు.. గిట్టుబాటు ధర లభించేలా చేయడంలో మార్కెటింగ్‌ శాఖ వైఫల్యం చెందిందని ఫైర్ అయ్యారు.. రైతులుకు క్వింటాలుకు 11వేల రూపాయల్ని గిట్టుబాటు ధర చెల్లించాలని జనసేనాని డిమాండ్ చేశారు..

18:48 - May 2, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ కుటుంబానికి పదవుల కోసం యువకులు విద్యార్థులు బలిదానాలు చేయలేదని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడంట్ రేవంత్‌ రెడ్డి అన్నారు. తన కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్‌ భావిస్తే .. భవిష్యత్తులో విద్యార్థులు తగిన విధంగా సమాధానం ఇస్తారని రేవంత్‌ హెచ్చరించారు. 

18:46 - May 2, 2017
18:45 - May 2, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణతీరుపై మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఫైర్ అయ్యారు.. దేశంలో చట్టం ఉండగా మళ్లీ జీవో తేవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.. పరిహారం చెల్లించాలంటూ భూనిర్వాసితులు డిమాండ్ చేస్తే వారిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:42 - May 2, 2017

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సెగ రాజుకుంది. గతంలో అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేసీఆర్‌కు కౌంటర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవ జలదృశ్యం పేరుతో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌ పార్టీ రెండు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు రెడీ అవుతోంది.

ప్రాజెక్టుల రీడిజైన్‌పై టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ మధ్య రగడ...

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రాజెక్టుల డిజైన్‌లో మార్పులకు తెరలేపినప్పటి నుంచి కాంగ్రెస్‌ - టీఆర్‌ఎస్‌ మధ్య రగడ రాజుకుంది. రెండు పార్టీల మధ్య సాగునీటి ప్రాజెక్టులపై పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ నిర్వాకంతో తెలంగాణ సాగునీటిని కోల్పోయిందన్న గులాబీ బాస్‌ ఆరోపణలతో కాంగ్రెస్‌ ఉడికిపోయింది. తమ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారో, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో జలదృశ్యం ప్రజెంటేషన్‌లోఉత్తమ్‌ వివరించారు. తమపై టీఆర్‌ఎస్‌ నిందారోపణలు చేయడం సరికాదంటూ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు.

ప్రాజెక్టుల రీడిజైన్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌...

తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్‌ను కాంగ్రెస్‌ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చి.. కాళేశ్వరం పేరుతో రీడిజైన్‌ చేసింది. మరికొన్ని ప్రాజెక్టుల ఆకృతులనూ సర్కార్‌ మార్చింది. అయితే ప్రాజెక్టుల రీడిజైన్‌పై కాంగ్రెస్‌ పోరుకు దిగాలని డిసైడ్‌ అయ్యింది. రీడిజైన్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నద్దమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు అంచనాలను పెంచిందని విమర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతినిపై ప్రభుత్వాన్ని ఉత్తమ్‌ ఎండగట్టాలని భావిస్తున్నారు.

మిగులు విద్యుత్‌పై వాస్తవాలను బయటపెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయం...

తెలంగాణలో మిగులు విద్యుత్‌ తమ ఘనతేనంటూ చెప్పుకొంటోన్న కేసీఆర్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తెలంగాణలో విద్యుత్‌ మిగులుకు కాంగ్రెస్‌ ఏం చేసిందన్నదానిపై మరో ప్రజెంటేషన్‌ ఇవ్వాలని ఉత్తమ్‌ భావిస్తున్నారు. మిగులు విద్యుత్‌కు కాంగ్రెస్‌ హయాంలోనే బాటలు పడ్డాయని ఉత్తమ్‌ వివరించనున్నారు. భూపాలపల్లి, జైపూర్‌ థర్మల్‌ ప్రాజెక్టులు తమ హయాంలోనే ప్రారంభించామని.. వాటి ద్వారా ఇప్పుడు 1800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని ప్రజెంటేషన్‌లో చెప్పనున్నారు. ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టనున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ మరోసారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. 

18:40 - May 2, 2017

హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై తమ శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని నాయిని అన్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న రాష్ట్ర పోలీసులపై దిగ్విజయ్ సింగ్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై అనవసర వ్యాఖ్యలు తగవని హెచ్చరించారు. తక్షణమే దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని నాయిని డిమాండ్ చేశారు.

ఎస్.కొత్తపల్లిలో మామిడి తోటపై ఏనుగుల మంద దాడి

కడప: రైల్వే కోడూరు మండలం ఎస్.కొత్తపల్లిలో మామిడి తోటపై ఏనుగుల మంద దాడి చేసింది. తోటలో ఉన్న వారిపై ఏనుగులు దాడి చేయడంతో పలువురికి తీవ్రగాయాలు కాగా, వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గవర్నర్ నరసింహన్ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలం నేటితో ముగియనుంది. అయితే ఆయన పదవీ కాలాన్ని తాత్కాలికంగా కేంద్రం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గవర్నర్ గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

 

మిర్చి రైతు సమస్య గళమెత్తిన జనసేనాని

హైదరాబాద్: పెట్టుబ‌డుల కోస‌మంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద ప్రభుత్వాలు చూపే శ్ర‌ద్ధ, దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌ల‌పై చూప‌క‌పోవ‌డం వ‌ల్లే రైతులు రోడ్డెక్క‌వ‌ల‌సిన ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయ‌ని జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. క‌ష్టించి పంట‌లు పండించే రైతు క‌న్నీరు పెట్ట‌డం దేశానికి శ్రేయ‌స్క‌రం కాద‌ని, రైతుల క‌ష్టాలు తీర్చాల‌ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆయ‌న త‌మ పార్టీ పేరిట ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీలో ముస‌లం

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో ముస‌లం మొద‌లైంది. ఇటీవ‌ల జ‌రిగిన ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌పై ప‌లువురు సొంత‌ నేత‌లే విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అందులో ప్ర‌ధానంగా కుమార్ విశ్వాస్ ఒక‌రు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీకి త్వ‌ర‌లోనే కొత్త ముఖ్య‌మంత్రి వ‌స్తార‌ని ఆయ‌న అన్న‌ట్లు స‌మాచారం. తాను ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌బోన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండాలా? లేదా? అన్న విష‌యం గురించి 24 గంట‌ల్లో ఓ ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని ఆయ‌న అన్నారు.

17:11 - May 2, 2017

అమరావతి: ముందస్తు ఎన్నికలు రావంటూనే.. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేపనిలో పడింది ఏపీ టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పార్టీని పటిష్టపరచడం, వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిసారించారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితిపై పసుపుపార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

విజయనగరం జిల్లాలో దిగజారుతున్న టీడీపీ పరిస్థితి...

విజయనగరం జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోందన్న సంకేతాలతో పార్టీ అధినాయకత్వం అప్రమత్తమయింది. సంస్థాగతంగా పార్టీని పటిష్టపరచడంతో పాటు వచ్చే ఎన్నికలకు క్యాడర్‌ను వేకప్‌చేసే పనిలో మంత్రి గంటా శ్రీనివాసరావును బిజీఅయ్యారు. దీన్లో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జులను నియమించింది టీడీపీ . విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా ఉన్న మంత్రి గంటా ఇటీవల జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీలో ఉన్న లోటుపాట్లపై ఆయన చర్చించారు.

సిట్టింగ్‌ స్థానాల్లో టీడీపీకి గడ్డుపరిస్థితి...

విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఏకంగా ఏడుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అటు సాలూరు, కురుపాం నియోజకర్గాల్లో వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే.. తమ ఎమ్మెల్యేల స్థానాల్లోనే తమ పరిస్థితి దిగజారిందని .. సైకిల్‌గుర్తుపార్టీ బేజారవుతోంది. ప్రధానంగా గజపతినగరం, నెల్లిమర్ల, పార్వతీపురం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపై అక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించింది. ప్రజలతో మమేకం కాకపోవడం, అవినీతి ఆరోపణలపై పార్టీ అధినేత వద్ద రిపోర్టు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు, బంధుప్రీతి లాంటి అంశాలు కూడా సిట్టింగ్ ఎమ్మల్యేలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే యోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా సూటిగా చెప్పాలంటే.. గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఈసారి కొత్తఅభ్యర్థులనే బరిలోకి దించాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు పార్టీవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

కురుపాం, సాలూరులో పరిస్థితిపై పార్టీ అధినాయకత్వం కలవరం...

జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీ సంస్థాగతంగా కూడా బలంగా లేదు. ముఖ్యంగా కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారడంపై టీడీపీ అధినాయకత్వం కలవరపడుతోంది. ఈ రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం వైసీపీకి కంచుకోటగా ఉన్నాయి. ఇక్కడ పార్టీని పటిష్టపరిచేందుకు స్థానిక నాయకత్వం సరిగ్గా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాలూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మధ్య మొదటి నుంచి సమన్వయం లేదు. అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు నడుపుతూ ఒకరినొకరు దెబ్బతీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీక్యాడర్‌ చెప్పుకుంటోంది. ఇప్పటికే వీరిద్దరి పంచాయితీ సీఎం చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

కురుపాంలో పార్టీ ఇన్‌చార్జ్‌ జనార్దన్‌ థాట్రాజ్‌పై క్యాడర్‌లో వ్యతిరేకత...

