Activities calendar

03 May 2017

తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణ రచయిత అవార్డు

ఢిల్లీ : జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 'పెళ్లి చూపులు చిత్రానికి' ఉత్తమ సంభాషణ రచయితగా అవార్డును తరుణ్ భాస్కర్ అందుకున్నారు. 

 

21:25 - May 3, 2017

తెలంగాణలో 54 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మంజూరు

హైదరాబాద్ : రాష్ట్రంలో 13 వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోస్టులు మంజూరు చేశారు. ఒక్కో ఆస్పత్రికి 10 చొప్పున కొత్త పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఆస్పత్రిలో ఇద్దరు సివిల్ సర్జన్, అసిస్టెంట్ సర్జన్లు, నలుగురు స్టాఫ్ నర్సుల చొప్పున పోస్టులు భర్తీ చేశారు. 

 

20:35 - May 3, 2017

హైదరాబాద్: ఎందుకు ఈ కష్టం.. ఎందుకు ఈ మంటలు, దీనికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు. పండించి పాపం చేశారా? పంటను అమ్ముకోవాలని తప్పు చేశారా? దళారులను తప్పించలేని నిశ్శహాయతకు తలవంచుతున్నారా? కడుపు మండి ప్రశ్నిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంట వెనుక ఉన్న విషయాలు ఏమిటి? ఇదే అంశం నైటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

తెలంగాణలో రవాణా కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో రవాణా కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈమేరకు ఫలితాలను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. 120 మంది అభ్యర్థులు రవాణా కానిస్టేబుళ్లుగా ఎంపిక అయ్యారు. మరో 18 రవాణా కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాలేదు. 

 

ఈనెల 19న రాష్ట్రస్థాయి పోలీసు విస్తృస్థాయి సదస్సు

హైదరాబాద్ : ఈనెల 19న రాష్ట్రస్థాయి పోలీసు విస్తృస్థాయి సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాంతిభద్రతలు, పోలీసుశాఖ బలోపేతంపై సదస్సులో చర్చించనున్నారు. పోలీసులు సాదకబాధలకాలను స్వయంగా తెలుసుకోనున్నారు. అన్ని విభాగాల ఐపీఎస్ లను ఈ సదస్సుకు ఆహ్వానించాలని 
డీజీపీ అనురాగ్ శర్మను సీఎం ఆదేశించారు. సమగ్ర వివరాలతో పోలీసులు హాజరు కావాలని 
అన్నారు. 

20:07 - May 3, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు పుణ్యమూర్తే గవర్నర్..నరసింహన్ సార్ నే ఉండమన్న కేంద్రం, మీడియా ముందు వీహెచ్ అన్న కన్నీళ్లు...మిర్చి రైతుల ఘోష కు కరిగిన గుండె, కంగారు మాటలంటున్న జేసీ ప్రభాకర్...సోషల్ మీడియాలో తిట్టి పోస్తున్న జనం, వలసలు ఆగని పాలమూరు బతుకు...బంగారు తెలంగాణ లో దొరకని మెతుకు, రాత్రికి రాత్రే ఉద్యోగాలు మాయం అయినయ్..మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ల మాయాజాలం, మద్ధతు ధరలకే కోటర్లు, బీర్లు అమ్మాలే...కడప జిల్లాలో మద్యం ప్రియుల డిమాండ్ ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంతో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

ఢిల్లీ : జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖ డైరెక్టర్ కె.విశ్వనాథ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 

ఆరోగ్యశాఖపై మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష

అమరావతి : ఆరోగ్యశాఖపై మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అన్ని జిల్లా ఆరోగ్యకేంద్రాల్లో అమలయ్యేలా చూస్తామని మంత్రి చెప్పారు. ఆరోగ్యశాఖలో బదిల్లో అవకతవకలు జరగకుండా చూస్తామని చెప్పారు. 

 

19:03 - May 3, 2017

అమరావతి: టీడీపీ ప్రభుత్వం దీర్ఘకాలిక దోపిడికి తెర లేపిందని వైసీపీ సీనీయర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. స్విస్‌ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి ఆమోదం తెలిపారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణ ఒప్పందాలన్నీ చంద్రబాబు అనుచరులకు చెందిన సింగపూర్‌ కంపెనీలకే కేటాయించారని ఆరోపించారు. 

19:01 - May 3, 2017

కృష్ణా : విజయవాడ శివారు గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ప్రారంభించారు. ఇందులో అమెరికా, స్పెయిన్‌, జర్మనీకి చెందిన కంపెనీలను దాదాపు 42,681 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో మేధా టవర్స్‌ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఏడు కంపెనీల్లో 1650 మందికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. రెండు సంవత్సరాల్లో ఏపీలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాలోకేష్‌ ఈ సందర్భంగా అన్నారు. 

19:00 - May 3, 2017

అమరావతి: నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పెట్టుబడులు రాబట్టడానికి సిఎం చంద్రబాబు గురువారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్‌తో పాటు మొత్తం 15 మంది సభ్యుల బృందం అమెరికా వెళ్ళనుంది. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపి పెట్టుబడులకు స్వర్గధామమని.. రాష్ట్రంలోని అవకాశాలు..నూతన రాజధాని నిర్మాణం ప్రాముఖ్యతను వారికి వివరించనున్నారు. ముఖ్యంగా ఐటి రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనుకుంటున్న బాబు..ఐటి దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ తదితర సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలతో భేటీ కానున్న బాబు..

అమెరికా పర్యటనలో రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులను తీసుకువచ్చే అంశాలపై పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఆ దేశానికి సంబంధించిన పారిశ్రామిక వేత్తలతోపాటు, ఎన్‌ఆర్‌ఐలతోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించనున్నారు. దీంతోపాటు గతంలో పలు ప్రముఖ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు, విశాఖలో జరిగిన పారిశ్రామిక సమ్మెట్‌ వివరాలను వారి దృష్టికి తేనున్నారు. అమెరికాలోని పలు యూనివర్సిటీలను సందర్శించనున్నారు.

ముందు ప్రకటించిన షెడ్యూల్‌లో మంత్రి నారా లోకేష్‌ పేరు...

అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీఎంతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల లోకేష్ అమెరికా టూర్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 17 మంది సభ్యుల బృందం అమెరికాలో పర్యటించనుందని జీఏడి అధికారులు ప్రకటించినా..15 మంది సభ్యుల బృందం అమెరికా వెళ్లనుందని మంగళవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు. ఏపీకి అత్యధికంగా పెట్టుబడులు రాబట్టడానికి 8 రోజుల పాటు చంద్రబాబు అమెరికాలో బిజీ బిజీగా గడపనున్నారు.  

18:57 - May 3, 2017

అనంతపురం: మద్యం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ కడపజిల్లా రైల్వేకోడూరులోని ఓ బ్రాందీ షాపు వద్ద స్ధానికులు ఆందోళన చేశారు. కొనుగోలు చేసే మద్యం బాటిళ్లకు బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో షాపు యజమానికి స్ధానికులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే మద్యం అమ్మాలని కోరుతూ స్ధానికులు ఎమ్మార్వో, ఎక్సైజ్ సీఐలకు వినతిపత్రం సమర్పించారు. 

18:56 - May 3, 2017

అనంతపురం: గత కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో కర్నూలు జిల్లా... కోడుమూరులో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. తొలుత మహిళలు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరికి మద్దతుగా నిలిచిన వామపక్షాల కార్యకర్తలు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. తాళాలు వేశారు. అనంతరం ఖాళీ బిందెలు పట్టుకుని రహదారిపై బైఠాయించారు. దాదాపు నాలుగు గంటలసేపు రహదారిని దిగ్భందించారు. దీంతో కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళనను విరమించారు.

18:36 - May 3, 2017

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

ఢిల్లీ : జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ లో ప్రదానోత్సకార్యాక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

ఢిల్లీ : జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ లో ప్రదానోత్సకార్యాక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 

జూన్ 5 నుంచి 19 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు : కడియం

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 84.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూన్ 5 నుంచి 19 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేది మే 18 అన్నారు. 

 

నయాం కేసులో సంజీవరెడ్డికి బెయిల్ మంజూరు

హైదరాబాద్ : నయాం కేసులో సంజీవరెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ యాక్టును సవాల్ చేస్తూ సంజీవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

'నాగార్జునసాగర్' ఘటనను కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాం : మంత్రి దేవినేని

అమరావతి : నాగార్జునసాగర్ వద్ద జరిగిన ఘటనను కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు తెలిపారు. సాగర్ వద్ద జరుగుతున్న పరిణామాలను రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఇద్దరు సీఎస్ లు దీనిపై చర్చిస్తున్నారని చెప్పారు. 5న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశంలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామన్నారు.

17:58 - May 3, 2017

హైదరాబాద్: మిర్చి రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు. కేసీఆర్‌ చెప్పుడు మాటలు విని రైతులను పట్టించుకోవడం లేదన్నారు. మిర్చి రైతులను కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టడం లేదని.. రైతులే స్వయంగా మద్దతు ధరపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు వీహెచ్‌. 

17:56 - May 3, 2017

హైదరాబాద్: మిర్చిరైతులకు 5వేల రూపాయల మద్దతు ధర ప్రకటించడం అన్యాయమన్నారు సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మద్దతు ధరను 12 వేలకు పెంచాలని జూలకంటి డిమాండ్ చేశారు. అదేవిధంగా వరి, కంది రైతులను ఆదుకోవాలని కోరారు.

 

17:55 - May 3, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య. క్వింటాలుకు 5వేలు మద్దతు ధర చెల్లించడం కంటి తుడుపు చర్యగా ఆయన ఆరోపించారు. ఛత్తీస్ గఢ్, నాగ్ పూర్, ఝార్ఖండ్ లలో 12 నుంచి, 14 వేలకు కొనుగోలు చేస్తున్నారని.. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో మద్దతు ధర నిర్ణయించాలని రాజయ్య డిమాండ్ చేశారు. 