అటు కురుపాం నియోజకవర్గ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని టీడీపీ స్థానిక నాయకులు అభిప్రాయంపడుతున్నారు. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి గా కొనసాగుతున్న జనార్థన్ థాట్రాజ్ పై అధిష్టానానికి సదాభిప్రాయం లేనట్లు తెలుస్తోంది. ఈయన పార్టీ కోసం పనిచేయడం లేదన్న అసంతృప్తి అటు కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. అధికారపార్టీ నీరసించడంతో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవి పొందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా పార్టీ పటిష్గతపై అంతగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపరిచేందుకు తీసుకునే చర్యలపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని పటిష్టం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మొత్తం మీద...వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టిన అధికారపార్టీ .. విజయనగరంజిల్లాలో గడ్డుపరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటుందో అనేది జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 

17:10 - May 2, 2017

కృష్ణా : విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పోటు సిబ్బంది సమ్మెకు దిగారు. లడ్డూతయారీ కేంద్రంలో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రోజువారీ కూలీ సరిపోవడం లేదంటూ.. లడ్డూతయారీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులను బుజ్జగించేందుకు ఆలయ అధికారులు తంటాలు పడుతున్నారు. 

16:52 - May 2, 2017

గుంటూరు: చంద్రబాబుపాలనలో రైతులకు ఆత్మహత్యలే మిగిలాయన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్‌. ధరల స్థీరీకరణకు రూ. 5వేల కోట్లు కేటాయిస్తానని ఎన్నికల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు రైతులు పూర్తిగా నష్టపోతున్నా పట్టించుకోవడంలేదని జగన్‌ విమర్శించారు.   

16:49 - May 2, 2017

నిజామాబాద్‌ : బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌పై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చేపల వ్యాపారమే వృత్తిగా బతుకుతున్న పది వేల మంది మత్స్యకారుల కుటుంబాలు బతుకుదెరువును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో టన్నుల కొద్ది చేపలు మత్యువాత...

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో టన్నుల కొద్ది చేపలు మత్యువాత పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించడం కోసమే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో కోటి చేప పిల్లలను వదిలింది. తమ జీవితాల్లో వెలుగులు పూస్తాయని భావించిన మత్స్యకారులు.. చేపలు పెద్ద సంఖ్యలో చనిపోతుండడంతో కలవర పడుతున్నారు.

జలాశయంలో 12.430 టీఎంసీల నీరు ఉన్నపటికీ...

జలాశయంలో 12.430 టీఎంసీల నీరు ఉన్నపటికీ... చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకూ మరణించిన చేపలను పరిశీలిస్తే వాటికి రెడ్‌ టెయిల్‌ అనే వ్యాధి సోకినట్లు చెబుతున్నారు. చేపల తోక భాగం ఎరుపు రంగులోకి మారిన రెండు మూడు రోజులలోపే చనిపోతున్నాయంటున్నారు. సమీప పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా నీరు కలుషితమై... చేపలు చనిపోతున్నట్టు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. నీటి కాలుష్యం కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. మిగిలిన కొద్దిపాటి మత్స్య సంపదనైనా కాపాడాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

16:47 - May 2, 2017

హైదరాబాద్: రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు ఎక్స్‌ట్రా ప్లేయర్‌ నాగ్స్‌ మరో ఫన్నీ వీడియోతో అలరిస్తున్నాడు. టీమ్‌ ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్ జట్టు ఆటగాళ్లతో కలిసి సందడి సందడి చేస్తున్నాడు. 

16:46 - May 2, 2017

హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్‌ రద్దు చేసింది. మే 25న ఇక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేమని, అందుకే రద్దు చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఉప ఎన్నికల సమయంలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉండటంతో 74 వేల మంది పారామిలిటరీ సిబ్బందిని ఏర్పాటుచేయాలని ఈసీ కేంద్ర హోంశాఖను కోరింది. 30వేల మంది సిబ్బందిని మాత్రమే విధులకు పంపగలమని హోంశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 9న శ్రీనగర్‌ ఉపఎన్నికల్లో అల్లర్లు చెలరేగి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువగా 7 శాతం పోలింగ్‌ నమోదైంది.

 

16:46 - May 2, 2017

ఢిల్లీ : ప్రజలకు జవాబుదారితనంగా ఉండే ప్రధాని కావాలని... అందుకు తగ్గట్లుగా నరేంద్ర మోది రోజుకు 20 గంటలు పనిచేస్తున్నారని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా కొనియాడారు. మోది ప్రభుత్వం పేదలు, రైతులు, నిరుద్యోగులకే అంకితమైందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి కార్పోరేటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల గెలుపే అంతిమ లక్ష్యం కాకూడదని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని అమిత్‌షా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకూడదని సూచించారు.

 

16:45 - May 2, 2017

హైదరాబాద్: ఒడిషాలోని మాఝీలో భార్య శవాన్ని మోసుకెళ్లిన ఘటన ఇంకా మరవకముందే ఉత్తరప్రదేశ్‌లోనూ అదే తరహా ఘటన వెలుగు చూసింది. ఇటావాకు చెందిన ఉదయ్‌వీర్‌ అనే కూలీ అనారోగ్యంతో ఉన్న తన 15 ఏళ్ల కుమారుడిని భుజంపైన మోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆసుపత్రి సిబ్బంది కనీసం స్ట్రెచర్‌ ఇవ్వకపోగా...వైద్యులు కూడా సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. బాబు కాళ్ల నొప్పులతో బాధ పడుతున్నాడని చెప్పగా...కొన్ని నిముషాలు కూడా చూడకుండా కొడుకును తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. డెడ్‌ బాడీని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేయకపోవడంతో చేసేదిలేక తన కుమారుడి మృతదేహాన్ని భుజాలపైనే మోసుకుని వెళ్లాడు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి మొబైల్ కెమెరాలో బంధించడంతో సోషల్‌ మీడియా ద్వారా ఈ ఘటన వెలుగు చూసింది. అదే వ్యక్తి తన బైక్‌పై శవాన్ని ఇంటికి చేర్చాడు. పేదల కోసం అంబులెన్స్‌ ఉచితంగా అందిస్తారన్న విషయం కూడా తనకు తెలియదని ఉదయ్‌వీర్‌ తెలిపాడు. ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే పుష్పేంద్ర మృతి చెందాడని... సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపిస్తామని అధికారులు చెప్పారు.

16:43 - May 2, 2017

అమరావతి: టిటిడి నూతన అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్నకు సందిగ్ధత వీడటం లేదు. టిటిడి పాల‌క‌మండ‌లి చైర్మన్‌ పదవీకాలం గ‌త నెల 26తో ముగియడంతో.. కొత్త చైర్మన్‌ ఎంపిక అనివార్యమైంది. ఈ ప‌ద‌వి కోసం చాలామంది పార్టీ సీనియ‌ర్లు పోటీప‌డుతుండ‌టంతో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టీటీడీ పాలకమండలి చైర్మన్‌ రేసులో ఎంపిలు రాయ‌పాటి, మురళీమోహ‌న్,జెసి దివాక‌ర్ రెడ్డి ఉన్నారు. అటు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు,జ్యోతుల నెహ్రు,బిజెపి నుంచి న‌ర్సాపురం ఎంపి గోక‌రాజు గంగ‌రాజు ఆశావహుల జాబితాలో ఉన్నారు. మరోవైపు కేంద్రం నుంచి కూడా బడా పారిశ్రామిక‌వేత్తల పేర్లతో సిఫార్సులు వ‌స్తున్నాయి. దీంతో టీటీడీ చైర్మన్‌ ఎంపిక సీఎం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది.

టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తానన్న హామీని గుర్తుచేస్తున్న రాయపాటి

రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాంగ్రెస్‌లో తనకు అన్యాయం జ‌రిగింద‌ని..టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తానన్న హామీ మీదనే తాను టీడీపీలో చేరినట్టు చెబుతున్నారు. ఇక జెసి దివాకర్ రెడ్డి తను ఏ పదవి ఆశించలేదని..టీటీడీ బోర్డు చైర్మన్‌ ప‌ద‌వి ఇవ్వడం వ‌ల్ల రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని మ‌రింత చేరువయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారట. గాలిముద్దుకృష్ణమనాయుడు కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ, సినీ ప్రముఖుడు మురళీమోహన్‌ కూడా ఈ పదవి కోసం తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం.

టీటీడీ చైర్మెన్ ప‌ద‌విపై ఆశలు పెట్టుకున్న ఎంపీ గోకరాజు గంగరాజు

ఇక మిత్రప‌క్షం బిజేపీ నుంచి ఎంపి గోకరాజు గంగ‌రాజు...టీటీడీ చైర్మెన్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఈసారి బిజేపీకి అవ‌కాశం క‌లిపించాల‌ని కోరుతున్నారు. దేవ‌స్థానం కార్యవ‌ర్గంలో త‌మ వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని ఉత్తరాధి ప్రముఖ‌ నేత‌లు..బ‌డా పారిశ్రామిక వేత్తలు పైరవీలు చేస్తున్నట్లు స‌మాచారం. నార్త్‌కు చెందిన అనిల్ కుమార్ సింగ్వాల్‌ను...టీటీడీ ఈవోగా నియ‌మించ‌డం వెనక ఉత్తరాది నేతల ఒత్తిడి ఫ‌లిత‌మేన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివరకు సీఎం చంద్రబాబు ఎవరి వైపు మొగ్గుచూపుతారన్నది..ఆయన విదేశీ పర్యటన పూర్తయ్యాకే క్లారిటీ రానుంది. 

16:39 - May 2, 2017

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కీలక విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేస్‌లో ముందువరుసలో నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు విన్నింగ్‌ మూమెంట్స్‌ మరోసారి చూద్దాం....

ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు - జగన్..

గుంటూరు : సీఎం చంద్రబాబు అయ్యాక 13 జిల్లాల్లో సాగు క్రమంగా తగ్గుతూ వస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కాసేపటి క్రితం ఆయన దీక్షను విరమించారు. చంద్రబాబు సీఎం కాకముందు రైతులు సగర్వంగా బ్యాంకులకు వెళ్లి రుణాలు పొందేవారని, ఈ రోజు మిర్చి యార్డుకు కావాలనే సెలవిచ్చారన్నారు. బాబు పాలనలో ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఇలాంటతి దుర్భర పరిస్థితులేవీ కనిపించవని, ద్రవ్యోల్బణం వల్ల కాంట్రాక్టర్లకు రేట్లు పెంచామంటున్న బాబు రైతుపై ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని తెలియదా అని సూటిగా ప్రశ్నించారు.

స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..

రంగారెడ్డి : కుత్బుల్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ బ్లూ డాల్ఫిన్స్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోమవారం హరీష్ నాయక్ అనే బాలుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ ప్రభుత్వ భవనాల డిజైన్స్..

విజయవాడ : రాజధానిలో ప్రభుత్వ భవనాల డిజైన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడుతో సీఆర్డీఏ అధికారులు భేటీ అయ్యారు. గతంలో ఇచ్చిన డిజైన్లకు అదనంగా మరిన్ని డిజైన్లను సీఎంకు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు అందచేశారు. అమెరికా పర్యటన అనంతరం తుది డిజైన్ ను సీఎం చంద్రబాబు ఖరారు చేయనున్నారు.

వాహనం బోల్తా..నలుగురి మృతి..

ఛత్తీస్ గడ్ : ఓ వాహనం బోల్తా కొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వడోదరలో కలెక్టరేట్ ఆఫీసులో అగ్నిప్రమాదం..

గుజరాత్ : వడోదరలోని కలెక్టరేట్ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

15:41 - May 2, 2017

గుంటూరు: సీఎం చంద్రబాబు తన రికార్డులను తానే బద్ధలు చేస్తాడని వైసీపీ నేత జగన్ అన్నారు. రైతు సమస్యలపై వైసీపీ అధినేత జగన్ చేపట్టిన రెండు రోజుల 'రైతు దీక్ష'ను విమరించారు. ఓ రైతు జగన్ నిమ్మరం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త‌న దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపిన వారంద‌రికీ జ‌గ‌న్ ధ‌న్య‌వాదాలు చెప్పారు. తాను చేస్తోన్న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఎండ‌ల్ని సైతం లెక్క‌చేయ‌కుండా రైతులు వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఈ సందర్భంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర సర్కారు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక 13 జిల్లాల్లో సాగు క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు.చంద్రబాబు సీఎం కాకముందు రైతులు సగర్వంగా బ్యాంకులకు వెళ్లి రుణాలు పొందేవారని, ఇపుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ రోజు మిర్చి యార్డుకు కావాలనే సెలవు ప్రకటించిన చంద్రబాబును ఏమనాలి అని జగన్ ప్రశ్నించారు. బాబు పాలనలో ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. 

15:28 - May 2, 2017

బాలీవుడ్ నటి 'ప్రియాంక చోప్రా' వేసుకున్న డ్రెస్ పై సోషల్ మాధ్యమాల్లో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌కు దూరమై హాలీవుడ్‌లో క్వాంటికో సీరియల్‌కు తర్వాత ప్రియాంక చోప్రా 'బేవాచ్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్స్ ఇటీవలే రిలీజ్ అయ్యాయి. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన 'మెట్‌ గాలా ఫ్యాషన్‌ ఈవెంట్‌'లో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక వేసుకున్న డ్రెస్ పై హాట్ టాపిక్ అయ్యింది. రాల్ఫ్‌ లౌరేన్‌ బ్రాండ్‌కి చెందిన బ్రౌన్‌ రంగు ట్రెంచ్‌ కోట్‌ వేసుకుని సంద‌డి చేసింది. ప్రియాంక ఇలాంటి డ్రెస్ వేసుకుందంటూ అభిమానులు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎందుకంటే వెనుక డ్రెస్ పెద్ద దుప్పటి పరిచినట్లు వేలాడుతూ ఉంది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ మైదానాన్ని కప్పి వేయవచ్చని..స్వచ్ఛ భారత్..టెంట్ లా ఉపయోగించుకోవచ్చని..గుడారాలు వేసుకోవచ్చని..మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

దిగ్విజయ్ వ్యాఖ్యలు బాధ్యతరహిత్యం : డీఎస్

హైదరాబాద్ : దిగ్విజయ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, ముస్లిం యూవకులను ఐసిస్ లో చేరేలా తెలంగాణ పోలీసులు ప్రోత్పహిస్తున్నారనడం అర్థరహితమని... రోజుకో మాట మాట్లాడే సంస్కృతి దిగ్విజయ్ దని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యడు డీ. శ్రీనివాస్ అన్నారు.

కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ

గుంటూరు : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ మావేశంలో రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణ, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై, అమరావతి డిజైన్ పై మాకీ సంస్థ చేస్తున్న అసత్యప్రచారంపై చర్చించనున్నారు. జగన్ దీక్షను ఎలా ఎదుర్కోవాలన్న అంశం చర్చించే అవకాశం ఉంది.

14:48 - May 2, 2017

అనంతపురం: కియా మోటార్స్ కార్ల పరిశ్రమతో కరువు జిల్లా అనంతపురం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరిశ్రమను అనంతపురం జిల్లాలో నెలకొల్పడం పట్ల ఎమ్మెల్యే బీకే పార్థసారధి నేతృత్వంలో జిల్లా ప్రజాప్రతినిధులు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా...

ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌కి రావడం చరిత్రాత్మక అంశమని బాబు తెలిపారు. పరిశ్రమ స్థాపనతో 11వేల మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఉద్యోగాల్లో 90శాతం స్థానికులకే అవకాశం ఉంటుందన్నారు.

అనంతపురం జిల్లాకు నీటి సౌకర్యం కల్పిస్తే ...

అనంతపురం జిల్లాకు నీటి సౌకర్యం కల్పిస్తే మరిన్ని పరిశ్రమలు జిల్లాకు వస్తాయని బాబు చెప్పారు. ఇందుకోసం హంద్రనీవా ప్రాజెక్టును త్వరతగితిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అనంతపురం జిల్లాకు వస్తున్న తొలి భారీ పరిశ్రమకు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నానన్నారు. 

14:46 - May 2, 2017

హైదరాబాద్: తెలంగాణ భవన్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. తెలంగాణ భవన్‌ విస్తరణ గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

14:45 - May 2, 2017

అమరావతి: ఈనెల 27,28,29 తేదీల్లో జరిగే మహనాడుపై... టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈభేటీలో... మహానాడుతో పాటు.. పార్టీ సంస్థాగత ఎన్నికలు, అంతర్గత విభేదాలపై నేతలతో చర్చించారు. ఎల్లుండి నుంచి ఈనెల 11వ తేదీ వరకు తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నందున... పాలనలో, పార్టీ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా చూసుకోవాలని బాబు సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నామినేటెడ్‌ పోస్టులను సక్రమంగా వినియోగించుకోవాలని సీఎం చెప్పారని.. మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను త్వరగా నిర్మించాలని ఆదేశించినట్లు చెప్పారు. 

14:43 - May 2, 2017

చిత్తూరు : జిల్లాలో..కుప్పం పీఎస్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ నిర్మల్‌ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. దీంతో ఆమెను ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు...నిర్మల పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం. గతంలో సీఐ రాజశేఖర్‌ వేధిస్తున్నాడని...అసభ్యంగా మాట్లాడుతున్నాడని....డీఎస్పీకి నిర్మల ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆమె ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.   

14:41 - May 2, 2017

వరంగల్‌ : నగరంలో ఎనుమాముల మార్కెట్‌లో మిర్చిని తగలబెట్టేందుకు రైతులు యత్నించారు. దీంతో రంగంలోకిదిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న ఇద్దరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

14:40 - May 2, 2017

రైతుల కోసం పోరాటం చేయడం తప్పు కాదని న్యూస్ మార్నింగ్ లో వక్తలు అభిప్రాయపడ్డారు. చర్చలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మల్యాద్రి, వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. భారతదేశంలో రైతంగా సంక్షోభం ఏర్పడిందని రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతుల సమస్య ప్రధానంగా ఉందని తెలిపారు. అలాగే రుణా మాఫి ఆలస్యం కావడం వల్ల రైతులకు ఇబ్బంది కల్గిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మాల్యాద్రి మాట్లాడుతూ రైతల కోసం నిధులు కేటాయించమని తెలిపారు. గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ మిర్చికి మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:40 - May 2, 2017

ఖమ్మం: జిల్లాలో మిర్చి రైతులకు మద్దతుగా అఖిలపక్షం నిర్వహించిన నగరం దిగ్బంధం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలీసులు ఎక్కడిక్కడ నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. రఘునాథపాలెం, పందిళ్లపల్లిలో ఆందోళన చేస్తున్న టీడీపీ, లెఫ్ట్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముదిగొండలో రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే సండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కొణిజర్ల పట్టణ దిగ్బంధానికి యత్నించిన లెఫ్ట్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

13:59 - May 2, 2017

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబును ఆనం వివేకానందరెడ్డి కలిశారు. అనంతరం తాను టీడీపీలోనే ఉంటానని వివేక్‌ ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సీఎంకి తెలియజేశామని ఆనం సోదరులు తెలియజేశారు.