17:52 - May 3, 2017

హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో చదివి ఇంటర్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిభ పురస్కారాలతో పాటు.. క్యాష్‌ అవార్డులు అందించారు. విద్యార్థులందరికి కడియం అభినందనలు తెలియజేశారు. 

15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ : కడియం

హైదరాబాద్ : 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 8,792 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టీఎస్ పీఎస్సీ ద్వారానే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. టెట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. 6 నెలల్లో టీచర్ల నియామకం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నందున పాత జిల్లాల ప్రకారమే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఇప్పట్లో టీచర్ల బదిలీలు ఉండవు అని తేల్చి చెప్పారు. గురుకులాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల భర్తీకి క్రీడల ధృవపత్రం నిబంధన తొలగించామని చెప్పారు. 

 

17:51 - May 3, 2017

హైదరాబాద్: త్వరలో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు కడియం. 

17:49 - May 3, 2017

హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన రోగి బంధువులు సనత్‌నగర్ సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల తీరుపై మండిపడ్డారు. కడుపునొప్పితో వెళ్లిన సతీష్‌కు డాక్టర్లు రెండు ఆపరేషన్‌లు చేశారని... సమస్య తీరకపోగా ...58 కిలోల ఉండే సతీష్‌ 30 కిలోలకు తగ్గిపోయాడని సతీష్‌ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మేమేం చేయలేమని డాక్టర్లు చెప్పడంతో సతీష్‌ను కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారని చెప్పారు. ఎం ఫార్మసీ చేసిన తన కొడుకు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా..లేవలేని స్థితికి చేరుకున్నాడని ఆమె వాపోయింది.

17:47 - May 3, 2017

హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత విస్తృతపరిచేందుకు ప్రభుత్వం వినూత్న ప్రచారం చేపట్టింది.. స్పైస్‌జెట్‌ ఎయిర్‌వేస్‌ ద్వారా రాష్ట్ర టూరిజం వివరాల్ని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ చేస్తోంది... ఈ ప్రచారాన్ని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి చందూలాల్‌ ప్రారంభించారు..పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

మహిళా పీఎస్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

విశాఖ : అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య తనపై కేసు పెట్టిందని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

17:33 - May 3, 2017
17:26 - May 3, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లా .. మైనార్టీ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసిన అధికారులు... తుది గడువు పూర్తి కాకముందే పోస్టుల భర్తీ అంటూ బోర్ట్ పెట్టడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మైనార్టీ వెల్ఫేర్‌ కార్యాలయం ముందు నిరుద్యోగులు ఆందోళన చేశారు. పేపర్ ప్రకటన చూసి వచ్చిన అభ్యర్థులను...అధికారులు మోసం చేశారని.. పోస్టులు ఎలా భర్తీ చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు.

 

17:24 - May 3, 2017

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు. ఉపాధిహామీ పధకానికి నిధులపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పధకాలను కేంద్ర మంత్రికి వివరించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు సుజనాచౌదరికూడా నరేంద్రతోమర్‌తో భేటీ అయ్యారు. 

రోడ్డు ప్రమాదం... యాంకర్ అనసూయకు గాయాలు

అనంతపురం : సీకేపల్లి మండలం గుట్టూరు వద్ద రెండు కార్లు ఢీ యాంకర్ అనసూయకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి 
తరలించారు. 

17:22 - May 3, 2017

కృష్ణా : విజయవాడ పటమట అయ్యప్పనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఇద్దరు చిన్నారులను బలితీసుకుంది. తల్లిదండ్రులు కూలీకి వెళ్లిన సమయంలో పూరిళ్లుకు మంటలు అంటుకోవడంతో... రాజేష్‌, లోకేష్‌ అనే ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీసులుభావిస్తున్నారు.

 

17:05 - May 3, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా దర్శకులు కె.విశ్వనాథ్‌ దాదాసాహేబ్‌ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విశ్వనాథ్‌.. ఈ అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. నాకు ఈ అవార్డు రావడానికి ఎంతో మంది సహకారం ఉందన్నారు విశ్వనాథ్‌.

 

17:03 - May 3, 2017

హైదరాబాద్: మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'శతమానం భవతి' దర్శకుడు సతీష్‌ వేగేశ్న అన్నారు. ఒకప్పుడు సినిమాకు అవార్డు వస్తే.. కమర్షియల్‌గా హిట్‌ అయ్యేది కాదని.. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిందన్నారు. గత కొంత కాలంగా కొన్ని సినిమాలకు అవార్డులు రావడమే కాకుండా.. కమర్షియల్‌గా కూడా హిట్‌ అవుతున్నాయన్నారు. ఆ కోవకు చెందిందే శతమానం భవతి అన్నారు. 64వ జాతీయ చలన చిత్ర అవార్డులలో 'శతమానం భవతి' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. 

16:53 - May 3, 2017

హైదరాబాద్‌ : క్షణికావేశంలోనే తన భర్త ప్రదీప్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పావనీ రెడ్డి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రదీప్‌ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. క్షణికావేశంలోనే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప, మరొకటి కాదని పేర్కొంది. గత రాత్రి తనకు, ప్రదీప్‌కు మధ్య జరిగింది చిన్న గొడవే అని, అయితే ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమ మధ్య లేవని పావనీరెడ్డి స్పష్టం చేసింది. శ్రావణ్‌ తన అన్నయ్య అని, గతరాత్రి అతడి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నామని అంతకుమించి ఏమీలేదని తెలిపింది.

ఇద్దరు చిన్నారుల సజీవదహనం

కృష్ణా : విజయవాడ పటమట అయ్యప్పనగర్ పూరింట్లో అగ్నిప్రమాదం జరిగింది. రాజేష్, లోకేష్ అనే ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. తల్లిదండ్రులు కూలీకి వెళ్లడంతో చిన్నారులు ఇంట్లో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

టెన్త్ ఫలితాలు.. జగిత్యాల ఫస్ట్.. వనపర్తి లాస్ట్

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 84.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5, 33, 701 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2 వేల స్కూళ్లల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చింది. 28 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. 97.35 శాతంతో జగిత్యాల జిల్లాకు మొదటిస్థానం, 64.81 శాతంతో వనపర్తి జిల్లాకు చివరి స్థానం వచ్చాయి. 

పదో తరగతి ఫలితాలు... 2 వేల స్కూళ్లల్లో 100శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 84.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5, 33, 701 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2 వేల స్కూళ్లల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చింది. 28 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. 97.35 శాతంతో జగిత్యాల జిల్లాకు మొదటిస్థానం, 64.81 శాతంతో వనపర్తి జిల్లాకు చివరి స్థానం వచ్చాయి. 

పదో తరగతి ఫలితాలు..84.15 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 84.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5, 33, 701 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2 వేల స్కూళ్లల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చింది. 28 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. 97.35 శాతంతో జగిత్యాల జిల్లాకు మొదటిస్థానం, 64.81 శాతంతో వనపర్తి జిల్లాకు చివరి స్థానం వచ్చాయి. 

16:23 - May 3, 2017
16:16 - May 3, 2017

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2017 మార్చి 14 -30 ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,033,701 మంది హాజరయ్యారని తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించినట్లు పేర్కొన్నారు. 2500 పాఠశాలలు 100 శాతం రిజల్టు రాగా, 28 ప్రైవేటు పాఠశాలు, జీరో రిజల్టు వచ్చినట్లు తెలిపారు. బిసి వెల్ఫేర్ రెసి డెన్షియల్ పాఠశాలలు 94.63 శాతం ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా 97.35 శాతంతో మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో 93.7% కరీంనగర్ ,వనపర్తి జిల్లా తక్కువ ఫలితాలను సాధించిందని తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం1.4 శాతం తగ్గినట్లు తెలిపారు. 5జూన్ నుండి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 మే నుండి పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు.

పదో తరగతి ఫలితాలు.. బాలికలదే పైచేయి

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. బాలికలు పై చేయి సాధించారు. 5, 33, 701 మంది పరీక్షలకు హాజరయ్యారు. 28 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు.  

 

ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

హైదరాబాద్ : సచివాలయంలో ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అందజేశారు. ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూ.కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. 

 

కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. 

 

తిరుమల కాలినడక మార్గంలో భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల : కాలినడక మార్గం 121వ మెట్టు వద్ద ఇద్దరు తమిళనాడు భక్తుల మధ్య ఘర్షణ నెలకొంది. కత్తులతో ఒకరినొకరు దాడికి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. 

 

మే 2 నుంచి 31 వరకు మిర్చి కొనుగోళ్లు : రాధామోహన్ సింగ్

ఢిల్లీ : మే 2 నుంచి ఈనెల 31 వరకు కొనుగోళ్లు చేసుకొవచ్చని రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. క్వింటాలుకు రూ.5 వేల మద్దతు ధర, అదనపు ఖర్చుల కోసం రూ.1250 ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50..50 శాతం నష్టం భరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. 

మిర్చి రైతుల సమస్యలను రాధామోహన్ సింగ్ కు వివరించాం : వెంకయ్యనాయుడు

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల సమస్యలను రాధామోహన్ సింగ్ కు వివరించామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా మిర్చి కొనాలని కేంద్రం నిర్ణయించిటన్లు చెప్పారు. 

 

15:32 - May 3, 2017

ఒంగోలు : ప్రకాశం జిల్లా టీడీపీకి కంచుకోట. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు హయం వరకు పార్టీకి అండగా ఉంటూ వస్తున్న జిల్లా. అటువంటి జిల్లా టీడీపీ నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బలప్రదర్శనకు దిగిన రవి, బలరాం వర్గాలు ....