 

13:55 - May 2, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సెగ రాజుకుంది. గతంలో అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేసీఆర్‌కు కౌంటర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవ జలదృశ్యం పేరుతో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌ పార్టీ రెండు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు రెడీ అవుతోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రాజెక్టుల డిజైన్‌లో మార్పులకు తెరలేపినప్పటి నుంచి కాంగ్రెస్‌ - టీఆర్‌ఎస్‌ మధ్య రగడ రాజుకుంది. రెండు పార్టీల మధ్య సాగునీటి ప్రాజెక్టులపై పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ నిర్వాకంతో తెలంగాణ సాగునీటిని కోల్పోయిందన్న గులాబీ బాస్‌ ఆరోపణలతో కాంగ్రెస్‌ ఉడికిపోయింది. తమ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారో, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో జలదృశ్యం ప్రజెంటేషన్‌లోఉత్తమ్‌ వివరించారు. తమపై టీఆర్‌ఎస్‌ నిందారోపణలు చేయడం సరికాదంటూ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్‌ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది....
తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్‌ను కాంగ్రెస్‌ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చి.. కాళేశ్వరం పేరుతో రీడిజైన్‌ చేసింది. మరికొన్ని ప్రాజెక్టుల ఆకృతులనూ సర్కార్‌ మార్చింది. అయితే ప్రాజెక్టుల రీడిజైన్‌పై కాంగ్రెస్‌ పోరుకు దిగాలని డిసైడ్‌ అయ్యింది. రీడిజైన్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నద్దమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు అంచనాలను పెంచిందని విమర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతినిపై ప్రభుత్వాన్ని ఉత్తమ్‌ ఎండగట్టాలని భావిస్తున్నారు.

కేసీఆర్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని....
తెలంగాణలో మిగులు విద్యుత్‌ తమ ఘనతేనంటూ చెప్పుకొంటోన్న కేసీఆర్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తెలంగాణలో విద్యుత్‌ మిగులుకు కాంగ్రెస్‌ ఏం చేసిందన్నదానిపై మరో ప్రజెంటేషన్‌ ఇవ్వాలని ఉత్తమ్‌ భావిస్తున్నారు. మిగులు విద్యుత్‌కు కాంగ్రెస్‌ హయాంలోనే బాటలు పడ్డాయని ఉత్తమ్‌ వివరించనున్నారు. భూపాలపల్లి, జైపూర్‌ థర్మల్‌ ప్రాజెక్టులు తమ హయాంలోనే ప్రారంభించామని.. వాటి ద్వారా ఇప్పుడు 1800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని ప్రజెంటేషన్‌లో చెప్పనున్నారు. ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టనున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ మరోసారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి.

 

13:49 - May 2, 2017

పెద్దపల్లి : గుడుంబా తాగి తెలంగాణా పల్లెల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. తాటికల్లు, ఈతకల్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా.. మంథని మండలం లక్కీపూర్‌ గ్రామ శివారులో ఆయన తాటికల్లు తాగారు. తాటికల్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారని... గుడుంబా తాగొద్దని ఎమ్మెల్యే సూచించారు.

13:48 - May 2, 2017

భారీగా కట్నాలు తీసుకున్నా కొంతమంది డబ్బు మీద ఆశ చావక...ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. కట్నం తెస్తేనే ఇంటికి రానిస్తానంటూ..డబ్బులు తేవాలంటూ కట్టుకున్న భార్యలను భర్తలు వేధిస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ పెళ్లి జరిగిన అనంతరం భార్యను తీసుకెళ్లాలంటే అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేసిన వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు...ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పల్వల్ నగరంలో ఫరీద్ ఖరేషి వివాహం స్థానికంగా ఉండే యువతితో వివాహం జరిగింది. వధువును అత్తవారింటికి తీసుకెళ్లేందుకు వరుడు, అతని సోదరులు, మరో ఇద్దరు అమ్మాయి ఇంటికి వచ్చారు. తనకు ఇంకా అదనపు కట్నం ఇవ్వాలని..లేనిపక్షంలో భార్యను కాపురానికి తీసుకెళ్లలని వరుడు చెప్పడంతో వధువు కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. తాము ఇవ్వలేమని చెప్పడంతో వరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడంట. అంతే ఒక్కసారిగా అమ్మాయి తల్లిదండ్రులు..కుటుంబసభ్యులకు కోపం వచ్చింది. వెంటనే వచ్చిన వారిని ఓ గదిలోకి నెట్టి తాళమేశారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో వరుడు..అతని వెంట వచ్చిన వారు బిక్కమొహం వేశారు. ఈ విషయాన్ని గ్రామపెద్దల దృష్టికి అమ్మాయి తరపు వారు తీసుకెళ్లారు. వధువు పేరు మీద నాలుగు బిఘాల భూమిని రాయాలని...లేదా ఆమె పేరు మీద రూ. 10 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ వేయాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. వరుడికి దిమ్మదిరిగింది. కాసుల కోసం కక్కుర్తి పడితే గిలా అయిందేంటీరా అని ఆలోచిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వారు జోక్యం చేసుకోలేదు. ప్రస్తుతం వధువు, వరుడి కుటుంబాలు..గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయంట.

13:47 - May 2, 2017

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో.. రామమాల విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట రామదీక్షాపరులు స్వామివారి ఇరుముడిని తలమీద పెట్టుకొని.. భద్రగిరి ప్రదక్షణ చేశారు. రామపాదుకలను తలపై ఉంచుకొని మేళతాళాల నడుమ గిరి ప్రదక్షణ చేశారు. ఆలయ వీధులన్నీ రామనామంతో మారుమోగాయి. రామపాదుకలతో భక్తులు దేవాలయానికి చేరుకొని.. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు, రామపాదుకలకు అభిషేకం నిర్వహించారు. నవమినాడు పునర్వసు నక్షత్ర ముహూర్తంలో రామదీక్ష చేపట్టిన భక్తులు.. అదే నక్షత్ర ముహూర్తంలో మాల విరమణ చేస్తారు. 

13:44 - May 2, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా సాప్ట్‌వేర్ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎచ్ 1 బీ వీసాలను కఠినతరం చేయడం, స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సిద్ధమైంది. తొలి దశగా... వచ్చే రెండేళ్లలో.. పదివేల మంది అమెరిక్లను నియమించుకోవాలని నిర్ణయించింది. అమెరికాలోని మేజ‌ర్ యూనివర్సిటీలు, స్థానిక‌, క‌మ్యూనిటీ కాలేజీల్లోని టెక్నాల‌జీ ప్రొఫెష‌నల్స్‌ను ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసుకోనుంది. వీరికి క్లౌడ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, బిగ్ డేటా లాంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు కూడా ఇన్ఫోసిస్ సిద్ధమౌతోంది.

 

13:40 - May 2, 2017

హైదరాబాద్ : బాహుబలి 2 కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతోంది. వసూళ్లలో ప్రభంజనం సాగిస్తూ సత్తా చాటుతోంది. బాహుబలి..ది కన్‌క్లూజన్‌ సునామీకి బాక్సాఫీసు షేక్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి మూడు రోజుల్లోనే 505 కోట్ల పైనే గ్రాస్‌ వసూళ్లు సాధించింది. భారత్‌లో బాహుబలి... ది కన్‌క్లూజన్‌ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 385కోట్లు, విదేశాల్లో 120 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం హిందీలో తొలి మూడు రోజులకు 128 కోట్లు రాబట్టింది. దీంతో దంగల్‌ 107.01 కోట్లు, సుల్తాన్‌ 105.53 కోట్లు రికార్డుల్ని దాటేసింది.

పీకే మూవీ 792 కోట్లే అత్యధిక వసూళ్లు...
భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు అమిర్ ఖాన్ నటించిన పీకే మూవీ 792 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును బ్రేక్‌ చేసేందుకు బాహుబలి 2 సిద్ధం అవుతోంది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే 505 కోట్లు కొల్లగొట్టింది. అటు అమెరికా బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. అక్కడ ప్రస్తుతం విన్ డీజిల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 మొదటి స్థానంలోను, ఒక లాటిన్ సినిమా రెండో స్థానంలోను ఉండగా మూడోస్థానంలో బాహుబలి నిలిచింది.

తొలి మూడు రోజుల్లో 120 కోట్లు 
ఒక్క హిందీలోనే తొలి మూడు రోజుల్లో 120 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది బాహుబలి2. అలాగే, ఒక్క అమెరికాలోనే ఓపెనింగ్ వీకెండ్‌లో 65.65 కోట్లు కొల్లగొట్టింది. బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను విశ్లేషిస్తున్న మార్కెట్‌ అనలిస్టులు.. 1000 కోట్ల మార్కును సునాయసంగా దాటుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి బిగినింగ్‌ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి..ది కన్‌క్లూజన్‌ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కలెక్షన్ పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. బాహుబలి 2 అద్భుతమైన గ్రాఫిక్ మాయాజాలంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. బాహుబలి-ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు కొల్లకొడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

 

13:23 - May 2, 2017

తెలంగాణలో 4,200కిలోమీటర్లు తిరిగి విభిన్న వర్గాల జీవన శైలిని పరశీలించి వచ్చారు. సీపీఎం నిర్వహించిన మహాజనపాదయాత్రలో కవరేజీకి వెళ్లి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉన్నారు రిపోర్టర్ భాస్కర్, వీడియో జర్నలిస్టు మురళీఅరుదైన రికార్డు సృష్టించారు. భాస్కర్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రయాణం చాలా గొప్ప అనుభుతిని ఇచ్చిందని, కొత్త రాష్ట్రంలో ఎక్కడ మార్పు రాలేదని అన్నారు. పాదయాత్రలో అనేక అనుభవాలు, అనేక సమస్యలు ఎదురైయ్యాయని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన టెన్ టివికి, మహాజన పాదయాత్ర నిర్వహాకులకు  ఆయన కృతజ్ఞతలు తెలపారు. మురళీ మాట్లాడుతూ ప్రభుత్వం రూ.4 వేలు ఇవ్వడం ఎంతవరకు సాధ్యం అనేది ఆలోచించాలని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:10 - May 2, 2017

ముస్లిం మహిళల్లో వెనుకబాటుకు ప్రధాన కారణం అక్షరాస్యత. అంతేగాకుండా వెనుకబాటుకు ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో ఐద్వా సభ్యురాలు అఫ్రొజ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన పాల్గొన్నారు. వారు తమ తమ అభిప్రాయాలు తెలియచేశారు. ముస్లిం మహిళల వెనుకబాటు తనానికి అక్షరాస్యత ప్రధాన కారణమని అఫ్రోజ్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేరడం లేదన్నారు. ముస్లిం మహిళల వెనుకబాటుతనానికి అధిక సంతానం కూడా ఒక కారణమని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. డబ్బు ఎరచూపి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:04 - May 2, 2017

వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పోలీసులు భారీ మొత్తంలో మోహరించారు. కమిషనరేట్‌ పరిధిలోని మొత్తం 10 మంది ఎస్‌ఐలతో పాటు 3 సీఐలు 70 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో పాటు వరంగల్ అర్బన్‌ తహశీల్దార్‌, వీఆర్‌వోలు మార్కెట్ యార్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మార్కెట్ యార్డ్‌కు వచ్చిన రైతుల ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్ పరిశీలించాకే లోనికి అనుమతిస్తున్నారు. ఎప్పుడు లేనిది కొత్తగా రూల్స్ పెట్టడంపై రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ వస్తున్న గండ్ర వెంకటరమణరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను గేట్ వద్ద నిలివివేయండంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వరుసగా 6 రోజుల సెలువులు కావడంతో నేడు భారీ ఎత్తున మిర్చ మార్కెట్ వచ్చింది. మార్కెట్లో మిర్చి ధర రూ.5వేల 800లుగా నిర్ణయించారు.

12:53 - May 2, 2017

గుంటూరు : జిల్లాలోని దుగ్గిరాల మండలం ఈమనిలో కౌలురైతు చంద్రశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండెకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాడు. కానీ, దిగుబడి లేక దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేక నష్టపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్య శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతని మృతితో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

 

ఇంద్రకిరణ్ అధ్యక్షతనలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం..

హైదరాబాద్ : దేవాదాయ మంత్రి ఇంద్రకిరణ్ అధ్యక్షతనలో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. మంత్రులు నాయినీ, జూపల్లి, తుమ్మలలు హాజరయ్యారు. దేవాదాయ శాఖను పటిష్టపరచడం..ఆలయాల అభివృద్ధి..అర్చకులు..ఆలయ ఉద్యోగుల జీతభత్యాలు..ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.

బుధవారం పదో తరగతి ఫలితాలు..

హైదరాబాద్ : బుధవారం తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4గంటలకు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.

నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన లక్ష్మారెడ్డి...

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిని మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. కొత్త భవనంలోని ప్రతి బ్లాక్ ను పరిశీలించారు. ఆసుపత్రి సౌకర్యాలపై డీఎంఈని అడిగి తెలుసుకున్నారు.

 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్య...

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లాట్ ఫాం నెంబర్ 4 పై దురంతో ఎక్స్ ప్రెస్ ఎక్కి పైనున్న విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

12:43 - May 2, 2017

ఖమ్మం : మిర్చికి మద్దతు ధర, రైతులపై కేసులు ఎత్తివేయాలని అఖిలపక్షం ఆధ్యర్యంలో సీపీఎం, సీపీఐ, టీడీపీ పార్టీలు నగర దిగ్భందన కార్యక్రమం చేపట్టాయి. దీనితో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. దిగ్భంధనంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి పోన్న వెంకటేశ్వరావును..సత్తుపల్లిలో ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని దూర ప్రాంతాల పీఎస్ లకు తరలిస్తున్నారు. మొన్న ఆందోళన చేసిన 10 మంది రైతులపై కేసులు పెట్టడంతో వారి కుటుంబ సభ్యులు  తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేసుల్లో సగం మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ధర పెంచాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.

12:41 - May 2, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడ పార్మాసిటీ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కంపెనీలో రియాక్టర్ వాల్ ఓపెన్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడనే ఉన్న కార్మికుల్లో ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా ప్రమాద ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు పేర్కొంటున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐటీయూ, సీపీఎం నేతలు కంపెనీ వద్దకు చేరుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అనూకులంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇద్దరు కార్మికులు మృతి చెందినా యాజమాన్యం ఇంతవరకు స్పందించలేకపోవడం గమనార్హం.

 

టిడిపిని వీడను - ఆనం వివేక..

విజయవాడ : తెలుగుదేశం పార్టీని వీడనున్నామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. తాము పార్టీలోనే ఉంటామని ఈ మేరకు ఈ విషయాన్ని చంద్రబాబుకు స్పష్టం చేయడం జరిగిందన్నారు.

రాజ్ నాథ్ ని కలిసిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై వీరు చర్చిస్తున్నారు.

11:51 - May 2, 2017

వాషిగ్టన్ : అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టోర్నడోల ధాటికి నాలుగు రాష్ర్టాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 15 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క టెక్సాస్‌లోనే ఐదు మంది మృతి చెందారు. చాలా రాష్ర్టాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. టెక్సాస్‌, మిస్సోరి, మిస్సిసిపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 

11:49 - May 2, 2017

వరంగల్ : జిల్లాలో పేరు గాంచిన ఎనుమాముల మార్కెట్ వద్ద అధికారులు కొత్త నిబంధనలు పెట్టారు. పాస్ పుస్తకాలు..ఆధార్ కార్డులను ఉంటేనే రైతులను లోనికి అనుమతించారు. మద్దతు ధర విషయంపై ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎనుమాముల మార్కెట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కమిషనరేట్‌ పరిధిలోని మొత్తం 10 మంది ఎస్‌ఐలతో పాటు 3 సీఐలు 70 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో పాటు వరంగల్ అర్బన్‌ తహశీల్దార్‌, వీఆర్‌వోలు మార్కెట్ యార్డుకు చేరుకుని భద్రతను పర్యవేక్షించారు. మార్కెట్ లోనికి వచ్చే రైతుల వద్ద ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్ లను పరిశీలించాకే లోనికి అనుమతిస్తున్నారు. ఎప్పుడు లేనిది కొత్తగా రూల్స్ పెట్టడంపై రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకుని మార్కెట్ వస్తున్న టి.కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు

11:45 - May 2, 2017

విజయవాడ : రైతుల మీద ఏపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేస్తోందని.. రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో రాయలసీమ బైటాయింపు కార్యక్రమం చేపట్టబోతున్నట్టు మధు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

11:40 - May 2, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారిని జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వీరిద్దరు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వామివారి ప్రసాదం అందజేశారు. మరోవైపు వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.

 

11:38 - May 2, 2017

విశాఖ : బీచ్‌ రోడ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని.. డిప్యూటీ సీఎం చినరాజప్ప పరామర్శించారు. సెవెన్‌ హిల్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపిస్తున్నామని చిన్నరాజప్ప తెలిపారు. 

11:35 - May 2, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పదవీ కాలం నేటితో ముగియనుంది. మరోవిడత కొనసాగిస్తారా.. లేక కొత్తవారిని నియమిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడుకు చెందిన నరసింహన్‌ 2006 డిసెంబరు 31న కేంద్ర నిఘా విభాగం సంచాలకునిగా పదవీ విరమణ పొందారు. 2007 జనవరి 25న తొలిసారి ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2010 జనవరిలో బదిలీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. 2012 మే 3న మొదటి విడత పదవీ కాలం ముగియడంతో..కేంద్ర ప్రభుత్వం ఇక్కడే మళ్లీ నియమించింది. 2014 జూన్‌ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భవించగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నరసింహన్‌ను కొనసాగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం ఇంకా వెల్లడి కాలేదు.

కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు...
నరసింహన్‌ పదవీకాలం పొడిగించాలనే అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. గతంలో మూడు సార్లు గవర్నర్‌గా ఎవరూ కొనసాగలేదని తెలిసింది. నరసింహన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించడంతో.. బీజేపీ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని కంటిన్యూ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు గవర్నర్‌గా ఉన్న రోశయ్యను పదవీ కాలం ముగిసిన తర్వాత కొనసాగించాలని వచ్చిన అభ్యర్థనలు కేంద్రం తోసిపుచ్చింది. నరసింహన్‌ విషయంలో ఏం వైఖరి అవలంబిస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ అంశాలపై అవగాహన దృష్ట్యా ఆయనను కొనసాగించే అవకాశం ఉందని కొందరు నేతలు, అధికారులు భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న సఖ్యత
జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందువల్ల గవర్నర్‌గా నరసింహన్‌నే కొనసాగించాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న సఖ్యత దృష్ట్యా ఈఎన్నికలు పూర్తయ్యే వరకు నరసింహన్‌ సేవలను వినియోగించుకోవాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు వచ్చినట్లు తెలిసింది. మరొకరిని నియమించకుంటే పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వకున్నా ప్రస్తుత గవర్నర్‌ కొనసాగవచ్చు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా కేంద్రం మరొకరిని నియమించే అవకాశం లేకపోలేదు. ఏదీ ఏమైనా ఒకటి, రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఎవరనేది స్పష్టత రానుంది.

11:33 - May 2, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడ పార్మాసిటీ కంపెనీఅలో ప్రమాదం జరిగింది. రియక్టర్ వాల్ ఓపెర్ కావడంతో మంటలున చెలరేగి ఒ కార్మికుడు మృతి చెందాడు, మరో నాలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గత కొద్ది రోజులుగా ప్రమాద ఘటనలు జరుగుతోన్న యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

రాజ్ నాథ్ ని కలిసిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై వీరు చర్చిస్తున్నారు.