జిల్లాలోని చీరాల, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ రెండు చోట్ల పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధినాయకత్వం చర్యలు చేపట్టినా అనుకున్నంత ఫలితాలు రావడంలేదు. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ నియోజవర్గ సమన్వయ కమిటీ భేటీకి హాజరైన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత... నేతల మధ్య నెలకొన్న విభేదాలను చూసి విస్తపోయారు. అద్దంకి అసెంబ్లీ నియోజకర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, ఎమ్మెల్సీ కలణం బలరాం వర్గాల బలప్రదర్శ, ఆధిపత్యపోరును చూసి నివ్వెర పోయారు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే ఇరువర్గాలు బలప్రదర్శనకు దిగాయి. సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న గొట్టిపాటి రవి..ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాన్ని కలుపుకుపోవడంలేదన్న వాదనలు ఉన్నాయి.

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య వర్గ విభేదాలు....

ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాల నియోజకవర్గ పరిస్థితి కూడా అద్దంకి తీసిపోదు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పోతుల సునీతను తప్పించి, పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఆధిపత్యపోరు పెరిగిపోవడంతో గొడవలు బాబు వరకు చేరాయి. తదనంతర పరిణామాల్లో పోతుల సునీతకు ఎమ్మెల్యే పదవి దక్కింది. దీంతో ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ పోతుల సునీతల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ సమస్వయ కమిటీ సమావేశానికి మంది, మార్భలంతో వచ్చిన సునీత, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరికి సర్దిచెప్పలేక మంత్రి పరిటాల సునీత సతమతమయ్యారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు టీడీపీకి నష్టం కలించేలా ఉండటంతో పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని మంత్రి పరిటాల సునీతి నిర్ణయించారు. 

గంజాయితో పట్టుబడ్డ 8 మంది విద్యార్థులు

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ లో 8 మంది విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

కేసీఆర్ ది దళారుల ప్రభుత్వం : వీహెచ్

హైదరాబాద్ : 'కేసీఆర్ ది రైతు ప్రభుత్వం కాదు..దళారుల ప్రభుత్వం' అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు  తీవ్రంగా విమర్శించారు. మంత్రి తుమ్మల రైతులను గూండాలు అనడం బాధాకరమని పేర్కొన్నారు. రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమన్నారు. దిగ్విజయ్ దిష్టిబొమ్మలను తగలబెట్టడం కాదు... దమ్ముంటే దిగ్విజయ్ ఛాలెంజ్ ను స్వీకరించాలని సవాల్ విసిరారు. సర్కార్ కు చేతనైతే విచారణ జరిపించాలన్నారు.

ఖమ్మం జైలులో ఉన్న రైతులకు టీడీపీ నేతల పరామర్శ

ఖమ్మం : జైలులో ఉన్న రైతులను టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, నామా వెంకటేశ్వర్లు, సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. రైతులతో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. 

 

పశువైద్యశాలలో విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి తలసాని

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పశు వైద్యశాలలో విద్యార్థుల ఆందోళనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. విద్యార్థులను మంత్రి చర్చలకు ఆహ్వానించారు. కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో విద్యార్థులతో విద్యార్థులతో చర్చలు జరుపనున్నారు. 

గంజాయితో పట్టుబడ్డ 8మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయితో 8 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

14:41 - May 3, 2017

ఢిల్లీ:ఏపీ, తెలంగాణలో మిర్చి రైతుల నుంచి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈనెల 31 వరకు మిర్చిని కొనుగోలు చేయనుంది. ఇక మిర్చికి 5వేల రూపాయలను మద్దతు ధరగా నిర్ణయించింది. అదనపు ఖర్చుల కోసం రైతులకు క్వింటాకు మరో 1250 రూపాయలను చెల్లించనుంది. కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌ తెలిపారు. మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తే మద్దతు ధర చెల్లించబోమన్నారు.  

14:39 - May 3, 2017

ఖమ్మం :జిల్లాలో టీ టీడీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మిర్చి రైతులను పరామర్శించేందుకు టీ టీడీపీ నేతలు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేలకొండపల్లికి టీటీడీపీ నేతలు రేవంత్‌, ఎల్‌.రమణ, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య రాగానే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీడీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోటాపోటీ నిరసనలతో నేలకొండపల్లి దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం టీడీపీ నేతలు ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరపున ఆర్దికసాయం అందజేశారు. అనంతరం ఖమ్మం మిర్చియార్డును సందర్శించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మిర్చి రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. తక్షణమే వాటిని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

14:38 - May 3, 2017

సూర్యాపేట : జిల్లాలో విషాదం నెలకొంది. పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలో మానస అనే టెన్త్‌ క్లాస్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. మానస మృతితో సింగిరెడ్డిపాలెంలో విషాదం నెలకొంది. 

14:36 - May 3, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద.. సీపీఎం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. హుస్సేన్‌సాగర్‌ నాలాలోకి రసాయన కాలుష్యాన్ని వదులుతున్న పైప్‌లైన్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. కూకట్‌పల్లి నాలా నుండి వస్తున్న వ్యర్థాలను నిరోధించాలని మహిళలు కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఇంటర్ వెన్షన్ స్కీం ద్వారా మిర్చి కొనుగోలు: కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల సమస్యలను కేంద్ర మంత్రి రాధామోహన్ సింగు కు వివరించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం ద్వారా మిర్చి కొనాలని కేంద్రం నిర్ణయించింది. మే 2 నుండి మే 31 వరకు కొనుగోళ్లు జరుపుతామన్నారు. క్వింటాలుకు రూ.5 వేల మద్ధతు ధరతో పాటు, అదనపు ఖర్చుల కోసం రూ. 1250 ఇవ్వనున్నట్లు రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50--50 శాతం నష్టం భరించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

13:48 - May 3, 2017

ఖమ్మం : జిల్లాలో టీ టీడీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మిర్చి రైతులను పరమార్శించేందుకు టీ టీడీపీ నేతలు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేలకొండపల్లికి టీటీడీపీ నేతలు రేవంత్‌, ఎల్‌.రమణ, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలు రాగానే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో నేలకొండపల్లి దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం టీడీపీ నేతలు రైతులను పరామర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మిర్చి రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. తక్షణమే వాటిని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తామని తెలిపారు.

13:43 - May 3, 2017

జగిత్యాల : మద్దతు ధర కల్పించండి మహాప్రభో...మమ్మల్ని ఆదుకోండి..అంటూ రైతులు నినాదాలు పాలకుల చెవికి ఎక్కడం లేదు. గత కొన్ని రోజులుగా మద్దతు ధర కోసం ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మద్దతు ధర రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఎద్దండి గ్రామంలో బొయాన గంగారం అనే రైతు పసుపు పంటను పండించాడు. బుధవారం పసుపును విక్రయించడానికి మార్కెట్ కు వచ్చాడు. కానీ మద్దతు ధర రాలేదు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గంగారం తాను తెచ్చిన పసుపు బస్తాలపైనే కుప్పకూలిపోయాడు. గంగారం మృతి చెందాడని తెలుసుకున్న తోటి రైతులు చలించిపోయారు. ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రైతుల బ్రతుకు చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వం స్పందించి మద్దతు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా నిజామాబాద్, జగిత్యాలలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

పతంజలి పరిశోధన సంస్థ ప్రారంభం..

హరిద్వార్ : పతంజలి పరిశోధన సంస్థను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు. యోగ్ పీఠ్ లో ఈ పరిశోధన సంస్థ శిలాఫలకాన్ని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

13:22 - May 3, 2017

హైదరాబాద్ : బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మంగళవారం రాత్రి వరకు బావమరిదితో చాట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పుప్పాలగూడ ఆల్కాపురం కాలనీ గ్రీన్ హోం అపార్ట్ మెంట్ లో ప్రదీప్ నివాసం ఉంటున్నాడు. ఉదయం 9గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ప్రదీప్ సప్తమాత్రిక సీరియల్ లో హీరోగా నటించారు. ఆయన భార్య కూడా బుల్లితెర నటిగా కొనసాగుతున్నారు.

మేథా టవర్స్ కు మరిన్ని సంస్థలు - లోకేష్..

విజయవాడ : ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలిపారు. రెండేళ్లలో మేథా టవర్స్ కు మరిన్ని సంస్థలు రానున్నాయని, ఇప్పటికే కొన్ని కంపెనీలతో మాట్లాడినట్లు తెలిపారు. సైబర్ టవర్ కారణంగానే హైదరాబాద్ లో సైబరాబాద్ అభివృద్ధి చెందిందని, ఏపీలోనూ అదే తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.

12:56 - May 3, 2017

హైదరాబాద్ : ఇటివలి నిర్వహించిన ఒక సర్వేలో వరకట్నపు వేధింపులతో రోజుకు 20 మరణిస్తున్నారని తెల్చింది. దీంట్లో అగ్ర స్థానంలో నిలిచింది ఢిల్లీ ....ఎందుకు ఈ వరకట్న వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి...వరకట్నపు వేధింపులకు సంబంధించి ఏ చట్టలు ఉన్నాయి...మహిళలు ఏవిధంగా ఆశ్రయించాలో తెలపాడానికి అడ్వకేట్ పార్వతి గారి న్యాయ సలహాలు, సూచనలు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

12:42 - May 3, 2017

గుంటూరు : వరుస విజయాలతో దేశవ్యాప్తంగా కమలం పార్టీ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో బీజేపీ ఉత్సాహం రెట్టింపు అయింది. ఇదే ఊపులో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ఊవిళ్లూరుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తమ బలం పెంచుకోవాలని కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టును పెంచుకోవడానికి ఉత్తరాంధ్రపై ఆ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఉత్తరాంధ్రలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉండడమే కాకుండా ఆ పార్టీకి ఓ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారు. దీంతో ఉత్తరాంధ్రలో ఇంకా బలపడాలని కమలనాధులు భావిస్తున్నారు. దీని ద్వారా రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపుతో పాటు మరికొన్ని ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పదాధికారుల సమావేశం
దీనిలో భాగంగానే గత నెలలో ఆంధ్రప్రదేశ్ పదాధికారుల సమావేశం నిర్వహించింది. రానున్న రోజుల్లో రెండు రోజుల పాటు విశాఖలో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రధానంగా రాష్ర్టంలో బలపడటంతో పాటుగా బూత్ లెవల్ లో కూడా బలపడాలనేదీ బీజేపీ అలోచన. ఈ అగస్ట్ లో బూత్ లెవల్ బాధ్యులతో విజయవాడలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ ప్రారంభించనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా..బీజేపీ బలపడాలంటే ఆ పార్టీ మిత్రపక్షమైన టీడీపీ బలహీనపడాలి. మరోవైపు బీజేపీ విస్తరణతో టీడీపీకి భయం పట్టుకుంది. పొత్తులో భాగంగా రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుందోనని ఆలోచిస్తున్నారు. బీజేపీ రోజురోజుకు రాష్ట్రంలో బలం పెంచుకోవడంతో అసంతృప్తులను కాపాడుకునే పనిలో టీడీపీ అధిష్టానం నిమగ్నమైనట్లు సమాచారం.