11:22 - May 2, 2017

ఖమ్మం : మర్చికి మద్దతు ధర, రైతులపై కేసులు ఎత్తివేయాలని అఖిలపక్షం ఆధ్యర్యంలో సీపీఎం, సీపీఐ, టీడీపీ ఖమ్మం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు దిగ్భంధం చేయాడంతో ఉద్రిక్తత నెలకొంది. దిగ్భంధనంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి పోన్న వెంకటేశ్వరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లిలో ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరయ్యను పోలీసులు అరెస్ట చేశారు. అరెస్ట్ చేసిన వారిని దూర ప్రాంతాల పీఎస్ లకు తరలిస్తున్నారు. మొన్న ఆందోళన చేసిన 10 మంది రైతులపై కేసుల పెట్టడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేసుల్లో సగం మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పటికైన ధర పెంచాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.

రమేష్ అనే రైతుల ఆత్మహత్య పాల్పపడ్డారు 

ఖమ్మంలో అఖిలపక్ష నేతల అరెస్టులు..

ఖమ్మం : జిల్లాలో రైతుల ఉద్యమం మరింత తీవ్రతరమైంది. మిర్చి రైతులకు మద్దతుగా ఖమ్మం నగరం దిగ్భందనం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు..రాస్తారోకోలు జరుగుతున్నాయి. రఘునాథపాలెం, పందిళ్లపల్లిలో ఆందోళన చేస్తున్న టిడిపి, లెఫ్ట్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముదిగొండలో ఎమ్మెల్యే సండ్ర రాస్తారోకోలో పాల్గొన్నారు. కొణిజర్ల పట్టణ దిగ్భందానికి ప్రయత్నించిన లెఫ్ట్ నేతలను అరెస్టు చేశారు. మిర్చి రైతులపై కేసులు ఎత్తివేయాలని, మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది.

ఎనుమాముల మార్కెట్ యార్డులోకి నో ఎంట్రీ..

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ యార్డులోకి రాజకీయ నేతలకు అనుమతిని నిరాకరిస్తున్నారు. మార్కెట్ లోకి వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డితో సహా పలువురిని మిల్స్ కాలనీ స్టేషన్ కు తరలించారు.

11:06 - May 2, 2017

సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు..హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో కూడా తమ నైపుణ్యాన్ని చూపెడుతుంటారు. కొందరు వ్యాపారంలోకి దిగితే మరికొందరు దర్శక..నిర్మాతలుగా మారుతున్నారు. అందులో ప్రధానంగా బాలీవుడ్ కు చెందిన కొందరు హీరోయిన్లు దర్శక..నిర్మాతలుగా మారి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ భిన్న చిత్రాలను నిర్మించి సక్సెస్‌ఫుల్‌ నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా వీరి జాబితాలోకి మరో కథానాయిక 'అలియా భట్‌' కూడా చేరింది. 'ఉడ్తాపంజాబ్‌', 'డియర్‌ జిందగీ', 'బద్రీనాథ్‌కి దుల్హనియా' వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. సినిమాలను నిర్మించే విషయంపై 'అలియా' దృష్టి సారించింది. అలియా తండ్రి మహేష్‌భట్‌ కూడా నిర్మాతే కాబట్టి ఆయన్నుంచి ప్రొడక్షన్‌ డిజైన్‌కి సంబంధించిన సలహాలను తీసుకోనుందని, అందుకే కథానాయికగా నయా ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 'డ్రాగన్‌' చిత్రంలో అలియా నటిస్తోంది.

11:02 - May 2, 2017

మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌ జంటగా బ్రహ్మానందం కీలక పాత్రలో జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర' త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోబోతోంది. పద్మశ్రీ డా||మోహన్‌బాబు జన్మదినం సందర్భంగా మార్చి 19న చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ నిమిత్తం అమెరికాకు వెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్‌ హైలైట్‌గా నిలవనుందని చిత్ర దర్శక, నిర్మాతలు వెల్లడించారు. కృష్ణమాచారి తప్పులు.. అప్పలాచారి తిప్పలేెంటివనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

10:56 - May 2, 2017

గుంటూరు : జిల్లాలోని మాచవరం మండలం వేమవరం గ్రామ సర్పంచ్ పాశం శ్రీనివాస్ దారుణ హత్యకు గురైయ్యారు. సోమవారం రాత్రి ప్రత్యర్థులు ఇంటికి వచ్చి బయటకు లాగి కత్తులతో దాడి చేసి హతమర్చారు. ఈ సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది. శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నాడు. విషయం తెలుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పాత గొడవలే హత్యకు కారణామని తెలుస్తోంది.

10:43 - May 2, 2017

విజయవాడ : రైతులకు మద్దతు ధర కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఉల్లి, మిర్చి, పసుపు, కందులకు ధర తగ్గాయని, శనగలకు పెరిగాయని తెలిపారు. 1947 నుంచి రైతులకు మద్దతు ధర ప్రకటించే పద్దతి ఉందని గుర్తు చేశారు. మిర్చికి కేవలం రూ. 1500 చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ పెట్టుబడి దారులకు అనూకులంగా వ్యవహరిస్తోందని అన్నారు.

10:35 - May 2, 2017

భద్రాద్రి కొత్తగూడం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తులు.. విలువైన కానుకలందించారు. బెంగళూరుకు చెందిన జివి. రంగారావు, శ్రీదేవి దంపతులు.. కోట్ల విలువైన బంగారు కవచాలను స్వామివారికి కానుకగా అందించారు. మొత్తం 21 రకాల ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆలయంలోని మూలవరులకు ఈ ఆభరణాలను అలంకరిస్తామని ఆలయ ఈవో రమేశ్‌బాబు తెలిపారు.

 

10:31 - May 2, 2017

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్‌ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కృష్ణఘాటి సెక్టార్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు పెట్రోలింగ్‌ జరుపుతున్న భారత జవాన్లపై పాకిస్తాన్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. మరో జవానుకు గాయాలయ్యాయి. మృతులను బిఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌సాగర్, ఆర్మీ జెసిఓ పరమ్‌జిత్‌సింగ్‌లుగా గుర్తించారు.

ముక్కలుగా జవాన్ల మృతదేహలు
అంతటితో ఆగని పాకిస్తాన్ బోర్డర్‌ యాక్షన్‌ టీం-భారత జవాన్ల మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరకడం ద్వారా తన పైశాచికత్వాన్ని చాటుకుంది. అత్యంత హేయమైన రీతలో జరిపిన ఈ కిరాతక చర్యకు తగిన రీతిలో బదులిస్తామని భారత ఆర్మీ ఉత్తర కమాండ్‌ ఓ ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది. పాక్‌ కాల్పులతో అప్రమత్తమైన భారత్‌ ఎదురు కాల్పులు జరిపి ధీటైన జవాబు చెప్పింది.తమ హక్కుల కోసం పోరాడుతున్న కశ్మీరీలకు తమ మద్దతు కొనసాగుతుందని పాక్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బాజ్‌వా మరోసారి వివాదస్పద ప్రకటన చేశారు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద పర్యటించిన ఆయన-ఇండియానే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. కశ్మీర్‌లో అలజడుల నేపథ్యంలో పాక్‌ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో ఏడుసార్లు దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత్‌తో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది.

 

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన..

కామారెడ్డి : బంజపల్లిలో నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణ పనులకు మంత్రి పోచారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జెడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సాయంత్రం ముగియనున్న జగన్ దీక్ష..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన రైతు దీక్ష కొనసాగుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనాన్ని నిరసిస్తూ ఆయన రెండు రోజుల పాటు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రంతో దీక్ష ముగియనుంది.

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం..

విశాఖపట్టణం : పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ వాల్ ఓపెన్ కావడంతో మంటలు చెలరేగడంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

టిడిపి సమన్వయ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశం జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు..మహానాడు ఏర్పాట్లపై చర్చించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జీ మంత్రుల పనితీరుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

10:16 - May 2, 2017

నెల్లూరు : జిల్లాలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష వైసీపీ జిల్లా రాజకీయాలపై దృష్టి సారించాయి. అధికార పార్టీ హోదాలో తెలుగుదేశం ఇప్పటికే జిల్లాపై పట్టు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీ కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా జిల్లా నాయకులు దృష్టి సారించాలని పార్టీ అధినేత జగన్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇటీవల ముఖ్య నేతలతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో జగన్‌ ప్రత్యేకంగా ముందస్తు ఎన్నికల సన్నద్ధత గురించి నేతలతో చర్చించినట్లు సమాచారం. దీంతో ఒక విధంగా జిల్లాలో ముందుస్తు ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధించాలని పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే పార్టీ కమిటీలు, బూత్‌ స్థాయి కమిటీల ఖాళీలపై దృష్టి సారించింది. ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని జగన్ నేతలకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికలకు సన్నద్ధంలో భాగంగా మరో రెండు వారాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తమ్మీద రెండు ప్రధాన పార్టీల్లో ఇప్పటి నుంచే ముందస్తు ఎన్నికల కదలికలు మొదలయ్యాయి.

 

 

10:12 - May 2, 2017

విజయనగరం : ఏపీలో ముందస్తు ఎన్నికల టాపిక్ జోరందుకోవడంతో...కాదు కాదంటూనే అధికార టీడీపీ ముందస్తుకు సమాయత్తమవుతోంది. కొత్త అభ్యర్థుల అన్వేషణ , కొన్ని చోట్ల సిట్టింగ్ లను మార్చే ఆలోచన చేస్తోంది. స్థానికంగా పార్టీ కమిటీలను పటిష్టపరచడంతో పాటు ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో టీడీపీ నేతల్లో హడావిడి మొదలైంది. పార్టీఅధినేత దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు రావంటూనే.. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేపనిలో పడింది ఏపీ టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పార్టీని పటిష్టపరచడం, వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిసారించారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితిపై పసుపుపార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

విజయనగరంలో రాజకీయలు...
విజయనగరం జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోందన్న సంకేతాలతో పార్టీ అధినాయకత్వం అప్రమత్తమయింది. సంస్థాగతంగా పార్టీని పటిష్టపరచడంతో పాటు వచ్చే ఎన్నికలకు క్యాడర్‌ను వేకప్‌చేసే పనిలో మంత్రి గంటా శ్రీనివాసరావును బిజీఅయ్యారు. దీన్లో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జులను నియమించింది టీడీపీ . విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా ఉన్న మంత్రి గంటా ఇటీవల జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీలో ఉన్న లోటుపాట్లపై ఆయన చర్చించారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఏకంగా ఏడుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అటు సాలూరు, కురుపాం నియోజకర్గాల్లో వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే.. తమ ఎమ్మెల్యేల స్థానాల్లోనే తమ పరిస్థితి దిగజారిందని .. సైకిల్‌గుర్తుపార్టీ బేజారవుతోంది. ప్రధానంగా గజపతినగరం, నెల్లిమర్ల, పార్వతీపురం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపై అక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించింది. ప్రజలతో మమేకం కాకపోవడం, అవినీతి ఆరోపణలపై పార్టీ అధినేత వద్ద రిపోర్టు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు, బంధుప్రీతి లాంటి అంశాలు కూడా సిట్టింగ్ ఎమ్మల్యేలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే యోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా సూటిగా చెప్పాలంటే.. గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఈసారి కొత్తఅభ్యర్థులనే బరిలోకి దించాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్టు పార్టీవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

పార్టీ సంస్థాగతం......
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీ సంస్థాగతంగా కూడా బలంగా లేదు. ముఖ్యంగా కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారడంపై టీడీపీ అధినాయకత్వం కలవరపడుతోంది. ఈ రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం వైసీపీకి కంచుకోటగా ఉన్నాయి. ఇక్కడ పార్టీని పటిష్టపరిచేందుకు స్థానిక నాయకత్వం సరిగ్గా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాలూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మధ్య మొదటి నుంచి సమన్వయం లేదు. అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు నడుపుతూ ఒకరినొకరు దెబ్బతీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీక్యాడర్‌ చెప్పుకుంటోంది. ఇప్పటికే వీరిద్దరి పంచాయితీ సీఎం చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అటు కురుపాం నియోజకవర్గ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని టీడీపీ స్థానిక నాయకులు అభిప్రాయంపడుతున్నారు. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జి గా కొనసాగుతున్న జనార్థన్ థాట్రాజ్ పై అధిష్టానానికి సదాభిప్రాయం లేనట్లు తెలుస్తోంది. ఈయన పార్టీ కోసం పనిచేయడం లేదన్న అసంతృప్తి అటు కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. అధికారపార్టీ నీరసించడంతో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవి పొందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా పార్టీ పటిష్గతపై అంతగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపరిచేందుకు తీసుకునే చర్యలపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని పటిష్టం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మొత్తం మీద...వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టిన అధికారపార్టీ .. విజయనగరంజిల్లాలో గడ్డుపరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటుందో అనేది జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

 

10:12 - May 2, 2017

చర్మంపై పలువురికి దద్దుర్లు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ట్రీట్ మెంట్స్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ తాత్కాలికంగా సమస్య పరిష్కారమౌతుంది. ఇంటి వద్దనే కొన్నింటిని ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

పెట్రోలియం జెల్లి : దురద..మంటల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా జెల్లీ తీసుకుని ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి. ఓ గంట అనంతరం దానిపై ఐస్ ప్యాక్ ను ఉంచాలి.
అరటి తొక్క : ఈ తొక్క వల్ల సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. అరటితొక్కలను ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉంచండి. అనంతరం దద్దుర్లు వచ్చిన ప్రాంతంపై తొక్కలతో రాసుకోవాలి. అర గంట అనంతరం కడుక్కొవాలి.
వేప ఆకు : ఒక లీటర్ నీళ్లలో పది నుండి పన్నెండు వేపాకులు వేయాలి. పదిహేను నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్నానానికి ఉపయోగించే నీటతిలో ఈ నీళ్లను కలుపుకోవాలి. ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల దద్దుర్లు మాయమయ్యే అవకాశం ఉంది.
కొత్తిమీర : యాంటి ఇరిటెంట్ గా..యాంటీ ఇన్ ఫ్లమేటరీగా..యాంటీ సెప్టిక్ గా కొత్తిమీర పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులను మెత్తని ముద్దలా చేసుకుని దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని దద్దుర్లు వచ్చిన ప్రాంతంలో రాయాలి. అర గంట అనంతరం కడిగేసుకోవాలి.

సెన్సెక్స్ జోరు..

ముంబై : మార్కెట్ లో జోరు కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఆర్జించి మళ్లీ 30 వేల బెంచ్ మార్క్ ను దాటింది. నిప్టీ కూడా 9300 పైనే ట్రేడ్ అవుతోంది.

10:00 - May 2, 2017

ఢిల్లీ : సబ్సిడీ గ్యాస్..కిరోసిన్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ ఎత్తివేసే క్రమంలో భాగంగా ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. సబ్సిడీ వంట గ్యాస్‌ ధర సిలిండర్‌కు రెండు రూపాయల చొప్పున...కిరోసిన్‌ లీటర్‌కు 26 పైసలు పెంచారు. చమురు సంస్థలు చివరి సారిగా ఏప్రిల్‌ 1న సబ్సిడీ గ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ 5.57పైసలు పెంచిన సంగతి తెలిసిందే. ప్రతినెలా చిన్న మొత్తంలో గ్యాస్‌ ధరలను పెంచుతూ వస్తున్నాయి. ప్రతినెలా గ్యాస్‌ ధరను రూ 2 మేర పెంచుతున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం పెంపును పక్కనపెట్టిన చమురు మార్కెటింగ్‌ సంస్థలు తిరిగి ధరల పెంపును చేపట్టాయి.

09:57 - May 2, 2017

గుంటూరు : కియా మోటార్స్ కార్ల పరిశ్రమతో కరువు జిల్లా అనంతపురం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరిశ్రమను అనంతపురం జిల్లాలో నెలకొల్పడం పట్ల ఎమ్మెల్యే బీకే పార్థసారధి నేతృత్వంలో జిల్లా ప్రజాప్రతినిధులు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌కి రావడం చరిత్రాత్మక అంశమని బాబు తెలిపారు. పరిశ్రమ స్థాపనతో 11వేల మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఉద్యోగాల్లో 90శాతం స్థానికులకే అవకాశం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాకు నీటి సౌకర్యం కల్పిస్తే మరిన్ని పరిశ్రమలు జిల్లాకు వస్తాయని బాబు చెప్పారు. ఇందుకోసం హంద్రనీవా ప్రాజెక్టును త్వరతగితిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అనంతపురం జిల్లాకు వస్తున్న తొలి భారీ పరిశ్రమకు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నానన్నారు.

 

 

 

09:51 - May 2, 2017

గుంటూరు :జపాన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ సంస్థ మాకీ అసోసియేట్స్‌కు సీఆర్డీయే లీగల్ నోటీసులు పంపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఆర్డీఏ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆ సంస్థ అసత్య ప్రచారాలు చేసిందని నోటీసులు జారీ చేసింది. ఇందుకు గాను న్యాయరమైన విచారణతో పాటు వంద కోట్ల జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత పుమిహికోకు సీఆర్డీయే అధికారులు నోటీసులు పంపారు.

 

 

09:49 - May 2, 2017

ఢిల్లీ : కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ ఎస్‌ అహ్లువాలియాను కలిసింది. గిట్టుబాటు ధరలు లభించక మిర్చి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసింది. మిర్చి ధరలు పతనం కావడంతో రైతు పడుతున్న కష్టాలు బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. మిర్చికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీము వర్తింపచేయాలని కోరింది. ఇందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే వ్యాపారుల ద్వారా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించే మిర్చిని కేంద్రం తీసుకుంటుందని అహ్లువాలియా హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్క్‌ ఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోలు చేయించాలని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ కోరారు. పంటల సాగు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించే మిర్చికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీము వర్తింప చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటను సేకరిస్తుందో ... లేదో... చూడాలి.

 

09:43 - May 2, 2017

ఖమ్మం : జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. మార్కెట్ యార్డ్‌పై దాడి కేసులో రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టడంతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనకు అన్ని వర్గాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా రైతులకు భరోసా కల్పించేందుకు వామపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అక్రమకేసుల విషయంలో మిర్చి రైతులకు భరోసా కల్పిచేందుకు వామపక్షాలు, ఇతర పార్టీలు ఇవాళ జిల్లా దిగ్భంధనానికి పిలుపునిచ్చాయి. దీనిని అడ్డుకునేందుకు అధికార పార్టీ అడ్డదారుల్లో పయనిస్తుంది. ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయించడానికి సిద్ధమవుతోంది. అయితే ఎన్ని కేసులు బనాయించిన వెనక్కి తగ్గేది లేదని వామపక్షాలు చెబుతున్నాయి. నెల రోజులుగా మిర్చి పంటకు కనీస ధర కూడా రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వామపక్ష నాయకులు తెలిపారు. మద్దతు ధర కల్పించాలని ఎన్ని సార్లు ధర్నాలు చేసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డులో దళారులు, వ్యాపారలుఉ రెచ్చిపోతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సగానికి పైగా ధరను తగ్గిస్తూ తమ పొట్ట కొడుతున్నారని.. జెండా పాట కూడా పెట్టకుండా కనీస ధరలు నిర్ణయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా కంటే ఎక్కువగా అన్ని జిల్లాల నుంచి రైతులు పంటను తీసుకువస్తున్నారని.. అందువల్లే కొనుగోలులో కాస్త ఆలస్యమవుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. బయట వ్యక్తుల ప్రమేయంతోనే యార్డ్‌లో దాడి జరిగిందన్నారు. రైతులకు ఎటువంటి నష్టం రాకుండా పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ చేపడుతున్న జిల్లా దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల పక్షాలు పిలుపునిచ్చాయి.