జూమ్ డెవలపర్స్ యజమాని అరెస్టు..

ఢిల్లీ : బ్యాంకును మోసగించిన కేసులో 'జూమ్ డెవలపర్స్' యజమాని విజయ్ చౌదరిని ఈడీ అరెస్టు చేసింది. బ్యాంకును రూ. 2650 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.

సంగారెడ్డిలో మంత్రి హరీష్..

సంగారెడ్డి : మంత్రి హరీష్ రావు జిల్లాలో పర్యటిస్తున్నారు. అందోల్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సింగూరు ప్రాజె క్టు కింద 20 ఏళ్ల తరువాత తొలిసారిగా యాసంగి పంటను రైతులు పండించారు.

12:32 - May 3, 2017

హైదరాబాద్ : బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారు. పుప్పాలగూడ ఆల్కాపురం కాలనీ గ్రీన్ హోం అపార్ట్ మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రదీప్ సప్తమాత్రిక సీరియల్ లో హీరోగా నటించారు. కుటుంబ కలహలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు జరిగిన బావమరిది పుట్టిన రోజు వేడుకలో గొడవ జరడగంతో బెడ్ రూంలోకి వెళ్లి ప్రదీప్ ఉరి వేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  

12:20 - May 3, 2017

ఖమ్మం : మిర్చి రైతులను పరామర్శించేందుకు టీ.టీడీపీ నేతలు నేలకొండపల్లికి చేరుకున్నారు. టీటీడీపీ నేతల పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. వీరికి పోటీగా టీ.టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రాజేశ్వరపురంలో రేవంత్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మంలో సెక్షన్ 144 అమలులో ఉండడంతో నేతలను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. కేసులో ఇరుకున్న రైతులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టీడీపీ నేతలు రూ. 10 వేలు ఇవ్వనున్నారు.

12:16 - May 3, 2017
12:15 - May 3, 2017

టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' రూపొందనుందని సోషల్ మాధ్యమాల్లో తెగవార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే చిత్ర షూటింగ్ ఉండనున్నట్లు ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు 'అభిషేక్ బచ్చన్' సతీమణి 'ఐశ్వర్య రాయ్' నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ మరోసారి కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలతో మెగా టీం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో 99 పాయింట్లు ఆర్జించి మళ్లీ 30వేల బెంచ్ మార్క్ ను సెన్సెక్స్ దాటింది. సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 29,952 వద్ద, నిప్టీ 9,328 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

టీవీ నటుడు ప్రదీప్ సూసైడ్..

హైదరాబాద్ : టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రీన్ హోమ్స్ అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. సప్తపది, ఆరుగురు పతివ్రతల సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనటించారు.

నేలకొండపల్లిలో ఉద్రిక్తత..

ఖమ్మం : నేలకొండపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టి.టిడిపి నేతల పర్యటనకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. టిడిపి..టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు.

మేధా టవర్స్ ఏడు ఐటీ కంపెనీలు..

కృష్ణా : మేధా టవర్స్ లో ఏడు ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 1650 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్రారంభించిన వాటిలో అమెరికా, స్పెయిన్, జర్మనీ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలున్నాయి.

ఐటీ కమిషనర్ అరెస్టు..

ముంబై : ఐటీ కమిషనర్ రాజేంద్రప్రసాద్ ను సీబీఐ అరెస్టు చేసింది. అవినీతి కేసులో ఆయనతో పాటు ఆరుగురిని అరెస్టు చేశారు. సోదాల్లో రూ. 1.5 కోట్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

11:38 - May 3, 2017
11:36 - May 3, 2017

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సమాయత్తమైంది. సార్క్‌ దేశాలన్నీ ఉపయోగించునేందుకు వీలుగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటూ.. ప్రధాని నరేంద్రమోదీ 2014 జూన్‌ 30న తనను కలిసిన శాస్త్రవేత్తలకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు, ఇస్రో శాస్త్రవేత్తలు సమాచారవ్యవస్థకు ఉపకరించే ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ శాటిలైట్‌ను, జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-9 వాహక నౌక ద్వారా, ఈనెల ఐదున సాయంత్రం ప్రయోగించనున్నారు.

నింగిలోకి జీ శాట్‌
ప్రస్తుతం నింగిలోకి పంపనున్న జీ శాట్‌ ఉపగ్రహాన్ని 2,230 కిలోల బరువుతో రూపొందించారు. ఈ ప్రయోగానికి భారత ప్రభుత్వం 235 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జీశాట్‌ ప్రయోగం ద్వారా భార‌త్‌తో పాటు నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో.... స‌మాచార వ్యవస్థ కొత్తపుంతలు తొక్కనుంది. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండ‌ర్లు ఉంటాయి. టెలీక‌మ్యునికేష‌న్, డీటీహెచ్‌, వీశాట్స్‌, టెలీ ఎడ్యుకేషన్‌, టెలీమెడిసిన్‌, విప‌త్తుల స‌మ‌యాల్లో నిర్వహణ సాయం వంటి సేవ‌లను ఈ ఉపగ్రహం ద్వారా పొందవచ్చు. అలాగే ద‌క్షిణాసియాలో భూకంపాలు, తుపాన్లు, వ‌ర‌ద‌లు, సునామీల వంటి ప్రమాదాలను ముందుగా తెలుసుకునే వీలుంటుంద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సార్క్‌ దేశాలకు మేలు
సార్క్‌ దేశాలకు మేలు కలిగేలా భారతదేశం ప్రయోగిస్తోన్న జీశాట్‌ ఉపగ్రహంపై పాక్ మినహా అన్ని దేశాలూ హర్షం వ్యక్తం చేశాయి. తమ దేశ సున్నితమైన సమాచారం భారత్‌కు తెలిసిపోతుందని పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. ఈ ఉపగ్రహానికి గతంలో పెట్టిన సార్క్ శాటిలైట్ పేరును దక్షిణాసియా ఉపగ్రహంగా మార్చారు. రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సెంటర్ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక సమావేశాన్ని బుధవారం నాడు నిర్వహించనున్నారు. ఆ తరువాత లాంచ్ ఆథరైజేషన్ బోర్డు మీటింగ్ కూడా జరగనుంది. ఇవన్నీ పూర్తైన వెంటనే ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. తరువాత కౌంట్ డౌన్ మొదలై ఐదో తేదీన రాకెట్ కక్ష్యలోకి వెళ్తుంది. ఈ ప్రయోగంపై సార్క్ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

 

11:32 - May 3, 2017

గుంటూరు : వ్యయం తక్కువ... పర్యావరణ హితం కావడంతో ఏపీ ప్రభుత్వం జలరవాణాకు ప్రాధాన్యాన్ని ఇస్తోంది. ఈ మేరకు రాజధాని నుంచి... ఇతర తీర ప్రాంతాలకు జలమార్గం ద్వారా సరుకుల రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి పరిధిలో ఛానల్‌ తవ్వేందుకు ఇప్పటికే లైన్‌ క్లియర్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను వంద కోట్ల అంచనాతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించారు..15 నెలల్లోగా ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.

62.50 కిలోమీటర్ల మేర జలరవాణా ఛానల్‌ తవ్వకం
అలాగే రెండు దశల్లో 62.50 కిలోమీటర్ల మేర జలరవాణా ఛానల్‌ తవ్వడానికి రెండు సంస్థలకు కాంట్రాక్ట్‌ ఇచ్చారు. రూ.42.39 కోట్లకు అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. హరిచంద్రపురం నుంచి చామర్రు వరకు 14.96 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి ... చానల్ ఏర్పాటు చేసే పనిని విజయవాడలోని కోస్టల్ కాన్సాలిడేటెడ్ స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. అలాగే చామర్రు నుంచి ముక్త్యాల వరకు 14.47 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను నదిలో డ్రెడ్జింగ్‌ చేసేందుకు ఇంటర్నేషనల్‌ మెరైన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. సీఎం చంద్రబాబు నాయుడు తేదీలు ఖరారు చేసిన అనంతరం ఈ పనులు ప్రారంభంకానున్నాయి. కాగా జల రవాణా ఆలోచన చాలా మంచిదని ... దీనిని త్వరలో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటే మంచిదని వామపక్ష నేతలు అంటున్నారు. మరోవైపు నదిలో బోటింగ్ ఛానల్‌తో పాటు మరో రూ.60 కోట్లతో మూడు టెర్మినల్స్, నాలుగు ఫ్లోటింగ్ జట్టీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సుమారు పది ఎకరాల స్థలంలో సరుకు పెట్టుకునేందుకు వీలుగా ఈ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు.  

11:26 - May 3, 2017

డెహ్రడూన్ :ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కేదార్‌నాథ్‌ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ గుడి తలుపులను స్వయంగా తెరిచారు. దాదాపు ఆరు నెలల తర్వాత భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకున్న ఈ ఆలయంలో ప్రధాని మోదీ తొలిపూజ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రధానిని సత్కరించారు. ఆలయ నమూనా ప్రతిమను బహుమతిగా అందజేశారు. అనంతరం ప్రధాని ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు అభివాదం చేశారు. పలువురు చిన్నారులను పలకరించారు. అంతకుముందు ప్రధాని డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేక విమానంలో కేదరినాథ్‌కు వెళ్లారు. ఉత్తరాఖండ్‌ సీఎం టీఎస్‌ రావత్‌, గవర్నర్‌ కేకే పౌల్‌లు మోదీకి పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు.