 

 

09:38 - May 2, 2017

ఖమ్మం : మిర్చి మద్దతు ధర కల్పించాలిని కొద్ది రోజుల క్రింద రైతులు చేసిన ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న దాదాపు 10 మంది రైతులపై కేసు నమోదు చేశారు.రైతులపై కేసులను ఎత్తివేయాలని అఖిలపక్షం ఆధ్యర్యంలో ఖమ్మం దిగ్భంధనం చేయనున్నారు. ఖమ్మంలో కొన్ని రోజులుగా సెక్షన్ 144 విధించాడం హక్కులను హరించడమే అని నాయకులు అంటున్నారు. రైతులు జైల్లో ఉండడంతో వారి ఇంటి వారు ఆందోళనకు గురౌతున్నారు.

 

09:31 - May 2, 2017

విజయనగరం : జిల్లాలోని బొబ్బిలిలో ఆస్తుల వివాదంలో వదిన, అన్న కొడుకు పై మరిది త్రీనాథ్ క్రికెట్ బ్యాట్ తో దాడి చేశాడు. దాడిలో వదిన చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందగా, అన్నకొడుకు మణికంఠ అపస్మరక స్థితిలోకి వెళ్లాడు. బాలున్ని ఆసుపత్రికి తరలించారు మణికంఠ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్తి తగాదాలే దాడికి కారణమని తెలుస్తోంది. శంకరయ్య, త్రీనాథ్ ఇద్దరు అన్నదమ్ములు వారికి అమ్మ కమలమ్మ ఉంది. ఆమె రిటైర్డ్ అయినప్పుడు రూ.14 లక్షల వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాట్టు తెలుస్తోంది. త్రీనాథ్ వ్యసనాలకు అలవాటు పడడంతో అతని భార్య వదిలి వెళ్లింది. ఒంటరిగా ఉంటున్న ఆయన దాడికి దిగాడం గ్రామంలో కలకలం రెపింది. దాడి సమయంలో అన్న శంకరయ్య లేకపోడంతో ఈ దారుణం జరిగింది.

టిడిపి సర్పంచ్ దారుణ హత్య..

గుంటూరు : టిడిపి సర్పంచ్ పాశం శ్రీనివాస్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. గుంటూరు జిల్లా మాచవరం (మం) వేమవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉమ్మడి నల్గొండలో రోడ్డు ప్రమాదాలు..

నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేరు వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. చివ్వెంల (మం) అక్కలదేవిగూడెం వద్ద బైక్ ను కారు ఢీకొంది. తండ్రి షేక్ తాజ్ మృతి చెందగా ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. బహుపేట - వంగపల్లి వద్ద బైక్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. భువనగిరి (మం) కోనూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందారు.

అనంతనాగ్ ఉప ఎన్నిక మళ్లీ వాయిదా..

ఢిల్లీ : రెండోసారి అనంతనాగ్ ఉప ఎన్నిక వాయిదా పడింది. శాంతి భద్రతల కారణంగా ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఎన్నిక నిర్వాహణకు అనుకూల పరిస్థితి లేదని ఈసీ తేల్చిచెప్పింది. ఈనెల 25న అనంతనాగ్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

ఖమ్మం నగర దిగ్బంధనం..

ఖమ్మం : మిర్చి రైతులకు మద్దతుగా నేడు నగరం దిగ్భందనం కార్యక్రమం జరగనుంది. టిడిపి..వామపక్ష పార్టీలు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొననున్నారు.

వదినె..బాలుడిపై మరిది బ్యాట్ తో దాడి..

విజయనగరం : బొబ్బిలి కోవెల వీధిలో దారుణం చోటు చేసుకుంది. వదిన..నాలుగేళ్ల కుమారుడిపై మరిది దాడికి పాల్పడ్డాడు. క్రికెట్ బ్యాట్ తో మోదడంతో వదిన మృతి చెందగా బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

ముగియనున్న గవర్నర్ పదవీకాలం..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం నేటితో ముగియనుంది. పదవీకాలాన్ని కేంద్రం పొడిగిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.

 

08:54 - May 2, 2017

ఎండకాలం వచ్చిదంటే చల్ల చల్లగా ఉండే బీర్లను మందుబాబులు గడగడా తాగేస్తుంటారు. కానీ బీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని పలువురు హెచ్చరిస్తుండడం చూస్తూనే ఉంటాం. తాజాగా బీరు పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. గ్రీన్‌విచ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 400 మందిపై 18 రకాల పరిశోధనలు చేశారు. బీరును కొద్దిపాటి మోతాదులో తీసుకుంటే పారసిటమాల్ మాత్ర కన్నా బాగా పనిచేసినట్లు తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఆందోళన..నొప్పి తీవ్రతను బీరు తగ్గిస్తుందా ? లేదా ? అనే దానిపై వీరు పరిశోధనలు జరిపారు. ఎక్కువ బీరు తాగిన వ్యక్తులకు తక్కువ నొప్పి ఉన్నట్లు..బీరు తాగిన వ్యక్తుల్లో ఆల్కహాల్ సమర్థవంతమైన పెయిన్‌కిల్లర్‌గా పనిచేసినట్లు బలమైన ఆధారం కనుగొన్నామని వారు పేర్కొంటున్నారు. దుష్ప్రభావాలు లేని మందులనూ ఆల్కహాల్‌తో తయారు చేయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.

 

08:46 - May 2, 2017

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో పోలవరంపై నిర్వహించిన రివ్యూలో సీఎం చంద్రబాబు నిర్మాణ సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎర్త్ వర్క్ విషయంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంపై నిర్మాణ సంస్థలను సీఎం నిలదీశారు. కాపర్ డ్యామ్ డిజైన్లు, నిధుల విడుదల, వర్కర్ల జీతాలు.. తదితర అంశాలు ఈ రివ్యూ మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చాయి. అంతా మాటలే చెబుతున్నారని.. ప్రాక్టికల్‌గా రిజల్ట్ చూపాలంటూ సీఎం, అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అధికారులు చెప్తున్న మాటలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. పనుల జాప్యానికి కారణాలు.. ప్రతిసమీక్షలో చెప్పేవే మళ్లీ చెబుతున్నారని.. పనుల్లో పురోగతి మాత్రం చూపించడం లేదన్నారు.

చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం
పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్‌, గేట్ల ఫాబ్రికేషన్‌ పనులు కొంతమేర ఆశాజనకంగా ఉన్నా.. ఎర్త్‌వర్క్‌, కాపర్‌ డ్యాం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో బ్యాంకర్లు సహకరించడం లేదని నిర్మాణసంస్థలు చెప్పడంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధుల పరంగా ఇబ్బంది ఉండదని నిర్మాణ సంస్థలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. బ్యాంకర్లతో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని..ఆర్థిక కారణాలు సాకుగా చూపితే సహించేది లేదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు 2018 డిసెంబర్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించాలని లక్ష్యం పెట్టుకున్నామని.. ఈవిషయంలో నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం మట్టి తవ్వకాలు సహా మిగిలిన అన్ని పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పనులకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం 

08:42 - May 2, 2017

ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌, ఈ శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా , ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్ తో సమావేశమయ్యారు. నితిన్‌ గడ్కరీతో జరిపిన భేటీలో వివిధ రోడ్ల ప్రాజెక్టుల కోసం 1700 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు. ఐటీ శాఖ మంత్రి రవిశకంర్‌ప్రసాద్‌తో జరిపిన భేటీలో వేగంగా అభివృద్ధి చెందున్న వరంగల్‌ వంటి చిన్న నగరాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కార్యరూపం ఇవ్వాలని విన్నించారు. ఎలక్ట్రానిక్స్‌ వస్తువు, మొబైల్‌ ఫోన్ల తయారీ, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రోత్సమించాలని కోరారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోరారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌తో సమావేశమైన కేటీఆర్‌ తెలంగాణకు కొత్తగా మరో నాలుగు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను మంజూరు చేయాలని కోరారు. కరీంనగర్‌ డెయిరీకి అనుబంధంగా శీతల గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలనవిన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

 

08:36 - May 2, 2017

హైదరాబాద్ : ప్రతి నివాసానికి మంచినీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమలుపై కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు హాజరైన ఈ సమీక్షలను పలు అంశాలపై కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మిషన్‌ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా పనుల వేగాన్ని పెంచాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి గోదావరి, కృష్ణా జలాలు గ్రామాలకు సరఫరా అయ్యేలా చూడాలిని కోరారు. పథకం అమల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు చర్చించుకుని, సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించేంది లేదని హెచ్చరించారు. భగీరథ పైపు లైన్లతోపాటు ఫైబర్‌ కేబుల్‌ కూడా వేసి ఇంటింటికి మంచినీళ్లతోపాటు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ అమెరికా సరసన నిలవాలన్న ఆకాంక్షను కేసీఆర్‌ వ్యక్తం చేశారు. ఇన్‌టేక్‌ వెల్స్‌, నీటి శుద్ధి కర్మాగారాల నిర్మాణాన్ని తర్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోగా పంటపొలాల్లో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తైన ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ ద్వారా నీరు అందించాలని కోరారు. ఈ పథకానికి కావాల్సిన కరెంటును అందించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

 

Don't Miss