11:21 - May 3, 2017

శ్రియ..టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఇన్నింగ్స్ ఆమెకు బాగానే కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 'గోపాల గోపాల'...’గౌతమి పుత్ర శాతకర్ణి' అవకాశాలు రావడం ఈ చిత్రాలు మంచి పేరు తెచ్చుకోవడంతో ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. 'బాలకృష్ణ' తాజా చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. తాజాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'నక్షత్రం' సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు..ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సందీప్ కిషన్..సాయి ధరమ్ తేజ్..తనీష్ లు నటిస్తున్నారు. వీరికి జోడిగా రాశీ ఖన్నా..రెజీనా..ప్రగ్వా జైస్వాల్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం 'శ్రియ' ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ రావడంతో చిత్రానికి మరింత గ్లామర్ పెరిగినట్లైంది.

11:13 - May 3, 2017

గుంటూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 11గంటకు గన్నవరం ఎయిరర్ పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేర్తారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమౌతారు. ముందుగా మధ్యాహ్నం 2గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తో భేటీ అవుతారు. ఉపాధి హామీ పథకంలో ఏపీకి రావాల్సిన నిధులపై చర్చిస్తారు. తర్వాత 3.30నిమిషాలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై పోలవరం ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై, 2014, 2015 రెవెన్యూ లోటు భర్తీపై చర్చించనున్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్రంలోని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి పై ఆ శాఖ మంత్రితో సమవేశం కానున్నారు. సాయంత్రం 5.30 నిమిషాలకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో భేటీ అవుతారు. డిజీటలైజేషన్ చైర్మన్ గా ఉన్న చంద్రబాబు నగదు రహిత లావాదేవీలపై ఆయనతో చర్చించనున్నారు. అనంతరం అర్థరాత్రి అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికాలో చంద్రబాబు 8 రోజులు పర్యటిస్తారనే సంగతి తెలిసిందే.  సీఎంతో పాటు ఆర్థిక మంత్రి యనమల,  ప్రభుత్వ సలహాదారు పరకాల, పలువురు ఐఏఎస్ లు ఉన్నారు. 

చిరంజీవి అనుమానాస్పద మృతి..

మేడ్చల్ : ఘట్ కేసర్ పోలీసుల అదుపులో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి కర్ణాటకలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. దొంగతనం కేసులో చిరంజీవిని పోలీసులు అరెస్టు చేశారు. సొత్తు రికవరీ కోసం నిందితుడిని కర్నాటకకు తీసుకెళ్లారు. పోలీసుల నుండి తప్పించుకొనే యత్నంలో హోటల్ బిల్డింగ్ పై నుండి కింద పడి మృతి చెందాడు.

11:06 - May 3, 2017

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తోన్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించాయి. గత ఐదేళ్లుగా డిగ్రీ ఫీజులు పెరగక, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫీజులు పెంచే వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లలో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు తమ కళాశాల్లలో పరీక్షలు జరగనివ్వమని స్పష్టం చేశాయి. ఫీజులు 40 నుంచి 50 శాతం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ తో భేటీ కానున్నారు.

 

 

11:05 - May 3, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తదుపరి చిత్రంపై పూర్తి ఇంట్రస్ట్ పెట్టాడు. ‘బాహుబలి'..'బాహుబలి-2’ చిత్రం కోసం 'ప్రభాస్' ఇతర చిత్రాలకు సైన్ చేయలేదనే సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ పూర్తయిన తరువాత సుజీత్ చిత్రానికి 'ప్రభాస్' పచ్చజెండా ఊపారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలైంది. దీనికి భారీగా రెస్పాన్స్ వస్తోంది. కానీ సినిమాకు సంబంధిన విషయాలు మాత్రం వెల్లడికావడం లేదు. ప్రభాస్ చిత్రంలో నటించేది ఎవరు ? హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర పాత్రలు ఎవరు పోషించనున్నారనేది తెలియరావడం లేదు. తాజాగా ఈ సినిమాలో 'ప్రభాస్'కు జోడిగా 'తమన్నా' నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో 'రెబల్' .. 'బాహుబలి' సినిమాల్లో వీరిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. 'బాహుబలి 2' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి ప్రభాస్ అమెరికా వెళ్లనున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నాడని తెలుస్తోంది.

10:49 - May 3, 2017

చిత్తూరు : టీటీడీ నూతన అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్నకు సందిగ్ధత వీడటం లేదు. టిటిడి పాల‌క‌మండ‌లి చైర్మన్‌ పదవీకాలం గ‌త నెల 26తో ముగియడంతో.. కొత్త చైర్మన్‌ ఎంపిక అనివార్యమైంది. ఈ ప‌ద‌వి కోసం చాలామంది పార్టీ సీనియ‌ర్లు పోటీప‌డుతుండ‌టంతో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టీటీడీ పాలకమండలి చైర్మన్‌ రేసులో ఎంపిలు రాయ‌పాటి, మురళీమోహ‌న్,జెసి దివాక‌ర్ రెడ్డి ఉన్నారు. అటు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు,జ్యోతుల నెహ్రు,బిజెపి నుంచి న‌ర్సాపురం ఎంపి గోక‌రాజు గంగ‌రాజు ఆశావహుల జాబితాలో ఉన్నారు. మరోవైపు కేంద్రం నుంచి కూడా బడా పారిశ్రామిక‌వేత్తల పేర్లతో సిఫార్సులు వ‌స్తున్నాయి. దీంతో టీటీడీ చైర్మన్‌ ఎంపిక సీఎం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాంగ్రెస్‌లో తనకు అన్యాయం జ‌రిగింద‌ని..టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తానన్న హామీ మీదనే తాను టీడీపీలో చేరినట్టు చెబుతున్నారు. ఇక జెసి దివాకర్ రెడ్డి తను ఏ పదవి ఆశించలేదని..టీటీడీ బోర్డు చైర్మన్‌ ప‌ద‌వి ఇవ్వడం వ‌ల్ల రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని మ‌రింత చేరువయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారట. గాలిముద్దుకృష్ణమనాయుడు కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ, సినీ ప్రముఖుడు మురళీమోహన్‌ కూడా ఈ పదవి కోసం తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం.

బిజేపీ నుంచి ఎంపి గోకరాజు గంగ‌రాజు...ఇక మిత్రప‌క్షం బిజేపీ నుంచి ఎంపి గోకరాజు గంగ‌రాజు...టీటీడీ చైర్మెన్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఈసారి బిజేపీకి అవ‌కాశం క‌లిపించాల‌ని కోరుతున్నారు. దేవ‌స్థానం కార్యవ‌ర్గంలో త‌మ వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని ఉత్తరాధి ప్రముఖ‌ నేత‌లు..బ‌డా పారిశ్రామిక వేత్తలు పైరవీలు చేస్తున్నట్లు స‌మాచారం. నార్త్‌కు చెందిన అనిల్ కుమార్ సింగ్వాల్‌ను...టీటీడీ ఈవోగా నియ‌మించ‌డం వెనక ఉత్తరాది నేతల ఒత్తిడి ఫ‌లిత‌మేన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివరకు సీఎం చంద్రబాబు ఎవరి వైపు మొగ్గుచూపుతారన్నది..ఆయన విదేశీ పర్యటన పూర్తయ్యాకే క్లారిటీ రానుంది. 

10:47 - May 3, 2017

సబ్ కలెక్టర్ ను ఓ ఎమ్మెల్యే వివాహమాడనున్నారు. ఈ విషయాన్ని కేరళలోని అరువిక్కర నియోజకవర్గ ఎమ్మెల్యేగా శబరినాథన్ స్వయంగా సోషల్ మాధ్యమం ద్వారా వెల్లడించారు. తిరువంతపురం సబ్ కలెక్టర్ దివ్యనాయర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను విడుదల చేశారు. కేరళ మాజీ స్పీకర్ కుమారుడు శబరినాథన్. తండ్రి మరణానంతరం ఇతను రాజకీయాల్లోకి వచ్చాడు. తిరువనంతపురంలోని అరువిక్కర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే 2015లో పోటీ చేసి గెలుపొందారు. తిరువనంతపురంలో మొదటిసారి తాను దివ్యను కలవడం జరిగిందని, తమ ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉన్నట్లు తెలిసిందని శబరినాథన్ పేర్కొన్నారు. ఓ సందర్భంలో తన మనసులోని మాటను దివ్యతో చెప్పానని, తమ పెళ్లికి రెండు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే సబ్ కలెక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

10:46 - May 3, 2017

 గుంటూరు : ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ నెలవు కానుంది. ఈ మేరకు పలు కంపెనీలు ఏపీలో స్థాపించనున్నారు. అంతర్జాతీయ కార్ల కంపెనీ కియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 11 వేల కోట్ల పెట్టుబడితో...అనంతపురంలో దీనిని స్థాపించనున్నారు. దీని ద్వారా 25 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రానున్నాయి. అలాగే బుధవారం ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ సహకారంతో మరో ఏడు ఐటీ కంపెనీలు ప్రారంభంకానున్నాయి. ఉదయం పది గంటలకు మంత్రి నారా లోకేష్‌ వీటిని ప్రారంభించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో మేధా టవర్స్‌లో ఈ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 1,650 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏడు ఐటీ కంపెనీలు మేథా టవర్స్‌లో 42 వేల 681 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఈ కంపెనీలు స్పెయిన్‌, అమెరికా, జర్మనీ దేశాలకు చెందినవి. ఈ మేరకు తయారీ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు నిరుద్యోగులకు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కోసం కూడా నారా లోకేష్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

10:43 - May 3, 2017

రాజన్న సిరిసిల్లా : జిల్లా కేంద్రములోని సుందరయ్య నగర్‌లో.. పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. వేములవాడ డిఎస్‌పి, సిరిసిల్ల ఇంచార్జ్‌ డిఎస్‌పి చంద్రశేఖర్‌.. నలుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, సుమారు నూట ఇరవై మంది కానిస్టేబుల్స్‌ ఈ కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య నగర్‌లోని ప్రతీ ఇంటిని సోదా చేశారు. అనుమానితులున్నారని, గుడుంబా తదితర అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించామని.. ఇంచార్జ్‌ డిఎస్‌పి చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు 12 లీటర్ల సార దొరికిందని ఆయన అన్నారు. అంతే కాకుండా పత్రాలు సరిగా లేని వాహనాలను పట్టుకున్నామని, మొదటిసారి కాబట్టి హెచ్చరించి వారిని వదిలేశామని తెలిపారు. 

నిలిచిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిలిచిపోయాయి. తమ కాలేజీ సెంటర్లలో పరీక్షలను ప్రైవేటు డిగ్రీ కాలేజీ మేనేజ్ మెంట్స్ బహిష్కరించింది.

ఈసెట్ పాస్ వర్డ్ విడుదల..

విజయవాడ : ఈసెట్ పాస్ వర్డ్ ను మంత్రి గంటా కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈసెట్ కు 34,993 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈసెట్ కు రాష్ట్రంలో 133, హైదరాబాద్ లో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరగనుంది.

మరోసారి కాల్పుల ఒప్పంద ఉల్లంఘన..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ జిల్లాలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

యువకుడిపై యువతి బంధువుల దాడి..

కర్నూలు : ఆలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడానే నెపంతో యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

10:27 - May 3, 2017

గుంటూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. 11గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరుతారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అనంతరం అర్థరాత్రి బాబు అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికాలో చంద్రబాబు 8 రోజులు పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల, పలువురు ఐఏఎస్ లు ఉన్నారు. 

నేడు ఏపీఈసెట్ -2017

విజయవాడ : నేడు ఏపీఈసెట్ -2017 పరీక్ష జరగనుంది. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 34,933 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

నేడు ఖమ్మంకు టి. టిడిపి బృందం...

హైదరాబాద్ : నేడు ఖమ్మం జిల్లాకు టి.టిడిపి నేతల బృందం పర్యటించనుంది. అరెస్టయి జైలులో ఉన్న రైతుల కుటుంబాలను ఎల్.రమణ, రేవంత్, నామా నాగేశ్వరరావులు పరామర్శించనున్నారు.

నేడే టి.టెన్త్ ఫలితాలు..

హైదరాబాద్ : నేడు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను డిప్యూటి సీఎం కడియం విడుదల చేయనున్నారు.

నేడు సంగారెడ్డికి మంత్రి హరీష్..

సంగారెడ్డి : నేడు జిల్లాకు మంత్రి హరీష్ రావు రానున్నారు. సింగూరు ప్రాజెక్టు వద్ద అదనంగా సాగయిన పంట పొలాలను మంత్రి పరిశీలించనున్నారు.

సన్ రైజర్స్ పై ఢిల్లీ గెలుపు...

ఢిల్లీ : ఐపీఎల్ -10లో సన్ రైజర్స్ పై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ గెలుపొందింది. సన్ రైజర్స్ 185/3..ఢిల్లీ డేర్ డెవిల్స్ 189/4..

ఏఎస్పీ కుమారుడు మృతి..

విశాఖపట్టణం : ఆర్కే బీచ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్పీ నందకుమార్ కుమారుడు దేవగురు మృతి చెందాడు.

09:50 - May 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖను పటిష్ఠపరచడం, అర్చకులు, ఆలయసిబ్బంది జీత భత్యాల అంశాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ప్రభుత్వ సలహాదారు రమణాచారితో పాటు ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఆలయ ఉద్యోగులు, అర్చకుల వేతనాలు ఎజెండాగా క్యాబినెట్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు, అర్చకులకు రూ.8000, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారికి రూ.10,000, కాంట్రాక్టు బేసిస్ మీద పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు రూ.12000 గా వారు పనిచేసే ప్రాంతం, వర్క్ లోడ్ ఆధారంగా కనీస వేతనం నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకు గానూ ప్రభుత్వ సాయంతో ప్రస్తుతమున్న చట్టాలకు సవరణలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఫైల్ ను రెండువారాల్లో ముఖ్యమంత్రికి నివేదిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

 

09:47 - May 3, 2017

హైదరాబాద్ : తెలుగువారికి కారం లేనిదే గొంతులోకి ముద్దదిగదు. కారం కొనడానికని దుకాణానికి వెళ్తే మిర్చి ధర మంటపుట్టిస్తోంది. కిలో ఎండుమిర్చి కొనాలంటే 100 నుంచి 120 రూపాయల కావాల్సిందే. వినియోగ దారుడికి ధరతో మంటపెడుతున్న మిర్చి అన్నదాతకు ఏమైనా మేలు చేస్తోందా అంటే అదీ లేదు. రైతులను కంట తడి పెట్టిస్తోంది. క్వింటాల్‌ మిర్చికి రూ. 4వేలకు మించి ధర పలకడం లేదు. మిర్చి ధరలతో అటు అన్నదాత, ఇటు వినియోగదారుడు ఎవరూ సంతోషంగా లేరు. వినియోగ దారుడు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంటే ఆ ప్రతిఫలం రైతులకు దక్కాలి. కానీ రైతు కూడా సంతోషంగా లేడు. గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నాడు. మరి ఇంతకీ మిర్చి అమ్మకం.. కొనుగోలులో ఎవరు లాభం పొందుతున్నారు. కొద్దిరోజులుగా తమ పంటకు మద్దతు ధర లభించడం లేదంటూ మిర్చి రైతులు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో పలుచోట్ల ఆందోళన చేస్తున్నారు. క్వింటాల్‌ మిర్చికి 2500 రూపాయలకు మించి కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన అన్నదాత ఖమ్మం మార్కెట్‌ యార్డును ధ్వంసం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర మార్కెట్లలోనూ మిర్చి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్వింటాల్‌ మిర్చిని రూ.10వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయినా అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై క్వింటాల్‌కు 4500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి 2500లకు కూడా వ్యాపారులు అడుతున్నారు.

వినియోగదారులకు కిలో రూ,100.....
4500 రూపాయలకు క్వింటాల్‌ మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేస్తే కిలో మిర్చికి 45 రూపాయలు చెల్లిస్తున్నట్టు లెక్క. మరి వినియోగదారుడికి దగ్గరికి వచ్చే సరికి మిర్చి ధర రూ.100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఎండు మిర్చిని కారంగా చేసి రూ. 250 నుంచి రూ.275 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులకు రవాణా, ఇతర చార్జీలు కలిపి కిలోకు పది రూపాయలు ఖర్చు అవుతుందని అనుకుందాం. అంటే ఎంత లేదన్నా కిలో ఎండు మిర్చికి రూ. 50 నుంచి 60 రూపాయలను వ్యాపారులు లాభంగా పొందుతున్నారు. రైతు పగలనకా, రాత్రనకా కష్టపడి సాగుచేస్తే రైతుకు మిగిలేదేమో అప్పులు. వ్యాపారులు ఏకష్టం చేయకుండా కాలుమీద కాలేసుకుని దర్జాగా కూర్చొని రైతులను దోపిడీ చేస్తూ కిలో మిర్చికి 50 నుంచి 60 రూపాయలు సంపాదిస్తున్నారు. దీంతో అటు అన్నదాతలు, ఇటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గతేడాది మిరప క్వింటాకు రూ.11550...
గతేడాది మిరప క్వింటాకు రూ.11550 నుంచి రూ.13500 వరకు ధర పలికింది. దీంతో ప్రభుత్వం కూడా తెల్లబంగారం వద్దని మిర్చిని విరివిగా సాగుచేయాలని రైతులకు సూచించింది. దీంతో రైతులు మిర్చిని సాగు చేశారు. ఈ ఏడాది జనవరిలో క్వింటా మిర్చికి రూ.12,500 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి నుంచి మిర్చి మార్కెట్‌కు భారీగా తరలివస్తుండడంతో ధరను తగ్గించుకుంటూ వచ్చారు. ఏప్రిల్‌ 15 నాటికి క్వింటా ధర ఏకంగా రూ.7,500లకు పడిపోయింది. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ జెండాపాట ఒకధర అయితే... క్షేత్రస్థాయిలో ధర మరోరకంగా మారింది. జెండాపాట 5,500గా నిర్ణయిస్తే ఈ ధరకు 10శాతం మాత్రమే కొన్నారు. మిగతా 90శాతం సరకు నాణ్యత లేదంటూ రూ.2,500 అమ్మితే కొంటామంటూ తేల్చి చెప్పారు. అంటే అధికారులు, వ్యాపారులు కలిసి మిర్చి ధరను ఒక పథకం ప్రకారం తగ్గించుకుంటూ వచ్చారు. చివరికి రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పించారు. దళారులు, వ్యాపారులు మిర్చి రైతుల రక్కాన్ని జలగలా పీల్చుతున్నా ప్రభుత్వంకానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవడంలేదు. సమాజానికి అన్నంపెట్టే రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమైన వ్యాపారులు, దళారులపై ఏ చర్యలు తీసుకోవడం లేదు. కడుపుమండి మార్కెట్‌ కార్యాలయాన్ని ధ్వంసంచేస్తే.... రైతులపైనే కేసులు బనాయించింది. రైతుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్న వారికి ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఇకనైనా మిర్చి రైతులకు అండగా నిలిచి రూ.10వేలకు మిర్చిని కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.

09:38 - May 3, 2017

న్యూఢిల్లీ : 'పాఠశాలకు వెళ్ళే విద్యార్థినులకు మొబైల్‌ ఫోన్‌లు ఎందుకు? తప్పుడు వ్యక్తులను కలుసుకోవడానికి, వారు తప్పుడు మార్గంలో పయనించడానికి ఫోన్లే ప్రధాన కారణం' అంటూ అలీగఢ్‌ మేయర్‌ భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజా సమర్థించడం గమనార్హం. మొబైల్ ఫోన్లపై ఆలీఘడ్ లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి నుండి దీనిని ఖచ్చితంగా అమల్లోకి తెస్తామని, ఈ చర్యకు తాను పూర్తి మద్దతిస్తానని రాజా స్పష్టం చేశారు. పాఠశాలలో ఉన్న బాలికలకు ఫోన్లు అవసరం లేదని, నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతేగాకుండా ఎమ్మెల్యే రాజా పలు వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ ముఖాలను కవర్ చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను రహస్యంగా ఉపయోగించుకొనేందుకు ఇదొక ఐడిగా అభివర్ణించారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వ్యక్తమౌతాయో చూడాలి.

09:34 - May 3, 2017

ఖమ్మం : కాసేపట్లో టీడీపీ నేతలు ఖమ్మం వెళ్లనున్నారు. మిర్చి రైతుల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీటీడీపీ నేతలు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఏర్పూర్, కల్లూరు, ముడిగొండ వెళ్లనున్నారు. ఖమ్మం సబ్ జైలులో ఉన్న మిర్చి రైతులను వారు పరామర్శించనున్నారు. టీడీపీ నేతల పర్యటన దృష్ట్యా ఖమ్మంలో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. ఖమ్మంలో ఇప్పటికే 144 సెక్షన్ ఉండడంతో టీడీపీ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వీరి పర్యటన ప్రశాంతంగా కొనసాగుతుందా...? లేదా చూడాలి.

 

 

09:32 - May 3, 2017

ఇటీవలే పలు పెళ్లిల్లలో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదనపు కట్నం ఇవ్వాలని కోరిన ఓ వరుడికి వధువు కుటుంబం బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా తనకు వరుడితో పెళ్లి వద్దంటూ వధువు చెప్పడంతో వివాహం నిలిచిపోయింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుక్సర్ జిల్లా సుజాత్ పూర్ లో ఇటీవలే ఓ పెళ్లి జరుగుతోంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యుల బంధువులు అందరూ వచ్చారు. కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టనున్నాడు. ఒక్కసారిగా వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ తేల్చిచెప్పేసింది. దీనితో అక్కడ కలకలం రేగింది. పెళ్లి వద్దనడానికి వధువు ఓ కారణం చెప్పింది. వరుడు తాగి వచ్చాడని..తాగుబోతు వ్యక్తితో తనకు పెళ్లి వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. మద్యం సేవించి ఉన్న అతడు సరిగ్గా నిలబడలేకపోతున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. వధువు చెప్పింది కూడా కరెక్టే అని నిర్ణయించిన పెద్దలు ఆమె నిర్ణయాన్ని సమర్థించడంతో పెళ్లి వేడుక ఆగిపోయింది. జంటగా వెళ్లాల్సిన పెళ్లి కొడుకు ఒక్కడే తిరుగుముఖం పట్టాడు. మద్య నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

09:18 - May 3, 2017

విశాఖ : గత ఆదివారం సాయంత్రం ఆర్క్ బీచ్ లో ఉన్న వారిపై ఓ ప్రైవేట్ స్కూల్ దూసుకోచ్చిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఈ ప్రమాద సమయంలో ప్రముఖ ధర్మరావు  అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా గాయాపడిన ఏఎస్పీ నందకుమార్ కుమారుడు దేవగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో ఆయన భార్యతో పాటు ఇద్దరు కుమారులు గాయపడ్డారు. నందకుమార్ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఏఎస్పీగా పనిచేస్తున్నారు. పోలీసులు ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నారు. వారు సీసీ ఫుటేజ్ పరశీలిస్తున్నారు. ఆదివారం రోజు శ్రీప్రకాశ్ విద్యాసంస్థల బస్సు బయటకు రావడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి.

 

కడియంతో ఘంట భేటీ

హైదరాబాద్ : నేడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో టీఎస్ పీఎస్ స్సీ చైర్మన్ ఘంట చక్రపాణి సమావేశం కానున్నారు. ఈ భేటీలో గురుకుల పోస్టులర్హతల్లో వెసులుబాటుపై చర్చించనున్నారు.

 

08:16 - May 3, 2017

నల్గొండ : జిల్లాలోని నార్కెట్‌పల్లి మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయిన ప్రైవేటు బస్సు డివైడర్‌ను ఢీ కొని బోల్తా పడిండి. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్ పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సు భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తోంది.

08:09 - May 3, 2017

మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం స్పందిచాలని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. మిర్చిరైతుల సమాస్యలపై జరిగిన చర్చలో విశ్లేషకులు భైర దీలిప్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, టీఆర్ఎస్ నేత గొవర్ధన్ పాల్గొన్నారు. దీలిప్ మాట్లాడుతూ మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకిభవించారు. ఇందిరా మాట్లాడుతూ పత్తికి బదులు కందులు, మిర్చి పంట వేయాలని చెప్పిన ప్రభుత్వం వారి మద్దతు కల్పించడం లేదన్నారు. గోవర్ధన్ మాట్లాడుతూ మిర్చి మద్దతు ధర విషయంలో రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

07:55 - May 3, 2017

హైదరాబాద్ : 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కొలిపాక సరిత, గట్ల లావణ్య, పెండ్రూ కొండల్ రెడ్డి, కట్కూర్‌ గోపాల్‌ రెడ్డి, పెండ్రూ హన్మాన్‌ రెడ్డి అన్నారు.  సరిత మాట్లాడుతూ కాళేశ్వరం కింద తమ భూమి కోల్పోతున్నామని తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అన్నారు. గ్రామంలో 144 సెక్షన్ విధించి భయందోళనతో ఉన్నామని తెలిపారు. లావణ్య మాట్లాడుతూ ఊరు వదిలి వెళ్లాడం బాధగా ఉందన్నారు. వీరు టెన్ టివి జనపథం లో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని చిన్న గ్రామమే గోలివాడలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోలివాడ దగ్గర సుందిళ్ల పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. మెగా, బిజిఆర్ కంపెనీలకు పంప్ హౌజ్ నిర్మాణ పనులు అప్పగించారు. రైతుల భూముల్లో తవ్వకాలు చేపట్టడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తవ్వకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయిన్నప్పటికీ కాంట్రాక్టర్లు తవ్వకాలు సాగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తవ్వకాలను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

07:36 - May 3, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రసూతి మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రోజుకో ప్రభుత్వాసుపత్రిని సందర్శించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసూతి మరణాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసూతి మరణాలు అత్యధికంగా జరుగుతున్నా..తెలంగాణలో చాలా వరకు అడ్డుకట్ట వేశామన్నారు. ప్రసూతి ఆసుపత్రుల్లో సిబ్బందిని పెంచేందుకు చర్యలు ముమ్మరం చేశామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.

పెద్దాసుపత్రుల్లో చాలావరకు రిఫరల్ హాస్పిటల్స్
హైదరాబాద్‌లోని దాదాపు అన్ని పెద్దాసుపత్రుల్లో చాలావరకు రిఫరల్ హాస్పిటల్స్ కావడంతో పూర్తిగా ఆరోగ్యం చేయిదాటిన తరువాత రాజధానికి వస్తున్నారని దీంతో రిస్క్ తో ఉన్న కేసులే ఎక్కువగా వస్తున్నాయని అందుకే మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అయితే నీలోఫర్‌లో సందర్శనకు వచ్చిన మంత్రికి ప్రభుత్వ డాక్టర్లు సమ్మె నోటీస్ అందజేసారు. దీంతో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు ఎక్కువ జరిగేలా ప్రయత్నం చేస్తున్నామని అందుకే సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటే బాబుకు 12 వేలు, పాప అయితే 13 వేల రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నామని మంత్రి గుర్తుచేసారు. కేసీఆర్ బేబీ కిట్ పేరుతో ఈ నెలాఖరు నుంచి అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో యూనిట్లు పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 

07:33 - May 3, 2017

హైదారాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ విద్య పడకేసింది. ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ప్రభుత్వ స్కూళల్లో హాజరు శాతం ఏటేటా తగ్గిపోతోంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి విద్యారంగాన్ని బయపడేయాలని ప్రభుత్వం నిర్ణయించిది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, మెరుగైన బోధన పద్ధతులు అవలంభించడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. అవసరమైన ప్రాంతాల్లో కొత్త పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టాలని ప్రతిపాదించింది. గత ప్రభుత్వాలు కేంద్ర పథకాలు గురించి సరిగా పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాలేదన్న అభిప్రాయంతో సర్కారు ఉంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 చివరి త్రైమాసికంలో సర్వశిక్ష అభియాన్ కింద 300 కోట్ల రూపాయలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద 110 కోట్ల రూపాయలు అదనంగా రాబట్టిన విషయాన్ని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి గుర్తు చేస్తున్నారు. ఇదే విధానాన్ని ఇకపై కూడా కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న కేజీబీవీలకు ఈ విద్యా సంవత్సరంలో ఫర్నీచర్ సమకూర్చడంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటైన 84 మండలాల్లో కేజీబీవీలను ప్రారంభిస్తారు. ప్రస్తుతం బాలికలకే పరిమితమైన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను 29 జిల్లాల్లో బాలుర కోసం ఒక్కో స్కూలును ప్రారంభిస్తారు. వీటి నిర్వహణకు కేంద్ర నిధులు రాబట్టాలని ప్రతిపాదించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ గురుకుల పాఠశాలలతోటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొదటి దశలో ఆరువేల స్కూళ్లలో బయో మెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ విద్య ప్రక్షాళనకు సర్కారు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

07:29 - May 3, 2017

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో రెండు నెలలుగా సాగుతున్న మరమ్మత్తు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఆధునీకరణ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో..తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. దాదాపు 40 నిమిషాల పాటు తెలంగాణా భవన్‌లో సీఎం కేసిఆర్ గడిపారు. భవన్‌లోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునీకరణ పనుల పర్యవేక్షనను సీఎం కేసీఆర్‌..మేయర్‌ బొంతురామ్మోహన్‌, మంత్రి హరీష్‌రావుకు అప్పజెప్పారు. దీంతో వారు కూడా సీఎం కేసీఆర్‌ వెంట ఉండి పనుల తీరును వివరించారు. వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.ఇప్పటి వరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..కొన్ని మార్పులను చేయాలని ఆదేశించారు. తన ఛాంబర్‌లో మొత్తం ఒకే కలర్ కాకుండా ఫర్చీచర్‌ను మార్చాలని సూచించారు. దీనికి తోడు ప్రధాన గేట్‌ను మరింత వెడల్పు చేయాలన్నారు. ప్రహరీ గోడ లోపలి భాగంలో మొత్తం ప్రభుత్వ పథకాలకు అద్దం పట్టేలా పేయింటింగ్స్ వేయించాలని సూచించారు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ప్రధాన గేట్‌కు కుడివైపున క్యాంటిన్‌ను నిర్మించాలని నేతలకు ఆదేశాలిచ్చారు.పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీ కార్యాలయంలో ఇప్పటి వరకు నేతల సందడి, కార్యకర్తల రాకపోకలు పెద్దగా లేవు. దీంతో రాబోయే రోజుల్లో నేతలు విధిగా పార్టీ కార్యాలయంలో గడిపేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలను ఆదేశించారు. తాను కూడా ఇకపై తరచూ తెలంగాణా భవన్‌కు వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాననే సంకేతాలను సీఎం ఇచ్చారు. ఆధునీకరణ పనులు పూర్తయిన వెంటనే కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని సిఎం అన్నట్లు సమాచారం. మొత్తానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావస్తుండడంతో..పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు.

 

07:27 - May 3, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నాయకులు, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మధ్య తలెత్తిన వివాదం మరింతగా ముదురుతోంది. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్‌ వెబ్‌సైట్‌ను సృష్టించి ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారంటూ దిగ్విజయ్‌సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించారు. దీనిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు సీరియస్‌ అయ్యాయి. దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ఖండించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దిగ్విజయ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాదు తెలంగాణ ప్రజలకు డిగ్గీరాజా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. దిగ్విజయ్‌సింగ్‌ తన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కోరారు. లేకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు కూడా వెనుకాడబోనని తేల్చి చెప్పారు. తెలంగాణ పోలీసులపై బాధ్యతాయుతంగానే ఆరోపణలు చేశానన్నారు. గత వారం ఢిల్లీలో కౌంటర్‌ టెర్రరిజం సమావేశం జరిగిందని.. అందులో తెలంగాణ పోలీసులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు అనుసరిస్తున్న తీరుపై ఏటీఎస్‌ అధికారులు అభ్యంతరం చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు అనుసరించిన తీరుపై కేంద్ర హోంమంత్రికి వారు ఫిర్యాదు చేశారని చెప్పారు. మధ్యప్రదేశ్‌ రైలులో బాంబు పేలుళ్లు, సైఫుల్లా ఎన్‌కౌంటర్‌లోనూ తెలంగాణ పోలీసులే సమాచారం ఇచ్చారన్నారు. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దేశ నైతికతకు భంగం కలిగేలా ఉందని ఆక్షేపించారు. మొత్తంగా ఎవరి వాదనలకు వారి కట్టుబడి ఉండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది.

 

07:04 - May 3, 2017

గుంటూరు :రైతులను ముంచడంలో చంద్రబాబు.. తన రికార్డును తానే అధిగమిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గుంటూరులో రెండు రోజుల దీక్షను విరమించాక మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరగకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్ష ముగిసింది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలో సోమ, మంగళవారాల్లో జగన్‌ దీక్ష జరిపారు. స్థానిక రైతులు నిమ్మరసం ఇచ్చి జగన్‌ దీక్షను విరమింపజేశారు.

దీక్ష ముగింపు....
దీక్ష ముగింపు సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రైతుల కోసం ఐదువేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు .. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వలేదని జగన్‌ ధ్వజమెత్తారు. రైతులు కన్నీరు కారిస్తే.. ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని విమర్శించారు. బ్యాంకు రుణాలు లభించక, పంటకు గిట్టుబాటు ధర రాక.. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని జగన్‌ మండిపడ్డారు. కాంట్రాక్టులు, కమీషన్ల లెక్కలపైనే చంద్రబాబు ధ్యాస ఉందని విమర్శించారు. చంద్రబాబు సీఎం అయ్యే​నాటికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 43 లక్షల హెక్టార్లు ఉంటే.. 2016-17లో 37 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు జగన్‌. దేశంలో ఒక్క చంద్రబాబు ఏలుబడిలోనే రైతులకు బ్యాంకు రుణాలు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. విడతలవారీ రుణమాఫీ ద్వారా రైతులకు ఏమాత్రం ఉపయోగపడని పని చేశారని విమర్శించారు. తమ పోరాటం ఇంతటితోనే ఆగదని, జీఎస్టీ బిల్లు కోసం ఈనెలలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లోపు రైతులకు న్యాయం చేయకుంటే అసెంబ్లీని ఎలా నడుపుతారో చూస్తామని జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చంద్రబాబు సర్కార్‌ను జగన్‌ డిమాండ్‌ చేశారు.

 

06:59 - May 3, 2017

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో మూడుగంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో సీడ్‌ క్యాపిటల్‌ ఏరియా అభివృద్ధికి స్విస్‌ చాలెంజ్‌ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదలను కేబినెట్‌ ఆమోదించింది. ఎసెండాస్‌, సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ అందజేసిన ప్రతిపాదలనపై విస్తృతంగా చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతిలో స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేస్తుంది. ఈ కన్సార్టియంకు సింగపూర్‌ ప్రభుత్వానికి 74.5 శాతం ఈక్విటీ ఉంది. అమరావతి అభివృద్ధి సంస్థ..ఏడీసీలో సింగపూర్‌ కన్సార్టియంకు 42 శాతం తీసుకుటుంది. మిగిలిన 58 శాతం వాటా ఏడీసీకి ఉంటుంది. 15 ఏళ్లలో మూడు దశల్లో 1691 ఎకరాల్లో సీడ్‌ క్యాపిటల్ అభివృద్ధి చేస్తారు. మొదటి విడత 200 ఎకరాల్లో రాజధాని అభివృద్ది జరుగుతుంది. ఏకరానికి నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సింగపూర్‌ కన్సార్టియం ఒప్పుకుంది. ముందు 50 ఎకరాలను నామమాత్రపు రేటుకు కేటాయిస్తారు. మొదటి విడత 646 ఎకరాలు, రెండో విడతలో 514 ఎకరాలు, మూడోదశలో 521 ఎకరాలు ఇస్తారు. లాభాల్లో ఏడీసీకి, సింగపూర్‌ కన్సార్టియంకు వాటా ఉంటుంది. సీడ్‌ క్యాపిటల్‌లో పదిహేనేళ్లలో రెండులన్న లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. మౌలిక సదుపాయాలను సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేస్తుంది.

త్వరలో పోలీసుశాఖలో ఉద్యోగాలు 
మరోవైపు పోలీసు, జైళ్ల శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరు వందల మంది సివిల్‌, రెండు వందల మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు కానిస్టేబుళ్లను నియమిస్తారు. విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సమానంగా ఈ పోస్టులను కేటాయించారు. ఏడాదికి ప్రభుత్వంపై 20.53 కోట్ల భారం పడుతుందని లెక్క తేల్చారు. విశాఖపట్నం, కడప సెంట్రల్‌ జైళ్లు, కర్నూలు, విజయవాడ, గుంటూరు, ఏలూరు జిల్లా జైళ్లలో 14 కొత్త పోస్టులను సృష్టించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజోలు, ఆలమూరు, ప్రకాశం జిల్లా కందుకూరు, పొదిలి, విశాఖజిల్లా భీమిలి, కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం, మడకశిర సబ్‌ జైళ్లను మూసివేతకు మంద్రివర్గం ఆమోదం తెలిపింది.

పీవీ. సింధుకు గ్రూప్ వన్ లో ఉద్యోగం
ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింది నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు వందల నుంచి ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేందుకు వీలు కల్పించారు. యూనిట్‌కు అయ్యే లక్షన్నర రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 92 వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింది 55 వేల రూపాయలు వెచ్చిస్తారు. లబ్ధిదారులు మూడు వేల రూపాయలు భరించాల్సి ఉంటుంది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు టాలీవుడ్‌ దర్శకుడు విశ్వనాథ్‌ ఎంపిక కావడం పట్ల కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి-2 చిత్ర నిర్మాణ బృందానికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది. సిమెంటు కంపెనీలు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్న తీరుపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. రేట్లు తగ్గించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సిమెంటు కంపెనీలకు ఇచ్చే రాయితీల్లో కోత విధించే అంశాన్ని కూడా మంత్రివర్గం పరిశీలించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధును గ్రూప్‌-వన్‌ సర్వీసులో నియమించేందుకు వీలుగా ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని నార్కెట్ పల్లి మండలం గోపలాయపల్లి సమీపంలో డివైడర్ ను ఢీ కొని బస్సుబోల్తా పడింది. 10 మందికి గాయాలయ్యాయి.

 

ఖమ్మంలో టీడీపీ నేతల పర్యటన

ఖమ్మం : నేడు జిల్లాలో టీడీపీ నేతలు పర్యటించనున్నారు. అరస్టయి జైలులో ఉన్న రైతుల కుటుంబాలను ఎల్. రమణ. రేవంత్, నామా నాగేశ్వర్ రావు, పరామర్శించనున్నారు.

నేడు అమెరికాకు ఏపీ సీఎం చంద్రబాబు

గుంటూరు : నేడు ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా విళ్లనున్నారు. గన్నవరం నుంచి వెళ్లి అక్కడి నుంచి అర్ధరాత్రి బాబు బృందం వెళ్లనుంది.

Don't Miss